breaking news
south africa
-
క్యాషియర్ సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కుంటే నేరమా బాస్?!
ఓ చిరుద్యోగం చేసుకునే మహిళ ఎంతో కష్టపడి, ఇష్టపడి కారు కొనుక్కుంటే..ఆ ఉద్యోగిని ఉద్యోగంలోంచి తీసేసిన ఘటన చర్చకు దారితీసింది. మంచి జీవితం గడపడం కూడా తప్పేనా అంటూ బాధిత మహిళ సోషల్ మీడియాలో తన గోడును వెళ్ల బోసుకుంది. దీంతో ఈ స్టోరీ వైరల్‌గా మారింది.దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్లో ఒక గ్యారేజ్‌లో క్యాషియర్‌గా పనిచేస్తోంది అసేజా లిమెలింటాకా (28) భారతీయ సంతతికి చెందిన షిరాజ్ పటేల్ ఆమె బాస్. సెకండ్‌హ్యాండ్ హోండా కారు కొనుక్కుని ఆ కారులో ఆఫీసుకు వెళ్లడమే ఆమె చేసిన నేరం. జీతం తక్కువగా ఉన్నా, కారు కొన్నావా అంటూ తన బాస్ తనను తొలగించారని ఆమె ఆరోపించింది. కష్టపడి ఎన్నో నెలల పొదుపు చేసుకుని, లోన్ తీసుకుని మరీ తన కారు కొన్నానని వాపోయింది.ఇవన్నీ చెప్పినా కూడా బాస్ పటేల్ తనను నమ్మ లేదని , వేరే చోట పనిచేస్తుందో లేదో తనిఖీ చేయడానికి ఆమె బ్యాంక్ ఖాతాను చూపించాలని డిమాండ్ చేశాడని ఆమె ఆరోపించింది. వివరాలు చూసి కొత్త ఫర్నిచర్ కొంటున్నావ్, ఇక నువ్వు క్యాషియర్‌గా ఉండటానికి వీల్లేదంటూ తనను తీసేసారని ఆమె ఫేస్బుక్ పోస్ట్‌లో రాసింది.అంతేకాదు దొంగతనం ఆరోపణలు కూడా చేశాడని పేర్కొంది. పెట్రోల్ పంప్ అటెండెంట్‌గా పనిచేయాలని లేదా రాజీనామా చేయాలని అతను ఆమెకు అల్టిమేటం ఇచ్చాడని ఆమె అన్నారు.అయితే బెర్క్లీ మోటార్ గ్యారేజ్ యజమాని లిమెలింటకా చేసిన ఆరోపణలను ఖండించారు. ఆమెను తొలగించలేదని పేర్కొన్నారు. తామె ఎవరిపైనా ఎలాంటి ఆరోపణలు చేయలేదద చాలా నిజాలని దాచిపెట్టిందన్నారు. అలాగే కంపెనీపై తప్పుడు ఆరోపణలు చేసినందు వల్ల ఇకపై అప్రమత్తంగా ఉంటామని తెలిపాడు. -
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ సౌతాఫ్రికాకు మరో కొత్త కెప్టెన్
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ సౌతాఫ్రికాకు రోజుల వ్యవధిలో ముగ్గురు కెప్టెన్లు మారారు. గత నెలలో జరిగిన డబ్ల్యూటీసీ 2023-25 ఫైనల్లో సౌతాఫ్రికాకు సారథ్యం వహించిన టెంబా బవుమా.. జింబాబ్వే పర్యటనకు విశ్రాంతి తీసుకోగా, కేశవ్ మహారాజ్‌ను తాత్కాలిక సారధిగా నియమించారు. జింబాబ్వే పర్యటనలో తొలి టెస్ట్‌లో అదరగొట్టిన కేశవ్ మహారాజ్ దురదృష్టవశాత్తు గాయపడటంతో, రెండో టెస్ట్‌లో అతనికి ప్రత్యామ్నాయంగా మరో కొత్త కెప్టెన్‌ను నియమించారు. కెరీర్లో కేవలం 20 టెస్ట్ మ్యాచ్‌లే ఆడిన వియాన్ ముల్దర్‌ను దక్షిణాఫ్రికా నూతన సారధిగా ఎంపిక చేశారు. జింబాబ్వేలో పర్యటిస్తున్న సౌతాఫ్రికా జట్టులో కేశవ్ మహారాజ్ తర్వాత ముల్దరే అత్యంత అనుభవజ్ఞుడు (కైల్ వెర్రిన్ (26) మినహా). మిగతా ఆటగాళ్లంతా 20కి మించి టెస్ట్‌లు ఆడలేదు. తొలి టెస్ట్‌తో ప్రిటోరియస్, బ్రెవిస్, కోడి యూసఫ్ అరంగేట్రం చేశారు. డబ్ల్యూటీసీ ఫైనల్ అనంతరం సీనియర్ ఆటగాళ్లంతా విశ్రాంతి తీసుకోవడంతో సౌతాఫ్రికా మేనేజ్మెంట్ జింబాబ్వే టూర్‌కు యువ జట్టును పంపింది. ఈ యువ జట్టుకు అత్యంత సీనియర్ అయిన కేశవ్ మహారాజ్‌ను కెప్టెన్‌గా నియమించింది.అయితే అతను తొలి టెస్ట్ సందర్భంగా గజ్జల్లో గాయానికి గురయ్యాడు. రెండో టెస్ట్‌లో అతనికి ప్రత్నామ్నాయ ఆటగాడిగా సెనురన్ ముత్తుస్వామిని ఎంపిక చేశారు. జులై 6 నుంచి బులవాయోలో జరిగే రెండో టెస్ట్‌లో వియాన్ ముల్దర్ దక్షిణాఫ్రికా సారధిగా వ్యవహరిస్తాడు. దీంతో సౌతాఫ్రికా మూడు వరుస టెస్ట్ మ్యాచ్‌ల్లో ముగ్గురు వేర్వేరు కెప్టెన్లతో బరిలోకి దిగినట్లవుతుంది.కొత్త కెప్టెన్ ముల్దర్ జింబాబ్వేతో జరిగిన తొలి టెస్ట్‌లో అద్బుతంగా రాణించాడు. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన అతను తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీసి, ఆతర్వాత బ్యాటింగ్‌లో సెంచరీ (147) చేశాడు. తొలి టెస్ట్‌లో సారధిగా వ్యవహరించిన కేశవ్ మహారాజ్ కూడా ఆల్‌రౌండర్‌గా రాణించాడు. బ్యాటింగ్‌లో 21, 51 పరుగులు చేసి బౌలింగ్‌లో 3,1 వికెట్లు తీశాడు.గాయంతో బాధపడుతున్న కేశవ్ మహారాజ్‌ను స్వదేశానికి పిలిపించిన సౌతాఫ్రికా యాజమాన్యం అతనితో పాటు సీనియర్ పేసర్ లుంగి ఎంగిడిని కూడా జట్టు నుంచి రిలీజ్ చేసింది. తొలి టెస్ట్‌లో అద్బుతంగా రాణించిన యువ పేసర్లకు మరో అవకాశం ఇవ్వడం కోసం ఎంగిడిని స్వదేశానికి పిలిపించారు. తొలి టెస్ట్‌లో పేసర్లు కోడి యూసఫ్, మఫాకా, బాష్, ముల్దర్ విశేషంగా రాణించారు. ఆ మ్యాచ్‌లో కేశవ్ మహారాజ్ ఏకైక స్పిన్నర్‌గా బరిలోకి దిగాడు.కాగా, జింబాబ్వేతో తాజాగా ముగిసిన టెస్ట్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా 328 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో కార్బిన్ బాష్ (100, 5/43), డ్రి ప్రిటోరియస్ (153), వియాన్ ముల్దర్ (4/50, 147), కేశవ్ మహారాజ్ (3/70, 51), కోడి యూసఫ్ (3/42, 3/22) అద్భుత ప్రదర్శనలు చేసి సౌతాఫ్రికాను గెలిపించారు. ఈ గెలుపుతో సౌతాఫ్రికా చివరి 9 మ్యాచ్‌ల్లో గెలిచిన జట్టుగా అరుదైన ఘనత సాధించింది. ప్రస్తుతం టెస్ట్ క్రికెట్లో ఏ జట్టు ఈ ఘనత సాధించలేదు. -
రెండో టెస్ట్‌లోనే అరుదైన ఫీట్ సాధించిన సౌతాఫ్రికా ఆల్‌రౌండర్
సౌతాఫ్రికా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కార్బిన్ బాష్ తన కెరీర్లో రెండో టెస్ట్‌లోనే అరుదైన ఫీట్ సాధించాడు. సెంచరీ సహా ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. తద్వారా ఈ ఘనత సాధించిన నాలుగో సౌతాఫ్రికా ప్లేయర్‌గా, ఓవరాల్‌గా 40వ ఆల్‌రౌండర్‌గా రికార్డుల్లోకెక్కాడు. బాష్‌కు ముందు (సౌతాఫ్రికా) జిమ్మీ సింక్లైర్ (106, 6/26), ఏ ఫాల్కనర్ (123. 5/120), జాక్ కల్లిస్ (110, 5/90), జాక్ కల్లిస్ (139 నాటౌట్, 5/21) ఈ ఘనత సాధించారు.జింబాబ్వేతో తాజాగా ముగిసిన టెస్ట్ మ్యాచ్‌లో బాష్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో బాష్ తొలి ఇన్నింగ్స్‌లో అజేయ సెంచరీ (100) చేసి రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన (5/43) నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో బాష్ సహా డ్రి ప్రిటోరియస్ (153), ముల్దర్ (4/50, 147), కేశవ్ మహారాజ్ (3/70, 51), కోడి యూసఫ్ (3/42, 3/ 22) సత్తా చాటడంతో జింబాబ్వేపై సౌతాఫ్రికా 328 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ గెలిచిన తర్వాతి మ్యాచ్‌లోనే సౌతాఫ్రికా ఛాంపియన్‌లా ఆడి కొత్త టెస్ట్ సైకిల్‌ను (2025-27) ఘనంగా ప్రారంభించింది. రెండు మ్యాచ్‌ల సిరీస్ కోసం జింబాబ్వేలో పర్యటిస్తున్న సౌతాఫ్రికా ద్వితియ శ్రేణి జట్టుతో బరిలోకి దిగింది. అయినా ఛాంపియన్ ఆట ఆడి పసికూన జింబాబ్వేపై తమ పరాక్రమాన్ని చూపించింది. సీనియర్లు బవుమా, మార్క్రమ్, రబాడ లాంటి వారు ఈ సిరీస్ ఆడకుండా విశ్రాంతి తీసుకున్నారు.ఈ మ్యాచ్‌లో జింబాబ్వే ఓడినప్పటికీ వారి స్థాయికి మించి పోరాటం చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు సౌతాఫ్రికాకు ధీటుగా బదులిచ్చే ప్రయత్నం చేసింది. సీన్ విలియమ్స్ (137) అద్బుతమైన సెంచరీతో జింబాబ్వేను గట్టెక్కించే ప్రయత్నం చేశాడు. మరో ఎండ్ నుంచి ఎవరి సహకారం లేకపోవడంతో అతని పోరాటం వృధా అయ్యింది. రెండో ఇన్నింగ్స్‌లో జింబాబ్వే పూర్తిగా చేతులెత్తేసింది. భారీ లక్ష్య ఛేదనలో ఆ జట్టు స్వల్ప స్కోర్‌కే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన అరంగేట్రం ఆటగాడు డ్రి ప్రిటోరియస్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ మ్యాచ్‌లో ప్రిటోరియస్తో పాటు డెవాల్డ్ బ్రెవిస్, కోడి యూసఫ్ అరంగేట్రం చేశారు. రెండో టెస్ట్ జులై 6 నుంచి బులవాయో వేదికగానే జరుగనుంది. -
సెంచరీతో కదంతొక్కిన సన్‌రైజర్స్ ఆల్‌రౌండర్
ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడే సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ వియాన్ ముల్దర్.. జింబాబ్వేతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీతో కదంతొక్కాడు. మ్యాచ్ మూడో రోజు లంచ్ విరామానికి ముందు ముల్దర్ 149 బంతుల్లో 13 ఫోర్లు, సిక్సర్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ముల్దర్‌కు టెస్ట్‌ల్లో ఇది రెండో సెంచరీ. గతేడాది అక్టోబర్‌లో ముల్దర్ బంగ్లాదేశ్‌పై అజేయ శతకం బాదాడు.ముల్దర్ ఇటీవలే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ టైటిల్ గెలిచిన సౌతాఫ్రికా జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ముల్దర్ తాజా ఐపీఎల్ సీజన్లో ఇంగ్లండ్ ఆటగాడు బ్రైడన్ కార్స్‌కు రీప్లేస్‌మెంట్‌గా ఎస్ఆర్హెచ్లో చేరాడు. ఎస్ఆర్హెచ్ ముల్దర్‌ను 75 లక్షల బేస్ ధరకు సొంతం చేసుకుంది. ముల్దర్ ఐపీఎల్ 2025లో 2 మ్యాచ్‌లు ఆడి కేవలం 9 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్‌లో ఓ ఓవర్ మాత్రమే వేశాడు.మ్యాచ్ విషయానికొస్తే.. బులవాయో వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో సౌతాఫ్రికా పటిష్ట స్థితిలో ఉంది. మూడో రోజు రెండో సెషన్ సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు 415 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. వియాన్ ముల్దర్ 142, కైల్ వెర్రిన్ 30 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.అంతకుముందు జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 251 పరుగులకు ఆలౌటై ఫాలో ఆన్ తప్పించుకుంది. జింబాబ్వేను సీన్ విలియమ్స్ (137) అద్బుత సెంచరీతో గట్టెక్కించాడు. రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీతో కదంతొక్కిన ముల్దర్ బంతితో కూడా రాణించాడు. 16 ఓవర్లు వేసి 4 వికెట్లు తీశాడు. కేశవ్ మహారాజ్, కోడి యూసఫ్ తలో 3 వికెట్లు పడగొట్టారు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 418 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. లుహాన్ డ్రి ప్రిటోరియస్ (153), కార్బిన్ బాష్ (100 నాటౌట్) సెంచరీలతో కదంతొక్కారు. డెవాల్డ్ బ్రెవిస్ (51) మెరుపు అర్ద సెంచరీతో రాణించారు.మిగతా ఆటగాళ్లలో టోని డి జోర్జి 0, బ్రీట్జ్కీ 13, ముల్దర్ 17, బెడింగ్హమ్ 0, వెర్రిన్ 10, కెప్టెన్ కేశవ్ మహారాజ్ 21, కోడి యూసఫ్ 27, మఫాకా 9 (నాటౌట్) పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో చివంగ 4, ముజరబానీ 2, మసరద్జ, మసెకెస తలో వికెట్ తీశారు. కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం సౌతాఫ్రికా జింబాబ్వేలో పర్యటిస్తుంది. -
అద్భుతమైన సెంచరీ.. ఆండీ ఫ్లవర్ తర్వాతి స్థానంలో సీన్ విలియమ్స్
బులవాయో వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో జింబాబ్వే వెటరన్ బ్యాటర్ సీన్ విలియమ్స్ అద్భుతమైన సెంచరీతో అదరగొట్టాడు. జట్టు కష్టాల్లో (23/2) ఉన్నప్పుడు బరిలోకి దిగి 121 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. 38 ఏళ్ల విలియమ్స్‌కు టెస్ట్‌ల్లో ఇది ఆరో శతకం. సెంచరీ అనంతరం కూడా విలియమ్స్ పోరాటం కొనసాగిస్తూ జింబాబ్వేను గౌరవప్రదమైన స్కోర్ దిశగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. విలియమ్స్ ప్రస్తుతం 134 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. అతనికి జతగా మసెకెస (4) క్రీజ్‌లో ఉన్నాడు. రెండో రోజు మూడో సెషన్ సమయానికి జింబాబ్వే 7 వికెట్లు కోల్పోయి 242 పరుగులు చేసింది. ఆ జట్టు సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 176 పరుగులు వెనుకపడి ఉంది. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో కైటానో 0, వెల్చ్ 4, క్రెయిగ్ ఎర్విన్ 36, వెస్లీ మెదెవెరె 15, మసౌరే 7, ట్సిగా 9, మసకద్జ 4 పరుగులు చేసి ఔట్ కాగా.. ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ (19) రిటైర్ట్ హర్ట్‌గా (తలకు గాయం) వెనుదిరగాడు. బెన్నెట్ ఈ మ్యాచ్‌లో తిరిగి బరిలోకి దిగడు. అతని స్థానంలో మసౌరేను కన్కషన్ సబ్‌స్టిట్యూట్‌గా ప్రకటించింది జింబాబ్వే మేనేజ్మెంట్. సౌతాఫ్రికా బౌలర్లలో యూసఫ్ కోడి, వియాన్ ముల్దర్ తలో 3 వికెట్లు పడగొట్టగా.. కేశవ్ మహారాజ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.అంతకుముందు సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 418 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. లుహాన్ డ్రి ప్రిటోరియస్ (153), కార్బిన్ బాష్ (100 నాటౌట్) సెంచరీలతో కదంతొక్కారు. డెవాల్డ్ బ్రెవిస్ (51) మెరుపు అర్ద సెంచరీతో రాణించారు.మిగతా ఆటగాళ్లలో టోని డి జోర్జి 0, బ్రీట్జ్కీ 13, ముల్దర్ 17, బెడింగ్హమ్ 0, వెర్రిన్ 10, కెప్టెన్ కేశవ్ మహారాజ్ 21, కోడి యూసఫ్ 27, మఫాకా 9 (నాటౌట్) పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో చివంగ 4, ముజరబానీ 2, మసరద్జ, మసెకెస తలో వికెట్ తీశారు.ప్లవర్ సరసన విలియమ్స్ఈ మ్యాచ్‌లో సెంచరీతో విలియమ్స్ జింబాబ్వే మాజీ ఆటగాళ్లు గ్రాంట్ ఫ్లవర్, బ్రెండన్ టేలర్ సరసన చేరాడు. ఫ్లవర్, టేలర్, విలియమ్స్ టెస్ట్‌ల్లో తలో ఆరు సెంచరీలు చేసి జింబాబ్వే తరఫున ఈ ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. టెస్ట్‌ల్లో జింబాబ్వే తరఫున అత్యధిక సెంచరీల రికార్డు ఆండీ ఫ్లవర్ పేరిట ఉంది. -
సౌతాఫ్రికా క్రికెట్లో సరికొత్త అధ్యాయం.. చరిత్ర సృష్టించిన కేశవ్ మహారాజ్
సౌతాఫ్రికా క్రికెట్లో సరికొత్త అధ్యాయం లిఖించబడింది. ఆ దేశం తరఫున తొలిసారి ఓ స్పిన్నర్ టెస్ట్‌ల్లో 200 వికెట్లు తీశాడు. సౌతాఫ్రికా తరఫున 200 టెస్ట్ వికెట్ల మార్కును ఇప్పటివరకు ఏ స్పిన్నర్ తాకలేదు. ఆ దేశం తరఫున 200కు పైగా టెస్ట్ వికెట్లు తీసిన బౌలర్లంతా ఫాస్ట్ బౌలర్లే. సౌతాఫ్రికా తరఫున టెస్ట్‌ల్లో 200 వికెట్లు తీసిన తొలి స్పిన్ బౌలర్‌గా కేశవ్ మహారాజ్ రికార్డు నెలకొల్పాడు. జింబాబ్వేతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో కేశవ్ ఈ ఘనత సాధించాడు. జింబాబ్వే కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ వికెట్ కేశవ్‌కు 200వ టెస్ట్ వికెట్. కేశవ్ తర్వాత టెస్ట్‌ల్లో సౌతాఫ్రికా తరఫున అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్లుగా టేఫీల్డ్ (170), పాల్ ఆడమ్స్ (134), పాల్ హ్యారిస్ (103), నికీ బోయే (100) ఉన్నారు. ఓవరాల్‌గా టెస్ట్‌ల్లో సౌతాఫ్రికా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా డేల్ స్టెయిన్ (439) ఉన్నాడు. అతని తర్వాత షాన్ పోలాక్ (421), ఎన్తిని (390), రబాడ (336), డొనాల్డ్ (330), మోర్కెల్ (309), కల్లిస్ (291), ఫిలాండర్ (224) 200 కంటే ఎక్కువ వికెట్లు తీసిన వారిలో ఉన్నారు. వీరంతా ఫాస్ట్ బౌలర్లే.మ్యాచ్ విషయానికొస్తే.. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బులవాయో వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో రెండో రోజు ఆట కొనసాగుతుంది. రెండో సెషన్ సమయానికి జింబాబ్వే 3 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. బ్రియాన్ బెన్నెట్ (19) రిటైర్డ్ హర్ట్ కాగా.. కైటానో 0, వెల్చ్ 4, క్రెయిగ్ ఎర్విన్ 36 పరుగులకు ఔటయ్యారు. సీన్ విలియమ్స్ (81), వెస్లీ మెదెవెరె (15) క్రీజ్‌లో ఉన్నారు. సౌతాఫ్రికా బౌలర్లలో కోడి యూసఫ్ 2, కేశవ్ మహారాజ్ ఓ వికెట్ తీశారు.అంతకుముందు సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 418 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. లుహాన్ డ్రి ప్రిటోరియస్ (153), కార్బిన్ బాష్ (100 నాటౌట్) సెంచరీలతో కదంతొక్కారు. డెవాల్డ్ బ్రెవిస్ (51) మెరుపు అర్ద సెంచరీతో రాణించారు.మిగతా ఆటగాళ్లలో టోని డి జోర్జి 0, బ్రీట్జ్కీ 13, ముల్దర్ 17, బెడింగ్హమ్ 0, వెర్రిన్ 10, కెప్టెన్ కేశవ్ మహారాజ్ 21, కోడి యూసఫ్ 27, మఫాకా 9 (నాటౌట్) పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో చివంగ 4, ముజరబానీ 2, మసరద్జ, మసెకెస తలో వికెట్ తీశారు. -
ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి రికార్డు సెంచరీ చేసిన సౌతాఫ్రికా ప్లేయర్
బులవాయో వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో సౌతాఫ్రికా ఆటగాడు కార్బిన్ బాష్ ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి సెంచరీ చేశాడు. తద్వారా ఆ దేశ దిగ్గజాల సరసన రికార్డు బుక్కుల్లో చోటు దక్కించుకున్నాడు. గతంలో మార్క్ బౌచర్ (122 నాటౌట్), డాల్టన్ (117), ముర్రే (109), డేవ్ రిచర్డ్సన్ (109), విన్స్లో (108), జేపీ డుమిని (100 నాటౌట్) సౌతాఫ్రికా తరఫున టెస్ట్‌ల్లో ఎనిమిదో స్థానంలో బరిలోకి దిగి సెంచరీలు చేశారు. జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్‌లో బాష్ తొలి ఇన్నింగ్స్‌లో 124 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 100 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో బాష్‌కు ముందు అరంగేట్రం ఆటగాడు లూహాన్ డ్రి ప్రిటోరియస్ (153) కూడా సెంచరీతో కదంతొక్కాడు. మరో అరంగేట్రం ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్ (41 బంతుల్లో 51) మెరుపు అర్ద సెంచరీతో అలరించాడు.MAIDEN INTERNATIONAL HUNDRED FOR CORBIN BOSCH WHILE BATTING AT 8 🥶 pic.twitter.com/Md4Qv3DwNN— Johns. (@CricCrazyJohns) June 28, 2025ప్రిటోరియస్, బాష్ సెంచరీలతో సత్తా చాటడంతో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 418 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో టోని డి జోర్జి 0, బ్రీట్జ్కీ 13, ముల్దర్ 17, బెడింగ్హమ్ 0, వెర్రిన్ 10, కెప్టెన్ కేశవ్ మహారాజ్ 21, కోడి యూసఫ్ 27, మఫాకా 9 (నాటౌట్) పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో చివంగ 4, ముజరబానీ 2, మసరద్జ, మసెకెస తలో వికెట్ తీశారు.అనంతరం బరిలోకి దిగిన జింబాబ్వే.. రెండో రోజు రెండో సెషన్ సమయానికి 2 వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. సీన్ విలియమ్సన్ (56), కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ (30) క్రీజ్‌లో ఉన్నారు. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు జింబాబ్వే ఇంకా 305 పరుగులు వెనుకపడి ఉంది. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో బ్రియాన్ బెన్నెట్ 19 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్ కాగా.. కైటానో 0, వెల్చ్ 4 పరుగులకు ఔటయ్యారు. అరంగేట్రం బౌలర్ కోడి యూసఫ్‌కు రెండు వికెట్లు దక్కాయి. కాగా, ఇటీవలే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌గా అవతరించిన సౌతాఫ్రికా తమ ద్వితియ శ్రేణి జట్టుతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం జింబాబ్వేలో పర్యటిస్తుంది. -
టెస్ట్ అరంగేట్రం చేయనున్న సీఎస్కే చిచ్చరపిడుగు
సీఎస్కే చిచ్చరపిడుగు డెవాల్డ్ బ్రెవిస్ తన జాతీయ జట్టు సౌతాఫ్రికా తరఫున టెస్ట్ అరంగేట్రానికి సిద్దమయ్యాడు. రేపటి నుంచి జింబాబ్వేతో జరుగబోయే టెస్ట్ మ్యాచ్ కోసం ప్రకటించిన తుది జట్టులో బ్రెవిస్ చోటు దక్కించుకున్నాడు. తుది జట్టు ఆటగాళ్ల జాబితాను క్రికెట్ సౌతాఫ్రికా ఇవాళ (జూన్ 27) ప్రకటించింది. సీనియర్ల గైర్హాజరీలో రెండు మ్యాచ్‌లో ఈ సిరీస్‌లో సౌతాఫ్రికా సారధిగా కేశవ్ మహారాజ్ ఎంపికయ్యాడు. రేపటి నుంచి ప్రారంభం కాబోయే టెస్ట్ మ్యాచ్‌లో మహారాజ్ యువ దక్షిణాఫ్రికా జట్టును ముందుండి నడిపిస్తాడు. ఓపెనర్లుగా టోనీ డి జోర్జి, మాథ్యూ బ్రీట్జ్కీ బరిలోకి దిగనుండగా.. వన్ డౌన్లో వియాన్ ముల్దర్, నాలుగో స్థానంలో డేవిడ్ బెడింగ్హమ్, ఐదో స్థానంలో లుహాన్ డ్రి ప్రిటోరియస్, ఆరో స్థానంలో డెవాల్డ్ బ్రెవిస్ బరిలోకి దిగనున్నారు. వికెట్ కీపర్ బ్యాటర్‌గా కైల్ వెర్రిన్, ఆల్‌రౌండర్ కోటాలో కార్బిన్ బాష్, స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కేశవ్ మహారాజ్, పేసర్లుగా కోడి యూసఫ్, క్వేనా మఫాకా బరిలోకి దిగనున్నారు. ఈ మ్యాచ్‌లో బ్రెవిస్‌తో పాటు డ్రి ప్రిటోరియస్ కూడా టెస్ట్ అరంగేట్రం చేస్తాడు.వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌గా అవతరించాక సౌతాఫ్రికా ఆడబోయే తొలి మ్యాచ్ ఇదే. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతుంది. డబ్ల్యూటీసీ టైటిల్ గెలవడం ద్వారా సౌతాఫ్రికా చిరకాల కల నెరవేర్చిన రెగ్యులర్ కెప్టెన్ టెంబా బవుమా ఈ సిరీస్‌కు దూరంగా ఉన్నాడు. అలాగే డబ్ల్యూటీసీ ఫైనల్లో అద్భుత సెంచరీ చేసిన మార్క్రమ్, అదే మ్యాచ్‌లో చెలరేగిన రబాడ, ఆల్‌రౌండర్ జన్సెన్, బ్యాటర్ ర్యాన్ రికెల్టన్ ఈ సిరీస్‌కు దూరంగా ఉన్నారు. వీరందరికి క్రికెట్ సౌతాఫ్రికా విశ్రాంతినిచ్చింది. డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడిన కార్బిన్ బాష్, వియాన్ ముల్దర్ తొలి టెస్ట్‌లో సౌతాఫ్రికా పేస్ విభాగాన్ని ముందుండి నడిపిస్తారు. రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం సౌతాఫ్రికా జింబాబ్వేలో పర్యటిస్తుంది. రెండు టెస్ట్‌లు బులవాయోలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్లో జరుగుతాయి. రెండో టెస్ట్ జులై 6 నుంచి ప్రారంభమవుతుంది.జింబాబ్వేతో తొలి టెస్ట్ కోసం సౌతాఫ్రికా తుది జట్టు..టోనీ డి జోర్జి, మాథ్యూ బ్రీట్జ్కీ, వియాన్ ముల్డర్, డేవిడ్ బెడింగ్హమ్, లుహాన్-డ్రి ప్రిటోరియస్, డెవాల్డ్ బ్రెవిస్, కైల్ వెర్రిన్ (వికెట్‌కీపర్), కార్బిన్ బాష్, కేశవ్ మహారాజ్ (కెప్టెన్), కోడి యూసఫ్, క్వేనా మఫాకాజింబాబ్వే జట్టు..క్రెయిగ్ ఎర్విన్ (కెప్టెన్), బ్రియాన్ బెన్నెట్, తనకా చివాంగా, ట్రెవర్ గ్వాండు, టకుద్జ్వానాషే కైటానో, వెస్లీ మాధేవెరే, క్లైవ్ మదాండే, విన్సెంట్ మసెకేసా, వెల్లింగ్టన్ మసకద్జా, ప్రిన్స్ మస్వౌరే, కుండై మతిగిము, బ్లెస్సింగ్ ముజరబానీ, న్యూమ్యాన్ న్యామ్హురి, తఫద్జా సిగ, నికోలస్ వెల్చ్, సీన్ విలియమ్స్ -
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ సౌతాఫ్రికాకు కొత్త కెప్టెన్
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ సౌతాఫ్రికాకు కొత్త కెప్టెన్ వచ్చాడు. టీ20 ఫార్మాట్లో ఆ జట్టుకు రస్సీ వాన్ డెర్ డస్సెన్ సారధిగా నియమితుడయ్యాడు. జులైలో జింబాబ్వేలో జరుగనున్న పొట్టి ఫార్మాట్ సిరీస్ కోసం క్రికెట్ సౌతాఫ్రికా డస్సెన్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. ఈ ట్రై సిరీస్‌లో జింబాబ్వే, సౌతాఫ్రికాతో పాటు న్యూజిలాండ్ పాల్గొననుంది. రెగ్యులర్ టీ20 కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ సహా సీనియర్లకు విశ్రాంతినివ్వడంతో డస్సెన్‌కు సారథ్య బాధ్యతలు అప్పజెప్పారు. ఈ ట్రై సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో చాలా కొత్త ముఖాలు ఉన్నాయి.ఈ ఏడాది సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన విధ్వంసకర ఓపెనర్ లూహాన్ డ్రి ప్రిటోరియస్ తొలిసారి జాతీయ టీ20 జట్టు నుంచి పిలుపునందుకున్నాడు. ఇదివరకే వన్డే, టెస్ట్‌ల్లో అరంగేట్రం చేసిన కార్బిన్ బాష్ కూడా తొలిసారి టీ20 బెర్త్ దక్కించుకున్నాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సత్తా చాటిన రూబిన్ హెర్మన్.. ఇదివరకే మిగతా రెండు ఫార్మాట్లలో జాతీయ జట్టుకు ఆడిన సెనురన్ ముత్తుస్వామి మిగతా అన్క్యాప్డ్ ప్లేయర్లుగా ఎంపికయ్యారు.గాయాల కారణంగా గత కొంతకాలంగా ఆటకు దూరంగా ఉన్న పేసర్లు నండ్రే బర్గర్, గెరాల్డ్ కొయెట్జీ ఈ ట్రై సిరీస్‌తో రీఎంట్రీ ఇవ్వనున్నారు. గత రెండేళ్లుగా జట్టుకు దూరంగా ఉన్న బ్యాటింగ్ సంచనలం డెవాల్డ్ బ్రెవిస్ కూడా ఈ సిరీస్ కోసం పిలుపునందుకున్నాడు. షుక్రీ కన్రాడ్ సౌతాఫ్రికా ఆల్ ఫార్మాట్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇదే అతనికి తొలి టీ20 అసైన్మెంట్. జింబాబ్వేలోని హరారే వేదికగా జరిగే ఈ ట్రై సిరీస్ జులై 14 నుంచి ప్రారంభమవుతుంది. జులై 26న జరిగే ఫైనల్‌తో ఈ టోర్నీ ముగుస్తుంది. కాగా, టెంబా బవుమా నేతృత్వంలోని సౌతాఫ్రికా ఇటీవలే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. లార్డ్స్‌లో జరిగిన ఫైనల్లో ఈ జట్టు ఆస్ట్రేలియాను చిత్తు చేసి చాలాకాలం తర్వాత ఐసీసీ టోర్నీ గెలిచింది.జింబాబ్వేలో జరిగే ట్రై సిరీస్ కోసం సౌతాఫ్రికా జట్టు..రస్సీ వాన్ డెర్ డస్సెన్ (కెప్టెన్), కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రెవిస్, నండ్రే బర్గర్, గెరాల్డ్ కోయెట్జీ, రీజా హెండ్రిక్స్, రూబిన్ హెర్మన్, జార్జ్ లిండే, క్వేనా మఫాకా, సెనురన్ ముత్తుస్వామి, లుంగి ఎంగిడి, న్కాబా పీటర్, లుహాన్-డ్రి ప్రిటోరియస్, ఆండైల్ సైమ్లేన్జింబాబ్వే ట్రై సిరీస్ షెడ్యూల్..జులై 14- జింబాబ్వే వర్సెస్ సౌతాఫ్రికాజులై 16- సౌతాఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్జులై 18- జింబాబ్వే వర్సెస్ న్యూజిలాండ్జులై 20- జింబాబ్వే వర్సెస్ సౌతాఫ్రికాజులై 22- న్యూజిలాండ్ వర్సెస్ సౌతాఫ్రికాజులై 24- జింబాబ్వే వర్సెస్ న్యూజిలాండ్జులై 26- ఫైనల్అన్ని మ్యాచ్‌లు హరారే స్పోర్ట్స్ క్లబ్లో జరుగుతాయి. భారతకాలమానం ప్రకారం మ్యాచ్‌లన్నీ సాయంత్రం 4:30 గంటలకు ప్రారంభమవుతాయి. -
28 బంతుల్లో సెంచరీ.. మళ్లీ బ్యాట్ పట్టనున్న ఏబీ డివిలియర్స్
సౌతాఫ్రికా బ్యాటింగ్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ (AB DE Villiers) మళ్లీ బ్యాట్ పట్టనున్నాడు. వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 (World Championship Of Legends) లీగ్ కోసం సౌతాఫ్రికా ఛాంపియన్స్ (South Africa Champions) జట్టులో జాయిన్ కానున్నాడు. ఈ లీగ్‌లో ఏబీడీ సౌతాఫ్రికా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. సౌతాఫ్రికా జట్టులో ఏబీడీతో పాటు హషీమ్ ఆమ్లా, క్రిస్ మోరిస్, అల్బీ మోర్కెల్, వేన్ పార్నెల్, హార్డస్ విల్యోన్, ఆరోన్ ఫాంగిసో తదితర దిగ్గజాలు ఉన్నారు.2021 నవంబర్‌లో క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన ఏబీడీ.. ఇటీవలే ఓ సారి బ్యాట్ పట్టాడు. ఈ ఏడాది ప్రారంభంలో ఓ ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడి తన సహజ శైలిలో రెచ్చిపోయాడు. ఆ మ్యాచ్‌లో టైటాన్స్ లెజెండ్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన ఏబీడీ.. బుల్స్ లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 28 బంతుల్లో సెంచరీ చేశాడు. ఇందులో 15 సిక్సర్లు ఉన్నాయి.ఆ మ్యాచ్ తర్వాత ఏబీడీ తిరిగి జులైలో బ్యాట్ పట్టనున్నాడు. వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ లీగ్ కోసం సౌతాఫ్రికా ఛాంపియన్స్ జట్టు ఏబీడీని సంప్రదించగా.. అతను ఒప్పుకున్నాడు. 41 ఏళ్ల ఏబీడీ తన అభిమానుల కోసమే ఈ లీగ్‌లో ఆడటానికి ఒప్పుకున్నానని చెప్పాడు.కాగా, వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ లీగ్ 2025 ఇంగ్లండ్ వేదికగా జులైలో జరుగనుంది. ఇంగ్లండ్‌లోని బర్మింగ్హమ్, నార్తంప్టన్, లీడ్స్, లీసెస్టర్ నగరాల్లో మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ లీగ్‌లో మొత్తం 6 జట్లు (ఇండియా ఛాంపియన్స్, దక్షిణాఫ్రికా ఛాంపియన్స్, ఆస్ట్రేలియా ఛాంపియన్స్, ఇంగ్లాండ్ ఛాంపియన్స్, వెస్టిండీస్ ఛాంపియన్స్ మరియు పాకిస్తాన్ ఛాంపియన్స్) పాల్గొంటాయి. ఈ లీగ్‌లో ఇది రెండో ఎడిషన్. గతేడాది ఈ లీగ్ పురుడు పోసుకుంది. గతేడాది కూడా జులైలో జరిగిన ఈ టోర్నీలో ఇండియా ఛాంపియన్స్ విజేతగా నిలిచింది. ఫైనల్లో యువరాజ్ సింగ్ నేతృత్వంలోని ఇండియా పాకిస్తాన్‌పై విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో భారత్ పాక్ నిర్దేశించిన 157 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో ఛేదించింది. అంబటి రాయుడు 50, యూసఫ్ పఠాన్ 30 పరుగులు చేసి భారత్ విజయంలో ప్రధాన పాత్రలు పోషించారు.ఏబీడీ కెరీర్ విషయానికొస్తే.. ఈ ప్రొటీస్ విధ్వంసకర బ్యాటర్ దక్షిణాఫ్రికా తరఫున 114 టెస్టులు, 228 వన్డేలు, 78 టీ20లు ఆడి 20,014 పరుగులు చేశాడు. ఏబీడీ తన అంతర్జాతీయ కెరీర్లో 47 సెంచరీలు, 99 అర్ద సెంచరీలు సాధించాడు. ఏబీడీ 2018లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నా వన్డేల్లో ఇప్పటికి అతని పేరిటే ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు ఉంది. 2015లో జోహనెస్‌బర్గ్‌లో అతను వెస్టిండీస్‌పై 31 బంతుల్లో సెంచరీ చేశాడు. ఏబీడీకి ఐపీఎల్‌లోనూ ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. లీగ్ ప్రారంభం నుంచి క్యాష్ రిచ్ లీగ్ ఆడిన ఏబీడీ 2021లో రిటైరయ్యాడు. ఈ లీగ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ (ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్) మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరపున ఆడిన ఇతను.. 184 మ్యాచ్‌ల్లో 151.68 స్ట్రైక్-రేట్‌తో 5162 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 40 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. -
స్వదేశంలో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్లకు ఘన స్వాగతం (ఫొటోలు)
-
‘లార్డ్’ బవుమా
‘కోటా’ వల్లే కొనసాగుతున్నాడనే విమర్శలు... ఆటగాడిగానూ అర్హత లేని వాడికి సారథ్యమా అనే విసుర్లు... సోషల్ మీడియాలో లెక్కకు మిక్కిలి మీమ్స్... కొన్నాళ్ల క్రితం ఆ ఆటగాడి పరిస్థితి ఇది! కానీ వాటన్నింటిని లెక్క చేయని ఆ ప్లేయర్... ‘పక్షి కన్నుకు గురి పెట్టిన పార్థుడిలా...’ లక్ష్యాన్ని మాత్రమే స్వప్నించాడు. దాని కోసమే తపించాడు. అహర్నిశలు దానికై సర్వశక్తులు ధారపోశాడు. ఎట్టకేలకు దాన్ని సాధించాడు. తమ దేశాభిమానులు సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న ఐసీసీ ట్రోఫీని అందించి... అందరికీ ప్రీతిపాత్రుడయ్యాడు.లార్డ్స్ బాల్కానీలో ఐసీసీ గద చేతబూని సగర్వంగా చిరు దరహాసం చేసిన ఆ ఐదడుగుల నాలుగు అంగుళాల ప్లేయరే తెంబా బవుమా. ‘బ్లాక్ ఆఫ్రికన్’ కాబట్టే జట్టులో చోటు దక్కిందనే విమర్శల దశ నుంచి... 27 ఏళ్ల తర్వాత దక్షిణాఫ్రికాకు ఐసీసీ ట్రోఫీ అందించిన సారథిగా ఇప్పుడు ఎక్కడ చూసినా అతడి పేరు మారుమోగుతోంది. ప్రధాన జట్లతో ఆడకుండానే ఫైనల్ చేరారనే విమర్శలకు తనదైన శైలిలో జవాబిచ్చిన బవుమా... తుదిపోరులో తమ మనోస్థయిర్యాన్ని దెబ్బతీసేందుకు కంగారూలు ‘చోకర్స్’ అంటూ స్లెడ్జింగ్‌కు దిగినా వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగుతూ జట్టుకు అపురూప విజయాన్ని అందించాడు. సఫారీ జట్టును ప్రపంచ టెస్టు చాంపియన్‌గా నిలిపిన బవుమా ప్రస్థానాన్ని ఓసారి పరిశీలిస్తే... – సాక్షి క్రీడావిభాగం లార్డ్స్ వేదికగా జరిగిన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో... దక్షిణాఫ్రికా ముందు 282 పరుగుల విజయ లక్ష్యం నిలిచింది. స్కోరు బోర్డుపై 70 పరుగులు చేరేసరికి రెండు వికెట్లు నేలకూలాయి. 27 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీ చేజిక్కించుకోవాలంటే సఫారీ జట్టుకు ఇంకా 212 పరుగులు చేయాల్సిన పరిస్థితి. అప్పుడు లార్డ్స్ లాంజ్ రూమ్ నుంచి దక్షిణాఫ్రికా సారథి తెంబా బవుమా చిట్టి చిట్టి అడుగులు వేస్తూ మైదానంలో అడుగు పెట్టాడు. అప్పటి వరకు పేసర్లు పండగ చేసుకున్న పిచ్ అది. అందులోనూ మిచెల్ స్టార్క్, జోష్ హాజల్‌వుడ్, ప్యాట్ కమిన్స్ వంటి ఆరున్నర అడుగుల ఆజానుబావుల భీకర బౌలింగ్. ఒక ఎండ్‌లో మార్క్రమ్ పోరాడుతున్నా... అతడికి సహకరించే వారేరి అనే అనుమానాలు. గతేడాది ఆరంభంలో కేప్‌టౌన్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన టెస్టులోనూ మార్క్రమ్ ఒంటరి పోరాటంతో సెంచరీ చేసినా అతడికి అండగా నిలిచేవారు లేక సఫారీ జట్టు ఘోర పరాజయం ఎదుర్కొంది. లార్డ్స్‌లోనూ దాదాపు అదే ప్రమాద ఘంటికలు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు రానున్న వారిలో పెద్దగా అనుభవం ఉన్న వాళ్లు లేరు. ఇలాంటి దశలో బవుమా తన కెరీర్లో అత్యుత్తమం అనదగ్గ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. అప్పటి వరకు 63 టెస్టులాడినా... కేవలం నాలుగు శతకాలే సాధించిన అతడు... లార్డ్స్‌లో ఆణిముత్యంలాంటి అర్ధసెంచరీతో మార్క్రమ్కు అండగా నిలిచాడు. ఆసీస్ పేసర్లు బాడీలైన్ బౌలింగ్‌తో పరీక్ష పెడుతున్నా... ప్రత్యర్థులు తన ఎత్తును అదునుగా చేసుకొని బౌన్సర్లతో బెంబేలెత్తిస్తున్నా ఏమాత్రం వెరవలేదు. క్రీజులో అడుగుపెట్టిన కాసేపటికే కండరాలు పట్టేసినా... మైదానం వీడితే క్షణాల్లో మ్యాచ్‌ను లాగేసుకోవడంలో సిద్ధహస్తులైన కంగారూలకు అవకాశం ఇవ్వకుండా నొప్పిని పంటిబిగువున భరిస్తూనే మార్క్రమ్కు అండగా నిలిచాడు. దీంతో స్వేచ్ఛగా ఆడిన మార్క్రమ్ జట్టును విజయ తీరాలకు చేరువ చేశాడు. సార్థక నామధేయుడు తెంబా బవుమా పేరు వెనక ఒక చరిత్ర ఉంది. దక్షణాఫ్రికా స్థానిక జులూ భాషలో తెంబా అంటే ‘ఆశ’ అని అర్థం. అందుకు తగ్గట్లే ఎప్పుడూ ఆశావాహ దృక్పథంతోనే ఉండే బవుమా... ‘పొట్టివాడు గట్టివాడు’ అని తన చేతలతో నిరూపించాడు. ఐసీసీ ట్రోఫీ ఫైనల్లో ఆ్రస్టేలియాతో తలపడాలంటే... ఆట ఆరంభానికి ముందే ప్రత్యర్థి మానసికంగా కుంగిపోవడం ఖాయం. అలాంటిది డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన కంగారూలను కంగుతినిపిస్తూ బవుమా జట్టును నడిపిన తీరుపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ‘చోకర్స్’ ముద్రను చెరిపేస్తూ... ‘క్రికెట్ మక్కా’ లార్డ్స్‌లో తమ జట్టును సుదీర్ఘ ఫార్మాట్లో విశ్వవిజేతగా నిలిపిన అతడి నాయకత్వ సామర్థ్యాన్ని విమర్శకులు సైతం కొనియాడుతున్నారు. గతంలో విరాట్ కోహ్లి మాదిరిగా ‘అతి సంబరాల’తో విమర్శల పాలైన బవుమా... డబ్ల్యూటీసీ ఫైనల్లో కైల్ వెరీన్ విన్నింగ్ రన్స్ కొట్టిన తర్వాత ముఖాన్ని అరచేతుల్లో దాచుకొని... కళ్లలో నీటి చెమ్మ కనిపించకుండా ముభావంగా కూర్చుండిపోయాడు. సహచరులంతా సంబరాల్లో మునిగి తేలుతుంటే... భారీ బరువేదో భుజస్కంధాలపై నుంచి దించేసుకున్నట్లు నింపాదిగా లేచి అందరితో కలిసిపోయాడు. ‘లాంగా’ నుంచి లార్డ్స్ వరకు... దక్షిణాఫ్రికా మూడు రాజధానుల్లో ఒకటైన కేప్‌టౌన్‌లో నల్లజాతీయులు అధికంగా నివసించే ‘లాంగా’లో బవుమా క్రీడా ప్రస్థానం ప్రారంభమైంది. పదేళ్ల ప్రాయంలో వీధుల్లో క్రికెట్ ఆడుతూ... గల్లీకొక మైదానం పేరుతో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసిన బవుమా... పదకొండేళ్లకు స్పోర్ట్స్ స్కాలర్షిప్ దక్కించుకున్నాడు. ఆ తర్వాత కఠోర శ్రమ, నిత్యం నేర్చుకోవాలనే తపనతో ఆటను మెరుగు పర్చుకున్నాడు. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సమీప బంధువు సూచనలు పాటిస్తూ ఒక్కో మెట్టూ ఎదుగుతూ జాతీయ జట్టు వరకు చేరుకున్నాడు. ప్రతీక్షణం నిరూపించుకోవాల్సిన కఠిన పరిస్థితులను ఎదురొడ్డి వచ్చిన అవకాశాలను అతడు సది్వనియోగ పర్చుకున్నాడు. కెరీర్ ఆరంభంలో పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో జట్టులో అతడి స్థానానికి భరోసా లేకపోయింది. అయితే డీన్ ఎల్గర్ రిటైర్మెంట్ అనంతరం అనూహ్యంగా సారథిగా ఎంపికైన తెంబా... ఆ తర్వాత చక్కటి ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. 2023–25 డబ్ల్యూటీసీ సర్కిల్లో జట్టు పగ్గాలు అందుకున్న బవుమా... కెపె్టన్‌గా ఆడిన తొలి 10 టెస్టుల్లో ఓటమి ఎరగని రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో ఆటగాడిగానూ మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. 13 ఇన్నింగ్స్‌ల్లో 59.25 సగటుతో 711 పరుగులు చేశాడు. అందులో 2 సెంచరీలు, 5 అర్ధసెంచరీలు ఉన్నాయి. భాగస్వామ్యాలకు పెట్టింది పేరైన బవుమా... ఈ డబ్ల్యూటీసీ సర్కిల్లో 60.35 పార్ట్నర్షిప్ సగటుతో అందరికంటే అగ్రస్థానంలో నిలిచాడు. ‘గత కొన్నేళ్లుగా తెంబా జట్టును సమర్థవంతంగా నడుపుతున్నాడు. ఫైనల్లో నా ప్రదర్శన వెనక అతడి ప్రోద్బలం ఎంతో ఉంది. కండరాలు పట్టేసిన స్థితిలో పరుగు తీయడం ఇబ్బందిగా మారినా మైదానాన్ని వీడకుండా పోరాడాడు. కీలక పరుగులతో ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచి చిరస్మర విజయంలో కీలకపాత్ర పోషించాడు’ అని తన సారథిపై మార్క్రమ్ ప్రశంసలు కురిపించాడు. నిస్వార్థ నాయకుడు... జట్టు ఓడితే ఆ బాధ్యత తాను వహించి... గెలిస్తే సహచరులకు ఆ క్రెడిట్ ఇచ్చేవాడే అత్యుత్తమ నాయకుడు. ఈ కోవలో చూస్తే బవుమాకు 100కు 100 మార్కులు పడతాయి. ఫైనల్లో తన అసమాన ప్రదర్శనను పక్కనపెట్టి... రబాడ, ఇన్‌గిడి, మార్క్రమ్ పోరాటంతోనే జట్టు విజయం సాధించిందని చెప్పిన గొప్ప మనసు బవుమాది. ‘జట్టంతా సమష్టిగా రాణిస్తేనే నిలకడగా విజయాలు సాధించడం సాధ్యమవుతుంది. మా టీమ్ అందుకు నిదర్శనం. ఒకరిని ఒకరు ప్రోత్సహించుకోవడంలో మేమెప్పుడూ ముందుంటాం. ఒకరి విజయాలను మరొకరం ఆస్వాదిస్తాం. అప్పుడే మెరుగైన ఫలితాలు వస్తాయి. ప్రతి రోజు మెరుగయ్యేందుకు ప్రయత్నించడమే మా విజయ లక్ష్యం’ అని బవుమా అన్నాడు. అతడు అన్నట్లుగానే 2023–25 డబ్ల్యూటీసీ సర్కిల్‌ను పరిశీలిస్తే... దక్షిణాఫ్రికా జట్టు ఏ ఒక్క ఆటగాడి ప్రదర్శనపైనో అతిగా ఆధారపడలేదు. మొత్తం 13 మ్యాచ్‌ల్లో తొమ్మిది మంది వేర్వేరు ఆటగాళ్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డులు అందుకున్నారంటే సఫారీ జట్టు ‘టీమ్ వర్క్’ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అందరిని కలుపుకుంటూ... మార్క్రమ్, బెడింగ్హామ్, స్టబ్స్ వంటి తెల్లజాతీయులు, కేశవ్ మహరాజ్, ముత్తుస్వామి వంటి భారత సంతతి ఆటగాళ్లు, రబాడ, ఇన్‌గిడి వంటి నల్ల జాతీయులు కలగలిపి ఉన్న దక్షిణాఫ్రికా జట్టును బవుమా చక్కగా నడిపించాడు. ‘విభిన్న నేపథ్యాల వాళ్లమైనా... జట్టుగా మేమంతా ఒక్కటే. సమష్టి ప్రదర్శనకు దక్కిన చక్కటి ఫలితమిది’ అని మ్యాచ్ అనంతరం బవుమా పేర్కొన్నాడు. ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ ఉద్యమం సమయంలో జట్టు సహచరుడు క్వింటన్ డికాక్ మోకాళ్లపై నిల్చునేందుకు నిరాకరించిన నోరు మెదపని బవుమా... ఎన్నో అడ్డంకులను దాటుకుంటూ దక్షిణాఫ్రికా జట్టుకు ఐసీసీ ట్రోఫీ అందించిన తొలి నల్లజాతి సారథిగా చరిత్రకెక్కాడు. మైదానం బయట కూడా మంచి మానవతావాదిగా గుర్తింపు తెచ్చుకున్న బవుమా... ప్రస్తుతం నిరుపేద పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించేందుకు ప్రత్యేకంగా ఒక ఫౌండేషన్ నడుపుతున్నాడు. వాళ్లకు ఇష్టమైన రంగంలో రాణించేందుకు ఈ సంస్థ సహకారం అందిస్తోంది. -
చోకర్స్ కాదు... విన్నర్స్
దాదాపు ఏడాది క్రితం దక్షిణాఫ్రికా జట్టు భారత్‌తో టి20 వరల్డ్ కప్ ఫైనల్లో తలపడింది. 177 పరుగుల లక్ష్య ఛేదనలో ఒక దశలో చేతిలో 6 వికెట్లతో 30 బంతుల్లో 30 పరుగులు చేయాల్సిన స్థితిలో నిలిచింది. ఇక విజయం లాంఛనమే అనిపించగా...చివరకు 7 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. డగౌట్లో కూర్చుకున్న కెప్టెన్ మార్క్రమ్ కన్నీళ్లపర్యంతమైన దృశ్యం దక్షిణాఫ్రికా అభిమానులకు కలచివేసింది. ఇప్పుడు సంవత్సరం తిరగక ముందే అతను సఫారీ ఫ్యాన్స్ దృష్టిలో హీరోగా మారిపోయాడు. ఆస్ట్రేలియా ‘బౌలింగ్ చతుష్టయం’ను ఎదుర్కొని దక్షిణాఫ్రికా 282 పరుగులు సాధించగలదా అనే సందేహాల మధ్య అతను అసాధారణ బ్యాటింగ్‌ను ప్రదర్శించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ‘డకౌట్’ అయినా రెండో ఇన్నింగ్స్‌లో ఎలాంటి అవకాశం ఇవ్వకుండా పట్టుదలగా తన కెరీర్లో అత్యంత విలువైన ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాడు. కెపె్టన్ తెంబా బవుమా విజయగాథ కూడా ఇలాంటిదే. 64 టెస్టుల కెరీర్లో కేవలం 4 సెంచరీలే సాధించిన అతను ప్రతీసారి తీవ్ర విమర్శలే ఎదుర్కొన్నాడు. ‘బ్లాక్ ఆఫ్రికన్’ కాబట్టి టీమ్‌లో చోటు దక్కిందని, రిజర్వేషన్ కారణంగానే కొనసాగుతున్నాడని వ్యాఖ్యలు వినిపిస్తూ వచ్చాయి. తాజా ఘనతతో బవుమా నాయకుడిగా ఆకాశమంత ఎత్తున నిలిచాడు. ఫైనల్‌కు ముందు తన కెపె్టన్సీలో ఆడిన 9 టెస్టుల్లో 8 మ్యాచ్‌లు గెలిపించి ఓటమి ఎరుగని అతను...ఇప్పుడు టీమ్‌ను వరల్డ్ చాంపియన్‌గా నిలిచి పొట్టివాడు అయినా గట్టివాడే అని నిరూపించాడు. మార్క్రమ్, బవుమా 147 పరుగుల భాగస్వామ్యం ఆ్రస్టేలియా ఆట కట్టించేలా చేసింది. డ్రగ్స్ వివాదం నుంచి బయటపడిన రబాడ 9 వికెట్లతో సఫారీ విజయానికి పునాది వేయగా, రెండో ఇన్నింగ్స్‌లో ఇన్‌గిడి తన విలువ చాటాడు. విమర్శలను అధిగమించి... దక్షిణాఫ్రికా జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధించినా...ఆ జట్టుపై పెద్దగా అంచనాలు లేవు. ఎదురుగా బలమైన ఆస్ట్రేలియాలాంటి ప్రత్యర్థి ఉండటంతో పాటు టీమ్‌లో అనుభవలేమి స్పష్టంగా కనిపించింది. టాప్–7 బ్యాటర్లతో పాటు ఆల్‌రౌండర్ యాన్సెన్ మొత్తం టెస్టు పరుగులు కలిపినా... ఒక్క స్టీవ్ స్మిత్ సాధించిన పరుగులకంటే తక్కువగా ఉన్నాయి! పైగా స్టార్క్, కమిన్స్, హాజల్‌వుడ్, లయన్ కలిసి ఆసీస్‌కు ఎన్నో అద్భుత విజయాలు అందించారు. అలాంటి బౌలింగ్‌ను ఎదుర్కొని గెలవడం దాదాపు అసాధ్యమని అనిపించింది. అన్నింటికి మించి సఫారీ టీమ్ ఫైనల్‌కు చేరిన క్రమంపై విమర్శలు ఉన్నాయి. 2023–25 డబ్ల్యూటీసీ సైకిల్లో అగ్రశ్రేణి టీమ్‌లైన ఇంగ్లండ్, ఆ్రస్టేలియాలను ఒక్క టెస్టులోనూ ఎదుర్కోని టీమ్... సొంతగడ్డపై భారత్ చేతిలో 55కు ఆలౌటై చిత్తుగా ఓడింది. వెస్టిండీస్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్‌లాంటి బలహీన ప్రత్యర్థులపై (వరుసగా 7 టెస్టులు) గెలిచి ఫైనల్ చేరిందని వ్యాఖ్యలు వచ్చాయి. అయితే ఫైనల్‌కు ముందు ‘అదంతా మా చేతుల్లో లేదు. ఈ ఒక్క మ్యాచ్ గెలిస్తే దానిని ఎవరూ పట్టించుకోరు’ అంటూ స్పష్టంగా చెప్పిన బవుమా దానిని చేసి చూపించాడు. ఆ్రస్టేలియాను ఓడిస్తేనే వరల్డ్ చాంపియన్‌గా భావిస్తాం అనేవారికి సమాధానం ఇచ్చాడు. స్వదేశంలో టి20 లీగ్ కోసం ప్రధాన ఆటగాళ్లతో కాకుండా ద్వితీయ శ్రేణి జట్టును న్యూజిలాండ్ పంపగా 0–2తో టీమ్ చిత్తయింది. అయినా సరే చివరకు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు జట్టు అర్హత సాధించడం విశేషం. ఆనందం దక్కింది... అంతర్జాతీయ క్రికెట్లోకి 1991లో దక్షిణాఫ్రికా పునరాగమనం చేసింది. ఆ తర్వాత 1992 వరల్డ్ కప్ సెమీస్‌లో వర్షం నిబంధనతో ఓడిన జట్టు, 1996లో అన్ని లీగ్‌లు గెలిచి క్వార్టర్స్‌లో అనూహ్యంగా ఓడింది. 1998తో క్రానే, కలిస్, రోడ్స్, బౌచర్‌లతో కూడిన జట్టు తొలి చాంపియన్స్ ట్రోఫీని గెలిచి ఆనందం పంచింది. అయితే ఆ తర్వాతే జట్టు రాత పూర్తిగా మారిపోయింది. గత ఏడాది టి20 వరల్డ్ కప్‌కు ముందు వరకు ఒక్క ఐసీసీ టోర్నీలోనూ ఫైనల్ చేరలేకపోయింది. 1999 సెమీస్‌లో ‘టై’తో గుండె పగలగా, సొంతగడ్డపై 2003లో మళ్లీ వర్షంతో లెక్క తప్పడంతో సెమీస్ కూడా చేరలేకపోయింది. ఆ తర్వాత మూడు సార్లు సెమీస్ వరకు చేరడంలో సఫలమైంది. స్వదేశంలో 2007 టి20 వరల్డ్ కప్‌లో సెమీస్ చేరని జట్టు తర్వాత రెండు సార్లు సెమీస్‌లోనే ఓడింది. చాంపియన్స్ ట్రోఫీలో ఐదు సార్లు సెమీస్‌కే పరిమితమైంది. వేర్వేరు కారణాలతో వచ్చిన ఈ ఓటములతో టీమ్‌లో నైరాశ్యం నెలకొంది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా బోర్డులో రాజకీయాలు, ఆర్థిక సంక్షోభం తదితర కారణాలతో జట్టు ఆటపై కూడా ప్రభావం పడింది. వరుస ఓటములతో టీమ్ వెనుకబడిపోవడంతో ఇతర టీమ్‌ల దృష్టిలో అది ద్వితీయ శ్రేణి జట్టుగా మారిపోయింది. అయితే తాజా విజయం సఫారీ టీమ్‌లో కొత్త ఉత్సాహం తీసుకు రానుంది. 2027 వన్డే వరల్డ్ కప్ కూడా అక్కడే జరగనున్న నేపథ్యంలో ఈ విజయం వారిలో జోష్ నింపడం ఖాయం. -
సూపర్ ‘సఫారీ’
దక్షిణాఫ్రికా సుదీర్ఘ స్వప్నం నెరవేరింది...ఐసీసీ ట్రోఫీ కోసం దాదాపు మూడు దశాబ్దాలుగా పోరాడిన టీమ్ ఎట్టకేలకు ఆ లక్ష్యాన్ని చేరుకుంది...1998లో ఐసీసీ నాకౌట్ కప్ సాధించిన తర్వాత 7 వన్డే వరల్డ్ కప్‌లు, 9 టి20 వరల్డ్ కప్‌లు, 9 చాంపియన్స్ ట్రోఫీలు, 2 వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లు జరగ్గా... ఒక్క సారి కూడా టైటిల్ అందుకునే అవకాశమే రాలేదు... అద్భుతంగా ఆడుతూ వచ్చి అసలు సమయంలో చేతులెత్తేసిన సందర్భాలు కొన్నయితే, అవసరమైన చోట అదృష్టం మొహం చాటేసిన సందర్భాలు మరికొన్ని... ఇప్పుడు ఆ ‘చోకర్స్’ ముద్రను వెనక్కి తోస్తూ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌తో సఫారీ టీమ్ సంబరాలు చేసుకుంది. ఆసక్తికరంగా సాగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆ్రస్టేలియాను చిత్తు చేసి బవుమా సేన సగర్వంగా సత్తా చాటింది. ఐసీసీ టోర్నీ ఫైనల్ అంటే చెలరేగిపోయే ఆసీస్ ఈ సారి మాత్రం బ్యాటింగ్ వైఫల్యంతో తలవంచి నిరాశగా వెనుదిరిగింది.లండన్: వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)లో దక్షిణాఫ్రికా చాంపియన్‌గా నిలిచింది. శనివారం ముగిసిన ఫైనల్లో దక్షిణాఫ్రికా 5 వికెట్ల తేడాతో ఆ్రస్టేలియాపై ఘన విజయం సాధించింది. 282 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓవర్‌నైట్ స్కోరు 213/2తో నాలుగో రోజు ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా 83.4 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఎయిడెన్ మార్క్రమ్ (207 బంతుల్లో 136; 14 ఫోర్లు) దాదాపు చివరి వరకు నిలబడి జట్టును గెలిపించాడు. న్యూజిలాండ్ (2021), ఆ్రస్టేలియా (2023) తర్వాత డబ్ల్యూటీసీ గెలుచుకున్న మూడో టీమ్‌గా దక్షిణాఫ్రికా నిలిచింది. విజేత దక్షిణాఫ్రికాకు రూ. 30.76 కోట్లు ప్రైజ్‌మనీ దక్కింది.27.4 ఓవర్లలో 69 పరుగులు... ఆట ఆరంభంలోనే తెంబా బవుమా (134 బంతుల్లో 66; 5 ఫోర్లు)ను కమిన్స్ అవుట్ చేయగా, కొద్ది సేపటికే స్టబ్స్ (8)ను స్టార్క్ బౌల్డ్ చేశాడు. ఆ సమయంలో దక్షిణాఫ్రికా మరో 41 పరుగులు చేయాల్సి ఉండటంతో కొంత ఉత్కంఠ పెరిగింది. అయితే మరో వైపు మార్క్రమ్ మూడో రోజు తరహాలోనే పట్టుదలగా ఆడుతూ జట్టును గెలుపు దిశగా నడిపించాడు. అతనికి బెడింగ్హామ్ (21 నాటౌట్) అండగా నిలిచాడు. ఎట్టకేలకు కొత్త బంతిని తీసుకున్న వెంటనే తొలి ఓవర్లోనే మార్క్రమ్ను హాజల్‌వుడ్ వెనక్కి పంపించినా...అప్పటికే ఆలస్యమైపోయింది. విజయానికి మరో 5 పరుగులు మాత్రమే కావాల్సి ఉండగా, స్టార్క్ వేసిన బంతిని వెరీన్ కవర్ పాయింట్ దిశగా ఆడి సింగిల్ తీయడంతో సఫారీ శిబిరంలో వేడుక మొదలైంది. స్కోరు వివరాలు: ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 212; దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 138; ఆ్రస్టేలియా రెండో ఇన్నింగ్స్ 207; దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: మార్క్రమ్ (సి) హెడ్ (బి) హాజల్‌వుడ్ 136; రికెల్టన్ (సి) క్యారీ (బి) స్టార్క్ 6; ముల్డర్ (సి) లబుషేన్ (బి) స్టార్క్ 27; బవుమా (సి) క్యారీ (బి) కమిన్స్ 66; స్టబ్స్ (బి) స్టార్క్ 8; బెడింగ్హామ్ (నాటౌట్) 21; వెరీన్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (83.4 ఓవర్లలో 5 వికెట్లకు) 282. వికెట్ల పతనం: 1–9, 2–70, 3–217, 4–241, 5–276. బౌలింగ్: స్టార్క్ 14.4–1–66–3, హాజల్‌వుడ్ 19–2–58–1, కమిన్స్ 17–0–59–1, లయన్ 26–4–66–0, వెబ్‌స్టర్ 5–0–13–0, హెడ్ 2–0–8–0. -
SA Vs AUS Photos: 27 ఏళ్ల నిరీక్షణకు తెర.. డబ్ల్యూటీసీ విజేతగా సౌతాఫ్రికా (ఫొటోలు)
-
విజయం దిశగా దక్షిణాఫ్రికా
ఐసీసీ టోర్నీల్లో తమ రాత మార్చుకునేందుకు దక్షిణాఫ్రికా సిద్ధమైంది. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో మూడో రోజు అసాధారణ ఆటతో టైటిల్‌కు చేరువైంది. 282 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఎక్కడా తడబడని సఫారీ టీమ్ గెలుపుపై గురి పెట్టింది. పేలవ ప్రదర్శనతో ఆసీస్ బౌలర్లు పూర్తిగా చేతులెత్తేయగా... మార్క్రమ్ సెంచరీతో చెలరేగాడు. మరోవైపు కండరాల నొప్పితో బాధపడుతూ కూడా బ్యాటింగ్ కొనసాగించిన కెపె్టన్ తెంబా బవుమా అండగా నిలిచాడు. చేతిలో 8 వికెట్లతో శనివారం మరో 69 పరుగులు సాధిస్తే 27 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీ దక్షిణాఫ్రికా ఖాతాలో చేరుతుంది. లండన్: వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)లో విజేతగా నిలిచే దిశగా దక్షిణాఫ్రికా అడుగులు వేస్తోంది. లార్డ్స్ మైదానంలో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో సఫారీ టీమ్ డిఫెండింగ్ చాంపియన్ ఆ్రస్టేలియాపై మూడో రోజు సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. 282 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా ఆట ముగిసే సమయానికి 56 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 213 పరుగులు సాధించింది. మార్క్రమ్ (159 బంతుల్లో 102 బ్యాటింగ్; 11 ఫోర్లు) శతకం బాదగా... కెప్టెన్ తెంబా బవుమా (121 బంతుల్లో 65 బ్యాటింగ్; 5 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు ఇప్పటికే అభేద్యంగా 143 పరుగులు జోడించారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 144/8తో ఆట కొనసాగించిన ఆ్రస్టేలియా తమ రెండో ఇన్నింగ్స్‌లో 207 పరుగులకు ఆలౌటైంది. స్టార్క్ (136 బంతుల్లో 58 నాటౌట్; 5 ఫోర్లు) హాఫ్ సెంచరీ సాధించాడు. చివరి వికెట్‌కు 59 పరుగులు... మూడో రోజు ఆట ఆరంభంలోనే లయన్ (2)ను రబాడ అవుట్ చేయడంతో ఆసీస్ 9వ వికెట్ కోల్పోయింది. ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎంతో సమయం పట్టదనిపించింది. అయితే స్టార్క్ పట్టుదలగా పోరాడాడు. అతనికి హాజల్‌వుడ్ (53 బంతుల్లో 17; 2 ఫోర్లు) అండగా నిలవడంతో ఆలౌట్ చేసేందుకు సఫారీ బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. కొన్ని చక్కటి షాట్లు ఆడిన స్టార్క్ 131 బంతుల్లో అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. దీంతో ఆసీస్ స్కోరు కూడా 200 దాటింది. ఎట్టకేలకు మార్క్రమ్ బౌలింగ్‌లో హాజల్‌వుడ్ వెనుదిరగడంతో దక్షిణాఫ్రికా ఊపిరి పీల్చుకుంది. స్టార్క్, హాజల్‌వుడ్ 22.3 ఓవర్ల పాటు ఆడి చివరి వికెట్‌కు 59 పరుగులు జోడించడం విశేషం. శతక భాగస్వామ్యం... తొలి ఇన్నింగ్స్‌కు భిన్నంగా దక్షిణాఫ్రికా ఆరంభం నుంచే ధాటిగా ఆడింది. 10 ఓవర్లలోనే 47 పరుగులు చేసిన జట్టు రికెల్టన్ (6) కోల్పోయింది. మార్క్రమ్, ముల్డర్ (27; 5 ఫోర్లు) ఓవర్‌కు 4 పరుగుల రన్‌రేట్‌తో ధాటిని కొనసాగించారు. లబుషేన్ చక్కటి క్యాచ్‌తో ముల్డర్ వెనుదిరగడంతో ఈ భాగస్వామ్యం ముగిసింది. అయితే ఆ్రస్టేలియా ఆనందం ఇక్కడికే పరిమితమైంది. మార్క్రమ్, బవుమా కలిసి సమర్థంగా ఇన్నింగ్స్‌ను నడిపించారు.ఈ క్రమంలో 69 బంతుల్లోనే మార్క్రమ్ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. తీవ్రంగా ఎండ కాయడంతో పిచ్ పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలంగా మారిపోయింది. దాంతో ఆసీస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది. కొద్ది సేపటికి బవుమా 83 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆట ముగియడానికి కొద్దిసేపు ముందు మార్క్రమ్ 156 బంతుల్లో సెంచరీతో సగర్వంగా నిలిచాడు. బవుమా క్యాచ్ పట్టి ఉంటే... భారీ భాగస్వామ్యానికి ముందు ఒకే ఒక్క సారి ఆసీస్‌కు మరింత పట్టు బిగించే అవకాశం వచ్చింది. 2 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బవుమాకు లైఫ్ లభించింది. స్టార్క్ ఓవర్లో బవుమా ఆడిన షాట్‌కు బంతి మొదటి స్లిప్‌లోకి దూసుకెళ్ళగా క్యాచ్ అందుకోవడంలో స్మిత్ విఫలమయ్యాడు. అయితే నిజానికి అది అంత సులువైన క్యాచ్ కాదు. ఈ టెస్టులో చాలా బంతులు బ్యాట్‌కు తగిలాక స్లిప్ కార్డాన్కు కాస్త ముందే పడుతుండటంతో స్మిత్ సాహసం చేస్తూ సాధారణంగా నిలబడే చోటుకంటే కాస్త ముందు వచ్చి నిలబడ్డాడు. ముందు జాగ్రత్తగా హెల్మెట్ కూడా పెట్టుకున్నాడు. ఊహించినట్లుగానే బంతి చాలా వేగంగా దూసుకొచి్చంది. మరీ దగ్గర కావడం వల్ల స్పందించే సమయం కూడా లేకపోయింది. దాంతో స్మిత్ కుడి చేతి వేలికి బంతి బలంగా తగిలి కింద పడిపోయింది. నొప్పితో విలవిల్లాడిన అతను వెంటనే మైదానం వీడాడు. అనంతరం స్కానింగ్‌లో వేలు విరిగినట్లు తేలింది! స్కోరు వివరాలు: ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్: 212; దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 138; ఆ్రస్టేలియా రెండో ఇన్నింగ్స్: 207; దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: మార్క్రమ్ (బ్యాటింగ్) 102; రికెల్టన్ (సి) కేరీ (బి) స్టార్క్ 6; ముల్డర్ (సి) లబుషేన్ (బి) స్టార్క్ 27; బవుమా (బ్యాటింగ్) 65; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (56 ఓవర్లలో 2 వికెట్లకు) 213. వికెట్ల పతనం: 1–9, 2–70. బౌలింగ్: స్టార్క్ 9–0–53–2, హాజల్‌వుడ్ 13–0–43–0, కమిన్స్ 10–0–36–0, లయన్ 18–3–51–0, వెబ్‌స్టర్ 4–0–11–0, హెడ్ 2–0–8–0. -
ఆస్ట్రేలియాకు భారీ షాక్.. స్టీవ్ స్మిత్‌కు తీవ్ర గాయం
లార్డ్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియా సూపర్ స్టార్ స్టీవ్ స్మిత్ గాయపడ్డాడు. మూడో రోజు ఆట సందర్భంగా స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా స్మిత్ చేతి వేలికి గాయమైంది. సౌతాఫ్రికా సెకెండ్ ఇన్నింగ్స్ 20వ ఓవర్ వేసిన మిచెల్ స్టార్క్.. రెండో బంతిని బావుమాకు షార్ట్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు.ఆ బంతిని బావుమా లెగ్ సైడ్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే బంతి థిక్ ఎడ్జ్ తీసుకుని సెకెండ్ స్లిప్ దిశగా వెళ్లింది. ఈ క్రమంలో స్మిత్ ఆ క్యాచ్‌ను అందుకునే ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో బంతి బలంగా స్మిత్ చిటికెన వేలికి తాకింది. దీంతో స్మిత్ తీవ్రమైన నొప్పితో విల్లవిల్లాడు.వెంటనే ఫిజియో సాయంతో స్మిత్ మైదానం నుంచి బయటకు వెళ్లిపోయాడు. అతడి స్దానంలో కొన్‌స్టాస్ సబ్‌స్ట్యూట్‌గా ఫీల్డ్‌లోకి వచ్చాడు. స్మిత్ గాయంపై క్రికెట్ ఆస్ట్రేలియా అప్డేట్ ఇచ్చింది. అతడి చిటికెన వేలు ఎముక పక్కకు జరిగిందని క్రికెట్ ఆస్ట్రేలియా ఓ ప్రకటనలో పేర్కొంది. దీంతో త్వరలో వెస్టిండీస్‌తో జరనున్న టెస్టు సిరీస్‌కు స్మిత్ దూరమయ్యే అవకాశముంది. -
రెండో రోజూ 14 వికెట్లు
వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ రెండో రోజు ముగిసేసరికే ఉత్కంఠభరిత స్థితికి చేరింది. గురువారం కూడా పేసర్ల జోరు కొనసాగడంతో తొలి రోజులాగే మొత్తం 14 వికెట్లు నేలకూలాయి. ముందుగా కమిన్స్ ధాటికి దక్షిణాఫ్రికా తడబడి ఆధిక్యం కోల్పోగా... ఆ తర్వాత రబాడ, ఇన్‌గిడి దెబ్బకు ఆసీస్ బ్యాటర్లు కూడాచేతులెత్తేశారు. అయితే ఇప్పటికే ఆధిక్యం 200 దాటిన ఆ్రస్టేలియాదే కాస్త పైచేయిగా కనిపిస్తుండగా... చివరి రోజు సఫారీ టీమ్ ముందు ఎంతటి లక్ష్యం ఉంటుందనేది ఆసక్తికరం. లండన్: ఆ్రస్టేలియా డబ్ల్యూటీసీ ట్రోఫీని నిలబెట్టుకుంటుందా... దక్షిణాఫ్రికా 27 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీ గెలుచుకుంటుందా అనేది శుక్రవారమే తేలే అవకాశం ఉంది. బౌలర్లు ఆధిపత్యం ప్రదర్శిస్తున్న ఫైనల్లో మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. అలెక్స్ కేరీ (50 బంతుల్లో 43; 5 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడగా... ప్రస్తుతం ఆసీస్ ఓవరాల్ ఆధిక్యం 218 పరుగులకు చేరింది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 43/4తో ఆటను కొనసాగించిన దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో 57.1 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌటైంది. దాంతో ఆ్రస్టేలియాకు 74 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది. బెడింగ్హామ్ (45; 6 ఫోర్లు), బవుమా (36; 4 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. కమిన్స్ (6/28) ఆరు వికెట్ల ప్రదర్శనతో చెలరేగాడు. 12 పరుగులకు 5 వికెట్లు... రెండో రోజు బవుమా, బెడింగ్హామ్ భాగస్వామ్యంతో జట్టు పరిస్థితి మెరుగ్గా కనిపించింది. లబుషిషేన్ అద్భుత క్యాచ్‌కు బవుమా వెనుదిరగడంతో ఈ భాగస్వామ్యానికి తెర పడింది. బవుమా, బెడింగ్హామ్ ఐదో వికెట్‌కు 64 పరుగులు జోడించారు. ఆ తర్వాత బెడింగ్హామ్ కొద్దిసేపు పోరాడాడు. అయితే లంచ్ తర్వాత కమిన్స్ ధాటికి దక్షిణాఫ్రికా ఒక్కసారిగా కుప్పకూలింది. 126/5తో ఉన్న జట్టు 12 పరుగుల వ్యవధిలో 5 వికెట్లు కోల్పోయింది. ఒకే ఓవర్లో వెరీన్ (13), యాన్సెన్ (0)లను అవుట్ చేసిన కమిన్స్... బెడింగ్హామ్నూ పెవిలియన్‌కు పంపించి ఐదు వికెట్ల ప్రదర్శనను పూర్తి చేసుకున్నాడు. కేశవ్ మహరాజ్ (7) రనౌట్ కాగా, రబాడ (1) వికెట్‌తో సఫారీల ఇన్నింగ్స్ ముగిసింది. టపటపా... తొలి ఇన్నింగ్స్‌కంటే మెరుగైన ప్రదర్శనతో ప్రత్యర్థికి సవాల్ విసరాల్సిన ఆ్రస్టేలియా బ్యాటింగ్ రెండో ఇన్నింగ్స్‌లో మరింత పేలవంగా సాగింది. ఓపెనర్లు లబుషేన్ (22), ఖ్వాజా (6) తొలి 10 ఓవర్ల పాటు జాగ్రత్తగా ఆడారు. దాంతో ఆసీస్‌కు సరైన ఆరంభం లభించినట్లు అనిపించింది. అయితే ఆ తర్వాత అనూహ్యంగా జట్టు పతనం మొదలైంది.ఒకే ఓవర్లో ఖ్వాజా, గ్రీన్ (0) లను రబాడ పెవిలియన్ పంపించగా, యాన్సెన్ చక్కటి బంతితో లబుషేన్‌ను అవుట్ చేశాడు. స్మిత్ (13) ఇన్‌గిడి బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. అంపైర్ నాటౌట్ ఇవ్వగా... ‘రివ్యూ’ లో దక్షిణాఫ్రికా ఫలితం సాధించింది. వెబ్‌స్టర్ (9), హెడ్ (9), కమిన్స్ (6) కేవలం 7 పరుగుల వ్యవధిలో వెనుదిరిగారు. కేరీ, స్టార్క్ (16 బ్యాటింగ్) 8వ వికెట్ కు 61 పరుగులు జోడించి జట్టు ను ఆదుకున్నారు. దాంతో ఆసీస్ ఓవరాల్ ఆధిక్యం 200 దాటింది.‘హ్యాండిల్డ్ ద బాల్’ వివాదం దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. వెబ్‌స్టర్ వేసిన 49వ ఓవర్లో బెడింగ్హామ్ బ్యాట్‌ను తాకిన బంతి అతని కాలి ప్యాడ్ ఫ్లాప్లోకి వెళ్లింది. అది కింద పడే లోపు క్యాచ్ అందుకునేందుకు ఆసీస్ కీపర్ కేరీ ప్రయత్నించాడు. అయితే అదే సమయంలో బెడింగ్హామ్ తన చేత్తో బంతిని తీసి కింద విసిరేశాడు. దీనిపై స్మిత్, ఖ్వాజా ‘హ్యాండిల్డ్ ద బాల్’ గురించి అప్పీల్ చేశారు. దీనిపై ఫీల్డ్ అంపైర్లు గాఫ్నీ, ఇల్లింగ్‌వర్త్ చర్చించి అప్పటికే ‘డెడ్‌బాల్’ అయిందని ప్రకటిస్తూ నాటౌట్‌గా తేల్చారు. అయితే రీప్లేలు చూస్తే బంతి ప్యాడ్‌లో ఇరుక్కుపోకుండా ఇంకా ‘రోలింగ్’లోనే ఉండటం కనిపించింది. అది స్పష్టంగా అవుట్ అని, మూడో అంపైర్‌ను సంప్రదించకుండా ఫీల్డ్ అంపైర్లు వేగంగా నిర్ణయం వెలువరించారని దీనిపై తీవ్ర చర్చ సాగింది. 300 టెస్టుల్లో ప్యాట్ కమిన్స్ వికెట్ల సంఖ్య. ఈ ఘనత సాధించిన ఎనిమిదో ఆ్రస్టేలియా బౌలర్‌గా నిలిచిన కమిన్స్ 68 టెస్టుల్లో ఈ మైలురాయిని చేరాడు. స్కోరు వివరాలుఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్: 212; దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: మార్క్రమ్ (బి) స్టార్క్ 0; రికెల్టన్ (సి) ఖ్వాజా (బి) స్టార్క్ 16; ముల్డర్ (బి) కమిన్స్ 6; బవుమా (సి) లబుషేన్ (బి) కమిన్స్ 36; స్టబ్స్ (బి) హాజల్‌వుడ్ 2; బెడింగ్హామ్ (సి) కేరీ (బి) కమిన్స్ 45; వెరీన్ (ఎల్బీ) (బి) కమిన్స్ 13; యాన్సెన్ (సి అండ్ బి) కమిన్స్ 0; మహరాజ్ (రనౌట్) 7; రబాడ (సి) వెబ్‌స్టర్ (బి) కమిన్స్ 1; ఇన్‌గిడి (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (57.1 ఓవర్లలో ఆలౌట్) 138. వికెట్ల పతనం: 1–0, 2–19, 3–25, 4–30, 5–94, 6–126, 7–126, 8–135, 9–138, 10–138. బౌలింగ్: స్టార్క్ 13–3–41–2, హాజల్‌వుడ్ 15–5–27–1, కమిన్స్ 18.1–6–28–6, లయన్ 8–3–12–0, వెబ్‌స్టర్ 3–0–20–0. ఆ్రస్టేలియా రెండో ఇన్నింగ్స్: లబుషేన్ (సి) వెరీన్ (బి) యాన్సెన్ 22; ఖ్వాజా (సి) వెరీన్ (బి) రబాడ 6; గ్రీన్ (సి) ముల్డర్ (బి) రబాడ 0; స్మిత్ (ఎల్బీ) (బి) ఇన్‌గిడి 13; హెడ్ (బి) ముల్డర్ 9; వెబ్‌స్టర్ (ఎల్బీ) (బి) ఇన్‌గిడి 9; కేరీ (ఎల్బీ) (బి) రబాడ 43; కమిన్స్ (బి) ఇన్‌గిడి 6; స్టార్క్ (బ్యాటింగ్) 16; లయన్ (బ్యాటింగ్) 1; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (40 ఓవర్లలో 8 వికెట్లకు) 144. వికెట్ల పతనం: 1–28, 2–28, 3–44, 4–48, 5–64, 6–66, 7–73, 8–134. బౌలింగ్: రబాడ 11–0–44–3, యాన్సెన్ 12–3–31–1, ముల్డర్ 6–0–14–1, ఇన్‌గిడి 9–0–35–3, మహరాజ్ 2–0–10–0. -
WTC Final 2025: చరిత్ర సృష్టించిన రబాడ
లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియాతో నిన్న (జూన్ 11) మొదలైన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో సౌతాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసిన అతను.. సౌతాఫ్రికా తరఫున టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన నాలుగో బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. రబాడ ఈ రికార్డు సాధించే క్రమంలో దిగ్గజ ఫాస్ట్ బౌలర్ అలెన్ డొనాల్డ్‌ను (72 టెస్ట్‌ల్లో 330 వికెట్లు) అధిగమించాడు. తాజా ప్రదర్శన అనంతరం రబాడ ఖాతాలో 332 వికెట్లు (70 టెస్ట్‌ల్లో) ఉన్నాయి.టెస్ట్‌ల్లో సౌతాఫ్రికా తరఫున అత్యధిక వికెట్లు తీసిన రికార్డు డేల్ స్టెయిన్ పేరిట ఉంది. స్టెయిన్ 93 టెస్ట్‌ల్లో 439 వికెట్లు తీశాడు. స్టెయిన్ తర్వాత షాన్ పొలాక్ (108 టెస్ట్‌ల్లో 421 వికెట్లు), మఖాయా ఎన్తిని (101 టెస్ట్‌ల్లో 390 వికెట్లు) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ఓవరాల్‌గా టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు ముత్తయ్య మురళీథరన్ పేరిట ఉంది. మురళీ 133 టెస్ట్‌ల్లో 800 వికెట్లు తీశాడు. షేన్ వార్న్ (145 టెస్ట్‌ల్లో 708), జేమ్స్ ఆండర్సన్ (188 టెస్ట్‌ల్లో 704) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.కాగా, ఆసీస్‌తో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో రబాడ చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. రబాడ ఆసీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఉస్మాన్ ఖ్వాజా, గ్రీన్, వెబ్‌స్టర్, కమిన్స్, స్టార్క్ వికెట్లు తీసి ఆసీస్ పతనాన్ని శాశించాడు.రబాడకు (5/51) జన్సెన్ (3/49), కేశవ్ మహారాజ్ (1/19), మార్క్రమ్ (1/5) తోడవ్వడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 212 పరుగులకే కుప్పకూలింది (56.4 ఓవర్లలో). తొలి రోజు టీ విరామం కాగానే ఆసీస్ ఇన్నింగ్స్ ముగిసింది. 67 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన ఆసీస్‌ను స్టీవ్ స్మిత్ (66), బ్యూ వెబ్‌స్టర్ (72) అర్ద సెంచరీలతో ఆదుకున్నారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 79 పరుగులు జోడించి ఆసీస్ గౌరవప్రదమైన స్కోర్ సాధించేందుకు దోహదపడ్డారు. వీరిద్దరు ఔటయ్యాక ఆసీస్ ఇన్నింగ్స్ మరోసారి పేకమేడలా కూలింది. మధ్యలో అలెక్స్ క్యారీ (23) కాసేపు పోరాడాడు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో స్మిత్, వెబ్‌స్టర్, క్యారీ కాక లబూషేన్ (17), ట్రవిస్ హెడ్ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా 20 బంతుల డకౌట్ కావడంతో ఆసీస్ పతనం మొదలైంది.ఈ మ్యాచ్‌తో ఖ్వాజాకు జోడీగా లబూషేన్‌తో ఓపెనింగ్ ప్రయోగం చేసినప్పటికీ సత్ఫలితం రాలేదు. గాయం నుంచి కోలుకొని చాలాకాలం తర్వాత తిరిగి వచ్చిన కెమరూన్ గ్రీన్ (4) దారుణంగా విఫలమయ్యాడు. స్టీవ్ స్మిత్‌ను మార్క్రమ్, క్యారీని కేశవ్ మహారాజ్.. హెడ్, లియోన్‌ను (0) జన్సెన్ ఔట్ చేశారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికాకు కూడా ఆదిలోనే కష్టాలు మొదలయ్యాయి. తొలి ఓవర్లోనే మార్క్రమ్ను స్టార్క్ డకౌట్ చేశాడు. జట్టు స్కోర్ 19 పరుగుల వద్ద ఉండగా మరో ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ను (16) స్టార్కే పెవిలియన్‌కు పంపాడు. వన్‌డౌన్ బ్యాటర్‌గా ప్రమోషన్ పొందిన వియాన్ ముల్దర్ (6) దారుణంగా విఫలమయ్యాడు. అతని వికెట్ కమిన్స్‌కు దక్కింది. అనంతరం వచ్చిన ట్రిస్టన్ స్టబ్స్‌ను (2) హాజిల్‌వుడ్ ఔట్ చేశాడు. దీంతో 30 పరుగులకే సౌతాఫ్రికా 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. సౌతాఫ్రికాను గట్టెక్కించే బాధ్యత బవుమా (3), బెడింగ్హమ్ భుజస్కందాలపై ఉంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ స్కోర్ 43/4గా ఉంది. ప్రస్తుతం ఆ జట్టు ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 169 పరుగులు వెనుకపడి ఉంది. -
మొదటి రోజు పేసర్ల హవా
సుదీర్ఘ ఫార్మాట్లో విశ్వ విజేతను తేల్చే అసలు సిసలు సమరం రసవత్తరంగా ప్రారంభమైంది. లార్డ్స్ వేదికగా డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య ప్రారంభమైన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో పేసర్ల జోరు సాగుతోంది. పచ్చిక పిచ్‌పై పేసర్ రబాడ విజృంభించినా... ఆసీస్ బ్యాటర్లు కాస్త సంయమనం చూపడంతో మెరుగైన స్కోరు చేయగలిగింది. ఆ తర్వాత కంగారూ పేసర్ల ధాటికి దక్షిణాఫ్రికా టాపార్డర్ తడబడింది. రెండో రోజు తొలి సెషన్లో కమిన్స్, స్టార్క్, హాజల్‌వుడ్‌ను సఫారీ జట్టు ఎదుర్కోవడంపైనే ఈ మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది. లండన్: బ్యాటర్ల పట్టుదలకు బౌలర్ల సహకారం తోడవడంతో... ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ను ఆ్రస్టేలియా మెరుగ్గా ఆరంభించింది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఆసీస్ బ్యాటింగ్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా... తమ పదునైన పేస్‌తో ప్రత్యర్థిని కట్టిపడేసింది. ఐసీసీ ట్రోఫీ చేజిక్కించుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా పెద్దగా మెరిపించలేకపోయింది. లార్డ్స్ వేదికగా బుధవారం ప్రారంభమైన ఈ పోరులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్‌లో 56.4 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటైంది. బ్యూ వెబ్‌స్టర్ (92 బంతుల్లో 72; 11 ఫోర్లు), స్టీవ్ స్మిత్ (112 బంతుల్లో 66; 10 ఫోర్లు) అర్ధ శతకాలు సాధించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కగిసో రబాడ 5 వికెట్లు పడగొట్టగా... మార్కో యాన్సెన్ 3 వికెట్లు తీశాడు. అనంతరం తొలి రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 22 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 43 పరుగులు చేసింది. చేతిలో 6 వికెట్లు ఉన్న సఫారీ జట్టు... ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 169 పరుగులు వెనుకబడి ఉంది. కెప్టెన్ తెంబా బవుమా (3 బ్యాటింగ్)తో పాటు డేవిడ్ బెడింగ్హామ్ (8 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ 2... హాజల్‌వుడ్, కమిన్స్ చెరో వికెట్ పడగొట్టారు. బౌలర్ల హవా సాగుతున్న ఈ మ్యాచ్‌లో తొలి రోజే 14 వికెట్లు నేలకూలగా... అందులో సింహభాగం (12 వికెట్లు) పేసర్ల ఖాతాలోకే వెళ్లాయి. రబాడ పేస్ దాడి.. ఐసీసీ టెస్టు గదను నిలబెట్టుకునేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు శుభారంభం దక్కలేదు. 20 బంతులాడినా ఖాతా తెరవలేకపోయిన ఉస్మాన్ ఖ్వాజా (0)ను రబాడ పెవిలియన్ బాట పట్టించాడు. అదే ఓవర్లో కామెరూన్ గ్రీన్ (4) కూడా అవుటయ్యాడు. మార్క్రమ్ స్లిప్స్‌లో చక్కటి క్యాచ్‌తో గ్రీన్‌ను సాగనంపగా... క్రీజులో నిలిచేందుకు మొండిగా ప్రయత్నించిన లబుషేన్ (56 బంతుల్లో 17)ను యాన్సెన్ బుట్టలో వేసుకున్నాడు. ఇక ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌ల్లో మంచి రికార్డు ఉన్న ట్రావిస్ హెడ్ (11) కీపర్ వెరీన్ పట్టిన ఒంటి చేతి క్యాచ్‌తో పెవిలియన్ చేరుకున్నాడు. దీంతో ఆసీస్ 67 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో స్మిత్ తన అనుభవాన్ని చూపించాడు. పేసర్లను కాచుకుంటూ... చెత్త బంతుల్లో పరుగులు రాబట్టాడు. దీంతో ఇక కోలుకున్నట్లే అనుకుంటున్న దశలో మార్క్రమ్ బౌలింగ్‌లో అనవసర షాట్‌కు అతడు అవుట్ కాగా... కేశవ్ మహరాజ్ బంతిని రివర్స్ స్వీప్ ఆడే ప్రయత్నంలో అలెక్స్ కేరీ (23) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మరో ఎండ్‌లో ధాటిగా ఆడిన వెబ్‌స్టర్‌ను కూడా రబాడ వెనక్కి పంపడంతో ఆసీస్ ఇన్నింగ్స్ వేగంగా ముగిసింది. 20 పరుగులకే జట్టు తమ చివరి 5 వికెట్లు కోల్పోయింది. బెంబేలెత్తించిన పేస్ త్రయం... దక్షిణాఫ్రికా పేసర్లు విజృంభించిన పిచ్‌పై ఆసీస్ పేస్ త్రయం మరింత రెచ్చిపోతుందని ఊహించినట్లే జరిగింది. బంతి బంతికి వికెట్ తీసేలా కనిపించిన కమిన్స్, స్టార్క్, హాజల్‌వుడ్... సఫారీ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించారు. స్టార్క్ తొలి ఓవర్ చివరి బంతిని వికెట్ల మీదకు ఆడుకున్న మార్క్రమ్ (0) ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరగా... కాసేపటికి రికెల్టన్ (16) కూడా అతడిని అనుసరించాడు. ఆసీస్ ఫీల్డర్లు క్యాచ్‌లు వదిలేసి అవకాశం ఇచ్చినా... దక్షిణాఫ్రికా బ్యాటర్లు వాటిని వినియోగించుకోలేకపోయారు. క్రీజులో అడుగు పెట్టిన తొలి బంతికే సింగిల్ తీసిన ముల్డర్ (44 బంతుల్లో 6) మరో పరుగు చేసేందుకు 39 బంతుల వరకు ఎదురు చూశాడంటే... కంగారూల బౌలింగ్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు దక్షిణాఫ్రికా కెప్టెన్ బవుమా 31వ బంతికి ఖాతా తెరవగా... స్టబ్స్ (2) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. 4 దక్షిణాఫ్రికా తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో కగిసో రబాడ నాలుగో స్థానానికి (332 వికెట్లు) చేరుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అతను అలెన్ డొనాల్డ్ (330)ను అధిగమించగా...టాప్–3లో వరుసగా డేల్ స్టెయిన్ (439, షాన్ పొలాక్ (421), మఖయా ఎన్తిని (390) ఉన్నారు. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: ఖ్వాజా (సి) బెడింగ్హామ్ (బి) రబాడ 0; లబుషేన్ (సి) వెరీన్ (బి) యాన్సెన్ 17; గ్రీన్ (సి) మార్క్రమ్ (బి) రబాడ 4; స్మిత్ (సి) యాన్సెన్ (బి) మార్క్రమ్ 66; హెడ్ (సి) వెరీన్ (బి) యాన్సెన్ 11; వెబ్‌స్టర్ (సి) బెడింగ్హామ్ (బి) రబాడ 72; కేరీ (బి) కేశవ్ 23; కమిన్స్ (బి) రబాడ 1; స్టార్క్ (బి) రబాడ 1; లయన్ (బి) యాన్సెన్ 0; హాజల్‌వుడ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (56.4 ఓవర్లలో ఆలౌట్) 212. వికెట్ల పతనం: 1–12, 2–16, 3–46, 4–67, 5–146, 6–192, 7–199, 8–210, 9–211, 10–212. బౌలింగ్: రబాడ 15.4–5–51–5; యాన్సెన్ 14–5–49–3; ఇన్‌గిడి 8–0–45–0; ముల్డర్ 11–3–36–0; కేశవ్ మహరాజ్ 6–0–19–1; మార్క్రమ్ 2–0–5–1. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: మార్క్రమ్ (బి) స్టార్క్ 0; రికెల్టన్ (సి) ఖ్వాజా (బి) స్టార్క్ 16; ముల్డర్ (బి)కమిన్స్ 6; బవుమా (నాటౌట్) 3; స్టబ్స్ (బి) హాజల్‌వుడ్ 2; బెడింగ్హామ్ (నాటౌట్) 8; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (22 ఓవర్లలో 4 వికెట్లకు) 43. వికెట్ల పతనం: 1–0, 2–19, 3–25, 4–30. బౌలింగ్: స్టార్క్ 7–3–10–2; హాజల్‌వుడ్ 7–3–10–1; కమిన్స్ 7–3–14–1; లయన్ 1–0–1–0. -
డబ్ల్యూటీసీ ఫైనల్.. ఆస్ట్రేలియా జట్టులో అనూహ్య మార్పు
లార్డ్స్ వేదికగా జూన్ 11న ప్రారంభమయ్యే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 ఫైనల్ కోసం సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు తమ ప్లేయింగ్ ఎలెవెన్‌ను ప్రకటించాయి. ఇరు జట్లలో ఊహించిన ఆటగాళ్లే తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. అయితే ఆస్ట్రేలియా మాత్రం తమ బ్యాటింగ్ ఆర్డర్లో ఓ అనూహ్య మార్పు చేసింది. మిడిలార్డర్లో కీలకమైన మార్నస్ లబూషేన్‌ను ఆసీస్ మేనేజ్మెంట్ ఓపెనర్‌గా ప్రమోట్ చేసింది. డేవిడ్ వార్నర్ రిటైరయ్యాక ఆసీస్ ఓపెనర్ సమస్యను ఎదుర్కొంటుంది. కొన్ని మ్యాచ్‌ల్లో స్టీవ్ స్మిత్‌ను ప్రయోగించినా ప్రతికూల ఫలితాలు వచ్చాయి. దీంతో ఉస్మాన్ ఖ్వాజాకు జోడీగా లబూషేన్‌తో ప్రయోగానికి పూనుకుంది. కీలక డబ్ల్యూటీసీ ఫైనల్ కావడంతో ఓపెనర్‌గా లబూషేన్ ఏ మేరకు రాణిస్తాడో అని అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. మరోవైపు సౌతాఫ్రికా కూడా బ్యాటింగ్ లైనప్‌లో ఓ మార్పు చేసింది. బౌలింగ్ ఆల్‌రౌండర్ వియాన్ ముల్దర్‌ను వన్‌డౌన్‌కు ప్రమోట్ చేసింది. సౌతాఫ్రికా తుది జట్టులో ఏకంగా నలుగురు వికెట్‌కీపర్ బ్యాటర్లు (రికెల్టన్, స్టబ్స్, వెర్రిన్, బెడింగ్హమ్) ఉండటం విశేషం. అయితే మ్యాచ్‌లో మాత్రం వెర్రిన్ వికెట్‌కీపింగ్ బాధ్యతలు చేపట్టనున్నట్లు సౌతాఫ్రికా మేనేజ్మెంట్ ప్రకటించింది.మ్యాచ్ విషయానికొస్తే.. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా టైటిల్ నిలబెట్టుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది. మరోవైపు 27 ఏళ్లుగా ఐసీసీ టైటిల్ సాధించలేకపోయిన సౌతాఫ్రికా ఈ సువర్ణావకాశాన్ని అస్సలు మిస్ చేసుకోకూడదని మహా పట్టుదలగా ఉంది.డబ్ల్యూటీసీలో ఇది మూడో ఫైనల్ కాగా...తొలి రెండు ట్రోఫీలను న్యూజిలాండ్, ఆ్రస్టేలియా గెలుచుకున్నాయి. రెండు సందర్భాల్లోనూ ఫైనల్ చేరి ఓడిన భారత్ ఈసారి తుది పోరుకు అర్హత సాధించలేకపోయింది. మూడో స్థానంతో సరిపెట్టుకుంది.తుది జట్లు..దక్షిణాఫ్రికా: ఎయిడెన్ మార్క్రమ్, 2. ర్యాన్ రికెల్టన్, 3. వియాన్ ముల్డర్, 4. టెంబా బవుమా (కెప్టెన్), 5. ట్రిస్టన్ స్టబ్స్, 6. డేవిడ్ బెడింగ్హమ్, 7. కైల్ వెర్రిన్ (వికెట్‌కీపర్), 8. మార్కో జన్సెన్, 9. కేశవ్ మహారాజ్, 10. కగిసో రబాడ, 11. లుంగి ఎంగిడిఆస్ట్రేలియా: 1. ఉస్మాన్ ఖవాజా, 2. మార్నస్ లబూషేన్, 3. కెమరూన్ గ్రీన్, 4. స్టీవ్ స్మిత్, 5. ట్రావిస్ హెడ్, 6. బ్యూ వెబ్‌స్టర్, 7. అలెక్స్ క్యారీ (వికెట్‌కీపర్), 8. పాట్ కమిన్స్ (కెప్టెన్), 9. మిచెల్ స్టార్క్, 10. నాథన్ లియోన్, 11. జోష్ హాజిల్‌వుడ్ -
రెండు జట్లకు తుది ‘టెస్టు’
టెస్టు క్రికెట్లో అతి పెద్ద సమరానికి రంగం సిద్ధమైంది. సాంప్రదాయ ఫార్మాట్లో విశ్వ విజేతను తేల్చే వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ పోరుకు నేడు తెర లేవనుంది. డిఫెండింగ్ చాంపియన్ ఆ్రస్టేలియా తమ టైటిల్‌ను నిలబెట్టుకోవాలని భావిస్తుండగా... గత 27 ఏళ్లుగా ఐసీసీ ట్రోఫీని సాధించలేకపోయిన దక్షిణాఫ్రికా ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి రికార్డును మార్చాలని పట్టుదలగా ఉంది. వరుసగా మూడోసారి ఇంగ్లండ్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఆతిథ్యం ఇస్తుండగా సౌతాంప్టన్, ఓవల్ తర్వాత ఈసారి వేదిక ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానానికి మారింది. లండన్: వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) 2023–25 టైటిల్ వేటలో ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికా హోరాహోరీ సమరానికి ‘సై’ అంటున్నాయి. లార్డ్స్ మైదానంలో నేటి నుంచి జరిగే ఫైనల్ పోరులో ఇరు జట్లు తలపడతాయి. 2023–25 మధ్య కాలంలో 9 జట్లు 27 సిరీస్‌లలో కలిపి మొత్తం 69 మ్యాచ్‌లలో తలపడిన అనంతరం తుది సమరానికి ఆసీస్, సఫారీ టీమ్ అర్హత సాధించాయి. ఇది మూడో డబ్ల్యూటీసీ ఫైనల్ కాగా...తొలి రెండు ట్రోఫీలను న్యూజిలాండ్, ఆ్రస్టేలియా గెలుచుకున్నాయి. రెండు సందర్భాల్లోనూ ఫైనల్ చేరి ఓడిన భారత్ ఈసారి తుది పోరుకు అర్హత పొందలేకపోయింది. ఆసీస్ అదే జోరుతో... ఐసీసీ ఫైనల్ మ్యాచ్‌లు అనగానే ఆస్ట్రేలియా ఆట ఒక్కసారిగా పతాక స్థాయికి చేరుతుందని గతంలో చాలాసార్లు రుజువైంది. ఆఖరి సమరంలో ప్రత్యర్థిపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడి మ్యాచ్‌ను తమ సొంతం చేసుకోవడంలో ఆ జట్టుకు తిరుగులేదు. మూడు ఫార్మాట్లలో కలిపి 13 ఐసీసీ ఫైనల్స్ ఆడిన కంగారూలు 10 టైటిల్స్ సాధించడం వారి ఆధిపత్యాన్ని చూపిస్తోంది. 2023లో భారత్‌పై ఫైనల్ ఆడిన తుది జట్టులోంచి 9 మంది మళ్లీ ఇక్కడా బరిలోకి దిగడం ఖాయమైంది. వార్నర్ రిటైర్ కాగా, ఆల్‌రౌండర్ వెబ్‌స్టర్‌కు చోటు దక్కింది. గాయంతో నాటి మ్యాచ్‌కు దూరమైన హాజల్‌వుడ్ ఇప్పుడు బోలండ్ స్థానంలో ఆడతాడు. ఖ్వాజాకు జోడీగా లబుõÙన్ ఓపెనింగ్ చేయనుండగా, గ్రీన్ మూడో స్థానంలో ఆడతాడు. ఆల్‌టైమ్ గ్రేట్ బ్యాటర్లలో ఒకడైన స్టీవ్ స్మిత్, గత డబ్ల్యూటీసీ ఫైనల్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హెడ్ బ్యాటింగ్‌లో ప్రధాన బలం కాగా, కీపర్ అలెక్స్ కేరీ కూడా చెలరేగిపోగలడు. కమిన్స్, స్టార్క్, హాజల్‌వుడ్, లయన్లతో టీమ్ బౌలింగ్ పటిష్టంగా కనిపిస్తోంది. రాత మారేనా... దక్షిణాఫ్రికా వరుసగా గత 7 టెస్టుల్లో విజయాలు సాధించి ముందుగా ఫైనల్‌కు అర్హత సాధించినా సరే టీమ్‌పై విమర్శలు వచ్చాయి. టెస్టుల్లో అగ్రగామి అయిన ఆ్రస్టేలియా, ఇంగ్లండ్‌లాంటి టీమ్‌లతో లీగ్ దశలో ఒక్కసారి కూడా తలపడకుండానే జట్టు ఫైనల్ చేరింది. అయితే ఏ దారిలో వచ్చినా ఇప్పుడు తుది పోరులో విజేతగా నిలిచి సత్తా చాటాలని సఫారీలు భావిస్తున్నారు. అయితే జట్టులో అనుభవలేమి స్పష్టంగా కనిపిస్తోంది. మార్క్రమ్, కెపె్టన్ తెంబా బవుమాలకు మాత్రమే ప్రస్తుత ఆసీస్ బౌలర్లను ఎదుర్కొన్న అనుభవం ఉంది. రికెల్టన్, ముల్డర్, స్టబ్స్, బెడింగ్హామ్ ఇంకా టెస్టు కెరీర్ ఆరంభ దశలోనే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే సఫారీ టాప్–7 బ్యాటర్లందరి టెస్టు పరుగులు కలిపినా (9,873)... ఒక్క స్మిత్ (10,271) పరుగులకంటే తక్కువే ఉన్నాయి! అయితే వైవిధ్యమైన బౌలింగ్ తో ఆసీస్‌ను కట్టడి చేయగలమని నమ్ముతోంది. ఇంగ్లండ్‌లో వాతావరణం అనుకూలిస్తే తన స్వింగ్‌తో రబాడ ప్రమాదకరమైన బౌలర్ కాగా, యాన్సెన్ లెఫ్టార్మ్ పేస్ కూడా ఇటీవల పదునెక్కింది. ఇక స్పిన్ కోసం మరోసారి దక్షిణాఫ్రికా మహరాజ్నే నమ్ముకుంది.పిచ్, వాతావరణంసాధారణ బ్యాటింగ్ పిచ్. ప్రస్తుతం ఉపఖండం తరహాలోనే వాతావరణం ఉంది. మ్యాచ్ సాగుతున్న కొద్దీ స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. వర్షంతో అంతరాయం కలగవచ్చు. అయితే ఐదు రోజులలో నిర్ణీత ఓవర్లు పూర్తి కాకుండా ఫలితం రాకపోతే ‘రిజర్వ్ డే’ ఆరో రోజుకు మ్యాచ్ సాగుతుంది. భారత్, కివీస్ మధ్య 2021 ఫైనల్లో ఇదే జరిగింది.తుది జట్లు (అంచనా)ఆస్ట్రేలియా: కమిన్స్ (కెప్టెన్), ఖ్వాజా, లబుషేన్, గ్రీన్, స్మిత్, హెడ్, వెబ్‌స్టర్, కేరీ, స్టార్క్, లయన్, హాజల్‌వుడ్. దక్షిణాఫ్రికా: బవుమా (కెప్టెన్), మార్క్రమ్, రికెల్టన్, ముల్డర్, స్టబ్స్, బెడింగ్హామ్, వెరీన్, యాన్సెన్, కేశవ్ మహరాజ్, రబాడ, ఇన్‌గిడి. -
సౌతాఫ్రికా టెస్ట్ జట్టు ప్రకటన.. సీఎస్కే చిచ్చరపిడుగుకు చోటు
ఈ నెలాఖరులో జింబాబ్వేతో జరుగనున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం 16 మంది సభ్యుల దక్షిణాఫ్రికా జట్టును ఇవాళ (జూన్ 6) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా టెంబా బవుమా ఎంపిక కాగా.. ఐదు అన్క్యాప్డ్ ప్లేయర్లకు చోటు దక్కింది. తాజాగా ముగిసిన ఐపీఎల్ సీజన్లో ఇరగదీసిన సీఎస్కే చిచ్చరపిడుగు డెవాల్డ్ బ్రెవిస్ తొలిసారి టెస్ట్ జట్టు నుంచి పిలుపునందుకున్నాడు. అతనితో పాటు మరో విధ్వంసకర బ్యాటర్ లుహాన్-డ్రి-ప్రిటోరియస్ కూడా టెస్ట్ అరంగేట్రానికి సిద్దమయ్యాడు. జింబాబ్వే సిరీస్‌లో బ్రెవిస్, ప్రిటోరియస్ సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్‌గా ఉంటారు. భారీ హిట్టర్లుగా పేరున్న వీరు టెస్ట్ ఫార్మాట్లో ఏమేరకు రాణిస్తారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సిరీస్ కోసం ఎంపిక చేసిన అన్క్యాప్డ్ ప్లేయర్ల జాబితాలో బ్రెవిస్, ప్రిటోరియస్తో పాటు లెసెగొ సెనొక్వానే (బ్యాటర్), కోడి యూసఫ్ (ఫాస్ట్ బౌలర్), ప్రెనెలన్ సుబ్రాయన్ (ఆఫ్ స్పిన్నర్) ఉన్నారు. స్పిన్నర్ జుబేర్ హంజా ఏడాది తర్వాత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు.డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ప్రస్తుతం ఇంగ్లండ్‌లో ఉన్న జట్టులోని ఎనిమిది మందికి (బవుమా, బెడింగ్హమ్, కార్బిన్ బాష్, జోర్జి, కేశవ్ మహారాజ్, ముల్దర్, ఎంగిడి, వెర్రిన్) మాత్రమే ఈ జట్టులో చోటు దక్కింది. జన్సెన్, రబాడ, మార్క్రమ్, రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్‌కు విశ్రాంతి కల్పించారు. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ 2023-25 ఫైనల్ జూన్ 11 నుంచి 15 వరకు లార్డ్స్ వేదికగా జరుగనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం సౌతాఫ్రికా జట్టు ఇదివరకే లండన్‌కు చేరుకుంది.జింబాబ్వేతో సిరీస్ షెడ్యూల్.. తొలి టెస్ట్-జూన్ 28-జులై 2 (బులవాయో)రెండో టెస్ట్-జులై 6-10 (బులవాయో)జింబాబ్వే సిరీస్‌కు దక్షిణాఫ్రికా టెస్టు జట్టు: టెంబా బవుమా (కెప్టెన్), డేవిడ్ బెడింగ్హమ్, మాథ్యూ బ్రీట్జ్కే, డెవాల్డ్ బ్రెవిస్, కార్బిన్ బాష్, టోనీ డి జోర్జి, జుబేర్ హంజా, కేశవ్ మహరాజ్, క్వేనా మఫాకా, వియాన్ ముల్డర్, లుంగి ఎంగిడి, లుహాన్-డ్రి-ప్రిటోరియస్, ప్రీటోరియస్, లెసెగొ సెనొక్వానే, ప్రెనెలన్ సుబ్రాయన్, కైల్ వెర్రిన్, కోడి యూసుఫ్. -
హెన్రిచ్ క్లాసెన్ షాకింగ్ నిర్ణయం
సౌతాఫ్రికా విధ్వంసకర ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. 33 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. క్లాసెన్ రిటైర్మెంట్ ప్రకటన క్రికెట్ ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసింది. క్లాసెన్ ఈజీగా మరో రెండు, మూడేళ్లు అంతర్జాతీయ కెరీర్‌ను కొనసాగించి ఉండవచ్చు. మరో విధ్వంసకర బ్యాటర్, ఆసీస్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన గంటల వ్యవధిలోనే క్లాసెన్ రిటైర్మెంట్ ప్రకటన రావడంతో వారివారి దేశ క్రికెట్ అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. మ్యాక్స్‌తో పోలిస్తే క్లాసెన్‌కు వయసు, ఫామ్ రెండూ ఉన్నాయి. పైగా 2027లో సౌతాఫ్రికాలో వన్డే వరల్డ్‌కప్ జరుగనుంది. క్లాసెన్ ఈ టోర్నీ ఆడతాడని ఆ దేశ అభిమానులు ఆశించి ఉంటారు. అయితే క్లాసెన్ షాకింగ్ నిర్ణయం తీసుకుని వారికి దుఖాన్ని మిగిల్చాడు. ఈ ఏడాది స్టార్ క్రికెటర్లు ఒక్కొక్కరుగా రిటైర్మెంట్ ప్రకటిస్తూ వస్తున్నారు. రోహిత్, కోహ్లి టెస్ట్‌లకు.. స్టీవ్ స్మిత్, మ్యాక్స్‌వెల్ వన్డేలకు.. తాజాగా క్లాసెన్ మూడు ఫార్మాట్లకు వీడ్కోలు పలికాడు.2018లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన క్లాసెన్.. సౌతాఫ్రికా తరఫున 4 టెస్ట్‌లు, 60 వన్డేలు, 58 టీ20లు ఆడాడు. ఇందులో 4 సెంచరీలు (వన్డేల్లో), 16 హాఫ్ సెంచరీల సాయంతో 3245 పరుగులు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినా క్లాసెన్ ఐపీఎల్ తదితర లీగ్‌ల్లో కొనసాగుతాడు. క్లాసెన్ ఇటీవలే ఐపీఎల్లో సెంచరీ బాది వార్తల్లో నిలిచాడు. కేకేఆర్‌తో జరిగిన తమ చివరి మ్యాచ్‌లో క్లాసెన్ కేవలం 39 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 105 (నాటౌట్) పరుగులు చేశాడు. క్లాసెన్‌కు ఐపీఎల్లో ఇది రెండో సెంచరీ. ఈ సీజన్లో 14 మ్యాచ్‌లు ఆడిన క్లాసెన్ 172.70 స్ట్రయిక్‌రేట్‌తో 487 పరుగులు చేశాడు. ఈ సీజన్లో క్లాసెన్ ప్రాతినిథ్యం వహించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ లీగ్ దశలోనే నిష్క్రమించింది. ఈ సీజన్ మెగా వేలానికి ముందు సన్‌రైజర్స్ యాజమాన్యం క్లాసెన్‌ను రీటైన్ చేసుకుంది. -
శ్వేతసౌధంలో మళ్లీ ‘పంచాయితీ’
అతిథుల్ని పిలిచి బహిరంగంగా వాగ్యుద్ధానికి దిగటం ఏ రకంగా దౌత్యనీతి అవుతుందో, దాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎక్కడ నేర్చారో ఎవరికీ తెలియదు. కానీ ఆయన దాన్ని కొనసాగించదల్చుకున్నారని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రాంఫోసాతో వైట్‌హౌస్‌లో తాజాగా సాగిన జగడం నిరూపిస్తోంది. మొన్న ఫిబ్రవరిలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ట్రంప్ ఇదే మాదిరి తగువు పెట్టుకున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న దురాక్రమణ యుద్ధంలో తప్పంతా ఉక్రెయిన్‌దే అన్నట్టు తేల్చి, దాన్ని వెంటనే నిలిపేయాలని ఒత్తిడి తెచ్చారు.అడుగడుగునా అవమా నిస్తూ మాట్లాడారు. మళ్లీ మూణ్ణెల్లకు అదే వైట్‌హౌస్‌లో ట్రంప్ ఆ డ్రామాకే తెరతీశారు. నిజానికి ఇరు దేశాల అధినేతలు కలుసుకుని చర్చించినాక వారిద్దరూ కలిసి మాట్లాడే మీడియా సంయుక్త సమావేశం లాంఛనప్రాయమైనది. నాలుగు గోడలమధ్యా నిర్మొహమాటంగా మాట్లాడుకున్నా, వాదులాడుకున్నా... మీడియా సమావేశంలో పరస్పరం ప్రశంసించుకోవటాలు, రెండు దేశాల మధ్యా కుదిరిన ఒప్పందాల విశిష్టతను అతిగా చూపించుకోవటాలు జరిగిపోతాయి. ఇందువల్లరెండు దేశాల్లోనూ అధినేతలకు ప్రశంసలు దక్కుతాయి. కానీ ఇలాంటివి ట్రంప్‌కు పట్టవు. ప్రపంచానికి తాను మకుటంలేని మహారాజునని, ఎవరినైనా ఏమైనా అనగలనని అమెరికా శ్వేతజాతి ఓటరు మహాశయులకు ఆయన చెప్పదల్చుకున్నారు.అందుకే అతిథులుగా వచ్చిన అధినేతలను కెమెరాల ముందు ఇష్టానుసారం మాట్లాడటం అల వాటు చేసుకున్నారు. పోనీ ఆయన నిలదీస్తున్న అంశాలు గొప్పవేమీ కాదు. వాటిల్లో చాలామటుకు నకిలీవీ... నిరాధారమైనవీ. సామాజిక మాధ్యమాల్లో ఎవరెవరో పెట్టే తప్పుడు పోస్టింగులే వాటికి ఆధారం. ఉక్రెయిన్‌లో దేశాధినేతను మార్చి, ఆయన ద్వారా రష్యాను చీకాకుపెట్టి చివరకు అది రెచ్చిపోయి దాడిచేసే స్థితి కల్పించింది అమెరికాయే. అటు తర్వాత రష్యాను ప్రపంచంలో ఏకాకిని చేయటానికి ప్రయత్నించి, ఉక్రెయిన్‌కు పెద్దయెత్తున ఆయుధాలు అమ్ముకున్నది అమెరికాయే. నాటో దేశాలను సైతం ఈ రొంపిలోకి దించింది కూడా ఆ దేశమే. జో బైడెన్ హయాంలో ఇవన్నీ జరిగినట్టు తెలిసినా, ట్రంప్ ఏమీ తెలియనట్టు నటించారు. ఉక్రెయిన్నే వేలెత్తి చూపారు. ఇప్పుడు రాంఫోసాతో సైతం అదే తరహాలో వ్యవహారం నడిపారు. దక్షిణాఫ్రికాలో శ్వేతజాతీయుల ఊచకోత సాగుతున్నదనీ, వాటిల్లో చాలాభాగం బయటకు రావటం లేదనీ ట్రంప్ వాదించారు. ఒకప్పటి శ్వేతజాతి పాలనలో నల్లజాతీయులపై అఘాయి త్యాలు జరిగాయని ఒప్పుకుంటూనే ఇప్పుడు నల్లజాతి పాలనలో శ్వేతజాతీయుల్ని ఆ మాదిరేహింసిస్తున్నారని చెప్పుకొచ్చారు. మీ వద్ద ఆధారాలున్నాయా అని రాంఫోసా అడిగితే, లేవని అంగీ కరిస్తూనే ట్రంప్ ఒక వీడియో ప్రదర్శించారు. అందులో నల్లజాతి వామపక్ష నాయకుడు జూలియస్ మలేమా ‘శ్వేతజాతి ఆఫ్రికన్లను హతమార్చండ’ంటూ నినాదాలిస్తున్న దృశ్యాలు కనబడ్డాయి. మొత్తం గంటసేపు జరిగిన ఈ మీడియా సమావేశంలో రాంఫోసా ఎక్కడా ఆవేశానికి పోకుండాఎంతో సంయమనంతో ట్రంప్‌కు జవాబిచ్చే ప్రయత్నం చేశారు. నిజానికి దక్షిణాఫ్రికాలో ఇప్పటికీ నాలుగింట మూడొంతుల వ్యవసాయ భూములు 8 శాతంకన్నా తక్కువ జనాభాగల శ్వేతజాతీయుల చేతుల్లో వున్నాయి. జనాభాలో 80 శాతంగా వున్న నల్లజాతీయులకు వ్యవసాయ భూముల్లో వాటా కేవలం 4 శాతం మాత్రమే. కానీ ట్రంప్ మాత్రం దక్షిణాఫ్రికా ప్రభుత్వం శ్వేతజాతీయుల భూముల్ని గుంజుకుని వాటిని నల్లజాతీయులకు పంచు తున్నదని ఆరోపించారు. శ్వేతజాతి దురహంకార పాలనలో నల్లజాతీయుల నుంచి అక్రమంగా చేజిక్కించుకున్న భూములు వెనక్కిప్పించాలని స్థానికులు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నా అక్కడి ప్రభుత్వం అంగీకరించటం లేదు. దానికి బదులు స్వచ్ఛందంగా అమ్మటానికి సిద్ధపడే శ్వేత జాతీయులకు పలు రాయితీలిస్తున్నది. శ్వేతజాతి రైతుల ఊచకోత సాగుతున్నదన్న ట్రంప్ వాదన కూడా పూర్తి అబద్ధం. నేరాల రేటు చూస్తే ప్రపంచంలోనే దక్షిణాఫ్రికా ముందుంది. అక్కడ సగటున రోజుకు 72 హత్యలు జరుగుతాయి. ఆరుకోట్ల జనాభాగల ఆ దేశంలో హతుల్లో అత్యధికులు నల్లజాతీయులు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం నిరుడు 26,232 మంది హత్యకు గురైతే అందులో కేవలం 8 మంది మాత్రమే శ్వేతజాతి రైతులు. వాస్తవాలు ఇవికాగా ట్రంప్ వైట్‌హౌస్ వేదికగా ఒక దేశాధినేతపై ప్రపంచమంతా చూస్తుండగా దబాయించటం ఎంత దారుణం! నిజానికి రెండు దేశాలూ చర్చించి పరిష్కరించుకోవాల్సినవి చాలావున్నాయి. శ్వేతజాతి రైతుల ఊచకోత ప్రచారాన్ని నమ్మటంతో బైడెన్ హయాంలోనే నిధులు ఆపేశారు. ట్రంప్ వచ్చాక 25 శాతం సుంకాల విధింపును ప్రకటించారు. ఆ దేశంలోని సహజ వనరులపై ట్రంప్ కన్నుపడింది. వీటిపై అర్థవంతమైన చర్చలు జరగకుండానే తప్పుడు ప్రచారంపై వాదులాట సాగింది. గాజాలో ఇజ్రాయెల్ సాగిస్తున్న ఊచ కోతపై ధైర్యంగా అంతర్జాతీయ న్యాయస్థానం తలుపుతట్టింది దక్షిణాఫ్రికాయే. రాంఫోసా అదృష్టం బాగుండి ట్రంప్‌కు ఆ సంగతి గుర్తురాలేదు. లేకుంటే మరింతగా విరుచుకుపడేవారు. వర్తమాన ప్రపంచంలో పలు దేశాధినేతలు తప్పుడు సమాచారాన్నీ, వదంతుల్నీ ప్రచారంలో పెట్టి అధికారంలోకొచ్చినవారే. ఈ ఎత్తుగడలే మరోసారి అందలం ఎక్కిస్తాయని... రాజ్యాంగాన్ని సవరించి మూడోసారి అధ్యక్షుడు కావాలని కలగంటున్న ట్రంప్ విశ్వసిస్తున్నారు. ఇలాంటపుడు అమెరికాలో అడుగుపెట్టడానికీ, ట్రంప్‌తో చీవాట్లు తినటానికీ ఏ దేశాధినేతయినా ధైర్యం చేయగలరా? -
IPL 2025: నేనైతే వెళ్లేవాడిని కాదు.. మీరూ వెళ్లొద్దు: ఆసీస్ మాజీ క్రికెటర్
ఐపీఎల్-2025 (IPL 2025) ప్లే ఆఫ్స్ దశకు చేరుకున్న వేళ అనుకోని విధంగా వారం పాటు వాయిదా పడింది. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే, ప్రస్తుతం పరిస్థితులు చక్కబడటంతో లీగ్‌ను పునఃప్రారంభించేందుకు బోర్డు సిద్ధమైంది.కొందరు వచ్చేశారుఇప్పటికే పది ఫ్రాంఛైజీలకు తమ ఆటగాళ్లందరినీ ఒకే చోట చేర్చాల్సిందిగా ఆదేశించిన బోర్డు.. శనివారం (మే 17) నుంచి మ్యాచ్‌లు కొనసాగించనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కొంత మంది విదేశీ ఆటగాళ్లు భారత్‌కు చేరుకోగా.. మరికొంత మంది జాతీయ జట్టు విధుల దృష్ట్యా స్వదేశాల్లోనే ఉండిపోయారు.ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మిచెల్ జాన్సన్ ఐపీఎల్ ఆడే విదేశీ ఆటగాళ్లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ‘‘ఐపీఎల్ ఆడేందుకు తిరిగి ఇండియాకు వెళ్లాలా వద్దా అనే నిర్ణయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా ఆటగాళ్లకే వదిలివేసింది.నేనైతే ‘నో’ చెప్పేవాడినినిజానికి మధ్యలోనే ఇలా లీగ్‌ను వదిలివేయడం నిరాశకు గురిచేస్తుంది. ప్రొఫెషనల్‌గా, ఆర్థికంగా ఒక్కోసారి ఎదురుదెబ్బలు తగులుతాయి. అయితే, అన్నింటికంటే భద్రతే ముఖ్యం. ఒకవేళ నేనే గనుక వారి స్థానంలో ఉండి ఉంటే.. ఇండియాకు వెళ్లి లీగ్ పూర్తి చేయాలని ఆదేశించినా.. కచ్చితంగా ‘నో’ చెప్పేవాడిని.ఎందుకంటే నా వరకు చెక్కుల కంటే కూడా ప్రాణాలు ముఖ్యమైనవి. అయితే, ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. ఐపీఎల్ ఒక్కటనే కాదు.. పాకిస్తాన్ సూపర్ లీగ్ ఆడేందుకు కూడా ఆటగాళ్లు అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదనే నేను భావిస్తున్నా’’ అని మిచెల్ జాన్సన్ ది వెస్ట్రన్ ఆస్ట్రేలియన్‌కు రాసిన కాలమ్‌లో పేర్కొన్నాడు.సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు ఓప్పుకోవడానికి కారణం అదేఅదే విధంగా.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్-2025 ఫైనల్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘జూన్ 3న ఐపీఎల్ ఫైనల్ జరుగుతుంది. ఆ తర్వాత వారం రోజులకే లార్డ్స్‌లో డబ్ల్యూటీసీ ఫైనల్ ఉంది. కాబట్టి ఈ మెగా మ్యాచ్‌కు సన్నద్ధమయ్యే క్రమంలో ఆటగాళ్లపై తీవ్రమైన ఒత్తిడి నెలకొంటుంది’’ అని మిచెల్ జాన్సన్ పేర్కొన్నాడు.అయితే, బీసీసీఐతో సౌతాఫ్రికా క్రికెట్ బోర్డుకు ఉన్న ఆర్థిక సంబంధాల దృష్ట్యా ప్రొటిస్ ఆటగాళ్లంతా తిరిగి ఐపీఎల్లో పాల్గొంటారని జాన్సన్ అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్ ఫ్రాంఛైజీల సారథ్యంలోనే సౌతాఫ్రికా టీ20 లీగ్ జరుగుతున్న విషయం తెలిసిందే.రిక్కీ పాంటింగ్ ఉండటమే కాదు.. వాళ్లనూ ఒప్పించాడుఇదిలా ఉంటే.. ధర్మశాలలో పంజాబ్ కింగ్స్- ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ అర్ధంతరంగా ఆగిపోయిన విషయం తెలిసిందే. పాక్ దుశ్చర్యలను తిప్పికొట్టేందుకు భారత్ అక్కడ బ్లాక్ అవుట్ (విద్యుత్ సరఫరా నిలిపివేయడం) ప్రకటించడంతో స్టేడియం కూడా చీకటైపోయింది.ఈ క్రమంలో ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులను సురక్షితంగా అక్కడి నుంచి తరలించింది బీసీసీఐ. అంతేకాదు.. వందే భారత్ రైలులో అత్యంత భద్రత నడుమ పంజాబ్, ఢిల్లీ ఆటగాళ్లను ఢిల్లీకి చేర్చింది. ఈ నేపథ్యంలో కాస్త భయాందోళనకు లోనైనప్పటికీ.. భారత్‌లోనే ఉండిపోవాలని పంజాబ్ కింగ్స్ హెడ్‌కోచ్, ఆసీస్ దిగ్గజ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ నిర్ణయించుకున్నాడు. బీసీసీఐ చేసిన ఏర్పాట్లు, భారత ప్రభుత్వం తీసుకున్న రక్షణ చర్యల నేపథ్యంలో ఆటగాళ్లను కూడా ఇందుకు ఒప్పించాడు. అయితే, మిచెల్ జాన్సన్ మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించాడు. కాగా ముంబై ఇండియన్స్ తరఫున రెండుసార్లు (2013, 2017) ఐపీఎల్ గెలిచిన జట్టులో జాన్సన్ సభ్యుడు. చదవండి: మాట తప్పారు!.. ఆర్సీబీకి తిరిగి ఆడాలని అనుకోలేదు: పాటిదార్ఐపీఎల్ 2025 పునఃప్రారంభం.. ఎవరు తిరిగొస్తున్నారు.. ఎవరు రావడం లేదు..? -
IPL 2025 Resumption: ఆ దేశ ఆటగాళ్లు లీగ్ పూర్తయ్యే వరకు అందుబాటులో ఉంటారు..!
ఐపీఎల్ 2025 విషయంలో క్రికెట్ సౌతాఫ్రికా (CSA) యూ టర్న్ తీసుకున్నట్లు తెలుస్తుంది. తొలుత తమ ఆటగాళ్లు ప్లే ఆఫ్స్‌కు అందుబాటులో ఉండరని (డబ్ల్యూటీసీ ఫైనల్ సన్నాహకాల కోసం) ప్రకటించిన ఆ క్రికెట్ బోర్డు, తాజాగా మనసు మార్చుకున్నట్లు సమాచారం. లీగ్ పూర్తయ్యే వరకు (జూన్ 3) వారి ఆటగాళ్లు సంబంధిత ఫ్రాంచైజీలతో ఉండేందుకు క్రికెట్ సౌతాఫ్రికా అంగీకరించినట్లు ఐపీఎల్ వర్గాలు అంటున్నాయి.ఈ ప్రచారం నిజమైతే ఫ్రాంచైజీలకు సగం టెన్షన్ వదిలినట్లే. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో 20 మంది సౌతాఫ్రికా ఆటగాళ్లు వివిధ జట్లకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వీరిలో 8 మంది డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ ఎనిమిది మందిలో ఆరుగురు (కార్బిన్ బాష్, జన్సెన్, ఎంగిడి, రబాడ, రికెల్టన్, స్టబ్స్) ప్రాతినిథ్యం వహిస్తున్న ఫ్రాంచైజీలు ప్లే ఆఫ్స్‌లో ముందున్నాయి. ఈ ఆరుగురు ప్లే ఆఫ్స్‌కు అందుబాటులో ఉండకపోతే సంబంధిత ఫ్రాంచైజీలు భారీగా నష్టపోతాయి.చక్రం తిప్పిన ఫ్రాంచైజీ యజమానులుక్రికెట్ సౌతాఫ్రికా ఆథ్వర్యంలో నడిచే సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో మొత్తం ఆరు ఫ్రాంచైజీలు ఉన్నాయి. ఈ ఆరు ఫ్రాంచైజీలను ఐపీఎల్ ఫ్రాంచైజీల యాజమాన్యాలే నడిపిస్తున్నాయి. తాజా పరిస్థితి నేపథ్యంలో ప్లే ఆఫ్స్ రేసులో ముందున్న ఫ్రాంచైజీల యాజమాన్యాలు చక్రం తిప్పాయి. వారు క్రికెట్ సౌతాఫ్రికాతో మాటామంతి జరిపి ఆ దేశ ఆటగాళ్లను ప్లే ఆఫ్స్ పూర్తయ్యే వరకు కొనసాగేందుకు ఒప్పించినట్లు తెలుస్తుంది.కాగా, రీ షెడ్యూల్ ప్రకారం ఐపీఎల్ ఫైనల్ ముగిసిన వారం రోజుల్లోనే సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్ జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే క్రికెట్ సౌతాఫ్రికా తమ ఆటగాళ్లను ముందుగా అనుకున్నట్లు మే 26వ తేదీలోగా స్వదేశానికి తిరిగి రావాలని కోరింది. అయితే ఐపీఎల్ ఫ్రాంచైజీల యాజమాన్యాలు చక్రం తిప్పడంతో క్రికెట్ సౌతాఫ్రికా తమ సన్నాహకలను (డబ్ల్యూటీసీ ఫైనల్) వాయిదా వేసుకుంది. జూన్ 3 తర్వాతే వాటి షెడ్యూల్‌ను ప్లాస్ చేసుకుంది.ప్లే ఆఫ్స్ రేసులో ముందున్న ఫ్రాంచైజీలకు చెందిన సౌతాఫ్రికా ఆటగాళ్లు (డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఎంపికైన వారు)..కార్బిన్ బాష్ (ముంబై ఇండియన్స్)మార్కో జన్సెన్ (పంజాబ్ కింగ్స్)లుంగి ఎంగిడి (ఆర్సీబీ)కగిసో రబాడ (గుజరాత్)ర్యాన్ రికెల్టన్ (ముంబై)ట్రిస్టన్ స్టబ్స్ (ఢిల్లీ)డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం సౌతాఫ్రికా జట్టు: టెంబా బావుమా (కెప్టెన్), ఎయిడెన్ మార్క్రమ్, లుంగి ఎంగిడి, టోనీ డి జోర్జి, డేవిడ్ బెడింగ్హమ్, కేశవ్ మహరాజ్, ట్రిస్టన్ స్టబ్స్, కార్బిన్ బాష్, సెనురన్ ముత్తుసామి, మార్కో జన్సెన్, కగిసో రబడ, కైల్ వెర్రెయిన్, డేన్ ప్యాటర్సన్, వియాన్ ముల్డర్, ర్యాన్ రికెల్టన్. -
IPL 2025: మే 26లోగా తిరిగి రండి.. సౌతాఫ్రికా ప్లేయర్లకు వార్నింగ్..!
ముందుగా అనుకున్నట్లుగా మే 26 తేదీలోగా స్వదేశానికి తిరిగి రావాలని ఐపీఎల్-2025 ఆడుతున్న తమ ఆటగాళ్లకు (డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఎంపికైన వారికి) క్రికెట్ సౌతాఫ్రికా వార్నింగ్ ఇచ్చింది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో 20 మంది సౌతాఫ్రికా ఆటగాళ్లు వివిధ జట్లకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వీరిలో 8 మందికి డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఎంపిక చేసిన సౌతాఫ్రికా జట్టులో చోటు దక్కింది.ఈ ఎనిమిది మంది విషయంలోనే క్రికెట్ సౌతాఫ్రికా, ఐపీఎల్ ఫ్రాంచైజీల మధ్య పేచీ పడేలా ఉంది. సంబంధిత ఫ్రాంచైజీలు క్రికెట్ సౌతాఫ్రికాతో చర్చలు జరుపుతున్నా వారు ససేమిరా అంటున్నట్లు తెలుస్తుంది. ఆటగాళ్లకు లీగ్ కంటే దేశమే ముఖ్యం కావాలని సౌతాఫ్రికా హెడ్ కోచ్ షుక్రి కాన్రాడ్ భావోద్వేగంతో పిలుపునిచ్చాడు. సదరు 8 మంది సౌతాఫ్రికా ప్లేయర్ల నిర్ణయంపై వారి ఫ్రాంచైజీల భవితవ్యం ఆధారపడి ఉంది.డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఎంపికైన 8 మంది సౌతాఫ్రికా ఆటగాళ్లు (ఐపీఎల్ ఆడుతున్న వారు)..కార్బిన్ బాష్ (ముంబై ఇండియన్స్)మార్కో జన్సెన్ (పంజాబ్ కింగ్స్)లుంగి ఎంగిడి (ఆర్సీబీ)కగిసో రబాడ (గుజరాత్)ర్యాన్ రికెల్టన్ (ముంబై)ట్రిస్టన్ స్టబ్స్ (ఢిల్లీ)ఎయిడెన్ మార్క్రమ్ (లక్నో)వియాన్ ముల్దర్ (ఎస్ఆర్హెచ్)పైనున్న ఆటగాళ్లలో ఐదుగురు (కార్బిన్ బాష్, జన్సెన్, ఎంగిడి, రబాడ, రికెల్టన్) సంబంధిత ఫ్రాంచైజీలకు ప్లే ఆఫ్స్‌లో కీలకమవుతారు. వీరు అందుబాటులో లేకపోతే వారి జట్ల విజయావకాశాలు ఖచ్చితంగా ప్రభావితమవుతాయి. మిగతా ముగ్గురు (స్టబ్స్, మార్క్రమ్, ముల్దర్) ఆటగాళ్లలో ఒకరి (ముల్దర్) జట్టు ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఇదివరకే నిష్క్రమించడంతో ఎలాంటి ఇబ్బంది లేదు. మరో ఇద్దరి (స్టబ్స్, మార్క్రమ్) జట్లు ప్లే ఆఫ్స్ బెర్త్ కోసం లైన్లో ఉన్నాయి. క్రికెట్ సౌతాఫ్రికా, బీసీసీఐ మధ్య ముందస్తు అగ్రిమెంట్ ప్రకారం.. మే 25న ఐపీఎల్ ఫైనల్ ముగిస్తే, ఆ మరుసటి రోజే (మే 26) సౌతాఫ్రికా ఆటగాళ్లంతా స్వదేశానికి బయల్దేరాలి. అనంతరం మే 30న డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఎంపికైన సౌతాఫ్రికా జట్టు ఇంగ్లండ్‌కు బయల్దేరాలి. అక్కడు జూన్ 3 నుంచి 6వ తేదీ వరకు జింబాబ్వేతో వార్మప్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. జూన్ 7న డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం లండన్‌కు బయల్దేరాలి. ఐపీఎల్ 2025 ముందస్తు షెడ్యూల్ ప్రకారం సౌతాఫ్రికా జట్టు ప్రణాళిక ఇది.అయితే భారత్, పాక్ మధ్య యుద్దం కారణంగా ఐపీఎల్ 2025 వారం రోజులు వాయిదా పడింది. దీంతో సీన్ మొత్తం మారిపోయింది. ఐపీఎల్ రివైజ్డ్ షెడ్యూల్‌కు (జూన్ 3) డబ్ల్యూటీసీ ఫైనల్‌కు (జూన్ 11) కేవలం వారం రోజుల గ్యాప్ మాత్రమే ఉంది. దీని వల్ల డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధించిన ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. ఆటగాళ్లు ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌ల వరకు మాత్రమే అందుబాటులో ఉండే పరిస్థితి ఏర్పడింది. డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం సౌతాఫ్రికా జట్టు: టెంబా బావుమా (కెప్టెన్), ఎయిడెన్ మార్క్రమ్, లుంగి ఎంగిడి, టోనీ డి జోర్జి, డేవిడ్ బెడింగ్హమ్, కేశవ్ మహరాజ్, ట్రిస్టన్ స్టబ్స్, కార్బిన్ బాష్, సెనురన్ ముత్తుసామి, మార్కో జన్సెన్, కగిసో రబడ, కైల్ వెర్రెయిన్, డేన్ ప్యాటర్సన్, వియాన్ ముల్డర్, ర్యాన్ రికెల్టన్.డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఎంపిక కాని మిగతా సౌతాఫ్రికా ఆటగాళ్లు (ఐపీఎల్ ఆడుతున్న వారు)..డెవాల్డ్ బ్రెవిస్ (చెన్నై సూపర్ కింగ్స్), ఫాఫ్ డుప్లెసిస్, డోనోవన్ ఫెరీరా (ఢిల్లీ క్యాపిటల్స్), గెరాల్డ్ కోట్జీ (గుజరాత్ టైటాన్స్), క్వింటన్ డికాక్, అన్రిచ్ నోర్ట్జే (కోల్‌కతా నైట్ రైడర్స్), డేవిడ్ మిల్లర్, మాథ్యూ బ్రీట్జ్కే (లక్నో), నండ్రే బర్గర్, క్వేనా మఫాకా, డ్రే ప్రిటోరియస్ (రాజస్థాన్ రాయల్స్), హెన్రిచ్ క్లాసెన్ (సన్‌రైజర్స్ హైదరాబాద్) -
డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం సౌతాఫ్రికా జట్టు ప్రకటన.. ఐపీఎల్ జట్లకు భారీ షాక్
జూన్ 11 నుంచి లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగే డబ్ల్యూటీసీ 2023-25 ఫైనల్ కోసం 15 మంది సభ్యుల సౌతాఫ్రికా జట్టును ఇవాళ (మే 13) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా టెంబా బవుమా వ్యవహరించనున్నాడు. ఈ జట్టులో ఏకంగా ఆరుగురు పేసర్లకు (కగిసో రబాడ, లుంగి ఎంగిడి, మార్కో జన్సెన్, వియన్ ముల్దర్, డేన్ ప్యాటర్సన్, కార్బిన్ బాష్) చోటు దక్కింది. లార్డ్స్ పిచ్ పేసర్లకు అనుకూలంగా ఉండనుండటంతో సౌతాఫ్రికా సెలక్టర్లు ఈ మేరకు నిర్ణయించారు.పేస్ దళంతో పోలిస్తే సౌతాఫ్రికా బ్యాటింగ్ విభాగం కాస్త బలహీనంగా కనిపిస్తుంది. ఆ జట్టులో బవుమా, మార్క్రమ్ మినహా అనుభవజ్ఞులైన బ్యాటర్లు లేరు. రికెల్టన్, స్టబ్స్, డేవిడ్ బెడింగ్హమ్ లాంటి పరిమిత ఓవర్ల స్టార్లు ఉన్నా టెస్ట్‌ల్లో వారు ఏ మేరకు రాణించగలరో చూడాలి.TEMBA BAVUMA ANNOUCING SOUTH AFRICA SQUAD FOR WTC FINAL. 🥶🔥 pic.twitter.com/uZbtbcxAGn— Johns. (@CricCrazyJohns) May 13, 2025డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం సౌతాఫ్రికా జట్టు: టెంబా బావుమా (కెప్టెన్), ఎయిడెన్ మార్క్రమ్, లుంగి ఎంగిడి, టోనీ డి జోర్జి, డేవిడ్ బెడింగ్హమ్, కేశవ్ మహరాజ్, ట్రిస్టన్ స్టబ్స్, కార్బిన్ బాష్, సెనురన్ ముత్తుసామి, మార్కో జన్సెన్, కగిసో రబడ, కైల్ వెర్రెయిన్, డేన్ ప్యాటర్సన్, వియాన్ ముల్డర్, ర్యాన్ రికెల్టన్.కాగా, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో సౌతాఫ్రికాకు ఇదే తొలి ఫైనల్. 1998 ఐసీసీ నాకౌట్ ట్రోఫీ తర్వాత ఆ జట్టు ఇప్పటివరకు ఒక్క ఐసీసీ టైటిల్ కూడా గెలవలేదు. మరోవైపు ఫైనల్లో సౌతాఫ్రికా ఎదుర్కోబోయే ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీలో డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉంది. ఆ జట్టు గత ఎడిషన్ (2021-23) ఫైనల్లో భారత్‌పై విజయం సాధించి ఛాంపియన్‌గా అవతరించింది. ఆస్ట్రేలియా కూడా ఇవాళే జట్టును ప్రకటించింది. ఆసీస్ జట్టుకు సారధిగా పాట్ కమిన్స్ వ్యవహరించనున్నాడు. ఆల్‌రౌండర్ కెమారూన్ గ్రీన్ చాలా కాలం తర్వాత ఆసీస్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు.డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్, స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ, కెమారూన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రవిస్ హెడ్, జోస్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖ్వాజా, సామ్ కొన్‌స్టాస్, మ్యాట్ కుహ్నేమన్, మార్నస్ లబూషేన్, నాథన్ లియోన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, బ్యూ వెబ్స్టర్ట్రావెలింగ్ రిజర్వ్: బ్రెండన్ డాగెట్ఐపీఎల్ జట్టుకు షాక్డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఇవాళ ప్రకటించిన ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లలో 13 మంది ఐపీఎల్ స్టార్లు చోటు దక్కించుకున్నారు. వీరిలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఐదుగురు కాగా.. సౌతాఫ్రికాకు చెందిన వారు ఎనిమిది మంది. ఐపీఎల్ 2025 పూర్తైన వారం రోజులకే డబ్ల్యూటీసీ ఫైనల్ మొదలు కానుండటంతో ఈ 13 మంది ఆటగాళ్లు క్యాష్ రిచ్ లీగ్‌కు ఏమేరకు అందుబాటులో ఉంటారో అన్నది ప్రశ్నార్థకంగా మారింది.డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఎంపికైన ఐపీఎల్ 2025 స్టార్లు..ఆసీస్ ఆటగాళ్లు..పాట్ కమిన్స్ (ఎస్ఆర్హెచ్)ట్రవిస్ హెడ్ (ఎస్ఆర్హెచ్)జోష్ హాజిల్‌వుడ్ (ఆర్సీబీ)జోస్ ఇంగ్లిస్ (పంజాబ్)మిచెల్ స్టార్క్ (ఢిల్లీ)సౌతాఫ్రికా ఆటగాళ్లు..మార్క్రమ్ (లక్నో)ఎంగిడి (ఆర్సీబీ)స్టబ్స్ (ఢిల్లీ)కార్బిన్ బాష్ (ముంబై ఇండియన్స్)ర్యాన్ రికెల్టన్ (ముంబై ఇండియన్స్)జన్సెన్ (పంజాబ్)రబాడ (గుజరాత్)ముల్దర్ (ఎస్ఆర్హెచ్) -
సౌతాఫ్రికా ఆల్ ఫార్మాట్ కోచ్‌గా షుక్రి కాన్రాడ్
సౌతాఫ్రికా సీనియర్ పురుషుల క్రికెట్ జట్టు ఆల్ ఫార్మాట్ హెడ్ కోచ్‌గా షుక్రి కాన్రాడ్ నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని క్రికెట్ సౌతాఫ్రికా ఇవాళ (మే 9) ప్రకటించింది. కాన్రాడ్ 2023 నుంచి సౌతాఫ్రికా టెస్ట్ హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. తాజాగా అతనికి పరిమిత ఓవర్ల ఫార్మాట్ల పగ్గాలు కూడా అప్పజెప్పారు. ఏప్రిల్ వరకు సౌతాఫ్రికా పరిమిత ఓవర్ల జట్లకు హెడ్ కోచ్‌గా రాబ్ వాల్టర్ ఉండేవాడు. వాల్టర్ తన పదవీకాలం ముగియండతో రాజీనామా చేశాడు. ఆల్ ఫార్మాట్ హెడ్ కోచ్‌గా కాన్రాడ్ 2027 వన్డే వరల్డ్‌కప్ వరకు కొనసాగుతాడు. ఆ ఏడాది వరల్డ్‌కప్‌కు సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా ఆతిథ్యమివ్వనున్నాయి. కాన్రాడ్ ఆథ్వర్యంలో సౌతాఫ్రికా టెస్ట్ జట్టు ఈ దఫా (2023-25) డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరింది. వచ్చే నెలలో లార్డ్స్‌లో జరుగబోయే ఫైనల్లో సౌతాఫ్రికా ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది. ఆల్ ఫార్మాట్ కోచ్‌గా నియమితుడు కావడంపై కాన్రాడ్ సంతోషం వ్యక్తం చేశాడు.58 ఏళ్ల కాన్రాడ్ సౌతాఫ్రికా జాతీయ జట్టు తరఫున ఎలాంటి మ్యాచ్‌లు ఆడనప్పటికీ.. కోచింగ్‌లో అతనికి మంచి అనుభవం ఉంది. కాన్రాడ్ దేశవాలీ క్రికెట్లో వెస్ట్రన్ ఫ్రావిన్స్‌కు ఆడేవాడు. 1985-91 మధ్య కాలంలో అతను 9 మ్యాచ్‌లు ఆడి 324 పరుగులు, 13 వికెట్లు తీశాడు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం చాలా మంది సౌతాఫ్రికా ఆటగాళ్లు ఐపీఎల్ కోసం భారత్‌లో ఉన్నారు. అయితే క్యాష్ రిచ్ లీగ్ రద్దు కావడంతో (భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్తతల కారణంగా) అంతా స్వదేశానికి తిరుగు ముఖం పట్టారు. -
‘శత’క్కొట్టిన జెమీమా
కొలంబో: ముక్కోణపు మహిళల వన్డే క్రికెట్ టోర్నమెంట్లో భారత జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన నాలుగో లీగ్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం 23 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. మూడు జట్ల మధ్య డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో ఈ టోర్నీ జరుగుతోంది. భారత జట్టు తమ నాలుగు మ్యాచ్‌లను పూర్తి చేసుకుంది. మూడు మ్యాచ్‌ల్లో గెలిచి ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు దక్షిణాఫ్రికా జట్టు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయి ఫైనల్‌కు దూరమైంది. భారత్ చేతిలో దక్షిణాఫ్రికా ఓడిపోవడంతో ఆతిథ్య శ్రీలంక జట్టు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. శుక్రవారం జరిగే నామమాత్రమైన చివరి లీగ్ మ్యాచ్‌లో శ్రీలంక, దక్షిణాఫ్రికా తలపడతాయి. భారత్, శ్రీలంక జట్ల మధ్య టైటిల్ పోరు ఆదివారం జరుగుతుంది. ఫైనల్ బెర్త్ లక్ష్యంగా దక్షిణాఫ్రికాతో పోరు ప్రారంభించిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 337 పరుగుల భారీ స్కోరు సాధించింది. జెమీమా రోడ్రిగ్స్ (101 బంతుల్లో 123; 15 ఫోర్లు, 1 సిక్స్) సఫారీ బౌలర్ల భరతం పట్టి కెరీర్లో రెండో సెంచరీ సాధించింది.ఓపెనర్ స్మృతి మంధాన (63 బంతుల్లో 51; 6 ఫోర్లు) కెరీర్లో 31వ అర్ధ సెంచరీ నమోదు చేసుకోగా... దీప్తి శర్మ (84 బంతుల్లో 93; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడి త్రుటిలో శతకాన్ని చేజార్చుకుంది. అనంతరం దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 314 పరుగులు చేసి ఓడిపోయింది. అనెరి డెరెక్సన్ (80 బంతుల్లో 81; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), చోల్ ట్రయాన్ (43 బంతుల్లో 67; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధ సెంచరీలతో రాణించినా ఫలితం లేకపోయింది. గాయం కారణంగా దక్షిణాఫ్రికా రెగ్యులర్ కెపె్టన్ లౌరా వొల్వార్ట్ ఈ మ్యాచ్‌కు దూరంకాగా... చోల్ ట్రయాన్ సారథిగా వ్యవహరించింది. ఈ మ్యాచ్‌తో శుచి ఉపాధ్యాయ్ (భారత్), మియాని స్మిట్ (దక్షిణాఫ్రికా) అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశారు. 122 పరుగుల భాగస్వామ్యం ఫైనల్ బెర్త్ లక్ష్యంగా బరిలోకి దిగిన భారత్‌కు శుభారంభం లభించలేదు. ప్రతీక (1), హర్లీన్ డియోల్ (4), హర్మన్‌ప్రీత్ కౌర్ (20 బంతుల్లో 28; 6 ఫోర్లు) తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. ఈ దశలో స్మృతి, జెమీమా మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. నాలుగో వికెట్‌కు 88 పరుగులు జోడించారు. స్మృతి అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న వెంటనే అవుటవ్వగా... జెమీమాతో దీప్తి శర్మ జత కలిసింది. వీరిద్దరూ దూకుడుగా ఆడటంతో భారత స్కోరు బోర్డులో వేగం పెరిగింది. ఈ క్రమంలో జెమీమా శతకం పూర్తి చేసుకుంది. ఐదో వికెట్‌కు వీరిద్దరూ 122 పరుగుల భాగస్వామ్యం జోడించాక జెమీమా పెవిలియన్ చేరుకుంది. వన్డేల్లో ఐదో వికెట్‌కు భారత్‌కిదే అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. గతంలో ఈ రికార్డు మిథాలీ రాజ్–వేద కృష్ణమూర్తి (108 పరుగులు) పేరిట ఉండేది. జెమీమా అవుటయ్యాక దీప్తి శర్మ మరింత దూకుడు పెంచడంతో భారత స్కోరు 300 పరుగులు దాటింది. ఏడు పరుగుల తేడాతో దీప్తి శర్మ సెంచరీని కోల్పోయింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోవడంతో ఏ దశలోనూ విజయంపై ఆశలు రేకెత్తించలేదు. డెరెక్సన్, ట్రయాన్ మెరిపించినా దక్షిణాఫ్రికా విజయానికి సరిపోలేదు. భారత బౌలర్లలో అమన్‌జోత్ కౌర్ మూడు వికెట్లు పడగొట్టింది. జెమీమా రోడ్రిగ్స్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: ప్రతీక రావల్ (సి) డెరెక్సన్ (బి) డి క్లెర్క్ 1; స్మృతి మంధాన (సి) డి క్లెర్క్ (బి) ట్రయాన్ 51; హర్లీన్ డియోల్ (బి) క్లాస్ 4; హర్మన్‌ప్రీత్ కౌర్ (సి) షాంగేస్ (బి) డెరెక్సన్ 28; జెమీమా రోడ్రిగ్స్ (సి) సునె లుస్ (బి) క్లాస్ 123; దీప్తి శర్మ (సి) ట్రయాన్ (బి) డి క్లెర్క్ 93; రిచా ఘోష్ (సి) బ్రిట్స్ (బి) మలాబా 20; అమన్‌జోత్ కౌర్ (సి) స్మిట్ (బి) మలాబా 5; శ్రీ చరణి (రనౌట్) 6; స్నేహ్ రాణా (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 337. వికెట్ల పతనం: 1–9, 2–18, 3–50, 4–138, 5–260, 6–296, 7–314, 8–336, 9–337. బౌలింగ్: మసబటా క్లాస్ 8–0–51–2, నదినె డి క్లెర్క్ 9–0–54–2, అనెరి డెరెక్సన్ 6–0–36–1, మలాబా 8–0–71–2, షాంగేస్ 6–0–43–0, చోల్ ట్రయాన్ 8–0–46–1, సునె లుస్ 3–0–15–0, మియాని స్మిట్ 2–0–20–0. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: లారా గుడాల్ (సి) రిచా ఘోష్ (బి) అమన్‌జోత్ కౌర్ 4; తజ్మీన్ బ్రిట్స్ (సి) జెమీమా (బి) అమన్‌జోత్ కౌర్ 26; మియాని సిŠమ్ట్ (బి) దీప్తి శర్మ 39; అనెరి డెరెక్సన్ (బి) అమన్‌జోత్ కౌర్ 81; షాంగేస్ (సి) హర్లీన్ డియోల్ (బి) ప్రతీక రావల్ 36; సినాలో జాఫ్టా (ఎల్బీడబ్ల్యూ) (బి) శ్రీ చరణి 21; చోల్ ట్రయాన్ (బి) దీప్తి శర్మ 67; నదినె డి క్లెర్క్ (నాటౌట్) 22; సునె లుస్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 314. వికెట్ల పతనం: 1–7, 2–70, 3–89, 4–159, 5–188, 6–260, 7–311. బౌలింగ్: స్నేహ్ రాణా 7–1–53–0, అమన్‌జోత్ కౌర్ 9–0–59–3, శ్రీ చరణి 10–0–58–1, శుచి ఉపాధ్యాయ్ 9–0–59–0, దీప్తి శర్మ 10–0–57–2, ప్రతీక రావల్ 3–0–15–1, స్మృతి మంధాన 2–0–12–0. -
టీమిండియా భారీ టార్గెట్.. వీరోచితంగా పోరాడిన సౌతాఫ్రికా
శ్రీలంకలో జరుగుతున్న మహిళల ట్రై నేషన్ సిరీస్‌లో ఇవాళ (మే 7) భారత్, సౌతాఫ్రికా జట్లు తలపడ్డాయి. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ 23 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. జెమీమా రోడ్రిగెజ్ (123) శతక్కొట్టడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 337 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత ఇన్నింగ్స్‌లో జెమీమాతో పాటు స్మృతి మంధన (51), దీప్తి శర్మ (93) కూడా సత్తా చాటారు. దీప్తి 7 పరుగులతో సెంచరీని కోల్పోయింది.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికా చివరి వరకు వీరోచితంగా పోరాడినప్పటికీ గెలవలేకపోయింది. అన్నెరీ డెర్క్సన్ (81), కెప్టెన్ క్లో ట్రయాన్ (67) సౌతాఫ్రికాను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 7 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేయగలిగింది. భారీ లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా ఆటగాళ్లు పోరాడిన తీరు అభిమానులను ఆకట్టుకుంది. భారత బౌలర్లలో అమన్‌జోత్ కౌర్ 3, దీప్తి శర్మ 2, శ్రీ చరణి, ప్రతిక రావల్ తలో వికెట్ తీశారు. ఫైనల్ రేసులో నిలవాలంటే సౌతాఫ్రికా ఈ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాల్సి ఉండింది. ఈ ఓటమితో సౌతాఫ్రికా టోర్నీ నుంచి నిష్క్రమించింది. భారత్, శ్రీలంక ఫైనల్‌కు చేరుకున్నాయి. మే 11న కొలొంబో వేదికగా ఫైనల్ జరుగుతుంది. అంతకుముందు సౌతాఫ్రికా మే 9న శ్రీలంకతో నామమాత్రపు మ్యాచ్ ఆడనుంది.ఈ టోర్నీలో సౌతాఫ్రికా ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. భారత్ నాలుగింట మూడు గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా.. శ్రీలంక మూడింట రెండు గెలిచి రెండో స్థానంలో ఉంది. -
మెగా గుమ్మడి!
దక్షిణాఫ్రికాలోని కల్లినన్ ప్రాంత రైతు సంఘం ప్రతి ఏటా గుమ్మడికాయల పోటీ పెడుతుంటుంది. కార్నెలి బెస్టర్ అనే రైతు ఈ ఏడాది 445 కిలోల గుమ్మడి ఫస్ట్ ప్రైజ్ గెల్చుకున్నారు. ఈ అవార్డు ఆయనకు కొత్త కాదు. గత ఏడాది ఏకంగా 730 కిలోల గుమ్మడితో ఆయనే ఫస్ట్ ప్రైజ్ గెల్చుకోవటం విశేషం. ఏడాదిలో అతిపెద్ద గుమ్మడి సైజు అంత ఎందుకు తగ్గిందో తెలీదు. బహుశా భూతాపోన్నతి కావచ్చు. అదలా ఉంచితే, 2023లో ఇంకా బరువైన గుమ్మడి కాయను పండించిన వైకస్ లాంప్రెచ్ట్ విజేతగా నిలిచారు. ఆయన గుమ్మడి కాయ బరువెంతో తెలిస్తే మరింత ఆశ్చర్యం కలుగుతుంది.. 890 కిలోలు! వ్యవసాయం పట్ట మక్కువను పెంపొందించే లక్ష్యం తోపాటు నిధుల సమీకరణ కోసం కల్లినన్ రైతు సంఘం ఈ వార్షిక ΄ోటీలు పెడుతుంటుంది. అట్లాంటిక్ జెయింట్ గుమ్మడితో సంకపరచిన వంగడంతో సాగు చేసిన కాయలనే ఇక్కడ పోటీలో ఉంచుతారు. పోటీ ముగిసిన తర్వాత ప్రిటోరియా నగరంలో పేదలకు ఈ గుమ్మడి కాయలను పంచుతారు! (చదవండి: దిల్ మ్యాంగో మోర్..! నోరూరించే వెరైటీ మ్యాంగ్ డెజర్ట్స్..) -
స్నేహ్ మాయాజాలం
భారత ఆఫ్‌స్పిన్నర్ స్నేహ్ రాణా 5 వికెట్ల ప్రదర్శన... వీటిలో ఒకే ఓవర్లో తీసిన 3 వికెట్లు... ప్రతీక రావల్ మరో అర్ధసెంచరీతో అద్భుత ఫామ్ కొనసాగింపు... తజ్మీన్ బ్రిట్స్ వీరోచిత సెంచరీ వృథా... భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌లో హైలైట్స్ ఇవి. ముక్కోణపు టోర్నీలో భాగంగా ఆడిన రెండో మ్యాచ్‌లోనూ గెలిచిన హర్మన్ బృందం తమ అగ్రస్థానాన్ని పటిష్టం చేసుకుంది. కొలంబో: ముక్కోణపు వన్డే టోర్నీలో భారత మహిళలు మరో విజయాన్ని అందుకున్నారు. మంగళవారం జరిగిన పోరులో భారత్ 15 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా మహిళల జట్టును ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది. ప్రతీక రావల్ (91 బంతుల్లో 78; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించగా... జెమీమా రోడ్రిగ్స్ (32 బంతుల్లో 41; 4 ఫోర్లు), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (48 బంతుల్లో 41 నాటౌట్; 4 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. అనంతరం దక్షిణాఫ్రికా 49.2 ఓవర్లలో 261 పరుగులకు ఆలౌటైంది. తజ్మీన్ బ్రిట్స్ (107 బంతుల్లో 109; 13 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీ చేయగా, ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ స్నేహ్ రాణా (5/43) ఐదు వికెట్ల ప్రదర్శనతో సఫారీ టీమ్‌ను పడగొట్టడంలో ప్రధాన పాత్ర పోషించింది. కీలక భాగస్వామ్యాలు... భారత్‌కు ప్రతీక, స్మృతి మంధాన (54 బంతుల్లో 36; 5 ఫోర్లు) శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు వీరిద్దరు 18.3 ఓవర్లలో 83 పరుగులు జోడించారు. స్మృతి వెనుదిరిగిన తర్వాత ప్రతీకకు హర్లీన్ డియోల్ (47 బంతుల్లో 29; 4 ఫోర్లు) సహకారం అందించింది. 58 బంతుల్లో ప్రతీక అర్ధ సెంచరీ పూర్తయింది. ప్రతీక, హర్లీన్ మూడు పరుగుల వ్యవధిలో వెనుదిరగ్గా... హర్మన్, జెమీమా 59 పరుగుల భాగస్వామ్యంతో ఇన్నింగ్స్‌ను నడిపించారు. చివర్లో రిచా ఘోష్ (14 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్) దూకుడైన ఆటను ప్రదర్శించగా...ఆఖరి 10 ఓవర్లలో భారత్ 82 పరుగులు సాధించింది. బ్రిట్స్ సెంచరీ వృథా... బ్రిట్స్ వరుస బౌండరీలతో చెలరేగిపోవడంతో ఛేదనలో దక్షిణాఫ్రికాకు మరింత ఘనమైన ఆరంభం దక్కింది. బ్రిట్స్‌తో తొలి వికెట్‌కు 140 పరుగులు జోడించిన తర్వాత కెప్టెన్ లౌరా వాల్వార్ట్ (75 బంతుల్లో 43; 3 ఫోర్లు) అవుట్ కాగా, ఆ తర్వాత 103 బంతుల్లో బ్రిట్స్ శతకం పూర్తయింది. ఆ తర్వాత తీవ్ర వేడి కారణంగా బ్రిట్స్ రిటైర్ట్‌హర్ట్‌గా వెనుదిరగ్గా... ఇక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది. 80 పరుగుల వ్యవధిలో జట్టు చివరి 8 వికెట్లు కోల్పోయి ఓటమి పాలైంది. ఐదు వికెట్లతో చివరి 3 ఓవర్లలో 28 పరుగులు చేయాల్సి ఉండగా... 48వ ఓవర్ వేసిన స్నేహ్ రాణా 3 వికెట్లు పడగొట్టింది. తిరిగి మైదానంలోకి వచ్చి ఆదుకునే ప్రయత్నం చేసిన బ్రిట్స్ కూడా ఇదే ఓవర్లో అవుట్ కావడంతో జట్టు ఆశలు కోల్పోయింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: ప్రతీక (బి) ఎమ్‌లాబా 78; స్మృతి (సి) మెసో (బి) డెర్క్సన్ 36; హర్లీన్ (బి) ఎమ్‌లాబా 29; హర్మన్‌ప్రీత్ (నాటౌట్) 41; జెమీమా (సి) ఖాకా (బి) క్లాస్ 41; రిచా (సి) లూస్ (బి) ఖాకా 24; దీప్తి (సి) ట్రైయాన్ (బి) డిక్లెర్క్ 9; కాశ్వీ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (50 ఓవర్లలో 6 వికెట్లకు) 276. వికెట్ల పతనం: 1–83, 2–151, 3–154, 4–213, 5–247, 6–259. బౌలింగ్: ఖాకా 8–1– 42–1, క్లాస్ 9–1–43–1, లూస్ 4–0–24–0, డిక్లెర్క్ 9–1–39–1, ఎమ్‌లాబా 10–0–55–2, డెర్క్సన్ 3–0– 40–1, ట్రైయాన్ 7–0–33–0. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: వోల్వార్ట్ (ఎల్బీ) (బి) దీప్తి 43; బ్రిట్స్ (సి అండ్ బి) స్నేహ్ రాణా 109, గుడాల్ (బి) స్నేహ్ రాణా 9; మెసో (బి) అరుంధతి రెడ్డి 7; లూస్ (సి) (సబ్) అమన్‌జోత్ (బి) శ్రీచరణి 28; ట్రైయాన్ (సి) (సబ్) అమన్‌జోత్ (బి) స్నేహ్ రాణా 18; డెర్క్సన్ (సి) హర్లీన్ (బి) స్నేహ్ రాణా 30; డిక్లెర్క్ (బి) స్నేహ్ రాణా 0; క్లాస్ (రనౌట్) 2; ఎమ్‌లాబా (రనౌట్) 8; ఖాకా (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (49.2 ఓవర్లలో ఆలౌట్) 261. వికెట్ల పతనం: 1–140, 2–151, 3–181, 4–207, 5–240, 6–250, 7–251, 8–252, 9–253, 10–261. బౌలింగ్: కాశ్వీ గౌతమ్ 7.2–0–47–0, అరుంధతి రెడ్డి 9–0–59–1, స్నేహ్ రాణా 10–0–43–5, శ్రీచరణి 10–0–51–1, దీప్తి శర్మ 10–0–40–1, ప్రతీక 3–0–17–0. -
ముక్కోణపు వన్డే సిరీస్.. టీమిండియా భారీ స్కోర్
శ్రీలంకతో జరుగుతున్న మహిళల ముక్కోణపు వన్డే సిరీస్-2025లో భారత్ ఇవాళ (ఏప్రిల్ 29) సౌతాఫ్రికాతో తలపడుతుంది (కొలొంబో వేదికగా). ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ ప్రతిక రావల్ (78) అర్ద సెంచరీతో.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (41), జెమీమా రోడ్రిగెజ్ (41), స్మృతి మంధన (36), హర్లీన్ డియోల్ (29), రిచా ఘోష్ (24) ఓ మోస్తరు స్కోర్లతో రాణించడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్‌లో దీప్తి శర్మ (9) ఒక్కరే సింగిల్ డిజిట్ స్కోర్‌కు ఔట్ కాగా.. కశ్వీ గౌతమ్ 5 పరుగులతో అజేయంగా నిలిచింది. సౌతాఫ్రికా బౌలర్లలో మ్లాబా 2, ఖాకాచ, క్లాస్, డి క్లెర్క్, డెర్క్సెన్ తలో వికెట్ పడగొట్టారు.కాగా, ఈ ట్రై నేషన్ సిరీస్‌లో భారత్, సౌతాఫ్రికాతో పాటు శ్రీలంకు కూడా పాల్గొంటుంది. ఈ టోర్నీ ఏప్రిల్ 27న ప్రారంభం కాగా.. తొలి మ్యాచ్‌లో భారత్, శ్రీలంక తలపడ్డాయి. వర్షం కారణంగా 39 ఓవర్లకు కుదించిన ఆ మ్యాచ్‌లో భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంకను భారత బౌలర్లు 147 పరుగులకే ఆలౌట్ (38.1 ఓవర్లలో) చేశారు. భారత బౌలర్లలో స్నేహ్ రాణా 3, నల్లపురెడ్డి చరణి, దీప్తి శర్మ తలో 2, అరుంధతి రెడ్డి ఓ వికెట్ పడగొట్టారు. శ్రీలంక ఇన్నింగ్స్‌లో హాసిని పెరీరా (30) టాప్ స్కోరర్‌గా నిలిచింది.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన భారత్.. 29.4 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. ఆ మ్యాచ్‌లో కూడా ప్రతిక రావల్ (50 నాటౌట్) అర్ద సెంచరీతో రాణించింది. స్మృతి మంధన 43, హర్లీన్ డియోల్ 48 (నాటౌట్) పరుగులతో సత్తా చాటారు. ఈ టోర్నీలో భారత్ సౌతాఫ్రికా, శ్రీలంకతో మరో మ్యాచ్ ఆడుతుంది. అన్ని మ్యాచ్‌ల తర్వాత మొదటి రెండు స్థానాల్లో నిలిచే జట్లు మే 11న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి. -
శ్రీలంక జట్టులో భారీ మార్పులు
కొలంబో: స్వదేశంలో జరగనున్న మహిళల ముక్కోణపు వన్డే టోర్నమెంట్ కోసం శ్రీలంక జట్టు భారీ మార్పులు చేసింది. ఆదివారం నుంచి ప్రారంభం కానున్న టోర్నీ కోసం శ్రీలంక జట్టు 8 మార్పులు చేసి బుధవారం 17 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఈ టోర్నీలో శ్రీలంకతో పాటు భారత్, దక్షిణాఫ్రికా జట్లు పాల్గొంటున్నాయి. గత నెలలో న్యూజిలాండ్ చేతిలో శ్రీలంక మహిళల క్రికెట్ జట్టు 0–2తో సిరీస్ కోల్పోవడంతో జట్టును ప్రక్షాళన చేసింది. సీనియర్ బ్యాటర్ చమరి ఆటపట్టు లంక జట్టుకు సారథ్యం వహిస్తుండగా... న్యూజిలాండ్‌తో టి20 సిరీస్‌లో ఆకట్టుకున్న మీడియం పేసర్ మల్కీ మదారాకు తొలిసారి వన్డే జట్టులో చోటు దక్కింది. ఈ టోర్నమెంట్లో ఒక్కో జట్టు మిగిలిన రెండు జట్లతో రెండేసి సార్లు తలపడనుంది. మ్యాచ్‌లన్నీ ప్రేమదాస స్టేడియంలోనే జరగనున్నాయి. వచ్చే నెల 11న ఫైనల్ జరుగుతుంది. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య శ్రీలంకతో భారత అమ్మాయిల జట్టు అమీతుమీ తేల్చుకోనుంది. శ్రీలంక జట్టు: చమరి ఆటపట్టు (కెప్టెన్ ), హర్షిత సమరవిక్రమ, విష్మీ గుణరత్నె, నీలాక్షిక సిల్వ, కవిషా దిల్హారి, అనుష్క సంజీవని, మనుడి ననయక్కర, హాసిని పెరెరా, ఆచిని కులసూర్య, పియూమి బడాల్గే, దేవ్మి విహంగ, హన్సిమ కరుణరత్నె, మల్కీ మదారా, ఇనోషి ప్రియదర్శిని, సుగంధిక కుమారి, రష్మిక, ఇనోక రణవీర. -
డౌట్ అక్కర్లేదు.. ఇవి సింహాలే..
ఎండాకాలం ఎఫెక్ట్ మరి.. దక్షిణాఫ్రికాలోని యుకుటులా రిజర్వ్ పార్క్‌లో జెడ్ నెల్సన్ అనే ఫొటోగ్రాఫర్ ఈ చిత్రాన్ని తీశారు. 2025 సోనీ వరల్డ్ ఫొటోగ్రఫీ పురస్కారాల్లో ఈ చిత్రం వైల్డ్ లైఫ్ అండ్ నేచర్ విభాగంలో మొదటి బహుమతిని గెలుచుకుంది. ఈ లయన్ రిజర్వులో శిక్షణ పొందిన గైడ్ల సాయంతో మనం సింహాలకు చాలా దగ్గరగా వెళ్లొచ్చు. వాటి జీవనశైలిని గమనించవచ్చు.రోమ్‌లో వాన్స్, మెలోనీ టారిఫ్ చర్చలురోమ్: టారిఫ్‌లపై అమెరికా–ఇటలీల మధ్య జరుగుతున్న చర్చల వేదిక రోమ్కు మారింది. శుక్రవారం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇటలీ ప్రధానమంత్రి జార్జియో మెలోనీతో సమావేశమయ్యారు, ప్రధాని కార్యాలయం ఛిగి ప్యాలెస్‌లో వీరు చర్చలు జరిపారు. అనంతరం, వైట్ హౌస్, మెలోనీ కార్యాలయం సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. అతిత్వరలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటలీని సందర్శించనున్నారని ఆ ప్రకటన తెలిపింది.ఆ సమయంలోనే అమెరికా– యూరప్ మధ్య చర్చలు జరపాలనే విషయం పరిశీలనలో ఉందని కూడా పేర్కొంది. గురువారం వైట్ హౌస్‌లో చర్చల సందర్భంగా మెలోనీ పక్కనే కూర్చున్న ట్రంప్.. వాణిజ్యం ఒప్పందాలు కుదుర్చుకునేందుకు తాము తొందరపడటం లేదని తెలిపారు. యూరప్‌తోపాటు మధ్యధరా ప్రాంతంలో అమెరికాకు అత్యంత ముఖ్యమైన భాగస్వామిగా ఇటలీ ఉంటుందని భావిస్తున్నామని మెలోనీ పేర్కొన్నారు. వాన్స్‌తో జరుగుతున్న చర్చల్లో సుదీర్ఘకాలం మైత్రి మరింత బలోపేతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇమ్రాన్ సోదరీమణుల అరెస్టు రావల్పిండీ: జైల్లో ఉన్న పాక్ మాజీ ప్రధాని 72 ఏళ్ల ఇమ్రాన్‌ఖాన్‌ను కలిసేందుకు వెళ్లిన ఆయన సోదరీమణులను పోలీసులు అరెస్టు చేశారు. ఆయన 2023 నుంచి రావల్పిండిలోని అడియాలా జైల్లో ఉన్నారు. ప్రతి మంగళ, గురువారాల్లో కుటుంబీకులు, లాయర్ల బృందం ఆయన్ను కలుస్తారు. గురువారం వెళ్లిన ఇమ్రాన్ సోదరీమణులు అలీమా, ఉజ్మా, నొరీన్తో పాటు పీటీఐ పార్టీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. వెనక్కు వెళ్లాలని కోరారు. వారు నిరాకరించడంతో ఘర్షణ నెలకొంది. వారిని అరెస్టు చేసి జైలుకు దూరంగా విడిచిపెట్టినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.అడియాలా జైలు బయట పీటీఐ నేతలను అరెస్టు చేయడం ఈ వారంలో ఇది రెండోసారి. వీటిని పార్టీ ఖండించింది. బలమైన ప్రజా ప్రతిస్పందన తప్పదని హెచ్చరించింది. ఇంగ్లండ్‌లో ఉంటున్న తన పిల్లలతో మాట్లాడేందుకు, వైద్య పరీక్షలకు ఇమ్రాన్ పెట్టుకున్న పిటిషన్లను పాక్ కోర్టు ఇటీవలే అనుమతించింది. -
గువాహాటిలో తొలిసారి టెస్టు
ముంబై: ఈ ఏడాది సొంతగడ్డపై భారత జట్టు ఆడే మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదలైంది. ఈ సంవత్సరం భారత క్రికెట్ జట్టు స్వదేశంలో 4 టెస్టులు, 3 వన్డేలు, 5 టి20 మ్యాచ్‌లు ఆడుతుంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి దేవజిత్ సైకియా స్వరాష్ట్రం అస్సాంలో భారత జట్టు తొలిసారి టెస్టు మ్యాచ్ ఆడనుంది. గువాహాటిలోని అస్సాం క్రికెట్ సంఘం (ఏసీఏ) స్టేడియం భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్టుకు నవంబర్ 26 నుంచి ఆతిథ్యమివ్వనుంది. ఈ ఏడాది వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్లు భారత్‌లో పర్యటించనున్నాయి. వెస్టిండీస్‌తో భారత్ రెండు టెస్టులు ఆడనుంది. అనంతరం దక్షిణాఫ్రికాతో టీమిండియా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టి20 మ్యాచ్‌ల్లో తలపడుతుంది. భారత్–దక్షిణాఫ్రికా మధ్య డిసెంబర్ 6న జరిగే మూడో వన్డే మ్యాచ్‌కు విశాఖపట్నం వేదిక కానుంది. -
భారత్‌లో పర్యటించనున్న వెస్టిండీస్, సౌతాఫ్రికా.. షెడ్యూల్ విడుదల
ఈ ఏడాది భారత క్రికెట్ జట్టు హోం సీజన్ (స్వదేశంలో ఆడే మ్యాచ్‌లు) షెడ్యూల్‌ను బీసీసీఐ ఇవాళ (ఏప్రిల్ 2) ప్రకటించింది. అక్టోబర్‌లో వెస్టిండీస్.. నవంబర్, డిసెంబర్ నెలల్లో సౌతాఫ్రికా క్రికెట్ జట్లు భారత్‌లో పర్యటించనున్నాయి.విండీస్ క్రికెట్ జట్టు రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం భారత్‌కు రానుంది. ఈ పర్యటనలో తొలి టెస్ట్ అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 2-6 మధ్య తేదీల్లో జరుగనుంది. రెండో టెస్ట్ కోల్‌కతా వేదికగా అక్టోబర్ 10-14 మధ్య తేదీల్లో జరుగుతుంది. టెస్ట్ సిరీస్ కోసం వెస్టిండీస్ భారత్‌లో పర్యటించడం 2018 తర్వాత ఇదే మొదటిసారి. ఆ సిరీస్‌లో భారత్ 2-0 తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది.అనంతరం నవంబర్ నెలలో సౌతాఫ్రికా జట్టు మల్టీ ఫార్మాట్ సిరీస్ కోసం భారత్‌కు రానుంది. ఈ పర్యటనలో సౌతాఫ్రికా రెండు టెస్ట్‌లు.. మూడు వన్డేలు.. ఐదు టీ20లు ఆడనుంది. నవంబర్ 14-18 మధ్య తేదీల్లో న్యూఢిల్లీలో తొలి టెస్ట్ జరుగనుంది. నవంబర్ 22 తేదీన గౌహతి వేదికగా రెండో టెస్ట్ ప్రారంభం కానుంది.నవంబర్ 30, డిసెంబర్ 3, డిసెంబర్ 6 తేదీల్లో రాంచీ, రాయ్‌పూర్, వైజాగ్ వేదికలుగా మూడు వన్డేలు జరుగనున్నాయి. డిసెంబర్ 9, 11, 14, 17, 19 తేదీల్లో కటక్, చండీఘడ్, ధర్మశాల, లక్నో, అహ్మదాబాద్ వేదికలుగా ఐదు టీ20లు జరుగనున్నాయి. వచ్చే ఏడాది మార్చిలో భారత్, శ్రీలంకల్లో జరుగనున్న టీ20 వరల్డ్‌కప్ దృష్ట్యా ఈ టీ20 సిరీస్‌ను షెడ్యూల్ చేశారు.కాగా, భారత క్రికెట్ జట్టు ఐపీఎల్ 2025 తర్వాత ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటన నెలన్నర పాటు సాగనుంది. మధ్యలో భారత్ జట్టు ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో ఖాళీగా ఉంటుంది. ఆతర్వాత హోం సీజన్ ప్రారంభమవుతుంది. భారత్‌లో వెస్టిండీస్ పర్యటన ముగిసిన అనంతరం టీమిండియా 3 వన్డేలు, 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ సిరీస్‌ల షెడ్యూల్‌ను కూడా బీసీసీఐ ఇటీవలే విడుదల చేసింది.ఆస్ట్రేలియాలో భారత్ పర్యటన షెడ్యూల్..అక్టోబర్ 19- తొలి వన్డే (డే అండ్ నైట్)- పెర్త్‌అక్టోబర్ 23- రెండో వన్డే (డే అండ్ నైట్)- అడిలైడ్‌అక్టోబర్ 25- మూడో వన్డే (డే అండ్ నైట్)- సిడ్నీఅక్టోబర్ 29- తొలి టీ20- కాన్‌బెర్రాఅక్టోబర్ 31- రెండో టీ20- మెల్‌బోర్న్‌నవంబర్ 2- మూడో టీ20- హోబర్ట్‌నవంబర్ 6- నాలుగో టీ20- గోల్డ్ కోస్ట్‌నవంబర్ 8- ఐదో టీ20- బ్రిస్బేన్ -
దక్షిణాఫ్రికాలో డ్రైవింగ్ అత్యంత ప్రమాదకరం
జొహన్నెస్‌బర్గ్: వాహన డ్రైవింగ్ విషయంలో ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశంగా దక్షిణాఫ్రికా నిలిచింది. వరుసగా రెండో ఏడాది ఈ అపప్రథ మూటగట్టుకున్న దేశంగా ఉంది. ఈ విషయంలో భారత్ ఐదో స్థానంలో ఉంది. అదేసమయంలో, ప్రపంచంలోనే డ్రైవింగ్‌కు అత్యంత సురక్షితమైన దేశంగా నార్వే వరుసగా నాలుగోసారి కీర్తి కిరీటం ధరించింది. అమెరికాకు చెందిన డ్రైవర్ ట్రెయినింగ్ కంపెనీ జుటోబీ వార్షిక నివేదికలో ఈ విషయాలున్నాయి. మొత్తం 53 దేశాలకు గాను దక్షిణాఫ్రికా అట్టడుగున 53వ స్థానంలో ఉండగా అమెరికాకు 51, భారత్‌కు 49వ ర్యాంకులు దక్కా యి. రహదారులపై స్పీడ్ లిమిట్లు, డ్రైవర్లకు బ్లడ్ ఆల్కహాల్ మోతాదు పరిమితులు, రహదారి ప్రమాదాల స్థాయిలు ఆధారంగా డ్రైవింగ్‌కు సురక్షితమైన, ప్రమాదకరమైన దేశాలను విశ్లేషించామ ని జుటోబీ తెలిపింది. ప్రతి లక్ష మందిగాను రోడ్డు ట్రాఫిక్ ప్రమాదాల్లో చనిపోయే సరాసరి సంఖ్య గతేడాది 8.9 ఉండగా ఈసారి ఇది 6.3కు తగ్గిందని జుటోబీ పేర్కొంది. దక్షిణాఫ్రికాలో చట్టాలున్నా అవినీతి అధికారుల కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నాయన్నది అందరికీ తెలిసిన విషయమని జొహన్నెస్‌బర్గ్‌కు చెందిన డ్రైవింగ్ కంపెనీ ఉద్యోగి అలిషా చిన్నాహ్ వ్యాఖ్యానించారు. -
IPL 2025: ముంబై ఇండియన్స్‌తో జతకట్టిన సౌతాఫ్రికా ఆల్‌రౌండర్
సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కార్బిన్ బాష్ ఫైవ్ టైమ్ ఐపీఎల్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌తో జతకట్టాడు. సహచరుడు లిజాడ్ విలియమ్స్ గాయం కారణంగా తదుపరి సీజన్‌కు దూరం కావడంతో అతని స్థానాన్ని బాష్ భర్తీ చేస్తున్నాడు. 30 ఏళ్ల బాష్‌ను ముంబై ఇండియన్స్ తమ హ్యామిలీలోకి ఆహ్వానించింది. రైట్ హ్యాండ్ బ్యాట్, రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలింగ్ వేసే బాష్ సౌతాఫ్రికా తరఫున ఓ టెస్ట్, 2 వన్డేలు ఆడాడు. బాష్ గతేడాది డిసెంబర్లో టెస్ట్‌ల్లో అరంగేట్రం చేశాడు.బాష్ తన తొలి టెస్ట్ మ్యాచ్‌లోనే ఇరగదీశాడు. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బాష్ తొలి ఇన్నింగ్స్‌లో అజేయమైన 81 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లో 4 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో బాష్ అద్భుత ఆల్‌రౌండ్ ప్రదర్శన కారణంగా సౌతాఫ్రికా పాకిస్తాన్‌ను 2 వికెట్ల తేడాతో చిత్తు చేసింది.ఈ మ్యాచ్‌కు ముందు బాష్ అదే పాకిస్తాన్‌పైనే వన్డే అరంగేట్రం చేశాడు. బాష్ ఇప్పటివరకు 2 వన్డేలు ఆడి 2 వికెట్లు సహా 55 పరుగులు చేశాడు. అరంగేట్రం ఇన్నింగ్స్‌లో బాష్ 44 బంతుల్లో 40 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇదే అతనికి వన్డేల్లో అత్యధిక స్కోర్. బాష్ తన రెండో వన్డేను కూడా పాక్‌తోనే ఆడాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు జరిగిన ట్రై సిరీస్‌లో బాష్ పాకిస్తాన్ మ్యాచ్‌లో ఆడాడు.అంతర్జాతీయ అరంగేట్రం అనంతరం బాష్ సౌతాఫ్రికా టీ20 లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ ఏడాది బాష్ ఎంఐ కేప్‌టౌన్ తరఫున బరిలో నిలిచాడు. ఈ సీజన్లో బాష్ 8 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు తీసి ఎంఐ కేప్‌టౌన్ తమ తొలి టైటిల్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు.బాష్ సౌతాఫ్రికా 2014 అండర్-19 వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. నాడు పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో చెలరేగి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. ఆ మ్యాచ్‌లో బాష్ 4 వికెట్లు తీశాడు. బాష్ తన కెరీర్లో వివిధ ఫార్మాట్లలో ఇప్పటివరకు 2500కు పైగా పరుగులు చేసి 150కిపైగా వికెట్లు తీశాడు. బాష్ టీ20ల్లో 86 మ్యాచ్‌లు ఆడి 59 వికెట్లు తీశాడు. బాష్ చేరికతో ముంబై ఇండియన్స్‌లో ఆల్‌రౌండర్ల సంఖ్య 9కి చేరింది. ఇప్పటికే ఆ జట్టులో కెప్టెన్ హార్దిక్ పాండ్యా, బెవాన్ జాకబ్స్, మిచెల్ సాంట్నర్, విల్ జాక్స్, అర్జున్ టెండూల్కర్ తదితర ఆల్‌రౌండర్లు ఉన్నారు. త్వరలో ప్రారంభంకానున్న ఐపీఎల్-2025 ఎడిషన్‌లో ముంబై తమ తొలి మ్యాచ్‌ను మార్చి 23న ఆడుతుంది. చెన్నైలో జరిగే ఆ మ్యాచ్‌లో ముంబై సీఎస్కేను ఢీకొంటుంది.ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్..రోహిత్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార యాదవ్, నమన్ ధిర్, బెవాన్ జాకబ్స్, రాజ్ బవా, విల్ జాక్స్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), విజ్ఞేశ్ పుథుర్, సత్యనారాయణ రాజు, కార్బిన్ బాష్, మిచెల్ సాంట్నర్, అర్జున్ టెండూల్కర్, ర్యాన్ రికెల్టన్, కృష్ణణ్ శ్రీజిత్, రాబిన్ మింజ్, జస్ప్రీత్ బుమ్రా, అశ్వనీ కుమార్, కర్ణ్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, ముజీబ్ ఉర్ రెహ్మాన్ -
పాపం క్లాసెన్.. ఎక్కడికి వెళ్లినా చేదు అనుభవమే..!
అంతర్జాతీయ క్రికెట్లో సౌతాఫ్రికా ఎంత దురదృష్టమైన జట్టో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఐసీసీ టోర్నీలో ఈ జట్టు దురదృష్టం పతాకస్థాయిలో ఉంటుంది. అంతర్జాతీయ క్రికెట్లోకి రీఎంట్రీ (1991) ఇచ్చిన నాటి నుంచి సౌతాఫ్రికా ఒకే ఒక ఐసీసీ టైటిల్ (1998 ఛాంపియన్స్ ట్రోఫీ) గెలిచింది. టన్నుల కొద్ది టాలెంట్ ఉన్నా ఈ జట్టుకు అదృష్టం కలిసి రాదు. ఐసీసీ టోర్నీల్లో మొదటి దశలో రెచ్చిపోయే సౌతాఫ్రికన్లు నాకౌట్ మ్యాచ్‌లు వచ్చే సరికి తేలిపోతారు. నాకౌట్ మ్యాచ్‌ల్లో.. ముఖ్యంగా సెమీఫైనల్స్‌లో సౌతాఫ్రికాను ఏదో ఒక రూపంలో దురదృష్టం వెంటాడుతుంది. తాజాగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనలే ఇందుకు నిదర్శనం.కాగా, సౌతాఫ్రికా దురదృష్టాన్ని ఆ జట్టు విధ్వంసకర బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ కొనసాగిస్తున్నాడు. క్లాసెన్ ఎక్కడ నాకౌట్ మ్యాచ్‌లు ఆడినా అతని జట్టు ఓటమిపాలవుతుంది. క్లాసెన్ నాకౌట్ ఫోబియా ఒక్క సౌతాఫ్రికాకే పరిమితం కాలేదు. ప్రైవేట్ లీగ్‌ల్లోనూ క్లాసెన్‌ను నాకౌట్ బూచి వెంటాడుతుంది. ప్రైవేట్ లీగ్‌ల్లో క్లాసెన్ ఆడిన మూడు నాకౌట్ మ్యాచ్‌ల్లో అతను ప్రాతినిథ్యం వహించిన జట్లు ఓడాయి. 2023 మేజర్ లీగ్ క్రికెట్ ఫైనల్లో క్లాసెన్ ప్రాతినిత్యం వహించిన సియాటిల్ ఓర్కాస్ ముంబై ఇండియన్స్ న్యూయార్క్ చేతుల్లో ఓడింది.2024 సౌతాఫ్రికా టీ20 లీగ్ ఫైనల్లో క్లాసెన్ ప్రాతినిథ్యం వహించిన డర్బన్ సూపర్ జెయింట్స్ సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్ చేతుల్లో ఓటమిపాలైంది. 2024 ఐపీఎల్ ఫైనల్లో క్లాసెన్ ప్రాతినిథ్యం వహించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కేకేఆర్ చేతుల్లో పరాజయంపాలైంది.తొలి నాకౌట్ నుంచే..క్లాసెన్ ప్రాతినిథ్యం వహించిన తొలి ఐసీసీ నాకౌట్లోనే సౌతాఫ్రికా ఓటమిపాలైంది. 2023 వన్డే సెమీఫైనల్లో సౌతాఫ్రికా ఆస్ట్రేలియా చేతిలో చిత్తైంది. క్లాసెన్ ప్రాతినిథ్యం వహించిన రెండో ఐసీసీ నాకౌట్లో సౌతాఫ్రికా గుండెబద్దలైంది. 2024 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్లో ఆ జట్టు భారత్ చేతిలో అనూహ్యంగా ఓటమిపాలైంది. తాజాగా క్లాసెన్ ప్రాతినిథ్యం వహించిన మూడో ఐసీసీ నాకౌట్లో కూడా సౌతాఫ్రికాకు చేదు అనుభవమే మిగిలింది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్‌లో సౌతాఫ్రికాను న్యూజిలాండ్ చిత్తుగా ఓడించింది. నాకౌట్ మ్యాచ్‌ల్లో ఇన్ని పరాభవాలు ఎదురుకావడంతో క్లాసెన్‌పై క్రికెట్ అభిమానులు జాలి చూపిస్తున్నారు. పాపం క్లాసెన్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఇదిలా ఉంటే, ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో సౌతాఫ్రికా గ్రూప్ దశలో అదిరిపోయే ప్రదర్శనలు చేసింది. ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లండ్‌పై ఘన విజయాలు సాధించింది. ఆస్ట్రేలియాతో మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. అయినప్పటికీ సౌతాఫ్రికా గ్రూప్ టాపర్‌గా సెమీస్‌కు చేరింది. సెమీస్‌లోనూ మంచి ప్రదర్శనే చేసినప్పటికీ న్యూజిలాండ్ బ్యాటర్లు రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ సూపర్ సెంచరీలు చేసి సౌతాఫ్రికా చేతి నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నారు. సెమీస్‌లో సౌతాఫ్రికాను చిత్తు చేసిన న్యూజిలాండ్ ఫైనల్లో భారత్‌తో అమీతుమీ తేల్చుకుంటుంది. -
ఏప్రిల్, మే నెలల్లో ట్రై సిరీస్ ఆడనున్న భారత్
ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో శ్రీలంకలో మహిళల ముక్కోణపు వన్డే టోర్నీ జరుగనుంది. ఈ టోర్నీలో శ్రీలంక సహా భారత్, సౌతాఫ్రికా జట్లు పాల్గొంటున్నాయి. ఈ టోర్నీ డబుల్ రౌండ్ రాబిన్ ఫార్మాట్లో జరుగుతుంది. ప్రతి జట్టు నాలుగు గ్రూప్ స్టేజీ మ్యాచ్‌లు ఆడుతుంది. గ్రూప్ మ్యాచ్‌ల అనంతరం మొదటి రెండు స్థానాల్లో నిలిచే జట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఈ టోర్నీలో అన్ని మ్యాచ్‌లకు కొలొంబోని ప్రేమదాస స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. మ్యాచ్‌లన్నీ డే మ్యాచ్‌లుగా జరుగుతాయి. ఏప్రిల్ 27న జరిగే టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు టీమిండియాతో తలపడనుంది. మే 11న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ టోర్నీ ఈ ఏడాది చివర్లో భారత్‌లో జరిగే వన్డే వరల్డ్‌కప్‌కు సన్నాహకంగా ఉపయోగపడుతుంది. ఈ టోర్నీలో పాల్గొనే మూడు జట్లు ఇదివరకే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించాయి.ముక్కోణపు సిరీస్ షెడ్యూల్ఏప్రిల్ 27- భారత్ వర్సెస్ శ్రీలంకఏప్రిల్ 29- భారత్ వర్సెస్ సౌతాఫ్రికామే 1- శ్రీలంక వర్సెస్ సౌతాఫ్రికామే 4- భారత్ వర్సెస్ శ్రీలంకమే 6- భారత్ వర్సెస్ సౌతాఫ్రికామే 8- సౌతాఫ్రికా వర్సెస్ శ్రీలంకమే 11- ఫైనల్‌కాగా, భారత్ ఈ ఏడాది ఆరంభంలో స్వదేశంలో ఐర్లాండ్‌తో వన్డే సిరీస్ ఆడింది. ఈ సిరీస్‌లో భారత్ జయకేతనం ఎగురవేసింది. గతేడాది చివర్లో సౌతాఫ్రికా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం ఇంగ్లండ్‌కు ఆతిథ్యమిచ్చింది. ఈ సిరీస్‌ను సౌతాఫ్రికా 1-2 తేడాతో కోల్పోయింది. శ్రీలంక విషయానికొస్తే.. ఈ జట్టు ప్రస్తుతం న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది.మహిళల క్రికెట్ విషయానికొస్తే.. ప్రస్తుతం భారత్‌లో డబ్ల్యూపీఎల్ మూడో సీజన్ జరుగుతుంది. ఈ లీగ్ చివరి దశకు చేరింది. 15 మ్యాచ్‌లు అయిపోయే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఢిల్లీ ఆడిన 7 మ్యాచ్‌ల్లో ఐదింట విజయాలు సాధించి ప్లే ఆఫ్స్‌కు కూడా అర్హత సాధించింది. గత రెండు సీజన్లలో చివరి స్థానంలో నిలిచిన గుజరాత్ ప్రస్తుతం రెండో స్థానంలో ఉంది. గతేడాది రన్నరప్ ముంబై ఇండియన్స్ మూడులో, ఢిపెండింగ్ చాంపియన్ ఆర్సీబీ నాలుగో స్థానంలో, యూపీ వారియర్జ్ ఐదో స్థానంలో ఉన్నాయి. లీగ్‌లో భాగంగా ఇవాళ (మార్చి 6) యూపీ వారియర్జ్, ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. -
NZ Vs SA: దుబాయ్‌కి న్యూజిలాండ్
టోర్నీకి ముందు... మూడు దశాబ్దాల తర్వాత చాంపియన్స్ ట్రోఫీ రూపంలో ఓ ఐసీసీ టోర్నీ భాగ్యం దక్కించుకున్న పాకిస్తాన్... ఎంతో మురిపెంగా న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాలను పిలిచి కనుమరుగైన ముక్కోణపు టోర్నీతో సన్నాహక సమరంలో పాల్గొంది. ఫైనల్‌కు ముందు... టైటిల్ పోరుకుముందే పాకిస్తాన్లో ఆతిథ్యం ముగిసింది. రెండో సెమీఫైనల్‌తోనే వారి ఐసీసీ ఈవెంట్ ముచ్చట తీరింది. ఇక ఓవర్ టు దుబాయ్! పాక్ సన్నాహక టోర్నీ పెడితే ట్రోఫీ గెలిచి మరీ సన్నద్ధమైన న్యూజిలాండ్ ఇప్పుడు ఏకంగా చాంపియన్స్ ట్రోఫీపైనే కన్నేసింది. లాహోర్: చాంపియన్స్ ట్రోఫీ రెండో సెమీఫైనల్లో న్యూజిలాండ్ గర్జించింది. ముందు బ్యాటింగ్‌లో... తర్వాత బౌలింగ్‌లో దక్షిణాఫ్రికా జట్టును కుదేలు చేసింది. రెండు మాజీ చాంపియన్ జట్ల మధ్య బుధవారం జరిగిన సెమీఫైనల్లో 2000 టోర్నీ విజేత కివీస్ 50 పరుగుల తేడాతో 1998 చాంపియన్ దక్షిణాఫ్రికాపై జయభేరి మోగించింది. టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 362 పరుగుల భారీస్కోరు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రచిన్ రవీంద్ర (101 బంతుల్లో 108; 13 ఫోర్లు, 1 సిక్స్), కేన్ విలియమ్సన్ (94 బంతుల్లో 102; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీలతో కదంతొక్కారు. ఫిలిప్స్ (27 బంతుల్లో 49 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్), మిచెల్ (37 బంతుల్లో 49; 4 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగారు. అనంతరం కష్టసాధ్యమైన లక్ష్యఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా జట్టు 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసి ఓడింది. మిల్లర్ (67 బంతుల్లో 100 నాటౌట్; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) వీరోచిత సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఓపెనర్, కెపె్టన్ బవుమా (71 బంతుల్లో 56; 4 ఫోర్లు, 1 సిక్స్), డసెన్ (66 బంతుల్లో 69; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. దుబాయ్‌లో ఈ నెల 9న ఆదివారం జరిగే ‘ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ’ ఫైనల్లో భారత్‌తో న్యూజిలాండ్ ఆడుతుంది. ఇటు రచిన్, అటు విలియమ్సన్ టాప్–4 బ్యాటర్లు ఆడితే స్కోరు ఏ రకంగా జోరందుకుంటుందో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ చూస్తే అర్థమవుతుంది. మొదట ఓపెనర్లు విల్ యంగ్ (23 బంతుల్లో 21; 3 ఫోర్లు), రచిన్ రవీంద్ర 48 పరుగులతో మంచి ఆరంభమే ఇచ్చారు. యంగ్ అవుటయ్యాక వచ్చిన విలియమ్సన్తో రచిన్ సమన్వయం న్యూజిలాండ్ భారీస్కోరుకు బాట వేసింది. సఫారీలాంటి మేటి బౌలర్లపై ఇద్దరూ సులువుగా షాట్లు బాదారు. అలుపు లేకుండా పరుగులు రాబట్టారు.47 బంతుల్లో రచిన్, 61 బంతుల్లో విలియమ్సన్ ఫిఫ్టీలు చేశారు. ఇద్దరి బ్యాటింగ్ ప్రతాపంతో స్కోరుబోర్డు పరుగు పెట్టింది. 93 బంతుల్లో రచిన్ శతకం పూర్తవగా, 32వ ఓవర్లో జట్టు 200 స్కోరు చేసింది. ఎట్టకేలకు రచిన్‌ను రబడ అవుట్ చేసి రెండో వికెట్‌కు 164 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు. మిచెల్ కూడా ధాటిగా పరుగులు సాధించడంతో దక్షిణాఫ్రికాకు కష్టాలు తప్పలేదు. విలియమ్సన్ 91 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకొని కాసేపటికి నిష్క్రమించాడు. 40 ఓవర్లలో 250 పరుగులు చేసిన న్యూజిలాండ్ చివరి 10 ఓవర్లలో 112 పరుగుల్ని చకచకా జత చేసింది. మిల్లర్ 100 నాటౌట్ ఓపెనర్ రికెల్టన్ (17) ఆరంభంలోనే అవుట్ కాగా... కెపె్టన్ బవుమా, డసెన్‌లు చక్కగా ఆడటంతో ఒకదశలో సఫారీ స్కోరు 125/1. లక్ష్యానికి సరైన దిశగా కనిపించింది. కానీ అదే స్కోరుపై బవుమా, కాసేపయ్యాక డసెన్, క్లాసెన్ (3), మార్క్రమ్ (29 బంతుల్లో 31; 3 ఫోర్లు)లు నిష్క్రమించడంతో 200 స్కోరు వద్ద ఆరో వికెట్ కోల్పోయి లక్ష్యానికి దూరమైంది. ఈ దశలో ఒకేఒక్కడు మిల్లర్ ఒంటరి పోరాటం చేశాడు. ముల్డర్ (8), యాన్సెన్ (3)ల అండలేక అతని పోరాటం ఓటమి అంతరాన్ని తగ్గించింది కానీ జట్టును గెలిపించలేకపోయింది. 46 ఓవర్లలో సఫారీ స్కోరు 259/9. అప్పటికి మిల్లర్ (47 నాటౌట్) ఫిఫ్టీ కూడా చేయలేదు. కానీ చివరి 4 ఓవర్లలో 53 పరుగులు చేస్తే ఆ పరుగులన్నీ అతనే బాదడం... 67 బంతుల్లోనే సెంచరీ సాధించడం విశేషం. స్కోరు వివరాలు న్యూజిలాండ్ ఇన్నింగ్స్: యంగ్ (సి) మార్క్రమ్ (బి) ఇన్‌గిడి 21; రచిన్ (సి) క్లాసెన్ (బి) రబడ 108; విలియమ్సన్ (సి) ఇన్‌గిడి (బి) ముల్డర్ 102; మిచెల్ (సి) రబడ (బి) ఇన్‌గిడి 49; లాథమ్ (బి) రబడ 4; ఫిలిప్స్ (నాటౌట్) 49; బ్రేస్‌వెల్ (సి) రికెల్టన్ (బి) ఇన్‌గిడి 16; సాంట్నర్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (50 ఓవర్లలో 6 వికెట్లకు) 362. వికెట్ల పతనం: 1–48, 2–212, 3–251, 4–257, 5–314, 6–360. బౌలింగ్: యాన్సెన్ 10–0–79–0, ఇన్‌గిడి 10–0–72–3, రబడ 10–1–70–2, ముల్డర్ 6–0–48–1, కేశవ్ మహరాజ్ 10–0–65–0, మార్క్రమ్ 4–0–23–0. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: రికెల్టన్ (సి) బ్రేస్‌వెల్ (బి) హెన్రీ 17; బవుమా (సి) విలియమ్సన్ (బి) సాంట్నర్ 56; డసెన్ (బి) సాంట్నర్ 69; మార్క్రమ్ (సి అండ్ బి) రచిన్ 31; క్లాసెన్ (సి) హెన్రీ (బి) సాంట్నర్ 3; మిల్లర్ (నాటౌట్) 100; ముల్డర్ (సి) రచిన్ (బి) బ్రేస్‌వెల్ 8; యాన్సెన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) ఫిలిప్స్ 3; కేశవ్ (సి) లాథమ్ (బి) ఫిలిప్స్ 1; రబడ (సి) ఫిలిప్స్ (బి) హెన్రీ 16; ఇన్‌గిడి (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 312. వికెట్ల పతనం: 1–20, 2–125, 3–161, 4–167, 5–189, 6–200, 7–212, 8–218, 9–256. బౌలింగ్: హెన్రీ 7–0–43–2, జేమీసన్ 7–1–57–0, రూర్కే 8–0–69–0, బ్రేస్‌వెల్ 10–0–53–1, సాంట్నర్ 10–0–43–3, రచిన్ రవీంద్ర 5–0–20–1, ఫిలిప్స్ 3–0–27–2. -
CT 2025: సౌతాఫ్రికాను చిత్తు చేసిన న్యూజిలాండ్.. ఫైనల్లో టీమిండియాతో అమీతుమీ
ఇవాళ (మార్చి 5) జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ-2025 రెండో సెమీఫైనల్లో సౌతాఫ్రికాపై న్యూజిలాండ్ 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా మార్చి 9న జరిగే ఫైనల్లో టీమిండియాతో అమీతుమీకి అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ రచిన్ రవీంద్ర (101 బంతుల్లో 108; 13 ఫోర్లు, సిక్స్), కేన్ విలియమ్సన్ (94 బంతుల్లో 102; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీలతో కదంతొక్కడంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 362 పరుగుల భారీ స్కోర్ చేసింది. డారిల్ మిచెల్ 49 పరుగులతో (37 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్) రాణించగా.. ఆఖర్లో గ్లెన్ ఫిలిప్స్ (27 బంతుల్లో 49 నాటౌట్; 6 ఫోర్లు, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడి 3, రబాడ 2, ముల్దర్ ఓ వికెట్ పడగొట్టారు.భారీ లక్ష్య ఛేదనలో తడబడిన సౌతాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 312 పరుగులు మాత్రమే చేయగలిగింది. బవుమా (56), డసెన్ (69) అర్ద సెంచరీలతో రాణించగా.. ఆఖర్లో పోరాడితే పోయేదేమీ లేదన్నట్లు ఆడి మిల్లర్ మెరుపు సెంచరీ (67 బంతుల్లో 100 నాటౌట్; 10 ఫోర్లు, 4 సిక్సర్లు) బాదాడు. మిల్లర్ చివరి బంతికి రెండు పరుగులు తీసి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కివీస్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ 3 వికెట్లు తీసి సౌతాఫ్రికా విజయావకాశాలను దెబ్బకొట్టాడు. మ్యాట్ హెన్రీ, గ్లెన్ ఫిలిప్స్ తలో 2, బ్రేస్‌వెల్, రచిన్ రవీంద్ర చెరో వికెట్ పడగొట్టారు. భారత్, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ దుబాయ్ వేదికగా జరుగనుంది. కాగా, తొలి సెమీఫైనల్లో టీమిండియా ఆసీస్‌పై ఘన విజయం సాధించి వరుసగా మూడోసారి, ఓవరాల్‌గా ఐదోసారి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు అర్హత సాధించింది. సెమీస్‌లో విరాట్ కోహ్లి చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ ఆడి భారత్ గెలుపులో కీలకపాత్ర పోషించాడు. చరిత్ర సృష్టించిన కేన్ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ ఓ అరుదైన మైలురాయిని తాకాడు. 27 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అంతర్జాతీయ క్రికెట్లో 19000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి న్యూజిలాండ్ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. కేన్ తన 370వ అంతర్జాతీయ మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు.48వ శతకం.. స్టీవ్ స్మిత్ రికార్డు సమంనేటి మ్యాచ్‌లో సెంచరీతో కేన్ వన్డేల్లో 15వ సెంచరీ, ఓవరాల్‌గా (మూడు ఫార్మాట్లలో) 48వ సెంచరీని నమోదు చేశాడు. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న క్రికెటర్లలో అత్యధిక వన్డే సెంచరీలు (మూడు ఫార్మాట్లలో) చేసిన ఆటగాళ్ల జాబితాలో కేన్ నాలుగో స్థానానికి ఎగబాకాడు. ఈ క్రమంలో ఆసీస్ స్టార్ ఆటగాడు, ఫాబ్ ఫోర్లో ఒకడైన స్టీవ్ స్మిత్ రికార్డును సమం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో యాక్టివ్‌గా ఉన్న క్రికెటర్లలో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు విరాట్ కోహ్లి (82) పేరిట ఉంది. ఓవరాల్‌గా అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు సచిన్ (100) పేరిట ఉంది. రచిన్ రికార్డు శతకంఈ మ్యాచ్‌లో సెంచరీతో రచిన్ కూడా రికార్డుల్లోకెక్కాడు. కివీస్ తరఫున ఐసీసీ వన్డే టోర్నీల్లో అత్యధిక శతకాలు (5) బాదిన క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ టోర్నీ ప్రస్తుత ఎడిషన్‌లో రచిన్‌కు ఇది రెండో శతకం కాగా.. అంతకుముందు భారత్‌లో జరిగిన 2023 వన్డే వరల్డ్‌కప్‌లో మూడు సెంచరీలు బాదాడు. -
దుబాయ్‌కు వెళ్లేదెవరో?
లాహోర్: ఎనిమిదేళ్ల విరామం తర్వాత జరుగుతున్న చాంపియన్స్ ట్రోఫీ వన్డే టోర్నమెంట్లో భారత జట్టు ఫైనల్ తొలి బెర్త్‌ను ఖరారు చేసుకోగా... ఫైనల్ రెండో బెర్త్ కోసం దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు నేడు ముఖాముఖి పోరుకు సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఆదివారం దుబాయ్‌లో జరిగే టైటిల్ పోరులో టీమిండియాతో ఆడుతుంది. ఐసీసీ టోర్నీల్లో దురదృష్టం వెంట పెట్టుకొని తిరిగే దక్షిణాఫ్రికా జట్టు ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని చూస్తుంటే... పాకిస్తాన్ పిచ్‌లపై ఇటీవల ముక్కోణపు సిరీస్ గెలిచిన న్యూజిలాండ్ అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. బలాబలాల దృష్ట్యా ఇరు జట్లు సమ ఉజ్జీలే అయినా... నాణ్యమైన స్పిన్నర్లు అందుబాటులో ఉన్న న్యూజిలాండ్‌దే పైచేయిగా కనిపిస్తోంది. ఇరు జట్లు గతంలో ఒక్కోసారి ఈ టోర్నీలో విజేతగా నిలిచాయి. 1998లో దక్షిణాఫ్రికా, 2000లో న్యూజిలాండ్ ఈ ట్రోఫీని చేజిక్కించుకున్నాయి. అయితే అప్పట్లో ఈ టోర్నీ పేరు చాంపియన్స్ ట్రోఫీ అని కాకుండా... ‘ఐసీసీ నాకౌట్ ట్రోఫీ’ అని ఉండేది. ఐసీసీ టోర్నీల్లో ‘చోకర్స్’గా ముద్ర చెరిపేసుకోవాలని తెంబా బవుమా సారథ్యంలో దక్షిణాఫ్రికా జట్టు కృతనిశ్చయంతో ఉంది. మరోవైపు 2015, 2019 వన్డే ప్రపంచకప్‌లలో తుదిమెట్టుపై తడబడి రన్నరప్‌తో సరిపెట్టుకున్న న్యూజిలాండ్ ఈసారి ట్రోఫీ చేజిక్కించుకోవడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. గ్రూప్ ‘బి’లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి... ఆసీస్‌తో పోరు వర్షం కారణంగా రద్దు కావడంతో దక్షిణాఫ్రికా 5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. మరోవైపు గ్రూప్ ‘ఎ’లో రెండు మ్యాచ్‌లు గెలిచి, ఒక దాంట్లో ఓడి 4 పాయింట్లతో కివీస్ సెమీస్‌కు చేరింది. సఫారీలకు సాధ్యమేనా? ఫార్మాట్‌తో సంబంధం లేకుండా ఐసీసీ నిర్వహిస్తున్న గత 7 ఈవెంట్లలో నాకౌట్‌కు చేరిన దక్షిణాఫ్రికా జట్టు... ఈసారి కప్పుకొట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. 2023 పురుషుల వన్డే ప్రపంచకప్, 2024 పురుషుల టి20 ప్రపంచకప్, 2025 ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ), 2024 పురుషుల అండర్–19 వరల్డ్‌కప్, 2024 టి20 ప్రపంచకప్, 2025 మహిళల అండర్–19 ప్రపంచకప్ ఇలా.. ఈ ఏడు టోర్నీల్లో సఫారీ టీమ్ నాకౌట్ దశకు చేరింది. గాయం కారణంగా గత మ్యాచ్‌కు అందుబాటులో లేకపోయిన దక్షిణాఫ్రికా కెప్టెన్ బవుమా ఈ మ్యాచ్‌లో ఆడనున్నాడు. డోర్జీ కూడా కోలుకున్నప్పటికీ అతడికి తుది జట్టులో చోటు దక్కడం అనుమానమే.మార్క్రమ్, డసెన్, క్లాసెన్, మిల్లర్, రికెల్టన్ కలిసి కట్టుగా రాణించాలని టీమ్ మేనేజ్మెంట్ ఆశిస్తోంది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించే సూచనలు ఉన్న నేపథ్యంలో స్టార్ ఆటగాళ్లలో ఒకరు ఇన్నింగ్స్ ఆసాంతం నిలవాల్సిన అవసరముంది. బౌలింగ్‌లో స్టార్ పేసర్లు కగిసో రబడ, లుంగి ఇన్‌గిడి కంటే... ఆల్‌రౌండర్ మార్కో యాన్సెన్, ముల్డర్ బాగా ప్రభావం చూపుతున్నారు. కేశవ్ మహరాజ్ స్పిన్ బౌలింగ్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ఆత్మవిశ్వాసంతో కివీస్... పాకిస్తాన్ వేదికగా ఇటీవల జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్ సొంతం చేసుకున్న న్యూజిలాండ్ ఆత్మవిశ్వాసంతో ఉంది. లీగ్ దశలో భాగంగా భారత్ చేతిలో ఓడినప్పటికీ కివీస్‌ను తక్కువ అంచనా వేసేందుకు లేదు. విల్ యంగ్, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిషెల్, టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్, బ్రేస్‌వెల్ రూపంలో న్యూజిలాండ్ బ్యాటింగ్ బలంగా ఉంది. బౌలింగ్ రూర్కే, హెన్రీ, జేమీసన్తో పాటు కెపె్టన్ సాంట్నర్ కీలకం కానున్నాడు.7 ఐసీసీ టోర్నీల్లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు జరగగా... అందులో న్యూజిలాండ్ 7 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. నాలుగింటిలో దక్షిణాఫ్రికా గెలిచింది. -
ఒక్క బంతి పడకుండానే...
రావల్పిండి: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ ‘బి’లో హోరాహోరీగా సాగాల్సిన మ్యాచ్‌పై వరుణుడు నీళ్లు చల్లాడు. దీంతో రావల్పిండిలో పసందైన క్రికెట్ విందును ఆస్వాదించాలని వచ్చిన ప్రేక్షకులకు నిరాశే మిగిలింది. రెండు పటిష్ట జట్ల మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగుతుందనుకున్న సమరం సర్వత్రా ఆసక్తిని రేపింది. గెలిచిన జట్టు సెమీఫైనల్ వైపు నడిచేది. కానీ వర్షం వల్ల ఈ మ్యాచ్ ఒక్క బంతికైనా నోచుకోలేకపోయింది. తెరిపినివ్వని వానతో మైదానమంతా చిత్తడిగా మారడంతో బ్యాట్లు, బంతులతో కుస్తీ చేయాల్సిన ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్లకే పరిమితమయ్యారు. చివరకు చేసేదేమీ లేక ఫీల్డ్ అంప్లైర్లు క్రిస్ గఫాని (ఆస్ట్రేలియా), రిచర్డ్ కెటిల్‌బొరొ (ఇంగ్లండ్)లు అవుట్‌ఫీల్డ్‌ను పరిశీలించి మ్యాచ్ నిర్వహణ అసాధ్యమని తేల్చారు. వెంటనే మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇరు జట్లకు ఒక్కో పాయింట్ కేటాయించారు. గ్రూప్ ‘బి’లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా తమ తొలి మ్యాచ్‌ల్లో శుభారంభం చేశాయి. ఫలితమివ్వని ఈ మ్యాచ్ వల్ల గ్రూప్‌లోని ఇంగ్లండ్, అఫ్గానిస్తాన్... అన్ని జట్లు ఇప్పుడు రేసులో నిలిచినట్లయ్యింది. ఎందుకంటే మూడేసి పాయింట్లతో ఉన్న దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలకు మిగిలింది ఒక్కటే మ్యాచ్ కాగా... పాయింట్ల పట్టికలో ఖాతా తెరువని ఇంగ్లండ్, అఫ్గానిస్తాన్లకు రెండేసి మ్యాచ్‌లున్నాయి. చాంపియన్స్ ట్రోఫీలో నేడుఇంగ్లండ్ X అఫ్గానిస్తాన్వేదిక: లాహోర్, మధ్యాహ్నం గం. 2:30 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియోహాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
చాంపియన్స్ ట్రోఫీని భారీ విజయంతో మొదలు పెట్టిన దక్షిణాఫ్రికా
-
అదరగొట్టిన దక్షిణాఫ్రికా
కరాచీ: సుదీర్ఘ కాలంగా ఐసీసీ ట్రోఫీ టైటిల్ కోసం తీవ్ర ప్రయత్నం చేస్తున్న దక్షిణాఫ్రికా చాంపియన్స్ ట్రోఫీని భారీ విజయంతో మొదలు పెట్టింది. తొలిసారి టోర్నీ ఆడుతున్న అఫ్గానిస్తాన్‌కు ఎలాంటి సంచలనానికి అవకాశం ఇవ్వకుండా తమ స్థాయికి తగ్గ ఆటతో పైచేయి సాధించింది. ముందుగా బ్యాటింగ్‌లో భారీ స్కోరుతో చెలరేగిన మాజీ చాంపియన్ ఆ తర్వాత పదునైన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్థిని పడగొట్టింది. శుక్రవారం జరిగిన గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 107 పరుగుల తేడాతో అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ర్యాన్ రికెల్టన్ (106 బంతుల్లో 103; 7 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో చెలరేగగా... కెప్టెన్ బవుమా (76 బంతుల్లో 58; 5 ఫోర్లు), మార్క్రమ్ (36 బంతుల్లో 52 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్), డసెన్ (46 బంతుల్లో 52; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం అఫ్గానిస్తాన్ 43.3 ఓవర్లలో 208 పరుగులకే ఆలౌటైంది. రహ్మత్ షా (92 బంతుల్లో 90; 9 ఫోర్లు, 1 సిక్స్) మినహా మిగతావారంతా విఫలమయ్యారు. మూడు అర్ధ సెంచరీలు... ఇన్నింగ్స్ ఆరంభంలోనే టోనీ జోర్జి (11) వెనుదిరగ్గా ... రికెల్టన్, బవుమా కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించారు. తొలి 10 ఓవర్లలో దక్షిణాఫ్రికా స్కోరు 46 పరుగులకు చేరింది. చక్కటి షాట్లతో ఆకట్టుకున్న రికెల్టన్ 48 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ జోడీని విడదీసేందుకు అఫ్గాన్ బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. 63 బంతుల్లో అర్ధ సెంచరీని అందుకున్న అనంతరం నబీ బౌలింగ్‌లో బవుమా వెనుదిరిగాడు. రికెల్టన్, బవుమా రెండో వికెట్‌కు 23.4 ఓవర్లలో 129 పరుగులు జోడించారు. ఆ తర్వాత కొద్దిసేపటికి 101 బంతుల్లో రికెల్టన్ కెరీర్లో తొలి శతకాన్ని సాధించాడు. అయితే తర్వాతి ఓవర్లోనే అతను అనూహ్యంగా రనౌటయ్యాడు. కీలక వికెట్ తీసిన ఆనందం అఫ్గాన్‌కు దక్కలేదు. ఆపై డసెన్, మార్క్రమ్ తమ జోరును ప్రదర్శించడంతో దక్షిణాఫ్రికా స్కోరు 300 దాటింది. రహ్మత్ షా మినహా... భారీ ఛేదనలో అఫ్గాన్ టీమ్ తడబడింది. రహ్మత్ షా పట్టుదలగా నిలబడినా... ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ భాగస్వామ్యం లేకపోయింది. నలుగురు సఫారీ పేసర్ల ధాటికి బ్యాటర్లు నిలవలేకపోయారు. పవర్‌ప్లే ముగిసేసరికే తొలి 2 వికెట్లు కోల్పోయిన జట్టు తర్వాతి 5 ఓవర్లలో మరో 2 వికెట్లు చేజార్చుకుంది. 89/5 స్కోరు వద్ద జట్టు గెలుపుపై ఆశలు వదిలేసుకుంది. రహ్మత్ మాత్రం కాస్త పోరాడుతూ సెంచరీకి చేరువయ్యాడు. అయితే మరోవైపు నుంచి అతనికి సహకారం లభించలేదు. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: రికెల్టన్ (రనౌట్) 103; టోనీ జోర్జి (సి) అజ్మతుల్లా (బి) నబీ 11; బవుమా (సి) సాదిఖుల్లా (బి) నబీ 58; డసెన్ (సి) హష్మతుల్లా (బి) నూర్ 52; మార్క్రమ్ (నాటౌట్) 52; మిల్లర్ (సి) రహ్మత్ (బి) ఫారుఖీ 14; యాన్సెన్ (బి) అజ్మతుల్లా 0; ముల్డర్ (నాటౌట్) 12; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (50 ఓవర్లలో 6 వికెట్లకు) 315. వికెట్ల పతనం: 1–28, 2–157, 3–201, 4–248, 5–298, 6–299. బౌలింగ్: ఫారుఖీ 8–0–59–1, అజ్మతుల్లా 6–0–39–1, నబీ 10–0– 51–2, రషీద్ ఖాన్ 10–0–59–0, గుల్బదిన్ 7–0–42–0, నూర్ అహ్మద్ 9–0–65–1. అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్: గుర్బాజ్ (సి) మహరాజ్ (బి) ఎన్గిడి 10; ఇబ్రహీమ్ (బి) రబడ 17; సాదిఖుల్లా (రనౌట్) 16; రహ్మత్ షా (సి) రికెల్టన్ (బి) రబడ 90; హష్మతుల్లా (సి) బవుమా (బి) ముల్డర్ 0; అజ్మతుల్లా (సి) రికెల్టన్ (బి) రబడ 18; నబీ (సి) రబడ (బి) యాన్సెన్ 8; గుల్బదిన్ (సి) బవుమా (బి) ఎన్గిడి 13; రషీద్ (సి) మార్క్రమ్ (బి) మహరాజ్ 18; నూర్ (బి) ముల్డర్ 9; ఫారుఖీ (నాటౌట్) 0; ఎక్స్ ట్రాలు 9; మొత్తం (43.3 ఓవర్లలో ఆలౌట్) 208. వికెట్ల పతనం: 1–16, 2–38, 3–50, 4–50, 5–89, 6–120, 7–142, 8–169, 9– 208, 10–208. బౌలింగ్: యాన్సెన్ 8–1– 32– 1, ఎన్గిడి 8–0–56–2,రబడ 8.3–1–36–3, ముల్డర్ 9–0–36–2, మహరాజ్ 10–0–46–1. చాంపియన్స్ ట్రోఫీలో నేడు ఆ్రస్టేలియా X ఇంగ్లండ్‌వేదిక: లాహోర్ మధ్యాహ్నం గం. 2:30 నుంచి స్టార్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ 18, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
ఛాంపియన్స్ ట్రోఫీలో నేడు (ఫిబ్రవరి 21) మరో ఆసక్తికర పోరు
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో (Champions Trophy) ఇవాళ (ఫిబ్రవరి 21) మరో ఆసక్తికర సమరం జరుగనుంది. టోర్నీలో తొలిసారి అడుగుపెట్టిన ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan).. ఓ సారి ఛాంపియన్ (1998) సౌతాఫ్రికాను (South Africa) ఢీకొట్టనుంది. కరాచీ వేదికగా ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతుంది. గ్రూప్-బిలో భాగంగా ఈ మ్యాచ్ జరుగుతుంది.సౌతాఫ్రికాకు షాకిచ్చిన ఆఫ్ఘనిస్తాన్సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్లు చివరిసారిగా 2024 సెప్టెంబర్‌లో ఎదురెదురుపడ్డాయి. యూఏఈ వేదికగా జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరు జట్లు తలపడ్డాయి. ఆ సిరీస్‌లో సౌతాఫ్రికాకు శృంగభంగం జరిగింది. ఆ సిరీస్‌ను సౌతాఫ్రికన్లు 1-2 తేడాతో కోల్పోయారు. దీనికి ముందు ఇరు జట్లు 2023 వన్డే వరల్డ్‌కప్‌లో తలపడగా.. ఆ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. వన్డేల్లో ఇరు జట్లు ఇప్పటివరకు ఐదు సార్లు తలపడగా.. 3 మ్యాచ్‌ల్లో ఆఫ్ఘనిస్తాన్, 2 మ్యాచ్‌ల్లో సౌతాఫ్రికా విజయాలు సాధించాయి.గతంలో పోలిస్తే ప్రస్తుతం సౌతాఫ్రికా జట్టు పటిష్టంగా ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆ జట్టు ఫుల్ మెంబర్ టీమ్‌తో బరిలోకి దిగింది. అలాగని ఆఫ్ఘనిస్తాన్‌ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఇటీవలి కాలంలో ఆఫ్ఘన్లు పటిష్టమైన జట్లకు షాకిచ్చారు.దక్షిణాఫ్రికా: ర్యాన్ రికెల్టన్(వికెట్‌కీపర్), టోనీ డి జోర్జి, టెంబా బవుమా(కెప్టెన్), ఎయిడెన్ మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్, వియాన్ ముల్డర్, మార్కో జన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగీ ఎంగిడి, తబ్రైజ్ షమ్సీ, ట్రిస్టన్ స్టబ్స్, కొర్బిన్ బాష్, రస్సీ వాన్ డర్ డస్సెన్ఆఫ్ఘనిస్తాన్: రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్‌కీపర్), ఇబ్రహీం జద్రాన్, సెదిఖుల్లా అటల్, రహమత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, గుల్బాదిన్ నాయబ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, ఫజల్హాక్ ఫరూఖీ, నూర్ అహ్మద్, ఫరీద్ అహ్మద్ మాలిక్, ఇక్రమ్ అలీఖిల్, నవీద్ జద్రాన్, నంగేయాలియా ఖరోటేఇదిలా ఉంటే, ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు జరగ్గా రెండు రసవత్తరంగా సాగాయి. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్, ఆతిథ్య జట్టు పాకిస్తాన్‌కు న్యూజిలాండ్ షాకిచ్చింది. ఈ మ్యాచ్‌లో కివీస్ 60 పరుగుల తేడాతో గెలుపొందింది. నిన్న (ఫిబ్రవరి 20) జరిగిన మ్యాచ్‌లో భారత్.. బంగ్లాదేశ్‌ను 6 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో భారత్‌కు అంత ఈజీగా గెలుపు దక్కలేదు. బంగ్లా ఆటగాళ్లు అద్భుతంగా పోరాడారు. -
సౌతాఫ్రికా ప్లేయర్ల పట్ల పాక్ ఆటగాళ్ల దురుసు ప్రవర్తన.. మొట్టికాయలు వేసిన ఐసీసీ
స్వదేశంలో జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్‌లో పాకిస్తాన్ ఆటగాళ్లు ఓవరాక్షన్ చేస్తున్నారు. సౌతాఫ్రికాతో నిన్న (ఫిబ్రవరి 12) జరిగిన మ్యాచ్‌లో షాహీన్ అఫ్రిది (Shaheen Afridi), సౌద్ షకీల్ (Saud Shakeel), కమ్రాన్ గులామ్ (Kamran Ghulam) తమ పరిధులు దాటి ప్రవర్తించారు. ఫలితంగా ఐసీసీ (ICC) ఈ ముగ్గురికి మొట్టికాయలు వేసింది. అఫ్రిది మ్యాచ్ ఫీజ్‌లో 25 శాతం.. షకీల్, గులామ్ మ్యాచ్ ఫీజుల్లో 10 శాతం కోత విధించింది. అలాగే ఈ ముగ్గురికి తలో డీమెరిట్ పాయింట్ కేటాయించింది.పూర్తి వివరాల్లోకి వెళితే.. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 28వ ఓవర్లో పరుగు తీసేందుకు ప్రయత్నించిన సౌతాఫ్రికా బ్యాటర్ మాథ్యూ బ్రీట్జ్కీను షాహీన్ అఫ్రిది ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నాడు. దీంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అఫ్రిది.. బ్రీట్జ్కీను కొట్టేస్తా అన్నట్లు చూశాడు. అతని మీదిమీదికి వెళ్లాడు. అఫ్రిది ఓవరాక్షన్‌ను సీరియస్‌గా తీసుకున్న ఐసీసీ ఆర్టికల్ 2.12 ఉల్లంఘణ కింద చర్యలు తీసుకుంది.ఆ మరుసటి ఓవర్లోనే (29వ ఓవర్) సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమాను రనౌట్ చేసిన ఆనందంలో సౌద్ షకీల్, సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ కమ్రాన్ గులామ్ అత్యుత్సాహం ప్రదర్శించారు. ఔటైన బాధలో వెళ్తున్న బవుమా దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి గెటౌట్ అన్నట్లు రియాక్షన్ ఇచ్చారు. షకీల్, గులామ్‌ల ఓవరాక్షన్‌ను ఫీల్డ్ అంపైర్లే తప్పుబట్టారు. ఈ విషయమై వారి కెప్టెన్ మొహమ్మద్ రిజ్వాన్‌కు కంప్లైంట్ చేశారు. ఐసీసీ ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుని షకీల్, గులామ్‌కు అక్షింతలు వేసింది.కాగా, ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ సంచలన విజయం సాధించింది. సౌతాఫ్రికా నిర్దేశించిన 353 పరుగుల లక్ష్యాన్ని మరో ఓవర్ మిగిలుండగానే ఊదేసింది. పాక్ వన్డే క్రికెట్ చరిత్రలో ఇదే అత్యుత్తమ లక్ష్య ఛేదన. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. బవుమా (82), బ్రీట్జ్కీ (83), క్లాసెన్ (87) అర్ద సెంచరీలతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 352 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్.. మొహమ్మద్ రిజ్వాన్ (122 నాటౌట్), సల్మాన్ అఘా (134) సెంచరీలతో కదంతొక్కడంతో 49 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఈ గెలుపుతో పాక్ ముక్కోణపు సిరీస్‌లో ఫైనల్‌కు చేరింది. రేపు (ఫిబ్రవరి 14) జరుగబోయే ఫైనల్లో పాక్.. న్యూజిలాండ్‌ను ఢీకొట్టనుంది. -
సౌతాఫ్రికాతో వన్డే.. 353 పరుగుల లక్ష్యాన్ని ఊదేసిన పాక్.. ఆల్‌టైమ్ రికార్డు
కరాచీ: చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ముందు సొంతగడ్డపై పాకిస్తాన్ జట్టు అదరగొట్టింది. వన్డే క్రికెట్ చరిత్రలో తమ అత్యధిక లక్ష్యాన్ని ఛేదించింది. ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగిన మూడో మ్యాచ్‌లో ఆతిథ్య పాకిస్తాన్ 6 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. ఈ విజయంతో పాకిస్తాన్ జట్టు ముక్కోణపు టోర్నీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓడిన పాకిస్తాన్... కీలక పోరులో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసింది. కెప్టెన్ తెంబా బవుమా (96 బంతుల్లో 82; 13 ఫోర్లు), హెన్రిచ్ క్లాసెన్ (56 బంతుల్లో 87; 11 ఫోర్లు, 3 సిక్స్‌లు), మాథ్యూ బ్రిజ్కీ (83; 10 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. పాకిస్తాన్ బౌలర్లలో షాహీన్ షా అఫ్రిది 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం 353 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 49 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 355 పరుగులు చేసింది. కెప్టెన్ మొహమ్మద్ రిజ్వాన్ (128 బంతుల్లో 122 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు), సల్మాన్ ఆఘా (103 బంతుల్లో 134; 16 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీలతో విజృంభించారు. ఒక దశలో 91 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన పాక్ జట్టును సల్మాన్‌తో కలిసి రిజ్వాన్ ఆదుకున్నాడు. సఫారీ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న ఈ జోడీ... నాలుగో వికెట్‌కు రికార్డు స్థాయిలో 229 బంతుల్లోనే 260 పరుగులు జోడించింది. ఓపెనర్ ఫఖర్ జమాన్ (28 బంతుల్లో 41; 6 ఫోర్లు, 1 సిక్స్) మెరుపు ఆరంభాన్నిచ్చాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ముల్డర్ 2 వికెట్లు తీశాడు. సల్మాన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి ఫైనల్‌కు చేరిన న్యూజిలాండ్‌తో శుక్రవారం పాకిస్తాన్ తలపడుతుంది.1 వన్డే క్రికెట్ చరిత్రలో పాకిస్తాన్ జట్టుకు ఇదే (353) అత్యధిక పరుగుల ఛేదన. 2022లో ఆ్రస్టేలియాపై చేసిన 349 పరుగుల ఛేదన రెండో స్థానంలో ఉంది. -
ఈ ఏడాది ఐసీసీ ట్రోఫీ సాధిస్తాం.. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ ధీమా
జొహన్నెస్‌బర్గ్: అంతర్జాతీయ క్రికెట్లో దక్షిణాఫ్రికా ఘనాపాఠి అయినా... ఐసీసీ ట్రోఫీల వెలతి మాత్రం ఆ జట్టును వేధిస్తోంది. అయితే ఈ ఏడాది సుదీర్ఘ నిరీక్షణకు తమ జట్టు తెరవేస్తుందని సఫారీ జట్టు మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ ధీమా వ్యక్తం చేశాడు. వచ్చే వారం ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ పాక్‌లో మొదలుకానుంది. జూన్‌లో ఆ్రస్టేలియాతో జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్స్‌కు ఇదివరకే దక్షిణాఫ్రికా అర్హత సాధించింది. ఈ రెండు టోర్నీలు జరుగనున్న నేపథ్యంలో స్మిత్ తమ జట్టు ఈ ఏడాది ఐసీసీ ట్రోఫీ చేజిక్కించుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ గెలుచుకున్న ‘ఎస్ఏటి20’ టోర్నీకి కమిషనర్‌గా వ్యవహరించిన స్మిత్ తమ జట్టు ప్రదర్శనపై గంపెడాశలు పెట్టుకున్నాడు. ‘2027లో సఫారీ ఆతిథ్యమివ్వబోయే వన్డే ప్రపంచకప్‌కు ముందే ఈ ఏడాది ఐసీసీ ట్రోఫీ లోటును భర్తీ చేసుకుంటాం. చాంపియన్స్ ట్రోఫీ, డబ్ల్యూటీసీలను గెలుచుకుంటే రెట్టించిన ఉత్సాహంతో సొంతగడ్డపై ప్రపంచకప్ ఆడేందుకు ఊతమిస్తుంది’ అని అన్నాడు. తదుపరి రెండేళ్లలో తమ దేశంలో స్టేడియాల నవీకరణ, పిచ్‌ల స్థాయి పెంచే పనులు జరుగుతాయని, దీంతో తదుపరి వన్డే మెగా ఈవెంట్ (2027)లో సొంత ప్రేక్షకుల మధ్య హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతామని చెప్పాడు. గతేడాది జరిగిన పురుషుల, మహిళల టి20 ప్రపంచకప్‌లలో దక్షిణాఫ్రికా షరామామూలుగా ఫైనల్ మెట్టుపై చతికిలబడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. విండీస్ గడ్డపై రోహిత్ బృందం సఫారీ జట్టును ఓడించే టైటిల్ నెగ్గింది. ఈ ఏడాది అండర్–19 మహిళల టి20 ప్రపంచకప్‌లో తెలంగాణ యువతేజం గొంగడి త్రిష ఆల్‌రౌండ్ షోతో భారత జట్టు దక్షిణాఫ్రికాను చిత్తు చేసి టైటిల్‌ను నిలబెట్టుకుంది. దీంతో దక్షిణాఫ్రికాపై ‘చోకర్స్’ ముద్ర మరింత బలంగా పడింది. అయితే ముద్రను తమ జట్టు త్వరలోనే చెరిపేస్తుందని మాజీ కెప్టెన్ స్మిత్ అన్నాడు. ఇప్పుడు క్రికెట్లో ఏదీ అంత సులువుగా రాదని, దేనికైనా పోరాడాల్సిందేనని చెప్పుకొచ్చాడు. టి20లకు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పెరుగుతోందని, ఆలాగే సంప్రదాయ టెస్టు ప్రభ కోల్పోకూడదనుకుంటే... కనీసం 6, 7 జట్లు గట్టి ప్రత్యర్థులుగా ఎదగాల్సి ఉంటుందన్నాడు. అప్పుడే పోటీ పెరిగి టెస్టులూ ఆసక్తికరంగా సాగుతాయన్నాడు. -
దక్షిణాఫ్రికాతో కయ్యానికి కారణాలేంటి?
కొత్తగా దక్షిణాఫ్రికాతో తగువు ప్రారంభించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. అందుకు ఆరంభం ఫిబ్రవరి 3న జరిగింది. దానికి ఆయన చెప్తున్న కారణాలు మూడు: ఒకటి, అక్కడి శ్వేతజాతీయుల భూములను సిరిల్ రామఫోసా ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటున్నది. రెండు– తెల్లవారిపట్ల వివక్ష చూపుతున్నది. మూడు– అమెరికాపై, దాని మిత్ర దేశాలపై అంతర్జాతీయంగా వ్యతిరేక వైఖరి తీసుకుంటున్నది. ఇవిగాక, తెల్లవారి విషయంలో ‘చాలా చెడ్డ పనులు చేస్తున్నది’ అని కూడా అన్నారాయన. దక్షిణాఫ్రికాలోని తీవ్ర వాద శ్వేతజాతీయుల సంస్థలు కొన్ని తమపై ‘సామూహిక హత్యా కాండలు సాగుతున్నట్లు’ 1994లో అక్కడ వర్ణ వివక్ష (అపార్థీడ్’) ముగిసినప్పటి నుంచి ఆరోపిస్తూనే ఉన్నాయి. ‘చెడ్డ పనులు’ అనటంతో ట్రంప్ ఉద్దేశం అదేనేమో తెలియదు.భూమి చట్టంతో మొదలు...ఈ విధమైన ఆరోపణలు చేసిన అమెరికా అధ్యక్షుడు ఆ విషయమై విచారణలు చేస్తున్నామనీ, అవి నిజమైతే దక్షిణాఫ్రికాకు తమ సహాయాన్ని నిలిపి వేయగలమనీ హెచ్చరించారు. ఆరోపణలు నిజమని తేలితే చర్యలు తీసుకోవటం వేరు. అంతకన్నా ముందే సహాయం ఆపివేయటం వంటి చర్యలు మొదలై పోయాయి. జీ–20కి ప్రస్తుతం అధ్యక్షత వహిస్తున్న రామఫోసా త్వరలో జొహాన్నెస్‌బర్గ్‌లో నిర్వహించనున్న శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనబోవటం లేదని అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో ప్రకటించేశారు. హెచ్ఐవీ చికిత్సల కోసం తాము చేసే ఆరోగ్య సహాయాన్ని ట్రంప్ ఆపివేశారు. దక్షిణాఫ్రికాలోనే పుట్టి పెరిగిన ట్రంప్ ముఖ్య సలహా దారు ఎలాన్ మస్క్, ట్రంప్ తరహా ఆరోపణలు, హెచ్చరికలు రెండు రోజులకొకసారి చేస్తున్నారు. దక్షిణాఫ్రికా శరణార్థుల కోసం శిబిరాలు సిద్ధం చేయాలంటూ ట్రంప్ తమ అధికారులను ఆదేశించారు కూడా! మరొకవైపు, అమెరికా అధ్యక్షుని ఆరోపణలలో ఎంతమాత్రం నిజం లేదని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు తోసిపుచ్చారు. ఆఫ్రికాలోగల తీవ్రమైన భూమి సమస్యల దృష్ట్యా ‘నిరుపయోగం’గా ఉన్న భూముల స్వాధీనానికి రామఫోసా ప్రభుత్వం గత నెల ఒక చట్టం చేసింది. నిజానికి ఇటువంటి చట్టాన్ని స్వయంగా అమెరికా కూడా 5వ రాజ్యాంగ సవరణ ద్వారా చేసిన విషయాన్ని రామఫోసా గుర్తు చేస్తున్నారు. ఇండియా మొదలైన అనేక దేశాలలోనూ ఈ చట్టాలు న్నాయి. ఇక తెల్లవారి పట్ల వివక్షలు, హత్యాకాండలున్నట్లు వారి సంస్థలు ఆరోపణలు చేయటం మినహా ఎటువంటి ఆధారాలూ చూపటం లేదు. ఈ మాట రామఫోసా ప్రభుత్వమే కాదు, దక్షిణాఫ్రి కాకు చెందిన ప్రజాస్వామిక శ్వేతజాతి వర్గాలు, పార్టీలు, పాశ్చాత్య దేశాలకు చెందిన ప్రముఖ మీడియా సంస్థలు అంటున్నదే! అట్లాంటి దేమీ లేదని నేను స్వయంగా అక్కడికి వెళ్లినపుడు గమనించాను.అటువంటి స్థితిలో ట్రంప్ విపరీత వైఖరికి కారణమేమిటి? ప్రధానంగా ఆయన శ్వేతజాతి దురహంకారి కావటమనిపిస్తున్నది. తను మొదటిసారి అధికారంలో ఉన్నప్పుడు (2017–21) కూడా రక రకాల ఆరోపణలు చేశారు. అప్పటికి దక్షిణాఫ్రికాలో ఈ చట్టం లేదు. దక్షిణాఫ్రికాకు చెందిన శ్వేతజాతి తీవ్రవాద సంస్థలు తరచుగా అమె రికా సహా పాశ్చాత్య దేశాలకు వెళ్లి లాబీయింగ్‌లు చేస్తుండేవారు. వారి వాదనలను డెమోక్రాట్లు, రిపబ్లికన్ల ప్రభుత్వాలు పట్టించు కోలేదు. తమ వంటి లక్షణాలు గల ట్రంప్ అధికారానికి వచ్చిన తర్వా తనే అందుకు విలువ ఇస్తున్నారు. ఇందుకు ఈసారి మరొక మూడు కారణాలు చేరాయి. ఒకటి– గాజాలో ఇజ్రాయెల్ మారణ కాండపై ప్రపంచంలో మొదట దక్షిణాఫ్రికాయే చొరవ తీసుకుని అంతర్జా తీయ న్యాయస్థానం (ఐసీజే)లో కేసు వేయటం. రెండు– అమెరికా ఆధిపత్యాన్ని తగ్గించి బహుళ ధ్రువ ప్రపంచం కోసం ప్రయత్నిస్తున్న బ్రిక్స్ కూటమిలో దక్షిణాఫ్రికా భాగస్వామి కావటం. మూడు– ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ కంపెనీలో 30 శాతం భాగస్వామ్యాన్ని స్థానిక నల్లవారికి ఇవ్వాలన్న షరతు. వాస్తవానికి ఇటువంటి భాగ స్వామ్య నిబంధన అక్కడి టెలికాం లైసెన్సింగ్ చట్టంలో గతం నుంచి ఉంది. తనను మినహాయించాలన్నది మస్క్ వాదన. దానిని ట్రంప్ బలపరుస్తున్నారు. దక్షిణాఫ్రికా ప్రభుత్వంనిరాకరిస్తున్నది.అన్నీ ఉన్నా వివక్షేనా?పోతే, 1994లో అపార్థీడ్, శ్వేతజాతి పాలన ముగిసిన 30 సుదీర్ఘ సంవత్సరాల తర్వాత ఇటువంటి భూమి చట్టం ఎందుకు చేయవలసి వచ్చిందన్నది అర్థం చేసుకోవలసిన విషయం. యూరోపియన్లు దక్షిణాఫ్రికాకు రావటం 1600వ సంవత్సరంలో మొదలు కాగా, వారు భూములను అత్యధిక భాగం ఆక్రమించుకున్నారు. వేర్వేరు యూరోపియన్ల మధ్య కూడా కొంతకాలం ఆధిపత్య యుద్ధాలు జరగగా చివరకు అందరూ కలిసి 1948లో శ్వేతజాతి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అంతకుముందే 1913, 1936లో భూమి చట్టాలు చేసి, మొత్తం భూములలో 87 శాతం తెల్లవారికి రిజర్వ్ చేశారు. ఆ పరిస్థితి 1994లో నల్లవారి ప్రభుత్వం ఏర్పడినా కొనసాగుతూనే వచ్చింది. ఇంకా చెప్పాలంటే, వివిధ కారణాల వల్ల ఆఫ్రికన్ రైతుల కొద్దిపాటి భూములు కూడా క్రమంగా శ్వేతజాతీయుల పరం కాసాగాయి. ఇది నేను అక్కడి ప్రభుత్వ రికార్డులను బట్టి స్వయంగా గమనించిన విషయం. ట్రంప్ తన ప్రకటనలో, తెల్లవారిలోని ఆఫ్రికానర్ల ప్రస్తావన ప్రత్యేకంగా చేశారు. హాలండ్, ఫ్రాన్స్ నుంచి వలస వచ్చిన జాతీయులను ‘ఆఫ్రికానర్లు’ అంటారు. అక్కడి జనాభాలో వారి శాతం కేవలం నాలుగు. భూములలో అధిక భాగం, ఆర్థిక వ్యవస్థలో గణనీయమైన భాగం వారి అధీనంలోనే ఉన్నాయి. అయినా వివక్ష అని మాట్లాడతారు. ఉదాహరణకు అక్కడ నేనుమౌంటేన్ ఫాక్స్ అనే పేరిట గల డచ్ వారి వ్యవసాయ క్షేత్రాన్ని చూశాను. ఆ కుటుంబానికి 740 ఎకరాలకు పైగా ఉంది. సొంత వైన్ యార్డ్, అందులో పండించే ద్రాక్షతో సొంత బ్రాండ్ సారాయి ఉన్నాయి. కొన్ని వాహనాలతో రవాణా కంపెనీ ఉంది. ఒక మధ్య తరహా హోటల్, ఒక బొటిక్ ఉన్నాయి. అయినా తమ ఆఫ్రికానర్ల పట్ల వివక్ష ఉందని వాపోతూ హాలండ్‌కు తిరిగి వెళ్లిపోవాలనుకుంటున్నట్లు చెప్పారు. అందుకు కారణం? తమ పిల్లవాడు ఇంజనీరింగ్ చేసి ప్రభుత్వ ఉద్యోగం కోసం వెళితే, అక్కడి కోటాల ప్రకారం ఆ ఉద్యోగం ఒక నల్లవాడికి ఇచ్చారట! అదీ వారనే వివక్ష. ఒక్కొక్కరి వద్ద వేలాది ఎకరాలుండటాన్ని, రహదారుల వెంట ఎంతదూరం వెళ్లినా కంచెలు వేసి పడావు పడటాన్ని చూశాను. పేదరికం వల్ల కొద్దిపాటి భూములు కూడా అమ్ముకుని నగరాలకు వలస వస్తూ చిల్లర పనులతో జీవిస్తున్న నల్లవారినీ కలిసి మాట్లాడాను.ఈ పరిస్థితులలో నల్లవారికి భూమి అన్నది తీవ్రమైన సమస్యగా ఉండిపోయింది. దానితో ముడిబడిన పేదరికం వల్ల అసంతృప్తి పెరుగుతున్నది. 30 ఏళ్ల తర్వాత ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ (ఏఎన్సీ) మొదటిసారిగా సొంత మెజారిటీ కోల్పోవటానికి ఇది ఒక ప్రధాన కారణం. అందువల్ల రామఫోసా ప్రభుత్వం ఈ చట్టాన్ని చేయటం అనివార్యమైంది. అయినప్పటికీ అమెరికా అధ్యక్షుడు దక్షిణాఫ్రికా ‘మానవ హక్కులను హరిస్తున్న’దనే గొప్ప మాట అన్నారు. అపార్థీ డ్‌ను అమెరికా ఎప్పుడూ వ్యతిరేకించలేదు. గాజా, కెనడా, గ్రీన్లాండ్, పనామా వంటి ఇతర దేశాలను ఆక్రమించుకోగలమని బాహాటంగా ప్రకటించే ట్రంప్, తెల్లవారి భూమి హక్కులంటూ ఇంతగా మాట్లాడటాన్ని బట్టి ఆయన తత్త్వం అర్థం చేసుకోవచ్చు.అయితే, తాము బెదిరి లొంగబోమనీ, తమ ప్రజలకు అవసర మైంది చేస్తామనీ రామఫోసా తమ పార్లమెంటులో స్పష్టం చేశారు. ఆ దేశం ఆఫ్రికా ఖండంలో పారిశ్రామికంగా అన్నింటికన్నా పెద్దది. బ్రిక్స్ కూటమిలో ప్రముఖ దేశం. ఇప్పటికే ఉత్తర అమెరికా, యూరప్, లాటిన్ అమెరికా, ఆసియా ఖండాల దేశాలతో తగవుకు దిగిన ట్రంప్, ఆఫ్రికాలోనూ అదే ధోరణి చూపటం వల్ల అంతిమంగా అమెరికాకు కలగగల నష్టాల గురించి ఆలోచిస్తున్నట్లు లేదు.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
క్రికెట్ చరిత్రలో అరుదైన ఘటన
అంతర్జాతీయ క్రికెట్లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. పాకిస్తాన్ ట్రై సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో నిన్న (ఫిబ్రవరి 10) జరిగిన మ్యాచ్‌లో ప్లేయర్లు లేక సౌతాఫ్రికా జట్టు ఫీల్డింగ్ కోచ్‌ను బరిలోకి దించింది. మెజార్టీ శాతం ఆటగాళ్లు సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఇరుక్కుపోవడంతో ఈ టోర్నీలో సౌతాఫ్రికాకు ఆటగాళ్ల కొరత ఏర్పడింది. ఈ టోర్నీ కోసం సౌతాఫ్రికా సెలెక్టర్లు కేవలం 12 మంది సభ్యుల జట్టును మాత్రమే ఎంపిక చేశారు. ఈ 12లోనూ ఇద్దరు ఆటగాళ్లు ఎమర్జెన్సీ మీద మైదానాన్ని వీడటంతో ఆ జట్టు ఫీల్డింగ్ కోచ్ వాండిలే గ్వావు తప్పనిసరి పరిస్థితుల్లో సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా బరిలోకి దిగాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతాయి. అయితే ఇలాంటి ఘటన సౌతాఫ్రికాకు మాత్రం కొత్తేమీ కాదు. గత సీజన్లో అబుదాబీలో జరిగిన ఓ మ్యాచ్‌లో ఆ జట్టు ఆటగాళ్లు అస్వస్థతకు గురికావడంతో బ్యాటింగ్ కోచ్ జేమీ డుమినీ సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా బరిలోకి దిగాడు.We don’t see that happening too often! 😅South Africa’s fielding coach Wandile Gwavu came on as a substitute fielder during the New Zealand innings! 👀#TriNationSeriesonFanCode pic.twitter.com/ilU5Zj2Xxn— FanCode (@FanCode) February 10, 2025ఈ విషయాన్ని పక్కన పెడితే.. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికాను న్యూజిలాండ్ 6 వికెట్ల తేడాతో ఓడించి, ఫైనల్‌కు చేరింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. అరంగట్రేం ఆటగాడు మాథ్యూ బ్రీట్జ్కీ (150) శతక్కొట్టడంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. ఈ సెంచరీతో బ్రీట్జ్కీ వన్డే అరంగేట్రంలో 150 పరుగుల మార్కును తాకిన తొలి బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో వియాన్ ముల్దర్ (64) అర్ద సెంచరీతో.. జే స్మిత్ (41) ఓ మోస్తరు స్కోర్లతో రాణించారు. కెప్టెన్ బవుమా (20), కైల్ వెర్రిన్ (1), ముత్తుసామి (2) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ, విలియమ్ ఓరూర్కీ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. బ్రేస్‌వెల్‌కు ఓ వికెట్ దక్కింది.అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్.. కేన్ విలియమ్సన్ (133) అజేయ శతకంతో విరుచుకుపడటంతో మరో 8 బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. డెవాన్ కాన్వే (97) తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నప్పటికీ.. న్యూజిలాండ్ గెలుపుకు గట్టి పునాది వేశాడు. విలియమ్సన్.. గ్లెన్ ఫిలిప్స్‌తో కలిసి (28 నాటౌట్) న్యూజిలాండ్‌ను గెలుపు తీరాలు దాటించాడు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో విల్ యంగ్ 19, డారిల్ మిచెల్ 10, టామ్ లాథమ్ డకౌటయ్యారు.సౌతాఫ్రికా బౌలర్లలో ముత్తుసామి 2, ఈథన్ బాష్, జూనియర్ డాలా తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో సెంచరీ చేసిన విలియమ్సన్ వన్డేల్లో అత్యంత వేగంగా 7000 పరుగులు పూర్తి చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఈ టోర్నీలో రేపు (ఫిబ్రవరి 12) జరుగబోయే మ్యాచ్‌లో (పాకిస్తాన్ వర్సెస్ సౌతాఫ్రికా) విజేత ఫిబ్రవరి 14న జరిగే ఫైనల్లో న్యూజిలాండ్‌తో తలపడుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాకిస్తాన్లో జరుగుతున్న టోర్నీ కావడంతో ఈ టోర్నీకి ప్రాధాన్యత సంతరించుకుంది. -
విలియమ్సన్ వీరోచితం
లాహోర్: ముక్కోణపు వన్డే టోర్నమెంట్లో రెండు వరుస విజయాలతో న్యూజిలాండ్ జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. తొలి పోరులో ఆతిథ్య జట్టు పాకిస్తాన్‌ను చిత్తు చేసిన కివీస్ రెండో లీగ్ మ్యాచ్‌లో సఫారీలను ఓడించింది. సోమవారం జరిగిన ఈ పోరులో న్యూజిలాండ్ 6 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌తోనే వన్డేల్లో అరంగేట్రం చేసిన మాథ్యూ బ్రీజ్కీ (148 బంతుల్లో 150; 11 ఫోర్లు, 5 సిక్స్‌లు) శతకంతో చెలరేగాడు. కెరీర్ తొలి వన్డేలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా బ్రీజ్కీ ఘనత సాధించాడు. వియాన్ ముల్డర్ (60 బంతుల్లో 64; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ చేయగా, జేసన్ స్మిత్ (51 బంతుల్లో 41; 1 ఫోర్, 2 సిక్స్‌లు) రాణించాడు. అనంతరం న్యూజిలాండ్ 48.4 ఓవర్లలో 4 వికెట్లకు 308 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కేన్ విలియమ్సన్ (113 బంతుల్లో 133 నాటౌట్; 13 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపు సెంచరీ సాధించగా... ఓపెనర్ డెవాన్ కాన్వే (107 బంతుల్లో 97; 9 ఫోర్లు, 1 సిక్స్) త్రుటిలో చేజార్చుకున్నాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 187 పరుగులు జోడించారు. 2019 వన్డే వరల్డ్ కప్ తర్వాత విలియమ్సన్కు ఇదే మొదటి శతకం కావడం విశేషం. దాదాపుగా ద్వితీయ శ్రేణి జట్టుతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాకు వన్డేల్లో ఇది వరుసగా ఐదో ఓటమి. బ్రీజ్కీతో పాటు మరో ముగ్గురు బౌలర్లు ఈథన్ బాష్, సెనురాన్ ముత్తుసామి, మిహ్లాలి ఎంపొంగ్వానా ఇదే వన్డేతో అరంగేట్రం చేశారు. దాంతో జట్టు బౌలింగ్ బలహీనంగా మారిపోయింది. బుధవారం పాకిస్తాన్, దక్షిణాఫ్రికా మధ్య జరిగే మ్యాచ్ ఫలితం తర్వాత న్యూజిలాండ్‌తో ఫైనల్లో తలపడే జట్టేదో తేలుతుంది. 150: దక్షిణాఫ్రికా క్రికెటర్ మాథ్యూ బ్రీజ్కీ అరంగేట్రం వన్డేలో చేసిన స్కోరు. ఆడిన తొలి వన్డేలోనే అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ప్లేయర్‌గా బ్రీజ్కీ నిలిచాడు. 47 ఏళ్లుగా వెస్టిండీస్ ప్లేయర్ డెస్మండ్ హేన్స్ పేరిట ఉన్న రికార్డును బ్రీజ్కీ బద్దలు కొట్టాడు. 1978లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో హేన్స్ 148 పరుగులు సాధించాడు. 4: బరిలో దిగిన తొలి వన్డేలోనే సెంచరీ చేసిన నాలుగో దక్షిణాఫ్రికా క్రికెటర్‌గా బ్రీజ్కీ గుర్తింపు పొందాడు. గతంలో కొలిన్ ఇంగ్రామ్ (124; జింబాబ్వేపై 2010లో), తెంబా బవూమా (113; ఐర్లాండ్‌పై 2016లో), రీజా హెన్డ్రిక్స్ (102; శ్రీలంకపై 2018లో) ఈ ఘనత సాధించారు. 2: దక్షిణాఫ్రికాపై సెంచరీ చేసిన క్రమంలో న్యూజిలాండ్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ వన్డేల్లో 7000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తక్కువ ఇన్నింగ్స్‌లలో 7 వేల పరుగులు పూర్తి చేసిన రెండో క్రికెటర్‌గా విలియమ్సన్ (159 ఇన్నింగ్స్) నిలిచాడు. ఈ జాబితాలో హాషిమ్ ఆమ్లా (150 ఇన్నింగ్స్) తొలి స్థానంలో ఉన్నాడు. -
అరంగేట్రంలోనే శతక్కొట్టిన సౌతాఫ్రికా ఓపెనర్.. వరల్డ్ రికార్డు
సౌతాఫ్రికా ఓపెనర్ (South Africa Opener) మాథ్యూ బ్రీట్జ్కీ (Matthew Breetzke) వన్డే అరంగేట్రంలోనే (ODI Debut) సెంచరీతో మెరిశాడు. పాకిస్తాన్ ట్రై సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో ఇవాళ (ఫిబ్రవరి 10) జరుగుతున్న మ్యాచ్‌లో బ్రీట్జ్కీ ఈ ఫీట్‌ను సాధించాడు. అరంగేట్రంలోనే సెంచరీ సాధించిన 19వ ఆటగాడిగా, నాలుగో సౌతాఫ్రికన్ ప్లేయర్‌గా బ్రీట్జ్కీ రికార్డుబుక్కుల్లోకెక్కాడు. బ్రీట్జ్కీకి ముందు డెన్నిస్ అమిస్ (ఇంగ్లండ్), డెస్మండ్ హేన్స్ (విండీస్), ఆండీ ఫ్లవర్ (జింబాబ్వే), సలీం ఇలాహి (పాకిస్తాన్), మార్టిన్ గప్తిల్ (న్యూజిలాండ్), కొలిన్ ఇంగ్రామ్ (సౌతాఫ్రికా), రాబర్ట్ నికోల్ (న్యూజిలాండ్), ఫిల్ హ్యూస్ (ఆస్ట్రేలియా), మైఖేల్ లంబ్ (ఇంగ్లండ్), మార్క్ చాప్మన్ (న్యూజిలాండ్), కేఎల్ రాహుల్ (ఇండియా), టెంబా బవుమా (సౌతాఫ్రికా), ఇమామ్ ఉల్ హార్ (పాకిస్తాన్), రీజా హెండ్రిక్స్ (సౌతాఫ్రికా), ఆబిద్ అలీ (పాకిస్తాన్), రహ్మానుల్లా గుర్బాజ్ (ఆఫ్ఘనిస్తాన్), మైఖేల్ ఇంగ్లిష్ (స్కాట్లాండ్), అమీర్ జాంగూ (వెస్టిండీస్) వన్డే అరంగేట్రంలోనే సెంచరీలు చేశారు.వన్డే అరంగేట్రంలనే సెంచరీలు చేసిన సౌతాఫ్రికా ఆటగాళ్లు..కొలిన్ ఇంగ్రామ్ 2010లో జింబాబ్వేపైటెంబా బవుమా 2016లో ఐర్లాండ్పైరీజా హెండ్రిక్స్ 2018లో శ్రీలంకపైమాథ్యూ బ్రీట్జ్కీ 2025లో న్యూజిలాండ్పైతటస్థ వేదికపై వన్డే అరంగ్రేటంలో సెంచరీ చేసిన ఆటగాళ్లు..ఆండీ ఫ్లవర్ 1992లో శ్రీలంకపైఇమామ్ ఉల్ హాక్ 2017లో శ్రీలంకపైఆబిద్ అలీ 2018లో ఆస్ట్రేలియాపైరహ్మానుల్లా గుర్బాజ్ 2021లో ఐర్లాండ్పైమాథ్యూ బ్రీట్జ్కీ 2025లో న్యూజిలాండ్పైబ్రీట్జ్కీ ప్రపంచ రికార్డున్యూజిలాండ్తో మ్యాచ్‌లో 148 బంతులు ఎదుర్కొన్న బ్రీట్జ్కీ 11 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 150 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ ప్రదర్శనతో బ్రీట్జ్కీ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. వన్డే అరంగేట్రంలో 150 పరుగులు చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. గతంలో వన్డే అరంగేట్రంలో 150 పరుగులు ఎవ్వరూ స్కోర్ చేయలేదు. ఈ మ్యాచ్‌కు ముందు వన్డే అరంగేట్రంలో అత్యధిక స్కోర్ రికార్డు విండీస్ దిగ్గజం డెస్మండ్ హేన్స్ పేరిట ఉండింది. హేన్స్ తన వన్డే డెబ్యూలో 148 పరుగులు స్కోర్ చేశాడు. తాజా ప్రదర్శనతో వన్డే అరంగేట్రంలో అత్యధిక స్కోర్ రికార్డు కూడా బ్రీట్జ్కీ ఖాతాలోకి చేరింది.న్యూజిలాండ్‌తో మ్యాచ్ విషయానికొస్తే.. సౌతాఫ్రికా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. మాథ్యూ బ్రీట్జ్కీ (150) అరంగేట్రంలోనే సెంచరీతో కదంతొక్కగా.. వియాన్ ముల్దర్ (64) అర్ద సెంచరీతో రాణించాడు. జేసన్ స్మిత్ (41) పర్వాలేదనిపించాడు. టెంబా బవుమా 20, కైల్ వెర్రిన్ 1, సెనూరన్ ముత్తుసామి 2 పరుగులు చేసి ఔటయ్యారు.న్యూజిలాండ్ బౌలర్లలో విలియమ్ ఓరూర్కీ, మ్యాట్ హెన్రీ తలో రెండు వికెట్లు.. మైఖేల్ బ్రేస్‌వెల్ ఓ వికెట్ పడగొట్టారు. -
జీ20 మంత్రుల భేటీకి అమెరికా దూరం
వాషింగ్టన్: దక్షిణాఫ్రికాలో ఈనెలలో జరిగే జీ–20 దేశాల విదేశాంగ మంత్రుల సమావేశానికి అమెరికా తరఫున ఎవరూ హాజరుకాబోరని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో బుధవారం ప్రకటించారు. ఈ నెల 20, 21 తేదీల్లో జొహన్నెస్‌బర్గ్‌లో జరిగే విదేశాంగ మంత్రుల జీ20 చర్చలను బహిష్కరిస్తున్నట్లు రూబియో చెప్పారు. దక్షిణాఫ్రికా ప్రభుత్వం అమెరికా వ్యతిరేక ఎజెండాతో వ్యవహరిస్తున్నందువల్లే సమావేశానికి దూరంగా ఉంటున్నట్లు వెల్లడించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న అమెరికా గైర్హాజరు జీ20 కూటమికి పెద్ద దెబ్బే. ఉక్రెయిన్ యుద్ధంపై దౌత్యానికి ట్రంప్ మొగ్గుచూపుతున్న విదేశాంగ మంత్రుల భేటీలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్తో రూబియో తొలిసారిగా భేటీ అవుతారని అంతా అనుకుంటున్న వేళ అసలు అమెరికా ఈ సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయించిందని రూబియో ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. -
పాకిస్తాన్లో జరిగే ట్రై సిరీస్ కోసం సౌతాఫ్రికా జట్టు ప్రకటన
ఛాంపియన్స్ ట్రోఫీకి (Champions Trophy 2025) ముందు పాకిస్తాన్లో జరిగే ట్రయాంగులర్ సిరీస్ (Tri Series) (తొలి మ్యాచ్‌కు మాత్రమే) కోసం 12 మంది సభ్యుల సౌతాఫ్రికా (South Africa) జట్టును ఇవాళ (ఫిబ్రవరి 5) ప్రకటించారు. ఈ జట్టుకు ఆరుగురు అన్క్యాప్డ్ ప్లేయర్లు ఎంపికయ్యారు. జట్టుకు సారధిగా టెంబా బవుమా (Temba Bavuma) వ్యవహరిస్తాడు. SA20-2025 నేపథ్యంలో ట్రై సిరీస్‌లో తొలి మ్యాచ్‌కు చాలామంది సౌతాఫ్రికా ఆటగాళ్లు అందుబాటులో లేరు. ఈ లీగ్ ఫిబ్రవరి 8తో ముగుస్తుంది. ఆ లోపు చాలామంది సీనియర్ ఆటగాళ్లు జట్టుతో జాయిన్ అవుతారు. ట్రై సిరీస్‌లో సౌతాఫ్రికా తమ తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 10న ఆడుతుంది. లాహోర్ వేదికగా జరిగే ఆ మ్యాచ్‌లో సౌతాఫ్రికా.. న్యూజిలాండ్‌తో తలపడుతుంది.న్యూజిలాండ్‌తో వన్డే కోసం ఎంపికైన అన్క్యాప్డ్ ప్లేయర్లలో మాథ్యూ బ్రీట్జ్కే, మీకా-ఈల్ ప్రిన్స్, గిడియన్ పీటర్స్, ఈతన్ బాష్, సెనురన్ ముత్తుసామి, మిహ్లాలి ఎంపోంగ్వానా ఉన్నారు. గాయం కారణంగా సౌతాఫ్రికా టీ20 లీగ్ మొత్తానికి దూరమైన స్టార్ ఫాస్ట్ బౌలర్ గెరాల్డ్ కొయెట్జీ ట్రై సిరీస్‌తో రీఎంట్రీ ఇస్తున్నాడు. SA20-2025 నుంచి ఇదివరకే ఎలిమినేట్ అయిన డర్బన్ సూపర్ జెయింట్స్ సభ్యులు కేశవ్ మహారాజ్, ఎయిడెన్ మార్క్రమ్ కూడా న్యూజిలాండ్‌తో వన్డేకు అందుబాటులో లేరు. ఈ ఇద్దరు ఫిబ్రవరి 12న పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌కు అందుబాటులో ఉంటారు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు, ఆతర్వాత జరిగే ఫైనల్ (ఒకవేళ క్వాలిఫై అయితే) కోసం సౌతాఫ్రికా జట్టును ఫిబ్రవరి 9న ప్రకటిస్తారు.ఇదిలా ఉంటే, ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపికైన మార్కో జన్సెన్, డేవిడ్ మిల్లర్, కగిసో రబాడ, ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, రస్సీ వాన్ డర్ డస్సెన్ ఫిబ్రవరి 14న పాకిస్తాన్‌కు పయనిస్తారు. వీరు ట్రై సిరీస్‌లో పాల్గొనరని తెలుస్తుంది. ట్రై సిరీస్‌లో ఫైనల్ మ్యాచ్ ఫిబ్రవరి 14న జరుగుతుంది.ట్రై సిరీస్‌లోని తొలి మ్యాచ్ (న్యూజిలాండ్) కోసం సౌతాఫ్రికా జట్టు..టెంబా బవుమా (కెప్టెన్), ఈథన్ బాష్, మాథ్యూ బ్రీట్జ్కే, గెరాల్డ్ కొయెట్జీ, జూనియర్ డాలా, వియాన్ ముల్డర్, మిహ్లాలి మ్పోంగ్వానా, సెనురన్ ముత్తుసామి, గిడియన్ పీటర్స్, మీకా-ఈల్ ప్రిన్స్, జాసన్ స్మిత్, కైల్ వెర్రెయిన్ట్రై సిరీస్ షెడ్యూల్..ఫిబ్రవరి 8-పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ (లాహోర్)ఫిబ్రవరి 10- న్యూజిలాండ్ వర్సెస్ సౌతాఫ్రికా (లాహోర్)ఫిబ్రవరి 12- పాకిస్తాన్ వర్సెస్ సౌతాఫ్రికా (కరాచీ)ఫిబ్రవరి 14- ఫైనల్ (కరాచీ)ఛాంపియన్స్ ట్రోఫీ కోసం సౌతాఫ్రికా జట్టు..టెంబా బవుమా (కెప్టెన్), టోనీ డి జోర్జి, డేవిడ్ మిల్లర్, ఎయిడెన్ మార్క్రమ్, రస్సీ వాన్ డర్ డస్సెన్, మార్కో జన్సెన్, వియాన్ ముల్దర్, ర్యాన్ రికెల్టన్, హెన్రిచ్ క్లాసెన్, ట్రిస్టన్ స్టబ్స్, కగిసో రబాడ, కేశవ్ మహారాజ్, తబ్రేజ్ షంషి, లుంగి ఎంగిడి -
సౌతాఫ్రికా క్రికెట్ టీమ్‌కు అభిమానిగా ఉండటం చాలా కష్టం..!
టన్నుల కొద్ది టాలెంట్ ఉన్నా గ్రాము అదృష్టం కూడా లేని క్రికెట్ జట్టు ఏదైనా ఉందా అంటే అది దక్షిణాఫ్రికా (South Africa) జట్టే అని చెప్పాలి. ఇటీవలికాలంలో ఐసీసీ టోర్నీల్లో ఆ జట్టు ప్రదర్శన చూస్తే ఇది వందకు వంద శాతం నిజం అనిపిస్తుంది. జెండర్‌తో, ఫార్మాట్‌తో సంబంధం లేకుండా ఆ జట్టు ఇటీవలికాలంలో వరుసగా మెగా టోర్నీల ఫైనల్స్‌లో ఓడుతుంది. రెండేళ్ల వ్యవధిలో సౌతాఫ్రికా పురుషుల, మహిళల జట్లు నాలుగు టీ20 వరల్డ్‌కప్ ఫైనల్స్‌లో ఓడాయి. 2023 మహిళల టీ20 వరల్డ్‌కప్ (T20 World Cup) ఫైనల్స్‌లో తొలిసారి ఓడిన సౌతాఫ్రికా... ఆ మరుసటి ఏడాది పురుషులు, మహిళల టీ20 వరల్డ్‌కప్ ఫైనల్స్ ఓటమి చవిచూసింది. తాజాగా ఆ దేశ మహిళల అండర్-19 జట్టు.. టీ20 వరల్డ్‌కప్ ఫైనల్స్‌లో భారత్ (Team India) చేతిలో పరాజయంపాలైంది.టీ20 వరల్డ్‌కప్ ఫైనల్స్‌లో వరుస పరాజయాల నేపథ్యంలో సౌతాఫ్రికా క్రికెట్ జట్లపై సానుభూతి వెల్లువెత్తుతుంది. నెటిజన్లు సౌతాఫ్రికా క్రికెట్ టీమ్‌లపై తెగ జాలి చూపుతున్నారు. ఏ జట్టుకైనా అభిమానిగా ఉండవచ్చు కానీ.. వరుస ఫైనల్స్‌లో ఓడుతున్న సౌతాఫ్రికా క్రికెట్ టీమ్‌లకు అభిమానిగా ఉండటం మాత్రం చాలా కష్టమని అంటున్నారు. సౌతాఫ్రికా క్రికెట్ జట్లకు గతంలో సెమీఫైనల్ ఫోబియా ఉండేది. ప్రస్తుతం అది పోయి ఫైనల్ ఫోబియా పట్టుకున్నట్లుంది. సౌతాఫ్రికా పురుషుల క్రికెట్ జట్టు త్వరలో మరో మెగా ఈవెంట్ ఫైనల్స్‌లో (వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 ఫైనల్స్‌లో) ఆస్ట్రేలియాతో తలపడాల్సి ఉంది. ఈసారైనా సౌతాఫ్రికా ఫైనల్ ఫోబియాను అధిగమించి టైటిల్ గెలవాలని ఆ జట్టు అభిమానులు కోరుకుంటున్నారు.కాగా, 2023 మహిళల టీ20 వరల్డ్‌కప్ ఫైనల్స్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన సౌతాఫ్రికా.. ఆ మరుసటి ఏడాది జరిగిన పురుషుల టీ20 వరల్డ్‌కప్ ఫైనల్స్‌లో భారత్ చేతిలో పరాభవాన్ని ఎదుర్కొంది. అదే ఏడాది జరిగిన మహిళల టీ20 వరల్డ్‌కప్ ఫైనల్స్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలైన పొట్రిస్ జట్టు.. ఇవాళ (ఫిబ్రవరి 2) జరిగిన 2025 అండర్ 19 మహిళల టీ20 వరల్డ్‌కప్ ఫైనల్స్‌లో యంగ్ ఇండియా చేతిలో చావుదెబ్బతింది.ఇదిలా ఉంటే, మలేసియాలో జరిగిన ఐసీసీ అండర్-19 మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ విజేతగా నిలిచింది. ఇవాళ జరిగిన ఫైనల్లో యంగ్ ఇండియా సౌతాఫ్రికాపై 9 వికెట్ల తేడాతో గెలుపొంది, వరుసగా రెండో ఎడిషన్‌లో జగజ్జేతగా నిలిచింది. ఈ టోర్నీ ఇనాగురల్ ఎడిషన్‌లోనూ (2023) భారత్ విజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో భారత బౌలర్లు చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 82 పరుగులకు ఆలౌటైంది. తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష (Gongadi Trisha) 3, పరునిక సిసోడియా, ఆయూశి శుక్లా, వైష్ణవి శర్మ తలో 2, షబ్నమ్ షకీల్ ఓ వికెట్ పడగొట్టారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో మికీ వాన్ వూర్స్ట్ (23) టాప్ స్కోరర్‌గా నిలువగా.. జెమ్మా బోథా (16), కరాబో మెసో (10), ఫే కౌలింగ్ (15) రెండంకెల స్కోర్లు చేశారు.83 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. 11.2 ఓవర్లలో (వికెట్ కోల్పోయి) ఆడుతూపాడుతూ విజయం సాధించింది. బంతితో మెరిసిన త్రిష బ్యాటింగ్‌లోనూ చెలరేగి 33 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో 44 పరుగులు చేసింది. వన్ డౌన్ బ్యాటర్ సనికా ఛల్కే 22 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 26 పరుగులు చేసింది. ఈ టోర్నీ మొత్తంలో భారత్ అజేయంగా నిలిచింది. టోర్నీ ఆధ్యాంతం బ్యాట్‌తో, బంతితో రాణించిన త్రిషకు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డుతో పాటు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. -
బంగారు గనిలో ఘోర ప్రమాదం.. పది మంది మృతి
బమాకో: పశ్చిమ ఆఫ్రికాలోని మాలి దేశంలో మరో ఘోర విషాదకర ఘటన చోటుచేసుకుంది. బంగారు గనిలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో దాదాపు 10 మంది మృతి చెందినట్టు అక్కడి అధికారులు తెలిపారు. అలాగే, పలువురి ఆచూకీ గల్లంతు అయినట్టు వెల్లడించారు. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.వివరాల ప్రకారం.. మాలిలోని బంగారు గనిలో కొండచరియలు విరిగిపడ్డాయి. కౌలికోరో ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో దాదాపు 10 మంది మృతిచెందగా.. పలువురు గల్లంతయ్యారు. కాగా, మృతుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నట్లు సమాచారం. అయితే, బంగారం వెతుకులాటకు వెళ్లి వారంతా శిథిలాల కింద చిక్కుకుపోయారని కౌలికోరో గవర్నర్ కల్నల్ లామైన్ కపోరీ సనొగో తెలిపారు. ఒక్కసారిగా బురదనీరు ప్రవేశించి మహిళలను చుట్టుముట్టిందని వెల్లడించారు. ఇక, దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇదిలా ఉండగా.. ఇటీవలే మాలిలో బంగారు గనిలో ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈనెల 25వ తేదీన మాలిలోని బంగారు గనిలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 70 మందికిపైగా మృత్యువాత పడ్డారు. అనధికారికంగా తవ్వకాలు చేపట్టే ఓ బంగారు గని కుప్ప కూలి 70 మంది మరణించారు. నైరుతి కౌలికోరో ప్రాంతంలోని కంగబా జిల్లాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇక, ఆఫ్రికా దేశాల్లో మూడో అతిపెద్ద బంగారు ఉత్పత్తిదారుగా మాలి ఉంది. ఈ దేశంలో గనుల ప్రమాదాలు తరచూ చోటుచేసుకుంటున్నాయి.A landslide at a gold mine southern Mali’s village of Danga has killed around 10 people and left several others missing, most of them women, the governorate of the Koulikoro region said. pic.twitter.com/lH9OxXYZk1— The Sudan Times (@thesudantimes) January 30, 2025 -
క్రికెట్ చరిత్రలో అసాధారణ రనౌట్
క్రికెట్ చరిత్రలో ఓ విచిత్రమైన రనౌట్ నమోదైంది. సౌతాఫ్రికా అండర్-19 జట్టుతో జరుగుతున్న అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ అండర్-19 జట్టు ఆటగాడు ఆర్యన్ సావంత్ అసాధారణ రీతిలో రనౌటయ్యాడు. మ్యాచ్ 3వ రోజు సావంత్ 11 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తూ జేసన్ రౌల్స్ వేసిన బంతిని స్లాగ్-స్వీప్ చేశాడు. అయితే బంతి షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న జోరిచ్ వాన్ షాల్క్విక్ హెల్మెట్‌ను బలంగా తాకి, స్టంప్స్‌పైకి తిరిగి వచ్చింది. ఆ సమయంలో సావంత్ క్రీజ్ బయట ఉన్నాడు. సెకెన్ల వ్యవధిలో జరిగిపోయిన ఈ తంతు చూసి కొందరు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు రనౌట్‌కు అప్పీల్ చేయగా.. మరికొందరు బంతి హెల్మెట్‌కు తాకి గాయపడిన జోరిచ్ను పరామర్శించే పనిలో పడ్డారు. The first and last time you'll see a run out like this... @collinsadam pic.twitter.com/ZIEFI8s1Te— Brent W (@brentsw3) January 28, 2025దక్షిణాఫ్రికా ఫీల్డర్ల అప్పీల్‌తో ఔటయ్యానన్న విషయాన్ని గ్రహించిన సావంత్ మెల్లగా పెవిలియన్ బాట పట్టగా.. బంతి బలంగా తాకడంతో జోరిచ్ మైదానంలో అపస్మారక స్థితిలో పడిపోయాడు. గాయపడిన జోరిచ్ను హుటాహుటిన అసుపత్రికి తరలించారు. జోరిచ్కు ఎలాంటి అపాయం కలగలేదని తదనంతరం దక్షిణాఫ్రికా మేనేజ్మెంట్ వెల్లడించింది. సావంత్ అసాధారణ రీతిలో రనౌటైన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.కాగా, ఈ మ్యాచ్‌లో సావంత్ ఔటయ్యే సమయానికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ను కొనసాగించిన ఇంగ్లండ్, మూడో రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ స్కోర్‌తో పోలిస్తే 20 పరుగులు వెనుకపడ్డ ఇంగ్లండ్ ప్రస్తుతం 255 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో థామస్ ర్యూ (71) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 299 పరుగులకు ఆలౌటైంది. ఫర్హాన్ అహ్మద్, జాక్ హోమ్ అర్ద సెంచరీలతో రాణించారు. బదులుగా సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 319 పరుగులు చేసింది. సౌతాఫ్రికా తరఫున ముహమ్మద్ బుల్బులియా, జేసన్ రౌల్స్ అర్ద సెంచరీలు చేశారు. -
మూడే మూడు చిట్కాలతో మిరాకిల్ : దెబ్బకు 8 కిలోలు తగ్గింది!
అసాధ్యం అనుకున్నదాన్ని సాధ్యం చేసిన చూపించిన వాళ్లే స్ఫూర్తిదాయకంగా నిలుస్తారు. అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతారు. చదువులో ర్యాంకు సంపాదించాలన్నా, మంచి ఉద్యోగం సాధించాలన్నా లక్ష్యం వైపు మన గురి, ఓపికతో మనం చేసిన ప్రయత్నాలే కీలకం. అలా పట్టుదల,ఓపిక తన డ్రీమ్‌ను సాకారం చేసుకున్న షీ’రో గురించి ఇపుడుతెలుసుకుందామా..!దక్షిణాఫ్రికాలో నివసిస్తున్న భారత సంతతికి చెందిన మహిళ రవిషా చిన్నప్ప అనూహ్యంగా బరువు తగ్గి అందర్నీ సర్ప్రైజ్ చేసింది. కేవలం 34 రోజుల వ్యవధిలో 8 కిలోల బరువు తగ్గింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ సందర్భంగా విజయరహస్యాన్ని వెల్లడించింది. మంచి ఆహారం, స్థిరమైన వ్యాయామం ద్వారానే ఇది సాధించానని తెలిపింది. Ravisha Chinappa ('IVF Momma') ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసిన కథనం ప్రకారం తొలుత ఆమె 55 కిలోల బరువునుండి 47 కిలోలకు తగ్గింది. ఈ ప్రయాణం చాలా మందికి స్ఫూర్తినిచ్చింది. ఒక పాపకు తల్లి అయిన రవీషా తాను గర్భం దాల్చిన తర్వాత అప్పుడు పెరిగిన బరువు, గత ఏడాది కాలంగా తగ్గడం లేదు. దీంతో మూడు సీక్రెట్స్‌ను పాటించాను. అవే తన బరువు తగ్గడానికి చాలా దోహదపడ్డాయని వెల్లడించింది. అంతేకాదు ఇంతకు ముందు తాను చాలా ప్రయత్నించినా విజయం సాధించలేదనీ, కానీ ఈ మూడు మార్గాలను స్వీకరించిన తర్వాత వేగంగా 8 కిలోల బరువు తగ్గానని తెలిపింది.మూడు చిట్కాలుజీవనశైలి,ఆహార మార్పులు : జీవనశైలి, శారీరక సామర్థ్యం, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి తన ప్రయాణాన్ని ప్రారంభించింది. సానుకూలంగా, తన ఫిట్నెస్ లక్ష్యాలను దృశ్యమానం చేసుకుంది.ఆహారం,వ్యాయామ దినచర్య, ప్రతీ గంటన్నకు ఒకసారి నీళ్లు ఇవే ఆమె మార్గాలు. రోజువారీ 100 గ్రాముల ప్రోటీన్ తీసుకుంది ఎక్కువ ప్రోటీన్, తక్కువ కార్బ్ ఆహారం నియమాన్ని పాటించింది. తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, సలాడ్లను ఎక్కువగా తీసుకుంది. తద్వారా చక్కెర, జంక్ ఫుడ్‌ను నివారించింది.కొంచెం బలమైన కార్డియో, యోగా చేసింది. ప్రతిరోజూ 45 నిమిషాల నుండి 1 గంట వ్యాయామం చేసింది. ఇందులో పరుగు, ప్లాంక్స్, వెయిట్ లిఫ్టింగ్ ఉన్నాయి.నీళ్లు : అలారం సెట్ చేసుకుని మరీ ప్రతిరోజూ 3-4 లీటర్ల చొప్పున నీళ్లు తాగింది. నీళ్ళు కొవ్వును కరిగిస్తాయి,మంచి అందాన్నిస్తాయని ఆమె అనుభవం. ఆకలి ఎక్కువగా అనిపిస్తే.. తక్కువ మోతాదులో రోజుకు 5-6సార్లు తినవచ్చట. View this post on Instagram A post shared by IVF momma 🌈🍍 (@ravisha.chinnappa)మానసిక ఆరోగ్యంపై దృష్టిఒత్తిడిని తగ్గించుకునేందుకు మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికి రోజువారీ ధ్యానం సాధన చేసింది. అంకితభావం, సరైన ఆహారం, వ్యాయామం ,మానసిక శ్రేయస్సు , జీవనశైలిమార్పులు తమ వెయిట్ లాస్ జర్నీకి కీలకంగా పనిచేసాయని తెలిపింది. ఇదీ చదవండి : మీరందరూ తప్పకుండా ఇలా చేయాలనేదే నా కోరిక: సమంతాఅతిలోకసుందరి వారసురాలు జాన్వీకపూర్ లగ్జరీ ఇల్లు : ఎంత వైభోగమో! -
టీ20 ప్రపంచకప్: భారత్‌తో పాటు సెమీస్ చేరిన జట్లు ఇవే.. షెడ్యూల్
మహిళల అండర్–19 టీ20 ప్రపంచకప్(ICC Under 19 Womens T20 World Cup 2025)లో చివరిదైన నాలుగో సెమీఫైనల్ బెర్త్ ఇంగ్లండ్ జట్టు దక్కించుకుంది. న్యూజిలాండ్ జట్టుతో సోమవారం జరిగిన ‘సూపర్ సిక్స్’ గ్రూప్–2 మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. రన్‌రేట్ పరంగా వెనుకబడినా..ఇక ఇప్పటికే ‘సూపర్ సిక్స్’ గ్రూప్–1 నుంచి భారత్(India), ఆస్ట్రేలియా(Australia)... గ్రూప్–2 నుంచి దక్షిణాఫ్రికా(South Africa) సెమీఫైనల్ చేరుకున్నాయి. కాగా గ్రూప్–2లో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు ఆరు పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాయి. అయితే మెరుగైన రన్‌రేట్ కారణంగా దక్షిణాఫ్రికా గ్రూప్ ‘టాపర్’గా ఉంది. మరోవైపు.. న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్ గెలుపొందడంతో నైజీరియా సెమీఫైనల్ అవకాశాలకు తెరపడింది. ఈనెల 29న ఐర్లాండ్‌తో జరిగే మ్యాచ్‌లో నైజీరియా గెలిచినా ఐదు పాయింట్లకే పరిమితం అవుతుంది.40 పరుగుల తేడాలో పది వికెట్లుఇక మ్యాచ్ విషయానికొస్తే... మలేషియాలోని కుచింగ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 89 పరుగులకు ఆలౌటైంది. ఒకదశలో 49/0తో పటిష్టంగా కనిపించిన న్యూజిలాండ్‌ను ఇంగ్లండ్ బౌలర్లు టిల్లీ కోర్టిన్ కోల్మన్ (4/8), ప్రిషా థానావాలా (3/19), ట్రూడీ జాన్సన్ (2/7) దెబ్బ కొట్టారు.ఫలితంగా న్యూజిలాండ్ 40 పరుగుల తేడాలో 10 వికెట్లను కోల్పోయింది. ఓపెనర్లు కేట్ ఇర్విన్(26 బంతుల్లో 35; 2 ఫోర్లు, 1 సిక్స్), ఎమ్మా మెక్లాయిడ్ (31 బంతుల్లో 18) మాత్రమే రెండంకెల స్కోరు దాటారు. మిగతా బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.అనంతరం ఇంగ్లండ్ జట్టు 11.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 90 పరుగులు చేసి గెలిచింది. డావినా పెరిన్ (15 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్), జెమీమా స్పెన్స్ (18 బంతుల్లో 29; 5 ఫోర్లు), చార్లోటి స్టబ్స్ (15 బంతుల్లో 17 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. మహిళల అండర్–19 టీ20 ప్రపంచకప్-2025లో సెమీస్ చేరిన జట్లు ఇవే👉గ్రూప్-1: భారత్, ఆస్ట్రేలియా👉గ్రూప్-2: దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్సెమీ ఫైనల్, ఫైనల్ షెడ్యూల్ ఇదేమహిళల అండర్–19 టీ20 ప్రపంచకప్-2025 టోర్నీలో జనవరి 31న సెమీ ఫైనల్-1 జరుగనుంది. కౌలలంపూర్లోని బేయుమస్ ఓవల్ మైదానం ఇందుకు వేదిక. భారత కాలమానం ప్రకారం ఉదయం 8 గంటలకు ఈ మ్యాచ్ ఆరంభమవుతుంది.ఇక రెండో సెమీ ఫైనల్ కూడా అదే రోజు అదే వేదికపై మధ్యాహ్నం 12 గంటలకు మొదలవుతుంది. ఇదిలా ఉంటే.. ఫైనల్ మ్యాచ్ ఫిబ్రవరి 2న మధ్యాహ్నం 12 గంటలకు ఆరంభం కానుంది. ఇక ఈమ్యాచ్‌లను జియోస్టార్, స్టార్ స్పోర్ట్స్-2 లో వీక్షించవచ్చుభారత్, ఆసీస్, దక్షిణాఫ్రికా సెమీస్ చేరాయిలా..కౌలాలంపూర్: అండర్–19 మహిళల టీ20 ప్రపంచకప్‌లో లీగ్ దశలో అజేయంగా నిలిచిన టీమిండియా... ‘సూపర్ సిక్స్’ గ్రూప్–1 తొలి మ్యాచ్‌లోనూ గెలిచింది. డిఫెండింగ్ చాంపియన్ హోదాకు తగ్గట్టు ఆడుతున్న భారత అమ్మాయిల జట్టు సెమీఫైనల్ బెర్త్‌ను ఆదివారం ఖరారు చేసుకుంది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో నికీ ప్రసాద్ సారథ్యంలోని భారత జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు కేవలం 64 పరుగులు మాత్రమే చేసింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఎడంచేతి వాటం స్పిన్నర్ వైష్ణవి శర్మ 4 ఓవర్లలో 15 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టి బంగ్లాదేశ్‌ను కట్టడి చేసింది.ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పేస్ బౌలర్ షబ్నమ్, జోషిత, తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష ఒక్కో వికెట్ తీసుకున్నారు. బంగ్లాదేశ్ బ్యాటర్లలో జన్నతుల్ మవువా (20 బంతుల్లో 14), కెప్టెన్ సుమయ అక్తర్ (29 బంతుల్లో 21 నాటౌట్; 1 ఫోర్) మాత్రమే రెండంకెల స్కోరు దాటారు. భారత బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ కారణంగా బంగ్లాదేశ్ బ్యాటర్లు ఇన్నింగ్స్ మొత్తంలో ఒక్క బౌండరీ మాత్రమే కొట్టడం గమనార్హం.ఇక 65 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు ఆడుతూ పాడుతూ విజయతీరానికి చేరింది. 7.1 ఓవర్లలో భారత జట్టు 2 వికెట్లు కోల్పోయి 66 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ గొంగడి త్రిష (31 బంతుల్లో 40; 8 ఫోర్లు) దూకుడుగా ఆడింది. త్రిష చేసిన 40 పరుగుల్లో 32 పరుగులు బౌండరీల ద్వారానే రావడం విశేషం.మరో ఓపెనర్ కమలిని (5) తక్కువ స్కోరుకే అవుటైనా... సనికా చాల్కె (5 బంతుల్లో 11 నాటౌట్; 2 ఫోర్లు), నికీ ప్రసాద్ (2 బంతుల్లో 5 నాటౌట్; 1 ఫోర్) మిగతా లాంఛనాన్ని పూర్తి చేశారు. వైష్ణవికి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. మంగళవారం జరిగే తమ చివరి ‘సూపర్ సిక్స్’ మ్యాచ్‌లో స్కాట్లాండ్తో భారత్ ఆడుతుంది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలకు సెమీస్ బెర్తుమరోవైపు ‘సూపర్ సిక్స్’ గ్రూప్–1 నుంచి ఆస్ట్రేలియా కూడా సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ఇదే గ్రూప్‌లో శ్రీలంక, స్కాట్లాండ్ జట్ల మధ్య ఆదివారమే జరగాల్సిన ‘సూపర్ సిక్స్’ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఆస్ట్రేలియాకు సెమీఫైనల్ బెర్త్ దక్కింది. ప్రస్తుతం ‘సూపర్ సిక్స్8 గ్రూప్–1లో భారత్, ఆస్ట్రేలియా జట్లు ఆరు పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉండగా ... శ్రీలంక మూడు పాయింట్లతో మూడో స్థానంలో ఉంది.ఈనెల 29న ఆస్ట్రేలియాతో జరిగే తమ చివరి ‘సూపర్ సిక్స్’ మ్యాచ్‌లో శ్రీలంక గెలిచినా ఐదు పాయింట్లకే పరిమితం అవుతుంది. ‘సూపర్ సిక్స్’ గ్రూప్–2 నుంచి దక్షిణాఫ్రికా జట్టు కూడా సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. చదవండి: చరిత్ర సృష్టించిన ఆసీస్ యువ ఓపెనర్.. టీ20 ఫైనల్స్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ -
గ్రూప్ దశలో అజేయంగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా..
కౌలాలంపూర్: మహిళల అండర్–19 టి20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు అజేయంగా లీగ్ దశను ముగించాయి. గ్రూప్ ‘డి’లో భాగంగా బుధవారం జరిగిన తమ చివరి మ్యాచ్‌లో ఆ్రస్టేలియా 83 పరుగుల తేడాతో నేపాల్ జట్టుపై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆ్రస్టేలియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది.బ్రయ్ (34 బంతుల్లో 45; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), లారోసా (31), హస్రత్ గిల్ (30) రాణించారు. అనంతరం ఛేదనలో నేపాల్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 56 పరుగులకే పరిమితమైంది. ఆడిన 3 మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన ఆ్రస్టేలియా 6 పాయింట్లతో గ్రూప్ ‘డి’ టాపర్‌గా నిలిచింది. గ్రూప్ ‘సి’లో భాగంగా నైజీరియాతో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు డక్‌వర్త్ లూయిస్ ప్రకారం 41 పరుగుల తేడాతో గెలుపొందింది.ఆడిన అన్నీ మ్యాచ్‌ల్లో గెలిచిన దక్షిణాఫ్రికా జట్టు 6 పాయింట్లతో గ్రూప్ ‘సి’ టాపర్‌గా నిలిచింది. బుధవారం జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో బంగ్లాదేశ్ జట్టు 17 పరుగుల తేడాతో స్కాట్లాండ్పై... ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో అమెరికా జట్టుపై... న్యూజిలాండ్ జట్టు 67 పరుగుల తేడాతో సమోవాపై... ఐర్లాండ్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 13 పరుగుల తేడాతో పాకిస్తాన్‌పై గెలిచాయి. నేడు జరిగే గ్రూప్ ‘ఎ’ చివరి రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో ఆతిథ్య మలేసియాతో వెస్టిండీస్; శ్రీలంకతో భారత్ తలపడతాయి. గ్రూప్ ‘ఎ’ నుంచి భారత్, శ్రీలంక... గ్రూప్ ‘బి’ నుంచి ఇంగ్లండ్, అమెరికా, ఐర్లాండ్... గ్రూప్ ‘సి’ నుంచి దక్షిణాఫ్రికా, నైజీరియా, న్యూజిలాండ్... గ్రూప్ ‘డి’ నుంచి ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, స్కాట్లాండ్ జట్లు ‘సూపర్ సిక్స్’ దశకు చేరుకున్నాయి. మలేసియా, వెస్టిండీస్ జట్ల మధ్య మ్యాచ్ విజేత గ్రూప్ ‘ఎ’ నుంచి చివరిదైన సూపర్ సిక్స్ బెర్త్‌ను ఖరారు చేసుకుంటుంది.చదవండి: ఆరంభం అదిరింది -
10 బంతుల్లోనే ఖేల్ ఖతం.. టీ20 వరల్డ్‌కప్-2025లో సంచలనం
అండర్ 19 మహిళల టీ20 ప్రపంచకప్-2025లో సంచలనం నమోదైంది. దక్షిణాఫ్రికా జట్టు 10 అంటే 10 బంతుల్లోనే మ్యాచ్ ముగించేసింది. ఇన్నింగ్స్ బ్రేక్‌కు వెళ్లొచ్చేలోగా ఖేల్ ఖతమైంది. గ్రూప్ ‘సి’లో భాగంగా సమోవా జట్టుతో నిన్న (జనవరి 20) జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఈ ఘనత సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సమోవా 9.1 ఓవర్లలో 16 పరుగులకే కుప్పకూలింది.సమోవా ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదుగురు డకౌట్లు కాగా.. నాలుగు ఒకట్లు (1), రెండు మూడులు (3 పరుగులు) నమోదయ్యాయి. ఎక్స్‌ట్రాల రూపంలో వచ్చిన 6 పరుగులే సమోవా తరఫున అత్యధిక స్కోర్‌గా ఉంది. సమోవా బ్యాటర్లు చేసిన పరుగులకంటే సఫారీ బౌలర్లు తీసిన వికెట్లే అంకెల్లో టాప్‌గా ఉన్నాయి. ఎన్‌తబిసెంగ్ నిని 3, ఫే కొలింగ్, కేలా రేనెకె, శేషిని నాయుడు తలో 2 వికెట్లు తీశారు.అనంతరం దక్షిణాఫ్రికా ఓపెనర్లు ఇద్దరే... పలువురు ప్రేక్షకులు బ్రేక్‌కు వెళ్లొచ్చే లోగా 10 బంతుల్లో 17 పరుగులు చేసి 10 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందించారు. ఓపెనర్లు సిమోన్ లారెన్స్ (6 నాటౌట్), జెమ్మా బోతా (6 నాటౌట్) 1.4 ఓవర్లలోనే మ్యాచ్‌నే ముగించారు. పెను సంచలనంనిన్ననే జరిగిన మరో మ్యాచ్‌లో పెను సంచలనం నమోదైంది. పసికూన నైజీరియా పటిష్టమైన న్యూజిలాండ్‌కు షాకిచ్చింది. న్యూజిలాండ్‌పై నైజీరియా 2 పరుగుల తేడాతో గెలుపొందింది. మహిళల అండర్ 19 టీ20 వరల్డ్‌కప్‌లో నైజీరియాకు ఇదే తొలి గెలుపు. మరోవైపు న్యూజిలాండ్ సీనియర్ మహిళల జట్టు ప్రస్తుత టీ20 వరల్డ్ ఛాంపియన్‌గా ఉంది. ఈ జట్టు గతేడాది పొట్టి ప్రపంచకప్‌లో జగజ్జేతగా నిలిచింది. -
చరిత్ర సృష్టించిన డేవిడ్ మిల్లర్
సౌతాఫ్రికా మిడిలార్డర్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ చరిత్ర సృష్టించాడు. టీ20ల్లో 11000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి సౌతాఫ్రికా ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్-2025లో భాగంగా ప్రిటోరియా క్యాపిటల్స్‌తో నిన్న (జనవరి 18) జరిగిన మ్యాచ్‌లో మిల్లర్ ఈ మైలురాయిని తాకాడు. ఈ మ్యాచ్‌లో మిల్లర్ రికార్డు లక్ష్య ఛేదనలో 24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అజేయమైన 48 పరుగులు చేశాడు. మిల్లర్ తన ఓవరాల్ టీ20 కెరీర్లో 468 ఇన్నింగ్స్‌లు ఆడి 11,046 పరుగులు చేశాడు.మిల్లర్ 11000 టీ20 రన్స్ క్లబ్లో చేరిన గంటల వ్యవధిలోనే మరో సౌతాఫ్రికన్ ఈ క్లబ్లో చేరాడు. సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ కూడా సౌతాఫ్రికా టీ20 లీగ్‌లోనే 11000 పరుగుల మార్కును తాకాడు. ఈ లీగ్‌లో భాగంగా ఎంఐ కేప్‌టౌన్‌తో జరిగిన మ్యాచ్‌లో డుప్లెసిస్ ఈ మైలురాయిని చేరుకున్నాడు. డుప్లెసిస్ 376 ఇన్నింగ్స్‌ల తన టీ20 కెరీర్లో 11,042 పరుగులు చేశాడు.టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన సౌతాఫ్రికా ఆటగాళ్లు..డేవిడ్ మిల్లర్-11046డుప్లెసిస్-11042డికాక్-10620ఏబీ డివిలియర్స్-9424రిలీ రొస్సో-9067నిన్న జరిగిన మ్యాచ్‌ల విషయానికొస్తే.. ప్రిటోరియా క్యాపిటల్స్‌పై పార్ల్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్ చేసింది. విల్ స్మీడ్ (34 బంతుల్లో 54; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీతో సత్తా చాటగా.. రహ్మానుల్లా గుర్భాజ్ (29 బంతుల్లో 42; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), కైల్ వెర్రిన్ (23 బంతుల్లో 45; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) ఓ మోస్తరు ఇన్నింగ్స్‌లతో రాణించారు. ఆఖర్లో జేమ్స్ నీషమ్ (13 బంతుల్లో 28 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. క్యాపిటల్స్ ఆటగాళ్లలో విల్ జాక్స్ 2, రిలీ రొస్సో 14 పరుగులు చేసి ఔటయ్యారు.213 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్ 19.4 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఇన్నింగ్స్ తొలి బంతికే ఇన్ఫామ్ బ్యాటర్ డ్రి ప్రిటోరియన్ డకౌట్ కాగా.. జో రూట్ (60 బంతుల్లో 92 నాటౌట్; 11 ఫోర్లు, 2 సిక్సర్లు), రూబిన్ హెర్మన్ (33 బంతుల్లో 56; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), డేవిడ్ మిల్లర్ (24 బంతుల్లో 48 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో తమ జట్టును గెలిపించారు. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఇదే రికార్డు లక్ష్య ఛేదన.మరో మ్యాచ్‌లో జోబర్గ్ సూపర్ కింగ్స్‌పై ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఓపెనర్లు డెవాన్ కాన్వే (31 బంతుల్లో 35; 4 ఫోర్లు), ఫాఫ్ డుప్లెసిస్ (38 బంతుల్లో 61; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), వికెట్ కీపర్ జానీ బెయిర్‌స్టో (27 బంతుల్లో 43 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించారు.ఛేదనలో ర్యాన్ రికెల్టన్ (39 బంతుల్లో 89; 8 ఫోర్లు, 6 సిక్సర్లు) శివాలెత్తిపోవడంతో ఎంఐ కేప్‌టౌన్ 15.5 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. రస్సీ వాన్ డర్ డస్సెన్ (24 బంతుల్లో 39; 4 ఫోర్లు, సిక్స్), రీజా హెండ్రిక్స్ (28 బంతుల్లో 34 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్) రాణించారు. -
యువ సమరం... నేడే ఆరంభం
రెండేళ్ల క్రితం నిర్వహించిన ఐసీసీ మహిళల అండర్–19 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన యువ భారత్... ట్రోఫీ నిలబెట్టుకునేందుకు సిద్ధమైంది. మహిళల క్రికెట్‌కు మరింత తోడ్పాటు అందించాలనే లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ టోర్నీకి నేటి నుంచి తెరలేవనుండగా... రేపు జరగనున్న తొలి పోరులో వెస్టిండీస్‌తో యువ భారత్ తలపడనుంది. షఫాలీ వర్మ, రిచా ఘోష్ వంటి సీనియర్ స్థాయిలో ఆడిన ప్లేయర్లతో బరిలోకి దిగి తొలిసారి విశ్వ విజేతగా నిలిచిన భారత్... ఈసారి కూడా ఆధిపత్యం కొనసాగించాలని చూస్తుంటే... తొలిసారి ట్రోఫీ చేజిక్కించుకోవాలని ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా తహతహలాడుతున్నాయి. 2023 వరల్డ్‌కప్ జట్టులోనూ ఆడిన తెలుగు ప్లేయర్లు గొంగడి త్రిష, షబ్నమ్‌లపై ఈసారీ భారీ అంచనాలు ఉన్నాయి. మహిళల అండర్–19 టి20 ప్రపంచకప్ టోర్నీలో భాగంగా ఈరోజు జరిగే ఆరు మ్యాచ్‌ల్లో స్కాటాండ్తో ఆస్ట్రేలియా (ఉదయం గం. 8 నుంచి); ఐర్లాండ్‌తో ఇంగ్లండ్ (ఉదయం గం. 8 నుంచి); సమోవాతో నైజీరియా (ఉదయం గం. 8 నుంచి); నేపాల్‌తో బంగ్లాదేశ్ (ఉదయం గం. 8 నుంచి); అమెరికాతో పాకిస్తాన్ (మధ్యాహ్నం గం. 12 నుంచి); దక్షిణాఫ్రికాతో న్యూజిలాండ్ (మధ్యాహ్నం గం. 12 నుంచి) తలపడతాయి. కౌలాలంపూర్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల అండర్–19 టి20 ప్రపంచకప్ రెండో ఎడిషన్‌కు రంగం సిద్ధమైంది. మొత్తం 16 జట్లు పాల్గొంటున్న ఈ టోర్నమెంట్‌కు శనివారం తెరలేవనుంది. 2023లో దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన తొలి వరల్డ్‌కప్‌లో అద్వితీయ ప్రదర్శన కనబర్చిన భారత జట్టు ట్రోఫీ కైవసం చేసుకోగా... ఈసారి డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతున్న యంగ్ ఇండియా టైటిల్ నిలబెట్టుకుంటుందా చూడాలి. ఫార్మాట్ ఎలా ఉందంటే... మొత్తం 16 జట్లను 4 గ్రూప్‌లుగా విభజించారు. వెస్టిండీస్, శ్రీలంక, ఆతిథ్య మలేసియాతో కలిసి భారత జట్టు గ్రూప్ ‘ఎ’ నుంచి బరిలోకి దిగనుంది. ఒక్కో గ్రూప్‌లో తొలి మూడు స్థానాల్లో నిలిచిన జట్లు (12) ‘సూపర్ సిక్స్’ దశకు చేరుకుంటాయి. ఈ 12 జట్లను ‘సూపర్ సిక్స్’లో రెండు గ్రూప్‌లుగా విభజిస్తారు. గ్రూప్–1లో ఆరు జట్లు... గ్రూప్–2లో మరో ఆరు జట్లు ఉంటాయి. ‘సూపర్ సిక్స్’ మ్యాచ్‌లు ముగిశాక గ్రూప్–1, గ్రూప్–2లలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన నాలుగు జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. సీనియర్ జట్టులోకి దారి... సీనియర్ జట్టులో చోటు దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్న ప్లేయర్లు ఈ టోర్నీలో రాణించి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాలని భావిస్తున్నారు. గత ఎడిషన్ ఫైనల్లో ఇంగ్లండ్‌పై గెలిచిన షఫాలీ వర్మ సారథ్యంలోని టీమిండియా... ఈసారి కూడా అదే ఆధిపత్యం కనబర్చాలని చూస్తోంది. 2023 అండర్–19 ప్రపంచకప్‌లో రాణించడం ద్వారా టిటాస్ సాధు, శ్వేత సెహ్రావత్... ఆ తర్వాతి కాలంలో భారత మహిళల జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు అదే బాటలో పయనించి మెరుగైన ప్రదర్శనతో ఈ ఏడాది భారత్‌లో జరగనున్న మహిళల టి20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోవాలని యంగ్ ప్లేయర్లు కసరత్తులు చేస్తున్నారు. త్రిష రెండోసారి... గత ప్రపంచకప్ ఫైనల్లో భారత్ తరఫున అత్యధిక స్కోరర్‌గా నిలిచిన హైదరాబాద్ అమ్మాయి గొంగడి త్రిష వరుసగా రెండోసారి ఈ మెగా టోర్నీలో ఆడనుంది. గత నెల మహిళల అండర్–19 ఆసియాకప్‌లో భారత జట్టు విజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించిన త్రిష... ఈసారి కూడా మెరుగైన ప్రదర్శన చేసి సీనియర్ జట్టులో చోటు దక్కించుకోవడమే లక్ష్యంగా సాగుతోంది. శనివారం స్కాట్లాండ్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్‌తో టోర్నీకి తెరలేవనుండగా... ఆదివారం జరగనున్న తమ తొలి పోరులో వెస్టిండీస్‌తో భారత జట్టు అమీతుమీ తేల్చుకోనుంది. సమోవా, నైజీరియా, నేపాల్, మలేసియా జట్లు తొలిసారి ఐసీసీ టోర్నీలో ఆడనున్నాయి. ఈ టోర్నీలో ప్రధానంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల నుంచి యంగ్ ఇండియాకు గట్టిపోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే ఇటీవల ఆసియాకప్ నెగ్గి మంచి జోరుమీదున్న అమ్మాయిలు కలసి కట్టుగా కదంతొక్కితే టైటిల్ నిలబెట్టుకోవడం పెద్ద కష్టం కాకపోవచ్చు. భారత మహిళల అండర్–19 టి20 క్రికెట్ జట్టు: నికీ ప్రసాద్ (కెప్టెన్), సానిక చల్కె, త్రిష, కమలిని, భవిక అహిరె, ఐశ్వరి అవసారె, మిథిలా, జోషిత, సోనమ్, పరుణిక, కేసరి ధ్రుతి, ఆయుషి శుక్లా, అనందిత, షబ్నమ్, వైష్ణవి. -
చాంపియన్స్ ట్రోఫీకి నోర్జే దూరం
జొహన్నెస్‌బర్గ్: చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే దక్షిణాఫ్రికా జట్టులో చోటు దక్కించుకున్న రెండు రోజులకే పేసర్ ఆన్రిక్ నోర్జే కథ మారింది! వెన్ను నొప్పి గాయంతో అతను ఈ టోరీ్నకి దూరమవుతున్నట్లు దక్షిణాఫ్రికా బోర్డు ప్రకటించింది. సోమవారం ప్రకటించిన టీమ్‌లో నోర్జే పేరు కూడా ఉంది. ఫిట్‌గా ఉన్నాడని సెలక్టర్లు నోర్జేను ఎంపిక చేయగా... స్కానింగ్‌తో అతని గాయం తీవ్రత తగ్గలేదని తేలింది. టోర్నీ ప్రారంభమయ్యే లోగా అతను కోలుకునే అవకాశం లేదని తేలింది. గత ఆరు ఐసీసీ టోర్నీల్లో మూడు సార్లు అతను గాయం కారణంగా చివరి నిమిషంలో టోర్నీ నుంచి తప్పుకున్నాడు. 2019, 2023 వన్డే వరల్డ్ కప్‌లతో పాటు ఇప్పుడు మరో వన్డే టోర్నీకి దూరమయ్యాడు. ఈ మధ్య కాలంలో జరిగిన మూడు టి20 వరల్డ్ కప్‌లు (2021, 2022, 2024)లలో అతను జట్టులో భాగంగా ఉన్నాడు. నోర్జే స్థానంలో మరో ఆటగాడి పేరును దక్షిణాఫ్రికా ఇంకా ప్రకటించలేదు. -
South Africa: బంగారు గనిలో చిక్కుకుని 100 మంది కార్మికులు మృతి
దక్షిణాఫ్రికాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఒక గనిలో చిక్కుకుని, 100 మంది కార్మికులు మృతిచెందారని సమాచారం. మీడియాకు తెలిసిన వివరాల ప్రకారం ఈ కార్మికులంతా దక్షిణాఫ్రికాలోని ఒక బంగారు గనిలో అక్రమంగా పనులు చేస్తున్నారు.గనిలో చిక్కుకున్న కార్మికులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక బృందం మీడియాతో మాట్లాడుతూ ఈ కార్మికులు నెలల తరబడి భూగర్భ గనిలో చిక్కుకున్నారని తెలిపింది. ఈ నేపధ్యంలోనే వారు మరణించారని పేర్కొంది. కాగా గనిలో చిక్కుకున్న కార్మికులను రక్షించడానికి పోలీసులు ప్రయత్నించినప్పటికీ, విజయం సాధించలేకపోయారు.మైనింగ్ ప్రభావిత కమ్యూనిటీస్ యునైటెడ్ ఇన్ యాక్షన్ గ్రూప్ ప్రతినిధి సబెలో మ్ంగుని మీడియాతో మాట్లాడుతూ కొందరు గని కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారని, వారి దగ్గర రెండు వీడియోలు లభ్యమయ్యాయన్నారు. ఆ వీడియోల్లో డజన్ల కొద్దీ మృతదేహాలు భూగర్భంలో గనిలో కనిపిస్తున్నాయన్నారు.వాయువ్య ప్రావిన్స్‌లోని ఈ గనిలో 100 మంది వరకూ మృతిచెందారని ఆ సంస్థ ప్రతినిధి తెలిపారు. ఇప్పటివరకు భూగర్భ గనిలో నుంచి 18 మృతదేహాలను బయటకుతీశారు. వారు ఆకలి, డీహైడ్రేషన్ కారణంగా చనిపోయి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.ఇది కూడా చదవండి: Mahakumbh-2025: మకర సంక్రాంతి వేళ.. అమృత స్నానానికి పోటెత్తిన జనం -
ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే సౌతాఫ్రికా జట్టు ఇదే..!
పాకిస్తాన్, యూఏఈ వేదికలుగా వచ్చే నెల (ఫిబ్రవరి) 19 నుంచి జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం 15 మంది సభ్యుల సౌతాఫ్రికా జట్టును ఇవాళ (జనవరి 13) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా టెంబా బవుమా వ్యవహరించనున్నాడు. గాయాల నుంచి కోలుకున్న స్టార్ పేసర్లు అన్రిచ్ నోర్జే, లుంగి ఎంగిడి ఈ టోర్నీతో రీఎంట్రీ ఇచ్చారు. 2023 వన్డే వరల్డ్‌కప్ ఆడిన జట్టులోని 10 మంది సభ్యులు ఈ టోర్నీ కోసం ఎంపికయ్యారు. ఈ జట్టులో టోనీ డి జోర్జీ, ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, వియాన్ ముల్దర్ లాంటి కొత్త ముఖాలు ఉన్నాయి. ఈ ముగ్గురికి ఇదే తొలి 50 ఓవర్ల ఐసీసీ టోర్నీ.ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో పాల్గొనే సౌతాఫ్రికా జట్టు..టెంబా బవుమా (కెప్టెన్), టోనీ డి జోర్జి, మార్కో జన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, ఐడెన్ మర్క్రమ్, డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్ట్జే, కగిసో రబడ, ర్యాన్ రికెల్టన్, తబ్రైజ్ షమ్సీ, ట్రిస్టన్ స్టబ్స్, రస్సీ వాన్ డెర్ డస్సెన్ఛాంపియన్స్ ట్రోఫీలో సౌతాఫ్రికా గ్రూప్-బిలో ఉంది. ఈ గ్రూప్‌లో ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు ఉన్నాయి. మెగా టోర్నీలో సౌతాఫ్రికా తమ తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 21న ఆడనుంది. కరాచీ వేదికగా జరిగే ఆ మ్యాచ్‌లో ప్రొటీస్ టీమ్ ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడుతుంది. అనంతరం ఫిబ్రవరి 25న రావల్పిండిలో జరిగే మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఆస్ట్రేలియాను ఢీకొంటుంది. తదనంతరం మార్చి 1న కరాచీలో జరిగే మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఇంగ్లండ్‌తో పోటీపడనుంది.కాగా, సౌతాఫ్రికా ఇటీవలికాలంలో ఐసీసీ ఈవెంట్లలో అదరగొడుతున్న విషయం తెలిసిందే. 2023 వన్డే వరల్డ్‌కప్‌లో ప్రొటీస్ టీమ్ సెమీఫైనల్‌కు చేరుకుంది. గతేడాది జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో సౌతాఫ్రికా రన్నరప్‌గా నిలిచింది. సౌతాఫ్రికా గత రెండు ఐసీసీ ఈవెంట్లలో చేసిన ప్రదర్శనలే ఛాంపియన్స్ ట్రోఫీలోనూ రిపీట్ చేయాలని భావిస్తుంది. సౌతాఫ్రికాకు ఛాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన అనుభవం కూడా ఉంది. ఈ జట్టు 1998 ఇనాగురల్ ఎడిషన్‌లో విజేతగా నిలిచింది. నాటి ఫైనల్లో సౌతాఫ్రికా వెస్టిండీస్‌ను చిత్తు చేసి ఛాంపియన్‌గా అవతరించింది.ఇదిలా ఉంటే, సౌతాఫ్రికా తాజాగా స్వదేశంలో పాకిస్తాన్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 2-0 తేడాతో గెలుచుకుంది. ఈ సిరీస్‌లో సౌతాఫ్రికా అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించి పాక్‌ను మట్టికరిపించింది. ఈ సిరీస్‌లోని తొలి టెస్ట్ అనంతరం సౌతాఫ్రికా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 ఫైనల్‌కు అర్హత సాధించింది. బవుమా నేతృత్వంలోని సౌతాఫ్రికా డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. -
ఇంగ్లండ్ కెప్టెన్‌గా మైఖేల్ వాన్ తనయుడు
ఇంగ్లండ్ అండర్-19 జట్టు కెప్టెన్‌గా ఇంగ్లండ్ మాజీ సారధి మైఖేల్ వాన్ కొడుకు ఆర్కీ వాన్ (Archie Vaughan) ఎంపికయ్యాడు. 19 ఏళ్ల ఆర్కీ వాన్ త్వరలో సౌతాఫ్రికాలో పర్యటించబోయే ఇంగ్లండ్ యువ జట్టును సారధిగా వ్యవహరించనున్నాడు. ఆర్కీ వాన్ తన తండ్రి మైఖేల్ వాన్ బాటలోనే ఇంగ్లండ్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. మైఖేల్ వాన్ హయాం ఇంగ్లండ్ జట్టుకు స్వర్ణ యుగం లాంటిది. మైఖేల్ వాన్ కెప్టెన్సీలో ఇంగ్లండ్ 2005 యాషెస్ సిరీస్ నెగ్గింది. 18 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్‌కు లభించిన తొలి యాషెస్ విజయం ఇది. మైఖేల్ వాన్ 51 టెస్ట్‌ల్లో, 60 వన్డేల్లో ఇంగ్లండ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు.మైఖేల్ వాన్ తనయుడు ఆర్కీ వాన్ తొలిసారి ఇంగ్లండ్ అంతర్జాతీయ జట్టుకు సారధిగా ఎంపికయ్యాడు. ఇంగ్లండ్ అండర్-19 జట్టు సౌతాఫ్రికా పర్యటనలో మూడు వన్డేలు, రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. సౌతాఫ్రికా పర్యటన జనవరి 17న ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో తొలుత వన్డే సిరీస్ జరుగనుంది. తొలి వన్డేకు కేప్‌టౌన్ ఆతిథ్యమివ్వనుంది. అనంతరం జనవరి 27న స్టెల్లెన్బాష్ వేదికగా తొలి టెస్ట్ ప్రారంభమవుతుంది.ఆర్కీ వాన్ ఇటీవలే ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లోకి కూడా అడుగుపెట్టాడు. వాన్ సోమర్సెట్ తరఫున నాలుగు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. ఆర్కీ వాన్ తన స్వల్ప ఫస్ట్ క్లాస్ కెరీర్లో అదరగొట్టాడు. బ్యాటింగ్ ఆల్‌రౌండర్ అయిన వాన్ 236 పరుగులు చేసి 15 వికెట్లు పడగొట్టాడు. సర్రేపై ఆర్కీ వాన్ రెండు ఐదు వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశాడు. ఆర్కీ వాన్ ఇటీవలే లిస్ట్-ఏ క్రికెట్లో కూడా అరంగేట్రం చేశాడు. మెట్రో బ్యాంక్ కప్ ఆర్కీ వాన్ తన తొలి 50 ఓవర్ల మ్యాచ్ ఆడాడు.ఇటీవలి కాలంలో ఇంగ్లండ్ అండర్-19 జట్టుకు ఎంపికైన రెండో మాజీ ఆటగాడి తనయుడు ఆర్కీ వాన్. కొద్ది రోజుల కిందట ఇంగ్లండ్ దిగ్గజ ఆల్‌రౌండర్ ఆండ్రూ ఫ్లింటాప్ తనయుడు రాకీ ఫ్లింటాఫ్ ఇంగ్లండ్ అండర్-19 జట్టుకు ఎంపికయ్యాడు. అయితే ప్రస్తుతం సౌతాఫ్రికా పర్యటన కోసం ఎంపిక చేసిన ఇంగ్లండ్ యువ జట్టులో రాకీ ఫ్లింటాఫ్‌కు చోటు దక్కలేదు.సౌతాఫ్రికా పర్యటన కోసం ఇంగ్లండ్ అండర్-19 జట్టు: ఆర్కీ వాన్ (కెప్టెన్), ఫర్హాన్ అహ్మద్, తజీమ్ అలీ, బెన్ డాకిన్స్, కేష్ ఫోన్సేకా, అలెక్స్ ఫ్రెంచ్, అలెక్స్ గ్రీన్, జాక్ హోమ్, జేమ్స్ ఇస్బెల్, ఎడ్డీ జాక్, బెన్ మాయెస్, జేమ్స్ మింటో, హ్యారీ మూర్, జో మూర్స్, థామస్ రెవ్, ఆర్యన్ సావంత్, నావ్య శర్మ, అలెగ్జాండర్ వేడే. -
17 ప్రేమ జంటలకు టోకరా ఇచ్చిన ఎన్ఆర్ఐ మహిళ : 20 ఏళ్ల నుంచి దందా
ఎదుటి వారి అమాయకత్వాన్ని, అవకాశాన్ని స్మార్ట్‌గా సొమ్ము చేసుకునే కంత్రీగాళ్లు మన చుట్టూనే వై..ఫై లా తిరుగుతుంటారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా నమ్మించి నట్టేట ముంచేయడానికి ఏ మాత్రం వెనుకాడరు. అలా 17జంటలకు టోకరా ఇచ్చిన ఒక ఎన్ఆర్ఐ మహిళా స్కామర్ పోలీసులకు చిక్కింది. ఆమె చేసిన ఫ్రాడ్ ఏంటి? పోలీసులు ఆమెను ట్రాక్ చేశారు? భారతీయ సంతతికి చెందిన ప్రీలిన్ మోహానాల్ (53) దక్షిణాఫ్రికాలో న్యాయవాదిగా పనిచేస్తోంది. వివాహాలను ప్లాన్ చేసుకోవాలనుకునే ప్రేమ జంటలను సోషల్ మీడియా ద్వారా వలవేసి పట్టుకునేంది. వారికి అందమైన వెడ్డింగ్ నేషన్స్ చూపిస్తానంటూ వారితో నమ్మబలికేది. ఆ స్థలంతో ఎటువంటి సంబంధం లేకుండా వేదిక కోసం పెద్ద మొత్తాలను ముందుగానే చెల్లించాలన పట్టుబట్టేది. సొమ్ములనురాబట్టేది. తీరా అక్కడికెళ్లాక విస్తుపోవడం ఖాళీ ప్లేస్ ప్రేమ జంట వంతయ్యేది. ఉనికిలో లేని, లేదా కనీస వసతులు కూడా లేని ప్రదేశాన్ని చూసి లబోదిబోమనేవారు. నీళ్లు, కరెంట్ కూడా లేకపోవడంతో వారి కలకాలం తీపి గుర్తుగా మిగిలిపోవాల్సిన పెళ్లి సందడి కాస్త జీవితంలో మర్చిపోలేనంత విచారకరంగా మారిపోయేది. ఇలా దక్షిణాఫ్రికా వ్యాప్తంగా ఒకే రోజు ఒకే వేదిక కోసం డబ్బులు తీసుకొని దేశవ్యాప్తంగా 17 జంటలను మోసం చేసింది. తమ వివాహాన్ని రద్దు చేసుకుని, ఈ సంవత్సరం చివరిలో తిరిగి ప్లాన్ చేసుకోవడానికి చాలాకష్టపడ్డామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.చివరికి పేరు చెప్పడానికి ఇష్టపడని జంట ఫిర్యాదుతో గుట్టు రట్టయింది. వీరు గత ఏడాది డిసెంబర్లో భద్రతా సంస్థ రియాక్షన్ యూనిట్ సౌత్ ఆఫ్రికా (RUSA) తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆమెను ట్రాక్ చేసి (జనవరి 7) అరెస్టు చేశారు. నిందితురాలు మోసానికి పాల్పడినట్లు ,ఆమెకు క్రిమినల్ రికార్డ్ ఉందని 20 సంవత్సరాలకు పైగా జరిగిన స్కామ్‌ల చరిత్ర ఉందని నిర్ధారించినట్టు రూసా ప్రతినిధి బలరామ్ చెప్పారు.మరోవైపు ఇది స్కామ్ కాదు, తాను స్కామర్‌ను కాదని ఆమె వాదిస్తోంది. కంపెనీ చాలా కష్టాలను ఎదుర్కొంది. ప్రతీ పైసా తిరిగి చెల్లిస్తానని ప్రతీ జంటకు లేఖలు పంపాననీ తెలిపింది. కానీ భాగస్వాములు అక్టోబర్‌లో వైదొలిగిన కారణంగా సకాలంలో తిరిగి చెల్లించలేకపోయానని స్థానికమీడియాకు తెలిపింది. తొమ్మిది జంటలకు సుమారు 60వేలు దక్షిణాఫ్రికా రాండ్ (రూ.2,72,319) బాకీ ఉందని అంగీకరించి, వాటిని తిరిగి చెల్లిస్తానని హామీ ఇచ్చింది.అయితే నేరాన్ని అంగీకరించి, బాధితులందరికీ తిరిగి చెల్లిస్తానని ఆమె న్యాయవాది, కుటుంబ సభ్యులు కేడా చెప్పడంతో ఆమె జైలు శిక్ష నుంచి తప్పించుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరి దీనిపై కోర్టు ఎలా నిర్ణయిస్తుందో చూడాలి. -
రేపటి నుంచి (జనవరి 9) మరో క్రికెట్ పండుగ.. అభిమానులకు జాతరే..!
జనవరి 9 నుంచి మరో క్రికెట్ పండుగ ప్రారంభం కానుంది. సౌతాఫ్రికా వేదికగా SA20-2025 లీగ్ (మూడో ఎడిషన్) మొదలవుతుంది. 30 రోజుల పాటు సాగే ఈ మెగా లీగ్‌లో మొత్తం 34 మ్యాచ్‌లు జరుగనున్నాయి. రేపు జరుగబోయే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్.. ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్‌తో తలపడుతుంది. ఐపీఎల్ తర్వాత అత్యంత ప్రజాధరణ కలిగిన ఈ లీగ్ ఆరు వేదికల్లో (గెబెర్హా, డర్బన్, పార్ల్, జొహనెస్‌బర్గ్, సెంచూరియన్, కేప్‌టౌన్) జరుగనుంది. ఈ లీగ్‌లో ప్లే ఆఫ్ మ్యాచ్‌లు (క్వాలిఫయర్-1, ఎలిమినేటర్, క్వాలిఫయర్-2, ఫైనల్) ఫిబ్రవరి 4న మొదలవుతాయి. ఫిబ్రవరి 8న జరిగే ఫైనల్‌తో ఈ లీగ్ ముగుస్తుంది. ఈ లీగ్‌లో అత్యంత విజయవంతమైన జట్టు సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్. ఈ జట్టు వరుసగా రెండు సీజన్లలో (2023, 2024) విజేతగా నిలిచింది.ఈ లీగ్‌లో మొత్తం ఆరు జట్లు (సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్, ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్, డర్బన్ సూపర్ జెయింట్స్, ప్రిటోరియా క్యాపిటల్స్, జోబర్గ్ సూపర్ కింగ్స్, పార్ల్ రాయల్స్) పాల్గొంటాయి. ఈ ఎడిషన్‌లో గత ఎడిషన్లలోలాగే ఒక్కో జట్టు 10 లీగ్ స్టేజ్ మ్యాచ్‌లు ఆడుతుంది.ఈ లీగ్‌లో డే మ్యాచ్‌లు భారతకాలమానం ప్రకారం సాయంత్రం 4:30 గంటలకు మొదలవుతాయి. నైట్ మ్యాచ్‌లు భారతకాలమానం ప్రకారం రాత్రి 9 గంటలకు ప్రారంభమవుతాయి.ఈ లీగ్‌లోని మ్యాచ్‌లు స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారమవుతాయి. లైవ్ స్ట్రీమింగ్ జియో సినిమా యాప్‌తో పాటు వెబ్సైట్లో జరుగుతుంది.జట్ల వివరాలు..డర్బన్ సూపర్ జెయింట్స్: బ్రాండన్ కింగ్ (వెస్టిండీస్), క్వింటన్ డి కాక్, నవీన్-ఉల్-హక్ (ఆఫ్ఘనిస్థాన్), కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్), క్రిస్ వోక్స్ (ఇంగ్లండ్), ప్రేనెలన్ సుబ్రాయెన్, డ్వైన్ ప్రిటోరియస్, కేశవ్ మహరాజ్, నూర్ అహ్మద్ (ఆఫ్ఘనిస్తాన్), హెన్రిచ్ క్లాసెన్, జోన్-జాన్ స్మట్స్, వియాన్ ముల్డర్, జూనియర్ డాలా, బ్రైస్ పార్సన్స్, మాథ్యూ బ్రీట్జ్కే, జాసన్ స్మిత్, మార్కస్ స్టోయినిస్ (ఆస్ట్రేలియా), షమర్ జోసెఫ్ (వెస్టిండీస్), సీజే కింగ్ (రూకీ).జోబర్గ్ సూపర్ కింగ్స్: ఫాఫ్ డు ప్లెసిస్, మొయిన్ అలీ (ఇంగ్లండ్), జానీ బెయిర్‌స్టో (ఇంగ్లండ్), మహేశ్ తీక్షణ (శ్రీలంక), డెవాన్ కాన్వే (న్యూజిలాండ్), గెరాల్డ్ కోయెట్జీ, డేవిడ్ వీస్ (నమీబియా), ల్యూస్ డు ప్లూయ్ (ఇంగ్లండ్), లిజాద్ విలియమ్స్, నాండ్రే బర్గర్, డోనోవన్ ఫెరీరా, ఇమ్రాన్ తాహిర్, సిబోనెలో మఖాన్యా, తబ్రైజ్ షమ్సీ, విహాన్ లుబ్బే, ఇవాన్ జోన్స్, డగ్ బ్రేస్‌వెల్ (న్యూజిలాండ్), జేపీ కింగ్ (రూకీ).ఎంఐ కేప్ టౌన్: రషీద్ ఖాన్ (ఆఫ్ఘనిస్థాన్), బెన్ స్టోక్స్ (ఇంగ్లండ్), కగిసో రబడా, ట్రెంట్ బౌల్ట్ (న్యూజిలాండ్), అజ్మతుల్లా ఒమర్జాయ్ (ఆఫ్ఘనిస్థాన్), డెవాల్డ్ బ్రీవిస్, ర్యాన్ రికెల్టన్, జార్జ్ లిండే, నువాన్ తుషార (శ్రీలంక), కానర్ ఎస్టర్‌హుజెన్ , డెలానో పోట్గీటర్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, థామస్ కాబెర్, క్రిస్ బెంజమిన్ (ఇంగ్లండ్), కార్బిన్ బాష్, కోలిన్ ఇంగ్రామ్, రీజా హెండ్రిక్స్, డేన్ పీడ్ట్, ట్రిస్టన్ లూస్ (రూకీ).ప్రిటోరియా క్యాపిటల్స్: అన్రిచ్ నోర్ట్జే, జిమ్మీ నీషమ్ (న్యూజిలాండ్), విల్ జాక్స్ (ఇంగ్లండ్), రహ్మానుల్లా గుర్బాజ్ (ఆఫ్ఘనిస్తాన్), లియామ్ లివింగ్‌స్టోన్ (ఇంగ్లండ్), విల్ స్మీడ్ (ఇంగ్లండ్), మిగెల్ ప్రిటోరియస్, రిలీ రోసౌవ్, ఈథన్ బాష్, వేన్ పార్నెల్, సెనూరన్ ముత్తుసామి, కైల్ వెర్రెయిన్, డారిన్ డుపావిల్లోన్, స్టీవ్ స్టోక్, టియాన్ వాన్ వురెన్, మార్క్వెస్ అకెర్మాన్, ఎవిన్ లూయిస్ (వెస్టిండీస్), కైల్ సిమండ్స్, కీగన్ లయన్-కాచెట్ (రూకీ).పార్ల్ రాయల్స్: డేవిడ్ మిల్లర్, ముజీబ్ ఉర్ రెహమాన్ (ఆఫ్ఘనిస్థాన్), సామ్ హైన్ (ఇంగ్లండ్), జో రూట్ (ఇంగ్లండ్), దినేష్ కార్తీక్ (భారత్), క్వేనా మఫాకా, లువాన్-డ్రే ప్రిటోరియస్, జోర్న్ ఫార్టుయిన్, లుంగి ఎన్గిడి, మిచెల్ వాన్ బ్యూరెన్, కీత్ డడ్జియన్, న్కాబా పీటర్, ఆండిలే ఫెహ్లుక్వాయో, కోడి యూసుఫ్, జాన్ టర్నర్ (ఇంగ్లండ్), దయాన్ గాలియం, జాకబ్ బెథెల్ (ఇంగ్లండ్), రూబిన్ హెర్మాన్, దేవాన్ మరియాస్ (రూకీ).సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్: ఐడెన్ మార్క్రామ్, జాక్ క్రాలే (ఇంగ్లాండ్), రోలోఫ్ వాన్ డెర్ మెర్వే (నెదర్లాండ్స్), లియామ్ డాసన్ (ఇంగ్లండ్), ఒట్నీల్ బార్ట్‌మన్, మార్కో జాన్సెన్, బేయర్స్ స్వాన్‌పోయెల్, కాలేబ్ సెలెకా, ట్రిస్టన్ స్టబ్స్, జోర్డాన్ హర్మన్, ప్యాట్రిక్ క్రుగర్, క్రెయిగ్ ఓవర్టన్ (ఇంగ్లండ్), టామ్ అబెల్ (ఇంగ్లండ్), సైమన్ హార్మర్, ఆండిల్ సిమెలన్, డేవిడ్ బెడింగ్హామ్, ఒకుహ్లే సెలే, రిచర్డ్ గ్లీసన్ (ఇంగ్లండ్), డేనియల్ స్మిత్ (రూకీ). -
సౌతాఫ్రికా చేతిలో ఘోర పరాజయం.. పాకిస్తాన్‌కు మరో షాక్
తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్‌లో 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న పాకిస్తాన్‌కు మరో షాక్ తగిలింది. ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ మెయిన్టైన్ చేసినందుకు గానూ పాకిస్తాన్ మ్యాచ్ ఫీజ్‌లో 25 శాతం కోత విధించబడింది. అలాగే ఐదు డబ్ల్యూటీసీ పాయింట్లు డాక్ చేయబడ్డాయి. మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్సన్ కథనం మేరకు.. నిర్దేశిత సమయం ముగిసే లోగా పాక్ ఐదు ఓవర్లు వెనుకపడింది. ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకారం.. నిర్దేశిత సమయంలోగా ఓవర్ వెనుకపడితే ఆటగాళ్ల మ్యాచ్ ఫీజ్‌లో ఐదు శాతం కోత విధిస్తారు. అలాగే ఓ డబ్ల్యూటీసీ పాయింట్ డాక్ చేయబడుతుంది. ఐసీసీ విధించిన జరిమానాను పాక్ సారధి షాన్ మసూద్ స్వీకరించాడు. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో పాక్ చివరి నుంచి రెండో స్థానంలో (ఎనిమిది) ఉంది.కాగా, సౌతాఫ్రికాతో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను పాక్ 0-2 తేడాతో కోల్పోయింది. తాజాగా ముగిసిన రెండో టెస్ట్‌లో పాక్ దారుణ పరాభవాన్ని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 615 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ డబుల్ సెంచరీతో (259) అదరగొట్టగా.. టెంబా బవుమా (106), వికెట్ కీపర్ కైల్ వెర్రిన్ (100) సెంచరీలు చేశారు. ఆఖర్లో మార్కో జన్సెన్ (62), కేశవ్ మహారాజ్ (40) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. పాక్ బౌలర్లలో మొహమ్మద్ అబ్బాస్, సల్మాన్ అఘా తలో మూడు వికెట్లు తీయగా.. మీర్ హమ్జా, ఖుర్రమ్ షెహజాద్ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు.అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో పాక్ 194 పరుగులకే కుప్పకూలింది. సఫారీ బౌలర్లు తలో చేయి వేసి పాక్ ఇన్నింగ్స్ నేలకూల్చారు. రబాడ 3, మఫాకా, మహారాజ్ తలో 2, మార్కో జన్సెన్, వియాన్ ముల్దర్ చెరో వికెట్ పడగొట్టారు. పాక్ తొలి ఇన్నింగ్స్‌లో బాబర్ ఆజమ్ (58) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. మొహమ్మద్ రిజ్వాన్ (46) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో పేలవ ప్రదర్శన కారణంగా పాక్ ఫాలో ఆడింది.సెకెండ్ ఇన్నింగ్స్‌లో పాక్ అద్భుతంగా పోరాడింది. ఫాలో ఆడుతూ రికార్డు స్కోర్ (478) చేసింది. కెప్టెన్ షాన్ మసూద్ (145) సూపర్ సెంచరీతో మెరవడంతో పాక్ ఇన్నింగ్స్ పరాజయాన్ని తప్పించుకోగలిగింది. కానీ ఓటమి మాత్రం తప్పలేదు. బాబర్ ఆజమ్ (81) వరుసగా రెండో ఇన్నింగ్స్‌లోనూ అర్ద సెంచరీతో ఆకట్టుకోగా.. మొహమ్మద్ రిజ్వాన్ (41), సల్మాన్ అఘా (48) ఓ మోస్తరు స్కోర్లు చేసి సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ స్కోర్‌ను దాటేలా చేశారు.పాక్ నిర్దేశించిన 58 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సౌతాఫ్రికా వికెట్ కోల్పోకుండా ఛేదించి జయకేతనం ఎగురవేసింది. బెడింగ్హమ్ (47), మార్క్రమ్ (14) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి సౌతాఫ్రికాను విజయతీరాలకు చేర్చారు. ఈ మ్యాచ్‌తో సౌతాఫ్రికా డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్లో మ్యాచ్‌లన్నీ పూర్తి చేసుకుంది. జూన్ 11 నుంచి లార్డ్స్‌లో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్లో సౌతాఫ్రికా ఆస్ట్రేలియాను ఢీకొంటుంది. -
బవుమా.. ద రియల్ కెప్టెన్.. ఓటమి ఎరుగని ధీరుడు..!
సౌతాఫ్రికా టెస్ట్ జట్టు సారథి టెంబా బవుమాపై ప్రశంసల వర్షం కురుస్తుంది. బవుమా తన సారథ్యంలో సౌతాఫ్రికాను తొమ్మిదింట ఎనిమిది మ్యాచ్‌ల్లో గెలిపించాడు. ఓ మ్యాచ్ డ్రా ముగిసింది. జట్టును విజయవంతంగా ముందుండి నడిపించడంతో పాటు బవుమా వ్యక్తిగతంగానూ అద్భుతంగా రాణిస్తున్నాడు. బవుమా సౌతాఫ్రికా కెప్టెన్‌గా 9 మ్యాచ్‌ల్లో 3 శతకాలు, 4 అర్ద శతకాల సాయంతో 809 పరుగులు (57.78 సగటున) చేశాడు. బవుమా తొలిసారి సౌతాఫ్రికాను డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేర్చాడు. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో సౌతాఫ్రికా అగ్రస్థానంలో ఉంది.ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ సౌతాఫ్రికా చాలాకాలం తర్వాత సెకెండ్ ప్లేస్‌కు చేరింది. బవుమా సారథ్యంలో సౌతాఫ్రికా ఒక్కటంటే ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోలేదు. బవుమా కెప్టెన్సీ స్కిల్స్‌కు ముగ్దులవుతున్న అభిమానులు అతన్ని గొప్ప సారధిగా కొనియాడుతున్నారు. బవుమా.. ద రియల్ కెప్టెన్.. ఓటమి ఎరుగని ధీరుడని జేజేలు పలుకుతున్నారు. బ్యాటర్‌గానూ పోరాట యోధుడని కితాబునిస్తున్నారు. బవుమా కెప్టెన్సీ భారాన్ని మోస్తూనే బ్యాటర్‌గా అద్భుతంగా రాణిస్తున్నాడు.గత 10 మ్యాచ్‌ల్లో బవుమా ప్రదర్శనలు ఇలా ఉన్నాయి..పాక్‌పై రెండో టెస్ట్‌లో 106 (179)పాక్‌పై తొలి టెస్ట్‌లో 31 (74), 40 (78)శ్రీలంకపై రెండో టెస్ట్‌లో 78 (109), 66 (116)శ్రీలంకపై తొలి టెస్ట్‌లో 70 (117), 113 (228)వెస్టిండీస్‌పై రెండో టెస్ట్‌లో 0 (2), 4 (18)వెస్టిండీస్‌పై తొలి టెస్ట్‌లో 86 (182), 15 (17)భారత్‌తో తొలి టెస్ట్‌లో 0 (0)వెస్టిండీస్‌తో రెండో టెస్ట్‌లో 28 (64), 172 (280)వెస్టిండీస్‌తో తొలి టెస్ట్‌లో 0 (2), 0 (1)ఆస్ట్రేలియాతో మూడో టెస్ట్‌లో 35 (74), 17 (42)బవుమా సారథ్యంలో సౌతాఫ్రికా వరుసగా ఏడు టెస్ట్ మ్యాచ్‌ల్లో గెలిచింది. అలాగే వరుసగా మూడు సిరీస్‌ల్లో 2-0 తేడాతో విజయాలు సాధించింది. కెరీర్లో 63 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన బవుమా 38 సగటున 3606 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, 24 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.ఇదిలా ఉంటే, సౌతాఫ్రికా తాజాగా పాకిస్తాన్‌తో టెస్ట్ మ్యాచ్ ఆడింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో (రెండో టెస్ట్) సౌతాఫ్రికా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో కూడా గెలిచిన ప్రొటీస్ పాక్‌ను 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది.పాక్‌తో రెండో టెస్ట్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 615 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ భారీ డబుల్ సెంచరీతో (259) అదరగొట్టగా.. టెంబా బవుమా (106), వికెట్ కీపర్ కైల్ వెర్రిన్ (100) సెంచరీలు చేశారు. ఆఖర్లో మార్కో జన్సెన్ (62), కేశవ్ మహారాజ్ (40) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. అనంతరం పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 194 పరుగులకే కుప్పకూలింది. సఫారీ బౌలర్లు తలో చేయి వేసి పాక్ ఇన్నింగ్స్ నేలకూల్చారు. రబాడ 3, మఫాకా, మహారాజ్ తలో 2, మార్కో జన్సెన్, వియాన్ ముల్దర్ చెరో వికెట్ పడగొట్టారు. పాక్ తొలి ఇన్నింగ్స్‌లో బాబర్ ఆజమ్ (58) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. మొహమ్మద్ రిజ్వాన్ (46) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో పేలవ ప్రదర్శన కారణంగా పాక్ ఫాలో ఆడింది.సెకెండ్ ఇన్నింగ్స్‌లో పాక్ అద్భుతంగా పోరాడింది. ఫాలో ఆడుతూ సౌతాఫ్రికా గడ్డపై రికార్డు స్కోర్ (478) చేసింది. కెప్టెన్ షాన్ మసూద్ (145) సూపర్ సెంచరీతో మెరవడంతో పాక్ ఇన్నింగ్స్ పరాజయం బారి నుంచి తప్పించుకుంది. మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ (81), మొహమ్మద్ రిజ్వాన్ (41), సల్మాన్ అఘా (48) ఓ మోస్తరు స్కోర్లు చేసి సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ స్కోర్‌ను దాటేలా చేశారు.పాక్ నిర్దేశించిన 58 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సౌతాఫ్రికా వికెట్ కోల్పోకుండా ఛేదించి జయకేతనం ఎగురవేసింది. బెడింగ్హమ్ (47), మార్క్రమ్ (14) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి సౌతాఫ్రికాను విజయతీరాలకు చేర్చారు. ఈ మ్యాచ్‌తో సౌతాఫ్రికా డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్లో మ్యాచ్‌లన్నీ పూర్తి చేసుకుంది. జూన్ 11 నుంచి లార్డ్స్‌లో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్లో సౌతాఫ్రికా ఆస్ట్రేలియాను ఢీకొంటుంది. -
ఘోర పరాభవాన్ని తప్పించుకున్న పాకిస్తాన్
కేప్‌టౌన్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఘోర పరాభవాన్ని తప్పించుకుంది. ఈ మ్యాచ్‌లో పాక్ ఇన్నింగ్స్ పరాజయాన్ని అధిగమించింది. తొలి ఇన్నింగ్స్‌లో 194 పరుగులకే కుప్పకూలిన పాక్ ఫాలో ఆన్ ఆడుతుంది. సెకెండ్ ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేయడంతో పాక్ లీడ్‌లోకి వచ్చింది. ఈ మ్యాచ్‌లో పాక్ ఓటమి నుంచి తప్పించుకోవాలంటే సౌతాఫ్రికా ముందు కనీసం 250 పరుగుల లక్ష్యాన్ని అయినా ఉంచాల్సి ఉంది. అయితే పరిస్థితులు అలా కనిపించడం లేదు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో పాక్ చేతిలో మరో మూడు వికెట్లు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం ఆ జట్టు కేవలం 50 పరుగుల ఆధిక్యంలో మాత్రమే ఉంది. కీలక బ్యాటర్లంతా పెవిలియన్‌కు చేరారు. నాలుగో రోజు ఆటలో మూడో సెషన్ కొనసాగుతుంది. ఈ మ్యాచ్‌లో పాక్ గట్టెక్కాలంటే రేపు (ఐదో) తొలి సెషన్ వరకు బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే సౌతాఫ్రికా ముందు ఫైటింగ్ టార్గెట్‌ను ఉంచగలుగుతుంది.పూర్తి వివరాల్లోకి వెళితే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా అతి భారీ స్కోర్ చేసింది. ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 615 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ భారీ డబుల్ సెంచరీ (259) చేసి సౌతాఫ్రికాను కమాండింగ్ పొజిషన్లో ఉంచాడు. కెప్టెన్ టెంబా బవుమా (106), వికెట్ కీపర్ కైల్ వెర్రిన్ (100) కూడా సెంచరీలు చేశారు. ఆఖర్లో మార్కో జన్సెన్ (62), కేశవ్ మహారాజ్ (40) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో మార్క్రమ్ 17, ముల్దర్ 5, ట్రిస్టన్ స్టబ్స్ 0, బెడింగ్హమ్ 5, మఫాకా 0, రబాడ 6 (నాటౌట్) పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో మొహమ్మద్ అబ్బాస్, సల్మాన్ అఘా తలో మూడు వికెట్లు తీయగా.. మీర్ హమ్జా, ఖుర్రమ్ షెహజాద్ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు.అనంతరం పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 194 పరుగులకే కుప్పకూలింది. సఫారీ బౌలర్లు తలో చేయి వేసి పాక్ ఇన్నింగ్స్ నేలకూల్చారు. రబాడ 3, మఫాకా, మహారాజ్ తలో 2, మార్కో జన్సెన్, వియాన్ ముల్దర్ చెరో వికెట్ పడగొట్టారు. పాక్ తొలి ఇన్నింగ్స్‌లో బాబర్ ఆజమ్ (58) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. మొహమ్మద్ రిజ్వాన్ (46) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. పాక్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ షాన్ మసూద్ 2, కమ్రాన్ గులామ్ 12, సౌద్ షకీల్ 0, సల్మాన్ అఘా 19, ఆమెర్ జమాల్ 15, ఖుర్రమ్ షెహజాద్ 14, మీర్ హమ్జా 13, మొహమ్మద్ అబ్బాస్ 0 (నాటౌట్) పరుగులు చేశారు. ఈ మ్యాచ్‌లో పాక్ 10 మంది ఆటగాళ్లతోనే బ్యాటింగ్‌ను కొనసాగించాల్సి వచ్చింది. యువ ఓపెనర్ సైమ్ అయూబ్ సౌతాఫ్రికా బ్యాటింగ్ సందర్భంగా తీవ్రంగా గాయపడ్డాడు. సైమ్ కాలు మడతపడటంతో ఉన్నపళంగా మైదానం నుంచి వైదొలిగాడు. అతను ఆరు వారాల పాటు క్రికెట్‌కు దూరంగా ఉండాలని డాక్టర్లు చెప్పారు. అందుకే అతను బ్యాటింగ్‌కు దిగలేదు.ఫాలో ఆన్ ఆడుతన్న పాక్ రెండో ఇన్నింగ్స్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తుంది. ఆ జట్టు నాలుగో రోజు మూడో సెషన్ సమయానికి 7 వికెట్ల నష్టానికి 471 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు 50 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. కెప్టెన్ షాన్ మసూద్ (145) సెకెండ్ ఇన్నింగ్స్‌లో అద్భుతమైన సెంచరీ చేశాడు. మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ (81) రెండో ఇన్నింగ్స్‌లోనూ హాఫ్ సెంచరీతో రాణించాడు. ఖుర్రమ్ షెహజాద్ (18), కమ్రాన్ గులామ్ (28), సౌద్ షకీల్ (23) కొద్ది సేపు నిలదొక్కుకున్నట్లు కనిపించినా ఆతర్వాత పెవిలియన్ బాట పట్టారు. మొహమ్మద్ రిజ్వాన్ (41), సల్మాన్ అఘా (48) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఆమెర్ జమాల్ (34 నాటౌట్), మీర్ హమ్జా (16 నాటౌట్) పాక్‌ను గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్, కగిసో రబాడ, మార్కో జన్సెన్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. మఫాకా ఓ వికెట్ దక్కించుకున్నాడు. -
ఒకే రోజు రెండు హాఫ్ సెంచరీలు.. ఫామ్‌లోకి వచ్చిన బాబర్ ఆజమ్
సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఓ అరుదైన ఫీట్‌ను సాధించాడు. ఈ మ్యాచ్‌లో బాబర్ ఒకే రోజు (మూడో రోజు) రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 58 పరుగులు చేసి బాబర్.. రెండో ఇన్నింగ్స్‌లో 59 పరుగలు చేసి ఇన్నింగ్స్ కొనసాగిస్తున్నాడు. చాలాకాలం పాటు పేలవ ఫామ్‌తో సతమతమైన బాబర్ ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చాడు. బాబర్ వరుసగా మూడు ఇన్నింగ్స్‌ల్లో (తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్) హాఫ్ సెంచరీలు చేశాడు.మ్యాచ్ మూడో రోజు బాబర్ తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 194 పరుగులకే కుప్పకూలడంతో పాక్ ఇదే రోజు ఫాలో ఆడింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన బాబర్ రెండో ఇన్నింగ్స్‌లోనూ హాఫ్ సెంచరీ చేశాడు.నిలకడగా ఆడుతున్న ఓపెనర్లుమూడో రోజు మూడో సెషన్ సమయానికి పాక్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 152 పరుగులు చేసింది. ఓపెనర్లు బాబర్ ఆజమ్, షాన్ మసూద్ (78) నిలకడగా ఆడుతున్నారు. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు పాక్ ఇంకా 269 పరుగులు వెనుకపడి ఉంది.ఫాలో ఆన్ ఆడుతున్న పాక్తొలి ఇన్నింగ్స్‌లో 194 పరుగులకే చాపచుట్టేసిన పాక్ ఫాలో ఆన్ ఆడుతుంది. సఫారీ బౌలర్లు రబాడ (3/55), క్వేనా మఫాకా (2/43), కేశవ్ మహారాజ్ (2/14), మార్కో జన్సెన్ (1/36), వియాన్ ముల్దర్ (1/44) ధాటికి పాక్ తొలి ఇన్నింగ్స్‌లో కుప్పకూలింది. పాక్ తొలి ఇన్నింగ్స్‌లో బాబర్ ఒక్కడే హాఫ్ సెంచరీ చేశాడు. మొహమ్మద్ రిజ్వాన్ (46) పర్వాలేదనిపించాడు. మిగతా ఆటగాళ్లంతా విఫలమయ్యారు.సౌతాఫ్రికా భారీ స్కోర్‌టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ప్రొటీస్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ (615 పరుగులు) చేసింది. ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ (259) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోగా.. కెప్టెన్ టెంబా బవుమా (106), వికెట్‌కీపర్ కైల్ వెర్రిన్ (100) సెంచరీలు చేశారు. ఆఖర్లో మార్కో జన్సెన్ (54 బంతుల్లో 62; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీతో మెరవగా.. కేశవ్ మహారాజ్ (35 బంతుల్లో 40; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో ఎయిడెన్ మార్క్రమ్ 17, వియాన్ ముల్దర్ 5, ట్రిస్టన్ స్టబ్స్ 0, డేవిడ్ బెడింగ్హమ్ 5, క్వేనా మపాకా 0 పరుగులకు ఔటయ్యారు. పాకిస్తాన్ బౌలర్లలో సల్మాన్ అఘా, మొహమ్మద్ అబ్బాస్ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. మిర్ హమ్జా, ఖుర్రమ్ షెహజాద్ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు. -
రెండు సెంచరీలు, ఓ డబుల్ సెంచరీ.. సౌతాఫ్రికా భారీ స్కోర్
కేప్‌టౌన్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా భారీ స్కోర్ చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ప్రొటీస్ తొలి ఇన్నింగ్స్‌లో 615 పరుగులకు ఆలౌటైంది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో ఓ భారీ డబుల్ సెంచరీ, రెండు సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ నమోదయ్యాయి. ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ (259) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోగా.. కెప్టెన్ టెంబా బవుమా (106), వికెట్‌కీపర్ కైల్ వెర్రిన్ (100) సెంచరీలు చేశారు. ఆఖర్లో మార్కో జన్సెన్ (54 బంతుల్లో 62; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీతో మెరవగా.. కేశవ్ మహారాజ్ (35 బంతుల్లో 40; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో ఎయిడెన్ మార్క్రమ్ 17, వియాన్ ముల్దర్ 5, ట్రిస్టన్ స్టబ్స్ 0, డేవిడ్ బెడింగ్హమ్ 5, క్వేనా మపాకా 0 పరుగులకు ఔటయ్యారు. పాకిస్తాన్ బౌలర్లలో సల్మాన్ అఘా, మొహమ్మద్ అబ్బాస్ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. మిర్ హమ్జా, ఖుర్రమ్ షెహజాద్ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు.ఆరు క్యాచ్‌లు పట్టిన రిజ్వాన్ఈ మ్యాచ్‌లో (తొలి ఇన్నింగ్స్) పాకిస్తాన్ వికెట్‌కీపర్ మొహమ్మద్ రిజ్వాన్ ఆరు క్యాచ్‌లు పట్టాడు. ఓ పక్క సౌతాఫ్రికా బ్యాటర్లు రెచ్చిపోయి ఆడినప్పటికీ రిజ్వాన్ అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. టెస్ట్‌ల్లో పాక్ తరఫున అత్యధిక క్యాచ్‌లు పట్టిన వికెట్కీపర్ల జాబితాలో రిజ్వాన్ నాలుగో స్థానంలో నిలిచాడు.7 - వాసిం బారి vs NZ, ఆక్లాండ్, 19796 - రషీద్ లతీఫ్ vs ZIM, బులవాయో, 19986 - అద్నాన్ అక్మల్ vs NZ, వెల్లింగ్టన్, 20116 - మొహమ్మద్ రిజ్వాన్ vs SA, కేప్ టౌన్, 2025100 వికెట్ల క్లబ్లో మొహమ్మద్ అబ్బాస్ఈ మ్యాచ్‌లో పాక్ పేసర్ మొహమ్మద్ అబ్బాస్ 100 వికెట్ల క్లబ్లో చేరాడు. క్వేనా మపాకా వికెట్ అబ్బాస్‌కు టెస్ట్‌ల్లో 100వది.తొలి ఓవర్లోనే పాక్‌కు షాక్సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేసి ఆలౌటైన అనంతరం పాక్ తొలి ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే పాక్‌కు భారీ షాక్ తగిలింది. తొలి ఓవర్ చివరి బంతికి కెప్టెన్ షాన్ మసూద్ (2) ఔటయ్యాడు. రబాడ బౌలింగ్‌లో బెడింగ్హమ్కు క్యాచ్ ఇచ్చి మసూద్ పెవిలియన్ బాట పట్టాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగాల్సిన సైమ్ అయూబ్ గాయపడటంతో అతని స్థానంలో బాబర్ ఆజమ్ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. గాయం తీవ్రత అధికంగా ఉండటంతో సైమ్ అయూబ్‌కు ఆరు వారాల విశ్రాంతి అవసరమని డాక్టర్లు చెప్పారు. 3.4 ఓవర్ల అనంతరం పాక్ స్కోర్ 10/1గా ఉంది. బాబర్ ఆజమ్ (2), కమ్రాన్ గులామ్ (4) క్రీజ్‌లో ఉన్నారు. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు పాక్ ఇంకా 605 పరుగులు వెనుకపడి ఉంది. -
SA Vs PAK: 2025లో తొలి డబుల్ సెంచరీ
2025లో తొలి టెస్ట్ డబుల్ సెంచరీ నమోదైంది. పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఆటగాడు ర్యాన్ రికెల్టన్ ద్విశతకం బాదాడు. ఈ ఏడాది ఇదే మొట్టమొదటి డబుల్ సెంచరీ. ఈ ఏడాది తొలి టెస్ట్ సెంచరీని కూడా రికెల్టనే సాధించాడు. రికెల్టన్ కెరీర్లో తన తొలి డబుల్ సెంచరీని 266 బంతుల్లో సాధించాడు. ఇందులో 24 ఫోర్లు, ఓ సిక్సర్ ఉన్నాయి. పాక్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌ల్లో డబుల్ సెంచరీ సాధించిన నాలుగో సౌతాఫ్రికా క్రికెటర్‌గా రికెల్టన్ రికార్డుల్లోకెక్కాడు. రికెల్టన్కు ముందు ఏబీ డివిలియర్స్ (278 నాటౌట్), గ్రేమ్ స్మిత్ (234), హెర్షల్ గిబ్స్ (228) పాక్‌పై డబుల్ సెంచరీలు చేశారు.తొలిసారి ఓపెనర్‌గా వచ్చి డబుల్ సెంచరీలు బాదిన క్రికెటర్లు..ర్యాన్ రికెల్టన్ టెస్ట్‌ల్లో తొలిసారి ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. రికెల్టన్ ఓపెనర్‌గా దిగిన తొలి మ్యాచ్‌లోనే డబుల్ సెంచరీ సాధించాడు. తొలిసారి ఓపెనర్‌గా వచ్చి అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడు కూడా రికెల్టనే. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు నలుగురు ఆటగాళ్లు తొలిసారి ఓపెనర్‌గా వచ్చి డబుల్ సెంచరీలు బాదారు.ర్యాన్ రికెల్టన్ (సౌతాఫ్రికా)- 211 నాటౌట్బ్రెండన్ కురుప్పు (శ్రీలంక)- 201 నాటౌట్గ్రేమీ స్మిత్ (సౌతాఫ్రికా)- 200డెవాన్ కాన్వే (న్యూజిలాండ్)- 200నాలుగో వేగవంతమైన ద్విశతకంపాక్పై రికెల్టన్ చేసిన ద్విశతకం టెస్ట్‌ల్లో సౌతాఫ్రికా తరఫున నాలుగో వేగవంతమైన ద్విశతకం. రికెల్టన్ 266 బంతుల్లో డబుల్ బాదాడు. టెస్ట్‌ల్లో సౌతాఫ్రికా తరఫున వేగవంతమైన డబుల్ సెంచరీని హెర్షల్ గిబ్స్ సాధించాడు. 2003లో పాక్‌పై గిబ్స్ 211 బంతుల్లోనే డబుల్ సెంచరీ చేశాడు.టెస్ట్‌ల్లో సౌతాఫ్రికా తరఫున వేగవంతమైన డబుల్ సెంచరీలు..హెర్షల్ గిబ్స్- 211 బంతుల్లోగ్రేమీ స్మిత్- 238 బంతుల్లోగ్యారీ కిర్‌స్టన్- 251 బంతుల్లో రికెల్టన్- 266 బంతుల్లోజాక్ కల్లిస్- 267 బంతుల్లోశతక్కొట్టిన బవుమాపాక్తో రెండో టెస్ట్‌లో రికెల్టన్ డబుల్ సెంచరీ సాధించగా.. కెప్టెన్ టెంబా బవుమా సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్‌లో బవుమా 106 పరుగులు (9 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసి ఔటయ్యాడు. టెస్ట్‌ల్లో బవుమాను ఇది నాలుగో శతకం. ఇటీవలి కాలంలో భీకర ఫామ్‌లో ఉన్న బవుమా.. గత ఏడు ఇన్నింగ్స్‌ల్లో మూడు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు చేశాడు.భారీ స్కోర్ దిశగా సౌతాఫ్రికాపాక్తో మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా భారీ స్కోర్ దిశగా సాగుతుంది. ఆ జట్టు 102 ఓవర్లు పూర్తయ్యే సరికి 5 వికెట్లు కోల్పోయి 405 పరుగులు చేసింది. రికెల్టన్ (211), కైల్ వెర్రిన్ (53) క్రీజ్‌లో ఉన్నారు.సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో ఎయిడెన్ మార్క్రమ్ (17), వియాన్ ముల్దర్ (5), ట్రిస్టన్ స్టబ్స్ (0), బవుమా (106), డేవిడ్ బెడింగ్హమ్ (5) ఔటయ్యారు. పాకిస్తాన్ బౌలర్లలో సల్మాన్ అఘా , మొహమ్మద్ అబ్బాస్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. ఖుర్రమ్ షెహజాద్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. కాగా, రెండు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో సౌతాఫ్రికా తొలి మ్యాచ్‌లో జయభేరి మోగించిన విషయం తెలిసిందే. తొలి టెస్ట్ విజయానంతరం సౌతాఫ్రికా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు క్వాలిఫై అయ్యింది. -
శతక్కొట్టిన బవుమా
కేప్‌టౌన్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా సారధి టెంబా బవుమా సెంచరీతో కదంతొక్కాడు. బవుమా 166 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. టెస్ట్‌ల్లో బవుమాకు ఇది నాలుగో శతకం. సెంచరీ అనంతరం బవుమా (106) ఔటయ్యాడు. మరో ఎండ్‌లో ర్యాన్ రికెల్టన్ (219 బంతుల్లో 172; 21 ఫోర్లు, సిక్స్) డబుల్ సెంచరీకి చేరువయ్యాడు. 76.4 ఓవర్ల అనంతరం సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ స్కోర్ 307/4గా ఉంది. ఎయిడెన్ మార్క్రమ్ (17), వియాన్ ముల్దర్ (5), ట్రిస్టన్ స్టబ్స్ (0), బవుమా ఔట్ కాగా.. రికెల్టన్, డేవిడ్ బెడింగ్హమ్ క్రీజ్‌లో ఉన్నారు. పాకిస్తాన్ బౌలర్లలో సల్మాన్ అఘా 2, ఖుర్రమ్ షెహజాద్, మొహమ్మద్ అబ్బాస్ తలో వికెట్ పడగొట్టారు.రికార్డు భాగస్వామ్యంఈ మ్యాచ్‌లో టెంబా బవుమా, ర్యాన్ రికెల్టన్ నాలుగో వికెట్‌కు 204 పరుగుల రికార్డు భాగస్వామ్యం నమోదు చేశారు. సౌతాఫ్రికా తరఫున నాలుగో వికెట్ ఇదే అత్యధిక భాగస్వామ్యం. సౌతాఫ్రికా తరఫున ఏ వికెట్‌కైనా అత్యధిక భాగస్వామ్యాన్ని గ్రేమ్ స్మిత్, హెర్షల్ గిబ్స్ నమోదు చేశారు. 2002-03 కేప్‌టౌన్ టెస్ట్‌లో గిబ్స్-స్మిత్ జోడీ తొలి వికెట్‌కు 368 పరుగులు జోడించారు.భీకర ఫామ్‌లో బవుమాఇటీవలి కాలంలో బవుమా భీకర ఫామ్‌లో ఉన్నాడు. బవుమా గత ఏడు ఇన్నింగ్స్‌ల్లో మూడు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు చేశాడు.ఫైనల్ల్లో సౌతాఫ్రికాదక్షిణాఫ్రికా జట్టు ఇదివరకే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరింది. 2023-25 ఎడిషన్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరిన తొలి జట్టు సౌతాఫ్రికానే. తొలి టెస్ట్‌లో పాకిస్తాన్‌పై విజయం అనంతరం సౌతాఫ్రికా డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. మరో బెర్త్ కోసం ఆస్ట్రేలియా, భారత్ పోటీపడుతున్నాయి.కాగా, పాక్‌తో జరుగుతున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో సౌతాఫ్రికా తొలి మ్యాచ్‌లో జయభేరి మోగించింది. సెంచూరియన్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో సౌతాఫ్రికా రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 211, రెండో ఇన్నింగ్స్‌లో 237 పరుగులకు ఆలౌటైంది. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 301, రెండో ఇన్నింగ్స్‌లో 150 పరుగులు (8 వికెట్లు కోల్పోయి) చేసింది.పాక్ తొలి ఇన్నింగ్స్‌లో కమ్రాన్ గులామ్ (54) అర్ద సెంచరీతో రాణించాడు. సౌతాఫ్రికా బౌలర్లలో డేన్ పీటర్సన్ 5, కార్బిన్ బాష్ 4 వికెట్లు తీశారు. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో ఎయిడెన్ మార్క్రమ్ (89), కార్బిన్ బాష్ (81 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించారు. పాక్ బౌలర్లలో ఖుర్రమ్ షెహజాద్, నసీం షా తలో మూడు వికెట్లు తీశారు. పాక్ రెండో ఇన్నింగ్స్‌లో బాబర్ ఆజమ్ (50), సౌద్ షకీల్ (84) అర్ద సెంచరీలు చేశారు. మార్కో జన్సెన్ 6 వికెట్లు తీసి పాక్ పతనాన్ని శాశించాడు. 150 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా తడబడింది. మార్క్రమ్ (37), బవుమా (40),రబాడ (31 నాటౌట్) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి సౌతాఫ్రికాను గెలిపించారు. -
సూపర్ సెంచరీతో సత్తా చాటిన రికెల్టన్
కేప్‌టౌన్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో సౌతాఫ్రికా ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ (Ryan Rickelton) సూపర్ సెంచరీతో సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా టీ విరామం సమయానికి 3 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. రికెల్టన్ 134 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సల్మాన్ అఘా బౌలింగ్‌లో బౌండరీ బాది రికెల్టన్ సెంచరీ మార్కును అందుకున్నాడు. టెస్ట్‌ల్లో రికెల్టన్కు ఇది రెండో సెంచరీ. మరోవైపు కెప్టెన్ టెంబా బవుమా కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. బవుమా 82 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. టీ విరామం సమయానికి రికెల్టన్ (106), బవుమా (51) క్రీజ్‌లో ఉన్నారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో ఎయిడెన్ మార్క్రమ్ 17, వియాన్ ముల్దర్ 5, ట్రిస్టన్ స్టబ్స్ 0 పరుగులకు ఔటయ్యారు. పాక్ బౌలర్లలో మొహమ్మద్ అబ్బాస్, ఖుర్రమ్ షెహజాద్, సల్మాన్ అఘా తలో వికెట్ పడగొట్టారు.కాగా, పాక్‌తో జరుగుతున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో సౌతాఫ్రికా తొలి మ్యాచ్‌లో జయభేరి మోగించింది. సెంచూరియన్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో సౌతాఫ్రికా రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 211, రెండో ఇన్నింగ్స్‌లో 237 పరుగులకు ఆలౌటైంది. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 301, రెండో ఇన్నింగ్స్‌లో 150 పరుగులు (8 వికెట్లు కోల్పోయి) చేసింది.పాక్ తొలి ఇన్నింగ్స్‌లో కమ్రాన్ గులామ్ (54) అర్ద సెంచరీతో రాణించాడు. సౌతాఫ్రికా బౌలర్లలో డేన్ పీటర్సన్ 5, కార్బిన్ బాష్ 4 వికెట్లు తీశారు. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో ఎయిడెన్ మార్క్రమ్ (89), కార్బిన్ బాష్ (81 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించారు. పాక్ బౌలర్లలో ఖుర్రమ్ షెహజాద్, నసీం షా తలో మూడు వికెట్లు తీశారు. పాక్ రెండో ఇన్నింగ్స్‌లో బాబర్ ఆజమ్ (50), సౌద్ షకీల్ (84) అర్ద సెంచరీలు చేశారు. మార్కో జన్సెన్ 6 వికెట్లు తీసి పాక్ పతనాన్ని శాశించాడు. 150 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా కూడా తడబడింది. మార్క్రమ్ (37), బవుమా (40),రబాడ (31 నాటౌట్) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి సౌతాఫ్రికాను గెలిపించారు. -
దక్షిణాఫ్రికా లక్ష్యం 148
సెంచూరియన్: పాకిస్తాన్‌తో జరుగుతున్న ‘బాక్సింగ్ డే’ తొలి టెస్టులో ఆతిథ్య దక్షిణాఫ్రికా గెలుపుబాటలో 121 పరుగుల దూరంలో ఉంది. అయితే కీలకమైన 3 వికెట్లు కోల్పోవడం వల్ల సఫారీకి నాలుగో రోజు ఛేజింగ్ అంత సులభంగా అయితే లేదు. అంతకుముందు శనివారం 88/3 ఓవర్‌నైట్ స్కోరుతో మూడోరోజు రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన పాకిస్తాన్ 59.4 ఓవర్లలో 237 పరుగుల వద్ద ఆలౌటైంది. క్రితం రోజు బ్యాటర్లు బాబర్ ఆజమ్ (85 బంతుల్లో 50; 9 ఫోర్లు), సౌద్ షకీల్ (113 బంతుల్లో 84; 10 ఫోర్లు, 1 సిక్స్) ఇద్దరు అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు. వీరి జోడి నిలబడినంతవరకు బాగానే ఉన్నా... బాబర్ ఫిఫ్టీ తర్వాత నిష్క్రమించడంతో కథ మొదటికొచ్చిoది. జట్టు స్కోరు 153 పరుగుల వద్ద బాబర్‌ను జాన్సెన్ అవుట్ చేశాడు. దీంతో నాలుగో వికెట్‌కు 79 పరుగుల భాగస్వామ్యం ముగియగా, తర్వాత వచ్చిన రిజ్వాన్ (3), సల్మాన్ ఆఘా (1)లను జాన్సెన్ పెవిలియన్ చేర్చడంతో 176 స్కోరు వద్ద ఆరో వికెట్ పడింది. సఫారీ బౌలర్లు ఇదే జోరు సాగిచండంతో పాక్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. మార్కో జాన్సెన్ 6 వికెట్లు పడగొట్టగా, రబడకు 2 వికెట్లు దక్కాయి. తొలిఇన్నింగ్స్‌లో సఫారీకి 90 పరుగుల ఆధిక్యం దక్కడం వల్ల 148 పరుగుల లక్ష్యమే ఎదురైంది. దీన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా ఆట నిలిచే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 9 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 27 పరుగులు చేసింది. -
147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా..!
147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఎన్నడూ నమోదు కాని ఓ ఫీట్ సౌతాఫ్రికా, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో నమోదైంది. అరంగేట్రంలో 9వ స్థానంలో వచ్చి 80 ప్లస్ స్కోర్ నమోదు చేసిన తొలి ఆటగాడిగా సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ కార్బిన్ బాష్ చరిత్ర సృష్టించాడు. పాక్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బాష్ తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 81 పరుగులతో అజేయంగా నిలిచాడు.టెస్ట్ అరంగేట్రంలో తొమ్మిదో స్థానంలో వచ్చి అత్యధిక స్కోర్ నమోదు చేసిన ఆటగాళ్లు81* - కార్బిన్ బాష్ (SA) vs PAK, సెంచూరియన్, 202472 - మిలన్ రత్నాయకే (SL) vs ENG, ఓల్డ్ ట్రాఫోర్డ్, 202471 - బల్వీందర్ సంధు (IND) vs PAK, హైదరాబాద్ (సింద్), 198365 - డారెన్ గోఫ్ (ENG) vs NZ, ఓల్డ్ ట్రాఫోర్డ్, 199459 - మొండే జోండేకి (SA) vs ENG, హెడింగ్లీ, 2003పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో బాష్ బ్యాట్‌తో పాటు బంతితోనూ సత్తా చాటాడు. బ్యాట్‌తో వరల్డ్ రికార్డు స్కోర్ సాధించడానికి ముందు బాష్ నాలుగు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. తద్వారా దక్షిణాఫ్రికా తరఫున అరంగేట్రంలో హాఫ్ సెంచరీ సహా నాలుగు వికెట్లు తీసిన తొలి క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఇదే మ్యాచ్‌లో బాష్ 122 ఏళ్ల రికార్డును కూడా బద్దలు కొట్టాడు. సౌతాఫ్రికా తరఫున అరంగేట్రంలో ఎనిమిది అంతకంటే కింది స్థానాల్లో వచ్చి అత్యధిక స్కోర్ నమోదు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.మ్యాచ్ విషయానికొస్తే.. పాకిస్తాన్‌తో తొలి టెస్టులో దక్షిణాఫ్రికా పటిష్ట స్థితిలో నిలిచింది. అరంగేట్ర మ్యాచ్‌లో బంతితో 4 వికెట్లు పడగొట్టిన కార్బిన్ బాష్ (93 బంతుల్లో 81 నాటౌట్; 15 ఫోర్లు) బ్యాట్‌తోనూ విజృంభించాడు. ఫలితంగా ఓవర్‌నైట్ స్కోరు 82/3తో శుక్రవారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికా చివరకు 73.4 ఓవర్లలో 301 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆతిథ్య సఫారీ జట్టుకు 90 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఓపెనర్ మార్క్రమ్ (144 బంతుల్లో 89; 15 ఫోర్లు) 11 పరుగుల తేడాతో సెంచరీని కోల్పోయాడు. పాకిస్తాన్ బౌలర్లలో ఖుర్రమ్ షహజాద్, నసీమ్ షా చెరో 3 వికెట్లు పడగొట్టారు.అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 22 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 88 పరుగులు చేసింది. కెప్టెన్ షాన్ మసూద్ (28; 4 ఫోర్లు) అయూబ్ (28; 6 ఫోర్లు), కమ్రాన్ గులామ్ (4) అవుట్ కాగా... బాబర్ ఆజమ్ (16 బ్యాటింగ్), సౌద్ షకీల్ (8 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. చేతిలో 7 వికెట్లు ఉన్న పాకిస్తాన్... ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ స్కోరుకు 2 పరుగులు వెనుకబడి ఉంది. సఫారీ బౌలర్లలో యాన్సెన్ 2 వికెట్లు తీశాడు. -
మార్క్రమ్, బాష్ మెరుపులు.. పటిష్ట స్థితిలో సౌతాఫ్రికా
సెంచూరియన్: పాకిస్తాన్‌తో తొలి టెస్టులో దక్షిణాఫ్రికా పటిష్ట స్థితిలో నిలిచింది. అరంగేట్ర మ్యాచ్‌లో బంతితో 4 వికెట్లు పడగొట్టిన కార్బిన్ బాష్ (93 బంతుల్లో 81 నాటౌట్; 15 ఫోర్లు) బ్యాట్‌తోనూ విజృంభించాడు. లోయర్ ఆర్డర్ అండతో పాకిస్తాన్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ అర్ధ సెంచరీ నమోదు చేశాడు. అరంగేట్ర మ్యాచ్‌లో 9వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ఆటగాడిగా బాష్ రికార్డుల్లోకెక్కాడు. ఫలితంగా ఓవర్‌నైట్ స్కోరు 82/3తో శుక్రవారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికా చివరకు 73.4 ఓవర్లలో 301 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆతిథ్య సఫారీ జట్టుకు 90 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఓపెనర్ మార్క్రమ్ (144 బంతుల్లో 89; 15 ఫోర్లు) 11 పరుగుల తేడాతో సెంచరీని కోల్పోయాడు. కెప్టెన్ బవుమా (31; 4 ఫోర్లు), బెడింగ్హమ్ (30; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. కైల్ వెరిన్ (2), మార్కో యాన్సెన్ (2) విఫలమయ్యారు. పాకిస్తాన్ బౌలర్లలో ఖుర్రమ్ షహజాద్, నసీమ్ షా చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 22 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 88 పరుగులు చేసింది. కెప్టెన్ షాన్ మసూద్ (28; 4 ఫోర్లు) అయూబ్ (28; 6 ఫోర్లు), కమ్రాన్ గులామ్ (4) అవుట్ కాగా... బాబర్ ఆజమ్ (16 బ్యాటింగ్), సౌద్ షకీల్ (8 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. చేతిలో 7 వికెట్లు ఉన్న పాకిస్తాన్... ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ స్కోరుకు 2 పరుగులు వెనుకబడి ఉంది. సఫారీ బౌలర్లలో జన్సెన్ 2 వికెట్లు తీశాడు. -
SA Vs PAK: నిప్పులు చెరిగిన ప్యాటర్సన్, బాష్.. పాకిస్తాన్ 211 ఆలౌట్
సెంచూరియన్: అరంగేట్రం చేసిన ‘బాక్సింగ్ డే’ టెస్టును దక్షిణాఫ్రికా సీమర్ కార్బిన్ బాష్ (4/63) చిరస్మరణీయం చేసుకున్నాడు. సహచర పేసర్ డేన్ పాటర్సన్ (5/61)తో కలిసి పాకిస్తాన్ బ్యాటర్లను బెంబేలెత్తించాడు. తొలి టెస్టు మొదలైన రోజే ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 57.3 ఓవర్లలో 211 పరుగుల వద్ద ఆలౌటైంది. మిడిలార్డర్ బ్యాటర్ కమ్రాన్ గులామ్ (54; 8 ఫోర్లు, 1 సిక్స్) ఒక్కడే రాణించి సఫారీ బౌలర్లను ఎదుర్కొని అర్ధసెంచరీ సాధించాడు. మిగిలిన వారిలో అమీర్ జమాల్ (28; 4 ఫోర్లు, 1 సిక్స్), రిజ్వాన్ (27; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆతిథ్య దక్షిణాఫ్రికా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 22 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 82 పరుగులు చేసింది. జోర్జి (2), రికెల్టన్ (8), స్టబ్స్ (9) సింగిల్ డిజిట్‌కే నిష్క్రమించినా... ఓపెనర్ మార్క్రమ్ (47 బ్యాటింగ్; 9 ఫోర్లు) పాక్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నాడు. అతనితో పాటు కెప్టెన్ బవుమా (4 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. పాక్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు సౌతాఫ్రికా ఇంకా 129 పరుగులు వెనుకపడి ఉంది. -
పాకిస్తాన్ X దక్షిణాఫ్రికా
సెంచూరియన్: దక్షిణాఫ్రికా గడ్డపై తొలిసారి వన్డే సిరీస్ క్లీన్‌స్వీప్ చేసి చరిత్ర సృష్టించిన పాకిస్తాన్ జట్టు నేటి నుంచి టెస్టు సిరీస్ ఆడనుంది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా పాకిస్తాన్, దక్షిణాఫ్రికా మధ్య గురువారం నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో 63.33 పాయింట్లతో ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా... ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా ఫైనల్‌కు అర్హత సాధించాలంటే ఈ సిరీస్‌ను 2–0తో గెలవాల్సిన అవసరముంది. ఇదే తమ లక్ష్యమని సఫారీ జట్టు సారథి తెంబా బవుమా ఇప్పటికే ప్రకటించగా... వన్డే సిరీస్‌లో కనబర్చిన జోరును కొనసాగిస్తూ సుదీర్ఘ ఫార్మాట్లోనూ సత్తా చాటాలని పాకిస్తాన్ జట్టు ఆశిస్తోంది. పేసర్లకు సహకరించనున్న సెంచూరియన్ పిచ్‌పై దక్షిణాఫ్రికా నలుగురు పేసర్లతో బరిలోకి దిగనుంది. గత ఆరేళ్లలో సెంచూరియన్‌లో జరిగిన మ్యాచ్‌ల్లో పేసర్లు 227 వికెట్లు పడగొట్టగా... స్పిన్నర్లు కేవలం 16 వికెట్లు మాత్రమే తీశారు. సఫారీ గడ్డపై పాకిస్తాన్ టెస్టు రికార్డు ఏమంత గొప్పగా లేదు. 1995 నుంచి అక్కడ పర్యటిస్తున్న పాక్ జట్టు 15 టెస్టులాడి 12 మ్యాచ్‌ల్లో ఓడింది. పాకిస్తాన్ టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యల్ప స్కోరు (49) కూడా దక్షిణాఫ్రికా గడ్డపైనే నమోదైంది. వన్డే సిరీస్‌లో సత్తా చాటిన ప్రధాన పేసర్ షాహీన్ షా అఫ్రిది లేకపోవడం పాక్ జట్టుకు ప్రధాన లోటు కాగా... చివరగా ఇంగ్లండ్‌తో ఆడిన టెస్టు మ్యాచ్‌లో చోటు దక్కించుకోలేకపోయిన నసీమ్ షా, బాబర్ ఆజమ్ తిరిగి జట్టులోకి వచ్చారు. పేస్ బౌలర్ మొహమ్మద్ అబ్బాస్ మూడేళ్ల తర్వాత పాక్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. మరి టెస్టుల్లో నిలకడైన ప్రదర్శన కనబర్చలేకపోతున్న పాకిస్తాన్ జట్టు షాన్ మసూద్ సారథ్యంలో సఫారీ గడ్డపై పేస్ సవాల్‌ను ఎలా ఎదుర్కొంటుదనేది ఆసక్తికరం. -
SA VS PAK 1st ODI: రాణించిన క్లాసెన్
పార్ల్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి వన్డేలో సౌతాఫ్రికా స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ (97 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 86 పరుగులు) రాణించడంతో సౌతాఫ్రికా ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో టోనీ డి జోర్జి (33), ర్యాన్ రికెల్టన్ (36), ఎయిడెన్ మార్క్రమ్ (35), మార్కో జన్సెన్ (10), కగిసో రబాడ (11), ఓట్నీల్ బార్ట్‌మన్ (10 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. రస్సీ వాన్ డెర్ డస్సెన్ (8), ట్రిస్టన్ స్టబ్స్ (1), అండైల్ ఫెహ్లుక్వాయో (1) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.ఓపెనర్లు జోర్జి, రికెల్టన్ తొలి వికెట్‌కు 70 పరుగులు జోడించడంతో సౌతాఫ్రికా ఓ దశలో భారీ స్కోర్ చేసేలా కనిపించింది. అయితే ఇక్కడే పాక్ స్పిన్నర్ సల్మాన్ అఘా సఫారీ బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. అఘా 18 పరుగుల వ్యవధిలో జోర్జి, రికెల్టన్, డస్సెన్, స్టబ్స్ వికెట్లు పడగొట్టాడు. ఈ దశలో మార్క్రమ్.. కొద్దిసేపు క్లాసెన్‌తో కలిసి క్రీజ్‌లో నిలదొక్కుకున్నాడు. మార్క్రమ్ ఔటయ్యాక జన్సెన్ సాయంతో క్లాసెన్ సెంచరీ దిశగా సాగాడు. అయితే సఫారీలను ఈ సారి షాహీన్ అఫ్రిది ఇబ్బందుల్లోకి నెట్టాడు. సెంచరీకి చేరువలో ఉండగా అఫ్రిది క్లాసెన్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు.ఆఖర్లో టెయిలెండర్లు ఒక్కో పరుగు పోగు చేయడంతో సౌతాఫ్రికా 239 పరుగులు చేయగలిగింది. పాక్ బౌలర్లలో సల్మాన్ అఘా 4, అబ్రార్ అహ్మద్ 2, షాహీన్ అఫ్రిది, సైమ్ అయూబ్ తలో వికెట్ పడగొట్టారు. -
ఇంగ్లండ్ బ్యాటర్ల రికార్డు.. ఒకరేమో అరంగేట్రంలోనే సెంచరీ, మరొకరు ఫాస్టెస్ట్ సెంచరీ
మహిళల క్రికెట్లో భాగంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో ఇద్దరు ఇంగ్లండ్ బ్యాటర్లు సెంచరీలు చేసి రికార్డులు సృష్టించారు. ఈ మ్యాచ్‌లో మయా బౌచియర్ (126), నాట్ సీవర్ బ్రంట్ (128) మూడంకెల మార్కును అందుకున్నారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్.. తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 395 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ట్యామీ బేమౌంట్ 21, హీథర్ నైట్ 20, డేనియెల్ వ్యాట్ హాడ్జ్ 12, ఆమీ జోన్స్ 39, చార్లోట్ డీన్ 8, సోఫీ ఎక్లెస్టోన్ 21, ర్యానా మెక్ డోనాల్డ్ గే 2 పరుగులు చేసి ఔట్ కాగా.. లారెన్ ఫైలర్ (0), లారెన్ బెల్ (0) అజేయంగా నిలిచారు. సౌతాఫ్రికా బౌలర్లలో మ్లాబా నాలుగు వికెట్లు పడగొట్టగా.. అయాండా హ్లుబి 2, తుమీ సెఖుఖునే, మారిజన్ కాప్ తలో వికెట్ దక్కించుకున్నారు.అరంగేట్రంలోనే సెంచరీమయా బౌచియర్ అరంగేట్రంలోనే సెంచరీ చేసి రికార్డుల్లోకెక్కింది. అరంగేట్రంలో సెంచరీ చేసిన 14వ మహిళా క్రికెటర్‌గా బౌచియర్ రికార్డు సృష్టించింది. బౌచియర్ తన సెంచరీ మార్కును కేవలం 124 బంతుల్లో అందుకుంది. తద్వారా మహిళల క్రికెట్లో ఫాస్టెస్ట్ టెస్ట్ సెంచరీ చేసిన ఐదో బ్యాటర్‌గానూ రికార్డు నెలకొల్పింది.ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన నాట్ సీవర్మహిళల క్రికెట్లో ఫాస్టెస్ట్ టెస్ట్ సెంచరీ చేసిన ఘనత నాట్ సీవర్ బ్రంట్ దక్కింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో బ్రంట్ ఈ ఫీట్‌ను సాధించింది. బ్రంట్ కేవలం 96 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకుంది. మహిళల క్రికెట్లో ఎవ్వరూ 100లోపు బంతుల్లో టెస్ట్ సెంచరీ పూర్తి చేయలేదు. మహిళల క్రికెట్లో టాప్-5 ఫాస్టెస్ట్ సెంచరీల్లో నాలుగు దక్షిణాఫ్రికాపైనే నమోదు కావడం విశేషం.మహిళల క్రికెట్లో ఫాస్టెస్ట్ టెస్ట్ సెంచరీలు..నాట్ సీవర్ బ్రంట్-96 బంతుల్లో సౌతాఫ్రికాపైచమానీ సెనెవిరతన-106 బంతుల్లో పాకిస్తాన్పైషఫాలీ వర్మ-113 బంతుల్లో సౌతాఫ్రికాపైస్మృతి మంధన-122 బంతుల్లో సౌతాఫ్రికాపైమయా బౌచియర్-124 బంతుల్లో సౌతాఫ్రికాపై -
సౌతాఫ్రికాకు బిగ్ షాక్
సౌతాఫ్రికా, పాకిస్తాన్ జట్ల మధ్య ప్రస్తుతం మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగుతుంది. ఈ సిరీస్ జరుగుతుండగా సౌతాఫ్రికాకు భారీ షాక్ తగిలింది. గాయం కారణంగా ఆ జట్టు ప్రధాన పేసర్ అన్రిచ్ నోర్జే టీ20 సిరీస్‌తో పాటు తదుపరి జరిగే వన్డే సిరీస్‌కు కూడా దూరమయ్యాడు. టీ20 సిరీస్‌లో మొదటి మ్యాచ్‌కు కూడా నోర్జే దూరంగా ఉన్నాడు. నోర్జే ఎడమకాలి బొటనవేలు ప్రాక్చర్ అయినట్లు స్కానింగ్‌లో తేలింది. పాక్‌తో టీ20 సిరీస్‌కు నోర్జే ప్రత్యామ్నాయంగా అన్క్యాప్డ్ ఆల్‌రౌండర్ డయ్యాన్ గేలిమ్ ఎంపికయ్యాడు. గేలిమ్ తన 60 మ్యాచ్‌ల టీ20 కెరీర్లో 46 వికెట్లు పడగొట్టాడు.కాగా, నోర్జే ఈ ఏడాది జూన్‌లో జరిగిన టీ20 వరల్డ్‌కప్ ఫైనల్లో చివరిసారి సౌతాఫ్రికా జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఆ వరల్డ్‌కప్‌లో సౌతాఫ్రికా రన్నరప్‌గా నిలిచింది. ఈ మెగా టోర్నీలో నోర్జే సౌతాఫ్రికా తరఫున లీడింగ్ వికెట్ టేకర్‌గా (15 వికెట్లు) ఉన్నాడు. వర్క్ లోడ్ మేనేజ్మెంట్ కారణంగా నోర్జే జాతీయ కాంట్రాక్ట్ నుంచి కూడా తప్పుకున్నాడు.సౌతాఫ్రికాను పట్టి పీడిస్తున్న గాయాలుప్రస్తుతం సౌతాఫ్రికా జట్టును గాయాల సమస్య వేధిస్తుంది. నోర్జే గాయపడిన అనంతరం సౌతాఫ్రికా క్యాజ్యువల్స్ (బౌలర్లు) సంఖ్య ఐదుకు చేరింది. నోర్జేకు ముందు గెరాల్డ్ కొయెట్జీ, నండ్రే బర్గర్, లుంగి ఎంగిడి, వియాన్ ముల్దర్ గాయాల బారిన పడ్డారు. ప్రస్తుతానికి వీరంతా జట్టుకు దూరంగా ఉంటున్నారు.ఇదిలా ఉంటే, మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ల కోసం పాకిస్తాన్ జట్టు సౌతాఫ్రికాలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా ఇరు జట్ల మధ్య తొలుత టీ20 సిరీస్ మొదలైంది. డిసెంబర్ 10న జరిగిన తొలి టీ20లో పాకిస్తాన్‌పై సౌతాఫ్రికా 11 పరుగుల తేడాతో గెలుపొందింది. కిల్లర్ మిల్లర్ ఊచకోత (82), జార్జ్ లిండే ఆల్‌రౌండ్ షో (48, 4/21) కారణంగా ఈ మ్యాచ్‌లో పాక్‌పై సౌతాఫ్రికా సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. -
సౌతాఫ్రికాతో తొలి టీ20.. బాబర్ ఆజమ్, షాహీన్ అఫ్రిది రీ ఎంట్రీ
సౌతాఫ్రికాలో పాకిస్తాన్ పర్యటన ఇవాల్టి (డిసెంబర్ 10) నుంచి మొదలవుతుంది. డర్బన్ వేదికగా ఇరు జట్లు ఇవాళ తొలి టీ20లో తలపడతాయి. ఈ మ్యాచ్ కోసం పాకిస్తాన్ తుది జట్టును కాసేపటి కిందే ప్రకటించారు. జింబాబ్వే టీ20 సిరీస్‌కు దూరంగా ఉన్న స్టార్ ఆటగాళ్లు షాహీన్ అఫ్రిది, బాబర్ ఆజమ్, మొహమ్మద్ రిజ్వాన్ ఈ మ్యాచ్‌తో రీఎంట్రీ ఇవ్వనున్నారు.జింబాబ్వే టీ20 సిరీస్ పాక్ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించిన సల్మాన్ అలీ అఘాను ఈ మ్యాచ్ నుంచి తప్పించారు. గత కొన్ని సిరీస్‌లుగా అఘా దారుణంగా విఫలమవుతున్నాడు. జింబాబ్వే పర్యటనలో రాణించిన తయ్యబ్ తాహిర్ మిడిలార్డర్లో కీలకపాత్ర పోషించనున్నాడు. మిడిలార్డర్లో ఉస్మాన్ ఖాన్, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్ చోటు దక్కించుకున్నారు.సౌతాఫ్రికాతో తొలి మ్యాచ్‌లో ఎవరు ఓపెనింగ్ చేస్తారన్నది సందిగ్దంగా మారింది. జింబాబ్వే పర్యటనలో సత్తా చాటిన సైమ్ అయూబ్‌ను ఓపెనర్‌గా పంపిస్తారా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది. బాబర్ ఆజమ్, మొహమ్మద్ రిజ్వాన్ ఓపెనర్లుగా బరిలోకి దిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మొహమ్మద్ అబ్బాస్ అఫ్రిది ఆల్‌రౌండర్ పాత్ర పోషిస్తూ ఏడో స్థానంలో బరిలోకి దిగుతాడు.అబ్బాస్ అఫ్రిదితో పాటు షాహీన్ అఫ్రిది, హరీస్ రౌఫ్ పేస్ విభాగంలో ఉంటారు. స్పిన్నర్లు సూఫియాన్ ముఖీమ్, అబ్రార్ అహ్మద్ బరిలోకి దిగనున్నారు. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 9:30 గంటలకు ప్రారంభమవుతుంది. సౌతాఫ్రికాతో తొలి టీ20కి పాక్ తుది జట్టు..మొహమ్మద్ రిజ్వాన్ (కెప్టెన్ అండ్ వికెట్‌కీపర్), బాబర్ ఆజమ్, సైమ్ అయూబ్, ఉస్మాన్ ఖాన్, తయ్యబ్ తాహిర్, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, మొహమ్మద్ అబ్బాస్ అఫ్రిది, షాహీన్ అఫ్రిది, హరీస్ రౌఫ్, సూఫియాన్ ముఖీమ్, అబ్రార్ అహ్మద్ -
ఆసీస్‌ను వెనక్కు నెట్టి టాప్ ప్లేస్‌కు చేరిన సౌతాఫ్రికా
శ్రీలంకపై రెండో టెస్ట్‌లో విజయం అనంతరం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో సౌతాఫ్రికా అగ్రస్థానానికి చేరింది. ఈ మ్యాచ్‌కు ముందు వరకు ఆస్ట్రేలియా టాప్ ప్లేస్‌లో ఉండింది. తాజా విజయంతో సౌతాఫ్రికా ఆసీస్‌ను వెనక్కు నెట్టి అగ్రపీఠాన్ని అధిరోహించింది. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరేందుకు సౌతాఫ్రికా మరో గెలుపు దూరంలో ఉంది. సౌతాఫ్రికా తమ తొలి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరాలంటే పాకిస్తాన్‌తో జరుగబోయే రెండు మ్యాచ్‌ల్లో ఒక్క మ్యాచ్ గెలిచినా చాలు.ప్రస్తుతం సౌతాఫ్రికా విజయాల శాతం 63.33గా ఉంది. డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్లో సౌతాఫ్రికా ఆడిన 10 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించింది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా 60.71 విజయాల శాతం కలిగి ఉంది. ఆసీస్ చేతిలో రెండో టెస్ట్‌లో ఓటమి అనంతరం టీమిండియా మూడో స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం భారత్ విజయాల శాతం 57.29గా ఉంది. ప్రస్తుత సైకిల్లో టీమిండియా 16 మ్యాచ్‌లు ఆడి తొమ్మిదింట విజయాలు సాధించింది. సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్‌ను 0-2 తేడాతో కోల్పోయిన శ్రీలంక నాలుగో స్థానంలో ఉంది. ఆ జట్టు విజయాల శాతం 45.45గా ఉంది. న్యూజిలాండ్‌ను వారి సొంతగడ్డపై వరుసగా రెండు టెస్ట్‌ల్లో మట్టికరిపించిన ఇంగ్లండ్ ఐదో స్థానంలో ఉంది. స్వదేశంలో ఇంగ్లండ్ చేతిలో ఘోర పరాభవం ఎదుర్కొన్న న్యూజిలాండ్ ఆరో స్థానంలో.. పాకిస్తాన్, బంగ్లాదేశ్, వెస్టిండీస్ వరుసగా 7, 8, 9 స్థానాల్లో ఉన్నాయి.టీమిండియా విషయానికొస్తే.. భారత జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరాలంటే ఆసీస్‌తో తదుపరి జరుగబోయే మూడు టెస్ట్‌ల్లో విజయాలు సాధించాల్సి ఉంటుంది. ఆసీస్‌ను వారి సొంతగడ్డపై 4-1 తేడాతో ఓడిస్తే భారత విజయాల శాతం 63.15కు చేరి టేబుల్ టాపర్‌గా నిలుస్తుంది. ఇలా జరిగితే భారత్ ఇతర జట్ల జయాపజాలపై ఆధారపడకుండా నేరుగా ఫైనల్‌కు చేరుతుంది. ఆసీస్‌తో తదుపరి జరుగబోయే మూడు టెస్ట్‌ల్లో భారత్ ఒక్క మ్యాచ్‌లో ఓడినా ఇతర జట్ల జయాపజయాలపై ఆధారపడాల్సి ఉంటుంది. -
రెండో టెస్ట్‌లోనూ సౌతాఫ్రికాదే విజయం.. సిరీస్ కైవసం
గెబెర్హా వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టెస్ట్‌లో సౌతాఫ్రికా 109 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. 205/5 వద్ద ఐదో రోజు ఆటను ప్రారంభించిన శ్రీలంక ఓవర్‌నైట్ స్కోర్‌కు మరో 33 పరుగులు మాత్రమే జోడించి మిగతా ఐదు వికెట్లు కోల్పోయింది. ఛేదనలో శ్రీలంక 238 పరుగులకే చాపచుట్టేసింది. కేశవ్ మహారాజ్ ఐదు వికెట్లు తీసి లంక పతనాన్ని శాశించాడు. రబాడ, డేన్ పీటర్సన్ తలో రెండు వికెట్లు.. జన్సెన్ ఓ వికెట్ పడగొట్టారు. లంక సెకెండ్ ఇన్నింగ్స్‌లో ధనంజయ డిసిల్వ (50) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. కుసాల్ మెండిస్ (46), కమిందు మెండిస్ (35), ఏంజెలో మాథ్యూస్ (32) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.అంతకుముందు సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 317 పరుగులకు ఆలౌటైంది. ప్రభాత్ జయసూర్య ఐదు వికెట్లు తీసి సౌతాఫ్రికాను దెబ్బేశాడు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో మార్క్రమ్ (55), బవుమా (66) అర్ద సెంచరీలతో రాణించారు.దీనికి ముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 328 పరుగులు చేసింది. 89 పరుగులు చేసిన పథుమ్ నిస్సంక టాప్ స్కోరర్‌గా నిలిచాడు. డేన్ పీటర్సన్ ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులు చేసింది. ర్యాన్ రికెల్టన్ (101), కైల్ వెర్రిన్ (105 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కారు. లంక బౌలర్లలో లహీరు కుమార అత్యధికంగా నాలుగు వికెట్లు తీశాడు. కాగా, రెండు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో సౌతాఫ్రికా తొలి టెస్ట్‌లోనూ గెలుపొందిన విషయం తెలిసిందే. -
ఐదేసిన జయసూర్య
సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో శ్రీలంక బౌలర్ ప్రభాత్ జయసూర్య ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. టెస్ట్‌ల్లో జయసూర్యకు ఇది 10వ ఐదు వికెట్ల ఘనత. జయసూర్య కేవలం 34 ఇన్నింగ్స్‌ల్లోనే 10 ఐదు వికెట్ల ప్రదర్శనలు చేశాడు. జయసూర్య టెస్ట్ అరంగేట్రం నుంచి ఎవ్వరూ ఇన్ని ఐదు వికెట్ల ప్రదర్శనలు నమోదు చేయలేదు. జయసూర్య తర్వాత అత్యధికంగా అశ్విన్ 7 ఐదు వికెట్ల ప్రదర్శనలు చేశాడు.జయసూర్య టెస్ట్ అరంగేట్రం తర్వాత అత్యధిక ఐదు వికెట్ల ప్రదర్శనలు నమోదు చేసిన బౌలర్లు..ప్రభాత్ జయసూర్య-10 (34 ఇన్నింగ్స్‌ల్లో)అశ్విన్-7 (38 ఇన్నింగ్స్‌ల్లో)పాట్ కమిన్స్-6 (39 ఇన్నింగ్స్‌ల్లో)తైజుల్ ఇస్లాం-5 (25 ఇన్నింగ్స్‌ల్లో)రబాడ-5 (28 ఇన్నింగ్స్‌ల్లో)రవీంద్ర జడేజా-5 (32 ఇన్నింగ్స్‌ల్లో)మ్యాచ్ విషయానికొస్తే.. సౌతాఫ్రికా, శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ నువ్వా నేనా అన్నట్లు సాగుతుంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక లక్ష్యానికి 143 పరుగుల దూరంలో ఉంది. చేతిలో ఐదు వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఆట ముగిసే సమయానికి శ్రీలంక స్కోర్ 205/5గా ఉంది. ధనంజయ డిసిల్వ (39), కుసాల్ మెండిస్ (39) క్రీజ్‌లో ఉన్నారు. సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్, డేన్ పీటర్సన్ తలో 2 వికెట్లు తీయగా.. రబాడ ఓ వికెట్ దక్కించుకున్నాడు.అంతకుముందు సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 317 పరుగులకు ఆలౌటైంది. జయసూర్య ఐదు వికెట్లు తీసి సౌతాఫ్రికాను దెబ్బేశాడు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో మార్క్రమ్ (55), బవుమా (66) అర్ద సెంచరీలతో రాణించారు.దీనికి ముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 328 పరుగులు చేసింది. 89 పరుగులు చేసిన పథుమ్ నిస్సంక టాప్ స్కోరర్‌గా నిలిచాడు. డేన్ పీటర్సన్ ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులు చేసింది. ర్యాన్ రికెల్టన్ (101), కైల్ వెర్రిన్ (105 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కారు. లంక బౌలర్లలో లహీరు కుమార అత్యధికంగా నాలుగు వికెట్లు తీశాడు. కాగా, రెండు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో సౌతాఫ్రికా తొలి టెస్ట్‌లో గెలుపొందిన విషయం తెలిసిందే. -
రికెల్టన్, వెర్రిన్ సెంచరీలు.. సౌతాఫ్రికా భారీ స్కోర్
గెబెర్హా వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 103.4 ఓవర్లలో 358 పరుగులకు ఆలౌటైంది. ర్యాన్ రికెల్టన్ (101), వికెట్ కీపర్ కైల్ వెర్రిన్ (105 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కారు. కెప్టెన్ టెంబా బవుమా (78) అర్ద సెంచరీతో రాణించాడు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో మార్క్రమ్ 20, టోనీ డి జోర్జి 0, ట్రిస్టన్ స్టబ్స్ 4, బెడింగ్హమ్ 6, మార్కో జన్సెన్ 4, కేశవ్ మహారాజ్ 0, రబాడ 23, డేన్ పీటర్సన్ 9 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో లహీరు కుమార 4 వికెట్లు పడగొట్టగా.. అశిత ఫెర్నాండో 3, విశ్వ ఫెర్నాండో 2, ప్రభాత్ జయసూర్య ఓ వికెట్ దక్కించుకున్నారు. ప్రస్తుతం రెండో రోజు తొలి సెషన్ ఆట కొనసాగుతుంది.కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం శ్రీలంక జట్టు సౌతాఫ్రికాలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా జరిగిన తొలి టెస్ట్‌లో సౌతాఫ్రికా 233 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. -
డైరెక్ట్ ఫ్లైట్స్ కోసం భారత్‌తో చర్చలు
ముంబై: పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో భాగంగా నేరుగా విమానాలను ప్రవేశపెట్టడానికి భారత ప్రభుత్వంతోపాటు మూడు విమానయాన సంస్థలతో చర్చలు జరుపుతున్నట్టు దక్షిణాఫ్రికా పర్యాటక మంత్రి పచ్యూషా డె లో తెలిపారు. ప్రస్తుతం భారత్, దక్షిణాఫ్రికా మధ్య కనెక్టింగ్ విమానాశ్రయాలతో ఎమిరేట్స్, కెన్యా ఎయిర్వేస్, ఎయిర్ మారిషస్, ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్, ఎతిహాద్ ఎయిర్వేస్, ఎయిర్ సీషెల్స్, రువాండ్ ఎయిర్, ఖతార్ ఎయిర్వేస్ ద్వారా విమాన సరీ్వసులు నడుస్తున్నాయి. ‘భారతీయ ప్రయాణికుల కోసం దక్షిణాఫ్రికాను పర్యాటక గమ్యస్థానంగా ప్రోత్సహించడానికి, ఏవైనా సమస్యలను పరిష్కరించేందుకు, పర్యాటకాన్ని పెంచడానికి మేము ఇక్కడ ఉన్నాము. దక్షిణాఫ్రికా–భారత్ మధ్య ప్రత్యక్ష విమాన సర్వీసుల విషయంలో సమస్య ఉంది. భారతీయ విమానయాన సంస్థలు ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్‌జెట్‌తో రెండు దేశాల మధ్య నేరుగా విమాన సరీ్వసుల ప్రయోజనాలపై వారిని ఒప్పించబోతున్నాను. ఈ విమానయాన సంస్థలు పర్యాటకుల దృక్కోణం నుండి మాత్రమే కాకుండా వాణిజ్యం, వ్యాపార కోణం నుండి కూడా ఈ ప్రత్యక్ష విమానాలతో పొందగల ప్రయోజనాలను దక్షిణాఫ్రికా టూరిజం వివరిస్తుంది’ అని ఆమె వివరించారు. ఎల్రక్టానిక్ వీసా సౌకర్యాలతో.. దక్షిణాఫ్రికా ప్రభుత్వం భారతీయ ప్రయాణికులకు ఎలక్ట్రానిక్ వీసా సౌకర్యాలతో సుదీర్ఘ ప్రక్రియ సమస్యను పరిష్కరించిందని పచ్యూషా వివరించారు. ఈ–వీసాతో భారతీయ యాత్రికులు ఇప్పుడు దక్షిణాఫ్రికాకు రావడం చాలా సులభం అని చెప్పారు. దక్షిణాఫ్రికాకు అగ్రస్థానంలో ఉన్న మార్కెట్లలో భారత్ ఒకటిగా ఉందని, ఈ ఏడాది చివరినాటికి కోవిడ్‌కు ముందున్న స్థాయికి చేరుకోవాలని తాము భావిస్తున్నామని తెలిపారు. ‘2019లో మేము 95,000 మంది భారతీయ ప్రయాణికులను స్వాగతించాము. 2023లో ఈ సంఖ్య 79,000కి తగ్గింది. ఈ సంవత్సరం జనవరి–సెపె్టంబర్ మధ్య 59,000 మంది భారతీయులు ఇప్పటికే దక్షిణాఫ్రికాను సందర్శించారు. పర్యాటకుల సంఖ్య పరంగా ఈ సంవత్సరం కోవిడ్ పూర్వ స్థాయికి దగ్గరగా ఉండాలని మేము ఆశిస్తున్నాము’ అని ఆమె తెలిపారు. -
పాకిస్తాన్‌తో సిరీస్.. సౌతాఫ్రికా కెప్టెన్‌గా విధ్వంసకర వీరుడు
స్వదేశంలో పాకిస్తాన్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం సౌతాఫ్రికా జట్టును ఇవాళ (డిసెంబర్ 4) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా విధ్వంసకర వీరుడు, వికెట్‌కీపర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ ఎంపికయ్యాడు. శ్రీలంకతో టెస్ట్ సిరీస్ కమిట్మెంట్స్ కారణంగా రెగ్యులర్ కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ ఈ సిరీస్‌కు దూరంగా ఉన్నాడు. శ్రీలంకతో రెండో టెస్ట్ ముగిసిన మరుసటి రోజే టీ20 సిరీస్ మొదలుకానుండటంతో మార్క్రమ్ తప్పనిసరి పరిస్థితుల్లో ఈ సిరీస్‌కు దూరంగా ఉండాల్సి వస్తుంది. మార్క్రమ్తో పాటు లంకతో టెస్ట్ సిరీస్‌లో సభ్యులైన మార్కో జన్సెన్, కేశవ్ మహారాజ్, కగిసో రబాడ, ట్రిస్టన్ స్టబ్స్ కూడా పాక్‌తో టీ20 సిరీస్‌కు దూరంగా ఉన్నారు. లంకతో టెస్ట్ సిరీస్‌లో సభ్యులైన ర్యాన్ రికెల్టన్, క్వేనా మపాకా, మాథ్యూ బ్రీట్జ్కీ మాత్రం పాక్‌తో టీ20లకు ఎంపికయ్యారు.మరోవైపు, టీ20 వరల్డ్‌కప్ అనంతరం జట్టుకు దూరంగా ఉన్న అన్రిచ్ నోర్జే, తబ్రేజ్ షంషి పాక్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికయ్యారు. మూడేళ్లకు పైగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్న జార్జ్ లిండే కూడా పాక్‌తో సిరీస్‌కు ఎంపికయ్యాడు. కాగా, పాకిస్తాన్ జట్టు మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు మ్యాచ్‌ల సిరీస్‌ల కోసం సౌతాఫ్రికాలో పర్యటించనుంది. ఈ సిరీస్‌లలో తొలుత టీ20లు జరుగనున్నాయి. డిసెంబర్ 10, 13, 14 తేదీల్లో మూడు టీ20లు జరుగనున్నాయి. అనంతరం డిసెంబర్ 17, 19, 22 తేదీల్లో మూడు వన్డేలు జరుగుతాయి. డిసెంబర్ 26-30 వరకు తొలి టెస్ట్.. జనవరి 3-7 వరకు రెండో టెస్ట్ జరుగనున్నాయి. ఈ మూడు సిరీస్‌ల కోసం పాకిస్తాన్ జట్టును ఇవాళే ప్రకటించారు. పాక్‌తో టీ20 సిరీస్ కోసం సౌతాఫ్రికా జట్టు..హెన్రిచ్ క్లాసెన్ (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మన్, మాథ్యూ బ్రీట్జ్కే, డోనోవన్ ఫెరీరా, రీజా హెండ్రిక్స్, పాట్రిక్ క్రుగర్, జార్జ్ లిండే, క్వేనా మఫాకా, డేవిడ్ మిల్లర్, అన్రిచ్ నార్జే, న్కాబా పీటర్, ర్యాన్ రికెల్టన్, తబ్రేజ్ షంషి, అండైల్ సైమ్‌లేన్, రస్సీ వాన్ డర్ డస్సెన్ -
లంకతో టెస్ట్ సిరీస్.. సౌతాఫ్రికాకు బిగ్ షాక్
సౌతాఫ్రికా స్వదేశంలో శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్‌లో భాగంగా ప్రస్తుతం తొలి టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా కమాండింగ్ పొజిషన్లో ఉంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా సెకెండ్ ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు 281 పరుగుల ఆధిక్యంలో ఉంది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ టెంబా బవుమా (70) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. లంక బౌలర్లలో అశిత ఫెర్నాండో, లహీరు కుమార తలో 3 వికెట్లు పడగొట్టగా.. విశ్వ ఫెర్నాండో, ప్రభాత్ జయసూర్య చెరో 2 వికెట్లు దక్కించుకున్నారు.అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 42 పరుగులకే కుప్పకూలింది. జన్సెన్ (7/13) కెరీర్ అత్యుత్తమ గణాంకాలతో లంక పతనాన్ని శాశించాడు. లంక ఇన్నింగ్స్‌లో కమిందు మెండిస్ (13), లహీరు కుమార (10 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. సౌతాఫ్రికా 149 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది.కీలక ఆల్‌రౌండర్‌కు గాయంఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ సందర్భంగా సౌతాఫ్రికా కీలక ఆల్‌రౌండర్ వియాన్ ముల్దర్ గాయపడ్డాడు. లహీరు కుమార బౌలింగ్ ముల్దర్ బ్యాటింగ్ చేస్తుండగా అతని కుడి చేతి మధ్య వేలు ఫ్రాక్చర్ అయ్యింది. దీంతో అతను తొలి టెస్ట్ మిగతా సెషన్స్‌తో పాటు రెండో టెస్ట్‌కు కూడా దూరమయ్యాడు. రెండో టెస్ట్‌లో ముల్దర్ స్థానాన్ని మాథ్యూ బ్రీట్జ్కీ భర్తీ చేస్తాడని క్రికెట్ సౌతాఫ్రికా ప్రకటించింది. ముల్దర్ గాయమైనప్పటికీ తొలి ఇన్నింగ్స్‌తో పాటు రెండో ఇన్నింగ్స్‌లోనూ బ్యాటింగ్ చేయడం విశేషం. -
SA Vs SL 1st Test: చరిత్ర సృష్టించిన లంక బౌలర్
డర్బన్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో శ్రీలంక బౌలర్ ప్రభాత్ జయసూర్య చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో టోనీ డి జోర్జి వికెట్ తీసిన జయసూర్య.. టెస్ట్‌ల్లో వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మరో నలుగురితో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. జయసూర్యకు టెస్ట్‌ల్లో 100 వికెట్ల మార్కును తాకేందుకు 17 టెస్ట్‌లు అవసరమయ్యాయి. జయసూర్యతో పాటు టర్నర్, బార్నెస్, గ్రిమ్మెట్, యాసిర్ షా కూడా 17 టెస్ట్‌ల్లో 100 వికెట్ల మైలురాయిని తాకారు. టెస్ట్‌ల్లో వేగంగా 100 వికెట్లు తీసిన ఘనత ఇంగ్లండ్‌కు చెందిన జార్జ్ లోమన్కు దక్కుతుంది. లోమన్ కేవలం 16 టెస్ట్‌ల్లో 100 వికెట్ల మార్కును తాకాడు.ఇదిలా ఉంటే, సౌతాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో శ్రీలంక జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 42 పరుగులకే కుప్పకూలింది. మార్కో జన్సెన్ 7 వికెట్లు తీసి లంక పతనాన్ని శాశించగా.. కొయెట్జీ 2, రబాడ ఓ వికెట్ తీశారు. లంక ఇన్నింగ్స్‌లో కమిందు మెండిస్ (13), లహీరు కుమార (10 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ఐదుగురు ఆటగాళ్లు డకౌట్లు అయ్యారు.అంతకుముందు లంక బౌలర్లు సౌతాఫ్రికాను తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకే కట్టడి చేశారు. అశిత ఫెర్నాండో, లహీరు కుమార తలో 3 వికెట్లు పడగొట్టగా.. విశ్వ ఫెర్నాండో, ప్రభాత్ జయసూర్య చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో కెప్టెన్ బవుమా (70) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.149 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. టోనీ డి జోర్జి (17), మార్క్రమ్ (47), వియాన్ ముల్దర్ (15) ఔట్ కాగా.. ట్రిస్టన్ స్టబ్స్ (17), బవుమా (24) క్రీజ్‌లో ఉన్నారు. జయసూర్య 2, విశ్వ ఫెర్నాండో ఓ వికెట్ పడగొట్టారు. ప్రస్తుతం సౌతాఫ్రికా 281 పరుగుల ఆధిక్యంలో ఉంది. -
సౌతాఫ్రికా-శ్రీలంక మ్యాచ్‌కు వర్షం అడ్డంకి
సౌతాఫ్రికా, శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారింది. తొలి రోజు ఆటలో కేవలం 20.4 ఓవర్లు మాత్రమే సాధ్యపడ్డాయి. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా టాస్ ఓడి శ్రీలంక ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా స్కోర్ 4 వికెట్ల నష్టానికి 80 పరుగులుగా ఉంది. ఎయిడెన్ మార్క్రమ్ (9), టోనీ డి జోర్జి (4), ట్రిస్టన్ స్టబ్స్ (16), డేవిడ్ బెడింగ్హమ్ (4) ఔట్ కాగా.. టెంబా బవుమా (28), కైల్ వెర్రిన్ (9) క్రీజ్‌లో ఉన్నారు. లంక బౌలర్లలో లహీరు కుమార రెండు వికెట్లు పడగొట్టగా.. ఆశిత ఫెర్నాండో, విశ్వ ఫెర్నాండో తలో వికెట తీశారు. కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం శ్రీలంక సౌతాఫ్రికాలో పర్యటిస్తుంది. డబ్ల్యూటీసీలో భాగంగా ఇరు జట్లకు ఈ సిరీస్ చాలా కీలకం. ఈ సిరీస్‌లో గెలిచిన జట్టుకు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరే అవకాశాలు మెరుగవుతాయి. ఈ సిరీస్‌కు ముందు లంక స్వదేశంలో న్యూజిలాండ్‌ను టెస్ట్, వన్డే సిరీస్‌ల్లో ఓడించింది. సౌతాఫ్రికా.. ఇటీవలే భారత్ చేతిలో 1-3 తేడాతో టీ20 సిరీస్‌ను కోల్పోయింది. -
దక్షిణాఫ్రికా జట్టు ప్రకటన.. కెప్టెన్ వచ్చేస్తున్నాడు..!
స్వదేశంలో శ్రీలంకతో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం దక్షిణాఫ్రికా జట్టును ఇవాళ (నవంబర్ 19) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా టెంబా బవుమా ఎంపికయ్యాడు. బవుమా మోచేతి గాయం కారణంగా గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్నాడు. అక్టోబర్ 4 ఐర్లాండ్‌తో జరిగిన వన్డే సందర్భంగా బవుమా గాయపడ్డాడు.రబాడ రీఎంట్రీలంకతో సిరీస్‌తో కగిసో రబాడ కూడా రీఎంట్రీ ఇవ్వనున్నాడు. రబాడ భారత్‌తో ఇటీవల జరిగిన టీ20 సిరీస్‌కు దూరంగా ఉన్నాడు. భారత్‌తో టీ20 సిరీస్‌లో సత్తా చాటిన మార్కో జన్సెన్, గెరాల్ట్ కొయెట్జీ చాలాకాలం తర్వాత టెస్ట్ జట్టులో చోటు దక్కించుకున్నారు. వీరిద్దరు ఈ ఏడాది ఆరంభంలో భారత్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో చివరిసారిగా దర్శనమిచ్చారు. గాయాల కారణంగా ఈ సిరీస్‌కు లుంగి ఎంగిడి, నండ్రే బర్గర్ దూరమయ్యారు. ర్యాన్ రికెల్టన్, డేన్ పీటర్సన్, సెనూరన్ ముత్తుస్వామి 14 మంది సభ్యుల జట్టులో చోటు దక్కించుకున్నారు.సౌతాఫ్రికా డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు చేరాలంటే..?సౌతాఫ్రికా జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్‌కు చేరాలంటే శ్రీలంకతో జరిగే రెండు టెస్ట్ మ్యాచ్‌లతో పాటు తదుపరి (డిసెంబర్, జనవరి) స్వదేశంలో పాకిస్తాన్‌తో జరిగే రెండు టెస్ట్ మ్యాచ్‌లు గెలవాల్సి ఉంటుంది.శ్రీలంకతో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు దక్షిణాఫ్రికా జట్టు..టెంబా బవుమా (కెప్టెన్), డేవిడ్ బెడింగ్హమ్, గెరాల్డ్ కొయెట్జీ, టోనీ డి జోర్జి, మార్కో జన్సెన్, కేశవ్ మహారాజ్, ఎయిడెన్ మార్క్రమ్, వియాన్ ముల్దర్, సెనూరన్ ముత్తుస్వామి, డేన్ పీటర్సన్, కగిసో రబాడ, ట్రిస్టన్ స్టబ్స్, ర్యాన్ రికెల్టన్, కైల్ వెర్రిన్సౌతాఫ్రికా-శ్రీలంక సిరీస్ షెడ్యూల్తొలి టెస్ట్- నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1 (డర్బన్)రెండో టెస్ట్- డిసెంబర్ 5 నుంచి డిసెంబర్ 9 (గెబెర్హా)కాగా, సౌతాఫ్రికాతో సిరీస్‌కు శ్రీలంక జట్టును కూడా ఇవాళ్లే ప్రకటించారు. లంక జట్టుకు సారధిగా ధనంజయ డిసిల్వ వ్యవహరించనున్నాడు.దక్షిణాఫ్రికా సిరీస్‌కు శ్రీలంక జట్టు..ధనంజయ డిసిల్వ (కెప్టెన్), పతుమ్ నిస్సాంక, దిముత్ కరుణరత్నే, దినేష్ చండిమాల్, ఏంజెలో మాథ్యూస్, కుసాల్ మెండిస్, కమిందు మెండిస్, ఒషాద ఫెర్నాండో, సదీర సమరవిక్రమ, ప్రబాత్ జయసూర్య, నిషాన్ పీరిస్, లసిత్ ఎంబుల్దెనయ, మిలన్ రత్నాయకే, అసిత ఫెర్నాండో, విశ్వ ఫెర్నాండో, లహీరు కుమార, కసున్ రజిత -
కార్మికులను ఆదుకునేందుకు గనిలోకి వలెంటీర్లు
దక్షిణాఫ్రికాలో బంగారు గనిలో అక్రమ మైనింగ్ ఉదంతం ముదురు పాకాన పడుతోంది. నార్త్‌వెస్ట్ ప్రావిన్స్‌లో మూసేసిన స్టీల్ఫాంటీన్ గనిలో 4 వేల మంది దాకా కార్మికులు చిక్కుకుపోవడం తెలిసిందే. వారిని అరెస్టు చేసేందుకు పోలీసు లు భారీగా మోహరించారు. ఆహారం తది తరాలు అందకుండా అడ్డుకుంటున్నారు. ‘‘దాంతో మరో దారిలేక వారే బయటకు వస్తారు. రాగానే అరెస్టు చేస్తాం. అక్రమ మైనింగ్‌కు అడ్డుకట్ట వేయాలంటే ఇలాంటి కఠిన చర్యలు తప్పవు’’అని అధికారులు చెబున్నారు. ఈ ఉదంతం దక్షిణాఫ్రికాలోనే గాక అంతర్జాతీయంగా కూడా సంచలనం సృష్టిస్తోంది. ప్రాణాలు నిలుపుకోవడానికి మరో దారి లేక కార్మికులు టూత్‌పేస్టు తింటూ, వెనిగర్ తాగుతున్నారన్న వార్తలు గుండెల్ని పిండేస్తున్నాయి. ఇంకొద్ది రో జులు గడిస్తే వాళ్లు పూర్తిగా నీరసించి స్పృహ తప్పవచ్చంటున్నారు. ప్రభుత్వ చర్యలు హత్యాయత్నానికి ఏమాత్రం తీసిపోవంటూ హక్కుల సంస్థలు మండిపడుతున్నాయి. జీవించే హక్కును కాలరాసే అధికారం సహా ఎవరికీ లేదని వాదిస్తున్నాయి. అధికారులు మాత్రం చిక్కుబడ్డ కార్మికుల్లో పలువురి వద్ద ఆయుధాలుండే ఆస్కారం కూడా ఉందని చెబుతున్నారు. మరోవైపు కార్మికుల్లో పలువురు అక్రమంగా దేశంలో ప్రవేశించిన వారే కావడంతో కఠిన శిక్షలకు భయపడి బయటికొచ్చేందుకు ససేమిరా అంటున్నారు. ఈ నేపథ్యంలో కార్మికులను ఆదుకునేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చాయి. చాలామంది స్వచ్ఛంద కార్యకర్తలు ఆహారంతో పాటు నిత్యావసరాలు వెంట తీసుకుని భూగర్భ గనిలోకి ప్రవేశించారు. వారు 50 మందితో కూడిన బృందాలుగా లోనికి వెళ్తున్నారు. కార్మికులకు ఆహారం తదితరాలు అందించడమే గాక వారికి నచ్చజెప్పి బయటికి తీసుకొచ్చే పనిలో కూడా పడ్డారు. వాళ్లలో చాలామంది పూర్తిగా నీరసించిపోయిన స్థితిలో ఉండటంతో ఒక్కొక్కరిని బయటికి తీసుకొచ్చేందుకు గంటకు పైగా పడుతోందట. గనిలో పలు మృతదేహాలను కూడా వలెంటీర్లు గుర్తించినట్టు సమాచారం. అవి కుళ్లి కంపు కొడుతున్నట్టు చెబుతున్నారు! గత వారం రోజుల్లో 1,000 మంది దాకా కార్మికులు బయటికొచ్చి లొంగిపోయారు. దక్షిణాఫ్రికాలో అక్రమ మైనింగ్ భారీ ఎత్తున జరుగుతుంటుంది. ఫలితంగా ఖజానాకు వందలాది కోట్ల డాలర్ల మేరకు నష్టం వాటిల్లుతోంది. ఈ నేపథ్యంలో కొంతకాలంగా వాటిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. కొన్నేళ్లలో వందలాది గనులను మూసేయడంతో అప్పటిదాకా వాటిలో పని చేసిన కార్మికులు ఒక్కసారిగా రోడ్డున పడ్డారు. బతుకుదెరువు కోసం అక్రమ మైనింగ్‌కు పాల్పడే ముఠాల చేతిలో చిక్కుతున్నారు. ఆ క్రమంలో నెలల తరబడి భూగర్భంలో గడుపుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
తిలక్, సామ్సన్ వీర విధ్వంసం.. మూడో టీ20లో సౌతాఫ్రికా చిత్తు
వాండరర్స్‌లో బౌండరీల వర్షం... సిరీస్‌లో తొలి మ్యాచ్ సెంచరీ హీరో, మూడో మ్యాచ్ శతక వీరుడు ఈసారి జత కలిసి సాగించిన పరుగుల ప్రవాహానికి పలు రికార్డులు కొట్టుకుపోయాయి. తిలక్ వర్మ, సంజు సామ్సన్ ఒకరితో మరొకరు పోటీ పడుతూ బాదిన సెంచరీలతో జొహన్నెస్‌బర్గ్ మైదానం అదిరింది. వీరిద్దరి జోరును నిలువరించలేక, ఏం చేయాలో అర్థం కాక దక్షిణాఫ్రికా బౌలర్లు పూర్తిగా చేతులెత్తేశారు. టీమిండియా ఇన్నింగ్స్‌లో 17 ఫోర్లు, 23 సిక్సర్లు ఉండగా... బౌండరీల ద్వారానే 206 పరుగులు వచ్చాయి. అనంతరం మైదానంలోకి దిగక ముందే ఓటమిని అంగీకరించినట్లు కనిపించిన సఫారీ టీమ్ 20 ఓవర్లు కూడా పూర్తిగా ఆడలేకపోయింది. 3 ఓవర్లు ముగిసేసరికి 10/4 వద్ద నిలిచిన ఆ జట్టు మళ్లీ కోలుకోలేదు. జొహన్నెస్‌బర్గ్: సఫారీ పర్యటనను భారత టి20 జట్టు అద్భుతంగా ముగించింది. అన్ని రంగాల్లో తమ ఆధిపత్యం కొనసాగిస్తూ నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ను 3–1తో సొంతం చేసుకుంది. శుక్రవారం జరిగిన చివరి పోరులో భారత్ 135 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 20 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 283 పరుగులు చేసింది. హైదరాబాద్ క్రికెటర్ ఠాకూర్ తిలక్ వర్మ (47 బంతుల్లో 120 నాటౌట్; 9 ఫోర్లు, 10 సిక్స్‌లు), సంజు సామ్సన్ (56 బంతుల్లో 109 నాటౌట్; 6 ఫోర్లు, 9 సిక్స్‌లు) మెరుపు సెంచరీలతో విధ్వంసం సృష్టించారు. తిలక్‌కు ఇది వరుసగా రెండో సెంచరీ కాగా... వరుసగా రెండు డకౌట్ల తర్వాత సామ్సన్‌కు ఈ సిరీస్‌లో ఇది రెండో శతకం కావడం విశేషం. వీరిద్దరు రెండో వికెట్‌కు 86 బంతుల్లోనే ఏకంగా 210 పరుగులు జోడించారు. అనంతరం దక్షిణాఫ్రికా 18.2 ఓవర్లలో 148 పరుగులకే ఆలౌటైంది. ధనాధన్ జోడీ... పవర్‌ప్లేలో 73 పరుగులు... 10 ఓవర్లు ముగిసేసరికి 129... 15 ఓవర్లలో 219... చివరి 5 ఓవర్లలో 64... ఇదీ భారత్ స్కోరింగ్ జోరు! గత కొన్ని మ్యాచ్‌లలో వరుసగా విఫలమైన అభిõÙక్ శర్మ (18 బంతుల్లో 36; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఈసారి కాస్త మెరుగైన ఆటతో దూకుడు ప్రదర్శించాడు. అభిషేక్ అవుట య్యాక సామ్సన్, తిలక్ జత కలిసిన తర్వాత అసలు వినోదం మొదలైంది. ప్రతీ బౌలర్‌పై వీరిద్దరు విరుచుకుపడి పరుగులు సాధించారు. మహరాజ్ ఓవర్లో తిలక్ రెండు వరుస సిక్స్‌లు కొట్టగా... స్టబ్స్ ఓవర్లో సామ్సన్ అదే పని చేశాడు. సిపామ్లా ఓవర్లో ఇద్దరూ కలిసి 3 సిక్సర్లతో 20 పరుగులు రాబట్టారు. కెప్టెన్ మార్క్రమ్ ఓవర్లో తిలక్ మరింత రెచ్చిపోతూ వరుసగా 4, 6, 6, 4 బాదాడు. సామ్సన్ స్కోరు 27 వద్ద ఉన్నప్పుడు క్రీజ్‌లోకి వచ్చిన తిలక్ ఒకదశలో అతడిని దాటేసి సెంచరీకి చేరువయ్యాడు. అయితే ముందుగా 51 బంతుల్లోనే సామ్సన్ శతకం పూర్తి చేసుకోగా... తర్వాతి ఓవర్లోనే తిలక్ 41 బంతుల్లో ఆ మార్క్‌ను అందుకున్నాడు. టపటపా... భారీ ఛేదనను చెత్త ఆటతో మొదలుపెట్టిన దక్షిణాఫ్రికా గెలుపు గురించి ఆలోచించే అవకాశమే లేకపోయింది. తొలి రెండు ఓవర్లలో హెన్డ్రిక్స్ (0), రికెల్టన్ (1) వెనుదిరగ్గా... మూడో ఓవర్లో అర్ష్ దీప్ వరుస బంతుల్లో మార్క్రమ్ (8), క్లాసెన్ (0)లను పెవిలియన్ పంపించాడు. ఆ తర్వాత స్టబ్స్, మిల్లర్... చివర్లో జాన్సెన్ (29; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) కొద్దిసేపు నిలబడినా లాభం లేకపోయింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: సామ్సన్ (నాటౌట్) 109; అభిషేక్ (సి) క్లాసెన్ (బి) సిపామ్లా 36; తిలక్ వర్మ (నాటౌట్) 120; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (20 ఓవర్లలో వికెట్ నష్టానికి) 283. వికెట్ల పతనం: 1–73. బౌలింగ్: జాన్సెన్ 4–0–42–0, కొయెట్జీ 3–0–43–0, సిపామ్లా 4–0–58–1, సిమ్‌లేన్ 3–0–47–0, మహరాజ్ 3–0–42–0, మార్క్రమ్ 2–0–30–0, స్టబ్స్ 1–0–21–0. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: రికెల్టన్ (సి) సామ్సన్ (బి) పాండ్యా 1; హెన్డ్రిక్స్ (బి) అర్ష్ దీప్ 0; మార్క్రమ్ (సి) బిష్ణోయ్ (బి) అర్ష్ దీప్ 8; స్టబ్స్ (ఎల్బీ) (బి) బిష్ణోయ్ 43; క్లాసెన్ (ఎల్బీ) (బి) అర్ష్ దీప్ 0; మిల్లర్ (సి) తిలక్ (బి) వరుణ్ 36; జాన్సెన్ (నాటౌట్) 29; సిమ్‌లేన్ (సి) బిష్ణోయ్ (బి) వరుణ్ 2; కొయెట్జీ (సి) సామ్సన్ (బి) అక్షర్ 12; మహరాజ్ (సి) తిలక్ (బి) అక్షర్ 6; సిపామ్లా (సి) అక్షర్ (బి) రమణ్‌దీప్ 3; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (18.2 ఓవర్లలో ఆలౌట్) 148. వికెట్ల పతనం: 1–1, 2–1, 3–10, 4–10, 5–96, 6–96, 7–105, 8–131, 9–141, 10–148. బౌలింగ్: అర్ష్ దీప్ 3–0–20–3, పాండ్యా 3–1–8–1, రమణ్‌దీప్ 3.2–0–42–1, వరుణ్ 4–0–42–2, బిష్ణోయ్ 3–0–28–1, అక్షర్ 2–0–6–2. 283 టి20ల్లో భారత్‌కు ఇది రెండో అత్యధిక స్కోరు. గత నెలలో హైదరాబాద్‌లో బంగ్లాదేశ్‌పై భారత్ 297 పరుగులు చేసింది. 210 సామ్సన్, తిలక్ జోడించిన పరుగులు. ఏ వికెట్‌కైనా భారత్‌కు ఇదే అత్యధిక భాగస్వామ్యం. రోహిత్, రింకూ (190; అఫ్గానిస్తాన్‌పై 2024లో) రికార్డు కనుమరుగైంది. 5 అంతర్జాతీయ టి20ల్లో వరుసగా రెండు శతకాలు చేసిన ఐదో బ్యాటర్ తిలక్ వర్మ. భారత్ తరఫున సామ్సన్ ఇదే సిరీస్‌లో ఆ రికార్డు నమోదు చేయగా... గతంలో మరో ముగ్గురు గుస్తావ్ మెక్‌కియాన్, ఫిల్ సాల్ట్, రిలీ రోసో ఈ ఘనత సాధించారు. 3 ఒకే మ్యాచ్‌లో ఇద్దరు బ్యాటర్లు సెంచరీలు చేయడం ఇది మూడోసారి. గతంలో చెక్ రిపబ్లిక్, జపాన్ బ్యాటర్లు ఈ ఫీట్ నమోదు చేశారు. -
శివాలెత్తిన తిలక్, సంజూ.. విధ్వంసకర శతకాలు.. టీమిండియా అతి భారీ స్కోర్
జొహనెస్‌బర్గ్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న నాలుగో టీ20లో టీమిండియా అతి భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 283 పరుగులు చేసింది. సంజూ శాంసన్, తిలక్ వర్మ విధ్వంసకర శతకాలతో శివాలెత్తిపోయారు. సంజూ 55 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేయగా.. తిలక్ 41 బంతుల్లోనే 6 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో శతక్కొట్టాడు. తిలక్‌కు ఇది వరుసగా రెండో సెంచరీ కాగా.. సంజూకు ఈ సిరీస్‌లో ఇది రెండో సెంచరీ. తొలి టీ20లో సెంచరీ అనంతరం సంజూ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌటయ్యాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 56 బంతులు ఎదుర్కొన్న సంజూ 6 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 109 పరుగులు చేసి అజేయంగా నిలువగా.. తిలక్ 47 బంతుల్లో 9 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 120 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ సైతం మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అభిషేక్ 18 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 36 పరుగులు చేశాడు. సౌతాఫ్రికా బౌలర్లలో సిపామ్లాకు అభిషేక్ శర్మ వికెట్ దక్కింది. కాగా, నాలుగు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో టీమిండియా 2-1 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే.తుది జట్లు...భారత్ (ప్లేయింగ్ XI): సంజు శాంసన్(వికెట్‌కీపర్), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రమణదీప్ సింగ్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తిదక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్, రీజా హెండ్రిక్స్, ఎయిడెన్ మార్క్రమ్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్‌కీపర్), డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, ఆండిల్ సైమ్‌లేన్, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, లూథో సిపమ్లా -
భారత్, సౌతాఫ్రికా నాలుగో టీ20.. తుది జట్లు ఇవే..!
జొహనెస్‌బర్గ్ వేదికగా సౌతాఫ్రికాతో ఇవాళ (నవంబర్ 15) జరుగుతున్న నాలుగో టీ20లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు ఎలాంటి మార్పులు చేయలేదు. మూడో టీ20లో ఆడిన జట్లనే యధాతథంగా బరిలోకి దించుతున్నాయి. నాలుగు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో టీమిండియా 2-1 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే.తుది జట్లు..భారత్ (ప్లేయింగ్ XI): సంజు శాంసన్(వికెట్‌కీపర్), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రమణదీప్ సింగ్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తిదక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్, రీజా హెండ్రిక్స్, ఎయిడెన్ మార్క్రమ్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్‌కీపర్), డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, ఆండిల్ సైమ్‌లేన్, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, లూథో సిపమ్లా -
సౌతాఫ్రికాతో నాలుగో టీ20.. టీమిండియా గెలిచిందా చరిత్రే..!
జొహనెస్‌బర్గ్ వేదికగా భారత్, సౌతాఫ్రికా మధ్య ఇవాళ (నవంబర్ 15) నాలుగో టీ20 మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 8:30 గంటలకు ప్రారంభంకానుంది. నాలుగు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో ఉంది. నేటి మ్యాచ్‌లో భారత్ గెలిస్తే సరికొత్త చరిత్ర సృష్టించినట్లవుతుంది.ఈ మ్యాచ్ గెలుపుతో భారత్ సిరీస్‌ను కైవసం చేసుకోవడంతో పాటు సౌతాఫ్రికాపై టీ20ల్లో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా రికార్డు నెలకొల్పుతుంది. ప్రస్తుతం భారత్, ఆస్ట్రేలియా జట్లు సౌతాఫ్రికాపై తలో 17 విజయాలు సాధించాయి. ఆస్ట్రేలియా సౌతాఫ్రికాపై 25 మ్యాచ్‌ల్లో 17 విజయాలు సాధిస్తే.. భారత్ 30 మ్యాచ్‌ల్లో 17 విజయాలు సాధించింది. టీ20ల్లో సౌతాఫ్రికాపై అత్యధిక విజయాలు సాధించిన జట్ల జాబితాలో ఆస్ట్రేలియా, భారత్ తర్వాత వెస్టిండీస్ (14), ఇంగ్లండ్ (12), పాకిస్తాన్ (12), శ్రీలంక (5), న్యూజిలాండ్ (4), ఐర్లాండ్ (1), నెదర్లాండ్స్ (1) జట్లు ఉన్నాయి.కాగా, సౌతాఫ్రికాతో జరుగుతున్న నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ ఒకటి, మూడు మ్యాచ్‌ల్లో గెలుపొందగా.. సౌతాఫ్రికా రెండో మ్యాచ్‌లో విజయం సాధించింది. చివరిగా జరిగిన మూడో టీ20లో భారత్ సౌతాఫ్రికాపై 11 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. తిలక్ వర్మ (107 నాటౌట్) శతక్కొట్టడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ మెరుపు ఇన్నింగ్స్ (50) ఆడాడు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికా గెలుపు కోసం చివరి వరకు పోరాడినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. సౌతాఫ్రికా లక్ష్యానికి 12 పరుగుల దూరంలో నిలిచిపోయింది. మార్కో జన్సెన్ (54), హెన్రిచ్ క్లాసెన్ (41) దక్షిణాఫ్రికాను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. అర్షదీప్ సింగ్ 3 కీలక వికెట్లు తీసి దక్షిణాఫ్రికా గెలుపుకు అడ్డుకట్ట వేశాడు. -
దక్షిణాఫ్రికా గనిలో హాహాకారాలు
జోహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాలో బంగారం గనులు అధికంగా ఉన్నాయి. కొన్నిచోట్ల ముడి ఖనిజాన్ని పూర్తిగా తవ్వేసి గనులను మూసివేశారు. ఆయా గనుల్లోకి వెళ్లడం చట్టవిరుద్ధం. కానీ, అక్రమ మైనింగ్‌కు పాల్పడే ముఠాలు మూతపడిన గనులను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. అక్కడ ఇంకా బంగారం ఉంటుందన్న అంచనాతో మనుషులను అందులోకి పంపిస్తున్నాయి. మట్టిని తవ్వేసి బయటకు చేర్చడమే వీరి పని. వారాల తరబడి పని చేయాల్సి ఉంటుంది. ఈ గనుల్లో పని చేయడానికి పొరుగు దేశాల నుంచి కూడా వస్తుంటారు. ఇదంతా పెద్ద మాఫియాగా మారింది. నార్త్‌వెస్ట్ ప్రావిన్స్‌లోని స్టిల్‌ఫాంటీన్ గనిలో ఏకంగా 4 వేల మంది చిక్కుకుపోవడం సంచలనాత్మకంగా మారింది. వీరంతా కొద్ది రోజుల క్రితం గనిలోకి చేరుకున్నారు. ప్రస్తుతం ఆహారం, నీరు, ఇతర సౌకర్యాలు లేక అలమటిస్తున్నట్లు తెలిసింది. అక్రమ మైనింగ్‌కు పాల్పడేవారిని అరెస్టు చేసి, శిక్షించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం అధికారులు స్టిల్‌ఫాంటీన్ ప్రాంతంలోని బంగారు గని ప్రవేశ మార్గాలను మూసివేసినట్లు సమాచారం. ఆహారం అందకపోతే వారు చచ్చినట్లు బయటకు వస్తారని, అప్పుడు అదుపులోకి తీసుకుంటామని అధికారులు చెప్పారు. అక్రమ మైనింగ్‌ను అడ్డుకోవడానికి ఇలా కఠినంగా వ్యవహరించక తప్పదని అంటున్నారు. ప్రస్తుతం గని చుట్టూ పోలీసులు మోహరించారు. గనిలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించినవారికి సహాయం చేసే ఉద్దేశం లేదని దక్షిణాఫ్రికా మంత్రి ఖుమ్బుడ్జో షావెనీ స్పష్టంచేశారు. వారంతా నేరానికి పాల్పడ్డారని, శిక్షించక తప్పదని అన్నారు. నేరగాళ్లకు సహాయం ఎందుకు చేయాలని ప్రశ్నించారు. నార్త్‌వెస్ట్ ప్రావిన్స్‌లోని ఇలా వేర్వేరు గనుల్లో గత కొన్ని వారాల వ్యవధిలో వేయి మందికిపైగా కారి్మకులు బయటకు వచ్చారు. సరైన ఆహారం అందక వారంతా చాలా బలహీనంగా, అనారోగ్యంతో కనిపించారు.శాంతి భద్రతల సమస్యలు దక్షిణాఫ్రికాలో అక్రమ మైనింగ్ ముఠాలతో శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ ముఠాల వద్ద మారణాయుధాలు ఉంటాయి. ఎంతకైనా తెగిస్తారు. అడ్డుకొనేందుకు ప్రయతి్నంచిన అధికారులపై దాడులకు దిగుతుంటారు. ముఠాల మధ్య ఆధిపత్య పోరుతో రక్తపాతం జరిగిన సందర్భాలున్నాయి. స్థానికులపై దాడులు, మహిళలపై అత్యాచారాలకు పాల్పడడం సర్వసాధారణంగా మారిపోయింది. అందుకే అక్రమ మైనింగ్ ముఠాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. -
సిరీస్ సొంతం చేసుకోవాలని...
జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా గడ్డపై చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న భారత క్రికెట్ జట్టు శుక్రవారం చివరిదైన నాలుగో టి20లో ఆతిథ్య జట్టుతో తలపడనుంది. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో 2–1తో ఆధిక్యంలో ఉన్న సూర్యకుమార్ సారథ్యంలోని టీమిండియా... అదే జోరులో సిరీస్‌ను సొంతం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. మరోవైపు సొంతగడ్డపై సిరీస్ సమం చేయాలని సఫారీలు భావిస్తున్నారు. మూడు మ్యాచ్‌ల్లో రెండుసార్లు 200 పైచిలుకు స్కోర్లు చేసిన భారత జట్టు... ఓడిన మ్యాచ్‌లోనూ మెరుగైన పోరాటం కనబర్చింది. ఈ ఏడాది ఇప్పటి వరకు 25 టి20 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా... అందులో 23 విజయాలు సాధించి భళా అనిపించుకుంది. ఈ ఏడాదిలో భారత జట్టుకు ఇదే చివరి టి20 మ్యాచ్ కాగా... ఇందులోనూ విజయం సాధించాలని సూర్యకుమార్ బృందం తహతహలాడుతోంది. 2007 టి20 ప్రపంచకప్ ఫైనల్లో పాకిస్తాన్‌పై గెలిచి విశ్వవిజేత కిరీటం నెగ్గిన వాండరర్స్ మైదానంలోనే ఈ మ్యాచ్ జరగనుంది. ఇక్కడ సూర్యకుమార్ యాదవ్‌కు మంచి రికార్డు ఉంది. చివరిసారి వాండరర్స్‌లో ఆడిన మ్యాచ్‌లో సూర్య సెంచరీతో విజృంభించాడు. తాజా సిరీస్‌లో ఇప్పటికే భారత్ తరఫున సంజూ సామ్సన్, తిలక్ వర్మ శతకాలు బాదగా... ఆఖరి మ్యాచ్‌లో ఎవరు రాణిస్తారో చూడాలి. కలిసికట్టుగా కదంతొక్కితేనే.. తొలి మ్యాచ్‌లో సూపర్ సెంచరీతో చెలరేగిన ఓపెనర్ సామ్సన్ తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విఫలం కాగా... తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన మరో ఓపెనర్ అభిõÙక్ శర్మ మూడో టి20లో అర్ధశతకంతో మెరిశాడు. మొత్తంగా చూసుకుంటే టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్లో పెద్దగా లోపాలు కనిపించకపోయినా... ప్లేయర్లంతా కలిసికట్టుగా కదం తొక్కాల్సిన అవసరముంది. సెంచూరియన్ సెంచరీ హీరో తిలక్ వర్మ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు రావడం ఖాయమే కాగా... కెపె్టన్ సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్‌తో మిడిలార్డర్ పటిష్టంగా కనిపిస్తోంది. అయితే రింకూ సింగ్ బ్యాట్ నుంచి గత మెరుపులు కరువయ్యాయి. ఈ సిరీస్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో కలిపి రింకూ కేవలం 28 పరుగులే చేశాడు. అతడి స్థాయికి ఇది చాలా తక్కువే. తగినన్ని బంతులు ఆడే అవకాశం రాలేదన్నది నిజమే అయినా... క్రీజులో ఉన్న కాసేపట్లోనే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగల సత్తా ఉన్న రింకూ... చివరి పోరులో భారీ షాట్లతో విరుచుకుపడాల్సిన అవసరముంది. మూడో టి20 ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన హిట్టర్ రమణ్‌దీప్ సింగ్‌కు మరోసారి అవకాశం దక్కవచ్చు. అర్ష్ దీప్ సింగ్ పేస్ బాధ్యతలు మోయనున్నాడు. అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి స్పిన్ బాధ్యతలు చూసుకోనున్నారు. మిల్లర్, క్లాసెన్ మెరిస్తేనే! టి20 వరల్డ్‌కప్ ఫైనల్లో భారత్ చేతిలో ఓడిన దక్షిణాఫ్రికా... ఈ సిరీస్‌లోనూ పెద్దగా ఆకట్టుకోలేకపోతోంది. గత మ్యాచ్‌లో ప్రధాన ఆటగాళ్లంతా చేతులెత్తేసిన సమయంలో పేస్ ఆల్‌రౌండర్ మార్కో జాన్సన్ భారీ షాట్లతో విరుచుకుపడి టీమిండియాను భయపెట్టాడు.టాపార్డర్‌లో ఇలాంటి దూకుడు లోపించడంతోనే సఫారీ జట్టు ఇబ్బంది పడుతోంది. హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్లపై ఆ జట్టు అతిగా ఆధారపడుతోంది. ఈ ఇద్దరు ఒకటీ అరా మెరుపులు తప్ప... చివరి వరకు నిలకడగా రాణించలేకపోవడం జట్టును దెబ్బతీస్తోంది. గత ఏడాది టీమిండియాతో తమ దేశంలో జరిగిన సిరీస్‌ను 1–1తో సమం చేసుకున్న దక్షిణాఫ్రికా... ఇప్పుడదే ఫలితం రాబట్టాలంటే శక్తికి మించి పోరాడాల్సిన అవసరముంది. బౌలింగ్‌లో కేశవ్ మహరాజ్, సిమ్లెన్, కోట్జీ, మార్కో జాన్సన్ కీలకం కానున్నారు. -
డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు.. సౌతాఫ్రికాకు ఊహించని షాక్
డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్‌పై అడపాదడపా ఆశలు పెట్టుకున్న సౌతాఫ్రికాకు ఊహించిన షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ లుంగి ఎంగిడి గాయం కారణంగా త్వరలో జరుగబోయే నాలుగు టెస్ట్ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. ఎంగిడి తిరిగి వచ్చే ఏడాది జనవరిలో యాక్టివ్ క్రికెట్లోకి వస్తాడు. డబ్ల్యూటీసీ 2023-25లో భాగంగా జరిగే తదుపరి మ్యాచ్‌లకు ఎంగిడి దూరం కావడం సౌతాఫ్రికా విజయావకాశాలను ప్రభావితం చేస్తుంది. సౌతాఫ్రికా ఈ నెల 27 నుంచి శ్రీలంకతో.. ఆతర్వాత డిసెంబర్ 26 నుంచి పాకిస్తాన్‌తో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లు ఆడాల్సి ఉంది. ఈ నాలుగు మ్యాచ్‌ల్లో సౌతాఫ్రికా గెలిస్తే డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకోవడం ఖాయం. ఇలా జరగాలంటే ఎంగిడి లాంటి బౌలర్ సేవలు సౌతాఫ్రికాకు ఎంతో ముఖ్యం. ఎంగిడికి స్వదేశంలో ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. ఎంగిడి సొంతగడ్డపై ఆడిన 9 మ్యాచ్‌ల్లో 17.30 సగటున 39 వికెట్లు పడగొట్టాడు.ఎంగిడి గాయంతో పాటు సౌతాఫ్రికాను మరో పేసర్ నండ్రే బర్గర్ గాయం కూడా వేధిస్తుంది. బర్గర్ కూడా గాయం కారణంగా త్వరలో జరుగబోయే టెస్ట్ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండకపోవచ్చు. అయితే మార్కో జన్సెన్, గెరాల్డ్ కొయెట్జీ సరైన్ ఫిట్నెస్ కలిగి అందుబాటులో ఉండటం సౌతాఫ్రికాకు ఊరట కలిగించే అంశం. వీరిద్దరు ప్రస్తుతం టీమిండియాతో జరుగుతున్న నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో పాల్గొంటున్నారు. మరోవైపు భారత్‌తో టీ20 సిరీస్‌కు కగిసో రబాడకు విశ్రాంతినిచ్చిన విషయం తెలిసిందే. రబాడ.. శ్రీలంకతో జరుగబోయే టెస్ట్ సిరీస్ సమయానికి అందుబాటులో ఉంటాడని సమాచారం.సౌతాఫ్రికా పర్యటనలో శ్రీలంక ఆడబోయే రెండు టెస్ట్‌ల వివరాలు..నవంబర్ 27-డిసెంబర్ 1- తొలి టెస్ట్ (డర్బన్)డిసెంబర్ 5-9- రెండో టెస్ట్ (గెబెర్హా)సౌతాఫ్రికా పర్యటనలో పాకిస్తాన్ ఆడబోయే రెండు టెస్ట్‌ల వివరాలు..డిసెంబర్ 26-30- తొలి టెస్ట్ (సెంచూరియన్)జనవరి 3-7- రెండో టెస్ట్ (కేప్‌టౌన్)ఈ నాలుగు టెస్ట్‌లు డబ్ల్యూటీసీ 2023-25లో భాగంగా జరుగనున్నాయి. -
తిలక్ తుఫాన్.. మూడో టీ20లో భారత్ గెలుపు
గతేడాది విండీస్ గడ్డపై టి20తో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన హైదరాబాదీ స్టార్ తిలక్ వర్మ ఇప్పటివరకు 22 మ్యాచ్‌లు (18 టి20లు, 4 వన్డేలు) ఆడాడు. అడపాదడపా రాణించినా... తాజాగా తన 19వ టి20 మ్యాచ్‌లో చేసిన తుఫాన్ సెంచరీ కెరీర్లో కలకాలం గుర్తుండిపోతుంది. ఇన్నింగ్స్ మూడో బంతికి క్రీజులోకి వచ్చిన తిలక్ ఆఖరి బంతిదాకా అజేయంగా నిలిచాడు. సఫారీ గడ్డపై తన అంతర్జాతీయ కెరీర్లో తొలి సెంచరీని సాఫల్యం చేసుకున్నాడు. ఇక ఈ సిరీస్‌లో టీమిండియాను ఓడిపోకుండా నిలబెట్టాడు. వన్డే కెరీర్‌ను కూడా విదేశీ గడ్డపై (శ్రీలంక) మొదలుపెట్టిన ఈ టాపార్డర్ బ్యాటర్ ఇప్పుడు తొలి శతకాన్ని విదేశంలోనే నమోదు చేయడం విశేషం. సెంచూరియన్: హైదరాబాదీ సంచలనం ఠాకూర్ తిలక్ వర్మ అజేయ సెంచరీతో భారత్‌కు విజయ తిలకం దిద్దడంతో పర్యాటక జట్టు ఇక ఈ సిరీస్ గెలిచే స్థితిలో తప్ప ఓడే అవకాశం లేదు. మూడో టి20లో 11 పరుగుల తేడాతో గెలుపొందిన టీమిండియా నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో పైచేయి సాధించింది. భారత్ 2–1తో ఆధిక్యంలో ఉండగా, శుక్రవారం (15న) జొహన్నెస్‌బర్గ్‌లో ఆఖరి నాలుగో టి20 మ్యాచ్ జరుగనుంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీస్కోరు చేసింది. వన్‌డౌన్ బ్యాటర్ తిలక్ వర్మ (56 బంతుల్లో 107 నాటౌట్; 8 ఫోర్లు, 7 సిక్స్‌లు) శతక్కొట్టగా, ఓపెనర్ అభిషేక్ శర్మ (25 బంతుల్లో 50; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) దంచేశాడు. సిమ్‌లేన్, కేశవ్ మహరాజ్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం కష్టమైన లక్ష్యఛేదనకు దిగిన సఫారీ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసి ఓడింది. మార్కొ జాన్సెన్ (17 బంతుల్లో 54; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు), క్లాసెన్ (22 బంతుల్లో 41; 1 ఫోర్, 4 సిక్స్‌లు) విరుచుకుపడ్డారు. 51 బంతుల్లోనే సెంచరీ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ సంజూ సామ్సన్ (0) డకౌటయ్యాడు. మూడో బంతికి క్రీజులోకి వచ్చిన తిలక్... ఓపెనర్ అభిషేక్‌తో ధనాధన్ ఆటకు శ్రీకారం చుట్టాడు. ఇద్దరి జోరుతో 8.1 ఓవర్లో జట్టు స్కోరు 100కు చేరింది. అదే ఓవర్లో అభిషేక్ 24 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకొని అవుటయ్యాడు. దీంతో రెండో వికెట్‌కు 107 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. కెప్టెన్ సూర్యకుమార్ (1), హార్దిక్ పాండ్యా (18; 3 ఫోర్లు) మెరిపించలేదు. 32 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాక తిలక్ విశ్వరూపం చూపించాడు. కేశవ్ వేసిన 15వ ఓవర్లో వరుసగా 4, 6, 4 కొట్టిన తిలక్... కొయెట్జీ 16వ ఓవర్లో 2 సిక్స్‌లు, ఒక బౌండరీ బాదడంతో ఈ రెండు ఓవర్ల వ్యవధిలోనే 55 స్కోరు నుంచి అనూహ్యంగా 87కు చేరాడు. 19వ ఓవర్లో ఫోర్ కొట్టి 51 బంతుల్లోనే శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. రమణ్‌దీప్ (6 బంతుల్లో 15; 1 ఫోర్, 1 సిక్స్) ధాటిగా ఆడటంతో భారత్ 200 పైచిలుకు స్కోరు చేసింది. క్లాసెన్, జాన్సెన్ మెరుపులు దూకుడుగా మొదలైన దక్షిణాఫ్రికా లక్ష్యఛేదనకు మూడో ఓవర్ నుంచే ముకుతాడు పడింది. రికెల్టన్ (20), హెండ్రిక్స్ (21), స్టబ్స్ (12), కెపె్టన్ మార్క్రమ్ (18 బంతుల్లో 29; 2 సిక్స్‌లు) ధాటిగా ఆడే క్రమంలో వికెట్లను పారేసుకున్నారు. దీంతో సగం ఓవర్లు ముగిసేసరికి టాప్–4 బ్యాటర్లను కోల్పోయిన సఫారీ 84 పరుగులు చేసింది. మిగతా సగం ఓవర్లలో 136 పరుగుల సమీకరణం ఆతిథ్య జట్టుకు కష్టమైంది. అయితే హిట్టర్ క్లాసెన్ భారీషాట్లతో విరుచుకుపడ్డాడు. వరుణ్ వేసిన 14వ ఓవర్లో క్లాసెన్ 6, 6, 6, 0, 4, 1లతో 23 పరుగుల్ని పిండుకున్నాడు. అతని జోరుకు అర్ష్ దీప్ కళ్లెం వేయగా, తర్వాత జాన్సెన్ ధనాధన్ షోతో భారత శిబిరాన్ని వణికించాడు. చివరి 2 ఓవర్లలో దక్షిణాఫ్రికా విజయానికి 51 పరుగులు కావాలి. హార్దిక్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో జాన్సెన్ 26 పరుగులు సాధించాడు. విజయం కోసం దక్షిణాఫ్రికా 6బంతుల్లో 25 పరుగులు చేయాల్సి ఉండగా, ఆఖరి ఓవర్లో అర్ష్ దీప్ అతన్ని అవుట్ చేయడంతో భారత్ విజయం సాధించింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: సామ్సన్ (బి) జాన్సెన్ 0; అభిషేక్ (స్టంప్డ్) క్లాసెన్ (బి) కేశవ్ 50; తిలక్ వర్మ (నాటౌట్) 107; సూర్యకుమార్ (సి) జాన్సెన్ (బి) సిమ్‌లేన్ 1; హార్దిక్ (ఎల్బీడబ్ల్యూ) (బి) కేశవ్ 18; రింకూ సింగ్ (బి) సిమ్‌లేన్ 8; రమణ్‌దీప్ (రనౌట్) 15; అక్షర్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 219. వికెట్ల పతనం: 1–0, 2–107, 3–110, 4–132, 5–190, 6–218. బౌలింగ్: జాన్సెన్ 4–0–28–1, కొయెట్జీ 3–0–51–0, సిపామ్లా 4–0–45–0, సిమ్‌లేన్ 3–0–34–2, మార్క్రమ్ 2–0–19–0, కేశవ్ 4–0–36–2.దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: రికెల్టన్ (బి) అర్ష్ దీప్ 20; హెండ్రిక్స్ (స్టంప్డ్) (బి) వరుణ్ 21; మార్క్రమ్ (సి) రమణ్‌దీప్ (బి) వరుణ్ 29; స్టబ్స్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అక్షర్ 12; క్లాసెన్ (సి) తిలక్ (బి) అర్ష్ దీప్ 41; మిల్లర్ (సి) అక్షర్ (బి) హార్దిక్ 18; జాన్సెన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అర్ష్ దీప్ 54; కొయెట్జీ (నాటౌట్) 2; సిమ్‌లేన్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 208. వికెట్ల పతనం: 1–27, 2–47, 3–68, 4–84, 5–142, 6–167, 7–202. బౌలింగ్: అర్ష్ దీప్ 4–0–37–3, హార్దిక్ 4–0–50–1, అక్షర్ 4–0–29–1, వరుణ్ 4–0–54–2, రవి బిష్ణోయ్ 4–0–33–0.8 ఈ ఏడాది భారత జట్టు టి20ల్లో 8 సార్లు 200 పైచిలుకు పరుగులు సాధించింది. గత ఏడాది భారత జట్టు ఏడుసార్లు ఈ మైలురాయిని దాటింది.12 అంతర్జాతీయ టి20ల్లో సెంచరీ సాధించిన 12వ భారతీయ క్రికెటర్‌గా తిలక్ వర్మ గుర్తింపు పొందాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ (5), సూర్యకుమార్ యాదవ్ (4), కేఎల్ రాహుల్ (2), సంజూ సామ్సన్ (2), సురేశ్ రైనా (1), దీపక్ హుడా (1), విరాట్ కోహ్లి (1), శుబ్‌మన్ గిల్ (1), యశస్వి జైస్వాల్ (1), రుతురాజ్ గైక్వాడ్ (1), అభిషేక్ శర్మ (1) ఉన్నారు. అంతర్జాతీయ టి20ల్లో ఓవరాల్‌గా భారత క్రికెటర్లు 21 సెంచరీలు నమోదు చేశారు. -
సౌతాఫ్రికాతో మూడో టీ20.. శతక్కొట్టిన తిలక్ వర్మ.. టీమిండియా భారీ స్కోర్
సెంచూరియన్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి సౌతాఫ్రికా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. తిలక్ వర్మ మెరుపు సెంచరీ (56 బంతుల్లో 107 నాటౌట్; 8 ఫోర్లు, 7 సిక్సర్లు) చేసి టీమిండియా భారీ స్కోర్ చేయడానికి దోహదపడ్డాడు. అభిషేక్ శర్మ తనవంతుగా మెరుపు అర్ద శతకం (25 బంతుల్లో 50; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) బాదాడు. తిలక్ కేవలం 51 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. భారత ఇన్నింగ్స్‌లో సంజూ శాంసన్ డకౌట్ కాగా.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 1, హార్దిక్ పాండ్యా 18, రింకూ సింగ్ 8, రమణ్‌దీప్ సింగ్ 15 పరుగులు చేసి ఔటయ్యారు. ఆఖరి ఓవర్‌ను మార్కో జన్సెన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈ ఓవర్లో అతను కేవలం నాలుగు పరుగులలు మాత్రమే ఇచ్చి ఓ వికెట్ పడగొట్టాడు. సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్, సైమ్‌లేన్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. జన్సెన్కు ఓ వికెట్ దక్కింది. కాగా, నాలుగు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ప్రస్తుతం ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచిన విషయం తెలిసిందే. -
సౌతాఫ్రికాతో మూడో టీ20.. రమణ్‌దీప్ సింగ్ అరంగేట్రం, అభిషేక్‌కు మరో అవకాశం
సెంచూరియన్ వేదికగా టీమిండియాతో ఇవాళ (నవంబర్ 13) జరుగుతున్న మూడో టీ20లో సౌతాఫ్రికా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు చెరో మార్పు చేశాయి. భారత్ తరఫున ఆవేశ్ ఖాన్ స్థానంలో రమణ్‌దీప్ సింగ్ ఎంట్రీ ఇచ్చాడు. రమణ్‌దీప్‌కు ఇది డెబ్యూ మ్యాచ్. సౌతాఫ్రికా తరఫున న్కాబయోమ్జి పీటర్ స్థానంలో లూథో సిపమ్లా తుది జట్టులోకి వచ్చాడు. ఈ సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన అభిషేక్ శర్మకు మరో అవకాశం ఇచ్చింది టీమిండియా మేనేజ్మెంట్. కాగా, నాలుగు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో భారత్.. రెండో మ్యాచ్‌లో సౌతాఫ్రికా గెలుపొందిన విషయం తెలిసిందే.తుది జట్లు..భారత్ (ప్లేయింగ్ XI): సంజు శాంసన్(వికెట్‌కీపర్), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రమణదీప్ సింగ్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తిదక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్, రీజా హెండ్రిక్స్, ఎయిడెన్ మార్క్రమ్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్‌కీపర్), డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, ఆండిల్ సైమ్‌లేన్, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, లూథో సిపమ్లా -
వరుస సెంచరీలు.. చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా ప్లేయర్
మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో హోబర్ట్ హరికేన్స్ ఓపెనర్, సౌతాఫ్రికా ప్లేయర్ లిజెల్ లీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతుంది. ప్రస్తుత ఎడిషన్‌లో అరివీర భయంకమైన ఫామ్‌లో ఉన్న లీ.. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో రెండు విధ్వంసకర సెంచరీలు చేసింది. తొలుత పెర్త్ స్కార్చర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 75 బంతుల్లో అజేయమైన 150 పరుగులు (12 ఫోర్లు, 12 సిక్సర్లు) చేసిన లీ.. తాజాగా అడిలైడ్ స్ట్రయికర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మరో మెరుపు సెంచరీతో (59 బంతుల్లో 103; 13 ఫోర్లు, 4 సిక్సర్లు) విజృంభించింది. తద్వారా మహిళల బిగ్‌బాష్ లీగ్ చరిత్రలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో రెండు సెంచరీలు చేసిన తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది.కొడితే బ్యాట్ విరిగిపోయింది..!ఈ మ్యాచ్‌లో లిజెల్ కొట్టిన ఓ షాట్‌కు బ్యాట్ విరిగిపోయింది. ఓర్లా వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్ రెండో బంతికి లిజెల్ క్రీజ్ వదిలి ముందుకు వచ్చి భారీ షాట్ ఆడింది. ఈ షాట్‌కు బ్యాట్ విరిగిపోయినప్పటికీ బంతి బౌండరీని క్లియర్ చేసింది.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన హరికేన్స్.. లిజెల్ మెరుపు సెంచరీతో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 191 పరుగుల భారీ స్కోర్ చేసింది. లిజెల్కు నికోలా క్యారీ (46 బంతుల్లో 64 నాటౌట్; 7 ఫోర్లు, సిక్స్) సహకరించింది. హరికేన్స్ ఇన్నింగ్స్‌లో వ్యాట్ హాడ్జ్ డకౌట్ కాగా.. కెప్టెన్ ఎలైస్ విల్లాని 14 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 23 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. అడిలైడ్ బౌలర్లలో మెగాన్ షట్‌కు ఓ వికెట్ దక్కింది. ఈ మ్యాచ్‌లో లిజెల్ రనౌటయ్యింది.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన అడిలైడ్ స్ట్రయికర్స్ 15 ఓవర్ల అనంతరం మూడు వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. స్మృతి మంధన (32 బంతుల్లో 51; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీతో కదంతొక్కగా.. కేటీ మ్యాక్ 14, తహిళ మెక్‌గ్రాత్ 4 పరుగులు చేసి ఔటయ్యాడు. లారా వోల్వార్డ్ట్ (25), బ్రిడ్జెట్ ప్యాటర్సన్ (11) క్రీజ్‌లో ఉన్నారు. హరికేన్స్ బౌలర్లలో మోల్లీ స్ట్రానో, లారెన్ స్మిత్, యామీ స్మిత్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో అడిలైడ్ గెలవాలంటే 30 బంతుల్లో మరో 80 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 7 వికెట్లు ఉన్నాయి. -
‘డెత్ ఓవర్లలో బౌలింగ్ కత్తి మీద సామే’
సెంచూరియన్: పరిస్థితులకు తగ్గట్లు తన బౌలింగ్‌ను మార్చుకుంటూ ముందుకు సాగుతున్నానని భారత యువ పేసర్ అర్ష్ దీప్ సింగ్ అన్నాడు. దక్షిణాఫ్రికాతో టి20 సిరీస్‌లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్న అర్ష్ దీప్ ... ఒత్తిడిలో బౌలింగ్ చేయడాన్ని ఇష్టపడతానని వెల్లడించాడు. 2022లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన అర్ష్ దీప్ ఇప్పటి వరకు జాతీయ జట్టు తరఫున 58 టి20 మ్యాచ్‌లు ఆడి 89 వికెట్లు పడగొట్టాడు. ‘స్పష్టమైన గేమ్ ప్లాన్‌తో మైదానంలో అడుగుపెడతా. పరిస్థితులకు తగ్గట్లు దాన్ని మార్చుకుంటూ ఉంటా. జట్టుకు ఏం అవసరమో దాన్ని గుర్తిస్తా. వికెట్లు తీయడం ముఖ్యమా... లేక పరుగులు నియంత్రిచాల అనేది చూసి బౌలింగ్‌లో మార్పులు చేసుకుంటా. డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయడం కత్తిమీద సాము లాంటిది. ప్రతిసారి మనం అనుకున్న ఫలితం రాదు. అయినా దాని గురించి అతిగా ఆలోచించను. ఆరంభంలో రెండు ఓవర్లు వేసి మళ్లీ చివర్లో రెండు ఓవర్లు వేయడం మధ్య చాలా సమయం దక్కుతుంది. ఆ లోపు జట్టుకు ఏం కావాలో ఆర్థం అవుతుంది. రోజు రోజుకు మెరుగవడంపైనే ప్రధానంగా దృష్టి పెడతా.ఇటీవలి కాలంలో బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లో కూడా జట్టుకు సహాయ పడేందుకు ప్రయత్నిస్తున్నా. భారీ షాట్లు ఆడటం ఇష్టమే. నెట్స్‌లో కేవలం బౌలింగ్‌పైనే కాకుండా బ్యాటింగ్, ఫీల్డింగ్‌పై కూడా దృష్టి పెట్టా. ఆ దిశగా కష్టపడుతున్నా. బుమ్రాతో కలిసి బౌలింగ్ చేయడాన్ని బాగా ఆస్వాదిస్తా. అతడి లాంటి బౌలర్ మరో ఎండ్ నుంచి ఒత్తిడి పెంచుతుంటే వికెట్లు తీయడం చాలా సులువవుతుంది.మ్యాచ్‌పై పట్టు కొనసాగించడం ముఖ్యం. అది ప్రారంభ ఓవర్ అయినా... లేక చివరి ఓవర్ అయినా ఒకే విధంగా ఆలోచిస్తా’ అని అర్ష్ దీప్ వివరించాడు. పొట్టి ఫార్మాట్లో ప్రమాదక బౌలర్‌గా ఎదిగిన అర్ష్ దీప్ ... జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించడమే తన ప్రధాన లక్ష్యమని వెల్లడించాడు. -
భారం బ్యాటర్లపైనే!.. ఆధిక్యంపై భారత్ కన్ను
సెంచూరియన్: సిరీస్‌లో పైచేయి సాధించడమే లక్ష్యంగా భారత జట్టు మూడో టి20 బరిలోకి దిగుతోంది. సూర్యకుమార్ సేన గత మ్యాచ్‌లో ఓడినా కూడా తక్కువ లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టును వణికించింది. తొలి మ్యాచ్‌లో బ్యాటర్లు, రెండో మ్యాచ్‌లో బౌలర్లు సత్తా చాటుకున్నారు. ఇప్పుడు ఈ రెండు విభాగాలు పట్టు బిగిస్తే మూడో మ్యాచ్ గెలవడం ఏమంత కష్టమే కాదు. మరోవైపు సొంతగడ్డపై రెండు మ్యాచ్‌ల్లోనూ సఫారీల ప్రభావం అంతంతే! గత మ్యాచ్ గెలిచినా... అది గట్టెక్కడమే కానీ సాధికారిక విజయం కానేకాదు. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా మూడో టి20 కోసం పెద్ద కసరత్తే చేసింది. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని ఎదుర్కొనేందుకు ప్రత్యర్థి బ్యాటర్లు నెట్స్‌లో చెమటోడ్చారు. ఇది నాలుగు మ్యాచ్‌ల సిరీస్ కావడంతో బుధవారం జరిగే పోరులో ఎవరు గెలిచినా ఆ జట్టు సిరీస్‌ను చేజార్చుకోదు. నిలకడే అసలు సమస్య ఓపెనర్లలో సంజూ సామ్సన్ తొలి మ్యాచ్‌లో చెలరేగాడు. గత మ్యాచ్‌లో అతను విఫలమైనా ఫామ్‌పై ఏ బెంగా లేదు. కానీ అభిషేక్ శర్మ వరుస వైఫల్యాలు జట్టు శుభారంభానికి ప్రతికూలంగా మారుతోంది. డర్బన్‌లో (7), పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో (4) సింగిల్ డిజిట్లకే పరిమితమయ్యాడు. ఇప్పుడు సెంచూరియన్‌లో అయినా అభిషేక్ బ్యాట్ ఝళిపిస్తే బ్యాటింగ్ బలగం పెరుగుతుంది. రెండో మ్యాచ్‌లో టాపార్డర్ వైఫల్యం, నిలకడలేని మిడిలార్డర్‌తో భారత్ పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడింది. ముఖ్యంగా డెత్ ఓవర్లలో 20, 30 పరుగులు వచ్చే చోట 11 పరుగులే చేయడం బ్యాటింగ్ లోపాల్ని ఎత్తిచూపుతోంది. సూర్యకుమార్ నుంచి కూడా అలరించే ఇన్నింగ్స్ ఇంకా రాలేదు. ఈ మ్యాచ్‌లో అతని 360 డిగ్రీ బ్యాటింగ్ చూపిస్తే ఇన్నింగ్స్ దూసుకెళుతుంది. ఈ సిరీస్‌లో స్పిన్నర్లు వరుణ్, రవి బిష్ణోయ్‌లు సత్తా చాటుకుంటున్నారు. ఈ బౌలింగ్ ద్వయంకు ఊతమిచ్చేలా బ్యాటింగ్ దళం కూడా బాధ్యత పంచుకుంటే భారత్ ఈ మ్యాచ్‌లో గెలుస్తుంది. లేదంటే గత మ్యాచ్‌లో ఎదురైన ఫలితం వచి్చనా ఆశ్చర్యపోనక్కర్లేదు. టాపార్డర్‌లో లోపించిన నిలకడ గత మ్యాచ్‌కు సమస్యగా మారింది. వీటిని వెంటనే అధిగమిస్తేనే అనుకున్న ఫలితాలు సాధించవచ్చు.పైచేయి కోసం ప్రయత్నం మరోవైపు ఆతిథ్య దక్షిణాఫ్రికా కూడా సిరీస్‌లో పైచేయి సాధించాలని పట్టుదలగా ఉంది. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు పూర్తయినా... సఫారీ ఆటతీరు అంతంతమాత్రంగానే ఉంది. డర్బన్‌లో రెండొందల పైచిలుకు లక్ష్యానికి చేతులెత్తేసిన బ్యాటర్లు... రెండో టి20లో 125 పరుగులు చేసేందుకు కూడా తెగ కష్టపడ్డారు. చివరకు ఏదోలా గెలిచినా ఇదే తీరు కొనసాగితే మాత్రం సిరీస్ కోల్పోక తప్పదు. రికెల్టన్, హెండ్రిక్స్, మార్క్రమ్లతో కూడిన టాపార్డర్, క్లాసెన్, మిల్లర్‌లాంటి హిట్టర్లతో కూడిన మిడిలార్డర్ భారత స్పిన్నర్లకు ఏమాత్రం నిలబడలేకపోతోంది. గత రెండు మ్యాచ్‌ల్లో కలిపి వరుణ్ (3/25, 5/17) 8 వికెట్లు తీశాడు. దీంతో సఫారీ జట్టు మేనేజ్మెంట్ అతన్ని ఎదుర్కోనేందుకు పెద్ద కసరత్తే చేసింది.సెంచూరియన్‌లో అది ఏ మేరకు ప్రభావం చూపుతుందో చూడాలి. బౌలర్లలో కొయెట్జీ, మార్కొ జాన్సెన్ భారత బ్యాటర్లను ఇబ్బంది పెడుతున్నారు. పేస్‌కు అనుకూలించే సెంచూరియన్‌లో పోరు ఆసక్తికరంగా జరగడం ఖాయం. -
విజయాన్ని వదిలేశారు
పోర్ట్ ఎలిజబెత్: భారత్ చేసింది 124/6. తక్కువ స్కోరే! దక్షిణాఫ్రికా ముందున్న లక్ష్యం 125. సులువైందే! కానీ భారత ఆఫ్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (4–0–17–5) బిగించిన ఉచ్చు సఫారీని ఓటమి కోరల్లో పడేసింది. ఈ దశలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ట్రిస్టన్ స్టబ్స్ (41 బంతుల్లో 47 నాటౌట్; 7 ఫోర్లు) చేసిన పోరాటం ఆతిథ్య జట్టును గెలిపించింది.ఆదివారం జరిగిన రెండో టి20లో దక్షిణాఫ్రికా 3 వికెట్ల తేడాతో భారత్‌పై గెలిచింది. దాంతో నాలుగు టి20ల సిరీస్‌లో రెండు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. 13న సెంచూరియన్‌లో మూడో టి20 జరుగనుంది. మొదట భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 124 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా (45 బంతుల్లో 39 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) మెరుగ్గా ఆడాడంతే! అనంతరం లక్ష్యఛేదనకు దిగిన సఫారీ జట్టు 19 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసి గెలిచింది. కొయెట్జీ (9 బంతుల్లో 19 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) చేసిన కీలక పరుగులు, స్టబ్స్ పోరాటంతో దక్షిణాఫ్రికా పైచేయి సాధించింది. కష్టాలతో మొదలై... ఇన్నింగ్స్ మొదలైన తొలి ఓవర్లోనే జాన్సెన్ మూడో బంతికి సంజూ సామ్సన్ (0) క్లీన్‌బౌల్డయ్యాడు. తర్వాతి కొయెట్జీ ఓవర్ మూడో బంతికి అభిషేక్ శర్మ (4) కీపర్ క్యాచ్ నుంచి రివ్యూకెళ్లి బతికిపోయినా... మరో రెండు బంతులకే భారీ షాట్‌కు ప్రయతి్నంచి జాన్సెన్కు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. దీంతో 5 పరుగులకే భారత్ ఓపెనర్లను కోల్పోయింది. ఈ కష్టాలు చాలవన్నట్లు కెప్టెన్ సూర్యకుమార్ (4) సిమ్‌లేన్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. 15 పరుగులకే టాపార్డర్ కూలిపోగా... పవర్‌ప్లేలో భారత్ 34/3 స్కోరు చేసింది. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్స్ జోడీ ఠాకూర్ తిలక్ వర్మ (20 బంతుల్లో 20; 1 ఫోర్, 1 సిక్స్), అక్షర్ పటేల్ (21 బంతుల్లో 27; 4 ఫోర్లు) నిలదొక్కుకోకుండా మార్క్రమ్ చేశాడు. అతని బౌలింగ్‌లో తిలక్ షాట్ ఆడగా బుల్లెట్లా దూసుకొచ్చిన బంతిని మిల్లర్ గాల్లో ఎగిరి ఒంటిచేత్తో అందుకున్నాడు. అక్షర్ పటేల్ (21 బంతుల్లో 27; 4 ఫోర్లు) దురదృష్టవశాత్తూ రనౌటయ్యాడు. పీటర్ వేసిన 12వ ఓవర్లో హార్దిక్ స్ట్రెయిట్ డ్రైవ్ ఆడగా... అది నేరుగా వెళ్లి నాన్–స్ట్రయిక్ ఎండ్‌లోని వికెట్లకు తగిలింది. ఈ లోపే బంతిని అడ్డుకోబోయిన పీటర్ చేతికి టచ్ అయ్యింది. అక్షర్ రీప్లే వచ్చేవరకు వేచిచూడకుండా పెవిలియన్ వైపు నడిచాడు. దీంతో 70 పరుగులకే టీమిండియా సగం వికెట్లను కోల్పోయింది. తర్వాత వచ్చిన రింకూ (9)ను పీటరే అవుట్ చేశాడు. రింకూ ఆడిన షాట్‌ను షార్ట్‌ఫైన్ లెగ్‌లో కొయెట్జీ అందుకున్నాడు. ఎట్టకేలకు 17వ ఓవర్లో పాండ్యా బౌండరీతో జట్టు స్కోరు వందకు చేరింది. జాన్సెన్ వేసిన 18వ ఓవర్లో పాండ్యా 2 ఫోర్లు, ఒక సిక్స్ బాదాడు. చివరి రెండు డెత్ ఓవర్లను కొయెట్జీ, జాన్సెన్ చక్కగా నియంత్రించారు. పాండ్యా ఆఖరిదాకా క్రీజులో ఉన్నప్పటికీ కొయెట్జీ 19వ ఓవర్లో 3 పరుగులే ఇవ్వగా, జాన్సన్ ఆఖరి ఓవర్లో 6 పరుగులు వచ్చాయి. వరుణ్ తిప్పేసినా... సొంతగడ్డపై ప్రత్యర్థి స్వల్ప లక్ష్యమే నిర్దేశించినా... దక్షిణాఫ్రికా ఆపసోపాలు పడి గెలిచింది. హెండ్రిక్స్, కెపె్టన్ మార్క్రమ్ (3), జాన్సెన్ (7), క్లాసెన్ (2), మిల్లర్ (0)లను అవుట్ చేసిన వరుణ్ చక్రవర్తి ఆశలు రేపాడు. ఒక దశలో 64/3 వద్ద పటిష్టంగా కనిపించిన సఫారీ అంతలోనే వరుణ్ స్పిన్ ఉచ్చులో పడి 66 పరుగులకే 6 వికెట్లను కోల్పోయి ఓటమి ప్రమాదాన్ని తెచ్చుకుంది. కాసేపటికే సిమ్‌లేన్ (7)ను రవి బిష్ణోయ్ బౌల్డ్ చేయడంతో భారత్ శిబిరం ఆనందంలో మునిగితేలింది. 24 బంతుల్లో 37 పరుగులు చేయాల్సి ఉండగా, అర్ష్ దీప్ 17వ ఓవర్లో కొయెట్జీ 6, స్టబ్స్ 4 బాదారు. దీంతోనే సఫారీ జట్టు స్కోరు 100కు చేరింది. ఇక 18 బంతుల్లో 24 పరుగుల సమీకరణం వద్ద అవేశ్ బౌలింగ్‌కు దిగడంతో మ్యాచ్ స్వరూపమే మారింది. చెత్త బంతులేసిన అవేశ్ ఖాన్ రెండు ఫోర్లు సహా 12 పరుగులు సమర్పించుకున్నాడు. తర్వాతి ఓవర్ అర్ష్ దీప్ వేయగా స్టబ్స్ 4, 4, 0, 0, 4, 4లతో ఇంకో ఓవర్ మిగిలుండగానే మ్యాచ్‌ను ముగించాడు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: సామ్సన్ (బి) జాన్సెన్ 0; అభిషేక్ (సి) జాన్సెన్ (బి) కొయెట్జీ 4; సూర్యకుమార్ (ఎల్బీడబ్ల్యూ) (బి) సిమ్‌లేన్ 4; తిలక్ (సి) మిల్లర్ (బి) మార్క్రమ్ 20; అక్షర్ (రనౌట్) 27; పాండ్యా (నాటౌట్) 39; రింకూ (సి) కొయెట్జీ (బి) పీటర్ 9; అర్ష్ దీప్ (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 124. వికెట్ల పతనం: 1–0, 2–5, 3–15, 4–45, 5–70, 6–87. బౌలింగ్: జాన్సెన్ 4–1–25–1, కొయెట్జీ 4–0–25–1, సిమ్‌లేన్ 3–0–20–1, కేశవ్ 4–0– 24–0, మార్క్రమ్ 1–0–4–1, పీటర్ 4–0–20–1. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: రికెల్టన్ (సి) రింకూ (బి) అర్ష్ దీప్ 13; హెండ్రిక్స్ (బి) వరుణ్ 24; మార్క్రమ్ (బి) వరుణ్ 3; స్టబ్స్ (నాటౌట్) 47; జాన్సెన్ (బి) వరుణ్ 7; క్లాసెన్ (సి) రింకూ (బి) వరుణ్ 2; మిల్లర్ (బి) వరుణ్ 0; సిమ్‌లేన్ (బి) బిష్ణోయ్ 7; కొయెట్జీ (నాటౌట్) 19; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (19 ఓవర్లలో 7 వికెట్లకు) 128. వికెట్ల పతనం: 1–22, 2–33, 3–44, 4–64, 5–66, 6–66, 7–86. బౌలింగ్: అర్ష్ దీప్ 4–0–41–1, అవేశ్ 3–0–23–0, హార్దిక్ 3–0–22–0, వరుణ్ 4–0–17–5, రవి బిష్ణోయ్ 4–0–21–1, అక్షర్ 1–0–2–0. -
ఐదేసి మాయ చేసిన వరుణ్ చక్రవర్తి.. అయినా ఓటమిపాలైన టీమిండియా
నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా 3 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. సఫారీ బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 124 పరుగులు మాత్రమే చేయగలిగింది. సఫారీ బౌలర్లలో మార్కో జన్సెన్, గెరాల్డ్ కొయెట్జీ, అండైల్ సైమ్‌లేన్, ఎయిడెన్ మార్క్రమ్, ఎన్ పీటర్ పొదుపుగా బౌలింగ్ చేసి తలో వికెట్ పడగొట్టారు. భారత ఇన్నింగ్స్‌లో హార్దిక్ పాండ్యా (39 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలువగా.. తిలక్ వర్మ (20), అక్షర్ పటేల్ (27) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. సంజూ శాంసన్ 0, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ తలో 4, రింకూ సింగ్ 9 పరుగులు చేసి ఔటయ్యారు. అర్షదీప్ సింగ్ 7 పరుగులతో అజేయంగా నిలిచాడు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకునే క్రమంలో భారత్ ఆదిలో విజయవంతమైంది. వరుణ్ చక్రవర్తి (4-0-17-5) దెబ్బకు సౌతాఫ్రికా ఓ దశలో మరో ఓటమి మూటగట్టుకునేలా కనిపించింది. అయితే ఆఖర్లో ట్రిస్టన్ స్టబ్స్ (47 నాటౌట్), గెరాల్డ్ కొయెట్జీ (19 నాటౌట్) పట్టుదలగా ఆడి సౌతాఫ్రికాను విజయతీరాలకు చేర్చారు. 19 ఓవర్లలో సౌతాఫ్రికా 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో స్టబ్స్, కొయెట్జీతో పాటు ర్యాన్ రికెల్టన్ (13), రీజా హెండ్రిక్స్ (24) రెండంకెల స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవరి ఐదు, అర్షదీప్ సింగ్, రవి బిష్ణోయ్ తలో వికెట్ పడగొట్టారు. నాలుగు మ్యాచ్‌ల ఈ టీ20 సిరీస్‌లో టీమిండియా తొలి మ్యాచ్‌లో గెలుపొందిన విషయం తెలిసిందే. -
రాణించిన సఫారీ బౌలర్లు.. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన టీమిండియా
గెబెర్హాలో వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. సఫారీ బౌలర్లు అద్బుతంగా బౌలింగ్ చేసి భారత బ్యాటర్లను కట్టడి చేశారు. సఫారీ బౌలర్లలో మార్కో జన్సెన్, గెరాల్డ్ కొయెట్జీ, అండైల్ సైమ్‌లేన్, ఎయిడెన్ మార్క్రమ్, ఎన్ పీటర్ పొదుపుగా బౌలింగ్ చేసి తలో వికెట్ పడగొట్టారు.ఈ మ్యాచ్‌లో టీమిండియా ఐదు పరుగులకే ఓపెనర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మ వికెట్లు కోల్పోయింది. గత రెండు టీ20ల్లో సెంచరీలు చేసిన సంజూ మూడు బంతులు ఆడి డకౌట్ కాగా.. అభిషేక్ శర్మ (5 బంతుల్లో 4) తన వైఫల్యాల పరంపరను కొనసాగించాడు. ఆతర్వాత బ్యాటింగ్‌కు దిగిన సూర్యకుమార్ యాదవ్ కూడా పరుగులు చేసేందుకు ఇబ్బంది పడ్డాడు. స్కై 9 బంతుల్లో కేవలం 4 పరుగులు చేసి ఔటయ్యాడు.ఆతర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన తిలక్ వర్మ (20), అక్షర్ పటేల్ (27) క్రీజ్‌లో ఉన్నంత సేపు ధాటిగా ఆడారు. తిలక్ వర్మను డేవిడ్ మిల్లర్ అద్బుతమైన క్యాచ్‌తో పెవిలియన్‌కు పంపగా.. అక్షర్ పటేల్.. హార్దిక్ ఆడిన రిటర్న్ షాట్ కారణంగా రనౌటయ్యాడు. ఆతర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన హార్దిక్ చాలా నిదానంగా ఆడి 45 బంతుల్లో 4 బౌండీరలు, సిక్సర్ సాయంతో 39 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. రింకూ సింగ్ తొమ్మిది పరుగులు చేసి ఔట్ కాగా.. అర్షదీప్ సింగ్ 7 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో హార్దిక్ కాస్త వేగంగా ఆడి ఉంటే భారత్ మరింత మెరుగైన స్కోర్ చేసేది. ఇన్నింగ్స్ ఆఖర్లో హార్దిక్ స్ట్రయిక్ రొటేట్ చేసేందుకు ఇష్టపడలేదు. అతను సొంతంగా స్కోర్ చేయకపోగా.. బంతులను అనవసరంగా వృధా చేశాడు. -
SA VS IND 2nd T20: మార్పులు లేని టీమిండియా
గెబెర్హాలోని సెయింట్ జార్జ్స్ పార్క్ వేదికగా ఇవాళ (నవంబర్ 10) భారత్, సౌతాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోని రెండో మ్యాచ్ ఇది. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం సౌతాఫ్రికా ఓ మార్పు చేసింది. క్రూగర్ స్థానంలో రీజా హెండ్రిక్స్ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు భారత్ మాత్రం గత మ్యాచ్‌లో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించింది. డర్బన్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 61 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే.తుది జట్లు.. భారత్ (ప్లేయింగ్ XI): సంజు శాంసన్(వికెట్‌కీపర్), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, వరుణ్ చకరవర్తి, అవేష్ ఖాన్దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): ఎయిడెన్ మార్క్రమ్(కెప్టెన్), ర్యాన్ రికెల్టన్, రీజా హెండ్రిక్స్, ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్‌కీపర్), డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, ఆండిల్ సిమెలన్, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, న్కాబయోమ్జి పీటర్ -
మరో విజయం లక్ష్యంగా...
జిఖెబెర్హా (పోర్ట్ ఎలిజబెత్): టి20 క్రికెట్లో జోరు కొనసాగించాలని పట్టుదలగా ఉన్న భారత జట్టు మరో పోరుకు సన్నద్ధమైంది. నేడు దక్షిణాఫ్రికాతో జరిగే రెండో టి20లో భారత్ తలపడుతుంది. తొలి మ్యాచ్‌లో నెగ్గిన టీమిండియా ఇక్కడా విజయం సాధిస్తే 2–0తో ముందంజ వేస్తుంది. నాలుగు మ్యాచ్‌ల ఈ సమరంలో ఆపై సిరీస్ కోల్పోయే అవకాశం మాత్రం ఉండదు. మరో వైపు స్వదేశంలో కూడా ప్రభావం చూపలేక సమష్టి వైఫల్యంతో చిత్తయిన దక్షిణాఫ్రికాపై తీవ్ర ఒత్తిడి ఉంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి తమ అవకాశాలు కాపాడుకోవాలని ఆ జట్టు భావిస్తోంది. ఇక్కడి పిచ్‌పై చక్కటి బౌన్స్ ఉండటంతో అటు బ్యాటింగ్‌కు, ఇటు పేస్ బౌలింగ్‌కు అనుకూలం కాబట్టి ఆసక్తికర పోరు జరగవచ్చు. మ్యాచ్ రోజున వర్షం పడే అవకాశం తక్కువ. అంతర్జాతీయ టి20ల్లో వరుసగా 11 మ్యాచ్‌లు గెలిచిన భారత్ ఈ సారి కూడా విజయం సాధిస్తే తమ రికార్డు (12 మ్యాచ్‌లు)నే సమం చేస్తుంది. అందరూ చెలరేగితే... తొలి టి20లో భారత్ బ్యాటింగ్ పదునేమిటో కనిపించింది. ఇన్నింగ్స్ చివర్లో కాస్త తడబాటుకు గురైనా స్కోరు 200 దాటడం విశేషం. సంజు సామ్సన్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగుతుండటం సానుకూలాశం కాగా మరో ఓపెనర్ అభిషేక్ శర్మ అంచనాలను అందుకోవాల్సి ఉంది. వరుసగా విఫలమవుతున్న అతనికి ఇది చివరి అవకాశం కావచ్చు. సూర్యకుమార్ ఎప్పటిలాగే తనదైన శైలిలో బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించడం ఖాయం. తిలక్ వర్మ కూడా తొలి పోరులో మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. చివరి ఓవర్లలో వేగంగా ఆడే క్రమంలో పాండ్యా, రింకూ సింగ్ తొందరగానే అవుటైనా వారు తమ స్థాయికి తగినట్లు ఆడితే భారత్‌కు తిరుగుండదు. ఏడో స్థానంలో అక్షర్ పటేల్ లాంటి ఆల్‌రౌండర్ అందుబాటులో ఉండటం జట్టు బ్యాటింగ్ లోతును చూపిస్తోంది. బౌలింగ్‌లో కూడా వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ స్పిన్‌ను అర్థం చేసుకోవడంతో సఫారీలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. పేసర్ అర్‡్షదీప్ కూడా సత్తా చాటుతుండగా...పునరాగమనంలో అవేశ్ ఆకట్టుకున్నాడు. ఇలాంటి లైనప్ ఉన్న జట్టు మరోసారి చెలరేగితే వరుసగా రెండో విజయం జట్టు ఖాతాలో చేరడం ఖాయం. గెలిపించేది ఎవరు... సొంతగడ్డపై ఇటీవలే విండీస్ చేతిలో 0–3తో టి20 సిరీస్‌ను చేజార్చుకున్న దక్షిణాఫ్రికా ఈ ఫార్మాట్లో ఇంకా తడబడుతూనే ఉంది. తొలి పోరులో బౌలర్ల వైఫల్యంతో ముందుగా భారీగా పరుగులిచ్చుకున్న జట్టు...ఆ తర్వాత బ్యాటింగ్‌లో సాధారణ ప్రదర్శన కూడా చూపించలేదు. మార్క్రమ్ మళ్లీ విఫలం కాగా...రికెల్టన్, స్టబ్స్ కూడా నిలబడలేకపోయారు. క్లాసెన్, మిల్లర్ జోడీపై జట్టు అతిగా ఆధారపడుతున్నట్లు అనిపిస్తోంది. వీరిద్దరు వెనుదిరిగితే చాలు ప్రత్యర్థి చేతికి మ్యాచ్ అప్పగించినట్లే కనిపిస్తోంది. పేరుకే ఆల్‌రౌండర్ అయినా మార్కో జాన్సెన్ ఏమాత్రం ప్రభావం చూపడం లేదు. కొయెట్జీతో పాటు ఇతర బౌలర్లు కూడా రాణిస్తేనే భారత్‌ను సఫారీలు నిలువరించగలరు. పీటర్, సిమ్‌లేన్ గత మ్యాచ్‌లో విఫలమైనా... మరో మ్యాచ్‌లో అవకాశం దక్కవచ్చు. స్పిన్నర్‌గా కేశవ్ మహరాజ్ కూడా రాణించాల్సి ఉంది. -
#INDvsSA : తొలి టి20లో భారత్ ఘన విజయం...సెంచరీతో చెలరేగిన సామ్సన్ (ఫొటోలు)
-
IND VS SA 1st T20: తుది జట్లు ఇవే..!
నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా డర్బన్ వేదికగా టీమిండియాతో ఇవాళ (నవంబర్ 8) జరుగుతున్న తొలి టీ20లో సౌతాఫ్రికా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ముగ్గురు స్పెషలిస్ట్ స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగుతుంది. సంజూ శాంసన్, అభిషేక్ శర్మ ఓపెనర్లుగా రానున్నారు.భారత్, సౌతాఫ్రికా మధ్య ఇప్పటివరకు 27 టీ20 మ్యాచ్‌లు జరగగా.. భారత్ 15, సౌతాఫ్రికా 11 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి. ఓ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. ఇరు జట్లు చివరిసారి తలపడిన మ్యాచ్‌లో టీమిండియానే పైచేయి సాధించింది. టీ20 వరల్డ్‌కప్ 2024 ఫైనల్లో భారత్, సౌతాఫ్రికా తలపడగా.. ఆ మ్యాచ్‌లో టీమిండియా జయభేరి మోగించి రెండో సారి వరల్డ్‌కప్ ఛాంపియన్‌గా నిలిచింది. దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్(వికెట్‌కీపర్), ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, పాట్రిక్ క్రుగర్, మార్కో జాన్సెన్, ఆండిల్ సిమెలన్, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, న్కాబయోమ్జి పీటర్భారత్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, సంజు శాంసన్(వికెట్‌కీపర్), సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్ -
సౌతాఫ్రికాతో ఆల్ ఫార్మాట్ సిరీస్‌లకు ఇంగ్లండ్ జట్ల ప్రకటన
నవంబర్ 24 నుంచి సౌతాఫ్రికాతో జరుగబోయే ఆల్ ఫార్మాట్ సిరీస్‌ల కోసం ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్లను ఇవాళ (నవంబర్ 8) ప్రకటించారు. ఈ సిరీస్‌లలో తొలుత టీ20లు, తర్వాత వన్డేలు, ఆతర్వాత ఏకైక టెస్ట్ మ్యాచ్ జరుగనుంది. మూడు ఫార్మాట్లలో ఇంగ్లండ్ జట్టుకు హీథర్ నైట్ కెప్టెన్‌గా వ్యవహరించనుంది. ఇటీవల ఐర్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో అరంగేట్రం ఆల్‌రౌండర్ పైజ్ స్కోల్ఫీల్డ్ను టీ20 జట్టుకు ఎంపిక చేశారు. ఫాస్ట్ బౌలర్ లారెన్ ఫైలర్ మూడు ఫార్మాట్ల జట్లలో చోటు దక్కించుకుంది. 19 ఏళ్ల యంగ్ ప్రామిసింగ్ క్రికెటర్ ఫ్రేయా కెంప్ తొలిసారి టెస్ట్ జట్టులో చోటు దక్కించుకుంది. మైయా బౌచియర్ ఈ సిరీస్‌లో తన తొలి టెస్ట్ మ్యాచ్ ఆడే అవకాశం ఉంది. తొలుత టీ20 జట్టు నవంబర్ 16న సౌతాఫ్రికాకు బయల్దేరుతుంది. ఆ తర్వాత నవంబర్ 27న వన్డే, టెస్ట్ జట్లు టీ20 జట్టుతో కలుస్తాయి.షెడ్యూల్..నవంబర్ 24- తొలి టీ20 (ఈస్ట్ లండన్)నవంబర్ 27- రెండో టీ20 (బెనోని)నవంబర్ 30- మూడో టీ20 (సెంచూరియన్)డిసెంబర్ 4- తొలి వన్డే (కింబర్లీ)డిసెంబర్ 8- రెండో వన్డే (డర్బన్)డిసెంబర్ 11- మూడో వన్డే (పోచెఫ్స్రూమ్)డిసెంబర్ 15 నుంచి 18 వరకు- ఏకైక టెస్ట్ మ్యాచ్ (బ్లోంఫోంటెయిన్)ఇంగ్లండ్ మహిళల టీ20 జట్టు: హీథర్ నైట్ (కెప్టెన్), లారెన్ బెల్, మైయా బౌచియర్, చార్లీ డీన్, సోఫియా డంక్లీ, సోఫీ ఎక్లెస్టోన్, లారెన్ ఫైలర్, సారా గ్లెన్, బెస్ హీత్, అమీ జోన్స్, ఫ్రెయా కెంప్, పైజ్ స్కోల్ఫీల్డ్, నాట్ స్కివర్-బ్రంట్, లిన్సే స్మిత్, డాని వ్యాట్ హాడ్జ్ఇంగ్లండ్ మహిళల వన్డే జట్టు: హీథర్ నైట్ (కెప్టెన్), టామీ బ్యూమాంట్, లారెన్ బెల్, మైయా బౌచియర్, అలిస్ క్యాప్సే, కేట్ క్రాస్, చార్లీ డీన్, సోఫియా డంక్లీ, సోఫీ ఎక్లెస్టోన్, లారెన్ ఫైలర్, సారా గ్లెన్, అమీ జోన్స్, ఫ్రెయా కెంప్, నాట్ స్కివర్-బ్రంట్, డాని వ్యాట్ హాడ్జ్ఇంగ్లండ్ మహిళల టెస్టు జట్టు: హీథర్ నైట్ (కెప్టెన్), టామీ బ్యూమాంట్, లారెన్ బెల్, మైయా బౌచియర్, కేట్ క్రాస్, చార్లీ డీన్, సోఫియా డంక్లీ, సోఫీ ఎక్లెస్టోన్, లారెన్ ఫైలర్, అమీ జోన్స్, ఫ్రెయా కెంప్, నాట్ స్కివర్-బ్రంట్, డాని వ్యాట్ హాడ్జ్ -
ఇండియా, సౌతాఫ్రికా తొలి టీ20కి వర్షం ముప్పు..?
నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా భారత్, సౌతాఫ్రికా జట్లు ఇవాళ (నవంబర్ 8) తొలి మ్యాచ్‌లో తలపడనున్నాయి. డర్బన్ వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 8:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉందని యాక్యూవెదర్ పేర్కొంది. మ్యాచ్ జరిగే సమయంలో ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని సమాచారం. మ్యాచ్ ప్రారంభ సమయానికి 46 శాతం వర్షం పడే సూచనలు ఉన్నట్లు యాక్యూవెదర్ తెలిపింది. మ్యాచ్ జరిగే సమయంలో ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్‌గా ఉండనున్నట్లు తెలుస్తుంది. రాత్రి 9:30 గంటల ప్రాంతంలో వర్షం పడే అవకాశాలు 51 శాతానికి పెరుగుతాయని సమాచారం. ఇవాళ ఉదయం నుంచి డర్బన్‌లో ఆకాశం మేఘావృతమై ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తంగా చూస్తే నేటి మ్యాచ్‌కు వర్షం అంతరాయాలు తప్పేలా లేవు.కాగా, భారత్-సౌతాఫ్రికా చివరి సారి టీ20 ప్రపంచకప్ ఫైనల్లో తలపడిన విషయం తెలిసిందే. నాటి ఫైనల్లో భారత్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి ఛాంపియన్‌గా అవతరించింది. పొట్టి ప్రపంచ కప్ అనంతరం భారత్ టీ20ల్లో తిరుగులేని జట్టుగా ఉంది. సూర్యకుమార్ నేతృత్వంలో టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతుంది. శ్రీలంకను వారి సొంతగడ్డపై మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో క్లీన్‌స్వీప్ చేసిన భారత్.. తాజాగా బంగ్లాదేశ్‌ను సైతం మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో క్లీన్ స్వీప్ చేసింది. దక్షిణాఫ్రికా విషయానికొస్తే.. ప్రొటీస్ జట్టు పసికూన ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్ టీ20 సిరీస్‌ను 1-1తో సమం చేసుకుంది. జట్ల బలాబలాల ప్రకారం చూస్తే.. ఇరు జట్లు సమతూకంగా కనిపిస్తున్నాయి. ఇరు జట్లలో స్టార్ హిట్లర్లు ఉన్నారు. దక్షిణాఫ్రికా జట్టులో క్లాసెన్, మిల్లర్, మార్క్రమ్ ఉండగా.. టీమిండియాలో సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా లాంటి భారీ హిట్టర్లు ఉన్నారు. ఐపీఎల్ మెగా వేలం నేపథ్యంలో ఈ సిరీస్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సిరీస్‌లో రాణించిన ఆటగాళ్లపై ఐపీఎల్ ఫ్రాంచైజీలు కన్నేసే అవకాశం ఉంది. కాబట్టి ఇరు జట్ల ఆటగాళ్లు పోటీపడి సత్తా చాటాలని భావిస్తారు. -
ఒకే జట్టుకు ఆడనున్న టీమిండియా- పాక్ ఆటగాళ్లు?
బెనోనీ (దక్షిణాఫ్రికా): సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి ఆఫ్రో–ఆసియా కప్ నిర్వహించే దిశగా చర్చలు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు రెండుసార్లు జరిగిన ఈ కప్‌ను పునరుద్ధరించాలని ఆఫిక్రా క్రికెట్ సంఘం (ఏసీఏ) ప్రయత్నాలు చేస్తోంది. దీనికి సంబంధించి ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీతో)తో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. 2005లో తొలిసారి దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన ఆఫ్రో ఆసియా కప్ ‘డ్రా’గా ముగియగా... 2007లో భారత్ వేదికగా జరిగిన టోర్నీలో ఆసియా జట్టు విజేతగా నిలిచింది. షెడ్యూల్ ప్రకారం 2009లో కెన్యా వేదికగా మూడో ఎడిషన్ జరగాల్సి ఉన్నా అది సాధ్యపడలేదు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఇప్పుడు మళ్లీ దీనిపై చర్చ జరుగుతోంది. ‘ఆఫ్రో–ఆసియా కప్ ద్వారా కేవలం ఆటే కాదు... రెండు సంఘాలకు ఆర్థికంగా ఎంతో ప్రయోజనం చేకూరుతుంది’ అని ఏసీఏ తాత్కాలిక చైర్మన్ తవెంగ్వా ముకులాని అన్నాడు. జింబాబ్వే క్రికెట్ సంఘం అధ్యక్షుడిగానూ పని చేస్తున్న తవెంగ్వా దీని కోసం చర్చలు జరుగుతున్నాయని వెల్లడించాడు. ‘ఆసియా క్రికెట్ కౌన్సిల్‌తో ఈ కప్ గురించి చర్చ జరుగుతుంది. ఆఫ్రికా వాసులంతా ఈ టోర్నీని తిరిగి తీసుకు రావాలని కోరుకుంటున్నారు’ అని తవెంగ్వా పేర్కొన్నాడు. 2005లో జరిగిన ఆఫ్రో–ఆసియా కప్‌లో ఆసియా జట్టుకు అప్పటి పాకిస్తాన్ సారథి ఇంజమాముల్ హక్ సారథిగా వ్యవహరించగా... భారత్ నుంచి రాహుల్ ద్రవిడ్, ఆశిష్ నెహ్రా, అనిల్ కుంబ్లే పాల్గొన్నారు. ఇక 2007 లో జరిగిన టోర్నీలో భారత్ నుంచి ధోనీ, సౌరవ్ గంగూలీ, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్, యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహా్వగ్, సచిన్ టెండూల్కర్ పాల్గొనగా... పాక్ జట్టు నుంచి మొహమ్మద్ యూసుఫ్, షోయబ్ అక్తర్, మొహమ్మద్ ఆసిఫ్ ప్రాతినిధ్యం వహించారు. ఈసారి ఆఫ్రో–ఆసియా కప్‌ను ఐపీఎల్ తరహాలో నిర్వహించాలని భావిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఎక్కడ నిర్వహించాలి, ఎప్పుడు నిర్వహించాలి, ఎలాంటి పద్ధతిలో ముందుకు వెళ్లాలి అనే దశ వరకు చర్చలు జరగనట్లు సమాచారం. కాగా... సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్‌తో భారత్ ద్వైపాక్షిక సిరీస్‌లే ఆడటం లేదు. అలాంటిది ఇప్పుడు ఇరు దేశాల ఆటగాళ్లు కలిసి ఒకే జట్టుకు ప్రాతినిధ్యం వహించడం అంటే అది అంత సులభం మాత్రం కాదు. -
'తల్లులు' డోంట్ వర్రీ!..ప్రసవానంతరం జస్ట్ 34 రోజుల్లోనే..!
మహిళలు ప్రసవానంతరం బరువు తగ్గడం అంత ఈజీ కాదు. బిడ్డను కన్న తర్వాత శరీరంలో వచ్చే మార్పులు కారణంగా బరువు తగ్గించుకోవడం అత్యంత సవాలుగా ఉంటుంది. ఇది చాలామంది తల్లులకు ఎదురయ్యే కఠిన సమస్య. అయితే దక్షిణాప్రికాకు చెందిన భారత సంతతి మహిళ మాత్రం ఈ సమస్యను అధిగమించి విజయవంతంగా బరువు తగ్గింది. అదికూడా 34 రోజుల వ్యవధిలోనే కేజీల కొద్దీ బరువు కోల్పోవడం విశేషం. ఆమె వెయిట్‌లాస్ జర్నీ ఎలా సాగిందంటే..దక్షిణాఫ్రికాకు చెందిన భారత సంతతి మహిళ రవిషా చిన్నప్ప వెయిట్ లాస్ జర్నీ ఎందరికో స్ఫూర్తినిస్తుంది. ఐవీఎఫ్ ద్వారా తల్లి అయిన రవిషా ప్రసవానంతరం అధిక బరువు సమస్యతో ఒక ఏడాదిపాటు చాలా ఇబ్బందులు పడింది. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ బరువులో పెద్దగా మార్పు కనిపించలేదు. ఇక డైట్లో సమర్థవంతమైన మార్పులు తీసుకొస్తేనే బెటర్ అని భావించింది. అందుకోసం ఓ 'త్రీ ట్రిక్స్'ని క్రమంతప్పకుండా అనుసరించింది. అవే ఆమె బరువును వేగంగా తగ్గించేలా చేయడంలో కీలకంగా ఉపయోగపడ్డాయి. అవేంటంటే..మొదటిది..శరీరం హైడ్రేటెడ్ ఉంచుకునేలా చూడటం..రవిషా తల్లిగా బిజీ అయిపోవడంతో హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడంపై దృష్టిసారించలేకపోయినట్లు పేర్కొంది. నిజానికి కొవ్వుని కరిగించే మార్గాలలో హైడ్రేషన్ ఒకటి. అందుకోసం రవిషా తన ఫోన్ టైమర్ సహాయంతో హైడ్రేటెడ్‌గా ఉండేలా చూసుకునేది. నిద్ర లేచినప్పటి నుంచి ప్రతి 90 నిమిషాలకు ఒకసారి టైమర్ ఆన్ అయ్యేలా సెట్ చేసింది వెంటనే 20 సిప్ల నీరు తాగేలా చూసేకునేది రవిషా. మన శరీర బరువులో సగం ఔన్సుల నీటిని తాగేలా ప్రయత్నిస్తే అది జీర్ణక్రియకు మద్దతు ఇవ్వడమే గాకుండా బరువు తగ్గించే ప్రయాణంలో కీలకంగా ఉంటుంది. రెండొవది ..ఆహారంలో మార్పులు..జీవనశైలిలో ఆహారాన్ని తీసుకునే విధానంలో కొద్దిపాటి మార్పులు చేసింది. ఎక్కువ ప్రొటీన్లు ఉండే ఆహారం తీసుకోవడంతో తియ్యటి పదార్థాలను తినాలనే కోరికను నియంత్రించుకుంది రవిషా. ప్రతిరోజూ కనీసం వంద గ్రాముల ప్రోటీన్‌ని ఉండేలా చూసుకునేది. ఇది దాదాపు 400 కేలరీలకు సమానం. ఒకరకంగా ఇది అనారోగ్యకరమైన ఆహారపదార్థాలు తినాలనే కోరికలను గణనీయంగా తగ్గించేలా చేయడమే గాక పోషకాలు అధికంగా ఉండే ఆహారాలపై దృష్టిసారించేలా చేస్తుందని చెబుతోంది రవిషా. మూడొవది..క్రమం తప్పకుండా తన బరువుని చెక్‌చేసుకోవడం సానుకూల దృక్పథంతో ముందుకు సాగడం వంటివి చేయాలి. ఎలాంటి ఒత్తిడికి, ఆందోళనలకి తావివ్వకుండా బరువు తగ్గేలా ఇంకేం చేయగలమో అనే దానిపై దృష్టిపెట్టడం, పాజిటివ్ మైండ్‌తో ఉండడం వంటివి చేయాలి. ముఖ్యంగా ప్రశాంతతకు ప్రాధాన్యత ఇవ్వాలి అంటోంది రవిషా. ఇక్కడ రవిషా బరువు తగ్గాలనే సంకల్పం తోపాటు ఎలాంటివి ఆహారాలు తీసుకుంటే శరీరానికి మంచిది అనేది తెలుసుకుని మరీ ఆచరణలో పెట్టింది. చివరగా పాజిటివ్ ఆటిట్యూడ్‌కి పెద్దపీట వేసింది. ఇవే ఆమెను ప్రసావానంతరం విజయవంతంగా బరువు తగ్గేలా చేశాయి.(చదవండి: భారతీయలు-అమెరికన్లు: ఆహారపు అలవాట్లలో ఇంత వ్యత్యాసమా..?) -
ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా టీ20 సిరీస్.. పూర్తి వివరాలు
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ నవంబర్ 8 నుంచి ప్రారంభం కానుంది. దక్షిణాఫ్రికా గడ్డపై జరుగనున్న ఈ సిరీస్‌లో పాల్గొనేందుకు టీమిండియా ఇప్పటికే అక్కడికి చేరుకుంది. ఈ సిరీస్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం. ఈ సిరీస్ కోసం ఇరు జట్లను ఇప్పటికే ప్రకటించారు. టీమిండియాను సూర్యకుమార్ యాదవ్ ముందుండి నడిపించనుండగా.. దక్షిణాఫ్రికాకు ఎయిడెన్ మార్క్రమ్ సారథ్యం వహించనున్నాడు.దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కోసం ఎంపికైన భారత్ జట్టు..సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), రింకూ సింగ్, తిలక్ వర్మ, జితేష్ శర్మ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రమణ్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, విజయ్‌కుమార్ విశాక్, అవేశ్ ఖాన్, యశ్ దయాల్భారత్తో టీ20లో సిరీస్‌లో తలపడే దక్షిణాఫ్రికా జట్టు..ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మన్, గెరాల్డ్ కొయెట్జీ, డోనోవన్ ఫెరీరా, రీజా హెండ్రిక్స్, మార్కో జన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, పాట్రిక్ క్రూగర్, కేశవ్ మహారాజ్, డేవిడ్ మిల్లర్, మిహ్లాలీ ఎంపోంగ్వానా, నకాబా పీటర్, ర్యాన్ రికెల్టన్, ఆండిల్ సిమెమెలన్, ట్రిస్టన్ స్టబ్స్, లుథే సిపామ్లాషెడ్యూల్..నవంబర్ 8- తొలి టీ20 (డర్బన్)నవంబర్ 10- రెండో టీ20 (గ్వెబెర్హా)నవంబర్ 13- మూడో టీ20 (సెంచూరియన్)నవంబర్ 15- నాలుగో టీ20 (జొహనెస్‌బర్గ్)మ్యాచ్ టైమింగ్స్..ఈ సిరీస్‌లోని నాలుగు మ్యాచ్‌లు భారతకాలమానం ప్రకారం రాత్రి 9.30 గంటలకు ప్రారంభమవుతాయి.లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే..?ఈ సిరీస్‌ను టీవీల్లో స్పోర్ట్స్ 18 ఛానళ్లలో వీక్షించవచ్చు. ఆన్లైన్లో చూడాలనుకుంటే జియో సినిమాలో ఉచితంగా చూడవచ్చు. -
బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించిన సౌతాఫ్రికా.. సిరీస్ కైవసం
బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను సౌతాఫ్రికా 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఇవాళ (అక్టోబర్ 31) ముగిసిన రెండో టెస్ట్‌లో సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 273 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. టెస్ట్‌ల్లో పరుగుల పరంగా సౌతాఫ్రికాకు ఇది భారీ విజయం. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 6 వికెట్ల నష్టానికి 575 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.టోనీ డి జోర్జీ (177), ట్రిస్టన్ స్టబ్స్ (106), వియాన్ ముల్దర్ (105 నాటౌట్) సెంచరీలతో కదంతొక్కారు. ఈ ముగ్గురికి కెరీర్లో (టెస్ట్) ఇవి తొలి సెంచరీలు. ఒకే ఇన్నింగ్స్‌లో ముగ్గురు ఆటగాళ్లు తొలి సెంచరీలు నమోదు చేయడం ప్రపంచ రికార్డు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో టోనీ, ట్రిస్టన్, ముల్దర్ సెంచరీలతో సత్తా చాటగా.. డేవిడ్ బెడింగ్హమ్ (59), సెనురన్ ముత్తుస్వామి (68 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించారు. బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లాం ఐదు వికెట్లు తీశాడు.అనంతరం బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. రబాడ దెబ్బకు (5/37) తొలి ఇన్నింగ్స్‌లో 159 పరుగులకే కుప్పకూలింది. డేన్ పీటర్సన్, కేశవ్ మహారాజ్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. ముత్తుస్వామి ఓ వికెట్ దక్కింది. బంగ్లా ఇన్నింగ్స్‌లో మొమినుల్ హాక్ (82), తైజుల్ ఇస్లాం (30), మహ్మదుల్ హసన్ జాయ్ (10) రెండంకెల స్కోర్లు చేశారు.దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు 416 పరుగులు వెనుకపడి ఫాలో ఆన్ ఆడిన బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లోనూ పేలవ ప్రదర్శన కనబర్చింది. ఆ జట్టు సెకెండ్ ఇన్నింగ్స్‌లో 143 పరుగులకే ఆలౌటై ఘోర ఓటమిని మూటగట్టుకుంది. దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్ ఐదు, ముత్తుస్వామి నాలుగు వికెట్లు, పాటర్సన్ ఓ వికెట్ పడగొట్టారు. బంగ్లా ఇన్నింగ్స్‌లో షాంటో (36), హసన్ మహమూద్ (38 నాటౌట్), ఇస్లాం అంకోన్ (29), మహ్మదుల్ హసన్ (11) రెండంకెల స్కోర్లు చేశారు. కాగా, ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.చదవండి: మళ్లీ ఐదేసిన రబాడ.. ఫాలో ఆన్ ఆడుతున్న బంగ్లాదేశ్ -
టీమిండియాతో టీ20 సిరీస్.. దక్షిణాఫ్రికా జట్టు ప్రకటన.. స్టార్ పేసర్లు రీ ఎంట్రీ
త్వరలో టీమిండియాతో జరుగబోయే నాలుగు మ్యాచ్‌ల టీ20 కోసం దక్షిణాఫ్రికా జట్టును ఇవాళ (అక్టోబర్ 31) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా ఎయిడెన్ మార్క్రమ్ ఎంపికయ్యాడు. గత కొంతకాలంగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న మార్కో జన్సెన్, గెరాల్డ్ కొయెట్జీ ఈ సిరీస్‌తో రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ సిరీస్ కోసం లుంగి ఎంగిడిని పరిగణలోకి తీసుకోలేదు. ఎంగిడిని త్వరలో శ్రీలంకతో జరుగబోయే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం రిజర్వ్‌గా ఉంచారు. సౌతాఫ్రికా యూఏఈలో ఆడిన వైట్‌బాల్ సిరీస్‌లకు దూరంగా ఉన్న హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, కేశవ్ మహారాజ్ 16 మంది సభ్యులతో కూడిన ఈ జట్టుకు ఎంపికయ్యారు. ఈ సిరీస్‌లో కగిసో రబాడ ఆడటం లేదు. సెలెక్టర్లు అతనికి విశ్రాంతినిచ్చారు. ఆల్‌రౌండర్ మిహ్లాలీ మ్పోంగ్వానా తొలిసారి జాతీయ జట్టుకు ఎంపిక కాగా.. అన్క్యాప్డ్ ఆల్‌రౌండర్ అండీల్ సైమ్‌లేన్ కూడా జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ సిరీస్‌లో నకాబా పీటర్ మరో స్పిన్ ఆప్షన్‌గా ఉన్నాడు. జాతీయ కాంట్రాక్ట్ దక్కని తబ్రేజ్ షంషిని సెలక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. ప్రస్తుతం బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న ఎయిడెన్ మార్క్రమ్, కేశవ్ మహారాజ్, ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్ నవంబర్ 4న మిగతా జట్టు సభ్యులతో కలుస్తారు.టీమిండియాతో టీ20 సిరీస్‌కు దక్షిణాఫ్రికా జట్టు: ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మన్, గెరాల్డ్ కోయెట్జీ, డోనోవన్ ఫెరీరా, రీజా హెండ్రిక్స్, మార్కో జన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, పాట్రిక్ క్రూగర్, కేశవ్ మహరాజ్, డేవిడ్ మిల్లర్, మిహ్లాలీ మ్పోంగ్వానా, నకాబా పీటర్, ర్యాన్ రికెల్టన్, అండీల్ సైమ్‌లేన్, లూథో సిపామ్లా, రిస్టన్ స్టబ్స్భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, రమన్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా, అభిషేక్ శర్మ, అక్షర్ పటేల్, సంజూ శాంసన్, జితేశ్ శర్మ, రవి బిష్ణోయ్, విజయ్‌కుమార్ వైశాఖ్, వరుణ్ చక్రవర్తి, అర్షదీప్ సింగ్, యశ్ దయాల్, ఆవేశ్ ఖాన్షెడ్యూల్..తొలి టీ20- నవంబర్ 8- డర్బన్రెండో టీ20- నవంబర్ 10- గ్వెబెర్హామూడో టీ20- నవంబర్ 13- సెంచూరియన్నాలుగో టీ20- నవంబర్ 15- జొహనెస్బర్గ్చదవండి: IND vs NZ 3rd Test: బుమ్రాకు విశ్రాంతి..? -
మళ్లీ ఐదేసిన రబాడ.. ఫాలో ఆన్ ఆడుతున్న బంగ్లాదేశ్
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో సౌతాఫ్రికా పేసర్ కగిసో రబాడ అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన సహా తొమ్మిది వికెట్లు పడగొట్టిన రబాడ, రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో మరో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. రబాడ విజృంభించడంతో రెండో టెస్ట్‌లో బంగ్లాదేశ్ ఫాలో ఆన్ ఆడుతుంది.Kagiso Rabada picks up his 16th Test five wicket haul. 🤯 pic.twitter.com/lXOXbVSF2v— Mufaddal Vohra (@mufaddal_vohra) October 31, 2024పూర్తి వివరాల్లోకి వెళితే.. చట్టోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో దక్షిణాఫ్రికా గెలుపు దిశగా సాగుతుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 6 వికెట్ల నష్టానికి 575 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. టోనీ డి జోర్జీ (177), ట్రిస్టన్ స్టబ్స్ (106), వియాన్ ముల్దర్ (105 నాటౌట్) సెంచరీలతో కదంతొక్కారు. ఈ ముగ్గురికి కెరీర్లో (టెస్ట్) ఇవి తొలి సెంచరీలు. ఒకే ఇన్నింగ్స్‌లో ముగ్గురు ఆటగాళ్లు తొలి సెంచరీలు నమోదు చేయడం ప్రపంచ రికార్డు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో టోనీ, ట్రిస్టన్, ముల్దర్ సెంచరీలతో సత్తా చాటగా.. డేవిడ్ బెడింగ్హమ్ (59), సెనురన్ ముత్తుస్వామి (68 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించారు. బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లాం ఐదు వికెట్లు తీశాడు.అనంతరం బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. రబాడ దెబ్బకు (5/37) తొలి ఇన్నింగ్స్‌లో 159 పరుగులకే కుప్పకూలింది. డేన్ పీటర్సన్, కేశవ్ మహారాజ్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. ముత్తుస్వామి ఓ వికెట్ దక్కింది. బంగ్లా ఇన్నింగ్స్‌లో మొమినుల్ హాక్ (82), తైజుల్ ఇస్లాం (30), మహ్మదుల్ హసన్ జాయ్ (10) రెండంకెల స్కోర్లు చేశారు. దక్షిణాఫ్రికా తోలి ఇన్నింగ్స్ స్కోర్‌కు 416 పరుగులు వెనుకపడి ఫాలో ఆన్ ఆడుతున్న బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లోనూ పేలవ ప్రదర్శన కనబరుస్తుంది. మూడో రోజు టీ విరామం సమయానికి ఆ జట్టు 4 వికెట్ల నష్టానికి కేవలం 43 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు బంగ్లాదేశ్ ఇంకా 373 పరుగులు వెనుకపడి ఉంది. -
ఐదేసిన తైజుల్ ఇస్లాం.. సౌతాఫ్రికా భారీ స్కోర్
చట్టోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో సౌతాఫ్రికా భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న ప్రొటీస్ రెండో రోజు లంచ్ విరామం సమయానికి 5 వికెట్ల నష్టానికి 413 పరుగులు చేసింది. టోనీ డి జోర్జీ (177), ట్రిస్టన్ స్టబ్స్ (106) సెంచరీలతో కదంతొక్కగా.. డేవిడ్ బెడింగ్హమ్ (59) అర్ద సెంచరీతో రాణించాడు. టోనీ, ట్రిస్టన్‌కు టెస్ట్‌ల్లో ఇవి తొలి శతకాలు. ర్యాన్ రికెల్టన్ (11), వియాన్ ముల్దర్ (12) క్రీజ్‌లో ఉన్నారు.ఐదేసిన తైజుల్ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా కోల్పోయిన ఐదు వికెట్లు బంగ్లా స్పిన్నర్ తైజుల్ ఇస్లాం ఖాతాలోకే వెళ్లాయి. తైజుల్ కెరీర్లో ఇది 14వ ఐదు వికెట్ల ఘనత. కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం సౌతాఫ్రికా బంగ్లాదేశ్‌లో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.తొలి టెస్ట్‌లో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 106 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 307 పరుగులు చేయగా.. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 308, ఛేదనలో 106 పరుగులు చేసి విజయం సాధించింది. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో కైల్ వెర్రిన్ (114) మెరుపు సెంచరీతో కదంతొక్కాడు. రబాడ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి తొమ్మిది వికెట్లు తీసి బంగ్లాదేశ్‌ను దెబ్బకొట్టాడు. -
టోనీ, ట్రిస్టన్ శతకాలు.. భారీ స్కోర్ దిశగా సౌతాఫ్రికా
చట్టోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో సౌతాఫ్రికా భారీ స్కోర్ దిశగా సాగుతోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 2 వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది. టోనీ డి జోర్జీ (141 నాటౌట్), ట్రిస్టన్ స్టబ్స్ (106) సెంచరీలతో కదంతొక్కారు. వీరిద్దరికీ టెస్ట్‌ల్లో ఇవి తొలి శతకాలు. ఎయిడెన్ మార్క్రమ్ (33) శుభారంభం లభించినప్పటికీ భారీ స్కోర్‌గా మలచలేకపోయాడు. టోనీ డి జోర్జీతో పాటు డేవిడ్ బెడింగ్హమ్ (18) క్రీజ్‌లో ఉన్నాడు. సౌతాఫ్రికా కోల్పోయిన రెండు వికెట్లు తైజుల్ ఇస్లాంకు దక్కాయి. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం సౌతాఫ్రికా బంగ్లాదేశ్‌లో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 106 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 307 పరుగులు చేయగా.. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 308, ఛేదనలో 106 పరుగులు చేసి విజయం సాధించింది. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో కైల్ వెర్రిన్ (114) మెరుపు సెంచరీతో కదంతొక్కాడు. రబాడ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి తొమ్మిది వికెట్లు తీసి బంగ్లాదేశ్‌ను దెబ్బకొట్టాడు. -
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాక్‌కు ఊహించని షాక్..!
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాకిస్తాన్ జట్టుకు ఊహించని షాక్ తగలనున్నట్లు తెలుస్తుంది. ఆ జట్టు హెడ్ కోచ్ పదవి(పరిమిత ఓవర్లు) నుంచి గ్యారీ కిర్‌స్టన్ తప్పుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయమై ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ.. ఈ వార్త సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. త్వరలో పాక్ పరిమిత ఓవర్ల జట్లు ఆస్ట్రేలియా, జింబాబ్వే పర్యటనలకు వెళ్లనుండగా.. కిర్‌స్టన్ జట్లతో పాటు ఆయా దేశాలకు వెళ్లడం లేదని తెలుస్తుంది. కిర్‌స్టన్ పాక్ హెడ్ కోచ్ పదవి నుంచి వైదొలగడానికి ఆటగాళ్లతో ఏర్పడిన విభేదాలు కారణమని సమాచారం. మరోవైపు కిర్‌స్టన్ పాక్ హై పెర్ఫార్మెన్ కోచ్‌గా డేవిడ్ రీడ్‌ను నియమించాలని పాక్ క్రికెట్ బోర్డును కోరగా, అందుకు పీసీబీ ఒప్పుకోలేదని తెలుస్తుంది. కిర్‌స్టన్ వైదొలగడానికి ఇదీ ఒక కారణమని సమాచారం. కిర్‌స్టన్ పాక్ పరిమిత ఓవర్ల హెడ్ కోచ్‌గా ఎంపికై కేవలం నాలుగు నెలలే అవుతుంది. ఈ లోపే అతనికి బోర్డుకు మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడినట్లు తెలుస్తుంది. మరో నాలుగు నెలల్లో పాక్‌లోనే ఛాంపియన్స్ ట్రోఫీ జరుగనుంది. ఈ లోపు కిర్‌స్టన్ నిజంగా హెడ్ కోచ్ పదవి నుంచి వైదొలిగితే అది పాక్ జట్టుకు నష్టం వాటిల్లేలా చేస్తుంది. ఒకవేళ కిర్‌స్టన్ పాక్ హెడ్ కోచ్ పదవి నుంచి వైదొలిగితే అతని స్థానాన్ని టెస్ట్ జట్టు హెడ్ కోచ్ జేసన్ గిల్లెస్సీ లేదా జతీయ సెలెక్టర్ ఆకిబ్ జావిద్ భర్తీ చేసే అవకాశం ఉంది.కాగా, త్వరలో ఆస్ట్రేలియా, జింబాబ్వేలతో జరుగనున్న పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం పాక్ జట్లను నిన్న ప్రకటించారు. పాక్ క్రికెట్ బోర్డు తమ పరిమిత ఓవర్ల జట్ల కెప్టెన్‌గా మహ్మద్ రిజ్వాన్‌ను నియమించింది. పాక్ పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి బాబార్ ఆజమ్ ఇటీవలే తప్పుకున్నాడు. -
సౌతాఫ్రికా టీ20 ఛాలెంజ్ విజేతగా లయన్స్
క్రికెట్ సౌతాఫ్రికా టీ20 ఛాలెంజ్ విజేతగా లయన్స్ జట్టు ఆవిర్భవించింది. నిన్న (అక్టోబర్ 27) జరిగిన ఫైనల్లో లయన్స్.. టైటాన్స్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టైటాన్స్ 19.2 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌటైంది. క్లాసెన్ (13), ఫెరియరా (0) లాంటి భారీ హిట్టర్లు ఉన్న టైటాన్స్.. లయన్స్ బౌలర్ల దెబ్బకు కుదేలైంది. టైటాన్స్ ఇన్నింగ్స్‌లో గెరాల్డ్ కొయెట్జీ (20) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సిపామ్లా (4-0-12-4), మపాకా (4-0-15-2), ఫోర్టుయిన్ (3-0-10-2) టైటాన్స్‌ను దెబ్బకొట్టారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన లయన్స్ 15.1 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. రస్సీ వాన్ డెర్ డస్సెన్ (44 నాటౌట్), కాన్నర్ ఎస్టర్‌హ్యుజెన్ (48 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి లయన్స్‌ను గెలిపించారు. లయన్స్ ఇన్నింగ్స్‌లో జుబేర్ హమ్జా 20, రీజా హెండ్రిక్స్ 4 పరుగులు చేసి ఔటయ్యారు. టైటాన్స్ బౌలర్లలో గేలియమ్, గెరాల్డ్ కొయెట్జీ తలో వికెట్ పడగొట్టారు. సీఎస్ఏ టీ20 ఛాలెంజ్‌లో లయన్స్‌ను ఇది ఐదో టైటిల్. -
రఫ్ఫాడించిన రబాడ.. సౌతాఫ్రికా ఘన విజయం
ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో పర్యాటక సౌతాఫ్రికా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 106, రెండో ఇన్నింగ్స్‌లో 307 పరుగులు చేయగా.. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 308, ఛేదనలో 3 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసి విజయతీరాలకు చేరింది. సౌతాఫ్రికా పేసర్ రబాడ మ్యాచ్ మొత్తంలొ తొమ్మిది వికెట్లు తీసి బంగ్లా ఓటమికి ప్రధాన కారకుడయ్యాడు. కైల్ వెర్రిన్ తొలి ఇన్నింగ్స్‌లో సూపర్ సెంచరీ (114) తమ జట్టు గెలుపుకు పునాది వేశాడు.కుప్పకూలిన బంగ్లాదేశ్తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 106 పరుగులకు ఆలౌటైంది. రబాడ, వియాన్ ముల్దర్, కేశవ్ మహారాజ్ తలో మూడు వికెట్లు, డీన్ పైడిట్ ఓ వికెట్ తీసి బంగ్లా ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. బంగ్లా ఇన్నింగ్స్‌లో మహ్మదుల్ హసన్ (30), తైజుల్ ఇస్లాం (16), మెహిది హసన్ మిరాజ్ (13), ముష్ఫికర్ రహీం (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.వెర్రిన్ సూపర్ సెంచరీఅనంతరం సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 308 పరుగులకు ఆలౌటైంది. కైల్ వెర్రిన్ సూపర్ సెంచరీతో (114) తన జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ముల్దర్ హాఫ్ సెంచరీతో (54) రాణించాడు. బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లాం ఐదు వికెట్లు పడగొట్టగా.. హసన్ మహమూద్ 3, మెహిది హసన్ మిరాజ్ 2 వికెట్లు దక్కించుకున్నారు.సెంచరీ చేజార్చుకున్న మిరాజ్202 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ ఈ ఇన్నింగ్స్‌లో 307 పరుగులకు ఆలౌటైంది. తద్వారా సౌతాఫ్రికా ముందు 106 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. బంగ్లా బ్యాటర్ మెహిది హసన్ మిరాజ్ (97) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. రబాడ ఆరు వికెట్లు తీసి బంగ్లా పతనాన్ని శాశించాడు. కేశవ్ మహారాజ్ 3, ముల్దర్ ఓ వికెట్ పడగొట్టారు.చదవండి: IND vs NZ 2nd Test: అశ్విన్ మ్యాజిక్.. కెప్టెన్ ఔట్ -
ఆరేసిన రబాడ.. సౌతాఫ్రికా టార్గెట్ 106
ఢాకా వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఓటమి దిశగా సాగుతోంది. సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 307 పరుగులకు ఆలౌటైంది. తద్వారా సౌతాఫ్రికా ముందు 106 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. నాలుగో రోజు ఆట ప్రారంభమైన కొంత సేపటికే బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ ముగిసింది. ఓవర్‌నైట్ బ్యాటర్ మెహిది హసన్ మిరాజ్ తన వ్యక్తిగత స్కోర్‌కు మరో 10 పరుగులు జోడించి 97 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఓవర్‌నైట్ స్కోర్‌కు (283/7) బంగ్లాదేశ్ మరో 24 పరుగులు జోడించి మిగతా మూడు వికెట్లు కోల్పోయింది. రబాడ ఆరు వికెట్లు తీసి బంగ్లా పతనాన్ని శాశించాడు. కేశవ్ మహారాజ్ 3, ముల్దర్ ఓ వికెట్ పడగొట్టారు.అంతకుముందు సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 308 పరుగులకు ఆలౌటైంది. కైల్ వెర్రిన్ సూపర్ సెంచరీతో (114) తన జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ముల్దర్ హాఫ్ సెంచరీతో (54) రాణించాడు. బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లాం ఐదు వికెట్లు పడగొట్టగా.. హసన్ మహమూద్ 3, మెహిది హసన్ మిరాజ్ 2 వికెట్లు దక్కించుకున్నారు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 106 పరుగులకు ఆలౌటైంది. రబాడ, వియాన్ ముల్దర్, కేశవ్ మహారాజ్ తలో మూడు వికెట్లు, డీన్ పైడిట్ ఓ వికెట్ తీసి బంగ్లా ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. బంగ్లా ఇన్నింగ్స్‌లో మహ్మదుల్ హసన్ (30), తైజుల్ ఇస్లాం (16), మెహిది హసన్ మిరాజ్ (13), ముష్ఫికర్ రహీం (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. చదవండి: స్కై, విరాట్లను అధిగమించిన సికందర్ రజా -
బంగ్లాదేశ్ గడ్డపై సరికొత్త చరిత్ర
సౌతాఫ్రికా వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ కైల్ వెర్రిన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. బంగ్లాదేశ్ గడ్డపై టెస్ట్‌ల్లో సెంచరీ చేసిన తొలి సౌతాఫ్రికా వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. మ్యాచ్ రెండో రోజు సందర్భంగా వెర్రిన్ ఈ ఘనతను సాధించాడు. బంగ్లా గడ్డపై గతంలో ఏ దక్షిణాఫ్రికా వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ టెస్ట్‌ల్లో సెంచరీ చేయలేదు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో వెర్రిన్ 144 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 114 పరుగులు చేశాడు. ఫలితంగా ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా పటిష్ట స్థితికి చేరింది.మ్యాచ్ విషయానికొస్తే.. వెర్రిన్ సూపర్ సెంచరీతో చెలరేగడంతో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 308 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లాం ఐదు వికెట్లు తీశాడు. అంతకుముందు బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 101 పరుగులకు ఆలౌటైంది.202 పరుగులు వెనుకపడి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. బంగ్లాదేశ్.. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 101 పరుగుల వెనుకంజలో ఉంది. బంగ్లా సెకెండ్ ఇన్నింగ్స్‌లో షద్మాన్ ఇస్లాం (1), మొమినుల్ హక్ (0), నజ్ముల్ హసన్ షాంటో (23) ఔట్ కాగా.. మహ్మదుల్ హసన్ జాయ్ (38), ముష్ఫికర్ రహీం (31) క్రీజ్‌లో ఉన్నారు. సౌతాఫ్రికా బౌలర్లలో రబాడ రెండు, కేశవ్ మహారాజ్ ఓ వికెట్ పడగొట్టారు. రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం సౌతాఫ్రికా బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.చదవండి: గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ మెంటార్‌గా టీమిండియా మాజీ ప్లేయర్ -
చరిత్ర సృష్టించిన ముష్ఫికర్ రహీం.. తొలి బంగ్లాదేశ్ క్రికెటర్‌గా రికార్డు
బంగ్లాదేశ్ వెటరన్ బ్యాటర్ ముష్ఫికర్ రహీం సరికొత్త చరిత్ర సృష్టించాడు. టెస్ట్‌ల్లో బంగ్లాదేశ్ తరఫున 6000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్ సందర్భంగా రహీం ఈ ఘనత సాధించాడు. రహీం 172 ఇన్నింగ్స్‌ల్లో 38.24 సగటున 6003* పరుగులు సాధించాడు. బంగ్లా తరఫున టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రహీం తర్వాత తమీమ్ ఇక్బాల్ (5134), షకీబ్ అల్ హసన్ (4609), మొమినుల్ హక్ (4269), హబీబుల్ బషార్ (3026) ఉన్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. సౌతాఫ్రికాతో తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో ముష్ఫికర్ రహీం 31 పరుగులతో అజేయంగా ఉన్నాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి రహీంతో పాటు మహ్మదుల్ హసన్ జాయ్ (38) క్రీజ్‌లో ఉన్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 106 పరుగులకే కుప్పకూలిన బంగ్లాదేశ్.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు బంగ్లాదేశ్ ఇంకా 101 పరుగులు వెనుకపడి ఉంది.అంతకుముందు సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 308 పరుగులకు ఆలౌటైంది. వికెట్‌కీపర్ కైల్ వెర్రిన్ సూపర్ సెంచరీతో (114) సౌతాఫ్రికాకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. వెర్రిన్‌కు వియాన్ ముల్దర్ (54), డీన్ పైడిట్ (32) సహకరించారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో టోనీ డి జోర్జీ (30), ర్యాన్ రికెల్టన్ (27), ట్రిస్టన్ స్టబ్స్ (23) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లాం ఐదు వికెట్లు తీయగా.. హసన్ మహమూద్ 3, మెహిది హసన్ మిరాజ్ 2 వికెట్లు పడగొట్టారు.చదవండి: సౌతాఫ్రికాతో తొలి టెస్ట్.. కష్టాల్లో బంగ్లాదేశ్ -
సౌతాఫ్రికాతో తొలి టెస్ట్.. కష్టాల్లో బంగ్లాదేశ్
ఢాకా వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో బంగ్లాదేశ్ ఎదురీదుతుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. బంగ్లాదేశ్.. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 101 పరుగుల వెనుకంజలో ఉంది. బంగ్లా సెకెండ్ ఇన్నింగ్స్‌లో షద్మాన్ ఇస్లాం (1), మొమినుల్ హక్ (0), నజ్ముల్ హసన్ షాంటో (23) ఔట్ కాగా.. మహ్మదుల్ హసన్ జాయ్ (38), ముష్ఫికర్ రహీం (31) క్రీజ్‌లో ఉన్నారు. రబాడ సెకెండ్ ఇన్నింగ్స్‌లోనూ బంగ్లా బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. నాలుగు పరుగుల వద్ద రబాడ.. షద్మాన్ ఇస్లాం, మొమినుల్ హక్ వికెట్లు పడగొట్టాడు. షాంటో వికెట్ కేశవ్ మహారాజ్‌కు దక్కింది.అంతకుముందు సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 308 పరుగులకు ఆలౌటైంది. వికెట్‌కీపర్ కైల్ వెర్రిన్ సూపర్ సెంచరీతో (114) సౌతాఫ్రికాకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. వెర్రిన్‌కు వియాన్ ముల్దర్ (54), డీన్ పైడిట్ (32) సహకరించారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో టోనీ డి జోర్జీ (30), ర్యాన్ రికెల్టన్ (27), ట్రిస్టన్ స్టబ్స్ (23) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లాం ఐదు వికెట్లు తీయగా.. హసన్ మహమూద్ 3, మెహిది హసన్ మిరాజ్ 2 వికెట్లు పడగొట్టారు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. సఫారీ బౌలర్ల ధాటికి 106 పరుగులకే ఆలౌటైంది. రబాడ, వియాన్ ముల్దర్, కేశవ్ మహారాజ్ తలో మూడు వికెట్లు, డీన్ పైడిట్ ఓ వికెట్ తీసి బంగ్లా ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. బంగ్లా ఇన్నింగ్స్‌లో మహ్మదుల్ హసన్ (30), తైజుల్ ఇస్లాం (16), మెహిది హసన్ మిరాజ్ (13), ముష్ఫికర్ రహీం (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం సౌతాఫ్రికా బంగ్లాదేశ్‌లో పర్యటిస్తుంది.చదవండి: Sarfaraz vs KL Rahul: గిల్ రాక.. ఎవరిపై వేటు? కోచ్ ఆన్సర్ ఇదే -
సౌతాఫ్రికాతో టెస్ట్ మ్యాచ్.. ఐదు వికెట్లు తీసిన బంగ్లా బౌలర్.. అరుదైన క్లబ్లో చేరిక
ఢాకా వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ స్పిన్నర్ తైజుల్ ఇస్లాం ఐదు వికెట్ల ప్రదర్శనతో మెరిశాడు. ఈ మ్యాచ్‌లో తైజుల్ 13 ఓవర్లలో 47 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీశాడు. ఈ ప్రదర్శనతో తైజుల్ అరుదైన 200 వికెట్ల క్లబ్లో చేరాడు. తైజుల్ 85 ఇన్నింగ్స్‌ల్లో 201 వికెట్లు పడగొట్టాడు. బంగ్లా తరఫున 200 వికెట్ల క్లబ్లో చేరిన రెండో బౌలర్ తైజుల్. తైజుల్‌కు ముందు షకీబ్ అల్ హసన్ (121 ఇన్నింగ్స్‌ల్లో 246 వికెట్లు) ఈ ఘనత సాధించాడు.బంగ్లాదేశ్ తరఫున టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు..షకీబ్ అల్ హసన్-121 ఇన్నింగ్స్‌ల్లో 246 వికెట్లుతైజుల్ ఇస్లాం- 85 ఇన్నింగ్స్‌ల్లో 201 వికెట్లుమెహిది హసన్ మిరాజ్- 83 ఇన్నింగ్స్‌ల్లో 183 వికెట్లుమొహమ్మద్ రఫీక్- 48 ఇన్నింగ్స్‌ల్లో 100 వికెట్లుముషరఫే మొర్తజా- 51 ఇన్నింగ్స్‌ల్లో 78 వికెట్లుషహాదత్ హొసేన్- 60 ఇన్నింగ్స్‌ల్లో 72 వికెట్లుమ్యాచ్ విషయానికొస్తే.. ఇవాళే మొదలైన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 106 పరుగులకే కుప్పకూలింది. కగిసో రబాడ (3/26), వియాన్ ముల్దర్(3/22), కేశవ్ మహారాజ్ (3/34), డేన్ పీడెట్ (1/19) బంగ్లా పతనాన్ని శాశించారు. బంగ్లా ఇన్నింగ్స్‌లో మహ్మదుల్ హసన్ జాయ్ (30), తైజుల్ ఇస్లాం (16), మెహిది హసన్ మిరాజ్ (13), ముష్ఫికర్ రహీం (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా 40 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. బంగ్లా బౌలర్లలో తైజుల్ ఐదు, హసన్ మహమూద్ ఓ వికెట్ పడగొట్టారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో మార్క్రమ్ (6), టోనీ డి జోర్జీ (30), ట్రిస్టన్ స్టబ్స్ (23), డేవిడ్ బెడింగ్హమ్ (11), ర్యాన్ రికెల్టన్ (27), మాథ్యూ బ్రీట్జ్కీ (0) ఔట్ కాగా.. కైల్ వెర్రిన్ (18), వియాన్ ముల్దర్ (17) క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం సౌతాఫ్రికా 34 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. చదవండి: రెచ్చిపోయిన లంక బ్యాటర్లు.. విండీస్ ఖాతాలో మరో పరాజయం -
వరల్డ్ ఛాంపియన్స్‌గా న్యూజిలాండ్.. ప్రైజ్ మనీ ఎన్ని కోట్లంటే?
మహిళల టీ20 వరల్డ్‌కప్-2024 ఛాంపియన్స్‌గా న్యూజిలాండ్ అవతరించింది. ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాను 32 పరుగుల తేడాతో చిత్తు చేసిన న్యూజిలాండ్ మహిళల జట్టు.. తొలిసారి ప్రపంచకప్ టైటిల్‌ను ముద్దాడింది.గత 15 ఏళ్లగా ఊరిస్తున్న పొట్టివరల్డ్కప్ టైటిల్‌ను ఎట్టకేలకు వైట్ ఫెర్న్స్ తమ సొంతం చేసుకుంది. మరోవైపు దక్షిణాఫ్రికా తలరాత మారలేదు. పురుషుల జట్టు మాదిరిగానే మరోసారి సౌతాఫ్రికా అమ్మాయిలు కూడా ఆఖరి మెట్టుపై బోల్తా పడ్డారు. తొలిసారి వరల్డ్‌కప్ టైటిల్‌ను ముద్దాడాలనుకున్న దక్షిణాఫ్రికా కల మాత్రం నేరవేరలేదు. ఏదమైనప్పటి అద్బుత పోరాటంతో ఫైనల్ వరకు వచ్చిన సౌతాఫ్రికాపై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక టీ20 వరల్డ్‌కప్-2024 ముగిసిన నేపథ్యంలో విజేత, రన్నరప్ సహా ఈ టోర్నీలో పాల్గొన్న జట్లకు ఎంత మేర ప్రైజ్ మనీ దక్కిందన్న అంశాన్ని పరిశీలిద్దాం.విజేతకు ఎంతంటే?అయితే ఐసీసీ ఈ ప్రపంచకప్ నుంచి పురుషులు, మహిళల ప్రైజ్ మనీ సమానంగా పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఛాంపియన్ న్యూజిలాండ్‌కు 2.34 మిలియన్ డాలర్లు( భారత కరెన్సీలో సుమారు రూ.19.67 కోట్లు) బహుమతి లభించింది.►అదే విధంగా గ్రూపు దశలో నాలుగింటికి మూడు మ్యాచ్‌లు గెలిచిన డివైన్ బృందానికి ఛాంపియన్‌గా అందుకున్న మొత్తంతో పాటు అదనంగా రూ. 78 లక్షలు ముట్టింది. అంటే న్యూజిలాండ్ మొత్తంగా ప్రైజ్‌మనీ రూపంలో రూ.20.45 కోట్లు దక్కనుంది.గ్రూప్ దశలో ఒక మ్యాచ్ గెలిచిన ప్రతి జట్టుకు రూ. 26.19 లక్షల నగదు బహుమతి అందింది. ఈ క్రమంలోనే న్యూజిలాండ్‌కు భారీగా ప్రైజ్ మనీ లభించింది.రన్నరప్‌కు ఎంతంటే?►రన్నరప్ దక్షిణాఫ్రికాకు 1.17 మిలియన్ డాలర్లు (రూ. 9. 83 కోట్లు). అంతేకాకుండా లీగ్ స్టేజీలో 3 మ్యాచ్‌లు గెలిచిన సౌతాఫ్రికాకు రూ. 78 లక్షలు ఇందుకు అదనంగా లభించాయి. దీంతో మొత్తంగా సూమారు రూ.10.62 కోట్ల నగదు బహుమతిని దక్షిణాఫ్రికా అమ్మాయిలు అందుకున్నారు.సెమీస్ చేరిన జట్లకు ఎంత ముట్టిందంటే?►గ్రూపు-ఎ నుంచి ఆస్ట్రేలియా, గ్రూపు-బి నుంచి వెస్టిండీస్ సెమీ ఫైనలిస్టులుగా అందుకున్న మొత్తం చెరో 5.67 కోట్ల రూపాయలు.►ఇక లీగ్ స్టేజీలో నాలుగింటికి 4 మ్యాచ్‌లు గెలిచిన ఆసీస్‌కు అదనంగా దక్కిన మొత్తం 1.4 కోట్ల రూపాయలు.►అదే విధంగా గ్రూపు స్టేజిలో మూడు మ్యాచ్‌లు గెలిచిన విండీస్‌కు కు దక్కిన మొత్తం...రూ. 78 లక్షలు.►ఇక గ్రూపు స్టేజిలోనే ఇంటిముఖం పట్టిన భారత్‌కు కేవలం రూ. 52 లక్షలు మాత్రమే దక్కింది. ఎందుకంటే లీగ్ స్టేజీలో భారత్ కేవలం రెండు మ్యాచ్‌లే గెలిచింది. 👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
W T20 WC 2024: కొత్త చాంపియన్ న్యూజిలాండ్
ఒక జట్టు తలరాత మారలేదు. పురుషులు, మహిళల జట్టేదైనా కావొచ్చు కానీ... దక్షిణాఫ్రికా ఐసీసీ ప్రపంచకప్ భాగ్యానికి మాత్రం నోచుకోలేదు. మరో‘సారీ’ చోకర్స్గానే మిగిలారు. మరో జట్టు కొత్త చరిత్ర లిఖించింది. ఇన్నేళ్లయినా న్యూజిలాండ్ పురుషుల జట్టు సాధించలేకపోయిన వరల్డ్‌కప్ (వన్డే, టి20) టైటిల్స్‌ను న్యూజిలాండ్ మహిళల జట్టు (2000లో వన్డే) సాధించి ఔరా అనిపించింది. దుబాయ్: దక్షిణాఫ్రికాను చూస్తే ఎవరైనా అయ్యో పాపం అనక మానరు! సరిగ్గా నాలుగు నెలల కిందట టీమిండియా చేతిలో పురుషుల జట్టు, ఇప్పుడేమో న్యూజిలాండ్ చేతిలో మహిళల దక్షిణాఫ్రికా టీమ్ ఫైనల్లో పరాజయంతో ప్రపంచకప్ కలను కలగానే మిగిల్చుకున్నాయి. సఫారీకిది తీరని వ్యథే! మరీ ముఖ్యంగా అమ్మాయిలకైతే గతేడాది సొంతగడ్డపై, ఇప్పుడు దుబాయ్‌లో వరుసగా రన్నరప్ ట్రోఫీనే దిక్కయింది. మహిళల టి20 ప్రపంచకప్‌లో ఆదివారం జరిగిన టైటిల్ పోరులో న్యూజిలాండ్ కొత్త విశ్వవిజేతగా అవతరించింది. అమీతుమీలో కివీస్ జట్టు 32 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై నెగ్గింది. మూడో ప్రయత్నంలో టి20 ప్రపంచకప్‌ను దక్కించుకుంది. 2009, 2010లలో న్యూజిలాండ్ ఫైనల్లో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. విజేత న్యూజిలాండ్ జట్టుకు 23 లక్షల 40 వేల (రూ. 19 కోట్ల 67 లక్షలు) డాలర్లు, రన్నరప్ దక్షిణాఫ్రికా జట్టుకు 11 లక్షల 70 వేల డాలర్లు (రూ. 9 కోట్ల 83 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. టాపార్డర్ బ్యాటర్ అమెలియా కెర్ (43; 4 ఫోర్లు), ఓపెనర్ సుజీ బేట్స్ (32; 3 ఫోర్లు), మిడిలార్డర్లో బ్రూక్ హ్యాలిడే (28 బంతుల్లో 38; 3 ఫోర్లు) మెరుగ్గా ఆడారు. ప్రత్యర్థి బౌలర్లలో ఎమ్‌లాబా 2 వికెట్లు తీయగా, అయబొంగ, ట్రియాన్, డి క్లెర్క్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 126 పరుగులే చేసి ఓడిపోయింది. ఓపెనర్లు కెపె్టన్ లౌరా వోల్వార్ట్ (33; 5 ఫోర్లు), తజ్మిన్ బ్రిట్స్ (17; 1 ఫోర్) 6.5 ఓవర్లలో 51 పరుగులు చేసి శుభారంభమిచ్చారు. ఇక మిగిలిన 13.1 ఓవర్లలో 108 పరుగులు చేస్తే కప్ గెలిచేసేది. కానీ అదే స్కోరుపై బ్రిట్స్, కాసేపటికి లౌరా అవుట్ కావడంతోనే అంతా మారిపోయింది. తర్వాత వచ్చిన అనెకె (9), మరిజాన్ (8), డి క్లెర్క్ (6), ట్రియాన్ (14), సునె లుస్ (8), డెర్క్సెన్ (10) కివీ బౌలర్ల ధాటికి బెంబేలెత్తారు. రోజ్మేరీ, అమెలియా కెర్ చెరో 3 వికెట్లు తీశారు. కెర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, సిరీస్’ అవార్డులు దక్కాయి. -
నేడే ఫైనల్: దక్షిణాఫ్రికా Vs న్యూజిలాండ్
దుబాయ్: ఒక వైపు న్యూజిలాండ్ 14 ఏళ్ల తర్వాత ఫైనల్ చేరి తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది... మరో వైపు దక్షిణాఫ్రికా వరుసగా రెండో సారి తుది పోరుకు అర్హత సాధించి ఈ సారైనా కప్‌ను ఒడిసి పట్టుకోవాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో మహిళల టి20 వరల్డ్ కప్‌కు రంగం సిద్ధమైంది. నేడు జరిగే పోరులో సఫారీ టీమ్‌తో కివీస్ తలపడనుంది. ఈ వరల్డ్ కప్ లీగ్ దశలో రెండు జట్ల ప్రస్థానం దాదాపు ఒకే తరహాలో సాగింది. ఇరు జట్లు చెరో 3 విజయాలు సాధించి లీగ్ దశలో తమ గ్రూప్‌నుంచి రెండో స్థానంలోనే నిలిచి సెమీస్‌కు అర్హత సాధించాయి. ఆరు సార్లు చాంపియన్ ఆ్రస్టేలియాను ఓడించి దక్షిణాఫ్రికా ముందంజ వేయగా...మరో మాజీ చాంపియన్ వెస్టిండీస్‌పై పైచేయి సాధించి కివీస్ ఫైనల్ చేరింది. సుదీర్ఘ కాలంగా మహిళల క్రికెట్లో తిరుగులేని ఆధిపత్యం కనబరుస్తున్న ఆ్రస్టేలియా, తమదైన రీతిలో క్రికెట్‌కు చిరునామాగా ఉన్న ఇంగ్లండ్లను దాటి రెండు కొత్త జట్లు ఇప్పుడు ఆటపై కొత్త ముద్ర వేసేందుకు ఈ ఫైనల్ సరైన వేదిక కానుంది. ఎవరు గెలిచినా కొత్త చాంపియన్ అవుతారనే విషయమే మహిళల క్రికెట్లో ఆసక్తిని రేపుతోంది. సమ ఉజ్జీల్లాంటి రెండు టీమ్‌ల మధ్య ఫైనల్ ఎంత హోరాహోరీగా సాగుతుందనేది చూడాలి. ఇరు జట్లనుంచి అగ్రశ్రేణి క్రికెటర్లుగా ఎదిగిన సోఫీ డివైన్, సుజీ బేట్స్, మరిజాన్ కాప్లలో ఎవరికి వరల్డ్ కప్ చిరస్మరణీయంగా మారుతుందనేది ఆసక్తికరం. 2010లో ఫైనల్ ఆడిన కివీస్ జట్టులో డివైన్ సభ్యురాలిగా ఉంది. ఆమెతో పాటు అమేలియా కెర్, ప్లిమ్మర్, తహుహు, కార్సన్, రోజ్మేరీలపై జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. దక్షిణాఫ్రికా టీమ్‌లో బేట్స్, కాప్‌లతో పాటు కెపె్టన్ లారా వోల్వార్ట్, తజ్మీన్, ఎమ్‌లాబా కీలకం కానున్నారు. ఈ మ్యాచ్‌లోకి బరిలోకి దిగడం ద్వారా మహిళల క్రికెట్లో అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన మిథాలీ రాజ్ (333) రికార్డును బేట్స్ సవరించనుంది. సెమీస్‌లో అర్ధసెంచరీతో ఆసీస్ పని పట్టిన అనెక్ బాష్ మరో మంచి ఇన్నింగ్స్ ఆడాలని పట్టుదలగా ఉంది. తుది జట్లలో ఎలాంటి మార్పు చేయకుండా సెమీస్ ఆడిన టీమ్‌లనే కొనసాగించే అవకాశం ఉంది. దుబాయ్‌లో వాతావరణం అన్ని రకాలుగా అనుకూలంగా ఉంది. టోర్నీలో ఒక్కసారి కూడా వాన వల్ల మ్యాచ్‌లకు అంతరాయం కలగలేదు. మంచు సమస్య కూడా లేదు కాబట్టి స్పిన్నర్లు మంచి ప్రభావం చూపగలరు. -
W T20 WC: ఆసీస్ చిత్తు.. వరల్డ్‌కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికా ధమాకా
దుబాయ్: ఆరుసార్లు చాంపియన్ ఆస్ట్రేలియా జట్టుకు మహిళల టి20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా షాక్ ఇచ్చింది. గురువారం జరిగిన తొలి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా 8 వికెట్ల తేడాతో ఆసీస్‌ను బోల్తా కొట్టించింది. తద్వారా సొంతగడ్డ (దక్షిణాఫ్రికా 2023)పై జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంది. ఇప్పటివరకు ఎనిమిది సార్లు మెగా టోర్నీ జరిగితే ఏడుసార్లు ఫైనల్ చేరిన ఆ్రస్టేలియా జట్టును ఈసారి దక్షిణాఫ్రికా టైటిల్ పోరుకు దూరం చేసింది. ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. బెత్ మూనీ (44; 2 ఫోర్లు), ఎలీస్ పెరీ (31; 2 ఫోర్లు), కెపె్టన్ తాలియా మెక్‌గ్రాత్ (27; 3 ఫోర్లు) రాణించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో అయ»ొంగ ఖాకా 2, మరిజాన్ కాప్, ఎమ్‌లాబా చెరో వికెట్ తీశారు. తర్వాత దక్షిణాఫ్రికా మరో 2.4 ఓవర్లు మిగిలుండగానే 17.2 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ , ఓపెనర్ లౌరా వోల్వార్ట్ (37 బంతుల్లో 42; 3 ఫోర్లు, 1 సిక్స్), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అనెకె బాష్ (48 బంతుల్లో 74 నాటౌట్; 8 ఫోర్లు,1 సిక్స్) రెండో వికెట్‌కు చకచకా 96 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. నేడు రెండో సెమీఫైనల్లో న్యూజిలాండ్‌తో వెస్టిండీస్ తలపడుతుంది. ఇందులో గెలిచిన జట్టుతో ఆదివారం జరిగే ఫైనల్లో దక్షిణాఫ్రికా ఆడుతుంది. -
టీ20 వరల్డ్‌కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్
మహిళల టీ20 ప్రపంచకప్-2024 నుంచి మరో జట్టు నిష్క్రమించింది. గ్రూప్-బి నుంచి బంగ్లాదేశ్ జట్టు ఎలిమినేట్ అయ్యింది. నిన్న సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఓడటంతో బంగ్లాదేశ్ ఇంటిబాట పట్టింది. ఈ గ్రూప్ నుంచి స్కాట్లాండ్ ఇదివరకే ఎలిమినేట్ అయ్యింది.సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. శోభన మోస్తరి (38), నిగార్ సుల్తానా (32 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో మారిజన్ కాప్, డెర్క్సెన్, మ్లాబా తలో వికెట్ పడగొట్టారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. తంజిమ్ బ్రిట్స్ (42) రాణించడంతో 17.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. అన్నెకె బోష్ (25) ఓ మోస్తరు పరుగులు చేసింది. బంగ్లాదేశ్ బౌలర్లలో ఫహిమా ఖాతూన్ రెండు వికెట్లు పడగొట్టగా.. రితే మోనీ ఓ వికెట్ దక్కించుకుంది. ఈ మ్యాచ్‌లో గెలుపుతో సౌతాఫ్రికా అగ్రస్థానానికి (గ్రూప్-బి పాయింట్ల పట్టికలో) చేరుకుంది. వెస్టిండీస్, ఇంగ్లండ్ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.చదవండి: డీఎస్పీగా బాధ్యతలు.. పోలీస్ యూనిఫాంలో సిరాజ్! ఫోటో వైరల్ -
‘కామన్వెల్త్’ పవర్ లిఫ్టింగ్‌లో సాదియాకు బంగారు పతకాలు
సాక్షి, అమరావతి: దక్షిణాఫ్రికాలో జరుగుతున్న కామన్వెల్త్ పవర్ లిఫ్టింగ్ ఎక్విప్డ్ చాంపియన్ షిప్ జూనియర్ విభాగంలో సాదియా అల్మాస్ గురువారం బంగారు పతకాలు సాధించారు. స్వాట్, బెంచ్ ప్రెస్, డెట్ లిఫ్ట్ మూడు విభాగాల్లోను బంగారు పతకాలతోపాటు 460 కిలోల బరువులు ఎత్తి ఓవరాల్ విభాగంలో కూడా మరో బంగారు పతకం సాధించారు. ఈ సందర్భంగా అమెకు ఏపీ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అభినందనలు తెలిపింది. -
సౌతాఫ్రికా కెప్టెన్‌కు గాయం.. తొలి టెస్ట్‌కు దూరం
అక్టోబర్ 21 నుంచి బంగ్లాదేశ్‌తో జరుగబోయే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు ముందు సౌతాఫ్రికా జట్టుకు బ్యాడ్ న్యూస్ అందింది. గాయం కారణంగా ఆ జట్టు కెప్టెన్ టెంబా బవుమా తొలి టెస్ట్‌కు దూరమయ్యాడు. బవుమా స్థానంలో యువ ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్ తొలి టెస్ట్‌కు ఎంపికయ్యాడు. బ్రెవిస్‌కు టెస్ట్ జట్టు నుంచి పిలుపు రావడం ఇదే మొదటిసారి. తొలి టెస్ట్‌కు దూరమైనప్పటికీ బవుమా జట్టుతో పాటే ప్రయాణిస్తాడు. రెండో టెస్ట్ సమయానికి బవుమా కోలుకుంటాడని క్రికెట్ సౌతాఫ్రికా ఆశాభావం వ్యక్తం చేస్తుంది. బవుమా గైర్హాజరీలో ఎయిడెన్ మార్క్రమ్ తొలి టెస్ట్‌లో కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు.మరోవైపు ఇదే బంగ్లాదేశ్ సిరీస్‌కు ఎంపికైన నండ్రే బర్గర్ సైతం గాయపడ్డాడు. అతని స్థానంలో లుంగి ఎంగిడి జట్టులోకి వచ్చాడు. అప్డేట్ చేసిన జట్టు వివరాలను క్రికెట్ సౌతాఫ్రికా ఇవాళ (అక్టోబర్ 11) వెల్లడించింది.బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌కు సౌతాఫ్రికా జట్టు: టెంబా బవుమా (మొదటి టెస్టుకు అందుబాటులో ఉండడు), డేవిడ్ బెడింగ్హామ్, మాథ్యూ బ్రీట్జ్కే, డెవాల్డ్ బ్రెవిస్, టోనీ డి జోర్జి, కేశవ్ మహరాజ్, ఎయిడెన్ మార్క్రమ్, వియాన్ ముల్డర్, సెనురన్ ముత్తుసామి, లుంగి ఎంగిడి, డేన్ ప్యాటర్సన్, డేన్ పీడ్, ట్రిస్టన్ స్టబ్స్, కగిసో రబాడ, ర్యాన్ రికెల్టన్, కైల్ వెర్రేన్నేబంగ్లాదేశ్ వర్సెస్ సౌతాఫ్రికా షెడ్యూల్..తొలి టెస్ట్ (అక్టోబర్ 21-25, ఢాకా)రెండో టెస్ట్ (అక్టోబర్ 29-నవంబర్ 2, చట్టోగ్రామ్)చదవండి: పొదల్లోకి వెళ్లిన బంతి.. నవ్వులు పూయించిన ఆసీస్ స్టార్ ప్లేయర్( వీడియో) -
సౌతాఫ్రికా ఘన విజయం.. టీ20 వరల్డ్‌కప్ నుంచి స్కాట్లాండ్ ఔట్
మహిళల టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా ఇవాళ (అక్టోబర్ 9) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్పై సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. ఛేదనలో చేతులెత్తేసిన స్కాట్లాండ్ 17.5 ఓవర్లలో 86 పరుగులకు ఆలౌటైంది. సౌతాఫ్రికా బౌలర్లు ముకుమ్మడిగా రాణించి స్కాట్లాండ్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. ఈ మ్యాచ్‌లో ఓటమితో స్కాట్లాండ్ వరల్డ్‌కప్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో సౌతాఫ్రికా గ్రూప్-బి టాపర్‌గా కొనసాగుతుంది.రాణించిన వోల్వార్డ్ట్, బ్రిట్స్, కాప్టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికాకు ఓపెనర్లు వోల్వార్డ్ట్ (40), బ్రిట్స్ (43) శుభారంభాన్ని అందించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 64 పరుగులు జోడించారు. అనంతరం కాప్ (43) మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగింది. ఫలితంగా సౌతాఫ్రికా స్కాట్లాండ్ ముందు భారీ స్కోర్‌ను ఉంచింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో బోష్ 11, సూన్ లస్ 18 (నాటౌట్), క్లో టైరాన్ 2, డెర్క్సెన్ ఒక్క పరుగు చేశారు. స్కాట్లాండ్ బౌలర్లలో స్లేటర్, బ్రైస్, బెల్, ఫ్రేసర్, కార్టర్ తలో వికెట్ పడగొట్టారు.విజృంభించిన బౌలర్లుభారీ లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకునే క్రమంలో సౌతాఫ్రికా బౌలర్లు మూకుమ్మడిగా విజృంభించారు. మ్లాబా 3, టైరాన్, డి క్లెర్క్ చెరో 2, ఖాకా, సూన్ లస్, డెర్క్సెన్ తలో వికెట్ పడగొట్టారు. స్కాట్లాండ్ ఇన్నింగ్స్‌లో కేవలం ఫ్రేసర్ (14), లిస్టర్ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. చదవండి: T20 World Cup 2024: న్యూజిలాండ్‌ను చిత్తుగా ఓడించిన ఆస్ట్రేలియా -
చెలరేగిన అదైర్ బ్రదర్స్.. సౌతాఫ్రికాపై ఐర్లాండ్ సంచలన విజయం
పరిమిత ఓవర్ల క్రికెట్లో సౌతాఫ్రికా ఇటీవలికాలంలో ఘోర ప్రదర్శనలు చేస్తుంది. టీ20 వరల్డ్‌కప్ అనంతరం ఆ జట్టు వెస్టిండీస్ (టీ20 సిరీస్‌లో 0-3 తేడాతో ఓటమి), ఆఫ్ఘనిస్తాన్ (వన్డే సిరీస్‌లో 1-2 తేడాతో ఓటమి) లాంటి సాధారణ జట్ల చేతుల్లో దారుణ పరాజయాలు మూటగట్టుకుంది. తాజాగా సౌతాఫ్రికా క్రికెట్ పసికూన ఐర్లాండ్ చేతుల్లోనూ ఓటమిపాలైంది. రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా జరిగిన రెండో టీ20లో సౌతాఫ్రికాపై ఐర్లాండ్ సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో గెలుపుతో ఐర్లాండ్ రెండు మ్యాచ్ సిరీస్‌ను 1-1తో సమం చేసుకుంది. టీ20ల్లో ఐర్లాండ్‌కు సౌతాఫ్రికాపై ఇదే తొలి విజయం.THE HISTORIC MOMENT FOR IRELAND.- First time ever Ireland beat South Africa in a T20i match. 🇮🇪pic.twitter.com/Hp6BtushbB— Mufaddal Vohra (@mufaddal_vohra) September 30, 2024మెరుపు శతకంతో అలరించిన రాస్ అదైర్అబుదాబీ వేదికగా సౌతాఫ్రికాతో నిన్న (సెప్టెంబర్ 29) జరిగిన రెండో టీ20లో ఐర్లాండ్ 10 పరుగుల తేడాతో గెలుపొందింది. అదైర్ బ్రదర్స్ బ్యాట్‌తో, బంతితో చెలరేగి ఐర్లాండ్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్.. రాస్ అదైర్ మెరుపు శతకంతో (58 బంతుల్లో 100; 5 ఫోర్లు, 9 సిక్సర్లు) విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో పాల్ స్టిర్లింగ్ (31 బంతుల్లో 52) కూడా హాఫ్ సెంచరీతో రాణించాడు. సౌతాఫ్రికా బౌలర్లలో వియాన్ ముల్దర్ 2, ఎంగిడి, విలియమ్స్, క్రుగెర్ తలో వికెట్ పడగొట్టారు.బంతితో చెలరేగిన మార్క్ అదైర్196 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. మార్క్ అదైర్ (4-0-31-4), గ్రహం హ్యూమ్ (4-0-25-3) ధాటికి నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 185 పరుగులు మాత్రమే చేయగలిగింది. మాథ్యూ హంఫ్రేస్, బెంజమిన్ వైట్ తలో వికెట్ పడగొట్టారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో రీజా హెండ్రిక్స్ (51), మాథ్యూ బ్రీట్జ్కీ (51) అర్ద సెంచరీలతో రాణించారు. వీరిద్దరితో పాటు సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో ర్యాన్ రికెల్టన్ (36) ఒక్కడే రెండంకెల స్కోర్ చేశాడు. మిగతా వారంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.చదవండి: ఐదో వన్డేలో ఆసీస్ విజయం.. సిరీస్ కైవసం -
క్లీన్ స్వీప్ పరాభవం తప్పించుకున్న సౌతాఫ్రికా
షార్జా వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను సౌతాఫ్రికా 1-2 తేడాతో కోల్పోయింది. నిన్న (సెప్టెంబర్ 22) జరిగిన నామమాత్రపు మూడో వన్డేలో సౌతాఫ్రికా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా ఆఫ్ఘన్ల చేతిలో క్లీన్ స్వీప్ పరాభవం నుంచి తప్పించుకుంది. రెండో వన్డేలో సెంచరీ హీరో ఈ మ్యాచ్‌లో కూడా రాణించినప్పటికీ.. ఆఫ్ఘనిస్తాన్‌కు పరాజయం తప్పలేదు. తొలుత బౌలర్లు.. ఆతర్వాత మార్క్రమ్ నిలకడగా ఆడి సౌతాఫ్రికాకు ఎట్టకేలకే ఓ విజయాన్ని అందించారు.Afghanistan wins the ODI series against South Africa. 🇦🇫 pic.twitter.com/ddmwyc4Akd— Mufaddal Vohra (@mufaddal_vohra) September 22, 2024ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. 34 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌటైంది. రహ్మానుల్లా గుర్బాజ్ మరో మంచి ఇన్నింగ్స్‌తో (89) ఆఫ్ఘనిస్తాన్‌కు చెప్పుకోదగ్గ స్కోర్ అందించాడు. గుర్బాజ్ మినహా ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో ఏ ఒక్కరూ రాణించలేదు. అల్లా ఘజన్ఫర్ (31), షాహిది (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడి, నకాబా పీటర్, ఫ్లెహ్లుక్వాయో తలో మూడు వికెట్లు పడగొట్టగా.. ఫోర్టుయిన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.Rahmanullah Gurbaz scored 89 (94) out of Afghanistan's 169 total.- The lone warrior of Afghans tonight! 👏pic.twitter.com/pQQIQzm1aC— Mufaddal Vohra (@mufaddal_vohra) September 22, 2024అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. 33 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఎయిడెన్ మార్క్రమ్ (69 నాటౌట్), ట్రిస్టన్ స్టబ్స్ (26 నాటౌట్) ప్రొటీస్‌ను విజయతీరాలకు చేర్చారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో టోనీ జోర్జీ 26, బవుమా 22, రీజా హెండ్రిక్స్ 18 పరుగులు చేశారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో ఘజన్ఫర్, నబీ, అహ్మద్ మాలిక్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో 89 పరుగులు చేయడంతో పాటు రెండో వన్డేలో రికార్డు సెంచరీ చేసిన గుర్బాజ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, సిరీస్ అవార్డులు లభించాయి.చదవండి: రసవత్తరంగా సాగుతున్న న్యూజిలాండ్, శ్రీలంక టెస్ట్ మ్యాచ్