
సౌతాఫ్రికా మహిళా క్రికెట్ జట్టు ఓపెనర్లు లారా వోల్వార్డ్ట్, తంజిమ్ బ్రిట్స్ సరికొత్త చరిత్ర సృష్టించారు. సౌతాఫ్రికా తరఫున వన్డేల్లో ఏ వికెట్‌కైనా అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా రికార్డుల్లోకెక్కారు. అలాగే పాకిస్తాన్ గడ్డపై వన్డే క్రికెట్‌లో ఏ వికెట్‌కైనా అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన జోడీగా చరిత్రకెక్కారు.
లాహోర్‌లోని గడాఫీ స్టేడియం వేదికగా ఇవాళ (సెప్టెంబర్ 19) పాకిస్తాన్, సౌతాఫ్రికా మహిళా జట్లు వన్డే మ్యాచ్ ఆడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగగా.. ఆ జట్టు ఓపెనర్లు తంజిమ్, లారా తొలి వికెట్‌కు 260 పరుగులు జోడించారు. మహిళల వన్డే క్రికెట్‌లో తొలి వికెట్‌కు ఇది మూడో అత్యధిక భాగస్వామ్యం. ఏ వికెట్‌కైనా ఆరో అత్యధిక భాగస్వామ్యం.
మహిళల వన్డేల్లో ఏ వికెట్‌కైనా అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన రికార్డు భారత జోడీ పేరిట ఉంది. 2017లో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత ఓపెనర్లు దీప్తి శర్మ, పూనమ్ రౌత్ తొలి వికెట్‌కు 320 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు.
మహిళల వన్డేల్లో ఏ వికెట్‌కైనా అత్యధిక భాగస్వామ్యాలు (టాప్-6)
దీప్తి శర్మ-పూనమ్ రౌత్ (భారత్, 320, తొలి వికెట్‌కు)
కెర్-క్యాస్పరెక్ (న్యూజిలాండ్, 295, రెండో వికెట్‌కు)
టేలర్-బేమౌంట్ (ఇంగ్లండ్, 275, రెండో వికెట్‌కు)
టేలర్-అట్కిన్స్ (ఇంగ్లండ్, 268, తొలి వికెట్‌కు)
టిఫెన్-బేట్స్ (న్యూజిలాండ్, 262, రెండో వికెట్‌కు)
వోల్వార్డ్ట్-బ్రిట్స్ (సౌతాఫ్రికా, 260, రెండో వికెట్‌కు)
మ్యాచ్ విషయానికొస్తే.. వర్షం కారణంగా 46 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా 3 వికెట్ల నష్టానికి 292 పరుగులు చేసింది. తంజిమ్ బ్రిట్స్ 171 పరుగులతో (141 బంతుల్లో 20 ఫోర్లు, 4 సిక్సర్లు) అజేయంగా ఉండగా.. కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ 100 పరుగులు (129 బంతుల్లో 10 ఫోర్లు) చేసి ఔటైంది. పాక్ బౌలర్లలో డయానా బేగ్‌కు 2 వికెట్లు దక్కాయి.
కాగా, సౌతాఫ్రికా మహిళల జట్టు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం పాకిస్తాన్‌లో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికా 8 వికెట్ల తేడాతో పాక్‌ను చితు చేసింది. మూడో వన్డే లాహోర్‌లోనే సెప్టెంబర్ 22న జరుగనుంది.