ట్రాన్స్‌జెండర్స్ సేవలు వినియోగించాలన్న ముఖ్యమంత్రి
ట్రాఫిక్ విభాగంలో వలంటీర్లుగా తీసుకోవాలని సూచన
గత నెల 13న ప్రకటన, ఇప్పటికీ పట్టించుకోని అధికారులు
ఇప్పటికే తమిళనాడు, కర్ణాటకల్లో ఈ ప్రయోగాలు అమలు
సాక్షి, సిటీబ్యూరో: సాధారణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి వాళ్లు ఎలాంటి ఆదేశాల జారీ చేసినా.. క్షణాల్లో అమలులోకి వస్తాయి. సుదీర్ఘమైన కసరత్తు అవసరమైతే ఆ చర్యలు మొదలువతాయి. అవసరమైతే కమిటీలు, కమీషన్లు ఏర్పాటవుతాయి. అధికారులంతా ఆఘమేఘాల మీద ఉరుకులుపరుగులు పెడతారు. అయితే సీఎం ఎ.రేవంత్‌రెడ్డి ‘ట్రాఫిక్–ట్రాన్స్‌జెండర్ల సేవలు’ విషయంలో గత నెల 13న కీలక ప్రకటన చేశారు. దీనికి సంబంధించి అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
ఉన్నతమైన ఆలోచన చేసిన ముఖ్యమంత్రి..
ట్రాన్స్‌జెండర్స్ వల్ల సామాన్యులకు ఎదురవుతున్న సమస్యల తొలగింపుతో పాటు వారికి గౌరవప్రదమైన జీవితం అందించడం కోసం ట్రాఫిక్ వాలంటీర్లుగా నియమించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ నియంత్రణ బాధ్యతల్లో వారికీ భాగస్వామ్యం కల్పించాలని యోచించారు. ట్రాఫిక్ ఇక్కట్లు తప్పించడం కోసం పోలీసులు, హోంగార్డ్స్ తరహాలోనే ట్రా¯Œన్స్‌జెండర్లనూ వినియోగించాలని అధికారులకు ఆదేశించారు. ట్రాన్స్‌జెండర్లకు ఉద్యోగావకాశాలు తగ్గాయని, ఇలా చేస్తూ ప్రతి నెలా నిరీ్ణత మొత్తం అందిస్తే వారికి కొంత ఉపాధి కల్పింనట్లవుతుందని భావించారు.
ప్రత్యేక శిక్షణ, యూనిఫామ్ ఉండాలంటూ...
ఈ ప్రతిపాదనల్ని అమలులో పెట్టడానికి తక్షణం చర్యలు తీసుకోవాలంటూ గత నెల 13న అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో రోడ్లు, ఫుట్‌పాత్‌లతో పాటు ఇతర అభివృద్ధి పనులు, పారిశుద్ధ్యం తదితర అంశాలపై సచివాలయంలో నిర్వహించిన సమీక్ష సందర్భంగా సీఎం ఈ విషయం స్పష్టం చేశారు. ట్రాఫిక్ వాలంటీర్ల నియామకం కోసం ఆసక్తి ఉన్న ట్రాన్స్‌జెండర్ల వివరాలు సేకరించాలని, వారం నుంచి పది రోజుల పాటు అవసరమైన శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఈ వాలంటీర్లకు ప్రత్యేక యూనిఫామ్ కూడా అందించాలన్న ముఖ్యమంత్రి కొన్ని నమూనాలను పరిశీలించారు. సిబ్బంది కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ట్రాఫిక్ విభాగానికి ఈ ప్రయోగం సక్సెస్ అయితే పెద్ద ఉపశమనమే లభిస్తుంది.
ఇప్పటికే ఆ రెండు నగరాల్లో అమలు...
ట్రాఫిక్ విధుల్లో ట్రాన్స్‌జెండర్ల సేవలు వినియోగం అనేది దేశంలో సరికొత్త విధానమేమీ కాదు. తమిళనాడు రాజధాని చెన్నై ట్రాఫిక్ పోలీసులు 2013లోనే ఈ తరహా ప్రయోగం చేశారు. వన్ ఇండియా రోడ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ సహాయంతో పది మంది ట్రాన్స్‌జెండర్లకు శిక్షణ ఇచ్చి ట్రాఫిక్ వాలంటీర్లుగా మార్చారు. వారికి నెలకు రూ.9 వేల పారితోషకం అందించారు. 2018లో కర్ణాటకలోని టుమ్కూరు పోలీసులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రద్దీ వేళల్లో ట్రాఫిక్ నియంత్రణతో పాటు రహదారి నిబంధనలు, రోడ్డు భద్రతా అంశాలపై అవగాహన కల్పించడానికి ట్రాన్స్‌జెండర్లతో ఓ బృందాన్ని వేర్పాటు చేశారు. వాలంటీర్ల మాదిరిగా వీరికీ పారితోíÙకం అందిస్తూ రహదారులపై సేవలు వినియోగించుకున్నారు. కొచి్చన్ మెట్రో రైల్‌తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ ట్రాన్స్‌జెండర్లను వాలంటీర్లుగా వినియోగించిన సందర్భాలు ఉన్నాయి.
ఒక్క అడుగూ వేయని అధికారులు...
ట్రాన్స్‌జెండర్ల సేవలు వినియోగం విషయంలో ముఖ్యమంత్రి ఆదేశాలను అమలులో పెట్టే దిశలో అధికారులు కనీసం ఒక్క అడుగు కూడా వేయలేదు. దేశంలో ప్రస్తుతం ఎక్కడెక్కడ అమలులో ఉంది? ఫలితాలు ఏంటి? ఎలాంటి సవాళ్లు ఎదురవుతున్నాయి? తదితరాలు అధ్యయనం పైనా దృష్టి పెట్టలేదు. వీరి ఎంపికకు సంబంధించి ట్రాఫిక్ విభాగాలు, ట్రాన్స్‌జెండర్ల సంఘాలతోనూ సంప్రదింపులు జరపలేదు. ముఖ్యమంత్రి జారీ చేసిన ఆదేశాలకు సంబంధించిన ఆచరణ విధివిధానాలను ఏ అధికారీ సమీక్షించలేదు. కనీసం ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) సైతం ఈ కోణంలో చర్యలు తీసుకోకపోవడంతో క్షేత్రస్థాయి అధికారులు అసలు పట్టించుకోవట్లేదు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఉన్న ఆమ్రపాలి ఆంధ్రాకు వెళ్లిపోవడం, ప్రస్తుతం బల్దియాకు ఇన్‌చార్జ్
కమిషనర్ ఉండటంతో ‘ట్రాఫిక్ వాలంటీర్ల’ ప్రతిపాదన పట్టాలెక్కే పరిస్థితి కనిపించట్లేదు.
Comments
Please login to add a commentAdd a comment