KSCA tournament
-
సిక్సర్లతో శివాలెత్తిపోయిన గుజరాత్ టైటాన్స్ ప్లేయర్
మహారాజా టీ20 టోర్నీలో షిమోగా లయన్స్ ఆటగాడు, గుజరాత్ టైటాన్స్ ప్లేయర్ అభినవ్ మనోహర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఈ టోర్నీలో అభినవ్ 10 మ్యాచ్‌ల్లో 6 అర్ద సెంచరీల సాయంతో 84.50 సగటున 507 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఈ టోర్నీలో అభినవ్ ఏకంగా 52 సిక్సర్లు బాదాడు.నిన్న జరిగిన మ్యాచ్‌లోనూ అభినవ్ మరోసారి చెలరేగిపోయాడు. బెంగళూరు బ్లాస్టర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అభినవ్ 24 బంతుల్లో 7 సిక్సర్లు, బౌండరీ సాయంతో అజేయమైన 59 పరుగులు చేశాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన షిమోగా లయన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. లయన్స్ ఇన్నింగ్స్‌లో అభినవ్‌తో పాటు మోహిత్ (56), రోహన్ నవీన్ (45) కూడా విజృంభించారు. బ్లాస్టర్స్ బౌలర్లలో ఆతిథ్య గోయల్ 2 వికెట్లు పడగొట్టగా.. సంతోక్ సింగ్, ప్రతీక్ జైన్, కౌశల్ తలో వికెట్ దక్కించుకున్నాడు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన బ్లాస్టర్స్.. సూరజ్ అహూజా (82 నాటౌట్), శుభంగ్ హేగ్డే (85 నాటౌట్) వీర బాదుడు బాదడంతో మరో ఓవర్ మిగిలుండగానే కేవలం 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. బ్లాస్టర్స్ ఇన్నింగ్స్‌లో మయాంక్ అగర్వాల్ (33) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. షిమోగా బౌలర్లలో శరత్ 2, రాజ్వీర్, హార్దిక్ రాజ్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో అభినవ్ చెలరేగినా అతని జట్టు షిమోగా లయన్స్ ఓడిపోవడం విచారకరం. -
భీకర ఫామ్‌లో కరుణ్ నాయర్.. మరో మెరుపు ఇన్నింగ్స్
బెంగళూరు వేదికగా జరుగుతున్న మహారాజా టీ20 ట్రోఫీలో మైసూర్ వారియర్స్ సారథి కరుణ్ నాయర్ భీకర ఫామ్ కొనసాగుతుంది. ఈ టోర్నీలో నాయర్ ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడి సెంచరీ, మూడు హాఫ్ సెంచరీల సాయంతో 426 పరుగులు చేశాడు. తాజాగా హుబ్లీ టైగర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కరుణ్ మరోసారి రెచ్చిపోయాడు. కేవలం 48 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేశాడు. కరుణ్ మెరుపు ఇన్నింగ్స్ సాయంతో తొలుత బ్యాటింగ్ చేసిన మైసూర్ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. వారియర్స్ ఇన్నింగ్స్‌లో కొదండ కార్తీక్ (30), కార్తీక్ (29), సుచిత్ (20) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. టైగర్స్ బౌలర్లలో ఎల్ఆర్ కుమార్, మాధవ్ ప్రకాశ్ బజాజ్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. కరియప్ప, రిషి బొపన్న చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం 191 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టైగర్స్.. వారియర్స్ బౌలర్లు మూకుమ్మడిగా చెలరేగడంతో 18.4 ఓవర్లలో 117 పరుగులకే ఆలౌటైంది. శ్రీవత్సవ. సుచిత్. ధనుశ్ గౌడ, మనోజ్ భాంగడే తలో రెండు వికెట్లు పడగొట్టగా.. కృష్ణప్ప గౌతమ్, దీపక్ దేవడిగ చెరో వికెట్ దక్కించుకున్నారు. టైగర్స్ ఇన్నింగ్స్‌లో మొహమ్మద్ తాహా (33) టాప్ స్కోరర్‌గా నిలువగా.. మనీశ్ పాండే (14), శ్రీజిత్ (13), అనీశ్వర్ గౌతమ్ (11), కరియప్ప (11), ఎల్ఆర్ కుమార్ (10 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. -
విధ్వంసకర శతకంతో విరుచుకుపడిన టీమిండియా ట్రిపుల్ సెంచరీ హీరో
మహారాజా ట్రోఫీ కేఎస్‌సీఏ టీ20 టోర్నీలో భాగంగా మంగళూరు డ్రాగన్స్‌తో నిన్న (ఆగస్ట్ 19) జరిగిన మ్యాచ్‌లో మైసూర్ వారియర్స్ కెప్టెన్, టీమిండియా ట్రిపుల్ సెంచరీ హీరో కరుణ్ నాయర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో కరుణ్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. కరుణ్ తన శతకాన్ని కేవలం 43 బంతుల్లో 10 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో పూర్తి చేశాడు. KARUN NAIR SMASHED 124* (48). 🤯- A swashbuckling century in the Maharaja Trophy by Nair. A quality knock at the Chinnaswamy Stadium. 👌pic.twitter.com/cnXYiAZutv— Mufaddal Vohra (@mufaddal_vohra) August 19, 2024ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా 48 బంతులు ఎదుర్కొన్న కరుణ్.. 13 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 124 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన మైసూర్ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 226 పరుగుల భారీ స్కోర్ చేసింది. వారియర్స్ ఇన్నింగ్స్‌లో కరుణ్ మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తనయుడు సమిత్ ద్రవిడ్ 16, అజిత్ కార్తీక్ 11, కార్తీక్ 23, సుమిత్ కుమార్ 15 పరుగులు చేశారు. అఖర్లో బ్యాటింగ్‌కు దిగిన మనోజ్ భాంగడే 14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 31 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. డ్రాగన్స్ బౌలర్లలో అభిలాష్ షెట్టి 2 వికెట్లు పడగొట్టగా.. నిశ్చిత్ రావు, డర్శన్ తలో వికెట్ దక్కించుకున్నారు. వారియర్స్ ఇన్నింగ్స్ అనంతరం వర్షం మొదలు కావడంతో వీజేడీ పద్దతిన డ్రాగన్స్ లక్ష్యాన్ని 14 ఓవర్లలో 166 పరుగులుగా నిర్దారించారు.చేతులెత్తేసిన డ్రాగన్స్14 ఓవర్లలో 166 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన డ్రాగన్స్ ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేకపోయింది. ఆ జట్టు ఆటగాళ్లలో నికిన్ జోస్ (32), కృష్ణమూర్తి సిద్ధార్థ్ (50), రోహన్ పాటిల్ (12), దర్శన్ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ఫలితంగా ఆ జట్టు 14 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 138 పరుగులు మాత్రమే చేయగలిగింది. అజిత్ కార్తీక్, జగదీశ సుచిత్ తలో రెండు వికెట్లు తీసి డ్రాగన్స్‌ను దెబ్బకొట్టారు. -
మనీష్ పాండే కెప్టెన్ ఇన్నింగ్స్.. గుల్బర్గాదే మహారాజా ట్రోపీ
మహారాజా ట్రోఫీ కేఎస్‌సీఏ టి20 లీగ్ 2022 తొలి సీజన్ విజేతగా మనీష్ పాండే నేతృత్వంలోని గుల్బర్గా మైస్టిక్స్ నిలిచింది. శుక్రవారం రాత్రి బెంగళూరు బుల్స్‌తో జరిగిన ఫైనల్లో గుల్బర్గా 11 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరిసిన మనీష్ పాండే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. తొలుత బ్యాటింగ్ చేసిన గుల్బర్గా మైస్టిక్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 220 పరుగుల భారీ స్కోరు సాధించింది. దేవదత్ పడిక్కల్(42 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 56 పరుగులు నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ మనీష్ పాండే 17 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 41 పరుగులు నాటౌట్ ఆఖర్లో మెరుపులు మెరిపించాడు. అంతకముందు జెస్వాత్ ఆచార్య 39, రోహన్ పాటిల్ 38, కృష్ణన్ షిర్జిత్ 38 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన బెంగళూరు బుల్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ ఎల్ఆర్ చేతన్ (40 బంతుల్లో 91 పరుగులు, 6 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. క్రాంతి కుమార్ 41 మినహా మిగతావారెవరు రాణించకపోవడంతో బెంగళూరు బుల్స్ విజయానికి 11 పరుగుల దూరంలో ఆగిపోయింది. Gulbarga Mystics are the CHAMPIONS of the Maharaja Trophy KSCA T20!! 🔥🙌🏼@GulbargaMystics #MaharajaTrophy #KSCA #T20 #Cricket #Karnataka #IlliGeddavareRaja #ಇಲ್ಲಿಗೆದ್ದವರೇರಾಜ pic.twitter.com/7sTniWTvPL — Maharaja Trophy T20 (@maharaja_t20) August 26, 2022 చదవండి: Asia Cup 2022: ‘ఆసియా’ అందుకునేందుకు.. -
హెచ్‌సీఏలో గొడవ ముదిరింది!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) కార్యదర్శి శేష్ నారాయణ్, జి.వివేకానంద్ నేతృత్వంలోని అపెక్స్ కౌన్సిల్ మధ్య గత కొంత కాలంగా సాగుతున్న విభేదాలు ఇప్పుడు తారాస్థాయికి చేరాయి. ఇప్పటి వరకు అవినీతి, నిధుల గోల్మాల్వంటి అంశాలపై ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగించిన ఇరు వర్గాలు ఇప్పుడు జట్టు ఎంపిక విషయంలో కూడా తమ అహాన్ని బయట పెట్టాయి. ఈ నెల 18 నుంచి ఆగస్టు 15 వరకు కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం (కేఎస్‌సీఏ) ఒక టోర్నీ నిర్వహిస్తోంది. 2018–19 రంజీ సీజన్ సన్నాçహాల్లో భాగంగా జరిగే ఈ టోర్నీలో ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా హైదరాబాద్ జట్టు బరిలోకి దిగుతోంది. అయితే ఇందులో పాల్గొనే ఆటగాళ్లపై సందిగ్ధత నెలకొంది. అటు కార్యదర్శి, ఇటు అపెక్స్ కౌన్సిల్ రెండు వేర్వేరు జట్లను ప్రకటించాయి. మాదంటే మాదే అధికారిక జట్టని ఇరు వర్గాలు చెబుతున్నాయి. శివాజీ యాదవ్, రమేశ్, నిరంజన్, ఎంపీ అర్జున్, సయ్యద్ మిరాజ్‌లతో కూడా సెలక్షన్ కమిటీ ఆదివారం అపెక్స్ కౌన్సిల్ జట్టును ప్రకటించింది. ఈ కమిటీని కూడా శనివారమే ఏర్పాటు చేశారు. త్వరలో జరుగబోయే ఏజీఎంలో ఈ కమిటీ ఏర్పాటుకు ఆమోద ముద్ర వేస్తామని కౌన్సిల్ స్పష్టం చేసింది. అయితే నిబంధనల ప్రకారం కొత్త కమిటీ ఏర్పాటయ్యే వరకు పాత కమిటీనే కొనసాగుతుంది కాబట్టి పాత సెలక్షన్ కమిటీతోనే జట్టును ఎంపిక చేసినట్లు శేష్ నారాయణ్ చెబుతున్నారు. ఈ సెలక్షన్ కమిటీలో అరవింద్ శెట్టి, నిరంజన్, విష్ణువర్ధన్ సభ్యులుగా ఉన్నారు. ఈ తరహాలో జట్ల ఎంపిక క్రికెటర్లను ఆందోళనలో పడేసింది. తాము జట్టులోకి ఎంపికైనట్లా, కానట్లా... అసలు టోర్నీకి వెళ్లాల్సి ఉందా లేదా అని వారంతా సంకోచంలో ఉన్నారు. చివరకు ఇది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందనేది ఆసక్తికరం. హైదరాబాద్ జట్లు కార్యదర్శి ప్రకటించిన హైదరాబాద్ జట్టు: సీవీ మిలింద్ (కెప్టెన్), రోహిత్ రాయుడు, అభిరత్ రెడ్డి, ఠాకూర్ తిలక్ వర్మ, హిమాలయ్ అగర్వాల్ (వికెట్ కీపర్), చందన్ సహాని, యతిన్ రెడ్డి, టి. రవితేజ, సాకేత్ సాయిరామ్, టీపీ అనిరుధ్, తనయ్ త్యాగరాజన్, ముదస్సిర్ హుస్సేన్, కె. సుమంత్ (వికెట్ కీపర్), సమిత్ రెడ్డి, మల్లికార్జున్, అలంకృత్ అగర్వాల్, ఎన్. అర్జున్ యాదవ్ (కోచ్), నోయెల్ డేవిడ్ (ఫీల్డింగ్ కోచ్), మహబూబ్ అహ్మద్ (మేనేజర్), భీషం ప్రతాప్ సింగ్ (ఫిజియో), నవీన్ రెడ్డి (ట్రెయినర్). అపెక్స్ కౌన్సిల్ ప్రకటించిన హైదరాబాద్ జట్టు: అంబటి రాయుడు (కెప్టెన్), పి. అక్షత్ రెడ్డి (వైస్ కెప్టెన్), తన్మయ్ అగర్వాల్, రోహిత్ రాయుడు, బి. సందీప్, కొల్లా సుమంత్ (వికెట్ కీపర్), టి. రవితేజ, ఆకాశ్ భండారి, మెహదీహసన్, ప్రజ్ఞాన్ ఓజా, ఎం. రవికిరణ్, ముదస్సర్ హుస్సేన్, సీవీ మిలింద్, ఎ. వరుణ్ గౌడ్, చందన్ సహాని, ఠాకూర్ తిలక్ వర్మ, ఎన్పీ సింగ్ (కోచ్), ఇంద్ర శేఖర్ రెడ్డి (మేనేజర్), ప్రతాప్ సింగ్ (ఫిజియో), నవీన్ రెడ్డి (ట్రెయినర్). -
భరత్, సుమంత్ డబుల్ సెంచరీలు
కేఎస్‌సీఏ టోర్నీ ఫైనల్లో ఆంధ్ర జట్టు సాక్షి, విజయవాడ: కెప్టెన్ శ్రీకర్ భరత్, సుమంత్ డబుల్ సెంచరీలు సాధించడంతో... కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీఏ) ఆధ్వర్యంలో మైసూరులో జరుగుతోన్న తిమ్మ ప్పయ్య ఇన్విటేషన్ జాతీయ టోర్నమెంట్లో ఆంధ్ర జట్టు తొలిసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. కేఎస్‌సీఏ ఎలెవన్‌తో శనివారం ముగిసిన ఈ మూడు రోజుల మ్యాచ్‌లో ఫలితాన్ని టాస్ ద్వారా నిర్ణయించారు. మ్యాచ్‌లో రెండు జట్ల తొలి ఇన్నింగ్స్ పూర్తి కాకపోవడంతో టోర్నీ నిబంధనల ప్రకారం విజేతను నిర్ణయించడానికి టాస్ నిర్వహించగా... ఇందులో ఆంధ్ర జట్టును విజయం వరించింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర జట్టు 191.3 ఓవర్లలో 6 వికెట్లకు 591 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. శ్రీకర్ భరత్ (492 బంతుల్లో 218; 26 ఫోర్లు, 2 సిక్స్‌లు), సుమంత్ (363 బంతుల్లో 202 నాటౌట్; 21 ఫోర్లు, ఒక సిక్స్) డబుల్ సెంచరీలతో కదంతొక్కారు. అనంతరం కేఎస్‌సీఏ ఎలెవన్ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 310 పరుగులు చేయడంతో మ్యాచ్ ‘డ్రా’ అయింది. అభిషేక్ రెడ్డి (155 నాటౌట్; 16 ఫోర్లు), మయాంక్ అగర్వాల్ (100 నాటౌట్; 12 ఫోర్లు) సెంచరీలు సాధించారు.