కమల వర్సెస్‌ ట్రంప్‌: డిబేట్‌ రూల్స్‌ ఇవే.. | Donald Trump Vs Kamala Harris Debate In Philadelphia Ahead Of US Elections 2024, What Are The Rules Released By ABC | Sakshi
Sakshi News home page

Kamala Vs Trump Debate: డిబేట్‌ రూల్స్‌ ఇవే..

Published Mon, Sep 9 2024 5:08 PM | Last Updated on Mon, Oct 7 2024 10:38 AM

us polls Trump vs Harris Debate what are The Rules

న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం కొనసాగుతంది. మరోవైపు.. రిపబ్లిక్‌ పార్టీ అభ్యర్థి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఉపాధ్యక్షురాలు, డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌ తొలిసారి రేపు (మంగళవారం) అమెరికా బ్రాడ్‌కాస్టర్‌ ఏబీసీ నిర్వహించే డిబేట్‌లో తలపడనున్నారు. ఈసారి అధ్యక్ష ఎన్నికల పోరు.. ఇరువురి మధ్య నువ్వా-నేనా అనే స్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇరు పార్టీల అభ్యర్థులు డిబేట్‌ కోసం సిద్ధం అవుతున్నారు. 

ఇప్పటికే జరిగిన తొలి డిబేట్‌లో ట్రంప్‌.. ప్రెసిడెంట్‌ జో బైడెన్‌పై పైచేయి సాధించిన విషయం తెలిసిందే. ఇక రేపు జరగబోయే డిబేట్‌లో ఎలాంటి నియమాలు, నిబంధనలు ఉంటాయనే విషయంపై చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఏబీసీ డిబేట్‌ రూల్స్‌ను  వెల్లడించిన విషయం  తెలిసిందే. ఆ రూల్స్‌ ఇవే..

ఫిలడెల్ఫియాలోని జాతీయ రాజ్యాంగ కేంద్రంలో మంగళవారం రాత్రి 9:00 గంటలకు డిబేట్‌ ప్రారంభం అవుతుంది. ఈ డిబేట్‌ను ఏబీసీ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. ఇక.. డిబేట్‌ జరిగే గదిలో ప్రేక్షకులు ఎవరూ ఉండరు. చర్చను ఏబీసీ యాంకర్లు డేవిడ్ ముయిర్, లిన్సే డేవిస్‌లు నిర్వహిస్తారు. మొత్తం చర్చ సమయం రెండుసార్లు బ్రేక్‌ తీసుకొని 90 నిమిషాల పాటు జరుగుతుంది.

ఒకరు మాట్లాడుతున్న సయయంలో మరోకరు రన్నింగ్ కామెంట్రీ చేయటంతో ట్రంప్‌, బైడెన్‌ మధ్య జరిగిన తొలి డిబేట్‌ వివాదాస్పదమైన విషయం తెలిసిందే. అందుకు ఈసారి ఏబీసీ మైక్‌లను మ్యూట్‌ చేస్తామని తెలిపింది. అంటే ఒకరు మాట్లాడుతుంటే.. మరొకరి మైక్‌ మ్యూట్‌లో ఉంటుంది. డిబేట్‌ను జరిపించే యాంకర్లు మాత్రమే సంబంధిత అంశాలు, ప్రశ్నలను అభ్యర్థులను అడుగుతారు. ఎటువంటి అంశాలనే విషయాన్ని ముందుగా అభ్యర్థలకు తెలియజేయటం అనేది ఉండదు. మొత్తం లైవ్‌లోనే చర్చ జరుగుతుంది.

ప్రతి అభ్యర్థి మాట్లాడాటానికి రెండు నిమిషాలు సమయం కేటాయిస్తారు. ఒకరు మాట్లాడిన తర్వాత మరొకరు మాట్లాడుతారు. నిబంధనలు ప్రకారం కొనసాగింపు, వివరణ, ప్రతిస్పందనకు సంబంధించి మరో నిమిషం కేటాయిస్తారు. చర్చ  చివరిలో ముగింపు వ్యాఖ్యల కోసం ఇరువురికి రెండు నిమిషాల సమయం కేటాయిస్తారు. 

చర్చ మొత్తం అభ్యర్థులు నిల్చొని కొనసాగించాల్సి ఉంటుంది. ముందస్తుగా రాసుకున్న నోట్స్‌, డాక్యుమెంట్లు చర్చకు అనుమతించరు. కానీ డిబేట్‌ జరగుతున్న సమయంలో కీలక విషయాలను నోట్ చేసుకొని వాటి ఆధారంగా మాట్లాటం కోసం ఇద్దరు అభ్యర్థులకు ఒక పెన్ను, పేపర్‌ ప్యాడ్‌, వాటర్‌ బాటిల్‌ అందజేస్తారు. చర్చ మధ్యలో  రెండు​ సార్లు ఇచ్చే  బ్రేక్ సమయంలో తమ ప్రచారం బృందంతో మాట్లాడానికి అనుమతి లేదు.

ఇక.. ట్రంప్‌, కమలా మధ్య రేపు జరిగే తొలి డిబేట్‌పై అమెరికా ప్రజలు, ఓటర్లు ఎంతో ఆసక్తిగా ఎదు​రుచుస్తున్నారు. ఈ  డిబేట్‌  ఫలితం కూడా అధ్యక్ష ఎన్నికల్లో అభర్థులను గెలుపు, ఓటమిలపై ప్రభావం చూపుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement