
సాక్షి, ఢిల్లీ: రేవంత్ రియల్ హీరో అని.. ఆయనను విమర్శించడం తప్ప రైతు దీక్షలో కేటీఆర్ చేసిందేమీ లేదంటూ కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, అమలు చేయకుండా మోసం చేశాడంటూ కేటీఆర్ ఆరోపణలు చేశారు. కేటీఆర్ వారి ప్రభుత్వ హయాంలో 10 ఏళ్లు అమలు చేయకుండా ప్రజలను ఏవిధంగా ఇబ్బందులపాలు చేశారో చెప్పినట్లే ఉంది. కాంగ్రెస్‌ను, సీఎం రేవంత్‌ని విమర్శిస్తూ అస్తిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తుంది’’ అని మల్లు రవి విమర్శలు గుప్పించారు.
‘‘రైతు భరోసా 12 వేలు, రెండు లక్షల వరకు రుణమాఫీ, ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంపు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500కే గ్యాస్ ఇలా మేము ఇచ్చిన హామీలను అమలు చేశాం. మేము చేసింది వాస్తవం, మీరు చేయనిది వాస్తవం. బీఆర్‌ఎస్ 10 ఏళ్ల పాలనలో 7 లక్షల మంది విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచాం. కార్పొరేట్ విద్యను 56 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ హాస్టళ్ల నిర్మాణం చేపట్టింది వాస్తవం. కాంగ్రెస్ హయాంలో రేవంత్ రియల్ హీరో అని.. ఆయనను విమర్శించడం తప్ప రైతు దీక్షలో కేటీఆర్ చేసిందేమీ లేదంటూ కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి వ్యాఖ్యానించారు. అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు. ప్రజలకు ఏం చెప్పమో మొదటి ఏడాదిలోనే చేసి చూపించాం’’ అని మల్లు రవి పేర్కొన్నారు.
బీఆర్‌ఎస్ 10 ఏళ్లలో 7 లక్షల కోట్ల అప్పు చేస్తే వాటికి రూ.6500 కోట్ల రూపాయలు వడ్డీలు కడుతున్నాం. పేదలకు ఇచ్చిన మాటను నిలుపుకునేందుకు తల తాకట్టు పెటైనా నెరవేర్చాలనే సంకల్పంతో రేవంత్ పనిచేస్తున్నారు. ఓటమిని జీర్ణించుకోలేక అవాకులు చెవాకులు పేలుతున్నారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాలని బీఆర్‌ఎస్ నేతలకు సూచిస్తున్నాం. ఇష్టారీతిన మాట్లాడితే కేటీఆర్ మీదకు ప్రజలు తిరగబడతారు. రాష్ట్రంలో అనవసరంగా ఖర్చులు చేసింది కేసీఆర్. వందేళ్లు పనిచేసే సచివాలయాన్ని కూల్చేసి కట్టారు. కేసీఆర్ హయాంలో స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం కూడా లేదు. మా హయాంలో ప్రజల పాలన నడుస్తుంది’’ అని మల్లు రవి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment