
సాక్షి, హైదరాబాద్: బెట్టింగ్ యాప్‌లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌పై సిట్ ఏర్పాటుకు ఆదేశించింది. ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సిట్ విచారణకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఆన్‌లైన్ బెట్టింగ్ పట్ల కఠినంగా ఉండాలని నిర్ణయించామని సీఎం తెలిపారు.
‘‘ఆన్‌లైన్ బెట్టింగ్ నిషేధిస్తూ గత ప్రభుత్వం చట్టం చేసింది.. కానీ అమలు జరగడం లేదు. దర్యాప్తు కోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను వేస్తున్నాం. ప్రకటనలు చేసినా.. నిర్వహణలో భాగస్వామ్యం ఉన్నా కఠిన చర్యలు ఉంటాయి. నేరాలు చెప్పి జరగవు. నేరాల పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటుంది. గతంలో న్యాయవాదులు, వెటర్నరీ డాక్టర్ హత్యలు జరిగాయి’’ అని రేవంత్ అన్నారు.
ఎంఎంటీఎస్ రైలులో అత్యాచారయత్నం ఘటనపై సీఎం రేవంత్ స్పందిస్తూ.. శాంతిభద్రతలపై ప్రతిపక్షం దుష్ప్రచారం చేస్తోందన్నారు. ‘‘పెట్టుబడులు రాకుండా అడ్డుకోవాలని కుట్ర చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో దిశ ఘటన జరిగింది. వామనరావు దంపతులను నడిరోడ్డుపై చంపేశారు. జూబ్లీహిల్స్ అత్యాచారం కేసులో బీఆర్‌ఎస్ నేత కుమారుడిపై చర్యలు తీసుకోలేదు. తెలంగాణ అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్నారు. కుట్రలు మాని, విజ్ఞతతో మెలగాలి’’ అని రేవంత్‌రెడ్డి హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment