IND vs Aus 2nd Odi live updates and Highlights: అడిలైడ్ వేదికగా రెండో వన్డేలో టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది. రెండు వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టు చేతిలో ఓడి.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే మూడు వన్డేల సిరీస్‌ను కోల్పోయింది. మాథ్యూ షార్ట్ (74), కూపర్ కన్నోలి (61 నాటౌట్) అద్భుత హాఫ్ సెంచరీలతో రాణించి ఆసీస్‌కు విజయం అందించారు.
ఎనిమిదో వికెట్ డౌన్
స్టార్క్ (4) రూపంలో ఆసీస్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది.
ఏడో వికెట్ కోల్పోయిన ఆసీస్
అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో ఏడో వికెట్‌గా బార్ట్‌లెట్ (3) వెనుదిరిగాడు. 45 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసినన ఆసీస్.. విజయానికి 30 బంతుల్లో 10 పరుగుల దూరంలో ఉంది. కన్నోలి 56, స్టార్క్ సున్నా పరుగులతో క్రీజులో ఉన్నారు.
ఆరో వికెట్ కోల్పోయిన ఆసీస్
వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో అర్ష్‌దీప్ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి మిచెల్ ఓవెన్ (36) అవుటయ్యాడు. దీంతో ఆసీస్ ఆరో వికెట్ కోల్పోయింది. అయితే, అర్ధ శతకంతో కూపర్ కన్నోలి జోరుమీద ఉన్నాడు. జేవియర్ బార్ట్‌లెట్ అతడికి సహకరిస్తున్నాడు. 43.1 ఓవర్ల ఆట ముగిసే సరికి ఆరు వికెట్లు కోల్పోయిన ఆసీస్ విజయానికి.. 41 బంతుల్లో కేవలం 16 పరుగులే అవసరం.
ఐదో వికెట్ కోల్పోయిన ఆసీస్
హర్షిత్ రాణా బౌలింగ్‌లో ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు అర్థ శతక వీరుడు మాథ్యూ షార్ట్ (74). సిరాజ్‌కు క్యాచ్ ఇవ్వడంతో అతడి ఇన్నింగ్స్ ముగిసిపోగా ఆసీస్ ఐదో వికెట్ కోల్పోయింది. మిచెల్ ఓవెన్ క్రీజులోకి వచ్చాడు. 39 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోరు 207-5. విజయానికి 66 బంతుల్లో 58 పరుగులు కావాలి. కన్నోలి 34, మిచెల్ ఓవెన్ 17 పరుగులతో క్రీజులో ఉన్నారు.
నాలుగో వికెట్ కోల్పోయిన ఆసీస్
26.2వ ఓవర్- 132 పరుగుల వద్ద ఆసీస్ నాలుగో వికెట్ కోల్పోయింది. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో అలెక్స్ క్యారీ (9) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 30.3 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 4 వికెట్ల నష్టానికి 143 పరుగులుగా ఉంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ గెలవాలంటే మరో 122 పరుగులు చేయాలి.
మూడో వికెట్ కోల్పోయిన ఆసీస్
21.4వ ఓవర్- 109 పరుగుల వద్ద ఆసీస్ మూడో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో మ్యాట్ రెన్‌షా (30) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో మాథ్యూ షార్ట్‌తో 50 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. షార్ట్‌కు (37) జతగా అలెక్స్ క్యారీ క్రీజ్‌లోకి వచ్చాడు.
రెండో వికెట్ కోల్పోయిన ఆసీస్
12.2వ ఓవర్- 265 పరుగుల లక్ష్య ఛేదనలో ఆసీస్ 54 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. హర్షిత్ రాణా బౌలింగ్‌లో కోహ్లికి క్యాచ్ ఇచ్చి హెడ్ (28) ఔటయ్యాడు. అంతకుముందు 8వ ఓవర్ రెండో బంతికి అర్షదీప్ సింగ్ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి కెప్టెన్ మిచెల్ మార్ష్ (11) పెవిలియన్‌కు చేరాడు.

రోహిత్, శ్రేయస్ హాఫ్ సెంచరీలు.. భారత్ స్కోర్: 264/9
అడిలైడ్ వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 9 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ(73) టాప్ స్కోరర్‌గా నిలవగా.. శ్రేయస్ అయ్యర్(61), అక్షర్ పటేల్(44) రాణించారు. ఆఖరిలో హర్షిత్ రాణా(24), అర్ష్‌దీప్ సింగ్ కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో పాటు స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లి(0), కేఎల్ రాహుల్(11) విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా 4 వికెట్లు పడగొట్టగా..బార్ట్‌లెట్ మూడు, స్టార్క్ రెండు వికెట్లు సాధించాడు.
భారత్ ఎనిమిదో వికెట్ డౌన్..
అడిలైడ్ వన్డేలో భారత్ ఆలౌట్ దిశగా సాగుతోంది. నితీశ్ కుమార్ రెడ్డి రూపంలో టీమిండియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన నితీశ్.. ఆడమ్ జంపా బౌలింగ్‌లో స్టంపౌటయ్యాడు. భారత్ స్కోర్: 229-8(46 ఓవర్లు)
ఏడో వికెట్ కోల్పోయిన భారత్
44.1: నిలకడగా ఆడుతున అక్షర్ పటేల్ 44 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. జంపా బౌలింగ్‌లో స్టార్క్‌కు క్యాచ్ ఇవ్వడంతో అక్షర్ ధనాధన్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. దీంతో భారత్ ఏడో వికెట్ కోల్పోయింది. హర్షిత్ రాణా క్రీజులోకి రాగా.. నితీశ్ రెడ్డి ఏడు పరుగులతో ఉన్నాడు. స్కోరు: 223-7(44.1)
వాషీ అవుట్.. ఆరో వికెట్ డౌన్
41.5: బార్ట్‌లెట్ బౌలింగ్‌లో హాజిల్‌వుడ్‌కు క్యాచ్ ఇచ్చి అవుటైన వాషింగ్టన్ సుందర్ (12). దీంతో టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. నితీశ్ కుమార్ రెడ్డి క్రీజులోకి రాగా.. అక్షర్ పటేల్ 41 పరుగులతో ఆడుతున్నాడు. స్కోరు: 213-6(42).
టీమిండియా ఐదో వికెట్ డౌన్
టీమిండియా 174 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన రాహుల్.. ఆడమ్ జంపా బౌలింగ్‌లో
ఔటయ్యాడు. క్రీజులోకి వాషింగ్టన్ సుందర్ వచ్చాడు.
నాలుగో వికెట్ కోల్పోయిన భారత్
శ్రేయస్ అయ్యర్ (61) రూపంలో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. జంపా బౌలింగ్‌లో అయ్యర్ బౌల్డ్. స్కోరు: 160-4(32.4). అక్షర్ 13 పరుగులతో క్రీజులో ఉన్నాడు.
రోహిత్ శర్మ ఔట్..
రోహిత్ శర్మ రూపంలో భారత్ మూడో వికెట్ కోల్పోంయింది. 73 పరుగులు చేసిన రోహిత్.. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి అక్షర్ పటేల్ వచ్చాడు.
అయ్యర్ హాఫ్ సెంచరీ..
శ్రేయస్ అయ్యర్ కూడా తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 67 బంతుల్లో అయ్యర్ తన 23వ ఆర్ధ శతకాన్ని అందుకున్నాడు. టీమిండియా స్కోరు: 94-2 (29). రోహిత్ 72 పరుగులతో క్రీజులో ఉన్నాడు.

రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ
21.5: కన్నోలి బౌలింగ్‌లో సింగిల్ తీసి అర్ధ శతకం పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ. 74 బంతుల్లో యాభై పరుగుల మార్కు అందుకున్న హిట్‌మ్యాన్. వన్డేల్లో ఇది 59వ ఫిఫ్టీ. టీమిండియా స్కోరు: 94-2 (22). అయ్యర్ 33 పరుగులతో ఆడుతున్నాడు.
సిక్స్‌లు, ఫోర్.. 17 పరుగులు
19వ ఓవర్లో రోహిత్ శర్మ రెండు సిక్స్‌లు బాదగా.. శ్రేయస్ అయ్యర్ ఓ ఫోర్ బాదాడు. ఈ క్రమంలో మిచెల్ ఓవెన్ బౌలింగ్‌లో ఈ ఓవర్లో ఓవరాల్‌గా 17 పరుగులు వచ్చాయి. టీమిండియా స్కోరు 83-2.
నిలకడగా ఆడుతున్న రోహిత్, అయ్యర్..
15 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 50 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(26), శ్రేయస్ అయ్యర్(13) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.

టీమిండియాకు భారీ షాక్.. కోహ్లి డకౌట్
విరాట్ కోహ్లి రూపంలో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. జేవియర్ బార్ట్‌లెట్ బౌలింగ్‌లో కోహ్లి వికెట్లు ముందు దొరికిపోయాడు. దీంతో ఖాతా తెరవకుండానే కోహ్లి పెవిలియన్‌కు చేరాడు.
తొలి వికెట్ కోల్పోయిన భారత్..
రెండో వన్డేలో కూడా భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ విఫలమయ్యాడు. కేవలం 9 పరుగులు మాత్రమే చేసిన గిల్.. బార్ట్‌లెట్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి కోహ్లి వచ్చాడు.
తడబడుతున్న గిల్..
6 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 17 పరుగులు చేసింది. ఓ వైపు శుభ్‌మన్ గిల్(8 బంతుల్లో 9) మంచి టచ్‌లో కన్పిస్తుంటే.. రోహిత్ శర్మ(28 బంతుల్లో 8) మాత్రం తడబడుతున్నాడు.
అడిలైడ్ వేదికగా రెండో వన్డేలో ఆస్ట్రేలియా-భారత్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆసీస్ రెండు మార్పులతో బరిలోకి దిగింది.
తుది జట్టులోకి స్టార్ ప్లేయర్లు అలెక్స్ క్యారీ, అడమ్ జంపా వచ్చారు. మరోవైపు భారత్ మాత్రం ఎటువంటి మార్పులు చేయలేదు. పెర్త్‌లో ఆడిన జట్టునే కొనసాగించింది. కుల్దీప్ యాదవ్ మరోసారి బెంచ్‌కే పరిమితమయ్యాడు.
తుది జట్లు
ఆస్ట్రేలియా : మిచెల్ మార్ష్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, మాథ్యూ షార్ట్, మాట్ రెన్షా, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), కూపర్ కోనోలీ, మిచెల్ ఓవెన్, జేవియర్ బార్ట్‌లెట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్
భారత్ : రోహిత్ శర్మ, శుభ్‌మాన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్


