
అడిలైడ్: భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో ముందుగా బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా నిలకడగా ఆడుతోంది. స్వల్ప స్కోరుకే ఓపెనర్లు ఇద్దరూ అవుటయినప్పటికీ షాన్ మార్ష్ అర్ధ సెంచరీతో ఆసీస్ కోలుకుంది. మార్ష్ 62 బంతుల్లో 4 ఫోర్లతో హాఫ్ సెంచరీ చేశాడు. ఖావాజా, పీటర్ హ్యాండ్స్‌కోంబ్‌లతో కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. హ్యాండ్స్‌కోంబ్(20) నాలుగో వికెట్‌గా వెనుదిరిగాడు. ఆసీస్ 30 ఓవర్లలో 141/4 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది. మార్ష్ 65, స్టొయినిస్ 3 పరుగులతో ఆడుతున్నారు.
26 పరుగులకే ఓపెనర్లు ఇద్దరూ అవుటయ్యారు. ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ మరోసారి విఫలమ్యాడు. కేవలం 6 పరుగులు మాత్రమే చేసి భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. 18 పరుగులు చేసిన మరో ఓపెనర్ అలెక్స్ క్యారీని మహ్మద్ షమి పెవిలియన్‌కు పంపాడు.
టాస్ గెలిచి ఆస్ట్రేలియా ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నాడు. వరుసగా రెండోసారి ఫస్ట్ బ్యాటింగ్ చేసే అవకాశం రావడం పట్ల అతడు సంతృప్తి వ్యక్తం చేశాడు. సిడ్నీలో రాణించినట్టుగానే ఇక్కడ కూడా సత్తా చాటుతామన్నాడు. ఆస్ట్రేలియా జట్టు ఎటువంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతోంది. భారత జట్టులో ఒక మార్పు జరిగింది. ఖలీల్ అహ్మద్ స్థానంలో హైదరాబాద్ కుర్రాడు మహ్మద్ సిరాజ్ చోటు దక్కించుకున్నాడు. (లెక్క సరిచేస్తారా!)
తుది జట్లు
భారత్: శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి(కెప్టెన్), అంబటి రాయుడు, దినేశ్ కార్తిక్, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమి, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ సిరాజ్
ఆస్ట్రేలియా: ఆరోన్ ఫించ్(కెప్టెన్), అలెక్స్ క్యారీ(వికెట్ కీపర్), షాన్ మార్ష్, ఉస్మాన్ ఖావాజా, పీటర్ హ్యాండ్స్‌కోంబ్, మార్కస్ స్టొయినిస్, మ్యాక్స్‌వెల్, రిచర్డ్‌సన్, లయన్, పీటర్ సిడిల్, జాసన్ బెహ్రిన్‌డార్ఫ్
Comments
Please login to add a commentAdd a comment