Adelaide
-
Aus Vs Pak: 5 వికెట్లతో చెలరేగిన పాక్ పేసర్.. కుప్పకూలిన ఆసీస్! ఇమ్రాన్ రికార్డు బ్రేక్
ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో పాకిస్తాన్ బౌలర్లు అదరగొట్టారు. వరుస విరామాల్లో వికెట్లు తీసి కంగారూ జట్టును కోలుకోని దెబ్బకొట్టారు. పాక్ ప్రధాన పేసర్ షాహిన్ ఆఫ్రిది ఆసీస్ ఓపెనర్ల వికెట్లు తీసి శుభారంభం అందించగా.. మరో ఫాస్ట్ బౌలర్ హ్యారిస్ రవూఫ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.ఏకంగా ఐదు వికెట్లు కూల్చి ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. షాహిన్, రవూఫ్ దెబ్బకు కమిన్స్ బృందం కనీసం 200 పరుగుల మార్కు కూడా అందుకోలేకపోయింది. కాగా మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడేందుకు పాకిస్తాన్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది.ఇందులో భాగంగా మెల్బోర్న్ వేదికగా సోమవారం తొలి వన్డే జరుగగా.. ఆతిథ్య ఆసీస్ రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ క్రమంలో ఆసీస్- పాక్ మధ్య శుక్రవారం నాటి రెండో వన్డేకు అడిలైడ్ వేదికగా మారింది. టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ నమ్మకాన్ని నిలబెడుతూ షాహిన్ ఆఫ్రిది ఆసీస్ ఓపెనర్లు మాథ్యూ షార్ట్(19), జేక్ ఫ్రేజర్ మెగర్క్(13)లను స్వల్ప స్కోరుకే పెవిలియన్‌కు పంపాడు.ఐదు కీలక వికెట్లు అతడి సొంతంవన్డౌన్లో వచ్చిన స్టీవ్ స్మిత్(35) క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేయగా.. హస్నైన్ అతడిని అవుట్ చేశాడు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన హ్యారిస్ రవూఫ్ జోస్ ఇంగ్లిస్(18), మార్నస్ లబుషేన్(6), ఆరోన్ హార్డీ(14), గ్లెన్ మాక్స్వెల్(16), ప్యాట్ కమిన్స్(13) రూపంలో ఐదు కీలక వికెట్లు దక్కించుకున్నాడు. The man of the moment #AUSvPAK pic.twitter.com/t0UJ3iZJLh— cricket.com.au (@cricketcomau) November 8, 2024 మరోవైపు.. టెయిలెండర్లలో మిచెల్ స్టార్క్(1)ను షాహిన్ అవుట్ చేయగా.. ఆడం జంపా (18) కాసేపు పోరాడగా నసీం షా అతడిని బౌల్డ్ చేసి పని పూర్తి చేశాడు.Vintage Smith 👌#AUSvPAK pic.twitter.com/PWKlbk4NgK— cricket.com.au (@cricketcomau) November 8, 2024 ఈ క్రమంలో 35 ఓవర్లకే ఆస్ట్రేలియా కథ ముగిసింది. కేవలం 163 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇక ఆసీస్ విధించిన స్వల్ప లక్ష్యాన్ని పాకిస్తాన్ ఛేదిస్తుందా? లేదంటే తొలి వన్డే మాదిరి ఈసారీ మ్యాచ్‌ను చేజార్చుకుంటుందా? అనేది ఆసక్తికరంగా మారింది. ఆసీస్‌తో రెండో వన్డేలో హ్యారిస్ రవూఫ్ ఐదు వికెట్లతో సత్తా చాటగా.. షాహిన్ ఆఫ్రిది మూడు, నసీం షా, మహ్మద్ హస్నైన్ ఒక్కో వికెట్ తీశారు.చరిత్ర సృష్టించిన హ్యారిస్ రవూఫ్.. పాక్ తరఫున తొలి పేసర్గాఆసీస్తో రెండో వన్డేలో ఐదు వికెట్లు పడగొట్టిన పాక్ బౌలర్ హ్యారిస్ రవూఫ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అడిలైడ్‌లో వన్డేల్లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన మొట్టమొదటి పాకిస్తాన్ పేసర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో పాక్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రం, ఇమ్రాన్ ఖాన్ పేరిట ఉన్న రికార్డును రవూఫ్ బద్దలు కొట్టాడు.ఇక అడిలైడ్‌లో అంతకు ముందు స్పిన్నర్ సక్లెయిన్ ముస్తాక్ వన్డేల్లో ఐదు వికెట్లు ప్రదర్శన నమోదు చేశాడు. తద్వారా ఈ పాక్ తరఫున ఈ ఘనత నమోదు చేసిన మొదటి బౌలర్‌గా కొనసాగుతున్నాడు.అడిలైడ్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన పాక్ బౌలర్లుహ్యారిస్ రవూఫ్- 5/29*సక్లెయిన్ ముస్తాక్- 5/29ఇజాజ్ ఫాకిహ్- 4/43ఇమ్రాన్ ఖాన్-3/19షాహిన్ ఆఫ్రిది- 2/24.చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్.. -
స్మృతి కోసం చాలా ట్రై చేశాం.. ఎట్టకేలకు మా జట్టులో!(ఫొటోలు)
-
ఇదెక్కడి బాదుడురా సామీ.. 10 ఫోర్లు, 12 సిక్సర్ల సాయంతో 140 పరుగులు
బిగ్‌బాష్ లీగ్‌లో భాగంగా అడిలైడ్ స్ట్రయికర్స్‌తో ఇవాళ (జనవరి 22) జరుగుతున్న నాకౌట్ (ఛాలెంజర్) మ్యాచ్‌లో బ్రిస్బేన్ హీట్ ఓపెనర్ జోష్ బ్రౌన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 57 బంతుల్లోనే 10 ఫోర్లు, 12 సిక్సర్ల సాయంతో 140 పరుగులు బాదాడు. తొలి బంతి నుంచే శివాలెత్తిన బ్రౌన్.. బిగ్‌బాష్ లీగ్‌లో రెండో వేగవంతమైన సెంచరీని (41 బంతుల్లో) నమోదు చేశాడు. బ్రౌన్ విధ్వంసం ధాటికి ఈ మ్యాచ్‌లో బ్రిస్బేన్ హిట్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. Josh Brown scored an insane 140 in just 57 balls with 12 sixes for Brisbane Heat in the BBL....!!! 🤯 pic.twitter.com/O2hZWNKyLu — Mufaddal Vohra (@mufaddal_vohra) January 22, 2024 బ్రిస్బేన్ ఇన్నింగ్స్‌లో బ్రౌన్, కెప్టెన్ నాథన్ మెక్ స్వీని (33) మినహా ఒక్కరు కూడా రెండంకెల స్కోర్ చేయలేకపోయారు. చార్లీ వాకిమ్ 7, మ్యాట్ రెన్షా 6, మ్యాక్స్ బ్రయాంట్ 9, పాల్ వాల్టర్ 0, జిమ్మీ పియర్సన్ 4 పరుగులు చేయగా.. మైఖేల్ నెసర్ 6, జేవియర్ బార్ట్లెట్ 1 పరుగుతో అజేయంగా నిలిచారు. అడిలైడ్ స్ట్రయికర్స్ బౌలర్లలో డేవిడ్ పేన్, బాయ్స్, లాయిడ్ పోప్ తలో రెండు వికెట్లు.. థామ్టన్ ఓ వికెట్ పడగొట్టాడు. కాగా, బిగ్‌బాష్ లీగ్ 2023-24 ఎడిషన్ చివరి అంకానికి చేరింది. ఈ మ్యాచ్‌తో ప్రస్తుత ఎడిషన్ రెండో ఫైనలిస్ట్ ఎవరో తేలిపోతారు. బ్రిస్బేన్ హీట్, అడిలైడ్ స్ట్రయికర్స్లో గెలిచిన జట్టు ఫైనల్లో సిడ్నీ సిక్సర్స్‌తో తలపడేందుకు అర్హత సాధిస్తుంది. సిడ్నీ సిక్సర్స్ క్వాలిఫయర్‌లో విజయం సాధించి, ఫైనల్ బెర్త్ సాధించిన మొదటి జట్టుగా నిలిచింది. జనవరి 24న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. -
ఊచకోత.. 28 బంతుల్లోనే..!
బిగ్‌బాష్ లీగ్ 2023-24లో మరో మెరుపు ఇన్నింగ్స్ నమోదైంది. అడిలైడ్ స్ట్రయికర్స్‌తో ఇవాళ (జనవరి 3) జరిగిన మ్యాచ్‌లో పెర్త్ స్కార్చర్స్ ఆటగాడు లారీ ఈవాన్స్ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో 28 బంతులు ఎదుర్కొన్న ఈవాన్స్ 7 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో అజేయమైన 85 పరుగులు చేశాడు. ఈవాన్స్ తన హాఫ్ సెంచరీని కేవలం 18 బంతుల్లోనే పూర్తి చేశాడు. బీబీఎల్‌లో పెర్త్ స్కార్చర్స్ తరఫున ఇదే ఫాస్టెస్ట్ ఫిఫ్టి కావడం విశేషం. ఈవాన్స్ విధ్వంసం ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన స్కార్చర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 211 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈవాన్స్తో పాటు వైట్‌మ్యాన్ (31), ఆరోన్ హార్డీ (34), జోస్ ఇంగ్లిస్ (26) కూడా ఓ మోస్తరు స్కోర్లు చేశారు. స్ట్రయికర్స్ బౌలర్లలో థార్టన్, ఓవర్టన్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన స్ట్రయికర్స్.. కెప్టెన్ మాథ్యూ షార్ట్ (44 బంతుల్లో 74; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) క్రీజ్‌లో ఉన్నంతసేపు లక్ష్యం దిశగా సాగింది. అయితే షార్ట్ ఔటైన అనంతరం స్ట్రయికర్స్ వరుస క్రమంలో వికెట్లు కోల్పోవడంతో 19.2 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌటై, 42 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. లాన్స్ మోరిస్ (4-0-24-5) ఐదు వికెట్ల ప్రదర్శనతో స్ట్రయికర్స్ పతనాన్ని శాశించాడు. జై రిచర్డ్స్‌సన్ (2/31), ఆండ్రూ టై (2/35), బెహ్రెన్‌డార్ఫ్ (1/24) తలో చేయి వేశారు. స్ట్రయికర్స్ ఇన్నింగ్స్‌లో షార్ట్‌తో పాటు క్రిస్ లిన్ (27), థామస్ కెల్లీ (29), ఆడమ్ హోస్ (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. -
BBL: ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ! చివరికి ఏమైందంటే?
Big Bash League 2023-24: Sydney Sixers vs Adelaide Strikers: ఒక్క పరుగు.. ఒకే ఒక్క పరుగు తేడాతో గెలిచిన జట్టు పట్టరాని సంతోషంలో మునిగిపోతే.. ఓడిన జట్టుకు అంతకంటే బాధ మరొకటి ఉండదు.. బిగ్ బాష్ లీగ్ జట్లు సిడ్నీ సిక్సర్స్- అడిలైడ్ స్ట్రైకర్స్ ప్రస్తుతం ఇలాంటి పరిస్థితినే అనుభవిస్తున్నాయి. క్రికెట్ ఆస్ట్రేలియా నేతృత్వంలో ప్రస్తుతం బీబీఎల్ 2023-24 సీజన్ నడుస్తోంది. డిసెంబరు 7న మొదలైన ఈ టీ20 లీగ్.. జనవరి 24 నాటి ఫైనల్‌తో ముగియనుంది. ఇదిలా ఉంటే.. బీబీఎల్‌లో భాగంగా సిడ్నీ- అడిలైడ్ జట్ల మధ్య శుక్రవారం నాటి మ్యాచ్ ఆఖరి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపింది. సిడ్నీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అడిలైడ్ స్ట్రైకర్స్ సిడ్నీ సిక్సర్స్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో సిడ్నీ బ్యాటర్ జోర్డాన్ సిల్క్ 45 బంతుల్లో 66 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు మెరుగైన స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఓపెనర్ ఫిలిప్(16 బంతుల్లో 25 పరుగులు)తో కలిసి జట్టును గట్టెక్కించాడు. వీరిద్దరి ధనాధన్ ఇన్నింగ్స్ కారణంగా సిడ్నీ సిక్సర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనలో అడిలైడ్ స్ట్రైకర్స్ ఆఖరి బంతి వరకు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. కెప్టెన్ మాథ్యూ షార్ట్ (48 బంతుల్లో 55), జెమ్మీ ఓవర్టన్ (28 బంతుల్లో 31 పరుగులు(నాటౌట్)) ఇన్నింగ్స్ వృథా అయింది. గెలుపొందాలంటే చివరి బాల్‌కు మూడు పరుగులు తీయాల్సి ఉండగా.. ఓవర్టన్ రెండు పరుగులు మాత్రమే తీయగలిగాడు. దీంతో విజయానికి ఒక్క పరుగు దూరంలో నిలిచిపోయింది అడిలైడ్ జట్టు. ఇక.. అదే ఒక్క పరుగు తేడాతో గెలుపొందిన సిడ్నీ సిక్సర్స్ సంబరాలు అంబరాన్నంటాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. టీ20 ఫార్మాట్ అంటేనే సంచలనాలకు మారుపేరు అన్న విషయం మరోసారి రుజువైందంటూ నెటిజన్లు ఈ సందర్భంగా కామెంట్లు చేస్తున్నారు. SIXERS WIN BY ONE RUN! A final ball THRILLER at the SCG 🔥 📺 WATCH #BBL13 on Ch. 501 or stream via @kayosports https://t.co/bO5P5ypyKo ✍ BLOG https://t.co/miU8FhOoSJ 📲 MATCH CENTRE https://t.co/Hb1Gh6RhzI pic.twitter.com/qYG0apuOIl — Fox Cricket (@FoxCricket) December 22, 2023 1️⃣ run win are most disheartening for the loosing side and most satisfying for the winning side 😀#ViratKohli #INDvsSA #BBL13 #Sixers#INDvAUS #KLRahul #CricketTwitter pic.twitter.com/KThpQd5noi — Sujeet Suman (@sujeetsuman1991) December 22, 2023 -
తొలి రౌండ్లోనే సానియా జోడీ ఓటమి.. ప్రైజ్‌మనీ?
Adelaide Open 2023: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కొత్త సంవత్సరాన్ని ఓటమితో ప్రారంభించింది. సోమవారం మొదలైన అడిలైడ్ ఓపెన్ ఇంటర్నేషనల్–2 టోర్నీలో సానియా మీర్జా–అనా డానిలినా (కజకిస్తాన్) జోడీ తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. సానియా–డానిలినా ద్వయం 6–3, 3–6, 6–10తో ‘సూపర్ టైబ్రేక్’లో టాప్ సీడ్ స్టార్మ్ హంటర్ (ఆస్ట్రేలియా)–క్రిచికోవా (చెక్ రిపబ్లిక్) జోడీ చేతిలో ఓడిపోయింది. ఇక తొలి రౌండ్లోనే ఇంటిబాట పట్టిన సానియా– డానిలినా జోడీకి 4,350 డాలర్ల (రూ. 3 లక్షల 58 వేలు) ప్రైజ్‌మనీ దక్కింది. చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ప్లేయర్ -
ఒక్క సెట్ కూడా కోల్పోకుండా విజేతగా నిలిచిన సబలెంకా
అడిలైడ్: గత ఏడాది ఒక్క టైటిల్ నెగ్గలేకపోయిన బెలారస్ టెన్నిస్ స్టార్, ప్రపంచ ఐదో ర్యాంకర్ సబలెంకా ఈ సంవత్సరాన్ని టైటిల్‌తో ప్రారంభించింది. ఆదివారం ముగిసిన అడిలైడ్ ఇంటర్నేషనల్–1 ఓపెన్ డబ్ల్యూటీఏ–500 టోర్నీలో ఆమె విజేతగా నిలిచింది. ఫైనల్లో సబలెంకా 6–2, 7–6 (7/4)తో క్వాలిఫయర్ లిండా నొస్కోవా (చెక్ రిపబ్లిక్)పై గెలిచింది. ఈ టోర్నీలో సబలెంకా ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోకపోవడం విశేషం. సబలెంకా కెరీర్లో ఇది 11వ టైటిల్‌కాగా... ఆమెకు 1,20,150 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 98 లక్షల 92 వేలు)తోపాటు 470 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
Adelaide International 1: జొకోవిచ్... టైటిల్ నంబర్ 92
అడిలైడ్: కొత్త ఏడాదిని సెర్బియా టెన్నిస్ యోధుడు నొవాక్ జొకోవిచ్ టైటిల్‌తో మొదలుపెట్టాడు. ఆదివారం ముగిసిన అడిలైడ్ ఇంటర్నేషనల్–1 ఓపెన్ ఏటీపీ–250 టోర్నీలో 35 ఏళ్ల జొకోవిచ్ చాంపియన్‌గా నిలిచాడు. 3 గంటల 9 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ జొకోవిచ్ 6–7 (8/10), 7–6 (7/3), 6–4తో ప్రపంచ 33వ ర్యాంకర్ సెబాస్టియన్ కోర్డా (అమెరికా)పై శ్రమించి గెలిచాడు. జొకోవిచ్ కెరీర్లో ఇది 92వ సింగిల్స్ టైటిల్ కావడం విశేషం. అంతేకాకుండా 16 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అడిలైడ్ ఓపెన్‌లో ఈ మాజీ నంబర్‌వన్ విజేతగా నిలిచాడు. 2007లో 19 ఏళ్ల ప్రాయంలో జొకోవిచ్ తొలిసారి ఈ టోర్నీలో టైటిల్ సాధించాడు. 1998 ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్ పీటర్ కోర్డా తనయుడైన సెబాస్టియన్ కోర్డాతో తొలిసారి తలపడ్డ జొకోవిచ్ ఒకదశలో ఓటమి అంచుల్లో నిలిచాడు. తొలి సెట్ కోల్పోయిన జొకోవిచ్ రెండో సెట్లో 5–6తో వెనుకబడి తన సర్వీస్‌లోని 12వ గేమ్‌లో 30–40తో మ్యాచ్ పాయింట్‌ను కాచుకున్నాడు. ఓవర్‌హెడ్ షాట్‌తో పాయింట్ గెలిచి 40–40తో సమం చేసిన జొకోవిచ్ అదే జోరులో తన సర్వీస్‌ను నిలబెట్టుకొని స్కోరును 6–6తో సమం చేశాడు. ఆ తర్వాత టైట్రేక్లో జొకోవిచ్ పైచేయి సాధించాడు. నిర్ణాయక మూడో సెట్ కూడా హోరాహోరీగా సాగింది. జొకోవిచ్ 5–4తో ఆధిక్యంలోకి వెళ్లాక 12వ గేమ్‌లో కోర్డా సర్వీస్‌ను బ్రేక్ చేసి విజయాన్ని ఖరారు చేసుకున్నాడు. విజేతగా నిలిచిన జొకోవిచ్‌కు 94,560 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 77 లక్షల 85 వేలు)తోపాటు 250 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. పురుషుల టెన్నిస్ చరిత్రలో అత్యధిక సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారుల జాబితాలో జొకోవిచ్ సంయుక్తంగా నాలుగో స్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం జొకోవిచ్, రాఫెల్ నాదల్ (స్పెయిన్) 92 టైటిల్స్‌తో సమఉజ్జీగా నిలిచారు. ఈ జాబితాలో జిమ్మీ కానర్స్ (అమెరికా; 109 టైటిల్స్), ఫెడరర్ (స్విట్జర్లాండ్; 103 టైటిల్స్), ఇవాన్ లెండిల్ (అమెరికా/చెకోస్లొవేకియా; 94 టైటిల్స్) వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. -
ఇదేం బాదుడురా సామీ.. బిగ్‌బాష్ లీగ్‌లో చారిత్రక విజయం
బిగ్‌బాష్ లీగ్ (బీబీఎల్) చరిత్రలోనే అత్యంత భారీ లక్ష్య ఛేదన ప్రస్తుత సీజన్లో (2022-23) నమోదైంది. నిన్న (జనవరి 5) అడిలైడ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో హోబర్ట్ హరికేన్స్ నిర్ధేశించిన 230 పరుగుల లక్ష్యాన్ని అడిలైడ్ స్ట్రయికర్స్ మరో 3 బంతులుండగానే ఛేదించి (7 వికెట్ల తేడాతో) చరిత్ర సృష్టించింది. ఇరు జట్ల బ్యాటర్లు విధ్వంసకర బ్యాటింగ్ విన్యాసాలతో రెచ్చిపోవడంతో 39.3 ఓవర్లలో ఏకంగా 459 పరుగులు నమోదయ్యాయి. THE GREATEST CHASE! Simply incredible from Matt Short who brings up a ton to pull off the biggest chase in BBL history! Jawdropping stuff #BBL12 pic.twitter.com/98VzoYHMXY — KFC Big Bash League (@BBL) January 5, 2023 మాథ్యూ షార్ట్ వీరోచిత శతకంతో (59 బంతుల్లో 100 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) అడిలైడ్ స్ట్రయికర్స్‌కు చారిత్రక విజయాన్ని అందించాడు. షార్ట్‌కు క్రిస్ లిన్ (29 బంతుల్లో 64; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), ఆడమ్ హోస్ (22 బంతుల్లో 38; ఫోర్, 4 సిక్సర్లు) సహకరించడంతో కొండంత లక్ష్యం అమాంతం కరిగిపోయింది. హోబర్ట్ బౌలర్లలో ప్యాట్రిక్ డూలే (2/25), టిమ్ డేవిడ్ (1/18)లను మినహాయించి మిగతా బౌలర్లనంతా అడిలైడ్ బ్యాటర్లు ఉతికి ఆరేశారు. You should watch these highlights. #BBL12 https://t.co/3fWaTjiGFa — KFC Big Bash League (@BBL) January 5, 2023 తొలుత బ్యాటింగ్ చేసిన హోబర్ట్ హరికేన్స్.. బెన్ మెక్ డెర్మాట్ (30 బంతుల్లో 57; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), కాలెబ్ జువెల్ (25 బంతుల్లో 54; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), జాక్ క్రాలే (28 బంతుల్లో 54 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), టిమ్ డేవిడ్ (20 బంతుల్లో 39; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌ల సహకారంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. గ్రాండ్‌హోమ్ 2, కాన్వే, షార్ట్ తలో వికెట్ పడగొట్టారు. ఛేదనలో అడిలైడ్.. 19.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి, బీబీఎల్ హిస్టరీలో రికార్డు ఛేదనను నమోదు చేసింది. గతంలో ఈ రికార్డు హోబర్ట్ హరికేన్స్ పేరిట ఉండింది. 2016/17 సీజన్లో మెల్బోర్న్ రెనిగేడ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హరికేన్స్ 223 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
Big Bash League: సిడ్నీ థండర్ 15 ఆలౌట్!
సిడ్నీ: 0 0 3 0 2 1 1 0 0 4 1... ఇవీ ఒక టి20 మ్యాచ్‌లో వరుసగా 11 మంది ఆటగాళ్ల స్కోర్లు! ప్రతిష్టాత్మక బిగ్‌బాష్ లీగ్...ఐపీఎల్ తర్వాత అత్యంత ప్రజాదరణ ఉన్న టి20 టోర్నీ...ఇప్పటికే ఒక సారి చాంపియన్‌గా నిలిచిన సిడ్నీ థండర్ జట్టు... కానీ అత్యంత చెత్త ప్రదర్శనతో ఆ జట్టు టి20 చరిత్రలో తలదించుకునే రికార్డు నమోదు చేసింది. శుక్రవారం అడిలైడ్ స్ట్రైకర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సిడ్నీ థండర్ 5.5 ఓవర్లలో 15 పరుగులకే కుప్పకూలింది. ఒక్కరు కూడా రెండంకెల స్కోరు చేయలేకపోగా, ఎక్స్‌ట్రాల రూపంలో 3 పరుగులు వచ్చా యి. టి20 ఫార్మాట్లో విధ్వంసక ఆటగాళ్ల జాబి తాలో నిలిచే అలెక్స్ హేల్స్, రిలీ రోసో సిడ్నీ జట్టు లో ఉన్నారు. కనీసం ఒక్క ఆటగాడు కూడా పరిస్థితిని బట్టి నిలబడేందుకు గానీ, కౌంటర్ అటాక్‌తో పరుగులు రాబట్టేందుకు గానీ ప్రయత్నించలేదు. దాంతో 35 బంతుల్లోనే జట్టు ఇన్నింగ్స్ ముగిసింది. పదో నంబర్ బ్యాటర్ డాగెట్ బ్యాట్‌కు ఎడ్జ్ తీసుకొని ఒకే ఒక ఫోర్ రాగా... స్టేడియంలో ప్రేక్షకులంతా నిలబడి వ్యంగ్యంగా ‘స్టాండింగ్ ఒవేషన్’ ఇవ్వ డం పరిస్థితిని చూపిస్తోంది! 17 బంతుల్లో 3 పరుగులే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టిన అడిలైడ్ పేసర్ హెన్రీ థార్టన్ సిడ్నీ పతనంలో కీలక పాత్ర పోషించాడు. వెస్ అగర్ 12 బంతుల్లో 6 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. అంతకు ముందు 139 పరుగులు చేసిన స్ట్రైకర్స్ 124 పరుగులతో మ్యాచ్ గెలుచుకుంది. 15: టి20 క్రికెట్లో ఇదే అత్యల్ప స్కోరు. 2019లో కాంటినెంటల్ కప్‌లో భాగంగా చెక్ రిపబ్లిక్‌తో జరిగిన మ్యాచ్‌లో టర్కీ 21 పరుగులకే ఆలౌటైన రికార్డు ఇప్పుడు కనుమరుగైంది. అతి తక్కువ బంతులు (35) సాగిన ఇన్నింగ్స్ కూడా ఇదే. -
Ind Vs Aus: భారత జట్టుకు మరో ఓటమి.. సిరీస్ ఆస్ట్రేలియాదే
India Vs Australia- Hockey Series: ఆస్ట్రేలియా పురుషుల హాకీ జట్టుతో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత జట్టు 1–4తో కోల్పోయింది. అడిలైడ్‌లో జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్ 4–5తో ఓడింది. భారత్ తరఫున కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (24వ, 60వ ని.లో) రెండు గోల్స్... అమిత్ రోహిదాస్ (34వ ని.లో), సుఖ్జీత్ (55వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. ఆస్ట్రేలియా తరఫున విఖామ్ (2వ, 17వ ని.లో) రెండు గోల్స్.. జలెవ్‌స్కీ (30వ ని.లో), అండర్సన్ (40వ ని.లో), వెటన్ (54వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. కాగా ఈ సిరీస్‌లో భారత్‌కు ఒకే ఒక్క విజయం దక్కింది. మూడో మ్యాచ్‌లో టీమిండియా గెలుపొందింది. తద్వారా ప్రపంచ నంబర్‌వన్, కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్ ఆస్ట్రేలియా పురుషుల హాకీ జట్టుపై ఆరేళ్ల విరామం తర్వాత తొలి విజయం నమోదు చేసిన జట్టుగా హర్మన్‌ప్రీత్ బృందం చరిత్ర సృష్టించింది. అయితే తొలి, చివరి రెండు మ్యాచ్‌లలో ఓడి ఆతిథ్య జట్టుకు సిరీస్‌ను అప్పగించింది. చదవండి: Ind Vs Ban: రాహుల్ క్యాచ్ డ్రాప్ చేయడం వల్ల కాదు.. బంగ్లా చేతిలో ఓటమికి కారణం వాళ్లే: భారత దిగ్గజం మా ఓటమికి కారణం అదే.. కానీ వారు అద్భుతంగా పోరాడారు: రోహిత్ శర్మ -
'ఇది ఆటేనా.. ఫైనల్లో పాక్‌తో తలపడే అర్హత భారత్‌కు లేదు'
టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో టీమిండియా ఘోర ఓటమిని చవిచూసింది. 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. భారత జట్ట పేలవ ప్రదర్శనపై అభిమానులతో పాటు క్రీడా విశ్లేషకులు మండిపడుతున్నారు. ప్రపంచకప్ టోర్నీలో ఇలాంటి ప్రదర్శనేంటని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. టీమిండియా ప్రదర్శన అత్యంత పేలవంగా ఉందని విమర్శలు గుప్పించాడు. భారత జట్టు ప్రదర్శన పాతాళానికి పాడిపోయిందని పేర్కొన్నాడు. ఈ మేరకు తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడాడు. 'మెల్బోర్న్లో జరిగే ప్రపంచకప్ ఫైనల్లో పాకిస్తాన్‌తో తలపడే అర్హత భారత్‌కు లేదు. టీమిండియా సత్తా ఏంటో ఈ మ్యాచ్‌తో తేలిపోయింది. సెమీ ఫైనల్‌కు చేరడం గొప్పేం కాదు. ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు ప్రదర్శన పేలవంగా ఉంది. ఐసీసీ టోర్నీల్లో ఇలా ఉంటే చాలా కష్టం. టీమిండియా కెప్టెన్సీపై పునరాలోచించుకోవాలి. దారుణ పరాభవానికి జట్టు యాజమాన్యం పూర్తి బాధ్యత తీసుకోవాలి.' అని షోయబ్ అక్తర్ చెప్పుకొచ్చాడు. అడిలైడ్ వేదికగా జరిగిన రెండో సెమీఫైనల్లో టీమిండియా నిర్దేశించిన 169 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ సనాయాసంగా ఛేదించింది. ఓపెనర్లు జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్ అర్ధ సెంచరీలతో కదం తొక్కి 10 వికెట్ల తేడాతో తమ జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించి ఫైనల్ చేర్చారు. భారత బౌలర్లు ఏ మాత్రం ప్రభావం చూపలేక చేతులెత్తేశారు. మెల్బోర్న్ వేదికగా పాకిస్తాన్, ఇంగ్లాండ్ జట్ల మద్య ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అద్భుత ఫాంలో ఉన్న ఇంగ్లాండ్ జట్టు మరోసారి ప్రపంచకప్‌ను ముద్దాడాలని చూస్తుండగా.. 1992 సీన్‌ను రిపీట్ చేసి ఇంగ్లాండ్‌ను ఓడించి మరోసారి కప్పు ఎగరేసుకుపోవాలని పాకిస్తాన్ భావిస్తోంది. ఏదేమైనా ఈ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు అలరించనుంది. చదవండి: ఐపీఎల్ బ్యాన్ చేస్తేనే దారిలోకి వస్తారా! -
T20 WC 2022 2nd Semi Final: హేమాహేమీల సెమీస్.. మళ్లీ అదే చర్చ!
ఇప్పటి వరకు ఒక లెక్క... ఇప్పుడు మరో లెక్క... అవును, లీగ్ దశలో ఎలా ఆడామో, ఏం చేశామో అనేది అనవసరం... మరో రెండు మ్యాచ్‌లు ఈ భారత జట్టు ఘనతను ఎప్పటికీ గుర్తుంచుకునేలా చేస్తాయి... లేదా తేడా వస్తే ఎప్పటికీ మరచిపోలేని వేదనను మిగులుస్తాయి... ఆ రెండింటిలో మొదటి అంకానికి నేడు రంగం సిద్ధమైంది... 2013లో చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత ఐదు ఐసీసీ టోర్నీలలో భారత్ నాకౌట్ సమరాల్లో చేతులెత్తేసింది. ఇప్పుడు ఆనందం పంచేందుకు మరో అవకాశం టీమిండియాకు వచ్చింది. మాజీ చాంపియన్ ఇంగ్లండ్ కూడా ఎక్కడా తగ్గేలా లేదు. మూడేళ్ల వ్యవధిలో ఆ జట్టు రెండో ఐసీసీ టోర్నీ విజయాన్ని ఆశిస్తోంది... అందుకు తగ్గ వనరులు కూడా జట్టు వద్ద ఉన్నాయి కాబట్టి సెమీస్ పోరు హోరాహోరీగా సాగడం ఖాయం. టోర్నీలో వాన కారణంగా ఐర్లాండ్ చేతిలో అనూహ్యంగా ఓడితేనేమి... న్యూజిలాండ్, శ్రీలంకలపై సాధించిన సాధికారిక విజయాలు జట్టు సామర్థ్యాన్ని చూపించాయి. లైనప్‌లో తొమ్మిదో స్థానం వరకు బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్న ఆటగాళ్లతో ఆ జట్టు మరింత బలంగా కనిపిస్తోంది. ఇప్పటికే దాయాది జట్టు తుది పోరుకు అర్హత సాధించి రా రమ్మని మనల్ని పిలుస్తున్నట్లుగా ఉంది... ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానుల కోరిక అయిన భారత్, పాక్ ఫైనల్ జరగాలంటే ఇంగ్లండ్ రూపంలో ఉన్న అడ్డంకిని రోహిత్ సేన తొలగించాల్సిందే! అడిలైడ్: టి20 ప్రపంచకప్‌ను రెండోసారి గెలుచుకోవాలని పట్టుదలగా ఉన్న భారత జట్టుకు సెమీఫైనల్లో ఇంగ్లండ్ రూపంలో బలమైన ప్రత్యర్థి ఎదురుగా నిలిచింది. ఆదివారం జరిగే ఫైనల్ బెర్త్ కోసం నేడు ఇరు జట్లు తలపడనున్నాయి. బలాబలాలపరంగా చూస్తే ఇరు జట్లు సమఉజ్జీలుగానే కనిపిస్తున్నాయి. అయితే నాకౌట్ సమరంలో ఉండే తీవ్ర ఒత్తిడిని అధిగమించి ఏ జట్టు పైచేయి సాధిస్తుందనేది చూడాలి. ఇంగ్లండ్‌తో జరిగిన గత నాలుగు టి20 ద్వైపాక్షిక సిరీస్‌లను కూడా భారతే గెలుచుకోవడం గుర్తు చేసుకోవాల్సిన విషయం. ఇందులో రెండు భారత్‌లో జరగ్గా, మరో రెండు ఇంగ్లండ్‌లో జరగడం చూస్తే భారత్ ఆధిపత్యం ఎలాంటిదో స్పష్టమవుతుంది. మళ్లీ అదే చర్చ! భారత తుది జట్టు విషయంలో మొదటి మ్యాచ్ నుంచీ చూస్తే పెద్దగా అనూహ్యాలేమీ జరగలేదు. ఒక మ్యాచ్‌లో అక్షర్ స్థానంలో హుడా, మరో మ్యాచ్‌లో కార్తీక్‌కు బదులుగా పంత్ ఆడటం మినహా అంతా సాఫీగానే సాగిపోయింది. సెమీస్‌లో కూడా ఈ విషయంలోనే టీమ్ మేనేజ్మెంట్ ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేకపోతోంది. బ్యాటింగ్‌లో అదనపు బలమంటూ అశ్విన్, అక్షర్‌లను రెగ్యులర్‌గా ఆడిస్తున్నారు. అక్షర్ పెద్దగా ప్రభావం చూపడం లేదు కూడా. ఒకరిని తప్పించి స్పెషలిస్ట్ లెగ్‌స్పిన్నర్ చహల్‌ను ఆడించేందుకు ఒక ప్రత్యామ్నాయం అయితే ఉంది. కానీ కీలకమైన పోరులో వరల్డ్‌కప్‌లో ఒక్క మ్యాచ్ ఆడకుండా నేరుగా చహల్ బరిలోకి దిగడం కూడా సానుకూలాంశం కాదు. కీపర్ విషయంలో కూడా అదే సందిగ్ధత కొనసాగుతోంది. జింబాబ్వేపై పంత్‌ను ఆడించినా, జట్టు ప్రాధాన్యతల్లో కార్తీక్ ఉన్నట్లుగా కనిపిస్తోంది. అయితే ఓవరాల్‌గా చూస్తే టీమిండియా అన్ని రకాలుగా పటిష్టంగా కనిపిస్తోంది. టోర్నమెంట్ టాప్ స్కోరర్ కోహ్లి (246 పరుగులు) గురించి కొత్తగా చెప్పేదేముంది. అతనికి తోడుగా అగ్నిలా సూర్యకుమార్ (225) దాదాపు 200 స్ట్రయిక్‌రేట్‌తో చెలరేగిపోతున్నాడు. రాహుల్ కూడా కుదురుకోగా, రోహిత్ శర్మ ఫామ్ మాత్రమే కొంత ఇబ్బంది పెడుతోంది. 5 మ్యాచ్‌లలో కలిపి 89 పరుగులే చేసిన రోహిత్ తన స్థాయిని ప్రదర్శించేందుకు సెమీస్‌ను వేదికగా చేసుకుంటే మంచిదేమో. ముగ్గురు పేసర్లు కూడా సమష్టిగా రాణిస్తుండటం శుభసూచకం. భువీ బౌలింగ్‌లో 32 బంతులు ఎదుర్కొన్న బట్లర్ 30 పరుగులు మాత్రమే చేసి 5 సార్లు అవుట్ అయ్యాడంటే ఆరంభంలో పైచేయి చూపించేందుకు భారత్‌కు మరో అవకాశం ఉంది. ఆల్‌రౌండర్లతో... స్టోక్స్, వోక్స్, స్యామ్ కరన్, మొయిన్ అలీ, లివింగ్‌స్టోన్...100 శాతం రెండు విభాగాల్లో పనికొచ్చే ఇంగ్లండ్ ఆటగాళ్లు వీరంతా. బ్యాటింగ్‌లో విఫలమైతే బౌలింగ్‌లో, బౌలింగ్‌లో విఫలమైతే బ్యాటింగ్‌లో సత్తా చాటగల సమర్థులు. ఇంగ్లండ్ విజయావకాశాలు వీరి ప్రదర్శనపై ఆధారపడి ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా గాయం నుంచి కోలుకున్న తర్వాత స్యామ్ కరన్ రాటుదేలగా, కీలక మ్యాచ్‌లో ఏమాత్రం ఒత్తిడిని దరి చేరనీయకుండా ఎలా ఆడాలనేది స్టోక్స్‌కు బాగా తెలుసు. ఓపెనర్లుగా బట్లర్, హేల్స్ అందించే దూకుడైన ఆరంభం ఇంగ్లండ్‌ను ముందంజలో నిలపగలదు. హేల్స్ టోర్నీ మొత్తం నిలకడగా ఆడుతుండగా, బట్లర్ అసలు సమయంలో ఫామ్‌లోకి వచ్చాడు. మిడిలార్డర్లో లివింగ్‌స్టోన్ కీలకం కాగా, మలాన్ రూపంలో మరో కీలక బ్యాటర్ జట్టుకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గాయంతో బాధపడుతున్న మలాన్ కోలుకోకపోతే సాల్ట్ జట్టులోకి వస్తాడు. బౌలింగ్‌లో కూడా జట్టుకు పెద్ద దెబ్బ పడింది. ఈ టోర్నీలో ఫాస్టెస్ట్ బౌలర్‌గా ఉన్న మార్క్ వుడ్ కూడా గాయపడి కోలుకోలేదు. అతను ఆడలేకపోతే జోర్డాన్‌కు అవకాశం దక్కుతుంది. తుది జట్లు (అంచనా) భారత్: రోహిత్ (కెప్టెన్), రాహుల్, కోహ్లి, సూర్య, హార్దిక్, కార్తీక్, అక్షర్, అశ్విన్, భువనేశ్వర్, షమీ, అర్ష్‌దీప్. ఇంగ్లండ్: బట్లర్ (కెప్టెన్), హేల్స్, మలాన్/సాల్ట్, స్టోక్స్, బ్రూక్, లివింగ్‌స్టోన్, అలీ, స్యామ్ కరన్, వోక్స్, జోర్డాన్, రషీద్. పిచ్, వాతావరణం సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్. బంగ్లాదేశ్‌పై ఇదే మైదానంలో ఆడి భారత్ భారీ స్కోరు సాధించింది. పాక్ కూడా బంగ్లాను ఇక్కడే ఓడించింది. స్క్వేర్‌లెగ్ బౌండరీలు చిన్నవి (గరిష్టంగా 63 మీటర్లు) కాగా, నేరుగా బౌండరీ ఎక్కువ దూరం (80 మీటర్లు) ఉండటం ఈ ఓవల్ మైదానం ప్రత్యేకత. దీనిని బట్టి జట్టు వ్యూహాలు మార్చుకోవాల్సి ఉంటుంది. మ్యాచ్ రోజు వర్ష సూచన లేదు. 3: టి20 ప్రపంచకప్‌లో భారత్, ఇంగ్లండ్ మధ్య 3 మ్యాచ్‌లు జరగ్గా, భారత్ 2 గెలిచి, 1 ఓడింది. 12: ఇప్పటివరకు భారత్, ఇంగ్లండ్ మధ్య 22 అంతర్జాతీయ టి20లు జరిగాయి. భారత్ 12 మ్యాచ్‌ల్లో, ఇంగ్లండ్ 10 మ్యాచ్‌ల్లో గెలిచాయి. -
ఇంగ్లండ్‌తో సమరం.. అన్నింటా టీమిండియాదే పైచేయి.. రికార్డులే సాక్ష్యం
ఇంగ్లండ్‌తో రేపు (నవంబర్ 10) జరుగబోయే సెమీస్ సమరంలో టీమిండియానే కచ్చితంగా విజయం సాధిస్తుందని ఇంగ్లండ్ అభిమానులు మినహా యావత్ క్రికెట్ ప్రపంచం అంచనా వేస్తుంది. వీరి నమ్మకానికి టీమిండియా ఆటగాళ్ల ప్రస్తుత ఫామ్ ఒక కారణమైతే.. గత రికార్డులు మరో కారణం. బ్యాటర్లు విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్‌లు వరుస హాఫ్‌సెంచరీలతో చెలరేగి పోతుంటే.. బౌలర్లు అర్షదీప్ సింగ్, మహ్మద్ షమీ, హార్ధిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్ తమ పాత్రలను న్యాయం చేస్తూ టీమిండియా వరుస విజయాలు సాధించడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. భారత ఆటగాళ్లు సూపర్ ఫామ్‌కు, అనూకూలంగా ఉన్న గత రికార్డులు తోడవ్వడంతో టీమిండియాదే విజయమని అందరూ బలంగా నమ్ముతున్నారు. గత రికార్డులను పరిశీలిస్తే.. టీ20 ఫార్మాట్ ముఖా ముఖి పోరులో ఇరు జట్లు 22 సార్లు తలపడగా.. భారత్ 12 సార్లు, ఇంగ్లండ్ 10 సందర్భాల్లో విజయం సాధించాయి. టీ20 ప్రపంచకప్‌లో ఇరు జట్లు 3 సార్లు (2007, 2009, 2012) ఎదురెదురుపడగా.. టీమిండియా 2, ఇంగ్లండ్ ఒక్క సందర్భంలో గెలుపొందాయి. మరోవైపు మ్యాచ్‌కు వేదిక అయిన అడిలైడ్‌లో ఇంగ్లండ్‌కు చెత్త రికార్డు ఉండటం టీమిండియాకు అదనంగా కలిసొచ్చే అంశం. ఈ వేదికపై ఇంగ్లండ్ 17 వన్డేలు ఆడగా.. కేవలం 4 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచింది. ఆ జట్టు ఈ వేదికపై ఆడిన ఒకే ఒక టీ20లో (2011) ఆతిధ్య జట్టుపై అతికష్టం మీద గెలువగలిగింది. ఈ రికార్డులే కాక, అడిలైడ్‌లో కోహ్లి వ్యక్తిగత రికార్డులు, ప్రస్తుత ప్రపంచకప్‌లో ఇదే వేదికపై బంగ్లాదేశ్‌పై విజయం, ఈ ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌కు ఈ వేదికపై ఆడిన అనుభవం లేకపోవడం టీమిండియాకు అదనంగా కలిసొచ్చే అంశాలు. మరోపక్క టీమిండియాను కూడా మూడు సమస్యలు కలవరపెడుతున్నాయి. రోహిత్ శర్మ ఫామ్, దినేశ్ కార్తీకా లేక రిషబ్ పంతా అని ఎటూ తేల్చుకోలేకపోవడం, స్పిన్నర్ల వైఫల్యం.. ఈ మూడు అంశాలు టీమిండియాకు అందోళన కలిగిస్తున్నాయి. రేపటి మ్యాచ్‌లో భారత్.. ఈ మూడింటిని అధిగమించగలిగితే టీమిండియాను అడ్డుకోవడం దాదాపుగా అసాధ్యం. చదవండి: అడిలైడ్ అంటే కోహ్లికి 'పూనకం' వస్తుంది.. ఇక ఇంగ్లండ్‌కు చుక్కలే..! -
అడిలైడ్ అంటే కోహ్లికి 'పూనకం' వస్తుంది.. ఇక ఇంగ్లండ్‌కు చుక్కలే..!
అడిలైడ్ వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య రేపు (నవంబర్ 10) జరుగబోయే టీ20 వరల్డ్‌కప్-2022 రెండో సెమీఫైనల్‌కు సర్వం సిద్ధమైంది. ఇరు జట్లు ఇప్పటికే ప్రాక్టీస్‌లో తలమునకలై ఉన్నాయి. రేపటి సంగ్రామంలో గెలుపు కోసం ఇరు జట్లు సర్వశక్తులు ఒడ్డనున్నాయి. భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ నువ్వా-నేనా అన్నట్లు సాగనుందని క్రికెట్ అభిమనాలు అంచనా వేస్తున్నారు. ఇక, మ్యాచ్‌కు వేదిక అయిన అడిలైడ్ ఓవల్ విషయానికొస్తే.. ఈ పిచ్ స్పిన్నర్లకు సహకరించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ వేదికపై టీమిండియా తురుపుముక్క కింగ్ కోహ్లికి భీభత్సమైన రికార్డు ఉంది. ఇక్కడ మ్యాచ్ అంటేనే కింగ్‌ను పూనకం వస్తుంది. ఇక్కడ అతను ఆడిన 14 ఇన్నింగ్స్‌ల్లో (మూడు ఫార్మాట్లలో కలిపి) 75.5 సగటున 907 పరుగులు సాధించాడు. ఇందులో ఏకంగా 5 సెంచరీలు ఉండటం విశేషం. ముఖ్యంగా టీ20ల్లో కోహ్లికి ఈ వేదికపై ఘనమైన రికార్డు ఉంది. ఇక్కడ అతనాడిన రెండు మ్యాచ్‌ల్లో రెండు అర్ధసెంచరీల సాయంతో 155.55 సగటున 154 పరుగులు చేశాడు. 2016లో 90 నాటౌట్, ప్రస్తుత వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్‌పై 64 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరోవైపు ప్రస్తుత వరల్డ్‌కప్‌లో ఈ వేదికపై టీమిండియాకు ఓ మ్యాచ్ ఆడిన (బంగ్లాతో) అనుభవం ఉండగా.. ఇంగ్లండ్‌కు మాత్రం ఆ అవకాశం దక్కలేదు. చదవండి: నాకు ఓటేసిన వాళ్లందరికీ ధన్యవాదాలు: విరాట్ కోహ్లి -
WC 2022: సెమీ ఫైనల్ జట్లు, షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్.. ఇతర వివరాలు
ICC T20 World Cup 2022- Semi Final Schedule: టీ20 ప్రపంచకప్-2022 తుది అంకానికి చేరుకుంది. సూపర్-12లో భాగంగా ఆదివారం (నవంబరు 6) నాటి ఆఖరి మ్యాచ్‌ల ఫలితాలతో గ్రూప్-2 సెమీస్ బెర్తులు ఖరారైన విషయం తెలిసిందే. మొదటి మ్యాచ్‌లో పటిష్ట జట్టుగా పేరొందిన సౌతాఫ్రికాను ‘పసికూన’ నెదర్లాండ్స్ మట్టికరిపించగా.. టీమిండియా నేరుగా సెమీ ఫైనల్‌కు చేరుకుంది. తర్వాతి మ్యాచ్‌లో సెమీస్ అర్హత కోసం పాకిస్తాన్- బంగ్లాదేశ్ పోటీపడగా.. బాబర్ బృందానిదే పైచేయి అయ్యింది. దీంతో చిరకాల ప్రత్యర్థి భారత్‌తో పాటు పాకిస్తాన్ కూడా సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. 🇮🇳 & 🇵🇰 - 2 Asian giants from Group 2 qualify for the Semi-Finals of the ICC Men's #T20WorldCup2022! How do you think they’ll do in the semis? 😉#BelieveInBlue pic.twitter.com/ngOxm0Wjdt — Star Sports (@StarSportsIndia) November 6, 2022 ఇదిలా ఉంటే.. జింబాబ్వేతో నామమాత్రపు మ్యాచ్‌ను తేలికగా తీసుకోని రోహిత్ సేన ఘన విజయంతో సూపర్-12ను ముగించింది. క్రెయిగ్ ఎర్విన్ బృందంపై 71 పరుగుల తేడాతో గెలుపొంది గ్రూప్-2 టాపర్‌గా నిలిచింది. ఇక ఈ మ్యాచ్ సందర్భంగా భారత మిడిలార్డర్ స్టార్ సూర్యకుమార్ యాదవ్, కెప్టెన్ రోహిత్ శర్మ వ్యక్తిగతంగా పలు రికార్డులు సృష్టించారు కూడా! ఇక గ్రూప్-1 విషయానికొస్తే.. న్యూజిలాండ్.. ఐర్లాండ్‌ను ఓడించి సెమీస్ బెర్తును ఖాయం చేసుకోగా.. ఇంగ్లండ్- శ్రీలంక మ్యాచ్ ఫలితంపై ఆధారపడ్డ డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాకు నిరాశే మిగిలింది. శ్రీలంకను బట్లర్ బృందం చిత్తు చేయడంతో ఆతిథ్య ఆసీస్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. లంకపై విజయంతో ఇంగ్లండ్ సెమీస్‌కు అర్హత సాధించింది. Ladies and gentlemen, here are our first two semi-finalists of the ICC Men's #T20WorldCup 2022! Any surprise in there for you in the Super 12 Group 1 Final standings? pic.twitter.com/cNZEuYl82r — Star Sports (@StarSportsIndia) November 5, 2022 ఈ క్రమంలో టీ20 వరల్డ్‌కప్ ఎనిమిదో ఎడిషన్‌లో సెమీఫైనల్లో ఎవరితో ఎవరు తలపడనున్నారో ఖరారైంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్, మ్యాచ్ వేదికలు, ఆరంభ సమయం, ఫైనల్ వేదిక తదితర వివరాలు తెలుసుకుందాం. మొదటి సెమీ ఫైనల్ నవంబర్ 9: న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ వేదిక: సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, సిడ్నీ సమయం: మధ్యాహ్నం గం. 1:30 నుంచి జట్లు: న్యూజిలాండ్ ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే (వికెట్ కీపర్), కేన్ విలియమ్సన్ (కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, జేమ్స్ నీషమ్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి, టిమ్ సౌతీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్, మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్మన్, ఆడమ్ మిల్నే, మార్టిన్ గప్టిల్. పాకిస్తాన్: మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), బాబర్ అజామ్ (కెప్టెన్), మహ్మద్ హరీస్, షాన్ మసూద్, ఇఫ్తీకర్ అహ్మద్, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, మహ్మద్ వసీం జూనియర్, నసీమ్ షా, హారీస్ రవూఫ్, షాహీన్ అఫ్రిది, ఆసిఫ్ అలీ, ఖుష్దిల్ షా, మహ్మద్ హస్నైన్, హైదర్ అలీ రెండో సెమీ ఫైనల్ నవంబర్ 10: భారత్ వర్సెస్ ఇంగ్లండ్ వేదిక: అడిలైడ్ ఓవల్, అడిలైడ్ సమయం: మధ్యాహ్నం గం. 1:30 నుంచి జట్లు భారత్: కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేశ్ కార్తిక్(వికెట్ కీపర్), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యజ్వేంద్ర చాహల్, హర్షల్ పటేల్, దీపక్ హుడా. ఇంగ్లండ్: అలెక్స్ హేల్స్, జోస్ బట్లర్ (కెప్టెన్, వికెట్ కీపర్), డేవిడ్ మలన్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, మోయిన్ అలీ, సామ్ కర్రాన్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, క్రిస్ జోర్డాన్, డేవిడ్ విల్లీ, టైమల్ మిల్స్, ఫిలిప్ సాల్ట్ లైవ్ స్ట్రీమింగ్: స్టార్ స్పోర్ట్స్–1 చానెల్లో టీవీలో ప్రత్యక్ష ప్రసారం డిజిటల్లో డిస్నీ+హాట్‌స్టార్ వివిధ దేశాల్లో ప్రసారం చేసే చానెల్స్ ►భారత్‌లో- స్టార్ స్పోర్ట్స్ చానెల్స్ ►పాకిస్తాన్లో- పీటీవీ స్పోర్ట్స్, టెన్ స్పోర్ట్స్ ►ఆస్ట్రేలియా- కాయో స్పోర్ట్స్, ఫాక్స్టెల్ ►న్యూజిలాండ్- స్కై స్పోర్ట్స్ ►సౌతాఫ్రికా- సూపర్‌స్పోర్ట్ ►యునైటెడ్ కింగ్డం- స్కై స్పోర్ట్ ►అమెరికా- విల్లో టీవీ, విల్లో ఎక్స్ట్రా టీవీ ►కెనడా- విల్లో టీవీ ►యూఏఈ- మధ్య ప్రాచ్య దేశాలు- బీఇన్(BeIN) స్పోర్స్ ►హాంకాంగ్, మలేషియా, సింగపూర్- ఆస్ట్రో క్రికెట్ ఫైనల్: నవంబరు 13, మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ చదవండి: WC 2022: ఈసారి వర్షం కాదు.. ఇదంతా స్వయంకృతమే! ఆ ట్యాగ్ మాకు కొత్తేమీ కాదు! ఇకపై T20 WC 2022: నెదర్లాండ్స్ సంచలనం.. బంగ్లాదేశ్‌ను వెనక్కి నెట్టి మేటి జట్లతో పాటు నేరుగా View this post on Instagram A post shared by ICC (@icc) -
బంగ్లాదేశ్‌తో కీలక మ్యాచ్.. టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్
టీ20 ప్రపంచకప్-2022(సూపర్-12)లో భాగంగా కీలక మ్యాచ్‌లో ఆడిలైడ్ వేదికగా బంగ్లాదేశ్‌తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు తమ సెమీస్ అవకాశాలను మరింత పదిలం చేసుకుంటే.. ఓడిన జట్టు సెమీస్ ఛాన్స్‌లను సంక్లిష్టం చేసుకుంటుంది. కాగా ఈ కీలక మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించే అవకాశం ఉన్నట్లు అక్కడి వాతావారణ శాఖ మంగళవారం(నవంబర్ 1)న వెల్లడించింది. దీంతో వర్షం ఆటంకం ఉందనడంతో భారత అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో టీమిండియా అభిమానులకు ఆడిలైడ్ నుంచి ఓ గుడ్ న్యూస్ అందింది. బుధవారం(నవంబర్ 2) ఉదయం నుంచి ఆడిలైడ్‌లో వర్షం పడేలేదు. అదే విధంగా నిన్నటి కంటే(మంగళవారం) ఈ రోజు వాతావరణం గణనీయంగా మెరుగుపడినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రముఖ స్పోర్ట్స్ బోరియా మజుందార్ ట్విటర్లో వెల్లడించారు. "గత కొన్ని గంటల నుంచి ఇక్కడ పూర్తిగా వర్షం పడడంలేదు. అదృష్టవశాత్తూ భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ వర్షంఆటంకం కలిగించే ఛాన్స్ లేదు" అని మజుందార్ ట్విటర్లో పేర్కొన్నారు. 9am Adelaide. No rain for some hours now. Overcast yes but no rain. @RevSportz pic.twitter.com/W0zWcES5dB — Boria Majumdar (@BoriaMajumdar) November 1, 2022 తుది జట్లు (అంచనా) బంగ్లాదేశ్: నజ్ముల్ హొస్సేన్ శాంటో, సౌమ్య సర్కార్, లిట్టన్ దాస్, షకీబ్ అల్ హసన్ (c), అఫీఫ్ హొస్సేన్, యాసిర్ అలీ, మొసద్దెక్ హొస్సేన్, నూరుల్ హసన్ (వికెట్ కీపర్), ముస్తాఫిజుర్ రెహమాన్, హసన్ మహమూద్, తస్కిన్ అహ్మద్ భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్ చదవండి: T20 World Cup 2022: ఇంగ్లండ్, ఆస్ట్రేలియా ఇంటికే.. ఆ రెండు జట్ల మధ్యే ఫైనల్ -
బంగ్లాదేశ్‌తో భారత్ కీలక పోరు.. గెలిస్తే సెమీస్ బెర్త్!
సాధారణంగా అయితే బంగ్లాదేశ్‌తో భారత్ మ్యాచ్ అంటే ఎలాంటి విశ్లేషణలు లేకుండా మనదే గెలుపు ఖాయమని అందరిలో నమ్మకం. అయితే కొంత కాలంగా బంగ్లాతో మ్యాచ్‌లు కూడా ఒక్కసారిగా ఆసక్తికరంగా మారిపోతున్నాయి. తుది ఫలితం టీమిండియాకు అనుకూలంగా వచ్చినా... మ్యాచ్‌లో వేర్వేరు దశల్లో బంగ్లా అనూహ్యంగా చెలరేగి మన జట్టును ఇబ్బంది పెడుతోంది. పాక్‌తో మ్యాచ్ తరహాలో అభిమానులు కూడా అదనంగా కొన్నిసార్లు తమ భావోద్వేగాలు ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో టి20 ప్రపంచకప్‌లో ఇరు జట్ల మధ్య మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత్ సెమీస్ చేరడం దాదాపు ఖాయం కానుండగా, తమకంటే చిన్న జట్లపై రెండు విజయాలు సాధించిన బంగ్లాదేశ్ సంచలనాన్ని ఆశిస్తోంది. అడిలైడ్: గత మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో ఎదురైన పరాజయాన్ని మరచి కొత్త ఉత్సాహంతో మరో పోరుకు భారత్ సన్నద్ధమైంది. సఫారీలను ఓడించి ఉంటే ఇప్పటికే మన సెమీస్ అవకాశాలపై మరింత స్పష్టత వచ్చేది. అయితే పెర్త్ పిచ్ అలాంటి అవ కాశం ఇవ్వలేదు. ఇప్పుడు గ్రూప్–2లో బలహీన జట్లలో ఒకటైన బంగ్లాదేశ్‌ను నేడు రోహిత్ సేన ఎదుర్కొంటోంది. బలాబలాలు, ఫామ్‌ను బట్టి చూస్తే భారత్ సహజంగానే ఫేవరెట్ కాగా, అలసత్వం దరి చేరనీయకుండా ఆడాల్సి ఉంటుంది. తమ స్థాయిని బట్టి చూస్తే టోర్నీలో ఇప్పటికే సంతృప్తికర ప్రదర్శన ఇచ్చిన బంగ్లా ఈ మ్యాచ్‌లో ఎలాంటి పోటీనిస్తుందనేది ఆసక్తికరం. పంత్‌కు చాన్స్! వరల్డ్‌కప్‌లో ఇప్పటి వరకు కోహ్లి, సూర్యకుమార్ రెండు అద్భుత ఇన్నింగ్స్‌లతో అభిమానులను ఆనందపరిచారు. రోహిత్ కూడా నెదర్లాండ్స్‌పై అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. అయితే టోర్నీలో ఇప్పటికీ తనేంటో కేఎల్ రాహుల్ నిరూపించుకోలేకపోయాడు. వరుసగా మూడు మ్యాచ్‌లలో అతను 4, 9, 9 చొప్పున పరుగులు చేశాడు. అయితే రాహుల్ విలువేంటో తమకు తెలుసని, జట్టులోంచి అతడిని తప్పించే అవకాశమే లేదని కోచ్ ద్రవిడ్ ఖరాఖండీగా చెప్పేశాడు కాబట్టి స్థానంపై ఎలాంటి సందేహాలు లేవు. కీపర్ దినేశ్ కార్తీక్ గాయం విషయంలో ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కార్తీక్‌కు ఆడించడంకంటే అవకాశం కోసం ఎదురు చూస్తున్న పంత్‌కు అవకాశం ఇవ్వడమే సరైన నిర్ణయం కావచ్చు. బౌలింగ్‌లో ముగ్గురు రెగ్యులర్ పేసర్లకు తోడు స్పిన్నర్‌గా అశ్విన్‌నే కొనసాగిస్తారా చూడాలి. బంగ్లా లైనప్‌లో నలుగురు ఎడంచేతివాటం బ్యాటర్లు ఉండటంతో అశ్విన్ సరైనోడు కావచ్చు. బౌలింగ్‌పైనే ఆశలు... లీగ్ దశలో జింబాబ్వే, నెదర్లాండ్స్‌లపై స్వల్ప తేడాలతో నెగ్గిన బంగ్లాదేశ్ జట్టుకు ఆ రెండు విజయాలు బౌలింగ్ కారణంగానే వచ్చాయి. ముఖ్యంగా పేసర్ తస్కీన్ అహ్మద్ జట్టు భారం మోస్తున్నాడు. ముస్తఫిజుర్ మళ్లీ ఫామ్‌లోకి రావడం సానుకూలాంశం. హసన్ మహమూద్ కూడా కీలక పేసర్. ఆఫ్‌స్పిన్నర్ మొసద్దిక్ కూడా ప్రభావం చూపగలడు. అయితే వీరంతా కూడా బలమైన భారత బ్యాటింగ్‌ను నిలువరించడం అంత సులువు కాదు. బ్యాటింగ్‌లోనైతే జట్టు బలహీనంగా కనిపిస్తోంది. నజ్ముల్, లిటన్, సర్కార్, అఫీఫ్లు ఏమాత్రం రాణిస్తారనేదానిపైనే జట్టు అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. అన్నింటికి మించి కెప్టెన్ షకీబ్ ఫామ్‌లో లేకపోవడమే ఇబ్బందిగా మారింది. పైగా ‘మేం వరల్డ్ కప్ గెలవడానికి రాలేదు’ అంటూ అతను వ్యాఖ్యానించడం జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీసేవే. పిచ్, వాతావరణం అడిలైడ్ ఓవల్ మైదానం మొదటి నుంచీ బ్యాటింగ్‌కు బాగా అనుకూలం. భారీ స్కోర్లకు అవకాశం ఉంది. అయితే వర్షం మ్యాచ్‌కు అంతరాయం కలిగించవచ్చు. అప్పుడు ఏం జరిగిందంటే... టి20ల్లో భారత్, బంగ్లాదేశ్ మధ్య 11 మ్యాచ్‌లు జరగ్గా, 10 భారత్ గెలిచింది. వరల్డ్‌కప్‌లో 2016లో ఆఖరిసారిగా ఇరు జట్లు తలపడ్డాయి. అద్భుతంగా సాగిన ఈ మ్యాచ్‌లో పరుగు తేడాతో భారత్ నెగ్గింది. 5 బంతుల్లో 10 పరుగులు చేయాల్సిన బంగ్లా వరుసగా 2 ఫోర్లు కొట్టి సంబరాలు చేసుకోగా, తర్వాతి 3 బంతుల్లో భారత్ ఒక్క పరుగూ ఇవ్వకుండా 3 వికెట్లు తీయడాన్ని అభిమానులు మరచిపోలేరు. చదవండి: కేఎల్ రాహుల్‌కు కోహ్లి పాఠాలు -
అడిలైడ్‌కు చేరుకున్న టీమిండియా.. వైరల్ అవుతున్న కోహ్లి ఫొటో
ICC Mens T20 World Cup 2022- India vs Bangladesh- Virat Kohli: టీ20 ప్రపంచకప్-2022 టోర్నీలో టీమిండియా తమ తదుపరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. అడిలైడ్ ఓవల్ మైదానం వేదికగా సూపర్-12లో భాగంగా బుధవారం(నవంబరు 2) షకీబ్ అల్ హసన్ బృందంతో పోటీ పడనుంది. ఈ నేపథ్యంలో భారత జట్టు సోమవారం పెర్త్ నుంచి అడిలైడ్‌కు చేరుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసింది. ఇక అడిలైడ్‌కు చేరే క్రమంలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫొటో నెటిజన్లను ఆకర్షిస్తోంది. మహ్మద్ సిరాజ్, యజువేంద్ర చహల్, సూర్యకుమార్ యాదవ్ తదితరులతో ఫొటోకు పోజులిచ్చాడు కింగ్. వైరల్ అవుతున్న కోహ్లి ఫొటో ‘అడిలైడ్‌కు చేరుకున్నాం’ అన్న క్యాప్షన్‌తో కోహ్లి షేర్ చేసిన ఈ ఫొటో క్షణాల్లోనే వైరల్‌గా మారింది. గంటలోనే 2 మిలియన్లకు పైగా లైకులతో దూసుకుపోతోంది. ఇక ఈ ఫొటోపై కోహ్లి సతీమణి అనుష్క శర్మ బ్లూ హార్ట్ ఎమోజీలతో బదులివ్వగా.. కొంత మంది ఫ్యాన్స్ మాత్రం హోటల్ రూం లీక్ ఘటనను గుర్తు చేస్తూ సలహాలు ఇస్తున్నారు. ‘‘సర్ హోటల్ గదిని లాక్ చేసుకుని వెళ్లండి. ఆటతో పాటు మీ భద్రత కూడా మాకు ముఖ్యమే. దయచేసి జాగ్రత్తగా ఉండండి’’ అంటూ కోహ్లికి విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా దక్షిణాఫ్రికాతో మ్యాచ్ నేపథ్యంలో పెర్త్‌లో బస చేసిన కోహ్లి హోటల్ రూం వీడియో లీకైన విషయం విదితమే. నేరుగా సెమీస్ చేరాలంటే! ఇదిలా ఉంటే.. గ్రూప్-2 సూపర్-12లో భాగంగా పాకిస్తాన్, నెదర్లాండ్స్‌ను మట్టికరిపించిన టీమిండియా.. ఆదివారం సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. దీంతో ఎలాంటి సమీకరణాలతో పనిలేకుండా నేరుగా సెమీస్ చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌లలో రోహిత్ సేన తప్పక విజయం సాధించాలి. బంగ్లాదేశ్, జింబాబ్వేలను భారీ తేడాతో ఓడిస్తే నేరుగా సెమీ ఫైనల్లో అడుగుపెట్టడం లాంఛనమే! చదవండి: Virat Kohli: కోహ్లి రూం వీడియో లీక్.. ఇది వాళ్ల పనే! స్పందించిన హోటల్ యాజమాన్యం రాహుల్‌ను తీసేసి.. అతడితో ఓపెనింగ్ చేయిస్తే బెటర్! మ్యాచ్ విన్నర్‌ను పక్కన పెట్టడం ఏంటి? T20 WC 2022: టీమిండియా మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిస్తేనే! పాక్ దింపుడు కల్లం ఆశలు.. View this post on Instagram A post shared by Virat Kohli (@virat.kohli) Touchdown Adelaide 📍 #TeamIndia | #T20WorldCup pic.twitter.com/l6GalMP0TI — BCCI (@BCCI) October 31, 2022 -
భళా బోపన్న... అడిలైడ్ ఓపెన్ డబుల్స్ టైటిల్ సొంతం
అడిలైడ్: నాలుగు పదుల వయసు దాటినా తనలో ఇంకా చేవ తగ్గలేదని నిరూపిస్తూ భారత వెటరన్ టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న తన కెరీర్లో 20వ డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఆదివారం ముగిసిన అడిలైడ్ ఓపెన్ ఏటీపీ–250 టోర్నీలో రోహన్ బోపన్న–రామ్‌కుమార్ రామనాథన్ (భారత్) జంట చాంపియన్‌గా నిలిచింది. 81 నిమిషాలపాటు జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో అన్‌సీడెడ్ బోపన్న–రామ్‌కుమార్ ద్వయం 7–6 (8/6), 6–1తో టాప్ సీడ్ మార్సెలో మెలో (బ్రెజిల్)–ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా) జోడీపై సంచలన విజయం సాధించింది. బెంగళూరుకు చెందిన 41 ఏళ్ల బోపన్న కెరీర్లో ఇది 20వ డబుల్స్ టైటిల్. 2020లో వెస్లీ కూలాఫ్ (నెదర్లాండ్స్)తో కలసి దోహా ఓపెన్ టైటిల్ సాధించాక బోపన్న ఖాతాలో చేరిన మరో టైటిల్ ఇదే కావడం విశేషం. మరోవైపు చెన్నైకి చెందిన 27 ఏళ్ల రామ్‌కుమార్ కెరీర్లో ఇదే తొలి టైటిల్ కావడం గమనార్హం. అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) సర్క్యూట్లో బోపన్న–రామ్‌కుమార్ కలసి ఆడటం ఇదే ప్రథమం. 55 నిమిషాలపాటు జరిగిన తొలి సెట్లో రెండు జోడీలు తమ సర్వీస్‌లను నిలబెట్టుకున్నాయి. దాంతో టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో భారత జోడీ పైచేయి సాధించి సెట్‌ను దక్కించుకుంది. రెండో సెట్లో మాత్రం భారత జంట ఆధిపత్యం కనబరిచింది. రెండుసార్లు ప్రత్యర్థి జోడీ సర్వీస్‌లను బ్రేక్ చేసి తమ సర్వీస్‌లను కాపాడుకొని విజయాన్ని ఖాయం చేసుకుంది. విజేతగా నిలిచిన బోపన్న–రామ్‌కుమార్ జంటకు 18,700 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 13 లక్షల 89 వేలు)తోపాటు 250 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. నేడు మొదలయ్యే అడిలైడ్ ఓపెన్–2 టోర్నీలో రోజర్ వాసెలిన్ (ఫ్రాన్స్)తో కలసి బోపన్న బరిలో దిగుతుండగా... మరోవైపు రామ్‌కుమార్‌తోపాటు భారత్‌కే చెందిన ప్రజ్నేశ్ గుణేశ్వరన్, యూకీ బాంబ్రీ మెల్బోర్న్లో జరగనున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ టోర్నీలో ఆడనున్నారు. చదవండి: సాయిప్రణీత్‌కు కరోనా పాజిటివ్ -
Rohan Bopanna-Ramkumar: టైటిల్‌కు విజయం దూరంలో...
అడిలైడ్: కొత్త ఏడాదిని టైటిల్‌తో శుభారంభం చేసేందుకు భారత టెన్నిస్ జోడీ రోహన్ బోపన్న–రామ్‌కుమార్ విజయం దూరంలో నిలిచింది. ఆస్ట్రేలియాలో జరుగుతున్న అడిలైడ్ ఓపెన్ ఏటీపీ–250 టోర్నీలో బోపన్న–రామ్‌కుమార్ ద్వయం ఫైనల్లోకి దూసుకెళ్లింది. బోపన్న కెరీర్లో ఇది 48వ ఏటీపీ టోర్నీ డబుల్స్ ఫైనల్‌కాగా... రామ్‌కుమార్ తన కెరీర్లో తొలిసారి ఏటీపీ టోర్నీలో టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో అన్‌సీడెడ్ బోపన్న–రామ్‌కుమార్ జంట 6–2, 6–4తో నాలుగో సీడ్ శాంటియాగో గొంజాలెజ్ (మెక్సికో)–తొమిస్లావ్ బిర్కిచ్ (బోస్నియా హెర్జెగోవినా) జోడీపై విజయం సాధించింది. నేడు జరిగే ఫైనల్లో టాప్ సీడ్ ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా)–మార్సెలో మెలో (బ్రెజిల్) జంటతో బోపన్న–రామ్‌కుమార్ ద్వయం తలపడుతుంది. శాంటియాగో–బిర్కిచ్లతో 58 నిమిషాలపాటు జరిగిన సెమీఫైనల్లో బోపన్న, రామ్‌కుమార్ ఎని మిది ఏస్‌లు సంధించారు. రెండు డబుల్ ఫాల్ట్‌లు చేశారు. ప్రత్యర్థి జోడీ సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసి తమ సర్వీస్‌ను ఒక్కసారీ కోల్పోలేదు. 41 ఏళ్ల బోపన్న తన కెరీర్లో 19 డబుల్స్ టైటిల్స్ సాధించి, 28 సార్లు రన్నరప్‌గా నిలిచాడు. (చదవండి: కోహ్లిని స్టార్క్‌తో పోల్చిన ఆసీస్ మీడియా.. కౌంటరిచ్చిన వసీం జాఫర్) -
సానియా మీర్జాకు షాక్... టోర్నీ నుంచి అవుట్!
Adelaide Open: కొత్త ఏడాదిలో భారత మహిళా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పోరాటం సెమీఫైనల్లో ముగిసింది. అడిలైడ్ ఓపెన్ డబ్ల్యూటీఏ టోర్నీలో సానియా (భారత్)–నాదియా కిచెనోక్ (ఉక్రెయిన్) జోడీ సెమీఫైనల్లో పోరాడి ఓడిపోయింది. యాష్లే బార్టీ–స్టార్మ్ సాండెర్స్ (ఆస్ట్రేలియా) ద్వయంతో జరిగిన మ్యాచ్‌లో సానియా–కిచెనోక్ 1–6, 6–2, 8–10తో ‘సూపర్ టైబ్రేక్’లో ఓటమి చవిచూశారు. సెమీస్‌లో బోపన్న ద్వయం మరోవైపు అడిలైడ్ ఓపెన్ పురుషుల టోర్నీలో రోహన్ బోపన్న–రామ్‌కుమార్ (భారత్) జంట సెమీఫైనల్‌కు చేరింది. క్వార్టర్ ఫైనల్లో బోపన్న–రామ్6–1, 6–3తో బోంజి (ఫ్రాన్స్)–హుగో నిస్ (మొనాకో)లపై నెగ్గారు. చదవండి: SA vs IND: "కోహ్లి స్థానంలో కెప్టెన్‌గా అతడే సరైనోడు" -
రెండు వైపులా రనౌటయ్యాడు..
సిడ్నీ: బిగ్‌బాష్ లీగ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుంది. సిడ్నీ థండర్స్, అడిలైడ్ స్ట్రీకర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అడిలైడ్ ఓపెనర్ జేక్ వెథరాల్డ్ రెండు ఎండ్స్లోనూ రనౌటైన సన్నివేశం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో థండర్స్ బౌలర్ క్రిస్ గ్రీన్ బౌలింగ్ చేస్తున్న సందర్భంలో బ్యాట్స్‌మెన్ ఫిలిప్ సాల్ట్ కొట్టిన బంతి గ్రీన్ ఎడమ చేతిని తాకుతూ వికెట్లను ముద్దాడింది. ఈ సమయంలో నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో జేక్ వెథరాల్డ్ క్రీజ్ బయట ఉన్నాడు. దీన్ని అంతగా పట్టించుకోని వెథరాల్డ్.. సాల్ట్ పరుగు కోసం పిలుపునివ్వడంతో స్ట్రైకింగ్ ఎండ్ వైపు పరిగెట్టాడు. వెథరాల్డ్ క్రీజ్‌కు చేరుకునే లోపే వికెట్ కీపర్ సామ్ బిల్లింగ్స్ వికెట్లకు గిరాటు వేశాడు. ప్రత్యర్ధి ఆటగాళ్లు అపీల్ చేయడంతో థర్డ్ అంపైర్ రనౌట్‌ను పరిశీలిస్తుండగా వెథరాల్డ్ రెండు వైపులా రనౌటైనట్లు తేలింది. ఒకే బ్యాట్స్‌మెన్ రెండు ఎండ్స్లోనూ రనౌటైన ఈ సన్నివేశం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
అచ్చం ధోని తరహాలో..
అడిలైడ్ : ఆసీస్‌తో జరిగిన పింక్ బాల్ టెస్టులో టీమిండియా ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. టీమిండియా వైఫల్యాన్ని అభిమానులు అంత తొందరగా జీర్ణించుకోలేకపోతున్నారు. భారత్ విధించిన 90 పరుగుల విజయలక్ష్యాన్ని ఆసీస్ 21 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. అయితే ఆసీస్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ మాథ్యూ వేడ్‌ను వృద్ధిమాన్ సాహా రనౌట్ చేశాడు. సాహా రనౌట్ చేసిన తీరు అచ్చం టీమిండియా మాజీ ఆటగాడు ఎంఎస్ ధోనిని గుర్తుకుతెస్తుంది. రవిచంద్రన్ అశ్విన్ వేసిన 18వ ఓవర్ రెండో బంతిని వేడ్ ఫ్లిక్ చేయగా.. అది కీపర్ సాహా చేతికి చిక్కింది. వెంటనే సాహా.. ధోని తరహాలో తన కాళ్ల సందుల నుంచి బంతిని వికెట్లకు గిరాటేశాడు. అప్పటికే క్రీజు దాటి ముందుకు పరిగెత్తిన వేడ్ రనౌట్‌గా వెనుదిరిగాడు. (చదవండి : 96 ఏళ్ల చరిత్రను రిపీట్ చేశారు) ఈ వీడియోనూ క్రికెట్ ఆస్ట్రేలియా తన ట్విటర్లో షేర్ చేసింది. ' అలర్ట్.. అద్భుతమైన రనౌట్.. సాహా నుంచి వచ్చిన ఈ సిగ్నల్ దేనిని సూచిస్తుందో చెప్పగలరా..' అంటూ క్యాప్షన్ జత చేసింది. కాగా ఇరుజట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ మెల్బోర్న్ వేదికగా డిసెంబర్ 26న మొదలుకానుంది. విరాట్ కోహ్లి పెటర్నిటీ సెలవులపై స్వదేశం వెళ్లనున్న నేపథ్యంలో అజింక్యా రహానే మిగిలిన టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. Bizarre dismissal alert! What about that from Saha?! #AUSvIND pic.twitter.com/OqMLnSNgCE — cricket.com.au (@cricketcomau) December 19, 2020 -
96 ఏళ్ల చరిత్రను రిపీట్ చేశారు
అడిలైడ్ : ఆసీస్‌తో జరిగిన పింక్‌బాల్ టెస్టులో టీమిండియా ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే. రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులు చేసిన టీమిండియా టెస్టుల్లో అత్యల్ప స్కోరు నమోదు చేయడంతో పాటు మరో చెత్త రికార్డును నమోదు చేసింది. ఆసీస్ పేసర్ల దాటికి భారత బ్యాట్స్‌మన్ అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. భారత ఇన్నింగ్స్‌లో మయాంక్ అగర్వాల్ 9 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఒక ఇన్నింగ్స్‌లో ఒక్క ఆటగాడు కూడా డబుల్ డిజిట్ దాటకపోవడం 96 ఏళ్ల తర్వాత మళ్లీ ఇదే కావడం విశేషం. (చదవండి : షమీ రిటైర్డ్ హర్ట్ కాదు.. రిటైర్డ్ అవుట్) 1924లో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు 30 పరుగులకే ఆలౌటైంది. అప్పటి దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో హెర్బీ టేలర్ 7 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవడం.. మిగతా ఆటగాళ్లు కూడా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. కాగా మ్యచ్ విషయానికి వస్తే ఆసీస్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టీమిండియా విధించిన 90 పరుగులు టార్గెట్‌ను ఆతిథ్య జట్టు రెండు వికెట్లు కోల్పోయి చేధించింది. జో బర్స్న్ అర్థసెంచరీతో మెరవగా.. వేడ్ 33, లబుషేన్ 6 పరుగులు చేశారు. కాగా అంతకముందు క్రితం రోజు స్కోరు 9/1తో బరిలోకి దిగిన టీమిండియా ఇన్నింగ్స్ పేకమేడలా కుప్పకూలింది.(చదవండి : టీమిండియా ఘోర వైఫల్యం.. నెటిజన్ల ట్రోల్స్) ఇక టెస్టు క్రికెట్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్‌లో అత్యల్ప స్కోర్లను పరిశీలిస్తే.. 1955లో న్యూజిలాండ్, ఇంగ్లండ్ మధ్య జరిగిన టెస్టులో కివీస్ 26 పరుగులకే ఆలౌట్ అయి అత్యంత తక్కువస్కోరుకే ఆలౌట్ అయిన జట్టుగా నిలిచింది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా జట్టు మూడుసార్లు అత్యల్పస్కోరును నమోదు చేసింది. 1896,1924,1899లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌ల్లో 30,30,35 పరుగులకు ఆలౌట్ అయింది. 1902లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ 36 పరుగులకే ఆలౌట్ అయింది. తాజాగా 2020లో అడిలైడ్ వేదికగా ఆసీస్‌తో జరిగిన పింక్‌బాల్ టెస్టులో టీమిండియా 36 పరుగులకే ఆలౌట్ అయింది.