భారత్‌దే వన్డే సిరీస్ | India women's team take unassailable lead over Sri Lanka | Sakshi
Sakshi News home page

భారత్‌దే వన్డే సిరీస్

Published Thu, Feb 18 2016 12:06 AM | Last Updated on Sun, Sep 3 2017 5:50 PM

భారత్‌దే వన్డే సిరీస్

భారత్‌దే వన్డే సిరీస్

 లంకపై రెండో విజయం
 రాంచీ: ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన భారత మహిళల జట్టు... శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకుంది. జేఎస్‌సీఏ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన లంక 50 ఓవర్లలో 9 వికెట్లకు 178 పరుగులు చేసింది. సురంగిక (43 నాటౌట్), ప్రసాదిని (37), సిరివర ్ధనే (19), కౌసల్య (18) రాణించారు. భారత బౌలర్ల ధాటికి వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన లంకేయులు భారీ స్కోరు చేయడంలో విఫలమయ్యారు. దీప్తి శర్మ 4 వికెట్లు తీసింది. తర్వాత భారత్ 43.1 ఓవర్లలో 4 వికెట్లకు 179 పరుగులు చేసింది. కెప్టెన్ మిథాలీ (53 నాటౌట్), మందన (46), హర్మన్‌ప్రీత్ కౌర్ (41), తిరుష్ కామిని (26)లు చెలరేగారు. మందన, కామిని తొలి వికెట్‌కు 67 పరుగులు జోడించి శుభారంభాన్నిచ్చారు. సుగందిక కుమారి 4 వికెట్లు పడగొట్టింది. దీప్తికి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement