వాషింగ్టన్:అమెరికా రెండోసారి అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత ట్రంప్ కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వీటిలో భాగంగా అమెరికా ఆర్మీలో ఉన్న ట్రాన్స్‌జెండర్లను ట్రంప్ పూర్తిగా తొలగించనున్నట్లు ది సండే టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. ప్రమాణస్వీకారం తర్వాత ట్రంప్ ట్రాన్స్‌జెండర్లను తొలగించే ఫైల్‌పై సంతకం చేయనున్నట్లు తెలిపింది.
ఓ వైపు ఆర్మీలోకి కొత్తవారి నియామకం అంతగా లేని ప్రస్తుత సమయంలో ట్రంప్ ట్రాన్స్‌జెండర్లను తొలగించనుండడం చర్చనీయాంశమవుతోంది. ట్రాన్స్‌జెండర్లు ఆధునిక ఆర్మీ అవసరాలకు తగినట్లుగా సేవలందించడం లేదని ట్రంప్ నిర్ణయాన్ని సమర్థించే వారు చెబుతున్నారు. ఈ మేరకు వారు సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
అయితే ఆర్మీ నుంచి తొలగించే ముందు ట్రాన్స్‌జెండర్లకు అన్ని గౌరవాలు ఇచ్చి పంపిస్తారని తెలుస్తోంది.ట్రంప్ తన తొలిటర్ములో కూడా ఇలాంటి వివాదాస్పద నిర్ణయమే తీసుకున్నారు. అయితే ట్రాన్స్ జెండర్లను ఆర్మీలోకి తీసుకోవడాన్ని మాత్రమే ట్రంప్ నిషేధించారు. అప్పటికే ఉన్నవారిని కొనసాగించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలను బైడెన్ అధికారం చేపట్టిన తర్వాత రద్దు చేశారు. కాగా, నవంబర్ 5న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ తిరిగి అధ్యక్షుడిగా ఎన్నికైన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment