Assembly
-
ఢిల్లీలో ఒకే విడతలో ఎన్నికలు.. ఫిబ్రవరి 5న పోలింగ్
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడింది. విజ్ఞాన్ భవన్లో జరిగిన సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. ఢిల్లీలో ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి ఐదో తేదీన అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి ఎనిమిదో తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ఇలా.. జనవరి 10న ఎన్నికల నోటిఫికేషన్ ఎన్నికలకు పోలింగ్.. ఫిబ్రవరి 5ఎన్నికల ఫలితాలు.. ఫిబ్రవరి 8నామినేషన్లకు చివరి తేదీ.. జనవరి 17నామినేషన్ల విత్ డ్రా చివరి తేదీ.. జనవరి 20 #WATCH | Delhi to vote in a single phase on February 5; counting of votes on February 8 #DelhiElections2025 pic.twitter.com/QToVzxxADK— ANI (@ANI) January 7, 2025ఈ సందర్భంగా సీఈసీ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. దేశంలో ఓటర్ల సంఖ్య 99 కోట్లు దాటింది. గతేడాది ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాం. ఢిల్లీలో దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఉంటారు. ఓట్ల తొలగింపు ఆరోపణలను ఖండిస్తున్నాం. ఎన్నికలను పారదర్శంగా నిర్వహిస్తున్నాం. ఈవీఎంల పనితీరుపై పూర్తి విశ్వాసంగా ఉన్నాం. ఈవీఎంల వాడకంలో పారదర్శకత ఉంది. ఈవీఎంలు ట్యాపరింగ్ జరిగినట్టు ఆధారాలు లేవు. ఈవీఎంల విషయంలో అసత్యాలను నమ్మవద్దు. ఈ ఏడాది తొలి ఎన్నికల్లో ఢిల్లీలో జరగబోతున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ(Delhi Assembly)లో మొత్తం 70 స్థానాలు ఉన్నాయి. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఢిల్లీ అసెంబ్లీ ఏడవది. దీని గడువు ఫిబ్రవరి 15వ తేదీతో ముగియనుంది. ఢిల్లీకి స్టేట్ స్టేటస్ వచ్చాక 1993లో జరిగిన తొలి ఎన్నికల్లో బీజేపీ నెగ్గింది. అయితే ఐదేళ్ల పాలనలో ముగ్గురు సీఎంలను మార్చింది. ఆపై జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నెగ్గింది. షీలా దీక్షిత్ సారథ్యంలో హస్తం పార్టీ హ్యాట్రిక్ పాలన సాగించింది. ఇక..2013 నుంచి ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో కొనసాగుతోంది. దీంతో..ఈసారి ఎలాగైనా హస్తినను చేజిక్కించుకోవాలని బీజేపీ(BJP) భావిస్తోంది. మరోసారి అధికారం దక్కించుకోవాలని ఆప్ భావిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి అధికారంపై కన్నేసింది. హర్యానా ఎన్నికల తర్వాత ఇండియా కూటమి మిత్రపక్షాలైన ఆప్-కాంగ్రెస్‌లు మరోసారి ఢిల్లీ ఎన్నికల ముక్కోణ్ణపు పోటీలో తలపడనున్నాయి. -
ఏంటా రహస్యం?.. అసెంబ్లీలో మల్లు సోదరుల గుసగుసలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క.. ఆయన సోదరుడు, నాగర్‌కర్నూల్ లోక్‌సభ సభ్యుడు మల్లు రవి గుసగుసలాడుకున్నారు. అసెంబ్లీ లాబీల్లోని భట్టి చాంబర్‌కు మల్లురవి రాగా, ఆ సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావుతో పాటు ఇతరులు భట్టి చాంబర్లోనే ఉన్నారు. దీంతో తన సోదరుడితో రహస్యంగా మాట్లాడి మల్లు రవి వెళ్లిపోయారు.అయితే, అసెంబ్లీలో ఈ అన్నదమ్ములు ఎందుకు గుసగుసలాడారా అన్న విషయంపై ‘సాక్షి’ ఆరా తీయగా, రహస్యమేమీ లేదని ఎంపీ మల్లురవి చెప్పారు. అసెంబ్లీ ఆమోదం పొందిన మన్మోహన్సింగ్ సంతాప తీర్మానం ఇప్పించాలని, దానిపై తెలంగాణ ఎంపీల సంతకాలు పెట్టించి రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రికి ఇస్తానని భట్టికి చెప్పానని ఆయన వెల్లడించారు.ఇదీ చదవండి: హుస్సేన్ సాగర్ చుట్టూ నో ఎంట్రీ... హద్దు మీరితే అంతే -
మన్మోహన్ చిరస్థాయిగా నిలిచిపోతారు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉన్నంతకాలం మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ పేరు నిలిచిపోతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటుకు పార్లమెంట్లో అవసరమైన బలం లేకున్నా ప్రతిపక్షాలను ఒప్పించి నాటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాం«దీ, ప్రధాని మన్మోహన్ తెలంగాణ బిల్లును ఆమోదింపజేశారని గుర్తు చేసుకున్నారు. సోమవారం శాసనసభ ప్రత్యేక సమావేశంలో మన్మోహన్‌కు నివాళి అర్పిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చలో భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు ఉత్తమ్, శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహా, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క తదితరులు మాట్లాడారు. రుణమాఫీకి స్ఫూర్తినిచ్చారు: భట్టి చర్చలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ‘‘ఎందరో పుట్టి మాయం అవుతారు. కొందరు మాత్రమే ఈ భూమిపై మానవీయ పరిమళాలు వెదజల్లుతారు. అందులో మన్మోహన్ ఒకరు. దేశంలో తొలిసారిగా రైతు రుణమాఫీ చేసిన ప్రధాని ఆయనే. నేడు రాష్ట్రంలో రూ.2 లక్షల రుణమాఫీ అమలుకు స్ఫూర్తి ప్రదాత ఆయనే. దేశ ఆర్థిక, సామాజిక స్థితులను అర్థం చేసుకొని సమాచార హక్కు, అటవీ హక్కు, భూసేకరణ, ఉపాధి హామీ వంటి చట్టాలను తీసుకువచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఏర్పడగా... ఉపాధి హామీతో దేశ ప్రజలు ఆర్థిక మాంద్యం బారిన పడకుండా కాపాడగలిగారు..’’అని పేర్కొన్నారు. అణు ఒప్పందం చేసుకున్న ధీశాలి: ఉత్తమ్ దేశానికి రైతు వెన్నెముక అయితే.. దేశ రైతాంగానికి మాజీ ప్రధాని మన్మోహన్ వెన్నెముకగా నిలిచారనని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. యావత్ దేశ రైతాంగానికి ఏకకాలంలో ఋణమాఫీ చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని చెప్పారు. అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకోవడంతోపాటు ప్రతిపక్షాలు వ్యతిరేకించినా ఉభయసభల్లో బిల్లు పెట్టి ఆమోదింపజేసుకున్న ధీశాలి మన్మోహన్ అని కొనియాడారు. తన రాజకీయ గురువు పీవీ నరసింహారావు జన్మదిన వేడుకలను సంవత్సరం పొడవునా నిర్వహించాలని తమకు సూచించి గురుభక్తిని చాటుకున్నారని చెప్పారు. 114 ప్రెస్మీట్స్ పెట్టినా మౌన ప్రధానిగా విమర్శలు: శ్రీధర్‌బాబు మన్మోహన్ ప్రధానిగా మీడియా, విపక్షాల నుంచి నిరంతరం విమర్శలను ఎదుర్కొన్నారని మంత్రి శ్రీధర్‌బాబు గుర్తు చేసుకున్నారు. ఆయన 114 ప్రెస్మీట్లు పెట్టి మాట్లాడినా.. అన్యాయంగా మౌన ప్రధాని అని విమర్శించారని పేర్కొన్నారు. తెలుగు బిడ్డ పీవీ నాయకత్వంలో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ తీసుకొచ్చిన సరళీకృత ఆర్థిక విధానాలే నేడు దేశ ప్రగతికి దోహదపడుతున్నాయని చెప్పారు. మన్మోహన్‌కు గుర్తుగా పార్కు: కోమటిరెడ్డి విగ్రహం ఏర్పాటు మాత్రమే కాకుండా మన్మోహన్ సింగ్‌కు గుర్తుగా మంచి పార్కును రూపొందించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు. పార్లమెంటు ఎదుట ఎంపీలుగా తాము ధర్నాలో ఉండగా, తమ మధ్య కూర్చుకుని మద్దతు తెలపటాన్ని ఎన్నటికీ మరువలేమన్నారు. ఆయన వల్లే దేశ సుస్థిర ఆర్థిక పురోగతి: దామోదర రాజనర్సింహ దేశం స్థిరమైన ఆర్థిక పురోగతిని సాధించటంలో ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా మన్మోహన్ సింగ్ తీసుకున్న నిర్ణయాలే ప్రధాన కారణమని మంత్రి దామోదర రాజనర్సింహ కొనియాడారు. రాబోయే తరాలు కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన గొప్ప వ్యవహార శైలి మన్మోహన్సింగ్దని పేర్కొన్నారు. దేశమంతా మాట్లాడుకునేలా చేశారు: మంత్రి పొన్నం మన్మోహన్సింగ్ ఎక్కువగా మాట్లాడరని అంతా అంటారని, కానీ తాను చేసిన కార్యక్రమాలపై ప్రపంచమంతా మాట్లాడుకునేలా చేసిన గొప్ప వ్యక్తి ఆయన అని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ప్రపంచంలో మరే రాజకీయ నేత సాహసించని రీతిలో ఆయన సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చారన్నారు. ఆయన మాట్లాడితే ప్రపంచమంతా వింటుంది: సీతక్క విద్యకు ఒకేసారి రూ.70 వేల కోట్లను బడ్జెట్లో ప్రతిపాదించటమే కాకుండా దేశవ్యాప్తంగా 30 వేల పాఠశాలలను ఏర్పాటు చేశారని మన్మోహన్‌ను మంత్రి సీతక్క కొనియాడారు. మన్మోహన్ మాట్లాడితే ప్రపంచమంతా వింటుందని అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా గొప్పగా చెప్పారని గుర్తు చేశారు. -
మన్మోహన్ సింగ్ కు భారతరత్న ఇవ్వాలి: హరీశ్ రావు
-
తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ప్రారంభం
-
రేపు అసెంబ్లీ ప్రత్యేక భేటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ సోమవారం ప్రత్యేకంగా సమావేశం కానుంది. దేశాన్ని ఆర్థిక చిక్కుల నుంచి బయటపడేసి, అభివృద్ధి పథంలో పయనించేలా మార్గనిర్దేశం చేసిన మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు నివాళులు అర్పించనుంది. దేశానికి మార్గం చూపిన ఆయనకు భారత రత్న ఇవ్వాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇటీవల జరిగిన శాసనసభ శీతాకాల సమావేశాల అనంతరం ఈ నెల 21న సభ నిరవధికంగా వాయిదాపడిన సంగతి తెలిసిందే.అయితే సభను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇంకా ప్రోరోగ్ చేయకపోవడంతో.. ఈ నెల 30న సోమవారం ప్రత్యేక భేటీ నిర్వహించాలని నిర్ణయించారు. దీనిపై స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ఆదేశాల మేరకు సోమవారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ప్రారంభించనున్నట్టు శాసనసభ వ్యవహారాల కార్యదర్శి డాక్టర్ నరసింహాచార్యులు శనివారం లేఖ విడుదల చేశారు. ఈ ప్రత్యేక సమావేశం ఒక్కరోజుకే పరిమితం చేయనున్నారు. మన్మోహన్‌ను కొనియాడుతూ తీర్మానం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈనెల 3వ తేదీ వరకు ఏడు రోజుల పాటు సంతాప దినాలుగా పాటిస్తున్నాయి. ఈ క్రమంలో మన్మోహన్ ప్రధానిగా ఉన్న సమయంలోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటాన్ని గుర్తు చేసుకుంటూ, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో ఆయన కృషిని కొనియాడుతూ తీర్మానం చేయడం ద్వారా నివాళి అర్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఆధునిక భారత దేశ ఆర్థిక సంస్కర్తగా పేరుగాంచిన మన్మోహన్‌కు ‘భారతరత్న’ఇవ్వాలని కోరుతూ తీర్మానం చేసే అవకాశం ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.ప్రత్యేక భేటీకి ప్రతిపక్ష నేత కేసీఆర్మాజీ ప్రధాని మన్మోహన్‌కు నివాళి అర్పించేందుకు సోమవారం నిర్వహిస్తున్న అసెంబ్లీ ప్రత్యేక భేటీకి బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు హాజరయ్యే అవకాశం ఉన్నట్టు తెలిసింది. మన్మోహన్ నేతృత్వంలోని కేబినెట్లో కొంతకాలం కేంద్ర మంత్రిగా పనిచేసిన కేసీఆర్.. పలు సందర్భాల్లో ఆయనతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కేసీఆర్ సీఎం అయ్యాక తెలంగాణ ఏర్పాటులో మన్మోహన్ సహకారాన్ని రికార్డుల్లో చేర్చాలని కోరుతూ అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు కూడా. ఈ నేపథ్యంలో మన్మోహన్ కృషిని కొనియాడుతూ, నివాళి అర్పించే అసెంబ్లీ ప్రత్యేక భేటీకి ప్రతిపక్ష నేతగా కేసీఆర్ హాజరవుతారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. -
రైతు సాయానికి కోతలు పెట్టే కుట్ర
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతులకు అందాల్సిన పెట్టుబడి సాయంలో కోతలు పెట్టేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కె.తారక రామారావు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే రైతు బంధుపై దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఎలాంటి ఆంక్షలు, కత్తిరింపులు లేకుండా రైతు భరోసా అమలు చేయాలని డిమాండ్ చేశారు. శాసనసభలో శనివారం రైతు భరోసా అంశంపై స్వల్పకాలిక చర్చ జరిగింది. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చర్చను ప్రారంభిస్తూ.. ఈ పథకంపై సభ్యులు సూచనలు చేయాలని, దీని ఆధారంగా విధివిధానాలు రూపొందిస్తామని తెలిపారు.కేటీఆర్ ఈ చర్చలో మాట్లాడారు. ‘‘రైతు భరోసాకు రూ.23 వేల కోట్లు అవసరమైతే రూ.15 వేల కోట్లు మాత్రమే బడ్జెట్లో కేటాయించడం కోత విధించడానికే. రైతు భరోసాపై మంత్రివర్గ ఉప సంఘం ఇచ్చిన నివేదికను ప్రజల ముందుంచాలి. ఎన్నికల హామీ ప్రకారం రాష్ట్రంలో ఉన్న 22 లక్షల మంది కౌలుదార్లకు కూడా రైతు భరోసా ఇస్తారా?’’అని ప్రశ్నించారు. ప్రభుత్వం యాసంగి, వానాకాలం కలిపి ఒక్కో రైతుకు రూ.17,500 చొప్పున... రైతులందరికీ కలిపి రూ.26,775 కోట్లు బాకీ పడిందని చెప్పారు. గెలిచిన వెంటనే ఎకరానికి రూ.15 వేలు ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ఆంక్షలు లేకుండా పెట్టుబడి సాయం ఇవ్వాలిరైతులు పచ్చగా ఉంటే కొంతమంది కళ్లు మండుతున్నాయని కేటీఆర్ విమర్శించారు. రైతు బంధు తీసుకుంటున్న వారిలో 98 శాతం సన్న, చిన్నకారు రైతులే ఉన్నారని తెలిపారు. 91.33 శాతం లబ్ధిదారులు ఐదెకరాల కంటే తక్కువ ఉన్నవారేనని.. 5 నుంచి 10 ఎకరాలు 7.28 శాతం మందికే ఉన్నాయని, 10 ఎకరాలు పైబడి ఉన్నవాళ్లు 1.39 శాతమేనని పేర్కొన్నారు. 25 ఎకరాలపైన ఉన్న పెద్ద రైతులు కేవలం 0.09 శాతం మాత్రమేనని చెప్పారు.రైతుబంధు నిధుల్లో 70 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ రైతుల ఖాతాల్లోనే పడ్డాయని వివరించారు. గిరిజనులకు చెందిన 4.5 లక్షల ఆర్వోఎఫ్ఆర్ భూములకు, పత్తి, కంది ఉద్యానవనాలకు రైతు భరోసా ఇస్తారా? లేదా? చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వ్యవసాయ స్థిరీకరణ జరిగే వరకు కూడా ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతు బంధు ఇవ్వాలన్నదే తమ ఉద్దేశమని తెలిపారు.రుణమాఫీ నిరూపిస్తే రాజీనామా.. ‘‘రాష్ట్రంలో ఏ గ్రామంలోనైనా వంద శాతం రుణమాఫీ జరిగినట్టు కాంగ్రెస్ సర్కారు నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తా. రుణమాఫీకి రూ.49,500 కోట్లు అవసరమని లెక్క తేల్చారు. రూ.40 వేల కోట్లు అవుతుందని సీఎం అన్నారు. కేబినెట్లో రూ.31 వేల కోట్లు అన్నారు. తీరా బడ్జెట్లో రూ.26 వేల కోట్లు కేటాయించారు. ఆఖరుకు రూ.17,934 కోట్లే మాఫీ చేశారు..’’అని కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎక్కడన్నా 24 గంటల ఉచిత విద్యుత్ అందించినట్టు లాక్బుక్కుల్లో చూపిస్తే తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.నల్లగొండకు నీళ్లు ఇచ్చిన అంశంపై ఆ జిల్లాలోనే తేల్చేందుకు తాము సిద్ధమని ప్రకటించారు. పాలమూరులో పెండింగ్ ప్రాజెక్టులు చేపట్టి వలసలు ఆపామని చెప్పారు. తెలంగాణలో ఎవరైనా చనిపోతే స్నానానికి కూడా నీళ్లు లేని పరిస్థితి ఉందని గతంలో కాంగ్రెస్ పారీ్టపై సీఎం రేవంత్ చేసిన విమర్శలను కేటీఆర్ గుర్తు చేశారు. రైతుబంధు వల్ల రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తి పెరిగిందని కేటీఆర్ తెలిపారు.రుణమాఫీపై చర్చిద్దాం.. రెడీనా?సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ ఇచ్చిన మాట మేరకు పెట్టుబడి సాయం పెంచి ఇవ్వాల్సిందేసాక్షి, హైదరాబాద్: మొత్తం రుణమాఫీ చేశామని సీఎం రేవంత్‌రెడ్డి చెబుతున్నారని... దీనిపై ఆయన స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో అయినా, సొంత నియోజకవర్గం కొడంగల్లోనైనా రైతుల ముందు చర్చిద్దామా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కె.తారక రామారావు సవాల్ చేశారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.వివరాలు ఆయన మాటల్లోనే... ‘‘రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి బండారం బయటపడటంతో అసెంబ్లీలో ఆగమయ్యారు. ఆరు గ్యారంటీలు, రుణమాఫీ అమలు చే యడం చేతకాదని చెప్పకనే చెప్పారు. రూ.49,500 కోట్ల రుణమాఫీ రూ.26 వేల కోట్లతో ఎలా అయిందో రేవంత్ చెప్పలేకపోయారు. కేవలం 25శాతం రుణమాఫీ చేసి 100శాతం అయిందని చెబుతున్నారు. రైతుబంధులో రూ.22 వేల కోట్లు ఎవరికి ఇచ్చారో అడిగితే ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదు. కంది, పత్తి, మొక్కజొన్నల రెండో పంటకు రైతుబంధు ఇవ్వకుండా కుట్ర చేస్తున్నారు. బీఆర్ఎస్ పదేళ్లలో రూ.28 వేల కోట్ల రుణమాఫీ చేస్తే.. కాంగ్రెస్ రూ.12 వేల కోట్లు మాత్రమే చేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నిలదీయండి రైతుబంధుకు పాన్‌కార్డు ఆప్షన్ పెడితే 1.30 కోట్ల మంది నష్టపోతారు. ఐటీ ఉన్న వారందరికీ రైతుబంధు కట్ చేస్తే ఇక మిగిలేదెవరు? మాజీ సీఎం కేసీఆర్ చెప్పినట్టుగా కాంగ్రెస్ వస్తే రైతుబంధు బంద్ అయింది. రుణమాఫీ, రైతుబంధు ఏమైందని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ప్రజలంతా నిలదీయాలి. ఆరు గ్యారంటీలు, 420 హామీలు అమలయ్యేదాకా కాంగ్రెస్ పార్టీని వదిలేది లేదు. రేవంత్‌రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని నీడలా వెంటాడుతూనే ఉంటాం. రైతు ఆత్మహత్యలపై అన్నీ అబద్ధాలే.. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు చెప్పే దుస్థితికి దిగజారింది. కేంద్ర నేర గణాంక సంస్థ (ఎన్సీఆర్బీ) లెక్కల ప్రకారం... 2014లో 1,348 రైతు ఆత్మహత్యలు జరిగితే... రైతు బంధు పథకం ప్రారంభమైన తర్వాత 2022 నాటికి కేవలం 178 మందికే తగ్గింది. పదేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ప్రోత్సాహం ఇవ్వడంతోనే ఆత్మహత్యలు తగ్గాయి. రాష్ట్రం ఏర్పడక ముందు దేశంలోనే తెలంగాణ ప్రాంతం రైతు ఆత్మహత్యల్లో తొలి రెండు స్థానాల్లో ఉండేది. ఓటుకు నోటు దొంగ రేవంత్‌రెడ్డి చెప్పే ప్రతీ మాటా నమ్మాల్సిన అవసరం లేదు. రైతు భరోసా ఇచ్చేదెప్పుడో! సంక్రాంతి తర్వాత రైతుభరోసా ఇస్తామంటున్న ప్రభుత్వం ఏ సంక్రాంతికో చెప్పడం లేదు. రైతు భరోసాపై కాలయాపన కోసమే కమిటీ వేశారు. ప్రజలు కోరుకున్నది పేర్ల మార్పిడి కాదు, గుణాత్మకమైన మార్పు. మేం సీఎం రేవంత్‌రెడ్డి కేసులకు, ఈడీ, మోదీలకు భయపడబోం’’అని కేటీఆర్ పేర్కొన్నారు. -
నేను తొక్కుకుంటూ వచ్చా..
సాక్షి, హైదరాబాద్: ‘‘నేను నల్లమల నుంచి వచ్చా. క్రూరమృగాల మధ్య పెరుగుకుంటూ వచ్చా. తొక్కుకుంటూ వచ్చా. ఇక్కడున్నోళ్లను తొక్కితే అక్కడ తేలిన్రు. నేను అయ్య పేరుమీదనో, మామ పేరుమీదనో వచి్చనోడిని కాదు. స్వశక్తిని నమ్ముకొని పైకొచ్చినవాడ్ని. అమెరికాలోనో, గుంటూరులోనో చదువుకున్న చావు తెలివితేటలు వాళ్లకుంటే ఉండొచ్చు. నాకు సామాన్యుడి తెలివితేటలు ఉన్నాయి. నా వ్యక్తిగత కోపతాపాలు చూపవద్దని ఇంతకాలం ఓపికతో ఉన్నా.ఈ ఆర్థిక విధ్వంసకారులను నియంత్రించే శక్తి, క్రూరమృగాలను కూడా బోనులో బంధించే శక్తి నా సభకు, సభ్యులకు ఉంది’’అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం శాసనసభలో రైతు భరోసాపై జరిగిన స్వల్పకాలిక చర్చలో సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. అందులో ముఖ్యాంశాలు రేవంత్ మాటల్లోనే... ‘‘తెలంగాణపై కమిట్మెంట్ ఉన్నోళ్లు కూడా కొందరు అటువైపు ఉన్నారు. వారికి చెప్తున్నా.. దొంగలకు సద్దులు మోసేవాళ్ల సావాసం మంచిది కాదు. వాళ్లు ఇదే నగరంలో పుట్టినవారు. హైదరాబాద్ కూడా Éఢిల్లీలా కాలుష్యం కోరల్లో చిక్కుకోవాలా? నల్లగొండకు ఫ్లోరైడ్ నుంచి మోక్షం వద్దా? బావాబామ్మర్దులిద్దరూ రండి. నల్లగొండకో, రంగారెడ్డికో, భువనగిరికో, మునుగోడుకో, ఎల్బీనగర్కో, సూర్యాపేటకో పోదాం. మూసీ పునరుజ్జీవం చేయాలా? వద్దా? ప్రజలను అడుగుదాం. నేను, రాజగోపాల్‌రెడ్డి గన్‌మన్ లేకుండా వస్తాం. మీరూ రండి. జనం మధ్యనే తేల్చుకుందాం. వాళ్లలా ఇస్తే ప్రతిపక్షాల సీట్లలోనే ఉంటాం.. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో రైతు భరోసాకు శ్రీకారం చుట్టింది. దీనిపై ఎవరికీ అనుమానాలు అవసరం లేదు. గత ప్రభుత్వం గొప్పగా చెప్పుకొనే రైతుబంధు కేవలం పెట్టుబడి సహాయ పథకం మాత్రమే. ఆ రూపంలో రూ.72,816 కోట్లు ఇస్తే.. అందులో రూ.22,606 కోట్లు సాగులోనే లేని రాళ్లురప్పలకు, గుట్టలకు, రోడ్లు, రియల్ ఎస్టేట్ భూములు, పరిశ్రమల స్థలాలకు ఆయాచితంగా చెల్లించారు. గిరిజనులకు అందించిన పోడు భూములకు బీఆర్ఎస్ నేతలు నకిలీ పట్టాలు రూపొందించి రైతుబంధు పొందారు. ఇప్పుడు మేం కూడా అలా చెల్లించాలంటూ బీఆర్ఎస్ నేతలు నీతులు చెప్తున్నారు. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటే మేం ఇక్కడ ఎందుకు కూర్చుంటాం, ప్రతిపక్షాల సీట్లలోనే ఉంటాం కదా. ఇక వారి నేత ఆయన చేసిన అద్భుతాలపై ప్రశి్నస్తారన్న భయంతో సభకే రావడం లేదు. నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పే సంఘానికి అధ్యక్షుడు ఆయన. ఉపాధ్యక్షుడు.. అదే వర్కింగ్ ప్రెసిడెంట్ వచ్చి రైతు ఆత్మహత్యలపై అబద్ధాలు చెప్పారు. ఇక వారు చేసిన రుణమాఫీ వడ్డీలకే మాత్రమే సరిపోయింది. అదికూడా ఔటర్ రింగురోడ్డును తెగనమ్మి రూ.7,500 కోట్లు తెచ్చి రుణమాఫీకి వాడేశారు. మేం కేవలం 27 రోజుల్లో రూ.17,869.21 కోట్లు రుణమాఫీ చేశాం. సాంకేతిక కారణాలతో మాఫీ కాని వారికోసం నవంబర్‌లో రూ.2,747 కోట్లు విడుదల చేశాం. మొత్తం 25,35,963 మందికి రూ.20,616 కోట్లు మాఫీ చేసి వారి రుణం తీర్చుకున్నాం. స్విస్ బ్యాంకు కూడా అప్పులిస్తారు.. రైతుల రుణాలను ఒకేసారి మాఫీ చేయలేం. రూ.8 వేల కోట్లు కావాలి. మా దగ్గర నల్లధనం లేదు అని నాటి సీఎం అన్నారు. నల్లధనం ప్రభుత్వం వద్ద లేదేమోగానీ వారి వద్ద ఎందుకుండదు? అంతా అక్కడికే కదా చేరింది. స్విస్ బ్యాంకుకు కూడా అప్పు ఇచ్చే సామర్థ్యం వాళ్లది.ఆయన కోసం ఏడాది నుంచి ఎదురుచూస్తున్నా..గత ప్రభుత్వం చేసిన అప్పులు రూ.7,11,807 కోట్లు. మేం అధికారంలోకి వచ్చాక రూ. 1,27,208 కోట్లు అప్పు చేశామంటున్నారు. రెండూ కలిపితే దాదాపు 8.39 లక్షల కోట్లు కావాలి. రెండు రోజుల క్రితం తీసుకున్న లెక్కల ప్రకారం రాష్ట్ర అప్పులు మొత్తం రూ.7,22,788 కోట్లే. 58 ఏళ్లలో 16 మంది సీఎంలు చేసిన అప్పు రూ.72 వేల కోట్లే. గత ప్రభుత్వం చేసిన అప్పులు, బకాయిల భారం లేకపోతే.. మేం అద్భుతాలు సృష్టించి ఉండేవాళ్లం. గత పదేళ్లలో కనీసం హాస్టళ్లకు భవనాలు కూడా కట్టలేకపోయారు. దీనిపై ముక్కు నేలకు రాసి దళిత, గిరిజన, మైనారిటీ పిల్లలకు క్షమాపణ చెప్పాలి. ముఖం చాటేస్తున్న ఆయన సభకు వస్తే అడిగి, కడుగుదామని సంవత్సరం నుంచి ఎదురుచూస్తున్నా.అన్నీ అడ్డుకుంటే అభివృద్ధి ఎలా? నా ప్రాంతం కాకున్నా కొడంగల్‌లో ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. అక్కడే మళ్లీ గెలిచి సీఎం అయ్యా. ఆ వెనకబడ్డ ప్రాంత ప్రజల రుణం తీర్చుకోవాలనుకున్నా, పరిశ్రమలు తేవాలని నిర్ణయించా. ఓ 50 వేల మందికి ఉద్యోగాలు రావటంతోపాటు ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయనుకున్నా. దీన్ని సహించలేని కొందరు డబ్బు, మద్యం పంచి అధికారులపై దాడులు చేయించారు. మూసీ వద్దంటారు, మెట్రో పొడిగిస్తామంటే వద్దంటారు, ఫ్యూచర్ సిటీ అంటే వద్దంటారు, పరిశ్రమలు వద్దంటారు.. తెలంగాణను అభివృద్ధి పథం వైపు నడిపించడం ఎలా సాధ్యం. తెలంగాణ పురోగతిని అడ్డుకునే వాళ్లను ఏం చేయాలో ప్రజలే చెప్పాలి..’’అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. -
సినిమా వాళ్లు స్పెషలా?: సీఎం రేవంత్
సినీ పరిశ్రమకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇలాంటి విషయాల్లో అమానవీయంగా వ్యవహరించొద్దు. మీరు సినిమా తీయండి. వ్యాపారం చేసుకోండి. డబ్బులు సంపాదించండి. ప్రత్యేక ప్రోత్సాహకాలు, సబ్సిడీలు అన్నీ తీసుకోండి. షూటింగ్స్ కోసం ఏమేం కావాలో అదీ తీసుకోండి. అయితే ఎవరిదైనా హత్య జరిగాక, ఎవరిదైనా ప్రాణం పోయాక మాత్రం స్పెషల్ ప్రివిలేజెస్ కోరితే.. అవి ఎట్టిపరిస్థితుల్లోనూ దొరకవు. నేను సీఎం సీట్లో ఉన్నంత వరకూ అది జరగదు. – సీఎం రేవంత్సాక్షి, హైదరాబాద్: సినిమా వాళ్లకు మానవత్వం లేకపోవడాన్ని ఏమనాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. సినీ పరిశ్రమ తీరు అమానవీయమని.. ఎవరి ప్రాణాలైనా పోయిన తర్వాత ప్రత్యేక హక్కు కావాలంటే దొరకదని పేర్కొన్నారు. కేవలం ఒక్కరోజు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన హీరోను పరామర్శించిన సినీ పరిశ్రమ పెద్దలు... బాధిత కుటుంబీకులను కనీసం పరామర్శించలేదని మండిపడ్డారు. సాధారణ ప్రజల ప్రాణాలు కాపాడటం తమకు ప్రధానమని.. ప్రాణాలు పోయేందుకు ఎవరు కారణమైనా విడిచిపెట్టబోమని హెచ్చరించారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణమైన వారిని విచారించి శిక్షించే వరకు విడిచిపెట్టబోమని ప్రకటించారు. శనివారం అసెంబ్లీలో రైతుభరోసాపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. ‘‘సంధ్య థియేటర్ తొక్కిసలాట విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అతిగా స్పందించిందన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఒక మహిళ చనిపోగా, ఒక బాలుడు కోమాలో, మరొకరు తొక్కిసలాటలో ఇరుక్కుపోతే.. ఆ హీరో కనీసం పట్టించుకోకుండా అభిమానులకు చేతులు ఊపుతూ వెళ్లడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?’’అని పేర్కొన్నారు. దీంతో సీఎం రేవంత్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘ఈ అంశం సభలో చర్చకు వస్తుందని అనుకోలేదు. డిసెంబర్ 4న పుష్ప–2 విడుదల సందర్భంగా హీరో, హీరోయిన్ వస్తారని బందోబస్తు కల్పించాలని డిసెంబర్ 2న సంధ్య టాకీస్ వాళ్లు చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌లో దరఖాస్తు చేశారు. ఆ ప్రాంతంలో రద్దీతోపాటు సంధ్య థియేటర్లోకి వెళ్లడానికి, బయటికి రావడానికి ఒకే గేటు ఉన్న కారణంగా సెక్యూరిటీ కల్పించలేమని అనుమతి నిరాకరిస్తూ 3న అక్కడి సీఐ సమాధానమిచ్చారు. అయినా 4న రాత్రి 9 గంటల ప్రాంతంలో అల్లు అర్జున్ ఆర్టీసీ క్రాస్‌రోడ్డు మీదుగా తన కారు రూఫ్‌టాప్ ఓపెన్ చేసి రోడ్‌షో నిర్వహిస్తూ థియేటర్‌కు వచ్చారు. తీవ్ర ట్రాఫిక్ రద్దీ ఉన్న ఆ ప్రాంతంలో వేలమంది ఒకచోట చేరడంతో పరిస్థితి అదుపు తప్పింది. అల్లు అర్జున్ 50, 60 మంది ప్రైవేట్ సెక్యూరిటీ అడ్డుగా ఉన్న వారిని తోసేయడం తొక్కిసలాటకు దారితీసింది. రేవతి అనే మహిళ, శ్రీతేజ్ అనే బాలుడు స్పృహ తప్పినట్టుగా పోలీసులు గుర్తించారు. అప్పటికే రేవతి మరణించగా, శ్రీతేజ్ బ్రెయిన్‌డెడ్‌గా వైద్యులు ప్రకటించారు. పోలీసులు చెప్పినా పట్టించుకోలేదు ఏసీపీ ఆ రోజు రాత్రి 11 గంటల సమయంలో సంధ్య థియేటర్‌కు వెళ్లి పరిస్థితి బాగో లేదని.. హీరోను అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరినా పూర్తి సినిమా చూస్తానంటూ ఆయన పట్టించుకోలేదు. తర్వాత డీసీపీ వెళ్లారు. వెంటనే వెళ్లిపోకపోతే అరెస్ట్ చేయాల్సి ఉంటుందని హెచ్చరించడంతో బయటికి వచ్చారు. ఇంత ప్రమాదం జరిగి, ఒకరు చనిపోయాక కూడా హీరో కారు రూఫ్‌టాప్ ఓపెన్ చేసి అభిమానులకు చెయ్యి ఊపుతూ వెళ్లారంటే... ఆయన ఎలాంటి మనిషి అనుకోవాలి? నేను సీఎం కుర్చీలో కూర్చుని మౌనంగా ఉండలేను. ఇంటికెళ్లిన పోలీసులతో దురుసుగా.. తొక్కిసలాట ఘటనపై పోలీసులు కేసు పెట్టారు. కొందరిని అరెస్ట్ చేశారు. కొన్నిరోజుల తర్వాత హీరో నివాసానికి కూడా వెళ్లి తమ వెంట రావాల్సిందిగా కోరారు. కానీ పోలీసులపై వారు దురుసుగా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయి. ఆ హీరోను పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లగానే... నా రాజకీయ మిత్రుల కోసం కేసు పెట్టానంటూ సోషల్ మీడియాలో కొన్ని రాజకీయపార్టీల వారు నన్ను పైశాచికంగా, నీచంగా తిడుతూ పోస్టులు పెట్టారు. బాధితులను కనీసం పరామర్శించలేదు శ్రీతేజ్ తండ్రి నెలకు రూ.30 వేలు సంపాదించే మామూలు ఉద్యోగి. కొడుకు ఆ హీరో అభిమాని కావడంతో.. స్పెషల్ షో కోసం ఒక్కో టికెట్‌కు రూ.మూడేసి వేల చొప్పున రూ.12 వేలు పెట్టి కొన్నారు. తల్లి రేవతి చనిపోయి, అబ్బాయి తీవ్ర అస్వస్థతకు గురై 11 రోజులు గడిచినా ఆ కుటుంబ సభ్యులను హీరో, ప్రొడ్యూసర్, మరెవరూ పరామర్శించలేదు. ఇది ఏరకమైన మానవత్వం? ఇలా వ్యవహరించే వారిని ఏమనాలి? విధి నిర్వహణలో భాగంగా హీరోను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళితే.. పదేళ్లు మంత్రిగా ఉన్న ఓ వ్యక్తి, ఉద్యమాల టైంలో షూటింగ్‌లు జరపొద్దంటూ దాడులు చేసిన వ్యక్తి విమర్శలు చేస్తారు. ఈ హీరో భగవత్ స్వరూపుడు, ఆయనను పోలీసులు ముట్టుకుంటారా? అసలేం జరుగుతోంది? అంటారు. అంటే మీ స్నేహితులైతే అరెస్ట్ చేయొద్దా? వారేం చేసినా మాఫీనా? ప్రత్యేక రాయితీలిచ్చింది మా సర్కారే కదా! సినీ పరిశ్రమను ప్రోత్సాహించాలని ఆ సినిమాకు టికెట్ రేట్ల పెంపు, స్పెషల్ షోలకు అనుమతినిచ్చింది మా ప్రభుత్వమే. అయితే ఇలా ప్రోత్సహించే క్రమంలో ప్రాణాలు తీసే ఘటనలు జరిగినా ఏమీ చేయకూడదంటే ఎలా? అంటే ఫిల్మ్‌స్టార్, సూపర్‌స్టార్, రాజకీయ ప్రముఖులు ఎవరినైనా హత్యచేసినా... వారిని ప్రాసిక్యూట్ చేయొద్దని ఏదైనా ప్రత్యేక చట్టం ఉంటే చెప్పండి పాటిస్తాం. సినీ ప్రముఖులను సూటిగా అడుగుతున్నా.. తల్లి చనిపోయింది, పిల్లవాడు బ్రెయిన్‌డెడ్ అయ్యి కోమాలో ఉంటే ఒక్కరైనా వెళ్లారా? సినీ ప్రముఖులను సూటిగా అడుగుతున్నా.. ఆ సినీ హీరోకు ఏమైంది కాలు పోయిందా? చెయ్యి పోయిందా? కన్ను పోయిందా? కిడ్నీలు దెబ్బతిన్నాయా? ఏమైంది.. వెళ్లి పరామర్శించడానికి.. అదే చావుబతుకుల్లో ఉన్న పిల్లవాడిని ఒక్కరూ పరామర్శించలేదు. ఇది సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి. హీరో అయితే అర్ధరాత్రి జైలు నుంచి వదిలిపెట్టాలా? హీరోకు హైకోర్టు బెయిల్ ఇచ్చింది. ఆయనను అర్ధరాత్రి 11, 12 గంటలకు విడుదల చేయాలని చాలా మంది గట్టిగా కోరారు. అర్ధరాత్రి జైలు నుంచి వదిలేందుకు చట్టంలో ఏదైనా వెసులుబాటు ఉందా? సినీహీరో కాబట్టి అర్ధరాత్రి వదిలిపెట్టాలంటే ఎలా? కొన్ని రాజకీయ పార్టీల నేతలు, పదేళ్లు మంత్రిగా ఉన్న వారు ఆ హీరోపై కేసు పెట్టడాన్ని తప్పుబడుతున్నారు. హీరో కాబట్టి ఏం చేసినా చెల్లుతుందా? మేం అంబేడ్కర్ రాసిన రాజ్యాంగానికి అనుగుణంగా చట్టం, న్యాయం ప్రకారం నడిపిస్తాం’’ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. -
అట్టుడికిన అసెంబ్లీ
సాక్షి, హైదరాబాద్: శాసనసభలో శుక్రవారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ‘ఫార్ములా–ఈ’రేసుపై ఏసీబీ కేసు మీద చర్చకు బీఆర్ఎస్ పట్టుబట్టడం, స్పీకర్ అంగీకరించకపోవడంతో నిరసనకు దిగడం, స్పీకర్ పోడియంను ముట్టడించే క్రమంలో వారికి మార్షల్స్‌కు మధ్య తోపులాట జరగడం, కాంగ్రెస్ సభ్యులు కూడా ఢీ అంటే ఢీ అన్నట్టు సిద్ధమవటంతో కొద్దిసేపు తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సభ వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమయ్యాక కూడా బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన కొనసాగించారు.తొలుత ఏసీబీ కేసుపై చర్చించాల్సిందే: హరీశ్‌రావు శుక్రవారం ఉదయం సభ ప్రారంభం కాగానే భూ భారతి బిల్లు పై చర్చను ప్రారంభించేందుకు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ సిద్ధమయ్యారు. అయితే బీఆర్ఎస్ సభ్యుడు హరీశ్‌రావు జోక్యం చేసుకుని ముందుగా ఫార్ములా–ఈ రేస్ విషయంలో ఏసీబీ కేసుపై చర్చించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ వెంటనే చర్చించలేని పక్షంలో ఎప్పుడు చర్చకు అనుమతిస్తారో ప్రకటించాలని కోరారు. ముందైతే భూ భారతి బిల్లుపై చర్చను కొనసాగిద్దామని, ఆ తర్వాత ఈ ఫార్ములా రేస్ అంశంపై చూద్దామని స్పీకర్ పేర్కొనగా.. హరీశ్‌రావు అభ్యంతరం చెప్పారు. ఆ సభ్యుడికి అవకాశం ఇవ్వాలి కదా.. ‘కేటీఆర్‌పై పెట్టింది అక్రమ కేసు కాకుంటే, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఈ సభలో ఈ–కార్ రేసింగ్ అంశంపై చర్చించాలని కోరుతున్నా. అసెంబ్లీ జరుగుతున్న సమయంలో ఓ సభ్యుడిపై అక్రమ కేసు పెట్టినప్పుడు ఆ సభ్యుడికి చెప్పుకునే అవకాశం ఇవ్వాలి కదా.. ఆయనకు చెప్పుకునే అవకాశం ఇస్తే ఆ కేసులో ఆయనది తప్పా, ఒప్పా అన్న విషయంలో ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకు కూడా ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ముమ్మాటికీ అక్రమ కేసు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీల గురించి, లగచర్ల అంశం గురించి ప్రశి్నస్తున్నాడు గనుకనే కేటీఆర్‌ను వేధించే క్రమంలో ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసు పెట్టారు..’అని హరీశ్‌రావు పేర్కొన్నారు. భూ భారతి రాష్ట్రానికి సంబంధించిన అంశం: స్పీకర్ స్పీకర్ స్పందిస్తూ..‘శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి సభలో లేరు. ఆయన వచ్చిన తర్వాత మీ వినతిపై నిర్ణయం తీసుకుంటాం. ముందైతే భూ భారతి మీద చర్చను కొనసాగిద్దాం..’అని అన్నారు. అయినా హరీశ్‌రావు, ఇతర బీఆర్ఎస్ సభ్యులు ముందు వరసలోకి వచ్చి ఫార్ములా–ఈ రేసుపై చర్చకు పట్టుబట్టారు. దీంతో ‘భూ భారతి రాష్ట్రానికి సంబంధించిన అంశం. మీరు అడుగుతోంది ఓ సభ్యుడికి సంబంధించింది.ముందు భూ భారతిపై చర్చ జరుపుదాం..’అని స్పీకర్ మరోసారి కోరారు. కానీ బీఆర్ఎస్ సభ్యులు పట్టువీడలేదు. కాంగ్రెస్ సభ్యుడు రేవూరి ప్రకాశ్‌రెడ్డి లేచి, ఈ–కార్ రేసింగ్‌పై విచారణకు గవర్నర్ అనుమతిచ్చాక, ఏసీబీ కేసు పెట్టిన తర్వాత శాసనసభలో దానిపై చర్చించే అంశమే ఉత్పన్నం కాదని, ప్రజల్లో ఓ అయోమయాన్ని సృష్టించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని విమర్శించారు. అనంతరం భూ భారతి బిల్లుపై స్పీకర్ చర్చ ప్రారంభించారు. స్పీకర్‌పైకి ప్లకార్డు ముక్కలు, కాగితాలు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చర్చను ప్రారంభిస్తూ.. భూ భారతి చట్టం తేవాలనుకోవటానికి గల కారణాలను వివరించటం ప్రారంభించారు. దీంతో బీఆర్ఎస్ సభ్యులు వెల్‌లోకి వచ్చి, ఈ–కార్ రేస్‌పై పెట్టిన కేసు కక్షపూరితమైందని పేర్కొనే ప్లకార్డులు పట్టుకుని నినాదాలివ్వటం ప్రా రంభించారు. తర్వాత స్పీకర్ పోడియం దగ్గర గుమిగూడారు. మార్షల్స్‌ను తోసుకుంటూ పోడియంను ముట్టడించారు.ఈ క్రమంలో మార్షల్స్‌కు, బీఆర్ఎస్ సభ్యులకు మధ్య తోపులాట జరిగింది. ఇంతలో మరికొందరు మార్షల్స్ అక్కడికి చేరుకుని బీఆర్ఎస్ సభ్యులను పోడియంకు దూరంగా నెట్టుకుంటూ తీసుకెళ్లారు. ఆ సమయంలో బీఆర్ఎస్ సభ్యుడు కౌశిక్‌రెడ్డి తన చేతిలోనే ప్లకార్డును ముక్కలు చేసి స్పీకర్‌పైకి విసిరారు. మరికొందరు సభ్యులు, అసెంబ్లీ వ్యవహారాలకు సంబంధించిన కాగితాలను పోడియం పైకి విసిరారు. బీఆర్ఎస్ సభ్యుడొకరు మంత్రి పొంగులేటి వైపు దూసుకు రావడంతో కొందరు కాంగ్రెస్ సభ్యులు ఆయనకు రక్షణగా నిలబడ్డారు. బీఆర్ఎస్ సభ్యులపైకి కాగితాలు ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ సభ్యులు కొందరు ముందు వరసలోకి వచ్చి కాగితాలను బీఆర్ఎస్ సభ్యులపైకి విసిరారు. పరిస్థితి చేయిదాటేలా ఉండటంతో స్పీకర్ సభను 15 నిమిషాలపాటు వాయిదా వేశారు. స్పీకర్ చాంబర్లో దీనిపై కాంగ్రెస్ సభ్యులు ఆయనతో చర్చించారు. 35 నిమిషాల తర్వాత సభ తిరిగి ప్రారంభం కాగా.. మంత్రి పొంగులేటి ప్రసంగాన్ని కొనసాగించారు. అయితే ఆయన మాట్లాడుతున్నంత సేపు బీఆర్ఎస్ సభ్యులు వెల్‌లో నినాదాలిస్తూ నిరసన తెలుపుతూనే ఉన్నారు.చర్చకు సహకరించాలని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు కోరినా బీఆర్ఎస్ సభ్యులు పట్టువీడలేదు. చర్చలో భాగంగా బీఆర్ఎస్కు అవకాశం ఇచ్చిన స్పీకర్, ఆ పార్టీ సభ్యుడు పల్లా రాజేశ్వరరెడ్డిని మాట్లాడాల్సిందిగా సూచించినా.. ఆయన నిరసనలోనే ఉండి మాట్లాడ్డానికి రాలేదు. దీంతో బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డికి స్పీకర్ అవకాశం ఇచ్చారు. అయినా బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన కొనసాగించారు. దీంతో చాంబర్‌కు వస్తే మాట్లాడదామని వారికి చెప్పిన స్పీకర్ సభను వాయిదా వేశారు. మధ్యాహ్నం తర్వాతా కొనసాగిన ఆందోళన మధ్యాహ్నం తర్వాత సభ ప్రారంభం కాగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్లకార్డులు పట్టుకుని స్పీకర్ పోడియం వద్దకు వెళ్లే ప్రయత్నం చేశారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి తదితరులు ముందుకు దూసుకువస్తుండడంతో మహిళా మార్షల్స్‌ను వారికి అడ్డుగా నిలబెట్టి నిలువరించే ప్రయత్నం చేశారు. ఈ గందరగోళంలోనే మహేశ్వర్‌రెడ్డి భూభారతి బిల్లుపై చర్చలో పాల్గొన్నారు. అప్పుడు కూడా బీఆర్ఎస్ సభ్యులు తమ ఆందోళన కొనసాగించారు.మహేశ్వర్‌రెడ్డి, ఆ తర్వాత మంత్రి పొంగులేటి, ఎంఐఎం నేత అక్బరుద్దీన్లు మాట్లాడుతున్నంత సేపు నినాదాలు చేశారు. దాదాపు 45 నిమిషాల పాటు నిరసన కొనసాగించినా స్పీకర్ పట్టించుకోక పోవడం, అధికార పక్షం స్పందించకపోవడం, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక వ్యక్తి కోసం తాపత్రయపడుతున్నారంటూ వ్యాఖ్యానించడంతో సభ నుంచి ని్రష్కమించారు. ఆ సమయంలో మాట్లాడుతున్న అక్బరుద్దీన్..‘బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఓడిపోయి వెళ్లిపోతున్నారు.’అని వ్యాఖ్యానించారు. మండలిలో వాయిదాల పర్వం శాసనమండలిలో శుక్రవారం వాయిదాల పర్వం కొనసాగింది. శుక్రవారం ఉదయం మండలి ప్రారంభం కాగానే ఫార్ములా ఈ–రేస్ విషయంలో ఏసీబీ కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. మధుసుదనాచారి, సత్యవతి రాథోడ్, కవిత, వాణీదేవి తదితరులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభ ముందుకు సాగనీయకుండా అడ్డుకున్నారు. చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఎదుటకు వచ్చి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు.కేసును తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో చైర్మన్ స్వల్ప విరామం ఇస్తూ సభను వాయిదా వేశారు. ఆ తర్వాత సభ ప్రారంభం కాగా.. బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన కొనసాగించడంతో చైర్మన్ భోజన విరామం కోసం వాయిదా వేశారు. ఆ తర్వాత సభ ప్రారంభమైనప్పుడు కూడా అదే వాతావరణం నెలకొనడంతో శనివారం ఉదయానికి వాయిదా వేశారు. -
హైదరాబాద్ లో బీజేపీ ఎమ్మెల్యేల వినూత్న నిరసన
-
దమ్ముంటే ‘ఫార్ములా–ఈ రేస్’ పై చర్చించండి
సాక్షి, హైదరాబాద్: ‘ఫార్ములా–ఈ రేస్’అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ మీడియా ద్వారా అవాస్తవాలు ప్రచారం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తద్వారా ఫార్ములా–ఈ రేస్ నిర్వహణలో ఏదో జరిగిందనే అపోహలు సృష్టించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు. దమ్ముంటే ఫార్ములా–ఈ రేస్ అంశంపై శాసనసభలో చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కేటీఆర్ బుధవారం లేఖ రాశారు. ‘ఫార్ములా–ఈ రేస్ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నెలలుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంతోపాటు నా మీద అనేక నిరాధార ఆరోపణలు చేస్తున్నది. అసెంబ్లీ ఆవరణలో సీఎం ఆధ్వర్యంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై గంటన్నర పాటు చర్చించినట్టు వార్తా కథనాలు వచ్చాయి. ఈ అంశం మీద నాలు గు గోడల నడుమ చర్చించడానికి బదులు గా శాసనసభ వేదికగా నాలుగు కోట్ల మంది ప్రజల ముందు సవివర చర్చ జరిగితే అందులో నిజానిజాలు ఏమిటో అందరికీ తెలు స్తాయి’అని కేటీఆర్ తన లేఖలో పేర్కొన్నా రు. ‘తెలంగాణ, హైదరాబాద్ నగరానికి మంచి జరగాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ‘ఫార్ములా–ఈ రేస్’ నిర్వాహ కులతో ఒప్పందం చేసుకుంది. తద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సుమారు రూ.700 కోట్ల లబ్ధి చేకూరిందని నీల్సన్ నివేదిక స్పష్టం చేసింది. 2024లో మరోదఫా రేస్ జరగాల్సి ఉండగా, కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్షంగా రద్దు చేసింది. ఒప్పందం పారదర్శకంగా జరిగినా ప్రభుత్వం మాత్రం దుష్ప్రచారం మానడం లేదు. నిజానిజాలేమిటో తెలుసుకునే హక్కు రాష్ట్ర ప్రజలకు ఉన్నందున శాసనసభలో ‘ఫార్ములా–ఈ రేస్’అంశంపై చర్చ పెట్టాలి’అని కేటీఆర్ సీఎం రేవంత్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలి: స్పీకర్‌కు బీఆర్ఎస్ వినతిఫార్ములా– ఈ రేస్ అంశంలో కేటీఆ ర్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న నిరాధార ఆరోపణలపై చర్చించాలని బీఆర్ఎస్ శాసనసభాపక్షం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మాజీ మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం బుధవారం స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు వినతిపత్రం అందజేసింది. సీఎం రేవంత్‌కు కేటీఆర్ రాసిన లేఖలోని అంశాలను ఉటంకిస్తూ ప్రస్తుత సమావేశాల్లో సభకు అనుకూలమైన రోజు ఈ అంశంపై చర్చించాలని స్పీకర్‌ను కోరారు. స్పీకర్‌ను కలిసిన వారిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్, కేపీ.వివేకానంద, కల్వకుంట్ల సంజయ్, విజయుడు, మాణిక్‌రావు, చామకూర మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, చింత ప్రభాకర్ ఉన్నారు. -
ఆటోల్లో అసెంబ్లీకి..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై రోజుకో రూపంలో నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బుధవారం ఖాకీ చొక్కాలతో అసెంబ్లీకి వచ్చారు. ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు ఉదయం 9.30కు చేరుకున్న నేతలు ఖాకీ చొక్కాలు ధరించి ఆటోల్లో అసెంబ్లీకి బయలుదేరారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, బండారి లక్ష్మారెడ్డి స్వయంగా ఆటోలు నడిపారు.మార్గంమధ్యలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తన వాహనాన్ని ఆపి నిరసన తీరు బాగుంది అంటూ వీడియో తీసుకున్నారు. కాగా బీఆర్ఎస్ జెండాలతో కూడిన ఆటోలతో పలువురు ఆటో కార్మికులు కేటీఆర్ నడుపుతున్న ఆటోను అనుసరిస్తూ అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. ప్రవేశ ద్వారం వద్ద ఆటోలను పోలీసులు అడ్డుకోవడంతో ఎమ్మెల్యేలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ, నినాదాలు చేస్తూ సభకు వచ్చారు. అంతకుముందు ఆదర్శనగర్ క్వార్టర్స్ వద్ద కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలేమయ్యాయి? ‘అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ 8 లక్షల మంది ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 93 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరి జాబితాను గత అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రభుత్వానికి ఇచ్చినా స్పందించడం లేదు. కాంగ్రెస్ ఇచి్చన హామీ మేరకు ఆటో డ్రైవర్లకు ఏటా రూ.12 వేలు ఇవ్వడంతో పాటు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి..’అని కేటీఆర్ డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ కార్మిక విభాగం నేతలు ఆటో డ్రైవర్ల సమస్యలతో కూడిన జాబితాను కేటీఆర్‌కు అందజేశారు. ఇలావుండగా ఆటోడ్రైవర్ల ఆత్మహత్యలు, హామీల అమలులో ప్రభుత్వ వైఫల్యంపై బీఆర్ఎస్ శాసనసభా పక్షం అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇచి్చంది. అదానీతో ఒప్పందాలు రద్దు చేసుకోవాలి కాంగ్రెస్ చలో రాజ్‌భవన్ సందర్భంగా బీఆర్ఎస్ను ఉద్దేశించి సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నిరసనకు దిగింది. సభ విరామ సమయంలో హరీశ్‌రావు నేతృత్వంలో లాబీలోని బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయం నుంచి ఒక్కసారిగా బయటకు వచ్చిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు అదానీ, రేవంత్‌రెడ్డి కలిసి ఉన్న ఫొటోలను ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ‘గల్లీలో దోస్తీ.. ఢిల్లీలో కుస్తీ, అదానీ..సీఎం భాయ్..భాయ్’అంటూ నినదించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్దకు చేరుకుని, అదానీతో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న రూ.12,400 కోట్ల ఒప్పందాలు రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. సభా హక్కుల ఉల్లంఘనపై చర్చకు అనుమతించండి శాసనమండలిలో బుధవారం ప్రశ్నోత్తరాల సందర్భంగా.. మూసీ సుందరీకరణ అంశంపై సీఎం రేవంత్ తరఫున మంత్రి శ్రీధర్‌బాబు తప్పుడు సమాచారం ఇచ్చారని బీఆర్ఎస్ శాసనసభా పక్షం ఆరోపించింది. ఎమ్మెల్సీ కవిత అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ.. మూసీ డీపీఆర్, ప్రపంచ బ్యాంకు నుంచి ఆర్థిక సాయం అంశంలో మంత్రి తప్పుడు సమాచారం ఇచ్చారని పేర్కొంది. శాసనమండలి నియమావళి 168 (ఏ) కింద సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబుపై తామిచ్చిన సభా హక్కుల ఉల్లంఘన నోటీసుపై చర్చకు అనుమతించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డికి వినతిపత్రం సమరి్పంచింది. -
శాసనసభలో కరీంనగర్ పంచాయితీ
సాక్షి, హైదరాబాద్: కరీంనగర్ పంచాయితీకి కొద్దిసేపు శాసనసభ వేదిక అయ్యింది. మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మధ్య వాగ్వాదం జరిగింది. అది వ్యక్తిగత విమర్శల దాకా వెళ్లింది. గురుకులాల్లో సౌకర్యాల కల్పనపై అసెంబ్లీలో సాగిన స్వల్పకాలిక చర్చలో మంత్రి సీతక్క మాట్లాడిన అనంతరం బీఆర్ఎస్ నుంచి గంగుల కమలాకర్ మాట్లాడుతూ తెలంగాణకు ఏర్పాటు కాక ముందు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు విద్య అందించలేదని, చదువు చెప్పలేదని వ్యాఖ్యానించారు.దీంతో మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ ‘ఆయన మారుమూల ప్రాంతం నుంచి కరీంనగర్‌కు వచ్చి కాంగ్రెస్ హయాంలో చదువుకోలేదా? ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో చదివితే ఆ బాధ తెలుస్తది. ఆయన ప్రభుత్వ పాఠశాలలో చదవలే. బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లలో చదవలే. మీకేం తెలుసు ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల గురించి’అని అన్నారు. దానికి గంగుల స్పందిస్తూ.. ‘మీరు మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలకు ట్రైనింగ్ ఇచి్చన అన్నరు. పార్లమెంట్, అసెంబ్లీ ప్రొసీడింగ్స్ తెలవయ్’అని వ్యాఖ్యానించారు. దానికి స్పందించిన పొన్నం ‘మొదటిసారి ఎమ్మెల్యేలకు ఏం తెలియదన్నట్లా, అజ్ఞానులన్నట్టా? పార్లమెంట్ మెంబర్ చేసిన, తెలంగాణ కోసం కొట్లాడిన. మీ నాయకుడు నిన్ను ‘షేర్ పటాక’అన్నాడు.తెలంగాణ ఉద్యమంల పార్టీ మారి ఇట్ల మాట్లాడితే ఎట్ల?’అని అన్నారు. దానికి కమలాకర్ బదులిస్తూ... ‘షేర్ పటాకనా, పెప్పర్ స్ప్రే డూప్లికేటా అని నేననలే. దొంగేడుపు ఏడవలే. కండ్లు పోయినయని ఏడువలె ’అని తెలంగాణ బిల్లు సందర్భంగా పార్లమెంట్లో జరిగిన సంఘటనలపై వ్యాఖ్యానించారు. దీంతో పొన్నం సీరియస్ అవుతూ ‘పార్లమెంట్లో పెప్పర్ స్ప్రే ఒరిజనలా, డూప్లికేటా రికార్డులు పరిశీలిద్దాం. కుక్క షేర్ పటాక.. ఎక్కడ శవం కనిపిస్తే అక్కడికి పోయి ఏడుస్తడని వాళ్ల నాయకుడు అన్నడు’అని వ్యాఖ్యానించారు. దీంతో గంగుల స్పందిస్తూ ‘మేం కరీంనగర్ తెలంగాణ చౌక్ల కొట్లాడిన దాన్ని అసెంబ్లీ దాక తీసుకొస్తున్నాడు.కరీంనగర్లో ఎందుకు ఓడిపోయినవ్ , ఎందుకు హుస్నాబాద్ పారిపోయినవ్ అని నేను అన్ననా? జిల్లా విడిచిపెట్టి పోతరా ఎవరన్నా? ’అని కామెంట్ చేశారు. దీనికి స్పందిస్తూ ‘కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు పోటీ చేయడానికి పారిపోయిన్రా? దమ్ముంటే రా. నెక్ట్స్ టైం వచ్చి నామీద పోటీ చేయ్. వేరే నియోజకవర్గానికి పోవడం తప్పా? నీలాగా కోట్ల కోట్లు లేవు. నాకు దమ్ముంది. అక్కడికి పోయి గెలిచిన’అని తీవ్రస్థాయిలో స్పందించారు. మంత్రి శ్రీధర్‌బాబు జోక్యంతో కరీంనగర్ పంచాయితీ సద్దుమణిగింది. -
సామాన్యుడి భూహక్కుల పరిరక్షణకే భూభారతి
భూభారతి చట్టాన్ని పూర్తిస్థాయిలో ఆన్‌లైన్‌లోకి తెచ్చిన తర్వాత 2014కు ముందు సబ్ రిజ్రిస్టార్ల వద్ద ఉన్న రికార్డులను అప్డేట్ చేస్తాం. 2014కు ముందు ప్రభుత్వ భూములుగా రికార్డుల్లో ఉండి తర్వాత అన్యాక్రాంతమైన భూములను తిరిగి స్వాధీనం చేసుకొని పేదలకు పంచే విషయాన్ని పరిశీలిస్తున్నాం. ధరణి లోపాలను పూర్తిగా సవరించి, ప్రతి అంశాన్ని క్షుణ్నంగా చర్చించి కొత్త చట్టాన్ని రూపొందించాం..’’ సాక్షి, హైదరాబాద్: సామాన్యుల భూహక్కుల పరిరక్షణే ధ్యేయంగా ‘ఆర్వోఆర్ –భూభారతి’ చట్టాన్ని రూపొందించామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో 49 ఏళ్ల క్రితం నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్ఓఆర్ చట్టం అద్భుతంగా పనిచేసిందని.. రాష్ట్ర విభజన తర్వాత కూడా ఏడేళ్ల పాటు కొనసాగిందని చెప్పారు. కానీ నాలుగు గోడల మధ్య అసంబద్ధంగా రూపొందించిన ‘ధరణి’తో కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్టుగా పరిస్థితి తయారైందని విమర్శించారు.లక్షల మందిని నానా తిప్పలు పెట్టిన ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామన్న హామీని అమల్లోకి తెచ్చి... దాని స్థానంలో ప్రజల భూమి హక్కులను సంరక్షించే సరికొత్త భూభారతి చట్టాన్ని తెస్తున్నామని ప్రకటించారు. బుధవారం శాసనసభలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూభారతి బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ప్రసంగించారు. వివరాలు పొంగులేటి మాటల్లోనే... ‘‘కొత్త చట్టంపై ఆగస్టు 2న ముసాయిదా ప్రవేశపెట్టాం. 40 రోజుల పాటు వెబ్సైట్లో ఉంచి, చర్చావేదికలు నిర్వహించి ప్రజాప్రతినిధులు, కవులు, మేధావులు, విశ్రాంత అధికారులు, సాధారణ ప్రజల సలహాలు, సూచనలు స్వీకరించి కొత్త చట్టాన్ని రూపొందించాం. మాజీ మంత్రి హరీశ్‌రావు వంటి వారు ఇచ్చిన సూచనలను కూడా పరిగణనలోకి తీసుకున్నాం. 18 రాష్ట్రాల్లోని ఆర్వోఆర్ చట్టాలను అధ్యయనం చేసి, ఉత్తమ విధానాలను కొత్త చట్టంలో పొందుపరిచాం. ధరణి తప్పులను భూభారతితో సరిదిద్దుతాం గత ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్ వల్ల లక్షలాది మంది మానసిక క్షోభకు గురయ్యారు. రవి అనే బీఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీ సభ్యుడు నా వద్దకు వచ్చి.. 1,398 ఎకరాల భూములపై గిరిజనులు హక్కులు కోల్పోవాల్సి వచ్చిందని, ధరణిలో వాటిని అటవీ భూములుగా చూపారని వాపోయారు. వేలాది పుస్తకాలు చదివిన మేధావి తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌తో లక్షలాది కొత్త సమస్యలు తలెత్తాయి. మానవ సంబంధాలను సైతం ధరణి దెబ్బతీసింది.భూయజమానికి తెలియకుండానే భూమి చేతులు మారిపోయేలా చేసింది. గత చట్టంలోని తప్పులను అధ్యయనం చేసి భూ–భారతి ద్వారా సరిదిద్దేలా ఏర్పాట్లు చేశాం. ధరణి పోర్టల్ పార్టు–బీలో ఉన్న 18 లక్షల ఎకరాలకు పరిష్కారం లభిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లోని ఆబాదీ/గ్రామకంఠం సమస్యలకు తెరపడుతుంది. భవిష్యత్తులో భూవివాదాలకు తావు లేకుండా ప్రత్యేక సర్వే ద్వారా శాశ్వత పరిష్కారం లభిస్తుంది. రిజ్రిస్టేషన్ దస్తావేజుల ద్వారా మ్యుటేషన్ జరిగేప్పుడు ఏవైనా తప్పులు జరిగితే అప్పీల్ చేసుకునే వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నాం. రిజ్రిస్టేషన్, ఆ వెంటనే మ్యుటేషన్ జరిగే వెసులుబాటు కలి్పంచటం ధరణిలో మెరుగైన అంశం. ఆ సమయంలో పొరపాట్లు జరిగితే కూడా సరిదిద్దే కొత్త ఏర్పాటుతో దాన్ని కొత్త చట్టంలో పొందుపరిచాం. ఆధార్ తరహాలో భూదార్.. ఆధార్ నంబర్ తరహాలో ‘భూదార్’ నంబర్ తీసుకొస్తాం. ప్రతి రైతుకు ఒక కోడ్ ఇస్తాం. గతంలో రెవెన్యూ గ్రామాల్లో ఒక ఏడాదిలో జరిగిన భూలావాదేవీలను పొందుపరిచేందుకు నిర్వహించే జమాబందీని బీఆర్ఎస్ ప్రభుత్వం తొలగించింది. దానిని తిరిగి తీసుకొస్తున్నాం. రైతుల భూములకు సంబంధించిన ఫిర్యాదులపై అప్పీల్ చేసుకునేందుకు ప్రస్తుతం ఎలాంటి వ్యవస్థ లేదు. దీనికోసం గతంలో కొనసాగిన ల్యాండ్ ట్రిబ్యునల్స్‌ను పునరుద్ధరించనున్నాం. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తుల ఆక్రమణల నుంచి రక్షించేందుకు సీసీఎల్ఏ ద్వారా చర్యలు తీసుకోనున్నాం. గతంలో పట్టదారు పాస్‌బుక్‌లలో ఉన్న అనుభవదారులు, కాస్తుదారుల కాలం (నిలువు వరుస)ను పునరుద్ధరించాలని నిర్ణయించాం. అక్రమాలకు పాల్పడే అధికారులపై కఠిన చర్యలు ఆన్లైన్లో ధరణి తీసుకొచ్చిన తర్వాత భూములకు సంబంధించిన పాత రికార్డులు లేకుండా చేశారు. ఇకపై ఆన్‌లైన్‌తోపాటు మాన్యువల్ పహాణీలను నమోదుచేయాలని కొత్త చట్టంలో పొందుపరిచాం. ప్రభుత్వ భూములను ఉద్దేశపూర్వకంగానో, ప్రలోభాలకు లోనైగానీ ప్రైవేటు వ్యక్తులకు అప్పగించిన అధికారులు, ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోనున్నాం. సులువుగా తెలుసుకునేలా భూముల వివరాలు గత ప్రభుత్వం ధరణిని 3 మాడ్యూల్స్‌తో ప్రారంభించి 33 మాడ్యూల్స్‌కు తీసుకొచ్చింది. తద్వారా పేద, చిన్నకారు రైతుల భూములు కనిపించని పరిస్థితి ఏర్పడింది. మేం భూభారతి ద్వారా 33 మాడ్యుల్స్ బదులు 6 మాడ్యుల్స్ తెస్తున్నాం. అలాగే గతంలో 32 కాలమ్స్ (నిలువు వరుసలు)లో ఉన్న పహాణీలను ఒకే కాలమ్‌లోకి తెచ్చారు. దీనిని భూభారతిలో 11 కాలమ్స్‌కు పెంచాం. ధరణి పోర్టల్‌లో సొంత భూమిని కూడా చూసుకునే వీలు లేకుండా దాచేవారు. భూభారతి ద్వారా ప్రపంచంలో ఎక్కడి నుంచైనా సర్వే నంబర్ల ఆధారంగా భూమి వివరాలు తెలుసుకోవచ్చు..’’ అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
TG: గురుకులాలపై అసెంబ్లీలో మాటల యుద్ధం
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలోని గురుకులాల విద్యార్థుల సమస్యలపై తెలంగాణ అసెంబ్లీలో బుధవారం(డిసెంబర్18) హాట్‌హాట్‌గా చర్చ జరిగింది. ఈ చర్చలో బీఆర్ఎస్ తరపున మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాల్గొన్నారు. ఇటీవల రాష్ట్రంలోని గురుకులాల్లో వివిధ కారణాలతో విద్యార్థులు మరణించడంపై ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇలా ఎంత మంది విద్యార్థుల చావులకు కారణమవుతారని ప్రశ్నించారు. వెంటనే గురుకులాల్లో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.దీనికి స్పందించిన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్క మాట్లాడుతూ అక్కడక్కడా గురుకులాల్లో ఫుడ్‌పాయిజన్ ఘటనలు జరిగిన విషయం వాస్తవమేనని ఒప్పుకున్నారు. తమ ప్రభుత్వం గురుకులాల అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. ఇటీవల విద్యార్థులకు 40 శాతం డైట్ ఛార్జీలు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో 54 యంగ్ ఇండియా స్కూళ్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు.మంత్రి పొన్నం వర్సెస్ గంగులఇదే విషయమై బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో గురుకులాలను పట్టించుకున్న పాపాన పోలేదని ఎదురుదాడి చేశారు.దీనికి గంగుల స్పందిస్తూ మొదటిసారి సభకు వచ్చిన వ్యక్తి తాను మాట్లాడుతుండగా అడ్డుకోవడం సరికాదన్నారు. దీనిపై పొన్నం అభ్యంతరం చెప్పారు. తాను ఎంపీగా పనిచేశానని, తనను మొదటిసారి సభ్యుడు అనడాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. తాను డబ్బుల సంచులతో గెలిచేవాడని కాదని, హుస్నాబాద్‌కు పారిపోయి గెలవలేదన్నారు. సభ్యుడు తొలిసారి వచ్చినా ఎన్నిసార్లు వచ్చిన గౌరవం ఇవ్వాలని మరో మంత్రి శ్రీధర్‌బాబు గంగులకు సూచించారు.గురుకులాల విషయమై కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి కూడా మాట్లాడారు. బీఆర్ఎస్ గురుకులాలకు కనీసం భవనాలు కట్టలేకపోయిందని విమర్శించారు.గురుకులాల్లో ప్రతి పనిని పెండింగ్‌లో పెట్టిందన్నారు. తాము ఎప్పుడూ సామాన్యులవైపే ఉంటామని,గురుకులాల అభివృద్ధికి కట్టుబడి ఉంటామని చెప్పారు. -
Formula E case: సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. దమ్ముంటే ఫార్ములా ఈ-రేస్ అంశంపై రాష్ట్ర శాసనసభలో చర్చ పెట్టాలని లేద్వారా సవాల్ విసిరారాయన.‘‘ఫార్ములా-ఈ రేస్ వ్యవహారంలో మీ ప్రభుత్వం కొన్ని నెలలుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద, ముఖ్యంగా నా మీద అనేక నిరాధార అరోపణలు చేస్తోంది. విషయం మీద ఈ వారం మీ ఆధ్వర్యంలో జరిగిన కేబినెట్ సమావేశంలో గంటన్నర సేపు చర్చ కూడా జరిగినట్టు వార్తా కథనాలు వచ్చాయి. ఈ అంశం మీద నాలుగు గోడల మధ్య చర్చ కన్నా రాష్ట్ర శాసన సభలో నాలుగు కోట్ల మంది ప్రజల ముందు చర్చ జరగితే నిజానిజాలు ఏమిటో అందరికీ తెలుస్తాయి.తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి మంచి జరగాలనే సదుద్దేశంతో గత ప్రభుత్వం ఫార్ములా-ఈ రేస్ నిర్వాహకులతో ఒక ఒప్పందం చేసుకున్నది. ఈ రేసు వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సుమారు రూ.700 కోట్ల రూపాయల లబ్ది చేకూరింది అని నీల్సన్ సంస్థ నివేదిక స్పష్టం చేసింది. 2024లో మరో దఫా రేస్ జరగవలసి ఉండగా మీ ప్రభుత్వం వచ్చిన వెంటనే దాన్ని ఏకపక్షంగా రద్దు చేయడం జరిగింది. అప్పటి నుంచి.. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఈ రేస్ గురించి అనేక అవాస్తవాలను మీడియా ద్వారా ప్రచారం చేసి, ఇందులో ఏదో జరిగింది అనే అపోహలు సృష్టించే ప్రయత్నం మీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది. ఫార్ములా-ఈ రేస్ ఒప్పందం అంతా పారదర్శకంగా జరిగింది. రేసు నిర్వాహకులకు చెల్లింపులు కూడా పారదర్శకంగానే జరిగాయి అని ఇదివరకే నేను వివరంగా చెప్పడం జరిగింది. అయినా మీ ప్రభుత్వం మాత్రం దుష్ప్రచారం మానడం లేదు.రాష్ట్ర ప్రజలకు నిజాలేమిటో తెలుసుకునే హక్కు ఉన్నది. కాబట్టే మీరు శాసనసభలో ఈ అంశంపై చర్చ పెట్టాలని నేను డిమాండ్ చేస్తున్నాను. దీనిపైన శాసనసభలో సవివరమైన చర్చ జరిగితే నిజానిజాలేమిటో నిగ్గుతేలుతాయి అని లేఖలో కోరారాయన.💥 దమ్ముంటే ఫార్ములా-ఈ రేస్ అంశంపై రాష్ట్ర శాసనసభలో చర్చ పెట్టండి - ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే @KTRBRS లేఖ❇️ ఫార్ములా-ఈ రేస్ వ్యవహారంలో మీ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై, ముఖ్యంగా నాపై, అనేక నిరాధార ఆరోపణలు చేస్తున్నది.❇️ ఈ అంశంపై ఇటీవల మీ… pic.twitter.com/Iv2fNkjAfl— BRS Party (@BRSparty) December 18, 2024 -
తెలంగాణ అప్పులపై అసెంబ్లీలో అధికార, విపక్షాల సమరం
-
కనీసం వెయ్యి కోట్లయినా ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.5,020 కోట్ల మేర పేరుకు పోయాయని, అందులో కనీసం రూ.1,000 కోట్లయినా విడుదల చేయాలని ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ ప్రభుత్వాన్ని కోరారు. 20 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన బకాయిలు విడుదల చేయకపోవడంతో కళాశాలల నిర్వహణ కష్టంగా మారిందని మంగళవారం జీరో అవర్ సందర్భంగా ఆయన అసెంబ్లీ దృష్టికి తెచ్చారు. విదేశీ విద్యానిధి పథకం కింద విద్యార్థికి రూ.20 లక్షలు మంజూరు చేసేందుకు రూ.5 లక్షలు కమీషన్ తీసుకుంటున్నారని ఆరోపించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారని.. ఏపీ, తెలంగాణలో లక్షలాది మంది విద్యార్థులు ప్రయోజనం పొందారని గుర్తుచేశారు. ఉస్మానియా తరలింపు ఆపండి: రాజాసింగ్ ఉస్మానియా ఆస్పత్రిని గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్‌కు తరలించే ప్రతిపాదనను రద్దు చేయాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు. గోషామహల్లో ఆస్పత్రి కడితే ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని, ఉస్మానియా వెనుకవైపు ఉన్న విశాలమైన స్థలంలో కొత్త నిర్మాణం జరపాలని సూచించారు. సింగరేణిలో పనిచేస్తున్న 30 వేల మంది కాంట్రాక్టు కారి్మకులకు కనీస వేతనాలను అమలు చేయాలని ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్ కోరారు. 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం కొత్తగూడెం, పాల్వంచ పట్టణాలను కలిపి కార్పొరేషన్‌గా ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహించాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. దళితబంధు పథకం కింద హుజూరాబాద్‌లో 5 వేల కుటుంబాలకు ఇవ్వాల్సిన రెండోవిడత ఆర్థిక సాయాన్ని విడుదల చేయాలని కోరారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామ్యూల్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ తదితరులు తమ నియోజకవర్గాల్లోని సమస్యలను సభ దృష్టికి తెచ్చారు. -
రెవెన్యూ డివిజన్లు, మండలాల గందరగోళాన్ని సరిదిద్దుతాం: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
సాక్షి, హైదరాబాద్: ‘గత ప్రభుత్వ హయాంలో కొత్తగా రెవెన్యూ డివిజన్లు, మండలాలను అస్తవ్యస్తంగా ఏర్పాటు చేశారు. దీంతో ఇప్పుడు ఇ బ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యమంత్రి, ఇతర మంత్రులతో చర్చించి వాటిని సరిచేసేందుకు సానుకూల నిర్ణయం తీసుకుంటాం’అని రె వెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. మంగళవారం శాసనసభ ప్రశ్నోత్తరాల స మయంలో పెద్దసంఖ్యలో సభ్యులు, రెవెన్యూ డి విజన్లు, మండలాల గందరగోళంపై అడిగిన ప్ర శ్నలకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు. చేర్యాలను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ సభ్యుడు పల్లా రాజేశ్వరరెడ్డి కోరారు.ఐదు మండలాలున్న చేర్యాల ప్రాంతంలో ప్రజలకు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని, పోలీసు సంబంధిత పనులకు హుస్నాబాద్‌కు, వ్యవసాయశాఖ పనులకు గజ్వేల్ కార్యాలయానికి, కలెక్టరేట్ కోసం సిద్దిపేటకు తిరగాల్సి వస్తోందని, దీన్ని సరిదిద్దాల్సిన అవసరముందన్నారు. ముధోల్, తాండూరు, జడ్చర్ల, వేములవాడ, నారాయణఖేడ్, వర్ధన్నపేట, మహబూబాబాద్.. ఇలా పలు నియోజకవర్గాల పరిధిలో నెలకొన్న ఇలాంటి సమస్యలపై సభ్యులు లేవనెత్తారు. చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అంశం కలెక్టర్ పరిశీలనలో ఉందని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇలాంటి సమస్యలపై సీఎం, సహచర మంత్రులతో చర్చించి వాటిని సరిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. -
దద్దరిల్లిన అసెంబ్లీ: చేతికి సంకెళ్లతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ నిరసన చేపట్టారు. నల్ల దుస్తులు, బేడీలతో అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. రైతులకు బేడీలా సిగ్గు సిగ్గు అంటూ నినాదాలు చేశారు. లగచర్ల రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు.‘లగచర్ల’ఘటనపై నిన్న (సోమవారం) కూడా శాసనసభ అట్టుడికింది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సభ్యుల నిరసనలు, నినాదాలతో హోరెత్తింది. ‘రాష్ట్రంలో పర్యాటక విధానం’అంశంపై మంత్రి జూపల్లి కృష్ణారావు లఘుచర్చను ప్రారంభించగానే బీఆర్ఎస్ సభ్యులంతా లేచి.. ‘లగచర్ల’రైతుల నిర్బంధం, అరెస్టులపై చర్చించాలని పట్టుబట్టారు. స్పీకర్ అంగీకరించకపోవడంతో ప్లకార్డులను ప్రదర్శిస్తూ, నినాదాలు చేశారు. వెల్‌లోకి దూసుకొచ్చి నిరసన తెలిపారు.మరోవైపు, లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి, చిత్రహింసలకు గురిచేశారని.. దీనిపై మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన తెలపాలని బీఆర్ఎస్ పిలుపు ఇచ్చింది. జైళ్లలో నిర్బంధించి, రైతన్న చేతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ అమానవీయ, అణచివేత విధానాలను నిలదీయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు. లగచర్ల రైతులపై కేసులను ఎత్తివేసి వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: ‘ఈ కార్ రేసు’ కేసు.. స్పందించిన కేటీఆర్ -
ఆ విషయం తెలిసే కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదు: మంత్రి కోమటిరెడ్డి
సాక్షి,హైదరాబాద్:బీఆర్ఎస్పై మరోసారి ఫైరయ్యారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. ఆ పార్టీ ఎమ్మెల్యేలను కేసీఆర్ హౌలా గాళ్లను చేస్తుండని సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం(డిసెంబర్16)కోమటిరెడ్డి అసెంబ్లీలో మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు.‘గతంలో కాంగ్రెస్ పార్టీకి ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా భట్టి విక్రమార్క రోజు సభకు వచ్చారు.ఇప్పుడు 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ ఎందుకు సభకు రావడం లేదు?ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి కంటే ఎక్కువ విలువ ప్రతిపక్ష నాయకుడికి ఉంటుంది.భవిష్యత్తులో బీఆర్ఎస్ ఖతం అవుతుంది అని కేసిఆర్ ముందే తెలుసుకొని సభకు రావడం లేదు. బీఆర్ఎస్ సభలో ఎంత అరిచి గీ పెట్టినా ఉపయోగం ఉండదు’అని కోమటిరెడ్డి స్పష్టం చేశారు.కాగా, సోమవారం అసెంబ్లీలో లగచర్ల రైతులకు బేడీలు వేసిన అంశంపై చర్చించాలని బీఆర్ఎస్ పట్టుబట్టిన విషయం తెలిసిందే. దీనికి ఒప్పుకోని ప్రభుత్వం టూరిజం పాలసీని చర్చకు పెట్టింది. దీంతో సభలో తీవ్ర గందరగోళం రేగి సభ మంగళవారానికి వాయిదా పడింది. -
‘చాయ్ బిస్కట్’ సమావేశాలు కాదు: హరీశ్‌రావు ఫైర్
సాక్షి,హైదరాబాద్:బీఏసీ సమావేశం నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేసింది. అసెంబ్లీని కనీసం 15 రోజుల పాటు నడపాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఎన్ని రోజులు సభ నడుపుతారో క్లారిటీ ఇవ్వకపోవడంతో వాకౌట్ చేసినట్లు బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు తెలిపారు. బీఏసీ నుంచి బయటికి వచ్చిన సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ బీఏసీ అంటే బిస్కట్ అండ్ చాయ్ సమావేశం కాదని ఎద్దేవా చేశారు.‘అసెంబ్లీ సమావేశాలపై ఏమీ తెల్చకపోవడంతో బయటకు వచ్చినం.ఎన్ని రోజులు సభ నడుపుతారో చెప్పక పోవడంతో బీఏసీ నుంచి వాకౌట్ చేశాం. రేపు లగచర్ల అంశంపై చర్చకు బీఅర్ఎస్ పట్టు పట్టింది. ఒక రోజు ప్రభుత్వానికి,మరొక రోజు విపక్షానికి ఇవ్వడం సంప్రదాయం. లగచర్లపైన చర్చకు పట్టుపట్టినం. రైతులకు బేడీలు వేసిన అంశం మాకు చాల కీలకం.కచ్చితంగా ఈ అంశంపైన చర్చకు అవకాశం ఇవ్వాల్సిందే.బీఏసీకి కేవలం సూచన చేసే అధికారం మాత్రమే ఉందన్న సీఎం వ్యాఖ్యలపైన బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. హౌస్ కమీటీ ఏర్పాటుచేయాలి. బీఏసీపైన తమ పార్టీ అభిప్రాయం తెలుసుకోకుండా ఎలా నిర్ణయం తీసకుంటారని స్పీకర్‌ను అడిగాం. బీఏసీలో లేకుండా సభలో బిల్లులు ప్రవేశపెట్టడంపైన అభ్యంతరం వ్యక్తం చేశాం’అని హరీశ్‌రావు చెప్పారు.కాగా, సోమవారం అసెంబ్లీలో లగచర్ల రైతులకు బేడీలు వేసిన అంశంపై చర్చించాలని బీఆర్ఎస్ పట్టుబట్టింది. దీనికి ఒప్పుకోని ప్రభుత్వం టూరిజం పాలసీని చర్చకు పెట్టింది. దీంతో సభలో తీవ్ర గందరగోళం చెలరేగి సభను స్పీకర్ మంగళవారానికి వాయిదా వేశారు. -
తెలంగాణలో ఉత్తమ శాసనసభ వక్త అవార్డు: శ్రీధర్ బాబు
సాక్షి, హైదరాబాద్: శాసనసభ అంటే అందరిదీ.. ఏ ఒక్క పార్టీకి చెందినది కాదన్నారు మంత్రి శ్రీధర్ బాబు. కొత్తగా శాసనసభకు ఎన్నికైన నేతలందరూ సభకు హాజరయ్యే సంప్రదాయం కొనసాగించాలని కోరారు. సిద్ధాంతపరంగా బేధాలున్నప్పటికీ.. సభలో ఎవరి పాత్ర వాళ్లు పోషించాలన్నారు.శాసనసభ వ్యవహారాలపై తెలంగాణ శాసనసభ, మండలి సభ్యులకు బుధ, గురువారాల్లో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ..‘మొదటి సారి ఎన్నికైన శాసనసభ్యులు 57 మంది శాసన సభలో ఉన్నారు. శాసన సభ అందరిది.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలో మరొక పార్టీదో కాదు. ఈ ట్రైనింగ్ సెషన్స్ కోసం అందరికీ ఆహ్వానం పంపించాము.పాత రోజుల్లో సిద్ధాంత పరంగా భేదాభిప్రాయాలు ఉన్నా సభలో ఎవరి పాత్ర వారు పోషించారు. నేను మొదటిసారి ఎన్నికైనప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. నేను నాలుగోసారి సభలో ఉన్నప్పుడు పీఏసీని ప్రతిపక్షానికి ఇవ్వలేదు. ఎమ్మెల్యేలు అందరూ శాసనసభకు హాజరయ్యే సాంప్రదాయం కొనసాగించాలి. ఎమ్మెల్యేగా గెలిచి సభ రాకుండా దూరంగా ఉండకండి. పార్లమెంట్లో ఎలాగైతే ఉత్తమ పార్లమెంటేరియన్ ఇస్తున్నారో అదే విధంగా ఉత్తమ శాసనసభ వక్త అవార్డు ఇవ్వాలని స్పీకర్‌ను కోరుతున్నాం’ అంటూ కామెంట్స్ చేశారు.స్పీకర్ గడ్డం ప్రసాద్ మాట్లాడుతూ..‘చట్టాలను రూపొందించే హక్కు శాసన సభ్యులకు ఉంటుంది. గతంలో శాసనసభ సమావేశాలు ఉంటే సినిమా రిలీజ్ వాయిదా వేసుకునే వారు. ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి గొప్ప వ్యక్తులు బాగా మాట్లాడి మంచి పేరు తెచ్చుకున్నారు. ఉత్తమ పార్లమెంటేరియన్ మాదిరిగా ఉత్తమ శాసనసభ వక్త అవార్డు పరిశీలన చేస్తాం’ అంటూ చెప్పుకొచ్చారు.తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ..‘గాలివాటం రాజకీయాలు ప్రారంభం అయినప్పటికీ కొత్త వాళ్ళు మళ్ళీ గెలవడం లేదు. మొదటిసారి ఎన్నికై రాజకీయాల్లో సక్సెస్ అయ్యే వారి శాతం 25శాతమే. కొందరు నాయకులు గెలిచాక ప్రజలతో మమేకం కావడం లేదు. ఎమ్మెల్యేకు కోటరీ వల్ల ప్రజలు స్వయంగా ఎమ్మెల్యేను కలిసే అవకాశం ఎక్కువగా ఉండదు. ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండాలి.. ఫోన్లు ఎత్తాలి. నేను ఒకసారి ఓడిపోవడానికి నాకు సెక్యూరిటీ సమస్య వల్లే. ప్రజలు ఎమ్మెల్యేకు దూరం అవ్వడానికి కారణం పీఏలు, పీఆర్వోలు అంటూ కామెంట్స్ చేశారు. -
అసెంబ్లీ వద్ద టెన్షన్ టెన్షన్