Harish Rao
-
HYD: కౌశిక్‌రెడ్డికి అర్ధరాత్రి బెయిల్
సాక్షి,హైదరాబాద్:బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ సీఐని దుర్భాషలాడిన కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గురువారం(డిసెంబర్5)అర్ధరాత్రి ఒంటిగంటకు కొత్తపేటలోని జడ్జి నివాసంలో పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు ప్రవేశపెట్టగా జడ్జి బెయిల్ మంజూరు చేశారు.రూ.5వేల పూచీకత్తుతో కౌశిక్‌రెడ్డికి బెయిల్ ఇచ్చారు.కౌశిక్‌రెడ్డికి బెయిల్ ఇచ్చిన సందర్భంగా జడ్జి నివాసం వద్దకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్,రాగిడి లక్ష్మారెడ్డి, శ్రీధర్‌రెడ్డి తదితరులతో భారీగా బీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చారు. కౌశిక్‌రెడ్డిని గురువారం ఉదయం ఆయన ఇంటివద్ద బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేసినప్పుడు హైడ్రామా జరిగింది. బీఆర్ఎస్ నేతలు హరీశ్‌రావు తదితరులు పోలీసులతో వాగ్వాదానికి దిగి అడ్డుకోవడంతో వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని సాయంత్రం విడుదల చేశారు. ఇదీ చదవండి: కౌశిక్‌రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత -
హరీశ్‌రావు అరెస్టు..10 గంటల హైడ్రామా
గచ్చిబౌలి/ బంజారాహిల్స్/ సాక్షి, హైదరాబాద్: మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అరెస్టుతో గచ్చిబౌలి ఠాణా అట్టు డికింది. పార్టీ మరో ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిని అరెస్టు చేస్తారనే సమా చారంతో గురువారం ఉదయం కొండాపూర్‌లోని ఆయన ఇంటికి వెళ్లిన హరీశ్‌ను గచ్చిబౌలి పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. అనంతరం కౌశిక్‌రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు బంజారాహిల్స్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అనంతరం కౌశిక్‌రెడ్డి ఇంటికి వచ్చిన మాజీమంత్రి జగదీశ్‌రెడ్డి తదితరులను అదుపులోకి తీసుకుని రాయదుర్గం పీఎస్‌కు తీసుకెళ్లారు. అయితే హరీశ్‌రావు అరెస్టుతో గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.ఆయన్ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు పోలీస్‌స్టేషన్ ప్రవేశ ద్వారం వద్ద బైఠాయించారు. మరోవైపు హరీశ్‌రావును పరామర్శించేందుకు ఎమ్మెల్సీ కవిత సహా పలువురు ముఖ్య నేతలు, పార్టీ శ్రేణుల తరలిరావడం, భారీయెత్తున బలగాల మోహరింపుతో గందరగోళం నెలకొంది. సీఎం రేవంత్‌రెడ్డి, పోలీసులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలు పెద్దపెట్టున నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేయడంతో 50 మందికి పైగా నాయకులను అరెస్టు చేసి నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.కాగా హరీశ్‌రావును ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8.30 వరకు పీఎస్‌లోనే ఉంచిన పోలీసులు ఆ తర్వాత విడుదల చేశారు. మాజీ స్పీకర్ మధుసూదనాచారి, ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తదితరులు పోలీస్‌స్టేషన్‌లో హరీశ్‌రావును పరామర్శించారు.ఇందిరమ్మ రాజ్యం కాదు పోలీస్ రాజ్యం హరీశ్‌రావు, జగదీశ్వర్‌రెడ్డి, కౌశిక్‌రెడ్డిలను అరెస్టు చేయడాన్ని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండించారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం కాదు..ఎమర్జెన్సీని తలపించేలా పోలీస్ రాజ్యం నడుస్తోందని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఫిర్యాదును తీసుకోని ప్రభుత్వం కేసులు పెట్టడం అన్యాయం అని అన్నారు. తెలంగాణ సమాజం అణచివేతను సహించదని, తమ గొంతు నొక్కాలని ప్రయత్నిస్తే ప్రజలు తిరగబడే రోజు వస్తుందని హెచ్చరించారు.ప్రజల పక్షాన ప్రశ్నించే వారిపై కేసులు పెట్టడం, నిర్బంధించడం ప్రభుత్వానికి తగదని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. హమీలు అమలు చేయడం చేతగాని సీఎం రేవంత్‌రెడ్డి, అక్రమ అరెస్టులతో గొంతులు మూయాలని ప్రయత్నిస్తున్నాడని విమర్శించారు. సీఐని బెదిరించారనే ఆరోపణలపై కౌశిక్‌రెడ్డి అరెస్టు పోలీసు విధులను అడ్డుకోవడమే కాకుండా అంతు చూస్తానంటూ బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్రను బెదిరించారనే ఆరోపణలపై ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని బంజారాహిల్స్ పోలీసులు గురువారం ఉదయం అరెస్టు చేశారు. కొండాపూర్‌లోని కోలా లగ్జారియా విల్లాస్‌లో ఉంటున్న ఆయన్ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. తన ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ సీఎం రేవంత్‌రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్రెడ్డిలపై ఫిర్యాదు చేసేందుకు బుధవారం బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన కౌశిక్‌రెడ్డి..తనతో వాగ్వివాదానికి దిగడమే కాకుండా పోలీసు వాహనానికి తన కారును అడ్డుగా పెట్టి విధులకు ఆటంకం కలిగించారని ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర ఫిర్యాదు చేశారు.దీంతో బీఎన్ఎస్ సెక్షన్లు 57, 126 (2), 127 (2), 132, 224, 333, 451 (3), 191 (2) రెడ్‌విత్ 190, 3(5) కింద కౌశిక్‌రెడ్డిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన్ను అరెస్టు చేశారు. ఉదయం ఇంట్లో ఉన్న కౌశిక్‌రెడ్డి బయటకు రాకపోవడంతో, తమకు సహకరించాలని లేనిపక్షంలో తామే బలవంతంగా లోపలికి రావాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరించారు. దీంతో ఆయన తలుపులు తీశారు. అప్పటికే లోపల ఉన్న హరీశ్‌రావును తొలుత అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అనంతరం కౌశిక్‌రెడ్డిని అరెస్టు చేశారు. ఆయన కానును సీజ్ చేశారు.పోలీస్‌స్టేషన్‌లో ఉన్న కౌశిక్‌రెడ్డిని ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యేలు వివేక్‌గౌడ్, సంజయ్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తదితరులు పరామర్శించారు. కౌశిక్‌రెడ్డి అరెస్టు విషయం తెలిసి అక్కడికి చేరుకున్న మాజీమంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, రాకేష్‌రెడ్డి తదితరులను అరెస్టు చేసిన పోలీసులు రాయదుర్గం, నార్సింగి పీఎస్‌లకు తరలించారు. -
సీఎం రేవంత్ పగ పట్టారు: హరీష్‌రావు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పగ, ప్రతీకారాలతో పనిచేస్తోదంటూ మాజీ మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. తెలంగాణలో అసలు ప్రజాస్వామ్యం ఎక్కడుంది అంటూ ప్రశ్నించారు. గురువారం రాత్రి గచ్చిబౌలి పీఎస్ నుంచి విడుదలైన అనంతరం హరీష్‌రావు మాట్లాడుతూ, ఎఫ్ఐఆర్లు పోలీస్‌స్టేషన్ నుంచి కాదు.. గాంధీభవన్ నుంచి వస్తున్నాయంటూ నిప్పులు చెరిగారు.రేవంత్‌రెడ్డి పాలనపై దృష్టి లేదు. అక్రమ కేసులు, అక్రమ సంపాదనపైనే ఆయన దృష్టి. ప్రశ్నించే వారి గొంతు నొక్కాలని చూస్తున్నారు. వందరోజుల్లో హామీలు అమలు చేస్తామని బాండ్ పేపర్‌పై సంతకాలు చేసి. ప్రజల కాళ్లా వేళ్లా పడి ఓట్లు వేయించుకున్నారు. ఆ హామీలు అమలు చేయాలని మేం అడుగుతున్నాం.. తప్పా?. రేవంత్‌రెడ్డి ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. అవ్వాతాతలకు 4వేల పెన్షన్ ఇస్తానన్నావ్ ఎప్పుడిస్తావ్?. మూసీలో పేదల ఇళ్లు కూలగొట్టొద్దన్నారు. ఇది సూచన కాదా?. సూచనలు తీసుకునే సోయి నీకు లేదు. గల్లీ నాయకుడిలా, ముఠా నాయకుడిలా కక్షతో రేవంత్‌రెడ్డి పనిచేస్తున్నారు’’ అంటూ హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.కాగా, అంతకు ముందు మాజీ మంత్రి హరీష్‌రావును విడుదల చేయాలంటూ గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ దగ్గర బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కొన్ని గంటల పాటు గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లోనే ఉన్న హరీశ్‌రావును ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రులు, బీఆర్ఎస్నేతలు కలిశారు. కేసీఆర్ కట్టించిన అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించకుండా రేవంత్ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు నిరసనకు దిగిన తెలిసిందే. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లిన హరీష్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఇదీ చదవండి: హైకోర్టులో హరీష్ రావుకు ఊరట -
Harish Rao Arrest: గచ్చిబౌలి పీఎస్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి హరీశ్‌రావును విడుదల చేయాలంటూ గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ దగ్గర బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకా గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లోనే ఉన్న హరీశ్‌రావును ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రులు, బీఆర్ఎస్నేతలు కలిశారు. ఎన్టీఆర్ మార్గ్‌లో ఉన్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్ద రేపు(శుక్రవారం) బీఆర్ఎస్ నిరసనకు పిలుపునిచ్చింది. నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ ముఖ్య నేతలు పాల్గొనున్నారు.ప్రశ్నించిన వారిని అరెస్ట్ చేస్తూ.. రేవంత్ సర్కార్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని బీఆర్ఎస్ మండిపడుతోంది. కేసీఆర్ కట్టించిన అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించకుండా రేవంత్ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో మాజీ మంత్రి హరీష్ రావు, పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లిన హరీష్ రావు, జగదీష్ రెడ్డిని బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఇక, ఇదే సమయంలో కౌశిక్‌రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని క్రైం నెంబర్ 1127/ 2024 కింద కేసు నమోదు చేశారు బంజారాహిల్స్ పోలీసులు. ఈ క్రమంలో బుధవారం కౌశిక్‌రెడ్డిపై పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డికి మద్దతు ఇచ్చేందుకు హరీష్ రావు, జగదీష్ రెడ్డి గురువారం ఉదయం ఆయన నివాసానికి వెళ్లారు. దీంతో, హరీష్, జగదీష్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ గులాబీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. -
హైదరాబాద్ లో BRS ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్
-
హైకోర్టులో హరీష్ రావుకు ఊరట
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకు ఊరట లభించింది. పంజాగుట్ట పోలీసు స్టేషన్లో హరీష్‌పై నమోదైన కేసులో ఆయనను అరెస్ట్ చేయవద్దంటూ కోర్టు ఆదేశించింది.వివరాల ప్రకరారం.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. పంజాగుట్ట పీఎస్‌లో నమోదైన కేసుపై ఆయన కోర్టును ఆశ్రయించారు. ఈ సందర్బంగా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హరీష్‌ను పోలీసులు అరెస్టు చేయవద్దంటూ హైకోర్టు ఆదేశించింది. నోటీసులు ఇచ్చి విచారించుకోవచ్చు అని తెలిపింది. -
సూటుకేసులు మీకు.. అరెస్టులు మాకు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీపై సంచలన కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే కేసులు పెడతారా? అని ప్రశ్నించారు. అలాగే, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతల అరెస్ట్ అప్రజాస్వామికం.. వారిని వెంటనే విడుదల చేయాలని కామెంట్స్ చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..‘ప్రభుత్వ తప్పులపై ప్రశ్నిస్తే కేసులు !పార్టీ హామీలపై నిలదీస్తే అరెస్టులు !పాలనలో లోపాలను గుర్తు చేస్తే కేసులు !గురుకులాల్లో విద్యార్థుల అవస్థలను పరిశీలిస్తే కేసులు !ప్రభుత్వం లాక్కుంటున్న భూములపై ఎదిరిస్తే కేసులు !ప్రభుత్వం కూల్చుతున్న ఇండ్లకు అడ్డొస్తే కేసులు !ప్రభుత్వంలోని వ్యవస్థలను వాడుకుని దుర్వినియోగం చేస్తున్నారని ఫిర్యాదు చేస్తే కేసులు !ప్రజలపై కేసులు.. ప్రజాప్రతినిధులపై కేసులుకేసులు .. కేసులు .. కేసులు.. కాసులు మీకు-కేసులు మాకుసూటుకేసులు మీకు .. అరెస్టులు మాకుమాజీ మంత్రులు మా నాయకులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి గార్లతోపాటు మా ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు,నాయకుల అరెస్ట్ లు అప్రజాస్వామికం..తక్షణం విడుదల చెయ్యాలి...జాగో తెలంగాణ జాగో’ అంటూ కామెంట్స్ చేశారు ప్రభుత్వ తప్పులపై ప్రశ్నిస్తే కేసులు !పార్టీ హామీలపై నిలదీస్తే అరెస్టులు !పాలనలో లోపాలను గుర్తు చేస్తే కేసులు !గురుకులాల్లో విద్యార్థుల అవస్థలను పరిశీలిస్తే కేసులు !ప్రభుత్వం లాక్కుంటున్న భూములపై ఎదిరిస్తే కేసులు !ప్రభుత్వం కూల్చుతున్న ఇండ్లకు అడ్డొస్తే కేసులు !…— KTR (@KTRBRS) December 5, 2024 ఎమ్మెల్యే @KaushikReddyBRS ఫిర్యాదు చేసేందుకు వస్తున్నారని తెలిసి ఏసీపీ పరార్... సీఐ పారిపోతారు... ఎంత అధికార పార్టీకి ఊడిగం చేస్తే మాత్రం ప్రతిపక్ష ఎమ్మెల్యేను అధికారికంగా మీ ఆఫీసులోనే కలిసేందుకు కూడా భయమా? పట్టుకొని నిలదీస్తే... అక్రమ కేసులా? ఇదెక్కడి రాజకీయం? ఇదేనా ప్రజా…— KTR (@KTRBRS) December 5, 2024 -
మాజీ మంత్రి హరీష్‌రావు అరెస్టు
-
మాజీ మంత్రి హరీష్‌రావు, కౌశిక్ రెడ్డి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మాజీ మంత్రి హరీష్ రావు, పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లిన హరీష్ రావు, జగదీష్ రెడ్డిని బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక, ఇదే సమయంలో కౌశిక్‌రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని క్రైం నెంబర్ 1127/ 2024 కింద కేసు నమోదు చేశారు బంజారాహిల్స్ పోలీసులు. ఈ క్రమంలో బుధవారం కౌశిక్‌రెడ్డిపై పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డికి మద్దతు ఇచ్చేందుకు హరీష్ రావు, జగదీష్ రెడ్డి గురువారం ఉదయం ఆయన నివాసానికి వెళ్లారు. దీంతో, హరీష్, జగదీష్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ గులాబీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ..‘తెలంగాణలో అడుగడుగునా రాజ్యాంగ ఉల్లంఘనే నడుస్తోంది. ఫోన్ ట్యాపింగ్‌పై ఫిర్యాదు చేయడానికి బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌కు వెళ్లిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక ప్రజాప్రతినిధి ఇచ్చిన ఫిర్యాదు నమోదు చేసేందుకు వెనుకడుతారు, మళ్ళీ ఉల్టా కేసు బనాయిస్తరు?. ఇదేం విడ్డూరం. ఇదెక్కడి న్యాయం? ఇదేం ప్రజాస్వామ్యం?. రేవంత్ మీ పాలన మార్పు మార్కు ఇదేనా?. రాజ్యాంగాన్ని కాపాడుదామని రాహుల్ గాంధీ రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరుగుతడు. నువ్వేమో తెలంగాణలో అడుగడుగునా రాజ్యాంగ ఉల్లంఘన చేస్తూనే ఉంటవు. ప్రజల తరఫున పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెడతామంటే అదిరేది లేదు, బెదిరేది లేదు. ప్రజాక్షేత్రంలో నిన్ను నిలదీస్తూనే ఉంటాం. నీ వెంట పడుతూనే ఉంటాం’ అంటూ విమర్శలు చేశారు. ఇందిరమ్మ రాజ్యమా...? ఎమర్జెన్సీ పాలనా?ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్తే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై ఉల్టా కేసు బనాయించారు.ఉదయాన్నే పదుల సంఖ్యలో పోలీసులు ఎమ్మెల్యే ఇంటి మీదకు వచ్చి అక్రమ అరెస్టు చేసే ప్రయత్నం చేశారు.ఈ దుర్మార్గాన్ని… pic.twitter.com/aXvinFpkqY— Harish Rao Thanneeru (@BRSHarish) December 5, 2024 -
పదేళ్లలో కోటి మంది మహిళలు 'కోటీశ్వరులు': రేవంత్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాబోయే పదేళ్లలో ఆర్టీసీ, సోలార్ విద్యుత్ కేంద్రాలు, ఐకేపీ కేంద్రాలు తదితర అన్ని రంగాల్లో స్వయం సహాయక సంఘాల మహిళలకు అవకాశాలు కల్పించడం ద్వారా కోటిమందిని కోటీశ్వరు లుగా మార్చేవరకు తాము విశ్రమించబోమని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. రాబోయే ఎన్నికల్లో ఆడబిడ్డల ఓట్లతోనే విజయం సాధిస్తామన్నారు. గత పదేళ్లకాలంలో ఒక్క విమానాశ్రయం కట్టలేదని, కానీ తాము రామగుండం, వరంగల్, కొత్తగూడెం, ఆదిలాబాద్ విమానాశ్రయాలను కడతామని తెలిపారు. గత ప్రభుత్వం యువతకు ఉద్యోగాలివ్వలేదు కానీ, కేసీఆర్ కుటుంబ సభ్యులందరికీ ఉద్యోగాలొచ్చాయని విమర్శించారు. తమ ఇందిరమ్మ పాలనలో ఏడాదిలోనే 55,143 మందికి ఉద్యోగాలిచ్చామని, ఇదే వేదికపై 8,084 మందికి నియామక పత్రాలు అందజేస్తున్నామని వెల్లడించారు. డిసెంబర్ 10 వరకు తాము చేసిన పనులన్నీ చెప్పుకుంటామన్నారు. రైతులకు రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేసి చూపించామని, దీనిపై ప్రధాన మోదీ, కేంద్రమంత్రులు బండి సంజయ్, కిషన్‌రెడ్డి తమతో చర్చకు రావాలని సవాల్ చేశారు. కేటీఆర్, హరీశ్‌లను అచ్చోసిన ఆంబోతుల్లా సమాజంలోకి కేసీఆర్ వదిలిండని, తెల్లారిలేస్తే సోషల్ మీడియాలో తమపై విష ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా బుధవారం పెద్దపల్లిలో యువవికాసం పేరిట నిర్వహించిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు.బలమైన కుర్రాడు ఒక్క రోజులో పిల్లాడిని కనలేడుగా..‘రూ.లక్ష కోట్లు వెచ్చించి కేసీఆర్ కాళేశ్వరం కడితే కూలింది. మేం 50 ఏళ్ల కింద కట్టిన ప్రాజెక్టులేవీ చెక్కు చెదరలేదు. కాళేశ్వరం నుంచి ఒక్క చుక్క ఎత్తకుండానే రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండింది. అందులో పెద్దపల్లి అగ్రగామిగా నిలిచింది. గతంలో వర్సిటీలు నిరాదరణకు గురయ్యాయి. మేం 10 వర్సిటీలకు వీసీలను నియమించాం. శాతవాహన వర్సిటీకి లా, ఇంజనీరింగ్ కాలేజీలు మంజూరు చేస్తున్నాం. డీఎస్సీ పిలిచి 11 వేల టీచర్ కొలువులిచ్చాం. చెప్పినవన్నీ చేసుకుంటూ పోతున్నాం. ఇందిరా పార్కు వద్ద మూసేసిన ధర్నా చౌక్ తెరిపించాం. మా ప్రమాణ స్వీకారం రోజునే ప్రగతిభవన్ ముళ్ల కంచెను తొలగించాం. ప్రగతిభవన్‌లో ప్రతివారం చిన్నారెడ్డి ప్రజల ఫిర్యాదులు తీసుకుని పరిష్కరిస్తున్నారు. పేద పిల్లలకు 40% కాస్మెటిక్, డైట్ చార్జీలు పెంచాం. ఫీజు రీయింబర్స్మెంట్ సమస్యను పరిష్కరించుకుంటాం. ప్రతిదానికీ ఒక విధానం ఉంటుంది. బలమైన కుర్రాడికి పెళ్లి చేసినంత మాత్రాన.. ఒక్కరోజులో పిల్లాడిని కనలేడుగా..’ అని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.పదేళ్లలో ఉద్యాగాలెందుకు ఇవ్వలేదు? ‘కవితమ్మ ఎంపీగా ఓడిపోతే 3 నెలల్లో ఎమ్మెల్సీని చేశారు. సంతోష్‌కు రాజ్యసభ, ఎంపీ ఎ్ననికల్లో ఓడిన వినోద్‌కు ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ ఇచ్చారు. అదే పదేళ్లలో ఎందుకు ఉద్యోగాలివ్వలేదు. ఇందుకోసమేనా తెలంగాణ విద్యార్థులు బలిదానం చేసింది? కొలువుల్లేక దాదాపు 35 లక్షల మంది ఉపాధి కూలీలుగా, అడ్డా కూలీలుగా మారారు. వందలాది బలిదానాలు, లక్షలాదిమంది కేసులు ఒక్క కుటుంబం కోసమా? తెలంగాణ ప్రజల కోసమా? 80 వేల పుస్తకాలు చదివిన మీకు నిరుద్యోగుల కష్టం అర్థం కాలేదా? అందుకే మేం ఆలోచన చేసి 55 వేల ఉద్యోగాలు ఇచ్చాం. కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ ఆత్మహత్యలు చేసుకోవద్దని యువ వికాసం లాంటి కార్యక్రమాలు చేస్తున్నాం..’ అని సీఎం పేర్కొన్నారు. కొందరు విష ప్రచారం చేస్తున్నారు..‘పెద్దపల్లి జిల్లా ప్రజల వెన్నుదన్నుల వల్లే ఇక్కడ మాట్లాడగలుగుతున్నాం. కేసీఆర్ పదేళ్ల కాలంలో రైతాంగానికి గిట్టుబాటు ధర రాలేదు. కనీసం తనలా ఎకరానికి రూ.కోటి ఆదాయం ఎలా తీయాలో నేర్పలేదు. నాడు ఎస్సారెస్పీ నీటి కోసం అరెస్టయిన విజయరమణారావు కల నేడు ఫలించింది. ఇవాళ ఆ ప్రాజెక్టులను పూర్తి చేసుకునే అవకాశం వచ్చింది. పెద్దపల్లి జిల్లాకు రూ.1,030 కోట్లతో ఆర్అండ్బీ, పీఆర్ పనులు, ఆర్టీసీ డిపో వచ్చాయంటే అందుకు కారణం మీ అభిమాన విజ్జన్న, శ్రీధర్‌బాబులే. వాస్తవానికి ఈ పనులు కావాలని మంత్రి శ్రీధర్‌బాబు మమ్మల్ని అడగలేదు..బెదిరించారు (నవ్వులు). తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు కట్టి కరీంనగర్, ఆదిలాబాద్‌కు నీరిస్తాం. రోజుకు 18 గంటలు కష్టపడుతున్నాం. కొందరు తమకు భవిష్యత్తు లేదన్న భయంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వారు చేసే విష ప్రచారాన్ని డిసెంబరు 10 వరకు తిప్పికొట్టి చరిత్ర తిరగరాస్తాం. నరేంద్ర మోదీ 14 ఏళ్లు గుజరాత్ సీఎంగా ఉన్నారు. 11 సంవత్సరాల నుంచి పీఎంగా ఉన్నారు. గుజరాత్లో తొలి ఏడాదిలో 55వేల ఉద్యోగాలు ఇచ్చారా? చర్చకు సిద్ధమా? మోదీకి ప్రత్యేక విమానం పెడతాం. సచివాలయంలో చర్చ పెడతాం..’ అని సీఎం సవాల్ చేశారు. మద్దతు ధర, బోనస్ ఇస్తున్నాం..‘రైతులకు ఎమ్మెస్పీ ఇవ్వడమే కాదు.. 66 లక్షల ఎకర్లాలో 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి మేం కట్టిన ప్రాజెక్టులతోనే సాధ్యమైంది. ఆనాడు ఐకేపీ కేంద్రాలు తెరవమంటే ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదు.. వరి వేసుకుంటే ఉరే అని కేసీఆర్ చెప్పారు. నేడు ఇందిరమ్మ రాజ్యంలో మద్దతు ధరతో పాటు బోనస్ ఇస్తున్నాం. రైతుబంధు రూ.7,625 కోట్లు ఇచ్చాం. రూ.21 వేల కోట్ల రైతు రుణమాఫీతో ఈ ప్రభుత్వం చరిత్రను తిరగరాసింది. గుజరాత్లో రైతు రుణమాఫీ చేశారా? చర్చకు సిద్ధమేనా?..’ అని రేవంత్ ప్రశ్నించారు.కులగణనలో కేసీఆర్ ఎందుకు పాల్గొనడం లేదు?‘రాహుల్‌గాంధీ పిలుపుతో కులగుణన చేపట్టాం. 95 శాతం పూర్తి చేశాం. కులగణనలో కేసీఆర్ ఎందుకు పాల్గొనడం లేదు? బీసీ దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని కులగణన చేస్తుంటే.. కేసీఆర్ కుటుంబం ఎందుకు దూరంగా ఉంది. మేం ప్రతిపక్షంలో ఉన్నపుడు సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొనలేదా? బీసీ సంఘాలు ఆలోచించాలి. బీసీ కులగణనలో పాల్గొనని వారిని సామాజికంగా బహిష్కరించాలి..’ అని ముఖ్యమంత్రి అన్నారు. -
‘కుట్ర’ కేసు కొట్టేయండి.. హైకోర్టులో హరీష్‌రావు పిటిషన్
సాక్షి, హైదరాబాద్: పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో తనపై నమోదైన కేసు కొట్టివేయాలంటూ హైకోర్టులో మాజీ మంత్రి హరీష్ రావు పిటిషన్ వేశారు. సిద్ధిపేటకు చెందిన చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు డిసెంబర్ 1న హరీష్‌రావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాజకీయ కక్షతోనే కేసు నమోదు చేశారంటూ హరీష్‌రావు తన పిటిషన్లో పేర్కొన్నారు. నిరాధార ఆరోపణలు చేసి సంబంధం లేని కేసు పెట్టారంటూ పేర్కొన్న హరీష్ రావు.. కేసు కొట్టివేయడంతో పాటు అరెస్టు చేయకుండా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలంటూ కోరారు.తన, కుటుంబసభ్యుల ఫోన్లను ట్యాప్ చేశారని, తన రాజకీయ ఎదుగుదలను అడ్డుకోవడానికి కుట్రతో అక్రమ కేసులు పెట్టారని... రియల్ ఎస్టేట్ వ్యాపారి జి.చక్రధర్‌గౌడ్ ఇచ్చిన ఫిర్యాదుతో హరీష్‌రావుపై ఈ కేసు నమోదైంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయి, రిమాండ్‌లో ఉన్న టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావును సైతం నిందితుడిగా చేర్చారు. వివిధ సెక్షన్ల కింద ఆదివారమే ఎఫ్ఐఆర్ నమోదవగా.. ఆలస్యంగా మంగళవారం వెలుగులోకి వచ్చింది.పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం.. ‘‘సిద్దిపేటకు చెందిన చక్రధర్‌గౌడ్ రియల్ ఎస్టేట్ వ్యాపారి. 2022 సెప్టెంబర్ 25న సిద్దిపేటలోని కొండ భూదేవి గార్డెన్స్‌లో చక్రధర్.. ఆత్మహత్యలకు పాల్పడ్డ వంద మంది కౌలురైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు. ఆ తర్వాత మరో 150 మందికి రూ.లక్ష నగదు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల నేపథ్యంలో భవిష్యత్తులో చక్రధర్‌గౌడ్ తనకు పోటీ అవుతారని హరీశ్‌రావు భావించారు.అనంతరం సిద్దిపేట జిల్లాలో ‘అగ్గిపెట్టె మచ్చా‘ పేరిట మ్యాచ్బాక్స్ కంపెనీని ప్రారంభించనున్నట్టు చక్రధర్‌గౌడ్ ప్రకటించారు. దీనితో హరీశ్‌రావు చక్రధర్‌పై శామీర్‌పేట పోలీసుస్టేషన్లో తప్పుడు కేసు నమోదు చేయించి, అరెస్టు చేయించారు. అయితే 2023 మార్చి 15న చక్రధర్ బీజేపీలో చేరారు. అదే ఏడాది ఏప్రిల్ 28న హైదరాబాద్‌లోని పంజగుట్ట నాగార్జున సర్కిల్లో చక్రధర్‌కు చెందిన ‘ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్’ ఆఫీసుకు మఫ్టీలో వచ్చిన పోలీసులు ఆయనను టాస్క్‌ఫోర్స్ ఓఎస్డీగా ఉన్న పి.రాధాకిషన్‌రావు ముందు హాజరుపర్చారు.ఆయన చక్రధర్‌ను తీవ్రస్థాయిలో బెదిరించి, హరీశ్‌రావు అనుమతి లేకుండా సిద్దిపేట నియోజకవర్గంలో ఎలాంటి కార్యక్రమాలు చేయవద్దని హెచ్చరించారు. ఒకసారి పోలీసులు చక్రధర్ ఐఫోన్ తీసుకుని, తర్వాత తిరిగిచ్చారు. ఫోన్ ట్యాప్ చేయడం ద్వారా వివరాలన్నీ తెలుసుకుని చక్రధర్‌ను, అనుచరులను బెదిరించారు. గతంలో మంత్రిగా పనిచేసిన హరీశ్‌రావు అధికార దురి్వనియోగానికి పాల్పడి ఈ చర్యలకు పాల్పడ్డారు’’ అని పోలీసులు ఎఫ్ఆర్లో పేర్కొన్నారు. -
లక్ష తప్పుడు కేసులు పెట్టినా ప్రశ్నించడం ఆపను. మాజీమంత్రి హరీశ్‌రావు వ్యాఖ్య.. ఇంకా ఇతర అప్డేట్స్
-
లక్ష కేసులు పెట్టినా నన్ను ఆపలేరు..
-
మిస్టర్ రేవంత్.. అంత వరకు నేను ఆగను: హరీష్ రావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చేతనైంది ఒక్కటే.. తప్పు చేసి దబాయించడం, తప్పుడు కేసులు బనాయించడం అంటూ విమర్శించారు. ఇదే సమయంలో తనపై లక్ష తప్పుడు కేసులు పెట్టించినా, తాను మాత్రం ప్రజల పక్షాన ప్రశ్నించడం ఆపను అంటూ వార్నింగ్ ఇచ్చారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ట్విట్టర్ వేదికగా..‘మిస్టర్ రేవంత్ రెడ్డి.. అడుగడుగునా నువ్వు చేస్తున్న అన్యాయాలను నిలదీస్తున్నందుకు, నీ నిజ స్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నందుకు, ప్రజల పక్షాన నీమీద ప్రశ్నలు సంధిస్తున్నందుకు భరించలేక, సహించలేక నామీద అక్రమ కేసులెన్నో బనాయిస్తున్నావు. నీకు చేతనైంది ఒక్కటే.. తప్పు చేసి దబాయించడం, తప్పుడు కేసులు బనాయించడం.రుణమాఫీ విషయంలో దేవుళ్లను సైతం దగా చేసినవు అని అన్నందుకు యాదగిరి గుట్ట పోలీసు స్టేషన్లో తప్పుడు కేసు పెట్టించినవు. ఇచ్చిన హామీలను ఎగవేస్తున్న నిన్ను ఎగవేతల రేవంత్ రెడ్డి అని అన్నందుకు బేగం బజార్ పోలీసు స్టేషన్లో తప్పుడు కేసు పెట్టించినవు. సోషల్ మీడియాలో ఎవరో పెట్టిన పోస్టుకు సైబర్ క్రైం పోలీసు స్టేషన్లో నా మీద సంబంధం లేని కేసు పెట్టించావు. పార్టీ కార్యక్రమంలో మాట్లాడితే కోడిగుడ్డుమీద ఈకలు పీకి, తలాతోక లేని కేసు మానకొండూరులో అక్రమ కేసు పెట్టించినవు.నీ రెండు నాలుకల వైఖరిని బట్టబయలు చేసినందుకు, ప్రజాక్షేత్రంలో నిలదీసినందుకు తట్టుకోలేక ఇవాళ పంజాగుట్ట స్టేషన్లో మరో తప్పుడు కేసు పెట్టించినవు. నువ్వు లక్ష తప్పుడు కేసులు పెట్టించినా, నేను ప్రజల పక్షాన ప్రశ్నించడం ఆపను. ప్రజా కోర్టులో, ప్రజా తీర్పుతో నీకు తగిన శిక్ష పడేంత వరకు ఆగను. #CongressFailedTelangana అంటూ ఘాటు విమర్శలు చేశారు. మిస్టర్ @revanth_anumula అడుగడుగునా నువ్వు చేస్తున్న అన్యాయాలను నిలదీస్తున్నందుకు, నీ నిజ్వస్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నందుకు, ప్రజల పక్షాన నీమీద ప్రశ్నలు సంధిస్తున్నందుకు భరించలేక, సహించలేక నామీద అక్రమ కేసులెన్నో బనాయిస్తున్నావు.నీకు చేతనైంది ఒక్కటే.. తప్పు చేసి దబాయించడం,…— Harish Rao Thanneeru (@BRSHarish) December 3, 2024 -
బాచుపల్లికి చెందిన చక్రధర్ గౌడ్ ఫిర్యాదుతో హరీష్రరావుపై కేసు
-
ఫోన్‌ట్యాపింగ్ ఆరోపణలు..హరీశ్‌రావుపై కేసు నమోదు
సాక్షి,హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీశ్‌రావుపై మంగళవారం(డిసెంబర్3) కేసు నమోదైంది. తన ఫోన్ ట్యాప్ చేశారని బాచుపల్లికి చెందిన చక్రధర్‌గౌడ్ హరీశ్‌రావుపై పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పంజాగుట్ట పోలీసులు హరీశ్‌రావుపై 120బి,386,409 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో హరీశ్‌రావుతో పాటు టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావును కూడా పోలీసులు చేర్చడం గమనార్హం. కాగా, ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన ఫోన్‌ట్యాపింగ్ కేసు విచారణలో ఉంది. బీఆర్ఎస్ హయాంలో టాస్క్‌ఫోర్స్‌లో పనిచేసిన పలువురు పోలీసు అధికారులను ఈ కేసులో అరెస్టు చేశారు.ఇటీవలే ఈ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను కూడా పోలీసులు విచారించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కీలకనేత హరీశ్‌రావుపై ఫోన్‌ట్యాపింగ్ ఆరోపణలపై మరో కేసు నమోదు చేయడం చర్చనీయాంశమైంది.ఇదీ చదవండి: ప్రభుత్వ వైఫల్యాలపై 7న ఛార్జ్‌షీట్: హరీశ్‌రావు -
ప్రభుత్వ వైఫల్యాలపై 7న చార్జిషీట్
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి రెండు నాలుకల మనిషి అని, అలాంటి వ్యక్తిత్వం కలిగిన వారు ప్రజలను నిలువునా ముంచేస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి టి.హరీశ్‌రావు విమర్శించారు. పూటకో రకంగా మాట్లాడే విద్యలో రేవంత్ పీహెచ్డీ చేశాడని ఎద్దేవా చేశారు. రేవంత్ నిజ స్వరూపాన్ని ప్రజల ముందు పెట్టాలన్నదే తన ప్రయత్నమని చెప్పారు. కాంగ్రెస్ ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ఈ నెల 7న ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ సవివర చార్జిషీట్ విడుదల చేస్తామని ప్రకటించారు.సోమవారం తెలంగాణ భవన్లో మాజీ మంత్రులు మహమూద్ అలీ, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, ఎమ్మెల్సీలు శేరి సుభాశ్‌రెడ్డి, మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యేలు ఆనంద్, చిరుమర్తి లింగయ్య తదితరులతో కలసి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. ‘గత ఏడాది పాలనలో సీఎం ద్వంద్వ ప్రమాణాలకు అద్దం పట్టే ఆణిముత్యాలు’ అంటూ వివిధ అంశాలపై రేవంత్ చేసిన ప్రకటనల వీడియో క్లిప్పింగులను హరీశ్‌రావు విడుదల చేశారు.ఏడాది పాలనలో ఎడతెగని వంచనతెలంగాణ ప్రజలను మోసగించడం, వంచించడం రేవంత్ నైజమని హరీశ్ విమర్శించారు. ఏడాది నుంచి ఫిరాయింపులు, దబాయింపులు, బుకాయింపులతో పాలన సాగుతోందని.. సీఎం అపరిచితుడిలా పొంతన లేని వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. మూడో పంటకు రైతు బంధు ఇవ్వాలని... కౌలు రైతులకు రైతుబంధు ఇస్తామని ప్రకటించిన రేవంత్ ప్రస్తుతం మాట మార్చారని ఆరోపించారు.‘బతుకమ్మ చీరల పథకం, ఎల్ఆర్ఎస్, పోటీ పరీక్షల వాయిదా, కుల సర్వే, ఆక్రమణల కూల్చివేతలు వంటి అంశాలపై రేవంత్ మాటలు మారుస్తున్నారు. ఏక్ పోలీసు విధానం, మద్యం, కాళేశ్వరం ప్రాజెక్టు తదితర అంశాలపై రేవంత్ మాటలు మార్చారు. పచ్చ పార్టీలో ఉన్నప్పుడు సోనియాను బలిదేవత అన్నారు.. ఇప్పుడు అమ్మ అంటున్నారు. రేవంత్ అవసరమొస్తే కాళ్లు పట్టగలడు, అవసరం తీరిన తర్వాత కాళ్లు లాగగలడు..’’ అని హరీశ్ వ్యాఖ్యానించారు.నిర్బంధాలు, అణచివేతలే..కాంగ్రెస్ ఏడో గ్యారంటీగా ప్రజాస్వామ్య పునరుద్ధరణ అని చెప్పిందని... గత ఏడాది పాలనలో నిర్బంధాలు, అణచివేతలు, లాఠీచార్జీలు, కంచెలు, ఆంక్షలు నిత్యకృత్యం అయ్యాయని హరీశ్ ఆరోపించారు. న్యాయం కావాలని రోడ్డెక్కిన నిరుద్యోగులపై కేసులు, లగచర్ల గిరిజనులపై దాడులు ఏమిటని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ పేరిట ప్రజాస్వామ్య హననానికి పాల్పడుతున్నారని.. రాజ్యాంగం ద్వారా వచ్చిన హక్కులను కాలరాసి, రాక్షస పాలన కొనసాగిస్తురని మండిపడ్డారు. విపక్ష నేతగా నక్సలైట్లపై మొసలి కన్నీరు కార్చిన రేవంత్.. బూటకపు ఎన్కౌంటర్లు చేస్తున్నారని ఆరోపించారు. -
సీఎం రేవంత్ రెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలే
-
అన్నీ అబద్ధాలు.. అసత్య ప్రచారాలు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నీ అబద్ధాలు, అసత్య ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాది కాంగ్రెస్ పాలన అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. ‘ఈ సర్కారు ఉత్త బేకారు ఉన్నదని ప్రజలు అనుకుంటున్నరు. ఎవరు మెచ్చుకునే పరిస్థితి లేదు గనుక, ముఖ్యమంత్రి తన భుజం తానే తట్టుకుంటున్నడు. మాది సుపరిపాలన అని డబ్బా కొట్టుకుంటున్నడు’అని ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో హరీశ్‌రావు పేర్కొన్నారు.సీఎం రేవంత్ అపరిపక్వత (ఇమ్మెచ్యూరిటీ), అసమర్థత (ఇన్ క్యాపబులిటీ), ప్రతికూల వైఖరి (నెగెటివ్ ఆటి ట్యూడ్)తో రాష్ట్రంలో అన్నిరంగాల్లో ప్రతికూల వాతావరణం నెలకొందన్నారు. ‘మేము మంచి ఆర్థిక/వృద్ధితో రాష్ట్రాన్ని అప్పగిస్తే, నీ రాక తర్వాత ఆశించిన మేరకు ఆర్థికవృద్ధి రేటు పెరగలేదు. వృద్ధి రేటు పెంచే సత్తా లేదు, సంపద పెంచలేక, ప్రజలకు పంచలేక నోటికి వచ్చినట్టు వాగుతున్నావు. నెపం ప్రతిపక్షం మీదకు నెట్టుతున్నవు.కాంగ్రెస్ పాలన ఎట్లుందంటే.. ముందు దగా, వెనుక దగా, కుడి ఎడమల దగా దగా అన్న శ్రీశ్రీ కవిత లాగ ఉంది’అని హరీశ్‌రావు విమర్శించారు. ‘ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసి రైతుబంధు ఆపిన విషయం, అధికారంలోకి వస్తే 15వేలు ఇస్తామని చెప్పిన విషయం. నీకు గుర్తులేకపోవచ్చు రేవంత్‌రెడ్డి. ఆ ఫిర్యాదు కాపీ, ఎన్నికల కమిషన్ ఆదేశాలను, మీరు మాట్లాడిన వీడియోను పంపుతున్నా చూడండి’ అని హరీశ్‌రావు పేర్కొన్నారు. -
తెలంగాణకు మణిహారం.. తెలుగు ప్రజలకు సంజీవని
సాక్షి, సిద్దిపేట: మరణం అంచుకి వెళ్లిన చిన్నారులకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు చేసి పునర్జన్మనిస్తూ, తెలంగాణ రాష్ట్రానికి మణిహారంగా, తెలుగు ప్రజలకు సంజీవనిలా సత్యసాయి ఆస్పత్రి సేవలందిస్తోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాకలో శ్రీసత్యసాయి సంజీవని సెంటర్ ఫర్ చైల్డ్ హార్ట్‌కేర్, రీసెర్చ్‌లో తొలిసారి గుండె ఆపరేషన్లు జరగ్గా.. శనివారం హరీశ్‌రావు సందర్శించిన అనంతరం మాట్లాడారు. దేశంలో 5వ ఆస్పత్రిని సిద్దిపేటలో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వం చేయని పనిని సత్యసాయి ట్రస్ట్, మధుసూదన్ సాయి చేస్తున్నారని కొనియాడారు. గుండె ఆపరేషన్ల కోసం రూ.3 నుంచి రూ.5 లక్షలు ఖర్చు పెట్టలేక ఎన్నో కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయని, ఉచితంగా సర్జరీలు చేయడం అభినందనీయం అని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఐదు రాష్ట్రాల్లో 5.77 లక్షల మందికి ఓపీ, 33,600 మంది చిన్నారులకు గుండె శస్త్రచికిత్సలు చేశారన్నారు. ఆరు రోజుల్లో 18 మంది చిన్నారులకు సర్జరీలు పూర్తి చేసి వారికి పునర్జన్మ ప్రసాదించడం గొప్ప విషయం అని కొనియాడారు. మధుసూదన్ సాయి కళాశాల వార్షికోత్సవం సందర్భంగా కార్యక్రమానికి వచి్చనప్పుడు ఇక్కడ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని 2022లో కోరానని, దీంతో స్పందించి 2023లో ఓపీ ప్రారంభించారని తెలిపారు. మంత్రి, ఎమ్మెల్యే పదవుల్లో అనుభూతి కంటే గుండె ఆపరేషన్ అయిన తర్వాత పిల్లల్లో సంతోషం చూసి తన జన్మ ధన్యమైందన్నారు.శ్రీసత్యసాయి ట్రస్ట్ చైర్మన్ శ్రీనివాస్ మాట్లాడుతూ మొదట కొండపాకలో యంగ్ అడోల్సెంట్ కార్యక్రమం నిర్వహించాలనుకున్నా.. హరీశ్‌రావు చొరవతో ఇక్కడ గుండె శస్త్రచికిత్సల ఆస్పత్రిని ఏర్పాటు చేశామని తెలిపారు. ఒక్కఫొటోతో బాడీ ప్రొఫైల్ వచ్చే విధంగా హెచ్డీ స్టెత్‌తో గుండె పనితీరు తెలుసుకునే అత్యాధునిక పరికరాలు అందుబాటులోకి తెస్తున్నామన్నారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రమణాచారి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి పాల్గొన్నారు. ఆరు నెలల కిందట తెలిసింది నా బిడ్డ పేరు రక్ష. వయసు పదేళ్లు. ఆర్నెల్ల కిందట నిలోఫర్‌లో డాక్టర్లు పరిశీలించి గుండెలో హోల్ ఉందని చెప్పారు. బయట ఆస్పత్రుల్లో రూ.5 లక్షలు అవుతాయన్నారు. అయితే సిద్దిపేటలో ఫ్రీగా గుండె ఆపరేషన్లు చేస్తారని నిలోఫర్ డాక్టర్లు చెప్పారు. దీంతో అక్కడ ఆపరేషన్ చేయించాం. ఈ డాక్టర్లకు, ట్రస్ట్‌కు మేము రుణపడి ఉంటాం. నా బిడ్డ కూడా డాక్టర్ అయి ఇలా ఉచితంగా సేవలందిస్తుంది. ఏమిచ్చినా రుణం తీర్చుకోలేంమాది మెదక్ జిల్లా చిన్నశంకరంపే ట. మెకానిక్ గా పని చేస్తా. నా బిడ్డ వయసు ఆరేళ్లు. దగ్గు, జలుబు, వాంతులు అయ్యా యి. అప్పుడు వెంటనే లోకల్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాం. వారు చూసి గుండె స్పీడ్ గా కొ ట్టుకుంటోంది అని చెప్పారు. దీంతో నిమ్స్, నిలోఫర్ ఆ స్పత్రులు తిరిగాం. ఇక్కడ ఫ్రీగా చేస్తారని తెలిసింది వెంటనే వచ్చాం. నా బిడ్డకు పునర్జన్మనిచి్చన డాక్టర్లు, ట్రస్ట్ వారికి ఏమిచి్చనా రుణం తీర్చుకోలేం. -
‘రైతుపండుగ’పై హరీశ్‌రావు సెటైర్లు
సాక్షి,హైదరాబాద్:రైతులను విజయవంతంగా మోసం చేసినందుకు రైతు పండుగ నిర్వహిస్తున్నావా రేవంత్‌రెడ్డి? అని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు నిలదీశారు. ఈ మేరకు హరీశ్‌రావు శనివారం(నవంబర్ 30) ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు చేశారు.‘మేనిఫెస్టోలో చెప్పి,రైతులను నమ్మించి అధికారంలోకి వచ్చాక దగా చేసినందుకు విజయోత్సవాలా రేవంత్ రెడ్డి? రైతుల బతుకులు మార్చేందుకు కేసీఆర్ తీసుకొచ్చిన రైతు బంధు పథకాన్ని నిలిపివేసే కుట్రను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది.నేడు మహబూబ్‌నగర్‌లో నిర్వహించే కార్యక్రమంలో రైతు బంధు అమలుపై స్పష్టత ఇవ్వాలి.పెండింగ్‌లో ఉన్న వానకాలం రైతుబంధుతో పాటు యాసంగికి పంట పెట్టుబడి సాయం వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. -
మరోమారు పోరాటం చేయాల్సిన అవసరం వచ్చింది
-
రేవంత్‌రెడ్డి ఒక్కనాడైనా జై తెలంగాణ అన్నారా?
సాక్షి, సిద్దిపేట: సీఎం రేవంత్ రెడ్డి ఒక్కనాడైనా జై తెలంగాణ అన్నా రా? ఉద్యమంలో ఒక్క కేసైనా ఉందా? ఒక్కనాడైనా అమరులకు పూ లు వేశారా? అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రశ్నించారు. ‘కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తాడట. అలుగునూరులో కేసీ ఆర్‌ను అరెస్టు చేసిన ఆనవాళ్లు, ఖమ్మం జైలులో దీక్ష చేసిన అనవాళ్లు తుడుస్తావా? లేదా తెలంగాణ సాధించి, తెలంగాణ తొలి సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆనవాళ్లు తుడిచి వేస్తావా?’అని నిలదీశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2009, నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన దీక్షను గుర్తు చేస్తూ శుక్రవారం సిద్దిపేటలో దీక్షా దివస్‌ను చేపట్టారు.ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడారు. లగచర్లలో గిరిజనులు తిరగబడితే వెనక్కి తగ్గారని, హైదరాబాద్‌లో హైడ్రా, మూసీలపై పేదలు తిరగబడటం, పోరాటాల ఫలితంగా రేవంత్ వెనక్కి తగ్గారన్నారు. డిసెంబర్ 9న చేసిన తెలంగాణ ప్రకటనను ఆంధ్రవారికి తలొగ్గి కేంద్రంలోని కాంగ్రెస్ డిసెంబర్ 23న వెనక్కి తీసుకుందని గుర్తుచేశారు. నాడు తెలంగాణ కోసం రాజీనామా చేయాలని కోరితే సీఎం రేవంత్ రెడ్డి, కిషన్‌రెడ్డి చేయలేదని హరీశ్ విమర్శించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్, టీడీపీ తెలంగాణకు అనుకూలమని తీర్మానాలు చేసి, అవసరాలు తీరాక మాట మార్చారని మండిపడ్డారు. బీజేపీ ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని చెప్పి మాట తప్పిందన్నారు. ప్రజావ్యతిరేక సర్కార్‌ను గద్దె దించుదాం కేసీఆర్ దీక్ష స్ఫూర్తితో ఈ ప్రజావ్యతిరేక సర్కారును గద్దె దించేవరకు రైతులు, యువకులు, బాధితుల పక్షాన పోరాటానికి సంకల్పం తీసుకుందామని హరీశ్‌రావు పిలుపునిచ్చారు. కొందరు దొంగలు పారీ్టలోకి వచ్చి పందికొక్కుల్లాగా తిని వెళ్లిపోయారని విరుచుకుపడ్డారు. తెలంగాణను కాపాడాలని ఆ రోజు కేసీఆర్ కొన్ని నిర్ణయాలు తీసుకున్నారని, ఇకపై అలాంటి వారికి పారీ్టలో చోటు ఉండదని హరీశ్‌రావు స్పష్టం చేశారు. అంతకుముందు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, అమరవీరుల స్తూపానికి నివాళులరి్పంచారు. పార్టీ కార్యాలయంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యాలయంలో ఏర్పాటు చేసిన తెలంగాణ ఉద్యమంలో చేసిన దీక్షలు, ఆందోళన ఫొటోలతో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డితో పాటు నాయకులు పాల్గొన్నారు. -
కేటీఆర్, హరీష్ రావులది నా స్థాయి కాదు: కోమటిరెడ్డి
సాక్షి, నల్గొండ జిల్లా: కేటీఆర్, హరీష్ రావులది తన స్థాయి కాదని.. వాళ్లు కేవలం కేసీఆర్ కుమారుడు, అల్లుడు మాత్రమేనంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు. జ్యోతిబా పూలే వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మంత్రి.. అనంతరం మీడియాతో మాట్లాడారు.‘‘బంగారు తెలంగాణ అంటూ అప్పులు చేసి కేసీఆర్ ఫాంహౌస్‌లో పడుకున్నాడు. తెలంగాణలో అమలు అవుతున్న పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా అమలు అవుతున్నాయా?. ఇప్పటికే 18 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేశాం. మిగతా రుణమాఫీ ఈ నెల 30న చేస్తాం’’ అని కోమటిరెడ్డి పేర్కొన్నారు.మోదీ సొంత రాష్ట్రంలో పదమూడు వందలకు గ్యాస్ సిలిండర్ విక్రయిస్తున్నారు. తెలంగాణలో రూ.500కే సిలిండర్ ఇస్తున్నాం. రూ.500కే గ్యాస్ ఎందుకు ఇవ్వడం లేదో ప్రధాన మోదీ, బీజేపీ నేతలు సమాధానం చెప్పాలి’’ అని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణలో కేసీఆర్ అప్పులపాలు చేసి రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తారిలా మార్చారు. ఒక ఇళ్లు కట్టకుండా కేసీఆర్ ఏడు లక్షల కోట్ల అప్పులు చేశాడుకేసీఆర్ ఫామ్ హౌస్‌లో పడుకుంటే మోదీ విదేశాల్లో తిరుగుతున్నారు. డిసెంబరు మొదటి వారంలో సీఎం రేవంత్ నల్లగొండ జిల్లాలో పర్యటిస్తారు’’ అని కోమటిరెడ్డి తెలిపారు. -
మూసీ రివర్ పై సర్కారు వాస్తవాలు దాచి పెడుతుంది: హరీష్ రావు