KCR
-
కోహ్లీకి దీటుగా కేసీఆర్ రికార్టు
సాక్షి, హైదరాబాద్: వన్డేల్లో 14 వేల పరుగులు సాధించి విరాట్ కోహ్లి రికార్డు సృష్టిస్తే, 14 నెలలుగా అసెంబ్లీకి రాకుండా మాజీ సీఎం కేసీఆర్ కూడా రికార్డు సృష్టించారని దేవాదాయ, అటవీ శాఖమంత్రి కొండా సురేఖ ఎద్దేవా చేశారు. ఈ మేరకు సోమవారం ఆమె పత్రికా ప్రకటన విడుదల చేశారు. ‘దుబాయ్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించడం హర్షణీయం. ఈ విజయాన్ని అందరం టీవీల్లో చూసి సంబురపడ్డాం. క్రికెట్లో అది విరాట్ కోహ్లి పర్వం అయితే, ప్రజా సమస్యలపై మాట్లాడకుండా ప్రజలకు అందుబాటులో లేకుండా పోవడం దేశ రాజకీయ చరిత్రలో పెద్ద రికార్డే కదా? ఇది కేసీఆర్ విరాట పర్వం’ అని ఆ ప్రకటనలో సురేఖ వెల్లడించారు. ఆధార్ లేకుంటే వైద్యానికి నిరాకరిస్తున్నారా?సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో ఆధార్ లేకుంటే వైద్యానికి నిరాకరిస్తున్నారా? అని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. వివరాలు తెలుసుకొని చెప్పాలని స్పెషల్ జీపీని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. ఓయూలో ఆధార్ లేకుంటే వైద్యం చేయట్లేదంటూ న్యాయవాది బైరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి పిల్ దాఖలు చేశారు. ఈ పిల్‌పై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ రేణక యారా ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున న్యాయవాది ఆకాశ్ బాగ్లేకర్ వాదిస్తూ ప్రభుత్వాస్పత్రిలో వైద్యానికి ఆధార్ తప్పనిసరి అనడం చట్టవిరుద్ధమన్నారు. ఆధార్ అడగకుండా వైద్యం అందించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. కాగా, ఆధార్ లేకున్నా వైద్యం అందిస్తున్నామని స్పెషల్ జీపీ రాహుల్ పేర్కొన్నారు. -
‘సూటిగా కేసీఆర్‌ను అడుగుతున్నా మీ ఓట్లెవ్వరికని..?’
కరీంనగర్ జిల్లా: కరీంనగర్ సభను సక్సెస్ చేసి కరీంనగర్ కాంగ్రెస్ కు కంచుకోట అని నిరూపించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ సభలో సీఎం రేవంత్ ప్రసంగించారు. ‘కరీంనగర్ జిల్లాకు దేశంలోనే ప్రత్యేకత ఉంది. ప్రపంచంలోనే మూడో ఆర్థికశక్తిగా ఎదగడానికి ఘనత వహించిన పీవీ ఇక్కడివారు. అలాంటివారెందరికో కరీంనగర్ వేదిక. కరీంనగర్ చైతన్యవంతమైన వేదిక ఆనాడు ఆరు పార్లమెంట్, 42 అసెంబ్లీ స్థానాల్లో కేవలం మంథని, సంగారెడ్డిల్లో మాత్రమే మనకు శాసనసభ్యులుండె. అయినా, జీవన్ రెడ్డిని పట్టభద్రులు గెలిపించారు. కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించాలని బీఆర్ఎస్ కోరుతుంది కదా మరి ఎవరిని వాళ్ళు గెలిపించాలని కోరుతున్నారో సమాధానం చెప్పాలి. సూటిగా కేసీఆర్ ను అడుగుతున్నా మీ ఓట్లెవ్వరికని..?, ఢిల్లీ కాళ్ళ ముందు బీఆర్ఎస్ నాయకులు సాగిలపడ్డారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టలేని బీఅర్ఎస్ ఉప ఎన్నికలు వేస్తే గెలుస్తామంటోంది. మీ నీతేంది, జాతేందని అడుగుతున్నా . ఈ 14 నెలల్లో మేం టీచర్స్ బదిలీలు, గ్రాడ్యుయేట్స్ కు ఉద్యోగాలు కల్పించకపోతే మాకు ఓటు వేయకండని నేనే చెబుతున్నా. పదకొండు వేల మంది ఉపాధ్యాయులకు ఓట్లెయకుంటే మీరు ఓటెయ్యొద్దని చెబుతున్నా . కేసీఆర్ జీతాలు కూడా ఇవ్వకుండా అడుక్కునేలా చేశాడు ఇవాళ మీ జీతాలు సమయానికి వేస్తున్నాం కదా ఆలోచించి ఓటేయండని కోరుతున్నా. ఐటీఐలను టాటాలతో కలిసి ఏటీసీలుగా అప్ గ్రేడ్ చేశాం. క్రీడాకారులను ప్రోత్సహించేందుకే యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని తీసుకొచ్చాం. 60 ఎకరాల్లో 600 కోట్ల కార్పస్ ఫండ్ తో నాణ్యమైన విద్య కోసం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని తీసుకొచ్చాం . ఇవన్నీ విప్లవాత్మక నిర్ణయాలు . ఇవన్నీ చూసి ఆలోచించి మాకు ఓటేయండి. నిఖిత్ జరీన్, సిరాజ్ వంటివారిని ప్రోత్సహిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా..?, బీఆర్ఎస్ సీటును గుంజుకున్నామనే బీఆర్ఎస్ అక్కసు. బీఆర్ఎస్, బీజేపీ చీకటి ఒప్పందం చేసుకున్నాయి. ప్రభుత్వానికి తెల్వకుండా ఢిల్లీలో కేటీఆర్, హరీష్ రావు నిధులడుగుతున్నామని చెప్పడమేంటి..?, బీఆర్ఎస్ రైతుబంధులో ఇచ్చిన దానికంటే తాలుతప్ప పేరిట ధాన్యం కోత పెట్టి పంచుకుందెక్కువ. పదేళ్లలో నువ్వు చేసిన దుర్మార్గాలు, 12 ఏళ్ల మోడీ నిర్లక్ష్యం పక్కనబెట్టి మమ్మల్ని ఓడగొట్టాలా?, సందెట్లో సడేమియా అన్నట్టు సంజయ్ బయల్దేరిండు. మా పొన్నం తెలంగాణా కోసం కొట్లాడిండు. ఈ సంజయ్ ఏం తెచ్చిండు..? చిల్లిగవ్వ తేలే.ఏం తేలేకపోయినా పర్లేదు.. పెద్ద బీసీ మోదీ, చిన్న బీసీ సంజయ్ బీసీ లెక్కలైనా తేల్చారా కనీసం?, కేసీఆర్ లెక్కలు నమ్మి కిషన్ రెడ్డి, బండి సంజయ్ అవే చిలుకపలుకులు పలుకుతున్నారు 1979లోనే మండల్ కమిషన్ 29 ముస్లింలలోని తెగలను బీసీల్లో కలిపింది. బండికి అవగాహన లేకుంటే వారి అధికారులను కనుక్కోవాలని చెబుతున్నా. మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బీసీల్లో ముస్లింలను చేర్చలేదా.. మోదీ ఆ విషయాలు చెప్పలేదా..?, కిషన్ రెడ్డి, బండి సంజయ్ వి చావు తెలివితేటలు. మతం పేరిట రెచ్చగొడితే రెచ్చిపోయే సమాజం కాదు తెలంగాణా. బండి సంజయ్ ని ఓర్వలేక అధ్యక్షుడి సీటు గుంజుకుండు. బండారు దత్తాత్రేయను పక్కకు జరిపి తాను సీటెక్కిండు. నేను పీసీసీ ప్రెసిడెంట్ గా పక్కకు జరిగి ఓ బీసీ అయిన మహేష్ గౌడ్ కు సీటు అప్పజెప్పినా. మోదీ కౌగిలిలో మందకృష్ణ నలిగిపోయిండు. ఈ ఎమ్మెల్సీ సీటు పోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి పోయేదేముండదు. కానీ, దీనివెనుక బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర ఉంది’ అని రేవంత్ మండిపడ్డారు. -
కేసీఆర్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు
-
KCR: హైకోర్టులో కేసీఆర్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్
సాక్షి,హైదరాబాద్: మేడిగడ్డ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అధినేత.. మాజీ సీఎం కేసీఆర్(KCR), మాజీ మంత్రి హరీష్ రావులు వేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు.. తీర్పు రిజర్వు చేసింది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు.. తీర్పును తర్వాత వెల్లడిస్తామని తెలిపింది. మేడిగడ్డ కుంగిన వ్యవహరంపై భూపాలపల్లి కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేసీఆర్, హరీష్ రావులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై ఇవాళ (ఫిబ్రవరి24) హైకోర్టు విచారణ జరపింది. విచారణ సందర్భంగా.. లోయర్ కోర్టులో పిటిషన్ వేసిన రాజలింగమూర్తి(Raja Lingamurthy) చనిపోయాడని కేసీఆర్, హరీష్ తరుఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే.. కేసు వేసిన పిటిషనర్ చనిపోయినా లీగల్ హైర్(Legal Heir)ను ఇంప్లీడ్ చేస్తే.. పిటిషన్ మెయింటేనబుల్ అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. కాబట్టి, మళ్లీ లోయర్ కోర్టుకు రిఫర్ చేయాలని బెంచ్‌కు విజ్ఞప్తి చేశారు. అయితే.. ఇది క్రిమినల్ పిటిషన్ కాబట్టి లీగల్ హైర్‌కు ఆస్కారం ఉండబోదని కేసీఆర్ అడ్వకేట్ వాదించారు. లీగల్ హైర్ ను ఇంప్లీడ్ చేయడం సమన్స్ కేసుకు మాత్రమే వర్తిస్తుందని కోర్టుకు నివేదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. -
బీసీలపై పెద్ద కుట్ర.. బీఆర్ఎస్, బీజేపీలపై సీఎం రేవంత్ ఫైర్
హైదరాబాద్: బీసీ రిజర్వేషన్ల కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తా.. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీ బీసీ నేతలదేనని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన బీసీ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘‘తప్పు తప్పు అంటూ బీఆర్ఎస్, బీజేపీ అసత్య ప్రచారం చేస్తున్నాయి.. ఎక్కడ తప్పు జరిగిందో చూపించాలంటూ ఆ పార్టీ నేతలకు సవాల్ విసిరారు.‘‘రాష్ట్ర పార్టీ నేతలకు బీసీ కులగణనపై అవగాహన చేసుకోవాలి. ప్రతిపక్షాల ఉచ్చులో పడొద్దు. బీసీలు మౌనంగా ఉంటే మీకే నష్టం. బీసీలు నిలదీస్తే.. తమ పదవులు పోతాయని బీజేపీ, బీఆర్ఎస్లో రెండు వర్గాల వారు కుట్ర చేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి కొస్తే కులగణన చేస్తామని రాహుల్ గాంధీ మాటిచ్చారు. బలహీన వర్గాలు ముందుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. మా నాయకుడు ఇచ్చిన మాటను నిలబెట్టాలని బీసీ కులగణన చేశాం’’ అని రేవంత్ చెప్పారు.‘‘కేసీఆర్ ఒక్క రోజులో సర్వే చేసి కాకి లెక్కలు చెప్పారు. ఆ వివరాలు బయటకు చెప్పకుండా దాచి పెట్టుకున్నారు. రాజకీయాలకు ఆ వివరాలను కేసీఆర్ వినియోగించుకున్నారు. కానీ మేము అలా చేయలేదు. ప్లానింగ్ విభాగాన్ని నోడల్ ఏజెన్సీగా పెట్టుకుని సర్వే చేశాం. కేసీఆర్ చేసిన సమగ్ర సర్వే తప్పుడు సర్వే. ఎస్సీల్లో 56 కులాలు ఉంటే 86 కులాలుగా సమగ్ర కుటుంబ సర్వేలో చూపించారు. మేము చేసిన సర్వేను కొందరు తప్పుపడుతున్నారు. ఎక్కడ తప్పు ఉందో చెప్పండి. బీఆర్ఎస్, బీజేపీ కోర్టుల్లో కేసులు వేసి కులగణన ప్రక్రియను నిర్వీర్యం చేసే ప్రమాదం ఉంటుంది. వారికి ఆ అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా సర్వే చేశాంమోదీ బీసీ అని చెప్పుకుంటారు. 2011లో కాంగ్రెస్ చేసిన బీసీ సర్వే లెక్కలు బయట పెట్టాలి. బండి సంజయ్‌కు ప్రేమ ఉంటే ఆ లెక్కలు బయట పెట్టండి. బీసీలకు వాటా ఇవ్వాల్సి వస్తుందని బయట పెట్టడం లేదు. ప్రతీ రాష్ట్రంలో ఈ డిమాండ్ వస్తే దేశం మొత్తం చేయాల్సి వస్తుంది. బీసీల లెక్క తేలితే బీజేపీలో అధికారం చెలాయించే ఒకటి రెండు సామాజిక వర్గాలకు ఇబ్బంది అవుతుంది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఇప్పటి వరకు వారి వివరాలు నమోదు చేసుకోలేదు. 50 శాతం ప్రజలు, అర శాతం ఉన్న వాళ్లను ప్రశ్నిస్తారని వాళ్ల భయం. అందుకే బీసీల సర్వేకు వారు సహకరించడం లేదు. కేసిఆర్ నాలుగు కేటగిరీల్లో లెక్కలు తీస్తే మేము ఐదు కేటగిరీల్లో వివరాలు తీశాం’’ అని రేవంత్ పేర్కొన్నారు.‘‘తప్పుడు లెక్కలు అని తప్పుడు మాట్లాడొద్దు. ఎక్కడ తప్పు జరిగిందో చెప్పండి. మేము పారదర్శకంగా సర్వే చేశాం. ఇది చరిత్రలో నిలిచి పోతుంది. మేము చేసిన సర్వే దేశానికే ఆదర్శం. సర్వే లెక్కలు బయట పెట్టొద్దని నా మీద కొందరు ఒత్తిడి కూడా తెచ్చారు. అయినా నేను పట్టించుకోలేదు. మన లెక్కలు తప్పని కొందరు తప్పుడు ప్రచారం చేస్తే మన వాళ్ళు మౌనంగా ఉండటం సరికాదు. రాహుల్ గాంధీ బీసీ కులగణనకు డిమాండ్ చేస్తే మోదీకి నష్టం. మోదీ పదవి పోతే బండి సంజయ్, కిషన్ రెడ్డి పదవులు పోతాయి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, బండి సంజయ్, కిషన్ రెడ్డి సర్వే తప్పు అనడం కాదు. ఎక్కడ తప్పు ఉందో చూపించండి. ఇదంతా బీసీలపై జరుగుతున్న పెద్ద కుట్ర. సర్వే లెక్కల ప్రకారం ఎలా న్యాయం చేయాలని నేను ఆలోచిస్తున్నా’’సెకండ్ ఫేజ్ సర్వే పూర్తి అయిన తర్వాత దీనికి చట్టబద్ధత కల్పిస్తాం. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు జనాభా లెక్కలలోనే లేరు. వారి ఇంటి ముందు మేలుకొలుపు డప్పు కొట్టండి. లెక్కలు చెప్పకుండా ఫామ్ హౌస్ లో పన్నోడు మంచోడు. మీ లెక్కలు తీసిన నేను మంచోడిని కాదా. మీరు కూడా నన్ను విలన్‌గా చూస్తే ఎలా?. అసెంబ్లీలో సర్వేకు చట్టబద్ధత కల్పించే వరకే నా బాధ్యత.. దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇక బీసీల మీదే ఉంది. బీజేపీకి నా డిమాండ్. కేంద్రం చేసే జనగణనలో కుల గణన చేయండి. నేను చెప్పిన లెక్కలు తప్పని తేల్చండి. మార్చి 10 వరకు అన్ని కుల సంఘాల సమావేశాలు పెట్టుకోండి. తీర్మానాలు చేయండి. బీసీల లెక్కలు మోదీ వద్దంటున్నారు కాబట్టే.. బండి సంజయ్ వద్దు అంటున్నారు.‘‘మనం చేసిన సర్వేకు ప్రజామోదం కూడా ముఖ్యం. అన్ని సామాజిక వర్గాల సమావేశాలు పెట్టీ తీర్మానాలు చేయండి. యూనివర్సిటీల్లో విద్యార్థులు సెమినార్ లు నిర్వహించండి. బలహీన వర్గాలకు ఇదే భగవద్గీత, ఇదే ఖురాన్, ఇదే బైబిల్. ఇంతకంటే మించిన పాలసీ డాక్యుమెంట్ ఏది లేదు.’’ అని రేవంత్ పేర్కొన్నారు. -
గులాబీ బాస్.. ఇంక వ్యూహం మార్చాల్సిందేనా?
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి , బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ సెంటిమెంట్‌తో మరోసారి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. పార్టీ ప్రధాన కార్యాలయంలో సుదీర్ఘ ప్రసంగం చేసిన ఆయన తన తొమ్మిదిన్నరేళ్ల పదవీకాలంలో చేసిన అభివృద్దిని ప్రస్తావిస్తూనే, తన సహజశైలిలో కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. అయితే తాము అధికారంలో ఉండగా జరిగిన తప్పులను సమీక్షించుకునేందుకు ఆయన సిద్ధంగా ఉన్నట్లు కనిపించలేదు. ప్రత్యేకించి.. పార్లమెంటు ఎన్నికల ఫలితాలను తేలికగా తీసుకుంటున్న అభిప్రాయం కలుగుతుంది. శాసనమండలి ఎన్నికలలో పోటీ చేయడం లేదంటే అర్థం చేసుకోవచ్చు కాని లోక్‌సభ ఎన్నికలలో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోవడం బీఆర్ఎస్(BRS)కు పెద్ద షాకే. పార్టీ ఆవిర్భావం తర్వాత ఇంత ఘోరమైన ఫలితాన్ని చవిచూడలేదు. ఈ పరిస్థితి ఎందుకు అనేదానిపై ఆయన దృష్టి పెట్టారో, లేదో తెలియదు. కేసీఆర్(KCR) పార్టీ కంటే ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌కే ఎక్కువగా పరిమితమవుతున్నారు అని పార్టీ భావిస్తోంది. బీఆర్ఎస్ శ్రేణులు సైతం ఆయనను కలవాలంటే అంత దూరం వెళ్లాల్సి వస్తోంది. కేసీఆర్ కుమారుడు, బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు తారక రామారావు, మాజీ మంత్రి హరీష్ రావులు యాక్టివ్ గా ఉండడం బాగానే ఉన్నా.. ప్రధాన నాయకుడిగా కేసీఆర్ కూడా అందుబాటులో ఉండవలసిన అవసరముంది. తెలంగాణ రక్షణ కవచం బీఆర్ఎస్ అని చెప్పుకున్నా.. తెలంగాణ చరిత్ర ప్రసవించిన బిడ్డ టీఆర్ఎస్ నుంచి పేరు మారిన బీఆర్ఎస్ అని ప్రకటించినా.. పార్టీకి కొత్తగా వచ్చేదేమీ ఉండదు. తొమ్మిదిన్నరేళ్లపాటు సీఎంగా ఉన్న కేసీఆర్ పలు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టిన మాట నిజం. ప్రత్యేకించి హైదరాబాద్ అభివృద్దిలో విశేష కృషి ఉంది. అందువల్లే హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో బీఆర్ఎస్ పూర్తి మెజార్టీని సాధించింది. తెలంగాణ రూరల్ ప్రాంతంలో మాత్రం పార్టీ బాగా దెబ్బతింది. ఫలితంగా అనూహ్యమైన ఓటమిని చవిచూడవలసి వచ్చింది. ఇందుకు.. కాంగ్రెస్ ప్రకటించిన హామీల ప్రభావం కొంత ఉండవచ్చు. కాని అదే టైమ్ లో కెసిఆర్ యాటిట్యూడ్ , అభ్యర్థుల ఎంపికలో లోటుపాట్లు, మొదలైన కారణాల వల్ల కూడా పార్టీకి నష్టం జరిగింది. శాసనసభ ఎన్నికలలో 38 సీట్లు గెలుచుకున్న బీఆర్ఎస్లోక్ సభ ఎన్నికలలో దారుణ పరాజయం ఎదుర్కొనప్పటికీ.. ఇప్పుడిప్పుడే మళ్లీ కోలుకుంటున్న మాట వాస్తవం. కాంగ్రెస్ పార్టీ తప్పులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహార శైలి.. ఇందుకు ఉపకరిస్తున్నాయి. కాంగ్రెస్ వాగ్దానాల అమలుకు ప్రయత్నం చేస్తున్నప్పటికీ.. అవి అలవి కావడం లేదు. ఈ అంశాల ఆధారంగా బీఆర్ఎస్లో జోష్ నింపడానికి కేసీఆర్ యత్నించారు. పార్టీని గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా పటిష్ట నిర్మాణం చేసి అటు పార్టీ విజయాన్ని, ఇటు తెలంగాణ ప్రజల శాశ్వత విజయం కోసం సమాంతరంగా పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అంతవరకు బాగానే ఉంది. కానీ.. కేసీఆర్ కేవలం ప్రసంగం చేసి తిరిగి ఫామ్ హౌస్‌కే పరిమితమైతే అంత ఉపయోగపడకపోవచ్చు. ఈ విషయాన్ని పక్కనబెడితే కేసీఆర్ ఉపన్యాసంలో కొన్ని ఆశ్చర్యకర విషయాలను ప్రస్తావించారు. తద్వారా తెలంగాణ ఫీలింగ్‌ను పెంచడం ద్వారా రాజకీయం చేయడం అంత తేలిక కాకపోవచ్చు. కేసీఆర్‌తో పోటీగా రేవంత్ రెడ్డి(Revanth Reddy) కూడా దానిని రెచ్చగొట్టగలరు. ఆ విషయాన్ని ఆయన మర్చిపోరాదు. తామే రాష్ట్రాన్ని సాధించామని చెప్పుకోవడం వరకు ఓకే. దానిని జనం నమ్ముతారు కూడా. కాని చరిత్రను తనకు అనుకూలంగా మలచుకుని మాట్లాడుతున్న వైనం ఎంతవరకు ప్రయోజనమన్నది ప్రశ్న. కేసీఆర్ ఏమన్నారో చూడండి.. 'తెలంగాణ సామాజిక, చారిత్రక అవసరాల దృష్ట్యా.. తెలంగాణ చరిత్ర ప్రసవించిన బిడ్డ బీఆర్ఎస్ , తెలంగాణ రాజకీయ అస్తిత్వ పార్టీగా, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తన చారిత్రక బాధ్యతను నిర్వర్తించిన తెలంగాణ ప్రజల పార్టీ బీఆర్ఎస్" అన్నారు. 'తెలంగాణ కన్నీళ్లు తెలిసిన పార్టీగా.. తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాలను చైతన్య పరుస్తూ, తెలంగాణ అస్థిత్వ పటిష్టతకు కృషి చేస్తూ, గత గాయాల నుంచి కోలుకున్న తెలంగాణను, తిరిగి అవే కష్టాల పాలు కాకుండా, గత దోపిడీ వలసవాదుల బారిన పడకుండా, తెలంగాణ ప్రజలకు శాశ్వత విజయం అందించే దిశగా సమస్త పార్టీ శ్రేణులు కృషి చేయాలి" అని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి పదంలో తెలంగాణ సెంటిమెంట్ ను చొప్పించడానికి కేసీఆర్ ప్రయత్నం చేశారు. ఇదే ప్రసంగంలో ఆయన ఒక మాట అన్నారు. ఇటీవలి పార్లమెంటు ఎన్నికల ఓటమి గురించి మాట్లాడుతూ రాజకీయాలలో గెలుపు ఓటములు సహజమని, కొత్తతరంలో తెలంగాణ సోయి లేనందునే పార్లమెంటు ఎన్నికలలో ఓడిపోయామని చెప్పారు. ఇందులో వాస్తవం ఉందా? లేదా? అనేదాని కన్నా, ఆయన ఉద్దేశం అర్థమవుతూనే ఉంది. మళ్లీ తెలంగాణ సెంటిమెంట్‌ను రేకెత్తించడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలన్నదే ఆయన లక్ష్యం అనే విమర్శలకు ఆస్కారం ఇస్తున్నారు. తన పదవీకాలంలో ఎప్పుడైనా ఒకసారి సెంటిమెంట్ గురించి మాట్లాడినా, సాధ్యమైనంత వరకు ఏ రాష్ట్రం నుంచి వచ్చిన వారైనా తెలంగాణ ప్రజలగానే చూడాలని అనేవారు. అది ఆయనకు కలిసి వచ్చింది కూడా. అందువల్లే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి హైదరాబాద్ చుట్టుపక్కల నివసిస్తున్న వారిలో మెజార్టీ బీఆర్ఎస్కే మద్దతు ఇచ్చారు. ఒకప్పుడు హైదరాబాద్‌లో ఆనాటి టీఆర్ఎస్ ఉనికే పెద్దగా లేదన్నది వాస్తవం. కాని అధికారంలోకి వచ్చాక ఎలాంటి గొడవలు లేకుండా, ఉద్యమం వివాదాలు కనిపించకుండా కేసీఆర్ ప్రభుత్వం సాగింది. కనుకే వారి మన్ననలు పొందగలిగారు. అయితే.. నిజాం సంస్థానాన్ని ఆనాటి కేంద్ర ప్రభుత్వం సర్దార్ పటేల్ నేతృత్వంలో భారత్‌లో విలీనం చేయడానికి చేపట్టిన సైనిక చర్య గురించి కేసీఆర్ మాట్లాడిన తీరు అంత సబబు కాదేమో!. కాంగ్రెస్ పార్టీ ఆది నుంచి తెలంగాణకు ద్రోహం చేసిందని వాదించడానికి ఈ అంశాన్ని ఎంపిక చేసుకున్నారు. 'దేశానికి స్వాతంత్య్రం వచ్చినా తెలంగాణకు రాలేదని, తెలంగాణ ఇంకా నిజాం పాలనలో ఉంటే భారత మిలటరీ సైనిక ఆక్రమణకు పాల్పడిందని కేసీఆర్ వివరించారు. భారత ప్రభుత్వం చేపట్టిన సైనిక చర్యతో 20-30 వేల మంది ప్రాణాలు కోల్పోయారని, వీరిలో కొంత మంది రజాకార్లు ఉన్నా మరికొంత మంది సామాన్యులు, కమ్యూనిస్టులు కూడా ఉన్నారని, మాజీ హోంమంత్రి దివంగత నాయిని నర్సింహారెడ్డి తండ్రి వంటివారు ఎందరో మరణించారని గుర్తు చేశారు. సాయుధ పోరాటం తర్వాత తెలంగాణను ఆంధ్రాలో అన్యాయంగా విలీనం చేయడం వల్ల యువత, ప్రజల్లో అలజడి పెరిగిందని తెలిపారు. ‘ఆత్మగౌరవ పోరాటాలు చేసిండ్రు. ఇడ్లీ సాంబార్ గో బ్యాక్’ వంటి అనేక ఉద్యమాలు మొదలైనయి." అంటూ మాట్లాడారని మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే.. కాంగ్రెస్ పార్టీని విమర్శించదలచుకుంటే ప్రస్తుత పరిణామాలలో చాలా దొరుకుతాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఎన్నైనా విమర్శలు చేయవచ్చు. కాని భారత మిలటరీ సైనిక ఆక్రమణలకు పాల్పడిందని అనడం చరిత్రాత్మకంగా ఎంత వరకు కరెక్టు? ఆనాడు భారత మిలటరీ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ప్రజలు స్వాగతం పలికిన సన్నివేశాలు కూడా ఉన్నాయన్న సంగతి మర్చిపోకూడదు. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రులను విమర్శించడానికి, అప్పట్లో తెలంగాణలో పెద్దగా అభివృద్ది సాగలేదని చెప్పడానికి కేసీఆర్ యత్నించినట్లు కనిపిస్తోంది. అదే సమయంలో.. ఇప్పుడు సమైక్య రాష్ట్ర ఊసు అంత అవసరమా?. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణకు జరిగిన అన్యాయంపై కేసీఆర్ గళమెత్తారు. ఎన్డీయే రూపంలో చంద్రబాబు తిరిగి తెలంగాణ రాజకీయాలలోకి వస్తున్నారన్న సంశయాన్ని ఆయన వ్యక్తం చేశారు. విశేషం ఏమిటంటే 2018లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు తెలుగుదేశంతో స్నేహం చేసి ఓటమి చవి చూసింది. ఏపీలో 2024లో బీజేపీ, జనసేనలతో కూటమి కట్టి టీడీపీ అధికారంలోకి వచ్చింది. 2024 లోక్ సభ ఎన్నికలలో బీజేపీతో భాగస్వామిగా ఉన్నప్పటికీ తెలంగాణలో టీడీపీ పోటీ చేయలేదు. తెలంగాణ వరకు చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ కూడా అంతగా ఇష్టపడకపోవచ్చు. కాని రాజకీయాలలో ఏమైనా జరగవచ్చు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చంద్రబాబు(Chandrababu)కి సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నది అందరి భావన. అందువల్ల తెలంగాణలో వచ్చే ఎన్నికల నాటికి ఏమి అవుతుందన్నది ఇప్పటికిప్పుడు చెప్పలేం. ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబును విమర్శించి, జాతీయ పార్టీ అయిన బీజేపీ జోలికి కేసీఆర్ పెద్దగా వెళ్లినట్లు కనబడదు. దీనిపై కాంగ్రెస్ నేతలు విమర్శలు చేయవచ్చు. ఇక ఫిరాయింపులు, ఉప ఎన్నికల గురించి కేసీఆర్ బాగానే మాట్లాడారు. కాని ఆయన కూడా తను అధికారంలో ఉన్నప్పుడు ఫిరాయింపులను పెద్ద ఎత్తునే ప్రోత్సహించారు. దానివల్ల పెద్ద ప్రభావం ఉండకపోవచ్చు. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూనే.. తెలంగాణ సెంటిమెంట్ ను ఉపయోగించడానికి పాత తరం వ్యూహరచన చేస్తున్నట్లుగా ఉంది. కాని కేసీఆర్ చెబుతున్నట్లే కాలం మారింది. తరం మారింది. దానికి తగినట్లుగా ఆయన వ్యూహం మార్చుకోరా? అనేదే ప్రశ్న.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
‘కారు’ ఇక పరుగు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా ఆవిర్భవించిన భారత్ రాష్ట్ర సమితి ఈ ఏడాది ఏప్రిల్ 27 నాటికి 25 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఏడాది పొడవునా పార్టీ రజతోత్సవాల నిర్వహణకు సన్నద్ధమవుతోంది. మరోవైపు సంస్థాగత నిర్మాణంతో పాటు ప్రజా సమస్యలపై ఉద్యమించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా కొత్త వ్యూహాలకు పదును పెడుతోంది. ఈ క్రమంలోనే పార్టీ కీలక నేతల మధ్య పని విభజన ద్వారా అన్ని వర్గాల ప్రజలకు చేరువ కావడంపై దృష్టి సారించింది. ఉద్యమకాలంలో కలిసి నడిచిన శక్తులకు తిరిగి దగ్గర కావాలని నిర్ణయించింది.తెలంగాణ అస్తిత్వాన్ని మరోసారి గుర్తు చేస్తూ పార్టీ భావజాలాన్ని వ్యాపింపజేయాలనే అభిప్రాయంతో ఉంది. తద్వారా కొత్త తరాన్ని ఆకర్షించే ఎత్తుగడలకు పదును పెడుతోంది. ఈ నెల 19న జరిగిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి భేటీలో పార్టీ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఈ మేరకు సంకేతాలు ఇచ్చారు. కీలక నేతలకు ముఖ్య బాధ్యతలు పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడంతో పాటు అన్ని స్థాయిల్లో యంత్రాంగాన్ని సమన్వయం చేసేందుకు కీలక నేతల నడుమ పని విభజన చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీ రామారావుకు క్షేత్ర స్థాయిలో ప్రజా సమస్యలపై చేపట్టాల్సిన కార్యక్రమాలు, వాటి అమలు బాధ్యతను అప్పగించనున్నారు. ఇప్పటికే ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన రైతు ధర్నాల్లో పాల్గొన్న కేటీఆర్.. ప్రభుత్వ వైఫల్యాలపై భవిష్యత్తులో జరిగే ఆందోళనలు, నిరసన కార్యక్రమాలకు నేతృత్వం వహించనున్నారు.సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావుకు పార్టీ సంస్థాగత నిర్మాణ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ఇప్పటికే కేసీఆర్ ప్రకటించారు. ఏప్రిల్ 10న ప్రారంభమయ్యే పార్టీ సభ్యత్వ నమోదుతో పాటు గ్రామ, వార్డు, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీల కూర్పు, పార్టీ శిక్షణ కార్యక్రమాలు తదితరాలను హరీశ్ పర్యవేక్షిస్తారు. పార్టీ రజతోత్సవాల నిర్వహణ బాధ్యతలను కూడా హరీశ్‌రావుకే అప్పగించనున్నట్లు సమాచారం. అనుబంధ సంఘాలపై కవిత దృష్టి ఇప్పటికే బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మహిళలకు సంబంధించిన అంశాలపై దృష్టి కేంద్రీకరించి పనిచేస్తున్న ఎమ్మెల్సీ కవిత.. పార్టీ అనుబంధ సంఘాలను బలోపేతం చేసే దిశగా ఇప్పటికే కార్యాచరణ అమలు చేస్తున్నారు. మహిళా రిజర్వేషన్లు, కులగణన, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు వంటి అంశాలపై కవిత వరుస సదస్సులు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఉద్యమ శక్తుల ఏకీకరణ.. యువతకు చేరువ ఉద్యమ కాలంలో పార్టీతో కలిసి వచ్చిన వ్యక్తులు, శక్తులకు తిరిగి దగ్గర కావాలనే అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 27 నుంచి ఏడాది పొడవునా సాగే పార్టీ రజతోత్సవాల్లో ఉద్యమంలో కలిసి వచ్చిన కవులు, కళాకారులు, రచయితలు, వివిధ జేఏసీల్లో క్రియాశీలంగా పనిచేసిన వారితో కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తద్వారా తెలంగాణ అస్తిత్వాన్ని, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యతను గుర్తు చేయడంతో పాటు కొత్త తరానికి తెలంగాణ నేపథ్యం, రాష్ట్ర సాధన ఉద్యమం తదితరాలను పరిచయం చేయాలని, పార్టీ భావజాలాన్ని వ్యాపింపజేయాలని కేసీఆర్ భావిస్తున్నారు.మరోవైపు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో బీఆర్ఎస్ పాత్ర, పదేళ్ల పాలనలో రాష్ట్ర అభివృద్ధికి చేసిన కృషిని గుర్తు చేసేలా కార్యక్రమాలు రూపొందించనున్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావ సమయంలో పుట్టిన పసికందులు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తున్న యువతగా ఎదిగారు. వారిలో తెలంగాణ అస్తిత్వ స్ఫూర్తిని రగిలించేలా సదస్సులు, సమావేశాలు, సభలు నిర్వహించాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఈ కార్యక్రమాలకు రూపకల్పన బాధ్యతను పార్టీలోని కొందరు ముఖ్య నేతలకు అప్పగించనున్నారు. కార్యాచరణ రూపకల్పనకు కోర్ గ్రూప్ పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చలు, ప్రణాళికల రూపకల్పనకు సుమారు 25 నుంచి 30 మంది సీనియర్ నేతలతో కోర్ గ్రూప్ ఏర్పాటు చేయాలని అధినేత భావిస్తున్నారు. ఈ గ్రూప్‌లో ఉద్యమ కాలం నుంచి పార్టీలో పనిచేసిన నేతలతో పాటు వివిధ సందర్భాల్లో పార్టీలో చేరిన సీనియర్లకు చోటు కలి్పస్తారు. ఎర్రవల్లి నివాసంలో ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేయాలని కూడా భావిస్తున్నారు. వ్యవసాయ క్షేత్రంలో భోజనశాల, పార్కింగ్ తదితర వసతుల కల్పన పూర్తయిన తర్వాత మినీ సభలను తలపించేలా ఈ సమావేశాలు జరగనున్నాయి. -
అసలు ఇంతకీ తప్పు ఎవరిది?
ఐఏఎస్, ఐపీఎస్, అఖిలభారత సర్వీసు అధికారుల తీరుతెన్నులపై తెలంగాణ ముఖ్యమంత్రి ఆసక్తికరమైన అంశాన్ని లేవనెత్తారు. అధికారులు తమతో తప్పులు చేయించరాదని, నిస్పక్షపాతంగా ఉండాలని రేవంత్ రెడ్డి అనడం ఆహ్వానించదగ్గ పరిణామం. యాదృచ్ఛికమైన అంశం ఇంకోటి ఉందిక్కడ. రేవంత్‌రెడ్డికి రాజకీయ గురువుగా భావించే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరి ఈ విషయంలో పూర్తి వ్యతిరేకం!. రెడ్‌బుక్ పేరుతో ఇప్పటికే ఏపీలో అరాచకం సృష్టిస్తున్న ఆయన తమది రాజకీయ పాలనేనని మొహమాటం లేకుండా పచ్చిగా... బహిరంగంగానే మాట్లాడుతుంటారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గోపాలకృష్ణ రాసిన పుస్తకావిష్కరణ సభలో రేవంత్ అఖిలభారత సర్వీసు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. రాజకీయ నేతలు ఒక తప్పు చేయాలంటే.. అధికారులు మూడు తప్పులు చేద్దామంటున్నారని వ్యాఖ్యానించారు. తద్వారా రాజకీయ నేతలు అధికారులతో తప్పులు చేయిస్తున్నారని చెప్పకనే చెప్పినట్లయింది. ఆ పాయింట్ ఆధారంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ తదితరులు విమర్శలు చేశారు. విత్తు ముందా? చెట్టు ముందా? అన్నట్లు నేతల కారణంగా అధికారులు తప్పులు చేస్తున్నారా? లేక అధికారులు నేతలతో తప్పులు చేయిస్తున్నారా? చర్చనీయాంశం. నిజానికి ఇది రెండువైపుల నుంచి జరుగుతున్న తప్పే. రాజకీయ నేతలు అధికారంలోకి వచ్చేంత వరకూ ఒకలా.. ఆ తరువాత అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ఇంకోలా ప్రవర్తిస్తున్నారన్న విమర్శ ఉంది. ఎన్నికల్లో గెలుపునకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి.. అధికారం దక్కితే పెట్టిన ఖర్చును ఎలాగోలా చక్రవడ్డీలతో రాబట్టుకోవాలని నేతలు యత్నిస్తూంటారు. ఈ క్రమంలో అధికారులు తమ మాట వినేలా చేసుకునేందుకు నేతలు అన్ని పన్నాగాలు పన్నుతూంటారు. చెప్పినట్లు వినని అధికారిని శంకరగిరి మాన్యాలు పట్టించేందుకూ వెనుకాడరు. ఇదిలా ఉంటే ఇంకోవైపు కొందరు అధికారులు ముఖ్యమంత్రిని తెగ పొగుడుతూంటే.. కొందరు మంత్రులతో గిల్లికజ్జాలకు దిగుతుంటారు. ముఖ్యమంత్రి, మంత్రి ఎవరైనా సమర్థులైన అధికారులను విసృ్తత ప్రజా ప్రయోజనాల కోసం వాడుకోగలుగుతున్నారా? అంటే కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. రాజకీయ నేతల్లో మాదిరిగానే అధికార యంత్రాంగంలోనూ రాజకీయాలు, వర్గాలు ఉన్నాయన్నది నిజం. ఉత్తరాది, దక్షిణాది, కులం, ఒకే రాష్ట్రంలోని ప్రాంతం వంటి అంశాల ఆధారంగా అధికారులు ఒకరినొకరు విభేదించుకున్న సందర్భాలు బోలెడు. అఖిలభారత సర్వీసు అధికారులంటే పదవుల్లో ఉన్నవారు చాలా గౌరవం ఇచ్చేవారు. అధికారులు కూడా ప్రజలకు సేవ చేయాలన్న తలంపుతో వచ్చిన వారే ఎక్కువగా ఉండేవారు. కాని రాను, రాను నేతల్లో, అధికారుల్లోనూ మార్పు వచ్చింది. జనాన్ని నేతలు కరప్ట్ చేస్తున్నారా? లేక జనమే నేతలు కరప్ట్ అయ్యేలా చేస్తున్నారా? అంటే సమాధానం వెతుక్కోవాల్సిన పరిస్థితి. దురదృష్టవశాత్తు అధికారులతోపాటు న్యాయ వ్యవస్థలోనూ సమాజంలోని అన్ని అవలక్షణాలు వచ్చి చేరుతూందన్న బాధ చాలామందిలో ఉంది. అది వేరే విషయం. ఒకప్పుడు ముఖ్యమంత్రులుగా ఉన్నవారు నిబంధనల ప్రకారమే నిర్ణయాలు చేయాలని చెప్పేవారు. కానీ ఆ తర్వాత కాలంలో ప్రజల ఆకాంక్షలలో మార్పులు రావడం వల్ల ,వారిలో స్వార్ధచింతన పెరగడం వల్ల నిబంధనలు ఎలా ఉన్నాయన్నది ముఖ్యంకాదు.. అవసరమైతే వాటిని మార్చండి.. మేము చెప్పే పనులు చేయండి అని ఆదేశాలు ఇచ్చే పరిస్థితి ఏర్పడింది. దాంతో అధికారుల్లోనూ మార్పులు వచ్చాయి. పలువురు అధికారులు తమ సంగతేమిటి? అనే ఆలోచనకు వస్తున్నారు. ఉమ్మడి ఏపీలో కొందరు ముఖ్యమంత్రుల అనుభవాలను పరిశీలిస్తే ఆసక్తికరమైన అంశాలు కనిపిస్తాయి. ఒకప్పుడు ముఖ్యమంత్రుల వద్ద పనిచేసే సీనియర్ అధికారుల సంఖ్య పరిమితంగా ఉండేది. కానీ రాను, రాను సీఎం ఆఫీసులోనే అధికారం కేంద్రీకృతమవుతోంది. దాంతో తమకు కావల్సిన అధికారులనే వీరు నియమించుకుంటున్నారు. ఎస్వీ ప్రసాద్ వంటి అధికారులు కొద్ది మంది మాత్రం పార్టీ, ముఖ్యమంత్రి ఎవరన్న దానితో సంబంధం లేకుండా పలువురు సీఎంల వద్ద కీలకమైన బాధ్యతలలో ఉండేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి మారితే ఆయన పేషీలోని అధికారులు, సీఎస్ పోస్టులో ఉన్నవారు సైతం తిరిగి పోస్టు కోసం ఇబ్బంది పడవలసి వస్తోంది. ఆ విషయంలో రేవంత్ ప్రభుత్వం కొంత బెటర్ అని చెప్పాలి. కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న సీఎస్ శాంతికుమారినే కొనసాగించారు. కానీ.. ఏపీలో మాత్రం అప్పటి ముఖ్యమంత్రి జగన్ వద్ద పనిచేసిన అధికారులను చంద్రబాబు ప్రభుత్వం పక్కనపెట్టింది. సీఎస్ జవహర్ రెడ్డి వంటి సీనియర్ అధికారుల పట్ల కూడా అవమానకర తీరులో వ్యవహరించింది. అంతెందుకు! రేవంత్ ఐసీఎస్‌లకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా వేధించారన్న ఆరోపణ ఒక్కటి లేదు. కానీ చంద్రబాబు గత హయాంలో జరిగిన స్కామ్‌లపై విచారించారన్న కారణంగా కొందరు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్‌లను ఇలా వేధిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో అధికార యంత్రాంగాన్ని కులపరంగా కూడా చీల్చే యత్నం కనిపించదు. ఏపీలో మాత్రం కులం ఆధారంగా పోస్టింగ్‌లు, పార్టీ ఆధారంగా నియామకాలు జరుగుతున్న తీరు తీవ్ర విమర్శలకు గురి అవుతోంది. విశ్రాంత ఐపీఎస్ అధికారి ఒకరు ఒక కుల సమావేశంలో పాల్గొని గత ముఖ్యమంత్రి జగన్ మళ్లీ అధికారంలోకి రాకుండా అడ్డుకోడానికి ఆ కులం వారంతా పనిచేయాలని పిలుపు ఇచ్చారు. అలాంటి అధికారికి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌లు పెద్ద పీట వేసి ఒక పెద్ద పదవి కూడా ఇచ్చేశారు. దీనిని బట్టే ఆ ప్రభుత్వ వ్యవహార శైలి అర్థమవుతుంది. ఆ అధికారి తన సర్వీసులో ఏ రకంగా వ్యవహరించింది చెప్పకనే చెబుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్‌ల ప్రభుత్వం రెడ్‌బుక్ పేరుతో అరాచకాలకు పాల్పడుతుంటే ఐపీఎస్ అధికారులు వారికి మద్దతు ఇస్తున్నారు. కేసులు పెట్డడంలోనూ వివక్ష చూపుతున్నారు. చివరికి కొందరు ఐపీఎస్‌లే ముందస్తు బెయిల్ తెచ్చుకోవలసి వచ్చింది. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారు. ఏపీతో పోల్చితే తెలంగాణలో ఈ గొడవ తక్కువ. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారులకు స్వేచ్చ ఉండేది. వారు తమ అభిప్రాయాలు చెబితే వాటిని విని అవసరమైతే నిర్ణయాలలో మార్పు చేసుకునే వారు. ఒకవేళ అధికారులతో విభేధిస్తే, ‘‘మీరు మీ అభిప్రాయాలు రాయండి.. దానిపై నా అభిప్రాయం నేను రాస్తాను..’’ అని చెప్పేవారట. తద్వారా అధికారులకు ఇబ్బంది లేకుండా చూసేవారని ఒక రిటైర్డ్ అధికారి చెప్పారు. అయినప్పటికీ కాంగ్రెస్, టీడీపీలు కలిసి వైఎస్ కుమారుడు జగన్ పై అక్రమ కేసులు బనాయించే ప్రక్రియలో భాగంగా కొంతమంది ఐఎఎస్ అధికారులను కూడా ఇరికించారు. ఉదాహరణకు బీపీ ఆచార్య అనే ఐఏఎస్ అధికారి ప్రస్తుతం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాన్ని అభివృద్ది చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. అలాంటి వ్యక్తిని జగన్ కేసులో ఇరికించి జైలులో పెట్టారు. ఆ తర్వాత కాలంలో ఆయనపై కేసును కోర్టు కొట్టివేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి తీసుకున్న నిర్ణయాల విషయంలో అధికార యంత్రాంగం తలొగ్గక తప్పలేదని అంటారు. దాని ఫలితంగా ఇప్పుడు ఆ ప్రాజెక్టు పై ఏర్పడిన విచారణ కమిషన్ ను ఎదుర్కోవలసి వస్తోంది.ఇదే టైమ్‌లో ఇంకో సంగతి చెప్పాలి. కొంతమంది అధికారులు తమ తరపున ఏజెంట్లను పెట్టుకుని అక్రమ సంపాదనకు పాల్పడుతుంటారన్న ఆరోపణలు కూడా వినిపిస్తుంటాయి. అధికారులు క్షేత్ర స్థాయి పరిశీలనకు వెళ్లడం లేదని రేవంత్ అంటున్నారు. అది రాజకీయ నేతలకు కూడా వర్తిస్తుంది. ఇక్కడ సమస్య ఏమిటంటే నిధుల వినియోగంలో ఉండే ప్రాధాన్యత క్రమాలు కూడా ముఖ్యం అని భావించాలి. డబ్బులు లేకుండా జనంలోకి వెళ్ళినా వారితో తిట్లు తినడం తప్ప పెద్ద ఉపయోగం ఉండదు. ఉదాహరణకు.. కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది. వాటిని అమలు చేసే బాధ్యత అధికారులు ఏ రకంగా తీసుకోగలుగుతారు?. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మధ్య అధికారులు ఇన్నోవేటివ్ ఆలోచనలు చేయాలని పదే,పదే చెబుతున్నారు. ఆ ఇన్నోవేటివ్ పద్దతి ఏమిటో చెప్పకుండా డైలాగులు చెబితే ఏమి ప్రయోజనం? అని కొందరు వ్యాఖ్యానించారు.పైగా చంద్రబాబు ఈ మధ్య ఏమి మాట్లాడుతున్నారో తెలియడం లేదు. గంటల తరబడి సమీక్షలు పెట్టడం వల్ల అధికారులకు విసుగు వస్తోందని ఆయన అనుకూల మీడియానే పేర్కొందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. జగన్ టైంలో స్పందన కార్యక్రమం పెట్టి అనేక ఫిర్యాదుల పరిష్కారానికి ప్రయత్నించారు. అలాగే వలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్య క్లినిక్.. ఇలాంటి కొత్త వ్యవస్థలు తీసుకు వస్తే వాటిని విధ్వంసం చేసే పనిలో చంద్రబాబు సర్కార్ ఉంది. మరి ఆ వ్యవస్థలను తీసుకురావడం కోసం పనిచేసిన అధికారులది తప్పవుతుందా? లేక ఇప్పుడు విధ్వంసంలో భాగస్వాములవుతున్న అధికారులది తప్పు అవుతుందా?. ఏది ఏమైనా నిబద్దత కలిగిన అధికారులకు ప్రోత్సాహం ఉంటుందని రేవంత్ చెప్పడం బాగానే ఉంది. కాని ముందుగా రాజకీయ నేతలలో ఆ నిబద్దత ఉంటే ఆటోమేటిక్ గా అధికార యంత్రాంగం కూడా చాలా వరకు సర్దుకుంటుందని చెప్పాలి.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
మళ్లీ అధికారంలోకి వస్తాం పోరాటానికి సిద్ధమవ్వండి
-
కాంగ్రెస్ గ్రాఫ్ డౌన్: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ వేగంగా పడిపోతోంది. ప్రభుత్వంపై ప్రజల్లో ఇంత త్వరగా వ్యతిరేకత వస్తుందని అనుకోలేదు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టులో గట్టిగా కొట్లాడుతున్నాం. ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు పార్టీ యంత్రాంగం సిద్ధంగా ఉండాలి. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని జనం కోరుకుంటున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న ఈ విషయాన్ని నేను గమనిస్తున్నా. చంద్రబాబు నాయుడు ఎన్డీఏ పేరిట మళ్లీ ఏదో ఒక రూపంలో తెలంగాణలో అడుగు పెడుతానంటున్నడు. తెలంగాణ మళ్లీ వలసవాద కుట్రలకు బలికావొద్దు..’ అని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. తెలంగాణ భవన్లో బుధవారం జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యం, బీఆర్ఎస్ ప్రస్థానం, సంస్థాగత నిర్మాణం, పార్టీ రజతోత్సవాల నిర్వహణ, కాంగ్రెస్ ప్రభుత్వ పాలన తదితర అంశాలపై మాట్లాడారు. సీఎంకు పాలనపై పట్టు లేదని తేలిపోయింది ‘తెలంగాణ ప్రజలకు నచ్చి కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి రాలేదు. అధికారంలో వచ్చినా కాంగ్రెస్‌కు అచ్చి రాలేదు. మంత్రివర్గానికి, సీఎంకు నడుమ సమన్వయం లేదు. ఐఏఎస్, ఐపీఎస్‌లు అవినీతికి పాల్పడుతున్నారని సీఎం చెప్పడం ద్వారా ఆయనకు పాలనపై పట్టు లేదని తేలిపోయింది. మనం ఏటా రూ.15 వేల కోట్ల ఆదాయం పెంచుకుంటూ వచ్చి ప్రజలకు కావాల్సినవి సమకూర్చాం. కానీ గడిచిన మూడు త్రైమాసికాల్లో రూ.12 వేల కోట్ల ఆదాయాన్ని రాష్ట్రం కోల్పోయింది. ఆర్థికంగా రాష్ట్రాన్ని బలోపేతం చేసి ఖజానాను ఎలా నింపాలో వారికి తెలియడం లేదు..’ అని కేసీఆర్ అన్నారు. తెలంగాణ చరిత్ర ప్రసవించిన బిడ్డ బీఆర్ఎస్ ‘తెలంగాణ సమాజం సామాజిక, చారిత్రక అవసరాల కోసం తెలంగాణ చరిత్ర ప్రసవించిన బిడ్డ బీఆర్ఎస్ పార్టీ. అలా పురుడు పోసుకున్న బిడ్డను నలిపివేయాలని ఎన్నో కుట్రలు సాగాయి. గతం గాయాల నుంచి కోలుకుంటున్న మనం తిరిగి వలసవాద పాలకుల చేతిలో పడితే తెలంగాణ కోలుకోకుండా ఆగమయ్యే ప్రమాదముంది. తెలంగాణకు రాజకీయ అస్తిత్వం, రక్షణ కవచం బీఆర్ఎస్ పార్టీనే. తెలంగాణకు శాశ్వత న్యాయం జరగాలంటే ప్రజలను తిరిగి చైతన్యం చేయాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలపై ఉంది..’ అని బీఆర్ఎస్ అధినేత చెప్పారు. తెలంగాణ భవన్లో పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ప్రసంగిస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. చిత్రంలో కేటీఆర్, హరీశ్‌రావు, కవిత ఇతర ముఖ్య నేతలు 7 నెలల పాటు సంస్థాగత నిర్మాణం ‘ఏప్రిల్ 10 నుంచి అక్టోబర్ వరకు పార్టీ సంస్థాగత నిర్మాణంపై పనిచేయాలి. ఏప్రిల్ 10న పార్టీ ప్రతినిధుల సభ, అదే నెల 27న బహిరంగ సభ నిర్వహిస్తాం. దీనికి సంబంధించి సబ్ కమిటీ బాధ్యతలు హరీశ్‌రావుకు అప్పగిస్తున్నాం. ఏప్రిల్ 10 నుంచి సభ్యత్వ నమోదుతో పాటు గ్రామ, వార్డు, పట్టణ, మండల, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కమిటీల ఏర్పాటు జరుగుతుంది. అక్టోబర్‌లో పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ఉంటుంది. సంస్థాగత శిక్షణ కార్యక్రమాలకు సంబంధించిన షెడ్యూల్ కూడా ప్రకటిస్తాం. త్వరలో 30 మందికి పైగా కీలక నేతలతో భేటీ జరిపి అన్ని అంశాలపైనా స్పష్టమైన కార్యాచరణ ప్రకటిస్తాం. సోషల్ మీడియా సహా పార్టీ అనుబంధ కమిటీలను బలోపేతం చేస్తాం..’ అని కేసీఆర్ తెలిపారు. కొత్త తరంలో తెలంగాణ సోయి లేనందుకే ఓటమి ‘రాజకీయ పార్టీలకు అధికారమే పరమావధి. కానీ బీఆర్ఎస్కు తెలంగాణ ప్రయోజనాలే ప్రాధాన్యత. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. కొత్త తరంలో తెలంగాణ సోయి లేనందునే పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోయాం. కొత్త తరానికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ నేపథ్యం, బీఆర్ఎస్ పోషించిన పాత్రను వివరించాలి. తెలంగాణ చరిత్రను అర్ధం చేసుకుంటే గుండె బరువెక్కుతుంది. భారతదేశంలో విలీనం తర్వాత కూడా తెలంగాణ ఒక రాష్ట్రంగా తన రాజకీయ అస్తిత్వాన్ని చాటుకోలేక పోయింది. రాజకీయంగా తెలంగాణ నాయకత్వాన్ని విస్మరించి కాంగ్రెస్ అడుగడుగునా కుట్రపూరిత రాజకీయాలు చేసింది. వలసాంధ్ర ముఖ్యమంత్రులు తెలంగాణను అన్ని విధాల నాశనం చేశారు. తెలంగాణలో నెత్తురు ఏరులై పారిన సందర్భంలో నా ఉద్యమ ప్రస్థానం ప్రారంభమైంది. తెలంగాణ జాతి ప్రస్థానంలో తలెత్తిన గాయాలు బాధలను పూర్తిగా తొలగిపోయే విధంగా, స్వేచ్ఛావాయువులు పీల్చుకునే విధంగా తెలంగాణ తనకు తాను నిలబడాలనే ఆకాంక్షతో పుట్టిందే బీఆర్ఎస్ పార్టీ. సిల్వర్ జూబ్లీ వేడుకల్లో పార్టీ యంత్రాంగంతో పాటు కవులు, కళాకారులు, రచయితలు, మేధావులు, వివిధ వర్గాలను కలుపుకోవాలి. తెలంగాణ ఉద్యమ తరహాలో పార్టీ రజతోత్సవ వేడుకలు ఏడాది పొడవునా నిర్వహించాలి. తెలంగాణ చరిత్ర, బీఆర్ఎస్ ప్రస్థానాన్ని వివరించే డాక్యుమెంటరీలకు రూపకల్పన జరగాలి..’ అని మాజీ సీఎం ఆదేశించారు. అభిప్రాయాలు వెల్లడించిన నేతలు సుమారు నాలుగున్నర గంటల పాటు సాగిన సమావేశంలో పార్టీ నేతలు తమ అభిప్రాయాలను వెల్లడించేందుకు కేసీఆర్ అవకాశం ఇచ్చారు. పలువురు మాజీ మంత్రులతో పాటు సీనియర్, జూనియర్ నాయకులు 29 మంది మాట్లాడారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, యువతతో పాటు వివిధ వర్గాలకు చేరువ కావాల్సిన అవసరం, పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణకు సంబంధించి పలు సూచనలు చేశారు. కొందరు మాజీ ఎమ్మెల్యేలు క్షేత్ర స్థాయిలో చురుగ్గా పనిచేయాలనే ఆభిప్రాయం వ్యక్తం చేశారు. మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, పార్టీ నేతలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, తాతా మధు, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, రాకేశ్‌రెడ్డి, రాజా వరప్రసాద్, మూల విజయారెడ్డి, దాసరి ఉష, సత్య తదితరులు ప్రసంగించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు హరీశ్‌రావు సహా మాజీ మంత్రులు, పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లా పార్టీ అధ్యక్షులు, ప్రస్తుత, మాజీ ఎంపీలు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిలు, తదితర నేతలు హాజరయ్యారు. -
మరో పదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే.. ఇది పక్కా..
సాక్షి,హైదరాబాద్ : బీఆర్ఎస్ శ్రేణులు వాస్తవాలు మాట్లాడుతుంటే.. అవి జీర్ణించుకోలేని ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అసహనంతో మాట్లాడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు.కేసీఆర్ అధ్యక్షతన బుధవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఆ సమావేశంలో పార్టీ పని అయిపోయిందంటూ వ్యతిరేక ప్రచారం చేసిన బీఆర్ఎస్ నేతలపైన కేసీఆర్ మండిపడ్డారు.‘ఎంపీ ఎన్నికల్లో పార్టీ ఓటమి చెందగానే పార్టీ పని అయిపోందని మన పార్టీ నేతలే ప్రచారం చేశారు. అందుకే 10 మంది ఎమ్మెల్యేలు నైరాశ్యంతో పార్టీ మారారు. ఇలాంటి ప్రచారం చేయడం సరైంది కాదు. ఇది ఖండించ దగ్గ విషయం’ అని సీరియస్ టోన్‌తో అన్నారాయన. అయితే.. ఇప్పటికీ మించి పోయింది ఏమీ లేదని.. లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీ కోసం అంతా కష్టపడాలని సూచించారు.కేసీఆర్ చేసిన ఆ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ‘కేసీఆర్‌కు ప్రజాస్వామ్యం అంటే విలువ లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో రెండు హామీలను అమలు చేసాం. పంట బోనస్ , రైతు భరోసా పెంపు , 55 వేల ఉద్యోగాలు, డీఎస్సీ పోస్టింగులు ఇలా చెప్పుకుంటే పోతే అనేకం చేశాం. ఇంకా చేస్తాం. కేసీఆర్ వ్యాఖ్యల్లో అసహనం తప్ప మరొకటి కనబడటం లేదు. అధికారం దరిదాపుల్లో కనబడక పోవడంతోనే కేసీఆర్‌లో అసహనం ఎక్కువై ఇలా మాట్లాడుతున్నారు. తెలంగాణ ప్రజలు పదేళ్లు అధికారం ఇస్తారు... ఇది పక్కా. ఆర్థిక విధ్వంసం తర్వాత కూడా పాత పథకాలను ఒక్కటి కూడా రద్దు చేయకుండా ,మేము ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం. కేంద్రం ఇంకా సహకరిస్తే.. మరింత అభివృద్ధి చేస్తాం. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు కేసీఆర్ కలిసి రావాలి. తమిళనాడు తరహాలో రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని రాజకీయ పక్షాలు ప్రభుత్వంతో కలిసి పనిచేయాలి. బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఢిల్లీ వెళ్తాం. ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ కలసి రావాల్సిందేనని డిమాండ్ చేశారు పొన్నం ప్రభాకర్. -
BRS శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం
-
తెలంగాణ భవన్‌కు కేసీఆర్ వస్తుండటంతో కోలాహలం
-
బీఆర్ఎస్ పనైపోయిందని మనవాళ్లే ప్రచారం చేశారు: కేసీఆర్
హైదరాబాద్, సాక్షి: బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశాన్ని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆసక్తికర వ్యాఖ్యలతో మొదలుట్టారు. పార్టీ పని అయిపోయిందంటూ వ్యతిరేక ప్రచారం చేసిన బీఆర్ఎస్ నేతలపైన ఆయన మండిపడ్డారు.‘‘ఎంపీ ఎన్నికల్లో పార్టీ ఓటమి చెందగానే పార్టీ పని అయిపోందని మన పార్టీ నేతలే ప్రచారం చేశారు. అందుకే 10 మంది ఎమ్మెల్యేలు నైరాశ్యంతో పార్టీ మారారు. ఇలాంటి ప్రచారం చేయడం సరైంది కాదు. ఇది ఖండించదగ్గ విషయం’’ అని సీరియస్ టోన్‌తో అన్నారాయన. అయితే.. ఇప్పటికీ మించి పోయింది ఏమీ లేదని.. లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీ కోసం అంతా కష్టపడాలని సూచించారు. 27న భారీ బహిరంగ సభఇక.. ఏప్రిల్‌లో బీఆర్ఎస్ పార్టీ(BRS Party) సిల్వర్ జూబ్లీ వేడుకలు(Silver Jubilee Celebrations) ఉంటాయని.. ఏడాది పొడవునా ఘనంగా నిర్వహించాలని ఆయన ఆదేశించారు. ఏప్రిల్ 10 నుంచి 27వ తేదీ దాకా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందని, ప్రతీ జిల్లా కేంద్రంలో ఈ కార్యక్రమం నిర్వహించాలని నేతలకు సూచించారాయన. ఏప్రిల్ 10వ తేదీన పార్టీ ప్రతినిధుల సభ ఉంటుందన్నారు. అలాగే.. ఏప్రిల్ 27వ తేదీన భారీ బహిరంగ సభ ఉంటుందని ఆయన కేడర్‌కు తెలిపారు. అలాగే బహిరంగ సభ తర్వాత పార్టీ సంస్థాగత కమిటీలను వేయాలని నిర్ణయించిన ఆయన.. ఆ కమిటీలకు ఇంఛార్జిగా సీనియర్ నేత హరీష్ రావు(Harish Rao)కు బాధ్యతలు అప్పజెప్పారు. అలాగే పార్టీ అనుబంధం సంఘాల పటిష్టతకు సీనియర్ నేతలతో కమిటీలు వేయనున్నట్లు ప్రకటించారు. అక్టోబర్ లేదా నవంబర్‌లో బీఆర్ఎస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు ఉంటాయని ప్రకటించారు.భవిష్యత్తు బీఆర్ఎస్దేత్వరలో పార్టీలో సమూల మార్పులు ఉంటాయి. శిక్షణా తరగతులు నిర్వహిస్తాం. మహిళా కమిటీలు ఏర్పాటు చేస్తాం. డీలిమిటేషన్‌తో అసెంబ్లీ స్థానాలు 160 అవుతాయి. అందులో మహిళలకు 53 సీట్లు కేటాయిస్తాం. పోరాడి సాధించుకున్న తెలంగాణ.. ఇప్పుడు అభివృద్ధిలో వెనక్కి పోతోంది. గత గాయాల నుంచి కోలుకున్న తెలంగాణను అస్థితికి తీసుకెళ్తున్నారు. మరోసారి దోపిడీ, వలసవాదుల బారిన పడకుండా కాపాడుకోవాలి. ఈ 25 ఏళ్ల స్ఫూర్తితో కార్యకర్తలు మళ్లీ పోరాడాలి. బీఆర్ఎస్.. తెలంగాణ అస్థిత్వ పార్టీ. బీఆర్ఎస్ అంటే ఒక్కసారి ఓటమితో కొట్టుకుపోయే పార్టీ కాదు. తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతోంది. భవిషత్తులో కాంగ్రెస్ మళ్లీ గెలవదు. వంద శాతం మళ్లీ అధికారంలోకి వస్తాం. ప్రజల కోసం పార్టీ నేతలు, కార్యకర్తలు పని చేయాలి. భవిష్యత్తు బీఆర్ఎస్దే. తెలంగాణ ప్రజలకు శాశ్వత విజయమే బీఆర్ఎస్ లక్ష్యం.ఉప ఎన్నికలు గ్యారెంటీతెలంగాణలో ఉప ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయని పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై వేటు పడడం ఖాయం. ఈ అంశంపై నేనే లాయర్లతో మాట్లాడా. తెలంగాణలో త్వరలోనే ఉప ఎన్నికలు రాబోతున్నాయి అని అన్నారాయన. ఒర్రకండిరా బాబూ..సుమారు ఏడు నెలల తర్వాత కేసీఆర్ తెలంగాణ భవన్‌కు రావడంతో అక్కడ కోలాహలం నెలకొంది. అయితే.. కేసీఆర్ కార్యాలయానికి చేరుకున్న సమయంలో కేడర్ మధ్య తోపులాట చోటు చేసుకోగా.. ఆయన ఇబ్బంది పడ్డారు. కార్యకర్తలంతా ఆయన్ని చుట్టుముట్టి ‘సీఎం.. సీఎం’ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఆయన ఒకింత అసహనానికి లోనయ్యారు. ‘ఒర్రకండిరా బాబూ.. మీకు దండం పెడతా..’ అంటూ పిలుపు ఇచ్చారు. అయినా కేడర్ చల్లారలేదు. ఈ క్రమంలో తోపులాట చోటు చేసుకోగా.. ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కేసీఆర్ పాస్‌పోర్ట్ రెన్యువల్అంతకు ముందు .. కేసీఆర్ సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి నగరానికి వచ్చారు. ముందుగా సికింద్రాబాద్ పాస్‌పోర్టు కార్యాలయానికి వెళ్లారు. అక్కడ డిప్లోమేటిక్ పాస్‌పోర్టును అప్పగించి.. సాధారణ పాస్‌పోర్టును రెన్యువల్ చేసుకున్నారాయన. ఆ టైంలో భార్య శోభ, మాజీ ఎంపీ సంతోష్‌లు వెంట ఉన్నారు. అక్కడి నుంచి బంజారాహిల్స్ నందినగర్‌లోని నివాసానికి చేరుకున్నారు. -
తెలంగాణ భవన్ కు కేసీఆర్
-
నేడు తెలంగాణ భవన్‌కు కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ఆరు నెలల సుదీర్ఘ విరామం తర్వాత బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌కు రానున్నారు. తెలంగాణ భవన్లో బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు జరిగే పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఈ సమావేశానికి హాజరు కావాలంటూ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల మాజీ ఛైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, జెడ్పీ మాజీ చైర్మన్లు కలుపుకొని సుమారు 400 మందికి ఆహ్వానం పంపారు.ఈ భేటీలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంతోపాటు చేపట్టాల్సిన రాజకీయ కార్యకలాపాలపై కేసీఆర్ దిశా నిర్దేశం చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా టీఆర్ఎస్ పేరిట ఆవిర్భవించిన బీఆర్ఎస్ వచ్చే ఏప్రిల్ 27 నాటికి 25 ఏళ్లు పూర్తి చేసుకుంటుండటంతో సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నారు.ఈ నేపథ్యంలో వచ్చే రెండు నెలల పాటు పార్టీ కేడర్‌లో కొత్త ఉత్సాహం నింపేలా సన్నాహక కార్యక్రమాలు ఉంటాయని పార్టీ నేతలు భావిస్తున్నారు. సభ్యత్వ నమోదు, సంస్థాగత నిర్మాణంలో భాగంగా గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కమిటీల ఏర్పాటు, శిక్షణ కార్యక్రమాలకు సంబంధించి షెడ్యూలు ప్రకటించే అవకాశముంది. -
నేను ఐదు సంవత్సరాలు కేసీఆర్ క్యాబినెట్ మంత్రినే..
హైదరాబాద్: తాను కేసీఆర్(KCR) క్యాబినెట్ లో ఐదేళ్లు మంత్రిగా చేశానని, మంత్రులకు ప్రగతి భవన్ లోకి ఎంట్రీ లేదని, అందుకు తానే సాక్ష్యమన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. మంగళవారం సీఎల్పీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన జూపల్లి.. ‘ కేసీఆర్ మీటింగుల్లో కేసీఆర్ వచ్చేదాకా ఎవరూ మాట్లాడడానికి అవకాశం ఉండకపోయేది. కేజ్రీవాల్ ఓడిపోవడానికి కారణం ఎవరో అందరికీ తెలుసు. తెలంగాణలో ఆరిపోయింది కాకుండా ఢిల్లీలో అరిపోయారు. సెక్రటేరియట్ కట్టడం తప్పు పట్టడం లేదు కానీ, సెక్రటేరియట్ రాకపోవడం తప్పని ఆనాడే అన్నాను. అమరవీరుల చిహ్నం, అంబేద్కర్ విగ్రహం పెట్టడానికి పదేండ్లు పట్టిందా?, బీఆర్ఎస్(BRS) ఓడిపోవడానికి వాళ్ళ స్వయంకృపరాదమే కారణం. కేసీఆర్ పాలన రావాలని తెలంగాణ ప్రజలు తపిస్తున్నట్టు నిన్న ఆయన అనుచరులు ప్రచారం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ పాత్ర కూడా ఉంది. ఎంతో మంది ప్రాణత్యాగం, ఎంతోమంది పోరాటం, రాజకీయ సంఘర్షణలు తెలంగాణ రాష్ట్రం కోసం జరిగాయి. పది సంవత్సరాల తర్వాత కూడా కేసీఆర్ పాలన కావాలని ఎందుకు కోరుకుంటారు. గడిచిన 65 సంవత్సరాల్లో 18 మంది ముఖ్యమంత్రులు 65 వేల కోట్ల అప్పు చేశారు.కేసీఆర్ పదేండ్ల అప్పుల పాలన గొప్ప పాలన ఎలా అవుతుంది?, ఆంధ్రవాళ్ళు అంద్రవాళ్ళు అన్న కేటీఆర్(KTR) ఆంధ్రా కాంట్రాక్టర్లకు దోచి పెట్టాడు. పది సంవత్సరాల్లో కేసీఆర్ ఒక్కసారైనా అంబేద్కర్ కి దండ వేశాడా?, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్న కేసీఆర్ ఆనాడు ప్రతిపక్షాలకు సమయం ఇచ్చాడా?, రాష్ట్ర అప్పు 2 లక్షల కొట్లే అని అసెంబ్లీలో కేసీఆర్ అన్నారు. అదే నిజమని అనుకున్నాం. కేసీఆర్ శాసనసభకే రాలేదు. ఆయన పాలన కావాలని కోరుకుంటారు ఏంటి?, కేసీఆర్ వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశాడు. కేటీఆర్ మాట్లాడితే నవ్వాలో ఏడ్వాలో అర్థం కావడం లేదుసర్పంచులకి బిల్లులు ఇవ్వడం లేదని అనడానికి కేటీఆర్ కి సిగ్గు ఉందా?, కేసీఆర్ చేసిన పనికి....అప్పు కట్టడానికి అప్పు తేవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్ కి వాత పెట్టారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రజలు కేసీఆర్ కి వాత పెడతారు. కేసీఆర్ ని విమర్శించే అర్హత ఎవరికీ లేదు’ అని జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. -
‘కేసీఆర్ హీరోనే.. ఎందుకు గెలవలేదు’
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కులగణన వందశాతం సరిగా చేసిందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు.మంగళవారం(ఫిబ్రవరి 18) మీడియాతో సుఖేందర్‌రెడ్డి చిట్‌చాట్ నిర్వహించారు.‘అసలు కులగణ మీద బీసీల జనాభాపై లెక్క ఎక్కడ ఉంది. దేశంలోనే ఇదే మొదటిసారి కదా బీసీ కులగణ చేసింది.సమగ్ర కుటుంబ సర్వే అఫీషియల్ రికార్డు లేదు.అసెంబ్లీలో పెడితే రికార్డులో ఉండేది. ప్రజలతో మమేకమైన వాడే నాయకుడు అవుతాడు.కులం,మతం తో సంబంధం ఉండదు.బీజేపీ బీసీ కులగణకు వ్యతిరేకమని అందరికి తెలిసిందే. రాజకీయం,ప్రభుత్వ సంస్థలు ఇతర వ్యవస్థలపై సైతం నమ్మకం తగ్గుతుంది.ఉచితాలపై ఒక కఠినమైన చట్టం రావాల్సిందే.రాష్ట్ర బడ్జెట్‌ను బట్టి పథకాలు ఉండాలి.ఈ ప్రభుత్వ పాలన పర్వాలేదు.కేసీఆర్ త్యాగాలు చేసింది నిజమే.తెలంగాణ ఉద్యమం నడిపించింది వాస్తవమే.కానీ 4కోట్ల ప్రజల హీరో అంటే.. మరి ఎన్నికల్లో 4 కోట్ల ప్రజలు ఓట్లు వేయలేదు కదా..నువ్వు నేను కోరుకుంటే ఎన్నికలు రావు.ప్రభుత్వం పడిపోతుంది అంటే అది అధికారం కోల్పోయిన బాధలో మాట్లాడుతున్నారని ప్రజలు అనుకుంటారు’అని సుఖేందర్‌రెడ్డి అన్నారు. -
తెలంగాణ జాతికి కేసీఆర్ హీరో
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ జాతిపిత కేసీఆర్. నా ఒక్కడికే కాదు అందరికీ ఆయన బాపు. తెలంగాణ జాతికి, నాలుగు కోట్ల ప్రజలకు హీరో. సమైక్య పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగించిన మహానుభావుడు. కారణ జన్ముడు ఆయన. కేసీఆర్ కొడుకుగా పుట్టడం నా పూర్వజన్మ సుకృతం’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు భావోద్వేగంతో వ్యాఖ్యానించారు. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు 71వ జన్మదినం సందర్భంగా సోమవారం తెలంగాణ భవన్లో జరిగిన వేడుకల్లో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘ధన, కుల, మీడియా బలం లేకున్నా.. 25 ఏళ్ల క్రితం జనబలం, గుండె బలంతో పార్టీని ఏర్పాటు చేసి అవమానాలు, ప్రతికూల ఫలితాలను ఎదుర్కొని తెలంగాణ కలను సాకారం చేశారు’అని అన్నారు. తెలంగాణలోని ఏ మూలకు వెళ్లి పలకరించినా అన్ని వర్గాలు.. కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాయని పేర్కొన్నారు. ‘తెలంగాణ అనే పసిగుడ్డును తిరిగి ఆయన చేతిలో పెట్టడమే కేసీఆర్‌కు మనం ఇచ్చే బహుమానం. కేసీఆర్‌ను తిరిగి ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా 60 లక్షల మంది గులాబీ సైనికులు పనిచేయాలి’అని కేటీఆర్ పిలుపునిచ్చారు. నాలుగు కోట్ల ప్రజల భావోద్వేగం: హరీశ్‌రావు ‘కేసీఆర్ ఒక వ్యక్తి కాదు. నాలుగు కోట్ల ప్రజల భావోద్వేగం. ఆయనకు తెలంగాణతో ఉన్న బంధం, తల్లీబిడ్డల పేగుబంధం లాంటిది. గతంలో తెలుగుదేశంలో పనిచేసినా కేసీఆర్ తెలంగాణ ప్రయోజనాల కోసం ప్రశ్నించారు. కేసీఆర్ మొండి పట్టుదల వల్లే తెలంగాణ రాష్ట్ర కల సాకారమైంది. తెచి్చన తెలంగాణను కన్నబిడ్డలా చూసుకుని, పదేళ్లలో అన్ని రంగాల్లో తీర్చిదిద్ది దేశానికే రోల్‌మోడల్‌గా చేశారు. కేసీఆర్ తెచ్చిన తెలంగాణలో సీఎం రేవంత్ 20–20 మ్యాచ్‌లు అంటూ.. డబ్బుల కోసం తొండి మ్యాచ్ ఆడుతున్నారు.దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని రేవంత్ తాపత్రయపడుతున్నారు. అన్ని వర్గాలూ.. రేవంత్ పాలన బాగోలేదంటూ, కేసీఆర్‌ను మళ్లీ సీఎంగా కోరుకుంటున్నాయి. భవిష్యత్తులో మరో మూడు టర్ములు బీఆర్ఎస్ గెలుపొందడానికి కృషి జరుగుతోంది’అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. ‘రేవంత్ ఒక పిల్ల కాకి. కేసీఆర్ కళ్లు తెరిస్తే ఆయన పని ఖతమవుతుంది’అని శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి అన్నారు. తెలంగాణభవన్‌లో ఘనంగా వేడుకలు తెలంగాణ భవన్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు హాజరైన కేటీఆర్, హరీశ్‌రావు, ఇతర ముఖ్య నేతలు కలసి కేసీఆర్ 71వ పుట్టిన రోజు సందర్భంగా 71 కిలోల భారీ కేక్‌ను కట్ చేశారు. కేసీఆర్ రాజకీయ నేపథ్యం, తెలంగాణ ఉద్యమ ప్రస్థానాన్ని గుర్తు చేసేలా రూపొందించిన ఫొటోలు, వీడియోను ప్రదర్శించారు.పార్టీ నేతలు కవిత, బండ ప్రకాశ్, మహమూద్ అలీ, శ్రీనివాస్‌గౌడ్, సత్యవతి రాథోడ్, రవిచంద్ర, తక్కెళ్లపల్లి రవీందర్రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కాలేరు వెంకటేశ్ తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం కేటీఆర్, హరీశ్‌రావు సహా పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు వందల సంఖ్యలో కేసీఆర్‌ను కలసి శుభాకాంక్షలు చెప్పేందుకు ఎర్రవల్లికి బయలుదేరి వెళ్లారు. కార్యకర్తలు, అభిమానులతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. కేసీఆర్‌కు సీఎం రేవంత్ శుభాకాంక్షలు మాజీ సీఎం కేసీఆర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి ఎక్స్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.జీవితానికి సరిపడే స్ఫూర్తిని ఇచ్చారు‘ప్రతీ కొడుకు నాన్నే తనకు హీరో అని చెప్తాడు. కానీ మా నాన్న నాకే కాదు తెలంగాణకే హీరో. మీ పోరాటంతో సాధించిన ఈ రాష్ట్ర పురోభివృద్ధిలో మీ వారసత్వాన్ని కొనసాగించేందుకు ప్రతీక్షణం పనిచేస్తానని హామీ ఇస్తున్నా. జీవితకాలానికి సరిపడా మీరు అందించిన స్ఫూర్తికి కృతజ్ఞతలు. నాన్నా.. పుట్టిన రోజు శుభాకాంక్షలు’. –‘ఎక్స్’లో కేటీఆర్హ్యాపీ బర్త్‌డే డాడీ: కవితహ్యాపీ బర్త్‌డే డాడీ.. అంటూ కేసీఆర్ నుంచి ఆశీర్వాదం తీసుకుంటున్న ఫొటోను ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె కవిత తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.కేసీఆర్ అంటేనే ఒక ఉద్వేగం, యుద్ధ నినాదం‘మీరు నా తలనిమిరే తల్లిప్రేమ. నాకు ఎనలేని మమకారం పంచిన మేనమామ. నాకు రాజకీయ చైతన్యాన్ని నేరి్పంచి, నాలో ప్రజాసేవా సంస్కారాన్ని రంగరించి ఉద్యమ కార్యాచరణలో నడిపించారు. కేసీఆర్ అంటేనే ఒక ఉద్వేగం, ఉద్రేకం, స్వాభిమానం, యుద్ధ నినాదం, ప్రజాగళం, ఆత్మగౌరవ రణం, తెలంగాణ జనం గుండెల్లో నిత్య సూర్యోదయం’. –‘ఎక్స్’లో హరీశ్‌రావు -
కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
-
కేసీఆర్ పుట్టినరోజు.. కేటీఆర్ ఎమోషనల్ కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: నేడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదినం. ఈ సందర్బంగా కేసీఆర్‌కు ప్రముఖులు, పార్టీ నేతలు, రాజకీయ నాయకుడు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా కేసీఆర్ తనయుడు కేటీఆర్.. ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా ఎమోషనల్ కామెంట్స్ చేశారు.బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..‘ప్రతీ తండ్రీ తమ పిల్లల హీరో అని అంటారు. నా తండ్రి నా ఒక్కడికే కాదు.. తెలంగాణ హీరో కావడం నా అదృష్టం. కల కనడం.. దాని కోసం హద్దులేని నిబద్ధతతో బయలుదేరారు. విమర్శకులను ఎదుర్కోవడం, అది ఎలా నెరవేరుతుందో వారికి గర్వంగా చూపించారు. తెలంగాణ అనే కలను ప్రేమించారు. వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించకుండా తెలంగాణ సాధించారు. మీరు గర్వంగా మీ కొడుకని పిలుచుకునే వ్యక్తి కావడమే నా లక్ష్యం. మీ వారసత్వానికి అర్హులుగా ఉండటానికి ప్రతీక్షణం కృషి చేస్తా’ అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు.They say every Father is their child’s HeroI am blessed that my father isn’t just mine alone but the Hero of Telangana 😊He defines what it means;To have a dream and to set out for it with unbridled commitment! To fight off naysayers and show them proudly how it is done!… pic.twitter.com/bPqeb6Begz— KTR (@KTRBRS) February 17, 2025ఇక, కేసీఆర్ కుమార్తె కవిత కూడా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలుపుతూ కేసీఆర్‌తో ఆశీర్వాదం తీసుకున్న ఫొటోను షేర్ చేశారు.Happy Birthday Daddy ❤️ pic.twitter.com/MXZKo2zUVw— Kavitha Kalvakuntla (@RaoKavitha) February 17, 2025మరోవైపు.. తెలంగాణభవన్‌లో కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో కేటీఆర్, తలసాని శ్రీనివాస్ సహా పలువురు బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణభవన్‌లో సందడి వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. LIVE: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి జన్మదిన వేడుకలు. 📍తెలంగాణ భవన్, హైదరాబాద్#HappyBirthdayKCR https://t.co/0WQOAgS9SL— BRS Party (@BRSparty) February 17, 2025 ఇదిలా ఉండా.. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా పలుచోట్ల బీఆర్ఎస్ శ్రేణులు, ఆయన మద్దతుదారులు వేడుకల్లు నిర్వహించారు. మరికొన్నిచోట్ల రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలను బీఆర్ఎస్ ట్విట్టర్లో షేర్ చేసింది.ఆస్ట్రేలియాలో ఘనంగా మహానేత కేసీఆర్‌కు వృక్షార్చనతో జన్మదిన శుభాకాంక్షలు.బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదిన వేడుకలు ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్బోర్న్, అడిలైడ్, బ్రిస్బెన్ నగరాల్లో బీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా… pic.twitter.com/zj3m5TSmyk— BRS Party (@BRSparty) February 17, 2025 లండన్‌లో ఘనంగా కేసీఆర్ గారి జన్మదిన వేడుకలుఎన్నారై బీఆర్ఎస్ యూకే ఆధ్వర్యంలో, లండన్‌లో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర ప్రధాత కేసీఆర్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.#HappyBirthdayKCR pic.twitter.com/UidcKOU9lV— BRS Party (@BRSparty) February 17, 2025 -
కేసీఆర్‌కు వైఎస్ జగన్ బర్త్ డే విషెస్
సాక్షి,తాడేపల్లి:బీఆర్ఎస్ అధినేత,తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌కు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు వైఎస్ జగన్ సోమవారం(ఫిబ్రవరి 17) ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు చేశారు.‘పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావుగారికి శుభాకాంక్షలు. దేవుడు ఆయనకు ఆరోగ్యం,సంతోషకరమైన పరిపూర్ణ జీవితాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నా’అని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.Warm greetings to Telangana's former Chief Minister, Sri K. Chandrashekar Rao (KCR) garu, on his birthday. May God bless him with good health, happiness, and a fulfilling life. pic.twitter.com/rLHYG15IIU— YS Jagan Mohan Reddy (@ysjagan) February 17, 2025కాగా,సోమవారం కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని బీఆర్ఎస్ శ్రేణులు తెలంగాణవ్యాప్తంగా వేడుకలు జరుపుతున్న విషయం తెలిసిందే. -
నేడు కేసీఆర్ జన్మదిన వేడుకలు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు 71వ జన్మదిన వేడుకలు సోమవారం తెలంగాణ భవన్లో నిర్వహిస్తారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ వేడుకల్లో భాగంగా 71 కిలోల భారీ కేక్‌ను కట్ చేస్తారు. కేసీఆర్ రాజకీయ ప్రస్థానాన్ని వివరించేలా రూపొందించిన ప్రత్యేక డాక్యుమెంటరీ ప్రదర్శిస్తారు. డప్పు కళాకారులు, గిరిజన నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.తెలంగాణ భవన్లో జరిగే కేసీఆర్ జన్మదిన వేడుకల ఏర్పాట్లను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదివారం పార్టీ నేతలతో కలిసి పరిశీలించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు హాజరవుతారు. రాష్ట్రవ్యాప్తంగా పండ్ల పంపిణీ, అన్నదానం, ప్రార్థనా మందిరాల్లో ప్రత్యేక ప్రార్థనలు, దేవాలయాల్లో పూజలు నిర్వహిస్తారని తలసాని వెల్లడించారు.మాజీ మంత్రి మహమూద్ అలీ, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి ఏర్పాట్లను పరిశీలించిన వారిలో ఉన్నారు. కాగా, కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ‘వృక్షార్చన’లో భాగంగా పంజగుట్టలోని జలగం వెంగళరావు పార్కులో 40 మంది మాజీ కార్పొరేషన్ల చైర్మన్లు మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు జోగినిపల్లి సంతోష్ పిలుపు మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. -
కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్
-
ప్రధాని మోదీపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్:పుట్టుకతో ప్రధాని మోదీ బీసీ కాదని,ఆయన లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం(ఫిబ్రవరి14) గాంధీభవన్‌లో జరిగిన యూత్ కాంగ్రెస్ సభలో సీఎం రేవంత్ మాట్లాడారు. సర్టిఫికెట్లలో మోదీ బీసీ కానీ మోదీ మనసంతా బీసి వ్యతిరేకి. మోదీ తొలిసారి సీఎం అయ్యాకే ఆయన కులాన్ని బీసీల్లో కలిపారు. అన్నీ తెలుసుకునే మోదీ కులంపై మాట్లాడుతున్నా. కేంద్రానికి సవాల్ చేస్తున్నా.. జనగణనతో పాటు కులగణన చెయ్యాలి. కేంద్రం లెక్కలు మా ప్రభుత్వం చేసిన లెక్కలను సరిపోల్చుదాం. కులగణన సర్వేలో పాల్గొనని కేసీఆర్,కేటీఆర్,హరీష్ లను బహిష్కరణ చెయ్యాలి.బహిష్కరణ కోసం మీ సమక్షంలో తీర్మానం చేస్తున్న. ప్రభుత్వ సర్వే తప్పుల తడక అని చెప్పే ప్రయత్నం బీఆర్ఎస్ చేసింది. భారత్ జోడో యాత్రలోనే రాహుల్ గాంధీ స్పష్టం గా కులగణన చేస్తాం అని హామీ ఇచ్చారు. దేశంలో ఉన్న అన్ని జాతులకు వారి ఫలాలు అందాలని రాహుల్ గాంధీ ఆకాంక్షించారు.డోర్ టు డోర్ వెళ్లిన సిబ్బంది ముందే డేటా ఎంట్రీ చేశాం. కేసీఆర్ సర్వే..కాకిలెక్కల సర్వే.తెలంగాణ సమాజంలో తిరిగే హక్కే కేసీఆర్, కేటీఆర్,సంతోష్ రావ్ లకు లేదు. సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు కేసీఆర్ ఇచ్చి ఉంటే మాట్లాడే హక్కు ఉండేది.కులగణన సర్వేలో డేటా ఇవ్వని లిస్టులో ముందు వరుసలో కేసీఆర్ కేటీఆర్,సంతోష్ రావ్ గ్యాంబ్లింగ్ శ్రీనివాస్‌లు ఉన్నారు.కేసీఆర్ లెక్క తేలితే..వార్డు మెంబర్ పదవి కూడా ఆ కుటుంబానికి రాదుగొప్పగొప్ప నేతలు యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చినవాళ్లే. చంద్రబాబు,కేసీఆర్ కూడా యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చిన వారే. యూత్ కాంగ్రెస్ శక్తి ఏంటో మాకు తెలుసు. అనిల్‌యాదవ్,బల్మూరి వెంకట్ సేవలను గుర్తించి వారికి పదవులు ఇచ్చాం. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే 55వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం.డబ్బుతో రాజకీయాలు సాధ్యాం కాదు. వచ్చే ఎన్నికల్లో ప్రజల్లో ఉన్నవారికే టికెట్లిస్తాం. ఢిల్లీ నుంచి కాదు గల్లీ నుంచి వారికే పదవులు వస్తాయి. పదేళ్లు కేసీఆర్ తప్పుడు హామీలిచ్చి ప్రజలను మోసం చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అని చెప్పి కేసీఆర్ అబద్ధాలు చెప్పాడు. లిక్కర్ కేసు ద్వారా కేసీఆర్, కేజ్రీవాల్‌ను ఓడగొట్టిన కవిత ఇప్పుడు మాట్లాడుతోంది. కేసీఆర్‌నే గట్టిగా ఓడగొట్టాం నువ్వొచ్చి చేసేదేముంది. కేసీఆర్ గట్టిగా కొడతా అంటున్నాడు. కొట్టాలనుకుంటే నీ కొడుకు కేటీఆర్‌ను పిచ్చిపిచ్చిగా కొట్టు. ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్‌ను ఓడగొట్టినందుకు నీ అల్లుడిని కొట్టు. డబ్బుతో గెలవాలనుకుంటే కేసీఆరే గెలిచేవాడు. కేసీఆర్,కేటీఆర్, కవిత దగ్గర వేల కోట్లున్నాయిప్రభుత్వ పథకాలను యూత్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.ప్రజలకు అండగా ఉన్నవారికి మాత్రమే పదవులు ఇస్తాం.సామాన్యులకు పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. కష్టపడి పనిచేసిన వారికి తప్పకుండా అవకాశాలు కల్పిస్తాం. డబ్బుతో ఎన్నికల్లో గెలవడం సాధ్యం కాదు’అని రేవంత్‌రెడ్డి అన్నారు. -
చాలా కాలం తర్వాత BRS ఆఫీస్ కు రానున్న కేసీఆర్
-
19న తెలంగాణ భవన్‌కు కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు(KCR) సుదీర్ఘ విరామం తర్వాత ఈ నెల 19న పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్(Telangana Bhavan)కు రానున్నారు. పార్టీ ఆవిర్భవించి ఈ ఏడాది ఏప్రిల్‌కు 25 ఏళ్లు కానుంది. ఈ నేపథ్యంలో పార్టీ రజతోత్సవాల నిర్వహణతో పాటు పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత నిర్మాణం వంటి కీలక అంశాలపై చర్చించేందుకు ఈ నెల 19న బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు.మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమయ్యే ఈ భేటీకి పార్టీ రాష్ట్ర కార్యవర్గంతో పాటు జిల్లా అధ్యక్షులు, తాజా, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ప్రభుత్వ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, మాజీ జెడ్పీ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జీలకు పార్టీ తరఫున ఆహ్వానం పంపించారు. కేసీఆర్ అధ్యక్షత న జరిగే పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ నిర్మాణానికి సంబంధించి దిశానిర్దేశం చేస్తారని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. బహిరంగ సభ వేదిక ఖరారు చేసే అవకాశంరాష్ట్రంలో అధికార కాంగ్రెస్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు బీఆర్ఎస్ అనుసరించాల్సిన కార్యాచ రణపైనా ఈ భేటీలో సమగ్రంగా చర్చిస్తారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసేలా ఒత్తిడి పెంచడంతో పాటు ప్రజల హక్కులను కాపాడే దిశగా పార్టీ పరంగా నాయకులు, కార్యకర్తలు అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశా నిర్దేశం చేస్తారు. ఈ నెలాఖరులో బీఆర్ఎస్ సత్తా చాటేలా భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని కేసీఆర్ ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలో సభా వేదికను కూడా 19న జరిగే భేటీలో ఖరారు చేసే అవకాశముంది. ఆహ్వానితులు కచ్చితంగా హాజరు కావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.ఆరు నెలల తర్వాత..సుమారు ఆరు నెలల తర్వాత తెలంగాణ భవన్‌కు వస్తున్న పార్టీ అధినేత కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశముందని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో గత ఏడాది జూలై 23న తెలంగాణ భవన్‌కు వచ్చిన కేసీఆర్ నేతలతో భేటీలో ప్రభుత్వ పనితీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ కవిత అరెస్టు, ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వంటి అంశాలను ప్రస్తావిస్తూ నేతలను తయారు చేసుకోవడం బీఆర్ఎస్కు కొత్త కాదంటూ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికే పరిమితం అయ్యారు. అక్కడే పార్టీ నేతలు, కార్యకర్తలతో భేటీ అవుతూ పలు అంశాలపై దిశా నిర్దేశం చేస్తూ వస్తున్నారు. -
ఖజానా ఖాళీ.. తలలు పట్టుకుంటున్న సీఎం,డిప్యూటీ సీఎం
సాక్షి,హైదరాబాద్ : కేసీఆర్ ఖజానా ఖాళీ చేశారు. ఇప్పుడు నిధులు సర్దుబాటు చేయలేక సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క తలలు పట్టుకుంటున్నారని’ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలపై ఆయన మీడియాతో మాట్లాడారు. బండి సంజయ్ ,కిషన్ రెడ్డి కోతల రాయుళ్లు.ఐటీఐఆర్ తీసుకొచ్చి బీజేపీ నేతలు మాట్లాడాలి. నేనేంటో,నా పనితనం ఏంటో రాష్ట్ర నేతలకు, ఎంపీ రాహుల్ గాంధీ, ఏఐసీసీ నేతలకు తెలుసు. నా అవసరం అనుకుంటే జగ్గారెడ్డికి పదవి ఇస్తారు. జగ్గారెడ్డి పదవి ఉన్నా ..లేకున్నా పార్టీ కోసం పనిచేస్తూనే ఉంటాడు.బీజేపీ నేతలు సీఎం రేవంత్‌ను రెచ్చగొట్టి తిట్టించుకుంటారు. ఎన్నికలకు చాలా సమయం ఉంది.. పింక్ బుక్ అంటూ రెచ్చగొట్టకు కవిత. కేసీఆర్ ఖజానా ఖాళీ చేశారు. నిధులు సర్దుబాటు చేయలేక మా సీఎం, డిప్యూటీ సీఎం తలలు పట్టుకుంటుంన్నారు.వరంగల్‌కు రావాలంటే రాహుల్ గాంధీ భయపడతారా?..రాహుల్ గాంధీ ఓంట్లోనే భయం లేదు.. కన్యాకుమారి టూ కాశ్మీర్ పాదయాత్ర చేశారు. కేసీఆర్ కనీసం పది కిలోమీటర్లు పాదయాత్ర చేయగలరా? ఐటీఐఆర్ కోసం అవసరం అయితే కిషన్ రెడ్డి, బండి సంజయ్‌ను కలుస్తా. ఐటీఐఆర్ ద్వారా వేల ఉధ్యోగాలు తెలంగాణ నిరుద్యోగులకు వస్తాయి’ అని అన్నారు. -
ఎర్రబెల్లి దయాకర్‌రావు సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్, సాక్షి: బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గద్దె దించేందుకు అధికార కాంగ్రెస్ పార్టీలోనే కుట్ర జరుగుతోందని ఆరోపించారాయన. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.‘‘అధికార పార్టీకి చెందిన పాతిక మంది ఎమ్మెల్యేలు ఒక్కటయ్యారు. వాళ్లంతా సీఎం రేవంత్‌ను గద్దె దించేందుకు ఒక్కటయ్యారు. రేవంత్ పదవికి సొంత ఎమ్మెల్యేలతోనే ముప్పు పొంచి ఉంది’’ అని అన్నారాయన. అలాగే.. ఓటమి భయంతోనే స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తున్నారని ఎర్రబెల్లి ఎద్దేవా చేశారు.తెలంగాణ భవన్‌కు కేసీఆర్బీఆర్ఎస్ అధినేత ఎట్టకేలకు తెలంగాణ భవన్‌కు రానున్నారు. ఈ నెల 19వ తేదీన ఆయన అధ్యక్షతన బీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ మీటింగ్‌లో పార్టీ సిల్వర్‌జూబ్లీ వేడుకల నిర్వహణపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. -
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు జరుగుతాయని అన్నారు. ఆ ఎన్నికల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజలే బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. స్టేషన్ ఘన్పూర్లోనూ ఉప ఎన్నిక జరుగుతుంది. ఆ ఎన్నికల్లో కడియం శ్రీహరి ఓడి పోతారు. రాజయ్య ఎమ్మెల్యేగా గెలుస్తారని కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే రాజయ్యతో పాటు పలువురు నాయకులు ఎర్రవల్లిలో కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ పై విధంగా మాట్లాడారు. -
రేవంత్.. చైనా ఫోన్ లాంటి పాలన నీది: కవిత
సాక్షి, జగిత్యాల: తెలంగాణలో కేసీఆర్ పాలన ఐఫోన్లా ఉంటే.. రేవంత్ రెడ్డి పాలన చైనా ఫోన్లా ఉందని ఎద్దేవా చేశారు ఎమ్మెల్సీ కవిత. చైనా ఫోన్ చూడటానికే బాగుంటుంది కానీ.. సరిగా పనిచేయదు. రాజకీయ కక్షను పక్కనపెట్టి సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం నీళ్లను విడుదల చేయాలి అని డిమాండ్ చేశారు. అలాగే, ఏ కులంలో ఎంత జనాభా ఉన్నారో లెక్కలు ఎందుకు బయటపెట్టడం లేదు? అని ప్రశ్నించారు.జగిత్యాలలో బీఆర్ఎస్ ఎమ్మెల్సి కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడుతూ..‘కేసీఆర్ పాలనకు, రేవంత్ రెడ్డి సర్కార్‌కు ఎంత తేడా ఉందో ప్రజలే గమనిస్తున్నారు. మాటలు చెప్పి బీసీల ఓట్లు వేయించుకుని సీఎం రేవంత్ రెడ్డి బురిడీ కొట్టిస్తున్నాడు. ఏ కులంలో ఎంత జనాభా ఉన్నారో లెక్కలు ఎందుకు బయటపెట్టడం లేదు?. తూతూ మంత్రంగా పొన్నం ప్రభాకర్ బీసీ సంఘాలతో సమావేశం పెట్టారు. బీసీ ఉద్యమం చేస్తున్న నాయకులతో ముఖ్యమంత్రి మాట్లాడక పోవడం బీసీలను అవమానించడమే అవుతుంది.బీసీ కుల సంఘాలతో ముఖ్యమంత్రి చర్చలు జరపాలి. 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే వరకు ఉద్యమం ఆగదు. మరో తెలంగాణ పోరాటం తరహా పోరాటానికి బీసీలంతా సిద్ధంగా ఉండాలి. 52 శాతం బీసీలు ఉన్నారని 2014లోనే కేసీఆర్ లెక్క తేల్చారు. బీసీల సంఖ్యను తక్కువ చూపించడం శోచనీయం. ఈ తప్పుడు లెక్కలు చెప్పి రాహుల్ గాంధీ పార్లమెంట్‌ను తప్పదోవపట్టించారు. స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి బిల్లు ఎందుకు పెట్టడం లేదు?.ఎండిన పంటపొలాలను చూస్తుంటే కన్నీళ్లు వచ్చే పరిస్థితి ఉంది. కేసీఆర్‌పై అక్కసుతో మేడిగడ్డ ప్రాజెక్టును వినియోగించడం లేదు. రైతులకు నీళ్లు ఇచ్చే తెలివి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. రాజకీయ కక్షను పక్కనపెట్టి సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం నీళ్లను విడుదల చేయాలి. మహిళలను చిన్నచూపు చూస్తున్న రేవంత్ రెడ్డికి కాలం గుణపాఠం చెబుతుంది. రేవంత్ రెడ్డి తప్పులను ప్రజలు లెక్కిస్తున్నారు.. తగిన సమయంలో బుద్దిచెబుతారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఉప ఎన్నిక వస్తే జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోతుంది’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
మండలి ఎన్నికలకు బీఆర్ఎస్ దూరం!
సాక్షి, హైదరాబాద్: శాసన మండలిలోని మూడు స్థానాలకు ఈ నెల 27న జరిగే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు ముఖ్య నేతలకు స్పష్టత ఇచ్చారు. పట్టభద్రుల కోటా స్థానంలో పోటీ చేయాలని పార్టీ నేతలు చేసిన ప్రతిపాదనను కేసీఆర్ తిరస్కరించారు. పట్టభద్రుల కోటాలో పార్టీ టికెట్ ఆశిస్తున్న నేతలకు ఈ సమాచారం ఇవ్వాల్సిందిగా కీలక నేతలకు సూచించారు.అదే సమయంలో మండలి ఎన్నికల్లో ఇతర పార్టీలు లేదా అభ్యర్థులెవరికీ మద్దతు ఇవ్వ డం లేదనే సంకేతాలు కూడా ఇచ్చారు. శాసన మండలి ఎన్ని కలకు బదులు త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల దిశగా సన్నాహాలు ప్రారంభించాలని పార్టీ శ్రేణులను కేసీఆర్ ఆదేశించారు. ఇక స్థానిక ఎన్నికల సన్నద్ధతకు సంబంధించి ఫిబ్రవరి నెలాఖరులో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు.. త్వరలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహిస్తామని కేసీఆర్ పేర్కొన్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. సభ నిర్వహణపై వారంలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలిపాయి. పోటీకి నేతలు సిద్ధమైనా.. శాసనమండలిలో పట్టభద్రుల నియోజకవర్గంతోపాటు ఉపాధ్యాయ కోటా స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ నుంచి పలువురు ఆశావహులు టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు. కరీంనగర్ మాజీ మేయర్ సర్దా ర్ రవీందర్‌సింగ్, డాక్టర్ బీఎన్ రావు, శేఖర్‌రావు, రాజారాం యాదవ్ తదితరుల పేర్లు వినిపించాయి.పట్టభద్రుల కోటా లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న నరేందర్‌రెడ్డిని బీఆర్ఎస్లో చేర్చుకుని టికెట్ ఇవ్వాలని ఓ దశలో ప్రతిపాదనలు వచ్చాయి. ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి పోటీకి సన్నద్ధమవుతున్న ప్రసన్న హరికృష్ణను బీఆర్ఎస్లోకి తీసుకువచ్చి పార్టీ టికెట్ ఇప్పించేందుకు కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి కొంతమేర ప్రయత్నాలు కూడా చేశారు. కానీ చివరికి పోటీకి దూరంగా ఉండాలని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. కాగా ఢిల్లీ పర్యటనలో ఉన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు తిరిగి వచ్చాక స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై ఫోకస్ చేయనున్నారు. -
బీసీల కోసమైనా కేసీఆర్ రేపు అసెంబ్లీకి రావాలి: పొన్నం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీసీలకు న్యాయం జరగాలని కోరుకుంటే మాజీ సీఎం కేసీఆర్(KCR) రేపు అసెంబ్లీకి రావాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్రంలో కుల గణనపై అన్ని రాజకీయ పార్టీలు తమ స్టాండ్ ఏంటో తెలియచేయాలని కోరారు. ఇదే సమయంలో కల్వకుంట్ల ఫ్యామిలీలో కవిత(kavitha) తప్ప ఎవరూ వివరాలు ఇవ్వలేదని చెప్పారు. తెలంగాణలో కుల గణన చేస్తామని మాట ఇచ్చాం.. చేసి చూపించామని కామెంట్స్ చేశారు.మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘కేసీఆర్ రేపు అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నాం. బీసీలకు న్యాయం జరగాలని కోరుకుంటే కేసీఆర్ రేపు అసెంబ్లీకి వస్తారు. మేం కమిటీ రిపోర్టును బీరువాలో, ఫ్రిడ్జ్ ఏమీ పెట్టం. కల్వకుంట్ల ఫ్యామిలీలో కవిత తప్ప ఎవరూ వివరాలు ఇవ్వలేదు. సర్వే కోసం వెళ్లిన వాళ్లపైకి కుక్కలని వదిలిన వారూ ఉన్నారు. సహాయ నిరాకరణ లాగా కొందరు కావాలని వివరాలు ఇవ్వలేదు. కుల గణనపై అన్ని రాజకీయ పార్టీలు తమ స్టాండ్ ఏంటో తెలియచేయాలి.బలహీన వర్గాల కోసం రేపు అసెంబ్లీలో అన్ని పార్టీలు తమ వాదన వినిపించాలి. కులగణన ఒక ఉద్యమంలాగా చేశాం. రాష్ట్రంలో ఎవరు ఎంత అనే లెక్క తేలింది. కేబినెట్ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటాం. కులగణన చేస్తామని మాట ఇచ్చాం.. చేసి చూపించాం. కులగణన అడ్డుకుంటే ఊరుకునేది లేదు. నిర్ణయం నుండి నివేదిక దాకా కులగణన ప్రక్రియలో చేసినందుకు గర్వంగా ఉంది. బీసీ సోదరులందరూ రేపు ఉత్సవాలు జరపండి అని వ్యాఖ్యలు చేశారు.ఇది కూడా చదవండి: కులగణనపై కవిత కీలక వ్యాఖ్యలు -
కేసీఆర్‌కు ముందున్న అతి పెద్ద సవాల్ ఇదే..
చాలాకాలం తర్వాత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పులిలా గాండ్రించారా?. ఆ పులిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బెదరగొట్టే ప్రయత్నం చేశారా?. రేవంత్‌కు ఎప్పటి నుంచో ఒక కోరిక ఉంది. కేసీఆర్‌ను ముగ్గులోకి దించి ఆయనతో విమర్శలలో సైతం తలపడి పైచేయి సాధించాలన్నది వాంఛగా కనిపిస్తుంది. ఆయన ముఖ్యమంత్రి అయిన ఈ పదిహేను నెలల కాలంలో పలుమార్లు కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. శాసనసభలో సైతం ఘాటుగా మాట్లాడారు. ఎలాగైనా కేసీఆర్‌ను రెచ్చగొట్టాలన్నది ఆయన వ్యూహంగా కనిపించేది. ఇప్పటికైతే రేవంత్ ఆశించినట్లు జరిగిందని చెప్పాలి. కానీ, వాదోపవాదాలలో ఆయన ఎంత వరకు సఫలం అయ్యారన్నదే ప్రశ్న..కేసీఆర్ ఇంతకాలం దాదాపు పూర్తి మౌనం పాటించారు. కారణం ఏదైనా ఒక కార్యక్రమంలో బీఆర్ఎస్కు ఉత్తేజం తెచ్చేలా ప్రసంగం చేశారు. తెలుగు రాష్ట్రాలలో మంచి భాషలో పదునైన పదాలు వాడే శక్తి కేసీఆర్ సొంతం అని చెప్పాలి. ఆయనకు ధీటుగా తెలంగాణలో కాంగ్రెస్ గతంలో స్పందించలేకపోయేది. రేవంత్ రెడ్డి పీసీపీ అధ్యక్షుడు అయిన తర్వాత ఆ లోటు కొంత తగ్గిందని చెప్పాలి. రేవంత్ చాలా దూకుడుగా కేసీఆర్‌పైన, ఆయన కుటుంబంపైన విమర్శలు చేసేవారు. కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదాలు, ఈగో సమస్యతో పాటు గ్రామీణ ప్రాంతంలో బీఆర్ఎస్పై ఏర్పడిన వ్యతిరేకత కారణంగా కాంగ్రెస్ అధికారంలోకి రాగలిగింది.ఆరు గ్యారంటీలు, తదితర హామీలు కూడా కాంగ్రెస్‌కు ఉపయోగపడ్డాయి. పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడం కేసీఆర్ ముందున్న సవాలు అయితే, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడం రేవంత్‌కు ఉన్న ఛాలెంజ్. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ తరపున ఎవరో చిన్న నేత ఎక్స్‌లో పెట్టిన పోల్ కేసీఆర్‌కు ప్రయోజనకరంగా మారింది. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం కావాలా?. ఫాం హౌస్ ప్రభుత్వం కావాలా? అని పోల్ పెడితే 67 శాతం మంది ఫాం హౌస్ పాలనే బెటర్ అని, మిగిలిన 33 శాతం కాంగ్రెస్‌కు అనుకూలంగా అభిప్రాయం తెలిపారు. ఇది సహజంగానే రేవంత్‌కు కాస్త చికాకు తెప్పిస్తుంది. కేసీఆర్ తన ప్రసంగంలో ఆ పాయింట్‌ను అడ్వాంటేజ్ చేసుకోవడానికి గాను ప్రజాభిప్రాయం పూర్తిగా మారిపోయిందని, తెలంగాణ శక్తి ఏమిటో మళ్లీ చూపిస్తామని, తాను కొడితే వట్టిగా ఉండదు అంటూ సీరియస్ వ్యాఖ్య చేశారు. ఇంతకాలం గంభీరంగా, మౌనంగా చూస్తూ వచ్చానని, ఏడాదిలో రాష్ట్రాన్ని కాంగ్రెస్ దివాళా తీయించిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ వాళ్లు దొరికితే జనం కొట్టేలా ఉన్నారని కూడా ఆయన అన్నారు.ఈ ఊపులో ఆయన ఫిబ్రవరిలో ఒక భారీ బహిరంగ సభ పెడతామని ప్రకటించారు. కేసీఆర్ వ్యాఖ్యలు సహజంగానే బీఆర్ఎస్ నేతలలో, కేడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. కాంగ్రెస్‌లో కాకను పెంచుతాయి. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు పార్టీని గట్టిగానే నడుపుతున్నప్పటికీ అసలు నేత కేసీఆర్ కావడంతో ఆయన ప్రజాక్షేత్రంలోకి ఎప్పుడు వస్తారా అని కేడర్ ఎదురు చూసింది. కేసీఆర్ వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందిస్తూ పులి లేచింది అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఏడాదిపాటు సైలెంట్‌గా ఉన్నారు. కానీ, ఇకపై నిజంగానే జనంలోకి వచ్చి తిరుగుతారా? లేక అప్పుడప్పుడు ఇలా స్పెషల్ షోలకు పరిమితం అవుతారా? అన్నది అప్పుడే చెప్పలేం. నగరానికి దూరంగా ఉన్న ఫామ్ హౌస్ లోనే ఆయన ఎక్కువకాలం గడపడం బలహీనతగానే చెప్పాలి. కేటీఆర్, హరీష్ రావులు ఇంత గట్టిగా పనిచేయడం కష్టం అవుతుందని అనుకున్నారేమో తెలియదు కానీ, ఆయన కార్యకర్తలకు అంతగా అందుబాటులో లేరని చెబుతారు. శాసనసభ ఎన్నికలలో ఓటమి పాలైన తర్వాత కేసీఆర్ బాగా డీలా పడ్డారు. తాను బాగా పని చేశానని, అయినా ఓటమి పాలయ్యాయని బాధపడుతుండవచ్చు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు దీనికి కారణమని ఆయన అభిప్రాయపడుతున్నారు. దీనిని కౌంటర్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వంలోని వీక్ పాయింట్స్‌ను పట్టుకుని ముందుకు వెళ్లాలని చూస్తున్నారు. కానీ, ముందుగా బీఆర్ఎస్లో ఉన్న బలహీనతలను ఆయన గుర్తించగలగాలి. భారతీయ జనతా పార్టీ ఒకవైపు బీఆర్ఎస్ స్థానాన్ని ఆక్రమించాలని చూస్తోంది. దానికి తగినట్లుగానే ఆ పార్టీ వ్యూహాలు పన్నుతోంది. ఇప్పటికే పార్లమెంటు ఎన్నికలలో ఎనిమిది స్థానాలు సంపాదించి సంచలనం సృష్టించింది. బీఆర్ఎస్కు ఒక్క సీటు రాకపోవడం బాగా ఇబ్బంది కలిగించే అంశమే.బీజేపీ గెలుపునకు పరోక్షంగా బీఆర్ఎస్ సహాయపడిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత కేసీఆర్ అంత యాక్టివ్ కాకపోయినా, కాంగ్రెస్ హామీలను నెరవేర్చలేకపోవడం, ప్రభుత్వపరంగా తీసుకున్న కొన్ని నిర్ణయాలు బీఆర్ఎస్కు ప్రయోజనం కలిగించాయి. పార్లమెంటు ఎన్నికలలో ఓటమి పాలైనా, అసెంబ్లీ ఎన్నికలలో ఆ పరిస్థితి ఉండదని బీఆర్ఎస్ భావన. కాకపోతే ఇంకా దాదాపు నాలుగేళ్లు పోరాటాలు సాగించాలి. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే అధికంగా మాటల తూటాలు పేలుతున్నాయి. వచ్చే స్థానిక ఎన్నికలలో బీఆర్ఎస్ కనుక గణనీయమైన స్థానాలు సాధించగలిగితే అప్పుడు కాంగ్రెస్ భయపడే పరిస్థితి వస్తుంది. కానీ, అది అంత తేలికకాదు. అంతేకాక కేసీఆర్‌కు కాళేశ్వరం ప్రాజెక్టుపై జరుగుతున్న విచారణ తలనొప్పి కాకుండా ఉండాలి. ఇకపై రేవంత్ మరింతగా కవ్విస్తుంటారు. దానిపై కేసీఆర్ ఎలా స్పందిస్తారు? అన్నది కూడా ఆసక్తికరమైన అంశమే అవుతుంది.మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు కాంగ్రెస్ వైపు వెళ్లకుండా చూసుకోగలగాలి. దానివల్ల పార్టీలో ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఇక రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ వ్యూహాలను ఎలా ఎదుర్కుంటారన్న దానిపై కాంగ్రెస్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అనాలోచితంగా ఏదో మంచి జరుగుతుందనుకుని కాంగ్రెస్ పార్టీ ఎక్స్ లో పోల్ పెట్టి నాలుక కరచుకోవాల్సి వచ్చింది. ఈ పోల్ నిజంగానే ప్రజలలో ఉన్న అభిప్రాయానికి దర్పణం పడుతోందా? లేదా? అన్నదానిపై రేవంత్ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. హైడ్రా దూకుడు, ఆరు గ్యారంటీల అమలులో ఉన్న ఇబ్బందులు, అవి కాక ఎన్నికల ప్రణాళికలోని ఇతర హామీలు, వివిధ వర్గాలకు ఇచ్చిన డిక్లరేషన్లు .. ఇవన్నీ కూడా కాంగ్రెస్‌కు ఇరకాటమైనవే అని చెప్పాలి. హామీలను నెరవేర్చాలన్న తాపత్రయం ఉన్నా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అందుకు అవకాశం ఇవ్వడం లేదు. తెలంగాణాకు ఆదాయం బాగానే ఉన్నా, ఈ హామీలకు అది సరిపోవడం లేదు. అందుకే పైలట్ ప్రాజెక్టు పేరుతో మండలానికి ఒక గ్రామం చొప్పున తీసుకుని స్కీముల అమలుకు ప్రయత్నిస్తున్నారు. దీనివల్ల కూడా కొంత నష్టం జరగవచ్చు.గతంలో కేసీఆర్ దళిత బంధును ప్రవేశపెట్టి అందరికీ ఇవ్వలేక సతమతమయ్యారు. దాని ఫలితంగా బీఆర్ఎస్కు చాలా నష్టం జరిగింది. ఇప్పుడు అలాంటి వాతావరణమే కాంగ్రెస్‌కు ఎదురవుతోంది. ఈ నేపధ్యంలో పోల్ లో కాంగ్రెస్ పై వ్యతిరేకత ఏర్పడిన అభిప్రాయం కలిగింది. దీనిపై రేవంత్ స్పందన అంత బాగోలేదని చెప్పాలి. కేసీఆర్‌ను రాకీ సావంత్ తో పోల్చడం సరికాకపోవచ్చు. కేసీఆర్ తాను కొడితే వట్టిగా ఉండదన్న వ్యాఖ్య కేవలం హైప్ కోసమే చేసింది అయినా, రేవంత్ గతంలో ప్రతిపక్షంలో ఉన్నట్లుగానే వ్యక్తిగతంగానే మాట్లాడారనిపిస్తుంది. ముందు సరిగా నిలబడడం నేర్చుకో అని ఆయన అన్నారు. కేసీఆర్‌ను చెల్లని వెయ్యి రూపాయల నోటుతో పోల్చారు. దమ్ముంటే అసెంబ్లీకి రా అని సవాల్ చేయడం సరైనదే అని చెప్పాలి. ఎందుకంటే కేసీఆర్‌కు ప్రతిపక్షనేత హోదా ఉందన్న సంగతి మర్చిపోకూడదు.ఈ విషయంలో బీఆర్ఎస్కు కొంత ఇబ్బందే. అయితే, కేసీఆర్ నిత్యం ప్రజలకు, ముఖ్యంగా కేడర్‌కు అందుబాటులోకి వచ్చి, టూర్లు మొదలు పెడితే వచ్చే స్పందనపై బీఆర్ఎస్ భవితవ్యం ఆధారపడి ఉంటుంది. రేవంత్ ప్రభుత్వం ప్రజలలో కొంత వ్యతిరేకత ఎదుర్కుంటున్న మాట నిజం. దానిని అధిగమించడానికి, ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి రేవంత్ ఏ చర్యలు తీసుకుంటారన్నదానిపై, ప్రజలలో సానుకూల అభిప్రాయం ఎలా కలిగిస్తారన్న దానిపై కాంగ్రెస్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. బీఆర్ఎస్ను బలహీనపరచాలన్న లక్ష్యంతో ఆ పార్టీ వారిని కాంగ్రెస్ లోకి తీసుకు వచ్చినంత మాత్రాన పూర్తి ఫలితాన్ని ఇవ్వదన్న సంగతి ఆ పార్టీ నేతలకు అర్దం అయి ఉండాలి.కేసీఆర్ చేస్తున్న మరో ముఖ్యమైన విమర్శ రియల్ ఎస్టేట్ బలహీనంగా ఉండడం. అది దేశవ్యాప్తంగా ఉన్న విషయమే అయినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా ద్వారా చేసిన కూల్చివేతలు కూడా కొంత నష్టం చేశాయి. దానిని కవర్ చేసుకోవడానికి ప్రభుత్వం కొంత యత్నం చేస్తోంది. రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాలు బాగా జరిగితే రేవంత్ ప్రభుత్వం అడ్వాంటేజ్లోకి వెళుతుంది. కేంద్రంలో తనకు ఉన్న అధికారాన్ని వినియోగించుకుని కాంగ్రెస్, బీఆర్ఎస్లను దెబ్బకొట్టడానికి బీజేపీ సహజంగానే యత్నిస్తుంది. రాష్ట్రంలోని అధికారంతో పట్టు బిగించాలని కాంగ్రెస్ వ్యూహరచన చేస్తుంది. పులిగా మారతారో లేదో కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో రెండు జాతీయ పార్టీలను ఎదుర్కోవడం కేసీఆర్ ముందున్న అతి పెద్ద సవాల్ అని చెప్పక తప్పదు.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
రేవంత్ హనీమూన్ ముగిసింది: కేటీఆర్
సాక్షి,పరిగి: కేసీఆర్ కొడితే ఎలా ఉంటుందో రేవంత్ పాత గురువు, కొత్త బాస్‌లు రాహుల్,సోనియాగాంధీలకు తెలుసని, వారిని అడిగితే కేసీఆర్ దెబ్బ ఎలా ఉంటుందో చెబుతారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శనివారం(ఫిబ్రవరి1) పరిగిలో జరిగిన సభలో కేటీఆర్ మాట్లాడారు.‘కేసీఆర్ కర్ర లేకుండా నిలబడతారు. ముందు రేవంత్‌రెడ్డి కమీషన్ లేకుండా పాలించాలి. ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు. నా సవాల్‌కు రేవేంత్‌రెడ్డి స్పందించడం లేదు. 71 సంవత్సరాల పెద్ద మనిషి నాయకుడిని పట్టుకొని కట్టె పట్టుకొని నిలబడమంటూ సంస్కారం లేకుండా మాట్లాడుతున్నాడు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి నిలబెట్టినవాడు కేసీఆర్ అనే విషయం గుర్తుంచుకో. రేవంత్‌రెడ్డి హనీమూన్ పిరియడ్ ముగిసింది, రేవంత్‌కు ఇక పైన సినిమా చూపిస్తాం. కేసీఆర్ అసెంబ్లీకి రావడం కాదు రేవంత్ రెడ్డికి దమ్ముంటే లగచర్ల కి రావాలి. రేవంత్‌రెడ్డి వచ్చినా రాకున్నా కొడంగల్‌కి మాత్రం త్వరలో నేను వస్తున్నా..నీకు దమ్ముంటే ఆపు. రేవంత్ తన పోలీసు బలగంతో నన్ను ఎక్కడికక్కడ ఆపే ప్రయత్నం చేస్తున్నాడు. కచ్చితంగా కొడంగల్ పోతాం నీ సంగతి చూస్తా. రేవంత్ గతంలో ప్రతిపక్ష నేతగా సిరిసిల్లతోపాటు మంత్రుల నియోజకవర్గాల్లో స్వేచ్ఛగా తిరగలేదా.. అప్పుడు ఇదే పోలీసులను పెట్టి సమావేశాలకు రక్షణ కల్పించిన విషయం రేవంత్ మర్చిపోయాడు. టికెట్ కొనకుండా లాటరీ గెలిచిన వ్యక్తి రేవంత్‌రెడ్డి. ఆయన కంటే ముందు అనేక మంది ముఖ్యమంత్రులు పనిచేసిన విషయాన్ని రేవంత్‌రెడ్డి గుర్తుంచుకోవాలి. రేవంత్‌రెడ్డి ఇప్పటికైనా బూతు పురాణం మానేసి పరిపాలన పైన దృష్టి సారించాలి’అని కేటీఆర్ సూచించారు. -
కాంగ్రెస్‌లో అలజడి.. పది మంది ఎమ్మెల్యేల రహస్య భేటీ!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో అలజడి నెలకొన్నట్టు తెలుస్తోంది. తాజాగా పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. హైదరాబాద్ సమీపంలోని ఓ హోటల్లో వీరంతా సమావేశం అయ్యారు. అయితే, ఓ కేబినెట్ మంత్రి వ్యవహరిస్తున్న తీరుపై వీరు అసంతృప్తిగా ఉన్నారనే చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై ఎమ్మెల్యేలు సమాలోచనలు చేస్తున్నట్టు సమాచారం. ఎమ్మెల్యేల సమావేశంపై కాంగ్రెస్‌లో చర్చ మొదలైంది.ఇక, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మంత్రులతో సమావేశం కానున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులతో సీఎం భేటీ అవనున్నారు. అయితే, అధికారులు లేకుండా కేవలం మంత్రులతో సీఎం భేటీ కొనసాగే అవకాశముంది. దీంతో రాజకీయపరమైన చర్చ జరుగుతుందని టాక్ వినిపిసస్తోంది. ఈ నేపథ్యంలో మేజర్ పొలిటికల్ డెసిషన్ వస్తుందా అనే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు.. సోషల్ మీడియాలో కాంగ్రెస్ నేతలు పెట్టిన పోల్ అంశం కూడా తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ పెట్టిన పోల్.. ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. 70 శాతం బీఆర్ఎస్కు అనుకూలంగా, 30 శాతం కాంగ్రెస్‌కు ఫేవర్‌గా ఓట్లు పడ్డాయి. ఈ క్రమంలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోల్ రావడం హస్తం నేతలకు మింగుడు పడటం లేదని సమాచారం. ఈ నేపథ్యంలో కొందరు కాంగ్రెస్ నేతలు దిక్కులు చూస్తున్నారనే చర్చ సైతం నడుస్తోంది.ఇదిలా ఉండగా.. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్‌పై నిన్ననే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విరుచుకుపడిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో జరుగుతున్న విషయాలను నేను గంభీరంగా, మౌనంగా చూస్తున్నా.. నాకు కొడితే వట్టిగా కొట్టుడు అలవాటు లేదు. నాలుగు రోజులు కానీయ్ అన్నట్లు చూస్తున్నా. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోయింది. కాంగ్రెస్ మెడలు వంచి భవిష్యత్తు కోసం కొట్లాడాలి. అలాగే, ప్రాణం పోయినా సరే తెలంగాణకు రక్షకులం మనమే. తెలంగాణ హక్కుల కోసం తెగించి కొట్లాడాల్సిందే అని కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. దీంతో, హస్తం నేతలు బీఆర్ఎస్ పంచన చేరే అవకాశాలు సైతం ఉన్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
మౌనం వీడి రేవంత్ సర్కార్ పై నిప్పు లు చెరిగిన కేసీఆర్
-
నాకు వట్టిగ కొట్టుడు అలవాటు లేదు, నాలుగు రోజులు కానీయ్ అని చూస్తున్నా... తెలంగాణ ప్రభుత్వంపై కేసీఆర్ ఆగ్రహం
-
దమ్ముంటే అసెంబ్లీకి రా.. తేల్చుకుందాం
సాక్షి,రంగారెడ్డి జిల్లా: ‘‘కేసీఆర్(KCR) గత 14 నెలలుగా ఫౌమ్‌హౌస్‌లో పడుకొని గంభీరంగా చూస్తున్నానని అంటున్నారు. ఎవరిని చూస్తున్నావు? ఎందుకు చూస్తున్నావు? బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశంపై చర్చించేందుకు ఫిబ్రవరి మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయబోతున్నాం. ఫామ్‌హౌస్‌లో పడుకుని పొంకనాలు కొట్టడం కాదు. దమ్ముంటే అసెంబ్లీకి రా.. అన్ని లెక్కలు తేల్చుకుందాం.’’ అని మాజీ సీఎం కేసీఆర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి(Revanth Reddy) సవాల్ విసిరారు.రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం ఫరూఖ్‌నగర్ మండలం మొగిలిగిద్ద ప్రభుత్వ పాఠశాల 150వ వార్షికోత్సవానికి సీఎం రేవంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా ఫౌమ్‌హౌస్‌లో పడుకొని కొడుకు, అల్లుడిని ఊర్లపైకి ఉసిగొల్పుతున్నడు. జహంగీర్‌పీర్ దర్గా, వేములవాడ రాజన్నలను మోసం చేసిన చరిత్ర నీది. నీ రాక కోసం తెలంగాణ ప్రజలెవరూ ఎదురు చూడటం లేదు. సరిగ్గా నిలబడటం నేర్చుకో.. నువ్వో చెల్లని వెయ్యి రూపాయల నోటువు. ఆ నోటును ఎవరైనా జేబులో పెట్టుకునిపోతే.. జైలుకు వెళ్లడం ఖాయం. కొడితే బలంగా కొడతానని అంటున్నారు. కొట్టడం కాదు ముందు సరిగ్గా నిలబడటం నేర్చుకో. సోషల్ మీడియా టిక్‌టాక్‌లో తనకు ఎక్కువ మార్కులు వచ్చాయని గొప్పలు చెప్పుకొంటున్నారు. సల్మాన్‌ఖాన్‌కు రాఖీ సావంత్‌కు మధ్య పోటీపెడితే ఎక్కువ లైకులు రాఖీ సావంత్‌కే వచ్చాయి. అంత మాత్రన సల్మాన్‌ఖాన్ గొప్పవాడు కాకుండా పోతాడా? ఆయన ఆరోగ్య పరిస్థితి బాగులేదు కేసీఆర్ మానసిక ఆరోగ్య పరిస్థితి సరిగా లేదు. ఆయన కుటుంబ సభ్యులు యమకింకరులై తిరుగుతున్నారు. ఫామ్‌హౌస్‌లో పడుకుని సోది చెప్పుకోవడం కాదు. అసెంబ్లీకి రా.. అన్ని లెక్కలు వివరిస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో చేసిన అభివృద్ధి పనులను, చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను అభినంచడానికి మనసు రాకపోతే ఫామ్‌హౌస్‌లోనే పడుకో. పాలమూరు, జూరాల ఎత్తిపోతల, కోయల్‌సాగర్ కడతానని హామీ ఇచ్చి.. ప్రజలను మోసం చేశావు. నువ్వు ఎన్ని చెప్పినా తెలంగాణ ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితిలో లేరు. ఏడాదిలో ఎన్నో చేశాం.. మా ఏడాది పాలనలో రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశాం. సన్నాలకు రూ.500 బోనస్ ఇచ్చాం. 24 గంటల కరెంట్ ఇస్తున్నాం. 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే గృహాలకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నాం. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాం. ఏడాదిలోనే 55,143 ఉద్యోగాలు భర్తీ చేశాం. రైతు భరోసా కింద ఎకరానికి రూ.12 వేలు ఇస్తున్నాం. భూమి లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద నగదు అందజేస్తున్నాం, రైతును రాజును చేస్తున్నాం. ప్రభుత్వ విద్యకు బడ్జెట్ 15 శాతానికి పెంచుతాం దివంగత వైఎస్సార్ పాలనలో జిల్లాకో యూనివర్సిటీ ఏర్పాటు చేశాం. అనేక ప్రభుత్వ పాఠశాలలను నెలకొల్పాం. ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టి పేదలకు ఉన్నత చదువులు చదివే అవకాశం కల్పించాం. పదేళ్ల కేసీఆర్ పాలనలో ప్రభుత్వ విద్యారంగం పూర్తిగా నిర్విర్యమైంది. ఉస్మానియా, కాకతీయ వర్సిటీలు పునరావాస కేంద్రాలుగా మారాయి. అవి ప్రతిష్టను కోల్పోయే పరిస్థితికి దిగజార్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చాం. బడ్జెట్లో ఏడు శాతం నిధులు కేటాయించాం. తండాలు, మారుమూల గ్రామాల్లో మూసివేసిన అనేక పాఠశాలలను పునఃప్రారంభించాం. 11 వేల కొత్త ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశాం. భవిష్యత్తులో విద్యకు బడ్జెట్‌ను 15 శాతానికి పెంచాలని నిర్ణయించాం. స్టాన్‌ఫర్డ్ వర్సిటీతో ఎంఓయూకు యత్నం మహాత్మాగాంధీ నడిపిన యంగ్ ఇండియా పత్రిక స్ఫూర్తితో విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యాలను అందించేందుకు ‘యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్’ను ఏర్పాటు చేస్తున్నాం. రూ.2,400 కోట్లతో 75 ఐటీఐలను ఆధునీకరించాం. టాటా కంపెనీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాం. సింగపూర్ నుంచి నిపుణులను ఇక్కడికి రప్పించి, నిరుద్యోగులకు ఆయా అంశాల్లో శిక్షణ ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రఖ్యాత స్టాన్‌ఫర్డ్ వర్సిటీతో ఎంఓయూ కోసం ప్రయత్నిస్తున్నాం. కేవలం చదువుకున్నవారికే కాదు ఆటల్లో రాణిస్తున్నవారికీ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్‌కు డీఎస్పీ ఉద్యోగంతోపాటు రూ.2 కోట్ల ఆర్థిక సాయం అందించాం. పెద్దగా చదువు లేని సిరాజుద్దీన్ సహా దీప్తికి గ్రూప్–2 ఉద్యోగం, ఆర్థిక సాయం, ఇంటి స్థలం ఇచ్చి ప్రోత్సహించాం..’’ అని సీఎం రేవంత్ తెలిపారు. ప్రభుత్వ టీచర్లు ఆత్మ విమర్శ చేసుకోవాలి. విద్యార్థుల భవిష్యత్తు తరగతి గదుల్లోనే నిర్మితమై ఉంది. రాష్ట్రంలో 12వేల ప్రైవేటు పాఠశాలల్లో 31లక్షల విద్యార్థులు చదువుతుంటే.. 30వేల ప్రభుత్వ పాఠశాలల్లో 24 లక్షల మంది చదువుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి. ప్రభుత్వ విద్య ప్రైవేటుపరం కాకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంది. మట్టిలో మాణిక్యాలను గుర్తించి ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఉపాధ్యాయులు స్థానికంగా నివాసం ఉండాలి. విద్యార్థులను ప్రోత్సహించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో డిగ్రీలు, పట్టాలు ఉంటే సరిపోదు. పోటీ ప్రపంచంలో రాణించాలంటే మార్కులు, డిగ్రీలేకాదు.. సాంకేతిక నైపుణ్యం కూడా తోడవాలి. అప్పుడే కోరిన ఉద్యోగం దొరుకుతుంది. మొగిలిగిద్దకు రూ.16 కోట్లు మొగిలిగిద్ద పాఠశాల తెలంగాణకే వన్నె తెచ్చిందని, ఇక్కడ చదువుకున్న వారిలో ఇద్దరు సీఎంలు, గవర్నర్, మాజీ మంత్రి, ప్రొఫెసర్ సహా అనేక మంది ఉన్నారని సీఎం గుర్తు చేశారు. ఇలాంటి చారిత్రక స్కూలు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉండటం గర్వకారణమని పేర్కొన్నారు. మొగిలిగిద్దలో పాఠశాల భవనం, గ్రామ పంచాయతీ భవనం, సీసీ రోడ్ల కోసం రూ.16 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక్కడి విద్యార్థులకు వివిధ అంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు ‘అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్’ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ బహిరంగ సభలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ హరగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
నేను కొడితే.. వట్టిగ ఉండదు: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘‘రాష్ట్రంలో జరుగుతున్న విషయాలను నేను గంభీరంగా, మౌనంగా చూస్తున్నా.. నాకు కొడితే వట్టిగా కొట్టుడు అలవాటు లేదు కదా. నాలుగు రోజులు కానీయ్ అన్నట్లు చూస్తున్నా. కాంగ్రెస్(congress party) అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోయింది. సంగమేశ్వర, బసవేశ్వర, పాలమూరు ఎత్తిపోతల పథకాలు నిలిచిపోయాయి. కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) ను ఎండబెడుతున్నరు. ఈ అన్యాయాలపై ఫిబ్రవరి నెలాఖరులో బహిరంగ సభ పెట్టి వీళ్ల సంగతి చూడాలి. పెద్ద ఎత్తున సభకు తరలివచ్చి తెలంగాణ శక్తిని మరోమారు చాటాలి. కాంగ్రెస్ మెడలు వంచి భవిష్యత్తు కోసం కొట్లాడాలి’ అని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు(Kcr) పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంగం మండలం మేదపల్లి గ్రామం నుంచి వందలాది మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు 140 కిలోమీటర్లు పాదయాత్ర చేసి శుక్రవారం ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడారు.వివరాలు ఆయన మాటల్లోనే... ‘‘మన పార్టీకి కులం, మతం, జాతి అనే భేదభావం లేదు. తెలంగాణ సరిహద్దు లోపల ఉన్న వారందరికీ న్యాయం జరిగి బాగుపడాలి. తెలంగాణకు అన్యాయం జరిగితే కొట్లాడేందుకు ఎవరూ ముందుకు రారు. ప్రాణం పోయినా సరే తెలంగాణకు రక్షకులం మనమే. తెలంగాణ హక్కుల కోసం తెగించి కొట్లాడాల్సింది బీఆర్ఎస్ అనే విషయంలో రెండో మాటే లేదు. ప్రత్యక్ష ప్రజా పోరాటాలు లేవదీసైనా సరే ప్రాజెక్టులు, నీళ్లు సాధించుకోవాలి. అవసరమైన సందర్భంలో నేను, జిల్లా నాయకులు ఇచ్చే పిలుపునకు స్పందించి ప్రజలకు జరిగే అన్యాయాలపై ఎదురు తిరిగి కొట్లాడాలి. తెలంగాణ కోసమే బయలుదేరిన గులాబీ జెండా తెలంగాణను సాధించి దేశంలోనే నంబర్ వన్‌గా నిలబెట్టింది. కాంగ్రెస్ మోసాలకు బలయ్యారు.. ఇన్నాళ్లూ కోటి రూపాయలు పలికిన భూమిని ఇప్పుడు రూ.50లక్షలకు కొనే పరిస్థితి లేదు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి మార్చి వరకు రూ.15వేల కోట్ల ఆదాయం తగ్గుతోందని కాగ్ రిపోర్టు చెబుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏటా ఆదాయంలో రూ.15 వేల కోట్ల వృద్ధిని సాధించింది. ఇప్పుడు మరో నాలుగైదు నెలల్లో ఉద్యోగులకు జీతాలు ఇవ్వడమే కష్టమనే పరిస్థితిలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉంది. రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వలేని విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దివాలా తీయించారు.మనం ప్రాజెక్టులు, చెరువుల కింద నీటి తీరువా రద్దు చేసి రైతులకు ఎన్నో సదుపాయాలు కల్పించాం. కానీ కొన్ని నియోజకవర్గాల్లో అత్యాశకు పోయి ఓట్లేసి బావిలో పడ్డారు. మంది మాటలు పట్టుకుని మార్వాణం పోతే మళ్లీ వచ్చేసరికి ఇల్లు ఆగమైందన్నట్టు పరిస్థితి తయారైంది. తులం బంగారం ఇస్తామంటే నమ్మి ఓటేస్తే ఏమవుతుందో తెలంగాణలో మంచి గుణపాఠం అయింది. కైలాసం ఆటలో పెద్దపాము మింగినట్టు కాంగ్రెస్ మోసాలకు బలయ్యారు. ప్రశ్నిస్తే పోలీసు కేసులు పెడుతున్నరు.. రైతుబంధుతో వ్యవసాయం మెరుగై అప్పులు తీర్చుకుని, చిట్టీలు వేసుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడా సంతోషం మంటగలిసింది. వాళ్లు ఎన్నికల సమయంలో ఇస్తరో ఎప్పుడు ఇస్తరో దేవుడికే ఎరుక. కరోనా సమయంలో మేం రైతుబంధు ఇచ్చి రైతులను కాపాడుకున్నాం. కాంగ్రెస్ పార్టీ ముస్లింల ఓట్లు వేయించుకుని వారి బాగోగులను పట్టించుకోవడంలేదు. మనం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలల ద్వారా పేద విద్యార్థులకు కాన్వెంట్ విద్య అందిస్తే.. ఇప్పుడు పిల్లలు విషాహారం, పురుగుల అన్నం, కడుపునొప్పితో ఇంటి బాట పడుతున్నరు. కాంగ్రెస్ పాలన లోపాలను ప్రశ్నిస్తే పోలీసు స్టేషన్లకు పట్టిస్తున్నారు. ఏడాది పాలనతోనే కాంగ్రెస్ వాళ్లు దొరికితే కొడతం అన్నట్లుగా జనం ఉన్నరు. ఫామ్‌హౌజ్‌కు వస్తే పార పట్టొచ్చు వాళ్ల పార్టీ నిన్న ఒక పోలింగ్ పెట్టింది. అందులో 70శాతం మనకు, 30శాతం వాళ్లకు వచ్చింది. ఫామ్ హౌజ్ అంటే ఇక్కడ వరి, మక్కలు, అల్లం తప్ప ఏముంటది. కాంగ్రెస్ వాళ్లు వస్తే తలాకొంత సేపు పారపట్టి పనిచేయచ్చు. ఫామ్‌హౌజ్ అని బదనాం చేసి అధికారంలోకి వచ్చారు. ఏడాదిలోనే కాంగ్రెస్ పాలనకు విసిగి మళ్లీ మనమే రావాలని ప్రజలు వందశాతం కోరుకుంటున్నరు. కచ్చితంగా రాబోయే ప్రభుత్వం మనదే..’’ అని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. రైతులను సమీకరించి ఉద్యమం జహీరాబాద్ నియోజకవర్గంలో సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్టులను బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసినా.. ప్రస్తుత ప్రభుత్వం ఆ పనులు నిలిపివేసి రైతులను ఇబ్బందులు పెడుతోందని కేసీఆర్ మండిపడ్డారు. రైతులకు నష్టం జరుగుతుంటే ఆ జిల్లా మంత్రి ఏం చేస్తున్నారని నిలదీశారు. దీనిపై రైతులను భారీ స్థాయిలో సమీకరించి ఉద్యమం చేపట్టాలని మాజీ మంత్రి హరీశ్‌రావుకు కేసీఆర్ సూచించారు.పాదయాత్రగా ఎర్రవల్లికి వచ్చిన మాజీ సర్పంచులు పరమేశ్వర్ పాటిల్, బోయిని చంద్రయ్య, పార్టీ నేతలు సంగమేశ్వర్, ప్రశాంత్, బోయిని శ్రీనివాస్, ప్రదీప్ తదితరులు కేసీఆర్‌ను సత్కరించి కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయ ప్రసాదం అందజేశారు. సమావేశంలో ఎమ్మెల్యేలు మాణిక్ రావు, సునీతా లక్ష్మారెడ్డి, చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్ తడాఖా అప్పుడే తెలిసింది: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
సాక్షి,నల్లగొండజిల్లా:కేసీఆర్ ఇప్పటికైనా బయటకు వచ్చినందుకు సంతోషమని,రేపటి నుంచి ఆయనను ఎండ కట్టడాన్ని తెలంగాణ ప్రజలు చూస్తారని మంత్రి కోమటిరెడ్డివెంకట్‌రెడ్డి అన్నారు. శుక్రవారం(జనవరి31) కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు.‘దళితులకు మూడెకరాల భూమి,డబుల్ బెడ్రూమ్ ఇస్తానని ఎన్ని ఇల్లు ఇచ్చావు.రేపటి నుంచి తడాఖా చూపిస్తా అని కేసీఆర్ అంటున్నారు.కేసీఆర్ తడాఖా ఏంటో పార్లమెంటు ఎన్నికల్లో చూశాం.పదహారు లోక్‌సభ స్థానాల్లో ప్రచారం చేస్తే తొమ్మిదింటిలో డిపాజిట్ కూడా రాలేదు.నువ్వేదో నాయకుడివి అనుకుంటున్నావు.తెలంగాణ సాధనలో నీ పాత్ర అసలే లేదు. నాలాంటి వాళ్లు మంత్రి పదవికి రాజీనామా చేస్తే తెలంగాణ వచ్చింది. కేసీఆర్ దొంగ దీక్షలు చేశాడు.మాటలతో పదేళ్లు కేసీఆర్ రాజకీయాలు చేశాడు.ముందు అసెంబ్లీకి వచ్చి మాట్లాడు.బయటికి వస్తా అంటున్నావ్ కదా ఏ జిల్లాకు పోదాం చెప్పు. పదేళ్లు రేషన్ కార్డులు ఇవ్వలేదు.ఏడు లక్షల కోట్ల అప్పు చేశావు’ -
కేసీఆర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి సవాల్
సాక్షి,హైదరాబాద్: ‘ఆయన కొడితే బలంగా కొడతా అంటున్నారు. బలంగా కొట్టుడు కాదు. సరిగ్గా నిలబడమనండి’’ అంటూ మాజీ సీఎం కేసీఆర్ (kcr) వ్యాఖ్యలకు సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) కౌంటర్ ఇచ్చారు. ఫామ్ హౌస్ (Farm House)లో కూర్చొని మాటలు చెప్పుడు కాదు. అసెంబ్లీకి రావాలంటూ సవాల్ విసిరారు. 150 ఏళ్లు పూర్తి చేసుకున్న రంగారెడ్డి జిల్లా మొగిలిగిద్ద ప్రభుత్వ ఉన్నత పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..‘‘కేసీఆర్ కోసం ఎవరు ఎదురు చూడడం లేదు. జహంగీర్ పీర్కి రూ.100 కోట్లు, రాజరాజేశ్వరస్వామికి రూ.100 కోట్లు ఇస్తామని మోసం చేశారు. పాలమూరును ఎండబెట్టిన ఘనలు మీరు. ఆయన కొడితే బలంగా కొడతా అంటున్నారు. బలంగా కొట్టుడు కాదు. సరిగ్గా నిలబడు. 14 నెలల ఫామ్ హౌస్‌లో పడుకుని గంభీరంగా చూస్తున్నాం అని అంటున్నావ్. ఏం చేస్తున్నావ్...హరీష్‌ను, కేటీఆర్‌ను ఊరిమీదకు వదిలావ్. నీను మీలాగా మాటలు చెప్పి ఎగ్గొట్టను. అబద్ధాలు చెప్పడం వల్లే ఓడిపోయారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్‌కు గాడిగుడ్డు చేతికి ఇచ్చారు. అసెంబ్లీకి వస్తే ఏ ఊరికి ఎంత రుణ మాఫీ చేశామో చెబుతాం. నాకు, కేసీఆర్‌కు పోలింగ్ పెడితే కేసీఆర్‌కు ఎక్కువ ఓట్లు వచ్చాయంటా. సల్మాన్‌ఖాన్‌కు.. రాఖీ సావంత్‌కు ఓటింగ్ పెడితే .. రాఖీ సావంత్‌కు ఎక్కువ ఓట్లు వచ్చాయి. అంత మాత్రానా సల్మాన్ ఖాన్ హీరో కాకుండా పోరుగా. ప్రజలు తిరస్కరించినా బుద్ధిరాలేదు’ అని రేవంత్ వ్యాఖ్యానించారు.👉చదవండి : నేను కొడితే మామూలుగా ఉండదు -
కేసీఆర్ ఫాంహౌజ్ కలలు మానాలి: టీపీసీసీ చీఫ్
సాక్షి,హైదరాబాద్:కేసీఆర్ ఫాంహౌస్ కలలు మానుకోవాలని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్ హితవు పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై శుక్రవారం(జనవరి31) మహేష్‌కుమార్ స్పందించారు.‘బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫాంహౌస్‌లో కూర్చొని ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారు. స్థానిక సంస్థల్లో ఆ పార్టీకి అభ్యర్థులు కూడా దొరికే పరిస్థితి లేకపోవడంతో కేసీఆర్ అభ్యర్థుల కోసం ఏదేదో మాట్లాడుతున్నారు. ప్రజలు ఫాం హౌస్ పాలన,గడీల పాలన కోరుకోవడం లేదు. ప్రజా పాలన,ఇందిరమ్మ రాజ్యాన్ని కోరుకుంటున్నారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో సాధించలేని ప్రగతిని కాంగ్రెస్ ఏడాది పాలనలో సాధించడంతో ఆయన దిక్కుతోచక మాట్లాడుతున్నారు. కుమార్తె కవితపై ఇప్పుడు మరో లిక్కర్ స్కాం ఆరోపణలు రావడంతో ఆయన ఆ అంశాన్ని పక్కదారి పట్టిస్తున్నారు.అసెంబ్లీకి రాకుండా ప్రతిపక్ష నేతగా విఫలమైన కేసీఆర్,కాంగ్రెస్ అధికారంలో విఫలమైందని వ్యాఖ్యానించడం హాస్వాస్పదం. కాంగ్రెస్ ఏడాది పాలనలో 50 వేలకుపైగా ఉద్యోగాలు భర్తీ చేయడం ఆయనకు కనిపించడం లేదా? అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు గద్దెదింపినా, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటూ దక్కకపోయినా గుణపాఠం నేర్వని కేసీఆర్ ఫాంహౌస్‌లో పగటి కలలు కంటున్నారు.రాబోయే స్థానిక ఎన్నికల్లో ఆ పార్టీకి అభ్యర్థులే కరువైన నేపథ్యంలో ఆయన కాంగ్రెస్‌పై అవాకులు చెవాకులు పలుకుతున్నారు.ప్రజలు చీ కొట్టినా కేసీఆర్ వ్యవహార శైలి,మాటతీరులో మార్పు రాలేదు. ఇలాగే ఉంటే రాబోయే స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి మరోసారి భంగపాటు తప్పదు’అని మహేష్‌కుమార్‌గౌడ్ అన్నారు. -
తెలంగాణ శక్తి ఏంటో కాంగ్రెస్ వాళ్లకు చూపిస్తా: కేసీఆర్
-
కేసీఆర్ వ్యాఖ్యలకు మంత్రి పొంగులేటి కౌంటర్
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ వ్యాఖ్యలకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ గర్జనలు, గంభీరాలు గమనిస్తున్నాం. ఫామ్ హౌస్‌లోనే ఉండి మాట్లాడతారా.. లేదా అసెంబ్లీకి వస్తారా?’’ అంటూ ఎద్దేవా చేశారు.కేసీఆర్ ఇన్నాళ్లు అసెంబ్లీకి ఎందుకు రాలేదు?: మల్లు రవికేసీఆర్ ఇన్నాళ్లు అసెంబ్లీకి ఎందుకు రాలేదంటూ కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ప్రశ్నించారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ కుంభకర్ణుడిలా ఏడాదిగా నిద్రపోతున్నారు. సోషల్ మీడియాలో మాతరమే బీఆర్ఎస్ పని చేస్తుంది. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ ఓటింగ్ చేసి.. జిమ్మిక్కులు చేసింది. మేము ప్రజల్లో పనిచేస్తున్నాం. రెండు లక్షల రుణమాఫీ ఏడాది లోపలే చేశాం. మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం ఏర్పాటు చేశాం. కవిత వల్ల కేజ్రీవాల్ లాంటి వారే జైలుకు పోయారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. -
నేను కొడితే మాములుగా ఉండదు : కేసీఆర్
సాక్షి,హైదరాబాద్ : సుదీర్ఘ కాలం తర్వాత మాజీ సీఎం కేసీఆర్ ( kcr) మౌనం వీడారు. ‘నేను కొడితే మాములుగా ఉండదు’ అంటూ రాష్ట్రంలో కాంగ్రెస్ (congress party) పాలనపై నిప్పులు చెరిగారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో జహీరాబాద్ బీఆర్ఎస్ (brs) కార్యకర్తలతో కేసీఆర్ సమావేశం అయ్యారు. కేసీఆర్ మళ్ళీ సీఎం కావాలని ఆకాంక్షిస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలు ఈ నెల 27న జహీరాబాద్ నుంచి పాదయాత్రగా ఇవాళ ఎర్రవల్లికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇన్ని రోజులుగా నేను మౌనంగా ఉన్నా.. గంభీరంగా చూస్తున్నా. నేను కొడితే మామూలుగా ఉండదు. తెలంగాణ శక్తి ఏందో కాంగ్రెస్ వాళ్లకు చూపించి మెడలు వంచుతా. కాంగ్రెస్ ఏడాది పాలనలో తెలంగాణ ప్రజలు సంతోషంగా లేరు. కాంగ్రెస్ వాళ్లు దొరికితే ప్రజలు కొట్టేలా ఉన్నారు. తులం బంగారానికి ఆశపడి కాంగ్రెస్‌కు ఓటేశారు. 👉చదవండి : కేసీఆర్‌కు సీఎం రేవంత్ సవాల్నిన్న కాంగ్రెస్ వాళ్లు ఓటింగ్ పెడితే మనకే ఎక్కువ ఓటింగ్ వచ్చింది. నేను చెప్పినా వినలేదు. అత్యాసకు పోయి కాంగ్రెస్‌కు ఓటేశారు. మన విజయం తెలంగాణ విజయం కావాలి. భూముల ధరలు అమాంతం పడిపోయాయి. ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కండి. ఫిబ్రవరి నెలాఖరును భారీ బహిరంగ సభ పెడుతున్నాం. మీరందరూ తప్పకుండా రావాలి. ఓట్ల కోట్ల కోసం కాంగ్రెస్ ముస్లింలను వాడుకుంటుంది. సంగమేశ్వ, బసవేశ్వర టెండర్లను ఎందుకు పిలవలేదు. కాంగ్రెస్‌పై అంతటా అసంతృప్తే. అన్ని వర్గాలను కాంగ్రెస్ ముంచేసింది. పాలన వైఫల్యాలను ఎత్తి చూపితే కేసులు పెడుతున్నారు.రైతుబంధుకి రాంరాం, దళితబంధుకు జైభీం చెబుతారని ఆనాడే చెప్పా. అన్నీ మబ్బులు తొలగి పోయి అన్నీ బయటకు వస్తున్నాయి. మంచేదో చెడేదో ప్రజలకు తెలుస్తోంది. తులం బంగారానికి ఆశపడి కాంగ్రెస్‌కు ఓటేశారు. రాబోయే రోజుల్లో విజయం మనదే. మనం విజయం తెలంగాణ విజయం కావాలి. కైలాసం ఆడితే పాము మింగినట్లుగా ఉంది పరిస్థితి. మాట్లాడితే ఫామ్ హౌస్.. ఫామ్ హౌస్ అని బద్నం చేస్తున్నారు. ఫామ్ హౌస్‌లో పంటలే ఉంటాయి కదా’ అని వ్యాఖ్యానించారు. -
2028లో కేసీఆరే ముఖ్యమంత్రి
తెలంగాణ భవన్: మున్సిపల్ ఛైర్మన్, వైస్ చైర్మన్ ఆత్మీయ సత్కారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2028 ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. మళ్లీ ముఖ్యమంత్రి కేసీఆరే’అని అన్నారు. శుక్రవారం కేటీఆర్ పదవీకాలం ముగిసిన మున్సిపల్ ఛైర్మన్ , వైస్ చైర్మన్ ఆత్మీయ సత్కారం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. 2028లో ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుంది. కేసీఆరే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో దేశంలోని అన్నీ రాష్ట్రాల కంటే మన రాష్ట్ర మున్సిపాలిటీలను అభివృద్ది చేసుకున్నాం. బీఆర్ఎస్ హయంలో 6 లక్షలకు పైగా రేషన్ కార్డులు ఇచ్చాం. రూ. 700 కోట్లతో నల్లగొండను అభివృద్ది చేసుకున్నాం.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 420 రోజులు అవుతుంది, 400 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత నియోజకవర్గంలో మున్సిపల్ ఉద్యోగులకు 4 నెలలగా జీతాలు రావడం లేదు.సూర్యాపేట మున్సిపల్ ఛైర్మన్ జనరల్ స్థానంలో దళిత బిడ్డకు అవకాశం ఇచ్చాం. టకీ టకీమని డిల్లీలో పైసలు పడుతున్నాయి తప్పా..రైతుల అకౌంట్లలో మాత్రం పడడం లేదు. పదవి కాలం ముగిసిన మున్సిపల్ ఛైర్మన్ , వైస్ చైర్మన్లు ప్రజల్లోనే ఉంటే తిరిగి ప్రజలే గెలిపిస్తారు’ అని కేటీఆర్ దిశానిర్ధేశం చేశారు. -
రేవంత్.. నీళ్ల మీద నీచ రాజకీయాలు ఎందుకు?: కవిత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నీళ్ల మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం నీచ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. నీటి విషయాల్లో రాజకీయం చేయడం మానేసి నిజాలు చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. ఇదే సమయంలో రాజకీయాలకు అతీతంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని సూచనలు చేశారు. కేసులు వేసి ప్రాజెక్టులను అడ్డుకున్న నీచమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీదీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ‘నీళ్లు-నిజాలు’పై నేడు రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నీటి రంగ నిపుణులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ..‘నీళ్ల మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం నీచ రాజకీయం చేస్తోంది. నీటి విషయాల్లో రాజకీయం చేయడం మానేసి నిజాలు చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ బురద రాజకీయానికి గోదావరి వరదను కూడా తట్టుకొని మేడిగడ్డ బ్యారేజీ నిలబడింది. కేసీఆర్ పూర్తి చేసిన ప్రధాన ప్రాజెక్టుల్లో మిగిలి ఉన్న చిన్న చిన్న పనులను ప్రభుత్వం పూర్తి చేయాలి. రాజకీయాలకు అతీతంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలి.వైఎస్సార్ ప్రారంభించిన ఆరోగ్యశ్రీని కేసీఆర్ కొనసాగించారు. కాంగ్రెస్ ప్రారంభించిన ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ కొనసాగిస్తోంది. అదే తరహాలో కేసీఆర్ ప్రారంభించిన పనులను సీఎం రేవంత్ రెడ్డి కొనసాగించాలి. రేవంత్ రెడ్డి మిస్ గైడెడ్ మిస్సైల్లా పనిచేస్తున్నారు. కేసీఆర్ శత్రువు అని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు. ఆంధ్ర కేడర్‌లో పనిచేసిన ఆదిత్యా నాథ్ దాస్‌ను బాధ్యతల నుంచి తొలగించాలి. కృష్ణ ట్రిబ్యునల్‌లో రాష్ట్రం తరఫున బలంగా వాదనలు వినిపించాలి.కాలంతో పోటీ పడి ప్రపంచంలోనే అత్యద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ నిర్మించారు. కోటి 24 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రాజెక్టులను పూర్తి చేశాం. మిషన్ కాకతీయ ద్వారా నీటిని అందించడం జరిగింది. కేవలం చెరువులను బాగు చేసుకోవడం వల్ల 9.6 టీఎంసీల నీటిని ఒడిసి పట్టుకున్నాం. తెలంగాణ ఏర్పడే సమయానికి 68 లక్షల టన్నుల వరి పండితే.. 2022-23 నాటికి కోటి 68 లక్షల టన్నుల ధాన్యం పండింది. గోదావరి, కృష్ణా జలాలను వినియోగంలోకి తెచ్చుకోడానికి కేసీఆర్ కష్టపడ్డారు. కేసులు వేసి ప్రాజెక్టులను అడ్డుకున్న నీచమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీదీ. కేసీఆర్ నిర్మించిన ప్రాజెక్టులు పనికిరావని దుష్ప్రచారం చేస్తున్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా, ఇరిగేషన్ శాఖ మంత్రి సొంత జిల్లాలో పంటను ఎండగొట్టారు. బీఆర్ఎస్ హయాంలోనే సీతారామ ఎత్తిపోతల పథకం పనులు దాదాపు పూర్తయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఆర్భాటంగా ప్రారంభించినా ఆ ప్రాజెక్టు ద్వారా చుక్క నీరు కూడా ఇవ్వలేదు’ అంటూ మండిపడ్డారు. -
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిసిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
-
‘మండలి’ పోటీపై నేడోరేపో బీఆర్ఎస్ స్పష్టత
సాక్షి, హైదరాబాద్: శాసనమండలిలో మూడు స్థానాల ఎన్నికలకు సంబంధించి షెడ్యూలు వెలువడిన నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఆ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావుతో గురువారం భేటీ అయ్యారు. ఎర్రవల్లి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో మండలి ఎన్నికల్లో పోటీ, ఎస్సీ వర్గీకరణ, స్థానిక సంస్థల ఎన్నికలు తదితర అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. మాజీ మంత్రి హరీశ్‌రావు కూడా ఈ సమావేశంలో పాల్గొనాల్సి ఉన్నా.. జ్వరం కారణంగా హాజరు కాలేదని తెలిసింది. మెదక్– కరీంనగర్– నిజామాబాద్– ఆదిలాబాద్, వరంగల్– ఖమ్మం– నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలపై పార్టీ పరంగా ఎలాంటి వ్యూహం అనుసరించాలనే అంశంపై చర్చ జరిగినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఎవరికైనా అధికారికంగా మద్దతు ఇవ్వాలా? లేక తటస్థంగా ఉండాలా? అనే అంశంపై ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాపై స్పష్టత వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. పట్టభద్రుల కోటాలో ‘మెదక్– కరీంనగర్– నిజామాబాద్– ఆదిలాబాద్’స్థానం నుంచి పార్టీ తరఫున పోటీ చేసేందుకు పలువురు ఆసక్తి చూపుతున్న విషయం ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చింది. ఆశావహులు కూడా పార్టీ వైఖరిపై స్పష్టత ఇవ్వాలని ఒత్తిడి పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో ఒకటి రెండు రోజుల్లో కేటీఆర్ దీనిపై స్పష్టత ఇవ్వనున్నారు. ఎస్సీ వర్గీకరణ.. స్థానిక ఎన్నికలు ఎస్సీ వర్గీకరణను వెంటనే అమలుచేయాలన్న డిమాండ్‌తో ఫిబ్రవరి 7న ఎంఆర్పీఎస్ నిర్వహించనున్న బహిరంగ సభపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం. వర్గీకరణకు అనుకూలంగా అసెంబ్లీలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తీర్మానానికి అనుగుణంగా ముందుకు సాగాలని కేసీఆర్ సూచించినట్లు తెలిసింది.రెండు రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు నివాసంలో జరిగిన పార్టీ మాదిగ సామాజికవర్గం నేతల భేటీలో చర్చించిన అంశాలను కేసీఆర్‌కు కేటీఆర్ వివరించారు. ఉద్యోగాలతోపాటు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు చేయాలనే డిమాండ్‌ను ప్రభుత్వం ముందు పెట్టాలని నిర్ణయించారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం పార్టీ పరంగా సన్నద్ధతను వేగవంతం చేయాలని కేసీఆర్ సూచించారు. నేడు మున్సిపల్ మాజీ చైర్మన్ల ఆత్మీయ సమావేశం ఇటీవల పదవీకాలం ముగిసిన బీఆర్ఎస్ పార్టీకి చెందిన మున్సిపల్ మాజీ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు శుక్రవారం తెలంగాణ భవన్లో సమావేశం కానున్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఆత్మీయ భేటీకి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మాజీమంత్రి హరీశ్‌రావు ముఖ్య అతిథులుగా హాజరవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. -
కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్
-
మాజీ సీఎం KCR ఇంట్లో విషాదం
-
మన్మనితోని మొక్క నాటిచ్చిన కేసీఆర్
-
మరిన్ని పిచ్చి కేసులతో వేధిస్తారు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం పసలేని కేసులు నమోదు చేసి, పార్టీ నేతలను ఇబ్బందులకు గురి చేసినా ప్రజా సమస్యలను ఎత్తి చూపడంపైనే దృష్టి కేంద్రీకరించాలని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పార్టీ నేతలను ఆదేశించారు. ‘ఫార్ములా ఈ– రేస్’కేసులో ఏసీబీ విచారణకు హాజరైన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు శుక్రవారం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. గురువారం ఏసీబీ విచారణ అనంతరం నందినగర్ నివాసానికి వెళ్లిన కేటీఆర్, శుక్రవారం తన భార్యతో కలసి ఎర్రవల్లి నివాసానికి వెళ్లారు. మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, మరో నేత కార్తీక్‌రెడ్డి కూడా కేసీఆర్‌తో జరిగిన ఈ భేటీలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఏసీబీ విచారణలో అధికారులు అడిగిన ప్రశ్నలు, తాను ఇచ్చిన సమాధానాలు, సమర్పించిన పత్రాలు.. తదితర అంశాలను ఈ సమావేశంలో కేటీఆర్ వివరించారు. ఇదిలా ఉండగా, ‘రాబోయే రోజుల్లో ఇలాంటి మరిన్ని పిచ్చి కేసులతో పార్టీ నేతలను ప్రభుత్వం వేధిస్తుంది. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల ఆత్మస్థైర్యం దెబ్బతీయాలని రేవంత్ పిచ్చి ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదో ఒక గందరగోళం సృష్టించి స్థానిక సంస్థల గండం నుంచి బయట పడేందుకు ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా జనంతో ఉంటే వారే గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు’అని కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు సమాచారం.ఏడాదిలోనే కాంగ్రెస్ తేలిపోయింది‘అధికారంలోకి వచ్చిన ఏడాది లోపే కాంగ్రెస్ ప్రభుత్వం తేలిపోయింది. ఉన్న పథకాలు అమలు చేయలేక, కొత్త పథకాలు తెచ్చే తెలివిలేక ప్రభుత్వం చేతులెత్తేసింది’అని కేసీఆర్ అన్నట్లు తెలిసింది. ఎన్నికల హామీలేవీ అమలు చేసే పరిస్థితి లేదని ప్రజలకు అర్థమైందని, గతంలో మనం చేసిన మంచితో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న చెడును కూడా ప్రజలకు వివరించాల్సిన బాధ్యత బీఆర్ఎస్పై ఉందని ఆయన అన్నట్లు్ల సమాచారం. ‘స్థానిక సంస్థల ఎన్నికల్లో సరైన రీతిలో పనిచేస్తే ఫలితాలు మనకే అనుకూలంగా ఉంటాయి. పండుగ తర్వాత దృష్టి అంతా పార్టీ నిర్మాణం, బలోపేతంపైనే ఉంటుంది’అని కేసీఆర్ పేర్కొన్నారు. -
కేసీఆర్ .. మీకు ప్రతిపక్ష నేత హోదా ఎందుకు?
సాక్షి,హైదరాబాద్ : రైతు భరోసా చెల్లింపుల కోసం భూముల్ని తాకట్టుపెట్టి వేలకోట్లు అప్పుగా తెచ్చారు. మరి వచ్చే దఫా రైతు భరోసా సొమ్ము కోసం మీ దగ్గర తాకట్టు పెట్టడానికి ఇంకేం మిగిలిందని కాంగ్రెస్‌పై కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రశ్నలు సంధించారు.రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.‘ఇంకెన్నాళ్లీ డైవర్షన్ పోలిటిక్స్. ప్రజలను మోసం చేయడంలో కాంగ్రెస్ గురువు కేసీఆర్ (kcr).ఆయన బాటలోనే రేవంత్ (revanth reddy) ప్రభుత్వం నడుస్తోంది.ఒక్కో రైతుకు ఏడాది బకాయితో కలిసి ఎకరాకు రూ.18 వేల బకాయి చెల్లిస్తారా?.70 లక్షల మంది రైతులకు రూ.12 వేల 600 కోట్లు జనవరి 26న చెల్లిస్తారా? లేదా?.రైతు భరోసా (rythu bharosa) సొమ్ము చెల్లించేందుకు టీఎస్ఐఐసీ భూములను తాకట్టు పెట్టి రూ.10 వేల కోట్లు తెచ్చారు? మరి వచ్చే దఫా రైతు భరోసా సొమ్ము కోసం మీ దగ్గర తాకట్టు పెట్టడానికి ఇంకేం మిగిలింది?లోకల్ బాడీ ఎలక్షన్లలో ఓట్లేయించుకునేందుకే అప్పు తెచ్చి రైతు భరోసా చెల్లిస్తున్నారు. ఎన్నికల తర్వాత రైతు భరోసా ఆపేయడం ఖాయం.తెలంగాణ ప్రజాలారా..కాంగ్రెస్ మోసాలను తెలుసుకోండి.ఫాంహౌజ్‌లో పడుకునే కేసీఆర్..మీకు ప్రతిపక్ష నేత పదవి ఎందుకు?.ప్రజా సమస్యలపై స్పందించని మీరే ప్రతిపక్ష నేత? చేతనైతే ఆ పదవిని హరీష్, గంగుల, తలసాని, జగదీష్ రెడ్డిలలో ఎవరికైనా ఇచ్చే దమ్ముందా?.ఫీజు రీయంబర్స్ మెంట్, ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు, పేదలు అల్లాడుతున్నారు. రాష్ట్రంలో ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీకి అంతు లేకుండా పోయింది’అని బండి సంజయ్ ఆరోపించారు. 👉ఇదీ చదవండి : ‘రేవంత్‌ను వదిలిపెట్టం’ -
ప్రమాణ పత్రాలు అడగడం సిగ్గుమాలిన చర్య
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి రైతుబంధు పథకం అమలు చేయడం చేతకాకపోతే రైతుల కాళ్లు పట్టుకొని క్షమాపణ కోరాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు డిమాండ్ చేశారు. గతంలో వ్యవసాయ చట్టాలపై రైతుల ఆందోళనకు తలొగ్గి ఏడాది తర్వాత వెనక్కి తగ్గి ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పారని ఆయన గుర్తుచేశారు. గత బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ రైతులను రాజులుగా శాసించే స్థితికి తీసుకెళ్తే.. రేవంత్ ప్రభుత్వం మాత్రం వారిని యాచించే స్థాయికి దిగజారుస్తోందని ఆరోపించారు. కేసీఆర్ ఆనవాళ్లు చెరి పేయడమే లక్ష్యంగా రైతుబంధు పథకాన్ని బొందపెట్టే ప్రయత్నం చేస్తోందని ఆగ్ర హం వ్యక్తం చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్లో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఇతర నేతలతో కలిసి కేటీఆర్ విలేకరుల సమా వేశంలో మాట్లాడారు. ‘రైతు భరోసా కోరు కొనే రైతులు ప్రమాణ పత్రాలు ఇవ్వాలని చెప్పడం సిగ్గు మాలిన చర్య. ప్రభుత్వానికి దమ్ముంటే రైతు రుణమాఫీ, వరికి బోనస్, ధాన్యం కొనుగోలుకు డబ్బు చెల్లింపు, రైతు బంధు పథకంపై ఊరూరా ‘ఇమాన పత్రాలు’ ఇవ్వాలి. ఏడాది నుంచి గ్రామాలవారీగా ఎందరు కౌలు రైతులు, రైతు కూలీలకు లబ్ధి జరిగిందో జాబితాలు ప్రదర్శించాలి. రైతు బంధులో రూ. 22 వేల కోట్లు పక్కదారి పట్టినట్లు ఆరోప ణలు చేస్తున్న కాంగ్రెస్ నేతలు ఆ వివరాలు కూడా గ్రామాల వారీగా బయట పెట్టాలి’అని కేటీఆర్ డిమాండ్ చేశారు.దరఖాస్తులపై ప్రభుత్వాన్ని నిలదీయండి‘కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు తదితరాల కోసం అభయ హస్తం పేరిట 1.06 కోట్ల దరఖాస్తుల స్వీకరణ చేపట్టింది. ఇటీవల కులగణన పేరిట నిర్వహించిన ఇంటింటి సర్వేలోనూ రైతుల పూర్తి వివరాలు సేకరించింది. అలాంటప్పుడు రైతుల నుంచి మళ్లీ ప్రమాణ పత్రాలు కోరాలనే అలోచన దుర్మార్గం. గతంలో ఇచ్చిన దరఖాస్తులపై అధికారులను రైతులు నిలదీయాలి. పత్తి, కంది, చెరుకు, పసుపు, మిర్చితోపాటు ఇతర ఉద్యాన పంటలకు రైతుబంధు ఎగ్గొట్టే ఉద్దేశంతోనే ప్రభుత్వం ప్రమా ణ పత్రాలను తెరపైకి తెచ్చింది. క్రషర్లు, రియల్ ఎస్టేట్, వెంచర్లు, గుట్టలు, రాళ్లు రప్పలకు రైతుబంధు ఇచ్చారని ఆరోప ణలు చేస్తున్న కాంగ్రెస్ నేతలు ఊరూరా ఆ వివరాలు బయట పెట్టాలి. ఏడాది కాలంగా రైతుబంధు ఇవ్వకుండా ఎగవేసిన ప్రభుత్వం ఒక్కో రైతుకు ఎకరాకు రూ. 17 వేలు చొప్పున బకాయి పడింది. ఒక ఎకరా మొదలుకొని ఏడు ఎకరాల వరకు లెక్కతీసి రైతుబంధు రూపంలో రైతులకు రావాల్సిన బకాయిలపై గ్రామ గ్రామాన పోస్టర్లు వేస్తాం. రైతుభరోసాలో కోతలు విధిస్తే ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా రైతులతో కలిసి ఉద్యమిస్తాం’అని కేటీఆర్ హెచ్చరించారు. తమ హయాంలో రైతుల నుంచి ఎలాంటి దరఖాస్తులు తీసుకోకుండా, ఆఫీసుల చుట్టూ వారు తిరిగే అవసరం లేకుండా 11 సీజన్లలో రూ. 73 వేల కోట్లను రైతుల ఖాతాలో వేశామన్నారు. -
కొత్త ఏడాది శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: కొత్త ఏడాది 2025 వేళ ప్రజలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మాజీ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది ప్రతీ ఒక్కరి జీవితంలోనూ శుభ సంతోషాలు నింపాలని, మంచి జరగాలని కోరుకుంటున్నట్టు కోరుకుంటున్నట్టు నాయకులు తెలిపారు.సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా.. నవ వసంతంలో…విశ్వ వేదిక పై…విజయ గీతికగా…తెలంగాణ…స్థానం… ప్రస్థానం ఉండాలని…ప్రతి ఒక్కరి జీవితంలో…ఈ నూతన సంవత్సరం…శుభ సంతోషాలను నింపాలని…మనసారా కోరుకుంటూ…అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నవ వసంతంలో…విశ్వ వేదిక పై…విజయ గీతికగా…తెలంగాణ…స్థానం… ప్రస్థానం ఉండాలని…ప్రతి ఒక్కరి జీవితంలో…ఈ నూతన సంవత్సరం…శుభ సంతోషాలను నింపాలని…మనసారా కోరుకుంటూ…అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. #HappyNewYear2025 #HappyNewYear— Revanth Reddy (@revanth_anumula) January 1, 2025నూతన సంవత్సరం ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా కేసీఆర్..‘2025 సంవత్సరంలో ప్రజలందరికీ మంచి జరగాలని, సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు. కాల ప్రవాహంలో ఎదురొచ్చే మంచి చెడులను, కష్ట సుఖాలను సమానంగా స్వీకరించే స్థితప్రజ్ఞతను అలవర్చుకుంటూ ఆశావహ దృక్పథంతో తమ జీవితాలను చక్కదిద్దుకోవాలని అన్నారు. నూతన సంవత్సరంలో ప్రజల జీవితాల్లో గుణాత్మకమైన మార్పులు సాధించడం ద్వారానే పురోగతి సాధ్యమవుతుందని తెలిపారు. ఆ దిశగా ప్రభుత్వాలు కృషి చేయాలని కేసీఆర్ సూచించారు. -
KTR: కేసులకు భయపడేదే లేదు
సాక్షి, తెలంగాణ భవన్: ఫార్ములా ఈ-కారు రేసు కేసులో విచారణకు రావాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ఈ తరుణంలో కేసులకు భయపడేది లేదంటూ ఫార్ములా ఈ-కారు రేసింగ్ కేసుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (ktr) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.కేటీఆర్ సోమవారం మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ క్యాడర్లో విశ్వాసం, ఆత్మస్థైర్యం కనిపిస్తోంది. కేసులకు భయపడేది లేదు. ఏసీబీ కేసులో బలం లేదని రేవంత్‌కు కూడా తెలుసు. నేను మాట మార్చలేదు.. చెప్పినదానికే కట్టుబడి ఉన్నా.ఈ కార్ రేసుకు మంత్రి హోదాలో నేనే డబ్బులు కట్టమన్నా. ప్రొసీజర్ ప్రకారం జరగకపోతే .. ఈసీ,ఆర్బీఐ దగ్గరకు ప్రభుత్వం ఎందుకు పోలేదు?.డబ్బులు ముట్టిన వారిపై కేసులు ఎందుకు పెట్టలేదు?’అని ప్రశ్నించారు. ఎప్పుడు బయటకు రావాలో కేసీఆర్‌కు తెలుసుఎప్పుడు బయటకు రావాలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు తెలుసు. 24ఏళ్ళు కేసీఆర్ కష్టపడ్డారు. కాస్త రెస్ట్ తీసుకుంటున్నారు. తెలంగాణ బిడ్డ పీవీపై కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపుతుంది. ఢిల్లీలో పీవీకి మెమోరియల్ కట్టాలని అసెంబ్లీలో తీర్మానం ఎందుకు చేయరు? మరణంలో కూడా పీవీని కాంగ్రెస్ గౌరవించలేదు. పీవీకి గౌరవం దక్కేవరకు రాజ్యసభలో బీఆర్ఎస్ కొట్లాడుతుంది. రేవంత్‌కు బీజేపీ ఎంపీలు రక్షణ కవచంగా మారారు. అమృత్, సివిల్ సప్లై స్కాంలో కేంద్రం ఎందుకు విచారణ జరపదు. రాష్ట్ర ప్రభుత్వ కుంభకోణాలకు కేంద్రం సహకరిస్తుంది. 2025లో బీఆర్ఎస్ అధ్యక్షుడి ఎన్నిక, సంస్థాగత కమిటీ వేస్తాం. లోకల్ బాడీస్‌లో బీఆర్ఎస్ సత్తా చూపిస్తాం’అని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఫార్ములా ఈ-కారు రేస్ కేసులో కీలక పరిణామంతెలంగాణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫార్ములా ఈ-కారు రేస్ కేసుకు సంబంధించి కేటీఆర్‌కు తాజాగా ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో జనవరి ఏడో తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈడీ.. కేటీఆర్ సహా అరవింద్ కుమార్‌కు సైతం నోటీసులు ఇచ్చింది.వివరాల ప్రకారం.. ఫార్ములా ఈ-కారు రేసు కేసుకు సంబంధించి తాజాగా కేటీఆర్‌కు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ సందర్భంగా వచ్చే నెల ఏడో తేదీన విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. ఇదే సమయంలో సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిలకు కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. వీరిని జనవరి 2, 3 తేదీల్లో విచారణకు రావాలని నోటీసుల్లో తెలిపింది. ఇక, ఫార్ములా ఈ-కారు రేసు కేసును ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా పీఎంఎల్ఏ కింద ఈడీ విచారణ జరుపుతోంది. ఫెమా నిబంధనలను ఉల్లఘించినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. FEOకు 55 కోట్లు నగదు బదిలీ, ఆర్థికపరమైన అవకతవకలు జరిగినట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు.ఇదిలా ఉండగా.. ఫార్ములా ఈ-కారు రేస్ కేటీఆర్.. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై ఏసీబీ నమోదు చేసు చేసిన కేసులను కొట్టివేయాలని కోరుతూ ఈ నెల 21న కేటీఆర్.. హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఆ పిటిషన్‌పై ఇప్పటికే విచారణ చేపట్టిన ధర్మాసనం కేటీఆర్‌ను ఈనెల 30 వరకు ఆరెస్ట్ చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో విచారణను కొనసాగించవచ్చని హైకోర్టు పేర్కొంటూ కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీ, పురపాలక శాఖ కార్యదర్శి దానకిషోర్‌లకు నోటీసులు జారీ చేసింది. -
ఓటీటీకి కేసీఆర్ సినిమా.. ట్రైలర్ చూశారా?
కమెడియన్‌గా రాకింగ్ రాకేశ్(Rocking Rakesh) హీరోగా నటించి నిర్మించిన సినిమా కేసీఆర్ (KCR Movie). గతనెల 22న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కేసీఆర్ అలియాస్ 'కేశవ చంద్ర రమావత్' సినిమాకు గరుడవేగ అంజి దర్శకత్వం వహించారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యం, కొత్తగా ఏర్పడిన తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎన్నికైన పరిణామాలకు ఓ లంబాడీ యువకుడి జీవిత ప్రయాణాన్ని జోడించి ఈ మూవీని తెరకెక్కించారు. నటి సత్య కృష్ణన్ కూతురు అనన్య కృష్ణన్ (Ananya Krishnan) ఈ చిత్రంతో హీరోయిన్గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ చిత్రం ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈనెల 28 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే స్ట్రీమింగ్ తేదీని ప్రకటించిన మేకర్స్.. తాజాగా ఓటీటీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.అసలు కథేంటంటే..'కేసీఆర్' కథ విషయానికొస్తే.. తెలంగాణ ఉద్యమం నడుస్తున్న రోజుల్లో కేసీఆర్ ప్రసంగాలు విని అతడికి అభిమాని అవుతాడు కేశవ చంద్ర రమావత్ (రాకింగ్ రాకేష్). ఊరివాళ్లంతా కేశవ చంద్రరమావత్‌ను కేసీఆర్ అని పిలుస్తుంటారు. కేశవను అతడి మరదలు మంజు (అనన్య కృష్ణన్) ఇష్టపడుతుంది. బావనే పెళ్లిచేసుకోవాలని కలలు కంటుంది. మరదల్ని కాదని కేశవ చంద్ర రమావత్ బాగా డబ్బున్న అమ్మాయితో పెళ్లికి సిద్ధపడతాడు.తన పెళ్లి అభిమాన నాయకుడు కేసీఆర్ చేతుల మీదుగా జరగాలని కేశవ చంద్ర కలలు కంటాడు. కేసీఆర్‌ను కలవడం కోసం హైదరాబాద్ వస్తాడు. ఆ తర్వాత ఏమైంది? కేశవ చంద్ర రమావత్.. కేసీఆర్‌ను కలిశాడా? తమ ఊరికి ఎదురైన రింగ్ రోడ్ సమస్యని ఇతడు ఎలా పరిష్కరించాడు? మరదలి ప్రేమను అర్థం చేసుకున్నాడా అనేదే మూవీ స్టోరీ. -
ఓటీటీలోకి 'కేసీఆర్' సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
'జబర్దస్త్' షోతో కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న రాకింగ్ రాకేశ్ (Jabardasth Rakesh).. హీరోగా నటించిన నిర్మించిన సినిమా కేసీఆర్ (KCR Movie). గతనెల 22న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రానికి యావరేజ్ టాక్ వచ్చింది గానీ అదే టైంలో మరికొన్ని మూవీస్ రిలీజ్ కావడంతో ఇది పెద్దగా జనాలకు రీచ్ కాలేదు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. అధికారిక పోస్టర్ కూడా విడుదల చేశారు.కేసీఆర్ అలియాస్ 'కేశవ చంద్ర రమావత్' సినిమాకు గరుడవేగ అంజి దర్శకత్వం వహించారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యం, కొత్తగా ఏర్పడిన తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎన్నికైన పరిణామాలకు ఓ లంబాడీ యువకుడి జీవిత ప్రయాణాన్ని జోడించి ఈ మూవీని తెరకెక్కించారు. నటి సత్య కృష్ణన్ కూతురు అనన్య కృష్ణన్ (Ananya Krishnan).. ఈ చిత్రంతో హీరోయిన్గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.(ఇదీ చదవండి: మోహన్ లాల్ 'బరోజ్' సినిమా రివ్యూ)నవంబర్ 22న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. డిసెంబర్ 28 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. 'కేసీఆర్' విషయానికొస్తే.. తెలంగాణ ఉద్యమం నడుస్తున్న రోజుల్లో కేసీఆర్ ప్రసంగాలు విని అతడికి అభిమాని అవుతాడు కేశవ చంద్ర రమావత్ (రాకింగ్ రాకేష్). ఊరివాళ్లంతా కేశవ చంద్రరమావత్‌ను కేసీఆర్ అని పిలుస్తుంటారు. కేశవను అతడి మరదలు మంజు (అనన్య కృష్ణన్) ఇష్టపడుతుంది. బావనే పెళ్లిచేసుకోవాలని కలలు కంటుంది. మరదల్ని కాదని కేశవ చంద్ర రమావత్ బాగా డబ్బున్న అమ్మాయితో పెళ్లికి సిద్ధపడతాడు.తన పెళ్లి అభిమాన నాయకుడు కేసీఆర్ చేతుల మీదుగా జరగాలని కేశవ చంద్ర కలలు కంటాడు. కేసీఆర్‌ను కలవడం కోసం హైదరాబాద్ వస్తాడు. ఆ తర్వాత ఏమైంది? కేశవ చంద్ర రమావత్.. కేసీఆర్‌ను కలిశాడా? తమ ఊరికి ఎదురైన రింగ్ రోడ్ సమస్యని ఇతడు ఎలా పరిష్కరించాడు? మరదలి ప్రేమను అర్థం చేసుకున్నాడా అనేదే మూవీ స్టోరీ.(ఇదీ చదవండి: ఎదురుపడ్డ మాజీ ప్రేమికులు నిఖిల్-కావ్య.. అక్కడే ఉన్నా గానీ!) -
కేసీఆర్, హరీశ్‌రావులకు హైకోర్టులో ఊరట
సాక్షి,హైదరాబాద్:బీఆర్ఎస్ అధినేత,మాజీ సీఎం కేసీఆర్(kcr), మాజీ మంత్రి హరీశ్‌రావు(HarishRao)కు తెలంగాణ హైకోర్టులో మంగళవారం(డిసెంబర్24) ఊరట లభించింది. మేడిగడ్డ ప్రాజెక్టు పై భూపాలపల్లి కోర్టు ఇచ్చిన నోటీసులను తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేసింది. ఈ అంశంలో తదుపరి విచారణను జనవరి ఏడో తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. కాగా, మేడిగడ్డ(Medigadda) బ్యారేజీలో పగుళ్లకు కేసీఆర్,హరీశ్‌రావే కారణమని భూపాలపల్లి కోర్టు(Bhupalapalli Court)లో స్థానిక న్యాయవాది ఒకరు గతంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన భూపాలపల్లి సివిల్ కోర్టు కేసీఆర్,హరీశ్‌రావులు విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులను క్వాష్ చేయాల్సిందిగా కేసీఆర్,హరీశ్‌రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు భూపాలపల్లి కోర్టు నోటీసులపై కేసీఆర్,హరీశ్‌రావులకు ఊరటనిచ్చింది. ఈ కేసులో ఫిర్యాదుదారునికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. -
తెలంగాణ హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావు క్వాష్ పిటిషన్లు
సాక్షి,హైదరాబాద్ : మాజీ సీఎం కేసీఆర్,మాజీ మంత్రి హరీష్ రావులు తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. మేడిగడ్డ నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ భూపాలపల్లి కోర్టు పంపిన నోటీసుల్ని కొట్టివేయాలని కోరారు.మేడిగడ్డ నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ గతంలో భూపాలపల్లి కోర్టులో ప్రైవేట్ పిటిషన్ దాఖలైంది. విచారణ చేపట్టిన కోర్టు ఈ ఏడాది జులై 10న కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసులు పంపింది. అయితే, ఈ నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టులో కేసీఆర్, హరీష్‌రావు తాజాగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై మంగళవారం హైకోర్టు విచారణ చేపట్టనుంది. -
వాగ్వాదాలు.. వాకౌట్లు
సాక్షి, హైదరాబాద్: వారం పాటు సాగిన అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఆరోపణలు– ప్రత్యారోపణలు, సవాళ్లు–ప్రతి సవాళ్లు, వాగ్వాదాలు, నిరసనలు, ఉద్రిక్తతల మధ్య శనివారం ముగిశాయి. ఈ సమావేశాల్లో ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ విచారణ, ధరణి అక్రమాలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అప్పులపై తీవ్రస్థాయిలో చర్చ జరగ్గా.. ప్రధానమైన భూ భారతితోపాటు మొత్తం 8 బిల్లులు ఆమోదం పొందాయి.ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సభ ప్రారంభమైన తొలి రోజు నుంచి అడుగడుగునా అధికారపక్షాన్ని ఇరుకున పెట్టేందుకు యతి్నంచింది. అధికార పక్షం కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ పదేళ్ల పాలన రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిందని, వాటిని సరిచేయడానికే సరిపోతోందని చెప్పింది. ప్రశ్నోత్తరాలు, బిల్లులు, వాయిదా తీర్మానాలు, స్వల్పకాలిక చర్చ కోసం ప్రతిపాదించిన అంశాలపై పలు సందర్భాల్లో అధికార, విపక్ష సభ్యులు పరస్పరం దుమ్మెత్తిపోసుకున్నారు. సమావేశాల చివరి రోజు శనివారం రైతుభరోసాపై జరిగిన స్వల్పకాలిక చర్చలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జోక్యం చేసుకుని బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష నేత, మాజీ సీఎం కేసీఆర్, ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్‌రావు లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధించారు. కేటీఆర్ కూడా రైతు రుణమాఫీ అంశంలో రేవంత్ ప్రభుత్వం అబద్ధాలు చెప్తోందంటూ మాటల దాడికి దిగారు. రాష్ట్రంలోని ఏ ఒక్క గ్రామంలోనైనా రుణమాఫీ సంపూర్ణంగా జరిగిందని రుజువు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాలు చేశారు.మిషన్ భగీరథ, నల్లగొండ జిల్లాకు సాగునీరు అంశాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, హరీశ్‌రావు నడుమ కూడా సవాళ్ల పర్వం నడిచింది. ఇన్నాళ్లూ తమ మిత్రపక్షంగా చెప్పుకున్న ఎంఐఎం విమర్శలు చేయడం బీఆర్ఎస్ను ఇరుకున పెట్టింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ లక్ష్యంగా బీజేపీ విమర్శలు చేయగా, కాంగ్రెస్ మిత్రపక్షం సీపీఐ ప్రభుత్వ అప్పులపై జరిగిన చర్చలో అధికార పక్షం వాదనను పూర్తిగా సమరి్థంచింది. మరిన్ని అప్పులు చేసి ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టాలని సూచించింది. రోజుకో రచ్చ.. కొత్త రూపంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు, అదానీతో రేవంత్ ఫొటోలు, ఆటో డ్రైవర్ల సమస్యలు, లగచర్ల రైతులకు బేడీలు, ప్రభుత్వ అప్పులు, గురుకుల విద్యాసంస్థల్లో మౌలిక వసతులు, భూ భారతి బిల్లు, ఫార్ములా ఈ, రైతు భరోసా, సభా ఉల్లంఘన నోటీసులు, ప్రతిపక్ష నేత కేసీఆర్ సమావేశాలకు గైర్హాజరు వంటి అంశాలు కేంద్రంగా అసెంబ్లీ సమావేశాలు సాగాయి. ఈ నెల 9న ప్రారంభమైన అసెంబ్లీ కేవలం ఒక రోజు మాత్రమే సమావేశమై తిరిగి 16వ తేదీకి వాయిదా పడింది. 16న స్పీకర్ అధ్యక్షతన జరిగిన బీఏసీ భేటీలో సభ నిర్వహణ తేదీలు, ఎజెండాపై స్పష్టత ఇవ్వకపోవడంతో సమావేశం నుంచి బీఆర్ఎస్, ఎంఐఎం వాకౌట్ చేశాయి. రాష్ట్ర పర్యాటక విధానం, గురుకుల విద్యా సంస్థల్లో మౌలిక వసతులు, ప్రభుత్వ అప్పులు, రైతు భరోసా అంశాలపై స్వల్పకాలిక చర్చ జరిగింది. మండలిలో రైతు భరోసాపై స్వల్పకాలిక చర్చ చేపట్టకుండానే సమావేశాలు ముగిసినట్లు ప్రకటించారు. ప్రస్తుత సమావేశాల్లో సీఎం రేవంత్‌రెడ్డి శాసనమండలి భేటీకి హాజరు కాలేదు. ఆమోదం పొందిన 8 బిల్లులు యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీలు (సవరణ), జీఎస్టీ (సవరణ), వేతనాలు, పెన్షన్ల చెల్లింపులు, అనర్హతల తొలగింపు (సవరణ), భూ భారతి (ఆర్వోఆర్), మున్సిపాలిటీ (సవరణ), జీహెచ్ఎంసీ (సవరణ), పంచాయతీరాజ్ (సవరణ) బిల్లులు. -
ఓల్డ్ సిటీ అభివృద్ధిపై అక్బరుద్దీన్ తో మాట్లాడా: CM Reventh
-
మీరు కోరినట్లు చేస్తే మేం ప్రతిపక్షంలో ఉంటాం: సీఎం రేవంత్
హైదరాబాద్, సాక్షి: ప్రతిపక్ష నేత కేసీఆర్ వచ్చి రైతు భరోసా మీద సలహాలు ఇస్తారని అనుకున్నానని, సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే రావట్లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో భూభారతి, రైతు భరోసాలపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు.బీఆర్ఎస్ హయాంలో క్రషర్ యూనిట్లకు, మైనింగ్ భూములకు రైతు బంధు ఇచ్చారు. లేఅవుట్లు వేసి.. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన వాళ్లకు కూడా రైతు బంధు ఇచ్చారు. రోడ్డు విస్తరణలో పోయిన భూమికి కూడా రైతు బంధు ఇచ్చారు.మేము ఇచ్చినట్లు గానే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలని కేటీఆర్ అంటున్నారు. మీరు ఇచ్చినట్లు ఇస్తే..మేము ప్రతిపక్షం లో ఉంటాం. ఆ తర్వాత బయటకు వెల్లాల్సి వస్తుంది. కేసీఆర్ చేసిన ఘనకార్యానికి ఇప్పుడు ఆయన సభకు రాలేకపోతున్నారు..గుట్టలు, రోడ్డు, రియలెస్టేట్ వెంచర్లకు రైతు భరోసా ఇవ్వాలా? వద్దా? బీఆర్ఎస్ సమాధానం చెప్పాలి. మా ప్రభుత్వం సూచనలను తీసుకోవడానికి సిద్ధం గా ఉంది. బీఆర్ఎస్ సభలో ఎంత చిల్లరగా వ్యవహరించినా ఓపికతో ఉన్నాం’ అని రేవంత్ అన్నారు.అబద్ధాల సంఘానికి అధ్యక్షుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రవర్తన, చిత్ర విచిత్ర వేషాలు ప్రజలు గమనిస్తున్నారు. అబద్ధాల సంఘానికి అధ్యక్షుడు సభకు రాలేదు. ఉపాధ్యక్షుడు వచ్చారు.మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి రైతుభరోసాపై సలహాలు ఇస్తారనుకున్నాం. కానీ అలా జరగడం లేదు.గత పదేళ్ల పాలనపై సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే సభకు రావడం లేదేమోఒకసారి అధికారం.. మరోసారి డిపాజిట్లు కోల్పోయిన బీఆర్ఎస్ నేతల తీరు మారడం లేదు. మీరు లక్ష రూపాయల రుణమాఫీ చేయడానికి ఆపసోపాలు పడ్డారు. కానీ మేం మీలా కాదు. దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రుణమాఫీ చేశామని అన్నారు. -
మేడిగడ్డ నిర్ణయం కేసీఆర్‌దే!
సాక్షి, హైదరాబాద్: తుమ్మిడిహెట్టికి బదులు మేడిగడ్డ బరాజ్ నిర్మించాలన్న ఆలోచన నాటి సీఎం కేసీఆర్‌దేనని కేంద్ర జలశక్తి శాఖ సలహాదారుడు వెదిరె శ్రీరామ్ స్పష్టం చేశారు. తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) లేఖ ఇవ్వడం, మహారాష్ట్రతో ముంపుపై వివా దం ఏర్పడడంతోనే మేడిగడ్డకు మార్చామని కేసీఆర్ ప్రభుత్వం చేసిన వాదన పూర్తిగా అబద్ధమని కొట్టిపారేశారు.తుమ్మిడిహెట్టి వద్ద 165 టీఎంసీల నీటిలభ్యత ఉందని సీడబ్ల్యూసీ ఎన్నో లేఖలు రాసిందని, సంప్రదింపులతో మహారాష్ట్రతో ముంపు సమస్యను పరిష్కారానికి అవకాశం ఉండేదన్నారు. రాజకీయ, ‘ఇతర’కారణాలతోనే మేడిగడ్డ బరాజ్ నిర్మించారని ఆరోపించారు. కాళేశ్వరం బరాజ్‌ల నిర్మాణంపై విచారణలో భాగంగా జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ శుక్రవారం నిర్వహించిన క్రాస్ ఎగ్జామినేషన్‌కు వెదిరె శ్రీరామ్ హాజరై సమాధానాలిచ్చారు. వ్యక్తిగత హోదాలోనే సాక్ష్యం... వ్యక్తిగత హోదాలోనే కమిషన్ ముందు సాక్షిగా హాజరైనట్టు వెదిరే శ్రీరామ్ స్పష్టత ఇచ్చారు. కాళేశ్వ రం ప్రాజెక్టుకు అనుమతుల కోరుతూ సీడబ్ల్యూసీకి నీటిపారుదల శాఖలోని సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్(సీడీఓ) సీఈ రాసిన లేఖను సాక్ష్యంగా ఆయన గతంలో కమిషన్‌కు సమరి్పంచగా, ఆ లేఖలో వ్యత్యాసాలున్నట్టు కమిషన్ ఎత్తిచూపింది. ఈ లేఖను తాను సీడబ్ల్యూసీ నుంచే స్వీకరించానని, సీడీఓ సీఈ లేఖను మార్చి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. అధికారికంగా తీసుకోనందున వాటిని సాక్ష్యంగా పరిగణించబోమని కమిషన్ తేల్చి చెప్పింది. అన్నారం, సుందిళ్ల కుంగిపోవచ్చు.. మేడిగడ్డ బరాజ్ తరహాలో అన్నారం, సుందిళ్ల బరాజ్‌లూ కుంగిపోవచ్చని వెదిరె శ్రీరామ్ అన్నారు. బరాజ్‌ల వైఫల్యానికి కారణాలేమిటని కమిషన్ ప్రశ్నించగా, సరైన ఇన్వెస్టిగేషన్లు జరపకుండానే డిజైన్ల రూపకల్పన, డిజైన్లు, మాడల్ స్టడీస్‌కు విరుద్ధంగా నిర్మాణం, నిర్వహణ జరగడమేనన్నారు. ప్లాన్ తయారీకి ముందే పనులు ప్రారంభించారా అని కమిషన్ అడగ్గా, అవునని బదులిచ్చారు. 2016 ఏప్రిల్/మేలో బరాజ్‌లు నిర్మించాలని నిర్ణయించి 2019లోగా పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం అత్యాశే అన్నారు.డీపీఆర్ తయారీకి ఏడాది అవసరం కాగా, 4 నెలల్లోనే పూర్తి చేయాలని వ్యాప్కోస్ను కోరారన్నారు. డీపీఆర్‌కు ఆమోదం లభించకముందే టెండర్లు పిలిచి పనులు అప్పగించారని, నాటికి ఇంకా డిజైన్లు సైతం సిద్ధం కాలేదన్నారు. అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల స్థలాలను మార్చడంతో అప్పటికే నిర్వహించిన ఇన్వెస్టిగేషన్లు వృథా అయ్యాయని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ ఆమోదించిందా అని కమిషన్ అడగగా, లేదని బదులిచ్చారు. తొందరపాటుతో క్షేత్రస్థాయిలోని ఈఈ నుంచి ఈఎన్సీ వరకు అందరూ తప్పిదాలు చేశారన్నారు. నిర్వహణ విభాగం ఈఎన్సీ జాప్యం చేశారు బరాజ్‌లలో సీపేజీతో నీరు లీకైనప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ) సలహా కోరడంలో నిర్వహణ విభాగం ఈఎన్సీ(నాగేంద్రరావు) జాప్యం చేయడంతో నష్టం తీవ్రత పెరిగిందా అని కమిషన్ ప్రశ్నించగా, అవునని వెదిరె బదులిచ్చారు. బరాజ్ కుంగే వరకు ఎన్డీఎస్ఏకు సమాచారం లేదని, కుంగిన 5 రోజులకు ఎన్డీఎస్ఏ బృందం పరిశీలనకు వచ్చిందన్నారు. ఎన్డీఎస్ఏ 20 రకాల సమాచారం కోరితే సకాలంలో ఆ ఈఎన్సీ ఇవ్వలేదని, దీంతో బరాజ్‌ల వైఫల్యానికి కారణాలను గుర్తించడం ఎన్డీఎస్ఏకి క్లిష్టంగా మారిందన్నారు. మళ్లీ గడువు పొడిగించలేం ..కోదండరామ్‌కు కమిషన్ స్పష్టీకరణ మీరు సమరి్పంచిన పత్రాలకు ఆధారాలు ఏమిటని టీజేఎస్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ కోదండరామ్‌ను కమిషన్ ప్రశ్నించగా, మరిన్ని ఆధారాలు సమర్పించేందుకు రెండు రోజుల సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ఓసారి గడువు పొడిగించి మీకు అవకాశం ఇచ్చామని, మళ్లీ పొడిగించడం సాధ్యం కాదని కమిషన్ స్పష్టం చేసింది. అఫిడవిట్‌పై చేసిన సంతకం మీదేనా? అని కమిషన్ ప్రశ్నించగా, అవునని కోదండరామ్ ధ్రువీకరించారు. గతంలో నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేసిన వికాస్‌రాజ్ కమిషన్ ముందు హాజరై కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో తన పాత్ర ఏమిలేదని తెలపడంతో ఆయనకు కమిషన్ ఎలాంటి ప్రశ్నలు వేయలేదు. -
మన రాష్ట్ర అగ్రిమెంట్ పలు దేశాలకు మారింది
-
ధరణి పోర్టల్ లో అసలైన మోసం..
-
ఇందిరాగాంధీ హయాంలో అసైన్డ్ ల్యాండ్ పంపణీ జరిగింది: CM Revanth
-
మాజీ CS సోమేశ్ కుమార్ పై కాళేశ్వరం కమిషన్ సీరియస్
-
కాళేశ్వరం నిర్ణయం కేసీఆర్, హరీశ్రావులదే!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల నిర్మాణం విషయంలో విధానపరమైన నిర్ణయం తీసుకున్నది నాటి సీఎం కేసీఆర్, నాటి నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావులేనని మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి చెప్పారు. నాటి సీఎం కేసీఆర్ అధ్యక్షతన వ్యాప్కోస్, సీఈ–సీడీఓ, ఇంజనీర్లతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. 2016 మే 2న మేడిగడ్డ వద్ద భూమిపూజ చేసి బరాజ్‌ల నిర్మాణాన్ని కేసీఆర్ ప్రారంభించారని వివరించారు. అదే రోజు ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పేరును కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చినట్టు వెల్లడించారు. కాళేశ్వరం బరాజ్‌ల నిర్మాణంపై విచారణలో భాగంగా జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ బుధవారం నిర్వహించిన క్రాస్ ఎగ్జామినేషన్‌లో ఆయన పాల్గొన్నారు.సీఎం నిర్ణయాన్ని సాధారణంగా వ్యతిరేకించరు బరాజ్‌ల నిర్మాణంపై విధానపర నిర్ణయం ఎవరిది? అని కమిషన్ ప్రశ్నించగా, నాటి సీఎం నేతృత్వంలో మంత్రివర్గం, ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. అని తొలుత బదులిచ్చారు. నిర్ణయం మంత్రివర్గందా? సీఎందా? ప్రభుత్వం అంటే ఎవరు? అని కమిషన్ గుచి్చగుచ్చి ప్రశ్నించగా, నిర్ణయం సీఎందేనని, మంత్రివర్గం బలపరిచిందని తెలిపారు. మంత్రివర్గ భేటీలో ఎవరైనా మంత్రి అసమ్మతి వ్యక్తం చేయలేదా? అని ప్రశ్నించగా, అలాంటి విషయం తన దృష్టికి రాలేదన్నారు. సీఎం నిర్ణయంపై అసమ్మతి తెలిపితే మరుసటి రోజే మంత్రి పదవి కోల్పోవాల్సి వస్తుందనే భావనతో ఎవరూ అలా చేయరన్నారు. ‘మహా’ అభ్యంతరాలు, నీటి లభ్యత లేదనడంతోనే.. తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్‌కి మహారాష్ట్ర అభ్యంతరాలు, వణ్యప్రాణి సంరక్షణ కేంద్రం ప్రతిబంధకాలుగా మారడం, తగిన నీటి లభ్యత లేదని కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) లేఖ రాయడంతో బరాజ్‌ను మేడిగడ్డకు మార్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఎస్కే జోషి వివరణ ఇచ్చారు. మేడిగడ్డ బరాజ్ వైఫల్యానికి కచి్చతమైన కారణాలు చెప్పలేనని, డిజైన్లకు అనుగుణంగా నిర్మాణం జరగకపోవడం, నాణ్యతా లోపాలు, నిర్వహణ/పర్యవేక్షణ లోపాలు వంటి అనేక కారణాలు ఉండవచ్చని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి కేవలం ఒకే ఒక పరిపాలనపర అనుమతి జారీ చేయలేదని, సుమారు 200కి పైగా అనుమతులు జారీ చేశారని తెలిపారు. సబ్ కాంట్రాక్టర్లపై సమాచారం లేదు మేడిగడ్డ బరాజ్ నిర్మాణ సంస్థ ఇతర సంస్థలకు (సబ్ కాంట్రాక్టర్లకు) ఏమైనా పనులు అప్పగించిందా? వేరే సంస్థలు నిర్మించడంతోనే 7వ బ్లాక్ కుంగిందా? అని కమిషన్ ప్రశ్నించగా, దీనిపై తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని జోషి, క్రాస్ ఎగ్జామినేషన్‌కు హాజరైన నీటిపారుదల శాఖ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌లు వేర్వేరుగా బదులిచ్చారు. అప్పట్లో బరాజ్‌లలో లోపాలు కనబడలేదు: రజత్‌కుమార్ పునాదుల కింద ఇసుక కొట్టుకుపోవడంతోనే మేడిగడ్డ బరాజ్‌లోని 7వ బ్లాక్ కుంగిందని రజత్‌కుమార్ చెప్పారు. నీటి ప్రవాహాన్ని నియంత్రించడానికే మేడిగడ్డ వంటి బరాజ్‌లను నిర్మిస్తారని, నిల్వల కోసం నాగార్జునసాగర్ వంటి జలాశయాలు నిర్మిస్తారని చెప్పారు. ఓ స్థాయి వరకే బరాజ్‌లలో నిల్వలను కొనసాగించి, మిగిలిన ప్రవాహాన్ని విడుదల చేయాల్సిన బాధ్యత ప్రాజెక్టు సీఈదేనని అన్నారు. ప్రభుత్వం రుణాలు తీసుకోక తప్పదు డిఫెక్ట్ లయబిలిటీ కాలంలోనే బరాజ్‌లు దెబ్బతిన్నా మరమ్మతులు చేయకుండా నిర్మాణ సంస్థలకు డిపాజిట్లను ఎలా చెల్లిస్తారు? అని కమిషన్ ప్రశ్నించగా, 2020 ఫిబ్రవరిలో తాను శాఖ బాధ్యతలు చేపట్టే నాటికి పనులు పూర్తయ్యాయని రజత్‌కుమార్ వివరణ ఇచ్చారు. అప్పట్లో బరాజ్‌లలో ఎలాంటి లోపాలు కనబడలేదన్నారు. కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టులను పూర్తిగా ప్రభుత్వ నిధులతో నిర్మించడం సాధ్యం కాదని, రుణాలు తీసుకోక తప్పదని పేర్కొన్నారు. నిపుణుల కమిటీ చైర్మన్ సీబీ కామేశ్వర్ రావు కూడా కమిషన్ ముందు హాజరయ్యారు. బరాజ్‌ల వైఫల్యాలపై తన నివేదికలో పేర్కొన్న అంశాలన్ని వాస్తవాలేనంటూ వాంగ్మూలం ఇచ్చారు. కాగా గురువారం మాజీ సీఎస్ సోమేశ్‌కుమార్, మాజీ సీఎం కేసీఆర్ కార్యదర్శిగా వ్యవహరించిన స్మితా సబర్వాల్ క్రాస్ ఎగ్జామినేషన్ జరగనుంది. -
ఆ విషయం తెలిసే కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదు: మంత్రి కోమటిరెడ్డి
సాక్షి,హైదరాబాద్:బీఆర్ఎస్పై మరోసారి ఫైరయ్యారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. ఆ పార్టీ ఎమ్మెల్యేలను కేసీఆర్ హౌలా గాళ్లను చేస్తుండని సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం(డిసెంబర్16)కోమటిరెడ్డి అసెంబ్లీలో మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు.‘గతంలో కాంగ్రెస్ పార్టీకి ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా భట్టి విక్రమార్క రోజు సభకు వచ్చారు.ఇప్పుడు 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ ఎందుకు సభకు రావడం లేదు?ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి కంటే ఎక్కువ విలువ ప్రతిపక్ష నాయకుడికి ఉంటుంది.భవిష్యత్తులో బీఆర్ఎస్ ఖతం అవుతుంది అని కేసిఆర్ ముందే తెలుసుకొని సభకు రావడం లేదు. బీఆర్ఎస్ సభలో ఎంత అరిచి గీ పెట్టినా ఉపయోగం ఉండదు’అని కోమటిరెడ్డి స్పష్టం చేశారు.కాగా, సోమవారం అసెంబ్లీలో లగచర్ల రైతులకు బేడీలు వేసిన అంశంపై చర్చించాలని బీఆర్ఎస్ పట్టుబట్టిన విషయం తెలిసిందే. దీనికి ఒప్పుకోని ప్రభుత్వం టూరిజం పాలసీని చర్చకు పెట్టింది. దీంతో సభలో తీవ్ర గందరగోళం రేగి సభ మంగళవారానికి వాయిదా పడింది. -
పార్టీ మారిన నేతలు.. అసెంబ్లీలో ఏ ముఖంతో మాట్లాడతారు: కవిత
సాక్షి, జగిత్యాల: జగిత్యాల అంటే బీఆర్ఎస్ అడ్డా అని చెప్పుకొచ్చారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఎన్నికల్లో కేసీఆర్ బొమ్మ పెట్టుకుని గెలిచిన ఎమ్మెల్యే సంజయ్ ఏ ముఖం పెట్టుకుని మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లిని, బతుకమ్మను దూరం చేసిందని ఘాటు విమర్శలు చేశారు.ఎమ్మెల్సీ కవిత ఆదివారం జగిత్యాలలో పర్యటించనున్నారు. నియోజకవర్గంలో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. జగిత్యాల అంటే బీఆర్ఎస్ అడ్డా. మీరు గెలిపించిన నాయకుడు పార్టీకి ద్రోహం చేసిన వెళ్లిపోయాడు. ఎన్నికల్లో కేసీఆర్ బొమ్మ పెట్టుకొని గెలిచిన ఎమ్మెల్యే సంజయ్ అసెంబ్లీకి వెళ్ళి ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతాడో చూద్దాం. జగిత్యాలకి ఒక్క రూపాయి రాలేదు, జగిత్యాలలో అభివృద్ధి ఏమీ జరగలేదు.పైసల కోసం సంజయ్ పార్టీ మారాడు. పైసలా కోసం పార్టీ మారిన వ్యక్తులు నాయకులే కాదు. మిమ్మల్ని చూస్తే అర్థం అవుతుంది మీలో ఒకరు ఎమ్మెల్యే అవుతారు. కేసీఆర్‌కు సైనికులుగా మీరంతా ఉన్నారు. మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే. కాంగ్రెస్ ప్రభుత్వం మనకు తెలంగాణ తల్లిని, బతుకమ్మను దూరం చేసింది. అధికారం కోసం కాంగ్రెస్ నేతలు ఎన్నో హామీలు ఇచ్చారు. కానీ, ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు అంటూ ాటు వ్యాఖ్యలు చేశారు. -
మిలిటెంట్ తరహాలో ముందుకు..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ఏడాది పాలన పూర్తయిన నేపథ్యంలో ఇకపై దూకుడుగా పోరాటాలు చేపట్టా లని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నిర్ణయించింది. కొత్త ప్రభుత్వం కుదురుకుని పనిచేసేందుకు సరిపడా సమయం ఇచ్చా మని భావిస్తోంది. ఇక ముందు పూర్తిస్థాయిలో ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని.. ఒకవైపు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే, మరోవైపు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు చేసిన మంచిని వివరించాలని నిర్ణయించింది.కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ఎన్నికల హామీలు అమలు చేయకపోవడంపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని.. బీఆర్ఎస్ దీనిని అనుకూలంగా మలుచుకోవాలని నేతలు, కార్యకర్తలకు పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. రాబోయే రోజుల్లో పార్టీ కేడర్‌ను, ప్రజలను భాగస్వాములను చేస్తూ రేవంత్ ప్రభుత్వం తీరుపై ‘మిలిటెంట్ తరహా దూకుడు పోరాటాలు చేయాల’ని ఇటీవల జరిగిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భేటీలో సూచించినట్టు తెలిసింది. పార్టీ విధానాలపై ఫోకస్.. కాంగ్రెస్ విధానాలను నిరంతరం విమర్శించడం వల్ల అధికారం కోల్పోయానే బాధతో విమర్శలు చేస్తున్నట్టుగా ప్రజలు భావించే అవకాశం ఉందని కేసీఆర్ అభిప్రాయపడినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే దూరదృష్టితో పదేళ్ల పాలనలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, వాటి అమలు వెనుక ఉన్న తాతి్వకతను కూడా ప్రజలకు విడమరిచి చెప్పాలని సూచించినట్టు సమా చారం. ‘‘హైదరాబాద్‌లో భారీ బహుళ అంతస్తుల భవనాల నిర్మాణానికి అనుమతులివ్వడం ఇక్కడి ఆర్థిక పటిష్టతను ప్రజలకు చాటి చెప్పాం. ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో ఉన్న అవకాశాలను దృష్టిలో పెట్టుకుని భారీ ఫార్మాసిటీ ఏర్పాటుకు భూసేకరణ చేశాం. గత ప్రభుత్వం తీసుకున్న ప్రతీ నిర్ణయం వెనుక అనేక శాస్త్రీయ కోణాలు ఉన్నాయి. వాటిని సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో అసెంబ్లీలో, బయటా పార్టీ నేతలు విడమరిచి చెప్పాలి..’’అని పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో కేసీఆర్ పేర్కొన్నట్టు తెలిసింది.ప్రభుత్వ తప్పులను ఎండగట్టడం, పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం కేవలం ప్రెస్మీట్లు, పత్రికా ప్రకటనలకు పరిమితం కాకుండా... సోషల్ మీడియాను విస్తృతంగా వాడుకోవాలని సూచించినట్టు తెలిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తు న్న ప్రజా వ్యతిరేకత బీజేపీకి అనుకూలంగా ఏమీ మారడం లేదని, దీనిని బీఆర్ఎస్ అందిపుచ్చుకోవాలని పేర్కొన్నట్టు సమాచారం. అసెంబ్లీ వేదికగా ఒత్తిడి పెంచి..: అసెంబ్లీ శీతాకాల సమావేశాలను వేదికగా చేసుకుని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది. తొలిరోజున అదానీ–రేవంత్ దోస్తీ అంటూ టీషర్టులు ధరించి అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. సభ జరిగే మిగతా రోజుల్లోనూ ఏదో ఒకరకమైన వ్యూహంతో అసెంబ్లీకి వచ్చి ప్రజల్లో చర్చ జరిగేలా చేయాలని నిర్ణయానికి వచి్చ నట్టు తెలిసింది. పార్టీ ఫిరాయింపుల అంశంపై స్పీకర్ అనుసరిస్తున్న వైఖరిని ప్రశ్నిస్తూ వాయిదా తీర్మానం ఇవ్వడం, లేదా స్వల్పకాలిక చర్చకు పట్టుబట్టడం దిశగా ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ఇక కాంగ్రెస్ ఇచ్చిన 6గ్యారంటీలకు అసెంబ్లీతో చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్‌తో ఒత్తిడి తీసుకురావాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఈసారి అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ హాజరైనా ఎలాంటి చర్చల్లో పాల్గొనే అవకాశం లేదని సమాచారం. అసెంబ్లీ సమావేశాలు ముగిశాక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లాల్లో పర్యటించనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.సంస్థాగత అంశాలపై ఫోకస్.. వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలాఖరులో హైదరాబాద్, వరంగల్‌లలో కాకుండా అన్ని జిల్లాలనుంచి రాకపోకలకు అనువుగా ఉండే ప్రాంతాన్ని ఎంచుకుని భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించినట్టు తెలిసింది. ఉద్యమకాలంలో నిర్వహించిన తరహాలో భారీ జనసమీకరణతో పార్టీ సత్తా చాటేలా సభ ఉంటుందని ఇటీవల తనను కలిసిన పార్టీ నేతలతో కేసీఆర్ పేర్కొన్నట్టు సమాచారం. ఇక వచ్చే ఏడాది పొడవునా గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కార్యవర్గాల ఏర్పాటు, సంస్థాగత శిక్షణ వంటి కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్టు తెలిసింది. యువత, మహిళలకు చేరువ కావడం లక్ష్యంగా కార్యక్రమాలనిర్వహణకు సన్నాహాలు జరుగుతున్నట్టు సమాచారం. -
బయ్యారం స్టీల్ ప్లాంట్ ఇక లేనట్లేనా?
సాక్షి,హైదరాబాద్ : బీజేపీ తెలంగాణ పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి, ప్రేమ ఉన్నా తక్షణమే బయ్యారంలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని బీఆర్ఎల్సీ కవిత డిమాండ్ చేశారు. బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు, తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు ముడి ఇనుము నిల్వల కేటాయింపుపై లోక్ సభలో చర్చ జరిగింది. ఆ చర్చ సందర్భంగా కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడంపై కీలక వ్యాఖలు చేశారు. కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కవిత ఎక్స్ వేదికగా స్పందించారు. The Bayyaram Steel Plant is not merely a promise; it is a constitutional commitment made during the formation of Telangana. The BJP’s blatant refusal to fulfill this commitment exposes their neglect of the backward and tribal communities in Khammam District, Telangana.It is… https://t.co/uuTMbcH1oB— Kavitha Kalvakuntla (@RaoKavitha) December 12, 2024 ‘బయ్యారం ఉక్కు - తెలంగాణ హక్కు’ అంటూ తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కేసీఆర్ నాయకత్వంలో పోరాటం చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం రాకముందే 2013లోనే బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు కేసీఆర్ లేఖ రాశారు. లక్షా 41 వేలకు పైగా ఎకరాల్లో 300 మిలియన్ టన్నులకుపైగా ఐరన్ ఓర్ నిల్వలు ఉన్నాయి. అక్కడ ఉక్కు పరిశ్రమ వస్తే స్థానికంగా ఉపాధి అవకాశాలు ఉద్యోగాలు పెరుగుతాయి అన్నది కేసీఆర్ ఆలోచన.బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని రాష్ట్ర విభజన చట్టంలో ఉంది. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్న చట్టాన్ని మాత్రం అమలు చేయాల్సిందే. 10 సంవత్సరాలకు పైగా అధికారంలో ఉన్న బీజేపీ హామీని అమలు చేయడం లేదు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారు.ఐరన్ ఓర్ నాణ్యత నేపథ్యంలో ఉక్కు పరిశ్రమ సాధ్యం కాదని బీజేపీ ప్రభుత్వం సాకు చూపిస్తోంది. ఇక్కడ ప్లాంట్ ఏర్పాటు సాధ్యం కావడానికి అవసరమైన మరో 100 మిలియన్ టన్నుల ఐరన్ ఓర్‌ను ఛత్తీస్ ఘడ్ నుంచి తీసుకువచ్చేందుకు కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వంతో కేసీఆర్ మాట్లాడారు. బీజేపీ తెలంగాణ పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి, ప్రేమ ఉన్నా తక్షణమే బయ్యారంలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలిఉక్కు పరిశ్రమ ఏర్పాటు కాదని పార్లమెంటు సాక్షిగా తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించడం బాధాకరం. రాష్ట్రం నుంచి ఎనిమిది మంది బిజెపి ఎంపీలను గెలిపిస్తే ఒక్కరు కూడా స్పందించకపోవడం శోచనీయం. ప్రస్తుత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గతంలో ఎంపీగా ఉన్న సమయంలో ఉక్కు పరిశ్రమ కోసం డిమాండ్ చేశారు. కానీ ఇప్పుడు మాత్రం మాట్లాడటం లేదు. బీజేపీ కేంద్రంపై, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి ఉక్కు పరిశ్రమలు ఏర్పాటు చేయించాలి’ అని డిమాండ్ చేశారు. -
తెలంగాణ తల్లి సెంటిమెంట్ పండేనా?
తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణలో కొత్త సెంటిమెంట్ రాజుకునేందుకు కారణమవుతోందా? ఇటీవలి పరిణామాలను గమనిస్తే ఇది నిజమే కావచ్చు అనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం రూపొందించిన ఈ విగ్రహం చుట్టూనే రాజకీయాలన్నీ తిరుగుతూండటం ఇందుకు కారణమవుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో ఉమ్మడి ఏపీలోని తెలుగు తల్లి విగ్రహానికి పోటీగా తెలంగాణ తల్లి పేరుతో విగ్రహాన్ని తయారు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమ స్ఫూర్తిని రగిలించే ప్రయత్నం చేశారు. ఇందులో పలువురు ఉద్యమకారుల ప్రమేయం ఉన్నప్పటికీ మూల కారకుడు బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు అని చెప్పక తప్పదు. అప్పట్లో వాడవాడల్లో సుమారు ఐదు వేల విగ్రహాలను ప్రతిష్టించారు. బీఆర్ఎస్ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లోనూ ప్రత్యేకంగా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యమైన కార్యక్రమాలు జరిగినప్పుడల్లా తొలుత ఆ విగ్రహానికి నివాళులు అర్పించే మొదలుపెట్టేవారు. ఇది ఒక సెంటిమెంట్ గా మారింది. అయితే ఏ కారణం వల్లో బీఆర్ఎస్ ఈ విగ్రహానికి అధికారిక ముద్ర వేయలేకపోయింది. పదేళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కొత్త సచివాలయాన్ని నిర్మించారు. సచివాలయం ఎదుట భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఆయన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మాత్రం పెట్టలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతోనే సచివాలయం వద్ద మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో, బీఆర్ఎస్ దాన్ని వ్యతిరేకించింది. తాము అధికారంలోకి రాగానే ఆ విగ్రహం స్థానంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతామని బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ ప్రకటించారు కూడా. ఆ వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి, ఇన్నాళ్లు తెలంగాణ తల్లి విగ్రహన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నిస్తూ, తామే సచివాలయంలో ఆ విగ్రహాన్ని స్థాపిస్తామని చెప్పి శంకుస్థాపన కూడా చేసేశారు. ఆ తర్వాత కొత్త డిజైన్‌తో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సిద్ధం చేశారు. వివాదం ఇక్కడే ఆరంభమైంది. ఈ విగ్రహాన్ని ఒక సెంటిమెంట్‌గా మార్చడానికి ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ప్రభుత్వం రూపొందించిన తల్లి విగ్రహం ఆకుపచ్చ చీర ధరించి ఉంటుంది. అంతేకాక మెడలో ఒకటి, రెండు నగలతోనే చిత్రీకరించారు. ఈ విగ్రహంలో తల్లి చేతిని ప్రముఖంగా ప్రదర్శిస్తుంటుంది. ఇది కాంగ్రెస్ పార్టీ అధికారిక గుర్తు అయిన చేతి గుర్తును పోలి ఉందని, ఇదంతా రాజకీయమని విపక్షాలు వ్యాఖ్యానిస్తున్నాయి. విమర్శలు చేస్తున్నాయి. ఈ విగ్రహం కాంగ్రెస్ తల్లి అని బీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ కనుక, విగ్రహంలో చేతిని ప్రొజెక్టు చేయడంలో తప్పు ఏముందని ఇంకొందరి ప్రశ్న. ఇక విగ్రహ ముఖ కవళికలపై కూడా పలు వ్యాఖ్యలు ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించి వస్తున్న కామెంట్లు సమర్థనీయం కాదు. విగ్రహం ముఖ కవళికలు రేవంత్ కుటుంబ సభ్యులను పోలి ఉన్నట్లు ఉన్నాయని కొంతమంది ఆరోపిస్తున్నారు. ఇందులో నిజం ఉండదు. అయినా ఎవరి దృష్టి కోణంతో చూస్తే, వారి కోణంలోనే అలా అనిపిస్తుంటుంది. గతంలో ఎన్టీఆర్.ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టాంక్బండ్ పై పలువురు తెలుగు తేజాల విగ్రహాలను ఏర్పాటు చేసి, దానిని ఒక టూరిస్ట్ స్పాట్ గా అభివృద్ది చేశారు. అప్పట్లో విపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ విగ్రహాల ఏర్పాటు వృథా వ్యయం అని విమర్శించేది. ఆ విగ్రహాలు అచ్చం ఎన్టీఆర్. ముఖ కవళికలతో ఉన్నట్లుగా కొన్ని పత్రికలలో కార్టూన్లు కూడా వచ్చాయి. ఉమ్మడి ఏపీలో మూడు ప్రాంతాలకు చెందిన పలువురు ప్రముఖ సాంస్కృతిక వేత్తలు, కవులు,కళాకారుల విగ్రహాలను ఎన్టీఆర్. ఏర్పాటు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వాటిలో ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు చెందిన ప్రముఖుల విగ్రహాలను కూల్చివేసే యత్నం జరిగింది. కొన్ని విగ్రహాలకు నల్లరంగు పులిమారు. బంజారాహిల్స్ లో ఉన్న పెద్ద పార్కుకు కేబీఆర్ పార్క్ అని పేరు పెట్టి మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి పార్కు విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేస్తే, ఆయనను సమైక్యవాది అని భావించి కొందరు ఉద్యమకారులు దానిని కూడా ధ్వంసం చేశారు. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి టాంక్ బండ్ పై ఉన్న విగ్రహాలను, అలాగే కాసు విగ్రహన్ని పునరుద్దరించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కేసీఆర్ ఆధ్వర్యంలో తయారు చేయించి ఈ ప్రాంతం అంతా వ్యాప్తి చేశారు. ఆ విగ్రహంలో తెలంగాణ తల్లి పింక్ రంగు చీర ధరించినట్లు కనిపిస్తుంది. అయితే అది బీఆర్ఎస్ రంగు పింక్ కాదని, మెరూన్ కలర్ అని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. భరతమాత విగ్రహంలో ఉన్న చీర కలర్ కూడా మెరూనే అని వీరు అంటున్నారు. మెడలో నెక్ లెస్, తదితర మంచి ఆభరణాలు కనిపిస్తాయి. బతుకమ్మ ఉత్సవాలకు ప్రతీకగా దీనిని తయారు చేయించామని బీఆర్ఎస్ నేతల వాదన. తలకు కిరీటం కూడా ఉంటుంది. ఇది కూడా భరతమాతనే పోలి ఉంందని వీరి అభిప్రాయం.అయితే బీఆర్ఎస్ మహిళా నేత, కేసీఆర్ కుమార్తె కవిత ఒక సందర్భంలో తెలంగాణ తల్లి విగ్రహంలో తన పోలిక ఉందని చెప్పుకున్నారు. ఈ వ్యాఖ్యను కాంగ్రెస్ నేతలు తమకు అనుకూలంగా వాడుకుంటున్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం మూర్ఖత్వమని మాజీ సీఎంకేసీఆర్ వ్యాఖ్యానించారు. సీఎం వి తలతిక్క ఆలోచనలని, వాటివల్ల తెలంగాణ అస్తిత్వానికి గాయం అవుతోందని ఆయన ధ్వజమెత్తారు. ఈ అంశాన్ని సెంటిమెంట్ గా మార్చడానికి ఆయన ప్రయత్నించవచ్చు. తెలంగాణ ఉద్యమం ప్రధానంగా నడిచింది అంతా సెంటిమెంట్ రాజకీయాలతోనే అన్న సంగతి తెలిసిందే. తెలంగాణలో అభివృద్ది మా హక్కు అని, తెలంగాణ రాష్ట్రం మా సెంటిమెంట్ అని ఉద్యమ సమయంలో కేసీఆర్ ప్రచారం చేసేవారు. కాగా కేసీఆర్ సెంటిమెంట్ రాజకీయాన్ని ఎదుర్కోవడానికి రేవంత్ సిద్దపడుతున్నారు. చాకలి ఐలమ్మ స్పూర్తితో తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేయించామని, కుడిచేతితో జాతికి అభయాన్ని ఇస్తోందని అన్నారు. ఎడమ చేతిలో వరి, జొన్న, సజ్జ పంటలతో ఈ విగ్రహం తయారైందని అన్నారు. తెలంగాణ సంప్రదాయాలకు అనుగుణంగా విగ్రహ రూపకల్పన జరిగిందని ఆయన వాదించారు. శాసనసభలో భావుకతను కూడా ప్రదర్శిస్తూ ప్రసంగించారు. డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం జరుపుతామని కూడా ప్రకటించడం విశేషం. సోనియాగాంధీ జన్మ దినం ఇదే రోజు కావడం గమనార్హం. బీఆర్ఎస్ ఇందుకు అంగీకరించదు. తెలంగాణ అవతరణ దినోత్సవ తేదీని మార్చడానికి కాంగ్రెస్ కుట్ర చేస్తోందని బిజెపి ఆరోపించింది. దీనిని కాంగ్రెస్ విగ్రహంగా తయారు చేశారని కూడా బీజేపీ ఎమ్మెల్యేలు విమర్శించారు. ప్రపంచ వ్యాప్తంగా విగ్రహాలను సెంటిమెంట్‌గా పరిగణిస్తుంటారు. అవి కూడా కాలాన్ని బట్టి, రాజకీయాలను బట్టి, మారిన ప్రభుత్వాలను బట్టి కూడా ఉండవచ్చు. టాంక్ బండ్ మీద ఉన్న విగ్రహాలను ఒకప్పుడు కూల్చే యత్నం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వాటి జోలికి ఎవరూ వెళ్లలేదు. అంతవరకు మంచిదే. రష్యా లో కమ్యూనిస్టు ప్రభుత్వాల నేతలు లెనిన్, స్టాలిన్ వంటి వారి విగ్రహాలను కూడా తొలగించారు. మన దేశంలో విగ్రహాల చుట్టూ కూడా రాజకీయాలు సాగుతుంటాయి. ఎన్టీఆర్ విగ్రహాన్ని తెలుగుదేశం సెంటిమెంట్ గా మార్చుకుంటే, మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని వైఎస్ ఆర్ కాంగ్రెస్ సెంటిమెంట్ గా పరిగణిస్తుంది. తెలంగాణ తల్లి విగ్రహంపై రాజకీయం ఎలా సాగుతుందన్నది అప్పుడే చెప్పలేం. కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఈ విగ్రహం ఏర్పాటు చేసింది కనుక, రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా ప్రభుత్వ స్థలాలలో ఈ విగ్రహాలను నెలకొల్పవచ్చు. కాని ఇప్పటికే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటైన తెలంగాణ తల్లి విగ్రహాలు అలాగే కొనసాగవచ్చు.. బీజేపీ అధికారంలోకి వస్తే వారు కొత్త విగ్రహం తయారు చేసి చేతిలో కమలం గుర్తు పెడతారేమోనని కొందరు చమత్కరిస్తున్నారు.ఏది ఏమైనా ప్రజలు ఈ విగ్రహాల సెంటిమెంట్ రాజకీయాలకు ప్రభావితం అవుతారా?లేక రాజకీయ పార్టీల పనితీరుకు ప్రభావితం అవుతారా?అంటే అది సందర్భాన్ని బట్టి, ఆయా నాయకుల చాకచక్యాన్ని బట్టి ఉంటుందేమో! -
తెలంగాణ అస్థిత్వంపై దాడి చేస్తున్నారు: కేటీఆర్
-
తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ప్రతిపక్ష నేతలు దూరం
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కార్యక్రమానికి ప్రతిపక్ష నేతలు గైర్హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఇవాళ (సోమవారం)సాయంత్రం 6.5గంటలకు సెక్రటరియేట్లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం జరగనుంది. విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానం అందించింది. విగ్రహావిష్కరణ కోసం ప్రతిపక్ష నేత కేసీఆర్‌తో పాటు పాటు కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్,ఎంఐఎం నేతలను సైతం ఆహ్వానాలు పంపింది. అయితే, తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ప్రతిపక్ష నేతలు హాజరు కావడం లేదు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో రాలేకపోతునట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కిషన్ రెడ్డితో పాటు ఇతర బీజేపీ నేతలు, కేసీఆర్ సైతం పాల్గొనడం లేదని సమాచారం.తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు పూర్తితెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం సాయంత్రం 6.05 గంటలకు సచివాలయ ఆవరణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు,కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ కార్యకర్తలు, స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొననున్నారు. -
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం
-
ఇక నిలదీయడమే!
సాక్షి, హైదరాబాద్: పాలకుల అసమర్ధతపై ప్రజలు తిరుగుబాటు చేస్తున్న నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ ఎస్.. ప్రభుత్వాన్ని నిలదీయాలని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి తగినంత సమ యం ఇచ్చామని, సోమవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై గొంతు విప్పాలని సూచించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడం చేతకాక ప్రభుత్వం కొనసాగిస్తున్న అణచివేత విధానాలను ఎండగట్టాలని చెప్పారు. ఆదివారం ఎర్రవల్లి నివాసంలో జరిగిన బీఆర్ఎస్ శాసనసభా పక్షం సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. సుమారు రెండున్నర గంటల పాటు సాగిన ఈ భేటీలో పలు అంశాలను ప్రస్తావించారు. నమ్మి ఓట్లేసిన వాళ్లను వేధిస్తున్నారు.. ‘త్యాగాలు చేసి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ఆగం చేయాలని కాంగ్రెస్ చూస్తోంది. నమ్మి ఓట్లు వేసిన రైతులు, గిరిజనులు, దళితులను వేధిస్తోంది. ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల మీద కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు కాళేశ్వరం అంశాన్ని ముందుకు తెచ్చింది. ఉద్యోగులకు మొండి చేయి చూపుతూ కేవలం ఒకేఒక్క డీఏను విడుదల చేసి అది కూడా 17 వాయిదాల్లో చెల్లిస్తోంది.దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దిన గురుకుల విద్యాలయాలను కాంగ్రెస్ ప్రభుత్వం అస్తవ్యస్తం చేసింది. విషాహారంతో పిల్లలు చనిపోవడాన్ని చూసి సభ్య సమాజం సిగ్గు పడుతోంది. గురుకుల బాట పేరిట బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన కమిటీని ప్రభుత్వం అడ్డుకుంది. గురుకులాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని పార్టీ కమిటీ నివేదిక ఇచ్చింది. గురుకుల విద్యా సంస్థల్లో సమస్యలపై బీఆర్ఎస్ త్వరలో కార్యాచరణ ప్రకటిస్తుంది. గురుకుల విద్యా సంస్థల్లో వైఫల్యాలను అసెంబ్లీలో ఎండగట్టాలి..’ అని కేసీఆర్ సూచించారు. తెలంగాణ అస్తిత్వం మీద సోయి లేదు ‘తెలంగాణ అస్తిత్వం, ప్రజల ఆకాంక్షల మీద సోయి లేని సీఎం కేవలం రాజకీయ స్వార్ధంతో పాటు నాపై ఉన్న కక్షతో తెలంగాణ విగ్రహం రూపురేఖలు మార్చే పిచ్చి పనులకు పూనుకుంటున్నాడు. తెలంగాణ తల్లి భావన కేవలం నాది మాత్రమే కాదు, మొత్తం తెలంగాణ సమాజానిది. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలనే మూర్ఖత్వంతో సీఎం వ్యవహరిస్తున్నాడు. ప్రత్యేక ఆంధ్ర ఉద్యమ సమయంలో ఆంధ్రామాత అనే భావన ముందుకు తెచ్చిన అక్కడి నాయకత్వం తర్వాత తెలుగు తల్లిని తెరమీదకు తెచ్చి తెలంగాణ అస్తిత్వాన్ని మరిపించింది.తెలుగు తల్లి విగ్రహం ఒక రకంగా తెలంగాణ ప్రజల్లో అస్తిత్వ భావనకు ఊపిరిపోసింది. ఇక్కడి ప్రజల అస్తిత్వానికి చిహ్నంగా తెలంగాణ తల్లిని భగవత్ స్వరూపంలో చేతులెత్తి మొక్కేలా రూపొందించాం. అనేకమంది మేధావులు, కవులు, కళాకారులు వేలాది గంటల పాటు చర్చించి, శ్రమించి తెలంగాణ చారిత్రక సాంస్కృతిక సామాజిక నేపథ్యంలో నుంచి ప్రస్తుత తెలంగాణ తల్లి రూపాన్ని తీర్చిదిద్దారు. సమైక్య పాలనలో మరిచిపోయిన తెలంగాణ ప్రతీకలను ఉద్యమ సమయంలో పునరుజ్జీవింప చేసుకోవడానికే తెలంగాణ తల్లిని నిలుపుకున్నాం.కానీ తెలంగాణ సాంస్కృతిక వారసత్వంపై అవగాహన లేని సీఎం తెలంగాణ అస్తిత్వానికి మచ్చ తెస్తున్నారు. కొత్త రూపంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న తెలంగాణ విగ్రహం ఆవిష్కరణకు నన్ను ఆహా్వనించడం వెనుక ఉన్న కోణం, ఉద్దేశం ఏదైనా ఇంటికి వచ్చిన మంత్రికి తెలంగాణ సాంప్రదాయం ప్రకారం భోజనం పెట్టి సాదరంగా గౌరవించాం..’ అని మాజీ సీఎం చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టండి‘కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని విర్రవీగుతున్న ముఖ్యమంత్రి నేను చేపట్టిన అనేక పనులు, పథకాలను ప్రారంభిస్తున్నాడు. యాదాద్రి పవర్ ప్లాంట్ కేసీఆర్ ఆనవాలు అనే విషయం తెలియదా. వ్యవసాయ రంగాన్ని నిరీ్వర్యం చేయడంపై అసెంబ్లీలో నిలదీయాలి, రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని స్థిరీకరిచేందుకు దార్శనికతతో వ్యవసాయ అభివృద్ధి, రైతు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం. ఎలాంటి పరిమితులు విధించకుండా రైతుబంధును అందజేశాం. కానీ ఎన్నికల సమయంలో రైతులకు ఆశపెట్టి ఎగవేస్తున్న ప్రభుత్వ వైఖరిని అసెంబ్లీలో ఎండగట్టాలి. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు హామీల అమలుపై నిలదీయాలి. కేవలం ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడానికే పరిమితం కాకుండా గతంలో బీఆర్ఎస్ పాలనలో అమలు చేసిన పథకాలు, కార్యక్రమాలను వివరించాలి..’ అని కేసీఆర్ చెప్పారు. వచ్చే ఏడాదంతా సంస్థాగత నిర్మాణం ‘ప్రజలు కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ను మాత్రమే చూస్తున్నారు. ఫిబ్రవరి చివరి వారంలో వరంగల్, హైదరాబాద్ కాకుండా అందరికీ అందుబాటులో ఉండే చోటును చాటుకుని భారీ జనసమీకరణతో సభ నిర్వహిద్దాం. వచ్చే ఏడాదంతా పూర్తిగా పార్టీ సంస్థాగత నిర్మాణం, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కార్యవర్గాల ఏర్పాటు, సంస్థాగత శిక్షణ కార్యక్రమాలపైనే దృష్టి పెడదాం. జమిలి ఎన్నికలు జరిగే పక్షంలో పెద్దగా సమయం ఉండదు. మళ్లీ అధికారంలోకి వంద శాతం మనమే వస్తాం..’ అని బీఆర్ఎస్ అధినేత భరోసా ఇచ్చారు. ఈ సమావేశం అనంతరం ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ నేతృత్వంలోని పార్టీ కమిటీ కేసీఆర్‌కు ‘గురుకుల బాట’ నివేదిక అందజేసింది. ఈ సందర్భంగా కమిటీని కేసీఆర్ అభినందించారు. ఇలావుండగా హైదరాబాద్‌లో ఈ నెల 11న జరిగే తన పెద్ద కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి.. ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్‌ను, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆహా్వనించారు.