శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా పేసర్ మొహమ్మద్ సిరాజ్ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో సిరాజ్ ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ (పథుమ్ నిస్సంక) తీశాడు. తద్వారా వన్డేల్లో ఈ ఘనత సాధించిన నాలుగో భారత బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. గతంలో దేబశిష్ మహంతి, జహీర్ ఖాన్, ప్రవీణ్ కుమార్ భారత్ తరఫున తొలి బంతికే వికెట్ తీశారు. వీరిలో జహీర్ ఖాన్ అత్యధికంగా నాలుగు సార్లు ఈ ఘనత సాధించాడు.
దేబశిష్ మహంతి- 1999లో వెస్టిండీస్‌పై (రిడ్లే జాకబ్స్)
జహీర్ ఖాన్- 2001లో న్యూజిలాండ్‌పై (మాథ్యూ సింక్లెయిర్)
జహీర్ ఖాన్- 2002లో శ్రీలంకపై (సనత్ జయసూర్య)
జహీర్ ఖాన్- 2007లో ఆస్ట్రేలియాపై (మైఖేల్ క్లార్క్)
జహీర్ ఖాన్- 2009లో శ్రీలంకపై (ఉపుల్ తరంగ)
ప్రవీణ్ కుమార్- 2010లో శ్రీలంకపై (ఉపుల్ తరంగ)
మొహమ్మద్ సిరాజ్- 2024లో శ్రీలంకపై (పథుమ్ నిస్సంక)
మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 45 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. పథుమ్ నిస్సంక 0, అవిష్క ఫెర్నాండో 40, కుశాల్ మెండిస్ 30, సమరవిక్రమ 14, అసలంక 25, లియనగే 12 పరుగులు చేసి ఔట్ కాగా.. వెల్లలగే (37), కమిందు మెండిస్ (18) క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment