ట్రంప్ విజయంలో మనోడు
ట్రంప్ విజయంలో మనోడు
Published Fri, Nov 11 2016 1:59 AM | Last Updated on Thu, Apr 4 2019 5:04 PM
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం వెనుక ఒక తెలుగు తేజం హస్తముంది. ట్రంప్ ప్రచారంలో పక్కా వ్యూహాలు రచించి ఆయన గెలుపు కోసం శ్రమించిన అవినాశ్‌కు రాజకీయాలంటే అమితాసక్తి. రాజకీయ ప్రచార వ్యూహాల్లో దిట్ట. లక్నోలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుంచి ఎంబీఏ పట్టా పొందిన ఆయన ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలోనూ పాలుపంచుకున్నారు. ఢిల్లీలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌లో ఉద్యోగాన్ని వదులుకొని ఆయన వైఎస్సార్‌సీపీ కోసం పనిచేశారు. రాజకీయాలంటే ఇష్టం ఉండటంతో అమెరికాలోనూ వాటిని వదలలేకపోయారు.
అవినాష్ భార్య అమెరికాలోని అరిజోనాలో ఇంటెల్‌లో పనిచేస్తుండగా, సెలవుల కోసం ఆయన అక్కడికి వెళ్లారు. ఆ సమయంలో అరిజోనాలో గవర్నర్ ఎన్నికలు జరుగుతున్నారుు. ఆ ఎన్నికలకు సంబంధించి సమగ్ర అధ్యయనం చేసిన తర్వాత డగ్ డూసీ అనే రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ప్రచారంలో అవినాశ్ పాలుపంచుకున్నారు. విసృ్తత సమాచార సేకరణ చేసి దాన్ని క్రోడీకరించారు. భారీగా ఓట్లు పొందడానికి సమగ్ర ప్రణాళిక రచించారు. ఇదంతా డూసీకి కలిసొచ్చింది.
ఆయన అవలీలగా విజయం సాధించారు. దీంతో అవినాశ్ పొలిటికల్ డెరైక్టర్‌గా పదోన్నతి పొందారు. కొద్దికాలంలోనే ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా ఎదిగారు. తర్వాత అవినాశ్ డొనాల్డ్ ట్రంప్ ప్రచార శిబిరంలో చేరారు. అనంతరం అరిజోనా రాష్ట్రం బాధ్యతను ఆయనకు అప్పగించారు. ఆయన ట్రంప్ గెలుపు కోసం మంచి వ్యూహాలు రచించారు. అంతిమంగా ట్రంప్ విజయం సాధించారు.
Advertisement