భారత మహిళల క్రికెట్ జట్టు
కింబర్లీ: దక్షిణాఫ్రికాలో వన్డే సిరీస్ గెలుచుకునేందుకు భారత మహిళల క్రికెట్ జట్టు ముందు మంచి అవకాశం. తొలి వన్డేలో 88 పరుగుల భారీ తేడాతో ఆతిథ్య జట్టును చిత్తు చేసిన మిథాలీ సేన... బుధవారం కింబర్లీలో రెండో వన్డే ఆడనుంది. ప్రపంచకప్ ఆడిన ఏడు నెలల తర్వాత బరిలో దిగినా ఆ ప్రభావం ఏమీ లేకుండా సోమవారం ప్రత్యర్థిపై సునాయాస విజయం సాధించింది. ఇదే ఊపును కొనసాగిస్తే మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను సొంతం చేసుకోవడం కష్టం కాదు.
బ్యాటింగ్‌లో స్మృతి, కెప్టెన్ మిథాలీ, బౌలింగ్‌లో పేసర్లు జులన్, శిఖా పాండేల ఫామ్‌తో జట్టు బలంగా కనిపిస్తోంది. మొదటి వన్డేలో వీరే గెలుపు బాధ్యత మోశారు. ఈసారీ రాణిస్తే తిరుగుండదు. మిగతావారు విఫలమవడంతో సఫారీలు కెప్టెన్ వాన్ నికెర్క్‌పైనే ఆధారపడుతున్నారు. సిరీస్ చేజారకుండా చూసుకోవాలంటే వారు సమష్టిగా ఆడాల్సిన అవసరం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment