win
-
నాగాలాండ్‌పై హైదరాబాద్ ఘనవిజయం
అహ్మదాబాద్: దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ జట్టు శుభారంభం చేసింది. గ్రూప్ ‘సి’లో భాగంగా శనివారం జరిగిన తమ తొలి పోరులో హైదరాబాద్ 42 పరుగుల తేడాతో నాగాలాండ్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 48.1 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌటైంది. వికెట్ కీపర్ బ్యాటర్ అరవెల్లి అవనీశ్ (82 బంతుల్లో 100; 14 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో ఆకట్టుకోగా... ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (51; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), వరుణ్ గౌడ్ (57) హాఫ్ సెంచరీలతో రాణించారు. కెప్టెన్ తిలక్ వర్మ (0) విఫలమయ్యాడు. నాగాలాండ్ బౌలర్లలో ఇమ్లీవతి లెమ్టర్ 4, జొనాథన్ మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో నాగాలాండ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. యుగంధర్ సింగ్ (80; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), జగదీశ సుచిత్ (66; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధశతకాలతో పోరాడినా లాభం లేకపోయింది. హైదరాబాద్ బౌలర్లలో నిశాంత్, ముదస్సిర్ రెండేసి వికెట్లు తీశారు. అవనీశ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. తదుపరి మ్యాచ్‌లో సోమవారం ముంబైతో హైదరాబాద్ తలపడనుంది. -
గెలిచి నిలిచిన గాయత్రి–ట్రెసా జోడీ
హాంగ్జౌ (చైనా): బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో భారత జోడీ పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ తొలి విజయం నమోదు చేసుకుంది. మొదటిసారి ఈ టోర్నీకి అర్హత సాధించిన గాయత్రి–ట్రెసా జంట తొలి లీగ్ మ్యాచ్‌లో ప్రపంచ నంబర్ జోడీ చేతిలో ఓడినా... రెండో మ్యాచ్‌లో తిరిగి పుంజుకుంది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా గురువారం జరిగిన పోరులో గాయత్రి –ట్రెసా ద్వయం 21–19, 21–19తో ప్రపంచ ఆరో ర్యాంక్ పియర్లీ టాన్–థీనా మరళీధరన్ (మలేసియా) జంటపై గెలుపొందింది. సెమీఫైనల్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో మన అమ్మాయిలు... ప్రత్యరి్థకి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వరుస గేమ్‌ల్లో విజృంభించారు. 46 నిమిషాల పాటు సాగిన పోరులో మలేసియా జోడీ ఒక దశలో వరుసగా 6 పాయింట్లు సాధించి ఆధిక్యం కనబర్చే ప్రయత్నం చేయగా... భారత జంట కీలక సమయాల్లో విజృంభించి గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లోనూ ఆధిక్యం చేతులు మారుతూ సాగినా... చివరకు గాయత్రి–ట్రెసా జంటనే విజయం వరించింది. గ్రూప్ ‘ఎ’లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన చైనా జంట 2 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా... భారత జట్టు ఒక పాయింట్‌తో రెండో స్థానంలో ఉంది. భారత షట్లర్లు సెమీఫైనల్‌కు అర్హత సాధించాలంటే నేడు జరిగే గ్రూప్ దశ చివరి లీగ్ మ్యాచ్‌లో నామీ మసుయమా–చిహారు షిడా (జపాన్)పై విజయం సాధించాల్సి ఉంటుంది. -
భారత్ పై ఆస్ట్రేలియా విజయం
-
‘మహా’ పోరు: అధికారం పీఠం దక్కించుకునేదెవరు?
సాక్షి ముంబై: అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ప్రధాన కూటముల మధ్య గట్టి పోటీ కనిపించినప్పటికీ మహాయుతి మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నవంబరు 23వ తేదీ (శనివారం) వెలుపడను న్నాయి. ఈ నేపథ్యంలో లోక్‌షాహీ, రిపబ్లిక్ , చాణక్య, పోల్‌డైరీ వంటి అనేక సంస్ధలు ఎగ్జిట్‌పోల్ సర్వేలు నిర్వహించాయి. మహాయుతిదే మళ్లీ అధికార పీఠమని కొన్ని సర్వేలు వెల్లడించగా, మరి కొన్ని సర్వేలు మాత్రం మహావికాస్ ఆఘాడి కూటమి అ«ధికారంలో రానుందని పేర్కొన్నాయి. మహా వికాస్ ఆఘా డీకి 124 నుంచి 156 స్థానాలు లభించనున్నాయని, మహాయుతి కూటమికి 129 నుంచి 150 స్థానాలు, ఇతరులు 10 స్థానా ల్లో గెలిచే అవకాశముందని లోక్‌షాహీ నిర్వహించిన ఎగ్జిట్‌పోల్స్‌లో వెల్లడైంది. ఇదిలాఉండగా మహాయుతికి 137 నుంచి 157 స్థానాలు, మహావికాస్ ఆఘాడీకి 126 నుంచి 146 స్థానాలు లభించే అవకాశాలున్నాయని రిపబ్లిక్ సర్వే ప్రకటించింది. ఈ నేపథ్యంలో అధికారపీఠమెక్కేదెవరన్న అంశంపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ కనిపిస్తోంది. మరోవైపు గెలుపు మీద ఎవరికివారే ధీమా వ్యక్తం చేస్తున్నారు.#WATCH | Delhi | On Shiva Sena (UBT)'s claim that they (MVA) will secure 160 seats in Maharashtra elections, Union Minister Giriraj Singh says, “The election results will be out by this time tomorrow. They (Shiv Sena) are nervous, that’s why they are making such claims.” pic.twitter.com/oQhlxkevZm— ANI (@ANI) November 22, 2024 -
రికార్డు: తొలిసారి అమెరికా సెనేట్‌కు ట్రాన్స్‌జెండర్
వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికలతో పాటు అమెరికాలో కాంగ్రెస్ ఎన్నికల రిజల్ట్స్ కూడా బుధవారం(నవంబర్ 6) వెలువడుతున్నాయి. డెలవేర్‌లోని ఎట్ లార్జ్హౌస్ డిస్ట్రిక్ట్ నుంచి సెనేట్‌కు డెమోక్రటిక్ పార్టీ తరపున పోటీ చేసిన ట్రాన్స్‌జెండర్ సారా మెక్‌బ్రైడ్ విజయం సాధించారు.దీంతో సారా అమెరికా కాంగ్రెస్‌కు ఎన్నికైన తొలి ట్రాన్స్‌జెండర్‌గా రికార్డులకెక్కారు.రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి జాన్ వేలెన్ 3తో,సారా మెక్‌బ్రైడ్ పోటీపడ్డారు.ఈ ఎన్నికలో సారాకు 95శాతం ఓట్లు పోలవగా వేలెన్కు 57.9 శాతం ఓట్లు పోలయ్యాయి.తాను ట్రాన్స్‌జెండర్‌గా చరిత్ర సృష్టించడానికి పోటీ పడలేదని డెలవేర్లో మార్పు కోసమే పోటీ చేసినట్లు సారా పేర్కొన్నారు.కాగా,సారా మెక్ బ్రైడ్ ఎల్జీబీటీక్యూ జాతీయ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారు.ఎన్నికల సమయంలో దాదాపు 3 మిలియన్ల డాలర్లకుపైగా ప్రచార విరాళాలు సేకరించారు. 2010 నుంచి డెలవేర్ డెమోక్రాట్లకు కంచుకోటగా ఉంది.ఇదీ చదవండి: అమెరికా ఎన్నికలు.. సుహాస్ సుబ్రమణ్యం సరికొత్త రికార్డు -
PKL 11: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో డిఫెండింగ్ చాంపియన్ పుణెరి పల్టాన్ శుభారంభం సత్తా చాటిన గౌరవ్ ఖత్రి
హైదరాబాద్, అక్టోబర్ 19: డిఫెండింగ్ చాంపియన్ పుణెరి పల్టాన్ ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్లో శుభారంభం చేసింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సత్తా చాటుతూ పది పాయింట్ల తేడాతో హర్యానా స్టీలర్స్‌ను చిత్తు చేసింది. శనివారం రాత్రి ఇక్కడి జీఎంసీ బాలయోగి గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పల్టాన్ 35–25 తో స్టీలర్స్‌పై ఘన విజయం సాధించింది. తన ఉడుం పట్టుతో ప్రత్యర్థులను నిలువరించిన డిఫెండర్ గౌరవ్ ఖత్రి 7 పాయింట్లతో పుణెరి విజయంలో కీలక పాత్ర పోషించాడు. కెప్టెన్, ఆల్‌రౌండర్ అస్లాం ఇనాందర్ ఐదు పాయింట్లతో ఆకట్టుకోగా.. పంకజ్ మోహితే, మోహిత్ గోయత్, అమన్ నాలుగేసి పాయింట్లు రాబట్టారు. హర్యానా స్టీలర్స్ జట్టులో శివం పతారె, శంకర్ మిశ్రా ఐదు పాయింట్లతో టాప్ స్కోరర్‌గా నిలిచారు.. ఆల్‌రౌండర్ మొహమ్మద్ రెజా షాడ్లోయి (4), రైడర్ వినయ్ పోరాడినా మిగతా ఆటగాళ్లు నిరాశ పరిచారు. ఆట ఆరంభంలో ఇరు జట్లూ వరుస పాయింట్లతో పోటాపోటీగా తలపడ్డాయి. 6–6తో స్కోరు సమంగా ఉన్న దశలో పుణెరి పల్టాన్ వేగం పెంచింది. రైడింగ్‌లో పాటు డిఫెన్స్‌లోనూ సత్తా చాటుతూ 13వ నిమిషంలోనే హర్యానా స్టీలర్స్‌ను ఆలౌట్ చేసి 13–7తో ఆధిక్యం సాధించింది. శివం పతారే డుబ్కి స్కిల్ చూపెడుతూ రెండు పాయింట్లు తీసుకురావడంతో స్టీలర్స్9–13తో పుంజుకునేలా కనిపించింది. కానీ, పంకజ్ మోహితే మూడు పాయింట్ల సూపర్ రైడ్ చేయడంతో పుణెరి తన ఆధిక్యాన్ని 18–10కి పెంచుకుంది. పుణెరి రైడర్ మోహిత్ గోయత్‌ను చియానే చేసిన సూపర్ ట్యాకిల్ చేసి రెండు పాయింట్టు రాబట్టినా పల్టాన్ 19–13 ఆధిక్యంతో తొలి అర్ధభాగాన్ని ముగించింది. రెండో భాగంలో డిఫెండర్ చియనే సత్తా చాటినా రైడింగ్‌లో హర్యానా అంతగా ఆకట్టుకోలేక వెనుకబడింది. పుణెరి డిఫెండర్ ఖత్రి వరుసగా విజయ్, శివం పతారేను ట్యాకిల్ చేశాడు. చివరి నిమిషాల్లో ఆ జట్టు తన ఆధిక్యాన్ని మరింత పెంచుకుంది. అయితే, హర్యానా ఆఖరి రైడ్‌లో శంకర్ మిశ్రా మూడు టచ్ పాయింట్లు సహా నాలుగు పాయింట్లతో సూపర్ రైడ్ చేయడంతో హర్యానా తన ఓటమి అంతరాన్ని కాస్త తగ్గించుకుంది. ఆదివారం రాత్రి జరిగే తొలి మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్–జైపూర్ పింక్ పాంథర్స్ తలపడాయి. మరో మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్–బెంగళూరు బుల్స్ పోటీ పడతాయి. -
యూఎస్ ఓపెన్ ఛాంపియన్‌గా సబలెంక (ఫోటోలు)
-
‘2028లో పసిడి సాధించాలి’
భువనేశ్వర్: వరుసగా రెండు ఒలింపిక్స్ క్రీడల్లో కాంస్య పతకాలు సాధించిన భారత హాకీ జట్టు 2028 లాస్ ఏంజెలెస్ విశ్వక్రీడల్లో పసిడి పతకం నెగ్గాలని ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆకాంక్షించారు. పారిస్ క్రీడల్లో కాంస్యం సాధించి స్వదేశానికి తిరిగి వచ్చిన హాకీ జట్టును బుధవారం ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సన్మానించగా.. గురువారం మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పలువురు ప్లేయర్లను సత్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సుదీర్ఘ విరామం తర్వాత వరుసగా రెండు ఒలింపిక్స్‌లో పతకాలు రావడం ఆనందంగా ఉంది. ఇదే ఆటతీరు కొనసాగిస్తూ లాస్ ఏంజెలెస్‌లో స్వర్ణం సాధించాలి’ అని ఆకాంక్షించారు. 2018 నుంచి భారత హాకీ జట్లకు ఒడిశా ప్రభుత్వం అధికారిక స్పాన్సర్‌గా వ్యవహరిస్తుండగా... హాకీ పూర్వ వైభవం దిశగా అడుగులు వేయడంలో నవీన్ పట్నాయక్ పాత్ర ఎంతో ఉందని ప్లేయర్లు కొనియాడారు.ఆటగాళ్ల అవసరాలను తీర్చుతూ అత్యుత్తమ సదుపాయాలు అందుబాటులోకి తేవడం వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని సుమిత్ పేర్కొన్నాడు. ఈ కార్యక్రమంలో హాకీ ఇండియా అధ్యక్షుడు దిలిప్ టిర్కీ, లలిత్ కుమార్ ఉపాధ్యాయ్, అభిషేక్, సుమిత్, సంజయ్ తదితరులు పాల్గొన్నారు. -
‘కమల’ వికాసం సాధ్యమే: లిచ్‌మాన్
వాషింగ్టన్: గత నాలుగు దశాబ్దాలుగా అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను దాదాపు ఖచి్చతంగా ఊహించి చెప్పిన అలాన్ లిచ్‌మాన్ మరోమారు తన విశ్లేషణను వెల్లడించారు. తాజా ఎన్నికల ప్రచార సరళి, అమెరికా ఓటర్ల మనోభావాలను లెక్కలోకి తీసుకుంటే డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ నెగ్గే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని ఆయన చెప్పారు. అయితే వచ్చే నెలలో డెమొక్రటిక్ కన్వెన్షన్ తర్వాతే తన తుది అంచనాలను వెల్లడిస్తానని ఆయన స్పష్టంచేశారు. 1984 ఏడాది నుంచి అమెరికాలో 10 సార్లు అధ్యక్ష ఎన్నికలు జరిగితే తొమ్మిది సార్లు ఈయన చెప్పింది నిజమైంది. దీంతో ఆయన్ను అమెరికా అధ్యక్ష ఎన్నికల నోస్ట్రడామస్‌గా అందరూ పిలుస్తారు. అమెరికన్ విశ్వవిద్యాలయంలో గత యాభై సంవత్సరాలుగా అధ్యాపకుడిగా పనిచేస్తున్న లిచ్‌మాన్ 1981 ఏడాదిలో ‘గెలుపునకు 13 సూత్రాలు’ అనే విధానాన్ని ప్రతిపాదించారు. ఈ 13 అంశాల ప్రాతిపదికన ఏ పార్టీ, అభ్యర్థి గెలుస్తారని అంచనా వేస్తానని ఆయన చెప్పారు. 2016లో ట్రంప్, 2020లో బైడెన్ గెలుస్తారన్న జోస్యాలు నిజమవడంతో 2024లో గెలుపుపై ఏం చెప్పబోతున్నారోనని ఆసక్తి నెలకొంది. -
Iran election 2024: మతవాద పాలనకు ఎదురుదెబ్బ
టెహ్రాన్: ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో సంస్కరణవాదులదే పైచేయి అయింది. కరడుగట్టిన మతవాది సయీద్ జలిలిపై మితవాది, సంస్కరణాభిలాషి మసూద్ పెజెష్కియాన్ ఘనవిజయం సాధించారు. జూన్ 28న జరిగిన తొలి విడత ఎన్నికల్లో ఆరుగురు అభ్యర్థుల్లో ఎవరికీ మెజారిటీ రాలేదు. దాంతో విజేతను తేల్చేందుకు తొలి రెండు స్థానాల్లో నిలిచిన జలిలి, పెజెష్కియాన్ మధ్య శుక్రవారం తిరిగి ఎన్నిక అనివార్యమైంది. శనివారం ఫలితాలు వెల్లడయ్యాయి. పోలైన దాదాపు 3 కోట్ల ఓట్లలో పెజెష్కియాన్‌కు 1.64 కోట్లు వచ్చాయి. సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అనుచరునిగా పేరుబడ్డ జలిలి 1.35 కోట్ల ఓట్లు మాత్రమే సాధించారు. దేశ తొమ్మిదో అధ్యక్షునిగా పెజెష్కియాన్ ఎన్నికైనట్టు అంతర్గత మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. ఇరాన్‌పై దశాబ్దాలుగా ఆధిపత్యం చలాయిస్తూ వస్తున్న మతవాద కూటమికి ఈ ఫలితాలు గట్టి షాకివ్వడమే గాక సంస్కరణవాదుల్లో జోష్ నింపాయి. నిజానికి ఈసారి అధ్యక్ష ఎన్నికల ప్రక్రియనే బహిష్కరిస్తున్నట్టు ప్రకటించిన ప్రజలు శుక్రవారం రాత్రి దాకా జరిగిన ఓటింగ్‌లో అనూహ్యంగా భారీ సంఖ్యలో పాల్గొనడం విశేషం. దాంతో 53 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. తద్వారా ఖమేనీ ఏకపక్ష పోకడలపై ప్రజలు స్పష్టమైన వ్యతిరేకత వ్యక్తం చేశారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఫలితాల వెల్లడి మొదలవుతూనే రాజధాని టెహ్రాన్, పశి్చమ ఇరాన్‌లోని పెజెష్కియాన్ సొంత నగరం తబ్రీజ్తో పాటు దేశవ్యాప్తంగా ఆయన మద్దతుదారులు, అభిమానులు భారీగా వీధుల్లోకి వచ్చి డ్యాన్సుల సంబరాలు చేసుకున్నారు. దేశాన్ని కాపాడేందుకు ఓటర్లు భారీ సంఖ్యలో బూత్‌లకు తరలారంటూ నినాదాలు చేశారు. పెజెష్కియాన్ ఎన్నికల నినాదమైన ‘సేవ్ ఇరాన్’ సందేశాలతో సోషల్ మీడియా హోరెత్తిపోయింది. దేశంలో మెజారిటీలపై మైనారిటీల పెత్తనానికి మొత్తానికి తెర పడ్డట్టేనంటూ సంస్కరణవాదులు సంబరపడుతున్నారు. అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మేలో హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలవడంతో ఎన్నిక అనివార్యమైంది. ఎన్నికల ఫలితాలను ఖమేనీ లాంఛనంగా ఆమోదముద్ర వేశాక 30 రోజుల్లో పెజెష్కియాన్ బాధ్యతలు స్వీకరిస్తారు. నాలుగేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. ఆయనకు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు దేశాధినేతలు శుభాకాంక్షలు తెలిపారు.పోలింగ్ శాతం పెరగడం వెనక... → నిజానికి ఏళ్లుగా తామెదుర్కొంటున్న పలు కీలక సమస్యల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై ఇరానీలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. → ఖమేనీ యంత్రాంగం తీరుకు నిరసనగా ఈసారి అధ్యక్ష ఎన్నికల ప్రక్రియను మూకుమ్మడిగా బహిష్కరించారు. దాంతో తొలి రౌండ్లో దేశ చరిత్రలోనే అత్యల్పంగా కేవలం 40 శాతం పోలింగ్ నమోదైంది. → అత్యంత మితవాదిగా పేరొందిన పెజెష్కియాన్ అనూహ్యంగా తుది పోరులో బరిలో నిలవడంతో ఆయనకు మద్దతుగా వారంతా భారీ సంఖ్యలో పోలింగ్ బూత్‌లకు తరలారు. → పోలింగ్‌కు ముందు నుంచీ పెజెష్కియాన్ ప్రచార సరళికి, ‘సేవ్ ఇరాన్’ నినాదానికి దేశ యువత బాగా ఆకర్షితులయ్యారు. దాంతో ఆయన ర్యాలీలకు, సభలకు జనం పోటెత్తారు. → ఇస్లామిక్ పాలనకు తెర పడాల్సిందేనని యువతతో పాటు విద్యావంతులు కూడా తొలిసారిగా బాహాటంగానే వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. కరడుగట్టిన మతవాది అయిన జలిలి ఇరాన్‌ను ఎప్పటికీ ఏకం చేయలేరని మైకుల సాక్షిగా చెప్పుకొచ్చారు. → జలిలిని ఓడించడం ద్వారా నిరంకుశ మతవాద పాలనకు వ్యతిరేకంగా ఇరానీలు స్పష్టమైన తీర్పు వెలువరించారు. → ఖమేనీ మతవాద పాలన, హిజాబ్‌ను తప్పనిసరి వంటి కఠినతరమైన సామాజిక నిబంధనలు, ఇరాన్‌పై ఆర్థిక ఆంక్షలను ఎత్తేసేలా అంతర్జాతీయ సమాజంతో చర్చలకు ముందుకు రాని పోకడలపైనా ప్రజలు తమ వ్యతిరేకతను ఓటు రూపంలో స్పష్టంగా వ్యక్తం చేశారంటున్నారు.హార్ట్ సర్జన్‌పై ఆశలెన్నో...! 69 ఏళ్ల పెజెష్కియాన్‌కు హార్ట్ సర్జన్‌గా దేశవ్యాప్తంగా అపారమైన పేరు ప్రఖ్యాతులున్నాయి. ఆయన ఇరాక్–ఇరాన్ యుద్ధంలో పాల్గొన్న వార్ వెటరన్ కూడా. 16 ఏళ్లుగా పార్లమెంటు సభ్యునిగా ఉన్నారు. డిప్యూటీ స్పీకర్‌గా, నాలుగేళ్ల పాటు ఆరోగ్య మంత్రిగా కూడా చేశారు. ఆయన భార్య కారు ప్రమాదంలో చనిపోయారు. మళ్లీ పెళ్లి చేసుకోకుండా సింగిల్ పేరెంట్‌గా పిల్లలను అన్నీ తానై పెంచారు. మతపరమైన మైనారిటీ అయిన అజెరీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడం ఈ ఎన్నికల్లో పెజెష్కియాన్‌కు మరింత కలిసొచి్చంది. ప్రచారం పొడవునా కూతురిని వెంట ఉంచుకోవడం ద్వారా మహిళలకు మరింత స్వేచ్ఛ ఇవ్వాల్సిన అవసరాన్ని ఆయన చెప్పకనే చెప్పారు. దాంతో పార్టీలకు అతీతంగా ప్రజలు ఆయనకు భారీగా ఓటేశారు. సవాళ్ల స్వాగతం... లెక్కలేనన్ని సమస్యలు పెజెష్కియాన్‌కు స్వాగతం పలుకుతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత దయనీయంగా ఉంది. ఇరుగుపొరుగుతో సంబంధాలు దారుణంగా దిగజారాయి. యెమన్, లెబనాన్ గుండా ఇజ్రాయెల్‌పై సాయుధ పోరుకు ఇరాన్ అన్నివిధాలా సాయపడుతూ అంతర్జాతీయ సమాజం నుంచి మరింత ఆగ్రహం చవిచూస్తోంది. ఆ క్రమంలో గత ఫిబ్రవరిలో అమెరికాతో, అనంతరం ఏప్రిల్‌లో ఇజ్రాయెల్‌తో ఇరాన్ యుద్ధం ముంగిటి దాకా వెళ్లొచి్చంది. ఈ రుగ్మతలకు పెజెష్కియాన్ ఎలాంటి వైద్యం చేస్తారో చూడాలి. అయితే ఆ దిశగా ఇప్పటికే అడుగులు వేస్తున్నట్టు ఆయన స్పష్టమైన సంకేతాలిచ్చారు. దేశ ప్రగతి కోసం ప్రత్యర్థులతో కూడా కలిసి పని చేస్తానని ఫలితాల అనంతరం ప్రకటించారు. ‘‘ఎన్నికలు ముగిశాయి. ఇది మనమంతా సహకరించుకుంటూ ముందుకు సాగాల్సిన సమయం. నేను మిమ్మల్ని ఏకాకులను చేయను. మీరూ నన్ను ఏకాకిని చేయొద్దు’’ అంటూ పిలుపునిచ్చారు. తద్వారా అందరినీ కలుపుకుని పోతానంటూ అతివాద వర్గానికి స్పష్టమైన సందేశమిచ్చారు. అదే సమయంలో, ‘ఇరాన్ ఇరానీలందరిదీ’ అంటూ పునరుద్ఘాటించడం ద్వారా ప్రజల సంక్షేమానికే ప్రథమ తాంబూలమని చెప్పకనే చెప్పారు. ఈ నేపథ్యంలో ఇరాన్‌కు సర్వం సహా చక్రవర్తి అయిన ఖమేనీతో అధ్యక్షునిగా ఆయన సంబంధాలు ఏ మేరకు సజావుగా సాగుతాయన్నది ఆసక్తికరం. ప్రజల తీర్పును అంగీకరిస్తున్నా. దేశ ప్రగతి కోసం పెజెష్కియాన్‌కు మనమంతా దన్నుగా నిలవాల్సిన అవసరముంది.– ఫలితాల అనంతరం సయీద్ జలిలి – సాక్షి, నేషనల్ డెస్క్ -
UK Election Result 2024: ఇక స్టార్మర్ శకం
లండన్: అంతా ఊహించిందే జరిగింది. గురువారం జరిగిన బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో విపక్ష లేబర్ పార్టీ ఘనవిజయం సాధించింది. హౌజ్ ఆఫ్ కామన్స్‌లో 650 స్థానాలకు గాను ఏకంగా 412 సీట్లు కైవసం చేసుకుంది. ప్రధాని రిషి సునాక్ సారథ్యంలోని అధికార కన్జర్వేటివ్ పార్టీ కేవలం 121 స్థానాలతో ఘోర పరాజయం మూటగట్టుకుంది. ఏకంగా 252 స్థానాలు కోల్పోయింది! ఇది ఆ పార్టీ చరిత్రలోనే అత్యంత ఘోరమైన పరాజయం. లేబర్ పార్టీకి 33.7 శాతం రాగా కన్జర్వేటివ్‌లకు 23.7 శాతమే లభించాయి. శుక్రవారం మధ్యాహా్ననికల్లా ఫలితాలు వెలువడటం, సునాక్ రాజీనామా చేయడం, లేబర్ పార్టీని విజయపథంలో నడిపిన కియర్ స్టార్మర్ దేశ 58వ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించడం చకచకా జరిగిపోయాయి. దాంతో 14 ఏళ్ల కన్జర్వేటివ్ పాలనకు తెర పడింది. భారత మూలాలున్న తొలి ప్రధాని సునాక్ పాలన కూడా 20 నెలలకే ముగిసింది. రిచ్మండ్–నార్త్ అలెర్టన్ స్థానం నుంచి ఆయన ఘనవిజయం సాధించినా మాజీ ప్రధాని లిజ్ ట్రస్‌తో పాటు గ్రాంట్ షేప్స్, పెన్నీ మోర్డంట్, జాకబ్ రీస్ మాగ్ వంటి పలువురు కన్జర్వేటివ్ హేమాహేమీలు ఓటమి చవిచూశారు. దాంతో ఫలితాల అనంతరం మాట్లాడుతూ 44 ఏళ్ల సునాక్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ‘‘లేబర్ పార్టీకి, స్టార్మర్‌కు అభినందనలు. ఘోర ఓటమి చవిచూసిన నా కేబినెట్ సహచరులకు సానుభూతి. నాయకునిగా వారిని గెలిపించుకోలేకపోయినందుకు క్షమాపణలు. ప్రజల అంచనాలు అందుకోలేకపోయినందుకు వారికి కూడా క్షమాపణలు’’ అన్నారు. ఓటమికి బాధ్యత వహిస్తూ కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు సునాక్ ప్రకటించారు. అయితే ప్రధానిగా తన బాధ్యతలకు నూరు శాతం న్యాయం చేశానన్నారు. ప్రధానిగా కుటుంబంతో కలిసి అధికార నివాసంలో జరుపుకున్న దీపావళి వేడుకలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ‘‘మా తాతల కాలంలో చేతిలో పెద్దగా ఏమీ లేకుండా ఇంగ్లండ్ వచి్చన కుటుంబం మాది. అలాంటిది రెండే తరాల్లో నేను ప్రధాని కాగలిగాను. నా పిల్లలు డౌనింగ్ స్ట్రీట్ మెట్లపై దీపావళి ప్రమిదలు వెలిగించగలిగారు. అదీ దేశ గొప్పదనం’’ అంటూ కొనియాడారు. ‘‘నా వారసునిగా అత్యంత సవాళ్లమయమైన బాధ్యతను స్వీకరిస్తున్న నూతన ప్రధానికి 10, డౌనింగ్ స్ట్రీట్‌కు హార్దిక స్వాగతం. నూతన బాధ్యతల్లో ఆయన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. ఎందుకంటే ఆయన విజయమే మనందరి విజయం. ప్రచారంలో విమర్శలు గుప్పించుకున్నా స్టార్మర్ చాలా మంచి వ్యక్తి. ఆయన వ్యక్తిత్వాన్ని ఎంతగానో అభిమానిస్తాను’’ అన్నారు. అనంతరం రాజు చార్లెస్–3కు సునాక్ రాజీనామా సమర్పించారు. తర్వాత భార్య అక్షత, పిల్లలతో కలిసి అధికార నివాసం 10, డౌనింగ్ స్ట్రీట్‌ను ఖాళీ చేసి వెళ్లిపోయారు. స్టార్మర్‌కు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.దేశాన్ని పునర్నిర్మిస్తాం : స్టార్మర్ ప్రజలు మార్పు కోసం నిర్ణాయక రీతిలో ఓటేశారని 61 ఏళ్ల స్టార్మర్ అన్నారు. శుక్రవారం ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక 10, డౌనింగ్ స్ట్రీట్ నుంచి ఆయన తొలి ప్రసంగం చేశారు. ‘‘ప్రజల త్యాగాలకు, ప్రతిగా వారికందుతున్న సేవలకు మధ్య అంతరం ఈ స్థాయిలో పెరిగితే భవిష్యత్తు పట్ల వారిలో మిగిలేది నిరాశా నిస్పృహలే. ముందు వారిలో విశ్వాసాన్ని పాదుగొల్పాలి. ఇది మాటలతో కాదు. చేతల్లోనే చూపాలి. మనముందు భారీ లక్ష్యాలున్నాయి. కనుక నేటినుంచే పని మొదలవుతుంది’’ అన్నారు. ‘‘సేవే ఏకైక లక్ష్యంగా లేబర్ పార్టీని పునర్ వ్యవస్థీకరించాం. దేశమే ముందు, ఆ తర్వాతే పార్టీ అంటూ సమూలంగా మెరుగుపరిచి ప్రజల ముందుంచాం. అలాగే దేశాన్ని కూడా అన్ని రంగాల్లోనూ బలోపేతం చేసి చూపిస్తాం. ‘సేవల ప్రభుత్వం’గా పని చేస్తాం. లేబర్ పార్టీకి ఓటేయని వారికి కూడా అంతే చిత్తశుద్ధితో సేవ చేస్తాం. ప్రజలందరి నమ్మకాన్నీ నిలబెట్టుకుంటాం. బ్రిటన్ను పూర్తిస్థాయిలో పునర్నరి్మస్తాం’’ అని ప్రకటించారు. సునాక్‌పై ప్రశంసల జల్లు ప్రధానిగా సునాక్ ఎంతో సాధించారంటూ స్టార్మర్ ప్రశంసలు కురిపించడం విశేషం! 20 నెలల పాలనలో దేశ ప్రగతి కోసం ఆయన చిత్తశుద్ధితో ఎంతగానో కృషి చేశారంటూ కొనియాడారు. ‘‘ఆసియా మూలాలున్న తొలి బ్రిటిష్ ప్రధానిగా సునాక్ ఎంతో సాధించారు. ఆ ఘనతలను ఏ మాత్రం తక్కువ చేసి చూడలేం. ప్రధానిగా ఆయన పనితీరుకు జోహార్లు’’ అన్నారు. ఫలితాలు వెలువడగానే స్టార్మర్ బకింగ్‌హాం రాజ ప్రాసాదానికి వెళ్లి రాజు చార్లెస్–3తో భేటీ అయ్యారు. నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా స్టార్మర్ను రాజు లాంఛనంగా ఆహ్వానించారు. కేబినెట్లోకి లీసా నందిస్టార్మర్ మంత్రివర్గంలో భారతీయ మూలాలున్న 44 ఏళ్ల లీసా నందికి చోటు దక్కింది. ఆమెను సాంస్కృతిక, క్రీడా, సమాచార ప్రసార మంత్రిగా నియమించారు. విగాన్ నుంచి ఆమె వరుసగా రెండోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. లీసా తండ్రి దీపక్ విద్యావేత్త. 1950ల్లో బ్రిటన్ వెళ్లారు. అక్కడి అమ్మాయిని పెళ్లాడారు. జాతుల సయోధ్యకు బ్రిటన్‌లో గుర్తింపు పొందారు. లీసా 2020లో లేబర్ పార్టీ నాయకత్వం కోసం స్టార్మర్తో పోటీపడి మూడోస్థానంలో నిలిచారు. -
భారత మహిళల భారీ విజయం
చెన్నై: ఇన్నింగ్స్ ఓటమి నుంచి గట్టెక్కినా దక్షిణాఫ్రికా మహిళల జట్టు పరాజయాన్ని మాత్రం తప్పించుకోలేకపోయింది. భారత బౌలర్లు మరోసారి సమయోచితంగా రాణించడంతో దక్షిణాఫ్రికాతో జరిగిన ఏకైక టెస్టులో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దక్షిణాఫ్రికా కెప్టెన్ లౌరా వొల్వార్ట్ (314 బంతుల్లో 122; 16 ఫోర్లు) పట్టుదలతో పోరాడి తమ జట్టును ఇన్నింగ్స్ ఓటమి నుంచి తప్పించింది. మ్యాచ్ చివరిరోజు సోమవారం ఓవర్‌నైట్ స్కోరు 232/2తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికా 154.4 ఓవర్లలో 373 పరుగులకు ఆలౌటై భారత్‌కు 37 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్లు శుభ సతీశ్ (13 నాటౌట్; 1 ఫోర్), షఫాలీ వర్మ (24 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) ఇబ్బంది పడకుండా 9.2 ఓవర్లలో 37 పరుగులు సాధించి భారత్‌కు 10 వికెట్లతో విజయాన్ని అందించారు. అంతకుముందు ఓవర్‌నైట్ వ్యక్తిగత స్కోరు 93తో ఆట కొనసాగించిన లౌరా సెంచరీని పూర్తి చేసుకుంది. అనంతరం లౌరాను రాజేశ్వరి గైక్వాడ్ అవుట్ చేశాక దక్షిణాఫ్రికా క్రమం తప్పకుండా వికెట్లను చేజార్చుకుంది. భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించిన నదినె డి క్లెర్క్ (185 బంతుల్లో 61; 8 ఫోర్లు, 1 సిక్స్) చివరి వికెట్‌గా వెనుదిరగడంతో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ముగిసింది. మ్యాచ్ మొత్తంలో 10 వికెట్లు తీసిన భారత ఆఫ్ స్పిన్నర్ స్నేహ్ రాణాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. భారత టెస్టు చరిత్రలో 10 వికెట్లతో విజయం ఇది రెండోది మాత్రమే. 2002లో దక్షిణాఫ్రికాపైనే భారత జట్టు 10 వికెట్ల తేడాతో గెలిచింది. సంక్షిప్త స్కోర్లు భారత్ తొలి ఇన్నింగ్స్: 603/6 డిక్లేర్డ్; దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 266 ఆలౌట్; దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: 373 ఆలౌట్; భారత్ రెండో ఇన్నింగ్స్: 37/0 (9.2 ఓవర్లలో). -
2024 T20 World Cup: ‘టీమిండియా హై హమ్’ రెహమాన్ స్పెషల్ సాంగ్ వైరల్
హోరాహోరీగా జరిగిన పోరులో దక్షిణాఫ్రికాపై విజయం సాధించి టీ20 ప్రపంచకప్‌ను భారత జట్టు కైవసం చేసుకోవడంతో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. 17 ఏళ్ల తరువాత టీ20 వరల్డ్ కప్ టైటిల్‌ను దక్కించుకోవడంపై సర్వత్రా హర్హం వ్యక్తమవుతోంది. ఈ అపురూపమైన సందర్భాన్ని ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ కూడా సంబరంగా జరుపుకున్నారు. అంతేకాదు మెన్ ఇన్ బ్లూకి ఒక అధ్బుతమైన గిఫ్ట్ ఇచ్చారు. టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఏఆర్ రెహమాన్ బ్లూ ఇన్ మెన్‌కి అభినందనలుత తెలుపుతూ 'టీమ్ ఇండియా హై హమ్' పేరుతో ప్రత్యేక గీతాన్ని బహుమతిగా అందించారు. ఈ మ్యూజిక్ వీడియోకి సంబంధించిన యూట్యూబ్ లింక్‌ను ఏఆర్ రెహమాన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ సాంగ్‌ను తొలుత అజయ్ దేవగన్ 'మైదాన్' కోసం కంపోజ్ చేశారట. భారత ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితం ఆధారంగా అజయ్ దేవగన్ హీరోగా 'మైదాన్' మూవీకోసం 'టీమ్ ఇండియా హై హమ్'ఒరిజినల్ సాంగ్‌ను ఏఆర్ రెహమాన్ , నకుల్ అభ్యంకర్ పాడారు.కాగా జూన్29న ఉత్కంఠభరితంగా జరిగిన టీ20 వరల్డ్ కప్ పైనల్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ నాయకత్వంలో టీమిండియా దక్షిణాఫ్రికాపై ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో దేశవ్యాప్తంగా యువత రోడ్లపైకి వచ్చి, బాణా సంచా పేల్చి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నసంగతి తెలిసిందే. -
గణిత మేధావి.. తెలివితో 14 సార్లు లాటరీ గెలిచి..
లెక్కలు అనగానే చాలామందికి బాల్యం నుంచే భయం ఏర్పడుతుంది. అంకెలను చూసే సరికి కొంతమందిలో వణుకు పుడుతుంది. అయితే గణితం సాయంతో పలు విషయాల్లో విజయం సాధించవచ్చని తెలిస్తే వారిలోని భయం తొలగిపోతుంది. రొమేనియాకు చెందిన ఒక గణిత మేధావి లెక్కలతో లాటరీలలోని లాజిక్కును పట్టేసి, ఏకంగా 14 సార్లు లాటరీ గెలుచుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు.డైలీ స్టార్ వెబ్సైట్ తెలిపిన వివరాల ప్రకారం రొమేనియా నివాసి స్టెఫాన్ మాండెల్ గణిత శాస్త్రజ్ఞుడు. అతని జీతం భారత కరెన్సీతో పోలిస్తే ఏడు వేలు. అది అతని కనీస అవసరాలకు కూడా సరిపోయేది కాదు. దీంతో స్టెఫాన్ మాండెల్ తన జీవితాన్ని తక్షణం మార్చుకోవాలని, గణితాన్ని తెలివిగా ఉపయోగించి డబ్బు సంపాదించాలని అనుకున్నాడు. అంకెలను ఉపయోగించి ఒక సూత్రాన్ని సిద్ధం చేశాడు. దాని సాయంతో లాటరీలను గెలుచుకుంటూ వచ్చాడు.స్టెఫాన్ స్వయంగా ప్రత్యేక అల్గారిథమ్‌ను సృష్టించాడు. పలు పరిశోధనలు సాగించిన అనంతరం ‘సంఖ్యల ఎంపిక’కు అల్గారిథమ్‌ను సిద్ధం చేశాడు. దానికి ‘కాంబినేటోరియల్ కండెన్సేషన్’ అనే పేరు పెట్టాడు. తాను ఎన్ని లాటరీ టిక్కెట్లు కొన్నప్పటికీ, వాటికి అయ్యే ఖర్చు జాక్‌పాట్ కన్నా చాలా తక్కువగా ఉంటుందని స్టెఫాన్ కనుగొన్నాడు. దీంతో లాటరీని దక్కించుకునేందుకు అధికంగా లాటరీ టిక్కెట్లు కొని జాక్‌పాట్ గెలిచేందుకు వివిధ కాంబినేషన్లను సిద్ధం చేసేవారు. ఇది క్లిక్ అవడంతో స్టెఫాన్ లాటరీలను సొంతం చేసుకుంటూ వచ్చాడు.తరువాత స్టెఫాన్ లాటరీ సిండికేట్‌ను ఏర్పాటు చేశాడు. దీనిలో చేరినవారు స్టెఫాన్ సూచనలతో లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేస్తుంటారు. ఇలా వారు గెలుపు అవకాశాలను పెంచుకుంటారు. ఈ సిండికేట్‌కు లాటరీలో వచ్చే భారీ మొత్తాన్ని సభ్యులంతా పంచుకునేవారు. ఈ విధంగా సంపాదించిన డబ్బుతో స్టెఫాన్ ఆస్ట్రేలియాలో స్థిరపడ్డాడు.స్టెఫాన్ మాండెల్ తాను కనుగొన్న లెక్కల సూత్రం ఆధారంగా మొత్తం 14 సార్లు లాటరీని గెలుచుకున్నాడు. తరువాతి కాలంలో యూకేలోనూ తన లాటరీ సామ్రాజ్యాన్ని విస్తరించాడు. అయితే అతని సిండికేట్‌పై దర్యాప్తు సంస్థల కన్నుపడింది. దీంతో పెద్దమొత్తంలో టిక్కెట్లు కొనడంపై నిషేధం విధించారు. దీంతకితోడు స్టెఫాన్‌పై పలు కేసులు నమోదు కావడంతో న్యాయపోరాటం కోసం లెక్కకు మించినంత డబ్బు ఖర్చు చేయాల్సి వచ్చింది. దీంతో తాను కూడబెట్టిన సొమ్మునంతా పోగొట్టుకుని 1995లో తాను దివాలా తీసినట్లు స్టెఫాన్ ప్రకటించుకున్నాడు. ప్రస్తుతం స్టెఫాన్ తన స్నేహితులతో పాటు వనాటు ద్వీపంలో నివసిస్తున్నాడు. యూనిలాడ్ నివేదిక ప్రకారం స్టెఫాన్ 1960-70ల కాలంలోనే లాటరీలలో రూ. 200 కోట్లకుపైగా మొత్తాన్ని గెలుచుకున్నాడు. -
Priyanka Gandhi: మీ చెల్లెల్ని అయినందుకు గర్వంగా ఉంది
న్యూఢిల్లీ: తన సోదరుడు రాహుల్ గాంధీ ఎప్పటికీ వెనక్కి తగ్గరని, సత్యం కోసం పోరాటాన్ని ఆపబోరని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ వాద్రా ప్రశంసించారు. లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన రాహుల్‌కు బుధవారం ‘ఎక్స్’లో అభినందనలు తెలియజేశారు. ‘‘మీరు ఎప్పుడూ తలెత్తుకొని ఉంటారు. ఎవరేం చెప్పినా, ఏం చేసినా, ఎన్నిక ప్రతికూల పరిస్థితులు ఎదురైనా మీరు వెనక్కి తగ్గరు. మీ అంకితభావాన్ని ఎవరెంతగా సందేహించినా మీరు మీపై విశ్వాసం కోల్పోరు. కోపం, విద్వేషం వంటివి మిమ్మల్ని ప్రభావితం చేయలేవు. మీరు చాలా ధైర్యవంతులు. మీ చెల్లెల్ని అయినందుకు ఎంతో గర్వంగా ఉంది’’ అని ప్రియాంక పోస్టు చేశారు. -
అరుణాచల్‌లో బీజేపీ
ఈటానగర్: అరుణాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘనవిజయం సాధించింది. వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చింది. 60 స్థానాలకు గాను ఏకంగా 46 చోట్ల కాషాయ జెండా రెపరెపలాడింది. 10 స్థానాలు ముందే ఏకగ్రీవంగా బీజేపీ సొంతం కావడంతో ఏప్రిల్ 19న మిగతా 50 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఆదివారం ఓట్ల లెక్కింపు జరిగింది. బీజేపీ 36 సీట్లు గెలుచుకోగా నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) 5, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) 3, పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ (పీపీఏ) 2 స్థానాలు నెగ్గాయి. కాంగ్రెస్ ఒక స్థానంతో సరిపెట్టుకుంది. ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు నెగ్గారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 41 సీట్లు సాధించగా ఈసారి మరో ఐదు పెరగడం విశేషం. ఏకగ్రీవంగా నెగ్గిన వారిలో సీఎం పెమా ఖండూ కూడా ఉన్నారు. అభివృద్ధి రాజకీయాలకు పట్టం: మోదీ అరుణాచల్ ఫలితాలపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వెలిబుచ్చారు. బీజేపీకి మరోసారి విజయం కట్టబెట్టిన రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రగతి కోసం మరింత ఉత్సాహంగా, నూతన శక్తితో పని చేస్తామంటూ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ‘‘అభివృద్ధి రాజకీయాలకు ప్రజలు పట్టం కట్టారు. పార్టీ కార్యకర్తల అలుపెరుగని కృషితోనే ఈ విజయం సాధ్యమైంది’’ అని అన్నారు. సంగీతాభిమాని...అరుణాచల్‌లో బీజేపీని వరుసగా మూడోసారి గెలుపు బాటన నడిపిన నాయకుడిగా పెమా ఖండూ పేరు మార్మోగిపోతోంది. క్రీడలు, సంగీతం పట్ల అమితాసక్తి ఉన్న ఆయన రాష్ట్రంలో తిరుగులేని నేతగా ఎదిగారు. 2000లో కాంగ్రెస్‌లో చేరిన ఖండూ తండ్రి డోర్జీ ఖండూ ప్రాతినిధ్యం వహించిన ముక్తో అసెంబ్లీ స్థానం నుంచి ఉప ఎన్నికలో గెలిచారు. నబామ్ తుకీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. 2016 జనవరిలో రాష్ట్రపతి పాలన అనంతరం బీజేపీ మద్దతిచి్చన కల్హోపుల్ ప్రభుత్వంలో మరోసారి మంత్రి అయ్యారు. సుప్రీంకోర్టు జోక్యంతో తుకీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చింది. తుకీ రాజీనామాతో 2016లో ఖండూ 37 ఏళ్ల వయసులో తొలిసారి సీఎం అయ్యారు. తర్వాత బీజేపీలో చేరారు. 2019లో రెండోసారి సీఎం అయి ఐదేళ్లూ కొనసాగారు. తాజాగా మరోసారి విజయం దక్కించుకున్నారు. బౌద్ధ మతస్థుడైన పెమా ఖండూ మోన్పా గిరిజన తెగకు చెందినవారు. తండ్రి డోర్జీ 2011లో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. -
పశ్చిమ బెంగాల్లో బీజేపీకి పట్టం? కారణాలివే?
2024 లోక్‌సభ ఎన్నికల ఏడు దశల ఓటింగ్ ముగిసింది. ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి. అయితే అందరి చూపు జూన్ 4న వెలువడనున్న తుది ఫలితాలపైనే ఉంది. ఇండియా టీవీ సీఎన్ఎక్స్ సర్వే ప్రకారం పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఆధిక్యంలో నిలవనుంది. బీజేపీకి 22-26 సీట్లు వస్తాయని తేలింది. టీఎంసీ 14-18 సీట్లు దక్కించుకునే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ 1-2 సీట్లతో సరిపెట్టుకునేలా కనిపిస్తోంది. పశ్చి బెంగాల్లో బీజేపీ ఆధిక్యతకు కారణాలివేనంటూ పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.పశ్చిమ బెంగాల్లో హిందూ ఓటర్లు మమతా బెనర్జీ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారట. దీనికి రుజువుగా సోషల్ మీడియాలో పలు వీడియోలు కనిపిస్తాయి. మమత ప్రభుత్వం ఒక వర్గానికి చెందినవారిని ప్రోత్సహిస్తూ, హిందువులను అణచివేస్తున్నదనే ఆరోపణలున్నాయి.సందేశ్‌ఖాలీ బసిర్హత్ లోక్‌సభ స్థానం పరిధిలోకి వస్తుంది. ఇక్కడి మహిళలపై జరిగిన లైంగిక వేధింపుల ఘటనలో బీజేపీ తృణమూల్ కాంగ్రెస్‌ను కార్నర్ చేసింది. నిందితుడు షాజహాన్ షేక్‌కు టీఎంసీతో సంబంధం ఉందని, అందుకే అతని అరెస్టులో జాప్యంపై జాప్యం చేసిందని బీజేపీ దుమ్మెత్తిపోసింది.బెంగాల్లో ఎన్నికలు జరిగినప్పుడల్లా హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటాయి. దీనిని రాజకీయ పార్టీలు సద్వినియోగం చేసుకుంటున్నాయి. రామ నవమి సందర్భంగా ఊరేగింపుపై రాళ్లు రువ్వడం విషయంలో మమత ప్రభుత్వం మౌనం వహించడాన్ని పలువురు తప్పుబట్టారు. మమతా బెనర్జీపై ప్రజల్లో ఆగ్రహం పెరగడానికి ఇదే ప్రధాన కారణమంటారు.ఈ ఏడాది బెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో రామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. రామమందిరంతో బీజేపీకి ప్రత్యక్ష సంబంధం ఉండటంతో బెంగాల్లో బీజేపీకి అనుకూల వాతావరణం ఏర్పడింది.ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమిత్ షా లోక్‌సభ ఎన్నికల సందర్భంగా పలు ర్యాలీలు నిర్వహించారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ఓటమి తరువాత, ఆపార్టీ బెంగాల్లో మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. దాని ఫలితంగా ఈ రోజు బీజేపీ బెంగాల్లో ఆధిక్యంలో ఉన్నట్లు సమాచారం.బెంగాల్లో అవినీతి, ఉపాధి లేకపోవడం, ఫ్యాక్టరీల మూసివేత, శాంతిభద్రతల సమస్యలు సర్వసాధారణంగా మారాయి. అటువంటి పరిస్థితిలో ప్రజల్లో అధికార ప్రభుత్వంపై ఆగ్రహం ఏర్పడింది. ఇది కూడా బీజేపీకి ఓట్లు పడేలా చేసిందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. -
కంగనా ఇక మండీ క్వీన్?
హిమాచల్ ప్రదేశ్‌లోని నాలుగు లోక్‌సభ స్థానాలకు వెలువడిన ఎగ్జిట్ పోల్స్ బీజేపీవైపే మొగ్గుచూపాయి. రాష్ట్రంలో బీజేపీ ఆధిక్యతను ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. మండి లోక్‌సభ స్థానం నుంచి పోటీకి దిగిన బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్, కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్ మధ్య భారీ పోటీ ఏర్పడింది. అయితే ఫలితాల్లో కంగనా రనౌత్ గెలిచే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఈ స్థానం నుంచి నుంచి పది మంది అభ్యర్థులు పోటీ చేసినప్పటికీ మండీ కిరీటం కంగనాకే దక్కుతుందని ఎగ్జిట్ పోల్స్ అంచనావేశాయి. కాంగ్రా లోక్‌సభ స్థానంలో బీజేపీ నుంచి రాజీవ్, కాంగ్రెస్ నుంచి ఆనంద్ శర్మ తలపడ్డారు. ఈ స్థానంలో కూడా బీజేపీ విజయం ఖాయంగా కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కాంగ్రాలోనూ బీజేపీ ఆధిక్యంలో ఉంది. ఈ స్థానం నుంచి పది మంది అభ్యర్థులు పోటీకి దిగారు.హమీర్పూర్ లోక్‌సభ స్థానంలో బీజేపీ నుంచి అనురాగ్ ఠాకూర్, కాంగ్రెస్ నుంచి సత్పాల్ సింగ్ రైజాదా మధ్య పోటీ నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం అనురాగ్ ఠాకూర్ హమీర్పూర్ స్థానాన్ని గెలుచుకునే అవకాశం ఉంది. ఈ స్థానంలో మొత్తం 12 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. సిమ్లా లోక్‌సభ స్థానంలో బీజేపీ నుంచి సురేశ్ కుమార్, కాంగ్రెస్ నుంచి వినోద్ సుల్తాన్‌పురి తలపడ్డారు. ఈ స్థానంలో కూడా బీజేపీ విజయం సాధించనుందని తెలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా దక్కే అవకాశాలు లేవని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. బీజేపీ ఈ నాలుగు స్థానాల్లో విజయం దక్కించుకునే అవకాశాలున్నాయని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. -
కాంగ్రెస్ ఖాతాలో రాయ్‌బరేలీ? రాహుల్‌కు పట్టం?
దేశంలో లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి వెలువడిన పలు ఎగ్జిట్ పోల్స్‌లోని వివరాల ప్రకారం కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ రాయ్ బరేలీ స్థానం నుండి విజయం సాధించే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ తన సంప్రదాయ స్థానమైన రాయ్ బరేలీని కాపాడుకోవడంలో విజయం సాధించనుంది. అలాగే మంచి ఆధిక్యతనూ దక్కించుకోనున్నదని ఎగ్జిట్‌పోల్స్ చెబుతున్నాయి.రాయ్‌బరేలీలో రాహుల్ గాంధీపై బీజేపీ దినేష్ ప్రతాప్ సింగ్‌ను రంగంలోకి దింపింది. ఈ ప్రాంతంలో ఆయనకు మంచి పట్టు ఉంది. అయితే పలు ఎగ్జిట్ పోల్స్ ఈ సీటు కాంగ్రెస్‌కే దక్కుతుందని అంచనా వేస్తున్నాయి. 2019లో ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ గెలుపొందిన ఏకైక స్థానం రాయ్‌బరేలీ. సోనియా గాంధీ ఇక్కడ నుంచి వరుసగా నాలుగోసారి ఎంపీగా గెలిచారు. రాయ్‌బరేలీ మినహా యూపీలోని మరే సీటులోనూ కాంగ్రెస్ ఖాతా తెరవలేదు.2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీ అమేథీ స్థానం నుంచి పోటీ చేసి, ఓటమి పాలయ్యారు. అయితే అదేసమయంలో కేరళలోని వయనాడ్ నుంచి విజయం సాధించారు. సోనియా గాంధీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయలేదు. తన కుమారుడు రాహుల్ గాంధీని రాయ్‌బరేలీ నుంచి పోటీకి దింపాలని సోనియా ముందుగానే నిర్ణయించుకున్నారు. ఎన్నికల ప్రచారంలో సోనియా గాంధీ తన కుమారుడిని రాయ్ బరేలీ ప్రజలకు అప్పగిస్తున్నట్లు పేర్కొన్నారు. సోనియా గాంధీ చేసిన ఈ ప్రకటన ఓటర్లను ఆకట్టుకుంటుందని కాంగ్రెస్ భావించింది. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్ అంచనాలకు ఊతమిస్తున్నాయి.రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం కాంగ్రెస్‌కు కంచుకోట. 1951-52లో రాయ్‌బరేలీ ప్రత్యేక స్థానం కాదు. అప్పట్లో రాయ్‌బరేలీ, ప్రతాప్‌గఢ్‌లను కలిపి ఒక సీటు ఉండేది. తొలి ఎన్నికల్లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ భర్త ఫిరోజ్ గాంధీ ఇక్కడి నుంచి పోటీ చేసి ఎంపీ అయ్యారు. ఆ తర్వాత 1957లో రాయ్‌బరేలీ ప్రత్యేక స్థానంగా మారడంతో ఫిరోజ్ గాంధీ ఈ స్థానం నుంచి తరిగి పోటీ చేసి, విజయం సాధించి పార్లమెంటుకు చేరుకున్నారు. ఇందిరా గాంధీ వరుసగా నాలుగు సార్లు ఇక్కడ నుండి ఎంపీ అయ్యారు. మొదటి లోక్‌సభ ఎన్నికల నుండి 2019లో జరిగిన ఎన్నికల వరకు మొత్తం 16 సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు ఈ స్థానం నుండి విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ ఈ స్థానం నుంచి ఓడిపోయిన సందర్భాలు మూడు మాత్రమే ఉన్నాయి. -
రాహుల్‌గాంధీపై అస్సాం సీఎం సంచలన వ్యాఖ్యలు
గువహటి: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీపై అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌గాంధీ పాకిస్తాన్లో పోటీచేస్తే ఖచ్చితంగా గెలుస్తారని ఎద్దేవా చేశారు.‘పాకిస్తాన్లో రాహుల్‌గాంధీ చాలా పాపులర్. ఒకవేళ పాకిస్తాన్లో ఎన్నికలు జరిగితే అక్కడ రాహుల్‌గాంధీ భారీ మెజారిటీతో గెలుస్తారు. రాహుల్‌ను పాకిస్థాన్‌లో మేం ఓడించలేం. అయితే పాకిస్తాన్లో ఏం జరుగుతుందో దానికి వ్యతిరేకంగా భారత్‌లో జరుగుతుంది’అని హిమంత సెటైర్లు వేశారు. రాహుల్‌గాంధీ శుక్రవారం(మే3) తన పాత నియోజకవర్గం ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నుంచి కాకుండా రాయ్‌బరేలి నియోజకవర్గం నుంచి నామినేషన్ వేసిన వేళ హిమంత ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. -
Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్‌తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
-
బీజేపీ 400 లక్ష్యానికి ఈ 32 సీట్లు కీలకం!
దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల సందడి నెలకొంది. ఏప్రిల్ 19 నుంచి జూన్ ఒకటి వరకు ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. ఒకవైపు బీజేపీ మూడోసారి ఎన్నికల్లో విజయం సాధించాలని ప్రయత్నిస్తుండగా, మరోవైపు ఇండియా కూటమి.. బీజేపీని ఓడించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మూడోసారి గెలిస్తే, వరుసగా మూడు లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ రికార్డును ప్రధాని మోదీ సమం చేసినట్లవుతుంది. నెహ్రూ 1951–52, 1957, 1962లో వరుసగా మూడు లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు. ఈసారి ఎన్డీఏకు 400కు పైగా సీట్లు వస్తాయని, అందులో బీజేపీకి కనీసం 370 సీట్లు వస్తాయని ప్రధాని మోదీ ఇప్పటికే నమ్మకం వ్యక్తం చేశారు. అయితే ఈ లక్ష్యాన్ని సాధించాలంటే కమలదళం 2019లో తొలిసారిగా గెలిచిన 32 లోక్‌సభ స్థానాలను తిరిగి గెలుచుకోవడం ఎంతో ముఖ్యం. ఈ కీలకమైన సీట్లలో పశ్చిమ బెంగాల్ నుంచి 16, హర్యానా నుంచి 3, కర్ణాటక నుంచి 3, ఒడిశా నుంచి 3, తెలంగాణ నుంచి 2, త్రిపుర నుంచి 2 సీట్లు ఉన్నాయి. ఒక సీటు అస్సాం నుండి, ఒక సీటు మహారాష్ట్ర నుండి, ఒక సీటు మణిపూర్ నుండి కూడా గెలుచుకోవాల్సివుంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో బీజేపీ తొలిసారిగా 16 సీట్లు గెలుచుకుంది. అలాగే హర్యానాలోని సిర్సా, హిసార్, రోహ్తక్ స్థానాలను బీజేపీ గెలుచుకుంది. ఇదే విధంగా కర్ణాటకలోని చామరాజనగర్, చిక్కబల్లాపూర్, కోలార్ స్థానాలను కూడా గెలుచుకుంది. 2019 ఎన్నికల్లో ఒడిశాలో బీజేపీ మొదటిసారి మూడు స్థానాలను గెలుచుకుంది. 2019లో తొలిసారిగా తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్‌లో పార్టీ విజయం సాధించింది. అదే ఏడాది త్రిపుర పశ్చిమ, త్రిపుర తూర్పు లోక్‌సభ స్థానాలను గెలుచుకోవడం ద్వారా ఆ రాష్ట్రంలో తొలిసారిగా బీజేపీ తన ఖాతా తెరవడంలో విజయం సాధించింది. 2019లో తొలిసారిగా అసోంలో బీజేపీ 9 సీట్లు గెలుచుకుంది. 2019లో తొలిసారిగా మహారాష్ట్రలో మాధాలో బీజేపీ విజయం సాధించింది. ఇన్నర్ మణిపూర్ సీటును గెలుచుకోవడం ద్వారా, బీజేపీ 2019లో మొదటిసారి మణిపూర్‌లో తన ఖాతాను తెరిచింది. -
అరుణాచల్‌లో బీజేపీకి తొలి విజయం?.. ఐదుగురు ఏకగ్రీవం?
అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే బీజేపీకి సానుకూల వాతావరణం ఏర్పడింది. ముఖ్యమంత్రి పెమా ఖండూ సహా ఐదుగురు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కావచ్చని సమాచారం. మార్చి 26, బుధవారం నామినేషన్‌కు చివరి తేదీ అని, అయితే రాష్ట్రంలోని ఐదు అసెంబ్లీ స్థానాల్లో ఇతర పార్టీల అభ్యర్థులెవరూ నామినేషన్ దాఖలు చేయలేదని ఓ అధికారి తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని రెండు లోక్‌సభ, 60 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 19న ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ బుధవారం సాయంత్రంతో ముగిసినట్లు అధికారి తెలిపారు. గురువారం నామినేషన్ పత్రాల పరిశీలన జరుగుతుందని, మార్చి 30 వరకు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చన్నారు. గురువారం నామినేషన్ పత్రాల పరిశీలన తర్వాత ఆ ఐదుగురు బీజేపీ అభ్యర్థులు ఏకపక్షంగా గెలుస్తారా లేదా అనేది నిర్ణయిస్తామని జాయింట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ లైకెన్ కోయు మీడియాకు తెలిపారు. రాష్ట్రంలోని 60 అసెంబ్లీ స్థానాలకు మొత్తం 197 మంది అభ్యర్థులు నామినేషన్ పత్రాలు దాఖలు చేసినట్లు ఆయన తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్‌లో ముఖ్యమంత్రి పెమా ఖండూ, ఉప ముఖ్యమంత్రి చౌనా మెయిన్‌తో సహా ఐదుగురు అభ్యర్థులు ఎన్నికలలో ఏకగ్రీవంగా గెలిచారని బీజేపీ పేర్కొంది. వీరు పోటీ చేస్తున్న చోట నుంచి చివరి రోజు వరకు ఇతర పార్టీల అభ్యర్థులెవరూ నామినేషన్ దాఖలు చేయలేదని రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి తేజీ నేచా పేర్కొన్నారు. -
నాడు హత్యలకు అడ్డా.. నేడు అత్యంత సురక్షిత ప్రాంతం!
ఎల్ సాల్వడార్.. మధ్య అమెరికాలోని అత్యంత చిన్నదైన, అత్యధిక జనాభా కలిగిన దేశం. ఒకప్పుడు నేరాలు, అవినీతి, హత్యలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న ఈ దేశం రూపురేఖలు ఇప్పుడు సమూలంగా మారిపోయాయి. అధ్యక్షుడు నయూబ్ బకెలే దేశ అధికార పగ్గాలు చేపట్టడంతో దేశంలో నేరాలు, హత్యల సంఖ్య గణనీయంగా తగ్గింది. ‘కూల్ డిక్టేటర్’గా గుర్తింపు ఇటీవల జరిగిన ఎల్ సాల్వడార్ ఎన్నికల్లో నయీబ్ బుకెలే ఘనవిజయం సాధించి, అధ్యక్షపీఠం అధిరోహించారు. దేశంలో అంతకంతకూ దిగజారుతున్న ప్రజాస్వామ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, వీటిని నయూబ్ బుకెలే చక్కదిద్దుతారన్న నమ్మకంతో ఓటర్లు ఆయన పార్టీకి పట్టం కట్టారు. నయీబ్ బుకెలే దేశంలో పెరుగుతున్న హత్యల నియంత్రణకు తీసుకున్న కఠిన చర్యలపై ఎల్ సాల్వడార్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశంలోని కార్మికులైతే ఘనంగా సంబరాలు జరుపుకుంటున్నారు. నయీబ్ బుకెలే ఇప్పుడు ప్రపంచవ్యాపంగా ‘కూల్ డిక్టేటర్’గా గుర్తింపు పొందారు. గణనీయంగా తగ్గిన భద్రతా ముప్పు ఒక నివేదిక ప్రకారం నయీబ్ బుకెలే 2019లో తొలిసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎల్ సాల్వడార్లో శాంతిభద్రతల పరిస్థితిలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. ఫలితంగా దేశంలో భద్రతా ముప్పు గణనీయంగా తగ్గింది. తాజాగా 2024 అధ్యక్ష ఎన్నికల్లోనూ ఆయనే గెలవడంతో అతని ‘న్యూ ఐడియాస్ పార్టీ’ కార్యకర్తలు విజయోత్సాహంతో ర్యాలీలు చేపట్టారు. లెక్కలేనంతమంది బుకెలే అభిమానులు సాల్వడార్‌లోని సెంట్రల్ స్క్వేర్‌లో సమావేశమై, ఉత్సవాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నీలి రంగు దుస్తులు ధరించి ఆనందంగా జెండాలు రెపరెపలాడించారు. ‘న్యూ ఐడియాస్ పార్టీ’ పాలన 42 ఏళ్ల అధ్యక్షుడు నయీబ్ బుకెలే తాను మరోమారు సాధించిన ఈ విజయాన్ని తన పరిపాలనకు ఇదొక ‘రిఫరెండం’గా అభివర్ణించారు. దేశ శాసనసభలో మొత్తం 60 స్థానాలను గెలుచుకున్న బుకెలేకి చెందిన ‘న్యూ ఐడియాస్ పార్టీ’ దేశాన్ని మరోమారు పాలించనుంది. ఈ ఎన్నికల తర్వాత దేశంలో బుకెలే ప్రభావం మరింతగా పెరిగింది. సాల్వడార్ చరిత్రలో బుకెలే అత్యంత ప్రభావవంతమైన నాయకునిగా ఎదిగారని విశ్లేషకులు చెబుతుంటారు. అసురక్షితం నుంచి సురక్షితానికి.. అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన నేపధ్యంలో నయీబ్ బుకెలే తన భార్యతో కలిసి నేషనల్ ప్యాలెస్ బాల్కనీ నుండి మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడుతూ ‘అందరూ కలిసి ప్రతిపక్షాన్ని కూల్చివేశారు. ఎల్ సాల్వడార్ అత్యంత అసురక్షిత దేశం అనే పేరు నుంచి అత్యంత సురక్షితమైన దేశమనే దిశకు చేరుకుంది. రాబోయే ఐదేళ్లలో మనం చాలా చేయాల్సివుంది’ అని ఆత్మవిశ్వాసంతో పేర్కొన్నారు. ఒకే వారంలో 80 మంది హత్య ఒక నివేదిక ప్రకారం బుకెలే దేశ అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఎల్ సాల్వడార్లో హత్యల రేటు గణనీయంగా తగ్గింది. ‘మారా సాల్వత్రుచా గ్యాంగ్’ (ఎంఎస్-13)సభ్యులు దేశంలో పెద్ద సంఖ్యలో హత్యలు సాగిస్తూ వచ్చారు. 2022 మార్చి లో ఒకే వారంలో వీరు 80 మందిని హత్య చేశారు. బుకెలే ప్రభుత్వం నేరస్తుల ముఠాతో సంబంధం ఉన్న 75 వేల మందిని అరెస్టు చేసింది. El Salvador's President Nayib Bukele, who has described himself as the 'World's coolest dictator,' is all but certain to be re-elected in a presidential bid for another five-year term https://t.co/t7X5vV5VLq pic.twitter.com/1LmIt9aaVV — Reuters (@Reuters) January 30, 2024 70 శాతం మేరకు తగ్గిన హత్యల రేటు పెద్ద సంఖ్యలో అరెస్టులు జరిగిన తర్వాత ఎల్ సాల్వడార్‌లోని క్రిమినల్ ముఠాల వెన్ను విరిగినట్లయ్యింది. ఈ చర్య ఫలితంగా 2022లో హత్యలు దాదాపు 60 శాతం మేరకు తగ్గాయి. అయితే 2023 నాటికి దేశంలో అత్యధిక ఖైదు రేటు నమోదు కావడంతో ఇది మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలకు దారితీసింది. భద్రతా దళాల చర్యల అనంతరం 2023లో ఎల్ సాల్వడార్లో హత్యల రేటు 70 శాతం మేరకు తగ్గి, అది ఒక లక్షకు 2.4 శాతానికి చేరింది. ఈ సంఖ్య లాటిన్ అమెరికాలోని చాలా దేశాల కంటే అతి స్వల్పం నేరాలు, అవినీతి, అసమానతలతో పోరాటం 2019లో ఎల్ సాల్వడార్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సొంతం చేసుకున్న బుకెలే దేశంలో చోటుచేసుకున్న నేరాలు, అవినీతి, అసమానతలతో పోరాడతానని వాగ్దానం చేశారు. తన మద్దతుదారులతో మెరుగ్గా కమ్యూనికేట్ చేయడానికి, విమర్శకులను ట్రోల్ చేయడానికి ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, టిక్‌టాక్ తదితర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను సమర్థవంగంగా ఉపయోగించుకున్నారు. బుకెల్ తరచూ బేస్ బాల్ క్యాప్, లెదర్ జాకెట్, సన్ గ్లాసెస్ ధరిస్తారు. సెల్ఫీలు, మీమ్లను అమితంగా ఇష్టపడతారు. President Bukele takes a victory lap after El Salvador becomes the safest nation in the Western hemisphere He then tells foreign critics to go stuff it pic.twitter.com/iBNEPooXcP — Jack-of-all-trades (@Upliftingvision) February 13, 2024 -
South Africa Under-19: అర్షిన్ సెంచరీ: అజేయంగా భారత్
దక్షిణాఫ్రికాలో జరుగుతున్న అండర్–19 ప్రపంచకప్ క్రికెట్ టోర్నీలో అమెరికాతో ఆదివారం జరిగిన గ్రూప్ ‘ఎ’ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత జట్టు 201 పరుగుల తేడాతో గెలిచింది. లీగ్ దశను అజేయంగా ముగించింది. ముందుగా భారత్ 50 ఓవర్లలో 5 వికెట్లకు 326 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అర్షిన్ కులకర్ణి (108; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీ సాధించాడు. అనంతరం అమెరికా 50 ఓవర్లలో 8 వికెట్లకు 125 పరుగులు చేసి ఓడిపోయింది. మంగళవారం జరిగే ‘సూపర్ సిక్స్’ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో భారత్ ఆడతుంది. -
Australia v West Indies: విండీస్ సంచలనం
బ్రిస్బేన్: వెస్టిండీస్ యువ పేసర్ షామర్ జోసెఫ్ (7/68) నిప్పులు చెరిగే బంతులతో ఆ్రస్టేలియా బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. 1997 తర్వాత ఆ్రస్టేలియా గడ్డపై వెస్టిండీస్‌కు తొలిసారి టెస్టులో విజయం అందించాడు. ఇప్పటి వరకు ఆడిన 11 డే/నైట్ టెస్టుల్లోనూ గెలిచిన ఆ్రస్టేలియా జట్టు షామర్ దెబ్బకు 12వ డే/నైట్ టెస్టులో తొలిసారి పరాజయం రుచి చూసింది. డే/నైట్‌గా జరిగిన రెండో టెస్టులో ఆట నాలుగో రోజు 216 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించేందుకు ఆ్రస్టేలియా ఓవర్‌నైట్ స్కోరు 60/2తో బరిలోకి దిగింది. ఒకదశలో ఆసీస్ 113/2తో విజయం దిశగా సాగుతున్నట్లు కనిపించింది. అయితే క్రీజులో నిలదొక్కుకున్న కామెరాన్ గ్రీన్ (42; 4 ఫోర్లు)ను, ట్రావిస్ హెడ్ (0)ను షామర్ జోసెఫ్ వరుస బంతుల్లో అవుట్ చేశాడు. ఒకవైపు ఓపెనర్ స్టీవ్ స్మిత్ (91 నాటౌట్; 9 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరి పోరాటం చేస్తుండగా.. మరోవైపు ఇతర ఆసీస్ బ్యాటర్లను షామర్ పెవిలియన్‌కు పంపించాడు. చివరకు ఆ్రస్టేలియా 50.5 ఓవర్లలో 206 పరుగులవద్ద ఆలౌట్ కావడంతో వెస్టిండీస్ 8 పరుగుల తేడాతో చిరస్మరణీయ విజయం అందుకుంది. రెండు టెస్టుల సిరీస్‌ను 1–1తో ‘డ్రా’ చేసుకుంది. షామర్ జోసెఫ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’తోపాటు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి. షామర్ ఈ సిరీస్‌లో 13 వికెట్లు తీయడంతోపాటు 57 పరుగులు చేశాడు. సంక్షిప్త స్కోర్లు వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్: 311; ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్: 289/9 డిక్లేర్డ్; వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్: 193; ఆ్రస్టేలియా రెండో ఇన్నింగ్స్: 206 ఆలౌట్ (50.5 ఓవర్లలో) (స్టీవ్ స్మిత్ 91 నాటౌట్, గ్రీన్ 42, స్టార్క్ 21, షామర్ జోసెఫ్ 7/68). -
Womens Hockey Olympic Qualifier: గెలిచి నిలిచిన భారత్
రాంచీ: పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించే అవకాశాలు సజీవంగా ఉండాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత మహిళల హాకీ జట్టు సత్తా చాటుకుంది. ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా న్యూజిలాండ్ జట్టుతో జరిగిన గ్రూప్ ‘బి’ రెండో లీగ్ మ్యాచ్‌లో భారత్ 3–1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. భారత్ తరఫున సంగీత కుమారి (1వ ని.లో), ఉదిత (12వ ని.లో), డుంగ్‌డుంగ్ బ్యూటీ (14వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. న్యూజిలాండ్ జట్టుకు మేగన్ హల్ (9వ ని.లో) ఏకైక గోల్‌ను అందించింది. మరో మ్యాచ్‌లో అమెరికా 2–0తో ఇటలీ జట్టును ఓడించింది. ప్రస్తుతం అమెరికా 6 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా... భారత్, న్యూజిలాండ్ 3 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాయి. మంగళవారం జరిగే చివరి రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో అమెరికాతో న్యూజిలాండ్; ఇటలీతో భారత్ తలపడతాయి. -
గెలుపు
విక్రాంత్‌కి మెలకువ వచ్చింది. తాను చనిపోయాడని అతనికి తెలుసు. ఇది స్వర్గమా లేక మధ్యలో ఏదైనా మజిలీనా.. అనుకుంటూ చుట్టూ చూశాడు. అది ఒక గది. విక్రాంత్ ఆ గదిలోని ఒక కిటికీ దగ్గర కూర్చుని ఉన్నాడు. ఏదో ఆఫీస్ రూమ్‌లా ఉందా గది. కాస్త దూరంలో ఉన్న ఇంకో చైర్లో ఎవరో వ్యక్తి కూర్చుని టేబుల్ లైట్ వెలుగులో ఏదో రాసుకోవడం కనిపిస్తోంది. తాను చనిపోయిన విషయం విక్రాంత్‌కి స్పష్టంగా గుర్తుంది. అర్ధరాత్రి వేళ ఇంటికి వెళుతుంటే.. స్కూటీ మీదనించి ఎగిరి పడటం, రోడ్డు పక్కనున్న డివైడర్‌కి తల గుద్దుకోవడం, ఆ ఫోర్స్ తెలియడంతోనే ప్రాణం పోతోందని అర్థంకావడం, కళ్ళ మీంచి కారిపోతున్న రక్త ధారల మధ్యలోంచి తనని గుద్దిన కారు వేగంగా అక్కడినించి వెళ్లిపోవడాన్ని మసక మసకగా చూడటం.. ఇవన్నీ అతనికి గుర్తున్నాయి. ఆ యాక్సిడెంట్లో అతను బతికే అవకాశమే లేదు. తాను నిజంగా చనిపోయాడని అతనికి తెలీడానికి కారణం అదొక్కటే కాదు. తనకి శరీరం లేని విషయం, ఇప్పుడు ఆలోచిస్తున్నది తన ఆత్మ మాత్రమేనన్న సంగతి అతనికి బాగా అర్థమవడం కూడా! తన సెన్సరీ ఆర్గాన్స్ అన్నీ చాలా గొప్ప వృద్ధి పొందినట్టుగా, బతికి ఉన్నప్పటి అనుభూతికి భిన్నమైన గ్రాహ్యత ఏదో అతనికి తెలుస్తోంది. ఎక్కడున్నాడు మరి! కొంచెం వెనక్కి జరిగి కిటికీ కర్టెన్‌ని జరిపి బయటకి చూశాడు. అంతా చీకటి. వీధి లైట్లు కూడా వెలగడం లేదు. ఇంతలో అతనున్న గదిలో కదలికకి మళ్ళీ తిరిగి చూశాడు. ఆ గదిలో కూర్చుని ఉన్న వ్యక్తి.. భయం, అయోమయం నిండిన ముఖంతో కదిలిన కర్టెన్లోంచి లోపలికి వస్తున్న వాహనాల హెడ్ లైట్ల వెలుగును చూస్తున్నాడు. ఆ వెలుగు నీడల మధ్య ఆ వ్యక్తిని గుర్తు పట్టాడు విక్రాంత్. అతను రఘు. తండ్రి అతనికి విక్రాంత్ అని పేరు పెట్టినప్పుడు అందరూ నవ్వారట. ‘నీ రాతల పైత్యం నీ కొడుకు పేరులో కూడా కనిపిస్తోందిరోయ్’ అంటూ స్నేహితుల్లాంటి శత్రువులు వెటకారం చేశారట. ‘నా కొడుకు ఈ జీవితమనే యుద్ధాన్ని గెలిచి విక్రాంతుడవాలి. అందుకే ఆ పేరు పెట్టాను’ అనేవాడట తండ్రి. అతను స్కూల్ చదువుకి వచ్చినప్పుడు కూడా పిల్లలు ‘వికారం వికారం’ అని ఏడిపించేవారు. తెలుగు మాస్టారు విశ్వనాథంగారు మాత్రం ‘మంచి మోడరన్ పేరు పెట్టాడురా మీ నాన్న!’ అన్నరోజు తాను పడిన సంతోషం ఇంకా గుర్తుంది విక్రాంత్‌కి. ఇంటికెళ్లి తండ్రికి ఎంతో గొప్పగా చెప్పాడు ఆ విషయం. మురిపెంగా నవ్వి ముద్దు పెట్టుకున్న తండ్రి, ప్రేమగా, గారంగా తనని చూసుకున్న తండ్రి అనుకోకుండా అనారోగ్యం బారిన పడ్డాడు. పెద్దగా ఆస్తులేవీ లేని, కో ఆపరేటివ్ బ్యాంక్‌లో క్లర్క్ ఉద్యోగం చేస్తున్న తండ్రికి సరైన వైద్యం అందలేదు. అసలు రోగమేమిటో కూడా తెలీకుండానే నెల తిరక్కుండా తననీ, అమాయకురాలైన అమ్మనీ అనాథల్ని చేసి వెళ్ళిపోయాడు. ఉన్న ఒక్క మేనమామే వాళ్ళకి దిక్కయ్యాడు. ‘ఒక్కడే మగపిల్లాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది’ అని చుట్టుపక్కల వాళ్ళు అనుకోవడం విక్రాంత్‌కి తెలుసు. ఆ మేనమామ కొడుకే రఘు. రఘు ముఖంలో కనిపిస్తున్న ఆ భయం చూస్తుంటే విక్రాంత్‌కి అదో విధమైన ఆనందం కలిగింది. మెల్లగా కర్టెన్ వదిలేశాడు. రఘు ఓసారి గదంతా కలియజూసి, తిరిగి రాసుకోవడం మొదలుపెట్టాడు. మరోసారి కర్టెన్ జరిపి రఘు రియాక్షన్ ఏమిటో చూడాలనిపించింది విక్రాంత్‌కి. ‘చిన్న పిల్లాడిలా ఏంటిది!’ అనుకుని తన ఆలోచనకి తనే నవ్వుకున్నాడు. చనిపోయాడు సరే, తన ఇంటికి వెళ్లకుండా ఇక్కడికి ఎందుకు వచ్చాడు? స్వాతి ఎంత కంగారు పడుతూంటుందో, తను యాక్సిడెంట్లో చనిపోయిన విషయం ఇంకా తెలిసిందో లేదో, సహజ తన కోసం ఎదురు చూసీ చూసీ నిద్రపోయి ఉంటుంది. సూపర్ మార్కెట్లో ఆ ఉద్యోగం వల్ల వచ్చే సంపాదనతో గడవక, పిజ్జా డెలివరీలు చేస్తుండటంతో ఇంటికి వెళ్ళడానికి ఒక టైమంటూ లేకుండాపోయింది. తను ఎప్పటిలాగే తిరిగి వస్తాడని అనుకుంటూండి ఉంటుంది స్వాతి. ఎదురుగా టేబుల్ మీద ఉన్న సెల్ మోగడంతో విక్రాంత్ అటువైపు చూశాడు. రఘు ఫోన్ లిఫ్ట్ చేస్తూనే ఏం విన్నాడో గానీ ఒక్కసారిగా కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు. ‘ఎప్పుడు? ఎక్కడ? వస్తున్నా...’ అంటూ రూమ్ లోంచి బయటకి పరుగుతీశాడు. తిరిగి చూసేసరికి హాస్పటల్లో ఉన్నాడు విక్రాంత్. ఎదురుగా బెడ్ మీద పదిహేడు, పద్దెనిమిదేళ్ల అబ్బాయి వెంటిలేటర్ మీద కనిపించాడు. దగ్గరికి వెళ్ళాడు విక్రాంత్. ముఖానికి కూడా బాగా గాయాలయ్యాయి. బతకడం కష్టంలాగే అనిపిస్తోంది. తర్వాతి నిమిషంలో పోలీస్ యూనిఫామ్‌లో ఉన్న ఇద్దరు వ్యక్తులు రఘుతో మాట్లాడుతూండటం కనిపించింది విక్రాంత్‌కి. ఈసారి హాస్పిటల్‌లోని విజిటింగ్ రూమ్‌లో ఉన్నాడు విక్రాంత్. ఈ మార్పులు, ప్లేస్‌లు, టైమ్ ఒక్కసారిగా ముందుకు జరిగిపోవడం ఇవన్నీ సహజంగానే అనిపిస్తున్నాయి విక్రాంత్‌కి. బతికి ఉన్నప్పుడే కనుక ఇలా జరిగి ఉంటే, తనకేవో అద్భుత శక్తులు లభించాయని అనుకునేవాడేమో! ‘చాలా స్పీడ్‌గా వెళ్లి.. ఆగి ఉన్న లారీని గుద్దుకున్నాడు. పైగా డ్రింక్ చేసి ఉన్నాడు. మైనర్ కదా. అసలు కారెలా ఇచ్చారు మీరు అబ్బాయికి?’ ఇద్దరిలో కొంచెం పొడుగ్గా ఉన్న పోలీస్ అడుగుతున్నాడు రఘని. ‘వాడు కారు తీసుకెళ్లిన విషయమే నేను గమనించలేదు సార్. ఎప్పుడు తీశాడో ఏమో!’నిజమో అబద్ధమో తెలీదు గానీ రఘు శరీరం వణకడం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ కుర్రవాడు రఘు కొడుకన్నమాట. పోలీస్ ఇంకా గట్టిగా గదమాయిస్తున్నాడు. కొంచెం పక్కకి తిరిగి చూస్తే కాస్త అవతలగా చైర్లో కూర్చుని కనిపించింది రేఖ. ఎటో చూస్తోంది. ఆమె శరీరంలో అసలు చలనం ఉందా అనిపిస్తోంది. కళ్ళు ఎర్రబడి వాచిపోయి ఉన్నాయి. చెంపల మీదనించి ఇంకా నీళ్లు కారుతూనే ఉన్నాయి. ఆమె వల్లనే కదా తను దొంగయ్యాడు! ఒకే కాలేజ్‌లో కలిసి చదువుకున్నారు విక్రాంత్, రఘు, రేఖలు. అప్పట్లో అమ్మాయిలు.. అబ్బాయిలతో పెద్దగా మాట్లాడేవారు కాదు. లైబ్రరీ బుక్స్‌లో అక్కడక్కడా కవితలు రాసి కింద పేరు రాసుకునేవాడు విక్రాంత్. అలా చూసిందట రేఖ.. అతని కవిత ఒకటి. నిజానికి అది కవిత కూడా కాదు, ఏదో ఒక ఆలోచనలాంటిది అంతే! అలా ఏదైనా ఊహ తోచినప్పుడు ఒక పుస్తకంలోనో, అక్కడో ఇక్కడో రాసేస్తూ ఉండేవాడు. లైబ్రరీ పుస్తకంలో రాసింది ఆమెకి బాగా నచ్చిందట. వచ్చి పలకరించింది. మెల్లగా పరిచయం పెరిగింది. అది ఇష్టంగా మారింది. ప్రేమ మాటలూ, చూపులూ దొర్లాయి. ప్రపంచం అంత అందంగా అంతకు ముందెప్పుడూ కనిపించలేదు విక్రాంత్‌కి. కానీ... అనుకోకుండా ఓ రోజు కాలేజ్‌లో ఇన్స్పెక్షన్ జరిగింది. అతని బ్యాగ్‌లో, రాబోయే సంవత్సరపు పరీక్ష పేపర్ దొరికింది. విక్రాంత్ కాలేజ్నించి ఎక్స్పెల్ అయ్యాడు. ఇంట్లో కూడా బీరువాలో ఉండే వెండి కంచం కనిపించకుండా పోయింది. మెడ పట్టి గెంటకపోయినా మేనమామ కాస్త మర్యాదగానే ఇంట్లోంచి వెళ్లిపొమ్మన్నాడు. అప్పటికే అతని తల్లి చనిపోయి రెండేళ్ళవుతోంది. ఉండటానికి చోటు లేక, తినడానికి తిండి లేక ఫుట్‌పాత్ మీద పడుకున్నాడు నాలుగైదు నెలలు. చివరికి కూలి పనికి వెళ్ళాడు ఆకలి తీర్చుకోవడానికి. కానీ అన్నింటికంటే పెద్ద బాధ రేఖ కోసం పడ్డదే. ఆమె మళ్ళీ అతనికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. ఎందుకో కూడా అతనికి తెలీదు. ప్రేమలో ఉన్నామన్న ఆ భావం వల్ల, అది పోగొట్టుకున్నప్పుడు కలిగే బాధ కంటే ఏదీ ఎక్కువ కాదేమో! నిద్ర పట్టేది కాదు. ఒకటే దుఃఖం. ఏం చెయ్యాలో ఎందుకు బతకాలో తెలీని స్థితి. చివరికి ఎలాగో అందులోంచి బయట పడ్డాడు. జీవితంలో కొంత స్థిరపడ్డాడు. తనలాగే స్వాతికి కూడా తల్లితండ్రులు లేరు. కులం ఒక్కటీ లెక్క చూసుకుని ఆమెని తనకి ముడేసి వదిలేసి, చేతులు దులుపుకున్నారు ఆమె దగ్గరి బంధువులు. తమ మధ్య అద్భుతమైన ప్రేమ బంధం ఏర్పడకపోయినా ఒక ఒప్పందంలాంటి జీవితం ఉంది. ఒకరికి ఒకరున్నారన్న ధైర్యం, ఆసరా ఉన్నాయి. సహజ పుట్టాక ఆ బంధం మరింతగా బలపడింది. ఇప్పుడు స్వాతి ఒంటరి. పైగా పసితనం ఇంకా వీడని సహజ బాధ్యత ఒకటి. స్వాతి పెద్దగా చదువుకోలేదు. తను లేకుండా ఎలా బతుకుతారో ఇద్దరూ...! అతనా ఆలోచనలో ఉండగానే ఏదో ఒక సందేశం లాంటిది అడ్డు తగిలింది. ‘నీ ముందు ఇప్పుడు రెండు మార్గాలున్నాయి’ అంది అదృశ్య శక్తి. ‘ఏమిటవి?’ అన్నాడతను, జరుగుతున్నది అతి సహజమైన విషయంలాగా. ‘ఆ కుర్రవాడిని బతికించే చాయిస్ నువ్వు తీసుకుంటే పదేళ్ల పాటు ఒక చీకటి ప్రదేశంలో ఆకలి దప్పికలతో, ఒంటరితనంతో బాధ పడుతూ బతకాల్సి వస్తుంది’ అందా శక్తి. అంటే నరకమా... అనుకున్నాడు. అంతలోనే అవన్నీ మనిషిగా ఉన్నప్పటి నమ్మకాలని గుర్తొచ్చి, ‘మరి రెండో చాయిస్ ఏమిటీ?’ అడిగాడు. కుర్రవాడి చావుకి అతన్ని వదిలేసి నీదారి నువ్వు చూసుకుంటే ఆకలి దప్పికలు లేని వెలుగులోకంలో ఎప్పటికీ ఉండిపోయే అవకాశం. స్వర్గమన్నమాట... ఈసారి కావాలనే అనుకున్నాడు. ‘ఎందుకు అలా? మంచి పని చేస్తే శిక్షా! ఇదేం న్యాయం?’ అన్నాడు. ‘కుర్రవాడికి ఆయుష్షు లేదు. నీ కరుణతో అతన్ని బతికించి ఆ శిక్ష నువ్వు తీసుకోగలవా?’ అంది అదృశ్య శక్తి. ‘నిర్ణయం పూర్తిగా నీ ఇష్టం’ అంటూ మౌనం వహించింది. కళ్ళ ఎదురుగా మళ్ళీ రేఖ కనిపించింది. అప్పట్లో ఆమె తనని ఎందుకు దూరం పెట్టిందో తెలీలేదు. నిన్న చనిపోయే వరకు కూడా ఆ ప్రశ్నకి సమాధానం దొరక్క చాలా బాధపడేవాడు. ఇప్పుడు ఎంతో సహజంగానే, అప్పట్లో అన్నీ చూసినట్టుగానే తెలుస్తోంది.రఘు... రఘు కూడా ఆమెని ఇష్టపడ్డాడు. విక్రాంత్‌కి ఆమె దగ్గర కావడం సహించలేకపోయాడు. ఆ క్వశ్చన్ పేపర్ విక్రాంత్ బ్యాగ్‌లోకి రావడానికి, ఇంట్లో వెండి కంచం పోవడానికి కూడా రఘునే కారణం. కవిత్వం కూడా రఘు రాసిందే విక్రాంత్ దొంగిలించినట్టుగా ఆమెని నమ్మించాడు. విక్రాంత్‌ని చూసి అంతో ఇంతో రాయాలని రఘు కూడా ప్రయత్నించేవాడు అప్పట్లో. విక్రాంత్‌ని రోడ్డు మీద పడేశాకా, జీవితంలో స్థిరపడ్డాకా విక్రాంత్ పాత కవితల పుస్తకాన్ని అచ్చు వేయించుకుని సో కాల్డ్ సాహితీ ప్రపంచానికి దగ్గరయ్యాడు. ఒక కవిగా, రచయితగా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు అతని కొడుకుని బతికిస్తే తనకి పదేళ్ల నరకం. తనకి ఎంతో ద్రోహం చేసినవాడికి మంచి చేసే అవకాశం. తన గొప్పతనానికి పరీక్ష. ఇప్పుడు తనకి జరిగిన అన్యాయానికి బదులు తీర్చుకుంటే మాత్రం తను కోల్పోయిన జీవితం వెనక్కి వస్తుందా! తను పడ్డ బాధ, కష్టాలు మాయమై పోతాయా! చీకటీ, ఆకలిదప్పికలూ తనకి కొత్తేమీ కాదు. ఇంకో పదేళ్లు భరిస్తే ఒక చిన్న కుర్రవాడు బతుకుతాడు. నిండు జీవితాన్ని అనుభవిస్తాడు. ఇద్దరు మనుషులకి కడుపు కోత తప్పుతుంది. అది రఘు కన్న ప్రేమ అయితేనేం... కత్తికి కత్తి, కన్నుకి కన్ను ఎలా సమాధానం అవుతాయి! తిరిగి పొడిస్తే పడిన పోటు మానిపోదు. అవతలి కన్ను కూడా పోగొడితే, పోయిన చూపు తిరిగి రాదు. నిర్ణయం తీసుకోవడానికి విక్రాంత్‌కి ఎక్కువ సమయం పట్టలేదు. లేకపోతే పట్టిందా... ఏమో... ఆ లెక్క ఇప్పుడు పెద్దగా తెలీడం లేదు. ‘సరే. నరకమే’ అన్నాడు అదృశ్య శక్తితో. అప్పుడు ఆ శక్తి ఇంకో విషయం కూడా చెప్పింది. ఈసారి ఆ కాస్త కూడా ఆలోచించకుండానే, ‘అయినా పర్లేదు’ అన్నాడు. అప్పుడే అతనికి ఒక విజన్ వచ్చింది. కలలాగా భవిష్యత్తు కనిపించింది. తన కొడుకు బతకడానికి కారణం విక్రాంత్ అని రఘుకి తెలియడం, విక్రాంత్ కుటుంబాన్ని ఆదుకుంటానని అతను మాట ఇవ్వడం, అంతేకాక సహజ తన ఇంట్లోనే తన బిడ్డలా పెరుగుతుందని చెబుతూ రఘు, విక్రాంత్ కూతుర్ని కన్నీళ్లతో దగ్గరికి తీసుకోవడం... ‘ఆపండి!’ అన్నాడు విక్రాంత్ వెంటనే. ‘ఇంకా తనకి మానవ సహజమైన రియాక్షన్స్వదిలినట్టు లేవు’ అనుకున్నాడు. ‘ఈ చాయిస్ తీసుకోవడానికి నాకు ఒక కండిషన్ ఉంది’ అన్నాడు విక్రాంత్. ఏమిటో చెప్పమంది అదృశ్య శక్తి. ‘నాకారణంగా రఘు కొడుకు బతుకుతాడన్న విషయం రఘు కుటుంబానికి తెలియకూడదు’ అన్నాడు. ‘నీ కుటుంబం ఏమవుతుంది?అతను ఆదుకుంటాడు కదా’ అంది అదృశ్య శక్తి. ‘వద్దు’ అన్నాడు విక్రాంత్. ‘సరే’ అంది అదృశ్య శక్తి. తండ్రి పోయాక తల్లి చెయ్యి పట్టుకుని మేనమామ ఇంటికి వెళ్లినప్పటినించీ అక్కడ ఎదుర్కొన్న అవమానాలన్నీ గుర్తొచ్చాయి అతనికి. పరాయి ఇంట్లో ఉంటూ, తింటూ, ఎంత చాకిరీ చేసినా, పెద్దగా మాటల రూపంలో వినకపోయినా, అవతలినించి ఎదురొచ్చిన నిర్లక్ష్యం, చులకన భావం, విసుగులూ, అసహనాలూ, లోకువతనాలూ అన్నీ అతన్ని ఒక్కపెట్టున చుట్టుముట్టాయి. ఆ బెంగతోనే కదా అతని తల్లి బతికున్నప్పుడు కూడా చనిపోయినట్టే ఉండేది. అటువంటి స్థితి మళ్ళీ స్వాతికి, సహజకి రాకూడదు. మరి వాళ్ళు ఎలా బతుకుతారు? ఏమో అది అతనికి తెలీదు. ఇంతలో ఎవరో చిటికె వేసినట్టుగా చాలా వేగంగా కొన్ని సంఘటనలు జరిగిపోయాయి. అతను చూస్తూ నిలబడ్డాడు. విక్రాంత్ ఆర్గాన్స్‌తో రఘు కొడుక్కి సర్జరీ అవడం, కుర్రవాడు తొందరలోనే కోలుకోవడం, ఆర్గాన్స్డొనేట్ చేసిన ఆ అజ్ఞాత వ్యక్తిని తలుచుకుని రఘు, రేఖ కృతజ్ఞతతో కన్నీళ్లు పెట్టుకోవడం... అలా సెకన్ల మీద అతని కళ్ళ ముందు... కాదు కాదు ఊహ ముందు కదిలిపోయాయి. ఇక ఇప్పుడు చీకటిలోకానికి ప్రయాణం. ఆ ప్రయాణంలో మరో విజన్ కలిగిందతనికి. మరో భవిష్యత్ దృశ్యం. స్వాతి, సహజ.. ఇండియాలో ఒక పెద్ద చైన్ అఫ్ హోటల్స్‌కి ఓనర్స్. వాళ్ళు ఎంతో సంతోషంగా, దర్జాగా, హుందాగా జీవిస్తున్నారు. తనకి తెలుసు. స్వాతి దగ్గర ఆ శక్తి ఉంది. ఆమె వంటలు చాలా బాగా చేస్తుంది. అతను పోయిన కొత్తలో కొంత ఇబ్బంది పడ్డారు. కానీ మెల్లగా పచ్చళ్ళు చెయ్యడం, ఉద్యోగులకి క్యారేజ్‌లు వండి పంపడం మొదలుపెట్టింది స్వాతి. అది చాలా తొందరగా వృద్ధిలోకి వచ్చి ఒక హోటల్ కూడా పెట్టింది. అది చైన్స్గా విస్తరించింది. సహజ కూడా ఎంబీఏ చేసి ఆ బిజినెస్ నడపడంలో తల్లికి సహాయంగా ఉంది. విక్రాంత్ మనసు తృప్తితో నిండిపోయింది. ఈ బెంగ కూడా ఇక తనకి అవసరం లేదు. ‘రఘు కుటుంబానికి చెందిన భవిష్యత్తు కూడా చూస్తావా?’ అంది అదృశ్య శక్తి. ‘వద్దు’ అన్నాడు విక్రాంత్. అది తనకి సంబంధం లేని విషయం. తన ప్రయాణం ముగుస్తోందని విక్రాంత్‌కి అర్థం అయింది. అతను మెల్లగా.. ఏమీ లేని, ఏమీ తెలియని స్థితిలోకి జారిపోతున్నాడు. ఆ చివరి నిమిషంలో అతనికి ఓ విషయం అర్థమయింది. బహుశా ఆ చీకటి లోకం గురించి అదృశ్య శక్తి చెప్పిందంతా ఒక పరీక్ష. తాను ఆ నరకానికి వెళ్ళబోవడం లేదు. అలాగని స్వర్గంలోనూ అడుగు పెట్టడం లేదు. నిజానికి ఆ రెండూ ఉన్నాయో లేదో కూడా! తాను పూర్తిగా ఒక తెలియనితనంలోకి వెళ్ళిపోతున్నాడు. ఏమీ లేకపోవడంలోకి. ఒక కథని, తన కథని తనే రాసుకుని పూర్తి చేసుకుంటున్నాడు. జీవితంలో ఓడిపోయి మరణంలో గెలుస్తున్నాడు. తన తండ్రి పెట్టిన పేరుని సార్థకం చేసుకుంటున్నాడు. ఆ ఆఖరి క్షణంలో అదృశ్య శక్తి చెప్పిన ఇంకో విషయం గుర్తొచ్చింది అతనికి. తాగిన మత్తులో యాక్సిడెంట్ చేసి, అతని చావుకి కారణమైంది రఘు కొడుకే. ఆ కంగారులో కాస్త దూరం వెళ్ళాకా, ఆగి ఉన్న లారీని గుద్దుకున్నాడు.ప్రయాణంతో పాటుగా, అతని ఆలోచన కూడా అక్కడితో అలా అంతమైపోయింది. ఇప్పుడతను పూర్తిగా విక్రాంతుడయ్యాడు. -భవానీ ఫణి -
అత్యధిక ఎంపీ సీట్లలో గెలుపే లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి అత్యధిక ఎంపీ సీట్లలో గెలుపే లక్ష్యంగా ముందుకెళతామని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి తెలిపారు. కలిసికట్టుగా ముందుకుసాగుతూ తెలంగాణలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయ పార్టీగా ఎదిగేలా పోరాడుతామన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిరాశ పరిచినా మరింత గట్టిగా పోరాడి, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 80 సీట్లు సాధించేలా ఇప్పటి నుంచే పట్టుదలతో కృషి ప్రారంభిస్తామని చెప్పారు. ఎంతో కష్టపడినా అనుకున్న స్థాయిలో ఫలితాలు రాలేదని, ఈ ఎన్నికల్లో బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించిందని, 7 నుంచి 14 శాతానికి ఓటు బ్యాంకు పెరిగిందన్నారు. గత ఎన్నికలతో పోల్చుకుంటే 100 శాతం ఓటింగ్ పెరిగిందని చెప్పారు. పార్టీ నేతలు కాసం వెంకటేశ్వర్లుయాదవ్, ప్రేంసింగ్‌రాథోడ్, చింతా సాంబమూర్తి, ప్రకాష్‌రెడ్డి తదితరులతో కలిసి కిషన్‌రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడారు. ఓడిన స్థానాలపై జాతీయస్థాయి నుంచి జిల్లా, మండల, బూత్ స్థాయి వరకు సమీక్ష జరిపి వచ్చే లోక్‌సభ ఎన్నికలకల్లా లోటుపాట్లను సరిదిద్దుకుంటామని చెప్పారు. లోక్‌సభకు ఓటేస్తామన్నారు : అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి బీజేపీ నేతలు వెళ్లినప్పుడు బీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు మద్దతు తెలిపే ఓటర్లు తాము అసెంబ్లీకి ఎవరికి ఓటేసినా పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం బీజేపీకి వేస్తామని చెప్పారన్నారు. తాము గెలిచింది 8 స్థానాలే అయినా, 80 మంది ఎమ్మెల్యేల బలాన్ని ప్రజలు ఇచ్చారని చెప్పారు. క్రియాశీల ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషిస్తామని, ప్రజల పక్షాన నిలబడి పోరాడతామని తెలి పారు. అధికార బీఆర్ఎస్పై ఐదేళ్లుగా బీజేపీ సాగించిన పోరు వల్ల కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో లాభం పొందిందన్నా రు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై గట్టిగా పోరాడుతూ రాష్ట్రంలో ఆ పార్టీకి ప్రత్యామ్నాయంగా మారేందుకు కృషి చేస్తామన్నారు. బీజేపీపై పడి ఏడ్చి బురదచల్లిన వారు ఈ రోజు ఫామ్‌హౌస్‌కు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని (మాజీ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి) వ్యాఖ్యానించారు. అక్కడ కాంగ్రెస్‌కు ఆ పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఉన్న పరిస్థితి ఛత్తీస్‌గఢ్, రా జస్తాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో లేదని కిషన్‌రెడ్డి పేర్కొన్నా రు. రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారాన్ని బీజేపీ చేజిక్కించుకుందని, మధ్యప్రదేశ్‌లో గతంలో కంటే ఎక్కువ మెజారిటీ సాధించిందని చెప్పారు. కామారెడ్డిలో సీఎం కేసీఆర్, సీఎం అభ్యర్థి అని చెబుతున్న రేవంత్‌రెడ్డిని బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఓడించి రికార్డు సృష్టించారన్నారు. ఇలాంటి రికార్డు దేశంలో మరే రాష్ట్రంలోనూ సాధ్యం కాలేదన్నారు. పార్టీ పోటీచేసిన స్థానాల్లో ఓటమికి దారి తీసిన కారణాలను విశ్లేషించుకుంటామని, ఢిల్లీ వెళ్లి జాతీయ నాయకత్వంతో సమావేశమై రాష్ట్రంలో ఎన్నికల సరళి, ప్రభావం చూపిన అంశాలు, తదితర విషయాలపై చర్చిస్తామని చెప్పారు. పార్లమెంట్ సమావేశాలు, రాబో యే లోక్‌సభ ఎన్నికలకు సిద్ధం కావడం, తెలంగాణ ఎన్నికల తీరుతెన్నులపై సవివరంగా తెలియజేస్తామన్నారు. తమ పార్టీ వారే తనను ఓడించారని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఒక విలేకరి ప్రస్తావించగా, ఆ వ్యాఖ్యలు తన దృష్టికి రాలేదని కిషన్‌రెడ్డి సమాధానమిచ్చారు. బీఆర్ఎస్, మజ్లిస్ కుట్రలను తిప్పికొట్టారు: కిషన్‌రెడ్డి రాజాసింగ్ నివాసానికి వెళ్లి అభినందించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సాక్షి, హైదరాబాద్: శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీల అధినేతలు కేసీఆర్, అసదుద్దీన్ ఎన్ని కుట్రలు చేసినా ఎమ్మెల్యే రాజాసింగ్ బలమైన విశ్వాసం, ధైర్యంతో తిప్పికొట్టారని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ప్రశంసించారు. ముఖ్యంగా మజ్లిస్ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా నిరంతరం పోరాటం కొనసాగిస్తూ, ప్రజల ఆశీస్సులతో రాజాసింగ్ మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెడుతున్నారని అన్నారు. అధికార దురి్వనియోగం, కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టినా గోషామహల్లో ధర్మం, జాతీయ భావజాలమే గెలిచింద ని పేర్కొన్నారు. సోమవారం గోషామహల్లో రాజా సింగ్ నివాసానికి వెళ్లిన కిషన్‌రెడ్డి ఆయనను అభినందించారు. తప్పుడు ప్రచారాలతో అనేక శక్తులు పన్ని న కుట్రలను ఎదుర్కొని బీజేపీ ఎమ్మెల్యేగా రాజాసింగ్‌ను గెలిపించిన గోషామహల్ ప్రజలకు, ఆయన విజయం కోసం పనిచేసిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. రానున్నరోజుల్లో పార్టీ మరింత విస్తరణకు రాజాసింగ్ సేవలను రాష్ట్రవ్యాప్తంగా వినియోగించుకుంటామన్నారు. 2024 ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ విజయం కోసం కృషి చేస్తామని కిషన్‌రెడ్డి తెలిపారు. -
17 మంది రాజస్తాన్ మంత్రుల ఓటమి
జైపూర్: రాజస్తాన్ ఎన్నికల్లో బీజేపీ గెలుపుగాలులకు పలువురు మంత్రులు ఓటమి దిశలో కొట్టుకుపోయారు. రాజస్తాన్ విపత్తు నిర్వహణ శాఖ మంత్రి, పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ సారథి అయిన గోవింద్ రామ్ మేఘ్వాల్ సహా 17 మంది మంత్రులు ఓటమిని చవిచూశారు. ఓడిన మంత్రుల్లో రమేశ్ చంద్ మీనా, షాలే మొహమ్మద్, భన్వర్ సింగ్ భటి, శకుంతలా రావత్, విశ్వేంద్ర సింగ్, ఉదయ్‌లాల్ అంజనా, బీడీ కల్లా, జహిదా ఖాన్, ప్రతాప్‌సింగ్ కచరియావాస్, భజన్‌లాల్ జాతవ్, మమతా భూపేశ్, పర్సాదీ లాల్ మీనా, సుఖ్రామ్ విష్ణోయ్, రామ్‌లాల్ జాట్, ప్రమోద్ జైన్ భయ్యా, రాజేంద్ర యాదవ్ ఉన్నారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్‌కు సలహాదారులుగా ఉన్న ఎమ్మెల్యేలు సన్యమ్ లోధా, రాజ్‌కుమార్ శర్మ, బాబులాల్ నగార్, దానిష్ అబ్రార్సహా ఆరుగురు ఎమ్మెల్యేలు ఓడిపోయారు. మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిరంజన్ ఆర్య సైతం విజయం సాధించలేకపోయారు. ముఖ్యమంత్రి గెహ్లోత్ 25 మంది మంత్రులతో కలిసి ఈసారి తమ గెలుపు అదృష్టాన్ని పరీక్షించుకోగా కొద్దిమంది మాత్రమే గెలుపు తలుపు తట్టారు. సర్దార్‌పుర స్థానంలో గెహ్లోత్ గెలిచారు. నలుగురు బీజేపీ ఎంపీల గెలుపు బీజేపీ ఏడుగురు ఎంపీలను ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులుగా రంగంలోకి దింపింది. వీరిలో నలుగురు విజయం సాధించారు. విద్యాధర్ నగర్ బీజేపీ మహిళా ఎంపీ దియా కుమారీ, ఝోట్వారా ఎంపీ రాజ్యవర్ధన్ రాథోడ్, తిజారా ఎంపీ బాబా బాలక్ నాథ్, రాజ్యసభ సభ్యుడు కిరోడిలాల్ మీనాలు గెలిచారు. -
నేడు సీఎల్పీ భేటీ
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ.. నూతన ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా సోమవారం పార్టీ శాసనసభాపక్ష (సీఎల్పీ) సమావేశాన్ని నిర్వహించనుంది. హైదరాబాద్‌లోని ఎల్లా హోటల్ వేదికగా ఉదయం 9:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ భేటీలో సీఎం ఎంపికపై కొత్త ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయాలను సేకరించనున్నారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పర్యవేక్షణలో, ఇతర ఏఐసీసీ ముఖ్యుల సమక్షంలో ఈ సమావేశం జరగనుంది. దీనికోసం కాంగ్రెస్ కొత్త ఎమ్మెల్యేలంతా ఆదివారం రాత్రే హైదరాబాద్‌కు చేరుకున్నారు. భేటీ తర్వాత అధిష్టానం పరిధిలోకి.. పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరించాక సీఎం ఎంపిక, మంత్రివర్గ కూర్పు అంశం అధిష్టానం పెద్దల చేతికి వెళ్లనుంది. డీకే బృందం ఎమ్మెల్యేలతో భేటీ పూర్తికాగానే ఢిల్లీ వెళ్లనున్నట్టు సమాచారం. అక్కడ ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాందీలతో సమాలోచనలు జరిపి సీఎం ఎవరన్న దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. తర్వాత సీఎం రేసులో ఉన్న ఇతర నేతలను ఢిల్లీకి పిలిపించి బుజ్జగించి, ఏకాభిప్రాయం సాధించే అవకాశం ఉందని తెలిసింది. తర్వాత మరోమారు ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి లాంఛనంగా సీఎల్పీ నాయకుడి ఎంపికను పూర్తి చేయనున్నారు. ఈ నెల 9వ తేదీకల్లా ఈ ప్రక్రియ అంతా పూర్తిచేసి ఎల్బీ స్టేడియం వేదికగా ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నిర్వహించవచ్చని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సోమ, మంగళవారాల్లోనే ప్రమాణ స్వీకారం? ఎక్కువ రోజులు పొడిగించకుండా సోమవారం లేదా మంగళవారమే సీఎంతోపాటు ఒకరిద్దరు మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించే అవకాశాలు కూడా ఉన్నాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సోమవారం సీఎల్పీ భేటీ తర్వాత డీకే శివకుమార్, ఇతర పెద్దలు ఇక్కడి నుంచే ఢిల్లీ పెద్దలతో మాట్లాడి, నేరుగా గవర్నర్‌ను కలసి రాజ్‌భవన్‌లోనే ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పూర్తి చేస్తారనే చర్చ జరుగుతోంది. ఇదే జరిగితే ఈనెల 9 నాటికి మంత్రివర్గాన్ని కూర్చి పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ సభలో మంత్రుల ప్రమాణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పోలీసుల పేరిట లేఖ ఫేక్ సీఎంగా రేవంత్‌రెడ్డి సోమవారం ప్రమాణస్వీకారం చేస్తారని, ఆ కార్యక్రమానికి రాహుల్, ప్రియాంక వచ్చే అవకాశం ఉందని, ఇందుకోసం తగిన భద్రత ఏర్పాటు చేయాలంటూ పోలీసు ఉన్నతాధికారుల పేరిట ఓ లేఖ వైరల్‌గా మారింది. అయితే అది ఫేక్ అని టీపీసీసీ వర్గాలు ప్రకటించాయి. గవర్నర్‌ను కలసిన కాంగ్రెస్ నేతలు ఫలితాల అనంతరం హైదరాబాద్‌లోని ఎల్లా హోటల్లో సమావేశమైన కాంగ్రెస్ నేతలు.. రాత్రి 9 గంటల సమయంలో రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ తమిళిసైను కలిశారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఏఐసీసీ పరిశీలకులు దీపాదాస్మున్షీ, కేజీ జార్జ్ తదితరులు రాజ్‌భవన్‌కు వెళ్లిన బృందంలో ఉన్నారు. తమకు 65 మంది సభ్యుల మద్దతు ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ వారు గవర్నర్‌కు లేఖ అందజేశారు. తర్వాత రాజ్‌భవన్ ఎదుట డీకే శివకుమార్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. సీఎంపై సోమవారమే స్పష్టత: ఉత్తమ్ గవర్నర్‌ను కలవడానికి ముందు ఎల్లా హోటల్ వద్ద ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియాతో మా ట్లాడారు. సోమవారం సీఎల్పీ సమావేశం జరగనుందని, సీఎం ఎవరన్నదానిపై స్పష్టత వస్తుందని చెప్పారు. ఈ విషయంలో తన అభిప్రాయాన్ని సమావేశంలోనే వెల్లడిస్తానని, బయ ట చెప్పనని వివరించారు. తెలంగాణలో కాంగ్రెస్ విజయం ప్రజల విజయమని అభివర్ణించారు. -
Madhya Pradesh: చౌహాన్ చరిష్మా.. బీజేపీ ఘన విజయానికి కారణాలివే..
మధ్యప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. తన అత్యుత్తమ రాజకీయ విజయాలలో ఒకటిగా నమోదు చేసుకుంది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీని చావుదెబ్బ కొట్టిన విజయంగా దీన్ని రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. అయితే మధ్యప్రదేశ్‌లో బీజేపీ రికార్డు విజయానికి దోహదం చేసిన ఐదు కీలక అంశాలు ఉన్నాయి. క్షేత్రస్థాయిపై పట్టు ఆటుపోట్లను తమకు అనుకూలంగా మలుచుకోవడానికి, కేంద్ర మంత్రులతో సహా అనేక మంది ప్రాంతీయ నేతలు, ఎంపీలను ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరం ఉందని బీజేపీ ప్రారంభంలోనే అర్థం చేసుకుంది. అందుకు అనుగుణంగా ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో తీవ్రమైన గ్రౌండ్ వర్క్ చేశారు. కేంద్ర మంత్రులతో సహా అనేక మంది ప్రాంతీయ నేతలు, ఎంపీలు ఎన్నికలలో పోటీ చేశారు. 'లాడ్లీ బహ్నా' పథకం శివరాజ్ సింగ్ చౌహాన్ తన ప్రభుత్వ పథకాలు, ముఖ్యంగా 'లడ్లీ బహనా' పథకం చుట్టూ బీజేపీ తన ప్రచారాన్ని నడిపించింది. మధ్యప్రదేశ్‌లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల మహిళలకు నెలవారీ ఆర్థిక సాయం అందించే 'లాడ్లీ బెహనా' పథకాన్ని ప్రారంభించిన బీజేపీ మహిళా కార్డు అధికార పార్టీకి బాగా పనిచేసినట్లు కనిపిస్తోంది. సామాన్యులకు అందుబాటులో చౌహాన్ సామాన్యులకు అందుబాటులో ఉండే ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్‌కు పేరుంది. ఆయన్ను ఇక్కడి ప్రజలు 'మామా'గా పిలుచుకుంటారు. బీజేపీ సంస్థాగత బలం బీజేపీ సంస్థాగత బలం, దాని హిందుత్వ కార్డు, ప్రధానమంత్రి అభివృద్ధి మంత్రం, ప్రచారంలో జాతీయ అహంకారం గురించి మాట్లాడటం బీజేపీకి బాగా పనిచేసినట్లు కనిపించింది. ప్రభావవంతమైన పోల్ వ్యూహం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు 2024 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని భోపాల్‌లో మోదీ ప్రారంభించిన ‘మేరా బూత్ సబ్సే మజ్బూత్’ ప్రచారం బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి దోహదపడిందని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. -
కేబీసీలో చిచ్చరపిడుగుకు కోటి రూపాయలు
ప్రముఖ క్విజ్ షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’(కేబీసీ) సీజన్ 15లో ప్రస్తుతం ‘కేబీసీ జూనియర్స్ వీక్’ జరుగుతోంది. చివరి ఎపిసోడ్లో హర్యానాలోని మహేంద్రగఢ్ నివాసి మయాంక్ హాట్‌సీట్‌పై కూర్చున్నాడు. ఈ 12 ఏళ్ల కంటెస్టెంట్‌తో హోస్ట్ బిగ్ బీ అమితాబ్ పలు విషయాలను ముచ్చటించారు. అమితాబ్ బచ్చన్ ఈ ఎపిసోడ్‌లోని మొదటి ప్రశ్నను అడిగారు. దీనికి సమాధానం చెబితే రూ. 6,40,000 గెలుచుకోవచ్చు. 2023లో వాషింగ్టన్ డీసీలో ప్రారంభించిన ‘స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ’ ఎవరి పేరు మీద ఉంది? అని అడిగారు. దీనికి మయాంక్ సరైన సమాధానం ఇస్తూ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ అని చెప్పాడు. తరువాతి ప్రశ్నలకు మయాంక్ సరైన సమాధానాలు చెబుతూ వచ్చాడు. గేమ్ సమయంలో మయాంక్ తాను పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నదీ ఇంకా తనకు తెలియడం లేదని చెప్పాడు. తరువాత మాయాంక్ ‘మీరు చిన్నప్పుడు ఏం కావాలని అనుకున్నారు?’ అని అడిగాడు. అందుకు అమితాబ్ బదులిస్తూ ‘చిన్నప్పుడు ఎక్కువగా గిల్లీ దందా ఆడేవాళ్లం. అది తప్ప మరేదీ మా మనసులోకి రాలేదు’ అని చెప్పారు. తరువాత అమితాబ్.. మయాంక్‌ను కోటి రూపాయల ప్రశ్న అడిగాడు. కొత్తగా కనుగొన్న ఖండానికి ‘అమెరికా’ అని పేరు పెట్టిన ఘనత ఏ యూరోపియన్ కార్టోగ్రాఫర్‌కు దక్కుతుంది? అడి అడిగారు. దీనికి సమాధానం చెప్పేందుకు మయాంక్ ఒక ఒక నిపుణుడి సహాయం తీసుకుని ‘మార్టిన్ వాల్డ్సీముల్లర్’అని సరైన సమాధానం చెప్పాడు. సీజన్ 15లో భారీ మొత్తాన్ని గెలుచుకున్న తొలి జూనియర్ కోటీశ్వరుడు మయాంక్. ఈ విషయాన్ని అమితాబ్ షోలో ప్రకటించారు. ఆ సమయంలో మయాంక్ తల్లిదండ్రులు భావోద్వేగానికి లోనయ్యారు. తరువాత అమితాబ్.. మయాంక్‌ను రూ. 7 కోట్ల ప్రశ్న అడిగారు. దీనికి మయాంక్ సమాధానం చెప్పలేక గేమ్ ముగించి, కోటి రూపాయలు తీసుకున్నారు. ఇది కూడా చదవండి: ఇప్పుడు దీపావళి చేసుకుంటాం: ఉత్తరకాశీ కార్మికులు -
బల్దియా టు అసెంబ్లీ
చెరుపల్లి వెంకటేశ్: కార్పొరేటర్ నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులుగా ఎదిగిన వారెందరో ఉన్నారు. హైదరాబాద్ బల్దియా నుంచే ఇలా ఎదిగిన వారూ చాలామంది ఉన్నారు. కార్పొరేటర్లుగా పోటీ చేసి గెలిచినా, ఓడి నా పట్టు వదలకుండా కృషి చేసి పైమెట్టు ఎక్కారు. ఎక్కువ పర్యాయాలు ఎమ్మెల్యేలుగా గెలవడంతోపాటు మంత్రులైన తలసాని శ్రీనివాస్ యాదవ్, టి.పద్మారావుగౌడ్, సి.కృష్ణయాదవ్, ముఖేశ్‌గౌడ్ తదితరులు నగరపాలకసంస్థ కార్పొరేటర్లుగా పోటీచేసిన వారే. ఎంసీహెచ్ నుంచే మొదలు తొలిసారిగా చాలామంది ఎంసీహెచ్(మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్) 1986 ఎన్నికల్లో రాజకీయ అరంగేట్రం చేశారు. ఆ ఎన్నికల్లో మోండా డివిజన్ నుంచి జనతాపార్టీ అభ్యర్థిగా పోటీచేసిన తలసాని, పద్మారావు చేతిలో ఓడిపోయారు. అనంతరం తలసాని 5 పర్యాయాలు ఎమ్మెల్యే గా గెలిచి టీడీపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాల్లో మంత్రిగా పలుశాఖలు నిర్వహించారు. ఇక 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన పద్మారావు బీఆర్ఎస్ ప్రభు త్వంలో మంత్రిగానూ, డిప్యూ టీ స్పీకర్‌గా నూ పనిచేశారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన కృష్ణయాదవ్ టీడీపీ హయాంలో మంత్రిగానూ, ప్ర భుత్వ విప్‌గానూ పనిచేశారు. మూడుసార్లు ఎమ్మె ల్యే అయిన ముఖేశ్‌గౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. తొలుత టీడీపీ కార్పొరేటర్‌గా ఉన్న రాజాసింగ్ బీజేపీ నుంచి రెండు పర్యాయాలు ఎమ్యెల్యేగా ఎన్నికై మూడోసారి పోటీ చేస్తున్నారు. ఓటమి నుంచి గెలుపు.. దోమలగూడ, జవహర్‌నగర్ నుంచి కార్పొరేటర్లుగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ జి.సాయన్న, డా.కె.లక్ష్మణ్ తర్వాతి కాలంలో ఎమ్మెల్యేలుగా గెలిచారు. వీరిలో సాయన్న ఐదు పర్యాయాలు, లక్ష్మణ్ రెండుసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచారు. లక్ష్మణ్ ప్రస్తు తం రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతున్నారు. సాయన్న మరణానంతరం ప్రస్తుతం ఆయన కుమార్తె లాస్య నందిత తండ్రి ప్రాతినిధ్యం వహించిన కంటోన్మెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నారు. మూసారాంబాగ్ కార్పొరేటర్‌గా ఓడిపోయిన తీగల కృష్ణారెడ్డి 2002లో జరిగిన ప్రత్యక్ష ఎన్నికల్లో మేయర్‌గా గెలిచారు. ఆ తర్వాత మహేశ్వరం నియోజకవర్గం నుంచి 2014లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సీన్ రివర్స్ ►మోండా డివిజన్‌కు పోటీ చేసిన పద్మారావు చేతిలో శ్రీనివాస్‌యాదవ్ కార్పొరేటర్‌గా ఒకసారి, సికింద్రాబాద్ నుంచి శాసనసభ ఎన్నికల్లో ఒకసారి ఓడిపోగా, శ్రీనివాస్‌యాదవ్ చేతిలో ఎమ్మెల్యే ఎన్నికల్లో పద్మారావు ఒకసారి ఓడిపోయారు. ►జవహర్‌నగర్ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా గోపాల్ చేతిలో ఓటమిపాలైన లక్ష్మణ్, ముషీరాబాద్‌లో 2014లో గోపాల్‌పై ఎమ్మెల్యేగా గెలిచారు. తిరిగి 2018లో గోపాల్ గెలవగా లక్ష్మణ్ ఓడారు. పార్టీ అధ్యక్షులుగానూ కార్పొరేటర్లుగా పోటీ చేయడం నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలైన శ్రీనివాస్‌యాదవ్, కృష్ణయాదవ్ , సాయన్న, ముఠా గోపాల్ హైదరాబాద్ జిల్లా టీడీపీ అధ్యక్షులుగానూ పనిచేశారు. పద్మారావు టీఆర్ఎస్ గ్రేటర్ అధ్యక్షుడిగా పనిచేశారు. లక్ష్మణ్ బీజేపీ జిల్లా అధ్యక్షునిగా పనిచేశారు. ఎంపీలుగానూ.. ఎంఐఎం వ్యవస్థాపకుడు సలావుద్దీన్ ఒవైసీ సైతం కార్పొరేటర్ నుంచి ఎంపీ స్థాయికి ఎదిగారు. బంజారాహిల్స్ కార్పొరేటర్‌గా చేసిన రేణుకాచౌదరి ఎంపీగా, కేంద్రమంత్రిగానూ పనిచేశారు. ఇలా బల్దియా నుంచి రాజకీయప్రస్థానం ప్రారంభించి తదనంతరం గెలిచినవారు, ఓడిన వారు ఇంకా ఎందరో ఉన్నారు. పలువురు వివిధ ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్లు, డైరెక్టర్లుగానూ పనిచేశారు. కృష్ణారెడ్డి, సు«దీర్‌రెడ్డి హుడా చైర్మన్లుగానూ వ్యవహరించారు. ఈ ఎన్నికల్లో... పోటీలో సిట్టింగ్ కార్పొరేటర్లు ప్రస్తుతం బల్దియా సిట్టింగ్ కార్పొరేటర్లలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన జగదీశ్వర్‌గౌడ్ శేరిలింగంపల్లి నుంచి , విజయారెడ్డి ఖైరతాబాద్ నుంచి శాసనసభకు పోటీ చేస్తున్నారు. తోకల శ్రీనివాసరెడ్డి(బీజేపీ) రాజేంద్రనగర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. శాస్త్రిపురం కార్పొరేటర్‌గా ఉన్న మహ్మద్ మోబిన్ బహదూర్‌పురా నుంచి ఎంఐఎం అభ్యర్థిగా బరిలో ఉన్నారు. షేక్‌పేట కార్పొరేటర్ రాషెద్ ఫరాజుద్దీన్ జూబ్లీహిల్స్ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తున్నారు. మాజీలు సైతం.. మాజీ కార్పొరేటర్ పరమేశ్వర్‌రెడ్డి ఉప్పల్ నుంచి కాంగ్రెస్ తరపున బరిలో ఉన్నారు. ఎంఐఎం మాజీ కార్పొరేటర్ బి.రవియాదవ్ రాజేంద్రనగర్ నుంచి పోటీ చేస్తున్నారు. మాజీ మేయర్లు, డిప్యూటీ మేయర్ కూడా జీహెచ్ఎంసీ మేయర్లుగా పనిచేసిన జులి్ఫకర్ అలీ, మాజిద్‌హుస్సేన్ ఎంఐఎం అభ్యర్థులుగా చారి్మనార్, నాంపల్లి నియోజకవర్గాల నుంచి ప్రస్తుతం పోటీ చేస్తున్నారు. డిప్యూటీ మేయర్‌గా పనిచేసిన జాఫర్ హుస్సేన్ ఇప్పటికే రెండు పర్యాయాలు నాంపల్లి ఎమ్మెల్యేగా చేసి మూడోసారి యాకుత్‌పురా నియోజకవర్గం నుంచి బరిలో నిలిచారు. వీరిలో జుల్ఫికర్‌అలీ, మాజిద్ హుస్సేన్‌లు మేయర్ల పదవీకాలం ముగిశాక సైతం తిరిగి కార్పొరేటర్లుగానూ పనిచేశారు. మాజిద్ ప్రస్తుతం సిట్టింగ్ కార్పొరేటర్‌గా కూడా ఉన్నారు. తలసాని శ్రీనివాస్‌యాదవ్ సనత్‌నగర్ నుంచి పోటీ చేస్తున్నారు. సుదీర్‌రెడ్డి ఎల్బీనగర్ నుంచి రెండుపర్యాయాలు గెలిచి మళ్లీ బరిలో ఉన్నారు. ముఠాగోపాల్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి, తిరిగి పోటీ చేస్తున్నారు. పద్మారావు సికింద్రాబాద్‌లో మూడుసార్లు గెలిచారు. మళ్లీ బరిలో నిలిచారు. హిమాయత్‌నగర్ నియోజకవర్గంగా ఉన్నప్పుడు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కృష్ణయాదవ్ రూపాంతరం చెందిన అంబర్‌పేట నియోజకవర్గం నుంచి ప్రస్తుతం బీజేపీ అభ్యర్థిగా బరి లో ఉన్నారు. -
తెలంగాణలో మహిళలకు రక్షణ లేదు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, మహిళలపై జరుగుతున్న అత్యాచారాల్లో తెలంగాణనే నంబర్‌వన్‌గా నిలుస్తోందని గణాంకాలు చెబుతున్నాయని ఏఐసీసీ అధికార ప్రతినిధి డోలిశర్మ అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం లిక్కర్ విక్రయాలు పెంచడం మినహా మరేమీ చేయలేదని విమర్శించారు. కనీసం మహిళల సంక్షేమం కోసం ఒక బోర్డును కూడా ఏర్పాటు చేయలేదని అన్నారు. శుక్రవారం ఆమె గాందీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో బీఆర్ఎస్ మోడల్ విఫలమయిందని చెప్పిన డోలి శర్మ, కర్ణాటకలో మహిళల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కృషిచేస్తోందని చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌లో కూడా అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తూ ఇచి్చన హామీలను నిలబెట్టుకుంటున్నామన్నారు. తెలంగాణలో పార్టీ మహిళలకు మహాలక్ష్మి పేరుతో ప్రతి మహిళకు నెలకు రూ.2,500 నగదు, రూ.500కే వంట గ్యాస్ సిలిండర్, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం లాంటి హామీలనిచ్చిందని, ఈ పథకాల పట్ల మహిళల నుంచి మంచి స్పందన కనిపిస్తోందని, ఈ పథకాలతో కాంగ్రెస్ పార్టీకి మహిళలు పట్టం కట్టడం ఖాయమని చెప్పారు. టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ జెట్టి కుసుమకుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, అధికారంలోకి వచి్చన మొదటి రోజు నుంచే బీఆర్ఎస్ ప్రభుత్వం ఆబద్ధాలు ఆడుతూ కాలం వెళ్లదీస్తోందని విమర్శించారు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. -
సఫారీ... రికార్డుల సవారీ
న్యూఢిల్లీ: ప్రపంచకప్ తొలి మూడు మ్యాచ్‌లలో అంతంతమాత్రం ప్రదర్శనతో నిరాశ చెందిన అభిమానులకు నాలుగో మ్యాచ్ అసలైన వినోదాన్ని అందించింది. దక్షిణాఫ్రికా, శ్రీలంక మధ్య ఫిరోజ్‌షా కోట్లా స్టేడియంలో జరిగిన పోరు కొత్త రికార్డులకు వేదికగా నిలిచింది. ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిపోయిన దక్షిణాఫ్రికా అసాధారణ స్కోరు సాధిస్తే... ఓటమి ఎదురైనా పూర్తిగా చేతులెత్తేయకుండా లంక కూడా ఆఖరి వరకు పోరాడింది. చివరకు 102 పరుగుల తేడాతో విజయం దక్షిణాఫ్రికా సొంతమైంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 428 పరుగులు సాధించింది. వాన్ డర్ డసెన్ (110 బంతుల్లో 108; 13 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఎయిడెన్ మార్క్రమ్ (54 బంతుల్లో 106; 14 ఫోర్లు, 3 సిక్స్‌లు), క్వింటన్ డి కాక్ (84 బంతుల్లో 100; 12 ఫోర్లు, 3 సిక్స్‌లు) శతకాలతో చెలరేగారు. అనంతరం శ్రీలంక 44.5 ఓవర్లలో 326 పరుగులకు ఆలౌటైంది. చరిత్ అసలంక (65 బంతుల్లో 79; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు), కుశాల్ మెండిస్ (42 బంతుల్లో 76; 4 ఫోర్లు, 8 సిక్స్‌లు), దసున్ షనక (62 బంతుల్లో 68; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడారు. 428/5 వరల్డ్ కప్‌లో ఒక జట్టు సాధించిన అత్యధిక స్కోరు ఇదే. ఓవరాల్‌గా వన్డేల్లో 9వ అత్యధిక స్కోరు. 1 ప్రపంచకప్‌లో ఒక ఇన్నింగ్స్‌లో ముగ్గురు సెంచరీలు చేయడం ఇదే మొదటిసారి. ఓవరాల్‌గా వన్డేల్లో ఇది నాలుగో సారి. ఇందులో మూడు దక్షిణాఫ్రికావే. 49 బంతులు మార్క్రమ్ ప్రపంచకప్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసి గతంలో కెవిన్ ఓబ్రైన్ (50 బంతులు) పేరిట ఉన్న రికార్డును సవరించాడు. -
‘స్థానిక’ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ హవా
సాక్షి, అమరావతి: ఎన్నికలు ఏవైనా రాష్ట్రంలో వైఎస్సార్సీపీ హవా కొనసాగుతోంది. కృష్ణా జిల్లా మచిలీపట్నం నగర కార్పొరేషన్ మేయర్ స్థానంతో పాటు నందిగామ మున్సిపల్ వైస్ చైర్మన్, రెండు ఎంపీపీ, మూడు వైస్ ఎంపీపీ స్థానాలకు సోమవారం జరిగిన ఉప ఎన్నికల్లో అధికార వైఎస్సార్సీపీ విజయం సాధించింది. మచిలీపట్నం నగర కార్పొరేషన్ మేయర్‌గా వైఎస్సార్సీపీకి చెందిన 43వ వార్డు మెంబర్ సీహెచ్ వెంకటేశ్వరమ్మ ఎన్నికయ్యారు. నందిగామ మున్సిపల్ వైస్ చైర్మన్‌గా వైఎస్సార్సీపీ తరుఫున గెలిచిన ఒకటో వార్డు మెంబర్ పాకాలపాటి కృష్ణ ఎన్నికైనట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం వెల్లడించింది. పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం, లింగాల ఎంపీపీగా అలవాలపాటి రమాదేవి (వైఎస్సార్సీపీ), తాడిపత్రి నియోజకవర్గం, పెద్దపప్పూరు మండలాధ్యక్షుడిగా జి.వెంకటరామిరెడ్డి (వైఎస్సార్సీపీ), అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం గాలివీడు మండల పరిషత్ ఉపాధ్యక్షుడిగా గాలి శ్రీనివాసులు (వైఎస్సార్సీపీ), రాప్తాడు నియోజకవర్గం, చెన్నేకొత్తపల్లి మండల పరిషత్ ఉపాధ్యక్షులుగా పి.జ్యోతి (వైఎస్సార్సీపీ), అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం ఎస్.రాయవరం మండల ఉపాధ్యక్షుడిగా బొలిశెట్టి గోవిందరావు (వైఎస్సార్సీపీ)లు ఎన్నికైనట్టు అధికారులు వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లా నలజర్ల మండలంలో పార్టీ రహితంగా జరిగిన కోఆప్షన్ సభ్యుని ఎన్నికలో సయ్యద్ మునాఫ్ గెలిచినట్లు అధికారులు వెల్లడించారు. 170 గ్రామాల్లో ఉప సర్పంచి ఎన్నిక పూర్తి.. రాష్ట్ర వ్యాప్తంగా 186 గ్రామాల్లో ఉప సర్పంచి పదవులకుగాను సోమవారం 170 గ్రామాల్లో ఎన్నిక పూర్తయినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయం అధికారులు పేర్కొన్నారు. 11 గ్రామాల్లో ఎన్నికలు వాయిదా పడగా.. మరో చోట స్థానిక వార్డు మెంబర్ చనిపోయిన కారణంగాను, ఇంకో నాలుగు గ్రామ పంచాయతీల్లో కోరం లేక తాత్కాలికంగా ఉప సర్పంచ్ ఎన్నిక వాయిపడినట్టు అధికారులు వివరించారు. వాయిదా పడిన 11 గ్రామాల్లో మంగళవారం మరో విడత ఎన్నిక నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. -
ఓటమి ఒప్పుకున్నకేసీఆర్!
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ స్వయంగా తన ఓటమిని ఒప్పుకున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయడం ద్వారా ఈ విషయం స్పష్టమైందని అన్నారు. అభ్యర్థుల ప్రకటన సమయంలో ముఖ్యమంత్రి గొంతులో ఓటమి భయం స్పష్టంగా కనిపించిందని, ఆయన పోటీ చేస్తున్న గజ్వేల్, కామారెడ్డి రెండింటిలో ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. మొత్తం సిట్టింగులకు సీట్లివ్వాలన్న తన సవాల్‌ను స్వీకరించకుండా కొందరిని మార్చారని అన్నారు. సోమవారం గాందీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. మైనారిటీలను అవమానించడమే.. ముఖ్యమంత్రి కేసీఆర్ కామారెడ్డికి పారిపోతున్నారని తాను మొదటి నుంచి చెప్పిన మాటలు నిజమయ్యాయని రేవంత్ అన్నారు. బీఆర్ఎస్ జాబితా చూసిన తర్వాత వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని తేలిపోయిందని, మూడింట రెండొంతుల మెజారిటీతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ‘కేసీఆర్ పారిపోవాలనుకుంటే సిద్దిపేట ఉంది.. సిరిసిల్ల ఉంది..కానీ ఒక మైనారిటీ నేత బరిలో ఉన్న కామారెడ్డికి వెళ్లడం.. మైనారిటీలను అవమానించడమే. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ ఎనలేని సేవ చేశారు. కాంగ్రెస్ అంతా షబ్బీర్ అలీకి అండగా ఉండి కేసీఆర్ పని పడుతుంది. అసలు కేసీఆర్ సొంత జిల్లా సిద్దిపేటకు వెళ్లకుండా కామారెడ్డికి ఎందుకు వెళ్తున్నారో ప్రజలకు చెప్పాలి..’అని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్ ఓటమి సూర్యాపేట సభలోనే స్పష్టంగా కనిపించిందని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను మధ్యాహ్నం 12.03 గంటలకు విడుదల చేస్తున్నట్లు ప్రచారం జరగగా, ఆ సమయంలో లిక్కర్ షాపుల డ్రా తీశారని ఎద్దేవా చేశారు. దీనిని బట్టి కేసీఆర్ ప్రాధాన్యత ఏంటో తెలంగాణ సమాజం అర్ధం చేసుకోవాలని అన్నారు. రుణమాపీలో రూ.11 వేల కోట్లు మిగుల్చుకున్నారు రుణమాఫీ పేరుతో కేసీఆర్ అతి తెలివితేటలు ప్రదర్శించారని రేవంత్ విమర్శించారు. రూ 99,999 వరకు మాత్రమే రుణమాఫీ చేసి రూ.11 వేల కోట్లు మిగుల్చుకున్నారని ఆరోపించారు. ఒక్క రూపాయే తేడా అని అందరూ అనుకుంటున్నారు కానీ.. దానివల్ల వేలాది మంది రైతులకు రుణమాఫీ కాలేదని తెలిపారు. కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి కాంగ్రెస్ హయాంలోనే పూర్తి రుణమాఫీ జరిగిందని రేవంత్ చెప్పారు. రూ.75 ఉన్న పింఛన్‌ను రూ.200కు పెంచింది కాంగ్రెస్సేనన్నారు. ‘50 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసింది అని కేసీఆర్ అంటున్నారు. నాగార్జునసాగర్ లాంటి ప్రాజెక్టులు మీ తాతలు కట్టారా? 12,500 గ్రామ పంచాయతీలకు కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ కాదా? చింతమడకలో బడి కట్టింది, ముఖ్యమంత్రి ఇంటికి కరెంటు ఇచ్చింది కాంగ్రెస్సే. ఔటర్ రింగ్ రోడ్డు, మెట్రో నిర్మించింది కాంగ్రెస్..’అని స్పష్టం చేశారు. 50 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందో లెక్కలతో సహా చర్చకు సిద్ధమని ప్రకటించారు. కమ్యూనిస్టులను కరివేపాకులా తీసేశారు.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, రూ.4 వేల పెన్షన్ ఇస్తుందని రేవంత్ దీమా వ్యక్తం చేశారు. ఈ విషయం ప్రగతి భవన్ గోడలమీద రాసుకోవాలని సవాల్ విసిరారు. ఏ పెద్ద ఒప్పందం జరిగినా, తర్వాత పది రోజులకు పెట్టుబడులు పెట్టేందుకు మంత్రి కేటీఆర్ విదేశాలకు వెళ్తారని విమర్శించారు. సూర్యాపేట సభలో శ్రీకాంత చారి తల్లిని నిలబెట్టి కేసీఆర్ అవమానించారని అన్నారు. కమ్యూనిస్టులను కరివేపాకులా తీసి పారేశారని ధ్వజమెత్తారు. మోసానికి గురైన కమ్యూనిస్టులు కేసీఆర్‌పై తిరుగుబాటు చేయాలని అన్నారు. పార్టీ లో చేరికలు బాన్సువాడ, వర్ధన్నపేట, ముధోల్ నియోజకవర్గాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు పలువురు సోమవారం గాందీభవన్‌లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. రేవంత్ వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. -
తాడిపత్రిలో వైఎస్సార్సీపీ హవా.. జేసీ బ్రదర్స్‌కు ఎదురుదెబ్బ
సాక్షి, అనంతపురం జిల్లా: తాడిపత్రిలో జేసీ బ్రదర్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది. జేసీ సొంత మండలం పెద్దపప్పూరులో టీడీపీ ఓటమి చెందింది. దేవునుప్పలపాడు పంచాయతీలో వైఎస్సార్ సీపీ మద్దతుదారు కాటమయ్య గెలుపొందారు.తాడిపత్రి నియోజకవర్గంలో ఐదు వార్డుల్లో వైఎస్సార్ సీపీ మద్దతుదారుల ఘన విజయం సాధించారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో జరిగిన పంచాయితీ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఒక్కొక్కటిగా ఫలితాలు వెలువడుతున్నాయి. మెజార్టీ స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు.. బలపర్చిన అభ్యర్థులే జయకేతనం ఎగరేస్తున్నారు. మొత్తం 35 సర్పంచ్, 245 వార్డు మెంబర్ల స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. -
నితీష్ కుమార్‌కు ఊరట.. కుల గణనకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..
పాట్నా: బిహార్ సీఎం నితీష్ కుమార్‌కు పాట్నా హైకోర్టులో ఊరట లభించింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణన కార్యక్రమానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బిహార్ ప్రభుత్వం చేపడుతున్న కుల గణన కార్యక్రమాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో గతంలో పలు పిటీషన్లు నమోదయ్యాయి. వీటిని కొట్టివేస్తూ హైకోర్టు నేడు తీర్పును వెలువరించింది. బిహార్‌లో కుల గణన మొదటి సర్వే జనవరి 7 నుంచి 21 వరకు జరిగింది. రెండో దఫాలో ఏప్రిల్ 15 నుంచి మే 15 వరకు జరగాల్సి ఉంది. కాగా ఈ కార్యక్రమంపై మే 4నే హైకోర్టు నిలుపుదల ఉత్తర్వులు ఇచ్చింది. కుల గణన చేపట్టాలని గత ఏడాది జూన్ 21నే రాష్ట్ర అసెంబ్లీలో క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసమే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. కాగా.. బిహార్ సీఎం నితీష్ కుమార్ దేశ రాజకీయాల్లో కీలకంగా మారిన విషయం తెలిసిందే. కేంద్రంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష కూటమిని నిర్మించడానికి ఆయన ప్రధాన వ్యక్తిగా నిలిచారు. ఎన్డీయే కూటమికి దేశంలో ప్రతిపక్షాలన్నింటిని ఒకే తాటి మీదకు తీసుకువచ్చి ఇండియా అనే కూటమిని నిర్మించిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: Haryana Nuh Violence: హర్యానాలో హై అలర్ట్.. కర్ఫ్యూ విధింపు.. -
గెలుపు.. గమనం.. మలుపు
గెలవాలి అని మనం దృఢంగా నిర్ణయించుకోవాలి; మనం మనస్పూర్తిగా గెలుపును కోరుకోవాలి; మనం గెలిచేందుకు త్రికరణ శుద్ధిగా పూనుకోవాలి; మనం గెలవాలి. మనకు మనుగడ ఉంది అని అంటే అది గెలుస్తూ ఉండేందుకే అని తెలుసుకోవాలి. ఎన్ని అవరోధాలు ఉన్నా, ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా, ఎంత వ్యతిరేకత పైనపడినా మనం గెలవాలి అని నిలవాలి; మనం గెలుస్తూ మెరుస్తూ ఉండాలి. ‘యమే వైష వృణుతే తేన లభ్యస్తైష ఆత్మా వివృణుతే తనూమ్ స్వామ్’ అని కఠోపనిషత్ చెబుతోంది. అంటే అతడి చేత ఏదైతే కోరుకోబడి అడగబడిందో దానివల్ల అతడు పొందబడతాడు; అతడికి ఆ ఆత్మ తన సహజ ప్రకృతిని తెరుస్తుంది అని అర్థం. ఈ సత్యాన్నే తెలియజేస్తూ ‘అడుగుడీ మీకియ్యబడును; వెదకుడీ మీకు దొరకును; తట్టుడీ మీకు తియ్యబడును’ అని చెప్పింది మత్తయి సువార్త. మనం గెలుపును కోరుకుని ప్రయత్నిస్తే మనకు గెలుపు తన తలుపును తెరుస్తుంది. మనం గెలుపును పొందాలనుకుని ఉద్యుక్తులం ఐతే మనం గెలుపు చేత పొందబడతాం. మనం ఉన్న ఈ ప్రపంచం ఒక పద్మవ్యూహం. కానీ మనలో ఎవరూ అభిమన్యుడు కారాదు. ప్రతివ్యక్తీ అర్జునుడే అవాలి; అర్జునుడి తీరే మనకు ఆదర్శం కావాలి; మనకు మార్గదర్శకం కావాలి. తాను ఏ స్థితిలో ఉన్నా, శాపవశాత్తు తన స్థితే మారి తాను పేడిగా మారిపోయినా అర్జునుడు గెలుపునే కోరుకుని, గెలిచేందుకు పూనుకుని గెలుపు తలుపును తట్టాడు. గెలుపు తలుపు తెరుచుకోబడి ఆ గెలుపుచేత పొందబడ్డాడు; అర్జునుడు విజయుడుగా పేరుపొందాడు. గెలుపు అనేది లక్ష్యమా? కాదు, కాదు. గెలుపు లక్ష్యంగా కాదు మనకు లక్షణంగా ఉండాలి. మనుగడ ఉన్నంతవరకూ మనం గెలుపు కోసమే, గెలుపుతోనే రోజుల్ని గడుపుతూ ఉండాలి. రోజు అనేది రావడమే ఒక గెలుపు. అదిగో ఆ రోజు రావడమే మనకు ప్రేరణ. రోజులాగా మనుగడ ఆసాంతమూ మనకు గెలుపు అనేది వస్తూనే ఉండాలి. రోజు ఒకసారి మాత్రమే వచ్చేదే ఐతే కాల గమనమూ, ప్రపంచ గమనమూ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకుందాం. అలా జరిగితే కాలానికి, ప్రపంచానికి గమనమే ఉండదు కదా? రోజు అనేది వస్తూ ఉండడమే గమనం జరుగుతోంది అన్నదానికి ఋజువు. మనకు గెలుపు వస్తూ ఉండడమే మనుగడ గమనాన్ని నిర్ధారణ చేస్తుంది. పొందే ప్రతి గెలుపు మనిషికి ఒక మలుపు. మలుపులు తిరుగుతూ పయనం సాగాలి. గెలుపులతో సాగడమే మనుగడకు సార్థకత. మనుగడ అన్నది ఒక సాగే తీగ అయితే ఆ తీగకు గెలుపుల పూలు పూస్తూ ఉండాలి. మనుగడ గెలుపుల పూలు పూచే ఒక వల్లరి కావాలి లేదా మనుగడ గెలుపుల పుష్పగుచ్ఛం కావాలి. గెలుపుల పూల పరిమళానికి ఆకృతిగా మనిషి మంచి మాటకెక్కాలి. ‘గెలుపును పొందాలని తలపోద్దాం; గెలుపును పొందుదాం. గెలుస్తూ ఉన్నవాళ్లమై తల ఎత్తుకుని మనుగడ చేద్దాం; మన తలలకు విలువను పొదువుకుందాం. గెలుపు మనకు అభిరుచి కావాలి; గెలుపును మనం చవి చూస్తూ ఉండాలి; మనం మనుగడకు చవిని చేకూర్చుకోవాలి‘. 100% – నేను గెలిచాను. 90% – నేను గెలుస్తాను. 80% – నేను గెలవగలను. 70% – నేను గెలవగలను అని అనుకుంటున్నాను. 60% – నేను గెలవగలనేమో. 50% – నేను గెలవచ్చేమో అని అనుకుంటున్నాను. 40% – ఏది గెలుపు? 30% – నాకు గెలవాలని ఉంది. 20% – ఎలా గెలవాలో నాకు తెలియదు. 10% – నేను గెలవలేను. 0% – నేను గెలవను. ఇది గెలుపునకు నిచ్చెన. మనిషి ఈ నిచ్చెనను ఎక్కాలి; తప్పకుండా ఈ నిచ్చెనను ఎక్కి తనను తాను మనిషిని అని నిరూపించుకోవాలి. – రోచిష్మాన్ -
వెస్టిండీస్ పై ఐదు వికెట్ల తేడాతో భారత్ విజయం
-
‘స్థానిక’ ఉపఎన్నికల్లో వైఎస్సార్సీపీ జయకేతనం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పట్టణ, స్థానిక సంస్థల్లో గురువారం జరిగిన పలు ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ జయకేతనం ఎగురవేసింది. ఒక మండలాధ్యక్ష పదవికి, మూడు మండల ఉపాధ్యక్ష పదవులకు ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ వివరాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు వెల్లడించారు. మచిలీపట్నం నగరపాలక సంస్థలో రెండు డిప్యూటీ మేయర్ పదవులకు ఎన్నికలు జరిగాయి. అధికార వైఎస్సార్సీపీకి చెందిన మాడపాటి విజయలక్ష్మి (26వ వార్డు కార్పొరేటర్), సీలం భారతీనాగకుసుమ (మూడోవార్డు) ఈ పదవుల్ని గెల్చుకున్నారు. పెడన మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా వైఎస్సార్సీపీకి చెందిన కటకం నాగకుమారి (ఏడోవార్డు కౌన్సిలర్) గెలుపొందారు. మాచర్ల మున్సిపాలిటీలో వైస్ చైర్మన్‌గా మాచర్ల ఏసోబు (18వ వార్డు) ఎన్నికయ్యారు. ధర్మవరం మున్సిపాలిటీ వైస్ చైర్మన్లుగా వేముల జయరామిరెడ్డి (రెండోవార్డు), షేక్ షంసద్ బేగం (38వ వార్డు) గెలుపొందారు. 13 మండలాల్లో నాలుగు ఎంపీపీ, ఏడు మండల ఉపాధ్యక్ష, మూడు కో–ఆప్షన్ సభ్యుల పదవులకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. వీటిలో రామకుప్పం (చిత్తూరు జిల్లా) మండలాధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు, విజయాపురం (చిత్తూరు), రాయదుర్గం (అనంతపురం) మండలాల ఉపాధ్యక్ష పదవులకు ఎన్నికలు వాయిదాపడ్డాయి. తొండంగి (కాకినాడ), వత్సవాయి (ఎన్టీఆర్), చేజర్ల (నెల్లూరు) మండలాధ్యక్షులుగా, పెదకడబూరు (కర్నూలు), గాలివీడు (అన్నమయ్య), రాపూరు (నెల్లూరు), పార్వతీపురం (పార్వతీపురం మన్యం) మండల ఉపాధ్యక్షులుగా వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలుపొందారు. చిత్తూరు (చిత్తూరు), రాజంపేట (అన్నమయ్య), బి.మఠం (వైఎస్సార్) మండలాల్లో కో–ఆప్షన్ సభ్యుల ఎన్నిక పూర్తయింది. -
రాసి పెట్టుకోండి.. బీజేపీ ఓడిపోతుంది..
జైపూర్: త్వరలో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి వస్తుందని బీజేపీ ఓడిపోవడం ఖాయమన్నారు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్. గడిచిన ఐదేళ్ళలో మా ప్రభుత్వం అనుసరించిన విధానాలు, మేము చేసిన అభివృద్ధిని మాత్రమే ప్రజలు పరిగణనలోకి తీసుకుంటారు అంతేగాని ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తే వారు తిప్పికొడతారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తుందని బీజేపీ ఓడిపోవడం ఖాయమని అన్నారు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్. అదొక్కటే మార్గం.. ఓ మీడియా సంస్థ చేసిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. మతసామరస్యాన్ని దెబ్బతీయడం తప్ప బీజేపీ చేయగలిగింది ఏమీ లేదు. వారు కర్ణాటకలో కూడా అదే తంత్రాన్ని ప్రయోగించారు. కానీ అక్కడ వారి ప్రయత్నం కాస్తా బెడిసికొట్టింది. నిన్న అక్కడ జరిగిందే రేపు ఇక్కడ కూడా జరుగుతుంది. వారు గెలవడానికి మతసామరస్యాన్ని దెబ్బతీయడం తప్ప మరో మార్గాన్ని ఎంచుకుంటారని నేననుకోవడంలేదు. రెచ్చగొట్టడమే తెలుసు.. ప్రచారానికి ప్రధాన మంత్రి మోదీ వచ్చినా అమిత్ షా వచ్చినా వాళ్ళు మతవిద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగాలే చేస్తారు. దాని వలన వారికి ఒరిగే ప్రయోజనమేమీ ఉండదు. కర్ణాటక ఎన్నికల సమయంలో వారు బజరంగ్ బలి నినాదాలు చేశారు. అయినా కూడా అక్కడ వారి పాచిక పారలేదు. అది చాలా పెద్ద తప్పు. నేరం కూడాను. ఈ విషయాన్ని నేనప్పుడే ప్రస్తావించి ప్రధాన మంత్రి ప్రచారాన్ని అడ్డుకోవాలని ఎన్నికల కమిషన్ కు కూడా విజ్ఞప్తి చేశాను. ప్రజలకు అన్నీ తెలుసు.. రేపు ఇక్కడ జరగబోయే ఎన్నికల్లో కూడా వారు ఇదే తరహా ప్రచారానికి తెరతీసినా ఆశ్చర్యపోనక్కరలేదు. అది వారి నైజం. కానీ ఇక్కడి ప్రజలు వారి మాటలను నమ్మే పరిస్థితి లేదు. గడిచిన ఐదేళ్ళలో ఇక్కడ జరిగిన అభివృద్ధి, ఆడబిడ్డల సంక్షేమం,విద్య, వైద్యం, మంచినీటి సదుపాయాలకు పెద్దపీట వేస్తూ మేము అవలంబించిన విధానాలే మమ్మల్ని గెలిపిస్తాయని అన్నారు. ఇది సమయం కాదు.. తనకూ సచిన్ పైలట్ కు మధ్య విభేదాల గురించి ప్రస్తావించగా రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే వంటి ముఖ్య నేతల సమక్షంలో మేము మాట్లాడుకున్నాం. అది పూర్తిగా మా అంతర్గత వ్యవహారం. దాని గురించి ఇప్పుడు మాట్లాడి అనవసర వివాదాలకు తావివ్వకూడదని అనుకుంటున్నానని తెలివిగా మాట దాటవేశారు. ఇది కూడా చదవండి: కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై.. సచిన్ పైలట్ కొత్త పార్టీ? -
WTC ఫైనల్ డ్రా అయితే ట్రోఫీ ఏ జట్టుకంటే..!
-
IPL 2024కి రెడీ 41 ఏళ్ళ వయసు ఆయన తగ్గేదేలే ..!
-
CSK IPL ట్రోఫీ కి ప్రత్యేక పూజలు..!
-
ధోని నోట రిటైర్మెంట్ మాట ఎప్పటికి క్లారిటీ వచ్చింది..
-
ఫైనల్ బెర్త్ ఎవరిది..
-
Vinesh Phogat: ఇలాంటివి చూసేందుకే పతకాలు సాధించామా?
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా భారత్ రెజ్లర్లు ఏప్రిల్ 23 నుంచి జంతర్‌మంతర్ వద్ద నిరసన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెజ్లర్ల నిరసను ఆపించి, తరలించేందుకు భారీ సంఖ్యలో ఢిల్లీ పోలీసులు జంతర్‌మంతర్ వద్దకు చేరుకున్నారు. దీంతో ఇరు వర్గాల మద్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో వర్షం కారణంగా వారి పరుపులు తడిచిపోవడంతో బయటనుంచి మరికొన్నింటిని తీసుకొచ్చేందుకు యత్నించగా అందుకు పోలీసులు అంగీకరించలేదు. మేము నేరస్తులం కాదు.. ఈక్రమంలోనే బృందంలోని కొంతమంది సభ్యులను ఢిల్లీ పోలీసులు దూషించారు. దీంతో పోలీసులు, రెజ్లర్ల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ మేరకు రెజ్లర్ వినేష్ ఫోగట్ ఇలాంటి రోజులు చూడటానికేనా! తాము పతకాలు సాధించింది? అంటూ కన్నీటి పర్యంతమైంది. ఈ సందర్భంగా వినేష్ ఉద్వేగంగా మాట్లాడుతూ.. మాపై ఇలా పోలీసులు దురుసుగా ప్రవర్తించడానికి తామేమి నేరస్తులం కాదంటూ మండిపడ్డారు. ఘటనా స్థలంలో మహిళా పోలీసులు లేకపోవడంపై నిలదీశారు. ఓ పోలీసు అధికారి తాగిన మద్యం మత్తులో దుర్భాషలాడి, తమపై దాడి చేశారని ఆరోపణలు చేశారు. Watch | "Did We Win Medals To See Such Days?" Wrestler Vinesh Phogat Breaks Down pic.twitter.com/NXOrAZwfPA — NDTV (@ndtv) May 3, 2023 ఆప్ నేత అరెస్టు! ఈ క్రమంలో రెజ్లింగ్ ఛాంపియన్షిప్ లో నాలుగు పతకాలు గెలుచుకున్న బజరంగ్ పునియా ఉద్వేగభరితంగా తన పతకాలన్నింటిని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాని అని చెప్పారు. ఇదిలా ఉండగా ఈ ఘటనలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే సోమనాథ్ భారతితో సహా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనుమతి లేకుండా భారతి మంచాలు తీసుకొచ్చేందుకు యత్నించారని, దూకుడుగా ప్రవర్తించారని అందుకే ఆయనతోపాటు మరో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటన అనంతరం జంతర్ మంతర్ ప్రాంతాన్ని సీల్ చేశారు. రెజ్లర్లను పరామర్శించేందుకు వస్తున్న ప్రతిపక్షాల హాజరును నమోదు చేసి మరీ నిరసన ప్రాంతానికి అనుమతించకుండా, రెజ్లర్లను కలవకుండా అడ్డుకున్నారు. కాగా, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై ఏడుగురు మహిళ రెజ్లర్లు లైంగిక వేధింపులకు గురి చేశారంటూ ఆరోపణలు చేశారు. అతడిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ తదనంతరం సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవడంతో ఢిల్లీ పోలీసులు బ్రిజ్ భూషణ్‌పై రెండు కేసులు నమోదు చేశారు. (చదవండి: కోపంలో నోరు జారిన పోలీసు..సెకనులో టెర్రరిస్టుగా మారుస్తా! అని బెదిరింపులు) #WATCH | Delhi: A scuffle breaks out between protesting wrestlers and Delhi Police at Jantar Mantar pic.twitter.com/gzPJiPYuUU — ANI (@ANI) May 3, 2023 -
విజయంతో ముగించిన హైదరాబాద్ ఎఫ్‌సీ
ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) లీగ్ దశను హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (హెచ్ఎఫ్సీ) విజయంతో ముగించింది. ఆదివారం కొచ్ఛిలో జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ 1–0 గోల్ తేడాతో కేరళ బ్లాస్టర్స్‌ను ఓడించింది. 29వ నిమిషంలో చేసిన ఏకైక గోల్‌తో బొర్జా హెరెరా హైదరాబాద్‌ను గెలిపించాడు. లీగ్ దశలో ఆడిన 20 మ్యాచ్‌లలో 13 గెలిచి 4 మ్యాచ్‌లు ఓడిన హైదరాబాద్ మరో 3 మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకుంది. మొత్తం 42 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచిన టీమ్ ఇప్పటికే ‘ప్లే ఆఫ్స్’ దశకు అర్హత సాధించింది. లీగ్ దశలో 46 పాయింట్లతో ముంబై సిటీ ఎఫ్‌సీ అగ్రస్థానంలో నిలిచింది. మార్చి 4న కోల్‌కతాలో మోహన్‌బగాన్, ఒడిషా ఎఫ్‌సీ జట్ల మధ్య మ్యాచ్ విజేతతో హైదరాబాద్ రెండో సెమీఫైనల్ (తొలి అంచె)లో తలపడుతుంది. ఈ మ్యాచ్ మార్చి 9న హైదరాబాద్‌లోనే జరుగుతుంది. మార్చి 13న రెండో సెమీఫైనల్ (రెండో అంచె) మ్యాచ్ ప్రత్యర్థి వేదికపై జరుగుతుంది. -
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ 90 స్థానాలు గెలుస్తుంది : బండి సంజయ్
-
బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన భారత్
-
గుజరాత్ : రవీంద్ర జడేజా సతీమణి రివాబా గెలుపు
-
FIFA World Cup Qatar 2022: ఇంగ్లండ్ అజేయంగా...
ఐదున్నర దశాబ్దాలుగా ఊరిస్తున్న రెండో ప్రపంచకప్ టైటిల్‌ను ఈసారైనా సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు తొలి దశను సాఫీగా అధిగమించింది. కనీసం ‘డ్రా’ చేసుకుంటే నాకౌట్ దశకు అర్హత సాధించే అవకాశం ఉన్నా... ఈ మాజీ చాంపియన్ మాత్రం అదరగొట్టే ప్రదర్శనతో భారీ విజయం నమోదు చేసి గ్రూప్ దశను అజేయంగా ముగించి తమ గ్రూప్ ‘బి’లో ‘టాపర్’గా నిలిచింది. అల్ రయ్యాన్ (ఖతర్): ఆద్యంతం ఆధిపత్యం చలాయించిన ఇంగ్లండ్ జట్టు ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీలో 13వసారి నాకౌట్ దశకు అర్హత సాధించింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి తర్వాత జరిగిన గ్రూప్ ‘బి’ చివరి రౌండ్ లీగ్ మ్యాచ్‌లో 1966 విశ్వవిజేత ఇంగ్లండ్ 3–0 గోల్స్ తేడాతో వేల్స్ జట్టుపై ఘనవిజయం సాధించింది. ఇంగ్లండ్ తరఫున మార్కస్ రాష్‌ఫోర్డ్ (50వ, 68వ ని.లో) రెండు గోల్స్ చేయగా... ఫిల్ ఫోడెన్ (51వ ని.లో) ఒక గోల్ అందించాడు. 1958లో తొలిసారి ప్రపంచకప్‌లో పాల్గొని క్వార్టర్ ఫైనల్ చేరిన వేల్స్ 64 ఏళ్ల తర్వాత ఈ మెగా ఈవెంట్‌కు రెండోసారి అర్హత సాధించినా ఈసారి మాత్రం గ్రూప్ దశను దాటలేకపోయింది. వేల్స్‌తో కనీసం ‘డ్రా’ చేసుకున్నా తదుపరి దశకు అర్హత పొందే అవకాశమున్నా ఇంగ్లండ్ మాత్రం విజయమే లక్ష్యంగా ఆడింది. అయితే వేల్స్ డిఫెండర్లు గట్టిగా నిలబడటంతో తొలి అర్ధభాగంలో ఇంగ్లండ్ ఖాతా తెరువలేకపోయింది. పలువురు స్టార్ ఆటగాళ్లతో నిండిన ఇంగ్లండ్ రెండో అర్ధభాగంలో వ్యూహం మార్చి ఫలితం పొందింది. 18 నిమిషాల వ్యవధిలో ఏకంగా మూడు గోల్స్ సాధించి వేల్స్‌కు కోలుకునే అవకాశం ఇవ్వకుండా చేసింది. 50వ నిమిషంలో లభించిన ఫ్రీకిక్‌ను రాష్‌ఫోర్డ్ నేరుగా వేల్స్ గోల్‌పోస్ట్‌లోనికి పంపించాడు. 2020 యూరో ఫైనల్లో ఇటలీపై పెనాల్టీ షూటౌట్లో తన షాట్‌ను గోల్‌గా మలచలేకపోయిన రాష్ఫోర్డ్కు గత రెండేళ్లుగా ఏదీ కలసి రావడంలేదు. నల్ల జాతీయుడు కావడంతో స్వదేశంలో అతనిపై జాతి వివక్ష వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే వేల్స్‌పై రాష్‌ఫోర్డ్ రెండు గోల్స్‌తో రాణించి మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. తొలి గోల్ అయ్యాక నిమిషం వ్యవధిలోనే ఇంగ్లండ్ ఖాతాలో రెండో గోల్ చేరింది. కెప్టెన్ హ్యారీ కేన్ క్రాస్ పాస్‌ను ‘డి’ ఏరియాలో అందుకున్న ఫిల్ ఫోడెన్ బంతిని లక్ష్యానికి చేర్చాడు. అనంతరం 68వ నిమిషంలో రాష్‌ఫోర్డ్ గోల్‌తో ఇంగ్లండ్ ఆధిక్యం 3–0కు పెరిగింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేసిన మూడో గోల్ ప్రపంచకప్ చరిత్రలో ఆ జట్టుకు 100వ గోల్ కావడం విశేషం. 92 ఏళ్ల ప్రపంచకప్ టోర్నీ చరిత్రలో 100 గోల్స్ మైలురాయిని అందుకున్న ఏడో జట్టుగా ఇంగ్లండ్ గుర్తింపు పొందింది. ‘బి’ గ్రూప్ టాపర్‌గా నిలిచిన ఇంగ్లండ్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సెనెగల్ జట్టుతో ఆడుతుంది. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5101504615.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
సాక్షి కార్టూన్ 07-11-2022
-
Dutch GP 2022: వెల్డన్ వెర్స్టాపెన్
జాండ్‌వూర్ట్ (నెదర్లాండ్స్): ఆద్యంతం ఆధిపత్యం చలాయించిన రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ ఫార్ములావన్ (ఎఫ్1) 2022 సీజన్లో పదో విజయం నమోదు చేశాడు. సొంతగడ్డపై ఆదివారం జరిగిన డచ్ గ్రాండ్‌ప్రి ప్రధాన రేసులో వెర్స్టాపెన్ విజేతగా నిలిచాడు. 72 ల్యాప్‌ల ఈ రేసును ‘పోల్ పొజిషన్’తో ప్రారంభించిన వెర్స్టాపెన్ అందరికంటే వేగంగా గంటా 36 నిమిషాల 42.773 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. జార్జి రసెల్ (మెర్సిడెస్) రెండో స్థానంలో, చార్లెస్ లెక్లెర్క్ (ఫెరారీ) మూడో స్థానంలో నిలిచారు. ప్రపంచ మాజీ చాంపియన్ లూయిస్ హామిల్టన్ నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. 22 రేసుల ఈ సీజన్లో ఇప్పటివరకు 15 రేసులు పూర్తయ్యాయి. వెర్స్టాపెన్ 319 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. తాజా గెలుపుతో వెర్స్టాపెన్ వరుసగా రెండో ఏడాదీ 10 విజయాలు సాధించాడు. ఒకే సీజన్లో అత్యధిక విజయాలు సాధించిన రికార్డు మైకేల్ షుమాకర్ (జర్మనీ; 2004లో 13), సెబాస్టియన్ వెటెల్ (జర్మనీ; 2013లో 13) పేరిట సంయుక్తంగా ఉంది. 201 పాయింట్లతో చార్లెస్ లెక్లెర్క్ (ఫెరారీ), సెర్గియో పెరెజ్ సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. సీజన్‌లోని తదుపరి రేసు ఇటలీ గ్రాండ్‌ప్రి ఈనెల 11న జరుగుతుంది. విజేత వెన్నెల–శ్రియాన్షి జోడీ పుణే: ఇండియా జూనియర్ ఇంటర్నేషనల్ గ్రాండ్‌ప్రి బ్యాడ్మింటన్ టోర్నీలో కలగొట్ల వెన్నెల–శ్రియాన్షి వలిశెట్టి (భారత్) జోడీ అండర్–19 మహిళల డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో వెన్నెల–శ్రియాన్షి ద్వయం 21–19, 21–18తో నర్దన–రిధి కౌర్ (భారత్) జోడీపై విజయం సాధించింది. మహిళల సింగిల్స్ ఫైనల్లో ఉన్నతి హుడా (భారత్) 25–23, 17–21, 10–21తో సరున్‌రక్ వితిద్సర్న్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో దివ్యం అరోరా–రిధి కౌర్ (భారత్) జోడీ టైటిల్ దక్కించుకుంది. -
ఇంగ్లండ్ ఘనవిజయం
మాంచెస్టర్: పేస్ బౌలర్లు ఓలీ రాబిన్సన్ (4/43), అండర్సన్ (3/30), స్టోక్స్ (2/30), బ్రాడ్ (1/24) అదరగొట్టడంతో... దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 85 పరుగుల ఆధిక్యంతో ఘనవిజయం సాధించింది. ఆట మూడో రోజు ఓవర్‌నైట్ స్కోరు 23/0తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికా 85.1 ఓవర్లలో 179 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. పీటర్సన్ (42; 1 ఫోర్), డసెన్ (41; 5 ఫోర్లు) మినహా మిగతావారు విఫలమయ్యారు. ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన స్టోక్స్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఈ గెలుపుతో మూడు టెస్టుల సిరీస్‌ను ఇంగ్లండ్ 1–1తో సమం చేసింది. -
వెర్స్టాపెన్ ఖాతాలో ఎనిమిదో విజయం
ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ ఎనిమిదో విజయం నమోదు చేశాడు. బుడాపెస్ట్‌లో ఆదివారం జరిగిన హంగేరి గ్రాండ్‌ప్రిలో వెర్స్టాపెన్ విజేతగా నిలిచాడు. 70 ల్యాప్‌ల రేసును వెర్స్టాపెన్ అందరికంటే వేగంగా గంటా 39 నిమిషాల 35.912 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. హామిల్టన్ (మెర్సిడెస్) రెండో స్థానంలో... ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన జార్జి రసెల్ (మెర్సిడెస్) మూడో స్థానంలో నిలిచారు. -
French Grand Prix: వెర్‌స్టాపెన్‌కు ఏడో విజయం
లె కాసెలెట్ (ఫ్రాన్స్): ఈ సీజన్లో తన అద్భుత ఫామ్ కొనసాగిస్తూ రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ తన ఖాతాలో ఏడో విజయాన్ని జమ చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఫ్రెంచ్ గ్రాండ్‌ప్రిలో వెర్స్టాపెన్ విజేతగా నిలిచాడు. నిర్ణీత 53 ల్యాప్‌లను వెర్స్టాపెన్ అందరికంటే వేగంగా గంటా 30ని:02.112 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ప్రారంభించిన లెక్లెర్క్ (ఫెరారీ) 18వ ల్యాప్‌లో నియంత్రణ కోల్పోయి గోడను ఢీకొట్టి రేసు నుంచి నిష్క్రమించాడు. కెరీర్లో 300వ గ్రాండ్‌ప్రి రేసులో పాల్గొన్న మాజీ చాంపియన్ లూయిస్ హామిల్టన్ (మెర్సిడెస్) రెండో స్థానాన్ని పొందగా... జార్జి రసెల్ (మెర్సిడెస్) మూడో స్థానంలో నిలిచాడు. సీజన్లో 12 రేసులు ముగిశాక వెర్స్టాపెన్ 233 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. సీజన్‌లోని తదుపరి రేసు హంగేరి గ్రాండ్‌ప్రి ఈనెల 31న జరుగుతుంది. -
ఆత్మకూరు ఉప ఎన్నిక: భారీ మెజార్టీతో మేకపాటి విక్రమ్ రెడ్డి గెలుపు
ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో అధికార వైఎస్సార్సీపీ పార్టీ భారీ విజయాన్ని అందుకుంది. ఏకపక్షంగా సాగిన ఈ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి.. 82,888 ఓట్ల భారీ మెజార్టీతో విజయ ఢంకా మోగించారు. ఉప ఎన్నికలో బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్ డిపాజిట్ కోల్పోయారు. ఇక, పోటీలో నిలిచిన ప్రతిపక్ష నేతలను మేకపాటి విక్రమ్ రెడ్డి చిత్తుగా ఓడించారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డికి 1,02,240 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థి భరత్‌కుమార్‌కు 19,352 ఓట్లు వచ్చాయి. ఉప ఎన్నికలో ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ నుంచి మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగారు. రౌండ్లు ముగుస్తున్న కొద్దీ ఆధిక్యాన్ని పెంచుకున్నారు. బీజేపీ అభ్యర్థి భరత్‌కుమార్.. విక్రమ్ రెడ్డికి ఏ మాత్రం పోటీనివ్వలేదు. ఇక, పోస్టల్ బాలెట్లో 205 ఓట్లకు గానూ వైఎస్సార్సీపీకి 167 ఓట్లు వచ్చాయి. దీంతో, బ్యాలెట్ ఓట్లలోనూ వైఎస్సార్సీపీ భారీ ఆధిక్యం సాధించింది. కాగా, రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం కారణంగా ఆత్మకూరు నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ఆయన సోదరుడు మేకపాటి విక్రమ్‌రెడ్డి, బీజేపీ నుంచి భరత్‌కుమార్ యాదవ్ సహా మొత్తం 14 మంది అభ్యర్థులు పోటీ చేశారు. -
మేకపాటి విక్రమ్ రెడ్డి గెలుపు ఏకపక్షం: చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ
-
లక్కీ ఫెలో.. భార్య వద్దన్నా లాటరీ టికెట్ కొన్నాడు.. ఇలా జాక్‌పాట్..
ఏదో ఓ రోజు తనకు లాటరీ తగలకపోతుందా అని 34 ఏళ్లుగా లాటరీ టికెట్స్ కొంటున్న వ్యక్తి బంపర్ ప్రైజ్ కొట్టేశాడు. లాటరీలో ఏకంగా రూ.2.5 కోట్ల ప్రైజ్ మనీని దక్కించుకున్నాడు. ఈ ఘటన పంజాబ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. భటిండా జిల్లాకు చెందిన రోషన్ బట్టల దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. రోషన్‌కు లాటరీ టికెట్స్ కొనడం అలవాటు.. అందులో భాగంగానే 34 ఏళ్ల నుంచి లాటరీ టికెట్లు కొంటూనే ఉన్నాడు. వీటిల్లో అప్పుడప్పుడూ రూ. 100, రూ. 200 ప్రైజ్‌లు వచ్చాయి. కానీ, అతడి ఆశ మాత్రం తీరలేదు. ఇలా ఎప్పుడూ లాటరీ టికెట్స్ కొనడంతో రోషన్ భార్య తరచూ అతడిపై ఆగ్రహం వ్యక్తం చేసేది. ఇదిలా ఉండగా.. తాజాగా పంజాబ్ స్టేట్ డియర్ వైశాఖి బంపర్ లాటరీలో మెగా ప్రైజ్ గెలుపొందడంతో రోషన్ సింగ్ ఆనందం వ్యక్తం చేశాడు. మొదట బంపర్ ప్రైజ్ గెలుచుకున్నట్టు రోషన్‌కు డీలర్ నుంచి ఫోన్ కాల్ రాగా అది ఫ్రాంక్ కాల్ అనుకున్నాడు. అనంతరం తాము రాంపుర ఫుల్ లాటరీ సెంటర్ నుంచి ఫోన్ చేస్తున్నామని ఏజెంట్ చెప్పడంతో ఎగిరి గంతేశాడు. ఈ సందర్భంగా రోషన్ మాట్లాడుతూ.. లాటరీ ప్రైజ్ గెలుచుకున్నానని తెలుసుకున్న రోజు రాత్రంతా నిద్రపోలేదని తెలిపాడు. లాటరీలో వచ్చిన డబ్బులపై పన్నులన్నీ తీసాక తమకు రూ 1.75 కోట్లు వస్తాయని లెక్కలేసుకున్నానని అన్నాడు. లాటరీ మనీ మొత్తాన్ని తన ఫ్యామిలీ కోసం, కొత్త వ్యాపారం కోసం ఖర్చు చేస్తానని చెప్పుకొచ్చాడు. ఇది కూడా చదవండి: బైక్‌పై లవర్స్ హల్చల్.. వీడియో వైరల్ -
చెన్నైపై ఆల్‌రౌండ్ పంజా
ముంబై: పంజాబ్ కింగ్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఐపీఎల్ డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్‌పై 54 పరుగులతో ఘనవిజయం సాధించింది. ముందుగా పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 180 పరుగులు చేసింది. బ్యాట్‌తో బాల్‌తో లివింగ్‌స్టోన్ (32 బంతుల్లో 60; 5 ఫోర్లు, 5 సిక్సర్లు; 2 వికెట్లు) చెలరేగాడు. తర్వాత చెన్నై 18 ఓవర్లలో 126 పరుగులకే ఆలౌటై ఈ లీగ్‌లో వరుసగా మూడో ఓటమి చవిచూసింది. శివమ్ దూబే (30 బంతుల్లో 57; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరిపించాడు. రాహుల్ చహర్ 3 వికెట్లు పడగొట్టాడు. లివింగ్‌స్టోన్ సిక్సర్లతో... ఇన్నింగ్స్ రెండో బంతికే పంజాబ్ కెప్టెన్ మయాంక్ (4) వికెట్‌ను కోల్పోయింది. రెండో ఓవర్లో భానుక రాజపక్స (9) రనౌటయ్యాడు. కింగ్స్ స్కోరు 14/2. ఇలాంటి దుస్థితిలో ఉన్న పంజాబ్‌ను లివింగ్‌స్టోన్ మెరుపు ఇన్నింగ్స్ మార్చేసింది. ముఖ్యంగా ముకేశ్ చౌదరి బౌలింగ్‌ను చితగ్గొట్టాడు. ముకేశ్ ఐదో ఓవర్లో 6, 0, 4, వైడ్, వైడ్, 4, 4, 6లతో 26 పరుగుల్ని పిండుకున్నాడు. ఓవర్‌కు పది పైచిలుకు రన్‌రేట్‌తో పంజాబ్ 9.1 ఓవర్లోనే 100 పరుగులు దాటేసింది. 11వ ఓవర్లో లివింగ్‌స్టోన్ తుఫాన్ ఇన్నింగ్స్‌ను జడేజా ముగించడంతో పంజాబ్ జోరు తగ్గింది. జితేశ్ (17 బంతుల్లో 26; 3 సిక్సర్లు) విరుచుకుపడినా... షారుక్ (6), స్మిత్ (3) నిరాశపరిచారు. చెన్నై చతికిల... పంజాబ్ పేస్‌కు చెన్నై బ్యాటర్స్ చతికిలబడ్డారు. టాపార్డర్ సహా ఐదో వరుస బ్యాట్స్‌మన్ వరకు ఎవరూ నిలువలేకపోయారు. సీమర్లు వైభవ్ అరోరా (2/), రబడ (1/28), స్మిత్ (1/14), అర్శ్‌దీప్ (1/13) పవర్ ప్లేలోనే చెన్నైకి చెక్ పెట్టారు. ఇంకా 14 ఓవర్లు ఉన్నా కూడా ఏంచేయలేని స్థితిలోకి పడేశారు. శివమ్ దూబే మెరుపులు కాసేపు ప్రేక్షకుల్ని అలరించాయే తప్ప జట్టును కష్టాల ఊబి నుంచి గట్టెక్కించలేకపోయాయి. ఉతప్ప (13), రుతురాజ్ (1), మొయిన్ అలీ (0), రాయుడు (13), జడేజా (0) నిప్పులు చెరిగే బౌలింగ్ ముందు మోకరిల్లారు. ధోని (23), దూబే కలిసి కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకోగలిగారు. ఐపీఎల్లో నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్ X లక్నో సూపర్ జెయింట్స్ వేదిక: ముంబై, రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం -
బద్వేలు ఉప ఎన్నిక: బద్వేల్లో వైఎస్సార్సీపీ భారీ విజయం
-
వైఎస్సార్సీపీ తిరుగులేని ఆధిక్యం..
సాక్షి, అమరావతి: ఎంపీటీసీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైఎస్సార్సీపీ.. శుక్రవారం మండల ప్రజా పరిషత్ (ఎంపీపీ) అధ్యక్ష పదవులకు నిర్వహించిన ఎన్నికల్లోనూ పూర్తి ఆధిక్యత సాధించింది. రాష్ట్రంలోని 660 మండలాల్లోని 11 మండలాల్లో ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించలేదు. మిగతా 649 మండలాలకు శుక్రవారం ఎంపీపీ అధ్యక్ష పదవులకు అధికారులు ఎన్నికలు నిర్వహించారు. ఇందులో కోరం లేకపోవడం, నామినేషన్లు వేయకపోవడం వల్ల 15 మండలాల్లో ఎన్నికను వాయిదా వేశారు. ఎంపీపీ ఎన్నిక నిర్వహించిన 634 మండలాల్లో 621 ఎంపీపీ అధ్యక్ష పదవులను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. టీడీపీ ఐదు చోట్ల సొంతంగా.. పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు చోట్ల జనసేన మద్దతుతో మొత్తంగా ఏడు ఎంపీపీలకే పరిమితమైంది. జనసేన, సీపీఎం ఒక్కో ఎంపీపీ పదవిని దక్కించుకోగా.. నాలుగు చోట్ల స్వతంత్రులు ఆ పదవులను చేజిక్కించుకున్నారు. కాగా, 639 మండలాల్లో కో ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక, 619 మండలాల్లో ఉపాధ్యక్ష ఎన్నికలు జరిగాయి. వాయిదా పడిన మండలాల్లో తిరిగి నేడు ఎన్నికలు నిర్వహిస్తారు. ఎంపీపీ రెండో ఉపాధ్యక్ష పదవి! మండలాల్లోనూ రెండో ఉపాధ్యక్ష పదవిని కొత్తగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ చట్టానికి సవరణలు తీసుకొచ్చేందుకు కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసి శుక్రవారం ప్రభుత్వానికి పంపినట్టు తెలిసింది. -
నారావారిపల్లెలో చంద్రబాబుకు షాక్
-
శోకోవిచ్... వరల్డ్ నంబర్‌వన్ కల చెదిరె
అవును... జొకోవిచ్ ఓడిపోయాడు! అరుదైన ఫామ్‌తో, ఆశలు, అంచనాలతో అడుగు పెట్టి అద్భుత ప్రదర్శనతో ఆడుతూ వచ్చిన వరల్డ్ నంబర్‌వన్ ఆఖరి మెట్టుపై అయ్యో అనిపించాడు! మెల్బోర్న్, పారిస్, లండన్ సమరాలను దిగ్విజయంగా దాటిన సెర్బియా స్టార్‌కు న్యూయార్క్ మాత్రం అనూహ్యంగా నిరాశను మిగిల్చింది. 1969 తర్వాత ఒకే క్యాలెండర్ ఇయర్లో నాలుగు గ్రాండ్‌స్లామ్‌లు గెలిచిన అత్యంత అరుదైన ఘనత సాధించే, ఇరవై ఒకటవ ‘మేజర్’ టైటిల్‌తో అందనంత ఎత్తులో నిలిచే అవకాశం ముంగిట బరిలోకి దిగిన జొకో చివరకు ఓటమితో కన్నీళ్లపర్యంతమై నిష్క్రమించాడు. జొకోవిచ్‌తో తలపడటం, అదీ గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో అంటే ఓటమికి సిద్ధం కావడమే అనే స్థితి కనిపిస్తున్న దశలో రష్యన్ ఆటగాడు మెద్వెదెవ్ పెను సంచలనంతో సత్తా చాటాడు. మైదానం మొత్తం ప్రత్యర్థికి అనుకూలంగా హోరెత్తుతున్న సమయంలోనూ ప్రశాంతంగా ఆడిన అతను కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్‌తో చిరునవ్వులు చిందించాడు. ఫైనల్ ఫలితం ఎలా ఉన్నా... చివరి వరకు పోరాడుతానని మ్యాచ్‌కు ముందు వ్యాఖ్యానించిన మెద్వెదెవ్ అంతకు మించిన ఆటతో చాంపియన్‌గా నిలిచాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో జొకోవిచ్ చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నాడు. చాంపియన్‌గా నిలిచిన మెద్వెదెవ్కు 25 లక్షల డాలర్లు (రూ. 18 కోట్ల 37 లక్షలు)... రన్నరప్ జొకోవిచ్‌కు 12 లక్షల 50 వేల డాలర్లు (రూ. 9 కోట్ల 18 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. న్యూయార్క్: 2021లో మూడు గ్రాండ్‌స్లామ్‌లు ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ గెలిచి యూఎస్ ఓపెన్ ఫైనల్ చేరే వరకు 27–0 మ్యాచ్‌ల విజయాలతో జోరు ప్రదర్శించిన వరల్డ్ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్‌కు భంగపాటు ఎదురైంది. యూఎస్ ఓపెన్ టోర్నీ ఫైనల్లో ఓడిన అతను 1969 తర్వాత ఒకే క్యాలెండర్ ఇయర్లో నాలుగు గ్రాండ్‌స్లామ్‌లు గెలిచిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించే అవకాశాన్ని కోల్పోయాడు. భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు ముగిసిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా) వరుస సెట్లలో 6–4, 6–4, 6–4తో జొకోవిచ్‌ను చిత్తు చేశాడు. 2 గంటల 15 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో మెద్వెదెవ్, ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. మెద్వెదెవ్ 16 ఏస్‌లు కొట్టగా, జొకో 6 ఏస్‌లకే పరిమితమయ్యాడు. 2019లో ఇదే టోర్నీ ఫైనల్లో నాదల్ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచిన మెద్వెదెవ్... రెండేళ్ల తర్వాత తన తొలి గ్రాండ్‌స్లామ్ కల నెరవేర్చుకున్నాడు. . మెద్వెదెవ్ జోరు... గతంలో జొకోవిచ్‌తో తలపడిన రెండు గ్రాండ్‌స్లామ్ మ్యాచ్‌లలోనూ ఓడిన మెద్వెదెవ్ ఈసారి పూర్తి స్థాయి సన్నద్ధతతో వచ్చాడు. తొలి సెట్లో 8 ఏస్‌లు సంధించిన మెద్వెదెవ్ ఒక్క బ్రేక్ పాయింట్ కూడా ఇవ్వలేదు. రెండో సెట్లో జొకో పోటీనిచ్చే ప్రయత్నం చేసినా... తొలి రెండు గేమ్‌లలో 5 బ్రేక్ పాయింట్లు కాపాడుకున్న రష్యన్, ప్రత్యర్థి సరీ్వస్‌ను బ్రేక్ చేసి ముందంజ వేయగలిగాడు. మూడో సెట్లోనూ ఇదే జోరు చూపించిన అతను డబుల్ బ్రేక్ పాయింట్లతో దూసుకుపోయాడు. జొకో కొత్త చరిత్రను చూసేందుకు తరలివచ్చిన దిగ్గజ ఆటగాళ్లు, హాలీవుడ్ స్టార్లూ మెద్వెదెవ్ ఆటతో ఆశ్చర్యపోయారు. మ్యాచ్ చివర్లో స్టేడియంలోని అభిమానులంతా మెద్వెదెవ్‌ను గేలి చేయడం మొదలు పెట్టారంటే వారి దృష్టిలో ఈ ఫలితం ఎంత అనూహ్యమైందో అర్థం చేసుకోవచ్చు. మూడో సెట్లో 5–2 వద్ద డబుల్ ఫాల్ట్ చేసినా... చివరకు పదో గేమ్‌లో సరీ్వస్ నిలబెట్టుకొని మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. తమ పెళ్లి రోజున తొలి గ్రాండ్‌స్లామ్ గెలిచిన క్షణాన మెద్వెదెవ్... ‘డెడ్ ఫిష్’ సంబరాన్ని ప్రదర్శించాడు. జొకో అసహనం... మ్యాచ్‌లో కొన్ని కీలక సమయాల్లో లభించిన అవకాశాలను జొకోవిచ్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. రెండో సెట్లో రెండు సార్లు మెద్వెదెవ్ సర్వీస్‌ను బ్రేక్ చేసే అవకాశం వచి్చనా అది చేజారింది. ఒక దశలో 40–0తో ముందంజలో ఉన్నా చివరకు గేమ్ దక్కలేదు. దాంతో తీవ్ర అసహనంతో తన రాకెట్‌ను మూడు సార్లు నేలకేసి విరగ్గొట్టిన అతను అంపైర్ హెచ్చరికకు గురి కావాల్సి వచ్చింది. ఆ తర్వాత అతను మళ్లీ కోలుకోలేకపోయాడు. ఈ టోర్నీ మూడో రౌండ్ నుంచి సెమీస్ వరకు వరుసగా నాలుగు మ్యాచ్‌లలోనూ జొకో తొలి సెట్ కోల్పోయాడు. ఫైనల్లోనూ అలాగే జరుగుతుందని అంతా ఆశించినా రష్యన్ ఆ అవకాశం ఇవ్వలేదు. చివరి చేంజ్ ఓవర్ సమయంలో జొకో టవల్ మధ్యలో మొహం దాచుకొని ఏడ్చేశాడు! జొకో, అతని అభిమానులకు నా క్షమాపణలు. అతను గెలిస్తే ఏం జరిగేదో అందరికీ తెలుసు. నా కెరీర్లో ఒక్క గ్రాండ్‌స్లామ్ అయినా గెలవగలనా అనుకునేవాడిని. గెలవకపోయినా నా అత్యుత్తమ ప్రదర్శన చేస్తూనే ఉండాలనుకున్నా. ఇప్పుడు తొలి ‘గ్రాండ్’ విజయంతో చాలా చాలా ఆనందంగా ఉంది. తర్వాత మరొకటి గెలిచినా ఇంతగా స్పందిస్తానో లేదు తెలీదు. జొకో ప్రతీ మ్యాచ్‌కు వ్యూహం మారుస్తాడు. అన్నింటికీ సన్నద్ధమై వచ్చా. పెళ్లి రోజు నా శ్రీమతికి ఈ టైటిల్‌ను బహుమతిగా ఇచ్చా. –మెద్వెదెవ్ ఈ రోజు గెలవకపోయినా మీ అభిమానం చూసి నా మనసు సంతోషంతో నిండిపోయింది. నా గుండెను తడిమిన మీ ఆదరణ చూస్తుంటే ఇప్పుడు ప్రపంచంలో అందరికంటే ఎక్కువ ఆనందంగా ఉన్న వ్యక్తిని నేనే అనిపిస్తోంది. అద్భుతంగా ఆడిన మెద్వెదెవ్కే గెలిచే అర్హత ఉంది. ఫలితం నిరాశ కలిగించినా... ఇన్ని రోజులుగా రికార్డు వేటలో నాపై ఉన్న తీవ్ర మానసిక ఒత్తిడి, అంచనాల భారం తొలగిపోయినందుకు ప్రశాంతంగా అనిపిస్తోంది. –జొకోవిచ్ ► రష్యా తరఫున గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచిన మూడో ఆటగాడు మెద్వెదెవ్. గతంలో కఫెలి్నకోవ్ (1996 ఫ్రెంచ్ ఓపెన్, 1999 ఆ్రస్టేలియన్ ఓపెన్), మరాత్ సఫిన్ (2000 యూఎస్ ఓపెన్, 2005 ఆస్ట్రేలియన్ ఓపెన్) రెండేసి ట్రోఫీలు గెలిచారు. ► ఒకే గ్రాండ్‌స్లామ్ టోరీ్నలో పురుషుల, మహిళల సింగిల్స్ విభాగాల్లో కొత్త చాంపియన్స్ అవతరించడం 2004 తర్వాత ఇదే తొలిసారి. 2004లో ఫ్రెంచ్ ఓపెన్‌లో గాస్టన్ గాడియో (అర్జెంటీనా), అనస్తాసియా మిస్కినా (రష్యా) తొలిసారి ‘గ్రాండ్’ విజేతలుగా నిలిచారు. ► ఒకే ఏడాది తొలి మూడు గ్రాండ్‌స్లామ్ (ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్, వింబుల్డన్) టైటిల్స్ గెలిచి చివరిదైన యూఎస్ ఓపెన్‌లో ఓడిపోయిన మూడో ప్లేయర్ జొకోవిచ్. గతంలో జాక్ క్రాఫోర్డ్ (1933లో), లె హోడ్ (1956లో)లకు ఇలాంటి ఫలితం ఎదురైంది. ► జొకోవిచ్ కెరీర్లో 11సార్లు గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫైనల్స్‌లో ఓడిపోయాడు. ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న ఫెడరర్ (11), ఇవాన్ లెండిల్ (11) సరసన జొకోవిచ్ కూడా చేరాడు. -
Tokyo Olympics: పీవీ సింధు కొత్త చరిత్ర
-
రాష్ట్ర చరిత్రలో వైఎస్సార్సీపీది అపూర్వ చరిత్ర: సజ్జల
సాక్షి, అమరావతి: జనరంజక పాలనకు ప్రజలు మరోసారి పట్టం కట్టారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సోమవారం ఆయన తాడేపల్లిలో వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఏలూరు కార్పొరేషన్ ఫలితాలే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. కులాలు, మతాలు, పార్టీలకతీతంగా సంక్షేమాన్ని అందిస్తున్నామని తెలిపారు. 12 కార్పొరేషన్లను వైఎస్సార్సీపీ దక్కించుకుందన్నారు. రాష్ట్ర చరిత్రలో వైఎస్సార్సీపీది అపూర్వ చరిత్ర అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఏలూరులో జనమంతా ఒకేమాటగా వైఎస్సార్సీకి ఓటేశారు. ఏలూరులో వైఎస్సార్సీపీకి 56.3 శాతం మంది ఓటేశారు. టీడీపీ ఏలూరులో 28.2 శాతానికే పరిమితమైంది. ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ప్రజలు ఏకపక్షంగా పట్టం కట్టారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాల్లోనూ ఇవే ఫలితాలు కనిపిస్తాయని’’ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. -
ఏలూరు కార్పొరేషన్ వైఎస్సార్సీపీ కైవసం
-
న్యూజిలాండ్‌దే పైచేయి
రెండో రోజు వెలుతురు, వర్షం పదే పదే ఆటను ఆపేశాయి. మూడో రోజు జెమీసన్ భారత ఇన్నింగ్స్‌ను అదే పనిగా కూల్చేశాడు. తొలి సెషన్లో పిచ్ పూర్తిగా పేస్‌వైపే మళ్లడంతో భారత బ్యాట్స్‌మెన్‌కు కఠినమైన సవాళ్లు ఎదురయ్యాయి. ఆరంభంలోనే కెప్టెన్ కోహ్లి ఔటవ్వడం... ఇదే అదునుగా ఇంకెవరూ క్రీజులో పాతుకుపోయే అవకాశాన్ని కివీస్ పేసర్లు ఇవ్వనేలేదు. తర్వాత అనూహ్యంగా పిచ్ బ్యాటింగ్‌కు సహకరించడంతో న్యూజిలాండ్ ఆడుతూ పాడుతూ పరుగులు జత చేసింది. టెస్టుపై పట్టుబిగించేందుకు సిద్ధంగా ఉంది. సౌతాంప్టన్: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో న్యూజిలాండ్ పేస్ పదునుకు భారత్ తడబడింది. కలిసొచ్చిన పిచ్‌పై న్యూజిలాండ్ సీమర్ కైల్ జేమీసన్ (5/31) నిప్పులు చెరగడంతో భారత్ బదులివ్వలేకపోయింది. ఆదివారం తొలి సెషన్లోనే భారత్ పతనం అంచున నిలిచింది. చివరకు రెండో సెషన్ మొదలైన కాసేపటికే భారత్ తొలి ఇన్నింగ్స్ 92.1 ఓవర్లలో 217 పరుగుల వద్ద ముగిసింది. రహానే (190 బంతుల్లో 49; 5 ఫోర్లు), కోహ్లి (196 బంతుల్లో 44; 1 ఫోర్) రాణించారు. బౌల్ట్, వాగ్నర్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. తర్వాత న్యూజిలాండ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 49 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. భారత స్కోరుకు 116 పరుగుల దూరంలో నిలిచింది. విలియమ్సన్ (12 బ్యాటింగ్), రాస్ టేలర్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. అశ్విన్, ఇషాంత్‌కు చెరో వికెట్ దక్కింది. కోహ్లి పరుగు జత చేయకుండానే... మూడో రోజు ఆట మొదలైందో లేదో గట్టిదెబ్బ తీశాడు జేమీసన్. ఓవర్‌నైట్ స్కోరుకే కెప్టెన్ కోహ్లి పెవిలియన్ చేరాడు. జేమీసన్ చక్కని లెంత్ బాల్‌తో భారత కెప్టెన్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. రివ్యూకు వెళ్లాలా వద్దా అన్న సందేహంలో తటపటాయించిన కోహి ఆఖరి క్షణంలో రివ్యూ కోరాడు. కానీ ఫలితం దక్కలేదు. తర్వాత డాషింగ్ బ్యాట్స్‌మన్ పంత్‌ను జేమీసనే ఔట్ చేశాడు. దీంతో 156 పరుగుల వద్ద ఐదో వికెట్ కూలింది. పేస్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై రహానే ఆట కూడా ఎంతోసేపు సాగలేదు. వాగ్నర్ బౌలింగ్‌లో రహానే స్క్వేర్ లెగ్‌లో లాథమ్ చేతికి చిక్కాడు. పేసర్ల ప్రతాపం... ప్రత్యర్థి బౌలర్లు నిప్పులు చెరగడంతో స్పెషలిస్టు బ్యాట్స్‌మెన్ అంటూ ఎవరూ మిగల్లేదు. బ్యాటింగ్ సామర్థ్యమున్న జడేజా (15), అశ్విన్ (22)ల ఆట స్కోరును 200 పరుగుల దాకా తీసుకొచ్చిందేగానీ... గట్టి భాగస్వామ్యానికి బాటలు వేయలేకపోయింది. సౌతీ తెలివైన బంతితో అశ్విన్‌ను పడేయగా... 211/7 స్కోరు వద్ద భారత్ లంచ్‌కు వెళ్లింది. ఆ తర్వాత మరో 6 పరుగులు చేసి మిగిలున్న మూడు వికెట్లను కోల్పో యింది. ఇషాంత్ (4), బుమ్రా (0)లను జేమీసన్ ఔట్ చేయగా... జడేజాను బౌల్ట్ బోల్తా కొట్టించడంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. 71 పరుగుల తేడాతో భారత్ 7 వికెట్లను కోల్పోయింది. శుభారంభం... పిచ్ పరిస్థితిని గుర్తించిన కివీస్ ఓపెనర్లు లాథమ్, కాన్వే జాగ్రత్తగా ఆడి తొలి వికెట్‌కు 70 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ఇద్దరు వందేసి బంతుల్ని ఎదుర్కొన్నారు. లాథమ్ (104 బంతుల్లో 30; 3 ఫోర్లు)ను ఎట్టకేలకు అశ్విన్ పడేయడం కోహ్లి సేనకు కాస్త ఊరట నిచ్చింది. మరోవైపు ఓపెనర్ కాన్వే ఫిఫ్టీ పూర్తి చేసుకోగా... జట్టు స్కోరు వంద దాటింది. మరికాసేపటికే ఇషాంత్... కాన్వేను ఔట్ చేయడంతో 101 పరుగుల వద్ద కివీస్ రెండో వికెట్‌ను కోల్పోయింది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: రోహిత్ (సి) సౌతీ (బి) జేమీసన్ 34; గిల్ (సి) వాట్లింగ్ (బి) వాగ్నర్ 28; పుజారా (ఎల్బీడబ్ల్యూ) (బి) బౌల్ట్ 8; కోహ్లి (ఎల్బీడబ్ల్యూ) (బి) జేమీసన్ 44; రహానే (సి) లాథమ్ (బి) వాగ్నర్ 49; పంత్ (సి) లాథమ్ (బి) జేమీసన్ 4; జడేజా (సి) వాట్లింగ్ (బి) బౌల్ట్ 15; అశ్విన్ (సి) లాథమ్ (బి)సౌతీ 22; ఇషాంత్ (సి) రాస్ టేలర్ (బి) జేమీసన్ 4; బుమ్రా (ఎల్బీడబ్ల్యూ) (బి) జేమీసన్ 0; షమీ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (92.1 ఓవర్లలో ఆలౌట్) 217. వికెట్ల పతనం: 1–62, 2–63, 3–88, 4–149, 5–156, 6–182, 7–205, 8–213, 9–213, 10–217. బౌలింగ్: సౌతీ 22–6–64–1, బౌల్ట్ 21.1–4–47–2; జేమీసన్ 22–12–31–5, గ్రాండ్‌హోమ్ 12–6–32–0, వాగ్నర్ 15–5–40–2. యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: లాథమ్ (సి) కోహ్లి (బి) అశ్విన్ 30; కాన్వే (సి) షమీ (బి) ఇషాంత్ 54; విలియమ్సన్ (బ్యాటింగ్) 12; రాస్ టేలర్ (బ్యాటింగ్) 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (49 ఓవర్లలో 2 వికెట్లకు) 101. వికెట్ల పతనం: 1–70, 2–101. బౌలింగ్: ఇషాంత్ శర్మ 12–4–19–1, జస్ప్రీత్ బుమ్రా 11–3–34–0; షమీ 11–4–19–0, అశ్విన్ 12–5–20–1, రవీంద్ర జడేజా 3–1–6–0. -
‘ఆనంద్‌ను మోసం చేసి గెలిచాను.. నన్ను క్షమించండి’
ముంబై: ఆ ఆటగాడు చెస్‌లో ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు. చెస్ ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. అలాంటి ఆటగాడిపై ఓ వ్యాపారవేత్త గెలచాడంటే నమ్మగలమా? కానీ ఇది నిజమే. అయితే దానికి వెనుక దాగున్న అసలు నిజాలు బయటపడ్డాయి. ఆదివారం జరిగిన ఓ ఛారిటీ మ్యాచ్‌లో జెరోదా కంపెనీ కో ఫౌండర్ నిఖిల్ కామత్ ఆడిన చెస్ గేమ్‌లో విశ్వనాథ్ ఆనంద్‌ను ఓడించాడు. ఈ విజయం చాలా మందిని షాక్‌కు గురి చేసిందనే చెప్పాలి. కాగా కోవిడ్ సహాయ నిధి కోసం విరాళాలు సేకరించడానికి చెస్ కింగ్ విశ్వనాథన్ ఆనంద్, పలువురు సెలబ్రిటీలతో చెస్ గేమ్స్ ఆడారు. అందులో ఆమిర్ ఖాన్, రితేష్ దేశ్‌ముఖ్‌లాంటి బాలీవుడ్ ప్రముఖులు కూడా ఉన్నారు. తాజాగా నిఖిల్ కామత్ తన విజయంపై స్పందిస్తూ.. ఈ విజయం వెనుక అసలు కారణాన్ని బట్ట బయలు చేశాడు. అతను తన ట్విటర్లో.. ‘ నేను విశ్వనాథ్ ఆనంద్‌ని కలుసుకోవాలని, మాట్లాడాలని కలలు కనేవాడిని. ఈ కలను సాకారం చేసినందుకు అక్షయ్‌పాత్రకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అందరూ నేను ఆనంద్‌పై విజయం సాధించానని అనుకుంటున్నారు. కానీ గేమ్‌ను చూస్తున్న నిపుణులు, కంప్యూటర్ల సాయం ద్వారా ఈ ఆటను గెలిచాను. ఇలా చేసినందుకు నన్ను క్షమించాలని’ ట్వీట్ చేశాడు. ఓ చారిటీ మ్యాచ్‌లో ఇలా మోసం చేసి గెలవడం దురదృష్టకరమని, ఇలా జరిగి ఉండాల్సింది కాదని ఆలిండియా చెస్ ఫెడరేషన్ సెక్రటరీ భరత్ చౌహాన్ అన్నారు. It is ridiculous that so many are thinking that I really beat Vishy sir in a chess game, that is almost like me waking up and winning a 100mt race with Usain Bolt. 😬 pic.twitter.com/UoazhNiAZV — Nikhil Kamath (@nikhilkamathcio) June 14, 2021 చదవండి: గుర్రంతో పోటీపడి పరుగులు తీస్తున్న ధోని.. -
చిలీ పర్యటన అజేయం..
భారత జూనియర్ మహిళల హాకీ జట్టు చిలీ పర్యటనను అజేయంగా ముగించింది. సీనియర్ చిలీ జట్టుతో సాంటియాగోలో సోమవారం జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్ 2–1తో గెలుపొందింది. బ్యూటీ డుంగ్‌డుంగ్ (6వ ని.లో, 26వ ని.లో) రెండు గోల్స్ చేసి భారత్ విజయంలో కీలకపాత్ర పోషించింది. చిలీ తరఫున 40వ నిమిషంలో ఫ్రాన్సిస్కా టాలా ఏకైక గోల్ సాధించింది. ఈ పర్యటనలో ఆరు మ్యాచ్‌లు ఆడిన భారత్ 5 మ్యాచ్‌ల్లో గెలుపొంది ఒక మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించింది. మరోవైపు అర్జెంటీనా పర్యటనలో ఉన్న భారత సీనియర్ మహిళల హాకీ జట్టుకు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. అర్జెంటీనా ‘బి’ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 2–3 గోల్స్ తేడాతో ఓడిపోయింది. భారత్ తరఫున సలీమా (6వ ని.లో), గుర్జీత్ కౌర్ (42వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. -
టీమిండియా గెలుపు : దిగ్గజాల స్పందన
సాక్షి, న్యూఢిల్లీ: భారత్-ఆస్ట్రేలియా నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయపై భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పందించారు. భారత క్రికెట్ జట్టు విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉందంటూ ట్వీట్ చేశారు. అద్భుతమైన శక్తి, వారి అభిరుచి మ్యాచ్ అంతా కనిపించిందని, ఈ గెలుపు దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. జట్టుకు అభినందనలు! మీ భవిష్యత్ ప్రయత్నాలకు శుభాకాంక్షలు అని మోదీ తెలిపారు. (చెలరేగిన పంత్.. భారత్ సంచలన విజయం) చరిత్రను రికార్డులను తిరగరాసిన టీమిండియా బోర్డర్-గావస్కర్ ట్రోఫీ నాలుగో టెస్ట్ సంచలన విజయంపై పలువురు ప్రముఖులు, ఇతర దిగ్గజాలు సోషల్ మీడియా ద్వారా ఎనలేని ఆనందాన్ని ప్రకటించారు. ముఖ్యంగా క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ స్పందిస్తూ గొప్ప సిరీస్ విజయాలలో ఇదొకటి అని ట్వీట్ చేశారు. ప్రతి సెషన్‌కి క్రొత్త హీరోను వస్తున్నాడు. ప్రతీసారి విజయం సాధించాం. చాలా స్థిరంగా ధీటుగా నిలబడ్డాం. నిర్లక్క్ష్యంగా కాదు.. నిర్భయంగా, నమ్మకంగా ఆడుతూ క్రికెట్ సరిహద్దులను చెరిపేసాం. గాయాల్ని, ఇతర అనిశ్చితులను విశ్వాసంతో ఎదుర్కొన్నామని సచిన్ ట్వీట్ చేశారు. బీసీసీఐతోపాటు మాజీ, ప్రస్తుత భారత క్రికెటర్లు, ఇతర క్రీడాకారులు సంబరాలు చేసుకుంటున్నారు. విరాట్ కోహ్లి, వీవీఎస్ లక్క్ష్మణ్, శిఖర్ ధావన్, ఇశాంత్ శర్మ తదితరులు ట్విటర్ ద్వారా తమ ఆనందాన్ని ప్రకటించారు. అంతేకాదు టెక్ దిగ్గజం సుందర్ పిచాయ్ కూడా టీమిండియా గెలుపుపై సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. గొప్ప టెస్ట్ సిరీస్‌లో ఒకటి ఎప్పుడూ గెలుస్తుంది. విజయం సాధించిన టీమిండియాకు అభినందనలు అని తెలిపారు. కాగా ఆస్ట్రేలియా గెలుపునకు కేరాఫ్‌గా భావించే బ్రిస్బేన్‌లోని గబ్బాలో భారత్ విజయ బావుటా ఎగురవేసింది. దాదాపు మూడు దశాబ్దాల తరువాత కొత్త చరిత్ర సృష్టించింది. దీంతో నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తో టీమిండియా కైవసం చేసుకున్నసంగతి తెలిసిందే. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని వరుసగా రెండోసారి నిలబెట్టుకుంది. We are all overjoyed at the success of the Indian Cricket Team in Australia. Their remarkable energy and passion was visible throughout. So was their stellar intent, remarkable grit and determination. Congratulations to the team! Best wishes for your future endeavours. — Narendra Modi (@narendramodi) January 19, 2021 EVERY SESSION WE DISCOVERED A NEW HERO. Every time we got hit, we stayed put & stood taller. We pushed boundaries of belief to play fearless but not careless cricket. Injuries & uncertainties were countered with poise & confidence. One of the greatest series wins! Congrats India. pic.twitter.com/ZtCChUURLV — Sachin Tendulkar (@sachin_rt) January 19, 2021 Historic series win for Team India! Youngsters delivered when it mattered, with Gilll and Pant in the forefront. Hats off to Ravi Shastri and the support staff for their part in this turnaround! So so proud of this bunch, this is one for the ages👏👏👏 #AUSvsIND — VVS Laxman (@VVSLaxman281) January 19, 2021 The champions & the greatest chase!🙌#TeamIndia has proved it again by team efforts, great character, courage & max determination! Despite the bruises, the team made it possible for our country. That’s why we play for the country’s flag to go high every time we perfom🇮🇳#INDvAUS — Ishant Sharma (@ImIshant) January 19, 2021 -
నమ్మకాన్ని నిలబెట్టుకుంటా: బైడెన్
సాక్షి, వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికల్లో తన గెలుపు అమెరికన్ల విజయమని జో బైడెన్ అన్నారు. డెమొక్రాట్ల విజయోత్సవ సభలో ఆయన ప్రసంగించారు. అమెరికన్ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని తెలిపారు. ‘‘అమెరికన్ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. అమెరికా చరిత్రలో ఇదొక నూతన అధ్యాయం. 7.4 కోట్ల మంది అమెరికన్లు డెమొక్రాట్లకు ఓటేశారు. అమెరికన్లు తమ భవిష్యత్ కోసం ఓటేశారు. మీరు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా. ప్రజాస్వామ్య బద్ధంగానే పరిపాలన చేస్తా. ప్రత్యర్ధులు మన శత్రువులు కాదు.. వారు కూడా అమెరికన్లే. అమెరికాకు కొత్త రోజులు రాబోతున్నాయి. కమలా హ్యారిస్ అద్భుత నాయకురాలు. అమెరికాలో వర్ణవివక్ష లేకుండా అభివృద్ధి చేసుకుందాం’’ అని పేర్కొన్నారు. (చదవండి: బైడెన్‌కే పట్టాభిషేకం) ప్రజాస్వామ్యాన్ని కాపాడారు: కమలాహారిస్ అమెరికన్లు ప్రజాస్వామ్యాన్ని కాపాడారని అమెరికా మొదటి మహిళా ఉపాధ్యక్షురాలిగా పదవిని చేపట్టనున్న కమలా హ్యారిస్ అన్నారు. ‘‘అమెరికా చరిత్రలో నూతన అధ్యాయం. ఉపాధ్యక్ష ఎన్నికల్లో నా గెలుపు మహిళా లోకం విజయం. అమెరికా ప్రజలు తమ గళాన్ని గట్టిగా వినిపించారని’’ ఆమె పేర్కొన్నారు. (చదవండి: చరిత్ర సృష్టించిన కమలా హ్యారిస్) -
ఎమ్మెల్సీ ఉపఎన్నికలో సత్తా చాటిన టీఆర్ఎస్
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి, టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కుమార్తె, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఘనవిజయం సాధించారు. 672 ఓట్ల భారీ మెజారిటీ దక్కించుకున్నారు. బరిలో నిలిచిన బీజేపీ, కాంగ్రెస్‌లకు డిపాజిట్లు కూడా దక్కలేదు. మొత్తం 823 ఓట్లు పోలవగా, మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతోనే ఫలితం తేలిపోయింది. 728 (88%) మొదటి ప్రాధాన్యత ఓట్లు కవితకే దక్కాయి. రెండోస్థానంలో నిలిచిన బీజేపీ అభ్యర్థి పోతనకర్ లక్ష్మీనారాయణకు 56 మొదటి ప్రాధాన్యత ఓట్లు రాగా, మూడో స్థానానికి పడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి వి.సుభాష్ రెడ్డికి 29 మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. కాగా, పది ఓట్లు చెల్లలేదు. ఈ ఎమ్మెల్సీ స్థానానికి ఈ నెల 9న పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. సోమవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కాగా, ఉదయం 10.30 గంటలకల్లా ఫలితం వెలువడింది. ఎన్నికల సంఘానికి నివేదించిన అనంతరం కవితకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నారాయణరెడ్డి ధ్రువీకరణపత్రాన్ని అందజేశారు. డిపాజిట్లు కోల్పోయిన జాతీయ పార్టీలు.. అభ్యర్థులకు డిపాజిట్లు దక్కాలంటే మొత్తం పోలైన ఓట్లలో ఆరోవంతు ఓట్లు రావాలి. మొత్తం 823 ఓట్లలో ఆరోవంతు అంటే 138 మొదటి ప్రాధాన్యత ఓట్లు రావాల్సి ఉంటుంది. కానీ, బీజేపీకి 56, కాంగ్రెస్‌కు 29 మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. రెండు పార్టీల అభ్యర్థులకు కలిపినా డిపాజిట్లు దక్కేలా ఓట్లు రాకపోవడం గమనార్హం. ఈ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగినట్లు స్పష్టమైంది. కాంగ్రెస్, బీజేపీల నుంచి గెలిచిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కవితకు ఓట్లేయడం గమనార్హం. స్థానిక సంస్థలైన మున్సిపాలిటీలు, జిల్లా, మండల పరిషత్‌లతో కలిపి కాంగ్రెస్ పార్టీకి మొత్తం 141 మంది సభ్యుల బలం ఉంది. ఇందులో సుమారు 75 మంది కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్లో చేరారు. కాంగ్రెస్‌లో మిగిలిన సుమారు 66 మంది కూడా ఆ పార్టీ అభ్యర్థికి ఓటు వేయలేదు. అందులో 29 మంది మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థి వి.సుభాష్‌రెడ్డికి ఓటు వేశారు. దీన్ని బట్టి చూస్తే 37 మంది కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్లు తేలింది. జిల్లాలోని స్థానిక సంస్థల్లో కాంగ్రెస్‌తో పోలిస్తే బీజేపీకి నామమాత్రంగానే బలముంది. బీజేపీకి 85 మంది సభ్యులు ఉన్నారు. ఈ ఎన్నికల్లో 56 ఓట్లు సాధించింది. ఈ ఎన్నికల నాటికి ఆ పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్లో చేరారు. ఆత్మ ప్రబోధానుసారం ఓట్లేశారు: మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ ప్రజాప్రతినిధులు పార్టీలకు అతీతంగా వారి అంతరాత్మ ప్రబోధా నుసారం ఓటేశారని మంత్రి ప్రశాంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పార్లమెంట్ ఎన్నికల్లో డూప్లి కేట్ బాండ్లు, మోసపూరిత హామీలిచ్చి రైతు లను, ప్రజలను మోసం చేసి గెలిచారని విమర్శిం చారు. కవిత గెలుపునకు సహకరించిన ప్రజా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం ఆశీస్సులు తీసుకున్న కవిత ఎమ్మెల్సీగా గెలుపొందిన కవిత రిటర్నింగ్ అధికారి నుంచి ధ్రువపత్రం తీసుకుని జిల్లా కు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి సోమవారం సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకున్నారు. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు సురేశ్‌రెడ్డితోపాటు జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కేసీఆర్ అభినందించారు. అనంతరం శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని ఆయన నివాసంలో కవిత కలుసుకుని ఆశీస్సులు తీసుకున్నారు. బుధవారం ఆమె మండలి సభ్యురాలిగా ప్రమాణం చేయనున్నారు. అందరికీ కృతజ్ఞతలు: కవిత ‘‘ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజలకు సేవ చేసుకునే అవకాశం కల్పించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు, మద్దతు తెలిపిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు హృదయపూర్వక ధన్యవాదాలు. నా గెలుపునకు కృషి చేసిన మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు’’అని కవిత ట్వీట్ చేశారు. -
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్ ఎన్నిక
సాక్షి, న్యూఢిల్లీ : రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఎన్డీయే అభ్యర్థి జేడీ(యూ)కి చెందిన హరివంశ్ నారాయణ్ సింగ్ సోమవారం ఎన్నికయ్యారు. హరివంశ్ సింగ్ డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికైనట్టు రాజ్యసభ చీఫ్ ఎం వెంకయ్యనాయుడు ప్రకటించారు. వాయిస్‌ఓట్ ద్వారా రాజ్యసభ ఛైర్మన్ ఎన్నిక నిర్వహించారు. ఆర్జేడీ అభ్యర్థి మనోజ్ ఝాపై హరివంశ్ నారాయణ్ సింగ్ విజయం సాధించారు. హరివంశ్ సింగ్ అట్టడుగు వర్గం నుంచి వచ్చిన మేథావి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పెద్దల సభ డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికైన హరివంశ్ సింగ్‌ను ఆయన అభినందించారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్ వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. విపక్ష నేతలు సైతం హరివంశ్‌ను అభినందించారు. ఇక అంతకుముందు హరివంశ్‌కు మద్దతుగా బీజేపీ చీఫ్ జేపీ నడ్డా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మనోజ్ ఝాను బలపరుస్తూ విపక్ష నేత గులాం నబీ ఆజాద్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. గత రెండేళ్లుగా పెద్దల సభను హరివంశ్ నడిపించిన తీరుతో పార్టీలకు అతీతంగా పలువురు సభ్యుల నుంచి ఆయనకు ప్రశంసలు లభించాయి. మరోవైపు 245 మంది సభ్యులు కలిగిన రాజ్యసభలో ఎన్డీయేకు 113 మంది సభ్యులుండగా, హరివంశ్ ఎన్నికకు అనుకూలంగా విపక్ష ఎంపీల మద్దతు కూడగట్టడంలో బీజేపీ విజయవంతమైంది. చదవండి : పెద్దల సభ : ఎథిక్స్ కమిటీ బలోపేతం -
విశ్వాస పరీక్షలో గహ్లోత్ సర్కార్ విజయం
జైపూర్ : రాజస్తాన్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం శుక్రవారం జరిగిన విశ్వాస పరీక్షలో విజయం సాధించింది. పాలక కాంగ్రెస్ ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానంపై జరిగిన ఓటింగ్‌లో మూజువాణి ఓటుతో గహ్లోత్ సర్కార్ నెగ్గింది. విశ్వాస పరీక్షపై ఓటింగ్ అనంతరం సభను ఈనెల 21 వరకూ వాయిదా వేస్తున్నట్టు అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషీ ప్రకటించారు. తిరుగుబాటు నేత సచిన్ పైలట్ పార్టీ అగ్రనేతలు రాహుల్, ప్రియాంకలతో భేటీ అనంతరం తిరిగి పార్టీ గూటికి చేరడంతో కాంగ్రెస్ ప్రభుత్వం విశ్వాస తీర్మానాన్ని సులభంగా నెగ్గింది. తాను కాంగ్రెస్ తరపున పోరాడే శక్తివంతమైన యోధుడనని పేర్కొన్న సచిన్ పైలట్ ఎలాంటి విపత్కర పరిస్ధితుల్లోనూ పార్టీని కాపాడుకుంటానని చెప్పారు. విశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శాంతి ధరివాల్ మాట్లాడుతూ మధ్యప్రదేశ్, మణిపూర్, గోవా రాష్ట్రాల్లో ధనం, అధికార బలం ప్రయోగించి ప్రభుత్వాలను బీజేపీ కూల్చివేసిందని ఆరోపించారు. రాజస్తాన్‌లోనూ అదే ప్రయత్నం చేసిన కాషాయపార్టీ భంగపడిందని అన్నారు. ఇక 200 మంది సభ్యులు కలిగిన రాజస్తాన్ అసెంబ్లీలో గహ్లోత్ సర్కార్‌కు 107 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండగా, బీజేపీ సంఖ్యాబలం 72గా ఉంది. ఇక అసెంబ్లీ సమావేశాలకు ముందు అశోక్ గహ్లోత్ మాట్లాడుతూ ఈరోజు అసెంబ్లీ భేటీ వాస్తవాలకు అద్దం పడుతుందని, కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఐక్యతకు సంకేతంగా నిలుస్తుందని..సత్యమేవ జయతే అంటూ ట్వీట్ చేశారు. చదవండి : రాజస్తాన్ అసెంబ్లీలో పైలట్ కీలక వ్యాఖ్యలు -
చైనాతో రెండు యుద్ధాలు : వెనక్కి తగ్గేది లేదు
సాక్షి, న్యూఢిల్లీ : భారత్ - చైనా సరిహద్దులో ఉద్రిక్తత నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. పొరుగు దేశం చైనాతో దేశం రెండు యుద్ధాలు చేస్తోందని వ్యాఖ్యానించారు. ఒకటి చైనా సరిహద్దులో, రెండవది చైనా నుంచి వ్యాపించిన కరోనాతో పోరాడుతోందన్నారు. అయితే ఈ రెండు యుద్ధాల్లోనూ భారత్ గెలుస్తుందంటూ ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అటు సరిహద్దులో సైనికులు, ఇటు కరోనాపై పోరులో వైద్యులు ముందుండి పోరాడుతున్నారని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. (మూడురెట్లు పెరిగిన టెస్టింగ్ సామర్థ్యం) చైనాతో ప్రస్తుతం రెండు యుద్ధాలు చేస్తున్నామంటూ కేజ్రీవాల్ హిందీలో ట్విట్ చేశారు. లద్దాఖ్ సరిహద్దులో 20 మంది జవాన్లు వెన్నుచూపకుండా ధీరత్వాన్ని చూపారు. అదే తరహాలో తాము కూడా కరోనాను అంత మొందించేదాకా వెనక్కి తగ్గమన్నారు. ఈ పోరులో విజయం సాధిస్తామన్నారు. అంతేకాదు రాజకీయాలకు ఇది సమయం కాదనీ, ఐక్యంగా ఈ యుద్ధాలను గెలవాలని కేజ్రీవాల్ పిలుపు నిచ్చారు. ఢిల్లీలో కరోనా విస్తరణ, కట్టడిపై సీఎం కేజ్రీవాల్ మీడియాకు వివరాలు వెల్లడించారు. కరోనా పరీక్షలను మూడు రెట్లు పెంచామని చెప్పారు. అంతకుముందు రోజుకు 5,000 పరీక్షలు నిర్వహించగా, ప్రస్తుతం దాదాపు 18 వేల పరీక్షలు చేస్తున్నట్టు తెలిపారు. అలాగే హోమ్ క్వారంటైన్లో చికిత్స పొందుతున్న వారికి ఆక్సిజన్ స్థాయిలను మానిటర్ చేసేందుకు పల్స్ ఆక్సీమీటర్లు అందిస్తారు చెప్పారు. आज हम चीन के ख़िलाफ़ दो युद्ध लड़ रहे हैं - भारत चीन बॉर्डर पर और चीन से आए वाइरस के ख़िलाफ़। हमारे 20 वीर जवान पीछे नहीं हटे। हम भी पीछे नहीं हटेंगे और दोनों युद्ध जीतेंगे। https://t.co/DaBag9jkIk — Arvind Kejriwal (@ArvindKejriwal) June 22, 2020