
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో మాజీ మంత్రి హరీశ్ రావు మరోసారి భేటీ అయ్యారు. సోమవారం కాళేశ్వరం కమిషన్ విచారణకు హరీశ్ రావు హాజరయ్యారు. విచారణ అనంతరం నేరుగా ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు వెళ్లిన ఆయన.. కేసీఆర్‌తో భేటీ అయ్యారు. కాళేశ్వరం కమిషన్ అడిగిన ప్రశ్నలు, విచారణ తీరుపై కేసీఆర్‌కు వివరించినట్లు తెలిసింది. వీరి భేటీ సుమారు 3గంటల పాటు సాగింది. అయితే, ఇవాళ మరోసారి హరీశ్ రావు ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు వెళ్లి కేసీఆర్‌తో భేటీ అయ్యారు.