
Photo Courtesy: BCCI/IPL
ఐపీఎల్-2025లో అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో ఒకే వేదికలో అతి తక్కువ ఇన్నింగ్స్‌లలో 1000 పరుగులు మైలు రాయిని అందుకున్న రెండో ప్లేయర్‌గా గిల్ నిలిచాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గిల్ వెయ్యి ఐపీఎల్ పరుగులను పూర్తి చేసుకున్నాడు.
తద్వారా ఈ ఫీట్‌ను గిల్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకు ఈ రికార్డు ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్, సన్‌రైజర్స్ మాజీ సారథి డేవిడ్ వార్నర్ పేరిట ఉండేది. వార్నర్ హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ మైదానంలో 22 ఇన్నింగ్స్‌లలో 1000 పరుగులు మైలు రాయిని అందుకున్నాడు.
తాజా మ్యాచ్‌తో వార్నర్ రికార్డును గిల్ బ్రేక్ చేశాడు. ఇక అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్ అగ్రస్ధానంలో ఉన్నాడు. గేల్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో 19 ఇన్నింగ్స్‌లలోనే ఈ ఫీట్‌ను అందుకున్నాడు.
ఇక శుబ్‌మన్ గిల్ ఓవరాల్‌గా తన ఐపీఎల్ కెరీర్‌లో ఇప్పటివరకు 105 మ్యాచ్‌లు ఆడి 3287 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 4 సెంచరీలు ఉన్నాయి. ఇక ఈ మ్యాచ్‌లో గిల్ 38 పరుగులు చేసి ఔటయ్యాడు. 11 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ వికెట్ నష్టానికి 101 పరుగులు చేసింది.
తుది జట్లు
ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ XI: రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, సత్యనారాయణ రాజు, ముజీబ్ ఉర్ రెహమాన్, ట్రెంట్ బౌల్ట్
గుజరాత్ టైటాన్స్ ప్లేయింగ్ XI: శుభమన్ గిల్ (కెప్టెన్), B సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ
చదవండి: IND vs ENG: టీమిండియా కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్..!?