Kaleshwaram project
-
‘కాళేశ్వరం’పై ప్రాథమిక నివేదిక రెడీ!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు బరాజ్‌ల నిర్మాణంపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ నిర్వహిస్తున్న విచా రణ ఓ కొలిక్కి వచ్చినట్టు తెలిసింది. ఇప్పటివరకు నిర్వహించిన సుదీర్ఘ విచారణలో కమిషన్ గుర్తించిన అంశాలు, అవకతవకలు, ఇతర అంశాలపై సుమారు 204 పేజీలతో ప్రాథమిక నివేదికను సిద్ధం చేసినట్టు సమాచారం. నివేది కలో దాదాపుగా 12 అధ్యయనాల వివరాలున్నట్టు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన వేల సంఖ్యలోని ఫైళ్లను అధ్యయనం చేయడంతోపాటు సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్‌లో సేకరించిన వివరాలను నివేదికలో పొందుపరిచినట్టు సమాచారం.బరాజ్‌ల నిర్మా ణంతోపాటు ఇతర పనుల్లో అవకతవకలు జరిగినట్టుగా కమిషన్ నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. కాంట్రాక్టర్లకు లబ్ధి కలిగించడానికి బరాజ్‌ల అంచనాలను ఏటేటా పెంచడంతోపాటు జరగని పనులకు కూడా రూ.కోట్లలో బిల్లులు జారీ చేసినట్టుగా ఆధారాలను సేకరించినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి బరాజ్‌లకు సంబంధించిన విధానపర నిర్ణయాలు, సాంకేతిక, ఆర్థికపర అంశాలపై విచారణ దాదాపు పూర్తయిందని.. మరికొందరు సాక్షులను క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తే విచారణ ప్రక్రియ పూర్తవుతుందని అంటున్నాయి. ఇక జనవరి, ఫిబ్రవరిలో రెండు పర్యాయాలు క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించి.. మిగతా వారిని ప్రశ్నించేందుకు కమిషన్ సన్నద్ధమైనట్టు తెలిసింది. శాసనసభ బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందే తుది నివేదికను సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనున్నట్టు సమాచారం. ప్రభుత్వం శాసనసభలో నివేదికను ప్రవేశపెట్టి చర్చ చేపట్టే అవకాశం ఉన్నట్టు తెలిసింది. రామకృష్ణారావుకు క్రాస్ ఎగ్జామినేషన్.. ఇప్పటికే పలు దఫాలుగా క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించి 80 మందికిపైగా ఇంజనీర్లు, ఐఏఎస్, మాజీ ఐఏఎస్ అధికారులను ప్రశ్నించిన పీసీ ఘోష్ కమిషన్.. మంగళవారం నుంచి మరో దఫా క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియను ప్రారంభించనుంది. తొలిరోజు రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావును ప్రశ్నించనుంది. కాళేశ్వరం కార్పొరేషన్ కు లేని ఆదాయాన్ని కాగితాలపై చూపి రుణాలను సమీకరించినట్టు వచ్చిన ఆరోపణలపై కమిషన్ ఆయనను విచారించనుంది. బీఆర్ఎస్ నేత వి.ప్రకాష్, బరాజ్‌ల నిర్మాణ సంస్థల ప్రతినిధులను కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆడిట్ నిర్వహించిన కాగ్ అధికారులనూ ఇదే విడతలో ప్రశ్నించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. వచ్చే నెలలో కేసీఆర్, హరీశ్, ఈటలకు పిలుపు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి విధానపర నిర్ణయాలు తీసుకోవడంలో కీలక పాత్ర పోషించిన నాటి సీఎం కేసీఆర్, నీటిపారుదల, ఆర్థిక మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌లకు కమిషన్ వచ్చే నెలలో క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించనున్నట్టు తెలిసింది. వారికి సమన్లు జారీ చేయడానికి ముందే బలమైన ఆధారాలను సిద్ధం చేసుకోవడంపై దృష్టి పెట్టినట్టు సమాచారం. చివరగా కేసీఆర్‌ను ప్రశ్నించడం ద్వారా కమిషన్ విచారణను ముగించి, ప్రభుత్వానికి తుది నివేదిక సమర్పించే యోచనతో ఉన్నట్టు తెలిసింది. -
కేసీఆర్, హరీశ్, ఈటలకు సమన్లు?
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల నిర్మాణంపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ విచారణ చివరి అంకానికి చేరింది. ఆదివారం హైదరాబాద్‌కు చేరుకున్న జస్టిస్ చంద్రఘోష్ మంగళవారం నుంచి క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియను పునఃప్రారంభించనున్నారు. ఇప్పటికే ఆయన పలు దఫాలుగా క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించగా, ఇదే తుది విడత క్రాస్ ఎగ్జామినేషన్ కావొచ్చని అధికారవర్గాలు తెలిపాయి. గత క్రాస్ ఎగ్జామినేషన్‌కు హాజరుకాలేకపోయిన ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావును ఈ దఫాలో కమిషన్ ప్రశ్నించనుంది. దీంతో అధికారుల వంతు పూర్తికానుంది. బరాజ్‌ల నిర్మాణ సంస్థల ప్రతినిధులతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆడిట్ నిర్వహించిన కాగ్ అధికారులను సైతం కమిషన్ ఇదే దఫాలో ప్రశ్నించనుంది. అనంతరం చివర్లో మాజీ సీఎం కేసీఆర్, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు, నాటి ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను క్రాస్ ఎగ్జామినేషన్ కోసం కమిషన్ పిలిచే అవకాశం ఉంది.సోమవారం వీరికి కమిషన్ కార్యాలయం నుంచి సమన్లు జారీ చేసే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో సంబంధమున్న నీటిపారుదల శాఖ మాజీ ఈఎన్సీలు, ఇతర కీలక ఇంజనీర్లు, రిటైర్డ్ ఇంజనీర్లతో పాటు ఐఏఎస్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులను ఇప్పటికే కమిషన్ ప్రశ్నించింది. తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు బరాజ్ లొకేషన్‌ను మార్చడంతో పాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల నిర్మాణ స్థలాల ఎంపిక, ఇతర అంశాల్లో కేసీఆర్, హరీశ్‌రావు కీలక నిర్ణయాలు తీసుకున్నారని ఇప్పటికే పలువురు ఇంజనీర్లు, మాజీ ఇంజనీర్లు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు కమిషన్ ముందు వాంగ్మూలం ఇచ్చారు. వీరందరి నుంచి సేకరించిన సాక్ష్యాధారాల ఆధారంగా కేసీఆర్, హరీశ్‌రావును కమిషన్ ప్రశ్నించనుంది. కమిషన్ గడువు ఫిబవ్రరితో పూర్తికానుండగా, ఆలోపే ప్రభుత్వానికి నివేదిక సమర్పించే అవకాశం ఉంది. -
‘మేడిగడ్డ’ లోపాలు..ఇంజినీర్లకు విజిలెన్స్ నోటీసులు
సాక్షి,హైదరాబాద్:కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో లోపాలపై సంబంధిత ఇంజినీర్ల మీద తెలంగాణ ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక ఆధారంగా ఇద్దరు ఇంజినీర్లకు నోటీసులు జారీ చేసింది. బ్యారేజీ పనులు పూర్తికాకున్నా సర్టిఫికెట్లు ఇచ్చిన ఇంజినీర్లు రమణారెడ్డి,తిరుపతి రావులకు నోటీసులు విజిలెన్స్ నోటీసులిచ్చింది. నోటీసులపై పదిరోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో మొత్తం ఇరవై మందికిపైగా ఇంజనీర్లు తప్పులు చేసినట్లు విజిలెన్స్ నివేదికలు పేర్కొన్నాయి.2023అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు మేడిగడ్డ బ్యారేజీలో పెద్దశబ్దంతో పగుళ్లు ఏర్పడ్డ విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు, లోపాలపై జ్యుడీషియల్ కమిషన్ విచారణ కూడా జరుగుతున్న విషయం తెలిసిందే.ఇదీ చదవండి: రేవంత్ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందే -
మేడిగడ్డ నిర్ణయం కేసీఆర్‌దే!
సాక్షి, హైదరాబాద్: తుమ్మిడిహెట్టికి బదులు మేడిగడ్డ బరాజ్ నిర్మించాలన్న ఆలోచన నాటి సీఎం కేసీఆర్‌దేనని కేంద్ర జలశక్తి శాఖ సలహాదారుడు వెదిరె శ్రీరామ్ స్పష్టం చేశారు. తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) లేఖ ఇవ్వడం, మహారాష్ట్రతో ముంపుపై వివా దం ఏర్పడడంతోనే మేడిగడ్డకు మార్చామని కేసీఆర్ ప్రభుత్వం చేసిన వాదన పూర్తిగా అబద్ధమని కొట్టిపారేశారు.తుమ్మిడిహెట్టి వద్ద 165 టీఎంసీల నీటిలభ్యత ఉందని సీడబ్ల్యూసీ ఎన్నో లేఖలు రాసిందని, సంప్రదింపులతో మహారాష్ట్రతో ముంపు సమస్యను పరిష్కారానికి అవకాశం ఉండేదన్నారు. రాజకీయ, ‘ఇతర’కారణాలతోనే మేడిగడ్డ బరాజ్ నిర్మించారని ఆరోపించారు. కాళేశ్వరం బరాజ్‌ల నిర్మాణంపై విచారణలో భాగంగా జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ శుక్రవారం నిర్వహించిన క్రాస్ ఎగ్జామినేషన్‌కు వెదిరె శ్రీరామ్ హాజరై సమాధానాలిచ్చారు. వ్యక్తిగత హోదాలోనే సాక్ష్యం... వ్యక్తిగత హోదాలోనే కమిషన్ ముందు సాక్షిగా హాజరైనట్టు వెదిరే శ్రీరామ్ స్పష్టత ఇచ్చారు. కాళేశ్వ రం ప్రాజెక్టుకు అనుమతుల కోరుతూ సీడబ్ల్యూసీకి నీటిపారుదల శాఖలోని సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్(సీడీఓ) సీఈ రాసిన లేఖను సాక్ష్యంగా ఆయన గతంలో కమిషన్‌కు సమరి్పంచగా, ఆ లేఖలో వ్యత్యాసాలున్నట్టు కమిషన్ ఎత్తిచూపింది. ఈ లేఖను తాను సీడబ్ల్యూసీ నుంచే స్వీకరించానని, సీడీఓ సీఈ లేఖను మార్చి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. అధికారికంగా తీసుకోనందున వాటిని సాక్ష్యంగా పరిగణించబోమని కమిషన్ తేల్చి చెప్పింది. అన్నారం, సుందిళ్ల కుంగిపోవచ్చు.. మేడిగడ్డ బరాజ్ తరహాలో అన్నారం, సుందిళ్ల బరాజ్‌లూ కుంగిపోవచ్చని వెదిరె శ్రీరామ్ అన్నారు. బరాజ్‌ల వైఫల్యానికి కారణాలేమిటని కమిషన్ ప్రశ్నించగా, సరైన ఇన్వెస్టిగేషన్లు జరపకుండానే డిజైన్ల రూపకల్పన, డిజైన్లు, మాడల్ స్టడీస్‌కు విరుద్ధంగా నిర్మాణం, నిర్వహణ జరగడమేనన్నారు. ప్లాన్ తయారీకి ముందే పనులు ప్రారంభించారా అని కమిషన్ అడగ్గా, అవునని బదులిచ్చారు. 2016 ఏప్రిల్/మేలో బరాజ్‌లు నిర్మించాలని నిర్ణయించి 2019లోగా పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం అత్యాశే అన్నారు.డీపీఆర్ తయారీకి ఏడాది అవసరం కాగా, 4 నెలల్లోనే పూర్తి చేయాలని వ్యాప్కోస్ను కోరారన్నారు. డీపీఆర్‌కు ఆమోదం లభించకముందే టెండర్లు పిలిచి పనులు అప్పగించారని, నాటికి ఇంకా డిజైన్లు సైతం సిద్ధం కాలేదన్నారు. అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల స్థలాలను మార్చడంతో అప్పటికే నిర్వహించిన ఇన్వెస్టిగేషన్లు వృథా అయ్యాయని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ ఆమోదించిందా అని కమిషన్ అడగగా, లేదని బదులిచ్చారు. తొందరపాటుతో క్షేత్రస్థాయిలోని ఈఈ నుంచి ఈఎన్సీ వరకు అందరూ తప్పిదాలు చేశారన్నారు. నిర్వహణ విభాగం ఈఎన్సీ జాప్యం చేశారు బరాజ్‌లలో సీపేజీతో నీరు లీకైనప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ) సలహా కోరడంలో నిర్వహణ విభాగం ఈఎన్సీ(నాగేంద్రరావు) జాప్యం చేయడంతో నష్టం తీవ్రత పెరిగిందా అని కమిషన్ ప్రశ్నించగా, అవునని వెదిరె బదులిచ్చారు. బరాజ్ కుంగే వరకు ఎన్డీఎస్ఏకు సమాచారం లేదని, కుంగిన 5 రోజులకు ఎన్డీఎస్ఏ బృందం పరిశీలనకు వచ్చిందన్నారు. ఎన్డీఎస్ఏ 20 రకాల సమాచారం కోరితే సకాలంలో ఆ ఈఎన్సీ ఇవ్వలేదని, దీంతో బరాజ్‌ల వైఫల్యానికి కారణాలను గుర్తించడం ఎన్డీఎస్ఏకి క్లిష్టంగా మారిందన్నారు. మళ్లీ గడువు పొడిగించలేం ..కోదండరామ్‌కు కమిషన్ స్పష్టీకరణ మీరు సమరి్పంచిన పత్రాలకు ఆధారాలు ఏమిటని టీజేఎస్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ కోదండరామ్‌ను కమిషన్ ప్రశ్నించగా, మరిన్ని ఆధారాలు సమర్పించేందుకు రెండు రోజుల సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ఓసారి గడువు పొడిగించి మీకు అవకాశం ఇచ్చామని, మళ్లీ పొడిగించడం సాధ్యం కాదని కమిషన్ స్పష్టం చేసింది. అఫిడవిట్‌పై చేసిన సంతకం మీదేనా? అని కమిషన్ ప్రశ్నించగా, అవునని కోదండరామ్ ధ్రువీకరించారు. గతంలో నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేసిన వికాస్‌రాజ్ కమిషన్ ముందు హాజరై కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో తన పాత్ర ఏమిలేదని తెలపడంతో ఆయనకు కమిషన్ ఎలాంటి ప్రశ్నలు వేయలేదు. -
3 ప్రాజెక్టుల డీపీఆర్‌లు వెనక్కి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) భారీ షాకిచ్చింది. అనుమతుల కోసం గతంలో రాష్ట్ర ప్రభుత్వం పంపించిన కాళేశ్వరం అదనపు టీఎంసీ, పాలమూరు–రంగారెడ్డి, వార్ధా ప్రాజెక్టుల డీపీఆర్‌లను వెనక్కి పంపించింది. ఈ మూడు ప్రాజెక్టులపై తాము లేవనెత్తిన అంశాల(అబ్జర్వేషన్ల)కు తెలంగాణ ప్రభుత్వం దీర్ఘకాలంగా సమాధానం ఇవ్వలేదని పేర్కొంది. బీఆర్ అంబేడ్కర్ వార్ధా ప్రాజెక్టు డీపీఆర్‌పై తాము లేవనెత్తిన అంశాలకు ఏడాదిగా సమాధానం ఇవ్వలేదని, సత్వరంగా ఇవ్వకపోతే డీపీఆర్‌ను వెనక్కి పంపిస్తామని హెచ్చరిస్తూ గత నెల 22న రాష్ట్ర ప్రభుత్వానికి సీడబ్ల్యూసీ లేఖ రాసింది. అయినా ప్రభుత్వం స్పందించకపోవడంతో.. మూడు ప్రాజెక్టుల డీపీఆర్‌లను పరిశీలించలేమని, వాటిని తమ పరిశీలనలో ఉన్న ప్రాజెక్టుల జాబితా నుంచి తొలగిస్తామని తేల్చి చెప్పింది. ఈ మేరకు డీపీఆర్‌లను వెనక్కి పంపిస్తూ సీడబ్ల్యూసీలోని ప్రాజెక్టుల మదింపు విభాగం డైరెక్టర్ రాజీవ్‌కుమార్ ఈ నెల 19న లేఖ రాశారు. తాము లేవనెత్తిన అంశాలకు 3 నెలల్లోగా సమాధానమివ్వకపోయినా, ట్రిబ్యునల్ పరిధిలో వివాదం ఉన్నా డీపీఆర్‌లను పరిశీలించకూడదనే నిబంధనలున్నాయని గుర్తుచేసింది. తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్‌కు మార్గం సుగమం వార్ధా ప్రాజెక్టుపై పలు అంశాలను లేవనెత్తుతూ 2023 జూలై 4, జూలై 20, 2024 నవంబర్ 17 తేదీల్లో సీడబ్ల్యూసీలోని వేర్వేరు డైరెక్టరేట్లు రాసిన లేఖలకు తెలంగాణ ప్రభుత్వం స్పందించలేదు. ప్రాజెక్టుతో మహారాష్ట్రలో ముంపు ఉండడంతో డీపీఆర్‌ను అంతర్రాష్ట్ర బోర్డు పరిశీలనకు పంపాలని సీడబ్ల్యూసీ గతంలో సూచించింది. ముంపుపై మహారాష్ట్ర నుంచి సమ్మతి తీసుకోవాలని కోరింది. ముంపు ఆధారంగా ప్రణాళికల్లో ఏమైనా మార్పులుంటే తెలపాలని సూచించింది. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు కింద హెడ్‌వర్క్స్, సొరంగాలు, ఇతర పనులు ఎంత మేరకు చేశారు? వ్యయం ఎంత? పనుల లొకేషన్ ఏమిటి? ప్రాజెక్టు కోసం సేకరించిన పంపుసెట్ల వివరాలు, వార్ధా లేదా ఇతర ప్రాజెక్టులో వాటి వినియోగంపై సమాచారం ఇవ్వాలని కోరింది. ప్రభుత్వం సమాచారం ఇవ్వకపోవడంతో సీడబ్ల్యూసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. వార్ధా ప్రాజెక్టు డీపీఆర్‌ను సీడబ్ల్యూసీ వెనక్కి పంపడంతో ప్రాణహిత కింద ప్రతిపాదించిన తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్ నిర్మించడానికి మార్గం సుగమమైందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అదనపు ప్రయోజనం లేకుండా అంత ఖర్చు ఎందుకు? ఎలాంటి అదనపు ప్రయోజనాలు లేకపోయినా కాళేశ్వరం అదనపు టీఎంసీ ప్రాజెక్టుపై రూ.27 వేల కోట్లను ఎలా ఖర్చు చేస్తారని సీడబ్ల్యూసీ ప్రశ్నించింది. దీనిపై ఎన్నో లేఖలు రాసినా సమాధానం ఇవ్వడం లేదని తప్పుబట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టు రోజువారీ పంపింగ్ సామర్థ్యాన్ని 2 టీఎంసీల నుంచి 3 టీఎంసీలకు పెంచడానికి ఈ పనులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే ప్రాజెక్టు నిర్వహణ ఆర్థికంగా ఆచరణీయమైనదని నిరూపించడానికి దానితో వచ్చే పంటల దిగుబడులను, వాటి విలువను భారీగా పెంచి చూపారంటూ సీడబ్ల్యూసీ తప్పుబట్టింది. చివరగా గత జనవరి 12న రాసిన లేఖకు ఇంకా సమాధానం ఇవ్వలేదని తెలిపింది. ట్రిబ్యునల్‌లో తేలేవరకు పాలమూరుకు అనుమతి నో ఏపీ, తెలంగాణల మధ్య కృష్ణా జలాల పంపిణీ వ్యవహారం కృష్ణా ట్రిబ్యునల్–2 పరిధిలో ఉన్నందున పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్‌ను పరిశీలించలేమని సీడబ్ల్యూసీ స్పష్టం చేసింది. ఉమ్మడి ఏపీకి కృష్ణా జలాల్లో ఉన్న 811 టీఎంసీల వాటాతో పాటు ‘పోలవరం’ప్రాజెక్టు నిర్మాణంతో సాగర్ ఎగువన లభ్యతలోకి వచి్చన 45 టీఎంసీల జలాలను ఏపీ, తెలంగాణ మధ్య పంపిణీ చేసే బాధ్యతను కృష్ణా ట్రిబ్యునల్–2కు కేంద్రం అప్పగించిన విషయాన్ని గుర్తు చేసింది. పోలవరం ప్రాజెక్టు ద్వారా 80 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు తరలిస్తే దానికి బదులుగా సాగర్ ఎగువ రాష్ట్రాలు 80 టీఎంసీలను వాడుకోవడానికి ట్రిబ్యునల్ అవకాశం కల్పించింది. ఈ 80 టీఎంసీల్లో మహారాష్ట్ర, కర్ణాటకలు 35 టీఎంసీలు వాడుకోగా, మిగిలి ఉన్న 45 టీఎంసీలను ఏపీ, తెలంగాణకు పంచే అంశం కృష్ణా ట్రిబ్యునల్–2లో పరిధిలో ఉంది. కాగా ట్రిబ్యునల్ తుది నిర్ణయం వచ్చే వరకు నిర్ణయం తీసుకోవడానికి వీలు లేదని సీడబ్ల్యూసీ తాజాగా స్పష్టం చేసింది. -
మీరేం డిబేట్‌కు రాలేదు.. సోమేష్ కుమార్‌పై జస్టిస్ పీపీ ఘోష్ ఆగ్రహం
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్‌పై జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ సమయంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఆలస్యంగా లోపలికి రావడంతో పాటు ఆయన సమాధానాలిచ్చిన తీరుపైనా కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.కాళేశ్వరం అవకతకవలకు సంబంధించిన అభియోగాలపై ప్రస్తుతం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరుపుతున్నది తెలిసిందే. ఈ క్రమంలో ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌తో పాటు సోమేష్ కుమార్‌ను, మరికొందరిని ఇవాళ విచారించారు. అయితే విచారణ నిమిత్తం పీసీ ఘోష్.. కోర్టు హాల్లోకి సోమేష్‌ను పిలిచారు.అయినా కూడా చాలాసేపు దాకా ఆయన లోపలికి వెళ్లలేదు. దీంతో.. ఆయన కోసం ఎంతసేపు ఎదురు చూడాలని పీసీ ఘోష్ ఆగ్రహం ప్రదర్శించారు. విషయం తెలిసి సోమేష్ హడావిడిగా లోపలికి వెళ్లినట్లు సమాచారం.సూటిగా సమాధానాలివ్వండికమిషన్ ముందర చాలా సమాధానాలకు ‘గుర్తు లేదు’ అనే మాజీ సీఎస్ సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో.. ప్రశ్నలకు సూటిగా సమాధానం ఇవ్వాలని జస్టిస్ పీసీ ఘోష్ ఆదేశించారు. ‘‘మీరేం డిబేట్‌కు రాలేదు.. స్ట్రయిట్‌గా ఆనర్సివ్వండి’’ అని చెప్పారాయన. అదే సమయంలో.. విచారణకు హాజరైన మరో ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ సైతం ఇదే రీతిలో పొడిపొడిగా సమాధానం ఇచ్చారు. దీంతో.. సూటిగా సమాధానాలివ్వని ఈ ఇద్దరిపైనా పీసీ ఘోష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
నాకేం తెలీదు.. గుర్తు లేదు: స్మితా సబర్వాల్
హైదరాబాద్, సాక్షి: కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలు, అందులో భాగమైన మేడిగడ్డ ప్రాజెక్టు కుంగుబాటుపై ఏర్పాటైన కాళేశ్వరం కమిషన్ విచారణను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా.. ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌ను కమిషన్ ఇవాళ విచారణ జరిపింది.హైదరాబాద్ బీఆర్కే భవన్లో ఈ విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. తొలుత ఓపెన్ కోర్టులో ‘‘అన్నీ నిజాలే చెప్తా..’’ అని కమిషన్ చీఫ్ జస్టిస్ పీసీ చంద్రఘోష్, స్మితా సబర్వాల్‌తో ప్రమాణం చేయించారు. ఆపై ప్రశ్నలు గుప్పించారు.కమిషన్: క్యాబినెట్ ఆమోదం లేకుండానే మూడు బ్యారేజీలకు చెందిన పరిపాలన అనుమతుల జీవోలు తెలియజేశారా?స్మితా సబర్వాల్: అది నా దృష్టిలో లేదుకమిషన్: కొన్ని ఫైల్స్ సీఎంఓ కి రాకుండానే క్యాబినెట్ అనుమతి పొందకుండానే పరిపాలన అనుమతులు పొందాయా?స్మితా సబర్వాల్: కమిషన్ అడిగినటువంటి ప్రశ్నలకు నాకు సమాధానం తెలీదు.. అవగాహన కూడా లేదుకమిషన్: క్యాబినెట్ పొందకుండానే మూడు బ్యారేజీల నిర్మాణ పనులు ప్రారంభించారా? స్మితా సబర్వాల్: నాకు తెలీదుకమిషన్: దాచడానికి ఏమీ లేదు నిజాలు మాత్రమే చెప్పాలిస్మితా సబర్వాల్: సీఎంఓకి వచ్చేటువంటి ప్రతి ఫైల్ సీఎం అప్రూవల్ ఉంటుంది2014 నుంచి పదేళ్లపాటు గత ప్రభుత్వం సీఎంవోలో సెక్రటరీగా పని చేశాసీఎంవోలో ఏడు శాఖలను పర్యవేక్షించా మై రోల్ ఈజ్ లిమిటెడ్.. జనరల్ కోఆర్డినేషన్ మాత్రమే కమిషన్: మూడు బ్యారేజీలకు సంబంధించిన ఏదైనా డిపార్ట్మెంట్ నుంచి నోట్స్ సీఎంవోకి వచ్చాయా?స్మితా సబర్వాల్: నా దృష్టిలో లేదు... నాకు ప్రస్తుతం గుర్తుకు లేదుఇదిలా ఉంటే.. మాజీ సీఎస్ సోమేష్ కుమార్ సైతం ఇవాళ్టి విచారణకు హాజరయ్యారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వపరంగా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో భాగస్వామ్యం ఉన్న నేపథ్యంలో.. ఉన్నత అధికారులందరినీ కమిషన్ విచారిస్తోంది. ఓపెన్ కోర్టు ద్వారా కమిషన్ ఛైర్మన్ పినాకి చంద్రఘోష్, మాజీ అధికారులపై ప్రశ్నల వర్షం గుప్పిస్తున్నారు. నిన్న (బుధవారం) రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు, ఇరిగేషన్ శాఖ మాజీ కార్యదర్శులు ఎస్కే జోషి, రజత్ కుమార్‌ను కమిషన్ విచారించింది.ఇదీ చదవండి: కాళేశ్వరం నిర్ణయం కేసీఆర్, హరీశ్రావులదే! -
కాళేశ్వరం నిర్ణయం కేసీఆర్, హరీశ్రావులదే!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల నిర్మాణం విషయంలో విధానపరమైన నిర్ణయం తీసుకున్నది నాటి సీఎం కేసీఆర్, నాటి నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావులేనని మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి చెప్పారు. నాటి సీఎం కేసీఆర్ అధ్యక్షతన వ్యాప్కోస్, సీఈ–సీడీఓ, ఇంజనీర్లతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. 2016 మే 2న మేడిగడ్డ వద్ద భూమిపూజ చేసి బరాజ్‌ల నిర్మాణాన్ని కేసీఆర్ ప్రారంభించారని వివరించారు. అదే రోజు ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పేరును కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చినట్టు వెల్లడించారు. కాళేశ్వరం బరాజ్‌ల నిర్మాణంపై విచారణలో భాగంగా జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ బుధవారం నిర్వహించిన క్రాస్ ఎగ్జామినేషన్‌లో ఆయన పాల్గొన్నారు.సీఎం నిర్ణయాన్ని సాధారణంగా వ్యతిరేకించరు బరాజ్‌ల నిర్మాణంపై విధానపర నిర్ణయం ఎవరిది? అని కమిషన్ ప్రశ్నించగా, నాటి సీఎం నేతృత్వంలో మంత్రివర్గం, ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. అని తొలుత బదులిచ్చారు. నిర్ణయం మంత్రివర్గందా? సీఎందా? ప్రభుత్వం అంటే ఎవరు? అని కమిషన్ గుచి్చగుచ్చి ప్రశ్నించగా, నిర్ణయం సీఎందేనని, మంత్రివర్గం బలపరిచిందని తెలిపారు. మంత్రివర్గ భేటీలో ఎవరైనా మంత్రి అసమ్మతి వ్యక్తం చేయలేదా? అని ప్రశ్నించగా, అలాంటి విషయం తన దృష్టికి రాలేదన్నారు. సీఎం నిర్ణయంపై అసమ్మతి తెలిపితే మరుసటి రోజే మంత్రి పదవి కోల్పోవాల్సి వస్తుందనే భావనతో ఎవరూ అలా చేయరన్నారు. ‘మహా’ అభ్యంతరాలు, నీటి లభ్యత లేదనడంతోనే.. తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్‌కి మహారాష్ట్ర అభ్యంతరాలు, వణ్యప్రాణి సంరక్షణ కేంద్రం ప్రతిబంధకాలుగా మారడం, తగిన నీటి లభ్యత లేదని కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) లేఖ రాయడంతో బరాజ్‌ను మేడిగడ్డకు మార్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఎస్కే జోషి వివరణ ఇచ్చారు. మేడిగడ్డ బరాజ్ వైఫల్యానికి కచి్చతమైన కారణాలు చెప్పలేనని, డిజైన్లకు అనుగుణంగా నిర్మాణం జరగకపోవడం, నాణ్యతా లోపాలు, నిర్వహణ/పర్యవేక్షణ లోపాలు వంటి అనేక కారణాలు ఉండవచ్చని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి కేవలం ఒకే ఒక పరిపాలనపర అనుమతి జారీ చేయలేదని, సుమారు 200కి పైగా అనుమతులు జారీ చేశారని తెలిపారు. సబ్ కాంట్రాక్టర్లపై సమాచారం లేదు మేడిగడ్డ బరాజ్ నిర్మాణ సంస్థ ఇతర సంస్థలకు (సబ్ కాంట్రాక్టర్లకు) ఏమైనా పనులు అప్పగించిందా? వేరే సంస్థలు నిర్మించడంతోనే 7వ బ్లాక్ కుంగిందా? అని కమిషన్ ప్రశ్నించగా, దీనిపై తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని జోషి, క్రాస్ ఎగ్జామినేషన్‌కు హాజరైన నీటిపారుదల శాఖ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌లు వేర్వేరుగా బదులిచ్చారు. అప్పట్లో బరాజ్‌లలో లోపాలు కనబడలేదు: రజత్‌కుమార్ పునాదుల కింద ఇసుక కొట్టుకుపోవడంతోనే మేడిగడ్డ బరాజ్‌లోని 7వ బ్లాక్ కుంగిందని రజత్‌కుమార్ చెప్పారు. నీటి ప్రవాహాన్ని నియంత్రించడానికే మేడిగడ్డ వంటి బరాజ్‌లను నిర్మిస్తారని, నిల్వల కోసం నాగార్జునసాగర్ వంటి జలాశయాలు నిర్మిస్తారని చెప్పారు. ఓ స్థాయి వరకే బరాజ్‌లలో నిల్వలను కొనసాగించి, మిగిలిన ప్రవాహాన్ని విడుదల చేయాల్సిన బాధ్యత ప్రాజెక్టు సీఈదేనని అన్నారు. ప్రభుత్వం రుణాలు తీసుకోక తప్పదు డిఫెక్ట్ లయబిలిటీ కాలంలోనే బరాజ్‌లు దెబ్బతిన్నా మరమ్మతులు చేయకుండా నిర్మాణ సంస్థలకు డిపాజిట్లను ఎలా చెల్లిస్తారు? అని కమిషన్ ప్రశ్నించగా, 2020 ఫిబ్రవరిలో తాను శాఖ బాధ్యతలు చేపట్టే నాటికి పనులు పూర్తయ్యాయని రజత్‌కుమార్ వివరణ ఇచ్చారు. అప్పట్లో బరాజ్‌లలో ఎలాంటి లోపాలు కనబడలేదన్నారు. కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టులను పూర్తిగా ప్రభుత్వ నిధులతో నిర్మించడం సాధ్యం కాదని, రుణాలు తీసుకోక తప్పదని పేర్కొన్నారు. నిపుణుల కమిటీ చైర్మన్ సీబీ కామేశ్వర్ రావు కూడా కమిషన్ ముందు హాజరయ్యారు. బరాజ్‌ల వైఫల్యాలపై తన నివేదికలో పేర్కొన్న అంశాలన్ని వాస్తవాలేనంటూ వాంగ్మూలం ఇచ్చారు. కాగా గురువారం మాజీ సీఎస్ సోమేశ్‌కుమార్, మాజీ సీఎం కేసీఆర్ కార్యదర్శిగా వ్యవహరించిన స్మితా సబర్వాల్ క్రాస్ ఎగ్జామినేషన్ జరగనుంది. -
‘మేడిగడ్డ’ ఎప్పుడు దెబ్బతింది?
సాక్షి, హైదరాబాద్: ‘వరదనీటి మళ్లింపు కోసం ని ర్మించే బరాజ్‌లను నీటినిల్వ డ్యామ్‌లుగా ఏ ప్రాతి పదికన పరిగణించారు? 2019లో బరాజ్‌లు పూర్త యితే 2021లో వచ్చిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ కింద 2023 జూలైలో కాళేశ్వరం బరాజ్‌లను డ్యామ్ లుగా గుర్తించడం వెనక అంతర్యం ఏమిటి?’ అని రాష్ట్ర డ్యామ్‌ల భద్రత సంస్థ (ఎస్డీఎస్ఓ) మాజీ ఎస్ఈ మురళీకృష్ణను జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రశ్నించింది.కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల నిర్మాణంపై విచారణలో భాగంగా జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ సోమవారం అమెరికాలో ఉన్న మురళీకృష్ణను వర్చువల్‌గా క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది.చట్టంలో ఉన్నందునే పరిగణించాం..‘డ్యామ్‌ల రక్షణ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? మీరు అఫిడవిట్లో పేర్కొన్నదంతా వాస్తవమే నా? మీ బాధ్యతలేంటి?’ అని కమిషన్ మురళీకృష్ణ ను ప్రశ్నించింది. అందుకు ఆయన బదులిస్తూ 2021 డిసెంబర్ 30న నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ ను నోటిఫై చేశారని పేర్కొన్నారు. 15 మీటర్ల ఎత్తు కలిగి, నీటిని నిల్వ చేసే జలాశయాలతోపాటు 10 మీటర్లకు మించి ఎత్తున్న చెక్ డ్యామ్‌లను కూడా డ్యామ్‌లుగా పరిగణించాలని చట్టంలో ఉందని మురళీకృష్ణ తెలియజేశారు. దీనిపై కమిషన్ స్పంది స్తూ ‘నీటిని మళ్లించడానికే బరాజ్‌లు కడతారు.. మరి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లను డ్యామ్‌లుగా ఎలా పరిగణించారు? అని మళ్లీ ప్రశ్నించింది. చట్ట ప్రకారం స్పెసిఫైడ్ డ్యామ్‌లుగా బరాజ్‌లను నోటి ఫై చేశారని మురళీకృష్ణ వివరించారు. డ్యామ్‌ల రక్ష ణ చట్టం అమలు కోసం క్షేత్రస్థాయిలో అధికారుల తో చర్చించామని.. ఆయా డ్యామ్‌లను సమగ్రంగా పరిశీలించి నోటిఫై చేయించామని తెలిపారు.బరా జ్లు ఎప్పుడు పూర్తయ్యాయని కమిషన్ ప్రశ్నించ గా 2023లో స్పెసిఫైడ్ డ్యామ్‌లుగా నోటిపై చేశామ న్నారు. 2021లో చట్టం వస్తే 2019లోనే బరాజ్ పూ ర్తవడం వాస్తవమా? కాదా? అని కమిషన్ అడగ్గా వాస్తవమేనని చెప్పారు. పదేపదే విజ్ఞప్తుల అనంత రం స్పెసిఫైడ్ డ్యామ్‌ల జాబితాలో బరాజ్‌లను చేర్చారని బదులిచ్చారు. 2019లో మేడిగడ్డలో వర దలు వచ్చాయని, తొలుత సుందిళ్ల, అన్నారంలో బుంగలు ఏర్పడ్డాయని, ఆ తర్వాత మేడిగడ్డ దెబ్బ తిందని మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. అయి తే బరాజ్‌ల అధికారులు ఈ విషయాన్ని నివేదించలేదని మురళీకృష్ణ వెల్లడించారు.రెండో వారంలో మళ్లీ విచారణనాలుగో విడత క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి చేసిన జస్టిస్ చంద్రఘోష్.. మంగళవారం సాయంత్రం కోల్‌కతా తిరిగి వెళ్లనున్నారు. అనంతరం రెండో వారంలో తిరిగి హైదరాబాద్ వచ్చి ఐదో దఫా విచా రణలో ఈఎన్సీలు, మాజీ ఈఎన్సీలను ప్రశ్నించ నున్నారు. ఆ తర్వాత ఐఏఎస్‌లను విచారించే అవకాశాలున్నాయి. -
కాళేశ్వరం సేప్టీ అధికారులపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫైర్
సాక్షి, హైదరాబాద్ : కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాలు, భద్రత వంటి అంశాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ చేస్తున్న బహిరంగ విచారణ కొనసాగుతుంది. అయితే ఈ బహిరంగ విచారణలో ఆన్లైన్లో డ్యామ్ స్టేఫీ అధికారి మురళీకృష్ణపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఫైరయ్యిందిఆన్లైన్లో డ్యామ్ సేప్టీ అధికారి మురళీకృష్ణను జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారించింది. ఈ సందర్భంగా మూడు బ్యారేజీల సేఫ్టీపై ఆరా తీసింది. డ్యామ్ సేప్టీ అధికారులు నిబంధనలు పాటించలేదని గుర్తించింది. దీంతో సేప్టీ అధికారులపై కాళేశ్వరం కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. -
ఎన్ని కష్టాలు వచ్చినా హామీలు నెరవేర్చి తీరుతాం: భట్టి
మహబూబ్‌నగర్ న్యూటౌన్: బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో పాలమూరు జిల్లాలో పారుతున్న కృష్ణానదిని పట్టించుకోలేదని.. గోదావరిపై కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి రాష్ట్రాన్ని కుదువపెట్టారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్ర మార్క ఆరోపించారు. రైతు పండుగ సభలో ఆయన మాట్లాడా రు. కృష్ణా నీళ్లను పాల మూరుతో పాటు పక్కనున్న రంగారెడ్డి, నల్ల గొండ జిల్లాలకు ఇవ్వాలని ఆలో చన చేసింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వమేని చెప్పారు. ‘‘కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది కాలేదు. అప్పుడే బీఆర్ఎస్ నాయకు లు ప్రజల వద్దకు వెళ్తాం. ఉద్యమాలు చేస్తాం, నిల దీస్తామని చెప్పడం చూస్తే నవ్వు వస్తోంది. పకడ్బందీగా ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు చేపట్టి వారం రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తుంటే.. ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఒకాయన అంటాడు.ఇంకో ఆయన వచ్చి ఉద్యమం చేస్తానని చెప్తాడు. ఇది సిగ్గు చేటు. ఇది దొరల ప్రభుత్వం కాదు. ప్రజల కోసం పనిచేసే ప్రజా ప్రభుత్వం. ఇచ్చిన హామీ మేరకు ఎన్ని కష్టాలు వచ్చినా పథకాలు అమలు చేసి తీరుతాం’’ అని భట్టి పేర్కొన్నారు. తాము రు ణమాఫీ చేయడం మాత్రమే కా కుండా... పంట నష్టపోయిన రైతు లకు పరిహారం కింద రూ. 100 కోట్లు విడుదల చేశామని తెలిపా రు. పంటల బీమా కింద ప్రభు త్వమే రాష్ట్రంలోని 50 లక్షల మంది రైతులకు సంబంధించి రూ. 1,433 కోట్ల ప్రీమియం చెల్లించిందని భట్టి తెలిపారు. బడ్జెట్లో రూ.73 వేల కోట్లు కేటాయించి వ్యవసాయాన్ని పండుగలా చేసిన ఘ నత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. మహిళలను కోటీశ్వరులను చేసేందుకు రూ.లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.రూ.2,747 కోట్లు రుణమాఫీ సొమ్ము విడుదలరైతు పండుగ ముగింపు సందర్భంగా నాలుగో విడత రుణమాఫీ కింద రూ.2,747 కోట్లు విడుదల చేస్తున్నట్టు సీఎం ప్రకటించారు. అదేవిధంగా 255 స్వయం సహాయక మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ చెక్కును అందజేశారు. సమావేశంలో మంత్రులు తుమ్మల, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, వేం నరేందర్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు పాల్గొన్నారు.రైతు సంక్షేమం మొదలైంది వైఎస్సార్ హయాం నుంచే..రైతు పండుగ సభలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రైతులకోసం కాంగ్రెస్ ప్రవేశపెట్టిన పథకాలను గుర్తు చేసుకు న్నారు. మొదట రైతులకు రుణమాఫీ చేసినది, ఉచిత కరెంట్ ఇచ్చినది వైఎస్సార్ హయాంలోనేనని మంత్రి సీతక్క పేర్కొన్నారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎనిమిది లక్షల ఎకరాలకు నీరందించేలా ప్రాజెక్టులు రూపొందించారని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. మొదటిసారిగా రైతు రుణమాఫీ చేసినది వైఎస్ అని మంత్రి దామోదర రాజనర్సింహ గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ రైతుల ప్రభుత్వమని, వైఎస్సార్ హయాం నుంచీ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశామని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ చెప్పారు. -
కమిషన్ ముందు కథలు చెప్పొద్దు
సాక్షి, హైదరాబాద్: ‘మీరు ఇంజనీరేనా? ఏ యూనివర్సిటీలో చదువుకున్నారు? కమిషన్ ముందు కథలు చెబుతున్నారా? బాధ్యతలను కేంద్రంపైకి నెట్టేయడానికి ప్రయత్నిస్తున్నారా? ఎవరిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు? పక్కదోవ పట్టించడానికి యత్నించినా వాస్తవాలన్నీ వెలుగులోకి తెస్తాం..’అని కాళేశ్వరం ప్రాజెక్టు మాజీ చీఫ్ ఇంజనీర్ (సీఈ) శంకర్ నాయక్‌పై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బరాజ్‌ల నిర్మాణంలో లోపాలు, అవకతవకలపై విచారణలో భాగంగా బుధవారం 15 మంది ఇంజనీర్లకు క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించింది. డిజైన్ ఫ్లడ్స్ అంటే ఏమిటని కమిషన్ ప్రశ్నించగా, పరీవాహక ప్రాంతంలో వచ్చే వరద ఆధారంగా డిజైన్లు తయారు చేయడమేనని నాయక్ బదులిచ్చారు. దీంతో మీరు ఇంజనీరేనా? డిజైన్ ఫ్లడ్ అంటే కూడా తెలియదా? అని కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తాను జేఎనీ్టయూలో చదువుకున్నానని, నదిలో వచ్చే వరద ఆధారంగా చేసేదే డిజైన్ ఫ్లడ్ అని ఆయన బదులిచ్చారు. ‘ఏం దాస్తున్నారు? రిటైరయ్యాక కూడా దాచేది ఏముంది? విచారణను పక్కదారిపట్టించే ప్రయత్నం చేస్తారా? అని కమిషన్ ఆయనపై మండిపడగా, లేదని శంకర్‌నాయక్ వివరణ ఇచ్చారు. 2016 జనవరి 17న నాటి సీఎం అధ్యక్షతన జరిగిన సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్‌ను వ్యాప్కోస్ సంస్థ సమరి్పంచిందా? ఆ సమావేశం మినిట్స్‌ను పరిశీలించారా? అన్న ప్రశ్నకు మినిట్స్‌ను చూడలేదని నాయక్ తెలిపారు. కేంద్ర జలవనరుల సంఘం కాళేశ్వరం ప్రాజెక్టుకు హైడ్రాలజీ క్లియరెన్స్ ఇచ్చిందన్నారు. నీటి లభ్యతను తొలుత ఇక్కడి ఇంజనీర్లే నిర్ధారించాల్సి ఉంటుందని కమిషన్ తప్పుబట్టింది. కేంద్రంపై తోసేందుకు ప్రయత్నిస్తున్నారా? ఎంత ప్రయత్ని0చినా వాస్తవాలను బయటికి తీసుకొస్తాం అని ఆగ్రహం వ్యక్తంచేసింది.క్షేత్రస్థాయిలోని ఇంజనీర్లు పంపే నీటి లభ్యత లెక్కలను పరిశీలించి సరిగ్గా ఉన్నట్టు నిర్ధారించడమే తమ బాధ్యత అని శంకర్‌నాయక్ తెలిపారు. బరాజ్‌ల నిర్మాణ స్థలాలను మార్చిన విషయం వాస్తవమేనని అంగీకరించారు. నీటి లభ్యత అధ్యయనాలు జరపకముందే జనరల్ అలైన్మెంట్ డ్రాయింగ్స్ తయారు చేస్తారా? అని కమిషన్ ప్రశ్నించగా, లేదని నాయక్ బదులిచ్చారు. వరద తీవ్రత ఆధారంగా ఎన్ని గేట్లు పెట్టాలనే దానిపై నిర్ణయం తీసుకుంటారన్నారు. కాగా, బరాజ్ సీసీ బ్లాక్స్ ఎందుకు కొట్టుకుపోయాయి? బ్లాకులు కొట్టుకుపోతే పైఅధికారులకు ఎందుకు లేఖలు రాయలేదు? మౌఖికంగానే సమాచారం ఇస్తారా? అని అన్నారం బరాజ్ ఏఈఈ ఆర్మూరి రామచందర్‌పై కమిషన్ మండిపడింది. పినాకిని అంటే అర్థం తెలుసా? మీ పదవీకాలంలో బరాజ్‌లను ఎన్నిసార్లు సందర్శించారు? నివేదికలు ఏమైనా ఇచ్చారా? అని ఓ అండ్ ఎం విభాగం మాజీ సీఈ జి.రమేశ్‌ను కమిషన్ ప్రశ్నించింది. 2021 జూలైలో ఒక్కసారి పరిశీలించి నివేదిక ఇచ్చానని రమేశ్ బదులిచ్చారు. జస్టిస్ పినాకి చంద్రఘోష్ పేరుకి బదులు అఫిడవిట్లో పినాకిని చంద్రఘోష్ అని రాయడంపై కమిషన్ అసహనం వ్యక్తం చేసింది. పినాకిని అంటే అర్థం తెలుసా?, అఫిడవిట్ ప్రారంభంలోనే తప్పులు ఉంటే ఎలా? సంతకం చేయడానికి ముందు అఫిడవిట్ చదువుకోరా? అని నిలదీసింది. అర్జీల్లో అచ్చు తప్పులున్నా న్యాయస్థానాలు కేసులను కొట్టివేసిన సందర్భాలున్నాయని గుర్తు చేసింది. సరైన పరిశోధనలు చేయకుండానే బరాజ్‌ల నిర్మాణంపై నిర్ణయాలు తీసుకున్నారని మాజీ ఇంజనీర్ ఐ.వికల్రార్ కమిషన్‌కు తెలిపారు. బరాజ్‌ల వైఫల్యానికి హైపవర్ కమిటీ ప్రధాన కారణమని ఆరోపించారు. 2–3 టీఎంసీల సామర్థ్యంతోనే బరాజ్‌లను నిర్మిస్తారని, 16 టీఎంసీల సామర్థ్యంతో కట్టడంతోనే సమస్యలొచ్చాయన్నారు. గత మూడు రోజుల్లో మొత్తం 49 మంది ఇంజనీర్లకు కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించడంతో ఇంజనీర్ల వంతు ముగిసింది. మళ్లీ సోమవారం నుంచి ఐఏఎస్, మాజీ ఐఏఎస్‌లతోపాటు కాంట్రాక్టర్లను ప్రశ్నించనుంది. -
మేడిగడ్డలో సాక్ష్యాధారాలు ధ్వంసం!
సాక్షి, హైదరాబాద్: ‘కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల పునాదుల కింద ఇసుక కొట్టుకుపోయి ఏర్పడిన బుంగలను పూడ్చడానికి ముందు, అక్కడి స్థితిగతులు తెలుసుకోవడానికి వరుస క్రమంలో నిర్వ హించాల్సిన పరీక్షలపై నిపుణుల కమిటీ చేసిన సి ఫారసులను రాష్ట్ర నీటిపారుదల శాఖ అమలు చే యకుండా నీరుగార్చింది..’అంటూ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇరిగేషన్ శాఖ నిర్వాకంతో బరాజ్‌లు దెబ్బతినడానికి దారితీసిన కారణాల విశ్లేషణకు అవసరమైన కీలక సమాచారం, సాక్ష్యాధారాలు ధ్వంసమయ్యాయి..’అని తెలిపింది. నీటిపారుదల శాఖ సొంతంగా ఏర్పాటు చేసుకున్న మరో సాంకేతిక కమిటీ చేసిన సిఫారసుల ఆధారంగా ఆ శాఖ నిర్వహించిన మరమ్మతులు.. ఎన్డీఎస్ఏ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సిఫారసుల్లో జోక్యం చేసుకునేలా ఉన్నాయి..’అని పేర్కొంది. ఈ మేరకు ఎన్డీఎస్ఏ డైరెక్టర్ (టెక్నికల్) గత నెల 11న ఇరిగేషన్ కార్యదర్శికి లేఖ రాశారు. కేంద్ర జలశక్తి శాఖ సల హాదారు వెదిరే శ్రీరామ్ బుధవారం కాళేశ్వరం బరాజ్‌లపై విచారణ జరుపుతున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్‌కు అఫిడవిట్ సమర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎన్డీఎస్ఏ లేఖను మీడియాకు విడుదల చేశారు. బుంగల పూడ్చివేతతో స్థితిగతుల్లో మార్పులు ‘మేడిగడ్డ బరాజ్ ప్లింత్ శ్లాబుకి ఎగువ, దిగువన గ్రౌటింగ్ చేసి భూగర్భంలో ఏర్పడిన బుంగలను పూడ్చి వేయడంతో సికెంట్ పైల్స్, పారామెట్రిక్ జాయింట్స్ వద్ద స్థితిగతుల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. బరాజ్ కుంగిన తర్వాత భూగర్భంలో ఉన్న వాస్తవ స్థితిగతులను అధ్యయనం చేయాల్సి ఉండగా, స్థితిగతుల్లో మార్పులతో ఆ అవకాశం లేకుండా పోయింది..’అని ఎన్డీఎస్ఏ లేఖలో ఆందోళన వ్యక్తం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బరాజ్ గతేడాది అక్టోబర్‌లో కుంగిపోగా, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో బుంగలు ఏర్పడి నీళ్లు లీకైన విషయం తెలిసిందే. బరాజ్‌లలో లోపాలపై అధ్యయనం చేసి వాటి పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలను సిఫారసు చేయడానికి ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ గత మే 1న మధ్యంతర నివేదికను సమర్పించింది. బరాజ్‌లకు మరింత నష్టం జరగకుండా వర్షాకాలం ప్రారంభానికి ముందే తీసుకోవాల్సిన అత్యవసర మరమ్మతులతో పాటు బరాజ్‌లలో లోపాలను నిర్ధారించడానికి నిర్వహించాల్సిన జియో ఫిజికల్, జియో టెక్నికల్ పరీక్షలు ఇందులో ఉన్నాయి. ఈ పరీక్షలు నిర్వహించక పోవడాన్ని ఎన్డీఎస్ఏ తప్పుబట్టింది. ఈ అధ్యయనాలు/పరీక్షలు ప్రారంభించడంలో జాప్యం చేయడం ద్వారా నీటిపారుదల శాఖ విలువైన సమయాన్ని కోల్పోయిందంటూ అసంతృప్తి వ్యక్తం చేసింది. అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో కూడా..‘అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల పునాదుల కింద ఏర్పాటు చేసిన సికెంట్ పైల్స్ వాస్తవ స్థితిగతులను అధ్యయనం చేయడానికి ముందే కరై్టన్ గ్రౌటింగ్ చేసి భూగర్భంలో బుంగలను పూడ్చివేశారు. పునాదుల (ర్యాఫ్ట్‌లు) కింద బుంగలను పూడ్చడానికి సిమెంట్ మిశ్రమంతో గ్రౌటింగ్ చేశారు. గ్రౌటింగ్‌కు ముందే జియో టెక్నికల్ పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా, అలా చేయలేదు. ఇప్పుడు పరీక్షలు నిర్వహిస్తే ఎన్డీఎస్ఏ కమిటీకి అవసరమైన వాస్తవ సమాచారం లభించదు. దీనివల్ల ఎన్డీఎస్ఏ కమిటీ పని ప్రణాళికకు విఘాతం కలిగింది..’అని ఎన్డీఎస్ఏ లేఖలో స్పష్టం చేసింది. నీటిపారుదల శాఖ తాజాగా తీసుకోవాల్సిన చర్యలను, చేయాల్సిన పరీక్షలను సిఫారసు చేసింది. 160 టీఎంసీల లభ్యత లేదనడం అవాస్తవం: వెదిరే శ్రీరామ్ ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా ప్రతిపాదించిన తుమ్మిడిహెట్టి వద్ద 75 డిపెండబిలిటీ ఆధారంగా 160 టీఎంసీల నీటి లభ్యత ఉందని సీడబ్ల్యూసీ నిర్ధారించిందని వెదిరే శ్రీరామ్ చెప్పారు. నీటి లభ్యత లేదని చెప్పి ప్రాజెక్టు రీఇంజనీరింగ్‌ను చేపట్టారని విమర్శించారు. వ్యాస్కోస్ వ్యాపార సంస్థ అని, ఎవరు పని అప్పగిస్తే వారి ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేస్తుందని అన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్ కట్టి రూ.32 వేల కోట్లతో మొత్తం ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పూర్తి చేసి 16.4 లక్షల ఎకరాలకు నీరందించడానికి వీలుండగా, కేవలం రూ.2 లక్షల అదనపు ఆయకట్టు కోసం కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టారని విమర్శించారు. ప్రస్తుతం దీని అంచనాలు రూ.1.27 లక్షల కోట్లకు ఎగబాకాయన్నారు. -
కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ
-
మేడిగడ్డ ఏఈఈ, డీఈఈపై జస్టిస్ ఘోష్ అసహనం
హైదరాబాద్, సాక్షి: కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ ముందు ఇవాళ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వద్ద పనిచేసిన డీఈఈ, ఏఈఈలు హాజరయ్యారు. అయితే కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్రఘోష్ వాళ్లపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.కమిషన్ ముందు వాళ్లు వివరణ ఇస్తున్న సమయంలో ఒక్కసారిగా జస్టిస్ చంద్రఘోష్ అసహనానికి లోనయ్యారు. ‘‘ అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు చెప్పాలి. ముందుగా అనుకొని వచ్చి.. పొంతనలేని సమాధానాలు చెప్పొద్దు’’ అని మందలించారాయన. ఆపై.. నిర్మాణం, పనుల వివరాలు ఆరా తీశారు.కాళేశ్వరంలో జరిగిన పనులపై ప్లేస్మెంట్ రికార్డులు రోజువారీగా చేశారా? ఒకరోజు పనిని మరొక రోజు నమోదు చేశారని అని ప్రశ్నించారు. మేడిగడ్డపై కుంగినటువంటి పిల్లర్లకు సంబంధించిన బ్లాక్ సెవెన్ రిజిస్టర్ లపై ఈ ఇద్దరు ఇంజనీర్ల సంతకాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో క్వాలిటీ కంట్రోల్ రిజిస్టర్లు మిస్ అయినట్లు గుర్తించారు.ఇక.. 2020లోనే కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజీ వద్ద డ్యామేజీని గుర్తించి ఉన్నతాధికారులకు నిర్మాణ సంస్థలకు లేఖలు రాసినట్లు ఇంజినీర్లు, కమిషన్ ముందు చెప్పారు.కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ మొదటి రోజు ఇంజనీర్లతో ముగిసింది. AEE - DEE - EE - CE CDO.. ఇలా మొత్తం 18 మంది ఇంజనీర్‌స్థాయి అధికారులను స్వయంగా విచారించారు కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్ర ఘోష్. రేపు (మంగళవారం) మరో 15 మందిని విచారిస్తారని సమాచారం. -
మరోసారి కాళేశ్వరంపై విచారణ
-
‘మేడిగడ్డ’లో భారీ కుట్ర!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బరాజ్ నిర్మాణంలో ఇంజనీరింగ్ అధికారులు, నిర్మాణ సంస్థ ‘ఎల్ అండ్ టీ’ కుమ్మక్కై రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాలకు విరుద్ధంగా భారీ కుట్రకు పాల్పడ్డారని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం పేర్కొంది. రాష్ట్ర ఖజానాకు తీవ్ర నష్టం కలిగించినందుకు ఆ అధికారులు, నిర్మాణ సంస్థపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేపట్టవచ్చని స్పష్టం చేసింది. మేడిగడ్డ బరాజ్ నిర్మాణంపై ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి సమరి్పంచిన మధ్యంతర నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది. విజిలెన్స్ ఆ నివేదికలో పేర్కొన్న కీలక అంశాలివీ.. ఈఈ, ఎస్‌ఈలపై క్రిమినల్ చర్యలు! మేడిగడ్డ బరాజ్‌లో మిగులు పనుల పూర్తికి ఎలాంటి హామీ తీసుకోకుండానే.. పనులు దాదాపుగా పూర్తయినట్టుగా ధ్రువీకరిస్తూ నిర్మాణ సంస్థ ‘ఎల్ అండ్ టీ’కి మహదేవ్పూర్ డివిజన్–1 ఈఈ (ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్) సీహెచ్ తిరుపతిరావు, ఎస్ఈ బీవీ రమణారెడ్డి సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ విషయంలో అధికారులిద్దరూ నిర్మాణ సంస్థ ‘ఎల్ అండ్ టీ’తో కుమ్మక్కై అనుచిత లబ్ధి కల్పించారు. రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగిస్తూ.. ఒప్పందంలోని 42వ క్లాజ్ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించారు. క్షేత్రస్థాయిలో పరిశీలన జరపకుండానే పనులు పూర్తయినట్టు తప్పుడు ధ్రువీకరణ ఇచ్చారు. నిర్మాణ సంస్థ విజ్ఞప్తిని సరిగ్గా పరిశీలించలేదు. ఏ పని పూర్తయిందో స్పష్టంగా పేర్కొనలేదు. ప్రభుత్వ ఖజానాకు రూ.22.9 కోట్ల నష్టం వాటిల్లింది. ఎస్ఈ, ఈఈతోపాటు నిర్మాణ సంస్థ కూడా సంబంధిత చట్టాల కింద క్రిమినల్ ప్రాసిక్యూషన్‌కు అర్హులే. తప్పుడు వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్.. మేడిగడ్డ బరాజ్ మిగులు పనులు పూర్తిచేయాలని... దెబ్బతిన్న సీసీ బ్లాకులు, వియరింగ్ కోట్కు మరమ్మతులు చేయాలని 2021 ఫిబ్రవరి 17న కాంట్రాక్టర్‌కు జారీచేసిన నోటీసులను విస్మరిస్తూ, 2021 మార్చి 15న వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్ ఇచ్చారు. బరాజ్‌లో లోపాలు సరిదిద్దాలంటూ 2020 మే 18న స్వయంగా తానే జారీ చేసిన నోటీసులను విస్మరిస్తూ.. వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్‌పై ఎస్ఈ రమణారెడ్డి కౌంటర్ సంతకం చేసి ఒప్పందంలోని 52.2(సీ) క్లాజును ఉల్లంఘించారు. మిగులు పనుల పూర్తి, మరమ్మతుల నిర్వహణలో ఎల్ అండ్ టీ విఫలమైంది. మెజర్మెంట్ బుక్ నం.56/2000 పేరుతో వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్ జారీ చేశారు. కానీ అసలు అలాంటి సర్టిఫికెటే లేదని తేలింది. అంటే పనులు పూర్తయ్యాయా లేదా అన్నది పరిశీలించలేదని అర్థమవుతోంది. ఉద్దేశపూర్వకంగానే నిర్మాణ సంస్థకు అనుచిత లబ్ధి కలిగించారు. బరాజ్ దెబ్బతిన్నా నిర్మాణ సంస్థను బాధ్యులుగా చేయలేని పరిస్థితి కల్పించి ప్రభుత్వాన్ని ఇబ్బందికర పరిస్థితిలో పడేశారు. గడువుకు ముందే బ్యాంకు గ్యారంటీలనూ తిరిగి ఇచ్చేయడం కూడా.. నిర్మాణ సంస్థతో మరమ్మతులు చేయించే అవకాశానికి గండికొట్టింది. నిర్వహణలో నేరపూరిత నిర్లక్ష్యం బరాజ్ ప్రారంభించిన నాటి నుంచే డ్యామేజీలు, లీకేజీలు బయటపడినా.. అధికారులు, నిర్మాణ సంస్థ మరమ్మతులు చేపట్టలేదు. డ్యామ్ అధికారులు నిర్వహణను గాలికి వదిలేసి, నిర్మాణ సంస్థకు లేఖలు రాయడంతో సరిపెట్టారు. డ్యామ్ అధికారుల నేరపూరిత నిర్లక్ష్యంతోనే బరాజ్ కుంగిపోయి ఖజానాకు తీవ్ర నష్టం కలిగించింది. అధికారులు, కాంట్రాక్టర్‌ను ప్రాసిక్యూట్ చేయాలి. కొంపముంచిన కాఫర్ డ్యామ్! బరాజ్ నిర్మాణానికి ముందు వరదను మళ్లించడానికి ఏర్పాటు చేసిన కాఫర్ డ్యామ్, దానికి సంబంధించిన షీట్‌పైల్స్‌ను నిర్మాణం పూర్తయిన తర్వాత సంపూర్ణంగా తొలగించలేదు. అవి నదిలో సహజ వరద ప్రవాహానికి అడ్డంకిగా మారి బరాజ్‌కు ముప్పు కలిగించాయి. కాఫర్ డ్యామ్ తొలగించడం పూర్తిగా కాంట్రాక్టర్ బాధ్యతే. బరాజ్‌ను ప్రారంభించాక కాంట్రాక్టర్‌కు అధిక చెల్లింపులు చేసి.. ఉద్దేశపూర్వకంగా నిధుల దురి్వనియోగానికి పాల్పడేందుకు కాఫర్ డ్యామ్ అంచనాలను రూ.61.21 కోట్లకు పెంచారు. ఈ అంశంలో అధికారులు, కాంట్రాక్టర్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. – డీవాటరింగ్ పనుల్లో అధికారులు కాంట్రాక్టర్‌కు రూ.39.43 కోట్ల అనుచిత లబ్ధి కలిగించారు. పని విలువలో డీవాటరింగ్ వ్యయం 3శాతంలోపే ఉండాలి. కానీ 2017 డిసెంబర్ 9న నాటి సీఎం నిర్వహించిన సమీక్షలో 5 శాతానికి మించిన వ్యయంతో సవరణ అంచనాలను ఆమోదించారు. నాణ్యత పరీక్షలు లేకుండానే చెల్లింపులు బరాజ్‌లకు నాణ్యత పరీక్షలు నిర్వహించకుండానే కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించారు. నాణ్యత పరీక్షలు నిర్వహించకుండా క్షేత్రస్థాయి ఇంజనీర్లు, క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లు భారీ తప్పిదం చేశారు..’’ అని విజిలెన్స్ మధ్యంతర నివేదికలో పేర్కొంది. -
12 నుంచి ఐఏఎస్‌ల విచారణ!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు బరాజ్‌లపై విచారణ చేస్తున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఈ నెల 12 నుంచి క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియను పునరుద్ధరించనున్నట్టు తెలిసింది. ఈ నెల 11న జస్టిస్ పినాకి చంద్రఘోష్ హైదరాబాద్‌కు రానున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే నిర్వహించిన రెండు విడతల క్రాస్ ఎగ్జామినేషన్‌లో నీటిపారుదల శాఖ రిటైర్డ్ ఈఎన్సీలు మురళీధర్, నల్లా వెంకటేశ్వ ర్లు, బి.నాగేంద్రరావుతోపాటు పలువురు చీఫ్ ఇంజనీర్లు, ఇతర ఇంజనీర్లను కమిషన్ ప్రశ్నంచింది. మూడో విడతలో ప్రధానంగా ఐఏఎస్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులను ప్రశ్నించాలని నిర్ణయించినట్టు తెలిసింది. నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా వ్యవహరించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు ఎస్కే జోషి, రజత్‌కుమార్, ఇన్చార్జి కార్యదర్శిగా వ్యవహరించిన సోమేశ్‌కుమార్, వికాస్‌రాజ్, గత ప్రభుత్వంలో సీఎం కార్యదర్శిగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పర్యవేక్షించిన స్మితా సబర్వాల్ తదితరులను కమిషన్ ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఓసారి కమిషన్ వీరికి సమన్లు జారీ చేసి విచారించింది. అఫిడవిట్ రూపంలో సమాధానాలను తీసుకుంది. ఆ అఫిడవిట్ల ఆధారంగానే క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తోంది. మొత్తానికి ఈ నెలాఖరులోగా అధికారులు, మాజీ అధికారుల విచారణను కమిషన్ ముగించే అవకాశాలు ఉన్నాయి. డిసెంబర్ చివరి నాటికి నివేదిక! కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్న గత ప్రభుత్వ పెద్దలను పీసీ ఘోష్ కమిషన్ వచ్చే నెలలో విచారించే అవకాశాలు ఉన్నాయి. మాజీ సీఎం కేసీఆర్, నీటిపారుదల శాఖ మాజీ మంత్రి హరీశ్‌రావుతోపాటు ఇతర ప్రజాప్రతినిధులను విచారించవచ్చని అధికార వర్గాలు చెప్తున్నాయి. ఇంజనీర్లు, అధికారుల నుంచి క్రాస్ ఎగ్జామినేషన్ లో సేకరించే అంశాల ఆధారంగా కేసీఆర్, హరీశ్‌రావులను విచారించాలని కమిషన్ భావిస్తున్నట్టు తెలిసింది. వచ్చే నెల లో వారికి కమిషన్ నుంచి నోటీసులు అందే అవకాశం ఉంద ని సమాచారం. మొత్తంగా కమిషన్ డిసెంబర్ నెలాఖరులో గా ప్రభుత్వానికి నివేదిక సమరి్పంచనున్నట్టు తెలిసింది. మరోవైపు గత ప్రభుత్వంలో జరిగిన ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొను గోలు ఒప్పందం, యాదాద్రి, భదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాలపై ఏర్పాటు చేసిన జస్టిస్ మదన్ బి లోకూర్ కమిషన్ గత నెలాఖరులోనే ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఇంకా గడువు పొడిగించని సర్కారు! వాస్తవానికి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గడువు గత నెలాఖరుతోనే ముగిసింది. మరో రెండు నెలలు పొడిగించాలని ప్రతిపాదిస్తూ సీఎం కార్యాలయానికి ఫైల్ వెళ్లినా.. ఇంకా నిర్ణయం వెలువడలేదు. గడువు పొడిగింపుపై ఉత్తర్వులు వస్తే ఈ నెల 11న హైదరాబాద్‌కు వస్తానని జస్టిస్ పీసీ ఘోష్ అధికారులకు సమాచారం ఇచి్చనట్టు తెలిసింది. -
కాళేశ్వరం కమిషన్ విచారణలో కీలక ఆధారాలు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ విచారణలో కీలక ఆధారాలు లభించాయి. కమిషన్ ఎదుట కాళేశ్వరం ప్రాజెక్టు మాజీ ఇంజినీర్‌ఇన్‌చీఫ్ (ఈఎన్సీ) వెంకటేశ్వర్లు నేడు మరోసారి విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా డీపీఆర్ ఎస్టిమేట్ డాక్యుమెంట్‌కు మాజీ కేసీఆర్ ఆమోదం తెలిపినట్లు కమిషషన్ ఎదుట డాక్యుమెంట్ల దాఖలు చేశారు. కాళేశ్వరం డిజైన్లు, డ్రాయింగ్స్ కేసీఆర్ ఫైనల్ చేయమని చెప్పినట్లు మినేట్స్ డాక్యుమెంట్స్ దాఖలు చేశారు. దీంతో కమిషన్ వద్దకు అన్నారం ఆక్సిస్ చేంజ్ డాక్యుమెంట్స్, జియోటెక్నికల్ ఫౌండేషన్ టెస్టుల ఆధారాలు వచ్చాయి.మూడు బ్యారేజీల వివరాలను వెంకటేశ్వర్లు కమిషన్‌కు అందించారు. కమిషన్ బహిరంగ విచారణలో మేడిగడ్డ బ్లాక్ సెవెన్ ఘటన ప్రస్తావనకు రాగా.. ఆపరేషన్ అండ్ మైంటెనెన్స్ కారణంగానే మేడిగడ్డ డ్యామేజ్ అయింది కదా అని కమిషన్ ప్రశ్నించింది. మేడిగడ్డతో పాటు మూడు బ్యారేజీలలో నీళ్లను నింపమని ఎవరు ఆదేశించారని ప్రశ్నించింది. అయితే నాన్ అవైలబిలిటీ ఆఫ్ టెయిల్ వాటర్, ఆపరేషన్ ఆఫ్ గేట్స్ కారణంగా డామేజ్ అయిందని, మూడు బ్యారేజీలలో నీళ్లను నింపమని హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆదేశించారని వెంకటేశ్వర్లు తెలిపారు.బ్యారేజీలకు ఒరిజినల్ ఎస్టిమేషన్ ప్రారంభంలో మేడిగడ్డ రూ, 2591 కోట్లు, అన్నారం 1785 కోట్లు, సుందిళ్ల 1437 కోట్లు అని చెప్పారు. మూడు బ్యారేజీలు పూర్తి అయ్యేసరికి మేడిగడ్డ 4613 కోట్లు, అన్నారం 2700 కోట్లు, సుందిళ్ల 2200 కోట్లకు పెరిగినట్లు చెప్పారు వెంకటేశ్వర్లు. కాగా వెంకటేశ్వర్లను అక్టోబర్ 24న కూడా కాళేశ్వరం కమిషన్ విచారించింది. బ్యారేజీల డీపీఆర్, నీటి నిల్వ గురించి ప్రశ్నించింది.ప్రభుత్వానికి చేరిన మెడిగడ్డ పై విచారణ విజిలెన్స్ రిపోర్ట్రిపోర్ట్ను పరిశీలిస్తున్న ప్రభుత్వంరెండు మూడు రోజుల్లో కాళేశ్వరం కమిషన్ కు విజిలెన్స్ రిపోర్ట్ ఇవ్వనున్న సర్కార్.అధికారుల తప్పిదాలు ఉన్నట్లు ఇప్పటికే తాత్కాలిక రిపోర్ట్విజిలెన్స్ రిపోర్ట్ పరిశీలన తరువాత ఐఎఎస్ అధికారులను పిలువనున్న కమిషన్ -
కాళేశ్వరం కమిషన్ విచారణ.. మూడుసార్లు హరీష్ రావు పేరు ప్రస్తావన
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణకు చీఫ్ ఇంజనీర్ సుధాకర్ రెడ్డి శనివారం హాజరయ్యారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల టెండర్లపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఆయన్ను విచారించింది. విచారణలో భాగంగా మాజీ జలవనరులశాఖ మంత్రి హరీష్ రావు పేరును సుధాకర్ రెడ్డి మూడుసార్లు ప్రస్తావించారు. ప్రాజెక్టు కోసం చేసిన టెస్టుల రిపోర్టులను వ్యాప్కోస్ సంస్థకు ఇవ్వనని ఎవరు ఆదేశించారని కమిషన్ ప్రశ్నించగా.. ఆ సమయంలో హరీష్ రావు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారని, ఆయనే ఆదేశించారని తెలిపారు. కాళేశ్వరం కార్పొరేషన్ పెట్టింది అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలోనేనని పేర్కొన్నారు.కాళేశ్వరం ప్రాజెక్టు రీ డిజైన్ పేరుతో 40 వేల కోట్ల నుంచి 127 వేల కోట్లకు పెంచారు. ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది కేవలం అదనంగా రెండు లక్షల ఎకరాల కోసమా?: కమిషన్డీపీఆర్ ప్రకారం కాఫర్ డ్యామ్‌కు డబ్బులు ఇచ్చాం-సుధాకర్ రెడ్డికాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్ టెండర్ల ప్రాసెస్ జరిగిందా? కమిషన్టెండరింగ్ ప్రాసెస్ జరగలేదు. నామినేషన్ ప్రాసెస్ ద్వారా వ్యాప్కొస్ సంస్థకు కాంట్రాక్టు అప్పగించారు- సుధాకర్ రెడ్డికాళేశ్వరం ప్రాజెక్టు టెండర్ ప్రాసెస్ ఎందుకు చేయలేదు చెయ్యొద్దు అని ఎవరు ఆదేశించారు?- కమిషన్బ్యారేజీ పనులు పూర్తయినట్లు సర్టిఫికెట్ ఏ సమయంలో ఇస్తారు?- కమిషన్దాదాపు 90 శాతం పనులు పూర్తయితే సబ్ స్టాన్షల్ సర్టిఫికేట్ విడుదల చేస్తారు?- సుధాకర్ రెడ్డిపనులు పూర్తయినట్లు సర్టిఫికెట్ ఇచ్చేముందు ఫీల్డ్ విజిట్ లేదా డాక్యుమెంట్స్ చెక్ చేశారా?- కమిషన్ఫీల్డ్ విసిట్, డాక్యుమెంట్స్ చెక్ చేయకుండా పనులు పూర్తయినట్లు సర్టిఫికెట్ ఎలా ఇస్తారు?- కమిషన్42.2b క్లాజ్ ఉపయోగించి సర్టిఫికెట్‌ను రిజెక్ట్ చేసే అర్హత ఉన్నప్పటికీ ఎందుకు ఆపలేదు?- కమిషన్సర్టిఫికెట్ ఇచ్చేముందు అసలు నిజాలు చూడకుండా ఎలా గుడ్డిగా సంతకాలు పెడుతారు?- కమిషన్కాపర్ డ్యాం నిర్మాణం తొలగింపు కోసం అదనంగా ఖర్చు చేసే నిధులు ప్రభుత్వానికి నష్టమే కదా?- కమిషన్మేడిగడ్డ అన్నారం సుందిళ్ల ఫైనల్ బిల్లులు ఆలస్యం ఎందుకు అయ్యాయి? - కమిషన్అన్నారం సుందిళ్ల ఫైనల్ బిల్లులను నిర్మాణ సంస్థలు ఇచ్చాయి,.మేడిగడ్డ బ్యారేజీ ఫైనల్ బిల్లులు ఇంకా సబ్మిట్ చేయలేదు.- సుధాకర్ రెడ్డిబిల్లుల చెల్లింపుల అంశంలో కాళేశ్వరం కార్పొరేషన్ ప్రస్తావన..కాళేశ్వరం కార్పొరేషన్ ఎవరు పెట్టారు? పెట్టమని ఎవరు ఆదేశించారు;- కమిషన్కాళేశ్వరం కార్పొరేషన్ ప్రభుత్వం పెట్టింది. అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో జరిగింది. సుధాకర్ రెడ్డిమేడిగడ్డ బ్యారేజీ కింద బొగ్గు గనుల ఆనవాళ్లు ఉన్నట్లు జోధాపూర్ యూనివర్సిటీ సర్దార్ కన్సల్టెన్సీ నివేదిక ఇచ్చింది. సుధాకర్ రెడ్డిబ్యారేజీలలో నీళ్లు స్టోరేజ్ చేయొచ్చా చేస్తే ఎంత చేయొచ్చు?- కమిషన్మేడిగడ్డ బ్యారేజీలో 100 మీటర్ల లెవెల్ వరకు స్టోర్ చేయొచ్చు.- సుధాకర్ రెడ్డిచేసుకున్న అగ్రిమెంట్ కంటే ఎక్కువ నిధులు ఏజెన్సీకి పే చేస్తే అది ప్రభుత్వానికి నష్టమే కదా- కమిషన్డిజైన్లలో లోపాల వల్ల బ్యారేజీల వద్ద డ్యామేజ్ జరిగింది నిజమేనా? - కమిషన్మేడిగడ్డ బ్యారేజీ లోని బ్లాక్ లలో లెన్త్ అండ్ విడ్త్ డిజైన్ సరిగ్గా లేకపోవడం వల్లే డ్యామేజి జరిగింది- సుధాకర్ రెడ్డి వరద వేగాన్ని అంచనా వేయకపోవడం వల్లే బ్లాకులు దెబ్బతిన్నాయి-సుధాకర్ రెడ్డి. -
మాజీ ఈఎన్సీకి కాళేశ్వరం కమిషన్ కీలక ఆదేశాలు
సాక్షి,హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు మాజీ ఇంజినీర్‌ఇన్‌చీఫ్(ఈఎన్సీ) వెంకటేశ్వర్లుకు కాళేశ్వరం విచారణ కమిషన్ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిర చేసింది. వెంకటేశ్వర్లు శుక్రవారం(అక్టోబర్ 25) కమిషన్ ముందు వరుసగా రెండోరోజు విచారణకు హాజరయ్యారు. రెండు రోజుల విచారణలో భాగంగా కమిషన్ మాజీ ఈఎన్సీని రెండు వందలకుపైగా ప్రశ్నలు అడిగింది. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పని ఈఎన్సీ జవాబులు డ్యాక్యుమెంట్ల రూపంలో అందిస్తానని కమిషన్‌కు తెలిపారు. దీంతో సోమవారం విచారణకు వచ్చేటపుడు డాక్యుమెంట్స్ తీసుకురావాలని కమిషన్ ఆదేశించింది. వెంకటేశ్వర్లు బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం ఈఎన్సీగా పనిచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం నిర్మాణంలో అక్రమాలపై విచారణకు కమిషన్ వేసిన విషయం తెలిసిందే.ఇదీ చదవండి: భూదాన్ భూముల భాగోతం.. ఐఏఎస్‌పై ఈడీ ప్రశ్నల వర్షం -
బరాజ్‌ల నిర్ణయం కేసీఆర్‌దే!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లను నిర్మించాలని నాటి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావే నిర్ణయం తీసుకున్నారని నీటిపారుదల శాఖ రామగుండం మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు చెప్పారు. 2016 జనవరిలో కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఓ సమావేశంలోనే ఈ మేరకు నిర్ణయం జరిగిందని పేర్కొన్నారు. వ్యాప్కోస్ రూపొందించిన కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిందని, కేసీఆర్ స్వయంగా సంతకం చేశారని అన్నారు. ఈ డీపీఆర్ ఆధారంగా వివిధ కాంపోనెంట్ల అంచనాలను సిద్ధం చేయాలని కేసీఆర్ ఆదేశించారని వివరించారు. బరాజ్‌లను ఎక్కడ కట్టాలో ప్రభుత్వమే చెప్పగా, ఆ మేరకు డీపీఆర్‌ను వ్యాప్కోస్ సిద్ధం చేసిందన్నారు. నిర్మాణ దశలో అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల స్థలాలను మార్చినట్టు చెప్పారు. గ్రావిటీ కాల్వ పొడవు తగ్గించడం, నిల్వ సామర్థ్యం పెంచడం, అటవీ భూముల సేకరణను తగ్గించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల నిర్మాణంపై విచారణలో భాగంగా జస్టిస్ పినాకి చంద్రఘోష్ గురువారం ఆరు గంటల పాటు నిర్వహించిన రెండో విడత ఎగ్జామినేషన్‌లో వెంకటేశ్వర్లు ఈ మేరకు వివరణ ఇచ్చారు. తొలి విడతలో ఆయనకు 71 ప్రశ్నలు వేసిన కమిషన్.. తాజాగా రెండో విడతలో ఏకంగా 128 ప్రశ్నలు సంధించింది. శుక్రవారం కూడా క్రాస్ ఎగ్జామినేషన్‌కు హాజరుకావాలని ఆదేశించింది. నిర్మాణ దశలో మార్పులు ‘డీపీఆర్‌ను 2016 మార్చిలో కేంద్ర జల సంఘానికి(సీడబ్ల్యూసీ) సమర్పించిన తర్వాత నిర్మాణంలో పలు మార్పులు, చేర్పులపై నిర్ణయాలు జరిగాయి. డీపీఆర్‌లో అన్ని కాంపోనెంట్లు లేవు. గైడ్‌బండ్, ఫ్లడ్ బ్యాంకులు, డైవర్షన్ చానల్స్‌ను తర్వాత చేర్చాం. నిర్మాణ దశలో సైట్ పరిస్థితుల ఆధారంగా మరికొన్ని మార్పులు చేశాం. స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ (ఎస్ఎల్సీ)లో తీసుకున్న నిర్ణయాల మేరకు ఈ మార్పులు జరిగాయి. డీపీఆర్‌లో అన్నారం బరాజ్‌ను 120 మీటర్ల ఎత్తులో నిర్మించాలని ప్రతిపాదించగా, అటవీ భూముల ముంపు, సైట్ పరిస్థితుల ఆధారంగా 119 మీటర్లకు కుదించాం. ప్రాథమికంగా మూడు బరాజ్‌లకు వేర్వేరు డీపీఆర్‌లను తయారు చేయగా, తర్వాత ఉమ్మడి డీపీఆర్‌ను తయారు చేశాం..’అని కమిషన్‌కు వెంకటేశ్వర్లు తెలిపారు. సీడబ్ల్యూసీ చెప్పడంతోనే రీఇంజనీరింగ్ ‘ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు 2007లో రూ.17,875 కోట్లతో అనుమతిచ్చి 2008లో రూ.38,500 కోట్లకు అంచనాలను పెంచి రూ.6,156 కోట్ల పనులు సైతం పూర్తి చేశాక 2 లక్షల ఎకరాల అదనపు ఆయకట్టు కోసం రీఇంజనీరింగ్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించాల్సిన అవసరం ఏమిటి?’అని కమిషన్ నిలదీసింది. ‘తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో బరాజ్‌కు మహారాష్ట్ర అభ్యంతరం తెలపడంతో 148 మీటర్లకు ఎత్తు తగ్గించి ఒప్పందం చేసుకున్నాం. ఆ ఎత్తులో బరాజ్ కడితే 44 టీఎంసీల లభ్యతే ఉంటుంది. తుమ్మిడిహెట్టి వద్ద నీటిలభ్యత లేదని సీడబ్ల్యూసీ చెప్పడంతోనే రీఇంజనీరింగ్ చేశారు’ అని వెంకటేశ్వర్లు వివరించారు.మ్యాథమెటికల్లీ తప్పుడు నిర్ణయమే ! ప్రాణహిత ప్రాజెక్టు ద్వారా రెండుదశల్లో కలిపి 304 మెగావాట్ల పంపుల సామర్థ్యంతో నీళ్లను ఎత్తిపోయడానికి వీలుండగా రీఇంజనీరింగ్ చేసి పంపుల సామర్థ్యాన్ని 11 వేల మెగావాట్లకు పెంచడం సరైందేనా అని కమిషన్ ప్రశ్నించగా, గణితపరంగా తప్పుడు నిర్ణయమేనని మాజీ ఈఎన్సీ పేర్కొన్నారు. కోల్‌బెల్ట్ ఏరియాలో మేడిగడ్డ బరాజ్ నిర్మించారా? అని ప్రశ్నించగా వాస్తవం కాదని ఆయన బదులిచ్చారు. బరాజ్ ప్రాంతంలో బొగ్గు నిక్షేపాలున్నట్టు జాదవ్‌పూర్ వర్సిటీ ఇచి్చన నివేదికను ప్రస్తావించగా దానితో తాను ఏకీభవించనని చెప్పారు. ప్రభుత్వ అధినేత ఆదేశాలతో బరాజ్‌లలో నీళ్లను నిల్వ చేశామని మరో ప్రశ్నకు బదులిచ్చారు. బెంగాల్ సహా 4 రాష్ట్రాల్లో నిర్మించిన బరాజ్‌లలో సికెంట్ పైల్స్ వాడినట్టు చెప్పగా.. తన స్వరాష్ట్రం బెంగాల్ పేరును ఉటంకించడంపై జస్టిస్ ఘోష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తు ఏంటి ?
-
‘మేడిగడ్డ’పై తుది నివేదిక ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల శాశ్వత పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలను సిఫారసు చేస్తూ తుది నివేదికను వెంటనే అందించాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ (ఎన్డీఎస్ఏ)కి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మరోసారి విజ్ఞప్తి చేయనున్నారు. ఈ నెల 11న ఢిల్లీకి వెళ్లనున్న ఆయన... ఎన్డీఎస్ఏ చైర్మన్ అనీల్ జైన్, ఇతర అధికారులతో భేటీ కానున్నారు. ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ గతంలో అందించిన మధ్యంతర నివేదికలో చేసిన సిఫారసుల ఆధారంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం బరాజ్‌లకు తాత్కాలిక మరమ్మతులు నిర్వహించింది.అయితే ప్రభుత్వం వివిధ సాంకేతిక పరీక్షలు నిర్వహించి తమకు నివేదికలు సమర్పించాకే తుది నివేదిక ఇస్తామని ఎన్డీఎస్ఏ గతంలో స్పష్టం చేసింది. శాశ్వత పునరుద్ధరణ పనులు నిర్వహించే వరకు నీళ్లను నిల్వ చేయరాదని ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ కోరడంతో ప్రస్తుతానికి మూడు బరాజ్‌లు ఉపయోగంలోకి లేవు. మరోవైపు వర్షాలతో గోదావరిలో వరద ఉధృతి పెరగడం వల్ల కొన్ని పరీక్షలను మాత్రమే నీటిపారుదల శాఖ పూర్తి చేయగలిగింది. వాటికి సంబంధించిన నివేదికలను అధికారులు ఢిల్లీకి వెళ్లి ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీకి అందజేశారు.సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ మేడిగడ్డ బరాజ్ కు పరీక్షలు నిర్వహించి అందించిన నివేదికను సైతం ఎన్డీఎస్ఏకు ఇటీవల అప్పగించారు. శాశ్వత పునరుద్ధరణ చర్యలపై తుది నివేదికను అందజేయాలని రాష్ట్ర అధికారులు కోరగా, మిగిలిన పరీక్షలను సైతం పూర్తి చేసి నివేదికలు సమరి్పస్తేనే తుది నివేదిక ఇస్తామని ఎన్డీఎస్ఏ అధికారులు తేల్చి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారుల విజ్ఞప్తుల కు ఎన్డీఎస్ఏ యంత్రాంగం స్పందించకపోవడంతో స్వయంగా ఢిల్లీ వెళ్లాలని మంత్రి ఉత్తమ్ నిర్ణయించారు. మంగళవారం సచివాలయంలో ఆయన నీటిపారుదల శాఖ ఈఎన్సీలు అనిల్‌కుమార్, నాగేంద్రరావు, హరిరామ్‌లతో సమావేశమయ్యారు. మేడిగడ్డకు ప్రత్యామ్నాయాలు.. గోదావరికి ఉపనది అయిన వార్దాపై బరాజ్‌తోపాటు ప్రాణహితపై తమ్మిడిహట్టికి దిగువన రబ్బర్ డ్యామ్ కట్టాలన్న ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ రెండింటి నీళ్లను గ్రావిటీ ద్వారా సుందిళ్ల బరాజ్‌కు తరలించి అక్కడి నుంచి ఎల్లంపల్లి బరాజ్‌లోకి పంపింగ్ చేయాలని యోచిస్తోంది. మేడిగడ్డ బరాజ్‌కు ప్రత్యామ్నాయంగా ఈ రెండు బరాజ్‌లు ఉపయోగపడనున్నాయి. మేడిగడ్డకు వెంటనే శాశ్వత మరమ్మతులు సాధ్యం కాకుంటే ప్రత్యామ్నాయాలుగా వాటిని నిర్మించే అంశంపై ఎన్డీఎస్ఏతో సమావేశం అనంతరం ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. మూసీ కాల్వలకు సత్వర అనుమతులు.. నల్లగొండ జిల్లాలోని మూసీ ప్రాజెక్టుకు సంబంధించిన బునాదిగాని కాలువ, ధర్మారెడ్డి కాలువ, పిల్లాయిపల్లి కాలువ పనులకు పరిపాలనా అనుమతులు పొందాలని అధికారులను మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. పాలమూరు–రంగారెడ్డి, సీతారామ, డిండి, దేవాదుల తదితర ఎత్తిపోతల పథకాల పెండింగ్ భూసేకరణను వేగంగా పూర్తి చేయాలన్నారు. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) పరిధిలోని సాంకేతిక సలహా మండలి పరిశీలనలో ఉన్న సీతమ్మసాగర్ ప్రాజెక్టు డీపీఆర్‌కు వెంటనే ఆమోదం లభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమ్మక్కసాగర్ బరాజ్ నిర్మాణం విషయంలో ఛత్తీస్‌గఢ్‌తో నెలకొన్న వివాదాన్ని పరిష్కరించుకొని ఎన్ఓసీ పొందడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.త్వరగా ఇంజనీర్లకు పదోన్నతులునీటిపారుదల శాఖలో ఇంజనీర్ల పదోన్నతులపై మంత్రి ఉత్తమ్ అధికారులతో చర్చించారు. పదోన్నతులపై హైకోర్టులో కేసు సోమవారం కొలిక్కి వచ్చే అవకాశముందని అధికారులు ఆయనకు వివరించారు. ఆ వెంటనే ఇంజనీర్లకు పదోన్నతులు జారీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
మేడిగడ్డపై తుది నివేదిక కోసం విజిలెన్స్ కసరత్తు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బరాజ్ వైఫల్యానికి గల కారణాలపై తుది నివేదిక అందించడానికి వీలుగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కసరత్తును ముమ్మరం చేసింది. మేడిగడ్డ బరాజ్‌కి సంబంధించిన అంశాలపై లోతైన విచారణలో భాగంగా కీలక అధికారులను విచారించింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు శనివారం నీటి పారుదల శాఖ మాజీ ఈఎన్సీ (జనరల్) సి.మురళీధర్, డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ అజ్మల్ ఖాన్ హాజరయ్యారు. మేడిగడ్డ బరాజ్ నిర్మాణంలో మార్పులు, చేర్పులకు ఆదేశాలు ఇచ్చింది ఎవరు..? సవరణ అంచనాలకు ఆమోదం తెలిపిందెవరు..? మేడిగడ్డ నిర్మాణ సంస్థకు బ్యాంకు గ్యారంటీలు విడుదల చేయాలని ఆదేశించింది ఎవరు..? వంటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 7న ఈఎన్సీ (ఓ అండ్ ఎం), స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ సభ్యుడు బి.నాగేంద్రరావును, 8న సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీవో) మాజీ చీఫ్ ఇంజనీర్ టి.శ్రీనివాస్, డైరెక్టర్ వర్క్ అకౌంట్స్ డైరెక్టర్ వి.ఫణిభూషణ్‌శర్మను విచారించనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల వైఫల్యాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సంస్థ ప్రాథమిక, మధ్యంతర నివేదికలు అందించగా...తుది నివేదికను సత్వరం అందించాలని కాళేశ్వరం విచారణ కమిషన్ విజిలెన్స్‌ను ఆదేశించింది. సెప్టెంబర్ నెలాఖరులోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించగా..ఆ సంస్థ మరింత గడువును కోరినట్లు తెలిసింది. దాంతో ఈ నెలాఖరుకల్లా తుది నివేదికను సమర్పించడానికి అవసరమైన వివరాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకోవడానికి వీలుగా కసరత్తును చేపట్టింది.