కాంగ్రెస్ ప్రభుత్వమే దానిని నిరూపించింది
మాజీ మంత్రి హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ప్రచా రం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం అదే ప్రాజెక్టు వ్యవస్థను ఉపయోగించుకుంటోందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బరాజ్‌లో కుంగిన మూడు పిల్లర్లను చూపుతూ మొత్తం ప్రాజెక్టు మీద రూ.లక్ష కోట్లు వృథా అయినట్లు ప్రజలను తప్పుదోవ పట్టించిందని మండిపడ్డారు.
ఇప్పుడు మల్లన్నసాగర్, ఇతర ప్రాజెక్టుల్లో నీటిని నింపుతూ ‘కాళేశ్వరం ప్రాజెక్టు వృథా’అని వారు సృష్టించిన సిద్ధాంతాన్ని వారే అబద్ధమని నిరూపిస్తున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు హరీశ్‌రావు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కాళేశ్వరం పంపింగ్ వ్యవస్థ ద్వారానే ఎల్లంపల్లి నీటిని ఎత్తిపోశారనే నిజాన్ని మంత్రి పొన్నం అంగీకరించాలన్నారు.
ఎల్లంపల్లిని వినియోగంలోకి తెచ్చాం
కాంగ్రెస్ పాలనలో వివక్షకు గురై పెండింగులో ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టు పనులను బీఆర్‌ఎస్ ప్రభుత్వమే పూర్తి చేసిందని హరీశ్‌రావు వెల్లడించారు. భూసేకరణ, పునరావాస కాలనీలు, కరీంనగర్ – మంచిర్యాల రాజీవ్ రహదారిపై హైలెవెల్ వంతెన.. తదితర పనులు పూర్తి చేసి ఎల్లంపల్లిని తమ హయాంలోనే నింపామన్నారు.
గతంలో కాంగ్రెస్ చేపట్టిన ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం కేవలం 14 టీఎంసీలు కాగా, రీ ఇంజనీరింగ్‌తో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 141 టీఎంసీలకు పెంచామన్నారు. ఎల్లంపల్లి నుంచి నీటిని లిఫ్ట్ చేసినా కూడా వినియోగించింది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మాణం అయిన వసతుల వల్లే సాధ్యమైందని అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో లింకు–1 పునరుద్ధరణపై దృష్టిపెట్టి, 2025 వానాకాలం పంటలకు నీరు ఇచ్చేలా మంత్రి పొన్నం ప్రభాకర్ కృషిచేయాలని హరీశ్‌రావు హితవు పలికారు.
సీఎల్పీ భేటీకి అరికెపూడి ఎలా వెళతారు?
శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశానికి హాజరు కావడంపై మంత్రి శ్రీధర్‌బాబు చేసిన వ్యాఖ్యలు.. నవి్వపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్లుగా ఉన్నాయని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు.
‘సిద్దిపేట నియోజకవర్గానికి ముఖ్యమంత్రి ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా వస్తే కలుస్తాను. కానీ ఎల్పీ మీటింగ్‌కు వస్తే కలవను, ఏ ఎమ్మెల్యే కలవకూడదు కూడా. పిల్లి కళ్లుమూసుకుని పాలు తాగినట్టుంది శ్రీధర్ బాబు వైఖరి’అని హరీర్‌రావు వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment