second ODI
-
సిరీస్ విజయమే లక్ష్యంగా...
ఇంగ్లండ్‌పై టి20 సిరీస్ జోరును కొనసాగిస్తూ వన్డేల్లోనూ శుభారంభం చేసిన భారత జట్టు ఇప్పుడు మరో సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకునేందుకు సిద్ధమైంది. అన్ని రకాలుగా ఫామ్‌లో ఉన్న టీమిండియా ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ గెలుచుకోవాలని పట్టుదలగా ఉంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో చెలరేగుతున్న భారత్‌ను నిలువరించడంలో తీవ్రంగా ఇబ్బంది పడుతూ వరుస పరాజయాలు ఎదుర్కొంటున్న ఇంగ్లండ్ ఈ సారైనా కోలుకొని పోటీనిస్తుందా చూడాలి. కటక్: ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీకి ముందు సొంతగడ్డపై తమ సత్తాను ప్రదర్శిస్తున్న భారత జట్టు ఇంగ్లండ్‌పై వన్డే సిరీస్‌ను గెలుచుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. బారాబతి స్టేడియంలో నేడు జరిగే రెండో వన్డేలో భారత్, ఇంగ్లండ్ తలపడనున్నాయి. తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేసి 38.4 ఓవర్లలోనే ఛేదన పూర్తి చేసిన భారత్ అదే స్థాయి ఆటను ప్రదర్శిస్తే మరో మ్యాచ్ కూడా రోహిత్ సేన ఖాతాలో చేరుతుంది.టి20ల్లో చిత్తుగా ఓడి తొలి వన్డేలో కూడా 248కే పరిమితమైన ఇంగ్లండ్ మెరుగైన ప్రదర్శనతో సిరీస్ సమం చేయాలని భావిస్తోంది. 2006 నుంచి భారత గడ్డపై 31 సార్లు భారత్‌తో తలపడిన ఇంగ్లండ్ 5 మ్యాచ్‌లే గెలిచి 25 ఓడింది. కోహ్లి సిద్ధం... గాయంతో తొలి మ్యాచ్‌కు దూరమైన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి పూర్తి ఫిట్‌గా సిద్ధమయ్యాడు. రెండో వన్డేలో అతను బరిలోకి దిగడం ఖాయమైంది. కోహ్లి కూడా చాలా రోజులుగా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. లయ అందుకునేందుకు అతనికి ఇదే సరైన అవకాశం. అయితే ఎవరి స్థానంలో విరాట్ ఆడతాడనేది ఆసక్తికరం. గత మ్యాచ్‌లో చెప్పినదాని ప్రకారం శ్రేయస్‌ను తప్పించి కోహ్లిని తీసుకోవాలి. కానీ మెరుపు అర్ధసెంచరీతో ఆకట్టుకున్న శ్రేయస్‌ను పక్కన పెడితే టీమ్ మేనేజ్మెంట్పై తీవ్ర విమర్శలు రావచ్చు. కోచ్ గంభీర్ సాధారణంగా ఓపెనింగ్ ఎడమ, కుడిచేతివాటం కాంబినేషన్‌ను ఇష్టపడతాడు. అలా చూస్తే శ్రేయస్‌పైనే వేటు వేసి జైస్వాల్‌ను ఆడించవచ్చు. కానీ చాంపియన్స్ ట్రోఫీ ప్రణాళికలను దృష్టిలో ఉంచుకొని చూస్తే ప్రయోగాలు చేయకుండా జైస్వాల్‌ను పక్కన పెట్టడం సరైన నిర్ణయమవుతుంది. మరో వైపు రాహుల్ స్థానంలో కీపర్‌గా పంత్‌ను ఆడించే ఆలోచన కూడా ఉంది. లెఫ్టార్మ్ పేసర్ అర్ష్ దీప్ సింగ్‌ను పరీక్షించేందుకు రాణాను పక్కన పెట్టాలనే చర్చ కూడా జరుగుతోంది. ఎలాగైనా ఈ సిరీస్ గెలవాలని భావిస్తే భారత జట్టు మార్పులపై దృష్టి పెట్టకపోవచ్చు. కానీ చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఈ సిరీస్‌లో ఆటగాళ్లను పరీక్షించాలనే ఆలోచన ఉంటే మాత్రం మార్పులు ఖాయం. సీనియర్ పేసర్ షమీ గత మ్యాచ్‌లో వికెట్లు తీయకపోయినా చక్కటి బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఆల్‌రౌండర్ అక్షర్ బ్యాటింగ్‌లో రాణించడం సానుకూలాంశం. అయితే అన్నింటికి మించి కెపె్టన్ రోహిత్ ఫామ్‌లోకి రావడం భారత్‌కు ముఖ్యం. చాలా కాలంగా వరుసగా విఫలమవుతున్న రోహిత్ ఇక్కడైనా రాణిస్తాడా చూడాలి. గిల్, పాండ్యా, జడేజాలతో మన బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. గెలిపించేదెవరు? ఈ పర్యటనలో ఐదు మ్యాచ్‌లలో ఓడిన ఇంగ్లండ్ ఆట దిశానిర్దేశం లేకుండా సాగుతోంది. పేరుకు భారీ బ్యాటింగ్ లైనప్ కనిపిస్తున్నా ఆ జట్టు వ్యూహాల్లో పదును లోపించింది. గుడ్డిగా బ్యాట్లు ఊపడం తప్ప ఆటగాళ్లు విఫలమవుతున్న చోట రెండో ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. కోచ్ మెక్‌కలమ్ ప్రణాళికలు ఏవీ పని చేయడం లేదు. భారత గడ్డపై అనుభవం ఉన్న బట్లర్ మాత్రమే ఎంతో కొంత రాణిస్తుండగా బెతెల్ కాస్త పట్టుదలగా ఆడగలిగాడు. జట్టు ఆధారపడుతున్న రూట్, బ్రూక్ స్థాయికి తగ్గ ఆటను కనబర్చాల్సి ఉంది. ముఖ్యంగా బ్రూక్ 5 టి20లు, వన్డే కలిపి 91 పరుగులే చేశాడు. డకెట్ ఇంకా వన్డే ఓపెనర్‌గా కుదురుకోకపోగా, సాల్ట్ మరో మెరుపు ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. ఆర్చర్, కార్స్ పేస్ భారత బ్యాటర్లపై ఎలాంటి ప్రభావం చూపకపోగా, రషీద్ తేలిపోయాడు. ఈ మ్యాచ్‌లో మరో పేసర్ వుడ్ బరిలోకి దిగే అవకాశం ఉంది. 40 ఓవర్లలోపే భారత్ తొలి వన్డే ముగించడం ఇంగ్లండ్ బౌలింగ్ బలహీనతను కూడా చూపించింది. దీనిని ఆ జట్టు ఎలా అధిగమిస్తుందో చూడాలి. తుది జట్లు (అంచనా) భారత్: రోహిత్ (కెప్టెన్ ), గిల్, కోహ్లి, శ్రేయస్, రాహుల్/ పంత్, పాండ్యా, జడేజా, అక్షర్, కుల్దీప్, అర్ష్ దీప్, షమీ ఇంగ్లండ్: బట్లర్ (కెప్టెన్ ),సాల్ట్, రూట్, బ్రూక్,డకెట్, లివింగ్‌స్టోన్, బెతెల్, కార్స్, ఆర్చర్, రషీద్, వుడ్. పిచ్, వాతావరణం ఈ మైదానంలో ఐదేళ్ల తర్వాత వన్డే మ్యాచ్ జరుగుతోంది. మొదటినుంచి ఇక్కడి పిచ్ బ్యాటింగ్‌కు బాగా అనుకూలం. భారీ స్కోర్లు నమోదయ్యాయి. ఈ సారి కూడా పరుగుల వరద ఖాయం. వర్షం అంతరాయం కలిగించే అవకాశం లేదు. -
సిరీస్ విజయంపై గురి
రాజ్‌కోట్: స్వదేశంలో వరుస విజయాల జోరు కొనసాగిస్తున్న భారత మహిళల క్రికెట్ జట్టు మరో పోరుకు సిద్ధమైంది. యంగ్ ప్లేయర్లు సత్తా చాటడంతో ఐర్లాండ్‌పై తొలి వన్డేలో ఘన విజయం సాధించిన స్మృతి మంధన సారథ్యంలోని భారత జట్టు... ఆదివారం రెండో వన్డే ఆడనుంది. మొదటి మ్యాచ్‌లో ప్రతీక రావల్, తేజల్ హసబ్నిస్ అర్ధ శతకాలతో సత్తా చాటడంతో సునాయాసంగా గెలుపొందిన టీమిండియా... ఈ మ్యాచ్‌లోనూ సమిష్టిగా రాణించి మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ పట్టేయాలని చూస్తోంది. శుక్రవారం జరిగిన తొలి వన్డేలో బౌలింగ్, బ్యాటింగ్‌లో ఆకట్టుకున్న భారత జట్టు... ఫీల్డింగ్‌లో మాత్రం తీవ్రంగా నిరాశ పరిచింది. సులువైన క్యాచ్‌లను సైతం జారవిడిచి ప్రత్యర్థికి భారీ స్కోరు చేసే అవకాశం ఇచి్చంది. ఈ మ్యాచ్‌లో ఫీల్డింగ్‌పై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరముంది. హర్మన్‌ప్రీత్ కౌర్ గైర్హాజరీలో స్మృతి మంధన మరోసారి జట్టును నడిపించనుండగా... ప్రతీక రావల్ ఫామ్ కొనసాగించాలని చూస్తోంది. గత మ్యాచ్‌లో ఎక్కువసేపు నిలవలేకపోయిన హర్లీన్ డియోల్, జెమీమా రోడ్రిగ్స్ కూడా మంచి ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకుంటే టీమిండియాకు తిరుగుండదు. తేజల్, రిచా ఘోస్, దీప్తి శర్మతో బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే టిటాస్ సాధు, సయాలీ, సైమా ఠాకూర్, ప్రియా మిశ్రా, దీప్తి శర్మ కీలకం కానున్నారు.ఏడాది స్వదేశంలో వన్డే ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో రిజర్వ్ బెంచ్ సత్తా పరీక్షించుకునేందుకు ఈ సిరీస్ ఉపయోగపడనుంది. మరోవైపు తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో ఆకట్టుకొని ఆత్మవిశ్వాసం నింపుకున్న ఐర్లాండ్ అదే జోష్‌లో సిరీస్ సమం చేయడంతో పాటు... భారత్‌పై తొలి విజయం సాధించాలని చూస్తోంది. -
సిరీస్‌పై భారత మహిళల గురి
అహ్మదాబాద్: భారత మహిళల జట్టు సిరీస్ లక్ష్యంగా రెండో వన్డే బరిలోకి దిగుతోంది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో తొలి మ్యాచ్‌లో పర్యాటక న్యూజిలాండ్‌ను కంగు తినిపించిన భారత్ ఇప్పుడు వరుస విజయంపై కన్నేసింది. తద్వారా మరో వన్డే మిగిలుండగానే మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2–0తో కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో ఉంది. మరోవైపు కివీస్ ఈ మ్యాచ్‌లో పుంజుకొని సిరీస్ రేసులో నిలవాలని ఆశిస్తోంది. తప్పక గెలవాల్సిన ఒత్తిడి ఉన్న కివీస్ ఏమేరకు రాణిస్తుందో చూడాలి. స్మృతి రాణిస్తేనే... గత మ్యాచ్‌లో రెగ్యులర్ కెపె్టన్ హర్మన్‌ప్రీత్ ఫిట్నెస్ సమస్యలతో దూరం కావడంతో సారథ్యం వహించిన స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన ఫామ్ జట్టును కలవరపెడుతోంది. ఇటీవలి టి20 ప్రపంచకప్ సహా వరుసగా విఫలమవడం బ్యాటింగ్ విభాగాన్ని ఒత్తిడికి గురిచేస్తోంది. టాపార్డర్‌లో షఫాలీ, యస్తిక భాటియా మెరుగ్గా ఆడటం, జెమీమా, దీప్తిశర్మ తమ స్థాయికి తగ్గ ఆటతీరు కనబరుస్తుండటం జట్టుకు కలిసొచ్చే అంశం. గత మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన తేజల్ హసబి్నస్ మిడిలార్డర్లో కీలకమైన ఇన్నింగ్స్ ఆడటంతో హర్మన్ జట్టులోకి వచ్చినా ఆమె స్థానానికి ఢోకాలేదు. కివీస్‌కు మరో దెబ్బ సిరీస్‌లో వెనుకబడిన న్యూజిలాండ్‌కు అమెలియా కెర్ గాయం మరో దెబ్బకొట్టింది. తొలి వన్డే సందర్భంగా ఆమె తొడకండరాల గాయానికి గురైంది. దీంతో మిగతా మ్యాచ్‌లకు దూరమైన ఆమె స్వదేశానికి పయనమైంది. ఇటీవల టి20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ విజయంలో కీలకపాత్ర పోషించిన స్టార్ ఆల్‌రౌండర్ లేకపోవడం జట్టుకు మరింత ఇబ్బందికరంగా మారింది. ఇలాంటి సమయంలో ఇప్పుడు సోఫీ డివైన్ సేన సమష్టిగా ఆడితేనే గెలిచి సిరీస్‌లో నిలుస్తుంది. లేదంటే సిరీస్ కోల్పోయే పరిస్థితి వస్తుంది. జట్లు (అంచనా) భారత్: హర్మన్‌ప్రీత్ (కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ, యస్తిక, జెమిమా, తేజల్ హసబ్నిస్, దీప్తిశర్మ, అరుంధతీ, రాధా యాదవ్, సయిమా, రేణుకా సింగ్. న్యూజిలాండ్: సోఫీ డివైన్ (కెప్టెన్), సుజీబేట్స్, జార్జియా, బ్రూక్ హాలిడే, మ్యాడీ గ్రీన్, ఇసాబెల్ల గేజ్, జెస్ కెర్, మోలి ఫెన్ఫోల్డ్, ఎడెన్ కార్సన్, లీ తహుహు. -
స్పిన్ వలలో చిక్కిన భారత్.. 32 పరుగుల తేడాతో ఓటమి
కొలంబో: భారత్ ముందున్న లక్ష్యం 241. రోహిత్ శర్మ మెరుపులతో 13.2 ఓవర్లలోనే భారత్ (97/0) వందకు చేరువైంది. ఈ స్కోరు చూసిన వారెవరికైనా భారత్ గెలుపు సులువే అనిపిస్తుంది. కానీ ‘హిట్‌మ్యాన్’ అవుటవడంతోనే భారత్ మెడకు లంక స్పిన్ ఉచ్చు బిగించింది. అంతే 208 పరుగులకే భారత్ కుప్పకూలింది. దీంతో తొలి వన్డేను ‘టై’ చేసుకున్న ఆతిథ్య శ్రీలంక రెండో వన్డేలో 32 పరుగులతో విజయం సాధించింది. టి20ల్లో క్లీన్‌స్వీప్ అయిన లంక వన్డేల్లో 1–0తో ఇక సిరీస్ కోల్పోలేని స్థితిలో నిలిచింది. మొదట శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. అవిష్క ఫెర్నాండో (62 బంతుల్లో 40; 5 ఫోర్లు), కమిండు మెండిస్ (44 బంతుల్లో 40; 4 ఫోర్లు) మెరుగ్గా ఆడారు. వాషింగ్టన్ సుందర్ 3, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టారు.అనంతరం టీమిండియా 42.2 ఓవర్లలో 208 పరుగులకే ఆలౌటైంది. రోహిత్ శర్మ (44 బంతుల్లో 64; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), అక్షర్ పటేల్ (44 బంతుల్లో 44; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ లెగ్ స్పిన్నర్ జెఫ్రే వాండెర్సే (6/33) ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. అసలంక 3 వికెట్లు తీశాడు. సిరీస్‌లోని చివరిదైన మూడో వన్డే బుధవారం జరుగుతుంది. తొలి బంతికే వికెట్... ఫామ్‌లో ఉన్న ఓపెనర్ నిసాంక (0)ను ఇన్నింగ్స్ తొలి బంతికే భారత బౌలర్ సిరాజ్ పెవిలియన్ చేర్చాడు. మరో ఓపెనర్ అవిష్క ఫెర్నాండో, కుశాల్ మెండిస్ (42 బంతుల్లో 30; 3 ఫోర్లు) కుదురుగా ఇన్నింగ్స్‌ను నడిపించారు. అయితే సుందర్ తన వరుస ఓవర్లలో ఫెర్నాండో, కుశాల్‌లను అవుట్ చేయడంతో 74 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. దీంతోపాటు 79 పరుగుల వద్ద మూడు వికెట్లను కోల్పోయింది. తర్వాత కెప్టెన్ చరిత్ అసలంక (42 బంతుల్లో 25; 3 ఫోర్లు), సమరవిక్రమ (14) జట్టు స్కోరును వంద పరుగులు దాటించారు. అక్షర్ ఈ జోడీని ఎక్కువసేపు నిలువనీయలేదు. సమరవిక్రమను అవుట్ చేయడంతో 111 పరుగుల వద్ద నాలుగో వికెట్ పడింది. కొద్దిసేపటి తర్వాత జనిత్ లియనగే (12)ను కుల్దీప్, అసలంకను సుందర్ అవుట్ చేయడంతో లంక ఒక దశలో 136 పరుగులకే 6 వికెట్లను కోల్పోయింది. ఇలాంటి పరిస్థితిలో భారత బౌలర్లు పట్టుబిగించకుండా కమిండు మెండిస్ (44 బంతుల్లో 40; 4 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. దునిత్ వెలలగే (35 బంతుల్లో 39; 1 ఫోర్, 2 సిక్స్‌లు)తో కలిసి కమిండు ఏడో వికెట్‌కు చకచకా 72 పరుగులు జోడించడం లంకను నిలబెట్టింది. దునిత్ అవుటయ్యాక కూడా స్కోరులో వేగం తగ్గకుండా కమిండు, అకిల ధనంజయ (15; 2 ఫోర్లు) పరుగులు సాధించడంతో ఆఖరి 5 ఓవర్లలో శ్రీలంక 44 పరుగులు చేసింది. సిరాజ్, అక్షర్ పటేల్‌లకు చెరో వికెట్ దక్కింది. రోహిత్ ఉన్నంత వరకే... ఓపెనర్లు రోహిత్, శుబ్‌మన్ గిల్ (44 బంతుల్లో 35; 3 ఫోర్లు) తొలి వన్డే కంటే మరింత పటిష్టమైన పునాది వేశారు. నాలుగో ఓవర్ నుంచి కెప్టెన్ రోహిత్ దూకుడు పెంచాడు. వెలలగే వేసిన ఆ ఓవర్లో మూడు బౌండరీలు బాదాడు. అసిత ఏడో ఓవర్లో ఫోర్, సిక్సర్ కొట్టాడు. దీంతో జట్టు స్కోరు 50కి చేరింది. తర్వాత ధనంజయ, కమిండు మెండిస్ ఓవర్లలో భారీ సిక్సర్లతో రోహిత్ 29 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తిచేసుకున్నాడు. 10 ఓవర్లలో భారత్ స్కోరు 76/0. వెలలగే వేసిన 13వ ఓవర్లో సిక్స్ కొట్టిన రోహిత్... తర్వాతి వాండెర్సే బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ ఆడి నిసాంక చేతికి చిక్కాడు. దీంతో 97 పరుగుల ఓపెనింగ్ వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. కోహ్లి బౌండరీతో ఆ ఓవర్లోనే జట్టు స్కోరు వంద దాటింది. కానీ కాసేపటికే వాండెర్సే ఒకే ఓవర్లో గిల్, దూబే (0)లను అవుట్ చేశాడు. తన తదుపరి ఓవర్లలో కోహ్లి (14), శ్రేయస్ అయ్యర్ (7) వికెట్లు తీశాడు. దీంతో 133 పరుగులకే భారత్ సగం వికెట్లను కోల్పోయింది. అక్షర్ ధాటిగా ఆడుతుంటే... ఇంకోవైపు కేఎల్ రాహుల్ (0)ను వాండెర్సే డకౌట్ చేశాడు. అక్షర్, సుందర్ (15) కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నప్పటికీ జట్టును ఒడ్డున పడేయలేకపోయారు. వీళ్లిద్దరితో పాటు సిరాజ్‌ను అసలంక పెవిలియన్ చేర్చడంతో 201 పరుగుల వద్దే భారత్ 9వ వికెట్ కోల్పోయింది. అర్‡్షదీప్ (3) రనౌట్ కావడంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. స్కోరు వివరాలు శ్రీలంక ఇన్నింగ్స్: నిసాంక (సి) రాహుల్ (బి) సిరాజ్ 0; అవిష్క (సి అండ్ బి) సుందర్ 40; కుశాల్ మెండిస్ (ఎల్బీడబ్ల్యూ) (బి) సుందర్ 30; సమరవిక్రమ (సి) కోహ్లి (బి) అక్షర్ 14; అసలంక (సి) అక్షర్ (బి) సుందర్ 25; జనిత్ (సి అండ్ బి) కుల్దీప్ 12; వెలలగే (సి) దూబే (బి) కుల్దీప్ 39; కమిండు (రనౌట్) 40; ధనంజయ (రనౌట్) 15; వాండెర్సే (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 24; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 240. వికెట్ల పతనం: 1–0, 2–74, 3–79, 4–111, 5–136, 6–136, 7–208, 8–239, 9–240. బౌలింగ్: సిరాజ్ 8–1–43–1, అర్‡్ష దీప్ 9–0–58–0, అక్షర్ 9–0–38–1, శివమ్ దూబే 2–0–10–0, సుందర్ 10–1–30–3, కుల్దీప్ 10–1–33–2, రోహిత్ 2–0–11–0. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) నిసాంక (బి) వాండెర్సే 64; గిల్ (సి) కమిండు (బి) వాండెర్సే 35; కోహ్లి (ఎల్బీడబ్ల్యూ) (బి) వాండెర్సే 14; దూబే (ఎల్బీడబ్ల్యూ) (బి) వాండెర్సే 0; అక్షర్ (సి అండ్ బి) అసలంక 44; అయ్యర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) వాండెర్సే 7; రాహుల్ (బి) వాండెర్సే 0; సుందర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అసలంక 15; కుల్దీప్ (నాటౌట్) 7; సిరాజ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అసలంక 4; అర్‡్షదీప్ (రనౌట్) 3; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (42.2 ఓవర్లలో ఆలౌట్) 208. వికెట్ల పతనం: 1–97, 2–116, 3–116, 4–123, 5–133, 6–147, 7–185, 8–190, 9–201, 10–208. బౌలింగ్: అసిత ఫెర్నాండో 7–0–31–0, వెలలగే 6–0–41–0, ధనంజయ 10–1–54–0, కమిండు మెండిస్ 3–0–19–0, వాండెర్సే 10–0–33–6, అసలంక 6.2–2–20–3. -
IND VS SL 2nd ODI: బంతి పట్టిన హిట్‌మ్యాన్.. వైరల్ వీడియో
ప్రస్తుత శ్రీలంక పర్యటనలో టీమిండియా స్పెషలిస్ట్ బ్యాటర్లు పార్ట్ టైమ్ బౌలర్లుగా అవతారమెత్తుతున్నారు. టీ20 సిరీస్‌లో సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్ బంతితో మ్యాజిక్ చేయగా.. తొలి వన్డేలో శుభ్‌మన్ గిల్, రెండో వన్డేలో రోహిత్ శర్మ బంతితో మ్యాజిక్ చేసే ప్రయత్నం చేశారు. శ్రీలంకతో ఇవాళ జరుగుతున్న మ్యాచ్‌లో రోహిత్ రెండు ఓవర్లు వేసి పర్వాలేదనిపించాడు. క్రీజ్‌లో ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు ఉండటంతో హిట్‌మ్యాన్ తనలోని ఆఫ్ స్పిన్ బౌలింగ్ నైపుణ్యాన్ని వెలికితీశాడు. రోహిత్ రెండు ఓవర్లలో 11 పరుగులిచ్చాడు. రోహిత్ అంతర్జాతీయ వేదికపై ఎక్కువగా బౌలింగ్ చేయనప్పటికీ.. ఐపీఎల్ మంచి ట్రాక్ రికార్డే ఉంది. ఐపీఎల్లో హిట్‌మ్యాన్ పేరిట హ్యాట్రిక్ కూడా ఉంది.Rohit Sharma this series:Batting ✅Bowling ✅Captaincy ✅Watch #SLvIND 2nd ODI LIVE NOW on #SonyLIV 🍿 pic.twitter.com/qBIl1vNwsU— Sony LIV (@SonyLIV) August 4, 2024మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. లంక ఇన్నింగ్స్‌లో పథుమ్ నిస్సంక 0, అవిష్క ఫెర్నాండో 40, కుశాల్ మెండిస్ 30, సమరవిక్రమ 14, అసలంక 25, లియనగే 12, వెల్లలగే 37, కమిందు మెండిస్ 40, అఖిల ధనంజయ 15 పరుగులు చేసి ఔట్ కాగా.. జెఫ్రీ వాండర్సే 1 పరుగుతో అజేయంగా నిలిచారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు పడగొట్టగా.. కుల్దీప్ యాదవ్ 2, సిరాజ్, అక్షర్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు. All-rounders in India's limited-overs set up after T20 World Cup 2024 💹📸: Sony LIV pic.twitter.com/oorO7IJdIR— CricTracker (@Cricketracker) August 4, 2024 -
IND VS SL 2nd ODI: మొహమ్మద్ సిరాజ్ అరుదైన ఘనత
శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా పేసర్ మొహమ్మద్ సిరాజ్ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో సిరాజ్ ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ (పథుమ్ నిస్సంక) తీశాడు. తద్వారా వన్డేల్లో ఈ ఘనత సాధించిన నాలుగో భారత బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. గతంలో దేబశిష్ మహంతి, జహీర్ ఖాన్, ప్రవీణ్ కుమార్ భారత్ తరఫున తొలి బంతికే వికెట్ తీశారు. వీరిలో జహీర్ ఖాన్ అత్యధికంగా నాలుగు సార్లు ఈ ఘనత సాధించాడు.దేబశిష్ మహంతి- 1999లో వెస్టిండీస్‌పై (రిడ్లే జాకబ్స్)జహీర్ ఖాన్- 2001లో న్యూజిలాండ్‌పై (మాథ్యూ సింక్లెయిర్)జహీర్ ఖాన్- 2002లో శ్రీలంకపై (సనత్ జయసూర్య)జహీర్ ఖాన్- 2007లో ఆస్ట్రేలియాపై (మైఖేల్ క్లార్క్)జహీర్ ఖాన్- 2009లో శ్రీలంకపై (ఉపుల్ తరంగ)ప్రవీణ్ కుమార్- 2010లో శ్రీలంకపై (ఉపుల్ తరంగ)మొహమ్మద్ సిరాజ్- 2024లో శ్రీలంకపై (పథుమ్ నిస్సంక)మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 45 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. పథుమ్ నిస్సంక 0, అవిష్క ఫెర్నాండో 40, కుశాల్ మెండిస్ 30, సమరవిక్రమ 14, అసలంక 25, లియనగే 12 పరుగులు చేసి ఔట్ కాగా.. వెల్లలగే (37), కమిందు మెండిస్ (18) క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు. -
‘టై’ని బ్రేక్ చేసేదెవరో?
కొలంబో: వన్డే సిరీస్‌లోనూ శుభారంభం చేస్తుందనుకున్న భారత్‌కు తొలి మ్యాచ్ ‘టై’ ఫలితం ఏమాత్రం ఊహించనిది. స్పిన్‌కు అనుకూలించిన పిచ్‌పై ఆతిథ్య బౌలర్లు ఓడే మ్యాచ్‌ను సమం చేసుకున్నారు. బంతులు మిగిలున్నా... స్పిన్ ఉచ్చులో పడి ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయిన భారత్ ఇప్పుడు ఆ ‘టై’ని బ్రేక్ చేసే పనిలో పడింది. ఆదివారం జరిగే రెండో వన్డేలో గెలుపే లక్ష్యంగా రోహిత్ శర్మ బృందం బరిలోకి దిగుతోంది. పైగా ఈ వేదికపై టీమిండియాకు మంచి రికార్డే ఉంది. ఇక్కడ 6 వన్డేల్లో గెలిచిన ఘనత భారత్‌ది! సరిగ్గా మూడేళ్ల క్రితం 2021లో చివరిసారిగా లంక చేతిలో ఓడింది. తర్వాత గత ‘టై’ మినహా ఆడిన ప్రతి మ్యాచ్ గెలిచింది. మిడిలార్డర్ బాధ్యతగా ఆడితే... తొలి వన్డేలో భారత బౌలర్లు, ఓపెనర్లు బాగానే ఆడారు. 231 లక్ష్యఛేదనలో 130/3 స్కోరు వద్ద పటిష్టంగానే ఉంది. 101 పరుగులు చేస్తే గెలిచే చోటా ఏడు వికెట్లు చేతిలో ఉన్న టీమిండియా సరిగ్గా 100 చేసింది. మిడిలార్డర్లో నిలకడలేమి వల్లే జట్టు చివరకు ‘టై’ చేసుకోవాల్సి వచ్చింది. అయితే ఒక్క మ్యాచ్‌తో వేలెత్తిచూపేలా బ్యాటింగ్ ఆర్డర్ అయితే లేదు. కాస్త ఓపిక, అదేపనిగా స్పిన్‌ను ఎదుర్కోనే సహనం కనబరిస్తే చాలు జట్టు గాడిన పడుతుంది. కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్‌లు బ్యాట్ ఝళిపిస్తే సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లవచ్చు. స్పిన్ ట్రాక్ కావడంతో మూడో పేసర్‌కు అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి అర్‡్షదీప్, సిరాజ్‌లకు తోడుగా ముగ్గురు స్పిన్నర్లు అక్షర్, సుందర్, కుల్దీప్లతో బౌలింగ్ దళం బరిలోకి దిగుతుంది. పైచేయి సాధించే పనిలో... పొట్టి ఫార్మాట్లో క్లీన్‌స్వీప్ అయిన ఆతిథ్య శ్రీలంక తొలి వన్డేలో ప్రత్యర్థికి దీటుగా పోరాడింది. ఈ మ్యాచ్‌లో విజయం లభించకపోయినా... వచ్చిన కొండంత ఆత్మవిశ్వాసమే బలంగా ఇప్పుడు లంక బరిలోకి దిగుతోంది. ఓపెనర్లలో నిసాంక సూపర్‌ఫామ్‌లో ఉండటం... స్పిన్నర్లు పట్టు బిగించడం జట్టు స్థయిర్యాన్ని పెంచింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో రెండో మ్యాచ్‌లో గెలిచి పైచేయి సాధించాలని అసలంక సేన భావిస్తోంది. కలిసొచ్చే పిచ్‌పై నమ్ముకున్న స్పిన్ బౌలింగ్ దళం జట్టును ఒడ్డున పడేస్తుందని జట్టు మేనేజ్మెంట్ అంచనాలతో ఉంది. టాపార్డర్‌లో అవిష్క, కుశాల్ మెండిస్, సమరవిక్రమ కూడా తమవంతు పాత్ర పోషిస్తే పరుగుల రాక సులువవుతుంది. లోయర్ ఆర్డర్లో దునిత్ వెలలగే రూపంలో జట్టును ఆదుకునే బ్యాటర్ ఉండటం జట్టుకు అదనపు బలం. బౌలింగ్‌లో స్పిన్నర్లు హసరంగ, అసలంక, ధనంజయ రాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో టి20 సిరీస్‌ల కాకుండా వన్డే సిరీస్ పోటాపోటీగా జరగడం ఖాయం. పిచ్, వాతావరణం ప్రేమదాస స్టేడియం స్పిన్‌కే అనుకూలం. గత మ్యాచ్‌లో పడిన 18 వికెట్లలో స్పిన్నర్ల (13) వాటానే అధికం. దీంతో బ్యాటర్లకు ఇబ్బందులు తప్పవు. ఆదివారం చిరుజల్లు కురిసే అవకాశముంది. జట్లు (అంచనా) భారత్: రోహిత్ (కెప్టెన్ ), గిల్, కోహ్లి, అయ్యర్, కేఎల్ రాహుల్, శివమ్ దూబే, అక్షర్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్, సిరాజ్, అర్‡్షదీప్. శ్రీలంక: అసలంక (కెప్టెన్ ), నిసాంక, అవిష్క ఫెర్నాండో, కుశాల్ మెండీస్, సమరవిక్రమ, లియనగే, వెలలగే, హసరంగ, ధనంజయ, షిరాజ్, అసిత ఫెర్నాండో. -
SL vs ZIM, 2nd ODI: రసవత్తర సమరం.. అంతిమంగా శ్రీలంకదే విజయం
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జింబాబ్వేతో జరిగిన రెండో వన్డేలో ఆతిథ్య శ్రీలంక 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. రసవత్తరంగా సాగిన ఈ సమరంలో శ్రీలంక మరో ఓవర్ మాత్రమే మిగిలి ఉండగా విజయతీరాలకు చేరింది. జనిత్ లియనగే (95) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి శ్రీలంక విజయంలో ప్రధానపాత్ర పోషించాడు. జింబాబ్వే పేసర్ రిచర్డ్ నగరవ ఐదు వికెట్ల ఘనతతో (5/32) శ్రీలంకను ముప్పుతిప్పలు పెట్టాడు. అయినా అంతిమంగా శ్రీలంకనే విజయం వరించింది. కెరీర్లో తొలి ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన నగరవ రికార్డు స్థాయిలో వరుసగా 28వ పరిమిత ఓవర్ల మ్యాచ్‌లో వికెట్ తీసి ఔరా అనిపించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. తీక్షణ (4/31), చమీరా (2/44), వాండర్సే (2/47), మధుషంక (1/24) ధాటికి 44.4 ఓవర్లలో 208 పరుగులకు ఆలౌటైంది. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ (82) మాత్రమే రాణించాడు. జాయ్‌లార్డ్ గుంబీ (30), మిల్టన్ షుంబ (26), ర్యాన్ బర్ల్ (31), క్లైవ్ మదాండే (14) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంకకు నగరవ ముచ్చెమటలు పట్టించాడు. నగరవ ధాటికి శ్రీలంక ఓ దశలో ఓడిపోయేలా కనిపించింది. అయితే లియనగే అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి తన జట్టును ఓటమి బారి నుంచి కాపాడాడు. ఆఖర్లో సహన్ అరచ్చిగే (21), తీక్షణ (18), చమీరా (18 నాటౌట్), వాండర్సే (19 నాటౌట్) తలో చేయి వేయడంతో శ్రీలంక విజయతీరాలకు చేరింది. జింబాబ్వే బౌలర్లలో నగరవతో పాటు సికందర్ రజా (2/32), ముజరబానీ (1/41) వికెట్లు పడగొట్టారు. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక మూడో వన్డే జనవరి 11న జరుగుతుంది. వర్షం కారణంగా తొలి వన్డే తుడిచిపెట్టుకపోయిన విషయం తెలిసిందే. -
రిచా పోరాటం వృథా
ముంబై: గెలవాల్సిన రెండో వన్డేలో భారత మహిళల జట్టు పోరాడి ఓడింది. సిరీస్ పరాజయంతో ఈ ఏడాదిని ముగించింది. 259 లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 47 ఓవర్లలో 237/6 వద్ద పటిష్టంగానే కనిపించింది. 18 బంతుల్లో 22 పరుగుల విజయ సమీకరణం భారత మహిళలకే అనుకూలంగా ఉంది. కానీ తర్వాతి వరుస ఓవర్లలో పూజ (8), హర్లీన్ (1) అవుట్ కావడంతో ఓటమి ఖాయమైంది. 6 బంతుల్లో 16 పరుగులు చేయలేకపోయింది. తుదకు ఆసీస్ మహిళల జట్టు 3 పరుగుల తేడాతో భారత్‌పై గెలిచింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను 2–0తో కైవసం చేసుకుంది. గాయం పంటిబిగువన భరించిన ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రిచా ఘోష్ (117 బంతుల్లో 96; 13 ఫోర్లు)... జెమీమా రోడ్రిగ్స్ (55 బంతుల్లో 44; 3 ఫోర్లు) అండతో అది్వతీయ పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. సిరీస్‌లోని చివరిదైన మూడో వన్డే జనవరి 2న జరుగుతుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆ్రస్టేలియా 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. ఓపెనర్ లిచ్‌ఫిల్డ్ (98 బంతుల్లో 63; 6 ఫోర్లు), వన్‌డౌన్ బ్యాటర్ ఎలీస్ పెరీ (47 బంతుల్లో 50; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలు సాధించారు. ఇద్దరు మూడో వికెట్‌కు 77 పరుగులు జోడించారు. తర్వాత వచ్చిన వారిలో తాలియా (24; 2 ఫోర్లు), అనాబెల్ సదర్లాండ్ (23; 1 ఫోర్), జార్జియా (22; 1 ఫోర్, 1 సిక్స్) కాస్త మెరుగ్గా ఆడారు. అయితే టెయిలెండర్ అలానా కింగ్ (17 బంతుల్లో 28 నాటౌట్; 3 సిక్స్‌లు) కొట్టిన భారీ సిక్సర్లతో ఆసీస్ 250 పైచిలుకు స్కోరు చేయగలిగింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ (5/38) వరుస విరామాల్లో వికెట్లను పడగొట్టింది. తర్వాత భారత్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 255 పరుగులకే పరిమితమైంది. అనాబెల్ సదర్లాండ్ (3/47) కీలక సమయంలో విలువైన వికెట్లను తీసి భారత్ గెలుపు రాతను మార్చింది. ఫీల్డింగ్‌లో గాయపడిన స్నేహ్ రాణా స్థానంలో హర్లీన్ డియోల్ కన్కషన్ సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగింది. బెత్ మూనీ కొట్టిన షాట్‌ను బంతిని అందుకునే క్రమంలో చెరోవైపు నుంచి వచ్చిన స్నేహ్ రాణా, పూజ ఇద్దరి తలలు పరస్పరం ఢీకొని విలవిలలాడారు. తలనొప్పితో స్నేహ్రాణా మైదానం వీడింది. స్కోరు వివరాలు ఆ్రస్టేలియా ఇన్నింగ్స్: లిచ్‌ఫిల్డ్ (సి) రిచా (బి) శ్రేయాంక 63; అలీసా హీలీ (బి) పూజ 13; ఎలీస్ పెరీ (సి) శ్రేయాంక (బి) దీప్తి శర్మ 50; బెత్ మూనీ (ఎల్బీడబ్ల్యూ) (బి) దీప్తి శర్మ 10; తాలియా (బి) దీప్తి శర్మ 24; గార్డ్నెర్ (సి) అమన్‌జీత్ (బి) స్నేహ్ రాణా 2; అనాబెల్ (సి అండ్ బి) దీప్తి 23; జార్జియా (సి) స్మృతి (బి) దీప్తి శర్మ 22; అలానా కింగ్ (నాటౌట్) 28; కిమ్ గార్త్ (నాటౌట్) 11; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 258. వికెట్ల పతనం: 1–40, 2–117, 3–133, 4–160, 5–170, 6–180, 7–216, 8–219. బౌలింగ్: రేణుక 7–0–36–0, పూజ 10–0–59–1, అమన్‌జోత్ 3–0–21–0, శ్రేయాంక 10–0–43–1, స్నేహ్ రాణా 10–0–59–1, దీప్తి శర్మ 10–0–38–5. భారత్ ఇన్నింగ్స్: యస్తిక (ఎల్బీడబ్ల్యూ) (బి) కిమ్ గార్త్ 14; స్మృతి (సి) తాలియా (బి) అలానా 34; రిచా ఘోష్ (సి) లిచ్‌ఫిల్డ్ (బి) అనాబెల్ 96; జెమీమా (సి) లిచ్‌ఫిల్డ్ (బి) వేర్హమ్ 44; హర్మన్‌ప్రీత్ (సి) హీలీ (బి) వేర్హమ్ 5; దీప్తి శర్మ (నాటౌట్) 24; అమన్‌జోత్ (బి) అనాబెల్ 4; పూజ (సి) గార్డ్నెర్ (బి) అనాబెల్ 8; హర్లీన్ (బి) గార్డ్నెర్ 1; శ్రేయాంక (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 20; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 255. వికెట్ల పతనం: 1–37, 2–71, 3–159, 4–171, 5–218, 6–224, 7–240, 8–243. బౌలింగ్: గార్డ్నెర్ 10–0–46–1, బ్రౌన్ 7–0–37–0, కిమ్ గార్త్ 6–0–24–1, అనాబెల్ సదర్లాండ్ 9–0–47–3, అలానా కింగ్ 7–0–43–1, తాలియా 4–0–15–0, జార్జియా వేర్హమ్ 7–0–39–2. -
రిచా ఘోష్ వీరోచిత పోరాటం వృధా.. రెండో వన్డేలోనూ టీమిండియా ఓటమి
ముంబై వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా యువ బ్యాటర్ రిచా ఘోష్ వీరోచిత పోరాటం (117 బంతుల్లో 96; 13 ఫోర్లు) వృధా అయ్యింది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ నిర్ధేశించిన 259 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. రిచా ఘోష్ చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో రాణించినప్పటికీ ఆఖర్లో వరుసగా వికెట్లు కోల్పోవడంతో వరుసగా రెండో మ్యాచ్‌లో ఓటమిపాలైంది. తద్వారా భారత్ సిరీస్‌ను సైతం 0-2తో కోల్పోయింది. రిచాకు జెమీమా రోడ్రిగెజ్ (44), స్మృతి మంధన (34) సహకరించినప్పటికీ.. ఆఖర్లో భారత బ్యాటర్లు ఒక్కో పరుగు చేసేందుకు కూడా ఇబ్బంది పడి వికెట్లు సమర్పించుకున్నారు. దీప్తి శర్మ (24 నాటౌట్) టీమిండియాను గట్టెక్కించే ప్రయత్నం చేసింది. భారత్ నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి లక్ష్యానికి నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోయింది (255/8). గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమిపాలు కావడంతో టీమిండియా అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. సదర్‌ల్యాండ్ (3/47), వేర్హమ్ (2/39) టీమిండియాను దెబ్బకొట్టారు. అంతకుముందు దీప్తి శర్మ (10-0-38-5) ఐదు వికెట్ల ప్రదర్శనతో విజృంభించడంతో టీమిండియా.. ఆసీస్‌ను 258 పరుగులకు (8 వికెట్ల నస్టానికి) పరిమితం చేయగలిగింది. దీప్తితో పాటు పూజా వస్త్రాకర్, స్నేహ్ రాణా, శ్రేయాంక పాటిల్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో భారత ఫీల్డర్లు ఏకంగా ఏడు క్యాచ్‌లు జారవిడిచడం విశేషం. ఆసీస్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ లిచ్‌ఫీల్డ్ (63), ఎల్లైస్ పెర్రీ (50) అర్ధసెంచరీలతో రాణించగా.. తహిళ మెక్‌గ్రాత్ (24), సదర్‌ల్యాండ్ (23), జార్జ్ వేర్హమ్ (22), అలానా కింగ్ (28 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఈ సిరీస్‌లో తొలి వన్డేలో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. అంతకుముందు ఇదే సిరీస్‌లో భాగంగా జరిగిన ఏకైక టెస్ట్‌లో భారత్ ఆసీస్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. చరిత్ర సృష్టించిన దీప్తి శర్మ.. ఆసీస్‌పై రెండో వన్డేలో ఐదు వికెట్ల ప్రదర్శనతో దీప్తి శర్మ ఓ అరుదైన ఘనత సాధించింది. ఆసీస్‌పై వన్డేల్లో ఐదు వికెట్ల ఘనత సాధించిన తొలి భారత మహిళా బౌలర్‌గా రికార్డుల్లోకెక్కింది. -
INDW VS AUSW 2nd ODI: ఆసీస్ వెన్ను విరిచిన దీప్తి శర్మ
మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ముంబై వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియాతో (మహిళల జట్టు) జరుగుతున్న రెండో మ్యాచ్‌లో టీమిండియా స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ సత్తా చాటింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేయగా.. దీప్తి శర్మ ఐదు వికెట్ల ప్రదర్శనతో ఆసీస్ వెన్ను విరిచింది. తన కోటా 10 ఓవర్లు పూర్తి చేసిన దీప్తి కేవలం 38 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు కీలక వికెట్లు పడగొట్టింది. దీప్తితో పాటు పూజా వస్త్రాకర్, స్నేహ్ రాణా, శ్రేయాంక పాటిల్ తలో వికెట్ పడగొట్టడంతో ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లో వస్త్రాకర్ 18 పరుగులు సమర్పించుకోవడంతో ఆసీస్ 250 పరుగుల మార్కును దాటగలిగింది. ఈ మ్యాచ్‌లో భారత ఫీల్డర్లు ఏకంగా ఏడు క్యాచ్‌లు జారవిడిచడం విశేషం. ఆసీస్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ లిచ్‌ఫీల్డ్ (63), ఎల్లైస్ పెర్రీ (50) అర్ధసెంచరీలతో రాణించగా.. తహిళ మెక్‌గ్రాత్ (24), సదర్‌ల్యాండ్ (23), జార్జ్ వేర్హమ్ (22), అలానా కింగ్ (28 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఈ సిరీస్‌లో తొలి వన్డేలో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. అంతకుముందు ఇదే సిరీస్‌లో భాగంగా జరిగిన ఏకైక టెస్ట్‌లో భారత్ ఆసీస్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. వన్డే సిరీస్ అనంతరం ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కూడా జరుగనుంది. చరిత్ర సృష్టించిన దీప్తి శర్మ.. ఆసీస్‌పై రెండో వన్డేలో ఐదు వికెట్ల ప్రదర్శనతో దీప్తి శర్మ ఓ అరుదైన ఘనత సాధించింది. ఆసీస్‌పై వన్డేల్లో ఐదు వికెట్ల ఘనత సాధించిన తొలి భారత మహిళా బౌలర్‌గా రికార్డుల్లోకెక్కింది. -
భారత్‌కు చుక్కెదురు
పోర్ట్ ఎలిజబెత్: వరుసగా రెండో వన్డే గెలిచి సిరీస్‌నూ కైవసం చేసుకోవాలనుకున్న భారత్ ఆశలు మూకుమ్మడి వైఫల్యంతో ఆవిరయ్యాయి. నిలకడలేని బ్యాటింగ్, పసలేని బౌలింగ్, నిలువెత్తు నిర్లక్ష్యం భారత్ కొంపముంచాయి. ఇదే అదనుగా దక్షిణాఫ్రికా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో భారత్‌ను దెబ్బకొట్టింది. దీంతో మంగళవారం జరిగిన రెండో వన్డేలో టీమిండియా 8 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో పరాజయం చవిచూసింది. ఆతిథ్య జట్టు సిరీస్‌ను 1–1తో సమం చేసింది. చివరిదైన మూడో వన్డే రేపు పార్ల్‌లో జరుగుతుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 46.2 ఓవర్లలో 211 పరుగులకే ఆలౌటైంది. టాపార్డర్‌లో సాయి సుదర్శన్ (83 బంతుల్లో 62; 7 ఫోర్లు, 1 సిక్స్), మిడిలార్డర్లో కేఎల్ రాహుల్ (64 బంతుల్లో 56; 7 ఫోర్లు)... ఈ ఇద్దరు తప్ప ఇంకెవరూ కనీసం 20 పరుగులైన చేయలేకపోయారు. సఫారీ బౌలర్లు బర్జర్ (3/30), బ్యురన్ హెన్డ్రిక్స్ (2/34), కేశవ్ మహరాజ్ (2/51) సమష్టిగా దెబ్బతీశారు. క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లను పూర్తిగా ఆడలేకపోయింది. అనంతరం సులువైన లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా 42.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 215 పరుగులు చేసి ఛేదించింది. ఓపెనర్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ టోని డి జోర్జి (122 బంతుల్లో 119 నాటౌట్; 9 ఫోర్లు, 6 సిక్స్‌లు) అజేయ సెంచరీతో కదంతొక్కగా, రీజా హెన్డ్రిక్స్ (81 బంతుల్లో 52; 7 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించాడు. ఇద్దరు తొలి వికెట్‌కు 130 పరుగులు చేయడంతోనే భారత్ పరాజయం ఖాయమైంది. వాన్ డర్ డసెన్ (36; 5 ఫోర్లు) మెరుగ్గా ఆడాడు. ఈ మ్యాచ్‌తో రింకూ సింగ్ వన్డేల్లో అరంగేట్రం చేశాడు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రుతురాజ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) బర్జర్ 4; సాయి సుదర్శన్ (సి) క్లాసెన్ (బి) విలియమ్స్ 62; తిలక్‌వర్మ (సి) బ్యురన్ హెన్డ్రిక్స్ (బి) బర్జర్ 10; రాహుల్ (సి) మిల్లర్ (బి) బర్జర్ 56; సామ్సన్ (బి) బ్యురన్ హెన్డ్రిక్స్ 12; రింకూ సింగ్ (స్టంప్డ్) క్లాసెన్ (బి) కేశవ్ 17; అక్షర్ (సి) సబ్–వెరెన్ (బి) మార్క్రమ్ 7; కుల్దీప్ (సి) బ్యురన్ హెన్డ్రిక్స్ (బి) కేశవ్ 1; అర్ష్ దీప్ (సి) మిల్లర్ (బి) బ్యురన్ హెన్డ్రిక్స్ 18; అవేశ్ (రనౌట్) 9; ముకేశ్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (46.2 ఓవర్లలో ఆలౌట్) 211. వికెట్ల పతనం: 1–4, 2–46, 3–114, 4–136, 5–167, 6–169, 7–172, 8–186, 9–204, 10–211. బౌలింగ్: బర్జర్ 10–0–30–3, విలియమ్స్ 9–1–49–1, బ్యురన్ హెన్డ్రిక్స్ 9.2–1–34–2, ముల్డర్ 4–0–19–0, కేశవ్ 10–0–51–2, మార్క్రమ్ 4–0–28–1. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: రీజా హెన్డ్రిక్స్ (సి) ముకేశ్ (బి) అర్ష్‌దీప్ 52; టోని (నాటౌట్) 119; డసెన్ (సి) సామ్సన్ (బి) రింకూ 36; మార్క్రమ్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (42.3 ఓవర్లలో 2 వికెట్లకు) 215. వికెట్ల పతనం: 1–130, 2–206. బౌలింగ్: ముకేశ్ 8–2–46–0, అర్ష్‌దీప్ 8–0–28–1, అవేశ్ 8–0–43–0, అక్షర్ 6–0–22–0, కుల్దీప్ 8–0–48–0, తిలక్ వర్మ 3–0–18–0, రింకూ సింగ్ 1–0–2–1, సాయి సుదర్శన్ 0.3–0–8–0. -
శతక్కొట్టిన సౌతాఫ్రికా ఓపెనర్.. రెండో వన్డేలో టీమిండియా ఓటమి
శతక్కొట్టిన సౌతాఫ్రికా ఓపెనర్.. రెండో వన్డేలో టీమిండియా ఓటమి దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. పోర్ట్ ఎలిజబెత్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 46.2 ఓవర్లలో 211 పరుగులకు ఆలౌట్ కాగా.. సౌతాఫ్రికా కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 42.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. భారత ఇన్నింగ్స్‌లో సాయి సుదర్శన్ (62), కేఎల్ రాహుల్ (56) అర్ధసెంచరీలతో రాణించగా.. సౌతాఫ్రికాను యువ ఓపెనర్ టోనీ జోర్జీ (119) అజేయమైన శతకంతో విజయతీరాలకు చేర్చాడు. ఈ సిరీస్‌లో తొలి వన్డేలో భారత్ గెలవగా.. రెండో వన్డేలో సౌతాఫ్రికా విజయం సాధించింది. నిర్ణయాత్మకమైన మూడో వన్డే డిసెంబర్ 21న జరుగనుంది. శతక్కొట్టిన టోనీ జోర్జీ దక్షిణాఫ్రికా యువ ఓపెనర్ టోనీ జోర్జీ 109 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. టోనీకి కెరీర్లో ఇది తొలి సెంచరీ. 37 ఓవర్ల తర్వాత సౌతాఫ్రికా స్కోర్ 187/1. ఎట్టకేలకు తొలి వికెట్ పడింది.. 212 పరుగుల లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 130 పరుగుల వద్ద (27.5వ ఓవర్) తొలి వికెట్ కోల్పోయింది. అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో రీజా హెండ్రిక్స్ (52) ఔటయ్యాడు. టోనీ జోర్జీ (75), డస్సెన్ క్రీజ్‌లో ఉన్నారు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న జోర్జీ సౌతాఫ్రికా ఓపెనర్ టోనీ జోర్జీ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతనికి జతగా మరో ఓపెనర్ రీజా హెండ్రిక్స్ 25 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. 18 ఓవర్ల తర్వాత సౌతాఫ్రికా స్కోర్ 77/0గా ఉంది. టార్గెట్ 212.. ఆచితూచి ఆడుతున్న సౌతాఫ్రికా 212 పరుగుల లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా ఆచితూచి ఆడుతుంది. 7 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 29/0గా ఉంది. టోనీ డి జర్జీ (21), రీజా హెండ్రిక్స్ (7) క్రీజ్‌లో ఉన్నారు. 211 పరుగులకు ఆలౌటైన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 46.2 ఓవర్లలో 211 పరుగులకు ఆలౌటైంది. ఆవేశ్ ఖాన్ (9) ఆఖరి వికెట్‌గా వెనుదిరిగాడు. భారత ఇన్నింగ్స్‌లో సాయి సుదర్శన్ (62), కేఎల్ రాహుల్ (56) మాత్రమే అర్ధసెంచరీలతో రాణించారు. సఫారీ బౌలర్లలో నంబ్రే బర్గర్ 3, హెండ్రిక్స్, కేశవ్ మహారాజ్ చెరో 2, లిజాడ్ విలియమ్స్, ఎయిడెన్ మార్క్రమ్ తలో వికెట్ పడగొట్టారు. ఎనిమిదో వికెట్ కోల్పోయిన టీమిండియా 186 పరుగుల వద్ద టీమిండియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. మార్క్రమ్ బౌలింగ్‌లో అక్షర్ పటేల్ (7) ఔటయ్యాడు. పేక మేడలా కూలుతున్న టీమిండియా ఇన్నింగ్స్ ఆరంభంలో కాస్త మెరుగ్గా ఆడిన టీమిండియా, ఆతర్వాత వరుసగా వికెట్లు కోల్పోతుంది. 172 పరుగుల వద్ద భారత జట్టు ఏడో వికెట్ కోల్పోయింది. కేశవ్ మహారాజ్ బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్ (1) ఔటయ్యాడు. ఆరో వికెట్ కోల్పోయిన టీమిండియా 169 పరుగుల వద్ద టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. కేశవ్ మహారాజ్ బౌలింగ్‌లో రింకూ సింగ్ (17) స్టంపౌటయ్యాడు. 167 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన టీమిండియా టీమిండియా 167 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. హాఫ్ సెంచరీ అనంతరం కేఎల్ రాహుల్ (56) ఔటయ్యాడు. నండ్రే బర్గర్ బౌలింగ్‌లో మిల్లర్‌కు క్యాచ్ ఇచ్చి రాహుల్ పెవిలియన్ బాట పట్టాడు. సంజూ శాంసన్ క్లీన్ బౌల్డ్ 136 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. హెండ్రిక్స్ బౌలింగ్‌లో సంజూ శాంసన్ (12) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా.. సాయి సుదర్శన్ ఔట్ 114 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. 62 పరుగులు చేసి సాయి సుదర్శన్ ఔటయ్యాడు. లిజాడ్ విలియమ్స్ బౌలింగ్‌లో క్లాసెన్‌కు క్యాచ్ ఇచ్చి సుదర్శన్ పెవిలియన్‌కు చేరాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసిన సాయి సుదర్శన్ టీమిండియా ఓపెనర్ సాయి సుదర్శన్ తన వన్డే కెరీర్లో వరుసగా రెండో హాఫ్ సెంచరీ సాధించాడు. సౌతాఫ్రికాతో సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి వన్డేలో అజేయమైన అర్ధశతకం సాధించిన సుదర్శన్.. రెండో వన్డేలోనూ హాఫ్ సెంచరీ మార్కును దాటాడు. 20 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 84/2గా ఉంది. సుదర్శన్‌తో పాటు కేఎల్ రాహుల్ (15) క్రీజ్‌లో ఉన్నాడు. నత్త నడకన సాగుతున్న టీమిండియా బ్యాటింగ్ టీమిండియా బ్యాటింగ్ నత్త నడకను తలపిస్తుంది. 15 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 54/2గా ఉంది. సాయి సుదర్శన్ (36), కేఎల్ రాహుల్ (1) క్రీజ్‌లో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా.. 46 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 10 పరుగులు చేసిన తిలక్ వర్మ.. బర్గర్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి కెప్టెన్ రాహుల్ వచ్చాడు. రెండో బంతికే వికెట్ కోల్పోయిన టీమిండియా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా రెండో బంతికే వికెట్ కోల్పోయింది. నంబ్రే బర్గర్ బౌలింగ్‌లో తొలి బంతికి బౌండరీ బాదిన రుతురాజ్ ఆతర్వాతి బంతికే ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. రుతురాజ్ రివ్యూకి వెళ్లడంతో భారత్ ఓ రివ్యూ కోల్పోయింది. పోర్ట్ ఎలిజబెత్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో సౌతాఫ్రికా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా ఒకటి, సౌతాఫ్రికా రెండు మార్పులు చేసింది. భారత్ తరఫున శ్రేయస్ అయ్యర్ స్థానాన్ని రింకూ సింగ్ భర్తీ చేశాడు. ఈ మ్యాచ్‌తో రింకూ వన్డే అరంగట్రేం చేయనున్నాడు. మరోవైపు సౌతాఫ్రికా రెండు మార్పులు చేసింది. ఆండిలే ఫెహ్లుక్వాయో, తబ్రేజ్ షంషి స్థానాల్లో బ్యూరాన్ హెండ్రిక్స్, లిజాడ్ విలియమ్స్ తుది జట్టులోకి వచ్చారు. తుది జట్లు: భారత్: సాయి సుదర్శన్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్ (కెప్టెన్), రింకూ సింగ్, సంజు శాంసన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్ దక్షిణాఫ్రికా: టోనీ డి జోర్జి, రీజా హెండ్రిక్స్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, కేశవ్ మహరాజ్, నండ్రే బర్గర్, బ్యూరాన్ హెండ్రిక్స్, లిజాడ్ విలియమ్స్ -
సిరీస్ విజయమే లక్ష్యంగా...
పోర్ట్ ఎలిజబెత్: దక్షిణాఫ్రికాతో తొలి వన్డేలో అదరగొట్టిన భారత జట్టు ఇప్పుడు అదే తరహాలో మరో గెలుపుపై కన్నేసింది. ఒక మ్యాచ్ ముందే సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకోవాలని పట్టుదలగా ఉంది. గత మ్యాచ్ ఘన విజయం ఇచ్చి న ఉత్సాహం టీమిండియాలో కనిపిస్తుండగా... సొంతగడ్డపై అనూహ్యంగా 116 పరుగులకే కుప్పకూలిన దక్షిణాఫ్రికా తమ టీమ్ ప్రదర్శనపై కొత్త సందేహాలు రేపింది. మూడో టి20లో ఓటమి తర్వాత తొలి వన్డేలో ఆ జట్టు ఆటతీరు మరీ పేలవంగా కనిపించింది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య నేడు రెండో వన్డే మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. భారత్ సిరీస్ అందుకుంటుందా లేక సఫారీ టీమ్ కోలుకొని తగిన రీతిలో బదులిస్తుందా అనేది చూడాలి. రజత్ పటిదార్‌కు అవకాశం! గత మ్యాచ్‌లో భారత బౌలర్లు అర్‡్షదీప్, అవేశ్ ఖాన్ ప్రత్యర్థిని పడగొట్టగా... ఐదో బౌలర్ అవసరం కూడా రాకుండానే దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ముగిసింది. అరంగేట్ర మ్యాచ్‌లోనే సాయి సుదర్శన్ ఆకట్టుకున్నాడు. ఈ స్థితిలో తుది జట్టులో ఎలాంటి మార్పు అవసరం లేకుండానే జట్టు బరిలోకి దిగేది. అయితే టెస్టు సిరీస్ సన్నద్ధత కోసం శ్రేయస్ అయ్యర్ ఈ మ్యాచ్‌తో పాటు తర్వాతి మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు. దాంతో బ్యాటింగ్ విభాగంలో ఒక ఖాళీ ఏర్పడింది. చాలా కాలంగా తొలి అవకాశం కోసం ఎదురు చూస్తున్న మధ్యప్రదేశ్ బ్యాటర్ రజత్ పటిదార్‌కు నేరుగా చోటు దక్కనుంది. ఈ స్థానం కోసం రింకూ సింగ్ నుంచి కూడా పోటీ ఉన్నా... టి20 సిరీస్‌లో అవకాశం దక్కించుకున్న రింకూకంటే రజత్‌కే మొదటి ప్రాధాన్యత దక్కనుంది. తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్ చేయని రాహుల్, సంజు సామ్సన్‌లు కూడా రాణిస్తే భారత్‌కు తిరుగుండదు. బౌలింగ్‌లో మరోసారి కుల్దీప్ పదునైన బంతులను సఫారీలు ఎలా ఎదుర్కొంటారో చూడాలి. హెన్‌డ్రిక్స్‌పై దృష్టి... దక్షిణాఫ్రికా కూడా గత ఓటమిని మరచి కోలుకునే ప్రయత్నంలో ఉంది. అయితే ఆ జట్టు బ్యాటింగ్‌లో ఆత్మవిశ్వాసం కనిపించడం లేదు. ఎన్నో అంచనాలతో వన్డేల్లో వరుసగా అవకాశం దక్కించుకుంటున్న ఓపెనర్ హెన్డ్రిక్స్ పేలవంగా ఆడుతుండగా... డసెన్, మార్క్రమ్, మిల్లర్ కూడా ప్రభావం చూపలేకపోతున్నారు. భారత గడ్డపై వరల్డ్ కప్‌లో చెలరేగిన క్లాసెన్ సొంత మైదానంలో మాత్రం ఇంకా తన స్థాయిని ప్రదర్శించలేదు. అనుభవం లేని బర్జర్, ముల్దర్‌ల బౌలింగ్ భారత్‌కు ఏమాత్రం ఇబ్బంది పెట్టలేదు. పిచ్ కారణంగా ఈ సారి కూడా ఇద్దరు స్పిన్నర్లు కేశవ్, షమ్సీ తుది జట్టులో ఉంటారు. పిచ్, వాతావరణం దక్షిణాఫ్రికా అత్యంత నెమ్మదైన మైదానాల్లో ఇదొకటి. సాధారణ పిచ్. భారీ స్కోర్లకు అవకాశం లేదు. గత 12 ఏళ్లలో ఇక్కడ 8 వన్డేలు జరగ్గా... ఒక్కసారి కూడా స్కోరు 300 దాటలేదు. మ్యాచ్‌కు అనుకూల వాతావరణం ఉంది. వర్షసూచన లేదు. -
ఇండోర్‌లో ఇరగదీశారు.. సిరీస్ మనదే
వరల్డ్ కప్‌కు ముందు భారత్ అదరగొట్టే ప్రదర్శన... పలువురు కీలక ఆటగాళ్లు లేకపోయినా అద్భుత ఆటతో టీమిండియా బృందం ఆ్రస్టేలియాకు చుక్కలు చూపించింది. భారీ విజయమే కాకుండా ఇప్పటి వరకు వరకు బెంగగా ఉన్న శ్రేయస్ ఫామ్ సమస్య కూడా తొలగిపోగా... సూర్యకుమార్ కూడా ఎట్టకేలకు తన అసలు ప్రతాపాన్ని చూపించాడు. ఫలితంగా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2–0తో సిరీస్ భారత్ సొంతమైంది. ఇండోర్: సమష్టి ప్రదర్శనతో అదరగొట్టిన భారత్ ఆదివారం హోల్కర్ స్టేడియంలో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో 99 పరుగుల తేడాతో ఆ్రస్టేలియాను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా జట్టుపై భారత్‌కు వన్డేల్లో ఇదే అత్యధిక స్కోరు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శ్రేయస్ అయ్యర్ (90 బంతుల్లో 105; 11 ఫోర్లు, 3 సిక్స్‌లు), శుబ్‌మన్ గిల్ (97 బంతుల్లో 104; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీలతో సత్తా చాటారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 164 బంతుల్లోనే 200 పరుగులు జోడించడం విశేషం. ఈ ఇద్దరితో పాటు సూర్యకుమార్ యాదవ్ (37 బంతుల్లో 72 నాటౌట్; 6 ఫోర్లు, 6 సిక్స్‌లు), కేఎల్ రాహుల్ (38 బంతుల్లో 52; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) కూడా దూకుడుగా ఆడటంతో భారత్ భారీ స్కోరు సాధించగలిగింది. భారత్ ఇన్నింగ్స్‌లో ఏకంగా 31 ఫోర్లు, 18 సిక్సర్లు ఉండటం విశేషం. అనంతరం వర్షం కారణంగా ఆ్రస్టేలియా లక్ష్యాన్ని 33 ఓవర్లలో 317 పరుగులుగా (డక్‌వర్త్ లూయిస్ ప్రకారం) నిర్దేశించారు. ఆసీస్ 28.2 ఓవర్లలో 217 పరుగులకు ఆలౌటైంది. వార్నర్ (39 బంతుల్లో 53; 7 ఫోర్లు, 1 సిక్స్), అబాట్ (36 బంతుల్లో 54; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధసెంచరీలు చేశారు. చివరి వన్డే బుధవారం రాజ్‌కోట్‌లో జరుగుతుంది. చివరి వరకు మెరుపులు... అరంగేట్ర బౌలర్ స్పెన్సర్ వేసిన తొలి ఓవర్లోనే రెండు ఫోర్లు కొట్టిన రుతురాజ్ (8) ఎక్కువసేపు నిలవలేదు. అయితే నాలుగో ఓవర్ ఐదో బంతి నుంచి మొదలైన గిల్, శ్రేయస్ భాగస్వామ్యం ఆస్ట్రేలియాను ఒక ఆటాడుకుంది. గత మ్యాచ్‌లో రనౌటై తీవ్ర నిరాశకు గురైన శ్రేయస్ ఈసారి తనను తాను నిరూపించుకునే ప్రయత్నంలో జోరు ప్రదర్శించాడు. తన తొలి 14 బంతుల్లోనే అతను 5 ఫోర్లు కొట్టాడు. అబాట్ ఓవర్లో గిల్ 6, 4 కొట్టడంతో భాగస్వామ్యం 29 బంతుల్లోనే 50 పరుగులకు చేరింది. వానతో 40 నిమిషాల విరామం తర్వాత ఆట మళ్లీ మొదలైంది. గిల్ 37 బంతుల్లో, శ్రేయస్ 41 బంతుల్లో అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఈ భాగస్వామ్యాన్ని విడదీసేందుకు ఆసీస్ బౌలర్లు తీవ్రంగా శ్రమించినా లాభం లేకపోయింది. తన ధాటిని కొనసాగిస్తూ 86 బంతుల్లో కెరీర్లో మూడో సెంచరీ అందుకున్న శ్రేయస్ తర్వాతి ఓవర్లో వెనుదిరగ్గా... కొద్ది సేపటికే 92 బంతుల్లో గిల్ ఆరో వన్డే సెంచరీ పూర్తయింది. గిల్ కూడా అవుటయ్యాక ఇషాన్ (18 బంతుల్లో 31; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), రాహుల్, సూర్య కలిసి మరింత దూకుడుగా ఆడారు. 43 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 311/4. ఈ దశలో సూర్య మెరుపు బ్యాటింగ్‌తో ఇండోర్ దద్దరిల్లింది. తర్వాతి 7 ఓవర్లలో భారత్ 88 పరుగులు చేయగా... అందులో సూర్య ఒక్కడే 68 పరుగులు సాధించడం విశేషం. 24 బంతుల్లోనే అతను హాఫ్ సెంచరీ మార్క్‌ను చేరుకున్నాడు. అశ్విన్‌కు 3 వికెట్లు... ఛేదనలో ఆసీస్ ఆరంభంలోనే తడబడింది. ప్రసిధ్ తన తొలి ఓవర్లోనే వరుస బంతుల్లో షార్ట్ (9), స్మిత్ (0)లను అవుట్ చేసి దెబ్బ కొట్టాడు. ఆ తర్వాత వార్నర్, లబుషేన్ (27) కలిసి మూడో వికెట్‌కు 80 పరుగులు జోడించి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే వీరిద్దరితో పాటు ఇన్‌గ్లిస్ (6)ను 12 పరుగుల వ్యవధిలో అశ్విన్ అవుట్ చేయడంతో ఆసీస్ కోలుకోలేకపోయింది. ఆఖర్లో సీన్ అబాట్, హాజల్‌వుడ్ (23) కలిసి తొమ్మిదో వికెట్‌కు 44 బంతుల్లోనే 77 పరుగులు జోడించి పోరాడినా లక్ష్యానికి జట్టు చాలా దూరంలో ఆగిపోయింది. వరుసగా 4 సిక్సర్లు... గత మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో రాణించిన సూర్యకుమార్ ఈసారి తన అసలైన 360 డిగ్రీ ఆటను ప్రదర్శించాడు. ముఖ్యంగా గ్రీన్ వేసిన ఇన్నింగ్స్ 44వ ఓవర్లో అతను అద్భుత షాట్లతో చెలరేగాడు. తొలి నాలుగు బంతులను అతను లాంగ్ లెగ్, ఫైన్ లెగ్, కవర్స్, డీప్ మిడ్‌వికెట్ మీదుగా సికర్లుగా మలచడం విశేషం. ఆట చూస్తే తర్వాతి రెండు బంతులూ సిక్సర్లుగా మారతాయేమో అనిపించింది. అయితే గ్రీన్ రెండు చక్కటి బంతులతో కట్టడి చేయడంలో సఫలమయ్యాడు. వార్నర్ రైట్ హ్యాండర్‌గా... ఆసీస్ ఇన్నింగ్స్ 13వ ఓవర్లో వార్నర్ అనూహ్యంగా గార్డ్ తీసుకొని మరీ పూర్తి స్థాయి ‘రైట్ హ్యాండ్’ బ్యాటర్‌గా ఆడాడు. అశ్విన్ వేసిన ఈ ఓవర్లో ఒక చక్కటి ఫోర్ సహా అతను 6 పరుగులు చేశాడు. అయితే అశ్విన్ తర్వాతి ఓవర్లోనూ ఇలాగే దిగి లెఫ్ట్ హ్యాండర్ తరహాలో రివర్స్ స్వీప్ ఆడబోయి తొలి బంతికే ఎల్బీగా అవుటయ్యాడు. వార్నర్ దీనిని రివ్యూ చేయకపోగా, రీప్లేలో బంతి అతని బ్యాట్‌ను తాకినట్లు తేలింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రుతురాజ్ (సి) క్యారీ (బి) హాజల్‌వుడ్ 8; గిల్ (సి) క్యారీ (బి) గ్రీన్ 104; శ్రేయస్ (సి) షార్ట్ (బి) అబాట్ 105; రాహుల్ (బి) గ్రీన్ 52; ఇషాన్ కిషన్ (సి) క్యారీ (బి) జంపా 31; సూర్యకుమార్ (నాటౌట్) 72; జడేజా (నాటౌట్) 13; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (50 ఓవర్లలో 5 వికెట్లకు) 399. వికెట్ల పతనం: 1–16, 2–216, 3–243, 4–302, 5–355. బౌలింగ్: స్పెన్సర్ 8–0–61–0, హాజల్‌వుడ్ 10–0–62–1, అబాట్ 10–0–91–1, గ్రీన్ 10–0–103–2, జంపా 10–0–67–1, షార్ట్ 2–0–15–0. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: షార్ట్ (సి) అశ్విన్ (బి) ప్రసిధ్ 9; వార్నర్ (ఎల్బీ) (బి) అశ్విన్ 53; స్మిత్ (సి) గిల్ (బి) ప్రసిధ్ 0; లబు షేన్ (బి) అశ్విన్ 27; ఇన్‌గ్లిస్ (ఎల్బీ) (బి) అశ్విన్ 6; క్యారీ (బి) జడేజా 14; గ్రీన్ (రనౌట్) 19; అబాట్ (బి) జడేజా 54; జంపా (బి) జడేజా 5; హాజల్‌వుడ్ (బి) షమీ 23; స్పెన్సర్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (28.2 ఓవర్లలో ఆలౌట్) 217. వికెట్ల పతనం: 1–9, 2–9, 3–89, 4–100, 5–101, 6–128, 7–135, 8–140, 9–217, 10–217. బౌలింగ్: షమీ 6–0–39–1, ప్రసిధ్ 6–0–56–2, అశ్విన్ 7–0–41–3, శార్దుల్ 4–0–35–0, జడేజా 5.2–0–42–3. -
భారత బ్యాటర్ల విశ్వరూపం.. చెత్త రికార్డు మూటగట్టుకున్న గ్రీన్
ఇండోర్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో భారత బ్యాటర్లు విశ్వరూపం ప్రదర్శించడంతో ఆసీస్ యువ పేసర్ కెమరూన్ గ్రీన్ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 10 ఓవర్లు బౌల్ చేసిన గ్రీన్ రికార్డు స్థాయిలో 103 పరుగులు సమర్పించుకుని, వన్డేల్లో ఆసీస్ తరఫున మూడో చెత్త బౌలింగ్ గణాంకాలను (పరుగుల పరంగా) నమోదు చేశాడు. 2006లో జోహనెస్‌బర్గ్‌లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ బౌలర్ మిక్ లెవిస్ సమర్పించుకున్న 113 పరుగులు వన్డేల్లో ఆసీస్ తరఫున అత్యంత చెత్త బౌలింగ్ ప్రదర్శన కాగా.. కొద్ది రోజుల కిందట అదే సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఆడమ్ జంపా కూడా 113 పరుగులు సమర్పించుకుని ఆసీస్ తరఫున రెండో చెత్త బౌలింగ్ ప్రదర్శనను నమోదు చేశాడు. తాజాగా గ్రీన్ భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 103 పరుగులు సమర్పించుకుని వన్డేల్లో ఆసీస్ తరఫున మూడో చెత్త బౌలింగ్ ప్రదర్శనను నమోదు చేశాడు. వన్డేల్లో ఆసీస్ తరఫున ఓ ఇన్నింగ్స్‌లో 100 అంతకంటే ఎక్కువ పరుగులు సమర్పించుకున్న బౌలర్లు మొత్తం నలుగురు కాగా.. వారిలో మిక్ లెవిస్, ఆడమ్ జంపా, కెమరూన్ గ్రీన్, ఆండ్రూ టై (100) ఉన్నారు. ఇవాల్టి మ్యాచ్‌లో గ్రీన్ 2 వికెట్లు తీసినప్పటికీ ధారాళంగా పరుగులు సమర్పించుకుని చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. వన్డేల్లో భారత్‌పై అత్యంత చెత్త ప్రదర్శనల్లో గ్రీన్ ఇవాల్టి మ్యాచ్ ప్రదర్శన (2/103) మూడో స్థానంలో నిలిచింది. గ్రీన్ కంటే ముందు లంక బౌలర్ నువాన్ ప్రదీప్ (0/106), టిమ్ సౌథీ (0/105) ఉన్నారు. కాగా, రెండో వన్డేలో టాస్ ఓడి ఆసీస్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 399 పరుగుల భారీ స్కోర్ చేసింది. శుభ్‌మన్ గిల్ (104), శ్రేయస్ అయ్యర్ (105) శతకాలతో విరుచుకుపడగా.. ఆఖర్లో సూర్యకుమార్ యాదవ్ (37 బంతుల్లో 72 నాటౌట్; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. భారత ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ (52) అర్ధసెంచరీతో రాణించగా.. ఇషాన్ కిషన్ (31) పర్వాలేదనిపించాడు. రుతురాజ్ (8) ఒక్కడే విఫలమయ్యాడు. ఆసీస్ బౌలర్లలో కెమరూన్ గ్రీన్ 2 వికెట్లు పడగొట్టగా.. ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్, సీన్ అబాట్ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం 400 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా రెండో ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో మాథ్యూ షార్ట్ (9), స్టీవ్ స్మిత్ (0) వరుస బంతుల్లో ఔటయ్యారు. 12 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 82/2గా ఉంది. లబూషేన్ (26), వార్నర్ (43) క్రీజ్‌లో ఉన్నారు. 33 ఓవర్లకు మ్యాచ్ కుదింపు.. వర్షం కారణంగా సమయం వృధా కావడంతో మ్యాచ్‌ను 33 ఓవర్లకు కుదించి, డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం ఆసీస్ లక్ష్యాన్ని 317 పరుగులుగా నిర్ధేశించారు. -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. వన్డే క్రికెట్లో తొలి జట్టుగా ప్రపంచ రికార్డు
ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డే సందర్భంగా టీమిండియా చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్‌లో భారత క్రికెటర్లు రికార్డు స్థాయిలో 18 సిక్సర్లు బాదడంతో భారత్ వన్డే క్రికెట్లో 3000 సిక్సర్ల మార్కును (3007) తాకిన తొలి జట్టుగా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. అంతర్జాతీయ వన్డేల్లో ఏ జట్టు ఇప్పటివరకు 3000 సిక్సర్లు కొట్టలేదు. భారత్ తర్వాత వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన జట్టుగా విండీస్ (2953) ఉంది. ఈ జాబితాలో పాక్ (2566), ఆస్ట్రేలియా (2476), న్యూజిలాండ్ (2387), ఇంగ్లండ్ (2032), సౌతాఫ్రికా (1947), శ్రీలంక (1779), జింబాబ్వే (1303), బంగ్లాదేశ్ (959) వరుస స్థానాల్లో ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్ (97 బంతుల్లో 104; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (90 బంతుల్లో 105; 11 ఫోర్లు, 3 సిక్సర్లు), కేఎల్ రాహుల్ (38 బంతుల్లో 52; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), ఇషాన్ కిషన్ (18 బంతుల్లో 31; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (37 బంతుల్లో 72 నాటౌట్; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది. వన్డేల్లో ఆస్ట్రేలియాపై భారత్‌కు ఇదే అత్యధిక స్కోర్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు కొట్టిన 18 సిక్సర్లు వన్డేల్లో భారత్ రెండో అత్యధిక సిక్సర్ల రికార్డుగా నమోదైంది. 2013లో బెంగళూరులో ఆసీస్‌పై బాదిన 19 సిక్సర్లు వన్డేల్లో ఓ ఇన్నింగ్స్‌లో భారత అత్యధిక సిక్సర్ల రికార్డుగా నమోదై ఉంది. కాగా, ఆసీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ నిర్ధేశించిన 400 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా రెండో ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో మాథ్యూ షార్ట్ (9), స్టీవ్ స్మిత్ (0) వరుస బంతుల్లో ఔటయ్యారు. 9 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 56/2 వద్ద ఉండగా వర్షం మొదలై ఆటకు అంతరాయం కలిగింది. లబూషేన్ (17), వార్నర్ (26) క్రీజ్‌లో ఉన్నారు. -
2023 అంతా 'శుభ్'మయం.. రికార్డులు కొల్లగొడుతున్న టీమిండియా యంగ్ డైనమైట్
అంతర్జాతీయ క్రికెట్లో 2023 సంవత్సరమంతా 'శుభ్'మయంగా మారింది. ఈ ఏడాది ఈ టీమిండియా యంగ్ డైనమైట్ ఫార్మాట్లకతీతంగా చెలరేగుతూ, సెంచరీల మీద సెంచరీలు చేస్తూ, పరుగుల వరద పారిస్తూ రికార్డులను కొల్లగొడుతున్నాడు. ఆసీస్‌తో ఇవాళ (సెప్టెంబర్ 24) జరుగుతున్న రెండో వన్డేలో శతక్కొట్టిన గిల్ (97 బంతుల్లో 104; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) వన్డేల్లో ఆరో సెంచరీని, ఈ ఏడాది ఐదో వన్డే శతకాన్ని, ఓవరాల్‌గా (అన్ని ఫార్మాట్లలో) ఈ ఏడాది ఏడో శతకాన్ని నమోదు చేశాడు. ఈ క్రమంలో గిల్ పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఓ క్యాలెండర్ ఇయర్లో 5 అంతకంటే ఎక్కువ వన్డే సెంచరీలు చేసిన ఏడో భారత ఆటగాడిగా.. 25 ఏళ్లలోపే ఈ ఘనత సాధించిన ఐదో ప్లేయర్‌గా.. భారత్ తరఫున వన్డేల్లో అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 6 సెంచరీలు పూర్తి చేసిన ఆటగాడిగా పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఈ రికార్డులతో పాటు గిల్ ఈ ఏడాది దాదాపు అన్ని విభాగాల్లో అగ్రస్థానంలో నిలిచాడు. అవేంటంటే.. వన్డే కెరీర్లో మొత్తంగా 35 మ్యాచ్‌లు ఆడి 66.10 సగటున 6 సెంచరీలు, 9 అర్ధసెంచరీల సాయంతో 1919 పరుగులు చేసిన గిల్.. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఆడిన 20 మ్యాచ్‌ల్లో 1230 పరుగులు చేసి, వన్డేల్లో ఈ ఏడాది టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. 2023లో వన్డేల్లో అత్యధిక సెంచరీలు (5) చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఈ ఏడాది అత్యధిక అంతర్జాతీయ పరుగులు (అన్ని ఫార్మాట్లలో): 1763 ఈ ఏడాది అత్యధిక సెంచరీలు (అన్ని ఫార్మాట్లలో): 7 ఈ ఏడాది అత్యధిక సిక్సర్లు (అన్ని ఫార్మాట్లలో): 46 ఈ ఏడాది అత్యధిక ఫోర్లు (అన్ని ఫార్మాట్లలో): 186 ఈ ఏడాది వన్డేల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు: 10 ఈ ఏడాది వన్డేల్లో అత్యధిక బౌండరీలు: 139 ఇలా గిల్ ఈ ఏడాది దాదాపుగా అన్ని విభాగాల్లో టాప్‌లో కొనసాగుతున్నాడు. వన్డే అగ్రపీఠం దిశగా.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో కొనసాగుతున్న గిల్.. ప్రస్తుతం ఆసీస్‌తో జరుగుతున్న సిరీస్‌లో విచ్చలవిడిగా పరుగులు చేస్తూ అగ్రపీఠం దిశగా దూసుకుపోతున్నాడు. ఆసీస్‌తో సిరీస్‌కు ముందు 814 రేటింగ్ పాయింట్లు కలిగిన గిల్.. ర్యాంకింగ్స్‌లో టాప్‌లో ఉన్న బాబర్ ఆజమ్‌ను దాటేందుకు 44 పాయింట్ల దూరంలో ఉన్నాడు. ఆసీస్‌పై తొలి వన్డేలో 74 పరుగులు, రెండో వన్డేలో 104 పరుగులు చేసిన గిల్.. వన్డే అగ్రస్థానం దక్కించుకునేందుకు కావాల్సిన 44 పాయింట్లను ఈ రెండు ప్రదర్శనలతోనే సాధిస్తాడు. ఈ సిరీస్‌లో మరో మ్యాచ్ కూడా ఉండటంతో గిల్ వన్డే టాప్ ర్యాంక్‌కు చేరడం దాదాపుగా ఖాయమైపోయింది. ఈ ఏడాది ఐపీఎల్‌లోనూ ఇరగదీసిన గిల్.. అంతర్జాతీయ క్రికెట్లోనే కాకుండా ఈ ఏడాది గిల్ ఐపీఎల్‌లోనే సత్తా చాటాడు. 2023 ఐపీఎల్లో 17 మ్యాచ్‌లు ఆడిన గిల్ 59.33 సగటున, 157.80 స్ట్రయిక్‌రేట్‌తో 890 పరుగులు చేసి, ఎడిషన్ టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ ఎడిషన్‌లో మొత్తం 3 సెంచరీలు బాదిన గిల్.. అత్యధిక పరుగులతో పాటు అత్యధిక వ్యక్తిగత స్కోర్, అత్యుత్తమ సగటు, అత్యధిక శతకాలు,అత్యధిక ఫోర్లు.. ఇలా పలు విభాగాల్లో టాప్‌లో నిలిచాడు. ఇదిలా ఉంటే, రెండో వన్డేలో టాస్ ఓడి ఆసీస్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 399 పరుగుల భారీ స్కోర్ చేసింది. శుభ్‌మన్ గిల్ (104), శ్రేయస్ అయ్యర్ (105) శతకాలతో విరుచుకుపడగా.. ఆఖర్లో సూర్యకుమార్ యాదవ్ (37 బంతుల్లో 72 నాటౌట్; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. భారత ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ (52) అర్ధసెంచరీతో రాణించగా.. ఇషాన్ కిషన్ (31) పర్వాలేదనిపించాడు. రుతురాజ్ (8) ఒక్కడే విఫలమయ్యాడు. ఆసీస్ బౌలర్లలో కెమరూన్ గ్రీన్ 2 వికెట్లు పడగొట్టగా.. ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్, సీన్ అబాట్ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం 400 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా రెండో ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో మాథ్యూ షార్ట్ (9), స్టీవ్ స్మిత్ (0) వరుస బంతుల్లో ఔటయ్యారు. 7 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 43/2గా ఉంది. లబూషేన్ (12), వార్నర్ (19) క్రీజ్‌లో ఉన్నారు. -
సూర్యకుమార్ విధ్వంసం.. ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ
ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా చిచ్చరపిడుగు సూర్యకుమార్ యాదవ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాది విధ్వంసం సృష్టించాడు. కేవలం 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి, వన్డేల్లో భారత్ తరఫున ఆరో వేగవంతమైన హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తంగా 37 బంతులు ఎదుర్కొన్న స్కై 6 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 72 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఫలితంగా టీమిండియా నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 399 పరుగుల భారీ స్కోర్ చేసింది. వన్డేల్లో ఆసీస్‌పై భారత్‌కు ఇదే అత్యధిక స్కోర్. వన్డేల్లో భారత్ తరఫున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ ఎవరిదంటే..? వన్డేల్లో భారత్ తరఫున వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డు ప్రస్తుత భారత జట్టు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పేరిట నమోదై ఉంది. 2000 సంవత్సరంలో అగార్కర్ జింబాబ్వేపై 21 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఆతర్వాత వేగవంతమైన హాఫ్ సెంచరీ కపిల్ దేవ్ పేరిట ఉంది. కపిల్ 1983లో వెస్టిండీస్‌పై 22 బంతుల్లో ఫిఫ్టి కొట్టాడు. ఆతర్వాత వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్, యువరాజ్ సింగ్ 22 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేశారు. ఇవాల్టి మ్యాచ్‌లో స్కై చేసిన 24 బంతుల ఫిఫ్టి వన్డేల్లో భారత్ తరఫున ఆరో ఫాసెస్ట్ ఫిఫ్టిగా రికార్డైంది. వరుసగా నాలుగు సిక్సర్లు బాదిన స్కై.. గ్రీన్ వేసిన ఇన్నింగ్స్ 44వ ఓవర్లో సూర్యకుమార్ పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. వరుసగా నాలుగు సిక్సర్లు బాది గ్రీన్‌కు దడ పుట్టించాడు. ఈ ఓవర్లో తొలి నాలుగు బంతులను సిక్సర్లుగా మలిచిన స్కై.. ఓవర్లో మొత్తంగా 26 పరుగులు పిండుకున్నాడు. స్కై ధాటికి గ్రీన్ 10 ఓవర్లలో 103 పరుగులు సమర్పించుకున్నాడు. తద్వారా గ్రీన్ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. వన్డేల్లో ఓ ఇన్నింగ్స్‌లో 100 అంతకంటే ఎక్కువ పరుగులు సమర్పించుకున్న మూడో ఆస్ట్రేలియన్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఓ ఓవర్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా.. ఈ మ్యాచ్‌లో గ్రీన్ వేసిన ఇన్నింగ్స్ 44వ ఓవర్లో తొలి నాలుగు బంతులను సిక్సర్లుగా మలిచిన స్కై.. వన్డేల్లో ఓ ఓవర్లో ఆసీస్‌పై అత్యధిక సిక్సర్లుగా బాదిన భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ఆసీస్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 399 పరుగుల భారీ స్కోర్ చేసింది. శుభ్‌మన్ గిల్ (104), శ్రేయస్ అయ్యర్ (105) శతకాలతో విరుచుకుపడగా.. ఆఖర్లో సూర్యకుమార్ యాదవ్ (37 బంతుల్లో 72 నాటౌట్; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. భారత ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ (52) అర్ధసెంచరీతో రాణించగా.. ఇషాన్ కిషన్ (31) పర్వాలేదనిపించాడు. రుతురాజ్ (8) ఒక్కడే విఫలమయ్యాడు. ఆసీస్ బౌలర్లలో కెమరూన్ గ్రీన్ 2 వికెట్లు పడగొట్టగా.. ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్, సీన్ అబాట్ తలో వికెట్ దక్కించుకున్నారు. -
శతక్కొట్టిన శ్రేయస్, శుభ్‌మన్.. భారీ స్కోర్ దిశగా టీమిండియా
ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో భారత బ్యాటర్లు చెలరేగిపోతున్నారు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన శ్రేయస్ అయ్యర్ (90 బంతుల్లో 105; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) ఎట్టకేలకు ఫామ్‌ను దొరకబుచ్చుకుని కెరీర్లో మూడో వన్డే శతకాన్ని సాధించి ఔట్ కాగా.. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (92 బంతుల్లో 100 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) తన భీకర ఫామ్‌ను కొనసాగిస్తూ వన్డే కెరీర్లో ఆరో సెంచరీ నమోదు చేశాడు. ఫలితంగా భారత్ భారీ స్కోర్ దిశగా సాగుతుంది. 33 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 230/2గా ఉంది. గిల్ (100), రాహుల్ (9) క్రీజ్‌లో ఉన్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ఆసీస్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన భారత్ 16 పరుగుల వద్ద రుతురాజ్ గైక్వాడ్ (8) వికెట్ కోల్పోయింది. హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో అలెక్స్ క్యారీకు క్యాచ్ ఇచ్చి రుతు ఔటయ్యాడు. కాగా, ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓ మార్పుతో బరిలోకి దిగింది. బుమ్రా స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు ఆస్ట్రేలియా మూడు మార్పులతో బరిలోకి దిగింది. మిచెల్ మార్ష్, మార్కస్ స్టోయినిస్, పాట్ కమిన్స్ స్థానాల్లో అలెక్స్ క్యారీ, జోష్ హాజిల్‌వుడ్, స్పెన్సర్ జాన్సన్ తుది జట్టులోకి వచ్చారు. ఆస్ట్రేలియా : డేవిడ్ వార్నర్, మాథ్యూ షార్ట్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), మార్నస్ లాబుషేన్, జోష్ ఇంగ్లిస్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), కామెరాన్ గ్రీన్, సీన్ ఆంథోనీ అబాట్, ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్, జోష్ హాజిల్‌వుడ్ ఇండియా : శుభమన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, లోకేష్ రాహుల్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, ప్రసిద్ధ్ కృష్ణ -
నేడు ఆసీస్‌తో రెండో వన్డే: సిరీస్ విజయం లక్ష్యంగా భారత్
ఇండోర్: వన్డే ప్రపంచకప్‌కు ముందు జరుగుతున్న చివరి సిరీస్‌ను సొంతం చేసుకొని మెగా ఈవెంట్లో పూర్తి విశ్వాసంతో బరిలోకి దిగాలనే లక్ష్యంతో భారత్... తొలి మ్యాచ్‌లో జరిగిన లోపాలను సరిదిద్దుకోవాలనే పట్టుదలతో ఆ్రస్టేలియా... నేడు ఇక్కడి హోల్కర్ స్టేడియంలో జరిగే రెండో వన్డేలో తలపడనున్నాయి. రెండు జట్లలోని బ్యాటర్లు మెరిస్తే భారీ స్కోర్లకు పెట్టింది పేరైన హోల్కర్ స్టేడియంలో అభిమానులకు మరో పరుగుల విందు లభించడం ఖాయం. శనివారం ఇండోర్‌లో వర్షం కురిసినా ఆదివారం మ్యాచ్ సమయంలో ఒకట్రెండుసార్లు చిరుజల్లులు పడే అవకాశముందని స్థానిక వాతావరణ శాఖ తెలిపింది. తొలి వన్డేలో రుతురాజ్ గైక్వాడ్, శుబ్‌మన్ గిల్, తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ అర్ధ సెంచరీలు సాధించడం శుభపరిణామం. అయితే శ్రేయస్ అయ్యర్ తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. రెండో వన్డేలో అయ్యర్ భారీ స్కోరు సాధిస్తే అతను ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో ఆడే అవకాశాలు మెరుగవుతాయి. మరోవైపు భారత సీనియర్ పేస్ బౌలర్ మొహమ్మద్ షమీ బంతితో చెలరేగాడు. తొలి వన్డే నుంచి విశ్రాంతి తీసుకున్న సిరాజ్‌ను ఆడిస్తే బుమ్రా ఈ మ్యాచ్‌లో ఆడకపోవచ్చు. ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ ఆకట్టుకున్నా ఈ ఒక్క ప్రదర్శన అతనికి సరిపోదు. రెండో మ్యాచ్‌లోనూ ఈ తమిళనాడు స్పిన్నర్ రాణించాల్సి అవసరం ఉంది. ఎడంచేతి వాటం స్పిన్నర్ అక్షర్ పటేల్ చేతి వేలి గాయం నుంచి కోలుకోకపోతే అతని స్థానంలో అశ్విన్ ప్రపంచకప్ జట్టులోకి చివరి నిమిషంలో వచ్చే అవకాశముంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలో ఉన్న భారత్ రెండో మ్యాచ్‌లోనూ గెలిస్తే సిరీస్‌ను 2–0తో సొంతం చేసుకుంటుంది. ఈ ఏడాది ఆరంభంలో ఆసీస్ చేతిలో ఎదురైన సిరీస్ ఓటమికి బదులు తీర్చుకుంటుంది. మరోవైపు ఆస్ట్రేలియా జట్టు సిరీస్‌లో నిలవాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితిలో నిలిచింది. తొలి మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, కామెరూన్ గ్రీన్, లబుషేన్ రాణించినా క్రీజులో నిలదొక్కుకున్న తరుణంలో అవుటవ్వడం ఆసీస్‌ను దెబ్బ కొట్టింది. ఓపెనర్‌గా వచ్చిన ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ బ్యాట్ నుంచి కూడా పరుగులు వస్తే ఆసీస్ స్కోరు 300 పరుగులు దాటే అవకాశముంటుంది. ఈ మైదానంలో ఈ ఏడాది జనవరి 24న భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య చివరిసారి వన్డే జరిగింది. రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ సెంచరీలతో కదంతొక్కడంతో భారత్ 9 వికెట్లకు 385 పరుగులు చేసింది. న్యూజిలాండ్ 295 పరుగులకు ఆలౌటైంది. బౌండరీల దూరం తక్కువగా ఉండటంతో ఈసారీ భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశముంది. జట్ల వివరాలు (అంచనా) భారత్: రుతురాజ్ గైక్వాడ్/ఇషాన్ కిషన్, శుబ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), జడేజా, వాషింగ్టన్ సుందర్, అశ్విన్, శార్దుల్ ఠాకూర్, షమీ, సిరాజ్/బుమ్రా. ఆ్రస్టేలియా: వార్నర్, మిచెల్ మార్ష్, స్మిత్, లబుషేన్, కామెరూన్ గ్రీన్, అలెక్స్ క్యారీ, జోస్ ఇన్‌గ్లిస్/ఆరోన్ హార్డీ, కమిన్స్ (కెప్టెన్), సీన్ అబాట్, ఆడమ్ జంపా, హాజల్‌వుడ్. -
ENG VS NZ 2nd ODI: లివింగ్‌స్టోన్ విధ్వంసం.. తృటిలో సెంచరీ మిస్
4 మ్యాచ్‌లో వన్డే సిరీస్‌లో భాగంగా సౌతాంప్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో ఇవాళ (సెప్టెంబర్ 10) జరుగుతున్న రెండో మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ ప్రత్యర్ధి ముందు ఓ మోస్తరు లక్ష్యాన్ని ఉంచింది. వర్షం కారణంగా 34 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. లియామ్ లివింగ్‌స్టోన్ (78 బంతుల్లో 95 నాటౌట్; 9 ఫోర్లు, సిక్స్) సూపర్ ఇన్నింగ్స్‌తో ఆదుకోవడంతో గౌరవప్రదమైన స్కోర్ సాధించగలిగింది. లివింగ్‌స్టోన్‌కు బట్లర్ (30), మొయిన్ అలీ (33), సామ్ కర్రన్ (42) తోడ్పాటునందించడంతో ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. ఈ సిరీస్‌లో లివింగ్‌స్టోన్ వరుసగా రెండో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ కష్టాల్లో ఉన్నప్పుడు (12.1 ఓవర్లలో 55/5) ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన లివింగ్‌స్టోన్ ఎంతో బాధ్యతాయుతంగా ఆడి కెరీర్లో తొలి సెంచరీకి చేరువగా వచ్చాడు. ఇన్నింగ్స్ ఆఖరి రెండు బంతులు ఎదుర్కొనే అవకాశం లివింగ్‌స్టోన్‌కు వచ్చినప్పటికీ అతను 4 పరుగులు మాత్రమే రాబట్టగలిగాడు. దీంతో శతకానికి 5 పరుగుల దూరంలో నిలిచిపోయాడు. 4.2 ఓవర్లలోనే ఇంగ్లండ్ టాప్-3 బ్యాటర్లను పెవిలియన్‌కు పంపి ఇంగ్లండ్ పతనాన్ని శాశించిన బౌల్ట్ మొత్తంగా ఈ మ్యాచ్‌లో 7 ఓవర్లు వేసి 3 వికెట్లు పడగొట్టగా.. సౌథీ 2, హెన్రీ, సాంట్నర్ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం 227 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందకు బరిలోకి దిగిన న్యూజిలాండ్ 3 ఓవర్లలో వికెట్ నష్టానికి 19 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ రెండో బంతికే డేవిడ్ విల్లే.. ఫిన్ అలెన్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. అయినప్పటికీ ఏమాత్రం తగ్గని విల్ యంగ్.. విల్లే వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో తొలి 3 బంతులను బౌండరీలుగా మలచి సత్తా చాటాడు. యంగ్ (17), కాన్వే (1) క్రీజ్‌లో ఉన్నారు. -
తొలి వన్డేలో 59 పరుగులకే చిత్తు.. రెండో వన్డేలో 227/0.. ఇంతలో ఎంత మార్పు..!
ఆఫ్ఘనిస్తాన్ జట్టులో కేవలం గంటల వ్యవధిలో భారీ మార్పు వచ్చింది. మొన్న (ఆగస్ట్ 24) హంబన్‌తోటలో పాకిస్తాన్‌తో జరిగిన తొలి వన్డేలో 59 పరుగులకే చిత్తై, చెత్త రికార్డులు మూటగట్టుకున్న ఆఫ్ఘన్లు.. ఇవాళ (ఆగస్ట్ 24) అదే పాకిస్తాన్‌తో అదే హంబన్‌తోటలో జరుగుతున్న మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతూ పలు అరుదైన రికార్డులు తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ మ్యాచ్‌లో ఆ జట్టు ఓపెనర్లు రహ్మానుల్లా గుర్భాజ్ (135), ఇబ్రహీమ్ జద్రాన్ (80) తొలి వికెట్‌కు ఏకంగా 227 పరుగులు జోడించి పలు రికార్డులు సొంతం చేసుకున్నారు. పాక్‌పై 100 కంటే ఎక్కువ పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన తొలి ఆఫ్ఘనిస్తాన్ ఓపెనింగ్ జోడీగా.. అలాగే ఆఫ్ఘనిస్తాన్ తరఫున వన్డేల్లో రెండు సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేసిన జోడీగా.. 2010 తర్వాత పాక్‌పై అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం (227) నమోదు చేసిన రెండో జోడీగా పలు రికార్డులు మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన రహ్మానుల్లా గుర్భాజ్.. పాకిస్తాన్‌పై వన్డే సెంచరీ చేసిన తొలి ఆప్ఘన్ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. తొలి వికెట్‌కు 227 పరుగుల భారీ భాగస్వామ్యం జోడించిన అనంతరం ఉసామా మిర్ బౌలింగ్‌లో ఇఫ్తికార్ అహ్మద్‌కు క్యాచ్ ఇచ్చి జద్రాన్ (80) ఔట్ కావడంతో ఆఫ్ఘనిస్తాన్ తొలి వికెట్ కోల్పోయింది. 43 ఓవర్ల తర్వాత ఆ జట్టు వికెట్ నష్టానికి 247 పరుగులు చేసింది. గుర్భాజ్ (147), మహ్మద్ నబీ (7) క్రీజ్‌లో ఉన్నారు. తేలిపోయిన పాక్ పేసర్లు.. తొలి వన్డేలో ఆఫ్ఘన్ ప్లేయర్ పాలిట సింహస్వప్నల్లా ఉండిన పాక్ పేసర్లు ఈ మ్యాచ్‌లో తేలిపోయారు. తొలి మ్యాచ్‌లో 5 వికెట్ల ప్రదర్శనతో నిప్పులు చెరిగిన హరీస్ రౌఫ్ ఈ మ్యాచ్‌లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. షాహీన్ అఫ్రిది, నసీం షా సైతం అతన్ని ఫాలో అయ్యారు. ఈ మ్యాచ్‌లో ఈ పేస్ త్రయం ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. -
విండీస్ చేతిలో ఘోర పరాభవం.. టీమిండియాను ఏకి పారేసిన భారత మాజీ
విండీస్‌తో రెండో వన్డేలో ప్రయోగాలకు పోయి చేతులు కాల్చుకున్న టీమిండియాపై ముప్పేట దాడి జరుగుతుంది. అభిమానులు, మాజీలు భారత ఆటగాళ్లపై దుమ్మెత్తిపోస్తున్నారు. రోహిత్, కోహ్లిలను రెస్ట్ ఇచ్చి టీమిండియా మేనేజ్మెంట్ పెద్ద తప్పిదమే చేసిందని మండిపడుతున్నారు. కోచ్ రాహుల్ ద్రవిడ్ చెత్త వ్యూహాల వల్ల వరల్డ్‌కప్‌కు అర్హత సాధించలేని జట్టు చేతిలో టీమిండియా ఓటమిపాలైందని ధ్వజమెత్తుతున్నారు. డబ్బు, గర్వం వల్ల భారత క్రికెటర్లు ఆటపై దృష్టి పెట్టడం లేదని 1983 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ కపిల్ దేవ్ విమర్శిస్తే.. తాజాగా మరో భారత మాజీ (వెంకటేశ్ ప్రసాద్) టీమిండియాను తూర్పారబెట్టాడు. రెండో వన్డేలో విండీస్ చేతిలో ఓడిన భారత జట్టుపై అతను విరుచుకుపడ్డాడు. టెస్ట్ క్రికెట్‌ను పక్కన పెడితే, గత కొంతకాలంగా టీమిండియా మిగతా రెండు ఫార్మాట్లలో అతి సాధారణమైన జట్టుగా తయారైందని.. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, చివరకు బంగ్లాదేశ్ చేతిలో కూడా సిరీస్‌లు కోల్పోయిందని దుయ్యబట్టాడు. గత రెండు టీ20 వరల్డ్‌కప్‌లలో టీమిండియా ప్రదర్శన పేలవంగా ఉందని, మనకంటే చిన్న జట్లు చాలా మెరుగైన ప్రదర్శనలు చేసాయని గుర్తు చేశాడు. టీమిండియా పరిస్థితి ప్రస్తుతం చాలా దారుణంగా ఉందని.. డబ్బు, అధికారం ఉండటంతో భారత జట్టు సాధారణ విజయాలకే పొంగిపోతుందని, ఛాంపియన్ జట్టుకు కావాల్సిన లక్షణాలు టీమిండియాలో అస్సలు కనిపించడం లేదని విమర్శలు గుప్పించాడు. Despite the money and power, we have become used to celebrating mediocrity and are far from how champion sides are. Every team plays to win and so does India but their approach and attitude is also a factor for underperformance over a period of time. — Venkatesh Prasad (@venkateshprasad) July 30, 2023 టీమిండియాలో ప్రస్తుత ఇంగ్లండ్ జట్టులోని దూకుడు కానీ, 90ల్లో ఆస్ట్రేలియా జట్టులోని భీకరత్వం కానీ లేవని అన్డాను. గతకొంతకాలంగా భారత పరిమిత ఓవర్ల జట్టు అతి సాధారణ జట్టులా ఉంటుందని ట్విటర్ వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ప్రతి జట్టు గెలవడానికే ఆడుతుందని, టీమిండియా కూడా అదే లక్ష్యంతోనే బరిలోకి దిగుతున్నప్పటికీ.. ఆట విషయంలో వారి వైఖరి గత కొంత కాలంగా ఏమీ బాగోలేదని, ఇదే భారత జట్టు పేలవ ప్రదర్శనకు ప్రధాన కారణమని ట్వీట్లో జోడించాడు. ఇదిలా ఉంటే, విండీస్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఫలితంగా మూడు వన్డేల సిరీస్‌ను విండీస్ 1-1తో సమం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. విండీస్ బౌలర్ల ధాటికి 40.5 ఓర్లలో 181 పరుగులకే కుప్పకూలింది. భారత ఇన్నింగ్స్‌లో ఇషాన్ కిషన్ (55), శుభ్‌మన్ గిల్(34) మాత్రమే రాణించారు. విండీస్ బౌలర్లలో రొమారియో షెఫర్డ్, గుడకేశ్ మోటీ తలో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం 182 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్.. 36.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. విండీస్ బ్యాటర్లలో కెప్టెన్ హోప్ (63 నాటౌట్), కార్టీ (48 నాటౌట్) రాణించారు. -
వరుసగా రెండో మ్యాచ్‌లో విండీస్ ప్రతాపం
వెస్టిండీస్ జట్టు వరుసగా రెండో మ్యాచ్‌లో పసికూన యూఏఈపై ప్రతాపం చూపించింది. 3 వన్డేల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విండీస్.. నిన్న (జూన్ 6) జరిగిన రెండో వన్డేలో 78 పరుగుల తేడాతో గెలుపొందింది. ఫలితంగా సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కరీబియన్ టీమ్.. ఓపెనర్లు బ్రాండన్ కింగ్ (70 బంతుల్లో 64; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), జాన్సన్ చార్లెస్ (47 బంతుల్లో 63; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), చివర్లో ఓడియన్ స్మిత్ (24 బంతుల్లో 37; 3 ఫోర్లు, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడటంతో 49.5 ఓవర్లలో 306 పరుగులకు ఆలౌటైంది. యూఏఈ బౌలర్లలో జహూర్ ఖాన్ 3.. అఫ్జల్ ఖాన్, సంచిత్ శర్మ, అలీ నసీర్ తలో 2 వికెట్లు, ఆదిత్య షెట్టి ఓ వికెట్ పడగొట్టారు. 307 పరుగుల భారీ లక్ష్యఛేదనకు దిగిన యూఏఈ.. 95 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న దశలో బాసిల్ అహ్మద్ (49), అలీ నసీర్ (57), అయాన్ అఫ్జల్ ఖాన్ (25 నాటౌట్) ఆదుకునేందుకు విఫలయత్నం చేశారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. యూఏఈ.. ఓవర్లు మొత్తం ఆడి 7 వికెట్ల నష్టానికి 228 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. విండీస్ బౌలర్లలో హాడ్జ్, రోస్టన్ ఛేజ్ తలో 2 వికెట్లు.. అకీమ్ జోర్డన్, ఓడియన్ స్మిత్, యాన్నిక్ కారియా తలో వికెట్ పడగొట్టారు. ఇరు జట్ల మధ్య జూన్ 9న నామమాత్రపు మూడో వన్డే జరుగనుంది. చదవండి: పసికూనపై విండీస్ ప్రతాపం.. శతక్కొట్టిన కింగ్ -
ప్రతీకారం తీర్చుకున్న లంకేయులు.. భారీ విజయం
తొలి వన్డేలో ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఎదురైన పరాభవానికి శ్రీలంక ఆటగాళ్లు ప్రతీకారం తీర్చుకున్నారు. హంబన్‌తోట వేదికగా ఇవాళ (జూన్ 4) జరిగిన రెండో వన్డేలో ఆఫ్ఘనిస్తాన్‌ను మట్టికరిపించారు. తొలుత బ్యాటింగ్‌లో ఆతర్వాత బౌలింగ్‌లో రెచ్చిపోయిన లంకేయులు.. పర్యాటక జట్టుపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి గెలుపొందారు. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసుకున్నారు. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక మూడో వన్డే జూన్ 7న ఇదే వేదికగా జరుగనుంది. మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. పథుమ్ నిస్సంక (43), కరుణరత్నే (52), కుశాల్ మెండిస్ (78), సమర విక్రమ (44), ధనంజయ డిసిల్వ (29 నాటౌట్), షనక (23), హసరంగ (29 నాటౌట్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 323 పరుగులు చేసింది. తొలి వన్డేలో సత్తా చాటిన అసలంక (6) మినహా లంక ఇన్నింగ్స్‌లో ప్రతి ఒక్కరు బ్యాట్‌ను ఝులిపించారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో నబీ, ఫరీద్ అహ్మద్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. ముజీబ్ ఉర్ రెహ్మాన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్.. ఓ దశలొ (146/2) విజయం దిశగా సాగుతున్నట్లు కనిపించినప్పటికీ.. స్పిన్నర్ ధనంజయ డిసిల్వ (10-0-39-3) ఆ జట్టును భారీగా దెబ్బకొట్టాడు. సెట్ బ్యాటర్లు ఇబ్రహీం జద్రాన్ (54), హస్మతుల్లా షాహిది (57)లను ఔట్ చేసి ఆఫ్ఘన్ల ఓటమికి బీజం వేశాడు. అనంతరం హసరంగ (9-2-42-3) వారి పతనాన్ని శాశించాడు. వీరితో పాటు చమీరా (2/18), తీక్షణ (1/35), షనక (1/29) తలో చేయి వేయడంతో ఆఫ్ఘన్లు 42.1 ఓవర్లలో 191 పరుగులు మాత్రమే చేసి ఆలౌటయ్యారు. ఫలితంగా 132 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలయ్యారు. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో జద్రాన్, షాహిది హాఫ్ సెంచరీలతో రాణించగా.. రహ్మత్ షా (36), అజ్మతుల్లా ఒమర్జాయ్ (28) ఓ మోస్తరుగా రాణించారు. మిగతా వారంతా సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితమయ్యారు. -
తొలి వన్డేలో పరాభవం ఎఫెక్ట్.. రెండో వన్డేలో లంక బ్యాటర్ల ఉగ్రరూపం
మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం శ్రీలంకలో పర్యటిస్తున్న ఆఫ్ఘనిస్తాన్.. హంబన్‌తోట వేదికగా ఇవాళ (జూన్ 4) రెండో వన్డే ఆడుతుంది. తొలి వన్డేలో ఎదురైన పరాభవం (ఓటమి) నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో లంక బ్యాటర్లు ఉగ్రరూపం దాల్చారు. భారీ స్కోర్ చేశారు. ప్రత్యర్ధి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. పథుమ్ నిస్సంక (43), కరుణరత్నే (52), కుశాల్ మెండిస్ (78), సమర విక్రమ (44), ధనంజయ డిసిల్వ (29 నాటౌట్), షనక (23), హసరంగ (29 నాటౌట్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 323 పరుగులు చేసింది. తొలి వన్డేలో సత్తా చాటిన అసలంక (6) మినహా లంక ఇన్నింగ్స్‌లో ప్రతి ఒక్కరు బ్యాట్‌ను ఝులిపించారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో నబీ, ఫరీద్ అహ్మద్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. ముజీబ్ ఉర్ రెహ్మాన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్.. 11 పరుగులకే వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది. ధాటిగా ఆడే రహ్మానుల్లా గుర్భాజ్ 12 బంతులు ఆడి కేవలం 2 పరుగులు మాత్రమే చేసి చమీర బౌలింగ్‌లో కుశాల్ మెండిస్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 9 ఓవర్ల తర్వాత ఆఫ్ఘనిస్తాన్ స్కోర్ 28/1గా ఉంది. రహ్మత్ షా (9), ఇబ్రహీమ్ జద్రాన్ (14) క్రీజ్‌లో ఉన్నారు. కాగా, అంతకుముందు తొలి వన్డేలో ఆఫ్ఘనిస్తాన్.. తమ కంటే మెరుగైన శ్రీలంకపై 6 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. చరిత్ అసలంక (95 బంతుల్లో 91; 12 ఫోర్లు), ధనంజయ డిసిల్వ (59 బంతుల్లో 51; 5 ఫోర్లు) అర్ధసెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 268 పరుగులు చేసి ఆలౌటైంది. ఛేదనలో ఇబ్రహీం జద్రాన్ (98 బంతుల్లో 98; 11 ఫోర్లు, 2 సిక్సర్లు), రహ్మత్ షా (55) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి ఆఫ్ఘనిస్తాన్‌ను గెలిపించారు. ఇరు జట్ల మధ్య మూడో వన్డే జూన్ 7న ఇదే వేదికగా జరుగనుంది. -
పాక్ ఓపెనర్ విధ్వంసం..న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు..17 ఫోర్లు,6 సిక్సర్లతో 180 నాటౌట్
స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో పాక్ ఓపెనర్ ఫకర్ జమాన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. తొలి వన్డేలో సెంచరీతో (114 బంతుల్లో 117; 13 ఫోర్లు, సిక్స్) కదం తొక్కిన జమాన్.. రెండో వన్డేలో మరింత రెచ్చిపోయాడు. భారీ లక్ష్యఛేదనలో 144 బంతుల్లో 17 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 180 పరుగులతో అజేయంగా నిలిచి విధ్వంసం సృష్టించాడు. జమాన్‌కు జతగా బాబర్ ఆజమ్ (65), మహ్మద్ రిజ్వాన్ (54 నాటౌట్) రాణించడంతో కివీస్ నిర్ధేశించిన 337 పరుగుల లక్ష్యాన్ని పాక్ మరో 10 బంతులుండగానే ఛేదించి, 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. డారిల్ మిచెల్ (119 బంతుల్లో 129; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీతో, లాథమ్ (85 బంతుల్లో 98; 8 ఫోర్లు, సిక్స్), బోవ్స్ (51 బంతుల్లో 51; 7 ఫోర్లు) హాఫ్‌సెంచరీలతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 336 పరుగులు స్కోర్ చేసింది. పాక్ బౌలర్లలో హరీస్ రౌఫ్ 4, నసీం షా ఓ వికెట్ పడగొట్టారు. భారీ లక్ష్య ఛేదనలో పాక్ ఆరంభం నుంచే దూకుడగా ఆడింది. ఫకర్ జమాన్ బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడుతుంటే.. కెప్టెన్ బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్ స్ట్రయిక్ రొటేట్ చేస్తూ అతనికి సహకరించారు. ఇమామ్ ఉల్ హాక్ (24) పర్వాలేదనిపించగా.. అబ్దుల్లా షఫీక్ (7) విఫలమయ్యాడు. కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ, హెన్రీ షిప్లే, ఐష్ సోధిలకు తలో వికెట్ దక్కింది. సెంచరీతో చెలరేగిన ఫకర్ జమాన్‌కు వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య మూడో వన్డే కరాచీ వేదికగా మే 3న జరుగుతుంది. ప్రస్తుత పాక్ పర్యటనలో న్యూజిలాండ్ టీ20 సిరీస్‌ను 2-2తో సమం చేసుకున్న విషయం తెలిసిందే. -
శ్రీలంకకు ఏది కలిసి రావడం లేదు.. కివీస్‌తో రెండో వన్డే వర్షార్పణం, అంతలోనే మరో షాక్
2 టెస్ట్‌లు, 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్ ఆడేందుకు న్యూజిలాండ్ గడ్డపై అడుగుపెట్టిన శ్రీలంకకు ఏది కలిసి రావడం లేదు. 2-0తో టెస్ట్ సిరీస్ గెలిచి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వెళ్లాలని భావించిన ఆ జట్టును ఆతిధ్య దేశం చావుదెబ్బకొట్టగా.. కనీసం వన్డే సిరీస్ అయినా గెలిచి వన్డే వరల్డ్‌కప్‌కు నేరుగా అర్హత సాధించాలని భావిస్తే, ఆ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. తొలి వన్డేలో ఓటమిపాలై వరల్డ్‌కప్‌కు నేరుగా అర్హత సాధించే అవకాశాలను దాదాపుగా చేజార్చుకున్న శ్రీలంక.. కివీస్‌తో ఇవాళ (మార్చి 28) జరగాల్సిన రెండో వన్డే వర్షార్పణం కావడంతో వరల్డ్ కప్‌కు నేరుగా అర్హత సాధించే అశలను పూర్తిగా వదిలేసుకుంది. ఇంతలోనే ఆ జట్టుకు ఐసీసీ మరో షాకిచ్చింది. కివీస్‌తో తొలి వన్డేలో స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేసినందుకు గాను ఐసీసీ ఆ జట్టుకు ఓ పాయింట్ కోత విధించింది. దీంతో శ్రీలంక అధికారికంగా వరల్డ్‌కప్ రేసు నుంచి నిష్క్రమించింది. ఆ జట్టు చిన్న జట్లతో క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు ఆడి వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించాల్సి ఉంటుంది. కాగా, క్రైస్ట్‌చర్చ వేదికగా న్యూజిలాండ్‌తో ఇవాళ జరగాల్సిన రెండో వన్డే వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దైంది. దీంతో శ్రీలంక సిరీస్ గెలిచే అవకాశం లేకుండా పోయింది. ఇప్పటికే తొలి వన్డేలో నెగ్గిన కివీస్ 3 మ్యాచ్‌ల సిరీస్‌లో 2 వన్డేల అనంతరం 1-0 ఆధిక్యంలో ఉంది. ఒకవేళ శ్రీలంక ఆఖరి వన్డేలో గెలిచినా సిరీస్ డ్రా అవుతుందే తప్ప, ఒరిగేదేమీ ఉండదు. మూడో వన్డే మార్చి 31న హామిల్టన్ వేదికగా జరుగనుంది. అనంతరం ఇరు జట్ల మధ్య 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగనుంది. -
అరుదైన క్లబ్లో చేరిన తమీమ్ ఇక్బాల్.. తొలి బంగ్లాదేశీగా రికార్డు
బంగ్లాదేశ్ వన్డే జట్టు కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ తన 34వ పుట్టిన రోజున ఓ అరుదైన క్లబ్లో చేరాడు. బంగ్లాదేశ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో 15000 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్‌గా, ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన 40వ బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. సిల్హెట్ వేదికగా ఐర్లాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో తమీమ్ ఈ మైలురాయిని అధిగమించాడు. Congratulation Tamim Iqbal on becoming the first Bangladeshi batsman to complete 15000 runs in International Cricket. 🔥🏏#BCB | #Cricket pic.twitter.com/J4mj5W8k9T — Bangladesh Cricket (@BCBtigers) March 20, 2023 ఈ మ్యాచ్‌లో 31 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 23 పరుగులు చేసి రనౌటైన తమీమ్ 14 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద 15000 పరుగుల మైలురాయిని టచ్ చేశాడు. 2007లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన తమీమ్.. ఇప్పటికే అత్యధిక సెంచరీలు, అత్యధిక వన్డే పరుగులు, టీ20ల్లో సెంచరీ చేసిన ఏకైక బంగ్లాదేశీగా రికార్డు, బంగ్లాదేశ్ తరఫున 3 ఫార్మట్లలో సెంచరీ చేసిన ఏకైక ఆటగాడిగా పలు రికార్డులు కలిగి ఉన్నాడు. తమీమ్ ఖాతాలో 3 ఫార్మాట్లలో కలిపి మొత్తంగా 25 సెంచరీలు ఉన్నాయి. మరే బంగ్లాదేశీ క్రికెటర్ అంతర్జాతీయ క్రికెట్లో ఇన్ని సెంచరీలు చేయలేదు. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటివరకు 383 మ్యాచ్‌లు ఆడిన తమీమ్ 15009 పరుగులు చేశాడు. తమీమ్.. 69 టెస్ట్‌ల్లో 10 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీల సాయంతో 5082 పరుగులు, 235 వన్డేల్లో 14 సెంచరీలు, 55 హాఫ్ సెంచరీల సాయంతో 8146 పరుగులు, 78 టీ20ల్లో సెంచరీ, 7 హాఫ్ సెంచరీల సాయంతో 1758 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే, ఐర్లాండ్‌తో రెండో వన్డేలో ముష్ఫికర్ రహీం సునామీ శతకంతో (60 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 100 నాటౌట్), లిటన్ దాస్ (71 బంతుల్లో 70; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), నజ్ముల్ హొస్సేన్ షాంటో (77 బంతుల్లో 73; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), తౌహిద్ హ్రిదొయ్ (34 బంతుల్లో 49; 4 ఫోర్లు, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడటంతో బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవరల్లో 6 వికెట్ల నష్టానికి 349 పరుగుల రికార్డు స్కోర్ సాధించింది. బంగ్లాదేశ్‌కు ఇది వన్డేల్లో అత్యధిక స్కోర్. ఈ మ్యాచ్‌లో సెంచరీ చేసిన ముష్ఫికర్.. వన్డేల్లో బంగ్లాదేశ్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు షకీబ్ పేరిట ఉండేది. 2009లో షకీబ్ జింబాబ్వేపై 63 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. కాగా, ఇన్ని రికార్డులు నమోదైన ఈ మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండా ముగియడంతో బంగ్లాదేశ్ అభిమానులు నిరాశకు లోనయ్యారు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ పూర్తివగానే మొదలైన వర్షం ఎంతకు తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. -
ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన ముష్ఫికర్.. వన్డేల్లో బంగ్లాదేశ్ రికార్డు స్కోర్
BAN VS IRE 2nd ODI: సిల్హెట్ వేదికగా ఐర్లాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో బంగ్లాదేశ్ వెటరన్ ముష్ఫికర్ రహీం సునామీ శతకం సాధించాడు. కేవలం 60 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 100 పరుగులతో అజేయంగా నిలిచిన ముష్ఫికర్.. వన్డేల్లో బంగ్లాదేశ్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు నమోదు చేశాడు. గతంలో ఈ రికార్డు షకీబ్ పేరిట ఉండేది. 2009లో షకీబ్ జింబాబ్వేపై 63 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. Mushfiqur Rahim 100 not out off 60 balls. Fastest hundred in ODIs for Bangladesh.#BCB | #Cricket | #BANvIRE. pic.twitter.com/NtjZXAR7a5 — Bangladesh Cricket (@BCBtigers) March 20, 2023 ఈ క్రమంలో బంగ్లా టైగర్స్ వన్డేల్లో అత్యధిక టీమ్ స్కోర్ రికార్డు కూడా నెలకొల్పారు. ముష్ఫికర్ మెరుపు సెంచరీతో పాటు లిటన్ దాస్ (71 బంతుల్లో 70; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), నజ్ముల్ హొస్సేన్ షాంటో (77 బంతుల్లో 73; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), తౌహిద్ హ్రిదొయ్ (34 బంతుల్లో 49; 4 ఫోర్లు, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడటంతో బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 349 పరుగుల రికార్డు స్కోర్ సాధించింది. Just days after posting their highest ever ODI score of 338 in the first ODI, Bangladesh have broken it again with 349/6 in the second ODI! Mushfiqur Rahim brings up a 60-ball century - the quickest for his nation - with the last ball of the innings #BANvIRE — 🏏Flashscore Cricket Commentators (@FlashCric) March 20, 2023 వన్డేల్లో బంగ్లాదేశ్‌కు ఇదే అత్యధిక స్కోర్. రోజుల వ్యవధిలోనే బంగ్లాదేశ్ అత్యధిక టీమ్ స్కోర్ రికార్డును బద్దలుకొట్టడం విశేషం. ఇదే సిరీస్‌లో మార్చి 18న ఐర్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో 338 పరుగులు చేసిన బంగ్లాదేశ్.. 2 రోజుల గ్యాప్‌లోనే రికార్డును మెరుగుపర్చుకుంది. Mushfiqur Rahim became the 3rd Bangladeshi batsman to complete 7000 runs in ODIs after Tamim Iqbal and Shakib Al Hasan during the second ODI against Ireland. 🔥#BCB | #Cricket | #BANvIRE pic.twitter.com/xdat9MLMfS — Bangladesh Cricket (@BCBtigers) March 20, 2023 6వ స్థానంలో బరిలోకి దిగిన ముష్ఫికర్ ఆకాశమే హద్దుగా చెలరేగి వన్డే కెరీర్లో 9వ సెంచరీ నమోదు చేయడంతో పాటు 7000 పరుగుల మైలురాయిని కూడా అధిగమించాడు. తద్వారా తమీమ్ ఇక్బాల్, షకీబ్ అల్ హసన్ తర్వాత ఈ ఘనత సాధించిన మూడో బంగ్లా క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఈ సెంచరీతో ముష్ఫికర్ మరో రికార్డు కూడా సాధించాడు. వన్డేల్లో బంగ్లాదేశ్ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో తమీమ్ ఇక్బాల్ 14 సెంచరీలతో అగ్రస్థానంలో ఉండగా.. ముష్ఫికర్ (9), షకీబ్ (9)తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. కాగా, ఇన్ని రికార్డులు నమోదైన ఈ మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండా ముగియడంతో బంగ్లాదేశ్ అభిమానులు నిరాశకు లోనయ్యారు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ పూర్తివగానే మొదలైన వర్షం ఎంతకు తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. -
IND vs AUS 2nd ODI 2023: ఆసీస్ పేస్‌కు భారత్ బోల్తా
రెండు రోజులుగా కురిసిన వర్షాలతో మ్యాచ్ జరుగుతుందా లేదా అనే సందేహం... తీరా మ్యాచ్ సమయానికి వరుణుడు కూడా కరుణించడంతో ... నిర్ణీత సమయానికే ఆట ప్రారంభం... ఇక పరుగుల విందు ఖాయమని అభిమానులు ఆశగా ఎదురుచూస్తుండగా... పిచ్‌పై ఉన్న తేమను సద్వినియోగం చేసుకున్న ఆసీస్ పేస్ బౌలర్లు మిచెల్ స్టార్క్, సీన్ అబాట్, నాథన్ ఎలిస్ నిప్పులు చెరిగే బంతులతో భారత బ్యాటర్లను బెంబేలెత్తించారు. స్టార్క్ స్వింగ్ బౌలింగ్‌కు భారత స్టార్ బ్యాటర్లు గిల్, రోహిత్, రాహుల్, సూర్యకుమార్ ఇలా వచ్చి అలా వెళ్లారు. దాంతో టీమిండియా 117 పరుగులకే కుప్పకూలింది. అనంతరం ఆసీస్ ఓపెనర్లు మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్ భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు. భారత బ్యాటర్లు చేతులెత్తేసిన పిచ్‌పై ఆసీస్ ఓపెనర్లు అదరగొట్టి 11 ఓవర్లలోనే తమ జట్టుకు విజయాన్ని అందించారు. సాక్షి, విశాఖపట్నం: సిరీస్‌లో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో ఆదివారం జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో భారత్‌పై ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఫీల్డింగ్ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 26 ఓవర్లలో కేవలం 117 పరుగులకే ఆలౌటైంది. ఆసీస్ పేసర్లు మిచెల్ స్టార్క్ (5/53), సీన్ అబాట్ (3/23), నాథన్ ఎలిస్ (2/13) తమ స్వింగ్ బౌలింగ్‌తో భారత్‌ను దెబ్బ కొట్టారు. భారత ఇన్నింగ్స్‌లో కోహ్లి (35 బంతుల్లో 31; 4 ఫోర్లు) టాప్ స్కోరర్‌కాగా... రోహిత్ శర్మ (15 బంతుల్లో 13; 2 ఫోర్లు), రవీంద్ర జడేజా (39 బంతుల్లో 16; 1 ఫోర్), అక్షర్ పటేల్ (29 బంతుల్లో 29 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు) మాత్రమే రెండంకెల స్కోరును దాటారు. అనంతరం ఆస్ట్రేలియా ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. 11 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 121 పరుగులు సాధించింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (30 బంతుల్లో 51 నాటౌట్; 10 ఫోర్లు), మిచెల్ మార్ష్ (36 బంతుల్లో 66 నాటౌట్; 6 ఫోర్లు, 6 సిక్స్‌లు) అలరించారు. స్టార్క్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ప్రస్తుతం రెండు జట్లు 1–1తో సమంగా ఉండగా... సిరీస్‌లోని చివరిదైన మూడో వన్డే ఈనెల 22న చెన్నైలో జరుగుతుంది. సూర్యకుమార్ మళ్లీ విఫలం... బ్యాటింగ్‌కు స్వర్గధామంగా ఉన్న విశాఖ పిచ్‌పై భారత బ్యాటర్లు తడబడ్డారు. పిచ్‌పై ఉన్న తేమను ఆసీస్ పేసర్ స్టార్క్ సద్వినియోగం చేసుకున్నాడు. స్వింగ్‌తోపాటు కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేయడంతో భారత బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. స్టార్క్ బౌలింగ్‌లో గిల్, రోహిత్ వికెట్లకు దూరంగా వెళ్తున్న బంతులను ఆడి అవుటయ్యారు. సూర్యకుమార్ యాదవ్ వరుసగా రెండో వన్డేలోనూ స్టార్క్ బౌలింగ్‌లో తొలి బంతికే ఎల్బీడబ్ల్యూగా అవుటయ్యాడు. ఆ తర్వాత రాహుల్, హార్దిక్, కోహ్లి, జడేజా కూడా ఎక్కువసేపు క్రీజులో నిలువ లేకపోయారు. అబాట్ వేసిన ఇన్నింగ్స్ పదో ఓవర్లో హార్దిక్ పాండ్యా (1) షాట్ ఆడతా... స్టీవ్ స్మిత్ స్లిప్‌లో తన కుడి వైపునకు గాల్లో అమాంతం డైవ్ చేస్తూ తీసుకున్న క్యాచ్ హైలైట్‌గా నిలిచింది. ధనాధన్ ఆట... స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌కు ఓపెనర్లు హెడ్, మార్ష్ శుభారంభం ఇచ్చారు. వీరిద్దరు భారత బౌలర్లపై ఎదురుదాడి చేశారు. ముఖ్యంగా మార్ష్ చెలరేగిపోయాడు. షమీ వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో మార్ష్ 2 సిక్స్‌లు, 1 ఫోర్ కొట్టగా... సిరాజ్ వేసిన ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో హెడ్ వరుసగా నాలుగు ఫోర్లు బాదాడు. అనంతరం హార్దిక్ వేసిన ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్లో మార్ష్ 3 సిక్స్‌లతో అలరించాడు. దాంతో ఆసీస్ 8 ఓవర్లలో 90 పరుగులు సాధించింది. ఆ తర్వాతా ఇదే జోరు కొనసాగించి ఆసీస్ 11 ఓవర్లలో లక్ష్యాన్ని అందుకుంది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) స్మిత్ (బి) స్టార్క్ 13; శుబ్‌మన్ గిల్ (సి) లబుషేన్ (బి) స్టార్క్ 0; విరాట్ కోహ్లి (ఎల్బీడబ్ల్యూ) (బి) ఎలిస్ 31; సూర్యకుమార్ యాదవ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) స్టార్క్ 0; కేఎల్ రాహుల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) స్టార్క్ 9; హార్దిక్ పాండ్యా (సి) స్మిత్ (బి) అబాట్ 1; రవీంద్ర జడేజా (సి) క్యారీ (బి) ఎలిస్ 16; అక్షర్ పటేల్ (నాటౌట్) 29; కుల్దీప్ యాదవ్ (సి) హెడ్ (బి) అబాట్ 4; షమీ (సి) క్యారీ (బి) అబాట్ 0; సిరాజ్ (బి) స్టార్క్ 0; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (26 ఓవర్లలో ఆలౌట్) 117. వికెట్ల పతనం: 1–3, 2–32, 3–32, 4–48, 5–49, 6–71, 7–91, 8–103, 9–103, 10–117. బౌలింగ్: మిచెల్ స్టార్క్ 8–1–53–5, కామెరాన్ గ్రీన్ 5–0–20–0, సీన్ అబాట్ 6–0–23–3, నాథన్ ఎలిస్ 5–0–13–2, ఆడమ్ జంపా 2–0–6–0. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: ట్రావిస్ హెడ్ (నాటౌట్) 51; మిచెల్ మార్‡్ష (నాటౌట్) 66; ఎక్స్‌ట్రాలు 4, మొత్తం (11 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 121. బౌలింగ్: షమీ 3–0–29–0, సిరాజ్ 3–0–37–0, అక్షర్ పటేల్ 3–0–25–0, హార్దిక్ పాండ్యా 1–0–18–0, కుల్దీప్ యాదవ్ 1–0–12–0. -
Viral Video: శతాబ్దపు అత్యుత్తమ క్యాచ్ అందుకున్న స్టీవ్ స్మిత్
విశాఖ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ నమ్మశక్యంకాని క్యాచ్‌ను అందుకున్నాడు. పక్షిలా గాల్లోకి ఎగురుతూ ఒంటిచేత్తో అందుకున్న ఈ డైవిండ్ క్యాచ్‌ను క్రికెట్ విశ్లేషకులు, అభిమానులు క్యాచ్ ఆఫ్ ద సెంచరీగా అభివర్ణిస్తున్నారు. భారత ఇన్నింగ్స్ 9.2వ ఓవర్లో సీన్ అబాట్ బౌలింగ్ చేస్తుండగా ఫస్ట్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న స్టీవ్ స్మిత్ సెన్సేషనల్ క్యాచ్ పట్టడంతో హార్ధిక్ పాండ్యా (1) పెవిలియన్ బాటపట్టాడు. వాస్తవానికి ఈ క్యాచ్ సెకెండ్ స్లిప్ ఫీల్డర్ అందుకోవడం కూడా కష్టమే. Hardik Pandya dismissed for 1. what a catch by Smith#HardikPandya #INDvsAUS #ViratKohli #SuryakumarYadav India 49/5 now. pic.twitter.com/idE6IjpaSR — Rajkumar (@Rajkumar0507) March 19, 2023 అలాంటిది స్మిత్ సూపర్ మ్యాన్‌లా గాల్లోకి ఎగురుతూ కళ్లు చెదిరే డైవింగ్ క్యాచ్ అందుకుని యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఔరా అనిపించాడు. స్మిత్‌కు ఇలాంటి ఫీల్డింగ్ విన్యాసాలు కొత్త కానప్పటికీ, ఈ క్యాచ్ మాత్రం అతనికి జీవితాంతం గుర్తుండిపోతుంది. స్మిత్ సెన్సేషనల్ డైవింగ్ క్యాచ్‌ను సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తుంది. ఇది చూసి స్మిత్‌ను వ్యతిరేకించే వారు సైతం అతన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. ఇదిలా ఉంటే, ఆసీస్‌తో రెండో వన్డేలో సూర్యకుమార్, శుభ్‌మన్ గిల్ డకౌట్లు కావడంతో పాటు రోహిత్ శర్మ (13), కేఎల్ రాహుల్ (9), హార్ధిక్ పాండ్యా (1), జడేజా (16) దారుణంగా విఫలం కావడంతో టీమిండియా 91 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. విరాట్ కోహ్లి (31) ఒక్కడే కాస్త పర్వాలేదనిపించాడు. -
సూర్యకుమార్ 'ఖేల్' ఖతమైనట్టే..!
IND VS AUS 2nd ODI: భారీ అంచనాల నడుమ ప్రతి మ్యాచ్ బరిలోకి దిగే టీమిండియా విధ్వంసకర బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ గత కొన్ని మ్యాచ్‌లుగా చెత్త ప్రదర్శన చేస్తూ ఉసూరుమనిపిస్తున్నాడు. జనవరి 7న శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో (51 బంతుల్లో 112) చివరిసారిగా సెంచరీ చేసిన స్కై.. ఆతర్వాత వరుస విఫలమవుతూ ఫ్యాన్స్‌కు విసుగు తెప్పిస్తున్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగిన సూర్యకుమార్.. తొలి వన్డేలోనూ ఇదే తరహాలో తొలి బంతికే ఔటయ్యాడు. రెండు సార్లు మిచెల్ స్టార్కే స్కై వికెట్ తీశాడు. అది కూడా ఒకే తరహాలో ఎల్బీడబ్ల్యూ చేసి ఔట్ చేశాడు. వరుస వైఫల్యాల నేపథ్యంలో సూర్యకుమార్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్కైని వెంటనే వన్డే జట్టు నుంచి తప్పించాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. కొందరేమో వన్డేల్లో స్కైకి మరికొన్ని అవకాశాలు ఇవ్వాలని అంటుంటే.. మెజార్టీ శాతం అతన్ని సాగనంపాలని కోరుతున్నారు. పొట్టి ఫార్మాట్లో ఇరగదీసే స్కై.. వన్డేల్లో తేలిపోతుండటం అతని అభిమానులతో పాటు అతన్ని కూడా బాధిస్తుంది. గత 10 వన్డే ఇన్నింగ్స్‌ల్లో కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయకపోవడంతో స్కైని మర్యాద పూర్వకంగా వన్డే జట్టు నుంచి తప్పించాలని బీసీసీఐ వర్గాలు కూడా యోచిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే, ఆసీస్‌తో రెండో వన్డేలో సూర్యకుమార్, శుభ్‌మన్ గిల్ డకౌట్లు కావడంతో పాటు రోహిత్ శర్మ (13), కేఎల్ రాహుల్ (9), హార్ధిక్ పాండ్యా (1) దారుణంగా విఫలం కావడంతో టీమిండియా 49 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. విరాట్ కోహ్లి (30), జడేజా (8) టీమిండియాను గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. -
ఆసీస్ ఓపెనర్ల విధ్వంసం.. రెండో వన్డేలో భారత్ ఓటమి
ఆసీస్ ఓపెనర్ల విధ్వంసం.. రెండో వన్డేలో భారత్ ఓటమి టీమిండియాతో జరిగిన రెండో వన్డేలో 10 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 118 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. వికెట్ నష్టపోకుండా 11 ఓవర్లలోనే చేదించింది. ఆసీస్ ఓపెనర్లు మిచెల్ మార్ష్(36 బంతుల్లో 66 నాటౌట్), ట్రావిస్ హెడ్(30 బంతుల్లో 51 నాటౌట్) విధ్వంసం సృష్టించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా.. ఆసీస్ బౌలర్లు నిప్పులు చేరగడంతో కేవలం 117 పరుగులకే కుప్పకూలింది.ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ 5వికెట్లతో టీమిండియా వెన్ను విరచగా.. అబాట్ మూడు, నాథన్ ఎల్లిస్ రెండు వికెట్లు సాధించారు. విజయానికి చేరువలో ఆసీస్.. 118 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. 8 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 90 పరుగులు చేసింది. ఆసీస్ ఓపెనర్ మిచెల్ మార్ష్(54) హాఫ్ సెంచరీ సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లలో ఇప్పటి వరకు 5 ఫోర్లు, 5 సిక్స్‌లు ఉన్నాయి. అతడితో పాటు హెడ్(32) పరుగులతో క్రీజులో ఉన్నాడు. 118 పరుగుల టార్గెట్.. దూకుడుగా ఆడుతున్న ఆసీస్ 118 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్.. ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతుంది. 3 ఓవర్లలో ఆ జట్టు వికెట్ నష్టపోకుండా 24 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ (10), ట్రవిస్ హెడ్ (10) క్రీజ్‌లో ఉన్నారు. నిప్పులు చెరిగిన ఆసీస్ పేసర్లు.. 117 పరుగులకే కుప్పకూలిన భారత్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. మిచెల్ స్టార్క్ (5/53), సీన్ అబాట్ (3/23), నాథన్ ఇల్లీస్ (2/13) నిప్పులు చెరగడంతో భారత్‌ను 117 పరుగులకే ఆలౌట్ చేసింది. భారత ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లి (31) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 103 పరుగుల వద్ద 2 వికెట్లు కోల్పోయిన టీమిండియా 103 పరుగుల వద్ద టీమిండియా 2 వికెట్లు కోల్పోయింది. కుల్దీప్ (4), షమీ (0)లను అబాట్ పెవిలియన్‌కు పంపాడు. క్రీజులో అక్షర్ పటేల్, సిరాజ్ ఉన్నారు. ఏడో వికెట్ కోల్పోయిన భారత్.. జడ్డూ (16) ఔట్ 91 పరుగుల వద్ద టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది. నాథన్ ఇల్లీస్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ అలెక్స్ క్యారీ క్యాచ్ పట్టడంతో రవీంద్ర జడేజా (16) ఔటయ్యాడు. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ క్రీజ్‌లో ఉన్నారు. ఆరో వికెట్ కోల్పోయిన భారత్... కోహ్లి ఔట్ 71 పరుగుల వద్ద టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. నాథన్ ఇల్లీస్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లి (31) ఎల్బీడబ్ల్యూ ఔటయ్యాడు. స్మిత్ సెన్సేషనల్ క్యాచ్.. 49 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన భారత్ ఫస్ట్ స్లిప్‌లో స్టీవ్ స్మిత్ సెన్సేషనల్ క్యాచ్ పట్టడంతో హార్ధిక్ పాండ్యా (1) పెవిలియన్ బాటపట్టక తప్పలేదు. దీంతో టీమిండియా 49 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. విరాట్ కోహ్లి (22), జడేజా క్రీజ్‌లో ఉన్నాడు. నాలుగో వికెట్ కోల్పోయిన భారత్.. రాహుల్ ఔట్, 4 వికెట్లు స్టార్క్ ఖాతాలోకే మిచెల్ స్టార్క్ టీమిండియాను దారుణంగా దెబ్బకొడుతున్నాడు. ఇప్పటికే 3 వికెట్లు పడగొట్టిన స్టార్క్.. కేఎల్ రాహుల్ (9)ను కూడా వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. 9 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 49/4. కోహ్లి (22), హార్ధిక్ (1) క్రీజ్‌లో ఉన్నారు. వరుస బంతుల్లో వికెట్లు కోల్పోయిన భారత్.. స్కై మరో డకౌట్ టీమిండియా కష్టాల్లో పడింది. స్టార్క్ వరుస బంతుల్లో రోహిత్ శర్మ (13), సూర్యకుమార్ యాదవ్‌లకు ఔట్‌చేసి టీమిండియాను దారుణంగా దెబ్బకొట్టాడు. 4.5 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 32/3గా ఉంది. విరాట్ కోహ్లి (15), కేఎల్ రాహుల్ క్రీజ్‌లో ఉన్నారు. రోహిత్ శర్మ ఔట్.. రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా 13 పరుగులు చేసిన రోహిత్ శర్మ స్టార్క్ బౌలింగ్‌లో స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 32 పరుగులు చేసింది. మూడు ఓవర్లలో టీమిండియా స్కోరు 29/1 మూడు ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్ నష్టానికి 29 పరుగులు చేసింది. కోహ్లి 14, రోహిత్ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు. గిల్ డకౌట్.. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే టీమిండియాకు షాక్ తగిలింది. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో గిల్ డకౌట్ అయ్యాడు. లబుషేన్‌కు సింపుల్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా వికెట్ నష్టానికి నాలుగు పరుగులు చేసింది. తొలుత బ్యాటింగ్ చేయనున్న భారత్ విశాఖ వేదికగా ఇవాళ (మార్చి 19) జరుగుతున్న భారత్-ఆస్ట్రేలియా రెండో వన్డే వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోతుందేమోనని ఆందోళన చెందిన అభిమానులకు శుభవార్త. వరుణుడు శాంతించి, ఎండ కాయడంతో జరుగదనుకున్న మ్యాచ్ మొదలైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆసీస్ రెండు మార్పులతో బరిలోకి దిగనుండగా.. టీమిండియా ఒక్క మార్పు చేసింది. మ్యాక్స్‌వెల్ స్థానంలో నాథన్ ఇల్లీస్, జోస్ ఇంగ్లిస్ ప్లేస్‌లో అలెక్స్ క్యారీ బరిలోకి దిగనుండగా.. భారత్ నుంచి శార్దూల్ ఠాకూర్ స్థానాన్ని అక్షర్ పటేల్ భర్తీ చేయనున్నాడు. తుది జట్లు.. భారత్: శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ ఆస్ట్రేలియా: ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్(కెప్టెన్), మార్నస్ లాబుషేన్, అలెక్స్ క్యారీ(వికెట్ కీపర్), కామెరాన్ గ్రీన్, నాథన్ ఇల్లీస్, మార్కస్ స్టోయినిస్, సీన్ అబాట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా -
సెంచరీల మీద సెంచరీలు బాదుతూ జాత్యాహంకారుల నోళ్లు మూయించిన ధీరుడు
SA VS WI 2nd ODI: జాతి వివక్ష.. వర్ణ భేదం.. ఆహార్యంపై వెకిలి మాటలు..జాతీయ జట్టుకు సారధి అయినప్పటికీ, సొంతవారి నుంచే వ్యతిరేకత.. ఇలా చెప్పుకుంటూ పోతే వర్ణించరాని ఎన్నో కష్టాలు, అవమానాలు, ఆటుపోట్లను ఎదుర్కొన్న సౌతాఫ్రికా టెస్ట్, వన్డే జట్టు సారధి టెంబా బవుమా.. అవకాశం దొరికిన ప్రతిసారి తనను విమర్శించిన వారికి తన ఆటతీరుతో బదులిస్తున్నాడు. పేలవ ఫామ్ కారణంగా ఇటీవలే టీ20 కెప్టెన్సీని కోల్పోయిన బవుమా.. ప్రస్తుతం కెరీర్ అత్యుత్తమ ఫామ్‌లో కొనసాగుతున్నాడు. తాజాగా స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో విధ్వంసకర శతకంతో (118 బంతుల్లో 144; 11 ఫోర్లు, 7 సిక్సర్లు) విజృంభించిన బవుమా.. అంతర్జాతీయ క్రికెట్లో వరుసగా రెండో శతకాన్ని (విండీస్‌తో రెండో టెస్ట్‌లో 172) బాదాడు. బవుమాకు గత 3 వన్డేల్లో ఇది రెండో శతకం. ఈ మ్యాచ్‌కు ముందు ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో 35 పరుగులు చేసిన బవుమా అంతకుముందు జరిగిన రెండో వన్డేలో 109 పరుగులు చేశాడు. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్ట్ రెండు ఇన్నింగ్స్‌ల్లో డకౌట్ కావడంతో తీవ్ర విమర్శలను ఎదుర్కొన్న బవుమాను ఓ దశలో టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పించాలని కొందరు జాత్యాహంకారులు డిమాండ్ చేశారు. బవుమా సౌతాఫ్రికా కెప్టెన్ కావడం ఇష్టం లేని కొందరు అతను ఒక్క మ్యాచ్‌లో విఫలమైనా పని కట్టుకుని మరీ విమర్శలు చేసేవారు. అలాంటి వారికి బవుమా ప్రతిసారి తన బ్యాట్‌తో సమాధానం చెప్తూ వస్తున్నాడు. తాజా సెంచరీతో బవుమా తన జట్టును గెలిపించలేకపోయినా.. అద్భుతమైన పోరాటపటిమ, ఆటతీరుతో విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు. విండీస్‌తో రెండో వన్డేలో శైలీకి భిన్నంగా 7 భారీ సిక్సర్లు బాదిన బవుమా విమర్శకులు ముక్కునవేళ్లేసుకునేలా చేశాడు. ఈ మ్యాచ్‌లో భారీ షాట్లతో పాటు మాస్టర్ క్లాస్ ఆటను ఆడిన బవుమా..సొగసైన బౌండరీలు కొట్టి, స్ట్రయిక్ రొటేట్ చేస్తూ బెస్ట్ వన్డే నాక్ ఆడాడు. కెరీర్ ఆరంభం నుంచే జాత్యాహంకారులకు టార్గెట్‌గా మారిన బవుమా.. ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా, ఏమాత్రం నిరుత్సాహానికి లోను కాకుండా ప్రతిసారి బ్యాట్‌తో సమాధానం చెప్పడం యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆకట్టుకుంటుంది. క్లిష్ట సమయంలో ముళ్ల కిరీటం లాంటి సౌతాఫ్రికన్ కెప్టెన్సీని చేపట్టిన బవుమా.. సారధిగానూ అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ, సహచరుల నుంచి సరైన మద్దతు లభించడం లేదని స్పష్టంగా తెలుస్తోంది. సౌతాఫ్రికా కెప్టెన్‌గా నియమితుడైన మొట్టమొదటి బ్లాక్ అఫ్రికన్ అయిన బవుమా.. సౌతాఫ్రికా తరఫున టెస్ట్‌ల్లో సెంచరీ చేసిన తొలి నల్లజాతీయుడిగా, వన్డే అరంగేట్రంలో సెంచరీ చేసిన తొలి సౌతాఫ్రికన్‌గా పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా, సౌతాఫ్రికాలో జాతి వివక్ష గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నెల్సన్ మండేలా ఎందు కోసం పోరాడాడో యావత్ ప్రపంచం చూసింది. కాలంలో ఎన్ని మార్పులు వస్తున్నా ఇంకా కొంత మంది సౌతాఫ్రికన్లలో జాత్యాహంకారం బీజాలు పోలేదు. ఈ వరుస సౌతాఫ్రికా క్రికెట్లో ఇంకా కొనసాగుతూనే ఉంది. జాత్యాహంకారానికి వ్యతిరేకంగా మోకాలిపై నిలబడాలని క్రికెట్ సౌతాఫ్రికా ఆదేశించినా ఆ జట్టు స్టార్ ఆటగాడు క్వింటన్ డికాక్‌తో పాటు కొందరు అలా చేసేందుకు నిరాకరించడం ఇందుకు నిదర్శనం. మున్ముందు ఇలా చేయాల్సి వస్తుందేమోనని డికాక్ ఏకంగా తన కెరీర్‌నే వదులుకునేందుకు సిద్ధపడ్డాడు. గతంలో సౌతాఫ్రికా జట్టులో బ్లాక్స్‌ను వ్యతిరేస్తూ కొందరు స్టార్ ఆటగాళ్లు ఏకంగా దేశం వదలి ఇతర దేశాలకు వలస వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. బవుమా లాంటి ఆటగాళ్లు తమ టాలెంట్‌తో కెప్టెన్ స్థాయికి ఎదగడంతో కొందరు కడుపు మంటతో అనునిత్యం విమర్శలు చేస్తూనే ఉంటారు. నేషనల్ టీమ్‌కు కెప్టెన్ అయినప్పటికీ స్వదేశంలో ఇటీవల జరిగిన ఎస్ఏ20 లీగ్‌లో బవుమాను ఏ ఫ్రాంచైజీ తీసుకోకుండా ఘోరంగా అవమానించింది. రేసిజమ్ కారణంగా ఇలా జరిగిందని క్రికెట్ సర్కిల్స్‌లో ప్రచారం జరిగింది. ఆతర్వాత రీప్లేస్‌మెంట్‌గా బవుమాను ఓ ఫ్రాంచైజీ అక్కును చేర్చుకున్నప్పటికీ ఇది క్రికెట్ సౌతాఫ్రికాకు మాయని మచ్చగా మిగిలిపోతుంది. కెరీర్లో 56 టెస్ట్‌లు, 24 వన్డేలు, 33 టీ20లు ఆడిన బవుమా.. మొత్తంగా 4500 పైచిలుకు పరుగులు సాధించాడు. ఇందులో 2 టెస్ట్ శతకాలు, 20 అర్ధసెంచరీలు.. 4 వన్డే హండ్రెడ్స్, 2 ఫిఫ్టీలు.. ఓ టీ20 హాఫ్ సెంచరీ ఉన్నాయి. -
వైజాగ్‌లో సిరీస్ సాధిస్తారా!
సాక్షి, విశాఖపట్నం: ఆస్ట్రేలియాను టెస్టు సిరీస్‌లో ఓడించిన భారత జట్టు ఇప్పుడు వన్డే సిరీస్‌లో కూడా పడగొట్టేందుకు మరో మ్యాచ్ దూరంలో ఉంది. ఇరు జట్ల నేడు విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో రెండో వన్డే జరుగుతుంది. ఈ పోరులో గెలిస్తే సిరీస్ భారత్ ఖాతాలో చేరుతుంది. మరోవైపు సిరీస్‌ను సజీవంగా ఉంచేందుకు ఆసీస్‌కు ఈ మ్యాచ్‌లో గెలవడం తప్పనిసరి. వ్యక్తిగత కారణాలతో తొలి వన్డే నుంచి తప్పుకున్న రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో సారథిగా బాధ్యతలు తీసుకుంటాడు. మూడో స్పిన్నర్‌కు చోటు... తొలి వన్డేలో భారత పేసర్లు షమీ, సిరాజ్ చక్కగా రాణించారు. స్పిన్ విభాగంలో జడేజా రాణించగా, కుల్దీప్ మాత్రమే కొన్ని పరుగులిచ్చాడు. అయితే ముంబైతో పోలిస్తే వైజాగ్ పిచ్ స్పిన్‌కు మరింత అనుకూలంగా ఉండటంతో రెండో రెగ్యులర్ స్పిన్నర్ ఉంటే బాగుంటుందని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. అదే జరిగితే శార్దుల్ ఠాకూర్ స్థానంలో వాషింగ్టన్ సుందర్‌కు అవకాశం దక్కవచ్చు. మూడో పేసర్ పాత్రను హార్దిక్ సమర్థంగా నిర్వహిస్తుండటంతో శార్దుల్ అవసరం ఇప్పుడు జట్టుకు కనిపించడం లేదు. బ్యాటింగ్‌లో ఊహించినట్లుగానే మిడిలార్డర్లో శ్రేయస్ లేని లోటు కనిపిస్తోంది. సూర్యకుమార్ మరోసారి వన్డేల్లో అవకాశాన్ని వృథా చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లోనైనా ఆడకపోతే అతను వన్డే కెరీర్ ఇబ్బందుల్లో పడటం ఖాయం. రోహిత్ రాకతో ఓపెనింగ్‌లో జట్టు బలం పెరిగింది. గత మ్యాచ్‌లో విఫలమైన కోహ్లి తన స్థాయికి తగ్గట్లు ఆడితే భారీ స్కోరు ఖాయం. వార్నర్ ఆడితే... మరోవైపు ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిన స్థితిలో బరిలోకి దిగుతోంది. అయితే ఆ జట్టు బ్యాటింగ్ బలహీనత తొలి వన్డేలో స్పష్టంగా కనిపించింది. గాయం నుంచి కోలుకున్న వార్నర్ ఆడితే జట్టులో ఎవరిని పక్కన పెడతారనేది ఆసక్తికరం. పైగా బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు జరుగుతాయి. కీపర్ ఇన్‌గ్లిస్ స్థానంలో క్యారీ వస్తాడు. హెడ్, లబుషేన్ రాణించడం కీలకం. అయితే అన్నింటికి మించి స్టీవ్ స్మిత్ ఫామ్ ఆసీస్‌ను ఆందోళన పరుస్తోంది. భారత్‌లో అడుగు పెట్టినప్పటి నుంచి అతను కనీసం ఒక్క అర్ధ సెంచరీ కూడా చేయలేకపోయాడు. ఇప్పటికైనా అతను ఆ లోటును తీర్చుకుంటాడా చూడాలి. స్టార్క్ తన బౌలింగ్ పదును భారత్‌కు చూపించగా... తొలి వన్డేలో ఒక బౌలర్‌ను తక్కువగా ఆడించి ఇబ్బంది పడిన కంగారూలు ఈసారి ఎలా వ్యూహం మారుస్తారో చూడాలి. వాన గండం... విశాఖ పిచ్ మొదటి నుంచి బ్యాటింగ్‌కు బాగా అనుకూలం. దాదాపు అన్ని మ్యాచ్‌లలో భారీ స్కోర్లు నమోదయ్యాయి. ఈసారి కూడా అలాంటి పిచ్ ఎదురు కావచ్చు. అయితే వర్షం ఆటకు ఇబ్బందిగా మారవచ్చని తెలుస్తోంది. స్థానిక వాతావరణ సూచన ప్రకారం ఆదివారం వాన పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. తుది జట్లు (అంచనా) భారత్: రోహిత్ (కెప్టెన్), గిల్, కోహ్లి, సూర్యకుమార్, రాహుల్, పాండ్యా, జడేజా, సుందర్, కుల్దీప్, షమీ, సిరాజ్. ఆస్ట్రేలియా: స్మిత్ (కెప్టెన్), మార్‡్ష, హెడ్, లబుషేన్, క్యారీ, గ్రీన్, మ్యాక్స్‌వెల్, స్టొయినిస్, అబాట్, స్టార్క్, జంపా. 7:విశాఖపట్నంలో భారత్ 9 వన్డేలు ఆడగా...7 గెలిచింది. ఒక మ్యాచ్‌లో ఓడిపోగా, మరో మ్యాచ్ ‘టై’గా ముగిసింది. ఈ వేదికపై ఆడిన ఆరు వన్డేల్లో కోహ్లి 118, 117, 99, 65, 157 నాటౌట్, 0 స్కోర్లు నమోదు చేశాడు. -
IND VS AUS 2nd ODI: హాట్‌కేకుల్లా ‘విశాఖ’ వన్డే టికెట్ల విక్రయం
విశాఖ స్పోర్ట్స్: భారత్, ఆస్ట్రేలియా సిరీస్‌లో భాగంగా ఈనెల 19న విశాఖలోని వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో జరగనున్న రెండో వన్డేకు సంబంధించిన టికెట్లు మంగళవారం హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి. స్టేడియం సామర్థ్యం 27 వేలు కాగా.. పేటీఎం సంస్థ ఈ నెల 10, 11, 12 తేదీల్లో రూ.600 నుంచి రూ.6 వేల వరకు వివిధ విభాగాల్లో 70 శాతం టికెట్లను ఆన్లైన్లో విక్రయించింది. మిగిలిన 30 శాతం టికెట్లను స్థానిక అభిమానులను దృష్టిలో పెట్టుకొని వైఎస్సార్ స్టేడియంతో పాటు మరో రెండు సెంటర్లలో ఏసీఏ నిర్వాహక కమిటీ మంగళవారం అందుబాటులో పెట్టింది. వీటి కోసం తెల్లవారుజాము నుంచే క్రికెట్ అభిమానులు ‘క్యూ’లు కట్టారు. దీంతో టికెట్లన్నీ హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి. కాగా, సిరీస్‌లో తొలి వన్డే 17వ తేదీన ముంబైలో, మూడో వన్డే 22న చెన్నైలో జరగనుంది. -
టీమిండియా చేతిలో పరాజయం.. టాప్ ర్యాంక్ కోల్పోయిన న్యూజిలాండ్
IND VS NZ 2nd ODI: భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో వన్డే తర్వాత ఐసీసీ టీమ్ వన్డే ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. టీమిండియా చేతిలో ఓటమి అనంతరం న్యూజిలాండ్ వన్డేల్లో తమ టాప్ ర్యాంక్ కోల్పోయి రెండో స్థానానికి పడిపోయింది. తాజా ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ అగ్రస్థానానికి చేరుకోగా టీమిండియా నాలుగు నుంచి మూడో స్థానానికి ఎగబాకింది. ప్రస్తుతం ఇంగ్లండ్, న్యూజిలాండ్, భారత్ ఖాతాల్లో సమానంగా 113 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. కివీస్‌తో సిరీస్‌ను భారత్ 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేస్తే సింగిల్‌గా టాప్ ర్యాంక్‌కు చేరుకుంటుంది. ఇప్పటికే టీ20ల్లో టాప్ ర్యాంక్‌లో ఉన్న భారత్.. వన్డేల్లో ఆ స్థానాన్ని చేరుకునేందుకు మరో మ్యాచ్ దూరంలో మాత్రమే ఉంది. ఇక టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం ఆస్ట్రేలియా (126 రేటింగ్ పాయింట్లు) తర్వాత రెండో స్థానంలో ఉన్న భారత్.. త్వరలో స్వదేశంలో జరిగే 4 మ్యాచ్‌ల సిరీస్‌ను 3-1 తేడాతో కైవసం చేసుకోగలిగితే, ఈ విభాగంలోనూ అగ్రపీఠానికి చేరుకుంటుంది. మొత్తంగా క్రికెట్లోని అన్ని ఫార్మాట్లలో టీమిండియా టాప్ ర్యాంక్‌కు చేరుకునేందుకు మరో 5 మ్యాచ్‌ల దూరంలో (ఓ వన్డే, 4 టెస్ట్‌లు) మాత్రమే ఉంది. ఇదిలా ఉంటే, రాయ్‌పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన భారత్.. మహ్మద్ షమీ (3/18), మహ్మద్ సిరాజ్ (1/10), శార్దూల్ ఠాకూర్ (1/26), హార్ధిక్ పాండ్యా (2/16), కుల్దీప్ యాదవ్ (1/29), వాషింగ్టన్ సుందర్ (2/7) విజృంభించడంతో 34.3 ఓవర్లలోనే కివీస్‌ను 108 పరుగులకు ఆలౌట్ చేసింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో గ్లెన్ ఫిలిప్స్ (36), మైఖేల్ బ్రేస్‌వెల్ (22), మిచెల్ సాంట్నర్ (27) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. 109 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. 20.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఆడుతూపాడుతూ విజయం సాధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ (50 బంతుల్లో 51 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) కెరీర్లో 48వ హాఫ్ సెంచరీతో అదరగొట్టగా.. మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (53 బంతుల్లో 40 నాటౌట్; 6 ఫోర్లు) భీకర ఫామ్‌ను కొనసాగించాడు. వేగంగా మ్యాచ్ ముగించే క్రమంలో విరాట్ కోహ్లి (9 బంతుల్లో 11; 2 ఫోర్లు) సాంట్నర్ బౌలింగ్‌లో స్టంప్ ఔటయ్యాడు. కివీస్ బౌలర్లలో హెన్రీ షిప్లే, మిచెల్ సాంట్నర్లకు తలో వికెట్ దక్కింది. నామమాత్రమైన మూడో వన్డే ఇండోర్ వేదికగా జనవరి 24న జరుగనుంది. -
Ind Vs NZ: మన బౌలింగ్ భళా... అంతా ఏకపక్షమే, భారత్ పక్షమే
ఎలాంటి సంచలన ప్రదర్శనలు, ఎలాంటి ప్రతిఘటన, పోరాటాలు లేవు... అంతా ఏకపక్షమే, భారత్ పక్షమే.. తొలి వన్డేలో మన జట్టును వణికించిన న్యూజిలాండ్ రెండో పోరులో పూర్తిగా చేతులెత్తేసింది. భారత బౌలింగ్‌ను ఎదుర్కోలేక 108 పరుగులకే ఆట కట్టేసి ముందే ఓటమికి సిద్ధమైంది. ఆ తర్వాత ఆడుతూ పాడుతూ ఛేదన పూర్తి చేసిన భారత్ మరో సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకుంది. రాయ్‌పూర్: తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లో రాయ్‌పూర్ అభిమానులకు తగిన ఆనందం దక్కలేదు. మొత్తం మ్యాచ్ 54.4 ఓవర్లలోనే ముగిసిపోయింది. శనివారం జరిగిన రెండో వన్డేలో భారత్ 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 34.3 ఓవర్లలో 108 పరుగులకే కుప్పకూలింది. భారత్‌పై ఆ జట్టుకు ఇది మూడో అత్యల్ప స్కోరు. గ్లెన్ ఫిలిప్స్ (52 బంతుల్లో 36; 5 ఫోర్లు) టాప్ స్కోరర్. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ షమీ (3/18) కివీస్‌ను దెబ్బ తీశాడు. అనంతరం భారత్ 20.1 ఓవర్లలో 2 వికెట్లకు 111 పరుగులు చేసి గెలిచింది. రోహిత్ శర్మ (50 బంతుల్లో 51; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), శుబ్‌మన్ గిల్ (53 బంతుల్లో 40 నాటౌట్; 6 ఫోర్లు) తొలి వికెట్‌కు 72 పరుగులు జోడించి విజయానికి పునాది వేశారు. భారత్‌కు సొంతగడ్డపై ఇది వరుసగా ఏడో వన్డే సిరీస్ విజయం. చివరిదైన మూడో వన్డే మంగళవారం ఇండోర్‌లో జరుగుతుంది. సమష్టి వైఫల్యం... ఇన్నింగ్స్ ఐదో బంతికి అలెన్ (0)ను షమీ బౌల్డ్ చేయడంతో కివీస్ పతనం మొదలైంది. ఆ తర్వాత పరుగు తేడాతో నికోల్స్ (2), మిచెల్ (1) వెనుదిరగ్గా... ఆరు బంతుల వ్యవధిలో కాన్వే (7), లాథమ్ (1) అవుటయ్యారు. దాంతో కేవలం 15 పరుగుల స్కోరు వద్దే కివీస్ సగం బ్యాటర్లు పెవిలియన్ చేరారు. ఈ దశలో ఫిలిప్స్‌తో కలిసి గత మ్యాచ్ హీరోలు బ్రేస్‌వెల్, సాన్‌ట్నర్ పోరాడారు. ఫిలిప్స్... ఆరో వికెట్‌కు బ్రేస్‌వెల్‌తో 41 పరుగులు, ఏడో వికెట్‌కు సాన్ట్నర్తో 47 పరుగులు జోడించాడు. షమీ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టి జోరు పెంచే ప్రయత్నం చేసిన బ్రేస్‌వెల్ తర్వాతి బంతికి అవుట్ కాగా, కుల్దీప్ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన సాన్ట్నర్ను పాండ్యా వెనక్కి పంపించాడు. స్కోరు 100 దాటాక తర్వాతి రెండు వికెట్లు సుందర్ ఖాతాలో చేరగా, కుల్దీప్ చివరి వికెట్ పడగొట్టాడు. స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్‌కు ఎలాంటి ఇబ్బందీ ఎదురు కాలేదు. రోహిత్, గిల్ చక్కటి షాట్లతో పరుగులు రాబట్టడంతో 10 ఓవర్లలో స్కోరు 52/0కు చేరింది. 47 బంతుల్లో రోహిత్ హాఫ్ సెంచరీ పూర్తయ్యాక టిక్నర్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. కోహ్లి (11) విఫలంకాగా... అప్పటికే కుదురుకున్న గిల్... ఇషాన్ కిషన్ (8 నాటౌట్)తో కలిసి మ్యాచ్‌ను ముగించాడు. స్కోరు వివరాలు న్యూజిలాండ్ ఇన్నింగ్స్: అలెన్ (బి) షమీ 0; కాన్వే (సి అండ్ బి) పాండ్యా 7; నికోల్స్ (సి) గిల్ (బి) సిరాజ్ 2; మిచెల్ (సి అండ్ బి) షమీ 1; ఫిలిప్స్ (సి) సూర్యకుమార్ (బి) సుందర్ 36; బ్రేస్‌వెల్ (సి) ఇషాన్ (బి) షమీ 22; సాన్‌ట్నర్ (బి) పాండ్యా 27; షిప్లీ (నాటౌట్) 2; ఫెర్గూసన్ (సి) సూర్యకుమార్ (బి) సుందర్ 1; టిక్నర్ (ఎల్బీ) (బి) కుల్దీప్ 2; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (34.3 ఓవర్లలో ఆలౌట్) 108. వికెట్ల పతనం: 1–0, 2–8, 3–9, 4–15, 5–15, 6–56, 7–103, 8–103, 9–105, 10–108. బౌలింగ్: షమీ 6–1–18–3, సిరాజ్ 6–1–10–1, శార్దుల్ 6–1–26–1, హార్దిక్ పాండ్యా 6–3–16–2, కుల్దీప్ 7.3–0–29–1, వాషింగ్టన్ సుందర్ 3–1–7–2. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (ఎల్బీ) (బి) షిప్లీ 51; గిల్ (నాటౌట్) 40; కోహ్లి (స్టంప్డ్) లాథమ్ (బి) సాన్‌ట్నర్ 11; ఇషాన్ (నాటౌట్) 8; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (20.1 ఓవర్లలో 2 వికెట్లకు) 111. వికెట్ల పతనం: 1–72, 2–98. బౌలింగ్: ఫెర్గూసన్ 5–0– 21–0, షిప్లీ 5–0–29–1, టిక్నర్ 4–0–19–0, సాన్‌ట్నర్ 4.1–0–28–1, బ్రేస్‌వెల్ 2–0–13–0. రోహిత్ మతిమరుపు... టాస్ సమయంలో అనూహ్య ఘటన జరిగింది. టాస్ గెలిచిన రోహిత్ ఏం ఎంచుకోవాలో చెప్పకుండా కొన్ని క్షణాల పాటు తటపటాయించాడు. టాస్ గెలిస్తే ఏం చేయాలో తాను మరచిపోయానని అంటూ కొంత ఆలోచించి, ఆలోచించి చివరకు ఫీల్డింగ్ అంటూ చెప్పడం నవ్వు తెప్పించింది. -
IND VS NZ 2nd ODI: హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ
3 వన్డేల సిరీస్‌లో భాగంగా రాయ్‌పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా విజయం దిశగా సాగుతుంది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన భారత్.. మహ్మద్ షమీ (3/18), మహ్మద్ సిరాజ్ (1/10), శార్దూల్ ఠాకూర్ (1/26), హార్ధిక్ పాండ్యా (2/16), కుల్దీప్ యాదవ్ (1/29), వాషింగ్టన్ సుందర్ (2/7) విజృంభించడంతో 34.3 ఓవర్లలోనే కివీస్‌ను 108 పరుగులకు ఆలౌట్ చేసింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో గ్లెన్ ఫిలిప్స్ (36), మైఖేల్ బ్రేస్‌వెల్ (22), మిచెల్ సాంట్నర్ (27) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. 109 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. 13 ఓవర్ల తర్వాత వికెట్ నష్టపోకుండా 71 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (47 బంతుల్లో 50 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) కెరీర్లో 48వ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (31 బంతుల్లో 20; 3 ఫోర్లు) ఆచితూచి ఆడుతున్నాడు. కివీస్ బౌలర్లు వికెట్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఫలితం దక్కడం లేదు. -
తొలి వన్డేలో 7 ఓవర్లలో 70.. రెండో మ్యాచ్‌లో 6-3-16-2
Hardik Pandya: రాయ్‌పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా బంతితో విజృంభించాడు. 6 ఓవర్లలో కేవలం 16 పరుగులిచ్చి 2 కీలక వికెట్లు (కాన్వే, సాంట్నర్) పడగొట్టాడు. హార్ధిక్ తన స్పెల్‌లో ఏకంగా 3 మెయిడిన్ ఓవర్లు సంధించడం విశేషం. హార్ధిక్‌తో పాటు షమీ (6-1-18-3), సిరాజ్ (6-1-10-1), శార్దూల్ (6-1-26-1), కుల్దీప్ (7.3-0-29-1), వాషింగ్టన్ సుందర్ (3-1-7-2) అద్భుతమైన గణాంకాలు నమోదు చేయడంతో రెండో వన్డేలో భారత్.. న్యూజిలాండ్‌ను 108 పరుగులకే కుప్పకూల్చింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో గ్లెన్ ఫిలిప్స్ (36), మైఖేల్ బ్రేస్‌వెల్ (22), మిచెల్ సాంట్నర్ (27) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. కాగా, తొలి వన్డేలో 7 ఓవర్లలో 70 పరుగులు సమర్పించుకుని చెత్తగా బౌలింగ్ చేసిన హార్ధిక్.. మరుసటి మ్యాచ్‌లోనే ఊహించని రీతిలో రికవర్ అయ్యి బౌలింగ్ చేయడంతో భారత క్రికెట్ అభిమానులు అతన్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. హార్ధిక్ ఓ ఫైటర్ అంటూ తెగ మోసేస్తున్నారు. 6 ఓవర్లలో ఏకంగా 3 మెయిడిన్లు వేయడం అద్భుతమని కొనియాడుతున్నారు. నిజానికి హార్ధిక్ ఈ మ్యాచ్‌లో ఫ్రంట్ లైన్ పేసర్‌గా సత్తా చాటాడు. షమీ, సిరాజ్‌లతో పోటీ పడి మరీ అద్భుతమైన గణాంకాలను నమోదు చేశాడు. రెండో వన్డేలో హార్ధిక్ ప్రదర్శన తర్వాత కొందరు భారత అభిమానులు భిన్నంగా స్పందిస్తున్నారు. ఓ మ్యాచ్‌లో విఫలమైతే దూషించడం, మరుసటి మ్యాచ్‌లో రాణిస్తే ఆకాశానికెత్తడం షరా మామూలుగా మారిందని కామెంట్లు పెడుతున్నారు. -
టీమిండియా బౌలర్ల విజృంభణ.. 108 పరుగులకే కుప్పకూలిన న్యూజిలాండ్
రాయ్‌పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా బౌలర్లు రెచ్చిపోయారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన భారత్.. మహ్మద్ షమీ (3/18), మహ్మద్ సిరాజ్ (1/10), శార్దూల్ ఠాకూర్ (1/26), హార్ధిక్ పాండ్యా (2/16), కుల్దీప్ యాదవ్ (1/29), వాషింగ్టన్ సుందర్ (2/7) విజృంభించడంతో 34.3 ఓవర్లలోనే కివీస్‌ను ఆలౌట్ చేసింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో గ్లెన్ ఫిలిప్స్ (36), మైఖేల్ బ్రేస్‌వెల్ (22), మిచెల్ సాంట్నర్ (27) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. తొలి వన్డే సెంచరీ హీరో బ్రేస్‌వెల్ ఈ మ్యాచ్‌లోనూ చెలరేగేలా కనిపించినప్పటికీ.. అతన్ని షమీ బోల్తా కొట్టించాడు. కివీస్ ఇన్నింగ్స్‌లో ఫిన్ అలెన్ (0), డెవాన్ కాన్వే (7), హెన్రీ నికోల్స్ (2), డారిల్ మిచెల్ (1), టామ్ లాథమ్ (1), ఫెర్గూసన్ (1), బ్లెయిర్ టిక్నర్ (2) విఫలమయ్యారు. కాగా, హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్ 12 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. 3 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. -
IND vs NZ 2023: మరో హోరాహోరీకి రె‘ఢీ’
రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్‌నారాయణ్ సింగ్ స్టేడియం... 60 వేలకు పైగా సామర్థ్యంతో దేశంలోని మూడో అతి పెద్ద క్రికెట్ మైదానం... ఇప్పుడు తొలి అంతర్జాతీయ మ్యాచ్‌కు సిద్ధమైంది. అయితే భారత్, న్యూజిలాండ్ రెండో వన్డేపై ఆసక్తి పెరిగేందుకు ఇది మాత్రమే కారణం కాదు. బుధవారం హైదరాబాద్ మ్యాచ్ అందించిన వినోదం ఈ సిరీస్‌ను ఒక్కసారిగా ఆసక్తికరంగా మార్చేసింది. భారత్ ఏకపక్ష విజయం సాధించి ఉంటే... కివీస్ 131/6 నుంచి గెలుపు అంచుల దాకా వెళ్లకుండా ఉంటే ఈ మ్యాచ్‌కు ఇంత ఆకర్షణ వచ్చి ఉండేది కాదేమో! ఈ నేపథ్యంలో మరోసారి ఇరు జట్ల మధ్య మ్యాచ్‌లో అదే తరహాలో పరుగుల వరద పారుతుందా అనేది చూడాలి. రాయ్‌పూర్: సొంతగడ్డపై మరో వన్డే సిరీస్‌ను గెలుచుకునే లక్ష్యంతో భారత జట్టు తమ అస్త్రశస్త్రాలతో సిద్ధమైంది. శనివారం న్యూజిలాండ్‌తో జరిగే రెండో వన్డేలో గెలిస్తే సిరీస్ టీమిండియా ఖాతాలో చేరుతుంది. మరోవైపు పట్టుదలకు మారుపేరైన కివీస్ గత మ్యాచ్‌లో చేజారిన విజయాన్ని అందుకొని సిరీస్ సమం చేయాలని భావిస్తోంది. తొలి వన్డేలో ఇరు జట్ల ఆట, బలాబలాలను చూస్తే హోరాహోరీ పోరు ఖాయం. ఉమ్రాన్‌కు చాన్స్! ఒకరు కాదు, ఇద్దరు కాదు... ఒకేసారి ముగ్గురు ‘డబుల్ సెంచూరియన్’లు భారత తుది జట్టులో ఆడబోతుండటం విశేషం. ఇది భారత బ్యాటింగ్ బలాన్ని చూపిస్తోంది. రోహిత్, గిల్ ఓపెనర్లుగా మెరుపు ఆరంభం అందిస్తే టీమిండియాకు తిరుగుండదు. గత మ్యాచ్‌లో విఫలమైనా... కోహ్లి ఎప్పుడైనా చెలరేగిపోగలడు కాబట్టి సమస్య లేదు. మిడిలార్డర్లో ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ బాగా ఆడటం జట్టుకు కీలకం. ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్యా గత కొంత కాలంగా తగిన న్యాయం చేయలేకపోతున్నాడు. బౌలింగ్‌లో సిరాజ్ మినహా మిగతా వారంతా విఫలమవుతున్నారు. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు పనికొస్తాడని తొలి వన్డేలో శార్దుల్‌ను తీసుకున్నారు. అయితే అది పెద్దగా ఫలితం చూపలేదు. దానికంటే రెగ్యులర్ బౌలర్‌కే అవకాశం ఇవ్వడం మంచిదని భావిస్తే మూడో పేసర్‌గా ఉమ్రాన్ జట్టులోకి తిరిగొస్తాడు. సోధి ఆడతాడా! న్యూజిలాండ్ పోరాటపటిమ ఏమిటో తొలి వన్డేలోనే కనిపించింది. ప్రధాన బ్యాటర్లంతా విఫలమైనా... అనామకుడు అనుకున్న మైకేల్ బ్రేస్‌వెల్ తన విధ్వంసకర బ్యాటింగ్‌ను చూపించాడు. స్పిన్నర్ సాన్‌ట్నర్ కూడా బ్యాటింగ్‌తో జట్టుకు ఉపయోగపడగలనని నిరూపించుకున్నాడు. ఇదే ఆర్డర్‌ను చూసుకుంటే ఎనిమిదో స్థానం వరకు ఆ జట్టులో బ్యాటర్లకు కొదవ లేదు. గత మ్యాచ్‌లో విఫలమైనా... అలెన్, ఫిలిప్స్ మెరుపు షాట్లతో చెలరేగిపోగల సమర్థులు. కాన్వే, కెప్టెన్ టామ్ లాథమ్ కూడా తమ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరిస్తే న్యూజిలాండ్ గట్టి పోటీనివ్వగలదు. ఫాస్టెస్ట్ బౌలర్లలో ఒకడైన ఫెర్గూసన్‌ను గిల్ చితక్కొట్టాడు. ఇలాంటి స్థితిలో లెగ్‌స్పిన్నర్ ఇష్ సోధి గాయం నుంచి కోలుకోవాలని జట్టు ఆశిస్తోంది. పిచ్, వాతావరణం స్టేడియంలో ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్. పిచ్‌పై బౌన్స్ కొంత ఎక్కువగా కనిపిస్తోంది. అటు బ్యాటర్లు, ఇటు బౌలింగ్‌కూ అనుకూలం. వర్ష సూచన లేదు. భారత జట్టుకు జరిమానా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో స్లో ఓవర్ రేట్ కారణంగా భారత జట్టుకు ఐసీసీ భారీ జరిమానా విధించింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా నిర్ణీత సమయంలో మూడు ఓవర్లు తక్కువగా వేసింది. దాంతో ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 60 శాతం కోత విధిస్తున్నట్లు రిఫరీ జవగల్ శ్రీనాథ్ ప్రకటించారు. -
Team India: స్వదేశంలో బెబ్బులి.. మరి విదేశాల్లో, మెగా టోర్నీల్లో..?
స్వదేశంలో జరిగే ద్వైపాక్షిక సిరీస్‌ల్లో, చిన్న జట్లతో జరిగే వన్ టు వన్ సిరీస్‌ల్లో బెబ్బులిలా రెచ్చిపోయే టీమిండియా.. విదేశాల్లో జరిగే సిరీస్‌ల్లో, అలాగే పెద్ద జట్లు పాల్గొనే నాకౌట్ మెగా టోర్నీల్లో చతికిలపడటం చాలాకాలంగా మనం గమనిస్తూనే ఉన్నాం. టీమిండియా ఆటగాళ్లు సొంతగడ్డపై మాత్రమే పులులు అన్న అపవాదును సైతం మనం చాలాకాలంగా మోస్తూనే ఉన్నాం. ధోని హయాంలో, కొద్దికాలం పాటు విరాట్ కోహ్లి జమానాలో ఈ అపవాదు తప్పని నిరూపించుకోగలిగినప్పటికీ, ఇటీవలి కాలంలో మళ్లీ పాత పరిస్థితే ఎదురవుతూ వస్తుంది. రోహిత్ సారధ్య బాధ్యతలు చేపట్టాక ఆడిన రెండు మెగా టోర్నీల్లో రిక్త హస్తాలతోనే ఇంటి ముఖం పట్టిన టీమిండియా.. చిన్న జట్లపై, అలాగే స్వదేశంలో జరిగే ద్వైపాక్షిక సిరీస్‌ల్లో మాత్రం రెచ్చిపోతుంది. ఎంతలా అంటే.. డబుల్ సెంచరీలు, సెంచరీలు, 5 వికెట్లు తీసిన ఆటగాళ్లను కూడా బెంచ్‌కు పరిమితం చేసేంతలా సొంతగడ్డపై టీమిండియా దూకుడు ప్రదర్శిస్తుంది. రిజర్వ్ బెంచ్ సైతం ఇంత బలంగా ఉన్న జట్టు విదేశాల్లో, పెద్ద జట్లతో మ్యాచ్‌ల్లో, మెగా టోర్నీల్లో ఎందుకు ఓటమిపాలవుతుందన్న విషయాన్ని బేరీజు వేసుకుంటే, ఒక్క విషయం కొట్టొచ్చినట్లు కనపడుతుంది. అదేంటంటే.. స్వదేశంలో నాణ్యమైన ఫాస్ట్ బౌలింగ్ పిచ్‌లు లేకపోవడం. ఇక్కడి సంప్రదాయ స్పిన్ పిచ్‌లకు అలవాటు పడి, వీటిపై పరుగుల వరద పారించే మన హీరోలు.. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ ట్రాక్‌లపై ఆ దేశ పేసర్లకు దాసోహమైపోతున్నారు. ఇక మెగా టోర్నీల్లో టీమిండియా వైఫల్యాల విషయానికొస్తే.. ఆడిన ప్రతి టోర్నీలో భారీ అంచనాలు జట్టు కొంపముంచుతున్నాయి. 130 కోట్లకు పైగా భారతీయులు ప్రతి మ్యాచ్‌లో జట్టు గెలవాలని కోరుకోవడం, అంచనాలకు తగ్గట్టుగా రాణించాలని ఆటగాళ్లు ఒత్తిడికి లోనవ్వడం సమాంతరంగా జరిగిపోతున్నాయి. విదేశాల్లో, మెగా టోర్నీల్లో టీమిండియా ఓటములకు మరో కారణం బీసీసీఐలో నెలకొన్న రాజకీయాలు. ఆటగాళ్ల ఎంపిక విషయంలో సెలెక్షన్ కమిటీ కాకుండా స్వయంగా బోర్డు అధ్యక్షుడే జోక్యం చేసుకునేంతలా బీసీసీఐ రాజకీయాలు భ్రష్ఠుపట్టాయి. ఆటగాళ్ల ఎంపికలో, తుది జట్టు కూర్పు విషయంలో బోర్డు పెద్దలు జోక్యం చేసుకోకుంటే.. కోచ్, కెప్టెన్ సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. బీసీసీఐ రాజకీయాలు మానుకుని పై పేర్కొన్న మూడు అంశాలపై ప్రత్యేక శ్రద్ధ పెడితే స్వదేశంలో, చిన్న జట్లపై బెబ్బులిలా రెచ్చిపోయే టీమిండియా ఆటగాళ్లు.. విదేశాల్లో, పెద్ద జట్లపై, మెగా టోర్నీల్లో తమ ప్రతాపం చూపుతారు. -
శ్రీలంకతో రెండో వన్డే.. టాస్ ఓడిన టీమిండియా, ఒక్క మార్పుతో బరిలోకి..!
కోల్‌కతా వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా టాస్ ఓడి, తొలుత బౌలింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ ఓ మార్పు చేసింది. తొలి వన్డేలో ఫీల్డింగ్ చేస్తున్న సందర్భంగా గాయపడ్డ చహల్ మ్యాచ్ సమయానికి కోలుకోక పోవడంతో అతని స్థానంలో కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు శ్రీలంక రెండు మార్పులతో బరిలోకి దిగింది. పథుమ్ నిస్సంక, మధుశంక స్థానాల్లో నువనిదు ఫెర్నాండో, లహీరు కుమార తుది జట్టులోకి వచ్చారు. కాగా, శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 67 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 373 పరుగులు చేసింది. కోహ్లి (113) సెంచరీతో, రోహిత్ శర్మ (83), శుభ్‌మన్ గిల్ (70) అర్ధసెంచరీలతో రాణించారు. ఛేదనలో నిస్సంక (72) అర్ధసెంచరీతో, షనక (108 నాటౌట్) సెంచరీతో పోరాడినప్పటికీ శ్రీలంక గెలవలేకపోయింది. ఫలితంగా 3 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తుది జట్లు.. భారత్: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యా, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్ శ్రీలంక: కుశాల్ మెండిస్, అవిష్క ఫెర్నాండో, చరిత్ అసలంక, ధనంజయ డిసిల్వ, నువనిదు ఫెర్నాండో, దసున శనక, వనిందు హసరంగ, చమిక కరుణరత్నే, దునిత్ వెల్లలాగే, లహిరు కుమార, కసున్ రజిత -
PAK VS NZ 2nd ODI: పాక్ జెర్సీని నేలకేసి కొట్టిన అంపైర్
కరాచీ వేదికగా పాకిస్తాన్‌తో నిన్న (జనవరి 11) జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ 79 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1–1తో సమం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. డెవాన్ కాన్వే (92 బంతుల్లో 101; 13 ఫోర్లు, సిక్స్) సూపర్ సెంచరీతో, కెప్టెన్ కేన్ విలియమ్సన్ (100 బంతుల్లో 85; 10 ఫోర్లు) హాఫ్ సెంచరీతో సత్తా చాటడంతో 49.5 ఓవర్లలో 261 పరుగులకు ఆలౌటైంది. నవాజ్ (4/38), నసీమ్ షా (3/58) కివీస్ పతనాన్ని శాశించారు. అనంతరం 262 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్తాన్ 43 ఓవర్లలో 182 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ బాబర్ ఆజమ్ (114 బంతుల్లో 79; 8 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. న్యూజిలాండ్ బౌలర్లలో సౌథీ, సోధీ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. ఫెర్గూసన్, సాంట్నర్, బ్రేస్‌వెల్, ఫిలిప్స్ తలో వికెట్ దక్కించుకున్నారు. కాగా, ఇరు జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో పాక్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. మూడో వన్డే శుక్రవారం (జనవరి 13) జరుగుతుంది. Ouch 😬🙏#PAKvNZ | #TayyariKiwiHai pic.twitter.com/JyuZ0Jwxi5 — Pakistan Cricket (@TheRealPCB) January 11, 2023 కాగా, ఈ మ్యాచ్‌లో చోటు చేసుకున్న ఓ ఊహించని పరిణామం ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. న్యూజిలాండ్ బ్యాటింగ్ సమయంలో (39వ ఓవర్లో)పాక్ ఆటగాడు మహ్మద్ వసీం జూనియర్ వికెట్లకు గురిపెట్టి విసిరిన ఓ త్రో ఫీల్డ్ అంపైర్ అలీం దార్ కాలికి బలంగా తాకింది. బంతి తాకిడికి చిర్రెత్తిపోయిన అంపైర్, చేతిలో ఉన్న పాక్ బౌలర్ హరీస్ రౌఫ్ జెర్సీని నేలకేసి కొట్టాడు. ఆతర్వాత గ్రౌండ్లో ఉన్న పాక్ ఆటగాళ్లు అంపైర్ కాలిని రుద్దుతూ సేవలు చేశారు. ఈ మొత్తం తంతుకు సంబంధించిన వీడియోను పాకిస్తాన్ క్రికెట్ బోర్డే సోషల్‌మీడియాలో షేర్ చేసింది. -
కింగ్ కోహ్లి సెంచరీ కొడితే టీమిండియా గెలవాల్సిందే.. అదీ లెక్క..!
IND VS SL 1st ODI: 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా జనవరి 10న శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో శతకం బాదిన విరాట్ కోహ్లి (87 బంతుల్లో 113; 12 ఫోర్లు, సిక్స్).. ఈ సెంచరీతో పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో 45వ శతకాన్ని, ఓవరాల్‌గా 73వ అంతర్జాతీయ సెంచరీని బాదిన కోహ్లి.. శ్రీలంకపై తన 9వ శతకాన్ని నమోదు చేసి క్రికెట్ గాడ్ సచిన్ రికార్డును (శ్రీలంకపై 8 శతకాలు) బద్దలుకొట్టాడు. ఈ క్రమంలో శ్రీలంక, వెస్టిండీస్, ఆస్ట్రేలియాలపై 9 సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడిగానూ రికార్డుల్లోకెక్కాడు. ఈ రికార్డులతో పాటు కోహ్లి మరో ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో కింగ్ సెంచరీ చేసిన 37 సందర్భాల్లో (ఓవరాల్‌గా 45 సెంచరీలు) టీమిండియా విజయం సాధించింది. ఈ ఫార్మాట్ చర్రితలో ఇది ప్రపంచ రికార్డుగా నమోదైంది. గతంలో క్రికెట్ దిగ్గజం సచిన్ సెంచరీ చేసిన 35 సందర్భాల్లో (ఓవరాల్‌గా 49 సెంచరీలు) టీమిండియా విజయం సాధించింది. ఈ గణాంకాలను బట్టి చూస్తే, కోహ్లి సెంచరీ కొడితే టీమిండియా గెలుపు డిసైడ్ అయిపోతుందన్నది సుస్పష్టం అవుతుంది. ఇదిలా ఉంటే, శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 67 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 373 పరుగులు చేసింది. కోహ్లి సెంచరీతో, రోహిత్ శర్మ (83), శుభ్‌మన్ గిల్ (70) అర్ధసెంచరీలతో రాణించారు. ఛేదనలో నిస్సంక (72) అర్ధసెంచరీతో, షనక (108 నాటౌట్) సెంచరీతో పోరాడినప్పటికీ శ్రీలంక గెలవలేకపోయింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే కోల్‌కతాలో ఇవాళ (జనవరి 12) జరుగనుంది. -
కాన్వే సూపర్ సెంచరీ.. పాక్‌ను మట్టికరిపించిన న్యూజిలాండ్
కరాచీ: పాకిస్తాన్‌తో బుధవారం (జనవరి 11) జరిగిన రెండో వన్డేలో పర్యాటక న్యూజిలాండ్ 79 పరుగుల తేడాతో గెలిచి మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1–1తో సమం చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 49.5 ఓవర్లలో 261 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ డెవాన్ కాన్వే సూపర్ సెంచరీతో (92 బంతుల్లో 101; 13 ఫోర్లు, సిక్స్) అదరగొట్టగా.. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (100 బంతుల్లో 85; 10 ఫోర్లు) హాఫ్ సెంచరీతో రాణించాడు. పాక్ బౌలర్లలో నవాజ్ (4/38), నసీమ్ షా (3/58) ఆకట్టుకున్నారు. అనంతరం 262 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్తాన్ 43 ఓవర్లలో 182 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ బాబర్ ఆజమ్ (114 బంతుల్లో 79; 8 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. బాబర్ మినహా పాక్ జట్టంతా విఫలమైంది. మహ్మద్ రిజ్వాన్ (28), అఘా సల్మాన్ (25) ఓ మోస్తరుగా రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో సౌథీ, సోధీ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. ఫెర్గూసన్, సాంట్నర్, బ్రేస్‌వెల్, ఫిలిప్స్ తలో వికెట్ దక్కించుకున్నారు. కాగా, ఇరు జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో పాక్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. మూడో వన్డే శుక్రవారం (జనవరి 13) జరుగుతుంది. -
శ్రీలంకతో రెండో వన్డే.. సూర్యకుమార్, ఇషాన్ కిషన్‌లకు ఛాన్స్.. ఎవరిపై వేటు..?
IND VS SL 2nd ODI: భారత్-శ్రీలంక జట్ల మధ్య కోల్‌కతా వేదికగా రేపు (జనవరి 12) రెండో వన్డే జరుగనున్న విషయం తెలిసిందే. తొలి వన్డేలో లంకపై 67 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించిన భారత్.. రేపటి మ్యాచ్ కోసం ఎలాంటి మార్పులు చేయబోతుందోనని క్రికెట్ ప్రేమికులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత మ్యాచ్‌లో ప్రదర్శనల ఆధారంగా చూస్తే రేపటి మ్యాచ్‌లో ఎవరినీ తప్పించే అవకాశం లేనప్పటికీ.. సూర్యకుమార్ యాదవ్ (లంకతో మూడో టీ20లో మెరుపు శతకం సాధించాడు), ఇషాన్ కిషన్ (బంగ్లాదేశ్‌తో తన చివరి వన్డేలో డబుల్ సెంచరీ బాదాడు) లతో రిజర్వ్ బెంచ్ బలంగా ఉంది కాబట్టి, రొటేషన్ పద్దతిలో వీరిద్దరికి ఛాన్స్ లభిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ వీరిద్దరికి అవకాశం కల్పిస్తే ఎవరిపై వేటు వేస్తారన్నది ప్రస్తుతం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. తొలి వన్డేలో కోహ్లి (113), రోహిత్ శర్మ (83), శుభ్‌మన్ గిల్ (70) పరుగుల వరద పారించారు కాబట్టి వీరిని కదిలించే అవకాశం లేదు. బ్యాటింగ్ విభాగంలో ఇక మిగిలింది శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్‌లు మాత్రమే. గత మ్యాచ్‌లో వీరిద్దరు కూడా ధాటిగానే ఇన్నింగ్స్ ఆరంభించినప్పటికీ, వాటిని భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యారు. శ్రేయస్ 28, రాహుల్ 39 పరగులు చేసి ఔట్ కావడంతో అందరి కళ్లు వీరిద్దరిపై పడ్డాయి. స్కై, ఇషాన్‌లకు ఛాన్స్ ఇవ్వాలంటే వీరిని తప్పించాల్సిందే తప్ప వేరే మార్గం లేదు. ఇషాన్ ఎటూ వికెట్‌కీపింగ్ చేస్తాడు కాబట్టి రాహుల్ స్థానాన్ని భర్తీ చేస్తాడని, శ్రేయస్ స్థానాన్ని సూర్యకుమార్‌తో ఫిల్ చేయాలని అభిమానుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వినిస్తున్నాయి. అయితే కేవలం ఒక్క మ్యాచ్‌లో పరుగులు చేయనంత మాత్రానా, జట్టును నుంచి తప్పిస్తారా అని ప్రశ్నించే వారు కూడా లేకపోలేదు. తొలి వన్డేలో శ్రేయస్, రాహుల్ బరిలోకి దిగిన సమయానికి ధాటిగా పరుగులు చేయాల్సి ఉండింది, ఆ క్రమంలోనే వారు ఔటయ్యారు, అలాంటప్పుడు వారిని జట్టు నుంచి తప్పించాలనడం ఎంత మాత్రం సమంజసం కాదని వాదిస్తున్నారు. ఇలా వాదించే వారికి స్కై, ఇషాన్ అభిమానులు కూడా తగు రీతిలో కౌంటర్లు ఇస్తున్నారు. ఇషాన్ తాను ఆడిన ఆఖరి వన్డేలో డబుల్ సెంచరీ, స్కై.. తానాడిన చివరి మ్యాచ్‌లో సెంచరీ చేసినప్పటికీ, జట్టు సమతూకం పేరు చెప్పి వీరిని తప్పించలేదా అని ప్రశ్నిస్తున్నారు. సోషల్‌మీడియాలో ఈ ఆసక్తికర చర్చ నేపథ్యంలో రేపటి మ్యాచ్ కోసం జట్టు మేనేజ్మెంట్ ఎలాంటి మార్పులు చేస్తుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
అందుకే సంజూ శాంసన్‌ను పక్కకు పెట్టాం: టీమిండియా కెప్టెన్
హామిల్టన్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఇవాళ (నవంబర్ 27) జరగాల్సిన రెండో వన్డే వర్షం కారణంగా రద్దైంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్.. 12.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 89 పరుగులు చేసింది. ఓపెనర్ శిఖర్ ధవన్(3) విఫలం కాగా, మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (42 బంతుల్లో 45 నాటౌట్; 4 ఫోర్లు, సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్(25 బంతుల్లో 34 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) క్రీజ్‌లో ఉన్నారు. 4.5 ఓవర్ల తర్వాత తొలిసారి మ్యాచ్‌కు అంతరాయం కలిగించిన వర్షం, మళ్లీ 12.5 ఓవర్ల తర్వాత అడ్డుతగిలింది. ఈ దశలో ప్రారంభమైన భారీ వర్షం, ఎంతకూ తగ్గకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు. ఫలితంగా 3 మ్యాచ్‌ల సిరీస్‌లో కివీస్ ఆధిక్యం 1-0తో కొనసాగుతుంది. తొలి వన్డేలో టామ్ లాథమ్ భారీ శతకంతో చెలరేగడంతో న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా, ఈ మ్యాచ్‌లో భారత తుది జట్టు కూర్పుపై పెద్ద దూమారమే రేగింది. తొలి వన్డేలో పర్వాలేదనిపించిన సంజూ శాంసన్‌ను జట్టు నుంచి తప్పించడం, గత కొన్ని మ్యాచ్‌లుగా దారుణంగా విఫలమవుతున్న రిషబ్ పంత్‌ను జట్టులో కొనసాగిండచడంపై అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదాస్పద నిర్ణయం తీసుకున్నందుకు సోషల్‌మీడియా వేదికగా కెప్టెన్ శిఖర్ ధవన్, కోచ్ వీవీఎస్ లక్ష్మణ్‌లను ఎండగట్టారు. సంజూ శాంసన్ దక్షిణాది రాష్ట్రానికి చెందిన వాడు కాబట్టే ఇలా చేస్తున్నారని కొందరు, కుల వివక్ష కారణంగానే శాంసన్‌కు అవకాశాలు ఇవ్వకుండా అణగదొక్కుతున్నారని మరికొందరు పరుష పదజాలం ఉపయోగించి బీసీసీఐ, కెప్టెన్, కోచ్, సెలెక్టర్లను టార్గెట్ చేశారు. శాంసన్‌ను జట్టు నుంచి ఎందుకు తప్పించారో టాస్ సమయంలో కెప్టెన్ ధవన్ ఎలాంటి కారణం చెప్పకపోవడంతో అభిమానులు మరింత రెచ్చిపోయారు. జట్టు నుంచి ఎందుకు తప్పించారో చెప్పాల్సిన బాధ్యత కెప్టెన్‌పైన ఉంటుంది, అలాంటిది శాంసన్‌ను తప్పించడంపై కెప్టెన్ ధవన్ కనీస సమాచారం కూడా ఇవ్వకపోవడం అహంకారానికి నిదర్శనమని దుయ్యబట్టారు. అయితే, ఈ విషయం వివాదాస్పదంగా మారడం, నెట్టింట భారీ ఎత్తున ట్రోలింగ్ జరుగుతుండటంతో మ్యాచ్ రద్దైన అనంతరం కెప్టెన్ ధవన్ స్పందించాడు. రెండో వన్డేలో శాంసన్‌ను పక్కకు పెట్టడానికి గల కారణాలను వివరించాడు. జట్టుకు ఆరో బౌలర్ అవసరమని, తప్పనిసరి పరిస్ధితుల్లో శాంసన్‌కు బదులు దీపక్ హుడాను తుది జట్టులో తీసుకున్నామని తెలిపాడు. పిచ్ స్వింగ్‌కు అనుకూలిస్తుందని భావించి శార్దూల్ ఠాకూర్ స్థానంలో దీపక్ చాహర్‌కు అవకాశం కల్పించామని పేర్కొన్నాడు. ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ కోసమే శాంసన్‌ను పక్కకు పెట్టాల్సి వచ్చిందని, దీనిపై రాద్దాంతం అనవసరమని ట్రోలింగ్‌కు దిగిన వారికి పరోక్షంగా చురకలంటించాడు. -
సిరీస్ కాపాడుకునేందుకు...
హామిల్టన్: న్యూజిలాండ్ గడ్డపై గత పర్యటనలో టి20 సిరీస్ గెలిచిన భారత్ వన్డే సిరీస్‌ను కోల్పోయింది. ఈసారి కూడా టి20 సిరీస్ గెలిచిన ఊపులో వన్డేల్లో అడుగు పెట్టిన టీమిండియా తొలి మ్యాచ్‌ను చేజార్చుకుంది. 306 పరుగులు చేసిన తర్వాత కూడా ఆక్లాండ్‌లో ఓటమి ఎదురైంది. ఇప్పుడు ఇదే తరహా భారీ స్కోర్లకు వేదికైన పిచ్ సెడాన్ పార్క్‌లో ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో భారత్ కోలుకొని సిరీస్‌ను మూడో వన్డే వరకు తీసుకెళుతుందా, లేక కివీస్ ఖాతాలో సిరీస్ చేరుతుందా చూడాలి. న్యూజిలాండ్ చేతిలో భారత్ వరుసగా గత 5 వన్డేలు ఓడగా... సొంతగడ్డపై కివీస్ వరుసగా 13 వన్డేలు నెగ్గి జోరు మీదుంది. మ్యాచ్‌కు వర్షం వల్ల అంతరాయం కలిగే అవకాశం ఉంది. కుల్దీప్కు చాన్స్! తొలి వన్డేలో శిఖర్ ధావన్, గిల్, అయ్యర్ అర్ధ సెంచరీలు చేయగా, సంజు సామ్సన్ కూడా దూకుడుగా ఆడాడు. అయితే ఓపెనర్లు ధావన్, గిల్ మరీ నెమ్మదిగా ఆడటం, పవర్‌ప్లేను సద్వినియోగం చేసుకోకపోవడం భారత్‌ను నష్టపరిచింది. సూర్యకుమార్ వైఫల్యం జట్టును కొంత ఇబ్బంది పెడుతోంది. టి20ల్లో విధ్వంసానికి మారుపేరుగా నిలుస్తున్న అతను వన్డేల్లో మాత్రం రాణించడం లేదు. అవసరమైతే ఆరో బౌలింగ్ ప్రత్యామ్నాయం కోసం సూర్య స్థానంలో దీపక్ హుడాను ఎంపిక చేసే అవకాశం ఉంది. భారీగా పరుగులిచ్చిన శార్దుల్ స్థానంలో దీపక్ చహర్‌కు చాన్స్ దక్కవచ్చు. మరోవైపు లెగ్‌స్పిన్నర్ చహల్ బౌలింగ్‌లో మునుపటి పస కనిపించడం లేదు. అతనికి బదులుగా కుల్దీప్ యాదవ్‌ను ఆడించే ఆలోచనలతో మేనేజ్మెంట్ ఉంది. నీషమ్‌కు చోటు! విలియమ్సన్ నాయకత్వంలో కివీస్ మంచి ఫామ్‌లో ఉంది. తొలి వన్డేలో ఆ జట్టు ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. ఓపెనింగ్ నుంచి మిడిలార్డర్‌కు మారినా లాథమ్ బ్యాటింగ్‌లో జోరు తగ్గలేదు. ఓపెనర్లు అలెన్, కాన్వే దూకుడుగా ఆడగల సమర్థులు. గాయంతో గత మ్యాచ్‌కు దూరమై ఇప్పుడు కోలుకున్న నీషమ్... ఫిలిప్స్ స్థానంలో జట్టులోకి వస్తాడు. -
రెండో వన్డేలో సౌతాఫ్రికాపై భారత్ ఘన విజయం
-
IND vs SA 2nd ODI: సెంచరీతో చెలరేగిన శ్రేయస్.. దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం
రాంచీ: శ్రేయస్ అయ్యర్ (111 బంతుల్లో 113 నాటౌట్; 15 ఫోర్లు) అజేయ శతకం... ‘ఇషాన్’దార్ (84 బంతుల్లో 93; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) ఇన్నింగ్స్ భారత్‌ను సిరీస్‌లో నిలబెట్టాయి. రెండో వన్డేలో ఏడు వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై టీమిండియా గెలిచి మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1–1తో సమం చేసింది. సిరీస్ నిర్ణాయక మూడో వన్డే మంగళవారం ఢిల్లీలో జరుగుతుంది. రెండో వన్డేలో టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేపట్టిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. మార్క్రమ్ (89 బంతుల్లో 79; 7 ఫోర్లు, 1 సిక్స్), రీజా హెండ్రిక్స్ (76 బంతుల్లో 74; 9 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలతో అదరగొట్టారు. భారత బౌలర్లలో సిరాజ్ (10–1– 38–3) ఆకట్టుకున్నాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన భారత్ 45.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 282 పరుగులు చేసి గెలిచింది. ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున షహబాజ్ అహ్మద్ అరంగేట్రం చేశాడు. సఫారీ జట్టులో ఫామ్‌లో లేని కెప్టెన్ బవుమా, స్పిన్నర్ షమ్సీల స్థానాల్లో ఫోర్టున్, హెండ్రిక్స్ బరిలోకి దిగారు. దీంతో కేశవ్ మహరాజ్ సారథ్యం చేపట్టాడు. రాణించిన హెండ్రిక్స్, మార్క్రమ్ డాషింగ్ ఓపెనర్ డికాక్ (5)ను క్లీన్‌బౌల్డ్ చేసిన సిరాజ్ సఫారీని గట్టిదెబ్బే తీశాడు. కాసేపటికి మలాన్ (31 బంతుల్లో 25; 4 ఫోర్లు)ను షహబాజ్ అహ్మద్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. 40 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన సఫారీని హెండ్రిక్స్, మార్క్రమ్ ఆదుకున్నారు. హెండ్రిక్స్ 58 బంతుల్లో, మార్క్రమ్ 64 బంతుల్లో ఫిఫ్టీలను పూర్తి చేసుకున్నారు. చాలాసేపు భారత శిబిరాన్ని ఇబ్బంది పెట్టిన ఈ జోడీని ఎట్టకేలకు సిరాజే విడగొట్టాడు. దీంతో 129 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత వచ్చిన క్లాసెన్ (26 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), మిల్లర్ (34 బంతుల్లో 35 నాటౌట్; 4 ఫోర్లు) వేగంగా ఆడారు. ఆఖరి 10 ఓవర్లను భారత బౌలర్లు కట్టడి చేయడంతో 57 పరుగులే వచ్చాయి. కిషన్ సిక్సర్లు కెప్టెన్ ధావన్ (13), గిల్ (26 బంతుల్లో 28; 5 ఫోర్లు) మళ్లీ నిరాశపరిచారు. దాంతో భారత్ 48 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. గత మ్యాచ్ ఫలితం, సిరీస్ చేజార్చుకోవడం తప్పదనిపించింది. ఈ దశలో ఇషాన్, శ్రేయస్ ‘లెఫ్ట్–రైట్’ కాంబినేషన్ తో అదరగొట్టారు. మొదట ఆచి తూచి ఆడిన ఈ జోడీ మ్యాచ్ సాగేకొద్దీ దంచేసే పనిలో పడింది. 20.3 ఓవర్లో భారత్ వంద స్కోరు దాటింది. కేశవ్ వేసిన 21వ ఓవర్లో రెండు భారీ సిక్సర్లు బాదిన ఇషాన్ తర్వాత నోర్జేనూ చితకబాదాడు. మరోవైపు శ్రేయస్ అయ్యర్ చక్కని ప్లేసింగ్‌తో చూడముచ్చటైన బౌండరీలతో అలరించాడు. ముందుగా ఇషాన్ 60 బంతుల్లో (2 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆ తర్వాత అయ్యర్ 48 బంతుల్లో (7 ఫోర్లు) అర్ధసెంచరీలు సాధించారు. కెప్టెన్ కేశవ్ మహరాజ్ మార్చిమార్చి బౌలర్లను ప్రయోగించినా ఈ భాగస్వామ్యాన్ని విడగొట్టలేకపోయాడు. భారత బ్యాటర్లు చెలరేగడంతో 33.3 ఓవర్లో స్కోరు 200 పరుగులు దాటింది. కేవలం 16.3 ఓవర్లలో 79 పరుగుల విజయ సమీకరణం సులువైపోయింది. సెంచరీ దిశగా దూసుకెళ్తున్న ఇషాన్‌ను ఫోర్టున్ అవుట్ చేశాడు. దీంతో 161 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యం ముగిసింది. తర్వాత సామ్సన్ (30 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్)తో కలిసి అయ్యర్ అజేయంగా లక్ష్యాన్ని పూర్తిచేశాడు. ఈ క్రమంలో శ్రేయస్ 103 బంతుల్లో (14 ఫోర్లు) వన్డేల్లో తన రెండో శతకాన్ని సాధించాడు. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: డికాక్ (బి) సిరాజ్ 5; మలాన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) షహబాజ్ 25; హెండ్రిక్స్ (సి) షహబాజ్ (బి) సిరాజ్ 74; మార్క్రమ్ (సి) ధావన్ (బి) సుందర్ 79; క్లాసెన్ (సి) సిరాజ్ (బి) కుల్దీప్ 30; మిల్లర్ (నాటౌట్) 35; పార్నెల్ (సి) శ్రేయస్ (బి) శార్దుల్ 16; కేశవ్ (బి) సిరాజ్ 5; ఫోర్టున్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 278. వికెట్ల పతనం: 1–7, 2–40, 3–169, 4–215, 5–215, 6–256, 7–277. బౌలింగ్: సిరాజ్ 10–1–38–3, వాషింగ్టన్ సుందర్ 9–0–60–1, షహబాజ్ అహ్మద్ 10–0– 54–1, అవేశ్ ఖాన్ 7–0–35–0, కుల్దీప్ యాదవ్ 9–0–49–1, శార్దుల్ ఠాకూర్ 5–0–36–1. భారత్ ఇన్నింగ్స్: ధావన్ (బి) పార్నెల్ 13; గిల్ (సి అండ్ బి) రబడ 28; ఇషాన్ కిషన్ (సి) హెండ్రిక్స్ (బి) ఫోర్టున్ 93; శ్రేయస్ (నాటౌట్) 113; సామ్సన్ (నాటౌట్) 30; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (45.5 ఓవర్లలో 3 వికెట్లకు) 282. వికెట్ల పతనం: 1–28, 2–48, 3–209. బౌలింగ్: ఫోర్టున్ 9–1– 52–1, వేన్ పార్నెల్ 8–0–44–1, రబడ 10–1– 59–1, నోర్జే 8.5–0–60–0, కేశవ్ మహరాజ్ 7–0–45–0, మార్క్రమ్ 3–0–22–0. -
IND vs SA 2nd ODI: సిరీస్ కాపాడుకునేందుకు...
రాంచీ: దక్షిణాఫ్రికాతో తొలి వన్డేలో ఎంతో చేరువగా వచ్చినా, త్రుటిలో గెలుపు అవకాశం చేజార్చుకున్న భారత జట్టు ఇప్పుడు దానిని సరిదిద్దుకోవాలని పట్టుదలతో ఉంది. మరో మ్యాచ్‌లో ఓడి సిరీస్ కోల్పోరాదని భావిస్తున్న టీమిండియా నేడు జరిగే రెండో వన్డేలో బరిలోకి దిగుతోంది. టాప్ ఆటగాళ్లు లేకుండా ఎక్కువ మంది ద్వితీయ శ్రేణి ఆటగాళ్లతోనే మైదానంలోకి అడుగు పెట్టిన భారత్‌కు సంబంధించి వన్డే సిరీస్‌కు పెద్దగా ప్రాధాన్యత లేకపోయినా... దక్షిణాఫ్రికాకు మాత్రం వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్‌కప్‌నకు అర్హత సాధించేందుకు ప్రతీ మ్యాచ్ గెలుపు ద్వారా లభించే 10 ‘సూపర్ లీగ్’ పాయింట్లు ఎంతో అవసరం. ఈ నేపథ్యంలో మరో ఆసక్తికర పోరు ఖాయం. పేస్ బౌలర్ దీపక్ చహర్ వెన్ను నొప్పితో మిగిలిన రెండు మ్యాచ్‌లకు దూరం కాగా, అతని స్థానంలో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. తొలి వన్డేలోనూ చహర్ బరిలోకి దిగలేదు. షహబాజ్‌కు అవకాశం దక్కేనా! 40 ఓవర్లకు కుదించిన మొదటి వన్డేలో భారత్ కేవలం 9 పరుగులతో ఓడింది. ఇన్నింగ్స్ చివర్లో సామ్సన్‌కు మరికొన్ని బంతులు ఆడే అవకాశం వచ్చి ఉంటే ఫలితం భిన్నంగా ఉండేదేమో. కాబట్టి ఓవరాల్‌గా చూస్తే అదే జట్టును కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. మన బ్యాటింగ్ బృందంలో సామ్సన్ తన సత్తా ఏమిటో చూపించగా, శ్రేయస్ అయ్యర్ కూడా వన్డేలకు తాను సరైనవాడినని నిరూపించుకున్నాడు. అయితే గత మ్యాచ్‌లో విఫలమైన టాప్–4 ఈసారి ఎలా ఆడతారన్నది చూడాలి. ఓపెనర్లు ధావన్, గిల్ ప్రభావం చూపించాల్సి ఉండగా... తొలి వన్డేలో మరీ పేలవంగా ఆడిన రుతురాజ్, ఇషాన్ కిషన్‌లు ఏమాత్రం రాణిస్తారనేది కీలకం. ఆల్‌రౌండర్ శార్దుల్ రెండు విధాలా ఆకట్టుకోవడం సానుకూలాంశం. కుల్దీప్ యాదవ్ కూడా మరోసారి తన భిన్నమైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని నిలువరించగలడు. అయితే రెండో స్పిన్నర్‌గా రవి బిష్ణోయ్ స్థానంలో షహబాజ్ అహ్మద్‌కు చాన్స్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. షహబాజ్ ఇప్పటివరకు భారత్ తరఫున అరంగేట్రం చేయలేదు. ఇద్దరు పేసర్లు అవేశ్, సిరాజ్ మరోసారి కొత్త బంతిని పంచుకోవడం ఖాయం. ఇటీవల వన్డేల్లో ఎంతో మెరుగుపడిన సిరాజ్, చివరి ఓవర్లలో మరింత కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడం సానుకూలాంశం. చహర్ స్థానంలో ఎంపికైన సుందర్‌కు తుది జట్టులో అవకాశం దక్కకపోవచ్చు. రెండు మార్పులతో... వన్డే సూపర్ లీగ్ పాయింట్లలో దక్షిణాఫ్రికా ప్రస్తుతం 11వ స్థానంలో కొనసాగుతోంది. నేరుగా అర్హత సాధించేందుకు టాప్–8లో నిలవాల్సి ఉండగా ఆ జట్టుకు ప్రతీ వన్డే కీలకం కానుంది. రెండో వన్డేతో పాటు చివరి మ్యాచ్‌లో కూడా గెలిస్తేనే జట్టు పరిస్థితి మెరుగవుతుంది. అయితే లక్నో మ్యాచ్‌లోనూ అదృష్టవశాత్తూ గెలిచిన ఆ జట్టు మరో విజయాన్ని అందుకుంటుందా అనేది ఆసక్తికరం. పూర్తి స్థాయి జట్టే అందుబాటులో ఉన్నా, భారత్‌ను ఓడించేందుకు సఫారీ టీమ్ తీవ్రంగా శ్రమించింది. ఇలాంటి స్థితిలో జట్టులో అందరూ రాణించాల్సి ఉంది. కెప్టెన్ బవుమా జట్టుకు పెద్ద బలహీనతగా మారగా, ఆల్‌రౌండర్ మార్క్రమ్ గత కొంత కాలంగా వన్డేల్లో ఘోరంగా విఫలమవుతున్నాడు. మలాన్, వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ రూపంలో చెప్పుకోదగ్గ ఓపెనర్లు ఉండటం కాస్త నయం. గత మ్యాచ్‌లోనూ వీరిద్దరు శుభారంభం అందించగా, ఆ తర్వాత టీమ్ తడబడింది. మిల్లర్, క్లాసెన్ ఆదుకోవడంతో పరిస్థితి మెరుగైంది. మరోసారి ఈ జోడీపై దక్షిణాఫ్రికా అమితంగా ఆధారపడుతోంది. ఆల్‌రౌండర్ ప్రిటోరియస్ గాయంతో దూరం కావడం జట్టు సమతుల్యతను దెబ్బ తీసింది. ఈ నేపథ్యంలో జట్టులో రెండు మార్పులు కనిపిస్తున్నాయి. వేన్ పార్నెల్, షమ్సీ స్థానాల్లో మరో ఇద్దరు పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు జాన్సెన్, ఫెలుక్వాయోలకు అవకాశం దక్కవచ్చు. రబడ, కేశవ్ మహరాజ్ ప్రభావం చూపిస్తుండగా... ఇన్‌గిడి మరింత మెరుగైన ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. పిచ్, వాతావరణం బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్. ఇక్కడ జరిగిన ఐదు వన్డేల్లో నాలుగింటిలో భారీ స్కోర్లే నమోదయ్యాయి. బౌలర్లూ ఎప్పుడూ ప్రభావం చూపలేకపోయారు. మ్యాచ్ రోజు కొన్ని చినుకులు పడే అవకాశం ఉన్నా... ఆటకు అంతరాయం కలగకపోవచ్చు. -
ధవన్ సేన బి టీమ్ కాదు.. భారత్‌కు ఒకేసారి నాలుగైదు జట్లను ఆడించే సత్తా ఉంది..!
IND VS SA 2nd ODI: రాంచీ వేదికగా టీమిండియాతో రేపు (అక్టోబర్ 9) జరుగబోయే రెండో వన్డేకి ముందు దక్షిణాఫ్రికా స్టార్ స్పిన్నర్ కేశవ్ మహారాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సీనియర్ల గైర్హాజరీలో తమతో వన్డే సిరీస్ ఆడుతున్న శిఖర్ ధవన్ సేనను భారత-బి టీమ్ అంటే అస్సలు ఒప్పుకోనని అతను వ్యాఖ్యానించాడు. భారత ఆటగాళ్లలో చాలా టాలెంట్ ఉందని, ఒకేసారి నాలుగైదు అంతర్జాతీయ స్థాయి జట్లను బరిలోకి దించే సత్తా వారికి ఉందని టీమిండియా ఆటగాళ్లను పొగడ్తలతో ముంచెత్తాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి జట్టులో లేనంత మాత్రాన ధవన్ సేనను తక్కువ అంచనా వేయడానికి వీళ్లేదని పేర్కొన్నాడు. తమతో వన్డే సిరీస్ ఆడుతున్న భారత జట్టులో నాణ్యమైన ప్లేయర్లు ఉన్నారని, వారితో ఏమరపాటుగా ఉంటే అసలుకే మోసం వస్తుందని సఫారీ ప్లేయర్లను పరోక్షంగా హెచ్చరించాడు. ధవన్ సేనలో చాలా మంది కుర్రాళ్లకు ఐపీఎల్‌తో పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం ఉందని, వారంతా ప్రపంచ స్థాయి ఆటగాళ్లేనని సంజూ శాంసన్, శ్రేయస్ అయ్యర్‌లను ఉద్దేశించి కామెంట్ చేశాడు. టీమిండియాతో ఆడటం ఎంతటి జట్టుకైనా సవాలుతో కూడుకున్న పనేనని, వారు ఒకేసారి నాలుగైదు జట్లను బరిలోకి దించినా వారి బ్యాటింగ్ లైనప్ దుర్భేద్యంగానే ఉంటుందని కొనియాడాడు. టీ20 సిరీస్‌ను 1-2 తేడాతో కోల్పోయిన తమ జట్టు 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో ఉందని, ఈ సిరీస్‌ను తామ తప్పక చేజిక్కించుకుని ఆస్ట్రేలియాకు (టీ20 వరల్డ్‌కప్ వేదిక) బయల్దేరుతామని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇదిలా ఉంటే, లక్నో వేదికగా భారత్‌తో జరిగిన తొలి వన్డేలో సఫారీ జట్టు 9 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో సంజూ శాంసన్ (86 నాటౌట్) అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి మ్యాచ్‌ను చివరి నిమిషం వరకు ఆసక్తికరంగా మార్చాడు. అయితే ఆఖర్లో టెయిలెండర్ ఆవేశ్ ఖాన్ చేసిన పొరపాట్ల వల్ల శాంసన్‌కు స్ట్రయిక్ రాకపోవడంతో భారత్ ఓటమిపాలైంది. 40 ఓవర్ల పాటు సాగిన ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీ జట్టు 4 వికెట్ల నష్టానికి 249 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఛేదనలో టీమిండియా 40 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేయగలిగింది. -
‘జులన్‌కు ఘనంగా వీడ్కోలు ఇస్తాం’
కాంటర్బరి: వరుసగా రెండు మ్యాచ్‌ల విజయాలతో 2–0తో సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత మహిళల జట్టు ఇక ఏ ఒత్తిడి లేకుండా ఆఖరి పోరు ఆడుతుందని కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తెలిపింది. ‘తొలి మ్యాచ్ గెలిచిన మాకు రెండో మ్యాచ్ కీలకమైంది. ఇందులో గెలిచి సిరీస్ సాధించాలనే పట్టుదలతో ఆడాం. అనుకున్నది సాధించాం. ఎన్నో ఏళ్ల తర్వాత ఇంగ్లండ్ గడ్డపై సిరీస్ సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇక మాకు లార్డ్స్‌లో జరి గే ఆఖరి మ్యాచ్ నామమాత్రమైంది. అక్కడ ఏ బెంగ లేకుండా ఆడేయొచ్చు. అంతేకాదు... దిగ్గజ సీమ ర్ జులన్ గోస్వామి కెరీర్లో ఆఖరి మ్యాచ్ కాబట్టి విఖ్యాత లార్డ్స్ మ్యాచ్ మాకిపుడు ప్రత్యేకమైంది. మా పేసర్‌కు విజయంతో వీడ్కోలు ఇస్తాం’ అని హర్మన్ మ్యాచ్ ముగిసిన అనంతరం పేర్కొంది. ఇంగ్లండ్ గడ్డపై 23 ఏళ్ల తర్వాత... భారత అమ్మాయిల జట్టు బుధవారం జరిగిన రెండో వన్డేలో 88 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టుపై జయభేరి మోగించింది. తద్వారా 2–0తో ఇంగ్లండ్ గడ్డపై 23 ఏళ్ల తర్వాత వన్డే సిరీస్ గెలిచింది. చివరి సారిగా 1999లో అక్కడ సిరీస్ నెగ్గింది. బుధవారం జరిగిన పోరులో మొదట భారత్ 5 వికెట్ల నష్టానికి 333 పరుగుల భారీస్కోరు చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (111 బంతుల్లో 143 నాటౌట్; 18 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆఖరి దాకా చెలరేగింది. హర్లీన్ డియోల్ (72 బంతుల్లో 58; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), స్మృతి మంధాన (51 బంతుల్లో 40; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. తర్వాత ఇంగ్లండ్ 44.2 ఓవర్లలో 245 పరుగుల వద్ద ఆలౌటైంది. వ్యాట్ (58 బంతుల్లో 65; 6 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించగా, కాప్సీ (39; 6 ఫోర్లు), కెప్టెన్ అమీ జోన్స్ (39; 3 ఫోర్లు, 1 సిక్స్) మెరుగ్గా ఆడారు. రేణుక సింగ్ (4/57) చావుదెబ్బ తీయగా, హేమలత 2 వికెట్లు పడగొట్టింది. రేపు లార్డ్స్‌లో ఆఖరి వన్డే జరుగుతుంది. -
Ind vs Eng 2nd ODI: హర్మన్ హరికేన్
కాంటర్బరీ: ఇంగ్లండ్ మహిళల జట్టుతో జరిగిన రెండో వన్డేలో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (111 బంతుల్లో 143 నాటౌట్; 18 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను గెలిచేందుకు అవసరమైన భారీ స్కోరును ప్రత్యర్థి ముందుంచింది. బుధవారం జరిగిన ఈ డే–నైట్ మ్యాచ్‌లో మొదట భారత జట్టు 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 333 పరుగులు చేసింది. ఓపెనర్ షఫాలీ వర్మ (8) నిరాశపరచగా, స్మృతి మంధాన (51 బంతుల్లో 40; 4 ఫోర్లు, 1 సిక్స్), యస్తిక భాటియా (34 బంతుల్లో 26; 4 ఫోర్లు) రెండో వికెట్‌కు 54 పరుగులు జోడించారు. జట్టు స్కోరు 66 పరుగుల వద్ద యస్తిక నిష్క్రమించడంతో క్రీజులోకి వచ్చిన హర్మన్ మొదట కుదురుగా ఆడింది. తర్వాత దూకుడు పెంచింది. ఇక ఆఖర్లో చుక్కలు చూపించింది. 64 బంతుల్లో ఫిఫ్టీ (4 ఫోర్లు, 1 సిక్స్) పూర్తి చేసుకున్న హర్మన్ వంద బంతుల్లో సెంచరీ (12 ఫోర్లు, 1 సిక్స్) సాధించింది.ఆమె వన్డే కెరీర్లో ఇది ఐదో శతకం. తర్వాత 11 బంతుల్లోనే 43 పరుగులు ధనాధన్‌గా చేసింది. 6 ఫోర్లు, 3 సిక్సర్ల రూపంలోనే 42 పరుగులు వచ్చాయి. హర్లీన్ డియోల్ (72 బంతుల్లో 58; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అండగా నిలిచింది. పూజ వస్త్రకర్ (18) తక్కువ స్కోరే చేయగా, దీప్తి శర్మ (9 బంతుల్లో 15 నాటౌట్; 2 ఫోర్లు) కెప్టెన్‌తో కలిసి అజేయంగా నిలిచింది. -
WI vs NZ: మెరిసిన అలెన్, సౌతీ, బౌల్ట్.. విండీస్‌పై కివీస్ విజయం
బ్రిడ్జ్‌టౌన్: వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో న్యూజిలాండ్ 50 పరుగుల తేడాతో విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1–1తో సమం చేసింది. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 48.2 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ ఫిన్ అలెన్ (117 బంతుల్లో 96; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) నాలుగు పరుగుల తేడాతో సెంచరీని కోల్పోయాడు. డరైల్ మిచెల్ (41; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో కలిసి అలెన్ నాలుగో వికెట్‌కు 84 పరుగులు జత చేశాడు. జేసన్ హోల్డర్ (3/24), కెవిన్ సింక్లెయిర్ (4/41) కివీస్ ఇన్నింగ్స్‌ను దెబ్బ తీశారు. 213 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్‌ను ట్రెంట్ బౌల్ట్ (3/18), టిమ్ సౌతీ (4/22) బెదరగొట్టారు. విండీస్ స్కోరు 63/7 వద్ద ఉన్నపుడు వర్షం కారణంగా ఆట నిలిచిపోయింది. అనంతరం విండీస్ లక్ష్యాన్ని 41 ఓవర్లలో 212 పరుగులుగా నిర్ణయించారు. చివర్లో యానిక్ కరియా (52; 2 ఫోర్లు, 1 సిక్స్), అల్జారి జోసెఫ్ (31 బంతుల్లో 49; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) పట్టుదలతో ఆడి తొమ్మిదో వికెట్‌కు 85 పరుగులు జోడించారు. అయితే నాలుగు పరుగలు తేడాలో వీరిద్దరు అవుటవ్వడంతో విండీస్ ఇన్నింగ్స్ 161 పరుగుల వద్ద ముగిసింది. సిరీస్‌లో చివరిదైన మూడో వన్డే నేడు జరుగుతుంది. చదవండి: T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు ప్రకటన.. ఎప్పుడంటే? -
India vs Zimbabwe 2nd ODI: భారత్ జోరుకు తిరుగుందా!
హరారే: జింబాబ్వే గడ్డపై అలవోక విజయంతో శుభారంభం చేసిన టీమిండియా ఇప్పుడు అదే జోరుతో సిరీస్‌పై కన్నేసింది. మరో మ్యాచ్ మిగిలుండగానే ఇక్కడే కప్ గెలవాలనే పట్టుదలతో రాహుల్ సేన బరిలోకి దిగుతోంది. బంగ్లాదేశ్‌తో భారీ స్కోర్లను ఛేదించి మరీ గెలిచిన ఆతిథ్య జింబాబ్వే జట్టు... వారాల వ్యవధిలోనే భారత్ ఆల్‌రౌండ్ దెబ్బకు విలవిల్లాడింది. ఇప్పుడు సిరీస్‌లో నిలిచేందుకో, ఈ మ్యాచ్ గెలిచేందుకో కాదు... భారత్ ధాటిని ఎదుర్కోవాలని లక్ష్యంతోనే జింబా బ్వే రెండో మ్యాచ్‌కు సిద్ధమైంది. టీమిండియా సీమర్లను ఆరంభ ఓవర్లలో ఎదుర్కొంటే... గెలుపు, భా రీస్కోరు సంగతి అటుంచి కనీసం 50 ఓవర్ల కోటా అయినా ఆడుకోవచ్చని జింబాబ్వే ఆశిస్తోంది. ఆకాశమే హద్దుగా భారత్ భారత్ జోరుకు ఆకాశమే హద్దు! ముఖ్యంగా ఓపెనింగ్ జోడి. ధావన్–శుబ్‌మన్ గిల్ కొన్నాళ్లుగా తమకెదురైన ప్రతీ ప్రత్యర్థిని, ప్రతీ బౌలర్‌ను అలవోకగా ఎదుర్కొంటున్నారు. సులువుగా పరుగులు, భారీ భాగస్వామ్యాలు నమోదు చేస్తున్నారు. మిడిలార్డర్లో రాహుల్ తన పునరాగమనాన్ని చాటాలని ఉవ్విళ్లూరుతుండగా, సంజు సామ్సన్, దీపక్ హుడా సీనియర్ల గైర్హాజరీలో సత్తా చాటుకుంటున్నారు. బౌలింగ్ విభాగం కూడా ఆతిథ్య జట్టు కంటే పటిష్టంగా ఉంది. బరిలోకి దిగి చాన్నాళ్లయినా... దీపక్ చహర్ తొలి ఓవర్‌నుంచే లయ అందుకున్నాడు. గత మ్యాచ్‌లో అతను టాపార్డర్‌ను కూల్చిన తీరు అద్భుతం. స్పిన్నర్ అక్షర్, సీమర్ ప్రసిధ్ కూడా వైవిధ్యమైన బంతులతో బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెడుతున్నారు. ఒత్తిడిలో జింబాబ్వే పటిష్టమైన ప్రత్యర్థిని ఎదుర్కొనేందుకు జింబాబ్వే ఆపసోపాలు పడుతోంది. అటు బ్యాటింగ్‌లో, ఇటు బౌలింగ్‌లో తేలిపోతోంది. తొలి వన్డే ఫలితాన్ని పరిశీలిస్తే ఆతిథ్య జట్టు సిరీస్‌ను ఆఖరి దాకా తీసుకొ చ్చే అవకాశమైతే లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎటొచ్చీ ఓటమి అంతరాన్ని తగ్గించడం, లేదంటే పరువు నిలుపుకొనే పోరాటంపైనే జింబాబ్వే దృష్టి పెట్టింది. ఇన్నోసెంట్ కైయా, మరుమని, వెస్లీ బాధ్యత కనబరిస్తే మంచి స్కోరు చేయవచ్చు. పిచ్–వాతావరణం తొలి వన్డే ఆడిన పిచే! మ్యాచ్ ఆరంభంలో కొత్తబంతి సీమర్లు చెలరేగొచ్చు. తర్వాత బ్యాటింగ్‌కు స్వర్గధామం. ఆటకు అనుకూల వాతవరణం ఉంది. వాన ముప్పే లేదు. జట్లు (అంచనా) భారత్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), ధావన్, గిల్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, సంజూ సామ్సన్, అక్షర్ పటేల్, దీపక్ చహర్, కుల్దీప్, ప్రసిధ్ కృష్ణ, సిరాజ్. జింబాబ్వే: రెగిస్ చకాబ్వా (కెప్టెన్), కైయా, మరుమని, సియాన్ విలియమ్స్, వెస్లీ మధెవెర్, సికందర్ రజా, రియాన్ బర్ల్, ల్యూక్ జాంగ్వే, ఇవాన్స్, విక్టర్, రిచర్డ్. -
India vs West Indies: మరో సిరీస్ సాధించేందుకు...
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: ఐదుగురు స్టార్ ఆటగాళ్లు లేకపోయినా... మరో వన్డే సిరీస్ విజయానికి భారత జట్టు బాటలు వేసుకుంది. తొలి మ్యాచ్‌లో విండీస్‌పై స్వల్ప తేడాతో నెగ్గిన టీమిండియా కరీబియన్ పర్యటనలో వరుసగా రెండో సిరీస్ గెలుచుకోవాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో నేడు క్వీన్స్ పార్క్ ఓవల్‌లో జరిగే రెండో వన్డేలో భారత్, విండీస్ తలపడనున్నాయి. సొంతగడ్డపై కొద్ది రోజుల క్రితమే బంగ్లాదేశ్‌కు సిరీస్ అప్పగించిన వెస్టిండీస్ మరో సిరీస్ కోల్పోరాదంటే తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. అంతా ఫామ్‌లోకి... శిఖర్ ధావన్ చాలా రోజుల తర్వాత చెప్పుకోదగ్గ బ్యాటింగ్‌తో అర్ధసెంచరీ నమోదు చేశాడు. రుతురాజ్, ఇషాన్ కిషన్‌లను కాదని ఓపెనర్‌గా అవకాశం దక్కించుకున్న శుబ్‌మన్ గిల్ తన క్లాసిక్ బ్యాటింగ్‌కు చూపించగా... రాణిస్తే తప్ప జట్టులో చోటు దక్కే అవకాశం లేని స్థితిలో బరిలోకి దిగిన శ్రేయస్ అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అటు బౌలింగ్‌లో సిరాజ్ చక్కగా రాణించి వన్డేలకూ తాను తగినవాడినన్ని నిరూపించుకున్నాడు. ముఖ్యంగా అతను తీసిన పూరన్ వికెట్ కీలక దశలో వరుస ఓవర్లలో శార్దుల్ తీసిన రెండు వికెట్లు ఆల్‌రౌండర్‌గా అతని బలాన్ని ప్రదర్శించాయి. ఈ నేపథ్యంలో మార్పులు లేకుండానే భారత జట్టు రెండో మ్యాచ్‌లోనూ బరిలోకి దిగే అవకాశం ఉంది. తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్ టాప్–4 బ్యాటర్లలో ముగ్గురు రాణించారు. అయితే జట్టును గెలిపించడానికి అది సరిపోలేదు. కీలక దశలో ఆ జట్టు వికెట్లు కోల్పోయింది. కొన్ని చక్కటి షాట్లు ఆడి వెనుదిరుగుతూ టి20 శైలి బ్యాటింగ్ చేస్తున్న పూరన్.. కెప్టెన్‌గా జట్టుకు విజయం అందించే ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. మేయర్స్, కింగ్స్‌లకు తోడు బ్రూక్స్ కూడా మెరుగ్గా ఆడితే విండీస్ గెలుపుపై ఆశలు పెట్టుకోవచ్చు. గత ఆరు మ్యాచ్‌లలో షై హోప్స్ విఫలం కావడంతో టీమ్‌కు శుభారంభం లభించడం లేదు. దీనికి ఆ జట్టు సరిదిద్దుకోవాల్సి ఉంది. బౌలింగ్‌లో మాత్రం విండీస్‌లో తడబాటు స్పష్టంగా కనిపించింది. ఉత్కంఠభరిత ముగింపు తొలి వన్డే చివరి ఓవర్లో విండీస్ విజయానికి 15 పరుగులు కావాలి. సిరాజ్ వేసిన తొలి 4 బంతుల్లో ఒక ఫోర్ సహా 7 పరుగులు వచ్చాయి. 2 బంతుల్లో 8 పరుగులు అవసరం. ఆ తర్వాత సిరాజ్ వేసిన బంతి లెగ్‌స్టంప్‌కు చాలా దూరంగా ‘వైడ్’గా వెళ్లింది. అది వేగంగా వెళ్లి బౌండరీని తాకి ఉంటే సమీకరణం వేరేలా ఉండేది. కానీ కీపర్ సంజు సామ్సన్ అద్భుతంగా ఎడమ వైపు డైవ్ చేస్తూ దానిని ఆపడంలో సఫలమయ్యాడు. దాంతో ఒక పరుగే వచ్చింది. అనంతరం చివరి 2 బంతుల్లో సిరాజ్ 3 పరుగులే ఇవ్వడంతో 3 పరుగుల తేడాతో విజయం భారత్ సొంతమైంది. భారత్ చేసిన 308 పరుగులకు బదులుగా వెస్టిండీస్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 305 పరుగులే చేయగలిగింది. కైల్ మేయర్స్ (68 బంతుల్లో 75; 10 ఫోర్లు, 1 సిక్స్), బ్రాండన్ కింగ్ (66 బంతుల్లో 54; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), బ్రూక్స్ (61 బంతుల్లో 46; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించగా... శార్దుల్, సిరాజ్, చహల్ తలా 2 వికెట్లు తీశారు. శిఖర్ ధావన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. -
ప్రసిధ్ కృష్ణ ఔట్.. ఆవేశ్ ఖాన్‌కు ఛాన్స్..!
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ట్రినిడాడ్ వేదికగా విండీస్‌తో రేపు (జులై 24) జరుగబోయే రెండో వన్డే కోసం టీమిండియా సిద్ధమవుతోంది. తొలి మ్యాచ్‌లో ఆతిధ్య జట్టును 3 పరుగుల తేడాతో ఓడించిన ధవన్ సేన.. రెండో వన్డేలోనూ విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఇందుకోసం టీమిండియా తుది జట్టులో ఓ మార్పు చేసే అవకాశం ఉంది. తొలి వన్డేలో వికెట్ లేకుండా ధారాళంగా పరుగులు సమర్పించుకున్న ప్రసిధ్ కృష్ణ స్థానంలో మరో పేసర్ ఆవేశ్ ఖాన్‌కు ఛాన్స్ ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఒక్క మార్పు మినహా తొలి వన్డేలో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించే ఛాన్స్ ఉంది. ఓపెనర్లుగా ధవన్, గిల్, వన్‌డౌన్‌లో శ్రేయస్ అయ్యర్, మిడిలార్డర్లో సూర్యకుమార్, దీపక్ హుడా, సంజూ శాంసన్, ఆల్‌రౌండర్ల కోటాలో అక్షర్ పటేల్, శార్ధూల్ ఠాకూర్, ఏకైక స్పిన్నర్‌గా చహల్, పేసర్లుగా ఆవేశ్ ఖాన్, సిరాజ్‌లను తుది జట్టులో ఆడించే అవకాశం ఉంది. మరోవైపు తొలి వన్డేలో దాదాపు విజయపు అంచుల వరకు వచ్చిన విండీస్ సైతం ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలుపొంది సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని పట్టుదలగా ఉంది. భారత తుది జట్టు (అంచనా).. శిఖర్ ధవన్(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, సంజూ శాంసన్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, మహ్మద్ సిరాజ్, ఆవేశ్ ఖాన్ చదవండి: అసలు అతడికి ఇక్కడ ఏం పని? ధావన్‌పై మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు! -
సఫారీల భరతం పట్టిన ఇంగ్లండ్ బౌలర్లు.. రెండో వన్డేలో బట్లర్ సేన ఘన విజయం
పర్యాటక దక్షిణాఫ్రికా చేతిలో తొలి వన్డేలో ఎదురైన పరాభవానికి ఇంగ్లండ్ జట్టు ప్రతీకారం తీర్చుకుంది. ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరిగిన రెండో వన్డేలో 118 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా 3 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచింది. వర్షం కారణంగా 29 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లీష్ జట్టు 28.1 ఓవర్లలో 201 పరుగులకు ఆలౌటైంది. జట్టులో ఏ ఒక్క ఆటగాడు చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయినా, ఆఖర్లో లివింగ్‌స్టోన్ (26 బంతుల్లో 38; ఫోర్, 3 సిక్సర్లు), సామ్ కర్రన్ (18 బంతుల్లో 35; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపుల సాయంతో ఇంగ్లండ్ భారీ స్కోర్ సాధించగలిగింది. సఫారీ బౌలర్లలో ప్రిటోరియస్ (4/36), నోర్జే (2/53), షంషి (2/39), కెప్టెన్ కేశవ్ మహారాజ్ (1/29)లు వికెట్లు సాధించారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లీష్ బౌలర్లు మూకుమ్మడిగా రెచ్చిపోవడంతో సఫారీ జట్టు 20.4 ఓవర్లలో కేవలం 83 పరుగులకే కుప్పకూలింది. ఆదిల్ రషీద్ (3/29), మొయిన్ అలీ (2/22), రీస్ టాప్లే (2/17), డేవిడ్ విల్లే (1/9), సామ్ కర్రన్ (1/5) సఫారీల భరతం పట్టారు. వీరి ధాటికి సఫారీల ఇన్నింగ్స్‌లో ఏకంగా నాలుగురు బ్యాటర్లు డకౌటయ్యారు. హెన్రిచ్ క్లాసెన్ (40 బంతుల్లో 33), డేవిడ్ మిల్లర్ (12), ప్రిటోరియస్ (17) మాత్రమే రెండంకెల స్కోర్ చేయగలిగారు. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక మూడో వన్డే హెడింగ్లే వేదికగా జులై 24న జరుగనుంది. చదవండి: Ind Vs WI: సంజూ ఆ బంతిని ఆపకపోయి ఉంటే.. టీమిండియా ఓడిపోయేదే! -
IND vs ENG 2nd ODI: ‘టాప్’లీ లేపేశాడు...
లండన్: లార్డ్స్‌లో సీన్ రివర్స్ అయ్యింది. తొలి వన్డేలో మన పేస్‌కు తలవంచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్‌లాగే... ఇక్కడ ప్రత్యర్థి నిప్పులు చెరిగే బౌలింగ్‌కు భారత్ కుదేలైంది. దీంతో భారత్ రెండో వన్డేలో ఓటమి పాలైంది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 49 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌటైంది. మొయిన్ అలీ (64 బంతుల్లో 47; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), విల్లీ (49 బంతుల్లో 41; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. చహల్ (4/47) తిప్పేయగా, బుమ్రా, పాండ్యా చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన భారత్ 38.5 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది.జడేజా (29), హార్దిక్ పాండ్యా (29) టాప్స్కోరర్లుగా నిలువగా, రీస్ టాప్లీ 6 వికెట్లు పడగొట్టాడు. కోహ్లి గాయం నుంచి కోలుకోవడంతో రెండో వన్డే బరిలోకి దిగాడు. దీంతో శ్రేయస్‌ను తుదిజట్టు నుంచి తప్పించారు. ఆఖరి వన్డే 17న మాంచెస్టర్‌లో జరుగుతుంది. ఆరంభానికి చహల్ తూట్లు ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను ఆరంభించిన రాయ్, బెయిర్‌స్టో జాగ్రత్త పడ్డారు. దీంతో తొలి 4 ఓవర్లలో 17 పరుగులే చేశారు. ఐదో ఓవర్లో రాయ్ బౌండరీ, సిక్సర్ బాదడంతో 13 పరుగులు వచ్చాయి. తర్వాత కూడా ఇద్దరు ఆచితూచి ఆడటంతో పరుగుల వేగం మందగించింది. 9వ ఓవర్ వేసిన పాండ్యా తన తొలి ఓవర్లోనే జేసన్ రాయ్ (33 బంతుల్లో 23; 2 ఫోర్లు, 1 సిక్స్)ని అవుట్ చేశాడు. 10 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు 46/1. చహల్ (4/47) అనంతరం స్పిన్నర్ చహల్ బౌలింగ్‌కు దిగడంతో ఇంగ్లండ్ కష్టాలు పెరిగాయి. ధాటిగా ఆడగలిగే బెయిర్‌స్టో (38 బంతుల్లో 38; 6 ఫోర్లు)తో పాటు జో రూట్ (11)ను తన వరుస ఓవర్లలో పెవిలియన్ చేర్చాడు. బట్లర్(4) షమీ బౌల్డ్ చేయడంతో ఇంగ్లండ్ 87 పరుగులకే కీలకమైన 4 వికెట్లను కోల్పోయింది. చహల్ వేసిన 20వ ఓవర్లో రెండు బౌండరీలు బాదిన స్టోక్స్ ఆ స్పిన్నర్ మరుసటి ఓవర్లో వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆదుకున్న అలీ, విల్లీ ఇంగ్లండ్ 102 స్కోరుకే ప్రధానమైన సగం వికెట్లను కోల్పోయింది. ఈ దశలో లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. ఊరించే బంతులు వేసిన హార్దిక్ పాండ్యా... లివింగ్‌స్టోన్ (33 బంతుల్లో 33; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు)ను బోల్తా కొట్టించాడు. దీంతో అలీతో జతకట్టిన డేవిడ్ విల్లే పరుగుల బాధ్యతను పంచుకున్నారు. ఒక పరుగు వద్ద విల్లీ ఇచ్చిన క్యాచ్‌ను ప్రసిధ్ వదిలేయడం జట్టుకు కలిసొచ్చింది. అయితే కట్టుదిట్టమైన భారత బౌలింగ్ వల్ల రన్‌రేట్ మందగించింది. ఇద్దరు ఏడో వికెట్‌కు 62 పరుగులు జోడించారు. జట్టు స్కోరు 200పైచిలుకు చేరాక అలీ, కాసేపటికి విల్లీ అవుట్ కావడంతో డెత్ ఓవర్లలో తగినన్ని పరుగులు రాలేదు. టాప్ లేపిన టాప్లీ ప్రత్యర్థి జట్టును తక్కువ స్కోరుకే ఆలౌట్ చేసిన ఉత్సాహం ఆవిరయ్యేందుకు ఎంతో సేపు పట్టలేదు. ఓపెనర్లు రోహిత్ శర్మ (0), శిఖర్ ధావన్ (9) టాప్లీ పేస్‌కు తలవంచారు. ఆ వెంటనే రిషభ్ పంత్ (0)ను కార్స్ ఖాతా తెరువనీయలేదు. అయినా విరాట్ కోహ్లి (16) ఉండటంతో కొంత నమ్మకం ఉన్నా, అతని ఆటకు విల్లీ చెక్ పెట్టాడు. సూర్యకుమార్ (29 బంతుల్లో 27; 1 ఫోర్, 1 సిక్స్), హార్దిక్ పాండ్యా (44 బంతుల్లో 29; 2 ఫోర్లు) కొద్ది సేపు పోరాడటంతో స్కోరు వంద దాటింది! జట్టు స్కోరు 140 పరుగుల వద్ద జడేజా అవుట్ కావడంతో భారత్ ఆశలు కోల్పోయింది. స్కోరు వివరాలు ఇంగ్లండ్ ఇన్నింగ్స్: రాయ్ (సి) సూర్యకుమార్ (బి) పాండ్యా 23; బెయిర్‌స్టో (బి) చహల్ 38; రూట్ (ఎల్బీ) (బి) చహల్ 11; స్టోక్స్ (ఎల్బీ) (బి) చహల్ 21; బట్లర్ (బి) షమీ 4; లివింగ్‌స్టోన్ (సి) సబ్–శ్రేయస్ (బి) పాండ్యా 33; అలీ (సి) జడేజా (బి) చహల్ 47; విల్లీ (సి) సబ్–శ్రేయస్ (బి) బుమ్రా 41; ఓవర్టన్ నాటౌట్ 10; కార్స్ (ఎల్బీ) (బి) ప్రసిధ్ 2; టాప్లీ (బి) బుమ్రా 3; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (49 ఓవర్లలో ఆలౌట్) 246. వికెట్ల పతనం: 1–41, 2–72, 3–82, 4–87, 5–102, 6–148, 7–210 బౌలింగ్: షమీ 10–0–48–1, బుమ్రా 10–1–49–2, హార్దిక్ 6–0–28–2, ప్రసిధ్ 8–0–53–1, చహల్ 10–0–47–4, జడేజా 5–0–17–0. -
ఇంగ్లండ్‌తో రెండో వన్డే.. సందడి చేసిన ధోని, రైనా
IND VS ENG 2nd ODI: లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో వన్డే సందర్భంగా టీమిండియా మాజీ క్రికెటర్లు మహేంద్ర సింగ్ ధోని, సురేశ్ రైనా, హర్భజన్ సింగ్‌లు సందడి చేశారు. ఈ టీమిండియా మాజీ త్రయం వీఐపీ గ్యాలరీలో ఫోటోలకు పోజులిస్తూ సందడి చేసింది. ఇటీవలి కాలంలో టీమిండియా ఎక్కడికి వెళ్లినా ఫాలో అవుతున్న ధోని.. తొలి వన్డే సందర్భంగా కూడా మైదానంలో హడావుడి చేశాడు. విండీస్ దిగ్గజం గార్డన్ గ్రీనిడ్జ్, సైఫ్ అలీ ఖాన్‌లతో కలిసి ఫోటోలు దిగాడు. తాజాగా తలా.. చిన్న తలా (రైనా)తో కలిసి దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. Great watching the boys in blue 🇮🇳 @harbhajan_singh @msdhoni pic.twitter.com/1UEGAzEG7R — Suresh Raina🇮🇳 (@ImRaina) July 14, 2022 సహచరులు భజ్జీ, ధోనిలతో కలిసి దిగిన ఫోటోలను రైనా ట్విటర్లో పోస్ట్ చేశాడు. కాగా, ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ను వీక్షించేందుకు దిగ్గజ ఆటగాళ్లు చాలా మంది హాజరవుతున్నారు. తొలి వన్డే సందర్భంగా సచిన్, గంగూలీలతో పాటు చాలా మంది స్టార్లు మ్యాచ్‌ను లైవ్‌లో వీక్షించారు. ఇదిలా ఉంటే, రెండో వన్డేలో టీమిండియా బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో ఇంగ్లండ్ 246 పరుగులకే ఆలౌటైంది. చహల్ 4, బుమ్రా, హార్థిక్ తలో 2 వికెట్లు, ప్రసిద్ధ కృష్ణ, షమీ చెరో వికెట్ పడగొట్టారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో మొయిన్ అలీ (47) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చదవండి: విండీస్ దిగ్గజాల రికార్డుకు ఎసరు పెట్టిన రోహిత్-ధవన్ జోడీ -
విండీస్ దిగ్గజాల రికార్డుకు ఎసరు పెట్టిన రోహిత్-ధవన్ జోడీ
Rohit-Dhawan: టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ-శిఖర్ ధవన్లు మరో అరుదైన రికార్డుపై కన్నేశారు. ఇంగ్లండ్‌తో రెండో వన్డేలో ఈ ద్వయం మరో 43 పరుగులు జోడిస్తే.. విండీస్ దిగ్గజ ఓపెనర్ల రికార్డును అధిగమిస్తారు. వన్డేల్లో విండీస్ లెజెండరీ ఓపెనింగ్ పెయిర్ గార్డన్ గ్రీనిడ్జ్-డెస్మండ్ హేన్స్ జోడీ తొలి వికెట్‌కు 102 ఇన్నింగ్స్‌ల్లో 5150 పరుగులు జోడించగా.. రోహిత్-ధవన్ జోడీ 112 ఇన్నింగ్స్‌ల్లో 5108 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌తో నేటి (జులై 14) మ్యాచ్‌లో భారత ఓపెనింగ్ ద్వయం మరో 43 పరుగులు సాధించగలిగితే.. వన్డేల్లో అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం నెలకొల్పిన జోడీల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకుతుంది. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్-సౌరవ్ గంగూలీ జోడీ (136 ఇన్నింగ్స్‌ల్లో 6609 పరుగులు) అగ్రస్థానంలో ఉండగా.. ఆసీస్ ఆల్‌టైమ్ గ్రేట్ ఓపెనింగ్ జోడీ మాథ్యూ హేడెన్-ఆడమ్ గిల్‌క్రిస్ట్ (114 ఇన్నింగ్స్‌ల్లో 5472) రెండో ప్లేస్‌లో నిలిచింది. తొలి వన్డేలో హిట్‌మ్యాన్- ధవన్ పెయిర్ తొలి వికెట్‌కు అజేయమైన 114 పరుగులు సాధించడం ద్వారా ఫిఫ్టి ఓవర్స్ ఫార్మాట్లో 5000 పరుగుల మైలురాయిని చేరుకుంది. ఇదిలా ఉంటే, తొలి వన్డేలో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను మట్టికరిపించిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లీష్ జట్టు బుమ్రా (6/19), మహ్మద్ షమీ (3/31) నిప్పులు చెరగడంతో 110 పరుగులకే చాపచుట్టేసింది. ఛేదనలో రోహిత్ శర్మ (58 బంతుల్లో 76 నాటౌట్; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) శిఖర్ ధవన్ (54 బంతుల్లో 31 నాటౌట్; 4 ఫోర్లు)లు చెలరేగడంతో ఇంగ్లండ్ నిర్ధేశించిన 111 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా సునాయాసంగా ఛేదించింది. ఫలితంగా టీమిండియా 10 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసి 3 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అంతకుముందు టీ20 సిరీస్‌ను టీమిండియా 2-1 తేడాతో చేజిక్కించుకుంది. చదవండి: విండీస్‌తో టి20 సిరీస్.. కోహ్లి, బుమ్రా ఔట్ -
England Vs India, 2nd ODI: భారత్ జోరును ఆపతరమా!
బర్మింగ్‌హామ్ టెస్టు ఫలితం తర్వాత ఇంగ్లండ్ జట్టు ఊహించి ఉండకపోవచ్చు తాము టి20 సిరీస్ కోల్పోతామని...ఊహించకపోవచ్చు తొలి వన్డేలో ఇంత ఘోరంగా ఓడతామని...బుమ్రా స్వింగ్ బౌలింగ్ ఇంత ప్రమాదకరంగా ఉంటుందని అంచనా వేసి ఉండకపోవచ్చు...కానీ ఇప్పుడు వారికి టీమిండియా అసలు సత్తా ఏమిటో తెలిసొచ్చింది. మరో వైపు భారత బృందం ఆత్మవిశ్వాసం అంబరాన ఉంది. టి20ల్లాగే ఇక్కడా రెండో పోరులోనే సిరీస్‌ను గెలుచుకొని పైచేయి సాధించాలని పట్టుదలగా ఉంది. సరిగ్గా మూడేళ్ల క్రితం ఇదే రోజు ఇదే లార్డ్స్ మైదానంలో వన్డే వరల్డ్ కప్ విజేతగా నిలిచిన ఇంగ్లండ్ ఆ స్ఫూర్తితో ప్రస్తుతానికి సిరీస్ కాపాడుకోగలదా చూడాలి. లండన్: ఏకపక్షంగా సాగిన మొదటి పోరు తర్వాత భారత్, ఇంగ్లండ్ తర్వాతి సమరానికి సన్నద్ధమయ్యాయి. గురువారం జరిగే రెండో వన్డేలో ఇరు జట్లు తలపడనున్నాయి. భారత్ తమ జోరు కొనసాగిస్తే 2–0తో సిరీస్ సొంతమవుతుంది. ఇంగ్లండ్ కోలుకోగలిగితే సిరీస్ ఫలితం ఆదివారానికి మారుతుంది. భారత్ అన్ని రంగాల్లో బలంగా కనిపిస్తున్నా...సొంతగడ్డపై ఒకే మ్యాచ్ ప్రదర్శనతో ఇంగ్లండ్‌ను తక్కువగా అంచనా వేయడం సరైంది కాదు. మార్పుల్లేకుండా... గెలిచిన జట్టును మార్చేందుకు సహజంగా ఏ జట్టూ ఇష్టపడదు. భారత్ కూడా తాజా మ్యాచ్ విషయంలో అదే తరహాలో తుది జట్టును ఎంపిక చేయవచ్చు. గజ్జల్లో గాయంతో తొలి వన్డే ఆడని విరాట్ కోహ్లి కోలుకున్నాడా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే అతను ఈ మ్యాచ్‌కూ దూరమయ్యే అవకాశాలే ఎక్కువ. దాంతో మార్పుల అవసరం కూడా ఉండకపోవచ్చు. బౌలింగ్‌లో బుమ్రా, షమీ మరోసారి ప్రధానాస్త్రాలుగా ప్రత్యర్థిపై చెలరేగడం ఖాయం. ప్రసిధ్ కూడా తానేమీ తక్కువ కాదని నిరూపించుకున్నాడు. కాబట్టి యువ పేసర్ అర్ష్‌దీప్ అరంగేట్రానికి ఎదురు చూడాల్సి ఉంటుంది. నాలుగో పేసర్‌గా పాండ్యా రూపంలో భారత్‌కు చక్కటి ప్రత్యామ్నాయం ఉంది. ఓవల్ మ్యాచ్‌లో చహల్ 2 ఓవర్లే వేయగా, జడేజా బౌలింగ్ చేయాల్సిన అవసరమే రాలేదు. ఈ సారి అవసరమైతే వీరంతా సత్తా చాటాల్సి ఉంది. స్వల్ప లక్ష్యమే అయినా రోహిత్ మెరుపు బ్యాటింగ్ హైలైట్‌గా నిలిచింది. ధావన్ తన ఇన్నేళ్ల శైలికి భిన్నంగా బాగా నెమ్మదిగా ఆడటం కొంత ఆశ్చర్యపరిచే అంశమే అయినా...ఈ మ్యాచ్‌లో అతను దూకుడు పెంచాలి. శ్రేయస్, సూర్యకుమార్, పంత్‌లతో బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. హార్దిక్, జడేజా కూడా భారీ స్కోరులో కీలక పాత్ర పోషించగలరు. మొత్తంగా చూస్తే ప్రతీ ఒక్కరు తమ వంతు పాత్రను సమర్థంగా పోషించేందుకు సిద్ధంగా ఉన్నారు. బట్లర్‌కు పరీక్ష... టాప్–6లో నలుగురు డకౌట్! వన్డేల్లో ఐదు వందలుకు చేరువగా టాప్–3 స్కోర్లు నమోదు చేసిన ఇంగ్లండ్ జట్టునుంచి ఇలాంటి ప్రదర్శన ఆశ్చర్యం కలిగించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసి భారీ స్కోరు నమోదు చేయడం, ఆపై ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచడం...ఇన్నేళ్లుగా ఆ జట్టు అదే తరహాలో విధ్వంసం కొనసాగిస్తోంది. అయితే పిచ్ కాస్త బౌలింగ్‌కు అనుకూలంగా మారగానే తొలుత బ్యాటింగ్ చేసి కూడా జట్టు కుప్పకూలింది. ఆ ప్రదర్శన ఒకే మ్యాచ్‌కే పరిమితమని ఇంగ్లండ్ నిరూపించాల్సి ఉంది. చాలా కాలంగా విఫలమవుతున్న రాయ్‌పై అదనపు ఒత్తిడి ఉండగా, మరో ఓపెనర్ బెయిర్‌స్టో చెలరేగగలడా చూడాలి. మిడిలార్డర్లో రూట్, స్టోక్స్ ఎంత బాధ్యతగా ఆడతారనేదానిపై జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. అన్నింటికి మించి బట్లర్ పాత్ర కీలకం. బ్యాటర్‌గా ఘనమైన రికార్డు ఉన్న అతను రెగ్యులర్ కెప్టెన్‌గా తొలి టి20 సిరీస్‌లో తడబడ్డాడు. సిరీస్ కోల్పోవడంతో పాటు బ్యాటింగ్‌లోనూ విఫలమయ్యాడు. మొదటి వన్డేలో కూడా ఓటమి పక్షాన నిలిచిన బట్లర్ ఈ మ్యాచ్‌లో కెప్టెన్సీతో పాటు బ్యాటింగ్‌లోనూ తన సామర్థ్యం నిరూపించుకోవాల్సి ఉంది. కనీస అనుభవం లేని పేస్ బౌలర్లు ఇంగ్లండ్ బలహీనతగా మారారు. విల్లీ, టాప్లీ, ఒవర్టన్, కార్స్‌లు బలమైన టీమిండియా లైనప్‌ను నిలువరించడం అంత సులువు కాదు. ఒవర్టన్ స్థానంలో ఆల్‌రౌండర్ స్యామ్ కరన్‌కు అవకాశం దక్కవచ్చు. పిచ్, వాతావరణం చక్కటి బ్యాటింగ్ పిచ్, భారీ స్కోరుకు అవకాశం ఉంది. మ్యాచ్‌కు వర్షం సమస్య లేదు. టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవచ్చు. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: రోహిత్ (కెప్టెన్), ధావన్, శ్రేయస్, సూర్యకుమార్, పంత్, హార్దిక్, జడేజా, షమీ, బుమ్రా, ప్రసిధ్, చహల్. ఇంగ్లండ్: బట్లర్ (కెప్టెన్), రాయ్, బెయిర్‌స్టో, రూట్, స్టోక్స్, లివింగ్‌స్టోన్, అలీ, విల్లీ, కార్స్, టాప్లీ, ఒవర్టన్/స్యామ్ కరన్. -
IPL 2022: రఫ్ఫాడించిన రబాడ.. పట్టలేని ఆనందంలో పంజాబ్
Kagiso Rabada: రబాడ (5/39) ఐదు వికెట్లతో రఫ్ఫాడించడంతో బంగ్లాదేశ్‌తో ఇవాళ(మార్చి 20) జరిగిన రెండో వన్డేలో ఆతిధ్య ప్రోటీస్ జట్టు అద్భుత విజయం సాధించింది. ఈ విజయంతో సఫారీలు 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసుకోవడంతో పాటు తొలి వన్డేలో బంగ్లాదేశ్ చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకున్నారు. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్.. సఫారీ జట్టును 38 పరుగుల తేడాతో మట్టికరిపించగా, ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో పర్యాటక జట్టుపై రివెంజ్ విక్టరీ సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా జట్టు రబాడ ధాటికి నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేయగా, డికాక్ (62), కైల్ వెర్రిన్ (58 నాటౌట్) అర్ధ సెంచరీలతో రాణించడంతో సఫారీ జట్టు 37.2 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయసంగా లక్ష్యాన్ని ఛేదించింది. అంతకుముందు అఫీఫ్ హోసేన్ (107 బంతుల్లో 77; 9 ఫోర్లు) ఒంటరి పోరటాం చేయడంతో బంగ్లాదేశ్ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మకమైన మూడో వన్డే బుధవారం (మార్చి 23) జరగనుంది. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో రబాడ భీకరమైన బంతులతో ప్రత్యర్ధులను గడగడలాడించడంతో అతని ఐపీఎల్ జట్టు పంజాబ్ కింగ్స్ ఆనందంలో మునిగి తేలుతుంది. ఇటీవల జరిగిన మెగా వేలంలో రబాడను పంజాబ్ ఏకంగా రూ. 9. 25 కోట్లు వెచ్చించి సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా, రబాడ, ఎంగిడి, డస్సెన్, మార్క్రమ్ సహా పలువురు సౌతాఫ్రికా క్రికెటర్లు స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరగాల్సిన టెస్ట్ సిరీస్‌కు డుమ్మా కొట్టి ఐపీఎల్ ఆడేందుకు పయనమవుతున్నారు. చదవండి: హిట్టర్లలతో సిద్దమైన పంజాబ్.. పూర్తి జట్టు ఇదే A great catch from Janneman Malan to ensure @KagisoRabada25 five-wicket haul🖐️ #SAvBAN #BetwayPinkODI #BePartOfIt | @Betway_za pic.twitter.com/hlYxZDjyPN — Cricket South Africa (@OfficialCSA) March 20, 2022 -
IND vs WI: రెండో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
అహ్మదాబాద్: పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న భారత్ చేసింది 237 పరుగులే. కాస్త జాగ్రత్తగా ఆడినా వెస్టిండీస్ ఈ లక్ష్యాన్ని ఛేదించవచ్చు. కానీ భారత బౌలర్లు ఆ అవకాశం ఇవ్వలేదు. చక్కటి బౌలింగ్‌తో విండీస్‌ను కట్టి పడేశారు. తక్కువ స్కోరును కూడా కాపాడుకుంటూ సిరీస్‌ను గెలిపించారు. విండీస్ గత మ్యాచ్‌లాగే మరోసారి పేలవ బ్యాటింగ్‌తో చేతులెత్తేసింది. బుధవారం జరిగిన రెండో వన్డేలో భారత్ 44 పరుగుల తేడాతో విండీస్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (83 బంతుల్లో 64; 5 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా, కేఎల్ రాహుల్ (48 బంతుల్లో 49; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. అనంతరం వెస్టిండీస్ 46 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌటైంది. షామర్ బ్రూక్స్ (64 బంతుల్లో 44; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ప్రసిధ్ కృష్ణ (4/12) ప్రత్యర్థిని పడగొట్టడంలో కీలక పాత్ర పోషించాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 2–0తో గెలుచుకోగా, రేపు చివరి వన్డే జరుగుతుంది. కోహ్లి మళ్లీ విఫలం... వ్యక్తిగత కారణాలతో గత మ్యాచ్‌కు దూరమైన రాహుల్‌కు జట్టులో చోటు దక్కడంతో ఇషాన్ కిషన్‌ను పక్కన పెట్టిన భారత్, ప్రయోగాత్మకంగా రిషభ్ పంత్‌తో కెరీర్లో తొలిసారి ఓపెనింగ్ చేయించింది. అయితే కీమర్ రోచ్ తన రెండో ఓవర్లోనే రోహిత్ శర్మ (5)ను అవుట్ చేసి భారత్‌ను దెబ్బ తీయగా... పంత్ (18) ఆశించిన స్థాయిలో దూకుడు కనబర్చలేక తడబడుతూ ఆడాడు. గాయంతో మ్యాచ్ నుంచి తప్పుకున్న పొలార్డ్ స్థానంలో జట్టులోకి వచ్చిన ఒడెన్ స్మిత్ ఒకే ఓవర్లో పంత్‌తో పాటు కోహ్లి (18)ని కూడా అవుట్ చేశాడు. ఈ దశలో రాహుల్, సూర్యకుమార్ కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. 4 పరుగుల వద్ద రాహుల్ ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను కీపర్ హోప్ వదిలేయడం కూడా భారత్‌కు కలిసొచ్చింది. ఆ తర్వాత వీరిద్దరు చక్కటి సమన్వయంతో పరుగులు సాధించారు. నాలుగో వికెట్‌కు 91 పరుగులు జోడించిన అనంతరం రనౌట్‌తో ఈ భాగస్వామ్యం విడిపోయింది. ఆ తర్వాత 70 బంతుల్లో సూర్యకుమార్ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. సూర్య వెనుదిరిగిన తర్వాత చివర్లో దీపక్ హుడా (29), సుందర్ (24) కొన్ని కీలక పరుగులు జత చేశారు. చివరి పది ఓవర్లలో భారత్ 54 పరుగులే చేయగలిగింది. టపటపా... ఛేదనను విండీస్ సానుకూలంగానే ప్రారంభించినా... ప్రసిధ్ ఆ జట్టు పతనానికి శ్రీకారం చుట్టాడు. తన వరుస ఓవర్లలో అతను బ్రండన్ కింగ్ (18), డారెన్ బ్రేవో (1)లను అవుట్ చేశాడు. ఆ తర్వాత షై హోప్ (27)ను చహల్ పెవిలియన్ పంపించగా... పది పరుగుల వ్యవధిలో పూరన్ (9), హోల్డర్ (2) వెనుదిరగడంతో విండీస్ పరిస్థితి మరింత దిగజారింది. అప్పటి వరకు చక్కగా బ్యాటింగ్ చేసిన బ్రూక్స్‌ను దీపక్ హుడా తన తొలి అంతర్జాతీయ వికెట్‌గా అవుట్ చేయడంతో విండీస్ వేగంగా ఓటమి వైపు దూసుకుపోయింది. చివర్లో హొసీన్ (52 బంతుల్లో 34; 3 ఫోర్లు), స్మిత్ (24) కొంత పోరాడినా అది విజయానికి సరిపోలేదు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) హోప్ (బి) రోచ్ 5; పంత్ (సి) హోల్డర్ (బి) స్మిత్ 18; కోహ్లి (సి) హోప్ (బి) స్మిత్ 18; రాహుల్ (రనౌట్) 49; సూర్య కుమార్ (సి) జోసెఫ్ (బి) అలెన్ 64; సుందర్ (సి) జోసెఫ్ (బి) హొసీన్ 24; హుడా (సి) హొసీన్ (బి) హోల్డర్ 29; శార్దుల్ (సి) బ్రూక్స్ (బి) జోసెఫ్ 8; సిరాజ్ (సి) హోప్ (బి) జోసెఫ్ 3; చహల్ (నాటౌ ట్) 11; ప్రసిధ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 237. వికెట్ల పతనం: 1–9, 2–39, 3–43, 4–134, 5–177, 6–192, 7–212, 8–224, 9–226. బౌలింగ్: రోచ్ 8–0–42–1, జోసెఫ్ 10–0–36–2, ఒడెన్ స్మిత్ 7–0–29–2, హోల్డర్ 9–2–37–1, హొసీన్ 6–0–39–1, అలెన్ 10–0–50–1. వెస్టిండీస్ ఇన్నింగ్స్: హోప్ (సి) సూర్యకుమార్ (బి) చహల్ 27; కింగ్ (సి) పంత్ (బి) ప్రసిధ్ 18; బ్రేవో (సి) పంత్ (బి) ప్రసిధ్ 1; బ్రూక్స్ (సి) సూర్యకుమార్ (బి) హుడా 44; పూరన్ (సి) రోహిత్ (బి) ప్రసిధ్ 9; హోల్డర్ (సి) హుడా (బి) శార్దుల్ 2; హొసీన్ (సి) పంత్ (బి) శార్దుల్ 34; అలెన్ (సి) పంత్ (బి) సిరాజ్ 13; ఒడెన్ స్మిత్ (సి) కోహ్లి (బి) సుందర్ 24; జోసెఫ్ (నాటౌట్) 7; రోచ్ (ఎల్బీ) (బి) ప్రసిధ్ 0; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (46 ఓవర్లలో ఆలౌట్) 193. వికెట్ల పతనం: 1–32, 2– 38, 3–52, 4–66, 5–76, 6–117, 7–159, 8– 159, 9–193, 10–193. బౌలింగ్: సిరాజ్ 9–1– 38–1, శార్దుల్ 9–1–41–2, ప్రసిధ్ కృష్ణ 9–3– 12–4, చహల్ 10–0–45–1, సుందర్ 5–0–28–1, హుడా 4–0–24–1. -
IND VS WI: రెండో వన్డేకు ప్రత్యేక అతిథులు.. సీనియర్లను ఉత్సాహపరిచిన జగజ్జేతలు
Under 19 World Cup Winners Spotted At Narendra Modi Stadium: భారత్-విండీస్ జట్ల మధ్య అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేకు ప్రత్యేక అతిధులు వచ్చారు. అండర్-19 ప్రపంచకప్ విజేతలైన యువ భారత జట్టు సభ్యులు బుధవారం నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రత్యక్షమయ్యారు. సీనియర్ల ఆటను వీక్షించేందుకు బీసీసీఐ వీరిని ప్రత్యేకంగా ఆహ్వానించింది. జగజ్జేతలతో పాటు జట్టు కోచ్ హృషికేశ్ కనిత్కర్, ఎన్సీఏ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్, బీసీసీఐ కార్యదర్శి జై షాలు స్టేడియంలో కాసేపు మ్యాచ్‌ను ఎంజాయ్ చేశారు. We all are in Ahemdabad 😊 |U-19 players 🇮🇳 #BoysInBlue #ICCUnder19WorldCup #IndianCricketTeam #INDvWI pic.twitter.com/COR14eCBaM — Harnoor Singh 🇮🇳 (@HarnoorSingh40) February 9, 2022 టీమిండియా బ్యాటింగ్ సమయంలో బౌండరీలు వచ్చినప్పుడు వీరు జాతీయ పతాకాన్ని ఊపుతూ ఉత్సాహంగా కనిపించారు. అనంతరం బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు. ఈ కార్యక్రమంలో ప్రపంచకప్ విజేతలైన యంగ్ ఇండియా సభ్యులకు బీసీసీఐ సన్మానం చేసింది. కాగా, ఆంటిగ్వా వేదికగా జరిగిన అండర్-19 ప్రపంచకప్ 2022 ఫైనల్లో యశ్ ధుల్ నేతృత్వంలోని యంగ్ ఇండియా.. 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను మట్టికరిపించి ఐదో సారి జగజ్జేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, విండీస్‌తో రెండో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(64), కేఎల్ రాహుల్(49) రాణించగా.. మిగతా భారత ఆటగాళ్లు నిరాశపరిచారు. విండీస్ బౌలర్లలో అల్జరీ జోసఫ్, ఓడియన్ స్మిత్ చెరో 2 వికెట్లు, కీమర్ రోచ్, జేసన్ హోల్డర్, అకీల్ హొసేన్, ఫేబియన్ అలెన్‌లు తలో వికెట్ పడగొట్టారు. అనంతరం ఛేదనలో విండీస్ తడబడుతుంది. 38 ఓవర్లు ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 156 పరుగలు చేసింది. విండీస్ గెలుపుకు 72 బంతుల్లో 82 పరుగులు చేయాల్సి ఉంది. చదవండి: 9.25 కోట్లు వెచ్చించారు.. కానీ, ఒక్క మ్యాచ్ కూడా ఆడించలేదు..! -
IND VS WI 2nd ODI: సూర్యకుమార్ యాదవ్ ప్రపంచ రికార్డు.. వన్డే క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు
విండీస్‌తో జరిగిన రెండో వన్డేలో 83 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 64 పరుగులు చేసిన టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ సూర్యకుమార్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. వన్డే క్రికెట్ చరిత్రలో తొలి ఆరు మ్యాచ్‌ల్లో 30కి పైగా పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా వరల్డ్ రికార్డును క్రియేట్ చేశాడు. గతంలో నెదర్లాండ్స్ ఆటగాళ్లు ర్యాన్ టెన్ డస్కటే, టామ్ కూపర్, పాకిస్థాన్ ఆటగాడు ఫఖర్ జమాన్‌లు తొలి ఐదు వన్డే ఇన్నింగ్స్‌ల్లో 30కి అదనంగా పరుగులు చేశారు. తాజాగా సూర్యకుమార్ వీరిని అధిగమించి ప్రపంచ క్రికెట్లో ఎవరికీ సాధ్యం కాని అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డే కెరీర్లో ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడిన సూర్యకుమార్.. 65.25 సగటున 261 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే, విండీస్‌తో రెండో వన్డేలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లు ఆడి 9 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(64), కేఎల్ రాహుల్(49) రాణించగా.. మిగతా భారత ఆటగాళ్లు నిరాశపరిచారు. విండీస్ బౌలర్లలో అల్జరీ జోసఫ్, ఓడియన్ స్మిత్ చెరో 2 వికెట్లు, కీమర్ రోచ్, జేసన్ హోల్డర్, అకీల్ హొసేన్, ఫేబియన్ అలెన్‌లు తలో వికెట్ పడగొట్టారు. చదవండి: సూర్య తప్పు లేదు.. ఎందుకు ఆగావో తెలీదు -
విండీస్‌తో రెండో వన్డే.. విరాట్ కోహ్లి ఖాతాలో మరో సెంచరీ..!
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి పరుగులు సాధించినా, సాధించకపోయినా రికార్డులు మాత్రం అతని ఖాతాలో వాటంతట అవే వచ్చి చేరుతుంటాయి. విండీస్‌తో రేపు జరగబోయే రెండో వన్డేలో కోహ్లి ఖాతాలో ఇలాంటి ఓ అరుదైన రికార్డే వచ్చి చేరబోతోంది. కోహ్లి అన్ని ఫార్మాట్లలో కలిపి సెంచరీ సాధించి రెండేళ్లకుపైగానే అవుతుంది. అయితే రేపటి మ్యాచ్‌లో అతని సెంచరీ దాహం తీరనుంది. అదెట్టా అనుకుంటున్నారా..? ఇది చదవండి. విండీస్‌తో అహ్మదాబాద్ వేదికగా రేపు జరగబోయే రెండో వన్డే, విరాట్ కోహ్లికి స్వదేశంలో 100వ వన్డే మ్యాచ్ కానుంది. వన్డే కెరీర్లో ఇప్పటివరకు 258 మ్యాచ్‌లు ఆడిన రన్ మెషీన్.. స్వదేశంలో 99 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. క్రికెట్ చరిత్రలో ఇలా స్వదేశాల్లో 100 వన్డేలు ఆడిన ఆటగాళ్లు కోహ్లి కంటే ముందు 35 మంది మాత్రమే ఉన్నారు. ఈ జాబితాలో టీమిండియా నుంచి సచిన్ టెండూల్కర్(164), ఎంఎస్ ధోని(127), అజహారుద్దీన్(113), యువరాజ్ సింగ్(108)లు ఉన్నారు. రేపటి మ్యాచ్‌లో కోహ్లి వీరి సరసన చేరనున్నాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లి సెంచరీ కొట్టినా, కొట్టకపోయినా.. పరోక్షంగా అతని ఖాతాలో మరో సెంచరీ చేరడం ఖాయం. ఇదిలా ఉంటే, కోహ్లి స్వదేశంలో ఆడిన 99 మ్యాచ్‌ల్లో 60 సగటుతో 5002 పరుగులు చేశాడు. ఇందులో 19 సెంచరీలు, 25 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కాగా, విండీస్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. భారత బౌలర్లు చహల్(4/49), వాషింగ్టన్ సుందర్(3/30), ప్రసిద్ద్ కృష్ణ(2/29), సిరాజ్(1/26) చెలరేగడంతో విండీస్ 176 పరుగుల స్వల్ప స్కోర్‌కే కుప్పకూలింది. జేసన్ హోల్డర్(71 బంతుల్లో 57; 4 సిక్సర్లు) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. అనంతరం ఛేదనలో రోహిత్ శర్మ(60), ఇషాన్ కిషన్(28) తొలి వికెట్‌కు 84 పరుగులు జోడించి టీమిండియా గెలుపుకు పునాది వేయగా, ఆఖర్లో సూర్యకుమార్ యాదవ్(36 బంతుల్లో 34; 5 ఫోర్లు), దీపక్ హూడా(32 బంతుల్లో 26; 2 ఫోర్లు)తో కలిసి మ్యాచ్‌ను లాంఛనంగా ముగించాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లి కేవలం 8 పరుగులకే పరిమితమైనప్పటికీ.. సచిన్ పేరిట ఉన్న ఓ రికార్డును బద్దలు కొట్టాడు. స్వదేశంలో 5 వేలకు పైగా వన్డే పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. చదవండి: క్రికెటర్ల సంఖ్యను ప్రకటించిన బీసీసీఐ.. జట్టులో కనీసం..! -
కోవిడ్ నుంచి కోలుకున్న టీమిండియా ఆటగాళ్లు.. రెండో వన్డేకు అతడు దూరమేనా..!
విండీస్‌తో తొలి వన్డేకు ముందు కరోనా బారిన పడిన నలుగురు టీమిండియా ఆటగాళ్లలో ముగ్గురు కోలుకున్నారు. నిన్న జరిపిన ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో శిఖర్ ధవన్, శ్రేయస్ అయ్యర్, రిజర్వ్ ఆటగాడు నవ్‌దీప్ సైనీలకు నెగిటివ్ వచ్చిందని, రిజర్వ్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌లో మాత్రం ఇంకా స్వల్ప కరోనా లక్షణాలు ఉన్నాయని బీసీసీఐ ఇవాళ ప్రకటించింది. కోవిడ్ నుంచి కోలుకున్న ముగ్గురు తొలి వన్డేకు దూరమైన కేఎల్ రాహుల్‌తో కలిసి ఇవాళ జరిగిన ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నారు. అయితే, వీరిలో రాహుల్‌ను మినహాయించి మిగతా ముగ్గురు రెండో వన్డే ఆడటం అనుమానమేనని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. కరోనా నెగెటివ్ వచ్చినప్పటికీ వీరు వైద్య బృందం పర్యవేక్షణలో ఉండనుండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. రాహుల్ గైర్హాజరీలో తొలి వన్డేలో రోహిత్‌తో కలిసి ఓపెనింగ్ చేసిన యువ ఆటగాడు ఇషాన్ కిషన్ రెండో వన్డేకు బెంచ్‌కే పరిమితం కానున్నాడు. టీమిండియాలో ఈ ఒక్క మార్పు మినహా తొలి వన్డే బరిలో దిగే జట్టే యధాతథంగా కొనసాగే అవకాశం ఉంది. తొలి వన్డేలో మిడిలార్డర్ బ్యాటర్లు సూర్యకుమార్ యాదవ్, దీపక్ హూడాలు పర్వాలేదనిపించడంతో ఇషాన్ కిషన్‌తో పాటు షారూక్ ఖాన్, మయాంక్ అగర్వాల్‌లు మరో అవకాశం కోసం వేచి చూడక తప్పదు. ఇదిలా ఉంటే, ఆదివారం జరిగిన తొలి వన్డేలో వెస్టిండీస్‌పై టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారత బౌలర్లు చహల్(4/49), వాషింగ్టన్ సుందర్(3/30), ప్రసిద్ద్ కృష్ణ(2/29), సిరాజ్(1/26) చెలరేగడంతో విండీస్ 176 పరుగుల స్వల్ప స్కోర్‌కే కుప్పకూలింది. జేసన్ హోల్డర్(71 బంతుల్లో 57; 4 సిక్సర్లు) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. అనంతరం ఛేదనలో రోహిత్ శర్మ(60), ఇషాన్ కిషన్(28) తొలి వికెట్‌కు 84 పరుగులు జోడించి టీమిండియా గెలుపుకు పునాది వేయగా, ఆఖర్లో సూర్యకుమార్ యాదవ్(36 బంతుల్లో 34; 5 ఫోర్లు), దీపక్ హూడా(32 బంతుల్లో 26; 2 ఫోర్లు) మ్యాచ్‌ను లాంఛనంగా ముగించారు. కోహ్లి(8), పంత్(11) మరోసారి నిరుత్సాహపరిచారు. చదవండి: కోహ్లిని మరోసారి అవమానించిన బీసీసీఐ.. 100వ టెస్ట్ యధాతథంగా..! -
IND VS WI: రెండో వన్డేకు కేఎల్ రాహుల్ సహా కీలక ఆటగాళ్లు రెడీ..
వ్యక్తిగత కారణాల చేత వెస్టిండీస్‌తో తొలి వన్డేకు దూరమైన టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్.. రెండో వన్డేకు రెడీ అయ్యాడు. అతనితో పాటు మరో ఇద్దరు కీలక ఆటగాళ్లు మయాంక్ అగర్వాల్, నవ్‌దీప్ సైనీలు సోమవారం అహ్మదాబాద్‌లోని టీమిండియా క్యాంపులో చేరారు. బుధవారం జరగనున్న రెండో వన్డే కోసం ఈ ముగ్గురు ప్రత్యేకంగా నెట్స్‌లో చెమటోడ్చారు. ‘ఎవరొచ్చారో చూడండి.. ఈ ముగ్గురు జట్టుతో చేరారు. సోమవారం ప్రాక్టీస్ సెషన్లో చెమటోడ్చారు’ అని బీసీసీఐ ఈ ముగ్గురి ఫొటోలను ట్విట్టర్లో షేర్ చేసింది. బీసీసీఐ ప్రత్యేకంగా ఈ ముగ్గురి ఫోటోలను షేర్ చేయడం బట్టి చూస్తే, రెండో వన్డేలో వీరు తుది జట్టులో ఉండటం ఖాయంగా తెలుస్తోంది. Look who are here! 🙌 The trio has joined the squad and sweated it out in the practice session today. 💪#TeamIndia | #INDvWI | @Paytm pic.twitter.com/Nb9Gmkx98f — BCCI (@BCCI) February 7, 2022 కాగా, విండీస్‌తో తొలి వన్డేకు ముందు శిఖర్ ధవన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, బ్యాకప్ ప్లేయర్ సైనీలతో పాటు నలుగురు సహాయక సిబ్బంది కోవిడ్ బారిన పడ్డారు. వీరిలో సైనీ ఐసోలేషన్ పూర్తి చేసుకుని జట్టుతో చేరగా.. ధవన్ స్థానంలో జట్టులోకి వచ్చిన మయాంక్ అగర్వాల్ మూడు రోజుల క్వారంటైన్ ముగించుకుని గ్రౌండ్లో అడుగుపెట్టాడు. ఇదిలా ఉంటే, ఆదివారం వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీమిండియా తమ 1000వ వన్డేలో టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుని ప్రత్యర్ధిని 176 పరుగులకే ఆలౌట్ చేసింది. స్పిన్నర్లు యుజ్వేంద్ర చహల్(4/49), వాషింగ్టన్ సుందర్(3/30), పేసర్లు ప్రసిద్ద్ కృష్ణ(2/29), మహ్మద్ సిరాజ్(1/26) చెలరేగడంతో విండీస్ స్వల్ప స్కోర్‌కే కుప్పకూలింది. జేసన్ హోల్డర్(71 బంతుల్లో 57; 4 సిక్సర్లు) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. అనంతరం ఛేదనలో రోహిత్ శర్మ(60), ఇషాన్ కిషన్(28) తొలి వికెట్‌కు 84 పరుగులు జోడించి టీమిండియా గెలుపుకు పునాది వేయగా, ఆఖర్లో సూర్యకుమార్ యాదవ్(36 బంతుల్లో 34; 5 ఫోర్లు), దీపక్ హూడా(32 బంతుల్లో 26; 2 ఫోర్లు) మ్యాచ్‌ను లాంఛనంగా ముగించారు. కోహ్లి(8), పంత్(11) మరోసారి నిరుత్సాహపరిచారు. చదవండి: స్వదేశంలో యశ్ ధుల్ సేనకు ఘన స్వాగతం.. ఉబ్బి తబ్బిబ్బయిన యువ క్రికెటర్లు -
చివరి వన్డేలో గెలిచి భారత్ పరువు నిలుపుకునేనా?
కేప్‌టౌన్: అలసిన శరీరాలు, పరుగులో తగ్గిన చురుకుదనం, మైదానంలో ఏమాత్రం కనిపించని ఉత్సాహం... శుక్రవారం దక్షిణాఫ్రికాతో రెండో వన్డేలో ఓటమి దిశగా వెళుతున్న సమయంలో భారత ఆటగాళ్ల పరిస్థితి ఇది! దక్షిణాఫ్రికా గడ్డపై అడుగు పెట్టినప్పుడు, ఆ తర్వాత తొలి టెస్టులో ఘన విజయం సాధించినప్పుడు చూస్తే టీమిండియా సభ్యుల్లో ఆకాశాన్ని తాకిన ఆత్మవిశ్వాసం, అమితోత్సాహం కనిపించాయి. ఇక పర్యటన చివరకు వచ్చే సరికి అంతా మారిపోయింది. ఎప్పుడు సిరీస్ ముగించి స్వదేశం వెళదామా అన్నట్లుగా కనిపిస్తోంది. బయో బబుల్ ఒక కారణం కాగా...ఫేవరెట్‌గా బరిలోకి దిగి అనూహ్యంగా ఎదురైన పరాజయాలు భారత ఆటగాళ్లను నిస్సత్తువగా మార్చేశాయి. ఈ నేపథ్యంలో నేడు దక్షిణాఫ్రికాతో మూడో వన్డేకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే 0–2తో సిరీస్ కోల్పోయిన భారత్ చివరిదైన ఈ మూడో మ్యాచ్‌లోనైనా తమ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి ఒక విజయాన్ని నమోదు చేస్తుందా లేక ఓటమితో టూర్‌ను ముగిస్తుందా అనేది చూడాలి. రెండు వన్డేల్లోనూ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ ఏమాత్రం ఆకట్టుకోకపోగా...హెడ్ కోచ్‌గా ప్రధాన ఆటగాళ్లతో తొలి పర్యటనలోనే రాహుల్ ద్రవిడ్‌కు కూడా సంతృప్తికర ఫలితం దక్కలేదు. చివరి మ్యాచ్‌లో భారత్ పలు మార్పులతో బరిలోకి దిగవచ్చు. ప్రధాన పేసర్ బుమ్రాకు విశ్రాంతినిచ్చి అతని స్థానంలో సిరాజ్‌ను ఆడించే అవకాశం ఉండగా... రెండు మ్యాచ్‌లలోనూ ఘోరంగా విఫలమైన భువనేశ్వర్ కుమార్ స్థానంలో దీపక్ చహర్‌ను, వెంకటేశ్ అయ్యర్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌ను తీసుకునే చాన్స్ ఉంది. -
టీమిండియాపై గెలుపు.. సంబరాల్లో ఉన్న దక్షిణాఫ్రికాకు అక్షింతలు
South Africa Fined For Slow Over Rate In 2nd ODI Vs India: టీమిండియాపై 2-0 తేడా వన్డే సిరీస్ గెలుపొందిన దక్షిణాఫ్రికాకు.. గెలుపు సంబరాల నుంచి తెరుకునే లోపే గట్టి షాక్ తగిలింది. రెండో వన్డేలో స్లో ఓవర్ రేట్ కారణంగా ఆ జట్టు మ్యాచ్ ఫీజ్‌లో 20 శాతం కోత విధిస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది. ఈ మేరకు మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ శనివారం ప్రకటన విడుదల చేశాడు. నిర్ణీత సమయంలోగా ఓ ఓవర్ తక్కువగా బౌల్ చేసినందుకు బవుమా సేనకు ఫైన్ విధిస్తున్నట్లు పైక్రాఫ్ట్ పేర్కొన్నాడు. కాగా, టీమిండియాతో శుక్రవారం జరిగిన రెండో వన్డేలో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ కైవసం చేసుకుంది. అంతకుముందు ఇదే వేదికగా జరిగిన తొలి వన్డేలోనూ దక్షిణాఫ్రికానే విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ప్రొటీస్ సేన 31 పరుగుల తేడాతో గెలుపొందింది. కాగా, ఇరు జట్ల మధ్య జరిగిన 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను కూడా ఆతిధ్య జట్టే 2-1తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. చదవండి: పటిష్టంగా కనిపించినా..రెండు సిరీస్‌లూ పాయే..! -
పటిష్టంగా కనిపించినా..రెండు సిరీస్‌లూ పాయే..!
దక్షిణాఫ్రికా గడ్డపై అడుగు పెట్టే ముందు రెండు ఫార్మాట్లలోనూ విజేతగా నిలిచేలా పటిష్టంగా కనిపించిన భారత జట్టు చివరకు పేలవ ప్రదర్శనతో రెండు సిరీస్‌లూ కోల్పోయింది. టెస్టు సిరీస్‌ను 1–2తో చేజార్చుకున్న టీమిండియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే వన్డే సిరీస్‌నూ అప్పగించింది. తొలి పోరుకు దాదాపు రీప్లేలా కనిపించిన రెండో వన్డేలోనూ భారత బృందం సునాయాసంగా తలవంచింది. పంత్ మినహా పసలేని బ్యాటింగ్‌తో ముందుగా సాధారణ స్కోరుకే పరిమితం కాగా... ఆపై బౌలింగ్ పూర్తిగా నిరాశపరచింది. పేలవ ఆటతో ఒకదశలో వికెట్ తీయడమే గగనంగా మారిపోయింది. డి కాక్, మలాన్ జోరైన ఆటతో దక్షిణాఫ్రికా జట్టును గెలిపించారు. పార్ల్: భారత్‌తో జరిగిన రెండో వన్డేలో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా మూడు వన్డేల సిరీస్‌ను 2–0తో గెలుచుకుంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. రిషభ్ పంత్ (71 బంతుల్లో 85; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు), రాహుల్ (79 బంతుల్లో 55; 4 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం దక్షిణాఫ్రికా 48.1 ఓవర్లలో 3 వికెట్లకు 288 పరుగులు చేసి గెలిచింది. జేన్‌మన్ మలాన్ (108 బంతుల్లో 91; 8 ఫోర్లు, 1 సిక్స్), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డి కాక్ (66 బంతుల్లో 78; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) తొలి వికెట్‌కు 132 పరుగులు జోడించారు. చివరి మ్యాచ్ ఆదివారం కేప్‌టౌన్‌లో జరుగుతుంది. శతక భాగస్వామ్యం... తొలి వన్డేతో పోలిస్తే ఈసారి భారత్‌కు ఓపెనర్లు మెరుగైన ఆరంభాన్ని అందించారు. రాహుల్, శిఖర్ ధావన్ (38 బంతుల్లో 29; 5 ఫోర్లు) కొన్ని చక్కటి షాట్లతో పరుగులు రాబట్టడంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 57 పరుగులకు చేరింది. 8 పరుగుల వద్ద మలాన్ క్యాచ్ వదిలేయడంతో రాహుల్ బతికిపోయాడు. అయితే ధావన్‌ను అవుట్ చేసి మార్క్రమ్ 63 పరుగుల భాగస్వామ్యాన్ని విడదీయగా... కేశవ్ మహరాజ్ వేసిన తర్వాతి ఓవర్లోనే కవర్స్‌లో సునాయాస క్యాచ్ ఇచ్చి విరాట్ కోహ్లి (0) డకౌటయ్యాడు. ఈ దశలో రాహుల్, పంత్ సెంచరీ పార్ట్నర్షిప్ జట్టును నడిపించింది. పంత్ దూకుడు పెంచి షమ్సీ వేసిన ఓవర్లో మూడు ఫోర్లు కొట్టడంతో 43 బంతుల్లో అతని అర్ధసెంచరీ పూర్తయింది. 46 పరుగుల వద్ద మార్క్రమ్ క్యాచ్ వదిలేయడంతో మళ్లీ ‘లైఫ్’ లభించిన రాహుల్ ఆ తర్వాత 71 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 31 ఓవర్లు ముగిసేసరికి 179/2తో భారత్ పటిష్టమైన స్థితిలో నిలిచింది. అయితే మూడో వికెట్‌కు 115 పరుగులు జోడించిన రాహుల్, పంత్‌లను వరుస ఓవర్లలో అవుట్ చేసిన సఫారీ బౌలర్లు... శ్రేయస్ అయ్యర్ (11)ను కూడా వెనక్కి పంపి మళ్లీ పట్టు బిగించారు. వెంకటేశ్ అయ్యర్ (22) కీలక పరుగులు జోడించగా... చివర్లో శార్దుల్ ఠాకూర్ (38 బంతుల్లో 40 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్), అశ్విన్ (24 బంతుల్లో 25 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) ధాటిగా ఆడి ఏడో వికెట్‌గా అభేద్యంగా 37 బంతుల్లోనే 48 పరుగులు జత చేయడంతో భారత్ చెప్పుకోదగ్గ స్కోరు సాధించగలిగింది. ఓపెనర్ల జోరు... ఛేదనలో ఓపెనర్లు అందించిన భారీ భాగస్వామ్యమే దక్షిణాఫ్రికా విజయానికి బాటలు వేసింది. మలాన్, డి కాక్ పోటీ పడి పరుగులు సాధించడంతో స్కోరు వేగంగా దూసుకుపోయింది. భువనేశ్వర్ తొలి ఓవర్లో 2 ఫోర్లు, 1 సిక్స్ కొట్టిన డి కాక్ ఇతర భారత బౌలర్లను కూడా సమర్థంగా ఎదుర్కొన్నాడు. పది ఓవర్లు ముగిసేసరికి సఫారీ టీమ్ 66 పరుగులు చేయగా, ఆ తర్వాత 36 బంతుల్లోనే డి కాక్ అర్ధ సెంచరీ పూర్తయింది. భారీ భాగస్వామ్యం తర్వాత ఎట్టకేలకు డి కాక్‌ను అవుట్ చేసి శార్దుల్ ఈ జోడీని విడదీశాడు. అనంతరం బవుమా (36 బంతుల్లో 35; 3 ఫోర్లు) కూడా మలాన్‌కు చక్కటి సహకారం అందించడంతో రెండో వికెట్‌కు 80 పరుగుల పార్ట్నర్షిప్ నమోదైంది. వీరిద్దరు రెండు పరుగుల వ్యవధిలో పెవిలియన్ చేరినా... మార్క్రమ్ (37 నాటౌట్; 4 ఫోర్లు), డసెన్ (37 నాటౌట్; 2 ఫోర్లు) ఇబ్బంది లేకుండా ఆడి దక్షిణాఫ్రికాకు విజయాన్ని అందించారు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రాహుల్ (సి) డసెన్ (బి) మగాలా 55; ధావన్ (సి) మగాలా (బి) మార్క్రమ్ 29; కోహ్లి (సి) బవుమా (బి) మహరాజ్ 0; పంత్ (సి) మార్క్రమ్ (బి) షమ్సీ 85; శ్రేయస్ (ఎల్బీ) (బి) షమ్సీ 11; వెంకటేశ్ (స్టంప్డ్) డి కాక్ (బి) ఫెలుక్వాయో 22; శార్దుల్ (నాటౌట్) 40; అశ్విన్ (నాటౌట్) 25; ఎక్స్‌ట్రాలు 20; మొత్తం (50 ఓవర్లలో 6 వికెట్లకు) 287. వికెట్ల పతనం: 1–63, 2–64, 3–179, 4–183, 5–207, 6–239. బౌలింగ్: ఎన్గిడి 8–0–35–0, మగాలా 8–0–64–1, మార్క్రమ్ 8–0–34–1, కేశవ్ మహరాజ్ 9–0–52–1, ఫెలుక్వాయో 8–0–44–1, షమ్సీ 9–0–57–2. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: మలాన్ (బి) బుమ్రా 91; డి కాక్ (ఎల్బీ) (బి) శార్దుల్ 78; బవుమా (సి అండ్ బి) చహల్ 35; మార్క్రమ్ (నాటౌట్) 37; డసెన్ (నాటౌట్) 37; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (48.1 ఓవర్లలో 3 వికెట్లకు) 288. వికెట్ల పతనం: 1–132, 2–212, 3–214. బౌలింగ్: బుమ్రా 10–0–37–1, భువనేశ్వర్ 8–0–67–0, అశ్విన్ 10–1–68–0, చహల్ 10–0–47–1, శార్దుల్ 5–0–35–1, వెంకటేశ్ 5–0–28–0, శ్రేయస్ 0.1–0–1–0. -
వసీం జాఫర్ మేనల్లుడి అద్భుత శతకం.. రెండో వన్డేలో ముంబై ఘన విజయం
మస్కట్: టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ మేనల్లుడు అర్మాన్ జాఫర్ (114 బంతుల్లో 122; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) సూపర్ సెంచరీతో చెలరేగడంతో ఒమన్‌తో జరిగిన రెండో వన్డేలో ముంబై జట్టు 231 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. అర్మాన్తో పాటు సుజిత్ నాయక్ (70 బంతుల్లో 73; 6 ఫోర్లు) రాణించాడు. ఒమన్ బౌలర్లలో మహ్మద్ నదీమ్ 4, నెసట్ర్ దంబా 2, కలీముల్లా, ఆకిబ్ ఇలియాస్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన ఒమన్ ముంబై బౌలర్లు మోహిత్ అవస్థి (4/31), ధుర్మిల్ మట్కర్ (3/21), దీపక్ షెట్టి (2/9), అమాన్ ఖాన్(1/8) ధాటికి 22.5 ఓవర్లలో 69 పరుగులకే ఆలౌటైంది. ఒమన్ ఇన్నింగ్స్‌లో మహ్మద్ నదీమ్(35) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ విజయంతో 4 వన్డేల సిరీస్‌లో ముంబై 2-0 ఆధిక్యంలో నిలిచింది. అంతకుముందు జరిగిన తొలి వన్డేలో కూడా ముంబై జట్టే విజయం సాధించింది. మూడో వన్డే సెప్టెంబర్ 2న జరుగనుంది. చదవండి:క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన స్టార్ బౌలర్.. -
టాస్ వేశాక మ్యాచ్ వాయిదా పడింది.. కారణం ఏంటంటే..?
సెయింట్ లూసియా: వెస్టిండీస్, ఆస్ట్రేలియా మధ్య గురువారం జరగాల్సిన రెండో వన్డే మ్యాచ్ వాయిదా పడింది. అయితే ఈ మ్యాచ్ టాస్ వేశాక వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించడం గమనార్హం. ఇలా జరగడానికి కారణం ఏమై ఉంటుందని అనుకుంటున్నారా? వివరాల్లోకి వెళితే.. ఆసీస్, విండీస్ జట్ల మధ్య రెండో మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఇరు జట్ల కెప్టెన్లు టాస్కు కూడా వెళ్లారు. టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ అలెక్స్ క్యారీ బ్యాటింగ్ ఎంచుకున్నట్లు ప్రకటించాడు. అనంతరం విశ్లేషకుడు డారెన్ గంగా పిచ్ రిపోర్టు కూడా చెప్పాడు. ఆసీస్ ఓపెనర్లు బరిలోకి దిగేందుకు రెడీగా ఉన్నారు. ఇంతలో ఏమైందో ఏమో తెలీదు, మ్యాచ్ వాయిదా వేస్తున్నట్లు రిఫరీ ప్రకటించాడు. ఆటగాళ్లంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఏం జరిగిందా అని ఆరా తీయగా వెస్టిండీస్ జట్టు సిబ్బంది ఒకరికి కరోనా సోకడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. దీంతో రెండు జట్లలోని ఆటగాళ్లకు మరోసారి కరోనా టెస్ట్‌లు నిర్వహించారు. ఈ మ్యాచ్ మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తామన్నది తర్వాత ప్రకటిస్తామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం బయో బబుల్‌లో ఉన్న ఇరు జట్లను ఐసోలేషన్‌లో ఉంచనున్నట్లు తెలిపారు. ఆటగాళ్లకు సంబంధించిన తాజా కోవిడ్ రిపోర్టులు వెల్లడి కావాల్సి ఉండటంతో రేపటి మూడో వన్డే సైతం వాయిదా పడినట్టేనని అధికారులు తెలిపారు. -
India Vs Srilanka: ప్రయోగాలు చేస్తారా!
కొలంబో: బౌలర్ దీపక్ చహర్ అసమాన బ్యాటింగ్‌తో రెండో వన్డేలో గెలిచిన భారత్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను 2–0తో సొంతం చేసుకుంది. రెండు రోజుల విరామం అనంతరం శ్రీలంకతో సిరీస్‌లో చివరిదైన మూడో వన్డేకు శిఖర్ ధావన్ బృందం సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లోనూ నెగ్గి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని భారత్ యోచిస్తోంది. మరోవైపు ఆఖరి పోరులోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని లంక పట్టుదలగా ఉంది. మార్పులు ఉంటాయా! ఇప్పటికే సిరీస్‌ను భారత్ కైవసం చేసుకోవడంతో చివరి వన్డేలో రిజర్వ్ బెంచ్‌ను పరీక్షించేందుకు కోచ్ రాహుల్ ద్రవిడ్ మొగ్గు చూపే అవకాశం ఉంది. అలా జరిగితే టీమిండియాలో పలు మార్పులు చోటు చేసుకోవచ్చు. పృథ్వీ షా స్థానంలో మరో యువ ఓపెనర్ దేవదత్ పడిక్కల్‌ను ఆడించే అవకాశం కనిపిస్తోంది. వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ స్థానంలో సంజూ సామ్సన్ కూడా తుది జట్టులో ఆడే అవకాశం ఉంది. సిరీస్‌లో విశేషంగా రాణిస్తో న్న స్పిన్ ద్వయం కుల్దీప్, చహల్‌లకు విశ్రాంతి ఇచ్చి రాహుల్ చహర్, కృష్ణప్ప గౌతమ్‌లను ఆడించొచ్చు. అంతేకాకుండా భారత్ తన లోపాలపై దృష్టి పెట్టాల్సి ఉంది. రెండో వన్డేలో టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలం కాగా... సూర్య కుమార్, మనీశ్ పాండేలు జట్టును ఆదుకున్నారు. చివర్లో దీపక్ చహర్, భువనేశ్వర్ ఆడకుండా ఉంటే భారత్‌కు ఓటమి తప్పేదికాదు. వీటితో పాటు డెత్ ఓవర్లలో భారత బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకుం టున్నారు. ఈ సమస్యలను అధిగమిస్తే మూడో వన్డేలో భారత్‌కు విజయం పెద్ద కష్టమేమీ కాదు. మరోవైపు రెండో వన్డేలో అంచనాలకు మించి ఆడిన లంకేయులు ఒక దశలో మ్యాచ్‌ను గెలిచేలా కనిపించారు. దీపక్, భువనేశ్వర్‌ల భాగస్వామ్యం ఆ జట్టుకు గెలుపును దూరం చేసింది. ఈ సిరీస్ ద్వారా శ్రీలంక జట్టులో నాణ్యమైన ఆటగాళ్లకు కొదవలేదని తేలింది. వీరు అనుభవం గడిస్తే శ్రీలంక జట్టు మళ్లీ పూర్వ వైభవాన్ని అందుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా అవిష్క ఫెర్నాండో, మినోద్ భానుక, అసలంక, కెప్టెన్ దసున్ షనక, కరుణరత్నే, హసరంగ ఈ సిరీస్‌లో విశేషంగా రాణిస్తున్నారు. వీరందరూ చివరి వన్డేలోనూ ఆడితే భారత్‌కు శ్రీలంక గట్టిపోటీ ఇచ్చే అవకాశం ఉంది. శ్రీలంక జట్టుకు జరిమానా రెండో వన్డేలో స్లో ఓవర్‌రేట్ కారణంగా శ్రీలంక జట్టుకు జరిమానా విధించారు. నిర్ణీత సమయంలోపు ఒక ఓవర్ తక్కువగా వేయడంతో మ్యాచ్ రిఫరీ రంజన్ మదుగలే శ్రీలంక ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించారు. అంతేకాకుండా ఈ సిరీస్ ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచకప్ సూపర్ లీగ్‌లో భాగం కావడంతో శ్రీలంక జట్టుకు ఒక పాయింట్ కోత విధించారు. ఆర్టికల్ 16.12.2 ప్రకారం నిర్ణీత సమయంలోపు ఎన్ని ఓవర్లు తక్కువగా వేస్తే ఓవర్‌కు పాయింట్ చొప్పున కోత విధిస్తారు. -
ఆ నిర్ణయం ద్రవిడ్‌దే.. అందువల్లే గెలవగలిగాం: భువీ
కొలంబో: ఉత్కంఠ పోరులో ఏడో స్థానంలో బరిలోకి దిగి అసాధారణ బ్యాటింగ్‌తో టీమిండియాకు అద్భుత విజయాన్ని అందించిన దీపక్ చాహర్(82 బంతుల్లో 69 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్)పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తున్న వేళ, టీమిండియా వైస్ కెప్టెన్ భువనేశ్వర్ కుమార్ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. వికెట్లు వడివడిగా పడుతున్న సమయంలో చాహర్‌ను బ్యాటింగ్ ఆర్డర్లో ముందు పంపాలన్న నిర్ణయం కోచ్ రాహుల్ ద్రవిడ్దేని, అందువల్లే తాము మ్యాచ్ గెలవగలిగామని తెలిపాడు. మరపురాని ఇన్నింగ్స్‌తో చాహర్ ఏడో స్థానానికి న్యాయం చేశాడని ప్రశంసించాడు. మ్యాచ్ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చివరి బంతి వరకు ఆడాలని తాము ముందుగానే నిర్ధేశించుకున్నామని పేర్కొన్నాడు. ద్రవిడ్ కోచింగ్‌లో భారత్-ఏ తరఫున చాహర్ భారీగా పరుగులు చేశాడని, అతడు భారీ షాట్లు ఆడగలడని ద్రవిడ్‌కు ముందే తెలుసని, అందుకే చాహర్‌ను బ్యాటింగ్ ఆర్డర్లో ముందుగా పంపాడని వెల్లడించాడు. ద్రవిడ్ పెట్టుకున్న నమ్మకాన్ని చాహర్ కూడా వమ్ము చేయలేదని అన్నాడు. తాను కూడా రంజీల్లో చాహర్ బ్యాటింగ్‌ను చూశానని, అందేవల్లే అతనితో సమన్వయం చేసుకోగలిగానని తెలిపాడు. కాగా, చాహర్ తన 5 వన్డేల కెరీర్లో ఎప్పుడు కూడా ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగలేదు. ఇదిలా ఉంటే, చాహర్ సూపర్ ఇన్నింగ్స్‌కు తోడు సూర్యకుమార్ యాదవ్ (44 బంతుల్లో 53; 6 ఫోర్లు) బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీ, భువీ(28 బంతుల్లో 19 నాటౌట్; 2 ఫోర్లు)తో కీలక 84 పరుగుల భాగస్వామ్యం తోడవ్వడంతో టీమిండియా మూడు వికెట్లతో శ్రీలంకపై గెలుపొందింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను 2–0తో సొంతం చేసుకుంది. బ్యాటింగ్‌లో రెచ్చిపోయిన చాహర్ (2/53), భువీ(3/54) బౌలింగ్‌లోనూ రాణించారు. ఇరు జట్ల మధ్య నామకార్ధమైన మూడో వన్డే ఇదే వేదికగా శుక్రవారం(జులై 23) జరగనుంది. -
వన్డే క్రికెట్లో చరిత్ర సృష్టించిన టీమిండియా
కొలొంబొ: అసాధారణ పోరాటపటిమతో శ్రీలంకపై రెండో వన్డే గెలిచిన టీమిండియా.. పలు రికార్డులను తన పేరిట లిఖించుకుంది. ఈ విజయంతో 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకున్న టీమిండియా.. వన్డే క్రికెట్ చరిత్రలో ఏ జట్టుకు సాధ్యపడని ఓ అరుదైన ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. వన్డే క్రికెట్ చరిత్రలో ఓ ప్రత్యర్ధి(శ్రీలంక)పై అత్యధిక విజయాలు సాధించిన ఏకైక జట్టుగా రికార్డు నెలకొల్పింది. నిన్నటి మ్యాచ్‌లో విజయం ద్వారా టీమిండియా.. లంకపై 93వ విజయాన్ని నమోదు చేసింది. గతంలో వన్డేల్లో ఏ జట్టు కూడా ఓ ప్రత్యర్ధి ఇన్ని విజయాలు నమోదు చేయలేదు. నిన్నటి మ్యాచ్‌కు ముందు వరకు ఈ రికార్డు భారత్(శ్రీలంకపై 92 విజయాలు), ఆస్ట్రేలియా(న్యూజిలాండ్‌పై 92 విజయాలు), పాకిస్తాన్(శ్రీలంకపై 92 విజయాలు) జట్ల పేరిట సంయుక్తంగా ఉండింది. అయితే మంగళవారం జరిగిన మ్యాచ్‌తో టీమిండియా చరిత్ర తిరగరాసింది. అలాగే నిన్నటి ఉత్కంఠ పోరులో విజయం ద్వారా టీమిండియా మరిన్ని రికార్డులు తన ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్‌లో విజయం శ్రీలంకపై భారత్‌కు వరుసగా పదో విజయం కాగా, వరుసగా తొమ్మిదో సిరీస్ విజయంగా కూడా నిలిచింది. ఇక వ్యక్తిగత రికార్డుల విషయానికి వస్తే.. టీమిండియా తాజా సంచలనం దీపక్ చాహర్.. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి రెండో అత్యధిక పరుగులు(69 నాటౌట్) సాధించిన క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. అతని కంటే ముందు 2019 ప్రపంచకప్ సెమీఫైనల్లో రవీంద్ర జడేజా ఇదే స్థానంలో వచ్చి 77 పరుగులు చేశాడు. ఇక భువనేశ్వర్‌తో కలిసి దీపక్ చాహర్ నెలకొల్పిన 84 పరుగుల భాగస్వామ్యం.. 8వ వికెట్‌కు ఇండియా తరఫున రెండో అత్యధిక పార్ట్నర్షిప్గా రికార్డుల్లోకెక్కింది. 2017లో ధోనీతో కలిసి భువీ.. శ్రీలంకపైనే 8వ వికెట్‌కు 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. -
శ్రీలంకతో నేడు రెండో వన్డే.. సిరీస్‌పై భారత్ గురి
కొలంబో: పెద్దగా అనుభవంలేని ప్లేయర్లతో కూడిన శ్రీలంక జట్టుపై అన్ని విభాగాల్లో ఆధిపత్యం ప్రదర్శించిన భారత్ తొలి వన్డేలో ఘనవిజయం సాధించింది. రోజు విరామం తర్వాత శిఖర్ ధావన్ నాయకత్వంలోని భారత్ మరో పోరుకు సిద్ధమైంది. నేడు శ్రీలంక జట్టుతో జరిగే రెండో వన్డేలో గెలిచి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను దక్కించుకోవాలని భారత్ పట్టుదలగా ఉంది. మరోవైపు శ్రీలంక పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా ఉంది. గెలవడం మాట అటుంచి కనీసం ప్రత్యర్థికి గట్టిపోటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ జట్టు ఉంది. ఇదే మంచి అవకాశం రెగ్యులర్ జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉండటంతో శ్రీలంకతో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌లలో యువ ఆటగాళ్లను పరీక్షించేందుకు భారత్‌కు చక్కటి అవకాశం దక్కింది. జట్టుతో ఉన్నా ఎక్కువగా రిజర్వ్ బెంచ్‌కే పరిమితమయ్యే మనీశ్ పాండేతో పాటు గత మ్యాచ్‌తో వన్డేల్లో అరంగేట్రం చేసిన సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్‌లకు ఈ పర్యటనతో తమను తాము నిరూపించుకునేందుకు చక్కటి అవకాశం లభించింది. అందుకు తగ్గట్లే ఇషాన్ కిషన్ తొలి వన్డేలో చక్కటి బ్యాటింగ్ ప్రదర్శన చేశాడు. తొలి మ్యాచ్‌లో అతని బ్యాటింగ్‌ను చూస్తే మొదటి వన్డే ఆడుతున్నట్లే అనిపించలేదు. ఇక చివర్లో బ్యాటింగ్‌కు వచ్చిన సూర్యకుమార్ యాదవ్ కూడా దూకుడైన ఇన్నింగ్స్‌తో అలరించాడు. ఓపెనర్లుగా పృథ్వీ షా, ధావన్ తొలి వన్డేలో అదరగొట్టారు. ముఖ్యంగా పృథ్వీ షా స్వేచ్ఛగా బ్యాట్‌ను ఝుళిపిస్తూ అన్ని వైపులా షాట్లు ఆడాడు. అయితే మనీశ్ పాండే మాత్రం క్రీజులో కాస్త ఇబ్బంది పడ్డాడు. అతడు కూడా రాణిస్తే భారత్‌కు ఇక తిరుగుండదు. ఇక బౌలింగ్‌లో కూడా భారత్ పటిష్టంగా కనిపిస్తోంది. గత మ్యాచ్‌లో కృనాల్ పాండ్యా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతనికి కేవలం ఒక్క వికెటే దక్కినా... ప్రత్యర్థి ఆటగాళ్లు అతని బౌలింగ్‌లో పరుగులు సాధించడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్, దీపక్ చహర్ తమ వంతు పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే అనుభవజ్ఞుడు భువనేశ్వర్ మాత్రం తన స్థాయికి తగ్గట్లు బౌలింగ్ చేయలేకపోయాడు. అయితే రెండో వన్డేలో అతను బౌలింగ్ లయను అందుకుంటాడనే విశ్వాసంతో టీమ్ మేనేజ్మెంట్ ఉంది. దాంతో ఈ మ్యాచ్‌లో ఎటువంటి మార్పులు లేకుండానే భారత్ బరిలోకి దిగే అవకాశం ఉంది. భయం వీడితేనే... టాప్ టీమ్‌తో ఆడుతున్నామనే భయాన్ని వీడితేనే శ్రీలంక జట్టు మెరుగైన ప్రదర్శనను కనబర్చగలదు. ఎందుకంటే సీనియర్ల గైర్హాజరీలో ఆ టీమ్ అంతా కొత్త ముఖాలతోనే ఆడుతోంది. తొలి వన్డేలో శ్రీలంక బ్యాటింగ్‌లో ఫర్వాలేదనిపించింది. చివర్లో వచ్చిన చమిక కరుణరత్నే పోరాటంతో ఆ జట్టు గౌరవప్రదమైన స్కోరును సాధించగలిగింది. అంతేకాకుండా ఓపెనర్లుగా వచ్చి అవిష్క ఫెర్నాండో, మినోద్ భానుక చక్కగా బ్యాటింగ్ చేశారు. వీరితో పాటు కెప్టెన్ దసున్ షనక, చరిత్ అసలంక కూడా ఆడినంత సేపు ఆత్మవిశ్వాసంతో కనిపించారు. వీరందరికీ మంచి ఆరంభం లభించినా వాటిని భారీ స్కోర్లుగా మార్చలేకపోయారు. వీరు ఆ సమస్యను అధిగమిస్తే భారత్‌కు శ్రీలంక గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. బౌలింగ్‌లో మాత్రం ఆ జట్టు తేలిపోయింది. ధనంజయ డిసిల్వా రెండు వికెట్లు తీసినా ధారాళంగా పరుగులు ఇచ్చాడు. దుష్మంత చమీర మాత్రమే బౌలింగ్‌లో ఫర్వాలేదనిపించాడు. ఈ మ్యాచ్‌లో శ్రీలంక ఒక మార్పుతో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇసురు ఉదాన స్థానంలో లహిరు కుమార తుది జట్టులోకి వచ్చే చాన్స్ ఉంది. పిచ్, వాతావరణం తొలి వన్డే జరిగిన ప్రేమదాస స్టేడియంలోనే రెండో వన్డే కూడా జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్ కోసం వేరే పిచ్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. పిచ్‌పై టర్న్ ఉన్నా బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉంది. మ్యాచ్‌కు వర్ష సూచన లేదు. జట్ల వివరాలు (అంచనా) భారత్: ధావన్ (కెప్టెన్), పృథ్వీ షా, ఇషాన్ కిషన్, మనీశ్ పాండే, సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్, దీపక్ చహర్, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్. శ్రీలంక: దసున్ షనక (కెప్టెన్), అవిష్క ఫెర్నాండో, మినోద్ భానుక, భానుక రాజపక్స, ధనంజయ, చరిత్ అసలంక, హసరంగ, కరుణరత్నే, చమీర, సందకన్, లహిరు కుమార. -
మరొకటి గెలిస్తే... మూడోది మనదే!
ఆడిన రెండు ఫార్మాట్లను విజయంతో ముగించింది. మూడో ఫార్మాట్లో మొదటిది గెలిచి ముందంజలో నిలిచింది. ఇప్పుడు రెండో వన్డేతో ఈ మూడో సిరీస్‌ను గెలవాలనే లక్ష్యంతో భారత్ బరిలోకి దిగుతోంది. మరోవైపు ఆతిథ్య జట్టుకు ఈ టైటిల్‌నూ అప్పగించొద్దనే పట్టుదలతో ఇంగ్లండ్ జట్టు చావోరేవోకు సిద్ధమైంది. తప్పక గెలవాల్సిన ఒత్తిడిలో, సిరీస్‌లో నిలవాలనే కసితో పర్యాటక జట్టు ఉంది. పుణే: జోరు మీదున్న భారత్ ఇప్పుడు రెండో వన్డేతోనే సిరీస్‌పై కన్నేసింది. పర్యాటక జట్టును రిక్తహస్తాలతోనే ఇంటిదారి పట్టించాలనే లక్ష్యంతో ఉంది. మరోవైపు అన్నింటా దెబ్బతిన్న ఇంగ్లండ్ ఆఖరి సిరీస్‌తోనైనా స్వదేశానికి పయనం కావాలనుకుంటోంది. రెండో మ్యాచ్‌లో గెలిచి తుదిపోరుదాకా నిలవాలనే పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో రెండో వన్డే రసవత్తరంగా జరిగే అవకాశముంది. కోహ్లిసేన ఆత్మవిశ్వాసంతో కనిపిస్తుంటే ..పర్యాటక జట్టు ఒత్తిడిలో ఉంది. కెప్టెన్ మోర్గాన్ గాయం కారణంగా మిగిలిన రెండు మ్యాచ్‌లకు దూరం కావడం ఆ జట్టుకు మరో దెబ్బ. ఆల్‌రౌండ్ సత్తాతో... టీమిండియా ఆల్‌రౌండ్ సత్తాతో దూసుకెళుతోంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో అద్భుతంగా రాణించే కుర్రాళ్లు అందుబాటులో ఉన్నారు. ముఖ్యంగా ఫామ్‌లేమితో తంటాలు పడుతున్న ‘గబ్బర్’ ధావన్ టచ్‌లోకి రావడం జట్టుకు కలిసొచ్చే అంశం. మరో ఓపెనర్ రోహిత్ శర్మ కూడా శిఖర్‌తో హిట్టయితే ప్రత్యర్థి బౌలర్లకు కష్టాలు తప్పవు. గత మ్యాచ్‌లో మోచేతి గాయానికి గురైన ‘హిట్‌మ్యాన్’ పూర్తి ఫిట్నెస్తో ఉన్నాడు. టాపార్డర్‌లో కోహ్లి, మిడిలార్డర్లో రాహుల్, పాండ్యా బ్రదర్స్ (హార్దిక్, కృనాల్)తో బ్యాటింగ్ ఆర్డర్ అత్యంత పటిష్టంగా క నిపిస్తోంది. గాయపడిన శ్రేయస్ అయ్యర్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ అరంగేట్రం చేసే అవకాశాలున్నాయి. లేదంటే రిషభ్ పంత్‌పై నమ్మకముంచితే సూర్య అరంగేట్రం ఆలస్యం కావొచ్చు. బౌలింగ్‌లో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ ఒక్క వికెటైనా తీయకపోగా... 9 ఓవర్లలోనే ధారాళంగా 68 పరుగులివ్వడంతో కోహ్లి అతన్ని తప్పించి చహల్‌ను తుది జట్టులో ఆడించే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. గెలిపించేదెవరు? తొలి టెస్టు మినహా ప్రతి మ్యాచ్‌లో, ప్రతీ సిరీస్‌లో ఇంగ్లండ్‌కు సవాళ్లు, ఓటమిలే ఎదురవుతున్నాయి. పొట్టి సిరీస్‌లో మొదట హోరాహోరీగా తలపడిన ఇంగ్లండ్ తర్వాత భారత్‌తో ఢీకొనలేకపోయింది. ఇప్పుడు తొలి వన్డేలోనూ లక్ష్య ఛేదనలో టీమిండియాకు దీటుగా సాగిన ఇంగ్లండ్ అనంతరం చేతులెత్తేసింది. ఈ కష్టాలు చాలవన్నట్లు ఇప్పుడు వన్డే ప్రపంచకప్ విజయసారథి మోర్గాన్ గాయంతో దూరమవడం జట్టును ఇబ్బందిపెట్టే అంశం. నెట్ ప్రాక్టీస్ కూడా చేయని కెప్టెన్ తదుపరి రెండు వన్డేలకు దూరమని జట్టు మేనేజ్మెంట్ ప్రకటించింది. ఓపెనర్లు రాయ్, బెయిర్ స్టోలు సూపర్ ఫామ్‌లో ఉన్నారు. వీరిద్దరి మెరుపులకు స్టోక్స్, బట్లర్ చెలరేగితే తప్పకుండా ఈ వన్డే ఫలితం మారొచ్చు. సిరీస్‌లో సజీవంగా నిలవొచ్చు. జట్లు (అంచనా): భారత్: కోహ్లి (కెప్టెన్), రోహిత్, ధావన్, పంత్/సూర్యకుమార్, రాహుల్, హార్దిక్, కృనాల్, భువనేశ్వర్, శార్దుల్, చహల్, ప్రసిధ్. ఇంగ్లండ్: బట్లర్ (కెప్టెన్), రాయ్, బెయిర్ స్టో, మలాన్, స్టోక్స్, లివింగ్‌స్టోన్, మొయిన్, స్యామ్ కరన్, టామ్ కరన్, రషీద్, వుడ్/టోప్లీ. పిచ్, వాతావరణం పిచ్ బ్యాటింగ్‌కు స్వర్గ ధామం. టాస్ గెలిచిన జట్టు లక్ష్య ఛేదనకే మొగ్గుచూపేలా పిచ్ ఉంది. వర్షం ముప్పు లేదు. -
విండీస్‌దే వన్డే సిరీస్
నార్త్‌సౌండ్: శ్రీలంకతో రెండో వన్డేలో వెస్టిండీస్ ఐదు వికెట్లతో నెగ్గి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను 2–0తో సొంతం చేసుకుంది. 274 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ జట్టు 49.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఎవిన్ లూయిస్ (103; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీ చేశాడు. షై హోప్ (84; 6 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 192 పరుగులు జోడించారు. వీరిద్దరు అవుటయ్యాక విండీస్ బ్యాట్స్‌మెన్ వెంటవెంటనే పెవిలియన్‌కు చేరడంతో ఉత్కంఠ పెరిగింది. చివరి ఓవర్లో విండీస్ విజయానికి 9 పరుగులు అవసరమయ్యాయి. పూరన్ (35 నాటౌట్; 4 ఫోర్లు) మరో రెండు బంతులు మిగిలి ఉండగానే విండీస్ జట్టుకు విజయాన్ని అందించాడు. అంతకుముందు శ్రీలంక 50 ఓవర్లలో 8 వికెట్లకు 273 పరుగులు చేసింది. గుణతిలక (96; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు), చండీమల్ (71; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. -
కోహ్లి నాయకత్వంలో లోపాలు
ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో జస్ప్రీత్ బుమ్రా స్థాయి బౌలర్‌తో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి కేవలం రెండు ఓవర్ల స్పెల్ వేయించడం ఆశ్చర్యపరిచింది. సాధారణంగా వన్డేల్లో ప్రధాన బౌలర్లకు 4–3–3 వ్యూహాన్ని అనుసరిస్తారు. టి20ల్లో అయితే రెండు ఓవర్లు కొంత అర్థం చేసుకోవచ్చేమో గానీ వన్డేల్లోకి వచ్చేసరికి బౌలర్ లయ అందుకోవడానికి తగిన సమయం కచ్చితంగా పడుతుంది. ఇది కోహ్లికి తెలియనిది కాదు. వన్డేల్లో 40 ఓవర్లపాటు కనీసం ఐదుగురు ఫీల్డర్లు సర్కిల్ లోపలే ఉంటారు. అలాంటి స్థితిలో ఐదుగురు బౌలర్లతోనే బరిలోకి దిగి ప్రత్యర్థిని కట్టడి చేయడం అంత సులువు కాదు. ఇక్కడా టీమిండియా వ్యూహాలు ఏమాత్రం పని చేయలేదు. ఫలితంగా ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ను చేజార్చుకోవాల్సి వచ్చింది. ముఖ్యంగా విదేశీ గడ్డపైనే రెండు సిరీస్ పరాజయాలు ఎదురయ్యాయి. ఎప్పుడో ధోని కెప్టెన్ కాక ముందు 2006 సంవత్సరంలో మాత్రమే భారత్ వన్డేల్లో గెలిచిన మ్యాచ్‌ల (3)కంటే ఓడిన మ్యాచ్‌ల (9) సంఖ్య ఎక్కువగా ఉండగా, 2020లో అది పునరావృతమైంది. సాక్షి క్రీడా విభాగం ‘భారత బ్యాట్స్‌మెన్ బౌలింగ్ చేయలేరు...భారత బౌలర్లు బ్యాటింగ్ చేయలేరు’... ఆస్ట్రేలియా చేతిలో సిరీస్ పరాజయంలో భారత కూర్పు గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఈ వ్యాఖ్య సరిపోతుంది. ఆల్‌రౌండ్ నైపుణ్యం గల ఆటగాళ్లు లేకనే భారత్ ఈ ఏడాది విదేశాల్లో రెండో వన్డే సిరీస్ ఓడిపోయింది. ఆరంభంలో న్యూజిలాండ్ చేతిలో 0–3తో చిత్తయిన టీమ్, ఇప్పుడు ఆసీస్ చేతిలో పరాజయం పాలైంది. తాజా సిరీస్‌ను కోల్పోవడానికి కొన్ని కారణాలను విశ్లేషిస్తే... వన్డేల మధ్య విరామం ఈ ఏడాది మార్చిలో దక్షిణాఫ్రికాతో జరగాల్సిన వన్డే సిరీస్ అనూహ్యంగా రద్దయిన తర్వాత భారత్ మళ్లీ ఇప్పుడే వన్డేల్లోకి బరిలోకి దిగింది. మధ్యలో ఆస్ట్రేలియా మాత్రం ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ ఆడిం ది. అయితే ఈతరంలో వన్డేల్లో వేగానికి, టి20లకు పెద్దగా తేడా లేని పరిస్థితుల్లో ఐపీఎల్ ఆడిన తర్వాత వన్డేలు ఆడటం సమస్య కాకపోవచ్చు. అయితే సుదీర్ఘ కాలం బయో బబుల్‌లో ఉన్న అలసట వల్ల కుదురుకునేందుకు కొంత ఇబ్బంది పడిన మాట వాస్తవమే. ఆల్‌రౌండర్ల సమస్య బలవంతంగా రెండో వన్డేలో హార్దిక్‌తో బౌలింగ్ చేయించినా... ప్రస్తుతానికి అతను పూర్తి స్థాయి బ్యాట్స్‌మన్‌గానే ఆడుతున్నాడు. బ్యాట్స్‌మన్ అయి ఉండి కొంత బౌలింగ్ చేయగలిగే విజయ్ శంకర్, దూబే, కృనాల్, జాదవ్‌లాంటి వారితో ఎన్ని ప్రయత్నాలు చేసినా భారత్ వన్డేల్లో సఫలం కాలేకపోతోంది. ఒకదశలో సచిన్, యువరాజ్, సెహ్వాగ్, రైనా అవసరమైతే ఏ క్షణానైనా బౌలింగ్‌కు సిద్ధంగా ఉండేవారు. ఇప్పటి మన టాప్–5లో ఒక్కరూ కనీసం ఒక్క బంతి కూడా వేయడం లేదు. మరో కోణంలో చూస్తే ‘త్రో డౌన్ స్పెషలిస్ట్’ల కారణంగా నెట్స్‌లో మన బ్యాట్స్‌మెన్ ఎవరికీ బౌలింగ్ చేయాల్సిన అవసరం గానీ అవకాశం గానీ ఉండటం లేదు. బౌలర్ల వైఫల్యం ఈ ఏడాది ఆడిన 9 వన్డేల్లో కలిపి భారత్ తొలి 10 ఓవర్ల పవర్‌ప్లేలో కేవలం 4 వికెట్లే పడగొట్టగలిగింది! ముఖ్యంగా గాయంతో భువనేశ్వర్ కుమార్ దూరం కావడం కూడా జట్టును ప్రభావితం చేస్తోంది. సీనియర్లు షమీ, బుమ్రా కూడా తమదైన ముద్ర వేయలేకపోగా... అనుభవం లేని నవదీప్ సైనీ సహజంగానే విఫలమయ్యాడు. రెండు మ్యాచ్‌లలోనూ మన పేసర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఇక కుల్దీప్–చహల్ ద్వయా న్ని బలవంతంగా టీమ్ విడగొట్టాల్సి వచ్చిం ది. కుల్దీప్–చహల్ కలిసి 27 మ్యాచ్‌లు ఆడితే భారత్ 20 గెలవడం దీనికి మంచి ఉదాహరణ. బ్యాటింగ్ మరీ బలహీనంగా మారిపోతుండటంతో జడేజాను తీసుకు రావాల్సి వచ్చింది. రోహిత్ శర్మ లేకపోవడం... కీలక ఆస్ట్రేలియా సిరీస్‌లో స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ ఆడకపోవడం మాత్రం కచ్చితంగా జట్టుకు లోటే. ధావన్‌కు సరి జోడిగా ఉండే రోహిత్‌తో పోలిస్తే మయాంక్, శుబ్‌మన్ గిల్ల అనుభవం చాలా చాలా తక్కువ. తొలి రెండు వన్డేల్లో కూడా భారీ లక్ష్యాలను ఛేదించే సమయంలో రోహిత్ శర్మ ఉండి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదేమో. వన్డేల్లో అతని అద్వితీయ రికార్డు, ఆస్ట్రేలియాపై గత ప్రదర్శనను చూస్తే రోహిత్ విలువేమిటో అర్థమవుతుంది. విజయానికి దారి సిరీస్ ఓటమి అనంతరం మేలుకున్న భారత్ చివరి వన్డేలో మాత్రం తమ స్థాయికి తగ్గ ప్రదర్శనను ఇచ్చింది. ముఖ్యంగా రెండు వన్డేల్లో భారీగా పరుగులు సమర్పించుకున్న బుమ్రా తన అసలు సత్తాను కీలక సమయంలో చూపించాడు. ఆసీస్ విజయానికి చేరువైన దశలో అద్భుత బంతితో మ్యాక్స్‌వెల్ వికెట్ తీసి జట్టుకు గెలుపు బాట పరిచాడు. ఆరు, ఏడు స్థానాల్లో ఆడే ఆల్‌రౌండర్లు బ్యాటింగ్‌లో ఎంత బలంగా ఉండాలో పాండ్యా, జడేజా భాగస్వామ్యం చూపించింది. ముఖ్యంగా ఎంతో నమ్మకం పెట్టుకున్న జడేజా అర్ధ సెంచరీ విజయానికి పనికొచ్చింది. ఇక రెండు కీలక మార్పులు కూడా టీమ్‌ను విజయంవైపు నడిపించాయి. చహల్ స్థానంలో వచ్చిన కుల్దీప్, సైనీకి బదులుగా బరిలోకి దిగిన శార్దుల్ రాణించి ఆసీస్‌ను ఒత్తిడిలో పడేశారు. నిజానికి ఈ రెండు మార్పులు రెండో వన్డేలోనే చేయాల్సింది. అదే తరహాలో సిరీస్‌పై ప్రభావం చూపని మ్యాచ్ కాబట్టి నటరాజన్‌తో అరంగేట్రం చేయించడం కూడా మంచి వ్యూహం. గత కొన్ని మ్యాచ్‌లలో దూరమైన ‘పవర్‌ప్లే వికెట్’ను అందించి నటరాజన్ తన అవకాశానికి న్యాయం చేశాడు. ఐదుగురు భిన్నమైన శైలి బౌలర్లు చివరకు ఆసీస్‌ను ఓడించడంలో కీలక పాత్ర పోషించారు. అయితే నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్ వైఫల్యానికి మాత్రం ఇంకా సమాధానం లభించలేదు. -
టీమిండియా పోరాటం సరిపోలేదు
శుక్రవారం... భారత్‌పై ఆస్ట్రేలియా అత్యధిక స్కోరు... 62 బంతుల్లోనే స్మిత్ సెంచరీ... భారీ ఛేదనలో ఇద్దరు బ్యాట్స్‌మెన్ అర్ధ సెంచరీలతో పోరాడి ఓడిన టీమిండియా... ఆదివారం... ఆస్ట్రేలియా తమ భారీ స్కోరును మరింత మెరుగుపర్చుకుంది... స్మిత్ మళ్లీ 62 బంతుల్లోనే శతకం బాదాడు... మరోసారి ఇద్దరు బ్యాట్స్‌మెన్ హాఫ్ సెంచరీలు సాధించినా... గత మ్యాచ్‌కంటే పెద్ద స్కోరును ఛేదించే క్రమంలో భారత్ పోరాటం వరకే పరిమితమైంది. ఓటమి అంతరంలో 15 పరుగులు తగ్గినా... తుది ఫలితం మాత్రం మారలేదు. సరిగ్గా చెప్పాలంటే గత మ్యాచ్ చూస్తున్నట్లే అనిపించింది. బౌలర్ల ఘోర వైఫల్యం, భారత్ పరాజయం సహా మిగతా అంతా సేమ్ టు సేమ్! సిడ్నీ: కరోనా విరామం తర్వాత ఆడిన తొలి సిరీస్‌ను భారత్ చేజార్చుకుంది. ఆస్ట్రేలియాతో ఆదివారం ఇక్కడ జరిగిన రెండో వన్డేలో 51 పరుగులతో ఓడిన భారత్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను 0–2తో సమర్పించుకుంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 389 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ స్టీవ్ స్మిత్ (64 బంతుల్లో 104; 14 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ సాధించగా... వార్నర్ (77 బంతుల్లో 83; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), లబ్‌షేన్ (61 బంతుల్లో 70; 5 ఫోర్లు), మ్యాక్స్‌వెల్ (29 బంతుల్లో 63 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), ఫించ్ (69 బంతుల్లో 60; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 338 పరుగులకు పరిమితమైంది. విరాట్ కోహ్లి (87 బంతుల్లో 89; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), కేఎల్ రాహుల్ (66 బంతుల్లో 76; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) టాప్ స్కోరర్లుగా నిలిచారు. సిరీస్‌లో చివరి వన్డే బుధవారం కాన్బెర్రాలో జరుగుతుంది. ఒకరితో పోటీ పడి మరొకరు... ఓపెనర్లు వార్నర్, ఫించ్ మరోసారి జట్టుకు శుభారంభం అందించారు. బుమ్రా తన తొలి ఓవర్‌ను ‘మెయిడిన్’తో మొదలు పెట్టినా ఆ తర్వాత గతి తప్పగా... షమీ, సైనీ కూడా సరైన దిశలో బంతులు వేయకపోవడంతో ఆసీస్ బ్యాట్స్‌మెన్ జోరు ప్రదర్శించారు. తొలి 10 ఓవర్లలో జట్టు 59 పరుగులు చేసింది. చహల్ ఓవర్లో వరుసగా 6, 4 కొట్టిన వార్నర్ 39 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 16వ ఓవర్ చివరి బంతికి స్కోరు 100 పరుగులు దాటగా, చహల్ బౌలింగ్‌లో సిక్స్‌తో ఫించ్ 60 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ ను అందుకున్నాడు. ఎట్టకేలకు 23వ ఓవర్లో ఫించ్ ను అవుట్ చేసి షమీ ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. కొద్ది సేపటికే లేని రెండో పరుగు కోసం ప్రయత్నించిన వార్నర్‌ను అయ్యర్ డైరెక్ట్ హిట్‌తో రనౌట్ చేశాడు. అయితే స్మిత్, లబ్‌షేన్ కలిసి మళ్లీ భారత బౌలర్ల పని పట్టారు. ముఖ్యంగా గత మ్యాచ్ తరహాలోనే చెలరేగిపోయాడు. జడేజా ఓవర్లో ఫోర్, సిక్స్ కొట్టిన అతను, సైనీ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు బాది 38 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. ఆసీస్‌ను ఆపడానికి చివరకు ఓపెనర్ మయాంక్‌కు కూడా భారత్ బంతిని అప్పగించింది. అర్ధ సెంచరీ తర్వాత మరింత చెలరేగిపోయిన స్మిత్‌కు సెంచరీ చేరేందుకు మరో 24 బంతులే సరిపోయాయి. ముఖ్యంగా బుమ్రా ఓవర్లో అతను కొట్టిన 3 ఫోర్లు హైలైట్‌గా నిలిచాయి. చివరకు పాండ్యా బౌలింగ్‌లో స్మిత్ వెనుదిరిగాడు. అయితే ఆ తర్వాత కథ ముగిసిపోలేదు. 46 బంతుల్లో లబ్‌షేన్ హాఫ్ సెంచరీ పూర్తి కాగా... మ్యాక్స్‌వెల్ తనదైన శైలిలో దూకుడు ప్రదర్శించాడు. అతను సిక్సర్లతో సత్తా చాటుతూ 25 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేయగా... ఆసీస్ చివరి 10 ఓవర్లలో 114 పరుగులు సాధించడం విశేషం. కెప్టెన్ ఆడినా... సిరీస్‌ను కాపాడుకునే ప్రయత్నంలో భారత ప్రధాన బ్యాట్స్‌మెన్ అంతా తలా ఓ చేయి వేసినా జట్టును ఓటమి నుంచి రక్షించలేకపోయారు. ఓపెనర్లు శిఖర్ ధావన్ (23 బంతుల్లో 30; 5 ఫోర్లు), మయాంక్ అగర్వాల్ (26 బంతుల్లో 28; 4 ఫోర్లు) తొలి వికెట్‌కు 46 బంతుల్లోనే 58 పరుగులు జోడించడంతో సరైన ఆరంభం లభించింది. అయితే వీరిద్దరిని ఆసీస్ వరుస ఓవర్లలో పెవిలియన్ పంపించింది. శ్రేయస్ అయ్యర్ (36 బంతుల్లో 38; 5 ఫోర్లు) జతగా కెప్టెన్ కోహ్లి కొన్ని చూడచక్కటి షాట్లు ఆడాడు. 11 పరుగుల వద్ద అంపైర్ కోహ్లిని ఎల్బీగా ప్రకటించినా... రివ్యూలో బంతి బ్యాట్‌ను తాకిందని తేలింది. జంపా బౌలింగ్‌లో ఫైన్ లెగ్ దిశగా ఫోర్ కొట్టి కోహ్లి 53 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ వెంటనే అయ్యర్ అవుట్ కాగా... కెప్టెన్‌కు రాహుల్ జత కలిశాడు. కోహ్లితో పోటీ పడి దూకుడు ప్రదర్శించాడు. అయితే సెంచరీ దిశగా దూసుకుపోతున్న సమయంలో మిడ్వికెట్లో హెన్రిక్స్ అద్భుత క్యాచ్ పట్టడంతో కోహ్లి ఇన్నింగ్స్ ముగిసింది. 52 బంతు ల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రాహుల్‌ను జంపా వెనక్కి పంపాడు. 6.2 ఓవర్లలో 102 పరుగులు చేయాల్సిన ఈ దశలోనే భారత్ గెలుపుపై ఆశలు కోల్పోయింది. వార్నర్‌కు గాయం: భారత్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో ధావన్ కొట్టిన బంతిని మిడాఫ్‌లో ఆపే ప్రయత్నంలో ఆసీస్ బ్యాట్స్‌మన్ వార్నర్‌కు గజ్జల్లో గాయమైంది. వార్నర్ గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు మ్యాక్స్‌వెల్ వెల్లడించాడు. దీంతో వార్నర్ చివరి వన్డేతో పాటు టి20 సిరీస్‌కు కూడా దూరమయ్యే అవకాశం ఉంది. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: వార్నర్ (రనౌట్) 83; ఫించ్ (సి) కోహ్లి (బి) షమీ 60; స్మిత్ (సి) షమీ (బి) పాండ్యా 104; లబ్‌షేన్ (సి) మయాంక్ (బి) బుమ్రా 70; మ్యాక్స్‌వెల్ (నాటౌట్) 63; హెన్రిక్స్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (50 ఓవర్లలో 4 వికెట్లకు) 389. వికెట్ల పతనం: 1–142; 2–156; 3–292; 4–372. బౌలింగ్: షమీ 9–0–73–1; బుమ్రా 10–1–79–1; సైనీ 7–0–70–0; చహల్ 9–0–71–0; జడేజా 10–0–60–0; మయాంక్ 1–0–10–0; హార్దిక్ పాండ్యా 4–0–24–1. భారత్ ఇన్నింగ్స్: మయాంక్ (సి) క్యారీ (బి) కమిన్స్ 28; ధావన్ (సి) స్టార్క్ (బి) హాజల్‌వుడ్ 30; కోహ్లి (సి) హెన్రిక్స్ (బి) హాజల్‌వుడ్ 89; అయ్యర్ (సి) స్మిత్ (బి) హెన్రిక్స్ 38; కేఎల్ రాహుల్ (సి) హాజల్‌వుడ్ (బి) జంపా 76; పాండ్యా (సి) స్మిత్ (బి) కమిన్స్ 28; జడేజా (సి) మ్యాక్స్‌వెల్ (బి) కమిన్స్ 24; సైనీ (నాటౌట్) 10; షమీ (సి అండ్ బి) మ్యాక్స్‌వెల్ 1; బుమ్రా (ఎల్బీ) (బి) జంపా 0; చహల్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 338. వికెట్ల పతనం: 1–58; 2–60; 3–153; 4–225; 5–288; 6–321; 7–321; 8–326; 9–328. బౌలింగ్: స్టార్క్ 9–0–82–0; హాజల్‌వుడ్ 9–0–59–2; కమిన్స్ 10–0–67–3; జంపా 10–0–62–2; హెన్రిక్స్ 7–0–34–1; మ్యాక్స్‌వెల్ 5–0–34–1. ► ఆసీస్ తరఫున టాప్–5 బ్యాట్స్‌మెన్ కనీసం అర్ధ సెంచరీ సాధించడం ఇది రెండోసారి. 2013లో జైపూర్‌లో ఇలాగే చేసినా (359/5)... భారత్ ఆ మ్యాచ్‌ను 43.3 ఓవర్లలోనే నెగ్గింది. ► మూడు ఫార్మాట్లలో కలిపి అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లి 22 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన ఎనిమిదో క్రికెటర్‌గా, భారత్ నుంచి సచిన్, ద్రవిడ్ తర్వాత మూడో క్రికెటర్‌గా కోహ్లి గుర్తింపు పొందాడు. ► రెండో వన్డేలో బరిలోకి దిగడం ద్వారా కోహ్లి భారత్ తరఫున 250 వన్డేలు పూర్తి చేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన ఎనిమిదో భారత క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. -
ఆసీస్ చేజేతులా...
మాంచెస్టర్: ఇంగ్లండ్ గడ్డపై ఆస్ట్రేలియా చేజేతులా ఓటమిని కొని తెచ్చుకుంది. ఆదివారం జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ 24 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. 232 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 48.4 ఓవర్లలో 207 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ ఫించ్ (73; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించగా... లబ్‌షేన్ (48; 3 ఫోర్లు), క్యారీ (36; 2 ఫోర్లు) రాణించారు. 37 పరుగులకే 2 వికెట్లు కోల్పోయినా... ఫించ్, లబ్‌షేన్ మూడో వికెట్‌కు 107 పరుగులు సాధించడంతో జట్టు గెలుపు దిశగా సాగింది. అయితే లబ్‌షేన్‌ను వోక్స్ అవుట్ చేశాక జట్టు పతనం వేగంగా సాగిపోయింది. 21 బంతుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయిన కంగారూలు ఆ తర్వాత కోలుకోలేకపోయారు. 65 పరుగుల తేడాలో చివరి 8 వికెట్లు కోల్పోయి ఆ జట్టు ఓటమి పాలైంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఆర్చర్ (3/34), వోక్స్ (3/32), స్యామ్ కరన్ (3/35) ప్రత్యర్థిని పడగొట్టారు. అంతకు ముందు ఇంగ్లండ్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 231 పరుగులు చేసింది. మూడు మ్యాచ్‌లు సిరీస్‌లో రెండు జట్లు ప్రస్తుతం 1–1తో సమంగా ఉండగా మూడో వన్డే రేపు జరుగుతుంది. -
బెయిర్‌స్టో ధనాధన్ ఇన్నింగ్స్
సౌతాంప్టన్: ఆరంభంలో బెయిర్‌స్టో ధనాధన్ ఇన్నింగ్స్ (41 బంతుల్లో 82; 14 ఫోర్లు, 2 సిక్స్‌లు)... చివర్లో స్యామ్ బిల్లింగ్స్ (61 బంతుల్లో 46 నాటౌట్; 6 ఫోర్లు), డేవిడ్ విల్లీ (46 బంతుల్లో 47 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) బాధ్యతాయుత బ్యాటింగ్ ఇంగ్లండ్‌కు సిరీస్ విజయాన్ని కట్టబెట్టింది. ఐర్లాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శనివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన రెండో వన్డేలో ఇంగ్లండ్ నాలుగు వికెట్ల తేడాతో నెగ్గింది. సిరీస్‌ను 2–0తో కైవసం చేసుకుంది. తొలుత ఐర్లాండ్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 212 పరుగులు చేసింది. కర్టిస్ క్యాంఫర్ (68; 8 ఫోర్లు) మినహా మిగతా బ్యాట్స్‌మన్ పూర్తిగా విఫలమయ్యారు. అనంతరం ఇంగ్లండ్ 32.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 216 పరుగులు చేసి గెలుపొందింది. ఒక దశలో 131/3తో పటిష్టంగా ఉన్న ఇంగ్లండ్... 6 పరుగుల వ్యవధిలో మూడు కీలక వికెట్లను కోల్పోయింది. అయితే బిల్లింగ్స్, విల్లీ అజేయమైన ఏడో వికెట్‌కు 79 పరుగులు జోడించి జట్టుకు విజయాన్ని ఖాయం చేశారు. -
మ్యాచ్‌తో పాటు సిరీస్ కూడా...
అద్భుత రీతిలో న్యూజిలాండ్‌పై టి20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన భారత్ వన్డే సిరీస్‌లో తలవంచింది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓడి సిరీస్‌ను సమర్పించుకుంది. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని విధంగా బ్యాటింగ్ వైఫల్యం భారత్‌ను దెబ్బ తీసింది. కివీస్ జట్టు భిన్న ఆటగాళ్ల సమష్టి ప్రదర్శనతో ఆధిక్యం ప్రదర్శించి ఊపిరి పీల్చుకుంది. ఛేదనలో శ్రేయస్ అయ్యర్, జడేజా, సైనీ చేసిన పోరాటం టీమిండియా మ్యాచ్ గెలిచేందుకు సరిపోలేదు. జట్టులోని రిజర్వ్ ఆటగాళ్లంతా అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ అసిస్టెంట్ కోచ్ ల్యూక్ రోంచీ బరిలోకి దిగి ఫీల్డింగ్ చేయడం విశేషం. రోంచీ కివీస్ తరఫున 2017లో చివరి మ్యాచ్ ఆడాడు. అయితే ఒక కోచ్ జట్టు సభ్యుడిగా మైదానంలోని వ్యూహాల్లో భాగం కావడం విమర్శకు దారి తీసిన మరో కోణం. ఆక్లాండ్: సొంతగడ్డపై న్యూజిలాండ్‌కు ఊరట దక్కింది. భారత్‌తో శనివారం జరిగిన రెండో వన్డేలో 22 పరుగులతో గెలిచిన కివీస్ మూడు వన్డేల సిరీస్‌ను 2–0తో సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసింది. మార్టిన్ గప్టిల్ (79 బంతుల్లో 79; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), రాస్ టేలర్ (74 బంతుల్లో 73 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీలు సాధించారు. అనంతరం భారత్ 48.3 ఓవర్లలో 251 పరుగులకే ఆలౌటైంది. రవీంద్ర జడేజా (73 బంతుల్లో 55; 2 ఫోర్లు, 1 సిక్స్), శ్రేయస్ అయ్యర్ (57 బంతుల్లో 52; 7 ఫోర్లు, 1 సిక్స్), నవదీప్ సైనీ (49 బంతుల్లో 45; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. 6 అడుగుల 8 అంగుళాల పొడగరి, ఈ మ్యాచ్‌తోనే అరంగేట్రం చేసిన కివీస్ బౌలర్ కైల్ జేమీసన్ తన ఆల్‌రౌండ్ ప్రదర్శనకుగాను ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. చివరి వన్డే మంగళవారం మౌంట్ మాంగనీలో జరుగుతుంది. రాణించిన ఓపెనర్లు... న్యూజిలాండ్‌కు మరోసారి ఓపెనర్లు శుభారంభం అందించారు. ఈసారి పరుగుల వేటలో గప్టిల్ ముందుండగా, నికోల్స్ (59 బంతుల్లో 41; 5 ఫోర్లు) సహకరించాడు. బుమ్రా వేసిన ఎనిమిదో ఓవర్లో గప్టిల్ 2 ఫోర్లు, సిక్స్ బాదడం విశేషం. తొలి పవర్‌ప్లే ముగిసేసరికి కివీస్ 52 పరుగులు చేసింది. ఈ భాగస్వామ్యం శతకానికి చేరువవుతున్న దశలో నికోల్స్‌ను ఎల్బీగా అవుట్ చేసి చహల్ తొలి వికెట్ అందించాడు. నికోల్స్ రివ్యూ కోరినా లాభం లేకపోయింది. మరోవైపు 15 సెకన్ల సమయం ముగిసిన తర్వాత కూడా నికోల్స్‌ను అంపైర్ రివ్యూకు అనుమతించడంపై కోహ్లి నిరసన వ్యక్తం చేశాడు. అనంతరం 49 బంతుల్లో గప్టిల్ అర్ధ సెంచరీ పూర్తయింది. టపటపా... చక్కటి ఆరంభం తర్వాత కివీస్ బ్యాటింగ్ ఒక్కసారిగా తడబడింది. భారత బౌలర్ల ధాటికి ఆ జట్టు వరుస వికెట్లు కోల్పోయింది. బ్లన్‌డెల్ (22)ను శార్దుల్ అవుట్ చేయడంతో పతనం మొదలైంది. ఒక దశలో 55 పరుగుల వ్యవధిలో ఆ జట్టు 7 వికెట్లు చేజార్చుకుంది. ఆదుకున్న టేలర్... ఈ దశలో మరోసారి రాస్ టేలర్ కీలక ఇన్నింగ్స్ ఆడగా... కైల్ జేమీసన్ (24 బంతుల్లో 25 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్సర్లు) అతనికి అండగా నిలిచాడు. వీరిద్దరు తొమ్మిదో వికెట్‌కు 51 బంతుల్లోనే అభేద్యంగా 76 పరుగులు జోడించడంతో కివీస్ చెప్పుకోదగ్గ స్కోరు సాధించగలిగింది. అయ్యర్ మినహా... మయాంక్ అగర్వాల్ (3) ఆరంభంలోనే వెనుదిరగ్గా, పరుగులు మొత్తం బౌండరీల రూపంలోనే చేసిన పృథ్వీ షా (19 బంతుల్లో 24; 6 ఫోర్లు)ను బౌల్డ్ చేసి జేమీసన్ కెరీర్లో తొలి వికెట్ సాధించాడు. అయితే సౌతీ చక్కటి బంతికి కోహ్లి (15) కూడా బౌల్డ్ కావడంతో భారత శిబిరంలో ఆందోళన పెరిగింది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న లోకేశ్ రాహుల్ (4) అనూహ్యంగా విఫలం కాగా, కేదార్ జాదవ్ (27 బంతుల్లో 9) బంతులను వృథా చేశాడు. మరో ఎండ్‌లో అయ్యర్ మాత్రం కొన్ని చక్కటి షాట్లతో పోరాటం కొనసాగించాడు. 56 బంతుల్లో అతను అర్ధ సెంచరీ సాధించాడు. అయితే అయ్యర్‌తో పాటు శార్దుల్ (15 బంతుల్లో 18; 3 ఫోర్లు)ను కూడా తక్కువ వ్యవధిలో పెవిలియన్ పంపించి కివీస్ పట్టు బిగించింది. కీలక భాగస్వామ్యం... 153/7 స్కోరుతో భారత్ 32వ ఓవర్లోనే ఓటమికి సిద్ధమైనట్లు కనిపించింది. ఈ దశలో జడేజా, సైనీ కలిసి గెలిపించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా పేసర్ సైనీ బ్యాటింగ్ ఆకట్టుకుంది. గ్రాండ్‌హోమ్ ఓవర్లో మూడు ఫోర్లు కొట్టిన అనంతరం జేమీసన్ బౌలింగ్‌లో ఎక్స్ట్రా కవర్ మీదుగా అతను కొట్టిన సిక్సర్ హైలైట్‌గా నిలిచింది. 34 బంతుల్లో మరో 45 పరుగులు చేయాల్సిన స్థితిలో సైనీ బౌల్డ్ కావడం భారత్ విజయావకాశాలను దెబ్బ తీసింది. వీరిద్దరు ఎనిమిదో వికెట్‌కు 80 బంతుల్లో 76 పరుగులు జత చేశారు. స్కోరు వివరాలు న్యూజిలాండ్ ఇన్నింగ్స్: గప్టిల్ (రనౌట్) 79; నికోల్స్ (ఎల్బీ) (బి) చహల్ 41; బ్లన్‌డెల్ (సి) సైనీ (బి) శార్దుల్ 22; టేలర్ (నాటౌట్) 73; లాథమ్ (ఎల్బీ) (బి) జడేజా 7; నీషమ్ (రనౌట్) 3; గ్రాండ్‌హోమ్ (సి) అయ్యర్ (బి) శార్దుల్ 5; చాప్మన్ (సి అండ్ బి) చహల్ 1; సౌతీ (సి) సైనీ (బి) చహల్ 3; జేమీసన్ (నాటౌట్) 25; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 273. వికెట్ల పతనం: 1–93; 2–142; 3–157; 4–171; 5–175; 6–185; 7–187; 8–197. బౌలింగ్: శార్దుల్ 10–1–60–2; బుమ్రా 10–0–64–0; సైనీ 10–0–48–0; చహల్ 10–0–58–3; జడేజా 10–0–35–1. భారత్ ఇన్నింగ్స్: పృథ్వీ షా (బి) జేమీసన్ 24; మయాంక్ (సి) టేలర్ (బి) బెన్నెట్ 3; కోహ్లి (బి) సౌతీ 15; అయ్యర్ (సి) లాథమ్ (బి) బెన్నెట్ 52; రాహుల్ (బి) గ్రాండ్‌హోమ్ 4; జాదవ్ (సి) నికోల్స్ (బి) సౌతీ 9; జడేజా (సి) గ్రాండ్‌హోమ్ (బి) నీషమ్ 55; శార్దుల్ (బి) గ్రాండ్‌హోమ్ 18; సైనీ (బి) జేమీసన్ 45; చహల్ (రనౌట్) 10; బుమ్రా (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (48.3 ఓవర్లలో ఆలౌట్) 251. వికెట్ల పతనం: 1–21; 2–34; 3–57; 4–71; 5–96; 6–129; 7–153; 8–229; 9–251; 10–251. బౌలింగ్: బెన్నెట్ 9–0–58–2; సౌతీ 10–1–41–2; జేమీసన్ 10–1–42–2; గ్రాండ్‌హోమ్ 10–1–54–2; నీషమ్ 9.3–0–52–1. -
సిరీస్ కాపాడుకునేందుకు...
తొలి వన్డేలో 347 పరుగులు...ఇంత భారీ స్కోరు చేసిన తర్వాత కూడా భారత జట్టు మ్యాచ్‌ను కాపాడుకోలేకపోయింది. టీమిండియా బౌలింగ్, ఫీల్డింగ్ వైఫల్యాలు ఇక్కడ స్పష్టంగా కనిపించాయి. టి20 సిరీస్‌లో ఘన విజయం తర్వాత జట్టు ఉదాసీనత ప్రదర్శించినట్లు గత మ్యాచ్‌లో అనిపించింది. ఇప్పుడు ఆ పరాజయాన్ని మరచి కొత్త వ్యూహంతో బరిలోకి దిగాల్సిన సమయం వచ్చింది. సిరీస్ కాపాడుకునేందుకు కచ్చితంగా నెగ్గాల్సిన స్థితిలో భారత్ ఉండగా... విజయం ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో కివీస్ మరో పోరుకు ఉత్సాహంగా సిద్ధమైంది. కనీసం వన్డే సిరీస్‌నైనా సొంతం చేసుకొని పరువు కాపాడుకోవాలని ఆ జట్టు పట్టుదలగా ఉంది. ఆక్లాండ్: గత ఏడాది న్యూజిలాండ్ పర్యటనలో టి20 సిరీస్‌ను కోల్పోయిన భారత్ వన్డే సిరీస్‌ను గెలుచుకుంది. ఈ పర్యటనలో టి20 సిరీస్ మన ఖాతాలోకి వచ్చేసింది. అయితే మళ్లీ ‘లెక్క సమం’ కాకుండా ఉండాలంటే కోహ్లి బృందం తమ స్థాయికి తగ్గ ప్రదర్శనను కనబర్చాల్సి ఉంది. ఈ నేపథ్యంలో భారత్, న్యూజిలాండ్ జట్లు నేడు జరిగే రెండో వన్డేలో తలపడబోతున్నాయి. ఇరు జట్లు కనీసం ఒక మార్పుతో బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. జాదవ్ స్థానంలో పాండే! నాలుగో స్థానంలో పూర్తిగా స్థిరపడిపోయిన శ్రేయస్ అయ్యర్, కెరీర్లో అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న కేఎల్ రాహుల్, ఎప్పటిలాగే కోహ్లి నిలకడ వెరసి గత మ్యాచ్‌లో భారత్ భారీ స్కోరుకు కారణమయ్యాయి. బ్యాటింగ్‌పరంగా భారత్ ఆందోళన చెందాల్సిన అవసరమేమీ లేదు. తొలిసారి ఓపెనింగ్ చేశారు కాబట్టి రోహిత్–ధావన్ స్థాయిలో ఆరంభాన్ని పృథ్వీ–మయాంక్‌ల నుంచి ఆశించడం కూడా సరైంది కాదు. అయితే తమ సత్తా చాటేందుకు వీరికి ఈ మ్యాచ్ మరో అవకాశం ఇస్తోంది. ఓపెనింగ్ జోడి శుభారంభం అందిస్తే దానిపై జట్టు దూసుకుపోవచ్చు. ఆరో స్థానంలో కేదార్ జాదవ్ బాగానే ఆడినా అతని బ్యాటింగ్‌పై మళ్లీ సందేహాలు వస్తున్నాయి. జాదవ్కంటే ఏ రకంగా చూసినా మనీశ్ పాండే అత్యుత్తమ బ్యాట్స్‌మన్. పైగా అద్భుతమైన ఫీల్డర్ కూడా. అదనపు బౌలర్‌గా జాదవ్ పనికొస్తాడంటూ తుది జట్టులో తీసుకుంటున్నా గత మ్యాచ్‌లో అతను ఒక్క ఓవర్ కూడా వేయలేదు. కాబట్టి మార్పు తప్పకపోవచ్చు. తొలి వన్డేలో భారీగా పరుగులు ఇచ్చిన శార్దుల్, కుల్దీప్ల స్థానాల్లో సైనీ, చహల్‌లకు అవకాశం ఇవ్వాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. గత మ్యాచ్‌లో కీలక సమయంలో అనూహ్యంగా బుమ్రా కూడా ప్రభావం చూపలేకపోవడం కోహ్లిని కలవర పెట్టింది. అతను మళ్లీ తన స్థాయిలో బౌలింగ్ చేయాలని జట్టు కోరుకుంటోంది. అన్నింటికంటే ముఖ్యంగా భారత ఫీల్డింగ్ మెరుగుపడటం ఎంతో ముఖ్యం. ప్రత్యర్థి జట్టుతో పోలిస్తే మన ప్రదర్శన ఈ విషయంలో ఎంతో తీసికట్టుగా కనిపిస్తోంది. 6.8 అడుగుల అరంగేట్రం! గత మ్యాచ్‌లో వీరోచిత ప్రదర్శనతో ఆధిక్యం సంపాదించిన న్యూజిలాండ్‌కు అదే జోరులో సిరీస్ గెలుచుకునేందుకు ఇది మంచి అవకాశం. జట్టు బ్యాటింగ్ బలమేంటో తొలి వన్డే చూపించింది. అనుభవజ్ఞుడైన రాస్ టేలర్ అసలు సమయంలో చెలరేగగా, తాత్కాలిక కెప్టెన్ టామ్ లాథమ్ భారత్‌పై తన అద్భుత రికార్డును మరింత మెరుగపర్చుకున్నాడు. ఓపెనర్ నికోల్స్ ప్రదర్శన కూడా బాగుంది. వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన అతి కొద్ది మందిలో ఒకడైన మరో ఓపెనర్ గప్టిల్ కూడా రాణిస్తే ఆ జట్టుకు తిరుగుండదు. తొలి మ్యాచ్‌లో విఫలమైనా... మూడో స్థానంలో బ్లన్డెల్కు మరో అవకాశం ఖాయం. కివీస్‌ను ఇబ్బంది పడుతున్న అంశం కీలకమైన ఆల్‌రౌండర్ల వైఫల్యం. వన్డే సిరీస్‌కే అందుబాటులోకి వచ్చిన నీషమ్ పెద్దగా ప్రభావం చూపలేదు. మరోవైపు టి20ల్లో ఘోరంగా విఫలమైన గ్రాండ్‌హోమ్ తొలి వన్డేలోనూ తన వైఫల్యాన్ని కొనసాగించాడు. వీరిద్దరు స్వదేశంలో తమ స్థాయికి తగినట్లుగా ఆడితే భారత్‌కు సమస్యలే. బౌలింగ్ ఎప్పటిలాగే బలహీనంగానే ఉండటంతో తమ బ్యాటింగ్‌నే కివీస్ నమ్మకుంటోంది. ఇష్ సోధిని తప్పించి అతని స్థానంలో 6 అడుగుల 8 అంగుళాల పొడగరి కైల్ జేమీసన్ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టడం ఖాయమైంది. సౌతీ ఘోరంగా విఫలమవుతున్నా... సీనియర్‌గా అతనిలాంటి మరో ప్రత్యామ్నాయం కివీస్‌కు అందుబాటులో లేదు. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), పృథ్వీ షా, మయాంక్, అయ్యర్, రాహుల్, పాండే, జడేజా, షమీ, బుమ్రా, సైనీ, చహల్. న్యూజిలాండ్: లాథమ్ (కెప్టెన్), గప్టిల్, నికోల్స్, బ్లన్‌డెన్, టేలర్, గ్రాండ్‌హోమ్, నీషమ్, సాన్‌ట్నర్, జేమీసన్, సౌతీ, బెన్నెట్. పిచ్, వాతావరణం ఇలా బ్యాట్‌కు బంతి తగలడమే ఆలస్యం అలా బౌండరీ దాటడం ఈడెన్ పార్క్‌లో సహజం. ప్రపంచంలో అతి చిన్న మైదానాల్లో ఇదొకటి. పరుగుల వరదతో భారీ స్కోర్లు ఖాయం. ఈ పర్యటనలో తొలి రెండు టి20లు ఇక్కడే జరిగాయి. ఛేదన సులువు కాబట్టి టాస్ కీలకం కానుంది. మ్యాచ్ రోజు వర్షం ముప్పు లేదు. -
పౌరుషానికి.. రోషానికి.. పోటీ!
వారా.. వీరా! మనవారా... వైరి పక్షం వారా! వీరులా.. శూరులా! ఇద్దరిలో గెలుపెవరిది? పరాయి గడ్డ నుంచి వచ్చిన కొదమ సింహం ధాటికి సొంత గడ్డ మీద దుమ్ము రేపేస్తున్న మదపుటేనుగు మోకరిల్లుతుందా? ఒక్కసారిగా విరుచుకు పడే మెన్ ఇన్ బ్లూ మెరుపు దాడి ముందు కరేబియన్ దళం కకావికలవుతుందా? అంతుచిక్కని ప్రశ్న ఇది. ఉత్కంఠతో ఉక్కిరిబిక్కిరి చేసే సందేహమిది. అందుకే.. బుధవారం వైఎస్సార్ స్టేడియంలో భారత, వెస్టిండీస్ జట్ల మధ్య రెండో వన్డే చూడాల్సిన సందర్భమిది. విశాఖ స్పోర్ట్స్: సవాళ్లకే సవాలని.. సమరాలకే సమరమని.. సంఘర్షణలకే సంఘర్షణని చెప్పుకోదగ్గ సంఘటనలు కొన్నే జరుగుతాయి. అలాటి సందర్భాలు అరుదుగా వస్తాయి. అలాటి.. రసవత్తర.. మహత్తర పోరాటం బుధవారం వైఎస్సార్ స్టేడియం వేదికగా బుధవారం మధ్యాహ్నం ప్రారంభం కాబోతోంది. ఉత్కంఠను పరాకాష్టకు తీసుకువెళ్లే ‘ఘర్షణ’కు కొన్ని గంటల్లో తెర తొలగబోతోంది. ఇటీవలి విజయాలతో ఊపు మీద ఉన్న కోహ్లీ సేనతో, సంచలనం సాధించే తాపత్రయంతో ఉన్న పోలార్డ్ బృందం తలపడనున్న వన్డే క్రికెట్ మ్యాచ్.. ఈ చలికాలంలో కూడా సెగలు పుట్టించనుంది. ఈ సిరీస్‌లో ఇప్పటికే ఒక మ్యాచ్ గెలిచి.. సిరీస్ మీద కన్నేసిన వెస్టిండీస్ జట్టు తమను కాస్త కరుణించిన విశాఖ గడ్డ మీద అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమైతే.. అచ్చొచ్చిన స్టేడియంలో పట్టు చేజారనివ్వకుండా.. మ్యాచ్‌ను నిలబెట్టుకోవాలని భారత జట్టు పట్టుదలతో కృషి చేయనుంది. దాంతో క్రికెట్ వీరాభిమానులకు విందు వంటి మ్యాచ్ చూసే అవకాశం దక్కబోతోంది. టాప్ ప్లేయర్ల డుమ్మా భారత జట్టు హోమ్ సిరీస్ విజయాలకు విశాఖలో గండి కొట్టాలని ఊపు మీద ఉన్న వెస్టిండీస్ జట్టు వ్యూహం పన్నడంలో వింత లేదు కానీ.. మంగళవారం ప్రాక్టీస్‌ను భారత్ జట్టు సీరియస్‌గా తీసుకోలేదా? అన్న సందేహం సగటు అభిమానికి కలిగే అవకాశం ఉంది. గత పదిహేనేళ్లలో భారత్ జట్టు రెండే సార్లు హోమ్ సిరీస్‌లో పరాజయం పాలైంది. వరుసగా ఐదు సిరీస్‌ల్లో భారత్ విజయకేతనం ఎగురవేసింది. వన్డే సిరీస్‌లో నిలవాలంటే గెలవాల్సిన మ్యాచ్ భారత్దైతే...విశాఖ వేదికగానే సిరీస్ కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది వెస్టీండీస్ జట్టు. అచ్చివచ్చిన స్టేడియంలో మరోసారి గెలిచి ప్రస్తుతానికి సిరీస్‌ను సమం చేయాలనే పట్టుదలతో భారత్ జట్టు ప్రాక్టీస్ చేసినా ప్రధాన ఆటగాళ్ళు కనీసం నెట్స్‌లో ప్రాక్టీస్‌కు రాకపోవడం విస్మయపరిచేదే. మంగళవారం ఇరుజట్లు ప్రాక్టీస్ చేశాయి. ఉదయం వెస్టీండీస్ ప్రాక్టీస్ చేయగా మధ్యాహానం భారత్ జట్టు ఒళ్లొంచింది. భారత కెప్టెన్ కోహ్లీ, హిట్టర్ రోహిత్‌శర్మ లాంటి కీలక ఆటగాళ్ళు ప్రాక్టీస్‌కు డుమ్మా కొట్టారు. ప్రాక్టీస్‌లోనూ దీపక్ చాహర్ ప్రధానంగా నిలవగా ప్రీసెషన్ సమావేశంలోనూ ఇతనే మాట్లాడాడు. ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ రాహుల్, శ్రేయస్, రిషబ్, శివమ్ నెట్స్‌లో చెమటోడ్చారు. మిడిల్ ఓవర్లలో కోహ్లీ రాణిస్తున్నా... ఓపెనింగ్ భాగస్వామ్యం నిలదొక్కుకోలేక పోతే అచ్చివచ్చిన స్టేడియంలోనూ భారత్ కష్టపడాల్సి వస్తుంది. జట్టులో లేని బుమ్రా మంగళవారం ఫిట్నెస్ నిరూపణకు బౌలింగ్‌లో చెమటోడ్చగా.. కుల్దీప్, జడేజా కూడా కోచ్‌ల సూచనలకు అనుగుణంగా బంతులు సంధించారు. విశాఖ ప్రత్యేకం ⇒ విశాఖలో గడిచిన ఆరు వన్డేల్లో ఒక్కసారి మినహా చేజింగ్ జట్టే విజయాలు సాధించడం విశేషం. ⇒ ఈ స్టేడియంలో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు సరాసరి పరుగులు 275గా నమోదు కావడం గమనార్హం. ⇒ విశాఖలో కోహ్లీకి సంచలన రికార్డులున్నాయి. వెస్టిండీస్ విజయం సాధించిన మ్యాచ్‌లో అతడు 99 పరుగుల వద్ద ఔట్ కావడం ఓ విశేషమైతే.. మూడు సార్లు సెంచరీలు చేయడం మరో ప్రత్యేకాంశం. అతడు ఇక్కడ మొత్తం556 పరుగులు చేయగా అత్యధికం 157 పరుగులు. వైజాగ్‌లో విండీస్ ⇒ వెస్టిండీస్ జట్టు విశాఖలో మొత్తం ఐదు వన్డేలాడింది. వీటిలో ఒకటి పాతనగరంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో.. నాలుగు వైఎస్సార్ ఏసీఏ స్టేడియంలో జరిగాయి. హుద్‌హుద్ తుపాను కారణంగా ఓ మ్యాచ్ రద్దయింది. ⇒ వైఎస్సార్ స్టేడియంలో భారత జట్టు ఓడిన ఏకైక మ్యాచ్ 2013లో జరగ్గా.. ఆ మ్యాచ్‌లో కరేబియన్ జట్టు రెండు వికెట్ల తేడాతో నెగ్గింది. ⇒ ఈ స్టేడియంలో టై అయిన ఏకైక వన్డేలో కూడా తలపడినవి ఈ రెండు జట్లే. గతేడాది అక్టోబర్ 24న జరిగిన ఆ మ్యాచ్‌లో రెండు జట్లూ 321 పరుగులే చేయడం విశేషం. ⇒ టై అయిన మ్యాచ్‌లో కోహ్లీ చెలరేగి చేసిన 157 పరుగులు ఈ స్టేడియంలో రికార్డు. ఆ మ్యాచ్‌లో విజృంభించిన విండీస్ ఆటగాళ్లు హోప్ (123), హెట్మేయర్ (94) ఈసారి కూడా బరిలోకి దిగుతున్నారు. -
విశాఖ చేరిన భారత్, విండీస్ జట్లు
విశాఖ స్పోర్ట్స్: రెండో వన్డే మ్యాచ్‌లో తలపడేందుకు భారత్, వెస్టిండీస్ క్రికెట్ జట్లు సోమవారం విశాఖపట్నం చేరుకున్నాయి. మంగళవారం రెండు జట్లు నెట్ ప్రాక్టీస్‌లో పాల్గొననున్నాయి. మ్యాచ్ నిర్వహణ సజావుగా సాగేందుకు అపెక్స్ కమిటీ సోమవారం సమీక్ష నిర్వహించింది. నిర్వహణ కమిటీలు సమావేశమై ఏర్పాట్లపై చర్చించాయి. అనంతరం కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ... క్రీడాకారుల భద్రత, టిక్కెట్ల విక్రయాలు, స్టేడియంలో ఆహార పదార్థాలు తదితర విషయాలపై తీసుకున్న చర్యలను వివరించారు. స్థానిక ఆటగాడు, భారత మాజీ క్రికెటర్ వై.వేణుగోపాల్ రావు పేరిట స్టేడియంలో ఓ గేట్‌ను ఏర్పాటు చేయనున్నామని... దానిని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రారంభిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర క్రికెట్ సంఘం అధ్యక్షుడు శరత్ చంద్రారెడ్డి, కార్యదర్శి దుర్గాప్రసాద్, కోశాధికారి గోపీనాథ్ రెడ్డిలతో పాటు డీసీపీ రంగారెడ్డి, జేసీ వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వెస్టిండీస్‌కు భారీ జరిమానా తొలి వన్డేలో భారత్‌ను ఓడించిన వెస్టిండీస్ క్రికెట్ జట్టు ఓవర్‌రేట్‌లో మాత్రం భారీగా వెనుకబడింది. దాంతో ఆ జట్టు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో ఏకంగా 80 శాతం కోత పడింది. భారత బ్యాటింగ్ సమయంలో 50 ఓవర్లకు నిర్దేశించిన సమయం ముగిసినా దానిని పూర్తి చేయలేక విండీస్ మరో నాలుగు ఓవర్లు వెనుకబడింది. ఐసీసీ నిబంధనల ప్రకారం ఒక్కో ఓవర్‌కు 20 శాతం జరిమానా చొప్పున విండీస్ జట్టు సభ్యులపై 80 శాతం మ్యాచ్ ఫీజును జరిమానాగా విధిస్తున్నట్లు రిఫరీ డేవిడ్ బూన్ ప్రకటించారు. -
విజయాల వీచిక...
విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియానికి 2019లో అరుదైన అవకాశం లభించింది. ఒకే ఏడాది మూడు వేర్వేరు ఫార్మాట్లలో అంతర్జాతీయ మ్యాచ్‌లకు ఈ మైదానం వేదికైంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాతో టి20లో తలపడిన భారత్... అక్టోబరులో దక్షిణాఫ్రికాను టెస్టు మ్యాచ్‌లో ఎదుర్కొంది. ఇప్పుడు వెస్టిండీస్‌తో వన్డే సమరానికి కోహ్లి సేన సన్నద్ధమైంది. మ్యాచ్‌లు కేటాయించే బీసీసీఐ రొటేషన్ విధానాన్ని బట్టి చూస్తే ఒకే సంవత్సరం ఇలా మూడు మ్యాచ్‌లు దక్కడం పెద్ద విశేషంగానే చెప్పవచ్చు. 2005లో మొదటి మ్యాచ్ జరిగిన నాటి నుంచి బాగా అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలో భారత్‌ను ఒకే ఒక పరాజయం పలకరించింది. ధోని విధ్వంసక రూపాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన నాటి నుంచి కోహ్లి 10 వేల పరుగుల మైలురాయిని అందుకున్న చిరస్మరణీయ క్షణం వరకు వైజాగ్ ఎన్నో అపురూప క్షణాలకు వేదికైంది. ఇక్కడ ఆడిన ఎనిమిది వన్డేల్లో భారత్ 6 గెలిచి, 1 మ్యాచ్‌లో ఓడగా, మరో మ్యాచ్ ‘టై’గా ముగిసింది. రేపు భారత్, విండీస్ పోరు నేపథ్యంలో ఇక్కడ జరిగిన వన్డేల విశేషాలను చూస్తే.... 5 ఏప్రిల్, 2005 ఫలితం: పాక్‌పై 58 పరుగులతో భారత్ గెలుపు. విశేషాలు: కెరీర్ ఐదో వన్డే బరిలోకి దిగిన మహేంద్ర సింగ్ ధోని (123 బంతుల్లో 148; 15 ఫోర్లు, 4 సిక్సర్లు) తుఫాన్ ఇన్నింగ్స్ చిరకాల ప్రత్యర్థిని చిత్తు చేసింది. ధోనితో పాటు సెహ్వాగ్ (74), ద్రవిడ్ (52) అర్ధ సెంచరీలతో భారత్ 9 వికెట్లకు 356 పరుగులు చేయగా, పాక్ 298 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ గంగూలీ అండతో మూడో స్థానంలో ఆడే అవకాశం దక్కించుకున్న ధోని అద్భుత ప్రదర్శన అతని సత్తాను బయటపెట్టడంతో పాటు కొత్త హీరోను భారత క్రికెట్‌కు అందించింది. 17 ఫిబ్రవరి, 2007 ఫలితం: శ్రీలంకపై 7 వికెట్లతో భారత్ విజయం. విశేషాలు: చమర సిల్వా (107 నాటౌట్) సహాయంతో శ్రీలంక 7 వికెట్లకు 259 పరుగులు చేయగా, భారత్ 41 ఓవర్లలోనే 3 వికెట్లకు 263 పరుగులు చేసి విజయాన్నందుకుంది. యువరాజ్ సింగ్ (83 బంతుల్లో 95 నాటౌట్; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా, గంగూలీ (58 నాటౌట్), ఉతప్ప (52) రాణించారు. మహరూఫ్ వేసిన చివరి ఓవర్లో యవీ వరుసగా 4, 4, 0, 6, 4, 4 బాది మ్యాచ్‌ను ముగించడం విశేషం. 29 అక్టోబరు, 2010 ఫలితం: ఆస్ట్రేలియాపై 5 వికెట్లతో భారత్ విజయం. విశేషాలు: మైకేల్ క్లార్క్ (111) సెంచరీతో పాటు కామెరాన్ వైట్ (89 నాటౌట్), మైక్ హస్సీ (69) రాణించడంతో ఆసీస్ 3 వికెట్లకు 289 పరుగులు చేసింది. అయితే విరాట్ కోహ్లి (121 బంతుల్లో 118; 11 ఫోర్లు, 1 సిక్స్) చక్కటి బ్యాటింగ్‌కు సురేశ్ రైనా (71 నాటౌట్), యువరాజ్ సింగ్ (58) అండగా నిలవడంతో భారత్ 5 వికెట్లకు 292 పరుగులు చేసింది. శిఖర్ ధావన్, మిషెల్ స్టార్క్‌లకు ఇదే తొలి వన్డే. 2 డిసెంబర్, 2011 ఫలితం: వెస్టిండీస్‌పై 5 వికెట్లతో భారత్ విజయం. విశేషాలు: విశాఖ మైదానంలో విరాట్ కోహ్లి వరుసగా రెండో మ్యాచ్‌లోనూ సెంచరీలతో మెరిశాడు. రవి రామ్‌పాల్ (86), లెండిల్ సిమన్స్ (78) అర్ధ సెంచరీలతో వెస్టిండీస్ 9 వికెట్లకు 269 పరుగులు చేయగా, కోహ్లి (113 బంతుల్లో 117; 14 ఫోర్లు), రోహిత్ శర్మ (90 నాటౌట్) భాగస్వామ్యంతో భారత్ 5 వికెట్లకు 270 పరుగులు చేసి నెగ్గింది. 24 నవంబర్, 2013 ఫలితం: భారత్‌పై 2 వికెట్లతో వెస్టిండీస్ విజయం. విశేషాలు: నగరంలో టీమిండియాకు ఎదురైన ఓటమి ఇదొక్కటే. కోహ్లి (99) మరో సెంచరీ చేజార్చుకోగా, ధోని (51) అర్ధ సెంచరీ చేయడంతో భారత్ 7 వికెట్లకు 288 పరుగులు నమోదు చేసింది. అనంతరం విండీస్ 8 వికెట్లకు 289 పరుగులు సాధించింది. జట్టులో నలుగురు బ్యాట్స్‌మెన్ అర్ధ సెంచరీలు చేయడం విశేషం. డారెన్ స్యామీ (63 నాటౌట్), సిమన్స్ (62), పావెల్ (59), డారెన్ బ్రేవో (50) ఆకట్టుకున్నారు. 29 అక్టోబరు, 2016 ఫలితం: న్యూజిలాండ్‌పై 190 పరుగులతో భారత్ విజయం. విశేషాలు: అమిత్ మిశ్రా (5/18) మ్యాజిక్ బౌలింగ్‌తో గెలిపించిన మ్యాచ్ ఇది. రోహిత్ శర్మ (70), విరాట్ కోహ్లి (65) అర్ధ శతకాలతో భారత్ 6 వికెట్లకు 269 పరుగులు చేయగా, కివీస్ 23.1 ఓవర్లలో 79 పరుగులకే కుప్పకూలింది. ఐదుగురు బ్యాట్స్‌మెన్ డకౌటయ్యారు. భారత ఆటగాళ్లంతా సొంత పేర్లు కాకుండా తమ జెర్సీలపై తమ తల్లుల పేర్లు ముద్రించుకొని బరిలోకి దిగడం విశేషం. 17 డిసెంబర్, 2017 ఫలితం: శ్రీలంకపై 8 వికెట్లతో భారత్ విజయం. విశేషాలు: ఉపుల్ తరంగ (95) మినహా అంతా విఫలం కావడంతో శ్రీలంక 215 పరుగులకే ఆలౌటైంది. శిఖర్ ధావన్ (85 బంతుల్లో 100 నాటౌట్; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ, శ్రేయస్ అయ్యర్ (65) అర్ధ సెంచరీ కలిసి భారత్‌కు విజయాన్ని అందించారు. ఈ మ్యాచ్‌లో గెలుపుతో భారత్ వరుసగా ఎనిమిదో సిరీస్ విజయాన్ని సాధించింది. ఏడాది క్రితం వీరిద్దరే... చెన్నైలో తొలి వన్డేలో సెంచరీలతో చెలరేగి భారత్ ఓటమికి కారణమైన హెట్‌మైర్, షై హోప్‌లు మరో అద్భుత ప్రదర్శన కనబర్చాలని పట్టుదలగా ఉన్నారు. రెండో మ్యాచ్ వేదిక వైజాగ్ కావడం వారిలో ఉత్సాహాన్ని పెంచింది. గత ఏడాది అక్టోబర్ 24న విశాఖ మైదానంలో భారత్–విండీస్ మధ్య వన్డే ‘టై’ కావడంలో వీరిదే కీలక పాత్ర కావడం విశేషం. ముందుగా విరాట్ కోహ్లి (129 బంతుల్లో 157 నాటౌట్; 13 ఫోర్లు, 4 సిక్సర్లు) అద్భుత శతకానికి రాయుడు (73) అండగా నిలవడంతో భారత్ 6 వికెట్లకు 321 పరుగులు చేసింది. ఆ తర్వాత షై హోప్ (134 బంతుల్లో 123 నాటౌట్; 10 ఫోర్లు, 3 సిక్సర్లు), హెట్‌మైర్ (64 బంతుల్లో 94; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) చెలరేగడంతో విండీస్ కూడా 7 వికెట్లకు 321 పరుగులే చేసింది. చివరి ఓవర్లో విండీస్ విజయానికి 14 పరుగులు అవసరం కాగా, తొలి 5 బంతుల్లో 9 పరుగులు వచ్చాయి. చివరి బంతికి ఐదు పరుగులు అవసరం కాగా, హోప్ ఫోర్ కొట్టగలిగాడు. కోహ్లి ఈ మ్యాచ్‌లోనే 10 వేల పరుగుల మైలురాయిని దాటాడు. కోహ్లి సూపర్ రికార్డు... విశాఖపట్నంలో ఆడిన ఐదు వన్డేల్లో కోహ్లి వరుసగా 118, 117, 99, 65, 157 నాటౌట్ పరుగులు చేశాడు. సెంచరీలు చేసిన మూడు సందర్భాల్లోనూ అతనే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కావడం విశేషం. అంతకుముందు ఐదు వన్డేలు... విశాఖపట్నంలో ప్రస్తుత స్టేడియం నిర్మించక ముందు కూడా ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో 1988–2001 మధ్య ఐదు వన్డేలు జరిగాయి. న్యూజిలాండ్, వెస్టిండీస్‌లపై ఒక్కో మ్యాచ్ గెలిచిన టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలైంది. మిగతా రెండు వన్డేలు ఆస్ట్రేలియా–కెన్యా, పాకిస్తాన్–శ్రీలంక మధ్య జరిగాయి. -
భారత మహిళల జోరు
నార్త్‌సౌండ్: వెస్టిండీస్‌తో జరుగుతున్న సిరీస్‌లో తొలి వన్డేలో ఓడిన భారత మహిళల జట్టు వెంటనే కోలుకుంది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన రెండో వన్డేలో భారత్ 53 పరుగుల తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. పూనమ్ రౌత్ (128 బంతుల్లో 77; 4 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా, కెప్టెన్ మిథాలీ రాజ్ (67 బంతుల్లో 40; 4 ఫోర్లు), హర్మన్ ప్రీత్ కౌర్ (52 బంతుల్లో 46; 4 ఫోర్లు) రాణించారు. అనంతరం వెస్టిండీస్ 47.2 ఓవర్లలో 138 పరుగులకే కుప్పకూలింది. క్యాంప్‌బెల్ (90 బంతుల్లో 39; 2 ఫోర్లు) టాప్‌స్కోరర్ కాగా...ముగ్గురు విభిన్న శైలి గల భారత స్పిన్నర్లు దీప్తి శర్మ, పూనమ్ యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్ తలా 2 వికెట్లు తీసి ప్రత్యర్థిని పడగొట్టారు. భారత్ 17 పరుగులకే ఓపెనర్లు ప్రియా పూనియా (5), జెమీమా (0) వికెట్లు కోల్పోయింది. ఈ దశలో పూనమ్ రౌత్, మిథాలీ కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. తొలి 9 ఓవర్లలో భారత్ ఇన్నింగ్స్‌లో ఒక్క ఫోర్ కూడా లేకపోగా, మిథాలీ తాను ఎదుర్కొన్న మూడో బంతిని బౌండరీకి తరలించి బోణీ చేసింది. పూనమ్ మరీ నెమ్మదిగా ఆడుతూ వికెట్ కాపాడుకునే ప్రయత్నం చేసింది. తన 70వ బంతికి గానీ ఆమె తొలి ఫోర్ కొట్టలేకపోయింది. వీరిద్దరు మూడో వికెట్‌కు 66 పరుగులు జోడించారు. అనంతరం పూనమ్‌తో జత కలిసిన హర్మన్ దూకుడుగా ఆడింది. పూనమ్ కూడా ధాటిని పెంచడంతో పరుగులు వేగంగా వచ్చాయి. 17.5 ఓవర్లలోనే వీరిద్దరు నాలుగో వికెట్‌కు 93 పరుగులు జత చేయడం విశేషం. ఆరు బంతుల వ్యవధిలో పూనమ్, హర్మన్ అవుటయ్యారు. వెస్టిండీస్ ఇన్నింగ్స్ మొదటినుంచి తడబడుతూనే సాగింది. ఎవరూ భారత స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కోలేకపోయారు. కెప్టెన్ స్టెఫానీ టేలర్ (20) విఫలం కావడంతో ఆ జట్టు విజయంపై ఆశలు కోల్పోయింది. సిరీస్‌లో ఇరు జట్లు 1–1తో సమంగా నిలవగా చివరి వన్డే ఇదే వేదికపై బుధవారం జరుగుతుంది. -
భారత్ ‘ఎ’ను గెలిపించిన ఇషాన్
తిరువనంతపురం: కీలక దశలో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన భారత ‘ఎ’ జట్టు యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ (24 బంతుల్లో 55; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టు ఆశలపై నీళ్లు చల్లాడు. శనివారం జరిగిన రెండో అనధికారిక వన్డేలో ఇషాన్ అద్భుత ఇన్నింగ్స్‌తో భారత్ ‘ఎ’ రెండు వికెట్ల తేడాతో గెలిచి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. వర్షం కారణంగా 21 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ ‘ఎ’ కెప్టెన్ మనీశ్ పాండే ఫీల్డింగ్ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా ‘ఎ’ 21 ఓవర్లలో 5 వికెట్లకు 162 పరుగులు చేసింది. జార్జి లిండే (25 బంతుల్లో 52 నాటౌట్; ఫోర్, 5 సిక్స్‌లు) అర్ధ సెంచరీతో మెరిపించాడు. కెప్టెన్ బవుమా (33 బంతుల్లో 40; 6 ఫోర్లు), క్లాసెన్ (27 బంతుల్లో 31; 3 సిక్స్‌లు) కూడా ధాటిగా ఆడారు. భారత్ ‘ఎ’ బౌలర్లలో దీపక్ చహర్, ఖలీల్ అహ్మద్, యజువేంద్ర చహల్, అక్షర్ పటేల్‌లకు ఒక్కో వికెట్ లభించింది. అనంతరం 163 పరుగుల లక్ష్యాన్ని భారత్ ‘ఎ’ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి అధిగమించింది. క్రీజులోకి వచ్చిన ప్రతి బ్యాట్స్‌మెన్ దూకుడుగా ఆడటంతో మరో ఓవర్ మిగిలి ఉండగానే భారత్ ‘ఎ’ లక్ష్యాన్ని ఛేదించింది. ఇషాన్ కిషన్‌కు జతగా అన్మోల్ప్రీత్ సింగ్ (19 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కృనాల్ పాండ్యా (15 బంతుల్లో 23 నాటౌట్; ఫోర్, సిక్స్) కూడా బ్యాట్ ఝళిపించారు. ఇషాన్ కిషన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. సిరీస్‌లోని మూడో వన్డే సోమవారం జరుగుతుంది. -
భువీ... పడగొట్టేశాడు
వన్డే సిరీస్‌లోనూ భారత్ ఆధిపత్యం మొదలైంది. బ్యాటింగ్‌లో కోహ్లి, శ్రేయస్ అయ్యర్ భారత్ స్కోరుకు బాటలు వేయగా... భువనేశ్వర్ తన పేస్‌తో విండీస్ ఇన్నింగ్స్‌ను కూల్చేశాడు. కుల్దీప్ స్పిన్‌తో ఇబ్బంది పెట్టాడు. దీంతో వాన అంతరాయం కలిగించినా... టీమిండియా విజయాన్ని అడ్డుకోలేకపోయింది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్: కరీబియన్ గడ్డపై ఇక ఈ వన్డే సిరీస్ కూడా భారత్ కోల్పోదు. ఆఖరి మ్యాచ్‌లో ఓడినా సమమైనా చేసుకుంటుంది కానీ... చేజార్చుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే రెండో వన్డేలో భారత్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 59 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై గెలుపొందింది. దీంతో 1–0తో సిరీస్‌లో ఆధిక్యంలోకి వచ్చింది. ఈ మ్యాచ్‌లో భువనేశ్వర్ (4/31) ధాటికి వర్షం అడ్డుపడిందేమోగానీ... ప్రత్యర్థి శిబిరం నుంచి ఏ ఒక్క బ్యాట్స్‌మెన్ ఎదురుపడలేదు. భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారు జామున ముగిసిన ఈ మ్యాచ్‌లో మొదట టీమిండియా 50 ఓవర్లలో 7 వికెట్లకు 279 పరుగులు చేసింది. కోహ్లి (125 బంతుల్లో 120; 14 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ సాధించగా, అయ్యర్ (68 బంతుల్లో 71; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. వర్షం అంతరాయం కలిగించడంతో వెస్టిండీస్ లక్ష్యాన్ని 46 ఓవర్లలో 270 పరుగులకు కుదించారు. కానీ విండీస్ మాత్రం ఆ ఓవర్లదాకా ఆడలేకపోయింది. 42 ఓవర్లలో 210 పరుగులకే ఆలౌటైంది. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (2/59) తిప్పేయగా, షమీ (2/39) ఆఖరి స్పెల్‌తో ముగించాడు. శతక్కొట్టిన కోహ్లికి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి వన్డే వర్షార్పణమవగా... ఆఖరి వన్డే రేపు ఇక్కడే జరుగుతుంది. లూయిస్ ఒక్కడే... గేల్, షై హోప్, నికోలస్ పూరన్, బ్రాత్‌వైట్ లాంటి హిట్టర్లున్న జట్టుకు సొంతగడ్డపై 270 పరుగుల లక్ష్యం కష్టమే కాదు. కానీ పూరన్ మినహా ఇంకెవరూ కష్టపడలేదు. 300 వన్డే ఆడుతున్న గేల్ (11) విఖ్యాత బ్యాట్స్‌మన్ లారా (10,348) అత్యధిక పరుగులు చేసిన విండీస్ బ్యాట్స్‌మన్ ఘనతను 10,353 పరుగులతో తన పేర లిఖించుకున్నాడు. కానీ ఆటలో విఫలమయ్యాడు. హోప్ (5), హెట్‌మైర్ (18), చేజ్ (18) కూడా చేతులెత్తేశారు. ఓపెనర్ ఎవిన్ లూయిస్ (80 బంతుల్లో 65; 8 ఫోర్లు, 1 సిక్స్), పూరన్‌తో కలిసి పోరాడాడు. ఇద్దరు నాలుగో వికెట్‌కు 56 పరుగులు జోడించారు. ఒక దశలో విండీస్ 148/3 స్కోరు వద్ద పటిష్టంగా కనిపించింది. కానీ అదే స్కోరు వద్ద లూయిస్... కుల్దీప్ స్పిన్‌లో చిక్కుకున్నాడు. పూరన్‌ను భువీ ఔట్ చేయడంతో 179 పరుగుల వద్ద ఐదో వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత విండీస్ చకాచకా వికెట్లను కోల్పోయి లక్ష్యానికి దూరమైంది. మిగతా సగం వికెట్లు కేవలం 31 పరుగుల వ్యవధిలోనే పడటంతో విండీస్ 210 స్కోరు వద్ద ఆలౌటైంది. బ్రాత్‌వైట్ (0), కీమర్ రోచ్ (0) డకౌటయ్యారు. జట్టు స్కోరును 200 పరుగులు దాటించాకా కాట్రెల్ (17), థామస్ (0)లను షమీ ఓకే ఓవర్లో ఔట్ చేయడంతో విండీస్ ఇన్నింగ్స్ ముగిసింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: 279/7; వెస్టిండీస్ ఇన్నింగ్స్: గేల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) భువనేశ్వర్ 11; లూయిస్ (సి) కోహ్లి (బి) కుల్దీప్ 65; హోప్ (బి) అహ్మద్ 5; హెట్‌మైర్ (సి) కోహ్లి (బి) కుల్దీప్ 18; పూరన్ (సి) కోహ్లి (బి) భువనేశ్వర్ 42; చేజ్ (సి అండ్ బి) భువనేశ్వర్ 18; హోల్డర్ (నాటౌట్) 13; బ్రాత్‌వైట్ (సి) షమీ (బి) జడేజా 0; రోచ్ (బి) భువనేశ్వర్ 0, కాట్రెల్ (సి) జడేజా (బి) షమీ 17; థామస్ (ఎల్బీడబ్ల్యూ) (బి) షమీ 0; ఎక్స్‌ట్రాలు 21; మొత్తం (42 ఓవర్లలో ఆలౌట్) 210 వికెట్ల పతనం: 1–45, 2–52, 3–92, 4–148, 5–179, 6–179, 7–180, 9–209, 10–210. బౌలింగ్: భువనేశ్వర్ 8–0–31–4, షమీ 8–0–39–2, అహ్మద్ 7–0–32–1, కుల్దీప్ 10–0–59–2, జాదవ్ 5–0–25–0, జడేజా 4–0–15–1. పొదుపుగా బౌలింగ్ చేద్దామనుకుంటే... నేను బౌలింగ్‌కు వచ్చినపుడు ఒకటే ఆలోచించా... డాట్ బాల్స్ వేయాలని, పొదుపుగా బౌలింగ్ చేయాలని..! కానీ అనూహ్యంగా వికెట్లు కూడా దక్కడం ఆనందాన్నిచ్చింది. నిజానికి నేనసలు మ్యాచ్ ఫలితంపై ఆలోచించలేదు. అయితే ఒకట్రెండు వికెట్లు తీస్తే గెలుపుదారిన పడతామనిపించింది. భారత్ బ్యాటింగ్‌లో కెప్టెన్ కోహ్లి సెంచరీ కూడా లక్ష్యాన్ని కాపాడుకునేందుకు దోహదం చేసింది. వాన చినుకులు పడటంతో పరుగులు చేయడం అంత సులభం కాదనిపించింది. ఇదే విషయాన్ని కోహ్లి మాకు చెప్పాడు. చేజ్‌ను రిటర్న్ క్యాచ్‌తో ఔట్ చేయడం అద్భుతమైన అనుభూతినిచ్చింది. నేను క్యాచ్‌కు ప్రయత్నించాను, కానీ చేతికందుతుందని అస్సలనుకోలేదు. ఈ సిరీస్‌లో ఆధిక్యంలో నిలిచిన మేం తదుపరి మ్యాచ్ గెలిచి సిరీస్ గెలుచుకుంటాం. –భారత పేసర్ భువనేశ్వర్ -
కోహ్లి కొట్టాడు...
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: మొదట్లో, చివర్లో తడబడినా... మధ్యలో కెప్టెన్ విరాట్ కోహ్లి (125 బంతుల్లో 120; 14 ఫోర్లు, సిక్స్) సెంచరీ, యువ బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్ (68 బంతుల్లో 71; 5 ఫోర్లు, సిక్స్) చక్కటి అర్ధ సెంచరీలతో మెరవడంతో ఆదివారం ఇక్కడ జరిగిన రెండో వన్డేలో వెస్టిండీస్‌పై టీమిండియా మెరుగైన స్కోరు సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా... ఓపెనర్లు విఫలమైనా కోహ్లి, అయ్యర్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 279 పరుగులు చేసింది. వన్డేల్లో కోహ్లి 42వ శతకం సాధించాడు. విండీస్ బౌలర్లలో బ్రాత్‌వైట్ (3/53) రాణించగా, కాట్రెల్, హోల్డర్, చేజ్‌లకు ఒక్కో వికెట్ దక్కింది. కడపటి వార్తలు అందేసరికి... వర్షం వల్ల ఆట నిలిచే సమయానికి వెస్టిండీస్ 12.5 ఓవర్లలో రెండు వికెట్లకు 55 పరుగులు చేసింది. భువనేశ్వర్ బౌలింగ్‌లో క్రిస్ గేల్ (24 బంతుల్లో 11; ఫోర్) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగ్గా... ఖలీల్ బౌలింగ్‌లో ౖషై హోప్ (1) బౌల్డయ్యాడు. వ్యక్తిగత స్కోరు 7 పరుగుల వద్ద క్రిస్ గేల్ విండీస్ తరఫున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. బ్రియాన్ లారా (10,348 పరుగులు) పేరిట ఉన్న రికార్డును గేల్ అధిగమించాడు. వారే నిలిపారు... ఓపెనర్ ధావన్ (2) పరుగుల ప్రయాస కొనసాగడంతో భారత్‌కు శుభారంభం దక్కలేదు. ఇన్నింగ్స్ మూడో బంతికే అతడు కాట్రెల్‌కు వికెట్ల ముందు దొరికిపోయాడు. అంపైర్ ఔటివ్వకున్నా విండీస్ రివ్యూ కోరి ఫలితం రాబట్టింది. మరో ఓపెనర్ రోహిత్ శర్మ (34 బంతుల్లో 18; 2 ఫోర్లు)... 11వ బంతికి ఖాతా తెరిచాడు. ఆ తర్వాతా ఇబ్బందిగానే కనిపించాడు. సమన్వయ లోపంతో రెండుసార్లు రనౌటయ్యే ప్రమాదం ఎదుర్కొన్నాడు. ఎక్కువగా స్ట్రయికింగ్ తీసుకున్న కోహ్లి తనదైన శైలిలో సాధికారికంగా ఆడాడు. చకచకా అర్ధసెంచరీ (57 బంతుల్లో) అందుకున్నాడు. ఈ దశలో చేజ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి రోహిత్ పెవిలియన్ చేరాడు. వీరి మధ్య రెండో వికెట్‌కు 74 పరుగులు జతకూడితే ఇందులో విరాట్‌వే 50 ఉండటం గమనార్హం. నాలుగో స్థానంలో పంత్ (35 బంతుల్లో 20; 2 ఫోర్లు) ప్రయోగం ఈసారీ విఫలమైంది. శరీరాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రత్యర్థి బౌలర్లు వేసిన బంతులకు పంత్ ఇబ్బంది పడ్డాడు. బ్రాత్‌వైట్ స్లో డెలివరీని ఫైన్ లెగ్‌లోకి స్కూప్ చేసే యత్నంలో బౌల్డయ్యాడు. అప్పటికి స్కోరు 22.2 ఓవర్లలో 101/3. మరో వికెట్ పడకుండా చూసుకుంటూ కోహ్లి, అయ్యర్ స్వేచ్ఛగా ఆడారు. శ్రేయస్ సింగిల్స్‌తో స్ట్రయిక్ రొటేట్ చేస్తూ వీలుచూసుకుని బౌండరీలు బాదాడు. మొదటి నుంచి అతడి స్ట్రయిక్ రేట్ 100పైనే నిలిచింది. హోల్డర్ బౌలింగ్‌లో సింగిల్‌తో కోహ్లి సెంచరీ (112 బంతుల్లో) పూర్తి చేసుకున్నాడు. ఆ వెంటనే అయ్యర్ అర్ధశతకం (49 బంతుల్లో) అందుకున్నాడు. థామస్ ఓవర్లో నాలుగు బంతుల వ్యవధిలో మూడు ఫోర్లు బాది స్కోరు పెంచే యత్నం చేసిన కోహ్లి అదే ఊపులో బ్రాత్‌వైట్ బౌలింగ్‌లో భారీ షాట్ కొట్టబోయి వెనుదిరిగాడు. కోహ్లి–అయ్యర్ నాలుగో వికెట్‌కు 115 బంతుల్లోనే 125 పరుగులు జోడించారు. భారత ఇన్నింగ్స్ 42.2వ ఓవర్ వద్ద ఉండగా వర్షం 25 నిమిషాలు ఆటంకం కలిగించింది. తిరిగి ప్రారంభమయ్యాక రోచ్ ఓవర్లో చక్కటి సిక్స్ కొట్టిన అయ్యర్ కెరీర్లో తొలి సెంచరీ సాధించేలా కనిపించాడు. కానీ, అతడిని హోల్డర్ పెవిలియన్ చేర్చాడు. జాదవ్ (16), భువనేశ్వర్ (1) విఫలమైనా జడేజా (16 నాటౌట్) కాసిన్ని పరుగులు జోడించాడు. కోహ్లి శతక నిరీక్షణ తీరింది... ప్రపంచ కప్ నుంచి సాగుతున్న కోహ్లి సెంచరీల నిరీక్షణకు తెరపడింది. కప్‌లో 9 మ్యాచ్‌ల్లోనూ సెంచరీ చేయలేకపోయిన విరాట్ విండీస్‌పై రెండో వన్డేలో అవకాశాన్ని వదల్లేదు. మార్చిలో స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో కోహ్లి శతకం (123) బాదాడు. ఆ సిరీస్‌లో మిగతా రెండు మ్యాచ్‌లు, తర్వాత ప్రపంచ కప్‌లో 9 మొత్తం 11 మ్యాచ్‌ల్లోనూ సెంచరీ కొట్టలేకపోయాడు. గతంలో ఓసారి అతడు వరుసగా 18 మ్యాచ్‌ల్లో శతకం అందుకోలేకపోయాడు. ఓవ రాల్‌గా వెస్టిండీస్‌పై అతడికిది 8వ సెంచరీ. ఆసీస్, శ్రీలంకపైనా ఎనిమిదేసి సెంచరీలు చేశాడు. నాలుగులో అయ్యర్ కాదు.. పంత్ ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ మళ్లీ చర్చనీయాంశమైంది. నాలుగో స్థానంలో నిఖార్సైన బ్యాట్స్‌మన్ కోసం ఎదురుచూస్తూ, అందుకే అన్నట్లుగా ఎంపిక చేసిన అయ్యర్‌ను కాదని పంత్‌ను ముందుగా పంపారు. రోహిత్ ఔటైన ఆ సమయానికి ఇంకా 34.3 ఓవర్లున్నాయి. కెప్టెన్ కోహ్లితో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించేందుకు, నాణ్యమైన నంబర్–4 బ్యాట్స్‌మన్ దిగేందుకు ఇది అనువైన పరిస్థితి. భారత్ భవిష్యత్ అవసరాలరీత్యా చూసినా శ్రేయస్నే దింపాలి. కానీ, ఊహించని విధంగా పంత్ వచ్చాడు. వస్తూనే రెండు ఫోర్లు కొట్టిన రిషభ్ ఆ తర్వాత జోరు చూపలేకపోయాడు. అతడు ఎదుర్కొన్న చివరి 14 బంతుల్లో 12 బంతులకు పరుగే రాలేదు. అయ్యర్,పంత్ బ్యాటింగ్ చేసిన తీరును పోల్చి చూసినా నంబర్–4లో ఎవరు సరైనవారో తెలిసిపోతుంది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: శిఖర్ ధావన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) కాట్రెల్ 2; రోహిత్ శర్మ (సి) పూరన్ (బి) చేజ్ 18; విరాట్ కోహ్లి (సి) రోచ్ (బి) బ్రాత్‌వైట్ 120; రిషభ్ పంత్ (బి) బ్రాత్‌వైట్ 20; శ్రేయస్ అయ్యర్ (బి) హోల్డర్ 71; కేదార్ జాదవ్ (రనౌట్) 16; జడేజా (నాటౌట్) 16; భువనేశ్వర్ (సి) రోచ్ (బి) బ్రాత్‌వైట్ 1; షమీ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 279. వికెట్ల పతనం: 1–2, 2–76, 3–101, 4–226, 5–250, 6–258, 7–262. బౌలింగ్: కాట్రెల్ 10–0–49–1, రోచ్ 7–0–54–0, హోల్డర్ 9–0–53–1, థామస్ 4–0–32–0, చేజ్ 10–1–37–1, బ్రాత్‌వైట్ 10–0–53–3. ► 120 పరుగులు ► 14ఫోర్లు ► 1సిక్స్ గంగూలీని దాటిన కోహ్లి... కోహ్లి అరుదైన రికార్డుకు రెండో వన్డే వేదికైంది. భారత్ తరఫున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్ జాబితాలో మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ (311 మ్యాచ్‌ల్లో 11,363)ని అధిగమించి అతడు రెండో స్థానానికి చేరాడు. దిగ్గజ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ (463 మ్యాచ్‌ల్లో 18,426 పరుగులు) టాప్‌లో ఉన్నాడు. సరిగ్గా పదకొండేళ్ల క్రితం ఆగస్టులో శ్రీలంకపై తొలి వన్డే ఆడిన కోహ్లి... ఇప్పటివరకు 238 మ్యాచ్‌లు, 229 ఇన్నింగ్స్‌ల్లో 11,406 పరుగులు చేశాడు. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన వారిలో అతను ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. -
ఫించ్ మరో సెంచరీ
షార్జా: కెప్టెన్ ఆరోన్ ఫించ్ (143 బంతుల్లో 153 నాటౌట్; 11 ఫోర్లు, 6 సిక్స్‌లు) మరో సెంచరీ చేయడంతో... పాకిస్తాన్‌తో జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా ఎనిమిది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. తొలి వన్డేలోనూ ఫించ్ సెంచరీ చేసి ఆసీస్ విజయంలో ముఖ్యపాత్ర పోషించగా... రెండో వన్డేలోనూ అతను కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 284 పరుగులు చేసింది. మొహమ్మద్ రిజ్వాన్ (126 బంతుల్లో 115; 11 ఫోర్లు) సెంచరీ చేయగా... షోయబ్ మాలిక్ (61 బంతుల్లో 60; 3 ఫోర్లు, సిక్స్) అర్ధ సెంచరీ సాధించాడు. ఆసీస్ బౌలర్లలో రిచర్డ్సన్, కూల్టర్‌నీల్ రెండేసి వికెట్లు పడగొట్టారు. 285 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 47.5 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి అధిగమించింది. ఉస్మాన్ ఖాజా (109 బంతుల్లో 88; 8 ఫోర్లు)తో కలిసి ఫించ్ తొలి వికెట్‌కు 209 పరుగులు జోడించడం విశేషం. ఖాజా, మ్యాక్స్‌వెల్ ఔటయ్యాక షాన్ మార్‡్ష (11 నాటౌట్)తో కలిసి ఫించ్ ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చాడు. 1996లో మార్క్ వా తర్వాత ఆసియాలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో రెండు సెంచరీలు చేసిన తొలి ఆసీస్ బ్యాట్స్‌మన్‌గా ఫించ్ ఘనత వహించాడు. మూడో వన్డే అబుదాబిలో బుధవారం జరుగుతుంది. -
సిరీస్ వేటలో మహిళలు
మౌంట్ మాంగనీ: న్యూజిలాండ్ గడ్డపై భారత పురుషుల జట్టు తమ హవా కొనసాగించి వన్డే సిరీస్‌ను గెలుచుకుంది. ఇదే సమయంలో అక్కడే ఉన్న మహిళల జట్టు కూడా సిరీస్ విజయంపై కన్నేసింది. నేపియర్‌లో జరిగిన తొలి మ్యాచ్‌ను సునాయాసంగా గెలుచుకున్న మిథాలీ సేన నేడు కివీస్‌తో రెండో వన్డేకు సన్నద్ధమైంది. గత మ్యాచ్‌లో మన అమ్మాయిలు ప్రత్యర్థిపై సంపూర్ణ ఆధిపత్యం కనబర్చారు. ఇదే జోరును కొనసాగిస్తే మరో విజయం ఖాయమవుతుంది. స్మృతి మంధాన అద్భుత సెంచరీకి తోడు జెమీమా రోడ్రిగ్స్ చెలరేగడంతో విజయం కోసం మరో బ్యాట్స్‌మన్ అవసరమే రాలేదు. మిథాలీ రాజ్, హర్మన్ ప్రీత్ కౌర్ కూడా జత కలిస్తే భారత్ భారీ స్కోరు చేసేందుకు అవకాశం ఉంటుంది. బౌలింగ్‌లో మన ముగ్గురు స్పిన్నర్లు ఏక్తా బిష్త్, పూనమ్ యాదవ్, దీప్తి శర్మ కివీస్‌ను పూర్తిగా కట్టి పడేశారు. వీరినుంచి మరోసారి అదే తరహా ప్రదర్శనను ఆశించవచ్చు. ఆల్‌రౌండర్లు హేమలత, శిఖా పాండేలతో పాటు వికెట్ కీపర్ తాన్యా భాటియా కూడా కీలకం కానుంది. అటు అగ్రశ్రేణి జట్టయిన న్యూజిలాండ్‌కు తొలి మ్యాచ్‌లో ఓటమి షాక్‌కు గురి చేసింది. ఆ మ్యాచ్‌లో జట్టు టాప్ ప్లేయర్ సుజీ బేట్స్, కెప్టెన్ సాటర్‌వెయిట్ మాత్రమే కొద్దిగా పోరాడగలిగారు. దీని నుంచి తొందరగా కోలుకొని సిరీస్ చేజారిపోకుండా చూడాలని న్యూజిలాండ్ భావిస్తోంది. సోఫీ డెవిన్, అమేలియా కెర్ ప్రదర్శనపై కూడా జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఐసీసీ ఉమెన్ చాంపియన్‌షిప్ (2017–21)లో భాగంగా జరుగుతున్న ఈ సిరీస్‌లో గెలిచే ప్రతీ మ్యాచ్ భారత్ ఖాతాలో పాయింట్లు చేరుస్తుంది. ఫలితంగా 2021 వన్డే వరల్డ్ కప్‌కు నేరుగా అర్హత పొందే అవకాశాలు మరింత మెరుగవుతాయి. కాబట్టి సిరీస్ కోణంలోనే కాకుండా భారత్‌కు ప్రతీ గెలుపు కీలకం కానుంది. ►ఉదయం గం.6.30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం -
కావాలి... మరో గెలుపు
అలవోక గెలుపుతో న్యూజిలాండ్ పర్యటనలో శుభారంభం చేసిన టీమిండియా... ఆ ఊపును రెండో మ్యాచ్‌లోనూ కొనసాగించేందుకు సమాయత్తం అవుతోంది. అటు బౌలర్లు, ఇటు బ్యాట్స్‌మెన్ సమష్టిగా రాణించడంతో కోహ్లి సేన ఆత్మవిశ్వాసం రెట్టింపైంది. తొలి వన్డేలో స్పిన్నర్ల ప్రతాపాన్ని రుచి చూసిన ఆతిథ్య న్యూజిలాండ్... ఆ మేరకు తమ కూర్పులో మార్పుతో బరిలో దిగనుంది. ఆధిక్యాన్ని మరింత పెంచుకోవాలని భారత్ భావిస్తుండగా... సొంతగడ్డపై పట్టు జారకుండా చూసుకునే ప్రయత్నంలో కివీస్ ఉంది. మౌంట్ మాంగనీ: సాదాసీదాగా సాగి... తక్కువ స్కోర్లతో అభిమానులను నిరుత్సాహపరిచింది తొలి వన్డే. అయితే, పరుగుల వరద పారే పిచ్‌తో ఆ లోటును సంపూర్తిగా తీర్చేందుకు సిద్ధమైంది మౌంట్ మాంగనీలోని మైదానం. ఈ నెల ప్రారంభంలో ఇక్కడ జరిగిన మ్యాచ్‌ల స్కోర్లను పరిశీలిస్తే... భారత్, న్యూజిలాండ్ మధ్య శనివారం నాటి రెండో వన్డే ప్రేక్షకులను కనువిందు చేయనుండటం ఖాయంగా కనిపిస్తోంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1–0 ఆధిక్యంలో ఉన్న టీమిండియా గత మ్యాచ్ జట్టునే కొనసాగించనుండగా, న్యూజిలాండ్ పేసర్ టిమ్ సౌతీ స్థానంలో స్పిన్నర్ ఇష్ సోధిని ఆడించే అవకాశం కనిపిస్తోంది. మంచి బ్యాట్స్‌మెన్ ఉన్నప్పటికీ నేపియర్‌లో తడబడి కుప్పకూలిన కివీస్... ఈసారి భారత బౌలర్లను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. మార్పేమీ లేకుండా... ఆస్ట్రేలియాతో చివరి వన్డేకు తప్పించిన అంబటి రాయుడును అనూహ్యంగా న్యూజిలాండ్‌తో తొలి వన్డే ఆడించారు. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా బదులు కుల్దీప్ను ఎంచుకున్నారు. ఈ అవకాశాన్ని కుల్దీప్ ఉపయోగించుకున్నాడు. ఇక రాయుడిపై మరోసారి నమ్మకం ఉంచుతూ మార్పుల్లేకుండా రెండో వన్డే ఆడనుంది టీమిండియా. మరోవైపు ఓపెనర్లలో ధావన్ ఫామ్‌లోకి రావడం శుభపరిణామం. 4, 5 వన్డేలు, టి 20 సిరీస్‌కు సారథ్యం చేపట్టనున్నందున ఓపెనర్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో రాణించాల్సిన అవసరం ఉంది. ఆసీస్‌పై తొలి వన్డేలో సెంచరీ తర్వాత అతడు మళ్లీ స్థాయికి తగిన ఇన్నింగ్స్ ఆడలేదు. ఇక్కడి బ్యాటింగ్ పిచ్‌పై వీరిద్దరూ మంచి ప్రారంభం ఇస్తే... కెప్టెన్ విరాట్ కోహ్లి సహా తర్వాత వచ్చే బ్యాట్స్‌మెన్ దానిని మరింత పైకి తీసుకెళ్లే వీలుంటుంది. పేసర్ మొహమ్మద్ షమీ బౌలింగ్ పదునేంటో నేపియర్‌లో కివీస్‌కు తెలిసొచ్చింది. అతడితో పాటు భువనేశ్వర్‌ను ప్రత్యర్థి ఎదుర్కొనలేకపోయింది. వీరితో పాటు కుల్దీప్, యజువేంద్ర చహల్ మణికట్టు స్పిన్ మాయతో చుట్టేస్తే ఆతిథ్య జట్టుకు ఇక్కట్లు తప్పవు. స్పిన్నర్‌కు అవకాశం ఫ్లాట్ పిచ్‌పై ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే తొలి వన్డేలో కివీస్ కుప్పకూలింది. సొంతగడ్డపై చెలరేగుతారని ఊహించిన బ్యాట్స్‌మెన్ కనీస స్కోర్లూ చేయకలేకపోయారు. కెప్టెన్ విలియమ్సన్ ఒక్కడే పోరాడాడు. రెండో వన్డేలో భారత బౌలింగ్ దళానికి విధ్వంసక గప్టిల్, మున్రో, రాస్ టేలర్, నికోల్స్ ఎలా జవాబిస్తారో చూడాలి. నలుగురు పేసర్లతో బరిలో దిగినా, స్కోరు బోర్డుపై పెద్దగా పరుగులు లేకపోవడంతో వారు చేసేదేమీ లేకపోయింది. భారత స్పిన్నర్ల బౌలింగ్ తీరు చూశాక పొరపాటును గ్రహించినట్లుంది. దీంతో శనివారం మ్యాచ్‌కు సౌతీని తప్పించి స్పిన్నర్ సోధిని ఆడించనుంది. ఏదేమైనా బ్యాట్స్‌మెన్ రాణింపుపైనే న్యూజిలాండ్ విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. పిచ్, వాతావరణం మౌంట్ మాంగనీ పిచ్ బ్యాటింగ్‌కు పూర్తిగా అనుకూలం. ఇటీవల న్యూజిలాండ్–శ్రీలంక మధ్య ఇక్కడ జరిగిన రెండు వన్డేల్లోనూ పరుగులు పోటెత్తాయి. తొలుత పేసర్లకు అనుకూలించినా, మ్యాచ్ సాగేకొద్దీ వారి ప్రభావమూ నామమాత్రమే అవుతుంది. ►ఈ మైదానంలో భారత్, కివీస్ తొలిసారి తలపడనున్నాయి. న్యూజిలాండ్ మాత్రం ఈ వేదికపై ఆరు మ్యాచ్‌లు ఆడింది. మూడింటిలో గెలిచి, మరో మూడింటిలో ఓడిపోయింది. తుది జట్లు అంచనా భారత్: రోహిత్, ధావన్, కోహ్లి (కెప్టెన్), రాయుడు, ధోని, జాదవ్, శంకర్, కుల్దీప్, చహల్, భువనేశ్వర్, షమీ. న్యూజిలాండ్: గప్టిల్, మున్రో, విలియమ్సన్ (కెప్టెన్), రాస్ టేలర్, లాథమ్, నికోల్స్, సాన్‌ట్నర్, సౌతీ/సోధి, ఫెర్గూసన్, బ్రాస్‌వెల్, బౌల్ట్. ► ఉదయం 7.30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం -
దక్షిణాఫ్రికా గెలుపు
డర్బన్: పాకిస్తాన్‌తో మంగళవారం జరిగిన రెండో వన్డేలో దక్షిణాఫ్రికా ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత పాకిస్తాన్ 45.5 ఓవర్లలో 203 పరుగులకు ఆలౌటైంది. హసన్ అలీ (45 బంతుల్లో 59; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), సర్ఫరాజ్ అహ్మద్ (41; 2 ఫోర్లు) రాణించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఫెలుక్వాయో (4/22) ఆకట్టుకున్నాడు. అనంతరం దక్షిణాఫ్రికా 42 ఓవర్లలో 5 వికెట్లకు 207 పరుగులు చేసి విజయం సాధించింది. వాన్ డెర్ డసెన్ (80 నాటౌట్; 9 ఫోర్లు), ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఫెలుక్వాయో (69 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేశారు. వీరిద్దరు ఆరో వికెట్‌కు అజేయంగా 127 పరుగులు జోడించారు. ఈ ఫలితంతో ఐదు వన్డేల సిరీస్‌లో రెండు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. మూడో వన్డే సెంచూరియన్ పార్క్‌లో శుక్రవారం జరుగుతుంది. -
టీమిండియా లక్ష్యం 299
అడిలైడ్: భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. టీమిండియాకు 299 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. షాన్ మార్ష్ సెంచరీకి మ్యాక్స్‌వెల్ మెరుపులు తోడవడంతో ఆసీస్ మంచి స్కోరు సాధించింది. మార్ష్ 123 బంతుల్లో 11 ఫోర్లతో 3 సిక్సర్లతో 131 పరుగులు చేశాడు. మ్యాక్స్‌వెల్ 37 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌తో 48 పరుగులు బాదాడు. అలెక్స్ క్యారీ 18, ఖవాజా 21, పీటర్ హ్యాండ్స్కోంబ్ 20, స్టొయినిస్ 29, లయన్ 12 పరుగులు చేశారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 4, మహ్మద్ షమి 3 వికెట్లు పడగొట్టారు. జడేజా ఒక వికెట్ తీశాడు. -
అడిలైడ్ వన్డే; మార్ష్ హాఫ్ సెంచరీ
అడిలైడ్: భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో ముందుగా బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా నిలకడగా ఆడుతోంది. స్వల్ప స్కోరుకే ఓపెనర్లు ఇద్దరూ అవుటయినప్పటికీ షాన్ మార్ష్ అర్ధ సెంచరీతో ఆసీస్ కోలుకుంది. మార్ష్ 62 బంతుల్లో 4 ఫోర్లతో హాఫ్ సెంచరీ చేశాడు. ఖావాజా, పీటర్ హ్యాండ్స్కోంబ్లతో కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. హ్యాండ్స్కోంబ్(20) నాలుగో వికెట్‌గా వెనుదిరిగాడు. ఆసీస్ 30 ఓవర్లలో 141/4 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది. మార్ష్ 65, స్టొయినిస్ 3 పరుగులతో ఆడుతున్నారు. 26 పరుగులకే ఓపెనర్లు ఇద్దరూ అవుటయ్యారు. ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ మరోసారి విఫలమ్యాడు. కేవలం 6 పరుగులు మాత్రమే చేసి భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. 18 పరుగులు చేసిన మరో ఓపెనర్ అలెక్స్ క్యారీని మహ్మద్ షమి పెవిలియన్‌కు పంపాడు. టాస్ గెలిచి ఆస్ట్రేలియా ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నాడు. వరుసగా రెండోసారి ఫస్ట్ బ్యాటింగ్ చేసే అవకాశం రావడం పట్ల అతడు సంతృప్తి వ్యక్తం చేశాడు. సిడ్నీలో రాణించినట్టుగానే ఇక్కడ కూడా సత్తా చాటుతామన్నాడు. ఆస్ట్రేలియా జట్టు ఎటువంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతోంది. భారత జట్టులో ఒక మార్పు జరిగింది. ఖలీల్ అహ్మద్ స్థానంలో హైదరాబాద్ కుర్రాడు మహ్మద్ సిరాజ్ చోటు దక్కించుకున్నాడు. (లెక్క సరిచేస్తారా!) తుది జట్లు భారత్: శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి(కెప్టెన్), అంబటి రాయుడు, దినేశ్ కార్తిక్, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమి, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ సిరాజ్ ఆస్ట్రేలియా: ఆరోన్ ఫించ్(కెప్టెన్), అలెక్స్ క్యారీ(వికెట్ కీపర్), షాన్ మార్ష్, ఉస్మాన్ ఖావాజా, పీటర్ హ్యాండ్స్కోంబ్, మార్కస్ స్టొయినిస్, మ్యాక్స్‌వెల్, రిచర్డ్సన్, లయన్, పీటర్ సిడిల్, జాసన్ బెహ్రిన్డార్ఫ్ -
విండీస్‌ను గెలిపించిన షై హోప్
ఢాకా: ఓపెనర్ షై హోప్ (144 బంతుల్లో 146 నాటౌట్; 12 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ శతకంతో కడదాకా నిలవడంతో బంగ్లాదేశ్‌తో ఇక్కడ జరిగిన రెండో వన్డేలో వెస్టిండీస్ నాలుగు వికెట్లతో గెలుపొందింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లకు 255 పరుగులు చేసింది. ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ (50), వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీమ్ (62), ఆల్‌రౌండర్ షకిబుల్ హసన్ (65) అర్ధశతకాలు సాధించారు. ఒషేన్ థామస్ (3/54) కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి భారీ స్కోరు చేయకుండా చూశాడు. ఛేదనలో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ హోప్ దాదాపు ఒంటరి పోరాటం చేశాడు. డారెన్ బ్రేవో (27), మార్లోన్ శామ్యూల్స్ (26) ఫర్వాలేదనిపించగా, హేమ్రాజ్ (3), హెట్‌మైర్ (14), రావ్మన్ పావెల్ (1), ఛేజ్ (9) విఫలమయ్యారు. 185 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన స్థితిలో హోప్‌కు కీమో పాల్ (18 నాటౌట్) అండగా నిలిచాడు. దీంతో విండీస్ 49.4 ఓవర్లలో 256 పరుగులు చేసి విజయాన్నందుకుంది. రెండు జట్ల మధ్య మొదటి వన్డేలో బంగ్లాదేశ్ నెగ్గింది. సిరీస్‌లో నిర్ణయాత్మకమైన మూడో వన్డే శుక్రవారం జరుగనుంది. -
బ్రాడ్‌మన్ తర్వాత కోహ్లినే!
రెండో వన్డే ‘టై’గా ముగియడం నా దృష్టిలో సరైన ఫలితమే. ఎందుకంటే ఇరు జట్ల బౌలర్లు కూడా తమ జట్టును గెలిపించే స్థాయి ప్రదర్శన ఇవ్వలేదు. కెప్టెన్లు ఇద్దరూ తమ బౌలింగ్ బలగాల గురించి ఆందోళన చెందుతూ ఉండవచ్చు. ఇంతకుముందే చెప్పుకున్నట్లుగా టి20 క్రికెట్ ప్రభావం వల్ల వన్డేల్లో కూడా జోరు పెరిగింది. ఒక జట్టు 300 పరుగుల స్కోరు సాధించడం గతంలోలాగా అరుదుగా కాకుండా ఇప్పుడు చాలా సహజంగా మారిపోయింది. విరాట్ కోహ్లి బ్యాటింగ్ చేస్తున్న తీరు చూస్తుంటే అతను మానవమాత్రుడిలా కనిపించడం లేదని కొద్ది రోజుల క్రితం బంగ్లాదేశ్ బ్యాట్స్‌మన్ తమీమ్ ఇక్బాల్ వ్యాఖ్యానించాడు. అతని మాటలు ఇప్పుడు నిజంలాగే అనిపిస్తున్నాయి. స్విచ్ వేయగానే యంత్రం పని చేయడం ప్రారంభించినట్లు కోహ్లి పరుగులు చేసేస్తున్నాడు. కోహ్లి నిలకడ గురించి చెప్పాలంటే అద్భుతం అనే మాట కూడా సరిపోదు. అయితే దీనికి మించి అతను పరిస్థితులను అర్థం చేసుకుంటూ జట్టుకు ఏది అవసరమో దాని ప్రకారం తన ఆటను మార్చుకుంటూ ఆడటమే మరింత పెద్ద విశేషం. అతను బ్యాటింగ్‌కు వెళుతున్నాడంటే చాలు కచ్చితంగా సెంచరీ సాధిస్తాడనే విషయంలో కించిత్ కూడా సందేహం కనిపించడం లేదు. గతంలో ఇలాంటి స్థితి ఒక్క సర్ డాన్ బ్రాడ్‌మన్ విషయంలోనే కనిపించేది. నాడు బ్రాడ్‌మన్ మైదానంలోకి దిగుతుంటే చూడచక్కగా స్టైల్‌గా కనిపించేది. ఇప్పుడు కోహ్లి తనదైన శైలిలో గంభీరంగా, ఆత్మవిశ్వాసంతో వెళుతుంటే ప్రత్యర్థి ఆటగాళ్లు అతని కళ్లల్లో కళ్లు పెట్టి చూసే ధైర్యం కూడా చేయడం లేదు. అయితే భారత జట్టు ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో మ్యాచ్‌లో మలుపులు సాగుతున్నప్పుడు మాత్రం తన భావోద్వేగాలను ప్రదర్శిస్తూ కోహ్లి మామూలు మానవుడిలా కనిపిస్తున్నాడు. వెస్టిండీస్‌ను ఈసారి 300లోపు కట్టడి చేసే బౌలింగ్ బలగం భారత్‌కు ఉందని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు. గత మ్యాచ్లకంటే ఈసారి మరింత మెరుగ్గా ఫీల్డింగ్ చేయాలని కూడా జట్టు భావిస్తోంది. రనౌట్‌కు అవకాశం లేకున్నా అనవసరంగా స్టంప్స్‌పైకి బంతిని విసిరే అలవాటుపై కూడా టీమ్ మేనేజ్మెంట్ దృష్టి పెట్టాల్సి ఉంది. -
బంగ్లాను గెలిపించిన కైస్, దాస్
చిట్టగాంగ్: ఓపెనర్లు ఇమ్రూల్ కైస్ (90; 7 ఫోర్లు), లిటన్ దాస్ (83; 12 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో బంగ్లాదేశ్ రెండో వన్డేలో 7 వికెట్ల తేడాతో జింబాబ్వేపై గెలిచింది. మరో వన్డే మిగిలుండగానే మూడు వన్డేల సిరీస్‌ను 2–0తో కైవసం చేసుకుంది. బుధవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట జింబాబ్వే 50 ఓవర్లలో 7 వికెట్లకు 246 పరుగులు చేసింది. బ్రెండన్ టేలర్ (75; 9 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ సాధించాడు. విలియమ్స్ (47; 2 ఫోర్లు), సికందర్ రజా (49; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. తర్వాత లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ 44.1 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 250 పరుగులు చేసింది. నేడు చివరి వన్డే జరుగుతుంది. -
వైజాగ్మే సవాల్..
సన్నాహాలు పూర్తయ్యాయి. పోరుకు వ్యూహాలూ సిద్ధమయ్యాయి. ఇక సమరమే తరువాయి. అందుకు భారత, వెస్టిండీస్ క్రికెట్‌జట్లు కాలుదువ్వుతున్నాయి. పది నెలల విరామం తర్వాత విశాఖలో జరగబోతున్న వన్డేను ప్రత్యక్షంగా చూడాలని, ఆ ఆనందం మనసారా అనుభవించాలని వేలాది మంది అభిమానుల కళ్లు కలలు కంటున్నాయి. బుధవారం జరగబోయే డేనైట్ కదనం ఫలితం సంగతి అటుంచితే.. మ్యాచ్ రంజుగా సాగాలని.. కొన్న టిక్కెట్టుకు రెట్టింపుగా వినోదం సమకూరాలని అందరి హృదయాలూ ఆశిస్తున్నాయి... ఏ దిల్ మాంగే మోర్ అంటున్నాయి. విశాఖ స్పోర్ట్స్: ఒకటి మీరు.. ఒకటి మేం.. మరి మూడో మ్యాచ్‌లో ఎవరిది పైచేయి? అన్నట్టుగా భారత, వెస్టిండీస్ జట్లు సమరానికి సిద్ధమయ్యాయి. విశాఖలో ప్రస్తుతానికి ఆధిక్యమెవరిదో తేల్చుకునే ధ్యేయంతో బరిలోకి దిగుతున్నాయి. ఇందుకోసం బుధవారం జరగనున్న వన్డే క్రికెట్ మ్యాచ్‌కు ఏర్పాట్లు పక్కాగా పూర్తయ్యాయి. ఇక్కడి వైఎస్ఆర్ స్టేడియంలో ఇరుజట్లు రెండు సార్లు తలపడగా చెరో విజయం లభించిన సంగతి తెలిసిందే. ఒక మ్యాచ్ తుపాను కారణంగా రద్దయింది. ఇప్పుడు సిరీస్‌లో రెండో వన్డేలో ఇరు జట్లూ తలపడబోతున్నాయి. మొదటి వన్డేలో ధాటిగా గెలిచిన భారత్ మంచి ఊపు మీద ఉన్న సంగతి తెలిసిందే. అయితే ధాటిగా బ్యాటింగ్ చేసి 300కు పైగా పరుగులు చేసిన వెస్టిండీస్ తమ చాన్స్ కోసం ఆరాటపడుతోంది. ధాటిగా విండీస్ ప్రాక్టీస్ ఈ మ్యాచ్‌లోనైనా సత్తా చూపించాలన్న పట్టుదలతో ఉన్న వెస్టిండీస్ జట్టు మంగళవారం నెట్స్‌లో గట్టిగా కసరత్తు చేసింది.ఉదయాన్నే వెస్టిండీస్ జట్టు వైఎస్సార్ స్టేడియంలోని నెట్స్‌లో చెమటోడ్చింది. భారత్ జట్టు మధ్యాహ్నం నెట్స్‌లో ప్రాక్టీస్ చేసినా అంత సీరియస్‌నెస్ కనిపించలేదు. తొలి మ్యాచ్‌లో సెంచరీ వీరులు విరాట్‌కోహ్లి, రోహిత్ శర్మ ప్రాక్టీస్‌కు డుమ్మా కొట్టేశారు. అయితే ధోనీ మాత్రం సీరియస్‌గానే ప్రాక్టీస్ చేసాడు. ఉమేష్, షమి, చాహాల్, ఖలీల్ బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తే శిఖర్, రవీంద్ర బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. అంబటి రాయుడు నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తూండగా స్థానిక బౌలర్‌కు నేరుగా బంతి తగలడంతో గాయమైంది. అతడిని భారత జట్టు చీఫ్ సెలక్టర్ ఎంఎస్కే ప్రసాద్ అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. కోహ్లీపై చూపు స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ అతివేగంగా పదివేల పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా రికార్డుల్లోకి ఎక్కనున్నాడు. 204 ఇన్నింగ్స్‌లో విరాట్ ఇప్పటికే 9919 పరుగులు చేసేశాడు. మరో 81 పరుగులు చేస్తే ఈ రికార్డు సొంతం కానుంది. విశాఖ వేదికపై హాట్రిక్ సెంచరీల రికార్డును కోహ్లీ గతంలో వెంట్రుక వాసి తేడాలో చేజార్చుకున్న సంగతి తెలిసిందే. 99 పరుగుల స్కోర్ వద్ద అతడు అవుటై అభిమానులను నిరాశపరిచాడు. ఈసారి పదివేల పరుగుల మార్కును ఇక్కడే అందుకోవాలని అంతా ఆశపడుతున్నారు. మరి అభిమానుల ఆశలు ఏమేరకు నెరవేరనున్నాయో.వన్డేల్లో అత్యంత వేగంగా ఐదువేల పరుగులు చేసిన రికార్డు సాధించేందుకు శిఖర్ ధావన్ మరో 173 పరుగుల దూరంలో ఉన్నాడు. రోహిత్ మరో సిక్స్ కొడితే వన్డేల్లో తెండుల్కర్ బాదేసిన 195 సిక్స్‌ల రికార్డు సమం చేస్తాడు. అయితే ధోనీ ఇప్పటికే 217 సిక్స్‌లు బాదేసిన విషయం గుర్తుంచుకోవాలి. భారీ ఎత్తున పోలీస్ బందోబస్తు పీఎంపాలెం(భీమిలి): వైఎస్సార్ క్రికెట్ స్టేడియంలో భారత్–వెస్టిండీస్ జట్ల మధ్య బుధవారం జరగనున్న రెండో వన్డే మ్యాచ్ సందర్భంగా నగర కమిషనర్ మహేష్‌చంద్ర లడ్డా ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రశాంతంగా మ్యాచ్ నిర్వహణకు అవసరమైన పూర్తి స్థాయి చర్యలు చేపట్టారు. మొత్తం 1400 మంది పోలీసు సిబ్బందిని నియమించగా.. లా అండ్ ఆర్డర్ నుంచి 600 మంది, ట్రాఫిక్ విభాగం నుంచి 600 మంది, హోమ్ గార్డులు 200 మంది బందోబస్తు నిర్వహించనున్నారు. స్టేడియం చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటుచేశారు. స్టేడియం చుట్టూ ఉన్న 20 గేట్ల వద్ద విధులు నిర్వహించే పోలీసుల వివరాలను బుధవారం సాయంత్రం స్థానిక సీఐ కె.లక్ష్మణమూర్తి సీపీ ఆదేశాల మేరకు ప్రకటించారు. స్టేడియంలోని ఎంట్రీ గేట్లను 14 సెక్టార్లుగా విభజించి డీఎస్పీ స్థాయి అధికారులను ఇన్చార్జిలుగా నియమించారు. గాయల కారణంగా అవకాశాలు మిస్ మిడిలార్డర్‌కు ఇదో చాలెంజ్...టాప్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్ గావుంది. గాయాల బరిన పడటంతో కొంత వెనుకబడ్డాను. మళ్లీ మంచి అవకాశం కలిగింది. తొలివన్డేలో రాణించడం జట్టులో తిరిగి నిలదొక్కుకున్నట్లయ్యింది. జట్టు పూర్తి సన్నద్దతతో ఉంది. –అంబటి రాయుడు, బ్యాట్స్‌మన్ (ప్రీ మ్యాచ్ సెషన్లో..) బౌలర్లపైనే బాధ్యత మా బౌలర్లు మరింత మెరుగైన ప్రదర్శన చూపాలి. బౌలింగ్ పదును తేరాలి. కొత్త బంతితో మరిన్ని వికెట్లు తీయాలి. మొదటి వన్డేలో మేం కొత్త బంతితో ఒక్క వికెట్టు తీయగలిగాం. మరిన్ని వికెట్లు సాధించి ఉంటే ప్రత్యర్థి మీద ఒత్తిడి పెరిగేది. –హోల్డర్ , వెస్టిండీస్ కెప్టెన్ క్రీడాకారులకుఈరోజు పండగ మావంటి క్రీడాకారులకు మ్యాచ్ జరిగే రోజే పండగ. అన్ని పండగల సంగతలా ఉం చితే.. క్రికెట్ మ్యాచ్ జరిగిన రోజు మాకు పర్వదినంలా ఉంటుంది. పైగా ఇలాటి స్టేడియం మా ప్రాంతంలో ఉండడం సంబరంగా ఉం టుంది.–పిళ్లా నర్శింగరావు, మధురవాడ ఆనందానికి హద్దులేదు అమ్మయ్య.. మ్యాచ్‌కు టిక్కెట్టు దొరికింది. ఈ మ్యాచ్ చూడడం కోసం ఎస్. కోట నుండి మా పిన్ని ఇంటికి వచ్చాను. కొన్ని గంటల్లో మ్యాచ్ చూడబోతున్న సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతున్నాను. –యుగంధర్, క్రీడాభిమాని, ఎస్. కోట -
విశాఖలోనేనా కోహ్లి ‘పది’నిసలు?
సాక్షి, విశాఖపట్నం: విశాఖ మైదానంతో పాటు, వెస్టిండీస్‌తో రెండో వన్డే భారత సారథి విరాట్ కోహ్లికి మరుపురానివిగా మిగిలే అవకాశం ఉంది. ఇక్కడ ఇప్పటికే ఆడిన నాలుగు వన్డే మ్యాచ్‌ల్లో 118, 117, 99, 65 పరుగులు చేసిన అతడు... మరో 81 పరుగులు చేస్తే చాలు వన్డేల్లో 10 వేల పరుగులు సాధించిన ఐదో భారత క్రికెటర్‌గా రికార్డు పుటల్లోకి ఎక్కుతాడు. అంతేకాకుండా అత్యంత వేగంగా (205 ఇన్నింగ్స్‌ల్లో) ఈ ఘనత సాధించిన బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందుతాడు. వన్డేల్లో తొలిసారి 10 వేల పరుగుల మైలురాయి అందుకున్న దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్‌కు ఇందుకు 259 ఇన్నింగ్స్ పట్టాయి. ప్రస్తుతం కోహ్లి ఫామ్ చూస్తే అరుదైన ఘనతకు విశాఖ వేదిక కావడం ఖాయంగా కనిపిస్తోంది. -
ఊపులోనే ఊదేయాలి
ఏక పక్షంగా సాగుతున్న భారత్–వెస్టిండీస్ సిరీస్‌లో నేడు మరో మ్యాచ్. సాగర తీర అందాల నగరం విశాఖపట్నం వేదికగా బుధవారం రెండో వన్డే. బెబ్బులిలా విరుచుకుపడుతున్న కోహ్లి సేన... ఘనమైన రికార్డున్న మైదానంలో ఇంకో విజయాన్ని ఖాతాలో వేసుకోవాలని ఆశిస్తుండగా, ఎంత ప్రయత్నించినా కనీస పోటీ ఇవ్వలేకపోతున్న హోల్డర్ బృందం... ఇక్కడ తమకు ఐదేళ్ల క్రితం అదృష్టవశాత్తు దక్కిన గెలుపును ఊహించుకుంటూ ఆశావహంగా బరిలో దిగుతోంది. కానీ, వరుస పరాజయాలతో డీలాపడి, టీమిండియా ముందు మరీ పసికూనలా కనిపిస్తున్న పర్యాటక జట్టుకు ఇదేమంత సులభం కాబోదు. అయితే, పరిమిత ఓవర్ల క్రికెట్లో ఎప్పుడైనా చెలరేగే ఆటగాళ్లున్న విండీస్‌పై ఓ కన్నేసి ఉంచడం ఎందుకైనా మంచిది! సాక్షి, విశాఖపట్నం: వరుసగా మూడు (రెండు టెస్టులు, తొలి వన్డే) ఘోర పరాజయాలు! వీటిలో వన్డేలో కొంత ప్రతిఘటన కనబర్చినా, టీమిండియా హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ, కెప్టెన్ విరాట్ కోహ్లి బ్యాటింగ్ జోరుతో అది మరుగున పడింది. విజయానికి మొహం వాచిన పరిస్థితుల్లో వెస్టిండీస్‌కు కొంత మానసిక బలాన్నిస్తోంది 2013 నాటి విశాఖపట్నం వన్డే విజయమే. కానీ, అప్పటి కథ వేరు! నేటి సంగతి వేరు కోహ్లి సేన తాజా దూకుడు చూస్తుంటే... అదృష్టవశాత్తు నాడు దక్కిన ఆ గెలుపును విండీస్ కనీసం ఊహించలేని దైన్యం. ఈ నేపథ్యంలో మరో సాధికార ప్రదర్శనతో... ఇక్కడి డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ–వీడీసీఏ మైదానంలో ప్రత్యర్థిని చుట్టేసేందుకు సిద్ధమవుతోంది మన జట్టు. ఆ ఒక్క మార్పుతో... గువాహటి వన్డేలో టీమిండియా ఇబ్బంది పడింది బౌలింగ్‌లోనే. పిచ్ బ్యాటింగ్‌కు సహకరించింది కాబట్టి బౌలర్లను పూర్తిగా తప్పుపట్టలేం. విశాఖలో మిగతా జట్టును యథాతథంగా కొనసాగించినా, ఒక బౌలర్‌ను మార్చే సూచన ఉంది. దీన్నిబట్టి చైనామన్ కుల్దీప్ను ఆడించొచ్చని తెలుస్తోంది. అయితే, అతడిని జడేజా స్థానంలో తీసుకుంటారా? లేక ఖలీల్ అహ్మద్‌ను తప్పించి తీసుకుంటారా? అనేది తెలియాల్సి ఉంది.ఆల్‌రౌండ్ నైపుణ్యాన్ని పరిగణిస్తే జడేజాకు చోటుంటుంది. కానీ, కోహ్లి... ఎడమచేతి వాటం పేసర్ ఖలీల్‌ను పరీక్షించి చూద్దామనుకుంటున్నాడు. తొలి మ్యాచ్‌లో మిగతా ఇద్దరి కంటే ఈ యువ పేసరే కొంత ఫర్వాలేదనిపించాడు. ప్రధాన పేసర్లు షమీ, ఉమేశ్‌తో పాటు అతడికి మరో అవకాశం దక్కొచ్చు. వీరితో పాటు చహల్ రాణిస్తే విండీస్ బ్యాట్స్‌మెన్‌కు కళ్లెం పడినట్లే. బ్యాటింగ్‌లో టాప్ త్రయం ధావన్, రోహిత్, కోహ్లిలను కట్టడి చేయడం విండీస్‌కు తలకు మించిన భారమే. వీరు భారీ స్కోర్లు చేయడంలో విఫలమైతేనే రాయుడు, పంత్, ధోనిలకు పూర్తి స్థాయిలో బ్యాటింగ్‌కు అవకాశం దక్కుతుంది. ఆ విధంగా చూసినా, మిడిలార్డర్ సత్తాను పరీక్షకు గురిచేసే ఈ పరిణామం భారత్‌కు ఒకింత మేలే. ‘విన్’డీస్ బెంగ తీరేదెలా? భారీ స్కోరు చేసి మరీ... తొలి వన్డేను మరో 8 ఓవర్లు ఉండగానే సమర్పించుకున్న వెస్టిండీస్‌కు సిరీస్ రానురాను గండమే అన్నట్లుంది. గువాహటిలో ఆ జట్టు బౌలర్లు చేష్టలుడిగిపోయారు. దీంతో విశాఖలో పేస్ మేళవింపు మార్చే యోచనలో ఉంది. అయితే, సీనియర్ కీమర్ రోచ్‌కు జతగా పేస్ భారాన్ని పంచుకునేదెవరో స్పష్టం కావాల్సి ఉంది. బహుశా ఒషేన్ థామస్‌ను కాదని అల్జారి జోసెఫ్, కీమో పాల్లలో ఒకరికి చోటివ్వచ్చు. స్పిన్‌లో ఆష్లే నర్స్‌ను తప్పించి ఫాబియాన్ అలెన్‌ను దింపే అవకాశం ఉంది. ఇక బ్యాటింగ్‌లోనూ కొంత నిలకడ అవసరమే. అత్యంత అనుభవజ్ఞుడైన మార్లోన్ శామ్యూల్స్ తొలి వన్డేలో ఖాతా తెరవలేకపోయాడు. హేమ్రాజ్ విఫలమయ్యాడు. హెట్‌మైర్ మెరుపు శతకమే జట్టును కాపాడింది. ఓపెనర్ కీరన్ పావెల్, షై హోప్ నాణ్యమైన బ్యాట్స్‌మెనే. భారీ ఇన్నింగ్స్ ఆడగలరు. వీరికి కెప్టెన్ హోల్డర్, రావ్మన్ పావెల్ తోడైతే జట్టు ఎంతటి పెద్ద లక్ష్యాన్నైనా ఛేదించగలదు. ముందుగా బ్యాటింగ్ చేసినా వీరిని నిలువరించడం ముఖ్యమే. ప్రాక్టీస్‌కు విరాట్ కోహ్లి దూరం... మంగళవారం విండీస్ ఆటగాళ్లందరూ ప్రాక్టీస్‌కు హాజరయ్యారు. భారత టీమ్ మేనేజ్మెంట్ మాత్రం ఆప్షనల్ ప్రాక్టీస్æ సెషన్ నిర్వహించడంతో కెప్టెన్ విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, పేస్ బౌలర్లు ప్రాక్టీస్‌కు దూరంగా ఉన్నారు. ధోని, రిషభ్ పంత్, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, కుల్దీప్, మనీశ్ పాండే, ధావన్ ప్రాక్టీస్ చేశారు. ఈ మైదానంలో జరిగిన ఏడు వన్డేల్లోనూ టాస్ గెలిచిన జట్టే విజయం సాధించింది. నేటి మ్యాచ్ భారత్‌కు 950వ వన్డే కానుంది. ఇప్పటివరకు 949 వన్డేలు ఆడిన భారత్ 490 మ్యాచ్‌ల్లో గెలిచి, 411 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 8 మ్యాచ్‌లు ‘టై’కాగా... 40 మ్యాచ్‌ల్లో ఫలితం రాలేదు. భారత్ తర్వాత వరుసగా ఆస్ట్రేలియా (916), పాకిస్తాన్ (899) ఉన్నాయి. అచ్చొచ్చిన చోట... విశాఖపట్నం...ధోని! 13 ఏళ్ల క్రితం ఈ రెండు పేర్లూ ఒకేసారి మార్మోగాయి. ఇక్కడి స్టేడియంలో 2005లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో వన్డేలో ధోని ఆడిన ఇన్నింగ్స్ అలాంటిది మరి! ఆ మ్యాచ్‌లో సుడిగాలిలా చెలరేగిన ధోని 148 పరుగులు చేసి ప్రపంచానికి తనను తాను పరిచయం చేసుకున్నాడు. తాజాగా వెస్టిండీస్‌తో రెండో వన్డే ఆడేందుకు వచ్చిన మహి... మంగళవారం మైదానంలోకి వెళ్లి పిచ్‌ను పరిశీలించాడు.గ్రౌండ్స్‌మెన్‌తో కాసేపు ముచ్చటించాడు. ఈ సందర్భంగా, ‘ఈ మైదానం, నగరంతో ప్రత్యేక అనుబంధం, జ్ఞాపకాలు ఉన్న రాజు ఇక్కడున్నాడు. మరిన్ని ఘనతలు రేపు నెలకొల్పనున్నాడు’ అంటూ బీసీసీఐ ట్వీట్ చేయడం గమనార్హం. మరోవైపు అచ్చొచ్చిన విశాఖను, స్థానిక ప్రకృతి అందాలను మహి గతంలో పలుసార్లు ప్రస్తావించాడు. మరో రెండు సిక్స్‌లు బాదితే... భారత్ తరఫున వన్డేల్లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన రెండో బ్యాట్స్‌మన్‌గా సచిన్ టెండూల్కర్ (195)ను వెనక్కి నెట్టి రోహిత్ శర్మ ముందుకొస్తాడు. భారత్ తరఫున అత్యధిక సిక్స్‌ల ఘనత ధోని (217) పేరిట ఉంది. -
రెండో వన్డేలో పాక్ గెలుపు
బులవాయో: ఓపెనర్ ఫఖర్ జమాన్ (117 నాటౌట్; 16 ఫోర్లు) అజేయ శతకంతో జింబాబ్వేతో రెండో వన్డేలో పాకిస్తాన్ 9 వికెట్లతో నెగ్గింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో పాక్ బౌలర్లు ఉస్మాన్ (4/36), హసన్ అలీ (3/32) ధాటికి జింబాబ్వే 49.2 ఓవర్లలో 194 పరుగులకే ఆలౌటైంది. అనంతరం పాక్ 36 ఓవర్లలో వికెట్ నష్టానికి 195 పరుగులు చేసి గెలిచింది. ఫఖర్ జమాన్... ఇమాముల్ హక్ (44)తో తొలి వికెట్‌కు 119 పరుగులు, ఆజమ్ (29 నాటౌట్)తో రెండో వికెట్‌కు 76 పరుగులు జోడించాడు. -
రెండో వన్డేలో ఇంగ్లండ్ జయభేరి
-
భారత్ జోరుకు బ్రేక్
లండన్: ఈసారి ఇంగ్లండ్ వంతు. ముందు బ్యాటింగ్‌లో గర్జించింది. తర్వాత బౌలింగ్‌లో బెంబేలెత్తించింది. భారత్ జోరుకు బ్రేక్ వేసింది. చివరకు రెండో వన్డేలో ఇంగ్లండ్ 86 పరుగుల తేడాతో టీమిండియాను మట్టికరిపించింది. మూడు వన్డేల సిరీస్‌ను 1–1తో సమం చేసింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది. జో రూట్ (116 బంతుల్లో 113; 8 ఫోర్లు, 1 సిక్స్) మోర్గాన్ (51 బంతుల్లో 53; 4 ఫోర్లు, 1 సిక్స్), విల్లే (31 బంతుల్లో 50 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. కుల్దీప్ 3 వికెట్లు తీశాడు. అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన భారత్ సరిగ్గా 50 ఓవర్లలో 236 పరుగులే చేసి ఆలౌటైంది. కోహ్లి (56 బంతుల్లో 45; 2 ఫోర్లు), రైనా (63 బంతుల్లో 46; 1 ఫోర్) పరువు నిలిచే స్కోరు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో ప్లంకెట్‌కు 4 వికెట్లు దక్కాయి. రూట్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. చివరి వన్డే 17న లీడ్స్‌లో జరగనుంది. ఓపెనర్ల శుభారంభం... టాస్ నెగ్గిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకోగా ఓపెనర్లు జేసన్ రాయ్ (42 బంతుల్లో 40; 4 ఫోర్లు, 1 సిక్స్), బెయిర్ స్టో (31 బంతుల్లో 38; 5 ఫోర్లు 1 సిక్స్) గత వన్డేలాగే శుభారంభం అందించారు. ఉమేశ్ తొలి ఓవర్ తొలి బంతికి బౌండరీతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన జేసన్ రాయ్ పేసర్లను అలవోకగా ఎదుర్కొన్నాడు. బెయిర్ స్టో కూడా యథేచ్ఛగా షాట్లు ఆడటంతో స్కోరు బోర్డు ఓవర్‌కు ఆరు పరుగులు చొప్పున కదిలింది. పది ఓవర్లు ముగిసే సరికి వికెట్ కోల్పోకుండా 69 పరుగులు చేసింది. ఈ దశలో కోహ్లి... కుల్దీప్ యాదవ్‌కు బంతి అప్పగించాడు. కెప్టెన్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతూ 11వ ఓవర్ రెండో బంతికే బెయిర్ స్టోను బోల్తా కొట్టించాడు. స్వీప్ షాట్‌కు ప్రయత్నించగా బంతి అతని ప్యాడ్లను తాకుతూ వెళ్లి లెగ్ స్టంప్‌ను పడేసింది. దీంతో 69 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత జేసన్‌కు జో రూట్ జతయ్యాడు. కానీ స్వల్ప వ్యవధిలోనే కుల్దీప్... జేసన్ వికెట్‌ను చేజిక్కించుకున్నాడు. మిడ్‌వికెట్ మీదుగా భారీషాట్‌కు ప్రయత్నించగా అక్కడే ఉన్న ఉమేశ్ క్యాచ్ అందుకున్నాడు. ఈ దశలో వచ్చిన మోర్గాన్, రూట్ జాగ్రత్తగా ఆడారు. ఇద్దరు క్రీజులో క్రమంగా పాతుకుపోవడంతో భారత బౌలర్లకు కష్టాలు తప్పలేదు. చూస్తుండగానే జట్టు స్కోరు 150కి చేరింది. రూట్ 56 బంతుల్లో (4 ఫోర్లు), మోర్గాన్ 49 బంతుల్లో (4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలు పూర్తిచేసుకున్నారు. మూడో వికెట్‌కు 103 పరుగులు జోడించాక జట్టు స్కోరు 189 పరుగుల వద్ద మోర్గాన్‌ను కుల్దీప్ పెవిలియన్ చేర్చాడు. తర్వాత వచ్చిన స్టోక్స్ (5), బట్లర్ (4) విఫలమయ్యారు. స్టోక్స్‌ను హార్దిక్ పాండ్యా, బట్లర్‌ను ఉమేశ్ ఔట్ చేశారు. మొయిన్ అలీ (13) కాసేపు నిలిచినా... చహల్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. 239 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఆరో వికెట్‌ను కోల్పోయింది. తర్వాత వచ్చిన విల్లే అండతో రూట్ 109 బంతుల్లో (8 ఫోర్లు) సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో అతనికిది 12వ సెంచరీ. విల్లే దాటిగా ఆడటంతో స్కోరు వేగం పుంజుకుంది. సిద్ధార్థ్ కౌల్ వేసిన 46వ ఓవర్లో విల్లే ఒక సిక్స్, రెండు ఫోర్లు బాదాడు. ఉమేశ్ వేసిన మరుసటి ఓవర్లో రెండు బౌండరీలు కొట్టిన విల్లే...అర్ధసెంచరీకి చేరువయ్యాడు. హార్దిక్ పాండ్యా వేసిన 48వ ఓవర్లో విల్లే ఫోర్, రూట్ భారీ సిక్సర్ బాదాడు. విల్లే 30 బంతుల్లోనే (5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ చేశాడు. ఇద్దరు అబేధ్యమైన ఏడో వికెట్‌కు 83 పరుగులు జోడించారు. చహల్, పాండ్యా, ఉమేశ్ తలా ఒక వికెట్ తీశారు. భారత్‌కు దెబ్బ మీద దెబ్బ... భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత ఓపెనర్లు రోహిత్ శర్మ (26 బంతుల్లో 15; 2 ఫోర్లు), ధావన్ (30 బంతుల్లో 36; 6 ఫోర్లు) ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ మొదలెట్టారు. అడపాదడపా బౌండరీలతో శుభారంభం ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఈ జోష్ ఎక్కువసేపు నిలువలేదు. 8 ఓవర్ల దాకా బాగానే ఆడిన ఓపెనర్లిద్దరూ వరుస ఓవర్లలో నిష్క్రమించడం ఇన్నింగ్స్‌ను దెబ్బతీసింది. మార్క్‌వుడ్ వేసిన ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్లో రోహిత్ భారీ షాట్ ఆడే ప్రయత్నంలో క్లీన్‌బౌల్డయ్యాడు. దీంతో 49 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యం ముగిసింది. విల్లే వేసిన మరుసటి ఓవర్లోనే ధావన్ కూడా పెవిలియన్ బాట పట్టాడు. అతను బ్యాక్వర్డ్ పాయింట్లో స్టోక్స్‌కు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. తదుపరి ఓవర్లో లోకేశ్ రాహుల్ ఖాతా తెరువకుండానే వెనుదిరిగాడు. ప్లంకెట్ బౌలింగ్‌లో బట్లర్ క్యాచ్ పట్టడంతో మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. జట్టు స్కోరు 60 పరుగుల వద్ద రాహుల్ ఔటయ్యాడు. కేవలం 11 పరుగుల వ్యవధిలో ఈ మూడు వికెట్లు కోల్పోవడంతో భారత్ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. కోహ్లి, రైనా కాసేపు నిలబడినప్పటికీ అది భారీస్కోరుకు ఏ మాత్రం సరిపోలేదు. నాలుగో వికెట్‌కు 80 పరుగులు జతయ్యాక కోహ్లి... మొయిన్ అలీ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో క్రీజులోకి ధోని వచ్చాడు. 31వ ఓవర్లో జట్టు స్కోరు 150 పరుగులకు చేరింది. కాసేపటికే రైనా రూపంలో భారత్ మరో దెబ్బ తగిలింది. అతన్ని రషీద్ బౌల్డ్ చేశాడు. 154 పరుగుల వద్ద సగం వికెట్లు కోల్పోయిన భారత్ ఇక లక్ష్యం కోసం కాకుండా పరువు కోసం ఆడాల్సి వచ్చింది. 21 పరుగులు చేసిన హార్దిక్ పాండ్యాను ప్లంకెట్ ఔట్ చేయగా, ఉమేశ్‌యాదవ్ (0) రషీద్ బౌలింగ్‌లో స్టంపౌటయ్యాడు. ధోని (59 బంతుల్లో 37; 2 ఫోర్లు ) చివరి వరుస బ్యాట్స్‌మెన్‌తో కలిసి జట్టు స్కోరును 200 పరుగులు దాటించాడు. అతను ఔటయ్యాక కుల్దీప్ (8 నాటౌట్), చహల్ (12) కాసేపు ఇంగ్లండ్ బౌలింగ్‌ను ఎదుర్కొన్నారు. చహల్ ఆఖరి ఓవర్ ఆఖరి బంతికి ఔట్ కావడంతో భారత్ 236 పరుగుల వద్ద ఆలౌటైంది. రషీద్, విల్లే రెండేసి వికెట్లు తీశారు. ధోని... పది వేల క్లబ్లో... మాజీ కెప్టెన్ ధోని మరో మైలురాయిని అధిగమించాడు. వన్డేల్లో పది వేల పరుగులు చేసిన నాలుగో భారత బ్యాట్స్‌మెన్‌గా రికార్డుల్లోకెక్కాడు. 33 పరుగుల వద్ద ఈ మైలురాయి చేరాడు. ఓవరాల్‌గా అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో అతను 12వ స్థానంలో ఉన్నాడు. అంతకుముందు 300 క్యాచ్‌ల క్లబ్లో చేరాడు. ఈ ఘనతెక్కిన నాలుగో వికెట్ కీపర్‌గా ధోని నిలిచాడు. గిల్‌క్రిస్ట్ (417), బౌచర్ (403), సంగక్కర (402) ముందు వరుసలో ఉన్నారు. -
సిరీస్‌పై భారత్ గురి
ఇంగ్లండ్ గడ్డపై అడుగు పెట్టిన రోజు నుంచి భారత జట్టు ఎదురు లేకుండా సాగిపోతోంది. ఐర్లాండ్‌పై టి20 సిరీస్ విజయం, ఆ తర్వాత ఇంగ్లండ్‌పై కూడా టి20 సిరీస్ గెలుపు, ఇక తొలి వన్డేలో ఘన విజయం. మరొక్క మ్యాచ్‌లో ఇదే జోరు కొనసాగిస్తే అసలైన టెస్టు సిరీస్‌కు ముందు అంబరమంత స్థాయిలో ఆత్మవిశ్వాసం లభిస్తుంది. ఈ నేపథ్యంలో రెండో వన్డేకు ఇరు జట్లు సిద్ధమయ్యాయి. లండన్: వన్డే క్రికెట్లోని టాప్–2 జట్లలో ఎవరి సత్తా ఏమిటో తొలి మ్యాచ్‌లో కనిపించింది. ఇంగ్లండ్‌ను సాధారణ స్కోరుకే పరిమితం చేసిన టీమిండియా అలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది. ఇప్పుడు మరో విజయం సాధించి వరుసగా ఏడో వన్డే సిరీస్‌ను గెలుచుకోవాలని భారత్ పట్టుదలగా ఉంది. మరోవైపు సొంతగడ్డపై పరువు కాపాడుకునే క్రమంలో కచ్చితంగా మ్యాచ్ నెగ్గాల్సిన స్థితిలో మోర్గాన్ సేన నిలిచింది. ఈ నేపథ్యంలో నేడు ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో రెండో వన్డేలో అమీతుమీ తేల్చుకునేందుకు ఇరు జట్లు సన్నద్ధమయ్యాయి. అదే జట్టుతో... తొలి వన్డేలో అద్భుత విజయం తర్వాత భారత్ ఇక్కడా అదే జట్టును కొనసాగించడం దాదాపుగా ఖాయం. అయితే పేస్ బౌలర్లలో భువనేశ్వర్ గాయం నుంచి కోలుకుంటే సిద్ధార్థ్ కౌల్ స్థానంలో బరిలోకి దిగుతాడు. కుల్దీప్, చహల్ మరో సారి ప్రత్యర్థి పని పట్టడానికి సిద్ధంగా ఉన్నారు. బ్యాటింగ్‌లో శిఖర్ ధావన్ ఫామ్‌లోకి వచ్చాడు. రోహిత్ తిరుగులేని ఆటను ప్రదర్శిస్తుండగా, కోహ్లి ఆట గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. గత మ్యాచ్‌లో బ్యాటింగ్ చేయాల్సిన అవసరం రాని సురేశ్ రైనా, ధోని, హార్దిక్ పాండ్యా ఈసారి చెలరేగడానికి సిద్ధంగా ఉన్నారు. కుల్దీప్ను ఆడగలరా... వన్డేల్లో రికార్డు విజయాలతో ఊపు మీద కనిపించిన ఇంగ్లండ్ ఒక్కసారిగా భారత్ దెబ్బకు నేలకు దిగొచ్చింది. తమ స్పిన్ బలహీనతను ఆ జట్టు బయట పెట్టుకుంది. ముఖ్యంగా కుల్దీప్ వేస్తున్న ఏ బంతి ఎటు వెళుతుందో అర్థం కాని స్థితిలో జట్టు బ్యాట్స్‌మెన్ నిలిచారు. పేస్ బౌలిం గ్లో ఆరంభంలో రాయ్, బెయిర్‌స్టో వేగంగా పరుగులు సాధిస్తున్నా, స్పిన్నర్లు రాగానే అంతా మారిపోతోంది. రూట్ వైఫల్యం జట్టును కలవరపరిచే అంశం. రెండో టి20 తరహాలో కుల్దీప్ను జాగ్రత్తగా ఆడగలిగితే ఆ జట్టు నిలిచే అవకాశం ఉంది. స్పిన్‌ను కొంత మెరుగ్గా ఆడుతున్న బట్లర్ ఈసారి బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు రానున్నాడు. బౌలింగ్‌లో బాగా బలహీనంగా కనిపిస్తున్న ఇంగ్లండ్ తుది జట్టులో ఏమైనా మార్పులు జరుగుతాయా చూడాలి. పిచ్, వాతావరణం లార్డ్స్ పిచ్ అటు బ్యాటింగ్‌కు, ఇటు బౌలింగ్‌కు సమంగా అనుకూలిస్తుంది. ఇటీవల దేశవాళీ వన్డే ఫైనల్లో బంతి స్పిన్ తిరిగింది. వాతావరణం పొడిగా ఉంది. వర్ష సూచన లేదు. ►మరో 33 పరుగులు చేస్తే వన్డేల్లో ధోని 10 వేల పరుగులు పూర్తవుతాయి ►మధ్యాహ్నం గం. 3.30 నుంచి సోనీ సిక్స్, సోనీ టెన్–3లలో ప్రత్యక్ష ప్రసారం -
రెండో వన్డేలో భారత మహిళల ఓటమి
నాగ్‌పూర్: ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో అదరగొట్టిన భారత మహిళల జట్టు రెండో వన్డేలో చతికిలబడింది. సోమవారం ఇక్కడ జరిగిన రెండో మ్యాచ్‌లో మిథాలీ బృందం 8 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. తొలుత భారత్ 37.2 ఓవర్లలో 113 పరుగులకే కుప్పకూలింది. స్మృతి మంధాన (42; 3 ఫోర్లు, 1 సిక్స్), దీప్తి శర్మ (26 నాటౌట్; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించగా... కెప్టెన్ మిథాలీ రాజ్ (4), హర్మన్‌ప్రీత్ (3) సహా మిగతావారు నిరాశ పరిచారు. ప్రత్యర్థి బౌలర్లలో హజెల్, ఎకల్స్టన్ నాలుగేసి వికెట్లు పడగొట్టారు. అనంతరం ఇంగ్లండ్ 29 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 117 పరుగులు చేసి గెలుపొందింది. వ్యాట్ (47; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), బ్యూమౌంట్ (39 నాటౌట్; 3 ఫోర్లు) రాణించారు. ఇరు జట్ల మధ్య చివరిదైన మూడో వన్డే గురువారం జరుగనుంది. -
స్టోక్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శన
మౌంట్ మాంగనీ: ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ అదరగొట్టడంతో న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ సునాయస విజయం సాధించింది. తొలి వన్డేలో ఓడిన ఇంగ్లండ్ బుధవారం జరిగిన రెండో మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్‌ను 1–1తో సమంచేసింది. స్టోక్స్ (63 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్)తో పాటు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (62; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), బెయిర్‌స్టో (37; 5 ఫోర్లు, 1 సిక్స్), బట్లర్ (36 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగడంతో 37.5 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 225 పరుగులు చేసి గెలుపొందింది. అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 49.4 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌటైంది. గప్టిల్ (50; 7 ఫోర్లు), సాన్‌ట్నర్ (63; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో స్టోక్స్, వోక్స్, మొయిన్ అలీలకు రెండేసి వికెట్లు దక్కాయి. బౌలింగ్, బ్యాటింగ్‌లలో రాణించడంతో పాటు రెండు రనౌట్లలో పాలుపంచుకున్న స్టోక్స్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్లు మధ్య మూడో వన్డే శనివారం వెల్లింగ్టన్లో జరుగనుంది. -
మహిళల జట్టుకూ సదవకాశం
కింబర్లీ: దక్షిణాఫ్రికాలో వన్డే సిరీస్ గెలుచుకునేందుకు భారత మహిళల క్రికెట్ జట్టు ముందు మంచి అవకాశం. తొలి వన్డేలో 88 పరుగుల భారీ తేడాతో ఆతిథ్య జట్టును చిత్తు చేసిన మిథాలీ సేన... బుధవారం కింబర్లీలో రెండో వన్డే ఆడనుంది. ప్రపంచకప్ ఆడిన ఏడు నెలల తర్వాత బరిలో దిగినా ఆ ప్రభావం ఏమీ లేకుండా సోమవారం ప్రత్యర్థిపై సునాయాస విజయం సాధించింది. ఇదే ఊపును కొనసాగిస్తే మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను సొంతం చేసుకోవడం కష్టం కాదు. బ్యాటింగ్‌లో స్మృతి, కెప్టెన్ మిథాలీ, బౌలింగ్‌లో పేసర్లు జులన్, శిఖా పాండేల ఫామ్‌తో జట్టు బలంగా కనిపిస్తోంది. మొదటి వన్డేలో వీరే గెలుపు బాధ్యత మోశారు. ఈసారీ రాణిస్తే తిరుగుండదు. మిగతావారు విఫలమవడంతో సఫారీలు కెప్టెన్ వాన్ నికెర్క్పైనే ఆధారపడుతున్నారు. సిరీస్ చేజారకుండా చూసుకోవాలంటే వారు సమష్టిగా ఆడాల్సిన అవసరం ఉంది. -
జోరు కొనసాగాలి
సెంచూరియన్: వన్డే సిరీస్‌లో శుభారంభం చేసిన కోహ్లి బృందం ఆధిపత్యాన్ని మరింత పెంచుకునేందుకు సై అంటోంది. నేడు ఇక్కడి సూపర్ స్పోర్ట్ పార్క్‌లో దక్షిణాఫ్రికాతో జరిగే రెండో మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. చివరి టెస్టు, తొలి వన్డేలో విజయాల తర్వాత టీమిండియాలో ఉత్సాహం తొణికిసలాడుతుండగా, కీలక ఆటగాళ్ల గాయాలతో సొంతగడ్డపై సఫారీ టీమ్ తడబాటును ఎదుర్కొంటోంది. ఇలాంటి స్థితిలో భారత్ ఈ మ్యాచ్‌లోనూ గెలిస్తే సిరీస్‌పై మరింత పట్టు బిగుస్తుంది. మార్పులు లేకుండానే... తొలి వన్డేలో టీమిండియా ఆట చూస్తే జట్టులో ఒక్క మార్పుకు కూడా అవకాశం కనిపించదు. కోహ్లిని అడ్డుకోవడం దక్షిణాఫ్రికా బౌలర్ల వల్ల కావడం లేదు. భారత బ్యాటింగ్ వెన్నెముక అయిన కోహ్లిని నిరోధిస్తే విజయావకాశాలు పెరుగుతాయని దక్షిణాఫ్రికా చెబుతూ వచ్చింది. అదే కారణంగా కోహ్లి క్యాచ్‌ను స్లిప్‌లో పట్టుకునే క్రమంలోనే డివిలియర్స్, డు ప్లెసిస్ వేలికి గాయాలతో జట్టుకు దూరం కావడం యాదృచ్ఛికం! ధావన్, రోహిత్ తమదైన శైలిలో ఆడితే భారత్‌కు తిరుగుండదు. తన విలువేంటో రహానే గత మ్యాచ్‌లో చూపించాడు. 10 వేల పరుగులకు చేరువలో ఉన్న ధోని బ్యాట్ ఝళిపించేందుకు సిద్ధం. మరో వైపు పేస్ బౌలర్లు భువనేశ్వర్, బుమ్రాల ప్రదర్శనపై ఎలాంటి అనుమానాలు లేవు. తొలి మ్యాచ్ ప్రదర్శనను బట్టి చూస్తే భారత్ మరో ఆలోచన లేకుండా ఇద్దరు స్పిన్నర్లు చహల్, కుల్దీప్లను కొనసాగించడం ఖాయం. మొత్తంగా భారత్ అన్ని రంగాల్లో పటిష్టంగా కనిపిస్తోంది. అన్నీ సమస్యలే... తొలి వన్డేలో స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోలేక సఫారీ బృందం చేతులెత్తేసింది. స్పిన్‌ను సమర్థంగా ఆడగల డివిలియర్స్ ముందే తప్పుకోగా, మరో బ్యాట్స్‌మన్ డు ప్లెసిస్ కూడా గాయపడటం ఆ జట్టును మరింత బలహీనపర్చింది. ఈ నేపథ్యంలో ఆమ్లాపై అదనపు భారం పడనుంది. దక్షిణాఫ్రికా ఈ సిరీస్‌లో కోలుకోవాలంటే సీనియర్లు డుమిని, మిల్లర్ మిడిలార్డర్లో ప్రధాన పాత్ర పోషించాల్సి ఉంది. కెప్టెన్‌గా మార్క్రమ్ భారత్‌తో తొలి వన్డేకు ముందు తుది జట్టులో కూడా చోటు లేని పరిస్థితి... కానీ ఇప్పుడు 23 ఏళ్ల మార్క్రమ్కు ఏకంగా కెప్టెన్సీ అవకాశం లభించింది. కెరీర్లో 2 వన్డేలే ఆడిన మార్క్రమ్...ప్లెసిస్ స్థానంలో సిరీస్‌లోని మిగతా వన్డేలకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. 2014 అండర్–19 ప్రపంచకప్ గెలుచుకున్న దక్షిణాఫ్రికా జట్టుకు అతను కెప్టెన్‌గా వ్యవహరించాడు. ►మధ్యాహ్నం గం. 1.30 నుంచి సోనీ టెన్–1, 3లో ప్రత్యక్ష ప్రసారం -
రెండో వన్డేలోనూ ఇంగ్లండ్‌దే విజయం
బ్రిస్బేన్: వరుసగా రెండో వన్డేలోనూ ఆసీస్‌కు ఇంగ్లండ్ చేతిలో ఓటమి ఎదురైంది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 4 వికెట్లతో గెలిచి ఐదు వన్డేల సిరీస్‌లో 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. తొలుత ఆసీస్ 9 వికెట్లకు 270 పరుగులు చేసింది. ఫించ్ (106; 9 ఫోర్లు, 1 సిక్స్) వరుసగా రెండో మ్యాచ్‌లోనూ సెంచరీ సాధించాడు. ఇంగ్లండ్ ఆరు వికెట్లు కోల్పోయి 274 పరుగులు చేసి విజయం సాధించింది. బెయిర్ స్టో (60; 9 ఫోర్లు), హేల్స్ (57; 7 ఫోర్లు, 1 సిక్స్) ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ జో రూట్ (46 నాటౌట్), బట్లర్ (32 బంతుల్లో 42; 5 ఫోర్లు), వోక్స్ (27 బంతుల్లో 39; 5 ఫోర్లు, 1 సిక్స్) తలోచేయి వేశారు. మూడో వన్డే ఆదివారం సిడ్నీలో జరుగనుంది. -
రెండో వన్డేలోనూ కివీస్‌దే విజయం
నెల్సన్: న్యూజిలాండ్, పాకిస్తాన్ వన్డే సిరీస్‌లో రెండో మ్యాచ్‌నూ వర్షం విడిచి పెట్టలేదు. దీంతో ఈ మ్యాచ్ ఫలితాన్నీ డక్‌వర్త్ లూయిస్ (డీఎల్) పద్ధతే తేల్చింది. మంగళవారం ఇక్కడ జరిగిన రెండో వన్డేలో ఆతిథ్య కివీస్ జట్టు డీఎల్ పద్ధతిలో 8 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌పై గెలిచింది. మొదట పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 246 పరుగులు చేసింది. మహమ్మద్ హఫీజ్ (60; 8 ఫోర్లు), షాదాబ్ ఖాన్ (52; 3 ఫోర్లు, 1 సిక్స్), హసన్ అలీ (51; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధసెంచరీలు చేశారు. తర్వాత వర్షం వల్ల లక్ష్యాన్ని 25 ఓవర్లలో 151 పరుగులుగా నిర్దేశించారు. దీన్ని న్యూజిలాండ్ 23.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. గప్టిల్ (71 బంతుల్లో 86 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), రాస్ టేలర్ (43 బంతుల్లో 45 నాటౌట్; 4 ఫోర్లు) రాణించారు. ఐదు వన్డేల సిరీస్‌లో ప్రస్తుతం కివీస్ 2–0తో ఆధిక్యంలో ఉంది. మూడో వన్డే శనివారం డ్యునెడిన్‌లో జరుగుతుంది. -
మాథ్యూస్ సెంచరీ వృథా.. తప్పని ఓటమి
మొహాలి: తొలి వన్డేలో ఎదురైన పరాభవానికి టీమిండియా బదులు తీర్చుకుంది. రెండో వన్డేలో శ్రీలంకను చిత్తుగా ఓడించి విజయబావుటా ఎగురవేసింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అద్భుతంగా రాణించి ప్రత్యర్థిని చిత్తు చేసింది. బుధవారం జరిగిన రెండో మ్యాచ్‌లో లంకను 141 పరుగుల తేడాతో ఓడించింది. రోహిత్ సేన నిర్దేశించిన 393 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక 50 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 251 పరుగులు సాధించింది. సీనియర్ ఆటగాడు మాథ్యూస్ సెంచరీతో ఒంటరి పోరాటం చేసినా లంకను ఓటమి నుంచి గట్టెక్కించలేకపోయాడు. ఏ ఒక్కరూ అతడికి తోడుగా నిలబడలేకపోయారు. 122 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో సెంచరీ పూర్తి చేసి ఓటమి అంతరాన్ని తగ్గించాడు. వన్డేల్లో అతడికిది రెండో సెంచరీ. 111 పరుగులతో అజేయంగా నిలిచాడు. భారత బౌలర్లలో చాహల్ 3, బుమ్రా 2 వికెట్లు పడగొట్టారు. భువనేశ్వర్, వాషింగ్టన్ సుందర్, హార్దిక్ పాండ్యా తలో వికెట్ తీశారు. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 392 పరుగులు చేసింది. రోహిత్ శర్మ చెలరేగి ఆడి అజేయ డబుల్ సెంచరీ(208) సాధించాడు. శ్రేయస్ అయ్యర్(88), శిఖర్ ధవన్(68) అర్ధసెంచరీలు చేశారు. రోహిత్ శర్మకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 1-1తో సమం చేసింది. నిర్ణయాత్మక మూడో వన్డే ఆదివారం విశాఖపట్నంలో జరగనుంది. -
సిరీస్ భారత్ ‘ఎ’ సొంతం
హుబ్లీ: బంగ్లాదేశ్ మహిళల ‘ఎ’ జట్టుతో జరుగుతున్న వన్డే సిరీస్‌ను భారత ‘ఎ’ జట్టు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సొంతం చేసుకుంది. మంగళవారం రెండో వన్డేలో భారత్ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 195 పరుగులు చేసింది. 196 పరుగుల లక్ష్యాన్ని భారత్ 48.1 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఎన్.ఎమ్ చౌదరి (56; 9 ఫోర్లు), వనిత (42; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడగా... ఆరేళ్ల తర్వాత మళ్లీ జట్టులోకి వచ్చిన నేహా తన్వర్ (44; 3 ఫోర్లు) కూడా ఆకట్టుకుంది. రెండు జట్ల మధ్య మూడో వన్డే గురువారం ఇదే స్టేడియంలో జరగనుంది. -
'పుణే'ను కాపాడుకోవాలి!
ఇటీవలి కాలంలో సిరీస్‌ను రక్షించుకోవాల్సిన స్థితిలో భారత జట్టు మ్యాచ్ బరిలోకి దిగిన దాఖలాలు దాదాపుగా లేవు. సొంతగడ్డపై నాలుగేళ్లుగా మన జట్టు ఒకే సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌లు ఎప్పుడూ ఓడిపోలేదు కూడా. కానీ బుధవారం ఆ ప్రమాదం కనిపిస్తోంది. అలవోకగా తలవంచుతుందనుకున్న ప్రత్యర్థి న్యూజిలాండ్ గత మ్యాచ్‌లో ఇచ్చిన అనూహ్య షాక్‌తో ఇప్పుడు పరిస్థితి తలకిందులైంది. సిరీస్ చేజారిపోకుండా ఉండాలంటే తప్పనిసరిగా గెల వాల్సిన మ్యాచ్‌లో కోహ్లి సేన ఒత్తిడిని అధిగమించి అన్ని రకాలుగా చెలరేగాల్సి ఉంటుంది. ముంబై వన్డే చూస్తే న్యూజిలాండ్ జట్టు ఈ సిరీస్ కోసం మంచి హోంవర్క్ చేసి వచ్చిందని అర్థమైపోయింది. స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు స్వీప్ షాట్లను సమర్థంగా ఉపయోగించడంతో పాటు తమ బ్యాటింగ్ ఆర్డర్లో కూడా కీలక మార్పులు చేసి ఆ జట్టు ఫలితం సాధించింది. సమష్టితత్వంతో తొలి వన్డే గెలుచుకున్న కివీస్ ఇప్పుడు సిరీస్ గెలుపుపై దృష్టి పెట్టింది. విదేశీ గడ్డపై అరుదుగా వచ్చిన ఈ అవకాశాన్ని కోల్పోరాదని ఆ జట్టు పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో పుణేలో భారత్ పరువు దక్కుతుందా లేక కివీస్ చరిత్ర సృష్టిస్తుందా చూడాలి. పుణే: న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో ఊహించని విధంగా వెనుకబడిన భారత్ చావో రేవో మ్యాచ్‌కు సిద్ధమైంది. ఇక్కడి ఎంసీఏ మైదానంలో నేడు జరిగే రెండో వన్డేలో ఇరు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ గెలిస్తే భారత్ 1–1తో సమం చేసి సిరీస్‌లో నిలుస్తుంది. అయితే గత మ్యాచ్ విజయం ఇచ్చిన ఉత్సాహంతో ఉన్న కివీస్ కూడా మరో గెలుపుపై దృష్టి పెట్టింది. రెండు జట్లు కూడా మార్పుల్లేకుండానే బరిలోకి దిగే అవకాశం ఉంది. ఆర్డర్ మారుతుందా... తొలి వన్డేలో కోహ్లి సెంచరీ తప్ప భారత బ్యాటింగ్ గురించి చెప్పుకోవడానికేమీ లేదు. కనీసం మరో అర్ధ సెంచరీ లేకుండా దాదాపు అందరూ విఫలమయ్యారు. ఫలితంగా భారీ స్కోరు సాధ్యం కాక జట్టుకు ఓటమి ఎదురైంది. ఈ మ్యాచ్‌లోనైనా ఆ తప్పును వారు దిద్దుకోవాల్సి ఉంది. ఓపెనర్లు రోహిత్, ధావన్‌ల నుంచి జట్టు శుభారంభం ఆశిస్తోంది. మిడిలార్డర్లో దినేశ్ కార్తీక్, ధోని కొద్దిసేపు నిలబడినా... అది సరిపోలేదు. పాండ్యా ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చడం జట్టుకు ఎంతో అవసరం. అయితే కీలకమైన నాలుగో స్థానంలో కేదార్ జాదవ్‌ను పంపించిన ప్రయోగం విఫలమైంది. ముఖ్యంగా సొంతగడ్డపై జరగనున్న ఈ మ్యాచ్ జాదవ్‌కు ఎంతో కీలకం. ఈ ఏడాది జనవరిలో పుణే స్టేడియంలోనే ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఏకంగా 351 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఇందులో మెరుపు వేగంతో 76 బంతుల్లోనే 120 పరుగులు చేసి జాదవ్ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. అయితే ఆ తర్వాత అతను మరో 23 మ్యాచ్‌లు ఆడినా ఎక్కడా తన ముద్ర చూపించలేకపోయాడు. ఇప్పటికే టి20 టీమ్‌లో చోటు కోల్పోయిన అతను వన్డేల్లో కొనసాగాలంటే ఇప్పుడు బాగా ఆడాల్సిందే. అందుకోసం సొంత మైదానానికి మించిన వేదిక అతనికి దొరకదు! మొదటి వన్డేలో భువనేశ్వర్, బుమ్రా మెరుగ్గానే బౌలింగ్ చేసినా... కివీస్ ఓపెనర్లు వారిని సమర్థంగా ఎదుర్కోవడంతో ఫలితం దక్కలేదు. మరోవైపు వరుసగా భారత్‌ను గెలిపిస్తూ వచ్చిన స్పిన్నర్లు చహల్, కుల్దీప్ హవా కూడా పని చేయలేదు. కివీస్ బ్యాట్స్‌మెన్‌ను అడ్డుకునేందుకు వీరిద్దరు కొత్త తరహా వ్యూహంతో సిద్ధం కావాల్సి ఉంది. మొత్తంగా ఒత్తిడి భారత్‌పైనే ఉందనేది వాస్తవం. అరుదైన అవకాశం... సరిగ్గా సంవత్సరం క్రితం భారత్‌లో పర్యటించిన న్యూజిలాండ్ జట్టు ఒక దశలో ఐదు వన్డేల సిరీస్‌లో 2–2తో సమంగా నిలిచింది. చివరి మ్యాచ్‌లో బ్యాటింగ్ వైఫల్యంతో ఆ జట్టు సిరీస్ కోల్పోయింది కానీ నాడు కూడా జట్టులోని ప్రధాన ఆటగాళ్లంతా రాణించారు. ఇప్పుడు ఆ అనుభవం వారికి చాలా వరకు ఉపయోగపడిందని గత మ్యాచ్ హీరో టామ్ లాథమ్ అభిప్రాయపడ్డాడు. స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కోవడంతో పాటు మిడిలార్డర్‌పై కూడా ప్రత్యేక దృష్టి పెట్టినట్లు అతను చెప్పాడు. వారి ప్రణాళిక ముంబై మ్యాచ్‌లో చాలా బాగా పని చేసింది. మూడు వికెట్లు కోల్పోయిన తర్వాత కూడా కివీస్ ఏమాత్రం కలవరపడకుండా ప్రశాంతంగా విజయం దిశగా వెళ్లడం ఆ జట్టు పట్టుదలను సూచిస్తోంది. లాథమ్, టేలర్లతో పాటు ఓపెనర్లు గప్టిల్, మున్రో కూడా మెరుగ్గానే ఆడారు. కెప్టెన్ విలియమ్సన్ విఫలమైనా అతనిలాంటి అగ్రశ్రేణి ఆటగాడు ఎప్పుడైనా ఫామ్‌లోకి రావచ్చు. నికోల్స్, హిట్టర్ గ్రాండ్‌హోమ్‌లతో జట్టు బ్యాటింగ్‌లో లోతు ఉంది. ఇక బౌలింగ్‌లో బౌల్ట్ మరోసారి మన బ్యాట్స్‌మెన్‌కు ఇబ్బందులు సృష్టించగలడు. ముఖ్యంగా ఓపెనర్లను కట్టి పడేయడంలో అతని పాత్రనే కీలకం. సౌతీ, సాన్‌ట్నర్ కూడా మంచి బౌలర్లు కావడంతో కివీస్ బలంగానే కనిపిస్తోంది. గత మ్యాచ్ జోరును కొనసాగిస్తే ఆ జట్టుకు చిరస్మరణీయ విజయం దక్కుతుంది. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), ధావన్, రోహిత్, కార్తీక్, జాదవ్, ధోని, పాండ్యా, భువనేశ్వర్, కుల్దీప్, చహల్, బుమ్రా. న్యూజిలాండ్: విలియమ్సన్ (కెప్టెన్), గప్టిల్, మున్రో, టేలర్, లాథమ్, నికోల్స్, గ్రాండ్‌హోమ్, సాన్‌ట్నర్, సౌతీ, బౌల్ట్, మిల్నే. పిచ్, వాతావరణం బ్యాటింగ్‌కు బాగా అనుకూలం. బౌండరీలు కూడా చిన్నవి కావడం తో భారీ స్కోర్లకు అవకాశం ఉంది. వాతావరణం బాగుంది. వర్ష సూచన లేదు -
మళ్లీ అదరగొట్టారు
-
మళ్లీ అదరగొట్టారు
►రెండో వన్డేలో భారత్ 50 పరుగులతో విజయం ►రాణించిన కోహ్లి, రహానే ►కుల్దీప్ యాదవ్ ‘హ్యాట్రిక్’ ►భువనేశ్వర్ 3/9 ►మూడో వన్డే ఆదివారం భారత్ తమదైన శైలిలో మరోసారి సత్తా చాటింది. శ్రీలంకను చిత్తుగా ఓడించి వచ్చినా, ఆస్ట్రేలియాతో అంత సులువు కాదని అంతా భావించారు. అయితే అద్భుతమైన ఆట ముందు ఆసీస్ అయినా ఎవరైనా ఒకటే అని మన జట్టు మళ్లీ రుజువు చేసింది. టీమిండియా ఆల్‌రౌండ్ ప్రదర్శన ముందు నిలవలేక కంగారూలు మళ్లీ తలవంచారు. భారీ స్కోరు సాధించకపోయినా... తమ బౌలింగ్ వనరులతో చెలరేగిన కోహ్లి సేన ప్రత్యర్థి పని పట్టింది. వరుసగా రెండో విజయంతో సిరీస్‌పై పట్టు బిగించింది. కోహ్లి కీలక ఇన్నింగ్స్... అండగా నిలిచిన రహానే... ఈ ఇద్దరి శతక భాగస్వామ్యం భారత్‌ను నడిపించాయి. చివర్లో ఎలాంటి మెరుపులు లేకున్నా... జట్టు మెరుగైన స్కోరుతో సవాల్ విసిరింది. ఛేదనలో భువనేశ్వర్ కుమార్ దెబ్బకు 9 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ఆసీస్ గత మ్యాచ్ వైఫల్యాన్నే కొనసాగించింది. మధ్యలో కుల్దీప్ యాదవ్ ‘హ్యాట్రిక్’ జోరుకు ఆ జట్టు కుదేలైంది. స్మిత్, స్టొయినిస్ అర్ధ సెంచరీలు గెలుపు అంతరాన్ని మాత్రమే తగ్గించగలిగాయి. కోల్‌కతా: ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్‌లో భారత్ మళ్లీ పైచేయి సాధించింది. సమష్టి కృషితో టీమిండియా మరో సారి సత్తా చాటింది. గురువారం ఇక్కడి ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగిన రెండో వన్డేలో భారత్ 50 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. ఐదు వన్డేల సిరీస్‌లో 2–0తో ఆధిక్యంలో నిలిచింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది. విరాట్ కోహ్లి (107 బంతుల్లో 92; 8 ఫోర్లు) త్రుటిలో సెంచరీ కోల్పోగా, అజింక్య రహానే (64 బంతుల్లో 55; 7 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించాడు. అనంతరం ఆస్ట్రేలియా 43.1 ఓవర్లలో 202 పరుగులకు ఆలౌటైంది. మార్కస్ స్టొయినిస్ (65 బంతుల్లో 62 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), స్టీవ్ స్మిత్ (76 బంతుల్లో 59; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. భారత చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ‘హ్యాట్రిక్’ సాధించడం విశేషం. 33వ ఓవర్లో వరుస బంతుల్లో వేడ్, అగర్, కమిన్స్‌లను కుల్దీప్ అవుట్ చేశాడు. విరాట్ కోహ్లికి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. సిరీస్‌లో మూడో వన్డే ఆదివారం ఇండోర్‌లో జరుగుతుంది. సెంచరీ భాగస్వామ్యం... 35 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 185/3. కోహ్లి మరో సెంచరీ దిశగా సాగుతున్నాడు. ఈ దశలో భారత్ 300 పరుగులు చేసేలా కనిపించింది. అయితే తర్వాతి ఐదు ఓవర్ల వ్యవధిలో కోహ్లితో పాటు పాండే, ధోని కూడా అవుట్ కావడంతో భారత్ జోరుకు కళ్లెం పడింది. ఆ తర్వాత ఇన్నింగ్స్ చివర్లో కూడా భారత్ ఆఖరి 20 బంతుల్లో 15 పరుగులు మాత్రమే చేసి నాలుగు వికెట్లు కోల్పోయి సాధారణ స్కోరుకే పరిమితమైంది. పిచ్‌పై ఉన్న తేమను బాగా ఉపయోగించుకున్న ఆసీస్ పేసర్లు కమిన్స్, కూల్టర్ నీల్ ఆరంభంలో భారత బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు. ఆరో ఓవర్లో కూల్టర్‌నీల్‌కు రోహిత్ శర్మ (7) రిటర్న్ క్యాచ్ ఇవ్వడంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ఈ దశలో రహానే, కోహ్లి కలిసి చక్కటి సమన్వయంతో బ్యాటింగ్ చేశారు. జాగ్రత్తగా ఆడుతూనే వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదారు. అయితే రహానే రనౌట్‌తో వీరిద్దరి 102 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. రెండో పరుగు తీసే ప్రయత్నంలో కోహ్లి వేగానికి తగిన విధంగా స్పందించని రహానే వెనుదిరగాల్సి వచ్చింది. అప్పటి వరకు కోల్‌కతా వేడిలో చెమటలు చిందిస్తూ ఇబ్బంది పడిన ఆసీస్‌కు ఈ వికెట్ కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఇదే జోరులో తక్కువ వ్యవధిలో పాండే (3), ధోని (5), కోహ్లిలను అవుట్ చేసి ఆ జట్టు పట్టు బిగించింది. ఒక దశలో తాను ఆడిన వరుస బంతుల్లో 4, 4, 6 కొట్టి దూకుడు ప్రదర్శించిన కేదార్ జాదవ్ (24 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్స్) కూడా ఆ వెంటనే పెవిలియన్ చేరాడు. పాండ్యా (20), భువనేశ్వర్ (20) కలిసి ఏడో వికెట్‌కు 35 పరుగులు జత చేయడంతో భారత్ గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది. సొంతగడ్డపై ముందుగా బ్యాటింగ్ చేస్తూ భారత్ ఆలౌట్ కావడం 2013 జనవరి (పాక్‌పై) తర్వాత ఇదే తొలిసారి. స్మిత్ మినహా... సాధారణ విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా మరోసారి తడబాటుకు లోనైంది. భువనేశ్వర్ అద్భుత బౌలింగ్ ముందు ఆసీస్ ఓపెనర్లు పరుగు తీయడమే గగనంగా మారింది. భువీ జోరుకు ముందుగా కార్ట్‌రైట్ (15 బంతుల్లో 1), ఆ తర్వాత వార్నర్ (9 బంతుల్లో 1) తక్కువ వ్యవధిలో వెనుదిరిగారు. అనంతరం స్మిత్, హెడ్ (39 బంతుల్లో 39; 5 ఫోర్లు) కలిసి జట్టును ఆదుకున్నారు. 15 పరుగుల వద్ద హెడ్ ఇచ్చిన క్యాచ్‌ను రోహిత్ వదిలేయగా... వీరిద్దరు క్రీజ్‌లో ఉన్నంత సేపు చకచకా పరుగులు సాధించి భారత్‌పై ఒత్తిడి పెంచారు. ఈ జంట మూడో వికెట్‌కు 73 బంతుల్లోనే 76 పరుగులు జత చేసిన అనంతరం చహల్ ఈ జోడీని విడదీశాడు. ఆ తర్వాత కుల్దీప్ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు బాది జోరు ప్రదర్శించిన మ్యాక్స్‌వెల్ (14) ఎక్కువ సేపు నిలవలేదు. చహల్ చక్కటి బంతికి ధోని మెరుపు స్టంపింగ్ తోడై మ్యాక్సీ పెవిలియన్ చేరాడు. మరో ఎండ్‌లో 65 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న స్మిత్... పాండ్యా ఉచ్చులో చిక్కాడు. బౌన్సర్‌ను పుల్ షాట్ ఆడబోయి జడేజాకు క్యాచ్ ఇవ్వడంతో ఆసీస్ మ్యాచ్‌పై ఆశలు కోల్పోయింది. చివర్లో స్టొయినిస్ పోరాడే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. ►భారత్ తరఫున వన్డేల్లో హ్యాట్రిక్ నమోదు చేసిన మూడో బౌలర్ కుల్దీప్ యాదవ్. గతంలో చేతన్ శర్మ (న్యూజిలాండ్‌పై), కపిల్‌దేవ్ (శ్రీలంకపై) ఈ ఘనత సాధించారు. ఓవరాల్‌గా అంతర్జాతీయ క్రికెట్లో కుల్దీప్‌కిది రెండో హ్యాట్రిక్. 2014లో జరిగిన అండర్–19 వరల్డ్ కప్‌లో స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్‌లోనూ కుల్దీప్ ‘హ్యాట్రిక్’ సాధించాడు. ► 1 ఆస్ట్రేలియాపై రెండో వన్డేలో విజయం సాధించిన భారత్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో మళ్లీ నంబర్‌వన్ ర్యాంక్‌కు చేరుకుంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా, భారత్ 119 రేటింగ్ పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాయి. -
విండీస్, ఇంగ్లండ్ రెండో వన్డే రద్దు
నాటింగ్హమ్: భారీ వర్షం కారణంగా ఇంగ్లండ్, విండీస్ జట్ల మధ్య రెండో వన్డే రద్దయింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 2.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. ఈ దశలో వచ్చిన వర్షం ఎంతకూ తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. -
వాన ఆగితేనే ఆట!
►రెండో వన్డేకు వర్షం ముప్పు ►నేడు కోల్‌కతాలో భారత్, ఆసీస్ పోరు ►మ.గం. 1.20 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం 11 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయినా 281 పరుగుల వరకు చేరడం... టి20 తరహా లక్ష్యాన్ని ఇచ్చి దానిని కాపాడుకోగలగడం... భారత జట్టు ఎంత బలంగా ఉందో చెప్పడానికి తొలి వన్డేలో ఈ ప్రదర్శన చూస్తే చాలు. మరోవైపు విదేశీ గడ్డపై ఆడిన గత 10 వన్డేల్లో 9 ఓడిన ఆస్ట్రేలియా పరిస్థితి మాత్రం ఇంకా ఆందోళనకరంగా ఉంది. ఈ నేపథ్యంలో రెండో వన్డేకు ఈడెన్ గార్డెన్స్ సిద్ధం కాగా... వరుణుడు కరుణిస్తేనే మ్యాచ్ జరిగే అవకాశముండటం తాజా స్థితి. కోల్‌కతా: తొలి వన్డేలో విజయం ఇచ్చిన ఉత్సాహంతో ఉన్న భారత జట్టు మరోసారి ఆస్ట్రేలియాను చిత్తు చేసేందుకు సన్నద్ధమైంది. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు ఇక్కడి ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగే రెండో వన్డేలో భారత్, ఆసీస్ తలపడనున్నాయి. ఒకవైపు భారత్ అన్ని విధాలా పటిష్టంగా కనిపిస్తుండగా... తుది జట్టు ఎంపిక విషయంలో ఆసీస్‌ను అనేక సమస్యలు వెంటాడుతున్నాయి. ఈ మ్యాచ్‌లోనూ భారత్ గెలిస్తే సిరీస్‌పై పట్టు చిక్కినట్లే. అయితే అన్నింటికి మించి వర్షం మ్యాచ్‌కు అడ్డంకిగా మారవద్దని అభిమానులు కోరుకుంటున్నారు. రహానే ఇప్పుడైనా: గత మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించినా... ఒక లోటు మాత్రం స్పష్టంగా కనిపించింది. ఓపెనర్‌గా అజింక్య రహానే సామర్థ్యంపై ఆ మ్యాచ్ మరోసారి సందేహాలు రేకెత్తించింది. శిఖర్ ధావన్ గైర్హాజరుతో శ్రీలంకపై చివరి వన్డేలో, చెన్నై వన్డేలో ఓపెనర్‌గా అవకాశం దక్కించుకున్న రహానే తన పాత్రకు న్యాయం చేయలేకపోయాడు. దూకుడుగా ఆడలేడంటూ అతనిపై గతంలో వచ్చిన విమర్శలకు రహానే మళ్లీ అవకాశం కల్పిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లోనైనా అతను మెరుగ్గా ఆడాల్సి ఉంది. నాలుగో స్థానాన్ని మనీశ్ పాండే ఖాయం చేసుకున్నాడు కాబట్టి ఒక్క మ్యాచ్ వైఫల్యంతో అతనిపై వేటు పడకపోవచ్చు. లోకేశ్ రాహుల్ ఈసారి కూడా పెవిలియన్‌కే పరిమితం కానున్నాడు. గత మ్యాచ్‌లో విఫలమైన కోహ్లి, రోహిత్ తమ సత్తాను చూపించాలని పట్టుదలగా ఉండగా... హార్దిక్ పాండ్యా, ధోని మరోసారి లోయర్ ఆర్డర్లో కీలకం కానున్నారు. ఇక బౌలింగ్‌లో కొత్త ‘మణికట్టు జోడి’ ఆసీస్‌ను గత మ్యాచ్‌లో దెబ్బ తీసింది. యజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్‌లను ఎదుర్కోవడం ప్రత్యర్థిగా సమస్యగా మారింది. బ్యాట్స్‌మెన్ సత్తాకు పరీక్ష: పరిమిత ఓవర్ల క్రికెట్లో చాలా కాలంగా ఆస్ట్రేలియా ముగ్గురు బ్యాట్స్‌మెన్‌పైనే ఎక్కువగా ఆధారపడుతోంది. వార్నర్, స్మిత్, మ్యాక్స్‌వెల్‌లో కనీసం ఒకరు భారీ ఇన్నింగ్స్ ఆడితేనే జట్టుకు విజయావకాశాలు ఉంటున్నాయి. తొలి వన్డేలో మ్యాక్స్‌వెల్ మెరుపు దాడి ఒక దశలో ఆసీస్‌ను గెలిపించినంత పని చేసింది. అయితే వార్నర్ స్థాయికి తగినట్లుగా ఆడకపోవడం, స్మిత్ వైఫల్యం జట్టును దెబ్బ తీశాయి. అనుభవం లేని కార్ట్‌రైట్, హెడ్, స్టొయినిస్లపై ఎవరూ అంచనాలు కూడా పెట్టుకోవడం లేదు. పిచ్, వాతావరణం: కోల్‌కతాలో గత మూడు రోజులుగా వానలు కురుస్తున్నాయి. మ్యాచ్ రోజు కూడా వర్ష సూచన ఉంది. పాక్షికంగా అంతరాయం కలగడం లేదా పూర్తిగా రద్దయ్యే ప్రమాదం కూడా ఉంది. ఇటీవల ఈడెన్ పిచ్ చక్కటి బౌన్స్‌తో పేసర్లకు అనుకూలంగా ఉంటోంది. తుది జట్లు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), రోహిత్, రహానే, పాండే, జాదవ్, ధోని, పాండ్యా, భువనేశ్వర్, చహల్, కుల్దీప్, బుమ్రా. ఆస్ట్రేలియా: స్మిత్ (కెప్టెన్), వార్నర్, హెడ్, కార్ట్‌రైట్/హ్యాండ్స్కోంబ్, మ్యాక్స్‌వెల్, స్టొయినిస్, వేడ్, ఫాల్క్‌నర్, కూల్టర్ నీల్, కమిన్స్, జంపా. చికెన్ ఉడకలేదు! మంగళవారం ప్రాక్టీస్ సందర్భంగా బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) తమ కోసం సిద్ధం చేసిన ఆహారంపై ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. గ్రిల్ చికెన్‌ను తాము కోరినట్లుగా 73 డిగ్రీల వద్ద వేడి చేయకుండా... అంతకంటే తక్కువ ఉష్ణోగ్రతతో వేడి చేసి అందించారని ఆటగాళ్లు ఆరోపించారు. ఇది తమ ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందని వారు అన్నారు. చికెన్‌పై ఆసీస్ ఆటగాళ్లు అసహనం వ్యక్తం చేసిన మాట వాస్తవమేనని, ఇక ముందు తగిన జాగ్రత్తలు తీసుకుంటామని ‘క్యాబ్’ అధికారులు వివరణ ఇచ్చారు. స్మిత్ @ 100 ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు ఇది వందో వన్డే మ్యాచ్ కానుంది. ఆరంభంలో తన బౌలింగ్, ఫీల్డింగ్‌తోనే చోటు దక్కించుకున్న స్మిత్ ఆ తర్వాత అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. తొలి 38 వన్డేల్లో 20.73 సగటుతో కేవలం 477 పరుగులు చేసిన స్మిత్... తర్వాతి 61 వన్డేల్లో 54.22 సగటుతో 2711 పరుగులు చేశాడు. -
వాళ్లు ప్రాక్టీస్‌లో... మనోళ్లు హోటల్లో...
►వాన కారణంగా భారత్ సెషన్ రద్దు ►ఇండోర్ నెట్స్‌లో ఆస్ట్రేలియా సాధన ►రేపటి రెండో వన్డేపై సందేహాలు! కోల్‌కతా: భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే మ్యాచ్‌కు వాన ముప్పు వీడేలా కనిపించడం లేదు. స్థానిక వాతావరణ శాఖ అధికారులు చెబుతున్న దాని ప్రకారం నగరంలో మరో 48 గంటల పాటు వర్ష సూచన ఉంది. గత రెండు రోజులుగా ఈడెన్ గార్డెన్స్ మైదానాన్ని పూర్తిగా కవర్లతో కప్పి ఉంచారు. మంగళవారం కూడా వర్షం పడటంతో భారత జట్టు ప్రాక్టీస్‌కు దూరమైంది. ఆటగాళ్లంతా హోటల్ రూమ్లకే పరిమితమయ్యారు. ‘వాన కారణంగా ప్రాక్టీస్ చేసే అవకాశం లేదు. జట్టు ఆటగాళ్లు స్టేడియానికి వెళ్లటం లేదు’ అని భారత టీమ్ మేనేజ్మెంట్ వెల్లడించింది. అయితే ఆస్ట్రేలియా మాత్రం ఈడెన్ మైదానానికి వచ్చి ఇండోర్ సౌకర్యాలను ఉపయోగించుకుంది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్ ఇండోర్ నెట్స్‌లో చాలా సమయం పాటు ప్రాక్టీస్ చేయగా, బౌలర్లు మాత్రం వెనక్కి వెళ్లిపోయారు. అయితే తమ వద్ద అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయని, కొద్దిసేపు ఎండ కాసినా మ్యాచ్ కోసం గ్రౌండ్‌ను సిద్ధం చేయగలమని ఈస్ట్‌జోన్ క్యురేటర్ ఆశిష్ భౌమిక్ విశ్వాసం వ్యక్తం చేశారు. స్మిత్‌కు కఠిన సవాల్: క్లార్క్ ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ ప్రస్తుతం నాయకుడిగా క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నాడని మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ అభిప్రాయపడ్డాడు. ఏదో ఒకటి చేసి ఆసీస్‌ను అతను గెలుపు బాట పట్టించాల్సిన అవసరం ఉందని అన్నాడు. ‘చాలా కాలంగా స్మిత్ చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అయితే కెప్టెన్‌గా మాత్రం సవాళ్లు ఎదురవుతున్నాయి. జట్టును గెలిపించేందుకు అతను పరిష్కారం కనుగొనాలి. రెండో వన్డే సిరీస్ గమనాన్ని నిర్దేశిస్తుంది కాబట్టి ఆస్ట్రేలియా కోలుకునేందుకు ఇదే సరైన తరుణం’ అని క్లార్క్ విశ్లేషించాడు. మరో వైపు 2019 ప్రపంచకప్‌లోనే కాకుండా 2023లో కూడా ఆడగల సామర్థ్యం ధోనికి ఉందంటూ క్లార్క్ సరదాగా వ్యాఖ్యానించాడు. -
‘ఈడెన్’కూ వర్షం బెడద
►కోల్‌కతా చేరిన భారత్, ఆస్ట్రేలియా జట్లు ►గురువారం రెండో వన్డే కోల్‌కతా: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈడెన్ గార్డెన్స్‌లో ఈ నెల 21న జరగనున్న రెండో వన్డేకూ వాన ముప్పు ఉంది. స్థానిక వాతావరణ కేంద్రం డైరెక్టర్ గణేష్ దాస్ మాట్లాడుతూ ‘ఈ నెల 21 వరకు వర్షాలు కురుస్తాయని ఇప్పటికే తెలియజేశాం. ఇక్కడ ఈ నెలంతా సాయంత్రం చిరుజల్లులు కురిసే అవకాశం ఎక్కువ’ అని అన్నారు. పరిస్థితిని సమీక్షించిన క్యాబ్ అధ్యక్షుడు గంగూలీ స్టేడియం వర్గాలకు అవసరమైన సూచనలు చేశారు. పిచ్, ఔట్ ఫీల్డ్‌ను కవర్స్‌తో కప్పి ఉంచారు. రెండో వన్డే ఆడేందుకు ఇరు జట్లు సోమవారం కోల్‌కతా చేరుకున్నాయి. అంతకుముందు కోల్‌కతాకు బయలు దేరేముందు చెన్నై విమానాశ్రయంలో ధోని, కోహ్లి తదితరులు ఎయిర్‌పోర్ట్‌లోని ఫ్లోర్‌పై కాసేపు సేదతీరిన ఫొటోలను బీసీసీఐ తమ వెబ్సైట్లో పోస్ట్ చేసింది. కోల్‌కతా చేరుకున్న ఆటగాళ్లు సోమవారం ప్రాక్టీస్ చేయకుండా పూర్తిగా విశ్రాంతి తీసుకున్నారు. చెన్నైలో జరిగిన తొలి వన్డేలో భారత్ శుభారంభం చేసిన సంగతి తెలిసిందే. ఇదే ఆఖరి ‘ఐదు’ సిరీస్ ఏమో! ఇకపై ముఖాముఖీ సిరీస్‌ల్లో ఐదు మ్యాచ్‌లకు చోటు ఉండకపోవచ్చని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) చీఫ్ ఎగ్జిక్యూటీవ్ జేమ్స్ సదర్లాండ్ అన్నారు. ప్రస్తుతం భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న 5 వన్డేల సిరీసే ఆఖరి పోరెమోనని చెప్పారు. ‘భవిష్యత్తులో ఏ దేశం కూడా మూడు వన్డేల సిరీస్‌కు మించి అంగీకరించకపోవచ్చు. దీంతో ద్వైపాక్షిక సిరీస్‌లన్నీ మూడు మ్యాచ్‌లతో జరుగుతాయని నాకు అనిపిస్తోంది’ అని సదర్లాండ్ తెలిపారు. ఇప్పటికే ముఖాముఖీ షెడ్యూల్లో టి20లు వచ్చేశాయని, త్వరలో టెస్టు చాంపియన్‌షిప్, 13 జట్ల వన్డే లీగ్‌లకూ శ్రీకారం జరగొచ్చని చెప్పారు. ఈ నేపథ్యంలో వన్డే సిరీస్‌ల కుదింపు అనివార్యమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ జరిగితే ఇటీవలి ఆసీస్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగినట్లుగా పోటాపోటీ ఉండాలని ఆయన ఆకాంక్షించారు. -
భువీంద్రజాలం
►భారత్‌ను గెలిపించిన భువనేశ్వర్, ధోని ►ఆరు వికెట్లు తీసిన లంక బౌలర్ ధనంజయ భారత్ ముందున్న లక్ష్యం 231... రోహిత్, ధావన్ జోరుగా ఆడి తొలి వికెట్‌కు 109 పరుగులు జోడించారు. ఇక మ్యాచ్ మళ్లీ ఏకపక్షం అనుకున్న దశలో లంక స్పిన్నర్ అఖిల ధనంజయ మాయకు బ్యాటింగ్ ఆర్డర్ ఒక్కసారిగా పేకమేడలా కుప్పకూలింది. 22 పరుగుల వ్యవధిలో ఏకంగా 7 వికెట్లు కూలాయి. జట్టు ఓటమి దిశగా పయనిస్తున్న సమయంలో ధోని, భువీ భాగస్వామ్యం అద్భుత విజయాన్ని అందించింది. ధోని ఎప్పటిలాగే తనదైన శైలిలో ప్రశాంతంగా ఆడగా... భువనేశ్వర్ తన కెరీర్లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్‌తో సత్తా చాటాడు. 100 పరుగుల అభేద్య భాగస్వామ్యం టీమిండియాకు ఎప్పటికీ గుర్తుంచుకునే విజయాన్ని అందించింది. కాండీ: ఓటమి ఖాయమే అనుకున్న స్థాయి నుంచి సీనియర్ బ్యాట్స్‌మన్ ఎంఎస్ ధోని (68 బంతుల్లో 45 నాటౌట్; 1 ఫోర్) అనుభవానికి తోడు భువనేశ్వర్ (80 బంతుల్లో 53 నాటౌట్; 4 ఫోర్లు; 1 సిక్స్) విలువైన అర్ధసెంచరీతో భారత జట్టు గట్టెక్కింది. ఈ జోడీ రికార్డు భాగస్వామ్యంతో గురువారం జరిగిన రెండో వన్డేలో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిన భారత్ మూడు వికెట్ల తేడాతో శ్రీలంకపై నెగ్గింది. అంతకుముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లంక 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 236 పరుగులు చేసింది. సిరివర్ధన (58 బంతుల్లో 58; 2 ఫోర్లు, 1 సిక్స్), కపుగెడెర (61 బంతుల్లో 40; 2 ఫోర్లు) మాత్రమే రాణించారు. బుమ్రాకు నాలుగు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత భారీ వర్షం కురవడంతో రెండు గంటలపాటు మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. దీంతో 47 ఓవర్లలో లక్ష్యాన్ని 231 పరుగులకు కుదించారు. రోహిత్ (45 బంతుల్లో 54; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), ధావన్ (50 బంతుల్లో 49; 6 ఫోర్లు, 1 సిక్స్) వేగంగా ఆడారు. ధనంజయకు ఆరు వికెట్లు దక్కాయి. ఆదుకున్న సిరివర్ధన లంక ఇన్నింగ్స్‌లో ఓపెనర్ డిక్వెల్లా క్రీజులో ఉన్న కాసేపు వేగంగా ఆడాడు. అయితే మిడ్ వికెట్లో ధావన్ పట్టిన క్యాచ్‌తో అవుటయ్యాడు. దీంతో తొలి వికెట్‌కు 41 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. కొద్దిసేపటికే వరుస ఓవర్లలో గుణతిలక (37 బంతుల్లో 19; 2 ఫోర్లు), కెప్టెన్ తరంగ (9) అవుట్ కావడంతో జట్టుపై ఒత్తిడి పెరిగింది. ఆ తర్వాత కుశాల్ (19), మాథ్యూస్ (41 బంతుల్లో 20;2 ఫోర్లు) రూపంలో 121 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో లంక ఇన్నింగ్స్‌ను సిరివర్ధన, కపుగెడెర ఆదుకున్నారు. సిరివర్ధన 49 బంతుల్లో 50 పరుగులు పూర్తిచేశాడు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని బుమ్రా విడదీశాడు. శుభారంభం అదుర్స్.. స్వల్ప లక్ష్యం కోసం బరిలోకి దిగిన భారత్‌కు రోహిత్, ధావన్ మెరుపు ఆరంభాన్నిచ్చారు. ముఖ్యంగా లంక గడ్డపై ఆడిన చివరి పది వన్డేల్లో మొత్తం 37 పరుగులే చేసిన రోహిత్ ప్రారంభం నుంచే ఎదురుదాడికి దిగాడు. రెండో బంతినే ఫోర్‌గా మలిచిన అతను తొమ్మిదో ఓవర్ లో వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. 43 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా అటు ధావన్ కూడా చెత్త బంతులను బౌండరీ దాటించడంతో 15 ఓవర్లలోనే జట్టు స్కోరు 102 పరుగులకు చేరింది. 16వ ఓవర్ నుంచి స్పిన్నర్ ధనంజయ చేసిన మాయతో భారత శిబిరం కుదేలైంది. మొదట రోహిత్‌ను ఎల్బీగా అవుట్ చేయడంతో తొలి వికెట్‌కు 109 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. సిరివర్ధన వేసిన ఆ మరుసటి ఓవర్లోనే మాథ్యూస్ తీసుకున్న అద్భుత డైవింగ్ క్యాచ్‌తో ధావన్ అవుటయ్యాడు. ఇక 18వ ఓవర్లో ధనంజయ భారత్‌కు గట్టి షాకే ఇచ్చాడు. బ్యాటింగ్ ప్రాక్టీస్ కోసం రాహుల్ (4), జాదవ్ (1)లను కోహ్లి (4)ముందుగా పంపించాడు. కానీ ధనంజయ ఐదు బంతుల వ్యవధిలోనే తన గూగ్లీ బంతులతో ఈ ముగ్గురినీ బౌల్డ్ చేయడంతో ఏం జరుగుతుందో అర్ధం కాని పరిస్థితి నెలకొంది. ఇంతటితో ఆగకుండా తన మరుసటి రెండు ఓవర్లలో పాండ్యా (0), అక్షర్ (6)ల పనిపట్టాడు. ఈ ఇబ్బందికర పరిస్థితిలో క్రీజులో ఉన్న ధోనికి భువనేశ్వర్ అండగా నిలిచాడు. దాదాపు 23 ఓవర్ల పాటు క్రీజులో నిలిచిన ఈ జోడి మొదట వికెట్ పడకుండా ఆచితూచి ఆడినా చివర్లో జోరు కనబరిచింది. ముఖ్యంగా భువీ.. ధోనికన్నా వేగంగా ఆడుతూ 77 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. చివరికంటా నిలిచిన వీరు జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు. ► 1 ఎనిమిదో వికెట్‌కు భారత్ తరఫున అత్యధిక భాగస్వామ్యం (100) నెలకొల్పిన ధోని, భువనేశ్వర్ జోడి ► 99 వన్డేల్లో ఎంఎస్ ధోని చేసిన స్టంపింగ్ల సంఖ్య. సంగక్కరతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. -
మరో పంచ్‌కు రెడీ!
-
మరో పంచ్‌కు రెడీ!
∙ నేడు రెండో వన్డే ∙ జోరు మీదున్న భారత్ ∙ శ్రీలంక కోలుకునేనా! తొలి టెస్టు నుంచి తొలి వన్డే వరకు వరుసగా నాలుగు మ్యాచ్‌లు... ఒకదాన్ని మించి మరో మ్యాచ్‌లో భారత్ అత్యద్భుత ఆటతీరు ఒకవైపు... కనీస పోటీ కూడా ఇవ్వలేకుండా పేలవంగా కుప్పకూలుతున్న శ్రీలంక మరోవైపు... ఇరు జట్ల మధ్య పోరు మరీ ఏకపక్షంగా మారిపోయింది. టీమిండియాలో ప్రతీ ఆటగాడు తన సత్తా చాటేందుకు ప్రయత్నిస్తుంటే... లంక క్రికెటర్లు ఘోరమైన ప్రదర్శన ఇవ్వడంలో ఒకరితో మరొకరు పోటీ పడుతున్నారు. అభిమానుల ఆసక్తిని దూరం చేస్తున్న ఈ పర్యటనలో మరో మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. మళ్లీ కోహ్లి సేన ఆధిపత్యమా... లేక లంకేయుల పోరాటమా అనేది చూడాలి. పల్లెకెలె: శ్రీలంకతో ఐదు వన్డేల సిరీస్‌లో తమ ఆధిక్యం పెంచుకునేందుకు భారత్ సన్నద్ధమైంది. ఇరు జట్ల మధ్య నేడు రెండో వన్డే జరగనుంది. ఆదివారం జరిగిన తొలి వన్డేలో భారత్ 9 వికెట్లతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లోనూ గెలిస్తే ఆధిక్యం 2–0కు చేరుతుంది. సొంతగడ్డపై కనీసం ఒక్క విజయం కోసం ఆశగా ఎదురు చూస్తున్న శ్రీలంక ఈసారైనా తమ అదృష్టం మార్చుకోవాలని పట్టుదలగా ఉంది. 2019లో జరిగే ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించాలంటే లంక ఈ సిరీస్‌లో కనీసం 2 వన్డేలైనా నెగ్గాలి. ఇలాంటి స్థితిలో ఆ జట్టు ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరం. అదే జట్టుతో... 2019 ప్రపంచ కప్ సన్నాహాల్లో భాగంగా జట్టులో సభ్యులందరికీ వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడే అవకాశం ఇవ్వాలనేది భారత టీమ్ మేనేజ్మెంట్ ఆలోచన. అయితే సిరీస్‌లో రెండో మ్యాచే కావడంతో గత మ్యాచ్‌లో ఆడిన టీమ్‌లో మార్పులు లేకుండానే భారత బరిలోకి దిగనుంది. మీడియా సమావేశంలో విరాట్ కోహ్లి కూడా సూత్రప్రాయంగా ఇదే విషయాన్ని వెల్లడించాడు. కాబట్టి రహానే, పాండేలు మరోసారి పెవిలియన్‌కే పరిమితం కానున్నారు. బౌలింగ్ విషయంలో కూడా కుల్దీప్ యాదవ్కంటే అక్షర్‌కే కెప్టెన్ ప్రాధాన్యత ఇస్తున్నాడు. అక్షర్‌తో పాటు తొలి వన్డేలో చహల్ చక్కటి బౌలింగ్ ప్రదర్శన కనబర్చాడు. వీరిద్దరి బౌలింగ్ వైవిధ్యం లంక బ్యాట్స్‌మెన్‌కు మరోసారి ఇబ్బందులు సృష్టించనుంది. పార్ట్‌టైమర్‌గా జాదవ్ సత్తా చాటగా... బుమ్రా ఎప్పటిలాగే ఆకట్టుకున్నాడు. అయితే కొత్త బంతితో బౌలింగ్ చేసిన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన బౌలింగ్‌ను ఇంకా మెరుగుపర్చుకోవాల్సి ఉంది. అతనికి ఈ మ్యాచ్ ఆ అవకాశం కల్పిస్తోంది. బ్యాటింగ్‌లో ధావన్, కోహ్లి అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. గత మ్యాచ్‌లో విఫలమైన రోహిత్ శర్మ భారీ ఇన్నింగ్స్‌పై దృష్టి పెట్టాడు. అయితే రాహుల్, జాదవ్‌లకు మరింత ప్రాక్టీస్ కల్పించేందుకు వారి బ్యాటింగ్ స్థానాల్లో మార్పులు చేసే అవకాశం మాత్రం ఉంది. ధోనికి కూడా బ్యాటింగ్ అవకాశం రావడం ముఖ్యం. గెలిపించేది ఎవరు? ఒక్క విజయం కోసం శ్రమిస్తున్న శ్రీలంక వద్ద అన్నీ సమాధానం లేని ప్రశ్నలే కనిపిస్తున్నాయి. గెలుపు కోసం ప్రయత్నించాల్సిన సమయంలో జట్టులో అభిప్రాయభేదాలు బయటపడినట్లు సమాచారం. గత వన్డేలో టెస్టు కెప్టెన్ చండిమాల్‌కు తుది జట్టులో స్థానమే లభించలేదు. ఓపెనర్ అయిన కెప్టెన్ తరంగ నాలుగో స్థానంలో బరిలోకి దిగడం కూడా అనూహ్య నిర్ణయం. కోచ్ పొథాస్, మేనేజర్ గురుసిన్హా, చీఫ్ సెలక్టర్ జయసూర్య మధ్య సమన్వయలేమి లంకను దెబ్బ తీస్తోంది. తొలి వన్డేలో శుభారంభం చేసినా... చివరి వరకు అదే జోరును కొనసాగించడంలో శ్రీలంక విఫలమైంది. పేసర్లను సమర్థంగా ఎదుర్కొన్న ఆ జట్టు స్పిన్నర్లకు తలవంచింది. ఈ నేపథ్యంలో రెండో వన్డేలో కొత్త వ్యూహంతో బరిలోకి దిగాలని లంక భావిస్తోంది. బ్యాటింగ్‌లో టాప్–4 డిక్వెలా, గుణతిలక, కుషాల్ మెండిస్, తరంగలలో కనీసం ఇద్దరు భారీ స్కోర్లు చేయాల్సి ఉంది. మాథ్యూస్, కపుగెడెర కూడా తమ పాత్రలకు న్యాయం చేయలేదు. బౌలింగ్‌లో ఆ జట్టు పదును పూర్తిగా తగ్గిపోయింది. ముఖ్యంగా సీనియర్ ఆటగాడు మలింగ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోగా... ఫెర్నాండో గత మ్యాచ్‌లోనే అరంగేట్రం చేశాడు. తిసార పెరీరాపై ఈ మ్యాచ్‌లో వేటు పడవచ్చు. అతని మీడియం పేస్ భారత్‌కు ఏమాత్రం ఇబ్బంది సృష్టించలేకపోగా... భారత్ తరహాలో ఆ జట్టు స్పిన్నర్లు ఆకట్టుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో మ్యాచ్‌లో గెలవాలంటే లంక తీవ్రంగా శ్రమించాలి. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), ధావన్, రోహిత్, రాహుల్, ధోని, జాదవ్, పాండ్యా, అక్షర్, భువనేశ్వర్, బుమ్రా, చహల్. శ్రీలంక: తరంగ (కెప్టెన్), డిక్వెలా, గుణతిలక, మెండిస్, మాథ్యూస్, కపుగెడెర, డి సిల్వ, సిరివర్దన, సందకన్/ధనంజయ, మలింగ, ఫెర్నాండో. పిచ్, వాతావరణం సాధారణ బ్యాటింగ్ వికెట్. అయితే రెండో ఇన్నింగ్స్ సమయంలో పేసర్లకు కాస్త అనుకూలించవచ్చు. స్పిన్నర్లు కూడా ప్రభావం చూపించగలరు. మ్యాచ్ రోజున చిరుజల్లులకు అవకాశం ఉంది. ►మధ్యాహ్నం గం. 2.30 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం -
వరుణుడు కరుణిస్తేనే..
♦ నేడు వెస్టిండీస్‌తో భారత్ రెండో వన్డే ♦ యువరాజ్ ఫామ్‌పై ఆందోళన పోర్ట్ ఆఫ్ స్పెయిన్: బలహీన వెస్టిండీస్‌పై క్లీన్‌స్వీప్ లక్ష్యంగా బరిలోకి దిగిన భారత క్రికెట్ జట్టుకు తొలి వన్డేలోనే వర్షం దెబ్బ కొట్టింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లు కూడా ఆడకముందే భీకర వర్షంతో మ్యాచ్ రద్దయ్యింది. వర్షం వల్ల ఆట నిలిచే సమయానికి భారత్ 39.2 ఓవర్లలో మూడు వికెట్లకు 199 పరుగులు చేసింది. ఆ తర్వాత వర్షం తెరిపినివ్వకపోవడంతో ఆట సాధ్యపడలేదు. దాంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఇక నేడు (ఆదివారం) అదే క్వీన్స్ పార్క్ ఓవల్ మైదానంలో రెండో వన్డే జరగనుంది. ఈ మ్యాచ్‌కు కూడా వరుణుడే కీలకం కానున్నాడు. ఎందుకంటే ఆదివారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడే అవకాశాలున్నాయి. ఓపెనర్లు శిఖర్ ధావన్, అజింక్యా రహానే సెంచరీ భాగస్వామ్యం తొలి వన్డేలో హైలైట్‌గా నిలిచింది. కెప్టెన్ కోహ్లి ఫామ్‌పై ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు. ఇక జట్టు ఆందోళనంతా డాషింగ్ బ్యాట్స్‌మన్ యువరాజ్ సింగ్ ఫామ్‌పైనే ఉంది. చాంపియన్స్ ట్రోఫీ ఆరంభ మ్యాచ్‌లో పాక్‌పై అర్ధ సెంచరీ చేసిన అనంతరం వరుసగా అతను చేసిన స్కోర్లు 7, 23 నాటౌట్, 22 మాత్రమే. విండీస్‌తో జరిగిన తొలి వన్డేలో యువీ 4 పరుగులే చేయగలిగాడు. అతడి క్లాస్ ఆటతీరుతో పాటు అనుభవంపై ఎవరికీ సందేహాలు లేకున్నా 35 ఏళ్ల వయస్సు మున్ముందు కెరీర్‌కు ప్రతిబంధకం కావచ్చు. ఇప్పటికే పలువురు మాజీలు యువీ జట్టులో ఉండడంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని అతడిపై ఓ నిర్ణయానికి రావాలని అండర్–19 కోచ్ రాహుల్ ద్రవిడ్ ఇటీవల సూచించారు. ఈ నేపథ్యంలో విండీస్‌తో సిరీస్‌ను ఓ మంచి అవకాశంగా మలుచుకుని విమర్శకులకు గట్టి సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అటు విండీస్ బౌలర్లు మ్యాచ్ జరిగిన కొద్దీ వికెట్లను తీసి కాస్త ఒత్తిడి పెంచాడు. రెండో వన్డేలోనూ పటిష్ట బ్యాటింగ్ లైనప్‌ను ఇబ్బంది పెట్టాలని విండీస్ బౌలింగ్ విభాగం ఆలోచిస్తోంది. జట్లు (అంచనా): భారత్: కోహ్లి (కెప్టెన్), ధావన్, రహానే, ధోని, యువరాజ్, కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్యా, అశ్విన్, భువనేశ్వర్, ఉమేశ్, కుల్దీప్. విండీస్: హోల్డర్ (కెప్టెన్), లూయిస్, పావెల్, హోప్, కార్టర్, మొహమ్మద్, చేజ్, నర్స్, జోసెఫ్, బిషూ, కమిన్స్. సాయంత్రం 6.30 నుంచి టెన్–3లో ప్రత్యక్ష ప్రసారం -
ఇంగ్లండ్‌దే సిరీస్
అంటిగ్వా: వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ నాలుగు వికెట్లతో గెలిచింది. మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ ఉండగానే 2–0తో దక్కించుకుంది. ముందుగా విండీస్ 47.5 ఓవర్లలో 225 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత ఇంగ్లండ్ 48.2 ఓవర్లలో ఆరు వికెట్లకు 226 పరుగులు చేసి నెగ్గింది. జో రూట్ (90 నాటౌట్; 3 ఫోర్లు)... రాయ్ (48 బంతుల్లో 52; 7 ఫోర్లు, 1 సిక్స్), క్రిస్ వోక్స్ (83 బంతుల్లో 68 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. -
దక్షిణాఫ్రికా జోరుకు బ్రేక్
రెండో వన్డేలో న్యూజిలాండ్ గెలుపు ∙ రాస్ టేలర్ సెంచరీ క్రైస్ట్‌చర్చ్: వరుసగా 12 విజయాలతో జోరు మీదున్న దక్షిణాఫ్రికా జట్టుకు న్యూజిలాండ్ అడ్డుకట్ట వేసింది. బుధవారం జరిగిన రెండో వన్డేలో కివీస్ ఆరు పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో నాలుగు వికెట్లకు 290 పరుగులు సాధించింది. రాస్ టేలర్ (110 బంతుల్లో 102; 8 ఫోర్లు) సెంచరీ చేయగా... విలియమ్సన్ (75 బంతుల్లో 69; 6 ఫోర్లు), నీషమ్ (57 బంతుల్లో 71 నాటౌట్; 6 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. టేలర్, విలియమ్సన్ మూడో వికెట్‌కు 104 పరుగులు జోడించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ప్రెటోరియస్ రెండు వికెట్లు తీశాడు. 291 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 283 పరుగులు చేసి ఓడిపోయింది. డి కాక్ (65 బంతుల్లో 57; 6 ఫోర్లు), ప్రెటోరియస్ (27 బంతుల్లో 50; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేసినా కీలక సమయాల్లో దక్షిణాఫ్రికా వికెట్లు కోల్పోయి మూల్యం చెల్లించుకుంది. 214 పరుగులకు ఎనిమిది వికెట్లు కోల్పోయిన దశలో ప్రెటోరియస్, ఫెలుక్వాయో (29 నాటౌట్; 4 ఫోర్లు) తొమ్మిదో వికెట్‌కు 59 పరుగులు జోడించారు. ప్రెటోరియస్ అవుటయ్యాక చివరి ఓవర్లో దక్షిణాఫ్రికా విజయానికి 16 పరుగులు అవసరమయ్యాయి. అయితే ఆ జట్టు తొమ్మిది పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. కివీస్ బౌలర్లలో బౌల్ట్ మూడు, సాంట్నెర్ రెండు వికెట్లు తీశారు. ఐదు వన్డేల సిరీస్‌లో ప్రస్తుతం రెండు జట్లు 1–1తో సమంగా ఉన్నాయి. మూడో వన్డే శనివారం జరుగుతుంది. -
కటక్‌లోనే కొట్టేయాలి!
సిరీస్ విజయమే భారత్ లక్ష్యం ఒత్తిడిలో ఇంగ్లండ్ నేడు రెండో వన్డే కొండలనైనా పిండి చేసే కోహ్లి తత్వానికి గత మ్యాచ్‌లో జాదవ్ జత కలవడంతో భారత జట్టు ఒక అద్భుతమైన విజయాన్ని అందుకుంది. 351 పరుగుల లక్ష్యాన్ని కూడా అలవోకగా అందుకొని వన్డే క్రికెట్లో తమ బలాన్ని ప్రదర్శించింది. ఇప్పుడు మళ్లీ అదే జోరును కొనసాగించి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. మరోవైపు ఎంత భారీ స్కోరు చేసినా గత మ్యాచ్‌లో ప్రత్యర్థిని కట్టడి చేయలేకపోయిన ఇంగ్లండ్ శిబిరంలో కాస్త ఆందోళన పెరిగింది. ఈ నేపథ్యంలో ఇరు జట్లు రెండో వన్డేకు సిద్ధమయ్యాయి. బారాబతి స్టేడియంలో భారత్‌కు మంచి రికార్డు ఉండటం మరో సానుకూలాంశం. కటక్: టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించిన కోహ్లి సేన ఇప్పుడు వన్డే సిరీస్ విజయానికి మరో మ్యాచ్ దూరంలో నిలిచింది. తొలి వన్డేలో చెలరేగి మ్యాచ్‌ను గెలుచుకున్న భారత్, నేడు (గురువారం) జరిగే రెండో వన్డేలో ఇంగ్లండ్‌తో పోరుకు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. మరోవైపు 350 పరుగులు చేసి కూడా మ్యాచ్‌ను కాపాడుకోలేకపోయిన ఇంగ్లండ్, సిరీస్‌లో కోలుకునే ప్రయత్నంలో ఉంది. ఇరు జట్లలోనూ దూకుడుగా ఆడే బ్యాట్స్‌మెన్‌కు లోటు లేకపోవడంతో మళ్లీ పరుగుల వరద పారడం ఖాయంగా కనిపిస్తోంది. భారత్, ఇంగ్లండ్ బుధవారమే కటక్ చేరుకొని ప్రాక్టీస్‌లో పాల్గొన్నాయి. అయితే భారత కెప్టెన్ కోహ్లి నెట్స్‌కు దూరంగా ఉన్నాడు. అశ్విన్ రాణించేనా... ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో తనదైన శైలిలో కోహ్లి సాగించిన వేట, జాదవ్ మెరుపు బ్యాటింగ్ భారత్‌కు విజయాన్నందించాయి. అయితే కొన్ని ఇతర లోపాలు కూడా ఇందులో కనిపించకుండా పోయాయి. వీరిద్దరు మినహా ఇతర బ్యాట్స్‌మెన్ అంతా విఫలమయ్యారు. భారత్ ఆరంభంలోనే నలుగురు ప్రధాన ఆటగాళ్ల వికెట్లు కోల్పోయింది. కోహ్లి, జాదవ్ భారీ భాగస్వామ్యం లేకపోతే ఫలితంలో తేడా వచ్చేది. కానీ ఇలాంటి అదృష్టం ప్రతీ రోజు కలిసి రాకపోవచ్చు. ముఖ్యంగా ఓపెనర్ శిఖర్ ధావన్ తన సత్తా ప్రదర్శించాల్సిన సమయం ఆసన్నమైంది. చాలా రోజులుగా అతడి నుంచి చెప్పుకోదగ్గ ప్రదర్శన రాలేదు. మరో ఓపెనర్ లోకేశ్ రాహుల్ కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. అన్నింటికి మించి ఇద్దరు ఆటగాళ్లు ఒత్తిడిలో ఉన్నారనేది వాస్తవం. పునరాగమనం చేసిన యువరాజ్‌తో పాటు ఇప్పుడు కేవలం బ్యాటింగ్ నైపుణ్యంతోనే జట్టులో కొనసాగాల్సిన ధోని కూడా మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉంది. లేదంటే కెప్టెన్ కోహ్లికి ఇది సమస్యగా మారవచ్చు. హార్దిక్ పాండ్యా రాణించడం సానుకూలాంశం కాగా, భారీ స్కోరు నమోదైన మ్యాచ్‌లోనూ జడేజా ఓవర్‌కు ఐదు పరుగులే ఇచ్చి ఆకట్టుకున్నాడు. అయితే ఇప్పుడు అశ్విన్ ఫామ్ ఆందోళన రేపుతోంది. టెస్టుల్లో తిరుగులేని బౌలింగ్ చేసిన ఈ నంబర్‌వన్ స్పిన్నర్ వన్డేల్లో మాత్రం తేలిపోతున్నాడు. గత 14 వన్డేలలో అతను ఎనిమిది సార్లు కనీసం తన ఓవర్ల కోటా కూడా పూర్తి చేయలేకపోయాడు. అతని స్థానంలో లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రాను తీసుకోవచ్చని వినిపిస్తున్నా... కోహ్లి తన ప్రధాన స్పిన్నర్‌పై ఇంత తొందరగా నమ్మకం కోల్పోకపోవచ్చు. ఉమేశ్, బుమ్రా పుణేలో విఫలమైనా ఈ మ్యాచ్‌లో వారి స్థానాలకు ఢోకా లేదు. ఏం చేయాలి? భారత పర్యటనలో ఇంగ్లండ్ తమ తొలి విజయాన్ని అందుకోవాలంటే అద్భుతం చేయాల్సిందేనేమో! అన్ని రంగాల్లో భారత్‌పై ఆ జట్టు ఆధిక్యం ప్రదర్శిస్తే గానీ గెలుపు రుచి చూడకపోవచ్చు. తొలి వన్డేలో రనౌటైన హేల్స్ మినహా ఆ జట్టు ప్రధాన బ్యాట్స్‌మెన్ అంతా రాణించడం వల్లే ఇంగ్లండ్ భారీ స్కోరు చేయగలిగింది. రాయ్, రూట్, స్టోక్స్ మంచి ఫామ్‌లో ఉండగా, మోర్గాన్, బట్లర్ ఒంటి చేత్తో మ్యాచ్ దిశను మార్చగల సమర్థులు. ఈసారి కూడా జట్టు తమ బ్యాటింగ్‌పైనే ప్రధానంగా ఆధార పడుతోంది. బౌలింగ్‌లో ఇద్దరు పేసర్లు వోక్స్, విల్లీ ప్రభావం చూపించగా, బాల్, స్టోక్స్ విఫలమయ్యారు. భారత్‌లాగే ఇంగ్లండ్‌ను కూడా తన స్పిన్ విభాగం కలవరపెడుతోంది. ఇద్దరు స్పిన్నర్లు రషీద్, మొయిన్ అలీ ఘోరంగా విఫలమయ్యారు. నిజానికి టెస్టులకంటే కూడా రషీద్‌కు పరిమిత ఓవర్లలోనే మంచి రికార్డు ఉంది. కానీ పుణే మ్యాచ్‌లో అతని బౌలింగ్‌ను భారత్ చితక్కొట్టింది. రషీద్ స్థానంలో మరో పేసర్ ప్లంకెట్‌ను ఆడించాలని కూడా ఇంగ్లండ్ భావిస్తోంది. ఓవరాల్‌గా తమ బౌలింగ్‌పై పెద్దగా నమ్మకం ఉంచే పరిస్థితి లేకపోవడంతో మరోసారి భారీ స్కోరుపైనే ఇంగ్లండ్ ఆశలు పెట్టుకుంది. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), ధావన్, రాహుల్, యువరాజ్, ధోని, జాదవ్, పాండ్యా, జడేజా, అశ్విన్/మిశ్రా, బుమ్రా, ఉమేశ్. ఇంగ్లండ్: మోర్గాన్ (కెప్టెన్), రాయ్, హేల్స్, రూట్, బట్లర్, స్టోక్స్, అలీ, వోక్స్, విల్లీ, బాల్, రషీద్/ ప్లంకెట్. పిచ్, వాతావరణం బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌పై తొలి మ్యాచ్‌లాగే ఈసారి కూడా భారీ స్కోరుకు అవకాశం ఉంది. బారాబతి స్టేడియంలో బౌండరీలు చిన్నగా ఉండటం కూడా మరో కారణం. బుధవారం పిచ్‌పై కాస్త పచ్చిక ఉన్నా, మ్యాచ్ ముందు దానిని తొలగించవచ్చు. అయితే మంచు ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తోంది కాబట్టి టాస్ కీలకం కానుంది. ఈ మైదానంలో ఆడిన 15 వన్డేల్లో భారత్ 11 గెలిచి, 4 ఓడింది. ఇందులో నాలుగు సార్లు భారత్, ఇంగ్లండ్ తలపడ్డాయి. వీటిలో ఇరు జట్లు చెరో 2 మ్యాచ్‌లు నెగ్గాయి. రెండేళ్ల క్రితం ఇక్కడ శ్రీలంకతో జరిగిన వన్డేలో 363 పరుగులు చేసిన భారత్ 169 పరుగులతో విజయం సాధించింది. ఇందులో ధావన్, రహానే సెంచరీలు చేశారు. మధ్యాహ్నం గం. 1.30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్షప్రసారం -
రెండో వన్డేలో భారత్ ఓటమి
-
నేలకు దించారు
►రెండో వన్డేలో భారత్ ఓటమి ►6 పరుగులతో కివీస్ విజయం ►సెంచరీతో చెలరేగిన విలియమ్సన్ ►మూడో వన్డే ఆదివారం మూడు టెస్టుల్లో ఘన విజయం, ఆ తర్వాత తొలి వన్డేలోనూ భారీ తేడాతో గెలుపు... న్యూజిలాండ్ జట్టు మన గడ్డపై అడుగు పెట్టిననాటినుంచి వరుస విజయాలతో పండుగ చేసుకున్న భారత జట్టు జోరుకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. సాధారణ లక్ష్యాన్ని ఛేదించడంలో మన బ్యాట్స్‌మెన్ విఫలం కావడంతో భారత గడ్డపై కివీస్ బోణీ చేసింది. తక్కువ స్కోర్ల మ్యాచ్ చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగినా... చివరకు విలియమ్సన్ సేనదే పైచేరుు అరుుంది. 243 పరుగుల లక్ష్య ఛేదనలో ఒక దశలో భారత్ స్కోరు 183/8... మిగిలిన 55 బంతుల్లో గెలుపు కోసం 60 పరుగు చేయాలి. ఎలాంటి ఆశలు లేని ఈ దశలో హార్దిక్ పాండ్యా, ఉమేశ్ యాదవ్ 49 పరుగుల భాగస్వామ్యం జట్టును విజయానికి చేరువగా తెచ్చింది. తొలి మ్యాచ్‌లో బౌలింగ్‌తో ఆకట్టుకున్న పాండ్యా ఈ సారి బ్యాట్‌తో మెరిశాడు. మరో 11 పరుగులు చేయాల్సిన సమయంలో అతను వెనుదిరగడంతో భారత్ విజయం వాకిట కుప్పకూలింది. న్యూఢిల్లీ: ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్‌లో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న కేన్ విలియమ్సన్ ఎట్టకేలకు తన క్లాస్ చూపించాడు. సహచరులంతా విఫలమైన వేళ ఒంటరిగా నిలబడి సెంచరీ సాధించాడు. ఆ తర్వాత తన కెప్టెన్సీతో జట్టును గెలిపించాడు. మరో వైపు ప్రధాన బ్యాట్స్‌మెన్ అవుటైన దశలో 19వ ఓవర్లోనే క్రీజ్‌లోకి వచ్చిన ధోని తన బాధ్యతను సమర్థంగా నిర్వర్తించలేకపోయాడు. ఇటీవల తన పేలవ ప్రదర్శనను కొనసాగిస్తూ జట్టును నడిపించడంలో విఫలమయ్యాడు. మొత్తంగా ఇరు జట్ల కెప్టెన్ల పోరులో విలియమ్సన్ గెలిచాడు. గురువారం ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ 6 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది. కేన్ విలియమ్సన్ (128 బంతుల్లో 118; 14 ఫోర్లు, 1 సిక్స్) కెరీర్లో ఎనిమిదో సెంచరీని సాధించాడు. బుమ్రా, మిశ్రా చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం భారత్ 49.3 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌటైంది. కేదార్ జాదవ్ (37 బంతుల్లో 41; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా... ధోని (65 బంతుల్లో 39; 3 ఫోర్లు), హార్దిక్ పాండ్యా (32 బంతుల్లో 36; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. ఈ ఫలితంతో ఐదు వన్డేల సిరీస్ 1-1తో సమంగా నిలిచింది. మూడో వన్డే ఆదివారం మొహాలీలో జరుగుతుంది. కీలక భాగస్వామ్యం టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగగా... కివీస్ జట్టులో మూడు మార్పులు జరిగారుు. కివీస్ ఓపెనర్ గప్టిల్ (0) పేలవ ఫామ్ ఈ మ్యాచ్‌లోనూ కొనసాగింది. ఇన్నింగ్స రెండో బంతికే అతడిని బౌల్డ్ చేసి ఉమేశ్ భారత్‌కు శుభారంభం అందించాడు. అరుుతే మరో ఓపెనర్ లాథమ్ (46 బంతుల్లో 46; 6 ఫోర్లు, 1 సిక్స్), విలియమ్సన్ జాగ్రత్తగా ఆడారు. భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ వీరు అలవోకగా పరుగులు సాధించడంతో పవర్‌ప్లే ముగిసే సరికి జట్టు స్కోరు 50 పరుగులకు చేరింది. అక్షర్ పటేల్ వేసిన ఒక ఓవర్లో రెండు ఫోర్లు, సిక్సర్ బాది విలియమ్సన్ జోరు ప్రదర్శించాడు. 46 పరుగుల వద్ద విలియమ్సన్ ఇచ్చిన కష్టసాధ్యమైన క్యాచ్‌ను పాండ్యా వదిలేయడం కివీస్‌కు కలిసొచ్చింది. వీరిద్దరి అటాకింగ్ ఆటతో తర్వాతి పది ఓవర్లలో 65 పరుగులు వచ్చారుు. ఆ వికెట్ తర్వాత... పార్ట్‌టైమర్ జాదవ్ మరోసారి జట్టుకు అదృష్టం తెచ్చాడు. తన తొలి ఓవర్లోనే లాథమ్‌ను అవుట్ చేసి అతని భారీ భాగస్వామ్యానికి తెర దించాడు. ఆ తర్వాత ఒక వైపు విలియమ్సన్ పట్టుదలగా నిలబడ్డా... మరో ఎండ్‌లో కివీస్ పతనం మొదలైంది. క్రీజ్‌లో ఉన్నంత సేపు తీవ్రంగా ఇబ్బంది పడ్డ టేలర్ (21) మిశ్రా బౌలింగ్‌లో స్వీప్‌కు ప్రయత్నించి డీప్ మిడ్వికెట్లో క్యాచ్ ఇచ్చాడు. బుమ్రా బౌలింగ్‌లో కవర్స్ దిశగా ఆడి రెండు పరుగులు తీయడంతో 109 బంతుల్లో విలియమ్సన్ సెంచరీ పూర్తరుుంది. ఈ పర్యటన మొత్తంలో కివీస్ తరఫున ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. ఈ దశలో అండర్సన్ (21)ను అవుట్ చేసి మిశ్రా మళ్లీ దెబ్బ తీశాడు. మిశ్రా తన తర్వాతి ఓవర్లోనే చక్కటి బంతితో విలియమ్సన్‌ను కూడా పెవిలియన్ పంపించడంతో ఆ జట్టు కోలుకోలేకపోరుుంది. ఆ తర్వాత మరో 24 పరుగులు మాత్రమే చేసి కివీస్ తర్వాతి ఐదు వికెట్లు కోల్పోరుుంది. ఒక దశలో ఆ జట్టు వరుసగా 11 ఓవర్ల పాటు ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోరుుంది. భారత బౌలర్లలో బుమ్రా ఒక్కడే 37 డాట్ బాల్స్ వేయగా, మొత్తం కలిపి కివీస్ పరుగులు తీయని బంతులు 161 ఉండటం చూస్తే భారత బౌలర్లు ఎంతగా కట్టడి చేశారో అర్థమవుతుంది. కోహ్లి విఫలం ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని విధంగా భారత జట్టు తక్కువ వ్యవధిలోనే తొలి నాలుగు వికెట్లు కోల్పోరుుంది. టాప్-4 ఆటగాళ్లలో ఎవరూ ఎక్కువ సేపు నిలబడలేకపోయారు. ముందుగా రోహిత్ (15)ను అవుట్ చేసి బౌల్ట్ కివీస్‌కు తొలి వికెట్ అందించాడు. అరుదైన రీతిలో కోహ్లి (9) కూడా విఫలమయ్యాడు. సాన్‌ట్నర్ బౌలింగ్‌లో లెగ్ సైడ్ ఆడిన బంతిని కీపర్ రోంచీ చక్కగా అందుకోవడంతో కోహ్లి ఇన్నింగ్స ముగిసింది. చక్కటి షాట్లు ఆడిన రహానే (49 బంతుల్లో 28; 3 ఫోర్లు) కుదురుకుంటున్న దశలో సౌతీ దెబ్బ తీశాడు. ఫైన్ లెగ్ దిశగా రహానే పుల్ షాట్ ఆడగా తక్కువ ఎత్తులో వచ్చిన బంతిని అండర్సన్ క్యాచ్ పట్టాడు. అరుుతే అతని చేతుల్లో పడే ముందు బంతి నేలకు తగిలినట్లు కని పించింది. పదే పదే రీప్లేలు చూసిన తర్వాత థర్డ్ అంపైర్ రహానేను అవుట్‌గా ధ్రువీకరించారు. ఆ తర్వాతి ఓవర్లోనే మనీశ్ పాండే (19) రనౌట్‌గా వెనుదిరిగాడు. ఆదుకున్న ధోని, జాదవ్ ఈ దశలో జత కలిసిన ధోని, జాదవ్ దూకుడును ప్రదర్శించారు. ముఖ్యంగా జాదవ్ కెప్టెన్‌ను మించి ధాటిగా ఆడాడు. సాన్‌ట్నర్ వేసిన రెండు వరుస ఓవర్లలో అతను రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు బాదాడు. ఐదో వికెట్‌కు 66 పరుగులు జోడించిన అనంతరం హెన్రీ బౌలింగ్‌లో కీపర్ క్యాచ్ ఇచ్చి జాదవ్ నిష్ర్కమించాడు. అనంతరం ధోని, అక్షర్ కలిసి 33 పరుగులు జోడించినా... కివీస్ కట్టుదిట్టమైన బౌలింగ్, ఫీల్డింగ్‌తో పరుగులు నెమ్మదిగా వచ్చారుు. ఈ దశలో సౌతీ అద్భుత రిటర్న్ క్యాచ్‌తో ధోనిని పెవిలియన్ పంపించాడు. ఆ తర్వాత గప్టిల్ తన తొలి ఓవర్లో రెండు వికెట్లు తీయడంతో భారత్ ఓటమికి మరింత చేరువైంది. ఇలాంటి స్థితిలో పాండ్యా, ఉమేశ్ (18 నాటౌట్) జోడి గెలుపుపై ఆశలు రేపినా...చివరకు ఓటమి తప్పలేదు. 13 భారత్‌ను భారత గడ్డపై న్యూజిలాండ్ 13 ఏళ్ల తర్వాత ఓడించింది. ఈ కాలంలో ఇరు జట్ల మధ్య 8 వన్డేలు జరిగారుు. -
పోరాడి ఓడిన టీమిండియా
న్యూఢిల్లీ: న్యూజిలాండ్ తో రెండో వన్డేలో టీమిండియా పోరాడి ఓడింది. కాగా, ఈ విజయంతో న్యూజిలాండ్ ఐదు వన్డేల సిరీస్ ను 1-1తో సమం చేసింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ కివీస్ ను 242/9 పరుగుల కట్టడి చేసింది. కివీస్ బ్యాట్స్ మన్లలో కెప్టెన్ కేన్ విలియమ్సన్ 128 బంతుల్లో 118 పరుగులు చేశాడు. అనంతరం 243 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత ఓపెనర్లు శుభారంభం అందించడంలో విఫలమయ్యారు. ఇన్నింగ్స్ 21 పరుగుల వద్ద ఓపెనర్ రోహిత్ శర్మ(15) కీపర్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత కివీస్ బౌలర్లు విజృంభించడంతో భారత స్కోరు బోర్డు నత్త నడకన కదిలింది. విరాట్ కోహ్లీ(9), అజింక్యారహానే(28), మనీశ్ పాండే(19)లు కూడా త్వరగా ఔట్ అవడంతో టీమిండియా పీకల్లోతు కష్టాల్లోకి కూరుకుపోయింది. ఆచితూచి ఆడుతూ.. ఆ తర్వాత 73/4 వద్ద క్రీజులోకి వచ్చిన కెప్టెన్ ధోని, కేదార్ జాదవ్ లు చెత్త బంతులను బౌండరీలుగా మలుస్తూ ఇన్నింగ్స్ ను నిర్మించే ప్రయత్నం చేశారు. ఈ దశలో జాదవ్(41) అనవసర షాట్ కు యత్నించి 139/5 వద్ద కీపర్ క్యాచ్ గా వెనుదిరగాడు. దీంతో వీరిద్దరి భాగస్వామ్యనికి తెరపడింది. జాదవ్ ఔటయిన తర్వాత ఆల్ రౌండర్ హర్దిక్ పాండ్యాను వరుసలో వెనుకకు పంపి అక్షర్ ను క్రీజులోకి తీసుకువచ్చాడు ధోని. ఆచితూచి ఆడుతూ అక్షర్ పటేల్ తో కలిసి తిరిగి స్కోరును ముందుకు తీసుకువెళ్తున్న సమయంలో టిమ్ సౌథీ బౌలింగ్ లో అతనికే క్యాచ్ ఇచ్చి 172/6గా ధోని వెనుదిరిగాడు. ఆశలు కల్పించి.. దీంతో్ న్యూజిలాండ్ తిరిగి మ్యాచ్ పై పట్టు దొరికినట్లయింది. ఆ తర్వాత వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయి మ్యాచ్ ఇండియా చేజారిపోయే దశకు చేరింది. అప్పుడ బ్యాటింగ్ కు వచ్చిన ఉమేశ్ యాదవ్, ఆల్ రౌండర్ హర్ధిక్ పాండ్యాకు అండగా నిలిచాడు. దీంతో మ్యాచ్ తిరిగి ఇండియా చేతికి వచ్చినట్లు కనిపించింది. చివరి ఆరు బంతుల్లో 10 పరుగులు చేయాల్సిన సమయంలో పాండ్యా(36) క్యాచ్ గా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బుమ్రాను టిమ్ సౌథీ బౌల్డ్ చేయడంతో మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే 236 పరుగుల వద్ద టీమిండియా ఇన్నింగ్స్ ముగిసింది. కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, గుప్తిల్ బంతితో నిప్పులు చెరిగారు. సౌథీ మూడు వికెట్లను పడగొట్టగా.. బౌల్ట్, గుప్తిల్ లకు చెరో రెండు, హెన్రీ, సాంట్నర్ లకు తలా ఓ వికెట్ దక్కాయి. -
ప్రాక్టీస్... ప్రాక్టీస్...
జోరుగాధోని సాధన రెండో వన్డేకూ సురేశ్ రైనా దూరం న్యూఢిల్లీ: న్యూజిలాండ్‌తో రెండో వన్డేకు రెండు రోజుల ముందు మంగళవారం భారత ఆటగాళ్లకు ఆప్షనల్ ప్రాక్టీస్ మాత్రమే. దాంతో కోహ్లి, రహానే, రోహిత్ తదితర ఆటగాళ్లంతా సాధనకు దూరంగా విశ్రాంతి తీసుకున్నారు. అయితే కెప్టెన్ ధోని మాత్రం తన బ్యాటింగ్‌కు మరింత పదును పెట్టే పనిలో పడ్డాడు. జూనియర్లతో కలిసి సుదీర్ఘ సమయం పాటు నెట్స్‌లో ప్రాక్టీస్ చేశాడు. ముందుగా పేసర్ ధావల్ కులకర్ణిని ఎదుర్కొన్న అతను, ఆ తర్వాత కోచ్‌లు కుంబ్లే, బంగర్ విసిరిన త్రో డౌన్సలను పదే పదే పుల్ షాట్లు ఆడాడు. మరో వైపు కొత్త బౌలర్ జయంత్ యాదవ్ బౌలింగ్‌లో కూడా ప్రాక్టీస్ చేసిన ధోని అతనికి ఈ సందర్భంగా పలు సూచనలిచ్చాడు. ఫీల్డింగ్ స్థానాలను బట్టి ఎలా బౌలింగ్ చేయాలో చెప్పాడు. జ్వరం కారణంగా తొలి వన్డేకు దూరమైన సురేశ్ రైనా జట్టుతో కలిశాడు. కొద్దిసేపు ప్రాక్టీస్ కూడా చేశాడు. అయితే జ్వరం పూర్తిగా తగ్గకపోవడంతో ఈ మ్యాచ్‌లోనూ అతను ఆడటం లేదని జట్టు మేనేజ్మెంట్ ప్రకటించింది. నెట్స్‌లో జాదవ్ కూడా తీవ్రంగా సాధన చేశాడు. బ్యాటిం గ్‌తో పాటు చాలా సేపు ధోని, రైనాలకు బౌలింగ్ చేశాడు. -
ఢిల్లీ వన్డే: రైనా అవుట్
ఢిల్లీ: టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ సురేష్ రైనా.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేకూ దూరంకానున్నాడు. వైరల్ జ్వరంతో బాధపడుతున్న రైనా ఇంకా కోలుకోలేదు. మరికొంత కాలం విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు అతనికి సూచించారు. దీంతో ఈ నెల 20న ఢిల్లీలో జరిగే వన్డేకు రైనా అందుబాటులో ఉండటం లేదు. న్యూజిలాండ్‌తో ధర్మశాలలో ఆదివారం జరిగిన తొలి వన్డేకు కూడా రైనా దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్లతో విజయం సాధించింది. కాగా అతని స్థానంలో మరో ఆటగాడిని జట్టులోకి తీసుకోలేదు. -
భళా... బంగ్లాదేశ్
రెండో వన్డేలో ఇంగ్లండ్ ఓటమి మిర్పూర్: సొంతగడ్డపై తొలి వన్డేలో ఎదురైన పరాజయానికి బంగ్లాదేశ్ ప్రతీకారం తీర్చుకుంది. ఆదివారం ఇక్కడ జరిగిన రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 34 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. మహ్ముదుల్లా (75) టాప్ స్కోరర్‌గా నిలవగా, కెప్టెన్ మొర్తజా (44) రాణించాడు. వోక్స్, బాల్, రషీద్ తలా 2 వికెట్లు తీశారు. అనంతరం ఇంగ్లండ్ 44.4 ఓవర్లలో 204 పరుగులకే ఆలౌటైంది. బట్లర్ (57) అర్ధ సెంచరీ సాధించగా, బెయిర్‌స్టో (35) ఫర్వాలేదనిపించాడు. ఆదిల్ రషీద్ (33 నాటౌట్), జేక్ బాల్ (28) చివరి వికెట్‌కు 45 పరుగులు జోడించి పోరాడినా లాభం లేకపోరుుంది. సిరీస్ ఫలితాన్ని తేల్చే మూడో వన్డే బుధవారం చిట్టగాంగ్‌లో జరుగుతుంది. -
దక్షిణాఫ్రికా భారీ విజయం
జొహన్నెస్‌బర్గ్: ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఆధిపత్యం కొనసాగింది. ఆదివారం ఇక్కడ జరిగిన రెండో వన్డేలో దక్షిణాఫ్రికా 142 పరుగుల భారీ తేడాతో ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించింది. ఈ విజయంతో ఐదు వన్డేల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో నిలిచింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 361 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఫాఫ్ డు ప్లెసిస్ (93 బంతుల్లో 111; 13 ఫోర్లు) సెంచరీతో చెలరేగగా... డుమిని (58 బంతుల్లో 82; 10 ఫోర్లు, 3 సిక్సర్లు), రోసో (81 బంతుల్లో 75; 10 ఫోర్లు) అండగా నిలిచారు. అనంతరం ఆస్ట్రేలియా 37.4 ఓవర్లలో 219 పరుగులకే ఆలౌటైంది. హెడ్ (45 బంతుల్లో 51; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), వార్నర్ (56 బంతుల్లో 50; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలు చేశారు. పార్నెల్ 3 వికెట్లు పడగొట్టాడు. ఆసీస్‌పై పరుగులపరంగా సఫారీలకు ఇది రెండో అతి పెద్ద విజయం కావడం విశేషం. -
ఆడుతూ... పాడుతూ...
మరోసారి సేమ్ టు సేమ్ సీన్...ఎలాంటి తడబాటు లేదు, ఎలాంటి వైఫల్యమూ లేదు, జింబాబ్వేపై ధోని సేన సంపూర్ణ ఆధిపత్యం... ముందుగా చక్కటి బౌలింగ్‌తో ప్రత్యర్థిని మరింత తక్కువ స్కోరుకే కట్టడి చేసిన భారత యువ జట్టు ఆ తర్వాత సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. ప్రయోగంగా భావించిన పర్యటనలో కొత్త కుర్రాళ్లతో కూడా భారత్ అలవోకగా సిరీస్ విజయాన్ని అందుకుంది. ♦ రెండో వన్డే కూడా భారత్‌దే ♦ 8 వికెట్లతో జింబాబ్వే చిత్తు ♦ 2-0తో సిరీస్ సొంతం హరారే: జింబాబ్వే గడ్డపై భారత కుర్రాళ్ల జోరు కొనసాగుతోంది. సోమవారం ఇక్కడ జరిగిన రెండో వన్డేలో భారత్ 8 వికెట్ల తేడాతో జింబాబ్వేపై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 34.3 ఓవర్లలో 126 పరుగులకే ఆలౌటైంది. వుసీ సిబాందా (69 బంతుల్లో 53; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించగా, ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ యజువేంద్ర చహల్ (3/25) ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. అనంతరం భారత్ 26.5 ఓవర్లలో 2 వికెట్లకు 129 పరుగులు చేసింది. అంబటి రాయుడు (44 బంతుల్లో 41 నాటౌట్; 7 ఫోర్లు), కరుణ్ నాయర్ (68 బంతుల్లో 39; 5 ఫోర్లు), రాహుల్ (50 బంతుల్లో 33; 4 ఫోర్లు) రాణించారు. ఫలితంగా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్ భారత్ సొంతమైంది. చివరిదైన మూడో వన్డే బుధవారం జరుగుతుంది. చహల్‌కు మూడు వికెట్లు జింబాబ్వే బ్యాటింగ్ గత మ్యాచ్‌ను తలదన్నే రీతిలోనే సాగింది. ఒక దశలో 106/3తో మెరుగ్గా కనిపించిన ఆ జట్టు 9.1 ఓవర్లలో 20 పరుగుల వ్యవధిలో చివరి 6 వికెట్లు కోల్పోయింది. టాస్ ఓడిన జింబాబ్వే బ్యాటింగ్‌కు దిగగా... బరీందర్ తన వరుస ఓవర్లలో మసకద్జా (9), మూర్ (1)లను అవుట్ చేసి భారత్‌కు శుభారంభం అందించాడు. చిబాబా (21)ను ధావల్ వెనక్కి పంపడంతో 10 ఓవర్లు ముగిసే సరికి జింబాబ్వే 3 వికెట్లు కోల్పోయి 39 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ దశలో సిబాందా, రజా (16) కొద్ది సేపు క్రీజ్‌లో నిలదొక్కుకొని జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 15.2 ఓవర్లలో 67 పరుగులు జోడించారు. ఈ క్రమంలో సిబాందా 58 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే జింబాబ్వే కోలుకుంటున్న సమయంలో లెగ్‌స్పిన్నర్ చహల్ అద్భుత బౌలింగ్ ఆ జట్టును దెబ్బ తీసింది. భారీ షాట్ ఆడబోయిన రజా లాంగాన్‌లో చిక్కగా, తర్వాతి బంతికే చిగుంబురా (0) వెనుదిరిగాడు. చహల్ తన తర్వాతి ఓవర్లోనే సిబాందాను అవుట్ చేయడంతో జింబాబ్వే కుప్పకూలింది. తన చివరి 2 ఓవర్లను మెయిడిన్‌గా వేసిన చహల్ 3 వికెట్లు తీయడం విశేషం. అనంతరం జింబాబ్వే ఆలౌట్ కావడానికి ఎంతో సమయం పట్టలేదు. ఇర్విన్ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన విలియమ్స్ టాస్ తర్వాత గాయపడి బ్యాటింగ్‌కు రాలేకపోయాడు. అలవోకగా... స్వల్ప లక్ష్య ఛేదనలో భారత ఓపెనర్లు శుభారంభం అందించారు. తొలి మ్యాచ్‌లాగే రాహుల్ మళ్లీ ఆకట్టుకోగా, ఈ సారి కరుణ్ నాయర్ కూడా రాణించాడు. చటారా వేసిన వరుస ఓవర్లలో వీరిద్దరు చెరో రెండు బౌండరీలు బాది ధాటిని ప్రదర్శించారు. అయితే అర్ధ సెంచరీ భాగస్వామ్యం తర్వాత చిబాబా వేసిన బంతిని రాహుల్ వికెట్లపైకి ఆడుకోవడంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం నాయర్, రాయుడు కలిసి రెండో వికెట్‌కు 67 పరుగులు జత చేశారు. చిగుంబురా, చిబాబా ఓవర్లలో రెండేసి ఫోర్లు కొట్టిన రాయుడు వేగంగా జట్టును విజయానికి చేరువ చేశాడు. మరో 2 పరుగులు చేయాల్సిన సమయంలో నాయర్ అవుటైనా, పాండే (4 నాటౌట్) ముగించాడు. స్కోరు వివరాలు: జింబాబ్వే ఇన్నింగ్స్: మసకద్జా (సి) బుమ్రా (బి) బరీందర్ 9; చిబాబా (ఎల్బీ) (బి) ధావల్ 21; మూర్ (ఎల్బీ) (బి) బరీందర్ 1; సిబాందా (సి) జాదవ్ (బి) చహల్ 53; రజా (సి) జాదవ్ (బి) చహల్ 16; చిగుంబురా (ఎల్బీ) (బి) చహల్ 0; ముతుంబామి (సి) ధోని (బి) బుమ్రా 2; క్రీమర్ (నాటౌట్) 7; చటారా (బి) ధావల్ 2; ముజరబని (ఎల్బీ) (బి) అక్షర్ 5; సీన్ విలియమ్స్ (ఆబ్సెంట్హర్ట్); ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (34.3 ఓవర్లలో ఆలౌట్) 126. వికెట్ల పతనం: 1-19; 2-21; 3-39; 4-106; 5-106; 6-107; 7-112; 8-115; 9-126. బౌలింగ్: బరీందర్ 6-1-17-2; ధావల్ 9-1-31-2; బుమ్రా 6-0-27-1; అక్షర్ 7.3-0-22-1; చహల్ 6-2-25-3. భారత్ ఇన్నింగ్స్: రాహుల్ (బి) చిబాబా 33; నాయర్ (ఎల్బీ) (బి) రజా 39; రాయుడు (నాటౌట్) 41; పాండే (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (26.5 ఓవర్లలో 2 వికెట్లకు) 129. వికెట్ల పతనం: 1-58; 2-125. ; బౌలింగ్: చటారా 8-1-40-0; ముజరబని 3-1-13-0; చిబాబా 9-1-31-1; క్రీమర్ 3-0-17-0; చిగుంబురా 2-0-20-0; రజా 1.5-0-7-1. -
భారత్‌దే వన్డే సిరీస్
లంకపై రెండో విజయం రాంచీ: ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన భారత మహిళల జట్టు... శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకుంది. జేఎస్సీఏ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన లంక 50 ఓవర్లలో 9 వికెట్లకు 178 పరుగులు చేసింది. సురంగిక (43 నాటౌట్), ప్రసాదిని (37), సిరివర ్ధనే (19), కౌసల్య (18) రాణించారు. భారత బౌలర్ల ధాటికి వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన లంకేయులు భారీ స్కోరు చేయడంలో విఫలమయ్యారు. దీప్తి శర్మ 4 వికెట్లు తీసింది. తర్వాత భారత్ 43.1 ఓవర్లలో 4 వికెట్లకు 179 పరుగులు చేసింది. కెప్టెన్ మిథాలీ (53 నాటౌట్), మందన (46), హర్మన్‌ప్రీత్ కౌర్ (41), తిరుష్ కామిని (26)లు చెలరేగారు. మందన, కామిని తొలి వికెట్‌కు 67 పరుగులు జోడించి శుభారంభాన్నిచ్చారు. సుగందిక కుమారి 4 వికెట్లు పడగొట్టింది. దీప్తికి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. -
మూడో వన్ డేలో 330 కొడతాం: ధోనీ
బ్రిస్బేన్: ఆతిథ్య ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు వన్ డేల సిరీస్ లో తొలి రెండు మ్యాచ్ ల్లో 300 పైచిలుకు పరుగులు సాధించినప్పటికీ ఓటమిని చవిచూడటం బాధాకరమేనని, దీన్ని బట్టి ప్రత్యర్థి జట్టుకు 300 పరుగుల లక్ష్యం సరిపోవట్లేదని టీమిండియా సారధి ఎంఎస్ ధోనీ అన్నారు. బ్రిస్బేన్ లో రెండో వన్ డే అనంతరం మీడియాతో మాట్లాడిన ధోనీ.. మూడో వన్ డేలో 330 పైచిలుకు పరుగులు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. 'మా ముందున్నవి రెండే లక్ష్యాలు ఒకటి ప్రత్యర్థి బ్యాట్స్ మన్ కు కట్టడి చేయడం లేదా 330 పరుగులు సాధించడం. తర్వాతి మ్యాచ్ లో రెండో పని చేస్తాం' అని టీమిండియా కెప్టెన్ అన్నారు. భారత తురుపుముక్క ఇషాంత శర్మ వైఫల్యంపై స్పందిస్తూ మైదానంలో గాలి అనుకూలంగా వీయలేదని, ఒకవైపు కాకుండా అన్ని వైపుల నుంచి గాలి వీయడం వల్లే ఇషాంత్ స్వింగ్ రాబట్టలేకపోయాడని ధోనీ చెప్పారు. ఐదు మ్యాచ్ ల సిరీస్ లో 0-2తో వెనుకబడిపోయిన దృష్ట్యా మిగిలిన మూడు మ్యాచ్ ల్లో కఠోరంగా శ్రమిస్తామన్నారు. శుక్రవారం బ్రిస్బేన్ లో జరిగిన రెండో వన్ డేలో టీమిండియాపై ఆస్ట్రేలియా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. బుధవారం పెర్త్ లో రిగిన తొలి మ్యాచ్ లో ఆసీస్ ఐదు వికెట్ల తేడాతో జయభేరి మోగించిన సంగతి తెలిసిందే. మూడో వన్ డే ఆదివారం (జనవరి 17) మెల్ బోర్న్ లో జరగనుంది. -
ధోని సేన మళ్లీ ఓడింది..
బ్రిస్బేన్: వేదిక మారినా టీమిండియా తలరాత మారలేదు. మరోసారి భారీ స్కోరు సాధించిన ధోని సేనకు అదృష్టం కలిసిరాలేదు. రోహిత్ శర్మ అద్భుత సెంచరీతో కళాత్మక ఇన్నింగ్స్ ఆడినా మళ్లీ పాత కథే పునరావృతమైంది. ఆస్ట్రేలియాతో ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా శుక్రవారం బ్రిస్బేన్ లో జరిగిన రెండో వన్డేలో టీమిండియా పరాజయం పాలైంది. టీమిండియా నిర్దేశించిన 309 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆసీస్ ఏ మాత్రం తడబడకుండా లక్ష్యాన్ని చేరుకుంది. ఆసీస్ ఇన్నింగ్స్ లో ఓపెనర్లు అరోన్ ఫించ్(71), షాన్ మార్ష్(71) చక్కటి ఆరంభాన్నిచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్ కు 145 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును పటిష్టస్థితికి చేర్చారు. కాగా, ఈ జోడీ 21 పరుగుల వ్యవధిలో పెవిలియన్ కు చేరడంతో టీమిండియా జట్టులో ఆశలు చిగురించాయి. అయితే కెప్టెన్ స్టీవ్ స్మిత్(46), జార్జ్ బెయిలీ(76నాటౌట్ )లు మరోసారి ఆకట్టుకోవడంతో మ్యాచ్ మెల్లగా ఆసీస్ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఈ జంట 78 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన అనంతరం స్మిత్ మూడో వికెట్ గా అవుటయ్యాడు. ఆ తరుణంలో బెయిలీకి జత కలిసిన మ్యాక్ప్ వెల్ టీమిండియా బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ స్కోరు బోర్డును ముందుకు కదలించాడు. ఒకపక్క మ్యాక్స్ వెల్(26 నాటౌట్) కుదురుగా ఆడితే బెయిలీ మాత్రం దూకుడును ప్రదర్శించాడు. ఫలితంగా ఆసీస్ 49.0 ఓవర్లలో మూడు వికెట్లను మాత్రమే కోల్పోయి ఇన్నింగ్స్ ను ముగించింది. దీంతో ఆసీస్ టోర్నీలో 2-0 ఆధిక్యం సాధించింది. టీమిండియా బౌలర్లలో ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్, రవీంద్ర జడేజాలకు తలో వికెట్ దక్కింది. అంతకుముందు టాస్ గెలిచిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది. ఆదిలో ఓపెనర్ శిఖర్ ధవన్(6) వికెట్ ను కోల్పోయినా. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు ఆకట్టుకోవడంతో మూడొందల పైచిలుకు పరుగుల సాధ్యమైంది. విరాట్(59) హాఫ్ సెంచరీతో రాణిస్తే, రోహిత్(124; 127 బంతుల్లో 11ఫోర్లు, 3 సిక్సర్లు) మరోసారి కళాత్మక ఇన్నింగ్స్ తో శతకం నమోదు చేశాడు. కాగా, విరాట్-రోహిత్ శర్మల జోడీ రనౌట్ రూపంలో పెవిలియన్ చేరడం అభిమానుల్ని నిరాశపరిచింది. తొలుత విరాట్ అనవసరపు పరుగు కోసం యత్నించి రనౌట్ కాగా, తన కెరీర్ లో 10 వ సెంచరీ చేసి మంచి ఊపు మీద ఉన్న రోహిత్ శర్మ నాన్ స్ట్రైకర్ ఎండ్ లో ఉండగా బౌలర్ ఫాల్కనర్ చేతికి బంతి తగిలి రనౌట్ పెవిలియన్ చేరాడు. అయితే రోహిత్ అవుటైన తరువాత క్రీజ్ లోకి వచ్చిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని(11) క్రీజ్ లో ఎక్కువ సేపు నిలవలేదు. ఆ తరువాత రహానే(89 ) హాఫ్ సెంచరీ చేయగా, మనీష్ పాండే (6), రవీంద్ర జడేజా (5), అశ్విన్(1) లు స్కోరును పెంచే యత్నంలో వెంట వెంటనే అవుటై నిరాశపరిచారు. రోహిత్-కోహ్లిల అత్యత్తుమ భాగస్వామ్యం గబ్బా స్టేడియంలో విరాట్ కోహ్లి-రోహిత్ శర్మల జోడి భారత్ తరుపున అత్యుత్తమ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. రోహిత్ శర్మ- కోహ్లిలు రెండో వికెట్ కు 125 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించారు. ఈ స్టేడియంలో ఏ వికెట్ కైనా భారత్ అత్యధిక భాగస్వామ్యం ఇదే కావడం విశేషం. ఈ క్రమంలోనే రోహిత్ సెంచరీ చేయగా, విరాట్ హాఫ్ సెంచరీ సాధించాడు. అనంతరం రోహిత్ -అజింకా రహనేల జోడి మూడో వికెట్ కు 121 పరుగుల రెండో అత్యుత్తమ భాగస్వామ్యాన్ని సాధించారు. మరోవైపు ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాపై రోహిత్ శర్మ సరికొత్త రికార్డు సృష్టించాడు. రెండో వన్డేలో సెంచరీ చేసిన రోహిత్.. ఆస్ట్రేలియా గడ్డపై నాలుగు శతకాలు చేసిన భారత ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. గత పెర్త్ వన్డేలో భారీ సెంచరీ చేసి భారత మాజీ బ్యాట్స్ మెన్ వీవీఎస్ లక్ష్మణ్ సరసన నిలిచిన రోహిత్.. ఈ తాజా సెంచరీతో ఆ రికార్డును బద్దలు కొట్టాడు. ఇదిలా ఉండగా గబ్బా స్టేడియంలో అత్యధిక స్కోరు చేసిన భారత ఓపెనర్ గా నిలిచాడు. గతంలో సచిన్ టెండూల్కర్ ఈ స్టేడియంలో ఓపెనర్ గా చేసిన 91 పరుగుల రికార్డును రోహిత్ సవరించాడు. ఓవరాల్ గా రోహిత్ కెరీర్ లో ఇది 10 వన్డే సెంచరీ కాగా, ఆస్ట్రేలియాపై ఐదో సెంచరీ. ఆస్ట్రేలియాపై ఆస్ట్రేలియాలో వరుసగా రెండో సెంచరీ చేయడంతో వీవీఎస్, గ్రేమ్ హిక్ ల సరసన రోహిత్ నిలిచాడు. -
పటిష్టస్థితిలో ఆస్ట్రేలియా
బ్రిస్బేన్: టీమిండియా జరుగుతున్న రెండో వన్డేలో ఆస్ట్రేలియా నిలకడగా బ్యాటింగ్ కొనసాగిస్తోంది. టీమిండియా నిర్దేశించిన 309 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ దిగిన ఆసీస్ 37.0 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసి పటిష్టస్థితికి చేరింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్(29 బ్యాటింగ్), జార్జ్ బెయిలీ(17 బ్యాటింగ్) క్రీజ్ లో ఉన్నారు. అంతకుముందు అరోన్ ఫించ్(71), షాన్ మార్ష్(71)పెవిలియన్ కు చేరారు. వీరిద్దరూ తొలి వికెట్ కు 145 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. టీమిండియా బౌలర్లలో ఇషాంత్ శర్మ, రవీంద్ర జడేజాలకు తలో వికెట్ దక్కింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది. -
రెండో వన్డేలో మైకేల్ క్లార్క్!
బ్రిస్బేన్: ఇది ఒకింత ఆశ్చర్యానికి గురి చేయొచ్చు. అంతర్జాతీయ క్రికెట్ కు గతేడాది వీడ్కోలు పలికిన వ్యక్తి ఆకస్మికంగా మళ్లీ జట్టులోకి రావడమేమిటనేది సగటు క్రికెట్ అభిమానిని నిజంగా ఆలోనలో పడేసే విషయమే. క్లార్క్ మళ్లీ చడీ చప్పుడు కాకుండా ఆసీస్ కు ఆడుతున్నాడా? అనే అనుమానాన్ని రేకెత్తించారు బ్రిస్బేన్ స్కోరు బోర్డు నిర్వాహకులు. ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా టీమిండియాతో శుక్రవారం జరుగుతున్న రెండో వన్డేలో క్లార్క్ పేరు ప్రధాన స్కోరు బోర్డుపై ప్రత్యక్షమైంది. టాస్ గెలిచి టీమిండియా బ్యాటింగ్ దిగిన సమయంలో ఇరు జట్ల ఆటగాళ్ల పేర్లను స్టేడియంలో ఉన్న స్క్రీన్ పై చూపించిన క్రమంలో క్లార్క్ పేరు కనబడింది. అయితే దీన్ని చూసిన ప్రేక్షకులు తొలుత కాస్త ఆలోచనలో పడ్డారు. ఇది సాంకేతిక తప్పిదం వల్ల చోటు చేసుకుందని గ్రహించి కాసేపు నవ్వుకున్నారు. కాగా, దీనిపై మైకేల్ క్లార్క్ తనదైన శైలిలో స్పందించాడు. ఇంకా నన్ను గబ్బా ఇంకా ప్రేమిస్తున్నందుకు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశాడు. మళ్లీ క్రికెట్ జీవితంలోకి వచ్చే ఆలోచన లేదని ఈ సందర్భంగా క్లార్క్ పేర్కొన్నాడు. -
దీటుగా బదులిస్తున్న ఆసీస్
బ్రిస్బేన్: ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా ఇక్కడ శుక్రవారం టీమిండియా జరుగుతున్న రెండో వన్డేలో ఆస్ట్రేలియా దీటుగా బదులిస్తోంది. టీమిండియా విసిరిన 309 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన ఆసీస్ నిలకడగా బ్యాటింగ్ కొనసాగిస్తోంది. దీంతో 20.0 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ వికెట్ నష్టపోకుండా 93 పరుగులు చేసింది. ఆసీస్ ఓపెనర్లు షాన్ మార్ష్(46 బ్యాటింగ్), అరోన్ ఫించ్( 38బ్యాటింగ్) లు జట్టు స్కోరును ముందుకు తీసుకువెళుతున్నారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు చక్కటి ఇన్నింగ్స్ తో ఆకట్టుకోవడంతో టీమిండియా మూడొందల పైచిలుకు పరుగులు సాధించింది. విరాట్(59) హాఫ్ సెంచరీతో రాణిస్తే, రోహిత్(124; 127 బంతుల్లో 11ఫోర్లు, 3 సిక్సర్లు) మరోసారి కళాత్మక ఇన్నింగ్స్ తో శతకం నమోదు చేశాడు. ఈ జోడీ 125 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి మంచి పునాది వేయగా, ఆపై రోహిత్-అజింకా రహానే ల జోడి మూడో వికెట్ కు 121 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించింది. ఈ క్రమంలోనే రహానే(89) హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.