United States of America
-
వీసా గోల్డెన్ చాన్సేనా?
గోల్డ్ కార్డ్ వీసా.. ప్రపంచవ్యాప్తంగా కొత్త చర్చకు దారితీసిన టాపిక్ ఇది. అత్యంత గౌరవంగా భావించే అమెరికా పౌరసత్వం (US Citizenship) కోసం ట్రంప్ సర్కార్ తెచ్చిన ఈ కొత్త విధానం ఎంత మందిని ఆకట్టుకుంటుంది? అమెరికన్ కంపెనీలు ఈ పథకాన్ని ఉపయోగించి భారతీయులు సహా విదేశీ విద్యార్థులను, ప్రతిభావంతులను నియమించుకోవచ్చని ట్రంప్ అన్నారు. ట్రంప్ కేవలం పౌరసత్వ కలను అమ్ముకోవడం ద్వారా లాభం పొందాలని కోరుకోవడం లేదు. అమెరికన్ కంపెనీలు మంచి నిపుణులను నియమించుకోవడానికి వీలవుతుందని అంటున్నారు. వ్యాపారం పరంగా ఈ ఆఫర్ అమెరికన్ కంపెనీలకు ఆకర్షణీయమేనా? భారతీయులకు ప్రయోజనం చేకూరుస్తుందా? ఒక కోటి గోల్డ్ కార్డులు అమ్మడం ద్వారా అమెరికా (America) అప్పులు తొలగిపోతాయని ట్రంప్ పేర్కొంటున్నారు. కానీ రూ.43.7 కోట్ల విలువైన వీసాను కొనగలిగే అతి ధనవంతులు అమెరికా వెలుపల ఎంతమంది ఉన్నారనేదే ఇక్కడ ప్రశ్న. మరోవైపు పౌరసత్వం సరే.. పన్ను నిబంధనలపై అనిశ్చితి కారణంగా గోల్డ్‌కార్డు (Gold Card)ను తీసుకునేవారు తక్కువగా ఉంటారని నిపుణులు అంటున్నారు. – సాక్షి, బిజినెస్ బ్యూరోట్రంప్ లక్ష్యం అంత సులభమేమీ కాదు..ఒక కోటి గోల్డ్ కార్డుల అమ్మకాలు అమెరికా రుణభారాన్ని తుడిచిపెట్టగలవని ట్రంప్ అంటున్నారు. కానీ ఏకంగా రూ.43.7 కోట్లు వెచ్చించగల స్తోమత ఉన్న ధనవంతులు అమెరికా వెలుపల ఎంత మంది ఉన్నారు? క్రెడిట్ స్విస్ గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ ప్రకారం 2022లో ప్రపంచవ్యాప్తంగా 5–10 మిలియన్ డాలర్ల సంపద పరిధిలోని ధనికుల సంఖ్య 51 లక్షలు. ఇందులో 10 మిలియన్ డాలర్లకుపైగా ఉన్నవారు 28లక్షల మంది. ఇలాంటప్పుడు ఒక కోటి మంది గోల్డ్‌కార్డ్ కొనుగోలుదారులను పొందడం సాధ్యమయ్యేదేనా? అన్న సందేహాలు వస్తున్నాయి. రష్యా, చైనా, ఆగ్నేయాసియా నుంచి ధనవంతులు డబ్బు సంచులతో అమెరికాకు వస్తారని ట్రంప్ ఆశిస్తున్నారేమోగానీ.. విదేశీ బిలియనీర్లు గోల్డ్ కార్డ్‌ను తీసుకుంటారా? అని ఇమిగ్రేషన్ నిపుణులే పేర్కొంటున్నారు. గోల్డ్కార్డ్పై తలెత్తుతున్న ప్రశ్నలెన్నో.. » ఈ కార్యక్రమం ద్వారా అమెరికన్ పౌరసత్వాన్ని అమ్మకానికి పెట్టడం, యోగ్యత కంటే డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వడం వంటివాటిని ప్రతిభావంతులైన నిపుణుల ఖర్చుతో ధనవంతుల అవసరాలను తీర్చడంగా చూడవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. » గోల్డ్ కార్డుల వల్ల బలమైన నియంత్రణ, తనిఖీలు లేనప్పుడు పెట్టుబడి అంశంతో కూడిన ఇమిగ్రేషన్ కార్యక్రమాలు మనీలాండరింగ్‌కు, విదేశాల ప్రభావానికి గురయ్యే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ఇది రష్యన్ సామ్రాజ్యవాదులకు అమెరికా తలుపులు తెరుస్తుందా అని అడిగినప్పుడు ట్రంప్ ఉదాసీనంగా సమాధానమిచ్చారు. ‘అవును. నాకు కొందరు రష్యన్ సామ్రాజ్యవాదులు తెలుసు. వారు చాలా మంచి వ్యక్తులు’అని పేర్కొన్నారు. » ఉద్యోగాలను సృష్టించే సంస్థలలో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేకుండా గోల్డ్ కార్డ్ వస్తే.. చాలా మంది ధనవంతులు యూఎస్ ఆర్థిక వ్యవస్థకు ఎటువంటి తోడ్పాటు ఏమీ ఇవ్వకుండా నివాసం ఉండవచ్చనే ఆందోళనలు ఉన్నాయి. » కెనడాలో ఇలాంటి కార్యక్రమాన్ని తక్కువ పెట్టుబడితోనే ప్రారంభించారు. కానీ అది విపరీతంగా దుర్వినియోగం కావడంతో రద్దు చేశారు. ముందున్న సవాళ్లు రెండు.. ప్రతినిధుల సభ కాంగ్రెస్‌లో.. వలస విధానంలో ఏదైనా ముఖ్య మార్పును అమెరికా ప్రతినిధుల సభ కాంగ్రెస్ ఆమోదించాలి. ప్రస్తుతం రిపబ్లికన్ పార్టీ కి ఉభయ సభలలో మెజారిటీ ఉంది. కానీ అమెరికన్ పౌరసత్వాన్ని అమ్ముకుంటున్నారన్న ఆరోపణల నేపథ్యంలో అందరు రిపబ్లికన్లు సమర్థించకపోవచ్చు. డెమొక్రాట్లు ఈ ప్రతిపాదనను దాదాపుగా వ్యతిరేకిస్తారు. కోర్టులలో..అమెరికాలో చాలా చట్టపరమైన సవాళ్లు వీసా కార్యక్రమాల నిర్వహణ నుంచే ఉత్పన్నమవుతాయి. ట్రంప్ గోల్డ్ కార్డ్ ఎలాంటి చట్టపర సవాళ్లను ఎదుర్కొంటుందో ఊహించడం కష్టమేనని నిపుణులు అంటున్నారు. భారతీయులు–గోల్డ్ కార్డ్..కాన్సులర్ ప్రాసెసింగ్ ఉపయోగించి 2022–23లో ఈబీ–5 కార్యక్రమం ద్వారా 631 మంది భారతీయులు మాత్రమే యూఎస్ గ్రీన్‌కార్డులను పొందారు. ఈ పథకానికి రూ.9.17 కోట్లు పెట్టుబడి మాత్రమే అవసరం. అలాంటిది రూ.43.7 కోట్లపైన చెల్లించి గ్రీన్‌కార్డ్ కొనాలనే ఆలోచన చాలా మంది భారతీయులకు ఆకర్షణీయంగా కనిపించే అవకాశం లేదని యూఎస్ న్యాయవాది, అమెరికన్ ఇమిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ సభ్యురాలు రవనీత్ కౌర్ బ్రార్ అభిప్రాయపడ్డారు. గోల్డ్ కార్డ్ వీసా అంటే? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘గోల్డ్ కార్డ్’ను ఈ వారమే ఆవిష్కరించారు. ఇది విదేశీ పెట్టుబడిదారులకు అమెరికా పౌరసత్వం పొందేందుకు రాచమార్గం. అమెరికా గ్రీన్కార్డ్కు ఖరీదైన ప్రత్యామ్నాయం కూడా. గోల్డ్ కార్డ్ కోరుకునేవారు యూఎస్ ప్రభుత్వానికి 5 మిలియన్ డాలర్లు (సుమారు రూ.43.7 కోట్లు) చెల్లించాలి. ఈ వీసా విధివిధానాలు రెండు వారాల్లో వెలువడనున్నాయి. గోల్డ్ కార్డ్ హోల్డర్లు అమెరికా వెలుపల సంపాదించిన ఆదాయంపై పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. దేశీయంగా (యూఎస్‌లో) ఆర్జించే ఆదాయాలపై పూర్తి పన్నులు చెల్లించాల్సి ఉంటుందని ట్రంప్ స్పష్టం చేశారు. గోల్డ్‌కార్డుల విక్రయం ద్వారా పెద్ద పన్ను చెల్లింపుదారులు, ఉద్యోగ సృష్టికర్తలు అమెరికాకు సమకూరుతారని ట్రంప్ అన్నారు. అప్పుల భారం తగ్గించుకునేందుకు.. గోల్డ్ కార్డ్ విధానం అమెరికా రుణాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘మేం కోటి కార్డులు అమ్మితే 50 ట్రిలియన్ డాలర్లు (రూ.43,70,00,000 కోట్లు) సమకూరుతుంది. మాకు 35 ట్రిలియన్ డాలర్ల (రూ.30,59,00,000 కోట్లు) అప్పు ఉంది’’అని ఆయన పేర్కొన్నారు. అసాధారణ ప్రతిభ ఉన్న దరఖాస్తుదారులను స్పాన్సర్ చేయడం కోసం కంపెనీలను అనుమతించే నిబంధనలను గోల్డ్ కార్డ్‌లో చేర్చవచ్చని ట్రంప్ చెప్పారు. యాపిల్ వంటి సంస్థలు తాము నియమించుకోవాలనుకునే అగ్రశ్రేణి ప్రతిభావంతులకు గోల్డ్ కార్డులను స్పాన్సర్ చేయవచ్చన్నారు. ఆ రెండింటి మధ్య వ్యత్యాసం ఇదే.. ప్రస్తుత ఈబీ–5 వీసా స్థానంలో గోల్డ్ కార్డ్ రానుంది. యూఎస్ సిటిజన్‌షిప్, ఇమిగ్రేషన్ సర్వీసెస్ నిర్వహించే ఈబీ–5 ఇమిగ్రెంట్ ఇన్వెస్టర్ ప్రోగ్రామ్‌ను 1990లో అమెరికా ప్రజాప్రతినిధుల సభ అయిన కాంగ్రెస్ రూపొందించింది. విదేశీ పెట్టుబడిదారుల ద్వారా అమెరికాలో ఉద్యోగ సృష్టి, మూలధన పెట్టుబడి ద్వారా ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు దానిని అమలు చేస్తున్నారు. ఈబీ–5 వీసా కోసం 10,50,000 డాలర్ల (రూ.9.17 కోట్లు) పెట్టుబడి అవసరం. ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాల్లో అయితే 8,00,000 డాలర్లు (రూ.6.99 కోట్లు) పెట్టుబడి పెట్టినా సరిపోతుంది. దీనికితోడు కనీసం 10 మంది అమెరికన్లకు ఉద్యోగాలు కల్పించాలి. దీనిద్వారా సాధారణంగా 3–5 ఏళ్లలో గ్రీన్‌కార్డ్ అందుకోవచ్చు. ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్న 2019లో ఈ పరిమితిని 9,00,000 డాలర్లకు (రూ.7.8 కోట్లకు) పెంచాలన్న ప్రయత్నం జరిగింది. కానీ ఫెడరల్ కోర్టు అడ్డుకుంది. అమెరికా ఏటా 10,000 ఈబీ–5 వీసాలను జారీ చేస్తోంది. ప్రతి దేశానికి గరిష్టంగా 7% వీసాలు ఇస్తారు. ఈబీ–5 వీసా కావాల్సినవారు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అదే కొత్త గోల్డ్ కార్డ్ అయితే ఒకసారి కొనుక్కుంటే చాలు. పెట్టుబడి, ఉద్యోగ కల్పన భారం ఉండదు. దశాబ్దంలో 3,800 మంది.. హెచ్–1బీ, ఈబీ–2, లేదా ఈబీ–3 వీసాలపై యూఎస్‌లో ఉన్న భారతీయ వలసదారులు గోల్డ్ కార్డ్ వీసా కోసం దరఖాస్తు చేసుకుని అక్కడి పౌరసత్వాన్ని అందుకోవచ్చు. వర్క్ వీసాలు, ముఖ్యంగా హెచ్–1బీ వీసాల కోసం భారత్ నుంచి అత్యధిక డిమాండ్ ఉంది. గోల్డ్ కార్డ్ వీసా హోల్డర్ల రాక వల్ల.. ఇతర వీసా హోల్డర్లు గ్రీన్‌కార్డుల కోసం వేచిఉండాల్సి వస్తుందనే ఆందోళన ఉంది. అమెరికాలో గ్రీన్‌కార్డ్ (శాశ్వత చట్టపర నివాస అనుమతి) కోసం వేచి ఉండే సమయం భారతీయులకు చాలా ఎక్కువ. కొన్నిసార్లు దశాబ్దాల సమయం పడుతోంది. అత్యంత నైపుణ్యం కలిగిన నిపుణులకు ఓ–1 వీసా మెరుగైన ప్రత్యామ్నాయమని.. దానిద్వారా సులభంగా ఈబీ–1 గ్రీన్కార్డ్లోకి మారవచ్చని ఇమిగ్రేషన్ నిపుణులు చెబుతున్నారు. ఇది ఇతర ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డ్ విభాగాల్లా కాకుండా తక్కువ వెయిటింగ్ పీరియడ్ ఉంటుందని పేర్కొంటున్నారు. ఇక వ్యాపార సంస్థల యజమానులు, కీలక స్థానాల్లో ఉన్న ఉద్యోగులు ఎల్–1 వీసాను పరిగణించవచ్చు. ఈబీ–5 వీసా కోసం చూస్తున్నవారు ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో.. దానిని రద్దు చేయడానికి ముందే త్వరపడాలనే ఆత్రుత కనిపిస్తోంది. అయితే ఈబీ–5 వీసా రద్దు చేయాలంటే అమెరికన్ కాంగ్రెస్ ఆమోదం అవసరమని ఇమిగ్రేషన్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. గత దశాబ్దంలో దాదాపు 3,800 మంది భారతీయులు ఈబీ–5 వీసాతో అమెరికా వెళ్లారని అంచనా. 100కుపైగా దేశాల్లో సంపన్నులకు గోల్డెన్ వీసాలు ప్రపంచవ్యాప్తంగా 100కుపైగా దేశాలు సంపన్నులకు గోల్డెన్ వీసాలు ఇస్తున్నాయి. యూరప్, ఇతర ప్రాంతాల్లోని చాలా దేశాలు పెట్టుబడి కార్యక్రమాల ద్వారా పౌరసత్వాన్ని ఆఫర్ చేస్తున్నాయి. తమ దేశ ఆర్థిక అభివృద్ధికి దోహదపడే వారికి మాల్టా పౌరసత్వాన్ని అందిస్తోంది. ఆ విధానం ఉత్తమమైనదని హ్యాన్లీ సిటిజన్‌షిప్ ప్రోగ్రామ్ ఇండెక్స్ పేర్కొనడం గమనార్హం. మాల్టా పౌరసత్వం పొందాలంటే కనీసం €6,00,000 యూరోల (రూ.5.45 కోట్లు) పెట్టుబడితోపాటు అక్కడ కనీసం 36 నెలల పాటు నివాసం ఉండాలి. లేదా 12 నెలలు అక్కడ నివసించిన తర్వాత €7,50,000 యూరోలు (రూ.6.82 కోట్లు) ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. హ్యాన్లీ ఇండెక్స్ టాప్–10 జాబితాలో ఆ్రస్టియా, గ్రెనాడా, యాంటీగ్వా అండ్ బాబూడా, నౌరూ, సెయింట్ కిట్స్ ఉన్నాయి. తమ లాభాలను పెంచుకోవాలని చూస్తున్న అంతర్జాతీయ వ్యాపారులకు ఇవి ఆకర్షణీయ పన్ను స్వర్గధామాలు (ట్యాక్స్ హెవెన్స్) కూడా. ఇక హ్యాన్లీ గ్లోబల్ రెసిడెన్స్ ప్రోగ్రామ్ ఇండెక్స్ జాబితాలో గ్రీస్ అగ్రస్థానంలో ఉంది. తరువాతి స్థానాన్ని స్విట్జర్లాండ్ కైవసం చేసుకుంది. సంపన్న భారతీయులకు ఇష్టమైన గమ్యస్థానంగా నిలిచిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కనీసం 5,45,000 డాలర్ల (రూ.4.76 కోట్లు) పెట్టుబడితో గోల్డెన్ వీసా రెసిడెన్స్ ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తోంది. -
దూకుడు ఫలితం.. ట్రంప్ క్రేజ్‌కు బీటలు..?
వాషింగ్టన్: రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత వరుస దూకుడు నిర్ణయాలతో ట్రంప్‌కు అమెరికాలో క్రేజ్ తగ్గుతోందా..? ఆయన విధానాలతో అగ్ర దేశ ప్రజలు అంత సంతోషంగా లేరా..? అంటే తాజాగా వెల్లడైన పాపులర్ పోల్ సర్వే ఫలితాలు అవునేనే చెబుతున్నాయి. మంగళవారం(ఫిబ్రవరి 25)తో ముగిసిన రాయిటర్స్/ఇప్సోస్ తాజా పోల్‌లో ట్రంప్‌కు 44 శాతం మంది మాత్రమే మద్దతు పలికారు. జనవరి చివరి వారంలో నిర్వహించిన పోల్‌లో కంటే ట్రంప్‌కు మద్దతు పలికేవారి సంఖ్య కాస్త తగ్గింది. జనవరిలో వరుసగా ట్రంప్‌నకు 47 శాతం మంది అనుకూలంగా ఓటు వేయగా ప్రస్తుతం ఇది 44 శాతానికి పడిపోయింది. ఇదే సమయంలో ట్రంప్‌ను వ్యతిరేకించే వారి సంఖ్య జనవరితో పోలిస్తే ఏకంగా 10 శాతం పెరిగి 51 శాతానికి చేరింది. జనవరిలో నిర్వహించిన సర్వేలో ట్రంప్‌ను కేవలం 41 శాతం మంది మాత్రమే వ్యతిరేకించారు. ట్రంప్ వలస విధానానికి అత్యధికంగా 47 శాతం మంది మద్దతు పలుకుతుండగా అమెరికా ఆర్థిక వ్యవస్థను ట్రంప్ తిరోగమనం దిశగా తీసుకెళుతున్నారని ఏకంగా 53 శాతం మంది భావిస్తున్నారు.జనవరిలో ట్రంప్ ఆర్థిక విధానాలను కేవలం 43 శాతం మంది మాత్రమే వ్యతిరేకించగా ఇప్పుడు ఆ సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇదే సమయంలో ట్రంప్ ఇతర దేశాలపై విధిస్తున్న టారిఫ్ పన్నులు, ఇతర ఆర్థిక విధానాలను కేవలం 39 శాతం మంది మాత్రమే బలపరుస్తున్నారు. ట్రంప్ హయాంలో ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంటుందని అమెరికన్లు భావిస్తుంటారు. ఇదే గతేడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ప్రధానంగా ఎన్నికల్లో ఆయనకు కలిసొచ్చిన అంశం. అయితే రెండో టర్ము మొదలై రెండు నెలలు కూడా కాకముందే ట్రంప్ ఈ విషయంలోనే ప్రజల మద్దతు కోల్పోతుండడంపై చర్చ జరుగుతోంది. చైనా కాకుండా ఇతర దేశాల వస్తువులపై ట్రంప్ దిగుమతి సుంకాలు విధించడాన్ని 54 శాతం మంది వ్యతిరేకిస్తున్నారు. అయితే చైనాపై టారిఫ్‌ల విధింపు అంశంలో మాత్రం ట్రంప్‌కు 49 శాతం మంది మద్దతు లభించింది. చైనాపై టారిఫ్‌లను కూడా 47 శాతం మంది వ్యతిరేకిస్తుండడం గమనార్హం. రాయిటర్స్,ఇప్సోస్ నిర్వహించిన తాజా పోల్‌లో మొత్తం 4145 మంది పాల్గొన్నారు. -
హీరోలా ఎగిరే జీరో..
ట్రాఫిక్‌జామ్‌లకు భయపడి కారును బయటకు తీయాలంటేనే భయపడుతున్నారా? అయితే మీ లాంటి వారి కోసమే ఓ ఎగిరే కారు సిద్ధమవుతోంది. అమెరికాకు చెందిన అలెఫ్ ఏరోనాటిక్స్ అనే ఆటోమోటివ్, ఏవియేషన్ సంస్థ సరికొత్త ఫ్యూచర్ కారును అభివృద్ధి చేస్తోంది. రోడ్డుపై రయ్యిమని దూసుకెళ్లగలగడంతోపాటు అవసరమైనప్పుడు అమాంతం పైకి ఎగిరి వెళ్లగల కారును సిద్ధం చేస్తోంది.తాజాగా మోడల్ జీరో అనే కారును ప్రయోగాత్మకంగా కాలిఫోర్నియాలోని ఓ రోడ్డుపై విజయవంతంగా పరీక్షించింది. అందుకు సంబంధించిన వీడియోను సంస్థ నెటిజన్లతో పంచుకుంది. ఆ వీడియోలో మోడల్ జీరో కారు రోడ్డుపై కాస్త దూరం ప్రయాణించి ఆపై నిట్టనిలువుగా టేకాఫ్ అయి ముందున్న కారు పైనుంచి ఎగురుతూ ముందుకు సాగింది. అనంతరం మళ్లీ రోడ్డుపై దిగి ముందుకు కదిలింది. –సాక్షి, సెంట్రల్ డెస్క్ఎలా సాధ్యమైంది?సాధారణ కార్లలో బానెట్‌లో ఇంజన్ ఉంటే మోడల్ జీరో కారులో మాత్రం నాలుగు చిన్న ఇంజన్లను వాటి చక్రాల వద్ద కంపెనీ అమర్చింది. వాటి సాయంతో సాధారణ ఎలక్ట్రిక్ కారులాగానే ఈ కారు రోడ్డుపై దుసుకెళ్తోంది. ఇక ఖాళీగా ఉన్న బానెట్, డిక్కీలలో మొత్తం ఎనిమిది ప్రొపెల్లర్లను సంస్థ ఏర్పాటు చేసింది. వేర్వేరు వేగములతో వేటికవే విడివిడిగా పరిభ్రమించగలగడం ఈ ప్రొపెల్లర్ల్ల ప్రత్యేకత. ఫలితంగా కారు ఏ దిశలో అయినా ఎగరడం సాధ్యం అవుతోంది. ఇందుకోసం డిస్ట్రిబ్యూటెడ్ ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ టెక్నాలజీని కంపెనీ ఉపయోగించింది. కారు ఫ్రేమ్ కోసం కార్బన్ ఫైబర్ వాడటంతో బరువు 385 కిలోలకే పరిమితమైంది. ప్రస్తుత నమూనా గాల్లో సుమారు 177 కి.మీ. దూరం ప్రయాణించగలదని.. రోడ్డుపై మాత్రం 56 కి.మీ. దూరం వెళ్లగలదని అలెఫ్ ఏరోనాటిక్స్ వివరించింది. రెండు సీట్లుగల మోడల్ ఏ రకం కారు రోడ్డుపై సుమారు 320 కి.మీ. దూరం ప్రయాణించగలదని.. గాల్లో 177 కి.మీ. దూరం వెళ్లగలదని తెలిపింది. ఫ్లయింగ్ కార్లకన్నా భిన్నమైనది..ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే అభివృద్ధి దశలో ఉన్న ఫ్లయింగ్ కార్లకన్నా తాము రూపొందిస్తున్న కారు భిన్నమైనదని అలెఫ్ ఏరోనాటిక్స్ తెలిపింది. ఈవీటాల్ ఫ్లయింగ్ ట్యాక్సీల వంటి కార్లు టేకాఫ్ కోసం రోడ్డును రన్ వేలాగా ఉపయోగిస్తాయని.. కానీ తాము అభివృద్ధి చేస్తున్న కారు మాత్రం రోడ్డుపై నిట్టనిలువుగా టేకాఫ్ తీసుకోగలదని పేర్కొంది. సాధారణ ప్రజలు ఈ కారును వాడటం ఎంతో సులువని.. కేవలం 15 నిమిషాల్లో కారులోని కంట్రోల్స్‌పై పట్టు సాధించొచ్చని కంపెనీ సీఈఓ జిమ్ డకోవ్నీ పేర్కొన్నారు. ‘రైట్ బ్రదర్స్ విమాన వీడియో తరహాలో మా కారు ప్రయోగ వీడియో మానవాళికి సరికొత్త రవాణా సాధ్యమని నిరూపిస్తుందని భావిస్తున్నా’అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ధర ఎక్కువే..మోడల్ ఏ రకం కారుపై కంపెనీ ఇప్పటికే ప్రీ ఆర్డర్లు తీసుకుంటోంది. రోల్స్ రాయిస్, బెంట్లీ, ఆస్టన్ మార్టిన్ వంటి లగ్జరీ కార్ల తరహాలోనే ఈ కారు ధరను సుమారు రూ. 2.57 కోట్లుగా కంపెనీ ఖరారు చేసింది. అయితే భవిష్యత్తులో భారీ స్థాయిలో ఉత్పత్తి చేపట్టి సామాన్యులకు అందుబాటు ధరలో ఉండేలా సుమారు రూ. 27.35 లక్షలకు కారును అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. -
అమెరికా సాయం వివాదం..ఎవరీ వీణారెడ్డి..?
న్యూఢిల్లీ:భారత్‌లో ఓటింగ్ శాతం పెంచేందుకు అమెరికా చేసిన సాయం ప్రస్తుతం వివాదాస్పదమవుతోంది. బీజేపీ,కాంగ్రెస్ పార్టీల మధ్య ఈ వివాదంపై విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. భారత్‌కు రూ. 186 కోట్ల ఓటర్ టర్నవుట్ సాయాన్ని నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే.భారత్‌లో ఏదో ఒక పార్టీకి ఎన్నికల్లో సాయం చేయడానికే బైడెన్ ఈ సాయం చేసి ఉంటారని ట్రంప్ వ్యాఖ్యానించడం కూడా సంచలనమైంది.అయితే ఈ వ్యవహారంలో తాజాగా వీణారెడ్డి తెరపైకి వచ్చింది. వీణారెడ్డి యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్(యూఎస్ఎయిడ్)ఇండియాకు 2021-24 మధ్య డైరెక్టర్‌గా వ్యవహరించారు.భారత్‌కు ఓటర్ టర్నవుట్ విషయంలో సాయం చేయడంలో వీణారెడ్డి కీలకంగా వ్యవహరించారన్న ప్రచారం జరుగుతోంది. ఈమె 2021లో భారత్‌కు వచ్చి 2024 లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత తిరిగి అమెరికా వెళ్లారు. వీణారెడ్డి పాత్రపై విచారణ జరపాలని బీజేపీ ఎంపీ మహేష్ జెఠ్మలానీ తాజాగా ట్వీట్ చేయడంతో ఆమె పేరు వెలుగులోకి వచ్చింది.So #DOGE has discovered that #USAID allocated $21million for “voter turnout” in India ,a euphemism for paying voters to cast their votes to effect regime change. #VeenaReddy was sent to India in 2021 ( ominous?) as head of USAIDs Indian mission . Post #loksabha elections 2024 (…— Mahesh Jethmalani (@JethmalaniM) February 16, 2025వీణారెడ్డి యూఎస్ఎయిడ్ డైరెక్టర్‌గా ఉన్నపుడు అమెరికా నుంచి భారత్‌కు అందే సాయం గణనీయంగా పెరిగినట్లు సమాచారం.అమెరికా సాయంతో భారత్‌లో ఓటర్ టర్నవుట్ పెరిగితే అది కచ్చితంగా అధికార పార్టీకి అయితే మేలు చేయదని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవ్య ఇప్పటికే ఎక్స్(ట్విటర్)లో పోస్టు పెట్టడం గమనార్హం. -
వలసదారులకు సంకెళ్లు.. వైట్‌హౌజ్ వివాదాస్పద వీడియో
వాషింగ్టన్: అక్రమ వలసదారులకు సంకెళ్లు వేసి అవమానకరంగా పంపిస్తున్నారని భారత్‌తో సహా ఇతర దేశాల్లో అమెరికాపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా భారత్‌లో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో విమర్శలు గుప్పిస్తోంది. అమెరికా ఇప్పటివరకు భారత్‌కు పంపించిన వలసదారుల చేతులు, కాళ్లకు సంకెళ్లు వేసి అవమానకర రీతిలో తీసుకువచ్చారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.ఈ ఆరోపణలకు ఊతమిచ్చేలా వైట్‌హౌజ్ తాజాగా ఓ వివాదాస్పద 41 నిమిషాల నిడివి గల వీడియోను సోషల్‌మీడియాలో పోస్టు చేసింది. అక్రమ వలసదారులను విమానం ఎక్కించేముందు వారికి సంకెళ్లు వేస్తున్న దృశ్యాలు వీడియోలో ఉన్నాయి. అలాగే వారికి వేయడానికిగాను గొలుసులను పోలీసులు సిద్ధం చేస్తుండడం వీడియోలో కనిపిస్తోంది. అయితే విమానం ఎక్కుతున్న అక్రమ వలదారుల ముఖాలు మాత్రం వీడియోలో కనిపించలేదు. ASMR: Illegal Alien Deportation Flight 🔊 pic.twitter.com/O6L1iYt9b4— The White House (@WhiteHouse) February 18, 2025కాగా, అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులకు సంకెళ్లు వేసి తరలిస్తున్న అంశంలో ఇటీవలే అమెరికా పర్యటనకు వెళ్లిన మోదీ కూడా ఏమీ చేయలేకపోయారని కాంగ్రెస్ మండిపడుతోంది. ఇంతకుముందు ఇదే విషయమై భారత విదేశాంగ మంత్రి జై శంకర్ స్పందిస్తూ మహిళలకు, పిల్లలకు సంకెళ్లు వేయడం లేదని సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. -
భారత్‌పై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
వాషింగ్టన్:భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు అందిస్తున్న 21 మిలియన్ డాలర్ల సాయాన్ని ఇటీవల అమెరికా నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాలకు సంబంధించిన ఫైళ్లపై ట్రంప్ మంగళవారం(ఫిబ్రవరి 18) సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ట్రంప్ భారత్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ ‘ఇండియాకు 21 మిలియన్ డాలర్ల సాయం ఎందుకివ్వాలి. వాళ్ల దగ్గరే చాలా డబ్బులున్నాయి. అమెరికాపై వాళ్లు భారీగా పన్నులు వేస్తున్నారు. నాకు భారత దేశం అన్నా, ఆ దేశ ప్రధాని అన్నా గౌరవం ఉంది’అని ట్రంప్ అన్నారు. అమెరికాలోకి దిగుమతి అయ్యే వాహనాలపై ఏప్రిల్ 2 నుంచి 25 శాతం సుంకం విధించనున్నట్లు ట్రంప్ తెలిపారు. ఇటీవల ప్రధాని మోదీ అమెరికాలో పర్యటన ముగిసిన వెంటనే బిలియనీర్ ఇలాన్ మస్క్ నేతృత్వంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డీవోజీఈ) భారత్‌కు సాయాన్ని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. కేవలం భారత్‌కే కాకుండా బంగ్లాదేశ్,పాకిస్తాన్ తదితర దేశాలకు అందించే సాయాన్ని కూడా అమెరికా ప్రభుత్వ ఖర్చులు తగ్గించడంలో భాగంగా డీవోజీఈ ఆపివేసింది. -
ఎవరినీ వదిలేది లేదు: ట్రంప్ కీలక ప్రకటన
వాషింగ్టన్: అమెరికా వాణిజ్య విధానం ఇచ్చిపుచ్చుకునే విధంగా న్యాయంగా ఉంటుందని దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. కొత్త టారిఫ్ విధానంపై సోమవారం(ఫిబ్రవరి 17) ఆయన ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు చేశారు. తమ వాణిజ్య విధానంలో ఎక్కువ, తక్కువలకు చోటుండదన్నారు. అందరూ సమానమేనన్నారు.ఆయా దేశాలు తమ వస్తువులపై ఎంత సుంకాలు విధిస్తాయో తామూ అంతే విధిస్తామని స్పష్టం చేశారు. ఒకవేళ అమెరికా ఎక్కువ సుంకాలు విధిస్తోందని ఏ దేశమైనా భావిస్తే ముందు ఆ దేశం అమెరికా వస్తువులపై సుంకాలను తగ్గించుకోవాలి లేదా పూర్తిగా తీసేయాలని ట్రంప్ సూచించారు. అమెరికాలో ఉత్పత్తి, వస్తువుల తయారీ చేపడితే సుంకాలు ఉండవని తెలిపారు.సుంకాల విషయంలో అమెరికా మిత్ర,శత్రు దేశాలు చాలా కాలంగా అన్యాయంగా వ్యవహరిస్తున్నాయని ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ట్రంప్ అధ్యకక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికాతో వాణిజ్యం నిర్వహించే దేశాలకు చెందిన వస్తువులపై దిగుమతి సుంకాలు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. -
బర్డ్‌ఫ్లూ ఎఫెక్ట్.. అమెరికాలో కొండెక్కిన కోడిగుడ్డు
వాషింగ్టన్:బర్డ్‌ఫ్లూ ఇక్కడే కాదు అగ్రదేశం అమెరికానూ భయపెడుతోంది. ఒకవైపు బర్డ్‌ఫ్లూ వల్ల మన దేశంలో చికెన్,గుడ్లు తినాలంటే భయపడుతుండడంతో చికెన్,గుడ్ల అమ్మకాలు ఒక్కసారిగా పడిపోయాయి. అమెరికాలో బర్డ్‌ఫ్లూ దెబ్బకు కోడిగుడ్ల ధరలు రోజురోజుకు కొండెక్కుతున్నాయి. అమెరికాలో గుడ్లను ప్రోటీన్లు అందించే ఆహారంగా భావిస్తారు. దీంతో అక్కడ గుడ్లకు భారీగా డిమాండ్ ఉంటుంది.ఇదే సమయంలో బర్డ్‌ఫ్లూ కారణంగా గుడ్లు పెట్టే కోళ్లు చనిపోతుండడంతో వాటి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఈ కారణంతో గుడ్ల ఉత్పత్తి ఒక్కసారిగా పడిపోయింది. ఈ ఎఫెక్ట్ గుడ్ల ధరలపై పడింది. ప్రస్తుతం అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో డజను గుడ్ల ధర ఏకంగా పది డాలర్లు(రూ.867)కు చేరిందంటే పరిస్థితి ఎలాఉందో అర్థం చేసుకోవచ్చు.గత ఏడాది జనవరి నుంచి అమెరికాలో గుడ్ల ధరలు పెరుగుతూనే ఉన్నాయి.అప్పటి నుంచి ఇప్పటివరకు డజను గుడ్ల ధర ఏకంగా 65 శాతం పెరిగింది. గుడ్ల ఉత్పత్తి పడిపోవడంతో కొన్ని సూపర్ మార్కెట్లలో కస్టమర్లకు అమ్మే గుడ్లపై పరిమితులు విధించారు. ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా లేదా బర్డ్‌ఫ్లూ కోళ్లలో శరవేగంగా వ్యాప్తి చెందుతుంది. దీని వ్యాప్తి నివారించడానికి లక్షల్లో కోళ్లను అధికారులు చంపుతున్నారు. బర్డ్‌ఫ్లూ ప్రభావం ఫామ్‌లలో పెరిగే కోళ్ల మీద కంటే దేశీయంగా పెరిగే నాటుకోళ్లపై అధికంగా ఉంటుందని తేలింది. -
బలపడిన మైత్రీబంధం!
ఎవరి అంచనాలకూ అందని తన ఆచరణతో, మాటలతో దిగ్భ్రమపరిచే డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవి స్వీకరించి నెల్లాళ్లు కాకుండానే ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశాన్ని సందర్శించారు. మోదీ రెండు రోజుల అమెరికా పర్యటనపై మన దేశంలో మాత్రమే కాదు, అనేక దేశాల అధినేతలు సైతం ఎంతో ఉత్కంఠ కనబరిచారు. అందుకు కారణం ఉంది. వేరే దేశాలు తమ ఉత్పత్తులపైఎంత సుంకం విధిస్తాయో తామూ వారి ఉత్పత్తులపై అదే స్థాయిలో ప్రతిచర్యాత్మక సుంకం వసూలు చేస్తామని ట్రంప్ చెబుతున్నారు. అదే అమలైతే అన్ని దేశాల వ్యాపార, వాణిజ్యాలుతీవ్రంగా ప్రభావితమవుతాయి. ట్రంప్ తొలి ఏలుబడిలో ఆయనతో మోదీకున్న సాన్నిహిత్యం ఎవరికీ తెలి యనిది కాదు. చర్చల్లో ఆయన సుంకాల విషయంలో ట్రంప్‌ను ఒప్పిస్తే, తాము కూడా భారత్ కిచ్చిన వెసులుబాట్లను చూపి గండం నుంచి గట్టెక్కవచ్చని వారి ఆశ. ప్రమాణస్వీకారం చేసింది మొదలుకొని సన్నిహిత మిత్రులా... ‘నువ్వా నేనా’ అని పోటీపడే ప్రత్యర్థులా అనే విచక్షణ లేకుండా అందరికీ సుంకాల వడ్డింపు తప్పదని ఆయన హెచ్చరిస్తున్నారు. అయితే ఈ అంశంపై ఇరుదేశాల మధ్యా అధికారుల స్థాయి చర్చలు జరిగితే గానీ స్పష్టత రాదు. అధినేతలిద్దరూ నాలుగు గంటల సుదీర్ఘ చర్చల అనంతరం నిర్వహించిన మీడియా సమావేశం గమనిస్తే వారిద్దరి మధ్యా గతం మాదిరే సౌహార్ద సంబంధాలున్నాయని అర్థమవుతుంది. మోదీ ‘చాలా ప్రత్యేకమైన వ్యక్తి’ అని అభివర్ణించటంతో పాటు 2020లో భార్యాసమేతంగా భారత్ వెళ్లినప్పుడు ఆయన ఇచ్చిన ఆతిథ్యం మరువలేనని ట్రంప్ అన్నారు.మోదీ సైతం ‘మీతో ఉన్న అతి గొప్ప స్నేహబంధాన్ని ఇప్పటికీ మా ప్రజలు గుర్తు చేసుకుంటార’ని చెప్పారు. బైడెన్ హయాంలో రెండు దేశాల సంబంధాలకూ నష్టం కలిగే రీతిలో అవాంఛనీయ పరిణామాలు చోటు చేసుకున్నాయని ట్రంప్ అనటం గమనించదగ్గది. అయితే మోదీ పర్యటనకు కొన్ని గంటల ముందే సుంకాల పెంపుదల ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు. దీన్నిబట్టే అంచనాలకు దొరకని ట్రంప్ మనస్తత్వాన్ని గ్రహించవచ్చు. ప్రతిచర్యాత్మక సుంకాలపై ట్రంప్ అభీష్టం నెరవేరితే సంపన్న రాజ్యాల మధ్య అవగాహన ఫలితంగా దాదాపు 80 ఏళ్ల నుంచి ప్రపంచ వ్యాపార, వాణిజ్యాల్లో కొనసాగుతూ వస్తున్న విధానాలకు తిలోదకాలిచ్చినట్టవుతుంది. మధ్యలో ప్రపంచ దేశాల మధ్య సుంకాలు, వాణిజ్యాలపై కుదిరిన గాట్ ఒప్పందం, అటు తర్వాత ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) నిబంధనల కింద వర్థమాన దేశాలకు సుంకాల విషయంలో వెసులుబాట్లు లభించాయి. ఫలితంగా వాటి ఉత్పత్తులపై సంపన్న దేశాల్లో తక్కువ సుంకాలున్నాయి. అదే సమయంలో సంపన్న దేశాల ఉత్పత్తులపై వర్ధమాన దేశాలు అధిక సుంకాలు విధించగలిగాయి. ఇందువల్ల అమెరికా, ఇతర సంపన్న దేశాలకు కలిగిన నష్టమేమీ లేదు. ఎందుకంటే ఆ దేశాల కంపెనీలకు పరిశ్రమల స్థాపన కోసం నామమాత్ర ధరకు భూములు, అనేక ఇతర సదుపాయాలు లభించాయి. వాటి యుద్ధ విమానాలు, డ్రోన్లు, ఇతరేతర రక్షణ ఉత్పత్తులు వర్ధమాన దేశాలు కొనుగోలు చేస్తున్నాయి. ఒకచోట కనిపించే లోటు మరోచోట భర్తీ అవుతోంది. వాటి వ్యాపార వాణిజ్యాలు వందల రెట్లు పెరుగుతున్నాయి. కానీ ట్రంప్‌కు ఇవేం పట్టవు. అమెరికాలోని సంపన్న రైతులకు భారీ సబ్సిడీలిస్తున్న కారణంగా వారి సాగు ఉత్పత్తులు కారుచౌకగా ఉంటాయి. ఆ ఉత్పత్తులు భారత్ మార్కెట్లో అడుగుపెడితే మన ఉత్పత్తు లకు గిరాకీ పడిపోతుంది. అందువల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారు. ట్రంప్ తరచు చెప్పే అత్యంత ఖరీదైన హార్లీ–డేవిడ్ సన్ బైక్‌కి కూడా ఇది వర్తిస్తుంది. చవగ్గా లభించే విదేశీ ఆహారోత్పత్తులూ, విలాసవంతమైన వస్తువులూ కొనడానికి జనం ఎగబడితే మన విదేశీ మారకద్రవ్యమూ కరిగిపో తుంది. మన ఆర్థిక వ్యవస్థను కుంగదీస్తుంది. కనుకనే మనం భారీ సుంకాలు విధించాల్సి వస్తుంది.సుంకాల సంగతలా వుంచితే ఇరు దేశాలకూ అనేక అంశాల్లో భావసారూప్యత ఉంది. ఉమ్మడి లక్ష్యాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉగ్రవాదాన్ని అదుపు చేయటం, చైనా దుందు డుకు పోకడలను నియంత్రించటం అందులో ముఖ్యమైనవి. మన దేశం నుంచి చట్టవిరుద్ధంగా 7,25,000 మంది అమెరికాకు వలస పోయారని గణాంకాలు చెబుతున్నాయి. వీరందరినీ వెనక్కి పంపితే తమకు అభ్యంతరం లేదని మోదీ అమెరికాకు స్పష్టంగా చెప్పారు. ఇక మన ప్రయోజ నాలకు ఎంతగానో తోడ్పడే ఇరాన్‌లోని చాబహార్ పోర్టుతో తెగతెంపులు చేసుకోవాలని ట్రంప్ పట్టుబడుతున్నారు. పాకిస్తాన్‌తో ప్రమేయం లేకుండా అఫ్గాన్‌కు చేరడానికి, పశ్చిమాసియా దేశా లతో వాణిజ్యం నెరపడానికి దోహదపడుతుందని చాబహార్ పోర్టు నిర్మాణంలో మన దేశం భారీగా పెట్టుబడులు పెట్టింది. ఇరాన్ తమ శత్రువు గనుక ఆ పోర్టును వదులుకోవాలని ట్రంప్ చెబుతున్నారు. ఇన్నాళ్లుగా భారత్‌కి స్తున్న మినహాయింపు రద్దు చేశారు. ఇదెక్కడి న్యాయం! మోదీ పర్యటన వల్ల అమెరికా తయారీ ఎఫ్–35 ఫైటర్ జెట్ విమానాల కొనుగోలు, చమురు, సహజవాయు కొనుగోళ్లు, కృత్రిమ మేధ, ఇతర సాంకేతికతలు, అంతరిక్ష అన్వేషణ, అణు ఇంధనం వగైరా అంశాల్లో సహకారం పెంపుపై అవగాహన కుదిరింది. పరస్పర ప్రయోజనకరంగా ఒప్పందాలు కుదుర్చుకోవాలనుకోవటం, ఇరు దేశాల మధ్య వాణిజ్యం మరింత పెరగనుండటం బల పడుతున్న మైత్రీబంధానికి చిహ్నం. అయితే అసంబద్ధమైన సుంకాలతో, అడ్డగోలు విధానాలతో ఈ బంధాన్ని దెబ్బ తీయరాదని అమెరికా గ్రహించాలి. మోదీ పర్యటన అందుకు దోహదపడాలని అందరూ కోరుకుంటారు. -
ఆ విమానాలు అమృత్సర్కే ఎందుకు..?
అమృత్సర్: అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులను తీసుకువస్తున్న విమానాలు పంజాబ్‌లోని అమృత్సర్కే ఎందుకు వస్తున్నాయి. గుజరాత్,హర్యానా, దేశ రాజధాని ఢిల్లీకి ఎందుకు వెళ్లడం లేదు. ఇప్పుడు ఈ విషయం మీదే రాజకీయ వివాదం ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం కావాలనే ఆ విమానాలను అమృత్‌సర్‌కు పంపిస్తోందని పంజాబ్ సీఎం భగవంత్మాన్సింగ్ విమర్శించారు.పంజాబ్ పేరు చెడగొట్టేందుకే బీజేపీ ఉద్దేశపూర్వకంగా విమానాలను అమృత్సర్ పంపిస్తోందని మాన్ ఆరోపించారు. శనివారం(ఫిబ్రవరి15) రానున్న మరో విమానంలోని వారికి భగవంత్‌మాన్ స్వయంగా స్వాగతం పలకనున్నారు. ఇందుకుగాను ఆయన ఇప్పటికే అమృత్సర్ చేరుకున్నారు. కాంగ్రెస్ కూడా కేంద్రంపై మాన్ తరహాలోనే ఆరోపణలు చేస్తోంది. అయితే బీజేపీ మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తోంది.ఈ అంశాన్ని రాజకీయం చేయడం మంచిదికాదని హితవు పలుకుతోంది. ఆదివారం(ఫిబ్రవరి16) కూడా భారతీయులతో కూడిన మరో విమానం అమెరికా నుంచి రానుంది. ఇప్పటికే అమెరికా నుంచి వచ్చిన తొలి విమానంలో అమెరికాలో అక్రమంగా ఉంటున్న 104 మంది భారతీయులు తిరిగి వచ్చారు. తొలి విమానం పంజాబ్‌లోని అమృత్‌సర్‌లోనే ల్యాండ్ అయింది. -
మస్క్ టీమ్‌లోకి నిఖిల్ రాజ్‌పాల్..ఎవరంటే..
వాషింగ్టన్:డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రోజుకో సంచలన నిర్ణయం తీసకుంటున్నారు. ట్రంప్ తన సన్నిహితుడైన బిలియనీర్ ఇలాన్‌మస్క్‌కు అమెరికా ప్రభుత్వ పాలన వ్యవస్థ(డోజ్)ను ప్రకక్షాళన బాధ్యత అప్పగించారు. మస్క్ నేతృత్వంలోని డోజ్ నుంచి కూడా అమెరికా ప్రభుత్వ ఉద్యోగుల సమర్థత పెంపుపై రోజుకు ఒక కొత్త నిర్ణయం వెలువడుతోంది.ఈ క్రమంలోనే డోజ్‌లో మస్క్ టీమ్‌లో ఎంతమంది పనిచేస్తున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం మస్క్ టీమ్‌లో 19నుంచి24 ఏళ్ల వయసున్న ఆరుగురు ఇంజినీర్లు ఉన్నారు. వీరికి తోడు కొత్తగా నిఖిల్ రాజ్‌పాల్ అనే 30 ఏళ్ల భారతీయ యువకుడు డోజ్‌లో మస్క్ టీమ్ సభ్యుడిగా చేరారు.ఇప్పటికే మస్క్ టీమ్‌లో ఉన్న ఆకాష్బొబ్బ కూడా భారతీయ యువకుడే కావడం గమనార్హం. అయితే కొత్తగా చేరిన నిఖిల్ రాజ్‌పాల్ కంప్యూటర్ ఇంజినీర్. మస్క్‌కు చెందిన కంపెనీలు టెస్లా,ఎక్స్(ట్విటర్)లో కూడా నిఖిల్ కీలక బాధ్యతల్లో పనిచేశారు.తాజాగా డోజ్‌లో చేరిన నిఖిల్ అమెరికా ప్రభుత్వ పాలన వ్యవస్థ ప్రక్షాళనలోనూ కీలక పాత్ర పోషించనున్నట్లు చెబుతున్నారు. -
‘రెడ్‌బుక్’ ఎఫెక్ట్..! కాష్పటేల్కు సెనేట్ షాక్
వాషింగ్టన్:అమెరికాలోనూ కక్ష సాధింపు రాజకీయాల కాలం నడుస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వానికి ఉన్నట్లుగానే అక్కడా రిపబ్లికన్లు ఒక ‘రెడ్‌బుక్’ రాసి పెట్టుకున్నారు. అందులో వారు టార్గెట్‌గా చేసుకున్న ప్రత్యర్థుల పేర్లు రాసుకున్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరెవరిపై ఎలా కక్ష తీర్చుకోవాలనేది ముందే డిసైడయ్యారు. ఈ కక్ష సాధించే సంప్రదాయమే ట్రంప్ 2.0లో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) చీఫ్‌గా నామినేట్ అయిన కాశ్‌పటేల్ మెడకు చుట్టుకుంది. తాము కక్ష తీర్చుకోవాల్సిన డెమోక్రాట్లు చాలా మంది ఉన్నారని కాష్ పటేల్ గతంలో వ్యాఖ్యానించారు. కాష్ మాట్లాడిన ఈ మాటలే ప్రస్తుతం ఆయన ఎఫ్‌బీఐ చీఫ్‌గా పదవి చేపట్టేందుకు అడ్డంకిగా మారింది.ఈ మాటల వల్లే కాష్ పటేల్ నామినేషన్‌ను గత వారం అమెరికా ఎగువ సభ సెనేట్ ఆమోదించలేదు. కాష్ను ఎఫ్‌బీఐ చీఫ్‌గా నియమించడాన్ని డెమోక్రాట్ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. కక్ష సాధింపు రాజకీయాలు చేస్తానన్న కాష్ను ఎఫ్‌బీఐ చీఫ్‌గా నియమిస్తే అది రాజకీయ నియామకమే అవుతుందని వారు పేర్కొన్నారు.కాష్ పటేల్ రెడ్‌బుక్‌లో పలువురు డెమోక్రాట్ నేతలతో పాటు ట్రంప్ కేసులు వాదించిన ప్రాసిక్యూటర్లు, బైడెన్ హయాంలో కీలక బాధ్యతల్లో ఉన్న అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. భారత సంతతికి చెందిన కాష్ను ఎఫ్‌బీఐ చీఫ్‌గా ట్రంప్ గతేడాది అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన వెంటనే నామినేట్ చేయడం గమనార్హం. -
త్వరలో అమెరికా నుంచి వచ్చే జాబితాలో ఎంతమంది..?
న్యూఢిల్లీ:అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులను అక్కడి ప్రభుత్వం వెనక్కి పంపిస్తోంది. ఇప్పటికే మిలిటరీ విమానంలో 104 మంది భారతీయులను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే విమానంలో వచ్చిన వారికి సంకెళ్లు వేసి తీసుకురావడంపై ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం శుక్రవారం(ఫిబ్రవరి7) ఒక కీలక ప్రకటన చేసింది. త్వరలో మరో 487 మంది భారతీయ పౌరులను దేశం నుంచి తరలించాలన్న ఆదేశాలున్నాయని భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. ఈ విషయాన్ని తమకు అమెరికా ప్రభుత్వ వర్గాలు తెలిపాయని మిస్రీ చెప్పారు.అక్రమ మార్గాల ద్వారా దేశంలోకి ప్రవేశించిన వారిని తొలుత అమెరికా తిప్పి పంపిందన్నారు. వారంతా అమెరికా భద్రతకు ముప్పుగా పరిణమించారని అక్కడి ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. అయితే భారతీయులను మిలిటరీ విమానంలో అవమానించే తరహాలో తీసుకురావడంపై దేశంలో రాజకీయ దుమారం రేపింది. కాగా, బుధవారం అమెరికా నుంచి అమృత్‌సర్‌కు వచ్చిన సైనిక విమానంలో 105 మంది వలసదారులున్నారు. వీరిలో హరియాణా రాష్ట్రానికి చెందిన వాళ్లు 33 మంది ఉన్నారు. గుజరాత్(33), పంజాబ్(30), మహారాష్ట్ర(3), ఉత్తరప్రదేశ్(3), చండీగఢ్(2) రాష్ట్రాల వాళ్లూ ఉన్నారు.అమెరికా తిరిగి పంపిన వారిలో 19 మంది మహిళలు, నాలుగేళ్ల బాలుడు, ఐదేళ్లు, ఏడేళ్ల వయసున్న బాలికలున్నారు. ఇక్కడికొచ్చాక భారత అధికారులు పోలీసు వాహనాల్లో ఈ వలసదారులను స్వస్థలాలకు తరలించారు. -
భారతీయులపై తీవ్ర వ్యాఖ్యలు..మస్క్ టీమ్ సభ్యుడు రాజీనామా
వాషింగ్టన్:ప్రముఖ బిలియనీర్ ఇలాన్ మస్క్ నేతృత్వం వహిస్తున్న అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డీవోజీఈ) టీమ్ నుంచి ఓ ఇంజినీర్ రాజీనామా చేశాడు. 25 ఏళ్ల మార్కో ఇలెజ్ అనే ఇంజినీర్ భారతీయులపై సోషల్‌మీడియాలో గతంలో చేసిన జాత్యహంకార వ్యాఖ్యలు తాజాగా వైరల్ అయ్యాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ విషయంలో దుమారం రేగింది. ముఖ్యంగా భారత్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ క్రమంలోనే ఇలెజ్ తన పోస్టుకు రాజీనామా చేయాల్సి వచ్చింది.ఇలెజ్ రాజీనామాపై అమెరికా మీడియా కథనాలు ప్రచురించింది. అతడు గతంలో ‘నార్మలైజ్ ఇండియా హేట్’ అనే పోస్టుతో పాటు ఇండియా నుంచి వచ్చిన హెచ్-1బీ వీసాదారులను ఉద్దేశించి ‘గోయింగ్ బ్యాక్ డోంట్ వర్రీ’ అనే వివాదాస్పద పోస్టులు పెట్టాడు. ఈ పోస్టులపై తీవ్ర వ్యతిరేకత రావడంతో డీవోజీఈ ట్రెజరీ డిపార్ట్మెంట్కు ఇలెజ్ రాజీనామా చేశాడు. ఈ పోస్టు ఖాలీ అయినట్లు ప్రభుత్వం ఇప్పటికే నోటిపై చేసింది. ఇలెజ్ డీవోజీఈ కంటే ముందు ఎక్స్(ట్విటర్)లోనూ ఇలాన్ మస్క్‌తో కలిసి పనిచేయడం గమనార్హం.కాగా, అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత భారతీయులతో సహా పలు దేశాలకు చెందిన అక్రమ వలసదారులను అమెరికా నుంచి సైనిక విమానాల్లో పంపివేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్‌కు సన్నిహితుడైన ఇంజినీర్ భారతీయులకు వ్యతిరేకంగా చేసిన జాత్యహంకార వ్యాఖ్యలు వెలుగులోకి రావడం చర్చనీయాంశమవుతోంది. -
అమెరికా విమానంలో.. ఆ రాష్ట్రాల వారే ఎక్కువ..!
అమృత్సర్:అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్యల్లో భాగంగా అమెరికా పంపించిన ప్రత్యేక విమానంలో భారత్‌కు తిరిగి వచ్చిన వలసదారుల్లో ఎవరెవరున్నారన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బుధవారం(ఫిబ్రవరి5) మధ్యాహ్నం 1.45గంటలకు అమృత్‌సర్‌లోని గురురామ్దాస్జీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో వలసదారులతో వచ్చిన అమెరికా విమానం ల్యాండ్ అయిన విషయం తెలిసిందే.విమానంలో మొత్తం 205 మంది భారతీయలను అమెరికా నుంచి పంపించి వేశారని ప్రచారం జరిగింది. అయితే విమానంలో 104 మంది మంది భారతీయులే ఉన్నారు. 45 మంది దాకా అమెరికా అధికారులు కాగా, 11 మంది విమాన సిబ్బంది ఉన్నారు. అయితే 104మంది భారతీయుల్లో మొదటి స్థానంలో గుజరాత్,హర్యానాకు చెందిన వారు ఎక్కువగా ఉండగా తర్వాతి స్థానంలో పంజాబ్‌కు చెందిన వారు ఉన్నారు.విమానంలో వచ్చిన వారిలో 4 ఏళ్ల వయసున్న చిన్నారి కూడా ఉండడం గమనార్హం. అమెరికా నుంచి అందరు భారతీయులకు స్వాగతం పలికామని, మన దేశానికి చెందిన వారిని ఇలా పంపించి వేయడం దురదృష్టకరమని పంజాబ్ డీజీపీ వ్యాఖ్యానించారు. అమెరికాలో భారత అక్రమ వలసదారుల ఏడున్నర లక్షల మంది దాకా ఉన్నట్లు ఫ్యూ రీసెర్చ్ సెంటర్ అంచనా. ఈ లెక్కన మెక్సికో, ఎల్ సాల్వడోర్ తర్వాత అత్యధికంగా అలా ఉంటోంది భారతీయులే. వీళ్లందరినీ వెనక్కి పంపించే ప్రక్రియ కొనసాగుతుందని అక్కడి అధికారులు అంటున్నారు. ఈ క్రమంలో సుమారు 18 వేల మంది భారతీయులతో కూడిన జాబితాను అక్కడి ఇమ్మిగ్రేషన్ & కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ సిద్ధం చేసినట్లు సమాచారం. త్వరలో భారత ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించనున్నారు. ఆ సమయంలో ట్రంప్‌తో ఆయన ఈ అంశంపైనా చర్చించే అవకాశాలున్నాయి -
వలసదారుల విమానాలకు అంత ఖర్చా..?
వాషింగ్టన్:డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్రమ వలసదారులను ప్రత్యేక విమానాల్లో వారి దేశాలకు తిప్పి పంపుతున్నారు. ఈ విమాన ప్రయాణాల కోసం అమెరికా భారీ ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది.పౌర విమానాల్లో కాకుండా వలసదారులను అమెరికా ప్రత్యేక సైనిక విమానాల్లో తరలిస్తుండటంతోనే ఎక్కువగా ఖర్చవుతోందన్న వాదన వినిపిస్తోంది. తాజాగా 205 మంది భారతీయులతో కూడిన మిలిటరీ విమానం బయల్దేరింది. ఈ విమాన ఖర్చు గంటకు కొన్ని వేల డాలర్లని అమెరికా అధికారులు చెబుతున్నారు.వలసదారులను వెనక్కి పంపే కేంద్ర ప్రభుత్వ వర్గాల సమన్వయం కూడా ఉన్నట్లు సమాచారం. గతంలోనూ వివిధ దేశాలకు చెందిన అక్రమ వలసదారుల్ని వెనక్కి పంపిన సంగతి తెలిసిందే.అయితే భారత్ విషయంలో మాత్రం అమెరికాకు ఇదే తొలి అడుగు.వచ్చే వారం భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో అక్రమ వలసదారుల్ని వెనక్కి పంపే అంశంపైనా చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. -
పనిగంటలపై మస్క్ సంచలన ట్వీట్
వాషింగ్టన్:ఇన్ఫోసిస్ నారాయణమూర్తి పనిగంటల పెంపు వ్యాఖ్యల వివాదం అమెరికాను తాకింది. అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డీవోజీఈ) చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ప్రముఖ బిలియనీర్ ఇలాన్‌మస్క్ ఈ విషయంలో నారాయణమూర్తి కంటే చాలా అడుగులు ముందుకు వేశారు. తాను తన డీవోజీఈ డిపార్ట్మెంట్ సిబ్బంది ఏకంగా వారానికి 120 గంటలు పనిచేస్తున్నామని చెప్పారు.ఇదే సమయంలో అమెరికా ఉన్నతస్థాయి అధికారులు వారానికి కేవలం 40 గంటలు మాత్రమే పనిచేస్తున్నారని అందుకే పౌరులు చెల్లిస్తున్న పన్ను సొమ్ము వృథా అవుతోందని మస్క్ తెలిపారు. ఈ మేరకు మస్క్ ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు చేశారు. అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగుల వ్యవస్థపై డీవోజీఈ చేస్తున్న ఆడిట్లో సంచలన విషయాలు బయట పడుతున్నాయని, ప్రజల డబ్బు ఎలా దుర్వినియోగమవుతోందో తెలుస్తోందని మస్క్ అన్నారు. DOGE is working 120 hour a week. Our bureaucratic opponents optimistically work 40 hours a week. That is why they are losing so fast. https://t.co/dXtrL5rj1K— Elon Musk (@elonmusk) February 2, 2025 అయితే డీవోజీఈ ఆడిట్లపై ఉద్యోగుల సంఘాలు మండిపడుతున్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ రాజకీయ దురుద్దేశాలతో చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అమెరికా బ్యూరోక్రసీని సమర్థవంతంగా తయారుచేసేందుకు ట్రంప్ డీవోజీఈ చీఫ్‌గా మస్క్‌ను నియమించిన విషయం తెలిసిందే. కాగా, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తితో పాటు ఎల్అండ్టీ చీఫ్ సుబ్రమణియన్ తదితరులు ఎక్కువ పనిగంటల విధానమే మేలని వ్యాఖ్యానించి వివాదానికి కారణమయ్యారు. అయితే భారత ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ఆర్థిక సర్వే మాత్రం 60 గంటల కంటే ఎక్కువ పనిచేస్తే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశముందని పేర్కొనడం గమనార్హం. -
అక్కడే పడుకుంటున్నా!: మస్క్ ఆసక్తికర కామెంట్స్
వాషింగ్టన్:అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ(డీవోజీఈ)కి సంబంధించి ఆ సంస్థ హెడ్, ప్రముఖ బిలియనీర్ ఇలాన్ మస్క్ ఆసక్తికర వ్యాఖల్యు చేశారు. డీవోజీఈ హెడ్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తాను ఆ సంస్థ ఆఫీసులోనే పడుకుంటున్నానని మస్క్ తన సన్నిహితులతో అన్నట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి.ఫెడరల్ ప్రభుత్వ బ్యూరోక్రసీ వ్యవస్థపై పట్టు సాధించేందుకు తన ఆఫీసునే బెడ్రూమ్గా మార్చుకున్నానని మస్క్ చెప్పారు.డీవోజీఈ ఆఫీసు వైట్‌హైజ్ పక్కనే ఉన్న ఇసెన్హొవర్ భవనంలో ఉంది. ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టక ముందే ట్రంప్‌ను డీవోజీఈ చీఫ్‌గా నియమించిన విషయం తెలిసిందే. అయితే మస్క్‌కు గొప్ప హార్డ్ వర్కర్‌గా పేరుంది. ఆయన గతంలో బిజీ సమయాల్లో తన టెస్లా కంపెనీకి చెందిన ఫ్యాక్టరీ నేలపైనే నిద్రపోయినట్లు వార్తలొచ్చాయి. టెస్లా ఫ్యాక్టరీయే తన మొదటి ఇల్లు అని 2022లో మస్క్ ఓ ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం. తాజాగా డీవోజీఈ ఆఫీసు విషయంలోనూ మస్క్ ఇదే తరహా విషయాన్ని వెల్లడించడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. -
ట్రంప్‌కు కోర్టు మరో షాక్
వాషింగ్టన్:అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడు నిర్ణయాలకు అక్కడి కోర్టులు వరుస బ్రేకులు వేస్తున్నాయి. ఉదార కార్యక్రమాలకు అమెరికా ప్రభుత్వ సాయాన్ని నిలిపివేస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై వాషింగ్టన్ జిల్లా కోర్టు తాజాగా స్టే ఇచ్చింది. ట్రంప్ ఆదేశాలపై తాత్కాలిక స్టే విధించిన కోర్టు విచారణను వారంపాటు వాయిదా వేసింది.ట్రంప్ ఆదేశాల చట్టబద్ధతను విచారణ సందర్భంగా జడ్జి ప్రశ్నించారు. విదేశాలు, స్వచ్ఛంధ సంస్థలు,పలు కార్యక్రమాల కింద సాయాన్ని మంగళవారం సాయంత్రం నుంచి నిలిపివేయాలని ట్రంప్ ఆదేశాలిచ్చారు.ఈ ఆదేశాలపై వాషింగ్టన్ కోర్టు స్టే ఇవ్వడంతో ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లే అవకాశాలున్నాయి. కాగా అమెరికా అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కోర్టుల నుంచి చుక్కెదురవడం ఇది రెండోసారి. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తొలిరోజే ట్రంప్ జారీ చేసిన జన్మతఃపౌరసత్వ హక్కు రద్దు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను అక్కడి ఫెడరల్ కోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ ఆదేశాలను కోర్టు రాజ్యాంగ విరుద్ధ చర్యగా అభివర్ణించడం గమనార్హం. -
ట్రంప్.. విద్యార్థుల జంప్!
సాక్షి, అమరావతి: అమెరికాలోని డల్లాస్‌లో చదువుకుంటున్న సురేష్‌ది పశ్చిమ గోదావరి జిల్లాలోని ఓ మారుమూల పల్లె. ఏటా రూ.40 లక్షలు ఖర్చవుతుండగా కొంత అప్పు చేసి, పార్ట్ టైం ఉద్యోగం (Part time job) చేస్తూ ఫీజులు కడుతున్నాడు. అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) విధించిన నిబంధనలు సురేష్ కు పిడుగుపాటులా మారాయి. యూనివర్సిటీల్లో చదువుకునే విద్యార్థులు పార్ట్ టైం జాబ్స్ చేస్తూ పట్టుబడితే వీసా రద్దు (Visa Cancel) చేస్తామని హెచ్చరించడంతో హతాశుడయ్యాడు. పార్ట్ టైం జాబ్ చేయకుండా చదువుకు అయ్యే ఖర్చులెలా సమకూర్చుకోవాలో తెలియక, మధ్యలో చదువు వదిలేసి స్వదేశానికి తిరిగి రాలేక తల పట్టుకుంటున్నాడు.కరిగిపోతున్న కల..అమెరికాలో ఉన్నత విద్య చదువుకోవడమనేది మన విద్యార్థుల కల. తమ పిల్లలను అప్పు చేసైనా సరే అమెరికా పంపాలని ఎంతో మంది తల్లిదండ్రులు ఆరాట పడుతుంటారు. సంపన్న కుటుంబాలు దీన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తుంటాయి. కానీ అక్కడికి వెళ్లిన తరువాత మన విద్యార్ధులు పడే అగచాట్లు సాధారణంగా బయటకు రావు. ఎవరికీ చెప్పుకోలేక మౌనంగా భరిస్తుంటారు. దూరపు కొండలు నునుపు అన్నట్లు అమెరికా చదువులు, ఉద్యోగాలు దూరం నుంచి చూసేవారికి అందంగానూ, గొప్పగానూ కనిపిస్తుంటాయి. ట్రంప్ రాకతో వాస్తవాలు బయటకు వస్తున్నాయి.ఇంటి అద్దెకూ చాలవు..ఓపెన్ డోర్స్ నివేదిక ప్రకారం.. అమెరికాలో ప్రస్తుతం దాదాపు 3 లక్షల మంది భారతీయ విద్యార్ధులు (Indian Students) ఉండగా వీరి సంఖ్య ఏటా 35 శాతం పెరుగుతోంది. చైనాను కూడా ఈ విషయంలో మనవాళ్లు వెనక్కు నెట్టేశారు. అయితే అమెరికా వెళ్లే విద్యార్థుల్లో అధిక శాతం అప్పులు చేసి విమానం ఎక్కుతున్నారు. ఆ అప్పులను తీర్చడం కోసం అమెరికాలో గ్యాస్ స్టేషన్లు, సూపర్ మార్కెట్లు, రెస్టారెంట్లు తదితర చోట్ల పార్ట్‌టైమ్ జాబ్స్ చేస్తుంటారు. వీరికి సగటున గంటకు 10 డాలర్ల వరకూ చెల్లిస్తారు. మాస్టర్ ఆఫ్ సైన్స్(ఎంఎస్) చేస్తున్న విద్యార్ధి వారానికి 20 గంటలు పాటు పని చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ లెక్కన నెలకు దాదాపు రూ.70 వేల వరకూ సంపాదిస్తాడు. దీన్ని ఇంటి అద్దె, కళాశాల ఫీజు, భోజనం, రవాణా ఖర్చులకు సరిపెట్టుకోవాలి. అమెరికాలో ప్రస్తుతం ఒక సింగిల్ బెడ్రూమ్ అద్దెకు తీసుకోవాలంటే 1,700 డాలర్లు అంటే దాదాపు రూ.1.46 లక్షలు చెల్లించాలి. మెయింటెనెన్స్ ఖర్చులు అదనం. ఒక విద్యార్ధి నెలంతా పార్ట్‌టైమ్ జాబ్ చేసినా ఇంటి అద్దె, ఇతర ఖర్చులు నెగ్గుకు రావడం కష్టం. అలాంటిది ఇప్పుడు అది కూడా సంపాదించడం కుదరదని అమెరికా ప్రభుత్వం ఖరాకండిగా చెబుతుండటంతో తీవ్ర నిరాశలో కూరుకుపోతున్నారు.బతుకు భారం.. పోనీ ఎలాగోలా ఇంటి దగ్గర్నుంచి అప్పులు చేసి డబ్బు తెప్పించి చదువుకుని ఉద్యోగం తెచ్చుకున్నా వచ్చే జీతంలో ప్రతి రూ.100కి ప్రభుత్వానికి రూ.30 పన్ను కింద చెల్లించాలి. ఆ మిగిలిన దానిలోనే అన్ని ఖర్చులూ భరించాలి. అలా అయినా ఎలాగోలా గడుపుదామంటే గ్రీన్ కార్డ్ రావడం పెద్ద ప్రహసనం. మన దేశానికి ఏటా 7 వేల గ్రీన్ కార్డులు (అమెరికా పౌరసత్వం) మాత్రమే ఇస్తుండగా పోటీపడుతున్న వారు లక్షల్లో ఉన్నారు.2012లో గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి ఇప్పుడు ఇస్తున్నారంటే ఇక ఇప్పుడు దరఖాస్తు చేసుకునే వారికి రావాలంటే కనీసం 40 ఏళ్లు పడుతుంది. అప్పటి వరకూ అదనపు ట్యాక్స్‌లు కడుతూ.. హెచ్1 వీసాపై బిక్కుబిక్కుమంటూ జీవించాలి. చదవండి: అన్నంత పనీ చేసిన డొనాల్డ్ ట్రంప్!ఇంత కష్టం ఉన్నప్పటికీ అమెరికాలో చదువుకోవాలనే ఆశతో వెళుతున్న వారికి ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ) షాక్ ఇస్తోంది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే దాదాపు 18 వేల మందికి పైగా పార్ట్‌టైమ్ జాబ్ చేస్తున్న వారిని గుర్తించి ‘ఐస్’ టీమ్ అదుపులోకి తీసుకుంది. దీంతో భారతీయ విద్యార్ధులు అమెరికాలో పార్ట్‌టైమ్ జాబ్స్‌ను వదులుకుంటున్నారు. దండిగా డబ్బులుంటేనే రండి.. అమెరికాలో చదువుకోవాలనుకుంటే ముందుగా అంత ఆర్థ్ధిక స్తోమత ఉందో లేదో చూసుకోవాలి. ఏదో అప్పు చేసి కొంత డబ్బు సమకూర్చుకుని ఇక్కడికి రావడం సరైన విధానం కాదు. అమెరికాలో ప్రస్తుతం పార్ట్‌టైమ్ జాబ్స్ చేయడానికి ప్రభుత్వం అంగీకరించడం లేదు.కాబట్టి చదువుకుంటూ సంపాదించడం ఇక కుదరకపోవచ్చు. జాబ్ వచ్చినా ఇక్కడ ఖర్చులతో పోల్చితే సంపాదించేది ఏమాత్రం సరిపోదు. అమెరికాకు రావాలనుకునే విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు ఈ విషయాలను గమనించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది’’ – మణితేజ, డాలస్, అమెరికా -
ఏఐ ‘డీప్’ వార్!
మా పరిశోధకుల్లో ఎక్కువ మంది చైనా టాప్యూనివర్సిటీల నుంచి తీసుకున్న ఫ్రెష్ గ్రాడ్యుయేట్లే. భారీపెట్టుబడులతో నవకల్పనలు పెరుగుతాయంటే పొరపాటే. అదే నిజమైతే ప్రపంచంలోని ఇన్నోవేషన్ అంతాబడా కంపెనీల చేతుల్లోకి వెళ్లిపోయేది – డీప్‌సీక్ ఫౌండర్ లియాంగ్ వెన్ఫెంగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)లో ఎదురులేని అమెరికా టెక్ దిగ్గజాలకు చైనా ఊహించని షాక్ ఇచ్చింది. ఏఐ రారాజు చాట్‌జీపీటీకి ఓ అనామక చైనా ఏఐ స్టార్టప్ పెను సవాల్ విసిరింది. అదే డీప్‌సీక్. దీని చౌక ఏఐ దెబ్బకు మొత్తం సిలికాన్ వ్యాలీ చివురుటాకులా వణుకుతోంది. లక్షల కోట్లు వెచ్చించి అమెరికా కంపెనీలు కడుతున్న ‘ఆర్టిఫిషియల్’కోటను బద్దలుకొట్టేందుకు డ్రాగన్ బరిలోకి దూకడంతో ఏఐ వార్‌కు తెరలేచింది. దీంతో జపాన్ నుంచి యూరప్ మీదుగా.. అమెరికా వరకు టెక్ షేర్లన్నీ కుప్పకూలాయి. విలువ పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీ ఎన్విడియా షేరు ఏకంగా 17 శాతం పడిపోవటంతో దాదాపు 600 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ తుడిచిపెట్టుకుపోయింది. మనదేశంలో మూడు అతిపెద్ద కంపెనీలైన రిలయన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టీసీఎస్‌ల మొత్తం మార్కెట్ విలువ కంటే ఇది ఎక్కువ. – సాక్షి, హైదరాబాద్2023లో ఆవిర్భావండీప్సీక్ పురుడుపోసుకుని రెండేళ్లు కూడా కాలేదు. క్వాంట్ హెడ్జ్ ఫండ్ ‘హై–ఫ్లయర్’చీఫ్ లియాంగ్ వెన్ఫెంగ్ 2023లో దీన్ని నెలకొల్పారు. అతి తక్కువ ఖర్చుతో డీప్‌సీక్ రూపొందించిన ఆర్1 ఏఐ మోడల్ చైనాతోపాటు అమెరికా టెక్ దిగ్గజాలను కూడా ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఏఐ మోడల్‌ను పూర్తి ఉచితంగా అందిస్తుండటం ఓపెన్ ఏఐ వంటి కంపెనీల భవిష్యత్‌కు గొడ్డలిపెట్టులా మారింది. అమెరికాలో విడుదలైన వారంలోనే యాపిల్ యాప్ స్టోర్‌లో డీప్‌సీక్ మొబైల్ యాప్ అత్యధిక డౌన్లోడ్లతో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుని చాట్‌జీపీటీని వెనక్కి నెట్టింది. ఈ నెల 27న ఒక్కరోజే ఏకంగా 20 లక్షల మంది డౌన్లోడ్ చేసుకోవడం దీని జోరుకు నిదర్శనం. మరోపక్క టెక్ట్స్ ప్రాంప్ట్‌ను ఇమేజ్‌గా మార్చే జానస్–ప్రో–7బీతో మరో సంచలనానికి తెరతీసింది డీప్‌సీక్. అమెరికాకు ‘డీప్’ట్రబుల్.. ఏఐలో అగ్రస్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన వెంటనే స్టార్గేట్ ప్రాజెక్టును ప్రకటించిన విషయం తెలిసిందే. నాలుగేళ్లలో 500 బిలియన్ డాలర్లు వెచ్చించి అమెరికాను తిరుగులేని ఏఐ సూపర్‌పవర్‌గా చేసేందుకు ఓపెన్ఏఐ, ఒరాకిల్, సాఫ్ట్ బ్యాంక్, ఎంజీఎక్స్ చేతులు కలిపాయి. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కకముందే డీప్‌సీక్ కారు చౌకగా ఏఐ మోడల్‌ను అభివృద్ధి చేసి షాకిచ్చింది. ట్రంప్ సలహాదారు మార్క్ ఆండర్సన్.. డీప్‌సీక్–ఆర్1ను ఏకంగా ‘‘ఏఐ స్పుత్నిక్ మూమెంట్’’గా (1957లో సోవియట్ యూనియన్ ప్రపంచంలో తొలి శాటిలైట్ స్పుత్నిక్ను ప్రయోగించడంతో యూఎస్, సోవియట్ మధ్య స్పేస్ వార్‌కు తెరలేచింది) అభివర్ణించడం విశేషం.దిగ్గజాలకు దీటుగా..ఎన్విడియా అధునాతన చిప్స్, గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్స్ (జీపీయూ)తో పోలిస్తే చాలా లో ఎండ్ హార్డ్‌వేర్‌తో (పాత ఎన్విడియా ఏ100 జీపీయూలు) తాము ఏఐ మోడల్స్‌ను రూపొందించామని డీప్‌సీక్ ప్రకటించింది. చైనాకు అధునాతన చిప్స్, టెక్నాలజీ ఎగుమతిపై అమెరికా విధించిన ఆంక్షలను సైతం ఎదురొడ్డి సొంతంగా దిమ్మదిరిగే ఏఐ మోడల్‌ను అభివృద్ధి చేయడంపై నిపుణులు కూడా నోరెళ్లబెడుతున్నారు. డీప్‌సీక్ దెబ్బతో ప్రపంచ ఏఐ పరిశ్రమ స్వరూపమే మారిపోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఇది ఓపెన్ సోర్స్ (డెవలపర్లు ఈ సాఫ్ట్‌వేర్‌ను మెరుగుపరచే అవకాశంతో పాటు దీని ఆధారంగా సొంత టూల్స్‌ను రూపొందించుకోవచ్చు) మోడల్ కావడంతో తక్కువ బడ్జెట్లోనే కంపెనీలు, యూజర్లకు ఏఐ అందుబాటులోకి వస్తుంది. డీప్‌సీక్ ఆర్1 ఏఐ మోడల్ మేథమెటిక్స్, కోడింగ్, రీజనింగ్, లాంగ్వేజ్ పరంగా అన్ని రకాల ప్రమాణాల్లో చాట్‌జీపీటీ, జెమిని, గ్రోక్ వంటి ఏఐ మోడళ్లకు దీటుగా నిలవడం గమనార్హం. మెటా ఏఐ మోడల్ అభివృద్ధికి 6 బిలియన్ డాలర్లు ఖర్చు చేయగా.. డీప్‌సీక్ కేవలం 6 మిలియన్ డాలర్లతోనే ఆర్1 ఏఐ మోడల్‌ను తీసుకొచ్చింది.మైక్రోసాఫ్ట్ నుంచి 13 బిలియన్ డాలర్లతో సహా, భారీగా నిధులు సమీకరించిన ఓపెన్ఏఐలో సిబ్బంది సంఖ్య 4,500. దీనికి పూర్తి భిన్నంగా ఇప్పటిదాకా డీప్‌సీక్ వెచ్చించింది 10 మిలియన్ డాలర్లే. ఉద్యోగులు 200 మంది మాత్రమే.ఎన్విడియాకు షాకెందుకు?ఏఐ మోడల్స్‌ను నడిపేందుకు హై ఎండ్ చిప్స్, జీపీయూలు, నెట్వర్కింగ్ అవసరమని ఇప్పటిదాకా ఊదరగొడుతున్నారు. ఈ రంగంలో నంబర్ వన్‌గా ఉన్న ఎన్విడియా మార్కెట్ విలువ 2023 డిసెంబర్లో తొలిసారి 500 బిలియన్ డాలర్లు దాటింది. గడిచిన ఏడాదిలోనే ఏకంగా 3.5 ట్రలియన్ డాలర్లను (మన కరెన్సీలో రూ.301 లక్షల కోట్లు) తాకి ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా యాపిల్‌ను వెనక్కి నెట్టింది. డీప్‌సీక్ చౌక మోడల్ వల్ల డిమాండ్ తగ్గొచ్చనే భయంతో ఇన్వెస్టర్లు ఏఐ టెక్ షేర్లను అమ్మేసుకుంటున్నారు. దీంతో ఎన్విడియా షేర్ 17 శాతం కుప్పకూలింది. బ్రాడ్‌కామ్, ఏఎండీ, అరిస్టా నెట్వర్క్స్, నెదర్లాండ్స్ చిప్ దిగ్గజం ఏఎస్ఎంఎల్ హోల్డింగ్స్, తైవాన్ సెమీకండక్టర్స్ మాన్యుఫ్యాక్చర్స్ (టీఎస్ఎం) వంటి చిప్, నెట్వర్కింగ్ షేర్లు సైతం 15–23 శాతం పడిపోయాయి. -
ట్రంప్ రివేంజ్ పాలిటిక్స్.. 12 మంది ప్రాసిక్యూటర్ల తొలగింపు
వాషింగ్టన్:రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత ట్రంప్ వరుసగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. వీటిలో రాజకీయ కక్ష తీర్చుకునే నిర్ణయాలు కూడా ఉన్నాయి. తాజాగా అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ 12 మంది దాకా ప్రాసిక్యూటర్లను తొలగించింది. వీరంతా గత ప్రభుత్వంలో ట్రంప్‌ను ప్రాసిక్యూట్ చేసిన లాయర్లు కావడం గమనార్హం. బైడెన్ హయాంలో ట్రంప్ పలు క్రిమినల్ కేసుల్లో విచారణను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అధ్యకక్షుడిని కేసులతో ముప్పుతిప్పలు పెట్టిన వారిని వదిలేదని లేదన్న సంకేతాలను జస్టిస్ డిపార్ట్మెంట్ ఇచ్చిందన్న ప్రచారం జరుగుతోంది. ‘గతంలో అధ్యక్షుడు ట్రంప్‌ను ప్రాసిక్యూట్ చేసిన న్యాయవాదులను యాక్టింగ్ అటార్నీ జనరల్ సర్వీసు నుంచి తొలగించారు. అధ్యక్షుడి ఎజెండాను అమలు చేయలేరన్న కారణంతోనే వీరిని తొలగిస్తున్నాం’అని జస్టిస్ డిపార్ట్మెంట్ ఒక ప్రకటనలో తెలిపింది. ట్రంప్‌ను ప్రాసిక్యూట్ చేసిన న్యాయవాదులంతా ప్రత్యేక కౌన్సిల్ జాక్‌స్మిత్ నేతృత్వంలో పనిచేశారు. జాక్ స్మిత్ జనవరి మొదటి వారంలోనే తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. కాగా, ట్రంప్ గత ప్రభుత్వ హయంలో ప్రముఖంగా ‘క్యాపిటల్’ తిరుగుబాటు, పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్ హష్మనీ కేసులను ఎదుర్కొన్నారు. వీటిలో హష్మనీ కేసులో ట్రంప్ ఇప్పటికే దోషిగా తేలారు. అయితే కోర్టు ట్రంప్‌కు ఈ కేసులో ఎలాంటి శిక్ష వేయలేదు. -
గురుద్వారాల్లో తనిఖీలు.. ట్రంప్‌పై సిక్కుల ఆగ్రహం
వాషింగ్టన్:ఎన్నికల ముందు చెప్పినట్టుగానే అమెరికా(America) అధ్యక్షుడు ట్రంప్ అక్రమ వలసదారులను సాగనుంపుతున్నారు. ఈ క్రమంలో అక్రమ వలసదారులను అరెస్టు చేయడానికి ట్రంప్(Trump) అనుసరిస్తోన్న విధానాలపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. అక్రమ వలసదారుల్ని గుర్తించే క్రమంలో అధికారులు న్యూయార్క్,న్యూజెర్సీల్లోని గురుద్వారాల్లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. తాము పవిత్రంగా భావించే ప్రార్ధనా మందిరాల్లో అక్రమ వలసదారుల కోసం హోం ల్యాండ్ సెక్యూరిటీ అధికారులు వెతకడంపై సిక్కు సంస్థలు మండిపడుతున్నాయి. గురుద్వారాల పవిత్రతను ట్రంప్ చర్య దెబ్బతీస్తోందని ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.కాగా, ట్రంప్ యంత్రాంగం అమెరికాలో ఇప్పటివరకు వందలమంది అక్రమ వలసదారులను అరెస్టు చేసింది. అరెస్టయిన వారంతా ఉగ్రవాదం,డ్రగ్స్,లైంగిక నేరాలు వంటి కేసుల్లో నిందితులుగా ఉన్నవారేనని అధికారులు చెబుతున్నారు. ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ(Deportation) ఆపరేషన్ చేపట్టారు.ఇప్పటికే సైనిక విమానాల్లో వందల మంది అక్రమ వలసదారులను దేశం నుంచి బయటకు పంపించేశామని వైట్‌హౌస్ వెల్లడించింది.మరోవైపు,అక్రమ వలసలకు తాము వ్యతిరేకమని,ఎందుకంటే అది పలురకాల వ్యవస్థీకృత నేరాలతో ముడిపడి ఉందని ఇప్పటికే భారత్ స్పష్టం చేయడం గమనార్హం. -
బంగ్లాదేశ్‌కు ట్రంప్ బిగ్ షాక్
వాషింగ్టన్: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ షాకిచ్చారు. బంగ్లా ప్రభుత్వానికి అమెరికా సాయాన్ని రద్దు చేస్తూ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో బంగ్లాదేశ్‌లో ఆహారభద్రత, ఆరోగ్యం, విద్య తదితర కీలక రంగాల్లో చేపట్టిన ప్రాజెక్టులు ఆగిపోనున్నాయి. 90 రోజుల పాటు పలు దేశాలకు అమెరికా సాయాన్ని నిలిపివేసే పాలసీలో భాగంగా బంగ్లాదేశ్‌కు సాయం నిలిపివేశారు. ఈజిప్ట్, ఇజ్రాయెల్‌లకు తప్ప ఇతర అన్ని దేశాలకు 90 రోజులపాటు అమెరికా సాయాన్ని నిలిపివేశారు. ట్రంప్ ఇటీవల అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. వలసదారుల విధానాలు, ఫెడరల్ వర్కర్లు ఆఫీసు నుంచి విధులు నిర్వహించడం, లేకెన్ రిలే చట్టం అమలు, పారిస్ ఒప్పందం నుంచి తప్పుకోవడం వంటి నిర్ణయాలు వీటిలో ఉన్నాయి.వీటికి తోడు అమెరికాలో ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకోవడం కోసం ప్రపంచంలోని ఇతర దేశాలకు సాయాన్ని 90 రోజుల పాటు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో భాగంగా ట్రంప్ ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇదీ చదవండి: 90 వేల మంది ఉద్యోగుల తొలగింపు..ట్రంప్ కఠిన నిర్ణయం -
హెచ్1బీ వీసాలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
వాషింగ్టన్:అత్యుత్తమమైన నైపుణ్యమున్న వ్యక్తులే తమ దేశానికి రావాలని అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆకాంక్షించారు. మంగళవారం(జనవరి21) వైట్‌హౌజ్‌లో ట్రంప్ ఈ విషయమై ఒరాకిల్,ఓపెన్ఏఐ,సాఫ్ట్‌బ్యాంక్ సీఈవోలతో కలిసి మీడియాతో మాట్లాడారు.‘హెచ్1బీ వీసాలపై విభిన్నమైన వాదనలున్నాయి. రెండు వాదనలకు నేను మద్దతిస్తున్నాను. నేను కేవలం ఇంజినీర్ల గురించే మాట్లాడడం లేదు. అన్ని స్థాయిల్లో నైపుణ్యమున్న వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాను. హెచ్1బీ వీసాలపై నాకు వ్యక్తిగత అవగాహన ఉంది. నాణ్యమైన మానవవనరులు అమెరికాకు వచ్చేలా వలస విధానం ఉండాలి. దేశంలో వ్యాపారాల విస్తరణను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఒరాకిల్,సాఫ్ట్‌బ్యాంక్ వంటి కంపెనీలకు అత్యుత్తమ ఇంజినీర్ల అవసరం ఉంది. అత్యుత్తమ సాంకేతిక నిపుణులు వస్తారన్న అభిప్రాయంతోనే ఇలాన్‌మస్క్ హెచ్1బీ వీసాలకు మద్దతిస్తున్నారు.హెచ్1బీ వీసాల జారీని నేను ఆపడం లేదు’అని ట్రంప్ క్లారిటీ ఇచ్చారు. కాగా, హెచ్1బీ వీసాలపై ఇటీవల రిపబ్లికన్లలోనే భిన్న వాదనలు వినిపించాయి. కొందరు హెచ్1బీ వీసాల జారీని పూర్తిగా ఆపేయాలని డిమాండ్ చేశారు. అప్పుడే అమెరికాలో స్థానికులకు ఉద్యోగావకాశాలు వస్తాయన్నారు. ఇక అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపులో కీలక పాత్ర పోషించిన ప్రముఖ బిలియనీర్ ఇలాన్ మస్క్ మాత్రం హెచ్1బీ వీసాల జారీని సమర్థించారు. అత్యుత్తమ నైపుణ్యం కలిగిన వ్యక్తులు అమెరికాకు రావాల్సిన అవసరం ఉందన్నారు. #WATCH | Washington DC | On H1B visas, US President Donald Trump says, "... I like both sides of the argument but I also like very competent people coming to our country, even if that involves them training and helping others that may not have the qualifications... About HB1, I… pic.twitter.com/ALFRoHUWgD— ANI (@ANI) January 22, 2025 ఇదీ చదవండి: ట్రంప్ 2.0..భారత్‌కు దక్కిన అరుదైన గౌరవం -
ట్రంప్ 2.0..భారత్‌కు దక్కిన అరుదైన గౌరవం
వాషింగ్టన్:అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణస్వీకారం చేయగానే భారత్,అమెరికా సంబంధాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత తొలి ప్రాధాన్యం భారత్‌కే లభించింది. అమెరికా కొత్త విదేశాంగ శాఖ మంత్రి మారో రుబియో తన తొలి భేటీ భారత విదేశాంగశాఖ మంత్రితోనే నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటీలో అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్జ్ కూడా పాల్గొన్నారు.సాధారంగా కొత్త అధ్యక్షుడు అధికారం చేపట్టగానే అమెరికా విదేశాంగశాఖ తొలి భేటీ పొరుగు దేశాలైన కెనడా,మెక్సికో లేదంటే నాటో కూటమిలోని ఏదో ఒక దేశంతో జరుగుతుంది. ఈసారి సంప్రదాయానికి భిన్నంగా భారత విదేశీవ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌తో తొలి భేటీ జరపడం గమనార్హం.అది కూడా అమెరికా విదేశాంగశాఖ మంత్రిగా మైక్ రుబియో పదవీ బాధ్యతలు చేపట్టిన గంటలోనే భేటీ జరగడం విశేషం. గంటపాటు జరిగిన ఈ భేటీలో అమెరికా,భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించారు.భేటీ ముగిసిన తర్వాత జైశంకర్,రుబియోలు మీడియా ముందుకు వచ్చి కరచాలనం చేసుకున్నారు.రుబియోతో భేటీ అవడం సంతోషంగా ఉందని జైశంకర్ తన ఎక్స్(ట్విటర్)ఖాతాలో పోస్టు చేశారు. Delighted to meet @secrubio for his first bilateral meeting after assumption of office as Secretary of State.Reviewed our extensive bilateral partnership, of which @secrubio has been a strong advocate. Also exchanged views on a wide range of regional and global issues.Look… pic.twitter.com/NVpBUEAyHK— Dr. S. Jaishankar (@DrSJaishankar) January 21, 2025 ఇదీ చదవండి: జన్మతఃపౌరసత్వం రద్దు -
అమెరికాలో కాల్పులు..హైదరాబాద్ యువకుడి దుర్మరణం
వాషింగ్టన్: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. దుండగులు జరిపిన కాల్పుల్లో మరో తెలుగు యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్ చైతన్యపురికి చెందిన కొయ్యడ రవితేజ కాల్పుల్లో దుర్మరణం పాలయ్యారు.రవితేజ మరణవార్త విని చైతన్యపురి ఆర్కేపురం డివిజన్లో నివసిస్తున్న అతడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రవితేజ 2022లో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ప్రస్తుతం ఉద్యోగాణ్వేషణలో ఉన్నారు. ఘటన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదీ చదవండి: ఒక్కసారి కనబడు బిడ్డా -
ప్రమాణస్వీకారానికి ముందు ట్రంప్ సంచలన ప్రకటన
వాషింగ్టన్:ప్రమాణస్వీకారానికి కొన్ని గంటల ముందు అమెరికా(America)కు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) సంచలన ప్రకటన చేశారు. వాషింగ్టన్ డీసీలో ఆదివారం జరిగిన మేక్ అమెరికా గ్రేట్ ఎగెయిన్(MAGA) ర్యాలీని ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించారు. ఈ సందర్భంగా అమెరికాలోకి వలసలపై ట్రంప్ దూకుడుగా మాట్లాడారు.‘నేను ప్రమాణస్వీకారం చేసిన వెంటనే మన దేశంపై అక్రమ వలసదారుల దండయాత్ర ఆగిపోతుంది. సరిహద్దుల నుంచి అక్రమంగా ప్రవేశించడాన్ని ఆపేస్తాం. ఇక మన సంపదను మనమే అనుభవిస్తాం. అక్రమంగా వలస వచ్చిన వేలాది మందిని బలవంతంగా సాగనంపే కార్యక్రమం అమెరికా చరిత్రలోనే భారీగా మొదలుపెడతాం.ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం. టిక్‌టాక్ యాప్‌ను మళ్లీ తీసుకొచ్చాం. మన ఉద్యోగాలు చైనాకు పోవడానికి వీల్లేదు. అందుకే టిక్‌టాక్ యాప్‌లో అమెరికా ప్రభుత్వం 50 శాతం భాగస్వామ్యం తీసుకుంటుంది. అధికారం చేపట్టకముందే ట్రంప్ ఎఫెక్ట్‌తో ఇప్పటికే కొన్ని పనులు జరిగిపోతున్నాయి. ఇది నా ఎఫెక్ట్ కాదు. మీ అందరి ఎఫెక్ట్’అని ర్యాలీకి హాజరైన వారిని ట్రంప్ తన ప్రసంగంతో ఉత్తేజపరిచారు. కాగా, గతేడాది నంబర్లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ట్రంప్ సోమవారం(జనవరి 20)న రెండోసారి అమెరికా అధ్యక్షునిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అధికారం చేపట్టిన వెంటనే ట్రంప్ ఏ నిర్ణయాలు తీసుకుంటారన్నది ప్రపంచ దేశాలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాయి.ఇదీ చదవండి: నేడే ట్రంప్ పట్టాభిషేకం -
బాధ్యత లేని బాల్యచాపల్యం
బాల్యావస్థ చిత్రమైనది. ఆ దశలో కంటిముందు కనబడేవన్నీ తన సొంతం అనుకునే మనస్తత్వం ఉంటుంది. మరో పదిరోజుల్లో అమెరికా అధ్యక్ష పీఠం ఎక్కబోతున్న డోనాల్డ్ ట్రంప్ ఈ మాదిరి సమస్యతో ఇబ్బంది పడుతున్నట్టు కనబడుతోంది. అధికారంలోకి రాకముందే ఆయన వరసబెట్టి పొరుగు దేశాలకు తాఖీదులు పంపుతున్నారు. ‘మీరంతా నా దారికి రండి’ అన్నదే వాటి సారాంశం. అమెరికాలో 51వ రాష్ట్రంగా స్థిరపడటానికి కెనడా సిద్ధంగా ఉండాలట. డెన్మార్క్‌లో భాగంగా ఉన్న గ్రీన్‌ల్యాండ్ ప్రాంతాన్ని ఆ దేశం వదిలేసుకోవాలట. అలాగే పనామా అధీనంలోని పనామా కాల్వపై అమెరికాకు పూర్తి హక్కున్నదట. తన అభీష్టం నెరవేరటానికి ఆ దేశాలపై టారిఫ్ మోత మోగి స్తారట. ఫలితం రాకపోతే దురాక్రమణకు సిద్ధపడతారట. సోవియెట్ యూనియన్ దురాక్రమణకు పాల్పడే అవకాశం ఉన్నదని బెదరగొట్టి 1949లో నాటో కూటమిని ఏర్పాటుచేసింది అమెరికాయే. దాని స్థానంలో వచ్చిన రష్యావల్ల కూడా ముప్పు ముంచుకురావచ్చని ఒప్పించి నాటోను కొన సాగిస్తున్నదీ అమెరికాయే. తీరా ట్రంప్ ప్రకటనల తీరు చూశాక నిజమైన ముప్పు అమెరికానుంచే ఉండొచ్చన్న భయాందోళనలు యూరప్ దేశాల్లో కలుగుతున్నాయి. ఏడెనిమిదేళ్లుగా అమెరికా ‘నియమాల ఆధారిత’ ప్రపంచం గురించి మాట్లాడుతోంది. చైనా ప్రాబల్యాన్ని అడ్డగించటమే లక్ష్యంగా అమెరికా వాడుకలోకి తెచ్చిన ఇండో–పసిఫిక్ వ్యూహానికి ప్రాతిపదిక ‘నియమాల ఆధా రిత’ ప్రపంచమే. ట్రంప్ ప్రకటనలకూ, ఈ వ్యూహానికీ పూర్తిగా చుక్కెదురు. అమలులో ఉన్న నియ మాలను ధిక్కరించి, అంతర్జాతీయ న్యాయానికి భిన్నంగా ప్రవర్తించి ఏ దేశాన్నయినా ఆక్రమించు కోవాలనుకునే మనస్తత్వం దేనికి దారితీస్తుంది? అందుకే యూరప్ దేశాలన్నీ ట్రంప్ ప్రకటనపై విరుచుకు పడుతున్నాయి. సభ్యదేశాల్లో ఎవరిపై దాడి జరిగినా మిగిలిన దేశాలన్నీ అండగా నిలవాలన్నది నాటో నియమం. దానికి అనుగుణంగానే జర్మనీ, ఫ్రాన్స్ మొదలు అన్ని దేశాలూ ట్రంప్ తీరును ఖండిస్తున్నాయి. ఉక్రెయిన్ దురాక్రమణకు పాల్పడిన రష్యాను ఖండిస్తూ, తైవాన్ను సొంతం చేసుకోవాలనుకునే చైనాను హెచ్చరిస్తూ వస్తున్న అమెరికా ట్రంప్ ఏలుబడి మొదలయ్యాక తానే దురాక్రమణదారుగా మారుతుందా అన్నది చెప్పలేం. పూర్వాశ్రమంలో రిపబ్లికన్ పార్టీకే చెందిన నిక్సన్ అమెరికా అధ్యక్షుడిగా ఇలాంటి బెదిరింపులకే పాల్పడేవారు. తానొక ప్రమాదకారినన్న భావన కలిగిస్తే చాలు... ప్రపంచమంతా పాదాక్రాంతమవుతుందన్న భ్రమ ఆయనకు ఉండేది. దాన్ని ‘మ్యాడ్‌మ్యాన్ థియరీ’గా పిలిచేవారు. చివరకు ఆయన హయాంలోనే ఎంతో అప్రదిష్టపాలై ఉత్తర వియత్నాం నుంచి అమెరికా సైనికులు వైదొల గాల్సి వచ్చింది. ట్రంప్ మాటలు ‘మ్యాడ్‌మ్యాన్ థియరీ’వంటివేనా... నిజంగా ప్రమాదకరమైనవా అనే విచికిత్సలో పడ్డాయి యూరప్ దేశాలు. దౌత్యరంగంలో ఎవరైనా సరే... మరో దేశాధినేత వ్యక్తిగతంగా కలిసినప్పుడు తమకేం చెప్పారన్నది కాక, వారి బహిరంగ ప్రకటనలనూ, వారి ఆచరణనూ పరిగణనలోకి తీసుకుంటారు. తొలి ఏలుబడిలో సైతం ట్రంప్ ఇలాంటి హెచ్చరికలు చాలా చేసేవారు. ఉత్తర కొరియాపై నిప్పుల వాన కురిపించబోతున్నట్టు ప్రకటనలు చేయటం, చివరకు ఆ దేశానికి అతిథిగా వెళ్లి ఒప్పందం కుదుర్చుకురావటం అందరూ చూశారు. చైనా పైనా అదే తరహాలో చిందులు తొక్కేవారు. కానీ ఎప్పుడూ దాని జోలికిపోలేదు. అయితే ఇరాన్ విషయంలో అలా కాదు. ఆ దేశ అగ్రనేతల్లో ఒకరైన కాసిం సొలేమనిని హత్య చేయించారు. వేరే దేశాల నేతలపై దాడులకు పాల్పడటం, దాన్ని అధికారికంగా ప్రకటించటం అసాధారణం. కనుకనే ట్రంప్ రెండో ఏలుబడిపై అందరిలోనూ ఆందోళన నెలకొన్నది. విస్తరణవాద చాపల్యం అమెరికాకు మొదటినుంచీ ఉన్నదే. కానీ అదంతా మృదువైన భాష వెనక నడిచేది. వేరే దేశాల్లో పాలకుల్ని మార్చకుండానే తన పెత్తనాన్ని సుస్థిరం చేసుకునేది. నేరుగా బెదిరింపులకు దిగటం ట్రంప్ ప్రవేశపెట్టిన కొత్త ధోరణి. ఏటా కెనడా రక్షణకు రెండువేల కోట్ల డాలర్లు వెచ్చిస్తున్నామని, అందువల్ల ఒరిగేదేమీ లేదన్నది ఆయన అభిప్రాయం. 51వ రాష్ట్రంగా కలుపుకొంటే అదంతా ఆదా అవుతుందని ట్రంప్ అంటున్నారు. కెనడా వాదన భిన్నంగా ఉంది. అమెరికా–కెనడా సంబంధాల వల్ల ఇరు దేశాలూ బాగుపడుతున్నాయని ఆ దేశం చెబుతోంది. తమనుంచి అత్యుత్తమ ప్రమాణాలు కలిగిన ఇంధనం మార్కెట్ ధరకన్నా తక్కువకు అమెరికాపొందుతున్నదని, వేలకోట్ల డాలర్ల విలువైన అమెరికా సరుకులు కెనడాలో అమ్ముడవుతున్నాయని, అమెరికా చేసే యుద్ధాలకు కోట్ల డాలర్ల ధనం వెచ్చిస్తున్నామని కెనడా విపక్ష నేత పియే పొలియేరా గుర్తుచేశారు. దండిగా ఖనిజ వనరులున్న గ్రీన్‌ల్యాండ్‌పై ట్రంప్ కన్నుపడింది. పద్దెనిమిదేళ్ల ట్రంప్ కుమారుడు ఆ ప్రాంతానికెళ్లి అది తమ సొంత జాగీరన్న అర్థం వచ్చేలా ప్రకటించాడు. నిజానికి గ్రీన్‌ల్యాండ్ డెన్మార్క్ అధీనంలో కూడా లేదు. 57,000 మంది నివసించే ఆ ప్రాంతానికి స్వయంప్రతిపత్తి ఉంది. కేవలం సైనిక, ఆర్థిక వ్యవహారాలు మాత్రమే డెన్మార్క్ చూస్తుంది. పనామా కాల్వపై హక్కు వదులుకోవటానికి పనామా దేశం కూడా సిద్ధంగా లేదు. ట్రంప్ ఒక తేనెతుట్టె కదిల్చి తమాషా చూడదల్చుకున్నారా... నిజంగానే దురాక్రమణకు సిద్ధపడతారా అన్నది మున్ముందు తేలుతుంది. దురాక్రమణకు సిద్ధపడితే ఇప్పుడు పుతిన్‌కు ఉక్రెయిన్‌లో ఎదురవుతున్న పరాభవమే అమెరికాకు తప్పకపోవచ్చు. అంతకన్నా కీలకమైనదేమంటే... అమెరికా విశ్వసనీయతతో పాటు మిత్రులనూ కోల్పోతుంది. ఏకాకిగా మారుతుంది. -
నయా రాకెట్ నిశేష్ రెడ్డి...
అంతర్జాతీయ స్థాయిలో మరో యువ టెన్నిస్ ఆటగాడు దూసుకొస్తున్నాడు. అమెరికాలో పుట్టి పెరిగిన తెలుగు సంతతి కుర్రాడు నిశేష్ బసవరెడ్డి... గత సీజన్లో అనూహ్య ప్రదర్శనతో అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) యూత్ చాలెంజర్స్ టూర్ ఫైనల్స్ టోర్నీకి అర్హత సాధించడంతో పాటు... సీజన్ ఆరంభ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆ్రస్టేలియన్ ఓపెన్‌కు వైల్డ్ కార్డు ఎంట్రీ పొందాడు. కాలిఫోర్నియాలో పుట్టి పెరిగిన 19 ఏళ్ల నిశేష్ బసవరెడ్డి డిసెంబర్లోనే ప్రొఫెషనల్ ప్లేయర్‌గా మారాడు. 457వ ర్యాంక్‌తో 2024వ సంవత్సరం టెన్నిస్ సీజన్‌ను ప్రారంభించిన నిశేష్... వరుస విజయాలతో సత్తా చాటి సీజన్ ముగిసేసరికి ఏటీపీ ర్యాంకింగ్స్‌లో 138వ స్థానానికి చేరాడు. చాలెంజర్ టూర్ టోర్నీల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చిన నిశేష్ ఈ మధ్యకాలంలో 6 టోర్నీల్లో ఫైనల్‌కు చేరి రెండింట టైటిల్ చేజిక్కించుకున్నాడు. దీంతో అతడికి ఆ్రస్టేలియా ఓపెన్‌లో బరిలోకి దిగే అవకాశం దక్కింది. ఆదివారం నుంచి మెల్బోర్న్ వేదికగా ప్రారంభం కానున్న గ్రాండ్‌స్లామ్ టోర్నీలో నిశేష్ బరిలోకి దిగనున్నాడు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో డాటా సైన్సెస్ అభ్యసించిన నిశేష్ కుటుంబం నెల్లూరు నుంచి అమెరికాకు వెళ్లి స్థిరపడింది. నెల్లూరుకు చెందిన నిశేష్ తండ్రి మురళీ రెడ్డి టెక్ పరిశ్రమలో పని చేస్తుండగా... సోదరుడు నిశాంత్ రెడ్డి ఐటీ కంపెనీలో ఉద్యోగి. తల్లి సాయి ప్రసన్న గృహిణి. చిన్నప్పుడు చాలాసార్లు భారత్‌కు వచ్చి వెళ్లిన నిశేష్‌కు హైదరాబాద్, నెల్లూరులో బంధువులు ఉన్నారు. చుట్టాలు, స్నేహితుల వల్ల తెలుగుపై అవగాహన పెంచుకున్న నిశేష్ స్పష్టంగా మాట్లాడలేకపోయినా సినిమాలు మాత్రం బాగా చూస్తాడు. సబ్ టైటిల్స్ లేకుండా భాషను అర్థం చేసుకుంటాడు. ఒలింపిక్ పతక విజేత రాజీవ్ రామ్ వద్ద శిక్షణ పొందుతున్న నిశేష్... భవిష్యత్తుపై భరోసా పెంచుతున్నాడు. ‘17 ఏళ్ల వయసులోనే పట్టభద్రుడిగా మారాను. చాలా అంశాలపై ఆసక్తి ఉంది. అందుకే వాటిలో మరింత మెరుగవ్వాలని నిర్ణయించుకున్నా. శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా దృఢంగా అయ్యేందుకు ప్రయత్నిస్తున్నా. చిన్నప్పుడు తరచూ గాయపడే వాడిని. పాఠశాల విద్య పూర్తవగానే ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్‌గా మారాలని అనుకోలేదు. కానీ అలా జరిగిపోయిందంతే. చిన్నప్పటి నుంచి టెన్నిస్ అంటే విపరీతమైన ఇష్టం. టీవీలో ఎప్పుడూ టెన్నిస్ చానల్ చూస్తూ ఉండేవాడిని. కామెంటేటర్లు చెప్పే మాటలు వింటూ ప్లేయర్ల లాగా షాట్లు ఆడేందుకు ప్రయత్నించేవాడిని. దేన్నైనా నిశితంగా పరిశీలించడం నాకు అలవాటు. దీనివల్లే ప్రత్యర్థి ఆటగాళ్ల తప్పులను గమనించి అందుకు తగ్గట్లు వ్యూహాలు రచించుకోవడం నేర్చుకున్నా. ఇది అంత సులువుగా సాధ్యం కాలేదు. నిరంతర సాధన వల్ల వచ్చిoది’ అని తాజా ర్యాంకింగ్స్‌లో 133వ ర్యాంక్‌లో ఉన్న నిశేష్ అన్నాడు. –సాక్షి క్రీడా విభాగంఆక్లాండ్ ఓపెన్‌లో శుభారంభంఈ ఏడాది ఆడుతున్న రెండో ఏటీపీ–250 టోర్నీలో నిశేష్ బసవరెడ్డి శుభారంభం చేశాడు. న్యూజిలాండ్‌లో జరుగుతున్న ఆక్లాండ్ ఓపెన్ టోర్నీలో నిశేష్ రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. క్వాలిఫయింగ్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో నెగ్గి పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’లో క్వాలిఫయర్‌గా అడుగు పెట్టిన నిశేష్ తొలి రౌండ్లో 6–2, 6–2తో ప్రపంచ 85వ ర్యాంకర్ ఫ్రాన్సిస్కో కమ్సానా (అర్జెంటీనా)పై గెలుపొందాడు. 69 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నిశేష్ ఆరు ఏస్‌లు సంధించాడు. ఒక్క డబుల్ ఫాల్ట్ కూడా చేయని నిశేష్ ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. గతవారం బ్రిస్బేన్ ఓపెన్ ఏటీపీ–250 టోర్నీలోనూ క్వాలిఫయర్‌గా మెయిన్ ‘డ్రా’లో ఆడిన నిశేష్ తొలి రౌండ్లో ఫ్రాన్స్ సీనియర్ స్టార్ ప్లేయర్ గేల్ మోన్ఫిల్స్ చేతిలో మూడు సెట్లపాటు పోరాడి ఓడిపోయాడు. -
తడబడ్డ కమలాహారిస్..వీడియో వైరల్
వాషింగ్టన్:అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ తడబడ్డారు. అమెరికా 119వ కాంగ్రెస్ ప్రారంభం సందర్భంగా సెనేట్‌లో చేసిన ప్రతిజ్ఞలో జెండా అనే పదాన్ని వదిలేసి చదివారు. హారిస్ తడబడ్డ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఆమెను నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అమెరికాలో 119వ కాంగ్రెస్ తాజాగా సమావేశమైంది. ఈ సందర్భంగా చేసే ప్రతిజ్ఞలో ‘నేను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జెండాకు విధేయత చూపుతాను’ అని చదవాలి అయితే హారిస్ ‘జెండా’ పదాన్ని వదిలేసి చదివారు. దీనిపై పలువురు నెటిజన్లు స్పందించారు.హారిస్ విధేయత ప్రతిజ్ఞను సలాడ్ చేసేశారని ఒకరు కామెంట్ చేయగా సెనెట్‌లో ప్రతిజ్ఞను తప్పుగా పలికి హారిస్ దేశాన్ని అవమానించారని మరొకరు విమర్శించారు. చరిత్రలో అతి తక్కువ ఐక్యూ కలిగిన అధ్యక్ష అభ్యర్థి కమలాహారిస్ అని మరో నెటిజన్ విమర్శించారు. FLAG FLUB: Vice President Kamala Harris appears to flub the Pledge of Allegiance during the opening moments of the 119th Congress. pic.twitter.com/NlyMB6iUoz— Fox News (@FoxNews) January 3, 2025 మరో వీడియోలో హారిస్ కొత్తగా ఎన్నికైన సెనేటర్లతో ప్రతిజ్ఞ చేయిస్తుండగా అక్కడే ఉన్న అమెరికాకు కాబోయే ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇతర సభ్యులతో కలిసి నవ్వుతూ కనిపించారు. ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ అభ్యర్థిగా పోటీచేసిన కమలాహారిస్ ట్రంప్ చేతిలో ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే.JD Vance laughing as Kamala Harris swears in new U.S. Senators 🤣pic.twitter.com/LRot5mia2Z— Benny Johnson (@bennyjohnson) January 3, 2025 ఇదీ చదవండి: ప్రధానిపై విమర్శలు..మస్క్‌కు బ్రిటన్ కౌంటర్ -
‘న్యూ ఓర్లీన్స్’ దాడి..ట్రంప్ కీలక ట్వీట్
వాషింగ్టన్:న్యూ ఓర్లీన్స్లో జరిగిన ట్రక్కు దాడిపై అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న డెమొక్రాట్ల విధానాల వల్లే అమెరికాలో ఇలాంటి దాడులు జరుగుతున్నాయని విమర్శించారు. ఈ మేరకు శుక్రవారం(జనవరి3) ట్రంప్ ఎక్స్(ట్విటర్)లో ఓ పోస్టు చేశారు.సరిహద్దులు తెరిచి పెట్టడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు.బలహీన,అసమర్థ నాయకత్వమే ఇందుకు కారణమన్నారు.డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్(డీవోజే) ఎఫ్‌బీఐ,డెమోక్రట్ ప్రభుత్వం,న్యాయవాదులు తమ విధిని సక్రమంగా నిర్వహించక పోవడం వల్లే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు.Our Country is a disaster, a laughing stock all over the World! This is what happens when you have OPEN BORDERS, with weak, ineffective, and virtually nonexistent leadership. The DOJ, FBI, and Democrat state and local prosecutors have not done their job. They are incompetent and…— Donald J. Trump (@realDonaldTrump) January 3, 2025అమెరికా విఫలమైందని అంతా మాట్లాడుకుంటున్నారన్నారు. న్యూ ఓర్లీన్స్లో బోర్బన్ వీధిలో నూతన సంవత్సర వేడుకలు జరుగుతుండగా అమెరికా ఆర్మీ మాజీ ఉద్యోగి జబ్బార్ ట్రక్కుతో జనంపైకి దూసుకువచ్చిన ఘటనలో 15 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ దాడి తర్వాత పోలీసులు జరిపిన కాల్పుల్లో జబ్బార్ మృతి చెందాడు.ఈ కేసులో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎఫ్‌బీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. జబ్బార్ విదేశీ సంస్థల సహకారం లేకుండా ఒంటరిగానే ట్రక్కు దాడి చేశాడని ఎఫ్‌బీఐ తేల్చింది.అయితే ఐసిస్ ఉగ్రవాద సంస్థ నుంచి జబ్బార్ స్ఫూర్తి పొందాడని ఎఫ్‌బీఐ తెలిపింది. ఇదీ చదవండి: ట్రక్కు దాడి.. ఎఫ్‌బీఐ కీలక ప్రకటన -
కాలిఫోర్నియాలో కూలిన విమానం
కాలిఫోర్నియా: వరుస విమాన ప్రమాదాలు హడలెత్తిస్తున్నాయి. కాలిఫోర్ని యాలో విమాన ప్రమాదం జరిగింది. డిస్నీల్యాండ్‌కు సమీపంలోని ఆరెంజ్ కౌంటీలో ఉన్న ఫుల్లర్టన్ మున్సిపల్ విమానాశ్రయంలో టేకాఫ్ అయిన నిమిషంలోనే విమానం కుప్పకూలింది. ఓ వాణిజ్య భవనం పైకప్పుపై పడింది. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గురువారం మధ్యాహ్నం 2.09 గంటలకు ఈ ఘటన జరిగింది. సింగిల్ ఇంజన్ కలిగిన నాలుగు సీట్ల చిన్న విమానమే అయినప్పటికీ.. ఫర్నీచర్ గోదామ్పై కుప్పకూలడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. విమానం కూలగానే గోదాములో మంటలు చెలరేగాయి. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపు చేసి సమీప భవనాలను ఖాళీ చేయించారు. గతేడాది నవంబర్‌లో మరో చిన్న విమానం టేకాఫ్ అయిన వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తుండగా విమానాశ్రయానికి అర మైలు దూరంలో ఉన్న చెట్టును ఢీకొట్టింది. విమానంలో ఉన్న ఇద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి. ఇదీ చదవండి: ట్రక్కు దాడి.. ఎఫ్‌బీఐ కీలక ప్రకటన -
USA:ట్రక్కు దాడి.. ఎఫ్‌బీఐ కీలక ప్రకటన
వాషింగ్టన్:న్యూ ఓర్లీన్స్ ట్రక్కు దాడిలో విదేశీ శక్తుల కుట్ర లేదని అమెరికా అత్యున్నత దర్యాప్తు ఏజెన్సీ ఫెడరల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ) తేల్చింది. దాడికి పాల్పడ్డ జబ్బార్ ఒంటరిగానే ఈ దుశ్చర్యకు ఒడిగట్టాడని తెలిపింది. దాడికి ముందు జబ్బార్ ఫేస్బుక్లో ఐదు వీడియోలు పోస్ట్ చేసినట్లు పేర్కొంది.దాడి దర్యాప్తు పురోగతిని అధ్యక్షుడు బైడెన్‌కు ఎఫ్‌బీఐ వివరించింది. సుమారు గంట సేపు అధికారులతో చర్చించి దర్యాప్తు వివరాలను బైడెన్ తెలుసుకున్నారు. దాడిపై స్వదేశీ,విదేశీ కుట్ర కోణంలో దర్యాప్తు కొనసాగుతోందని వైట్‌హౌజ్ వర్గాలు తెలిపాయి. ఈ దాడి కోసం జబ్బార్ విదేశీ సంస్థలతో కలిసి పనిచేయలేదు. అయితే అతను ఐసిస్ నుంచి స్ఫూర్తి పొందాడు. ఇది వంద శాతం ఉగ్రవాద చర్యనే’అని ఎఫ్‌బీఐ కౌంటర్ టెర్రరిజం విభాగానికి చెందిన అధికారి క్రిస్టఫర్ తెలిపారు. ఐసిస్ మళ్లీ పుంజుకోకుండా సిరియాలోని అమెరికా బలగాలు ఉగ్రవాద సంస్థ నేతలపై వైమానిక దాడులు నిర్వహిస్తున్నాయని ఓ సీనియర్ అధికారి తెలిపారు. నూతన ఏడాది వేడుకల వేళ న్యూఓర్లీన్స్‌లో అమెరికా ఆర్మీ మాజీ ఉద్యోగి జబ్బార్ పికప్ ట్రక్కుతో జనంపైకి దూసుకొచ్చిన ఘటనలో 15 మంది మరణించిన విషయం తెలిసిందే. అనంతరం పోలీసుల కాల్పుల్లో జబ్బర్ మృతి చెందాడు. -
అమెరికాలోనూ ‘చాయ్.. సమోసా’
‘తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ’ అంటూ భారతీయ పర్యాటకులను మరింతగా ఆకట్టుకునేందుకు అమెరికా కొత్త పల్లవి అందుకుంది. అక్కడి పర్యాటక పరిశ్రమ భారతీయుల కోసం రెడ్ కార్పెట్ పరుస్తోంది. ఇతర దేశాల నుంచి అమెరికాకు టూరిస్టుల రాక భారీగా తగ్గడం.. అదే సందర్భంలో భారత్ నుంచి పర్యాటకుల సందడి పెరుగుతుండటం అగ్రరాజ్యానికి ఆశాకిరణంగా మారింది. ఫలితంగా అక్కడి పర్యాటక పరిశ్రమ మన సంప్రదాయాలను పుణికిపుచ్చుకుని ‘రండి.. రండి.. రండి’ అంటూ భారతీయులకు చక్కటి అతిథి మర్యాదలు చేస్తోంది.సాక్షి, అమరావతి: అమెరికా పర్యాటక పరిశ్రమ మందకొడిగా సాగుతోంది. కోవిడ్ మునుపటి స్థాయిని అందుకునేందుకు అష్టకష్టాలు పడుతోంది. నిరంతర ద్రవ్యోల్బణం కారణంగా అమెరికన్లు విశ్రాంతి ఖర్చులను తగ్గించుకుంటున్నారు. తూర్పు ఆసియా దేశాల నుంచి పర్యాటకుల రాక గణనీయంగా పడిపోయింది. ఈ ఖాళీని భారతీయ పర్యాటకులతో భర్తీ చేయాలని అమెరికా భావిస్తోంది. అగ్రరాజ్యానికి ఆతిథ్య పరిశ్రమ ఆశాకిరణంగా కనిపిస్తోంది. ఇందుకే అమెరికా హోటళ్లు భారతీయ సంప్రదాయ రుచులకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. భారతీయ పర్యాటకులను ఆకర్షించి ఆదాయాన్ని పెంచుకునేందుకు కొత్త ఆతిథి మర్యాదలు చేస్తున్నాయి.భారతీయ టీవీ చానళ్ల మోతఅమెరికా పర్యాటక పరిశ్రమలో ఆదాయాన్ని పునరుద్ధరించడానికి హోటళ్లు, ట్రావెల్ కంపెనీలు భారతీయ పర్యాటకులపైనే ఆశలు పెట్టుకున్నాయి. ఇందులో భాగంగా అగ్రరాజ్య హోటళ్లు ‘చాయ్.. సమోసా’లను ప్రవేశపెట్టాయి. దీనికితోడు లాంజ్‌లు, గెస్ట్ రూమ్స్‌లో భారతీయ టీవీ చానళ్ల ప్రసారాల మోత మోగిస్తున్నాయి. యూఎస్ నేషనల్ ట్రావెల్ అండ్ టూరిజం ఆఫీస్ (ఎన్టీటీవో) డేటా ప్రకారం గతేడాది తొలి పది నెలల్లో సుమారు 20 లక్షల మంది భారతీయులు అమెరికాను సందర్శించారు.ఇది కోవిడ్ పూర్వపు స్థాయి కంటే 48 శాతం పెరుగుదలను నమోదు చేయడం విశేషం. ముఖ్యంగా వ్యాపార సందర్శనల కోసం జారీ చేసిన వీసాలలో 50 శాతం, హాలిడే వీసాలు 43.50 శాతం వృద్ధి చెందాయి. విస్తరిస్తున్న భారతీయ మధ్యతరగతి జనాభా, అధిక ప్రయాణ బడ్జెట్లు, పెరిగిన విమాన సామర్థ్యం భారతీయుల్లో అంతర్జాతీయ ప్రయాణ ఒరవడిని చూపిస్తున్నాయి. చైనా, జపాన్ నుంచి తగ్గుదలఆర్థిక, సాంకేతికంగా అభివృద్ధి చెందిన దేశాల నుంచి వచ్చే సందర్శకుల సంఖ్య అమెరికాలో భారీగా తగ్గింది. ఇందులో చైనా నుంచి 44.50 శాతం, జపాన్ నుంచి 50.8 శాతం, దక్షిణ కొరియా నుంచి 23.90 శాతం క్షీణత నమోదైంది. వీరి స్థానాన్ని భారతీయులు భర్తీ చేస్తున్నట్టు ఆసియా అమెరికన్ హోటల్ ఓనర్స్ అసోసియేషన్ వెల్లడించింది. యూరోపియన్ పర్యాటకులు అమెరికాకు మళ్లీ తిరిగి వస్తున్నారు. అయితే యూకే, జర్మనీ, ఫ్రాన్స్ తదితర దేశీయుల సందర్శన 2019 ముందుతో పోలిస్తే తక్కువగా ఉంది. గతేడాది భారతీయ ప్రయాణికులు చేసిన యూఎస్ బుకింగ్‌లు 50 శాతంపైనే పెరిగాయి. ఇది 2019 కోవిడ్ మహమ్మారి స్థాయితో పోలిస్తే మూడు రెట్లు వృద్ధిని సూచిస్తోంది. ఓఏజీ ఏవియేషన్ డేటా ప్రకారం 2019తో పోలిస్తే గతేడాది భారత్–యూఎస్ మధ్య షెడ్యూల్డ్ విమాన సామర్థ్యం 42.3 శాతం పెరిగింది. -
అమెరికా ఖజానాపై సైబర్ దాడి..!
వాషింగ్టన్:అగ్ర దేశం అమెరికా ఖజానాపై చైనా సైబర్ దాడి చేసినట్లు సమాచారం. వర్క్ స్టేషన్లు,కీలక ఫైల్స్‌పై చైనా ప్రోద్బలంతో జరిగిన సైబర్ దాడిని గుర్తించామని అమెరికా ట్రెజరీ శాఖ కాంగ్రెస్‌కు లేఖ రాసింది.ఈ లేఖ మీడియా చేతికి చిక్కడంతో అసలు విషయం బయట పడింది.డిసెంబర్ నెల ప్రారంభంలో సైబర్ దాడి ఘటన జరిగినట్లు తెలుస్తోంది.థర్డ్ పార్టీ సైబర్ సెక్యూరిటీ సర్వీస ప్రొవైడర్ పాస్‌వర్డ్‌ను కనిపెట్టిన హ్యాకర్లు బ్రేక్ చేసి వర్క్ స్టేషన్లు, కొన్ని ఫైల్స్‌లోని సమాచారాన్ని దొంగిలించారని ట్రెజరీ శాఖ అధికార ప్రతినిధి లేఖలో తెలిపారు.ఈ విషయాన్ని యూఎస్ సైబర్ సెక్యూరిటీ,ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఏజెన్సీ దృష్టికి ట్రెజరీ శాఖ తీసుకువెళ్లింది.సైబర్ దాడిపై ట్రెజరీ శాఖకు థర్డ్‌పార్టీ సైబర్ సెక్యూరిటీ సేవలందిస్తున్న బియాండ్ ట్రస్ట్ సంస్థ ఈ వ్యవహారంపై స్పందించలేదు. ఇటీవలి కాలంలో కొన్ని థర్డ్ పార్టీ సైబర్ సెక్యూరిటీ సర్వీస్ ప్రొవైడర్‌ను టార్గెట్ చేసి సైబర్ దాడులకు పాల్పడే ట్రెండ్ పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. -
రూపాయి పడింది... ఫీజు భారం పెరిగింది!
సాక్షి, హైదరాబాద్: డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ క్రమంగా పతనమవుతుండటంతో, ఇప్పటికే అమెరికాలో చదువుతున్న వారితో పాటు కొత్తగా ఎమ్మెస్ కోసం అక్కడికి వెళ్లాలని భావిస్తున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై అదనపు భారం పడుతోంది. యూఎస్ వెళ్లేందుకు అన్ని సన్నాహాలూ చేసుకున్న విద్యార్థులు అంచనాలు తారుమారవడంతో ఆందోళన చెందుతున్నారు. 2022 ఫాల్ సీజన్ (సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్)లో డాలర్ విలువ రూ.79 కాగా ఇప్పుడది రూ.85.03కు ఎగబాకడం గమనార్హం. 2014లో డాలర్ (Dollar) విలువ రూ. 60.95 మాత్రమే కావడం గమనార్హం. రూపాయి (Rupee) విలువ తగ్గిపోవడంతో విదేశీ యూనివర్సిటీలకు చెల్లించాల్సిన ఫీజుల మొత్తం గణనీయంగా పెరిగిపోతోంది. ట్యూషన్ ఫీజు 10 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. పెరిగిన మారకం విలువకు తగ్గట్టుగా బ్యాంకులు అదనంగా రుణాలు ఇచ్చేందుకు సిద్ధపడటం లేదు. ఇప్పటికే అప్పులు చేసిన విద్యార్థులు పెరిగిన భారానికి తగిన మొత్తం ఎలా సమకూర్చుకోవాలో పాలుపోని స్థితిలో ఉన్నారు. పెరిగిన మారకం విలువకు తగ్గట్టుగా బ్యాంకులు అదనంగా రుణాలు ఇచ్చేందుకు సిద్ధపడటం లేదు. ఇప్పటికే అప్పులు చేసిన విద్యార్థులు పెరిగిన ఖర్చును ఎలా సమకూర్చు కోవాలో పాలుపోని స్థితిలో ఉన్నారు. రూపాయితో పోల్చు కుంటే డాలర్ విలువ గత రెండేళ్లలోనే 8 శాతం పెరగడం విద్యార్థులపై పెనుభారం మోపుతోంది. మరోవైపు పార్ట్ టైం ఉద్యోగాలకు (part time jobs) అవకాశాలు సన్నగిల్లడంతో విద్యార్థులు భారత్‌లోని తల్లిదండ్రుల వైపు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అమెరికాతో పాటు కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్ తదితర దేశాల్లో పరిస్థితి ఈ విధంగానే ఉందనే వార్తలొస్తున్నాయి. 2025లో రూ.5.86 లక్షల కోట్ల భారంభారత్ నుంచి ఏటా సగటున 13 లక్షల మంది విదేశీ విద్యకు వెళ్తున్నారు. వీరిలో 38 శాతం వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వారే ఉంటున్నారు. 2025లో ఈ సంఖ్య 15 లక్షలకు చేరుతుందని అంచనా. ఇక 2019లో విదేశీ విద్యకు భారతీయులు చేసిన ఖర్చు రూ. 3.10 లక్షల కోట్లు కాగా 2022 నాటికి ఇది 9 శాతం పెరిగి రూ.3.93 లక్షల కోట్లకు చేరింది. ప్రస్తుతం డాలర్ విలువ పెరగడంతో 2024లోఇది 8 నుంచి 10 శాతం మేర పెరిగి రూ. 4.32 లక్షల కోట్లకు చేరుతుందని భారత ప్రభుత్వం అంచనా వేసింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో 2025లో ఇది రూ.5.86 లక్షల కోట్ల వరకు వెళ్లే అవకాశం ఉందని విదేశీ మంత్రిత్వ శాఖ అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. ఫీజుకే అదనంగా రూ. 2.40 లక్షల వ్యయంస్ప్రింగ్ (మార్చి నుంచి జూన్) సీజన్లో చదువుకు సన్నాహాలు మొదలు పెట్టినప్పుడు వర్సిటీల ఫీజు సగటున రూ.24 లక్షలుగా విద్యార్థులు అంచనా వేసుకున్నారు. అయితే ప్రస్తుతం రూపాయి నేల చూపులు చూడటంతో ఇప్పుడు కనీసం రూ.2.40 లక్షలు అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక వసతి ఖర్చులు దీనికి అదనం కాగా.. మొత్తం మీద అమెరికాలో రూ.43 లక్షలతో ఎంఎస్ పూర్తవుతుందని అంచనా వేసుకుంటే, ఇప్పుడదని రూ. 52 లక్షల వరకు వెళుతుందని అంచనా. ఉపాధి భరోసా ఏదీ?అమెరికా వెళ్లే విద్యార్థి ముందుగా అక్కడ ఏదో ఒక పార్ట్‌టైం ఉద్యోగం వెతుక్కుంటాడు. 2019కి ముందుతో పోలిస్తే 2023లో ఈ అవకాశాలు 40 శాతం తగ్గాయని విదేశీ మంత్రిత్వ శాఖ అధ్యయనంలో గుర్తించారు. కరోనా తర్వాత ఏ దేశం నుంచి వచ్చిన విద్యార్థి అయినా పార్ట్ టైం ఉద్యోగం కోసం పోటీ పడాల్సి వస్తోంది. దీంతో అవకాశాలకు భారీగా గండి పడింది. కెనడాలో 2.22 లక్షల మంది భారత విద్యార్థులున్నారు. చదవండి: త్వరలో హైదరాబాద్ – డాలస్ విమానంఇక్కడ అమెరికాతో పోల్చుకుంటే 30 శాతం ఫీజులు తక్కువ ఉంటాయి. దీంతో ఈ దేశానికి వెళ్లేవారి సంఖ్య పెరుగుతోంది. అయితే ఇటీవల అక్కడ అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. వీసా నిబంధనల్లో మార్పులు తెర్చారు. 2020–21లో చదువు పూర్తి చేసిన వారికి పార్ట్‌టైం ఉద్యోగాలు వచ్చే పరిస్థితి తగ్గింది. దీంతో విద్యార్థులు అనేక కష్టాలు పడుతున్నారు. బ్రిటన్, ఆస్ట్రేలియాలోనూ ప్రతికూల పరిస్థితులే కన్పిస్తున్నాయి. ఈ పరిస్థితి ఊహించలేదు అమెరికా వస్తున్పప్పుడు రూ. 50 లక్షల వరకు అప్పు చేశా. రూపాయి విలువ పతనంతో ట్యూషన్ ఫీజు మొత్తం పెరిగింది. ప్రస్తుతం వ్యక్తిగత ఖర్చులు తగ్గించుకోవడానికి ఒకే గదిలో నలుగురం ఉంటున్నాం. అయినా ఇబ్బందిగానే ఉంది. పార్ట్ టైం ఉద్యోగం చేసినా పెద్దగా ఆదాయం ఉండటం లేదు. ఇంటికి ఫోన్ చేయాలంటే బాధగా అన్పిస్తోంది. ఇలాంటి పరిస్థితి ఊహించలేదు. – పాయం నీలేష్ (అమెరికాలో ఎంఎస్ విద్యార్థి)వెళ్లాలా? వద్దా? అనే డైలమాలో ఉన్నా..యూఎస్ వెళ్లడానికి బ్యాంక్ లోన్ ఖాయమైంది. కానీ ఈ సమయంలోనే రూపాయి పతనంతో యూనివర్సిటీకి చెల్లించాల్సిన మొత్తం పెరిగింది. బ్యాంకు వాళ్లు అదనంగా లోన్ ఇవ్వనన్నారు. మిగతా ఖర్చుల కోసం నాన్న అప్పుచేసి డబ్బులు సిద్ధం చేశారు. ఇప్పుడు ఆ డబ్బులు సరిపోయే పరిస్థితి లేదు. అమెరికా వెళ్లాలా? వద్దా? అనే డైలమాలో ఉన్నా. – నీలిమ (అమెరికా వెళ్లే ప్రయత్నంలో ఉన్న విద్యార్థిని)2014లో డాలర్ విలువ రూ.60.952022 (ఫాల్ సీజన్)లో రూ.792024 డిసెంబర్లో రూ.85.032025లో రూ.9 లక్షల వరకు అదనపు భారం! -
హెచ్–1బీ వీసాలకు ట్రంప్ దన్ను
వాషింగ్టన్: నిపుణులైన విదేశీ కార్మికులకు అమెరికా సంస్థల్లో ఉపాధికి ఉద్దేశించిన హెచ్–1బీ వీసాల పరిరక్షణ కోసం యుద్ధానికైనా సిద్ధమని వ్యాఖ్యానించిన ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి మద్దతు లభించింది. హెచ్–1బీ వీసాల జారీని అమెరికాలో పలువురు వ్యతిరేకిస్తున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకుంది. నిపుణులైన ఉద్యోగులకు అమెరికాలో పని చేసుకొనేందుకు అవకాశం కల్పించే హెచ్–1బీ వీసాలను వ్యతిరేకించేవారు తమ అభిప్రాయం మార్చుకోవాలని మస్క్ సూచించడం తెల్సిందే. కేవలం నైపుణ్యత మీదనే మనగలిగే స్పేస్ఎక్స్, టెస్లా వంటి సృజనాత్మక సంస్థలకు హెచ్–1బీ వీసాదారుల అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. మస్క్ చేసిన ఈ వ్యాఖ్యలను ట్రంప్ సమర్థించారు. ‘‘హెచ్–1బీ వీసా ప్రక్రియను నేనెప్పుడూ ఇష్టపడతా. వాటికి మద్దతు పలుకుతా. అందుకే అవిప్పటిదాకా అమెరికా వ్యవస్థలో కొనసాగుతున్నాయి. నా వ్యాపార సంస్థల్లోనూ హెచ్–1బీ వీసాదారులున్నారు. హెచ్–1బీ వ్యవస్థపై నాకు నమ్మకముంది. ఈ విధానాన్ని ఎన్నోసార్లు వినియోగించుకున్నా. ఇది అద్భుతమైన పథకం’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పాలనలో సమూల సంస్కరణలే లక్ష్యంగా ట్రంప్ కొత్తగా తెస్తున్న డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజ్)కు సంయుక్త సారథులు కానున్న మస్క్, వివేక్ రామస్వామి హెచ్–1బీకి మద్దతు తెలుపుతున్నారు. దీన్ని రిపబ్లికన్ పారీ్ట సీనియర్లు తప్పుబడుతున్నారు. స్థానిక అమెరికన్లకే అధిక ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానన్న ట్రంప్ ఎన్నికల వాగ్దానానికి ఇది విరుద్ధమంటున్నారు. వాళ్ల వైఖరిని మస్క్ తప్పుబట్టారు. హెచ్–1బీ వీసాల కోసం ఎంతకైనా తెగిస్తానని శనివారం ప్రకటించారు. -
USA:హాలిడే సీజన్‌పై టోర్నడోల ఎఫెక్ట్
కాలిఫోర్నియా:క్రిస్మస్,న్యూఇయర్ సెలవులను ఎంజాయ్ చేద్దామనుకున్న అమెరికా(America) వాసులను వాతావరణం ఇబ్బందులకు గురిచేస్తోంది. టోర్నడోలు, భారీ మంచు కారణంగా ఏకంగా 7వేల దాకా విమానాలు శనివారం(డిసెంబర్28) ఆలస్యంగా నడిచాయి. దీంతో బంధు,మిత్రులతో కలిసి సెలవులు సరదాగా గడుపుదామనుకున్నవారికి నిరాశే ఎదురైంది.అట్లాంటా,హూస్టన్లలోని విమానాశ్రయాల నుంచి విమానాలు ఆలస్యంగా నడిచాయి.ఆగ్నేయ రాష్ట్రాలైన టెక్సాస్,లూసియానా,మిసిస్సిపిలలో కనీసం పది టోర్నడోలు బీభత్సం సృష్టించాయి. టోర్నడోల ధాటికి ఒకరు మృతిచెందగా నలుగురు గాయపడ్డారు.కాలిఫోర్నియాలోని టాహో బేసిన్లో భారీ వర్షాలతో పాటు మంచు కురవనుందని వాతావరణశాఖ తెలిపింది.కాగా ఇయర్ ఎండింగ్లో అమెరికాలో కక్రిస్మస్తో పాటు న్యూఇయర్‌ను పురస్కరించుకుని ఉద్యోగులకు వరుస సెలవులు వస్తాయి. దీంతో సెలవుల్లో సరదాగా పర్యటనలకు వెళ్లడంతో పాటు బంధు,మిత్రులను కలిసేందుకు అమెరికా వాసులు ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు. దీంతో ప్రస్తుతం అక్కడి విమానాశ్రయాలన్నీ కిటకిటలాడుతుంటాయి. -
టిక్‌టాక్‌పై నిషేధం ఆపండి: ట్రంప్
వాషింగ్టన్:అమెరికాలో అధికారం చేతులు మారనున్న వేళ టిక్‌టాక్(TikTok) యాప్ నిషేధం వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్(Donald Trump) పదవీ బాధ్యతలు చేపట్టేవరకు టిక్‌టాక్‌పై నిషేధం విధించవద్దని ఆయన తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టును కోరారు.వచ్చే ఏడాది జనవరి 20న ట్రంప్ అధికార బాధ్యతలు చేపట్టనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టిక్‌టాక్‌పై నిషేధం కేసులో మరింత సమయం ఇవ్వాలని ట్రంప్ న్యాయవాదులు సుప్రీం కోర్టు(Supreme Court)ను కోరారు.దీనిపై రాజకీయ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వారు కోర్టుకు తెలియజేశారు. కాగా,యాప్ వినియోగదారుల డేటా సేకరిస్తున్నారనే ఆరోపణలతో భారత్ సహా పలు దేశాలు చైనాకు చెందిన టిక్‌టాక్‌పై ఇప్పటికే నిషేధం విధించాయి. గతంలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అమెరికాలో టిక్‌టాక్ నిషేధానికి ప్రయత్నాలు జరిగాయి. న్యాయపరమైన చిక్కుల వల్ల నిషేధం ఆచరణలోకి రాలేదు.అప్పట్లో ట్రంప్ టిక్‌టాక్ నిషేధానికి తీవ్రంగా ప్రయత్నించారు. జాతీయ భద్రతకు టిక్‌టాక్ పెద్ద ముప్పుగా పరిణమించిందని ఆరోపణలు చేశారు.ట్రంప్ తర్వాత అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ టిక్‌టాక్‌పై నిషేధంపై బిల్లు ప్రవేశపెట్టారు.నిషేధానికి మద్దతుగా 352 మంది ఓటు వేయగా 65 మంది వ్యతిరేకించారు.దీంతో బిల్లు ఆమోదం పొందింది. ఈ బిల్లుకు ట్రంప్ కూడా పరోక్షంగా మద్దతు పలికారు. అయితే,కొన్ని రోజుల తర్వాత అనూహ్యంగా ఆయన టిక్‌టాక్ వాడకం మొదలుపెట్టారు. దీంతో యాప్ నిషేధంపై తన నిర్ణయాన్ని మార్చుకుంటున్నట్లు ట్రంప్ వెల్లడించారు. ఇటీవల అధ్యక్ష ఎన్నికల ప్రచారంలోనూ టిక్‌టాక్ నిషేధంపై మాట మార్చారు. తాను అధికారంలోకి వస్తే టిక్‌టాక్‌ను నిషేధించబోనని స్పష్టం చేశారు. -
మన్మోహన్‌కు ప్రధాని,రాష్ట్రపతి నివాళి
మన్మోహన్సింగ్ పార్థివ దేహానికి ప్రధాని మోదీ నివాళులు..మన్మోహన్ సింగ్ ఇంటికి చేరుకున్న ప్రధాని మోదీమాజీ ప్రధాని పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించిన మోదీమన్మోహన్ సతీమణి గురుశరణ్‌కౌర్, కుటుంబ సభ్యులకు సంతాపంప్రధానితో పాటు మన్మోహన్ ఇంటికి వచ్చిన అమిత్ షా, జేపీ నడ్డా మన్మోహన్ పార్థివ దేహానికి రాష్ట్రపతి నివాళిమన్మోహన్సింగ్ పార్థివ దేహానికి రాషష్ట్రపతి ద్రౌపది ముర్ము నివాళిమన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపిన ముర్ము ఢిల్లీమన్మోహన్సింగ్ పార్థివ దేహానికి తెలంగాణ సీఎం రేవంత్ నివాళులుమన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నివాళులర్పించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిమన్మోహన్ సింగ్ భార్య గురుశరణ్ కౌర్‌ను, ,కుటుంబ సభ్యులను పరామర్శించిన రేవంత్ రెడ్డిమన్మోహన్ నివాసానికి కాంగ్రెస్ అగ్రనేతలుమన్మోహన్ ఇంటికి వచ్చిన సోనియాగాంధీ రాహుల్‌గాంధీ, మల్లికార్జునఖర్గే, ప్రియాంకగాంధీమన్మోహన్ పార్థివ దేహానికి నివాళులర్పించిన నేతలు వ్యక్తిగతంగా నాకు తీరనిలోటు: మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మన్మోహన్ లేని లోటు పూడ్చలేనిదిచాలా కాలం నుంచి మన్మోహన్ నాకు తెలుసుసభ్యతకు నిలువెత్తు రూపం మన్మోహన్సింగ్వీడియో విడుదల చేసిన మాజీ రాష్ట్రపతిఆ మాటే నిజమైంది: శశిథరూర్ మాజీ ప్రధాని మన్మోహన్ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తూ పోస్టు పెట్టిన శశిథరూర్చరిత్ర నా పట్ల దయతో ఉంటుందని 2014లో వ్యాఖ్యానించిన మన్మోహన్ఆయన చెప్పిన మాటలను గుర్తుచేస్తూ పోస్టు పెట్టిన కాంగ్రెస్ ఎంపీపదేళ్ల తర్వాత అదే నిజమైందని వ్యాఖ్యమన్మోహన్ దేశ సేవ..రాబోయే తరాలకు స్ఫూర్తి: సిక్కిం సీఎం తమాంగ్మన్మోహన్ మృతిపట్ల సంతాపం తెలిపిన సిక్కిం సీఎం ప్రేమ్‌సింగ్ తమాంగ్ఆర్థిక సంస్కరణలకు నాంది పలికి దేశాభివృద్ధికి గట్టి పునాది వేశారుదేశానికి మన్మోహన్ చేసిన సేవలు రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని వ్యాఖ్య మాజీ ప్రధాని మన్మోహన్ మృతి పట్ల అమెరికా సంతాపంగత రెండు దశాబ్దాల్లో అమెరికా,భారత్ సాధించిన మన్మోహన్ పునాది వేశారుఅమెరికా, భారత్ పౌర అణు సహకార ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మన్మోహన్ కీలక పాత్ర పోషించారుభారత్ వేగంగా అభివృద్ధి చెందడానికి ఆయన ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు ప్రజలకు గుర్తుండిపోతాయిప్రకటించిన అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ -
బిల్ క్లింటన్‌కు అస్వస్థత..ఆస్పత్రిలో చేరిక
వాషింగ్టన్:అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ అస్వస్థతకు గురయ్యారు.చికిత్స కోసం ఆయనను వాషింగ్టన్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ విషయాన్ని క్లింటన్ వ్యక్తిగత సిబ్బంది వెల్లడించారు.బిల్ క్లింటన్ జ్వరంతో బాధపడుతున్నట్లు అధికారులు తెలిపారు. క్లింటన్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందన్నారు. క్రిస్మస్ పండుగకు ఆయన ఇంటికి తిరిగి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.కాగా,అమెరికా అధ్యక్షుడిగా బిల్‌క్లింటన్ రెండు సార్లు (1993-2001) పనిచేశారు. 2001 తర్వాత వైట్‌హౌస్‌ను వీడిన ఆయన తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు.2004లో తీవ్ర ఛాతీ నొప్పి, శ్వాసకోస సమస్యలు రావడంతో ఆయనకు నాలుగుసార్లు బైపాస్ సర్జరీ చేశారు. ఏడాది తర్వాత ఊపిరితిత్తులు మళ్లీ దెబ్బతినడంతో తిరిగి ఆస్పత్రిలో చేర్పించారు.2010లో గుండె సంబంధిత సమస్య రావడంతో మరోసారి శస్త్రచికిత్స చేసి రెండు స్టెంట్లు అమర్చారు. తర్వాత కొద్ది రోజులకు ఆయన పూర్తిగా కోలుకున్నారు.ఇటీవల 2021లో మూత్రనాళ ఇన్ఫెక్షన్కు చికిత్స తీసుకున్నారు.నవంబర్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో డెమోక్రట్ల తరఫున ఆయన చురుకుగా ప్రచారం నిర్వహించారు. -
అమెరికా అండర్–19 క్రికెట్ జట్టు కెప్టెన్ అనిక రెడ్డి
బ్రూమ్‌ఫీల్డ్ (కొలరాడో): వచ్చే ఏడాది జనవరిలో మలేసియా వేదికగా జరిగే మహిళల అండర్–19 ప్రపంచకప్ టి20 క్రికెట్ టోర్నీలో పాల్గొనే అమెరికా జట్టును ప్రకటించారు. 15 మంది సభ్యులతో కూడిన అమెరికా జట్టుకు భారత సంతతికి చెందిన తెలుగమ్మాయి కొలన్ అనిక రెడ్డి కెప్టెన్‌గా వ్యవహరిస్తుంది. తెలుగు సంతతికి చెందిన పగిడ్యాల చేతన రెడ్డి, ఇమ్మడి శాన్వి, సషా వల్లభనేని కూడా అమెరికా జట్టు తరఫున బరిలోకి దిగనున్నారు. వచ్చే ఏడాది జనవరి 18 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు మలేసియాలోని నాలుగు వేదికల్లో ఈ మెగా ఈవెంట్ జరుగుతుంది. మొత్తం 16 జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. డిఫెండింగ్ చాంపియన్ భారత్, వెస్టిండీస్, శ్రీలంక, మలేసియా జట్లకు గ్రూప్ ‘ఎ’లో చోటు కల్పించారు. గ్రూప్ ‘బి’లో అమెరికా, ఇంగ్లండ్, పాకిస్తాన్, ఐర్లాండ్... గ్రూప్ ‘సి’లో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, నైజీరియా, సమోవా... గ్రూప్ ‘డి’లో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, నేపాల్, స్కాట్లాండ్ జట్లున్నాయి. అమెరికా అండర్–19 జట్టు: కొలన్ అనిక రెడ్డి (కెప్టెన్), అదితిబా చుదసమ (వైస్ కెప్టెన్), పగిడ్యాల చేతన రెడ్డి, చేతన ప్రసాద్, దిశ ఢింగ్రా, ఇసాని మహేశ్ వాఘేలా, లేఖ హనుమంత్ శెట్టి, మాహి మాధవన్, నిఖర్ పింకూ దోషి, పూజా గణేశ్, పూజా షా, రీతూప్రియా సింగ్, ఇమ్మడి శాన్వి, సషా వల్లభనేని, సుహాని థదాని. -
అమెరికాలో ‘చైనా’ కలకలం.. ఎంత పని చేసింది!
మన్హటన్: చైనా ప్రభుత్వం తరఫున అమెరికాలో నడిపే రహస్య పోలీస్‌స్టేషన్ ఒకటి మొట్టమొదటిసారిగా బయటపడింది. మన్‌హటన్‌లోని చైనాటౌన్‌లో 2022 నుంచి చెన్ జిన్‌పింగ్, లు జియన్వాంగ్ అనే వారు చైనా ప్రభుత్వం పబ్లిక్ సెక్యూరిటీ శాఖ తరఫున దీనిని నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. అదే ఏడాది ఫెడరల్ బ్యూరో అధికారులు దీనిని మూసివేయించారు. చెన్ జిన్‌పింగ్, లు జియాన్ వాంగ్లు తమ సెల్ఫోన్లలోని చైనా మంత్రిత్వ శాఖ మెసేజీలను పూర్తిగా డిలీట్ చేశారు.అమెరికా పౌరసత్వమున్న వీరిద్దరినీ గతేడాది ఏప్రిల్‌లో అధికారులు అరెస్ట్ చేశారు. ఈ నెల 18వ తేదీన కోర్టులో వీరిపై విచారణ పూర్తయింది. ఆరోపణలు రుజువని తేలితే వచ్చే ఏడాది వెలువడే తీర్పులో కోర్టు చెన్కు ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశముంది. లుపై విచారణ ఇంకా పూర్తి కాలేదు. కాలిఫోర్నియాలోని ప్రజాస్వామ్య అనుకూల వాదిని గుర్తించేందుకు చైనా ప్రభుత్వానికి సాయం చేయడంతోపాటు, పరారీలో ఉన్న నేరస్తుడిని అమెరికా నుంచి తిరిగి చైనా వెళ్లిపోవాలంటూ ఒత్తిడి చేయడం వంటి ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.తమ చెప్పుచేతల్లోకి తెచ్చుకునేందుకు..ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ దేశస్తులపై నిఘా పెంచి, వారిని తమ చెప్పుచేతల్లోకి తెచ్చుకునేందుకు చైనాలోని నియంతృత్వ కమ్యూనిస్ట్ ప్రభుత్వం దాదాపు 53 దేశాల్లో 100కు పైగా ఇటువంటి పోలీస్స్టేషన్లను నిర్వహిస్తోందని హక్కుల సంస్థలు ఆరోపిస్తున్న వేళ ఈ వ్యవహారం బయటపడటం గమనార్హం. అయితే, ఈ ఆరోపణలను చైనా ఖండిస్తోంది. విదేశాల్లోని తమ దేశస్తులకు పరిపాలనా సేవలను అందించే సర్వీస్ స్టేషన్లే తప్ప, ఇవి పోలీస్స్టేషన్లు కావని చెబుతోంది. మన్‌హటన్‌లోని చైనాటౌన్‌లో తాజాగా బయటపడిన పోలీస్ స్టేషన్ రామెన్ మాల్లోని ఓ ఫోర్ మొత్తం ఆక్రమించింది. ఇందులో చైనీయులకు పౌరసత్వ పొడిగింపు సేవలను అందిస్తున్నట్లు చెబుతున్నప్పటికీ, ఇక్కడి ప్రజాస్వామ్య అనుకూల చైనీయులను గుర్తించేందుకే వాడుతున్నట్లు అమెరికా న్యా య శాఖ ఆరోపిస్తోంది.చదవండి: పాకిస్తాన్‌కు షాకిచ్చిన అమెరికా..ఏమాత్రం సహించం‘ఈ అప్రకటిత విదేశీ పోలీసు స్టేషన్ అమెరికా సార్వభౌమాధికారానికి అవమానం, ప్రమాదకరం. దీనిని ఏమాత్రం సహించం’అని ఆ శాఖ అసిస్టెంట్ అటార్నీ జనరల్ మాథ్యూ ఓల్సెన్ స్పష్టం చేశారు. గతేడాది సెప్టెంబర్‌లో న్యూ యార్క్ గవర్నర్ కార్యాలయంలో పనిచేసే మాజీ ఉద్యోగిని లిండా సన్ చైనా ప్రభుత్వానికి ప్రయోజనం కలిగించేలా అధికారం దుర్వినియోగానికి పాల్పడినట్లు గుర్తించారు. అందుకామె ప్రతిఫలాలు అందుకున్నారని తేలింది. గతేడాది చైనా పబ్లిక్ సెక్యూరిటీ శాఖకు సాయం అందిస్తున్నట్లుగా 34 మంది అధికారులను గుర్తించి, కేసులు పెట్టారు. -
ట్రంప్ సరికొత్త లుక్.. నెట్టింట వైరల్
ఫ్లోరిడా: అమెరికాకు రెండోసారి అధ్యక్షుడిగా మరికొద్ది రోజుల్లో బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ సరికొత్త అవతారంలో అభిమానులను అలరించారు. ఫ్లోరిడాలోని తన పామ్ బీచ్ గోల్ఫ్ క్లబ్లో ట్రంప్ తాజాగా కొత్త అవతారంలో దర్శనమిచ్చారు. తెలుపు రంగు గోల్ఫ్ టీ షర్ట్, బ్లాక్ ప్యాంట్, చేతిలో ఎరుపు రంగు క్యాప్ పట్టుకుని సందర్శకులతో సరదాగా మాట్లాడుతున్న వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది.అయితే ఈ లుక్‌లో ట్రంప్‌లో కొత్త దనం ఏంటంటే మారిన ఆయన జుట్టు. ఎప్పుడూ కదులుతూ ఫ్రీగా ఉండే ఆయన జుట్టు స్టైల్ ఇప్పుడు పూర్తిగా మారింది. జుట్టు పైకి దువ్వి వెనక్కి సెట్ చేయడంతో ‘హ్యాట్ హెయిర్’ స్టైల్లోకి వచ్చేసింది.PRESIDENT DONALD J. TRUMP HAS A NEW HAIRSTYLE MAKEOVER pic.twitter.com/j4gXErl2KN— X Analyst (@topic_flow) December 18, 2024కాగా, ట్రంప్‌కు హష్మనీ కేసులో తాజాగా కోర్టులో ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. ఇప్పటికే దోషిత్వం రుజువైన కేసును అధ్యక్ష పదవి వచ్చినంత మాత్రానా కొట్టేయడం కుదరదని కోర్టు ఇటీవలే తేల్చి చెప్పడం గమనార్హం. -
అమెరికాలో భారీ భూకంపం
కాలిఫోర్నియా:అమెరికాలోని కాలిఫోర్నియా తీర ప్రాంతంలో అమెరికా కాలమానం ప్రకారం గురువారం(డిసెంబర్5) ఉదయం 10.44 గంటలకు భారీ భూకంపం వచ్చింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై ఏడుగా నమోదైంది. ఫెర్నడెల్ పట్టణంలో భూకంప కేంద్రం నమోదైంది. ఈ విషయాన్ని అమెరికా జియోగ్రఫికల్ సర్వే విభాగం వెల్లడించింది.తీర ప్రాంతంలో భారీ భూకంపం రావడంతో అమెరికా సునామీ కేంద్రం ముందస్తు చర్యగా సునామీ హెచ్చరికలు జారీ చేసింది. భూకంప ప్రభావంతో పెట్రోలియా, స్కాటియా, కాబ్ తదితర ప్రాంతాల్లో శక్తిమంతమైన ప్రకంపనలు నమోదయ్యాయి.Shocking Footage of California's 7.0 Mega Quake Captured on Cam!Mother Earth just showed off her raw power with a 7.0 shaker in Cali, and folks, it's all on camera! From swimming pools doing the wave to dogs sensing the rumble before humans, this earthquake video is the talk of… pic.twitter.com/j2hHVBj7JL— 𝕏VN (@xveritasnow) December 5, 2024ఉత్తర దిశలో వచ్చన భూ ప్రకంపనలు దక్షిణ ప్రాంతంలోని శాన్ఫ్రాన్సిస్కో దాకా వచ్చాయంటే తీవ్రత అర్థం చేసుకోవచ్చు.భూకంపం వల్ల భవనాల్లోని ప్రజలు కొంత సేపు అటుఇటు ఊగిపోయారు. భూకంపం ముగిసిన తర్వాత కూడా అనంతర ప్రకంపనలు వచ్చాయి. భూకంపం ధాటికి ప్రాణ,ఆస్తి నష్టాలు ఏమైనా సంభవించాయా అనేది తెలియాల్సి ఉంది. -
హిందువులపై దాడులు..బంగ్లాదేశ్‌కు అమెరికా కీలక సూచన
వాషింగ్టన్:బంగ్లాదేశ్‌లో జరుగుతున్న ఆందోళకర పరిణామాలపై అగ్రదేశం అమెరికా స్పందించింది. పౌరుల ప్రాథమిక స్వేచ్ఛకు భంగం కలిగించొద్దని బంగ్లాదేశ్ ప్రభుత్వానికి అమెరికా సూచించింది. బంగ్లాదేశ్‌లో మైనారిటీలుగా ఉన్న హిందువులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో దేశంలో మత,ప్రాథమిక,మానవ హక్కులను గౌరవించాలని అక్కడి మధ్యంతర ప్రభుత్వాన్ని అమెరికా కోరింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ మంగళవారం(డిసెంబర్4) మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వాలన్నీ చట్టాలను గౌరవించాల్సిందేనన్నారు. నిర్బంధంలో ఉన్నవారికి కూడా ప్రాథమిక స్వేచ్ఛనిస్తూ వారి మానవ హక్కులకు భంగం కలగకుండా చూడాలని పటేల్ కోరారు.కాగా, బంగ్లాదేశ్‌లో షేక్‌హసీనా ప్రభుత్వం పడిపోయి మధ్యంతర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్కడ మైనారిటీలుగా ఉన్న హిందువులపై దాడులు మొదలైన విషయం తెలిసిందే. ఇటీవల హిందు మతానికి చెందిన చిన్మయ్ కృష్ణదాస్‌ను కూడా అక్కడి ప్రభుత్వం అరెస్టు చేసింది. చిన్మయ్ తరపున కేసు వాదించేందుకు వచ్చిన న్యాయవాదిపైనా దాడి జరగడం బంగ్లాదేశ్‌లో దిగజారిన పరిస్థితులను తెలియజేస్తోంది. -
అమెరికా కీలక నిర్ణయం.. టార్గెట్ రష్యా..!
వాషింగ్టన్: కొన్నిరోజుల్లో అధ్యక్ష పదవీకాలం ముగియనుందనగా అమెరికా అధ్యక్షుడు బైడెన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ట్రంప్ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో ముందుగానే ఊహించి ప్రాధాన్యమున్న పనులన్నీ చకచకా చక్కబెట్టుకుంటున్నారు.ఈ క్రమంలోనే రష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్‌కు రూ.6వేల కోట్ల భారీ మిలిటరీ ప్యాకేజీ ప్రకటించారు. ఈ ప్యాకేజీలో భాగంగా ల్యాండ్ మైన్లు,యాంటీ ఆర్మర్ వెపన్లను అమెరికా ఉక్రెయిన్‌కు సమకూర్చనుంది.భవిష్యత్తులో ఉక్రెయిన్‌కు ఇలాంటి సహాయం అందకపోవచ్చనే ఆలోచనతో హుటాహుటిన ప్యాకేజీ అందిస్తున్నట్లు తెలుస్తోంది.రష్యా దాడులను అడ్డుకొని,ఉక్రెయిన్ ఆత్మరక్షణ సామర్థ్యాన్ని మెరుగుపరచుకునేలా ప్యాకేజీ ఇస్తున్నామని అమెరికా విదేశాంగశాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ వెల్లడించారు. -
వియ్యంకుడికి ట్రంప్ కీలక పదవి
ఫ్లోరిడా:రెండోసారి అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్న ట్రంప్ తన టీమ్‌లో ఒక్కొక్కరిని నియమించుకుంటున్నారు. ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా కశ్యప్పటేల్గా నామినేట్ చేసిన మరుసటి రోజే తన ప్రభుత్వానికి పశ్చిమాసియా వ్యవహారాల్లో సలహాదారుగా మసాద్ బౌలోస్‌ను ట్రంప్ నియమించుకున్నారు.అరబ్,మిడిల్ఈస్ట్ వ్యవహారాల్లో అధ్యక్షుడికి సీనియర్ సలహాదారుగా మసాద్ సేవలందిస్తారని తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫాం ద్వారా ట్రంప్ వెల్లడించారు. లెబనీస్-అమెరికా వ్యాపారవేత్త అయిన మసాద్ ట్రంప్ కుమార్తె టిఫానీకి మామ,ట్రంప్‌కు వియ్యంకుడు కావడం గమనార్హం.గాజాపై ఇజ్రాయెల్ దాడుల అంశంపై అసంతృప్తిగా ఉన్న అరబ్ అమెరికన్ ఓటర్లను ఇటీవలి అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ వైపునకు మళ్లించడంలో మసాద్ కీలకంగా పనిచేశారు.జనవరి 20న ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేయనున్నారు. -
కుమారుడికి ఊరట.. బైడెన్ సంచలన నిర్ణయం
వాషింగ్టన్:అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన పదవీ కాలం మరో రెండు నెలల్లో ముగియనుందనగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. అక్రమంగా తుపాకీ కొనుగోలు,ట్యాక్స్ అక్రమాల కేసుల్లో తన కుమారుడు హంటర్ బైడెన్‌కు క్షమాభిక్ష ప్రసాదించారు.హంటర్‌కు క్షమాభిక్ష ఇవ్వబోనని అతడు దోషిగా తేలిన సందర్భంలో స్పష్టంగా పేర్కొన్న బైడెన్ ఇప్పుడు మాట మార్చడం గమనార్హం. అక్రమంగా తుపాకీ కొనుగోలు,ఆదాయపు పన్ను విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చారని డెలావెర్,కాలిఫోర్నియాలో హంటర్‌పై నమోదైన కేసుల్లో అతడికి ఇప్పటికే కోర్టులు శిక్ష విధించాయి.ఒక తండ్రిగా,అధ్యక్షుడిగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నానో అమెరికా ప్రజలు అర్థం చేసుకుంటారని భావిస్తున్నానని బైడెన్ తన నిర్ణయంపై వివరణ ఇచ్చారు. కాగా,ఇటీవల అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ట్రంప్ జనవరి 20న రెండోసారి అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. -
కెనడా నుంచి అమెరికాలోకి.. చొరబాటుదారుల్లో ఇండియన్సే ఎక్కువ
వాషింగ్టన్:కెనడా సరిహద్దు ద్వారా అక్రమంగా అమెరికాలోకి చొరబడేందుకు ప్రయత్నించి పట్టుబడుతున్న భారతీయుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. 2023-24లో కెనడా సరిహద్దు నుంచి అమెరికాలోకి చొరబడేందుకు యత్నించిన వారిలో 23 శాతం మంది భారతీయులే కావడం గమనార్హం.అక్రమ చొరబాట్ల సమస్య అమెరికా,కెనడాల మధ్య ప్రస్తుతం దౌత్యపరమైన సమస్యగా మారిందంటే తీవ్రత అర్థం చేసుకోవచ్చు.అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్(యూఎస్సీబీపీ) లెక్కల ప్రకారం 2022లో కెనడా నుంచి అమెరికాలోకి అక్రమంగా చొరబడేందుకు 1లక్షా9వేల535 మంది యత్నించగా ఇందులో 16 శాతం మంది భారతీయులే.2023-24లో మాత్రం ఈ సంఖ్య గణనీయంగా పెరిగి కెనడా నుంచి అమెరికాలోకి చొరబడేందుకు ప్రయత్నించిన భారతీయుల సంఖ్య ఏకంగా 47వేలకు చేరింది. ట్రంప్ రెండోసారి అధ్యక్షునిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఈ చొరబాట్లపై ఎలా స్పందిస్తారనేది ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. -
అమెరికాలో కాల్పులు.. ఖమ్మం యువకుడి మృతి
సాక్షి,ఖమ్మంజిల్లా: తెలంగాణకు చెందిన యువకుడిపై అమెరికాలో దుండగులు తుపాకీతో కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఖమ్మం రూరల్ మండలం రామన్నపేటకు చెందిన నూకారపు సాయితేజ అక్కడికక్కడే మృతిచెందాడు.సాయితేజ అమెరికాకు ఎమ్మెస్ చేయడానికి వెళ్లాడు. సాయితేజ మృతితో రామన్నపేటలో విషాదం నెలకొంది. మృతదేహాన్ని ఖమ్మం తీసుకురావడానికి అధికారులు కృషి చేస్తున్నారు. -
అమెరికా విద్యలో భారత్ హవా
సాక్షి, అమరావతి: అమెరికా విద్యా సంస్థల్లో అంతర్జాతీయ విద్యార్థుల చేరికల్లో భారత్ అగ్రస్థానంలో నిలుస్తోంది. దాదాపు దశాబ్దంన్నర తర్వాత అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య గరిష్టస్థాయికి చేరుకుంది. 2023–24లో అంతర్జాతీయ విద్యార్థుల ప్రవేశాల్లో భారత్ వాటా 29 శాతంగా ఉన్నట్లు యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ ఓపెన్ డోర్స్ 2024 నివేదిక వెల్లడించింది. గత విద్యా సంవత్సరం 3.31 లక్షల మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో చదువుల కోసం వెళ్లారు. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఇది 23 శాతం అధికం. 2023–24లో అంతర్జాతీయ విద్యార్థుల ద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థకు రూ.4.22 లక్షల కోట్లు సమకూరగా ఇందులో భారత్ వాటా 20 శాతంగా ఉంది.డ్రాగన్‌ను దాటేశాం..!అమెరికా వర్సిటీలు, కళాశాలల్లో అంతర్జాతీయ విద్యార్థుల చేరికల్లో చైనాను భారత్ అధిగవిుంచింది. చైనా విద్యార్థుల సంఖ్య 2022–23లో 27.4 శాతం ఉండగా 2023–24లో 24.6 శాతానికి పడిపోయింది. 15 ఏళ్లలో ఇదే తక్కువ. గత విద్యా సంవత్సరం అమెరికాలో 11.26 లక్షల మంది అంతర్జాతీయ విద్య అభ్యసిస్తున్నట్టు నివేదిక తెలిపింది. ఇది ఆల్‌టైమ్ రికార్డుగా పేర్కొంది. ఇందులో అగ్రస్థానంలో భారతీయ విద్యార్థులు (3.31 లక్షలు) ఉండగా 2.77 లక్షలతో చైనా విద్యార్థులు, 43,149 మందితో సౌత్ కొరియా విద్యార్థులు తరువాత స్థానాల్లో నిలిచారు. 64.5 శాతం మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో పబ్లిక్ వర్సిటీలను ఎంచుకుంటున్నారు. 35.5 శాతం మంది స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్స్, పరిశోధనల కోసం ప్రైవేట్ వర్సిటీలకు వెళ్తున్నారు. ఈ ఏడాది 3 శాతం పెరుగుదల..ప్రస్తుత విద్యా సంవత్సరంలో అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థుల చేరికలు మూడు శాతం పెరిగినట్లు స్నాప్‌చాట్ నివేదిక చెబుతోంది. యూఎస్‌లోని చాలా విద్యా సంస్థలు గ్రాడ్యుయేట్ విద్యలో ప్రవేశాలను పెంచుకునేందుకు భారత్, చైనా, ఘనా, నైజీరియాలపై దృష్టి పెట్టినట్టు తెలిపింది. 2022–23లో అమెరికాకు చెందిన 2.80 లక్షల మంది విద్యార్థులు ఇతర దేశాల్లో విద్యనభ్యసించారు. ఇటలీ, యూకే, స్పెయిన్, ఫ్రాన్స్ వారి ప్రధాన గమ్యస్థానాలుగా (45 శాతం) ఉన్నాయి. ఆ తర్వాత ఆస్ట్ర్రేలియా, న్యూజిలాండ్ (25 శాతం)లో ఎక్కువగా చేరికలున్నాయి. స్టెమ్ కోర్సులపై దృష్టి..భారతీయ విద్యార్థులకు అమెరికాలో అత్యంత ప్రాధాన్య విద్యా గమ్యస్థానాలుగా కాలిఫోరి్నయా, న్యూయార్క్, టెక్సాస్, మసాచుసెట్స్, ఇల్లినాయిస్ నిలిచాయి. అంతర్జాతీయ విద్యార్థులలో 56 శాతం మంది స్టెమ్ కోర్సులను అభ్యసించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్‌లో ఎక్కువగా ప్రవేశాలు పొందుతున్నారు. బిజినెస్ మేనేజ్మెంట్ ప్రవేశాల్లో 2 శాతం, ఫైన్, అప్లైడ్ ఆర్ట్స్‌లో 5 శాతం పెరుగుదల నమోదైంది. గ్లోబల్ డెస్టినేషన్..2014 నుంచి అంతర్జాతీయ విద్యార్థుల గ్లోబల్ డెస్టినేషన్‌గా అమెరికా కొనసాగుతోంది. కెనడా, యూకే తరువాత వరుసలో ఉన్నాయి. యూకేలో మొత్తం విద్యార్థుల్లో అంతర్జాతీయ విద్యార్థులు 27 శాతం, కెనడాలో 38 శాతం, ఆస్ట్రేలియాలో 31 శాతం ఉన్నారు. మరోవైపు భారత్‌ను అధ్యయన కేంద్రంగా ఎంచుకున్న అమెరికా విద్యార్థుల్లో 300 శాతం పెరుగుదల కనిపించింది. 2022–23లో భారత్‌లో చదువుతున్న అమెరికన్ల సంఖ్య 300 నుంచి 1,300కి పెరిగింది. -
బ్లాక్ ఫ్రైడే ఆఫర్స్ అదుర్స్
అమెరికాలో అత్యంత ప్రజాదరణ పొందిన బ్లాక్ ఫ్రైడే సేల్స్ సంస్కృతి ఇప్పుడు భారతదేశ మార్కెట్లోకి ప్రవేశించింది. దసరా–దీపావళి డిస్కౌంట్ సేల్స్‌కు దీటుగా ఈసారి రిటైల్ సంస్థలు బ్లాక్ ఫ్రైడే సేల్స్‌లో భారీ డిస్కౌంట్స్‌ను ఆఫర్ చేస్తున్నాయి. ఈ నెల 29 నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు జరిగే ఈ బ్లాక్ ఫ్రైడే సేల్స్‌లో పలు ఉత్పత్తులపై ఏకంగా 50 నుంచి 80 శాతం వరకు డిస్కౌంట్స్‌ను ఇస్తున్నాయి. ఎయిర్ ఇండియా, ఐఆర్టీసీ దగ్గర నుంచి ఆన్లైన్ రిటైల్ సంస్థలు, గృహోపకరణాల సంస్థలు ఈ బ్లాక్ ఫ్రైడే సేల్స్ సందర్భంగా ప్రత్యేక రాయితీలు ప్రకటించాయి. ఈ నెల 29 నుంచి డిసెంబర్ 2వ తేదీలోపు విమాన టికెట్లు బుక్ చేసుకున్న వారికి ఎయిర్ ఇండియా 12 నుంచి 20 శాతం డిస్కౌంట్‌ను అందిస్తోంది. అంతర్జాతీయ ప్రయాణ టికెట్ చార్జీలపై 12 శాతం, దేశీయ టికెట్ చార్జీలపై 20 శాతం డిస్కౌంట్‌ను ఇస్తోంది. ఐఆర్టీసీ అయితే ఈ ఆఫర్ సమయంలో కన్వేనియన్స్ ఫీజులను తొలగించడంతోపాటు ఉచిత బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించింది. – సాక్షి, అమరావతి బ్లాక్ ఫ్రైడే సేల్స్ అంటే..» అమెరికాలో రైతులు తమ పంటల దిగుబడి పూర్తయినందుకు సంతోషంగా ప్రతి ఏడాది నవంబర్ నాలుగో గురువారం ‘థ్యాంక్స్ గివింగ్’ పేరిట పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆ రోజు ఆమెరికాలో జాతీయ సెలవు దినం. » ‘థాంక్స్ గివింగ్ డే’ మరుసటి రోజు వచ్చే శుక్రవారాన్ని ‘బ్లాక్ ఫ్రైడే సేల్స్’ పేరుతో షాపింగ్ కోసం కేటాయిస్తారు.» డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ పర్వదినాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యాపార సంస్థలు బ్లాక్ ఫ్రైడే సేల్స్‌లో భారీ డిస్కౌంట్స్‌ను ప్రకటిస్తాయి. » అమెరికాలో అత్యధికంగా అమ్మకాలు జరిగేది ఈ బ్లాక్ ఫ్రైడే సేల్స్‌లోనే. » ఇప్పుడు ఈ సంస్కృతి నెమ్మదిగా మన దేశంలోకి కూడా విస్తరించింది.ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్స్ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, గృహోపకరణాలపై అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్ డిజిటల్, మింత్రా వంటి ఈ–కామర్స్ దిగ్గజ సంస్థలు భారీ డిస్కౌంట్స్‌ను ప్రకటిస్తున్నాయి. అంతేకాకుండా శామ్సంగ్, షియోమీ, సోనీ, హెచ్‌పీ వంటి సంస్థలు కూడా డిస్కౌంట్ ఆఫర్స్‌ను ప్రకటించాయి. సామ్సంగ్ తన గెలాక్సీ ఫోన్లపై రూ.12,000 వరకు, రెడ్మీ అయితే రూ.15,000 వరకు డిస్కౌంట్లను అందిస్తున్నాయి. కొన్ని సంస్థలు ఎంపిక చేసిన బ్యాంకుల కార్డుల ద్వారా లావాదేవీలు నిర్వహిస్తే అదనపు తగ్గింపును వర్తింపజేస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది బ్లాక్ ఫ్రైడే అమ్మకాలు 35 నుంచి 40శాతం వరకు పెరుగుతాయని ఈ–కామర్స్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. డిసెంబర్ 2న ‘సైబర్ మండే’తో ఈ డిస్కౌంట్ అమ్మకాలు ముగుస్తాయి. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. అమెరికాలో ప్రభాకర్‌రావు పిటిషన్
సాక్షి,హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు కొత్త మలుపు తిరిగింది. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు తెలంగాణ ప్రభుత్వానికి షాకిచ్చారు. ప్రస్తుతం ప్రభాకర్‌రావు అమెరికాలో ఉన్న విషయం తెలిసిందే. తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలని అమెరికా ప్రభుత్వానికి ప్రభాకర్ రావు తాజాగా పిటిషన్ పెట్టుకున్నారు.ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ ప్రభుత్వం తనను ఇబ్బంది పెడుతోందని పిటిషన్లో ప్రభాకర్‌రావు పేర్కొన్నారు.తెలంగాణ ప్రభుత్వంలో తాను కీలక స్థానంలో పనిచేశానని తెలిపారు. రాజకీయంగా తనను వేధిస్తున్నారని ఆరోపించారు. తాను తీవ్ర అనారోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నానని ప్రభాకర్‌రావు పేర్కొన్నారు.ప్రస్తుతం తాను ఫ్లోరిడాలోని కుమారుని వద్ద ఉంటున్నానని తెలిపారు.కాగా,మరో వైపు అమెరికాలో తలదాచుకుంటున్న ప్రభాకర్‌రావును ఇండియాకు రప్పించేందుకు తెలంగాణ పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.ఇంటర్ పోల్ ద్వారా ప్రభాకర్‌రావుకు రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయించేందుకు పోలీసులు గట్టిగా ప్రయత్నిస్తున్నారు.ఈ కేసులో మరో నిందితుడు, టీవీఛానల్ ఎండి శ్రవణ్ రావు అమెరికాలోని చికాగోలో ఉంటున్నట్లు పోలీసులు కనిపెట్టారు. -
15 ఏళ్ల వేట.. చివరకు చిక్కిన మోస్ట్‌వాంటెడ్
వాషింగ్టన్: అమెరికా మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న నేరస్తుడిని బ్రిటన్‌లో అరెస్టు చేశారు. 2009లో కాలిఫోర్నియా బయోటెక్నాలజీ సంస్థపై జరిగిన బాంబు దాడి ఘటనలో డేనియల్ ఆండ్రియాస్ ప్రధాన అనుమానితుడు. అమెరికాలో అప్పట్లో అతన్ని మోస్ట్ వాంటెడ్ నేరగాళ్ల లిస్టులో చేర్చారు.బాంబు దాడి తర్వాత పరారీలో ఉన్న డేనియల్ను బ్రిటన్‌లోని వేల్స్లో అరెస్టు చేసినట్లు ఎఫ్‌బీఐ ప్రకటించింది.బ్రిటన్ పోలీసులు,ఎఫ్‌బీఐ సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో డేనియల్ను అరెస్టు చేసినట్లు ఎఫ్‌బీఐ వెల్లడించింది.డేనియల్ 2009 నుంచి పరారీలో ఉన్నా తాము అతడిని వెంబడించడం ఆపలేదని ఎఫ్‌బీఐ డైరెక్టర్ క్రిస్టోఫర్ వ్రే తెలిపారు.2009కు ముందు కూడా డేనియల్ పలు హింసాత్మక ఘటనలకు కారణమయ్యాడన్నఅభియోగాలుండడంతో అతడిని మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చారు. -
ట్రంప్ టీమ్‌లోకి మరో భారతీయుడు..ఎన్ఐహెచ్ హెడ్‌గా భట్టాచార్య
వాషింగ్టన్:రెండోసారి అమెరికా అధ్యక్ష పదవి చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ తన టీమ్‌లో వరుసగా ఒక్కొక్కరిని నియమిస్తున్నారు. తాజాగా అమెరికా హెల్త్‌సైన్సెస్ పరిశోధనలకు కీలకమైన నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్(ఎన్ఐహెచ్) డైరెక్టర్‌గా భారతీయుడైన డాక్టర్ జే భట్టాచార్యను నియమించారు. అమెరికాలో మెడికల్ సైన్సెస్‌లో కీలక పరిశోధనలు చేసే మొత్తం 27 సంస్థలకు ఎన్ఐహెచ్ నుంచే నిధులు కేటాయిస్తారు. ఎన్ఐహెచ్ ఏడాది బడ్జెట్ రూ. 4 లక్షల కోట్ల దాకా ఉంటుందంటే దాని ప్రాముఖ్యత అర్థం చేసుకోవచ్చు. భట్టాచార్య ప్రస్తుతం స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ మెడికల్ సైన్సెస్ ప్రొఫెసర్‌గా ఉన్నారు.భట్టాచార్య 1968లో కోల్‌కతాలో జన్మించి అమెరికా వెళ్లారు. కొవిడ్ సమయంలో జో బైడెన్ ప్రభుత్వ పాలసీని తీవ్రంగా విమర్శించిన భట్టాచార్య రిపబ్లికన్లకు దగ్గరయ్యారు. కాగా,ఇటీవలే ట్రంప్ ప్రభుత్వంలో ఆరోగ్య మంత్రిగా ఆర్ఎఫ్కెన్నెడీ జూనియర్ నియమితులైన విషయం తెలిసిందే.ఇప్పటికే భారత సంతతి వ్యాపారవేత్త వివేక్‌రామస్వామి ట్రంప్ టీమ్‌లో ఇలాన్ మస్క్‌తో పాటు డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ(డీవోజీఈ) హెడ్ పదవికి ఎంపికైన విషయం తెలిసిందే. -
ట్రాన్స్జెండర్లకు ట్రంప్ షాక్..!
వాషింగ్టన్:అమెరికా రెండోసారి అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత ట్రంప్ కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వీటిలో భాగంగా అమెరికా ఆర్మీలో ఉన్న ట్రాన్స్జెండర్లను ట్రంప్ పూర్తిగా తొలగించనున్నట్లు ది సండే టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. ప్రమాణస్వీకారం తర్వాత ట్రంప్ ట్రాన్స్జెండర్లను తొలగించే ఫైల్‌పై సంతకం చేయనున్నట్లు తెలిపింది. ఓ వైపు ఆర్మీలోకి కొత్తవారి నియామకం అంతగా లేని ప్రస్తుత సమయంలో ట్రంప్ ట్రాన్స్జెండర్లను తొలగించనుండడం చర్చనీయాంశమవుతోంది. ట్రాన్స్జెండర్లు ఆధునిక ఆర్మీ అవసరాలకు తగినట్లుగా సేవలందించడం లేదని ట్రంప్ నిర్ణయాన్ని సమర్థించే వారు చెబుతున్నారు. ఈ మేరకు వారు సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే ఆర్మీ నుంచి తొలగించే ముందు ట్రాన్స్జెండర్లకు అన్ని గౌరవాలు ఇచ్చి పంపిస్తారని తెలుస్తోంది.ట్రంప్ తన తొలిటర్ములో కూడా ఇలాంటి వివాదాస్పద నిర్ణయమే తీసుకున్నారు. అయితే ట్రాన్స్ జెండర్లను ఆర్మీలోకి తీసుకోవడాన్ని మాత్రమే ట్రంప్ నిషేధించారు. అప్పటికే ఉన్నవారిని కొనసాగించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలను బైడెన్ అధికారం చేపట్టిన తర్వాత రద్దు చేశారు. కాగా, నవంబర్ 5న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ తిరిగి అధ్యక్షుడిగా ఎన్నికైన విషయం తెలిసిందే. -
లండన్‌లో హై అలర్ట్.. అమెరికా ఎంబసీ ముందు పార్సిల్ కలకలం
లండన్:బ్రిటన్ రాజధాని లండన్‌లో హైఅలర్ట్ పరిస్థితి ఏర్పడింది. శుక్రవారం (నవంబర్22) నగరంలో అమెరికా ఎంబసీ కార్యాలయం బయట ఒక అనుమానాస్పద ప్యాకేజీ కలకలం సృష్టించింది. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు ద్వారా ప్యాకేజ్‌ను నిర్వీర్యం చేశారు. ఆ ప్యాకేజీ ఎక్కడినుంచి వచ్చిందనేదానిపై లండన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని అమెరికా ఎంబసీ వెల్లడించింది.మరోవైపు గాట్విక్ ఎయిర్‌పోర్టులో భద్రతాపరమైన ఘటన ఇంకొకటి జరిగింది.దీంతో ఎయిర్‌పోర్టు దక్షిణ టెర్మినల్‌ను ఖాళీ చేయించామని అధికారులు తెలిపారు. ఇదిలాఉంటే రష్యా- ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం నేపథ్యంలో మాస్కో, అమెరికాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి.ఈ క్రమంలోనే అమెరికాలోని డిఫెన్స్ కంపెనీలపై రష్యా దాడులు చేసే అవకాశముందని ఆ దేశ ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి.ఈ మేరకు నేషనల్ కౌంటర్ ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ సెంటర్ ఓ ప్రకటనను విడుదల చేసింది. -
ఉక్రెయిన్ను రష్యా ఏం చేయబోతోంది.? ఖాళీ అవుతున్న ఎంబసీలు
కీవ్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఏ మలుపు తిరుగుతుందోనని ప్రపంచ దేశాల్లో భయాందోళనలు మొదలయ్యాయి. ఉక్రెయిన్‌పై రష్యా మున్ముందు ఎలాంటి దాడులు చేస్తుందోనని పలు దేశాలు అప్రమత్తమవుతున్నాయి.ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో రాయబార కార్యాలయాన్ని మూసేసిన అమెరికా బాటలోనే పలు దేశాలు కూడా నడుస్తున్నాయి.ఇటలీ ,గ్రీస్,స్పెయిన్లు కూడా కీవ్‌లోని తమ ఎంబసీలను తాత్కాలికంగా మూసివేసినట్లు తెలుస్తోంది. కీవ్‌లోని తమ ఎంబసీపై రష్యా భారీ వైమానిక దాడులకు పాల్పడే అవకాశం ఉందనే సమాచారం అందడంతో వెంటనే దానిని అమెరికా తాత్కాలికంగా మూసివేసింది. నవంబర్ 20న దాడి జరగబోతోందని తమకు అందిన కచ్చితమైన సమాచారంతోనే ఎంబసీ ఖాళీ చేసినట్లు అమెరికా వెల్లడించింది. ఈ క్రమంలోనే ఇటలీ, గ్రీస్, స్పెయిన్లు తమ ఎంబసీలను తాత్కాలికంగా మూసివేశాయి.కాగా,రష్యా అణ్వాయుధాల వినియోగానికి అనుమతించే నిబంధనలను మరింత సరళతరం చేసే కీలక ఫైల్‌పై రష్యా అధ్యక్షుడు పుతిన్ తాజాగా సంతకం చేసిన సంగతి తెలిసిందే.అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశం సాయంతో ఏ దేశమైనా తమపై దాడి చేస్తే దాన్ని సంయుక్త దాడిగానే రష్యా పరిగణించనుంది. -
టెన్షన్..టెన్షన్: హాట్‌లైన్‌పై రష్యా సంచలన ప్రకటన
మాస్కో:అమెరికా-రష్యా మధ్య అత్యవసర కమ్యూనికేషన్‌కు కీలకమైన హాట్‌లైన్ వ్యవస్థ ఇప్పుడు అందుబాటులో లేదని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ వెల్లడించారు. అమెరికా,రష్యాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తితే రెండు దేశాల అధ్యక్షులు చర్చించేందుకు ఓ సురక్షితమైన కమ్యూనికేషన్ వ్యవస్థ ఉందని,ఇది వీడియో కూడా ప్రసారం చేయగలదని పెస్కోవ్ గతంలో చెప్పారు.అయితే ప్రస్తుతం ఇది వినియోగంలో లేదని తాజాగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు పెస్కోవ్ సమాధానమిచ్చారు. కాగా,రష్యాపై అమెరికా తయారీ లాంగ్రేంజ్ మిసైల్స్ వాడేందుకు ఉక్రెయిన్‌కు అమెరికా అధ్యక్షుడు బైడెన్ అనుమతివ్వడంతో యూరప్‌లో ఉద్రిక్తతలు పెరిగాయి.దీనికి ప్రతిగా అణ్వాయుధాల ప్రయోగంపై నిబంధనలను రష్యా సరళతరం చేసింది.ఈ పరిణామాల నడుమ మంగళవారం(నవంబర్ 19) కీవ్ దళాలు రష్యా ప్రధాన భూభాగంపై క్షిపణులతో దాడులు చేశాయి.ఇందుకు ప్రతీకారంగా ఉక్రెయిన్‌పై మాస్కో దళాలు దాడి చేయవచ్చనే భయాలు పెరిగిపోయాయి. దీంతో ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని తన దౌత్య కార్యాలయాన్ని అమెరికా ఖాళీ చేసింది.ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా,రష్యా మధ్య హాట్‌లైన్ వాడకంలో లేదన్న వార్త మరింత భయాందోళనలకు కారణమవుతోంది. -
అమెరికాలో అన్మోల్ బిష్ణోయ్ అరెస్టు.. భారత్‌కు అప్పగించేది అప్పుడే..
కాలిఫోర్నియా/ముంబయి:గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తమ్ముడు అన్మోల్ బిష్ణోయ్ అమెరికాలో అరెస్టైనట్లు సమాచారం. సోమవారం(నవంబర్ 18) తెల్లవారుజామున అన్మోల్ను కాలిఫోర్నియాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.తొలుత అమెరికా పోలీసులు అన్మోల్ను విచారించిన తర్వాత ఖలిస్తానీ తీవ్రవాది హర్దీప్సింగ్నిజ్జర్ హత్య కేసులో కెనడా పోలీసులకు అప్పగించే అవకాశం ఉందని ముంబై క్రైమ్‌బ్రాంచ్ పోలీసులు చెబుతున్నారు. తర్వాతే భారత్‌కు అన్మోల్ను అప్పగిస్తారని ముంబై పోలీసులు భావిస్తున్నారు. గతేడాది తన అన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్‌బిష్ణోయ్ అరెస్టయిన తర్వాత అన్మోల్ భారత్ వదిలి అమెరికా పారిపోయాడు. బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ ఇంటి బయట కాల్పుల ఘటనతో పాటు పంజాబ్ సింగర్ సిద్ధు మూసేవాలా హత్య సహా పలు కేసుల్లో అన్మోల్ నిందితుడిగా ఉన్నాడు.ఇతడి సూచనల మేరకే ఇటీవల ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీని హత్య చేసినట్లు పట్టుబడ్డ నిందితులు వెల్లడించిన విషయం తెలిసిందే. అన్మోల్కు సంబంధించిన సమాచారమిస్తే రూ.10 లక్షలిస్తామని పోలీసులు ఇప్పటికే ప్రకటించారు. -
పోలీస్ వర్సెస్ ప్రభాకర్‌రావు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) కేంద్రంగా జరిగిన అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడైన ఆ విభాగం మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావును అమెరికా నుంచి రప్పించడానికి పోలీసులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. వాటిని తిప్పికొట్టడానికి ప్రభాకర్‌రావు కూడా అక్కడి నుంచే పావులు కదుపుతున్నారు. దీనితో పోలీసులు వెర్సస్ ప్రభాకర్‌రావు అన్నట్టుగా మారింది. పరిణామాలను గమనించి అమెరికా వెళ్లిపోయి.. ఎస్ఐబీకి సుదీర్ఘకాలం నేతృత్వం వహించిన టి.ప్రభాకర్‌రావు గత ఏడాది డిసెంబర్ 4న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూసిన వెంటనే రాజీనామా చేశారు. అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు, తర్వాతి పరిణామాలను గమనించిన ఆయన... ఈ ఏడాది మార్చిలో తిరుపతి వెళ్లి, అటు నుంచే చెన్నై మీదుగా అమెరికా వెళ్లిపోయారు. ప్రస్తుతం అక్కడి టెక్సాస్‌లో ఉండి, వైద్యం చేయించుకుంటున్నట్టు తెలుస్తోంది.ప్రభాకర్‌రావు తనపై అరెస్టు వారెంట్ జారీ చేయవద్దంటూ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన సమయంలో... తాను వైద్యం కోసం అమెరికా వచ్చానని, షెడ్యూల్ ప్రకారం జూన్ 26న తిరిగి వస్తానని వివరణ ఇచ్చారు. జూలైలో ఈ–మెయిల్ ద్వారా దర్యాప్తు అధికారికి లేఖ రాసిన ఆయన... తనపై తప్పుడు కేసు, నిరాధార ఆరోపణలతో ఏర్పడిన మానసిక వేదన కారణంగా ఆరోగ్యం మరింత క్షీణించిందని, ఇప్పట్లో తిరిగి రాలేనని స్పష్టం చేశారు. అప్పటి నుంచి పోలీసులు ఆయనపై రెడ్ కార్నర్ నోటీసుల జారీ కోసం ప్రయత్నాలు చేస్తూనే.. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖతోనూ (ఎంఈఏ) సంప్రదింపులు జరుపుతున్నారు. తొలుత పాస్‌పోర్ట్ ఇంపౌండ్ చేయించి... రాష్ట్ర పోలీసులు తొలుత రీజనల్ పాస్‌పోర్టు కార్యాలయం (ఆర్పీఓ) ద్వారా ప్రభాకర్‌రావు, మరో నిందితుడు శ్రవణ్‌రావుల పాస్‌పోర్టులను ఇంపౌండ్ (సస్పెన్షన్) చేయించారు. ఆపై ప్రభాకర్‌రావు పాస్‌పోర్టును పూర్తిగా రద్దు చేయాలంటూ మరో ప్రతిపాదన పంపారు. ప్రస్తుతం ఆ ఫైల్ విదేశీ వ్యవహారాల శాఖ (ఎంఈఏ) వద్ద పెండింగ్‌లో ఉంది. ప్రభాకర్‌రావు తన న్యాయవాదుల ద్వారా పాస్‌పోర్టు ఇంపౌండ్ చేయడాన్ని ఎంఈఏ జాయింట్ సెక్రటరీ వద్ద సవాల్ చేశారు. ఈ వివాదం పరిష్కారమైతే తప్ప పాస్‌పోర్టు రద్దుపై నిర్ణయం తీసుకోవడానికి ఆస్కారం లేదు. అయితే ఎవరైనా వ్యక్తిపై చార్జ్‌షీట్ దాఖలు కావడం, న్యాయస్థానం తగిన ఆదేశాలు జారీ చేయడం, నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ కావడం జరిగితే.. పాస్‌పోర్టు ఇంపౌండ్, రద్దుకు అవకాశం ఉంటుంది. ప్రభాకర్‌రావు విషయంలో ఈ మూడూ జరిగిన నేపథ్యంలో.. ఆయన పాస్‌పోర్టు త్వరలోనే రద్దవుతుందని పోలీసులు భావిస్తున్నారు. రద్దయినా ఇప్పట్లో రావడం కష్టమే! ప్రభాకర్‌రావు పాస్‌పోర్టు రద్దు అయినా ఆ సమాచారం ఎంఈఏ, ఇమిగ్రేషన్ అధికారుల వద్ద మాత్రమే ఉంటుంది. ఆయన అమెరికా నుంచి మరో దేశానికి రాకపోకలు సాగించినా దీని ద్వారా గుర్తించలేరు. కేవలం పాస్‌పోర్టు పేజీలు అయిపోవడం, గడువు తీరిపోవడం, పోగొట్టుకోవడం వంటివి జరిగి.. ఆ దేశంలో ఉన్న భారత రాయబార కార్యాలయానికి వెళ్లినప్పుడు మాత్రమే అధికారులు దాన్ని స్వా«దీనం చేసుకుంటారు. ఎమర్జెన్సీ సర్టిఫికెట్ జారీ చేయడం ద్వారా బలవంతంగా భారత్‌కు పంపుతారు. అలా కాకుండా ప్రభాకర్‌రావు తనంతట తానుగా తిరిగి వస్తే.. విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు పట్టుకుని పోలీసులకు అప్పగిస్తారు. ప్రభాకర్‌రావును అమెరికా ప్రభుత్వమే తిప్పిపంపాలంటే మాత్రం పాస్‌పోర్టు రద్దు తర్వాత కేంద్ర హోంశాఖ (ఎంహెచ్ఏ) ద్వారా అమెరికా దేశ ఏజెన్సీలను సంప్రదించాల్సి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. వీసాలో గడువులో మతలబులు ఎన్నో... కొన్నేళ్లుగా తరచూ అమెరికాకు వెళ్లి వస్తున్న, కుటుంబీకులు అక్కడే ఉంటున్న ప్రభాకర్‌రావు వంటి వారికి సాధారణంగా 10 నుంచి 15 ఏళ్ల గడువుతో కూడిన వీసాలు లభిస్తుంటాయి. అయితే ఒకసారి ఆ దేశంలో అడుగుపెట్టిన తర్వాత గరిష్టంగా 180 రోజులలోపు తిరిగి వెళ్లాలనే నిబంధన ఉంది. దీనితో ప్రస్తుతం ఆయన 179 రోజులు అక్కడ ఉండి.. సమీపంలోని కెనడా, లేదా మరో దేశానికి కొన్ని రోజులు వెళ్లి రావొచ్చు. అలా మరో 179 రోజులు అమెరికాలో ఉండొచ్చు. అయితే ప్రభాకర్‌రావు వైద్యం చేయించుకుంటున్న నేపథ్యంలో వీసా గడువు తేలిగ్గా పొడిగించుకునే అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు ఉన్నాయి. -
ట్రంప్ రాజకీయం.. ఇండియన్ అమెరికన్ నేత నిక్కీ హేలీకి బిగ్ షాక్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలిచిన తర్వాత కీలక నిర్ణయాలు తీసకుంటున్నారు. ఇప్పటికే రిపబ్లికన్ పార్టీ ప్రచార వ్యూహకర్తను సుజీ వైల్స్‌ను వైట్‌హౌజ్ స్టాఫ్ చీఫ్‌గా ట్రంప్ నియమించారు. రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థిత్వానికి తనతో పోటీ పడిన నిక్కీ హేలీ వైట్‌హౌజ్ కార్యవర్గంలోకి తీసుకోబోనని ట్రంప్ స్పష్టం చేశారు. హేలితో పాటు మైక్ పాంపియోను కూడా తీసుకోవడం లేదని ట్రంప్ ట్రూత్ సోషల్‌లో ట్రంప్ పోస్టు చేశారు.‘నిక్కీ హేలీ, మైక్ పాంపియోను నూతన కార్యవర్గంలోకి ఆహ్వానించడం లేదు. గతంలో వారితో కలిసి పనిచేయడం చాలా ఆనందానిచ్చింది. దేశానికి వారు చేసిన సేవకు ధన్యవాదాలు’ అని ట్రంప్ తన పోస్టులో పేర్కొన్నారు.కాగా, ట్రంప్ పోస్టుపై నిక్కీ హేలీ స్పందించారు. గతంలో ట్రంప్‌తో కలిసి పనిచేయడం తనకు ఆనందాన్నిచ్చిందని, అమెరికాను ట్రంప్ మరింత ముందుకు తీసుకువెళ్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: అరిజోనాలోనూ ట్రంప్ గెలుపు -
ఫోన్‌ట్యాపింగ్ కేసులో కొత్త ట్విస్ట్.. ప్రభాకర్‌రావుకు అమెరికాలో గ్రీన్‌కార్డు?
సాక్షి,హైదరాబాద్:ఫోన్ ట్యాపింగ్ కేసు అనూహ్య మలుపు తిరిగింది. ఈ కేసులో ఇప్పటివరకు విచారణకు హాజరుకాని ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావుకు తాజాగా అమెరికాలో గ్రీన్ కార్డు వచ్చినట్లు సమాచారం. అమెరికాలో సెటిల్ అయిన కుటుంబసభ్యుల ద్వారా ఆయన కొద్దిరోజుల క్రితమే గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరయినట్టు తెలుస్తోంది.గ్రీన్ కార్డు మంజూరు విషయం తెలిసి ఫోన్‌ట్యాపింగ్ కేసు దర్యాప్తు అధికారులు ఈ విషయమై ఆరా తీశారు. ప్రభాకర్‌రావుకు గ్రీన్‌కార్డు లభించడంతో దర్యాప్తులో ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశంపై పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇప్పటికే ప్రభాకర్ రావు పై పోలీసులు లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. మరోవైపు ఇంటర్ పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయించేందుకు ప్రయత్నిస్తున్నారు.కాగా, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫోన్‌ట్యాపింగ్ జరిగిందని ఆరోపిస్తూ దర్యాప్తు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ కేసులో గతంలో ఇంటెలిజెన్స్‌లో పనిచేసిన పలువురు పోలీసు అధికారులను అరెస్టు చేసి విచారించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావును కూడా విచారించేందుకు పోలీసులు ప్రయత్నించినప్పటికీ ఆయన అమెరికా వెళ్లిపోవడంతో అది సాధ్యం కాలేదు. ఇదీ చదవండి: కేసు పెడితే పెట్టుకో.. దేనికైనా రెడీ: కేటీఆర్ -
అమెరికా నుంచి లారెన్స్‌బిష్ణోయ్ తమ్ముడి బెదిరింపులు
న్యూఢిల్లీ:గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తమ్ముడు అన్మోల్ బిష్ణోయ్‌పై గురుగ్రామ్‌లో బెదిరింపుల కేసు నమోదైంది. భీమ్‌సేన చీఫ్ సత్పల్ తన్వర్‌ను విదేశాల నుంచి బెదిరించినందుకు అన్మోల్‌పై కేసు రిజిస్టర్ చేసినట్లు పోలీసులు తెలిపారు. తన్వర్‌ను ముక్కలుముక్కలుగా నరికేస్తామంటూ అన్మోల్ గ్యాంగ్ బెదిరించినట్లు సమాచారం.అన్మోల్ జింబాబ్వే,కెన్యా ఫోన్ నెంబర్లను వాడుతూ అమెరికా, కెనడాల నుంచి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు పోలీసులు చెప్పారు.ఈ కేసులో దర్యాప్తు కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అన్మోల్ను భారత్ తీసుకు రావడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.కాగా, అన్మోల్ బిష్ణోయ్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.అతడి ఆచూకీ తెలిపితే రూ.10 లక్షల రివార్డు ఇస్తామని నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ(ఎన్ఐఏ) పోలీసులు ఇప్పటికే ప్రకటించారు. ఇదీ చదవండి: భీమ్ ఆర్మీచీఫ్ ప్రయాణిస్తున్న వందేభారత్ రైలుపై దాడి -
అమెరికా కొత్త ఆంక్షలు!
అనుకున్నది సాధించటం కోసం, మాట వినని దేశాలను దారికి తెచ్చుకోవటం కోసం ఆంక్షల అస్త్రాన్ని ప్రయోగించటం అమెరికాకు అలవాటైన విద్య. దాన్ని సహేతుకంగా వినియోగిస్తున్నామా... ఆశించిన ఫలితాలు వస్తున్నాయా దుష్పరిణామాలు పుట్టుకొస్తున్నాయా అనే ఆలోచన దానికి ఎప్పుడూ రాలేదు. ‘ప్రపంచంలో అగ్రజులం, మన మాట చెల్లుబాటు కావాలంతే...’ అన్న పట్టింపే అధికం. ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధానికి తోడ్పడుతున్నారని ఆరోపిస్తూ ప్రపంచవ్యాప్తంగా 400 సంస్థలపైనా, వ్యక్తులపైనా ఆంక్షలు విధిస్తున్నట్టు అమెరికా విదేశాంగ శాఖ గురువారం ప్రకటించింది. ఇందులో మన దేశానికి సంబంధించి 19 ప్రైవేటు సంస్థలున్నాయి. ఇంకా ఈ జాబితాలో చైనా, మలేసియా, థాయ్‌లాండ్, తుర్కియే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) తదితరాలున్నాయి. ఈ దేశాలన్నీ రష్యాకు ఉపకరణాలు, విడిభాగాలు పంపుతున్నాయనీ, వీటితో ఆయుధాలకు పదునుపెట్టుకుని రష్యా ఉక్రెయిన్‌పై దురాక్రమణ యుద్ధం కొనసాగిస్తోందనీ అమెరికా ఆరోపణ. వీటిల్లో ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, విమాన విడిభాగాలూ ఉన్నాయంటున్నది. పరాయి దేశాలపై ఆంక్షలు విధించేందుకు ఏ దేశానికైనా హక్కుంటుంది. కానీ ఆ దేశాలతో ఉన్న స్నేహసంబంధాలూ, ద్వైపాక్షిక ఒప్పందాలూ వగైరా చూసుకోవటం, అంతకుముందు సంబంధిత దేశాలతో చర్చించటం కనీస మర్యాద. అమెరికా ఎప్పుడూ ఈ మర్యాద పాటించిన దాఖలా లేదు.ఎప్పుడూ స్వీయప్రయోజనాలే పరమావధిగా భావించే అమెరికా తన విదేశాంగ విధాన లక్ష్యాలను నెరవేర్చుకోవటానికి ఆంక్షల్ని ఆయుధంగా మలుచుకోవటం పాత కథే. అయితే ఈమధ్యకాలంలో ఇది బాగా ముదిరిందని ఒక అధ్యయనం చెబుతోంది. దాని ప్రకారం మొదటి ప్రపంచయుద్ధానికీ (1914–18), 2000 సంవత్సరానికీ మధ్య అమెరికా 200కు పైగా ఆంక్షలు విధించిందని తేలింది. చిత్రంగా అటు తర్వాత ఈ రెండు దశాబ్దాలపైగా కాలంలో ఈ ఆంక్షలు తొమ్మిదిరెట్లు పెరిగాయని ఆ అధ్యయనం వివరిస్తోంది. అంటే ఎనిమిది దశాబ్దాల కాలంలో అమెరికా విధించిన ఆంక్షల సంఖ్య చాలా స్వల్పం. జాతీయ భద్రత, విదేశాంగ విధానం, ఆర్థికాంశాలు... ఒకటేమిటి అనేకానేక అంశాల విషయంలో ఈ ఆంక్షల జడి పెరిగిపోయింది. క్యూబా, వెనెజులా, ఇరాన్, ఇరాక్ తదితర దేశాలు ఈ ఆంక్షల పర్యవసానాన్ని ఎక్కువగా ఎదుర్కొంటున్నాయి. అసలు అవతలి దేశంనుంచి ఆశిస్తున్నదేమిటో చెప్పకుండానే వీటిని వినియోగించిన సందర్భాలు కూడా ఉన్నాయి. సాఫల్య వైఫల్యాలను అమెరికా గమనంలోకి తీసుకుంటున్నదా లేదా అనే సంశయం కూడా లేకపోలేదు. ఎందుకంటే ఈ మొత్తం ఆంక్షలవల్ల నెరవేరిన ప్రయోజనాలు ఆశించిన లక్ష్యాల్లో 34 శాతం దాటవన్నది ఆ అధ్యయన సారాంశం. ఈ ఆంక్షలు వికటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు ఇరాక్‌లో రసాయన ఆయుధాలున్నాయని ప్రపంచాన్ని నమ్మించి ఆ దేశంపై దండెత్తిన అమెరికా అంతకుముందూ ఆ తర్వాత దాన్ని ఆంక్షల చక్రబంధంలో బంధించింది. అందువల్ల పసిపిల్లలకు పాలడబ్బాలు మొదలుకొని ప్రాణావసరమైన ఔషధాల వరకూ ఎన్నో నిత్యావసరాలు కరువై లక్షలమంది మృత్యువాత పడ్డారు. తాను ఆంక్షలు విధించటంతో సరిపెట్టక మిత్రులైన పాశ్చాత్య దేశాలను కలుపుకోవటం అమెరికా విధానం. అంతా అయినాక, ఇరాక్ పాలకుడు సద్దాం హుస్సేన్ ఉసురు తీశాక అక్కడ రసాయన ఆయుధాలున్నాయనటం పచ్చి అబద్ధమని తేలింది. మరి లక్షలమంది జనం ఉసురు తీసిన పాపం ఎవరిది? ఇరాన్లో సరేసరి... అక్కడ తన అనుకూలుడైన ఇరాన్ షా పదవీ భ్రష్టుడైంది మొదలుకొని ఆంక్షల పరంపర కొనసాగిస్తూనే ఉంది. ఇందువల్ల మన దేశం సైతం ఆర్థికంగా ఎంతో నష్టపోవాల్సి వచ్చింది. అందుకే ఈ అర్థరహిత ఆంక్షల్ని దాటుకుని, నష్టం కనిష్ట స్థాయిలో ఉండేలా తెలివిగా వ్యవహరించే దేశాల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. ఉదాహరణకు 2017–2021 మధ్య యూరప్ దేశాలకు రష్యాతో ఉన్న వాణిజ్యం ఉక్రెయిన్ యుద్ధం తర్వాత 5 శాతం తగ్గింది. అదే సమయంలో రష్యాకు ఆర్మేనియా, యూఏఈ, కజఖ్‌స్తాన్, ఉజ్బెకిస్తాన్, హాంకాంగ్‌లతో వాణిజ్యం పెరిగింది. మరోపక్క ఈ దేశాలన్నిటితో యూరప్ దేశాల వాణిజ్యం ఎన్నో రెట్లు పెరిగింది. అంటే రష్యానుంచి కొనుగోలు చేస్తున్న సరుకంతా ఈ దేశాలు యూరప్ దేశాలకు తరలిస్తున్నాయి. ఇక ఆంక్షల ప్రయోజనం ఏం నెరవేరినట్టు? రష్యా నుంచి మన ముడి చమురు దిగుమతులు భారీగా పెరగటం, యూరప్ దేశాలకు శుద్ధిచేసిన చమురునూ, గ్యాస్‌నూ మన దేశం విక్రయించటం ఇటీవలి ముచ్చట.అసలు ఆంక్షల వల్ల ఒరిగేది లేకపోగా నష్టం ఉంటుందని అమెరికా గుర్తించకపోవటం ఆశ్చర్యం కలిగిస్తుంది. భారత్ మిత్రదేశం. అసలే అమెరికాలో స్థిరపడిన ఖలిస్తానీ వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర విషయంలో ఇటీవల సంబంధాలు దెబ్బతిన్నాయి. అవి మరింత దిగజారేలా ఆంక్షలకు దిగటం నిజంగా ప్రయోజనాన్ని ఆశించా లేక నాలుగురోజుల్లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో గొప్పలు చాటుకోవటానికా అన్నది అర్థంకాని విషయం. ఒకపక్క ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రను నిలువరించటం కోసమని తనకు తోచినట్టు చేసుకుపోతున్న అమెరికా... గాజా, వెస్ట్‌బ్యాంక్, లెబనాన్లలో రోజూ వందలమందిని హతమారుస్తున్న ఇజ్రాయెల్ విషయంలో ఎందుకు నోరెత్తటం లేదు? తనవరకూ అమలు చేసుకుంటూ పోతానంటే అమెరికా విధించిన ఆంక్షలపై ఎవరికీ పెద్దగా అభ్యంతరం ఉండదు. కానీ అదే పని అందరూ చేయాలని శాసించటం తెలివితక్కువతనం. ఈ ఇంగితజ్ఞానం అమెరికాకు ఎప్పటికి అలవడుతుందో?! -
పరువుచేటు పనులు!
అంతర్జాతీయంగా సంచలనం సృష్టించే హత్యలూ, హత్యాయత్నాలూ ఒక్కోసారి ఉలిక్కిపడేలా చేస్తాయి. వాటి వెనక ప్రభుత్వాల ప్రమేయం ఉన్నదన్న అనుమానాలు తలెత్తితే అవి మరింత ఆసక్తిని రేకెత్తిస్తాయి. చాలా సందర్భాల్లో అవి దేశాలమధ్య చిచ్చు రేపుతాయి. ఇలాంటి ఆపరేషన్లను గుట్టుచప్పుడు కాకుండా చేయడంలో ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్ ఆరితేరింది. చేతికి నెత్తురంటకుండా, సాక్ష్యాధారాలేమీ మిగలకుండా ప్రత్యర్థులను మట్టుబెట్టడంలో ఆ సంస్థ తర్వాతే ఎవరినైనా చెప్పుకోవాలి. అలాంటి ఉదంతంలో ఇప్పుడు మన దేశం పేరు వినబడటం ఆశ్చర్య కరమే. అమెరికాలో స్థిరపడిన ఖలిస్తాన్ వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూపై హత్యాయత్నం కేసులో అమెరికాలో దాఖలైన తాజా నేరారోపణ పత్రం ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తోంది. నిజానికి ఏడాదికాలంగా ఆ పంచాయతీ నడుస్తోంది. నేరుగా భారత్‌ను నిందించక పోయినా నిరుడు మే నెలలో దాఖలు చేసిన నేరారోపణ పత్రం తమ గడ్డపై తమ పౌరుడిని హత్య చేసేందుకు జరిగిన ప్రయత్నం వెనక ‘భారత ప్రభుత్వంలో పనిచేసే ఒక ఉద్యోగి ప్రమేయం ఉన్నద’ంటూ ఆరోపించింది. అప్పట్లో ఆ ఉద్యోగి పేరు వెల్లడించకుండా ‘సీసీ 1’గా మాత్రమే ప్రస్తావించింది. కానీ శుక్రవారం అమెరికా న్యాయశాఖ అతని పేరు వికాస్ యాదవ్ అనీ, భారత గూఢచార సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా)లో ఇంతక్రితం పనిచేశాడనీ వెల్లడించింది. వికాస్ యాదవ్ ప్రస్తుతం భారత ప్రభుత్వ ఉద్యోగి కాదని నేరారోపణ పత్రం చెప్పటం... భారత ప్రభుత్వం ఈ కేసులో తమకు సహకరిస్తున్నదని విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ అనటం ఉన్నంతలో ఊరట. తమ దేశంలో స్థిరపడిన ఖలిస్తాన్ వేర్పాటువాద నాయకుడు హర్దీప్సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉన్నదని ఒకపక్క కెనడా ఆరోపిస్తున్న తరుణంలో అమెరికా సైతం ఇదే తరహా ఆరోపణ చేయటం గమనించదగ్గది. ఎన్నికల్లో సిక్కు ఓటు బ్యాంకును దృష్టిలో ఉంచుకుని కెనడా ప్రధాని ట్రూడో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కొట్టిపారేసిన మన దేశానికి తాజా పరి ణామం ఇబ్బంది కలిగిస్తుందనటంలో సందేహం లేదు. ఎందుకంటే గురుపత్వంత్ను హతమార్చ టానికి ఏమేం చేయాలో నిందితులు చర్చించుకున్న సందర్భంలోనే నిజ్జర్ హత్యను జయప్రదంగా పూర్తిచేయటం గురించిన ప్రస్తావన వచ్చింది. ఇలాంటి వ్యవహారాలు చక్కబెట్టే వారికి వేయి కళ్లుండాలి. తాము ఎవరిని సంప్రదిస్తున్నామోక్షుణ్ణంగా తెలిసివుండాలి. కానీ ఆ సమయంలో రా సీనియర్ అధికారిగా ఉన్న వికాస్ యాదవ్ మాదకద్రవ్య ముఠాలతో సంబంధాలుండే నిఖిల్ గుప్తాకు గురుపత్వంత్ను అంతంచేసే బాధ్యత అప్పగించటం, గుప్తా దాన్ని కాస్తా కిరాయి హంతకుడనుకున్న మరో వ్యక్తికి ఇవ్వటంతో కథ అడ్డం తిరిగింది. నిఖిల్ గుప్తా చెక్ రిపబ్లిక్లో దొరికిపోవటం, అతన్ని ఆ దేశం అమెరికాకు అప్పగించటం పర్యవసానంగా మొత్తం పథకం బట్టబయలైంది. కిరాయి హంతకుడనుకున్న వ్యక్తి కాస్తా అమెరికా మాదకద్రవ్య నిరోధక విభాగం ఏజెంటు. ఆ సంగతి తెలియక హత్య కోసం అతనితో లక్ష డాలర్లకు కాంట్రాక్టు కుదుర్చుకోవటం, అందులో 15 వేల డాలర్లు చెల్లించటం నిఖిల్ గుప్తాతోపాటు వికాస్ మెడకు చుట్టుకుంది. అది మన దేశ ప్రతిష్ఠకు కూడా మచ్చ తెచ్చింది. వికాస్ సాధారణ అధికారి కాదు. రా సంస్థకు ముందు ఆయన సీఆర్పీఎఫ్లో పనిచేశాడు. వికాస్‌ను సర్వీసునుంచి తొలగించి అతనికోసం గాలిస్తున్నామని మన ప్రభుత్వం ఇచ్చిన వివరణకు అమెరికా సంతృప్తి చెందింది. ‘రా’లో ఉన్నతాధికారులకు చెప్పకుండా వికాస్ యాదవ్ ఇలాంటి పెడధోరణులకు పాల్పడ్డాడని మన ప్రభుత్వం చెబుతోంది. విదేశాల్లో గూఢచర్యం ఆషామాషీ కాదు. అలాంటి పనిలో నిమగ్నమైవుండేవారు ఉన్నతాధి కారులకు తమ కార్యకలాపాలపై ఎప్పటికప్పుడు వర్తమానం అందిస్తే వేరే విషయం. చెప్పినా చెప్ప కున్నా అంతా సవ్యంగా జరిగితే రివార్డులు దక్కవచ్చేమో. కానీ వికటిస్తే ఆ అధికారితోపాటు దేశం పరువు కూడా పోతుంది. గురుపత్వంత్ ఖలిస్తాన్ వేర్పాటువాదే కావొచ్చు. ఆ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్న వ్యక్తే అయివుండొచ్చు. మన దేశంలో కేసులుంటే తమకు అప్పగించాలని అమె రికాను కోరాలి. ఆ దేశ పౌరుడిగా అక్కడే స్థిరపడిన వ్యక్తిపై అంతకుమించి ఏదో సాధించాలను కోవటం తెలివితక్కువతనం. అసలు ఒక వ్యక్తిని భౌతికంగా లేకుండా చేసినంత మాత్రాన ఉద్యమం ఆగిపోతుందా? అతని సహచరులు భయకంపితులై ఉద్యమానికి దూరమవుతారా? ఏం సాధిద్దా మని వికాస్ ఇలాంటి పనికి సిద్ధపడ్డాడో తేల్చటం అవసరం. వికాస్ యాదవ్ విషయంలో ఇంత పట్టుదలగా పనిచేస్తున్న అమెరికా చరిత్ర కూడా తక్కువేమీ కాదు. 2003 నాటి రవీందర్ సింగ్ వ్యవహారమే ఇందుకు ఉదాహరణ. ‘రా’లో సంయుక్త కార్య దర్శిగా ఉన్న రవీందర్ అమెరికా గూఢచార సంస్థ సీఐఏకు డబుల్ ఏజెంటుగా పనిచేసి పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ వగైరా దేశాల్లో రా కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం అందజేశాడు. తనసంగతి బయటపడిందని గ్రహించగానే కుటుంబంతో సహా మాయమై అమెరికాలో తేలాడు. వారికి అక్కడ మారు పేర్లతో పాస్‌పోర్టులు కూడా మంజూరయ్యాయి. విచిత్రంగా మన దేశం అతన్ని అప్పగించాలని పట్టుబట్టలేదు. ఉద్యోగంనుంచి తొలగించి అధికార రహస్యాల చట్టం కింద కేసు పెట్టడంతో సరిపెట్టింది. 2016లో ఒక రోడ్డు ప్రమాదంలో రవీందర్ మరణించాడని అంటున్నా దాన్ని ధ్రువీకరించే సమాచారం మన ప్రభుత్వం దగ్గరలేదు. మొత్తానికి గూఢచర్యం వికటిస్తే ఏమవుతుందో వికాస్ యాదవ్ ఉదంతం తెలియజెబుతోంది. -
జేబులో తుపాకీ..‘యూఎస్’లో హాట్‌టాపిక్ ఇదే
అమెరికాలో గన్‌కల్చర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు ఎవరు పడితే వారు సామాన్యులపైకి తుపాకులు ఎక్కుపెడుతుంటారు. వ్యక్తిగత, ఆర్థిక, విద్వేషం,జాాత్యహంకారం ఇలా కారణమేదైనా కావొచ్చు బహిరంగ ప్రదేశాల్లో విచక్షణారహితంగా కాల్పులు జరిపి అమాయకుల ప్రాణాలను అకారణంగా గాల్లో కలిపేస్తుంటారు. ఇలాంటి ఉన్మాద కాల్పులు అగ్రదేశంలో తరచూ జరుగుతూనే ఉంటాయి.సామాన్యుల మరణాలకు కారణమవుతున్న తుపాకులు దేశంలో అందరూ యథేచ్చగా వాడొచ్చా..వాటి విచ్చలవిడి అమ్మకాలపై నియంత్రణ ఉండాలా వద్దా అనే చర్చ అమెరికాలో ఎప్పటినుంచో జరుగుతోంది. ప్రస్తుతం జరుగుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోనూ ఇది హాట్‌టాపిక్‌గా మారింది. హారిస్ ఏమంటున్నారు..గన్ల విచ్చలవిడి అమ్మకాన్ని నిషేధించాలనే వాదనకు తన మద్దతుంటుందని అధ్యక్ష పోరులో తలపడుతున్న డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలాహారిస్ ఇప్పటికే స్పష్టం చేశారు.ఇక రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ట్రంప్ స్టాండ్ ఈ విషయంలో మరోలా ఉంది. వెనక్కు తగ్గని ట్రంప్..ఇటీవల ఎన్నికల ప్రచారంలో ఏకంగా తనపైనే కాల్పులు జరిగినా ట్రంప్ వెనక్కు తగ్గడం లేదు. తుపాకులు ఎవరికి పడితే వారికి అమ్మడాన్ని ఆయన మద్దతిస్తున్నారు. ఇంకో అడుగు ముందుకేసి బైడన్ హయాంలో గన్ల నియంత్రణపై తెచ్చిన చట్టాలేవైనా ఉంటే వాటిని తాను పవర్లోకి రాగానే రద్దు చేస్తానని కూడా తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో ట్రంప్‌కు మద్దతిస్తున్న టెక్ బిలియనర్, టెస్లా అధినేత ఇలాన్ మస్క్ గన్ కల్చర్‌పై ఒక ట్వీట్ చేశారు. మద్దతిస్తే 100 డాలర్లు.. ‘మస్క్’ వింత ఆఫర్ పెన్సిల్వేనియాలో ఓటర్‌గా నమోదై ఉండి వాక్స్వాతంత్రం, అందరూ తుపాకులు కలిగి ఉండడం అనే అంశాలకు మద్దతిస్తున్నవారందరికీ మస్క్ ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఈ అంశాలకు మద్దతుగా రూపొందించిన తమ పిటిషన్‌పై సంతకం పెడితే 100 డాలర్లు బహుమతిగా ఇస్తానని ప్రకటించి సంచలనం సృష్టించారు. If you’re a registered Pennsylvania voter, you & whoever referred you will now get $100 for signing our petition in support of free speech & right to bear arms.Earn money for supporting something you already believe in!Offer valid until midnight on Monday.— Elon Musk (@elonmusk) October 18, 2024 గన్ కల్చర్ ఎఫెక్ట్.. అమెరికాలో ఇటీవల జరిగిన కాల్పుల ఘటనలివీ..ఓక్లహామాలోని ఓక్లహామా నగరంలో ఇటీవల రెండురోజుల్లో వరుసగా జరిగిన కాల్పుల్లో ఇద్దరు మరణించారు.అలబామా రాష్ట్రం బర్మింగ్హమ్లోని ఓ నైట్ క్లబ్లో జరిగిన బహిరంగ కాల్పుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. డజను మందికిపైగా గాయపడ్డారు.టెక్సాస్‌లోని అలెన్‌లో ఓ షాపింగ్ సెంటర్లో దుండగుడు జరిపిన బహిరంగ కాల్పుల్లో 8 మంది మరణించారు. మరో ఏడుగురు గాయపడ్డారు.చివరికి పోలీసులు జరిపిన కాల్పుల్లో దుండగుడు మరణించాడు.ఇదీ చదవండి: హారిస్ సారీలు..హామీలు -
ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలుకు అమెరికాతో భారత్ కీలక ఒప్పందం
దేశ రక్షణ రంగాన్ని పటిష్టం చేసే దిశగా అమెరికా, భారత్ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. మన సాయుధ బలగాల నిఘా సామర్థ్యాలను మరింత బలోపేతం చేసేందుకు అమెరికా నుంచి అత్యాధునిక సాయుధ ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలు ఒప్పందంపై రెండు దేశాలు సంతకాలు చేశాయి. వీటి విలువ రూ. 32,000 కోట్లు కాగా ఈ డీల్ కింద భారతదేశంలో మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్‌హాల్ (ఎమ్ఆర్ఓ) సదుపాయాన్ని నెలకొల్పడంతో పాటు యూఎస్ నుంచి మొత్తం 31 MQ-9B హై ఆల్టిట్యూడ్ డ్రోన్లను భారత్ కొనుగోలు చేయనుంది. ఈ ప్రాజెక్ట్‌కు గత వారం క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (CCS) అనుమతి ఇచ్చింది. మొత్తం 31 డ్రోన్లలో 15 భారత నావికాదళానికి వెళ్తాయి. మిగిలినవి వైమానిక దళం, ఆర్మీల మధ్య సమంగా విభజించనున్నారు.కాగా డెలావేర్లో జరిగిన క్వాడ్ లీడర్స్ సదస్సు సందర్భంగా డ్రోన్ల కొనుగోలుకు సంబంధించి భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మధ్య చర్చలు జరిగిన నెలలోపే ఈ పరిణామం చోటుచేసుకుంది. అంతేగాక ఈ డీల్ మొత్తం విలువ రూ.34,500 కోట్లకు పెరగే అవకాశం ఉంది. చెన్నై సమీపంలోని ఐఎన్ఎస్ రాజాలి, గుజరాత్‌లోని పోర్బందర్, ఉత్తరప్రదేశ్‌లోని సర్సావా మరియు గోరఖ్‌పూర్‌తో సహా నాలుగు సాధ్యమైన ప్రదేశాలలో భారతదేశం డ్రోన్లను ఉపయోగించనుంది.అయితే చైనాతో ఉన్న వాస్తవాధీన రేఖ వెంబడి ఉంచేందుకు ఈ డ్రోన్లు అవసరమని భారత్ భావిస్తోంది. ఈ డ్రోన్లు గరిష్టంగా గంటకు 442 కిమీ వేగంతో, దాదాపు 50,000 అడుగుల ఎత్తులో ఎగురుతాయి. సుమారు 40 గంటలకుపైగా గాల్లో ఉండగలవు. నాలుగు హెల్ఫైర్ క్షిపణులను, 450 కిలోల బాంబులను మోసుకెళ్లగలవు. ఇప్పటికే భారత్ వీటిల్లో మరోరకమైన సీగార్డియన్ డ్రోన్లను వినియోగిస్తోంది. వీటిని కూడా జనరల్ అటామిక్స్ నుంచి లీజ్‌పై భారత్ తీసుకొంది. ఈ ఏడాది జనవరిలో కాంట్రాక్టు ముగియగా.. మన నౌకాదళం మరో నాలుగేళ్లపాటు దీనిని పొడిగించింది. -
హెజ్బొల్లా చితికి పోయింది: అమెరికా
వాషింగ్టన్: కాల్పుల విరమణ అంశాన్ని ప్రస్తావించడం హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూపు వెనుకంజను తెలియజేస్తోందని అమెరికా ప్రభుత్వ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ అన్నారు. మంగళవారం(అక్టోబర్8) వాషింగ్టన్లో ఆయన మీడియాతో మట్లాడారు. ఇటీవల ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హెజ్బొల్లా చితికిపోయిందన్నారు.‘సంవత్సరం నుంచి హెజ్బొల్లాను ప్రపంచం మొత్తం కాల్పుల విరమణ చేయాలని అడుగుతోంది. దీనిని హెజ్బొల్లా తిరస్కరిస్తూ వస్తోంది. ఇప్పుడేమో హెజ్బొల్లానే కాల్పుల విరమణ అడుగుతోంది. ఈ యుద్ధానికి దౌత్య పరమైన పరిష్కారమే అంతిమంగా మేం కోరుకుంటున్నాం’అని చెప్పారు. కాగా, హెజ్బొల్లా డిప్యూటీ లీడర్ కాసిమ్ మంగళవారం ఓ టీవీ చానల్‌తో మాట్లాడుతూ కాల్పుల విరమణ కోసం లెబనాన్ పార్లమెంట్ స్పీకర్ బెర్రీ చేస్తున్న ప్రయత్నాలకు తమ మద్దతుంటుందన్నారు. ఇజ్రాయెల్ తమపై భీకర దాడులు చేస్తున్నప్పటికీ ఆ దేశానికి ధీటైన జవాబిస్తున్నామని కాసిమ్ తెలిపారు.ఇదీ చదవండి: వేల మంది ఇజ్రాయెల్ పౌరులు నిరాశ్రయులవుతారు -
అమెరికాలో బతుకమ్మకు అధికారిక గుర్తింపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాంస్కృతిక వైభవం బతుకమ్మ ఖ్యాతి ఖండాంతరాలను దాటింది. బతుకమ్మ సంబుర ప్రాశస్త్యాన్ని, పండగలోని పరమార్థాన్ని అమెరికాలో పలు రాష్ట్రాలు గుర్తించాయి. జార్జియా, వర్జీనియా రాష్ట్రాలతోపాటు ఉత్తర కరోలినా రాష్ట్రంలోని చార్లెట్, రాలేహ్ నగరాలు బతుకమ్మ పండుగను అధికారికంగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేశాయి. ఈ మేరకు ఆయా రాష్ట్రాల గవర్నర్లు ఈ వారాన్ని బతుకమ్మ పండుగ, తెలంగాణ హెరిటేజ్ వీక్‌గా ప్రకటించారు. బతుకమ్మ ఎంతో ప్రత్యేకమైన, ప్రాముఖ్యతగల పండుగల్లో ఒకటని.. ఈ ఉత్సవాన్ని 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలే కాకుండా అమెరికాలో స్థిరపడ్డ 12 లక్షల మంది ఎన్నారైలు కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారని జార్జియా, వర్జీనియా రాష్ట్రాల గవర్నర్లతోపాటు ఉత్తర కరోలినాలోని చార్లెట్, రాలేహ్ మేయర్లలు అభివర్ణించారు. దీంతో వారికి గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు. అలాగే తెలంగాణ ఆడపడుచులకు అభినందనలు తెలియజేశారు. కొంతకాలంగా తెలంగాణ బతుకమ్మకు ఖండాంతరాల్లో గుర్తింపు తెచ్చేందుకు గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్, ఇతర సంఘాలు, ప్రవాస తెలంగాణవాసులు చేస్తున్న కృషికి ఈ గుర్తింపుతో ఫలితం దక్కినట్టయింది. గతంలోనూ అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు బతుకమ్మను గుర్తించాయి. -
అమెరికా మిలిటరీ బేస్‌పై రాకెట్ల దాడి
బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో ఉన్న అమెరికా మిలిటరీ క్యాంపు మీద ఇటీవల రాకెట్ల దాడి జరిగింది. ఈ రాకెట్లను అక్కడి యాంటీ మిసైల్ వ్యవస్థ సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు అమెరికా మిలిటరీ అధికారులు తెలిపారు. మొత్తం మూడు కత్యూష రాకెట్లతో జరిగిన దాడిలో భవనాలు, వాహనాలు ధ్వంసంకాగా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని చెప్పారు. ఇరాక్‌లో ఇప్పటికీ 2500 మంది దాకా అమెరికా సైనికులు విధులు నిర్వహిస్తున్నారు. వీరిపై ఇరాన్ సహాయంతో కొన్ని మిలిటెంట్ గ్రూపులు తరచూ దాడులు చేస్తుంటాయి. ఇదీ చదవండి: నెతన్యాహూతో మాట్లాడిన ప్రధాని మోదీ -
టార్గెట్ ఐసిస్..సిరియాపై అమెరికా దాడులు
వాషింగ్టన్:పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతున్నాయి.ఓ పక్క లెబనాన్‌పై ఇజ్రాయెల్ వరుస దాడులు చేస్తుండగానే సిరియాలో ఉగ్రవాద స్థావరాలపై అమెరికా బలగాలు విరుచుకుపడ్డాయి. అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో 37 మంది ఉగ్రవాదులు హతమైనట్లు అగ్రదేశం ప్రకటించింది.మరణించిన ఉగ్రవాదులు ఇస్లామిక్ స్టేట్ గ్రూప్(ఐసిస్),అల్‌ఖైదాతో లింకున్న సంస్థలకు చెందినవారని అమెరికా వెల్లడించింది.హతమైన వారిలో ఇద్దరు కీలక నేతలు కూడా ఉన్నట్లు తెలిపింది.అల్‌ఖైదాతో లింకున్న హుర్రాస్ అల్దీన్ గ్రూపునకు చెందిన ఉగ్రవాదులు టార్గెట్‌గా వాయువ్య సిరియాపై దాడులు చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఇదీ చదవండి: హెజ్బొల్లాకు మళ్లీ షాక్..మరో ముఖ్యనేత హతం -
ఉద్యోగాలకు డిగ్రీ తప్పనిసరేం కాదు : కమలా హారిస్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఉద్యోగాలు, విద్యార్హతపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అద్యక్షురాలిగా ఎన్నికైన తర్వాత దేశంలో కొన్ని ఫెడరల్ ఉద్యోగాలకు డిగ్రీ అర్హతను తొలగిస్తానని పేర్కొన్నారు. ఓ వ్యక్తి నైపుణ్యాలను ప్రదర్శించేందుకు డిగ్రీ తప్పనిసరి కాదని తెలిపారు.ఈ మేరకు పెన్సిల్వేనియాలోని విల్కేస్-బారేలో ప్రసంగిస్తూ.. ‘నేను అధ్యక్షురాలిగా ఎన్నికైతే.. ఫెడరల్ ఉద్యోగాల కోసం అవసరంలేని డిగ్రీ అర్హతను తొలగిస్తాను. ఇది నాలుగు సంవత్సరాల డిగ్రీ లేని వారికి ఉద్యోగాల అవకాశాలు పెంచడానికి దోహదపడుతుంది. ’ అని తెలిపారు.కళాశాల డిగ్రీ కంటే అప్రెంటిస్‌షిప్, సాంకేంతిక కార్యక్రమాలు వంటివి విజయానికి గల మార్గాల విలువను అమెరికా గుర్తించాలని అన్నారు. వ్యక్తి నైపుణ్యాలను సూచించేందుకు డిగ్రీ తప్పనిసరి కాదని తెలిపారు. అదే విధంగా ప్రైవేట్ రంగం కూడా ఇదే విధాన్ని పాటించేలా చూస్తానని భరోసా ఇచ్చారు.అయితే కమలా హారిస్ ప్రసంగానికి. నిరసనకారుల ఆందోళన వల్ల అంతరాయం ఏర్పడింది. గాజాలో 10 వేల మంది మరణానికి కారణమైన ఇజ్రాయెల్ యుద్ధానికి యూఎస్ మద్దత తెలపడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్‌కు ఆయుధాల రవాణాపై ఆంక్షలు విధించాలని, యుద్ధాన్ని ముగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు. ఈ క్రమంలో హారిస్ మాట్లాడుతూ..తమ ఆందోళనలను గౌరవిస్తానని చెప్పారు. కాల్పుల విరమణ, బందీల రక్షణ ఒప్పందానికి తన మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. చదవండి: పుతిన్‌పై ప్రశ్న.. రిపోర్టర్‌పై బైడెన్ ఆగ్రహంఇదిలా ఉండగా హారిస్ ఇజ్రాయెల్‌కు మద్దతిస్తున్నారు. గత అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్లకు అత్యధికంగా ఓటు వేసిన కార్యకర్తలు, ముస్లింలు, అరబ్బులతో సహా పాలస్తీనా అనుకూల అమెరికన్లు ఉన్నారు. వీరు ఈసారి తమ ఆలోచనను మార్చుకుంటే.. అది హారిస్ విజయావకాశాలను దెబ్బతీసే ప్రమాదం ఉందని పరిశీలకులు అంటున్నారు.అయితే 2023లో యూఎస్ సెన్సస్ బ్యూరో విడుదల చేసిన డేటా ప్రకారం.. 25 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న అమెరికన్ యువతలో 62% కంటే ఎక్కువ మంది బ్యాచిలర్ డిగ్రీని కూడా కలిగి లేరు. 2020లో ఐదుగురు ఓటర్లలో ముగ్గురు కళాశాల డిగ్రీ కూడా చేయలేదు. ఇందుకు కారణం విద్యకు అధిక ఖర్చు అవ్వడమేనని తేలింది.కాగా అమెరికాలో నవంబర్ 5న అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ పోరులో డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ తరపున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోటీ పడబోతున్నారు. వీరిరువురు ఇటీవల ఓ టీవీ చర్చలో పాల్గొన్న విషయం తెలిసిందే. -
అణుబాంబుల సామర్థ్యం భారీగా పెంచుకుంటాం: కిమ్
ప్యాంగ్యాంగ్: భవిష్యత్తులో తమ అణ్వాయుధ సామర్థ్యాన్ని భారీగా పెంచుకోనున్నట్లు ఉత్తరకొరియా నియంత కిమ్‌జోంగ్‌ఉన్ తెలిపారు. దేశ 76వ ఆవిర్భావ వేడుకల సందర్భంగా కిమ్ మాట్లాడారు. ‘యుద్ధంలో వాడేందుకు వీలుగా దేశ అణ్వాయుధ సామర్థ్యాన్ని పెంచుకుంటాం. ఎంత పెంచాలనేదానికి హద్దే లేదు. దీనికి సంబంధించి పాలసీ రూపొందిస్తున్నాం. ఉనికిని కాపాడుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం’అని కిమ్ చెప్పారు. కొరియా ద్వీపకల్పంలో ఇటీవలి కాలంలో దక్షిణ కొరియా, అమెరికా, జపాన్ మధ్య సంబంధాలు బలపడుతున్న నేపథ్యంలో కిమ్ అణుబాంబుల పెంపు నిర్ణయం తీసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. నవంబర్‌లో అమెరికా ఎన్నికలు జరగనున్న వేళ ఉత్తరకొరియా న్యూక్లియర్ బాంబు పరీక్ష జరిపే ఛాన్సుందని దక్షిణకొరియా అధ్యక్షుని భద్రతాసలహాదారు ఇటీవలే వెల్లడించారు. ఇదీ చదవండి.. ట్రంప్ వర్సెస్ కమల..హోరాహోరీ -
USA: రెండు రాష్ట్రాల్లో కార్చిచ్చు బీభత్సం
వాషింగ్టన్: అమెరికాలో రెండు రాష్ట్రాల్లో కార్చిచ్చు వేగంగా వ్యాపిస్తోంది. కాలిఫోర్నియా, నెవాడల్లో వేలాది ఎకరాలను కార్చిచ్చు మంటలు దహించివేస్తున్నాయి. దీంతో రెండు రాష్ట్రాల గవర్నర్లు అత్యవరస్థితి ప్రకటించారు. దక్షిణ కాలిఫోర్నియాలోని శాన్ బెర్నార్డినో కౌంటీలో ఒక్కరోజులోనే 20,553 ఎకరాల విస్తీర్ణంలో చెట్లను కార్చిచ్చుకాల్చి బూడిద చేసింది.మంటల భయంతో చాలా మంది కార్చిచ్చు ప్రాంతాలను వదిలి వెళ్లిపోతున్నారు. కార్చిచ్చు ప్రభావంతో ఈ ప్రాంతంలో అధిక ఉష్ణోగ్రత నమోదువుతోంది. ఆదివారం(సెప్టెంబర్ 8) రాత్రికి రాత్రే కార్చిచ్చు భారీగా విస్తరించింది. కార్చిచ్చును అదుపు చేసేందుకు వందలకొద్ది అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నారు. అయినా ఏ మాత్రం ప్రయోజనం లేకుండా పోయింది. కార్చిచ్చు శరవేగంగా వ్యాపిస్తుండడంతో గవర్నర్ గవిన్ న్యూసమ్ అత్యవసర స్థితి ప్రకటించారు. కార్చిచ్చును అరికట్టేందుకు అగ్నిమాపక శాఖకు అదనపు సిబ్బంది, నిధులు, పరికరాలను అందజేశారు. గ్రీన్ వ్యాలీ, సీడర్ గ్లెన్, లేక్యారో హెడ్, క్రిస్ట్లైన్, వ్యాలీ ఆఫ్ ఎన్క్యాచ్మెంట్లను ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.బేస్‌లైన్, అల్పిన్ స్ట్రీట్ వద్ద గురువారం రాత్రి అడవిలో పిడుగు పడడం వల్ల కార్చిచ్చు ప్రారంభమైనట్లు భావిస్తున్నారు. ఆ తర్వాత గాలి తోడవడంతో ఇది తీవ్రరూపం దాల్చింది. శుక్రవారం మూడు వేల ఎకరాలు, శనివారం ఏడు వేల ఎకరాలను కాల్చి బూడిద చేసింది. మరోవైపు నెవాడ రాష్ట్రంలో కూడా కార్చిచ్చుల కారణంగా అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్లు గవర్నర్ జోయి లాంబర్డో ప్రకటించారు. ఇదీ చదవండి.. మూడేళ్ల చిన్నారిని రక్షించడంలోడ్రోన్ సాయం -
అమెరికాకు షాక్.. డ్రోన్‌ను కూల్చేసిన ‘హౌతీ’లు
సనా: అమెరికాకు చెందిన అత్యాధునిక నిఘా డ్రోన్‌ను కూల్చేసినట్లు యెమెన్ కేంద్రంగా పనిచేసే మిలిటెంట్ గ్రూపు హౌతీ రెబెల్స్ ప్రకటించారు. యెమెన్ గగనతలంలో ఎగురుతున్న ఎమ్క్యూ-9 మానవరహిత విమానాన్ని(యూఏవీ) కూల్చేసినట్లు హౌతీల ప్రతినిధి యాహ్యా సారీ తెలిపారు. హౌతీ నియంత్రణలోని యెమెన్ భూభాగంపై అమెరికా వైమానిక దాడులకు పాల్పడినట్లు ఆరోపించారు.2014లో యెమెన్ రాజధాని సనాను హౌతీలు స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకు అమెరికాకు చెందిన పలు డ్రోన్లు, నిఘా విమానాలను రెబెల్స్ కూల్చేశారు. ‘మారిబ్ గవర్నరేట్ గగనతలంలో రీపర్ శత్రు కార్యకలాపాలకు పాల్పడుతోంది. అందుకే దానాని కూల్చేశాం. పాలస్తీనా ప్రజలు, యెమెన్ రక్షణ కోసం హౌతీలు దాడులు కొనసాగిస్తూనే ఉంటారు’అని సారీ చెప్పారు.ఎమ్క్యూ-9 రీపర్ డ్రోన్.. ఎన్నో ప్రత్యేకతలు..అమెరికా నిఘా డ్రోన్ ఎమ్క్యూ-9 విమానాన్ని పోలి ఉంటుంది. దీన్ని రిమోట్‌తో ఆపరేట్ చేస్తారు. పైలట్లు ఉండరు. సాధారణ డ్రోన్లతో పోలిస్తే ఈ నిఘా డ్రోన్ చాలా ఎత్తులో ఎగరగలదు. 50 వేల అడుగుల ఎత్తులో 24 గంటలపాటు నిరంతరాయంగా ఎగురుతూ కీలక సమాచారం సేకరించే సామర్థ్యం దీని సొంతం. దీని విలువ సుమారు రూ.250కోట్లకు పైనే.కాగా, ఇజ్రాయెల్- పాలస్తీనాకు చెందిన ఉగ్రవాద సంస్థ హమాస్‌కు మధ్య జరుతున్న యుద్ధంలో హౌతీ రెబెల్స్ పాలస్తీనాకు మద్దతు పలుకుతున్నారు. ఎర్రసముద్రంలోని వాణిజ్య నౌకలు లక్ష్యంగా కొంత కాలం నుంచి హౌతీలు దాడులు చేస్తున్నారు. ఇటీవల గల్ఫ్ ఆఫ్ ఎడెన్‌లో ఓ వాణిజ్య నౌకపై మిసైల్‌తో దాడి చేశారు. -
ఎట్టకేలకు గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో అ‘మెరిక’న్
న్యూయార్క్: సుదీర్ఘ నిరీక్షణకు తెరపడనుంది. ఎట్టకేలకు 2009 తర్వాత గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో అమెరికా ప్లేయర్‌ను ఫైనల్లో చూడబోతున్నాం. సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో అమెరికా ఆటగాళ్లు టేలర్ ఫ్రిట్జ్, ఫ్రాన్సెస్ టియాఫో సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. తొలి సెమీఫైనల్లో వీరిద్దరు ముఖాముఖిగా తలపడనున్నారు. దాంతో ఓ అమెరికా ప్లేయర్ యూఎస్ ఓపెన్ టైటిల్ పోరుకు అర్హత సాధించడం ఖాయమైంది. 2009 వింబుల్డన్ టోరీ్నలో ఆండీ రాడిక్ తర్వాత మరో అమెరికా ప్లేయర్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ పురుషుల సింగిల్స్ ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి క్వార్టర్ ఫైనల్లో 12వ సీడ్ టేలర్ ఫ్రిట్జ్ 7–6 (7/2), 3–6, 6–4, 7–6 (7/3)తో నాలుగో సీడ్, 2020 రన్నరప్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)ను బోల్తా కొట్టించాడు. తొమ్మిదో సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా)తో జరిగిన రెండో క్వార్టర్ ఫైనల్లో 20వ సీడ్ టియాఫో 6–3, 6–7 (5/7), 6–3, 4–1తో గెలుపొందాడు. నాలుగో సెట్లో టియాఫో 4–1తో ఆధిక్యంలో ఉన్న దశలో దిమిత్రోవ్ గాయంతో వైదొలిగాడు. మహిళల సింగిల్స్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ సబలెంకా (బెలారస్), ముకోవా (చెక్ రిపబ్లిక్) సెమీఫైనల్లోకి ప్రవేశించారు. -
అమెరికాలో రోడ్డు ప్రమాదం..హైదరాబాదీల సజీవదహనం
టెక్సాస్: అమెరికాలోని టెక్సాస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు భారతీయులు మృతిచెందారు. వీరిలో ముగ్గురు హైదరాబాద్‌కు చెందిన వారు. గత వారం జరిగిన ఈ ప్రమాద ఘటన వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. మృతుల్లో హైదరాబాద్‌కు చెందిన ఆర్యన్ రఘునాథ్, ఫరూఖ్, లోకేశ్ పాలచర్ల, తమిళనాడుకు చెందిన దర్శిని వాసుదేవన్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. కార్ పూలింగ్ ద్వారా ఈ నలుగురు బెన్టోన్విల్లె ప్రాంతానికి వెళ్లేందుకు ఒకే వాహనంలో ఎక్కారు. తర్వాత రోడ్డుపై వీరి వాహనాన్ని వేరే వాహనాలు వెనుకనుంచి అతివేగంగా ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. డల్లాస్‌లో బంధువును కలిసి ఇంటికి వెళ్తున్న ఆర్యన్ రఘునాథ్, భార్యను కలిసేందుకు లోకేశ్, యూనివర్సిటీకి వెళ్తున్న దర్శిని వాసుదేవన్, ఫరూఖ్ ఈ కారులో ఎక్కారు. ప్రమాదం కారణంగా వీరు ప్రయాణిస్తున్న వాహనానికి మంటలంటుకోవడంతో బయటకు రాలేకపోయినట్లు తెలుస్తోంది. వీరి మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా కాలిపోయాయి.