
ప్రశ్నోత్తరాలు రద్దు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ఐదో రోజు పలు ప్రభుత్వ శాఖలకు సంబంధించిన పద్దులపై చర్చ జరగనుంది. సోమవారం ఉదయం 10 గంటలకు సభ ప్రారంభమైన వెంటనే వివిధ పద్దులను ఆయా మంత్రులు సభ ఆమోదం కోసం ప్రతిపాదిస్తారు. సోమవారం ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు స్పీకర్ బులెటిన్ విడుదల చేసిన నేపథ్యంలో సభలో నేరుగా పద్దులపై చర్చ జరగనుంది.
సాధారణ పాలన, న్యాయ, వాణిజ్య పనులు, హోం మంత్రిత్వ శాఖలతో పాటు పాఠశాల, ఉన్నత, సాంకేతిక విద్యకు సంబంధించిన పద్దులపై చర్చ జరుగుతుంది. అలాగే పురపాలన, పట్టణ అభివృద్ధి, ఉపాధి కల్పన, కార్మిక, వైద్య, ఆరోగ్య, పరిశ్రమలు, ఐటీ, ఎక్సైజ్ తదితర శాఖలకు సంబంధించిన పద్దులపైనా అసెంబ్లీ చర్చించనుంది.