
సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేటీఆర్ సహా బీఆర్‌ఎస్ ముఖ్య నేతలంతా ఎర్రవల్లి ఫాంహౌస్‌కు చేరుకుంటున్నారు. కేసీఆర్‌తో కేటీఆర్ భేటీ అయ్యారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ నేపథ్యంలో బీఆర్‌ఎస్ నేతల సమావేశం జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇక, పార్టీ పరంగా ఎలా ముందుకు వెళ్లాలి అనే దానిపై నేతలకు కేసీఆర్ దిశా నిర్దేశం చేయనున్నట్టు సమాచారం.
