ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో ఉద్రిక్తత | BRS Leaders Ktr And Harish Rao House Arrest | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో ఉద్రిక్తత

Oct 9 2025 7:53 AM | Updated on Oct 9 2025 11:55 AM

BRS Leaders Ktr And Harish Rao House Arrest

బీఆర్‌ఎస్‌ నేతల బస్‌భవన్‌ అప్‌డేట్స్‌.. 

వినతి పత్రం అందజేత..

  • పెంచిన ఆర్టీసీ చార్జీలను తగ్గించాలని కోరిన బీఆర్‌ఎస్‌ నేతలు.  
  • ఆర్టీసీ ఎండీకి వినతి పత్రం ఇచ్చిన బీఆర్‌ఎస్‌ నేతలు కేటీఆర్, హరీష్ రావు. 

 

ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటే ఇదేనా?: హరీష్‌ ఫైర్‌

  • హరీష్‌ రావు కామెంట్స్‌..
  • ప్రజా ప్రతినిధులను ఎక్కడిక్కడ హౌస్ అరెస్టులు చేయడం అత్యంత దుర్మార్గం.
  • ఇది అప్రజాస్వామికం, కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశత్వానికి ఇది నిదర్శనం.
  • నాయకులను, కార్యకర్తల్ని ఎందుకు అరెస్టులు చేస్తున్నారు.
  • ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటే ఇదేనా?
  • వెంటనే అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
  • 20 నెలల్లో 5 సార్లు బస్ ఛార్జీలు పెంచారు.
  • భార్యకు ఫ్రీ అని భర్తకు టికెట్ డబుల్ చేశారు. విద్యార్థులకు డబుల్ చేశారు.
  • ఇప్పటికే జీవో 53, 54 లతో కొత్త వాహనాలపై లైఫ్ ట్యాక్స్ పెంచి ప్రజలపై భారం వేసిండు.
  • పేద, మధ్య తరగతి ప్రజలను దొంగ దెబ్బ కొట్టిండు రేవంత్ రెడ్డి
  • వాహన లైఫ్ టైం టాక్సులు, రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచడం ద్వారా ప్రజల రక్తం పీల్చుతున్నడు రేవంత్ రెడ్డి.
  • మెట్రో రైలును ఆగం చేసిండు.
  • కాంగ్రెస్ పాలనలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు కూడా లేదా?
  • ఇది ఇందిరమ్మ రాజ్యమా? ఎమర్జెన్సీ పాలనా?
  • ఇది ప్రజా పాలనా లేక ప్రజా పీడననా?
  • రేవంత్ రెడ్డి ఏం చేసినా ఎవ్వరూ అడగొద్దు అన్నట్లు ఉంది.
  • ప్రజాస్వామ్య పాలన అని రాక్షస పాలన సాగిస్తున్నడు.
  • మాటల్లో రాజ్యాంగ రక్షణ, చేతల్లో రాజ్యాంగ భక్షణ?
  • టికెట్ ధరల పెంపు పై బస్సులో ప్రయాణించి ఆర్టీసి ఎండీని కలిసి వినతిపత్రం ఇచ్చే అవకాశం ప్రజా ప్రతినిధులకు లేదా?
  • తెలంగాణలో హక్కులను కాలరాస్తున్న రేవంత్ రెడ్డి దుష్ట పాలన రాహుల్ గాంధీకి కనిపించడం లేదా?
  • ప్రశ్నిస్తే కేసులు, గొంతెత్తితే దాడులు, ప్రజా ప్రతినిధుల హౌజ్ అరెస్టులు, మీడియా పై కఠిన ఆంక్షలు.
  • ఇదేమి రాజ్యం రేవంత్ రెడ్డి?
  • ఏడవ గ్యారంటీగా ప్రజాస్వామ్య పునరుద్ధరణ అని డబ్బా కొట్టి ఇప్పుడు, ఉన్న ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశావు.
  • ఎమర్జెన్సీ పాలనను తలపిస్తున్నావు.
  • మీ అణచివేతలకు, మీ నిర్బంధాలకు, మీ దాడులకు బీఆర్ఎస్ పార్టీ అదరదు బెదరదు.
  • ప్రజా క్షేత్రంలో మిమ్మల్ని అడుగడుగునా నిలదీస్తూనే ఉంటం, ప్రజల తరఫున పోరాటం చేస్తూనే ఉంటాం.
  • అడ్డగోలుగా పెంచిన ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం
  • కమీషన్లు దంచుడు కాదు, పేదల కోసం పని చెయ్యి
  • నిరసన రాజ్యాంగం ఇచ్చిన హక్కు.
  • ఆర్టీసీ ధరలు పెంచితే మెట్రో ఎక్కుతారు అని రేవంత్ ఆలోచన..
  • ఆర్టీసీ అమ్మాలని,ప్రైవేట్ పరం చేసే కుట్ర కాంగ్రెస్ చేస్తుంది.
  • ఎలక్ట్రానిక్ బస్ ల పేరుతో పెద్ద కుట్ర జరుగుతోంది..
  • ఉప్పల్ మియాపూర్ వర్క్ షాప్స్ అమ్మకానికి పెట్టారు.
  • బస్ స్టాండ్ లు కూడబెట్టి 1500 కోట్లు తెచ్చారు.
  • ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడమేనా కాంగ్రెస్ పని
  • కార్గో ను అమ్మి ప్రైవేట్ చేయాలని చూస్తుంది
  • పేదల నడ్డి విరుస్తున్నారు.
  • రాహుల్ గాంధీ రాజ్యాంగం గూర్చి మాట్లాడుతారు..
  • రేవంత్ రెడ్డి రాజ్యాంగ భక్షణ జరుగుతుంది.
  • ఆర్టీసీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి.
  • ఆర్టీసీ ధరలు తగ్గించేవరకు బీఆర్ఎస్ ప్రజా ఉద్యమం చేస్తుంది.

 ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో ఉద్రిక్తత

  • బస్ భవన్‌కు వెళ్ళే మారాన్ని మూసేసిన పోలీసులు
  • సంధ్య థియేటర్ దగ్గర బారీకేడ్స్ ఏర్పాటు
  • కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ నేతలను ఆపేసిన పోలీసులు
  • ఆర్టీసీ ఎండీని కలవటానికి ముగ్గురు బీఆర్ఎస్ నేతలకు అనుమతి
  • పెంచిన ఆర్టీసీ చార్జీలు తగ్గించాలని ఆర్టీసీ ఎండీకి మెమొరాండం ఇవ్వనున్న కేటీఆర్, హరీష్ తోపులాట
  • పోలీసులకు, బీఆర్ఎస్ కేడర్‌కు తోపులాట, వాగ్వివాదం
  • బారికేడ్స్ తోసేసుకుని బస్ భవన్ వైపు వెళ్తోన్న బీఆర్ఎస్ నేతలు, క్యాడర్
  • సీఎం డౌన్ డౌన్ అంటూ బీఆర్ఎస్ కార్యకర్తల నినాదాలు

 

👉బస్‌ భవన్‌ బయలుదేరిని కేటీఆర్‌, హరీష్‌ రావు

👉హైదరాబాద్‌లో ఆర్టీసీ చార్జీల పెంపు నిర్ణయాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌(BRS Chalo Bus Bhavan) గురువారం ‘చలో బస్‌భవన్‌’ కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు.. బీఆర్‌ఎస్‌ నేతలను హౌస్‌ అరెస్ట్‌ చేస్తున్నారు. గురువారం ఉదయమే బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి హరీష్‌ రావును పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. ఈ క్రమంలో కోకాపేటలోని వారి నివాసాల వద్ద భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు.

👉ఇక, చలో బస్‌భవన్‌ కార్యక్రమంలో భాగంగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌(KTR), మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, పద్మారావు, సబితా ఇంద్రారెడ్డి తదితరులు ఉదయం 9 గంటలకు రేతిఫైల్‌ బస్టాండ్‌కు చేరుకుని అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులో ఆర్టీసీ బస్‌భవన్‌ వరకు వెళ్లాలని ప్లాన్‌ చేసు​కున్నారు. అనంతరం టీజీఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌కు వినతిపత్రం సమర్పించనున్నారు. 

👉ఈ సందర్భంగా కేటీఆర్‌ స్పందించారు.‘పెంచిన చార్జీలకు వ్యతిరేకంగా శాంతియుతంగా ఆర్టీసీ ఎండీ కార్యాలయానికి వెళ్లి లేఖ ఇద్దామని పార్టీ పిలుపునిచ్చింది. చార్జీలను వెనక్కి తీసుకోవాలని.. అందుకు కోరాలని అనుకున్నాము. ఆర్టీసీ బస్సులు ఎక్కి వెళ్తా అంటే భారీగా పోలీసులను ప్రభుత్వం ఇంటి ముందు మోహరించింది. ఒక వ్యక్తిని బస్సు ఎక్కకుండా ఆపడం కోసం ఇంతమంది పోలీసులను పంపారు. మమ్మల్ని నియంత్రించడంలో పోలీసులకు ఉన్న ఉత్సాహం రాష్ట్ర రాజధాని హైదరాబాదులో జరుగుతున్న నేరాల అదుపులో చూపిస్తే మంచిది. ఎన్ని రకాల కుట్రలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సు చార్జీలను వెనక్కి తీసుకొనే దాకా నిరసన తెలుపుతూనే ఉంటాము. ఇలాంటి పోలీసు నిర్బంధాలు మాకు.. మా పార్టీకి కొత్త కాదు అంటూ ఘాటు విమర్శలు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement