BRS Party
-
బీఆర్ఎస్కు పొంగులేటి వార్నింగ్.. కాంగ్రెస్ కార్యకర్తలు గాజులు తొడుక్కోలేదు
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి కేటీఆర్ అరెస్ట్‌పై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండమైపోతుందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. అదే జరిగితే కాంగ్రెస్ కార్యకర్తలెవరూ గాజులు తొడుక్కుని కూర్చోలేదన్నారు.తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యుల మధ్య వాడీవేడీ చర్చ నడుస్తోంది. ఈరోజు సమావేశాల్లో రైతుభరోసాపై చర్చ నడిచింది. దీంతో, బీఆర్ఎస్పై మంత్రులు సంచలన ఆరోపణలు చేశారు. ఇదే సమయంలో ఫార్ములా ఈ-కారు రేసు విషయంపై మంత్రి పొంగులేటి మాట్లాడారు. ఈ కేసులో కేటీఆర్ అరెస్ట్‌పై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. రాష్ట్రంలో భూభారతి చట్టం బీఆర్ఎస్కు ఇష్టం లేదు. తెలంగాణ ప్రజలకు మంచి జరగడం బీఆర్ఎస్ నేతలకు నచ్చదు. కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని బీఆర్ఎస్ నేతలు హెచ్చరిస్తున్నారు. అల్లర్లు చేయాలని నియోజకవర్గానికి రూ.2కోట్లు పంపించారు. అల్లర్లు జరిగితే కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరూ గాజులు తొడుక్కుని కూర్చోలేదు. రాష్ట్రం అగ్నిగుండం అయితే చూస్తూ ఊరుకోం. -
అది రుణమాఫీ కాదు.. వడ్డీ మాఫీ: సీతక్క
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రైతులు వరి వేస్తే ఉరి అన్నది బీఆర్ఎస్ నేతలు కాదా అని ప్రశ్నించారు మంత్రి సీతక్క. అలాగే, రైతులకు బేడీలు వేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ ఇచ్చింది రైతుబంధు కాదు.. పట్టా పెట్టుబడి అని కీలక వ్యాఖ్యలు చేశారు.తెలంగాణలో అసెంబ్లీ సమావేశాల సందర్బంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది. తాజాగా సభలో మంత్రి సీతక్క.. బీఆర్ఎస్ నేతలకు కౌంటరిచ్చారు. సభలో సీతక్క మాట్లాడుతూ.. కౌలు రైతుల గురించి మీకు మాట్లాడే అర్హత బీఆర్ఎస్కు ఉందా?. కౌలు రైతులకు రైతుబంధు ఎందుకు ఇవ్వాలని అన్నది మీరు కాదా. అద్దె ఇంట్లో ఉన్నవాళ్లు ఓనర్ అవుతారా? అని అన్నది ఎవరు?. ఈ రాష్ట్రంలో భూముల పై సమగ్ర సర్వే జరగాలి.వందల ఎకరాల్లో ఫాంహౌస్‌లు ఉన్నాయి. 5,6 లక్షల జీతాలు తీసుకునేవారు కూడా రైతుల ముసుగులో రైతుబంధు తీసుకున్నారు. గుట్టలు, రోడ్లకు బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు ఇచ్చింది. నిజంగా వ్యవసాయం చేసే కౌలు రైతులకు రైతుబంధు రాలేదు. బీఆర్ఎస్ ఇచ్చింది రైతుబంధు కాదు.. పట్టా పెట్టుబడి. పట్టాలేని ఎంతో మంది రైతులకు రైతుబంధు రాలేదు. బీఆర్ఎస్ చేసింది రుణమాఫీ కాదు.. వడ్డీ మాఫీ. బీఆర్ఎస్ అందరికీ రుణమాఫీ చేస్తే.. ఇప్పుడు 30వేల కోట్ల రుణ భారం ఎందుకు ఉంది.భూమి లేని పేదలకు మీరు ఏమిచ్చారు?. ఉచిత బస్సు సౌకర్యం ఇస్తే.. బీఆర్ఎస్ ఓర్వలేకపోతుంది. వందల ఎకరాల ఫౌంహౌస్‌లకు రైతు భరోసా ఇవ్వాలని బీఆర్ఎస్ అడుగుతుందా?. రైతు భరోసా ఎవరికి ఎంత పోతుంది అనేది అన్ని గ్రామాల్లో స్పష్టంగా వివరాలు ఉంచాలి అని కామెంట్స్ చేశారు. -
తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య.. -
ఏసీబీ కేసుపై కేటీఆర్ రియాక్షన్
-
ఫార్ములా ఈ-కారు రేస్ వ్యవహారంలో కేటీఆర్ పై కేసు నమోదు
-
ఫార్ములా ఈ రేస్ కేసుపై అసెంబ్లీలో కేటీఆర్ సవాల్
అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి.. సభలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్.. -
‘రేవంత్ ధర్నా చూసి జనం నవ్వుకున్నారు’
న్యూఢిల్లీ, సాక్షి: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తన మంత్రి వర్గ సహచరులతో.. అనుచరులతో రాజ్ భవన్ ముందు ధర్నా చెయ్యడం విడ్డూరంగా ఉందని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో రాష్ట్ర రాజకీయ పరిణామాలపై ఆయన మీడియాతో మాట్లాడారు.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. తన మంత్రివర్గ సహచరులతో పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఇవాళ హైదరాబాద్ రాజ్ భవన్ ముందు ధర్నా చేయడం విడ్డూరంగా అనిపించింది. ఏడాదిగా పాలనలతో.. సరైన పాలన లేదు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి మీద గాని ముందుడుగు పడటం లేదు.👉ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా అన్నిరకాల వైఫల్యంతో.. 12 ఏళ్లలో రావాల్సిన ప్రజావ్యతిరేకతను 12 నెలల్లోనే కూడగట్టుకున్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద మోదీ గారి మీద వ్యక్తిగత విమర్శలు చేస్తూ.. రేవంత్ రెడ్డి ధర్నా చేయడాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. అసలు అదానీ విషయం మాట్లాడే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదు. వందకోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటీకి ఖర్చు పెట్టేందుకు ఒప్పందం చేసుకున్నప్పుడు గుర్తులేదా?.. వందకోట్ల సహాయం ఎందుకు అడిగారు? ఎందుకు ఇస్తామన్నారు? ఇవన్నీ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది.👉కాంగ్రెస్ పార్టీని సవాల్ చేస్తున్నా.. రేవంత్ అయినా రాహుల్ గాంధీ అయినా.. ఏ ప్రాతిపదికన అదానీ మీద చర్యలు తీసుకోవాలి. ఒక సాక్ష్యం చూపిస్తారా?. మన మీడియా ముందు, న్యాయస్థానాల ముందు, ప్రజలముందు ఆధారాలు చూపించకుండా.. విమర్శలు చేయడం సరికాదు.👉గత పార్లమెంటు ఎన్నికల్లో ఇటీవల వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో వరుసగా ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంటున్న పార్టీ.. ఇవాళ ఫ్రస్టేషన్ లో అదానీ మాట మాట్లాడుతోంది. కేంద్ర ప్రభుత్వం పొరపాటు చేసిందని, కేంద్రం అవకతవకలకు పాల్పడిందని కాంగ్రెస్ పార్టీ ఇవాళ నిరూపించగలరా?.👉మాటమీద నిలబడే సత్తాలేక.. ఇవాళ విమర్శలు చేస్తున్నారు. ప్రపంచదేశాల ముందు భారతదేశాన్ని నవ్వలుపాలు చేస్తున్నది, భారత దేశ గౌరవ వ్యవస్థలపైన.. విదేశాల్లో మన సైనికుల మీద పరువు తీసే విధంగా మాట్లాడే అలవాటు మీ నాయకుడైన రాహుల్ గాంధీకి ఉంది.👉రేవంత్ రెడ్డి, కేసీఆర్ వైపే ఉన్నడు. కాంగ్రెస్, బీఆర్ఎస్ దోస్తులే. కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతే.. మళ్లీ బీఆర్ఎస్ పార్టీయే రావాలని కాంగ్రెస్ అధిష్టానం.. రేవంత్ రెడ్డికి హెచ్చరించిందా?. అందుకే రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ పాట పాడుతున్నాడా?. రేవంత్ రెడ్డి, కేసీఆర్ బొమ్మ బొరుసు లాంటి వ్యక్తులు.. దొందూ దొందే. ఈ రెండు పార్టీల పాలనకు తేడా లేదు. ప్రజలను వంచించడంలో తెలంగాణ సంపదను దోచుకోవడంలో, కుటుంబ పరిపాలన తీసుకురావడంలో, కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి తేడా లేదు అని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. -
‘వాళ్ల చేతులకు బేడీలేవీ?.. నిరసనల్లోనూ దురహంకారమేనా?’
హైదరాబాద్, సాక్షి: అసెంబ్లీలో ఇవాళ నల్ల దుస్తులు, చేతులకు బేడీలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేపట్టిన నిరసనపై మంత్రి సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిరసనల్లోనూ బీఆర్ఎస్లో సమానత్వమే లేదని అన్నారామె. అసెంబ్లీ లాబీలో మీడియా చిట్‌చాట్‌లో ఆమె మాట్లాడుతూ.. ‘‘కేటీఆర్, హరీష్ రావుల దొరతనం మరోసారి బయటపడింది. నిరసనల్లోనూ వాళ్లు తమ దురహంకారాన్ని ప్రదర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బేడీలు వేశారే తప్ప వాళ్లు వేసుకోలేదు. కనీసం వాళ్ల నిరసనల్లోనూ సమానత్వం లేదనే విషయం బయటపడింది’’ అని అన్నారామె. అలాగే.. లగచర్ల రైతుకు బేడీల వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. సంబంధిత అధికారులపై చర్యలు కూడా తీసుకున్నారు. కానీ, బీఆర్ఎస్ హయాంలో కనీసం పదిసార్లు అయినా రైతులకు బేడీలు వేసి ఉంటారు. ఆ టైంలో అధికారులపై కనీస చర్యలు కూడా తీసుకోలేదు. ఆ లెక్కన ఇప్పుడు రైతులకు బేడీలు వేశారంటూ మాట్లాడే అర్హత బీఆర్ఎస్ లేనేలేదు. గతంలో.. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా వెల్‌లోకి వెళ్తే సభ నుంచి సస్పెండ్ చేసేవాళ్లు. కానీ, ఇప్పుడు వాళ్లు పెట్టిన నిబంధనలనే వాళ్లు కాలరాస్తున్నారు. అయినా సభలో వాళ్ళు పెట్టిన రూల్స్ పై వాళ్ళే అభ్యంతరం చెప్పడం ఏంటో? అని సీతక్క అన్నారు. -
దద్దరిల్లిన అసెంబ్లీ: చేతికి సంకెళ్లతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ నిరసన చేపట్టారు. నల్ల దుస్తులు, బేడీలతో అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. రైతులకు బేడీలా సిగ్గు సిగ్గు అంటూ నినాదాలు చేశారు. లగచర్ల రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు.‘లగచర్ల’ఘటనపై నిన్న (సోమవారం) కూడా శాసనసభ అట్టుడికింది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సభ్యుల నిరసనలు, నినాదాలతో హోరెత్తింది. ‘రాష్ట్రంలో పర్యాటక విధానం’అంశంపై మంత్రి జూపల్లి కృష్ణారావు లఘుచర్చను ప్రారంభించగానే బీఆర్ఎస్ సభ్యులంతా లేచి.. ‘లగచర్ల’రైతుల నిర్బంధం, అరెస్టులపై చర్చించాలని పట్టుబట్టారు. స్పీకర్ అంగీకరించకపోవడంతో ప్లకార్డులను ప్రదర్శిస్తూ, నినాదాలు చేశారు. వెల్‌లోకి దూసుకొచ్చి నిరసన తెలిపారు.మరోవైపు, లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి, చిత్రహింసలకు గురిచేశారని.. దీనిపై మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన తెలపాలని బీఆర్ఎస్ పిలుపు ఇచ్చింది. జైళ్లలో నిర్బంధించి, రైతన్న చేతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ అమానవీయ, అణచివేత విధానాలను నిలదీయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు. లగచర్ల రైతులపై కేసులను ఎత్తివేసి వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: ‘ఈ కార్ రేసు’ కేసు.. స్పందించిన కేటీఆర్ -
బీఆర్ఎస్ సభ్యుల నిరసనల మధ్యే బిల్లులకు ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ నేడు వాడివేడిగా సాగుతోంది. టూరిజం పాలసీపై చర్చిద్దామని ప్రభుత్వం ప్రతిపాదించగా.. బలవంతపు భూసేకరణ, లగచర్ల రైతులకు బేడీలు వేసిన అంశంపైనే మొదట చర్చించాలని ప్రతిపక్ష బీఆర్ఎస్ పట్టింది. సభకు బీఆఎస్ ఎమ్మెల్యేలు బేడీలు వేసుకునిరావడం గమనార్హం. -
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళనలు..తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభం.. -
అసెంబ్లీలో చర్చకు సిద్ధమా?.. బీఆర్ఎస్కు డిప్యూటీ సీఎం సవాల్
సాక్షి, ఖమ్మం జిల్లా: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. లెక్కలపై అసెంబ్లీలో చర్చించేందుకు మేం సిద్ధమంటూ సవాల్ విసిరారు. ఆదివారం ఆయన కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మాట్లాడుతూ, మంచి పోషక విలువలు కలిగిన ఆహారం పిల్లలకు అందిస్తున్నామని తెలిపారు. నూతనంగా పెంచిన డైట్ ఛార్జీల కారణంగా రాష్ట్ర ప్రభుత్వంపై కొంత భారం పడుతుందన్నారు.‘‘రాష్ట్ర ప్రభుత్వం నేరుగా తీసుకున్న అప్పులు 2014 నాటికి 72450 కోట్ల రూపాయలు.. ప్రభుత్వంతో పాటు కొన్ని కార్పొరేట్ బ్యాంక్‌ల ద్వారా అప్పులు చేసింది. 5893 కోట్లు రాష్ట్ర విభజన జరిగే నాటికి అప్పు ఉంటే అవి 95 వేల కోట్లకు పెరిగింది. పదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం 7 లక్షల 23 వేల కోట్లు చేసింది. అది రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలి. మేము కూడ అప్పులు చేశామని అంటున్నారు. మీరు చేసింది తినేందుకు, మేము చేసేది అప్పు కట్టేందుకు’’ అంటూ భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.మా ప్రభుత్వం ఏర్పడ్డాక 50 వేల కోట్లు.. మేము అప్పు వడ్డీ కలిపి 66 వేల 722 కోట్లు చెల్లించాం. 2014 రాష్ట్ర విభజన జరిగే నాటికి సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టే అప్పు 6 వేల 400 కోట్లు ఉండేది. ఇంత భారం రాష్ట్ర ప్రభుత్వం మీద వేసి, తగుదునమ్మా అన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం మీద అరుస్తా ఉన్నారు. 10 ఏళ్లు పెరిగిన ధరలకు అనుగుణంగా మీరు రేట్లు పెంచలేదు కాబట్టి అన్నంలో పురుగులు వంటివి వచ్చాయి. మళ్ళీ తిరిగి రెసిడెన్షియల్ స్కూల్లో టాయిలెట్స్ సరిగా లేవని మాట్లాడుతున్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నది మీరే కదా?’’ అంటూ భట్టి ప్రశ్నించారు.‘‘మేము కేవలం సంవత్సర కాలంలోనే పూర్తి కాకముందే 21 వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాం. 66 వేల కోట్ల రూపాయలు అప్పు కడుతూ రైతుల అప్పు కడుతున్నాం. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇన్ని వేల కోట్లు రైతుల అప్పు కట్టలేదు. రైతు భరోసా 7 వేల 625 కోట్లు కల్పించాం. రైతు బీమా కట్టాం. 1500 రూపాయలు రైతు బీమా ప్రభుత్వం కట్టింది. ఆయిల్ ఫోం కి 40 కోట్లు విడుదల చేశాం. 30 వేల కోట్ల రూపాయలు రైతులకు మేము బోనస్ కాకుండా రైతుల కోసం మేము డిసెంబర్ నుండి వాటికి నేరుగా ఖర్చు పెట్టాం’’ అని భట్టి విక్రమార్క వివరించారు.పదేళ్లలో బీఆర్ఎస్ పార్టీ పంట నష్టపోయిన రైతులను పట్టించుకోలేదు. రైతుల పట్ల ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో పని చేస్తుంది. భూమిలేని నిరుపేదల గురించి కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. దానికి ప్రభుత్వం వెనకడుగు వేయడం లేదు. డిసెంబర్ 28వ తేదీన మొదటి ఇన్స్టాల్మెంట్ ఇస్తుంది. రైతుల పక్షాన, వ్యవసాయ పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. సీఎం పైన, ప్రభుత్వం పైన తప్పుడు కథనాలు ప్రచురిస్తే నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరు. 56 వేల మంది నిరుద్యోగ యువతకు నియామక పత్రాలు అందించాం. ఇంకా 22 వేల కోట్ల బడ్జెట్‌తో 3500 ఇళ్లను నిర్మించేందుకు ప్రభుత్వం పూనుకుంది. ప్రతిపక్ష పార్టీ వాస్తవాలను అవాస్తవాలుగా చూపించే ప్రయత్నం చేస్తుంది’’ అని భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. -
పార్టీ మారిన నేతలు.. అసెంబ్లీలో ఏ ముఖంతో మాట్లాడతారు: కవిత
సాక్షి, జగిత్యాల: జగిత్యాల అంటే బీఆర్ఎస్ అడ్డా అని చెప్పుకొచ్చారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఎన్నికల్లో కేసీఆర్ బొమ్మ పెట్టుకుని గెలిచిన ఎమ్మెల్యే సంజయ్ ఏ ముఖం పెట్టుకుని మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లిని, బతుకమ్మను దూరం చేసిందని ఘాటు విమర్శలు చేశారు.ఎమ్మెల్సీ కవిత ఆదివారం జగిత్యాలలో పర్యటించనున్నారు. నియోజకవర్గంలో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. జగిత్యాల అంటే బీఆర్ఎస్ అడ్డా. మీరు గెలిపించిన నాయకుడు పార్టీకి ద్రోహం చేసిన వెళ్లిపోయాడు. ఎన్నికల్లో కేసీఆర్ బొమ్మ పెట్టుకొని గెలిచిన ఎమ్మెల్యే సంజయ్ అసెంబ్లీకి వెళ్ళి ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతాడో చూద్దాం. జగిత్యాలకి ఒక్క రూపాయి రాలేదు, జగిత్యాలలో అభివృద్ధి ఏమీ జరగలేదు.పైసల కోసం సంజయ్ పార్టీ మారాడు. పైసలా కోసం పార్టీ మారిన వ్యక్తులు నాయకులే కాదు. మిమ్మల్ని చూస్తే అర్థం అవుతుంది మీలో ఒకరు ఎమ్మెల్యే అవుతారు. కేసీఆర్‌కు సైనికులుగా మీరంతా ఉన్నారు. మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే. కాంగ్రెస్ ప్రభుత్వం మనకు తెలంగాణ తల్లిని, బతుకమ్మను దూరం చేసింది. అధికారం కోసం కాంగ్రెస్ నేతలు ఎన్నో హామీలు ఇచ్చారు. కానీ, ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు అంటూ ాటు వ్యాఖ్యలు చేశారు. -
అల్లు అర్జున్ రిలీజ్ ఆలస్యమెందుకు?.. అదే జరిగితే స్టేట్ అగ్నిగుండమే: కౌశిక్ రెడ్డి
సాక్షి, కరీంనగర్: అల్లు అర్జున్ అరెస్ట్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎవరినైనా అరెస్ట్ చేయడం సరికాదన్నారు. ఇదే సమయంలో జైలు సూపరింటెండెంట్‌కు బెయిల్ పేపర్స్ అందిన తర్వాత కూడా ఎందుకు రిలీజ్ చేయలేదని ప్రశ్నించారు.అల్లు అర్జున్ అరెస్ట్‌పై తాజాగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పందించారు. ఈ సందర్బంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ..‘అల్లు అర్జున్ అరెస్ట్‌ను నేను తీవ్రంగా ఖండిస్తున్నా. అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్. అల్లు అర్జున్ అయినా, నేనైనా, ఎవరైనా సరే.. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయడం సరికాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్రమ అరెస్ట్‌లు చేయిస్తున్నాడు. బెయిల్ పేపర్స్ నిన్ననే జైలు సూపరింటెండెంట్‌కు అందిన తర్వాత రిలీజ్ ఎందుకు చేయలేదో చెప్పాలి.సోషల్ మీడియాలో కేటీఆర్ అరెస్ట్ అంటూ వస్తున్న వార్తలు వింటున్నా. అదే జరిగితే తెలంగాణా అగ్నిగుండం అవుతుంది. ఫార్ములా ఈ-రేసు కోసం ప్రపంచ దేశాలు పోటీ పడుతున్నాయి. ఓ విజన్ లేక, ఏం చేయాలో తెలియక, దాన్ని తీసుకొచ్చిన కేటీఆర్ ఏదో తప్పు చేసినట్టు చిత్రీకరిస్తున్నారు. ఫార్మూలా ఈ-రేసు తీసుకొచ్చి దాని ద్వారా హైదరాబాద్‌కు టెస్లా తీసుకొద్దామన్న ఆలోచన కేటీఆర్‌కు ఉండేది. ఈ విషయం వీళ్లకు తెలుసా అని ప్రశ్నించారు. -
మిలిటెంట్ తరహాలో ముందుకు..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ఏడాది పాలన పూర్తయిన నేపథ్యంలో ఇకపై దూకుడుగా పోరాటాలు చేపట్టా లని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నిర్ణయించింది. కొత్త ప్రభుత్వం కుదురుకుని పనిచేసేందుకు సరిపడా సమయం ఇచ్చా మని భావిస్తోంది. ఇక ముందు పూర్తిస్థాయిలో ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని.. ఒకవైపు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే, మరోవైపు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు చేసిన మంచిని వివరించాలని నిర్ణయించింది.కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ఎన్నికల హామీలు అమలు చేయకపోవడంపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని.. బీఆర్ఎస్ దీనిని అనుకూలంగా మలుచుకోవాలని నేతలు, కార్యకర్తలకు పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. రాబోయే రోజుల్లో పార్టీ కేడర్‌ను, ప్రజలను భాగస్వాములను చేస్తూ రేవంత్ ప్రభుత్వం తీరుపై ‘మిలిటెంట్ తరహా దూకుడు పోరాటాలు చేయాల’ని ఇటీవల జరిగిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భేటీలో సూచించినట్టు తెలిసింది. పార్టీ విధానాలపై ఫోకస్.. కాంగ్రెస్ విధానాలను నిరంతరం విమర్శించడం వల్ల అధికారం కోల్పోయానే బాధతో విమర్శలు చేస్తున్నట్టుగా ప్రజలు భావించే అవకాశం ఉందని కేసీఆర్ అభిప్రాయపడినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే దూరదృష్టితో పదేళ్ల పాలనలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, వాటి అమలు వెనుక ఉన్న తాతి్వకతను కూడా ప్రజలకు విడమరిచి చెప్పాలని సూచించినట్టు సమా చారం. ‘‘హైదరాబాద్‌లో భారీ బహుళ అంతస్తుల భవనాల నిర్మాణానికి అనుమతులివ్వడం ఇక్కడి ఆర్థిక పటిష్టతను ప్రజలకు చాటి చెప్పాం. ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో ఉన్న అవకాశాలను దృష్టిలో పెట్టుకుని భారీ ఫార్మాసిటీ ఏర్పాటుకు భూసేకరణ చేశాం. గత ప్రభుత్వం తీసుకున్న ప్రతీ నిర్ణయం వెనుక అనేక శాస్త్రీయ కోణాలు ఉన్నాయి. వాటిని సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో అసెంబ్లీలో, బయటా పార్టీ నేతలు విడమరిచి చెప్పాలి..’’అని పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో కేసీఆర్ పేర్కొన్నట్టు తెలిసింది.ప్రభుత్వ తప్పులను ఎండగట్టడం, పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం కేవలం ప్రెస్మీట్లు, పత్రికా ప్రకటనలకు పరిమితం కాకుండా... సోషల్ మీడియాను విస్తృతంగా వాడుకోవాలని సూచించినట్టు తెలిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తు న్న ప్రజా వ్యతిరేకత బీజేపీకి అనుకూలంగా ఏమీ మారడం లేదని, దీనిని బీఆర్ఎస్ అందిపుచ్చుకోవాలని పేర్కొన్నట్టు సమాచారం. అసెంబ్లీ వేదికగా ఒత్తిడి పెంచి..: అసెంబ్లీ శీతాకాల సమావేశాలను వేదికగా చేసుకుని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది. తొలిరోజున అదానీ–రేవంత్ దోస్తీ అంటూ టీషర్టులు ధరించి అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. సభ జరిగే మిగతా రోజుల్లోనూ ఏదో ఒకరకమైన వ్యూహంతో అసెంబ్లీకి వచ్చి ప్రజల్లో చర్చ జరిగేలా చేయాలని నిర్ణయానికి వచి్చ నట్టు తెలిసింది. పార్టీ ఫిరాయింపుల అంశంపై స్పీకర్ అనుసరిస్తున్న వైఖరిని ప్రశ్నిస్తూ వాయిదా తీర్మానం ఇవ్వడం, లేదా స్వల్పకాలిక చర్చకు పట్టుబట్టడం దిశగా ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ఇక కాంగ్రెస్ ఇచ్చిన 6గ్యారంటీలకు అసెంబ్లీతో చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్‌తో ఒత్తిడి తీసుకురావాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఈసారి అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ హాజరైనా ఎలాంటి చర్చల్లో పాల్గొనే అవకాశం లేదని సమాచారం. అసెంబ్లీ సమావేశాలు ముగిశాక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లాల్లో పర్యటించనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.సంస్థాగత అంశాలపై ఫోకస్.. వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలాఖరులో హైదరాబాద్, వరంగల్‌లలో కాకుండా అన్ని జిల్లాలనుంచి రాకపోకలకు అనువుగా ఉండే ప్రాంతాన్ని ఎంచుకుని భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించినట్టు తెలిసింది. ఉద్యమకాలంలో నిర్వహించిన తరహాలో భారీ జనసమీకరణతో పార్టీ సత్తా చాటేలా సభ ఉంటుందని ఇటీవల తనను కలిసిన పార్టీ నేతలతో కేసీఆర్ పేర్కొన్నట్టు సమాచారం. ఇక వచ్చే ఏడాది పొడవునా గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కార్యవర్గాల ఏర్పాటు, సంస్థాగత శిక్షణ వంటి కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్టు తెలిసింది. యువత, మహిళలకు చేరువ కావడం లక్ష్యంగా కార్యక్రమాలనిర్వహణకు సన్నాహాలు జరుగుతున్నట్టు సమాచారం. -
రేవంత్.. ప్రభుత్వమా లేక అబద్ధాల ఫ్యాక్టరీనా?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి కేటీఆర్. రేవంత్.. మీది ప్రభుత్వమా లేక అబద్ధాల ఫ్యాక్టరీనా అని ప్రశ్నించారు. అలాగే, కాకిలెక్కలతో ప్రజలని మోసగించడమే మీ విధానమా? అంటూ మండిపడ్డారు. అధికారం కోసం అబద్దాలు .. అధికారం దక్కిన తర్వాత పథకాల ఎగవేతకు కుంటిసాకులు అంటూ ఎద్దేవా చేశారు.బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..రేవంత్.. మీది ప్రభుత్వమా.. లేక అబద్దాల ఫ్యాక్టరీనా?మీ మాటలు అబద్ధం.. మీ చేతలు అబద్ధం..అర్దసత్యాలు..అభూతకల్పనలతో ఇంకెన్నాళ్లు మోసం చేస్తారు!కాకిలెక్కలతో ప్రజలని మోసగించడమే మీ విధానమా?50 వేల కోట్లు, 65 వేల కోట్లు వడ్డీలు అని అవాస్తవాల వల్లింపు ఎవరి కోసం?RBI Handbook of India States బట్టి తెలంగాణ అప్పు ఎంత వుందో తేటతెల్లమవుతుంది!ఢిల్లీకి మూటలు మూసేందుకా? నీ జేబు నింపుకునేందుకా? అబద్ధానికి అంగు లాగీ వేస్తే రేవంత్ అని మళ్లీ నిరూపించుకున్నారు!Lies, more lies and nothing but LIES! అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఇదే సమయంలో ప్రకటనలు కాదు.. పథకాల అమలు కావాలి.కోతలు కాదు, కూతలు కాదు.. చేతలు కావాలి.అధికారంలోకి వస్తే ఎకరాకు ఏడాదికి రూ.15 వేలు అని ఊదరగొట్టారు..ఏడాదిగా ప్రకటనలతోనే కాలం వెళ్లదీస్తున్నారు.అర్హుల కోసం, అమలు కోసం మంత్రివర్గ ఉపసంఘం అని సభలు, సమావేశాలు పెట్టారు.ఏడాదిగా రైతుబంధు మీద కొండను తవ్వి ఎలుకను పట్టలేదు.. మంత్రివర్గ ఉప సంఘం నివేదిక ఊసేలేదు.అధికారం కోసం అబద్దాలు .. అధికారం దక్కిన తర్వాత పథకాల ఎగవేతకు కుంటిసాకులు.పదేళ్ల కేసీఆర్ గారి పాలనలో ఆత్మవిశ్వాసంతో మీసం మెలేసిన రైతన్నలను .. ఏడాది కాంగ్రెస్ పాలనలోనే అప్పుల పాలు చేశారుఇప్పటికైనా కల్లు తెరవండి ..వర్షం కురుస్తుందో ? లేదో ?సాగునీరు అందుతుందో ? లేదో ?కరంటు వస్తుందో ? లేదో ?పెట్టిన పెట్టుబడికి తగిన దిగుబడి వస్తుందో ? లేదో తెలియకున్నాభూమిని నమ్మి సేద్యం చేసి .. ప్రపంచానికి బువ్వను అందించే రైతన్నలకు భరోసా ఇవ్వండిఅమ్మల విషయంలో అన్నదాతల విషయంలో వివక్ష చూపకండి..పథకాల అమలు ఎగవేతకు కారణాలు వెతకకండిజై కిసాన్.. జై తెలంగాణ అంటూ కామెంట్స్ చేశారు. -
ఏ బిల్లు.. ఏ తీర్మానం ఏంటి..?
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఈ నెల 11, 12 తేదీల్లో రెండురోజులపాటు అవగాహన కల్పించే కార్యక్రమాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో బుధ, గురువారాల్లో జరిగే ఈ అవగాహన కార్యక్రమ ఏర్పాట్లను స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వి.నర్సింహాచార్యులు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను ఎంసీహెచ్ఆర్డీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శశాంక్ గోయల్ వివరించారు. » తొలిరోజు బుధవారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే అవగాహన కార్యక్రమంలో ‘ప్రభావంతమైన శాసనసభ్యులుగా ఉండటం ఎలా’అనే అంశంపై చక్షురాయ్, ‘ప్రజాప్రతినిధులు–గౌరవ మర్యాదలు, ప్రొటోకాల్, పాలనలో వారి పాత్ర’అనే అంశంపై పీడీటీ ఆచారి ప్రసంగిస్తారు. » మధ్యాహ్నం సెషన్లో ‘ప్రశ్నోత్తరాలు, జీరో అవర్, తీర్మానాలు, వాయిదా తీర్మానాలు, ప్రత్యేక ప్రస్తావనలు, అత్యవసర అంశాలు’తదితరాలపై చక్షురాయ్ ప్రసంగిస్తారు. » రెండోరోజు గురువారం జరిగే ప్రారంభ సెషన్లో ‘బిల్లుల ప్రస్తావన.. వాటిని పరిగణనలోకి తీసుకోవడం, పాస్ చేయడం’, ‘రాష్ట బడ్జెట్‌ను అవగాహన చేసుకోవడం’పై తుషార్ చక్రవర్తి ప్రసంగిస్తారు. » భోజన విరామం అనంతరం జరిగే సెషన్లో ‘రాష్ట్ర లెజిస్లేచర్ కమిటీలను బలోపేతం చేయడం’పై పీడీటీ ఆచారి ప్రసంగిస్తారు. అనంతరం జరిగే ముగింపు కార్యక్రమంలో స్పీకర్, మండలి చైర్మన్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు పాల్గొంటారు ఓరియెంటేషన్‌ను బహిష్కరిస్తున్నాం: కేటీఆర్ రెండు రోజులపాటు జరిగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అవగాహన కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ‘శాసనసభ ప్రారంభానికి ముందే మా హక్కులకు భంగం కలిగేలా స్పీకర్ వ్యవహరించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాసమస్యలను ఎత్తిచూపేందుకు నిరసన తెలిపితే అరెస్టు చేశారు. మా పార్టీ శాసనసభ్యుల అక్రమ పార్టీ ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ నాని్చవేత ధోరణి అవలంబిస్తున్నారు. గత శాసనసభ సమావేశాల్లోనూ మా పార్టీ సభ్యుల గొంతు నొక్కేలా మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా వ్యవహరించారు. బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుల్లో అతి తక్కువమంది మాత్రమే కొత్త శాసనసభ్యులు ఉన్నారు. ఇప్పటికైనా స్పీకర్ పార్టీలకతీతంగా ఎలాంటి వివక్ష లేకుండా వ్యవహరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం’అని కేటీఆర్ పేర్కొన్నారు. -
తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నేతల నిరసనలు
-
బీఆర్ఎస్ పై కోమటిరెడ్డి సెటైర్లు
-
బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసనలు..
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సర్కార్‌కు వ్యతిరేకంగా తెలంగాణభవన్ వద్ద బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నిరసనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై సెటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు. రైతుబంధు గోవిందా.. తులం బంగారం గోవిందా అంటూ నినాదాలు చేస్తున్నారు.తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్బంగా బీఆర్ఎస్ నేతలు అదానీ-రేవంత్ ఫొటోతో ఉన్న టీ షర్ట్స్ ధరించి సమావేశాలకు వచ్చారు. ఈ సందర్బంగా అసెంబ్లీ గేటు వద్ద వారిని పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. అనంతరం, వారిని తెలంగాణ భవన్ వద్ద వదిలేశారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలు నిరసనలు తెలుపుతున్నారు.బీఆర్ఎస్ నేతలంతా తెలంగాణభవన్ ముందు కూర్చుని నినాదాలు చేస్తూ.. అదానీ రేవంత్ భాయ్ భాయ్..కోహినూర్ హోటల్ మే దేకో రేవంత్ అదానీ ...కొడంగల్ మే దేకో రేవంత్ అదానీ ...రామన్నపేట మే దేకో రేవంత్ అదానీ ..కాంగ్రెస్ తల్లి వద్దు తెలంగాణ తల్లి ముద్దు .. అంటూ నినాదాలు చేశారు.ఇదే సమయంలో కాంగ్రెస్ ఒచ్చి గోవిందా .. రేవంత్ ఒచ్చి గోవిందా ...కల్యాణ లక్షి గోవిందా ..తులం బంగారం గోవిందా ..బతుకమ్మ చీరలు గోవిందా ..చెపలు పెంచుడు గోవిందా ..గొర్రెలు పంచుడు గోవిందా ..రైతు బందు గోవిందా ..రైతు రుణ మాఫీ గోవిందా ... అంటూ నిరసనలు తెలుపుతున్నారు. -
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేనికి బిగ్ షాక్.. హైకోర్టు ఝలక్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పౌరసత్వంపై ఆయన వేసిన పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది. ఈ సందర్భంగా రమేష్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు.. ఆయనకు 30 లక్షలు జరిమానా విధించింది.బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. పౌరసత్వం విషయంలో రమేష్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. పదిన్నర సంవత్సరాల పాటు ఈ పిటిషన్‌పై సుదీర్ఘ విచారణ జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చెన్నమనేనిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వాదనల సందర్బంగా కోర్టును తప్పుదోవ పట్టించినందుకు హైకోర్టు సీరియస్ అయ్యింది. ఆయన పిటిషన్‌ను డిస్మిస్ చేస్తున్నట్టు తెలిపింది. రమేష్ కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారు.. ఫేక్ డాక్యుమెంట్స్ సమర్పించారు. కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు.జర్మనీ పౌరసత్వంతోనే ఆయన అక్కడికి వెళ్లారని కోర్టు తెలిపింది. దీంతో, చెన్నమనేనికి రూ.30 లక్షలు జరిమానా విధించింది. జరిమానాలో రూ.25 లక్షలు కాంగ్రెస్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు ఇవ్వాలని తెలిపింది. మిగిలిన రూ.5లక్షలను హైకోర్టు లీగల్ సర్వీస్ అథారిటీకి చెల్లించాలని ఆదేశం. నెల రోజుల్లో చెల్లింపులు పూర్తిచేయాలని చెన్నమనేనికి సూచించింది. -
బీఆర్ఎస్ నేతల టీ షర్ట్స్పై రేవంత్ ఫొటో.. అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ నేతలు.. అదానీ-రేవంత్ ఉన్న ఫొటోతో టీ షర్టులు వేసుకుని వచ్చారు. దీంతో, వారిని పోలీసులు అడ్డుకున్ని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చారు. ఈ క్రమంలో వారంతా రేవంత్, అదానీలు కలిసి ఉన్న ఫొటోలతో టీ షర్టీలు ధరించి అసెంబ్లీ వద్దకు వచ్చారు. ఈ క్రమంలో అసెంబ్లీ గేటు నెంబర్-2 వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. టీ షర్టులు ధరించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా పోలీసులు, బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వదం జరిగింది. అనంతరం, పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ.. అసెంబ్లీలో ప్రజా సమస్యలను లేవనెత్తుతాం. రేవంత్-అదానీ ఒక్కటై తెలంగాణ ప్రజలతో ఆడుకుంటున్నారు. ప్రతీ సమస్యపై అసెంబ్లీలో మాట్లాడుతాం. కాంగ్రెస్ ద్వంద్వ విధానాలను ఎండగడతాం.అనంతరం, హరీష్ రావు మాట్లాడుతూ.. రేవంత్-అదానీ టీషర్టు వేసుకుని సభలోకి వస్తే ఇబ్బందేంటి?. ప్రజా ప్రతినిధులను అడ్డుకోవడం ప్రజాస్వామ్యం అవుతుందా?. అదానీ, రేవంత్ రెడ్డి భాయ్, భాయ్. అరెస్ట్ చేసి, గొంతు నొక్కి మమ్మల్ని ఆపలేరు. -
కాంగ్రెస్ సర్కారుపై బీజేపీ, బీఆర్ఎస్ చార్జిషీట్
-
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం
-
అసెంబ్లీలో రేవంత్ సర్కార్‌ను నిలదీస్తాం: కేటీఆర్
సాక్షి, సిద్ధిపేట: రైతుల తరపున అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదిస్తామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గురుకులాల్లో ఉన్న దుర్భర పరిస్థితులపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఓ రిపోర్ట్ ఇచ్చామన్నారు. రైతులపై దాడి చేస్తూ భూములు లాక్కుంటూ ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తే అడ్డుకుంటామని కేటీఆర్ హెచ్చరించారు.‘‘మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల హక్కుల ఉల్లంఘన జరుగుతుంది. అత్యంత మూర్ఖంగా, అనాలోచితంగా చరిత్ర గురించి తెలియకుండా ఏర్పాటు చేస్తున్న విగ్రహం గురించి పోట్లాడతాం. మోసాలు, అడ్డగోలు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ఇచ్చిన మేనిఫెస్టోపై నిలదీస్తాం. రాష్ట్ర ప్రజల గొంతుకై తెలంగాణ సమస్యలపై అసెంబ్లీలో పోరాడతాం. అరకొరగా రుణమాఫీ చేశారు. కొనుగోలు కేంద్రాలు సరిగా నడపలేని పరిస్థితి. విజయోత్సవాల పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని మరోసారి మోసం చేస్తోంది ’’ అని కేటీఆర్ దుయ్యబట్టారు.రేపటి నుంచి (సోమవారం) నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో నేడు బీఆర్ఎస్ శాసనసభా పక్ష భేటీ జరిగింది. ఎర్రవల్లి నివాసంలో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీకి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు కొందరు ముఖ్య నేతలు కూడా హాజరయ్యారు. సుమారు వారం రోజుల పాటు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ నాయకులకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ఎన్నికల హామీలు, ఏడాదిలో రేవంత్ ప్రభుత్వ పాలన వైఫల్యాలతో పాటు ప్రజా సమస్యలను ప్రస్తావించాలని బీఆర్ఎస్ భావిస్తోంది. మరోవైపు సోమవారం బీఏసీ సమావేశంలో ప్రతిపాదించే ఎజెండా ఆధారంగా తమ వ్యూహానికి పదును పెట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది.