debate
-
Formula E case: సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. దమ్ముంటే ఫార్ములా ఈ-రేస్ అంశంపై రాష్ట్ర శాసనసభలో చర్చ పెట్టాలని లేద్వారా సవాల్ విసిరారాయన.‘‘ఫార్ములా-ఈ రేస్ వ్యవహారంలో మీ ప్రభుత్వం కొన్ని నెలలుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద, ముఖ్యంగా నా మీద అనేక నిరాధార అరోపణలు చేస్తోంది. విషయం మీద ఈ వారం మీ ఆధ్వర్యంలో జరిగిన కేబినెట్ సమావేశంలో గంటన్నర సేపు చర్చ కూడా జరిగినట్టు వార్తా కథనాలు వచ్చాయి. ఈ అంశం మీద నాలుగు గోడల మధ్య చర్చ కన్నా రాష్ట్ర శాసన సభలో నాలుగు కోట్ల మంది ప్రజల ముందు చర్చ జరగితే నిజానిజాలు ఏమిటో అందరికీ తెలుస్తాయి.తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి మంచి జరగాలనే సదుద్దేశంతో గత ప్రభుత్వం ఫార్ములా-ఈ రేస్ నిర్వాహకులతో ఒక ఒప్పందం చేసుకున్నది. ఈ రేసు వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సుమారు రూ.700 కోట్ల రూపాయల లబ్ది చేకూరింది అని నీల్సన్ సంస్థ నివేదిక స్పష్టం చేసింది. 2024లో మరో దఫా రేస్ జరగవలసి ఉండగా మీ ప్రభుత్వం వచ్చిన వెంటనే దాన్ని ఏకపక్షంగా రద్దు చేయడం జరిగింది. అప్పటి నుంచి.. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఈ రేస్ గురించి అనేక అవాస్తవాలను మీడియా ద్వారా ప్రచారం చేసి, ఇందులో ఏదో జరిగింది అనే అపోహలు సృష్టించే ప్రయత్నం మీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది. ఫార్ములా-ఈ రేస్ ఒప్పందం అంతా పారదర్శకంగా జరిగింది. రేసు నిర్వాహకులకు చెల్లింపులు కూడా పారదర్శకంగానే జరిగాయి అని ఇదివరకే నేను వివరంగా చెప్పడం జరిగింది. అయినా మీ ప్రభుత్వం మాత్రం దుష్ప్రచారం మానడం లేదు.రాష్ట్ర ప్రజలకు నిజాలేమిటో తెలుసుకునే హక్కు ఉన్నది. కాబట్టే మీరు శాసనసభలో ఈ అంశంపై చర్చ పెట్టాలని నేను డిమాండ్ చేస్తున్నాను. దీనిపైన శాసనసభలో సవివరమైన చర్చ జరిగితే నిజానిజాలేమిటో నిగ్గుతేలుతాయి అని లేఖలో కోరారాయన.💥 దమ్ముంటే ఫార్ములా-ఈ రేస్ అంశంపై రాష్ట్ర శాసనసభలో చర్చ పెట్టండి - ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే @KTRBRS లేఖ❇️ ఫార్ములా-ఈ రేస్ వ్యవహారంలో మీ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై, ముఖ్యంగా నాపై, అనేక నిరాధార ఆరోపణలు చేస్తున్నది.❇️ ఈ అంశంపై ఇటీవల మీ… pic.twitter.com/Iv2fNkjAfl— BRS Party (@BRSparty) December 18, 2024 -
రాజ్యాంగాన్ని ద్వేషించినవాళ్లా పాఠాలు నేర్పేది?: ఖర్గే
రాజ్యాంగంపై చర్చ.. రాజ్యసభలోనూ నిప్పులు రాజేస్తోంది. సోమవారం పెద్దల సభలో రాజ్యాంగం చర్చ మొదలైంది. అయితే.. నెహ్రూ ప్రస్తావనతో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆమె వ్యాఖ్యలకు కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు.‘‘లోక్‌సభలో రాజ్యాంగ చర్చ ద్వారా ప్రధాని మోదీ సభను తప్పుదోవ పట్టించారు. ఎలా మాట్లాడాలో ఈరోజు నేను వాళ్లకు(బీజేపీ నేతలను ఉద్దేశిస్తూ..) చెప్పదల్చుకున్నా. నేను చదువుకుంది మున్సిపాలిటీ బడిలో. ఆమె(నిర్మలా సీతారామన్) జేఎన్‌యూ(జవహార్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ)లోనే కదా చదివింది. ఆమె హిందీగానీ, ఇంగ్లీష్గానీ మాట్లాడడం బాగుంది. ఆమె ఆర్థిక నిపుణురాలే కావొచ్చు. కానీ, ఆమె మాట్లాడే విధానమే అస్సలు బాగోలేదు... జాతీయ పతకాన్ని, అందులో అశోక చక్రాన్ని.. రాజ్యాంగాన్నే ద్వేషించినవాళ్లు.. ఇవాళ మాకు పాఠాలు చెబుతున్నారు. రాజ్యాంగం వచ్చిన కొత్తలో వాళ్లే దానిని తగలబెట్టారు. రాజ్యాంగాన్ని ఆమోదించిన టైంలో.. రామ్‌లీలా మైదానంలో గాంధీ, నెహ్రూ, అంబేద్కర్ దిష్టిబొమ్మలను తగలబెట్టిన విషయాన్ని వాళ్లు మరిచిపోయారేమో!’’ అని ఆయన మండిపడ్డారు. అలాగే.. స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనని వాళ్లు కూడా.. ఆ పోరాటం ఎలా ఉంటుందో తమకు తెలుసంటూ వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందంటూ ప్రధాని మోదీని ఉద్దేశించి ఖర్గే సెటైర్లు వేశారు. 1949లో ఆరెస్సెస్ భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకించారని, అది మనుస్మృతికి తగ్గట్లుగా లేదని ఆనాడు విమర్శించారని, రాజ్యాంగాన్నే కాకుండా మువ్వన్నెల జెండాను కూడా అంగీకరించలేదని, ఆ సంస్థ ప్రధాన కార్యాలయంపై 2002 రిపబ్లిక్ డేన తొలిసారి జాతీయ జెండా ఎగరేశారని, అదీ కోర్టు ఆదేశాల తర్వాతేనని ఖర్గే రాజ్యసభకు గుర్తు చేశారు. #WATCH | Constitution Debate | Rajya Sabha LoP #mallikarjunkharge says, “In 1949, #RSS leaders opposed the Constitution of #India because it was not based on #manusmriti. Neither did they accept the #Constitution nor the tricolour. On 26 January 2002, for the first time, the… pic.twitter.com/yLScuHkY3o— TheNews21 (@the_news_21) December 16, 2024 -
మోదీ ప్రసంగం... యమా బోరు: ప్రియాంక
న్యూఢిల్లీ: లోక్‌సభలో రాజ్యాంగంపై చర్చ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం విసుగు తెప్పించిందని కాంగ్రెస్ నేత, ఎంపీ ప్రియాంకా గాంధీ వ్యాఖ్యానించారు. ‘‘ప్రధాని ప్రసంగంలో కొత్త విషయం ఒక్కటీ లేదు. అన్నీ దశాబ్ధాల నాటి పాత విషయాలు. రెండు గణితం క్లాసులు ఒకేసారి విన్నంత బోర్‌గా ఫీలయ్యా’’ అన్నారు. ‘‘మోదీ ప్రసంగం చూసి జేపీ నడ్డా చేతులు నలుపుకున్నారు. అమిత్ షా తలపట్టుకున్నారు. పీయూష్ గోయెల్ నిద్రమత్తులోకి వెళ్లారు. ఇలాంటివి నేనెప్పుడూ చూడలేదు. మోదీ కొత్త అంశాలను ఆసక్తికరంగా చెప్పి ఉండాల్సింది’’ అన్నారు. ‘‘విపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతున్నప్పుడు మోదీ, అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సభలో ఎందుకు లేరు? అవినీతిని ఉపేక్షించమంటూ చెప్పే ప్రభుత్వం అదానీ అంశంపై చర్చకు ఎందుకు అంగీకరించడం లేదు’’ అని ఆమె ప్రశ్నించారు. -
ఏపీలో రెడ్ బుక్ పాలన.. రాజ్యాంగంపై చర్చలో ఎంపీ గురుమూర్తి
సాక్షి, ఢిల్లీ: ఏపీలో రాజ్యాంగం బదులుగా రెడ్ బుక్ పాలన జరుగుతోందని ఎంపీ గురుమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగంపై లోక్‌సభలో చర్చ సందర్భంగా వైఎస్సార్సీపీ తరఫున ఆయన పాల్గొన్నారు. టీడీపీ ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతోందని.. కూటమి ప్రభుత్వం కేవలం వట్టి మాటలకే పరిమితమైందన్నారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వం సామాజిక న్యాయానికి, పారదర్శకతకు అద్దం పట్టిందన్న గురుమూర్తి.. జగనన్న విద్యా దీవెన, అమ్మఒడి, వైఎస్సార్ చేయూత లాంటి పథకాలు అణగారిన వర్గాలకు ఎంతగానో ఉపయోగపడ్డాయన్నారు.ఈ పథకాలు ఆయా వర్గాలను పైకి తీసుకొచ్చాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీల అభ్యున్నతికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి, వారి అభివృద్ధికి పాటుపడ్డారు. రాజ్యాంగం ఒక జీవన పత్రం. అసమానతలను తగ్గించే ఒక సాధనం రాజ్యాంగం. సామాజిక న్యాయం, స్వేచ్ఛ, సోదర భావనకు రాజ్యాంగం పెద్దపీట వేసింది. కేశవానంద భారతి కేసు రాజ్యాంగం పునాదులను మరోసారి నిర్వచించింది. 75 ఏళ్ల ఈ రాజ్యాంగ ప్రయాణంలో ఎంతో ప్రగతి సాధించాం.’’ అని ఎంపీ గురుమూర్తి పేర్కొన్నారు.‘‘ప్రపంచంలోనే అద్భుతమైన ప్రజాస్వామ్య దేశంగా భారత్ అవతరించింది. అనేక కోట్ల మంది ఓటర్లు ప్రజాస్వామ్య ప్రక్రియలో పాలుపంచుకున్నారు. మన రాజ్యాంగ సంస్థలపై విశ్వాసాన్ని ప్రకటించారు. అంటరానితనాన్ని నిర్మూలించేందుకు నిర్ణయాత్మక చర్యలు తీసుకున్నారు. వ్యవసాయ ఎకానమీ నుంచి ప్రపంచంలోనే ఐదో ఆర్థిక శక్తిగా ఎదిగింది.ఇదీ చదవండి: ఇక మరింత దూకుడుగా వైఎస్సార్సీపీ పోరుబాట..అక్షరాస్యతలో 74 శాతం సాధించాం. జీవన స్థాయి 70 ఏళ్లకు పెరిగింది. వాతావరణం మార్పులు జీ-20 విషయాల్లో భారత ప్రపంచం నాయకత్వం వహిస్తుంది. పెరుగుతున్న ఆర్థిక సమానతలు ఇంకా సవాలుగానే పరిణమిస్తున్నాయి. ఆర్థిక అసమానతలు, లింగ అసమానత్వాన్ని రూపుమాపితేనే నిజమైన సమానత్వం వస్తుంది’’ అని ఎంపీ గురుమూర్తి చెప్పారు. -
రాజ్యాంగం కన్నా... అధికారమే మీకు మిన్న
న్యూఢిల్లీ: రాజ్యాంగంపై కొంతకాలంగా అధికార, ప్రతిపక్షాల మధ్య సాగుతున్న ఆరోపణలు, ప్రత్యారోపణల యుద్ధం పార్లమెంటుకు చేరింది. ఈ విషయమై ఇరుపక్షాల మధ్య మధ్య వాడీవేడి చర్చకు శుక్రవారం లోక్‌సభ వేదికైంది. రాజ్యాంగ వజ్రోత్సవాలపై లోక్‌సభ చేపట్టిన రెండు రోజుల చర్చను ప్రభుత్వం తరఫున రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ప్రారంభించారు. కాంగ్రెస్‌కు ఎప్పుడూ అధికారంపైనే యావ అని, అందుకోసం రాజ్యాంగానికి నిరంతరం తూట్లు పొడుస్తూ వచ్చిందని మండిపడ్డారు. ‘‘కాంగ్రెస్ తన దశాబ్దాల పాలనలో వ్యవస్థల స్వయం ప్రతిపత్తిని ఎన్నడూ సహించింది లేదు. రాజ్యాంగ విలువలకు, స్ఫూర్తికి పాతర వేసేందుకు శక్తివంచన లేకుండా ప్రయతి్నంచింది. అలాంటి పార్టీ నోట రాజ్యాంగ పరిరక్షణ వంటి మాటలు వినడం ఎబ్బెట్టుగా ఉంది’’ అంటూ ఎత్తిపొడిచారు. ఆయన విమర్శలకు కాంగ్రెస్ తరఫున నూతన ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా గట్టిగా కౌంటరిచ్చారు. అసలు దేశానికి రాజ్యాంగం కల్పించిన రక్షణ కవచానికి నిలువునా తూట్లు పొడిచిందే మోదీ ప్రభుత్వమంటూ దుయ్యబట్టారు. జడ్జి బి.హెచ్.లోయా మృతిపై తృణమూల్ సభ్యురాలు మహువా మొయిత్రా చేసిన వ్యాఖ్యలు మంటలు రేపాయి. సభలో ఆద్యంతం ఇరుపక్షాల నడుమ మాటల తూటాలు పేలాయి. నినాదాలు, అరుపులు, కేకల నడుమ రెండుసార్లు సభ వాయిదా పడింది. జేబులో పెట్టుకోవడమే నైజం రాజ్యాంగాన్ని దేశానికి తానిచి్చన కానుకగా కాంగ్రెస్ భ్రమ పడుతోందని రాజ్‌నాథ్ అన్నారు. రాజ్యాంగ కూర్పులో, అది ప్రవచించిన విలువల పరిరక్షణలో విపక్షాలు, కాంగ్రెసేతర నేతల పాత్రను నిరంతరం తక్కువ చేసి చూపేందుకే ప్రయతి్నంచిందని ఆరోపించారు. 1944లోనే పలువురు దేశభక్త నేతలు స్వతంత్ర హిందూస్తాన్ రాజ్యాంగాన్ని రూపొందించారని నాటి హిందూ మహాసభ ప్రయత్నాలను ఉద్దేశించి రక్షణ మంత్రి వ్యాఖ్యలు చేశారు. ‘‘పండిట్ మదన్మోహన్ మాలవీయ, లాలా లజపతిరాయ్, భగత్‌సింగ్, వీర సావర్కార్ వంటి నాయకులు రాజ్యాంగ పరిషత్తులో సభ్యులు కాకపోయినా వారి భావజాలాలు రాజ్యాంగంలో అడుగడుగునా ప్రతిఫలిస్తున్నాయి. వారంతా నిత్య స్మరణీయులు. అలాంటి మహా నాయకులపైనా మతవాద ముద్ర వేసిన చరిత్ర కాంగ్రెస్‌ది! రాజ్యాంగాన్ని హైజాక్ చేసేందుకు, దాని రూపురేఖలనే మార్చేసేందుకు దుస్సాహసం చేసి పార్టీ ఏదన్నా ఉందంటే అది కాంగ్రెసే. ఆ లక్ష్యంతోనే తన దశాబ్దాల పాలనలో రాజ్యాంగాన్ని చీటికీమాటికీ సవరిస్తూ వచ్చింది. ఎమర్జెన్సీ విధింపు మొదలుకుని విపక్ష పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టడం, ఇందిర సర్కారు నిరంకుశత్వానికి అడ్డుకట్ట వేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులనే పక్కకు తప్పించడం దాకా ఇందుకు ఉదాహరణలన్నో! భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు తూట్లు పొడిచేందుకు కాంగ్రెస్‌కు చెందిన తొలి ప్రధాని నెహ్రూ కూడా ఏకంగా రాజ్యాంగాన్నే సవరించారు! అలాంటి పారీ్టకి చెందిన వాళ్లు నేడు రాజ్యాంగ పరిరక్షణ గురించి మాట్లాడుతుండటం హాస్యాస్పదం’’ అంటూ దుయ్యబట్టారు. ‘‘పైగా విపక్ష నేతలు కొందరు కొద్ది రోజులుగా రాజ్యాంగ ప్రతిని జేబుల్లో పెట్టుకుని తిరుగుతున్నారు. చిన్నతనం నుంచీ వారు నేర్చుకున్నది అదే. ఎందుకంటే వారి కుటుంబ పెద్దలు కొన్ని తరాలుగా రాజ్యాంగాన్ని తమ జేబుల్లో పెట్టుకున్న వైనాన్ని చూస్తూ పెరిగారు మరి!’’ అంటూ రాహుల్‌గాంధీ తదితరులను ఉద్దేశించి రాజ్‌నాథ్ ఎద్దేవా చేశారు. ఆయన వ్యాఖ్యలను ఎన్డీఏ సభ్యులు చప్పట్లతో అభినందించగా విపక్ష సభ్యులు ‘సిగ్గు, సిగ్గు’ అంటూ నిరసించారు. -
ఇటు ఎమర్జెన్సీ.. అటు రాజ్యాంగ పరిరక్షణ!
న్యూఢిల్లీ, సాక్షి: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యదేశమైన భారత్‌కు రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా.. ప్రత్యేక సమావేశాలతో అధికార-ప్రతిపక్షాలు పార్లమెంట్‌ను వేడెక్కించబోతున్నాయి. ఎన్డీయే సర్కార్ నుంచి రాజ్యాంగాన్ని రక్షించాలంటూ విపక్ష కూటమి.. అలాగే ఎమర్జెన్సీ అంశంతో బీజేపీ.. ఒకరినొకరు కార్నర్ చేసే అవకాశం కనిపిస్తోంది.రాజ్యాంగంపై చర్చ కోసం శుక్రవారం మధ్యాహ్నాం లోక్‌సభ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఇవాళ, రేపు రాజ్యాంగంపై ప్రజాప్రతినిధుల సభ చర్చించనుంది. బీజేపీ అగ్రనేత, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభోపన్యాసం చేస్తారు. ఎన్డీయే కూటమి తరఫున 12 నుంచి 15 మంది ఈ చర్చలో భాగమవుతారని తెలుస్తోంది. ఇందులో జేడీఎస్ అధినేత, కేంద్రమంత్రి హెచ్డీ కుమారస్వామి, బీహార్ మాజీ సీఎం జతిన్ మాంజీ, శివసేన తరఫున శ్రీకాంత్ షిండే (ఏక్నాథ్ షిండే) పేర్లు ఇప్పటికే ఖరారయ్యాయి. చివరిరోజు.. అంటే రేపు సాయంత్రం ప్రధాని మోదీ ప్రసంగంతో(సమాధానంతో) ఈ చర్చ ముగియనుంది.స్వతంత్ర భారతావనిలో నూతనంగా రూపొందించిన రాజ్యాంగాన్ని 1949, నవంబర్ 26వ తేదీన రాజ్యాంగ సభ ఆమోదించగా.. 1950 నవంబర్ 26వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. ఆ ఆమోదానికి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగానే ఈ చర్చ జరగనుంది. రాజ్యాంగ పరిణామం, ప్రాముఖ్యతతో మొదలయ్యే చర్చ.. రాజకీయ మలుపులు తిరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సజావుగా జరనివ్వకుండా ప్రతిపక్షాలు అవాంతరం కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంతో ప్రతిపక్షాలను టార్గెట్ చేసుకుని ఎన్డీయే.. అలాగే వివిధ అంశాలతో కేంద్రంపై ఇండియా కూటమి పరస్పరం విరుచుకుపడే అవకాశం కనిపిస్తోంది.కాంగ్రెస్సే లక్ష్యంగా..లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి ఆశించిన ఫలితం రాలేదు. ఇండియా కూటమి.. ప్రత్యేకించి కాంగ్రెస్‌కు మెరుగైన ఫలితాలు దక్కాయి. అలాగే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీకి మిశ్రమ ఫలితాలే దక్కుతున్నాయి. ఈ పరిణామాలను బీజేపీ సహించలేకపోతోంది. వీటన్నింటికి తోడు.. ఎన్నికల్లో గెలిస్తే బీజేపీ రాజ్యాంగాన్నే మార్చేస్తుందంటూ సార్వత్రిక ఎన్నికల టైంలో కాంగ్రెస్ విపరీతమైన ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో రాజ్యాంగంపై చర్చ ద్వారానే కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలోనే ధ్వజమెత్తాలని మోదీ నేతృత్వంలోని కేంద్రం భావిస్తోంది.ఆర్నెల్ల కిందట.. ఎమర్జెన్సీకి 49 ఏళ్లు పూర్తైన సందర్భాన్ని ప్రస్తావించి మరీ ప్రధాని మోదీ కాంగ్రెస్‌పై ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని తుంగలోకి తొక్కి దేశాన్ని జైల్లో పెట్టింది వారేనని(కాంగ్రెస్‌ను ఉద్దేశించి.. ).. నాడు ఎమర్జెన్సీ విధించి .. నేడు రాజ్యాంగంపై ప్రేమా? అంటూ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. ‘‘ఎమర్జెన్సీని ఎదిరించిన మహనీయులందరికీ నివాళులర్పించే రోజు ఇది. ప్రజల ప్రాథమిక స్వేచ్ఛను కాంగ్రెస్ ఎలా అణగదొక్కిందో.. ప్రతీ భారతీయుడు గౌరవించే దేశ రాజ్యాంగాన్ని ఎలా తుంగలో తొక్కారో నాటి చీకటిరోజులే మనకు గుర్తు చేస్తాయి అంటూ విసుర్లు విసిరిరాయన. దీంతో మరోసారి ఎమర్జెన్సీ అంశం రాజ్యాంగ చర్చలో ప్రస్తావన వచ్చే అవకాశమూ లేకపోలేదు.కౌంటర్‌కి ఇండియా కూటమి రెడీ..రాజ్యాంగంపై చర్చలో భాగంగా.. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. విపక్షాల తరఫున.. డీఎంకే నుంచి టీఆర్ బాలు, టీఎంసీ నుంచి మహువా మెయిత్రా-కల్యాణి బెనర్జీ పేర్లు ఖరారు కాగా.. మిగతావాళ్ల పేర్లు వెలువడాల్సి ఉంది. అలాగే రాహుల్ ఇవాళ మాట్లాడతారా? రేపా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.ఎన్డీయే కూటమి కౌంటర్ ఇచ్చే విషయంలో ఎక్కడా తగ్గొద్దని కాంగ్రెస్ భావిస్తోంది. అదానీ అంశం ప్రధానంగా పార్లమెంట్‌ను దద్దరిల్లిపోయేలా చేసింది ఇండియా కూటమి. ఈ నేపథ్యంలో రాజ్యాంగ చర్చను కేవలం ఆ అంశానికి మాత్రమే పరిమితం చేయొద్దని ఇతర ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. సంభల్ హింసతో పాటు రైతుల నిరనల, మణిపూర్ హింస తదితర అంశాలను కూడా ప్రస్తావించి రాజ్యంగాన్ని రక్షించాలంటూ పార్లమెంట్లో గట్టిగా నినదించాలని భావిస్తున్నయి.అటు పెద్దల సభలోనూ.. ఇవాళ, రేపు దిగువ సభలో మాత్రమే రాజ్యంగంపై చర్చ జరుగుతుంది. ఆదివారం పార్లమెంట్‌కు సెలవు. రాజ్యసభలో సోమ, మంగళవారం ఇదే తరహాలో రాజ్యాంగంపై చర్చ జరగనుంది. ఇప్పటికే మూడు లైన్ల విప్‌ను ఆయా ఎంపీలకు సదరు పార్టీలు జారీ చేశాయి. రాజ్యసభలో హోం మంత్రి అమిత్ షా ఈ చర్చను ప్రారంభించనున్నారు. -
ఎగ్జిట్ పోల్స్ డిబేట్లపై కాంగ్రెస్ కీలక నిర్ణయం!
మహారాష్ట్ర, ఝార్ఖండ్లలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు మహారాష్ట్రలో 45.53శాతం పోలింగ్ నమోదు కాగా.. అటు ఝార్ఖండ్‌లో 61.47శాతం ఓటింగ్ జరిగినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. సామాన్యులతోపాటు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సైతం తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ పూర్తయిన తర్వాత సాయంత్రం 6.30 గంటలకు ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి.ఈ క్రమంలో కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సాయంత్రం వెలువడే ఎగ్జిట్ పోల్స్‌పై టీవీ ఛాఆనళ్ల చర్చల్లో పాల్గొనకూడదని హస్తం పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం,గతంలో లోక్‌సభ ఎన్నికల సమయంలో కూడా ఇలాంటి నిర్ణయమే కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. అయితే ఓటమి భయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అప్పట్లో బీజేపీ విమర్శలు గుప్పించింది.కాగా మహారాష్ట్రలో ఒకేవిడతలో మొత్తం 288 నియోజకవర్గాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా.. ఝార్ఖండ్‌లో రెండోవిడతలో 38 నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. దీంతో పాటు పలు రాష్ట్రాల్లోని కొన్ని అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. నవంబరు 23న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు.ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి పోటాపోటీగా తలపడ్డాయి. నువ్వానేనా? అన్నట్టుగా రెండు పార్టీలు బరిలోకి దిగాయి. మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి మరోసారి అధికారం కోసం ప్రయత్నిస్తుండగా.. అధికారం చేజిక్కించుకోవాలన్న ఉద్దేశంతో ఇండియా కూటమి భావిస్తోంది. -
KSR: పవన్ ఎవరిని ప్రశ్నిస్తున్నారు?.. ప్రభుత్వంలో ఉంది మీరే కదా
-
మళ్లీ చర్చా.. ఆ చాన్సే లేదు: ట్రంప్
వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షురాలు, డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌తో మరో డిబేట్లో పాల్గొనబోనని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. మంగళవారం జరిగిన బిగ్ డిబేట్లో డెమొక్రాట్ల అభ్యర్థి కమలా హారిస్‌పై తాను గెలిచానని, ఆమె ఓడిపోయినందునే మరో చర్చ అంటున్నారని తన సొంత సోషల్ మీడియా వేదిక ట్రూత్‌లో గురువారం ప్రకటించారు. జూన్‌లో అధ్యక్షుడు జో బైడెన్‌తో జరిగిన మొదటి డిబేట్, ఆ తర్వాత హ్యారిస్‌తో మంగళవారం జరిగిన డిబేట్‌ను ప్రస్తావిస్తూ ఇక మూడోది ఉండబోదని స్పష్టం చేశారు. గెలుపు తనదేనని, సర్వేలు కూడా అదే చెబుతున్నాయని ట్రంప్ చెప్పారు. కాగా, ప్రధాన మీడియా సంస్థల సర్వేల ఫలితాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. బిగ్ డిబేట్‌ను చూసిన వారిలో 63 శాతం మంది కమలా హారిస్ గెలుస్తారని విశ్వాసం వ్యక్తం చేయగా, 37 శాతం మంది మాత్రమే ట్రంప్ వైపు మొగ్గు చూపారని సీఎన్ఎన్ సర్వే వెల్లడించిన సంగతి తెలిసిందే. -
హారిస్‌తో మళ్లీ డిబేట్.. ట్రంప్ కీలక ప్రకటన
వాషింగ్టన్: డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి కమలాహారిస్‌తో మళ్లీ డిబేట్లో పాల్గొనే ప్రసక్తే లేదని అమెరికా అధ్యక్ష ఎన్నికల రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తేల్చిచెప్పారు. ఓడిపోయిన వాళ్లే మళ్లీ డిబేట్ అవసరమని అడుగుతారని కమలాహారిస్‌ను ఉద్దేశించి ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు సోషల్‌మీడియా ప్లాట్‌ఫాం ట్రూత్‌సోషల్‌లో ట్రంప్ ఒక పోస్టు చేశారు. ‘కామ్రేడ్ హారిస్‌తో డిబేట్లో నాదే పైచేయి అని సర్వేలన్నీ చెబుతున్నాయి. ఆమె డిబేట్లో ఓడిపోయారు. ఓడిపోయినందునే ఆమె మరో డిబేట్ కావాలని అడుగుతున్నారు. ఆమెతో రెండో డిబేట్ అనేది ఉండదు’ అని ట్రంప్ స్పష్టం చేశారు. కాగా, డిబేట్లో తనదే పైచేయి అని ట్రంప్ ఉటంకించిన సర్వేలన్నీ పెద్దగా పేరులేని, ఎవరికీ తెలియని సంస్థలు వెల్లడించినవి కావడం గమనార్హం. సీఎన్‌ఎన్‌లాంటి ప్రధాన స్రవంతి మీడియా సంస్థలు మాత్రం హారిస్, ట్రంప్ డిబేట్ వీక్షించిన 63 శాతం మంది ప్రజలు హారిసే విజయం సాధించారని భావిస్తున్నట్లు వెల్లడించడం విశేషం. అమెరికా అధ్యక్ష ఎన్నికలపై అభ్యర్థులు ట్రంప్, హారిస్‌ల మధ్య మంగళవారం ఫిలడెల్ఫియాలో బహిరంగ చర్చ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఏడాది నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికల తుది పోరు జరగనుంది. ఇదీ చదవండి.. మరోసారి ట్రంప్‌తో కమల కరచాలనం -
కమలా హారిస్ క్లియర్ విన్నర్ కాదా?
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతోన్న రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ మధ్య తొలి డిబేట్ వాడీవేడిగా సాగింది. అయితే, ఈ డిబేట్లో ఆద్యాంతం కమలదేపై చేయి నడిచిందంటూ అమెరికా మీడియా చెబుతుండగా.. సోషల్ మీడియాలో మాత్రం ఓ కొత్త చర్చ మొదలైంది.కమలా హారిస్ ఛీటింగ్ చేశారంటూ కొందరు నెటిజన్లు చర్చ మొదలుపెట్టారు. దానికి ట్రంప్ మద్దతుదారులు జత కలవడంతో అది తారాస్థాయికి చేరింది. ఇంతకీ ఈ చర్చకు కారణం..డిబేట్ టైంలో ఆమె ధరించిన చెవిపోగులే.పెన్సిల్వేనియాలోని నేషనల్ కాన్స్టిట్యూషన్ సెంటర్ వేదికగా ట్రంప్-కమల మధ్య సంవాదం 90 నిమిషాల పాటు కొనసాగింది. ఇద్దరూ పలు అంశాలపై పరస్పర విమర్శలు గుప్పించున్నారు. డొనాల్డ్ ట్రంప్ సైతం ఈ డిబేట్‌ను అత్యుత్తమ చర్చల్లో ఒకటిగా భావిస్తున్నానని చెప్పారు. అయితే కమలకే ఎక్కువ ఓట్లు పడ్డప్పటికీ.. ఇప్పుడు ఓ విమర్శ ఆమెను చుట్టుముట్టింది.ఈ చర్చలో కమలా హారిస్ ధరించిన చెవిపోగులు సీక్రెట్ పరికరమని, వాటి సాయంతోనే ఆమె డిబేట్లో అంత అద్భుతంగా మాట్లాడగలిగారంటూ కొందరు వాదిస్తున్నారు. ఈమేరకు కొన్ని వెబ్సైట్ ఫొటోలను, రివ్యూలను చూపిస్తున్నారు.Kamala Harris wasn’t wearing Nova H1 earring headphones. Quit lying to yourselves. She’s wearing Tiffany Hardwear pearl earrings. See how the Nova earrings only have one stalk coming off of them? See how Kamala’s has two? They’re not even the same thing. pic.twitter.com/zfTXRjEfDr— Daulton (@DaultonVenglar) September 11, 2024‘‘డొనాల్డ్ ట్రంప్‌తో జరిగిన సంవాదంలో కమలా హారిస్ అద్భుతంగా మాట్లాడారు. ఇయర్రింగ్ మాదిరిగా ఉండే ఇయర్ఫోన్కు సంబంధించిన కథనం గుర్తుకు వచ్చింది’’ అని ఓ నెటిజన్, ఒబామా మాదిరిగానే కమలా బాగా మాట్లాడారన్న మరో యూజర్.. ఆమె ధరించిన చెవిపోగులు నోవా హెచ్1 ఆడియో ఇయర్రింగ్స్ మాదిరిగానే ఉన్నాయన్నారు. అయితే ఆమె మద్దతుదారులు మాత్రం ఆ వాదనను ఖండించారు. ఆమె రెగ్యులర్‌గా ధరించే ఇయర్రింగ్స్ అవని, వాటి విషయంలో అనవసర రాద్ధాంతం చేస్తున్నారంటూ ఆరోపణల్ని కొట్టిపారేస్తున్నారు.🚨🚨KAMALA HARRIS EXPOSED FOR WEARING EARPIECE IN DEBATE *PROOFShe is seen wearing an earring developed by Nova Audio Earrings first seen at CES 2023. This earring has audio transmission capabilities and acts as a discreet earpiece.Kamala Harris confirms claims that a… pic.twitter.com/1y60rUdJT0— ELECTION2024 🇺🇸 (@24ELECTIONS) September 11, 2024ఇక.. ఫస్ట్ ప్రెసిడెన్షియల్ డిబేట్లో విన్నర్‌గా ఉపాధ్యక్షురాలు, డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ గెలిచారు. ఈ విషయాన్ని అక్కడి మీడియా చానెల్స్ అధికారికంగా ప్రకటించాయి. డిబేట్లో ట్రంప్, హారిస్ దరిదాపుల్లోకి కూడా రాలేకపోయారంటూ విశ్లేషణాత్మక కథనాలు ఇచ్చాయి. డిబేట్లో పాల్గొన్న అభ్యర్థులిద్దరూ ఉత్తమ ప్రతిభ కనబరిచారు: ఫాక్స్ న్యూస్కమలా హారిస్‌పై పైచేయి సాధించేందుకు ట్రంప్ అసంబద్ధ వాదనలు. అయితే టైం వేస్ట్ చేయకుండా ట్రంప్‌పై హారిస్ విరుచుకుపడ్డారు: ఏబీసీ మీడియాఈ డిబేట్లో కమలా హారిస్‌దే భారీ విజయం: పొలిటికోడిబేట్లో ట్రంప్ తనను తాను సమర్థించుకునేందుకు యత్నించారు. ట్రంప్ వాదనలు సత్యదూరంగా ఉన్నాయి. ఒక ప్రాసిక్యూటర్‌గా తన అనుభవాన్ని ఉపయోగించి ట్రంప్‌ను ఇరకాటంలో పడేసేందుకు కమల ప్రయత్నించారు: ది న్యూయార్క్ టైమ్స్కమలా హారిస్ ప్రసంగంతో ట్రంప్‌లో అసహనం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఆమె పూర్తి సన్నద్ధతతో డిబేట్‌కు వచ్చారు: సీఎన్ఎన్డిబేట్లో ఇద్దరి మధ్య విమర్శ-ప్రతివిమర్శల్లో.. హారిస్‌దే పైచేయిగా సాగిందని, ట్రంప్ ఘోరంగా తడబడ్డారంటూ యూఎస్ మీడియా పేర్కొంది. అలాగే.. స్వింగ్ స్టేట్స్‌లోనూ కమలకు మంచి మార్కులు పడ్డాయని తెలిపాయి. మొత్తంగా హారిస్ ఈ డిబేట్లో క్లియర్ విన్నర్ అని తేల్చేశాయి.ఇదీ చదవండి: ట్రంప్ ఏమాత్రం మారలేదు -
కమల వర్సెస్ ట్రంప్: డిబేట్ రూల్స్ ఇవే..
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం కొనసాగుతంది. మరోవైపు.. రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షురాలు, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ తొలిసారి రేపు (మంగళవారం) అమెరికా బ్రాడ్‌కాస్టర్ ఏబీసీ నిర్వహించే డిబేట్లో తలపడనున్నారు. ఈసారి అధ్యక్ష ఎన్నికల పోరు.. ఇరువురి మధ్య నువ్వా-నేనా అనే స్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇరు పార్టీల అభ్యర్థులు డిబేట్ కోసం సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే జరిగిన తొలి డిబేట్లో ట్రంప్.. ప్రెసిడెంట్ జో బైడెన్‌పై పైచేయి సాధించిన విషయం తెలిసిందే. ఇక రేపు జరగబోయే డిబేట్లో ఎలాంటి నియమాలు, నిబంధనలు ఉంటాయనే విషయంపై చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఏబీసీ డిబేట్ రూల్స్‌ను వెల్లడించిన విషయం తెలిసిందే. ఆ రూల్స్ ఇవే..ఫిలడెల్ఫియాలోని జాతీయ రాజ్యాంగ కేంద్రంలో మంగళవారం రాత్రి 9:00 గంటలకు డిబేట్ ప్రారంభం అవుతుంది. ఈ డిబేట్‌ను ఏబీసీ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. ఇక.. డిబేట్ జరిగే గదిలో ప్రేక్షకులు ఎవరూ ఉండరు. చర్చను ఏబీసీ యాంకర్లు డేవిడ్ ముయిర్, లిన్సే డేవిస్‌లు నిర్వహిస్తారు. మొత్తం చర్చ సమయం రెండుసార్లు బ్రేక్ తీసుకొని 90 నిమిషాల పాటు జరుగుతుంది.ఒకరు మాట్లాడుతున్న సయయంలో మరోకరు రన్నింగ్ కామెంట్రీ చేయటంతో ట్రంప్, బైడెన్ మధ్య జరిగిన తొలి డిబేట్ వివాదాస్పదమైన విషయం తెలిసిందే. అందుకు ఈసారి ఏబీసీ మైక్‌లను మ్యూట్ చేస్తామని తెలిపింది. అంటే ఒకరు మాట్లాడుతుంటే.. మరొకరి మైక్ మ్యూట్‌లో ఉంటుంది. డిబేట్‌ను జరిపించే యాంకర్లు మాత్రమే సంబంధిత అంశాలు, ప్రశ్నలను అభ్యర్థులను అడుగుతారు. ఎటువంటి అంశాలనే విషయాన్ని ముందుగా అభ్యర్థలకు తెలియజేయటం అనేది ఉండదు. మొత్తం లైవ్‌లోనే చర్చ జరుగుతుంది.ప్రతి అభ్యర్థి మాట్లాడాటానికి రెండు నిమిషాలు సమయం కేటాయిస్తారు. ఒకరు మాట్లాడిన తర్వాత మరొకరు మాట్లాడుతారు. నిబంధనలు ప్రకారం కొనసాగింపు, వివరణ, ప్రతిస్పందనకు సంబంధించి మరో నిమిషం కేటాయిస్తారు. చర్చ చివరిలో ముగింపు వ్యాఖ్యల కోసం ఇరువురికి రెండు నిమిషాల సమయం కేటాయిస్తారు. చర్చ మొత్తం అభ్యర్థులు నిల్చొని కొనసాగించాల్సి ఉంటుంది. ముందస్తుగా రాసుకున్న నోట్స్, డాక్యుమెంట్లు చర్చకు అనుమతించరు. కానీ డిబేట్ జరగుతున్న సమయంలో కీలక విషయాలను నోట్ చేసుకొని వాటి ఆధారంగా మాట్లాటం కోసం ఇద్దరు అభ్యర్థులకు ఒక పెన్ను, పేపర్ ప్యాడ్, వాటర్ బాటిల్ అందజేస్తారు. చర్చ మధ్యలో రెండు సార్లు ఇచ్చే బ్రేక్ సమయంలో తమ ప్రచారం బృందంతో మాట్లాడానికి అనుమతి లేదు.ఇక.. ట్రంప్, కమలా మధ్య రేపు జరిగే తొలి డిబేట్‌పై అమెరికా ప్రజలు, ఓటర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచుస్తున్నారు. ఈ డిబేట్ ఫలితం కూడా అధ్యక్ష ఎన్నికల్లో అభర్థులను గెలుపు, ఓటమిలపై ప్రభావం చూపుతుంది. -
ప్చ్.. డిబేట్లో కమలను ఓడించడం కష్టం!
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పోటాపోటీగా దూసుకుపోతున్నారు. సెప్టెంబర్ 10వ తేదీ ఈ ఇద్దరి మధ్య జరగబోయే డిబేట్ కోసం యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు ఎస్తోంది. తాజాగా ఈ డిబేట్‌పై కమలా హారిస్ భర్త డగ్లస్ ఎంహోఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కమలా హారిస్‌తో ట్రంప్ డిబేట్ సమీపిస్తున్న నేపథ్యంలో మీ స్పందన ఏమిటని మీడియా అడిగిన ప్రశ్నకు డగ్లస్ ఎమ్హోఫ్ మాట్లాడారు. ‘ఇప్పటివరకు మా మధ్య జరిగే చర్చలు, వాదనల్లో నేను ఒక్కసారి కూడా గెలవలేదు. ఆమె చాలా గొప్ప డిబేటర్. ఫస్ట్ క్లాస్ ట్రయల్ లాయర్’ అని అన్నారు. కమలా హారిస్ రాజకీయాల్లోకి రాకముందు హారిస్ దంపతులు న్యాయవాదులుగా పని చేశారు. హారిస్ శాన్ ఫ్రాన్సిస్కో జిల్లా అటార్నీగా, కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా విధులు నిర్వర్తించారు.ఇక.. ఏబీసీ న్యూస్ సెప్టెంబర్ 10న రాత్రి 9 గంటలకు ఉపాధ్యక్షురాలు హారిస్‌కు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అధ్యక్ష ఎన్నికల రెండో డిబేట్‌ను నిర్వహించనుంది. ఇరునేతలు ముఖాముఖి డిబేట్లో పాల్గొనడం ఇదే మొదటిసారి. ఫిలడెల్ఫియాలోని జాతీయ రాజ్యాంగ కేంద్రంలో ఈ డిబేట్ జరుగుతుంది. తొలి డిబేట్లో అధ్యక్షుడు జో బైడెన్‌పై ట్రంప్ పైచేయి సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ఎన్నికల నుంచి తప్పుకోవాలని సొంత పార్టీ నేతలే డిమాండ్ చేయటంతో వైదొలిగారు. అనంతరం అధ్యక్ష బరిలో దిగిన ఉపాధ్యక్షురాలు కమల ప్రస్తుతం ప్రచారంలో దూసుకువెళ్తున్నారు. -
మళ్లీ అవే నిబంధనలతో కమలతో డిబేట్‌కు సిద్ధం: ట్రంప్
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. ఈ క్రమంలో సెప్టెంబర్ 10న అధ్యక్ష అభ్యర్థులు కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్ మధ్య జరగబోయే డిబేట్‌పై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ డిబెట్‌పై ట్రంప్ స్పందిస్తూ.. డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌తో డిబెట్ కోసం ఒప్పదం కుదుర్చుకున్నట్లు తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్‌లో వెల్లడించారు.‘కామ్రేడ్ కమలా హారిస్‌తో సెప్టెంబర్ 10న ఫిలడెల్ఫియాలో జరిగే డిబేట్ కోసం నేను రాడికల్ లెఫ్ట్ డెమోక్రాట్లతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాను. ఈ డిబేట్ ఏబీసీ ఫేక్ న్యూస్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. అయితే న్యూస్ సంస్థ మాత్రం చాలా అన్యాయమైంది’ అని అన్నారు. నిబంధనల విషయంలో ట్రంప్ ఈ డిబేట్‌ను రద్దు చేస్తారని వార్తలు వెలుడిన ఈ నేపథ్యంలో ఆయన మంగళవారం చేసిన వ్యాఖ్యలపై ప్రాధాన్యత సంతరించుకుంది. జూన్ 27 సీఎన్ఎన్లో తాను, అధ్యక్షుడు జో బిడెన్‌తో తలపడిన డిబేట్ నియమాలే.. కమలతో జరిగే డిబేట్లో ఉంటాయని తెలిపారు. వాటిని తాను పాటించడానికి ఒప్పందాన్ని కుదుర్చుకున్నానని తెలిపారు.‘‘సీఎన్ఎన్ డిబేట్ నిబంధనలే ఉంటాయి. అయితే ఈ నిబంధనలు ప్రెసిడెంట్ జో బైడెన్‌కు మినహా అందరికీ బాగా అనిపించాయి. డిబేట్లో అభ్యర్థులు నిలబడి మాట్లాడుతారు. అభ్యర్థులు నోట్స్ లేదా షీట్లు తీసుకురావటం ఉండదు. ఇక.. ఈ డిబేట్ న్యాయమైన చర్చగా ఉంటుందని ఏ పక్షానికి ముందుగానే ప్రశ్నలు ఇవ్వటం జరగదని ఏసీబీ ద్వారా మాకు హామీ ఇచ్చింది’’ అని పేర్కొన్నారు. -
ట్రంప్‌కి తులసీ..కమలకు మాయ..!
పలుకు ఒక్కటి చాలు పది వేల సైన్యం’ అనుకుంటే తులసీ గబార్డ్ అక్షరాలా ఆ మాటకు సరిపోతుంది. చర్చావేదికలలో తన వాక్చాతుర్యంతో ప్రత్యర్థిని ముప్పు తిప్పలు పెట్టడంలో తులసికి ఘన చరిత్ర ఉంది. ఆ ప్రతిభే ఆమెను అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలోకి తీసుకువచ్చింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ‘డిబేట్’ అనేది కీలక ఘట్టం. ఓటర్ల అభిప్రాయాలు, ఆలోచనలను ప్రభావితం చేసే చర్చావేదిక. వచ్చే నెలలో జరగబోయే డోనాల్డ్ ట్రంప్–కమలా హారిస్ డిబేట్ కోసం ట్రంప్‌కు శిక్షణ ఇస్తున్న మహిళగా తులసి వార్తల్లోకి వచ్చింది. కమలా హారిస్‌ను ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్న ట్రంప్‌కు తులసికి ఉన్న బహుముఖ ప్రజ్ఞ, ఆమె బృందంలోని ప్రతిభ విలువైన ఆస్తులుగా కనిపిస్తున్నాయి. ఇక కమలా హారిస్‌కు ఎన్నికల్లో బలమైన సలహదారుగా మాయ హారిస్ ఉంది. ఆమె ఎన్నికల ప్రసంగాలు ఫక్తు ఎన్నికల ప్రసంగాలలాగే ఉండనక్కర్లేదు అనేలా మాయా ప్రసంగాలు ఉంటాయి. కమలా హారిస్ చెల్లెలు మాయా హారిస్‌కు తన ప్రసంగాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? అంటే కుటుంబ బంధాల్లో నుంచి చెప్పొచ్చు. ఆమె ప్రసంగాలలో తన తల్లి ప్రస్తావన ఉంటుంది. ఆమె తన తల్లి గురించి చెప్పే భావోద్వేగపూరిత ప్రసంగాలు ట్రంప్‌పై చేసే రాజకీయ విమర్శల కంటే బలమైన ప్రభావం చూపుతాయి. ఆ అద్భుత నైపుణ్యమే మాయను అక్క కమలా హారిస్‌కు కీ అడ్వైజర్‌ని చేసింది. మరీ ఈ ఇద్దరి నేపథ్యం, వారి వాక్ శక్తి ఏంటో సవివరంగా చూద్దామా..ట్రంప్ సలహాదారుగా తులసీ‘హూ ఈజ్ షీ?’ అని ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది తులసి గబార్డ్ గురించి ఆరా తీస్తున్నారు. తులసి తండ్రి మైక్ గబార్డ్ సమోవా–అమెరికన్. రాజకీయ నాయకుడు. తల్లి కరోల్ పోర్టర్ ఇండియానా రాష్ట్రంలో పుట్టింది. టీనేజీలో హిందూమతాన్ని స్వీకరించింది. హిందూమతం పట్ల ఆమెకు ఉన్న ఆసక్తితో కుమార్తెకు ‘తులసి’ అని పేరు పెట్టింది. సెప్టెంబర్ 10న ట్రంప్, కమలా హారిస్ మధ్య తొలి డిబేట్ జరగనుంది. ఇద్దరు అభ్యర్థులు ఒకరినొకరు సవాలు చేసుకోవడానికి, పైచేయి సాధించడానికి సిద్ధమవుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని తన ప్రిపరేషన్‌కు సంబంధించి తులసి, ఆమె బృందం సహాయం తీసుకున్నాడు డోనాల్డ్ ట్రంప్. తులసి సహాయంతో కమలా హారిస్‌పై పై చేయి సాధించి తన స్థానాన్ని బలోపేతం చేసుకోవాలని, ఓటర్లను ప్రభావితం చేయాలని ట్రంప్ లక్ష్యంగా పెట్టుకున్నాడు. 2020 అధ్యక్ష ఎన్నికల తరువాత డెమొక్రాటిక్ ΄ార్టీని వీడిన తులసి ట్రంప్ మద్దతుదారులలో బలమైన వ్యక్తిగా గుర్తింపు పొందింది. ‘ఆమె మాటను ట్రంప్ తు.చ. తప్పకుండా పాటిస్తాడు’ అని చెప్పుకుంటారు.‘రాజకీయ చరిత్రలో ఉత్తమ వక్తలలో ఒకరిగా ట్రంప్ గుర్తింపు పొందాడు. ట్రంప్‌కు సంప్రదాయ డిబేట్ ప్రిపరేషన్ అవసరం లేదు. అయితే గతంలో కమలా హారిస్‌ను విజయవంతంగా ఎదుర్కొన్న తులసి గబార్డ్లాంటి గౌరవ సలహాదారుల అవసరం ఎంతో ఉంది’ అంటుంది ట్రంప్ అధికార ప్రతినిధి కరోలిన్. గత అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో జాతీయ దృష్టిని ఆకర్షించింది తులసి. దీనికి కారణం ‘డెమోక్రటిక్ డిబేట్స్’లో కమలా హారిస్‌తో పోటీపడి తన సత్తా చాటింది. హవాయి ఆర్మీ నేషనల్ గార్డ్‌లో పనిచేసినప్పటి నుంచి రాజకీయాల వరకు తులసి అనేక సవాళ్లను ఎదుర్కొంది. ‘నేనే సర్వస్వం’ అనుకునే డోనాల్డ్ ట్రంప్‌ను గ్రేట్ డిబేట్ కోసం సన్నద్ధం చేయడం అతి పెద్ద సవాలు. చిన్నప్పటి నుంచి ‘భగవద్గీత’ శ్లోకాల్లో మునిగి తేలిన తులసికి సవాళ్లను ఎదుర్కొనే వ్యూహం ఉంది. మాటలతో సత్తా చాటే శక్తి ఉంది. కమలకు మాయమద్దతు..చికాగోలో జరిగిన డెమొక్రటిక్ నేషనల్ కన్వెన్షన్ (డిఎన్సీ)లో అక్క కమలా హారిస్‌కు మద్దతుగా మాట్లాడిన మాయా హారిస్ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. తన ప్రసంగంలో భారతీయురాలైన తన తల్లి డా. శ్యామల గోపాలన్‌ను స్మరించుకుంది. ‘అమ్మ స్వయం నిర్ణయాధికార శక్తి మాకు స్ఫూర్తి. మేము స్వతంత్రంగా ముందడుగు వేయడంలో ఆమె పాత్ర ఎంతో ఉంది. ఈ హాల్లో అమ్మ ఉండి ఉంటే అక్కను చూసి ఎంత సంతోషించేది. నాకు తెలుసు... ఆమె దివి నుంచి చిరునవ్వుతో మమ్మల్ని ఆశీర్వదిస్తుంది.’ అంటుంది మాయ. ‘మీ జీవిత కథకు మీరే రచయిత్రులు’ అని తల్లి చెప్పిన మాటను ఎప్పుడూ గుర్తు చేసుకుంటుంది మాయాహారిస్. అక్క ΄ోరాట స్ఫూర్తి ఆమెకు ఎంతో ఇష్టం. స్టాన్ఫోర్డ్ లా స్కూల్లో చదువుకున్న మాయా హారిస్ ‘స్టాన్ఫార్డ్ లా రివ్యూ’ కు ఎడిటర్‌గా కూడా పనిచేసింది. విషయ విశ్లేషణ, ఒక అంశాన్ని అనేక కోణాల్లో చూడడం అనేది అక్కడి నుంచే అలవడింది. సామాజిక ఉద్యమాల్లోనూ చురుగ్గా ΄ాల్గొనేది మాయ. ‘డొమెస్టిక్ వయొలెన్స్ క్లినిక్’కు కో–ఆర్డినేటర్‌గా బాధ్యతలు నిర్వహించింది. లా స్కూల్లో పట్టా పుచ్చుకున్న తరువాత లా క్లర్క్‌గా పనిచేసింది. ఆ తరువాత ‘జాక్సన్’ లా ఫర్మ్‌లో చేరి సివిల్, క్రిమినల్ కేసులపై పనిచేసింది.కేవలం కమలా సోదరిగానే కాదు..రాజకీయ విషయాలకు వస్తే... డెమొక్రటిక్ ΄పార్టీలో హిల్లరీ క్లింటన్ ప్రచార ప్రతినిధిగా, తన సోదరి కమలా హారిస్ కోసం 2020లో ‘క్యాంపెయిన్ ఫర్ ప్రెసిడెంట్’గా పనిచేసింది. ‘వ్యక్తులను తక్కువ అంచనా వేసే వారికి ఎలా జవాబు చెప్పాలో అక్కకు తెలుసు. అండర్‌డాగ్‌గా ఉండడం ఎలా ఉంటుందో కూడా ఆమెకు తెలుసు. ఇప్పటికీ ఎన్నో అడ్డంకులను అధిగమించింది. ఆశావాదంతో ముందుకు వెళుతోంది. ఈ చారిత్రక సందర్భంలో ఆమె నాయకత్వం మనకు అవసరం’ అంటుంది మాయా హారిస్.అయితే అక్కలో ఉన్నాయని చెబుతున్న సుగుణాలన్నీ మాయలో కూడా ఉన్నాయి. ఆమె గుర్తింపు ‘కమలా హారిస్ సోదరి’కి మాత్రమే పరిమితమైనది కాదు. న్యాయవాదిగా, సామాజిక కార్యకర్తగా, రచయిత్రిగా, ఉపన్యాసకురాలిగా యూఎస్‌లో తనకంటూ సొంత గుర్తింపు ఉంది. ఎన్నికల ప్రచారం, వ్యూహాల విషయంలో కమలా హారిస్ ఇతరులపై ఆధారపడాల్సిన అవసరం లేదు. చెల్లి తనకు ఎంతో అండ. ఉత్తేజిత శక్తి. (చదవండి: డౌన్ సిండ్రోమ్‌తో లాయర్‌గా చరిత్ర సృష్టించింది! ఎవరీమె..?) -
కమలాహారిస్‌తో డిబేట్‌కు రెడీ: ట్రంప్
ఫ్లోరిడా: డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి కమలాహారిస్‌తో ప్రెసిడెన్షియల్ డిబేట్‌కు సిద్ధమని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. సెప్టెంబర్ 10న ఏబీసీ టీవీచానల్‌లో చర్చకు రెడీ అని తెలిపారు. ఫ్లోరిడాలోని తన పామ్‌బీచ్ ఎస్టేట్‌లో ట్రంప్ గురువారం(ఆగస్టు9) మీడియాతో మాట్లాడారు. అధ్యక్ష ఎన్నికల ముందు చర్చలు జరగడం చాలా ముఖ్యమని ట్రంప్ పేర్కొన్నారు. డెమొక్రటిక్ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి టిమ్ వాల్జ్ రాడికల్ లెఫ్ట్ భావాలున్న వ్యక్తని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే ట్రంప్ డిబేట్ ప్రతిపాదనపై కమలాహారిస్ క్యాంపు నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. తాను ఏబీసీ చానాల్లో చర్చకు రానని సోషల్ మీడియాలో ప్రకటించిన కొద్ది రోజులకే మాట మార్చి అందులోనే చర్చకు వస్తానని ట్రంప్ చెప్పడం గమనార్హం. నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. -
మధ్యతరగతిపై పన్నుల భారాన్ని తగ్గించాలి: విజయసాయిరెడ్డి
న్యూఢిల్లీ, సాక్షి: రకరకాల పన్నులతో ప్రజలపై భారం మోపడమే తప్ప.. వాళ్లకు ఒనగూరుతోంది ఏంటని? వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి సూటిగా ప్రశ్నించారు. ఫైనాన్స్ బిల్లుపై రాజ్యసభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు.‘‘ఓవైపు ఆదాయపన్ను, మరోవైపు జిఎస్టి, ఇంకోవైపు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ వేస్తున్నారు. కానీ ఈ పన్నులతో ప్రజలకు ఒనగురుతున్నది ఏంటి?. కేవలం రోడ్లు భవనాలు నిర్మిస్తున్నామంటే సరిపోదు. మధ్య తరగతి ప్రజలపై పన్నుల భారాన్ని తగ్గించాలి. అదే సమయంలో తగిన ప్రోత్సాహకాలు అందించాలి’’ అని ప్రసంగించారు.‘‘పెన్షన్‌పై ఎలాంటి పన్నులు వేయవద్దు. లక్ష రూపాయల వరకు పెన్షన్లు టాక్స్ ఫ్రీ చేయాలి. రిటైర్డ్ ఉద్యోగుల ఆరోగ్య ఖర్చులకు ఇది ఉపయోగపడుతుంది. అలాగే.. సీనియర్ సిటిజన్లో కోసం ఐటీ ఫైలింగ్ కోసం ప్రత్యేక సహాయ యంత్రంగా ఏర్పాటు చేయాలి. పీపీఎఫ్ వడ్డీరేట్లు, ఎఫ్డీ రేట్లకంటే చాలా తక్కువగా ఉన్నాయి. అందుకే పీపీఎఫ్ వడ్డీ రేట్లు పెంచాలి పొదుపును ప్రోత్సహించాలి. సరైన సమయంలో ఆదాయ పన్ను ఫైల్ చేసిన వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి’’ అని కేంద్రాన్ని కోరారాయన. వీటితో పాటు.. తక్కువ వడ్డీకే వాయిదాలు చెల్లించే వెసులుబాటు ఇవ్వాలని, వ్యవసాయ రంగానికి తగిన ప్రోత్సాహకాలు, నిధులు ఇవ్వాలని, అలాగే.. వ్యవసాయ యంత్రాలపై జీఎస్టీని తగ్గించాలి అని ఆయన వైఎస్సార్సీపీ తరఫున కేంద్రాన్ని కోరారు. -
USA Presidential Elections 2024: ఫాక్స్ డిబేట్‌కు రాను: కమల
వాషింగ్టన్: ఫాక్స్ న్యూస్ చానెల్లో డిబేట్‌కు రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రతిపాదనను డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ తోసిపుచ్చారు. నిజానికి అధ్యక్షుడు జో బైడెన్ ఆ పార్టీ అభ్యర్థిగా ఉండగా ఆయనతో సెప్టెంబర్ 10న ఏబీసీ చానల్లో రెండో డిబేట్‌కు ట్రంప్ అంగీకరించారు. అనంతరం బైడెన్ బదులు హారిస్ అభ్యర్థి అవడం తెలిసిందే. ఏబీసీ బదులు ఫాక్స్ న్యూస్ చానల్లో సెప్టెంబర్ 4న డిబేట్‌కు సిద్ధమని ట్రంప్ శనివారం ప్రకటించారు. దీన్ని హారిస్ తప్పుబట్టారు. ‘‘ఎక్కడైనా ఎప్పుడైనా చర్చకు సిద్ధమన్న ట్రంప్ ఇప్పుడేమో ఫలానా సమయంలో, ఫలానా చోటే అనడం ఆశ్చర్యకరం. అంగీకరించిన మేరకు సెప్టెంబర్ 10న ఏబీసీ న్యూస్‌లో చర్చకు నేను సిద్ధం. ఆయన పాల్గొంటారని ఆశిస్తున్నా’’ అన్నారు. డిబేట్‌కు ట్రంప్ భయపడుతున్నారని హారస్ ప్రచార బృందం వ్యాఖ్యానించింది. ఆయన తమాషాలు మానుకోవాలని హితవు పలికింది. -
Donald Trump: ‘ఫాక్స్’లో అయితేనే డిబేట్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థులైన డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ మధ్య అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రెసిడెన్షియల్ డిబేట్ జరిగే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. సెపె్టంబర్ 10న ఏబీసీ చానల్లో హారిస్‌తో జరగాల్సిన డిబేట్ నుంచి తప్పుకుంటున్నట్టు ట్రంప్ ప్రకటించారు. ‘‘నిజానికది జో బైడెన్‌తో జరగాల్సిన డిబేట్. ఆయన ఎన్నికల బరి నుంచి తప్పుకున్నందున ఆ డిబేట్ కూడా రద్దయినట్టే’’ అని వాదించారు. ఈ మేరకు సొంత సోషల్ మీడియా హాండిల్ ‘ట్రూత్’లో తాజాగా ట్రంప్ పలు పోస్టులు పెట్టారు. ఫాక్స్ న్యూస్ చానల్లో అయితేనే డిబేట్‌కు వస్తానంటూ మెలిక పెట్టారు. ‘‘సెప్టెంబర్ 4న పెన్సిల్వేనియాలో ఫాక్స్ స్టూడియోలో హారిస్ చర్చకు రావాలి. ఖాళీ స్టూడియోలో కాకుండా కిక్కిరిసిన ప్రేక్షకుల నడుమ డిబేట్ చేద్దాం’’ అని సవాలు విసిరారు. దీనిపై హారిస్ వర్గం మండిపడింది. పిరికితనంతో డిబేట్ నుంచి ట్రంప్ పారిపోతున్నారంటూ ఎద్దేవా చేసింది. ఈ నేపథ్యంలో ట్రంప్ రాకపోయినా కేవలం హారిస్‌తో ఏబీసీ డిబేట్ కొనసాగుతుందా అన్నది చూడాల్సి ఉంది. డెమొక్రాట్ల తరఫున అధ్యక్షుడు బైడెన్‌కు బదులు హారిస్ అధ్యక్ష రేసులో అడుగు పెట్టినప్పటి నుంచీ ఆమెతో డిబేట్‌కు ట్రంప్ వెనకా ముందాడుతూ వస్తున్నారు. తామిద్దరి గురించీ అమెరికన్లకు ఇప్పటికే అంతా తెలుసంటూ వ్యాఖ్యలు చేశారు. కానీ తనతో డిబేట్‌కు రావాల్సిందేనని హారిస్ పట్టుబడుతున్నారు. గూగుల్‌పై ట్రంప్ మండిపాటుతన వార్తలను, ఫొటోలను గూగుల్ సెన్సార్ చేస్తోందని, ప్రజలకు వాస్తవాలు చేరనివ్వడం లేదని ట్రంప్ మండిపడ్డారు. తనకు సంబంధించిన వార్తలను, సమాచారాన్ని ఫేసుబుక్‌లో సెన్సార్ చేసినందుకు సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ తనకు క్షమాపణ చెప్పారన్నారు. -
కమలా హారిస్‌తో డిబెట్‌కు ట్రంప్ ఓకే.. ఎప్పుడంటే..!
అమెరికా అద్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరపున పోటీకి దిగుతున్న వైఎస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్‌తో టీవీ చర్చలో పాల్గొనేందుకు రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ అంగీకారం తెలిపారు. సెప్టెంబర్ 4న హారిస్‌తో కలిసి ఫాక్స్ న్యూస్ డిబెట్లో పాల్గొననున్నట్లు అమెరికా మాజీ అధ్యక్షుడు శుక్రవారం అర్ధరాత్రి ప్రకటించారు.కాగా కమలా హారిస్,ట్రంప్ ప్రెసిడెన్షియల్ డిబేట్లో పాల్గొనడం ఇదే తొలిసారి. అయితే గత జూన్‌లో ట్రంప్, జోబైడెన్ అధ్యక్ష చర్చలో పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ చర్చలో బైడెన్ సరిగా మాట్లాడలేకపోయారని విమర్శలు వెల్లువెత్తాయి. ట్రంప్ మాటలకు సమాధానలు చెప్పడంలో విఫలమైనట్లు, తడబడినట్లు విశ్లేషకులు భావించారు. దీంతో ఆయన్ను అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలని డెమొక్రాట్ల నుంచి ఒత్తిడి వచ్చింది. అనుకున్నట్లుగానే చివరికి బైడెన్ అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్నారు.ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరఫున కమలా హారిస్ అభ్యర్థిత్వం ఖరారైన అనంతరం ట్రంప్ నుంచి ఈ ప్రకటన వెలువడింది. శుక్రవారం డెమోక్రటిక్ పార్టీ డెలిగేట్ల ఆన్లైన్ పోలింగ్ మొదలైన నేపథ్యంలో ఆమె మెజారిటీ ఓట్లను గెల్చుకున్నారు. దాంతో అభ్యర్థిత్వం ఖరారైంది. ఇదిలా ఉండగా నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. -
ఏదైనా ఉంటే ముక్కుసూటిగా.. ట్రంప్‌కు కమలా హారిస్ ఛాలెంజ్
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష పోటీకి సిద్ధమవుతున్న ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. మంగళవారం ఆమె జార్జియాలోని అట్లాంటా సిటీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని రిపబ్లిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై విమర్శలు గుప్పించారు. అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన డిబేట్ విషయంలో ట్రంప్ ఎదైనా చెప్పదల్చుకుంటే ముఖం మీద సూటిగా చెప్పాలని ఛాలెంజ్ విసిరారు. తాను అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన తర్వాత ఎన్నికల స్వరూపం మారిపోయిందని అన్నారామె.‘అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మార్పు వచ్చింది. ఈ మార్పు సంకేతాలను డొనాల్డ్ ట్రంప్ గమనించారు. గతవారం సెప్టెంబర్‌లో డిబేట్ సిద్ధమన్న ట్రంప్.. ప్రస్తుతం వైదొలిగారు. నాతో డిబేట్లో పాల్గొనడానికి మీరు( డొనాల్డ్ ట్రంప్) పునరాలోచిస్తున్నానని తెలుస్తోంది. అయితే మీరు ఏదైనా చెప్పదల్చుకుంటే నా ముఖం మీద సూటిగా చెప్పాలి. ట్రంప్ ఆయన రన్నింగ్ మేట్(ఉపాధ్యక్ష అభ్యర్థి) డిబేట్ చేయలనుకోరు. కానీ, నా గురించి ఏదో ఒకటి మాట్లాడాలని వాళ్లు చూస్తారు’ అని అన్నారు. కమలా హారిస్ పాల్గొన్న ఈ ర్యాలీలో 10 వేల మంది ప్రజలు హాజరయ్యారు. జార్జియా ప్రజలు మద్దతు తెలిపితే అధ్యక్ష ఎన్నికల్లో గెలువటం సులువు అవుతుంది. 2020 ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా ఇక్కడి ప్రజలు తమకు మద్దతు తెలుపుతారని ఆశిస్తున్నానని అన్నారు. ఈ ఎన్నికల్లో సైతం డెమోక్రటిక్ పార్టీ విజయం సాధిస్తుందని అన్నారు. ఈ ఎన్నికలు మనకు ట్రంప్‌కు మాత్రమే కాదని అన్నారు. దేశ భవిష్యత్తు గురించి ఆలోచించేవాళ్లకు, దేశాన్ని తిరోగమనంలోకి తీసుకువెళ్లారికి మధ్య జరగనున్నాయని కమలా హారిస్ అన్నారు.మరోవైపు.. ప్రచారం ప్రారంభించిన వారం వ్యవధిలోనే దాదాపు 20 కోట్ల డాలర్లను కమలా బృందం సేకరించడం గమనార్హం. దేశ అధ్యక్షుడు జో బైడెన్ రేసు నుంచి వైదొలిగిన అనంతరం.. కమలా హారిస్‌కు డెమోక్రటిక్ పార్టీ నుంచి పోటీకి మార్గం సుగమమైన విషయం తెలిసిందే. -
19 పద్దులకు సభ ఆమోదం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మూడో శాసనసభ మూడో విడత సమావేశాల్లో భాగంగా ఆరో రోజు మంగళవారం ఒక ప్రభుత్వ బిల్లుతో పాటు 2024–25 వార్షిక బడ్జెట్లోని వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన 19 పద్దులపై చర్చ జరిగింది. మంత్రుల సమాధానాల అనంతరం సభ వాటికి ఆమోదం తెలిపింది. పద్దులపై సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన చర్చ మంగళవారం తెల్లవారుజామున 3.10 గంటల వరకు కొనసాగింది.తిరిగి మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన అసెంబ్లీ వరుసగా రెండోరోజు కూడా పద్దులపైనే చర్చించింది. పశు మత్స్య పరిశ్రమ, క్రీడలు యువజన సేవలు, సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం, అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమం, నీటిపారుదల ఆయకట్టు అభివృద్ధి, పౌర సరఫరాలు, వ్యవసాయం, సహకారం, పర్యాటక, కళలు.. సాంస్కృతిక, ధర్మాదా య, అడవులు, శాస్త్ర సాంకేతికత, మహిళా శిశు సంక్షేమం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, రెవెన్యూ, ప్రజాసంబంధాల శాఖల పద్దులపై జరిగిన చర్చలో సభ్యులు పాల్గొన్నారు.పద్దులను ఆమోదించిన అనంతరం శాసన సభను బుధవారం ఉదయం 10 గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అలాగే యువ భారత నైపుణ్యాల విశ్వవిద్యాలయం (స్కిల్స్ యూనివర్సిటీ), ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య బిల్లు–2024ను సభలో ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతూ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ప్రతిపాదించారు. అసెంబ్లీ ఉభయ సభల్లో బుధవారం ద్రవ్య వినిమయ బిల్లు చర్చకు రానుంది. దీంతో ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. ఈ మేరకు శాసనసభ స్పీకర్, శాసనమండలి చైర్మన్ వేర్వేరుగా బులెటిన్లు జారీ చేశారు. -
నేడు అసెంబ్లీలో బడ్జెట్ పద్దులపై చర్చ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ఐదో రోజు పలు ప్రభుత్వ శాఖలకు సంబంధించిన పద్దులపై చర్చ జరగనుంది. సోమవారం ఉదయం 10 గంటలకు సభ ప్రారంభమైన వెంటనే వివిధ పద్దులను ఆయా మంత్రులు సభ ఆమోదం కోసం ప్రతిపాదిస్తారు. సోమవారం ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు స్పీకర్ బులెటిన్ విడుదల చేసిన నేపథ్యంలో సభలో నేరుగా పద్దులపై చర్చ జరగనుంది.సాధారణ పాలన, న్యాయ, వాణిజ్య పనులు, హోం మంత్రిత్వ శాఖలతో పాటు పాఠశాల, ఉన్నత, సాంకేతిక విద్యకు సంబంధించిన పద్దులపై చర్చ జరుగుతుంది. అలాగే పురపాలన, పట్టణ అభివృద్ధి, ఉపాధి కల్పన, కార్మిక, వైద్య, ఆరోగ్య, పరిశ్రమలు, ఐటీ, ఎక్సైజ్ తదితర శాఖలకు సంబంధించిన పద్దులపైనా అసెంబ్లీ చర్చించనుంది. -
బిగ్ డిబేట్లో బైడెన్ బేజారు!.. ‘నేనేం కుర్రాడిని కాదుగా’
వాషింగ్టన్: వాడీవేడిగా సాగిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(81), మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(78)ల చర్చ యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. నువ్వు అబద్ధాలకోరువంటే.. నువ్వే అబద్ధాలకోరువంటూ మాటల దాడి చేసుకున్నారు ఈ ఇద్దరూ. అయితే డిబేట్లో ట్రంప్ పైచేయి సాధించారంటూ బైడెన్ డెమొక్రటిక్ సహచరులు సైతం అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.ట్రంప్‌తో సాగిన డిబేట్లో తన ప్రదర్శపై అధ్యక్షుడు బైడెన్ శుక్రవారం స్పందించారు. ‘‘స్పష్టంగా చెప్పాలంటే.. నేను కుర్రాడిని కాదనే విషయం నాకు తెలుసు. అలాగని నడకలోనూ, మాటల్లోనూ, చర్చల్లోనూ అంత తేలికగా వ్యవహరించను. నేను ఈ బాధ్యతను(అధ్యక్ష పదవి) మళ్లీ సమర్థవంతంగా నిర్వహించగలనని మనసారా, ఆత్మ సాక్షిగా నమ్మాను. కాబట్టే మళ్లీ బరిలో నిలుచున్నా. ఏది ఏమైనా.. అధ్యక్ష రేసు నుంచి తప్పుకునేది లేదు. రిపబ్లికన్ ప్రత్యర్థి ట్రంప్‌ను ఓడించి తీరతా’’ అని బైడెన్ అన్నారు.దేశాధ్యక్ష పీఠం కోసం డెమొక్రటిక్ పార్టీ నుంచి బైడెన్, రిపబ్లికన్ల తరఫున ట్రంప్ బరిలో ఉన్న సంగతి తెలిసిందే. అమెరికా కాలమానం ప్రకారం గురువారం రాత్రి(భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం) జరిగిన డిబేట్లో పరస్పరం తీవ్ర విమర్శలు గుప్పించుకున్నారు. నవంబరులో జరగనున్న అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి వీరిద్దరి మధ్య ఇదే తొలి ముఖాముఖి చర్చ. దేశ ఆర్థిక వ్యవస్థ, సరిహద్దు, విదేశాంగ విధానం, గర్భవిచ్ఛిత్తి తదితర అంశాలపై ఒకరికొకరు ప్రశ్నలు సంధించుకొని.. దాదాపు 90 నిమిషాలపాటు ఆరోపణలు గుప్పించుకున్నారు. -
బిగ్ డిబేట్‌కు ముందు ట్రంప్‌కు ఊరట
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల క్యాంపెయిన్‌లో భాగంగా నిర్వహిస్తున్న బిగ్ డిబేట్‌కు కొద్ది గంటగల ముందు రిపబ్లికన్ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ఊరట లభించింది. హష్ మనీ కేసులో భాగంగా న్యూయార్క్‌లోని మన్‌హట్టన్ కోర్టు గతంలో ట్రంప్‌పై విధించిన గ్యాగ్(సైలెన్స్) ఆంక్షలను కొద్దిగా సడలించింది.సవరించిన ఆర్డర్ ప్రకారం హష్ మనీ కేసులో సాక్షులపై మాట్లాడడానికి ట్రంప్‌నకు అనుమతి లభించింది. అయితే కేసులో ప్రాసిక్యూటర్లు, ఇతర వ్యక్తులపై కామెంట్ చేయడానికి మాత్రం కోర్టు అనుమతివ్వలేదు. త్వరలో జరగబోయే డిబేట్లో డెమొక్రాట్ అభ్యర్థి, ప్రస్తుత దేశ అధ్యక్షుడు జో బైడెన్ మాటల దాడిని ఎదుర్కొని ధీటుగా సమాధానం చెప్పేందుకు కోర్టు విధించిన ఆంక్షలు అడ్డొస్తున్నాయని ట్రంప్ లాయర్లు వాదించారు. ట్రంప్ లాయర్ల అభ్యర్థనకు ప్రాసిక్యూటర్లు కూడా వ్యతిరేకించకపోవడంతో కోర్టు ఆంక్షలను కొంత మేర సడలించింది.హష్ మనీ కేసులో ట్రంప్ దోషి అని కోర్టు ఈ ఏడాది మే30న తేల్చింది. ఈ కేసులో కోర్టు జ్యూరీ తుది తీర్పు వెలువరించడంతో పాటు శిక్షను ఖరారు చేయాల్సి ఉంది. తనను లైంగికంగా వాడుకొని ఆ విషయం బయటికి చెప్పకుండా ఉండేందుకు డబ్బులు చెల్లించాడని పోర్న్‌స్టార్ స్టార్మీ డేనియల్స్ ట్రంప్‌పై హష్ మనీ కేసు పెట్టింది. కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలక ఘట్టంగా చెబుతున్న ట్రంప్, జో బైడెన్ల బిగ్ డిబేట్ గురువారం(జూన్27)న జార్జియాలో జరగనుంది. పలు అంశాలపై 90 నిమిషాల పాటు జరగనున్న ఈ డిబేట్లో జో బైడెన్, ట్రంప్ పలు కీలక అంశాలపై ముఖాముఖి చర్చించనున్నారు.