మహారాజా టీ20 టోర్నీలో షిమోగా లయన్స్ ఆటగాడు, గుజరాత్ టైటాన్స్ ప్లేయర్ అభినవ్ మనోహర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఈ టోర్నీలో అభినవ్ 10 మ్యాచ్‌ల్లో 6 అర్ద సెంచరీల సాయంతో 84.50 సగటున 507 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఈ టోర్నీలో అభినవ్ ఏకంగా 52 సిక్సర్లు బాదాడు.
నిన్న జరిగిన మ్యాచ్‌లోనూ అభినవ్ మరోసారి చెలరేగిపోయాడు. బెంగళూరు బ్లాస్టర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అభినవ్ 24 బంతుల్లో 7 సిక్సర్లు, బౌండరీ సాయంతో అజేయమైన 59 పరుగులు చేశాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన షిమోగా లయన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. లయన్స్ ఇన్నింగ్స్‌లో అభినవ్‌తో పాటు మోహిత్ (56), రోహన్ నవీన్ (45) కూడా విజృంభించారు. బ్లాస్టర్స్ బౌలర్లలో ఆతిథ్య గోయల్ 2 వికెట్లు పడగొట్టగా.. సంతోక్ సింగ్, ప్రతీక్ జైన్, కౌశల్ తలో వికెట్ దక్కించుకున్నాడు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన బ్లాస్టర్స్.. సూరజ్ అహూజా (82 నాటౌట్), శుభంగ్ హేగ్డే (85 నాటౌట్) వీర బాదుడు బాదడంతో మరో ఓవర్ మిగిలుండగానే కేవలం 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. బ్లాస్టర్స్ ఇన్నింగ్స్‌లో మయాంక్ అగర్వాల్ (33) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. షిమోగా బౌలర్లలో శరత్ 2, రాజ్‌వీర్, హార్దిక్ రాజ్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో అభినవ్ చెలరేగినా అతని జట్టు షిమోగా లయన్స్ ఓడిపోవడం విచారకరం.
Comments
Please login to add a commentAdd a comment