ravanth reddy
-
ఇక్కడి వాళ్లతో దావోస్‌లో ఒప్పందాలేంటి?: కిషన్‌రెడ్డి
సాక్షి,హైదరాబాద్:సీఎం రేవంత్ దావోస్ పర్యటనపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ విషయమై కిషన్‌రెడ్డి శుక్రవారం(జనవరి24) మీడియాతో మాట్లాడారు.‘రాష్ట్రానికి లాభం చేకూరుతంది అంటే ఎలాంటి విమర్శలు అవసరం లేదు. తెలంగాణ కంపెనీలనే దావోస్ తీసుకెళ్లి అక్కడ అగ్రిమెంట్ చేసుకోడం ఎంటి..?. నాకు ఏం అర్ధం కాలేదు. విదేశాలు,ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి పెట్టుబడి రావాలి. కాగితాలకే ఒప్పందాలు పరిమితం కావొద్దు. రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు వేరే రాష్ట్రానికి వెళ్లిపోతున్నారు.పారిశ్రామికవేత్తలను రాష్ట్ర ప్రభుత్వం వేధిస్తోంది. ముందు ఇళ్లు చక్కబెట్టుకోవాలి. కొంతమంది రియల్ ఎస్టేట్ రంగంలో నుంచి బయటికి వద్దామనుకుంటున్నారు.వ్యాపారం చేసుకోవడానికి వేరే రాష్ట్రాలకి తరలిపోతున్నారు. గత ప్రభుత్వం కొందరు వ్యాపారవేత్తలపై పక్షపాతం చూపిస్తే ఈ ప్రభుత్వం వ్యాపారులందరినీ వేధిస్తోంది.అందుకే అనేకమంది పారిశ్రామిక వేత్తలు మహారాష్ట్ర,మధ్యప్రదేశ్‌కి వెళ్లిపోతున్నారు. వేధింపులు ఆపకుండా ఇతర దేశాలకు వెళ్ళి ఒప్పందాలు చేసుకోవడం సరికాదు. కాంగ్రెస్ వేధించని పారిశ్రామికవేత్త లేడు’అని కిషన్‌రెడ్డి విమర్శించారు.కాగా, సీఎం రేవంత్ దావోస్ పర్యటన ముగించుకుని శుక్రవారం ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. అక్కడ వరల్డ్ ఎకనమిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్) సమావేశాల్లో పాల్గొని పలు కంపెనీలతో పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకున్నారు.ఈ పెట్టుబడుల ఒప్పందాల్లో తెలంగాణకు చెందిన మేఘా కంపెనీ పెట్టుబడులు కూడా ఉండడం విమర్శలకు దారితీసింది. -
తెలంగాణలో టికెట్ రేట్లపై దిల్ రాజు హాట్ కామెంట్స్
-
చిట్టినాయుడు కేసులకు భయపడం: కేటీఆర్
సాక్షి, రాజన్న సిరిసిల్ల జిల్లా: ఆరు గ్యారెంటీల్లో అర గ్యారెంటీ మాత్రమే అమలైందని.. రేవంత్‌కు పరిపాలన చేతకావడం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. రైతు బంధుకు కొర్రీలు పెడుతున్నారన్న కేటీఆర్.. సీఎం రేవంత్‌రెడ్డిని కటింగ్ మాస్టర్‌గా అభివర్ణించారు. శనివారం.. సిరిసిల్ల బీఆర్ఎస్ కార్యాలయంలో ముఖ్య నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ భేటిలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి, కోరుకంటి చందర్, పుట్టమధు, తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘‘రూ.2 లక్షల రుణమాఫీ అయ్యిందా? లేదా తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి ఊరికి పోదామా అంటూ అసెంబ్లీలో అడిగితే సమాధానం లేదు. సర్వశిక్షా అభియాన్ వాళ్ల సమస్యను అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామన్నాడు రేవంత్.. ఏమైంది?. కాంగ్రెస్ మాట తప్పిన ప్రభుత్వం. ఎప్పుడైనా నాట్లు పడేటప్పుడు పడాల్సిన రైతుబంధు.. ఓట్లు పడ్డప్పుడు వేసిన ఘనత కాంగ్రెస్‌ది. రైతు ప్రమాణ పత్రం రాయడమేంటి..?’’ అంటూ కేటీఆర్ నిలదీశారు.ఇదీ చదవండి: పదో ర్యాంకు వచ్చినా.. ఉద్యోగం ఇస్తలేరు..‘‘లక్షా 20 వేల కోట్ల రూపాయలు 70 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశారు కేసీఆర్. రైతును బద్నాం చేసే మాట, దొంగగా చిత్రీకరించేలా ఏడు వేల కోట్ల రూపాయలు మళ్లించారని మాట్లాడిండు రేవంత్. రెండో పంట వేయని రైతులను తప్పుగా చిత్రీకరిస్తోంది రేవంత్ ప్రభుత్వం. టీచర్ అయితే రైతుబంధు కట్ అంటుండు రేవంత్. ఇప్పుడు సీఎం అంటే కటింగ్ మాస్టర్’’ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.‘‘పర్రె మేడిగడ్డకు పడలే.. రేవంత్ పుర్రెకు పడ్డది. మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో కాంగ్రెసే ఏదో దొంగచాటుగా చేస్తోందనేది నా అనుమానం. స్థానిక సంస్థల ఎన్నికల సంవత్సరం కాబోతోంది ఈ ఏడాది. కాబట్టి ప్రేక్షకపాత్రకు పరిమితం కాకుండి. కేసులైనా భయపడకండి. చిట్టినాయుడు ఏం పీకలేడు. చిల్లర మిల్లర రాతలు రాయించేవారినీ వదిలిపెట్టం. బాక్సింగ్‌లో కిందపడ్డా నిలబడి కొట్లాడేటోడే వీరుడు. కాంగ్రెస్ 8, బీజేపీ 8 ఎంపీలైన్రు కానీ వచ్చింది గుండు సున్నా. కేసీఆర్ ఒక రోజు దేశంలో చక్రం తిప్పే రోజు ముందుంది..కాంగ్రెస్ నాడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి 369 కోట్ల రెవెన్యూ మిగులుతో అప్పజెప్పితే.. మనం దిగిపోయేనాడు 5 వేల 564 కోట్ల మిగులుతో కాంగ్రెస్‌కు అప్పజెప్పాం. రెవెన్యూ మిగులు విషయంలో ముఖ్యమంత్రిదో మాట, ఉప ముఖ్యమంత్రిదో మాట. పదేళ్లలో 4 లక్షల 17 వేల కోట్లు మనం అప్పు చేస్తే.. కాంగ్రెస్ ఒక ఏడాదిలో 1 లక్షా 37 వేల కోట్ల అప్పుజేసింది. మేం చేసిన అప్పుల వల్ల జరిగిన అభివృద్ధి గురించి మేం చెప్తాం.. మీరు చెప్పగలరా?. హైడ్రా పేరిట పేదల పొట్ట కొట్టడం తప్ప ఏం చేసింది ఈ ప్రభుత్వం?. ఢిల్లీకి పంపుతున్నారు పైసలన్నీ. తెలంగాణా ఢిల్లీకి ఏటీఎం అయిపోయింది.కొడంగల్ భూములివ్వని కేసులో కూడా నన్ను ఇరికించే యత్నం చేశాడు. ఆరు కేసుల్లో ఎలా ఇరికిద్దామా అనే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వానిది. వాళ్లు కేసుల గురించి ఆలోచించని.. మనం రైతుల గురించి ఆలోచిద్దాం. త్వరలో సభ్యత్వ నమోదు ప్రారంభించి బూత్ కమిటీ నుంచి రాష్ట్ర కమిటీలు వేసుకుందాం. రైతుభరోసాపై గ్రామాల్లో నాయకులంతా చర్చ పెట్టాలి. కోటి ఆరు లక్షల మంది నుంచి దరఖాస్తులు తీసుకుని ఏం చేసినట్టు?. మళ్ళీ ప్రమాణపత్రాలెందుకు?’’ అంటూ కేటీఆర్ విమర్శించారు. -
పోలీసుల మరణ మృదంగం.. సర్కార్‌కి పట్టింపు లేదా?: హరీష్‌రావు
సాక్షి, హైదరాబాద్: పోలీసుల మరణ మృదంగం.. ప్రభుత్వానికి పట్టింపు లేదా? అంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు మండిపడ్డారు. ఎక్స్ వేదికగా రేవంత్ సర్కార్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘‘ములుగు జిల్లాలో ఎస్ఐ, సిద్ధిపేటలో కానిస్టేబుల్ కుటుంబం, కామారెడ్డిలో ఎస్ఐ, కానిస్టేబుల్, ఈ రోజు సిరిసిల్లలో కానిస్టేబుల్ కుటుంబం, మెదక్ కుల్చారంలో హెడ్ కానిస్టేబుల్.. వీరంతా స్వల్ప కాలంలో ఆత్మహత్యలకు పాల్పడ్డ పోలీసులు. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన పోలీసులే వరసగా ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. శాంతి భద్రతలు పరిరక్షించవలసిన రక్షకుల జీవితాలకే రక్షణ కరువైంది.’’ అని హరీష్‌రావు ట్వీట్ చేశారు.పని ఒత్తిళ్లు, పెండింగ్ హామీలను తీర్చడంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి పోలీసులపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ ఆత్మహత్యలపై నిజానిజాలు వెలుగులోకి రావడానికి శాఖాపరమైన దర్యాప్తు చేయాలని డీజీపీని కోరుతున్నా. పోలీసుల్లో ఆత్మహత్యల ఆలోచనలు రాకుండా సైకాలజిస్టులతో కౌన్సెలింగ్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని హరీష్‌రావు పేర్కొన్నారు.ఇదీ చదవండి: తెలంగాణలో పోలీసుల ఆత్మహత్యలపై స్పందించిన డీజీపీ‘‘పోలీస్ మిత్రులారా.. సమస్యలు ఏవైనప్పటికీ ఆత్మహత్యలు పరిష్కారం కాదు. ఎంతో కష్టపడి ఈ ఉద్యోగాలు సాధించారు. మీ కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకండి. విలువైన జీవితాలను కోల్పోకండి. ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన మీరు ఆత్మస్థైర్యంతో విధులు నిర్వహిస్తేనే సమాజానికి భద్రత.’’ అంటూ హరీష్‌రావు సూచించారు.పోలీసుల మరణ మృదంగం.. ప్రభుత్వానికి పట్టింపు లేదా ? ములుగు జిల్లాలో ఎస్సై, సిద్దిపేటలో కానిస్టేబుల్ కుటుంబం, కామారెడ్డిలో ఎస్సై , కానిస్టేబుల్, ఈ రోజు సిరిసిల్లలో కానిస్టేబుల్ కుటుంబం, మెదక్ కుల్చారంలో హెడ్ కానిస్టేబుల్... వీరంతా స్వల్ప కాలంలో ఆత్మహత్యలకు పాల్పడ్డ పోలీసులు.…— Harish Rao Thanneeru (@BRSHarish) December 29, 2024 -
హాస్టళ్లు, గురుకులాల్లో కామన్ డైట్ ప్లాన్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
-
రేవంత్‌ను ఎందుకు అరెస్ట్ చేయరు?: హరీష్‌రావు
సాక్షి, హైదరాబాద్: అల్లు అర్జున్ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. అసలు ప్రత్యేక షోలకు అనుమతి ఇచ్చిందెవరు?. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా సినిమా ప్రదర్శించింది ఎవరు? అంటూ ప్రశ్నలు గుప్పించారు. సినిమా కోసం వెళ్లి తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. దీనికి అసలు కారకులు రాష్ట్ర పాలకులే. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే అని హరీష్‌రావు మండిపడ్డారు.రేవంత్ రెడ్డి బ్రదర్స్ వేధింపుల వల్లే చనిపోతున్నా అని సూసైడ్ లెటర్ రాసి సీఎం సొంత గ్రామం కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సాయి రెడ్డి ఆత్మహత్య చేసుకుంటే రేవంత్ బ్రదర్స్‌ని ఎందుకు అరెస్టులు చేయరు?. రేషన్ కార్డు నిబంధనల వల్లే, రుణమాఫీ కాక ఆత్మహత్య చేసుకుంటున్నా అని సూసైడ్ లెటర్ రాసి మేడ్చల్ వ్యవసాయ కార్యాలయం వద్ద సురేందర్ రెడ్డి అనే రైతు ఆత్మహత్య చేసుకుంటే కారకుడైన రేవంత్ రెడ్డిని ఎందుకు అరెస్టు చేయరు?. అరెస్టు చేయాల్సి వస్తే ముందు రేవంత్ రెడ్డి సోదరులను అరెస్టు చేయాలి’’ అని హరీష్‌రావు పేర్కొన్నారు.అల్లు అర్జున్ అరెస్ట్ కేసు లైవ్ అప్డేట్స్ కోసం క్లిక్ చేయండి‘‘ఏడాది పాలనలో రైతులను బలిగొన్నందుకు ఎవరిని అరెస్టు చేయాలి?. ఫుడ్ పాయిజన్లతో 49 మంది విద్యార్థులు చనిపోయారు. దీనికి ఎవరిని అరెస్టు చేయాలి. ఫార్మా సిటీ పేరుతో లగచర్ల గిరిజన బతుకులను ఛిద్రం చేశారు. దీనికి ఎవరిని అరెస్టు చేయాలి?. చట్టం అల్లు అర్జున్ విషయంలోనే కాదు ఎనుముల రేవంత్ రెడ్డి అండ్ బ్రదర్స్ విషయంలోనూ స్పందించాలి. చట్టం ఎవ్వరికీ చుట్టం కాకూడదు’’ అని హరీష్‌రావు వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: ‘అల్లు అర్జున్ అరెస్ట్‌తో నాకేం సంబంధం లేదు’ -
జరగబోయేది అదే.. రాహుల్‌కు కేటీఆర్ లేఖ
సాక్షి, హైదరాబాద్: చేతి గుర్తుకు ఓటేస్తే చేతకాని సీఎంని తెలంగాణ నెత్తిన రుద్దారంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఢిల్లీకి అందే మూటలపై తప్ప.. మీరిచ్చిన మాటపై శ్రద్ధ లేదా?. తెలంగాణ బతుకు ఛిద్రం అవుతుంటే ప్రేక్షకపాత్ర వహిస్తారా?’’ అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ రాశారు.‘‘నమ్మి అధికారమిస్తే ఆగం చేయడమే కాక.. అస్థిత్వాన్ని దెబ్బతీస్తారా?. గ్యారెంటీలకు దిక్కులేదు, 420 హామీలకు పత్తాలేదు, డిక్లరేషన్లకు అడ్రస్ లేదు!. అన్నదాతల నుంచి ఆడబిడ్డల వరకూ అందరూ బాధితులే. వ్యవసాయ రంగం నుంచి పారిశ్రామిక వర్గం వరకూ వంచితులే. ఇందిరమ్మ రాజ్యమంటే ఇంటింటా నిర్బంధం.. సకల రంగాల్లో సంక్షోభం. మేము పదేళ్లలో పేదల బతుకులు మార్చాం తప్ప పేర్లు మార్చలేదు’’ అని లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు.‘‘మేము తలుచుకుంటే రాజీవ్ పేర్లు, ఇందిరా విగ్రహాలు ఉంటాయా?. ఈ నీచ సంస్కృతికి సీఎం ఫుల్ స్టాప్ పెట్టకపోతే జరగబోయేది అదే! అంటూ లేఖలో కేటీఆర్ హెచ్చరించారు.కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS లేఖ♦️చేతి గుర్తుకు ఓటేస్తే చేతకాని సీఎంని తెలంగాణ నెత్తిన రుద్దారు.♦️ఢిల్లీకి అందే మూటలపై తప్ప.. మీరిచ్చిన మాటపై శ్రద్ధ లేదా?♦️తెలంగాణ బతుకు ఛిద్రం అవుతుంటే ప్రేక్షకపాత్ర వహిస్తారా? ♦️నమ్మి అధికారమిస్తే… pic.twitter.com/D4Nt9d8yDf— BRS Party (@BRSparty) December 11, 2024ఇదీ చదవండి: ఏం చేశాం.. ఏం చేద్దాం? -
కేసీఆర్, మోదీకి సీఎం రేవంత్ సవాల్
సాక్షి, నల్గొండ జిల్లా: కేసీఆర్ ప్రతిపక్ష పాత్ర ఎందుకు పోషించడం లేదంటూ సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఆయన ఫామ్‌హౌస్‌కే పరిమితం కావడం సరికాదన్నారు. నల్గొండలో మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవం, నర్సింగ్ కళాశాలకు శంకుస్థాపన చేసిన తర్వాత గంధంవారి గూడెంలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. ఏ రాష్ట్రంలోనైనా రూ.21 వేల కోట్ల రుణమాఫీ జరిగిందా?. నిరూపిస్తే మేమంతా వచ్చి క్షమాపణలు చెబుతాం అంటూ కేసీఆర్, మోదీకి సీఎం రేవంత్ సవాల్ విసిరారు.‘‘సమస్యను ప్రశ్నించడం ప్రతిపక్షాల బాధ్యత. కేసీఆర్ ఈ సంవత్సర కాలంలో ఏనాడైనా ప్రతిపక్ష నాయకుడి బాధ్యతను పోషించారా?. ఒక్కరోజైనా తెలంగాణ ప్రజల కోసం పనిచేశారా? ఆత్మపరిశీలన చేసుకోవాలి. ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉండటం మంచిదేనా?. మేం ఓడిపోయినా మళ్లీ ప్రజా తీర్పు కోరినాం. గెలిస్తే ఉప్పొంగడం.. ఓడితే కుంగిపోవడం మంచిదేనా?. కేసీఆర్ ఓ గాలి బ్యాచ్‌ను జతచేశారు. పరిశ్రమలు తెస్తామంటే, ఫార్మాసిటీ కడతాం అంటే, రోడ్లు వేస్తామంటే, ఫ్యూచర్ సిటీ నిర్మిస్తామంటే మీరు వద్దు అంటున్నారు. రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుంది? అంటూ రేవంత్ దుయ్యబట్టారు.పరీక్షలు పెట్టొద్దు.. ఉద్యోగాలు ఇవ్వొద్దంటే తెలంగాణకు మంచిదేనా?. 1200 మంది ప్రాణ త్యాగం చేసింది మీ ఇంట్లో ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్సీలు చేయడానికా?. జూన్ 2కు ఎంత ప్రాధాన్యత ఉందో డిసెంబరు 7కు అంతే ప్రాధాన్యత ఉంది. తొలి దశ ఉద్యమ కాలంలో కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి వాళ్లు మంత్రి పదవికి రాజీనామా చేశారు. మలిదశ ఉద్యమకాలంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రి పదవి త్యాగం చేశాడు. తొలి, మలిదశ ఉద్యమంలో నల్లగొండ గడ్డ ప్రాధాన్యత ఎంతో గొప్పది. నల్లగొండ గడ్డపై కాలు పెడితే నిజాంలను తమిరికొట్టిన ఉద్యమ స్పూర్తి వస్తుంది. ఫ్లోరైడ్ కారణంగా కన్నపిల్లలను కూడా తాళ్లతో కట్టేసి పనికిపోవాల్సిన పరిస్థితి ఉండేది. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయం కంటే కేసీఆర్ పాలనలో ఎక్కువ అన్యాయం జరిగింది’’ అని మండిపడ్డారు. -
CM రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్
-
లక్ష తప్పుడు కేసులు పెట్టినా ప్రశ్నించడం ఆపను. మాజీమంత్రి హరీశ్‌రావు వ్యాఖ్య.. ఇంకా ఇతర అప్డేట్స్
-
ప్రజా పాలన విజయోత్సవాలు.. షెడ్యూల్ ఇదే
సాక్షి, హైదరాబాద్: తొమ్మిది రోజుల పాటు నిర్వహించే ప్రజాపాలన విజయోత్సవాల షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. డిసెంబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఉత్సవాలను ఘనంగా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. 9వ తేదీ సెక్రటేరియట్ తెలంగాణ తల్లి విగ్రహం ప్రారంభం చేయనున్నారు. భారీ బహిరంగ సభకు సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. డిసెంబర్ 1వ తేదీ ఇంటిగ్రేటెడ్ భవనాలకు శంకుస్థాపనలు జరగనుంది.డిసెంబర్ 2వ తేదీ అన్ని జిల్లాల్లో సీఎం కప్ పోటీలను ప్రభుత్వం ప్రారంభించనుంది. ఒక్కో రోజు ఒక్కో డిపార్ట్మెంట్కు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. శాఖల వారీగా ఏడాది కాలం పనితీరుపై లెక్కలను మంత్రులు వెల్లడించనున్నారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు మంత్రులు వరుస మీడియా సమావేశాలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో రాష్ట్ర వ్యాప్త వేడుకలను ప్రభుత్వం కీలకంగా భావిస్తోంది.డిసెంబర్ 1:ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 2వ దశకు శంకుస్థాపన కార్యక్రమాలు.విద్యార్థుల కోసం వ్యాస రచన పోటీలు.సీఎం కప్ పోటీలు (డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 8 వరకు)డిసెంబర్ 2:16 నర్సింగ్ మరియు 28 పారా మెడికల్ కళాశాలల ప్రారంభోత్సవం213 కొత్త అంబులెన్సులు ప్రారంభం33 ట్రాన్స్ జెండర్ క్లినిక్‌ల ప్రారంభంట్రాఫిక్ వాలంటీర్లుగా ట్రాన్స్ జెండర్ల పై పైలట్ ప్రాజెక్టుడిసెంబర్ 3:హైదరాబాద్ రైజింగ్ కార్యక్రమాలుఆరాంఘర్ నుంచి జూ పార్క్ ఫ్లైఓవర్ ప్రారంభం.రూ. 150 కోట్లు విలువైన బ్యూటిఫికేషన్ పనుల ప్రారంభండిసెంబర్ 4:తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ భవన శంకుస్థాపనవర్చువల్ సఫారి మరియు వృక్ష పరిచయం కేంద్రం ప్రారంభం9,007 మందికి నియామక పత్రాల పంపిణీ.డిసెంబర్ 5:ఇందిరా మహిళా శక్తి బజార్ ప్రారంభంస్వయంసహాయక గ్రూపుల్లో చర్చలు3 (మేడ్చల్, మల్లేపల్లి, నల్గొండ లో) అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల ప్రారంభంఘట్ కేసర్లో బాలికల ITI కాలేజీ ప్రారంభండిసెంబర్ 6:యాదాద్రి పవర్ ప్లాంట్‌లో విద్యుదుత్పత్తి ప్రారంభం244 విద్యుత్ ఉపకేంద్రాల శంకుస్థాపన.డిసెంబర్ 7:స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ప్రారంభంపోలీస్ బ్యాండ్ ప్రదర్శనతెలంగాణ కళా ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు.డిసెంబర్ 8:7 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రాజెక్టుల ప్రారంభం130 కొత్త మీ సేవల ప్రారంభంయంగ్ ఇండియా యూనివర్శిటీకి శంకుస్థాపనతెలంగాణ కళా ప్రదర్శనలు, సాంస్కృతిక వేడుకలుడిసెంబర్ 9:లక్షలాది మంది మహిళా శక్తి సభ్యుల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ.ట్యాంక్ బండ్ మీద ముగింపు వేడుకలుడ్రోన్ షో, ఫైర్ వర్క్, ఆర్ట్ గ్యాలరీ, వివిధ స్టాళ్ల ఏర్పాటు -
అదానీ వ్యవహారంలో తెలంగాణలో పోటాపోటీ రాజకీయం!
అదానీ స్కామ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. రాజకీయ ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేసేందుకు ఒకపక్క తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్.. ఇంకోపక్క బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులు వ్యూహాలు రచిస్తున్నారు. స్కిల్ యూనివర్శిటీకి అదానీ ప్రకటించిన రూ.వంద కోట్ల విరాళాన్ని తిరస్కరిస్తున్నట్లు రేవంత్ ప్రకటించి తొలి అస్త్రం సంధించగా అదే అదానీతో రేవంత్ కుమ్మక్కు అయ్యారని కేటీఆర్, హరీశ్‌లు ఆరోపణలకు దిగారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అంశంపై ఉలుకు, పలుకూ లేకుండా ఉండటం. బహుశా మింగలేక, కక్కలేక అన్నట్టుగా ఉన్నట్టుంది బాబు గారి పరిస్థితి!సౌర విద్యుత్తు కొనుగోళ్లకు సంబంధించి అదానీపై అమెరికా కోర్టులో కేసు నమోదైన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున విమర్శలకు దిగిన సంగతి తెలిసిందే. ప్రధాని మోడీపై కూడా కాంగ్రెస్ తనదైన శైలిలో విరుచుకుపడింది. అయితే ఈ అంశం తెలంగాణలో రేవంత్‌కు కొంత ఇబ్బందిగా మారింది. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అదానీని విమర్శిస్తూంటే.. రేవంత్ మాత్రం కుమ్మక్కు అయ్యారని కేటీఆర్, రేవంత్‌లు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అదానీతో సంబంధాలు, పెట్టుబడులపై మీడియా అడిగిన ప్రశ్నలకు జవాబు ఇచ్చేందుకు రాహుల్ కొంత తడబడాల్సి వచ్చింది.ఆ తర్వాత ఏమైందో కాని తెలంగాణ సీఎం స్కిల్ యూనివర్శిటీకి అదానీ ఇచ్చిన వంద కోట్లను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. రాహుల్ గాంధీ అసంతృప్తి వ్యక్తం చేయడంతోనే రేవంత్ ఈ నిర్ణయం తీసుకున్నారని బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. అక్కడితో ఆగకుండా దావోస్‌లో అదానీతో కుదుర్చుకున్న రూ.12,400 కోట్ల ఒప్పందాల మాటేమిటని, రేవంత్ స్వస్థలం కొడంగల్‌లో ఏర్పాటు చేయతలపెట్టిన అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ సంగతేమిటి? అని కూడా కేటీఆర్, హరీశ్‌కు ప్రశ్నిస్తున్నారు. అదానీకి తాము గతంలో రెడ్‌లైట్ చూపామని, రేవంత్ మాత్రం రెడ్ కార్పెట్ పరిచారని ఎద్దేవా చేస్తున్నారు.కేసీఆర్ ప్రభుత్వం అప్పట్లో తీసుకున్న కొన్ని నిర్ణయాలపై రేవంత్ ప్రభుత్వం కమిషన్లు వేయడం, ఈ-ఫార్ములా రేస్ నిర్వహణకు సంబంధించి రూ.55 కోట్ల దుర్వినియోగం ఆరోపణతోపాటు కొన్ని ఇతర అంశాల విషయంలోనూ కేటీఆర్‌పై కేసులు పెట్టే ప్రయత్నం చేయడం ద్వారా రేవంత్ బీఆర్ఎస్ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సమయంలో ఎన్నికల హామీల అమలు వైఫల్యంతోపాటు హైడ్రా వ్యవహారాలు, మూసీ నదీగర్భంలో ఇళ్ల కూల్చివేత, లగచర్ల భూసేకరణ వివాదం వంటి అంశాలతో బీఆర్ఎస్ జనాల్లోకి వెళుతోంది. వీటన్నింటి మధ్యలో వచ్చిన అదానీ కేసును కూడా అందిపుచ్చుకునేందుకు ఇరు పక్షాలూ ప్రయత్నిస్తున్నాయి. నిజానికి అదాని విరాళానికి, ఆయనపై వచ్చిన కేసుకు సంబంధం ఉండకూడదు. కానీ.. రాజకీయాలలో పరిస్థితి అలా ఉండదు. అదానీ ప్రధాని మోడీకి సన్నిహితుడని, అతడిని రక్షిస్తున్నాడని కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి నేతలు ఆరోపిస్తున్న విషయం కొన్ని రాష్ట్రాల్లోని కాంగ్రెస్ ప్రభుత్వాలకు, నేతలకూ ఇబ్బందిగా మారింది. ఉదాహరణకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్‌తో చత్తీస్ లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఒప్పందం చేసుకుంది. దీన్ని రాహుల్ ఎలా సమర్థించుకుంటారన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. తమిళనాడులోని డీఎంకే ఆధ్వర్యంలోని కూటమిలో కాంగ్రెస్ భాగస్వామి. జమ్ము-కశ్మీర్లో రాష్ట్రపతి పాలన ఉండగా ఒప్పందం కుదిరింది. అంటే బీజేపీ ఆధ్వర్యంలోని రాష్ట్రంలలో ఒప్పందం కుదురిందన్నమాట. ఇందులో అవినీతి జరిగి ఉంటే ఆ మకిలీ కాంగ్రెస్, బీజేపీలు రెండింటికీ అంటుకుంటున్నట్లు అవుతుంది కదా! బీజేపీ ఇదే వాదన చేసి కాంగ్రెస్ పై ద్వజమెత్తింది. ఈ క్రమంలో తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం ఇరుకునపడినట్లయింది.ఇదీ చదవండి: కొత్త దుష్ట సంస్కృతికి తెరలేపిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి!విద్యుత్ సరఫరా ఒప్పందం తెలంగాణతో జరగక పోయినా ఆ ప్రభావం పెట్టుబడులపై పడుతోంది. రాజకీయంగా బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్య సాగుతున్న వార్ నేపథ్యంలో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది. దీనిపై రేవంత్ వివరణ ఇస్తూ తానేదో అప్పనంగా వంద కోట్లు తీసుకున్నట్లు ఆరోపణలు రావడం తనకు ఇష్టం లేదని, స్కిల్ యూనివర్శిటీ వివాదాలలో చిక్కుకోరాదన్న భావనతో అదానీ విరాళాన్ని తిరస్కరించినట్లు చెప్పారు. అయితే తొలుత రేవంత్ ప్రభుత్వం సంతోషంగానే ఈ మొత్తాన్ని స్వీకరించడానికి సిద్దపడింది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యూనివర్శిటీకి ఉపయోగపడుతుందని భావించింది. కానీ రాజకీయ విమర్శల కారణంగా వెనక్కి తగ్గుతున్నారు.గతంలో అదానితో కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేసుకోవడం కష్టమన్న భావను రేవంత్ వ్యక్తపరిచారు. వారు కోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుందని అన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం కూడా అదానీతో డేటా సెంటర్ తదితర అగ్రిమెంట్లు చేసుకుందని రేవంత్ వ్యాఖ్యానించారు. పెట్టుబడులపై బీఆర్ఎస్ విధానం ఏమిటని ప్రశ్నించారు. నిజమే! ఏ పారిశ్రామిక వేత్త అయినా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తే దానిని స్వీకరించకుండా ఉండడం కష్టమే. ఎందుకంటే రేవంత్ అన్నట్లు పరిశ్రమలు రాకపోతే తేలేదని అంటారు. తీరా ఏవైనా పరిశ్రమలు వస్తే ఆరోపణలు చేస్తుంటారని ఆయన అన్నారు.అనుభవమైంది కనుక రేవంత్ ఈ మాటలు చెబుతున్నారు. అదే తెలంగాణలో కాంగ్రెస్ విపక్షంలో ఉంటే ఆయన కూడా ఇదే తరహా రచ్చ చేసేవారు. అంతెందుకు...గతంలో వైఎస్ జగన్ పై పెట్టిన ఆక్రమ కేసులలో అనేక పరిశ్రమలకు తెలుగుదేశంతో కలిసి కాంగ్రెస్ అడ్డుపడిందన్న ఆరోపణలు ఉన్నాయి. దానివల్ల ఉమ్మడి ఏపీకి చాలా నష్టం జరిగింది. అమెరికాలో అదానీ కేసు తేలకముందే ఇక్కడ రాజకీయ దుమారాన్ని సృష్టించుకుని పెట్టుబడులపై ప్రభావం పడేలా చేస్తారా అన్న చర్చ వస్తుంది.మరో వైపు చంద్రబాబు నాయుడు ఏపీలో జగన్ టైమ్ లో ఏదో ఘోరం జరిగిపోయినట్లు ప్రచారం చేస్తూ, అదే టైమ్‌లో అదానితో మాత్రం స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. జగన్ లేనిపోని ఆరోపణలు చేసే చంద్రబాబు కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో కుదిరిన ఒప్పందం గురించి మాట్లాడదు. ఈ ఒప్పందం వల్ల రూ.లక్ష కోట్ల నష్టం వస్తుందని ఎల్లో మీడియా పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తోంది. ఈనాడు రాసింది నిజమే అయితే చంద్రబాబు వెంటనే సెకీ ఒప్పందాన్ని రద్దు చేయాలి కదా! అదానితో జగన్ ప్రభుత్వం అసలు ఒప్పందమే చేసుకోకపోయినా, ఎల్లో మీడియా తప్పుడు కథనాలు వండి వార్చుతోంది. అదానీ పై తన వైఖరి ఏమిటో చంద్రబాబు చెప్పరు.జగన్ టైమ్ లో సుమారు రూ.2.5 లక్షల కోట్ల విలువైన సౌర, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులను చేపట్టడానికి అదాని ముందుకు వచ్చారు. వాటిని కాదనే ధైర్యం చంద్రబాబుకు ఉందా? అదానిని ఏమైనా అంటే అది మోడీకే తగులుతుందన్న భయంతో చంద్రబాబు వ్యవహరిస్తున్నట్లు తెలియడం లేదా? పోనీ జగన్ టైమ్ లో కుదిరిన అగ్రిమెంట్లను వదలివేసి కొత్తగా అదానితో ఎలాంటి ఒప్పందాలు ఉండబోవని చంద్రబాబు ప్రభుత్వం చెప్పగలుగుతుందా? అలాంటిది ఏమీ లేదు. పైగా అదానికి స్వయంగా ఎదురేగి స్వాగతం పలికి అనేక రంగాలతో పాటు అమరావతిలో కూడా పెట్టుబడులు పెట్టడానికి ఆ గ్రూపు ముందుకు వచ్చిందని చంద్రబాబు ఆనందంగా ప్రకటించారు. అంటే అదానితో స్నేహం ఉండాలి. కాని జగన్ ను మాత్రం అప్రతిష్టపాలు చేయాలన్నమాట. చంద్రబాబు వ్యూహంలోని డొల్లతనం ఇక్కడే బహిర్గతం అయిపోతోంది. అదానీ, అంబాని వంటి పెద్ద పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి పెట్టుబడి తెస్తూంటే ఎవరూ వద్దనలేని పరిస్థితి ఉంది. కాకపోతే పారిశ్రామికవేత్తలపై వచ్చే ఆరోపణలను తమ రాజకీయ ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టడానికి మాత్రం వాడుకుంటున్నారు.ఇక్కడ ఒక సంగతి గమనంలోకి తీసుకోవాలి. అంబానీ, అదాని తదితర బడా పారిశ్రామికవేత్తలను కాదని కాంగ్రెస్, బీజేపీలు ఏమీ చేయడానికి సిద్దపడవన్నది వాస్తవం. గతంలో కేంద్రంలో కాంగ్రెస్ కూటమి అధికారంలో ఉన్నప్పుడు అంబానీకి వ్యతిరేకంగా అప్పటి కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి తీసుకున్న ఒక నిర్ణయం నేపథ్యంలో ఆయన శాఖే మారిపోయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు.ఈనాడు మీడియా ఇన్ని నీతులు వల్లిస్తుంటుంది కదా.. అంబానీకి వ్యతిరేకంగా ఒక్క వార్త ఇవ్వగలుగుతుందా? మార్గదర్శి అక్రమ డిపాజిట్ల కేసులో రామోజీకి అంబానీ సాయపడ్డారని చెబుతారు. ఇప్పుడు కూడా అంబానీ, అదానీలు బీజేపీకి సన్నిహితులే.కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అదానీపై విమర్శలు చేస్తున్నా, అధికారంలోకి వస్తే వారూ ఏమీ చేయరన్నది బహిరంగ రహస్యమే. అంబానీ, అదానీలను కాదంటే దాని ప్రభావం దేశ ఆర్ధిక వ్యవస్థపై పడే అవకాశం ఉంది. రాజకీయ దుమారం వేరు. వాస్తవ పరిస్థితి వేరు. ఇలాంటి పారిశ్రామికవేత్తలు రాజకీయాలను పరోక్షంగా శాసిస్తున్నారన్న అభిప్రాయం కూడా ఉంది. దీనికి రేవంత్ అయినా, చంద్రబాబు అయినా, మరెవరైనా అతీతం కాదన్నది నిజం.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఎవరనుకున్నారు.. ‘మార్పు’ ఇంత మోసగిస్తుందని..: కేటీఆర్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: రేవంత్ సర్కార్ పాలనా వైఫల్యాలను మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా మరోసారి ఎత్తి చూపారు. తెలంగాణాలో పింఛన్ల కోసం వృద్దులు రోడ్డెక్కుతారని ఎవరనుకున్నారు?. ఠంచన్‌గా అకౌంట్లో పడే పైసలు ఆగిపోతాయని ఎవరునుకున్నారు?’’ అంటూ ప్రశ్నస్త్రాలు సంధించారు.‘‘మూసీ బ్యూటిఫికేషన్ కోసం లాక్షా యాభై వేల కోట్లు వెదజల్లి... కనికరం లేకుండా వృద్దుల పెన్షన్ డబ్బులను ఆపుతారని ఎవరనుకున్నారు?. మందుబిళ్లల కోసం కొడుకులు , కోడళ్ల దగ్గర చేయిచాచే అవసరమే లేని రోజుల నుంచి మళ్లీ వేడుకునే 'మార్పు' వస్తుందని ఎవరనుకున్నారు?’’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.‘‘అణువణువునా కర్కశత్వాన్ని నింపుకున్న ఇందిరమ్మ రాజ్యంలో.. ఇంటింటా ఇక్కట్లే ఉంటాయని ఎవరనుకున్నారు?. మార్పు ఇంత మోసగిస్తుందని ఎవరనుకున్నారు?’’ అంటూ కేటీఆర్ మండిపడ్డారు.ఇట్లా అవునని ఎవరనుకున్నారు?తెలంగాణాలో ఫించన్ల కోసం వృద్దులు రోడ్డెక్కుతారని ఎవరనుకున్నారు?టంచన్ గా అకౌంట్లో పడే పైసలు ఆగిపోతాయని ఎవరునుకున్నారు?మూసీ బ్యూటిఫికేషన్ కోసం లాక్షా యాభై వేల కోట్లు వెదజల్లి...కనికరం లేకుండా వృద్దుల పెన్షన్ డబ్బులను ఆపుతారని ఎవరనుకున్నారు?… pic.twitter.com/hDQKbjOSrR— KTR (@KTRBRS) November 27, 2024 -
తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్ట్‌లు.. కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో నూతన ఎయిర్‌పోర్ట్‌ల నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. తమ హయాంలో వరంగల్ విమానాశ్రయాన్ని నూటికి నూరుపాళ్లు పూర్తి చేస్తామని తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వరంగల్‌తో పాటు మరో మూడు (పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్) విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారని తెలిపారు.పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం విషయంలో ఫీజిబిలిటీ స్టడీ చేయాల్సి ఉందని.. నివేదిక సానుకూలంగా వస్తే తర్వాత భూసేకరణకు వెళ్లొచ్చని రామ్మోహన్ నాయుడు చెప్పారు. ఆదిలాబాద్ విమానాశ్రయం రక్షణ శాఖ పరిధిలో ఉంది. ఆ శాఖ నుంచి అనుమతి ఉంటే అక్కడ కూడా విమానాశ్రయాన్ని చేస్తామన్నారు.‘‘ఆదిలాబాద్‌కు ఓవైపు చత్తీస్‌గఢ్, మరోవైపు మహారాష్ట్ర సరిహద్దులు ఉన్నాయి. దరిదాపుల్లో విమానాశ్రయం లేదు. అక్కడ ఏర్పాటు చేస్తే చాలామందికి ఉపయోగకరంగా ఉంటుంది. వరంగల్ విమానాశ్రయం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రో యాక్టివ్‌గా వ్యవహరిస్తూ భూసేకరణకు సర్క్యులర్ జారీ చేసింది. అక్కడ పూర్తిగా ఎయిర్‌ఫోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా విమానాశ్రయాన్ని నిర్మించి చూపిస్తాం. విమానయాన శాఖ వల్ల కేవలం విమాన ప్రయాణాలే కాదు.. టూరిజం ఉద్యోగ కల్పన మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధి పెరుగుతుంది’’ అని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. -
రేవంత్ ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు పరాభవం!
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్రలో తెలంగాణ సీఎం రేవంత్ ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు ఘోర పరాభవం ఎదురైంది. రేవంత్ ప్రచారం నిర్వహించిన షోలాపూర్ సిటీ నార్త్, షోలాపూర్ సౌత్, చంద్రాపూర్, భోకార్, నాయగావ్, నాందేడ్ నార్త్‌లో బీజేపీ అభ్యర్థులు విజయం దిశగా దూసుకెళ్తున్నారు. కాగా.. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఏఐసీసీ సీనియర్ అబ్జర్వర్‌గా డిప్యూటీ సీఎం భట్టి పని చేసిన సంగతి తెలిసిందే. అయితే క్షేత్ర స్థాయిలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు, ఇతర అంశాలను ఎప్పటి కప్పుడు అధిష్టానానికి చేర్చుతూ.. కింది స్థాయిలో హైకమాండ్ నిర్ణయాలను అమలు పరిచారు. జార్ఖండ్‌లో ఇండియా కూటమి హవా సాగుతోంది. ఇక్కడ ఎన్డీయే కూటమికి గట్టి షాక్ తగిలింది. హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జేఎంఎం స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది.జార్ఖండ్ అసెంబ్లీ పోస్ట్ ఎలక్షన్ ఏఐసీసీ అబ్జర్వర్‌గా భట్టి విక్రమార్కకు కాంగ్రెస్ అధిష్టానం బాధ్యతలు అప్పగించింది. ఆయనతో పాటు పార్టీ సీనియర్ లీడర్లు తన్వీర్ అన్వర్, కృష్ణ అల్లవూర్ నియమించింది.జార్ఖండ్‌లో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు దిశగా దూసుకెళ్తున్న క్రమంలో రాంచీలో కాంగ్రెస్ నేతలతో భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. ఫలితాల సరళిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ.. మంత్రి పదవులపై భట్టి విక్రమార్క సమాలోచనలు జరుపుతున్నారు. -
రేవంత్ వ్యాఖ్యలకు ఎర్రబెల్లి స్ట్రాంగ్ కౌంటర్
-
తెలంగాణ సెక్రటేరియట్.. ‘బాహుబలి’ గేటు తొలగింపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సెక్రటేరియట్ బాహుబలి మెయిన్ ఎంట్రెన్స్ గేట్లను ప్రభుత్వం తొలగించింది. వాస్తు మార్పుతో మెయిన్ ఎంట్రెన్స్ రెండు గేట్లను తొలగింపు చర్యలు చేపట్టారు. గేట్లు తొలగించిన చోట పూర్తిగా గ్రిల్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. తొలగించిన గేటును హుస్సేన్ సాగర్ వైపు గేటు నెంబరు 3 వద్ద పెట్టనున్నారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన సెక్రటేరియట్లో వాస్తు దోషం ఉందని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే అందుకు అనుగుణంగా ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి మార్పులు సూచించినట్లు సమాచారు. దీంతో దాదాపు 6 నెలల నుంచి బాహుబలి గేటుగా పిలిచే మెయిన్ ఎంట్రెన్స్ గేట్లకు తాళాలు వేసి మూసివేశారు. -
తెలంగాణ సెక్రటేరియట్లో మళ్లీ వాస్తు మార్పులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సెక్రటేరియట్లో మళ్లీ వాస్తు మార్పు చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. కొత్త నిర్మాణాలను ప్రభుత్వం ఫైనల్ చేసింది. ఎన్టీఆర్ మార్గ్ ఎంట్రీ నుంచి సౌత్ ఈస్ట్ గేటు వరకు ఎదురుగా కొత్త రోడ్డు నిర్మాణం చేయనుంది. గేట్ నెంబర్ 3 కి ఎదురుగా హుస్సేన్ సాగర్ వైపు మరో కొత్త గేటును పెట్టనుంది.బాహుబలి గేట్లకు ఎదురుగా ఉన్న మెయిన్ గేటును పూర్తిగా తొలగించనున్నారు. హుస్సేన్ సాగర్ గేటు నుంచి ప్రవేశించి.. గేటు 3 నుంచి ముఖ్యమంత్రి బయటకు వెళ్లనున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో గతంలో మూసిన ప్రధాన ద్వారాన్ని పూర్తిగా ప్రభుత్వం తొలగించనుంది. తెలంగాణ తల్లి విగ్రహం ప్రారంభం తేదీ నుంచే కొత్త గేటు అందుబాటులోకి రానుంది.కాగా, తెలంగాణ సచివాలయం భద్రత విధుల్లో తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (టీజీఎస్పీఎఫ్) చేరిన సంగతి తెలిసిందే. తమ డిమాండ్ల సాధన కోసం తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (టీజీఎస్పీ) ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో సెక్రటేరియట్ భద్రత విధుల నుంచి టీజీఎస్పీని తప్పించి టీజీఎస్పీఎఫ్‌కి బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సచివాలయం భద్రత కోసం ప్రస్తుతం 212 మంది టీజీఎస్పీఎఫ్ సిబ్బందిని పోలీసు ఉన్నతాధికారులు కేటాయించారు. -
‘నన్ను చంపితే స్వర్గానికి పోతా.. మీరు చస్తే నరకానికి పోతారు’
సాక్షి, ఢిల్లీ: కొందరు తనను చంపాలని చూస్తున్నారని.. అందుకే ప్రధాని మోదీ, అమిత్‌లకు సెక్యూరిటీ కోసం లేఖ రాశానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. ఢిల్లీలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నన్ను చంపితే స్వర్గానికి పోతా.. మీరు చస్తే నరకానికి పోతారు’’ అంటూ వ్యాఖ్యానించారు. ‘‘నేను అందరి కోసం పనిచేస్తున్నా.. పని చేస్తూనే ఉంటాను. కేసులు వేస్తున్నా.. కోర్టుల్లో పోరాడుతున్నా.. ఎన్నో కేసుల్లో స్టేలు తీసుకొస్తున్నా. కేసులు వెనక్కి తీసుకోవాలని బెదిరింపులు వస్తున్నాయి. మోదీ, చంద్రబాబు, పవన్, కాంగ్రెస్‌లు నాకు శత్రువులు. వేలాది మంది గ్రూప్-1 అభ్యర్థులు శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారు. అభ్యర్థులపై పోలీసు దాడులు బాధాకరం. వారిని గాయపరచడం సరైందా?’’ అంటూ కేఏ పాల్ ప్రశ్నించారు.ఇదీ చదవండి: అశోక్‌నగర్‌లో మరోసారి ఉద్రిక్తత..‘‘పరిపాలన చేత కాకపోతే సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. వేలమందినీ ఎందుకు కొడుతున్నారు? ఇల్లీగల్ అర్డర్‌ను ఇంప్లిమెంట్ చేస్తున్నారు. పోలీసులు పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మారాలి. రైతులు, నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరిగేలా చేస్తున్నారు’’ అని కేఏ పాల్ నిలదీశారు. -
ఆ విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ చీకటి ఒప్పందం: బండి సంజయ్
సాక్షి, వికారాబాద్: కుల గణన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చాలా దుర్మార్గమైనదని కేంద్రమంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. స్థానిక ఎన్నికలను తప్పించుకునే ధోరణిలో ప్రభుత్వం ఉందంటూ దుయ్యబట్టారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే చేశారు.. అది ఏమైంది?. మళ్లీ గణన ఎందుకు..? ఆ రిపోర్ట్ వాళ్లు బయట పెట్టలేదు. ఈ ప్రభుత్వం బయట పెట్టలేదు. ఈ రెండు పార్టీల మధ్య జరిగిన చీకటి ఒప్పందం ఏంటి..?’’ అంటూ బండి సంజయ్ నిలదీశారు.‘‘కుల గణన సర్వే ఫేక్. స్థానిక ఎన్నికల్లో ఓడిపోతామని గ్రహించి తప్పించుకునే ధోరణిలో ప్రభుత్వం ఉంది. రూ.150 కోట్ల రూపాయలతో కుల గణన సర్వే అంటూ ప్రభుత్వం డైవర్షన్ చేస్తోంది. ఆనాటి సమగ్ర కుటుంబ సర్వే ఎందుకు బయటపెట్టడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఏంటి..?’’ అని బండి సంజయ్ ప్రశ్నలు గుప్పించారు.ఇదీ చదవండి: హైడ్రా బాస్‌తో భేటీ.. ఎవరీ ఆనంద్ మల్లిగవాడ్ -
ముందూ వెనుక ఆలోచించకుండానే కూల్చివేతలా?
తెలంగాణ రాజధాని భాగ్య నగరంలో ఏం జరుగుతోంది? ప్రక్షాళన చేస్తున్నామని, లండన్ స్థాయికి చేరుస్తున్నామని ప్రభుత్వం చెబుతూంటే.. కాపురముంటున్న ఇళ్లను కూల్చి తమ జీవితాలను ప్రభుత్వం ధ్వంసం చేస్తోందని బాధితులు ఆరోపిస్తున్నారు. వరదలొస్తే ముంపు సమస్య లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కాదనడం లేదు. అనుమతుల్లేని నిర్మాణాలపై చర్యలకూ అభ్యంతరం లేదు. చెరువుల్లాంటి జల వనరుల పరిరక్షణే లక్ష్యంగా, అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన సంస్త హైడ్రా దూకుడుపై సామాన్య, మధ్య తరగతి వర్గాల నుంచి ముందుగా సానుకూలతే వ్యక్తమైంది.అయితే ధనికుల ఇళ్ల మాట ఎలా ఉన్నా.. హైడ్రా పేద, మధ్య తరగతి వర్గాలకే కేంద్రంగా చేసుకుని కూల్చివేతలకు పాల్పడుతూండటంతో గగ్గోలూ ప్రారంభమైంది. నోటీసులివ్వకుండా, అకస్మాత్తుగా.. ఇంట్లోని సామాన్లు రక్షించుకునేందుకూ సమయం ఇవ్వకుండా నేరుగా జేసీబీలతో హైడ్రా విరుచుకుపడుతూండటం సర్వత్రా విమర్శలకు గురవుతోంది. ఇళ్లు కోల్పోయిన వారు దిక్కులేని స్థితిలో పడిపోతున్నారు. అందుకే వారు అంతలా శాపనార్థాలు పెడుతున్నారు.ఇళ్ల కూల్చివేతలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చూసిన వారు ఎవరికైనా ఆవేదన కలక్క మానదు. పుస్తకాలు కూడా తీసుకోనివ్వకుండా తాముంటున్న ఇల్లు కూల్చేశారని ఐదేళ్ల పసిపాప ఏడుస్తూ చెప్పిన వైనం అందరినీ కలచివేసింది. ఇంకో మహిళ తాము రూ.కోటి పెట్టుబడి పెట్టి వర్క్‌షాప్ ఏర్పాటు చేసుకున్నామని, యంత్రాలు తరలించుకునేందుకు అవసరమైన సమయమూ ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా కూల్చేశారని వాపోతూ కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తి పోసింది. కొందరు మధ్యతరగతి వారు తాము పది- పదిహేనేళ్లుగా పైసా పైసా కూడబెట్టుకని, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని కష్టపడి ఇల్లో, అపార్ట్మెంటో సొంతం చేసుకున్నామని, ఇప్పుడు ప్రభుత్వ అకస్మాత్తుగా వాటిని కూల్చేస్తే ఎక్కడికెళ్లాలని ప్రశ్నిస్తున్నారు.గృహప్రవేశం చేసిన వారం కూడా కాక ముందే తమ ఇల్లు కూల్చేశారని ఓ కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి సోదరుడితోపాటు ధనికులు ఎక్కువగా ఉన్న చోట్ల నోటీసులిచ్చారని.. వారు కోర్టుకు వెళితే కొంత గడువూ ఇచ్చారని.. పేద, మధ్య తరగతికి చెందిన తమకు మాత్రం అలాంటి సౌకర్యాలు ఎందుకు లేవని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ అనుమతులన్నీ తీసుకుని, రిజిస్ట్రేషన్లూ జరిగిన తమ ఇళ్లకు పన్నులు కూడా కడుతున్నామని, ప్రభుత్వాలు విద్యుత్తు, మురుగునీటి సౌకర్యాలు కల్పించిందని, అయినా.. చెరువు సమీపంలో ఉందనో, ఇంకేదో కారణం చేతనో కూల్చివేతలకు దిగితే తాము ఎవరికి చెప్పుకోవాలని బాధితులు వాపోతున్నారు. ప్రభుత్వ భవనాల మాటేమిటి?మూసి పరివాహక ప్రాంతంలో కాని, హుస్సేన్ సాగర్ తదితర చోట్ల ఎఫ్ టిఎల్, బఫర్ జోన్లలో ప్రభుత్వ ఆఫీసులు ఉన్నాయి. వాటి సంగతేమిటన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి.. వరదలలో ఉండాలని ఎవరూ కోరుకోరు. అదే టైమ్ లో ఇల్లు లేకుండా రోడ్డు మీద పడిపోయే పరిస్థితిని కూడా కోరుకోరు. ఒకవైపు ఇందిరమ్మ ఇళ్లను ఇస్తామని ప్రభుత్వం చెబుతూ, మరో వైపు వేల సంఖ్యలో పేదల ఇళ్లను పడవేస్తుంటే ప్రయోజనం ఏమి ఉంటుంది? ఏది అతి కాకూడదు. మూసి నది మధ్యలో ఉన్న ఇళ్లను తొలగించడానికి కూడా ప్రభుత్వం పూనుకుంది. అయితే ఇక్కడ వారిని మాత్రం బుజ్జగిస్తారట. వారికి మాత్రమే పునరావాసం కల్పించాకే కూల్చుతామని అధికారులు చెబుతున్నారు. కూల్చి వేయవలసిన ఇళ్ల సర్వేకి సిబ్బంది వస్తే ప్రజలు అడ్డుకున్నారు.మూసి నది బెడ్ లో ఉన్న వారికే ఇళ్లు ఇస్తే, మిగిలిన ప్రాంతాల పేదలు ఏమి చేయాలి. రోడ్డు మీదనే నివసించాలా? కూల్చివేతలకు ఇప్పుడు ఉన్న హైడ్రా సిబ్బంది చాలదట. మరో 169 మంది సిబ్బందిని తీసుకుంటారట. ఈ ఫుల్ ఫోర్స్ తో కూల్చివేతలకు దిగుతారట. అన్ని చెరువులకు ఫుల్ టాంక్ లెవెల్, బఫర్ జోన్ వంటివి నిర్ధారణ అయిందా? లేక ఏదో ఒఒక అంచనా ప్రకారం ఇళ్లను తొలగిస్తున్నారా? ఎక్కడైనా వరదలకు కారణం అవుతున్న ఇళ్లను తీయడానికి ప్రయత్నిస్తే అదో పద్దతి. అంతేకాక తగు నోటీసులు ఇచ్చి ఇళ్లు ఖాళీ చేయడానికి అవకాశం కల్పించాలి. అవేమీ అవసరం లేదని అనుకుంటే అది మానవత్వం కాదు. హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ కు ఓట్లు వేయలేదన్న అక్కసుతోనే రేవంత్ ప్రభుత్వం పేదల ఇళ్లను కూల్చుతోందని మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కెటిఆర్ ఆరోపించారు. అర్థం, పర్థం లేకుండా కూల్చివేతలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ కాని, ఇతర మంత్రులు కాని ప్రభుత్వ చర్యలను సమర్థించుకుంటున్నారు. హైదరాబాద్ ప్రతిష్ట పెంచేందుకు, వరదల వంటి సమస్యలు రాకుండా చేయడానికే తమ ప్రయత్నమని అంటున్నారు. కానీ ప్రభుత్వాలే లాండ్ రెగ్యులరైజేషన్, బిల్డింగ్ రెగ్యులైజేషన్ స్కీములు పెట్టి వేల కోట్లు వసూలు చేసుకున్నాయని, కానీ ఇప్పుడు అందుకు విరుద్దంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని కొందరు విమర్శిస్తున్నారు.మరో కోణం ఏమిటంటే ప్రస్తుత హైడ్రా కూల్చివేస్తున్న ఇళ్లు, అపార్ట్ మెంట్లు చాలావాటికి బ్యాంకులు, ప్రైవేటు ఆర్దిక సంస్థలు రుణాలు ఇచ్చాయి. ఒక అంచనా ప్రకారం ఇప్పటివరకు కూల్చిన ఇళ్లకు సంబంధించి బ్యాంకు రుణాలే రూ.రెండు వేల కోట్లు వరకు ఉన్నాయి. ఇప్పుడు ఈ కూల్చివేతల వల్ల ఆ బకాయిలు వసూలు కావని బ్యాంకులు ఆందోళన చెందుతున్నాయి. దీనిపై బ్యాంకులు కేద్రానికి, ఆర్బీఐకి లేఖలు రాస్తాయట. ఈ పరిణామాలను ఆలోచించిన తర్వాత, వివిధ పరిష్కార మార్గాలను చూపి ఇళ్ల కూల్చివేతలు చేస్తే ఫర్వాలేదు. అలా కాకుండా లేడికి లేచిందే పరుగు అన్నట్లు ప్రభుత్వం, హైడ్రా, తమకు తోచిన రీతిలో ఇళ్లు కూల్చితే దాని ప్రభావం లక్షల మందిపై పడుతుంది. రేవంత్ ప్రభుత్వం ప్రజాగ్రహానికి గురి అయ్యే అవకాశం ఉంది.లక్ష్యం, ఉద్దేశం మంచిదే అయినా, అమలు తీరు సరిగా లేకపోతే కూడా నష్టం జరుగుతుంది.ఎమర్జెన్సీ టైమ్ లో ఇందిరగాంధీ రెండో కుమారుడు సంజయ్ గాంధీ ఢిల్లీ సుందరీకరణ లో భాగంగా తుర్కుమాన్ గేట్ వద్ద ఇళ్లు కూల్పించారు. దానితో వేలాది మంది నష్టపోయారు. అలాంటి చర్యల ఫలితంగా ఎమర్జెన్సీ ఎత్తివేసి 1977లో ఎన్నికలకు వెళితే డిల్లీతో సహా ఉత్తరాది రాష్ట్రాలన్నిటిలో కాంగ్రెస్ తుడుచిపెట్టుకుపోయింది. అలాంటి అనుభవాలను నేతలు గ్రహించాలి. ప్రస్తుతం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలలో బాధిత ప్రజలు రేవంత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలకు దిగుతున్నారు.ఇందిరాగాంధీ పేరుతో ఏర్పాటైన కాంగ్రెస్ పార్టీ పేదలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందన్న విమర్శ కూడా మంచిది కాదు. ఇందిరాగాంధీ పేదల కోసం 20 సూత్రాల పధకం తో సహా, పలు కార్యక్రమాలను అమలు చేసి వారి పెన్నిదిగా పేరు తెచ్చుకున్నారు.కాని ఇప్పుడు అదే కాంగ్రెస్ పేదల వ్యతిరేక పార్టీ అని పేరు తెచ్చుకోవడం మంచిది కాదు.నిరసనలు తీవ్రమవుతున్నాయని గమనించిన రేవంత్ ప్రభుత్వం కొద్దిగా తగ్గినట్లు అనిపిస్తోంది. పూర్తి స్థాయిలో ప్రజామోదం లేకుండా రేవంత్ కూల్చివేతలపై ముందుకు వెళితే, తీవ్రమైన పరిణామాలు సంభవించే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు..కాంగ్రెస్ లో ప్రత్యర్ధి వర్గాలు దీనిని అవకాశంగా తీసుకుని రేవంత్ పదవికి ఎసరు పెట్టవచ్చు.కనుక రేవంత్ రెడ్డి తస్మాత్ జాగ్రత్త అని చెప్పాలి.-కొమ్మినేని శ్రీనివాసరావుసీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఆ కిటుకేదో సామాన్యులకు చెప్పండి.. రేవంత్ సోదరుడికి కేటీఆర్ డిమాండ్
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు. ‘‘అనుముల తిరుపతి రెడ్డి గారు! ఎల్కేజీ చదివే వేదశ్రీ కి తన పుస్తకాలు తీసుకునే సమయం కూడా ఇవ్వలేదు!. 50 ఏళ్ల కస్తూరి బాయి తన జీవనాధారమైన చెప్పుల దుకాణం కోల్పోయింది!. 72 గంటల క్రితం కొన్న ఇల్లు నేల మట్టమైంది!. వారం ముందు గృహప్రవేశం చేసుకున్న ఇల్లు, అన్ని కాగితాలు ఉన్నా.. పేక మేడల కూల్చివేయబడింది!. తిరుపతి రెడ్డి గారు, క్షణం కూడా సమయం ఇచ్చే ప్రసక్తే లేదన్న హైడ్రా.. మీ విషయంలో నోరు మెదపలేదు!’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.‘‘వాల్టా అనుకుంటా.. ఏకంగా మీకు 30 రోజుల టైం ఇచ్చింది! కోర్టులో స్టే సంపాదించుకున్నారు!. ప్రస్తుతం జరుగుతున్న కూల్చివేతల రావణకాష్టంలో మట్టి కూడా అంటనిది బహుశా మీకు మాత్రమేనామో!. మీ సోదరుడి బల్డోజర్ల కింద నలిగిపోతున్న సామాన్యులకు ఆ కిటుకేదో చెప్పండి!’’ అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు.అనుముల తిరుపతి రెడ్డి గారు! LKG చదివే వేదశ్రీ కి తన పుస్తకాలు తీసుకునే సమయం కూడా ఇవ్వలేదు! 50 ఏళ్ళ కస్తూరి బాయి తన జీవనాధారమైన చెప్పుల దుకాణం కోల్పోయింది! 72 గంటల క్రితం కొన్న ఇల్లు నేల మట్టమైంది! వారం ముందు గృహప్రవేశం చేసుకున్న ఇల్లు, అన్ని కాగితాలు ఉన్నా….పేక మేడల… pic.twitter.com/1zIb7cBrCB— KTR (@KTRBRS) September 24, 2024ఇదీ చదవండి: యజమానుల తప్పిదం.. సామాన్యులు బలి! -
20న తెలంగాణ కేబినెట్ భేటీ.. వీటిపైనే చర్చ!
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 20న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. సచివాలయంలో సాయంత్రం నాలుగు గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఈ కేబినెట్ భేటీ జరగనుంది. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేబినెట్ చర్చించనుంది.వరద నష్టం గురించి సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. వ్యవసాయ కమిషన్‌కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఆర్వోఆర్ చట్టం రద్దు చేయనున్నట్లు సమాచారం. పేదలందరికీ ఆరోగ్య బీమా, భూమాత పోర్టల్, కొత్త రేషన్ కార్డు మార్గదర్శకాలు, విద్యా కమిషన్, 200 కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేయనున్నట్లు తెలిసింది.ఇదీ చదవండి: మాజీ సీఎస్ సోమేష్‌కుమార్‌కు సీఐడీ నోటీసులు -
సెప్టెంబర్ 17 నుంచి ప్రజాపాలన కార్యక్రమం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: సెప్టెంబర్ 17 నుంచి 10 రోజుల పాటు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. రేషన్ కార్డు, హెల్త్ కార్డుల కోసం వివరాల సేకరణ, పూర్తి హెల్త్ ప్రొఫైల్ తో రాష్ట్రంలో ప్రతీ పౌరుడికి హెల్త్ కార్డులు.. ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయిలో అధికారులను సన్నద్ధం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం.. వైద్యారోగ్యశాఖ ప్రాజెక్టులపై సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు.గోషామహల్లో నిర్మించబోయే కొత్త ఉస్మానియా ఆసుపత్రిపై కూడా సీఎం సమీక్ష నిర్వహించారు. రానున్న 50 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం కోసం భూ బదలాయింపు ప్రక్రియ, డిజైన్లు, ఇతర ప్రణాళికలను వేగంగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. భవిష్యత్తులో ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా రోడ్ల అనుసంధానానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలిపారు. -
కేంద్రమంత్రి సింధియాతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ
సాక్షి, ఢిల్లీ: కేంద్ర టెలికం, కమ్యునికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శుక్రవారం భేటీ అయ్యారు. టీ-ఫైబర్ ప్రాజెక్టును భారత్ నెట్ ఫేజ్ 3గా మార్చేందుకు సమర్పించిన డీపీఆర్‌ను ఆమోదించాలని సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. ఆప్టికల్ ఫైబర్ ద్వారా అన్ని గ్రామ పంచాయతీలు, మండలాలు, జిల్లాలకు నెట్వర్క్ కల్పించడం టీ-ఫైబర్ లక్ష్యమన్నారు. టీ-ఫైబర్ ప్రధాన ఉద్ధేశం 65,000 ప్రభుత్వ సంస్థలకు జీ2జీ, జీ2సీ సేవలు అందిస్తామని రేవంత్ చెప్పారు.గ్రామీణ ప్రాంతాల్లో 63 లక్షల గృహాలకు, పట్టణ ప్రాంతాల్లో 30 లక్షల గృహాలకు నెలకు కేవలం రూ. 300 కే ఇంటర్నెట్, కేబుల్ టీవీ, ఈ-ఎడ్యుకేషన్ సేవలు అందించడం లక్ష్యం. టీ-ఫైబర్ అమలుగానూ జాతీయ ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్క్ (ఎన్ఎఫ్ఓఎన్) మొదటి దశ మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వానికి త్వరగా అందించాలని కేంద్ర మంత్రి సింధియాకు సీఎం విజ్ఞప్తి చేశారు. టీ-ఫైబర్‌కు రూ. 1779 కోట్ల మేర వడ్డీ లేని దీర్ఘకాలిక రుణాన్ని ఇవ్వాలని కేంద్ర మంత్రి సింధియాను సీఎం రేవంత్‌రెడ్డి కోరారు.