Transgenders
-
వేములవాడలో ట్రాన్స్ జెండర్స్ వివాహం.. ఎందుకో తెలుసా? (ఫొటోలు)
-
ట్రాన్స్జెండర్లపై ఐఓసీ ఓ నిర్ణయానికి రావాలి
బెర్లిన్: లింగమార్పిడి చేసుకున్న క్రీడాకారుల్ని విశ్వక్రీడల్లో అనుమతించే విషయమై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని ఐఓసీ ఉపాధ్యక్షుడు యువాన్ ఆంటోని సమరాంచ్ సూచించారు. ‘ఈ విషయంలో యావత్ ప్రపంచం ఐఓసీ నిర్ణయం కోసం ఎదురుచూస్తోంది. మహిళా అథ్లెట్లు నష్టపోకుండా అంతర్జాతీయ క్రీడా సమాఖ్యలకు దిక్సూచిలా వ్యవహరించే నిర్ణయాన్ని ఐఓసీ తీసుకోవాలి. దీనిపై తాత్సారం చేయకుండా శాస్త్రీయమైన కారణాలను పరిశీలించి వెంటనే ఓ నిర్ణయానికి రావాలి’ అని 65 ఏళ్ల సమరాంచ్ పేర్కొన్నారు. లింగమార్పిడితో అమ్మాయిలుగా మారిన ట్రాన్స్జెండర్లతో నిజమైన మహిళా అథ్లెట్ల ప్రయోజనాలకు నష్టం కలుగకుండా ఐఓసీ నిర్ణయం ఉండాలన్నారు. గతేడాది రెండోసారి అమెరికా అధ్యక్ష పీఠానికి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న కఠిన నిర్ణయాల్లో ట్రాన్స్జెండర్లను అనుమతించబోమనే ప్రెసిడెన్షియల్ రూల్ కూడా ఉంది. ఇప్పటికే అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ క్రీడల్లో ట్రాన్స్జెండర్లను మహిళల కేటగిరీలో పోటీపడకుండా నిక్కచ్చిగా అమలు చేసేందుకు అధికార యంత్రాంగం కృషి చేస్తోంది. ఎందుకంటే 2028లో లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ నేపథ్యంలో ట్రంప్ ఆదేశాలు అమలవుతున్నాయి. ఈ నేపథ్యంలో సమరాంచ్ కూడా ఐఓసీ ఉన్నతస్థాయి మండలి తుది నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. స్పెయిన్‌కు చెందిన ఈ సీనియర్ ఉపాధ్యక్షుడు ప్రస్తుతం అధ్యక్ష రేసులో ఉన్నారు. పదవీకాలం ముగిసిన ప్రస్తుత అధ్యక్షుడు థామస్ బాచ్ వారసుడి ఎన్నిక కోసం మొత్తం ఏడుగురు అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఈ నెల 20న ఐఓసీ ఎన్నికలు జరుగనున్నాయి. సమరాంచ్తో పాటు ప్రపంచ అథ్లెటిక్స్ చీఫ్ సెబాస్టియన్ కో, పలు ఒలింపిక్స్‌లలో స్విమ్మింగ్ చాంపియన్ క్రిస్టీ కొవెంట్రీ, అంతర్జాతీయ సైక్లింగ్ చీఫ్ డేవిడ్ లాపర్టియెంట్, జోర్డాన్ చక్రవర్తి ఫైజల్ అల్ హుస్సేన్, ప్రపంచ జిమ్నాస్టిక్స్ హెడ్ మోరినరి వతనబె, కొత్తగా ఐఓసీలోకి వచ్చిన మల్టీ మిలియనీర్ జోహన్ ఎలియస్చ్ (ప్రపంచ స్కీయింగ్ చీఫ్)లు ఐఓసీ అధ్యక్ష పీఠంపై కన్నేశారు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో లింగమార్పిడి చేసుకున్న న్యూజిలాండ్ వెయిట్‌లిఫ్టర్ లారెల్ హబర్డ్ మహిళల ప్లస్ 87 కేజీ విభాగంలో పోటీపడింది. అయితే ఆమె చివరిదైన 14వ స్థానంతో సరిపెట్టుకుంది. ఈ క్రమంలో ఒలింపిక్స్‌లో పోటీపడ్డ తొలి ట్రాన్స్‌జెండర్ అథ్లెట్‌గా ఆమె గుర్తింపు పొందింది. -
మేం మారాం..!
సాక్షి, హైదరాబాద్: ట్రాన్స్జెండర్లకు సమాజంలో సముచిత స్థానం, గుర్తింపు ఇవ్వాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాఫిక్ విభాగంలో హోంగార్డుల మాదిరి ట్రాఫిక్ అసిస్టెంట్లు గా ఎంపిక చేయడం ద్వారా ఉపాధి కల్పించాలని ఆదేశించింది. దీంతో హైదరాబాద్ ట్రాఫిక్ విభాగంలో పైలెట్ ప్రాజెక్టుగా దీన్ని అమలు చేశారు. ఏదో ఆషామాషీగా కాకుండా ఎంపిక, శిక్షణలో కట్టుదిట్టంగా వ్యవహరించారు. గత ఏడాది డిసెంబర్ 4న గోషామహల్‌లోని పోలీసు స్టేడియంలో ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. మహిళా శిశుసంక్షేమ శాఖ కూడా ఇందులో పాలుపంచుకుంది.సాంఘిక సంక్షేమ శాఖ నుంచి అర్హులైన ట్రాన్స్జెండర్ల వివరాలను పోలీసులు సేకరించారు. కనీసం పదో తరగతి ఉత్తీర్ణులై 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు్కలు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. 165 సెంటీమీటర్ల ఎత్తు, (ఎస్టీలు 160 సెం.మీ) కలిగి ఉండాలనే నిబంధన విధించారు. శరీర దారుఢ్య పరీక్షల్లో భాగంగా 800 మీటర్ల పరుగు, లాంగ్ జంప్, షాట్ పుట్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు మొత్తం 58 మంది హాజరు కాగా 44 మంది ఎంపికయ్యారు. హావభావాల నుంచి అన్నీ మార్చి.. సిటీ ట్రాఫిక్ విభాగం ఆదీనంలోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (టీటీఐ) అధికారులు గోషామహల్ స్టేడియం కేంద్రంగా ఈ శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టారు. మొత్తం 15 రోజుల ట్రైనింగ్‌లో నాలుగు రోజులు కేవలం వారి ప్రవర్తన మార్చడానికే వెచ్చించారు. ఈ ట్రాన్స్జెండర్లు ఏళ్ల తరబడి ఓ విధమైన హావభావాల ప్రదర్శన, విపరీత ప్రవర్తన, క్రమశిక్షణ లేని జీవనశైలికి అలవాటుపడ్డారు.వీరిని పోలీసు విభాగంలోకి తీసుకుంటుండడం, అదీ ప్రజలతో నేరుగా సంబంధాలు కలిగి ఉండే ట్రాఫిక్ వింగ్‌లో పని చేయించనుండటంతో అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. నడక, నడవడిక, హావభావాలు, మాట తీరే కాదు... ఆహారం తినే విధానాన్నీ చక్కదిద్దారు. వారిలో స్ఫూర్తి నింపడం కోసం వారికి హీరోయిన్లు, యాంకర్ల వీడియోలు చూపించారు. ఆపై ఐదో రోజు నుంచి ట్రాఫిక్ శిక్షణ మొదలైంది. క్షేత్రస్థాయిలో సమర్థంగా విధులు అంబర్‌పేట, బహదూర్‌పుర, బంజారాహిల్స్, బేగంపేట, బోయిన్పల్లి, చిక్కడపల్లి, చాంద్రాయణగుట్ట, చిలకలగూడ, జూబ్లీహిల్స్, కాచిగూడ, లంగర్‌హౌస్, మహంకాళి, మలక్‌పేట్, మారేడ్‌పల్లి, నల్లకుంట, పంజగుట్ట, ఎస్సార్‌నగర్, సంతోష్‌నగర్, తిరుమలగిరి, టోలిచౌకి.. ఈ 20 ట్రాఫిక్ పోలీసుస్టేషన్లలోనూ వీరు క్షేత్రస్థాయి విధుల్లోనే ఉండటం గమనార్హం. ⇒ ట్రాఫిక్ విభాగంలో ట్రాన్స్జెండర్ల సేవలు అంటూ ప్రభుత్వం ప్రకటించినప్పుడు అంతా తేలిగ్గా తీసుకున్నారు... ⇒ సిటీ పోలీసులు ట్రాఫిక్ అసిస్టెంట్లుగా 44 మందిని ఎంపిక చేసిన తర్వాత శిక్షణ అయ్యే – వరకు వీళ్లు ఉంటారా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. ⇒ శిక్షణ పూర్తి చేసుకున్న 39 మంది విధుల్లో చేరనున్నారని తెలిశాక, వీళ్లు పట్టుమని పది రోజులు కూడా పని చేయరని, వివాదాలు తప్పవని భావించారు. ⇒ కానీ నెల రోజులుగా 38 మంది ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పని చేస్తుంటే అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ⇒ ఒకరిద్దరు ట్రాన్స్జెండర్లు భవిష్యత్తులో జరగబోయే కానిస్టేబుల్, ఎస్సై పరీక్షల్లోనూ పోటీపడేలా కోచింగ్ తీసుకునే ప్రయత్నాలు ప్రారంభించడం మరింత ఆసక్తికరం.వెన్నుతట్టి ప్రోత్సహించి..ఎంపికైన 44 మందిలో 39 మంది మాత్రమే శిక్షణ పూర్తి చేసుకున్నారు. మిగిలిన ఐదుగురూ అప్పటికే ఉన్న ఉద్యోగాల కారణంగా వెళ్లిపోయారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించిన తర్వాత తుది జాబితా ఖరారు చేశారు. ‘సమాజంలో మీకు ఎదురవుతున్న అవమానాలు, మీ పట్ల వివక్షను చూసిన ప్రభుత్వం ఈ అవకాశం ఇచ్చింది.మీ పని తీరుపైనే మీలాంటి ఇతరుల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది..’అంటూ వెన్ను తట్టి హితవు పలికిన నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ డిసెంబర్ 22న వీరి శిక్షణ పూర్తి అయినట్లు ప్రకటించారు. వీరి కవాతునూ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో వీక్షించారు. అనంతరం డిసెంబర్ 26 నుంచి ట్రాన్స్జెండర్లు ట్రాఫిక్ అసిస్టెంట్లుగా తమ కొత్త జీవితం ప్రారంభించారు. ఇప్పటికి నెల గడిచింది. ఈ నెల రోజుల్లో కేవలం ఒక్కరు మాత్రమే ఈ ఉద్యోగం వదిలి వెళ్లగా...మిగిలిన వారు సమర్థంగా తమ విధులు నిర్వర్తిస్తున్నారు. -
హైదరాబాద్: ట్రాఫిక్ విధుల్లోకి ట్రాన్స్జెండర్లు
హైదరాబాద్, సాక్షి: ట్రాన్స్జెండర్లు.. ఇక నుంచి ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర అడుక్కోరు!. కానీ, అవే సిగ్నల్స్ దగ్గర అతిత్వరలో ట్రాఫిక్‌ను కంట్రోల్ చేస్తూ కనిపించబోతున్నారు. ఈ మేరకు.. సెలక్షన్లో భాగంగా గోషామహల్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో తాజాగా వాళ్లకు ఈవెంట్స్ నిర్వహించారు అధికారులు.ఆసక్తిగా ఉన్న ట్రాన్స్జెండర్లను గుర్తించి.. వాళ్ల సేవలను ఉపయోగించుకోవాలని ఈ మధ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు.. ఈవెంట్స్‌కు వచ్చిన వాళ్లకు రన్నింగ్, జంపింగ్ ఇతర పరీక్షలు నిర్వహించారు. అర్హత సాధించిన వారికి ప్రత్యేకంగా ట్రాఫిక్ నిబంధనల అమలుపై శిక్షణ ఇచ్చి విధుల్లోకి తీసుకోనున్నారు.ప్రస్తుతం ట్రాఫిక్ విభాగంలో పోలీసులు, హోంగార్డులు విధులు నిర్వర్తిస్తున్నారు. హోంగార్డుల తరహాలో ట్రాన్స్ జెండర్లను కూడా వాలంటీర్లుగా నియమించనున్నారు. అర్హులైన వారిని ఎంపిక చేసి పది రోజులపాటు ట్రాఫిక్ విధులపై శిక్షణ అందిస్తారు. వీరికి ప్రత్యేక యూనిఫాంతోపాటు ప్రతి నెల నిర్దేశిత స్టైపెండ్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక తెలంగాణవ్యాప్తంగా 3 వేల మందికి పైగా ట్రాన్స్ జెండర్లుంటే.. వారిలో నగరంలోనే వెయ్యి మంది ఉన్నట్టు ఒక అంచనా అంచనా. -
ట్రాన్స్జెండర్లకు ట్రంప్ షాక్..!
వాషింగ్టన్:అమెరికా రెండోసారి అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత ట్రంప్ కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వీటిలో భాగంగా అమెరికా ఆర్మీలో ఉన్న ట్రాన్స్జెండర్లను ట్రంప్ పూర్తిగా తొలగించనున్నట్లు ది సండే టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. ప్రమాణస్వీకారం తర్వాత ట్రంప్ ట్రాన్స్జెండర్లను తొలగించే ఫైల్‌పై సంతకం చేయనున్నట్లు తెలిపింది. ఓ వైపు ఆర్మీలోకి కొత్తవారి నియామకం అంతగా లేని ప్రస్తుత సమయంలో ట్రంప్ ట్రాన్స్జెండర్లను తొలగించనుండడం చర్చనీయాంశమవుతోంది. ట్రాన్స్జెండర్లు ఆధునిక ఆర్మీ అవసరాలకు తగినట్లుగా సేవలందించడం లేదని ట్రంప్ నిర్ణయాన్ని సమర్థించే వారు చెబుతున్నారు. ఈ మేరకు వారు సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే ఆర్మీ నుంచి తొలగించే ముందు ట్రాన్స్జెండర్లకు అన్ని గౌరవాలు ఇచ్చి పంపిస్తారని తెలుస్తోంది.ట్రంప్ తన తొలిటర్ములో కూడా ఇలాంటి వివాదాస్పద నిర్ణయమే తీసుకున్నారు. అయితే ట్రాన్స్ జెండర్లను ఆర్మీలోకి తీసుకోవడాన్ని మాత్రమే ట్రంప్ నిషేధించారు. అప్పటికే ఉన్నవారిని కొనసాగించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలను బైడెన్ అధికారం చేపట్టిన తర్వాత రద్దు చేశారు. కాగా, నవంబర్ 5న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ తిరిగి అధ్యక్షుడిగా ఎన్నికైన విషయం తెలిసిందే. -
సీఎం చెప్పినా స్పందన లేదు!
సాక్షి, సిటీబ్యూరో: సాధారణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి వాళ్లు ఎలాంటి ఆదేశాల జారీ చేసినా.. క్షణాల్లో అమలులోకి వస్తాయి. సుదీర్ఘమైన కసరత్తు అవసరమైతే ఆ చర్యలు మొదలువతాయి. అవసరమైతే కమిటీలు, కమీషన్లు ఏర్పాటవుతాయి. అధికారులంతా ఆఘమేఘాల మీద ఉరుకులుపరుగులు పెడతారు. అయితే సీఎం ఎ.రేవంత్‌రెడ్డి ‘ట్రాఫిక్–ట్రాన్స్జెండర్ల సేవలు’ విషయంలో గత నెల 13న కీలక ప్రకటన చేశారు. దీనికి సంబంధించి అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఉన్నతమైన ఆలోచన చేసిన ముఖ్యమంత్రి.. ట్రాన్స్‌జెండర్స్ వల్ల సామాన్యులకు ఎదురవుతున్న సమస్యల తొలగింపుతో పాటు వారికి గౌరవప్రదమైన జీవితం అందించడం కోసం ట్రాఫిక్ వాలంటీర్లుగా నియమించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ నియంత్రణ బాధ్యతల్లో వారికీ భాగస్వామ్యం కల్పించాలని యోచించారు. ట్రాఫిక్ ఇక్కట్లు తప్పించడం కోసం పోలీసులు, హోంగార్డ్స్ తరహాలోనే ట్రా¯Œన్స్జెండర్లనూ వినియోగించాలని అధికారులకు ఆదేశించారు. ట్రాన్స్జెండర్లకు ఉద్యోగావకాశాలు తగ్గాయని, ఇలా చేస్తూ ప్రతి నెలా నిరీ్ణత మొత్తం అందిస్తే వారికి కొంత ఉపాధి కల్పింనట్లవుతుందని భావించారు. ప్రత్యేక శిక్షణ, యూనిఫామ్ ఉండాలంటూ... ఈ ప్రతిపాదనల్ని అమలులో పెట్టడానికి తక్షణం చర్యలు తీసుకోవాలంటూ గత నెల 13న అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో రోడ్లు, ఫుట్‌పాత్‌లతో పాటు ఇతర అభివృద్ధి పనులు, పారిశుద్ధ్యం తదితర అంశాలపై సచివాలయంలో నిర్వహించిన సమీక్ష సందర్భంగా సీఎం ఈ విషయం స్పష్టం చేశారు. ట్రాఫిక్ వాలంటీర్ల నియామకం కోసం ఆసక్తి ఉన్న ట్రాన్స్జెండర్ల వివరాలు సేకరించాలని, వారం నుంచి పది రోజుల పాటు అవసరమైన శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఈ వాలంటీర్లకు ప్రత్యేక యూనిఫామ్ కూడా అందించాలన్న ముఖ్యమంత్రి కొన్ని నమూనాలను పరిశీలించారు. సిబ్బంది కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ట్రాఫిక్ విభాగానికి ఈ ప్రయోగం సక్సెస్ అయితే పెద్ద ఉపశమనమే లభిస్తుంది. ఇప్పటికే ఆ రెండు నగరాల్లో అమలు... ట్రాఫిక్ విధుల్లో ట్రాన్స్జెండర్ల సేవలు వినియోగం అనేది దేశంలో సరికొత్త విధానమేమీ కాదు. తమిళనాడు రాజధాని చెన్నై ట్రాఫిక్ పోలీసులు 2013లోనే ఈ తరహా ప్రయోగం చేశారు. వన్ ఇండియా రోడ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ సహాయంతో పది మంది ట్రాన్స్జెండర్లకు శిక్షణ ఇచ్చి ట్రాఫిక్ వాలంటీర్లుగా మార్చారు. వారికి నెలకు రూ.9 వేల పారితోషకం అందించారు. 2018లో కర్ణాటకలోని టుమ్కూరు పోలీసులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రద్దీ వేళల్లో ట్రాఫిక్ నియంత్రణతో పాటు రహదారి నిబంధనలు, రోడ్డు భద్రతా అంశాలపై అవగాహన కల్పించడానికి ట్రాన్స్జెండర్లతో ఓ బృందాన్ని వేర్పాటు చేశారు. వాలంటీర్ల మాదిరిగా వీరికీ పారితోíÙకం అందిస్తూ రహదారులపై సేవలు వినియోగించుకున్నారు. కొచి్చన్ మెట్రో రైల్‌తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ ట్రాన్స్జెండర్లను వాలంటీర్లుగా వినియోగించిన సందర్భాలు ఉన్నాయి. ఒక్క అడుగూ వేయని అధికారులు...ట్రాన్స్జెండర్ల సేవలు వినియోగం విషయంలో ముఖ్యమంత్రి ఆదేశాలను అమలులో పెట్టే దిశలో అధికారులు కనీసం ఒక్క అడుగు కూడా వేయలేదు. దేశంలో ప్రస్తుతం ఎక్కడెక్కడ అమలులో ఉంది? ఫలితాలు ఏంటి? ఎలాంటి సవాళ్లు ఎదురవుతున్నాయి? తదితరాలు అధ్యయనం పైనా దృష్టి పెట్టలేదు. వీరి ఎంపికకు సంబంధించి ట్రాఫిక్ విభాగాలు, ట్రాన్స్జెండర్ల సంఘాలతోనూ సంప్రదింపులు జరపలేదు. ముఖ్యమంత్రి జారీ చేసిన ఆదేశాలకు సంబంధించిన ఆచరణ విధివిధానాలను ఏ అధికారీ సమీక్షించలేదు. కనీసం ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) సైతం ఈ కోణంలో చర్యలు తీసుకోకపోవడంతో క్షేత్రస్థాయి అధికారులు అసలు పట్టించుకోవట్లేదు. జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఉన్న ఆమ్రపాలి ఆంధ్రాకు వెళ్లిపోవడం, ప్రస్తుతం బల్దియాకు ఇన్చార్జ్ కమిషనర్ ఉండటంతో ‘ట్రాఫిక్ వాలంటీర్ల’ ప్రతిపాదన పట్టాలెక్కే పరిస్థితి కనిపించట్లేదు. -
ముందు వేషం.. ఆపై అవతారం
సాక్షి, హైదరాబాద్: కొత్తగా నిర్మించిన ఇల్లు, ప్రారంభించిన దుకాణం, శుభకార్యం జరిగే చోట్లకు వచ్చిన హిజ్రాలు దూషిస్తే చెడు జరుగుతుందనే సెంటిమెంట్ చాలా మందికి ఉంటోంది. దీనిని క్యాష్ చేసుకునేందుకు అనేక మంది నకిలీ ట్రాన్స్జెండర్లు రంగంలోకి దిగి బెదిరింపు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ దందా వ్యవస్థీకృతంగా సాగుతున్నట్లు ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు గుర్తించారు. శుక్రవారం కార్ఖానా ఠాణా పరిధిలో వరుస దాడులు చేసిన అధికారులు ప్రధాన నిర్వాహకురాలైన నకిలీ హిజ్రా, ముగ్గురు సహాయకులతో పాటు నలుగురు హిజ్రా వేషం వేసుకున్న పురుషులను అరెస్టు చేశారు. ఈ మేరకు డీసీపీ వైవీఎస్ సుదీంద్ర వివరాలు వెల్లడించారు. ఇటీవల పెరిగిపోయిన నకిలీ హిజ్రాల వేధింపుల నేపథ్యంలో నగర వ్యాప్తంగా టాస్క్‌ఫోర్స్ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. లాభదాయకంగా ఉండటంతో..ఎవరైతే పుట్టుకతో నపుంసకులుగా ఉంటారో వారిని మాత్రమే హిజ్రాలుగా పరిగణించాల్సి ఉంది. అయితే నగర వ్యాప్తంగా కూడళ్లతో పాటు దుకాణాలు, వాహనచోదకులు, పాదచారులను బెదిరించి, వారి వెంటపడి డబ్బు వసూలు చేసే నకిలీ హిజ్రాలు అనేక మందిని ఆకర్షిస్తున్నారు. ఈ దందా లాభదాయకంగా ఉందని భావించే తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. శివార్లలో తిష్టవేస్తూ తొలినాళ్లల్లో హిజ్రాల వేషం వేసుకుని వసూళ్లు ప్రారంభిస్తున్నారు. ఆపై నిర్ణీత మొత్తం తమ వద్దకు చేరిన తర్వాత ముంబై, పుణే సహా మహారాష్ట్రలోని వివిధ నగరాలకు వెళ్లి శస్త్రచికిత్సలు చేయించుకోవడం ద్వారా నకిలీ హిజ్రాలుగా మారుతున్నారు. ఆపై మరికొంత మందినీ తమతో చేర్చుకుని ముందు వేషం, ఆ తర్వాత అవతారం ఎత్తించి దందా కొనసాగిస్తున్నారు. ఒక్కడు వచ్చి ఆరుగురిని ‘చేరదీసి’..శ్రీకాకుళం జిల్లా, ఆముదాలవలసకు చెందిన సురద కుమార్ కొన్నేళ్ల క్రితం నగరానికి వలసవచ్చి యాప్రాల్‌లో స్థిరపడ్డాడు. తొలినాళ్లల్లో హిజ్రా వేషం వేసుకుని, ఆపై శస్త్రచికిత్స చేయించుకుని చాందినీగా మారి దందా నడిపాడు. కొన్నాళ్లకు అనంతపురం జిల్లాకు నల్లన్నగారి రమేష్ ఎత్తప్పగారి మల్తీలను ఆకర్షించి అదే పంథాలో జయశ్రీ,, మనీషాగా మార్చాడు. చాందినీ సహాయకులుగా మారిన వీరు తమ జిల్లాకే చెందిన కె.సురేష్ ఎస్కే బాష, ఎస్కే షఫీ, ఎష్కే ఇషాక్‌లను నగరానికి రప్పించి ఆశ్రయం కలి్పంచారు. ఈ నలుగురితోనూ హిజ్రా వేషం వేయించిన చాందినీ వీరికి చిత్ర, ముంతాజ్, ఆషు, సమీర అనే పేర్లు పెట్టాడు. చాందినీ, జయశ్రీ, మనీషా వీరికి ఆశ్రయం ఇవ్వడంతో పాటు ఆహారం, మద్యం తదితరాలు అందిస్తూ వసూళ్లు చేయిస్తున్నారు. అలా వచి్చన డబ్బు తీసుకునే వీరు రోజుకు ఒక్కొక్కరికీ రూ.500 చొప్పున చెల్లిస్తున్నారు. కొన్నాళ్లకు వీరికీ శస్త్రచికిత్సలు చేయించి నకిలీ హిజ్రాలుగా మార్చేందుకు పథకం వేశారు.సీపీ ఆదేశాలతో రంగంలోకి..రాజధానిలోని రోడ్ల పైన, చౌరస్తాల్లోనూ, దుకాణాల వద్ద ఈ నకిలీ హిజ్రాల ఆగడాలపై వరుస ఫిర్యాదులు రావడంతో కొత్వాల్ సీవీ ఆనంద్ సీరియస్‌గా తీసుకున్నారు. నగర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టాల్సిందిగా టాస్క్‌ఫోర్స్ పోలీసులను ఆదేశించారు. నార్త్‌జోన్ టాస్‌్కఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.సైదులు నేతృత్వంలో ఎస్సైలు శ్రీనివాసులు దాసు, పి.గగన్‌దీప్ కార్ఖానా ప్రాంతంలో శుక్రవారం వరుస దాడులు చేశారు. ఫలితంగా చాందినీతో పాటు ఇద్దరు సహాయకులు, హిజ్రా వేషం వేసిన వాళ్లు చిక్కారు. తదుపరి చర్యల నిమిత్తం వీరిని స్థానిక పోలీసులకు అప్పగించారు. నగరంలో ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు 100కు లేదా స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసి సహాయం పొందాలని అధికారులు కోరుతున్నారు. -
ట్రాఫిక్ నియంత్రణకు ట్రాన్స్జెండర్లు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నియంత్రణలో కొత్త ప్రయోగానికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రించేందుకు ట్రాన్స్జెండర్లను వలంటీర్లుగా నియమించుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ పోలీస్ విభాగంతో పాటు హోంగార్డ్స్ ప్రస్తుతం ఈ విధులు నిర్వహిస్తున్నారు. హోంగార్డ్స్ తరహాలోనే ట్రాన్స్జెండర్లకు ఈ విధులు అప్పగించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆర్థిక భరోసా.. సమాజంలో గౌరవం వలంటీర్లుగా పనిచేసే ట్రాన్స్జెండర్లకు ప్రతినెలా కొంత స్టైఫండ్ ఇవ్వాలని, దీంతో వారికి ఆర్థికంగా భరోసా కలి్పంచడంతో పాటు సమాజంలో గౌరవస్థానం కల్పించవచ్చునని సీఎం పేర్కొన్నారు. ఆసక్తిగా ఉన్న ట్రాన్స్జెండర్ల వివరాలను సేకరించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. వారం, పది రోజులపాటు వారికి అవసరమైన ప్రత్యేక శిక్షణను కూడా అందించాలని, విధుల్లో ఉండే ట్రాన్స్జెండర్లకు ప్రత్యేక యూనిఫామ్ కూడా ఉండాలని అధికారులకు సూచించారు.శుక్రవారం సచివాలయంలో జీహెచ్ఎంసీ పరిధిలోని రోడ్లు, ఫుట్‌పాత్‌లు, ఇతర అభివృద్ధి పనులు, పారిశుద్ధ్యం తదితర అంశాలపై సమీక్షా సమావేశం సందర్భంగా సీఎం ఈ విషయం వెల్లడించారు. సీఎం నిర్ణయంతో ఈ కార్యక్రమం విజయవంతమైతే దేశంలో ఇతర నగరాలు కూడా దీనిని ఆదర్శంగా తీసుకునే అవకాశం ఉంది. జీహెచ్ఎంసీలో పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం.. అడిషనల్ కమిషనర్లందరూ క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. పారిశుద్ధ్యం, ఘనవ్యర్థాల నిర్వహణ మెరుగుపడాలని చెప్పారు. -
మోదీ ప్రమాణ స్వీకారానికి ట్రాన్స్జెండర్లు, పారిశుధ్య కార్మికులు, కూలీలు
న్యూఢిల్లీ: మోదీ ప్రమాణ స్వీకారానికి భిన్న వర్గాల ప్రజలు హాజరయ్యారు. ట్రాన్స్జెండర్లు, పారిశుధ్య కార్మికులతోపాటు నూతన పార్లమెంట్ భవన నిర్మాణంలో పాలుపంచుకున్న కూలీలు సైతం హాజరుకావడం విశేషం. ప్రమాణ స్వీకారం కంటే ముందు ట్రాన్స్జెండర్లను కేంద్ర మాజీ మంత్రి వీరేంద్ర కుమార్, పారిశుధ్య కార్మికులను బీజేపీ ఎంపీ గజేంద్రసింగ్ షెకావత్ ఘనంగా సత్కరించారు. ‘సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్’ అంటూ ప్రధాని మోదీ ఇచి్చన పిలుపును అందిపుచ్చుకుంటూ ట్రాన్స్జెండర్లను సత్కరించినట్లు వీరేంద్ర కుమార్ తెలిపారు. -
ట్రాన్స్‌జెండర్స్‌కు అర్హత లేదు
అహ్మదాబాద్: అంతర్జాతీయ మహిళల క్రికెట్ సమగ్రతను కాపాడేందుకు, గౌరవం పెంచేందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇక మీదట లింగ మార్పిడి చేసుకున్న అబ్బాయిలు పూర్తిగా అమ్మాయిల హోదా పొందినప్పటికీ అంతర్జాతీయ మహిళల క్రికెట్లో ఆడేందుకు అర్హత లభించదని మంగళవారం ఇక్కడ జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. తొమ్మిది నెలల సంప్రదింపులు, సుదీర్ఘ కసరత్తు తర్వాతే ఈ విధాన నిర్ణయం తీసుకున్నామని ఐసీసీ సీఈఓ జెఫ్ అలర్డైస్ తెలిపారు. అయితే దేశవాళీ క్రికెట్లో ట్రాన్స్‌జెండర్స్‌ను ఆడించే విషయమై ఆయా సభ్యదేశాలకే నిర్ణయాధికారం కల్పించామని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది సెపె్టంబర్లో అంతర్జాతీయ క్రికెట్లో తొలి ‘ట్రాన్స్‌జెండర్’గా కెనడాకు చెందిన 29 ఏళ్ల డానిల్ మెక్‌గహే గుర్తింపు పొందింది. 2024 టి20 ప్రపంచకప్‌నకు అర్హత సాధించేందుకు నిర్వహించిన అమెరికన్ క్వాలిఫయర్ టోర్నీలో ఆమె కెనడా జట్టు తరఫున ఆరు మ్యాచ్‌లు ఆడి 118 పరుగులు సాధించింది. డానిల్ మెక్‌గహే కెనడా జాతీయ జట్టు తరఫున ఇప్పటికే కొన్ని మ్యాచ్‌లు ఆడినా వాటికి అంతర్జాతీయ హోదా లేదు. డానిల్ ఆ్రస్టేలియాలో పుట్టి మూడేళ్ల క్రితం కెనడాకు వలస వచ్చింది. 2020లో పురుషుడి నుంచి స్త్రీగా మారేందుకు సిద్ధమైన ఆమె 2021లో వైద్యపరంగా పూర్తి స్థాయిలో మహిళగా మారింది. ట్రాన్స్‌జెండర్స్‌కు అంతర్జాతీయ క్రికెట్లో ఆడే అవకాశం కల్పించడంపై తీవ్ర విమర్శలు రావడంతో ఐసీసీ నిబంధనలు మార్చింది. మరోవైపు మ్యాచ్ అధికారులు, అంపైర్లకు ఇకపై లింగబేధం లేకుండా పురుష అంపైర్లతో సమానంగా మహిళా అంపైర్లకు వేతన భత్యాలు ఇస్తారు. -
కొత్త పంథా.. అదే దందా!
హైదరాబాద్: కబ్జారాయుళ్లు కొత్త పంథా ఎంచుకున్నారు. ప్రభుత్వ స్థలంలో నిర్మిస్తున్న గదుల వద్ద ట్రాన్స్జెండర్లను ముందు పెట్టి.. వెనక కబ్జాల పర్వాన్ని కొనసాగిస్తున్నారు. గాజుల రామారం డివిజన్ కై సర్ నగర్‌లోని ప్రధాన రహదారిని ఆనుకొని హనుమాన్ దేవాలయానికి ఎదురుగా ఉన్న సర్వే నంబర్ 342/1 ప్రభుత్వ స్థలంలో ఓ కుల సంఘం పేరిట వారం రోజులుగా 200కు పైగా గదులు నిర్మించారు. ఈ నిర్మాణాల వెనక సదరు కుల సంఘం పెద్దగా చెప్పుకుంటున్న ఓ వ్యక్తి తన తతంగాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ విషయమై సోమవారం ‘ఇదే తరుణం.. కబ్జా చేద్దాం’ అని శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీంతో మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ స్పందించారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని. కబ్జాకు పాల్పడుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు రజనీకాంత్, రేణుకలు తమ సిబ్బందితో అక్కడికి చేరుకొని రెండు గదులను కూల్చివేశారు. దీంతో కబ్జా వెనకాల ఉన్న ఓ కుల పెద్ద ట్రాన్స్జెండర్లను రంగంలోకి దింపాడు. కూల్చివేతలను అడ్డుకొని నానా హంగామా చేసి రెవెన్యూ అధికారులను పరుగులెత్తించారు. చేసేదేమీ లేక వెనుదిరగాల్చి వచ్చింది. సదరు వ్యక్తిపై విచారణ.. సర్వే నంబర్ 342/1 ప్రభుత్వ స్థలంలో కుల సంఘం పేరుతో గదులను నిర్మిస్తూ రూ.కోట్లు ఆర్జిస్తున్న వ్యక్తిపై సంబంధిత అధికారులు రహస్యంగా విచారణ చేపట్టారు. సదరు వ్యక్తి గతంలో చాలాచోట్ల కుల సంఘం పేరిట ప్రభుత్వ స్థలాన్ని ప్లాట్లుగా చేసి, ఒక్కో ప్లాటును నలుగురికి అమ్మి ఎంతో మందిని మోసం చేసినట్లు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. -
వినిపిస్తోందా.. మూడో స్వరం
ప్రజాస్వామ్య సౌధమైన శాసనసభలో మూడో స్వరం వినిపించేందుకు ట్రాన్స్జెండర్లు ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. వరంగల్ తూర్పు సెగ్మెంట్ నుంచి బీఎస్పీ అభ్యర్థి గా పోటీ చేసేందుకు రామన్నపేటకు చెందిన చిత్రపు పుష్పిత లయకు తాజాగా అవకాశం లభించగా, గత ఎన్నికల్లో గోషామహల్ నుంచి బీఎల్ఎఫ్ అభ్యర్థి గా పోటీ చేసిన చంద్రముఖి కూడా ఈసారి ఇండిపెండెంట్‌గా బరిలో నిలిచేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇక ట్రాన్స్జెండర్లతో పాటు ప్రజల్లో ఓటు అవగాహనకు రాష్ట్ర ఎన్నికల ప్రచార కర్తగా వరంగల్‌కు చెందిన ట్రాన్స్‌జెండర్ లైలాను రాష్ట్ర ఎన్నికల కమిషన్ నియమించింది. ఆమె తమ కమ్యూనిటీ వారు ఓటు నమోదు చేసుకునేందుకు అవగాహన కలిగిస్తున్నారు. – సాక్షిప్రతినిధి, వరంగల్/హైదరాబాద్ రాష్ట్రంలో సుమారు 50 వేల మందికి పైగా ట్రాన్స్జెండర్లు ఉన్నట్లు స్వచ్చంద సంస్థలు అంచనా వేస్తున్నాయి. కానీ ఓటర్లుగా నమోదైన వారి సంఖ్య మాత్రం చాలా తక్కువగా ఉంది. ట్రాన్స్జెండర్ల పట్ల సమాజం నుంచి ఎదురయ్యే వివక్ష, అవమానాలు, వేధింపుల కారణంగానే చాలామంది ‘మగవారు’గానే మనుగడ కొనసాగిస్తున్నట్టు ఆయా సంస్థలు చెబుతున్నాయి. అన్ని జీవన సమూహాల్లాగే ట్రాన్స్జెండర్లు కూడా స్వేచ్ఛా యుతమైన జీవనాన్ని కొనసాగించే హక్కును కలిగి ఉన్నట్లు గతంలో వెలువరించిన సుప్రీంకోర్టు తీర్పు వారికి గొప్ప ఆత్మస్థైర్యాన్ని కలిగించింది. మరోవైపు వివిధ స్వచ్చంద సంస్థలు, ప్రజాసంఘాలు, హక్కులసంఘాల నుంచి వారికి సంపూర్ణమైన మద్దతు, అండదండలు లభించాయి. దీంతో ట్రాన్స్ జెండర్లు సంఘటితమయ్యారు. తమ ఉనికిని బలంగా చాటుకొనేందుకు ఎన్నికలను ఒక అస్త్రంగా మలుచుకున్నారు. తీవ్రమైన వివక్ష, అణచివేతకు గురవుతున్న ట్రాన్స్జెండర్ల అస్తిత్వాన్ని చాటుకొనేందుకు, ఆకాంక్షలనువెల్లడించేందుకు చట్టసభలను వేదికగా చేసుకోవాలని భావిస్తున్నట్లు చిత్రపు పుషి్పత లయ, చంద్రముఖి చెబుతున్నారు. బీఎస్పీ కార్యకర్త నుంచి అభ్యర్థిగా చిత్రపు పుష్పిత లయ ప్రస్థానం వరంగల్ రామన్నపేటకు చెందిన చిత్రపు పుష్పిత లయ బీఎస్పీ పార్టీ కార్యకర్తగా ఢిల్లీలో ఐదేళ్లు పనిచేశారు. ఆ తర్వాత డాక్టర్ అంబేడ్కర్ అసోసియేషన్ మహిళా అధ్యక్షురాలిగా పనిచేశారు. రెండేళ్ల నుంచి వరంగల్ తూర్పు బీఎస్పీ నియోజకవర్గ ఇన్చార్జ్గా పనిచేస్తున్నారు. అసెంబ్లీలో అడుగు పెట్టేందుకు ట్రాన్స్జెండర్ల తరఫున తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈసారి స్వతంత్ర అభ్యర్థి గా చంద్రముఖి ట్రాన్స్జెండర్ల అస్తిత్వాన్ని చాటుకొనేందుకు మరోసారి ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్టు మువ్వల చంద్రముఖి వెల్లడించారు. భరతనాట్య కళాకారిణి. వ్యాఖ్యాత, సినీనటి అయిన చంద్రముఖి దశాబ్దకాలంగా ట్రాన్స్‌జెండర్స్ హక్కుల కోసం పోరాడుతున్నారు. ప్రజాస్వామ్య సౌధంలో మూడోస్వరాన్ని వినిపించేందుకే 2018లో ట్రాన్స్జెండర్ల ప్రతినిధిగా, బీఎల్ఎఫ్ అభ్యర్థి గా గోషామహల్ నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆమెకు 1125 ఓట్లు లభించాయి. ఈ సారి మాత్రం స్వతంత్ర అభ్యర్థిగా నిలబడాలనుకుంటున్నట్లు చెప్పారు. ఏ నియోజకవర్గం నుంచి అనేది ఇంకా నిర్ణయించుకోలేదన్నారు. ఎన్నికల ప్రచారకర్తగా లైలా.. మహబూబాబాద్ జిల్లాలోని అన్నారం గ్రామానికి చెందిన లైలా అలియాస్ ఓరుగంటి లక్ష్మణ్ డిగ్రీ చదువుకునే రోజుల్లో హిజ్రావైపు మళ్లారు. పూర్తిస్థాయి ట్రాన్స్‌జెండర్‌గా మారి డబుల్ పీజీ కూడా చేశారు. 20 ఏళ్ల నుంచి మ్యారీ అనే స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో హెచ్ఐవీ ప్రాజెక్ట్‌లో హెల్త్ వర్కర్‌గా పనిచేస్తూ వరంగల్‌లో ఉంటున్నారు. రాష్ట్ర హిజ్రాల వెల్ఫేర్ సంఘం సభ్యురాలుగా కూడా ఎన్నికయ్యారు. వారి కమ్యూనిటీ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రస్థాయిలో కృషి చేస్తున్నారు. ఈమె సేవలను గుర్తించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ ఏడాది సెపె్టంబర్ 19వ తేదీన ఎన్నికల ప్రచారకర్త (అంబాసిడర్)గా నియమించడం విశేషం. -
ట్రాన్స్జెండర్లకు గుర్తింపు కార్డులు
ఏలూరు (టూటౌన్): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో అర్హులైన ట్రాన్స్జెండర్లకు గుర్తింపుకార్డులు జారీ చేస్తున్నట్లు విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జీసీహెచ్ ప్రభాకర్ అన్నారు. స్థానిక కలెక్టరేట్ ఆవరణలోని ఏడీ కార్యాలయంలో శుక్రవారం ట్రాన్స్జెండర్లకు గుర్తింపు కార్డులను అందజేశారు. జిల్లాలో ఇప్పటివరకు 126 మంది ట్రాన్స్జెండర్లకు గుర్తింపుకార్డులు అందజేశామని, ఇంకా అర్హులుంటే తమ వివరాలతో కార్యాలయ పనివేళల్లో దరఖాస్తు అందజేయాలని కోరారు. -
ట్రాన్స్జెండర్ల వేషంలో బలవంతపు వసూళ్లు
హైదరాబాద్: ట్రాన్స్జెండర్లుగా నటిస్తూ.. ప్రజలను వేధిస్తూ.. బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న ముఠాను నార్త్‌జోన్ పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు నార్త్‌జోన్ డీసీపీ చందనా దీప్తి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నార్త్‌జోన్ పరిధిలోని గోపాలపురం, మారేడుపల్లి, మహంకాళి, రాంగోపాల్‌పేట పోలీసు స్టేషన్ల పరిధిలో ట్రాన్స్జెండర్ల పేరిట బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న 19 మందిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. వీరికి వైద్య పరీక్షలు నిర్వహించి రిమాండ్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ట్రాఫిక్ జంక్షన్లు, పబ్లిక్ ప్లేసెస్‌లో బెగ్గింగ్‌కు పాల్పడుతున్నట్లు తెలిపారు. వాళ్లు అడిగిన వెంటనే డబ్బులు ఇవ్వకుంటే కార్లపై ఉమ్మివేయడం, దాడి చేయడం, దుర్భాషలాడటం వంటి చర్యలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయన్నారు. రాజేశ్ యాదవ్, అనిత అనే వ్యక్తులు నాయకులుగా బెగ్గింగ్ ముఠాను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అరెస్టు చేసిన మొత్తం 19 మంది మగవారే అయినప్పటికీ ట్రాన్స్జెండర్లకు వేషం మార్చుకుని మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. వీరిలో ఇద్దరు ఆపరేషన్ చేయించుకుని మరీ ట్రాన్స్జెండర్లుగా మారినట్లు తేలిందన్నారు. ఉదయం పూట బెగ్గింగ్‌తో పాటు సూర్యాస్తమయం తర్వాత అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లుగా గుర్తించామన్నారు. ఇటీవల ఓ ప్రైవేటు ఫంక్షన్‌కు వెళ్లి నిర్వాహకుల నుంచి రూ.లక్ష డిమాండ్ చేశారు. వారు అడిగిన డబ్బు ఇవ్వనందుకు వేధింపులతో పాటు, బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ మేరకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో స్పెషల్ డ్రైవ్ ద్వారా నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ ముఠాలో మరికొందరు కూడా ఉండే అవకాశమున్నందున, ఈ కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నామన్నారు. త్వరలోనే బెగ్గింగ్ ముఠాల గుట్టు రట్టు చేస్తామన్నారు. పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చేంత వరకు దాడులు కొనసాగిస్తామన్నారు. సమావేశంలో ఏసీపీలు సుధీర్, రవీందర్, వివిధ పోలీసు స్టేషన్ల ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. -
ట్రాన్స్జెండర్ల పైశాచికం.. గుండు కొట్టించి.. ఆపై మూత్ర విసర్జన చేసి..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని కాస్గంజ్ జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. ఐదుగురు ట్రాన్స్‌జండర్లు కలిసి ఓ వ్యక్తికి గుండు కొట్టింటారు. అనంతరం అతనిపై మూత్రం పోశారు. అంతేకాకుండా బాధితుని వద్ద నుంచి రూ.10 వేలు దోచుకెళ్లారు. జులై 26న ఈ ఘటన జరిగింది. కాగా.. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితుడు రాఫికుల్.. నిందితురాలి ఇంట్లో పనిచేసేవాడు. ఇటీవల అక్కడ పని మానేసి మరో ట్రాన్స్జండర్ ఇంట్లో పనిచేయడం ప్రారంభించాడు. ఈ మార్పుపై కోపాన్ని పెంచుకున్న నిందితురాలు.. రాఫికుల్ని మార్గమధ్యలో పట్టుకుని గుండు కొట్టించింది. అనంతరం అతనిపై మూత్రం పోశారని బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అంతేకాకుండా మూత్రం తాగాలని ఒత్తిడి చేసినట్లు వెల్లడించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా.. పోలీసుల దృష్టికి వెళ్లింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఇదీ చదవండి: అమానవీయం: నీళ్లు అడిగాడని.. దివ్యాంగుడ్ని పోలీసులు చితకబాదారు.. వీడియో వైరల్.. -
ట్రాన్స్జెండర్లను గౌరవించాలి
ఖలీల్‌వాడి: ట్రాన్స్జెండర్లను గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీసుధ అన్నారు. శనివారం జిల్లా కోర్టు భవన సముదాయంలో న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ట్రాన్స్జెండర్లు, సెక్స్ వర్కర్లకు పోస్టల్ శాఖ ద్వారా అమలవుతున్న గ్రూప్ యాక్సిడెంటల్ పాలసీ బాండ్లను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడారు. ట్రాన్స్జెండర్ల సమస్యలను చిత్రీకరిస్తూ అష్ట గంగాధర్ రూపొందించిన వీడియోతో కూడిన పాటను ఆవిష్కరించారు. జస్టిస్ శ్రీసుధ మాట్లాడుతూ ట్రాన్స్జెండర్ల పట్ల వివక్ష చూపడం తగదన్నారు. వారికి అన్ని రంగాల్లో అవకాశాలు లభించేలా కృషి చేయాలన్నారు. పోస్టల్ శాఖ ద్వారా కేవలం రూ.399 ప్రీమియంతో రూ.10 లక్షల ప్రమాద బీమాతో పాటు అనేక ప్రయోజనాలు ఉంటాయన్నారు. గ్రూప్ యాక్సిడెంటల్ పాలసీ గార్డ్‌ను ట్రాన్స్జెండర్లు, సెక్స్ వర్కర్లకు అందించడం అభినందనీయమన్నారు. దీనికి సహకరించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రతినిధులను ప్రశంసించారు. తక్కువ ప్రీమియంతో ఎక్కువ ప్రయోజనాలు అందిస్తున్న పోస్టల్ ప్రమాద బీమా గురించి ప్రచారం కల్పించాలన్నారు. జిల్లా జడ్జి సునీత మాట్లాడుతూ ట్రాన్స్ జెండర్లు, సెక్స్ వర్కర్లకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. దాతలు ముందుకు వచ్చి రూ.30 వేలు విరాళం అందించినట్లు తెలిపారు. దీనిని 50 మందికి ప్రీమియం కోసం ఖర్చు చేసినట్లు చెప్పా రు. ఈ కార్యక్రమం అనంతరం హైకోర్టు జడ్జి, న్యాయాధికారులతో భేటీ అయ్యి పలు అంశాలపై చర్చించారు. హైకోర్టు జడ్జికి స్వాగతం పలికిన జిల్లా జడ్జి, కలెక్టర్ హైకోర్టు జడ్జి శ్రీసుధ జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా జిల్లా ఉన్నతాధికారులు ఆమెకు ఘన స్వా గతం పలికారు. ఆర్అండ్బీ అతిథి గృహం వద్ద జిల్లా జడ్జి సునీత, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, ట్రెయినీ కలెక్టర్ కిరణ్మయి, నిజామాబాద్ ఆర్డీవో రవి, డీసీపీ(అడ్మిన్)మధుసూదన్ రావు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పద్మావతి తదితరులు స్వాగతం పలికారు. ఆమె పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. -
ట్రాన్స్‌జెండర్స్‌కు గుర్తింపు కార్డులు జారీ
సాక్షి ప్రతినిధి, కడప: జన్యుపరమైన లోపం వారి జీవితంలో చీకటి మిగిల్చింది. అయిన వాళ్లు కాదని, బయటి వాళ్లు ‘గే’ అని హేళన చేస్తుంటే ఏమి చేయాలో తోచని పరిస్థితి వారిది. అందరి చేత హిజ్రా అని పించుకున్న అటు ఇటు కాని వ్యక్తులు ఇప్పుడు ఆత్మ విశ్వాసంతో బతికే స్థాయికి ఎదుగుతున్నారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకుసాగుతున్నారు. యాచన మీద బతికే స్థాయి నుంచి విద్య, స్వయం ఉపాధి దిశగా పయనిస్తున్నారు. ● సీఎం వైఎస్ జగన్ అన్ని వర్గాల సం‘క్షేమం’కోసం చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగా హిజ్రా లు భిక్షాటన, సెక్స్‌వర్కర్‌గా జీవనం కొనసాగించకుండా ఉండటానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులోభాగంగా వైఎస్సార్ పింఛన్ కానుక కింద ప్రతినెలా రూ. 3000 పింఛన్ అందజేస్తున్నారు. మరోవైపు వి ద్య, ఉపాధి పట్ల చొరవ తీసుకుంటోంది. స్వయంశక్తి దిశగా ఎదిగేందుకు తోడ్పాటునిస్తూ ట్రాన్స్‌జెండర్స్ నియామకాలకు అవకాశం కల్పిస్తోంది. అర్హులైన వారికి న్యాయం .. నిబంధనల ప్రకారం హిజ్రాలు నిరుపేదలై తెల్లరేషన్‌కార్డు కలిగి ఉండాలి. ప్రభుత్వ ఆస్పత్రుల నుంచి ట్రాన్స్‌జెండర్స్‌గా గుర్తింపు కలిగిన పత్రం పొందాలి. ట్రాన్సుజెండర్గా దరఖాస్తు చేసుకున్న వీరికి ప్రభుత్వం గుర్తింపు కార్డులు జారీ చేస్తోంది. ముందుగా సచివాలయం లేదా ఇంటర్నెట్ సెంటర్లో దరఖాస్తు చేసుకుంటే ఆ వివరాలు సంబంధిత శాఖకు చేరుతాయి. వారి నుంచి ధ్రువీకరణ పొందితే ఆకార్డుపై కలెక్టర్ సంతకం చేసి ఐడెంటిటీ కార్డు జారీ చేస్తారు. గుర్తింపు కార్డు కావడంతో సంక్షేమ పథకాలకు అర్హత లభిస్తోంది. అలాంటి వారంతా వైఎస్సార్ పెన్షన్ కానుక కింద పింఛన్లు పొందేందుకు అర్హులు. ● సీఎం వైఎస్ జగన్ అర్హులకు ఎప్పటికప్పుడు కొత్త పెన్షన్లు మంజూరయ్యేలా చర్యలు చేపట్టారు. ప్రతి యేటా జనవరి, జులై నెలల్లో కొత్త పింఛన్లను మంజూరు చేస్తున్నారు. అర్హులైన వారు సచివాలయాల్లో పెన్షన్లకు దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి అర్హులుగా గుర్తిస్తారు. గత టీడీపీ పాలనలో ట్రాన్స్జెండర్లకు మంజూరు చేసే పెన్షన్ల ప్రక్రియ అస్తవ్యస్తంగా ఉండేది. అర్హులందరికీ పింఛన్లు దక్కేవి కాదు. ఎప్పటికప్పుడు చర్యలు అర్హులైన ట్రాన్స్‌జెండర్స్‌కు సక్రమంగా పెన్షన్లు అందేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అలాగే అర్హులకు ఎప్పటికప్పుడు కొత్త పింఛన్లు మంజూరు కావడానికి నిబంధనలను సులభతరం చేశారు. అర్హులు సచివాలయాల్లో దర ఖాస్తు చేసుకోవాలి. – కృష్ణకిశోర్, అసిస్టెంట్ డైరెక్టర్,జిల్లా విభిన్నప్రతిభావంతులు, హిజ్రాల సంక్షేమశాఖ, కడప ఊరటగా ఉంది ప్రభుత్వం రూ. 3000 పెన్షన్‌ను ప్రతినెలా 1వ తేదీనే అందజేస్తోంది. మాకెంతో ఊరటగా ఉంది. ప్రభుత్వం అన్ని వర్గాల మాదిరే మా సంక్షేమానికి కృషి చేయడం సంతోషదాయకం. – అంబవరం సారిక, బిల్టప్, కడప -
పెళ్లిలో రెచ్చిపోతున్న హిజ్రాలు.. డబ్బులు ఇవ్వకుంటే అసభ్యకర ప్రదర్శనలు
రెండు రోజుల కిందట కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో నగరానికి చెందిన ఓ పెద్ద వ్యాపారి కొడుకు వివాహం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న కొందరు హిజ్రాలు అక్కడికి చేరుకున్నారు. ఫంక్షన్‌హాల్ లోపలికి వెళ్లి వేదికపైకి వచ్చారు. ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించారు. డబ్బులివ్వాలంటూ అసభ్య పదజాలం వాడారు. దీంతో పెళ్లి కుమారుడి తండ్రి రూ.5 వేలు ఇచ్చాడు. ‘మాకు అవి సరిపోవు. రూ.50 వేలు కావాలి. అవి ఇస్తేనే ఇక్కడ నుంచి వెళ్లి పోతాం’ అని వీరంగం స్పష్టించారు. ఎంత చెప్పినా వినకుండా పెళ్లి మండపంపైనే కూర్చున్నారు. చేసేది ఏమీ లేక వధువు వరుడు తరఫున రూ.50 వేలు ఇచ్చి అక్కడి నుంచి పంపించారు. ఇలా ఒక్క కరీంనగర్‌లోనే కాదు.. ఉమ్మడి జిల్లాలోని అన్ని ఫంక్షన్ హాళ్లలో హిజ్రాలు ఇలానే హల్చల్ చేస్తున్నారు. ఒక్కో పెళ్లికి రూ.5 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నారు. తాజాగా కరీంనగర్ సమీప మండలంలోని ఓ గ్రామంలో సర్పంచ్ బంధువు వివాహం జరిగింది. రాత్రి బరాత్ జరుగుతున్న సమయంలో కొందరు హిజ్రాలు వచ్చి వీరంగం సృష్టించారు. పెళ్లి కుమారుడిని డబ్బులు డిమాండ్ చేశారు. అతను నిరాకరించడంతో రెచ్చిపోయి నగ్నంగా డ్యాన్స్ చేశారు. దీంతో అక్కడున్న వారు పారిపోయారు. దీంతో వధూవరుల తల్లిదండ్రులు తమ బంధువులు, స్నేహితుల ముందు హేళన కావొద్దని అడిగినంత ముట్టజెప్పారు. తిమ్మాపూర్(మానకొండూర్): పెళ్లంటే జీవితంలో ఒక్కసారి వచ్చే వేడుక. దీన్ని పేదవారు సైతం తమకు ఉన్నంతలో గొప్పగా జరుపుకోవాలని అనుకుంటారు. కానీ.. ఈ మధ్య హిజ్రాల కారణంగా భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. మామూళ్లు ఇవ్వకుంటే అసభ్యకరంగా ప్రవర్తిస్తూ శుభకార్యాల్లో అలజడి సృష్టిస్తున్నారు. సామాన్య కుటుంబాలకు చెందినవారు డబ్బు ఇచ్చేందుకు నిరాకరిస్తే అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. ఫలితంగా శుభకార్యానికి వచ్చిన బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు భయపడుతున్నారు. ఎవరైనా హిజ్రాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తే వారితో ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో అందరూ జంకుతున్నారు. దౌర్జన్యాలకు పాల్పడితే కఠిన చర్యలు కొంతమంది ట్రాన్స్జెండర్లు ఎక్కడ శుభకార్యం జరిగినా వారి ఇంటి ముందు వాలిపోయి ఇంటి యజమానికి చుక్కలు చూపిస్తూ, దౌర్జన్యంగా వేలకు వేలు డబ్బులు గుంజుతున్న సంఘటనలు దృష్టికి వస్తున్నాయి. ఎవరైనా చనిపోయిన సందర్భంలో కుటుంబ సభ్యులు పుట్టెడు దుఃఖంలో ఉండగా శ్మశాన వాటిక వద్దకు కూడా చేరిపోయి.. వదిలిపెట్టడం లేదు. వేలకు వేలు డబ్బులు గుంజుతున్నట్టుగా ఫిర్యాదులు వస్తున్నాయి. ఇప్పటికైనా వారు తమ వైఖరి మార్చుకోవాలి. లేని ఎడల వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఎవరైనా ఇటువంటి వేధింపులకు గురైతే బాధితులు వెంటనే డయల్ 100 టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి వివరాలు తెలియజేయాలి. ఐదు నిమిషాల్లో దగ్గరలో ఉన్న బ్లూ కోల్ట్స్ సిబ్బంది, పెట్రో కార్ సిబ్బంది చేరుకునేలా చర్యలు తీసుకుంటాం. జీవనోపాధి కోసం గౌరవంగా ఉండే ఏదైనా వృత్తిని.. లేక చిన్నచిన్న పనులు చేసుకొని జీవించాలి . ఇటీవల వారికి బ్యాంక్ రుణాలు కూడా మంజూరయాయి. వాహనాలు నడుపుకునేందుకు డ్రైవింగ్ లైసెన్స్‌లు కూడా ఇచ్చారు. – ఎల్.సుబ్బారాయుడు, పోలీస్ కమిషనర్ -
రికార్డు సృష్టించిన ట్రాన్స్‌జెండర్ ఆషాఢం ఆశ.. ఎలా అంటే?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఆ ఇద్దరూ.. ఊహ తెలిసినప్పటి నుంచీ.. తాము స్త్రీలమా.. పురుషులమా.. అన్న విషయం తెలియక మథనపడ్డారు. ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, విద్యార్హతల సర్టిఫికెట్ ఇలా ప్రతి చోటా గుర్తింపు సమస్యే. పైపెచ్చు హేళన, వివక్ష. దీంతో మరింత మనోవేదనకు గురయ్యారు. ఇలాగే ఉంటే.. తమ మనుగడ కష్టమవుతుందని భావించారు. ఇంటి గడప దాటి తమలా ఉండే వారితో కలిసి జీవిస్తున్నారు. తమ కాళ్ల మీద తాము నిలబడే గౌరవ ప్రదమైన జీవితం కోసం ప్రయత్నం చేస్తున్నారు. తోటివారికి సైతం సహకరిస్తున్నారు. సమాజంలో అన్నీ ఉండి కూడా ఏమీ చేయలేని ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. వారే కరీంనగర్‌కు చెందిన ఆషాఢం ఆశ, నక్కా సింధు. స్వయం ఉపాధికి ప్రభుత్వ రుణం సంపాదించిన రాష్ట్రంలోనే తొలి ట్రాన్స్‌జెండర్‌గా ఆషాఢం ఆశ రికార్డు సృష్టించింది. అదేవిధంగా స్వయం ఉపాధి కోసం డ్రైవింగ్ లైసెన్స్ సంపాదించిన రాష్ట్రంలోని రెండో ట్రాన్స్‌జెండర్‌గా నక్కా సింధు గుర్తింపు సాధించింది. కరీంనగర్ జిల్లాకు చెందిన వీరిద్దరూ తమ కమ్యూనిటీకి ఎంతో ఆదర్శంగా నిలుస్తున్నారు. ట్రాన్స్‌జెండర్ అనగానే.. ట్రాఫిక్ సిగ్నళ్లు, రైళ్లు, రైల్వేస్టేషన్లలో డబ్బులు వసూలు చేసేవాళ్లే కాదు.. అని కుండబద్ధలు కొడుతున్నారు. తమకు అవకాశాలిస్తే.. నైపుణ్యంతో సొంతకాళ్ల మీద నిలబడతామని ఢంకా భజాయిస్తున్నారు. ఫొటోగ్రఫీ వృత్తి కోసం 5 లక్షల రుణం సాధించిన ఆశ ప్రభుత్వ రుణం సంపాదించిన తొలి ట్రాన్స్‌జెండర్‌గా రికార్డు కాలేజీ సర్టిఫికెట్లు ఇవ్వలేదు.. కరీంనగర్‌కు చెందిన ఆషాఢం ఆశ మగాడిలా పుట్టినా.. చిన్ననాడే తన ఆలోచనలన్నీ అమ్మాయిలా ఉన్నా యని ఆమెకు అర్థమైపోయింది. ఆమె ప్రవర్తనను మొదట్లో కుటుంబసభ్యులు వ్యతిరేకించినా తర్వాత అర్థం చేసుకున్నారు. తన ఇష్టం మేరకు చదివించి హోటల్ మేనేజ్మెంట్లో సైతం చేర్పించారు. కానీ ఆఖరి సెమిస్టర్లో తాను థర్డ్ జెండర్ అని గుర్తించిన క్లాస్మేట్స్ వేధించడం ప్రారంభించారు. దీంతో తీవ్ర మానసిక వేదనకు గురైన ఆశ.. ఆపరేషన్లు చేయించుకుని పూర్తిగా అమ్మాయిలా మారింది. తీరా వెళ్లి సర్టిఫికెట్లు కావాలని అడిగితే కాలేజీ నిరాకరించింది. విధిలేని పరిస్థితుల్లో ఫొటోగ్రఫీ, గ్రాఫిక్స్ నేర్చుకుంది. మొదట్లో ఆల్బమ్‌లు అందంగా డిజైన్ చేసేది. తర్వాత తానే స్వయంగా ఫొటోలు తీయడం ప్రారంభించింది. మెల్లిగా ఈవెంట్లకు ఆర్డర్లు కూడా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం చాలామంది అవకాశాలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కరీంనగర్ మెప్మా అధికారుల ద్వారా కలెక్టర్ కర్ణన్‌ను కలిసింది. ఆయన వెంటనే రూ.5 లక్షలు బ్యాంకు రుణం ఇప్పించడంతో ఫొటోగ్రఫీ వృత్తిని అభివృద్ధి చేయడంపై దృష్టి సారించింది. సమాజం మారుతోంది.. సహకారం లభిస్తోంది సమాజంలో మాపై చిన్నచూపు ఇంకా ఉంది. తొలి నాళ్లలో నేను ఫొటోలు బాగా తీసినా థర్డ్ జెండర్నని చెప్పి వెనుకడుగు వేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితిలో మార్పు వస్తోంది. మా సమస్యలను సమాజం మెల్లిగా అర్థం చేసుకుంటోంది. ప్రముఖ నటులు లారెన్స్, సుధీర్‌బాబు, అక్షయ్ కుమా ర్లు మాలాంటి వారి కథలతో సినిమాలు తీయడం ద్వారా మా ఇబ్బందులు సమాజానికి తెలిసేలా చేశారు. ప్రభుత్వాలు, కోర్టుల నుంచి మాకు గుర్తింపు, సహకారం లభించడం గొప్ప విషయం. మాలాంటి వారికి ఆధార్, పాన్, ఓటరు తదితర గుర్తింపు కార్డులు, ప్రభుత్వ సాయాల సాధనకు కృషి చేస్తున్నా. ట్యాక్సీ కోసం డ్రైవింగ్ లైసెన్స్ పొందిన సింధు సహచర థర్డ్ జెండర్లలో స్ఫూర్తి నింపుతున్న వైనం విజయగాథలతో స్ఫూర్తి పొంది.. కరీంనగర్‌కే చెందిన నక్కా సింధు కొన్నినెలల క్రితం వరకు ఎలాంటి పనిలేకుండా ఉండేది. ఆశ లాగానే థర్డ్ జెండర్ కావడం వల్ల ఎవరూ పనిచ్చేవారు కాదు. స్కూలు వరకే చదువుకోవడం, బయట వివక్ష , హేళన కారణంగా ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. కానీ ఉస్మాని యాలో ప్రభుత్వ డాక్టర్లుగా చేరిన ట్రాన్స్జెండర్లు డాక్టర్ ప్రాచీ రాథోడ్, డాక్టర్ రుతు జాన్పాల్ల గురించి తెలుసుకున్నాక సింధు జీవితంలో మార్పు వచ్చింది. తమిళనాడులో థర్డ్‌జెండర్ కోటాలో ఎస్సై ఉద్యోగం సాధించిన ప్రతీక యాష్మీ విజయ గాథ కూడా ఆమెలో స్ఫూర్తినింపింది. ఎలాగైనా తన కాళ్ల మీద తాను నిలబడాలనే పట్టుదలతో కరీంనగర్ మెప్మా వారి సాయంతో డ్రైవింగ్‌లో శిక్షణ తీసుకుంది. డ్రైవింగ్ లైసెన్స్ పొందిన రెండో థర్డ్‌జెండర్‌గా (తొలి లైసెన్స్ జనగామ జిల్లాలోని డాలీ పేరిట జారీ అయింది) ప్రత్యేక రికార్డు సాధించింది.వెంటనే ట్యాక్సీ తీసుకునేందుకు అవసరమైన రుణం కోసం దరఖాస్తు చేసుకుంది. చిన్నచూపు పోవాలి.. నాకు చాలాకాలం పాటు ఎలాంటి పని దొరకక పోవడంతో చాలా కుంగిపోయా. కానీ నాలాంటి వారు కొందరి గురించి తెలుసుకున్నాక కొత్త ధైర్యం వచ్చింది. కరీంనగర్ మెప్మా వారి ప్రోత్సాహం నా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. అదే పట్టుదలతో కలెక్టర్ గారి సహకారంతో డ్రైవింగ్ లైసెన్స్ సాధించా. ప్రస్తుతం ట్యాక్సీ తీసుకోవడానికి అవసరమైన రుణం కోసం దరఖాస్తు చేసుకుంటున్నాను. సమాజంలో థర్డ్ జెండర్లపై చిన్నచూపు పోవాలి. అప్పుడే మాలాంటి వారికి అవకాశాలు వస్తాయి. – నక్కా సింధు -
యాచించిన చేతులు.. సాయానికొచ్చాయి!
వారిది అర్ధనారీశ్వర జననం సొంత ఊరులేని... సొంత ఇల్లు లేని చివరకు అద్దె ఇల్లు కూడా దొరకని దైన్యం వారిది మాతృత్వం లేని స్త్రీత్వం మోడువారిన జీవితం అయినా మానవత్వం మూర్తీభవించిన వ్యక్తిత్వం ఆడామగా కాకపోతేనేం మనసున్న మనుషులు వాళ్లు. వెలివేసిన సమాజంలోనే సేవాగుణం చాటుతూ మానవతా పరిమళాలు వెదజల్లుతున్నారు. నిన్నటి వరకు యాచించిన ఆ చేతులు ఇప్పుడు సాయం చేసేందుకు ముందుకొస్తున్నాయి. సమాజ సేవలో మేముసైతం అంటూ శభాష్ అనిపించుకుంటున్న ట్రాన్స్జెండర్లపై ప్రత్యేక కథనమిదీ.. సికింద్రాబాద్: వైద్యరంగ సేవల్లో మేము సైతం అంటూ ముందడుగు వేస్తున్నారు అర్ధనారీశ్వరులు. ప్రస్తుతం అనేక రంగాల్లో ప్రతిభ చాటుతున్న హిజ్రాలను వైద్య సహాయకులుగా తీర్చిదిద్దే పనిని సికింద్రాబాద్ ఇన్నర్ వీల్ క్లబ్ చేపట్టింది. మంచాన పడిన రోగుల బాగోగులు చూసుకునేలా వీరికి ఉచితంగా శిక్షణ ఇస్తోంది. తొలి విడత ప్రయోగాత్మకంగా 15 మంది ట్రాన్స్జెండర్లకు శిక్షణ ఇచ్చి ఆసుపత్రుల్లో రోగుల సహాయకులుగా నియమించింది. కొంతమందికి వారి వారి ఆసక్తి మేరకు ఇతర రంగాల్లోనూ ఉపాధి అవకాశాలు చూపిస్తోంది. బ్యాచ్‌కు 15 మంది చొప్పున.. ►పంజగుట్ట ప్రాంతంలోని ఫ్యామిలీ ప్లానింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంస్థ భవనంలో శిక్షణ ఇచ్చారు. బీపీ చెక్ చేయడం, ధర్మామీటర్లో టెంపరేచర్ చూడటం, గ్లూకోజ్ టెస్టులు చేయడంలో శిక్షణ ఇచ్చారు. అలాగే, రోగులకు చంటిపాపల్లా స్నానపానాదులు చేయించడంలోనూ తర్ఫీదు ఇచ్చారు. ►గత ఏడాది ముగ్గురు ట్రాన్స్జెండర్లకు మాత్రమే శిక్షణ ఇచ్చిన ఇన్నర్‌వీల్ క్లబ్ తాజాగా 15 మందితో కూడిన బ్యాచ్‌కు శిక్షణ ఇచ్చింది. ఉస్మానియా ఆసుపత్రితోపాటు నగరంలోని పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో ట్రాన్స్జెండర్లు రోగుల సహాయకులుగా విధుల్లో చేరారు. ►వైద్యసేవకులుగా మరింత మంది హిజ్రాలకు శిక్షణ ఇచ్చేందుకు ఇన్నర్‌వీల్ క్లబ్ రెండో జట్టును సిద్ధం చేసింది. 15 మందితో కూడిన ఈ బృందానికి వారం రోజుల్లో శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయి. ►మూడు నెలలకోమారు 15 మంది చొప్పున హిజ్రాలను ఎంపిక చేసి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. వారిని క్రమేణా వైద్య సేవకులుగా మార్చేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. గర్వంగా ఉంది: స్మిత, ట్రాన్స్‌జెండర్ సమాజంలో ట్రాన్స్జెండర్లు అంటేనే చిన్నచూపు. ఉపాధి కోసం సమాజం చీదరించుకునే వృత్తుల్లో చేరక తప్పని పరిస్థితులు ఉండేవి. విద్యావంతులైన హిజ్రాలు పెద్ద ఉద్యోగాల్లో చేరుతున్నారు. పాఠశాల విద్యకే పరిమితమైన హిజ్రాలు రోగుల అటెండర్లుగా చేరడం గర్వంగా ఉంది. నష్టం వాటిల్లదు: రోజీ, ట్రాన్స్‌జెండర్ రోగుల సేవకులే కాకుండా వివిధ వృత్తుల్లో చేరి ఉపాధి మార్గాలు ఎంచుకునేందుకు ఎక్కువ మంది ట్రాన్స్జెండర్లు ముందుకు వస్తున్నారు. కానీ వారి సేవలను వినియోగించుకునే సమాజం కావాలి. ట్రాన్స్జెండర్ల సేవలు వినియోగించుకోవడం ద్వారా ఎటువంటి నష్టం వాటిల్లదన్న విషయంపై సమాజంలో అవగాహన కలిగించాలి. గౌరవం చేకూర్చాలన్నదే లక్ష్యం సమాజానికి దూరంగా బతకడంతోపాటు, సమానత్వాన్ని పొందలేకపోతున్న ట్రాన్స్‌జెండర్స్‌కు గౌరవం చేకూర్చేందుకే వైద్యసేవల్లో శిక్షణ ఇచ్చే కార్యక్రమానికి అంకురార్పణ చేశాం. యాచకత్వం, సెక్స్ వృత్తులకు వారిని దూరం చేసి సేవాతత్పరతతో కూడిన వృత్తిని అందించాలన్న ఆశయంతో చేపట్టిన ప్రయోగం సత్ఫలితాలను ఇస్తోంది. క్రమేణా ఎక్కువ సంఖ్యలో ట్రాన్స్జెండర్లను ఈ వైద్య సేవల్లోకి తేవాలన్నదే మా లక్ష్యం. – జయంతీకన్నన్, ఇన్నర్వీల్స్ క్లబ్ అధ్యక్షురాలు -
బంజారాహిల్స్ పీఎస్ ఎదుట హిజ్రాల హంగామా.. వీడియో వైరల్
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట హంగామా సృష్టించిన 20 మందికిపైగా హిజ్రాలపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బంజారాహిల్స్ రోడ్ నంబరు 2లోని ఇందిరానగర్‌కు చెందిన సోనా రాథోడ్ బృందానికి, ఐడీపీఎల్ ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చిన మోనాలిసా టీం మధ్య కొద్ది రోజులుగా ఆధిపత్య గొడవలు జరుగుతున్నాయి. సోనా రాథోడ్ టీంపై మోనాలిసా దౌర్జన్యానికి పాల్పడుతుండటంతో చర్యలు తీసుకోవాలంటూ వారు ఆదివారం బంజారాహిల్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతోపాటు కిరోసిన్ మీద పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు సోనా రాథోడ్‌తోపాటు స్వీటి, చందుబాయి, జోయ, రోషిని, వైశాలి, లక్కీ, పుష్ప తదితర 20 మందికిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బంజారాహిల్స్ పోలీసులు పరారీలో ఉన్న హిజ్రాలను పట్టుకొనేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు. ఎస్సై మహేష్ ఆధ్వర్యంలో వారికోసం గాలించి పది మంది హిజ్రాలను అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో రోజా, వసు, హిమ, అన్షు, నందు, లక్ష్మి, వైష్ణవి, స్పందన, జోయ, రియా ఉన్నారు. ప్రధాన నిందితురాలు సోనా రాథోడ్, బుల్బుల్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. Extortion in Hyderabad: Third gender groups fight over who is original and who is fake and stage dharna infront of Banjara Hills police. Extortion of money by such groups increases a lot in Hyderabad.#Hyderabad #Thirdgender pic.twitter.com/OiJP1z1bYz — Sudhakar Udumula (@sudhakarudumula) December 26, 2022 కాగా గత కొద్ది కాలంగా హిజ్రాల తీరుపై పోలీసులకు పలు ఫిర్యాదులు అందుతున్నాయి. కూడళ్లతోపాటు ఏదైనా ఫంక్షన్ జరిగినా, షాప్ ఓపెనింగ్ జరిగినా అక్కడికి వచ్చి వాలుతున్నారని ఫిర్యాదులు అందడం, ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోనూ ఇలా వసూళ్లకు పాల్పడుతున్న నలుగురు హిజ్రాలతోపాటు వారికి సహకరిస్తున్న ఇద్దరు ఆటోవాలాలను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా హిజ్రాల మధ్య ఆధిపత్య పోరు కారణంగా ఒకరిపై ఒకరు దాడులకు దిగడం, పరస్పర ఫిర్యాదులు చేసుకోవడం తలెత్తింది. చదవండి: నడిరోడ్డుపై మహిళ ప్రసవం.. మహబూబ్‌నగర్‌లో హృదయవిదారక ఘటన -
ట్రాన్స్‌జెండర్ షాకింగ్ నిర్ణయం.. అసలు ఏం జరిగింది?
డోన్ రూరల్(నంద్యాల జిల్లా): మండల పరిధిలోని తాటిమాన్ కొత్తూరు గ్రామానికి చెందిన ట్రాన్స్‌జెండర్ బాలవినోదన్ బుధవారం పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. బంధువులు తెలిపిన వివరాలు.. బాలవినోదన్ కొంతకాలంగా డోన్ పట్టణంలోని వైఎస్ నగర్లో బంధువుల వద్ద ఉంటోంది. ఉదయం ఇంట్లోనే పురుగు మందు తాగింది. గమనించిన బంధువులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం డాక్టర్లు కర్నూలుకు రెఫర్ చేశారు. -
అది అత్యంత ముఖ్యమైనది: తొలి ట్రాన్స్ జెండర్ జడ్జి
ఇండోర్: ట్రాన్స్ జెండర్లకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించడం అత్యంత ముఖ్యమని తొలి ట్రాన్స్ జెండర్ జడ్జి జోయిత్ మోండల్ నొక్కి చెప్పారు. అంతేగాదు ట్రాన్స్ జెండర్లు పోలీస్ ఫోర్స్, రైల్వే వంటి విభాగాల్లో పనిచేయడం వల్ల వారిపట్ల సమాజ దృక్పథం కూడా మారుతుందని మోండల్ అన్నారు. ఈమేరకు లిట్ చౌక్ అనే సాంస్కృతి సాహిత్య ఫెస్టివల్లో పాల్గొన్న అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో జోయితా మోండల్ ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే తన కమ్యూనిటీ సభ్యులు, వారు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల అధికారులు చాలా సున్నితంగా వ్యవహరించాలని అన్నారు. ట్రాన్స్ జెండర్ల కమ్యునిటీలకు సరైన వసతి లేదని, అందుకోసం ఒక పథకాన్ని ప్రవేశ పెట్టాలని అన్నారు. ఇదిలా ఉండగా జోయితా మోండల్ 2017లో పశ్చిమ బెంగాల్ ఇస్లాంపూర్ లోక్ అదాలత్‌లో తొలి ట్రాన్స్‌జెండర్ న్యాయమూర్తిగా నియమితులయ్యారు. దేశంలో అలాంటి పదవిని అలంకరించిన తొలి ట్రాన్స్ జెండర్‌గా జోయితా మోండల్ నిలిచారు. ఆమె తర్వాత 2018లో మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో లోక్ అదాలత్‌లో న్యాయమూర్తిగా విద్యాకాంబ్లే, ఆమె తర్వాత గౌహతి నుంచిస్వాతి బిధాన్ బారుహ్ ఇలాంటి అత్యున్నత పదవిని అలకరించిన ట్రాన్స్ జెండర్లుగా నిలిచారు. కాగా మహారాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్ జెండర్లు కూడా పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని, ఫిబ్రవరి 2023 కల్లా ఫిజికల్ టెస్టులకు ప్రమాణాలు నిర్దేశిస్తామని బొంబే హైకోర్టుకు తెలపడం గమనార్హం. (చదవండి: ఉదయ్‌పూర్ డిక్లరేషన్ అమలు చేయండి ) -
మూడు గంటల్లో ట్రాన్స్‌జెండర్‌గా మారిన బాలీవుడ్ నటుడు..ఎందుకంటే?
బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రలో తెరకెకుతున్న చిత్రం 'హడ్డీ'. ఈ సినిమాలో ఆయన ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు అక్షత్ అజయ్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియోస్, ఆనందితా స్టూడియోస్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 2023లో జీ స్టూడియోస్‌లో విడుదల కానుంది. 'హడ్డీ'లో ట్రాన్స్‌జెండర్ లుక్ కోసం నవాజుద్దీన్ సిద్ధిఖీ తీవ్రంగా శ్రమించారు. దాదాపు మూడు గంటల పాటు మేకప్ కోసం కేటాయించాడు. ప్రస్తుతం నవాజుద్దీన్ సిద్ధిఖీ న్యూ ట్రాన్స్‌జెండర్ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీనికి సంబంధించిన మేకింగ్ వీడియోను జీ స్టూడియోస్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ట్రాన్స్‌జెండర్ మేకప్ కోసం నవాజుద్దీన్ సిద్ధిఖీ తన కుర్చీకి దాదాపు మూడు గంటల పాటు అతుక్కుపోయారని వెల్లడించింది. నవాజుద్దీన్ సిద్ధిఖీ మాట్లాడుతూ..'నిపుణుల సమక్షంలో నేను కుర్చీలో దాదాపు మూడు గంటలు కూర్చోవడం నా కెరీర్లో ఇదే మొదటిసారి. ఈ పాత్రను తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి కొత్త లుక్ నాకు శక్తినిచ్చింది. దీనిపై ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో చూసేందుకు నేను ఇక వేచి ఉండలేను' అని అన్నారు. View this post on Instagram A post shared by Zee Studios (@zeestudiosofficial) -
ఈ డాక్టర్లకు ఆల్ ది బెస్ట్
హైదరాబాద్‌లో ఇద్దరు డాక్టర్లు ప్రభుత్వ ఆసుపత్రిలో నియామకం పొందారు. అదేం పెద్ద విశేషం? విశేషమే. ఎందుకంటే వీరిద్దరూ ట్రాన్స్జెండర్లు. గత కొంతకాలంగా దేశంలో తమ ఆత్మగౌరవం కోసం, ఉపాధి కోసం, హక్కుల కోసం పోరాడుతున్న ‘ఎల్జిబిటి’ సమూహాలకు ఈ నియామకం ఒక గొప్ప గెలుపు. అందుకే వీరికి ఆల్ ది బెస్ట్ చెప్పాలి. గత వారం ప్రాచీ రాథోడ్ (30), రూత్ జాన్ పాల్ (28) ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో హెచ్.ఐ.వి రోగులకు చికిత్స అందించే ఏ.ఆర్.టి విభాగంలో వైద్యాధికారులుగా నియమితులయ్యారు. వీరు రాష్ట్రంలో డాక్టర్లుగా బాధ్యతలు చేపట్టిన తొలి ట్రాన్స్జెండర్లు కావడం విశేషం. కొత్త చరిత్రకు నాంది పలికిన వీరు ‘సాక్షి’ తో తమ అనుభవాలు పంచుకున్నారు. మా కమ్యూనిటీకి విజయమిది... ఈ ఇద్దరిలో డాక్టర్ రూత్‌ది ఖమ్మం. డాక్టర్ ప్రాచీ రాథోడ్‌ది ఆదిలాబాద్ జిల్లా. చిన్న వయసులోనే డాక్టర్లు కావాలని కలలు కన్నప్పటికీ, కుటుంబ సభ్యుల మద్దతు కరువై, స్కూల్లో తోటి విద్యార్థుల వేధింపులు, సమాజంలో చిన్నచూపు వంటివి ఎదుర్కొంటూనే లక్ష్యాన్ని సాధించగలిగారు. తమలాంటి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. ప్రభుత్వ రంగంలో భాగస్వామ్యం కోసం పోరాడుతున్న ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీకి ఇదొక చారిత్రాత్మక విజయం అని వీరు అంటున్నారు. అర్హత ఉన్నా... తిరస్కరించారు... ‘మల్లారెడ్డి వైద్య విజ్ఞాన సంస్థలో 2018లో వైద్యవిద్య పూర్తి చేసినప్పటి నుంచి ఉద్యోగం కోసం విఫలయత్నాలు ఎన్నో చేశా. సిటీలో కనీసం 15–20 ఆసుపత్రులు ఉద్యోగ దరఖాస్తులను తిరస్కరించాయి. దీనికి కారణం మా జెండర్ అని ముఖం మీద చెప్పలేదు. కానీ అది మాకు అర్ధమైంది’ అన్నారు డా.రూత్.. తొలుత ఓ ఆసుపత్రిలో ఇన్ టర్న్షిప్ చేస్తున్నప్పుడు తనకు ఏ సమస్యా రాలేదనీ ∙లింగ మార్పిడి విషయం బయటపెట్టిన తర్వాతే తనకు ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పారామె. తన అర్హతలను కాకుండా జెండర్‌నే చూశారన్నారు. తెలిశాక... వద్దన్నారు... డాక్టర్ ప్రాచీ రాథోడ్ రిమ్స్ నుంచి డిగ్రీ పూర్తి చేసి ప్రైవేట్‌రంగంలో పనిచేస్తూ కెరీర్ ప్రారంభించారు. సిటీలో ఓ ఆస్పత్రిలో పని చేస్తూనే ఎమర్జెన్సీ మెడిసిన్ లో డిప్లొమా చేశారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో మూడేళ్లపాటు పని చేశారు. తన మార్పిడి గురించి తెలిశాక.. రోగులరాకకు ఇబ్బంది అవుతుందని ఆసుపత్రి భావించడంతో ఉద్యోగం పోగొట్టుకున్నారు. ఏపీలో పెన్షన్ భేష్ ‘ఉస్మానియాలో సహ వైద్యులు, రోగులు బాగా సహకరిస్తున్నారు. ఎటువంటి ఇబ్బందులూ లేకపోవడం సంతోషంగా ఉంది’ అని వీరు చెప్పారు. పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ట్రాన్స్జెండర్లకు పింఛనుగా ఏటా రూ.10 వేలు ఇస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తూ అలాంటి ప్రత్యేక సహాయ సహకారాలు అన్ని చోట్లా మొదలు కావాలని ఆశిస్తున్నామన్నారు. ‘మేమిద్దరం ట్రాన్స్ఉమెన్ గా నీట్ పీజీ పరీక్షలను రాశాము, అయితే థర్డ్ జెండర్‌ను గుర్తించి అడ్మిషన్ ను మంజూరు చేసేందుకు వీలు కల్పించిన 2014 నాటి సుప్రీం కోర్ట్‡ తీర్పుకు అనుగుణంగా రిజర్వ్డ్ సీట్లు పొందలేదు’ అని చెప్పారు. తమ కమ్యూనిటీకి జరుగుతున్న అన్యాయాలపై గళమెత్తుతామని, సమాజంలో సమాన హక్కులకై పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేస్తున్నారు. దేశంలోనూ అక్కడక్కడ వైద్య రంగంలో కెరీర్ ఎంచుకుంటున్న ట్రాన్స్‌జెండర్స్ దేశంలో మరికొన్ని ప్రాంతాల్లోనూ కనిపిస్తున్నారు. కర్ణాటకలో త్రినేత్ర హల్దార్ గుమ్మరాజు ట్రాన్స్ డాక్టర్‌గా, యాక్టివిస్ట్‌గా జాతీయస్థాయిలో పేరొందారు. అలాగే కేరళకు చెందిన వి.ఎస్.ప్రియ కూడా లింగమార్పిడి చేయించుకున్న తొలి వైద్యురాలిగా రాణిస్తున్నారు. ఇప్పటికే రెండు ట్రాన్స్‌జెండర్ క్లినిక్స్ ప్రారంభించిన తొలి నగరంగా సిటీ నిలిచింది. ఇద్దరు ట్రాన్స్ డాక్లర్లకు చిరునామాగా నిలిచిన ఘనతను కూడా తన సొంతం చేసుకుంది. ఒకే తరహా కష్టం కలిపింది స్నేహం అనేకానేక బాధాకరమైన అనుభవాల తర్వాత బతుకుదెరువు వేటలో భాగంగా వీరు ఇద్దరూ వేర్వేరుగా గత ఏడాది నారాయణగూడలో ఎన్.జి.ఓ ఆధ్వర్యంలో ప్రారంభమైన ట్రాన్స్‌జెండర్ క్లినిక్ ‘మిత్ర్’లో చేరారు. మంచి స్నేహితులయ్యారు. ఒకే తరహా సమస్యల మధ్య ఏర్పడిన తమ స్నేహం వేగంగా దృఢమైన బంధంగా బలపడిందనీ ఒకరి కొకరు తోడుగా, తోడబుట్టిన అక్కచెల్లెళ్లను మించి సాగుతోందని వీరు చెప్పారు. ప్రతీ సందర్భంలోనూ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ముందుకు సాగుతున్నామంటున్నారు. – ఎస్.సత్యబాబు సాక్షి, సిటీబ్యూరో -
ట్రాన్స్జెండర్ల రక్షణకు సెల్ ప్రారంభం
సాక్షి, అమరావతి: పోలీస్ శాఖ రాష్ట్రంలో ట్రాన్స్జెండర్ల రక్షణ సెల్‌ను ఏర్పాటు చేసింది. సీఐడీ విభాగం ఆధ్వర్యంలో మంగళగిరిలోని రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఈ సెల్‌ను అదనపు డీజీ(సీఐడీ) పి.వి.సునీల్ కుమార్ బుధవారం ప్రారంభించారు. ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఎస్పీ జి.వి.సరిత ఈ ట్రాన్స్జెండర్ల రక్షణ సెల్‌కు నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు. ఇదే తరహాలో ప్రతి జిల్లా కేంద్రంలోనూ ట్రాన్స్జెండర్ల రక్షణ సెల్‌లను త్వరలో ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా అదనపు డీజీ సునీల్ కుమార్ మాట్లాడుతూ ట్రాన్స్జెండర్లను ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు. ట్రాన్స్జెండర్ల హక్కుల పరిరక్షణ కోసం జిల్లా స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ప్రత్యేకప్రతిభావంతులు, ట్రాన్స్జెండర్ల సంక్షేమ శాఖ డైరెక్టర్ ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఓటుహక్కు కలిగిన ట్రాన్స్జెండర్లు 3,800 మంది ఉన్నారన్నారు. కానీ జనాభా లెక్కల ప్రకారం దాదాపు 28 వేలమంది ఉన్నారని చెప్పారు. ట్రాన్స్జెండర్లకు ప్రభుత్వం నెలకు రూ.3వేలు పింఛన్ ఇస్తుండటంతోపాటు ఇళ్ల పట్టాలు కూడా ఇవ్వనుందన్నారు. ఎస్పీ సరిత మాట్లాడారు. -
Hyderabad: హిజ్రాల ఆగడాలు.. సిగ్నల్ పడిందా.. డబ్బు గుంజుడే!
సాక్షి, హైదరాబాద్(వనస్థలిపురం): పలు ప్రాంతాలలో హిజ్రాలు (థర్డ్ జెండర్స్) ఆగడాలు మితిమీరుతున్నాయి. ఇప్పటి వరకు వ్యాపార సంస్థల ప్రారంభోత్సవాలు, గృహ ప్రవేశాలు, పెళ్లిళ్లు తదితర ఫంక్షన్లకు వచ్చి డబ్బులు వసూలు చేసే థర్డ్ జెండర్స్ నేడు రోడ్లపై తిరుగుతూ వాహనదారులను సైతం వదలిపెట్టడం లేదు. హస్తినాపురం సెంట్రల్లో నిత్యం తిష్టవేస్తున్న హిజ్రాలు ట్రాఫిక్ రెడ్ సిగ్నల్ పడగానే వాహనదారుల వద్దకు వచ్చి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఎవరైనా ఇవ్వకపోతే అతని బండి తాళం చెవి లాక్కుని సిగ్నల్ పడినా ఇవ్వకుండా వేధిస్తున్నారు. ఇదేమని ఎవరైనా అడిగితే వారిని హేళన చేస్తున్నారు. హస్తినాపురంలో చౌరస్తాలో ట్రాఫిక్ కానిస్టేబుళ్లు ఉన్నా వారిని అడ్డుకున్న పాపాన పోవడం లేదు. హిజ్రాల ఆగడాలు ఎక్కువవుతున్నాయని, హస్తినాపురం సెంట్రల్ దాటాలంటే టోల్గేట్ పన్ను లాగా వారికి డబ్బులు ముట్టజెప్పాల్సి వస్తోందని వాహనదారులు వాపోతున్నారు. ఇప్పటికైనా లా అండ్ ఆర్డర్ పోలీసులు గానీ, ట్రాఫిక్ పోలీసులు గానీ జోక్యం చేసుకుని హిజ్రాల నుంచి తమను రక్షించాలని వాహనదారులు కోరుతున్నారు. చదవండి: (అందుకే ఢిల్లీకి.. పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన మర్రి శశిధర్‌రెడ్డి) -
రూ.40 వేలు అప్పుతీసుకున్న ట్రాన్స్‌జెండర్.. చెల్లించకపోవడంతో ఇంటికి వెళ్లి!
న్యూఢిల్లీ: పాత పరిచయం ఓ ట్రాన్స్‌జెండర్ (35)ను ఆస్పత్రిపాల్జేయగా, ఆమె సహచరుడి ప్రాణాలు తీసింది. రూ.40 వేల కోసం జరిగిన వాగ్వాదం ఘర్షణకు దారితీయడంతో ఓ వ్యక్తి టాన్స్‌జెండర్, ఆమె సహచరుడిపై కత్తితో దాడిచేశాడు. సెంట్రల్ ఢిల్లీలోని పహర్‌గంజ్ ప్రాంతం, ముల్తానీ దాంద్రాలో శుక్రవారం జరిగిన ఈ ఘటనలో ట్రాన్స్‌జెండర్ పార్ట్నర్ మృతి చెందాడు. సెంట్రల్ ఢిల్లీ డీసీపీ స్వేతా చౌహాన్ తెలిపిన వివరాల మేరకు.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫరుఖాబాద్కు చెందిన అనిల్‌కు ట్రాన్స్‌జెండర్‌కు 2020లో పరిచయం ఏర్పడింది. (చదవండి: డాక్టర్ సతీమణి అత్యుత్సాహం.. భర్త లేకపోవడంతో తానే వైద్యం, రోగి మృతి.. ఇద్దరూ పరార్!) వారిద్దరూ కలిసి బతుకుదాం అనుకున్నారు. ఆ సమయంలో ట్రాన్స్‌జెండర్‌కు రూ.40 వేలు అనిల్ అప్పుగా ఇచ్చాడు. అయితే, ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు గానీ.. టాన్స్‌జెండర్ అనిల్ వద్ద నుంచి వెళ్లి పోయి ప్రస్తుత పార్ట్నర్తో కలిసి ఉంటోంది. ఈ విషయమై పలుమార్లు అనిల్ వారిద్దరినీ హెచ్చరించాడు. తనను మోసం చేసినవారి అంతుచూస్తాననని బెదిరించాడు. ఈక్రమంలో ఘటన జరిగిన రోజు రాత్రి నిందితుడు టాన్స్‌జెండర్ ఉంటున్న ఇంటికి వెళ్లాడు. తన వద్ద తీసుకున్న రూ.40 వేలు చెల్లించాలని డిమాండ్ చేశాడు. ఆ సమయంలో ఇంట్లో ఆమె పార్ట్నర్ కూడా ఉన్నాడు. వారిమధ్య మాటామాటా పెరడంతో ఘర్షణ చెలరేగింది. అనిల్ కత్తితో వారిద్దరిపై దాడి చేశాడు. అనంతరం అక్కడ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. స్థానికులు అప్రమత్తపై అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తీవ్ర గాయాలపాలైన బాధితులను ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ట్రాన్స్‌జెండర్ పార్ట్నర్ ప్రాణాలు కోల్పోయాడు. అనిల్‌పై పలు ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని డీసీపీ తెలిపారు. (చదవండి: ‘ఇది జైలు కాదు.. కోవిడ్ ఐసోలేషన్ వార్డ్’.. హర్ష గోయెంకా ట్వీట్) -
హిజ్రాల హొయలు!
సాక్షి,చెన్నై: మిస్ హిజ్రా చెన్నై –2022 పోటీల ఆడిషన్స్ ఆ సంఘం ఆధ్వర్యంలో మొదలయ్యాయి. ఈ పోటీలకు అర్హులైన వారిని గురువారం చెన్నైలో ఎంపిక చేశారు. అక్టోబరు 15వ తేదీని హిజ్రాల ముప్పెరుం విళా చెన్నై వేదికగా నిర్వహించనున్నారు. ఈ పోటీల ఆడిషన్స్ కీల్పాకం డాన్ బాస్కో స్కూల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు సాగింది. 24 మంది హిజ్రాలు ఈ పోటీల్లో పాల్గొన్నారు. మోడల్స్‌కు తామేమీ తీసి పోమన్నట్లుగా ర్యాంప్‌పై హొయలొలికించారు. ఇందులో 13 మంది మిస్ హిజ్రా చెన్నై పోటీలకు ఎంపికయ్యారు. వీరికి పలు దశల్లో వడపోత చేపట్టనున్నారు. ఇందులో భాగంగా వచ్చే నెల 13న హిజ్రాల విద్య, ఉద్యోగంపై, 14న ఆరోగ్య సంరక్షణపై సదస్సు ఉంటుందని ఆ సంఘం నేత సుధా తెలిపారు. అలాగే ఫైనల్స్ చెన్నై కలైవానర్ అరంగం వేదికగా అక్టోబరు 15న నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. முப்பெரும் விழாவாக சென்னையில் நடக்கும் திருநங்கைகளுக்கான ‘மிஸ் சென்னை 2022’ போட்டி.!#Chennai #Transgender https://t.co/vHkgUzTDFv — Behindwoods (@behindwoods) September 22, 2022 -
ట్రాన్స్జెండర్లకు ‘ఆసరా’ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అర్హులందకీ ఇస్తున్నట్లే ట్రాన్స్జెండర్లకు కూడా ఆసరా పింఛన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. ఈ మేరకు జీవో నంబర్ 17లో మార్పులు చేయాలని స్పష్టం చేసింది. ట్రాన్స్జెండర్లకు సంబంధించి ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ట్రాన్స్జెండర్లకు ఉచిత బియ్యం, ఉచిత కోవిడ్ వ్యాక్సినేషన్ లాంటి సౌకర్యాలు అందడం లేదని.. వారికి కూడా గుర్తింపు కార్డులు ఇచ్చి పథకాలు అందేలా చూడాలని కోరుతూ.. వైజయంతి వసంత మోగ్లీ అలియాస్ ఎం.విజయ్‌కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీఎస్ సహా వైద్యారోగ్య, సివిల్ సప్లయ్, హోం, ఆర్థిక, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శులను ప్రతివాదులుగా చేర్చారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున న్యాయవాది జైనాబ్ వాదనలు వినిపించారు. ట్రాన్స్జెండర్లకు ఆధార్ సహా ఇతర గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ సర్వే ప్రకారం రాష్ట్రంలో 58,000 మంది ట్రాన్స్జెండర్లు ఉండగా, 12,000 మందికే కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి చేశారని చెప్పారు. కర్ణాటక, ఏపీ లాంటి రాష్ట్రాల్లో ట్రాన్స్జెండర్ల కోసం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని... రాష్ట్రంలోనూ వారి కోసం పథకాలు అమలు చేసేలా చూడాలన్నారు. అనంతరం ప్రభుత్వ న్యాయవాది రాధివ్‌రెడ్డి వాదిస్తూ ట్రాన్స్జెండర్లు ఉన్న ప్రాంతాల్లో కూడా వ్యాక్సినేషన్ చేపట్టామని చెప్పారు. పిటిషన్ వేసే నాటికి 12,000 మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేసినా.. ప్రస్తుతం దాదాపు అందరికీ పూర్తయిందని వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం ట్రాన్స్జెండర్లకు అసరా వర్తింజేయాలంటూ విచారణను అక్టోబర్ 19కి వాయిదా వేసింది. -
Engineering Student: ఇంజినీరింగ్ మధ్యలో హిజ్రాగా మారి
సాక్షి, చెన్నై: ఇంజినీరింగ్ చదువుతూ హిజ్రాగా మారిన ఓ యువకుడిని చదువు కొనసాగించేందుకు కళాశాల యాజమాన్యం నిరాకరించింది. దీంతో బాధితుడు కలెక్టర్‌ను ఆశ్రయించాడు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా పొన్నేరికి చెందిన కూలీ తెన్నరసు, శశికళ కుమారుడు లోకేష్. రెడ్‌హిల్స్ సమీపంలోని ఆర్వీఎస్ పద్మావతి ఇంజినీరింగ్ కళాశాలలో 2018లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కోర్సులో చేరాడు. రెండో సెమిస్టర్ పూర్తయిన తరువాత లోకేష్ హిజ్రాగా మారి గెజిట్‌లో ఓవియాగా పేరును మార్చుకున్నాడు. అంత వరకు సాఫిగా సాగిన లోకష్ కళాశాల జీవితం పూర్తిగా మారిపోయింది. హిజ్రాగా మారిన లోకేష్ అలియాస్ ఓవియాకు కళాశాల అనుమతి నిరాకరించింది. దీంతో మద్యలోనే ఇంజినీరింగ్ విద్యకు దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో చదువుపై మక్కువతో 2022–23వ సంవత్సరంగానూ డిగ్రీ చేయాలని పచ్చప్ప కళాశాలలో హిజ్రా కోటాలో సీటు ఆశించింది. అయితే హిజ్రా కోటాకు సంబందించి ప్రభుత్వం ఉత్తర్వులు లేకపోవడం, వయస్సు దాటడంతో సీటును నిరాకరించారు. దీంతో ఓవియా గత 18న కలెక్టర్ ఆల్బీజాన్‌వర్గీష్‌ను కలిసి పరిస్థితిని వివరించి కళాశాలలో సీటు ఇప్పించాలని కోరింది. ఈ సంఘటనపై స్పందించిన కలెక్టర్ పొన్నేరిలో ప్రభుత్వ కళాశాలలలో బీఎస్సీ మ్యాథమెటిక్స్ సీటు కేటాయిస్తూ ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను మంగళవారం సాయంత్రం ఓవియాకు అందజేశారు. ఈ సందర్భంగా ఓవియా మాట్లాడుతూ.. బాగా చదువుకుని టీచర్‌గా రాణిస్తానని మీడియాకు వివరించింది. చదవండి: (సీఎం స్టాలిన్ గొప్ప మనసు.. అంతు చిక్కని వ్యాధి సోకిన డానియాకు..) -
ట్రాన్స్జెండర్లకు ఆరోగ్యమస్తు.. తొలిసారిగా వారి కోసం ఎంజీఎంలో ప్రత్యేక క్లినిక్
సాక్షి, వరంగల్: ట్రాన్స్జెండర్లను సమాజం నేటికీ చిన్నచూపు చూస్తోంది. రీ అసైన్మెంట్ సర్జరీ కారణంగా తరచూ అనారోగ్యం బారినపడుతున్నప్పటికీ వైద్యం పొందడంలోనూ అడుగడుగునా వారికి వివక్ష ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో ట్రాన్స్జెండర్లకు ఎదురవుతున్న శారీరక, మానసిక సమస్యలకు చికిత్స అందించేందుకు వరంగల్‌లోని మహత్మాగాంధీ మెమోరియల్ (ఎంజీఎం) ఆస్పత్రి ముందుకొచ్చింది. రాష్ట్రంలోనే తొలిసారిగా వారి కోసం ప్రత్యేక క్లినిక్‌ను ఏర్పాటు చేసింది. వరంగల్ జిల్లా కలెక్టర్ గోపి ఈ క్లినిక్‌ను మంగళవారం ప్రారంభించనున్నారు. ఎంజీఎంలోని 133, 134 ఓపీ రూమ్‌లలో ప్రతి మంగళవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాన్స్జెండర్లకు ఎంజీఎం ఆస్పత్రి వైద్య సేవలు అందించనుంది. సైకలాజికల్ కౌన్సెలింగ్‌తోపాటు హర్మోనల్ థెరపీ, సెక్స్ రీ అసైన్మెంట్ సర్జరీ, బ్రెస్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్, మ్యాస్టెక్టమీ, హిస్టరెక్టమీ, ప్లాస్టిక్ సర్జరీ, చర్మవ్యాధులు వంటి వాటికి స్పెషలిస్ట్ వైద్యులు, ఇతర సిబ్బంది అందుబాటులో ఉండనున్నారు. నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా తమిళనాడులో ఈ సేవలు అందుతుండగా రాష్ట్రంలో మాత్రం ఎంజీఎం సొంతంగా మొదలు పెడుతోంది. హెల్ప్‌లైన్ నంబర్ ఏర్పాటు... ఎంజీఎంలో వారానికోరోజే ఈ క్లినిక్‌లో ఓపీ సేవ లు అందనున్న నేపథ్యంలో వివిధ జిల్లాల నుంచి వచ్చే ట్రాన్స్జెండర్లు ఇబ్బందిపడకుండా ఉండేందుకు ఆస్పత్రి యాజమాన్యం హెల్ప్‌లైన్ నంబర్ 99631 64111ను ఏర్పాటు చేసింది. ఈ నంబర్‌కు ఫోన్‌చేసి పేరు, అనారోగ్య సమస్య చెబితే క్లినిక్ పనివేళల సమాచారం చెబుతారు. ఓపీ సేవ ల్లో ఎస్టీఐ కౌన్సిలర్ కీర్తి సతీశ్‌కుమార్, తెలంగా ణ ట్రాన్స్‌జెండర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు ఓరుగంటి లైలా, కమ్యూనిటీ మొబిలైజర్ పూర్ణిమారెడ్డి చేదోడువాదోడుగా ఉండనున్నారు. సంపూర్ణ వైద్యసేవలు అందుతాయి.. ఇప్పటికే హెచ్ఐవీ పాజిటివ్ ట్రాన్స్జెండర్లకు యాంటీ రెట్రోవైరల్ థెరపీ, ఇతర వైద్యసేవలు అందిస్తున్నాం. ఇప్పుడు ఈ క్లినిక్‌తో వారికి సంపూర్ణ వైద్యసేవలు అందినట్టవుతాయి. ఇందుకోసం మా సిబ్బంది కృషి చేస్తారు. – వి.చంద్రశేఖర్, ఎంజీఎం సూపరింటెండెంట్ -
గదిలోకి దూరి లైంగిక దాడికి యత్నం.. యువతిని కాపాడిన హిజ్రాలు
బెంగళూరు: ఇంటిలో యువతి ఒంటరిగా ఉండగా తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో గది కాలింగ్ బెల్లు కొట్టి మరీ డోర్ తీయగానే ఇంట్లోకి దూరి యువతిపై వేధింపులకు పాల్పడ్డాడో దుండగుడు. ఆమె అరుపులు విని దగ్గరిలోని ఇద్దరు హిజ్రాలు వచ్చి కాపాడారు. నగరంలో కేఆర్ పురంలోని వివేకనగర పోలీస్‌స్టేషన్ పరిధిలో కోరమంగళ వద్దనున్న ఈజిపురలో ఈ ఘటన చోటు చేసుకుంది. దుండగుడు పశ్చిమ బెంగాల్‌కు చెందిన మసురుల్ షేక్ అని పోలీసులు తెలిపారు. ఈజిపురలో నివాసముంటూ నర్సింగ్ కోర్సు చదువుకుంటున్న మిజోరాంకు చెందిన యువతిపై దుండగుడు కన్నేశాడు. రోజూ కాలింగ్ బెల్ కొట్టి.. ఒక హోటల్లో పనిచేసే మసురుల్ షేక్ రోజూ తెల్లవారు జామున యువతి గది డోర్‌బెల్ కొట్టి పారిపోయేవాడు. ఆమె డోర్ తీసి చూస్తే ఎవరూ ఉండేవారు కాదు. ఈ నెల 2వ తేదీ తెల్లవారుజాము కూడా అదే మాదిరిగా బెల్ కొట్టాడు. ఆమె డోర్ తీయగానే గదిలోకి చొరబడి యువతిపైన లైంగిక దాడికి యత్నించగా కేకలు వేసింది. అక్కడ సమీపంలో ఉన్న ఇద్దరు ట్రాన్స్‌జెండర్స్ వచ్చి యువతిని కాపాడి అతన్ని పట్టుకున్నాడు. స్థానికులు వచ్చి దుండగునికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. చదవండి: (రూ.80 వేల జీతం, అయినా సరిపోలే.. భార్యను నిత్యం అనుమానిస్తూ..) -
అడ్డుకున్నారని.. సెక్యూరిటీపై ట్రాన్స్జెండర్ల దాడి
సాక్షి,నిజాంపేట్(హైదరాబాద్): ట్రాన్స్జెండర్లు సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేసిన ఘటన బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాచుపల్లి రాయల్ విలేజ్ ఈశ్వర్రావు అనే వ్యక్తి సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. కాగా ఆదివారం ఉదయం 3.50 గంటల ప్రాంతంలో కొందరు ట్రాన్స్జెండర్లు రాయల్ విలేజ్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో విధులు నిర్వహిస్తున్న ఈశ్వర్రావు, మరో సెక్యూరిటీ సిబ్బంది దుర్గాసింగ్‌లు వారిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ట్రాన్స్జెండర్లు వారిని నెట్టుకుంటూ కొట్టి గాయపరిచారు. దీంతో బాధితులు తమకు ప్రాణహాని ఉందని, ట్రాన్స్జెండర్లు తమపై దాడి చేసి సీసీ ఫుటేజీలను పరిశీలించాలని కోరుతూ బాచుపల్లి పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ప్రాణస్నేహితులు.. విధి ఆడిన ఆటలో ఆ నలుగురు.. -
పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ట్రాన్స్జెండర్ల డిమాండ్ ఇవే!
సాక్షి, హైదరాబాద్: మహిళలు, పురుషులతో సమానంగా తమకూ ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించాలని ట్రాన్స్జెండర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు పోలీస్ శాఖ ఇన్‌వార్డులో వైజయంతి వసంత, ఓరుగంటి లైలా, చంద్రముఖి మువ్వల తదితరులు వినతిపత్రం సమర్పించారు. అంతకుముందు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసిన అన్ని విభాగాల్లోని పోస్టుల్లో తమకు ప్రత్యేక కేటగిరీ కింద దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించాలని బుధవారం డీజీపీ కార్యాలయం వద్ద ట్రాన్స్జెండర్లు నిరసన చేపట్టారు. అందరితో సమానంగా బతికే హక్కు ట్రాన్స్జెండర్లకు ఉందంటూ సుప్రీంకోర్టు, హైకోర్టులిచ్చిన తీర్పులను, 2021లో కర్ణాటక ప్రభుత్వం ట్రాన్స్జెండర్లకు 1% రిజర్వేషన్లను కేటాయిస్తూ ఇచ్చిన జీవోను రాష్ట్రంలో అమలు చేయాలని కోరారు. బోర్డు విడుదల చేసిన పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు తమకు 45 రోజుల సమయం ఇవ్వాలని, దరఖాస్తు ఫారమ్‌లో స్త్రీ, పురుషులతో పాటుగా ట్రాన్స్‌జెండర్ ఆప్షన్ జోడించాలని డిమాండ్ చేశారు. -
హిజ్రాల అందాల పోటీలు.. సందడే సందడి
సాక్షి, చెన్నై: కూవాగం వైపుగా హిజ్రాలు తరలుతున్నారు. మిస్ కూవాగం పోటీలు హోరాహోరీగా మొదలయ్యాయి. మంగళవారం హిజ్రాల పెళ్లి సందడి ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని కళ్లకురిచ్చి జిల్లా ఉలందూరు పేట సమీపంలోని కూవాగం గ్రామంలో కొలువు దీరిన కూత్తాండవర్ హిజ్రాలకు ఆరాధ్యుడు అనే విషయం తెలిసిందే. ఈ ఆలయంలో ఈనెల 6వ తేదీ నుంచి చైత్రమాసం(చిత్తిరై) ఉత్సవాలు జరుగుతున్నాయి. గత రెండేళ్లుగా కరోనా కారణంగా ఈ ఉత్సవాలు జరగలేదు. అయితే, ఈ ఏడాది అనుమతి దక్కడంతో అత్యంత వేడుకగా జరుపుకునేందుకు హిజ్రాలు సిద్ధమయ్యారు. చదవండి: పెళ్లి కొడుకు.. పెళ్లి కూతురాయె! తండోపతండాలుగా.. ఈ ఉత్సవాల్లో ముఖ్యఘట్టమైన హిజ్రాల పెళ్లి సందడి అత్యంత వేడుకగా మంగళవారం జరగనుంది. ఈ వేడుక కోసం హిజ్రాలు కూవాగం వైపుగా పోటెత్తుతున్నారు. దేశ విదేశాల నుంచి సైతం ఇక్కడకు తరలి వస్తున్నారు. వీరి రాకతో విల్లుపురం, ఉలందూరు పేట పరిసరాల్లోని లాడ్జీలు, గెస్ట్ హౌస్‌లు కిటకిటలాడుతున్నాయి. అందగత్తెలకు తామేమీ తక్కువ కాదన్నట్లుగా సింగారించుకుని హిజ్రాలు రోడ్ల మీద ప్రత్యక్షం కావడంతో వారిని చూసేందుకు యువకులు ఎగబడుతున్నారు. ఆదివారం సాయంత్రం నుంచి ఉత్సవాల్లో భాగంగా హిజ్రాలకు ఫ్యాషన్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. తొలిరోజు ఓ సంఘం నేతృత్వంలో మిస్ కూవాగం పోటీలు అర్ధరాత్రి వరకు నిర్వహించారు. మరో సంఘం నేతృత్వంలో సోమవారం అందాల పోటీలు, సాంస్కృతిక వేడుకలు చేపట్టనున్నారు. ఈ ఉత్సవాలపై చెన్నై హిజ్రాల సంఘం కన్వీనర్ సుధా మాట్లాడుతూ, డీఎంకే సర్కారు అధికారంలోకి వచ్చినానంతరం తమకు గుర్తింపు పెరిగిందన్నారు. తమకోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడమే కాకుండా, పథకాల్ని అందజేస్తోందన్నారు. స్థానిక ఎన్నికల్లోనూ తమకు ప్రాధాన్యతను ఇచ్చారని గుర్తు చేశా రు. అందుకే ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ ఉత్సవాల్లో ప్రత్యేక కార్యక్రమాలకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. మంత్రి పొన్ముడి, ఎంపీలు తిరుచ్చి శివ, గౌతమ్ శిగామని, రవికుమార్, సినీ నటుడు సూరి, నళని వంటి వారు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరు కానున్నట్లు వెల్లడించారు. -
దేశంలో తొలి ట్రాన్స్‌జెండర్స్ ప్రొటెక్షన్ సెల్
సాక్షి,హైదరాబాద్: ట్రాన్స్‌జెండర్స్ రక్షణ కోసం మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో ‘ప్రైడ్ ప్లేస్’పేరుతో దేశంలో తొలిసారిగా ట్రాన్స్‌జెండర్స్ ప్రొటెక్షన్ సెల్‌ను ఏర్పాటు చేశారు. ఈ మేరకు మంగళవారం లక్డీకపూల్‌లోని మహిళా భద్రతా విభాగం కార్యాలయంలో‘ప్రైడ్ ప్లేస్’లోగోను డీజీపీ మహేందర్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ..ట్రాన్స్జెండర్ల సమస్యలను పరిష్కరించడంలో ‘ప్రైడ్ ప్లేస్’చాలా ఉపయోగపడుతుందన్నారు. వివక్షకు గురికాకుండా వారి రక్షణకు అన్ని చర్యలను ఈ సెల్ చేపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఒక ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ముగ్గురు సబ్ ఇన్స్పెక్టర్లు, కొంతమంది కానిస్టేబుళ్లు బృందంగా పనిచేయనున్నట్టు తెలిపారు. ఈ ప్రత్యేక సెల్ ఎప్పటికప్పుడు సంబంధిత కమ్యూనిటీతో చర్చలు జరుపుతూ రాష్ట్రంలోని అన్ని పోలీసుస్టేషన్లలో అధికారులకు, సిబ్బందికి రక్షణ చర్యలపై అవగాహన కల్పిస్తుందని తెలిపారు. 2019లో ట్రాన్స్‌జెండర్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం ఈ సెల్ ఏర్పాటుకు కృషి చేసిన మహిళా భద్రతా విభాగం అదనపు డీజీపీ స్వాతిలక్రా, డీఐజీ బి.సుమతి, తరుణి ఎన్జీవో బాధ్యులు మమతా రఘువీర్, ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ ప్రతినిధులను డీజీపీ మహేందర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. -
ట్రాన్స్‌జెండర్లలో మార్పు రావాలి: కొప్పుల
సాక్షి, హైదరాబాద్: ట్రాన్స్జెండర్ల వ్యవహార శైలిలో మార్పు రావాలని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ట్రాన్స్జెండర్ల సంక్షేమంపై వివిధ స్వచ్ఛంద సంస్థలతో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ తల్లిదండ్రులు, కుటుంబానికి దూరంగా ఉంటూ కష్టాలు పడుతున్న ట్రాన్స్జెండర్లపై ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారన్నారు. భిక్షాటన నివారణకు, ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రత్యేక కార్యక్రమాల ద్వారా స్వయం ఉపాధిని పెంపొందిస్తామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి దివ్య దేవరాజన్ తదితరులు పాల్గొన్నారు. -
బెడిసికొట్టిన లింగమార్పిడి శస్త్రచికిత్స
నెల్లూరు (క్రైమ్)/జరుగుమల్లి: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రం నెల్లూరులో ఇద్దరు బీ–ఫార్మసీ విద్యార్థులు వైద్యుల అవతారమెత్తారు. ఓ లాడ్జి గదిని ఆపరేషన్ థియేటర్‌గా చేసుకుని లింగమార్పిడి శస్త్రచికిత్స మొదలుపెట్టారు. ఈ క్రమంలో తీవ్ర రక్త స్రావమై పల్స్‌డౌన్ కావడంతో ఓ ట్రాన్స్జెం డర్ మృతి చెందాడు. ప్రకాశం జిల్లా జరుగు మల్లి మండలం కామేపల్లికి చెందిన బి.శ్రీకాంత్ అలియాస్ అమూల్య(28) చిన్న తనం నుంచే హైదరాబాద్‌లో తాపీపనికి వెళ్లే వాడు. అతడికి 2019లో మేనమామ కుమార్తె తో వివాహమైంది. వారు 2020లో విడాకులు తీసుకున్నారు. అప్పటినుంచి శ్రీకాంత్ ఒంగోలులో ఉంటున్నాడు. అక్కడే అతడికి విశాఖపట్నానికి చెందిన ట్రాన్స్ జెండర్ మోనాలిసా అలియాస్ జి.అశోక్‌తో పరిచయమైంది. ఇద్దరు స్నేహితులయ్యారు. వివిధ ప్రాంతాలకు తిరుగుతుండేవారు. ఆరునెలల కిందట శ్రీకాంత్‌కు సోషల్ మీడియా యాప్ ద్వారా నెల్లూరులోని ఓ ప్రైవేట్ కళాశాల బీ–ఫార్మసీ విద్యా ర్థులు ఎ.మస్తాన్, జీవాతో పరిచయమైంది. ఈ క్రమంలో శ్రీకాంత్ తాను ముంబై వెళ్లి లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించుకుంటానని మస్తాన్‌కు చెప్పాడు. లిం గమార్పిడికి ముంబైలో రూ.లక్షలు ఖర్చ వుతుందని, తక్కువ ఖర్చుతో తానే చేస్తానని మస్తాన్ చెప్పాడు. దీంతో అందరూ కలసి ఈ నెల 23న నెల్లూరు గాంధీబొమ్మ సెంటర్లోని ఎస్ఎస్ లాడ్జిలో గదిని అద్దెకు తీసుకున్నారు. 24న మస్తాన్, జీవా.. మోనాలిసా సహాయం తో శ్రీకాంత్‌కు శస్త్రచికిత్స ప్రారంభించి మర్మాం గాన్ని తొలగించారు. దీంతో శ్రీకాంత్‌కు తీవ్ర రక్తస్రావమై, పల్స్ పడిపోయింది. మోతాదుకు మించి మందులు వాడటంతో కొద్దిసేపటికే శ్రీకాంత్ మృతిచెందాడు. ఈ విషయాన్ని గమనించిన లాడ్జి సిబ్బంది చిన్నబజారు పోలీ సులకు సమాచారమందించారు. మృతుడి వద్ద లభ్యమైన ఆధారాలతో అతడి సోదరి పల్లవికి పోలీసులు సమాచారం అందించి, మృత దేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలిం చారు. నెల్లూరు చేరుకున్న పల్లవి దీనికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని చిన్నబజారు పోలీసు లకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారి స్తున్నట్లు సమాచారం. -
ట్రాన్స్జెండర్లకు అర్హతలు ఉంటే.. ‘డబుల్’ ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపునకు సంబంధించి జారీచేసిన జీవో 10కి అనుగుణంగా ట్రాన్స్జెండర్లకు అర్హతలు ఉంటే వారికి డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించే అంశాన్ని పరిశీలించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్‌కుమార్ షావలిలతో కూడిన ధర్మాసనం మంగళవారం తీర్పునిచ్చింది. డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపులో ట్రాన్స్జెండర్లకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించేలా ఆదేశించాలంటూ సామాజిక కార్యకర్త సీహెచ్ ప్రియామూర్తితోపాటు మరికొందరు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ధర్మాసనం విచారించింది. రేషన్‌కార్డు ఉన్న వారే డబుల్ బెడ్రూం ఇళ్లకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారని, ట్రాన్స్జెండర్లకు రేషన్‌కార్డులు లేవన్న కారణంగా వీరికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవ్వడం లేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది నివేదించారు. డబుల్ బెడ్రూం ఇళ్లను ట్రాన్స్జెండర్లకు కేటాయించరాదన్న నిబంధన ఏమైనా ఉందా అని ధర్మాసనం ప్రభుత్వ న్యాయవాది రాధీవ్రెడ్డిని ప్రశ్నించింది. అటువంటి నిబంధన ఏమీ లేదని, అయితే జీవో 10కి లోబడి అర్హతలు ఉన్న వారందరికీ కేటాయిస్తామని తెలిపారు. -
అందరిలానే.. వారూనూ..
సాక్షి, అమరావతి: ట్రాన్స్జెండర్ల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మూడు నెలల్లో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ట్రాన్స్జెండర్లను సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతిగా గుర్తించి వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్లు కల్పించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఎంత మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు? ప్రభుత్వ ఉద్యోగాల్లో వారి ప్రాతినిధ్యం ఎంత మేర ఉంది? వివక్ష చూపకుండా వారికి ఏ రకమైన ప్రయోజనాలను కల్పిస్తున్నారు? వారికి ఎంత మేర రిజర్వేషన్ కల్పించాలి? తదితర అంశాలపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి, మూడు నెలల్లో సుప్రీంకోర్టు ఆదేశాల అమలుకు చర్యలు తీసుకోవాలని తేల్చి చెప్పింది. ఆడ, మగతో సమానంగా ట్రాన్స్జండర్లను కూడా చూడాల్సిన అవసరం ఉందంది. ఉద్యోగ నోటిఫికేషన్లలో ట్రాన్స్జెండర్ల కాలమ్ పెట్టకపోవడం అనాలోచిత చర్య అని హైకోర్టు ఆక్షేపించింది. అయితే ట్రాన్స్జెండర్లకు ప్రస్తుతం ఎలాంటి రిజర్వేషన్లు లేవని, అలాంటి పరిస్థితుల్లో ట్రాన్స్‌జెండర్ అయిన పిటిషనర్‌కు ఎస్ఐ పోస్టు ఇవ్వాలని ఆదేశించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ట్రాన్స్జెండర్లకు రిజర్వేషన్లు కల్పించలేదన్న కారణంతో ఎస్ఐ పోస్టుల భర్తీ కోసం పోలీసు నియామక బోర్డు 2018లో జారీ చేసిన నోటిఫికేషన్ చట్ట విరుద్ధమైనదిగా ప్రకటించడం సాధ్యంకాదని హైకోర్టు తెలిపింది. నోటిఫికేషన్‌ను చట్ట విరుద్ధంగా ప్రకటించాలంటూ ట్రాన్స్‌జెండర్ గంగాభవాని 2019లో హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ఇటీవల తీర్పు వెలువరించారు. పిటిషనర్ తరఫున న్యాయవాది ఎం.సొలొమన్రాజు వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు తీర్పు అమలుకు సిద్ధం.. ప్రభుత్వ న్యాయవాది వైఎన్ వివేకానంద వాదనలు వినిపిస్తూ, ట్రాన్స్జెండర్ల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలు అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. చిన్న అవకాశం కూడా ఇవ్వలేదు.. ‘సమాజంలో అణగారిన వర్గంగా ఉన్న ట్రాన్స్జెండర్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిశ్చయాత్మక చర్యలు తీసుకోవాలి. ట్రాన్స్జెండర్లు శాపానికి గురైన వారిగా బతుకు వెళ్లదీస్తున్నారు. చాలా దీన, దయనీయ పరిస్థితుల మధ్య బతుకుతున్నారు. కొందరు భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నారు. మానసికంగా, భౌతికంగా, లైంగికంగా వారు పలువురి చేతిలో వేధింపులకు గురవుతున్నారు. రాష్ట్రంలో వారి సంఖ్య చాలా తక్కువ. అయినా కూడా వారికి ఉద్యోగ అవకాశాల్లో వారి దామాషా ప్రకారం సమాన అవకాశాలు కల్పించడం లేదు. రాష్ట్రం వారిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. ఉద్యోగ దరఖాస్తులో తమ లింగం గురించి రాసే అవకాశం కూడా వారికి లేకుండా పోయింది. ఇవన్నీ కూడా స్త్రీ, పురుషులతో సమానంగా ఉద్యోగ అవకాశాలను నిరాకరించడం కిందకే వస్తాయి. 2017లోనే రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్జెండర్ల పాలసీ తీసుకొచ్చింది. 2019లో ట్రాన్స్జెండర్ల హక్కుల పరిరక్షణ చట్టం వచ్చింది. అయినా కూడా ఇవేవీ కూడా సమర్థవంతంగా అమలు కావడం లేదు. ట్రాన్స్జెండర్లను మన రాజ్యాంగం గుర్తించలేదు. అయితే మన పురాణాలు గుర్తించాయి. కురుక్షేత్ర సంగ్రామంలో భీష్మాచార్యుల మరణంలో శిఖండి కీలకపాత్ర పోషించిన సంగతి పురాణాల్లో ఉంది. ట్రాన్స్జెండర్లకు రిజర్వేషన్లు కల్పించాలని మాత్రమే సుప్రీంకోర్టు చెప్పిందే తప్ప, ఫలానా శాతం మేర రిజర్వేషన్లు కల్పించాలని చెప్పలేదు. పిటిషనర్ ఏ నోటిఫికేషన్‌ను సవాలు చేశారో ఆ నోటిఫికేషన్ అప్పటికి అమల్లో ఉన్న సర్వీసు నిబంధనలకు అనుగుణంగానే ఇచ్చారు. అందువల్ల ఆ నోటిఫికేషన్‌ను చట్ట విరుద్ధంగా ప్రకటించడం సాధ్యం కాదు.’ అని జస్టిస్ సత్యనారాయణమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. -
కరోనాలో సేవా కార్యక్రమాలు.. ట్రాన్స్‌జెండర్ అనుమానాస్పద మృతి
సాక్షి, మంచిర్యాల(ఆదిలాబాద్): జిల్లా కేంద్రంలోని గోపాలవాడ శివారు రైల్వే ఏ క్యాబిన్ సమీపంలో నివాసం ఉంటున్న ట్రాన్స్‌జెండర్ బెజ్జం వెంకటేశ్ అలియాస్ శిరీష (24) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మంగళవారం స్థానికులు అందించిన సమాచారం మేరకు ఎస్సై కిరణ్‌కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. స్థానికులు, ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా కేంద్రంలోని శ్రీనివాస్‌నగర్‌కు చెందిన బెజ్జం చంద్రయ్య, సత్యవతి దంపతుల నాలుగో కుమారుడు వెంకటేశ్ ఐదేళ్ల క్రితం ట్రాన్స్‌జెండర్‌గా మారి మంచిర్యాలకు చేరుకున్నాడు. శిరీషగా పేరు మార్చుకున్న అనంతరం సామాజిక సేవల్లో పాల్గొంది. ఈ క్రమంలో ఇక్కడే ఇంటిని నిర్మించుకుంది. జనవరి 1 తర్వాత కనిపించకపోవడం, ఇంటి నుంచి వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని తలుపులు తీసి చూడగా బెడ్‌పై కుళ్లిన స్థితిలో శిరీష మృతదేహం ఉంది. దుర్గంధం వస్తుండటంతో నాలుగురోజుల క్రితమే మృతి చెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. బంధువులకు సమాచారం అందించి, మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి స్నేహితురాలు పింకి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వెల్లడించారు. పలు అనుమానాలు.. శనివారం రాత్రి వరకు చుట్టపక్కల వారితో చలాకీగా మాట్లాడిన శిరీష ఆ తర్వాత కనిపించలేదని స్థానికులు పేర్కొంటున్నారు. మంగళవారం శిరీష ఉంటున్న ఇంట్లో నుంచి వాసన రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇంట్లో బెడ్‌పై కూర్చోని, వెనుక వైపునకు వాలిపోయి ఉన్న స్థితిలో మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ముందు అన్నం ప్లేట్ ఉండటంతో అన్నంలో విషం కలుపుకుని ఆత్మహత్యకు పాల్పడిందా..? లేక ఎవరైనా మద్యం మత్తులో హత్య చేసి ఉంటారా..? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. సేవా కార్యక్రమాల్లో శిరీష.. అందరిలా కాకుండా శిరీష సొంతంగా వివాహది కార్యక్రమాలకు, డ్యాన్స్ ప్రోగ్రాంలకు, క్యాటరింగ్ పనులు చేసేందుకు వెళ్లేది. 2020లో కరోనా బారిన పడిన వారికి, నిరుపేదలకు బియ్యం, కూరగాయలు, నిత్యావసరాలు పంపిణీ చేసింది. -
పెళ్లిళ్లలో హిజ్రాల వీరంగం.. నిరాకరిస్తే నగ్నంగా డ్యాన్స్
సాక్షి, జగిత్యాలక్రైం: పెళ్లంటే జీవితంలో ఒక్కసారి వచ్చే వేడుక. దీన్ని పేదవారు సైతం తమకు ఉన్నంతలో గొప్పగా జరిపించాలని అనుకుంటారు. కానీ హిజ్రాల కారణంగా భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. మామూళ్లు ఇవ్వకుంటే అసభ్యకరంగా ప్రవర్తిస్తూ శుభకార్యాల్లో అలజడి సృష్టిస్తున్నారు. జగిత్యాల రూరల్ మండలం పొరండ్ల గ్రామానికి చెందిన భీమయ్య కుమారుడి వివాహం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిపించారు. రాత్రి బరాత్ జరుగుతున్న సమయంలో హిజ్రాలు వచ్చి, వీరంగం సృష్టించారు. పెళ్లి కుమారుడిని డబ్బులు డిమాండ్ చేశారు. అతను నిరాకరించడంతో రెచ్చిపోయి, నగ్నంగా డ్యాన్స్ చేయడంతో అక్కడున్నవారు పారిపోయారు. రెండు రోజుల కిందట జగిత్యాల జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌కు చెందిన రమణ కుమారుడి పెళ్లి స్థానిక ఓ ఫంక్షన్‌హాలులో జరిగింది. హిజ్రాలు వేదికపైకి వెళ్లి, ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించారు. డబ్బులివ్వాలంటూ అసభ్య పదజాలం వాడారు. దీంతో ఆయన రూ.5 వేలు ఇచ్చి, పంపించారు. చదవండి: (ఒకే కాలేజీ.. ఫేస్బుక్లో దగ్గరై సహజీవనం.. పవిత్రకు నిజం తెలిసి.. ) రూ.50 వేల వరకు వసూలు జగిత్యాల జిల్లాలోని అన్ని ఫంక్షన్‌హాళ్లలో హిజ్రాలు హల్చల్ చేస్తున్నారు. ఒక్కో పెళ్లికి రూ.5 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నారు. దీంతో వధూవరుల తల్లిదండ్రులు తమ బంధువులు, స్నేహితుల ముందు హేళన కావొద్దని వా రు అడిగినంత ముట్టజెబుతున్నారు. సామాన్య కుటుంబాలకు చెందినవారు డబ్బు ఇచ్చేందుకు నిరాకరిస్తే అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. ఫలి తంగా శుభకార్యానికి వచ్చిన బంధువులు, కుటు ంబ సభ్యులు, స్నేహితులు భయపడుతున్నారు. ఎవరైనా హిజ్రాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తే వారితో ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో అందరూ జంకుతున్నారు. చదవండి: (Hyderabad: వ్యభిచార గృహం గుట్టు రట్టు.. సోదరుడి ఇంట్లోనే..) హిజ్రాల ఆగడాలను అరికట్టాలి జిల్లాలో వివాహ వేడుకలకు వచ్చి, హిజ్రాలు మామూళ్లు కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఇవ్వకుంటే అసభ్యకరంగా ప్రవర్తిస్తుండటంతో ఫంక్షన్‌కు వచ్చిన వారంతా భయపడుతున్నారు. పోలీసులు స్పందించి, హిజ్రాల ఆగడాలను అరికట్టాలి. – మారు గంగారెడ్డి, జాబితాపూర్ ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం హిజ్రాలు మామూళ్ల కోసం డిమాండ్ చేస్తే బాధితులు 100 డయల్‌కు కాల్ చేయాలి. ఫిర్యాదు చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. శుభకార్యాల్లో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించి, డబ్బులివ్వాలని వేధిస్తే హిజ్రాలను కఠినంగా శిక్షిస్తాం. – రత్నపురం ప్రకాశ్, డీఎస్పీ, జగిత్యాల -
నువ్వురాకపోతే చచ్చిపోతా.. నువ్వు అవి మానేస్తానంటేనే వస్తా..
సాక్షి, ఒంగోలు: స్థానిక నేతాజీ కాలనీలో నక్కా మణికంఠ(30) ఇంటి సీలింగ్‌కు ఉన్న కొక్కేనికి తాడుసాయంతో ఉరేసుకుని ఆత్మహత్యచేసుకున్నాడు. తాను నివాసం ఉండే ఇంట్లోనే ఈ ఘటన సోమవారం అర్థరాత్రి దాటిన తరువాత వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం మణికంఠ స్వగ్రామం టంగుటూరు మండలం మర్లపాడు. రెండు సంవత్సరాలుగా తుపాకుల విజయ్‌కుమార్ అలియాస్ లవ్లీ అనే ట్రాన్స్‌జెండర్‌తో కలిసి ఉంటున్నాడు. ఆరు నెలల క్రితం ఇద్దరు వివాహం కూడా చేసుకున్నారు. గత నెల 19న మణికంఠకు గుండెపోటు వచ్చింది. దీంతో ఆస్పత్రిలో చూపించగా వైద్యులు మద్యం, ధూమపానానికి దూరంగా ఉండాలని సూచించారు. చదవండి: (దారుణ హత్య: తల, మొండెం వేరుచేసి తలతో పారిపోయి..) అయితే వత్తిరీత్యా డ్రైవర్ అయిన మణికంఠ మద్యం, సిగిరెట్లు మానకపోవడంతో సోమవారం మణికంఠ , లవ్లీ మధ్య వివాదం జరిగింది. దీంతో లవ్లీ చిలకలూరిపేట వెళ్ళింది. దీంతో నువ్వురాకపోతే చచ్చిపోతానని ఫోన్లో హెచ్చరించాడు. మానేస్తానంటేనే వస్తానంటూ అటునుంచి సమాధానం వచ్చింది. ఆ తరువాత కొద్దిసేపటికి ఫోన్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోతుండడంతో లవ్లీ సమీపంలోని వారికి ఫోన్‌చేసింది. వారు వెళ్లి చూడగా ఇంటిపైన ఉన్న కొక్కేనికి వేలాడుతూ కనిపించాడు. దీంతో ఉరేసుకున్నట్లు గుర్తించి వారు లవ్లీకి, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో తాలూకా ఎస్సై దేవకుమార్ ఘటనాస్థలానికి చేరుకుని మతదేహాన్ని కిందకు దించి చుట్టుపక్కల వారిని విచారించారు. లవ్లీ కూడా ఒంగోలుకు చేరుకోవడంతో ఆమెను విచారించారు. గతంలోను ఇదే విధంగా.. మణికంఠ తరచూ ఆత్మహత్యచేసుకుంటానని బెదిరించేవాడని, అదే విధంగా బెదిరిస్తున్నాడని అనుకున్నానని లవ్లీ చెబుతోంది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మానవత్వం చాటుకున్న ట్రాన్స్‌జెండర్ ఎస్ఐ
సాక్షి, చెన్నై(తమిళనాడు): ప్రాణాపాయ స్థితిలో ఉన్న హెడ్ కానిస్టేబుల్‌కు ట్రాన్స్ జెండర్ ఎస్ఐ ప్రితికా యాసిని రక్తదానం చేశారు. ఈ సమాచారంతో ప్రితికాను కమిషనర్ శంకర్ జివ్వాల్ బుధవారం అభినందించారు. చెన్నై అన్నాసాలై పోలీసు స్టేషన్లో ఎస్ఐగా కె ప్రితికా యాసిని పనిచేస్తున్నారు. రాష్ట్రంలో తొలి ట్రాన్స్‌జెండర్ ఎస్ఐగా గుర్తింపు పొందారు. ఈ క్రమంలో స్టేషన్లో పనిచేస్తున్న హెడ్‌కానిస్టేబుల్ శంకర్ అనార్యోగంతో ఉండడంతో రెండు రోజుల క్రితం పరామర్శించారు. ఆయనకు అత్యవసరంగా మూడు యూనిట్ల రక్తం అవసరం కావడంతో మంగళవారం తానే ఆస్పత్రికి వెళ్లి రక్తదానం చేశారు. కమిషనర్ శంకర్ జివ్వాల్ ఎస్ఐను అభినందించారు. చదవండి: బంజారాహిల్స్ కారు యాక్సిడెంట్ కేసు: కొంత ‘కాంప్రమైజ్’?.. -
టాటా సంచలన నిర్ణయం, సర్వత్రా హర్షం
Tata Steel Hires 14 Transgender People: అనితర సాధ్యుడు..ఓటమి ఎరుగని ధీరుడు..రతన్ టాటా పరిచయం అక్కర్లేని పేరు. దేశంలో తిరుగులేని వ్యాపార సామ్రాజ్యాన్ని నెలకొల్పడమే కాదు విలువలు, దాతృత్వానికి మారు పేరు. ముఖ్యంగా సందర్భాన్ని బట్టి మానవత్వం ప్రదర్శించడంలో రతన్ టాటాను మించిన వారెవరూ ఉండరేమో. అలాంటి లివింగ్ లెజెండ్ రతన్ టాటా సంచలన నిర్ణయం తీసుకున్నారు. సమాజం నుంచి వివక్షను ఎదుర్కొంటున్న ట్రాన్స్ జెండర్ల భవిష్యత్తును తీర్చిదిద్దేంకు కృషి చేస్తున్నారు. వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. జార్ఖండ్‌లోని రామ్‌ఘర్ జిల్లాలోని పశ్చిమ బొకారో డివిజన్లో హెవీ ఎర్త్ మూవింగ్ మెషినరీ ఆపరేటర్లుగా 14 మంది ట్రాన్స్జెండర్లను నియమించారు. ప్రస్తుతం ఈ 14మంది శిక్షణలో ఉన్నారని వచ్చే ఏడాది ప్రారంభం నుంచి మైనింగ్ కార్యకలాపాల్లో విధులు నిర్వహిస్తారని టాటా సంస్థ ప్రతినిధులు తెలిపారు. కాగా, అంతకుముందు కంపెనీ 17మంది మహిళలను హెచ్ఇఎమ్ఎమ్ ఆపరేటర్లుగా ఎంపిక చేసింది. ఈ సందర్భంగా టాటా స్టీల్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆత్రయీ సన్యాల్ మాట్లాడుతూ..ఇదే మాడ్యూల్లో పనిచేసేందుకు ఆన్‌బోర్డ్‌లో ఉన్న ట్రాన్స్జెండర్లు గనులలో పనిచేయడానికి ముందే సంవత్సరం పాటు శిక్షణ పొందుతారని తెలిపారు. అంతేకాదు ట్రాన్స్జెండర్ల వర్క్ ఫోర్స్‌ను పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు, 2025 నాటికి 25 శాతం ట్రాన్స్జెండర్లను ఉద్యోగులుగా నియమించేందుకు లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు అత్రయీ సన్యాల్ చెప్పారు. ఇదిలా ఉంటే, రతన్ టాటా నిర్ణయం పై నెటిజన్లు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్ ఆపత్కాలంలో ట్రాన్స్ జెండర్లకు ఉద్యోగ అవకాశం కల్పించడం గొప్ప విషయమని ప్రశంసలు కురిపిస్తున్నారు. చదవండి: ఆ మహానుభావుడు ఉంటే ఎంతో సంతోషించేవాడు.. ఎమోషనలైన రతన్ టాటా -
హిజ్రా ప్రాణం తీసిన ప్రేమ: స్వప్నతో నిషాంత్ వివాహం.. తల్లిదండ్రులకు తెలిసి..
సాక్షి, మీర్పేట్: ప్రేమించి పెళ్లిచేసుకున్న వ్యక్తి వదిలివెళ్లాడని మనస్తాపానికి గురై ఓ హిజ్రా ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాచలానికి చెందిన మొదపూరపు గుణ అలియాస్ స్వప్న (హిజ్రా) (24) కొంత కాలంగా మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నందనవనం జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎంలోని ఓ ఫ్లాట్‌లో స్నేహితులతో కలిసి ఉంటోంది. మూడు నెలల క్రితం నల్లగొండ జిల్లా నిడమనూరుకి చెందిన బైక్ మెకానిక్ గోశెట్టి నిషాంత్‌తో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారి రెండు నెలల క్రితం ఇద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇంట్లో పూజ ఉంది రమ్మని వారం క్రితం తండ్రి నుంచి ఫోన్ రావడంతో నిషాంత్ ఊరికి వెళ్లొస్తానని చెప్పివెళ్లాడు. హిజ్రాను వివాహం చేసుకున్నాడని తల్లిదండ్రులకు తెలిసి కొడుకును తిరిగి హైదరాబాద్ రానివ్వలేదు. నిషాంత్ విషయాన్ని స్వప్నకు ఫోన్ చేసి చెప్పాడు. ఆదివారం ఆమె వాళ్ల ఊరికి వెళ్లి చూడగా ఇంటికి తాళం ఉంది. దీంతో నిడమనూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు నిషాంత్, వారి తల్లిదండ్రులను పిలిపించగా స్వప్న తనకు ఇష్టం లేదని చెప్పడంతో మనస్తాపానికి గురైంది. రాత్రి నందనవనంలోని రూమ్‌కి వచ్చింది. సోమవారం ఉదయం ఎవరూ లేని సమయంలో చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. స్నేహితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మహేందర్‌రెడ్డి, ఎస్ఐ వెంకట్‌రెడ్డి తెలిపారు. చదవండి: (పిల్లలను ఇంట్లో వదిలి వివాహిత అదృశ్యం) -
‘ఆ నేరాలు చేసింది ట్రాన్స్‌జెండర్’
సాక్షి, హైదరాబాద్: మారేడ్‌పల్లి ప్రాంతానికి చెందిన రాజేందర్, కొండాపూర్‌లోని టీఎస్పీఎస్పీ కానిస్టేబుల్ ఈశ్వర్ ప్రసాద్‌ల నుంచి ఆదివారం ల్యాప్‌టాప్, బంగారు గొలుసులు కాజేసింది ట్రాన్స్‌జెండర్‌గా తేలింది. బెంగళూరు నుంచి వచ్చి, లాడ్జిలో బస చేసి, లిఫ్ట్ తీసుకుని ఈ నేరాలకు పాల్పడిన అంజుమ్‌తో పాటు ఆమెకు సహకరిస్తున్న అనుచరుడు బసవరాజ్‌ను నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ టీమ్ పట్టుకున్నట్లు ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు శుక్రవారం వెల్లడించారు. బెంగళూరులోని ప్రగతి లేఔట్ ప్రాంతానికి చెందిన అంజుమ్ ఎనిమిదేళ్ల క్రితం ట్రాన్స్‌జెండర్‌గా మారింది. చిన్న చిన్న పనులు చేసి పొట్టపోసుకునే ఈమె అప్పుడప్పుడు హైదరాబాద్ వచ్చి ట్రాన్స్జెండర్లతో కలిసి ఉండి వెళ్లేది. ఆమెకు ఇటీవల బెంగళూరుకు చెందిన చిరు వ్యాపారి బసవరాజ్‌తో పరిచయం ఏర్పడింది. సన్నిహితంగా ఉంటున్న ఇరువురూ అనేక ప్రాంతాలకు తిరుగుతూ ఖరీదైన హోటళ్లలో బస చేస్తూ విలాసవంతంగా జీవిస్తున్నారు. అందుకు అవసరమైన డబ్బు కోసం నేరాలు చేయాలని పథకం వేశారు. ఈ నెల 12న వీరి ద్దరూ విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. సికింద్రాబాద్‌లోని ఓ లాడ్జిలో బస చేశారు. అదే రోజు రాత్రి రాజేందర్ అనే వ్యక్తి కారులో మారేడ్‌పల్లి నుంచి బేగంపేట వెళ్తుండగా ప్యారడైజ్ సర్కిల్ వద్ద అంజుమ్ లిఫ్ట్ అడిగింది. కారు ఎక్కిన ఆమె రాజేందర్‌తో అసభ్యంగా ప్రవర్తించింది. దీంతో ఆయన సీటీఓ జంక్షన్ వద్ద కారు దిగమన్నాడు. అదును చూసుకున్న అంజుమ్ ఆయన మెడలోని గొలుసు, వెనుక సీటులో ఉన్న ల్యాప్‌టాప్ తీసుకుని ఉడాయించింది. దీనిపై బాధితుడు మహంకాళి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్నారు. అదే రోజు అమీర్‌పేట మార్కెట్ వద్దకు చేరుకున్న అంజుమ్ అటుగా బైక్‌పై వస్తున్న ఈశ్వర్ ప్రసాద్‌ను లిఫ్ట్ అడిగింది. పంజగుట్ట చౌరస్తా వరకు ప్రయాణించి ఆయన మెడలో ఉన్న చైన్ తస్కరించి దిగిపోయింది. దీనిపై పంజగుట్ట ఠాణాలో కేసు నమోదైంది. నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు నేతృత్వంలో ఎస్సైలు కె.శ్రీకాంత్, బి.పరమేశ్వర్, బి.అశోక్‌రెడ్డి, జి.శివానందం రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. తొలుత ఇది యువతి చేసిన పనిగా భావించారు. అయితే సీసీ కెమెరాల్లో నమోదైన ఫీడ్ ఆధారంగా ట్రాన్స్‌జెండర్ పనిగా తేల్చారు. ఆ ఆధారాలతో ముందుకు వెళ్లిన పోలీసులు అంజుమ్‌తో పాటు ఆ సొత్తు విక్రయిస్తున్న బసవరాజ్‌ను వారు బస చేసిన లాడ్జి వద్దనే అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం నిందితులతో పాటు సొత్తును మహంకాళి పోలీసులకు అప్పగించారు. -
రెండేళ్ల క్రితం పెళ్లి.. పిల్లలు కాలేదని డాక్టర్ దగ్గరకెళ్తే.. తను మహిళే కాదని..
సాక్షి, గుంటూరు ఈస్ట్: మోసపూరితంగా ట్రాన్స్‌జెండర్‌తో పెళ్లిచేసి, ఆపై బెదిరింపులకు దిగిన ఘటనపై పాతగుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. పాతగుంటూరుకు చెందిన యువకుడికి తాడికొండకు చెందిన యువతితో 2019లో పెళ్లయింది. ఎంతకూ పిల్లలు కలగకపోవడంతో ఇద్దరూ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో యువతి మహిళ కాదని, ట్రాన్స్‌జెండర్ అని నిర్ధారణ అయింది. దీంతో ఇదేమిటని ప్రశ్నించిన యువకుడిని మామ, అత్త, భార్య కలిసి బెదిరించారు. దీంతో పాత గుంటూరు పోలీసులకు బుధవారం బాధితుడు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (అద్దె ఇల్లు చూపిస్తానని చెప్పి.. మాయ మాటలతో లైంగిక దాడి) (కూతురు బాధ చూడలేఖ.. ఓ తండ్రి ఆత్మహత్య) -
అమెరికాలో తొలి ‘ఎక్స్’ జెండర్ పాస్‌పోర్టు
డెన్వర్: అగ్రరాజ్యం అమెరికాలో పురుషులు, మహిళలు కాని ఎల్జీబీటీ(లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్) వర్గం పౌరుల హక్కులను గుర్తించే ప్రక్రియలో కీలకమైన అడుగు పడింది. అమెరికా ప్రభుత్వం ‘ఎక్స్’ జెండర్ హోదా కలిగిన తొలి పాస్‌పోర్టు జారీ చేసింది. ఇది చరిత్రాత్మక పరిణామం, పండుగ చేసుకోవాల్సిన సందర్భం అని ఎల్జీబీటీ హక్కుల కార్యకర్త జెస్సికా స్టెర్స్ వ్యాఖ్యానించారు. అయితే, ‘ఎక్స్’ జెండర్ పాస్‌పోర్టును ఎవరికి జారీ చేశారన్న వివరాలను ప్రభుత్వం బయటపెట్టలేదు. గోప్యతను కాపాడాలన్న సంకల్పంతో పోస్‌పోర్టు దరఖాస్తుదారుల సమాచారాన్ని బహిర్గతం చేయబోమని అధికారులు చెప్పారు. కొలరాడోలో నివసించే డానా జిమ్ అనే వ్యక్తి ‘ఎక్స్’ జెండర్ పాస్‌పోర్టు కోసం 2015 నుంచి అమెరికా ప్రభుత్వంతో పొరాడుతున్నారు. పురుషుడిగా జన్మించి డానా జిమ్ కొంతకాలం అమెరికాలో సైన్యంలో పనిచేశారు. లింగ మార్పిడి చేయించుకొని మహిళగా మారారు. తనలాంటి వారి హక్కుల కోసం ఉద్యమిస్తున్నారు. తొలి ‘ఎక్స్’ జెండర్ పాస్‌పోర్టును డానా జిమ్‌కే జారీ చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
బియ్యం వ్యాపారంలోకి హిజ్రాలు
సాక్షి, తిరువొత్తియూరు: చెన్నైలో తొలిసారి 40 మంది హిజ్రాలు బియ్యపు వ్యాపారంలోకి ప్రవేశించారు. చెన్నైలో హిజ్రాలు స్వయం ఉపాధి కల్పనతో పలు వృత్తుల్ని స్వీకరిస్తున్నారు. వారికి పలు స్వ చ్ఛంద సంస్థలు సహకారం ఇస్తున్నాయి. ఈ నేప థ్యంలో రాయపేటలో తొలిసారి టీ దుకాణం, చాకలిపేటలో టిఫిన్ దుకాణాలు ఏర్పాటు చేశా రు. అంతేకాకుండా ఓ సంఘంగా ఏర్పడి 40 మంది హిజ్రాలు చెన్నై మైలాపూరులో బియ్యం వ్యాపారానికి శ్రీకారం చుట్టారు. వారికి 400 బస్తాల బియ్యాన్ని స్వచ్ఛంద సంస్థలు అందజేశా యి. హిజ్రా నర్తకి నటరాజ్, డాక్టర్ మాలతి, జయ, సబిత తదితరులు పాల్గొన్నారు. చదవండి: (ప్రాణం తీసిన చికెన్ గ్రేవీ, శీతల పానీయం?) -
సినిమాను తలపించే రీతిలో హిజ్రాల గ్యాంగ్‌వార్
సాక్షి, నల్లగొండ: జిల్లాలోని మిర్యాలగూడ పట్టణంలో హిజ్రాలు నడిరోడ్డుపై వీరంగం సృష్టించారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి తాజాగా బయటకు వచ్చింది. దాచేపల్లి ప్రాంతానికి చెందిన ఓ వర్గం గ్రూపువారు మిర్యాలగూడ పట్టణంలో ఉన్న షాపుల్లో డబ్బులు మరో వర్గం వారు సమాచారం అందుకుని అక్కడకు చేరుకున్నారు. ఈ సమయంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. ఇదే సమయంలో శృతి అనే హిజ్రాపై వ్యతిరేక వర్గం వారు దాడి చేసి విచక్షణారహితంగా కొట్టారు. ఈ ఘటనలో శృతికి గాయాలు కావడంతో అక్కడి నుంచి తప్పించుకుని సమీపంలో ఉన్న ఓ వస్త్ర దుకాణంలోకి వెళ్లి తలదాచుకుంది. షాపు యజమాని శృతిని కాపాడి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనస్థలానికి చేరుకుని గాయపడిన శృతిని అక్కడి నుంచి స్టేషన్‌కు తరలించారు. అనంతరం చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చదవండి: (ఆశ చంపమంది.. అపరాధ భావం చంపేసింది!) -
మొదటి ట్రాన్స్‌జెండర్ ఫొటో జర్నలిస్ట్ కథ చెప్పే క్లిక్
ఇండియాలో ఫస్ట్ ట్రాన్స్‌జెండర్ ఫొటో జర్నలిస్ట్‌గా జోయా థామస్ లోబో ఇటీవల వార్తల్లో నిలిచారు. ముంబైలో ఉంటున్న 27 ఏళ్ల జోయా యాచకురాలి నుంచి ఫొటోజర్నలిస్ట్‌గా ఎలా మారిందో తెలుసుకుంటే సాధనమున ఎవరికైనా ఏ పనైనా సాధ్యమే అనిపించకమానదు. ‘రకరకాల జీవన శైలులను బంధించడానికి నా కెమెరాతో వీధుల్లో నడవడం అంటే నాకు చెప్పలేనంత ఇష్టం’ అంటుంది జోయాను కదిలిస్తే. ‘చిత్రం’గా మలుపు ఇంట్లో చుట్టుపక్కలవారి నిరాదరణకు గురైన జోయా 18 ఏళ్ల వయసులో తన కుటుంబంనుంచి బయటకు వచ్చి, ముంబైలోని తన లాంటివారిని వెతుక్కుంటూ వెళ్లింది. కొంతమంది హిజ్రాల బృందంతో కలిసి, వారితో చేరి స్థానిక రైళ్లలో యాచించేది. ప్రతీ ఒక్కరినీ అవకాశాలు పలకరిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకున్నవారే విజేతలుగా నిలుస్తారు. అలాంటి విజేతల జాబితాలో జోయా నిలుస్తుంది. ‘‘2018లో ఒక రోజు నా జీవితం అకస్మాత్తుగా మలుపుతీసుకుంది. ఒక షార్ట్‌ఫిల్మ్ డైరెక్టర్ ట్రాన్స్‌జెండర్ నటుల కావాలని వెతికారు. నటులు ఎవరూ లేకపోవడంతో నాకు అందులో ఓ పాత్ర పోషించే అవకాశం వచ్చింది. ఆ తర్వాత మరో చిత్రం ట్రాన్స్జెండర్ల సమస్యల మీద తీశారు. అందులోనూ నటించాను’’ అని తనకు వచ్చిన అవకాశం గురించి ఆనందంగా వివరిస్తుంది జోయా. ఆ సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమం లో కుటుంబాలు, సమాజం ట్రాన్స్‌జెండర్స్‌ని దూరంగా ఉంచడం అన్యాయమని పలువురు వక్తలు ప్రసగించారు. అప్పుడు జోయా తను ఎదుర్కొన్న సమస్యలను సభాముఖంగా వివరించింది. ఆమె ఉచ్ఛారణ ఆకట్టుకునే విధంగా ఉండటంతో స్థానిక పత్రికా సంపాదకుడు ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా ఉద్యోగావకాశం ఇచ్చాడు. అలా మొదటిసారి పత్రికా ఆఫీసులో అడుగుపెట్టింది జోయా. అక్కడ ఉపయోగించే కెమెరాలు ఆమెను విపరీతంగా ఆకట్టుకున్నాయి. సాధనమున ఫొటోగ్రీఫీ కొన్ని నెలల్లో సాధన చేసి, సన్నివేశాన్ని కళ్లకు కట్టే క్లిక్‌ను ఔపోసన పట్టింది. కిందటేడాది ఏప్రిల్ లాక్డౌన్ సమయంలో ముంబైలోని బాంద్రా స్టేషన్ సమీపంలో చిక్కుకున్న వలస కార్మికుల నిరసనల ఫొటోలను అన్ని పత్రికలు కవర్ చేశాయి. అందులో జోయా తీసిన ఫొటోలు ఎంతోమంది ప్రశంసలు అందుకున్నాయి. జోయా ఓ కెమరా తీసుకొని, కరోనా మహమ్మారి మధ్య తన పని కోసం కష్టపడుతూ తిరిగింది. ‘ముందు జర్నలిజం గురించి చాలా తక్కువ తెలుసు. కెమెరాతో వర్క్ చేస్తున్నప్పుడు సంఘటనలను ఎలా ఒడిసిపట్టుకోవాలో, వార్తలో ఫొటో ప్రాధాన్యత ఎంతో వర్క్ చేస్తున్నప్పుడు నెమ్మదిగా అర్ధమైంది’ అంటూ తను నేర్చుకున్న పని గురించి వివరిస్తుంది. యాచన డబ్బుతో కెమెరా సాధనకు మరింత మెరుగులు పెట్టాలంటే అందుకు తగిన వనరులు కూడా ఉండాలి. ‘‘సొంతం గా నా దగ్గర ఒక కెమరా ఉండాలనుకున్నాను. కానీ, అంత డబ్బు నా దగ్గర లేదు. ఫ్రీలాన్సింగ్ జాబ్‌కి పెద్ద ఆదాయమూ లేదు. అందుకే, రైళ్లలో యాచిస్తూనే ఉండేదాన్ని. అలా వచ్చిన డబ్బు నుంచి కొంత మొత్తాన్ని దాచిపెట్టేదాన్ని. కానీ, అది కూడా చాలా తక్కువ. 2019 దీపావళి సమయంలో మాత్రం డబ్బు కోసం చాలా కష్టపడ్డాను. అలా వచ్చిన దానితో చివరికి నికాన్ డి–510ను కొన్నాను’’ అంటూ జోయా తన పోషణతో పాటు కెమెరా కొనుగోలుకోసం పడిన కష్టాన్ని తెలియజేస్తుంది. ఒక్క క్లిక్‌తో కథ స్కూల్ దశలోనే వదిలేసిన చదువు. పనిని ఎలా అర్ధం చేసుకుంటారు అని ఎవరైనా అడిగితే– ‘నేను పనిలోకి వెళ్లేటప్పుడు జర్నలిస్ట్ అడిగే ప్రశ్నలు, దానికి సరైన సమాధానం చెప్పగలిగే ఫొటో తీయడంపై దృష్టి పెడతాను. ఒక కథ చెప్పగలిగే ఫొటో ప్రయత్నిస్తాను. వలసకార్మికుల చిత్రాలకు మంచి ప్రశంసలు వచ్చాయి. సీనియర్ ఫొటో జర్నలిస్టులు నా పనిని మెచ్చుకున్నారు. లైసెన్స్, ఇతర సాంకేతిక విషయాలపై నాకు అవగాహన కల్పించారు. దీంతో నాకు తగినన్ని పనులు వచ్చాయి. డబ్బు గురించి పక్కన పెడితే ఫొటో జర్నలిస్టుగా నా వర్క్‌ని నేను అమితంగా ఆనందిస్తున్నాను. కథల గురించి వెతకనప్పుడు పక్షులు, జంతువుల ఫొటోలు తీస్తాను. ఇటీవల అమరావతి పర్యటనకు వెళ్లినప్పుడు కింగ్‌ఫిషర్‌ను క్లిక్ చేయగలిగాను. కిందటేడాది వరకు ఆర్థికంగా మార్పేమీ లేదు. రైళ్లలో యాచించవలసి వచ్చేది. లాక్డౌన్ కావడంతో కెమెరాను కూడా అమ్మాల్సి వస్తుందేమో అని భయపడ్డాను. కానీ, అలా జరగలేదు. నాకు మాట్లాడే అవకాశం వచ్చిన ప్రతిచోటా ట్రాన్స్‌జెండర్స్ చేయలేని పని ఏదీ లేదంటూ చెబుతూనే ఉన్నాను. వారి కుటుంబాల నుండి వారిని తిరస్కరించడం మానేస్తే, మంచి విద్య లభిస్తే, మిగ™ éవారిలాగే మంచి జీవితాలను గడుపుతారు. అన్ని ఉదోగ్యాలలో ట్రాన్స్జెండర్లు పనిచేస్తారు. యాచించరు’’ అని వివరిస్తుంది జోయా. -
World Milk Day 2021: 30 ఆవులు.. పాలతో పాటు గౌరవం కూడా!
తమిళనాడులో భిక్షాటన, బలవంతపు వ్యభిచారం వద్దనుకొని 30 మంది ట్రాన్స్‌జెండర్స్ నిర్ణయించుకున్నారు. తమ కాళ్ల మీద తాము నిలబడేందుకు 30 మంది 30 ఆవులు కొనుక్కుందామనుకున్నారు. తెలుగువాడైన డిస్ట్రిక్ట్ కలెక్టర్ వారికి సపోర్ట్‌గా నిలుచున్నాడు. ఇంకేముంది... 2020లో దేశంలో మొదటి ‘‘ట్రాన్స్ విమెన్ మిల్క్ డెయిరీ’ కోవిల్పట్టిలో మొదలైంది. ఆవులు వారికి పాలు ఇస్తున్నాయి. దాంతో పాటు గౌరవం కూడా. నేటికీ దేశంలో చాలాచోట్ల పాల మీద వచ్చే ఆదాయం ఆ ఇంటి ఆదాయంగా స్త్రీ ఆదాయంగా ఉంటుంది. పాలు ఈ దేశంలో యుగాలుగా ఉపాధి స్త్రీలకు. పాలు అమ్మి గృహ అవసరాలకు దన్నుగా నిలిచిన, నిలుస్తున్న స్త్రీలు ఉన్నారు. వీరి కోసమని పథకాలు ఉన్నాయి. లోన్లు ఉన్నాయి. అవి పొందేందుకు సాయం చేసే ఇంటి పురుషులు ఉంటారు. అయితే ఇటు స్త్రీలుగా, అటు పురుషులుగా గుర్తింపు పొందక, ఎటువంటి అస్తిత్వ పత్రాలు లేక, రేషన్ కార్డులు లేక అవస్థలు పడే ట్రాన్స్‌జెండర్స్ పరిస్థితి ఏమిటి? వీరికి ఉపాధి పొందే హక్కు లేదా? ఎందుకు లేదు? అనుకున్నారు తమిళనాడులో ట్రాన్స్‌జెండర్స్ యాక్టివిస్ట్ గ్రేస్ బాను. ట్రాన్స్‌జెండర్స్ కోసం నిలబడి తమిళనాడులో 30 ఏళ్ల గ్రేస్‌బాను ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్ పొందిన తొలి ట్రాన్స్ ఉమన్. అయితే ఆమె ఆ చదువును డిస్కంటిన్యూ చేసి ట్రాన్స్‌జెండర్స్ కోసం మదురైకు 100 కిలోమీటర్ల దూరంలో ఉండే కోవిల్పట్టి జిల్లాలో ఉంటూ తమిళనాడు అంతటా పని చేయసాగింది. ట్రాన్స్‌జెండర్స్‌కు గుర్తింపు పత్రాల కోసం, రేషన్ కార్డుల కోసం, గృహ వసతి కోసం ఈమె అలుపెరగక పని చేస్తున్నా ఎవరూ పట్టించుకునే వారు కాదు. ఆ సమయంలోనే కోవిల్పట్టికి తెలుగువాడైన సందీప్ నండూరి కలెక్టర్‌గా వచ్చారు. ఆయనను గ్రేస్‌బాను కలిసి సమస్యను వివరించారు. కోవిల్పట్టి జిల్లాలో దాదాపు 250 మంది ఎటువంటి దారి లేక రోడ్డుమీద జీవిస్తున్నారని గ్రేస్‌బాను కలెక్టర్‌కు వివరించారు. వీరిలో కొందరు తమ జీవితాలను మార్చుకుందామని అనుకుంటున్నారని తెలియచేశారు. తొలి డెయిరీ ఫామ్ గ్రేస్బానుతో కలిసి సందీప్ నండూరి 30 మంది ట్రాన్స్ ఉమన్‌ను గుర్తించారు. వీరి స్వయం సమృద్ధికి అవసరమైన లోన్లను బ్యాంకులతో మాట్లాడి ఇప్పించారు. ఒక్కొక్కరు ఒక్కో ఆవు కొనుక్కునేందుకు లోను లభించింది. ప్రభుత్వం తరఫున కోవిల్పట్టికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఒకటిన్నర ఎకరం భూమి కేటాయించబడింది. ఇక్కడ ఆవులకు కావాల్సిన షెడ్స్, నీళ్లు, మేత సదుపాయం అన్నీ కల్పించుకునే ఏర్పాటు జరిగింది. ఈ ట్రాన్స్ ఉమన్‌కు ఎవ్వరికీ ఇంతకుముందు పశువుల్ని చూసుకోవడం కానీ, పాలు పితకడం కానీ రాదు. వీరికి నిపుణులతో 10 రోజుల ట్రైనింగ్ ఇచ్చారు. అయితే ట్రాన్స్ ఉమన్ నుంచి నేరుగా పాలు కొనడానికి కొందరు వైముఖ్యం చూపవచ్చు. అందుకే కలెక్టర్ స్థానిక ప్రభుత్వ నిర్వహణలో ఉన్న పాలసంఘానికి వీరి పాలను కొనే ఏర్పాటు చేశారు. పాల సంఘానికి చేరిన పాలకు కులం, మతం, జెండర్ ఉండదు. పుష్టి తప్ప. 2020 జూన్ ప్రాంతంలో దేశంలోనే మొదటిసారిగా, ఒక ప్రయోగంగా ఈ డెయిరీ ఫామ్ మొదలైంది. అందరూ కలిసి... పంచుకుని డెయిరీని 30 మంది కలిసి చూసుకుంటారు. ఎవరి ఆవు బాగోగులు వారు చూసుకుంటారు. ముప్పై ఆవుల నుంచి మొత్తం పాలు సంఘానికి చేరతాయి. సంఘం సాయంత్రానికి వాటి డబ్బును డెయిరీ అకౌంట్లో వేస్తుంది. ఆ పడేది ఎంతైనా 30 సమాన భాగాలు అవుతుంది. నెలకు కనీసం 8 వేల నుంచి 10 వేల రూపాయలు ఒక్కొక్కరికి వస్తున్నాయి. ‘మా కల నిజమైంది. గౌరవంగా బతుకుతున్నాం’ అని ఈ ట్రాన్స్ ఉమన్ సంతృప్తిని, సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జీవనం సందీప్ నండూరి (ప్రస్తుతం తిరువణ్ణామలై జిల్లా కలెక్టర్) వీరి కోసం అక్కడే ఉమ్మడి జీవనానికి ఏర్పాటు చేశారు. సందీప్ మీద గౌరవంతో వారు ఆ కాలనీకి ‘సందీప్ నగర్’ అని పేరు పెట్టుకున్నారు. ట్రాన్స్‌జెండర్ లకు నివాసం, జీవనం చాలా ముఖ్యమైనవి. అవి కల్పిస్తే వారు ఈ సంఘంలో భాగమయ్యి తమ ప్రతిభా సామర్థ్యాలను నిరూపించుకుంటారని ఈ డెయిరీ చెబుతుంది. కోవెల్‌పట్టి దారిలో తమిళనాడులోని మరికొన్ని జిల్లాలు ఇలాంటి డెయిరీలు భిన్న వర్గాల కోసం నడపాలని యోచిస్తున్నాయి. మంచిదే కదా. – సాక్షి ఫ్యామిలీ -
Transgenders: నెలకు రూ. 1,500 ఆర్థిక సాయం
న్యూఢిల్లీ: మహమ్మారి మన జీవితాలను అతలాకుతలం చేసింది. వైరస్ కట్టడి కోసం లాక్డౌన్ విధించడంతో ఎందరో ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. సామాన్యుల పరిస్థితే ఇలా ఉంటే.. ఇక ట్రాన్స్జెండర్ల సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వారిలో చాలా మంది యాచక వృత్తిని పాటిస్తూ.. పొట్ట పోసుకుంటారు. లాక్‌డౌన్‌తో అన్ని బంద్ కావడంతో వారి జీవితాలు మరింత దుర్భరంగా మారాయి. ఈ క్రమంలో వారిని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ట్రాన్స్జెండర్లకు నెలకు 1,500 రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని సోమవారం ప్రకటించింది. ఈ మేరకు సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘‘మహమ్మారి మూలంగా అందరు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమయంలో తమను ఆదుకోవాల్సిందిగా పలువురు ట్రాన్స్జెండర్లు ఫోన్, ఈమెయిల్స్ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వారి అభ్యర్థనల మేరకు ప్రభుత్వం ట్రాన్స్జెండర్లకు నెలకు 1,500 రూపాయల ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించుకుంది. ఈ మొత్తం వారి రోజువారి కనీస అవసరాలు తీర్చడానికి ఉపయోగపడుతుంది. దీని గురించి ట్రాన్స్‌జెండర్స్ కోసం పని చేస్తున్న ఎన్జీఓలు, కమ్యూనిటీ ఆధారిత సంస్థలు వారికి అవగాహన కల్పించాల్సిందిగా కోరుతున్నాము’’ అన్నారు. ఎలా దరఖాస్తు చేయాలి.. ట్రాన్స్‌జెండర్ వ్యక్తి లేదా.. వారి తరఫున సీబీఓలు ఎవరైనా సరే వారి ప్రాథమిక వివరాలు తెలుపుతూ ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. https://forms.gle/H3BcREPCy3nG6TpH7 ఈ సైట్లో ఉన్న ఫామ్‌లో సదరు వ్యక్తులు తమ ఆధార్ కార్డ్ నంబర్, బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఫామ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్ వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంటుంది అని తెలిపారు. కౌన్సెలింగ్ సేవల కోసం హెల్ప్‌లైన్... ట్రాన్జెండర్లకు మానసిక మద్దుతు, మానసిక ఆరోగ్య సంరక్షణ కోసం ఉచిత హెల్స్‌లైన్ నంబర్లు ఏర్పాటు చేశాం అని సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ట్రాన్స్‌జెండర్ వ్యక్తి ఎవరైనా హెల్ప్‌లైన్ నంబర్ 8882133897 కి కాల్ చేసి నిపుణులతో కనెక్ట్ కావచ్చు. ఈ హెల్ప్‌లైన్ సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 11-01, మధ్యాహ్నం 3-5 గంటల మధ్య పనిచేస్తుంది. చదవండి: ట్రాన్స్... అప్డేట్ వెర్షన్ -
హిజ్రాతో దోస్తీ, రూ.3 లక్షలు తీసుకుని దారుణం
హిందూపురం(అనంతపురం): పట్టణ సమీపంలోని కొట్నూరు జాతీయ రహదారిపై ట్రాన్స్‌జెండర్ నిహారిక (35) శుక్రవారం రాత్రి దారుణ హత్యకు గురైంది. హిందూపురం ఒకటో పట్టణ సీఐ బాలమద్దిలేటి సమాచారం మేరకు.. పరిగి మండలం యర్రగుంటపల్లి చెందిన ట్రాన్స్‌జెండర్ నిహారిక.. హిందూపురంలోని ఇందిరమ్మ కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకుని భిక్షాటనతో జీవనం సాగిస్తోంది. కొంత కాలంగా అదే గ్రామానికి చెందిన రాజశేఖర్ ఆమెతో చనువుగా ఉంటూ వచ్చాడు. ఈ క్రమంలోనే నిహారిక తాను దాచుకున్న రూ. 3లక్షలను రాజశేఖర్‌కు అందజేసింది. శుక్రవారం రాత్రి కొట్నూరు జాతీయ రహదారిపై రాజశేఖర్, నిహారిక కలిసి మద్యం సేవించి, ఘర్షణ పడ్డారు. ఆ సమయంలో కత్తితో నిహారిక గొంతును రాజశేఖర్ కోసేశాడు. అనంతరం మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు శనివారం ఉదయం ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు. నిందితుడి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు సీఐ బాలమద్దిలేటి తెలిపారు. చదవండి: ఘోరం: అందరూ చూస్తుండగానే... యువకుడి నగ్న వీడియోలు రికార్డు చేసి.. -
హిజ్రాలకు ఐటీ కంపెనీల్లో కొలువులు
సాక్షి, సిటీబ్యూరో: హిజ్రా కమ్యూనిటీలో జరుగుతున్న నేరాలను నియంత్రించడంతో పాటు అవసరమైన సందర్భాల్లో వారికి పోలీసుల నుంచి చేయూతనందించే దిశగా సైబరాబాద్ పోలీసులు అడుగులు వేస్తున్నారు. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ) సహకారంతో గచ్చిబౌలి పోలీసు స్టేషన్లో ‘ట్రాన్స్‌జెండర్ హెల్ప్‌డెస్క్’ను పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ శనివారం ప్రారంభించనున్నారు. దీనిద్వారా ముఖ్యంగా ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీలో తరచూ జరుగుతున్న ఘర్షణలు, రెండు వర్గాల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించడంతో పాటు హిజ్రాలను ఎవరైనా వేధించిన సందర్భంలో పోలీసుల నుంచి సహాయం కోసం ఈ హెల్ప్‌డెస్క్ మార్గదర్శనం చేయనుంది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా తొలిసారిగా సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లోనే ట్రాన్స్‌జెండర్ హెల్ప్‌డెస్క్ ప్రారంభిస్తుండడం విశేషం. ఎవరెవరు ఉంటారంటే... గచ్చిబౌలి ఠాణాలోని ట్రాన్స్‌జెండర్ హెల్ప్ డెస్క్‌లో ఇద్దరు సిబ్బంది పనిచేస్తున్నారు. ఎస్సీఎస్సీ నియమించిన ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ కో–ఆర్డినేటర్ (హిజ్రా)తో పాటు పోలీసు విభాగం నుంచి ఓ కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తారు. వీరు హిజ్రాల నుంచి వచ్చే ఫోన్‌కాల్స్‌ను స్వీకరించి ఏదైనా ఆపదలో ఉంటే మార్గదర్శనం చేస్తారు. ఇతర సమస్యలు ఏవైనా ఉంటే పరిష్కారం కోసం పోలీసులను ఎలా సంప్రదించాలనే దానిపై సూచనలు చేస్తారు. ఏదైనా అత్యవసరమైతే సంబంధిత ఠాణా అధికారులను అప్రమత్తం చేసి వారి వద్దకు చేరుకొని సంరక్షించేలా చూస్తారు. అయితే చాలా మంది హిజ్రాలు లైంగిక వేధింపులు ఎదుర్కొంటూ..పోలీసులను ఎలా సంప్రదించాలో తెలియక తికమకపడతారు. ఒకవేళ వెళ్లినా ఆ ఫిర్యాదును పట్టించుకోరనే ఉన్న అపోహను తొలగించేలా ఈ హెల్ప్‌డెస్క్ పనిచేయనుంది. ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు... హైదరాబాద్‌లో దాదాపు ఎనిమిదివేల మంది వరకు హిజ్రాలు ఉన్నారు. వీరిలో బాగా చదువుకున్న వాళ్లూ ఉన్నారు. విద్యావంతులైన వారు కొందరు వారికి ఆసక్తి ఉన్న రంగంలో ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే హిజ్రాలకున్న సమస్యలను పరిష్కరించడంతో పాటు వారిలో బాగా చదువుకున్నవారికి ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పించేందుకు ఎస్సీఎస్సీ చేయూతతో ‘హెల్ప్‌డెస్క్’ పనిచేయనుంది. ఇప్పటికే హిజ్రాలకు ఉద్యోగాలిచ్చేందుకు రెండు ఐటీ కంపెనీలు ముందుకువచ్చాయని అధికారులు పేర్కొంటున్నారు. ఏఏ సమస్యలంటే... కొందరు హిజ్రాలు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద యాచిస్తున్నారు. వాహనాలు ఆపి మరీ బలవంతంగా పైసలు వసూలు చేస్తున్నారు. షాపుల వద్దకు వెళ్లి డబ్బులు అడుగుతున్నారు. వీరిలో కొందరు నకిలీ హిజ్రాలు సైతం ఉంటున్నారు. కొందరు వ్యభిచార వృత్తిలో కూడా కొనసాగుతున్నారు. ఆయా సందర్భాల్లో గొడవలు జరిగి నేరాలు పెరుగుతున్నాయి. వీటికి చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో ట్రాన్స్‌జెండర్ హెల్ప్‌డెస్క్‌ను అందుబాటులోకి తెస్తున్నారు. హిజ్రాల్లో కొంతమందినైనా మార్చగలిగితే నేరాలు నియంత్రణలోకి వస్తాయని సైబరాబాద్ పోలీసు అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. చదవండి: ఈ సిక్స్ ప్యాక్ బ్యాండ్ గురించి తెలుసా? -
ట్రాన్స్జెండర్లతో సమావేశమైన సీపీ సజ్జనార్
సాక్క్షి, హైదరాబాద్: రాష్ట్రంలోనే తొలిసారిగా సైబరాబాద్ కమిషనరేట్ ప్రాంగణంలో ట్రాన్స్‌జెండర్ డెస్క్‌ను శుక్రవారం కమిషనర్ వీసీ సజ్జనార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నగరం నలుమూలల నుంచి 150 మంది ట్రాన్స్జెండర్లతో ఇంటర్ఫేస్లో కమిషనర్ సజ్జనార్ సమావేశమయ్యారు. ట్రాన్స్జెండర్ల సమస్యల పరిష్కారానికి సామాజిక కార్యకర్త పద్మశ్రీ సునీతాకృష్ణన్ అభ్యర్థనపై ఈ డెస్క్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సునీతాకృష్ణన్ మాట్లాడుతూ..ట్రాన్స్జెండర్లకు విద్య, ఉపాధి, అద్దెకు ఇళ్ళు, సన్నిహిత భాగస్వామి హింస, వీధిలో వేధింపులు వంటివి ఉన్నాయని, వాటిని పరిష్కరించేందుకు ఈ డెస్క్ ద్వారా కృషి జరగాల్సిన అవసరం ఉందన్నారు. సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. ట్రాన్స్జెండర్ల సమస్యలను పరిష్కరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ట్రాన్స్జెండర్లు, వారి సంఘం ప్రజల్ని వేధించడం గానీ, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు గానీ పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. ట్రాన్స్జెండర్ల ద్వారా ఎలాంటి సమస్యలున్నా ప్రజలు డయల్ 100కు, వాట్సప్ నంబర్ 9490617444 ద్వారా తెలుపవచ్చన్నారు. కార్యక్రమంలో సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్‌కుమార్, శంషాబాద్ డీసీపీ ఎన్. ప్రకాశ్‌రెడ్డి, డబ్ల్యూసీఎస్‌డబ్ల్యూ విభాగం డీసీపీ సి.అనసూయ, ఏడీసీపీ క్రైమ్ కవిత, పలువురు ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, పలువురు ట్రాన్స్జెండర్లు పాల్గొన్నారు. -
అమ్మా.. నేనేం పాపం చేశాను.!
అందరు అమ్మల్లాగా నువ్వూ.. నవమాసాలు మోసి నాకు జన్మనిచ్చావు.. మగ పిల్లాడు పుట్టాడని సంతోషించావు.. కానీ.. ఆ దేవుడెందుకో నాకు మగతనం ఇవ్వలేదమ్మా.. ఇందులో నేను చేసిన తప్పేమిటమ్మా.. నేను ఎలా పుట్టాలో నా చేతిలో ఉందా అమ్మా.. ఎవరెన్ని మాటలు అన్నా నువ్వు నాకు అమ్మవే కదమ్మా.. మరి నేను ఈరోజు నీ బిడ్డను ఎందుకు కాలేకపోయానమ్మా.. నీ కడసారి చూపునకు కూడా నోచుకోనంతటి పాపం నేనేం చేశానమ్మా.. అమ్మా.. నీ మనసు నొప్పించి ఉంటే నన్ను క్షమించమ్మా.. (ఇది మరణించిన ఓ హిజ్రా ఆత్మఘోష..) కడప కల్చరల్: ఒక కాకి మరణిస్తే మిగతా కాకులు చుట్టూ చేరి ఆక్రందన చేస్తాయి. కోతి చనిపోతే సాటి కోతులు అక్కున చేర్చుకుని గోతిలో కప్పేస్తాయి. కానీ బాధ్యుడైన మనిషి మరణిస్తే సాటి మనిషి అటుంచి కన్న తల్లిదండ్రులే అసహ్యహించుకుంటే మానవత్వం బతికే ఉందనుకోవాలా? మనుషులమని చెప్పుకునేందుకే మనం సిగ్గుపడాలా? తన తప్పేమి లేకున్నా ట్రాన్స్‌జెండర్‌గా పుట్టిన కారణంగా కన్నబిడ్డను కాటికి చేర్చడానికి కన్నవారే ముందుకు రాకపోవడం మానవతా వాదులందరనీ కలచివేస్తోంది. వివరాలిలా ఉన్నాయి. జిల్లాలో దాదాపు 300కు పైగా ట్రాన్స్జెండర్లు ఉన్నారు. వారు తనలాంటి మరికొందరితో కలిసి బృందాలుగా జీవిస్తున్నారు. భిక్షాటనతోనూ, ఉత్సవాల్లో నృత్యాలు చేసి జీవనం గడుపుతున్నారు. (చదవండి: వింత: కోడి ఆకారంలో మేక..) కడప నగర శివార్లలో అలాంటి ఓ బృందం సభ్యురాలు శ్రీలేఖ శుక్రవారం మరణించింది. బృందం నాయకులు విషయాన్ని ఆమె తల్లికి తెలిపారు. ‘దాని పుట్టుకే వృథా.. మాకు అవమానకరం... చస్తే మేమేం చేయాలి.. మున్సిపాలిటీ వారికి చెప్పండి...ఈడ్చేస్తారు...అంటూ అసహ్యహించుకున్న సంఘటన ట్రాన్స్జెండర్ల బృందాన్ని ఆవేదనకు గురి చేసింది. తప్పనిసరి పరిస్థితుల్లో బృందం సభ్యులే తల్లిదండ్రుల బాధ్యతను భుజానికెత్తుకున్నారు. తమ నాయకురాలు సారిక ఆధ్వర్యంలో దాదాపు 150 మందికి పైగా ట్రాన్స్జెండర్లు ఆత్మబంధువులై నిలిచారు. శనివారం సహచరి మరణం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తూ అంత్యక్రియలు నిర్వహించారు. వారి గురించి తెలిసిన మానవతా వాదులైన పలువురు స్థానికులు ఈ కార్యక్రమానికి తమవంతు సహకారం అందించారు.(చదవండి: చేతిని అతికించి.. కుటుంబాన్ని బతికించారు) -
ప్రేమ విఫలం, ట్రాన్స్‌జెండర్ ఆత్మహత్య
కడప అర్బన్: కడప నగరంలోని ఏఎస్ఆర్ నగర్లో నివాసం ఉంటున్న శ్రీలేఖ అలియాస్ ప్రసాద్ (18) అనే ట్రాన్స్‌జెండర్ పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. సహచరుల, స్థానికుల సమాచారం మేరకు.. ట్రాన్స్‌జెండర్, ఓ యువకుడిని ప్రేమించింది. తనకు యువకుడి ప్రేమ దక్కలేదని, మానసిక వేదనకు గురై ఈనెల 4వ తేదీ రాత్రి పురుగుల మందు సేవించింది. స్థానికులు రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు కడప తాలూకా పోలీసులు తెలియజేశారు. -
ఈ సిక్స్ ప్యాక్ బ్యాండ్ గురించి తెలుసా?
సంగీతానికి అవధుల్లేవు అన్నది అందరికీ తెలిసిన మాట. అయితే సంగీత కచేరీకీ షరతుల్లేవు అని నిరూపించింది ఓ ట్రాన్స్‌జెండర్ గ్రూప్. ఆరుగురు ట్రాన్స్జెండర్లు కలిసి మ్యూజిక్ బ్యాండ్‌గా ఏర్పడి పాటలను వదిలారు. చెడామడా తిట్టిన నోళ్లే తమను మెచ్చుకుంటుంటే పొంగిపోయారు. ఆత్మస్థైర్యం పెంచుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతూ ముందుకు సాగుతున్నారు. ఇక ఈ సిక్స్ ప్యాక్ బ్యాండ్ భారత్‌లోనే తొలి ట్రాన్స్జెండర్ల సంగీత సమూహం కావడం విశేషం. (చదవండి: వారెంట్ జారీ అయ్యిందని తెలిసి షాకయ్యా: దర్శకుడు శంకర్) ఈ బ్యాండ్‌లో ఫిదా ఖాన్, రవీనా జగ్తప్, ఆశ జగ్తప్, చాందిని సువర్ణకర్, కోమల్ జగ్తప్, భవికా పాటిల్ అనే ఆరుగురు ట్రాన్స్జెండర్లు ఉంటారు. 2016లోనే ఏర్పడ్డ ఈ బ్యాండ్ నుంచి ఇప్పటి వరకు ఐదు పాటలు వెలువడ్డాయి. పాట రిలీజైన ప్రతిసారి అభిమానులు వాటిని విని, కొత్తగా ఉన్నాయంటూ మెచ్చుకునేవారు. సాధారణ ప్రేక్షకులే కాదు హృతిక్ రోషన్, సోనూ నిగమ్, అర్జున్ కపూర్, రహత్ ఫతే అలీ ఖాన్ వంటి పలువురు సెలబ్రిటీలు సైతం బ్యాండ్ ప్రతిభకు సపోర్ట్ చేస్తూ వారి పాటల వీడియోలో తళుక్కున మెరిశారు. సోనూ నిగమ్ అయితే వీరిని సంగీత పరిశ్రమలో గేమ్ ఛేంజర్‌గా పేర్కొన్నారు. (చదవండి: అరవై రోజులు ఆగకుండా షూటింగ్...!) నిజంగానే సమాజంలో వివక్షకు గురవుతున్న వీళ్లు ఇక్కడివరకు రావడం అంటే మాటలు కావు. అందరి ట్రాన్స్జెండర్ల లాగే వీళ్లకు కూడా ఎన్నో అవమానాలు, చీత్కారాలు, వేధింపులు ఎదురైనప్పటికీ వాటన్నింటినీ దాటి ముందడుగు వేశారు. సంగీత సరిగమలతో ప్రజల మనసు దోచుకునే బ్యాండ్‌గా ఎదిగారు. బాలీవుడ్‌లోనూ మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు అదే సంగీతాన్ని అస్త్రంగా చేసుకుని జెండర్ ఈక్వాలిటీ కోసం, వారి హక్కుల కోసం పోరాడుతున్నారు. (చదవండి: సుశాంత్ వదిలేసుకున్న 7 బ్లాక్‌బస్టర్ సినిమాలు!) -
ఇంట్లో నా ప్రవర్తన నచ్చలేదు
హిజ్రాలు..చాలామందికి వారంటే ఒక చులకన భావం.. రకరకాల అభిప్రాయాలు.. దగ్గరకు వస్తే చాలు.. మొహం తిప్పేస్తారు.. అయితే.. మార్పు మొదలైంది.. ఒక సమంత, ఒక సహస్ర, ఒక శైలజ ఇలా ఎందరో ఆ మార్పు దిశగా.. జీవితంలో ఒక కొత్త వసంతం దిశగా కలసికట్టుగా ముందడుగు వేస్తున్నారు. తద్వారా తమలాంటి వారెందరికో మార్గదర్శులుగా నిలుస్తున్నారు.. ఇంతకీ ఎవరు వీళ్లు? ఇదంతా ఎలా జరిగింది? నా పేరు జాస్మిన్ ఆడపిల్లలాంటి నా ప్రవర్తన ఇంట్లో నచ్చలేదు. డిగ్రీ మధ్యలోనే ఆపేసి హైదరాబాద్‌కు వచ్చాను. ఓ కెమికల్ కంపెనీలో చేరాను. మగవాళ్ల వేధింపుల వల్ల పని మానేసి బిచ్చమెత్తాను. పడుపు వృత్తి చేశాను. కోవిడ్ వల్ల ఆ ‘ఉపాధి’కూడా పోయింది. ఒక్కసారిగా జీవితం తలకిందులైంది. ట్రాన్స్‌జెండర్స్ అసోసియేషన్ ప్రతినిధి ముద్రబోయిన రచన సహకారంతో 20 మంది హిజ్రాలం కలిసి ‘ట్రాన్స్ ఈక్వాలిటీ సొసైటీ’ని ఏర్పాటు చేసుకున్నాం. స్వయం ఉపాధితో జీవిస్తున్నాం. (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) లాస్ట్ బెంచీలో కూర్చోబెట్టారు: సమంత మాది రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, ముక్కునూరు. చదువులో ఫస్టే అయినా నా ప్రవర్తన కారణంగా లాస్ట్ బెంచ్‌లో కూర్చోబెట్టారు. తోటి వారు హేళన చేశారు. స్కూల్‌కు వెళ్లలేకపోయాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌తోనే చదువు ఆపేశాను. నాన్న చిన్నప్పుడే చనిపోయాడు. ఇంట్లో నేను పెద్ద. కొన్నాళ్లు వ్యవసాయం చేశాను. మానేసి ఇంటి నుంచి బయటకు వచ్చేశాను. చనిపోవాలనిపించింది. ఢిల్లీ, ముంబైలో గడిపి తిరిగి హైదరాబాద్‌కు వచ్చి ఆటో నడిపాను. ఇప్పుడు కూరగాయల దుకాణం పెట్టుకుని రోజుకు రూ.500 సంపాదిస్తున్నాను. దుబాయ్‌కి పంపించారు: శైలజ మాది తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర తోకాడ గ్రామం. పెద్దగా చదువుకోలేదు. నాకు నచ్చినట్లు నేను ఉంటానంటే ఇంట్లో వాళ్లు తిట్టారు. నాలో మార్పు వస్తుందేమోననే ఉద్దేశంతో దుబాయ్‌కు పంపారు. అక్కడ మూడేళ్లు ఆఫీస్ బాయ్‌గా పని చేశాను. తిరిగి వచ్చిన తరువాత పెళ్లి ఏర్పాట్లు చేశారు. కానీ ఓ అమ్మాయి జీవితం పాడు చేయవద్దని ఇంటికి దూరంగా వెళ్లిపోయాను. 2010లో హైదరాబాద్‌కు వచ్చి భిక్షాటన చేశాను. జాస్మిన్ సహకారంతో ఇప్పుడు పచ్చళ్లు, పిండి వంటలు చేస్తున్నాను. ఖర్చులు పోను రోజుకు రూ.500 వస్తున్నాయి. హాస్టళ్లకు పచ్చళ్లు అందిస్తున్నాం. అనాథలా బతికాను: సహస్ర మాది భద్రాచలంలోని అంబేద్కర్ సెంటర్. నేను అనాథను.కొద్ది రోజులు హాస్టల్లో ఉండి చదువుకున్నాను. కానీ అడుగడుగునా అవమానాలు ఎదురయ్యాయి. మా ఇంటి దగ్గర ఉన్న ముంతాజ్ బేగం అనే అక్క చేరదీసింది. ఆ తరువాత కొంతకాలం ఇళ్లలో పని చేశాను. 2006లో హైదరాబాద్ వచ్చి రక రకాల పనులు చేశాను. నాలుగేళ్ల పాటు గాగిల్లాపూర్‌లోని ఓ పరిశ్రమలో పనిచేశాను. అక్కడా అవమానాలే. ఇప్పుడు సుందర్‌నగర్‌లో టీ స్టాల్ పెట్టుకున్నాను. రోజుకు రూ. 300 వస్తున్నాయి. ఆదరించి.. అండగా నిలిచి.. కుత్బుల్లాపూర్ పరిధిలోని సూరారం, దయానందనగర్లలో పనిచేస్తున్న ‘నా పల్లె నా వెలుగు’, ఉమెన్ అండ్ ట్రాన్స్‌జెండర్ జాయింట్ యాక్షన్ కమిటీ, ఎన్సీసీఐ వంటి స్వచ్ఛంద సంస్థలు 20 మంది హిజ్రాలకు అండగా నిలిచాయి. వారు తయారు చేసిన వస్తువులను ‘క్వికిల్స్’బ్రాండ్‌తో విక్రయిస్తున్నారు. ఒకరు టీస్టాల్ పెట్టుకున్నారు. కొందరు పచ్చళ్లు చేస్తున్నారు. ఇంకొందరు పాల వ్యాపారం చేస్తున్నారు. మరికొందరు మేకలు పెంచుకుంటున్నారు. పలువురు కూరగాయల వ్యాపారం చేస్తున్నారు. ప్రభుత్వ ఆదుకుంటే మరింత గౌరవప్రదంగా బతుకుతామని ఆశగా అంటున్నారు. -
స్వయం ఉపాధిలో హిజ్రాలు..
-
అనాథలకు రైస్ కార్డు
సాక్షి, కర్నూలు: ఒంటరి నిరుపేద జీవితం ఎంతో దుర్భరం. తమను తాము పోషించుకునే శక్తి లేక పూట గడవడమే కష్టంగా బతకాల్సి వస్తోంది. అలాగే సమాజ వివక్షకు గురవుతూ జీవితాంతం ఒంటరిగా జీవించే ట్రాన్స్జెండర్ల పరిస్థితి మరీ అధ్వానం. అటువంటి వారికి రైస్ కార్డులు మంజూరు చేసి అండగా నిలవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో వారిని గుర్తించే బాధ్యతను అధికారులు వలంటీర్లకు అప్పగించారు. తమ పరిధిలో కార్డులు లేని అనాథలు, ట్రాన్స్జెండర్లు, పిల్లలు లేని వితంతువులు, ఇల్లులేని వారిని గుర్తించాలి. అలా గుర్తించిన వారు గ్రామ/వార్డు సచివాలయాల్లో రైస్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలి. సాధారణ రైస్ కార్డు మాదిరిగానే ఆరు అంశాల ప్రాతిపదికన అర్హత ఉంటే చాలు. వీరికి కూడా పది రోజుల్లోనే కొత్త రైస్ కార్డులను మంజూరు చేస్తారు. ఈ మేరకు జిల్లాలో దాదాపు 5 వేల మంది కొత్తగా రైస్ కార్డు పొందే అవకాశం ఉన్నట్లు అంచనా. ఇకపై సంక్షేమ పథకాలకూ అర్హులు.. ఏ సంక్షేమ పథకానికైనా అర్హత ఉండాలంటే ముఖ్యంగా రైస్ కార్డు ఉండాలి. ఆ కార్డు లేకపోవడంతో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు అనాథలు, ఒంటరిలు, ట్రాన్స్జెండర్లు దూరం కావాల్సి వస్తోంది. దీంతో కార్డు పొందేందుకు వారు అధికారులు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగిపోవాల్సి వచ్చేది. ఇక నుంచి ఆ పరిస్థితి ఉండదు. ప్రభుత్వమే అర్హులైన వారిని గుర్తించి రైస్ కార్డులు ఇస్తుండటంతో సంక్షేమ పథకాలకు అర్హత పొందనున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై హర్షం.. ఒంటరిగా జీవించే వారికి చేయూత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడంపై హర్షం వ్యక్తమవుతోంది. గతంలోనూ ఈ డిమాండ్ ఉన్నా పాలకులు పట్టించుకోలేదు. సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మానవత్వంతో ఆలోచించి ఒంటరి బతుకులకు అండగా నిలవాలని నిర్ణయించడం అభినందనీయం. ఈ నిర్ణయంతో పలువురి ఒంటరి బతుకుల్లో వెలుగులు నిండనున్నాయి. సర్వే జరుగుతోంది గతంలో ఒంటరిగా జీవించే వారికి రేషన్‌కార్డులు ఇచ్చేవాళ్లం కాదు. ఈ ప్రభుత్వం వారికి అండగా నిలవాలని సంకల్పించింది. ఒంటరిగా జీవించే వ్యక్తులకు కూడా కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. వలంటీర్లతో సర్వే జరుగుతోంది. సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే నిబంధనల మేరకు రైస్ కార్డు మంజూరవుతుంది. – సయ్యద్ యాసిన్, డీఎస్ఓ మా జీవితాలకు భరోసా రెక్కల కష్టంపై బతికే మా జీవితాలకు ఓ భరోసా లభించింది. రైస్ కార్డు వస్తుందని ఇప్పటి వరకు కలలో కూడా ఊహించలేదు. ఇప్పుడు వలంటీర్ వచ్చి నాతో దరఖాస్తు చేయించారు. చాలా సంతోషం.– కె.రాజేశ్వరి, - ట్రాన్స్‌జెండర్, కర్నూలు -
ట్యాంక్‌బండ్‌పై చితకబాదిన ట్రాన్స్‌జెండర్స్
సాక్షి, హైదరాబాద్ : ఓ వ్యక్తిని ట్రాన్స్‌జెండర్స్ చితకబాదిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల జరిగిన గణేష్ నిమజ్జనం సందర్భంగా నగరంలోని ట్యాంక్‌బండ్‌పై ఓ వ్యక్తి ట్రాన్స్ జెండర్స్‌తో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో గుంపుగా వచ్చిన వారు ఆ వ్యక్తిని చితకబాదారు. ఈ క్రమంలోనే వారి నుంచి తప్పించుకుని ఆ వ్యక్తి అక్కడి నుంచి బయటపడ్డాడు. కొంతదూరం తరిమినప్పటికీ మళ్లీ వారి చేతికిచిక్కలేదు. అయితే ఈ ఘటనపై ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ వీడియాలో వైరల్‌గా మారింది. ఆ వ్యక్తి ఎవరు అనేది తెలియరాలేదు. -
ఇద్దరు హిజ్రాలు సహా ముగ్గురు హత్య
సాక్షి, చెన్నై: తిరునెల్వేలిలో ఇద్దరు హిజ్రాలు సహా ముగ్గురు హత్యకు గురైన సంఘటన శుక్రవారం కలకలం రేపింది. తిరునెల్వేలి సమీపంలోని సూత్తమల్లిలో హిజ్రాల నివాస ప్రాంతం ఉంది. ఇక్కడ నివాసం ఉంటున్న హిజ్రాలు భవాని, అనుష్క ఆమె భర్త మురుగన్ గురువారం నుంచి కనిపించలేదు. వారి కోసం సహ హిజ్రాలు ఆ చుట్టు పక్కల పలు ప్రాంతాల్లో గాలించారు. అయినా వారి ఆచూకీ కానరాలేదు. దీంతో పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఈ స్థితిలో శుక్రవారం ఈ సంఘటన గురించి పోలీసులు అదే ప్రాంతానికి చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు పాళయంకోట ఫోర్ వే రోడ్డు సమీపంలో ఉన్న బావిలో తేలుతున్న గోనె సంచుల్లో కట్టిన స్థితిలో ముగ్గురి మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కనిపించకుండా పోయిన హిజ్రాలు మృతదేహాలుగా కనిపించిన స్థితిలో సహ హిజ్రాలు పెద్ద సంఖ్యలో సూత్తమల్లి పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించి, హంతకులను పట్టుకోవాల్సిందిగా ఆందోళన చేపట్టారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. -
ఫ్రీ వైఫై; 80 వేల పోర్న్ వీడియోలు డౌన్లోడ్
లండన్: ఓ ట్రాన్స్‌జెండర్ ఆస్పత్రిలోని వైఫై ఉపయోగించుకుని ఏకంగా 80 వేల పోర్న్ వీడియోలను డౌన్లోడ్ చేసింది. ఈ షాకింగ్ ఘటన యూకేలో చోటు చేసుకుంది. 54 ఏళ్ల జూలీ మార్షాల్ అనే ట్రాన్స్‌జెండర్ 2017 ఆగస్టులో గుండెపోటుతో ఆస్పత్రిలో చేరింది. బెడ్డుపై పేషెంటు స్థితిలో ఉన్న ఆమె అక్కడ ఉన్న పబ్లిక్ వైఫైను తన ఫోన్‌కు, ల్యాప్‌టాప్‌కు కనెక్ట్ చేసుకుంది. అనంతరం 80 వేల వరకు పోర్న్ ఫొటోలు, వీడియోలను ల్యాప్‌టాప్‌లో డౌన్లోడ్ చేసింది. అవన్నీ కూడా పిల్లల పోర్న్ ఫొటోలే కావడం గమనార్హం. అయితే పెద్ద మొత్తంలో ఉండే ఇంటర్నెట్ ప్యాక్ ఎంతో తొందరగా అయిపోవడంతో ఆస్పత్రి వర్గాలు అసలేం జరుగుతోందని ఆరా తీశాయి. అప్పుడు ఆ ట్రాన్స్‌జెండర్ అసలు రంగు బయటపడింది. (చివరి క్షణాల్లో చావు నుంచి తప్పించిన ఫోటోగ్రాఫర్!) ఉన్న నెట్టంతా అసభ్య ఫొటోలు, వీడియోలు డౌన్లోడ్ చేసుకోడానికే ఆమె వినియోగించిందని తేలింది. దీంతో వెంటనే ఆస్పత్రి వర్గాలు పోలీసులకు సమాచారం అందించాయి. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమె దగ్గర నుంచి ఫోన్‌ను, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకుని అరెస్టు చేశారు. ఆమెపై అనుమానంతో ఇంటికి వెళ్లి చూడగా కుప్పలుగా పడి ఉన్న సీడీలను సైతం స్వాధీనం చేసుకున్నారు. దీనిపై సుదీర్ఘ విచారణ జరిపిన న్యాయస్థానం తాజాగా ఆమెకు తొమ్మిదేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే ఇప్పుడు పోలీసులకు అసలైన చిక్కొచ్చి పడింది. ట్రాన్స్‌జెండర్‌ను మహిళల జైల్లో ఉంచాలా? లేదా మగవాళ్ల జైల్లో ఉంచాలా? అనేది అర్థమవక తలలు పట్టుకుంటున్నారు. (జోక్ చేశాడని హత్య చేశారు!) -
ట్రాన్స్జెండర్లకు రేషన్ సరుకులు ఇచ్చారా?
సాక్షి, హైదరాబాద్: ట్రాన్స్జెండర్లకు రేషన్ షాపుల్లో సరుకుల కేటాయింపునకు ప్రభుత్వం చర్యలు తీసుకుందో లేదో తెలియజేయాలని హైకోర్టు కోరింది. కరోనా సమయంలో ట్రాన్స్జెండర్లకు నిత్యావసరా లు, వసతి, వైద్యం, ప్రభుత్వ పథకాలను అమలు చేసేలా ఉత్తర్వుల జారీని కోరుతూ వైజయంతి వసంత మొగిలి (ఎం.విజయ్‌కుమార్) దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి. విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్లో వివరాలు అసమగ్రంగా ఉన్నాయని, పూర్తి వివరాలు నివేదించాలని ధర్మాసనం ఆదేశించింది. వైరస్ వ్యాప్తికి గురయ్యే ట్రాన్స్జెండర్లకు వైద్య సహాయం అందించేందుకు గచ్చిబౌలిలోని టిమ్స్ ఆస్పత్రిలో ప్రత్యేక వార్డును కేటాయించే ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించాలని సూచించింది. వారిని జనరల్ వార్డులో ఉంచితే ఇతరులతో వారు సమస్యలు ఎదుర్కొనవచ్చునని వ్యాఖ్య చేసింది. ఇలా చేయడం దురదృష్టకరమని కోర్టు అభిప్రాయపడింది. అనంతరం కోర్టు కేసు విచారణ జూలై 6వ తేదీకి వాయిదా వేసింది. -
‘రెయిన్ బో’.. ఇది ప్రత్యేకంగా వారి కోసమే
లక్నో: నోయిడా మెట్రో రైల్ కార్పోరేషన్(ఎన్ఎమ్ఆరస్సీ) బుధవారం ‘ఆక్వా’ లైన్‌లోని (ఈ లైన్ నోయిడా స్టేషన్ నుంచి గ్రేటర్ నోయిడా స్టేషన్‌కు వెళుతుంది) ‘సెక్టార్ 50’ స్టేషన్‌ను ట్రాన్స్జెండర్లకు కేటాయించింది. దాని పేరును ‘రెయిన్ బో’గా మార్చింది. ఈ మేరకు ఎన్ఎమ్ఆర్సీ మేనేజింగ్ డైరెక్టర్ రీతూ మహేశ్వరి బుధవారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘వ్యక్తులు, ఎన్జీఓల సలహాల తర్వాత.. ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీని ఉద్దేశించి ‘సెక్టార్ 50’ స్టేషన్ పేరును ‘రెయిన్ బో’గా మార్చాం. ట్రాన్స్జెండర్లు సాధికరత సాధించాలనే గొప్ప ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాము. వారి కాళ్ల మీద వారు నిలబడేందుకు ఎన్ఎమ్ఆర్సీ ట్రాన్స్జెండర్లకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. ఈ స్టేషన్లో వారి కోసం ప్రత్యేక సదుపాయాలు, వసతులు ఏర్పాటు చేస్తాం’ అన్నారు. (మీ ముద్దు మాకొద్దు) అంతేకాక అక్కడ దిగి, ఎక్కే ట్రాన్స్‌జెండర్ ప్రయాణికులకు కూడా ప్రత్యేక సౌకర్యాలు ఉంటాయని రీతూ మహేశ్వరి తెలిపారు. అంతేకాక నోయిడా మెట్రోలో ఉన్న ట్రాన్స్‌జెండర్ స్టాఫ్ అందరినీ అక్కడికి బదలీ చేస్తామన్నారు. అందులోని వివిధ విభాగాలలో, కౌంటర్లలో ట్రాన్స్జెండర్లే ఉంటారని తెలిపారు. ఇది పూర్తిగా వారి కోసం కేటాయించిన స్టేషన్ అన్నారు. అయితే తొలుత ఈ ‘సెక్టార్ 50’ స్టేషన్ పేరును ‘షీ మ్యాన్’గా మారుస్తూ.. నోయిడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తీర్మానించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమయ్యింది. ఈ నిర్ణయం పట్ల ట్రాన్స్జెండర్లు నిరసన వ్యక్తం చేయడంతో చివరకు ‘రెయిన్ బో’గా మార్చారు. -
మణిపూర్ క్రీడల్లో ‘ట్రాన్స్‌జెండర్స్’
సాక్షి, న్యూఢిల్లీ : మణిపూర్ వాసులు ‘యేవ్‌శాంగ్’ పండుగను అంగరంగ వైభవంగా జరపుకుంటారు. వసంతం రాకకు సూచికగా జరపుకునే ఈ పండుగను ‘మణిపూర్ హోలీ’ పండుగగా కూడా అభివర్ణిస్తారు. ఐదు రోజులపాటు కొనసాగే ఈ పండుగ సందర్భంగా అన్ని వర్గాల వారు, అన్ని కులాల వారు, పిల్లా, పెద్ద, ఆడ, మగ తేడా లేకుండా ఈ పండుగ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. ఈ సందర్భంగా వివిధ రకాల క్రీడలు, ఆటల పోటీలు నిర్వహిస్తారు. ముగింపు సందర్భంగా సంగీత విభావరీలు కూడా ఉంటాయి. ఈసారి క్రీడల్లో త్రిలింగీయులు (ట్రాన్స్‌జెండర్స్) ప్రధాన ఆకర్షణ కానున్నారు. మణిపూర్ వాసుల్లో అత్యధిక ఆదరణ కలిగిన ఫుట్‌బాల్ పొటీల్లో వారు పాల్గొననున్నారు. యువజన, త్రిలింగీయుల సాధికారికతకు కృషి చేస్తోన్న ‘యా ఆల్’ ఎన్జీవో సంస్థ వ్యవస్థాపకులు, పీహెచ్డీ విద్యార్థి సదమ్ హంజాబమ్ ప్రోత్సాహంతో 14 మంది సభ్యులు గల త్రిలింగీయులు ఫుట్‌బాల్ పోటీల్లో పాల్గొనున్నారు. వారు ఆరుగురు జట్టు చొప్పున రెండు జట్లుగా విడిపోయి పరస్పరం పోటీ పడనున్నారు. (హిజ్రా అని అందరూ నవ్వుతున్నారు..) అటు స్త్రీలతోని, ఇటు పురుషుల జట్లతో పోటీ పడేందుకు త్రిలింగీయులు సిద్ధంగా ఉన్నప్పటికీ ఇంకా అందుకు సమాజం ఆమోదం రావడం లేదని, అప్పటి వరకు వారిలో వారు పోటీ పడడమే భావ్యమని భావించినట్లు వారితో జాతీయ జట్టును కూడా రూపొందించిన సదమ్ తెలిపారు. ఆయన త్రిలింగీయులతో 2018, 2019 సంవత్సరాల్లో వరుసగా ఫుట్‌బాల్ టోర్నమెంట్లు నిర్వహించారు. గత మార్చి నెలలో ఇంఫాల్‌లో నిర్వహించిన టోర్నమెంట్‌కు కూడా ప్రజల నుంచి మంచి ఆదరణ లభించింది. త్రిలింగీయులను రెండుగా విభజించి, అంటే పురుషులుగా మారిన వారిని ఓ జట్టుగా, స్త్రీలుగా మారిన వారిని ఓ జట్టుగా చేసి ఆయన పోటీలు నిర్వహించినప్పుడు ప్రజలు ఎగబడి చూశారు. అదే వారికి పురుషుతో, స్త్రీలతో పోటీలు నిర్వహిస్తే ఇప్పుడే సరైన ఆదరణ లభించక పోవచ్చని సదమ్ అన్నారు. ఏ నాటికైనా స్త్రీ, పురుషులతో సమానంగా త్రిలింగీయులను గుర్తిస్తారని, జాతీయ స్థాయి క్రీడల్లో వారికి కూడా సముచిత స్థానం లభిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్తారు. (జవాన్ల మరణంపై ట్వీట్: డాక్టర్ సస్పెన్షన్) -
హిజ్రాలకు శేఖర్ కమ్ముల చేయూత
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న హిజ్రాలను ఆదుకునేందుకు తన వంతు సాయాన్ని అందించారు దర్శకుడు శేఖర్ కమ్ముల. ఇప్పటికే ఆయన జీహెచ్ఎంసీ, కర్నూలు పారిశుద్య కార్మికులకు నెలరొజుల పాటు బాదం పాలు, మజ్జిగ అందజేసి తనవంతు సాయం చేస్తూ అందరికీ ఆదర్శకంగా నిలుస్తున్నారు. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని హిజ్రాలను ఆదుకునేందుకు ఆయన ముందుకు వచ్చారు. అంతేకాకుండా వీళ్లకు సహాయం చేయడానిఇక మరికొంతమంది ముందుకు రావాలని సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు. ‘ఈ లాక్డౌన్ సమయంలోలో అత్యంత ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ట్రాన్స్జెండర్లు. వాళ్లు పడుతున్న కష్టాలని ఊహించలేం కుడా. అన్నం లేక, ఉంటానికి గూడు దొరక్క, అద్దెలు కట్టుకోలేక చాలా బాధలు పడుతున్నారు. ఇవి కాక సమాజంలో వారి పట్ల ఉండే వివక్ష, అపోహలతో వాళ్ల ఇబ్బందుల్ని ఇంకా పెంచుతున్నాయి. వాళ్లకి అడ్రస్ ఉండదు. ఓటర్ కార్డ్ ఉండదు. రేషన్ కార్డ్ ఉండదు. హెల్త్‌కేర్ పథకాలు వర్తించవు. సెన్సిటివ్ గా ఉందాం. వాళ్ళని సపోర్ట్ చేద్దాం. ఎవరన్నా కాంటాక్ట్ చేయాలి అంటే rachanamudraboyina@gmail.comకు మెయిల్ చేయండి’అంటూ శేఖర్ కమ్ముల ట్వీట్ చేశారు. ఇక శేఖర్ కమ్ముల చేసిన సాయానికి కృతజ్ఞతగా హిజ్రాలు ‘థాంక్యూ శేఖర్ కమ్ముల’ అంటూ ప్లకార్డులు పట్టుకొని తమ సోషల్ మీడియాలో పోస్ట్ లు చేశారు. మరింత మంది తమను ఆదుకునేందుకు ముందుకురావాలని కోరారు. #rachanamudraboyina pic.twitter.com/YKQ12IjKpY — Sekhar Kammula (@sekharkammula) May 15, 2020 చదవండి: హరీష్‌పై బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు భార్యకు విడాకులు.. గాయనితో 9 ఏళ్లుగా -
మొన్న ఆడ, నిన్న మగ.. నేడు ఏదీ కాదు..
లండన్: హర్ట్ఫోర్డ్షైర్లో పుట్టి పెరిగిన కైరా బెల్ జన్మతా ఆడపిల్ల. రింగు రింగుల జుట్టుతో చిన్నప్పుడు అచ్చం ఆడ పిల్లలాగే ఉన్నా మగపిల్లల్లా గదమ మీద, చేతుల మీద వెంట్రుకలు వచ్చేవి. వాటిని రేజర్‌తో షేవ్ చేసుకోవాల్సి వచ్చేది. గొంతు కూడా ఆడ పిల్లలాగ కాకుండా పీల గొంతు ఉండేది. ఈ లక్షణాలకు తగినట్లుగానే ఆమెకు చిన్నప్పటి నుంచి మగవాళ్ల దుస్తులే ధరించేది టామ్‌బాయ్ (మగ దుస్తులు ధరించే ఆడపిల్ల)లాగా. ఆడ పిల్లల దుస్తులు «ధరించాల్సిందిగా తల్లి ఎంత మొత్తుకున్న వినేది కాదు. భర్త నుంచి విడిపోయి ఒంటరిగా ఉంటున్న తల్లితోనే ఆమె ఉండేది. రానురాను కైరా బెల్ శరీరంలో మగ లక్షణాలతోపాటు ఆలోచనల్లో కూడా మగ లక్షణాలే పెరగడంతో సెక్స్ మార్పిడి ఆపరేషన్ చేయించుకోవాలనుకుంది. 16వ ఏటా బ్రిటన్ నేషనల్ హెల్త్ స్కీమ్ ఆధ్వర్యంలో నడుస్తున్న లండన్‌లోని ‘ది టావిస్టాక్ సెంటర్’ చికిత్సా కేంద్రాన్ని సందర్శించింది. మూడున్నర గంటల కౌన్సిలింగ్ ద్వారా ఆమెకు సెక్స్ మార్పిడి చేయాలని వైద్యులు నిర్ణయించారు. ముందుగా ఆడ లక్షణాలకు సంబంధించిన హార్మోన్స్‌ను అడ్డుకునే మందులు ఇచ్చారు. ఆ తర్వాత సెక్స్ మార్పిడి ఆపరేషన్ చేశారు. ఆమెలో మహిళా హార్మోన్లు నశించడంతోపాటు పీరియడ్స్ ఆగిపోయాయి. లైంగిక కోరిక చచ్చిపోయింది. ఈ దశంలో ఆమెకు ‘టెస్టాస్టెరోన్’ హార్మోన్ల ఇంజెక్షన్లు ఇచ్చారు. అప్పుడు గడ్డం, మీసాలు బాగానే పెరిగాయి. ఆడ పిల్లల్లాగా బ్రెస్ట్ కూడా పెరుగుతూ వచ్చింది. దాంతో ఆమె తన 20వ ఏట ఆపరేషన్ ద్వారా బ్రెస్ట్ తీసేయించుకున్నారు. మళ్లీ పెరగకుండా ‘ప్రెసింగ్’ ట్రీట్మెంట్ తీసుకుందిజ ఈ క్రమంలో ఆమె ఎంతో బాధను అనుభవించింది. బర్త్ సర్టిఫికేట్, విద్యార్హతల్లో జెండర్‌ను ఆడ నుంచి మగగా మార్చుకోవడానికి కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఎంత కష్టపడ్డా పూర్తి మగ లక్షణాలు రాలేదు. దాంతో ఆమె పునరాలోచనలో పడింది. టెస్టోస్టెరోన్ ఇంజెక్షన్లు తీసుకోవడం మానేసింది. దాంతో ఆమెకు తిరిగి పీరియడ్స్ మొదలయ్యాయి. గడ్డం, మీసాలు పెరగడం తగ్గాయి. లైంగిక కోరికలు కలగడం కూడా మొదలయింది. తిరిగి ఆడపిల్ల కావాలనుకుంది. ఇక్కడే ఆమె జీవితం కొత్త మలుపు తిరిగింది. ‘ది టావిస్టాక్ సెంటర్’ 18 ఏళ్లు నిండని మైనర్లకు సెక్స్ మార్పిడి ఆపరేషన్లు చేయడం చట్టవిరుద్ధమంటూ దాఖలైన కేసులో ప్రత్యక్ష సాక్షిగా కైరా బెల్‌ను పేర్కొన్నారు. అందుకని ఆమె సెక్స్ మార్పిడికి ‘ది టావిస్టాక్’గానీ, ప్రాసిక్యూటర్లుగానీ అనుమతించడం లేదు. ఈ కేసు హైకోర్టులో తేలదని, బ్రిటన్ సుప్రీం కోర్టు వరకు వెళ్లాల్సి ఉంటుందని న్యాయనిపుణులు చెబుతున్నారు. సుప్రీంలో కేసు తేలడానికి కొన్నేళ్లు పట్టవచ్చని అంచనా వేస్తున్నారు. అప్పటి వరకు కైరా నిరీక్షించాల్సిందే. ‘నాది ఆడ లేదా మగ కాని బతుకైనది. రెండింటి మధ్య నలిగి పోతున్నాను. సెక్స్ మార్పిడి కోరుకునే వారికి నా అనుభవాలు ఓ గుణపాఠం కావాలి’ అని కైరా సమాజానికి సందేశం ఇస్తున్నారు. ఇంతకుముందు బ్రిటన్ చార్లీ ఎవాన్స్ ముందు ఆడ పిల్ల, సెక్స్ మార్పిడి ద్వారా పురుషుడయ్యారు. మళ్లీ ఆపరేషన్ ద్వారా ఆడపిల్లగా మారారు. ఇలాంటి అనుభవాలు ఉన్నప్పటికీ బ్రిటన్‌లో లింగ మార్పిడికి 13,500 మంది నిరీక్షణ జాబితాలో ఉన్నారు. 2009–10 సంవత్సరంలో 18 ఏళ్లలోపు ఆడపిల్లలు 40 మంది లింగ మార్పిడి ఆపరేషన్ చేసుకోగా వారి సంఖ్య 2017–2018 సంవత్సరానికి 1806కు చేరుకుంది. ఇక మగవారి సంఖ్య 57 నుంచి 753కు చేరుకుంది. -
ట్రాన్స్జెండర్లపై వివక్ష తగదు
సాక్షి, న్యూఢిల్లీ: ట్రాన్స్జెండర్లపై సమాజంలో కొనసాగుతున్న వివక్షను రూపుమాపాల్సి ఉందని వైఎస్సార్సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ట్రాన్స్‌జెండర్ (హక్కుల పరిరక్షణ) బిల్లుపై మంగళవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ, తరతరాలుగా సమాజంలో ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు వివక్ష, అవహేళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాన్స్‌జెండర్ వర్గాల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు తమ పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఈ బిల్లు ద్వారా ట్రాన్స్జెండర్ల ప్రయోజనాల పరిరక్షణతోపాటు వారికి విద్య, ఆరోగ్యం, ఉపాధి వంటి కనీస సదుపాయాలు పొందే చట్టబద్ధమైన అర్హత లభిస్తుందని చెప్పారు. ‘జిల్లా మేజిస్ట్రేట్ జారీ చేసే గుర్తింపు పత్రం ద్వారా ఒక వ్యక్తిని ట్రాన్స్‌జెండర్‌గా గుర్తించవచ్చని బిల్లులో చెబుతున్నారు. అలాగే స్వయం ప్రకటిత మార్గం ద్వారా కూడా ట్రాన్స్‌జెండర్‌ను గుర్తించడం జరుగుతుందని బిల్లులో చెబుతున్నారు. ఈ వైరుధ్యంపై బిల్లులో ఎక్కడా స్పష్టత, వివరణ లేదు’అని అన్నారు. ఖాతాదారులు నష్టపోతే వ్యవస్థీకృత రక్షణ ఉండాలి చిట్ ఫండ్స్‌లో పొదుపు చేసే ఖాతాదారులు నష్టపోయినప్పుడు వారిని ఆదుకునేందుకు వ్యవస్థీకృత రక్షణ ఉండాలని ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం రాజ్యసభలో చిట్ ఫండ్స్ (సవరణ) బిల్లు–2019పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘చిట్‌ఫండ్ ఖాతాదారులు, ముఖ్యంగా ఆర్థికంగా బలహీన వర్గాల ప్రజల ప్రయోజనాలు కాపాడేందుకు వీలుగా పలు చర్యలు తీసుకున్నారు. ఈ బిల్లుకు కొన్ని సూచనలతో మద్దతు ఇస్తున్నాం. ఏపీలో జరిగిన అగ్రిగోల్డ్ స్కామ్‌లో 32 లక్షల మంది నష్టపోయినప్పుడు.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.10 వేల వరకు నష్టపోయిన వారికి ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించారు. ఇలా నష్టపోయిన పరిస్థితుల్లో పేదలకు వ్యవస్థ అండగా ఉండాల్సిన అవసరం ఉంది..’అని పేర్కొన్నారు. పొగాకును నిషేధించాలి ఈ–సిగరెట్లనే కాకుండా సిగరెట్లు సహా మొత్తం పొగాకు ఉత్పత్తులను నిషేధించాలని, అదే సమయంలో పొగాకు రైతుల ప్రయోజనాలు కాపాడాలని వైఎస్సార్సీపీ ఎంపీ మార్గాని భరత్ కేంద్రాన్ని కోరారు. సభాపతి స్థానంలో ఉన్న ప్యానల్ స్పీకర్ మెహతాబ్ స్పందిస్తూ ‘భరత్ ఎల్లవేళలా మంచి సలహాలతో వస్తారు. రైతుల ప్రయోజనాలు ఎలా కాపాడాలన్న అంశంపై సలహాలు ఇచ్చారు..’అని ప్రశంసించారు. కాగా, నవరత్నాల పేరుతో ఆంధ్రప్రదేశ్ అమలుచేస్తున్న ప్రజాసంక్షేమ కార్యక్రమాలకు కేంద్రం సాయం చేయాలని లోక్‌సభ జీరో అవర్‌లో ఎంపీ మార్గాని భరత్ కోరారు. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. సింగపూర్‌లో ఉన్నవారు మాత్రమే డిజైన్ చేస్తారని బాబు నమ్మించారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ సవరణ బిల్లు–2019పై జరిగిన చర్చలో వైఎస్సార్సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడారు. అమరావతిలోని ఎన్ఐడీ సహా భోపాల్, జోర్హాట్, కురుక్షేత్రలోని ఎన్‌ఐడీలకు జాతీయస్థాయి ప్రాధాన్యత గల సంస్థలుగా గుర్తిస్తూ ఈ బిల్లును ప్రతిపాదించారు. బిల్లుపై లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ.. ‘మా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉదంతం ఒకటి ఇక్కడ ప్రస్తావించాలి. ఒక రాజధానిని మన దేశంలో డిజైన్ చేయలేమని అందరూ నమ్మేలా చేసేశారు. సింగపూర్లోనో, లండన్లోనో ఉండేవాళ్లు మాత్రమే రాజధానిని డిజైన్ చేయగలరని నమ్మేలా చేశారు. అందువల్ల మన సంస్థలు డిజైన్ అందించేలా చూడాల్సిన అవసరం ఉంది. విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి. ప్రత్యేక హోదా సహా అన్ని హామీలు నెరవేర్చాలి..’అని కోరారు. -
క్యాబ్ డ్రైవింగ్‌లో రాణించింది
ఆర్టికల్ 377ను సడలించినా.. సమాజంలో ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీని ఇంకా చిన్న చూపే చూస్తోంది సమాజం. ‘‘ఏ పనిలో పెట్టుకోరు, మాతో మర్యాదగా మాట్లాడరు, నోటి దురుసుతనమే కాదు చేయి కూడా చేసుకుంటారు. అందుకే చాలామంది ట్రాన్స్జెండర్లు భిక్షాటన, సెక్స్‌వర్క్‌లో దిగుతారు’’ అంటుంది హైదరాబాద్‌కు చెందిన ఓ ట్రాన్స్ ఉమన్ ఆవేదనగా. చుట్టూ ఉన్నవాళ్లు హేళన చేస్తున్నా, అడుగడుగునా అవమానపరుస్తున్నా ఆత్మవిశ్వాసం విడవకుండా ఇంకెంతోమంది ట్రాన్స్జెండర్లు పలురంగాల్లో రాణిస్తూ, తమను వెక్కిరిస్తున్న సమాజానికే పాఠం నేర్పుతున్నారు. ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ పదిమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. వాళ్లలో ముందు వరసలో ఉంటుంది రాణీ కిరణ్. ఒడిషా, భువనేశ్వర్‌కు చెందిన ఆమె కూడా తోటి ట్రాన్స్జెండర్లలాగే మొదట్లో రైళ్లల్లో భిక్షాటన చేసింది. చీదరింపులను ఎదుర్కొంది. ఆత్మాభిమానం దెబ్బతిని ఆ పనికి స్వస్తి చెప్పి ఆటోరిక్షా నడపడం స్టార్ట్ చేసింది. ఇక్కడా తిరస్కారమే ఎదురైంది. జనాలు ఆమె ఆటో ఎక్కడానికి సంకోచించేవాళ్లు. దాంతో పూట గడవక ఆటోకు బ్రేక్ వేయాల్సి ఇచ్చింది. ఆ టైమ్‌లోనే పూరీలో జరిగిన రథయాత్రలో అంబులెన్స్ నడిపే అవకాశం వచ్చింది. కాని ఎంతకాలం? పదిహేను రోజులే. తర్వాత మళ్లీ పని వెదుక్కోవాల్సిన స్థితి. అప్పుడే మేఘనా సాహూ అనే ట్రాన్స్ ఉమన్ గురించి తెలిసింది రాణీకి. ఊబర్‌లో ఫస్ట్ ట్రాన్స్ ఉమన్ డ్రైవర్ ఆమె. ఆ ప్రేరణతో కార్ డ్రైవింగ్ నేర్చుకొని, ఊబర్ వాళ్ల ఇంటర్వ్యూలోనూ నెగ్గింది. దాచుకున్న డబ్బు, కొంత లోన్ తీసుకొని సొంతంగా కారు కొనుక్కొంది. ఇప్పుడు భువనేశ్వర్‌లో ఫైవ్‌స్టార్ రేటింగ్ ఉన్న ఫస్ట్ అండ్ మోస్ట్ ఎఫీషియెంట్ ట్రాన్స్‌జెండర్ డ్రైవర్ తనే. మహిళా ప్యాసెంజర్లు చాలామంది రాణీ కారులోనే ప్రయాణించడానికి ఇష్టపడ్తారట. ‘‘మగవాళ్లు నడిపే టాక్సీ కన్నా రాణీ టాక్సీ చాలా సేఫ్ అన్నిరకాలుగా. జాగ్రత్తగా డ్రైవ్ చేస్తుంది. సురక్షితంగా గమ్యాన్ని చేరుస్తుంది’’ అంటారు భువనేశ్వర్‌లోని వర్కింగ్ విమెన్.‘‘ఎవరమైనా గౌరవంగా బతకాలనే కోరుకుంటాం. కొంతమందికి పుట్టు్టకతోనే అది ప్రివిలేజ్. మాలాంటి వాళ్లకు ఎంత కష్టపడ్డా దొరకదు’’ అంటుంది రాణీ కిరణ్. ఇప్పుడు రాణీ కిరణ్ చాలామందికి ఆదర్శం. ‘‘నా ప్రతి రైడ్‌కు ఫైవ్ స్టార్ రేటింగ్ వస్తుంది’’ అని చెప్తుంది గర్వంగా! -
నమ్మండి.. అమ్మాయిని కాదు
ఈ ‘అబ్బాయి’ పేరు ఆడం హ్యారీ. స్వస్థలం కేరళలోని త్రిస్సూర్. వయసు ఇరవై ఏళ్లు. ప్రత్యేకత ఏంటంటే దేశంలోనే తొలి ట్రాన్స్‌జెండర్ పైలట్ అవడం. అంతకన్నా ప్రత్యేకత.. తను అమ్మాయి కాదు.. అబ్బాయి అని ప్రపంచం చెవులు పగిలేలా హ్యారీ చేసిన ప్రయత్నం. హ్యారీ.. పుట్టినప్పుడు అమ్మాయే. కాని యుక్త వయసు వచ్చేసరికి తనలో అమ్మాయి కన్నా అబ్బాయి లక్షణాలే ఉన్నాయనే నిజాన్ని గ్రహించి, తన లైంగికతను అబ్బాయిలాగే నిర్థారించుకుని, అబ్బాయి గుర్తింపునే కోరుకున్నాడు. ఈ విషయం ఇంట్లో వాళ్ల దగ్గర రహస్యంగా ఉంచాడు. పందొమ్మిదేళ్లప్పుడు హ్యారీని పైలట్ ట్రైనింగ్ కోసం జోహన్నస్బర్గ్ (దక్షిణ ఆఫ్రికా)కు పంపారు. అక్కడికి వెళ్లాక సోషల్ మీడియా ద్వారా తన జెండర్ ఐడెంటిటీని బయటపెట్టాడు. దాంతో బంధువులు, తిస్సూర్లోని తమ ఇంటి చుట్టుపక్కల వాళ్లు ‘‘మీ తొలి సంతానం అమ్మాయి కాదు అబ్బాయి’’ అంటూ హ్యారీ తల్లిదండ్రులకు చెప్పి సూటిపోటి మాటలనడం, హేళన చేయడం మొదలుపెట్టారు. ఇలాంటి గేలి హ్యారీ తమ్ముడికీ అతని స్కూల్లో తప్పలేదు. ఇవన్నీ తెలిసి హ్యారీ చాలా బాధపడ్డాడు. తల్లిదండ్రులేమో హ్యారీని తమ సంతానమే కాదని వదిలేశారు. ట్రైనింగ్‌కి కావల్సిన ఫీజే కాదు.. ఖర్చులకూ డబ్బు పంపడం ఆపేశారు. అక్కడి నుంచి తిరిగి ఇండియా రావాలన్నా చేతిలో చిల్లిగవ్వలేని పరిస్థితి హ్యారీది. జోహన్నస్బర్గ్ ఎయిర్‌పోర్ట్‌లోని టెర్మినల్స్‌లో క్లీనర్‌గా పనిచేసి.. ఇండియాకు టికెట్ కొనుక్కునేంత సమకూర్చుకొని .. పైలట్ శిక్షణను మధ్యలోనే వదిలేసి బోలెడంత డిప్రెషన్‌తో త్రిస్సూర్‌లోని ఇంటికొచ్చేశాడు. కూతురుకి పిచ్చిపట్టిందని కౌన్సెలింగ్స్, హాస్పిటల్స్ చుట్టూ తిప్పడం మొదలుపెట్టారు తల్లిదండ్రులు. డాక్టర్లు, సైకియాట్రిస్ట్‌లు కూడా.. ‘అబ్బాయి అనేదే నా ఐడెంటిటీ’ అని హ్యారీ చెప్తున్నా వినకుండా హ్యారీలో అమ్మాయి హార్మోన్స్‌ను పెంచేలా తప్పుడు చికిత్సను సూచించారు. ఆ చికిత్స కోసం తల్లిదండ్రులు చేసిన ఒత్తిడిని తట్టుకోలేక చివరకు ఇంట్లోంచి వెళ్లిపోయి ఎర్నాకులం వచ్చేశాడు. దొరికిన పనిచేస్తూ బస్స్టాండ్లలో, రైల్వేప్లాట్ఫామ్లో, ఫుట్‌పాత్‌ల మీద ఉంటున్నాడు. ఈ క్రమంలో హ్యారి గురించి తెలుసుకున్న ఓ టీవీ చానల్ అతని కథను ప్రసారం చేసింది. ఇది చూసిన కేరళ రాష్ట్ర స్త్రీ, శిశుసంక్షేమ శాఖ హ్యారీని పిలిచి, పైలట్ కావాలనే అతని కల, లక్ష్యం గురించి తెలుసుకొని 23 లక్షల రూపాయల లోన్‌ను మంజూరు చేసి.. రాజీవ్‌గాంధీ అకాడమీ ఫర్ ఏవియేషన్ టెక్నాలజీలో పైలట్ శిక్షణ పూర్తిచేసేలా అతనికి అవకాశం ఇచ్చింది. ప్రస్తుతం ఆ శిక్షణలోనే ఉన్నాడు. ‘‘నేను అనుకున్న కల నెరవేరింది. 2023 కల్లా పూర్తిస్థాయి కమర్షియల్ పైలట్ అవుతాను. ఏదో ఒకరోజు మా అమ్మానాన్న నుంచీ పిలుపు వస్తుందనీ ఆశిస్తున్నా. ఈ విషయంలో మా ప్రాంతంలోని వారు మా తల్లిదండ్రులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కాని వాళ్లు ససేమిరా అంటున్నారు. ప్రపంచమంతా నన్ను అబ్బాయిగా అంగీకరించినా ‘మేమైతే ఒప్పుకోం’ అని మావాళ్లు తేల్చేశారు. కాని నాకెక్కడో మూలన ఆశ.. ఎప్పటికైనా మా పేరెంట్స్ నన్ను అక్కున చేర్చుకుంటారని, నేను సాధించినదాన్ని చూసి గర్వపడి.. ఏదోకరోజు నన్ను ఇంటికి పిలుస్తారని’’ అంటాడు ఆడం హ్యారి నమ్మకంగా. -
ట్రాన్స్‌జెండర్‌పై సామూహిక అత్యాచారం
ఇస్లామాబాద్ : పాకిస్తాన్లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ ట్రాన్స్‌జెండర్‌ను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఐదుగురు కామాంధులు. ఈ దారుణ ఘటన సెప్టెంబర్ 20న కామలి నగరంలోని ధూప్‌సారి గ్రామంలో చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. కామలి నగరానికి చెందిన నలుగురు ట్రాన్స్‌జెంటర్ ఓ ఈవెంట్ కోసం సెప్టెంబర్20న ధూప్‌సారి గ్రామానికి వెళ్లారు. అక్కడి కార్యక్రమం ముంగించుకొని అర్థరాత్రి 2 గంటల ప్రాంతంతో స్వగ్రామాలకు బయలుదేరారు. మార్గమధ్యలో ఐదుగురు దుండగులు వీరిని అడ్డుకున్నారు. వారితో అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా.. ఓ ట్రాన్స్జెండర్ని కిడ్నాప్ చేసి సమీపంలోని ఫామ్‌హౌజ్‌కి తీసుకెళ్లారు. అనంతరం ఐదుగురు కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దాదాపు మూడు గంటల పాటు ఆ ట్రాన్స్‌జెండర్‌కు నరకం చూపించారు. అనంతరం ఆమెను సహివాల్ నగరంలో విడిచిపెట్టి పారిపోయారు. ఓ స్నేహితురాలి ద్వారా ఇంటికి చేరుకున్న ఆమె.. మరుసటి రోజు హరప్పా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు మాత్రం కేసు నమోదు చేసుకోలేదు. దీంతో ఆమె సహివాల్ డీపీఓకు ఫిర్యాదు చేశారు. డీపీఓ సూచన మేరకు కేసు నమోదు చేసుకున్న హరప్పా పోలీసులు.. నెల రోజుల తర్వాత నిందితులను అరెస్ట్ చేశారు. -
అతడామె! జెస్ట్ చేంజ్!
పురుషుడు లింగమార్పిడితో మహిళగా మారడం ఇప్పుడు అంత కష్టం కాదు. కానీ సమాజం ఆమోదించడమే అరుదైన విషయం. జెండర్ మారిన విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించుకోవడం అంత సులభం కాదు. కావాలంటే సోనియా పాండే అనే ఈ యువతిని అడగండి. కొద్ది రోజుల క్రితం వరకు రాజేశ్ అనే యువకుడిగా ఉండేవాడు. ఇప్పుడు సోనియాగా మారిపోయాడు. ఎందుకిలా మారిపోయావని అడిగితే ఆత్మ తనదికాని శరీరంలో ప్రవేశపెట్టినంత ఇబ్బందిగా ఉండటంతో ‘చేంజ్’ కోరుకున్నానని జవాబిస్తాడు. మనది కాని శరీరంలో ఆత్మ ఉండటం ఎంత కష్టమో అనుభవించానని ఇకనైనా సోనియా పాండేగా తనను గుర్తించమని అడుగుతోంది. కాదు పోరాడుతోంది. ఎందుకంటే ఆమె పనిచేస్తున్న ఇండియన్ రైల్వే సోనియాను అతడిగానే కొనసాగి(చూ)స్తోంది. ఆమెగా మార్చమన్న అభ్యర్థనను ఆమోదించకుండా నిబంధనల పేరుతో మోకాలడ్డుతోంది. అధికారిక పత్రాల్లో తనపేరు, జెండర్ మార్చాలని గోరఖ్‌పూర్‌లోని నార్త్ ఈస్ట్రన్ రైల్వే(ఎన్ఈఆర్) జీఎం కార్యాలయం చుట్టూ సోనియా తిరుగుతోంది. రైల్వే చరిత్రలో ఇలాంటి అభ్యర్థన ఎప్పుడూ రాకపోవడంతో ఏం చేయాలో తోచక ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలకు చెందిన 35 ఏళ్ల సోనియా పాండే ముందుగా ఇజ్జత్‌నగర్ రైల్వే వర్క్‌షాప్ జనరల్ మేనేజర్‌కు తన అభ్యర్థనను విన్నవించుకుంది. తన సమస్యకు అక్కడ పరిష్కారం దొరక్కపోవడంతో ఎన్ఈఆర్ జీఎం వరకు వెళ్లాల్సివచ్చింది. గోరఖ్‌పూర్‌లో కూడా ఆమెకు నిరుత్సాహపూరితమైన సమాధానమే వచ్చింది. అధికారులు దాటవేట ధోరణి ప్రదర్శించారు. ఇది చాలా సంక్లిష్టమైన అంశమని, చట్టపరంగా ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకుని దీన్ని పరిష్కరించాల్సి ఉందంటూ ఎన్ఈఆర్ ప్రజాసంబంధాల అధికారి సీపీ చౌహాన్ లౌక్యం చూపారు తప్పా సోనియాకు స్పష్టమైన హామీయివ్వలేదు. సోనియా పాండే వీడిన చిక్కు‘ముడి’ నలుగురు అక్కాచెల్లెళ్ల నడుమ అల్లారుముద్దుగా పెరిగిన రాజేశ్ పాండే 2003లో తండ్రి చనిపోవడంతో డిపెండెంట్ ఉద్యోగం దక్కడంతో ఇజ్జత్‌నగర్ రైల్వే వర్క్‌షాప్‌లో గ్రేడ్–1 టెక్నీషియన్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించాడు. చిన్నతనం నుంచే అమ్మాయిగా మారాలన్న కోరికతో పెరిగిన రాజేశ్ 2017లో లింగమార్పిడి చేయించుకుని సోనియా పాండేగా రూపాంతరం చెందాడు. ఆపరేషన్ చేయించుకోవడానికి ముందే స్థానిక యువతితో అతడికి వివాహం జరిగింది. ‘అసలు సంగతి’ బయట పడటంతో వీరి వివాహ బంధం అట్టే కాలం నిలవలేదు. మగాడి దేహంలో ఇమడలేక సతమతం అవుతున్నానని, మగడిగా ఉండటం తనకు ఇష్టం లేదని భార్య దగ్గర రాజేశ్ ఓపెన్ అయ్యాడు. భర్త బాధను అర్థం చేసుకున్న ఆమె విడాకులు తీసుకుని మౌనంగా అతడి జీవితం నుంచి నిష్క్రమించింది. చిక్కు‘ముడి’ విడిపోవడంతో లింగమార్పిడి చేయించుకుని ఆమెగా అవతరించాడు. మహిళగా మారిన తర్వాత తనకు నచ్చిన జీవితం గడుపుతూ ‘గుర్తింపు’ కోరుకుంటున్నాడు. చీకటిలో కాంతి కిరణం అందరి మహిళల్లానే సోనియా పాండే బాగా ముస్తాబవుతుంది. చక్కగా చీర కట్టుకుని, ఫుల్ మేకప్‌తో ఆఫీసుకు వెళ్లే సోనియాను చూసి, అంతకుముందు ఆమె కాదు అతడంటే నమ్మడం ఎవరికైనా కష్టమే. అయితే అతడు ఆమెగా మారడం అంత సులువుగా ఏం జరగలేదు. ‘‘వయసు పెరుగుతున్న కొద్ది నాకు ఏం కావాలో తెలిసొచ్చింది. నా ఆత్మను పొరపాటున మగాడి శరీరంలో ప్రవేశపెట్టినట్టుగా అనిపించింది. అమ్మాయిలా ఆలోచించేవాడిని. అద్దం ముందు నిలబడి అమ్మాయిలా ప్రవర్తించేవాడిని. ఆడవాళ్లలా ముస్తాబు కావడానికి ఇష్టపడేవాడిని. కుటుంబ సభ్యులు ఒత్తిడి చేసి బలవంతంగా పెళ్లి చేశారు. కానీ నా భార్యకు నిజం చెప్పడంతో ఎవరి దారి వారు చూసుకోవడానికి అంగీకరించింది. మగాడిగా ఉండటం ఇష్టం లేక కుంగుబాటుకు గురయ్యాను. ఆత్మహత్య చేసుకోవాలని చేసుకోవాలని కూడా అనుకున్నాను. ఇంత నరకం అనుభవించే కంటే లింగమార్పిడి చేయించుకోవచ్చు కదా అని ఎవరో ఇచ్చిన సలహా చీకటిలో కాంతి కిరణంలా నాకు కనబడింది. మా అమ్మ, అక్కాచెల్లెళ్లు నా నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. నేను సంతోషంగా ఉండాలంటే అమ్మాయిగా మారడమే మంచిదని నా నిర్ణయానికే కట్టుబడ్డాను. లింగమార్పిడి చేయించుకుని రెండేళ్లయింది. ఇప్పుడంతా నార్మల్‌గా ఉంది’’ అని సోనియా వివరించింది. పోరాటానికి సిద్ధం సోని(న)యా రూపాన్ని కుటుంబ సభ్యులే కాదు ఆమె ఉద్యోగం చేస్తున్న రైల్వే బోర్డు కూడా గుర్తించ నిరాకరిస్తోంది. ఆమెగా గుర్తించాలని సోనియా అభ్యర్థనను అలకించడం లేదు. ‘‘న్యూ జెండర్ ఐడెంటిటీని గుర్తించకపోవడం చాలా బాధగా ఉంది. ఐడీ కార్డు, ఇతర పత్రాల్లో ఇంకా రాజేశ్‌గా కొనసాగించడాన్ని జీర్ణించుకోలేపోతున్నాను. లింగ మార్పిడి, పేరు మార్పిడితో నన్ను గుర్తించాలని రైల్వే అధికారులను వేడుకుంటున్నాను. అధికారిక పత్రాల్లో ఆమెగా నమోదు చేయాలని కోరుకుంటున్నాను. కొత్త రూపంతో నన్ను గుర్తించేందుకు అవసరమైతే రైల్వే బోర్డుతో పోరాటానికి వెనుకాడబోను’’ అని సోనియా స్పష్టం చేసింది. లింగమార్పిడి చేయించుకున్న కొత్తలో చుట్టుపక్కల వారు, సహోద్యోగులు వింతగా చూశారని సోనియా గుర్తు చేసుకుంది. ఇప్పడు అందరూ తనతో బాగానే మాట్లాడుతున్నారని, మామూలుగానే ఉంటున్నారని వెల్లడించింది. తనలాగే చాలా మంది లింగమార్పిడి చేయించుకుని మనసుకు నచ్చినట్టుగా బతుకుతున్నారన్న ధైర్యమే తనకు కొండంత విశ్వాసాన్ని ఇస్తోందని సంతోషం వ్యక్తం చేసింది. దేశ రాజధాని ఢిల్లీ, వాణిజ్య నగరం ముంబై, ఇతర మహానగరాలతో పాటు ప్రపంచంలోని చాలా చోట్ల తనలాంటి వారు ఉన్నారని సంతృప్తి చెందుతోంది. తమది కాని దేహంలో ఇమడలేక తన లాగే ఎంతో మంది లింగమార్పిడి చేయించుకుంటున్నారని సోనియా చెప్పింది. అవును ఇంతకీ ‘ఆమె’గా సోనియాను అధికారులు ఎప్పుడు గుర్తిస్తారు? – పోడూరి నాగ శ్రీనివాసరావు సాక్షి వెబ్‌డెస్క్ -
ఇంతకు ‘తను’ తండ్రా, తల్లా?!
సాక్షి, న్యూఢిల్లీ : బ్రిటన్‌కు చెందిన ఫ్రెడ్డీ మ్యాక్‌కనెల్స్‌కు ఇప్పుడు 30 ఏళ్లు. కొన్ని నెలల క్రితమే ఆయన పండంటి బాబుకు జన్మనిచ్చారు. ఇంతకు ఫ్రెడ్డీ ఆడ, మగా ! అని అనుమానం రావచ్చు. పుట్టుకతో ఆడ అయినా లింగ మార్పిడి ద్వారా ఐదేళ్ల క్రితమే మగగా మారిపోయారు. అయితే గర్భాశయాన్ని తొలగించుకోలేదు. బిడ్డను కనడం కోసం అలాగే ఉంచుకున్నారు. ఓ దాత వీర్యంతో ఎంచక్కా తల్లీ–తండ్రీ అయ్యారు. ఇంతకు ఆయన్ని ఆ బిడ్డకు తండ్రని పిలవాలా ? తల్లని పిలవాలా ? ఇది తేల్చుకోవడానికే ఆయన ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించారు. తన బిడ్డ పేరును రిజిస్టర్ చేయడానికి ఆయన ఇటీవల ‘ది జనరల్ రిజిస్టర్’ ఆఫీసుకు వెళ్లారు. తండ్రిగా తన పేరును చేర్చుకోవాలని ఆయన అక్కడి అధికారులను కోరారు. అక్కడి అధికారులు అందుకు ససేమిరా ఒప్పుకోలేదు. ‘నీ కడుపు చించుకు పుట్టిన బిడ్డ కనుక, ముమ్మాటికి నీవు తల్లివే’ అంటూ వారు వాదించారు. దాంతో ఆయన కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. ఫ్రెడ్డీ చిన్నప్పటి నుంచి తెలివైన విద్యార్థిని. అయినప్పటికీ బాలురు కన్నా ఆమెను చిన్న చూపు చూసేవారట. దాంతో బాలుడిగా పుట్టి ఉంటే బాగుండేది ఎప్పుడూ అనుకునేదట. ఆ ఆలోచనలతోనే ఆమె తన కౌమార దశకు చేరుకున్నారు. ఈడింబర్గ్ యూనివర్శిటీలో అరబిక్ భాషలో కోర్సు చేశారు. ఆ తర్వాత అధ్యాపక వృత్తిలో చేరారు. అయినప్పటికీ మగవాడినైతే బాగుండేదన్న భావన మాత్రం బుర్రలోనుంచి పోలేదట. లింగ మార్పిడి ఆపరేషన్లపై అవగాహన ఏర్పరుచుకొని అందుకు అవసరమైన ‘టెస్టోస్టెరోన్ (లైంగిక సామర్థ్యాన్ని పెంచే ఉత్ప్రేరకం)’ మాత్రలను మింగడం మొదలు పెట్టారు. కొంతకాలం తర్వాత బ్రెస్ట్‌ను తొలగించుకన్నారు. గర్భాశయం తీయించుకోవాలని అనుకున్నారు. ఆడ నుంచి మగగా మారినప్పటికీ 2017లో బ్రిటన్‌లో బిడ్డకు జన్మనిచ్చిన హేడెన్ క్రాస్ గురించి తెలుసుకుని గర్భాశయాన్ని తొలగించుకోకుండా ఉంచుకున్నారు. లింగ మార్పిడి చేయించుకున్నారు. ఫ్రెడ్డీ పూర్తి స్థాయి పురుషుడిగా మారిపోయిన తర్వాత ‘ది గార్డియన్’లో మల్టీమీడియా జర్నలిస్ట్‌గా చేరాడు. నవమాసాలు నిండడంతో బిడ్డకు జన్మనించేందుకు ఆస్పత్రిలో చేరారు. ఈ విషయం తెల్సిన మిగతా మీడియా, ఆయన బిడ్డకు జన్మ ఇవ్వడాన్ని కూడా ప్రత్యక్షంగా ప్రసారం చేయాలనుకుంది. దీనికి అభ్యంతరం వ్యక్తం చేసిన ఫ్రెడ్డీ, ఇది తన ప్రైవసీని ఉల్లంఘించడమంటూ హైకోర్టును ఆశ్రయించారు. ‘వైద్య విజ్ఞానం’పరంగా దీనిని అనుమతించాల్సిందేనంటూ కోర్టు ఆయన విజ్ఞప్తిని కొట్టివేసింది. దాంతో అప్పుడు బ్రిటీష్ టీవీలు ఆయన బిడ్డకు జన్మనివ్వడాన్ని ప్రత్యక్షంగా ప్రసారం చేశాయి. బిడ్డకు జన్మనిచ్చిన తండ్రి ఫ్రెడ్డీలాగా తండ్రయిన వారు హేడెన్ క్రాస్ ఒక్కరే కాదు. అంతకు కొన్ని నెలల ముందు స్కాట్ పారికర్, అంతకు ఎనిమిదేళ్ల క్రితం జారన్ బార్కర్ అనే బ్రిటీష్ యువకులు బిడ్డలకు జన్మనిచ్చారు. వారికి రాని సమస్య ఫ్రెడ్డీకి రావడమే ఇప్పుడు పెద్ద వార్తయింది. వారంతా తమ బిడ్డకు తల్లులుగానే తమ పేర్లను నమోదు చేయించుకున్నారు. తాను మగవాడిని కావాలనుకొని, లింగ మార్పిడి చేయించుకొని మగవాడిగా లైసెన్స్‌ను కూడా పొందాక తనను తండ్రిగా గుర్తించనంటే ఒప్పుకొనేది లేదని ఫ్రెడ్డీ వాదిస్తున్నారు. ఇలా ఒప్పుకోక పోవడం కూడా లింగ వివక్షతేనంటూ హైకోర్టుకెక్కారు. ఆయన వాదనతో హైకోర్టు ఏకీభవిస్తే అయనకు పుట్టిన బిడ్డ ప్రపంచంలోనే ‘తల్లికి కాకుండా తండ్రికి పుట్టిన తొలి బిడ్డ’ అవుతుంది. -
రైళ్లలో ఇక ఆ ఇబ్బంది ఉండదు..!
న్యూఢిల్లీ : సరదాగా సాగిపోతున్న రైలు ప్రయాణంలో ఒక రకమైన బెరుకు, ఇలా చేస్తున్నారేంటి..? అనే భావనను కలిగించే ట్రాన్స్జెండర్లపై రైల్వే శాఖ చర్యలు చేపట్టింది. ప్రయాణికులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న హిజ్రాలపై కొరడా ఝళిపించింది. గత నాలుగేళ్ల కాలంలో దాదాపు 73 వేల మందిని అరెస్టు చేసింది. రైళ్లలో బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న హిజ్రాలపై రైల్వే శాఖ చేపట్టిన చర్యలేంటో తెలపాలని దాఖలైన ఆర్టీఐ పిటిషన్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. గత ఏడాది కాలంలోనే 20 వేల మంది ట్రాన్స్జెండర్లు అరెస్టు కాగా, ఈ జనవరిలోనే 1399 మందిని అరెస్టు చేసినట్టు రైల్వే శాఖ వెల్లడించింది. 2015 జనవరి నుంచి హిజ్రాల డబ్బు వసూళ్ల పై చర్యలు ముమ్మరం చేశామని తెలిపింది. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా రైల్వే భద్రతా దళం ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తోందని తెలిపింది. ఇదిలాఉండగా.. రైల్వే శాఖ చర్యలతో నకిలీ ట్రాన్స్జెండర్ల ఆగడాలకు అడ్డుకట్ట పడిందని ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా పనిచేసుకుని బతికే బదులు తమకు ప్రత్యేక హక్కులున్నట్టుగా వ్యవహరించే వారికి తగిన బుద్ధి చెప్పినట్టయిందని అంటున్నారు. యాచించడం బదులు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడం, ఎదురు తిరిగితే అసభ్యంగా ప్రవర్తించడం నకిలీ హిజ్రాలకు అలవాటైందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
పట్టాభిషేకం
పట్టాభిషేకం పెద్ద మాట. ఏదో పెద్ద పొజిషన్లో కూర్చోబెట్టినట్లు!కానీ.. నలుగురూ తిరిగేచోటబిడ్డకు పాలిచ్చే చోటును కల్పించడమైనామహిళకు పట్టాభిషేకమే. ఇదొకటే కాదు.. మహిళా ఉద్యోగులకు, మహిళా ప్రయాణికులకుకొచ్చి మెట్రో ఇచ్చిన ఇంపార్టెన్స్‌ని చూస్తుంటే.. మహిళా సంక్షేమం పట్టాలు ఎక్కినట్లే ఉంది! అది కేరళలోని ‘అలువ’లో ఉన్న కొచ్చి మెట్రో ట్రైన్ స్టేషన్. ‘‘నీకు తెలుసా ఈ ట్రైన్‌ని లేడీ నడుపుతోంది’’.. స్టేషన్లో ఆగి ఉన్న మెట్రో రైలును చూపిస్తూ ఒకామె తోటి స్వీపర్‌తో చెప్తోంది. ‘లోకో పైలట్‌గా మహిళ.. అని గత కొన్నాళ్లుగా చూస్తూనే ఉన్నాం కదా’ అనుకుంటూ కౌంటర్ వైపు నడిచారు ప్రయాణికులు. అక్కడ.. టికెట్ కౌంటర్లు నడుపుతున్న వాళ్లు కూడా మహిళలే. ‘ఆల్ ఉమన్ రైల్వే స్టేషనా’ అనుకుంటూ ముందుకు నడుస్తుంటే.. మరో వైపు ఎంక్వైరీ డెస్క్. అందులో ఓ ట్రాన్స్‌జెండర్ ప్రయాణికులకు వివరాలు చెబుతున్నారు. మరోవైపు ప్రయాణికుల్లోని బిడ్డ తల్లులు తమ ఇంట్లో గదిలోకి వెళ్లినంత సౌకర్యంగా బ్రెస్ట్ ఫీడింగ్ ‘పాడ్’లలోకెళ్లి పాపాయికి పాలిచ్చి తిరిగి ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఇది ఒక్క అలువ మెట్రో స్టేషన్లో కనిపించే సన్నివేశం మాత్రమే కాదు. కేరళలో కొచ్చి మెట్రో స్టేషన్లన్నింటిలోనూ దాదాపుగా మహిళా సౌకర్యాలు, సదుపాయాలే. ఉమెన్ ఫ్రెండ్లీ స్టేషన్లు బ్రెస్ట్ ఫీడింగ్ పాడ్.. తల్లి కూర్చుని బిడ్డను పడుకోబెట్టడానికి వీలయిన చక్కటి సీటు, ఫ్యాన్, ఫోన్ చార్జింగ్ పాయింట్లతో చాలా సౌకర్యంగా ఉంది. వీటిని ఉపయోగించుకోవడానికి అదనంగా చార్జి ఏమీ ఉండదు. బిడ్డకు పాలిచ్చే తల్లుల కోసం ఇలాంటి ఏర్పాటు చేయడానికి కారణం చంటి పిల్లల ఆరోగ్యాన్ని సంరక్షించేందుకే అంటారు సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ సుమి నాదరాజన్. ‘‘కేరళలో చదువుకున్న మహిళలు ఎక్కువ. అలాగే ఉద్యోగాలు చేసే మహిళలు కూడా ఎక్కువే. ఈ పరిణామం పిల్లలకు పాలివ్వడం మీద చూపిస్తోంది. బహిరంగ ప్రదేశాలు పిల్లలకు పాలివ్వడానికి అనువుగా లేకపోవడంతో పాలివ్వగలిగిన తల్లులు కూడా పోతపాలు పడుతున్నారు. చంటి పిల్లలు ఇంట్లో ఉన్న సమయం మినహా మిగిలిన రోజంతా పోతపాల మీదే పెరగాల్సి వస్తోంది. ఆరోగ్యకరమైన భావితరం కోసం మా వంతు బాధ్యతగా ఇలాంటి నిర్ణయం తీసుకున్నాం. అవసరాన్ని బట్టి ఫీడింగ్ పాడ్ల సంఖ్యను పెంచుతాం కూడా’’ అన్నారు నాదరాజన్. ‘‘ఈ స్టేషన్లలో పని చేసే వాతావరణం బాగుంది. మహిళలకు చాలా సురక్షితంగా ఉంది. చక్కటి వర్క్ ఎన్విరాన్మెంట్ కావడంతో ఉద్యోగ బాధ్యతలను బాగా ఆస్వాదిస్తున్నాం. మాకొచ్చే జీతం మా జీవితాల్లో మంచి మార్పుకు కారణమవుతోంది’’.. అంటారు మెట్రో ఉద్యోగిని రజిత. ఎకో ఫ్రెండ్లీ కొచ్చి మెట్రో ట్రైన్ వ్యవస్థలో క్లీనింగ్ ఉద్యోగం నుంచి సీనియర్ మేనేజ్మెంట్ విధుల వరకు మహిళలే కీలకం. మేనేజింగ్ డైరెక్టర్ కూడా మహిళే. అందుకే ఆ స్టేషన్ ఉమెన్ ఫ్రెండ్లీగా ఉంది. మొత్తం పదమూడు వందల మంది మెట్రో ఉద్యోగుల్లో ఎనభై శాతం మహిళలే. అన్నింటికంటే కీలకమైన నిర్ణయం రైళ్లనునడిపే లోకో పైలట్లుగా వీలయినంత ఎక్కువ మంది మహిళలను నియమించడం. కొచ్చి మెట్రో రైళ్లలో 39 మంది లోకో పైలట్లున్నారు. వారిలో ఏడుగురు మహిళలు. ఉద్యోగుల నియామకంలోనే కాదు, స్టేషన్ల రూపకల్పనలోనే సమగ్రాభివృద్ధి కనిపిస్తుంది. స్టేషన్ నిర్వహణకు అవసరమయ్యే కరెంట్‌లో 35 శాతం సోలార్ ఎనర్జీ ఉపయోగిస్తున్నారు. స్టేషన్ చుట్టూ రెండు వందలకు పైగా పిల్లర్లున్నాయి. వాటికి నిలువెత్తు గార్డెన్ (వర్టికల్ గార్డెన్) పెంచారు. మున్సిపల్ వేస్ట్ నుంచి తయారైన కంపోస్టు ఎరువును ఈ వర్టికల్ గార్డెన్‌కు వాడుతున్నారు. ఈ విధులన్నిటినీ నిర్వహించేవారు ఎక్కువమంది మహిళలే. మెట్రో ఉపాధి కొచ్చి మెట్రో రైల్ వ్యవస్థ.. అందులో ఉద్యోగాలు చేసే మహిళలతోపాటు స్వయం సహాయక బృందాల మహిళలకు కూడా మంచి ఉపాధినిస్తోంది. కేరళలో మహిళల స్వయం సహాయక బృందాలను ‘కుదుంబశ్రీ’ బృందాలుగా వ్యవహరిస్తారు. ఈ మహిళలు తమ ఇళ్లలో చక్కటి, పరిశుభ్రమైన భోజనం వండి స్టీలు బాక్సుల్లో సర్ది తెస్తారు. లంచ్ బాక్సులు మధ్యాహ్నానికి రైల్వే ఉద్యోగులకు అందుతాయి. ఈ స్కీమ్ ఉభయతారకంగా ఉంది. ఉద్యోగులకు మంచి ఇంటి భోజనం అందుతుంది, అదే సమయంలో స్వయం ఉపాధి పొందుతున్న మహిళలకు ఆదాయ మార్గంగానూ ఉంది. మెట్రో స్టేషన్లను ప్లాస్టిక్ రహితంగా పర్యావరణ హితంగా మార్చే ప్రయత్నంలో భాగమే స్టీలు బాక్సులను ఉపయోగించాలనే నిబంధన. ఎక్కువ భోజనాల ఆర్డర్ ఉన్న మహిళలు మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒంటి గంట మధ్యలో రైల్లో ప్రయాణిస్తూ ప్రతి స్టేషన్లో బాక్సులను డెలివరీ చేస్తారు. మధ్యాహ్నం మూడు నుంచి ప్రతి స్టేషన్లో ఆగుతూ తమ బాక్సులను కలెక్ట్ చేసుకుంటారు. ఏ షిఫై్టనా ఓకే సాధారణంగా మహిళలను ఉద్యోగంలో చేర్చుకోవడానికి మగబాస్లు మొదటగా చెప్పే అభ్యంతరం ‘వాళ్లు నైట్ షిఫ్ట్‌లు చేయలేరు’ అని. ‘చేయలేరు’ అని మా తరఫున మీరు తీర్పు ఇవ్వడమేంటని ప్రశ్నిస్తోంది ఈ తరం మహిళ. ఏ షిఫ్టులో పని చేయడానికైనా మేము సిద్ధమేనంటున్నారు. ‘‘నేను నా ఉద్యోగాన్ని ప్రేమిస్తున్నాను. అంతగా ఇష్టపడిన పని చేసేటప్పుడు., ఫలానా షిఫ్టులో పని చేయను, ఫలానా షిఫ్టు అయితేనే చేయగలుగుతాను అని కండిషన్లు ఎలా పెడతాను. డ్రైవర్‌గా ప్రమోషన్ అందుకోవడం నా లక్ష్యం’’ అంటున్నారు అసిస్టెంట్ లోకో పైలట్ హిమ. మంజీర సమాజం కలుపుకోవాలి ట్రాన్స్జెండర్లకు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలిచ్చిన ఘనత కూడా కొచ్చి మెట్రోదే. ఇందులో 60 మంది ట్రాన్స్జెండర్లు ఉద్యోగం చేస్తున్నారు. ‘‘ట్రాన్స్జెండర్ల పట్ల సమాజం దృష్టి కోణం మారాల్సిన అవసరం ఉంది. సమాజం చూపులు మారాలంటే వాళ్లు కూడా సభ్యసమాజంలో అందరితోపాటు కలిసి అన్ని పనుల్లో కనిపించాలి. వృత్తి ఉద్యోగాల్లో వాళ్లతో కలివిడిగా మెలగడం, వాళ్ల సర్వీస్ పొందడం ద్వారా ట్రాన్స్‌జెండర్ వ్యక్తులను తమలో ఒకరిగా కలుపుకోగలుగుతుంది సమాజం. అందుకే ఈ ప్రయత్నం’’ అన్నారు కొన్నాళ్ల క్రితం వరకు మెట్రో మేనేజింగ్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తించిన ఎలియాస్ జార్జ్. ముప్పై ఆరేళ్ల కార్తీక రాఘవన్ బయో కెమిస్ట్‌గా ఉద్యోగం మానేసి మెట్రో రైల్ ఉద్యోగంలో చేరారు. ‘‘బయో కెమిస్ట్‌గా ల్యాబ్‌లో రోజంతా ప్రాణం లేని వస్తువులతోనే గడపాలి. నాకు మనుషుల మధ్య ఉద్యోగం చేయాలని ఉండేది. ఏ ఉద్యోగానికి అప్లయ్ చేద్దామన్నా విద్యార్హతలు, అనుభవంతోపాటు తప్పనిసరిగా ఓ కాలమ్ ఉంటుంది. అది జెండర్ కాలమ్. అందులో మగ లేదా ఆడ అనే గడులు మాత్రమే ఉంటాయి. ఏదో ఒకటి టిక్ చేయాలి. మెట్రో రైల్ నోటిఫికేషన్ కాలదోషం పట్టిన నిబంధనలను తుడిచేసింది. మాలాంటి వాళ్లందరికీ ఉద్యోగం చేసుకునే అవకాశం కల్పిస్తూ నిబంధనలను సరళీకరించింది. దాంతో నా చదువుకు సంబంధం లేని ఉద్యోగమైనా సరే, సంతోషంగా అప్లయ్ చేశాను. హ్యాపీగా ఉన్నాను’’ అన్నారు కార్తీక. -
మేము ఓటేస్తాం.. మీరూ వేయండి
హన్మకొండ చౌరస్తా: ‘మాకు సైతం ఓటు హక్కు కావాలని కొట్లాడి సాధించుకున్నాం.. అందుకే ఎన్నికల్లో సరైన ప్రజాప్రతినిధులను ఎన్నుకునే అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులకోం.. మీరు సైతం ఓటు హక్కు తప్పనిసరిగా వినియోగించుకోవాలి’ అంటూ ట్రాన్స్‌జెండర్స్ పిలుపునిచ్చారు. అవినీతి వ్యతిరేక సంస్థ జ్వాల, తెలంగాణ ట్రాన్స్‌జెండర్స్ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం ఓటరు అవగాహన ర్యాలీ నిర్వహించారు. హన్మకొండలోని వేయిస్తంభాల గుడి నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు సాగిన ఈ చైతన్య ర్యాలీలో ప్లకార్డులు, నినాదాలు చేస్తూ సుమారు 300 మంది హిజ్రాలు పాల్గొన్నారు. ఈ ర్యాలీని లోక్‌సత్తా ఉద్యమ సంస్థ రాష్ట్ర సలహాదారుడు ప్రొఫెసర్ పర్చా కోదండ రామారావు ముఖ్యఅతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టసభల్లో నేరచరిత్ర కలిగిన వారి సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోందన్నారు. మంచి నేతలను ఎన్నుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. జ్వాల సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సుంకరి ప్రశాంత్ మాట్లాడుతూ హిజ్రాలను సమాజం చిన్నచూపు చూస్తున్నప్పటికీ ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకుంటున్నారని ప్రశంసించారు. ఓటుకు దూరంగా ఉండే వ్యక్తులు హిజ్రాలను ఆదర్శంగా తీసుకుని ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. తెలంగాణ ట్రాన్స్‌జెండర్స్ సంఘం అధ్యక్షురాలు ఓరుగంటి లైలా మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు అత్యంత కీలకమైంది, దీనిని డబ్బు, మద్యంతో వెలకట్టలేమని అన్నారు. తెలంగాణ ట్రాన్స్‌జెండర్స్ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు గౌతమి, కోశాధికారి రజిత, సుధా, స్నేహా, జ్వాల సంస్థ సభ్యులు బుర్రి కృష్ణమూర్తి, కీత రాజ్‌కుమార్, వాంకె నర్సింగరావు, నిజాం తదితరులు పాల్గొన్నారు. ఓటు వేయడం మానుకోలేదు.. 2006కు ముందు వరకు మాకు ఓటు హక్కు లేదు. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నాం. విద్యావంతులు, యువత స్పందించి అందరూ ఓటు వేసేలా చైతన్యం కల్పించాలి. నూటికి 99శాతం మంది ఓటును సద్వినియోగం చేసుకున్నప్పుడే ప్రజాస్వామ్యంలో సరైన నాయకుడు పుట్టుకొస్తాడు. మాలో ఉన్నత విద్య చదివిన వారు చాలా మంది ఉన్నారు. వారందరికీ అర్హత ప్రకారం ప్రభుత్వ శాఖక్లా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. స్నేహ, వరంగల్ నాయకుల ప్రలోభాలకు గురికాము.. మాకు ఓటు హక్కు లేనప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. 2006 నుంచి ఇప్పటి వరకు శాసనసభ, లోక్‌సభ, కార్పొరేషన్ ఎన్నికల్లో నాలుగు సార్లు ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నాం. మాకు ఓటు ఉందని తెలిసిన అనేక మంది నాయకులు ప్రలోభాలకు గురిచేశారు. కానీ మా సమస్యలను ఎవరు గుర్తించి పరిష్కరిస్తారని నమ్మకం ఉన్న నేతలకే స్వచ్ఛందంగా ఓటు వేస్తాం. మేము బతకడానికి అడుక్కుంటాము గానీ ఓటును అమ్ముకోం. రేష్మ, వరంగల్ -
‘ప్రభుత్వానికి వ్యతిరేకంగానే మా ఓటు’
సాక్షి, న్యూఢిల్లీ : ‘మేము ఓటర్లలో సగం. దేశంలో పెరిగిపోతున్న మూక హత్యలకు వ్యతిరేకంగా మేము ఈ సారి ఓటు వేస్తాం. పట్టపగలు, పలువురు చూస్తుండగా ఈ హత్యలు జరుగుతుండడం దారణం. మా రాజ్యాంగ హక్కులు హరించుకుపోయాయి. మా భావప్రకటనా స్వేచ్ఛను అణచి వేస్తున్నారు’ అని 58 ఏళ్ల మంజూ శర్మ వ్యాఖ్యానించారు. ఆమె ఓ సామాజిక కార్యకర్త. గురువారం నాడు ఢిల్లీ మండి హౌజ్ నుంచి జంతర్ మంతర్‌కు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న మహిళల్లో ఆమె ఒకరు. మహిళలు, ట్రాన్స్జెండర్లు, రైతులు, విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు, న్యాయవాదులు, కళాకారులకు సంబంధించిన పలు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు నిర్వహించిన ఈ ర్యాలీలో కొన్ని వందల మంది మహిళలు పాల్గొన్నారు. వీరంతా ఒక్క ఢిల్లీ నుంచే కాకుండా హైదరాబాద్, బెంగళూరు, అజ్మీర్, చెన్నై, అహ్మదాబాద్ నగరాల నుంచి కూడా వచ్చి ర్యాలీలో పాల్గొన్నారు. కేంద్రంలోని ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలంటూ మహిళలకు పిలుపు ఇవ్వడంలో భాగంగానే ఈ ర్యాలీ జరిగిందని ర్యాలీలో పాల్గొన్న సామాజిక కార్యకర్త షబ్నమ్ హష్మీ తెలిపారు. పెద్దనోట్ల రద్దు కారణంగా దేశంలో ఎంతో మంది మహిళలు ఉద్యోగాలను కోల్పోయారని ఆమె చెప్పారు. పితృస్వామిక వ్యవస్థ, ఫాసిజం, కులతత్వం నశించాలంటూ ర్యాలీలో పాల్గొన్న పలువురు మహిళలు నినదించారు. సోమాసేన్, సుధా భరద్వాజ్ అనే సామాజిక కార్యకర్తలను విడుదల చేయాలంటూ కూడా వారు ప్లే కార్డులను ప్రదర్శించారు. పుణెకు సమీపంలోని భీమా కోరెగావ్‌లో సమావేశంలో పాల్గొన్న తొమ్మిది మందితోపాటు ఈ ఇరువురిని జూన్ నెలలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ మరుసటి రోజు జరిగిన విధ్వంసకాండకు ఆ సమావేశమే కారణం అంటూ వారిపై కేసులు నమోదు చేశారు. దేశంలో విద్వేష రాజకీయాలు పెరిగిపోయి విధ్వంసం, హింసాత్మక సంఘటనలు పెరిగిపోయాయని, మహిళలకు భద్రత కరవైందని, మరోపక్క నిరుద్యోగం పెరిగిపోయిందని, ఈ ఎన్నికల్లో ప్రధానాంశం నిరుద్యోగమేనని 50 ఏళ్ల అఫ్రోజ్ గుల్జార్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మహిళ వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నట్లు ర్యాలీలో పాల్గొన్న పలువురు మహిళలు ఆరోపించారు. -
ట్రాన్స్జెండర్ల సామూహిక వివాహాలు..
-
ట్రాన్స్జెండర్ల సామూహిక వివాహాలు..
రాయ్‌పూర్: తమకు ఓ మనసు ఉంటుందని అంటున్నారు ట్రాన్స్జెండర్లు. అందుకే కొందరు ట్రాన్స్జెండర్లు తమకు నచ్చినవారితో కలిసి జీవితాన్ని ఆరంభించేందుకు సిద్దమయ్యారు. శనివారం రోజున ఛత్తీస్‌గఢ్ రాయ్‌పూర్‌లో 15 ట్రాన్స్‌జెండర్ జంటలు వివాహ బంధంతో ఒకటయ్యాయి. హిందూ సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ వేడుకలకు రాయ్‌పూర్‌కు చెందిన సామాజిక కార్యకర్త విద్య రాజ్‌పుత్ ఏర్పాట్లు చేశారు. హిందూ సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ వేడుక ముందు రోజున మెహందీ, సంగీత్ కార్యక్రమాలు నిర్వహించారు. వివాహ బంధంతో ఒకటైన 15 జంటల్లో ఛత్తీస్‌గఢ్‌తో పాటు వివిధ రాష్ట్రాలకు చెందినవారు కూడా ఉన్నారు. చాలా కాలంగా తమ బాధలను ఎవరు పట్టించుకోలేదని ఈ వేడుకల్లో పాల్గొన్న మధు కిన్నర్ తెలిపారు. కానీ ఈ రోజు తాము పెళ్లిలు చేసుకోవటానికి చక్కటి అవకాశం కల్పించిందని అన్నారు. తాము జీవిత భాగస్వామ్యులను పొందడం కంటే గొప్ప వార్త ఎముంటుందని వ్యాఖ్యానించారు. దేశంలో ఇలాంటి వేడుక జరగడం ఇదే తొలిసారి అని.. భవిష్యత్తులో ఇలాంటివి మరెన్నో జరగడానికి ఇది స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. 2014లో సుప్రీం కోర్టు ట్రాన్స్‌జెండర్స్‌ని థర్డ్ జెండర్‌గా పేర్కొంటూ తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. వారికి రాజ్యాంగం కల్పించే అన్ని హక్కులూ వర్తిస్తాయని కోర్టు స్పష్టం చేసింది. దీంతో ఎల్జీబీటీ కమ్యూనిటీలో కొత్త ఆశలు చిగురించాయి. -
లోకేష్‌కు తమన్నా సింహాద్రి ఛాలెంజ్
సాక్షి, గుంటూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్‌కు దమ్ము, ధైర్యం ఉంటే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా పోటీకి దిగాలని ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి సవాల్ విసిరారు. ఆమె మంగళగిరి నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా సోమవారం నామినేషన్ వేశారు. అనంతరం తమన్నా సింహాద్రి మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో మొట్ట మొదటి ట్రాన్స్‌జెండర్‌గా ప్రజా సేవకు ముందుకు వస్తున్నానని, ఈ ఎన్నికల్లో తనకు నియోజకవర్గ ప్రజలు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. జనసేన పార్టీకి నేను దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఆ పార్టీ నాకు సరైన గుర్తింపు ఇవ్వలేదని అన్నారు. నారా లోకేష్ బాబుకు మంగళగిరిలో ఓటమి తప్పదని, ఆయనకు ఓటమి భయం పట్టుకుందని తమన్నా వ్యాఖ్యానించారు. తమకు ఏ పార్టీలతో ఎలాంటి ప్రయోజనం లేదని వాపోయారు. అందుకే తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు చెప్పారు. -
ఇతరులు @ 38,325 మంది
న్యూఢిల్లీ: 2014 సార్వత్రిక ఎన్నికల నుంచి ఓటర్ల జాబితాలో ‘ఇతరుల’విభాగంలో చేరిన ట్రాన్స్జెండర్ల సంఖ్యలో పెద్దగా పెరుగుదల కనిపించడం లేదు. ఎన్నికల కమిషన్ అందించిన సమాచారం మేరకు.. ఇతరుల విభాగంలో ఇప్పటివరకు ఎన్రోల్ అయిన ఓటర్లు 38,325 మంది కాగా.. గత ఐదేళ్లలో కొత్తగా చేరిన వారు కేవలం 15,306 మందే. ట్రాన్స్జెండర్లు ఇతరుల విభాగంలో ఓట్లు నమోదు చేసుకునేందుకు 2012 నుంచి అనుమతించారు. తమ జనాభా కంటే చాలా తక్కువస్థాయిలో ఐదేళ్లలో ఓటరు జాబితాలో చేరారని.. ఇప్పటికీ ఇతరుల విభాగంలో ఓట్లు నమోదు చేసుకునేందుకు చాలా మంది వెనకాడుతున్నారని ట్రాన్స్జెండర్ల హక్కుల కార్యకర్తలు చెబుతున్నారు. 2011 గణాంకాల ప్రకారం తమ వర్గానికి చెందిన వారి జనాభా 4.9 లక్షలని.. అయితే ఈ సంఖ్య కంటే ఎక్కువే తమ వారున్నారని వెల్లడించారు. ట్రాన్స్జెండర్ల కింద నమోదైతే సమాజంలో చిన్నచూపు చూస్తారని.. ఇతరుల విభాగంలో ఎన్రోల్ అయ్యేందుకు అడుగుతున్న ధ్రువపత్రాల కారణాంగా కూడా ఎక్కువ మంది ఓటు నమోదుచేసుకోలేకపోతున్నారని వారు అభిప్రాయపడ్డారు. ఓటరు జాబితాలో నమోదు చేసుకునే విషయమై ఒక్క గుర్తింపు కోసం ఎన్నో ధ్రువపత్రాలు అడుగుతున్నారని.. ఇది సరికాదని చెప్పారు. ‘ఇది ట్రాన్స్జెండర్లకు చాలా కష్టమైన పని. వీరిలో చాలా మందికి అన్నిధ్రువపత్రాలు ఉండవు..’అని ప్రత్యత్ జెండర్స్ ట్రస్ట్‌కు చెందిన అనింధ్య హజ్రా వ్యాఖ్యానించారు. అలాగే పాస్‌పోర్టుల విషయంలో కూడా ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయని.. 2014 నల్సా తీర్పునకు విరుద్ధంగా వైద్య ధ్రువీకరణ పత్రాలు అడుగుతున్నారని వాపోయారు. ఓటర్ జాబితాలో ఇదివరకు స్త్రీ లేదా పురుషుడుగా నమోదైన వారు ఇతరుల విభాగంలో చేరేందుకు చాలా సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తోందని చెప్పారు. ‘2014లో ఇచ్చిన కోర్టు తీర్పును ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. అన్ని రాష్ట్రాలు ట్రాన్స్జెండర్లకు గుర్తింపు కార్డులివ్వాలని.. వీటి మేరకే ఓటర్ జాబితాలో నమోదు చేసుకోవాలని చెప్పినా ప్రభుత్వాలు అమలు చేయడం లేదు..’అని నేషనల్ అలయన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్మెంట్, తెలంగాణ హిజ్రా ఇంటర్‌సెక్స్ ట్రాన్స్‌జెండర్ సమితికి చెందిన మీరా సంఘమిత్ర వాపోయారు. -
దేశంలో తొలిసారి ట్రాన్స్ జెండర్‌కు లైసెన్స్
సాక్షి, వైఎస్సార్: వినూత్న కార్యక్రమానికి వైఎస్సార్ కడప జిల్లా వేదికైంది. దేశంలో మొదటిసారిగా ట్రాన్స్ జెండర్‌కు డ్రైవింగ్ లైసెన్స్‌ను జిల్లా రవాణా శాఖ అధికారులు కల్పించారు. ఇంత వరకు దేశంలో ట్రాన్స్ జెండర్‌కు డ్రైవింగ్ లైసెన్స్ కల్పించని విషయం తెలిసిందే. రవాణ శాఖ డీటీసీ బసిరెడ్డి నేతృత్వంలో 32 మందికి శనివారం లైసెన్సును అందించారు. దీంతోపాటు ఆన్లైన్లో స్త్రీ, పురుషులతో పాటు ట్రాన్స్ జెండర్ ఆప్షన్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. జిల్లా కలెక్టర్ హరికిరణ్, జిల్లా న్యాయమూర్తి శ్రీనివాస్, ఎస్పీ అభిషేక్ మహంతిల చేతుల మీదుగా వీరికి లైసెన్సులను పంపిణీ చేశారు. -
చేతబడి చేసి తీసుకెళ్లారు
బంజారాహిల్స్: గోషామహల్ బీఎల్ఎఫ్ అభ్యర్ధి, ట్రాన్స్‌జెండర్ ఎం.రాజేష్ అలియాస్ చంద్రముఖి(32) అదృశ్యంపై మిస్టరీ వీడింది. రెండు రోజులుగా అజ్ఞాతంలో ఉన్న చంద్రముఖి బుధవారం రాత్రి 11.30గంటల ప్రాంతంలో బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ప్రత్యక్షం కావడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. తన కూతురు కనిపించడం లేదని చంద్రముఖి తల్లి హైకోర్టులో హెబియస్‌కార్పస్ పిటీషన్ దాఖలు చేయడంతో బుధవారం పోలీసులకు చెమటలు పట్టాయి. ఏమాత్రం ఆచూకి లేని చంద్రముఖిని గురువారం ఉదయంలోగా హైకోర్టులో ఎలా ప్రవేశపెట్టాలో తెలియక సతమతమయ్యారు. దీంతో బంజారాహిల్స్ పోలీసులు, టాస్క్‌ఫోర్స్ పోలీసులు బృందాలుగా విడిపోయి తెలుగు రాష్ట్రాలను జల్లెడపట్టారు. ఎట్టకేలకు రాత్రి 11 గంటల ప్రాంతంలో చంద్రముఖి సికింద్రాబాద్‌లోని లంబా థియేటర్ సమీపంలో ఉన్నట్లు సమాచారం అందడంతో ఆమె సన్నిహితులను అప్రమత్తం చేసిన పోలీసులు ఆమెను స్టేషన్‌కు రప్పించడంతో కథ సఖాంతమైంది. గురువారం ఉదయం ఆమెను హైకోర్టులో న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. అంతకుముందు బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ఆ రోజు ఉదయం 8 గంటలకు రూ.25వేలు బ్యాంకులో జమ చేసేందుకు వెళుతుండగా సందులో ఓ ఆటో ఎక్కడం జరిగిందన్నారు. ఆ ఆటోవాల తనను కోఠిలోని ఓ వీధిలోకి తీసుకెళ్లాడని అక్కడ మరో ఆటో ఎక్కి ఎల్బీనగర్లో దిగానన్నారు. అక్కడ బస్సు ఎక్కి విజయవాడలో, అక్కడి నుంచి తిరుపతి, అక్కడి నుంచి చెన్నై వెళ్లినట్లు చెప్పుకొచ్చింది. అయితే ఇదంతా ఎవరో తనను చేతబడి చేసి ముందుకు నడిపించినట్లుగా ఉందని, మత్తులో ఉండి తాను ఎటు వెళ్తున్నానో, ఏ బస్సు ఎక్కుతున్నానో తెలియలేదన్నారు. కోఠిలో ఇద్దరు వ్యక్తులు తనను బెదిరించారని, మరోసారి చూస్తే వారిని గుర్తుపడతానన్నారు. నామినేషన్ వేసినప్పటి నుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయన్నారు. తన అజ్ఞాతం వెనుక, తనను చేతబడి చేయడం వెనుక కచ్చితంగా రాజకీయ కోణం ఉందని ఆరోపించారు. అయితే ఆటోలో ఎక్కడం, బస్సులు ఎక్కడం అన్ని ప్రాంతాలు తిరగడం ఎలా సాధ్యమైందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె చెప్పే విషయాలపై పొంతన లేదని వారు పేర్కొన్నారు. ఏదైతేనేం చంద్రముఖి కనిపించడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. దీని వెనుక గల కారణాలపై ఆరా తీస్తున్నారు. -
చంద్రముఖి వాంగ్మూలమే ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: గోషామహల్ నియోజకవర్గం బీఎల్ఎఫ్ అభ్యర్థి ట్రాన్స్జండర్ చంద్రముఖి హైకోర్టుకు ఇచ్చిన వాంగ్మూలాన్నే ఫిర్యాదుగా పరిగణించి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని తెలంగాణ పోలీసుల్ని ధర్మాసనం ఆదేశించింది. ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు భద్రత కావాలని చంద్రముఖి కోరితే ఇవ్వాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు చంద్రముఖిని పోలీసులు గురువారం హైకోర్టు ధర్మాసనం ఎదుట హాజరుపర్చారు. ఎన్నికల్లో నామినేషన్ వేసిన తన కుమార్తె ఈ నెల 27 నుంచి అదృశ్యమైందని, ఆమె ఆచూకీ తెలియజేసేలా పోలీసులకు ఆదేశాలివ్వాలని కోరుతూ చంద్రముఖి తల్లి మువ్వల అనిత హైకోర్టులో దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ పరిష్కారమైనట్లుగా ప్రకటించింది. ఈమేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తిల ధర్మాసనం గురువారం ప్రకటించింది. ఇద్దరు వ్యక్తులు తనను బెదిరించి దౌర్జన్యంగా ఆటో ఎక్కించి తీసుకువెళ్లారని చంద్రముఖి విచారణ సందర్భంగా చెప్పారు. హెబియస్ కార్పస్ పిటిషన్ వ్యక్తి అదృశ్యానికి సంబంధించినది మాత్రమేనని, దీనితో బెదిరింపులకు సంబంధం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతోపాటుగా చంద్రముఖిని బెదిరించిన వ్యక్తులపై కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చింది. దీనిపై ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది శరత్ కల్పించుకుని..తనను బెదిరిస్తున్నారని చంద్రముఖి పోలీస్ స్టేషన్‌కు వచ్చి చెబుతున్నారని, తీరా అదే విషయంపై వాంగ్మూలం ఇవ్వడం లేదని చెప్పారు. దానికి ధర్మాసనం స్పందిస్తూ.. హైకోర్టు జ్యుడీయల్ రిజిస్ట్రార్ వద్ద బెదిరింపులు–అదృశ్యం కావడంపై చంద్రముఖి వాంగ్మూలం ఇవ్వాలని, దీని ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసుల్ని ఆదేశించింది. -
తెలంగాణలోనే చిన్నచూపు ..
ట్రాన్స్‌జెండర్స్.. హిజ్రాలు.. ఇతరులు పేరేమైన వారు మాత్రం నిరాధరణకు గురవుతున్నారు. తెలంగాణలో ఎలాంటి సంక్షేమ సహాయ కార్యక్రమాలు లేకపోవడంపై వారు ప్రశ్నిస్తున్నారు. తమ సంక్షేమానికి ఎవరు కట్టుబడితే వారికే ఓట్లు వేస్తామని స్పష్టం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఇతరులు.. వారి డిమాండ్లపై ప్రత్యేక కథనం.. రామగుండం: ట్రాన్స్‌జెండర్స్.. హిజ్రాలు.. ఇతరులు పేరేమైన వారు మాత్రం నిరాధరణకు గురవుతున్నారు. ఓట్ల కోసం వచ్చే నాయకులు తమ సంక్షేమంపై పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒడిశా, కేరళ, ఆంధ్రప్రదేశ్‌లో ఇతరులకు ప్రతీ నెల రూ.1,500 పింఛన్ ఇవ్వడంతోపాటు, విద్య, ఉద్యోగావకాల్లో రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. అయితే తెలంగాణలోనే ప్రభుత్వం నుంచి ఎలాంటి సంక్షేమ సహాయ కార్యక్రమాలు లేకపోవడంపై వారు ప్రశ్నిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో ప్రచారానికి వచ్చే నాయకులను నిలదీస్తామంటున్నారు. తమ సంక్షేమానికి ఎవరు కట్టుబడితే వారికే ఓట్లు వేస్తామని స్పష్టం చేస్తున్నారు. సుప్రీం తీర్పు అనంతరం నాలుగేళ్ల క్రితం ట్రాన్స్‌జెండర్స్–హిజ్రాలు తమ ఓటరు నమోదుకు కొందరు పురుషులు, మరికొందరు స్త్రీల జాబితాలో పేర్తు నమోదు చేసుకునే వారు. అయితే 2014లో సుప్రీంకోర్టు తీర్పు అనంతరం అన్నిరంగాల్లోని ట్రాన్స్‌జెండర్స్–హిజ్రాలకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. అనంతరం ట్రాన్స్‌జెండర్స్‌కు మూడో వరుస ఏర్పాటు చేసి ఇతరులుగా పేర్లను నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. గత నాలుగేళ్లలో రాష్ట్రంలో 2,667 మంది నూతనంగా నమోదు చేసుకోగా ఉమ్మ డి కరీంనగర్ జిల్లాలో 153 మంది ఓటరుగా నమోదు చేసుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 2014కు ముందు రాష్ట్ర వ్యాప్తంగా దాదా పు 1.20 లక్షల మంది ఉన్నట్లు హిజ్రాల రాష్ట్ర ప్రతినిధి లైలా తెలిపారు. హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్‌లోని గోర ఖ్పూర్లలో కార్పొరేషన్ మేయర్లుగా కొనసాగగా, ఉత్తరప్రదేశ్‌లో ఒకరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. నియోజకవర్గాల వారీగా.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో 12 నియోజకవర్గాలుండగా కరీంనగర్ నియోజకవర్గ పరిధిలో 36 మంది, రామగుండంలో 29, చొప్పదండిలో ఇద్దరు, హుజూరాబాద్‌లో 17, వేములవాడలో 3, జగిత్యాలలో 15, కోరుట్లలో 6, ధర్మపురిలో 3, మం థనిలో 21, పెద్దపల్లిలో 21 మంది హిజ్రాలు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. మానకొండూ ర్, సిరిసిల్ల నియోజకవర్గాల్లో ఒక్కరూ లేరు. కొన్ని రాష్ట్రాల్లోనే గుర్తింపు సుప్రీంకోర్టు 2014లో ఇచ్చిన తీర్పును కొన్ని రాష్ట్రాల్లోనే అమలు చేస్తున్నారు. ఒడిషా, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రా ల్లో హిజ్రాలకు రూ.1,500 పింఛన్ ఇస్తున్నారు. వీరి సం క్షేమానికి రాష్ట్ర బడ్జె ట్లో రూ.20 కోట్లు వెచ్చించాలని నిర్ణయించాయి. విద్యావకాశాల్లో రిజర్వేషన్లు అమలు చేస్తుండగా, వా రి కోసం ప్రత్యేక సంక్షేమ రెసిడెన్షియ ల్ విద్యాలయాలు ఏర్పాటు చేస్తున్న ట్లు తెలిపారు. అంతేకాకుండా ప్రధాన కూడళ్ల లో ప్రత్యేక టాయిలెట్స్ నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. నిత్యం అవహేళనలే.. మాపై ఇంటితోపాటు సమాజంలోనూ ఛీత్కారాలు ఎదురవుతున్నాయి. ఎక్కడికి వెళ్లిన ఏదోలా చూస్తుంటారు. మా పక్కనే ఉంటూ అసభ్యకరంగా మాట్లాడుతుంటారు. నిత్యం వింటూ ఎంతో మానసిక వేదన అనుభవిస్తున్నాం. ఒకవేళ ఎక్కడైనా పనికి వెళ్లిన అక్కడ మాపై ఇతరులకు వేరే భావాలు ఉంటాయి. మా క మ్యూనిటీ ని ప్రభుత్వం గుర్తించి విద్య, ఉపా ధి అవకాశా లు కల్పించాలి. – అర్చన, రాష్ట్ర కమిటీ ప్రతినిధి ఇక్కడే భిన్న నిర్ణయాలు ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత మా కమ్యూనిటీపై ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్ అవకాశం ఇస్తున్నారు. కానీ తెలంగాణలోనే చిన్నచూపు చూస్తున్నారు. పక్క రాష్ట్రంలో విద్య, ఉద్యోగావకాశాల్లో రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. మన రాష్ట్రంలోనే గుర్తింపు లేదు. ఆరు నెలల క్రితం హైదరాబాద్‌లో భారీ సమావేశం సైతం ఏర్పాటు చేశాం. అయినా ప్రభుత్వం స్పందించలేదు. – ప్రగతి, బెల్లంపల్లి గుర్తింపు లేదు మన రాష్ట్రంలో హిజ్రాలకు గుర్తింపు లేదు. పోస్ట్రుగాడ్యుయేట్ ఎంఏ సోషియాలజీ చదివాను. వరంగల్ ఎమ్మెల్యే కొండ సురేఖ గత అసెంబ్లీ సమావేశాల్లో హిజ్రాల సంక్షేమంపై మాట్లాడిని ప్రభుత్వం స్పందించలేదు. ఓట్ల కోసం మాత్రం వస్తారు.. కానీ మా గురించి పట్టించుకోరు. ఒక సీటు కేటాయించి హిజ్రాలపై మానవత దృక్పథంతో వ్యవహరించాలి. ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్లు కల్పించాలి. మేనిఫెస్టోలో ట్రాన్స్‌జెండర్స్ అంశాన్ని చేర్చాలి. ఒక ఎమ్మెల్యే సీటును కేటాయించాలి. – లైలా, అధ్యక్షురాలు, తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్‌జెండర్స్ – హిజ్రా అసోసియేషన్ -
బాలుడు కిడ్నాప్.. హిజ్రాగా ప్రత్యక్షం
వేసవి సెలవులు ముగించుకుని బస్సులో వస్తుండగా హిజ్రాలు బాలునికి మాయమాటలు చెప్పి వెంట తీసుకెళ్లారు. అతనికి లింగమార్పిడి చేసి తమలాగే మార్చి భిక్షాటన ప్రారంభించారు. తమ కొడుకు ఏమయ్యాడోననిఅప్పటినుంచి నిరీక్షించిన తల్లిదండ్రులకు పిడుగులాంటి నిజం తెలిసిదిగ్భ్రాంతికి గురయ్యారు. మైసూరు జిల్లాలో షాక్‌కు గురిచేసే సంఘటన బయటపడింది. ఇలా ఇంకెంతమంది బాలలు ఇటువంటి ముఠాల చెరలో మగ్గిపోతున్నారోనని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కర్ణాటక, యశవంతపుర: ఐదారు నెలల క్రితం అదృశ్యమైన 10వ తరగతి బాలుడు.. ఇప్పుడు హిజ్రాగా కనిపించడంతో కన్నవారు తీవ్రంగా విలపిస్తున్నారు. మైసూరు జిల్లా క్రిష్ణరాజపేట తాలూకా హక్కిమంచనహళ్లికి చెందిన చందన్‌కుమార్ (16) లింగమార్పిడితో ఇప్పుడు చందన్‌కుమారిగా మారిపోయాడు. వివరాలు.. చందన్‌కుమార్ బెంగళూరులోని పిన్నమ్మ ఇంట్లో ఉంటూ బీబీఎంపీ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదివేవాడు. ఈ ఏడాది మేలో వేసవి సెలల్లో సొంతూరికి వెళ్లాడు. సెలవు ముగియటంతో తల్లిదండ్రులుఅతడిని బస్ ఎక్కించి బెంగళూరుకు పంపించారు. బెంగళూరుకు వస్తూ మిస్సింగ్ అయితే చందన్ బెంగళూరుకు వెళ్లలేదు. అదృశ్యమయ్యాడని తల్లిదండ్రులు కేఆర్‌పేట పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటినుంచి పోలీసులు, కన్నవారు బాలుని కోసం గాలిస్తున్నారు. ఆదివారం ఉదయం ఇద్దరు హిజ్రాల జతలో బాలుడు కేఆర్ పేజీ పట్టణంలోని టీబీ రోడ్డులో ఉన్నాడు. ఆ సమయంలో మంజు అనే యాచకుడు చందన్‌ను చూసి గుర్తుపట్టాడు. ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు అని బాలున్ని ప్రశ్నిస్తుండగా ఇతర హిజ్రాలతో కలిసి ఆటోలో పారిపోవటానికి ప్రయత్నించగా మంజు ఆటోను వెంబడించి పట్టుకుని కేఆర్‌పేట పట్టణ పోలీసులకు అప్పగించాడు. తన కొడుకు హిజ్రాగా కనిపించాడని తెలిసిన తల్లిదండ్రులు బంధువులతో కలిసి స్టేషన్‌కు చేరుకున్నారు. తన కొడుకును హిజ్రాలే అపహరించి ఇలా మార్చారని తల్లిదండ్రులు పోలీసుల ముందు కన్నీరుమున్నీరయ్యారు. మైనర్ బాలుడిని కిడ్నాప్ చేసి లింగ మార్పిడి చేసిన ఆరోపణలపై ఇద్దరు హిజ్రాలను అదుపులోకి తీసుకోని పోలీసులు విచారిస్తున్నారు. చందన్‌ను మహిళ శిశు సంక్షేమశాఖ అధికారులకు అప్పగించిన్నట్లు ఎస్ఐ వెంకటేశ్ తెలిపారు. -
అర్ధరాత్రి హిజ్రాలు నిద్రిస్తున్న గదిలోకి ప్రవేశించి..
బంజారాహిల్స్: నెలవారి మామూళ్లు ఇవ్వడం లేదంటూ అర్ధరాత్రి దౌర్జన్యంగా హిజ్రాలు నిద్రిస్తున్న గదిలోకి ప్రవేశించి, కత్తులతో బెదిరించి అలమారాలో ఉన్న రూ.2 లక్షల నగదు, బంగారు నగలతో ఉడాయించిన రౌడీషీటర్ వెంకట్ యాదవ్‌తో పాటు సనత్‌నగర్ పహిల్వాన్ సాయిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే... బంజారాహిల్స్ రోడ్ నెం.2 లోని ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి వెనకాల ఇందిరానగర్‌లో యాస్మిన్(28) అనే హిజ్రా సహచర హిజ్రాలతో కలిసి నిద్రిస్తున్నది. ఈ నెల 27వ తేదీన రౌడీ షీటర్ వెంకట్‌యాదవ్, సనత్‌నగర్ పహిల్వాన్ సాయి ఇద్దరూ ఆమె ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించారు. ప్రతినెలా తమకు ఇచ్చే రూ.10 వేల మామూళ్ళు ఎందుకు ఇవ్వడం లేదంటూ ప్రశ్నిస్తూనే ఆమెను తీవ్రంగా కొట్టారు. అక్కడే ఉన్న ఆమె 17 నెలల కూతురిని కూడా హత్య చేస్తామంటూ బెదిరించారు. బలవంతంగా ఆమె దగ్గరి నుంచి అలమారా తాళంచెవులు తీసుకొని అందులో ఉన్న రూ.2 లక్షల నగదు, బంగారాన్ని తీసుకోవడమే కాకుండా ఆమె సెల్‌ఫోన్‌ను లాక్కున్నారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే అంతు చూస్తామంటూ బెదిరించారు. నిందితులు అక్కడి నుంచి పరారు కాగానే బాధితురాలు ఈ విషయాన్ని సహచర హిజ్రాలకు తెలియజేసింది. సమాచారం అందుకున్న వివిధ ప్రాంతాల హిజ్రా గ్రూపులు శనివారం రాత్రి 10 గంటలకు బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. ఈ నెల27వ తేదీన తాము పిర్యాదు చేస్తే ఇప్పటిదాకా వెంకట్ యాదవ్‌ను ఎందుకు అరెస్ట్ చేయలేదంటూ బాధితురాలు యాస్మిన్‌తో పాటు సనం, సోనా రాథోడ్, సనా, ప్రియా, లక్కీ, అలేఖ్య, లిప్సిక తదితరులు స్టేషన్ ముందు బైఠాయించారు. తెల్లవారుజామున 3 గంటల వరకు పెద్దసంఖ్యలో హిజ్రాలు విచ్చేసి స్టేషన్ ముందు బైఠాయించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బంజారాహిల్స్ ఏసీపీ కే.ఎస్.రావు, ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాస్ పరిస్థితిని సమీక్షించారు. నిందితుల జాడ కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఒకటి రెండు రోజుల్లో అరెస్ట్ చేస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. -
ప్రాణహాని ఉందంటూ హిజ్రాల ఆందోళన
సాక్షి, హైదరాబాద్ : బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు హిజ్రాలు శనివారం అర్ధరాత్రి ఆందోళన నిర్వహించారు. వెంకట్ అనే రౌడీ షీటర్ వేధింపుల నుంచి తమను కాపాడాలని పోలీసులను వేడుకొన్నారు. తమ నివాసాలపై మారణాయుధాలతో దాడి చేసి తరచూ డబ్బులు తీసుకెళ్తున్నాడని ఆవేదనవ్యక్తం చేశారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ స్పందించడంలేదని వాపోయారు. గత్యంతరం లేకనే ధర్నా చేస్తున్నామని తెలిపారు. వెంకట్ నుంచి తమకు ప్రాణహాని ఉందనీ, అతన్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రౌడిషీటర్పై చర్యలు తీసుకునేవరకు ఆందోళన విరమించమని తేల్చిచెప్పారు. నిందితునిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు నచ్చజెప్పడంతో హిజ్రాలు ఆందోళన విరమించారు. -
చులకనగా చూడొద్దు..
ట్రాన్స్‌జెండర్ అంజలి అమీర్ మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి సరసన హీరోయిన్గా నటించింది. మరో ట్రాన్స్‌జెండర్ ప్రీతికా యూషీనా తమిళనాడులోని చులైమేడు పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తోంది. ఇక సత్యశ్రీ షర్మిల ప్రముఖ లాయర్‌గా గుర్తింపు పొందింది. ఇలా దేశవ్యాప్తంగా ఎంతో మంది ట్రాన్స్జెండర్లు వివిధ రంగాల్లో తమ సత్తాచాటుతున్నారు. ‘మేమూ మనుషులమే..మమ్మల్ని చులకనగా చూడొద్ద’ని వేడుకుంటున్న వారు... ప్రతిభలో తామేమీ తీసిపోమనినిరూపిస్తున్నారు. ఇదే కోవకు చెందుతుందినగరానికి ట్రాన్స్‌జెండర్ అంజలి కల్యాణపు. హిమాయత్‌నగర్: బాలానగర్‌కు చెందిన అంజలి గ్రాడ్యుయేట్. ఆమెకు పుట్టుకతోనే వచ్చిందీ సమస్య. తర్వాత కొన్నేళ్లకు తెలిసింది తనలోని లోపం. ఇంట్లో వాళ్లకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించింది. కానీ వాళ్లు అర్థం చేసుకోకపోగా... ‘ఛీ.. పొమ్మని’ బయటకు గెంటేశారు. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో.. తానేంటో సమాజానికి చూపించాలనుకుంది. ట్రాన్స్జెండర్ల సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, తమ హక్కులు సాధించుకోవాలని నిశ్చయించుకుంది. ఇందుకు తోటివారితో కలిసి ‘ట్రాన్స్‌విజన్’ పేరుతో తెలుగు, కన్నడ, ఉర్దూ భాషల్లో 2017లో యూట్యూబ్ చానెల్ ప్రారంభించింది. దేశంలో ట్రాన్స్‌జెండర్ ప్రారంభించిన తొలి యూట్యూబ్ చానెల్ ఇదే కావడం విశేషం. ఆమే వ్యాఖ్యాత... అంజలి, ఆమె అమ్మగా భావించే ముద్రబోయిన రచన, చంద్రముఖి, జాహ్నవి, సోనియా కలిసి యూట్యూబ్ చానెల్ ఏర్పాటు చేయాలని ఆలోచించారు. వీరికి ప్రొడ్యూసర్ మోజెస్ చేయూతనిచ్చారు. అలా 2017లో ‘ట్రాన్స్‌విజన్’ పేరుతో తెలుగు, కన్నడ, ఉర్దూ భాషల్లో యూట్యూబ్ చానెల్ ప్రారంభమైంది. తెలుగులో అంజలి యాంకర్‌గా వ్యవహరిస్తున్నారు. తాను చిన్నప్పటి నుంచి ఎదుర్కొన్న సమస్యలను ప్రజల ముందుంచాలని, ట్రాన్స్జెండర్లను ఎవరూ చులకనగా చూడొద్దనే భావనతో ఆమే స్క్రిప్ట్ కూడా రూపొందించుకుంటోంది. ఏడాది కాలంగా 9 ఎపిసోడ్స్ చేశారు. దేశవ్యాప్తంగా ఎంతోమంది తమ చానెల్‌ను చూస్తున్నారని అంజలి తెలిపారు. యూనివర్సిటీల్లో అవగాహన... ట్రాన్స్‌జెండర్స్ ఆటో ఎక్కినా, బస్సెక్కినా, సినిమాకెళ్లినా వింతగా చూస్తారు. ఆ సమయంలో తామెంతో ఆవేదనకు గురవుతామని అంజలి పేర్కొన్నారు. ట్రాన్స్‌జెండర్స్ కూడా మనుషులేననే అవగాహనను విద్యార్థుల్లో కల్పించేందుకు పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీల్లో ప్రత్యేకంగా సదస్సులు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా తదితర నగరాల్లోని ప్రముఖ యూనివర్సిటీల్లోనూ వీరు అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. రెండ్రోజుల క్రితం నగంరలోని పోలీస్ అకాడమీలో యంగ్ ఐపీఎస్ అధికారులతో సమావేశమయ్యారు అంజలి. అవార్డుతో మరింత బాధ్యత... ‘ది లాడ్లీ మీడియా అండ్ అడ్వర్టయిజింగ్ అవార్డ్స్’ పేరుతో లాడ్లీ సంస్థ ప్రతి ఏటా వివిధ రంగాల్లోని ప్రతిభావంతులను గుర్తించి అవార్డులు అందజేస్తుంది. ఒక ట్రాన్స్‌జెండర్ వ్యాఖ్యాతగా తమ సమస్యలపై యూట్యూబ్ చానెల్ ఏర్పాటు చేసి అవగాహన కల్పించడం గొప్ప విషయమని ఆ సంస్థ గుర్తించింది. సెప్టెంబర్ 14న ఢిల్లీలో అంజలికి అవార్డు ప్రదానం చేశారు. ‘మమ్మల్ని మనుషులుగా గుర్తించండి. అప్పుడు మేమంతో హ్యాపీగా ఉంటాం. ప్రభుత్వం కూడా మమ్మల్ని గుర్తించి వివిధ రంగాల్లో అవకాశాలిస్తే బాగుంటుంది. సమాజానికి మేమేంటి? అనేది తెలియజేయాలనే యూట్యూబ్ చానెల్ ప్రారంభించాను. అందరికీ అవగాహన కల్పిస్తున్నాను. ఇప్పుడీ అవార్డు నా బాధ్యతను మరింత పెంచింద’ని అంజలి చెప్పారు. -
వారికి కూడా ప్రత్యేకంగా హాస్టల్ వసతి!
కాలేజీ క్యాంపస్‌లలో అమ్మాయిలు, అబ్బాయిలకు వేర్వేరుగా హాస్టల్స్ ఉంటాయి. అయితే ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టీఐఎస్ఎస్) మరో ముందడుగు వేసింది. లింగ నిర్ధారణ కాని వారు, ట్రాన్స్జెండర్ల కోసం ప్రత్యేకంగా హాస్టల్ వసతి కల్పించింది. వారి హక్కులను గౌరవించింది. ఇలా ఎల్జీబీటీక్యూ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా హాస్టల్ ఏర్పాటు చేయడం దేశంలోనే తొలిసారి. ‘వ్యక్తుల ఆత్మగౌరవాన్ని తప్పనిసరిగా పరిరక్షించాలి. హుందాగా జీవించే హక్కు ప్రాథమిక హక్కుగా గుర్తింపు పొందింది. లింగ భేదం కారణంగా వివక్ష చూపరాదు, గౌరవప్రదంగా జీవించే హక్కు వారికి ఉంది’ అని సర్వోన్నత న్యాయస్థానం ‘స్వలింగ సంపర్కం’కేసు తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించింది. వాటిని అక్షరాలా ఆచరించి చూపించింది టిస్. ఇలా ప్రారంభమైంది.. జెండర్ న్యూట్రల్స్‌కు క్యాంపస్‌లో ప్రత్యేక హాస్టల్, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని, గత సెప్టెంబర్‌లో జరిగిన విద్యార్థి సంఘం సర్వసభ్య సమావేశంలో తీర్మానించారు. విద్యార్థి సంఘం ఎన్నికల మేనిఫెస్టోలోనూ ఈ అంశాన్ని చేర్చారు. హాస్టల్ ఏర్పాటుపై విద్యార్థులు, పాలకవర్గం, బోధనా సిబ్బంది చర్చలు జరిపారు. వారి కోసం ప్రత్యేకంగా హాస్టల్ ఏర్పాటుకు యాజమాన్యం అంగీకరించింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ప్రత్యేక వసతి సౌకర్యం కల్పించారు. ఈ హాస్టల్ అవసరాన్ని అందరం గుర్తించామని, అందుకే వీరి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని విద్యార్థి వ్యవహారాల డీన్ ఆశా బానో అన్నారు. నిర్ధారణకు కమిటీ హాస్టల్ ఏర్పాటు నిర్ణయం అనంతరం ఓ కమిటీ నియమించారు. హాస్టల్లో ఎవరికి ప్రవేశం కల్పించాలనే అంశంపై నిబంధనలు రూపొందించారు. అమ్మాయిలు, అబ్బాయిల హాస్టల్లో చేర్చుకోవడానికి అవకాశం లేని వారికి ఇందులో ప్రవేశం కల్పించాలని నిర్ణయించారు. అయితే అదే సమయంలో ఎల్జీబీటీక్యూ విద్యార్థులను మిగతా వారి నుంచి వేరు చేయాలనేది తమ ఉద్దేశం కాదని ఓ ప్రొఫెసర్ తెలిపారు. ఈ హాస్టల్లో ఉండాలా.. వద్దా.. అనేది విద్యార్థుల ఇష్టమ న్నారు. ఇతరులు కూడా తమకు ఇష్టమైతే ఇక్కడ ఉండొచ్చ న్నారు. రూమ్‌కు ఇద్దరు ఉండేలా పది గదులను కేటాయిం చారు. ప్రస్తుతం 17 మంది ఈ హాస్టల్లో ఉంటున్నారు. ఎవరైనా రావొచ్చు సాధారణంగా అమ్మాయిల హాస్టల్‌కు అబ్బాయిలను రానివ్వరు..అబ్బాయిల హాస్టల్లోకి అమ్మాయిలకు ప్రవేశం ఉండదు. అయితే ఈ హాస్టల్‌కు ఎవరైనా రావొచ్చు.. రాత్రి 10 గంటల వరకు ఇక్కడ ఉండొచ్చు. ‘నన్ను క్వీర్గా గుర్తించారు. (విపరీత/ వికృత స్వభావం ఉన్నవారు) ప్రస్తుతం అబ్బాయిల హాస్టల్లో ఉంటున్నా.. ఎలా ఉంటుందో చూద్దామని అప్పుడప్పుడూ జెండర్ న్యూట్రల్ హాస్టల్లో ఉంటున్నా. నా అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించే అవకాశం, నా బాధలను చెప్పుకు నేందుకు స్నేహితులు ఇక్కడ దొరికారు’అని మిథున్ అనే వ్యక్తి తెలిపారు. -
‘ఎల్జీబీటీక్యూ’లకు ప్రత్యేక హాస్టల్
కాలేజీ క్యాంపస్‌లలో అమ్మాయిలు, అబ్బాయిలకు వేర్వేరుగా హాస్టల్స్ ఉంటాయి. అయితే ముంబైలోని టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్(టీఐఎస్ఎస్) మరో ముందడుగు వేసింది. లింగ నిర్ధారణ కాని వారు, ట్రాన్స్జెండర్ల కోసం ప్రత్యేకంగా హాస్టల్ వసతి కల్పించింది. వారి హక్కులను గౌరవించింది. ఇలా ఎల్జీబీటీక్యూ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఓ హాస్టల్ ఏర్పాటు చేయడం దేశంలోనే మొదటి సారి. ‘వ్యక్తుల ఆత్మగౌరవాన్ని తప్పనిసరిగా పరిరక్షించాలి. హుందాగా జీవించే హక్కు ప్రాథమిక హక్కుగా గుర్తింపు పొందింది...లింగ బేధం కారణంగా వివక్ష చూపరాదు, గౌరవ ప్రదంగా జీవించే హక్కు’ వారికి ఉంది’ సర్వోన్నత న్యాయస్థానం ‘స్వలింగ సంపర్కం’ కేసు తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించింది. వాటిని అక్షరాల ఆచరించి చూపించింది టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (‘టిఐఎస్ఎస్’). ఇలా ప్రారంభమైంది.. జెండర్ న్యూట్రల్స్‌కు క్యాంపస్‌లో ప్రత్యేక హాస్టల్, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని, గత సెప్టెంబర్‌లో జరిగిన విద్యార్థి సంఘం సర్వసభ్య సమావేశంలో తీర్మానించారు. విద్యార్థి సంఘం ఎన్నికల మ్యానిఫెస్టోలోనూ ఈ అంశాన్ని చేర్చారు. హాస్టల్ ఏర్పాటుపై విద్యార్థులు, పాలక వర్గం, బోధనా సిబ్బంది చర్చలు జరిపారు. ప్రత్యేకంగా హాస్టల్ ఏర్పాటుకు యాజమాన్యం అంగీకరించింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వారి కోసం ప్రత్యేక వసతి సౌకర్యం కల్పించారు. ఈ హాస్టల్ ఏర్పాటులో విద్యార్థులు, బోధనా సిబ్బంది, యాజమాన్యం సమష్టి కృషి ఉందని విద్యార్థి వ్యవహారాల డీన్ ఆశా బానో తెలిపారు. ఈ హాస్టల్ అవసరాన్ని అందరం గుర్తించాం..అందుకే వీరి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశామన్నారు. నిర్ధారణకు కమిటీ ఏర్పాటు హాస్టల్ ఏర్పాటు నిర్ణయం అనంతరం ఓ కమిటీ నియమించారు. హాస్టల్లో ఎవరికి ప్రవేశం కల్పించాలనే అంశంపై కొన్ని నిబంధనలు రూపొందించారు. ప్రధానంగా అమ్మాయిల, అబ్బాయిల హాస్టల్లో చేర్చుకోవడానికి అవకాశం లేని వారికి ఇందులో ప్రవేశం కల్పించాలని నిర్ణయించారు. అయితే అదే సమయంలో ఎల్జీబీటీక్యూ+ విద్యార్థులను మిగతా వారి నుంచి వేరు చేయాలనేది తమ ఉద్దేశ్యం కాదని గైడ్‌లైన్స్ కమిటీకి చెందిన ఓ ప్రొఫెసర్ తెలిపారు. ఈ హాస్టల్లో ఉండాలా? వద్దా? అనేది విద్యార్థుల ఇష్టమన్నారు. ఇతరులు కూడా తమకు ఇష్టమైతే ఇక్కడ ఉండొచ్చన్నారు. రూమ్‌కు ఇద్దరు విద్యార్థులు ఉండేలా పది గదులను వీరికోసం కేటాయించారు. ప్రస్తుతం 17 మంది ఈ హాస్టల్లో ఉంటున్నారు. మరో మూడు సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఎవరైనా రావొచ్చు సాధారణంగా అమ్మాయిల హాస్టల్‌కు అబ్బాయిలను రానివ్వరు..అబ్బాయిల హాస్టల్లోకి అమ్మాయిలకు ప్రవేశం ఉండదు. అయితే ఈ హాస్టల్‌కు ఎవరైనా రావొచ్చు..రాత్రి పదిగంటలకు వరకు ఇక్కడ ఉండొచ్చు. అందరం కలవడం వల్ల అనేక అంశాలపై ఇక్కడ చర్చలు జరుగుతాయి..విద్యార్థులకు ఇదో కల్చరల్ సెంటర్‌గా ఉంటుందని హాస్టల్ విద్యార్థి అకుంత్ తెలిపారు. ‘నన్ను క్వీర్గా గుర్తించారు .(విపరీత/ వికృత స్వభావం ఉన్నవారు) ప్రస్తుతం అబ్బాయిల హాస్టల్లో ఉంటున్నా.. ఎలా ఉంటుందో చూద్దామని అప్పుడప్పుడూ జెండర్ న్యూట్రల్ హాస్టల్లో ఉంటున్నా. నా అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించే అవకాశం, నా బాధలను చెప్పుకునేందుకు స్నేహితులు ఇక్కడ దొరికారని మిథున్ అనే వ్యక్తి తెలిపారు. ఇది తమకొక రక్షిత ప్రదేశంగా ఈ విద్యార్థులు భావిస్తున్నారు. హాస్టల్ ఏర్పాటయింది..అయితే తమ ఎజెండాలోని మరో అంశమైన ప్రత్యేక మరుగుదొడ్ల కోసం కృషి చేయనున్నట్లు దితి లేఖ అనే విద్యార్థి తెలిపారు. -
బొట్టు, దుప్పట్టతో ట్రాన్స్‌జెండర్‌లా గంభీర్.!
న్యూఢిల్లీ : టీమిండియా సీనియర్ క్రికెటర్ గౌతం గంభీర్ పెద్దబొట్టు, దుప్పట్ట కొంగుతో ట్రాన్స్‌జెండర్‌లా కనిపించాడు. గతకొంత కాలంగా అతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన ఈ ఢిల్లీ ఆటగాడు.. దేశంలో జరిగే ప్రతిఘటనపై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. గతవారం స్వలింగ సంపర్కం నేరం కాదని పేర్కొంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రాన్స్‌జెండర్స్ కమిటీ నిర్వహించిన హిజ్రా హబ్బా వేడుకలకు గంభీర్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొనాలంటే మగవారు బొట్టు, దుప్పట్ట, ఆడవారు మీసాలు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే గంభీర్ దుప్పట్ట, బొట్టు ధరించాడు. అతనికి ట్రాన్స్‌జెండర్స్ సాయం చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. ఇక గంభీర్ ట్రాన్స్‌జెండర్స్‌కు మద్దతుగా ఉండటం ఇదే తొలిసారేం కాదు. రక్షాబంధన్ సందర్భంగా వారితో రాఖీ కట్టించుకుని వారిని గౌరవించాలని పిలుపునిచ్చాడు. “It’s not about being a man or a woman. It’s about being a HUMAN.” With proud transgenders Abhina Aher and Simran Shaikh and their Rakhi love on my hand. I’ve accepted them as they are. Will you? #respecttransgenders pic.twitter.com/6gBOqXu6nj — Gautam Gambhir (@GautamGambhir) August 25, 2018 -
హగ్ మీ ప్లీజ్..
సాక్షి, ఖైరతాబాద్: ‘అందరిలాగే మేము కూడా మనుషులమే.. మమ్మలను అందరితో సమానంగా చూడండి. మాతో మాట్లాడినంత మాత్రాన, మమ్మల్ని కౌగిలించుకున్నంత మాత్రాన ఏమీ కాద’0టూ హిజ్రాలు, గే, లేస్బియన్స్ వినూత్న ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. తమతో స్నేహం చేయాలంటూ ఆదివారం సాయంత్రం మోబీరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘క్వీర్ కౌగిలి’ పేరుతో నెక్లెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజాలో ప్రచారం చేశారు. ప్రేమ అనేది మనసుకు చెందినదని, శరీరానికి కాదని, తమను ఓ సారి కౌగిలించుకుంటే ఏమీ కాదని ప్లకార్డులు ప్రదర్శించారు. తాము సమాజంలో మనుషులమేనని గుర్తించాలని కార్యక్రమాన్ని నిర్వహించినట్లు శాండీ, అనిల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పీపుల్స్ ప్లాజాలో రేయిన్బో ప్లాగ్‌ను ప్రదర్శిస్తూ ర్యాలీ తీశారు. -
మమ్మల్ని కించపరుస్తారా?
సాక్షి, హైదరాబాద్: కొంత మంది హిజ్రాలు మంగళవారం తెలుగు ఫిల్మ్‌చాంబర్ వద్ద ఆందోళన చేపట్టారు. నాగశౌర్య కథానాయకుడిగా తెరకెక్కిన ‘@నర్తనశాల’ మూవీలో హిజ్రాలను కించపరిచే సన్నివేశాలు ఉన్నాయని ఆరోపించారు. తమకు వ్యతిరేకంగా చిత్రికరించిన సన్నివేశాలను తొలిగించాలని లేకుంటే చిత్ర విడుదలను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ నెల 30న విడుదల కానున్న ‘నర్తనశాల’లో కశ్మీరా పరదేశి, యామినీ భాస్కర్ హీరోయిన్లుగా నటించారు. శ్రీనివాస చక్రవర్తి దర్శకత్వంలో శంకర ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఉషా ముల్పూరి ఈ మూవీని నిర్మించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన టీజర్లో నాగశౌర్య ‘గే’ లా నటించిన సీన్స్.. అతనికి తండ్రి పాత్ర పోషించిన శివాజీ రాజా ‘నా కొడుకు గే నా’ అని చెప్పిన డైలాగ్స్‌పై హిజ్రాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సముదాయించిన శివాజీరాజా హిజ్రాల ఆందోళనపై శివాజీరాజా స్పందించారు. తన చాంబర్ లోకి పిలిపించుకొని హిజ్రాలను సముదాయించారు. హిజ్రాల కోసం ప్రత్యేకంగా నర్తనశాల ప్రదర్శన వేయిస్తానని హామీయిచ్చారు. అభ్యంతరకర సన్నివేశాలు, దృశ్యాలను తొలగించేందుకు నిర్మాతలతో చర్చిస్తానని తెలిపారు. -
రాఖీ పండగ: ఆదర్శంగా నిలిచిన గంభీర్..!
సాక్షి, న్యూఢిల్లీ : టీమిండియా మాజీ ఆటగాడు గౌతం గంభీర్ వినూత్న నిర్ణయాలతో ఆదర్శంగా నిలుస్తున్నాడు. రక్షా బంధన్ సందర్భంగా ట్రాన్స్జెండర్లతో రాఖీ కట్టించుకుని సమాజానికి సందేశం ఇచ్చే ప్రయత్నం చేశాడు. ‘ఆడా, మగా అనే లింగభేదం ఎందుకు. ముందు మనుషులుగా మసలుకోవడం ప్రధానం. అభినా అహెర్, సిమ్రాన్ షైక్ ప్రేమతో నా చేతికి కట్టిన రాఖీలు ఎప్పుడూ గుర్తుంటాయి’అని అని ట్విటర్లో పేర్కొన్నారు. వారిద్దరి సోదర ప్రేమను నేను అంగీకరించాను. మీరు అంగీకరిస్తారా? అని ప్రశ్నించారు. మనుషులను మనుషులుగా గౌరవించడం మనందరి బాధ్యత అని అన్నారు. ట్రాన్స్‌జెండర్లయినా.. వారూ మనుషులేనని చెప్తూ.. లింగమార్పిడి చేయించుకున్న వారిపట్ల అమానుషంగా ప్రవర్తించే కొందరికి ఆయన హితవు పలికారు. కేరళలో జరుపుకునే ఓనమ్ పండుగకు క్రికెటర్లంతా.. శుభాకాంక్షలు తెలుపుతుంటే భారతదేశ వ్యాప్తంగా జరుపుకునే రాఖీ పండుగకు గంభీర్ ఇలా స్పందించాడు. -
నడిరోడ్డుపై నగ్నంగా ట్రాన్స్‌జెండర్స్ రచ్చ!
న్యూఢిల్లీ : దేశరాజధానిలో టాన్స్‌జెండర్స్ రెచ్చిపోయారు. నగ్నంగా డ్యాన్స్‌లు చేస్తూ .. వాహనాలు అడ్డుకుంటూ రచ్చచేశారు. ఈ ఘటనను ఓ వాహనదారుడు మొబైల్లో చిత్రికరించగా..ఈ వీడియోలు వాట్సాప్‌లో చక్కర్లుకొడుతున్నాయి. గత కొన్ని రోజులుగా ట్రాన్స్‌జెండర్స్ చట్టవ్యతిరేక(అర్ధరాత్రి రోడ్డుపై తిరగడం, వ్యభిచారం, డబ్బులు వసూలు చేయడం) పనులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నిరసనగా నడిరోడ్డుపై నగ్నంగా రచ్చచేశారు. 8 నుంచి 10 మంది ట్రాన్స్‌జెండర్స్ రెండు గ్రూప్‌లుగా ఏర్పడి దక్షిణ ఢిల్లీ, గ్రీక్‌పార్క్ రోడ్డులో ట్రాఫిక్‌ను అడ్డుకుంటూ నిరసన వ్యక్తం చేశారు. కొంత మంది నగ్నంగా మరికొంత మంది అర్ధనగ్నంగా వాహనాలపై ఎక్కి డ్యాన్స్ చేస్తూ ఇబ్బంది పెట్టారు. వారి ప్రయివేట్ పార్ట్స్‌ను చూపిస్తూ జుగుప్సాకరంగా ప్రవర్తించారు. ఒక గ్రూప్ వాహనాలపైకి ఎక్కి ఇబ్బంది పెట్టగా.. మరో గ్రూప్ నడిరోడ్డుపై వాహనాలు వెళ్లకుండా అడ్డుకుంది. ఈ ఘటనపై పోలీసులు స్పందిస్తూ.. గత నెలరోజులుగా రోడ్డుపై ట్రాన్స్‌జెండర్స్ చేసే చట్టవ్యతిరేక పనులు అడ్డుకుంటున్నామన్నారు. వారు హజ్కాస్ ప్రదేశానికి వెళ్తామని అడిగారని, అక్కడికి వెళ్లినా ఇలాంటి పనులు చేయవద్దని సూచించామని చెప్పారు. దీంతో వారు నిరసనగా రచ్చచేశారని పేర్కొన్నారు. ఈ ఘటనకు కారణమైన ఓ ఆరుగురు ట్రాన్స్‌జెండర్స్‌ను అదుపులోకి తీసుకున్నామన్నారు. వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించినప్పుడే ఈ సమస్య తగ్గుతుందని గుర్తించినట్లు పోలీసులు చెప్పుకొచ్చారు. యువ స్కీమ్ కింద హస్పిటాలిటీ సెక్టార్లో ఉద్యోగాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. -
అక్కడికెళితే అవమానాలే : ట్రాన్స్జెండర్లు
సాక్షి, న్యూఢిల్లీ: సమాజంలో తమకంటూ ఒక స్థానాన్ని, గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి ట్రాన్స్జెండర్లు అడుగులేస్తున్నారు. బ్యూటీషియన్ కోర్సులు నేర్చుకుని సెలూన్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. తమకు అవసరమైన సేవలు ‘మామూలు’ బ్యూటీపార్లర్లు అందించడం లేదని ఆరోపిస్తున్నారు. ట్రాన్స్జెండర్ల కోసం ప్రత్యేకంగా స్పా, బ్యూటీ సెంటర్లు ఏర్పాటుచేసుకుని దూసుకుపోతున్నారు. సగం ధరలకే సేవలు.. ‘నాకు అలంకరణ అంటే చాలా ఇష్టం. బ్యూటీ పార్లర్‌కు వెళ్లిన ప్రతీసారి అవమానాలు ఎదురయ్యేవి. అందుకే స్వయంగా నొయిడాలో బ్యూటీ పార్లర్ ఏర్పాటు చేసుకున్నాన’ని కాజల్ అనే ట్రాన్స్‌జెండర్, సెక్స్‌వర్కర్ తెలిపారు. తనలాగే ఇబ్బందులు పడుతున్న ట్రాన్స్జెండర్లకు ఇది ఎంతో ఉపయోగపడుతోందనీ, బయటితో పోల్చుకుంటే సగం ధరలకే ఇక్కడ సేవలందిస్తామమని ఆమె వెల్లడించారు. ఇక్కడే బ్యూటీకేర్ చేయించుకుంటున్న ఓ ట్రాన్స్‌జెండర్ మాట్లాడుతూ.. పొద్దంతా కష్టపడినా పూట గడవదు. అందుకే ఈ వ్యభిచార కూపంలో చిక్కుకున్నా. తలెత్తుకుని జీవించేందుకు బ్యూటీషియన్ కోర్సు నేర్చుకుంటున్నానని కనికా తెలిపారు. కాజల్ బ్యూటీపార్లర్ మా అందరికీ రిక్రియేషన్ సెంటర్‌గా కూడా ఉపయోగపడుతోందని తెలిపారు. రోజూ సాయంత్రం ఎంతో మంది ట్రాన్స్జెండర్లం ఇక్కడ కలులుసుకొని కష్టసుఖాలను పంచుకుంటామనీ, త్వరలోనే జీనత్ ప్రాతంలో బ్యూటీకేర్ సెంటర్ ఏర్పాటు చేస్తానని వెల్లడించారు. ఆ పని చేయలేం.. బ్యూటీకేర్ అయితే ఓకే.. ట్రాన్స్జెండర్లకు ఒక ఎన్జీవో చేయూతనిచ్చేందుకు ముందుకొచ్చింది. నొయిడాలోని ‘బసీరా సామాజిక్ సంస్థాన్’ అనే స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్టు ఆఫీసర్ రాంకాళీ మాట్లాడుతూ.. నైపుణ్యాభివృద్ధికి శిక్షణనిచ్చి ఉద్యోగాలు కల్పిస్తామంటే.. వారు వెనకడుగేశారు. కానీ, బ్యూటీ సెలూన్ల ఏర్పాటుచేసుకోవడానికి మొగ్గు చూపారని ఆయన తెలిపారు. బ్యూటీకేర్ సెంటర్ల నిర్వహణలో మంచి ప్రావీణ్యం సంపాదిస్తున్న ట్రాన్స్జెండర్లు.. వారి అలంకరణ అవసరాలను తీర్చుకోవడంతో పాటు, రానున్న రోజుల్లో మహిళలకు కూడా తమ సేవల్ని అందిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. -
టాన్స్జెండర్స్కు కేంద్రమంత్రి క్షమాపణలు
న్యూఢిల్లీ : కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ టాన్స్జెండర్స్కు క్షమాపణలు తెలిపారు. లోక్‌సభలో తప్పుగా సంభోదించినందుకు మన్నించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. మనుషుల అక్రమ రవాణా నిరోధక బిల్లును లోక్‌సభలో ప్రవేశపెడుతూ.. ఆమె ట్రాన్స్‌జెండర్స్‌ను అభ్యతకరమైన పదంతో సంభోదించారు. దీంతో సభలో నవ్వులు పూసాయి. ఆమె వ్యాఖ్యలపై ట్రాన్స్‌జెండర్స్ సంఘాల ఆగ్రహం వ్యక్తం చేయడంతో తన తప్పును గుర్తించారు. తను కావాలని అలా చేయలేదని, క్షమించాలని కోరుతూ ట్వీట్ చేశారు. ‘అక్రమ రవాణా నిరోధక బిల్లును లోక్‌సభలో ప్రవేశపెడుతూ.. నేను ట్రాన్స్‌జెండర్స్‌పై వాడిన పదానికి చింతిస్తున్నాను. నేను కావాలని అలా చేయలేదు. అనాలోచితంగా మాట్లాడినందుకు నాపై నాకే అసహ్యం వేస్తుంది. నిజానికి ట్రాన్స్‌జెండర్స్‌ను అధికారికంగా ఏమని పిలుస్తారో నాకు తెలియదు. భవిష్యత్తులో మళ్లీ మీ మనసులను నొప్పించను. ట్రాన్స్‌జెండర్స్ అనే పిలుస్తాను. క్షమించండి’ అని ట్వీట్లో పేర్కొన్నారు. మంత్రితో పాటు ఎంపీలు కూడా క్షమాపణలు తెలియజేయాలని టాన్స్‌జెండర్ సంఘం నేత మీరా సంఘమిత్ర డిమాండ్ చేశారు. I was not aware of the official terminology for the transgender community. In future, all official communication will use the term TGs. I would like to assure that the #AntiTraffickingBill2018 is gender neutral and provides protection to the aggrieved. — Maneka Gandhi (@Manekagandhibjp) July 30, 2018 -
ట్రాన్స్‌జెండర్ అనుకుంటే హ్యాపీనే!
ముంబై : ఓ వెబ్ సిరీస్‌లో కీలకపాత్ర పోషించిన నటికి చేదు అనుభవం ఎదురైంది. ఆమె పాత్రను చూసిన నెటిజన్లు నిజంగానే ట్రాన్స్‌జెండర్ నుకుని సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తున్నారట. ఆ నటి మరెవరో కాదు బాలీవుడ్ వెబ్ సిరీస్ ‘సాక్రిడ్ గేమ్స్’ ఫేమ్ కుబ్రా సైత్. ఈ వెబ్ సిరీస్‌లో సైఫ్ అలీఖాన్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, రాధికా ఆప్టే, కుబ్రా సైత్లు ప్రధాన పాత్రలు పోషించారు. నటి కుబ్రా సైత్ కుక్కూ అనే ట్రాన్స్‌జెండర్ రోల్లో కనిపించారు. అయితే వెబ్ సిరీస్ చూసిన నెటిజన్లు కుబ్రా సైత్ నిజంగానే ట్రాన్స్జెండరేనా అని అనుకునేలా నటించారు. దీంతో గూగుల్‌లో కుబ్రా అని టైప్ చేయగానే జెండర్ అనే కీవర్డ్ కనిపిస్తోంది. దీనిపై నటి కుబ్రా స్పందించారు. తనను ట్రాన్స్‌జెండర్ అని ప్రేక్షకులు భావించినందుకు గర్వంగా ఉందన్నారు. ’నాకు ఆ పాత్ర దక్కినందుకు సంతోషంగా ఉన్నా. నా నటనకు దక్కిన గౌరవంగా భావిస్తా. చిన్నప్పుడు స్కూల్లో ఓ నాటకంలో చెట్టు పాత్రను ఎంత నిజాయితీగా పోషించానో.. సాక్రిడ్ గేమ్స్‌లో ట్రాన్స్‌జెండర్ కుక్కూ పాత్రలోనూ అలాగే నటించా. నా సీన్లు బాగా రావడంతో మరిన్ని సీన్లు తీశారు. తన గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగిందింటే నా నటనకు మంచి మార్కులు పడ్డాయని తేలిపోయిందని’ నటి కుబ్రా సైత్ వివరించారు. విక్రమ్ చంద్రా రాసిన నవల ఆధారంగా అనురాగ్ కశ్యప్, విక్రమాదిత్య మోత్వానే దర్శకులుగా సాక్రిడ్ గేమ్స్ రూపొందిన విషయం తెలిసిందే. న్యూడ్ సీన్ పలుమార్లు తీస్తే ఏడ్చేశా! : నటి -
వద్దంటే వద్దన్నారు!
‘‘పందొమ్మిదేళ్లకే ‘మిస్ ఇండియా’ టైటిల్ గెలుపొందా. ‘అందాల పోటీలా! అంగాంగ ప్రదర్శనలా.. వద్దంటే వద్దు..’ అన్నారు మా బంధువులంతా. పోటీలకు వెళ్లకుండా అడ్డుకున్నారు కూడా. ఇప్పుడు సాధించాను. కౌగిలించుకుని అభినందిస్తున్నారు’’ అని ఎంతో సంతోషంగా చెబుతున్నారు అనుకృతీ వాస్. ఆమె గురించి మరికొన్ని విశేషాలు. ఇప్పటికైతే పక్కనపెట్టేశా! అమ్మ లేకపోతే నేను లేను. ఒంటరి అమ్మ నా కోసం పోరాడి నా విజయానికి కారణమైంది. నా లక్ష్యాన్ని గౌరవించింది. ‘డ్రెస్ అలా వేయద్దు.. ఇలా ఉండొద్దు.. మేకప్‌తో ఊళ్లు తిరగొద్దు’ అని మా అమ్మమ్మ మమ్మల్ని అడ్డుకునేది. కానీ.. అమ్మ నన్ను నమ్మింది. దాని ఫలితమే ఇది. నా కృషి, పట్టుదల కూడా నాకు తోడయ్యాయి. ఇప్పటి యువతకు ఒకటే చెపుతున్నా. గోల్స్ పెట్టుకోండి. వాటిని సాధించండి. అది ఏ రంగమైనా! నా ముందున్న లక్ష్యం విశ్వసుందరిగా మిస్ వరల్డ్ కిరీటం కైవసం చేసుకోవటమే. చాలా శ్రమించాలి. ఇందుకోసం చదువును కూడా పక్కన పెట్టి కసరత్తు చేస్తున్నా. మన తీరు మారాలి సమాజంలో ట్రాన్స్‌జెండర్ పై చాలా అపోహలు ఉన్నాయి. అవి మారాలి. నేను ట్రాన్స్ జెండర్ ఎడ్యుకేషన్‌కు సాయపడతా. వారికి సాయం చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. భారతదేశంలో చైల్డ్ అబ్యూస్పై కూడా చాలా అవగాహన అవసరం. ఇందుకు అన్ని రంగాల వారు ప్రాధాన్యం ఇవ్వాలి. హిందీ నేర్చుకుంటున్నా మిస్ ఇండియా అంటే బాహ్య అందం కాదు. అంతఃసౌందర్యం. ఫ్యాషన్ ఫీల్డ్‌పై సమాజంలో చాలా అపోహలు ఉన్నాయి. టెక్నాలజీ, ఫ్యాషన్, మోడల్ రంగంపై ముందు అవగాహన పెంపొందించుకోవాలి. సరైన ప్రోత్సాహం, అవగాహన ఉండాలి. తమిళనాడు నుండి గెలవటం చాలా గొప్పగా ఫీలవుతున్నా. ఇక్కడ సంస్కృతి, సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు. తమిళ్.. మిస్ ఇండియా టైటిల్ గెలిచేందుకు నాకు ప్లస్‌గా నిలిచింది. ఇప్పుడు హిందీ కూడా నేర్చుకుంటున్నా. ఇప్పుడే చెప్పలేను నా ప్రయాణం ఇప్పుడే మొదలైంది. చాలా దూరం వెళ్లాలి. చాలా అవకాశాలు ఉన్నాయి. రేపు ఏ రంగంలోకి వెళ్తానో ఇప్పుడు చెప్పలేను. నేను సైంటిస్ట్ కావచ్చు లేక మరేదైనా కానీ! ప్రస్తుతం నా ముందున్న లక్ష్యం ‘మిస్ వరల్డ్ మిస్ ఇండియా’. ఈ పోటీల్లో ధనవంతులే గెలుస్తారనే అపోహ ఉండేది. నాతో అది తొలగి ఉంటుంది. అనుకృతీవాస్ నచ్చిన టాపిక్ : ఫుడ్డు నచ్చిన ప్రదేశం : పుదుచ్చేరి ఇష్టాలు : ప్రయాణాలు నచ్చిన నటుడు : అందరూ ఇష్టమైన వ్యక్తి : అమ్మ చదువు : చెన్నై లయోలాలో బి.ఎ. (ఫ్రెంచ్) సెకండ్ ఇయర్. మనకు తెలియనివి : అనుకృతి అథ్లెట్, బైక్ రేసర్ కూడా. అమ్మాయిలకు ఇచ్చే సలహా : మీరు మీలా ఉండండి. మీక్కావలసింది ఎప్పటికైనా సాధించుకోగలరు. – సంజయ్ గుండ్ల, సాక్షి టీవీ, చెన్నై -
వీరు కూడా ఓటు వేశారు...
కర్ణాటక రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి. రాత్రికి రాత్రి ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. ఇవి పక్కన పెడితే, ఈసారి ఓటింగులో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఇంతకుముందు వరకు ఓటరు గుర్తింపు కార్డులో ఆడ, మగ రెండే ఉండేది. ట్రాన్స్జెండర్ల పోరాట ఫలితంగా వీరిని కూడా ఓటర్లలో చేర్చారు. వారికి కూడా ఓటరు గుర్తింపు కార్డులు ఇచ్చారు. కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5,000 మంది ట్రాన్స్జెండర్లు ఈసారి ఎంతో సంబరంగా ఉన్నారు. 2013 ఎలక్షన్ల కంటే ఈ సారి వీరి సంఖ్య రెట్టింపుగా ఉంది. వీరి సంఖ్య బెంగళూరులో బాగా ఎక్కువగా ఉంది. మొత్తం 28 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను వీరు 1,629 మంది ఉన్నారు. వీరిలో మొట్టమొదటిసారిగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న వారిలో లావణ్య కూడా ఉన్నారు.ఎవరు గెలిచినా, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ‘మాకు మాత్రం రక్షణ కల్పించాలి’ అంటున్నారు వీరంతా ముక్తకంఠంతో. ఓటు వేయడమనేది హక్కు మాత్రమే కాదు బాధ్యత కూడా అని తెలుసుకున్నారు వీరు. ‘‘ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా ఎంతోమంది రాజకీయ నాయకులు మా ఓట్లను కూడా అర్థించడానికి మా ఇళ్లకు వచ్చారు. మమ్మల్ని ఎంతో గౌరవంగా పలకరించారు. ముందుముందు కూడా అందరూ మా పట్ల ఎంతో గౌరవంగా ప్రవర్తిస్తారని ఆశిస్తున్నాం’’ అంటున్నారు లావణ్య. ట్రాన్స్జెండర్లు కూడా మనుషులేనని గుర్తించి, వారిని గౌరవంగా చూస్తే, ముందుముందు కూడా వీళ్లు ఓటు వేయడానికి ఆసక్తి చూపించే అవకాశం ఉందంటున్నారు విద్య దినకర్ అనే సామాజికవేత్త. ‘‘ట్రాన్స్జెండర్లను చాలామంది అవమానకరంగా చూస్తున్నారు. వారికి కూడా మనసు ఉంటుందని అర్థం చేసుకోవాలి. అయితే ఈ ఎన్నికలలో మొదటిసారిగా ఓట్లు వేస్తున్న వీరంతా ఎంతో సంతోషంగా ఉన్నారు. తాము కూడా ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో భాగస్వాములవుతున్నందుకు ఆనందిస్తున్నారు’’ అంటున్నారు దివ్య. కర్వార్ జిల్లా దండేలి గ్రామానికి చెందిన సంజన దక్షిణ కర్ణాటకలో మొట్టమొదటిసారిగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ‘‘నా పేరు మీద నాకు గుర్తింపు కార్డు ఇచ్చారు ‘సంజన’ అని. నేనంటే ఏమిటో నాకు ఇప్పుడు తెలుస్తోంది. నా కల నిజమవుతున్నందుకు నాకు ఆనందంగా ఉంది’’ అంటున్నారు. 2017లో రాష్ట్ర ప్రభుత్వం వీరి గురించి ఒక విధానం రూపొందించింది. వీరిని సంరక్షించేందుకు, ఉద్యోగం చేసేందుకు వీలుగాను, సమాజంలో ఎవ్వరూ వీరిని ఎగతాళి చేయకుండా మర్యాదగా చూసేందుకు అనుగుణంగా విధివిధానాలు రూపొందించింది. వారిని కూడా సాటివారిగా చూస్తూ, వారి పట్ల బాధ్యతగా ఉండాలని చెబుతున్నారు విద్య. – రోహిణి -
దేశంలోని ట్రాన్స్జెండర్ల విజయం..
తిరువనంతపురం, కేరళ : భారత్‌లో లెసిబియన్, గే, బై సెక్సువల్ అండ్ ట్రాన్స్‌జెండర్ (ఎల్జీబీటీ) కమ్యూనిటీ తొలి విజయం సాధించింది. కేరళ రాష్ట్రంలో ఇషాన్, సూర్య అనే ఇద్దరు ట్రాన్స్జెండర్లు చట్టబద్దంగా గురువారం వివాహం చేసుకున్నారు. పురుషుడి భావాలు కలిగిన ఇషాన్, స్త్రీ భావాలు కలిగిన సూర్యలు లింగమార్పిడి ఆపరేషన్లు చేయించుకున్నారు. ఒకరంటే మరొకరికి ఉన్న అనురాగంతో వివాహం చేసుకున్నారు. తిరువనంతపురంలోని మన్నం మెమోరియల్ హాల్లో జరిగిన ఈ వేడుకకు ఇరువురి కుటుంబసభ్యులు హాజరయ్యారు. అనంతరం ప్రత్యేక వివాహ చట్టం కింద వివాహాన్ని రిజిస్టర్ చేయించుకున్నారు. ఇషాన్, సూర్యలు ట్రాన్స్‌జెండర్ జస్టిస్ బోర్డులో కొన్నేళ్లుగా సభ్యులు. స్నేహితులు. వీరి వివాహం భారత్‌లో ఎప్పటినుంచో ఎల్జీబీటీ కమ్యూనిటీ ఎదుర్కొంటున్న అవమానాల నుంచి విజయంగా భావిస్తున్నారు. -
బరిలోకి దిగి... కన్నీళ్లతో వెనుదిరిగి...
గోల్డ్‌కోస్ట్: కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొంటున్న తొలి లింగ మార్పిడి వెయిట్‌లిఫ్టర్ లారెల్ హబ్బర్డ్ భుజం గాయంతో పోటీ నుంచి మధ్యలో తప్పుకుంది. న్యూజిలాండ్‌కు చెందిన ఈ 40 ఏళ్ల లిఫ్టర్ మహిళల ప్లస్ 90 కేజీల కేటగిరీలో పాల్గొనేందుకు సిద్ధమైంది. స్నాచ్‌లో మూడో ప్రయత్నం సందర్భంగా ఆమె తడబడి విఫలమైంది. బార్‌ను ఎత్తే ప్రయత్నంలో గాయపడ్డ ఆమె కంటతడి పెట్టుకొని పోటీ నుంచి వైదొలిగింది. లారెల్ మొదట పురుషుడు. పేరు గెవిన్ హబ్బర్డ్. పదేళ్ల క్రితం 30 సంవత్సరాల వయసులో లింగమార్పిడి చేయించుకొని అతను ఆమెగా మారాడు. వెయిట్‌లిఫ్టింగ్ అంటే ఎంతో ఇష్టమైన హబ్బర్డ్ కామన్వెల్త్ కోసం ఎంతో పట్టుదలగా సన్నద్ధమైంది. అయితే ఇతర దేశాలకు చెందిన లిఫ్టర్లు, కోచ్‌లు ఆమె ఇప్పుడు మహిళగా మారినప్పటికీ పూర్వమున్న పురుషుల బలం అంతర్గతంగా ఉండనే ఉంటుందని విమర్శించారు. హబ్బర్డ్‌ను మహిళల ఈవెంట్లో పాల్గొనేందుకు అనుమతించడం సహేతుకం కాదని సమోవా లిఫ్టింగ్ జట్టు హెడ్ కోచ్ జెర్రీ వాల్‌వర్క్ నిర్వాహకుల తీరును తప్పుబట్టారు. అయితే తాను మాత్రం ఇలాంటి విమర్శలను పట్టించుకోనని లారెల్ హబ్బర్డ్ చెప్పింది. -
పన్నుశాఖ మన్నించింది
ట్రాన్స్జెండర్లు ఒక్కో అవరోధాన్నీతొలగించుకుంటూ వస్తున్నారు.అయితే ఇంకా అనేక రంగాలు వీరికోసం చట్టబద్ధమైన సాంకేతిక నిబంధనలు సడలించవలసి ఉంది. ఏ అప్లికేషన్ పూర్తి చేయాలన్నా అందులో మేల్, ఫిమేల్ కాలమ్‌లో టిక్ చేయాలి. మరి ట్రాన్స్జెండర్లు ఏం చేయాలి? ఏదో ఒకటి టిక్ చేసేస్తే సరిపోతుందా? సరిపోదు. అందుకే తమకు ప్రత్యేక కాలమ్ కేటాయించాలని ట్రాన్స్జెండర్లు చాలా కాలంగా అనేక శాఖలతో పోరాడుతున్నారు. ఒక్కో పోరాటం చేస్తూ, ఒక్కో హక్కు సాధించుకుంటున్నారు. 1994లో ఓటుహక్కు కోసం పోరాడారు, 2013 నాటికి అది ఆచరణలోకి వచ్చింది. ఓటర్ ఐడీ కార్డులో థర్డ్ జెండర్ లేదా ఇతరులు అని కాలమ్ పెట్టారు.అందుకోసం ట్రాన్స్‌జెండర్లంతా కలిసి ఓ పెద్ద ప్రదర్శననే చేయవలసి వచ్చింది. ఆ క్రమంలోనే ఇప్పుడు మరో అడుగు ముందుకు వేశారు. పుదుచ్చేరిలో ఇన్‌కమ్‌ట్యాక్స్ అధికారిక పోర్టల్‌లో ఇన్‌కమ్‌ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడానికి ఇంతవరకూ లేని ట్రాన్స్‌జెండర్ కాలమ్‌ని ఎట్టకేలకు పొందుపరుచుకోగలిగారు. ఈ విజయం వెనుక ఉన్నది డాక్టర్ సమీర మహమూద్ జాగిర్దార్. వృత్తిరీత్యా ఆమె డాక్టరు. పుదుచ్చేరి మహాత్మాగాంధీ మెడికల్ కాలేజీ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో క్రిటికల్ కేర్ యూనిట్లో ఎమర్జన్సీ వార్డులో పనిచేస్తారు. ఇక్కడే చట్టబద్ధంగా తనను ‘అమ్మాయి’ నుంచి, ‘ట్రాన్స్‌జెండర్’గా మార్చుకున్నారు. అయితే పాన్‌ను ఆధార్‌కి జతపరిచేటప్పుడు పాన్‌లో ఆమె ‘మేల్’ అనీ, ఆధార్‌లో ‘ట్రాన్స్‌జెండర్’ అనీ ఉండటంతో సమీర జత చేయలేకపోయారు. అప్పుడే సమీర ఇంకో విషయం కూడా గ్రహించారు. ఇన్‌కమ్‌ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడానికి కూడా అందులో థర్డ్ జెండర్ ప్లేస్‌లో ట్రాన్స్‌జెండర్ కాలమ్ లేదని! ముందుగా ఇన్‌కమ్‌ట్యాక్స్ ఫామ్‌లో ట్రాన్స్‌జెండర్ కాలమ్ పెట్టించాలనుకున్నారు. ఇందుకోసం సమీర ఎన్నోసార్లు విజ్ఞప్తులు పెట్టుకున్నారు. లాభం లేకపోయింది. చివరి ప్రయత్నంగా, పుదుచ్చేరి ఇన్‌కమ్‌ట్యాక్స్ ప్రిన్సిపల్ కమిషనర్ జహనాబ్ అక్తర్‌ని నేరుగా కలిశారు. సమీర ఆలోచనను అర్థం చేసుకున్న జహనాబ్ అక్తర్ వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చి, సమీర అభ్యర్థనను మన్నించారు. ఐటీ రిటర్న్స్‌లో ‘ట్రాన్స్‌జెండర్’ కాలమ్ పెట్టించారు. అలాగే పాన్ ఆధార్ లింక్ విషయంలో ట్రాన్స్‌జెండర్ కాలమ్ పెట్టేవరకు వారు లింక్ చేసుకోనక్కర్లేదు అనే మినహాయింపు ఇచ్చారు. - డాక్టర్ సమీర జహంగీర్ మహమూద్ జాగిర్దార్ -
రోడ్డుపై ఉన్న హిజ్రా... నేను ఒక్కటే
సృష్టిలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. వాటిలో మనిషిది ప్రత్యేక స్థానం. మనుషుల్లో ఆడ, మగ అని...ఇవి రెండు మాత్రమే సహజ సిద్ధమైనవనీ... ఆడ, మగ కాకుండా మూడో రకాన్ని ఈ సమాజం చిన్న చూపు చూడటం జరుగుతోంది. సగం ఆడ, సగం మగ లక్షణాలతో ఉన్న వారి పట్ల లోకువే ఈ లోకానికి. మారుతున్న కాలంలో గే, లెస్బియన్స్, ట్రాన్స్‌జెండర్స్ అంటూ కొత్త లక్షణాలు వస్తున్నాయి. వీటన్నింటిని సమాజం అంగీకరించాలి. ఎందుకంటే వారు మనుషులే కదా. పాకిస్థాన్‌లో మొదటిసారిగా ఒక ట్రాన్స్‌జెండర్.. న్యూస్ యాంకర్ స్థాయికి ఎదిగింది. తను ఆస్థాయికి ఎదిగిన ప్రయాణాన్ని, ఎదురైన కష్టాలను ఎదురొడ్డిన తన అనుభవాల్ని పంచుకుంది. అయితే తను ఈ స్థాయికి రావడానికి ఎన్నో కష్టాలను పడాల్సి వచ్చిందనీ, తను చదువుకునే సమయంలో సెలూన్లో పనిచేస్తుండగా తనను గెంటేశారనీ, చేతి ఖర్చులకు కూడా తనవద్ద డబ్బులుండేవి కావనీ, అలాంటి సమయంలో రోడ్డుపై యాచిస్తూ ఉండే హిజ్రాలకు నాకు తేడా లేదనిపించిందంటూ తను పడిన వేదనను వివరించింది. మార్వియ మాలిక్ పాకిస్థాన్‌లో న్యూస్ యాంకర్ అయిన మొదటి ట్రాన్స్‌జెండర్. శనివారం మార్వియ చదివిన న్యూస్ బులిటెన్ వైరల్ అయ్యింది. దీంతో తనకు పాజిటివ్ కాల్స్, మెసేజ్‌లు వస్తున్నందుకు సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది. జరా చంగేజీ అనే ట్రాన్స్‌జెండర్ గొప్ప నటిగా గుర్తింపు పొందిన తరువాత, పాకిస్థాన్ సెనేట్ వీరిని కూడా మూడో జెండర్‌గా గుర్తించింది. డ్రైవింగ్ లైసెన్సులపై ఎక్స్(x) జెండర్‌గా ముద్రిస్తున్నారు. మొదటిసారిగా 2009లో పాక్ సుప్రీంకోర్టు మూడో జెండర్‌ను ఎక్స్(x) జెండర్‌గా గుర్తించడం జరిగింది. గతేడాది పాక్ ప్రభుత్వం మొదటిసారిగా ట్రాన్స్‌జెండర్ కేటగిరిలో పాస్‌పోర్ట్‌ను ఇచ్చింది. పైగా గతేడాది మొదటిసారిగా జనాభా లెక్కల్లో వీరిని కూడా చేర్చింది. దేశంలో 10,418 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నట్లు పేర్కొంది పాక్ ప్రభుత్వం. -
ట్రాన్స్‌జెండర్‌కు అవమానం!
సాక్షి, పుణె: తమను చిన్నచూపు చూస్తున్నారంటూ ట్రాన్స్జెండర్లు ఎన్నో సందర్భాల్లో బయటకొచ్చి పోరాటాలు చేశారు. కానీ అక్కడక్కడా ట్రాన్స్జెండర్లకు అవమనాలు ఎదురవడం చూస్తుంటాం. తాజాగా పుణేలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి.. 29 ఏళ్ల ఓ ట్రాన్స్‌జెండర్ సోనాలి దాల్వీ షాపింగ్ చేసేందుకు పుణెలో ఓ సెంటర్‌కు వెళ్లారు. ఆమెను షాపింగ్ మాల్‌లోకి అనుమతించకుండా అవమానించారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై బాధిత ట్రాన్స్‌జెండర్ సోనాలి ఏఎన్ఐతో మాట్లాడుతూ.. నేను ఇక్కడి ఫొనిక్స్ షాపింగ్ మాల్‌కు వెళ్లాను. మాల్ అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది నన్ను లోనికి అనుమతించలేదు. దాదాపు అరగంట సేపు వారిని ప్రాధేయపడ్డా కనికరించలేదు. కారణం అడిగితే.. ట్రాన్స్జెండర్లను మాల్‌లోకి అనుతించడం లేదని చెప్పారు. నాకు జరిగిన అవమానంపై ఆ షాపింగ్ మాల్ యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని సోనాలి తెలిపారు. తనలాగ మరో ట్రాన్స్‌జెండర్‌కు అవమానం జరగకూడదని భావించి ఫిర్యాదు చేయనున్నట్లు వివరించారు. -
మరో పాలసీ బ్యాన్ చేస్తూ ట్రంప్ సంతకం
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ దేశ సైన్యంలో ట్రాన్స్జెండర్లపై నిషేధం విధిస్తూ చేసిన తీర్మానంపై సంతకం చేశారు. అయితే, ఇతర సాయుధ బలగాల్లో వారిని ఉపయోగించుకునేందుకు కొంత విస్తృత భావనతో ఆలోచించాలని చెప్పారు. అమెరికా సైన్యంలో ఇప్పటి వరకు స్వలింగ సంపర్కులు సైతం తమ సేవలు అందించారు. అయితే, వారితో పలుమార్లు సమస్యలు వస్తున్నాయని, వారిలో చాలామంది ఆత్మన్యూనతవంటి భావనలతో జీవితాలపై ఆసక్తి లేకుండా బతికేస్తున్నారని, ఆ పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులు సైన్యంలో ఉపయోగించుకుంటే సమస్యలు వస్తాయని వారిని మున్ముందు కొనసాగించకూడదని నిర్ణయించారు. జెండర్ డిస్పోరియా అనే లక్షణం స్వలింగ సంపర్కుల్లో ఉంటుందని, వారికి వ్యక్తిగతంగా కొంత వైద్యం చేయించుకోవాల్సిన అవసరం ఉంటుందని, అలాగే, మందులు ఉపయోగించడం, అవసరం అయితే, శస్త్ర చికిత్సలు వెళ్లడం లాంటివి ఉంటాయని, వారితో మిలిటరీలో ప్రమాదం అని భావించి ఈనిర్ణయం తీసుకున్నట్లు వైట్ హౌస్ ప్రకటించింది. ఈ మేరకు వైట్ హౌస్ డిఫెన్స్ సెక్రటరీ జిమ్ మట్టిస్ ప్రకటన చేశారు. 'తాజాగా మా అధ్యక్షుడు సంతకం చేసిన కొత్త పాలసీ ద్వారా భౌతికంగా, మానసికంగా సమర్థులైనవారే సైన్యంలోకి రావాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం ద్వారా ప్రపంచంలోనే మేటి అయిన సైన్యాన్ని ఏర్పాటుచేయాలని నిర్ణయించుకున్నాం' అని ఆయన తెలిపారు. -
ట్రాన్స్జెండర్ల సంక్షేమానికి రూ.20 కోట్లు
సాక్షి, తిరుపతి : రాష్ట్రంలోని ట్రాన్స్జెండర్ల (హిజ్రాలు) సంక్షేమం కోసం ఈ బడ్జెట్టులో రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్లు కేటాయించింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో సుమారు 80 వేల మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. ఎక్కువ మంది యాచన ద్వారా జీవనం సాగిస్తున్నారు. సమాజంలో ఎదురయ్యే అవహేళనలను తట్టుకోలేక ఎక్కువ మంది ఇళ్లల్లోనే గడుపుతున్నారు. సొంతిళ్లు, రేషన్‌కార్డులు, హెల్త్ కార్డులు లేక అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో గతేడాది డిసెంబర్లో రాష్ట్రప్రభుత్వం 26 వేల మందిని గుర్తించి పెన్షన్ స్కీమ్ వర్తింపజేస్తున్నట్లు ప్రకటించింది. వారి సంక్షేమానికి సమగ్ర విధానాన్ని రూపొందిస్తున్నామని చెప్పిన ప్రభుత్వం.. వారికోసం ఏడాదికి రూ.50 కోట్లు ఖర్చు చేయాలని అప్పట్లో నిర్ణయించింది. అయితే బడ్జెట్లో కేవలం రూ.20 కోట్లు కేటాయించడంపై ట్రాన్స్జెండర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అరకొర నిధులతో ట్రాన్స్జెండర్ల సంక్షేమం, అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నిస్తున్నారు. కేరళ, ఒడిశా రాష్ట్రాల్లో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను రాష్ట్రంలోనూ అమలు చేయాలని ఏపీ ట్రాన్స్‌జెండర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. -
నా గుర్తింపు ఏదీ ..?
దేశంలోని ట్రాన్స్జెండర్లు గుర్తింపు సంక్షోభాన్ని ఎదుర్కుంటున్నారు. ఇప్పటికే వివిధ రూపాల్లో వివక్ష, వేధింపులకు గురవుతున్న వారికి పర్మినెంట్ అకౌంట్ నెంబర్ (పాన్) రూపంలో కొత్త సమస్య ఎదురైంది. ఆదాయపు పన్ను మదింపుతో సహా సంక్షేమ పథకాల లబ్దికి, బ్యాంకు రుణాలు, ఇతర ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వం ఆధార్–పాన్ అనుసంధానం తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. ఈ నెలాఖరుతో ఈ గడువు ముగుస్తుండడంతో ఈ అంశానికి ప్రాధాన్యత ఏర్పడింది. పురుషులు, మహిళల మాదిరిగానే ట్రాన్స్జెండర్ల పేరిట కూడా ఆధార్కార్టులు జారీచేస్తున్నారు. వచ్చిన చిక్కల్లా పాన్ కార్డుల్లో ఆ వెసులుబాలు లేకపోవడమే. ఆధార్‌కార్డుల్లో ట్రాన్స్జెండర్లుగా, పాన్‌కార్డుల్లో మాత్రం వారి గుర్తింపు పురుషుడు లేదా మహిళగా పేర్కొనడంతో ఆధార్–పాన్ లింకింగ్ కుదరడం లేదు. పుట్టిన సందర్భంగా మగ లేదా ఆడపిల్లగా పొందిన గుర్తింపు ఆధారంగా పాన్కార్డులిస్తుండడం, ట్రాన్స్జెండర్లను విడిగా గుర్తించకపోవడమే ఈ సమస్యకు కారణం. దీనితో వారు ఐటీ రిటర్న్స్ కూడా దాఖలు చేయలేకపోతున్నారు. దీని ప్రభావం ఇప్పుడు దాదాపు 5 లక్షల మంది (ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో కలిపి దాదాపు 70 వేలు) మేర ఉన్న మొత్తం ట్రాన్స్జెండర్ల సమాజంపై పడనుంది. ‘సుప్రీం’ తీర్పు ఏం చెబుతోంది ? ట్రాన్స్జెండర్లకు సామాజిక, రాజకీయ, ఆర్థిక సమానత్వం లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నల్సా) తీర్పు రూపంలో సుప్రీంకోర్టు నాలుగేళ్ల క్రితం ఆదేశాలిచ్చింది. సంక్షేమ పథకాల లబ్దితో మొదలుపెట్టి వీరికి అన్ని రకాల సహాయ,సహకారాలను అందించాలని సూచించింది. తమ గుర్తింపును తామే నిర్థారించుకునే ప్రాథమిక హక్కును వారికి కల్పిస్తున్నట్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ట్రాన్స్జెండర్ల సంక్షేమబోర్డులు ఏర్పాటు చేశాయి. ఈ నేపథ్యంలోనే పశ్చిమబెంగాల్లోని ఓ ప్రభుత్వ ఎయిడెడ్ కాలేజీ ట్రాన్స్‌జెండర్‌కు ప్రిన్సిపాల్‌గా అవకాశమిచ్చింది. కొచ్చి మెట్రో సంస్థ పలు విభాగాల్లో వీరి సర్వీసులు ఉపయోగించుకుంటోంది. ఎదురయ్యే సమస్యలివీ ! ఆధార్–పాన్ లింకింగ్ తప్పనిసరి అయిన నేపథ్యంలో ట్రాన్స్జండర్లకు ఎదురయ్యే సమస్యలు...ఆదాయ పన్ను రిటర్న్‌లు దాఖలు చేయలేకపోవడం, రూ. 50 వేలకు పైబడిన ఆస్తుల కొనుగోలు/విక్రయానికి పాన్ నెంబర్ తప్పనిసరి కావడంతో చిక్కులు. సొంతంగా ఏదైనా వ్యాపారాన్ని రిజిష్టర్ చేసుకోవాలంటే పాన్, ఆధార్‌కార్డుల ఆవశ్యకత. 2017 మనీలాండరింగ్ నియంత్రణ చట్టప్రకారం మ్యూచువల్ ఫండ్ ఖాతాలను అప్డేట్ చేయకపోవడం, బ్యాంక్ ఖాతాలు తెరిచేందుకు ఇబ్బందులు ఎదురవడం వంటి సమస్యలున్నాయి. నన్ను నాలాగే గుర్తించండి... ‘ట్రాన్స్‌జెండర్‌గా నన్ను నేను అంగీకరించాను. దీనినే ప్రతి గుర్తింపు కార్డు చాటిచెప్పాలని కోరుకుంటున్నాను. కారు యజమానిగా పత్రాల్లో గుర్తింపుతో పాటు, మెడికల్ ఇన్సురెన్స్, ఆస్తి పత్రాలు, పాన్‌కార్డు వరకు అన్నింట్లోనే ఇదే స్పష్టంగా పేర్కొనాలి’ అని రేష్మా ప్రసాద్ అంటున్నారు. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఈ సోనమ్ ఎవరో తెలుసా
బంజారాహిల్స్: నగరంలోని హిజ్రాలకు కౌన్సెలింగ్ ఇవ్వాలని శుక్రవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు పిలిచారు. ఓ పక్క సమావేశం జరుగుతోంది.. వివిధ ప్రాంతాలకు చెందిన హిజ్రాలు హాజరవుతున్నారు.. ఇంతలో ఓ యువతి వయ్యారంగా నడుచుకుంటూ స్టేషన్లోకి అడుగు పెట్టింది. ఏదన్నా సమస్యపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిందేమోనని పోలీసు సిబ్బంది.. స్టేషన్‌కు వచ్చిన మరికొందరు ఫిర్యాదుదారులు ఆమె వైపే చూస్తున్నారు. ఆమె తిన్నగా కౌన్సిలింగ్ హాల్లోకి వెళ్లేసరికి అంతా షాకయ్యారు. ‘నేనూ హిజ్రానే.. పేరు సోనమ్.. ఫ్రమ్ ముంబై’ అని చెప్పేసరికి అంతా అవాక్కయ్యారు. -
ట్రాన్స్‌జెండర్‌ను అనుమతించని శబరిమల అధికారులు
సాక్షి,శబరిమల : శబరిమల అయ్యప్ప దర్శనానికి వచ్చిన ఒక ట్రాన్స్‌జెండర్ (లింగ మార్పిడి చేసుకున్న వ్యక్తి)ని అధికారులు లోపలకు అనుమతించలేదు. తమిళనాడు నుంచి వచ్చిన ట్రాన్స్‌జెండర్.. గురువారం సాయంత్రం అయ్యప్ప దర్శనానికి సన్నిధానం చేరుకున్నారు. వెళ్లూరుకు చెందిన మోహన్ (30) ఇతర స్వాముల మాదిరగానే.. 41 రోజుల పాటు దీక్ష చేసినట్లు తెలుస్తోంది. సన్నిధానం దగ్గర లింగమార్పిడి చేయించుకున్న మోహన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో మోహన్.. లింగమార్పిడికి సంబంధించిన డాక్యుమెంట్లను పోలీసుల ముందుంచారు. అయితే మోహన్ సమర్పించిన డాక్యుమెంట్లు సరిగా లేవని పోలీసులు తెలిపారు. సన్నిధానం నుంచి ఇద్దరు పోలీసులు మోహన్‌ను పంబాకు తీసుకు వెళ్లారు. ఇదిలా ఉండగా.. శబరిమల ఆలయంలోని అయ్యప్పస్వామిని 10-50 ఏళ్ల మధ్యనున్న మహిళలు దర్శించేందుకు వీలు లేదు. అలాగే లింగమార్పిడి చేసుకున్న వారికి కూడా ఈ నియమం వర్తిస్తుంది. మతాచారాలను అందరూ పాటించాల్సిందేనని వాటిని ఎవరూ ధిక్కరించరాదని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు ఏ పద్మకుమార్ తెలిపారు. -
మాకూ సమాన హక్కు కల్పించండి
అనంతపురం అర్బన్: ‘సమాజంలో మేమూ ఒకరమే.. మమ్మల్ని దూరం పెట్టడం సమంజసం కాదు.. మాకూ సమాన హక్కు కల్పించాలని’ అని ట్రాన్స్జెండర్లు డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను కలెక్టర్‌కు విన్నవించి, వినతిపత్రం అందజేసేందుకు ‘మనవిజయం’ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్‌కు మంగళవారం వచ్చారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు రమణమ్మ, మయూరి, హాసిని మాట్లాడారు. ప్రస్తుతం ఏదైనా సర్టిఫికెట్, రేషన్ కార్డు, తదితర వాటికి దరఖాస్తు చేసుకుంటే దానిలో పురుష, మహిళ కాలమ్ మాత్రమే ఉంచుతున్నారన్నారు. ఇక నుంచి ‘ఇతరులు’ అనే ఆప్షన్ కూడా ఉంచాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలనూ తమకు వర్తింపజేయాలన్నారు. ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నారు. విద్యావంతులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. చదువులేని వారికి ఉపాధి చూపించాలన్నారు. చదువు, ఉద్యోగంలోనూ ఆప్షన్ ఉంచుతూ రిజర్వేషన్లు కల్పించాలన్నారు. -
ట్రాఫిక్ రూల్స్‌పై హిజ్రాల అవగాహన..
చెన్నై: ట్రాఫిక్ నియమాలను పాటించి తిరువళ్లూరును ప్రమాద రహిత జిల్లాగా మార్చడానికి సహకరించాలని హిజ్రాలు వాహనచోదకులకు సూచించారు. తిరువళ్లూరు ఎస్పీ శిబిచక్రవర్తి ఆదేశాల మేరకు హిజ్రాలు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఇందులో ఎస్పీ శిబిచక్రవర్తి, అదనపు ఎస్పీ స్టాలిన్ హజరుకాగా, దాదాపు 30 మంది హిజ్రాలు అవగాహన కల్పించారు. సెల్ఫోన్లో మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడపడం చేయకూడదని హిజ్రాలు సూచించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ హిజ్రాలు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో పలువురు పోలీసులు, హిజ్రాల సంఘం నేతలు పాల్గొన్నారు. -
మేమూ మనుషులమే...
హిమాయత్‌నగర్: ‘మేమూ మనుషులమే. మాకు అందరిలా స్వేచ్ఛగా సమాజంలో తిరిగే హక్కుంది. బస్, ఆటో, బస్టాండ్.. ఇలా ఎక్కడైనా మమ్మల్ని చులకనగా చూస్తున్నారు. జంతువుల్లా భావిస్తూ మమ్మల్ని చూస్తేనే అందరూ పరార్ అవుతున్నార’ హిజ్రాలు ఆవేదన వ్యక్తం చేశారు. తమ పట్ల ఈ విధంగా ప్రవర్తిస్తూ గుండెలు పగిలేలా చేయొద్దంటూ కన్నీరు పెట్టుకున్నారు. హైదరగూడలోని సెంట్రల్ పార్క్ హోటల్లో ‘ఇండియా హెచ్ఐవీ ఎయిడ్స్ అలియాన్స్’ సంస్థ ఆధ్వర్యంలో బుధవారం ‘హ్యాండ్సప్ ఫర్ హెచ్ఐవీ ప్రివెన్షన్’ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు నగరవ్యాప్తంగా ఉన్న హిజ్రాలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. తొలుత జరిగిన కార్యక్రమంలో వీరంతా మోడల్స్ తరహాలో క్యాట్‌వాక్ చేసి అందర్నీ ఆకట్టుకున్నారు. అనంతరం హిజ్రాల ప్రతినిధి, సోషలిస్టు చంద్రముఖి.. ఐహెచ్ఏ క్లినిక్ మేనేజర్ కె.బాలకృష్ణ, దర్శన్ ఫౌండేషన్ చైర్మన్ కుమార్‌లతో కలిసి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. హెచ్ఐవీ ఎయిడ్స్ బిల్లును రాజ్యసభలో ఆమోదించినప్పటికీ అమలు కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. హిజ్రాలను కూడా సాధారణ మనుషుల్లాగే గుర్తించి ప్రభుత్వం నుంచి వారికి అన్ని సంక్షేమ కార్యక్రమాలను అందించాలని జాతీయ లీగల్ సర్వీస్ అథారిటీ 2014లో ఆదేశాలు ఇచ్చినప్పటికీ.. అవి ఎక్కడా అమలు కావడం లేదన్నారు. జంతువుల్లా చూస్తున్నారు... అందరిలా మేము ఆటోల్లో వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. మేము ఆటో ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగానే ఏదో జంతువు వచ్చిందనే విధంగా మమ్మల్ని చూసి పారిపోతున్నారు. దీంతో మేం మానసికంగా ఎంతో కుంగిపోతున్నాం. – అంజలి మేమూ సాధించగలం.. అందరూ అబ్బాయిలు, అమ్మాయిల్లా మేమూ సమాజంలో పేరు ప్రఖ్యాతులు సాధించగలం. మేమూ గొప్ప గొప్ప చదువులు చదివాం... కానీ సమాజాన్ని చదవలేకపోతున్నాం. మమ్మల్ని మనుషులుగా గుర్తించండి. – మధుశ్రీ -
వాళ్లు కనిపిస్తే తల నరికేయండి!
హిజ్రాలపై వివాదాస్పద పోస్టర్లు కరాచీ: హిజ్రాలు కనిపిస్తే తల నరికేయాలంటూ పాకిస్థాన్ ఆర్థిక రాజధాని కరాచీలో వెలిసిన వివాదాస్పద పోస్టర్లు పెద్ద దుమారం రేపుతున్నాయి. కరాచీలో నిత్యం రద్దీగా ఉండే ప్రముఖ వాణిజ్య ప్రాంతంలో ఈ పోస్టర్లు పెద్దసంఖ్యలో అంటించి ఉండటంతో పోలీసులు రంగంలోకి దిగి అలర్ట్ ప్రకటించారు. పాకిస్థాన్‌లో ఇటీవలికాలంలో అసహనం, ఉగ్రవాదం పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఏకంగా షాపింగ్ మాల్స్ లోపల ఈ తరహా పోస్టర్లు వెలువడం హిజ్రాలను కలవరానికి గురిచేస్తున్నది. పొట్టపోసుకునేందుకు హిజ్రాలు నిత్యం ఈ ప్రాంతంలో తిరుగుతూ భిక్షాటన చేస్తుంటారు. ఈ నేపథ్యంలో హిజ్రాలపై ఎలాంటి దాడులు జరగకుండా అలర్ట్ ప్రకటించామని, ఎవరైనా తమ ప్రాణాలకు ముప్పు ఉంచి ఉందని భావిస్తే పోలీసుల రక్షణ కోరవచ్చునని స్థానిక పోలీసు అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు ఈ పోస్టర్లు వెలిసినప్పటి నుంచి ఈ ప్రాంతంలో హిజ్రాలు ఎవరూ కనిపించడం లేదని, వారి సంచారం తగ్గిందని స్థానిక షాపింగ్ మాల్ వద్ద పనిచేసే ఓ సెక్యూరిటీ గార్డు చెప్పారు. హిజ్రాలు తమ వ్యాపారాలకు అడ్డు తగులుతూ చికాకు కలిగిస్తున్నారనే ఉద్దేశంతో స్థానిక దుకాణాల యజమానులే ఈ పోస్టర్లు అంటించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు పోస్టర్లను సమర్థిస్తున్న వ్యాపారులు.. పురుషులే హిజ్రాల వేషం వేసుకొని మహిళలను తాకుతూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, వారి వద్ద అడుక్కుంటూ చికాకు కల్పిస్తున్నారని, ఇలాంటివి సాగనివ్వమని అంటున్నారు. -
‘ట్రాన్స్‌జెండర్స్’కు 3 శాతం రిజర్వేషన్ ఇవ్వండి
చెన్నయ్: ‘ట్రాన్స్ జెండర్స్’కు ప్రత్యేక తరగతికి చెందినవారిగా గుర్తించి వారికి విద్యా, ఉద్యోగ అవకాశాలను పెంపొందించేందుకు మూడు శాతం రిజర్వేషన్‌ను కల్పిస్తూ చర్యలు తీసుకోవాలని తమిళనాడు ప్రభుత్వ సాంఘిక సంక్షేమశాఖకు మద్రాసు హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. ఈ అంశంపై దాఖలైన ప్రజా ప్రయోజనాల వాజ్యాన్ని(పిల్) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ప్రభుత్వంలోని వివిధ ఉద్యోగాలకు గాను నిర్వహించిన పోటీ పరీక్షలకు పురుషుల విభాగంలో హాజరైన ట్రాన్స్‌జెండర్ మహిళలు దాఖలు చేసుకున్న పిటిషన్లను ధర్మాసనం విచారించింది. వారికి విద్యా, ఉద్యోగ రంగాల్లో ప్రత్యేకతరగతి వారిగా గుర్తించి మూడు శాతం రిజర్వేషన్ కల్పించాలని దీనిపై ఆరు నెలల్లోగా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇందుకు సంబంధించి వివిధ విభాగాలతో సంప్రదించి చర్యలు తీసుకోవాలంది. -
పాక్‌లో లింగమార్పిడి పెళ్లిళ్లకు అనుమతిస్తూ ఫత్వా
కరాచి: లింగమార్పిడి చేసుకున్న ఇద్దరు వ్యక్తులు ఆడ, మగైతే వారిద్దరు పెళ్లి చేసుకునేందుకు ఇస్లాం అనుమితిస్తోందంటూ పాకిస్థాన్‌లోని ఓ మత గురువుల బృందం ఇటీవల ఓ ఫత్వా జారీ చేసింది. వారికి వారసత్వ హక్కు కూడా వర్తిస్తుందని, మరణానంతరం వారిని ముస్లిం శ్మశానంలో ఖననం చేసేందుకు అనుమతి కూడా ఉంటుందని ఆ ఫత్వాలో పేర్కొన్నారు. అయితే పెళ్లి చేసుకోబోయే ఆడ, మగలు తమ శరీరాలపై తాము ఆడ, మగ అంటూ సూచించే గుర్తులు కలిగి ఉండాలని ఫత్వాలో షరతు విధించారు. లింగమార్పిడి చేసుకున్న ఆడ లేదా మగను సాధారణ స్త్రీ, పురుషులు కూడా పెళ్లి చేసుకోవచ్చని, అయితే శరీరాన్ని సూచించే లింగం గుర్తులు మాత్రం లింగమార్పిడి చేసుకున్న వారికి తప్పనిసరిగా ఉండాలని ఫత్వాలో పేర్కొన్నారు. సాధారణ పౌరులకు మాత్రం ఈ గుర్తులు అవసరం లేకపోవడమే కాకుండా, గుర్తులు ఉండడం కూడా ఇస్లాంకు వ్యతిరేకమేనని స్పష్టం చేశారు. అసలు ఈ గుర్తులు ఎందుకు అవసరమనే విషయాన్ని మాత్రం ఫత్వాలో ఎక్కడా వివరించలేదు. లాహోర్‌లోని ‘టాంజీమ్ ఇత్తెహాద్ ఇ-ఉమ్మత్ పాకిస్తాన్’ అనే సంస్థకు చెందిన యాభై మంది మత గురువులు జారీ చేసిన ఈ ఫత్వా ప్రతిని తాజాగా మీడియా సేకరించింది. ఈ మత గురువుల సంస్థ చిన్నదే అయినప్పటికీ, దానికి చట్టబద్ధత లేకపోయినప్పటికీ ఇలాంటి పెళ్లిళ్లను అనుమతిస్తూ ఫత్వా జారీ చేయడం ఓ ఇస్లామిక్ దేశంలో విశేషం. లింగమార్పిడి పౌరులకు సమాన హక్కులు కల్పిస్తూ 2012లోనే పాకిస్థాన్ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. వారికి వారసత్వ హక్కులను కూడా కల్పించింది. అయితే వారికి ఓటు హక్కు రావడానికి మాత్రం ఓ ఏడాది కాలం పట్టింది. ఇద్దరు మగవాళ్లు లేదా ఇద్దరు ఆడవాళ్ల మధ్య పెళ్లిళ్లను మాత్రం కోర్టులుగానీ, షరియా చట్టాలుగానీ పాకిస్థాన్‌లో ఇప్పటికీ అనుమతించడం లేదు. దేశంలో 19 కోట్ల మంది స్వలింగ సంపర్కులు ఉన్నారు. వారిని అక్కడి సమాజం ఇప్పటికీ గుర్తించకపోవడం వల్ల వారు అడుక్కోవడం లేదా వ్యభిచారం చేయడం ద్వారా బతుకుతున్నారు. -
లింగమార్పిడి వివాహాలకు ఓకే చెప్పిన ఫత్వా!
సాధారణంగా ఫత్వా అంటే అలా చేయొద్దు, ఇలా చేయొద్దు అనే ఆదేశాలే చూస్తుంటాం. కానీ, పాకిస్థాన్‌లో లింగమార్పిడి చేయించుకున్న వాళ్ల పెళ్లిళ్లను చట్టబద్ధం చేస్తూ 50 మంది మతపెద్దలు ఫత్వా జారీచేశారు. ‘తన్జీమ్ ఇత్తెహాద్ ఇ ఉమ్మత్’కు చెందిన మతగురువులు ఈ ఫత్వాను విడుదల చేశారు. లింగమార్పిడి చేయించుకున్న తర్వాత.. చూసేందుకు మగవాడిలా కనిపించే వాళ్లు ఒక మహిళను గానీ, లింగమార్పిడితో మహిళలా కనిపించే వాళ్లను గానీ పెళ్లి చేసుకోవచ్చని ఈ ఫత్వాలో తెలిపారు. అయితే, ఇద్దరి లక్షణాలు కనిపించేవాళ్లు మాత్రం ఎవరినీ పెళ్లి చేసుకోడానికి వీల్లేదట. అలాగే, లింగమార్పిడి చేయించుకున్న పిల్లలకు వారసత్వంగా వచ్చే ఆస్తిలో హక్కును నిరాకరించడం కూడా తగదని.. అలా చేస్తే దేవుడి ఆగ్రహానికి గురవుతారని ఫత్వాలో పేర్కొన్నారు. ఇలాంటి తల్లిదండ్రులపై చర్య తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. లింగమార్పిడి చేయించుకున్న వారిని అవమానించడం, టీజ్ చేయడం దారుణమైన నేరమని కూడా తెలిపింది. ఇతర ముస్లిం పురుషులు, మహిళలకు ఉన్నట్లుగానే లింగమార్పిడి చేయించుకున్న వాళ్లకు కూడా అంత్యక్రియలు చేయించాలన్న వాక్యంతో ఈ ఫత్వా ముగిసింది. -
సాంఘిక శాఖకు ట్రాన్స్జెండర్ల సంక్షేమం
న్యూఢిల్లీ: ట్రాన్స్జెండర్ల సంక్షేమాన్ని సాంఘిక న్యాయం, సాధికారత శాఖకు అప్పగిస్తూ కేంద్రం నిబంధనలు మార్చింది. వీరిపై సామాజిక వేధింపులను దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. దీంతో వీరి కోసం కొత్త జాతీయ పాలసీని మంత్రిత్వ శాఖ రూపొందించనుంది. ‘ట్రాన్స్జెండర్ల హక్కుల బిల్లు-2015’ ప్రకారం.. వీరిని ఇతరులు అని కాకుండా ట్రాన్స్జెండర్లు అనే పిలవాలి. -
'బాత్రూంలోకి వారిని కూడా అనుమతించండి'
వాషింగ్టన్: ఇక నుంచి లింగమార్పిడి(ట్రాన్స్ జెండర్స్) చేసుకున్నవారిపట్ల వివక్ష చూపడానికి వీల్లేదంటే అమెరికా ప్రభుత్వం స్పష్టం చేసింది. ముఖ్యంగా విద్యార్థుల విషయంలో ఇలాంటివి జరగొద్దని నొక్కి చెప్పింది. లింగమార్పిడి చేసుకున్నవారికి ఆయా పాఠశాలల్లో, కాలేజీల్లోని బాత్రూంలలోకి అనుమతించడం లేదని, ఈ సమస్య ఉత్తర కరోలినాలో అధికంగా ఉందని, దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న నేపథ్యంలో తాజాగా ఆదేశించింది. త్వరలోనే అన్ని రకాల విద్యాసంస్థలకు ప్రత్యేక మార్గదర్శకాలు పంపించనుంది. అయితే, ఏ చట్టం ప్రకారం ఇలాంటి మార్గదర్శకాలు జారీ చేస్తున్నారనే విషయం స్పష్టం చేయకుండా కేవలం విద్యాశాఖ అధికారుల సంతకాలతో ఈ లేఖలను ఆయా విద్యాసంస్థలకు పంపిచనున్నారు. లింగమార్పిడి చేసుకున్న విద్యార్థులకు బాత్రూంలలోకి అనుమతి లేకుండా నార్త్ కరోలినా ఒక చట్టాన్ని చేసింది. అయితే, ఈ చట్టం మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడేలా ఉందని, దీనిని మార్చాలంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ సందర్భంగా నార్త్ కరోలినాకు ఫెడరల్ గవర్న మెంట్ కు మధ్య తీవ్ర వైరుధ్యాలు కూడా వచ్చాయి. దీంతో అమెరికా విద్య, న్యాయశాఖలు ఈ అంశంలో జోక్యం చేసుకుని తాజాగా కొత్త మార్గదర్శకాలు జారీ చేసేందుకు సిద్ధమైంది. లింగమార్పిడి చేసుకున్నవారికి వారి వారి గుర్తింపు ప్రకారం బాత్ రూంలలోకి అనుమతించాలంటూ అందులో పేర్కొననుంది. -
వాళ్లను 'ఆమె కాదు.. అతడు కాదు' అనొద్దు
- 'థర్డ్ జెండర్' హక్కుల బిల్లుకు కీలకాంశాల చేర్పు ఢిల్లీ: భిక్షాటన చేయాలని ట్రాన్స్ జెండర్లపై ఒత్తిడి తేవడం ఇక నుంచి అట్రాసిటీ (వేధింపుల) కిందకు రానుంది. వారిని వివస్త్రులుగా చేయడం, కించపరిచేలా మాట్లాడటం, వారి ఆత్మగౌరవానికి భంగం కలిగేలా ప్రవర్తించడం వంటివి ఇకపై నేరాలుగానే పరిగణిస్తారు. అంతే కాదు 'ఆమె' కాదు, 'అతడు' కాదు.. అంటూ వాళ్లను అవహేళన చేయడం, ఇల్లు లేదా గ్రామం నుంచి వెళ్లగొట్టడం లాంటి చర్యలు మున్ముందు ఆక్షేపణీయం. ఏళ్లుగా సమాజంలో తమ ఉనికి కోసం పోరాడుతున్న ట్రాన్స్ జెండర్ల కృషి ఫలించి ప్రభుత్వం వారిని 'థర్డ్ జెండర్' గా గుర్తించిన విషయం తెలిసిందే. కాగా, 2015లో రూపొందించిన ట్రాన్స్ జెండర్ల హక్కుల బిల్లులో తాజాగా మరికొన్ని సూచనలు పొందుపర్చారు. త్వరలోనే ఇది చట్టబద్ధం కానుందని సామాజిక న్యాయం, సాధికారత శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. ట్రాన్స్ జెండర్ల హక్కులకు సంబంధించి కొన్ని అంశాలు: ట్రాన్స్ జెండర్లు పుట్టుకతోనే షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందనివారైతే.. వారి సామాజికవర్గాన్ని బట్టి బీసీలు లేదా ఓబీసీలుగా గుర్తించబడతారు. బిల్లు ప్రకారం ట్రాన్స్ జెండర్లు థర్డ్ జెండర్లుగా పరిగణించబడతారు. అయితే వారు ఆడ లేక మగ లేక ట్రాన్స్ జెండర్లలో ఏ వ్యక్తిగా గుర్తింపబడాలో నిర్ణయించుకునే హక్కు ప్రభుత్వం వారికి కల్పిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్రపాలిత ప్రభుత్వ స్థాయి అధారటీల నుండి వారు సరైన గుర్తింపు సర్టిఫికెట్‌ను పొందాల్సి ఉంటుంది. తమిళనాడు సంక్షేమ బోర్డుల ద్వారా ఈ గుర్తింపు సర్టిఫికెట్లు మంజూరు చేయబడతాయి. ఈ గుర్తింపు సర్టిఫికెట్ల ద్వారా వారు బర్త్ సర్టిఫికెట్, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, పాస్ పోర్టులు పొందవచ్చు. ఇక అందరు విద్యార్థులు పొందుతున్నట్లే ట్రాన్స్ జెండర్లు కూడా ఉపకార వేతనాలు, ఉచిత పాఠ్య పుస్తకాలు, ఉచిత హాస్టల్ వసతివంటివి పొందుతారు. -
ట్రాన్స్జెండర్లు నడిపే జీ టాక్సీలు!
పేరుకు మనుషులే అయినా సమాజంలో వారంటే ఓ రకమైన భావన. సమాజంలోనే ఉన్నా.. వారిపై చిన్నచూపు, వివక్ష. ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్న ట్రాన్స్జెండర్లు గౌరవంగా, స్వశక్తితో బతకడం కోసం కేరళ ప్రభుత్వం కొత్త పథకం ప్రారంభించనుంది. కేరళలో మహిళల సాధికారిత కోసం ప్రవేశపెట్టిన 'షీ టాక్సీ' పథకం విజయవంతం కావడంతో.. దీని బాటలోనే హిజ్రాల కోసం 'జెండర్ టాక్సీ' పథకానికి శ్రీకారం చుట్టింది. టాక్సీ సర్వీసులను ఆపరేట్ చేసేది, వాటి యజమానులూ హిజ్రాలే. వారిపై సామాజిక వివక్షను రూపుమాపాలన్న లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నారు. కేరళ సామాజికన్యాయ మంత్రిత్వ శాఖ పరిధిలోని జెండర్ పార్క్ ఈ పథకానికి రూపకల్పన చేసింది. షీ టాక్సీ పథకం మహిళా ప్రయాణికులకు ఉద్దేశించినది కాగా జెండర్ టాక్సీలో అందరూ ప్రయాణించవచ్చు. అన్ని అనుకూలిస్తే వచ్చే మార్చి నాటికి జీ టాక్సీ క్యాబ్‌లు కేరళ రోడ్లపై దర్శనమిస్తాయి. హిజ్రాల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి, మెరుగైన జీవితం అందించాలనే లక్ష్యంతో ట్రాన్స్‌జెండర్ పాలసీని ప్రారంభించామని, ఈ పథకం అమలులో భాగంగా తొలి అడుగుగా జీ టాక్సీ ప్రాజెక్టును ప్రవేశపెట్టనున్నట్టు కేరళ సామజికన్యాయ శాఖ మంత్రి ఎంకే మునీర్ చెప్పారు. జీ టాక్సీ ప్రాజెక్ట్ హిజ్రాలకు ఉపాధి కల్పించి, మెరుగైన జీవితం అందిస్తుందని జెండర్ పార్క్ సీఈవో డాక్టర్ పీటీఎమ్ సునీష్ చెప్పారు. 'జీ టాక్సీ వల్ల ట్రాన్స్జెండర్లకు ఆదాయం రావడమే గాక జనజీవన స్రవంతిలో కలసిపోవడానికి ఓ మంచి అవకాశం. జీ టాక్సీ సర్వీసుల్లో ప్రయాణించేవారు వారితో సంభాషించడం వల్ల, వారిపై తమ అభిప్రాయం మారుతుంది' అని సునీష్ అన్నారు. గతేడాది నవంబర్‌లో జరిగిన అంతర్జాతీయ జెండర్ కాన్ఫరెన్స్ సందర్భంగా ట్రాన్స్జెండర్లు తమ జీవనోపాధి కోసం షీ టాక్సీ తరహాలో ఓ పథకాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వాన్ని కోరినట్టు సునీష్ చెప్పారు. షీ టాక్సీ సర్వీసుల వలే జీ టాక్సీ సర్వీసుల్లో తగిన భద్రత చర్యలు చేపడతారు. -
మమ్మల్ని చిన్నచూపు చూడొద్దు
దోమలగూడ: సమాజం తమ పట్ల వివక్ష చూపకుండా అవగాహన కలిగించేందుకు క్వేర్ క్యాంపస్ హైదరాబాదు ఆధ్వర్యంలో లెస్బియన్, గే, ట్రాన్స్‌జెండర్స్ (ఎల్జీబీటీ) ఆదివారం సాయంత్రం ఇందిరాపార్కు వద్ద నృత్యప్రదర్శన ఇచ్చారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ లెస్బియన్లు, గే, ట్రాన్స్‌జెండర్స్ పట్ల సమాజం చిన్నచూపు చూస్తుందని, ఇది సరికాదని అన్నారు. మేము కూడా సమాజంలో భాగమేనని, అందరిలాగే మాకూ సమాన హక్కులున్నాయని అన్నారు. సత్య, అభిషేక్, నవదీప్, మణికిరణ్, ఆదిత్య, రవికిరణ్, సుధారాణి తదితరులు పాల్గోన్నారు. -
దుర్గా పూజలో ట్రాన్స్ జెండర్స్
కోల్‌కతా: దేశ వ్యాప్తంగా దసరా పండుగ నేపథ్యంలో జరుగుతున్న దుర్గా మాత ఉత్సవాల్లో స్వలింగ సంపర్కులు భాగమయ్యారు. తమపట్ల చూపుతున్న వివక్ష ఈ విధంగానైనా పోవాలని తాము కోరుకుంటున్నట్లు చెప్పారు. కోల్‌కతాలోని ట్రాన్స్ జెండర్స్ అంతా ఏకమై ప్రత్యేకంగా దుర్గామాత విగ్రహాన్ని కాకుండా అర్థనారీశ్వరుడి విగ్రహాన్ని ఏర్పాటుచేసి పూజలు ప్రారంభించారు. స్వలింగ సంపర్కుల ఉద్యమకారుడు అనింద్య హజ్రా ఈ విషయంపై మాట్లాడుతూ'మాకంటు ఒక గుర్తింపు, హక్కులు కావాలనే ఉద్దేశంతోనే ఉత్సవాన్ని జరుపుతున్నాం' అని తెలిపాడు. -
నగరంలో కదం తొక్కిన హిజ్రాలు
హైదరాబాద్: ఇందిరా పార్కు వద్ద హిజ్రాలు తమ హక్కుల కోసం ఆదివారం ధర్నా చేపట్టారు. ఉద్యోగం కావాలి.. ఉపాధి కావాలి.. రక్షణ కావాలి.. అంటూ తెలంగాణ హిజ్రా ట్రాన్స్‌జెండర్ సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. హిజ్రాలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలి, ట్రాన్స్జెండర్లపై జరుగుతున్న ఆకృత్యాలను అరికట్టాలని ప్లకార్డులు చేతబట్టుకుని నినాదాలు చేశారు. -
ట్రాన్స్‌జెండర్లకూ డ్రెస్‌కోడ్
ట్రాన్స్జెండర్లకు ప్రపంచంలో మొట్టమొదటి సారిగా థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్ యూనివర్సిటీ డ్రెస్ కోడ్‌ను ప్రకటించింది. ఫ్రెషర్స్‌లో ఆడవారికి, మగవారికి ప్రతిఏటా డ్రెస్ కోడ్‌ను ప్రకటించే ఆనవాయితీ గల ఈ యూనివర్సిటీ ఈసారి తొలిసారిగా ట్రాన్స్జెండర్ల (లింగ మార్పిడి చేసుకున్నవారు)కు కూడా డ్రెస్ కోడ్ ప్రకటించడం విశేషం. విద్యార్థినులకు బటన్లు కలిగిన షార్ట్ స్లీవ్, డార్క్ కలర్ కలిగిన లాంగ్ స్కర్ట్‌ను, విద్యార్థులకు వైట్ షర్ట్, నెక్ టై, బ్లాక్ ట్రౌజర్లను డ్రెస్ కోడ్‌గా నిర్ణయించింది. వీటిలో ఏ డ్రెస్‌నైనా ధరించే అవకాశాన్ని ట్రాన్స్జెండర్లకు కల్పించింది. 'ఫ్రెష్యీ ఛాయిస్' పేరిట యూనివర్సిటీ ఫేస్బుక్ పేజీలో డ్రెస్ కోడ్‌ను పోస్ట్ చేయగా, ప్రపంచం నలుమూలల నుంచి లైక్స్, కామెంట్స్ కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్నాయి. ముందుగా 'స్కూల్ ఆఫ్ ఫైన్ అండ్ అప్లైడ్ ఆర్ట్స్' కళాశాలలో ట్రాన్స్జెండర్లకు డ్రెస్ కోడ్‌ను అమలు చేస్తున్నామని, వచ్చే స్పందనను బట్టి మిగతా కళాశాలల్లో కూడా ఈ కోడ్‌ను అమలు చేస్తామని యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. మూడో జెండర్‌ను కూడా గుర్తిస్తూ గత జనవరిలో థాయ్ ప్రభుత్వం రాజ్యాంగ సవరణ తీసుకొచ్చిన నేపథ్యంలో యూనివర్సిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. -
తమిళనాడులో హిజ్రాల ఫెస్టివల్
-
ఇక ట్రాన్స్‌జెండర్లకూ సమానహక్కులు!
రాజ్యసభ చరిత్రలోనే ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనట్లుగా.. ఓ సభ్యుడి ప్రైవేటు బిల్లును సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ట్రాన్స్జెండర్లకు (లింగమార్పిడి చేయించుకున్నవారు) ఇతర పౌరులతో సమానహక్కుల కల్పించాలనే ఈ బిల్లును సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇలా ఏకగ్రీవంగా ఆమోదం పొందడం అత్యంత అరుదైన విషయమని డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ వ్యాఖ్యానించారు. ట్రాన్స్‌జెండర్ వర్గీయుల కోసం కేంద్ర, రాష్ట్రాల స్థాయుల్లో ప్రత్యేక కమిషన్లను ఏర్పాటుచేయాలని కూడా ఈ బిల్లులో పేర్కొన్నారు. చిట్టచివరి సారిగా ఓ ప్రైవేటు బిల్లు 1970లో ఆమోదం పొందింది. ప్రభుత్వంలో భాగం కాని అంటే.. మంత్రి కాని సభ్యుడు ప్రవేశపెట్టే బిల్లును ప్రైవేటు బిల్లు అంటారు. ఇప్పుడు ట్రాన్స్జెండర్ల హక్కుల బిల్లును డీఎంకే సభ్యుడు తిరుచ్చి శివ ప్రవేశపెట్టారు. అందరికీ మానవహక్కులు ఉన్నాయని, అలాంటప్పుడు కొంతమందిని ఎందుకు నిర్లక్ష్యం చేయాలని ఆయన ప్రశ్నించారు. ఈ బిల్లును రాజ్యసభ మూజువాణీ ఓటుతో ఆమోదించింది. -
తృతీయ ప్రకృతి!
సృష్టి గీసిన గీత ఒకటుంది. అందరూ ఆ గీతకు అటో, ఇటో ఉంటారన్నది...ఉండాలన్నది అధిక సంఖ్యాకుల్లో పాతుకుపోయిన భావన. అయితే ఆడ లేకపోతే మగ అన్నది ఈ భావన సారాంశం. అటూ ఇటూ కానివారున్నారని... దేహం ఒకలా, మనసు వేరేలా ఉండి ఆ తరహా పౌరులు సతమతమవుతున్నారని గుర్తించరు. అసలు వారిని మనుషులుగానే పరిగణించరు. అలాంటివారిని విపరీత మనస్తత్వం ఉన్నవారిగా, వికృత పోకడలకు పోతున్నవారిగా అవమానిస్తారు. శారీరకంగా, మానసికంగా హింసిస్తారు. సర్వోన్నత న్యాయస్థానం మొట్టమొదటిసారి ఇలా వివక్షకు గురవుతున్నవారి మనోవేదనను గుర్తించింది. లింగ వర్గీకరణలో ఇంతవరకూ పరిగణిస్తున్న స్త్రీ, పురుష కేటగిరీలను మాత్రమే కాక ఇకపై హిజ్రాలను మూడో కేటగిరీకింద గుర్తించాలని తీర్పునిచ్చింది. అంతేకాదు...అలాంటి పౌరులను సామాజికంగా, విద్యాపరంగా వెనకబడిన వర్గాలుగా గుర్తించి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. సమాజంలో వారెదుర్కొంటున్న అన్ని రకాల వివక్షనూ తొలగించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. ప్రభుత్వానికి సంబంధించిన అన్ని పత్రాల్లోనూ ఇంతవరకూ ఇలాంటివారంతా తమ అభీష్టానికి భిన్నంగా స్త్రీ అనో, పురుషుడనో మాత్రమే గుర్తింపుపొందుతున్నారు. అందువల్ల వారి వాస్తవ జనాభా ఎంతో, వారి అవసరాలేమిటో, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులేమిటో ప్రభుత్వాలకు తెలియకుండా పోయింది. వాస్తవానికి సమాజంలోని భిన్నవర్గాల సమస్యలను గుర్తించి, వారి అభ్యున్నతికి, సంక్షేమానికి అవసరమైన చర్యలు తీసుకోవడం పాలకుల ధర్మం. వారి బాధ్యత. తాము గుర్తించడం మాట అటుంచి, హిజ్రాలనుంచి వచ్చిన వినతులను కూడా ప్రభుత్వాలు పట్టించుకోలేదు. అందువల్లే సర్వోన్నత న్యాయస్థానం జోక్యం అవసరమైంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అనేకవిధాల విశిష్టమైనది. మన రాజ్యాంగం ఎవరినీ వారి పుట్టుక ఆధారంగా వివక్షకు గురిచేయకూడదని చెబుతున్నది. కానీ, జన్యుపరమైన లోపాలతో జన్మించే ఈ మాదిరి పౌరులు అడుగడుగునా వివక్ష ఎదుర్కొంటున్నారు. ఆ వర్గాలవారికి రాజ్యాంగపరమైన, చట్టపరమైన హక్కులేమీ ఉండటంలేదు. అందువల్లే వారు బహిరంగ ప్రదేశాల్లో, ఇళ్లలో, జైళ్లలో...ఆఖరికి రక్షక భటుల చేతుల్లో లైంగిక దాడులకు గురవుతున్నారని సుప్రీంకోర్టు సరిగానే గుర్తించింది. అల్పసంఖ్యాకులే అయినా వారూ మనుషులేనని, అందరికీ ఉండే మానవహక్కులు వారికీ వర్తిస్తాయని స్పష్టంచేసింది. జన్యుపరమైన లోపాల కారణంగా శారీరక సౌష్టవాన్నిబట్టి పురుషులుగానే కనబడ్డా వారు మానసికంగా వారు ఆ కేటగిరీలో చేరరని...అలాగే స్త్రీల మాదిరిగా కనబడ్డా వారికి ఆ శరీర ధర్మాలేవీ ఉండవని చెబుతూనే అలాగని దీన్ని కేవలం వైద్యపరమైన సమస్యగా మాత్రమే పరిగణించడానికి వీల్లేదని ధర్మాసనం స్పష్టంచేసింది. వీరిలో కొందరు శస్త్ర చికిత్స అనంతరం పురుషులుగానో, స్త్రీలగానో మారినప్పుడు వారు కోరిన గుర్తింపు ఇవ్వాల్సిందేనని తెలిపింది. మన దేశంలో పరిమిత ప్రయోజనాలకోసం హిజ్రాలను గుర్తించే పని చాన్నాళ్లక్రితమే మొదలైంది. 2005లో పాస్‌పోర్టు దరఖాస్తుల్లో అలాంటివారిని ‘ఈ’ కేటగిరీగా పరిగణిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఎన్నికల సంఘం గతానికి భిన్నంగా ఈసారి ఇలాంటివారిని ‘ఇతరులు’ అనే కేటగిరీలో పెట్టింది. జనాభా లెక్కల్లోనూ విడిగా సూచించారు. ఈ చర్యల తర్వాతనైనా కేంద్ర ప్రభుత్వం తనపరంగా చేయాల్సిన విధానపరమైన చర్యలను ప్రారంభించాల్సింది. కానీ, తొమ్మిదేళ్లయినా ఎలాంటి చలనమూ లేకపోయింది. తమిళనాడువంటి రాష్ట్రాలు హిజ్రాలకు సంబంధించి సంక్షేమ బోర్డును ఏర్పాటుచేయడం, ప్రత్యేక మరుగుదొడ్ల నిర్మాణం, రేషన్ కార్డుల మంజూరులాంటి చర్యలు తీసుకున్నాయి. కానీ, ఇవి మాత్రమే సరిపోవు. మొత్తంగా ఆ వర్గానికి సంబంధించిన పౌరుల కోసం సమగ్రమైన విధానం, కార్యాచరణ అవసరం. ముఖ్యంగా వైద్యపరమైన సౌకర్యాలు, ఇళ్ల మంజూరు... విద్యారంగంలోనూ, ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్లువంటివన్నీ ఉంటేనే అలాంటివారు తమ కాళ్లపై తాము నిలబడగలుగుతారు. ఆత్మగౌరవంతో బతుకుతారు. సామాజిక పురోగమనంలో తమ వంతు బాధ్యతను నిర్వర్తించగలుగుతారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వారు బిచ్చమెత్తుకునేవారిగా, వ్యభిచారులుగా బతుకులు వెళ్లదీయాల్సివస్తోంది. హిజ్రాల్లో అత్యధికులకు హెచ్ఐవీ, ఎయిడ్స్‌వంటి సాంక్రమిక వ్యాధుల బారిన పడటం ఈ దుస్థితివల్లే. మన పొరుగునున్న, మనతో పోలిస్తే అన్నివిధాలా చిన్న దేశాలైన నేపాల్, పాకిస్థాన్వంటివి హిజ్రాల సమస్యలపై ప్రత్యేక దృష్టిపెట్టి, వారికోసం చాలా ఏళ్లక్రితమే చట్టాలు చేశాయి. సమానత్వ సాధనలోనూ, మానవహక్కులపరంగానూ సుప్రీంకోర్టు తీర్పు కీలకమైనదే. అయితే, ఈ విషయంలో ఇంకా జరగాల్సింది ఎంతో ఉంది. ప్రస్తుత తీర్పు భిన్నమైన లైంగిక భావనలుండేవారందరికీ రక్షణనివ్వదు. ఇది కేవలం హిజ్రాలకు మాత్రమే పరిమితమని...స్వలింగ సంపర్కులకు, ద్విలింగ సంపర్కులకు వర్తించదని ధర్మాసనం తెలి పింది. నిరుడు డిసెంబర్లో స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణిస్తున్న శిక్షాస్మృతిలోని సెక్షన్ 377ను కొట్టేసేందుకు సుప్రీంకోర్టులోని మరో బెంచ్ నిరాకరించింది. ఈ విషయమై నిర్ణయం తీసుకోవాల్సింది శాసనవ్యవస్థేనని తేల్చిచెప్పింది. ఈ తీర్పులు రెండింటినీ గమనిస్తే ఈ విషయంలో విస్తృత అవగాహన, విశాల దృక్పథం మరింత అవసరమని అర్ధమవుతుంది. అందుకు సంబంధించిన బీజాలు ప్రస్తుత తీర్పులో ఉండటం హర్షించదగ్గ విషయం. -
''స్వలింగ సంపర్కులకు సర్వహక్కులు''
-
స్వలింగ సంపర్కులకు సర్వహక్కులుః సుప్రీం కోర్టు సంచలన తీర్పు
స్వలింగ సంపర్కులు, నపుంసకులు, తృతీయ ప్రకృతికి చెందిన వారిని మిగతా పౌరుల్లాగానే చూడాలని, మిగతావారికి ఉన్న సామాజిక ఆమోదం, సమానావకాశాల వంటి అన్ని హక్కులు వారికి కూడా ఉండాలని సుప్రీం కోర్టు బుధవారం సంచలనాత్మక తీర్పునిచ్చింది. వీరిని తృతీయ ప్రకృతిగా పరిగణించాలని సర్వోచ్చ న్యాయస్థానం పేర్కొంది. న్యాయమూర్తులు కె ఎస్ రాధాకృష్ణన్, ఎకె సిక్రీలతో కూడిన ధర్మాసనం ఈ చరిత్రాత్మక తీర్పునిచ్చింది. తృతీయప్రకృతి పట్ల వివక్షను అంతమొందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కూడా సుప్రీం కోర్టు పేర్కొంది. తృతీయ ప్రకృతిని సామాజికంగా వెనుకబడిన వారిగా గుర్తించాలని కూడ న్యాయస్థానం ఆదేశించింది. డ్రైవింగ్ లైసెన్సులు, రేషన్ కార్డులు, ఎన్నికల గుర్తింపు కార్డు, పాస్ పోర్టుల దరఖాస్తు ఫారాల్లో స్త్రీ, పురుష తో పాటు తృతీయ ప్రకృతి అనే క్యాటగరీని జోడించాలని, వారికి విద్యా సంస్థల్లో, ఆసుపత్రుల్లో ప్రవేశాన్ని కల్పించాలని, వారికి టాయిలెట్ల ఏర్పాటు చేయించాలని కూడా న్యాయస్థానం ఆదేశించింది. లక్ష్మీ త్రిపాఠీ అనే తృతీయ ప్రకృతికి చెందిన వ్యక్తి వేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టు ఈ సంచలనాత్మక తీర్పును వెలువరించింది. లక్ష్మీ త్రిపాఠీ ఈ తీర్పును చరిత్ర గతిని మార్చేసే తీర్పుగా అభివర్ణించింది. -
రాష్ట్రంలో 4,433 మంది 'ఇతర' ఓటర్లు!
ఓటర్లుగా నమోదు చేయించుకునేటప్పుడు మీరు పురుషులా.. స్త్రీలా అని అడుగుతారు. రెండూ కానివారు తమకూ ఓటుహక్కు కావాలని ఎన్నాళ్లనుంచో చేసిన పోరాటం ఫలించింది. ఈసారి 'ఇతరులు' అనే విభాగం కింద ఇలాంటి వారిని కూడా ఓటర్లుగా నమోదు చేశారు. ఇలా రాష్ట్రంలో మొత్తం 4,433 మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. వారి పేర్లు తుది జాబితాలో కనిపించాయి. ప్రధాన ఎన్నికల అధికారి ప్రచురించిన జాబితాలో ఈ పేర్లున్నాయి. గత సంవత్సరం మార్చి కంటే ఈ సంఖ్య 2,987 ఎక్కువ కావడం గమనార్హం. అంటే, దాదాపు మూడు వేల మంది తాము పురుషులం గానీ, మహిళలం గానీ కాదని చెప్పుకొని తాజాగా ఓటర్లుగా నమోదు చేయించుకున్నారన్నమాట. లింగమార్పిడి చేయించుకున్నవాళ్లు తమను ఇతరుల విభాగంలో చేర్చాలని పట్టుబడుతున్నారు. అయితే.. మొత్తమ్మీద ఎల్జీబీటీ కమ్యూనిటీ లెక్కలు చూస్తే వారిలో ఓటర్లుగా నమోదు చేయించుకున్నవాళ్ల సంఖ్య చాలా తక్కువగా ఉంటోంది. ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ సొసైటీ (ఏపీ శాక్స్) లెక్కల ప్రకారం చూస్తే ఒక్క హైదరాబాద్ నగరంలోనే 20 వేల మంది లింగమార్పిడి చేయించుకున్నవాళ్లున్నారు. అదే రాష్ట్రం మొత్తమ్మీద అయితే 2.4 లక్షల మంది వరకు ఉన్నారు. జనాభాతో పోలిస్తే ఈ ఓటర్ల సంఖ్య కాస్త తక్కువే అయినా, గతంతో పోలిస్తే నమోదు గణనీయంగా పెరిగిందని నిపుణులు అంటున్నారు. ఈ వర్గంలో కూడా అవగాహన పెరగడం, తామూ ఓటు వేయాలన్న చైతన్యం రావడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. మగ, ఆడ కాకుండా ఇతరులు అనే విభాగాన్ని 2010లో ఎన్నికల కమిషన్ ప్రవేశపెట్టింది. అప్పటినుంచి క్రమంగా మన రాష్ట్రంలో కూడా ఈ వర్గానికి చెందిన వారు ఓటర్లుగా నమోదు చేయించుకోవడం పెరుగుతూ వచ్చింది. ఎన్నికల కమిషన్ విడుదల చేసిన తుది జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం 6,23,88,619 మంది ఓటర్లున్నారు. వారిలో 3,13,56,704 మంది పురుషులు, 3,10,27,482 మంది మహిళలు, 4,433 మంది ఇతరులు ఉన్నారు. వీళ్లంతా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లు వేయడానికి అర్హులు. ఇన్నాళ్లుగా లింగమార్పిడి చేయించుకున్నవాళ్లు బయటకు చెప్పుకొనేవారు కారని, కానీ ఇప్పుడు ఎల్జీబీటీ వర్గం మొత్తం తమకు ఓ గుర్తింపు కావాలని కోరుకుంటున్నట్లు వివిధ రకాల లైంగిక జీవన శైలులపై పరిశోధన చేస్తున్న చల్లా సుధారాణి తెలిపారు. అందులో భాగంగానే ఇప్పుడు ఎన్నికల ఓటర్ ఐడీ కార్డుల్లోనూ తమ పేర్లు నమోదు చేయించుకుంటున్నారు.