
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు మరోసారి విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వేదికగా మాట్లాడిన హరీష్ రావు.. కాంగ్రెస్ ప్రతీ విషయంలోనూ పారియిందంటూ మండిపడ్డారు. ఈరోజు(శుక్రవారం) అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన హరీష్ రావు.. కాంగ్రెస్ ప్రభుత్వం తాము అడిగిన ఏ ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వకుండా పారిపోయిందని ఎద్దేవా చేశారు.
‘ బడ్జెట్ పై ప్రభుత్వం క్లారిఫికేషన్ ఇవ్వకుండా పారిపోయింది. శాసన సభ చరిత్రలో చీకటి రోజు. ప్రభుత్వం తలుపు లు తెచిచే ఉంటాయని చెప్పిన డిప్యూటీ సీఎం భట్టి... కేవలం 20 శాతం కమిషన్ కోసం మాత్రమే తెరిచి ఉంచారని ఎద్దేవా చేశారు హరీష్.ప్రభుత్వం 20 శాతం కమిషన్ అడుగుతుందని కాంట్రాక్టర్లు సెక్రటేరియట్ లో ధర్మ చేశారు. ఉద్యోగుల విషయంలో భట్టి విక్రమార్క సభను తప్పుదోవ పట్టించారు.
2 లక్షల ఉద్యోగలా గురించి ప్రశ్నిస్తే సభను వాయిదా వేసి పారిపోయారు. ఎల్ఆర్ఎస్ అంశంలో భట్టి విక్రమార్క దాట వేశారు. ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాలని మేము డిమాండ్ చేస్తే డబ్బులు చెల్లించాల్సిదేని భట్టి స్పష్టం చేశారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పెండింగ్ బిల్లులు క్లియర్ చేయలేదు. బీఆర్ఎస్ అప్పులపై లెక్కలు చూపించాలంటే పారిపోయారు. కాంట్రాక్టర్లు అంటే పెద్ద పీట .. ఉద్యోగులు అంటే చిన్నచూపు. మహాలక్ష్మి పథకం అమలు లేదు కానీ.. అందాల పోటీలు పెడుతున్నారు. ప్రభుత్వం దగ్గర మా ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పారిపోయింది. సభలో అబద్ధాలు చెప్పి ప్రభుత్వం పారిపోయింది’ హరీష్ విమర్శనాస్త్రాలు సంధించారు.
Comments
Please login to add a commentAdd a comment