breaking news
Shubman Gill
-
జైస్వాల్ అంటే గిల్‌కి అసూయ!.. అందుకేనా?: మాజీ క్రికెటర్ ఫైర్
వెస్టిండీస్‌తో రెండో టెస్టులో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal)భారీ శతకం బాదాడు. మొత్తంగా 258 బంతులు ఎదుర్కొనని 175 పరుగులు చేసిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. తన కెరీర్లో మూడో డబుల్ సెంచరీకి చేరువైన సమయంలో ఘోర తప్పిదం చేశాడు.ఇరవై ఐదు పరుగుల దూరంలోఅనవసరపు పరుగుకు యత్నించిన జైసూ.. రనౌట్ రూపంలో భారీ మూల్యమే చెల్లించాడు. ద్విశతకానికి ఇరవై ఐదు పరుగుల దూరంలో నిలిచిపోయాడు. ఢిల్లీ వేదికగా శనివారం నాటి రెండో రోజు ఆట సందర్భంగా ఈ పరిణామం చోటుచేసుకుంది.భారత్ తొలి ఇన్నింగ్స్ 92వ ఓవర్లో జేడన్ సీల్స్ (Jayden Seals) బౌలింగ్‌లో జైస్వాల్.. బంతిని మిడాఫ్ దిశగా బాదగా.. అది నేరుగా ఫీల్డర్ చెంతకు చేరింది. అయితే, అప్పటికే సింగిల్ కోసం జైసూ క్రీజును వీడగా.. మరో ఎండ్‌లో ఉన్న కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) మాత్రం పరిస్థితిని అంచనా వేసి తన స్థానం నుంచి కదిలినా మళ్లీ యథాస్థితికి వచ్చాడు.తలబాదుకుంటూఇంతలో జైస్వాల్ వెనక్కి పరిగెత్తగా అప్పటికే బంతిని అందుకున్న విండీస్ వికెట్ కీపర్ టెవిన్ ఇమ్లాచ్.. దానిని వికెట్లకు గిరాటేయగా.. జైసూ రనౌట్ అయ్యాడు. దీంతో తీవ్ర అసంతృప్తికి లోనైన జైస్వాల్ తలబాదుకుంటూ మైదానం వీడాడు.ఈ నేపథ్యంలో కొంతమంది నెటిజన్లు గిల్‌ను టార్గెట్ చేస్తూ ట్రోల్స్‌కు దిగారు. జైస్వాల్ అంటే గిల్‌కు అసూయ అని.. అందుకే అతడు రన్ కోసం పిలుపునిచ్చినా సరైన సమయంలో స్పందించలేదని నిందిస్తున్నారు. ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా తనదైన శైలిలో స్పందించాడు.జైస్వాల్ అంటే గిల్‌కు అసూయా?‘‘నితీశ్ రెడ్డి కోసం గిల్ పరిగెడతాడు. కానీ జైస్వాల్ కోసం సింగిల్ తీయడు. ఎందుకిలా?.. ఎందుకంటే.. జైస్వాల్ అంటే గిల్‌కు అసూయ!.. అసలేం మాట్లాడుతున్నారో అర్థమవుతోందా?వారి విషయంలోనూ ఇలాగే చేశారురోహిత్ శర్మ- విరాట్ కోహ్లి విషయంలోనూ మీరు ఇలాగే చేశారు. చాంపియన్స్ ట్రోఫీలో ఇద్దరూ కలిసికట్టుగా జట్టును గెలిపించారు. టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఇద్దరూ ట్రోఫీని ముద్దాడుతూ కన్నీటిపర్యంతమయ్యారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు.ఇక ఇప్పుడు మీరేమో మళ్లీ జైస్వాల్- గిల్ల గురించి ఇలాంటి ప్రచారమే మొదలుపెట్టారు. వాళ్లిద్దరు స్నేహితులు. ఇద్దరూ ఒకే జట్టుకు ఆడుతున్నారు. ఈ రనౌట్ విషయంలో తప్పు ఎవరిదైనా.. డ్రెసింగ్‌రూమ్‌లో వాళ్లిద్దరు సరదాగా మాట్లాడుకుంటున్న వీడియో కూడా చూడండి.అసహనం ప్రదర్శించాడంతేఈ ఘటన తర్వాత కూడా వాళ్లిద్దరు ఫ్రెండ్లీగానే మాట్లాడుకున్నారు. అసలేం జరిగిందో అర్థంకాక జైస్వాల్ అసహనం ప్రదర్శించాడంతే. ఫ్యాన్స్ ఆర్మీలే ఇలాంటి గొడవలు సృష్టిస్తాయి. కలిసికట్టుగా కాకుండా ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు ఆడతారని కామెంట్లు చేస్తారు. గిల్- జైస్వాల్‌ల ప్రయాణం ఇప్పుడే మొదలైంది. దయచేసి ఇలాంటి ట్రోలింగ్ ద్వారా వారి కెరీర్‌పై ప్రభావం పడేలా చేయకండి. వాళ్లిద్దరు కలిసి భారత క్రికెట్‌ను ఎలా ముందుకు తీసుకువెళ్తారో చూడండి’’ అంటూ ఆకాశ్ చోప్రా ట్రోలర్స్‌పై మండిపడ్డాడు.కాగా విండీస్‌తో రెండో టెస్టులో గిల్ అజేయ శతకం (129) సాధించిన తర్వాత.. ఐదు వికెట్ల నష్టానికి 518 పరుగుల వద్ద ఉన్న వేళ టీమిండియా తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. ఈ క్రమంలో మొదటి ఇన్నింగ్స్‌లో 248 పరుగులకు ఆలౌట్ అయిన వెస్టిండీస్.. ఫాలో ఆన్ ఆడుతోంది.చదవండి: భర్తేమో బ్యాటర్ల పాలిట విలన్.. భార్యేమో బౌలర్లకు హడల్! ఆ జంట ఎవరో తెలుసా? -
'శుబ్' శతకం
అనుకున్నట్లే రెండో రోజూ భారత్ జోరు కొనసాగింది. బ్యాటింగ్, బౌలింగ్‌తో కరీబియన్లను కష్టాల్లోకి నెట్టేసింది. మొదట కెప్టెన్ శుబ్‌మన్ గిల్ శతకంతో భారీ స్కోరులో భాగమయ్యాడు. 500 పైచిలుకు స్కోరు వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన భారత్... బౌలింగ్‌తోనూ అదరగొట్టింది. రెండో రోజే స్పిన్ తిరగడంతో భారత కెప్టెన్ గిల్... జడేజా, కుల్దీప్లతో అనుకున్న ఫలితాలు సాధించాడు.న్యూఢిల్లీ: ఈ రెండో టెస్టును కూడా ముందే ముగించేందుకు భారత్ సిద్ధమైంది. రెండో రోజు ఆటలో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది. బ్యాటింగ్‌లో శుబ్‌మన్ గిల్, నితీశ్ కుమార్ రెడ్డి, ధ్రువ్ జురేల్‌లు కరీబియన్ బౌలర్లపై సులువుగా పరుగులు రాబట్టారు. తర్వాత రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్‌లు స్పిన్ ఉచ్చును బిగించారు. తద్వారా క్లీన్‌స్వీప్‌నకు రాచబాట వేశారు. కెప్టెన్ గిల్ (196 బంతుల్లో 129 నాటౌట్; 16 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ సెంచరీ సాధించాడు. దీంతో భారత్ 134.2 ఓవర్లలో 5 వికెట్లకు 518 పరుగుల భారీస్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. నితీశ్ (54 బంతుల్లో 43; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), జురేల్ (79 బంతుల్లో 44; 5 ఫోర్లు) రాణించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 43 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. అలిక్ అతనేజ్ (84 బంతుల్లో 41; 5 ఫోర్లు, 1 సిక్స్) భారత బౌలర్లను ఎక్కువసేపు ఎదుర్కొన్నాడు. జడేజా 3 వికెట్లు తీశాడు. జైస్వాల్ రనౌట్డబుల్ సెంచరీ చేస్తాడనుకున్న ఓపెనర్ యశస్వి జైస్వాల్ కేవలం తన క్రితం రోజు స్కోరుకు 2 పరుగులే జతచేసి రనౌటయ్యాడు. దీంతో శనివారం 318/2 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆటకొనసాగించిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. సారథి గిల్ పరుగుకు ఉపక్రమించి వెనకడుగు వేయడంతో జైస్వాల్ నిష్క్రమించాల్సి వచ్చింది. నిరాశకు లోనైన యశస్వి తలకొట్టుకొని అసహనంగా క్రీజు వీడాడు. తర్వాత గిల్‌కు జతయిన నితీశ్ వన్డే తరహా ఆటతీరుతో ధాటిగా పరుగులు సాధించాడు. శుబ్‌మన్ అర్ధసెంచరీని పూర్తిచేసుకోగా... జట్టు స్కోరు తొలిసెషన్‌లోనే 400 పరుగులు దాటింది. క్రీజులో పాతుకుపోయిన నితీశ్‌ను లంచ్ విరామానికి ముందు వారికెన్ అవుట్ చేశాడు. క్రీజులోకి ధ్రువ్ జురేల్ రాగా 427/4 స్కోరు వద్ద తొలిసెషన్ ముగిసింది. శతక్కొట్టిన సారథిరెండో సెషన్లో పూర్తిగా భారత బ్యాటర్ల జోరే కొనసాగింది. జురేల్ అండతో గిల్ టెస్టుల్లో పదో సెంచరీ సాధించాడు. అడపాదడపా బౌండరీతతో పరుగులు సాధించడంతో భారత్ స్కోరు సాఫీగా సాగిపోయింది. ఈ క్రమంలో జట్టు స్కోరు 500 పరుగుల్ని దాటింది. ఐదో వికెట్‌కు 102 పరుగులు జోడించాక జురేల్‌ను చేజ్ అవుట్ చేయడంతోనే గిల్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన విండీస్ ఆదిలోనే క్యాంప్‌బెల్ (10) వికెట్‌ను కోల్పోయినా... చాలాసేపు పోరాడింది. తేజ్ నారాయణ్ చందర్‌పాల్ (34; 4 ఫోర్లు, 1 సిక్స్), అతనేజ్ భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు. జట్టు స్కోరు 87 వద్ద తేజ్‌ను జడేజా అవుట్ చేశాకే భారత్‌కు పట్టు దొరికింది. పరుగు తేడాతో అతనేజ్, చేజ్ (0) వికెట్లను స్పిన్నర్లు పడగొట్టేశారు. షై హోప్ (31 బ్యాటింగ్; 5 ఫోర్లు), ఇమ్లాచ్ (14 బ్యాటింగ్; 2 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. విండీస్ ఇంకా 378 పరుగుల వెనుకంజలో ఉంది.స్కోరు వివరాలుభారత్ తొలిఇన్నింగ్స్: జైస్వాల్ రనౌట్ 175; రాహుల్ (స్టంప్డ్) ఇమ్లాచ్ (బి) వారికెన్ 38; సాయి సుదర్శన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) వారికెన్ 87; శుబ్‌మన్ (నాటౌట్) 129; నితీశ్ రెడ్డి (సి) సీల్స్ (బి) వారికెన్ 43; జురేల్ (బి) చేజ్ 44; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (134.2 ఓవర్లలో) 518/5 డిక్లేర్డ్. వికెట్ల పతనం: 1–58, 2–251, 3–325, 4–416, 5–518. బౌలింగ్: సీల్స్ 22–2–88–0, ఫిలిప్ 17–2–71–0, గ్రీవెస్ 14–1–58–0, పియర్ 30–2–120–0, వారికెన్ 34–6–98–3, చేజ్ 17.2–0–83–1.వెస్టిండీస్ తొలిఇన్నింగ్స్: క్యాంప్‌బెల్ (సి) సుదర్శన్ (బి) జడేజా 10; తేజ్ (సి) రాహుల్ (బి) జడేజా 34; అతనేజ్ (సి) జడేజా (బి) కుల్దీప్ 41; షై హోప్ (బ్యాటింగ్) 31; చేజ్ (సి) అండ్ (బి) జడేజా 0; ఇమ్లాచ్ (బ్యాటింగ్) 14; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (43 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి) 140. వికెట్ల పతనం: 1–21, 2–87, 3–106, 4–107. బౌలింగ్: బుమ్రా 6–3–18–0, సిరాజ్ 4–0–9–0, జడేజా 14–3–37–3, కుల్దీప్ 12–3–45–1, సుందర్ 7–1–23–0. -
రెండో రోజు ముగిసిన ఆట.. జడేజా స్పిన్ మ్యాజిక్
ఢిల్లీ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న సెకెండ్ టెస్టులో టీమిండియా ఆధిపత్యం కొనసాగుతోంది. రెండో రోజు ఆటలో భారత్ అటు బ్యాట్‌తో, ఇటు బంతితో అదరగొట్టింది. ఓవర్‌నైట్ స్కోరు 318/2తో రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా.. మరో 200 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేసింది.భారత బ్యాటర్లలో యశస్వి జైశ్వాల్ (177) తృటిలో డబుల్ సెంచరీ మిస్ చేసుకోగా.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్(129) శతక్కొట్టాడు. వీరిద్దరితో పాటు ధ్రువ్ జురెల్ (44), నితీశ్ రెడ్డి (43), సాయిసుదర్శన్(87) రాణించారు. వెస్టిండీస్ బౌలర్లలో వారికన్ 3 వికెట్లు తీయగా కెప్టెన్ రోస్టన్ ఛేజ్ ఒక వికెట్ పడగొట్టాడు.జడేజా మ్యాజిక్..అనంతరం బ్యాటింగ్‌కు దిగిన విండీస్ తడబడుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి కరేబియన్ జట్టు 4 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. ప్రస్తుతం విండీస్ ఇంకా భారత్ కంటే 378 పరుగులు వెనుకంజలో ఉంది. క్రీజులో టెవిన్ ఇమ్లాచ్(14), షాయ్ హోప్(31) ఉన్నారు. భారత బౌలర్లలో జడేజా బంతితో మ్యాజిక్ చేశాడు. మూడు కీలక వికెట్లు పడగొట్టి విండీస్‌ను దెబ్బ తీశాడు. అతడితో పాటు కుల్దీప్ యాదవ్ ఓ వికెట్ సాధించాడు.చదవండి: IND vs WI: శుబ్‌మన్ గిల్ సరికొత్త చరిత్ర.. డాన్ బ్రాడ్‌మన్ రికార్డు బ్రేక్ -
యంగ్(టె)స్ట్ సూపర్‌స్టార్ దొరికాడు!
జీవితంలో ఏదోటి సాధించాలని ప్రతి ఒక్కరు కల (Dream) కంటారు. కానీ కొంతమంది మాత్రమే స్వప్నాలను సాకారం చేసుకుంటారు. అహరహం శ్రమించే వారు.. కష్టాలు, నష్టాలను ఓర్చుకునే వారే మాత్రమే తాము అనుకున్నది సాధిస్తారు. పేదరికం బెదిరించినా, అవరోధాలు అడ్డుగా నిలిచినా అదరక బెదరక లక్ష్యసాధనకై ముందుకుసాగే వారు మాత్రమే విజేతలవుతారు. చరిత్రలో తమకంటూ ఓ పేజీని లిఖించుకుంటారు. మనం చెప్పుకోబోతున్న యువ క్రికెటర్ కూడా అలాంటి వాడే!క్రికెటర్ కావాలన్న తన కలను నిజం చేసుకోవడానికి 10 ఏళ్ల లేత ప్రాయంలో స్వంత ఊరిని వదిలిపెట్టాడు. ఉత్తరప్రదేశ్‌లోని తన స్వస్థలం సూర్యవాన్ను విడిచిపెట్టి బరువైన బ్యాగ్‌తో పాటు అంతకంటే బరువైన కలను తనతో మోసుకుంటూ ముంబై మహా నగరానికి చేరుకున్నాడు. మొదట ఒక పాల దుకాణం పైకప్పుపై నివసించాడు. అక్కడి నుంచి ఒక్కో అడుగు వేస్తూ తానెంతో ప్రేమించే ఆటకు దగ్గరయ్యాడు. దీని కోసం ఏం చేయాల్సి వచ్చినా వెనుకాడలేదు, వెనుదిరగలేదు. ఆజాద్ మైదాన్ (Azad Maidan) సమీపంలో పానీ పూరీ అమ్మాడు. గ్రౌండ్స్‌మెన్‌తో పరిచయం పెంచుకుని వారితో కలిసి ఒకే టెంట్ పంచుకున్నాడు. అవకాశం దొరికినప్పుడల్లా క్రికెట్ ఆడేవాడు.సంకల్ప శుద్ధి, శ్రమకు సరైన సమయంలో గైడెన్స్ దొరికితే సక్సెస్ దానంతట అదే వస్తుంది. యశ్వసి జైస్వాల్ (Yashasvi Jaiswal) విషయంలో అదే జరిగింది. అవును ఇప్పటివరకు మనం చెప్పుకున్నది ఈ యువ స్టార్ క్రికెటర్ గురించే. కోచ్ జ్వాలా సింగ్ రూపంలో అతడికి సరైన సమయంలో చేయూత దొరికింది. యశస్విలో భవిష్యత్ క్రికెటర్‌ను చూసిన ఆయన.. జైస్వాల్‌కు అన్నివిధాలా అండగా నిలిచాడు. శిక్షణ ఇవ్వడమే కాకుండా ఆశ్రయం, ఆహారంతో పాటు నమ్మకాన్ని కల్పించాడు. ఆయన మార్గదర్శకత్వంలో జైస్వాల్ ఆట పదును తేలింది. అక్కడి నుంచి అతడి ఆటే సందేశం అయింది.బ్యాటింగ్ ఆపలేదుయశస్వి జైస్వాల్‌ను ప్రత్యేకంగా నిలబెట్టింది అతడు ఆడే షాట్లు లేదా టైమింగ్ మాత్రమే కాదు.. అనుకున్నది సాధించే వరకు పట్టు వదలని సంకల్పం. వైఫల్యానికి జైస్వాల్ భయపడేవాడని కోచ్ జ్వాలా సింగ్ తరచూ చెబుతుండేవారు. ఫెయిల్యూర్‌కు భయపడి అతడు ఎప్పుడూ బ్యాటింగ్ ఆపలేదు. మ్యాచ్ తర్వాత మ్యాచ్ ఆడుతూ ప్రతి బంతిని ఎదుర్కొన్నాడు. స్కూల్ క్రికెట్, ముంబై అండర్-16, అండర్-19, తర్వాత ఇండియా అండర్-19 తరపున పరుగులు చేస్తూనే ఉన్నాడు. 2018లో అండర్-19 ఆసియా కప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 2020 నాటికి అండర్-19 ప్రపంచ కప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ఒకప్పుడు పానీ పూరీ (pani puri) అమ్మిన అదే బాలుడు ఇప్పుడు ప్రతి స్కౌట్ సంతకం చేయాలనుకునే పేరుగా మారిపోయాడు.అన్‌స్టాపబుల్ ప్లేయర్దేశీయ క్రికెట్లో ముంబై తరఫున జైస్వాల్.. అన్‌స్టాపబుల్ ప్లేయర్‌గా మారిపోయాడు. సెంచరీలు సంఖ్య పెరగడంతో అతడి ఫస్ట్ క్లాస్ సగటు 60 దాటింది. రన్స్ సాధించడమే చేయడమే కాదు.. బ్యాటింగ్ చేసిన ప్రతిసారీ తన ప్రతిభను నిరూపించుకున్నాడు. దీంతో ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిలో పడ్డాడు. 2020 ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ ఈ యంగ్ ప్లేయర్‌ను ₹2.4 కోట్లకు దక్కించుకుంది. నమంత్రపు సిరి అతడిని ఏమాత్రం మార్చలేదు. ఆకర్షణ కంటే ఆటకే ఎక్కువ విలువనిచ్చాడు. తన స్వప్నం పూర్తిగా సాకారం కాలేదన్న సత్యాన్ని గమనించి టీమిండియా పిలుపు కోసం ఎదురు చూశాడు.తొలి మ్యాచ్‌లోనే భారీ సెంచరీ2023, జూలై 12.. యశస్వి జైస్వాల్ జీవితంలో మరపురాని రోజు. ఈ రోజున వెస్టిండీస్‌తో ప్రారంభమైన మ్యాచ్‌తో టీమిండియా తరపున టెస్టుల్లో అరంగ్రేటం చేశాడు. తొట్ట తొలి మ్యాచ్‌లోనే భారీ సెంచరీ (171)తో క్రీడా ప్రపంచాన్ని ఆకర్షించాడు. అప్పటి నుంచి టెస్ట్ క్రికెట్లో తనదైన ముద్ర వేసి ముందుకు సాగుతున్నాడు. తన తొలినాళ్లలో సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) లాగానే, జైస్వాల్ ఇప్పటికే దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లలో ఆడాడు. దక్షిణాఫ్రికా మినహా, అతడు అన్ని చోట్లా అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు.జైసూ జైత్రయాత్ర2024లో ఇంగ్లాండ్‌తో జరిగిన స్వదేశీ సిరీస్‌లో జైసూ జైత్రయాత్ర చేశాడు. 40 సంవత్సరాల రికార్డును తిరగరాశాడు. ఒకే టెస్ట్ సిరీస్‌లో 700 పరుగులు పైగా సాధించిన తొలి ఆసియా ఓపెనర్‌గా రికార్డుకెక్కాడు. భారత టెస్ట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ పేరిట ఉన్న రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. తాజాగా భారత్‌లో వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో 175 పరుగులు చేసి శభాష్ అనిపించుకున్నాడు. చిన్న వయసులో ఎక్కువ టెస్ట్ సెంచరీలు సాధించిన రెండో భారత బ్యాటర్‌గా నిలిచాడు. గత రెండేళ్లుగా టెస్టుల్లో జైస్వాల్ హవా కొనసాగుతోంది. తన అరంగేట్రం తర్వాత జో రూట్ మినహా ఎవరూ అతడి కంటే ఎక్కువ టెస్ట్ పరుగులు చేయలేదు. జైసూ చేసిన ఏడు సెంచరీల్లో 4 ఆసియా వెలుపల వచ్చాయి. సచిన్ టెండూల్కర్ తర్వాత అతడే యంగెస్ట్ టెస్ట్ సూపర్‌స్టార్ అన్న కామెంట్లు విన్పిస్తున్నాయి. టీమిండియా ప్రస్తుత కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) కూడా ఫామ్‌లో ఉన్నప్పటికీ.. జైస్వాల్ కంటే వయసులో అతడు మూడేళ్లు పెద్డోడు. టెస్టుల్లో కంటే వన్డేల్లో గిల్ బ్యాటింగ్ యావరేజ్ మెరుగ్గా ఉంది.చదవండి: తలబాదుకున్న జైస్వాల్.. తప్పు నీదే!దిగ్గజాల సరసన చోటు!23 ఏళ్ల ఎడంచేతి బ్యాటర్ లాంగ్ ఫార్మాట్లో నిలకడగా రాణిస్తున్నాడు. పాతిక టెస్టులకే దాదాపు 50 శాతం బ్యాటింగ్ సగటుతో 7 సెంచరీలు, 12 అర్ధసెంచరీలు బాదాడు. ఇదే స్థిరత్వం కొనసాగిస్తే టెస్ట్ క్రికెట్లో దిగ్గజాల సరసన అతడికి చోటు దక్కడం ఖాయం. టీమిండియా టాప్-5 టెస్ట్ బ్యాటర్ల పేర్ల జాబితాలో ఎడమచేతి వాటం ఆటగాళ్లు చాలా అరుదుగా కనిపిస్తారు. అయితే జైస్వాల్ తన కెరీర్‌ను ముగించే సమయానికి ఈ లిస్ట్ కచ్చితంగా మారుతుందని స్పోర్ట్స్ ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఆజాద్ మైదాన్ కుర్రాడు ఇప్పటికే చాలా దూరం వచ్చాడు. ఇంకెంత దూరం ప్రయాణిస్తాడో, ఎన్ని మైలురాళ్లు (Milestones) అందుకుంటాడో చూడాలి!Another stellar performance ✨Yashasvi Jaiswal with yet another superb Test innings 😎Scorecard ▶ https://t.co/GYLslRzj4G#TeamIndia | #INDvWI | @IDFCFIRSTBank | @ybj_19 pic.twitter.com/oDGP8iq6Le— BCCI (@BCCI) October 11, 2025 -
శుబ్‌మన్ గిల్ సరికొత్త చరిత్ర.. డాన్ బ్రాడ్‌మన్ రికార్డు బ్రేక్
ల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. వెస్టిండీస్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించిన గిల్.. 177 బంతుల్లో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.గిల్‌కు ఇది తన కెరీర్లో పదో టెస్టు సెంచరీ కావడం విశేషం. ఇంగ్లాండ్‌పై నాలుగు సెంచరీలతో 754 పరుగులు చేసిన గిల్, ఇప్పుడు విండీస్‌పై కూడా అదే ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. అతడి సంచలన బ్యాటింగ్ ఫలితంగా భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 518 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అతడితో పాటు జైశ్వాల్(175) సూపర్ సెంచరీతో మెరిశాడు. కాగా సెంచరీతో సత్తాచాటిన గిల్ రికార్డుల మోత మోగించాడు.గిల్ రికార్డుల పంట..ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC)లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా గిల్ చరిత్ర సృష్టించాడు. డబ్ల్యూటీసీ హిస్టరీలో ఇప్పటివరకు 71 మ్యాచ్‌లు ఆడిన గిల్ 2826 పరుగులు సాధించాడు. ఇంతకముందు ఈ రికార్డు స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్(2731) పేరిట ఉండేది. తాజా ఇన్నింగ్స్‌తో పంత్‌ను గిల్ అధిగమించాడు.కెప్టెన్‌గా అత్యంత వేగంగా 5 టెస్ట్ సెంచరీలు చేసిన మూడో ప్లేయర్‌గా శుబ్‌మన్ నిలిచాడు. ఈ క్రమంలో ఆసీస్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించాడు. బ్రాడ్‌మన్ ఈ ఫీట్ సాధించడానికి 13 ఇన్నింగ్స్‌లు అవసరమవ్వగా.. గిల్ కేవలం కేవలం 12 ఇన్నింగ్స్‌లలోనే నమోదు చేశాడు. ఈ ఫీట్ సాధించిన జాబితాలో అలిస్టర్ కుక్(9), గవాస్కర్(10) తొలి రెండు స్దానాల్లో ఉన్నాడు.ఒకే క్యాలెండర్ ఇయర్లో అత్యధిక టెస్టు సెంచరీలు బాదిన టీమిండియా కెప్టెన్‌గా గిల్.. విరాట్ కోహ్లి (Virat Kohli) రికార్డు సమం చేశాడు. కోహ్లి 2017, 2018లో చెరో ఐదు సెంచరీలు చొప్పున చేశాడు. ఇప్పుడు ఈ ఏడాదిలో గిల్‌కు ఇది ఐదో టెస్టు సెంచరీ. 2025లో గిల్ మరో సెంచరీ సాధిస్తే కోహ్లి ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేస్తాడు.చదవండి: IND vs WI 2nd Test: టీమిండియాకు భారీ షాక్.. -
ఇదొక ఊహించని పరిణామం.. తప్పు అతడిదే: కుంబ్లే
టెస్టుల్లో ఇప్పటికే రెండు డబుల్ సెంచరీలు సాధించాడు టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal). వెస్టిండీస్‌తో రెండో టెస్టు సందర్భంగా ముచ్చటగా మూడోది పూర్తి చేస్తాడనుకుంటే ఊహించని రీతిలో రనౌట్ అయ్యాడు.25 పరుగుల దూరంలోఢిల్లీలో శనివారం నాటి రెండో రోజు ఆట సందర్భంగా.. అనవసరపు పరుగు కోసం యత్నించి జైసూ మూల్యం చెల్లించాడు. 175 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రనౌట్ అయి డబుల్ సెంచరీకి 25 పరుగుల దూరంలో నిలిచిపోయాడు. టీమిండియా తొలి ఇన్నింగ్స్ 92వ ఓవర్లో ఈ ఘటన జరిగింది.జేడన్ సీల్స్ (Jayden Seales) బౌలింగ్‌లో బంతిని మిడాఫ్ దిశగా జైసూ బంతిని బాదగా.. అది నేరుగా ఫీల్డర్ దగ్గరకు వెళ్లింది. అయితే అప్పటికే పరుగు కోసం క్రీజు వీడిన జైస్వాల్.. మరో ఎండ్‌లో ఉన్న కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌కు పిలుపునిచ్చాడు. కానీ ఫీల్డర్ చేతికి బంతి చిక్కడంతో జాగ్రత్త పడ్డ గిల్ కాస్త ముందుకు కదిలినా మళ్లీ తన స్థానంలోకి వచ్చేశాడు.గిల్‌కు మద్దతుగా కుంబ్లేఇంతలో జైసూ వెనక్కి పరిగెత్తగా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ నేపథ్యంలో జైసూ- గిల్ తీరుపై విమర్శలు వస్తుండగా.. టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే మాత్రం గిల్‌కు మద్దతుగా నిలిచాడు. స్వీయ తప్పిదంతోనే జైస్వాల్ వికెట్ పారేసుకున్నాడని అభిప్రాయపడ్డాడు.‘‘ఇదొక ఊహించని పరిణామం. జైస్వాల్ వంటి ప్రతిభావంతమైన ఆటగాడు ఇలా చేస్తాడని ఎవరైనా అనుకుంటారా?.. తన షాట్ బాగానే ఆడానని జైస్వాల్ భావించి ఉంటాడు. ఏదేమైనా పరుగుకోసం వెళ్లాలనేది జైస్వాల్ నిర్ణయం.తప్పంతా అతడిదేఇందులో నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న ఆటగాడి (గిల్) తప్పేమీ లేదు. ఎందుకంటే జైసూ మిడాఫ్ ఫీల్డర్‌కు నేరుగా బంతిని అందించినట్లయింది. ఆ సమయంలో పరుగుకు తీయడానికి అసలు అవకాశమే లేదు’’ అని స్టార్ స్పోర్ట్స్ షోలో కుంబ్లే పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే.. రెండో రోజు ఐదు వికెట్ల నష్టానికి 518 పరుగుల వద్ద ఉన్న వేళ టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. గిల్ 196 బంతులు ఎదుర్కొని 16 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 129 పరుగులతో అజేయంగా నిలిచాడు.చదవండి: గిల్‌పై అసహనం!.. తలబాదుకున్న జైస్వాల్.. తప్పు నీదే! -
వెస్టిండీస్‌తో రెండో టెస్టు.. టీమిండియా భారీ స్కోరు.. డిక్లేర్డ్
వెస్టిండీస్‌తో రెండో టెస్టులో టీమిండియా భారీ స్కోరు సాధించింది. శనివారం నాటి రెండో రోజు ఆట సందర్భంగా.. ఐదు వికెట్ల నష్టానికి 518 పరుగుల వద్ద తమ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal)తో పాటు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) శతకంతో చెలరేగడంతో భారత్ ఈ మేర స్కోరు సాధ్యమైంది.ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27లో భాగంగా భారత్ వేదికగా టీమిండియా- వెస్టిండీస్ రెండు మ్యాచ్‌లు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఈ క్రమంలో తొలుత అహ్మదాబాద్‌లో ఇరుజట్లు తలపడగా.. టీమిండియా ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. జైస్వాల్ భారీ శతకంఇక ఢిల్లీలో శుక్రవారం రెండో టెస్టు (IND vs WI 2nd Test) మొదలు కాగా.. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లలో కేఎల్ రాహుల్ (38) ఊహించని విధంగా స్టంపౌట్ కాగా.. యశస్వి జైస్వాల్ మాత్రం భారీ శతకంతో విరుచుకుపడ్డాడు.తొలి టెస్టు సెంచరీ మిస్మరోవైపు.. వన్‌డౌన్‌లో వచ్చిన సాయి సుదర్శన్ (87)కెరీర్లో తొలి టెస్టు సెంచరీ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు. ఈ క్రమంలో తొలిరోజు ఆటలో రెండు వికెట్ల నష్టానికి 318 పరుగులు చేసిన టీమిండియా.. శనివారం ఆట మొదలైన కాసేపటికే మూడో వికెట్ కోల్పోయింది.జైసూ రనౌట్175 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద యశస్వి జైస్వాల్ రనౌట్ అయి.. డబుల్ సెంచరీ చేజార్చుకున్నాడు. అయితే, కెప్టెన్ గిల్ నిలకడగా ఆడుతూ సెంచరీ పూర్తి చేసుకోగా.. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డి 43, వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ 44 పరుగులు చేసి.. అర్ధ శతకాలు పూర్తి చేసుకోకుండానే వెనుదిరిగారు.𝗚𝗶𝗹𝗹. 𝗚𝗹𝗼𝗿𝘆. 𝗚𝗿𝗲𝗮𝘁𝗻𝗲𝘀𝘀. 🙌@ShubmanGill reaches a brilliant century, guiding #TeamIndia towards a huge total, inching closer to the 500 mark! 🏏💪Catch the LIVE action 👉 https://t.co/tg7ZEVlTSH#INDvWI 👉 2nd Test, Day 2 | Live Now on Star Sports &… pic.twitter.com/vIWGDISIcx— Star Sports (@StarSportsIndia) October 11, 2025గిల్ నిలకడగాఇక గిల్ మొత్తంగా 196 బంతులు ఎదుర్కొని 16 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 129 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో 134.2 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 518 పరుగుల వద్ద ఉన్న వేళ.. టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. వెస్టిండీస్ బౌలర్లలో లెఫ్టార్మ్ స్పిన్నర్ జొమెల్ వారికన్ రాహుల్, సాయి, నితీశ్ రెడ్డి వికెట్లు తీయగా.. కెప్టెన్ రోస్టన్ ఛేజ్ జురెల్ వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.చదవండి: గిల్‌పై అసహనం!.. తలబాదుకున్న జైస్వాల్.. తప్పు నీదే! -
శతక్కొట్టి.. చరిత్ర సృష్టించిన శుబ్‌మన్ గిల్
వెస్టిండీస్‌తో రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) శతకంతో మెరిశాడు. 177 బంతుల్లో వంద పరుగుల మార్కు అందుకున్నాడు. టెస్టుల్లో అతడికి ఇది పదో సెంచరీ కావడం విశేషం.ఆరునెలలు తిరిగే లోపేఅంతేకాదు.. ఈ ఏడాది గిల్‌కు ఐదో టెస్టు శతకం. తద్వారా ఒకే క్యాలెండర్ ఇయర్లో అత్యధిక టెస్టు సెంచరీలు బాదిన టీమిండియా కెప్టెన్‌గా గిల్.. విరాట్ కోహ్లి (Virat Kohli) రికార్డు సమం చేశాడు. 2017, 2018లో కోహ్లి ఈ ఘనత సాధించాడు. ఇక టీమిండియా కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టి ఆరునెలలు తిరిగే లోపే గిల్ ఈ ఫీట్ సాధించడం మరో విశేషం.𝗚𝗶𝗹𝗹. 𝗚𝗹𝗼𝗿𝘆. 𝗚𝗿𝗲𝗮𝘁𝗻𝗲𝘀𝘀. 🙌@ShubmanGill reaches a brilliant century, guiding #TeamIndia towards a huge total, inching closer to the 500 mark! 🏏💪Catch the LIVE action 👉 https://t.co/tg7ZEVlTSH#INDvWI 👉 2nd Test, Day 2 | Live Now on Star Sports &… pic.twitter.com/vIWGDISIcx— Star Sports (@StarSportsIndia) October 11, 2025ఇంగ్లండ్ పర్యటనలో నాలుగుకాగా జూన్‌లో ఇంగ్లండ్ పర్యటనకు ముందు కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడంతో.. అతడి స్థానంలో గిల్ సారథ్య బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టెస్టుల్లో భాగంగా గిల్ నాలుగు శతకాలు బాదాడు.అంతేకాదు ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో ఒకే ఇన్నింగ్స్‌లో ఏకంగా 269 పరుగులు సాధించి.. ఈ వేదిక మీద డబుల్ సెంచరీ సాధించిన భారత తొలి కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. ఇక టీమిండియా తాజాగా స్వదేశంలో వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ ఆడుతోంది.ఈ క్రమంలో అహ్మదాబాద్‌లో తొలి టెస్టు జరుగగా.. భారత్.. విండీస్‌ను ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో చిత్తు చేసింది. అనంతరం ఢిల్లీ వేదికగా ఇరుజట్ల మధ్య శుక్రవారం రెండో టెస్టు మొదలుకాగా.. టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగింది. తొలి ఇన్నింగ్స్ డిక్లేర్తొలిరోజు రెండు వికెట్ల నష్టానికి 318 పరుగులు చేసిన భారత జట్టు.. శనివారం నాటి రెండో రోజు ఆటలో తమ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. 134.2 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 518 పరుగుల భారీ స్కోరు వద్ద ఉన్న వేళ డిక్లేర్ చేస్తున్నట్లు ప్రకటించింది. గిల్ 196 బంతుల్లో 129 పరుగులు సాధించాడు. మిగిలిన వాళ్లలో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (175) భారీ శతకం సాధించగా.. వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ (87) గొప్పగా రాణించాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ 38, ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్‌రెడ్డి 43, వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ 44 పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో స్పిన్నర్ జొమెల్ వారికన్ మూడు వికెట్లు తీయగా.. కెప్టెన్ రోస్టన్ ఛేజ్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.చదవండి: గిల్‌పై అసహనం!.. తలబాదుకున్న జైస్వాల్.. తప్పు నీదే! -
నితీశ్ రెడ్డికి ప్రమోషన్.. ధనాధన్ దంచికొట్టి.. అంతలోనే..
వెస్టిండీస్‌తో రెండో టెస్టులో టీమిండియా (IND vs WI) అదరగొడుతోంది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను వైట్‌వాష్ చేయడమే లక్ష్యంగా బరిలోకి దిగిన గిల్ సేన.. లక్ష్యం దిశగా పయనిస్తోంది. శనివారం నాటి రెండో రోజు ఆట భోజన విరామ సమయానికి 116 ఓవర్లలో.. నాలుగు వికెట్ల నష్టానికి 427 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది.కాగా అహ్మదాబాద్ వేదికగా తొలి టెస్టులో విండీస్‌ను ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా.. ఢిల్లీలో విండీస్‌తో శుక్రవారం రెండో టెస్టు మొదలుపెట్టిన విషయం తెలిసిందే. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్.. తొలిరోజు ఆటలో కేవలం రెండు వికెట్లు నష్టపోయి 318 పరుగులు చేసి ఆధిక్యం ప్రదర్శించింది.డబుల్ సెంచరీ మిస్ చేసుకు న్న జైసూఈ క్రమంలో 318/2 ఓవర్‌నైట్ స్కోరుతో శనివారం నాటి రెండో రోజు ఆట మొదలుపెట్టిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. 173 పరుగులతో ఆట మొదలుపెట్టిన ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal).. మరో రెండు పరుగులు జతచేసి దురదృష్టవశాత్తూ రనౌట్ అయ్యాడు. దీంతో డబుల్ సెంచరీ చేయకుండానే జైసూ (175) నిష్క్రమించాడు.నితీశ్ రెడ్డి ధనాధన్అయితే, కెప్టెన్ శుబ్‌మన్ గిల్ నిలకడగా ఆడుతూ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. అతడికి తోడుగా.. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి ధనాధన్ దంచికొట్టాడు. ఫోర్లు, సిక్సర్లు బాదుతూ జోరు కనబరిచిన ఈ విశాఖ కుర్రాడు.. తృటిలో అర్ధ శతకాన్ని చేజార్చుకున్నాడు. 54 బంతులు ఎదుర్కొని నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 43 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్న వేళ.. విండీస్ స్పిన్నర్ జొమెల్ వారికన్ అద్భుత బంతితో నితీశ్ రెడ్డిని వెనక్కి పంపాడు.𝗕𝗶𝗴 𝗵𝗶𝘁, 𝗯𝗶𝗴 𝗶𝗺𝗽𝗮𝗰𝘁! 🙌#NitishKumarReddy hits a massive six, firing up the crowd as #TeamIndia builds momentum. 🔥Catch the LIVE action 👉 https://t.co/tg7ZEVlTSH#INDvWI 👉 2nd Test, Day 2 | Live Now on Star Sports & JioHotstar pic.twitter.com/OZzBhNROPF— Star Sports (@StarSportsIndia) October 11, 2025 ఐదో నంబర్‌కు ప్రమోట్ అయిటీమిండియా తొలి ఇన్నింగ్స్ 108.3వ ఓవర్లో వారికన్ బౌలింగ్‌లో జేడన్ సీల్స్కు క్యాచ్ ఇచ్చి నితీశ్ రెడ్డి పెవిలియన్ చేరాడు. కాగా బ్యాటింగ్ ఆర్డర్లో ఐదో నంబర్‌కు ప్రమోట్ అయి.. ధనాధన్ దంచికొట్టి ఇలా అతడు వెనుదిరగడం అభిమానులన నిరాశపరిచింది.ఇక లంచ్ బ్రేక్ సమయానికి గిల్ 75 పరుగులు, ధ్రువ్ జురెల్ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకు ముందు అంటే తొలి రోజు ఓపెనర్ కేఎల్ రాహుల్ (38) విఫలం కాగా.. వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ శతకం (87) చేజార్చుకున్న విషయం తెలిసిందే. ఇక విండీస్ తీసిన నాలుగు వికెట్లలో మూడు వారికన్ ఖాతాలోనే ఉన్నాయి. జైసూ రనౌట్‌తో విండీస్‌కు మరో కీలక వికెట్ దక్కింది.చదవండి: గిల్‌పై అసహనం!.. తలబాదుకున్న జైస్వాల్.. తప్పు నీదే!Leading from the front! 👑Captain @ShubmanGill brings up a classy half-century - crossing 1000 runs as skipper in international cricket! 💥Catch the LIVE action 👉 https://t.co/tg7ZEVlTSH#INDvWI 👉 2nd Test, Day 2 | Live Now on Star Sports & JioHotstar pic.twitter.com/CDjnnehzO6— Star Sports (@StarSportsIndia) October 11, 2025 -
గిల్‌పై అసహనం!.. తలబాదుకున్న జైస్వాల్.. తప్పు నీదే!
వెస్టిండీస్‌తో రెండో టెస్టులో భారీ శతకంతో కదంతొక్కిన టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. శనివారం నాటి రెండో రోజు ఆట ఆరంభమైన కాసేపటికే రనౌట్ అయ్యాడు. ద్విశతకానికి పాతిక పరుగుల దూరంలో నిలిచిపోయాడు.ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC) 2025-27 సైకిల్లో భాగంగా భారత్- వెస్టిండీస్ (IND vs WI) మధ్య రెండు మ్యాచ్‌ల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. అహ్మదాబాద్‌లో జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో విండీస్‌ను చిత్తు చేసిన టీమిండియా.. 1-0తో ఆధిక్యంలో ఉంది.తొలిరోజు భారత్దేఈ క్రమంలో ఇరుజట్ల మధ్య ఢిల్లీ వేదికగా శుక్రవారం రెండో టెస్టు మొదలుకాగా.. టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లలో కేఎల్ రాహుల్ (38) విఫలం కాగా.. యశస్వి జైస్వాల్ భారీ శతకం బాదాడు. అతడికి తోడుగా వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ (Sai Sudharsan- 87) రాణించాడు.జైసూ డబుల్ సెంచరీ మిస్ఈ క్రమంలో తొలిరోజు ఆట ముగిసే సరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 318 పరుగులు చేసింది. జైస్వాల్ 173, కెప్టెన్ శుబ్‌మన్ గిల్ 20 పరుగులతో క్రీజులో నిలిచారు. ఇక శనివారం ఆట సందర్భంగా డబుల్ సెంచరీ పూర్తి చేసుకోవాలని భావించిన జైస్వాల్ తన తొందరపాటు చర్యతో రనౌట్ అయ్యాడు.గిల్ తప్పా?టీమిండియా తొలి ఇన్నింగ్స్ 92వ ఓవర్లో విండీస్ పేసర్ జేడన్ సీల్స్ బంతితో రంగంలోకి దిగాడు. అతడి బౌలింగ్‌లో రెండో బంతికి మిడాఫ్ దిశగా జైసూ బాదిన బంతి నేరుగా ఫీల్డర్ చెంతకు చేరింది. అయితే, ఇంతలోనే జైస్వాల్ పరుగు కోసం క్రీజు వీడగా.. గిల్ మాత్రం పరిస్థితికి తగ్గట్టుగా నాన్-స్ట్రైకర్ ఎండ్‌లోనే ఉండిపోయాడు.Yashasvi Jaiswal (runout) seems to have developed a habit of taking off for a run even when the ball goes straight to the fielder. He really needs to learn from this —When you're on a big score, what's the rush for a single? 🤦♂️pic.twitter.com/asdamXT1zj— Sporttify (@sporttify) October 11, 2025 తల బాదుకున్న జైసూదీంతో జైస్వాల్ వెనక్కి పరిగెత్తగా.. అప్పటికే ఫీల్డర్ నుంచి బంతిని అందుకున్న వికెట్ కీపర్ టెవిన్ ఇమ్లాచ్ దానిని వికెట్లకు గిరాటేశాడు. ఫలితంగా తన ఓవర్‌నైట్ స్కోరుకు కేవలం రెండు పరుగులు జతచేసి రనౌట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో తీవ్ర నిరాశకు గురైన జైసూ.. కోపంలో తలబాదుకుంటూ క్రీజును వీడాడు.తప్పు నీదేఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతుండగా.. కొంతమంది గిల్‌ను తప్పుబడుతున్నారు. అయితే, చాలా మంది మాత్రం.. ‘బంతి ఫీల్డర్ చేతుల్లోకి వెళ్లినా తొందరపడి పరుగుకు రావడం జైసూ తప్పు. అతడికి ఇదొక అలవాటుగా మారింది. 175 పరుగులు చేసిన నీకు ఈ రిస్కీ సింగిల్ అవసరమా? ఇది నీ స్వీయ తప్పిదం’’ అంటూ జైస్వాల్‌ను విమర్శిస్తున్నారు.కాగా జైస్వాల్ తొలి ఇన్నింగ్స్‌లో మొత్తంగా 258 బంతులు ఎదుర్కొని 22 ఫోర్ల సాయంతో 175 పరుగులు సాధించాడు. వంద ఓవర్ల ఆట పూర్తయ్యేసరికి టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 371 పరుగులు చేసింది. గిల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన నితీశ్ కుమార్ రెడ్డి 20 పరుగులతో క్రీజులో ఉన్నాడు. చదవండి: యువీ తల్లిని పెళ్లి చేసుకుని తప్పు చేశా.. ఆమెను ఇంట్లో పెట్టి తాళం వేసేవాడిని! -
నాలో దూకుడు అలాగే ఉంది.. కానీ: గంభీర్ కామెంట్స్ వైరల్
టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనలో ఇప్పటికీ దూకుడు అలాగే ఉందని.. మైదానంలో తనను తాను ఇలా ఆవిష్కరించుకోవడం తన సహజమైన భావోద్వేగం అని తెలిపాడు. అయితే, వయసు పెరుగుతున్న దృష్ట్యా ఇంట్లో వాళ్ల కోసం కొన్నిసార్లు తనను తాను సంభాళించుకుంటున్నానని తెలిపాడు.కోహ్లితోనూ గొడవటీమిండియాకు ఆడిన రోజుల్లో గంభీర్ ఎంత అగ్రెసివ్‌గా ఉండేవాడో క్రికెట్ ప్రేమికులకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా దాయాది పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో దూకుడు ప్రదర్శిస్తూ ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లకు తనదైన శైలిలో కౌంటర్లు ఇచ్చేవాడు. అంతేకాదు.. భారత దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli)తోనూ.. ఈ వరల్డ్‌కప్ విన్నర్ గొడవ పడిన విషయం తెలిసిందే.ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ‘ఢిల్లీ బాయ్స్’ గంభీర్- కోహ్లి రెండుసార్లు తీవ్ర స్థాయిలో వాగ్వాదం చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. 43 ఏళ్ల గంభీర్ టీమిండియా హెడ్‌కోచ్‌గా వచ్చిన తర్వాత పాత పగలు పక్కనపెట్టి కోహ్లితో కలిసిపోయాడు. తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని స్వయంగా వీరిద్దరు చెప్పడంతో అభిమానుల మధ్య సోషల్ మీడియా ఫైట్స్‌కు తెరపడింది.ఎప్పుడూ గంభీరంగానేఇక గంభీర్ డగౌట్‌లోనూ ఎప్పుడూ గంభీరంగానే ఉంటాడన్న విషయం తెలిసిందే. అతడి ముఖంలో అమావాస్యకో.. పున్నమికో గానీ నవ్వు కనిపించదు. ఎప్పుడూ సీరియస్‌గా ఉండే గంభీర్‌పై ఈ విషయంలో ఎన్నో మీమ్స్ కూడా వస్తూ ఉంటాయి.నేను మారలేదుఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడిన గౌతం గంభీర్ తన వ్యవహారశైలి గురించి తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘నాలో ఇప్పటికీ ఆ దూకుడు అలాగే ఉంది. నేను మారలేదు. అగ్రెసివ్‌గా ముందుకు వెళ్లాలనుకున్నపుడు గొడవ పడటమే నాకు ముందుగా గుర్తుకువస్తుంది.ఇంట్లో పిల్లలు ఉన్నారుఅయితే, వయసు పెరిగింది కాబట్టి.. నా మనసు.. ‘ఇంట్లో పిల్లలు ఉన్నారు’ కదా అని హెచ్చరిస్తుంది’’ అంటూ గంభీర్ సరదాగా వ్యాఖ్యానించాడు. కాగా టీమిండియా ప్రస్తుతం స్వదేశంలో వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌తో బిజీగా ఉంది.రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి టెస్టులో విండీస్‌ను ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో చిత్తు చేసిన గిల్ సేన.. శుక్రవారం మొదలుపెట్టిన రెండో టెస్టులోనూ జోరు కనబరుస్తోంది. టీమిండియా- వెస్టిండీస్ రెండో టెస్టు తొలిరోజు ఆట సందర్భంగా గంభీర్ స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ పైవిధంగా స్పందించాడు. టీమ్ డిన్నర్ఇక ఈ మ్యాచ్‌కు ముందు గౌతీ తన ఇంట్లో టీమిండియాకు డిన్నర్‌పార్టీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌తో పాటు జస్ప్రీత్ బుమ్రా,ధ్రువ్ జురెల్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, ప్రసిద్ కృష్ణ సహా కోచ్‌లు ర్యాన్ టెన్ డష్కాటే, మోర్నీ మోర్కెల్, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా గంభీర్ పార్టీకి హాజరైనట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించి గిల్‌కు పగ్గాలు అప్పగించడంపై గంభీర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో గౌతీ టీమ్ డిన్నర్ ఇవ్వడం గమనార్హం. చదవండి: ‘యువీ గనుక తన పిల్లల్ని.. నాకు అప్పగిస్తే వారికీ అదే ‘గతి’ పట్టిస్తా’ -
రోహిత్‌కే కాదు.. నాకు ద్రవిడ్‌కు ఇలానే జరిగింది: సౌరవ్ గంగూలీ
భారత వన్డే జట్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మ స్ధానంలో యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్‌ను బీసీసీఐ నియమించిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా టూర్‌కు ముందు అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఈ ఆకస్మిక నిర్ణయం తీసుకుంది. దీంతో చాలా మంది సెలక్టర్ల నిర్ణయాన్ని తప్పుబట్టారు.రోహిత్‌ను కావాలనే కెప్టెన్సీ నుంచి తప్పించారని విమర్శించారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. రోహిత్‌ను వన్డే కెప్టెన్‌గా ఉద్దేశపూర్వకంగానే తొలగించారనే వాదనను గంగూలీ తోసిపుచ్చాడు. ప్రతీ కెప్టెన్‌కు కెరీర్ ఎండ్ సమయంలో ఇలా జరుగుతుందని దాదా అభిప్రాయపడ్డాడు. రోహిత్ ఇకపై వన్డే జట్టులో ప్లేయర్‌గా కొనసాగనున్నాడు. అయితే వన్డే ప్రపంచకప్-2027లో హిట్‌మ్యాన్ ఆడుతాడో లేదో ఇంకా స్పష్టత లేదు."రోహిత్‌తో మాట్లాడిన తర్వాతే సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకుని ఉంటారు. ఉద్దేశపూర్వకంగా అయితే అతడిని తప్పించి ఉండరు. రోహిత్, సెలక్టర్ల మధ్య పరస్పర అంగీకారంతోనే ఈ మార్పు చోటు చేసుకుందని అనుకుంటున్నా. రోహిత్ ఒక అద్భుతమైన కెప్టెన్. అతడు భారత్‌కు టీ20 ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్స్‌ను అందించాడు.వ్యక్తిగత ప్రదర్శన పరంగా కూడా రోహిత్ ముందంజలో ఉన్నాడు. ఇక్కడ రోహిత్ కెప్టెన్సీ, ఫెర్మామ్మెన్స్ సమస్య కాదు. 2027 నాటికి రోహిత్‌కు 40 ఏళ్లు వస్తాయి. క్రికెట్లో వయస్సు పరంగా అది చాలా ఎక్కవ నంబర్. కెరీర్ ఆఖరిలో ప్రతీ కెప్టెన్‌కు ఇలానే జరుగుతోంది. నాకు,ద్రవిడ్‌కు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. శుబ్‌మన్ గిల్ కూడా 40 ఏళ్ల వయస్సులో ఇదే పరిస్థితిని ఎదుర్కొంటాడు. జేంటిల్మ్యాన్ గేమ్‌లో ప్రతీ ఒక్కరు ఏదో రోజున తమ కెరీర్‌ను ముగించాల్సిందే. గిల్‌ను కెప్టెన్‌గా ప్రమోట్ చేయడం సరైన నిర్ణయమే. అతడు ఇంగ్లండ్ టూర్లో అద్భుతంగా జట్టును నడిపించాడు. కెప్టెన్‌గా గిల్ ఎదిగే వరకు రోహిత్ ఆడుతూనే ఉండవచ్చు" ఓ ఇంటర్వ్యూలో గంగూలీ పేర్కొన్నాడు.చదవండి: కెప్టెన్‌గా శార్ధూల్ ఠాకూర్.. సర్ఫరాజ్ ఖాన్ రీ ఎంట్రీ! నో సూర్య కుమార్? -
నిరాశపరిచిన కేఎల్ రాహుల్.. లంచ్ బ్రేక్ సమయానికి స్కోరెంతంటే?
ఢిల్లీ వేదికగా టీమిండియా- వెస్టిండీస్ మధ్య శుక్రవారం (అక్టోబరు 10) రెండో టెస్టు (IND vs WI 2nd Test) మొదలైంది. అరుణ్‌జైట్లీ స్టేడియంలో టాస్ గెలిచిన భారత జట్టు సారథి శుబ్‌మన్ గిల్ (Shubman Gill).. తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal), కేఎల్ రాహుల్ టీమిండియాకు శుభారంభం అందించారు.ఈసారి నిరాశపరిచిన కేఎల్ రాహుల్అయితే, గత మ్యాచ్‌లో సెంచరీ సాధించిన రాహుల్ ఈసారి మాత్రం కాస్త నిరాశపరిచాడు. 54 బంతుల్లో ఐదు ఫోర్లు, ఒక సిక్సర్ బాది 38 పరుగులు చేసి నిష్క్రమించాడు. విండీస్ లెఫ్టార్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్ జొమెల్ వారికన్ తన తొలి ఓవర్లోనే అద్భుతమైన బంతితో రాహుల్‌ను బోల్తా కొట్టించాడు.Shifting gears! ⚙After a steady start, @klrahul unwinds with an elegant punch down the ground. ⚡Catch the LIVE action 👉 https://t.co/8pkqpa9s4Z#INDvWI 👉 2nd Test, Day 1 | Live Now on Star Sports & JioHotstar pic.twitter.com/CpSkK3IJXi— Star Sports (@StarSportsIndia) October 10, 2025స్టంపౌట్గాటీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో పద్దెనిమిదవ ఓవర్ మూడో బంతికి వారికన్ బౌలింగ్‌లో షాట్ ఆడేందుకు ప్రయత్నించిన రాహుల్ విఫలమయ్యాడు. ఈ క్రమంలో వెంటనే బంతిని అందుకున్న వికెట్ కీపర్ టెవిన్ ఇమ్లాచ్ బెయిల్స్‌కు గిరాటేశాడు. pic.twitter.com/iNdmtNK9e6— crictalk (@crictalk7) October 10, 2025 దీంతో కనీసం హాఫ్ సెంచరీ కూడా చేయకుండానే దురదృష్టవశాత్తూ స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో 58 పరుగుల స్కోరు వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది.లంచ్ బ్రేక్ సమయానికి స్కోరెంతంటే?ఇక తొలి టెస్టులో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ రెండో టెస్టులో ఓపికగా ఆడుతున్నాడు. తొలిరోజు నాటి భోజన విరామ సమయానికి జైసూ 78 బంతులు ఎదుర్కొని ఏడు ఫోర్ల సాయంతో 40 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన సాయి సుదర్శన్ 36 బంతుల్లో మూడు ఫోర్లు బాది 16 పరుగులతో జైసూతో కలిసి అజేయంగా నిలిచాడు. ఫలితంగా శుక్రవారం లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా 28 ఓవర్ల ఆట పూర్తి చేసుకుని వికెట్ నష్టానికి 94 పరుగులు చేసింది. ఇదిలా ఉంటే.. తొలి టెస్టులో టీమిండియా విండీస్‌ను ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో త్తుగా ఓడించి.. రెండుమ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. తుది జట్లు..టీమిండియాయశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), ధ్రువ్ జురెల్ (వికెట్‌కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మొహహ్మద్ సిరాజ్వెస్టిండీస్: జాన్ క్యాంప్‌బెల్, తగ్‌నరైన్ చందర్‌పాల్, అలిక్ అథనాజ్, షాయ్ హోప్, రోస్టన్ చేజ్(కెప్టెన్), టెవిన్ ఇమ్లాచ్(వికెట్‌కీపర్), జస్టిన్ గ్రీవ్స్, జోమెల్ వారికన్, ఖరీ పియర్, అండర్సన్ ఫిలిప్, జేడెన్ సీల్స్చదవండి: అందుకే గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోయాం.. తనొక అద్భుతం: భారత కెప్టెన్ -
విండీస్‌తో రెండో టెస్ట్.. ఎట్టకేలకు టాస్ గెలిచిన శుభ్‌మన్ గిల్
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఇవాల్టి నుంచి (అక్టోబర్ 10) భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య రెండో టెస్ట్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టీమిండియా కెప్టెన్‌గా శుభ్‌మన్‌కు ఇది తొలి టాస్ విజయం. అతను టెస్ట్ కెప్టెన్ అయ్యాక వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో టాస్‌లు ఓడాడు.ఈ మ్యాచ్ కోసం భారత్ ఎలాంటి మార్పులు చేయలేదు. తొలి టెస్ట్‌లో ఆడిన జట్టునే యధాతథంగా బరిలోకి దించింది. విండీస్ మాత్రం రెండు మార్పులతో బరిలోకి దిగనుంది. కింగ్, జోహన్ లేన్ స్థానాల్లో టెవిమ్ ఇమ్లాచ్, ఆండర్సన్ ఫిలిప్ జట్టులోకి వచ్చారు. కాగా, రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. తుది జట్లు..వెస్టిండీస్: జాన్ క్యాంప్‌బెల్, తేజ్‌నరైన్ చందర్‌పాల్, అలిక్ అథనాజ్, షాయ్ హోప్, రోస్టన్ చేజ్(కెప్టెన్), టెవిన్ ఇమ్లాచ్(వికెట్‌కీపర్), జస్టిన్ గ్రీవ్స్, జోమెల్ వారికన్, ఖరీ పియర్, అండర్సన్ ఫిలిప్, జేడెన్ సీల్స్భారత్: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), ధ్రువ్ జురెల్(వికెట్‌కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్చదవండి: క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా..! -
అతడిని ఎందుకు సెలక్ట్ చేస్తున్నారో అర్థం కాదు: అశ్విన్ ఫైర్
ఆస్ట్రేలియా సిరీస్ నేపథ్యంలో టీమిండియా సెలక్టర్ల తీరుపై భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) ఆగ్రహం వ్యక్తం చేశాడు. రెండేళ్ల క్రితం అద్భుతమైన డెలివరీ సంధించాడని.. అదే ప్రాతిపదికగా ఇప్పటికీ ఓ ఆటగాడికి జట్టులో స్థానం కల్పిస్తున్నారంటూ ‘యువ పేసర్’ను టార్గెట్ చేశాడు.గిల్ సారథ్యంలో ..వెస్టిండీస్ స్వదేశంలో టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత టీమిండియా ఆస్ట్రేలియా పర్యటన (IND vs AUS)కు వెళ్లనుంది. ఆతిథ్య జట్టుతో అక్టోబరు 19- నవంబరు 8 వరకు మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఇందుకు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇప్పటికే జట్టును ప్రకటించింది.వన్డే కెప్టెన్‌గా రోహిత్ శర్మపై వేటు వేసిన బీసీసీఐ.. అతడి స్థానంలో శుబ్‌మన్ గిల్ (Shubman Gill)కు పగ్గాలు అప్పగించింది. ఇక ఆసీస్‌తో ఆడే వన్డే, టీ20 జట్లలో యువ పేసర్ హర్షిత్ రాణాకు చోటు దక్కడం గమనార్హం. ఈ నేపథ్యంలో అశ్విన్ ఘాటుగా స్పందించాడు.అతడిని ఎందుకు సెలక్ట్ చేస్తున్నారో అర్థం కాదు‘‘అసలు అతడిని ఎందుకు సెలక్ట్ చేస్తున్నారో అర్థం కావడం లేదు. నాకైతే ఈ విషయం అంతుపట్టడం లేదు. రాణాను జట్టులో చేర్చడానికి గల కారణమేమిటో తెలుసుకునేందుకైనా సెలక్షన్ కమిటీ సమావేశంలో భాగమైతే బాగుండు అనిపిస్తోంది.ఆస్ట్రేలియాలో బ్యాట్‌తోనూ రాణించగల ఫాస్ట్‌బౌలర్ టీమిండియాకు అవసరం. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేయగలిగే బౌలర్‌ను వాళ్లు ఎంపిక చేయాలి. నాకైతే అతడి బ్యాటింగ్‌పై ఎలాంటి నమ్మకమూ లేదు. రెండేళ్ల క్రితం ఐపీఎల్ మ్యాచ్‌లో నితీశ్ కుమార్ రెడ్డిని అద్భుతమైన పేస్ డెలివరీతో అవుట్ చేసినందుకు.. నేటికీ ఆ ఒక్క కారణంతోనే వరుస అవకాశాలు ఇస్తున్నారు’’ అని అశ్విన్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.గంభీర్‌కే చురకలుకాగా ఢిల్లీకి చెందిన హర్షిత్ రాణా ఐపీఎల్-2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ సమయంలో కేకేఆర్ మెంటార్‌గా ఉన్న గౌతం గంభీర్.. తర్వాత టీమిండియా హెడ్‌కోచ్ అయ్యాడు. ఈ క్రమంలో గంభీర్ ప్రియ శిష్యుడైన హర్షిత్ ఇప్పటికే మూడు ఫార్మాట్లలోనూ అరంగేట్రం చేయడమే కాదు.. వైఫల్యాలు ఎదురైనా జట్టులో వరుస అవకాశాలు దక్కించుకోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో అశూ పరోక్షంగా గంభీర్‌కు ఈ విధంగా చురకలు అంటించినట్లు తెలుస్తోంది.చదవండి: వన్డే కెప్టెన్‌గా రోహిత్‌పై వేటు!.. నాకు ముందే తెలుసు: గిల్ -
రోహిత్‌పై వేటు!.. నాకు ముందే తెలుసు: శుబ్‌మన్ గిల్
రోహిత్ శర్మ నుంచి తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని టీమిండియా టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) తెలిపాడు. రోహిత్ భయ్యా తనకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నాడు. టీమిండియాకు రెండు ఐసీసీ టైటిళ్లు అందించిన సారథి రోహిత్ శర్మ (Rohit Sharma).వన్డే కెప్టెన్‌గా రోహిత్‌పై వేటు!గతేడాది టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియాను చాంపియన్‌గా నిలిపిన రోహిత్.. ఈ ఏడాది ఐసీసీ (వన్డే) చాంపియన్స్ ట్రోఫీ -2025లో జట్టుకు కప్ అందించాడు. ఇక ఇప్పటికే అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన హిట్‌మ్యాన్.. ఇటీవలే టెస్టులకూ రిటైర్మెంట్ ప్రకటించగా.. టెస్టు సారథిగా గిల్ అతడి స్థానాన్ని భర్తీ చేశాడు.అయితే, వన్డేల్లో కొనసాగుతానని రోహిత్ శర్మ చెప్పినా.. బీసీసీఐ (BCCI) ఇటీవలే అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించింది. రోహిత్ స్థానంలో వన్డే కొత్త కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్‌ను నియమించింది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ సందర్భంగా అతడి శకం మొదలుకానుంది. ఇక ప్రసుతం స్వదేశంలో వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌తో బిజీగా ఉన్న గిల్ గురువారం మీడియాతో మాట్లాడాడు.నాకు ముందే ఈ విషయం గురించి తెలుసుఈ సందర్భంగా వన్డే సారథిగా రోహిత్ శర్మ స్థానాన్ని భర్తీ చేయడం గురించి స్పందిస్తూ.. ‘‘టెస్టు మ్యాచ్ మధ్యలోనే ఈ ప్రకటన వచ్చింది. అయితే, అంతకంటే ముందే నాకు ఈ విషయం గురించి తెలుసు. నాకు దక్కిన గొప్ప గౌరవం. అతిపెద్ద బాధ్యత.వన్డేల్లో టీమిండియాను ముందుకు నడిపించడానికి ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నా. గత కొన్ని నెలలుగా నా జీవితం కొత్తగా మారిపోయింది. ఉత్సుకతను పెంచింది. భవిష్యత్తులో జట్టును గొప్పగా ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తా’’ అని గిల్ పేర్కొన్నాడు. మూడు ఫార్మాట్లలోనూ నాయకత్వం వహించేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిపాడు.రోహిత్ భాయ్ నుంచి నేర్చుకున్నవి ఇవేఇక రోహిత్ శర్మ గురించి ప్రస్తావన రాగా.. ‘‘రోహిత్ భాయ్‌లో ఎన్నో గొప్ప గుణాలు ఉన్నాయి. వాటిని వారసత్వంగా నేను స్వీకరిస్తా. ముఖ్యంగా ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రశాంతంగా ఉండటం.. డ్రెసింగ్‌రూమ్‌లో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడం ఆయనలో నాకు నచ్చే గుణాలు. ఈ రెండింటిని నేను తప్పకుండా కొనసాగిస్తా’’ అని గిల్ పేర్కొన్నాడు.కాగా వెస్టిండీస్‌తో తొలి టెస్టులో ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా.. అక్టోబరు 10- 14 మధ్య జరిగే రెండో టెస్టులోనూ గెలిచి వైట్‌వాష్ చేయాలని పట్టుదలగా ఉంది. ఈ మ్యాచ్‌కు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానం వేదిక. చదవండి: నిజం చెప్పడానికి సిగ్గెందుకు?: సూర్యకుమార్ యాదవ్ -
టీమిండియాకు గంభీర్ డిన్నర్ పార్టీ!.. రోహిత్- కోహ్లి ఓ రోజు ముందుగానే..
ఇటీవలే ఆసియా టీ20 కప్-2025 (Asia Cup) గెలిచిన టీమిండియా వరుస సిరీస్‌లతో బిజీ బిజీగా గడుపనుంది. అక్టోబరు నెల మొత్తం భారత క్రికెట్ జట్టు ఆటలో తలమునకలు కానుంది. ఇప్పటికే స్వదేశంలో వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ మొదలుపెట్టిన టీమిండియా.. తొలి మ్యాచ్‌ను మూడు రోజుల్లోనే ముగించి జయభేరి మెగించింది.ఇరుజట్ల మధ్య ఢిల్లీ వేదికగా రెండో టెస్టుకు అక్టోబరు 10- 14 వరకు రెండో టెస్టుకు షెడ్యూల్ ఖరారైంది. ఇక ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత టీమిండియా ఆస్ట్రేలియా పర్యటన (India Tour Of Australia 2025)కు బయల్దేరనుంది. అక్టోబరు 15వ తేదీనే గిల్ సేన భారత్ నుంచి ఆసీస్‌కు పయనం కానున్నట్లు సమాచారం.టీమిండియాకు గంభీర్ డిన్నర్ పార్టీ!అయితే, అంతకంటే ముందు హెడ్‌కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) టీమిండియాకు తన నివాసంలో డిన్నర్ పార్టీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా ఆసీస్ టూర్‌కు ముందు... వన్డే కెప్టెన్‌గా రోహిత్ శర్మపై వేటు వేసిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) శుబ్‌మన్ గిల్‌ను కొత్త సారథిగా ఎంపిక చేసింది.అయితే, రోహిత్‌ను ఓపెనర్‌గా జట్టులోకి తీసుకుంది. ఈ నేపథ్యంలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్- హెడ్‌కోచ్ గంభీర్‌పై విమర్శలు వస్తున్నాయి. వీరిద్దరు కలిసే దిగ్గజ కెప్టెన్‌పై వేటు వేశారంటూ పలువురు మాజీ క్రికెటర్లు రోహిత్‌కు మద్దతుగా నిలుస్తున్నారు.రోహిత్- కోహ్లి ఓ రోజు ముందుగానే..ఈ నేపథ్యంలో భారత జట్టు కంటే ముందే రోహిత్ శర్మ- విరాట్ కోహ్లి ఓ రోజు ముందుగానే ఆస్ట్రేలియాకు బయల్దేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో గంభీర్.. గిల్ సేనకు ఢిల్లీలోని తన ఇంట్లో పార్టీ ఇచ్చేందుకు సిద్ధం కావడం మరోసారి సందేహాలకు తావిచ్చింది. రో-కోలకు గంభీర్‌తో సఖ్యత చెడిందనే గుసగుసలు మరోసారి గుప్పుమంటున్నాయి.కాగా అక్టోబరు 19- నవంబరు 8 వరకు టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. తొలుత మూడు వన్డేల సిరీస్.. ఆ తర్వాత ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఇందుకు సంబంధించి భారత్- ఆస్ట్రేలియా ఇప్పటికే తమ జట్లను ప్రకటించాయి.ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు టీమిండియాశుబ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మొహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), యశస్వి జైశ్వాల్.ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు టీమిండియాసూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, శుబ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, శివమ్ దూబె, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్. చదవండి: టీమిండియాతో సిరీస్‌లకు ఆసీస్ జట్ల ప్రకటన -
అగార్కర్‌కు అవమానకర ముగింపు తప్పదు: మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar)పై ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టీవ్ హార్మిసన్ (Steve Harmison) సంచలన వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ (Rohit Sharma)- విరాట్ కోహ్లి (Virat Kohli) విషయంలో అగార్కర్‌కు ఓటమి తప్పదని వ్యాఖ్యానించాడు. ఈ ఇద్దరు దిగ్గజ కెప్టెన్లు.. ముఖ్యంగా కోహ్లి.. అగ్కార్ను తప్పక ఓడించితీరతాడని పేర్కొన్నాడు.టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన తర్వాత రోహిత్- కోహ్లి అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఇటీవలే వీరిద్దరు టెస్టులకు కూడా రిటైర్మెంట్ ఇచ్చాడు. రో- కో ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతుండగా.. బీసీసీఐ ఇటీవల అనూహ్య నిర్ణయం తీసుకుంది.శుబ్‌మన్ గిల్‌కు పగ్గాలుఇటీవలే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన రోహిత్ శర్మ వన్డే కెప్టెన్‌గా తప్పించి.. శుబ్‌మన్ గిల్‌కు పగ్గాలు అప్పగించింది. ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా గిల్ వన్డే సారథిగా తన ప్రయాణం మొదలుపెడతాడని వెల్లడించింది. ఇక ఈ జట్టులో రోహిత్, కోహ్లి ఆటగాళ్లుగా కొనసాగనున్నారు.రో- కోకు పరోక్షంగా వార్నింగ్ఇక రోహిత్‌పై వేటు వేయడం గురించి చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. రో- కో వన్డే వరల్డ్‌కప్-2027 వరకు ఆడతారని గ్యారెంటీ లేదని పేర్కొన్నాడు. అందుకే గిల్‌ను కెప్టెన్ చేసినట్లు వెల్లడించాడు. అంతేకాదు.. వరల్డ్‌కప్ నాటికి జట్టులో ఉండాలంటే దేశీ క్రికెట్ కూడా ఆడకతప్పదని రో- కోకు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చాడు.అగార్కర్‌కు అవమానకర ముగింపు తప్పదుఈ విషయం గురించి స్టీవ్ హార్మిసన్ తాజాగా స్పందించాడు. ‘‘దురదృష్టవశాత్తూ.. చివరికి అగార్కర్ అవమానకరమైన ముగింపు తప్పదని భావిస్తున్నా. ఈ పోటీలో మాజీ కెప్టెన్లు గెలుస్తారా? లేదంటే మాజీ ఆల్‌రౌండర్‌దే గెలుపా? అంటే.. కచ్చితంగా ఆ ఇద్దరే గెలుస్తారని అనుకుంటున్నా.అలా కాకుండా కేవలం కోహ్లి- శర్మలను రెచ్చగొట్టడానికి.. వారిని ఎలాగైనా వరల్డ్‌కప్‌లో ఆడించాలనే ఉద్దేశంతో అగార్కర్ ఈ మాటలు అంటే అది వేరే సంగతి. నిజంగా అదొక మంచి విషయమే అవుతుంది. అలా కాకుండా వారి గురించి ఉద్దేశపూర్వకంగానే ఇలా మాట్లాడితే ఫలితం ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేము.కోహ్లి మాత్రం కచ్చితంగా..రోహిత్ కంటే కోహ్లికి వన్డేల్లో గొప్ప రికార్డు ఉంది. రోహిత్ కోహ్లి కంటే వయసులోనూ కాస్త పెద్దవాడు. కాబట్టి వరల్డ్‌కప్ నాటికి రోహిత్ విషయం ఎలా ఉన్నా.. కోహ్లి మాత్రం కచ్చితంగా కొనసాగుతాడనే అనుకుంటున్నా.ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వంటి జట్లపై 350 పరుగుల లక్ష్య ఛేదనలో కోహ్లి లేకుంటే టీమిండియా ఎలా గెలవగలదు?.. బహుశా కోహ్లి మనసులో కూడా ఇదే ఉండి ఉంటుంది. ఏదేమైనా అగార్కర్‌కు ఈ విషయంలో ఓటమి తప్పదు.ఛేజింగ్ కింగ్ఒకవేళ అగార్కర్ నిజంగానే రో- కో గురించి అలా అన్నాడా? లేదంటే అనువాద తప్పిదాలు ఏమైనా ఉన్నాయో నాకైతే తెలియవు’’ అని స్టీవ్ హార్మిసన్ పేర్కొన్నాడు. కాగా వన్డేల్లో ఛేజింగ్లోనే కోహ్లి 28 శతకాలు బాది 8064 పరుగులు రాబట్టాడు. ఇందులో 41 హాఫ్ సెంచరీలు కూడా ఉండటం విశేషం. అత్యుత్తమ స్కోరు 183. అంతేకాదు.. 300 పరుగుల లక్ష్య ఛేదనలో కోహ్లి ఏకంగా ఏడు సెంచరీలు నమోదు చేయడం అతడు ఛేజింగ్ కింగ్ అనడానికి మరో నిదర్శనం.చదవండి: ‘మీ నాన్నతో కలిసి ఆటో తోలుకో’;.. ధోని ఆరోజు చెప్పిన మాటతో ఇలా..: సిరాజ్ -
రోహిత్‌పై వేటు సరైన నిర్ణయం.. కోహ్లి జట్టులో కొనసాగాలంటే..: డివిలియర్స్
టీమిండియా వన్డే కెప్టెన్‌ను మారుస్తూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తీసుకున్న నిర్ణయం సరైందా? కాదా? అన్న చర్చ నడుస్తూనే ఉంది. రోహిత్ శర్మ (Rohit Sharma)ను తప్పించి శుబ్‌మన్ గిల్‌కు పగ్గాలు ఇవ్వడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఈ క్రమంలో భారత దిగ్గజం సునిల్ గావస్కర్ (Sunil Gavaskar)తో పాటు మదన్ లాల్ వంటి వారు సెలక్టర్ల నిర్ణయాన్ని సమర్థిస్తుండగా. హర్భజన్ సింగ్, రాబిన్ ఊతప్ప, మహ్మద్ కైఫ్ వంటి మాజీ క్రికెటర్లు దీనిని తొందరపాటు చర్యగా అభివర్ణిస్తున్నారు.ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా లెజండరీ బ్యాటర్ ఏబీ డివిలియర్స్ కూడా భారత వన్డే జట్టు కెప్టెన్ మార్పు అంశంపై తాజాగా స్పందించాడు. రోహిత్ శర్మను తప్పించి గిల్‌ను కెప్టెన్‌ను చేయడం సరైన నిర్ణయమని పేర్కొన్నాడు. ఇందుకు గల కారణాలు వివరిస్తూ..రోహిత్‌పై వేటు సరైన నిర్ణయం‘‘రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి (Virat Kohli).. వన్డే వరల్డ్‌కప్-2027 వరకు ఆడతారో లేదో నమ్మకం లేదు. ఆ ఆలోచనతోనే శుబ్‌మన్ గిల్‌ను వన్డే కెప్టెన్‌గా చేసి ఉంటారు. అతడికి గొప్ప అవకాశం లభించింది.యువకుడు.. బ్యాటర్‌గానూ మంచి ఫామ్‌లో ఉన్నాడు. అద్భుతమైన నాయకుడిగా ఎదగగలడు. రోహిత్, కోహ్లి జట్టులో ఉండగానే గిల్‌ను కెప్టెన్ చేయడం సరైన నిర్ణయం. ఈ ఇద్దరు గొప్ప, అనుభవజ్ఞులైన కెప్టెన్ల నుంచి గిల్ ఎంతో నేర్చుకునే అవకాశం లభిస్తుంది.రోహిత్, కోహ్లి జట్టులో కొనసాగాలంటే..వారి అనుభవం తనకు ఉపయోగపడుతుంది. కెప్టెన్‌గా ఎదిగే క్రమంలో అతడికి ఇది ఎంతో ముఖ్యం. వాళ్లిద్దరు జట్టులో ఉండటం గిల్‌కు సానుకూలంగా ఉంటుంది. ఏదేమైనా ఒకవేళ రోహిత్, కోహ్లి 2027 వరల్డ్‌కప్ వరకు కొనసాగాలనుకుంటే.. తప్పకుండా పరుగులు రాబట్టాల్సి ఉంటుంది.సెలక్టర్లకు బ్యాట్ ద్వారానే సందేశం ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం టీమిండియాలో చోటు కోసం తీవ్రమైన పోటీ ఉంది. ఈ పోటీని దాటి ముందుకు వెళ్లాలంటే కచ్చితంగా పరుగులు చేయాల్సిందే. రోహిత్, కోహ్లి వరల్డ్‌కప్ వరకు జట్టులో ఉంటే.. టీమిండియాకు అంతకంటే గొప్ప ఆస్తి మరొకటి ఉండదు’’ అని డివిలియర్స్ పేర్కొన్నాడు.ఆసీస్‌తో సిరీస్‌తో రీఎంట్రీకాగా ఇప్పటికే అంతర్జాతీయ టీ20లకు, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్, కోహ్లి.. వన్డేల్లో మాత్రం కొనసాగుతున్నారు. చివరగా ఇద్దరూ ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 సందర్భంగా టీమిండియా తరఫున బరిలోకి దిగారు. ఇక ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా వన్డే సిరీస్‌తో రో- కో పునరాగమనం చేయనున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే టీమిండియా టెస్టు కెప్టెన్‌గా గిల్ జట్టును ముందుకు నడిపిస్తుండగా.. టీ20 టీమ్‌కు సూర్యకుమార్ యాదవ్ సారథిగా ఉన్నాడు.చదవండి: ‘మీ నాన్నతో కలిసి ఆటో తోలుకో’;.. ధోని ఆరోజు చెప్పిన మాటతో ఇలా..: సిరాజ్ -
అజిత్ నుంచి గిల్ వరకు.. టీమిండియా వన్డే కెప్టెన్లు వీరే
టీమిండియా కొత్త వన్డే కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది. రోహిత్ శర్మ స్ధానాన్ని గిల్ భర్తీ చేయనున్నాడు. ఆసీస్ టూర్ నుంచి వన్డే సారథిగా గిల్ తన ప్రయాణాన్ని ప్రారంభించనున్నాడు. భారత వన్డే కెప్టెన్‌గా ఎంపికైన 28వ ఆటగాడిగా గిల్ నిలిచాడు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు భారత జట్టు వన్డే కెప్టెన్‌గా పనిచేసిన ప్లేయర్లపై ఓ లుక్కేద్దాం.అజిత్ వాడేకర్: వన్డేల్లో భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన తొలి ఆటగాడు. అతడి నాయకత్వంలో 1974లో భారత్ రెండు వన్డేలు ఆడింది.శ్రీనివాసరాఘవన్ వెంకటరాఘవన్: శ్రీనివాసరాఘవన్ ఏడు వన్డేల్లో టీమిండియాకు నాయకత్వం వహించాడు.బిషన్ సింగ్ బేడి: లెజెండరీ స్పిన్నర్ బిషన్ సింగ్ బేడి నాలుగు వన్డే మ్యాచ్‌లలో భారత్‌ను నడిపించాడు.సునీల్ గవాస్కర్: 1980 నుండి 1985 వరకు సునీల్ గవాస్కర్ నాయకత్వంలో భారత్ 37 వన్డే మ్యాచ్‌లు ఆడింది.గుండప్ప విశ్వనాథ్: 1981లో గుండప్ప విశ్వనాథ్ ఒక వన్డే మ్యాచ్‌కు భారత జట్టుకు నాయకత్వం వహించాడు.కపిల్ దేవ్: కపిల్ దేవ్ నాయకత్వంలో భారత్ 74 వన్డేలు ఆడింది. అతడి కెప్టెన్సీలోనే 1983 ప్రపంచ కప్‌ను టీమిండియా గెలుచుకుంది.సయ్యద్ కిర్మాణి: 1983లో సయ్యద్ కిర్మాణి ఒక వన్డే మ్యాచ్‌లో భారత జట్టుకు నాయకత్వం వహించాడు.మోహిందర్ అమర్నాథ్: 1984లో మోహిందర్ అమర్నాథ్ ఒక వన్డే మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించాడు.రవిశాస్త్రి:1986 నుండి 1991 వరకు 11 వన్డే మ్యాచ్‌లకు రవిశాస్త్రి టీమిండియా కెప్టెన్‌గా పనిచేశాడు.దిలీప్ వెంగ్‌సర్కార్: 1987 నుండి 1998 వరకు దిలీప్ వెంగ్‌సర్కార్ నాయకత్వంలో భారత్ 18 వన్డేలు ఆడింది.కృష్ణమాచారి శ్రీకాంత్: 1989లో కృష్ణమాచారి శ్రీకాంత్ భారత జట్టు కెప్టెన్‌గా వ్యవహరించాడు.అజారుద్దీన్: మహ్మద్ అజారుద్దీన్ కెప్టెన్సీలో భారత్ 174 వన్డే మ్యాచ్‌లు ఆడింది.సచిన్ టెండూల్కర్: లెజెండరీ బ్యాటర్ సచిన్ టెండూల్కర్ 1996 నుండి 1999 వరకు 73 వన్డేల్లో భారత జట్టుకు నాయకత్వం వహించాడు. కానీ అతడి కెప్టెన్సీలో 23 మ్యాచ్‌ల్లో మాత్రమే భారత్ విజయం సాధించింది. అజయ్ జడేజా: అజయ్ జడేజా భారత కెప్టెన్‌గా 13 వన్డేల్లో వ్యవహరించాడు. కెప్టెన్‌గా 8 విజయాలను అందుకున్నాడు.సౌరవ్ గంగూలీ: 1999 నుండి 2005 వరకు సౌరవ్ గంగూలీ నాయకత్వంలో భారత్ 146 వన్డేలు ఆడి 76 గెలిచింది.రాహుల్ ద్రవిడ్: 2000 నుండి 2007 వరకు 79 వన్డేల్లో భారత్‌కు నాయకత్వం వహించిన ద్రవిడ్ 42 మ్యాచ్‌లను గెలిపించాడు.అనిల్ కుంబ్లే: 2002లో కుంబ్లే భారత కెప్టెన్‌గా ఒకే ఒక వన్డే మ్యాచ్‌లో వ్యవహరించాడు.వీరేంద్ర సెహ్వాగ్: వీరేంద్ర సెహ్వాగ్ నాయకత్వంలో భారత్ 12 వన్డేలు ఆడి 7 విజయాలు సాధించింది.ఎంఎస్ ధోని: వన్డేల్లో అత్యంత విజయవంతమైన భారత కెప్టెన్లలో ధోని ఒకడిగా నిలిచాడు. 2007 నుంచి 2018 వరకు అతడి సారథ్యంలో 200 మ్యాచ్‌లు ఆడిన భారత్.. 110 మ్యాచ్‌లలో విజయం సాధించింది. అతడి నాయకత్వంలో భారత్ ఆసియాకప్, వన్డే ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకుంది.సురేష్ రైనా: 2010 నుండి 2014 వరకు 12 వన్డేల్లో రైనా భారత్‌కు నాయకత్వం వహించాడు.గౌతమ్ గంభీర్: ప్రస్తుత హెడ్‌కోచ్ భారత కెప్టెన్‌గా ఆరు వన్డేల్లో వ్యవహవరించాడు. మొత్తం అన్ని మ్యాచ్‌లలోనూ భారత్ విజయం సాధించింది.విరాట్ కోహ్లీ: 2013 నుండి 2021 వరకు భారత కెప్టెన్‌గా విరాట్ కోహ్లి వ్యవహరించాడు. అతడి సారథ్యంలో 95 వన్డేలు ఆడిన భారత్ 65 విజయాలు సాధించింది.అజింక్య రహానే: 2015లో, అజింక్య రహానే మూడు వన్డే మ్యాచ్‌ల్లో భారత్‌కు నాయకత్వం వహించాడు.రోహిత్ శర్మ: రోహిత్ శర్మ 2017 నుండి 2025 వరకు 56 వన్డేల్లో టీమిండియాకు నాయకత్వం వహించాడు. 42 మ్యాచ్‌లలో భారత్ గెలుపొందింది. అతడి కెప్టెన్సీలోనే భారత్ 2025 ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది.శిఖర్ ధావన్: మాజీ ఓపెనింగ్ బ్యాటర్ శిఖర్ ధావన్ కూడా 12 మ్యాచ్‌లలో భారత జట్టు కెప్టెన్‌గా వ్యవహరించాడు.కెఎల్ రాహుల్: స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఇప్పటివరకు 12 వన్డేల్లో భారత్‌కు నాయకత్వం వహించాడు.హార్దిక్ పాండ్యా: రోహిత్ శర్మ గైర్హజరీలో హార్దిక్ పాండ్యా మూడు వన్డేల్లో భారత జట్టుకు నాయకత్వం వహించాడు.శుభ్‌మన్ గిల్: అక్టోబర్ 19న పెర్త్‌లో ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌తో టీమిండియా వన్డే కెప్టెన్‌గా గిల్ శకం మొదలు కానుంది. -
గిల్ కాదు!.. సూర్య తర్వాత టీమిండియా టీ20 కెప్టెన్ అతడే!
భారత క్రికెట్లో గత కొన్నాళ్లుగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టీమిండియా జూన్‌లో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే ముందే కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) టెస్టులకు వీడ్కోలు పలకగా.. దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli)కూడా సంప్రదాయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.రో- కో బైబైఅంతకంటే ముందే.. అంటే 2024లో టీమిండియా టీ20 ప్రపంచకప్ టైటిల్ సాధించిన తర్వాత రోహిత్- కోహ్లి అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరు వన్డేల్లో మాత్రమే కొనసాగుతండగా.. ఆస్ట్రేలియా టూర్‌కు ముందు బీసీసీఐ రోహిత్‌పై వేటు వేసింది. వన్డే కెప్టెన్సీ నుంచి అతడిని తప్పించింది.ఇప్పటికే టెస్టు జట్టు సారథిగా వ్యవహరిస్తున్న యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ (Shubman Gill)ను.. వన్డేలకూ కెప్టెన్‌గా నియమించింది. ఈ విషయం గురించి టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. మూడు ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్లు ఉండటం సరికాదని పేర్కొన్నాడు.గిల్‌కే మేనేజ్మెంట్ మద్దతువన్డే వరల్డ్‌కప్-2027 టోర్నీకి పూర్తిస్థాయిలో జట్టును సిద్ధం చేసే క్రమంలో గిల్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించినట్లు అగార్కర్ తెలిపాడు. అంతేకాదు.. రోహిత్- కోహ్లి వన్డే ప్రపంచకప్ టోర్నీ ఆడతామనే హామీ ఇవ్వలేదంటూ అభిమానుల హృదయాలు ముక్కలు చేశాడు.ఇదిలా ఉంటే.. టెస్టు, వన్డే జట్లకు కెప్టెన్ అయిన గిల్.. త్వరలోనే టీ20 కెప్టెన్‌గానూ స్వీకరించబోతున్నట్లు అగార్కర్ మాటలను బట్టి అర్థమవుతోంది. ప్రస్తుతం టీమిండియా టీ20 కెప్టెన్‌గా ఉన్న సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్-2026 తర్వాత తప్పుకొంటే.. గిల్ అతడి స్థానాన్ని భర్తీ చేస్తాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.టెస్టులలో ఒకే.. కానీ వన్డేలలో..ఇలాంటి తరుణంలో టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప మాత్రం భిన్నంగా స్పందించాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘టెస్టు ఫార్మాట్‌కు గిల్ కెప్టెన్ కావడం మంచి పరిణామం. అందుకు తాను అర్హుడినని ఇప్పటికే తను నిరూపించుకుంటున్నాడు.అయితే, వన్డేల్లో మాత్రం.. గిల్ కంటే గొప్ప సామర్థ్యమున్న ఆటగాడు టీమిండియాకు దొరికేవాడు. బ్యాటర్‌గా అతడి గణాంకాలు ఫర్వాలేదు. కానీ ఇప్పటికిప్పుడు కెప్టెన్ అంటేనే కాస్త చిత్రంగా ఉంది.శ్రేయస్ అయ్యర్ వైపు చూపుటీ20 ఫార్మాట్లో మాత్రం ఇప్పటికీ శుబ్‌మన్ గిల్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే ప్రయత్నాల్లోనే ఉన్నాడు. నాకు తెలిసి టీ20 భవిష్య కెప్టెన్‌గా యాజమాన్యం శ్రేయస్ అయ్యర్ వైపు దృష్టి సారించే అవకాశం ఉందనిపిస్తోంది’’ అని భారత మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ రాబిన్ ఊతప్ప అభిప్రాయపడ్డాడు. కాగా ఫిట్నెస్ సమస్యల కారణంగా ఇటీవల టెస్టు ఫార్మాట్ నుంచి విరామం తీసుకున్న శ్రేయస్ అయ్యర్.. వన్డేల్లో మాత్రం సత్తా చాటుతున్నాడు. ఇటీవల ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియా తరఫున టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు.జట్టులోనే స్థానం లేదుమరోవైపు.. ఐపీఎల్లో గతేడాది కెప్టెన్‌గా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చాంపియన్‌గా నిలిపిన శ్రేయస్ అయ్యర్.. ఈ ఏడాది పంజాబ్ కింగ్స్ సారథిగా జట్టును ఫైనల్‌కు చేర్చాడు. బ్యాటర్‌గానూ పొట్టి ఫార్మాట్లో పరుగుల వరద పారించాడు. అయినప్పటికీ ఆసియా టీ20 కప్-2025 జట్టుకు సెలక్టర్లు అతడిని ఎంపిక చేయలేదు. ఆటగాడిగానే శ్రేయస్‌కు స్థానమివ్వని యాజమాన్యం.. సూర్యకుమార్ యాదవ్ తర్వాత అతడిని ఏకంగా కెప్టెన్‌ను చేస్తుందంటూ ఊతప్ప అంచనా వేయడం విశేషం. కాగా ఆసీస్‌తో వన్డేలకు గిల్‌కు డిప్యూటీగా.. వైస్ కెప్టెన్‌గా అయ్యర్ ఎంపిక కావడం గమనార్హం.చదవండి: ‘మీ నాన్నతో కలిసి ఆటో తోలుకో’;.. ధోని ఆరోజు చెప్పిన మాటతో ఇలా..: సిరాజ్ -
ఇది నిజంగా సిగ్గుచేటు: రోహిత్‌పై గంభీర్ ‘కామెంట్స్’ వైరల్
టీమిండియా వన్డే కెప్టెన్ మార్పు విషయంలో హెడ్‌కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir)పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్దేశపూర్వకంగానే రోహిత్ శర్మ (Rohit Sharma)ను తప్పించాడంటూ హిట్‌మ్యాన్ అభిమానులు గౌతీని సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. గౌతీతో పాటు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్క (Ajit Agarkar)ర్‌పై కూడా రోహిత్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు.అది సిగ్గుచేటుఈ నేపథ్యంలో గౌతం గంభీర్ రోహిత్ శర్మను ఉద్దేశించి గతంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో మరోసారి తెరమీదకు వచ్చింది. ఇందులో మాట్లాడుతూ.. ‘‘ఒకవేళ రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్ కాకపోతే అది జట్టు చేసుకున్న దురదృష్టమే కానీ... రోహిత్‌కు కాదు.పరిమిత ఓవర్ల క్రికెట్ లేదంటే టీ20 జట్టుకు అతడు కెప్టెన్ కాలేదంటే.. అది సిగ్గుచేటు. ఇంతకంటే రోహిత్ శర్మ ఇంకేం చేస్తే కెప్టెన్సీకి అర్హుడు అవుతాడు?’’ అంటూ గంభీర్ టీమిండియా యాజమాన్యం తీరును విమర్శిస్తూ రోహిత్ శర్మకు మద్దతు తెలిపాడు. పరోక్షంగా విరాట్ కోహ్లిని టార్గెట్ చేశాడు.నాడు కోహ్లి స్థానంలో రోహిత్ శర్మకాగా టీ20 ప్రపంచకప్-2021లో కనీసం సెమీస్ కూడా చేరకుండానే టీమిండియా ఇంటిబాట పట్టడంతో అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లి టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు. ఆ తర్వాత వన్డే సారథ్య బాధ్యతల నుంచి బీసీసీఐ కోహ్లిని తప్పించగా.. సౌతాఫ్రికా పర్యటన మధ్యలోనే టెస్టు కెప్టెన్సీ నుంచి కోహ్లి స్వయంగా తప్పుకొన్నాడు.ఈ క్రమంలో 2021-22 మధ్య కాలంలో కోహ్లి స్థానంలో రోహిత్ శర్మను మూడు ఫార్మాట్లలో కెప్టెన్‌ను చేసింది బీసీసీఐ. అప్పటి నుంచి రోహిత్ సారథ్యంలో టీ20 ద్వైపాక్షిక సిరీస్‌లలో సత్తా చాటిన టీమిండియా గతేడాది వరల్డ్‌కప్ గెలిచింది.అంతకుముందు వన్డే వరల్డ్‌కప్-2023లో అజేయంగా ఫైనల్ చేరింది. ఇటీవల ఐసీసీ చాంపియన్స్‌ట్రోఫీ-2025 గెలిచింది. అయితే, ఇప్పటికే అంతర్జాతీయ టీ20లకు, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ వన్డేల్లో కొనసాగుతానని చెప్పగా.. బీసీసీఐ అనూహ్యంగా అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించింది.ఇపుడు రోహిత్ ప్లేస్‌లో గిల్రోహిత్ స్థానంలో టెస్టు సారథిగా వచ్చిన యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్‌కు వన్డే పగ్గాలనూ అప్పగించింది. ఇందులో హెడ్‌కోచ్ గంభీర్ పాత్ర కీలకం అని తెలుస్తోంది. గంభీర్‌తో పాటు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కలిసి 38 ఏళ్ల రోహిత్‌ను కెప్టెన్‌గా తప్పించాలనే నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ వర్గాలు జాతీయ మీడియాతో పేర్కొనడం గమనార్హం.ఈ నేపథ్యంలో గంభీర్ గతంలో రోహిత్ శర్మపై ప్రశంసలు కురిపిస్తున్న వీడియోను షేర్ చేస్తూ.. ‘‘అప్పుడలా.. ఇప్పుడిలా.. నిజంగానే ఇది సిగ్గుచేటు’’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. కాగా వన్డే వరల్డ్‌కప్-2027 నాటికి గిల్ చుట్టు జట్టును నిర్మించే క్రమంలో అతడిని కెప్టెన్‌ను చేసినట్లు అగార్కర్ ఇప్పటికే స్పష్టం చేశాడు.చదవండి: ‘మీ నాన్నతో కలిసి ఆటో తోలుకో’;.. ధోని ఆరోజు చెప్పిన మాటతో ఇలా..: సిరాజ్Never seen anyone more hypocritical and two-faced than Gautam Gambhir. The same guy who once said, “If Rohit Sharma doesn’t become India’s captain, it’s India’s loss, not Rohit’s,” now doesn’t want him as captain after becoming coach himself. pic.twitter.com/pqRzYKDR2a— Kusha Sharma (@Kushacritic) October 4, 2025 -
గంభీర్, అగార్కర్ కలిసే చేశారు.. రోహిత్ కెప్టెన్‌గా ఉంటే ఆ ప్రమాదం!
‘వన్డే కెప్టెన్‌గా రోహిత్ శర్మను అకస్మాత్తుగా ఎందుకు తొలగించారు?’.. భారత క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం ఇదే ప్రధాన చర్చ. టీమిండియాకు రెండు ఐసీసీ టైటిళ్లు అందించిన హిట్‌మ్యాన్ పట్ల భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మండలి తీరుపై ఓవైపు విమర్శలు వస్తుండగా.. మరోవైపు.. సునిల్ గావస్కర్ (Sunil Gavaskar) వంటి దిగ్గజాలు మాత్రం బోర్డు నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు.రోహిత్ కెప్టెన్‌గా ఉంటే ఆ ప్రమాదం!ఈ నేపథ్యంలో టీమిండియా వన్డే కెప్టెన్సీ మార్పునకు సంబంధించి బీసీసీఐ సన్నిహిత వర్గాలు కీలక విషయాలు వెల్లడించాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా అందించిన వివరాల మేరకు.. ‘‘నాయకుడిగా డ్రెసింగ్‌రూమ్‌లో రోహిత్ శర్మ (Rohit Sharma) వ్యవహరించే తీరు భిన్నంగా ఉంటుంది. సారథిగా తనకంటూ ప్రత్యేక శైలి ఉంది.అయితే, తను ఇప్పుడు కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. మరి అలాంటపుడు.. కేవలం ఒక్క ఫార్మాట్‌కు తను కెప్టెన్‌గా ఉంటే టీమ్ కల్చర్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన మొదటి ఆరు నెలలు గౌతం గంభీర్ టెస్టు, వన్డే జట్ల విషయంలో వెనక ఉండే నడిపించాడు.అంతా గంభీర్ ఆధీనంలోనే..అయితే, స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాభవం (టెస్టుల్లో 3-0తో వైట్‌వాష్), ఆస్ట్రేలియా పర్యటనలో టెస్టు సిరీస్‌లో ఓటమి తర్వాత గంభీర్ అన్ని విషయాలను పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకున్నాడు.ప్రస్తుత నిర్ణయం (కెప్టెన్సీ నుంచి రోహిత్‌ను తప్పించడం) కూడా గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కలిసికట్టుగా తీసుకున్నారు. రోహిత్, విరాట్ కోహ్లిల వయస్సు ఇప్పటికే 35 ఏళ్లు దాటిపోయింది. కెరీర్లో వారు చివరి అంకానికి చేరుకుంటున్నారు. ఇలాంటి దశలో అకస్మాత్తుగా రోహిత్, కోహ్లిలు ఫామ్ కోల్పోతే నాయకత్వ బృందంలో గందరగోళం తలెత్తే పరిస్థితి ఉంటుంది.గంభీర్ నిర్ణయాల వల్లే మెరుగైన ఫలితాలునిజానికి ఇంగ్లండ్ పర్యటనకు ముందే వీరిద్దరు టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడం గురించి కూడా ఇక్కడ ప్రస్తావించాలి. ఏదేమైనా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీతో పాటు ఇంగ్లండ్‌లో రెండు టెస్టుల్లోనూ జస్ప్రీత్ బుమ్రా లేకుండానే టీమిండియా గెలిచిన తీరు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి’’ అని సదరు వర్గాలు పేర్కొన్నాయి.కాగా టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన తర్వాత.. రోహిత్‌తో పాటు కోహ్లి కూడా అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. ఇక ఇటీవల ఇంగ్లండ్‌తో టెస్టులకు ముందు సంప్రదాయ క్రికెట్‌కూ ఇద్దరూ రిటైర్మెంట్ ప్రకటించారు. అయితే, ఈ దిగ్గజ బ్యాటర్లు వన్డేల్లో మాత్రం మరికొన్నాళ్లు కొనసాగుతామని స్పష్టం చేశారు.త్వరలోనే టీ20 జట్టు పగ్గాలు కూడా అతడికేకానీ అనూహ్య రీతిలో రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించిన బీసీసీఐ.. అతడి స్థానంలో శుబ్‌మన్ గిల్‌ను వన్డేలకూ సారథిని చేసింది. వన్డే వరల్డ్‌కప్-2027 టోర్నీని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చీఫ్ సెలక్టర్ అగార్కర్ వెల్లడించాడు. అంతేకాదు.. రోహిత్- కోహ్లి 2027 ప్రపంచకప్ వరకు ఆడతామని తమకు హామీ ఇవ్వలేదని పేర్కొన్నాడు.ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ టూర్ సందర్భంగా గిల్ టెస్టు జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇటీవలే టీ20 జట్టులోనూ సూర్యకుమార్ యాదవ్‌కు డిప్యూటీగా గిల్ ఆసియా కప్-2025లో పాల్గొన్నాడు. త్వరలోనే టీ20లకు కూడా అతడే కెప్టెన్ అయ్యే అవకాశం లేకపోలేదు. ఏదేమైనా రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించడంలో గంభీర్ కీలక పాత్ర పోషించినట్లు బీసీసీఐ వర్గాల మాటల ద్వారా స్పష్టం అవుతోంది.చదవండి: 50 ఓవర్ల క్రికెట్లో ట్రిపుల్ సెంచరీ.. ఆసీస్ బ్యాటర్ విధ్వంసం -
'ఇంకెందుకు ఆలస్యం.. రోహిత్‌ను జట్టు నుంచి కూడా తీసేయండి'
టీమిండియా వన్డే కెప్టెన్‌గా రోహిత్ శర్మ స్ధానంలో శుబ్‌మన్ గిల్‌ను బీసీసీఐ సెలక్షన్ కమిటీ నియమించిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా టూర్‌కు జట్టు ఎంపిక సందర్భంగా ఈ అనుహ్య మార్పు చోటు చేసుకుంది. 2027 ప్రపంచ కప్ కోసం దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కకర్ పేర్కొన్నాడు. కాగా హిట్‌మ్యాన్ కెప్టెన్‌గా అద్బుతమైన ట్రాక్ రికార్డు కలిగి ఉన్నాడు.ఎంఎస్ ధోని తర్వాత మూడు ఐసీసీ వైట్ బాల్ ఈవెంట్స్‌లో భారత జట్టును ఫైనల్‌కు చేర్చిన ఏకైక కెప్టెన్‌గా రోహిత్ నిలిచాడు. భారత్‌కు టీ20 ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్స్‌ను రోహిత్ అందించాడు. వన్డే ప్రపంచకప్-2023లో రన్నరప్‌గా టీమిండియాను నిలిపాడు.అయినప్పటికి రోహిత్‌ను సడన్‌గా కెప్టెన్సీ నుంచి తప్పించడాన్ని చాలా మంది మాజీలు తప్పుబడుతున్నారు. ఈ జాబితాలోకి భారత మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ సబా కరీం చేరాడు. రోహిత్‌ను కెప్టెన్సీ తప్పించడంతో అతడి వన్డే భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారిందని కరీం అభిప్రాయపడ్డాడు."రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ సెలక్టర్ల తీసుకున్న నిర్ణయం నన్ను షాక్‌కు గురిచేసింది. ప్రస్తుతం అస్సలు కెప్టెన్సీ మార్పు అవసరమే లేదు. భారత్‌కు రోహిత్ వరుసగా రెండు ట్రోఫీలను అందించాడు. వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్‌కు మీరు ఇచ్చే గౌరవమిదేనా? 2027 ప్రపంచకప్‌కు ఇంకా సమయం ఉంది. తొందరపడాల్సిన అవసరం ఏమి వచ్చింది. అతడు ఇప్పటికే ఒక ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నాడు. రోహిత్ శర్మ ఒక నాయకుడిగా అద్బుతమైన జట్టును తాయారు చేశాడు. దాని ఫలితంగానే టీ20 ప్రపంచకప్-2024, ఛాంపియన్స్ ట్రోఫీ-2025ని భారత్ సొంతం చేసుకుంది.అంతేకాకుండా ప్రస్తుతం టీ20 ఫార్మాట్లలో దుమ్ములేపుతున్న భారత జట్టు వెనక కూడా రోహిత్ ఉన్నాడు. అందులో చాలా మంది ఆటగాళ్లు రోహిత్ సారథ్యంలోనే ఆడినవారే. రోహిత్ ఐదు ఆరు నెలలు ఆడకపోతే తన కెప్టెన్సీ, బ్యాటింగ్‌ను మర్చిపోయినట్లు కాదు.అతడికి వన్డే ఫార్మాట్లో ఎలా ఆడాలో తెలుసు, జట్టును విజయ పథంలో ఎలా నడిపించాలో తెలుసు. జట్టులో రోహిత్ రోల్‌పై సెలక్టర్లు క్లారిటీ వుందో లేదో నాకు ఆర్ధం కావడం లేదు. కెప్టెన్సీ నుంచి తప్పించారంటే రోహిత్ వన్డే ఫ్యూచర్‌పై మీకు స్పష్టత లేదు. 2027 ప్రపంచకప్‌లో హిట్ మ్యాన్ ఆడాడని మీరు అనుకుంటుంటే మరి జట్టులో ఎందుకు ఉంచారు. ప్రపంచకప్ ప్రణాళికలలో అతడు లేకపోతే జట్టులో ఎందుకు తీసేయండి? ఒకవేళ అతడు మీ ప్లాన్స్‌లో ఉంటే కెప్టెన్సీ నుంచి తొలిగించాల్సిన అవసరం ఏముంది? ఏదేమైనప్పటికి నా వరకు అయితే సెలక్టర్లు తీసుకున్న నిర్ణయం సరైనది కాదు" తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. -
వాళ్లలా పట్టుకుని వేలాడే రకం కాదు!.. అయినా ఎందుకిలా?: కైఫ్ ఫైర్
టీమిండియా వన్డే జట్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మ (Rohit Sharma)ను తప్పించడం పట్ల భారత మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ స్పందించాడు. పదహారేళ్లుగా జట్టుకు సేవలు అందిస్తున్న దిగ్గజ ఆటగాడికి.. కేవలం ఇంకొక్క ఏడాదైనా సమయం ఇచ్చి ఉంటే బాగుండేదని పేర్కొన్నాడు. ఇప్పటికిప్పుడు కెప్టెన్‌ను మార్చాల్సిన అవసరం ఏముందని.. రోహిత్ పట్ల భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తీరు సరికాదని మండిపడ్డాడు.ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ముందే బీసీసీఐ వన్డే కెప్టెన్‌ను మార్చిన విషయం తెలిసిందే. ఇటీవలే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్‌ను గెలిపించిన రోహిత్‌ను తప్పించి.. టెస్టు సారథి శుబ్‌మన్ గిల్ (Shubman Gill)కే వన్డే పగ్గాలూ అప్పగించింది. ఈ నేపథ్యంలో కైఫ్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు.గొప్పతనాన్ని చాటుకున్నాడు‘‘టీమిండియా కోసం రోహిత్ శర్మ తన జీవితంలో ఇప్పటికే పదహారేళ్లు ఇచ్చాడు. అతడి కోసం ఒక్కటంటే ఇంకొక్క ఏడాదే కెప్టెన్‌గా సమయం ఇవ్వలేరా?.. ఐసీసీ ఈవెంట్లలో పదహారు మ్యాచ్‌లలో పదిహేను మ్యాచ్‌లను గెలిపించిన సారథి. వన్డే వరల్డ్‌కప్-2023లో జట్టును ఫైనల్‌కు చేర్చాడు.ఇటీవల దుబాయ్‌లో జరిగిన ఐసీసీ చాంపియన్స్‌ట్రోఫీ ఫైనల్లో రోహిత్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. జట్టుకు ట్రోఫీ అందించాడు. 2024లో టీ20 ప్రపంచకప్ గెలవగానే రిటైర్మెంట్ ప్రకటించి తన గొప్పతనాన్ని చాటుకున్నాడు.కొందరు పట్టుకుని వేలాడతారు.. రోహిత్ అలా చేయలేదు‘మేము ప్రపంచకప్ గెలిచాం. కొత్త ఆటగాళ్లకు కూడా అవకాశాలు రావాలి’ అని తనే తప్పుకొన్నాడు. కొన్నాళ్లు లైమ్‌లైట్‌కు దూరంగా ఉన్నాడు. నిజానికి భారత క్రికెట్లో కెప్టెన్‌గా చాలామంది తమ కాలాన్ని పొడిగించుకునేందుకు, పదవిని పట్టుకుని వేలాడుతూ ఉంటారు.కానీ రోహిత్ శర్మ అలా చేయలేదు కదా!.. తను వాళ్ల లాంటి వాడు కాదు.. అయినా ఇలా ఎందుకు?.. నిజానికి రోహిత్ ఎంతో మంది ఆటగాళ్లను తీర్చిదిద్దాడు. వారికి ఎన్నో విషయాలు నేర్పించాడు. అయినా సరే అతడిని ఇంకొక్క ఏడాది కెప్టెన్‌గా కొనసాగించలేరా?ఇంత హడావుడిగా ఎందుకు?వన్డే వరల్డ్‌కప్-2027 గురించి చాలా మంది మాట్లాడుతున్నారు. అందుకు ఇంకా సమయం ఉంది. అయితే, ఇప్పటికే రోహిత్‌ను తొలగించారు. శుబ్‌మన్ గిల్ కొత్త సారథిగా వచ్చాడు. గిల్ ఇంకా యువకుడే. ఇప్పుడే హడావుడిగా అతడికి వన్డే కెప్టెన్సీ అప్పగించాల్సిన అవసరమైతే నాకు కనిపించలేదు’’ అంటూ కైఫ్ బీసీసీఐ తీరును విమర్శించాడు. చదవండి: 50 ఓవర్ల క్రికెట్లో ట్రిపుల్ సెంచరీ.. ఆసీస్ బ్యాటర్ విధ్వంసం -
వన్డే కెప్టెన్‌గా ఎంపిక.. శుబ్‌మన్ గిల్ రియాక్షన్ వైరల్
టీమిండియా వన్డే కెప్టెన్‌గా ఎంపిక కావడం పట్ల శుబ్‌మన్ గిల్ (Shubman Gill) హర్షం వ్యక్తం చేశాడు. వన్డేల్లోనూ జట్టుకు సారథ్యం వహించడం తనకు దక్కిన గొప్ప గౌరవమని పేర్కొన్నాడు. వరల్డ్‌కప్ గెలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతానని ఈ సందర్భంగా గిల్ పేర్కొన్నాడు.కాగా ఆస్ట్రేలియా పర్యటన నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వన్డే, టీ20 జట్లను శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, అనూహ్య రీతిలో రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించిన బోర్డు.. అతడి స్థానంలో గిల్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. వన్డే వరల్డ్‌కప్-2027 (ICC ODI World Cup 2027) టోర్నీని దృష్టిలో పెట్టుకుని ముందుగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ వెల్లడించాడు.ప్రపంచకప్ గెలవడమే లక్ష్యంఈ నేపథ్యంలో తాను వన్డే కెప్టెన్‌గా ఎంపిక కావడం పట్ల టెస్టు సారథి శుబ్‌మన్ గిల్ స్పందించాడు. ‘‘వన్డే క్రికెట్లో జాతీయ జట్టును ముందుకు నడిపించడం నాకు దక్కిన గొప్ప గౌరవం. చాంపియన్ జట్టుకు సారథిగా ఎంపిక కావడం గర్వంగా ఉంది. నేను కూడా జట్టును గొప్పగా ముందుకు నడిపించాలనే ఆశిస్తున్నా.వరల్డ్‌కప్ కంటే ముందు మేము 20 వరకు వన్డేలు ఆడబోతున్నాము. ప్రపంచకప్ గెలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతాం. ప్రతి ఒక్క ఆటగాడు తమ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలనే కోరుకుంటాడు. నేను కూడా అంతే. సౌతాఫ్రికాలో జరిగే ఐసీసీ టోర్నీకి మేము పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతాము. వరల్డ్‌కప్ గెలుస్తాం’’ అని శుబ్‌మన్ గిల్ పేర్కొన్నాడు.రోహిత్ ఖాతాలో రెండుకాగా చివరగా 2011లో మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో వన్డే వరల్డ్‌కప్ గెలిచిన టీమిండియా.. 2023లో సొంతగడ్డపై రోహిత్ శర్మ కెప్టెన్సీలో రన్నరప్‌గా నిలిచింది. అయితే, ఈ ఏడాది ఐసీసీ వన్డే చాంపియన్స్ ట్రోఫీ-2025లో మాత్రం విజేతగా నిలిచింది. తద్వారా కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఖాతాలో రెండు ఐసీసీ టైటిళ్లు చేరాయి. అంతకుముందు టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలోనూ కెప్టెన్ హోదాలో రోహిత్ భారత్‌ను చాంపియన్‌గా నిలిపిన సంగతి తెలిసిందే.అనూహ్య రీతిలోఆ తర్వాత అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ.. ఇటీవలే టెస్టులకు కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. వన్డేల్లో కొనసాగుతానని స్పష్టం చేసిన రోహిత్ శర్మ పది కిలోల బరువు తగ్గి ఫిట్నెస్ను మరింత మెరుగుపరచుకున్నాడు. వన్డే వరల్డ్‌కప్-2027 ఆడటమే లక్ష్యంగా తనను తాను తీర్చిదిద్దుకుంటున్న తరుణంలో అనూహ్య రీతిలో కెప్టెన్సీ కోల్పోయాడు. కాగా 2027లో సౌతాఫ్రికా- జింబాబ్వే- నమీబియా ఉమ్మడిగా వన్డే వరల్డ్‌కప్ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. చదవండి: 50 ఓవర్ల క్రికెట్లో ట్రిపుల్ సెంచరీ.. ఆసీస్ బ్యాటర్ విధ్వంసం -
అకస్మాత్తుగా అతడెలా ఊడిపడ్డాడు?: బీసీసీఐపై మాజీ కెప్టెన్ ఫైర్
టీమిండియా సెలక్టర్ల తీరుపై భారత జట్టు మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ (Kris Srikkanth) ఆగ్రహం వ్యక్తం చేశాడు. కొంతమంది ఆటగాళ్లను తప్పించడానికి వీరికి రోజుకో సాకు దొరుకుతుందని మండిపడ్డాడు. ఆస్ట్రేలియాతో వన్డేలకు ఎంపిక చేసిన జట్టు తనను ఆశ్చర్యపరిచిందని.. సంజూ శాంసన్ (Sanju Samson) పట్ల వివక్ష ఎందుకో అర్థం కావడం లేదని వాపోయాడు.ఆస్ట్రేలియా పర్యటనకు టీమిండియాస్వదేశంలో వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత టీమిండియా ఆస్ట్రేలియా పర్యటన (India Tour Of Australia 2025)కు వెళ్లనున్న విషయం తెలిసిందే. అక్టోబరు 19- నవంబరు 8 మధ్య ఇరుజట్లు మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లలో తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) శనివారం ఇందుకు సంబంధించిన జట్లను ప్రకటించింది.వారిద్దరు తొలిసారి..వన్డే కెప్టెన్‌గా రోహిత్ శర్మపై వేటు వేసి.. శుబ్‌మన్ గిల్‌కు పగ్గాలు అప్పగించారు. ఇక శ్రేయస్ అయ్యర్‌కు వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్ ఇవ్వడంతో పాటు.. నితీశ్ కుమార్ రెడ్డి, ధ్రువ్ జురెల్‌ను తొలిసారి వన్డే జట్టుకు ఎంపిక చేశారు. వికెట్ కీపర్ కోటాలో కేఎల్ రాహుల్‌తో పాటు జురెల్‌ను ఎంపిక చేసిన సెలక్టర్లు.. సంజూ శాంసన్‌కు మాత్రం మొండిచేయి చూపారు.అతడికి అన్యాయంఈ విషయంపై టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఘాటుగా స్పందించాడు. ‘‘మరోసారి అతడికి అన్యాయం చేశారు. ఆఖరిగా ఆడిన వన్డేలో అతడు సెంచరీ చేశాడు. ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు సంజూను తప్పక ఎంపిక చేయాల్సింది.కానీ ఓ ఆటగాడిని తప్పించడానికి వీళ్లకు (సెలక్టర్లు) రోజుకో సాకు దొరుకుతుంది. ఓసారి అతడిని ఐదో స్థానంలో బ్యాటింగ్ చేయమంటారు. మరోసారి ఓపెనర్‌గా రమ్మంటారు. ఇంకోసారి ఏడు లేదంటే ఎనిమిదో నంబర్ బ్యాటర్‌గా ఆడమంటారు.జురెల్ ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు?అయినా.. అకస్మాత్తుగా ధ్రువ్ జురెల్ ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు?.. వన్డేల్లో సంజూ శాంసన్ కంటే అతడికి మొదటి ప్రాధాన్యం ఎలా దక్కుతుంది?.. తుదిజట్టులో సంజూ ఉన్నా, లేకపోయినా జట్టులో మాత్రం అతడికి చోటివ్వాలి కదా!హర్షిత్ రాణా ఎందుకు?ఇలాంటి పనులు చేయడం ద్వారా ఆటగాళ్లను గందరగోళానికి గురిచేస్తున్నారు. ఒక్కోసారి యశస్వి జైస్వాల్ జట్టులో ఉంటాడు. మరోసారి అతడి పేరే కనిపించదు. అయితే, హర్షిత్ రాణా మాత్రం అన్ని జట్లలో ఉంటాడు.అతడు జట్టులో ఎందుకు ఉంటున్నాడో ఎవరికీ తెలియదు. ఇలా ప్రతిసారి ఒకరికి వరుస అవకాశాలు ఇస్తూ.. మరొకరిని తప్పించడం ద్వారా ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది’’ అని చిక్కా సెలక్టర్ల తీరును విమర్శించాడు. కాగా ఇప్పటికే టెస్టుల్లో ఇరగదీస్తున్న జురెల్.. టీమిండియా తరఫున టీ20 ఫార్మాట్లోనూ అరంగేట్రం చేశాడు.సౌతాఫ్రికా జట్టుపై సంజూ సెంచరీమరోవైపు.. సంజూ చివరగా 2023లో సౌతాఫ్రికాతో వన్డేలో 108 పరుగులు సాధించి.. టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించాడు. మొత్తంగా 16 వన్డేల్లో కలిపి సగటు 56తో 99కు పైగా స్ట్రైక్‌రేటుతో 510 పరుగులు సాధించాడు. అయినప్పటికీ సెలక్టర్లు మాత్రం అతడిని వన్డేలకు ఎంపిక చేయడం లేదు. అయితే, ఆసీస్‌తో టీ20 సిరీస్ ఆడే జట్టులో మాత్రం ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్‌కు చోటు దక్కింది.ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు బీసీసీఐ ప్రకటించిన జట్టుశుబ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మొహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), యశస్వి జైశ్వాల్.చదవండి: 50 ఓవర్ల క్రికెట్లో ట్రిపుల్ సెంచరీ.. ఆసీస్ బ్యాటర్ విధ్వంసం -
రోహిత్‌పై వేటు!.. సరైన నిర్ణయం.. త్వరలోనే అతడూ అవుట్: గావస్కర్
ఆస్ట్రేలియా పర్యటనకు ముందు భారత క్రికెట్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వన్డే కెప్టెన్‌గా రోహిత్ శర్మ (Rohit Sharma)పై వేటువేసిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI).. అతడి స్థానంలో శుబ్‌మన్ గిల్ (Shubman Gill)ను సారథిగా ఎంపిక చేసింది.ఆసీస్‌తో అక్టోబరులో జరిగే వన్డే సిరీస్ సందర్భంగా గిల్ వన్డే జట్టు పగ్గాలు చేపట్టనుండగా.. రోహిత్ శర్మ కేవలం ఆటగాడిగా కొనసాగనున్నాడు. ఈ నేపథ్యంలో బీసీసీఐ తీరుపై విమర్శలు వస్తుండగా.. భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ కూడా స్పందించాడు.త్వరలోనే అతడూ అవుట్రోహిత్ శర్మపై వేటు వేస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని గావస్కర్ సమర్థించాడు. ‘‘వన్డే వరల్డ్‌కప్-2027 నేపథ్యంలో బోర్డు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం నాకేమీ ఆశ్చర్యంగా అనిపించలేదు. ప్రస్తుతం టీ20 కెప్టెన్సీ సూర్యకుమార్ యాదవ్ చేతిలో ఉంది.ఇటీవలే అతడు టీమిండియాను ఆసియా కప్ విజేతగా నిలిపాడు. ఈ టోర్నీలో సూర్య డిప్యూటీగా, వైస్ కెప్టెన్‌గా గిల్ వ్యవహరించాడు. అంటే.. త్వరలోనే అతడు మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌గా ఉండబోతున్నాడని ముందుగానే స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు’’ అని గావస్కర్ స్పోర్ట్స్ టుడేతో పేర్కొన్నాడు. వన్డే ప్రపంచకప్-2027 నాటికి గిల్ చుట్టూ జట్టును నిర్మించే క్రమంలో బీసీసీఐ సరైన నిర్ణయమే తీసుకుందని అభిప్రాయపడ్డాడు. అందుకే ఈ నిర్ణయం’కెప్టెన్సీ మార్పు గురించి రోహిత్‌కు ముందే తెలియజేశాం. 2027 వన్డే వరల్డ్ కప్‌కు చాలా సమయం ఉన్నా సహజంగానే దాని గురించి ఆలోచించాల్సి ఉంటుంది. ఇప్పుడు వన్డే జరుగుతున్న తీరు చూస్తే వచ్చే రెండేళ్లలో ఎక్కువగా మ్యాచ్‌లు లేకపోవచ్చు. కాబట్టి కెప్టెన్ జట్టు గురించి తెలుసుకునేందుకు, తన ప్రణాళికలు రూపొందించుకునేందుకు తగినంత సమయం కావాలి. అందుకే గిల్‌ను ఎంపిక చేశాం. నిజంగా చెప్పాలంటే మూడు ఫార్మాట్లకు ముగ్గురు వేర్వేరు కెప్టెన్లు ఉండటం కూడా కష్టమే. కెప్టెన్‌గా రోహిత్ చాలా అద్భుతంగా నడిపించాడు. ఒక వేళ చాంపియన్స్ ట్రోఫీ గెలవకపోయినా అది అతని గొప్పతనాన్ని తగ్గించదు. కానీ ఇప్పుడు కాకపోతే ఆరు నెలల తర్వాత అయినా ఏదో ఒక దశలో టీమ్ భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిందే’ అని టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కూడా తమ నిర్ణయాన్ని సమర్థించుకున్న సంగతి తెలిసిందే. -
వన్డే సారథిగా గిల్
రోహిత్ శర్మ భారత వన్డే జట్టు కెప్టెన్ హోదాలో చాంపియన్స్ ట్రోఫీలో జట్టును విజేతగా నిలిపాడు. దీని తర్వాత టీమిండియా మరో వన్డే మ్యాచ్ ఆడలేదు. లెక్క ప్రకారం చూస్తే ఏదైనా స్వల్ప మార్పు మినహా అదే జట్టు తర్వాతి సిరీస్ కోసం కొనసాగాలి. కానీ బీసీసీఐ సెలక్షన్ కమిటీ భిన్నంగా ఆలోచించింది. ఐసీసీ టోర్నీని గెలిపించినా సరే... సారథ్యం నుంచి తప్పించి అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఓపెనింగ్ బ్యాటర్‌గా జట్టులో స్థానం దక్కించుకోగలిగిన ఆటగాడు నాయకత్వానికి మాత్రం అవసరం లేదని తేలి్చంది. ఇప్పటికే టెస్టు కెప్టెన్‌గా ఉన్న శుబ్‌మన్ గిల్‌ను ఇప్పుడు వన్డే కెప్టెన్‌గా కూడా నియమించి మార్పుకు సెలక్టర్లు శ్రీకారం చుట్టారు. ఆటగాళ్లుగా మాత్రం రోహిత్, విరాట్ కోహ్లి భారత జట్టు తరఫున ఆ్రస్టేలియా పర్యటనకు ఎంపికయ్యారు. అహ్మదాబాద్: భారత టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ ఇప్పుడు వన్డేల్లోనూ సారథ్య బాధ్యతలు చేపడుతున్నాడు. అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలక్షన్ కమిటీ గిల్‌ను వన్డే జట్టు కొత్త కెప్టెన్‌గా నియమించింది. ఇప్పటి వరకు కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మను అనూహ్యంగా నాయకత్వం నుంచి తప్పిస్తూ సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. ఆస్ట్రేలియా గడ్డపై జరిగే 3 వన్డేలు, 5 టి20ల సిరీస్‌ల కోసం టీమ్‌లను సెలక్టర్లు ప్రకటించారు. కెప్టెన్‌గా రోహిత్ వైఫల్యం లేకపోయినా... భవిష్యత్తును, ముఖ్యంగా 2027 వన్డే వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకొని 26 ఏళ్ల గిల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసినట్లు సెలక్టర్లు వెల్లడించారు. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో తొలి సారి టెస్టు కెప్టెన్‌గా వ్యవహరించిన గిల్ ఇప్పుడు రెండు ఫార్మాట్లలో కెప్టెన్ కావడంతో పాటు టి20 టీమ్‌కు వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. 2026 టి20 వరల్డ్ కప్ తర్వాత సూర్యకుమార్ యాదవ్‌నుంచి అతనికి టి20 సారథ్య బాధ్యతలు కూడా వచ్చే అవకాశం ఉంది. రోహిత్ వయసు (38)ను దృష్టిలో ఉంచుకొని చూస్తే 2027 వరకు ఆటగాడిగా, కెప్టెన్‌గా కొనసాగడం కష్టంగానే అనిపించినా... ఇంత తొందరగా అతడిని కెప్టెన్ హోదానుంచి తప్పిస్తారనేది మాత్రం ఎవరూ ఊహించలేదు. అయితే అసలు వన్డే జట్టులో ఉంటారా లేదా అనే చర్చ జరిగిన నేపథ్యంలో... రోహిత్‌తో పాటు మరో సీనియర్ విరాట్ కోహ్లిలకు కూడా వన్డే టీమ్‌లో స్థానం లభించింది. వైస్ కెప్టెన్‌గా శ్రేయస్... భారత జట్టు చాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచిన జట్టులో పలు మార్పులు జరిగాయి. ఆ టీమ్‌లో ఉన్నవారిలో రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా ఇంకా గాయాలనుంచి కోలుకోలేదు. ఇద్దరు స్పిన్నర్లు జడేజా, వరుణ్ చక్రవర్తిలను ఎంపిక చేయలేదు. పేస్ బౌలర్ మొహమ్మద్ షమీకి కూడా జట్టులో స్థానం లభించలేదు. వారి స్థానాల్లో నితీశ్ కుమార్ రెడ్డి, ధ్రువ్ జురేల్, ప్రసిధ్ కృష్ణ, అర్‡్షదీప్ సింగ్, మొహమ్మద్ సిరాజ్ వచ్చారు. టాప్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు వన్డేల నుంచి మరోసారి విశ్రాంతినిచ్చారు. గత ఏడాది ఆగస్టు తర్వాత వన్డేలు ఆడని సిరాజ్ తన ఇటీవలి టెస్టు ప్రదర్శనతో మళ్లీ టీమ్‌లోకి రాగా... టెస్టులు, టి20ల్లో ఆకట్టుకున్న ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి, కీపర్ ధ్రువ్ జురేల్‌లకు వన్డేల్లో ఇదే తొలి అవకాశం. దుబాయ్ తరహాలో ఎక్కువ మంది స్పిన్నర్లను ఆడించే అవకాశం ఆ్రస్టేలియాలో లేదని...అందుకే జడేజాను పక్కన పెట్టామని అగార్కర్ స్పష్టం చేశాడు. వన్డేల్లో నిలకడగా రాణిస్తున్న శ్రేయస్ అయ్యర్‌ను ఈ సిరీస్ కోసం వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. సుందర్‌కు చోటు... టి20 టీమ్‌లో మాత్రం సెలక్టర్లు పెద్దగా మార్పేమీ చేయలేదు. ఆసియా కప్‌లో విజేతగా నిలిచిన జట్టులో ఒక్క హార్దిక్ పాండ్యా మాత్రమే గాయం కారణంగా దూరమయ్యాడు. అతని స్థానంలోనే ఆల్‌రౌండర్‌గా నితీశ్ రెడ్డికి స్థానం లభించింది. ఆ 15 మందితో పాటు ఆ్రస్టేలియా పర్యటన కోసం అదనంగా 16వ ఆటగాడి రూపంలో ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను ఎంపిక చేశారు. వన్డేలకు దూరంగా ఉండనున్న బుమ్రా టి20లు మాత్రం ఆడతాడు. భారత్, ఆ్రస్టేలియా మధ్య అక్టోబర్ 19, 23, 25 తేదీల్లో వన్డేలు...అక్టోబర్ 29 నుంచి నవంబర్ 8 మధ్య 5 టి20లు జరుగుతాయి. -
రోహిత్ శర్మపై కుట్ర..! ఇది మీకు న్యాయమేనా?
భారత క్రికెట్లో కెప్టెన్‌గా రోహిత్ శర్మ శకం ముగిసింది. ఇప్పటికే టెస్టు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్‌ను తాజాగా వన్డే కెప్టెన్సీ నుంచి సైతం బీసీసీఐ తప్పించింది. అతడి స్ధానంలో యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్‌ను కొత్త వన్డే కెప్టెన్‌గా అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ నియమించింది.బీసీసీఐ సెలక్షన్ కమిటీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని హిట్‌మ్యాన్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా బీసీసీఐపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. రోహిత్ ఇప్పటికీ ఫిట్‌గా ఉన్నాడని, వన్డే ప్రపంచకప్-2027 వరకు అతడు ఆడగలడని ఫ్యాన్స్ పోస్ట్‌లు పెడుతున్నారు.రోహిత్ శర్మ ది బెస్ట్ కెప్టెన్.. బీసీసీపై అతడిని కావాలనే తప్పించందని ఓ యూజర్ ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. రెండు ఐసీసీ ట్రోఫీలు అందించిన కెప్టెన్‌ను ఇలా అవమానిస్తారా? అని మరో యూజర్ ఎక్స్‌లో రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఎక్స్‌లో రోహిత్ శర్మ పేరు ట్రెండ్ అవుతోంది. థాంక్యూ రోహిత్ అని అభిమానులు భావోద్వేగానికి లోనవతున్నారు.1 Like = 100 Slap .1 Rt =1000 Slap.#RohitSharma𓃵#RohitSharma #INDvsAUS pic.twitter.com/Qm4DJZI3ct— Avneesh Mishra (@RajaMishra007) October 4, 2025 END OF AN ERA 💔Thank You, Captain Rohit Sharma 🙌2 ICC trophies in just 8 months.A leader who gave India glory, pride & unforgettable memories. 🇮🇳THE HITMAN. THE CAPTAIN. THE LEGEND. #RohitSharma𓃵Congratulations Gill for your ODIs captaincy in #INDvsAUS#RohitSharma pic.twitter.com/V3KZeZAxWH— Adorable (@rehnedotumm_) October 4, 2025తిరుగులేని రోహిత్..మూడు ఫార్మాట్లలోనూ తిరిగి లేని కెప్టెన్‌గా రోహిత్ నిలిచాడు. నాయకుడిగా హిట్‌మ్యాన్ భారత్‌కు రెండు ఐసీసీ టైటిల్స్‌ను అందించాడు. టీ20 ప్రపంచకప్-2024, ఛాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిల్స్‌ను అతడి సారథ్యంలోనే టీమిండియా సొంతం చేసుకుంది. అదేవిధంగా వన్డే ప్రపంచకప్ 2023లో జట్టును ఫైనల్ వరకూ తీసుకెళ్లాడు. ఆ టోర్నీలో భారత్ మొత్తంగా 11 మ్యాచ్‌లలో పదింట గెలిచింది. అనుహ్యంగా తుది పోరులో ఓటమి పాలై తృటిలో ట్రోఫీని కోల్పోయింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా ఓవరాల్‌గా 56 వన్డే మ్యాచ్‌లు ఆడింది.అందులో 42 మ్యాచ్‌లలో గెలిచింది. 12 మ్యాచ్‌లలో ఓడిపోయింది. ఒక మ్యాచ్‌లో ఫలితం రాలేదు. మరో మ్యాచ్ టైగా ముగిసింది. కెప్టెన్‌గా అతడి విజయం శాతం 76గా ఉంది. ఆసీస్ టూర్‌కు భారత వన్డే జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్ , అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్ -
అందుకే రోహిత్ శర్మపై వేటు: కుండబద్దలు కొట్టిన అగార్కర్
టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ (Rohit Sharma) శకం ముగిసింది. ఇప్పటికే టెస్టు, అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన హిట్‌మ్యాన్.. వన్డేల్లో మాత్రం కెప్టెన్‌గా కొనసాగుతానని ప్రకటించాడు. అయితే, అనూహ్య రీతిలో ఆస్ట్రేలియా పర్యటనకు ముందు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) రోహిత్‌పై వేటు వేసింది.వన్డే సారథిగా రోహిత్ శర్మను తప్పించి.. అతడి స్థానంలో.. యువ ఆటగాడు, టీమిండియా టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill)కు పగ్గాలు అప్పగించింది. దీంతో రోహిత్ కేవలం ఆటగాడిగానే జట్టులో కొనసాగనున్నాడు. ఈ నేపథ్యంలో బీసీసీఐ తీరుపై రోహిత్ శర్మ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దిగ్గజ కెప్టెన్‌కు ఇది అవమానం లాంటిదేనని సోషల్ మీడియా వేదికగా సెలక్టర్ల తీరును ఎండగడుతున్నారు. వన్డేల్లో డెబ్బై ఐదుకు పైగా విజయశాతం కలిగి ఉన్న సారథి పట్ల ఇలా వ్యవహరించడం సరికాదని హితవు పలుకుతున్నారు.అందుకే రోహిత్ శర్మపై వేటుఇదిలా ఉంటే.. రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించడంపై టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పందించాడు. ఆస్ట్రేలియాతో వన్డే, టీ20 సిరీస్‌లకు జట్టును ప్రకటించిన సందర్భంగా ఈ విషయంపై వివరణ ఇచ్చాడు. ‘‘భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది.జట్టు అత్యుత్తమ ప్రయోజనాల గురించే ఆలోచించాల్సి ఉంటుంది. ముందుగానే స్పందించి.. కొత్త వ్యక్తి (గిల్) చుట్టూ జట్టును నిర్మించాల్సి ఉంటుంది. ఇది సహేతుకమైన నిర్ణయం’’ అగార్కర్ తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు.అదే విధంగా.. మూడు ఫార్మాట్లలో ముగ్గురు కెప్టెన్లు ఉండటం ప్రాక్టికల్‌గా అంతగా వర్కౌట్ కాదని.. అన్ని జట్లకు ఒకే కెప్టెన్ ఉండటం ద్వారా హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌కు కూడా పని సులువు అవుతుందని పేర్కొన్నాడు. అయితే, కెప్టెన్సీ నుంచి తప్పించడంపై రోహిత్‌తో ఎలాంటి చర్చ జరిగిందన్న విషయంపై మాత్రం అగార్కర్ స్పష్టతనివ్వలేదు.అప్పటి వరకు రో-కో ఆడటం కష్టమేఏదేమైనా వన్డే వరల్డ్‌కప్-2027 టోర్నీని దృష్టిలో పెట్టుకుని.. కెప్టెన్సీ విషయం గురించి రోహిత్‌తో మాట్లాడమని మాత్రమే అగార్కర్ వెల్లడించాడు. ఇక రోహిత్‌తో పాటు మరో దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి కూడా దేశీ క్రికెట్ ఆడాల్సి ఉంటుందా? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘ఆటగాళ్లు అందుబాటులో ఉన్నపుడు కచ్చితంగా దేశవాళీ క్రికెట్ ఆడాల్సి ఉంటుందని మేము స్పష్టంగా చెప్పాము’’ అని పేర్కొన్నాడు.అంతేకాదు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వన్డే వరల్డ్‌కప్-2027 నాటికి ఆడే విషయంపై తమకు ఎలాంటి హామీ ఇవ్వలేదని అగార్కర్ ఈ సందర్భంగా పేర్కొనడం గమనార్హం. ప్రస్తుతం నిబంధనలకు అనుగుణంగా ఇద్దరికీ ఫిట్నెస్ టెస్టులు నిర్వహించామని.. ఇద్దరూ మ్యాచ్ ఆడేందుకు ఫిట్‌గా ఉన్నారని తెలిపాడు. కాగా అక్టోబరు 19 నుంచి నవంబరు 8 వరకు టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇందుకు సంబంధించిన బీసీసీఐ శనివారం తమ జట్లను ప్రకటించింది.చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియా టూర్‌కు భారత జట్టు ప్రకటన.. నితీశ్ రెడ్డికి బంపరాఫర్ -
ఆస్ట్రేలియా టూర్‌కు భారత జట్టు ప్రకటన.. నితీశ్ రెడ్డికి బంపరాఫర్
ఆస్ట్రేలియా టూర్‌కు భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ శనివారం ప్రకటించింది. భారత జట్టు వన్డే కెప్టెన్‌గా రోహిత్ శర్మను సెలక్టర్లు తప్పించారు. అతడి స్ధానంలో శుభ్‌మన్ గిల్‌ను కొత్త వన్డే కెప్టెన్‌గా నియమించారు. గత కొన్నేళ్లుగా భారత వన్డే జట్టును నడిపిస్తున్న రోహిత్ శర్మ ఇకపై కేవలం ఆటగాడిగా మాత్రమే కొనసాగనున్నాడు.అతడితో పాటు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి కూడా వన్డే జట్టులో చోటు దక్కింది. కాగా ఆస్ట్రేలియా పర్యటనకు స్టార్ ప్లేయర్లు హార్ధిక్ పాండ్యా, రిషబ్ పంత్ గాయాల కారణంగా దూరమయ్యారు. ఇంగ్లండ్ పర్యటనలో గాయపడిన పంత్ ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించలేదు.అదేవిధంగా యూఏఈ వేదికగా జరిగిన ఆసియాకప్‌లో గాయపడ్డ హార్ధిక్ పూర్తిగా కోలుకోవడానికి మరో నెల రోజుల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వీరిద్దరిని సెలక్టర్లు ఎంపిక చేయలేదు. హార్ధిక్ పాండ్యా స్ధానంలో యువ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి వన్డే, టీ20 జట్టులో చోటు దక్కించుకున్నాడు. నితీష్ గత కొన్నాళ్లగా కేవలం టెస్టు జట్టులో మాత్రమే కొనసాగుతున్నాడు. కానీ హార్దిక్ గాయం పడడంతో నితీష్‌కు జాక్ పాట్ తగిలింది. పంత్ స్ధానంలో ధ్రువ్ జురెల్ ఎంపికయ్యాడు.బుమ్రాకు విశ్రాంతి..కాగా ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. మహ్మద్ సిరాజ్ తిరిగి వన్డే జట్టులోకి వచ్చాడు. పేస్ బౌలింగ్ ఎటాక్‌ను సిరాజ్ లీడ్ చేయనున్నాడు. అతడితో పాటు యువ పేసర్లు అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, ప్రసిద్ద్ కృష్ణలు బంతిని పంచుకోనున్నారు.స్పిన్నర్లగా కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ చోటు దక్కించుకున్నారు. ఇక టీ20 జట్టులో పెద్దగా మార్పులు చోటు చేసుకోలేదు. కెప్టెన్‌గా సూర్య కొనసాగుతుండగా.. నితీష్, సుందర్ కొత్తగా జట్టులోకి వచ్చారు. ఆక్టోబర్ 19 నుంచి భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటన ప్రారంభం కానుంది.ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు భారత జట్టు:శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహమ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), యశస్వి జైశ్వాల్ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు:సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, శివమ్ దూబె, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్చదవండి: BCCI: రోహిత్ శర్మకు భారీ షాక్.. టీమిండియా వన్డే కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ -
వరుసగా ఆరు ఓటములు.. మరేం పర్లేదు.. ఆ ముగ్గురు అద్భుతం: గిల్
వెస్టిండీస్‌తో తొలి టెస్టులో గెలుపు పట్ల టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) హర్షం వ్యక్తం చేశాడు. ఇదొక సంపూర్ణ మ్యాచ్ అని.. రెండు ఇన్నింగ్స్‌లో బౌలర్లు రాణించిన తీరు అద్భుతమని కొనియాడాడు. బ్యాటింగ్ పరంగానూ తాము గొప్పగా ఆడామని.. ముగ్గురు సెంచరీలు చేయడం సంతోషాన్నిచ్చిందని పేర్కొన్నాడు.ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా టీమిండియా టెస్టు సారథిగా గిల్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ గడ్డ మీద బ్యాటర్‌గా, కెప్టెన్‌గా రాణించిన ఈ కుడిచేతి వాటం ఆటగాడు.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-2తో సమం చేసుకున్నాడు. అయితే, ఇంగ్లండ్ గడ్డ మీద ఐదు టెస్టుల్లోనూ గిల్ టాస్ ఓడిపోయాడు.వరుసగా ఆరు ఓటములుతాజాగా వెస్టిండీస్‌తో తొలి టెస్టు (IND vs WI 1st Test)లోనూ ఇదే రిపీటైంది. అయితే, సారథిగా టాస్ ఓడినా మ్యాచ్‌లు మాత్రం గెలిచాడు గిల్. ఈ నేపథ్యంలో విండీస్‌పై విజయానంతరం మాట్లాడుతూ.. ‘‘వరుసగా ఆరుసార్లు టాస్ ఓడిపోయాను.అయితే, మ్యాచ్‌లు మాత్రం గెలుస్తూనే ఉన్నాం. కాబట్టి టాస్‌లో ఓడిన ప్రభావం పడిందని అనుకోను. దానిని అసలు లెక్కేచేయను. ఇదొక సంపూర్ణ మ్యాచ్. విజయం పట్ల సంతోషంగా ఉంది.ఎలాంటి ఫిర్యాదులూ లేవుముగ్గురు సెంచరీలు చేశారు. ఈ మ్యాచ్‌లో మా ఫీల్డింగ్ రెండు ఇన్నింగ్స్‌లోనూ భేషుగ్గా ఉంది. ఏ విషయంలోనూ ఎలాంటి ఫిర్యాదులూ లేవు. ఈ పిచ్ బ్యాటింగ్‌కు బాగానే ఉంది.అయితే, నేను, జైస్వాల్ మెరుగ్గా ఆడలేకపోయాము. శుభారంభం అందుకున్నా దానిని కొనసాగించలేకపోయాము. ఇక మా స్పిన్నర్ల గురించి ప్రత్యేకంగా చెప్పేదేమీ లేదు. నాణ్యమైన స్పిన్నర్లు జట్టులో ఉన్నారు. వారిని రొటేట్ చేసుకోవడమే కష్టం. అయితే, ఇలాంటి సవాలు ఎదురుకావడం జట్టుకు మంచిదే.కెప్టెన్‌గా చాలా విషయాలు నేర్చుకుంటున్నాఅవసరమైనప్పుడు ప్రతి ఒక్కరు అందుబాటులో ఉండి పని పూర్తి చేస్తారు. మా జట్టులో యువకులు ఎక్కువగా ఉన్నారు. కెప్టెన్‌గా నేను చాలా విషయాలు నేర్చుకుంటున్నా. క్లిష్ట పరిస్థితులను ఎలా అధిగమించాలో తెలుసుకుంటున్నా. జట్టుగా మేమంతా ఇప్పటికీ నేర్చుకునే దశలోనే ఉన్నాం. అనుభవం గడించే కొద్దీ మేము మరింత సానుకూలంగా.. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగగలం’’ అని గిల్ చెప్పుకొచ్చాడు. కాగా విండీస్‌తో తొలి టెస్టులో కేఎల్ రాహుల్ (100), ధ్రువ్ జురెల్ (125), రవీంద్ర జడేజా (104- నాటౌట్) సెంచరీలు చేయగా.. గిల్ 50 పరుగులు సాధించాడు. ఇక బౌలర్లలో పేసర్లు సిరాజ్ ఓవరాల్‌గా ఏడు వికెట్లు తీయగా.. బుమ్రా మూడు వికెట్లు కూల్చాడు. స్పిన్నర్లలో రవీంద్ర జడేజా నాలుగు, కుల్దీప్ యాదవ్ నాలుగు, వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ తొలి టెస్టు స్కోర్లుటీమిండియా: 448/5 డిక్లేర్డ్వెస్టిండీస్: 162 & 146ఫలితం: వెస్టిండీస్‌ను ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా.చదవండి: Rishabh Pant Facts: రిషభ్ పంత్ నెట్‌వర్త్ ఎంతో తెలుసా? -
రోహిత్ శర్మకు భారీ షాక్.. టీమిండియాకు కొత్త కెప్టెన్
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ముందు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. టీమిండియా వన్డే కెప్టెన్‌గా రోహిత్ శర్మ(Rohit sharma) స్ధానంలో యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్‌ను అజిత్ అగార్కర్ అండ్ కో నియమించింది. ఆస్ట్రేలియా టూర్‌కు భారత జట్టు ఎంపిక సందర్భంగా ఈ నిర్ణయాన్ని సెలక్టర్లు తీసుకున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు వన్డే జట్టులో సభ్యులుగా కొనసాగనున్నారు.2027 వన్డే ప్రపంచ కప్ దృష్ట్యా రోహిత్ శర్మ స్ధానంలో కెప్టెన్‌గా గిల్‌ను భారత క్రికెట్ నియంత్రణ బోర్డు(బీసీసీఐ) ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ప్రపంచ కప్‌కు ఇంకా రెండేళ్ల కంటే ఎక్కువ సమయం ఉండడంతో అప్పటివరకు రోహిత్ ఆడుతాడో లేదో స్పష్టత లేనందున భారత క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.ముగిసిన రోహిత్ శకం..భారత క్రికెట్లో కెప్టెన్‌గా రోహిత్ శర్మ శకం ముగిసింది. ఇప్పటికే టెస్టులకు, టీ20లకు వీడ్కోలు పలికిన హిట్‌మ్యాన్.. ఇప్పుడు వన్డే కెప్టెన్సీ కోల్పోయాడు. దీంతో ఆసీస్ సిరీస్‌లో అతడిని కెప్టెన్‌గా చూడాలనకున్న అభిమానులకు తీవ్ర నిరాశే ఎదురైంది.వన్డేల్లో భారత సారథిగా రోహిత్‌కు అద్భతమైన ట్రాక్ రికార్డు ఉంది. టీమిండియాకు కెప్టెన్‌గా ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు. వన్డేల్లో 50పైగా మ్యాచ్‌లలో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఏడుగురులో ఒకడిగా రోహిత్ నిలిచాడు. వన్డేల్లో 75% విజయ శాతంతో అత్యుత్తమ కెప్టెన్‌గా రోహిత్ నిలిచాడు. ఇది ఎంఎస్ ధోని, గంగూలీ, కోహ్లి వంటి దిగ్గజ కెప్టెన్లకు కూడా సాధ్యం కాలేదు. అదేవిధంగా అతడి సారథ్యంలోనే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిల్‌ను భారత్ సొంతం చేసుకుంది. అదేవిధంగా వన్డే ప్రపంచకప్-2023 రన్నరప్‌గా భారత్‌ను హిట్‌మ్యాన్ నిలిపాడు.ఈ టోర్నీ అసాంతం అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన భారత జట్టు తుది మొట్టుపై బోల్తా పడింది. మొత్తం 56 వన్డేల్లో భారత జట్టు కెప్టెన్‌గా వ్యవహరించిన రోహిత్.. 42 మ్యాచ్‌ల్లో విజయాలను అందించాడు. అతడి కెప్టెన్సీలో భారత్ కేవలం 12 వన్డేల్లో మాత్రం ఓటమి పాలైంది.పంత్ దూరం..కాగా ఆస్ట్రేలియా టూర్‌కు స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం కారణంగా దూరమయ్యారు. హార్దిక్ పాండ్యా స్ధానంలో నితీష్ కుమార్ రెడ్డి చోటు దక్కించుకోగా.. పంత్ స్ధానంలో ధ్రువ్ జురెల్ వన్డే జట్టులోకి వచ్చాడు. ఆసీస్‌తో వన్డేలకు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇచ్చారు.ఆసీస్ టూర్‌కు భారత వన్డే జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్ , అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, విరాట్ కోహ్లిభారత టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్ -
వెస్టిండీస్‌ను చిత్తుగా ఓడించిన టీమిండియా
వెస్టిండీస్‌తో తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. పర్యాటక జట్టును.. ఇన్నింగ్స్ మీద 140 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. సమిష్టిగా రాణించి ముచ్చటగా మూడు రోజుల్లోనే మ్యాచ్ ముగించింది.ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC) 2025-27 సీజన్లో భాగంగా తొలుత ఇంగ్లండ్‌తో తలపడిన టీమిండియా.. ఐదు మ్యాచ్‌లలో రెండు గెలిచి 2-2తో సిరీస్ సమం చేసుకుంది. అనంతరం స్వదేశంలో వెస్టిండీస్‌తో రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడుతోంది.చెలరేగిన భారత బౌలర్లుఇందులో భాగంగా తొలుత అహ్మదాబాద్ వేదికగా గురువారం ఇరుజట్ల మధ్య తొలి టెస్టు (IND vs WI 1st Test) మొదలైంది. టాస్ గెలిచిన వెస్టిండీస్ మొదట బ్యాటింగ్ చేసింది. భారత పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్ ధాటికి టాపార్డర్ కుదేలు కాగా.. మిడిలార్డర్లో కెప్టెన్ రోస్టన్ ఛేజ్ (24), షాయీ హోప్ (26), జస్టిన్ గ్రీవ్స్ (32) ఓ మోస్తరుగా రాణించారు.ఈ క్రమంలో 44.1 ఓవర్లలో 162 పరుగులు చేసి వెస్టిండీస్ ఆలౌట్ అయింది. టీమిండియా బౌలర్లలో సిరాజ్.. తగ్‌నరైన్ చందర్‌పాల్ (0), అలిక్ అథనాజ్ (12), బ్రాండన్ కింగ్ (13), రోస్టన్ ఛేజ్ రూపంలో నాలుగు కీలక వికెట్లు దక్కించుకున్నాడు.మరోవైపు.. బుమ్రా జాన్ కాంప్‌బెల్ (8), జస్టిన్ గ్రీవ్స్ (32), జొహాన్ లేన్ (1) వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్.. షాయీ హోప్ (26), వారికన్ (8) వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. వాషింగ్టన్ సుందర్ ఖరీ పియరీ (11)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు.రాహుల్, డీజే, జడ్డూ శతకాలుఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన భారత్ శుక్రవారం నాటి రెండో రోజు ఆట ముగిసే సరికి 128 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 448 పరుగులు సాధించింది. కేఎల్ రాహుల్ (100), ధ్రువ్ జురెల్ (125), రవీంద్ర జడేజా (104 నాటౌట్) శతకాలతో చెలరేగగా.. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీ (50) చేశాడు.అయితే, శనివారం నాటి మూడో రోజు ఆట మొదలుకాగానే భారత్ తమ ఓవర్‌నైట్ స్కోరు 448/5 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. దీంతో టీమిండియాకు 286 పరుగుల ఆధిక్యం దక్కింది. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన వెస్టిండీస్ 146 పరుగులకే కుప్పకూలింది.మరోసారి చెలరేగిన భారత బౌలర్లుభారత బౌలర్ల విజృంభణ కారణంగా విండీస్ బ్యాటర్లు పెవిలియన్‌కు వరుసకట్టారు. సిరాజ్ టీమిండియా తరఫున వికెట్ల వేట మొదలుపెట్టగా.. జడ్డూ వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్ యాదవ్ కూడా తన స్పిన్ మాయాజాలంతో విండీస్‌ను ఆడుకున్నాడు.ఈ క్రమంలో ఓపెనర్ తగ్‌నరైన్ చందర్‌పాల్ (8) మరోసారి విఫలం కాగా.. జాన్ కాంప్‌బెల్ 14, బ్రాండన్ కింగ్ 5, రోస్టన్ ఛేజ్ 1, షాయీ హోప్ 1 పరుగు చేశారు. వన్‌డౌన్‌బ్యాటర్ అలిక్ అథనాజ్ 38 పరుగులు సాధించగా.. అతడితో కలిసి జస్టిన్ గ్రీవ్స్ (25) కాసేపు పోరాటం చేశాడు.టీమిండియా ఘన విజయంఆఖర్లో ఖరీ పియరీ 13 పరుగులతో అజేయంగా నిలవగా.. బౌలర్ జేడన్ సీల్స్ 22 పరుగులతో సత్తా చాటాడు. అయితే, కుల్దీప్ బౌలింగ్‌లో సీల్స్ పదో వికెట్‌గా వెనుదిరగడంతో విండీస్ పరాజయం ఖరారైంది.ఇన్నింగ్స్ మీద 140 పరుగుల తేడాతో భారత్ జయభేరి మోగించింది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ జడ్డూ నాలుగు, సిరాజ్ మూడు వికెట్లు తీయగా.. కుల్దీప్ రెండు, వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక ఈ విజయంతో టీమిండియా రెండు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.భారత్ వర్సెస్ వెస్టిండీస్ తొలి టెస్టు సంక్షిప్త స్కోర్లు👉వేదిక: నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్👉టాస్: వెస్టిండీస్.. తొలుత బ్యాటింగ్👉వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 162 ఆలౌట్👉భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 448/5 డిక్లేర్డ్ ✊భారత్‌కు 286 పరుగుల ఆధిక్యం👉వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్ స్కోరు: 146 ఆలౌట్✌️ఫలితం: వెస్టిండీస్‌పై ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం.చదవండి: Rishabh Pant Facts: రిషభ్ పంత్ నెట్‌వర్త్ ఎంతో తెలుసా?Hugs and smiles all around 😊#TeamIndia celebrate a magnificent victory in Ahmedabad and take a 1-0 lead in the series 👏Scorecard ▶ https://t.co/MNXdZceTab#INDvWI | @IDFCFIRSTBank pic.twitter.com/22q4aUUhqp— BCCI (@BCCI) October 4, 2025 -
47 ఏళ్ల కిందటి రికార్డును రిపీట్ చేసిన శుభ్‌మన్ గిల్
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో (India vs West Indies) భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) ఓ అరుదైన ఘనత సాధించాడు. టెస్ట్ కెప్టెన్‌గా స్వదేశంలో తొలి ఇన్నింగ్స్‌లోనే హాఫ్ సెంచరీ బాది, 47 ఏళ్ల క్రితం సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) నెలకొల్పిన రికార్డును పునరావృతం చేశాడు.1978లో గవాస్కర్ భారత కెప్టెన్‌గా స్వదేశంలో తన తొలి ఇన్నింగ్స్‌లోనే హాఫ్ సెంచరీ చేశాడు. ముంబై వాంఖడే స్టేడియంలో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా డబుల్ సెంచరీనే (205) బాదాడు. తిరిగి 47 ఏళ్ల తర్వాత శుభ్‌మన్ గిల్ స్వదేశంలో భారత కెప్టెన్‌గా తన తొలి ఇన్నింగ్స్‌లోనే హాఫ్ సెంచరీ మార్కు తాకాడు.ఈ మ్యాచ్‌లో గిల్ సరిగ్గా 50 పరుగులు (100 బంతుల్లో 5 ఫోర్లు) చేసి రోస్టన్ ఛేజ్ బౌలింగ్‌లో జస్టిన్ గ్రీవ్స్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.మ్యాచ్ విషయానికొస్తే.. విండీస్‌ను 162 పరుగులకే ఆలౌట్ చేసి తొలి ఇన్నింగ్స్ కొనసాగిస్తున్న భారత్ భారీ స్కోర్ దిశగా సాగుతోంది. రెండో రోజు మూడో సెషన్ సమయానికి జట్టు స్కోర్ 4 వికెట్ల నష్టానికి 338 పరుగులుగా ఉంది. ప్రస్తుతం 176 టీమిండియా 176 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. ధృవ్ జురెల్ (75), రవీంద్ర జడేజా (56) అర్ద సెంచరీలు పూర్తి చేసుకొని ఇన్నింగ్స్‌లు కొనసాగిస్తున్నారు.అంతకుముందు కేఎల్ రాహుల్ సూపర్ సెంచరీతో సత్తా చాటాడు. 190 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో 100 పరుగులు చేసి ఔటయ్యాడు. వార్రికన్ బౌలింగ్‌లో గ్రీవ్స్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీనికి ముందే శుభ్‌మన్ గిల్ సరిగ్గా 50 పరుగుల వద్ద ఔటయ్యాడు. భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ 36, సాయి సుదర్శన్ 7 పరుగులు చేశారు.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 162 పరుగులకే ఆలౌటైంది. సిరాజ్ (14-3-40-4), బుమ్రా (14-3-42-3), కుల్దీప్ (6.1-0-25-2), వాషింగ్టన్ సుందర్ (3-0-9-1) ధాటికి విండీస్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది.విండీస్ ఇన్నింగ్స్‌లో ఏడో నంబర్ ఆటగాడు జస్టిన్ గ్రీవ్స్ చేసిన 32 పరుగులే అత్యధికం. ఈ ఇన్నింగ్స్‌లో భారత వికెట్‌కీపర్ ధృవ్ జురెల్ 4 క్యాచ్‌లు పట్టాడు. కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం వెస్టిండీస్ జట్టు భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. -
రాహుల్ సెంచరీ.. గిల్, డీజే హాఫ్ సెంచరీలు.. భారీ స్కోర్ దిశగా టీమిండియా
అహ్మదాబాద్ టెస్ట్‌లో (India vs West Indies) టీమిండియా (Team India) భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. రెండో రోజు రెండో సెషన్ సమయానికి 124 పరుగుల ఆధిక్యంలో ఉంది. భారత్ స్కోర్ 4 వికెట్ల నష్టానికి 286 పరుగులుగా ఉంది. ధృవ్ జురెల్ (Dhruv Jurel) అర్ద సెంచరీ పూర్తి చేసుకోగా.. రవీంద్ర జడేజా 30 పరుగులతో ఇన్నింగ్స్ కొనసాగిస్తున్నాడు.డీజే హాఫ్ సెంచరీరిషబ్ పంత్ స్థానంలో జట్టులోకి వచ్చిన ధృవ్ జురెల్ తనకు లభించిన అవకాశాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఐదో స్థానంలో బరిలోకి దిగి అర్ద సెంచరీ పూర్తి చేశాడు. 91 బంతుల్లో డీజే ఈ మార్కును తాకాడు. గ్రీవ్స్ బౌలింగ్‌లో బౌండరీ బాది హాఫ్ సెంచరీ మార్కును తాకాడు.రాహుల్ సూపర్ సెంచరీఓపెనర్ కేఎల్ రాహుల్ సూపర్ సెంచరీతో సత్తా చాటాడు. 190 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో 100 పరుగులు చేశాడు. సెంచరీ పూర్తైన వెంటనే రాహుల్ ఔటయ్యాడు. వార్రికన్ బౌలింగ్‌లో గ్రీవ్స్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. టెస్ట్‌ల్లో రాహుల్‌కు ఇది 11వ శతకం. సొంతగడ్డపై మాత్రం రెండోదే. రాహుల్ స్వదేశంలో తన చివరి శతకాన్ని 2016లొ చెన్నైలో ఇంగ్లండ్‌పై చేశాడు.గిల్ హాఫ్ సెంచరీశుభ్మన్ గిల్ హాఫ్ సెంచరీ (100 బంతుల్లో 5 ఫోర్లు) పూర్తి చేసిన వెంటనే ఔటయ్యాడు. రోస్టన్ ఛేజ్ బౌలింగ్‌లో జస్టిన్ గ్రీవ్స్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు.భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ 36, సాయి సుదర్శన్ 7 పరుగులు చేశారు. జైస్వాల్ వికెట్ సీల్స్కు, సాయి సుదర్శన్ వికెట్ ఛేజ్కు దక్కాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 162 పరుగులకే ఆలౌటైంది. సిరాజ్ (14-3-40-4), బుమ్రా (14-3-42-3), కుల్దీప్ (6.1-0-25-2), వాషింగ్టన్ సుందర్ (3-0-9-1) ధాటికి విండీస్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది.విండీస్ ఇన్నింగ్స్‌లో ఏడో నంబర్ ఆటగాడు జస్టిన్ గ్రీవ్స్ చేసిన 32 పరుగులే అత్యధికం. ఈ ఇన్నింగ్స్‌లో భారత వికెట్‌కీపర్ ధృవ్ జురెల్ 4 క్యాచ్‌లు పట్టాడు. కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం వెస్టిండీస్ జట్టు భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.చదవండి: నిప్పులు చెరిగిన పంజాబ్ కింగ్స్ బౌలర్ -
గిల్ హాఫ్ సెంచరీ.. సెంచరీ దిశగా రాహుల్.. ఆధిక్యంలో టీమిండియా
గిల్ ఔట్శుభ్మన్ గిల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసిన వెంటనే ఔటయ్యాడు. రోస్టన్ ఛేజ్ బౌలింగ్‌లో జస్టిన్ గ్రీవ్స్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. 59 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 192/3గా ఉంది. ప్రస్తుతం భారత్ 30 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. రాహుల్ 86, జురెల్ 2 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో భారత్ ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో రోజు తొలి సెషన్లోనే ఇది సాధించింది. 56 ఓవర్ల తర్వాత భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ 188/2గా ఉంది. ప్రస్తుతం టీమిండియా 26 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.శుభ్‌మన్ గిల్ (50) అర్ద సెంచరీ పూర్తి చేసుకోగా.. రాహుల్ (84) సెంచరీ దిశగా సాగుతున్నాడు. భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ 36, సాయి సుదర్శన్ 7 పరుగులు చేసి ఔటయ్యాడు. విండీస్ బౌలర్లలో జేడన్ సీల్స్, రోస్టన్ ఛేజ్ తలో వికెట్ తీశారు.అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 162 పరుగులకే ఆలౌటైంది. సిరాజ్ (14-3-40-4), బుమ్రా (14-3-42-3), కుల్దీప్ (6.1-0-25-2), వాషింగ్టన్ సుందర్ (3-0-9-1) ధాటికి విండీస్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది.విండీస్ ఇన్నింగ్స్‌లో ఏడో నంబర్ ఆటగాడు జస్టిన్ గ్రీవ్స్ చేసిన 32 పరుగులే అత్యధికం. గ్రీవ్స్ కాకుండా అలిక్ అథనాజ్ (12), బ్రాండన్ కింగ్ (13), కెప్టెన్ రోస్టన్ ఛేజ్ (24), షాయ్ హోప్ (26), ఖారీ పియెర్ (11) అతి కష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు.మిగతా వారిలో జాన్ క్యాంప్‌బెల్ 8, తేజ్‌నరైన్ చంద్రపాల్ డకౌట్, జోమెల్ వార్రికన్ 8, జోహన్ లేన్ ఒక్క పరుగుకు ఔటయ్యారు. ఈ ఇన్నింగ్స్‌లో భారత వికెట్‌కీపర్ ధృవ్ జురెల్ 4 క్యాచ్‌లు పట్టాడు. కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం వెస్టిండీస్ జట్టు భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. చదవండి: World Cup 2025: పాకిస్తాన్‌కు షాకిచ్చిన బంగ్లాదేశ్ -
భారత్‌తో తొలి టెస్టు.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్! తుది జట్లు ఇవే
అహ్మదాబాద్ వేదికగా భారత్-వెస్టిండీస్ మధ్య తొలి టెస్టు ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి టెస్టులో టీమిండియా ఇద్దరు స్పెషలిస్టు ఫాస్ట్ బౌలర్లు, ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్‌లో ఆడుతున్నాడు. అదేవిధంగా ఇంగ్లండ్ టూర్లో గాయం కారణంగా మధ్యలోనే వైదొలిగిన ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డి తిరిగి జట్టులోకి వచ్చాడు. యువ ఆటగాడు సాయిసుదర్శన్కు టీమ్ మెనెజ్‌మెంట్ మరో అవకాశమిచ్చింది. మరోవైపు విండీస్ తరపున ఖరీ పియర్, జోహన్ లేన్ టెస్టుల్లో అరంగేట్రం చేశారు.తుది జట్లువెస్టిండీస్ ప్లేయింగ్ ఎలెవన్: టాగెనరైన్ చందర్‌పాల్, జాన్ కాంప్‌బెల్, అలిక్ అథానాజ్, బ్రాండన్ కింగ్, షాయ్ హోప్ (వికెట్ కీపర్), రోస్టన్ చేజ్ (కెప్టెన్), జస్టిన్ గ్రీవ్స్, జోమెల్ వారికన్, ఖరీ పియర్, జోహన్ లేన్, జేడెన్ సీల్స్ఇండియా ప్లేయింగ్ ఎలెవన్: కెఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, బి సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (సి), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ -
విండీస్‌తో తొలి టెస్టుకు భారత్ సై..
సొంతగడ్డపై టెస్టుల్లో భారత్ దాదాపు 12 ఏళ్ల పాటు ఎదురులేని జట్టుగా ఒక్క సిరీస్ కూడా ఓడిపోకుండా ఆధిపత్యం ప్రదర్శించింది. పర్యటనకు వచ్చిన పెద్ద జట్లు కూడా టీమిండియా జోరును ఆపలేకపోయాయి. అయితే పుష్కర కాలం తర్వాత బలహీనం అనుకున్న న్యూజిలాండ్ పెద్ద దెబ్బ కొట్టింది. గత ఏడాది అనూహ్యంగా కివీస్ చేతిలో భారత్ క్లీన్‌స్వీప్‌నకు గురైంది. ఆ తర్వాత ఇప్పుడు మళ్లీ మన టీమ్స్వదేశంలో టెస్టు మ్యాచ్ బరిలోకి దిగుతోంది. ఈసారి కూడా బలహీనమైన వెస్టిండీస్ ఎదురుగా ఉంది. ఇంగ్లండ్‌పై చక్కటి ప్రదర్శన తర్వాత ఎలాంటి ఉదాసీనతకు తావు ఇవ్వకుండా ఆడితే విండీస్‌పై పైచేయి ఖాయం. ఈ నేపథ్యంలో రెండు మ్యాచ్‌ల సిరీస్‌కు రంగం సిద్ధమైంది. అహ్మదాబాద్: శుబ్‌మన్ గిల్ నాయకత్వంలో భారత జట్టు సొంతగడ్డపై తొలి టెస్టు సిరీస్ ఆడనుంది. వెస్టిండీస్‌తో జరిగే రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా నేటి నుంచి మొదటి టెస్టు జరుగుతుంది. సీనియర్లు కోహ్లి, రోహిత్, అశ్విన్‌ల రిటైర్మెంట్ తర్వాత టీమిండియా స్వదేశంలో ఆడనున్న మొదటి టెస్టు ఇదే కానుంది. ఇంగ్లండ్ గడ్డపై అద్భుత ఆటతో సిరీస్‌ను సమం చేసుకున్న టీమిండియా పటిష్టంగా కనిపిస్తోంది. మరోవైపు ఆసీస్‌తో ఆడిన గత టెస్టులో ‘27 ఆలౌట్’ తర్వాత విండీస్ ఇదే మ్యాచ్‌లో బరిలోకి దిగుతోంది. బలాబలాల్లో ఎంతో అంతరం కనిపిస్తుండగా, కరీబియన్ టీమ్ ఇక్కడ ఏమాత్రం పోటీనిస్తుందనేది సందేహమే. అదనపు పేసర్‌తో... సాధారణంగా స్వదేశంలో నల్లరేగడి మట్టితో సిద్ధం చేసే స్పిన్ అనుకూల పిచ్‌లపై భారత్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈసారి టీమ్ మేనేజ్మెంట్ ఉద్దేశపూర్వకంగా పేస్‌కు అనుకూలించే ‘ఎర్ర మట్టి’ పిచ్‌పై తమ సత్తాను పరీక్షించుకోవాలని భావిస్తోంది. దీని ప్రకారమే తుది జట్టు ఉండవచ్చు. ఇద్దరు ప్రధాన పేసర్లుగా బుమ్రా, సిరాజ్ ఖాయం. స్పిన్ ఆల్రౌండర్లుగా జడేజా, సుందర్ ఖాయం. అయితే మూడో స్పిన్నర్ అయిన కుల్దీప్, మరో పేసర్ మధ్య పోటీ ఉండవచ్చు. పిచ్‌ను బట్టి చూస్తే ప్రసిధ్ వైపే మొగ్గు కనిపిస్తోంది. అయితే ఆరో స్థానంలో ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డిని ఆడిస్తే అప్పుడు కుల్దీప్కు అవకాశం ఉంటుంది. నితీశ్ జట్టులోకి వస్తే బ్యాటర్ పడిక్కల్‌ను కూడా పక్కన పెట్టాల్సి రావచ్చు. ఇంగ్లండ్‌లో పెద్దగా ఆకట్టుకోకపోయినా నితీశ్‌పై సెలక్టర్లు నమ్మకం ఉంచారు. బ్యాటింగ్‌పరంగా యశస్వి, గిల్, రాహుల్ చక్కటి ఫామ్‌లో ఉండగా సుదర్శన్ కూడా ఇటీవల ఆ్రస్టేలియా ‘ఎ’పై సత్తా చాటాడు. అందరూ అంతంతే! ‘మా గెలుపుపై ఎవరికీ అంచనాలు లేకపోవడమే మా బలం. ఓటమి భయం లేకుండా స్వేచ్ఛగా ఆడతాం. కివీస్‌ను ఆదర్శంగా తీసుకుంటాం’ అని వెస్టిండీస్ కెప్టెన్ రోస్టన్ ఛేజ్ చెబుతున్నాడు. కానీ భారత్‌లో టెస్టులు అంటే ఎంతో కష్టమో విండీస్‌కు బాగా తెలుసు. 1994లో భారత్‌ను ఓడించిన తర్వాత ఇక్కడ ఆడిన 10 టెస్టుల్లో విండీస్ 8 ఓడి, 2 ‘డ్రా’ చేసుకుంది. 2018లో ఆడిన సిరీస్‌లో 2 టెస్టులూ మూడు రోజులకే ముగిశాయి! పట్టుదలగా క్రీజ్‌లో నిలబడి జట్టును నడిపించగల బ్యాటర్ ఎవరూ కనిపించడం లేదు. హోప్, ఛేజ్, వారికన్‌లకు మాత్రమే ఇక్కడ ఆడిన అనుభవం ఉండగా, జేడెన్ సీల్స్ ఇటీవల ఆకట్టుకుంటున్నాడు. ప్రధాన పేసర్లు అల్జారీ జోసెఫ్, షామర్ జోసెఫ్ గాయంతో సిరీస్‌కు దూరం కావడం పెద్ద లోటు. విండీస్ కూడా ముగ్గురు పేసర్లతో ఆడనుంది. పిచ్, వాతావరణం పిచ్‌పై పచ్చికను ఎక్కువగా ఉంచారు. పేస్ బౌలింగ్‌కు అనుకూలం కాగా బ్యాటర్లు పట్టుదల కనబర్చాల్సి ఉంది. నగరంలో అనూహ్యంగా కురుస్తున్న వర్షాలు మ్యాచ్‌కు స్వల్పంగా అంతరాయం కలిగించవచ్చు.తుది జట్లు (అంచనా) భారత్: గిల్ (కెప్టెన్ ), జైస్వాల్, రాహుల్, సుదర్శన్, జురేల్, నితీశ్ రెడ్డి/పడిక్కల్, జడేజా, సుందర్, బుమ్రా, సిరాజ్, కుల్దీప్/ప్రసిధ్.వెస్టిండీస్: ఛేజ్ (కెప్టెన్ ), చందర్‌పాల్, కెవ్లాన్ అండర్సన్, అతనజె, బ్రెండన్ కింగ్, షై హోప్, గ్రీవ్స్, పైర్, వారికన్, ఫిలిప్ అండర్సన్, సీల్స్. -
తొలి టెస్టులో బుమ్రా ఆడతాడా? కెప్టెన్ గిల్ సమాధానమిదే
భారత్, వెస్టిండీస్ మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ గురువారం(ఆక్టోబర్ 2) నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లోని తొలి టెస్టుకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే అహ్మదాబాద్‌కు చేరుకున్న భారత జట్టు నెట్స్‌లో తీవ్రంగా శ్రమించింది.కెప్టెన్ శుబ్‌మన్ గిల్, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ వంటి వారు నేరుగా దుబాయ్ నుంచి అహ్మదాబాద్‌కు చేరుకున్నారు. వీరంతా సెప్టెంబర్ 28న జరిగిన ఆసియాకప్-2025లో ఫైనల్లో భారత జట్టు తరపున ఆడారు. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే ఐదు రోజుల టెస్టు మ్యాచ్ ఆడేందుకు సిద్దమయ్యారు. అయితే వర్క్‌లోడ్‌లో భాగంగా తొలి టెస్టులో జస్ప్రీత్ బుమ్రా ఆడుతాడా లేదా అన్నది? ప్రస్తుతం ప్రశ్నార్ధకంగా మారింది. ఆసియాకప్‌లో కూడా బుమ్రా కేవలం 5 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. అంతకుముందు ఇంగ్లండ్ పర్యటనలో మూడు మ్యాచ్‌లకు మాత్రమే జస్ప్రీత్ అందుబాటులో ఉన్నాడు. మరి ఇప్పుడు విండీస్‌తో అన్ని మ్యాచ్‌లు బుమ్రా ఆడుతాడో లేదో వేచి చూడాలి. తాజాగా ఇదే విషయంపై ప్రీ మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. జట్టు కాంబనేషన్పై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని గిల్ చెప్పుకొచ్చాడు."జట్టు కాంబనేషన్పై మ్యాచ్ టు మ్యాచ్ ఆధారంగా నిర్ణయం తీసుకుంటాము. గేమ్ ఎంత సేపు సాగుతుంది, ఒక బౌలర్ ఎన్ని ఓవర్లు బౌలింగ్ చేయగలడు? ఇటువంటి ఆంశాలను పరిగణలోకి తీసుకుని తుది జట్టును ఎంపిక చేస్తాము. అంతే తప్ప ముందుగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోము.తొలి మ్యాచ్‌లో మా జట్టు కాంబనేషన్ గురుంచి రేపు మీకు తెలుస్తోంది. వాతావరణ పరిస్థితులు, పిచ్ కండీషన్ బట్టి మూడవ సీమర్‌ను ఆడించాలా వద్దా అన్నది రేపు నిర్ణయం తీసుకుంటాము" అని గిల్ పేర్కొన్నాడు.అయితే బుమ్రా రెండు మ్యాచ్‌లు కూడా అడే అవకాశముంది. ఇదే విషయాన్ని జట్టు ప్రకటన సందర్భంగా బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ స్పష్టం చేశాడు. బుమ్రా వెస్టిండీస్‌తో జరిగే రెండు టెస్టులు ఆడటానికి సిద్ధంగా ఉన్నాడని అగార్కర్ తెలిపాడు. అదేవిధంగా బుమ్రాకు దాదాపు ఐదు వారాల విశ్రాంతి లభించందని అతడు వెల్లడించాడు.చదవండి: వెస్టిండీస్‌తో తొలి టెస్టు.. టీమిండియాకు ఊహించని షాక్ -
టీమిండియాకు కొత్త టాస్క్.. మరో మూడు రోజుల్లో ప్రారంభం
ఆసియా కప్ 2025లో (Asia cup 2025) భారత్ (Team India) విజేతగా నిలిచింది. నిన్న (సెప్టెంబర్ 28) జరిగిన ఫైనల్లో పాక్‌ను ఓడించి 9వ సారి ఆసియా ఛాంపియన్‌గా అవతరించింది. టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీ దాదాపు 20 రోజుల పాటు సాగింది. భారత్ ఈ టోర్నీలో ఓటమెరుగని జట్టుగా నిలిచింది.గ్రూప్ దశలో యూఏఈ, పాకిస్తాన్, ఒమన్‌పై విజయాలు సాధించిన టీమిండియా.. సూపర్-4లో పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంకపై గెలుపొందింది. ఫైనల్లో మరోసారి పాక్‌పై గెలిచి టైటిల్ ఎగరేసుకుపోయింది. ఈ టోర్నీలో భారత్‌కు శ్రీలంక ఒక్కటే కాస్త టఫ్ ఫైట్ ఇచ్చింది. పాక్‌తో తలపడిన మూడు సందర్భాల్లో టీమిండియాదే పైచేయిగా నిలిచింది.ఆసియా కప్ అనంతరం టీమిండియా స్వదేశంలో వెస్టిండీస్‌తో (India vs West Indies) రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఆసియా కప్ తర్వాత కేవలం 3 రోజుల గ్యాప్‌లోనే భారత్, వెస్టిండీస్‌తో తలపడనుంది. అక్టోబర్ 2 నుంచి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో తొలి టెస్ట్ జరుగనుంది. అనంతరం అక్టోబర్ 10 నుంచి 14 వరకు న్యూఢిల్లీలో రెండో టెస్ట్ జరుగుతుంది.ఈ సిరీస్ కోసం ఇరు జట్లను ఇదివరకే ప్రకటించారు. భారత జట్టుకు శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా కొనసాగనుండగా.. విండీస్‌కు రోస్టన్ ఛేజ్ సారథ్యం వహిస్తాడు. ఈ సిరీస్‌కు ఇంగ్లండ్‌లో గాయపడ్డ భారత రెగ్యులర్ వికెట్‌కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ దూరంగా ఉన్నాడు. అతని స్థానంలో ధృవ్ జురెల్, ఎన్ జగదీసన్ వికెట్ కీపర్ బ్యాటర్లుగా ఎంపికయ్యారు.కొత్తగా దేవ్‌దత్ పడిక్కల్ జట్టులోకి వచ్చాడు. కరుణ్ నాయర్ స్థానాన్ని అతను భర్తీ చేయనున్నాడు. ఆస్ట్రేలియా సిరీస్ సందర్భంగా గాయపడిన నితీశ్ కుమార్ రెడ్డి ఈ సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చాడు. విండీస్ జట్టులో ఎక్కువ శాతం కొత్త ముఖాలు ఉన్నాయి. బ్యాటింగ్‌లో షాయ్ హోప్, బౌలింగ్‌లో అల్జరీ జోసఫ్ మాత్రమే కాస్త అనుభవజ్ఞులు.ఈ సిరీస్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. జియో హాట్‌స్టార్ యాప్‌లో లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది.భారత జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్ (వికెట్‌కీపర్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, ఎన్. జగదీశన్ (వికెట్‌కీపర్), మహ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్వెస్టిండీస్: రోస్టన్ ఛేజ్ (కెప్టెన్), కెవ్లాన్ ఆండర్సన్, తేజ్‌నరైన్ చంద్రపాల్, జాన్ క్యాంప్‌బెల్, జోహన్ లేన్, అలిక్ అథానాజ్, బ్రాండన్ కింగ్, జస్టిన్ గ్రీవ్స్, షాయ్ హోప్, టెవిన్ ఇమ్లాచ్, జోమెల్ వారికన్, ఆండర్సన్ ఫిలిప్, అల్జరీ జోసఫ్, జేడన్ సీల్స్, ఖారీ పియెర్చదవండి: Asia Cup 2025: సూర్యకుమార్ యాదవ్ చేశాడని పాకిస్తాన్ కెప్టెన్ కూడా..! -
IND vs WI: అందుకే అతడిని ఎంపిక చేయలేదు: అజిత్ అగార్కర్
టీమిండియా యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ (Sarfaraz Khan)ను మరోసారి దురదృష్టం వెంటాడింది. వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ (IND vs WI) ఆడే భారత జట్టులో అతడికి చోటు దక్కలేదు. అయితే, ఈసారి గాయం వల్ల అతడికి ఇలా చేదు అనుభవం ఎదురైంది. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో పరుగుల వరద పారించిన సర్ఫరాజ్ ఖాన్ ఎట్టకేలకు గతేడాది అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు.చివరగా గతేడాదిసొంతగడ్డపై ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్ సందర్భంగా సర్ఫరాజ్ ఖాన్ టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు మొత్తంగా ఆరు టెస్టులు ఆడి మూడు అర్ధ శతకాలు, ఓ సెంచరీ సాయంతో 371 పరుగులు చేశాడు. చివరగా గతేడాది స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో సర్ఫరాజ్ టీమిండియాకు ఆడాడు.భారీగా బరువు తగ్గి... ఆ తర్వాత ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక చేస్తారని ఆశించిన సర్ఫరాజ్ ఖాన్‌కు సెలక్టర్లు మొండిచేయి చూపారు. ఈ క్రమంలో తనకు దొరికిన విరామాన్ని ఈ ముంబై బ్యాటర్ ఫిట్‌నెస్‌పై శ్రద్ధ పెట్టేందుకు ఉపయోగించుకున్నాడు. రెండు నెలల వ్యవధిలో ఏకంగా పదిహేడు కిలోల బరువు తగ్గి గుర్తుపట్టలేనంతగా సన్నబడ్డాడు. ఈ క్రమంలో బుచ్చిబాబు ఇన్విటేషనల్ టోర్నీ ద్వారా కాంపిటేటివ్ క్రికెట్లో అడుగుపెట్టాడు. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ నిర్వహించే ఈ రెడ్‌బాల్ టోర్నీలో ముంబై తరఫున సర్ఫరాజ్ శతకంతో సత్తా చాటాడు. 114 బంతుల్లో పది బౌండరీలు, ఆరు సిక్సర్ల సాయంతో 138 పరుగులు సాధించాడు. విండీస్‌కు జట్టును ఎంపిక చేసే సమయంలో తనను గుర్తుపెట్టుకోవాలన్నట్లుగా ఇలా బ్యాట్‌తోనే సెలక్టర్లకు సందేశం ఇచ్చాడు.అంతా తలకిందులుకానీ గాయం కారణంగా అంతా తలకిందులైంది. తొడ కండరాల నొప్పితో బాధపడిన 27 ఏళ్ల సర్ఫరాజ్ ఖాన్... దులిప్ ట్రోఫీ టోర్నీకి కూడా దూరమయ్యాడు. తాజాగా వెస్టిండీస్‌తో టెస్టులకు కూడా అతడు ఎంపిక కాలేదు. ఇందుకు గల కారణాన్ని టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ వెల్లడించాడు. గాయం కారణంగానే అతడు సెలక్షన్‌కు అందుబాటులో లేకుండా పోయాడని తెలిపాడు.కాగా టీమిండియా స్వదేశంలో వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. అహ్మదాబాద్ వేదికగా అక్టోబరు 2- 6 తొలి టెస్టు.. ఢిల్లీలో అక్టోబరు 10- 14 వరకు రెండో టెస్టు నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.వెస్టిండీస్‌తో టెస్టులకు బీసీసీఐ ప్రకటించిన జట్టుశుబ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవ్‌దత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, నితీశ్ కుమార్ రెడ్డి, నారాయణ్ జగదీశన్ (వికెట్ కీపర్), మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్.చదవండి: టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్.. బీసీసీఐ ప్రకటన -
BCCI: వెస్టిండీస్‌తో టెస్టులకు టీమిండియా ప్రకటన.. అతడిపై వేటు
వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తమ జట్టును ప్రకటించింది. శుబ్‌మన్ గిల్ (Shubman Gill) సారథ్యంలో.. పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను గురువారం వెల్లడించింది.ఇక స్వదేశంలో జరిగే ఈ సిరీస్‌కు గిల్ డిప్యూటీగా సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja)ను.. బీసీసీఐ వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసింది. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ ఆడిన జట్టులో స్వల్ప మార్పులతోనే భారత్ విండీస్‌తో బరిలో దిగనుంది.రిషభ్ పంత్ దూరం.. కరుణ్‌పై వేటువైస్ కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant) గాయం నుంచి ఇంకా కోలుకోని కారణంగా వెస్టిండీస్‌తో సిరీస్‌కు దూరం కాగా.. ఇంగ్లండ్ పర్యటనలో వరుస వైఫల్యాలు చవిచూసిన కరుణ్ నాయర్‌పై వేటు పడింది. కాగా దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత టీమిండియా తరఫున ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ ద్వారా రీఎంట్రీ ఇచ్చిన కరుణ్ నాయర్ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాడు.ధ్రువ్ జురెల్‌తో పాటు అతడు..ఐదు టెస్టుల్లో భాగంగా నాలుగు మ్యాచ్‌లు ఆడిన కరుణ్ నాయర్.. కేవలం ఒకే ఒక్క హాఫ్ సెంచరీ చేయగలిగాడు. దీంతో బీసీసీఐ అతడికి మరో అవకాశం ఇచ్చేందుకు మొగ్గుచూపకపోవడం గమనార్హం. మరోవైపు.. వికెట్ కీపర్ల కోటాలో.. పంత్ గైర్హాజరీలో ధ్రువ్ జురెల్‌తో పాటు తమిళనాడు ప్లేయర్ నారాయణ్ జగదీశన్ జట్టుకు ఎంపికయ్యాడు.నితీశ్ రెడ్డికి చోటుఇక గాయం వల్ల ఇంగ్లండ్ సిరీస్ మధ్యలోనే జట్టుకు దూరమైన ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి కూడా.. విండీస్‌తో సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఇక పేస్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌తో కలిసి ప్రసిద్ కృష్ణ మరోసారి సేవలు అందించనున్నాడు. స్పెషలిస్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన స్థానాన్ని నిలబెట్టుకోగా.. స్పిన్ ఆల్‌రౌండర్ల కోటాలో జడేజా, అక్షర్ పటేల్‌తో కలిసి వాషింగ్టన్ సుందర్ బరిలో దిగనున్నాడు.2-2తో సమంకాగా ఆసియా టీ20 కప్- 2025 టోర్నీ ముగిసిన తర్వాత టీమిండియా సొంతగడ్డపై రెండు టెస్టులు ఆడనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27లో భాగంగా అక్టోబరు 2- అక్టోబరు 14 వరకు ఈ సిరీస్ జరుగుతుంది. కాగా చివరగా గిల్ సేన ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో తలపడి 2-2తో సమం చేసుకున్న విషయం తెలిసిందే. వెస్టిండీస్‌తో టెస్టులకు భారత జట్టుశుబ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవ్‌దత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, నితీశ్ కుమార్ రెడ్డి, నారాయణ్ జగదీశన్ (వికెట్ కీపర్), మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్.చదవండి: పాక్ ఆటగాళ్ల బరితెగింపు.. షాకిచ్చిన బీసీసీఐ!.. తగ్గమంటూ పీసీబీ ఓవరాక్షన్ -
సందిగ్దంలో సెలెక్టర్లు.. విండీస్ సిరీస్‌కు భారత జట్టు ప్రకటన వాయిదా
వెస్టిండీస్‌తో జరగబోయే టెస్టు సిరీస్‌కు (India vs West Indies) భారత జట్టు (Team India) ప్రకటన రేపటికి వాయిదా పడింది. బుమ్రా (Jasprit Bumrah) ఆసియా కప్‌లో పాల్గొంటున్న నేపథ్యంలో అతని అందుబాటుపై స్పష్టత లేకపోవడం.. ఆస్ట్రేలియా-ఏతో మ్యాచ్‌లో ప్రసిద్ధ్ కృష్ణ (Prasidh Krishna) గాయపడటం వంటి అంశాలు సెలక్టర్లను గందరగోళంలోకి నెట్టాయి.విండీస్‌తో సిరీస్‌కు బుమ్రా అందుబాటులో ఉన్నా అతని ఫిట్నెస్, వర్క్‌లోడ్ మేనేజ్మెంట్ అంశాలను సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకున్నారు. ఆసీస్-ఏతో మ్యాచ్‌లో ఇవాళ ప్రసిద్ధ్ కృష్ణ తలకు తీవ్ర గాయం కావడం సెలెక్టర్లను మరింత ఇరకాటంలో పడేసింది.అతనికి ప్రత్యామ్నాయంగా యాశ్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్, నవదీప్ సైనీ పేర్లను సెలెక్టర్లు పరిశీలిస్తున్నారు. పై రెండు కారణాల చేత జట్టు ప్రకటన రేపటికి వాయిదా పడింది. బీసీసీఐ వర్గాల సమాచారం మేరకు.. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) రేపు మధ్యాహ్నం లేదా సాయంత్రం సమయంలో టీమిండియాను ప్రకటించే అవకాశం ఉంది.చదవండి: చెలరేగిన వైభవ్ సూర్యవంశీ.. రాణించిన మాత్రే.. ఆసీస్‌ను చిత్తు చేసిన టీమిండియా -
నువ్వు ఏకే-47 అంటే.. వాళ్లు ఏకంగా ‘బ్రహ్మోస్’ ప్రయోగించారు: పాక్ మాజీ క్రికెటర్
టీమిండియాతో మ్యాచ్‌లో పాకిస్తాన్ (IND vs PAK) జట్టు ఆట తీరుపై ఆ దేశ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా (Danish Kaneria) విమర్శలు గుప్పించాడు. ప్రత్యర్థి జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నపుడు కనీసం 200 పరుగులైనా స్కోరు చేసి ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు.ఆసియా కప్-2025 టోర్నీలో తొలుత లీగ్ దశలో భారత్ చేతిలో ఏడు వికెట్ల తేడాతో ఓటమి పాలైన పాక్.. తాజాగా సూపర్-4 మ్యాచ్‌లోనూ ఆరు వికెట్ల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సల్మాన్ ఆఘా బృందం.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఫర్హాన్ ఓవరాక్షన్పాక్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (45 బంతుల్లో 58) టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. అయితే, చేసింది హాఫ్ సెంచరీయే అయినా.. ఏకే-47 మాదిరి గన్ ఎక్కుపెట్టి కాలుస్తున్నట్లు ఫర్హాన్ ఓవరాక్షన్ చేశాడు. అయితే, లక్ష్య ఛేదనలో టీమిండియా ఇందుకు బ్యాట్‌తోనే సమాధానమిచ్చింది.ఓపెనర్లు అభిషేక్ శర్మ (39 బంతుల్లో 74)- శుబ్‌మన్ గిల్ (28 బంతుల్లో 47) పాక్ బౌలర్లకు చుక్కలు చూపించారు. విధ్వంసకర బ్యాటింగ్‌తో తొలి వికెట్‌కు 105 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వీరికి తోడు తిలక్ వర్మ 30 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో టీమిండియా 18.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి.. పాక్‌ను మరోసారి కంగుతినిపించింది.ఈ నేపథ్యంలో టీమిండియా ఓపెనర్లు అభిషేక్ శర్మ (Abhishek Sharma), శుబ్‌మన్ గిల్‌లపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా ప్రశంసలు కురిపించాడు. వీరిద్దరు ఆది నుంచే అద్భుత రీతిలో బ్యాటింగ్ చేశారని కొనియాడాడు. ఈ క్రమంలో ఫర్హాన్ సెలబ్రేషన్ చేసుకున్న తీరును కూడా కనేరియా విమర్శించాడు.నువ్వు ఏకే-47 అంటే.. వాళ్లు ఏకంగా ‘బ్రహ్మోస్’ ప్రయోగించారు‘‘సాహిబ్జాదా ఫర్హాన్ ఏకే-47 గన్ కాలుస్తున్నట్లు సిగ్నల్ ఇచ్చాడు. కానీ ఆ తర్వాత శుబ్‌మన్ గిల్- అభిషేక్ శర్మ తమ బ్యాట్లతోనే ఏకంగా బ్రహ్మోస్ ప్రయోగించారు.ముఖ్యంగా అభిషేక్ శర్మ అయితే ముద్దులు విసురుతూనే బౌండరీల వర్షం కురిపించాడు. పాక్ బౌలింగ్‌పై వారిద్దరు విరుచుకుపడ్డారు. ఇందుకు పాక్ ఆటగాళ్ల వద్ద సమాధనమే లేకుండా పోయింది.మీరు ఉతుకుడు అని సంబరపడ్డారు. వారు ఉతికి.. ఉతికి ఆరేశారు. ప్రత్యర్థి జట్టులో అభిషేక్ శర్మ- శుబ్‌మన్ గిల్ వంటి ఓపెనర్లు ఉన్నపుడు 200 పరుగుల స్కోరు కూడా చిన్నదే అయిపోతుంది. వాళ్లిద్దరు క్లాస్ ప్లేయర్లు’’ అంటూ డానిష్ కనేరియా వార్తా సంస్థ IANSతో పేర్కొన్నాడు. -
పాక్‌ను చిత్తు చేసిన భారత్.. గౌతం గంభీర్ పోస్ట్ వైరల్
దాయాది పాకిస్తాన్‌కు టీమిండియా మరోసారి తమ స్థాయి ఏమిటో చూపించింది. దూకుడైన ఆటతో ‘చిరకాల ప్రత్యర్థి’కి చెక్‌పెట్టి .. పొట్టి ఫార్మాట్లో మరోసారి ఆధిపత్యాన్ని చాటుకుంది. కాగా ఆసియా కప్-2025 టోర్నీలో భాగంగా లీగ్ దశలో ఏడు వికెట్ల తేడాతో పాక్‌ను ఓడించిన భారత్.. తాజాగా కీలకమైన సూపర్-4 దశలోనూ సత్తా చాటింది.దుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్ సేన.. సల్మాన్ ఆఘా బృందాన్ని ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన భారత్.. పాక్‌ను నిర్ణీత 20 ఓవర్లలో 171 పరుగులకు కట్టడిచేయగలిగింది.అభిషేక్- గిల్ ధనాధన్‌ఇక లక్ష్య ఛేదనలో టీమిండియా మరోసారి తన మార్కును చూపించింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (Abhishek Sharma)- శుబ్‌మన్ గిల్ (Shubman Gill) అద్భుత రీతిలో ఆకట్టుకున్నాడు. అభిషేక్ 39 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లు బాది 74 పరుగులు చేయగా.. గిల్ 28 బంతుల్లో 47 పరుగులు సాధించాడు.వీరికి తోడుగా తిలక్ వర్మ (19 బంతుల్లో 30) ధనాధన్ బ్యాటింగ్‌తో అలరించాడు. ఈ క్రమంలో 18.5 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే నష్టపోయి టీమిండియా లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో టీ20 ఫార్మాట్లో పదిహేనుసార్ల ముఖాముఖి పోరులో టీమిండియా పాక్‌పై పన్నెండోసారి గెలుపు జెండా ఎగురవేసింది.దిగ్గజాలు లేకుండానేఈసారి ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి దిగ్గజాలు లేకుండానే యువ భారత జట్టు పాక్‌ను ఓడించడం విశేషం. ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ జట్టు ప్రదర్శన పట్ల సంతోషం వ్యక్తం చేశాడు.ఫియర్లెస్..ఇన్‌స్టా స్టోరీలో ‘‘ఫియర్లెస్.. ఫియర్లెస్.. ఫియర్లెస్’’ అంటూ అభిషేక్ శర్మ, శుబ్‌మన్ గిల్‌లతో పాటు టీమిండియా ఫొటోను గంభీర్ షేర్ చేశాడు. తమకు భయం లేదు.. తిరుగు లేదు అన్నట్లుగా గంభీర్ ప్రత్యర్థి జట్లకు పరోక్షంగా హెచ్చరిక జారీ చేశాడు. ముఖ్యంగా మైదానంలో అతి చేసిన దాయాది పాక్‌కు తనదైన శైలిలో ఇలా కౌంటర్ వేశాడు. చదవండి: ఇంకోసారి అలా అనకండి: పాక్ జట్టు పరువు తీసిన సూర్య -
పాక్ బౌలర్ల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన అభిషేక్, గిల్
ఆసియా కప్-2025 సూపర్-4 మ్యాచ్‌లో టీమిండియాతో మ్యాచ్ సందర్భంగా పాకిస్తాన్ పేసర్లకు చేదు అనుభవం ఎదురైంది. తమ బౌలింగ్‌లో భారత బ్యాటర్లు చితక్కొడుతుంటే వారి అసహనం కట్టలు తెంచుకుంది. ఈ క్రమంలో ఆటపై దృష్టి పెట్టాల్సింది పోయి .. నోటికి పనిచెప్పారు.పాక్ జట్టుకు ఓటమిని కానుకగాతమ బౌలింగ్‌లో ఉతికారేస్తున్న ఓపెనర్లు అభిషేక్ శర్మ (Abhishesk Sharma)- శుబ్‌మన్ గిల్ (Shuban Gill)లతో వాదులాటకు దిగేందుకు ప్రయత్నించారు. ఇందుకు వారిద్దరు బ్యాట్‌తోనే సమాధానమిచ్చి.. పాక్ జట్టుకు ఓటమిని కానుకగా అందించారు. దీంతో ఆడలేక అతి చేసిన పాక్ ఆటగాళ్లకు మరోసారి అవమానం తప్పలేదు.అసలేం జరిగిందంటే.. లీగ్ దశలో టీమిండియా చేతిలో చిత్తైన పాక్ (IND vs PAK).. తాజాగా సూపర్-4 మ్యాచ్‌లోనూ ఓడిపోయింది. అయితే, బ్యాటింగ్ పరంగా మాత్రం మెరుగ్గా రాణించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది.ఆది నుంచే పాక్ బౌలర్లకు చుక్కలు చూపించారుఅయితే, టీ20 వరల్డ్ నంబర్ వన్ అయిన భారత జట్టు పాక్ విధించిన లక్ష్యాన్ని 18.5 ఓవర్లలో ఊదేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (39 బంతుల్లో 74), శుబ్‌మన్ గిల్ (28 బంతుల్లో 47) ఆది నుంచే పాక్ బౌలర్లపై దూకుడు ప్రదర్శించారు. ఇద్దరూ బౌండరీలు బాదుతూ పాక్ బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టారు.ఈ క్రమంలో పాక్ పేసర్లు షాహిన్ ఆఫ్రిది, హ్యారీస్ రవూఫ్.. అభిషేక్- గిల్లను మాటలతో రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. షాహిన్ బౌలింగ్‌లో ఇరగొట్టిన గిల్.. అతడి ఓవరాక్షన్‌కు బదులుగా ‘‘వెళ్లి బంతి తెచ్చుకో’’ అంటూ కౌంటర్ ఇచ్చాడు.ఇక హ్యారిస్ రవూఫ్ పదే పదే మాటలతో కవ్వింపులకు పాల్పడగా.. అభిషేక్ ఓ దశలో అతడికి దగ్గరగా వెళ్లి బదులిచ్చే ప్రయత్నం చేశాడు. ఇంతలో అంపైర్ వచ్చి రవూఫ్‌ను పక్కకు తీసుకువెళ్లాడు.అస్సలు నచ్చలేదుఈ విషయంపై మ్యాచ్ అనంతరం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అభిషేక్ శర్మ మాట్లాడుతూ.. పాక్ బౌలర్లు కారణం లేకుండా మీద మీదకు వచ్చారని.. దురుసుగా ప్రవర్తించారని పేర్కొన్నాడు. తనకు అది అస్సలు నచ్చలేదని తెలిపాడు. తాము మాత్రం అనవసర విషయాల పట్ల కాకుండా ఆటపై మాత్రమే దృష్టి పెట్టామంటూ పాక్ బౌలర్లకు మరోసారి కౌంటర్ ఇచ్చిపడేశాడు.ఇక గిల్- అభిషేక్ శర్మ సోషల్ మీడియా వేదికగా.. ‘‘మీవి మాటలు- మావి చేతలు’’ అంటూ పాక్‌కు తమ ఓటమిని గుర్తు చేస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాగా ఈ ఇద్దరు పంజాబీ ఆటగాళ్లు చిన్ననాటి నుంచి స్నేహితులు. భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ వీరికి మెంటార్. ఇక తాజా మ్యాచ్‌లో విరాట్ కోహ్లిలేని లోటు పాక్ ఆటగాళ్లకు తెలియకుండా చేశారంటూ గిల్- అభిలపై టీమిండియా అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.చదవండి: ఛీ.. మీ బుద్ధిమారదా?.. బరితెగించిన పాక్ ఆటగాళ్లు!Ye Naya Bharat Hain. Ye Bekhauf Bharat hai! 💪 Watch the Asia Cup, Sept 9-28, 7 PM onwards, LIVE on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #INDvPAK pic.twitter.com/mn3n9OEZjv— Sony Sports Network (@SonySportsNetwk) September 21, 2025 -
అభిషేక్ శర్మ వరల్డ్ రికార్డు.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా ఘనత
ఆసియా కప్-2025 టోర్నమెంట్లో టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) అదరగొడుతున్నాడు. లీగ్ దశలో తొలుత యూఏఈపై ప్రతాపం చూపించిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. 16 బంతుల్లోనే 30 పరుగులు సాధించాడు.మరోసారి విశ్వరూపంఆ తర్వాత పాకిస్తాన్‌తో మ్యాచ్ (IND vs PAK)లో అభిషేక్ శర్మ విజృంభించాడు. కేవలం 13 బంతుల్లోనే 31 పరుగులు సాధించి.. దాయాదికి తన సత్తా ఏమిటో చూపించాడు. అనంతరం ఒమన్‌పై 15 బంతుల్లోనే 38 పరుగులు చేసిన అభిషేక్ శర్మ.. తాజాగా సూపర్-4లో భాగంగా పాకిస్తాన్‌కు మరోసారి విశ్వరూపం చూపించాడు.దుబాయ్ వేదికగా ఆదివారం నాటి మ్యాచ్‌లో అభిషేక్.. పాక్ బౌలింగ్‌ను ఉతికారేశాడు. 39 బంతులు ఎదుర్కొని.. ఆరు ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో 74 పరుగులు సాధించాడు. మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్ (28 బంతుల్లో 47)తో కలిసి తొలి వికెట్‌కు వందకు పైగా పరుగులు జతచేసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు.అతి తక్కువ బంతుల్లోనే 50 సిక్సర్లుఇలా కెరీర్ ఆరంభం నుంచి అద్భుత రీతిలో బ్యాటింగ్ చేస్తున్న అభిషేక్ శర్మ.. తాజాగా పాక్‌తో మ్యాచ్ సందర్భంగా ప్రపంచ రికార్డు సాధించాడు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో.. అతి తక్కువ బంతుల్లోనే 50 సిక్సర్లు పూర్తి చేసుకున్న తొలి క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. అంతేకాదు తక్కువ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా ఎవిన్ లూయీస్ వరల్డ్ రికార్డును అభిషేక్ సమం చేశాడు.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. టీమిండియా పాక్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. తద్వారా సూపర్-4 దశలోనూ మరోసారి దాయాదికి ఓటమి రుచి చూపించింది. కాగా లీగ్ దశలో భారత్.. పాక్‌పై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే.అతి తక్కువ బంతుల్లోనే అంతర్జాతీయ టీ20లలో 50 సిక్సర్లు బాదిన ఫుల్ మెంబర్ (టెస్టు హోదా) జట్ల ఆటగాళ్లుఅభిషేక్ శర్మ (ఇండియా)- 331 బంతుల్లోనే 50 సిక్సర్లుఎవిన్ లూయీస్ (వెస్టిండీస్)- 366 బంతుల్లో 50 సిక్సర్లుఆండ్రీ రసెల్ (వెస్టిండీస్)- 409 బంతుల్లో 50 సిక్సర్లుహజ్రతుల్లా జజాయ్ (అఫ్గనిస్తాన్)- 492 బంతుల్లో 50 సిక్సర్లుసూర్యకుమార్ యాదవ్ (ఇండియా)- 509 బంతుల్లో 50 సిక్సర్లుఅతి తక్కువ ఇన్నింగ్స్‌లో అంతర్జాతీయ టీ20లలో సిక్సర్లు బాదిన ఆటగాళ్లు (ఫుల్ మెంబర్ జట్లు)అభిషేక్ శర్మ- 20 ఇన్నింగ్స్లోఎవిన్ లూయీస్- 20 ఇన్నింగ్స్లోహజ్రతుల్లా జజాయ్- 22 ఇన్నింగ్స్లోక్రిస్ గేల్- 25 ఇన్నింగ్స్లోసూర్యకుమార్ యాదవ్- 29 ఇన్నింగ్స్‌లో. చదవండి: ఛీ.. మీ బుద్ధిమారదా?.. బరితెగించిన పాక్ ఆటగాళ్లు!కోత.. ఊచకోత 💥Abhishek Sharma ఇచ్చిపడేసాడంతే! 🥁చూడండి #INDvPAK లైవ్Sony Sports Network TV Channels & Sony LIV లో#SonySportsNetwork #DPWorldAsiaCup2025 pic.twitter.com/0ufRZ5nDs6— Sony Sports Network (@SonySportsNetwk) September 21, 2025 -
పవర్ ప్లేలో వాళ్లు అద్భుతం.. మేమింకా స్థాయికి తగ్గట్లు ఆడలేదు: పాక్ కెప్టెన్
టీమిండియాతో మ్యాచ్‌లో పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు మరోసారి పరాభవమే ఎదురైంది. ఆసియా కప్-2025 టోర్నీమెంట్లో లీగ్ దశలో భారత్ చేతిలో పరాజయం పాలైన పాక్.. తాజాగా సూపర్-4 దశలోనూ అదే ఫలితాన్ని చవిచూసింది. అయితే, గత మ్యాచ్ కంటే ఈసారి కాస్త మెరుగైన ప్రదర్శన చేయగలిగింది.ఈ నేపథ్యంలో టీమిండియా చేతిలో ఓటమిపై పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా (Salman Agha) స్పందించాడు. తాము ఇంతవరకు తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదని.. అయితే, మెరుగ్గా ఆడామని పేర్కొన్నాడు. పవర్ ప్లేలో టీమిండియా మ్యాచ్‌ను తమ నుంచి లాగేసుకుందని .. తాము ఇంకో 10- 15 పరుగులు చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని వ్యాఖ్యానించాడు.171 పరుగులుదుబాయ్ వేదికగా ఆదివారం నాటి మ్యాచ్‌లో టాస్ ఓడిన పాక్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లలో సాహిబ్జాదా ఫర్హాన్ (45 బంతుల్లో 58) రాణించగా.. ఫఖర్ జమాన్ (9 బంతుల్లో 15) ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. హ్యాట్రిక్ డకౌట్ల ‘స్టార్’ సయీబ్ ఆయుబ్ (17 బంతుల్లో 21) ఈసారి ఫర్వాలేదనిపించగా.. హుసేన్ తలట్ (10), మొహమ్మద్ నవాజ్ (21) తేలిపోయారు.అభి- గిల్ రఫ్పాడించారుకెప్టెన్ సల్మాన్ ఆఘా 17, ఫాహిమ్ ఆష్రఫ్ 20 బంతులతో అజేయంగా నిలిచారు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి పాక్ 171 పరుగులు చేయగలిగింది. ఇక లక్ష్య ఛేదనలో భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ (39 బంతుల్లో 74), శుబ్‌మన్ గిల్ (28 బంతుల్లో 47) ఆకాశమే హద్దుగా చెలరేగారు.పవర్ ప్లేలో విజృంభణతో తొలి వికెట్‌కు వందకు పైగా పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన అభి (Abhishek Sharma)- గిల్ (Shubman Gill) మ్యాచ్‌ను టీమిండియా వైపు తిప్పేశారు. తిలక్ వర్మ (19 బంతుల్లో 30 నాటౌట్) కూడా వేగంగా ఆడగా.. 18.5 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయిన టీమిండియా పని పూర్తి చేసింది.మా స్థాయికి తగ్గట్లుగా ఆడనేలేదుఈ నేపథ్యంలో సల్మాన్ ఆఘా మాట్లాడుతూ.. ‘‘ఇంత వరకు మేము మా స్థాయికి తగ్గట్లుగా ఆడనేలేదు. అయితే, మెరుగ్గా ఆడామని చెప్పగలను. కానీ పవర్ ప్లేలోనే వారు మ్యాచ్‌ను మా నుంచి లాగేసుకున్నారు. ఇంకో 10- 15 పరుగులు చేసి.. 180 వరకు స్కోరు బోర్డు మీద పెట్టి ఉంటే బాగుండేది.పవర్ ప్లేలో వాళ్లు అద్భుతంఏదేమైనా పవర్ ప్లేలో వాళ్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. అదే మ్యాచ్‌ను మలుపు తిప్పింది. మా జట్టులోనూ ఫఖర్, ఫర్హాన్ బాగా బ్యాటింగ్ చేశారు. హ్యారీ కూడా మెరుగ్గా ఆడాడు. తదుపరి శ్రీలంకతో మ్యాచ్‌లో సత్తా చాటుతాం’’ అని పేర్కొన్నాడు.కాగా గతంలో సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లలో సల్మాన్ బృందం మూడు మ్యాచ్‌లలోనూ 200కు పైగా స్కోరు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని విలేకరులు సల్మాన్ ఆఘా దగ్గర తాజాగా ప్రస్తావించారు.ఇందుకు బదులిస్తూ.. ‘‘అక్కడికి .. ఇక్కడికి పరిస్థితులు వేరు. మాకు మంచి పిచ్ దొరికితే కచ్చితంగా 200కు పైగా స్కోరు చేస్తాము. కానీ ఈ పిచ్‌లు మాకు అంతగా సహకరించడం లేదు’’ అని సల్మాన్ ఆఘా చెప్పుకొచ్చాడు. చదవండి: ఇంకోసారి అలా అనకండి: పాక్ జట్టు పరువు తీసిన సూర్యStarting your Monday with the Blue Storm that lit up Dubai last night 🌪️ 💙 Watch the #DPWorldAsiaCup2025, Sept 9-28, 7 PM onwards, LIVE on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #INDvPAK pic.twitter.com/DNKy14ylYn— Sony Sports Network (@SonySportsNetwk) September 22, 2025 -
అభిషేక్ సూపర్ షో.. పాకిస్తాన్‌కు చుక్కలు చూపించిన భారత్ (ఫొటోలు)
-
‘అతడు ఆల్ ఫార్మాట్ ప్లేయర్.. టెస్టుల్లో మాత్రమే ఆడించడం అన్యాయం’
టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal)ను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా (Aakash Chopra) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జైసూ మూడు ఫార్మాట్లలో అద్భుతంగా రాణించగలడని పేర్కొన్నాడు. అయితే, అతడిని కేవలం టెస్టులకే పరిమితం చేయడం సరికాదంటూ యాజమాన్యం తీరును విమర్శించాడు.టెస్టులలో దుమ్ములేపుతున్న జైసూభారత టెస్టు జట్టు ఓపెనర్‌గా యశస్వి జైస్వాల్ తన స్థానం సుస్థిరం చేసుకున్న విషయం తెలిసిందే. అరంగేట్రం నుంచే శతకాలు, ద్విశతకాలతో దుమ్ములేపుతున్న ఈ ముంబై బ్యాటర్.. ఇప్పటి వరకు 24 టెస్టుల్లో కలిపి 2209 పరుగులు సాధించాడు. ఇందులో ఏకంగా ఆరు సెంచరీలు, రెండు డబుల్ సెంచరీలు ఉన్నాయి.వన్డే, టీ20లలో మా త్రం నో ఛాన్స్ఇలా సంప్రదాయ ఫార్మాట్లో తనదైన ముద్ర వేస్తున్న జైసూకు పరిమిత ఓవర్ల క్రికెట్లో తగినన్ని అవకాశాలు రావడం లేదు. టీమిండియా తరఫున 23 టీ20లలో 723 పరుగులు చేసిన జైస్వాల్.. ఇప్పటి వరకు ఒకే ఒక్క వన్డే ఆడి 15 పరుగులు రాబట్టగలిగాడు. టీ20లలో ఓపెనర్‌గా అభిషేక్ శర్మ, వన్డేల్లో రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా శుబ్‌మన్ గిల్ ఉండటంతో జైసూకు నిరాశ తప్పడం లేదు.అతడు ఆల్ ఫార్మాట్ ప్లేయర్ఈ విషయాల గురించి కామెంటేటర్, మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. యశస్వి జైస్వాల్‌ను మూడు ఫార్మాట్లలో ఆడించాలని మేనేజ్మెంట్కు సూచించాడు. ‘‘యశస్వి మంచి ఆటగాడు. అతడు మూడు ఫార్మాట్లలో ఆడగలడు. కానీ ఇప్పుడు అతడు కేవలం ఒకే ఫార్మాట్లో ఆడిస్తున్నారు.ఇలా చేయడం సరికాదు. అతడికి అన్యాయం చేసినట్లే. యశస్విని తప్పకుండా మూడు ఫార్మాట్లలో ఆడించాలి. స్వదేశంలో వెస్టిండీస్‌తో టెస్టులు ఆడించడంతో పాటు.. తదుపరి ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లోనూ యశస్వికి అవకాశం ఇవ్వాలి. అతడిని ఆసీస్ పర్యటనలో వన్డేల్లో ఆడిస్తారనే అనుకుంటున్నా.అంతేకాదు.. శ్రేయస్ అయ్యర్‌తో కలిసి యశస్వి కూడా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో ఆడతాడని నమ్ముతున్నా. దీనిపై నాకు సమాచారం లేదు. కానీ మనస్ఫూర్తిగా ఈ మాట చెబుతున్నా’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. ఆసియా కప్ ముగించుకున్న తర్వాత కాగా టీమిండియా ప్రస్తుతం ఆసియా టీ20 కప్-2025 టోర్నీతో బిజీగా ఉంది. ఈ మెగా టోర్నీ ఆడే జట్టులో యశస్వి జైస్వాల్‌కు చోటు దక్కలేదు. స్టాండ్ బై ప్లేయర్‌గా మాత్రమే అతడు ఎంపికయ్యాడు.మరోవైపు.. పొట్టి ఫార్మాట్లో సూపర్ ఫామ్‌లో ఉన్నా.. శ్రేయస్ అయ్యర్‌కు కనీసం రిజర్వు ప్లేయర్‌గానూ స్థానం దక్కలేదు. ఇక ఆసియా కప్ టోర్నీ ముగిసిన తర్వాత టీమిండియా స్వదేశంలో వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్ ఆడుతుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో వన్డే, టీ20 సిరీస్‌లు ఆడనుంది. -
IND vs PAK: మనదే ఏకపక్ష విజయం.. అలా వద్దే వద్దు!.. ఊరించి మరీ..!
చిరకాల ప్రత్యర్థులు భారత్- పాకిస్తాన్ (IND vs PAK) క్రికెట్ జట్లు ముఖాముఖి తలపడేందుకు ముహూర్తం ఖరారైంది. ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్లో భాగంగా ఆదివారం రాత్రి (సెప్టెంబరు 14) దాయాదులు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్లు సబా కరీం, ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.అతడికి తిరుగులేదుటీమిండియా మాజీ వికెట్ కీపర్ సబా కరీం మాట్లాడుతూ.. భారత్- పాక్ మ్యాచ్‌లో కొందరు ఆటగాళ్ల మధ్య పోరు చూసేందుకు తాను ఆసక్తిగా ఉన్నానని తెలిపాడు. ‘‘పాక్ పేసర్ షాహిన్ ఆఫ్రిది- టీమిండియా స్టార్లు అభిషేక్ శర్మ, శుబ్‌మన్ గిల్ల మధ్య పోటీ ఎలా ఉండబోతుందో చూడాలి.ఇక కుల్దీప్ యాదవ్ మధ్య ఓవర్లలో ఎలా బౌలింగ్ చేయబోతున్నాడదనేది కూడా ఆసక్తికరం. బుమ్రా గురించి మాత్రం నేను మాట్లడను. ఎందుకంటే.. అతడికి తిరుగులేదు. ఎవరితో పోటీ కూడా లేదు. ఈసారి పాక్ జట్టు కనీస పోటీ ఇస్తుందనే అనుకుంటున్నా.ఏకపక్ష విజయంటీమండియా ఏకపక్ష విజయం సాధిస్తుంది. ప్రస్తుతం జట్టు పటిష్టంగా ఉంది. అందుకే సులువుగానే గెలుస్తారని నమ్ముతున్నా’’ అని సబా కరీం పేర్కొన్నాడు. అయితే, భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ మాత్రం భిన్నంగా స్పందించాడు.ఆఖరి వరకు సాగాలి.. ఊరించి గెలవాలి‘‘భారత్- పాక్ మ్యాచ్ ఆఖరి వరకు ఉత్కంఠగా సాగాలి. టీ20 ప్రపంచకప్-2022లో చివరి బంతి వరకు మ్యాచ్ సాగింది. టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలో కూడా ఇలాగే జరిగింది. అక్కడ బుమ్రా హీరో అయ్యాడు. ఈసారి కూడా పాక్‌ను ఊరించి మరీ టీమిండియా విజయం సాధించాలి’’ అని ఇర్ఫాన్ పఠాన్ ఆకాంక్షించాడు.కాగా 2022 ప్రపంచకప్‌లో భారత్ ఆఖరి బంతికి పరుగు తీసి.. పాక్‌పై నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇక 2024 వరల్డ్‌కప్ టోర్నీలో ఆరు పరుగుల తేడాతో జయభేరి మోగించింది. ఇదిలా ఉంటే.. ఈసారి యూఏఈ వేదికగా ఆసియా కప్ టోర్నీని టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. గ్రూప్-‘ఎ’లో ఉన్న భారత్, పాకిస్తాన్ ఇప్పటికే చెరో మ్యాచ్ గెలిచాయి. భారత్ యూఏఈపై అద్భుత విజయం సాధించగా.. పాక్ ఒమన్‌ను ఓడించింది.బాయ్‌కాట్ చేయాలంటూ డిమాండ్లుపహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌తో మ్యాచ్‌ను టీమిండియా బహిష్కరించాలంటూ డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఇదొక మల్టీలేటరల్ టోర్నీ కావున ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దాయాదుల పోరుకు అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. కానీ.. మ్యాచ్ జరుగుతుందా? లేదా? అన్న చర్చలు ఇప్పటికీ జరుగుతున్నాయి.చదవండి: విరాట్ కోహ్లిపై తాలిబన్ అగ్రనేత ఆసక్తికర వ్యాఖ్యలు -
పాకిస్తాన్‌తో మ్యాచ్.. టీమిండియాకు భారీ షాక్!
ఆసియాకప్-2025లో భాగంగా ఆదివారం దుబాయ్ వేదికగా భారత్-పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. ప్రాక్టీస్ సమయంలో భారత స్టార్ ఓపెనర్, వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ గాయపడ్డాడు.త్రోడౌన్ స్పెషలిస్ట్ బౌలింగ్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా బంతి గిల్ చేతికి బలంగా తాకింది. వెంటనే గిల్ నొప్పితో విలవిల్లాడు. ఆ తర్వాత ఫిజియో వచ్చి అతడి ఐస్ ప్యాక్ పెట్టి చికిత్స అందించాడు. అయితే విశ్రాంతి తీసుకున్నాక గిల్ తన ప్రాక్టీస్‌ను తిరిగి మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. కానీ గిల్ కాస్త ఆసౌకర్యంగా కన్పించనట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. అయితే ఇప్పటివరకు అతడి గాయంపై టీమ్ మెనెజ్‌మెంట్ ఎటువంటి ప్రకటన చేయలేదు. ఒకవేళ గిల్ గాయం కారణంగా దూరమైతే అది భారత్‌కు గట్టి ఎదురు దెబ్బే అనే చెప్పాలి. గిల్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. యూఏఈతో జరిగిన తొలి మ్యాచ్‌లో 20 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.భారత్ తుది జట్టు(అంచనా)అభిషేక్ శర్మ, శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్(వికెట్ కీపర్), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి -
నేను ఎదుర్కొన్న కఠినమైన బౌలర్ అతడే: శుబ్‌మన్ గిల్
టీమిండియా టీ20 వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అభిషేక్ శర్మ (Abhishek Sharma)తో కలిసి జీవితాంతం బ్యాటింగ్ చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. దాదాపు ఏడాది విరామం తర్వాత గిల్ భారత టీ20 జట్టులో పునరాగమనం చేసిన విషయం తెలిసిందే.ఆసియా కప్-2025 (Asia Cup 2025) టోర్నీలో భాగంగా యూఏఈతో మ్యాచ్‌లో గిల్ ఆడాడు. తన చిన్ననాటి స్నేహితుడు అభిషేక్ శర్మతో కలిసి భారత ఇన్నింగ్స్ ఆరంభించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. తొమ్మిది బంతుల్లోనే 20 పరుగులతో అదరగొట్టాడు. తద్వారా యూఏఈ విధించిన 57 పరుగుల లక్ష్యాన్ని.. టీమిండియా 4.3 ఓవర్లలోనే ఛేదించడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక గిల్ టీమిండియాతో కలిసి తదుపరి దాయాది పాకిస్తాన్ (సెప్టెంబరు 14)తో మ్యాచ్‌కు సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలో ఆసియా కప్ బ్రాడ్‌కాస్టర్ సోనీ స్పోర్ట్స్ గిల్ ర్యాపిడ్ ఫైర్ సెషన్లో పాల్గొన్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో పలు ప్రశ్నలకు అతడు జవాబు ఇచ్చాడు.👉ఈ టోర్నమెంట్ కోసం మీరు ఎన్ని బ్యాట్లు తీసుకువచ్చారు?😊గిల్: తొమ్మిది బ్యాట్లు👉ఏ బ్యాటర్‌తో కలిసి జీవితాంతం బ్యాటింగ్ చేయాలని అనుకుంటున్నారు?😊గిల్: ప్రస్తుతానికైతే అభిషేక్ శర్మతో కలిసి👉మీరు ఏ ఆటగాడి నుంచైనా దొంగతనం చేయాలని అనుకునే నైపుణ్యం ఏమిటి?😊గిల్: ఏబీ డివిలియర్స్ స్కూప్ షాట్👉మీరు ఎదుర్కొన్న కఠినమైన బౌలర్?😊గిల్: జేమ్స్ ఆండర్సన్ (ఇంగ్లండ్)👉మీ క్రికెట్ కెరీర్లో ఇప్పటి వరకు అత్యంత మధురమైన జ్ఞాపకం?😊గిల్: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 గెలవడం.👉మీ చీట్ మీల్లో ఉండే ఫుడ్?😊గిల్: ప్యాన్‌కేక్స్, బటర్ చికెన్, దాల్ మఖ్నీ.మూడు ఫార్మాట్ల భవిష్య కెప్టెన్‌గా..ఇరవై ఆరేళ్ల శుబ్‌మన్ గిల్ ఇటీవలే భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టాడు. రోహిత్ శర్మ రిటైర్మెంట్ నేపథ్యంలో ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా టీమిండియా సారథిగా సరికొత్త బాధ్యతలు తీసుకున్నాడు. ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీలో 754 పరుగులతో టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు.ఇక కెప్టెన్‌గా ఎడ్జ్‌బాస్టన్‌లో టీమిండియాకు తొలి విజయం అందించిన సారథిగా గిల్ చరిత్రకెక్కాడు. ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత 2-2తో సమం చేసుకోవడంలో బ్యాటర్‌గానూ తన వంతు పాత్ర పోషించాడు. కాగా ప్రస్తుతం టీమిండియాకు మూడు ఫార్మాట్లలో ముగ్గురు కెప్టెన్లు ఉన్న విషయం తెలిసిందే. వన్డేలకు రోహిత్ శర్మ, టీ20లకు సూర్యకుమార్ యాదవ్, టెస్టులకు గిల్ సారథ్యం వహిస్తున్నారు.అయితే, భవిష్యత్తులో మూడు ఫార్మాట్లకు కలిపి గిల్‌ను నియమించేలా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే అతడిని టీ20 జట్టులోకి వైస్ కెప్టెన్‌గా తీసుకువచ్చింది. త్వరలోనే గిల్ భారత వన్డే, టీ20 జట్లకు కూడా కెప్టెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.చదవండి: సూర్యకుమార్ యాదవ్ ప్రపంచ రికార్డు బద్దలు.. తొలి ప్లేయర్‌గా సాల్ట్ చరిత్రThe Prince took on the rapid-fire challenge. Here’s how it went… Watch cricket's 𝑼𝑳𝑻𝑰𝑴𝑨𝑻𝑬 𝑹𝑰𝑽𝑨𝑳𝑹𝒀 come alive on Sept 14, 7 PM onwards, LIVE on the Sony Sports Network TV channels & Sony LIV 📺#SonySportsNetwork #DPWorldAsiaCup2025 #INDvPAK pic.twitter.com/d2Rz0TUVGa— Sony Sports Network (@SonySportsNetwk) September 12, 2025 -
చిన్ననాటి స్నేహితుడిని కలిసిన గిల్.. 14 ఏళ్ల తర్వాత! వీడియో
టీమిండియా స్టార్ ప్లేయర్, టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ తన చిన్ననాటి స్నేహితుడు సిమ్రన్‌జీత్ సింగ్‌ను 14 ఏళ్ల తర్వాత కలిశాడు. ఇందుకు ఆసియాకప్-2025 వేదికైంది. పంజాబ్‌కు చెందిన స్పిన్నర్ సిమ్రంజీత్ సింగ్ ప్రస్తుతం యూఏఈ తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నాడు.ఈ మెగా టోర్నీలో భాగంగా బుధవారం దుబాయ్ వేదికగా యూఏఈ, భారత్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో యూఏఈను తొమ్మిది వికెట్ల తేడాతో టీమిండియా చిత్తు చేసింది. అయితే ఈ మ్యాచ్ ముగిశాక గిల్.. సిమ్రన్‌జీత్ వద్దకు వెళ్లి ఆలింగనం చేసుకుంటూ ఆప్యాయతగా మాట్లాడాడు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ మ్యాచ్‌లో గిల్ కేవలం 9 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్స్‌తో 20 పరుగులు చేశాడు. అతడితో పాటు అభిషేక్ శర్మ( 16 బంతుల్లో 30) మెరుపులు మెరిపించాడు. దీంతో 58 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ కేవలం 4.3 ఓవర్లలో చేధించింది.నాకు గిల్ తెలుసు..కాగా భారత్‌తో మ్యాచ్‌కు ముందు పీటీఐతో మాట్లాడిన సిమ్రన్‌జీత్.. గిల్ తనకు చిన్ననాటి నుంచి తెలుసు అని చెప్పుకొచ్చాడు. కానీ ఇప్పుడు అతడికి తాను గుర్తున్నానో లేదో తెలియదని ఈ యూఏఈ స్పిన్నర్ పేర్కొన్నాడు. కానీ ఇప్పుడు గిల్ కలిసి మాట్లాడడంతో సిమ్రన్‌జీత్ ఆనందంలో మునిగి తేలిపోతున్నాడు. ఇక భారత్ తమ తదుపరి మ్యాచ్‌లో ఆదివారం దుబాయ్ వేదికగా పాకిస్తాన్‌తో తలపడనుంది.When Shubman Gill Meets his childhood friend after 14 years | Asia Cup | Asia Cup 2025 | Simranjeet Singh | UAE | India | Team India | Ind vs uae...#Cricket #teamindia #india #shubmangill #shubman #asiacup #asiacup2025 #indvsuae #simranjeetsingh #shubmangillchildhoodfriend pic.twitter.com/WFQwrzIrPf— Dinesh Bedi (@dineshbedi6) September 11, 2025 -
మా జట్టుకు మాత్రం.. గిల్ ఎప్పుడూ ఇలా ఆడడు: కోచ్
ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నీతో అంతర్జాతీయ టీ20లలో పునరాగమనం చేశాడు టీమిండియా స్టార్ శుబ్‌మన్ గిల్ (Shubman Gil). దాదాపు ఏడాది విరామం తర్వాత యూఏఈతో మ్యాచ్ సందర్భంగా బుధవారం రీఎంట్రీ ఇచ్చాడు. అభిషేక్ శర్మతో కలిసి భారత ఇన్నింగ్స్ ఆరంభించిన గిల్ ధనాధన్ దంచికొట్టాడు.గిల్ ధనాధన్యూఏఈ విధించిన 58 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో గిల్ విశ్వరూపం ప్రదర్శించాడు. పసికూనపై ఆది నుంచే ఎదురుదాడి ఆరంభించాడు. తాను ఎదుర్కొన్న తొలి బంతి (రెండో ఓవర్ మొదటి బంతి)నే ఫోర్‌గా మలిచిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. అదే ఓవర్లో ఓ సిక్సర్ కూడా బాదాడు.టీమిండియా ఘన విజయం ఇక ఈ మ్యాచ్‌లో మొత్తంగా తొమ్మిది బంతులు ఆడిన శుబ్‌మన్ గిల్.. రెండు ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 20 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి స్ట్రైక్‌రేటు 222.22. ఇదిలా ఉంటే.. గిల్‌తో పాటు అభిషేక్ శర్మ (16 బంతుల్లో 30), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (2 బంతుల్లో 7 నాటౌట్) రాణించడంతో 4.3 ఓవర్లలోనే పని పూర్తి చేసింది టీమిండియా. యూఏఈని తొమ్మిది వికెట్ల తేడాతో ఓడించి ఘన విజయం సాధించింది.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, ఐపీఎల్ ఫ్రాంఛైజీ బ్యాటింగ్ కోచ్ పార్థివ్ పటేల్.. తమ కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టైటాన్స్‌కు ఆడేటపుడు గిల్లో ఇలాంటి దూకుడు చూడలేదని అన్నాడు. ‘‘తొలి బంతి నుంచే గిల్ అటాకింగ్ మోడ్‌లోకి వెళ్లిపోయాడు.మా జట్టుకు మాత్రం.. గిల్ ఇలా ఆడడుఆ తర్వాత వెంటనే.. క్రీజు బయటకు వచ్చి మరీ ఫోర్ బాదాడు. అదే ఓవర్లో సిక్స్ కూడా కొట్టాడు. గుజరాత్ టైటాన్స్‌కు ఆడేటపుడు అతడిలో ఇలాంటి దూకుడు ఎప్పుడూ చూడలేదు. నిజానికి ఇక్కడ కుదురుకునేందుకు గిల్ కాస్త సమయం తీసుకుంటాడు.కానీ టీమిండియా తరఫున ఈ మ్యాచ్‌లో ఎనిమిది మంది బ్యాటర్లు ఉన్న కారణంగా ఆది నుంచే దూకుడు ప్రదర్శించాడు. అద్భుతంగా ఆడాడు కూడా!’’ అని పార్థివ్ పటేల్ గిల్‌ను ప్రశంసించాడు. టీ20 జట్టు వైస్ కెప్టెన్గాకాగా టైటాన్స్‌కు సారథ్యం వహించడంతో పాటు ఓపెనర్‌గానూ గిల్ సేవలు అందిస్తున్నాడు. ఇటీవలే ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా టీమిండియా టెస్టు కెప్టెన్‌గా గిల్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీలో భాగంగా బ్యాట్‌తో ఇరగదీసిన ఈ పంజాబీ బ్యాటర్.. కెప్టెన్‌గానూ 2-2తో సిరీస్ సమం చేయగలిగాడు.ఇక భవిష్యత్తులో టీమిండియా మూడు ఫార్మాట్లలో గిల్‌ను కెప్టెన్‌ను చేయాలనే ఉద్దేశంతో.. ఇటీవలే టీ20 జట్టు వైస్ కెప్టెన్‌గా బీసీసీఐ తిరిగి నియమించింది. ప్రస్తుతం టీమిండియాకు వన్డేల్లో రోహిత్ శర్మ, టీ20లలో సూర్యకుమార్ యాదవ్, టెస్టుల్లో శుబ్‌మన్ గిల్ కెప్టెన్లుగా పనిచేస్తున్నారు.చదవండి: 21 సార్లు డకౌట్ అయినా సరే.. జట్టులోనే.. అతడికి గంభీర్ చెప్పిందిదే.. -
నువ్వు 21 సార్లు డకౌట్ అయినా సరే.. జట్టులో ఉంటావు: గంభీర్
ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్‌ను టీమిండియా అద్భుత విజయంతో ఆరంభించింది. గ్రూప్-‘ఎ’లో భాగమైన యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)తో తమ తొలి మ్యాచ్ ఆడిన భారత్.. పసికూనను తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో రాణించి మరోసారి సత్తా చాటింది.టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన టీమిండియా.. యూఏఈ జట్టును 57 పరుగులకే ఆలౌట్ చేసింది. ఆ తర్వాత స్వల్ప లక్ష్య ఛేదనను.. కేవలం 4.3 ఓవర్లలోనే పూర్తి చేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (16 బంతుల్లో 30), శుబ్‌మన్ గిల్ (9 బంతుల్లో 20 నాటౌట్), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (2 బంతుల్లో 7 నాటౌట్) వేగంగా ఆడటంతో ఈ రికార్డు విజయం సాధ్యమైంది.వికెట్ కీపర్‌గా సేవలుఇదిలా ఉంటే.. యూఏఈతో ఆడిన భారత తుదిజట్టులో సంజూ శాంసన్‌కు చోటు దక్కింది. అయితే, గిల్ (Shubman Gill) గైర్హాజరీలో అంతర్జాతీయ టీ20లలో ఓపెనర్‌గా వచ్చిన సంజూ.. ఇప్పుడు మిడిలార్డర్లో ఆడనున్నాడు. యూఏఈతో బుధవారం నాటి మ్యాచ్‌లో అతడు వికెట్ కీపర్‌గా సేవలు అందించగా.. బ్యాటింగ్ చేసే అవకాశం మాత్రం రాలేదు.ఈ నేపథ్యంలో భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ సంజూ పట్ల టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హెడ్‌కోచ్ గౌతం గంభీర్ల వైఖరిపై స్పందించాడు. ‘‘నిజంగా నాకైతే ఆశ్చర్యంగా అనిపించింది. అయితే, సంజూకు కెప్టెన్, కోచ్ ఇంతలా మద్దతునివ్వడం సంతోషంగా ఉంది.నువ్వు 21 సార్లు డకౌట్ అయినా సరేసంజూ పట్ల వారు వ్యవహరిస్తున్న తీరు అద్భుతం. మీడియా సమావేశంలో తాము సంజూ గురించి శ్రద్ధ తీసుకుంటున్నామని సూర్య చెప్పడం ఆనందదాయకం. ఇక సంజూకు బ్యాటింగ్ చేసే అవకాశం వస్తే అతడు మిడిలార్డర్లో వస్తాడు.పవర్ ప్లేలో త్వరగా వికెట్ కోల్పోతే సంజూ అప్పుడు బరిలోకి దిగుతాడు. అతడికి మంచి ప్రాధాన్యమే దక్కింది. ఏదేమైనా ఇది ప్రాజెక్ట్ సంజూ శాంసన్ అని చెప్పవచ్చు. నేను సంజూను ఇంటర్వ్యూ చేసినపుడు గంభీర్ తనతో ఏం చెప్పాడో సంజూ వివరించాడు.‘నువ్వు 21 సార్లు డకౌట్ అయినా సరే.. 22వ మ్యాచ్‌లో నీకు ఛాన్స్ ఉంటుంది’ అని గంభీర్ తనకు మద్దతుగా నిలిచాడని సంజూ చెప్పాడు. కోచ్, కెప్టెన్ ఓ ఆటగాడికి ఇలా అండగా నిలిస్తే అతడి ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది.నిజంగా అద్భుతంసంజూ నైపుణ్యాల పట్ల మేనేజ్మెంట్కు ఉన్న అవగాహన, నమ్మకం గురించి నాకు అప్పుడే అర్థమైంది. అతడి గురించి వారు ఆలోచించడం నిజంగా అద్భుతం’’ అని అశ్విన్.. సూర్య, గంభీర్‌లపై ప్రశంసలు కురిపించాడు. కాగా సంజూ శాంసన్ టీమిండియా తరఫున ఇప్పటి వరకు 43 టీ20 మ్యాచ్‌లు ఆడి 861 పరుగులు చేశాడు.ఇందులో మూడు శతకాలు ఉన్నాయి ఇక ఆసియా టీ20 కప్-2025 కంటే ముందు స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో మాత్రం సంజూ తేలిపోయాడు. ఐదు మ్యాచ్‌లలో నాలుగింటిలో కేవలం సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యాడు. అయితే, ఇటీవల జరిగిన కేరళ క్రికెట్ లీగ్‌లో భాగంగా సంజూ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. చదవండి: IND vs WI: వాషింగ్టన్ సుందర్ కీలక నిర్ణయం -
టీమిండియా కెప్టెన్‌గా కేఎల్ రాహుల్.. శ్రేయస్ రీ ఎంట్రీ?
ఆసియాకప్-2025 తర్వాత టీమిండియా స్వదేశంలో వెస్టిండీస్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడనుంది. ఈ రెడ్ బాల్ క్రికెట్ సిరీస్ ఆక్టోబర్ 2 నుంచి 16 వరకు జరగనుంది. వెంటనే ఆక్టోబర్ 19 భారత్-ఇండియా వైట్ బాల్ సిరీస్ ప్రారంభం కానుంది. దీంతో రాబోయో రెండు నెలల పాటు భారత జట్టు వరుస సిరీస్‌లతో బీజీబీజీగా గడపనుంది.కెప్టెన్‌గా రాహుల్..?వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు మరో పది రోజుల్లో ప్రకటించే అవకాశముంది. అయితే ఈ సిరీస్‌లోని తొలి టెస్టుకు టీమిండియా రెగ్యూలర్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌కు దూరమయ్యే అవకాశముంది. గిల్ ప్రస్తుతం ఆసియా కప్ టోర్నీలో బిజీగా ఉన్నాడు. గ్రూపు-ఎలో ఉన్న భారత్ ఫైనల్‌కు చేరడం దాదాపు ఖాయమనే చెప్పుకోవాలి. ఈ ఖండాంతర టోర్నీ ఫైనల్ సెప్టెంబర్ 28న జరగనుంది. అక్కడికి మూడు రోజుల్లో అంటే అక్టోబర్ 2 నుంచి వెస్టిండీస్‌తో తొలి టెస్టు మొదలు కానుంది. దీంతో మొదటి టెస్టుకు సెలక్టర్లు గిల్‌కు విశ్రాంతి ఇచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇదే జరిగితే తొలి టెస్టులో భారత కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ వ్యవహరించవచ్చు. రాహుల్ ఆసియాకప్ జట్టులో సభ్యునిగా లేని సంగతి తెలిసిందే.ఓపెనర్లగా రాహుల్, జైశ్వాల్..ఇక ఇంగ్లండ్ టూర్లో అద్బుతంగా రాణించిన యశస్వి జైశ్వాల్, కేఎల్ రాహుల్ ఓపెనర్లగా కొనసాగనున్నారు. అదేవిధంగా అభిమన్యు ఈశ్వరన్ మరోసారి రిజర్వ్ ఓపెనర్‌గా ఉంటాడు. సాయి సుదర్శన్, కరుణ్ నాయర్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్లగా ఎంపిక కానున్నారు. అయితే వీరిద్దరిలో ఒకరికే తుది జట్టులో చోటు దక్కే అవకాశముంది.పంత్‌కు గాయం, జగదీశన్‌కు చోటు..ఇక ఇంగ్లండ్ టూర్లో గాయపడ్డ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్.. విండీస్ సిరీస్‌కు దూరమయ్యే సూచనలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. అతడి స్ధానంలో ధ్రువ్ జురెల్ మరోసారి వికెట్ల వెనక బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. అయితే తమిళనాడుకు చెందిన నారయణ్ జగదీశన్ సెకెండ్ వికెట్ కీపర్‌గా ఉండనున్నాడు.అయ్యర్ ఎంట్రీ?ఇక మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తిరిగి భారత టెస్టు జట్టులోకి రానున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఈ కారణంతోనే అతడిని ఆసీస్-ఎతో సిరీస్‌కు భారత-ఎ జట్టు కెప్టెన్‌గా అయ్యర్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. శ్రేయస్‌కు భారత టెస్టు జట్టులో చోటు దక్కితే మరోసారి సర్ఫరాజ్ ఖాన్‌పై వేటు పడే అవకాశముంది.ఇక ఆల్రౌండర్లగా రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్,నితీష్ కుమార్ రెడ్డి తమ స్దానాలను పదిలం చేసుకున్నారు. ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ చోటు దక్కించుకోనున్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ కొనసాగనున్నాడు. అయితే ఆసియాకప్‌లో కెప్టెన్ గిల్‌తో భాగమైన బుమ్రా, కుల్దీప్ యాదవ్‌లు తొలి టెస్టుకు అందుబాటులో ఉంటారో లేదో వేచి చూడాలి.వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు భారత జట్టు (అంచనా)యశస్వీ జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, ధృవ్ జురెల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, ఎన్ జగదీశన్.చదవండి: #Babar Azam: 6 లగ్జరీ కార్లు.. పాక్ రిచెస్ట్ క్రికెటర్‌గా! బాబర్ ఆజం నెట్ వర్త్ ఎంతంటే? -
గిల్‌కు ప్రమోషన్.. సూర్యకు సెగ!
ఆసియాకప్ 2025 టోర్నిలో టీమిండియా ఈరోజు తన తొలి మ్యాచ్ ఆడనుంది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని భారత క్రికెట్ జట్టు టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. యంగ్ ప్లేయర్స్‌తో టీమిండియా మంచి ఊపుమీద ఉంది. భారత క్రికెట్ కొత్త పోస్టర్ బాయ్ శుబ్‌మన్ గిల్‌ను టి20 టీమ్‌కు వైస్ కెప్టెన్‌గా నియమించడంతో పాజిటివ్ బజ్ క్రియేటయింది. ఇదే సమయంలో కెప్టెన్ సూర్యకు పరోక్షంగా హెచ్చరిక జారీ చేసినట్టయింది. 'నీ పోస్టుకు ఎసరు తప్పద'ని సందేశం ఇచ్చినట్టుగా కనబడుతోంది. గిల్‌కు ప్రమోషన్‌తో సూర్యకు సెగ తాకిందా అనే చర్చ మొదలైంది.టీమిండియా పొట్టి ఫార్మాట్ కెప్టెన్‌గా సూర్య విజయవంతం అయ్యాడు. టి20 టీమ్ నాయకుడిగా అతడి విజయాల శాతం 80 వరకు ఉంది. కానీ ఆటగాడిగా విఫలమవుతున్నాడు. స్కై భారీ ఇన్నింగ్స్ ఆడి చాలా కాలమైంది. కెప్టెన్‌గా జట్టును విజయవంతంగా నడిపించడంతోనే సరిపెట్టుకోకుండా, వ్యక్తిగతంగానూ పరుగులు చేయాలని బీసీసీఐ (BCCI) పెద్దలు కోరుకుంటున్నారు. గత నెల టీమ్ ప్రకటన సందర్భంగా సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 'సిరీస్‌లు గెలవడం ఒక్కటే కెప్టెన్ పనికాదు. అతడి బ్యాట్ నుంచి ధారాళంగా పరుగులు కూడా రావాలి' అంటూ అగార్కర్ కమెంట్ చేశారు.కెప్టెన్ అయ్యాక రన్స్ డౌన్ సూర్యకుమార్ యాదవ్ 22 మ్యాచ్‌ల్లో జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి 26.57 సగటుతో 558 పరుగులు చేశాడు. ఇందులో సెంచరీ, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. జట్టు పగ్గాలు చేపట్టిన తర్వాత అతడి బ్యాట్ నుంచి పరుగులు రావడం తగ్గిపోయాయి. కెప్టెన్ కాకముందు 66 మ్యాచ్‌ల్లో 43.40 సగటుతో 2040 పరుగులు సాధించాడు. ఇందులో మూడు శతకాలు, 17 ఫిఫ్టీలు ఉన్నాయి. నాయకత్వ బాధ్యతలు తలకెత్తుకున్న తర్వాత స్కై బ్యాట్ నుంచి పరుగులు రావడం క్రమంగా తగ్గింది. గత ఏడాది అక్టోబర్‌లో బంగ్లాదేశ్‌పై అతడు చేసిన హాఫ్ సెంచరీ(75) తర్వాత మళ్లీ భారీ ఇన్నింగ్స్ ఆడలేదు. స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన 5 మ్యాచ్‌ల సిరీస్‌లోనూ దారుణంగా విఫలమయ్యాడు. ఈ సిరీస్‌లో అతడు చేసిన అత్యధిక స్కోరు 28.షార్ట్ సెలక్షన్ బాలేదుఆసియాకప్లో సూర్య ఎలా ఆడతాడనే దానిపై అతడి భవితవ్యం ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నాయి. అయితే సూర్య పుంజుకుంటాడని, ఐపీఎల్ ఫామ్‌ను కొనసాగిస్తాడని టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ (Wasim Jaffer) అభిప్రాయపడ్డాడు. 'పరుగులు సాధించలేకపోవడమే అతడి సమస్య. ఇంతకుముందు ఆడిన ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లో అతడి షార్ట్ సెలక్షన్ స్థాయికి తగినట్టు లేదు. కానీ ఐపీఎల్లో మాత్రం బాగా ఆడాడు. పొట్టి ఫార్మాట్లో అతడు ప్రమాదకర ఆటగాడు. తనదైన రోజున బౌలర్లకు చుక్కలు చూపిస్తాడు. ఆసియాకప్ భిన్నంగా ఉంటుంది. జట్టు కూర్పు, బ్యాటింగ్ ఆర్డర్ ఎలా ఉండాలో చూసుకోవడంతోనే సరిపోదు. ఏ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చినా ఎక్కువ పరుగులు చేసి స్కై తన స్థానాన్ని పదిలపరుచుకోవాల'ని జాఫర్ అన్నాడు. ఈ ఏడాది ఐపీఎల్లో 16 మ్యాచ్‌ల్లో 717 పరుగులు చేసిన సూర్య.. సాయి సుదర్శన్ తర్వాత రెండో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే.చదవండి: యువరాజ్ సింగ్‌కు అప్‌గ్రేడ్ వర్షన్ అతడు బ్యాట్‌తోనే జవాబిస్తాడుశుబ్మన్ గిల్‌ను వైస్ కెప్టెన్ నియమించడం వల్ల సూర్యపై ఒత్తిడి పెరగబోదని జాఫర్ అభిప్రాయపడ్డాడు. ప్రతి టోర్నమెంట్‌కు వైస్ కెప్టెన్ ఉంటాడని, అలాగే ప్రతి టోర్నీ కూడా సవాల్‌తో కూడుకున్నదని చెప్పాడు. భారీ స్కోరుతో గతవైభవాన్ని అందుకోవడమే సూర్య తక్షణ కర్తవ్యమని, అంచనాలకు తగినట్టుగా రాణించాలని అన్నాడు. తనపైన ముసురుకున్న నీలి మేఘాలను పటాపంచలు చేయాలని ప్రపంచం ఎదురు చూస్తోందన్నాడు. సూర్యపై తనకు నమ్మకం ఉందని, ఆటతోనే సమాధానం చెబుతాడని విశ్వాసం వ్యక్తం చేశాడు. కాగా, ఆరంభ రోజుల్లో జాఫర్ కెప్టెన్సీలో ముంబై తరపున సూర్య ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన సంగతి క్రికెట్ లవర్స్‌కు గుర్తుండే ఉంటుంది. -
ఆసియా కప్-2025: ‘యువీకి అప్‌గ్రేడ్ వర్షన్ అతడు’
ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్లో టీమిండియా టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) వేదికగా భారత్ ఆతిథ్యం ఇస్తున్న ఈ టీ20 టోర్నీ మంగళవారం మొదలైంది. అఫ్గనిస్తాన్- హాంకాంగ్ మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్‌కు తెరలేవగా.. బుధవారం టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో యూఏఈతో తలపడనుంది.అనంతరం సెప్టెంబరు 14న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్, సెప్టెంబరు 19న ఒమన్‌తో మ్యాచ్‌తో సూర్యకుమార్ సేన తమ లీగ్ దశను పూర్తి చేసుకోనుంది. ఈ నేపథ్యంలో భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. టీమిండియా యువ స్టార్లు శుబ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.అరంగేట్రంలోనే డకౌట్.. ఆ తర్వాతకాగా పంజాబ్‌కు చెందిన అభిషేక్ శర్మ (Abhishek Sharma) ఐపీఎల్లో సత్తా చాటి.. గతేడాది జూలైలో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. జింబాబ్వేతో జరిగిన టీ20 మ్యాచ్‌లో అరంగేట్రంలోనే డకౌట్ అయిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. మరుసటి మ్యాచ్‌లో 47 బంతుల్లోనే సెంచరీ చేసి సత్తా చాటాడు.ఈ క్రమంలో టీమిండియా టీ20 జట్టులో ఓపెనర్‌గా పాతుకుపోయిన అభిషేక్.. ఇప్పటి వరకు 17 మ్యాచ్‌లలో కలిపి 33కు పైగా సగటుతో 193కు పైగా స్ట్రైక్‌రేటుతో 535 పరుగులు సాధించాడు. ఇందులో రెండు శతకాలు, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.వైస్ కెప్టెన్‌గా రీఎంట్రీఇక మరోవైపు.. దాదాపు ఏడాది కాలం తర్వాత వైస్ కెప్టెన్‌గా టీమిండియా టీ20 జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు శుబ్‌మన్ గిల్. టెస్టుల్లో ఇప్పటికే సారథిగా పగ్గాలు చేపట్టిన ఈ పంజాబీ బ్యాటర్.. భవిష్యత్తులో మూడు ఫార్మాట్లలోనూ టీమిండియా కెప్టెన్‌గా ఎంపికయ్యే అవకాశం ఉంది.యువీకి అప్‌గ్రేడ్ వర్షన్ అతడుఇక ఆసియా కప్-2025లో తొలి మ్యాచ్‌కు అభిషేక్, గిల్ సిద్ధమవుతున్న వేళ రవిచంద్రన్ అశ్విన్ మాట్లాడుతూ.. ‘‘యూఏఈ పిచ్‌లపై కూడా అభిషేక్ శర్మ దూకుడైన ఆట కొనసాగుతుందో లేదో చూడాలి. ఏదేమైనా అతడో సూపర్ ప్లేయర్. యువరాజ్ సింగ్ అప్‌గ్రేడ్ వర్షన్ లాంటోడు.గిల్‌కు మంచి అవకాశంఇక ఈ టోర్నీలో పరుగులు చేయాలనే ఒత్తిడి శుబ్‌మన్ గిల్‌పై తప్పక ఉంటుంది. 140- 150కి పైగా స్ట్రైక్‌రేటుతో అతడు పరుగులు రాబట్టాల్సి ఉంటుంది. ఈసారి ఈ టోర్నమెంట్లో అత్యధిక పరుగుల వీరుడు అయ్యేందుకు గిల్‌కు మంచి అవకాశం ఉంది’’ అని పేర్కొన్నాడు.కాగా ఐపీఎల్-2025లో అభిషేక్ శర్మ సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఓపెనర్‌గా.. 14 మ్యాచ్‌లలో కలిపి 439 పరుగులు సాధించాడు. మరోవైపు.. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్.. 15 మ్యాచ్‌లు ఆడి 650 పరుగులతో టాప్-4లో నిలిచాడు.చదవండి: టెంబా బవుమాకు ఘోర అవమానం.. వరుసగా రెండోసారి..! -
గిల్ చిన్నప్పటి నుంచే తెలుసు.. గుర్తుపడతాడో లేదో!: యూఏఈ క్రికెటర్
టీమిండియా టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill)ను ఉద్దేశించి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) స్పిన్నర్ సిమ్రన్‌జీత్ సింగ్ (Simranjeet Singh) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చిన్ననాడు గిల్‌కు నెట్స్‌లో బౌలింగ్ చేశానని.. అయితే, ఇప్పుడు అతడికి తాను గుర్తున్నానో లేదో తెలియదని అన్నాడు. కాగా పంజాబ్‌లోని లుథియానాకు చెందిన సిమ్రన్‌జీత్ సింగ్ ఊహించని పరిస్థితుల్లో యూఏఈకి చేరుకున్నాడు.ఆ తర్వాత వరుస అవకాశాలు రావడంతో అక్కడే ఉండిపోయాడు. జూనియర్లకు కోచ్‌గా వ్యవహరిస్తూనే.. యూఏఈ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. ఇప్పటి వరకు అంతర్జాతీయ స్థాయిలో పన్నెండు టీ20 మ్యాచ్‌లు ఆడిన సిమ్రన్‌జీత్ సింగ్ పదిహేను వికెట్లు పడగొట్టాడు. ఇక ఇప్పుడు ఆసియా కప్-2025 రూపంలో మేజర్ టోర్నీ ఆడేందుకు అతడు సిద్ధమయ్యాడు.తొలి మ్యాచ్‌లోనే టీమిండియాతో ఢీకాగా సొంతగడ్డపై జరుగనున్న ఈ ఖండాంతర టోర్నీలో యూఏఈ.. టీమిండియాతో కలిసి గ్రూప్-‘ఎ’లో ఉంది. ఇరుజట్లు సెప్టెంబరు 10న తమ తొలి మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన సిమ్రన్‌జీత్ సింగ్ గిల్‌తో తనకున్న జ్ఞాపకాలు, తన క్రికెట్ ప్రయాణం గురించి తెలిపాడు.గిల్ చిన్నప్పటి నుంచే తెలుసు‘‘శుబ్‌మన్ చిన్నపిల్లాడిగా ఉన్నప్పటి నుంచే నాకు తెలుసు. అయితే, ప్రస్తుతం తనకు నేను గుర్తున్నానో లేదో తెలియదు. 2011-12లో మొహాలీలో ఉన్న పంజాబ్ క్రికెట్ అకాడమీలో ఉదయం ఆరు నుంచి పదకొండు వరకు మేము ప్రాక్టీస్ చేసేవాళ్లం.శుబ్‌మన్ వాళ్ల నాన్నతో కలిసి పదకొండు గంటలకు అక్కడికి వచ్చేవాడు. నేను కాసేపు ఎక్కువ సమయం అక్కడే ఉండేవాడిని గనుక గిల్‌కు బౌలింగ్ చేసేవాడిని. అయితే, ఇప్పుడు తను నన్ను గుర్తుపట్టగలడో లేదో తెలియదు’’ అని 35 ఏళ్ల లెఫ్టార్మ్ స్పిన్నర్ సిమ్రన్‌జీత్ సింగ్ గుర్తు చేసుకున్నాడు.అనూహ్య పరిస్థితుల్లోఅదే విధంగా.. ‘‘పంజాబ్ జట్టుకు జిల్లా స్థాయిలో చాలా మ్యాచ్‌లే ఆడాను. 2017 రంజీ ప్రాబబుల్స్‌లోనూ నాకు చోటు దక్కింది. అంతేకాదు ఐపీఎల్లో కింగ్స్ ఎలెవన్ మొహాలీలో మ్యాచ్ ఆడినప్పుడల్లా నెట్స్‌లో బౌలింగ్ చేసేవాడిని.అయితే, 2021 ఏప్రిల్‌లో దుబాయ్‌లో ఇరవై రోజుల పాటు ప్రాక్టీస్ చేసేందుకు నాకు ఆఫర్ వచ్చింది. అప్పుడే కోవిడ్ రెండో దశ తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇండియాలో మరోసారి లాక్డౌన్ విధించారు. దీంతో నేను దుబాయ్‌లోనే మరి కొన్నినెలల పాటు ఉండిపోవాల్సి వచ్చింది.సెంట్రల్ కాంట్రాక్టు కూడాఅప్పటి నుంచి దుబాయ్‌లోనే సెటిల్ అయ్యాను. జూనియర్ ఆటగాళ్లకు కోచింగ్ ఇవ్వడం ద్వారా మంచిగానే సంపాదించాను. క్లబ్ క్రికెట్ ఆడేవాడిని కూడా!.. అలా కుటుంబాన్ని పోషించుకునేవాడిని.ఈ క్రమంలోనే యూఏఈ జట్టులోకి వచ్చాను. యూఏఈ బోర్డు నాకు సెంట్రల్ కాంట్రాక్టు కూడా ఇచ్చింది. అప్పటి నుంచి నా ఆర్థిక పరిస్థితి మరింత మెరుగైంది’’ అని సిమ్రన్‌జీత్ సింగ్ చెప్పుకొచ్చాడు. కాగా ప్రస్తుతం టెస్టుల్లో టీమిండియా కెప్టెన్‌గా ఉన్న గిల్.. టీ20 జట్టు వైస్ కెప్టెన్‌గా ఇటీవలే తిరిగి నియమితుడయ్యాడు. ఇక సెప్టెంబరు 9- 28 వరకు టీ20 ఫార్మాట్లో ఆసియా కప్ టోర్నీ జరుగనుంది.చదవండి: ఆసియా కప్-2025: పూర్తి షెడ్యూల్, అన్ని జట్లు, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు -
గిల్ వద్దు!.. టీమిండియా ఓపెనర్‌గా అతడే సరైనోడు: రవిశాస్త్రి
ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్లో భారత ఓపెనింగ్ జోడీ గురించి టీమిండియా మాజీ క్రికెటర్ రవిశాస్త్రి (Ravi Shastri) కీలక వ్యాఖ్యలు చేశాడు. టాపార్డర్‌లో విశ్వరూపం ప్రదర్శించే సంజూ శాంసన్ (Sanju Samson)ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెనర్‌గా తప్పించవద్దని జట్టు యాజమాన్యానికి సూచించాడు.వైస్ కెప్టెన్ అయినప్పటికీ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) కూడా సంజూను రీప్లేస్ చేయలేడని.. అతడు వేరొక స్థానంలో బ్యాటింగ్‌కు రావాలని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. యూఏఈ వేదికగా సెప్టెంబరు 9- 28 వరకు టీ20 ఫార్మాట్లో ఆసియా కప్ నిర్వహణకు రంగం సిద్ధమైంది. వైస్ కెప్టెన్‌గా..ఈ మెగా ఈవెంట్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇప్పటికే తమ జట్టును ప్రకటించింది. దాదాపు ఏడాది తర్వాత అంతర్జాతీయ టీ20లలోకి గిల్‌కు పిలుపునిచ్చిన మేనేజ్మెంట్.. అతడిని వైస్ కెప్టెన్‌గా నియమించింది. ఈ నేపథ్యంలో గిల్ గైర్హాజరీలో ఓపెనర్‌గా వచ్చిన సంజూ శాంసన్‌పై వేటు పడే అవకాశాలు ఉన్నాయి.గిల్ లేనందు వల్లే సంజూ ఓపెనింగ్ చేశాడని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ వ్యాఖ్యానించడం ఇందుకు నిదర్శనం. అంతేకాదు ఓపెనర్‌గా అభిషేక్ శర్మ పాతుకుపోయాడంటూ కితాబులు ఇవ్వడం ద్వారా.. అభి- గిల్ భారత ఇన్నింగ్స్ ఆరంభిస్తారనే సంకేతాలు ఇచ్చాడు.ప్రమాదకర బ్యాటర్ఈ పరిణామాల నేపథ్యంలో టీమిండియా మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి మాత్రం సంజూ శాంసన్‌కే తన మద్దతు అంటూ కుండబద్దలు కొట్టేశాడు. ‘‘టాపార్డర్‌లో అత్యంత ప్రమాదకర బ్యాటర్ సంజూ శాంసన్. అక్కడ ఆడిస్తేనే మనకోసం మ్యాచ్‌లు గెలవగలడు. కాబట్టి తన బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చకూడదు.సంజూ శాంసన్ స్థానాన్ని భర్తీ చేయడం ఎవరికీ అంత సులువేం కాదు. టాప్ ఆర్డర్లో టీమిండియా తరఫున టీ20లలో సంజూకు మంచి రికార్డు ఉంది. గిల్ కూడా అతడిని డిస్ప్లేస్ చేయలేడు. కాబట్టి గిల్ వేరొకరి స్థానంలో బ్యాటింగ్ చేస్తే మంచిది.సంజూనే సరైనోడుసంజూ శాంసనే ఓపెనర్‌గా ఉండాలి. టీ20 ఫార్మాట్లో తనకు ఉన్న రికార్డును బట్టి సంజూనే సరైనోడు. టాప్‌లో రాణిస్తూ పరుగులు రాబట్టడంతో పాటు సెంచరీలు కూడా చేసిన ఘనత అతడిది’’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.కాగా రవిశాస్త్రి హెడ్‌కోచ్‌గా ఉన్న సమయంలోనే సంజూ టీమిండియాలో పునరాగమనం చేశాడు. అయితే, అతడికి వరుస అవకాశాలు మాత్రం రాలేదు. దీంతో టీ20 ప్రపంచకప్-2021 జట్టులోనూ చోటు దక్కలేదు. ఇక టీ20 ప్రపంచకప్-2024 ఆడిన భారత జట్టులో స్థానం దక్కినప్పటికీ.. ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు.జితేశ్ శర్మతో పోటీఇక గిల్ రాకతో ఆసియా కప్ టోర్నీలో కేవలం వికెట్ కీపర్ కోటాలొ సంజూ తుదిజట్టులో చోటు దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, అక్కడ కూడా జితేశ్ శర్మతో అతడికి పోటీ తప్పదు. జితేశ్ స్పెషలైజ్డ్ ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్నాడు కాబట్టి మేనేజ్మెంట్ అతడి వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. కాగా అంతర్జాతీయ స్థాయిలో 42 టీ20 మ్యాచ్‌లు ఆడిన సంజూ.. మూడు శతకాల సాయంతో 861 పరుగులు చేశాడు.చదవండి: అతడే నా ఫేవరెట్ క్రికెటర్.. టీమిండియాకు ఎందుకు సెలక్ట్ చేయరు? -
సెన్స్ ఉందా?.. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఏంటి?: రాజస్తాన్ రాయల్స్ స్టార్
రాజస్తాన్ రాయల్స్ పేసర్ సందీప్ శర్మ (Sandeep Sharma) సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్లో కెప్టెన్‌గా రాణించినంత ఉన్నంత మాత్రాన.. శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)ను టీమిండియా సారథిని చేయాల్సిన అవసరం లేదన్నాడు. సెన్స్‌లేని వాళ్లే అతడిని కెప్టెన్‌ను చేయాలని మాట్లాడతారని పేర్కొన్నాడు.పరుగుల వరద.. అయినా కనికరించని సెలక్టర్లుకాగా దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో పరుగుల వరద పారించాడు ముంబై బ్యాటర్ శ్రేయస్ అయ్యర్. గతేడాది ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)ను విజేతగా నిలిపిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఈ సంవత్సరం పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా వచ్చి.. జట్టును ఫైనల్‌కు చేర్చాడు.అంతేకాదు బ్యాటర్‌గానూ శ్రేయస్ అయ్యర్ మరోసారి తనను తాను నిరూపించుకున్నాడు. అయినప్పటికీ ఆసియా కప్-2025 టోర్నీకి ప్రకటించిన జట్టులో అతడికి చోటు దక్కలేదు. దాదాపు ఏడాది కాలంగా అంతర్జాతీయ టీ20లకు దూరంగా ఉన్న శుబ్‌మన్ గిల్‌ను పిలిపించిన బీసీసీఐ.. అతడికి మరోసారి వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్ ఇచ్చింది.శ్రేయస్‌ను కెప్టెన్ చేయాలి ఈ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్‌కు బీసీసీఐ అన్యాయం చేస్తోందనే విమర్శలు వచ్చాయి. ఓ ఆటగాడిగా తాను చేయాల్సిందింతా చేసినా అయ్యర్‌ను పక్కనపెట్టడం సరికాదని మాజీ క్రికెటర్లు సెలక్టర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మరికొంత మంది టీమిండియా టీ20 భవిష్య కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ సరైనోడని అభిప్రాయపడ్డారు.సెన్స్ ఉందా?.. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఏంటి?ఈ విషయంపై రాజస్తాన్ రాయల్స్ బౌలర్ సందీప్ శర్మ తాజాగా స్పందించాడు. క్రిక్‌ట్రాకర్‌తో మాట్లాడుతూ.. ‘‘బీసీసీఐకి సొంత డొమెస్టిక్ లీగ్ ఉంది కదా!.. ఎంతో మంది అక్కడ ఆడుతూ ఉంటారు. అయితే, అంతర్జాతీయ స్థాయి జట్టును ఎంపిక చేసినపుడు కేవలం 15 మంది పేర్లనే పరిగణనలోకి తీసుకుంటారు.ఆ పదిహేను మందిని మేనేజ్ చేయగల ఆటగాడినే కెప్టెన్‌గా ఎంపిక చేస్తారు. ఇక ఇక్కడ.. అంటే ఐపీఎల్లో చాలా మంది దేశీ క్రికెటర్లతో పాటు.. యువకులు, విదేశీ ప్లేయర్లు ఉంటారు. ఇక్కడ కెప్టెన్‌గా పనిచేసిన అనుభవం వేరు.టీమిండియాను మేనేజ్ చేయగల వ్యక్తి మాత్రమే మంచి కెప్టెన్ అవుతాడు. మరి ఈ చర్చ ఎందుకు? ఇలాంటివి సెన్స్‌లెస్ అని అనిపిస్తుంది. ఓ ఆటగాడు ఐపీఎల్లో కెప్టెన్‌గా రాణిస్తే.. టీమిండియా కెప్టెన్ అయిపోలేడు’’ అని సందీప్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశాడు.రెండే మ్యాచ్‌లు.. ఒక వికెట్‌కాగా చాలా మంది ఆటగాళ్లలాగే.. పంజాబ్‌కు చెందిన సందీప్ శర్మ కూడా ఐపీఎల్లో సత్తా చాటి టీమిండియాలోకి వచ్చాడు. 2015లో జింబాబ్వేతో టీ20 సిరీస్ సందర్భంగా అడుగుపెట్టిన ఈ రైటార్మ్ పేసర్.. కేవలం రెండు మ్యాచ్‌లు ఆడి ఒక వికెట్ మాత్రమే తీశాడు. కానీ ఐపీఎల్లో ఆడితే టీమిండియాలోకి రావడం అంతతేలిక కాదంటూ సందీప్ వ్యాఖ్యానించడం విశేషం. లీగ్ క్రికెట్ జట్టుకు, అంతర్జాతీయ జట్టుకు తేడా ఉంటుందని.. శ్రేయస్ అయ్యర్‌ను కెప్టెన్ చేయాలనడం సరికాదంటూ అభిప్రాయపడటం గమనార్హం.చదవండి: రూ. 4 వేల కోట్ల ప్యాలెస్.. 560 కిలోల బంగారం, వెండి రైలు, రథం.. ఇంకా.. -
చరిత్ర సృష్టించిన సికందర్ రజా.. వరల్డ్ నంబర్ వన్
జింబాబ్వే స్టార్ క్రికెటర్ సికందర్ రజా (Sikandar Raza) సరికొత్త చరిత్ర సృష్టించాడు. వన్డే ఫార్మాట్లో ప్రపంచ నంబర్ వన్ ఆల్‌రౌండర్ (ODI No.1 All Rounder)గా అవతరించాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో ఆల్‌రౌండర్ల జాబితాలో రజా అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు.అద్భుత ప్రదర్శనతద్వారా జింబాబ్వే నుంచి వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రపీఠం దక్కించుకున్న తొలి ఆల్‌రౌండర్‌గా సికందర్ రజా రికార్డు సాధించాడు. శ్రీలంకతో తాజా వన్డే సిరీస్ సందర్భంగా అద్భుత ప్రదర్శన కనబరిచిన ఈ రజా ఈ ఘనత సాధించాడు. కాగా పాకిస్తాన్‌లోని పంజాబ్‌లో జన్మించిన సికందర్ రజా చాలా ఏళ్ల క్రితమే జింబాబ్వేకు వలస వెళ్లాడు.అక్కడే అంతర్జాతీయ స్థాయి క్రికెటర్‌గా ఎదిగిన సికందర్ రజా.. జింబాబ్వే తరఫున మేటి బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌గా పేరుగాంచాడు. ప్రస్తుతం టీ20 ఫార్మాట్లో అతడు జింబాబ్వే జట్టు కెప్టెన్‌గా ఉన్నాడు. కాగా కుడిచేతి వాటం బ్యాటర్ అయిన రజా.. రైటార్మ్ ఆఫ్‌బ్రేక్ స్పిన్నర్ కూడా!సెంచరీ మిస్ అయినా..ఇక 39 ఏళ్ల సికందర్ రజా ప్రస్తుతం శ్రీలంకతో సిరీస్‌లతో బిజీగా ఉన్నాడు. రెండు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు లంక జింబాబ్వేకి వెళ్లింది. ఈ క్రమంలో తొలుత వన్డే సిరీస్ జరుగగా.. రెండింట గెలిచిన శ్రీలంక.. జింబాబ్వేను 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది.అయితే, వన్డే సిరీస్‌ను కోల్పోయినప్పటికీ సికందర్ రజా మాత్రం చెప్పుకోదగ్గ ప్రదర్శన చేశాడు. తొలి వన్డేలో 87 బంతుల్లో 92 పరుగులు చేయడంతో పాటు.. ఓ వికెట్ కూడా పడగొట్టాడు. ఇక రెండో వన్డేలోనూ అర్ధ శతకం (55 బంతుల్లో 59 నాటౌట్) సాధించాడు రజా. ఈ క్రమంలో ఐసీసీ మెన్స్ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి దూసుకువచ్చాడు.ఐసీసీ మెన్స్ వన్డే ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో టాప్-5లో ఉన్నది వీరే🏏సికందర్ రజా (జింబాబ్వే)- 302 రేటింగ్ పాయింట్లు🏏అజ్మతుల్లా ఒమర్జాయ్ (అఫ్గనిస్తాన్)- 296 రేటింగ్ పాయింట్లు🏏మహ్మద్ నబీ(అఫ్గనిస్తాన్)- 292 రేటింగ్ పాయింట్లు🏏మెహిదీ హసన్ మిరాజ్ (బంగ్లాదేశ్)- 249 రేటింగ్ పాయింట్లు🏏మైకేల్ బ్రాస్‌వెల్ (న్యూజిలాండ్)- 246 రేటింగ్ పాయింట్లు.నంబర్ వన్ గిల్, హార్దిక్👉ఇదిలా ఉంటే.. మెన్స్ టీ20 ర్యాంకింగ్స్ ఆల్‌రౌండర్ల జాబితాలో టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యా తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. మరోవైపు.. వన్డేల్లో శుబ్‌మన్ గిల్ నంబర్ వన్ బ్యాటర్‌గా టాప్ ర్యాంకులో కొనసాగుతుండగా.. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో కేశవ్ మహరాజ్ అగ్రపీఠంపై ఉన్నాడు. ఇక సికందర్ రజా వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లోనూ తొమ్మిది స్థానాలు ఎగబాకి 22వ ర్యాంకు సాధించడం గమనార్హం.చదవండి: అతడికి అనుమతి ఎందుకు?.. అసలు బీసీసీఐ ఏం చేస్తోంది? -
అతడికి అనుమతి ఎందుకు?.. అసలు బీసీసీఐ ఏం చేస్తోంది?
ఆసియా కప్-2025 టోర్నమెంట్, ఆ తర్వాత వరుస సిరీస్‌ల నేపథ్యంలో ఇప్పటికే భారత ఆటగాళ్లలో చాలా మంది ఫిట్నెస్ పరీక్షకు హాజరయ్యారు. బెంగళూరులో నిర్వహించిన టెస్టుల్లో వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma), టెస్టు సారథి శుబ్‌మన్ గిల్, టీ20 జట్టు నాయకుడు సూర్యకుమార్ యాదవ్ పాసయ్యారు.వీరితో పాటు మహ్మద్ సిరాజ్, జితేశ్ శర్మ (Jitesh Sharma), ప్రసిద్ కృష్ణ, రుతురాజ్ గైక్వాడ్, అభినవ్ మనోహర్, రింకూ సింగ్, ఆవేశ్ ఖాన్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయి, సంజూ శాంసన్, శివం దూబే, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, ముకేశ్ కుమార్, హార్దిక్ పాండ్యా (Hardik Pandya), ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, యశస్వి జైస్వాల్ తదితరులు ఫిట్నెస్ పరీక్ష పూర్తి చేసుకున్నట్లు సమాచారం.వారంతా రెండో దశలో..ఇక రెండో దశలో భాగంగా రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్, ఆకాశ్ దీప్, నితీశ్ కుమార్ రెడ్డి తదితరులు ఈ నెలలో ఫిట్నెస్ పరీక్ష పూర్తిచేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఆటగాళ్లంతా బెంగళూరులో ఫిట్నెస్ పరీక్షకు హాజరైతే.. టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి మాత్రం లండన్‌లోనే ఉన్నాడు.లండన్‌లోనే కోహ్లి ఫిట్నెస్ టెస్టుఅక్కడే కోహ్లి ఫిట్నెస్ పరీక్షలో పాల్గొన్నట్లు సమాచారం. ఇందుకోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నుంచి కోహ్లి ముందుగానే అనుమతి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, టీమిండియా అభిమానులు మాత్రం దీనిని జీర్ణించుకోలేకపోతున్నారు. ‘‘కోహ్లి భారత్‌లో కంటే లండన్‌లోనే ఎక్కువగా ఉంటాడు.తన కుటుంబమంతా అక్కడే ఉంటుంది. మ్యాచ్‌లు, ఐపీఎల్ ఉన్నపుడు మాత్రమే ఇండియాకు వస్తాడు. ఇప్పుడు ఫిట్నెస్ టెస్టు కూడా అక్కడేనా?.. అసలు బీసీసీఐ ఎందుకిలా చేస్తోంది?..అతడు ఏమైనా స్పెషలా? వేరేదేశంలో ఫిట్నెస్ టెస్టుకు ఎలా అనుమతినిస్తారు? మాకైతే ఇప్పుడు కోహ్లి ఇంగ్లండ్ క్రికెటర్ ఏమో అనే డౌట్ వస్తోంది’’ అంటూ సోషల్ మీడియా వేదికగా బీసీసీఐ, కోహ్లి తీరును ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు.ఆస్ట్రేలియాతో సిరీస్ సందర్భంగా రీఎంట్రీకాగా టీ20 ప్రపంచకప్-2024 తర్వాత అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన కోహ్లి.. ఇటీవలే టెస్టుల నుంచి కూడా వైదొలిగాడు. ప్రస్తుతం వన్డే, ఐపీఎల్లో కొనసాగుతున్న ఈ దిగ్గజ బ్యాటర్.. తదుపరి ఆస్ట్రేలియాతో సిరీస్ సందర్భంగా రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇదిలా ఉంటే.. చివరగా ఇంగ్లండ్ పర్యటనలో ఐదు టెస్టులు ఆడిన టీమిండియా.. తదుపరి ఆసియా కప్-2025 టోర్నీలో పాల్గొననుంది. సెప్టెంబరు 9-28 వరకు పొట్టి ఫార్మాట్లో జరిగే ఈ టోర్నీకి యూఏఈ వేదిక.చదవండి: ధృవ్ జురెల్‌ను తప్పించిన సెలెక్టర్లు -
అతడు కొడితే సెంచరీలు.. లేదంటే చీప్‌గా ఔట్ అవుతాడు: ఇర్ఫాన్ పఠాన్
ఆసియాకప్-2025 సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీలో టీమిండియా ఓపెనర్ ఎవరన్నది? ప్రస్తుతం క్రీడా వర్గాల్లో చర్చానీయాంశంగా మారింది. ఒక ఓపెనర్‌గా అభిషేక్ శర్మ ఖాయం కాగా.. మరో స్ధానం కోసం శుబ్‌మన్ గిల్, సంజూ శాంసన్ మధ్య పోటీ నెలకొంది.గత 12 నెలలుగా సంజూ భారత జట్టుకు ఓపెనర్ గా ఉన్నాడు. అయితే టీ20ల్లో గిల్‌కు విశ్రాంతి ఇవ్వడంతోనే ఓపెనర్‌గా శాంసన్‌కు అవకాశం లభించింది. ఇప్పుడు గిల్ టీ20 జట్టులోకి తిరిగి రావడంతో శాంసన్ పరిస్థితి ఏంటో ఆర్ధం కావడం లేదు. శాంసన్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నప్పటికి తుది జట్టు కూర్పులో పక్కన పెట్టే అవకాశముంది. ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్‌కు మిడిలార్డర్లో మంచి రికార్డు లేదు. దీంతో అతడి స్ధానంలో జితేష్ శర్మకు చోటు దక్కే సూచనలు కన్పిస్తున్నాయి.జితేష్ ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శలను చేశాడు. అతడు ఫినిషర్‌గా, వికెట్ కీపర్‌గా సేవలను అందించగలడు. అతడి వైపే టీమ్ మెనెజ్‌మెంట్ మొగ్గు చూపే ఛాన్స్ ఉంది. తాజాగా ఇదే విషయంపై టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆసియాకప్‌కు భారత తుది జట్టులో సంజూకు చోటు దక్కడం కష్టమేనని పఠాన్ అభిప్రాయపడ్డాడు."సంజూ శాంసన్ ఓపెనర్‌గా బాగా రాణించాడు. కానీ అతడి స్ధిరత్వంపై అందరికి సందేహం ఉంది. ఎందుకంటే అతడు చేస్తే సెంచరీలు చేస్తాడు లేదా చీప్‌గా ఔట్ అవుతాడు. బంగ్లాదేశ్ సిరీస్‌లో అద్బుతంగా రాణించిన సంజూ.. ఇంగ్లండ్‌పై పూర్తిగా తేలిపోయాడు.అయితే ప్లేయింగ్ ఎలెవన్‌లో అభిషేక్ శర్మ స్ధానానికి ఎటువంటి ఢోకా లేదు. అభిషేక్ అద్బుతమైన స్ట్రైక్ రేట్ కలిగి ఉన్నాడు. బౌలింగ్ కూడా చేయగలడు. అభిషేక్‌తో కలిసి శుబ్‌మన్ గిల్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశముంది. ప్రస్తుతం బీసీసీఐ ఆల్‌ఫార్మాట్ కెప్టెన్ కోసం వెతుకుతోంది.అందుకే గిల్ ఏడాది తర్వాత అనూహ్యంగా టీ20 సెటాప్లోకి వచ్చాడు. కాబట్టి తుది జట్టులో గిల్‌కు అవకాశమిచ్చేందుకు సంజూను పక్కన పెట్టచ్చు. అప్పటికి శాంసన్‌ను ఆడించాలంటే ఐదో స్ధానంలో బ్యాటింగ్‌కు పంపాలి.ఒకవేళ అదే జరిగితే జితేష్ శర్మ బెంచ్‌కు పరిమితవ్వాల్సిందే. అయితే సంజూను మిడిలార్డర్లో ఆడించి టీమ్ మెనెజ్‌మెంట్ రిస్క్ తీసుకుంటుందో లేదో వేచి చూడాలి" అని సోనీ స్పోర్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇర్ఫాన్ పేర్కొన్నాడు.చదవండి: ‘ధోని సహనం కోల్పోయాడు.. నా మీద గట్టిగా అరిచాడు.. వికెట్ తీసినా సరే’ -
పంజాబ్‌ను ఇలా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతోంది: శుబ్‌మన్ గిల్
ఉత్తరాది రాష్ట్రం పంజాబ్‌ను భారీ వరదులు ముంచెత్తున్నాయి. గత కొన్ని రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఇప్పటి వరకు 29 మంది మరణించారు. సుమారు వెయ్యి గ్రామాలు వాననీటిలో మునిగిపోయాయి. ఈ ప్రకృతి వైపరీత్యం వల్ల 2.65 లక్షలకు పైగా నివాసితులు ప్రభావితమయ్యారు. అంతేకాకుండా పంటలు కూడా భారీగా దెబ్బతిన్నాయి. ఈ వరదలు వల్ల పంజాబ్‌లోని గురుదాస్‌పూర్, పఠాన్‌కోట్, ఫజిల్కా, కపుర్తలా, తరన్ తరణ్, ఫిరోజ్‌పూర్, హోషియార్పూర్ అమృత్‌సర్‌తో సహా 12 జిల్లాలు అతలకుతలమయ్యాయి. ఆగస్టు నెలలో రాష్ట్రంలో 250 మి.మీ.లకు పైగా వర్షపాతం నమోదైంది. గత 25 సంవత్సరాలలో ఇదే అత్యధికం కావడం గమనార్హం. సట్లెజ్, బియాస్, రావి వంటి నదులు పొంగిపొర్లుతున్నాయి. ఈ తీవ్రమైన విఫత్తుపై పంజాబ్ లోకల్ బాయ్, టీమిండియా టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ స్పందించాడు."వరదలతో అతలాకుతలం నా పంజాబ్ చూస్తుంటే నా హృదయం తరుక్కుపోతుంది. పంజాబ్ ఎన్ని కష్టాల్లు వచ్చినా ఎల్లప్పుడూ బలంగా ఉంటుంది. మేము ఈ స్థితి నుంచి మళ్లీ పైకి వస్తాం. బాధిత కుటుంబాల కోసం నేను ప్రార్థిస్తున్నాను. ప్రజలకు నా పూర్తి మద్దతు ఉంటుంది" అని గిల్ ఎక్స్‌లో రాసుకొచ్చాడు. కాగా శుబ్‌మన్ ఆసియాకప్ కప్-2025 కోసం సిద్దమవుతున్నాడు. అతడు ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో ఉన్నాడు. సెప్టెంబర్ 9 నుంచి ఆసియాకప్ టీ20 టోర్నీ ప్రారంభం కానుంది. ఈ ఖండాంతర టోర్నీలో భారత జట్టు వైస్ కెప్టెన్‌గా గిల్ వ్యవహరించనున్నాడు.చదవండి: ‘ది హండ్రెడ్’లో ఇరగదీశారు.. ఆ నలుగరికి ఐపీఎల్లో భారీ ధర! -
‘ప్రతిసారి ఒక్కరికే మద్దతు.. అందుకే గిల్‌కు టీ20 జట్టులో చోటు’
టీమిండియా టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) అంతర్జాతీయ టీ20లలో పునరాగమనం చేయడంపై భారత క్రికెట్ వర్గాల్లో చర్చ కొనసాగుతూనే ఉంది. ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్‌కు జట్టు ప్రకటన సందర్భంగా గిల్‌కు చోటివ్వడంతో పాటు.. అతడిని వైస్ కెప్టెన్‌గానూ నియమించినట్లు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ తెలిపాడు.ఓపెనర్‌గానే గిల్!కాగా దాదాపు ఏడాది పాటు భారత టీ20 జట్టుకు గిల్ దూరంగా ఉండగా.. అభిషేక్ శర్మ- సంజూ శాంసన్ (Sanju Samson) ఓపెనింగ్ జోడీగా వచ్చి సత్తా చాటారు. అయితే, గిల్ రీఎంట్రీ సంజూకు గండంగా మారింది. అభిషేక్ శర్మనే ఓపెనర్‌గా కొనసాగిస్తామని అగార్కర్ ఇప్పటికే స్పష్టం చేశాడు.అంతేకాదు.. గిల్ లేడు కాబట్టే సంజూ ఓపెనర్‌గా వచ్చాడని అగార్కర్ పేర్కొన్నాడు. దీనిని బట్టి గిల్ కోసం సంజూపై వేటు వేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఓపెనర్‌గా కాకపోయినా వికెట్ కీపర్‌గా అయినా ఈ కేరళ స్టార్‌ను ఆడిస్తారనుకుంటే.. యాజమాన్యం జితేశ శర్మ వైపే మొగ్గుచూపే అవకాశం కనిపిస్తోంది.ఒక ఆటగాడిని అలా తయారు చేస్తారుఈ పరిణామాల నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మరోవైపు.. ఇప్పటికే టెస్టుల్లో కెప్టెన్ అయిన గిల్‌ను.. టీ20, వన్డేల్లోనూ భవిష్య కెప్టెన్‌గా నియమించేందుకు బీసీసీఐ అడుగులు వేస్తోందని మరికొందరు పేర్కొంటున్నారు. అయితే, భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప మాత్రం భిన్నంగా స్పందించాడు.‘‘భారత క్రికెట్లో పరిణామాలు నిశితంగా పరిశీలిస్తే.. ప్రతి తరంలోనూ ఒక సూపర్‌స్టార్‌ను తయారు చేస్తారు. భారత క్రికెట్‌ను కాపాడేందుకు ఎవరో ఒక ప్లేయర్‌కు ఎల్లవేళలా మద్దతుగా నిలుస్తూనే ఉంటారు.మార్కెటింగ్, వ్యాపారం కోసమేఇప్పుడు కూడా అదే జరుగుతోంది. మార్కెటింగ్, వ్యాపారం కోసం ఇలాంటి నిర్ణయాలు జరుగుతాయి. అతడిని అందుకే ఇప్పుడు టీ20 జట్టులోకి తిరిగి తీసుకువచ్చారు. అలాంటి సూపర్స్టార్లతో ఆటను ముందుకు తీసుకువెళ్లాలనే ప్లాన్. శుబ్‌మన్ గిల్ కూడా సూపర్స్టార్లలో ఒకడని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు’’ అని రాబిన్ ఊతప్ప తన యూట్యూబ్ చానెల్ వేదికగా చెప్పుకొచ్చాడు. కాగా యూఏఈ వేదికగా సెప్టెంబరు 9- 28 వరకు ఆసియా కప్ టోర్నీ జరుగుతుంది. ఈసారి టీ20 ఫార్మాట్లో ఈ ఖండాంతర టోర్నీని నిర్వహిస్తున్నారు. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, యూఏఈ, హాంగ్‌కాంగ్, ఒమన్ జట్లు ఇందులో పాల్గొంటున్నాయి.ఆసియా కప్ టీ20-2025 టోర్నీకి టీమిండియా సూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్.రిజర్వు ప్లేయర్లు: ప్రసిద్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్.చదవండి: ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన రషీద్ ఖాన్.. సరికొత్త చరిత్ర -
కోహ్లి దేశీ బాయ్!.. రన్ మెషీన్ మాత్రం అతడే: గంభీర్
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ తర్వాత టీమిండియాతో పాటు హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌కు కూడా విశ్రాంతి లభించింది. దాదాపు నెలరోజులుగా ఈ మాజీ క్రికెటర్ ఎక్కువగా కుటుంబానికే సమయం కేటాయించాడు. ఇక ఇటీవల ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (DPL)-2025 ఫైనల్‌కు కూడా గౌతీ హాజరయ్యాడు.ఈ క్రమంలో ఓ ఫన్ సెగ్మెంట్లో గంభీర్ భాగమయ్యాడు. ఈ పదం వినగానే మీకు ఏ క్రికెటర్ గుర్తుకువస్తారు అంటూ యాంకర్ అడుగగా.. ఈ ఢిల్లీ స్టార్ తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చాడు. ‘క్లచ్ (క్లిష్ట పరిస్థితులు, ఒత్తిడిలో గొప్పగా రాణించే ఆటగాడు’ ఎవరన్న ప్రశ్నకు గంభీర్.. సచిన్ టెండుల్కర్ పేరు చెప్పాడు.ఇక ‘దేశీ బాయ్’గా విరాట్ కోహ్లిని అభివర్ణించిన గౌతీ.. స్పీడ్ అన్న పదం వినగానే తనకు భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గుర్తుకువస్తాడన్నాడు. అదే విధంగా.. ‘గోల్డెన్ ఆర్మ్ (పార్ట్ టైమ్ బౌలరే అయినా కీలక వికెట్లు పడగొట్టే ఆటగాడు)’ అనగానే నితీశ్ రాణా పేరు చెప్పిన గంభీర్.. ‘మోస్ట్ స్టైలిష్’ అన్న పదానికి శుబ్‌మన్ గిల్ పేరు చెప్పాడు.ఇక ‘మిస్టర్ కన్సిస్టెంట్’గా రాహుల్ ద్రవిడ్‌ను పేర్కొన్న గంభీర్.. ‘రన్‌మెషీన్’ అనగానే తనకు వీవీఎస్ లక్ష్మణ్ గుర్తుకువస్తాడని తెలిపాడు. ‘మోస్ట్ ఫన్నీ’గా రిషభ్ పంత్ పేరు చెప్పిన గంభీర్.. ‘డెత్ ఓవర్ స్పెషలిస్టు’గా జహీర్ ఖాన్‌కు ఓటేశాడు.కాగా 2024లో టీమిండియా టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత రాహుల్ ద్రవిడ్ హెడ్‌కోచ్ పదవి నుంచి తప్పుకోగా.. గంభీర్ ఆ బాధ్యతలు చేపట్టాడు. వన్డే, టీ20లలో కోచ్‌గా వరుస విజయాలు సాధించిన ఈ ఢిల్లీ మాజీ బ్యాటర్.. టెస్టుల్లో మాత్రం విఫలమయ్యాడు.గంభీర్ మార్గదర్శనంలో స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో తొలిసారి 3-0తో వైట్‌వాష్‌కు గురైన టీమిండియా.. తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో పదేళ్ల తర్వాత తొలిసారి బోర్డర్- గావస్కర్ ట్రోఫీ (3-1)తో కోల్పోయింది. అయితే, ఇటీవల ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీలో టీమిండియా మెరుగైన ప్రదర్శన కనబరిచింది.విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ టెస్టు రిటైర్మెంట్ తర్వాత.. శుబ్‌మన్ గిల్ సారథ్యంలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన భారత జట్టు.. ఐదు టెస్టుల సిరీస్‌ను 2-2తో సమం చేసింది. ఇందులో బర్మింగ్‌హామ్ టెస్టు విజయం ప్రత్యేకమైనది. ఈ వేదికపై తొలిసారి భారత్ టెస్టు గెలవడం విశేషం. ఈ సానుకూల ఫలితాలు గంభీర్‌కు కాస్త ఉపశమనం కలిగించాయి.ఇక తదుపరి ఆసియా కప్-2025 టోర్నమెంట్‌తో టీమిండియాతో పాటు గంభీర్ బిజీ కానున్నాడు. ఈసారి టీ20 ఫార్మాట్లో సెప్టెంబరు 9-28 వరకు ఈ టోర్నీ జరుగనుంది. కాగా ఈ ఏడాది గంభీర్ మార్గదర్శనంలో టీమిండియా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే.. గతేడాది ప్రారంభమైన ఢిల్లీ ప్రీమియర్ లీగ్.. రెండో ఎడిషన్ ఆదివారం ముగిసింది. అరుణ్‌జైట్లీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో.. నితీశ్ రాణా కెప్టెన్సీలోని వెస్ట్ ఢిల్లీ లయన్స్.. సెంట్రల్ ఢిల్లీ కింగ్స్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. తద్వారా డీపీఎల్-2025 చాంపియన్‌గా అవతరించింది. -
T20 WC 2026: టీమిండియా ఓపెనర్లుగా ఊహించని పేర్లు!
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తొలిసారి ప్రవేశపెట్టిన టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్న ఘనత టీమిండియా సొంతం. మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) సారథ్యంలో 2007లో పొట్టి క్రికెట్ వరల్డ్‌కప్ ట్రోఫీని ముద్దాడింది. ఆ తర్వాత దాదాపు పదిహేడేళ్లకు అంటే.. 2024లో మరోసారి టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుంది భారత్.రో- కో గుడ్‌బై చెప్పిన తర్వాతఅమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా గతేడాది ఆతిథ్యం ఇచ్చిన ఈ మెగా టోర్నీలో రోహిత్ సేన.. ఆఖరి వరకు అజేయంగా నిలిచి చాంపియన్‌గా అవతరించింది. ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి కప్‌ను గెలుచుకుంది. ఈ ఐసీసీ ఈవెంట్లో ఓపెనర్లుగా వచ్చిన విరాట్ కోహ్లి (Virat Kohli)- రోహిత్ శర్మ (Rohit Sharma).. టీమిండియా విజయం తర్వాత అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు.అభి- సంజూ జోడీ హిట్ఇక కెప్టెన్‌గా రోహిత్ శర్మ స్థానాన్ని సూర్యకుమార్ యాదవ్ భర్తీ చేయగా.. భారత టీ20 జట్టు ఓపెనర్లుగా అభిషేక్ శర్మ- సంజూ శాంసన్ నిలదొక్కుకున్నారు. శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ టెస్టులతో బిజీ కావడంతో ఈ జోడీకి వరుస అవకాశాలు వచ్చాయి.అయితే, ఆసియా కప్-2025 టోర్నీ సందర్భంగా టీమిండియా ఓపెనర్లు మారే అవకాశం ఉంది. ఈసారి పొట్టి ఫార్మాట్లో నిర్వహించే ఈ ఖండాంతర టోర్నీకి ప్రకటించిన జట్టులో గిల్ స్థానం దక్కించుకున్నాడు. దాదాపు ఏడాది తర్వాత రీఎంట్రీ ఇచ్చిన ఈ టెస్టు కెప్టెన్.. టీ20 జట్టు వైస్ కెప్టెన్‌గానూ ఎంపికయ్యాడు.స్టాండ్ బై ప్లేయర్‌గా మాత్రమేజట్టు ప్రకటన సందర్భంగా టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ వ్యాఖ్యలను బట్టి.. ఒక ఓపెనర్‌గా అభిషేక్ శర్మ ఖరారు అయినట్లే. అతడికి జోడీగా సంజూను కాదని గిల్‌ను పంపే అవకాశాలే ఎక్కువ. ఇక ఈ మెగా ఈవెంట్‌కు ప్రకటించిన ప్రధాన జట్టులో యశస్వి జైస్వాల్‌కు చోటు దక్కనే లేదు. అతడు స్టాండ్ బై ప్లేయర్‌గా మాత్రమే ఎంపికయ్యాడు.ఓపెనర్ల రేసులో ఊహించని పేర్లుఇక టీ20 ప్రపంచకప్-2026కు సన్నాహకంగా భావిస్తున్న ఆసియా కప్-2025 టోర్నీతో అభిషేక్- గిల్ టీమిండియా ఓపెనింగ్ జోడీగా దాదాపు ఖరారైనట్లే. ఈ నేపథ్యంలో భారత మాజీ బ్యాటర్ సురేశ్ రైనా మాత్రం భిన్నంగా స్పందించాడు. వచ్చే ఏడాది జరిగే పొట్టి ప్రపంచకప్ టోర్నీలో టీమిండియా ఓపెనర్ల రేసులో ఊహించని పేర్లు చెప్పాడు.ప్రియాన్ష్ ఆర్య కూడా ఓ ఆప్షన్!శుభంకర్ మిశ్రా పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ‘‘నాకు తెలిసి యశస్వి ఓ ఓపెనర్‌గా ఉండొచ్చు. అంతేకాదు ప్రియాన్ష్ ఆర్యపై కూడా సెలక్టర్లు దృష్టి సారించవచ్చు. ఇక అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ ఉండనే ఉన్నారు.ఇప్పటికే తమను తాము నిరూపించుకున్నారు. రుతురాజ్ గైక్వాడ్ కూడా రేసులో ఉండవచ్చు. అయితే, నా మొదటి ప్రాధాన్యం మాత్రం అభిషేక్ శర్మకే. ఇక కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ నియమితుడుకాడని చెప్పేందుకు పెద్ద కారణాలు లేవు’’ అని రైనా పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2025లో పంజాబ్ కింగ్స్ తరఫున అరంగేట్రం చేసిన ప్రియాన్ష్ ఆర్య 17 మ్యాచ్‌లలో కలిపి 475 పరుగులు సాధించాడు. ఇందులో ఓ సెంచరీ కూడా ఉండటం విశేషం. చదవండి: వైభవ్? ఆయుశ్ మాత్రే?.. అతడే ముందుగా టీమిండియాలోకి వస్తాడు! -
కెప్టెన్ అయ్యర్ గిల్ కు భారీ షాక్
-
టీమిండియాకు గుడ్ న్యూస్.. జ్వరం నుంచి కోలుకున్న వైస్ కెప్టెన్
టీమిండియా టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ వైరల్ ఫీవర్ కారణంగా దులీప్ ట్రోఫీ-2025కు దూరమైన సంగతి తెలిసిందే. ఈ దేశవాళీ టోర్నీలో నార్త్ జోన్‌గా కెప్టెన్‌గా గిల్ వ్యవహరించాల్సి ఉండేది. కానీ టోర్నీ ఆరంభానికి ముందు గిల్ జ్వరం బారిన పడ్డాడు.దీంతో వైద్యుల సూచన మెరకు ఈ రెడ్‌బాల్ క్రికెట్ ఈవెంట్‌ను గిల్ వైదొలిగాడు. ఇక సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానున్న ఆసియాకప్‌పై గిల్ దృష్టిసారించాడు. ఈ క్రమంలో శుబ్‌మన్ శుక్రవారం(ఆగస్టు 29) బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో చేరాడు.టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం.. గిల్ జ్వరం నుంచి కోలుకుని శిక్షణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. కాగా ఆసియాకప్‌కు ముందు ఆగస్టు 30 లేదా 31న కేఎల్ రాహుల్, రోహిత్ శర్మలతో కలిసి గిల్ ఫిట్నెస్ పరీక్షలను ఎదుర్కొంటాడని వార్తలు వచ్చాయి. కానీ గిల్ మాదిరే రాహుల్ కూడా వైరల్ ఫీవర్ బారిన పడినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. దీంతో రోహిత్ ఫిట్నెస్ పరీక్షను సెప్టెంబర్ 15 వాయిదా వేసినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. గిల్ ఆసియాకప్‌లో ఆడేందుకు వెళ్లనుండడంతో ఈ ఫిట్నెస్ టెస్టులో రాహుల్, రోహిత్ మాత్రమే పాల్గోనున్నారు.ఆసియాకప్ కోసం టీమిండియా సెప్టెంబర్ 4న దుబాయ్‌కు బయలు దేరనుంది. అయితే భారత జట్టు వేర్వేరు బ్యాచ్‌లగా యూఏఈ గడ్డపై అడుగపెట్టనున్నట్లు సమాచారం. గిల్ బెంగళూరు నుంచి నేరుగా దుబాయ్‌కు వెళ్లనున్నాడు. కాగా భారత టీ20 జట్టులో చాలా మంది సభ్యులు సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్‌లోనే ఉన్నారు. దుబాయ్‌కు చేరుకున్నాక వారం రోజుల పాటు ట్రైనింగ్ క్యాంపును టీమిండియా ఏర్పాటు చేయనుంది. ఇక ఖండాంతర టోర్నీలో భారత్ తమ తొలి మ్యాచ్‌లో సెప్టెంబర్ 10న యూఏఈతో తలపడనుంది. ఈ టోర్నీ కోసం భారత జట్టును బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. మెన్ ఇన్ బ్లూ కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ వ్యవహరించనుండగా.. అతడికి డిప్యూటీగా గిల్ ఎంపికయ్యాడు.ఆసియా కప్ 2025 కోసం భారత జట్టు..సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ (వికెట్‌కీపర్), జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజు శాంసన్ (వికెట్‌కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్చదవండి: అదొక అత్యంత వరెస్ట్ టెస్ట్.. ఆటగాళ్లకు కఠిన సవాల్: డివిలియర్స్ -
టాప్‌లో కొనసాగుతున్న గిల్.. భారీగా మెరుగుపడిన ఆసీస్ ప్లేయర్లు
ఐసీసీ ఇవాళ (ఆగస్ట్ 27) ప్రకటించిన వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ ఆటగాడు శుభ్‌మన్ గిల్ టాప్ ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. భారత ఆటగాళ్లు రోహిత్ శర్మ (2), విరాట్ కోహ్లి (4), శ్రేయస్ అయ్యర్ (8) టాప్-10లో కొనసాగుతున్నారు.గడిచిన వారంలో అద్భుతంగా రాణించిన ఆసీస్ ఆటగాళ్లు ర్యాంకింగ్స్‌ను భారీగా మెరుగుపర్చుకున్నారు. సౌతాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో సెంచరీలతో కదంతొక్కిన ట్రవిస్ హెడ్, మిచెల్ మార్ష్, కెమరూన్ గ్రీన్ వరుసగా ఒకటి, నాలుగు, 40 స్థానాలు మెరుగుపర్చుకుని 11, 44, 78 స్థానాలకు ఎగబాకారు. మరో ఆసీస్ ఆటగాడు జోస్ ఇంగ్లిస్ 23 స్థానాలు మెరుగుపర్చుకుని 64వ స్థానానికి చేరాడు.బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఆసీస్‌తో మూడో వన్డేలో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేని కేశవ్ మహారాజ్ టాప్ ర్యాంక్‌ను లంక స్పిన్నర్ మహీశ్ తీక్షణతో సంయుక్తంగా పంచుకున్నాడు. గత వారమే టాప్ ర్యాంక్‌కు చేరిన మహారాజ్ గడిచిన వారంలో ఎలాంటి రేటింగ్ పాయింట్లను సాధించకపోగా.. తీక్షణ పలు పాయింట్లు సాధించి టాప్ ప్లేస్‌కు చేరాడు. ప్రస్తుతం మహారాజ్, తీక్షణ ఖాతాలో 671 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడో స్థానంలో కొనసాగుతుండగా.. రవీంద్ర జడేజా తొమ్మిదో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. షమీ, సిరాజ్ తలో స్థానం మెరుగుపర్చుకుని 12, 13 స్థానాలకు చేరారు. ఈ వారం ర్యాంకింగ్స్‌లో చెప్పుకోదగ్గ రీతిలో లబ్ది పొందింది సౌతాఫ్రికా పేసర్ లుంగి ఎంగిడి, ఆసీస్ పేసర్లు నాథన్ ఇల్లిస్, సీన్ అబాట్. వీరిలో ఎంగిడి 6, ఇల్లిస్ 21, అబాట్ 9 స్థానాలు మెరుగుపర్చుకుని 28, 65, 48 స్థానాలకు ఎగబాకారు.ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. అజ్మతుల్లా ఒమర్జాయ్, మొహమ్మద్ నబీ, సికందర్ రజా టాప్-3లో కొనసాగుతుండగా.. టీమిండియా ఆటగాడు జడేజా తొమ్మిదో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. -
ఆసియాకప్‌లో టీమిండియా ఓపెనర్లు ఎవరు?
ఆసియాకప్-2025 సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో అబుదాబి వేదికగా అఫ్గానిస్తాన్-హాంకాంగ్ జట్లు తలపడనున్నాయి. ఈ టోర్నీలో పాల్గోనే అన్ని జట్లు తమ ఆస్త్ర శాస్త్రాలను సిద్దం చేసుకుంటున్నాయి.ఈ ఆసియా క్రికెట్ పోరు కోసం పాకిస్తాన్ ఇప్పటికే తమ సన్నహాకాలను ప్రారంభించనుంది. ఈ టోర్నీకి ముందు అఫ్గాన్, యూఏఈలతో ముక్కోణపు టీ20 పాక్ ఆడనుంది. మరోవైపు భారత జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగనుంది.ఆసియాకప్-2023(వన్డే ఫార్మాట్) ఫైనల్లో శ్రీలంకను ఓడించి భారత్ టైటిల్ సొంతం చేసుకుంది. ఈ సారి ఫార్మాట్ మారిన ఫలితం మాత్రం మారకూడదని టీమిండియా భావిస్తోంది. ఇప్పటికే ఈ ఖండాంతర టోర్నీ కోసం బీసీసీఐ భారత జట్టును సైతం ప్రకటించింది.ఈ జట్టుకు సూర్యకుమార్ యాదవ్ సారథ్యం వహించనున్నాడు. అంతేకాకుండా శుబ్‌మన్ గిల్ తిరిగి టీ20 జట్టులో వచ్చాడు. ఈ ఆసియా జెయింట్స్ పోరులో సూర్యకు డిప్యూటీగా గిల్ వ్యవహరించనున్నాడు. అయితే ఈ జట్టులో శ్రేయస్ అయ్యర్, యశస్వి జైశ్వాల్ చోటు దక్కకపోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. అద్బుతమైన ఫామ్‌లో ఉన్నప్పటికి సెలక్టర్లు వీరిని పరిగణలోకి తీసుకోలేదు ఇక ఈ మెగా టోర్నీలో భారత జట్టు తమ తొలి మ్యాచ్‌లో సెప్టెంబర్ 10న యూఏఈతో తలపడనుంది. అనంతరం సెప్టెంబర్ 14న దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో దాయాది పాకిస్తాన్‌తో తాడోపేడో టీమిండియా తేల్చుకోనుంది.టీమిండియా ఓపెనర్ ఎవరు?కాగా టోర్నీలో భారత తుది జట్టు కూర్పు అనేది టీమ్ మెనెజ్‌మెంట్‌కు ఒక పెద్ద సవాలుగా మారనుంది. ముఖ్యంగా ఓపెనర్ల విషయంలో కెప్టెన్ సూర్య, హెడ్ కోచ్ గంభీర్ మల్లగుల్లాలు పడక తప్పదు. ఒక ఓపెనర్‌గా అభిషేక్ శర్మ ఫిక్స్ అయినప్పటికి.. అతడికి భాగస్వామిగా ఎవరిని పంపిస్తారన్నది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. ఎందుకంటే మరో స్లాట్ కోసం శుబ్‌మన్ గిల్, సంజూ శాంసన్ ఇద్దరు పోటీలో ఉన్నారు. అయితే వీరిద్దరూ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నారు. గిల్ గత కాలంగా భారత టీ20 జట్టుకు దూరంగా ఉన్నప్పటికి ఐపీఎల్లో మాత్రం దుమ్ములేపాడు.ఐపీఎల్‌తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో కూడా ఓపెనర్‌గా అదరగొట్టాడు. ఓపెనర్‌గా గిల్ ఫామ్‌కు ఎటువంటి ఢోకా లేదు. మరోవైపు సంజూ కూడా ఓపెనర్‌గా అద్బుతంగా రాణిస్తున్నాడు. గౌతమ్ గంభీర్ ప్రధాన కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత శాంసన్ టీ20ల్లో ఓపెనర్‌గా తనదైన ముద్రవేసుకున్నాడు. అభిషేక్ శర్మతో కలిసి ఓపెనర్‌గా ఈ కేరళ క్రికెటర్ విజయవంతమయ్యాడు.శాంసన్ 16 ఇన్నింగ్స్‌లలో 34.78 సగటుతో 487 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి. కానీ బలమైన ఇంగ్లండ్ జట్టుపై మాత్రం ఈ కేరళ ఆటగాడు బ్యాట్ ఝూళిపించలేకపోయాడు. ఐదు ఇన్నింగ్స్‌లలో కేవలం 51 పరుగులు మాత్రమే చేశాడు.అందులో మూడు సింగిల్ డిజిట్ స్కోర్లు ఉన్నాయి. కానీ ఐపీఎల్లో మాత్రం సంజూ తన బ్యాట్‌కు పని చెప్పాడు. ప్రస్తుతం జరుగుతున్న కేరళ ప్రీమియర్ లీగ్‌లోనూ ఓపెనర్‌గా వచ్చి పరుగుల వరద పారిస్తున్నాడు. దీంతో ఇద్దరు కూడా సూపర్ ఫామ్‌లో ఉండడంతో భారత్ ఇన్నింగ్స్‌ను అభిషేక్‌తో కలిసి ఎవరు ప్రారంభిస్తారో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒకవేళ అభిషేక్, గిల్‌ను ఓపెనర్లగా పంపాలని నిర్ణయించుకుంటే శాంసన్‌కు తుది జట్టులో చోటు దక్కడం కష్టమే అని చెప్పాలి. ఎందుకంటే అతడికి మిడిలార్డర్లో అంత మంచి ట్రాక్ రికార్డు లేదు. సంజూకు బదులుగా జితేష్ శర్మ వికెట్ కీపర్‌గా ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వచ్చే అవకాశముంటుంది.ఆసియా కప్ 2025 కోసం భారత జట్టు..సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ (వికెట్‌కీపర్), జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజు శాంసన్ (వికెట్‌కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్చదవండి: ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన అశ్విన్ -
‘సిరాజ్‌ను ఆగమని నేనెలా చెప్తా.. గెలిస్తే చాలు దేవుడా అనుకున్నా’
టీమిండియా టెస్టు కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ (Shubman Gill)కు మంచి ఆరంభమే లభించింది. అతడి సారథ్యంలో ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 2-2తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఇరుజట్ల మధ్య జరిగిన ఈ ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీలో గిల్ 754 పరుగులు సాధించి.. టాప్ రన్ స్కోరర్‌గానూ నిలిచాడు.సిరాజ్.. సూపర్హిట్ఇక టీమిండియా ఇంగ్లండ్‌తో సిరీస్‌ను సమం చేసుకోవడంలో పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj)ది కీలక పాత్ర. ముఖ్యంగా ఆఖరిదైన ఓవల్ టెస్టులో చివరి రోజు ఈ హైదరాబాదీ బౌలర్ అద్భుతమే చేశాడు. విజయానికి ఇంగ్లండ్ 35 పరుగులు.. భారత్ నాలుగు వికెట్ల దూరంలో ఉన్న వేళ.. ప్రసిద్ కృష్ణ (Prasidh Krishna) ఒక వికెట్ తీయగా... సిరాజ్ మూడు వికెట్లు కూల్చి టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు.అయితే, ఐదో టెస్టు ఆఖరి రోజు ఇంగ్లండ్ తొమ్మిదో వికెట్ కోల్పోగానే.. భుజం విరిగినప్పటికీ టెయిలెండర్ క్రిస్ వోక్స్ బ్యాటింగ్‌కు వచ్చాడు.అప్పటికి క్రీజులో ఉన్న అట్కిన్సన్ వోక్స్‌కు ఇబ్బంది కలగకుండా తానే సింగిల్స్ తీస్తూ.. ఓవర్ ముగిసే సరికి తానే క్రీజులోకి వచ్చేలా చూసుకున్నాడు.రనౌట్ ప్లాన్ఈ క్రమంలో కెప్టెన్ గిల్‌తో కలిసి సిరాజ్ ఈ జోడీని రనౌట్ చేయాలని ప్రణాళిక రచించారు. ఇందుకు అనుగుణంగా నాటి మ్యాచ్ 84 ఓవర్లో వైడ్ యార్కర్ వేయాలని వీరు ప్లాన్ చేశారు. ఇక సిరాజ్ సంధించిన డెలివరీని మిస్సయినప్పటికీ.. అట్కిన్సన్ సింగిల్ తీసేందుకు వెళ్లాడు. అయితే, వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ మాత్రం సరైన సమయంలో బంతిని అందుకోలేకపోయాడు.దీంతో రనౌట్ ఛాన్స్ మిస్ కాగా.. గిల్‌పై సిరాజ్ కాస్త అసహనం వ్యక్తం చేశాడు. జురెల్‌కు ముందే మన ప్లాన్ చెప్పి ఉండవచ్చు కదా అని అన్నాడు. విజయానంతరం గిల్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించాడు. ఇక ధ్రువ్ జురెల్ కూడా తాజా ఈ విషయంపై స్పందించాడు.సిరాజ్‌ను ఆగమని నేనెలా చెప్తా‘‘ఆరోజు అంతా త్వరత్వరగా జరిగిపోయింది. మా వాళ్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. బాల్ బాగా స్వింగ్ అవుతోంది. అప్పుడు నా కుడివైపు.. గిల్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్నాడు. ‘యార్.. సిరాజ్ ఇప్పుడు వైడ్ యార్కర్ వేయబోతున్నాడు’ అని నాతో చెప్పాడు.అయితే, నేను బదులిచ్చేలోపే సిరాజ్ బౌలింగ్ వేసేందుకు తన పరుగు మొదలుపెట్టాడు. అప్పుడు.. ‘నువ్వు కాస్త ఆగు’ అని సిరాజ్‌కు చెప్పడం సరికాదనిపించింది. నేను కుదురుకునేలోపే సిరాజ్ బంతి వేయడం.. బ్యాటర్లు పరుగుకు వెళ్లడం జరిగిపోయింది.గెలిస్తే చాలు దేవుడా అనుకున్నానిజానికి అది రనౌట్ కావాల్సింది. కానీ.. నా చేతుల్లో గ్రిప్ అంతగా లేదు. సరైన సమయంలో స్పందించలేకపోయాను. అప్పుడు ఒకటే అనుకున్నా.. ‘దేవుడా.. ఎలాగైనా మమ్మల్ని ఈ మ్యాచ్‌లో గెలిపించు’’ అని ప్రార్థించా.ఆరోజు రనౌట్ చేసేందుకు నాకు మంచి అవకాశం ఉంది. కానీ నేను మిస్సయిపోయా. ఏదేమైనా సిరాజ్ ఆరోజు అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మేము కచ్చితంగా మ్యాచ్ గెలుస్తామని అనుకున్నాం. అనుకున్నదే జరిగింది’’ అని ధ్రువ్ జురెల్ పేర్కొన్నాడు. వివేక్ సేతియా పాడ్‌కాస్ట్‌లో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చేదికాగా రనౌట్ ప్రమాదం నుంచి అట్కిన్సన్- వోక్స్ తప్పించుకునే సమయానికి ఇంగ్లండ్ విజయానికి కేవలం ఎనిమిది పరుగుల దూరంలో ఉంది. ఒకవేళ జురెల్ రనౌట్ మిస్ చేసిన తర్వాత.. సిరాజ్ అట్కిన్సన్ను బౌల్డ్ చేయకపోయి ఉంటే టీమిండియా భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చేది. ఎట్టకేలకు ఆఖరికి ఆరు పరుగుల తేడాతో ఓవల్‌లో గెలిచి 2-2తో సిరీస్‌ను సమం చేయగలిగింది.చదవండి: ఛతేశ్వర్ పుజారా నెట్‌వర్త్ ఎంతో తెలుసా? -
గిల్ దెబ్బకు ఆ ఇద్దరూ అబ్బా!
-
లార్డ్స్‌లో విరాట్ కోహ్లి.. ఆ సిరీస్‌కు సన్నద్ధం.. సెలక్టర్లకు మెసేజ్!
వన్డే వరల్డ్‌కప్-2027 వరకు టీమిండియా దిగ్గజాలు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma) ఆటలో కొనసాగుతారా?.. ఈ ఇద్దరి పేర్లను మెగా ఐసీసీ టోర్నీకి బీసీసీఐ (BCCI) సెలక్టర్లు పరిగణిస్తున్నారా? లేదా?.. భారత క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం ఇదో హాట్‌టాపిక్.ఇటీవల ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ నుంచి విరాట్, రోహిత్ పేర్లు మాయంకావడం.. ఆ తర్వాత తప్పును సరిదిద్దుకున్న ఐసీసీ మళ్లీ వారి పేర్లను చేర్చడం.. వన్డే రిటైర్మెంట్ వార్తలకు ఊతమిచ్చింది. ఇలాంటి తరుణంలో విరాట్, రోహిత్.. ఇద్దరూ తిరిగి ప్రాక్టీస్ మొదలుపెట్టడం ద్వారా వదంతులకు చెక్ పెట్టేశారు.లార్డ్స్ మైదానంలో ప్రాక్టీస్ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా వన్డే సిరీస్‌కు తాము సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చారు. కాగా ప్రస్తుతం లండన్‌లో ఉన్న విరాట్ కోహ్లి.. తాజాగా ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో నెట్ ప్రాక్టీస్ చేయడం విశేషం. ఈ కుడిచేతి వాటం బ్యాటర్ దాదాపు రెండు గంటల పాటు నెట్స్‌లో తీవ్రంగా శ్రమించినట్లు సమాచారం.స్పిన్, పేస్ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటూ... వైవిధ్యభరితమైన షాట్లు ఆడుతూ కోహ్లి తన ప్రాక్టీస్ సెషన్‌ను పూర్తిచేసినట్లు తెలిసింది. ఇక ప్రాక్టీస్‌కు వెళ్లిన సమయంలో లార్డ్స్ స్టేడియంలో అభిమానులతో కలిసి కోహ్లి ఫొటోలకు ఫోజులిచ్చాడు.భారత్-ఎ తరఫునమరోవైపు.. రోహిత్ శర్మ కూడా ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టగా.. మరో అనూహ్య నిర్ణయం కూడా తీసుకున్నట్లు సమాచారం. ఆస్ట్రేలియా-ఎ జట్టుతో స్వదేశంలో జరుగబోయే అనధికారిక వన్డే సిరీస్‌లో భారత్-ఎ తరఫున ఆడాలని రోహిత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.కాగా టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఇక ఇటీవల టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు ముందే రోహిత్ టెస్టులకు కూడా గుడ్‌బై చెప్పగా.. ఆ వెంటనే కోహ్లి కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే, ఈ ఇద్దరూ వన్డేల్లో మాత్రం కొనసాగుతామని స్పష్టం చేశారు.ఆసీస్ సిరీస్‌తో కోహ్లి, రోహిత్ రీ ఎంట్రీఇక రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత టీ20లలో సూర్యకుమార్ యాదవ్, టెస్టుల్లో శుబ్‌మన్ గిల్ టీమిండియా పగ్గాలు చేపట్టారు. గిల్ సారథ్యంలో ఇంగ్లండ్ గడ్డ మీద ఐదు టెస్టుల సిరీస్‌ను 2-2తో సమం చేసిన భారత్.. తదుపరి యూఏఈ వేదికగా సూర్య కెప్టెన్సీలో ఆసియా టీ20 కప్-2025 టోర్నీ ఆడనుంది. సెప్టెంబరు 9-28 వరకు జరిగే ఈ ఖండాంతర టోర్నీ అనంతరం స్వదేశంలో వెస్టిండీస్‌తో టెస్టులు ఆడుతుంది భారత జట్టు. ఆ తర్వాత అక్టోబరులో ఆస్ట్రేలియా పర్యటనలో పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడనుంది. చదవండి: Asia Cup 2025: అదొక వింత నిర్ణయం.. కెప్టెన్ అయ్యే ప్లేయర్‌ను జట్టు నుంచి తీసేస్తారా?రోహిత్, విరాట్ కోహ్లి రిటైర్మెంట్!? .. బీసీసీఐ ఉపాధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు -
ఆ టోర్నీ నుంచి శుబ్‌మన్ గిల్ ఔట్.. కెప్టెన్ ఎవరంటే?
టీమిండియా టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 28న ప్రారంభమయ్యే దులీప్ ట్రోఫీ-2025కు గిల్ దూరంగా ఉండనున్నట్లు సమాచారం. ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను డ్రాగా ముగించిన అనంతరం గిల్‌ను నార్త్ జోన్ కెప్టెన్‌గా సెలెక్టర్లు నియమించారు.వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు సన్నహాకాల్లో భాగంగా ఈ పంజాబ్ బ్యాటర్ దులీప్ ట్రోఫీలో ఆడుతారని అంతా భావించారు. ఆసియాకప్-2025కు గిల్ ఎంపికైనప్పటికి దులీప్ ట్రోఫీలో ఒక మ్యాచ్ ఆడనున్నాడని వార్తలు వచ్చాయి.ఇప్పుడు ఆ ఒక్క మ్యాచ్‌కు కూడా గిల్ దూరం కానున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. గిల్ ప్రస్తుతం కాస్త అనారోగ్యంతో బాధపడతున్నట్లు వినికిడి. ఈ క్రమంలో ఫిజియోలు, వైద్య బృందం శుబ్‌మన్ బ్లడ్ టెస్టు రిపోర్ట్స్‌ను బోర్డుకు సమర్పించి, అతడిని దులీప్ ట్రోఫీ జట్టు నుంచి తప్పించాలని సూచించినట్లు దైనిక్ జాగరన్ తమ రిపోర్ట్‌లో పేర్కొంది. నార్త్ జోన్ వైస్ కెప్టెన్‌గా ఎంపికైన అంకిత్ కుమార్ గిల్ స్ధానంలో జట్టు పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది. అయితే గిల్ దులీప్ ట్రోఫీ నుంచి తప్పుకొన్నప్పటికి.. ఆసియాకప్‌కు మాత్రం అందుబాటులో ఉండనున్నాడు.కాగా దులీప్ ట్రోఫీ తొలి క్వార్టర్ ఫైనల్లో నార్త్‌జోన్ బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్ వేదికగా ఈస్ట్‌జోన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఆగస్టు 28 నుంచి 31 వరకు జరగనుంది. ఇక గిల్ ఇంగ్లండ్ గడ్డపై అదరగొట్టాడు. కెప్టెన్‌గా, వ్యక్తిగత ప్రదర్శనపరంగా అందరిని ఆకట్టుకున్నాడు. ఐదు మ్యాచ్‌ల ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో 75.40 సగటుతో 754 పరుగులు చేసి గిల్ ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్‌గా నిలిచాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన రెండో టెస్టులో గిల్(261) ఏకంగా డబుల్ సెంచరీతో చెలరేగాడు. అదే మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 161 పరుగులు చేశాడు. ఒక టెస్టు మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో ప్లేయర్‌గా గిల్(430) నిలిచాడు.దులిప్ ట్రోఫీ-2025కి నార్త్‌జోన్ జట్టు ఇదేశుభమ్ ఖజురియా, అంకిత్ కుమార్ ( కెప్టెన్), ఆయుష్ బదోని, యశ్ ధుల్, అంకిత్ కల్సి, నిశాంత్ సింధు, సాహిల్ లోత్రా, మయాంక్ దాగర్, యుధ్వీర్ సింగ్ చరక్, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, అన్షుల్ కాంబోజ్, ఆకిబ్ నబీ, కన్హయ్య వాధావాన్.చదవండి: ఆసియాకప్-2025కు హాంకాంగ్ జట్టు ప్రకటన.. -
Asia Cup 2025: సంజూ శాంసన్ కీలక నిర్ణయం!
ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్ ఆడే జట్టులో ఎట్టకేలకు సంజూ శాంసన్‌కు చోటు దక్కింది. సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) కెప్టెన్సీలో పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టుకు ఈ కేరళ స్టార్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. ఇక.. ఈ టోర్నీ ద్వారానే శుబ్‌మన్ గిల్ అంతర్జాతీయ టీ20లలో రీఎంట్రీ ఇస్తున్నాడు. ఫస్ట్ ఛాయిస్ అతడేఅంతేకాదు.. వైస్ కెప్టెన్ స్థాయిలో గిల్ (Shubman Gill) జట్టులోకి వచ్చాడు. అతడి గైర్హాజరీలో ఇన్నాళ్లూ ఓపెనర్‌గా ఉన్న సంజూ శాంసన్‌కు ఇది తలనొప్పిగా మారింది. మొదటి ప్రాధాన్య ఓపెనర్‌గా అభిషేక్ శర్మకు పెద్ద పీట వేస్తామని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ బహిరంగంగానే వెల్లడించాడు.అంతేకాదు.. గిల్, యశస్వి జైస్వాల్ లేరు కాబట్టే సంజూను ఓపెనర్‌గా పంపించామని అగార్కర్ స్పష్టం చేశాడు. దీనిని బట్టి కేవలం వికెట్ కీపర్ బ్యాటర్‌గా మాత్రమే సంజూకు జట్టులో స్థానం ఇచ్చారన్నది సుస్పష్టం. కీపర్ కోటాలో జితేశ్ శర్మ కూడా ఉన్నందున సంజూ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది.తుదిజట్టులో సంజూ ఉండకపోవచ్చుఈ నేపథ్యంలో భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ సంజూను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘శుబ్‌మన్ గిల్ జట్టులోకి తిరిగి వచ్చాడు. అంతేకాదు.. అతడు ఇప్పుడు వైస్ కెప్టెన్ కూడా!.. కాబట్టి సంజూ శాంసన్ ప్లేస్ డేంజర్లో ఉన్నట్లే!గిల్‌ను ఓపెనర్‌గా పంపుతారు కాబట్టి సంజూకు భంగపాటు తప్పదు. ఒకవేళ.. సంజూ కోసం గిల్‌ను మూడో స్థానంలో పంపుతారా? అంటే అది కుదరని పని’’ అని అశూ అభిప్రాయపడ్డాడు. ఇలాంటి తరుణంలో సంజూ చేసిన పని క్రికెట్ వర్గాల్లో చర్చకు దారితీసింది.సంజూ కీలక నిర్ణయంఆసియా కప్ సన్నాహకాల్లో భాగంగా సంజూ ప్రస్తుతం కేరళ క్రికెట్ లీగ్ ఆడుతున్నాడు. ఈ టీ20 టోర్నీలో కొచ్చి బ్లూ టైగర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న సంజూ.. ఓపెనర్‌గా రావాల్సి ఉంది. అయితే, అదానీ త్రివేండ్రం రాయల్స్‌తో గురువారం నాటి మ్యాచ్‌లో మాత్రం అతడు ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చేందుకు సిద్ధపడ్డాడు.ఐదో స్థానంలో బ్యాటింగ్!ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టైగర్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుని.. రాయల్స్ జట్టును 97 పరుగులకే కట్టడి చేసింది. ఇక లక్ష్య ఛేదనలో 59 బంతులు మిగిలి ఉండగానే ఎనిమిది వికెట్ల తేడాతో టైగర్స్ జయభేరి మోగించింది. దీంతో సంజూ బ్యాటింగ్‌కు రావాల్సిన అవసరమే లేకుండా పోయింది.ఏదేమైనా తన బ్యాటింగ్ స్థానాన్ని డిమోట్ చేసుకోవడం ద్వారా.. ఆసియా కప్ టోర్నీలో ఏ స్థానంలో వచ్చేందుకైనా తాను సిద్ధంగా ఉన్నట్లు సంజూ మేనేజ్మెంట్కు సంకేతాలు ఇచ్చినట్లయింది. కాగా సెప్టెంబరు 9-28 వరకు యూఏఈ వేదికగా ఆసియా కప్ టోర్నీ జరుగుతుంది.చదవండి: నా బెస్ట్ కెప్టెన్ అతడే.. ధోనికి కూడా అంత సులువుగా ఏదీ రాలేదు: ద్రవిడ్ -
టాప్-10లో ఉన్నా ఏం ప్రయోజనం.. టాప్-40లో కూడా లేని ఆటగాడికి అవకాశం
ఆసియా కప్ 2025 కోసం ప్రకటించిన భారత జట్టులో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు చోటు దక్కకపోవడం అందరినీ బాధిస్తుంది. జైస్వాల్‌ను కాదని భారత సెలెక్టర్లు శుభ్‌మన్ గిల్‌వైపు మొగ్గు చూపడం కరెక్ట్ కాదని చాలా మంది భావిస్తున్నారు. ఎందుకంటే, గిల్ అంతర్జాతీయ టీ20 ఆడి ఏడాది దాటిపోయింది. అయినా టెస్ట్ జట్టు కెప్టెన్ అని, ఆ ఫార్మాట్లలో ఇటీవల అద్భుతంగా రాణించాడని అతన్ని ఆసియా కప్ జట్టుకు ఎంపిక చేశారు. ఇంతటితో ఆగకుండా వైస్ కెప్టెన్‌ను కూడా చేశారు.జైస్వాల్ పరిస్థితి అది కాదు. ఇతగాడు గత ఏడాది కాలంగా భారత టీ20 ఫార్మాట్లో రెగ్యులర్ సభ్యుడిగా ఉన్నాడు. గత 9 ఇన్నింగ్స్‌ల్లో 3 అర్ద సెంచరీలు చేసి రాణించాడు. పైగా టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్-10లో (10) ఉన్నాడు.ఆసియా కప్ జట్టులో ఉండేందుకు ఇన్ని అర్హతలు ఉన్నా.. గిల్లా బీసీసీఐ పెద్దల అండదండలు లేకపోవడం జైస్వాల్‌కు మైనస్ అయ్యింది. అందుకే అతడికి ఆసియా కప్ జట్టులో చోటు దక్కలేదు.జైస్వాల్ @10.. గిల్ @41ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో జైస్వాల్ 10వ స్థానంలో ఉండగా.. చాలాకాలంగా పొట్టి ఫార్మాట్‌కు దూరంగా ఉన్న గిల్ 41వ స్థానంలో కొనసాగుతున్నాడు. జైస్వాల్-గిల్ మధ్య ఈ ర్యాంకింగ్స్ వ్యత్యాసం చూసిన తర్వాత కొందరు భారత అభిమానులు వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. టాప్-10లో ఉన్నా ఏం ప్రయోజనం.. టాప్-40లో కూడా లేని ఆటగాడికి అవకాశం దక్కిందంటూ కామెంట్లు చేస్తున్నారు. ర్యాంకింగ్స్ విషయంలో గిల్‌తో పోలిస్తే జైస్వాల్‌కు ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే.. టెస్ట్‌ల్లో, టీ20ల్లో టాప్-10 ఉన్న ఏకైక బ్యాటర్ జైస్వాల్ ఒక్కడే. టీ20 ర్యాంకింగ్స్‌లో 10వ స్థానంలో ఉన్న జైస్వాల్.. టెస్ట్‌ల్లో 5వ స్థానంలో ఉన్నాడు. గిల్ విషయానికొస్తే.. వన్డేల్లో నంబర్ వన్‌గా కొనసాగుతున్న ఇతగాడు, టెస్ట్‌ల్లో 13వ స్థానంలో ఉన్నాడు. -
Asia Cup: అద్భుతమైన ఎంపిక: సెలక్టర్లపై గావస్కర్ ప్రశంసలు
టీమిండియా సెలక్టర్లపై భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ (Sunil Gavaskar) ప్రశంసలు కురిపించాడు. టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill)ను తిరిగి టీ20 జట్టులోకి పిలిపించి గొప్ప పనిచేశారని కొనియాడాడు. టీమిండియా టీ20 భవిష్యత్ కెప్టెన్‌గా గిల్ చుట్టూ ఇప్పటి నుంచే జట్టును తయారు చేయాలని సూచించాడు.అక్షర్‌ను తప్పించి గిల్‌కు వైస్ కెప్టెన్సీఆసియా కప్-2025 టోర్నమెంట్‌కు బీసీసీఐ మంగళవారం తమ జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్‌గా కొనసాగించిన యాజమాన్యం.. అక్షర్ పటేల్ (Axar Patel)ను మాత్రం వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించింది. అంతర్జాతీయ టీ20లకు ఏడాది కాలంగా దూరంగా ఉన్న టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌తో అక్షర్ స్థానాన్ని భర్తీ చేసింది.గొప్ప, అద్భుతమైన ఎంపికఈ నేపథ్యంలో గిల్‌ను వైస్ కెప్టెన్ చేయడంపై బీసీసీఐ తీరుపై విమర్శలు వస్తుండగా.. సునిల్ గావస్కర్ మాత్రం భిన్నంగా స్పందించాడు. ‘‘దాదాపు రెండు వారాల క్రితం.. ఇంగ్లండ్ గడ్డ మీద అతడు 750కి పైగా పరుగులు సాధించాడు.అద్భుతమైన ఫామ్‌లో ఉన్న అలాంటి ఆటగాడిని ఎలా విస్మరించగలరు. అంతేకాదు.. అతడికి వైస్ కెప్టెన్సీ కూడా ఇచ్చారు. దీనిని బట్టి అతడే భవిష్యత్తులో టీ20 జట్టుకు కెప్టెన్ అవుతాడని స్పష్టం చేశారు. నా దృష్టిలో ఇది చాలా చాలా గొప్ప, అద్భుతమైన ఎంపిక’’ అంటూ సెలక్టర్లపై ప్రశంసల జల్లు కురిపించాడు గావస్కర్.టీ20 భవిష్యత్ సారథిఈ సందర్భంగా జింబాబ్వే పర్యటనలో గిల్ టీ20 జట్టును ముందుకు నడిపించిన తీరును గావస్కర్ ప్రస్తావించాడు. ‘‘టీమిండియా 2024లో టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత జింబాబ్వే పర్యటనలో గిల్ కెప్టెన్‌గా రాణించాడు. ఇక ఇటీవల ఇంగ్లండ్‌లోనూ టెస్టు కెప్టెన్‌గా ఆకట్టుకున్నాడు.బ్యాటర్‌గానూ అత్యుత్తమ ప్రదర్శనతో టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. దీనిని బట్టి అతడు ఒత్తిడిని అధిగమిస్తూ.. ఆటగాడిగానూ ఎలా రాణించగలడో మనం అర్థం చేసుకోవచ్చు. టీ20లలోనూ అతడే కెప్టెన్ అవుతాడు’’ అని గావస్కర్ గిల్‌ను కొనియాడాడు. కాగా ఈసారి టీ20 ఫార్మాట్లో జరిగే ఆసియా కప్ టోర్నీకి సెప్టెంబరు 9- 28 వరకు షెడ్యూల్ ఖరారైంది.ఆసియా కప్ టీ20-2025 టోర్నమెంట్‌కు బీసీసీఐ ప్రకటించిన జట్టుసూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్.రిజర్వు ప్లేయర్లు: ప్రసిద్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్.చదవండి: ‘ఆసియా కప్ ఆడకపోయినా.. వరల్డ్‌కప్ జట్టులో శ్రేయస్ తప్పక ఉంటాడు’ -
ఆ ముగ్గురు ఎందుకు?.. ఈ జట్టుతో కప్ గెలవలేరు: భారత మాజీ కెప్టెన్ ఫైర్
ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఎంపిక చేసిన జట్టుపై టీమిండియా మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ పెదవి విరిచాడు. రోజురోజుకు మెరుగుపడాల్సి పోయి.. జట్టు తిరోగమనంలో పయనించేలా సెలక్టర్ల నిర్ణయం ఉందంటూ విమర్శించాడు.ఇలాంటి జట్టుతో ఆసియా కప్ గెలిచే అవకాశం ఉంటుందేమో గానీ.. టీ20 ప్రపంచకప్ టోర్నీలో మాత్రం అస్సలు గెలవలేరని చిక్కా ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహించే ఆసియా కప్ ఈవెంట్‌కు బీసీసీఐ మంగళవారం తమ జట్టును ప్రకటించింది.అక్షర్‌పై ‘వేటు’.. గిల్ రీ ఎంట్రీసూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav)ను కెప్టెన్‌గా కొనసాగిస్తూ.. రీఎంట్రీలో శుబ్‌మన్ గిల్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించింది. దీంతో దాదాపు ఏడాది కాలంగా సూర్య డిప్యూటీగా ఉన్న అక్షర్ పటేల్ (Axar Patel)కు భంగపాటు తప్పలేదు. మరోవైపు.. సూపర్ ఫామ్‌లో ఉన్న శ్రేయస్ అయ్యర్‌కు మరోసారి మొండిచేయి చూపిన సెలక్టర్లు.. యశస్వి జైస్వాల్‌ను స్టాండ్ బై ప్లేయర్‌గా మాత్రమే ఎంపిక చేశారు.సిరాజ్‌కు దక్కని చోటుఇక ఈ జట్టులో హైదరాబాదీ స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు చోటు దక్కలేదు. అయితే, యువ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణాతో పాటు.. ఇటీవలి కాలంలో అంతగా ఆకట్టుకోని శివం దూబే, రింకూ సింగ్‌లను కూడా సెలక్టర్లు ఆసియా కప్ టోర్నీకి ఎంపిక చేశారు. ఈ పరిణామాలపై మాజీ చీఫ్ సెలక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ స్పందించాడు.ఈ జట్టుతో వరల్డ్ కప్ గెలవలేరు‘‘ఈ జట్టుతో మనం మహా అయితే ఆసియా కప్ గెలుస్తామేమో!.. కానీ ఇదే జట్టును కొనసాగిస్తే టీ20 ప్రపంచకప్ మాత్రం గెలవలేము. మీరు ఈ జట్టును వరల్డ్‌కప్ టోర్నీకి తీసుకెళ్తారా?.. ఐసీసీ టోర్నీకి ఆరు నెలల సమయం మాత్రమే ఉంది. మరి మీ సన్నాహకాలు మాత్రం సరైన విధంగా లేవు.ఎవరైనా ముందుకు వెళ్లాలని అనుకుంటారు. కానీ మీరు జట్టును తిరోగమనంలో పయనించేలా చేస్తున్నారు. అక్షర్ పటేల్‌ను వైస్ కెప్టెన్సీ నుంచి ఎందుకు తొలగించారు?.. రింకూ సింగ్, శివం దూబే, హర్షిత్ రాణాను ఎందుకు ఎంపిక చేశారో తెలియదు.ఐపీఎల్ ప్రదర్శన మాత్రమే జాతీయ జట్టు ఎంపికకు ప్రామాణికం అని భావిస్తే.. మరి వీళ్లను ఎలా సెలక్ట్ చేసినట్లు?.. అసలు ఈ జట్టులో ఎవరు ఐదో స్థానంలో బ్యాటింగ్ చేస్తారు?ఆ ముగ్గురు ఎందుకు?వికెట్ కీపర్లుగా ఉన్న సంజూ శాంసన్, జితేశ్ శర్మ.. లేదంటే శివం దూబే, రింకూ సింగ్‌లలో ఒకరు ఐదో నంబర్ బ్యాటర్‌గా వస్తారా? సాధారణంగా హార్దిక్ పాండ్యా ఆ స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. ఇక అక్షర్ ఆరో స్థానంలో బ్యాటింగ్ చేయలేడు.మరి ఈ దూబేను ఎందుకు సెలక్ట్ చేశారో అర్థం కావడం లేదు. యశస్వి జైస్వాల్ అంతర్జాతీయ క్రికెట్లో, ఐపీఎల్లో అదరగొడుతున్నాడు. ఇంతకంటే ఇంకేం చేస్తే అతడిని జట్టుకు ఎంపిక చేసేవారు?’’ అంటూ చిక్కా సెలక్టర్ల తీరును ఎండగడుతూ.. ప్రశ్నల వర్షం కురిపించాడు. కాగా చివరగా ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో దూబే ఐదు మ్యాచ్‌లలో కలిపి 83 పరుగులు చేయగా.. రింకూ రెండు ఇన్నింగ్స్ ఆడి 39 రన్స్ చేశాడు.చదవండి: అప్పుడు గిల్ లేడు కాబట్టే సంజూ ఓపెనర్.. కానీ ఇప్పుడు: అగార్కర్ -
వైస్ కెప్టెన్‌గా గిల్
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో బ్యాటర్‌గా అసాధారణ ప్రదర్శన కనబర్చడంతో పాటు నాయకుడిగా కూడా సత్తా చాటిన శుబ్‌మన్ గిల్ ఇప్పుడు టి20ల్లో కూడా పునరాగమనం చేశాడు. దాదాపు ఏడాది కాలంగా ఈ ఫార్మాట్‌కు దూరంగా ఉన్న గిల్‌ను ఇప్పుడు జట్టులోకి ఎంపిక చేయడంతో పాటు వైస్ కెప్టెన్సీ కూడా ఇచ్చి భవిష్యత్తులో అతడిని అన్ని ఫార్మాట్లలో సారథిగా చూడాలనుకుంటున్నట్లు బీసీసీఐ సందేశం ఇచ్చింది. వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత బుమ్రా మళ్లీ టి20ల్లో ఆడనుండగా... అనూహ్యంగా హర్షిత్ రాణా, జితేశ్ శర్మలకు చోటు దక్కింది. ఐపీఎల్లో అద్భుతంగా ఆడిన శ్రేయస్ అయ్యర్, ఫామ్‌లో ఉన్న యశస్వి జైస్వాల్‌లను కూడా ఎంపిక చేయకుండా ఆసియా కప్ కోసం టీమిండియాను సెలక్టర్లు ప్రకటించారు.ముంబై: ఆసియా కప్ టి20 టోర్నీలో పాల్గొనే భారత పురుషుల క్రికెట్ జట్టును అజిత్ అగార్కర్ నాయకత్వంలో సెలక్షన్ కమిటీ మంగళవారం ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని 15 మంది సభ్యుల జట్టుకు శుబ్‌మన్ గిల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. మరో ఐదుగురు ఆటగాళ్లను రిజర్వ్‌లుగా ఎంపిక చేశారు.సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో ఆసియా కప్ టోర్నీ జరుగుతుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి–మార్చిలో భారత్‌లో జరిగే టి20 వరల్డ్ కప్‌కు ముందు టీమిండియా దాదాపు 20 మ్యాచ్‌లు ఆడనుంది. దీనిని దృష్టిలో ఉంచుకుంటూ జట్టును ఎంపిక చేశారు. కీపర్‌గా జితేశ్‌కు చాన్స్... శుబ్‌మన్ గిల్ ఏడాది క్రితం తన చివరి టి20 ఆడాడు. శ్రీలంకతో జరిగిన ఆ సిరీస్‌లో అతను వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే ఆ తర్వాత టెస్టులు, వన్డేల కారణంగా టి20లు ఆడలేదు. ఇప్పుడు తాజాగా ఇంగ్లండ్‌తో టెస్టుల్లో చూపించిన ఫామ్‌తో పాటు ఐపీఎల్లో కూడా రాణించడంతో సెలక్టర్లు అతడిని మళ్లీ జట్టులోకి తీసుకొచ్చారు. ఇప్పటికే వన్డే జట్టుకు కూడా వైస్ కెప్టెన్‌గా ఉన్న అతను మున్ముందు కెప్టెన్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దూకుడు మీదున్న అభిషేక్ శర్మతో కలిసి అతను ఓపెనింగ్ చేస్తాడు. గిల్ రాకతో తుది జట్టులో సంజు సామ్సన్‌కు చోటు దక్కడం కష్టమే. అందుకే ఫినిషింగ్‌కు తగినవాడిగా భావిస్తూ వికెట్ కీపర్‌గా జితేశ్ శర్మను ఎంపిక చేశారు. బ్యాటింగ్‌లో నిలకడగా రాణిస్తున్న హైదరాబాద్ ప్లేయర్ తిలక్ వర్మకు ఢోకా లేకుండా పోయింది. వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత టి20లు ఆడని బుమ్రా, కుల్దీప్ ఈ కీలక టోర్నీతో మళ్లీ బరిలోకి దిగుతున్నారు. ఇతర బౌలర్లు వరుణ్ చక్రవర్తి, అర్‡్షదీప్ సింగ్ మరో చర్చకు తావు లేకుండా జట్టులో నిలిచారు. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, శివమ్ దూబేల రూపంలో ముగ్గురు ఆల్‌రౌండర్లు జట్టులో ఉన్నారు. హర్షిత్‌కు మరో అవకాశం ఐపీఎల్లో 604 పరుగులు సాధించడంతో పాటు పంజాబ్‌ను ఫైనల్‌కు చేర్చిన శ్రేయస్ అయ్యర్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. ఈ ఫార్మాట్లో సెలక్టర్లు అతనిపై నమ్మకం ఉంచట్లేదు. అభిషేక్ మెరుపు బ్యాటింగ్ కారణంగా జైస్వాల్‌ను పక్కన పెట్టాల్సి వచ్చింది. ఇప్పటికే ముగ్గురు స్పిన్నర్లు ఉండటంతో సుందర్‌ను కూడా ఎంపిక చేయకుండా స్పెషలిస్ట్ బ్యాటర్‌గా రింకూ సింగ్‌ను తీసుకున్నారు. పేసర్ హర్షిత్ రాణా ఎంపిక మాత్రం అనూహ్యం. ఏకైక టి20 ఆడిన అతను ఐపీఎల్‌లోనూ రాణించలేదు. అయితే ప్రసిధ్ కృష్ణతో పోలిస్తే కాస్త బ్యాటింగ్ చేయగలగడం అతనికి సానుకూలంగా మారింది. భారత టి20 జట్టు: సూర్యకుమార్ (కెప్టెన్), గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్, సామ్సన్, తిలక్, దూబే, హార్దిక్, జితేశ్, అక్షర్, రింకూ సింగ్, కుల్దీప్, హర్షిత్, బుమ్రా, అర్ష్ దీప్, వరుణ్ చక్రవర్తి. రిజర్వ్: ప్రసిధ్ కృష్ణ, సుందర్, రియాన్ పరాగ్, జురేల్, యశస్వి జైస్వాల్. ఇంగ్లండ్‌లో మా అంచనాలకు మించి రాణించి గిల్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. నాయకత్వ లక్షణాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గిల్, జైస్వాల్ లేకపోవడం వల్లే అభిషేక్ శర్మ, సామ్సన్ జట్టులోకి వచ్చారనే విషయం మర్చిపోవద్దు. అభిషేక్‌ను పక్కన పెట్టే పరిస్థితి లేదు కాబట్టి దురదృష్టవశాత్తూ జైస్వాల్‌కు స్థానం దక్కలేదు. బుమ్రాకు మళ్లీ విశ్రాంతినిచ్చే విషయంలో ఎలాంటి ప్రణాళికలు లేవు. ఐపీఎల్‌తో పాటు దేశవాళీలో రాణించడంతోనే జితేశ్‌ను ఎంపిక చేశాం. శ్రేయస్ విషయంలో అతని తప్పుగానీ, మా తప్పుగానీ లేదు. ఎవరి స్థానంలో అతడిని తీసుకుంటాం? తన అవకాశం కోసం అతను ఎదురు చూడాల్సిందే. – అజిత్ అగార్కర్, చీఫ్ సెలక్టర్ -
సంజూ కాదు!.. ఆసియా కప్ ఓపెనర్‌గా అతడు ఫిక్స్: అగార్కర్
ఆసియా కప్-2025 టోర్నమెంట్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తమ జట్టును ఖరారు చేసింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో ఈ మెగా ఈవెంట్ ఆడబోయే జట్టును మంగళవారం ప్రకటించింది.కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav)తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్.. ఆసియా కప్ ఆడబోయే భారత జట్టులోని సభ్యుల పేర్లు వెల్లడించాడు. ఈ ఖండాంతర టోర్నీతో టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill).. టీమిండియా తరఫున టీ20లలో పునరాగమనం చేయనున్నాడు.ఓపెనింగ్ జోడీ ఎవరు?అంతేకాదు.. సూర్యకు డిప్యూటీగా గిల్ ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో ఆసియా కప్‌లో టీమిండియా ఓపెనింగ్ జోడీ ఎవరన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాగా గిల్ ఏడాది కాలంగా అంతర్జాతీయ టీ20లకు దూరంగా ఉండగా.. అభిషేక్ శర్మతో కలిసి సంజూ శాంసన్ భారత ఇన్నింగ్స్ ఆరంభించాడు.అయితే, ప్రస్తుత ఆసియా కప్ జట్టులో సంజూకు చోటు దక్కినా.. గిల్ రాకతో ఓపెనర్‌గా అతడిపై వేటు పడటం ఖాయమే కనిపిస్తోంది. కేవలం వికెట్ కీపర్ బ్యాటర్‌గా మాత్రమే అతడి పేరును పరిశీలనలోకి తీసుకుంటారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు.. మరో ఓపెనింగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్‌ను స్టాండ్ బై ప్లేయర్‌గా మాత్రమే ఎంపిక చేయడంతో సంజూకు కాస్త ప్రమాదం తప్పినట్లే విశ్లేషకులు అంటున్నారు.అప్పుడు గిల్ లేడు కాబట్టే సంజూ ఓపెనర్ఈ పరిణామాల నేపథ్యంలో ఆసియా కప్-2025లో భారత ఓపెనింగ్ జోడీ ఎవరన్న అంశంపై చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పందించాడు. ‘‘శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ లేరు కాబట్టి సంజూ శాంసన్ ఓపెనర్‌గా వచ్చాడు.అలాగే అభిషేక్ శర్మ కూడా!.. అయితే, ఓపెనర్‌గా అభిషేక్ అద్భుత ప్రదర్శనలు ఇచ్చాడు. పార్ట్‌టైమ్ స్పిన్నర్‌గానూ పనికివస్తాడు. ఇక అభిషేక్ శర్మకు జోడీగా ఇప్పుడు ఇద్దరు ఓపెనర్లు ఉన్నారు.అక్కడకు వెళ్లాకే నిర్ణయంశుబ్మన్ గిల్, సంజూ శాంసన్.. ఈ ఇద్దరూ మంచి ఓపెనింగ్ బ్యాటర్లు.అయితే, దుబాయ్‌లో ఓపెనర్‌గా ఎవరు వస్తారని అక్కడే నిర్ణయిస్తాం. ఇక గిల్ అంతకు ముందు కూడా వైస్ కెప్టెన్‌గా జట్టులో ఉన్నాడు. ఇప్పుడు తిరిగి వచ్చాడు. ఇందులో ఎలాంటి సమస్య లేదు’’ అని అగార్కర్ పేర్కొన్నాడు.ఈ క్రమంలో అభిషేక్ శర్మను మొదటి ప్రాధాన్య ఓపెనర్‌గా చెప్పిన అగార్కర్.. గిల్ రాకతో సంజూపై ఓపెనర్‌గా వేటు పడక తప్పదనే సంకేతాలు ఇచ్చాడు. కాగా ఆసియా కప్-2025కి ఎంపిక చేసిన భారత జట్టులో శ్రేయస్ అయ్యర్‌కు చోటు దక్కలేదు. దీంతో సెలక్టర్లపై తీరుపై విమర్శల వర్షం కురుస్తోంది.చదవండి: Asia Cup 2025: అందుకే శ్రేయస్‌ను సెలక్ట్ చేయలేదు: కుండబద్దలు కొట్టిన అగార్కర్ -
అందుకే అక్షర్‌ను తప్పించి.. వైస్ కెప్టెన్‌గా గిల్: సూర్యకుమార్ యాదవ్
టీమిండియా టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill).. అంతర్జాతీయ టీ20లలో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్ ఆడబోయే భారత టీ20 జట్టుకు అతడు ఎంపికయ్యాడు. అంతేకాదు.. పొట్టి ఫార్మాట్లో జరిగే ఈ ఖండాంతర ఈవెంట్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు గిల్ డిప్యూటీగా వ్యవహరించనున్నాడు.ఏడాది కాలంగా దూరంకాగా 2024 జూలైలో శ్రీలంక పర్యటన సందర్భంగా గిల్ చివరగా టీ20లలో టీమిండియాకు ఆడాడు. నాడు సూర్య కెప్టెన్సీలో ఓపెనర్‌గా వచ్చిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 39 పరుగులు చేశాడు. అనంతరం.. దాదాపు ఏడాది కాలంగా భారత టీ20 జట్టుకు దూరంగా ఉన్న గిల్.. మెగా టోర్నీ నేపథ్యంలో అకస్మాత్తుగా జట్టులోకి రావడమే కాకుండా.. వైస్ కెప్టెన్‌గానూ ఎంపిక కావడం గమనార్హం.అక్షర్ పటేల్‌ను తప్పించి..ఇన్నాళ్లు టీ20 జట్టు వైస్ కెప్టెన్‌గా ఉన్న అక్షర్ పటేల్‌ను తప్పించి.. గిల్‌ను సూర్య డిప్యూటీగా నియమించడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ఆసియా కప్ జట్టు ప్రకటన సందర్భంగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) ఈ విషయంపై స్పందించాడు. అందుకే వైస్ కెప్టెన్‌గా గిల్‘‘టీ20 ప్రపంచకప్-2024లో గెలిచిన తర్వాత టీమిండియా శ్రీలంకలో టీ20 సిరీస్ ఆడినపుడు నేను కెప్టెన్‌గా ఉంటే.. గిల్ వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. నిజానికి టీ20 ప్రపంచకప్-2026 కోసం కొత్త సైకిల్‌ను మేము అప్పుడే ఆరంభించాము.అయితే, ఆ తర్వాత వరుస టెస్టు సిరీస్‌లతో గిల్ బిజీ అయ్యాడు. అందుకే టీమిండియా తరఫున టీ20 మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. అంతేకాదు.. చాంపియన్స్ ట్రోఫీతోనూ మరింత బిజీ అయిపోయాడు.అందుకే టీ20లకు కాస్త దూరమయ్యాడు. అతడు తిరిగి జట్టులోకి రావడం సంతోషంగా ఉంది’’ అని సూర్యకుమార్ యాదవ్ మీడియా సమావేశంలో పేర్కొన్నాడు. కాగా రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20 రిటైర్మెంట్ తర్వాత సూర్య టీమిండియా టీ20 పగ్గాలు చేపట్టగా.. టెస్టులకు వీడ్కోలు పలికిన నేపథ్యంలో ఇటీవలే గిల్ టెస్టు జట్టు సారథి అయ్యాడు.ఇక ఇప్పటికే వన్డేల్లోనూ వైస్ కెప్టెన్‌గా ఉన్న గిల్.. టీ20లలోనూ రీఎంట్రీ ఇవ్వడంతో అతడిని ఆల్ ఫార్మాట్ ఫ్యూచర్ కెప్టెన్‌గా తీర్చిదిద్దేందుకు సిద్ధమైనట్లు బీసీసీఐ సంకేతాలు ఇచ్చినట్లయింది. కాగా సెప్టెంబరు 9- 28 వరకు యూఏఈ వేదికగా ఆసియా కప్ -2025 టోర్నీ జరుగనుంది.ఐపీఎల్లో అదరగొట్టాడుఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ గడ్డ మీద ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ సందర్భంగా శుబ్‌మన్ గిల్ టీమిండియా టెస్టు కెప్టెన్‌గా తన ప్రయాణం మొదలుపెట్టాడు. బ్యాటర్‌గా 754 పరుగులతో ఇరగదీసిన గిల్.. ఎడ్జ్‌బాస్టన్‌లో తొలిసారి భారత్‌కు టెస్టు విజయం అందించాడు. అంతేకాదు.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-2తో సమం చేసి సత్తా చాటాడు.అయితే, అంతర్జాతీయ టీ20లలో గిల్ ఇప్పటి వరకు 21 మ్యాచ్‌లు ఆడి 139.28 స్ట్రైక్‌రేటుతో 578 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ (126) ఉంది. ఇక ఐపీఎల్-2025లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా వ్యవహరించిన గిల్.. 15 మ్యాచ్‌లలో కలిపి 650 పరుగులు సాధించాడు. గుజరాత్‌ను ప్లే ఆఫ్స్ చేర్చినా టైటిల్ మాత్రం అందించలేకపోయాడు.చదవండి: Asia Cup 2025: అందుకే శ్రేయస్‌ను సెలక్ట్ చేయలేదు: కుండబద్దలు కొట్టిన అగార్కర్#ShubmanGill is back in T20Is! 😳Here's what skipper #SuryakumarYadav has to say about his inclusion as a vice-captain! 🗣Watch the Press Conference Now 👉 https://t.co/kwwh4UUSWe pic.twitter.com/OiX06F3995— Star Sports (@StarSportsIndia) August 19, 2025 -
అందుకే శ్రేయస్ అయ్యర్‌ను సెలక్ట్ చేయలేదు: కుండబద్దలు కొట్టిన అగార్కర్
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తీరుపై టీమిండియా అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పక్షపాత ధోరణి వీడాలంటూ సోషల్ మీడియా వేదికగా సెలక్టర్లకు హితవు పలుకుతున్నారు. కాగా ఈసారి టీ20 ఫార్మాట్లో జరిగే ఆసియా కప్-2025 (Asia Cup)కి బీసీసీఐ మంగళవారం తమ జట్టును ప్రకటించింది.సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav)ను టీ20 జట్టు సారథిగా కొనసాగించిన యాజమాన్యం.. వైస్ కెప్టెన్‌గా అక్షర్ పటేల్‌ను తప్పించింది. టీమిండియా టెస్టు సారథి శుబ్‌మన్ గిల్‌ను అతడి స్థానంలో సూర్యకు డిప్యూటీగా నియమించింది.శ్రేయస్ అయ్యర్‌కు మొండిచేయిచాన్నాళ్లుగా టీ20లలో టీమిండియాకు దూరంగా ఉన్న గిల్‌కు ప్రమోషన్ ఇచ్చిన బీసీసీఐ.. మిడిలార్డర్ స్టార్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)కు మాత్రం మరోసారి మొండిచేయి చూపింది. పదిహేను మంది సభ్యులతో కూడిన ఆసియా కప్ జట్టులో ఈ ముంబై బ్యాటర్‌కు చోటు దక్కలేదు.పడిలేచిన కెరటంలా.. కనీసం స్టాండ్ బై ప్లేయర్ల జాబితాలోనూ అయ్యర్‌కు స్థానం కల్పించలేదు. ఈ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్ అభిమానులు బీసీసీఐ తీరును విమర్శిస్తున్నారు. కాగా ఈ ముంబై బ్యాటర్ క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడ్డాడనే కారణంగా బీసీసీఐ గతంలో అతడిని సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తప్పించింది.అయితే, మళ్లీ దేశవాళీ క్రికెట్ ద్వారా తనను తాను నిరూపించుకున్న శ్రేయస్.. 2024లో ముంబై రంజీ ట్రోఫీ టైటిల్ గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టైటిల్ గెలిచిన జట్టులోనూ అతడు సభ్యుడు. వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలోనూ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు.అంతేకాదు.. ఐపీఎల్-2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్‌గా వ్యవహరించి.. ట్రోఫీ అందించాడు. ఇరానీ కప్-2024 గెలిచిన జట్టులోనూ సభ్యుడిగా ఉన్నాడు. ఈ క్రమంలో మళ్లీ బీసీసీఐ నుంచి పిలుపు అందుకున్న శ్రేయస్.. సెంట్రల్ కాంట్రాక్టు తిరిగి దక్కించుకోవడంతో పాటు.. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు ఎంపికయ్యాడు.చాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్రఅనంతరం.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో 243 పరుగులతో టాప్ రన్ స్కోరర్‌గా నిలిచి.. భారత్ టైటిల్ గెలవడంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2025 మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ శ్రేయస్ అయ్యర్‌ను రూ. 26.75 కోట్లకు కొని కెప్టెన్‌ను చేసింది.ఐపీఎల్‌లోనూ సత్తా చాటిఈ క్రమంలో బ్యాటర్‌గా, సారథిగా శ్రేయస్ అయ్యర్ అదరగొట్టాడు. ఈ ఏడాది క్యాష్ రిచ్ లీగ్‌లో ఏకంగా 604 పరుగులు సాధించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. పంజాబ్‌ను ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. పొట్టి ఫార్మాట్లో మరోసారి ఈ మేర సత్తా చాటాడు. కానీ బీసీసీఐ మాత్రం ఆసియా కప్ ఆడే జట్టులో అతడికి చోటు ఇవ్వకపోవడం గమనార్హం.కుండబద్దలు కొట్టిన అగార్కర్ఈ విషయం గురించి జట్టు ప్రకటన సందర్భంగా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ‘‘శ్రేయస్ అయ్యర్. జట్టుకు ఎంపిక కాకపోవడంలో అతడి తప్పేం లేదు. అలాగే మా తప్పు కూడా ఏమీ లేదు.అతడు ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే. అయినా.. ఎవరి స్థానంలో అతడిని తీసుకురావాలో మీరే చెప్పండి?’’ అని అగార్కర్ మీడియా సమావేశంలో ఎదురు ప్రశ్నించాడు. జట్టులో పదిహేను మందికి మాత్రమే స్థానం ఉందని.. కాబట్టి శ్రేయస్ అయ్యర్‌ను తీసుకోలేకపోయామని స్పష్టం చేశాడు.ఆసియా కప్ టీ20-2025 టోర్నీకి భారత జట్టు సూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్.రిజర్వు ప్లేయర్లు: ప్రసిద్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్.చదవండి: ‘శుబ్‌మన్ గిల్ కాదు!.. రోహిత్ తర్వాత వన్డే కెప్టెన్‌గా అతడే ఉండాలి’The wait is over! 🇮🇳#TeamIndia’s squad for Asia Cup 2025 is out, and it’s stacked! 💥Let the journey to T20 WC 2026 begin! #AsiaCup🤩Press Conference Live Now 👉 https://t.co/kwwh4UUSWe #AsiaCup2025 pic.twitter.com/zonMDTvmHO— Star Sports (@StarSportsIndia) August 19, 2025 -
‘గిల్ కాదు!.. రోహిత్ తర్వాత వన్డే కెప్టెన్‌గా అతడే ఉండాలి’
టీమిండియాకు ప్రస్తుతం మూడు ఫార్మాట్లలో ముగ్గురు కెప్టెన్లు ఉన్నారు. టీ20 ప్రపంచకప్-2024లో భారత్‌ను చాంపియన్‌గా నిలిపిన తర్వాత రోహిత్ శర్మ (Rohit Sharma) అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలకగా.. సూర్యకుమార్ యాదవ్ అతడి స్థానాన్ని భర్తీ చేశాడు.భారత టీ20 జట్టు కెప్టెన్‌గా రేసులో ముందున్న ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya)ను కాదని మేనేజ్మెంట్ సూర్య వైపు మొగ్గు చూపింది. మరోవైపు.. ఇటీవలి ఇంగ్లండ్ పర్యటనకు ముందే రోహిత్ టెస్టులకు కూడా గుడ్‌బై చెప్పేశాడు. దీంతో యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ (Shubman Gill) టీమిండియా టెస్టు ఫార్మాట్ సారథిగా పగ్గాలు చేపట్టాడు.సత్తా చాటుతున్న సూర్యఅయితే, వన్డేల్లో మాత్రం రోహిత్ శర్మనే కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. ఏదేమైనా రోహిత్ రిటైర్మెంట్ నిర్ణయం తర్వాత టీ20లలో సూర్య వరుస విజయాలతో అతడికి సరైన వారసుడు అనిపించుకుంటుండగా.. గిల్ సైతం కెప్టెన్‌గా మొదటి ప్రయత్నంలోనే మంచి మార్కులు సాధించాడు.ఇంగ్లండ్ గడ్డ మీద రాణించిన గిల్ఇంగ్లండ్ గడ్డ మీద బ్యాటర్‌గా 754 పరుగులు సాధించి రికార్డులు కొల్లగొట్టిన గిల్.. సారథిగా సిరీస్‌ను 2-2తో సమం చేసి సత్తా చాటాడు. ఇక అంతకంటే ముందు.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025ని రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.తద్వారా రెండో ఐసీసీ ట్రోఫీ సాధించి.. మహేంద్ర సింగ్ ధోని (3) తర్వాత.. అత్యధిక టైటిళ్లు గెలిచిన కెప్టెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మ వన్డే వరల్డ్‌కప్-2027 వరకు సారథిగా కొనసాగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వన్డేల్లో రోహిత్ వారసుడి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.గిల్ కాదు!.. రోహిత్ తర్వాత వన్డే కెప్టెన్‌గా అతడే ఉండాలిరోహిత్ శర్మ తర్వాత భారత వన్డే జట్టుకు కెప్టెన్ అయ్యే అర్హత శ్రేయస్ అయ్యర్‌కే ఉందని అంబటి రాయుడు అన్నాడు. ‘‘అద్భుతమైన నైపుణ్యాలతో గతేడాది ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను చాంపియన్‌గా నిలిపాడు.ఈ ఏడాది.. యువకులతో కూడిన పంజాబ్ కింగ్స్ జట్టును ఫైనల్‌కు చేర్చాడు. అతడొక అసాధారణ నైపుణ్యాలున్న కెప్టెన్. త్వరలోనే అతడు టీమిండియా కెప్టెన్‌గా నియమితుడు కావాలి’’ అని శుభంకర్ మిశ్రా చానెల్లో రాయుడు పేర్కొన్నాడు.వన్డేలలో సూపర్ హిట్‌కాగా టీ20, వన్డే జట్లకు కూడా త్వరలోనే శుబ్‌మన్ గిల్ కెప్టెన్ కానున్నాడనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇలాంటి సమయంలో రాయుడు మాత్రం ఈ మేరకు భిన్నంగా స్పందిస్తూ.. శ్రేయస్ అయ్యర్ పేరును ప్రస్తావించడం విశేషం. ఇదిలా ఉంటే.. భారత వన్డే జట్టులో ముంబై బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కీలక ఆటగాడు. వన్డే వరల్డ్‌కప్-2023లో రెండు శతకాల సాయంతో 530 పరుగులు చేసిన అయ్యర్.. చాంపియన్స్ ట్రోఫీలో 243 పరుగులు సాధించాడు. భారత్ ఈ టైటిల్ గెలవడంలో శ్రేయస్ అయ్యర్‌దే కీలక పాత్ర. చదవండి: నాన్సెన్స్.. అసలేం అనుకుంటున్నారు?: రోహిత్, కోహ్లి, గిల్‌పై మాజీ క్రికెటర్ ఆగ్రహం -
అసలేం అనుకుంటున్నారు?: రోహిత్, కోహ్లి, గిల్‌పై మాజీ క్రికెటర్ ఆగ్రహం
టీమిండియా స్టార్లు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ తీరుపై భారత మాజీ క్రికెటర్ కర్సన్ ఘవ్రీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దిగ్గజ బ్యాటర్ సునిల్ గావస్కర్ (Sunil Gavaskar) కు కనీస మర్యాద ఇవ్వకుండా ఇష్టారీతిన వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడ్డాడు. అనుభవం, నైపుణ్యం ఉన్న లెజెండ్ సలహాలు ఇస్తే.. వాటిని సానుకూల దృక్పథంతో స్వీకరించాలే తప్ప.. ప్రతి విమర్శలు చేస్తారా? అంటూ ఫైర్ అయ్యాడు.పాతికేళ్లకు పైగా..భారత దిగ్గజ క్రికెటర్లలో ఒకడిగా పేరొందిన సునిల్ గావస్కర్.. ఆ తర్వాత కామెంటేటర్‌గా అవతారమెత్తాడు. పాతికేళ్లకు పైగా తన వ్యాఖ్యానంతో ప్రేక్షకులను అలరిస్తూ.. మైదానంలో ఆటగాళ్లు చేసే తప్పులను విశ్లేషిస్తూ విమర్శలు చేస్తూంటాడు ‘లిటిల్ మాస్టర్’. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ (Shubman Gill) ఆట తీరును సందర్భానుసారం విమర్శిస్తూ కామెంట్లు చేశాడు.కోహ్లి కౌంటర్.. రోహిత్ ఫిర్యాదు!ముఖ్యంగా ఇటీవలి కాలంలో ఐపీఎల్లో కోహ్లి స్ట్రైక్ రేటును ప్రస్తావించడం.. ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో టీమిండియా కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మపై గావస్కర్ చేసిన విమర్శలను వాళ్లు తేలికగా తీసుకోలేకపోయారు. తాను స్ట్రైక్‌రేటు గురించి కాకుండా .. జట్టు ప్రయోజనాల కోసమే ఆడతానని కోహ్లి స్పష్టం చేయగా.. గావస్కర్ కామెంట్రీపై రోహిత్ శర్మ ఏకంగా బీసీసీఐకి ఫిర్యాదు చేసినట్లు వార్తలు వచ్చాయి.గిల్‌కు ఆయన అవసరం ఎంతగానో ఉందిఈ పరిణామాల నేపథ్యంలో గావస్కర్ సహచర ఆటగాడు కర్సన్ ఘవ్రీ.. నవతరం ఆటగాళ్ల తీరు సరిగ్గా లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘‘గత 25 ఏళ్లకు పైగా గావస్కర్ కామెంట్రీ చేస్తున్నాడు. యువ ఆటగాళ్లకు ఆయన మాటలు విలువైన సలహాలు. కానీ.. మన ఆటగాళ్లలో కొందరు మాత్రం సలహాల కోసం గావస్కర్ వద్దకు వెళ్లనే వెళ్లరు.విదేశీ ఆటగాళ్లు గావస్కర్ సలహాల కోసం వస్తుంటే.. మనోళ్లు మాత్రం ఆయనను పట్టించుకోరు. ఇప్పుడు భారత జట్టులో ఉన్న ప్రతీ ఆటగాడు కచ్చితంగా గావస్కర్ వద్దకు వెళ్లాలి. ముఖ్యంగా శుబ్‌మన్ గిల్‌కు ఆయన అవసరం ఎంతగానో ఉంది.విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ల ఆటను గావస్కర్ విమర్శించాడని వార్తలు వస్తాయే తప్ప.. సలహాల కోసం వాళ్లు ఆయనను సంప్రదించినట్లు ఎక్కడా కనబడదు. ఏదేమైనా గావస్కర్ సలహాలు ఇస్తే దానిని స్వీకరించకపోవడం నాన్సెన్స్ అనే చెప్పాలి.ఎవరైతే ఏంటి? అసలేం అనుకుంటున్నారు?నువ్వు రోహిత్ శర్మ లేదంటే విరాట్ కోహ్లి అయితే ఏంటి?.. దిగ్గజాన్ని గౌరవించడం నేర్చుకోవాలి. గావస్కర్ ఏం చెప్పినా అది మీ మంచి కోసమే. అంతెందుకు రవిశాస్త్రి కూడా విమర్శలు చేస్తాడు. అయితే, గావస్కర్ తనదైన శైలిలో మంచీ, చెడూ విశ్లేషిస్తాడు’’ అని మాజీ పేసర్ కర్సన్ ఘవ్రీ విక్కీ లల్వాణీ పాడ్‌కాస్ట్‌లో పేర్కొన్నాడు.చదవండి: ఆసియా కప్- 2025: అభిషేక్ శర్మకు జోడీగా.. వైభవ్ సూర్యవంశీ ఉండాలి: మాజీ కెప్టెన్ -
'శుబ్'సమయం ఆసన్నమైందా?
టీమిండియా త్వరలో ఆసియాకప్ టి20 సిరీస్ ఆడనుంది. మంగళవారం నాడు జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించే అవకాశం ఉంది. టెస్ట్ జట్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌ను ఎంపిక చేస్తారా, లేదా అనే చర్చ జరుగుతోంది. ఇదిలావుంచితే నాయకత్వంపై కూడా డిస్కషన్ నడుస్తోంది. టి20 టీమ్ కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) ఉన్నాడు కదా, ఇంక డిస్కషన్ ఏముంది అంటారా? దీని గురించి కాదు. మూడు ఫార్మాట్లకు ఒకరే కెప్టెన్‌గా ఉండాలనే చర్చ తాజాగా తెరపైకి వచ్చింది.రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి (Virat Kohli) టెస్టులకు గుడ్ బై చెప్పినప్పుడు జట్టు పగ్గాలు ఎవరికి ఇవ్వాలనే దానిపై పెద్ద కసరత్తే జరిగింది. బుమ్రా కెప్టెన్సీ నిరాకరించడంతో కేఎల్ రాహుల్ టెస్ట్ టీమ్ సారథి అవుతాడని చాలా మంది అనుకున్నారు. అనూహ్యంగా సెలక్షన్ కమిటీ శుబ్‌మన్ గిల్‌వైపు మొగ్గు చూపింది. దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని యువ నాయకత్వానికే బీసీసీఐ ఓటు వేసింది. కెప్టెన్ హోదాలో ఇంగ్లీషు గడ్డపై లాంగ్ ఫార్మాట్ ఆడిన గిల్.. అంచనాలకు మించి ఆడడంతో అతడిపై భ్రమలు తొలగిపోయాయి. అందరి కంటే ఎక్కువ పరుగులు సాధించడంతో పాటు సిరీస్‌ను సమం చేయడంతో గిల్ నాయకత్వ పటిమపై భారత్ క్రికెట్ అభిమానులకు నమ్మకం కుదిరింది.రోహిత్ తర్వాత అతడికే..ఇక ఇప్పుడు మూడు ఫార్మాట్లకు ఒక్కరే కెప్టెన్ ఉంటే బాగుంటుందన్న చర్చ మొదలైంది. ప్రస్తుతం వన్డే జట్టుకు రోహిత్ శర్మ, టీ20 టీమ్‌కు సూర్యకుమార్ యాదవ్, టెస్ట్ జట్టు కెప్టెన్‌గా గిల్ ఉన్నారు. రోహిత్‌కు వయసు మీద పడుతుడడంతో అతడు ఎంతకాలం కెప్టెన్‌గా కొనసాగుతాడన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. 2027లో సౌతాఫ్రికాలో జరిగే వన్డే వరల్డ్ కప్ నాటికి హిట్‌మాన్‌కు 40 ఏళ్లు నిండుతాయి. అప్పటి వరకు జట్టులో ప్లేయర్‌గా మాత్రమే కొనసాగుతాడని కొంతమంది నమ్ముతున్నారు. దీంతో గిల్‌కు వన్డే జట్టు పగ్గాలు అప్పగించే చాన్స్ ఉందని విశ్లేషకులు గట్టిగా నమ్ముతున్నారు. వన్డేల్లో గిల్‌కు మంచి ట్రాక్ రికార్డు ఉంది కాబట్టి రోహిత్ తర్వాత కెప్టెన్సీ చాన్స్ అతడికేనని విశ్లేషిస్తున్నారు.స్కై డిప్యూటీగా గిల్?టి20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ స్పోర్ట్స్ హెర్నియా ఆపరేషన్ నుంచి కోలుకుని ఆసియా కప్ (Asia Cup 2025) ఆడేందుకు రెడీ అవుతున్నాడు. అతడికి డిప్యూటీగా అక్షర్ పటేల్ వ్యవహరిస్తున్నాడు. జట్టు సుదీర్ఘ ప్రయోజనాలను లెక్కలోకి తీసుకుని అక్షర్‌ను టి20 టీమ్ వైస్ కెప్టెన్సీ నుంచి తప్పిస్తారని ప్రచారం జరుగుతోంది. గిల్‌ను సూర్యకుమార్‌కు డిప్యూటీగా నియమించి మూడు ఫార్మాట్ల నాయకత్వ బాధ్యతలు మోసేలా తీర్చిదిద్దాలని బీసీసీఐ భావిస్తున్నట్టు సమాచారం. వచ్చే ఏడాది టి20 వరల్డ్‌కప్ నాటికి మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌గా గిల్‌ను నియమించేలా కసరత్తు జరుగుతోందని టైమ్స్ ఆఫ్ ఇండియా తన కథనంలో పేర్కొంది.మూడింటికి ఒక్కరే బెస్ట్గత ఫలితాలు చూసుకుంటే మూడు ఫార్మాట్లకు కెప్టెన్ ఒక్కరే ఉన్నప్పుడు టీమిండియా మంచి ఫలితాలు సాధించింది. ఎంఎస్ ధోని పొట్టి ఫార్మాట్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు 2007లో మన జట్టు టి20 ప్రపంచకప్ విజేతగా నిలిచింది. 2011లో అతడిని మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ అప్పగించడంతో.. అదే ఏడాది టీమిండియా వన్డే వరల్డ్‌కప్ గెలిచింది. ధోని నాయకత్వంలోనే 2013లో ఇంగ్లీషు గడ్డపై చాంపియన్స్ ట్రోఫీ సొంతం చేసుకుంది. మూడు ఫార్మాట్లలోనూ రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఉన్నప్పుడే 2024లో రెండోసారి టి20 ప్రపంచకప్ విజేత కాగలిగింది. 2015- 17 మధ్య కాలంలో టీమిండియాకు ఇద్దరు నాయకత్వం వహించారు. పొట్టి ఫార్మాట్‌కు ధోని, టెస్టులకు కోహ్లి సారథులుగా ఉన్నారు.సేమ్ సిట్యుయేషన్ధోని నుంచి కోహ్లికి వన్డే కెప్టెన్సీ బదలాయింపు సులువుగానే జరిగిందని టైమ్స్ ఆఫ్ ఇండియాతో నేషనల్ సెలెక్టర్ దేవాంగ్ గాంధీ చెప్పారు. 'అప్పటికే టెస్టు కెప్టెన్‌గా కోహ్లి దూసుకుపోతున్నాడు. వన్డేల్లోనూ బాగా ఆడుతున్నాడు. అదే సమయంలో ధోని.. రిటైర్మెంట్కు ముందు కొద్ది రోజులు ఎటువంటి బాధ్యతలు లేకుండా క్రికెట్ ఆడాలని భావించాడు. దీంతో ఎటువంటి ఆటంకాలు లేకుండా ధోని నుంచి కోహ్లికి నాయకత్వ బాధ్యతల బదలాయింపు జరిగింది. ఇప్పుడు గిల్‌కు కూడా అలాంటి పరిస్థితి ఉంద'ని దేవాంగ్ గాంధీ అభిప్రాయపడ్డారు. సుదీర్ఘకాలం భారత క్రికెట్‌ను గిల్ ఏలుతాడని టీమిండియా మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి (Ravi Shastri) చేసిన వ్యాఖ్యలు ఇక్కడ ప్రస్తావనార్హం.చదవండి: ఇషాన్ కిషన్ అవుట్.. కారణం ఇదేవర్క్లోడ్ తట్టుకోగలరా?ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్లకు ఇద్దరేసి కెప్టెన్లు ఉన్నారు. మూడు ఫార్మాట్లకు ఒకరే కెప్టెన్‌గా ఉంటే వర్క్‌లోడ్ తట్టుకోగలరా అనే ప్రశ్న ఎదురవుతోంది. అయితే బౌలర్లతో పోలిస్తే బ్యాటర్లపై కెప్టెన్సీ భారం తక్కువగా ఉంటుందని భారత్ స్ట్రెంత్ అండ్ కండీషనింగ్ మాజీ కోచ్ రాంజీ శ్రీనివాసన్ అభిప్రాయపడ్డారు. ఇంకా చాలా కాలం పాటు క్రికెట్ ఆడే సత్తా గిల్‌కు ఉంది కాబట్టి అతడికిది సానుకూల అంశం అవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతానికి గిల్‌ను సూర్యకుమార్ డిప్యూటీ నియమిస్తే అతడికి అనుభవం పెరుగుతుందని, గిల్‌ను పరీక్షించడానికి వచ్చే టి20 ప్రపంచకప్ వరకు తగినంత సమయం కూడా ఉంటుందని అంటున్నారు. చూద్దాం మరి ఏమవుతుందో! -
Asia Cup: గిల్, శ్రేయస్‌కు అగార్కర్ నో!.. అతడికి లైన్ క్లియర్!
ఆసియా కప్-2025 టోర్నమెంట్లో ఆడే భారత జట్టులో.. టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) చోటు దక్కించుకుంటాడా? లేదా?.. భారత క్రికెట్ వర్గాల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్. గతేడాది జూలైలో గిల్ టీమిండియా తరఫున టీ20 మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత అతడు వన్డే, టెస్టులకు మాత్రమే పరిమితమయ్యాడు.మరోవైపు.. యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal)కు కూడా టెస్టుల్లోనే పెద్దపీట వేసింది మేనేజ్మెంట్. ఈ క్రమంలో అతడు కూడా గిల్ మాదిరి గతేడాదే చివరగా టీ20లలో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు.అదరగొట్టిన అభిషేక్- సంజూఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా గెలిచిన తర్వాత.. రోహిత్ శర్మ- విరాట్ కోహ్లి స్థానంలో అభిషేక్ శర్మ- సంజూ శాంసన్ (Sanju Samson) ఓపెనింగ్ జోడీగా వచ్చి అదరగొట్టారు. గత కొన్నాళ్లుగా ఓపెనర్లుగా జట్టులో పాతుకుపోయారు. అయితే, ఈసారి టీ20 ప్రపంచకప్-2026 సన్నాహకాల్లో భాగంగా ఆసియా కప్ టోర్నీని పొట్టి ఫార్మాట్లో నిర్వహించనున్నారు.ఈ క్రమంలో ఈ ఖండాంతర టోర్నీకి భారత జట్టు ఎంపిక ఆసక్తికరంగా మారింది. గిల్, జైసూలను తిరిగి టీ20 జట్టులోకి పిలిపించాలని హర్భజన్ సింగ్ వంటి మాజీ క్రికెటర్లు మేనేజ్మెంట్కు సూచిస్తుండగా.. మరికొందరు మాత్రం అభిషేక్- సంజూ జోడీకి ఓటు వేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఆసక్తికర వార్త తెరమీదకు వచ్చింది. క్రిక్‌బజ్ కథనం ప్రకారం.. శుబ్‌మన్ గిల్‌ను ఆసియా టీ20 కప్ టోర్నీలో ఆడించేందుకు సెలక్షన్ కమిటీ విముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ టోర్నీకి ఎంపిక చేసే జట్టులో గిల్‌కు చోటివ్వద్దని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ భావిస్తున్నట్లు సమాచారం.గిల్‌కు అగార్కర్ నో!.. అతడికి లైన్ క్లియర్!ఓపెనింగ్ జోడీగా అభిషేక్- సంజూ రిథమ్‌లో ఉన్నారు కాబట్టి వారినే కొనసాగించాలని అగార్కర్ భావిస్తున్నాడట. గిల్‌ను జట్టులోకి తీసుకుంటే తుదిజట్టు కూర్పు క్లిష్టతరంగా మారుతుందని.. అయితే, యశస్వి జైస్వాల్‌ను మాత్రం బ్యాకప్ ఓపెనర్‌గా తీసుకోవాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.గౌతీ రంగంలోకి దిగితే మాత్రంఅయితే, ఒకవేళ హెడ్‌కోచ్ గౌతం గంభీర్.. గిల్‌ను జట్టులో చేర్చాలని పట్టుబడితే మాత్రం.. అగార్కర్ అందుకు అంగీకరించే అవకాశం ఉంది. మరోవైపు.. దేశీ టోర్నీలు, ఐపీఎల్-2025లో అదరగొట్టిన శ్రేయస్ అయ్యర్‌కు కూడా అగార్కర్ మొండిచేయి చూపే అవకాశం ఉన్నట్లు సమాచారం.తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్‌లను ఈ టోర్నీకి తప్పక ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మిడిలార్డర్లో శివం దూబే, వాషింగ్టన్ సుందర్, హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండర్ స్థానం కోసం పోటీపడుతున్నారు.సిరాజ్, షమీలకు మొండిచేయిఇక పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా ఆసియా కప్ టోర్నీకి ఫిట్నెస్ సాధించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సీనియర్లు మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీలకు ఈ జట్టులో చోటు దక్కడం సాధ్యం కాకపోవచ్చు. బుమ్రా పేస్ దళంలో యువ బౌలర్లు అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, ప్రసిద్ కృష్ణ తప్పక స్థానం దక్కించుకోనున్నట్లు తెలుస్తోంది. కాగా ఆసియా కప్-2025 టోర్నీకి బీసీసీఐ.. మంగళవారం (ఆగష్టు 19) తమ జట్టును ప్రకటించే అవకాశం ఉంది. అప్పుడే ఈ అంశంపై స్పష్టత వస్తుంది.చదవండి: ఆసియా కప్- 2025: అభిషేక్ శర్మకు జోడీగా.. వైభవ్ సూర్యవంశీ ఉండాలి: మాజీ కెప్టెన్ -
ఆసియాకప్ రేసులో గిల్ కంటే అతడే ముందున్నాడు: అశ్విన్
ఆసియాకప్-2025 టీ20 టోర్నీ సెప్టెంబర్ 9 నుంచి యూఏఈ వేదికగా ప్రారంభం కానుంది. ఈ మార్క్యూ ఈవెంట్ కోసం భారత జట్టును అజిత్ అగర్కార్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఒకట్రెండు రోజుల్లో ప్రకటించే అవకాశముంది.అయితే ఈ టోర్నీకి భారత జట్టులో యవ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు చోటు ఇవ్వాలని లెజెండరీ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ సూచించాడు. కాగా టీమిండియా హెడ్‌కోచ్‌గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టాక టీ20 ఫార్మాట్లో ఓపెనర్లగా అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ కొనసాగుతున్నారు.చాలా టీ20 మ్యాచ్‌లకు జైశ్వాల్‌కు విశ్రాంతి ఇచ్చారు. ఇప్పుడు ఆసియాకప్‌నకు జైశ్వాల్‌తో పాటు మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్ కూడా ఉన్నాడు. దీంతో భారత జట్టులో ఎవరికి చోటు దక్కుతుందన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది."ఆసియాకప్ జట్టు ఎంపిక గురించి కొన్ని చర్చలు జరుగుతున్నాయి. టీ20 ప్రపంచకప్‌లో యశస్వి జైస్వాల్ బ్యాకప్ ఓపెనర్‌గా ఉన్నందున, శుబ్‌మన్ గిల్‌ను టీ20 ప్రణాళికలకు సరిపోతాడా లేదా అన్నది ఇప్పుడు అందరి మనస్సులను తొలుస్తున్న ప్రశ్న.నావరకు అయితే సెలక్టర్లు గిల్ కంటే జైశ్వాల్‌కే తొలి ప్రధాన్యత ఇస్తారని అనుకుంటున్నాను. రోహిత్ శర్మ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆ స్దానంలో జైశ్వాల్ ఆటోమేటిక్‌గా లభిస్తుంది. అభిషేక్ శర్మ స్దానానికి ఎటువంటి ఢోకా లేదు. ఇప్పుడంతా మరో ఓపెనర్ కోసమే చర్చ. శుబ్‌మన్ గిల్ అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అదేవిధంగా సంజూ శాంసన్ కూడా ఓపెనర్‌గా అద్బుతంగా రాణించాడు. కాబట్టి సెలెక్టర్లకు కష్టమైన పరిస్థితి" అని ఎక్స్‌ప్రెస్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అశ్విన్ పేర్కొన్నాడు.చదవండి: Asia Cup 2025: పాక్-భారత్ మ్యాచ్‌కు భారీ డిమాండ్.. 10 సెకన్లకు రూ.16 లక్షలు! -
Asia Cup: జైస్వాల్ కాదు!.. బ్యాకప్ ఓపెనర్‌గా అతడే సరైనోడు!
ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్ నేపథ్యంలో భారత జట్టు కూర్పు గురించి టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ (Mohammed Kaif) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఖండాంతర టోర్నీలో ఓపెనర్లుగా సంజూ శాంసన్ (Sanju Samson), అభిషేక్ శర్మను కొనసాగించాలని అభిప్రాయపడ్డాడు. అదే విధంగా.. వికెట్ కీపర్లలోనూ మొదటి ప్రాధాన్యంగా తన ఓటు సంజూకేనని స్పష్టం చేశాడు.గిల్, జైసూ రీ ఎంట్రీ పక్కా!కాగా యూఏఈ వేదికగా సెప్టెంబరు 9- 28 వరకు ఆసియా కప్ టోర్నీ జరుగనుంది. ఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహించే ఈ ఈవెంట్‌కు ఆగష్టు 19న బీసీసీఐ తమ జట్టును ప్రకటించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్, ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ల టీ20 రీఎంట్రీపై చర్చ భారత క్రికెట్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.హర్భజన్ సింగ్ వంటి మాజీ క్రికెటర్లు గిల్, జైసూలను తిరిగి జట్టులోకి తీసుకురావాలని సూచిస్తుండగా.. కైఫ్ మాత్రం భిన్నంగా స్పందించాడు. గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్న సంజూ- అభిషేక్ శర్మలనే ఓపెనింగ్ జోడీనే కొనసాగించాలని పేర్కొన్నాడు.జైస్వాల్ కాదు!.. బ్యాకప్ ఓపెనర్‌గా అతడే సరైనోడు!అయితే, వీరికి బ్యాకప్ ఓపెనర్‌గా గిల్‌ను ఎంపిక చేస్తే బాగుంటుందని కైఫ్ అభిప్రాయపడ్డాడు. ‘‘జైస్వాల్, గిల్.. వీరిద్దరిలో ఎవరో ఒకరికి మాత్రమే ఆసియా కప్ జట్టులో చోటు దక్కే వీలుంది. నేనైతే శుబ్‌మన్ గిల్ వైపే మొగ్గుచూపుతాను.ఇంగ్లండ్‌లో కెప్టెన్‌గా గిల్ రాణించాడు. 750 పరుగులు కూడా చేశాడు. అంతేకాదు.. ఐపీఎల్‌లోనూ అతడు మెరుగ్గా రాణించాడు. అయితే, తుదిజట్టులో కాకపోయినా.. బ్యాకప్ ఓపెనర్‌గానైనా గిల్ పేరు ఆసియా కప్ జట్టులో ఉంటుంది.జితేశ్ శర్మకు నా ఓటునిజానికి ఓపెనింగ్ స్లాట్ కోసం గిల్- జైస్వాల్ మధ్య తీవ్రమైన పోటీ ఉంది. అయితే, ఇద్దరిలో ఒక్కరికే ఛాన్స్ ఉంటుంది కాబట్టి.. గిల్ సరైన ఆప్షన్ అవుతాడు. ఇక బ్యాకప్ వికెట్ కీపర్ విషయానికి వస్తే.. జితేశ్ శర్మకు నా ఓటు.ఈ ఏడాది ఐపీఎల్లో ఆర్సీబీ ఫైనల్ చేరి టైటిల్ గెలవడంలో జితేశ్ పాత్ర కూడా కీలకం. కాబట్టి ఆసియా కప్ టోర్నీలో సంజూ ప్రధాన వికెట్ కీపర్‌గా ఉంటే.. జితేశ్ అతడికి బ్యాకప్‌గా ఉండాలి’’ అని మహ్మద్ కైఫ్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. అదే విధంగా.. ఆసియ కప్-2025లో భారత తుదిజట్టును కూడా కైఫ్ ఈ సందర్భంగా ఎంచుకున్నాడు. ఇక బ్యాకప్ ప్లేయర్లుగా వరుణ్ చక్రవర్తి, శుబ్‌మన్ గిల్, మహ్మద్ సిరాజ్, జితేశ్ శర్మలను కైఫ్ తన జట్టుకు ఎంపిక చేసుకున్నాడు.ఆసియా కప్-2025లో కైఫ్ ఎంచుకున్న భారత తుదిజట్టు ఇదేసంజూ శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివం దూబే, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా. చదవండి: సంజూ శాంసన్ మెరుపు ఇన్నింగ్స్.. టీమిండియా సెలక్టర్లకు వార్నింగ్! -
గిల్‌కు వారిద్దరి సపోర్ట్ కావాలి.. లేదంటే కష్టమే: సురేష్ రైనా
టీమిండియా దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌లో వీరిద్దరూ భారత జెర్సీలో కన్పించనున్నారు. అయితే ఈ సిరీస్ తర్వాత రోహిత్, కోహ్లిలు ఇద్దరూ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నట్లు ప్రచారం జరుగుతోంది. వన్డే వరల్డ్‌కప్-2027 కోసం వారిద్దరూ స్ధానంలో యువ ఆటగాళ్లను సిద్దం చేసే యోచనలో సెలక్టర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వార్తల నేపథ్యంలో రో-కో వన్డే భవిష్యత్తుపై టీమిండియా మాజీ ఆటగాడు సురేష్ రైనా కీలక వ్యాఖ్యలు చేశాడు. వన్డే ఫార్మాట్లో రోహిత్, కోహ్లి సేవలు భారత జట్టుకు కచ్చితంగా అవసరమని రైనా అభిప్రాయపడ్డాడు."ప్రస్తుత భారత వన్డే జట్టులో నంబర్ 1, నంబర్ 3లో సరైన ఆటగాళ్లు లేరు. ప్రత్యేకంగా ఛేజింగ్‌లో ఆయా స్ధానాల్లో నిలకడగా రాణించే ఆటగాళ్లు కావాలి. కాబట్టి ఎంతో అనుభవం ఉన్న రోహిత్, విరాట్ భారత జట్టులో కొనసాగాలి. వారిద్దరి తమ సేవలను టీమిండియాకు మరి కొన్నాళ్లపాటు అందించాలి. ఇక శుబ్‌మన్ గిల్ ఇంగ్లండ్ పర్యటనలో అద్బుతంగా రాణించాడు.వన్డే జట్టును కూడా నడిపించగలడు. కానీ గిల్‌కు విరాట్, రోహిత్ లాంటి ఆటగాళ్లు అవసరం. వారిద్దరూ వరల్డ్‌కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, ఐపీఎల్ గెలిచిన జట్లలో సభ్యులుగా ఉన్నారు. ఇద్దరూ లెజెండరీ కెప్టెన్లు. కచ్చితంగా వారిద్దరూ భారత డ్రెస్సింగ్ రూమ్‌లో భాగం కావాలి" అని టెలికాం ఆసియా స్పోర్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రైనా పేర్కొన్నాడు. కాగా భవిష్యత్తులో వన్డేల్లో కూడా భారత జట్టు పగ్గాలను గిల్‌కు అప్పగించే సూచనలు కన్పిస్తున్నాయి.చదవండి: అప్పటిలా కాదు.. అన్నీ మారిపోయాయి.. కోహ్లితో మాట్లాడాలంటే..: భువీ -
అతడు సుదీర్ఘకాలం భారత క్రికెట్‌ను ఏలుతాడు: రవిశాస్త్రి
భారత టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill)పై టీమిండియా మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి (Ravi Shastri) ప్రశంసలు కురిపించాడు. సారథిగా తన ఆగమనాన్ని ఘనంగా చాటాడని.. సుదీర్ఘ కాలం పాటు భారత క్రికెట్‌ను ఏలే సత్తా అతడికి ఉందని పేర్కొన్నాడు. కాగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి దిగ్గజాల రిటైర్మెంట్ తర్వాత గిల్ టీమిండియా టెస్టు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు.ఇంగ్లండ్ పర్యటన రూపంలో తొలి ప్రయత్నంలోనే గట్టి సవాలును ఎదుర్కొన్నాడు. అయితే, సారథిగా అనుభవం లేకపోయినా ఇంగ్లండ్ గడ్డపై గిల్ మెరుగైన ఫలితాన్నే అందుకున్నాడు. ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీని 2-2తో సమం చేసుకున్నాడు.డబుల్ సెంచరీతో.. అంతేకాదు.. బ్యాటర్‌గానూ మునుపెన్నడూ లేని విధంగా అద్భుత రీతిలో రాణించిన గిల్.. ఇంగ్లండ్ గడ్డ మీద రికార్డుల మోత మోగించాడు. ముఖ్యంగా ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో డబుల్ సెంచరీ (269), సెంచరీ (161) సాధించి.. ఈ మైదానంలో టీమిండియాకు తొలి గెలుపు అందించాడు. మొత్తంగా.. 754 పరుగులు సాధించి సిరీస్ టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు.సుదీర్ఘకాలం భారత క్రికెట్‌ను ఏలుతాడుతద్వారా తనపై విమర్శలు చేసిన వాళ్ల నోళ్లు మూతపడేలా చేశాడు. ఈ నేపథ్యంలో రవిశాస్త్రి మాట్లాడుతూ.. ‘‘ఇక్కడ.. ఇంగ్లండ్‌లో ఇలాంటి సిరీస్ ఆడిన తర్వాత.. అతడి స్థానం తప్పక సుస్థిరమవుతుంది. సుదీర్ఘకాలం పాటు భారత క్రికెట్లో భాగంగా ఉంటాడు.అతడికి ఇప్పుడు 25 ఏళ్లే. ఇంకా మెరుగుపడతాడు. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో అతడి టెంపర్మెంట్ బాగుంది. నిజమైన నాయకుడిలా.. యుద్ధానికి సైన్యాన్ని సిద్ధం చేసే రాజులా పరిణతి చూపిస్తూనే.. దూకుడు ప్రదర్శించాడు. పట్టుదలగా నిలబడి సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడాడు’’ అంటూ రవిశాస్త్రి స్కై స్పోర్ట్స్‌తో వ్యాఖ్యానించాడు.గొప్పగా నడిపించాడు: యువీమరోవైపు.. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో శుబ్‌మన్ గిల్ కెప్టెన్‌గా భారత జట్టును నడిపించిన తీరుపై మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ప్రశంసలు కురిపించాడు. ఈ సిరీస్‌కు ముందు తనపై వచ్చిన విమర్శలన్నింటికీ ఒకేసారి జవాబిస్తున్నట్లుగా అతని సారథ్యం కనిపించిందని యువీ అన్నాడు. గిల్ కెప్టెన్సీ నమ్మశక్యంగా అనిపించలేదని కితాబిచ్చాడు. కెరీర్ ఆరంభంలో స్వయంగా యువీనే మెంటార్‌గా గిల్‌కు మార్గనిర్దేశనం చేశాడు.‘విదేశాల్లో గిల్ రికార్డును చాలా మంది ప్రశ్నించారు కానీ అతను కెప్టెన్ కావడంతోనే నాలుగు సెంచరీలు బాదాడు. బాధ్యతను అప్పగిస్తే దానిని మరింత సమర్థంగా నిర్వర్తించిన తీరు నమ్మశక్యం కాని రీతిలో ఉంది. భారత జట్టును చూస్తే గర్వంగా అనిపించింది. పేరుకు సిరీస్ ‘డ్రా’ అయినా నా దృష్టిలో ఇది మనం గెలిచినట్లే. పెద్దగా అనుభవం లేని జట్టు ఇంగ్లండ్‌కు వెళ్లి ఇంగ్లండ్ గడ్డపై సత్తా చాటడం అంత సులువు కాదు’ అని యువరాజ్ అభిప్రాయ పడ్డాడు. కోహ్లి, రోహిత్‌లు లేకపోవడాన్ని ఒక సవాల్‌గా తీసుకొని మన కుర్రాళ్లు సత్తా చాటారని యువీ అన్నాడు.‘సాధారణంగా యువ ఆటగాళ్లు ఇంగ్లండ్‌కు వెళ్లినప్పుడు వారిపై తీవ్ర ఒత్తిడి ఉంటుంది. కోహ్లి, రోహిత్‌లాంటి ఆటగాళ్ల స్థానాలను భర్తీ చేయడం అంత సులువు కాదు. కానీ కుర్రాళ్లు తమ బాధ్యతను సమర్థంగా నిర్వర్తించారు. నా దృష్టిలో జడేజా, సుందర్ సెంచరీలతో మాంచెస్టర్ టెస్టును ‘డ్రా’ చేసుకోవడం కీలక మలుపు. ఇలాంటిది చాలా కాలంగా నేను చూడలేదు. ఇది మన జట్టు స్థాయి ఏంటో చూపించింది. జడేజాకు అంటే చాలా అనుభవం ఉంది. కానీ యువ ఆటగాడు సుందర్ ప్రదర్శనను మాత్రం ఎంత ప్రశంసించినా తక్కువే అవుతుంది’ అని యువరాజ్ విశ్లేషించాడు. చదవండి: ‘యాడ్స్ చేయడానికే పనికివస్తారు.. కోచ్‌ల మాట అస్సలు వినరు’ -
Asia Cup 2025: వారిని కాదని గిల్‌ను ఎంపిక చేస్తారా.. జైస్వాల్, శ్రేయస్ పరిస్థితి ఏంటి..?
త్వరలో ప్రారంభం కానున్న ఆసియా కప్ కోసం భారత జట్టును మరి కొద్ది రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. జట్టు ప్రకటనకు ముందు సెలెక్టర్లు పెద్ద సైజు కసరత్తే చేస్తున్నారు. ఆటగాళ్ల ఎంపిక రొటీన్ ప్రక్రియలా లేదు. 15 బెర్త్‌ల కోసం 20 మంది అర్హులు పోటీపడుతున్నారు. ఎవరిని ఎంపిక చేయాలో, ఎవరిని వదిలేయాలో తెలీక సెలెక్టర్లు తలలు పట్టుకున్నారు.సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, అర్షదీప్, మొహమ్మద్ షమీ లాంటి టీ20 స్టార్లతో ఇప్పటికే జట్టు పటిష్టంగా ఉండగా.. కొత్తగా శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, మొహమ్మద్ సిరాజ్, బుమ్రా, వాషింగ్టన్ సుందర్ లాంటి ఆటగాళ్లను అకామడేట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో వీరంతా (శ్రేయస్ మినహా) ఆకాశమే హద్దుగా చెలరేగారు. వీరి ఫామ్‌ను బట్టి ఆసియా కప్‌కు తప్పక ఎంపిక చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీరంతా ఆసియా కప్ ఆడేందుకు సంసిద్దత కూడా వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇదివరకే సెట్ అయిన ఆటగాళ్లను కదిలిస్తారా లేక టెస్ట్ హీరోలను ఎంపిక చేస్తారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయంలో సెలెక్టర్లు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.టెస్ట్ జట్టు కెప్టెన్ గిల్, అతని గుజరాత్ టైటాన్స్ సహచరుడు కూడా అయిన సిరాజ్‌ను అకామడేట్ చేయడం వారి ముందున్న ప్రధాన సమస్య. గిల్‌ను ప్లేయింగ్ ఎలెవెన్‌లోకి తేవాలంటే సెట్ అయిన ఓపెనర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మలలో ఎవరో ఒకరిని కదిలించాలి. జట్టు ప్రయోజనాల దృష్ట్యా ఇది ఆమోదయోగ్యమైంది కాదు. ఒకవేళ కదిలించినా అది పెద్ద సాహసమే అవుతుంది.అలాగని గిల్‌ను పక్కకు పెట్టే పరిస్థితి కూడా లేదు. ఓపెనింగ్ కాకుండా వేరే ఏదైన స్థానంలో అయిన ఆడిద్దామా అంటే ఎక్కడా ఖాళీలు లేవు. బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం సెట్ అయిపోయింది. వన్ డౌన్లో తిలక్ వర్మ, నాలుగో స్థానంలో సూర్యకుమార్, ఆతర్వాత దూబే, హార్దిక్, రింకూ ఇలా బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం ఆక్రమించబడింది. వీరిలో ఏ ఒక్కరినీ కదిలించే పరిస్థితి లేదు. వీరు ఇటీవలికాలంలో అద్భుతంగా రాణించి జట్టుకు చిరస్మరణీయ విజయాలు అందించారు. పొట్టి ఫార్మాట్లో వీరందరికి తిరుగులేని కూడా రికార్డు ఉంది. ర్యాంకింగ్స్‌లో కూడా వీరు టాప్‌లో ఉన్నారు. వీరిని జట్టులో కొనసాగించడం సమంజసమే అయినప్పటికీ.. అంతే అర్హత కలిగిన గిల్, జైస్వాల్, శ్రేయస్ అయ్యర్ లాంటి ఆటగాళ్లను కూడా కాదనలేని పరిస్థితి. ఈ తల నొప్పులు బ్యాటింగ్‌కు మాత్రమే పరిమితం కాలేదు. బౌలింగ్ విభాగంలోనూ ఉన్నాయి. అయితే తీవ్రత బ్యాటింగ్‌లో ఉన్నంత లేదు. షమీ స్థానంలో బుమ్రా ఎంట్రీకి ఎలాంటి సమస్య లేనప్పటికీ.. కొత్తగా సిరాజ్‌ను అకామడేట్ చేయడమే సమస్య. అర్షదీప్, బుమ్రా ఫస్ట్ ఛాయిస్ పేసర్లు కాగా.. మూడో పేసర్ స్థానం కోసం సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ, షమీ పోటీపడుతున్నారు. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన వాషింగ్టన్ సుందర్‌కు అకామడేట్ చేయడం కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ఇబ్బందిగానే ఉంది.ఇన్ని తలనొప్పుల మధ్య సెలెక్టర్లు ఎవరెవరిని ఎంపిక చేస్తారో అన్నది ఆసక్తికరంగా మారింది. ఆగస్ట్ 19న జట్టును ప్రకటించే అవకాశం ఉంది. -
గిల్ ఒక అత్యద్బుతం.. వారిద్దరూ కూడా నిజంగా గ్రేట్: యువరాజ్
ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో కెప్టెన్‌గా, బ్యాటర్‌గా గిల్ వందకు వంద మార్క్‌లు కొట్టేశాడు. కెప్టెన్‌గా తన తొలి సిరీస్‌లోనే అందరని ఆకట్టుకున్నాడు.అతడి సారథ్యంలోని భారత జట్టు ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-2 సమం చేసింది. అదేవిధంగా ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో గిల్ 754 లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో గిల్‌పై టీమిండియా లెజెండరీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇంగ్లండ్ వంటి కఠిన పరిస్థితుల్లో జట్టును బాగా నడిపించాడని గిల్‌ను యువీ కొనియాడాడు. కాగా గిల్ రోల్ మోడల్ యువీనే కావడం విశేషం."ఇంగ్లండ్ టూర్‌కు ముందు గిల్ విదేశీ రికార్డులపై ఎన్నో సందేహాలు, ప్రశ్నలు ఉండేవి. కానీ వాటిన్నటిని ఒక్క సిరీస్‌తో చెరిపేశాడు. కెప్టెన్ అయ్యాక అతడు ఇంగ్లండ్ వంటి కఠిన పరిస్థితుల్లో ఏకంగా నాలుగు టెస్టు సెంచరీలు చేశాడు. కెప్టెన్‌గా తన తొలి టెస్టు సిరీస్‌లో ఈ విధమైన ప్రదర్శన కనబరిచడం నిజంగా అత్యద్బుతం. ఓవల్‌లో చారిత్రత్మక విజయం సాధించిన భారత జట్టు పట్ల చాలా గర్వంగా ఉంది. డ్రా అయినప్పటికి సిరీస్ మనదేనని భావిస్తున్నాను. ఎందుకంటే ఇది యువ భారత జట్టు. ఇంగ్లండ్ వంటి జట్టుతో సిరీస్ డ్రా చేయడం అంత సులువు కాదు. అదేవిధంగా జడేజా, వాషింగ్టన్ సుందర్‌లు కూడా అద్బుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. చాలా రోజుల తర్వాత ఇద్దరూ భారత బ్యాటర్లు సెంచరీలు చేసి మ్యాచ్‌ను డ్రా ముగించడం చూశాను. జడేజా ఎప్పటి నుంచో జట్టుకు తన సేవలను అందిస్తున్నాడు. కానీ సుందర్ మాత్రం ఈ తరహా ప్రదర్శన చేయడం చాలా గ్రేట్" అని యువరాజ్ ఐసీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.చదవండి: కెప్టెన్‌గా రుతురాజ్‌పై వేటు.. జట్టులో పృథ్వీషాకు చోటు -
'టీమిండియా మూడు ఫార్మాట్ల కెప్టెన్‌గా అతడే సరైనోడు'
భారత పురుషుల క్రికెట్ జట్టుకు మూడు ఫార్మాట్లలో వెర్వేరు కెప్టెన్లు ఉన్న సంగతి తెలిసిందే. వన్డేల్లో రోహిత్ శర్మ, టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్, టెస్టుల్లో శుబ్‌మన్ గిల్ టీమిండియా సారథిలుగా ఉన్నారు. రోహిత్ శర్మ టీ20, టెస్టుల నుంచి రిటైర్ కావడంతో ఈ మార్పులు చోటు చేసుకున్నాయి. తాజాగా ఈ ముగ్గురు కెప్టెన్ల విధానంపై బీసీసీఐ మాజీ సెలెక్టర్ దేవాంగ్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. టీమిండియాకు మూడు ఫార్మాట్లలో కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్‌ను ఎంపిక చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు."ప్రస్తుతం శుబ్‌మన్ గిల్‌ను చూస్తుంటే 2017లో విరాట్ కోహ్లిలా కన్పిస్తున్నాడు. లెజెండరీ కెప్టెన్ ఎంఎస్ ధోని హయంలో విరాట్ బాగా రాటు దేలాడు. ఆ తర్వాత అతడి వారుసుడిగా కోహ్లి భారత జట్టు పగ్గాలు చేపట్టాడు. ఇప్పుడు గిల్ కూడా విరాట్ లాగే రోహిత్ సారథ్యంలో అత్యున్నత స్థాయికి చేరుకున్నాడు. టెస్ట్ కెప్టెన్‌గా గిల్‌ను నియమించి చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తన ముందుచూపును చాటుకున్నాడు. టీ20 ఫార్మాట్‌కు కూడా గిల్ సరిపోతాడు. 2026 టీ20 ప్రపంచకప్ తర్వాత సూర్యకుమార్ యాదవ్‌కు బదులుగా ఎవరు కెప్టెన్సీ తీసుకుంటారనే దానిపై బీసీసీఐ స్పష్టమైన సంకేతాలు ఇవ్వాలి.ఇతర దేశాలు మాదిరిగా భారత్‌లో స్ప్లిట్ కెప్టెన్సీ దీర్ఘకాలంలో పనిచేయదు. అన్ని ఫార్మాట్లలో అద్భుతంగా రాణిస్తున్న ఒక ఆటగాడు ఒక ఫార్మాట్‌కు కెప్టెన్‌గా ఉన్నప్పుడు, మిగిలిన ఫార్మాట్లకు కూడా అతనే నాయకత్వం వహించాలి. గిల్ బ్యాటర్‌గా కూడా రాణించాడు.అంతేకాకుండా ఐపీఎల్లో కూడా అతడు సారథ్యం వహించాడు" అని టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గాంధీ పేర్కొన్నాడు. కాగా రోహిత్ శర్మ భారత వన్డే జట్టు కెప్టెన్‌గా గిల్ ఎంపికయ్యే సూచనలు కన్పిస్తున్నాయి.చదవండి: Asia Cup 2025: సంజూ శాంసన్‌కు నో ఛాన్స్..? ఆర్సీబీ స్టార్‌కు చోటు? -
బాబర్ ఆజం రికార్డు బద్దలుకొట్టిన శుబ్‌మన్ గిల్
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం (Babar Azam) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును టీమిండియా టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) బద్దలు కొట్టాడు. అత్యధికసార్లు ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్ (ICC Player Of The Month)’ అవార్డును గెలిచిన ఆటగాడిగా కొనసాగుతున్న బాబర్‌ను వెనక్కినెట్టి.. సరికొత్త చరిత్ర సృష్టించాడు. కాగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ప్రతీ నెలా ప్రకటించే ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’ జూలై నెలకు గానూ గిల్ గెలుచుకున్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో అద్భుత ప్రదర్శన అతడిని జూలై నెల అవార్డుకు అర్హుడిగా మార్చింది. 754 పరుగులుఐదు టెస్టుల ఈ సిరీస్‌లో మొత్తం 754 పరుగులు చేసిన గిల్... అవార్డుకు పరిగణనలోకి తీసుకున్న జూలై నెలలో 3 టెస్టుల్లో కలిపి 567 పరుగులు సాధించాడు. ఇందులో బర్మింగ్‌హామ్‌లో జరిగిన రెండో టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లలో చేసిన 269, 161 (మొత్తం 430) పరుగుల ప్రదర్శన గిల్ కెరీర్లో హైలైట్‌గా నిలిచింది.ఐసీసీ అవార్డుకు ఎంపికైనందుకు సంతోషం వ్యక్తం చేసిన గిల్... ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో తాను ఆడిన 269 పరుగుల ఇన్నింగ్స్ ఎప్పటికీ తనకు మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుందని వ్యాఖ్యానించాడు. ఎప్పటికీ మర్చిపోలేనిది‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్‌గా ఎంపిక కావడం సంతోషంగా ఉంది. కెప్టెన్‌గా తొలి టెస్టు సిరీస్‌లో ప్రదర్శనకుగాను నాకు గుర్తింపు దక్కడం దీనిని మరింత ప్రత్యేకంగా మార్చింది. బర్మింగ్‌హామ్‌లో చేసిన డబుల్ సెంచరీ ఎంతో ప్రత్యేకమైంది. ఎప్పటికీ మర్చిపోలేనిది.ఇంగ్లండ్‌తో సిరీస్ కెప్టెన్‌గా నేను ఎంతో నేర్చుకునే అవకాశం కల్పించింది. ఇరు జట్లు చాలా బాగా ఆడాయి. ఆటగాళ్లందరికీ కూడా ఇది చిరస్మరణీయం. మున్ముందు ఇదే తరహా ప్రదర్శనను కొనసాగిస్తాను’ అని గిల్ స్పందించాడు. ఇదిలా ఉంటే.. ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’ అవార్డు పొందడం గిల్‌కిది నాలుగోసారి. 2023 జనవరిలో, సెప్టెంబర్‌లో... 2025 జనవరిలో, జూలైలో గిల్‌కు ఈ అవార్డు దక్కింది. ఈ క్రమంలోనే అత్యధికసార్లు ఈ అవార్డు నెగ్గిన మేల్ క్రికెటర్‌గా.. అదే విధంగా.. ఒకే ఏడాదిలో రెండుసార్లు అవార్డు గెలిచిన తొలి ప్లేయర్‌గా గిల్ నిలిచాడు.అత్యధికసార్లు ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు గెలిచిన పురుష క్రికెటర్లు వీరే1. శుబ్‌మన్ గిల్- ఇండియా- నాలుగుసార్లు విజేత2. బాబర్ ఆజం- పాకిస్తాన్- మూడుసార్లు విజేత3. శ్రేయస్ అయ్యర్- ఇండియా- రెండుసార్లు విజేత4. షకీబ్ అల్ హసన్- బంగ్లాదేశ్- రెండుసార్లు విజేత5. హ్యారీ బ్రూక్- ఇంగ్లండ్- రెండుసార్లు విజేత6. కమిందు మెండిస్- శ్రీలంక- రెండుసార్లు విజేత7. జస్ప్రీత్ బుమ్రా- ఇండియా- రెండుసార్లు విజేత8. ముహమ్మద్ వసీం- యూఏఈ- రెండుసార్లు విజేత.చదవండి: IPL 2026: ‘ఈసారి వేలంలో ఖరీదైన ప్లేయర్‌గా అతడే’ -
ఆ డబుల్ సెంచరీ గుర్తుండిపోతుంది.. కెప్టెన్ హోదాలో ఇలా..: గిల్
టీమిండియా టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill)కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) అవార్డు లభించింది. జూలై నెలకు గానూ అతడు ‘ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ (ICC Player Of The Month)’ అవార్డు గెలుచుకున్నాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ సిరీస్‌లో అదరగొట్టడం ద్వారా గిల్‌కు ఈ గౌరవం దక్కింది.భారీ డబుల్ సెంచరీఇంగ్లండ్ పర్యటనలో భాగంగా భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా యువ క్రికెటర్ శుబ్‌మన్ గిల్ పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో శతక్కొట్టి (147)న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. బర్మింగ్‌హామ్‌లో ఏకంగా భారీ డబుల్ సెంచరీ (269), సెంచరీ (161) సాధించి ఈ వేదికపై భారత్‌కు తొలి గెలుపు అందించాడు.అంతేకాకుండా.. మాంచెస్టర్‌లో జరిగిన నాలుగో టెస్టులో మరోసారి శతకం (103) బాది ఈ మ్యాచ్‌ను టీమిండియా డ్రా చేసుకోవడంలో గిల్ తన వంతు పాత్ర పోషించాడు. ఇక ఆఖరిదైన ఐదో టెస్టులో బ్యాటర్‌గా విఫలమైనా.. కెప్టెన్‌గా విజయం సాధించి.. సిరీస్‌ను 2-2తో సమం చేయగలిగాడు.754 పరుగులుఇక ఇంగ్లండ్‌తో ఓవరాల్‌గా ఐదు టెస్టుల సిరీస్‌లో శుబ్‌మన్ గిల్.. పది ఇన్నింగ్స్‌లో కలిపి 754 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో జూలై నెలకు గానూ ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డుకు అతడు నామినేట్ అయ్యాడు. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్, సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ వియాన్ ముల్దర్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్న గిల్.. ఎట్టకేలకు వీరిద్దరిని అధిగమించి అవార్డును సొంతం చేసుకున్నాడు.నాలుగోసారి.. అత్యంత మధురమైన క్షణం అదేకాగా 25 ఏళ్ల గిల్ ఈ పురస్కారం అందుకోవడం ఇది నాలుగోసారి. ఈ నేపథ్యంలో గిల్ స్పందిస్తూ.. ‘‘జూలై నెలకు గానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు అందుకోవడం గొప్పగా అనిపిస్తోంది. ఈసారి టీమిండియా టెస్టు కెప్టెన్ హోదాలో.. నా ప్రదర్శనకు గానూ ఈ పురస్కారం అందుకోవడం ఇంకా సంతోషంగా ఉంది.బర్మింగ్‌హామ్‌లో డబుల్ సెంచరీ సాధించడం ఇంగ్లండ్ పర్యటన మొత్తంలో నాకు అత్యంత మధురమైన క్షణం. ఇంగ్లండ్ గడ్డ మీద కెప్టెన్‌గా జట్టును ముందుకు నడిపించడం గొప్ప అనుభవం. ఇరుజట్లు అద్భుత పోరాట పటిమ కనబరిచాయి.నాకు ఈ అవార్డు దక్కేలా చేసిన జ్యూరీ మెంబర్లకు ధన్యవాదాలు. అదే విధంగా.. సిరీస్ ఆసాంతం అద్భుత ప్రదర్శన కనబరిచిన నా సహచర ఆటగాళ్లకు శుభాకాంక్షలు. దేశం కోసం మరింత గొప్పగా ఆడేందుకు నేను ఎదురుచూస్తున్నాను’’ అని గిల్ ఉద్వేగపూరిత వ్యాఖ్యలు చేశాడు. కాగా ఐసీసీ ఓటింగ్ అకాడమీతో పాటు ఆన్లైన్ ద్వారా వచ్చే అభిమానుల ఓట్ల ఆధారంగా ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు విజేతను నిర్ణయిస్తారు.చదవండి: AUS vs SA: బేబీ ఏబీడీ విధ్వంసకర శతకం.. తొలి ‘ఫాస్టెస్ట్ సెంచరీ’తో.. -
భారత స్టార్ ప్లేయర్‌కు షాక్.. శుబ్‌మన్ గిల్‌కు ప్రమోషన్..!
ఆసియాకప్-2025 సెప్టెంబర్ 9 నుంచి యూఈఏ వేదికగా ప్రారంభం కానుంది. 8 జట్లు పాల్గోనే ఈ మెగా టోర్నీకి యూఏఈలోని దుబాయ్, అబుదాబిలు ఆతిథ్యమివ్వనున్నాయి. ఈ మెగా ఈవెంట్‌కు భారత జట్టును బీసీసీఐ వచ్చే వారం ప్రకటించే అవకాశముంది. ఇప్పటికే అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ జట్టు ఎంపికపై కసరత్తలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.సూర్యకుమార్ ఫిట్..?గత నెలలో స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ చేయించుకున్న టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టోర్నీ ఆరంభ సమయానికి పూర్తి ఫిట్నెస్ సాధించనున్నాడు. దీంతో ఈ ఏడాది ఆసియాకప్‌లో భారత జట్టుకు సూర్యనే సారథ్యం వహించనున్నాడు. అయితే ఇంగ్లండ్ పర్యటనలో భారత జట్టును అద్భుతంగా నడిపించిన టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌కు ప్రమోషన్ ఇచ్చేందుకు సెలక్టర్లు సిద్దమైనట్లు సమాచారం. గిల్‌ను భారత టీ20 జట్టు వైస్ కెప్టెన్‌గా నియమించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆసియాకప్‌లో సూర్యకు డిప్యూటీగా గిల్ వ్యవహరించే సూచనలు కన్నిస్తున్నాయి.అక్షర్‌కు షాక్..?కాగా ప్రస్తుతం భారత టీ20 జట్టు కెప్టెన్‌గా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ఉన్నాడు. రోహిత్ శర్మ టీ20ల నుంచి తప్పుకొన్న తర్వాత సూర్య కెప్టెన్‌గా, అక్షర్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అయితే ఏడాది తిరగక ముందే అక్షర్‌పై వేటు వేసేందుకు బీసీసీఐ సిద్దమైంది. గిల్‌ను ఆల్‌ఫార్మాట్ కెప్టెన్‌గా చేసేందుకు బీసీసీఐ యోచిస్తున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. గిల్ ప్రస్తుతం వన్డేల్లో రోహిత్ శర్మ డిప్యూటీగా ఉన్నాడు. ఒకవేళ హిట్‌మ్యాన్ వన్డేల నుంచి తప్పుకొంటే 50 ఓవర్ల ఫార్మాట్లో కూడా ఈ పంజాబీ బ్యాటర్ భారత జట్టును నడిపించే అవకాశముంది. కాగా గిల్ చివరగా భారత తరపున టీ20ల్లో గతేడాది శ్రీలంకపై ఆడాడు. కానీ ఐపీఎల్లో మాత్రం దుమ్ములేపాడు. ఐపీఎల్-2025 సీజన్లో 650 పరుగులతో గుజరాత్ తరపున లీడింగ్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు.చదవండి: మహేశ్ బాబు మరదలితో సచిన్ ప్రేమ?!.. టెండుల్కర్ ఏమన్నాడంటే.. -
ఆసియాకప్-2025కు శుబ్‌మన్ గిల్ దూరం!?
ఆసియాకప్-2025కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. మరో నెల రోజుల్లో యూఏఈ వేదికగా ఈ మెగా టోర్నీ షూరూ కానుంది. సెప్టెంబర్ 9న అబుదాబి వేదికగా తొలి మ్యాచ్‌లో హాంకాంగ్, అఫ్గానిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఈ ఆసియా సింహాల పోరు కోసం బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డులు తమ ప్రాథిమిక జట్లను ప్రకటించాయి.బీసీసీఐ సెలక్షన్ కమిటీ కూడా వచ్చే వారం భారత జట్టును ప్రకటించే అవకాశముంది. అయితే ఈ టోర్నీ కోసం భారత జట్టులో టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌ను చేర్చాలా వద్దా అని సెలక్టర్లు తర్జబర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. వెస్టిండీస్‌తో జరగనున్న టెస్ట్ సిరీస్‌ను దృష్టిలో ఉంచుకుని గిల్‌కు విశ్రాంతి ఇవ్వాలని అజిత్ అగార్కర్ అండ్ కో భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.కాగా ఆసియాకప్ ముగిసిన నాలుగు రోజులకే భారత్-వెస్టిండీస్ మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. అయితే ఆసియాకప్‌నకు గిల్‌కు విశ్రాంతి ఇచ్చి టీ20 వరల్డ్ కప్-2026లో అతడిని ఆడించాలని సెలక్టర్లు యోచిస్తున్నట్లు ది టెలిగ్రాఫ్ తమ కథనంలో పేర్కొంది.కాగా గిల్ వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు ముందు దులీప్ ట్రోఫీ-2025లో ఆడనున్నాడు. నార్త్‌జోన్ కెప్టెన్‌గా శుబ్‌మన్ వ్యవహరించనున్నాడు. కాగా గిల్ ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో కెప్టెన్‌గా, వ్యక్తిగత ప్రదర్శనంగా పరంగా ఆకట్టుకున్నాడు.ఐదు మ్యాచ్‌లలో 75.40 సగటుతో 754 పరుగులు చేసి గిల్ ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్‌గా నిలిచాడు. ఇక ఆసియాకప్‌లో భారత్ తమ తొలి మ్యాచ్‌లో సెప్టెంబర్ 10న దుబాయ్ వేదికగా యూఏఈతో తలపడనుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 14న దాయాది పాకిస్తాన్‌తో మెన్ ఇన్ బ్లూ అమీతుమీ తెల్చుకోనుంది.చదవండి: శుబ్‌మన్ గిల్ జెర్సీ కోసం పోటీ.. ఎన్ని లక్షలకు అమ్ముడుపోయిందంటే? -
ప్రమాదంలో శుభ్‌మన్ గిల్ టాప్ ర్యాంక్
ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత టెస్ట్ జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ టాప్ ర్యాంక్ ప్రమాదంలో పడింది. ఈ స్థానం కోసం పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ కాచుకు కూర్చున్నాడు. ప్రస్తుతం గిల్, రెండో ర్యాంకర్ బాబర్ మధ్య కేవలం 18 రేటింగ్ పాయింట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది. గిల్‌కు అక్టోబర్ వరకు వన్డే మ్యాచ్ ఆడే అవకాశం లేకపోగా.. బాబర్ ప్రస్తుతం విండీస్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడుతున్నాడు.ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో బాబర్ ఓ మోస్తరు ప్రదర్శనతో రాణించాడు. 64 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్ సాయంతో 47 పరుగులు చేశాడు. ఈ ప్రదర్శనతో బాబర్ రేటింగ్ పాయింట్లు మెరుగుపడే అవకాశం ఉంది. మిగతా రెండు వన్డేల్లో బాబర్ ఇలాంటి ప్రదర్శనలే చేసిన సిరీస్ ముగిసే సమయానికి ఐసీసీ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో శుభ్‌మన్ గిల్‌ను కిందికి దించి అగ్రపీఠాన్ని అధిరోహిస్తాడు.గిల్ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఒక్క వన్డే కూడా ఆడకపోగా.. బాబర్ ఈ మధ్యలో పలు మ్యాచ్‌లు ఆడాడు. ప్రస్తుతం ర్యాంకింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ అగ్రస్థానంలో ఉండగా.. బాబర్ ఆజమ్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, డారిల్ మిచెల్ వరుసగా టాప్-5లో ఉన్నారు.ఇదిలా ఉంటే, తాజాగా విండీస్‌తో జరిగిన వన్డేలో పాక్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించి, మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో బోణీ కొట్టింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్.. షాహీన్ అఫ్రిది (8-0-51-4), నసీం షా (8-0-55-3) ధాటికి 49 ఓవర్లలో 280 పరుగులకు ఆలౌటైంది. విండీస్ ఇన్నింగ్స్‌లో ఎవిన్ లూయిస్ (60), షాయ్ హోప్ (55), రోస్టన్ ఛేజ్ (53) అర్ద సెంచరీలతో రాణించారు.అనంతరం బరిలోకి దిగిన పాక్.. బాబర్ ఆజమ్ (47), మొహమ్మద్ రిజ్వాన్ (53), హసన్ నవాజ్ (63 నాటౌట్), హుస్సేన్ తాలత్ (41 నాటౌట్) రాణించడంతో 48.5 ఓవరల్లో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. విండీస్ బౌలర్లలో షమార్ జోసఫ్ 2, జేడన్ సీల్స్, గుడకేశ్ మోటీ, రోస్టన్ ఛేజ్ తలో వికెట్ తీశారు. ఈ సిరీస్‌లో రెండో వన్డే ఇవాళ (ఆగస్ట్ 10) రాత్రి 11:30 గంటలకు ప్రారంభమవుతుంది. -
శుబ్‌మన్ గిల్ జెర్సీ కోసం పోటీ.. ఎన్ని లక్షలకు అమ్ముడుపోయిందంటే?
ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టులో టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ ధరించిన జెర్సీ నంబర్ 77 భారీ ధరకు అమ్ముడు పోయింది. ఈ మ్యాచ్ అనంతరం గిల్ తన జెర్సీని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఆండ్రూ స్ట్రాస్ ఫౌండేషన్ - రెడ్ రూత్ ఛారిటీకి ఇచ్చాడు. తాజాగా ఈ జెర్సీని బడ్స్ వేలంలో 4,600 పౌండ్ల(భారత కరెన్సీలో సుమారు 5.41 లక్షలు)కు కొనుగోలు చేశారు.ఆ మ్యాచ్‌లో సేకరించిన అన్ని వస్తువులలోకంటే గిల్ జెర్సీకే అత్యధిక మొత్తం లభించింది. ఇందులో రెండు జట్ల ఆటగాళ్లు సంతకం చేసిన జెర్సీ, క్యాప్‌లు కూడా ఉన్నాయి. కాగా లార్డ్స్ టెస్టులో రెడ్ రూత్ ఛారిటీకి మద్దతుగా ఇరు జట్ల ఆటగాళ్లు రెండో రోజు ఆటలో ఎర్రటి క్యాప్‌లు ధరించి బరిలోకి దిగారు.అప్పుడు సేకరించిన వస్తువులను తాజాగా రూత్ స్ట్రాస్ ఫౌండేషన్‌కు నిధుల సేకరణ కోసం వేలం నిర్వహించారు. ఈ వేలంలో గిల్ జెర్సీతో పాటు జస్ప్రీత్ బుమ్రా ,రవీంద్ర జడేజా జెర్సీలు కూడా భారీ మొత్తానికి అమ్ముడయ్యాయి. బుమ్రా, జడేజాల జెర్సీలు ఒక్కొక్కటి రూ.4 లక్షల 43 వేలకు సొంతం చేసుకున్నారు.అదేవిధంగా టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్, ఇంగ్లండ్ సీనియర్ ఆటగాడు కేఎల్ రాహుల్ జెర్సీలకు కూడా అభిమానుల నుంచి భారీ స్పందన లభించింది. రాహుల్ జెర్సీ రూ. 4.71 లక్షలకు అమ్ముడుపోగా.. రూట్ జెర్సీకి రూ.4.47 లక్షలు దక్కింది. కాగా ఇంగ్లండ్ గడ్డపై శుబ్‌మన్ గిల్ అదరగొట్టాడు. ఐదు మ్యాచ్‌లలో 75.40 సగటుతో 754 పరుగులు చేసి గిల్ ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్‌గా నిలిచాడు. అంతేకాకుండా కెప్టెన్‌గా తన సిరీస్‌లోనే అందరిని ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో గిల్ జెర్సీకి భారీ మొత్తం లభించింది.ఏంటీ రూత్ ఫౌండేషన్..ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఆండ్రూ స్ట్రాస్ భార్య రూత్ స్ట్రాస్ స్మారకార్థం నిర్వహిస్తున్నారు. స్మోకింగ్‌కు వ్యతిరేకంగా ప్రచారం కల్పించడం, క్యాన్సర్ బాధితుల్లో అవగాహన పెంచడం సహా వ్యాధి తీవ్రతరమైన వారి కుటుంబాలకు ఎమోషనల్ సపోర్టునివ్వడంలో తోడ్పడటం ఈ ఫౌండేషన్ ధ్యేయం. అతడి భార్య ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో ప్రాణాలు విడిచిన విషయం తెలిసిందే.చదవండి: NZ vs ZIM: చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్.. టెస్టుల్లో అతి పెద్ద విజయం! -
IND vs ENG: 500కు పైగా పరుగులు చేశాడు.. సంకుచిత బుద్ధి!
ఐపీఎల్ ఫ్రాంఛైజీ లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మరోసారి విమర్శల పాలైంది. ‘‘ఇంత సంకుచిత బుద్ధి ఎందుకు?. అసలు మిమ్మల్ని ఎవరు ఆ పోస్టు పెట్టమన్నారు’’ అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. విషయం ఏమిటంటే.. టీమిండియా ఇటీవల ఇంగ్లండ్ (IND vs ENG)తో ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ ఆడిన విషయం తెలిసిందే.ఇంగ్లండ్ గడ్డ మీద జరిగిన ఈ ఐదు టెస్టుల సిరీస్‌ను భారత జట్టు 2-2తో సమం చేసింది. టీమిండియా టెస్టు కెప్టెన్‌గా తొలి ప్రయత్నంలోనే బ్యాటర్‌గా చిరస్మరణీయ రికార్డులు సాధించిన శుబ్‌మన్ గిల్ (Shubman Gill).. సారథిగానూ మంచి మార్కులే కొట్టేశాడు. మరోవైపు.. వైస్ కెప్టెన్ రిషభ్ పంత్, యశస్వి జైస్వాల్‌లతో పాటు పేసర్లు మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్ కూడా అదరగొట్టారు.నిలకడగా రాణించిన ఏకైక ఆటగాడుఅయితే, ఈ సిరీస్ ఆసాంతం నిలకడగా రాణించిన ఆటగాడు ఎవరైనా ఉన్నారా అంటే.. అది ఓపెనింగ్ బ్యాటర్ కేఎల్ రాహుల్. ఐదు టెస్టుల్లో కలిపి 53.20 సగటుతో ఈ కర్ణాటక ఆటగాడు 532 పరుగులు సాధించాడు. ఇందులో రెండు శతకాలు, రెండు అర్ధ శతకాలు ఉన్నాయి.హెడింగ్లీలో తొలి టెస్టులో 137 పరుగులు సాధించిన కేఎల్ రాహుల్.. లార్డ్స్‌లో 100 పరుగులు చేశాడు. ఇక ఎడ్జ్‌బాస్టన్‌లో 55, ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానంలో 90 పరుగులు సాధించాడు. ఓవరాల్‌గా ఈ సిరీస్‌లో శుబ్‌మన్ గిల్ (754), జో రూట్ (537) తర్వాత మూడో టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు.రాహుల్ ఫొటో లేకుండానే..అసలు విషయానికి వస్తే.. లక్నో సూపర్ జెయింట్స్ తమ సోషల్ మీడియా ఖాతాలో శుక్రవారం ఓ పోస్టు పెట్టింది. ‘‘యుగాల పాటు నిలిచిపోయే ఫొటో ఆల్బమ్’’ అంటూ టీమిండియా ఆటగాళ్లతో కూడిన ఫొటోలను షేర్ చేసింది. అయితే, ఇందులో ఎక్కడా కేఎల్ రాహుల్ లేడు.ఒక్కటీ దొరకలేదా?ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్, కర్ణాటకకు చెందిన దొడ్డ గణేశ్ లక్నో యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘‘ఇలా చేయడం అస్సలు బాలేదు. చాలా ఇబ్బందికరంగా అనిపిస్తోంది.ఓపెనర్‌గా వచ్చి కొత్త బంతిని ఎదుర్కొని 500కు పైగా పరుగులు చేసిన ఆటగాడి ఫొటో మాత్రం మీకు దొరకలేదా?’’ అంటూ దొడ్డ గణేశ్ ప్రశ్నించాడు. నెటిజన్లు ఇందుకు స్పందిస్తూ.. ‘‘అంతే సార్.. వాళ్లకు గొప్పగా ఆడినవాళ్లు కనబడరు. అయినా లక్నోకు ఇలా చేయడం అలవాటే. వాళ్ల ఓనర్ సంజయ్ గోయెంకానే వారికి ఆదర్శం’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.గతేడాది లక్నోను వీడిన రాహుల్కాగా ఐపీఎల్-2022 సందర్భంగా క్యాష్ రిచ్ లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఎల్ఎస్జీకి కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. మూడేళ్లపాటు అదే జట్టుతో కొనసాగిన అతడు రెండుసార్లు జట్టును ప్లే ఆఫ్స్‌నకు చేర్చాడు. అయితే, గతేడాది లక్నో పేలవ ప్రదర్శన నేపథ్యంలో సంజీవ్ గోయెంకా అందరిముందే కేఎల్ రాహుల్‌ను తిట్టడం విమర్శలకు దారితీసింది. అనంతరం రాహుల్ జట్టును వీడి.. ఢిల్లీ క్యాపిటల్స్‌లో చేరాడు.అయితే, టీమిండియా తరఫున అతడు గొప్పగా చాటినా లక్నో తమ సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేసే ఫొటోల్లో అతడిపై వివక్ష చూపించడం.. వారి సంకుచిత బుద్ధికి నిదర్శనం అని కేఎల్ రాహుల్ అభిమానులు మండిపడుతున్నారు.చదవండి: చెవికి అతికించి.. ఛీ!.. ఇలా చేశావేంటి?.. హ్యారీ బ్రూక్ చర్య వైరల్This is getting embarrassing. Couldn’t get a picture of an opener who played the new ball and scored 500+ runs 🤷♂️ https://t.co/fGhFFuOWi3— Dodda Ganesh | ದೊಡ್ಡ ಗಣೇಶ್ (@doddaganesha) August 8, 2025 -
అదొక హేయమైన చర్య: టీమిండియా మేనేజ్మెంట్పై మాజీ క్రికెటర్ ఫైర్
టీమిండియా యాజమాన్యం తీరుపై భారత మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు (Navjot Singh Sidhu) ఆగ్రహం వ్యక్తం చేశాడు. గాయంతో బాధపడుతున్న ఆటగాడిపై కనికరం చూపకపోవడం ఏమిటని ప్రశ్నించాడు. కొంతమంది ఆటగాళ్లను బెంచ్‌కే పరిమితం చేసి.. మరికొందరిని మాత్రం రేసు గుర్రాల్లా ఎందుకు పరుగెత్తిస్తున్నారంటూ మండిపడ్డాడు.అసలేం జరిగిందంటే.. ఇంగ్లండ్ (IND vs ENG)తో చావోరేవో తేల్చుకోవాల్సిన ఐదో టెస్టులో టీమిండియా ఆఖరి వరకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిన విషయం తెలిసిందే. ఓవల్ టెస్టులో భారత్ విధించిన 374 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ బ్యాటర్లు జో రూట్ (105), హ్యారీ బ్రూక్ (111) శతకాలతో చెలరేగి తమ జట్టును పటిష్ట స్థితిలో నిలిపారు.ఇంజక్షన్ తీసుకున్నావా?ఆరంభంలోనే ఈ జోడీని విడదీసేందుకు భారత బౌలర్లు ఎంత కష్టపడినా ఫలితం దక్కలేదు. ఈ తరుణంలో కెప్టెన్ శుబ్‌మన్ గిల్.. పేసర్ ఆకాశ్ దీప్‌ను ఉద్దేశించి.. ‘‘ఇంజక్షన్ తీసుకున్నావా’’ అంటూ ఆరా తీయడం స్టంప్ మైకులో రికార్డయింది. కాగా వెన్నునొప్పి వల్ల నాలుగో టెస్టుకు దూరమైన ఈ రైటార్మ్ పేసర్‌కు.. ఐదో టెస్టులోనూ కాలికి గాయమైంది. అయినా సరే అతడిని ఆటలో కొనసాగించారు.ఎట్టకేలకు ఆఖరిదైన ఐదో రోజు టీమిండియా విజయానికి నాలుగు వికెట్లు అవసరం కాగా.. మహ్మద్ సిరాజ్ మూడు, ప్రసిద్ కృష్ణ ఒక వికెట్ తీసి జట్టును గెలిపించారు. ఈ పరిణామాల నేపథ్యంలో నవజ్యోత్ సింగ్ సిద్ధు మాట్లాడుతూ.. ‘‘ఆకాశ్ దీప్ ఇంజక్షన్ తీసుకున్నాడా? లేదా? అన్న విషయం గురించి అడిగినట్లు ఇంగ్లిష్ కామెంట్రీలో స్పష్టంగా వినిపించింది.హేయమైన చర్యఓ బౌలర్‌కు ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత కూడా టెస్టు మ్యాచ్ ఆడిస్తున్నారా? ఫిట్‌గా ఉన్న లెఫ్టార్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను మాత్రం బెంచ్ మీదే ఉంచుతారు. ఆకాశ్ బదులు అతడిని ఎందుకు ఆడించరు?పూర్తి ఫిట్‌గా లేని ఆటగాడితో బరిలోకి దిగడం నేరం లాంటిదే. హేయమైన తప్పిదం. మీ జట్టులోని మరో ఇద్దరు బౌలర్లు పూర్తి ఫిట్‌గా ఉన్నా వారిని ఆడించరు. రేసుగుర్రాల్లా మిగతావారిని పరిగెత్తిస్తారు.సిరాజ్‌కు విశ్రాంతే లేదుసిరాజ్ను కూడా మీరు వరుస మ్యాచ్‌లలో వాడుకున్నారు. అతడు కూడా పూర్తిగా అలసిపోయాడు. అదే ఇంగ్లండ్ జట్టును చూడండి. వాళ్లు నలుగురు పేస్ బౌలర్లను ఆడించారు. అందులో ఒక్కరు గాయపడినా.. మిగతా ముగ్గురు బాగానే ఉన్నారు.మీకు మాత్రం ముగ్గురంటే ముగ్గురే బౌలర్లు. అందులో ఒకరు సగం సగం ఫిట్‌గా ఉంటారు. అయినా ఇందులో ఆకాశ్ దీప్ తప్పేం లేదు’’ అని నవజ్యోత్ సింగ్ సిద్ధు టీమిండియా మేనేజ్మెంట్ తీరును విమర్శించాడు. ఇదిలా ఉంటే.. పనిభారం తగ్గించే దృష్ట్యా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాను ఇంగ్లండ్‌లో ఐదింట కేవలం మూడు మ్యాచ్‌లలోనే యాజమాన్యం ఆడించింది.వారిద్దరు ఒక్క మ్యాచ్ ఆడకుండానే..మరోవైపు.. సిరాజ్ మాత్రం ఐదింటిలోనూ ఆడి వెయ్యికి పైగా బంతులు వేసి 23 వికెట్లు కూల్చాడు. ఇక.. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాకపోగా.. అర్ష్‌దీప్ సింగ్ టెస్టు అరంగేట్రం కూడా వాయిదా పడింది. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీని టీమిండియా 2-2తో సమం చేసింది. చదవండి: చెవికి అతికించి.. ఛీ!.. ఇలా చేశావేంటి?.. హ్యారీ బ్రూక్ చర్య వైరల్ -
ఆ జట్టు కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్
టీమిండియా టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్(Shubman Gill) కీలక నిర్ణయం తీసుకున్నాడు. దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీలో ఆడేందుకు గిల్ సిద్దమయ్యాడు. స్వదేశంలో వెస్టిండీస్, సౌతాఫ్రికాలతో టెస్టు సిరీస్‌లను దృష్టిలో పెట్టుకుని గిల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నార్త్‌జోన్ కెప్టెన్‌గా గిల్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. తాజాగా ప్రకటించిన జట్టులో గిల్‌తో పాటు యువ పేసర్లు అర్ష్‌దీప్, హర్షిత్ రాణా, అన్షుల్ కాంబోజ్ కూడా చోటు దక్కించుకున్నారు. గిల్‌కు డిప్యూటీగా అంకిత్ కుమార్ ఎంపికయ్యాడు.ఇంగ్లండ్‌పై గడ్డపై అదుర్స్..ఇంగ్లండ్‌పై శుబ్‌మన్ గిల్ కెప్టెన్‌గా, ఆటగాడిగా అదరగొట్టాడు. ఈ పంజాబ్ ఆటగాడు కెప్టెన్‌గా తన తొలి సిరీస్‌లో మంచి మార్క్‌లు కొట్టేశాడు. ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను గిల్ సారథ్యంలోని భారత జట్టు 2-2తో సమం చేసింది. సిరీస్ సమంగా ముగియడంలో గిల్ది కీలక పాత్ర.ఈ సిరీస్‌లో గిల్ పరుగులు వరద పారించాడు. ఐదు మ్యాచ్‌లలో 75.40 సగటుతో 754 పరుగులు చేసి గిల్ ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్‌గా నిలిచాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన రెండో టెస్టులో గిల్(261) ఏకంగా డబుల్ సెంచరీతో చెలరేగాడు. అదే మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 161 పరుగులు చేశాడు.ఒక టెస్టు మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో ప్లేయర్‌గా గిల్(430) నిలిచాడు. గిల్ ఇంకా ఇంగ్లండ్‌లోనే ఉన్నాడు. త్వరలోనే భారత్‌కు రానున్న గిల్.. ఈ నెల ఆఖరిలో జరగనున్న దులీప్ ట్రోఫీలో ఆడనున్నాడు. ఆగష్టు 28- 31వరకు జరగనున్న తొలి క్వార్టర్ ఫైనల్లో ఈస్ట్‌జోన్‌తో నార్త్ జోన్ తలపడనుంది.ఒకవేళ నార్త్ జోన్ సెమీఫైనల్‌కు చేరిన గిల్ ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానున్న ఆసియాకప్‌లో కూడా గిల్ ఆడనున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ నుంచి అంతర్జాతీయ సిరీస్‌లలో గిల్ బీజీబీజీగా గడపనున్నాడు. తొలుత ఆసియాకప్, ఆతర్వాత వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్, ఆస్ట్రేలియాతో వైట్‌బాల్ సిరీస్‌లలో ఆడనున్నాడు. ఆసీస్ టూర్ ముగిసిన వెంటనే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో సౌతాఫ్రికాతో భారత్ తలపడనుంది.దులిప్ ట్రోఫీ-2025కి నార్త్‌జోన్ జట్టు ఇదేశుభమన్ గిల్ (కెప్టెన్), శుభమ్ ఖజురియా, అంకిత్ కుమార్ (వైస్ కెప్టెన్), ఆయుష్ బదోని, యశ్ ధుల్, అంకిత్ కల్సి, నిశాంత్ సింధు, సాహిల్ లోత్రా, మయాంక్ దాగర్, యుధ్వీర్ సింగ్ చరక్, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, అన్షుల్ కాంబోజ్, ఆకిబ్ నబీ, కన్హయ్య వాధావాన్.చదవండి: IND vs WI: అతడి ఖేల్ ఖతం.. శ్రేయస్ అయ్యర్ రీ ఎంట్రీ పక్కా! -
సెల్యూట్ చేసిన రిషభ్ పంత్.. సారీ చెప్పిన ఇంగ్లండ్ ప్లేయర్
భారత్- ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్ (IND vs ENG) సందర్భంగా ఇద్దరు ఆటగాళ్లు దేశం కోసం ఆడటం పట్ల తమ నిబద్ధతను మరోసారి నిరూపించుకున్నారు. గాయం తాలుకు బాధ వెంటాడుతున్నా జట్టు ప్రయోజనాల కోసం మైదానంలో దిగి.. అభిమానుల హృదయాలు గెలుచుకున్నారు.వారిద్దరు ఎవరో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. అవును.. టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (Rishabh Pant).. ఇంగ్లండ్ పేస్ బౌలర్ క్రిస్ వోక్స్ (Chris Woakes). మాంచెస్టర్‌లో జరిగిన నాలుగో టెస్టు సందర్భంగా వోక్స్ బౌలింగ్‌లోనే పంత్ గాయపడ్డాడు. వోక్స్ వేసిన బంతి పంత్ కుడికాలి పాదానికి బలంగా తాకడంతో ఉబ్బిపోయింది.బొటనవేలు ఫ్రాక్చర్ దీంతో నొప్పితో విలవిల్లాడుతూ మైదానం వీడిన పంత్ స్కానింగ్‌కు వెళ్లగా.. బొటనవేలు ఫ్రాక్చర్ అయినట్లు తేలింది. అయితే, సిరీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన ఈ లెఫ్టాండ్ బ్యాటర్ మళ్లీ బరిలో దిగాల్సిన పరిస్థితి. జట్టు ప్రయోజనాలు, దేశం కోసం ఆడటమే పరమావధిగా భావించే పంత్.. కట్టుతోనే బ్యాట్‌తో బరిలోకి దిగి అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో పంత్ ఆడాల్సిన అవసరం రాకపోగా.. ఈ టెస్టు డ్రా అయింది. ఇక ఐదో టెస్టుకు పంత్ దూరమయ్యాడు. ఇదిలా ఉంటే.. ఆఖరిదైన ఐదో టెస్టులో విజయం ఇరుజట్ల మధ్య ఆఖరి రోజు వరకు దోబూచులాడింది. ఐదో రోజు ఇంగ్లండ్ విజయానికి 35 పరుగులు.. టీమిండియా నాలుగు వికెట్ల దూరంలో ఉన్న వేళ భారత పేసర్లు విజృంభించారు.అతడూ జట్టే ముఖ్యం అనుకున్నాడుఈ క్రమంలో తొమ్మిదో వికెట్ పడగానే క్రిస్ వోక్స్ బ్యాట్ పట్టుకుని మైదానంలోకి రావాల్సి వచ్చింది. అంతకుముందే ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో కిందపడ్డగా.. అతడి భుజం విరిగింది. అయినప్పటికీ పంత్ మాదిరే అతడూ జట్టే తనకు ముఖ్యం అనుకున్నాడు.అయితే, వోక్స్‌కు ఇబ్బంది కలుగకుండా మరో ఎండ్‌లో ఉన్న గస్ అట్కిన్సన్ స్ట్రైక్‌రొటేట్ చేస్తూ తానే క్రీజులో ఉండేలా చూసుకున్నాడు. అయితే, మహ్మద్ సిరాజ్ అద్భుత బంతితో అట్కిన్సన్ను బౌల్డ్ చేయడంతో ఇంగ్లండ్ కథ ముగిసిపోయింది. విజయానికి ఆరు పరుగుల దూరంలో ఆతిథ్య జట్టు నిలిచిపోగా.. టీమిండియా జయభేరి మోగించి సిరీస్‌ను 2-2తో సమం చేసింది.సెల్యూట్ చేసిన రిషభ్ పంత్.. సారీ చెప్పిన ఇంగ్లండ్ ప్లేయర్ఈ నేపథ్యంలో రిషభ్ పంత్‌తో జరిగిన సంభాషణ గురించి క్రిస్ వోక్స్ తాజాగా వెల్లడించాడు. ‘‘నా ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ రిషభ్ సెల్యూట్ ఎమోజీతో అభినందించాడు. అందుకు నేను అతడికి కృతజ్ఞతలు చెప్పాను.నాపై ప్రేమ చూపినందుకు థాంక్యూ.. నీ పాదం నొప్పి ఎలా ఉంది అని అడిగాను. అప్పుడు నాకు రిషభ్ వాయిస్ నోట్ పంపించాడు. ‘మరేం పర్లేదు. త్వరగానే కోలుకుంటానని అనుకుంటున్నాను. తొందర్లోనే మనం మళ్లీ తిరిగి కలవాలని కోరుకుంటున్నా’ అన్నాడు.అయితే, తన పాదం విరగడానికి పరోక్ష కారణం నేనే కాబట్టి.. రిషభ్‌కు సారీ చెప్పకుండా ఉండలేకపోయాను’’ అని క్రిస్ వోక్స్ మైదానంలో ప్రత్యర్థులుగా ఉన్నా.. ఆటగాళ్లుగా తమ మధ్య ఉండే అనుబంధం గురించి తెలిపాడు.ఇక మ్యాచ్ ముగియగానే టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ కూడా క్రిస్ వోక్స్‌ను ప్రత్యేకంగా అభినందించాడు. ఈ విషయం గురించి వోక్స్ ది గార్డియన్‌తో మాట్లాడుతూ.. ‘‘నువ్వు నిజంగా సాహసమే చేశావు’ అని గిల్ నాతో అన్నాడు.అందుకు బదులిస్తూ.. ‘మీరు అసాధారణ రీతిలో సిరీస్ పూర్తి చేసుకున్నారు. అద్భుతంగా ఆడారు. ఇందుకు మీ జట్టుకు క్రెడిట్ ఇవ్వాల్సిందే’ అని నేను అన్నాను’’ అని తెలిపాడు. చదవండి: ప్రతోడు సచిన్, కోహ్లి అవుతారా?.. వాళ్ల ఫోన్లు కూడా ఎత్తను: టీమిండియా పేసర్ -
ప్రతిష్టాత్మక అవార్డు రేసులో శుబ్‌మన్ గిల్! అతడికి పోటీ ఎవరంటే?
జూలై నెలకు గాను ప్లేయర్ ఆఫ్‌ది మంత్ అవార్డుకు నామినేట్ అయిన ఆటగాళ్ల జాబితాను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ICC) తాజాగా ప్రకటించింది. పరుషుల విభాగంలో ముగ్గురు ఆటగాళ్లను ఐసీసీ షార్ట్‌లిస్ట్ చేసింది. ఇందులో ఇద్దరి ఆటగాళ్లు ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ నుంచి ఎంపికైనవారే. ఈ జాబితాలో టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్, ఇంగ్లండ్ బెన్ స్టోక్స్ ఉన్నారు. వీరిద్దరితో పాటు దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ వియాన్ ముల్డర్ కూడా ఈ జాబితాలో ఉన్నాడు.అదరగొట్టిన గిల్..ఇంగ్లండ్ గడ్డపై గత నెలలో శుబ్‌మన్ గిల్ పరుగులు వరద పారించాడు. గిల్ కెప్టెన్‌గా తన తొలి టెస్టు సిరీస్‌లోనే అదరగొట్టాడు. 25 ఏళ్ల ఈ పంజాబీ క్రికెటర్ ఐదు మ్యాచ్‌లలో 75.40 సగటుతో 754 పరుగులు చేశాడు. గత నెలలో ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన రెండో టెస్టులో గిల్(261) ఏకంగా డబుల్ సెంచరీతో చెలరేగాడు. అదే మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 161 పరుగులు చేశాడు.ఒక మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో ప్లేయర్‌గా గిల్(430) నిలిచాడు. అంతేకాకుండా ఒక ఒక టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో భారత ప్లేయర్‌గా గిల్ రికార్డు నెలకొల్పాడు. శుబ్‌మన్ తన అద్బుతప్రదర్శనలతో ప్లేయర్‌గా ఆఫ్‌ది సిరీస్‌గా నిలిచాడు. ఈ క్రమంలోనే గిల్‌ను ప్లేయర్ ఆఫ్‌ది మంత్ అవార్డుకు ఐసీసీ నామెనేట్ చేసింది.స్టోక్స్ ఆల్‌రౌండ్ షో..మరోవైపు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ సైతం ఆల్‌రౌండ్ ప్రదర్శనలతో ఆకట్టుకున్నాడు. ఈ సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన స్టోక్స్.. 43.43 సగటుతో 304 పరుగులు చేశాడు. అంతేకాకుండా 17 వికెట్లు పడగొట్టాడు. అయితే ఆఖరి టెస్టుకు గాయం కారణంగా స్టోక్స్ దూరమయ్యాడు.అదేవిధంగా దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ వియాన్ ముల్డర్.. జింబాబ్వేతో జరిగిన టెస్టు సిరీస్‌లో సంచలన ప్రదర్శన కనబరిచాడు. రెండో టెస్టులో ముల్డర్ (367 నాటౌట్) ఏకంగా ట్రిపుల్ సెంచరీతో చెలరేగాడు. వీరిముగ్గరిలో ఎవరిని ఈ ప్రతిష్టాత్మక అవార్డు వరిస్తుందో త్వరలోనే తెలియనుంది. -
వ్యాజ్‌లెన్ వాడారు: టీమిండియాపై పాక్ మాజీ క్రికెటర్ సంచలన ఆరోపణలు
ఓటమి ఖాయమనుకున్న సిరీస్‌లో టీమిండియా అద్భుతమే చేసింది. ఓవల్ టెస్టులో పోరాడితే పోయేదేమీ లేదన్నట్లుగా ఊహించని రీతిలో పుంజుకుని అసాధారణ ఆట తీరుతో ప్రత్యర్థిపై పైచేయి సాధించింది. ఆఖరిదైన ఐదో టెస్టులో ఇంగ్లండ్ (IND vs ENG)పై ఆరు పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ను 2-2తో సమం చేసింది.అయితే, భారత దిగ్గజ ఆటగాళ్లు విరాట్ కోహ్లి (Virat Kohli), రవిచంద్రన్ అశ్విన్, రోహిత్ శర్మ (Rohit Sharma) లేకుండానే.. ఇంగ్లండ్ గడ్డ మీద టీమిండియా ఇలాంటి ప్రదర్శన చేయడం విశేషం. టెస్టు జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్.. ఇటు బ్యాటర్‌గా.. అటు సారథిగా మంచి మార్కులే దక్కించుకున్నాడు.అందరూ సమిష్టిగా రాణించిరికార్డు స్థాయిలో 754 పరుగులు సాధించడంతో పాటు.. ఎన్నో చిరస్మరణీయ రికార్డులు సొంతం చేసుకున్నాడు. మరోవైపు.. వైస్ కెప్టెన్ రిషభ్ పంత్, ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, పేసర్లు ఆకాశ్ దీప్, ప్రసిద్ కృష్ణ సత్తా చాటగా.. మహ్మద్ సిరాజ్ ఏకంగా 23 వికెట్లు కూల్చి సిరీస్‌ను సమం చేయడంలో కీలక పాత్ర పోషించాడు.సూపర్ సిరాజ్ఇక చావోరేవో తేల్చుకోవాల్సిన టెస్టులో సిరాజ్ అద్భుత ప్రదర్శన కనబరిచిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ విజయానికి ఏడు పరుగులు.. టీమిండియా ఒక వికెట్ దూరంలో ఉన్న వేళ.. అద్భుత డెలివరీతో చివరి వికెట్ తీసి భారత్‌ను గెలుపుతీరాలకు చేర్చాడు ఈ హైదరాబాదీ బౌలర్.ఈ నేపథ్యంలో గిల్ సేనతో పాటు సిరాజ్‌ను మాజీ క్రికెటర్లు ప్రత్యేకంగా అభినందిస్తూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు సైతం.. ముఖ్యంగా దిగ్గజ బ్యాటర్ జో రూట్ సిరాజ్ నైపుణ్యాలను కొనియాడటం విశేషం.ఓర్వలేని పాక్ మాజీ క్రికెటర్.. సంచలన ఆరోపణలుటీమిండియా మొత్తం సంతోషంలో మునిగిన వేళ.. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షబ్బీర్ అహ్మద్ దాయాది జట్టుపై విద్వేషం చిమ్మాడు. బాల్ ట్యాంపరింగ్ అంటూ భారత జట్టుపై నిరాధార ఆరోపణలు చేశాడు.‘‘నాకు తెలిసి.. ఇండియా బంతిపై వ్యాజ్‌లెన్ రాసి ఉంటుంది. అందుకే 80కి పైగా ఓవర్లు బౌలింగ్ చేసిన తర్వాత కూడా.. బంతి ఇంకా కొత్తదానిలాగే మెరుస్తోంది. అంపైర్ ఆ బంతిని పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించాలి’’ అని పాక్ మాజీ ఫాస్ట్‌బౌలర్ షబ్బీర్ అహ్మద్ ఖాన్ ‘ఎక్స్’ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశాడు.ఇంతకు కుళ్లు దేనికి?ఈ నేపథ్యంలో షబ్బీర్ అహ్మద్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘టీమిండియా సంబరాలు చూసి ఓర్వలేకపోతున్నావా?.. దాయాది జట్టుపై ఇంత అక్కసు దేనికి?.. అక్కడా ఎవరూ అసలు దీని గురించి మాట్లాడలేదు. నీకెందుకు మరి ఈ చెత్త డౌట్ వచ్చింది.ఓహో మీ జట్టుకు ఇలాంటివి చేయడం.. ముఖ్యంగా ఫాస్ట్‌బౌలర్‌గా నీకు ఇలాంటివి బాగా అలవాటు కాబోలు. అందుకే పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగా అన్నట్లు టీమిండియాను చూసినా నీకు అదే అనిపిస్తోంది. అయినా ఫేమస్ అవ్వడానికి ఈ మధ్య నీలాంటి వాళ్లు బాగానే తయారయ్యారు’’ అంటూ గట్టిగా చురకలు అంటిస్తున్నారు. కాగా పాకిస్తాన్ తరఫున 10 టెస్టులు, 32 వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ ఆడిన షబ్బీర్ అహ్మద్.. ఆయా ఫార్మాట్లలో 51, 33 వికెట్లు తీశాడు. అంతర్జాతీయ టీ20లలో బౌలర్‌గా అసలు అతడు బోణీ కొట్టలేదు. చదవండి: Dhruv Jurel: అతడికి నువ్వెందుకు చెప్పలేదు? గిల్‌తో సిరాజ్.. కొంప మునిగేదే! -
అతడికి నువ్వెందుకు చెప్పవు? గిల్‌తో సిరాజ్.. కొంప మునిగేదే!
ఐదో టెస్టు ఆఖరి రోజు వరకు ఉత్కంఠ రేపిన పోరులో భారత్ ఇంగ్లండ్‌పై గెలిచి సిరీస్‌ను సమం చేసింది. ఓటమి అంచుల వరకు వెళ్లినా.. అనూహ్య రీతిలో పుంజుకుని సంచలన విజయం సాధించింది. ఓవల్‌లో చివరిదైన ఐదో రోజు ఆటలో ఇంగ్లండ్ గెలుపునకు 35 పరుగుల దూరంలో ఉండగా.. భారత్‌కు నాలుగు వికెట్లు అవసరమయ్యాయి.అద్భుతం చేసిన సిరాజ్ ఇలాంటి క్లిష్ట సమీకరణాల వేళ టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) అద్భుతమైన బౌలింగ్‌తో.. ఆఖరి రోజు నాలుగింటిలో మూడు వికెట్లు తానే పడగొట్టాడు. ముఖ్యంగా ఆఖరి వికెట్‌గా గస్ అట్కిన్సన్ను వెనక్కి పంపి భారత్‌ను గెలుపు తీరాలకు చేర్చడం సిరీస్ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది.జురెల్ ఏమరపాటు కారణంగానిజానికి ఇంగ్లండ్ ఇంకాస్త ముందే ఈ వికెట్ కోల్పోయి ఉండేది. అయితే, వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ (Dhruv Jurel) కాస్త ఏమరపాటుగా ఉండటంతో ప్రత్యర్థి జట్టుకు పరుగు లభించింది. దీంతో మరోసారి నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ సిరాజ్ సరైన సమయంలో అట్కిన్సన్ను అవుట్ చేయకపోయి ఉంటే.. జురెల్ చేసిన పొరపాటు కారణంగా టీమిండియా భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చేది.అసలేం జరిగిందంటే.. ఓవల్ టెస్టు ఆఖరి రోజు ఆటలో ఇంగ్లండ్ తొమ్మిదో వికెట్ కోల్పోగానే.. ఆ జట్టు ఆటగాడు క్రిస్ వోక్స్ భుజం విరిగినప్పటికీ బ్యాటర్‌గా వచ్చాడు. అయితే, స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న అట్కిన్సన్.. వోక్స్ బ్యాటింగ్ చేసే పరిస్థితి లేదు కాబట్టి.. ఓవర్లో ఆఖరి బంతికి సింగిల్ తీసి.. మళ్లీ తానే క్రీజులోకి వచ్చేలా చూసుకున్నాడు.సిరాజ్ ప్లాన్ ఇదేఈ నేపథ్యంలో భారత కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill)- సిరాజ్ కలిసి ఈ జోడీని రనౌట్ చేయాలి లేదంటే.. అద్భుతమైన డెలివరీతో అట్కిన్సన్ను వెనక్కి పంపాలని ప్రణాళిక రచించారు. ఇందులో భాగంగానే 84వ ఓవర్లో వైడ్ లేదా యార్కర్ వేయాలని సిరాజ్- గిల్ ప్లాన్ చేశారు.అనుకున్నట్లుగానే అట్కిన్సన్ సిరాజ్ వేసిన బంతిని మిస్సయ్యాడు. అయినా సింగిల్‌కు వెళ్లాడు. అయితే, వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ సరైన సమయంలో బంతిని అందుకుని స్టంప్స్ వైపు గిరాటెయ్యలేకపోయాడు. ఫలితంగా ఆ ఓవర్లో ఆఖరి బంతికి సింగిల్ తీసి అట్కిన్సన్ మరోసారి క్రీజులోకి వచ్చాడు. దీంతో సిరాజ్ వెళ్లి గిల్‌తో కాస్త గట్టిగానే ఏదో వాదించినట్లుగా కనిపించింది.అయితే, ఆ మరుసటి ఓవర్లోనూ సింగిల్ తీయగలిగిన అట్కిన్సన్ (29 బంతుల్లో 17)ను.. 86వ ఓవర్ మొదటి బంతికే సిరాజ్ బౌల్డ్ చేయడంతో ఇంగ్లండ్ కథ ముగిసింది. భారత్ ఆరు పరుగుల స్వల్ప తేడాతో గెలిచి.. సిరీస్‌ను 2-2తో సమం చేయగలిగింది.అతడికి ఎందుకు చెప్పవు?ఈ పరిణామాలపై స్పందించిన కెప్టెన్ గిల్ మాట్లాడుతూ.. ‘‘సిరాజ్ నా దగ్గరికి వచ్చి.. రనౌట్ చేసేందుకు ధ్రువ్ జురెల్‌ను సిద్ధంగా ఉండమని చెప్పాడు. అయితే, నేను ధ్రువ్‌తో ఈ మాట చెప్పే కంటే ముందే సిరాజ్ బౌలింగ్ చేసేందుకు రన్ మొదలుపెట్టాడు.దీంతో ధ్రువ్ వేగంగా స్పందించలేకపోయాడు. అతడు స్టంప్స్‌ను మిస్ చేయగానే సిరాజ్ నా దగ్గరికి వచ్చి.. ‘నువ్వు అతడికి ఎందుకు చెప్పవు?’’ అని నన్ను ప్రశ్నించాడు’’ అని గిల్ తెలిపాడు. కాగా ఇంగ్లండ్ పర్యటనలో ఐదు టెస్టులు ఆడిన టీమిండియా.. రెండు గెలిచి.. ఒకటి డ్రా చేసుకుంది. తద్వారా ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీని 2-2తో సమం చేసింది. టీమిండియా టెస్టు కెప్టెన్‌గా గిల్‌కు ఇదే తొలి సిరీస్ అన్న విషయం తెలిసిందే. ఇక ఈ సిరీస్‌లో సిరాజ్ వెయ్యికి పైగా బంతులు వేసి 23 వికెట్లు కూల్చడం విశేషం.చదవండి: ఆటగాళ్లు వస్తుంటారు.. పోతుంటారు: గంభీర్ స్పీచ్ వైరల్ज़िन्दगी देती है मौक़ा एक , अपनी पहचान बनाने काकुछ कर दिखाने का ✨@UltraTechCement | #SonySportsNetwork #ENGvIND #NayaIndia #DhaakadIndia #TeamIndia pic.twitter.com/atceen4I2W— Sony Sports Network (@SonySportsNetwk) August 5, 2025 -
ఆటగాళ్లు వస్తుంటారు.. పోతుంటారు: గంభీర్ స్పీచ్ వైరల్
ఇంగ్లండ్ గడ్డ మీద ఆద్యంతం ఆసక్తిగా సాగిన టెస్టు సిరీస్‌లో టీమిండియా మెరుగైన ప్రదర్శన కనబరిచింది. ముఖ్యంగా ఆఖరిదైన ఐదో టెస్టులో అసాధారణ రీతిలో పుంజుకుని ఆతిథ్య జట్టుపై విజయభేరి మోగించింది. తద్వారా ఓడిపోవడం ఖాయమనుకున్న ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ (Anderson- Tendulkar Trophy)ని 2-2తో సమం చేసింది.దీంతో వరుస పరాజయాల తర్వాత హెడ్‌కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir)కు కాస్త ఊరట లభించింది. టెస్టు జట్టు కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ (Shubman Gill)కు కూడా శుభారంభమే దక్కింది. అయితే, తుదిజట్టు విషయంలో కొన్ని అనూహ్య ఎంపికలు, చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను సిరీస్ మొత్తానికి దూరంగా ఉంచడం వీరిద్దరిపై విమర్శలకు కారణమయ్యాయి.దిగ్గజాల రిటైర్మెంట్ తర్వాత..ఏదేమైనా స్పిన్ లెజెండ్ రవిచంద్రన్ అశ్విన్, కెప్టెన్ రోహిత్ శర్మ, దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత... అది కూడా విదేశీ గడ్డ మీద జరిగిన సిరీస్‌లో భారత్ ఈ మేర సఫలం కావడం హర్షించదగ్గ విషయమే. ఈ పరిణామాల నేపథ్యంలో హెడ్‌కోచ్ గౌతం గంభీర్ డ్రెసింగ్‌రూమ్‌లో చేసిన ప్రసంగం వైరల్‌గా మారింది.ఆటగాళ్లు వస్తుంటారు.. పోతుంటారు‘ఇక్కడ ఈ సిరీస్‌ను 2–2తో ముగియడం చాలా గొప్ప ఫలితం. అందరికీ నా అభినందనలు. అయితే మనం మెరుగుపడేందుకు ఇంకా అవకాశం ఉంటుంది. దాని కోసం మరింత కష్టపడుతూనే ఉండాలి. అలా చేస్తే సుదీర్ఘ కాలం టీమిండియా ప్రపంచ క్రికెట్‌ను శాసించగలదు.ఆటగాళ్లు వస్తుంటారు, పోతుంటారు. డ్రెస్సింగ్‌రూమ్‌లో సంస్కృతి ఎలా ఉండాలంటే అందరూ ఇందులో భాగం కావాలని కోరుకోవాలి. ఇదే మనం చేయాల్సిన పని’ అని గంభీర్ మార్గనిర్దేశనం చేశాడు. ఓవల్‌లో విజయం తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో గంభీర్ ఈ మేరకు ఆటగాళ్లతో ప్రత్యేకంగా మాట్లాడాడు.గొప్పగా అనిపించిందిఈ సందర్భంగా ‘ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అనే ప్రత్యేక అవార్డును రవీంద్ర జడేజా చేతుల మీదుగా వాషింగ్టన్ సుందర్ అందుకున్నాడు. ‘ఇంగ్లండ్‌లో వరుసగా నాలుగు టెస్టులు ఆడే అవకాశం రావడం నా అదృష్టం. ఇక్కడ బాగా ఆడాలని ఎంతో కోరుకున్నాను. ప్రతీ రోజు మన జట్టు ఆడిన తీరు చాలా గొప్పగా అనిపించింది’ అని సుందర్ వ్యాఖ్యానించాడు.భారత్ వర్సెస్ ఇంగ్లండ్ ఐదు టెస్టుల సిరీస్-2025 ఫలితాలు👉తొలి టెస్టు- హెడింగ్లీ, లీడ్స్- ఐదు వికెట్ల తేడాతో ఇంగ్లండ్ గెలుపు✊రెండో టెస్టు- ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్- 336 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం- ఈ వేదికపై భారత్‌కు ఇదే తొలి గెలుపు👉మూడో టెస్టు- లార్డ్స్, లండన్- 22 పరుగుల తేడాతో గెలిచిన ఇంగ్లండ్🤝నాలుగో టెస్టు- ఓల్డ్ ట్రఫోర్డ్, మాంచెస్టర్- డ్రా✊ఐదో టెస్టు- కెన్నింగ్టన్ ఓవల్, లండన్- ఆరు పరుగుల తేడాతో టీమిండియా గెలుపు🤝సిరీస్ ఫలితం- 2-2తో సమంచదవండి: Asia Cup 2025: ఆసియా కప్‌లో గిల్, జైస్వాల్! View this post on Instagram A post shared by Team India (@indiancricketteam) -
Asia Cup 2025: ఆసియా కప్‌లో గిల్, జైస్వాల్!
న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో ‘డ్రా’గా ముగిసిన టెస్టు సిరీస్ తర్వాత భారత జట్టు వచ్చే నెలలో ఆసియా కప్ టి20 టోర్నీలో బరిలోకి దిగనుంది. సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వేదికగా ఈ టోర్నీ జరుగుతుంది. ఇది ముగిసిన తర్వాత అక్టోబర్ 2 నుంచి వెస్టిండీస్‌తో తొలి టెస్టులో టీమిండియా తలపడుతుంది. అయితే వారం రోజుల్లోపే టెస్టు సిరీస్ ఉన్నా సరే... టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌తో పాటు ఓపెనర్ యశస్వి జైస్వాల్‌లను ఆసియా కప్‌కు ఎంపిక చేయాలని సెలక్టర్లు భావిస్తున్నారు. బిజీ షెడ్యూల్ కారణంగా గత కొన్ని టి20లనుంచి గిల్, జైస్వాల్‌లకు విశ్రాంతినిచ్చారు. ఆ సమయంలో సంజు సామ్సన్, అభిషేక్ శర్మ ఓపెనర్లుగా చెలరేగిపోయారు. అయితే తాజా ఫామ్, ఐపీఎల్లో ప్రదర్శనను బట్టి చూస్తే గిల్, జైస్వాల్‌లను టి20 టీమ్‌లోకి తీసుకొచ్చే ఆలోచన ఉంది. ఐపీఎల్లో అద్భుతంగా రాణించిన మరో బ్యాటర్ సాయి సుదర్శన్ పేరు కూడా టీమ్ పరిశీలనలో ఉంది. సుదర్శన్ భారత్ తరఫున 3 వన్డేలు, ఏకైక టి20 మ్యాచ్ ఆడాడు. ఈ ముగ్గురినీ తీసుకుంటే టాప్–3 కోసం ప్రత్యామ్నాయం అందుబాటులో ఉంటుందనేది సెలక్టర్ల భావన. ఆసియా కప్‌కు 17 మందితో టీమ్‌ను ఎంపిక చేసే అవకాశం ఉంది కాబట్టి అదనపు ఆటగాళ్లను ఎంపిక చేయడంలో సమస్య రాకపోవచ్చు. ఆ తర్వాత ఆరు నెలల్లో టి20 వరల్డ్ కప్ కూడా జరగనున్న నేపథ్యంలో ‘కోర్ గ్రూప్’లో సభ్యులుగా అందరి ఆటను సెలక్టర్లు పరిశీలించే అవకాశం ఉంది. మరోవైపు బుమ్రా, సిరాజ్‌ల విషయంలో టోర్నీకి ముంద ఫిట్నెస్ను పరిశీలించే తుది నిర్ణయం తీసుకుంటారు. -
‘డ్రా’ అయినందుకే ఇంత సంబరమా?.. అవును.. కొన్ని పొరపాట్లున్నా..
భారత జట్టు చివరిసారిగా ఇంగ్లండ్ గడ్డపై 2007లో 1–0తో సిరీస్ గెలిచింది. ఆ తర్వాత నాలుగుసార్లు మన టీమ్ అక్కడకు వెళ్లింది. 2011లో 0–4తో చిత్తుగా ఓడిన జట్టు... 2014, 2018లలోనూ సిరీస్‌లు కోల్పోయింది. 2021 సిరీస్‌ను మాత్రం సమంగా ముగించగలిగింది. ఈసారి జట్టు ఇంగ్లండ్ బయల్దేరినప్పుడు కూడా ఎన్నో సందేహాలు. కోహ్లి, రోహిత్, అశ్విన్ రిటైర్ అయిన తర్వాత ఆడుతున్న తొలి టెస్టు సిరీస్ కావడంతో పాటు ఎక్కువ మందికి అనుభవం పెద్దగా లేకపోవడంతో కూడా అంచనాలు తక్కువగా ఉన్నాయి.అవును.. ‘డ్రా’ కూడా గెలుపు సంబరమేభారత మాజీ క్రికెటర్లు సహా ప్రసారకర్తల బృందంలో ఉన్నవారంతా ఇంగ్లండ్ సిరీస్ గెలవడం ఖాయమని జోస్యం చెప్పారు. భారత్ కొంత వరకు పోరాడుతుందని, సిరీస్ తుది ఫలితంలో మాత్రం మార్పు ఉండదని వారంతా వ్యాఖ్యానించారు. కానీ టీమిండియా తమ అసాధారణ ఆటతో అందరి నోళ్లు మూయించింది.ఈ పర్యటనకు ముందు స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 0–3తో ఓడి, ఆపై ఆస్ట్రేలియాలో 1–3తో చిత్తయిన జట్టు ఇంగ్లండ్‌కు వెళ్లి ఈ తరహా ఫలితంతో తిరిగి రావడం చాలా గొప్ప ప్రదర్శన. అంకెల్లో చూస్తే సిరీస్ ‘డ్రా’గా ముగిసిందని, భారత్ గెలవలేదని అనిపించవచ్చు కానీ మన కోణంలో చూస్తే ఇది విజయంతో సమానం. సిరీస్‌లో అన్ని మ్యాచ్‌లు చూసినవారు ఎవరైనా ఇదే విషయాన్ని అంగీకరిస్తారు. ఐదు టెస్టుల్లో వేర్వేరు దశల్లో, సెషన్లలో మన జట్టు ఆధిక్యం కనబర్చిన తీరు, వెనకబడిన ప్రతీసారి కోలుకున్న పట్టుదల చూస్తే ‘డ్రా’ కూడా గెలుపు సంబరమే. హోరాహోరీ పోరులో సత్తా చాటి... తొలి టెస్టులో భారత్ చిత్తుగా ఏమీ ఓడలేదు. మన జట్టు తరఫున ఐదు సెంచరీలు నమోదయ్యాయి. ఆ జట్టు దూకుడుగా ఆడి 371 పరుగులు ఛేదించగలిగింది. రెండో టెస్టులో ఏకంగా 336 పరుగులతో ఘన విజయం సాధించి సరైన రీతిలో మనం బదులిచ్చాం. లార్డ్స్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో స్కోరు సమం. చివర్లో కాస్త అదృష్టం కలిసొస్తే ఈ మ్యాచ్ కూడా మన సొంతమయ్యేది. ఓల్డ్ట్రఫోర్డ్లో తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 311 పరుగులు వెనుకబడి కూడా పోరులో నిలవడం, ఓటమిని తప్పించుకోవడం మన పోరాటపటిమను చూపించింది.రెండో ఇన్నింగ్స్‌లోనైతే సున్నాకి 2 వికెట్లు కోల్పోయిన తర్వాత మరో 2 వికెట్లు మాత్రమే చేజార్చుకొని 425 పరుగులు చేయడం అసాధారణం. ఒకదశలో ‘డ్రా’ కోసం ఇంగ్లండ్ ముందుకు రావడం, మన ఆటగాళ్లు నిరాకరించడం జట్టులో పెరిగిన ఆత్మవిశ్వాసాన్ని చూపించింది. ఇది తర్వాతి టెస్టులో కనిపిస్తుందని వేసిన అంచనాలు సరిగ్గా నిజమయ్యాయి. తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులు చేసి, ఆపై దూకుడుగా ఆడుతున్న ఇంగ్లండ్‌ను తక్కువ స్కోరుకే నిలువరించగలిగింది. ఆకట్టుకున్న వ్యక్తిగత ప్రదర్శనలు... సిరీస్‌లో సమష్టి ప్రదర్శన జట్టును ముందంజలో నిలిపింది. సిరాజ్ 23 వికెట్లు పడగొట్టగా, 3 మ్యాచ్‌లలో బుమ్రా 14 వికెట్లు తీశాడు. పరుగులు భారీగా ఇచ్చినా... ప్రసిధ్ కృష్ణ (14), ఆకాశ్‌దీప్ (13) కీలక సమయాల్లో వికెట్లు తీశారు. జడేజా బౌలర్‌గా విఫలమైనా ఆ లోటును బ్యాటింగ్‌తో పూరించాడు. ఏకంగా ముగ్గురు బ్యాటర్లు 500కు పైగా పరుగులు చేసి తామేంటో చూపించారు.శుబ్‌మన్ గిల్ (754), కేఎల్ రాహుల్ (532), జడేజా (516) చెలరేగగా... పంత్ (479), జైస్వాల్ (411) కూడా తమవంతు పాత్ర పోషించారు. మున్ముందు అశ్విన్ స్థానాన్ని పూర్తి స్థాయిలో భర్తీ చేయగల ఆల్‌రౌండర్‌గా సుందర్ నిరూపించుకున్నాడు. మాంచెస్టర్‌లో సెంచరీతో పాటు చివరి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అతను బాదిన 4 సిక్సర్లు తుది ఫలితంపై ప్రభావం చూపాయి. క్రికెట్‌ను మరో అవకాశం అడిగిన కరుణ్ నాయర్ అద్భుతంగా ఆడకపోయినా...చివరి టెస్టు హాఫ్ సెంచరీ అతడికి మరో అవకాశం కల్పించవచ్చు.ఇద్దరికీ పాస్ మార్కులు... గెలుపు విలువ వారికే తెలుసుఈ టెస్టు సిరీస్ ప్రధానంగా కెప్టెన్‌గా గిల్, కోచ్ గంభీర్‌లకు వ్యక్తిగతంగా ఎంతో కీలకమైంది. ఈ సిరీస్‌కు ముందు పేలవ సగటుతో బ్యాటర్‌గా కూడా గొప్ప రికార్డు లేని గిల్ అటు ఆటగాడిగా, ఇటు కెప్టెన్‌గా కూడా నిరూపించుకోవాల్సిన స్థితి. ఇందులో ఏది విఫలమైనా అతనిపై తీవ్ర విమర్శలు వచ్చేవి. అయితే గిల్ ఇప్పుడు విజయవంతంగా దీనిని ముగించాడు. టాప్ స్కోరర్‌గా నిలవడంతో పాటు కెప్టెన్‌గా సిరీస్‌ను కోల్పోలేదు.అక్కడక్కడ తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా తొలి సిరీస్ కాబట్టి క్షమించే పరిస్థితి ఉంది. ఇక గత రెండు టెస్టు సిరీస్‌లు కోల్పోయిన తర్వాత గంభీర్‌పై కూడా తీవ్ర ఒత్తిడి ఉంది. ముఖ్యంగా కోహ్లి, రోహిత్‌లను తానే సాగనంపి జట్టుపై పూర్తి పట్టు పెంచుకున్నాడనే వార్తలు ప్రచారంలో ఉన్న నేపథ్యంలో అతని ప్రతీ ప్రణాళికపై అందరి దృష్టీ ఉంది.ముఖ్యంగా ఇక్కడ ఓడితే కొన్ని అనూహ్య ఎంపికలకు అతను సమాధానం ఇచ్చుకోవాల్సి వచ్చేది. ఇక తాజా ప్రదర్శనతో గంభీర్ నిశ్చింతగా ఉండవచ్చు. భారత్ తమ తదుపరి టెస్టు సిరీస్‌ను స్వదేశంలో వెస్టిండీస్‌తో ఆడనుంది. 27 ఆలౌట్ తర్వాత ఆ జట్టు ఆడనున్న తొలి మ్యాచ్ ఇక్కడే కానుంది. ఇంగ్లండ్‌తో సిరీస్ తర్వాత మన జట్టు ప్రదర్శనను విశ్లేషిస్తే వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లో టీమిండియా జోరు కొనసాగడం ఖాయం. -సాక్షి క్రీడా విభాగం చదవండి: కన్నీటిపర్యంతమైన గంభీర్.... గూస్బంప్స్ తెప్పించేశారు భయ్యా! వీడియో వైరల్ -
గిల్ కాదు!.. ఆ అవార్డుకు అతడే అర్హుడు: మాట మార్చేసిన మెకల్లమ్
టెస్టు క్రికెట్ ప్రేమికులకు మజా అందించిన ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ సోమవారంతో ముగిసింది. ఇంగ్లండ్- భారత్ (IND vs ENG) మధ్య జరిగిన ఈ ఐదు టెస్టుల సిరీస్ 2-2తో సమమైంది. ఓవల్ మైదానంలో ఆఖరి రోజు వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన ఐదో టెస్టులో టీమిండియా ఆరు పరుగుల తేడాతో జయభేరి మోగించి.. ఈ మేరకు సిరీస్‌ను డ్రా చేసుకుంది.ఇక చివరి టెస్టులో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj)కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించగా.. టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill)తో పాటు.. ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ (Harry Brook) ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు గెలుచుకున్నారు.నాలుగో రోజు వరకు గిల్‌కే ఓటుఈ నేపథ్యంలో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు నామినేషన్ల గురించి భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ దినేశ్ కార్తిక్ ఆసక్తికర విషయం వెల్లడించాడు. టీమిండియా హెడ్‌కోచ్ హ్యారీ బ్రూక్ ప్రతిపాదించగా.. ఇంగ్లండ్ ప్రధాన కోచ్ బ్రెండన్ మెకల్లమ్ శుబ్‌మన్ గిల్ పేరు చెప్పాడట.అయితే, ఐదో టెస్టు ఆట ఐదో రోజుకు చేరే సరికి మెకల్లమ్ తన నిర్ణయాన్ని మార్చుకోవడం విశేషం. గిల్‌ను కాదని సిరాజ్‌కు ఈ అవార్డు ఇస్తే బాగుంటుందని మెకల్లమ్ భావించాడట. ఈ విషయం గురించి కామెంట్రీ ప్యానెల్లో ఉన్న దినేశ్ కార్తిక్ మాట్లాడుతూ.. ‘‘ఒకవేళ మ్యాచ్ నాలుగో రోజే ముగిసి ఉంటే.. శుబ్‌మన్ గిల్‌కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు.బ్రెండన్ మెకల్లమ్ గిల్ పేరే చెప్పాడు. ఇందుకు తగ్గట్లుగానే మైక్ ఆథర్టన్ ప్రజెంటేషన్‌లో అడగాల్సిన ప్రశ్నలు సిద్ధం చేసుకున్నాడు. శుబ్‌మన్ గిల్‌కు సంధించే ప్రశ్నల జాబితా రెడీ చేసుకున్నాడు.మాట మార్చేసిన మెకల్లమ్కానీ.. అరగంట.. 40 నిమిషాలు గడిచిన తర్వాత మెకల్లమ్ మహ్మద్ సిరాజ్ పేరు ప్రతిపాదించాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత స్కై స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ కూడా సిరాజ్ బౌలింగ్‌ను ఆస్వాదించానని చెప్పాడు’’ అని పేర్కొన్నాడు.కాగా ఐదో టెస్టులో సిరాజ్ మొత్తంగా తొమ్మిది వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవగా.. గిల్ సిరీస్ మొత్తంలో కలిపి రికార్డు స్థాయిలో ఏకంగా 754 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు సెంచరీలు ఉండగా.. అత్యధిక స్కోరు 269. ఇక ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన రెండో టెస్టులోనే గిల్ 430 (269+161) పరుగులు రాబట్టడం విశేషం.మరోవైపు.. హ్యారీ బ్రూక్ ఐదు టెస్టుల్లో కలిపి.. రెండు శతకాల సాయంతో 481 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 158. ఆఖరి టెస్టులో అతడు 98 బంతుల్లోనే 111 పరుగులు సాధించడం విశేషం. దీంతోనే మ్యాచ్ ఇంగ్లండ్ వైపు మళ్లగా.. సిరాజ్ అద్భుత డెలివరీతో ఆఖరి వికెట్ తీసి.. భారత జట్టును గెలుపుతీరాలకు చేర్చాడు.టీమిండియా వర్సెస్ ఇంగ్లండ్ ఐదో టెస్టు సంక్షిప్త స్కోర్లు👉వేదిక: కెన్నింగ్టన్ ఓవల్, లండన్👉టాస్: ఇంగ్లండ్.. తొలుత బౌలింగ్👉టీమిండియా- 224 & 396👉ఇంగ్లండ్- 247 & 367✊ఆరు పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై టీమిండియా విజయం.చదవండి: నేనే గనుక ఆ క్యాచ్ పట్టి ఉంటేనా: సిరాజ్ ఎమోషనల్.. గిల్ రియాక్షన్ వైరల్ -
ఓడినా సంతృప్తిగానే ఉన్నాం.. గొడవలు సహజమే.. అయితే..: స్టోక్స్
ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన భారత్- ఇంగ్లండ్ టెస్టు సిరీస్ (IND vs ENG Tests) అంతే రసవత్తరంగా ముగిసింది. చారిత్రక ఓవల్ మైదానంలో ఆఖరిదైన ఐదో టెస్టులో.. చివరి రోజు వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో భారత్ గెలుపొందింది. నువ్వా- నేనా అన్నట్లు హోరాహోరీగా సాగిన పోరులో ఆరు పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా.. ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ (Anderson- Tendulkar Trophy)ని 2-2తో సమం చేసింది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes) ఐదో టెస్టులో తమ ఓటమిపై స్పందించాడు.ఓడినా.. ఆ విషయంలో సంతృప్తిగా ఉంది‘‘ఇంతటి కీలకమైన మ్యాచ్‌కు గాయం వల్ల దూరం కావడం కాస్త కఠినంగానే తోచింది. విజయం కోసం ఇరు జట్లూ మరోసారి తీవ్రంగా పోరాడాల్సి వచ్చింది. ఇక్కడ గెలవలేకపోవడం నిరాశ కలిగించినా మా జట్టు ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నా.సిరీస్ మొత్తం చాలా గొప్పగా సాగింది. ప్రతీ ఒక్కరూ ఎన్నో సందర్భాల్లో తమ భావోద్వేగాలు ప్రదర్శించారు. ఆరంభంలోనే ఒక బౌలర్ తప్పుకొన్నా రెండో ఇన్నింగ్స్‌లో మిగతా వారు ఎంతో పోరాటపటిమ కనబర్చారు.ఇలా జరిగి ఉంటే బాగుండేదనే క్షణాలు గత ఐదు రోజుల్లో ఎన్నో వచ్చాయి. ఇవన్నీ ఆటను గొప్పగా మార్చాయి. అయితే మీ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వమని మాత్రమే మా ఆటగాళ్లకు చెప్పాం. ఆ విషయంలో సంతృప్తిగా ఉంది.నాలాగే గిల్ కూడా గర్వపడతాడుకానీ సిరీస్ గెలవలేకపోయామనే నిరాశ కూడా ఉంది. క్రిస్ వోక్స్ ఆఖరి రోజు బ్యాటింగ్ చేయడానికి ముందే సిద్ధమయ్యాడు. ఒంటిచేత్తో ఎలా బ్యాటింగ్ చేయాలో సన్నద్ధమయ్యాడు.విరిగిన వేళ్లు, ఫ్రాక్చర్ అయిన పాదాలతో ఆటగాళ్లు బరిలో దిగడం.. దేశానికి ప్రాతినిథ్యం వహించడం పట్ల వారికి ఉన్న నిబద్ధత, అంకితభావాన్ని తెలియజేస్తాయి. వోక్స్ విషయంలో నేను గర్వపడుతున్నాను. నాకు తెలిసి శుబ్‌మన్ గిల్ కూడా ఇలాగే గర్వపడుతూ ఉంటాడు’’ అని స్టోక్స్ పేర్కొన్నాడు.ఆటలో ఇవి సహజం.. అయితే వాటినే తలచుకుని..అదే విధంగా.. ఇరుజట్ల ఆటగాళ్ల మధ్య జరిగిన వాగ్యుద్ధాల గురించి మీడియా ప్రశ్నించగా.. ‘‘ఇండియా- ఇంగ్లండ్ సిరీస్ ఇరుజట్లకు ఎంతో కీలకమైనది. భావోద్వేగాలతో ముడిపడిన ఈ సిరీస్‌లో జరిగిన ఎలాంటి ఘటనలూ వ్యక్తిగతంగా ఆటగాళ్లపై ప్రభావం చూపవు.మైదానంలో జరిగిన వాటి గురించి ఆలోచిస్తూ ఎవరూ నిద్ర పాడుచేసుకోరు. ఇరుజట్ల ఆటగాళ్లు ఇలాగే ఆలోచిస్తారు. ఆటలో ఇవన్నీ భాగం’’ అని బెన్ స్టోక్స్ బదులిచ్చాడు.అపుడు పంత్.. ఇపుడు వోక్స్ఇదిలా ఉంటే.. ఐదో టెస్టులో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఇంగ్లండ్ పేసర్ క్రిస్ వోక్స్ భుజం విరిగింది. అయితే, ఐదో రోజు ఆటలో నిలవాలంటే అతడు బ్యాటింగ్‌కు దిగాల్సి రాగా.. ఒంటిచేత్తోనే ఆడేందుకు వోక్స్ మైదానంలో దిగాడు. అయితే, అతడు ఒక్క బంతి కూడా ఎదుర్కోవాల్సిన అవసరం రాలేదు. టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ గస్ అట్కిన్సన్ (17)ను బౌల్డ్ చేయడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌కు తెరపడగా.. టీమిండియా విజయం ఖరారైంది.మరోవైపు.. మాంచెస్టర్‌లో జరిగిన నాలుగో టెస్టులో కుడికాలి బొటనవేలు ఫ్రాక్చర్ అయినా టీమిండియా స్టార్ రిషభ్ పంత్ బ్యాటింగ్‌కు తిరిగి వచ్చి.. అర్ధ శతకంతో మెరిసిన విషయం తెలిసిందే. ఇక ఈ సిరీస్‌లో అన్ని మ్యాచ్‌లు ఐదు రోజులపాటు సాగి టెస్టు క్రికెట్ ప్రేమికులకు అసలైన మజా అందించాయి.చదవండి: కన్నీటిపర్యంతమైన గంభీర్.... గూస్బంప్స్ తెప్పించేశారు భయ్యా! వీడియో వైరల్All heart. All hustle. All 𝘋𝘩𝘢𝘢𝘬𝘢𝘥 💪A fightback that will go down in Indian cricket history ✨#SonySportsNetwork #ENGvIND #NayaIndia #DhaakadIndia #TeamIndia #ExtraaaInnings pic.twitter.com/bvXrmN5WAL— Sony Sports Network (@SonySportsNetwk) August 4, 2025 -
నేను ఆ క్యాచ్ పట్టి ఉంటేనా: సిరాజ్ ఎమోషనల్.. గిల్ రియాక్షన్ వైరల్
ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ (Harry Brook) క్యాచ్ మిస్ చేయడంపై టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) స్పందించాడు. తాను ఒకవేళ ఆ క్యాచ్ సరిగ్గా పట్టి ఉంటే.. ఆట ఐదో రోజుకు చేరి ఉండకపోయేదని అభిప్రాయపడ్డాడు. ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపుతిప్పే సత్తా కలిగిన బ్రూక్ విషయంలో తాను చేసిన పొరపాటు వల్ల భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చేదంటూ భావోద్వేగానికి లోనయ్యాడు.ఓటమి అంచుల వరకు వెళ్లి..ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీలో భాగంగా ఓవల్‌లో జరిగిన ఐదో టెస్టులో టీమిండియా అద్భుతం చేసింది. ఓటమి అంచుల వరకు వెళ్లి గెలుపులోని అసలైన మజాను రుచిచూసింది. తద్వారా సిరీస్‌ను 2-2తో సమం చేసింది. నిజానికి ఓవల్ టెస్టులో టీమిండియా విజయంలో సిరాజ్‌దే కీలక పాత్ర.బౌండరీ లైన్ తొక్కేయడంతోనరాలు తెగే ఉత్కంఠ నడుమ.. ఇంగ్లండ్ విజయానికి ఏడు పరుగులు.. భారత్ గెలుపునకు ఒక వికెట్ దూరంలో ఉన్న వేళ.. సిరాజ్ ఆఖరి.. ఆ ఒక్క వికెట్ తీసి.. జట్టుకు సంచలన విజయం అందించాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా సిరాజ్ తొమ్మిది వికెట్లతో సత్తా చాటి.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.అయితే, నాలుగో రోజు ఆటలో భాగంగా ఇంగ్లండ్ ప్రమాదకర బ్యాటర్ హ్యారీ బ్రూక్.. 19 పరుగల వద్ద ఉండగా.. లడ్డూ లాంటి క్యాచ్ ఇచ్చాడు. ఫైన్ లెగ్‌లో ఉన్న సిరాజ్ దీనిని ఒడిసిపట్టినా.. బౌండరీ లైన్ తొక్కేయడంతో బ్రూక్‌కు లైఫ్ లభించింది.Out? Six!?What's Siraj done 😱 pic.twitter.com/hp6io4X27l— England Cricket (@englandcricket) August 3, 2025నిన్ను నువ్వు నమ్ముఆ తర్వాత అతడు వెనుదిరిగి చూడలేదు. 98 బంతుల్లోనే 111 పరుగుల సాధించి మ్యాచ్‌ను ఇంగ్లండ్ వైపు తిప్పాడు. అయితే, ఆఖరికి.. ఆకాశ్ దీప్ బౌలింగ్‌లో మళ్లీ సిరాజే బ్రూక్ క్యాచ్ పట్టాడు.టీమిండియా విజయానంతరం సిరాజ్ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయంపై స్పందించాడు. ‘‘మొదటి రోజు నుంచి ఎంతో పోరాటపటిమ కనబర్చాం. ఇలాంటి ఫలితం రావడం చాలా సంతోషంగా ఉంది. సరైన చోట నిలకడగా బంతులు వేసి ఒత్తిడి పెంచాలనేదే నా వ్యూహం. ‘నిన్ను నువ్వు నమ్ము’ అని రాసి ఉన్న ఒక ఫోటోను గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను.నిజానికి హ్యారీ బ్రూక్ అసాధారణ ఆటగాడు. కొంతమంది డిఫెన్సివ్‌గా ఉంటారు కానీ... అతడు మాత్రం ఎల్లప్పుడూ అటాకింగ్ మోడ్‌లో ఉంటాడు. నేను గనుక అప్పుడే ఆ క్యాచ్ పట్టి ఉంటే మ్యాచ్ వేరేలా ఉండేది.అదొక గేమ్ ఛేంజింగ్ మూమెంట్ అయ్యేది. అయితే, సీనియర్ బౌలర్‌గా నాకున్న పరిణతితో.. ఈ భారాన్ని మోయడం వల్ల ఒరిగే ప్రయోజనం ఏదీ లేదని నాకు తెలుసు. ‘జరిగిందేదో జరిగిపోయింది. ఆటలో ఇలాంటివి సహజం’ అని నన్ను నేను సముదాయించుకున్నాను’’ అంటూ సిరాజ్ ఎమోషనల్ అయ్యాడు.గిల్ రియాక్షన్ వైరల్ఇంతలో పక్కనే ఉన్న కెప్టెన్ శుబ్‌మన్ గిల్ కలుగజేసుకుంటూ.. ‘‘ఒకవేళ మేము ఆ క్యాచ్ పట్టి ఉంటే.. ఇంకాస్త సులువుగా గెలిచేవాళ్లం. మేము చాలా గొప్పగా ఆడాము.. అవునా? కాదా?’’ అంటూ సిరాజ్‌కు అండగా నిలిచాడు. గిల్ అలా అనగానే అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులు నవ్వులు చిందించారు.చదవండి: కన్నీటిపర్యంతమైన గంభీర్.... గూస్బంప్స్ తెప్పించేశారు భయ్యా! వీడియో వైరల్ All heart. All hustle. All 𝘋𝘩𝘢𝘢𝘬𝘢𝘥 💪A fightback that will go down in Indian cricket history ✨#SonySportsNetwork #ENGvIND #NayaIndia #DhaakadIndia #TeamIndia #ExtraaaInnings pic.twitter.com/bvXrmN5WAL— Sony Sports Network (@SonySportsNetwk) August 4, 2025 -
కన్నీటిపర్యంతమైన గంభీర్.. గూస్బంప్స్ తెప్పిస్తున్న వీడియో!
‘‘గౌతమ్ గంభీర్.. వన్డే, టీ20 ఫార్మాట్లకు కోచ్‌గా ఫర్వాలేదు. కానీ టెస్టులకు మాత్రం అతడు పనికిరాడు. అతడు హెడ్‌కోచ్‌గా ప్రస్థానం మొదలుపెట్టిన తర్వాత పసికూన బంగ్లాదేశ్‌పై సిరీస్ విజయాన్ని మినహాయిస్తే.. టీమిండియా అత్యంత ఘోరమైన పరాజయాలు చవిచూసింది.సొంతగడ్డపై చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా న్యూజిలాండ్ (IND vs NZ)తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 3-0తో వైట్‌వాష్ అయింది. అంతేకాదు.. ఆస్ట్రేలియా పర్యటనలోనూ దాదాపు పదేళ్ల తర్వాత తొలిసారి బోర్డర్- గావస్కర్ ట్రోఫీ (IND vs AUS)ని చేజార్చుకుంది.ఇదంతా ఒక ఎత్తైతే.. ఇంగ్లండ్ టూర్‌కు ముందే దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli), కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడానికి గంభీర్ కూడా ఓ కారణం. అంతేకాదు.. యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ కెప్టెన్ కావడంలోనూ గౌతీదే కీలక పాత్ర.దిగ్గజాలు లేకుండా గిల్ సారథ్యంలో ఇంగ్లండ్ గడ్డ మీద గెలవాల్సిన తొలి జట్టులో టీమిండియా ఓడిపోవడానికి కోచ్, కెప్టెన్ వ్యూహాలు సరిగ్గా లేకపోవడమే కారణం’’.. ఇటీవలి కాలంలో టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌పై వచ్చిన విమర్శలూ, ఆరోపణలూ ఇవీ. టెస్టుల్లో భారత్ వరుసగా విఫలం కావడంతో అతడిని కోచ్‌గా తొలగించాలనే డిమాండ్లూ వచ్చాయి.ఈ సిరీస్ కూడా సమర్పయామి అంటూ..అయితే, ఎడ్జ్‌బాస్టన్‌లో టీమిండియా చారిత్రాత్మక విజయం సాధించిన తర్వాత గౌతీపై విమర్శల దాడికి కాస్త బ్రేక్ పడింది. కానీ ఆ తర్వాత మళ్లీ పాత కథే పునరావృతమైంది.లార్డ్స్ టెస్టులో ఓటమి.. మాంచెస్టర్‌లో మ్యాచ్ డ్రా కావడం.. ఆఖరిగా ఓవల్‌లో ఐదో టెస్టులోనూ ఆఖరి రోజు వరకు ఇంగ్లండ్ పటిష్ట స్థితిలో ఉండటంతో .. ఇక ఈ సిరీస్ కూడా సమర్పయామి అంటూ మళ్లీ గంభీర్‌పై విమర్శలు మొదలయ్యాయి.అయితే, చివరి నిమిషం వరకు ఉత్కంఠగా సాగిన ఈ టెస్టులో భారత్ సంచలన విజయం సాధించింది. ఇంగ్లండ్ విజయానికి 17 పరుగులు.. టీమిండియా విజయానికి రెండు వికెట్ల దూరంలో ఉన్నవేళ ప్రసిద్ కృష్ణ జోష్ టంగ్‌ను బౌల్డ్ చేసి తొమ్మిదో వికెట్ పడగొట్టాడు.అద్భుతం చేసిన సిరాజ్ఇక విజయ సమీకరణాలు 7 పరుగులు.. ఒక వికెట్‌గా మారగా మహ్మద్ సిరాజ్ మరోసారి అద్భుతమే చేశాడు. అద్భుతమైన డెలివరీతో గస్ అట్కిన్సన్ను బౌల్డ్ చేసి టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. ఈ దృశ్యాల్ని చూస్తున్న సగటు అభిమానులతో పాటు కోచ్ గంభీర్ హృదయం ఉప్పొంగిపోయింది.గంభీర్ కన్నీటి పర్యంతంగతంలో ఎన్నడూ లేనివిధంగా గౌతీ కంట నీరొలికింది. తీవ్ర భావోద్వేగానికి లోనైన గంభీర్.. సహచర సిబ్బందిని గట్టిగా ఆలింగనం చేసుకుని వారిని ఆప్యాయంగా ముద్దాడాడు. ఆనందభాష్పాలు రాలుస్తూ టీమిండియా చిరస్మరణీయ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు. గంభీర్‌కు ఈ గెలుపు ఎంత ముఖ్యమో.. ఎంత అవసరమో తెలియజేయడానికి ఈ దృశ్యాలు చాలు!!ఇందుకు సంబంధించిన వీడియోను భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారింది. ‘‘నిజంగా ఈ వీడియో గూప్‌బంప్స్ తెప్పిస్తోంది భయ్యా. టీమిండియాకు, గంభీర్‌కు శుభాకాంక్షలు’’ అంటూ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఓవల్‌లో విజయంతో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 2-2తో సమం చేసింది.భారత్ వర్సెస్ ఇంగ్లండ్ ఐదో టెస్టు సంక్షిప్త స్కోర్లు👉భారత్- 224 & 396👉ఇంగ్లండ్- 247 & 367✊ఆరు పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై గెలిచిన భారత్.చదవండి: నన్ను నమ్మినందుకు థాంక్యూ విరాట్ భయ్యా: మహ్మద్ సిరాజ్𝗕𝗲𝗹𝗶𝗲𝗳. 𝗔𝗻𝘁𝗶𝗰𝗶𝗽𝗮𝘁𝗶𝗼𝗻. 𝗝𝘂𝗯𝗶𝗹𝗮𝘁𝗶𝗼𝗻!Raw Emotions straight after #TeamIndia's special win at the Kennington Oval 🔝#ENGvIND pic.twitter.com/vhrfv8ditL— BCCI (@BCCI) August 4, 2025 -
టీమిండియా సరికొత్త చరిత్ర.. రికార్డుల జాతర
ఇంగ్లండ్‌తో జరిగిన టెండూల్కర్-ఆండర్సన్ ట్రోఫీ-2025 రికార్డులకు అడ్డాగా మారింది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో చాలా రికార్డులు తిరగరాయబడ్డాయి. వీటిలో సింహభాగం భారత్, భారత్ ఆటగాళ్ల ఖాతాలో పడ్డాయి. జట్టు పరంగా టీమిండియా ఓ సరికొత్త రికార్డు నెలకొల్పింది.ఓ టెస్ట్ సిరీస్‌లో ఆస్ట్రేలియా తర్వాత రెండో అత్యధిక పరుగులు నమోదు చేసిన జట్టుగా రికార్డుల్లోకెక్కింది. ఈ సిరీస్‌లో భారత్ 42.32 సగటున 3809 పరుగులు చేసింది. 1989 యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా అత్యధికంగా 3877 పరుగులు చేసింది. తాజా సిరీస్‌లో భారత్ కేవలం 5 టెస్ట్‌ల్లోనే ఈ పరుగులు చేయగా.. ఆసీస్ నాటి యాషెస్ సిరీస్‌లో 6 టెస్ట్‌లు ఆడి భారత్ కంటే కేవలం 68 పరుగులే ఎక్కువ చేసింది.ఈ రికార్డుతో పాటు టెండూల్కర్-ఆండర్సన్ సిరీస్ మరిన్ని రికార్డులకు వేదికైంది. ఆ రికార్డులపై ఓ లుక్కేద్దాం.భారత్-ఇంగ్లండ్ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లో అత్యధిక పరుగులు- శుభ్‌మన్ గిల్ (5 మ్యాచ్‌ల్లో 754 పరుగులు). గతంలో ఈ రికార్డు గ్రహం గూచ్ (752) పేరిట ఉండేది.ఓ టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్- శుభ్‌మన్ గిల్. గతంలో ఈ రికార్డు సునీల్ గవాస్కర్ (732) పేరిట ఉండేది.SENA దేశాల్లో జరిగిన సిరీస్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆసియా బ్యాటర్: శుభ్‌మన్ గిల్, గతంలో ఈ రికార్డు విరాట్ కోహ్లి (692) పేరిట ఉండేది.టెస్ట్‌ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన భారత కెప్టెన్: శుభ్‌మన్ గిల్ (269 ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో). గతంలో ఈ రికార్డు విరాట్ కోహ్లి (254) పేరిట ఉండేది.SENA దేశాల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సిన ఆసియా కెప్టెన్: శుభ్‌మన్ గిల్. గతంలో ఈ రికార్డు తిలకరత్నే దిల్షన్ (193) పేరిట ఉండేది.ఓ టెస్ట్ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన పర్యాటక బ్యాటర్: శుభ్‌మన్ గిల్ (430, ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో 269+161). గతంలో ఈ రికార్డు ఆసీస్ మాజీ కెప్టెన్ మార్క్ టేలర్ (426) పేరిట ఉండేది.ఒకే టెస్ట్‌లో సెంచరీ, 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన తొలి ఇంగ్లండ్ కెప్టెన్: బెన్ స్టోక్స్ (నాలుగో టెస్ట్)ఒకే టెస్ట్‌లో రెండు సెంచరీలు చేసిన తొలి భారత వికెట్‌కీపర్: రిషబ్ పంత్ (హెడింగ్లే టెస్ట్)టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకిన జో రూట్: ఈ సిరీస్‌లో రూట్ ద్రవిడ్, కల్లిస్, రికీ పాంటింగ్‌లను అధిగమించి టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ లిస్ట్‌లో సచిన్ టెండూల్కర్ టాప్‌లో ఉన్నాడు.వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ చరిత్రలో 6000 పరుగులు చేసిన తొలి బ్యాటర్: జో రూట్SENA దేశాల్లో 150 వికెట్లు తీసిన తొలి ఆసియా బౌలర్: బుమ్రా (61 ఇన్నింగ్స్‌ల్లో)ఓ సిరీస్‌లో రెండో అత్యధిక పరుగులు (ఇరు జట్లు): ఈ సిరీస్‌లో భారత్, ఇంగ్లండ్ కలిపి 7000 పైచిలుకు పరుగులు నమోదు చేశాయి. 1993 యాషెస్ సిరీస్‌లో మాత్రమే ఈ ఘనత నమోదైంది.భారత్ అత్యల్ప, అతి భారీ విజయాలు (పరుగుల పరంగా): భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యల్ప, అతి భారీ విజయాలు ఈ సిరీస్‌లోనే నమోదయ్యాయి. ఈ సిరీస్‌లోని ఓవల్ టెస్ట్‌లో భారత్ 6 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందగా.. ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో 336 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. -
శభాష్ సిరాజ్ మియా.. ఓవల్ టెస్ట్‌లో టీమిండియా చిరస్మరణీయ విజయం (ఫొటోలు)
-
అతడొక సంచలనం.. ప్రాణం పెట్టి ఆడాడు! ఎంత చెప్పిన తక్కువే: గిల్
ఇంగ్లండ్ పర్యటనను టీమిండియా అద్బుతమైన విజయంతో ముగించింది. ఆండర్సన్- టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా ఓవల్ వేదికగా జరిగిన ఐదో టెస్టులో 6 పరుగుల తేడాతో భారత్ చారిత్రత్మక విజయం సాధించింది. ఆఖరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ప్రత్యర్ధిని ఓడించి సిరీస్‌ను 2-2తో భారత్ సమం చేసింది.374 పరుగుల లక్ష్య చేధనలో ఇంగ్లండ్ సైతం ఆఖరివరకు పోరాడింది. ఓటమి తప్పదనుకున్న చోట భారత బౌలర్లు మహ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ అద్బుతం చేశారు. 339/6 ఓవర్ నైట్ స్కోర్‌తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్.. 85.1 ఓవర్లలో 367 పరుగులకు ఆలౌటైంది.సెకెండ్ ఇన్నింగ్స్‌లో సిరాజ్ ఐదు వికెట్లు పడగొట్టగా.. ప్రసిద్ద్ నాలుగు వికెట్లు సాధించారు. ఓవరాల్‌గా రెండు ఇన్నింగ్స్‌లు కలిపి సిరాజ్ తొమ్మిది, ప్రసిద్ద్ 8 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 224 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ 247 పరుగులకు ఆలౌటైంది. అనంతరం భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 396 పరుగుల భారీ స్కోర్ చేసి 374 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇక ఈ అద్బుత విజయంపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ స్పందించాడు. కీలక మ్యాచ్‌లో గెలిసి సిరీస్ సమం చేసినందుకు సంతోషంగా ఉందని గిల్ అన్నాడు."ఈ సిరీస్ అసాంతం రెండు జట్లు(భారత్, ఇంగ్లండ్) అద్బుతమైన ప్రదర్శన కనబరిచాయి. ఈ మ్యాచ్ ఐదో రోజు విషయానికి వస్తే.. ఇరు జట్లకు సమంగా విజయ అవకాశాలు ఉండేవి. ఎవరు గెలుస్తారో అంచనా వేయలేని పరిస్థితి. ఎవరి వ్యూహాలు వారికి ఉన్నాయి. ఆఖరికి ఈ ఉత్కంఠపోరులో మేము పై చేయి సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది.అందుకే కొత్త బంతిని తీసుకోలేదు..సిరాజ్, ప్రసిద్ద్ లాంటి బౌలర్లు ఇంత అద్బుతంగా బౌలింగ్ చేస్తే ఎవరికైనా కెప్టెన్సీ చాలా సులభం అనిపిస్తుంది. వారిద్దరూ మ్యాచ్ విన్నింగ్ స్పెల్ బౌలింగ్ చేశారు. పాత బంతితో మాకు ఎటువంటి సమస్యలేదన్పించింది. బంతి రెండు వైపులా మంచిగా మూవ్ అయింది. అందుకే కొత్త బంతిని తీసుకులేదు. అయితే ఆరంభంలో మాపై కొంత మాపై ఒత్తడి ఉండేది. కానీ గెలుస్తామన్న నమ్మకం అయితే మాకు ఉండేది. వారిని ఒత్తిడి గురిచేయాలనుకున్నాము. ఒత్తిడిలో ఎటువంటి జట్టు అయినా తప్పిదాలు చేస్తోంది. మా ప్రణాళికలకు తగ్గట్టే బౌలర్లు అద్బుతంగా రాణించారు.ఒక్కడు చాలు..సిరాజ్ ఒక సంచలనం. అటువంటి బౌలర్ ఒకరు జట్టులో ఉండాలని ప్రతీ కెప్టెన్ కోరుకుంటాడు. ఈ ఒక్క మ్యాచ్‌లోనే కాదు ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్ మొత్తం అతడు ఆసాధరణ ప్రదర్శన కనబరిచాడు. ప్రతీ బంతిని ప్రాణం పెట్టి బౌలింగ్ చేస్తాడు.ఈ విజయానికి మేము అన్ని రకాల ఆర్హులం. ఇక ఈ సిరీస్‌లో టాప్ రన్‌స్కోరర్‌గా నిలవడం చాలా ఆనందంగా ఉంది. ఈ సిరీస్ ఆరంభానికి ముందు నేను చాలా కష్టపడ్డాడు. ఈ సిరీస్‌లో బెస్ట్ బ్యాటర్‌గా ఉండడమే లక్ష్యంగా పెట్టుకున్నాను. ఇప్పుడు నా లక్ష్యాన్ని అందుకున్నాను" పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో గిల్ పేర్కొన్నాడు.చదవండి: IND vs ENG: ప్రతీకారం తీర్చుకున్న సిరాజ్.. ఓవల్‌లో భారత్ చారిత్రత్మక విజయంसूरमा नहीं विचलित होते,क्षण एक नहीं धीरज खोते,विघ्नों को गले लगाते हैं,काँटों में राह बनाते हैं।#INDvsENGTest #OvalTest pic.twitter.com/j7W0q1y2RY— Office of Shivraj (@OfficeofSSC) August 4, 2025 -
తప్పుల మీద తప్పులు!... గిల్, గంభీర్ తీరుపై అశ్విన్ ఆగ్రహం
ఇంగ్లండ్‌తో ఐదో టెస్టులో టీమిండియా ఆట తీరుపై భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) విమర్శలు గుప్పించాడు. నాయకత్వ బృందం వ్యూహాలు సరిగ్గాలేవని.. ప్రతి మ్యాచ్‌లోనూ ఆఖరి వరకు పోరాడినా ఓడిపోవడం హర్షించదగ్గ విషయం కాదన్నాడు. ఓవల్ టెస్టు (IND vs ENG Oval Test)లోనూ పాత తప్పిదాలే పునరావృతం చేశారంటూ అసంతృప్తి వ్యక్తం చేశాడు.ఆఖరి వరకు పోరాడినా..కాగా ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ (Anderson- Tendulkar Trophy)లో భాగంగా భారత్ ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ ఆడుతోంది. లీడ్స్ టెస్టులో టీమిండియా ఐదు సెంచరీలు సాధించినా.. ఆఖరికి ఆతిథ్య జట్టు చేతిలో ఓటమిపాలైంది. అయితే, ఎడ్జ్‌బాస్టన్‌లో స్టోక్స్ బృందాన్ని ఏకంగా 336 పరుగులతో చిత్తు చేసి చారిత్రాత్మక విజయం సాధించింది.అయితే, లార్డ్స్ టెస్టులో మాత్రం ఆఖరి వరకు పోరాడినా 22 పరుగుల తేడాతో టీమిండియాకు ఓటమి తప్పలేదు. ఇక మాంచెస్టర్‌లో డ్రాతో గట్టెక్కింది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో ఉండగా.. ఓవల్‌లో ఆఖరి టెస్టులో టీమిండియా తప్పక గెలవాలి.ఐదో రోజే ఫలితంఅయితే, రికార్డు స్థాయిలో ఈ వేదికపై ప్రత్యర్థికి 374 పరుగుల లక్ష్యాన్ని విధించిన గిల్ సేన.. దానిని కాపాడుకునే ప్రయత్నంలో తడబడుతోంది. ఆదివారం నాటి నాలుగో రోజు ఆట ముగిసేసరికి ఇంగ్లండ్ విజయానికి 35 పరుగుల దూరంలో నిలవగా.. భారత్ గెలుపొందాలంటే నాలుగు వికెట్లు కావాలి.తప్పుల మీద తప్పులు!ఇంగ్లండ్ ఈ మేర పటిష్ట స్థితికి చేరుకోవడానికి జో రూట్ (105), హ్యారీ బ్రూక్ (111) అద్భుత శతకాలే కారణం. ఈ నేపథ్యంలో అశ్విన్ మాట్లాడుతూ.. ‘‘వాటే ఫినిష్! ప్రతి మ్యాచ్‌లోనూ ఇరుజట్లు అనుభవలేమి కారణంగా ప్రాథమిక తప్పిదాలతో మూల్యం చవిచూస్తున్నాయి.అయితే, ఈరోజు ఇంగ్లండ్ పటిష్ట స్థితిలో నిలిచేందుకు ఎలాంటి అర్హత కలిగి లేదు. కానీ మనవాళ్ల వల్లే ఇది సాధ్యమైంది. ఓవల్‌లో టీమిండియా విఫలమైంది. అసలు ఈ సిరీస్‌లో భారత బృందం ఆది నుంచే వ్యూహాత్మక తప్పిదాలు చేసింది.అందుకే ఇంగ్లండ్ మనకంటే ముందుంది. శుబ్‌మన్ గిల్ రోజురోజుకీ మరింత మెరుగైన కెప్టెన్‌గా తయారవుతాడని నాకు నమ్మకం ఉంది. కానీ కొన్నిసార్లు ఆటకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.అతడిని ముందుగానే తీసుకురావాల్సిందిపేసర్ల బౌలింగ్‌లో ప్రత్యర్థి బ్యాటర్లు షాట్లు బాదుతూ ఉంటే.. స్పిన్నర్లను బరిలోకి దించాలి. వారు వికెట్లు తీయకపోయినా పరుగుల ప్రవాహాన్ని మాత్రం కట్టడి చేస్తారు కదా! హ్యారీ బ్రూక్ అటాక్ మొదలుపెట్టి.. 20 పరుగులు చేసిన తర్వాత.. కచ్చితంగా స్పిన్నర్‌ను తీసుకురావాల్సింది. స్పిన్ బౌలర్ ఉంటే పరుగులు రాకుండా కట్టడి చేసేవాడు. మరో ఎండ్ నుంచి పేసర్ బౌల్ చేసేవాడు. నిజంగా ఆదివారం వాషింగ్టన్ సుందర్ చేతికి ముందుగానే బంతిని ఇచ్చి ఉంటే జట్టుకు ప్రయోజనకరంగా ఉండేది.డ్రెసింగ్ రూమ్ నుంచి వీరికి ఎలాంటి సలహాలు, సూచనలు వస్తున్నాయో నాకైతే తెలియడం లేదు. కానీ రోజు చిన్న చిన్న తప్పిదాల వల్ల భారీ మూల్యం చెల్లించే పరిస్థితికి చేరుకున్నాం’’ అంటూ ఫైర్ అయ్యాడు. హెడ్‌కోచ్ గౌతం గంభీర్, కెప్టెన్ గిల్ ప్రణాళికలు సరిగ్గా లేవంటూ అశ్విన్ విమర్శించాడు.బౌలర్ల ప్రదర్శన ఇలా..కాగా ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో పేసర్లలో ఆకాశ్ దీప్ 20 ఓవర్లలో 85 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీయగా.. ప్రసిద్ కృష్ణ 22.2 ఓవర్లలో 109 రన్స్ ఇచ్చి మూడు వికెట్లు కూల్చాడు. సీనియర్ పేసర్ మహ్మద్ సిరాజ్ 26 ఓవర్లలో 95 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకోగా.. స్పిన్ ఆల్‌రౌండర్లు వాషింగ్టన్ సుందర్ 4 ఓవర్లలో 19, రవీంద్ర జడేజా 4 ఓవర్లలో 22 పరుగులు ఇచ్చారు.చదవండి: IND vs ENG: కామన్సెన్స్ లేదు.. నిజంగా సిగ్గుచేటు.. అరగంటలో ముగించేవారు!Just in awe 👏#SonySportsNetwork #ENGvIND #NayaIndia #DhaakadIndia #TeamIndia #ExtraaaInnings | @root66 pic.twitter.com/HkJjOiiOBT— Sony Sports Network (@SonySportsNetwk) August 3, 2025 -
ఇంజక్షన్ తీసుకున్నావా?.. పరితపించిపోయిన శుబ్‌మన్ గిల్
టీమిండియా టెస్టు కెప్టెన్‌గా అరంగేట్రంలోనే బ్యాట్‌తో అదరగొట్టాడు శుబ్‌మన్ గిల్ (Shubman Gill). ఇంగ్లండ్‌తో లీడ్స్ టెస్టులో శతక్కొట్టిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఎడ్జ్‌బాస్టన్‌లో డబుల్ సెంచరీ, సెంచరీలతో అలరించాడు. తద్వారా ఈ వేదికపై అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత సారథిగా నిలిచిన గిల్.. ఈ మైదానంలో తొలిసారి భారత్‌కు టెస్టు విజయం అందించిన కెప్టెన్‌గా చరిత్రకెక్కాడు.మరోసారి శతక్కొట్టిఇక లార్డ్స్‌లో జరిగిన మూడో టెస్టులో విఫలమైనా.. మాంచెస్టర్ టెస్టులో సెంచరీ సాధించి డ్రా కావడంలో శుబ్‌మన్ గిల్ కీలక పాత్ర పోషించాడు. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ను సమం చేయాలంటే ఆఖరిదైన ఐదో టెస్టు (IND vs ENG 5th Test)లో టీమిండియా తప్పక గెలవాల్సిన పరిస్థితి.రూట్, బ్రూక్ సెంచరీలుచావోరేవో తేల్చుకోవాల్సిన ఈ మ్యాచ్‌లో టీమిండియా ఇంగ్లండ్‌కు 374 పరుగుల మేర మెరుగైన లక్ష్యమే విధించింది. కానీ ఫీల్డింగ్ తప్పిదాల కారణంగా భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. జో రూట్ (Joe Root- 105) మరోసారి తన అనుభవంతో ఇంగ్లండ్‌ను గట్టెక్కించగా.. యువ ఆటగాడు హ్యారీ బ్రూక్ (111) అతడికి అండగా నిలిచాడు.ఈ జోడీని విడదీసేందుకు భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. బౌలర్లను మార్చుతున్నా ప్రయోజనం లేకపోయింది. పేసర్లు మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణలను వరుస విరామాల్లో బరిలోకి దించిన గిల్.. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ సేవలను కూడా వాడుకున్నాడు.నువ్వు ఇంజక్షన్ తీసుకున్నావా?అయితే, వీరిద్దరు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. దీంతో విసుగెత్తిన గిల్.. ఎలాగైనా మ్యాచ్‌ను తమవైపునకు తిప్పుకోవాలనే యోచనతో.. గాయపడిన ఆకాశ్ దీప్‌ను సిద్ధంగా ఉన్నావంటూ అడిగాడు. కాగా వెన్నునొప్పి కారణంగా నాలుగో టెస్టుకు దూరమైన ఆకాశ్ దీప్.. ఈ మ్యాచ్‌లో హ్యారీ బ్రూక్‌కు వేసిన బంతిని.. అతడు స్ట్రెయిట్ షాట్‌గా మలచగా.. దానిని ఆపే క్రమంలో గాయపడ్డాడు. అతడి కాలికి గాయమైంది.అయితే, భోజన విరామ సమయానికి ముందు ఆకాశ్ దీప్ సేవలు వాడుకోవాలని భావించిన గిల్.. ‘‘నువ్వు ఇంజక్షన్ తీసుకున్నావా?’’ అంటూ అతడిని ప్రశ్నించాడు. ఈ మాటలు స్టంప్ మైకులో రికార్డు కాగా.. నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో కామెంటేటర్, టీమిండియా మాజీ కోచ్ సంజయ్ బంగర్ స్పందిస్తూ.. ‘‘లంచ్ బ్రేక్ తర్వాత మరోసారి పేసర్లనే బరిలోకి దించాలని గిల్ భావిస్తున్నాడు’’ అంటూ ప్రత్యర్థి జట్టు వికెట్లు పడగొట్టేందుకు భారత సారథి ఎంతగా పరితపించిపోతున్నాడో తెలియజేశాడు.కాగా బ్రూక్‌ను ఆకాశ్ దీప్ అవుట్ చేయగా.. రూట్‌ను ప్రసిద్ పెవిలియన్‌కు పంపాడు. నాలుగో రోజు ఆట ముగిసేసరికి ఇంగ్లండ్ ఆరు వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. ప్రసిద్ మూడు, సిరాజ్ రెండు, ఆకాశ్ దీప్ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.ఈ నేపథ్యంలో భారత్- ఇంగ్లండ్ మధ్య ఐదో టెస్టు ఆఖరి రోజైన సోమవారం గిల్ సేన విజయానికి నాలుగు వికెట్లు అవసరం. అలా అయితేనే.. సిరీస్‌ను 2-2తో డ్రా చేయగలుగుతుంది. మరోవైపు.. ఆతిథ్య జట్టు గెలుపునకు 35 పరుగుల దూరంలో ఉంది. కాగా ఇంగ్లండ్‌తో ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీతో గిల్ భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా తన ప్రయాణం ఆరంభించిన విషయం తెలిసిందే.చదవండి: IND vs ENG: అక్కడ నిల్చుని ఏం ఆలోచిస్తున్నావు సిరాజ్?.. రిక్కీ పాంటింగ్ ఫైర్!pic.twitter.com/iX9bFm9i9b— The Game Changer (@TheGame_26) August 3, 2025 -
టీమిండియా సరికొత్త చరిత్ర.. ప్రపంచ రికార్డు సమం
ఇంగ్లండ్‌తో ఐదో టెస్టు సందర్భంగా టీమిండియా (IND vs ENG 5th Test) సరికొత్త చరిత్ర లిఖించింది. ఒక టెస్టు సిరీస్‌లో అత్యధిక శతకాలు బాదిన జట్ల జాబితాలో చేరింది. తద్వారా ఆస్ట్రేలియా, పాకిస్తాన్, సౌతాఫ్రికా జట్ల సరసన నిలిచి ప్రపంచ రికార్డు సమం చేసింది. అయితే, విదేశీ గడ్డ మీద ఈ ఘనత సాధించిన రెండో టీమ్‌గా మరో అరుదైన ఫీట్ నమోదు చేసింది.కాగా టీమిండియా ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ (Anderson- Tendulkar Trophy)లో భాగంగా ఆతిథ్య జట్టుతో ఐదు టెస్టులు ఆడుతోంది. ఇందులో ఇప్పటికే నాలుగు పూర్తి కాగా.. ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో ఉంది. ఓవల్ వేదికగా ఆఖరిదైన ఐదో టెస్టు గెలిస్తేనే టీమిండియా సిరీస్‌ను 2-2తో సమం చేయగలదు.జైసూ సెంచరీఇక ఈ మ్యాచ్‌లో శనివారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) సెంచరీ సాధించాడు. 127 బంతుల్లో శతక మార్కును అందుకున్నాడు. మొత్తంగా 164 బంతులు ఎదుర్కొని 118 పరుగులు సాధించి నిష్క్రమించాడు. కాగా అతడి టెస్టు కెరీర్లో ఇది ఆరో సెంచరీ.. ఈ సిరీస్‌లో రెండోది.12 సెంచరీలు అదే విధంగా.. జైసూ శతకంతో ఈ సిరీస్‌లో టీమిండియా తరఫున ఇప్పటికి 12 సెంచరీలు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మూడు జట్లకు మాత్రమే ఈ ఘనత సాధ్యంకాగా.. తాజాగా టీమిండియా కూడా చరిత్ర పుటల్లోకెక్కింది. ఇదిలా ఉంటే.. 75/2 ఓవర్‌నైట్ స్కోరుతో శనివారం నాటి మూడో రోజు ఆట మొదలుపెట్టిన టీమిండియా.. టీ బ్రేక్ సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. ధ్రువ్ జురెల్ 25, రవీంద్ర జడేజా 26 పరుగులతో క్రీజులో ఉన్నారు. జైస్వాల్ శతకం (118), ఆకాశ్ దీప్ అర్ధ శతకం (66)తో అదరగొట్టారు. ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్-2025లో ఇప్పటి వరకు శతకాలు బాదింది వీరేయశస్వి జైస్వాల్- 2 సెంచరీలు (హెడింగ్లీ- లీడ్స్, ది ఓవల్- లండన్)శుబ్‌మన్ గిల్- 4 సెంచరీలు (హెడింగ్లీ- లీడ్స్, ఎడ్జ్‌బాస్టన్- బర్మింగ్‌హామ్, ఓల్డ్ ట్రఫోర్డ్- మాంచెస్టర్ )రిషభ్ పంత్- 2 సెంచరీలు (హెడింగ్లీ- లీడ్స్)కేఎల్ రాహుల్- 2 సెంచరీలు (హెడింగ్లీ- లీడ్స్, లార్డ్స్- లండన్)రవీంద్ర జడేజా- 1 సెంచరీలు (ఓల్డ్ ట్రఫోర్డ్- మాంచెస్టర్)వాషింగ్టన్ సుందర్- 1 సెంచరీలు (ఓల్డ్ ట్రఫోర్డ్- మాంచెస్టర్)ఒక టెస్టు సిరీస్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన జట్లుఆస్ట్రేలియా- 1955లో వెస్టిండీస్ వేదికగా ఆతిథ్య జట్టు మీద- ఐదు టెస్టుల్లో- 12 సెంచరీలుపాకిస్తాన్- 1982/83లో సొంతగడ్డపై టీమిండియా మీద ఆరు టెస్టుల్లో- 12 సెంచరీలుసౌతాఫ్రికా- 2003/04లో సొంతగడ్డపై వెస్టిండీస్ మీద నాలుగు టెస్టుల్లో- 12 సెంచరీలుటీమిండియా- 2025లో ఇంగ్లండ్ వేదికగా ఆతిథ్య జట్టు మీద- 12 సెంచరీలుచదవండి: IND vs ENG: నేనైతే ఆకాశ్‌కు ఒక్కటి ఇచ్చేవాడిని: రిక్కీ పాంటింగ్ 𝘾𝙚𝙣𝙩𝙪𝙧𝙮 𝙖𝙜𝙖𝙞𝙣𝙨𝙩 𝙖𝙡𝙡 𝙤𝙙𝙙𝙨 🥶🗣 #YashasviJaiswal completes a dramatic knock to bring up his 6th International Test century in style! 🔥#ENGvIND 👉 5th TEST, DAY 3 | LIVE NOW on JioHotstar 👉 https://t.co/3V6YCy3sHy pic.twitter.com/ezdwfz3oYi— Star Sports (@StarSportsIndia) August 2, 2025 -
IND vs ENG: శతక్కొట్టిన జైస్వాల్.. ఇంగ్లండ్‌తో మ్యాచ్ అంటే అంతే!
ఇంగ్లండ్‌తో ఐదో టెస్టులో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiwal) శతక్కొట్టాడు. ఓవల్ మైదానంలో శనివారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా వంద పరుగుల మార్కును అందుకున్నాడు. 127 బంతుల్లోసెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతడి శతక ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు 2 సిక్సర్లు ఉన్నాయి. ఇక ఈ సిరీస్‌లో జైసూకు ఇది రెండో శతకం. అంతకు ముందు లీడ్స్ వేదికగా తొలి టెస్టులో జైస్వాల్ 101 పరుగులు చేశాడు. కాగా ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ (Anderson- Tendulkar Trophy)లో భాగంగా ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లండ్ టీమిండియాపై 2-1తో ఆధిక్యంలో ఉంది. ఈ క్రమంలో సిరీస్ ఫలితాన్ని తేల్చే ఆఖరిదైన ఐదో మ్యాచ్ లండన్‌లో గురువారం మొదలైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకు ఆలౌట్ అయింది.హాఫ్ సెంచరీని సెంచరీగా మలిచాడుతొలి ఇన్నింగ్స్‌లో జైస్వాల్ రెండు పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. ఇంగ్లండ్ పేసర్ గస్ అట్కిన్సన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. అయితే, రెండో ఇన్నింగ్స్‌కు వచ్చే సరికి జైస్వాల్ గేరు మార్చాడు. శుక్రవారం నాటి రెండో రోజు ఆటలోనే అర్ధ శతకం (52*) పూర్తి చేసుకున్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. శనివారం దానిని సెంచరీగా మలిచాడు.టెస్టులలో ఆరోది..తద్వారా ఈ సిరీస్‌లో రెండో శతకంతో పాటు.. తన టెస్టు కెరీర్లో ఆరో సెంచరీని నమోదు చేశాడు. ఇందులో నాలుగు ఇంగ్లండ్ మీద బాదినవే కావడం మరో విశేషం. ఇదిలా ఉంటే.. 75/2 ఓవర్‌నైట్ స్కోరుతో శనివారం ఆట మొదలుపెట్టిన టీమిండియా 51 ఓవర్ల ఆట పూర్తయ్యేసరికి నాలుగు వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. నైట్ వాచ్‌మన్ ఆకాశ్ దీప్ అర్ధ శతకం(66)తో చెలరేగగా.. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (11) మాత్రం నిరాశపరిచాడు. జైసూతో కలిసి కరుణ్ నాయర్ (9*) పరుగులతో క్రీజులో ఉన్నాడు. కాగా భారత్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకు కట్టడి చేసిన ఇంగ్లండ్.. తమ మొదటి ఇన్నింగ్స్‌లో 247 పరుగులకు ఆలౌట్ అయింది.చదవండి: IND vs ENG: నేనైతే ఆకాశ్‌కు ఒక్కటి ఇచ్చేవాడిని: రిక్కీ పాంటింగ్ -
ఊహించని రీతిలో చెలరేగిన ఆకాశ్.. గంభీర్, గిల్ రియాక్షన్ వైరల్
ఇంగ్లండ్‌తో ఐదో టెస్టులో టీమిండియా పేసర్ ఆకాశ్ దీప్ (Akash Deep) అర్ధ శతకంతో మెరిశాడు. శనివారం నాటి మూడో రోజు ఆట సందర్భంగా డెబ్బై బంతుల్లో యాభై పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. టెస్టుల్లో తన తొలి హాఫ్ సెంచరీని ఇంగ్లండ్ గడ్డ మీద నమోదు చేశాడు.గంభీర్, గిల్, జడేజా రియాక్షన్ వైరల్నైట్ వాచ్‌మన్‌గా వచ్చి అర్ధ శతకంతో ఆకాశ్ దీప్ ఇరగదీయడంతో భారత శిబిరంలో నవ్వులు పూశాయి. హాఫ్ సెంచరీని సెలబ్రేట్ చేసుకునే క్రమంలో ఆకాశ్ బ్యాట్ పైకెత్తగానే.. కెమెరాలు ఇండియన్ డ్రెసింగ్‌రూమ్ వైపు మళ్లాయి. లోపల కూర్చుని ఉన్న హెడ్‌కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) చిరునవ్వులు చిందించాడు.మరోవైపు.. బయటకు వచ్చిన కెప్టెన్ శుబ్‌మన్ గిల్, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) చప్పట్లతో ఆకాశ్ దీప్‌ను ఉత్సాహపరుస్తూ అతడికి శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే, టీమిండియా రెండో ఇన్నింగ్స్ 43వ ఓవర్లో ఇంగ్లండ్ పేసర్ జేమీ ఓవర్టన్ బౌలింగ్‌లో షాట్ ఆడేందుకు ప్రయత్నించిన ఆకాశ్ దీప్.. పాయింట్ దిశగా బంతిని గాల్లోకి లేపాడు.66.. అవుట్అక్కడికి దగ్గర్లో ఫీల్డింగ్ చేస్తున్న గస్ అట్కిన్సన్ పరుగెత్తుకుని వచ్చి డైవ్ చేసి మరీ బంతిని అందుకున్నాడు. దీంతో ఆకాశ్ దీప్ ‘హీరోచిత’ ఇన్నింగ్స్‌కు తెరపడింది. మొత్తంగా 94 బంతులు ఎదుర్కొన్న అతడు.. 12 ఫోర్ల సాయంతో 66 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. ఫలితంగా టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. కాగా 75/2 ఓవర్‌నైట్ స్కోరుతో శనివారం నాటి ఆట మొదలుపెట్టి టీమిండియా.. భోజన విరామ సమయానికి 44 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 85, కెప్టెన్ శుబ్‌మన్ గిల్ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు. లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా ఇంగ్లండ్ కంటే 166 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇక ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే టీమిండియా ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ను 2-2తో సమం చేయగలుగుతుంది.భారత్ వర్సెస్ ఇంగ్లండ్ ఐదో టెస్టు👉వేదిక: కెన్నింగ్టన్ ఓవల్, లండన్👉టాస్: ఇంగ్లండ్.. తొలుత బౌలింగ్👉భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 224👉ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 247.చదవండి: IND vs ENG: నేనైతే ఆకాశ్‌కు ఒక్కటి ఇచ్చేవాడిని: రిక్కీ పాంటింగ్A maiden international 5️⃣0️⃣ for Akash Deep 👏#SonySportsNetwork #ENGvIND #NayaIndia #DhaakadIndia #TeamIndia #ExtraaaInnings pic.twitter.com/O1wAt9ecyg— Sony Sports Network (@SonySportsNetwk) August 2, 2025 -
ENG VS IND 5th Test: ఇంగ్లండ్‌కు ఫ్రీ గిఫ్ట్.. వీడియో
కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఇంగ్లండ్‌తో ఇవాళ (జులై 31) మొదలైన ఐదో టెస్ట్‌లో టీమిండియా కష్టాల్లో ఉంది. వరుణుడి అంతరాయాల నడుమ సాగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్.. లంచ్ విరామం తర్వాత వర్షం ఆటంకం కలిగించే సమయానికి 3 వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది.INDIA HAS GIFTED A WICKET TO ENGLAND IN TOUGH CONDITIONS 💔 pic.twitter.com/K3TweTiVGs— Johns. (@CricCrazyJohns) July 31, 2025ఆట నిలిచిపోయే సమయానికి 10 నిమిషాల ముందు భారత్ ఇంగ్లండ్‌కు ఓ ఫ్రీ గిఫ్ట్ ఇచ్చింది. శుభ్‌మన్ గిల్ (21) లేని పరుగు కోసం ప్రయత్నించి అనవసరంగా వికెట్ పారేసుకున్నాడు. అప్పటికే కష్టాల్లో ఉన్న టీమిండియాను గిల్ రనౌట్ మరింత ఇరకాటంలో పడేసింది. ఈ ఇన్నింగ్స్‌లో గిల్ మంచి టచ్‌లో ఉన్నట్లు కనిపించాడు. ఆడిన 35 బంతుల్లో 4 సొగసైన బౌండరీలు బాదాడు.సిరీస్‌లో తొలి మ్యాచ్ నుంచి భీకర ఫామ్‌లో ఉన్న గిల్ చీప్‌గా రనౌట్ కావడాన్ని భారత అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అంతకుముందు భారత్ 38 పరుగులకే ఇద్దరు ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. యశస్వి జైస్వాల్ 2, కేఎల్ రాహుల్ 14 పరుగులు చేసి పలాయనం చిత్తగించారు. సాయి సుదర్శన్‌తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేస్తున్న గిల్ అనవసరంగా రనౌటై టీమిండియాను కష్టాల్లోకి నెట్టేశాడు.ప్రస్తుతం సాయి సుదర్శన్‌తో (28) పాటు కరుణ్ నాయర్ (0) క్రీజ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ (రాహుల్), అట్కిన్సన్కు (జైస్వాల్) తలో వికెట్ దక్కింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. వరుణుడు టాస్కు ముందు, లంచ్ విరామంలో ఓసారి, తాజాగా మరోసారి ఆటకు అడ్డుతగిలాడు. వాతావరణ శాఖ నివేదికల ప్రకారం ఈ రోజు ఆట అంతా ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. మధ్యమధ్యలో వరుణుడు పలకరిస్తూ పోతుంటాడు.కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ 1-2తో వెనుకపడి ఉన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే భారత్ సిరీస్‌ను సమం చేసుకోగలుగుతుంది. ఓడినా, డ్రా అయినా ఇంగ్లండే సిరీస్ ఎగరేసుకుపోతుంది. -
చరిత్ర సృష్టించిన శుభ్‌మన్ గిల్.. ఆల్‌టైమ్ రికార్డు బద్దలు
ఇంగ్లండ్ గడ్డపై ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వరుస పెట్టి రికార్డులు బద్దలు కొడుతున్నాడు. ఈ సిరీస్ ఆరంభం నుంచి భీకర ఫామ్‌లో ఉన్న గిల్.. తాజాగా మరో ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేసి చరిత్ర సృష్టించాడు.లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో ఇవాళ (జులై 31) ఐదో టెస్ట్ ప్రారంభం కాగా.. భారత్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగింది. కష్టమైన పిచ్‌పై తడబడుతూనే బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే భారీ ఎదురుదెబ్బలు తగిలాయి. స్కోర్ 50 పరుగులు కూడా దాటకుండానే ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (2), కేఎల్ రాహుల్ (14) పెవిలియన్‌కు చేరారు.ఈ దశలో బరిలోకి దిగిన గిల్.. ఎంతో సంయమనంగా బ్యాటింగ్ చేస్తూ లంచ్ విరామంలోపు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడాడు. ఈ క్రమంలో గిల్ సునీల్ గవాస్కర్ పేరిట ఉండిన ఓ ఆల్‌టైమ్ రికార్డును చెరిపేసి చరిత్రపుటల్లో తన పేరును లిఖించుకున్నాడు. 11 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద గిల్ ఓ టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్‌గా సునీల్ గవాస్కర్ రికార్డును బద్దలు కొట్టాడు.1978/79 వెస్టిండీస్ సిరీస్‌లో గవాస్కర్ 732 పరుగులు చేయగా.. ప్రస్తుత ఇంగ్లండ్ సిరీస్‌లో గిల్ ఈ రికార్డును తన ఖాతాలో వేసేసుకున్నాడు. ఈ సిరీస్‌లో గిల్ ఇప్పటివరకు 737* పరుగులు చేశాడు. తొలి రోజు లంచ్ విరామం సమయానికి భారత్ స్కోర్ 72/2గా ఉంది. గిల్ (15), సాయి సుదర్శన్ (25) క్రీజ్‌లో ఉన్నారు.ఓ టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్లు737* - శుభ్‌మన్ గిల్ vs ENG, 2025732 - సునీల్ గవాస్కర్ vs WI, 1978/79655 - విరాట్ కోహ్లీ vs ENG, 2016/17610 - విరాట్ కోహ్లీ vs SL, 2017/18593 - విరాట్ కోహ్లీ vs ENG, 2018కాగా, ఈ మ్యాచ్ కోసం భారత్, ఇంగ్లండ్ జట్లు చెరో నాలుగు మార్పులు చేశారు. భారత్ తరఫున రిషబ్ పంత్, శార్దూల్ ఠాకూర్, బుమ్రా, అన్షుల్ కంబోజ్ స్థానాల్లో ధ్రువ్ జురెల్, కరుణ్ నాయర్, ప్రసిద్ద్ కృష్ణ, ఆకాశ్‌దీప్ తుది జట్టులోకి రాగా.. ఇంగ్లండ్ తరఫున బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, బ్రైడన్ కార్స్, లియామ్ డాసన్ స్థానాల్లో జేకబ్ బేతెల్, గస్ అట్కిన్సన్, జోష్ టంగ్, జేమీ ఓవర్టన్ ప్లేయింగ్ ఎలెవెన్‌లోకి వచ్చారు.ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ 1-2తో వెనుకపడి ఉన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే భారత్ సిరీస్‌ను సమం చేసుకోగలుగుతుంది. ఓడినా, డ్రా అయినా ఇంగ్లండే సిరీస్ ఎగరేసుకుపోతుంది. తుది జట్లు..భారత్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్(కెప్టెన్), కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్‌కీపర్), వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్(కెప్టెన్), జో రూట్, హ్యారీ బ్రూక్, జాకబ్ బెథెల్, జామీ స్మిత్(వికెట్‌కీపర్), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, జేమీ ఓవర్టన్, జోష్ టంగ్ -
అతడి పేరు మర్చిపోయిన గిల్.. కరుణ్‌కు ఇదే లాస్ట్ ఛాన్స్
వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న కరుణ్ నాయర్ (Karun Nair)కు టీమిండియా యాజమాన్యం మరో అవకాశం ఇచ్చింది. ఇంగ్లండ్‌తో ఐదో టెస్టు (Ind vs Eng) తుదిజట్టులో ఈ వెటరన్ బ్యాటర్‌కు స్థానం కల్పించింది. హెడ్‌కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir)- కెప్టెన్ శుబ్‌మన్ గిల్ ఈ దేశవాళీ క్రికెట్ వీరుడుపై మరోసారి నమ్మకం ఉంచడం నిజంగా విశేషమే.ఈ మ్యాచ్‌కు ముందే కరుణ్ కెరీర్ ముగిసిపోయిందని అంతా భావించారు. త్వరలోనే అతడి నుంచి రిటైర్మెంట్ ప్రకటన వస్తుందనే ఊహాగానాలు జోరుగా వినిపించాయి. అయితే, అనూహ్యంగా మేనేజ్మెంట్ అతడికి మరోసారి పిలుపునివ్వడం పట్ల అభిమానులు సంతోషంగా ఉన్నారు.ఇదే ఆఖరి అవకాశంఅయితే, అదే సమయంలో కరుణ్ నాయర్‌కు లభించిన చివరి అవకాశం ఇదేనని.. ఇక్కడా విఫలమైతే కెరీర్ ముగిసినట్లేననే కామెంట్లు చేస్తున్నారు. కాగా రంజీల్లో విదర్భ తరఫున సత్తా చాటిన కరుణ్‌కు.. ఎనిమిదేళ్ల తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం చేసే అవకాశం లభించింది.ఇంగ్లండ్‌తో ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ సిరీస్ సందర్భంగా సెలక్టర్లు కరుణ్ నాయర్‌కు పిలుపునిచ్చారు. ఇంగ్లండ్ లయన్స్‌తో భారత్-ఎ తరఫున డబుల్ సెంచరీతో సత్తా చాటిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌కు.. ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో ఆడే అవకాశం ఇచ్చారు.చేసింది 131 పరుగులేఅయితే, కరుణ్ రీఎంట్రీలో డకౌట్ అయి పూర్తిగా నిరాశపరిచాడు. ఆ తర్వాత కూడా అతడు స్థాయికి తగ్గట్లు రాణించలేదు. రెండో టెస్టు నుంచి వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన కరుణ్ నాయర్.. ఇప్పటి వరకు చేసిన పరుగులు వరుసగా.. 0, 20, 31, 26, 40, 14.ఇలా మూడు టెస్టుల్లో ఆరు ఇన్నింగ్స్‌లో కలిపి 33 ఏళ్ల కరుణ్ నాయర్.. 131 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అయినా.. సరే ఆఖరి టెస్టులో అతడు మళ్లీ ప్లేయింగ్ ఎలెవన్‌లోకి రాగలిగాడు. కరుణ్‌ను చేర్చడం సహా ఐదో టెస్టులో టీమిండియా యాజమాన్యం తుదిజట్టులో నాలుగు మార్పులు చేసింది. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినివ్వగా.. గాయం వల్ల రిషభ్ పంత్ దూరమయ్యాడు. మరోవైపు.. శార్దూల్ ఠాకూర్, అన్షుల్ కంబోజ్‌లపై మేనేజ్మెంట్ వేటు వేసింది. వీరి స్థానాల్లో ఆకాశ్ దీప్, ప్రసిద్ కృష్ణ, కరుణ్ నాయర్, ధ్రువ్ జురెల్ తుదిజట్టులోకి వచ్చారు.ఒక్కమ్యాచ్ ఆడకుండానే కుల్దీప్, అర్ష్‌దీప్ ఇంటికిఇక చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు మరోసారి మొండిచేయే ఎదురైంది. ఈ సిరీస్‌కు అతడిని ఎంపిక చేసినా.. ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం ఇవ్వలేదు యాజమాన్యం. దీంతో ఒక్క టెస్టు ఆడకుండానే కుల్దీప్ ఇంగ్లండ్ పర్యటన ముగిసినట్లయింది.మరోవైపు.. యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ది కూడా ఇదే కథ. టీ20, వన్డే ఫార్మాట్లలో టీమిండియా తరఫున సత్తా చాటుతున్న ఈ లెఫ్టార్మ్ ఫాస్ట్‌బౌలర్‌కు ఇంతవరకు టెస్టుల్లో అరంగేట్రం చేసే అవకాశం దక్కనే లేదు. ఇంగ్లండ్ పర్యటనలోనైనా ఆ కల నెరవేరుతుందనుకుంటే.. భంగపాటే ఎదురైంది.ఆకాశ్ దీప్ పేరు మర్చిపోయిన గిల్కాగా లండన్‌లోని ఓవల్ మైదానంలో ఐదో టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ భారత్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అయితే, టీమిండియా కెప్టెన్ తమ తుదిజట్టు ప్రకటన సమయంలో ఆకాశ్ దీప్ పేరు మర్చిపోయాడు. శార్దూల్, పంత్, బుమ్రా స్థానాల్లో ప్రసిద్, జురెల్, కరుణ్ వస్తున్నారని మాత్రమే చెప్పాడు.చదవండి: ENG VS IND 5th Test: తుదిజట్లు ఇవే -
చెత్త రికార్డును మరింత మెరుగుపర్చుకున్న టీమిండియా
టాస్ విషయంలో టీమిండియా ఇప్పటికే తమ ఖాతాలో ఉన్న చెత్త రికార్డును మరింత మెరుగుపర్చుకుంది. వరుసగా 14 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో టాస్ ఓడి.. వరుసగా అత్యధిక మ్యాచ్‌ల్లో టాస్ ఓడిన జట్టుగా చలామణి అవుతున్న భారత్.. తాజాగా ఇంగ్లండ్‌తో ఐదో టెస్ట్‌లోనూ టాస్ ఓడి తమ వరుస టాస్ ఓటముల సంఖ్యను 15కు పెంచుకుంది. అంతర్జాతీయ క్రికెట్లో ఏ జట్టు ఇప్పటివరకు వరుసగా ఇన్ని మ్యాచ్‌ల్లో టాస్‌లు ఓడలేదు.ఇంగ్లండ్‌తో ఐదో టెస్ట్ కలుపుకొని భారత్ వరుసగా ఐదు టెస్ట్‌లు, అంతకుముందు 8 వన్డేలు, 2 టీ20ల్లో టాస్ కోల్పోయింది. భారత్ చివరిసారిగా ఈ ఏడాది జనవరిలో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో (రాజ్‌కోట్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్) టాస్ గెలిచింది.టాస్ విషయంలో భారత్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ కూడా ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఇంగ్లండ్‌తో సిరీస్‌తోనే భారత కెప్టెన్‌గా అరంగేట్రం చేసిన గిల్.. ఈ సిరీస్‌లో వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో టాస్ ఓడాడు. తద్వారా కెప్టెన్‌గా అరంగేట్రం సిరీస్‌లోనే ఐదు మ్యాచ్‌ల్లో టాస్ ఓడిన కెప్టెన్‌గా నిలిచాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఓ జట్టు ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో అన్ని మ్యాచ్‌ల్లో టాస్‌లు ఓడటం ఇది 14వ సారి.మ్యాచ్ విషయానికొస్తే.. లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదనంలో ఇవాళ (జులై 31) మొదలైన ఐదో టెస్ట్‌లో టీమిండియా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఈ మ్యాచ్ కోసం భారత్ ఏకంగా నాలుగు మార్పులు చేసింది. రిషబ్ పంత్, శార్దూల్ ఠాకూర్, బుమ్రా, అన్షుల్ కంబోజ్ స్థానాల్లో ధ్రువ్ జురెల్, కరుణ్ నాయర్, ప్రసిద్ద్ కృష్ణ, ఆకాశ్‌దీప్ తుది జట్టులోకి వచ్చారు.ఈ మ్యాచ్‌లో కరుణ్ నాయర్‌కు తుది జట్టులో చోటు దక్కుతుందని ఎవరూ ఊహించలేదు. గత మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో ఓ మోస్తరుగా రాణించిన శార్దూల్ ఠాకూర్‌ను పక్కకు పెట్టి మరీ కరుణ్‌కు అవకాశం ఇచ్చారు. బహుశా కరుణ్‌కు ఇదే లాస్ట్ ఛాన్స్ కావచ్చు. ఈ మ్యాచ్‌లో విఫలమైతే కరుణ్ కెరీర్ సమాప్తమైనట్లే.మరోవైపు ఇంగ్లండ్ సైతం ఈ మ్యాచ్ కోసం నాలుగు మార్పులు చేసింది. స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, బ్రైడన్ కార్స్, లియామ్ డాసన్ స్థానాల్లో జేకబ్ బేతెల్, గస్ అట్కిన్సన్, జోష్ టంగ్, జేమీ ఓవర్టన్ తుది జట్టులోకి వచ్చారు. వర్షం కారణంగా టాస్ కాస్త ఆలస్యమైంది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ 1-2తో వెనుకపడి ఉంది.తుది జట్లు..భారత్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్(కెప్టెన్), కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్‌కీపర్), వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్(కెప్టెన్), జో రూట్, హ్యారీ బ్రూక్, జాకబ్ బెథెల్, జామీ స్మిత్(వికెట్‌కీపర్), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, జేమీ ఓవర్టన్, జోష్ టంగ్ -
ENG VS IND 5th Test: మళ్లీ టాస్ ఓడిన భారత్.. జట్టులో ఎవరూ ఊహించని ఆటగాడు
ఇంగ్లండ్ గడ్డపై భారత్ వరుసగా ఐదో మ్యాచ్‌లో టాస్ ఓడింది. లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదనంలో ఇవాళ (జులై 31) ఐదో టెస్ట్ ప్రారంభం కానుండగా, ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ ఓడి ఇంగ్లండ్ తాత్కాలిక సారధి ఓలీ పోప్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ ఏకంగా నాలుగు మార్పులు చేసింది. రిషబ్ పంత్, శార్దూల్ ఠాకూర్, బుమ్రా, అన్షుల్ కంబోజ్ స్థానాల్లో ధ్రువ్ జురెల్, కరుణ్ నాయర్, ప్రసిద్ద్ కృష్ణ, ఆకాశ్‌దీప్ తుది జట్టులోకి వచ్చారు.ఈ మ్యాచ్‌లో కరుణ్ నాయర్‌కు తుది జట్టులో చోటు దక్కుతుందని ఎవరూ ఊహించలేదు. గత మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో ఓ మోస్తరుగా రాణించిన శార్దూల్ ఠాకూర్‌ను పక్కకు పెట్టి మరీ కరుణ్‌కు అవకాశం ఇచ్చారు. బహుశా కరుణ్‌కు ఇదే లాస్ట్ ఛాన్స్ కావచ్చు. ఈ మ్యాచ్‌లో విఫలమైతే కరుణ్ కెరీర్ సమాప్తమైనట్లే.మరోవైపు ఇంగ్లండ్ సైతం ఈ మ్యాచ్ కోసం నాలుగు మార్పులు చేసింది. బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, బ్రైడన్ కార్స్, లియామ్ డాసన్ స్థానాల్లో జేకబ్ బేతెల్, గస్ అట్కిన్సన్, జోష్ టంగ్, జేమీ ఓవర్టన్ తుది జట్టులోకి వచ్చారు. వర్షం కారణంగా టాస్ కాస్త ఆలస్యమైంది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ 1-2తో వెనుకపడి ఉంది.తుది జట్లు..భారత్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్(కెప్టెన్), కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్‌కీపర్), వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్(కెప్టెన్), జో రూట్, హ్యారీ బ్రూక్, జాకబ్ బెథెల్, జామీ స్మిత్(వికెట్‌కీపర్), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, జేమీ ఓవర్టన్, జోష్ టంగ్ -
'మాకు రూల్స్ తెలుసు.. చాలా క్రికెట్ ఆడాము'.. పిచ్ క్యూరేటర్పై గిల్ ఫైర్
ఇంగ్లండ్-భారత్ మధ్య ఐదో టెస్టు మ్యాచ్ ప్రారంభానికి ముందే అందరి దృష్టిని ఆకర్షించింది. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, ఓవల్ పిచ్ క్యూరేటర్ లీ ఫోర్టిస్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. మంగళవారం పిచ్ ను పరిశీలిస్తున్న భారత బృందం దగ్గరికి వచ్చిన ఫోర్టిస్.. పిచ్ ను రెండున్నర మీటర్ల దూరం నుంచి పరిశీలించాలని సూచించాడు.అతడి మాటలకు గంభీర్‌కు చిర్రెత్తుకు వచ్చింది. ఈ క్రమంలో ప్రధాన కోచ్ పిచ్ క్యూరేటర్‌తో వాగ్వాదానికి దిగాడు. అక్కడే ఉన్న భారత బ్యాటింగ్ కోచ్ సీతాన్షు కోటక్ సైతం లీ ప్రవర్తన పట్ల అసహనం వ్యక్తం చేశాడు. తాజాగా ఈ వివాదంపై టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ స్పందించాడు. లీ ఫోర్టిస్‌పై గిల్ అగ్రహం వ్యక్తం చేశాడు."నా కెరీర్లో చాలా మ్యాచ్‌లు ఆడాను. మ్యాచ్‌కు ముందు ప్రధాన పిచ్‌ను రెండున్నర మీటర్ల దూరం నుంచి పరిశీలించాలని ఇప్పటివరకు ఏ క్యూరేటర్ కూడా నాతో చెప్పలేదు. రబ్బర్ స్పైక్స్ లేదా బేర్ ఫూట్(చెప్పులు లేకుండా) తో పిచ్‌ను దగ్గరగా వెళ్లి పరిశీలించవచ్చు. మాకు రూల్స్ తెలుసు.ఒకవేళ స్పైక్స్ ఉన్న షూలను వేసుకున్నట్లయితే క్యూరేటర్ మమ్మల్ని అడ్డుకోవచ్చు. కానీ మేము అటువంటి షూలను ధరించలేదు. అయినా క్యూరేటర్ మమ్మల్ని ఎందుకు ఆపాడో ఆర్ధం కావడం లేదు. మేము ఇప్పటివరకు ఈ సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడాము. ఏ క్యూరేటర్ కూడా మాకు ఇలాంటి సూచనలు ఇవ్వలేదు" అని ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గిల్ పేర్కొన్నాడు.కాగా ఐదో టెస్టు గురువారం నుంచి ఓవల్ మైదానం వేదికగా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేసుకోవాలని భారత్ భావిస్తుంటే.. ఇంగ్లండ్ మాత్రం ఎలాగైనా పర్యటక జట్టును ఓడించి 3-1 తేడాతో సిరీస్ దక్కించుకోవాలని పట్టుదలతో ఉంది.చదవండి: IND vs ENG: ఇంగ్లండ్‌తో ఐదో టెస్టు.. అర్ష్‌దీప్ అరంగేట్రం! అతడికి మరోసారి నో ఛాన్స్? -
ఇంగ్లండ్‌తో ఐదో టెస్టు.. అర్ష్‌దీప్ అరంగేట్రం! అతడికి మరోసారి నో ఛాన్స్?
లండన్‌లోని ఓవల్ మైదానం వేదిగా ఇంగ్లండ్‌తో ఆఖరి టెస్టులో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను 2-2తో సమం చేయాలని భారత జట్టు భావిస్తోంది. ఈ కీలక మ్యాచ్‌లో ఆడేందుకు భారత్ తమ తుది జట్టులో మూడు మార్పులు చేసే అవకాశముంది. అరంగేట్ర మ్యాచ్‌లో విఫలమైన అన్షుల్ కాంబోజ్ వేటు వేసేందుకు గంభీర్ అండ్‌కో సిద్దమైనట్లు తెలుస్తోంది.అదేవిధంగా వర్క్‌లోడ్ లోడ్ మెనెజ్‌మెంట్‌లో భాగంగా జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు గాయంతో ఐదో టెస్టుకు దూరమైన పంత్ స్దానంలో ధ్రువ్ జురెల్ జట్టులోకి రావడం దాదాపు ఖాయమైంది. ఇక ఈ మ్యాచ్‌తో టీమిండియా స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ టెస్టుల్లో అరంగేట్రం చేయనున్నట్లు భారత కెప్టెన్ శుబ్‌మన్ గిల్ హింట్ ఇచ్చాడు. "ఆఖరి టెస్టు కోసం అర్ష్‌దీప్‌ను సిద్దంగా ఉండమని చెప్పాం. కానీ ఈ సాయంత్రం పిచ్‌ను పరిశీలించిన తర్వాత ప్లేయింగ్ ఎలెవన్‌పై నిర్ణయం తీసుకుంటాము" అని గిల్ ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పేర్కొన్నాడు. గిల్ వ్యాఖ్యలు బట్టి అర్ష్‌దీప్ భారత వైట్‌బాల్ జెర్సీలో కన్పించే ఛాన్స్ ఉంది. పిచ్‌పై పచ్చిక ఎక్కువగా ఉన్నందున ఫాస్ట్‌బౌలర్లకు అనుకూలించింది. ఈ క్రమంలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కంటే అర్ష్‌దీప్ వైపే మెనెజ్‌మెంట్ ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్ జట్టు ఒక్క ఫ్రంట్‌లైన్ స్పిన్నర్ లేకుండా ఆడుతోంది. మాకు మాత్రం జడేజా,వాషింగ్టన్లో రూపంలో ఇద్దు స్పిన్నర్లు ఉన్నారని గిల్ చెప్పుకొచ్చాడు. గిల్ వ్యాఖ్యలు బట్టి కుల్దీప్ బెంచ్‌కు పరిమితం కావడం దాదాపు ఖాయం.కాగా అన్షుల్ కాంబోజ్ స్దానంలో అర్ష్‌దీప్, బుమ్రా స్ధానంలో ఆకాష్ దీప్ ఆడనున్నట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. అయితే మాంచెస్టర్‌లో బంతితో విఫలమైన శార్ధూల్ ఠాకూర్‌ను తుది జట్టులో కొనసాగిస్తారా లేదా వేరే ఆటగాడికి ఛాన్స్ ఇస్తారా అన్నది వేచి చూడాలి.స్టోక్స్ దూరం..మరోవైపు ఆఖరి టెస్టు కోసం ఇంగ్లండ్ తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించింది. ఆతిథ్య జట్టు ఏకంగా నాలుగు మార్పులతో బరిలోకి దిగనుంది. ఈ కీలక మ్యాచ్ నుంచి కెప్టెన్ బెన్ స్టోక్స్ భుజం గాయంతో తప్పుకొన్నాడు. స్టోక్స్ స్దానంలో జాకబ్ బెతల్‌కు అవకాశమిచ్చారు.అదేవిధంగా ఆర్చర్, కార్స్‌లకు విశ్రాంతినివ్వగా...గత టెస్టులో పూర్తిగా విఫలమైన స్పిన్నర్ డాసన్‌ను ముందే పక్కన పెట్టారు. వీరి ముగ్గురి స్ధానాల్లో అట్కిన్సన్, ఒవర్టన్, టంగ్ జట్టులోకి వచ్చారు.తుది జట్ల వివరాలు: భారత్ (అంచనా): శుబ్‌మన్ గిల్ (కెప్టెన్ ), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురేల్, శార్దుల్ ఠాకూర్/ప్రసిధ్ కృష్ణ, అర్ష్ దీప్ సింగ్, ఆకాశ్‌దీప్, సిరాజ్.ఇంగ్లండ్: ఓలీ పోప్ (కెప్టెన్ ), జాక్ క్రాలీ, బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెతెల్, జేమీ స్మిత్, క్రిస్ వోక్స్, అట్కిన్సన్, ఒవర్టన్, టంగ్.చదవండి: Asia Cup 2025: ఆసియాకప్-2025కు జస్ప్రీత్ బుమ్రా దూరం! అతడు కూడా? -
‘కేఎల్ రాహుల్ విఫలమయ్యాడు.. అందుకు కారణం అదే’
బ్యాటింగ్ ఆర్డర్లో టీమిండియా యాజమాన్యం తరచూ మార్పులు చేయడం సరికాదని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ నిక్ కాంప్టన్ (Nick Compton) అన్నాడు. మేనేజ్మెంట్ నిలకడలేమితనం కారణంగా ఆటగాళ్లు ఇబ్బంది పడతారని.. ఇది వారి ప్రదర్శనపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నాడు. ఇందుకు కేఎల్ రాహుల్ నిదర్శనం అని కాంప్టన్ తెలిపాడు.కాగా టెస్టుల్లో కేఎల్ రాహుల్ (KL Rahul) గత కొన్నాళ్లుగా వేర్వేరు స్థానాల్లో బ్యాటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే కొన్నిసార్లు ఓపెనర్‌గా.. మరికొన్నిసార్లు మిడిలార్డర్ బ్యాటర్‌గా బరిలోకి దిగాడు. ముఖ్యంగా రోహిత్ శర్మ గైర్హాజరీలో ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ (Border- Gavaskar Trophy)లో ఓపెనర్‌గా వచ్చిన అతడు.. రోహిత్ రాకతో మళ్లీ ఐదో స్థానంలో బ్యాటింగ్ చేశాడు.రోహిత్ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడంతోఇక ఇంగ్లండ్ పర్యటనకు ముందే రోహిత్ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడంతో.. ఓపెనర్‌గా కేఎల్ రాహుల్ స్థానం సుస్థిరమైంది. యశస్వి జైస్వాల్‌తో కలిసి ఇంగ్లండ్ గడ్డ మీద అద్భుత ఆట తీరుతో ఈ కర్ణాటక బ్యాటర్ ఆకట్టుకుంటున్నాడు.ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ బ్యాటర్ నిక్ కాంప్టన్ మాట్లాడుతూ.. రాహుల్ పట్ల టీమిండియా మేనేజ్మెంట్ వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టాడు. ‘‘ఇంగ్లండ్ జట్టును చూడండి. జో రూట్ ఎల్లప్పుడూ నాలుగో స్థానంలోనే బ్యాటింగ్ చేస్తాడు.ఓపెనర్లు కూడా మారరు. కానీ టీమిండియాలో శుబ్‌మన్ గిల్ ఓసారి మూడో స్థానంలో ఆడతాడు. ఇంకోసారి మరెవరో.. మళ్లీ గిల్ తిరిగి వస్తాడు. ఇలాంటి నిర్ణయాల వల్ల ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది.అందుకే రాహుల్ వరుసగా విఫలమయ్యాడుఇక కేఎల్ రాహుల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో అతడిని అటూ.. ఇటూ మారుస్తూనే ఉన్నారు. ఫలితంగా అతడి ప్రదర్శన ప్రభావితం అయింది. రాహుల్ వరుసగా విఫలమయ్యాడు.నిజానికి అతడు ప్రతిభావంతుడైన ఆటగాడు. ఇప్పుడు సత్తా చాటుతున్నాడు. అయినా కరుణ్ నాయర్ వంటి ఆటగాళ్ల విషయంలో టీమిండియా త్వరత్వరగా నిర్ణయాలు మార్చేసుకోవడం సరికాదు. ఇంగ్లండ్ జట్టులో ఎవరిపై అంత తేలికగా వేటు వేయరు.సాయి సుదర్శన్ టాలెంట్ ప్లేయర్. కానీ అతడిని తప్పించి కరుణ్ నాయర్‌ను తీసుకురావడం.. మళ్లీ కోసం కరుణ్ నాయర్‌పై వేటు వేసి అతడిని తప్పించడం సరికాదు. సెలక్షన్లో నిలకడ లేకపోవడం వల్ల జట్టు నిర్మాణం దెబ్బతింటుంది’’ అని అభిప్రాయపడ్డాడు. కాంప్టన్ రెవ్‌స్పోర్ట్స్‌తో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.రెండు శతకాలుకాగా ఇంగ్లండ్‌తో టెస్టుల్లో తిరిగి ఓపెనర్‌గా వస్తున్న కేఎల్ రాహుల్ ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు చేసిన పరుగులు వరుసగా.. 42, 137, 2, 55, 100, 39, 46, 90.ఇక ఐదు టెస్టుల సిరీస్‌లో టీమిండియాపై ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు 2-1తో ఆధిక్యంలో ఉంది. ఆఖరిదైన ఐదో టెస్టులో గెలిస్తేనే గిల్ సేన సిరీస్‌ను 2-2తో సమం చేయగలుగుతుంది. ఇదిలా ఉంటే.. తొలి టెస్టులో సాయి సుదర్శన్‌ను మూడో స్థానంలో ఆడించిన యాజమాన్యం.. రెండు, మూడో టెస్టుల్లో ఆ స్థానంలో కరుణ్ నాయర్‌ను పంపింది. ఇక నాలుగో టెస్టులో తిరిగి సాయిని పిలిపించిన సెలక్టర్లు.. కరుణ్‌పై వేటు వేశారు. మరోవైపు.. విరాట్ కోహ్లి రిటైర్మెంట్ నేపథ్యంలో కొత్త కెప్టెన్ శుబ్‌మన్ గిల్ టెస్టుల్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తున్నాడు. అంతకుముందు అతడు వన్‌డౌన్‌లో వచ్చేవాడు.చదవండి: WCL 2025: స్టువర్ట్ బిన్నీ విధ్వంసం, యువీ, పఠాన్ మెరుపులు.. సెమీస్‌లో ఇండియా -
గిల్‌పై విమర్శలు.. గంభీర్ కౌంటర్!.. పంత్‌ను ఎంత పొగిడినా తక్కువే!
టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill)కు హెడ్‌కోచ్ గౌతం గంభీర్ మద్దతుగా నిలిచాడు. గతంలో గిల్‌పై విమర్శలు చేసినవారిని గంభీర్ తప్పు పట్టాడు. ‘గిల్ ప్రతిభ విషయంలో ఎప్పుడూ ఎలాంటి సందేహాలు లేవు. అతడిని విమర్శిస్తున్నవారికి క్రికెట్ గురించే తెలియకపోవచ్చు. అతడి ప్రదర్శన మాకు ఎవరికీ ఆశ్చర్యం కలిగించలేదు. అతడిపై కెప్టెన్సీ ఒత్తిడి కూడా లేదని తేలిపోయింది’ అని గంభీర్ వ్యాఖ్యానించాడు.కాగా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ (Tendulkar- Anderson Trophy)లో భాగంగా మాంచెస్టర్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టును భారత్ డ్రా చేసుకున్న విషయం తెలిసిందే. ఓపెనర్ కేఎల్ రాహుల్, కెప్టెన్ గిల్, ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ పోరాట పటిమ కారణంగా ఇది సాధ్యమైంది. మేము ఇంకా 1–2తో వెనుకబడే ఉన్నాంఈ నేపథ్యంలో గంభీర్ మాట్లాడుతూ.. ‘భారత బ్యాటర్లు కనబర్చిన పోరాటపటిమను కెప్టెన్ గిల్ ప్రత్యేకంగా మెచ్చుకున్నాడు. అయితే ఈ డ్రాతో ఏదో సాధించామని భావించడం లేదని, తర్వాతి పోరులో గెలిచేందుకు ప్రయత్నిస్తామని అతను అన్నాడు.‘నేను ‘డ్రా’ కంటే మ్యాచ్‌లో ఫలితం రావడాన్నే ఇష్టపడతా. మేం ఇంకా 1–2తో వెనుకబడి ఉన్నామనే విషయం మర్చిపోలేదు. దీనిని 2–2గా మార్చడం అవసరం. మా ఆటగాళ్లకు తగినంత అనుభవం లేకపోయినా ప్రస్తుతం ఇది మా ఉత్తమ జట్టు. వీరంతా ఎవరో ఒకరిని అనుకరించడం కాకుండా తామే కొత్త చరిత్ర సృష్టించాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు’ అని పేర్కొన్నాడు. మరో వైపు.. ఓవల్ మైదానంలో జరిగే చివరి టెస్టులో శార్దుల్ ఠాకూర్, అన్షుల్ కంబోజ్ స్థానాల్లో కుల్దీప్ యాదవ్, ఆకాశ్‌దీప్ వచ్చే అవకాశాలున్నాయి.పంత్‌పై ప్రశంసలుగాయం తాలుకు నొప్పి వేధిస్తున్నా మాంచెస్టర్ టెస్టులో బ్యాటింగ్‌కు దిగిన వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్‌పై గంభీర్ ప్రశంసలు కురిపించాడు. ‘‘అతడు సిరీస్‌లో మిగిలిని ఆఖరి మ్యాచ్‌కు దూరమయ్యాడని అందరికీ తెలుసు.అయితే, జట్టు నిర్మాణంలో పంత్ వంటి పట్టుదల కలిగిన ఆటగాళ్ల పాత్ర ఎంతో కీలకమైనది. దేశం కోసం, జట్టు కోసం రిషభ్ ఏం చేశాడో అందరమూ చూశాం కదా! అతడిని ఎంత పొగిడినా తక్కువే. వేలు విరిగినా అతడు బ్యాటింగ్ చేశాడు.పంత్‌లా అందరికీ ఇలాంటివి సాధ్యం కావు. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నవేళ నేనున్నానంటూ తను ముందుకు వచ్చాడు. టెస్టు జట్టులో పంత్ అత్యంత ముఖ్యమైన సభ్యుడు. అతడు త్వరలోనే కోలుకుని మళ్లీ మైదానంలో అడుగుపెట్టాలని కోరుకుంటున్నా’’ అని గంభీర్ పేర్కొన్నాడు.చదవండి: ఖలీల్ అహ్మద్ కీలక నిర్ణయం -
వారిద్దరూ అద్భుతం.. మాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది: శుబ్‌మన్ గిల్
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో ఓటమి అంచుల నుంచి తప్పించుకొని మ్యాచ్‌ను భారత్ ‘డ్రా’గా ముగించడంపై అన్ని వైపుల నుంచి ప్రశంసలు వచ్చాయి. రెండో ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే 2 వికెట్లు కోల్పోయి టీమిండియా... తర్వాతి ఐదు సెషన్లలో మరో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ప్రత్యర్ధిని నిలువరించగలిగింది. ఇది మన జట్టు పట్టుదలను చూపించింది.మాది ఒక గొప్ప జట్టు..ఈ విషయాన్ని భారత కెప్టెన్ శుబ్‌మన్ గిల్ కూడా ప్రత్యేకంగా ప్రస్తావించాడు. మంచి జట్టుకు, గొప్ప జట్టుకు మధ్య ఉన్న తేడాను తాము చూపించగలిగామని అతను చెప్పాడు. ‘మైదానంలో 143 ఓవర్ల పాటు ఒకే లక్ష్యంతో ఒకే తరహా ఆలోచనతో మానసికంగా దృఢంగా ఉండటం చాలా కష్టం. కానీ మేం దానిని చేసి చూపించాం. ఒక మంచి జట్టుకు, గొప్ప జట్టుకు మధ్య ఇదే ప్రధాన తేడా. ఈ టెస్టులో ఆటతో మాది గొప్ప జట్టని నిరూపించాం’ అని గిల్ వ్యాఖ్యానించాడు.సున్నాకే 2 వికెట్లు కోల్పోయిన దశలో సీనియర్ కేఎల్ రాహుల్‌తో కలిసి గిల్ నెలకొల్పిన భాగస్వామ్యమే జట్టు రాతను మార్చింది. 70.3 ఓవర్ల వీరి భాగస్వామ్యంలో 188 పరుగులు వచ్చాయి. ఈ పార్ట్‌నర్‌షిప్‌తోనే తాము మ్యాచ్‌ను కాపాడుకోగలమనే నమ్మకం కలిగిందని గిల్ చెప్పాడు. ‘మా జట్టు పట్టుదలగా ముందుకు వెళ్లాలంటే కావాల్సిన అగ్గిని రగిల్చేందుకు ఒక నిప్పు కణిక అవసరమైంది. నేను, రాహుల్ కలిసి నెలకొల్పిన భాగస్వామ్యం అలాంటిదే. మేం పెట్టుకున్న లక్ష్యాన్ని అందుకోగలమని అప్పుడే అనిపించింది. తుది ఫలితం చాలా సంతోషాన్నిచ్చింది. శనివారం మేం ఉన్న స్థితితో పోలిస్తే మ్యాచ్‌ను డ్రా చేసుకోవడం ఎంతో సంతృప్తికరం. నా ఇన్నింగ్స్ పట్ల కూడా ఎంతో ఆనందంగా ఉన్నా’ అని గిల్ పేర్కొన్నాడు.భారత్ ఓటమి నుంచి తప్పించుకోవడంలో కీలక పాత్ర పోషించిన జడేజా, సుందర్‌లపై కూడా కెప్టెన్ ప్రశంసలు కురిపించాడు. వీరిద్దరు 55.2 ఓవర్లు ఆడి అభేద్యంగా 203 పరుగులు జత చేశారు. ‘జడేజా, సుందర్ క్రీజ్‌లో ఉన్నప్పుడు కూడా బ్యాటింగ్‌కు అంత అనుకూల పరిస్థితి ఏమీ లేదు.బంతి అనూహ్యంగా స్పందిస్తోంది. కానీ అలాంటి స్థితి నుంచి ప్రశాంతంగా ఆడుతూ ఇద్దరూ సెంచరీలు సాధించడం చాలా గొప్ప విషయం. ఏకాగ్రత చెదరకుండా ప్రతీ బంతిపై వారు దృష్టి పెట్టి డ్రా వరకు తీసుకెళ్లడం ఎంతో ప్రత్యేకం. ఇది మాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది’ అని గిల్ అన్నాడు.చదవండి: IND vs PAK: ‘పాక్‌తో మ్యాచ్ ఆడాలి’!.. గంగూలీపై అభిమానుల ఆగ్రహం -
చాలా సంతోషంగా ఉంది.. అందుకే వారు షేక్ హ్యాండ్స్ ఇవ్వలేదు: గిల్
మాంచెస్టర్‌లో టీమిండియా అద్బుతం చేసింది. ఓటమి తప్పదనుకున్న చోట భారత ఆటగాళ్లు తమ విరోచిత పోరాటంతో ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టును డ్రాగా ముగించారు. దాదాపు రెండు రోజుల పాటు ఇంగ్లండ్ బౌలర్లకు ఎదురీది మరి మ్యాచ్‌ను తమ చేజారకుండా కాపాడుకున్నారు.సున్నా పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత జట్టును కెప్టెన్ శుబ్‌మన్ గిల్(103), కేల్ రాహుల్(90) తమ అద్బుత బ్యాటింగ్‌లతో ఆదుకోగా.. ఆ తర్వాత రవీంద్ర జడేజా(185 బంతుల్లో 107 నాటౌట్), వాషింగ్టన్ సుందర్(206 బంతుల్లో 101 నాటౌట్) ఆజేయ శతకాలతో భారత్‌ను ఓటమి నుంచి గట్టెక్కించారు.వీరిద్దరి అసమాన పోరాటానికి ఇంగ్లీష్ జట్టు ప్లేయర్లు తమ సహనాన్ని కోల్పోయారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ రెండు, ఆర్చర్, బెన్ స్టోక్స్ తలా వికెట్ సాధించారు. ఈ మ్యాచ్ డ్రా గా ముగియడంతో సిరీస్‌ను సమం చేసే అవకాశం టీమిండియాకు లభించింది. ఇక మాంచెస్టర్ టెస్టు డ్రా ముగియడంపై భారత కెప్టెన్ శుబ్‌మన్ గిల్ స్పందించాడు.తమ ఆటగాళ్ల అసాధారణ పోరాటంపై గిల్ ప్రశంసల వర్షం కురిపించాడు. "కీలకమైన మ్యాచ్‌లో మా బ్యాటింగ్ ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉంది. గత రెండు రోజులుగా మాపై తీవ్ర ఒత్తిడి ఉంది. ఎందుకంటే వికెట్లు పడితే మ్యాచ్ స్వరూపమే మారిపోతుంది.నాలుగో రోజును కేఎల్ భాయ్, నేను జాగ్రత్తగా ఆడి ముగించాము. ఐదో రోజు పిచ్ ఎలా ఉంటుందో, ఏం జరుగుతుందో? అనే ఆందోళన నెలకొంది. అందుకే ప్రతీ బంతిని కూడా జాగ్రత్తగా ఆడాలని నిర్ణయించుకున్నాము. అందుకే షేక్ హ్యాండ్స్ ఇవ్వలేదు..మేం ప్రతీ బంతిని ఆచితూచి ఆడుతూ మ్యాచ్‌ను వీలైనంత ఆఖరివరకు తీసుకెళ్లాలనుకున్నాం. జడేజా, సుందర్ ఆసాధరణ ప్రదర్శన కనబరిచారు. వారిద్దరూ తమ సెంచరీలకు చేరువలో ఉన్నారు. వారు సెంచరీలు చేసేందుకు ఆర్హులు, అందుకే డ్రాను అంగీకరించేందుకు కరచాలనం చేయలేదు.ఈ సిరీస్‌లో ప్రతీ మ్యాచ్ ఆఖరి రోజు, చివరి సెషన్ వరకు సాగింది. ఈ సిరీస్ నుంచి చాలా పాఠాలు నేర్చుకున్నాము. ప్రతీ టెస్టు మ్యాచ్ కూడా ఒక కొత్త పాఠాన్ని నేర్పుతోంది. మా ఆఖరి మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను సమం చేసేందుకు ప్రయత్నిస్తాము.ప్రతీసారి కాస్త ఒత్తిడి..నిజాయితీగా చెప్పాలంటే గతంలో ఎన్ని పరుగులు చేశారనేది ముఖ్యం కాదు. వైట్ జెర్సీ ధరించి దేశం కోసం ఆడిన ప్రతీసారి కొంత ఒత్తిడి అనేది ఉంటుంది. అప్పుడే మనం ధైర్యంగా నిలబడాలి. అప్పుడే ఆటను మనం ఎంతగా ప్రేమిస్తున్నామో తెలియజేస్తుంది.నేను బ్యాటింగ్ చేసే ప్రతీ సారి మెరుగైన ప్రదర్శన చేయాలనుకుంటా. నా బ్యాటింగ్‌ను ఆస్వాదించాలని కోరుకుంటునాను. తొలి ఇన్నింగ్స్‌లో మేము మంచి స్కోర్ సాధించాము. కానీ మా బ్యాటర్లలో చాలా మంది తమకు లభించిన ఆరంభాలను పెద్ద స్కోర్లగా మలచడంలో విఫలమయ్యారు. ఇలాంటి వికెట్‌పై ఒకరిద్దరు బ్యాటర్లు భారీ ఇన్నింగ్స్‌లు ఆడడం చాలా ముఖ్యం. కానీ దురదృష్టవశాత్తూ మేము అలా చేయలేకపోయాము. ఇక బుమ్రా ఫిట్నెస్ గురించి ఇప్పుడే ఏమి చెప్పలేను. అదేవిధంగా మేం మ్యాచ్ గెలుస్తున్నంత కాలం టాస్ గురించి కూడా పట్టించుకోమని" పోస్ట్ మ్యాచ్ ప్రెజేంటేషన్‌లో గిల్ పేర్కొన్నాడు.సంక్షిప్త స్కోర్లు:భారత్ తొలి ఇన్నింగ్స్ 358 ఆలౌట్( సాయి సుదర్శన్ 61, బెన్ స్టోక్స్ 5/72)ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 669 ఆలౌట్(జోరూట్ 150, బెన్ స్టోక్స్ 141, జడేజా 4/143)భారత్ రెండో ఇన్నింగ్స్: 425/4 (శుభ్‌మన్ గిల్ 103, జడేజా 107 నాటౌట్, సుందర్ 101 నాటౌట్, క్రిస్ వోక్స్ 2/67)చదవండి: పోరాటం కూడా గర్వించేలా... -
జడేజా, సుందర్ వీరోచిత శతకాలు.. డ్రాగా ముగిసిన నాలుగో టెస్ట్
ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లండ్ మధ్య మాంచెస్టర్ వేదికగా జరిగిన నాలుగో మ్యాచ్ డ్రాగా ముగిసింది. 311 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన భారత్ (నాలుగో రోజు).. ఖాతా తెరవకుండానే యశస్వి జైస్వాల్ (0), సాయి సుదర్శన్ (0) వికెట్లు కోల్పోయినప్పటికీ వీరోచితంగా పోరాడింది.తొలుత కేఎల్ రాహుల్ (90), శుభ్‌మన్ గిల్ (103) అద్భుతంగా బ్యాటింగ్ చేసి మూడో వికెట్‌కు రికార్డు స్థాయిలో 188 పరుగులు జోడించగా.. ఆతర్వాత వాషింగ్టన్ సుందర్ (101 నాటౌట్), రవీంద్ర జడేజా (107 నాటౌట్) వీరోచిత శతకాలు బాది మ్యాచ్‌ను డ్రా చేశారు. సుందర్-జడేజా జోడీ ఐదో వికెట్‌కు అజేయమైన 203 పరుగులు జోడించింది. ఫలితంగా భారత్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 425 పరుగులు చేసింది. అంతకుముందు ఇంగ్లండ్‌తో తొలి ఇన్నింగ్స్‌లో 669 పరుగులకు ఆలౌటైంది. జో రూట్ (150), బెన్ స్టోక్స్ (141) భారీ శతకాలతో కదంతొక్కగా.. జాక్ క్రాలే (84), బెన్ డకెట్ (94) సెంచరీలకు చేరువలో ఔటయ్యారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 4, బుమ్రా, సుందర్ తలో 2, అన్షుల్ కంబోజ్, సిరాజ్ చెరో వికెట్ పడగొట్టారు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ 58, కేఎల్ రాహుల్ 46, సాయి సుదర్శన్ 61, రిషబ్ పంత్ 54, శార్దూల్ ఠాకూర్ 41 రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ 5 వికెట్లు తీశాడు.నాలుగో టెస్ట్ డ్రా కావడంతో సిరీస్‌లో ఇంగ్లండ్ ఆధిపత్యం 2-1తో కొనసాగుతుంది. చివరిదైన ఐదో టెస్ట్ జులై 31 నుంచి లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్‌లో ప్రారంభమవుతుంది. ఈ సిరీస్‌లో ఒకటి, మూడు మ్యాచ్‌లు ఇంగ్లండ్ గెలువగా.. భారత్ రెండో మ్యాచ్‌లో విజయం సాధించింది. -
పీకల్లోతు కష్టాల్లో టీమిండియా.. నిలబడిందా అద్భుతమే..!
మాంచెస్టర్ టెస్ట్‌లో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. చివరి రోజు భారత్ తొలి సెషన్లోనే ఓవర్‌నైట్ బ్యాటర్లు కేఎల్ రాహుల్ (90), శుభ్‌మన్ గిల్ (103) వికెట్లు కోల్పోయింది.ఆట ప్రారంభమైన కొద్ది సేపటికే కేఎల్ రాహుల్ ఔటయ్యాడు. బెన్ స్టోక్స్ అద్భుతమైన బంతితో రాహుల్‌ను ఎల్బీడబ్ల్యూ చేశాడు. రికార్డు సెంచరీ పూర్తి చేసిన వెంటనే శుభ్‌మన్ గిల్ కూడా పెవిలియన్‌కు చేరాడు.జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ జేమీ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి గిల్ నాలుగో వికెట్‌గా (222 పరుగుల వద్ద) వెనుదిరిగాడు. లంచ్ విరామం సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 88 పరుగులు వెనుకపడి ఉంది. సుందర్ (21), రవీంద్ర జడేజా క్రీజ్‌లో ఉన్నారు.ఈ మ్యాచ్‌లో భారత్ గట్టెక్కడం దాదాపుగా అసాధ్యమనే చెప్పాలి. ఇంకా రెండు సెషన్ల ఆట మిగిలి ఉండగా.. భారత్ 6 వికెట్లను నిలుపుకోవాలి. సుందర్, జడేజా తర్వాత పంత్ బ్యాటింగ్‌కు వస్తాడని తెలుస్తుంది. ఈ ముగ్గురు ఔటైతే భారత్ ఖేల్ ఖతం అయినట్లే.ఈ మ్యాచ్‌లో ఓడితే భారత్ సిరీస్‌ను కూడా కోల్పోతుంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్‌ను భారత్ డ్రా చేసుకునే అవకాశం లేదు.స్కోర్ వివరాలు..భారత్ తొలి ఇన్నింగ్స్- 358 ఆలౌట్ (సాయి సుదర్శన్ 61, జైస్వాల్ 58, పంత్ 54, స్టోక్స్ 5/72)ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్- 669 ఆలౌట్ (రూట్ 150, స్టోక్స్ 141, రవీంద్ర జడేజా 4/143)భారత్ రెండో ఇన్నింగ్స్- 223/4 (ఐదో రోజు లంచ్ విరామం సమయానికి) -
శుభ్‌మన్ గిల్ వీరోచిత శతకం.. దిగ్గజాల సరసన చోటు
మాంచెస్టర్ టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వీరోచితంగా పోరాడుతున్నాడు. 311 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన భారత్.. ఖాతా తెరవకుండానే యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్ వికెట్లు కోల్పోగా.. గిల్.. కేఎల్ రాహుల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు రికార్డు స్థాయిలో 188 పరుగులు జోడించాక, రాహుల్ 90 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు.రాహుల్ ఔటైనా ఏమాత్రం ఒత్తిడికి లోను కాని గిల్.. వాషింగ్టన్ సుందర్ (7) సాయంతో భారత్‌ను గట్టెక్కించే ప్రయత్నం చేస్తూ సెంచరీ పూర్తి చేశాడు. ఈ సిరీస్‌లో గిల్‌కు ఇది నాలుగో సెంచరీ. ఈ సెంచరీతో అతను దిగ్గజాల సరసన చేరాడు. ఓ టెస్ట్ సిరీస్‌లో అత్యధిక సెంచరీ చేసిన భారత ఆటగాడిగా, ఓ టెస్ట్ సిరీస్‌లో అత్యధిక సెంచరీలు చేసిన కెప్టెన్‌గా డాన్ బ్రాడ్‌మన్, సునీల్ గవాస్కర్, విరాట్ కోహ్లితో కలిసి రికార్డును షేర్ చేసుకున్నాడు.ఓ టెస్ట్ సిరీస్‌లో భారత్ తరఫున అత్యధిక సెంచరీలు4 - సునీల్ గవాస్కర్ vs వెస్టిండీస్, 1971 (విదేశాల్లో)4 - సునీల్ గవాస్కర్ vs వెస్టిండీస్, 1978/79 (స్వదేశంలో)4 - విరాట్ కోహ్లీ vs ఆస్ట్రేలియా, 2014/15 (విదేశాల్లో)4 - శుభ్‌మన్ గిల్ vs ఇంగ్లండ్, 2025 (విదేశాల్లో)**కెప్టెన్‌గా ఓ టెస్ట్ సిరీస్‌లో అత్యధిక సెంచరీలు4 - సర్ డాన్ బ్రాడ్‌మన్ vs ఇండియా, 1947/48 (విదేశాల్లో)4 - సునీల్ గవాస్కర్ vs వెస్టిండీస్, 1978/79 (స్వదేశంలో)4 - శుభ్‌మన్ గిల్ vs ఇంగ్లాండ్, 2025 (విదేశాల్లో)**అలాగే ఓ టెస్ట్ సిరీస్‌లో భారత్ తరఫున మూడో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా.. ఇంగ్లండ్‌లో, ఇంగ్లండ్‌పై అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా, ఇంగ్లండ్ గడ్డపై అత్యధిక పరుగులు చేసిన ఆసియా బ్యాటర్‌గా పలు రికార్డులు సాధించాడు. ఇంగ్లండ్ గడ్డపై ఓ టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆసియా బ్యాటర్లు🏏శుభ్‌మన్ గిల్ (ఇండియా)- 720*- 2025లో- అత్యుత్తమ స్కోరు 269🏏మొహమ్మద్ యూసఫ్ (పాకిస్తాన్)- 631- 2006లో- అత్యుత్తమ స్కోరు 202🏏రాహుల్ ద్రవిడ్ (ఇండియా)- 602- 2002లో- అత్యుత్తమ స్కోరు 217🏏విరాట్ కోహ్లి (ఇండియా)- 593- 2018లో- అత్యుత్తమ స్కోరు 149🏏సునిల్ గావస్కర్ (ఇండియా)- 542- 1979లో- అత్యుత్తమ స్కోరు 221.ఓ టెస్ట్ సిరీస్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లు774 - సునీల్ గవాస్కర్ vs వెస్టిండీస్, 1971 (బయట)732 - సునీల్ గవాస్కర్ vs వెస్టిండీస్, 1978/79 (హోం)720* - శుభ్‌మన్ గిల్ vs ఇంగ్లండ్, 2025 (బయట)712 - యశస్వి జైస్వాల్ vs ఇంగ్లండ్, 2024 (హోం)ఈ సెంచరీతో గిల్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌తో అత్యధిక సెంచరీలు చేసిన భారత ఆటగాడిగా రోహిత్ శర్మ రికార్డును సమం చేశాడు. వీరిద్దరు డబ్ల్యూటీసీ చరిత్రలో తలో 9 సెంచరీలు చేశారు.25 ఏళ్ల వయసులో గిల్‌కు ఇది 18వ సెంచరీ. టెస్ట్‌ల్లో 9, వన్డేల్లో 8, టీ20ల్లో ఓ సెంచరీ చేశాడు. ఈ వయసులో సచిన్ 40, విరాట్ 26 సెంచరీలు చేశారు.మాంచెస్టర్‌లో 35 ఏళ్ల తర్వాత సెంచరీ చేసిన భారత ఆటగాడిగా గిల్ రికార్డు నెలకొల్పాడు.మ్యాచ్ విషయానికొస్తే.. గిల్ సెంచరీ పూర్తి చేసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు భారత్ ఇంకా 105 పరుగులు వెనుకపడి ఉంది. గిల్‌కు జతగా వాషింగ్టన్ సుందర్ (7) క్రీజ్‌లోకి వచ్చాడు.స్కోర్ వివరాలు..భారత్ తొలి ఇన్నింగ్స్- 358 ఆలౌట్ (సాయి సుదర్శన్ 61, జైస్వాల్ 58, పంత్ 54, స్టోక్స్ 5/72)ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్- 669 ఆలౌట్ (రూట్ 150, స్టోక్స్ 141, రవీంద్ర జడేజా 4/143) -
చరిత్ర సృష్టించిన శుభ్‌మన్ గిల్
టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్ గడ్డపై ఓ టెస్ట్ సిరీస్‌లో 700 పరుగుల మార్కును తాకిన తొలి ఆసియా ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా జరుగుతున్న నాలుగో మ్యాచ్‌లో గిల్ ఈ ఫీట్‌ను సాధించాడు. రెండో ఇన్నింగ్స్‌లో 85 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద గిల్ ఈ సిరీస్‌లో 700 పరుగులు పూర్తి చేసుకున్నాడు.గతంలో ఇంగ్లండ్ గడ్డపై ఓ టెస్ట్ సిరీస్‌లో 700 పరుగుల మైలురాయిని ఏ ఆసియా బ్యాటర్ తాకలేదు. గిల్‌కు ముందు పాకిస్తాన్ బ్యాటర్ మొహమ్మద్ యూసఫ్ అత్యధికంగా 631 పరుగులు (2006 పర్యటనలో) సాధించాడు.ఇంగ్లండ్ గడ్డపై ఓ టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆసియా బ్యాటర్లు🏏శుభ్‌మన్ గిల్ (ఇండియా)- 700*- 2025లో- అత్యుత్తమ స్కోరు 269🏏మొహమ్మద్ యూసఫ్ (పాకిస్తాన్)- 631- 2006లో- అత్యుత్తమ స్కోరు 202🏏రాహుల్ ద్రవిడ్ (ఇండియా)- 602- 2002లో- అత్యుత్తమ స్కోరు 217🏏విరాట్ కోహ్లి (ఇండియా)- 593- 2018లో- అత్యుత్తమ స్కోరు 149🏏సునిల్ గావస్కర్ (ఇండియా)- 542- 1979లో- అత్యుత్తమ స్కోరు 221.ఓవరాల్‌గా ఇంగ్లండ్ గడ్డపై ఓ టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఆసీస్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ పేరిట ఉంది. బ్రాడ్‌మన్ 1930 ఇంగ్లండ్ పర్యటనలో 5 మ్యాచ్‌ల్లో ఏకంగా 974 పరుగులు చేశాడు. బ్రాడ్‌మన్ తర్వాత ఇంగ్లండ గడ్డపై అత్యధిక పరుగులు చేసిన రికార్డు (విదేశీ ఆటగాళ్లు) మార్క్ టేలర్ (839), వివ్ రిచర్డ్స్ (829), స్టీవ్ స్మిత్ (774), బ్రియాన్ లారా (765) పేరిట ఉంది.నాలుగో బ్యాటర్ప్రస్తుత ఇంగ్లండ్ పర్యటనలో 700 పరుగుల మార్కును తాకిన గిల్ భారత్ తరఫున ఓ టెస్ట్ సిరీస్‌లో ఈ ఘనత సాధించిన నాలుగో బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు.భారత్ తరఫున ఓ టెస్ట్ సిరీస్‌లో 700 కంటే ఎక్కువ పరుగులు చేసిన బ్యాటర్లు774 - సునీల్ గవాస్కర్ vs వెస్టిండీస్, 1971 (బయట)732 - సునీల్ గవాస్కర్ vs వెస్టిండీస్, 1978/79 (హోం)712 - యశస్వి జైస్వాల్ vs ఇంగ్లండ్, 2024 (హోం)701* - శుభ్‌మన్ గిల్ vs ఇంగ్లండ్, 2025 (బయట)మ్యాచ్ విషయానికొస్తే.. 311 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన టీమిండియా పోరాడుతోంది. తొలి ఓవర్లో ఖాతా తెరవకుండానే రెండు వికెట్లు కోల్పోయి భారత్‌ను శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ ఆదుకున్నారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 188 పరుగులు జోడించారు.ఆదిలోనే షాక్ అయితే చివరి రోజు భారత్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. 90 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కేఎల్ రాహుల్ బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. ప్రస్తుతం శుభ్‌మన్ గిల్ 90, వాషింగ్టన్ సుందర్ 4 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. భారత్ స్కోర్ 193/3గా ఉంది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు భారత్ ఇంకా 118 పరుగులు వెనుకపడి ఉంది.స్కోర్ వివరాలు..భారత్ తొలి ఇన్నింగ్స్- 358 ఆలౌట్ (సాయి సుదర్శన్ 61, జైస్వాల్ 58, పంత్ 54, స్టోక్స్ 5/72)ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్- 669 ఆలౌట్ (రూట్ 150, స్టోక్స్ 141, రవీంద్ర జడేజా 4/143) -
చరిత్ర సృష్టించిన రాహుల్-గిల్ జోడీ.. ప్రపంచంలోనే
మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫర్డ్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టును డ్రాగా ముగించేందుకు టీమిండియా పోరాడుతోంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తమ సెకెండ్ ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది.311 పరుగుల లోటుతో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్‌కు ఆదిలోనే క్రిస్ వోక్స్ బిగ్ షాకిచ్చాడు. ఒకే ఓవర్లో వరుస బంతుల్లో యశస్వి జైశ్వాల్(0), సాయిసుదర్శన్(0) పెవిలియన్‌కు పంపాడు. భారత్ సున్నా పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. దీంతో నాలుగో రోజే భారత కథ ముగుస్తుందని అంతా భావించారు.కానీ కేఎల్ రాహుల్(87 బ్యాటింగ్), శుబ్‌మన్ గిల్(78 నాటౌట్) తమ అద్బుత బ్యాటింగ్‌తో అడ్డుగోడగా నిలిచారు. వీరిద్దరూ 62 ఓవర్లు పాటు తమ వికెట్‌ను కోల్పోకుండా బ్యాటింగ్ చేశారు. ఈ క్రమంలో గిల్-రాహుల్ జోడీ పలు అరుదైన ఘనతలను తమ పేరిట లిఖించుకున్నారు.తొలి జోడీగాఒక టెస్టు మ్యాచ్‌లో 'సున్నా' పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన తర్వాత థర్డ్ వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా గిల్-రాహుల్ వరల్డ్ రికార్డు సృష్టించారు. ఇప్పటివరకు ఈ రికార్డు దిగ్గజాలు మొహిందర్ అమర్నాథ్, గుండప్ప విశ్వనాథ్ పేరిట ఉండేది.1977లో ఆస్ట్రేలియాపై ఇటువంటి పరిస్థితుల్లో వీరిద్దరూ మూడో వికెట్‌కు 105 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే తాజా మ్యాచ్‌లో మూడో వికెట్‌కు 174 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన రాహుల్-గిల్ జంట 49 ఏళ్ల తర్వాత ఈ రేర్ ఫీట్‌ను బ్రేక్ చేసింది.కాగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ప్రస్తుత టెస్టు సిరీస్‌లో శుబ్‌మన్ గిల్, రాహుల్ ఇద్దరూ 500 పరుగుల మార్క్‌ను దాటేశారు. ఈ సిరీస్‌లో గిల్ ఇప్పటివరకు 697 పరుగులు చేయగా.. రాహుల్ 508 రన్స్ చేశాడు. విదేశీ గడ్డపై ఒక టెస్ట్ సిరీస్‌లో ఇద్దరు భారత బ్యాటర్లు 500కు పైగా పరుగులు చేయడం గత 54 ఏళ్లలో ఇదే మొదటిసారి. వీరికంటే ముదు 1970-71 విండీస్ పర్యటనలో భారత మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, దిలీప్ సర్దేశాయ్ ఈ ఫీట్ సాధించారు. ఆ సిరీస్‌లో సునీల్ గవాస్కర్ (774), దిలీప్ సర్దేశాయ్ (642) పరుగులు చేశారు.చదవండి: IND vs ENG: షాకింగ్.. 'జస్ప్రీత్ బుమ్రా త్వరలోనే రిటైర్మెంట్' -
ఇంగ్లండ్‌కు టీమిండియా సవాల్ విసురుతుందా? ఆఖరి రోజు ఎవరిది?
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్-భారత్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు ఆసక్తికరంగా మారింది. 311 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన టీమిండియా పోరాడుతోంది. సెకెండ్ ఇన్నింగ్స్ తొలి ఓవర్లో ఖాతా తెరవకుండానే రెండు వికెట్లు కోల్పోయి భారత్ కష్టాల్లో పడింది.ఈ సమయంలో జట్టును కెప్టెన్ శుబ్‌మన్ గిల్(167 బంతుల్లో 78 బ్యాటింగ్), కేఎల్ రాహుల్ (210 బంతుల్లో 87; 8 ఫోర్లు), విరోచిత పోరాటంతో ఆదుకున్నారు. ఇంగ్లండ్ బౌలర్లు సమర్ధవంతంగా ఎదుర్కొంటూ స్కోరు బోర్డును ముందుకు నడపించారు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండు వికెట్లు నష్టానికి 174 పరుగులు చేసింది. ప్రస్తుతం గిల్ సేన 137 పరుగులు వెనుకంజలో ఉంది.టీమిండియా సవాల్ విసురుతుందా?కాగా మాంచెస్టర్ టెస్టు రసవత్తర ముగింపునకు చేరుకుంది. కేవలం ఒక్క రోజు ఆట మాత్రమే మిగిలూండడంతో ఈ మ్యాచ్‌లో ఫలితం తేలుతుందా? లేదా డ్రా ముగిస్తుందా? అని అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఆఖరి రోజు ఆటలో తొలి సెషన్ టీమిండియాకు చాలా కీలకం కానుంది.ఇంగ్లండ్‌కు టార్గెట్ నిర్దేశించాలని భారత జట్టు భావిస్తే కచ్చితంగా మొదటి సెషన్లో వికెట్లు ఏమీ కోల్పోకుండా కాస్త దూకుడుగా ఆడాలి. ఇంగ్లండ్‌కు 200 పైగా టార్గెట్ ఇవ్వాలన్న టీమిండియా ఖచ్చితంగా టీ బ్రేక్ వరకు అయినా బ్యాటింగ్ చేయాలి. అంటే వన్డే తరహాలో తమ బ్యాటింగ్‌ను కొనసాగించాలి.ఒకవేళ తొలి సెషన్లో టీమిండియా వికెట్లు కోల్పోతే డ్రా కోసం వెళ్తే బెటర్ అని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే గాయపడిన రిషబ్ పంత్ బ్యాటింగ్ వచ్చినా, క్రీజులో నిలదొక్కకుంటాడో లేదా అన్నది ప్రశ్నార్ధంగా మారింది.అతడు కాలి పాదం గాయంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. పంత్ క్రీజులో ఉన్నంతసేపు భారీ షాట్లకు వెళ్లే అవకాశముంది. ఆ ప్రయత్నంతో పంత్ వికెట్ కోల్పోయిన ఆశ్చర్యపోన్కర్లలేదు. ఆ తర్వాత రవీంద్ర జడేజా ప్రతిఘటించే అవకాశమున్నప్పటికి, వాషింగ్టన్ సుందర్, శార్ధూల్ ఠాకూర్ ఎప్పుడూ ఎలా ఆడుతారో చెప్పలేం. కాబట్టి టీమిండియా మొత్తం ఆశలన్నీ క్రీజులో ఉన్న శుబ్‌మన్ గిల్, రాహుల్‌పైనే ఉన్నాయి. మరోవైపు ఆతిథ్య ఇంగ్లండ్ వీలైనంత త్వరగా భారత్‌ను ఆలౌట్ చేయాలని పట్టుదలతో ఉంది.చదవండి: కివీస్‌దే ముక్కోణపు టోర్నీ -
0/2 నుంచి 174/2 వరకు...
తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌కు ఏకంగా 311 పరుగుల ఆధిక్యం అప్పగించేశాం. లక్ష్యం నిర్దేశించడం సంగతి తర్వాత... ముందు ఈ లోటును ఎలా పూడ్చాలా అనే ఆందోళన... రెండో ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయి స్కోరు 0/2... మిగిలిన అరవైకి పైగా ఓవర్లను ఆడగలరా అనే సందేహం. నాలుగో రోజే కుప్పకూలి మ్యాచ్‌ను అప్పగించేస్తారేమో అనిపించింది. కానీ రాహుల్, గిల్ అసాధారణ రీతిలో గట్టిగా నిలబడ్డారు. ఆరంభంలో కాస్త తడబడ్డా ఏకాగ్రత చెదరకుండా రెండు సెషన్లు పట్టుదలగా ఆడారు. ఏకంగా 62.1 ఓవర్ల పాటు వికెట్ ఇవ్వకుండా రోజును ముగించారు. అయితే ప్రమాదం ఇంకా పూర్తిగా దాటిపోలేదు. మరో 137 పరుగులు వెనుకంజలో ఉన్న జట్టు ప్రస్తుతానికి మ్యాచ్‌ను రక్షించుకునేందుకు బాటలు వేసుకుంది. ఆపై ఎన్ని పరుగులు చేసి ఇంగ్లండ్‌కు సవాల్ విసరగలదా అనేది చూడాలి.మాంచెస్టర్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో ఓటమి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఉన్న భారత్ సురక్షిత స్థితికి చేరుతోంది. మ్యాచ్ నాలుగో రోజు శనివారం ఆట ముగిసే సమయానికి భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (210 బంతుల్లో 87; 8 ఫోర్లు), శుబ్‌మన్ గిల్ (167 బంతుల్లో 78 బ్యాటింగ్; 10 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నారు. అంతకు ముందు ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 669 పరుగులకు ఆలౌటైంది. బెన్ స్టోక్స్ (198 బంతుల్లో 141; 11 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రవీంద్ర జడేజాకు 4 వికెట్లు దక్కాయి. 22.1 ఓవర్లలో 125 పరుగులు... నాలుగో రోజు ఇంగ్లండ్ మెరుపు బ్యాటింగ్‌తో భారీ ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. స్టోక్స్ చాలా కాలం తర్వాత చెలరేగిపోగా, బ్రైడన్ కార్స్ (54 బంతుల్లో 47; 3 ఫోర్లు 2 సిక్స్‌లు), డాసన్ (26) అండగా నిలిచారు. ఆట ఆరంభంలోనే డాసన్‌ను బుమ్రా బౌల్డ్ చేసినా... స్టోక్స్, కార్స్ భాగస్వామ్యంతో ఇంగ్లండ్ దూసుకుపోయింది. సిరాజ్ బౌలింగ్‌లో లెగ్‌సైడ్ దిశగా కొట్టిన బౌండరీతో 164 బంతుల్లో స్టోక్స్ సెంచరీ పూర్తయింది. రెండేళ్ల తర్వాత, 35 ఇన్నింగ్స్‌లలో స్టోక్స్‌కు ఇది తొలి శతకం కావడం విశేషం. ఆ తర్వాత మరింత దూకుడుగా ఆడిన స్టోక్స్ తర్వాతి 34 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 41 పరుగులు రాబట్టడం విశేషం. మరో ఎండ్‌లో కార్స్ కూడా భారత బౌలర్లపై ధాటిని చూపించాడు.తొమ్మిదో వికెట్‌కు స్టోక్స్, కార్స్ కేవలం 95 బంతుల్లోనే 97 పరుగులు జోడించడం విశేషం. ఎట్టకేలకు జడేజా బౌలింగ్‌లో మరో భారీ షాట్‌కు ప్రయతి్నంచి స్టోక్స్ వెనుదిరగ్గా... తన తర్వాతి ఓవర్లో కార్స్‌ను అవుట్ చేసి జడేజా ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగించాడు. 2015 తర్వాత ఒకే ఇన్నింగ్స్‌లో నలుగురు భారత బౌలర్లు తలా 100కు పైగా పరుగులు ఇవ్వడం ఇదే తొలిసారి. భారీ భాగస్వామ్యం... భారత జట్టు ఇన్నింగ్స్ పేలవంగా మొదలైంది. వోక్స్ వేసిన తొలి ఓవర్లో స్కోరు బోర్డుపై ‘సున్నా’ పరుగులు ఉండగానే వరుస బంతుల్లో జైస్వాల్ (0), సాయి సుదర్శన్ (0) వెనుదిరిగారు. అయితే ఆ తర్వాత రాహుల్, గిల్ చక్కటి భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు. రెండో సెషన్లో ఆరంభంలో కొన్ని ఉత్కంఠ క్షణాలను ఎదుర్కొన్నా... ఆ తర్వాత వీరిద్దరు ఎలాంటి ఇబ్బంది లేకుండా, ప్రత్యర్థి బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా చూడచక్కటి షాట్లతో అలరించారు. 46 పరుగుల వద్ద గల్లీలో డాసన్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన గిల్ 77 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.26 ఓవర్ల రెండో సెషన్లో భారత్ ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు. టీ విరామం తర్వాత కూడా గిల్, రాహుల్ ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా ఆడారు. పరుగుల రాక కాస్త తగ్గినా ప్రమాదం కూడా ఏమీ కనిపించలేదు. ఒక దశలో వరుసగా 21.4 ఓవర్ల పాటు బౌండరీనే రాలేదు! 137 బంతుల్లో రాహుల్ హాఫ్ సెంచరీ పూర్తయింది. అయితే ఆ తర్వాత వీరిద్దరు స్వేచ్ఛగా ఆడారు. ఈ జోడీని విడదీసేందుకు ఇంగ్లండ్ బౌలర్లను మార్చి మార్చి ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది. అప్పుడప్పుడు కొన్ని చక్కటి బంతులు ఇబ్బంది పెట్టినట్లుగా అనిపించినా భారత్‌కు నష్టం జరగలేదు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్ 358; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: క్రాలీ (సి) రాహుల్ (బి) జడేజా 84; డకెట్ (సి) (సబ్) జురేల్ (బి) కంబోజ్ 94; పోప్ (సి) రాహుల్ (బి) సుందర్ 71; రూట్ (స్టంప్డ్) (సబ్) జురేల్ (బి) జడేజా 150; బ్రూక్ (స్టంప్డ్) (సబ్) జురేల్ (బి) సుందర్ 3; స్టోక్స్ (సి) సుదర్శన్ (బి) జడేజా 141; స్మిత్ (సి) (సబ్) జురేల్ (బి) బుమ్రా 9; డాసన్ (బి) బుమ్రా 26; వోక్స్ (బి) సిరాజ్ 4; కార్స్ (సి) సిరాజ్ (బి) జడేజా 47; ఆర్చర్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 38; మొత్తం (157.1 ఓవర్లలో ఆలౌట్) 669.వికెట్ల పతనం: 1–166, 2–197, 3–341, 4–349, 5–499, 6–515, 7–528, 8–563, 9–658, 10–669.బౌలింగ్: బుమ్రా 33–5–112–2, కంబోజ్ 18–1–89–1, సిరాజ్ 30–4–140–1, శార్దుల్ 11–0–55–0, జడేజా 37.1–0–143–4, సుందర్ 28–4–107–2. భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) రూట్ (బి) వోక్స్ 0; రాహుల్ (బ్యాటింగ్) 87; సుదర్శన్ (సి) బ్రూక్ (బి) వోక్స్ 0; గిల్ (బ్యాటింగ్) 78; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (63 ఓవర్లలో 2 వికెట్లకు) 174. వికెట్ల పతనం: 1–0, 2–0. బౌలింగ్: వోక్స్ 15–3–48–2, ఆర్చర్ 11–2–40–0, కార్స్ 10–2–29–0, డాసన్ 22–8–36–0, రూట్ 5–1–17–0.⇒ 3 టెస్టుల్లో 7 వేలకు పైగా పరుగులు చేసి 200కు పైగా వికెట్లు పడగొట్టిన మూడో ఆటగాడిగా స్టోక్స్ నిలిచాడు. గతంలో గ్యారీ సోబర్స్, జాక్ కలిస్ మాత్రమే ఈ ఘనత సాధించారు.⇒ 5 ఒకే టెస్టులో సెంచరీ సాధించడంతో పాటు ఐదు వికెట్లు కూడా తీసిన ఐదో కెప్టెన్ స్టోక్స్. గతంలో అట్కిన్సన్, సోబర్స్, ముస్తాక్ మొహమ్మద్, ఇమ్రాన్ ఖాన్లకు మాత్రమే ఇది సాధ్యమైంది.⇒1 టెస్టుల్లో బుమ్రా ఒక ఇన్నింగ్స్‌లో 100కు పైగా పరుగులివ్వడం ఇదే మొదటి సారి. అతను తన కెరీర్లో 48వ టెస్టు ఆడుతున్నాడు. -
IND vs ENG: ముగిసిన నాలుగవ రోజు ఆట.. భారత్ స్కోరు ఎంతంటే..
Update: నాలుగవ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 2 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 87(210), కెప్టెన్ శుబ్‌మన్ గిల్ 78(167)తో క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ కంటే టీమిండియా 137 పరుగులు వెనుకబడి ఉంది.ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టులో టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌తో పాటు ఓపెనర్ కేఎల్ రాహుల్ అర్ధ శతకం సాధించాడు. వీరిద్దరి పోరాట పటిమ కారణంగా రెండో ఇన్నింగ్స్‌లో భారత్ వంద పరుగుల మార్కు దాటింది. కాగా భారత్- ఇంగ్లండ్ మధ్య మాంచెస్టర్ వేదికగా బుధవారం నాలుగో టెస్టు మొదలైన విషయం తెలిసిందే.ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (58), కేఎల్ రాహుల్ (46)లు రాణించగా.. సాయి సుదర్శన్ (61), రిషభ్ పంత్ (54) అర్ధ శతకాలు సాధించారు. ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ 41 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో స్టోక్స్ ఐదు వికెట్లు తీయగా.. జోఫ్రా ఆర్చర్ మూడు, క్రిస్ వోక్స్, లియామ్ డాసన్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం.. బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ ఇందుకు దీటుగా బదులిచ్చి ఏకంగా 669 పరుగులు సాధించింది. ఓపెనర్లు జాక్ క్రాలీ (84), బెన్ డకెట్ (94)లు బజ్‌బాల్‌తో దుమ్ములేపగా.. వన్‌డౌన్ బ్యాటర్ ఓలీ పోప్ (71) అద్భుత అర్థ శతకం సాధించాడు. జో రూట్ (150), కెప్టెన్ బెన్ స్టోక్స్ (141) భారీ శతకాలు బాదారుఫలితంగా ఏకంగా 669 పరుగులు సాధించిన ఇంగ్లండ్.. తొలి ఇన్నింగ్స్‌లో 311 పరుగుల భారీ ఆధిక్యం సంపాదించింది. భారత రవీంద్ర జడేజా నాలుగు వికెట్లు తీయగా.. వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా రెండేసి వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. అన్షుల్ కంబోజ్, మహ్మద్ సిరాజ్‌లకు చెరో వికెట్ దక్కింది.ఈ క్రమంలో శనివారం నాటి నాలుగో రోజు ఆట సందర్భంగా రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన టీమిండియాకు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. తొలి ఇన్నింగ్స్‌లో అర్ధ శతకాలు బాదిన ఓపెనర్ యశస్వి జైస్వాల్, వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ ఈసారి డకౌట్‌గా వెనుదిరిగారు.టీమిండియా ఇన్నింగ్స్‌లో నాలుగో బంతికి జైసూను, ఐదో బంతిని సాయిని ఇంగ్లండ్ పేసర్ క్రిస్ వోక్స్ వెనక్కి పంపించాడు. ఇలా తొలి ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయన భారత జట్టును కెప్టెన్ గిల్, కేఎల్ రాహుల్ ఆదుకున్నారు. డ్రింక్స్ బ్రేక్ సమయానికి గిల్ 71, రాహుల్ 68 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఫలితంగా 54 ఓవర్ల ఆట పూర్తయ్యేసరికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. -
శుబ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీ
టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చాడు. ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టులో ఈ కుడిచేతి వాటం బ్యాటర్ అర్ధ శతకం (52)తో మెరిశాడు. మాంచెస్టర్‌లో శనివారం నాటి నాలుగో రోజు ఆటలో భాగంగా 77 బంతుల్లో యాభై పరుగుల మార్కును అందుకున్నాడు. కాగా టెస్టుల్లో గిల్‌కు ఇది ఎనిమిదో హాఫ్ సెంచరీ.కాగా లీడ్స్‌లో శతక్కొట్టిన గిల్.. ఎడ్జ్‌బాస్టన్‌లో డబుల్ సెంచరీ, సెంచరీ బాదిన విషయం తెలిసిందే. అయితే, ప్రఖ్యాత లార్డ్స్' మైదానంలో జరిగిన మూడో టెస్టులో మాత్రం పూర్తిగా నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 16 పరుగులే చేసిన గిల్.. రెండో ఇన్నింగ్స్‌లో ఆరు పరుగులకే పరిమితమయ్యాడు.ఇక మాంచెస్టర్ టెస్టులోనూ మొదటి ఇన్నింగ్స్‌లో కెప్టెన్ సాబ్ 12 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అయితే, తాజాగా రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం 52 పరుగులు పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్‌లో ఓపెనర్ కేఎల్ రాహుల్ నిలకడగా ఆడుతూ 30 పరుగులు పూర్తి చేసుకున్నాడు. టీ బ్రేక్ సమయానికి టీమిండియా 29 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది. ఇంగ్లండ్ కంటే ఇంకా 225 పరుగులు వెనుకబడి ఉంది. అంతకు ముందు ఓపెనర్ యశస్వి జైస్వాల్, వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగారు.ఇంగ్లండ్ 669కాగా మాంచెస్టర్ వేదికగా బుధవారం మొదలైన నాలుగో టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ భారత్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (58), కేఎల్ రాహుల్ (46)లతో పాటు సాయి సుదర్శన్ (61), రిషభ్ పంత్ (54), శార్దూల్ ఠాకూర్ (41) రాణించారు.అయితే, భారత బౌలర్ల వైఫల్యం కారణంగా ఇంగ్లండ్ భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు జాక్ క్రాలీ (84), బెన్ డకెట్ (94)లతో పాటు వన్‌డౌన్ బ్యాటర్ ఓలీ పోప్ (71) అద్భుత అర్థ శతకం సాధించాడు. జో రూట్ (150), కెప్టెన్ బెన్ స్టోక్స్ (141) భారీ సెంచరీలతో మెరిశారు. ఫలితంగా ఏకంగా 669 పరుగులు సాధించిన ఇంగ్లండ్.. తొలి ఇన్నింగ్స్‌లో 311 పరుగుల భారీ ఆధిక్యం సంపాదించింది. టీమిండియా బౌలర్లలో రవీంద్ర జడేజా నాలుగు వికెట్లు పడగొట్టగా.. వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా రెండేసి వికెట్లు దక్కించుకున్నారు. అన్షుల్ కంబోజ్, మహ్మద్ సిరాజ్‌లు చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. -
ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన గిల్.. ఆసియాలోనే తొలి బ్యాటర్‌గా
టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లండ్ గడ్డ మీద టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆసియా బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మొహమ్మద్ యూసఫ్ (Mohammad Yousuf) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టి ఈ ఫీట్ నమోదు చేశాడు.కెప్టెన్ రోహిత్ శర్మ, దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) టెస్టు ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత.. భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా గిల్ పగ్గాలు చేపట్టాడు. అతడి సారథ్యంలో టీమిండియా తొలుత ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది.లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో సారథిగా తొలి ప్రయత్నంలో విఫలమైన గిల్.. బ్యాటర్ (147, 8)గా మాత్రం అదరగొట్టాడు. ఇక రెండో టెస్టులో ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్ ఇంగ్లండ్‌ను 336 పరుగుల తేడాతో చిత్తు చేసిన చారిత్రాత్మక విజయం సాధించడంలో ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌ది కీలక పాత్ర.ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో డబుల్ సెంచరీ (269), శతకం (161)తో చెలరేగాడు గిల్. అయితే, లార్డ్స్ టెస్టు (16, 6)లో మాత్రం అతడు తీవ్రంగా నిరాశపరిచాడు. తాజాగా మాంచెస్టర్‌లో జరుగుతున్న నాలుగో టెస్టులోనూ గిల్ తొలి ఇన్నింగ్స్‌లో విఫలమయ్యాడు. మిడిలార్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తున్న ప్రిన్స్.. 12 పరుగులు చేసి నిష్క్రమించాడు.ఇక రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం గిల్ ఫర్వాలేదనిపిస్తున్నాడు. శనివారం నాటి నాలుగో రోజు ఆటలో భాగంగా టీమిండియా 18 ఓవర్ల ఆట ముగిసే సరికి 46 బంతుల్లో ఏడు ఫోర్ల సాయంతో 39 పరుగులు రాబట్టాడు.ఈ క్రమంలోనే ఇంగ్లండ్ గడ్డ మీద టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆసియా బ్యాటర్‌గా అవతరించాడు. ఈ ఇన్నింగ్స్‌లో 26 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద గిల్.. యూసఫ్‌ను అధిగమించాడు.ఇంగ్లండ్ గడ్డ మీద ఒక టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆసియా బ్యాటర్లు🏏శుబ్‌మన్ గిల్ (ఇండియా)- 645*- 2025లో- అత్యుత్తమ స్కోరు 269🏏మొహమ్మద్ యూసఫ్ (పాకిస్తాన్)- 631- 2006లో- అత్యుత్తమ స్కోరు 202🏏రాహుల్ ద్రవిడ్ (ఇండియా)- 602- 2002లో- అత్యుత్తమ స్కోరు 217🏏విరాట్ కోహ్లి (ఇండియా)- 593- 2018లో- అత్యుత్తమ స్కోరు 149🏏సునిల్ గావస్కర్ (ఇండియా)- 542- 1979లో- అత్యుత్తమ స్కోరు 221.చదవండి: తొలి ఓవర్లో రెండు వికెట్లు.. కష్టాల్లో టీమిండియా!.. గంభీర్‌పై ఫ్యాన్స్ ఫైర్ -
గిల్.. నేనైతే ఆ తప్పు చేసేవాడిని కాదు: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్
టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) సరైన వ్యూహాలు అమలు చేయడంలో విఫలమయ్యాడని ఇంగ్లండ్ మాజీ సారథి మైకేల్ వాన్ అన్నాడు. ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టులో బౌలర్ల సేవలు సరిగ్గా వినియోగించుకోలేకపోయాడంటూ పెదవి విరిచాడు. శుక్రవారం నాటి తొలి సెషన్లో స్పిన్నర్ల చేతికి బంతిని ఇచ్చి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు.కాగా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ (Tendulkar- Anderson Trophy)లో భాగంగా ఐదు టెస్టుల సిరీస్‌లో 1-2తో టీమిండియా వెనుకబడి ఉంది. మాంచెస్టర్ వేదికగా బుధవారం మొదలైన నాలుగో టెస్టులో గెలిస్తేనే గిల్ సేనకు సిరీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. అయితే, ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే డ్రా కోసం టీమిండియా ప్రయత్నించడమే ఉత్తమంగా కనిపిస్తోంది.358 పరుగులకు ఆలౌట్‌టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులకు ఆలౌట్ అయింది. ఇందుకు దీటుగా బదులిస్తున్న ఇంగ్లండ్.. శుక్రవారం నాటి మూడో రోజు ఆట ముగిసేసరికి ఏడు వికెట్ల నష్టానికి ఏకంగా 544 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత్ కంటే 186 పరుగుల ఆధిక్యం సంపాదించింది.భారీ ఆధిక్యంలో ఇంగ్లండ్టీమిండియా బౌలర్ల వైఫల్యం కారణంగా ఇంగ్లండ్ ఓపెనర్లు జాక్ క్రాలీ (113 బంతుల్లో 84), బెన్ డకెట్ (100 బంతుల్లో 94) మరోసారి ‘బజ్‌బాల్’ శైలిలో రెచ్చిపోయారు. మరోసారి జో రూట్ తన అనుభవాన్ని ప్రదర్శిస్తూ రికార్డు శతకం (150)తో చెలరేగగా.. కెప్టెన్ బెన్ స్టోక్స్ (77 నాటౌట్) కూడా అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఆతిథ్య జట్టుకు ఈ మేర ఆధిక్యం లభించింది.ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా పేస్‌లో పదును తగ్గగా.. మహ్మద్ సిరాజ్‌తో పాటు అరంగేట్ర పేసర్ అన్షుల్ కంబోజ్ పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాడు. ఈ ముగ్గురూ తలా ఒక వికెట్ దక్కించుకోగా.. ఇక శార్దూల్ ఠాకూర్ మరోసారి విఫలమయ్యాడు. అయితే, స్పిన్నర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ చెరో రెండు వికెట్లు పడగొట్టి సత్తా చాటారు.గిల్.. నేనైతే ఆ తప్పు చేసేవాడిని కాదుఈ నేపథ్యంలో శుబ్‌మన్ గిల్ కెప్టెన్సీ తీరుపై మైకేల్ వాన్ విమర్శలు గుప్పించాడు. ‘‘నేనే గనుక గిల్ స్థానంలో ఉండి ఉంటే.. స్పిన్నర్లతో రోజును ఆరంభించేవాడిని. కనీసం వారికి రెండు- మూడు ఓవర్లు వేసే అవకాశం ఇచ్చేవాడిని.కానీ గిల్ అలా చేయలేదు. అందుకు కారణమేమిటో అతడే వివరించాలి. అతడు వ్యూహాత్మక తప్పిదాలు చేశాడు’’ అని మైకేల్ వాన్ పేర్కొన్నాడు. ఇక దురదృష్టవశాత్తూ బుమ్రా కూడా ఈ పిచ్‌పై రాణించలేకపోయాడని.. సిరాజ్ మాత్రం ఫర్వాలేదనిపించాడన్నాడు. అదే విధంగా.. గంటకు 78- 81 మైళ్ల వేగంతో బౌలింగ్ చేసే శార్దూల్ ఠాకూర్ నుంచి ఇక్కడ మెరుగైన ప్రదర్శన ఆశించడం కూడా తప్పేనని వాన్ అభిప్రాయపడ్డాడు. ఇక అన్షుల్ కొత్త వాడని.. ఆదిలోనే అతడు అద్భుతాలు చేయలేడని పేర్కొన్నాడు. వీరందరితో నెగ్గుకురావడం కాస్త కష్టమేనంటూ ఒకానొక సందర్భంలో గిల్‌కు మద్దతు పలికాడు.చదవండి: AUS vs WI: టిమ్ డేవిడ్ మెరుపు సెంచరీ.. విండీస్‌ను చిత్తు చేసిన ఆసీస్ -
సిరాజ్‌ను కాదని అతడికి బంతినిస్తారా? బుమ్రాకు ఏమైంది?: పాంటింగ్ ఫైర్
మాంచెస్టర్ టెస్టులో ఇంగ్లండ్ తనదైన శైలిలో ‘బజ్‌బాల్’ ఆటతో చెలరేగింది. ఓపెనర్లు జాక్ క్రాలీ (Zak Crawley), బెన్ డకెట్ (Ben Ducket) దూకుడైన బ్యాటింగ్‌తో దుమ్ములేపారు. క్రాలీ 113 బంతుల్లోనే 84 పరుగులు చేయగా.. డకెట్ కేవలం 100 బంతుల్లోనే 94 పరుగులతో అలరించాడు. వన్డే మాదిరి బ్యాటింగ్ చేసిన వీరిద్దరిని ఆపడం టీమిండియా బౌలర్ల తరం కాలేదు.దీంతో ఒక్క సెషన్లోనే ఏకంగా 148 పరుగులు చేసిన ఇంగ్లండ్.. గురువారం నాటి రెండో రోజు ఆట ముగిసే సరికి కేవలం రెండు వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసి పటిష్ట స్థితికి చేరుకుంది. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill), ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాలపై ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ విమర్శలు గుప్పించాడు.సిరాజ్‌ను కాదని అతడికి బంతినిస్తారా?అరంగేట్ర పేసర్ అన్షుల్ కంబోజ్‌కు ముందుగానే బంతి ఇచ్చి గిల్ తప్పు చేశాడని పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. అనుభవజ్ఞుడైన సిరాజ్‌ను కాదని అన్షుల్‌ను రంగంలోకి దించినందుకు భారత్ భారీ మూల్యమే చెల్లించిందన్నాడు.మరోవైపు.. బుమ్రా సైతం వ్యూహాత్మకంగా బౌలింగ్ చేయలేకపోయాడని పాంటింగ్ విమర్శించాడు. ఈ మేరకు.. ‘‘ఆరంభం నుంచే టీమిండియా బౌలర్లు తడబడ్డారు. సిరాజ్‌ను కాదని అన్షుల్ కంబోజ్‌కు కొత్త బంతిని ఇచ్చి తప్పు చేశారు. అతడిని ముందే రంగంలోకి దించడం నాకైతే నచ్చలేదు.బుమ్రాకు ఏమైంది?డకెట్ కొట్టిన తొలి ఐదు బౌండరీలలో తొలి సిక్సర్ స్క్వేర్ లెగ్ మీదుగానే వచ్చింది. టీమిండియా వ్యూహాత్మక తప్పిదాలు చేసింది. ముఖ్యంగా బుమ్రా స్టాతమ్ ఎండ్ నుంచి కాకుండా ఆండర్సన్ ఎండ్ నుంచి బౌలింగ్ చేసి పొరపాటు చేశాడు. నిజానికి ముందు కూడా స్టాతమ్ ఎండ్ నుంచే ఎక్కువ వికెట్లు పడ్డాయి’’ అంటూ పాంటింగ్ గిల్, బుమ్రా తీరును విమర్శించాడు.ధారాళంగా పరుగులు ఇచ్చుకున్న భారత బౌలర్లుకాగా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్‌తో భారత జట్టు ఐదు టెస్టులు ఆడుతోంది. ఆతిథ్య జట్టు 2-1తో ఆధిక్యంలో ఉండగా.. మాంచెస్టర్‌లో జరుగుతున్న నాలుగో టెస్టులో గెలిస్తేనే టీమిండియా సిరీస్ ఆశలు సజీవంగా ఉంటాయి.ఇక ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. 264/4 ఓవర్‌నైట్ స్కోరుతో గురువారం నాటి ఆట మొదలుపెట్టిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులు చేసింది. ఇందుకు ఇంగ్లండ్ దీటుగా బదులిస్తోంది. గురువారం నాటి రెండో రోజు ఆట పూర్తయ్యేసరికి కేవలం రెండు వికెట్ల నష్టపోయి 46 ఓవర్లలోనే 225 పరుగులు చేసింది. క్రాలీని రవీంద్ర జడేజా అవుట్ చేయగా.. డకెట్ వికెట్‌ను అన్షుల్ దక్కించుకున్నాడు. ఓలీ పోప్ 20, జో రూట్ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు.#AnshulKamboj, welcome to Test cricket!Opens his wicket tally in style by removing a well-set Ben Duckett. 💥#ENGvIND 👉 4th TEST, DAY 2 | LIVE NOW on JioHotstar 👉 https://t.co/Y3btplYguV pic.twitter.com/aXAsyVjKjw— Star Sports (@StarSportsIndia) July 24, 2025 ఇక భారత బౌలర్లలో గురువారం బుమ్రా 13 ఓవర్లలో 37 పరుగులు, అన్షుల్ 10 ఓవర్లలో 48, సిరాజ్ 10 ఓవర్లలో 58 పరుగులు, శార్దూల్ ఠాకూర్ 5 ఓవర్లలోనే 35 పరుగులు, రవీంద్ర జడేజా 8 ఓవర్లలో 37 పరుగులు సమర్పించుకున్నారు.చదవండి: ‘పది కుట్లు పడ్డాయి.. టీమిండియాలోకి వచ్చే ఛాన్స్ లేదు’ -
అది నా చేతుల్లో లేదు.. అంతా కెప్టెన్ ఇష్టమే: శార్ధూల్ ఠాకూర్
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా ఆల్‌రౌండర్ శార్ధూల్ ఠాకూర్ బ్యాట్‌తో రాణించాడు. ఏడో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన శార్ధూల్.. 88 బంతులు ఎదుర్కొని 41 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే బౌలింగ్‌లో మాత్రం మరోసారి లార్డ్ ఠాకూర్ తేలిపోయాడు.ఇప్పటివరకు 5 ఓవర్లు బౌలింగ్ చేసిన ఠాకూర్ వికెట్ ఏమీ తీయకుండా 35 పరుగులు సమర్పించుకున్నాడు. లీడ్స్‌లో జరిగిన తొలి టెస్టులో విఫలమం కావడంతో శార్ధూల్‌పై టీమ్‌మెనెజ్‌మెంట్‌పై వేటు పడింది. ఆ తర్వాత రెండు మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితమైన ఈ ముంబై ఆల్‌రౌండర్.. తిరిగి మళ్లీ మాంచెస్టర్ టెస్టులో ఆడేందుకు అతడికి ఛాన్స్ లభించింది.అయితే బౌలర్‌గా శార్ధూల్ సేవలను టీమిండియా సరిగ్గా ఉపయోగించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. దేశవాళీ క్రికెట్లో బౌలర్‌గా అద్బుతంగా రాణిస్తున్న ఠాకూర్‌కు మొదటి టెస్టులో కేవలం 16 ఓవర్లు మాత్రమే వేసే అవకాశం దక్కింది. ఇప్పుడు మాంచెస్టర్ టెస్టులో కూడా కేవలం 5 ఓవర్లు మాత్రమే శార్ధూల్‌తో గిల్ బౌలింగ్ చేయించాడు. తాజాగా ఇదే విషయంపై శార్ధూల్ ఠాకూర్ స్పందించాడు. పరిస్థితులకు అనుగుణంగా ఎవరిని బౌలింగ్ చేయాలనేది కెప్టెన్ ఇష్టమే అని ఠాకూర్ తెలిపాడు."ఒక బౌలర్‌కు బౌలింగ్ ఇవ్వడం, ఇవ్వకపోవడం అది కెప్టెన్ నిర్ణయం. అది నా చేతుల్లో లేదు. బౌలింగ్‌లో ఎప్పుడు ఎవరిని ఎటాక్‌లోకి తీసుకురావాలో కెప్టెన్ నిర్ణయిస్తాడు. ఈ మ్యాచ్‌లో ఇంకా మూడు రోజుల ఆట మిగిలి ఉంది. మరిన్ని ఓవర్లు బౌలింగ్ చేసే అవకాశం లభిస్తుందని ఆశిస్తున్నాను" అని రెండో రోజు ఆట అనంతరం విలేకరుల సమావేశంలో ఠాకూర్ పేర్కొన్నాడు.ఇక మాంచెస్టర్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ రెండు వికెట్లు కోల్పోయి 225 పరుగులు చేసింది. అంతకుముందు భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులకు ఆలౌటైంది.