philadelhpia
-
Kamala Harris: నవతరం నాయకురాలిని
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కంటే తాను భిన్నమైన నేతనని, ‘నవతరం నాయకత్వాన్ని’అందిస్తానని ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అన్నారు. మార్పుకు ప్రతినిధిగా అమెరికన్ల ముందు తనను తాను ఆవిష్కరించుకుంటున్న డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ నవంబరు 5న జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌తో తలపడుతున్న విషయం తెలిసిందే. ఫిలడెలి్ఫయాలో శుక్రవారం హారిస్ ఒక టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ట్రంప్ విద్వేష, విభజన రాజకీయాలతో అమెరికన్లు విసిగిపోయారన్నారు. తనకు తుపాకీ ఉందని, ఎవరి తుపాకీ హక్కులను తాను హరించాలనుకోవడం లేదని తెలిపారు. ఆసల్ట్ స్టైల్ ఆయుధాలపైనే నిషేధం తప్పనిసరని తాను భావిస్తునన్నారు. బైడెన్‌కు మీరెలా భిన్నమో చెప్పాలని యాంకర్ బ్రియాన్ టాఫ్ అడగ్గా.. ‘నైనేతే జో బైడెన్‌ను కాను. నవతరం నాయకత్వాన్ని అందిస్తా’అని కమలా హారిస్ స్పందించారు. గతంలో ఆ నడిచిపోతుందిలే అని తేలికగా తీసుకున్న అంశాలను ఇకపై ఎవరూ నిర్లక్ష్యం చేయలేరన్నారు. పిల్లల సంరక్షణ కోసం తల్లిదండ్రులకు ఇచ్చే చైల్డ్ ట్యాక్స్ క్రెడిట్‌ను 6 వేల డాలర్లకు పెంచుతానన్నారు. ఒకరినొకరు వేలెత్తి చూపుకునేలా ప్రొత్సహిస్తున్న నాయకుడిలా (ట్రంప్‌లా) కాకుండా అమెరికన్లను ఏకతాటిపై నడిపే నాయకత్వం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తనకు తెలుసన్నారు. -
కమల వర్సెస్ ట్రంప్: డిబేట్ రూల్స్ ఇవే..
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం కొనసాగుతంది. మరోవైపు.. రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షురాలు, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ తొలిసారి రేపు (మంగళవారం) అమెరికా బ్రాడ్‌కాస్టర్ ఏబీసీ నిర్వహించే డిబేట్లో తలపడనున్నారు. ఈసారి అధ్యక్ష ఎన్నికల పోరు.. ఇరువురి మధ్య నువ్వా-నేనా అనే స్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇరు పార్టీల అభ్యర్థులు డిబేట్ కోసం సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే జరిగిన తొలి డిబేట్లో ట్రంప్.. ప్రెసిడెంట్ జో బైడెన్‌పై పైచేయి సాధించిన విషయం తెలిసిందే. ఇక రేపు జరగబోయే డిబేట్లో ఎలాంటి నియమాలు, నిబంధనలు ఉంటాయనే విషయంపై చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఏబీసీ డిబేట్ రూల్స్‌ను వెల్లడించిన విషయం తెలిసిందే. ఆ రూల్స్ ఇవే..ఫిలడెల్ఫియాలోని జాతీయ రాజ్యాంగ కేంద్రంలో మంగళవారం రాత్రి 9:00 గంటలకు డిబేట్ ప్రారంభం అవుతుంది. ఈ డిబేట్‌ను ఏబీసీ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. ఇక.. డిబేట్ జరిగే గదిలో ప్రేక్షకులు ఎవరూ ఉండరు. చర్చను ఏబీసీ యాంకర్లు డేవిడ్ ముయిర్, లిన్సే డేవిస్‌లు నిర్వహిస్తారు. మొత్తం చర్చ సమయం రెండుసార్లు బ్రేక్ తీసుకొని 90 నిమిషాల పాటు జరుగుతుంది.ఒకరు మాట్లాడుతున్న సయయంలో మరోకరు రన్నింగ్ కామెంట్రీ చేయటంతో ట్రంప్, బైడెన్ మధ్య జరిగిన తొలి డిబేట్ వివాదాస్పదమైన విషయం తెలిసిందే. అందుకు ఈసారి ఏబీసీ మైక్‌లను మ్యూట్ చేస్తామని తెలిపింది. అంటే ఒకరు మాట్లాడుతుంటే.. మరొకరి మైక్ మ్యూట్‌లో ఉంటుంది. డిబేట్‌ను జరిపించే యాంకర్లు మాత్రమే సంబంధిత అంశాలు, ప్రశ్నలను అభ్యర్థులను అడుగుతారు. ఎటువంటి అంశాలనే విషయాన్ని ముందుగా అభ్యర్థలకు తెలియజేయటం అనేది ఉండదు. మొత్తం లైవ్‌లోనే చర్చ జరుగుతుంది.ప్రతి అభ్యర్థి మాట్లాడాటానికి రెండు నిమిషాలు సమయం కేటాయిస్తారు. ఒకరు మాట్లాడిన తర్వాత మరొకరు మాట్లాడుతారు. నిబంధనలు ప్రకారం కొనసాగింపు, వివరణ, ప్రతిస్పందనకు సంబంధించి మరో నిమిషం కేటాయిస్తారు. చర్చ చివరిలో ముగింపు వ్యాఖ్యల కోసం ఇరువురికి రెండు నిమిషాల సమయం కేటాయిస్తారు. చర్చ మొత్తం అభ్యర్థులు నిల్చొని కొనసాగించాల్సి ఉంటుంది. ముందస్తుగా రాసుకున్న నోట్స్, డాక్యుమెంట్లు చర్చకు అనుమతించరు. కానీ డిబేట్ జరగుతున్న సమయంలో కీలక విషయాలను నోట్ చేసుకొని వాటి ఆధారంగా మాట్లాటం కోసం ఇద్దరు అభ్యర్థులకు ఒక పెన్ను, పేపర్ ప్యాడ్, వాటర్ బాటిల్ అందజేస్తారు. చర్చ మధ్యలో రెండు సార్లు ఇచ్చే బ్రేక్ సమయంలో తమ ప్రచారం బృందంతో మాట్లాడానికి అనుమతి లేదు.ఇక.. ట్రంప్, కమలా మధ్య రేపు జరిగే తొలి డిబేట్‌పై అమెరికా ప్రజలు, ఓటర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచుస్తున్నారు. ఈ డిబేట్ ఫలితం కూడా అధ్యక్ష ఎన్నికల్లో అభర్థులను గెలుపు, ఓటమిలపై ప్రభావం చూపుతుంది. -
డ్రగ్స్ కాపిటల్‌గా ఫిలడెల్ఫియా.. ఫుట్‌పాత్‌లపై ‘బానిసల’ వికృత చేష్టలు!
అమెరికాలోని ఫిలడెల్ఫియా డ్రగ్స్ కాపిటల్‌గా మారిపోయింది. ఇక్కడి జనం ప్రమాదకరమైన డ్రగ్ ‘ట్రాంక్’ బారిన పడి కెన్సింగ్టన్ వీధుల్లో వికృత చేష్టలకు దిగుతున్నారు. మత్తులో మునిగిపోయి, తామేమి చేస్తున్నామో తమకే తెలియని స్థితిలో రోడ్ల మీద తిరుగాడుతున్నారు. ‘ట్రాంక్’కు బానిసగా మారిన ఒక వ్యక్తి తన వీడియో క్లిప్‌ను టిక్‌టాక్‌లో షేర్ చేశాడు. ఇదిమొదలు ఇటువంటి అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిలో పలువురు జాంబీ డ్రగ్స్ తీసుకుంటూ వింతగా ప్రవర్తించడం కనిపిస్తుంది. ఇంతేకాకుండా మరికొందరు మద్యం తీసుకోవడం, ధూమపానం చేయడం, కాలి వేళ్లకు డ్రగ్స్ ఇంజెక్ట్ చేయడం ద్వారా మత్తులోకి దిగడం లాంటి దృశ్యాలు ఈ వీడియోలలో కనిపిస్తున్నాయి. ‘ట్రాంక్’ అంటే ఏమిటి? ఎందుకు ప్రమాదకరం? మీడియాకు అందిన సమాచారం ప్రకారం జిలాజైన్ డ్రగ్ లేదా ‘ట్రాంకో’ను విరివిగా వినియోగిస్తున్నవారి సంఖ్య అమెరికాలో విపరీతంగా పెరిగిపోయింది. ‘ట్రాంక్’ని ‘జాంబీ డ్రగ్స్’ అని కూడా అంటారు. తొలుత దీనిని ఇది జంతువుల చికిత్సకు ఉపయోగించేందుకు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) ఆమోదించింది. అయితే క్రమంగా దీనిని మత్తు పదార్థంగా ఉపయోగించడం ప్రారంభించారు. ‘ట్రాంక్’ను మత్తుపదార్థాలైన హెరాయిన్, కొకైన్, ఫెంటానిల్‌లను మరింత శక్తివంతం చేయడానికి ఉపయోగిస్తారు. This is what Philadelphia now looks like thanks to the new drug called “Tranq”. This is what the city where our Declaration of Independence was signed now looks like. Can you believe it? pic.twitter.com/oSZ8RJAtOX — Joey Mannarino (@JoeyMannarinoUS) May 28, 2023 ఫిలడెల్ఫియా ఆరోగ్య అధికారులు గత నెలలో ఒక ప్రకటన విడుదల చేస్తూ.. డ్రగ్స్ మహమ్మారి నగరాన్ని సంక్షోభంలో ముంచిందని పేర్కొన్నారు. ‘జిలాజైన్ డ్రగ్ ఫిలడెల్ఫియాను తీవ్రంగా దెబ్బతీసింది. డ్రగ్స్ ఓవర్ డోస్ వల్ల మరణాల సంఖ్య పెరిగింది. దీనిని తీసుకునే వ్యక్తులు తీవ్రమైన గాయాల బారిన పడుతున్నారు. ఈ డ్రగ్ మనిషి శరీర భాగాలను క్షీణింపజేస్తుంది. మాదకద్రవ్యాల మహమ్మారిని అరికట్టడానికి నగరంలోని స్వచ్ఛంద భాగస్వాములతో కలిసి పని చేస్తున్నామని’ ఫిలడెల్ఫియా డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ బోర్డ్ ఆఫ్ హెల్త్ పేర్కొంది. ఈ విషయమై స్పందించిన కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు డ్రగ్స్ కలిగించే చెడు ప్రభావాలను ప్రత్యక్షంగా చూశామని తెలిపారు. సావేజ్ సిస్టర్స్ వ్యవస్థాపకురాలు సారా లారెల్ మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలలో ఈ డ్రగ్ వినియోగం మరింతగా పెరిగిందన్నారు. దీనిని అరికట్టడంతో అటార్నీ లారీ క్రాస్నర్ విఫలమయ్యారని ఆరోపించారు. నేరాలను అరికట్టడంలో, డ్రగ్స్ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో విఫలమైన 2022లో లారీ క్రాస్నర్ సస్పెండ్ అయ్యారు. అయితే దీనికి సంబంధించిన విచారణ నిరవధికంగా వాయిదా పడుతూ వస్తోంది. ఇది కూడా చదవండి: అమ్మకానికి పాక్? సౌదీ యువరాజు పర్యటనలో పక్కా డీల్? Yet another video of my hometown Philadelphia where the zombies roam the streets high on Fentanyl and Tranq. Leaving that shithole of a city was the best move of my life other than marrying my wife and fathering my 3 awesome kids. pic.twitter.com/WW3etvaDPj — Nikki Davis (@BlondeNAmerican) May 26, 2023 -
US : ఇదెక్కడి ప్రకోపం, అమెరికాలో ఎందుకీ తెలుగు ప్రతాపం?
ఒకప్పుడు అమెరికాకు వచ్చే ప్రవాసాంధ్రులంటే ఎంతో గౌరవం. అక్కడి సమాజం హర్షించేలా హుందాగా ఉండేవారు. తెలివితేటల్లో మిన్నగా ఉంటూ ప్రతిభను చాటేవారు. అమెరికాలోని ఏ నగరానికి వెళ్లినా .. తెలుగు వాళ్లంటే ఓ బ్రాండ్ ఉండేది. ఇప్పుడు పరిస్థితి తరచుగా దిగజారుతోంది. చదువు, ఉద్యోగాల కోసం అమెరికాకు వెల్లువెత్తుతోన్న ప్రవాసాంధ్రుల్లో.. చాలా మంది కొన్నాళ్ల పాటు బాగానే ఉంటున్నారు. ఆ తర్వాతే అసలు రంగు బయటపెట్టుకుంటున్నారు. ఎందుకీ జాడ్యం తొలుత వృత్తి నైపుణ్యాలు, ఉద్యోగాలకు పరిమితమయిన ప్రవాసాంధ్రులు.. ఇప్పుడు కంపెనీలు నెలకొల్పారు, విజయవంతంగా నడిపిస్తున్నారు. అదే సమయంలో పేరాశ వీపరీతంగా పెరిగింది. డబ్బు సంపాదనతో ఆగిపోకుండా.. దాన్ని ఎగ్జిబిట్.. అంటే ప్రదర్శనకు తహతహలాడుతున్నారు. అమెరికన్ల తరహాలో హుందాగా వీక్ డేస్ లో కనిపించే ప్రవాసాంధ్రులు.. వీకెండ్ లో పార్టీ కల్చర్ వీపరీతంగా పెంచుకుని.. అక్కడ తమ స్థాయి, దర్పాన్ని ప్రదర్శించేందుకు ఉవ్విళ్లుతున్నారు. కనీసం కేజీ బంగారం శరీరంపై వేసుకుంటే తప్ప కన్వెన్షన్ కు హాజరు కాలేని పరిస్థితి చాలా మంది తెలుగు కుటుంబాల్లో ఉంది. ఆరంభంలో తమ కెరియర్ పై దృష్టి పెట్టిన చాలా మంది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం వైపు తొంగి చూస్తున్నారు. టిడిపి ఎంట్రీతో మారిన సీన్ అక్కడ బాగా సంపాదించిన వారు హఠాత్తుగా ఇక్కడికి వచ్చి అసెంబ్లీకి, పార్లమెంటుకు పోటీ చేయడం పరిపాటి అయింది. దీన్నే అక్కడ హెలికాప్టర్ క్యాండిడేట్స్ అని సరదాగా చెప్పుకుంటారు. ఇలాంటి అభ్యర్థులంటే తెలుగుదేశం పార్టీకి పండగే. టికెట్ల కోసం ఎంతయినా ఖర్చు పెట్టడం, ఓటుకు కోట్లు గుప్పించడం ఇలాంటి వారి వల్ల చాలా సులభమని చంద్రబాబు నమ్ముతారు. చాలా మంది ప్రవాసాంధ్రులు వ్యాపారాల వైపు మళ్లారు. అయితే వీరేమి గొప్ప వ్యాపారాలు చేయడం లేదు. పేరాశ బాగా పెరిగి రియల్ ఎస్టేట్ బిజినెస్, హోటల్ బిజినెస్ చేస్తున్నారు. ఈస్ట్ కోస్ట్ తో పాటు టెక్సాస్ లాంటి చాలా రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ అంతా మన వాళ్ల చేతిలోనే ఉంది. తనకు అనుకూలమైన కొందరిని విదేశాల నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంచడం చంద్రబాబుకు బాగా అబ్బిన కళ. అక్కడి నుంచి రకరకాల ఫేక్ స్టోరీలను వండి తెలుగు రాజకీయాలపై వదలడం బాబు కోటరీకి వెన్నతో పెట్టిన విద్య. పేరులో కులాలను మార్చి.. ప్రత్యర్థులపై దాడి చేయడం బాగా అలవాటుగా మారింది. ఇందులో కొందరు ఎన్నారైలు పావులైపోతున్నారు. డబ్బు కోసం విలువలు మరిచి.. ఇదే సమయంలో మరికొందరు ఓ అడుగు ముందుకేసి ఈవెంట్ మేనేజ్ మెంట్ పేరుతో ఇండియా నుంచి ప్రముఖ అమ్మాయిలను తెప్పించడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 'గంటకు ఇంత అంటూ' అనైతిక కార్యక్రమాలకు దిగి అక్కడి పోలీసులకు దొరికిపోయి మొత్తం తెలుగు ప్రజలకే చెడ్డ పేరు తెస్తున్నారు. షికాగో వేదికగా ఐదారేళ్ల కింద కొందరు పట్టుబడడం వల్ల చాలా మంది తెలుగు వాళ్లు ఇబ్బంది పడ్డారు. అసలు మాది తెలుగు అని చెప్పుకోవడానికి సిగ్గు పడ్డారు. వీసా ఇంటర్వ్యూలకు సినీ తారలు వెళ్తే అనుమానించే పరిస్థితి ఎదురయిందని కొందరు ప్రవాసాంధ్రులు తెలిపారు గ్రూపులు.. వర్గాలు ఇక ఏ ఈవెంట్ జరిగినా.. రెండుగా చీలడం పరిపాటయింది. ఇటీవల టెక్సాస్ లో బాలకృష్ణ అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు బాహటంగానే తన్నుకున్న విషయం ప్రవాసాంధ్రుల మదిలోంచి ఇంకా పోలేదు. ఒక్క తెలుగుదేశంలోనే చాలా వర్గాలున్నాయి. అమెరికాకు 40, 50 ఏళ్ల కిందనే రావడంతో టిడిపి ఎన్నారైలలో ప్రాంతీయ అభిమానం బాగా పెరిగిపోయింది కులాల పేరుతో సంఘాలు, సినీ నటుల పేర్లతో అభిమాన సంఘాలు బాగా పెరిగిపోయాయి. ఇక ప్రాంతాల వారీగా ఇది మరింత ముదిరింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాస్తా.. జిల్లాల పేరుతో మీటింగ్ లు, భేటీలు జరుగుతున్నాయి. ఒకప్పుడు ఘన చరిత్ర ఉన్న ప్రవాసాంధ్రులు కాస్తా.. ఇలాంటి పరిస్థితి కొని తెచ్చుకోవడం కాస్తా ఇబ్బందికరమేనని వాపోతున్నారు. చదవండి: తానా సభల్లో తన్నుకున్న 'తెలుగు' తమ్ముళ్లు మీకు జీవితంలో బుద్ధి రాదు మీ బతుకులు చెడ.. బండ్ల గణేష్ ఫుల్ ఫైర్ అమెరికాలో బాలయ్య ఫ్యాన్స్ వర్సెస్ పవన్ ఫ్యాన్స్.. -
'మీరెంత ఉరిమి చూసిన నేను భయపడను'
ఫిలడెల్ఫియా : 'మీరెంత ఉరిమి చూసిన నేను వచ్చిన పని పూర్తి చేసేదాకా తిరిగివెళ్లనంటూ' గ్రౌండ్హగ్ (ఉడుత జాతికి చెందిన జంతువు) అంటుంది. అదేంటి అసలు అది వచ్చిన పనేంటో తెలుసుకోవాలంటే మాత్రం వార్త మొత్తం చదివి తీరాల్సిందే. వివరాలు.. ఫిలడెల్ఫియాలో నివాసం ఉంటున్న క్రిస్టిన్ చలేలా బాగ్నెల్ అనే వ్యక్తి ఇంట్లో మంగళవారం ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. క్రిస్టిన్ తన పనిలో తాను నిమగ్నమయ్యుండగా.. ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు కానీ ఒక గ్రౌండ్ హగ్ దర్జాగా వారి ఇంటి బాల్కనిలోకి వచ్చి దర్జాగా ఫిజ్జాను తినడం ప్రారంభించింది. ఇంతలో యాజమాని పెంచుకుంటున్న రెండు కుక్కలు దానిపై దాడి చేసేందుకు వేగంగా వచ్చినా బాల్కనీకి అద్దం అడ్డుగా ఉండడంతో ఆగిపోయాయి. ఇంకేముంది తనను అవి ఏం చేయలేవని భావించిందేమో ఇంకా దర్జాగా తినడం ప్రారంభించింది. అయితే కుక్కలు ఉరిమి చూసిన ప్రతీసారీ వెటకారంగా వాటిని రెచ్చగొడుతూ ఆగి మరి ఫిజ్జాను తినడం మొదలుపెట్టింది. చివరకు అవి చూస్తుండగానే ఫిజ్జాను తినేసి అక్కడినుంచి వెళ్లిపోయింది. అయితే ఇదంతా గమనించిన ఇంటి యజయాని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి షేర్ చేసిన కాసేపటికే వేల సంఖ్యలో లైక్స్ వచ్చాయి. (ఆశ్చర్యం: గాలిపటం ఎగరేస్తున్న కోతి) -
నాట్స్ బోర్డు ఛైర్మన్‌గా శ్రీధర్ అప్పసాని
వార్మినిస్టర్, పెన్సిల్వేనియా: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) కార్యనిర్వాహక బోర్డు నూతన (2020-21) ఏడాదికి గాను కొత్త నాయకత్వాన్ని ఎన్నుకుంది. నాట్స్ స్థాపనలో కీలక పాత్ర పోషించి, గత పదేళ్లుగా అత్యంత క్రియాశీలకంగా వ్యవహారిస్తున్న బోర్డు ప్రస్తుత వైస్ ఛైర్మన్ శ్రీధర్ అప్పసానిని చైర్మన్‌గా బోర్డు బాధ్యతలు కట్టబెట్టింది. నాట్స్ వైస్ ఛైర్మన్‌గా అరుణగంటి, సెక్రటరీగా ప్రశాంత్ పిన్నమనేని ఎన్నికయ్యారు.కొత్త నాయకత్వాన్ని ప్రోత్సాహించే క్రమంలో కొత్తగా పది మందిని బోర్డు సభ్యులను ఎగ్జిక్యూటివ్ కమిటీ తీసుకుంది. టెక్సాస్ చెందిన సునీల్ పాలేరు, డాలస్‌కు చెందిన కిషోర్ వీరగంధం, లాస్ ఏంజిల్స్‌కు చెందిన చందు నంగినేని, కృష్ణ కిషోర్ మల్లిన, చికాగోకు చెందిన శ్రీరామమూర్తి కొప్పాక, రవి శ్రీకాకుళం, ఓహియోకు చెందిన సురేశ్ పూదోట, పెన్సిల్వేనియాకు చెందిన హరినాథ్ బుంగతావులకు బోర్డు సభ్యులుగా కొనసాగనున్నారు. ఫిలడెల్పియాలో సమావేశమైన బోర్డు పలు కీలక అంశాలపై చర్చించింది. నాట్స్ బోర్డు కమిటీ సమావేశంలో నాట్స్ హెల్ప్‌లైన్ కార్యక్రమాలను మరింత విస్తృత్తం చేయాలని నిశ్చయించుకున్నారు. 2021లో న్యూజెర్సీలోని, న్యూ జెర్సీ కన్వెన్షన్ అండ్ ఎక్స్పోసిషన్ సెంటర్, 97 సన్‌ఫీల్డ్ అవెన్యూ, ఎడిసన్‌లో జరగనున్న అమెరికా తెలుగు సంబరాలకు ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికతో వ్యవహారించాలని బోర్డు నిర్ణయించింది. బోర్డు సమావేశం తర్వాత కొత్త నాయకత్వాన్ని నాట్స్ సభ్యులందరికీ పరిచయం చేసింది. హ్యుస్టన్, బోస్టన్, న్యూయార్క్, న్యూజెర్సీ, టెంపా, వర్జీనీయా, డాలస్, లాస్ ఏంజిల్స్, చికాగో, సెయింట్ లూయిస్, డెట్రాయిట్, సౌత్ కరోలినాకు చెందిన నాట్స్ నాయకులు, సభ్యులు కూడా ఈ పరిచయ కార్యక్రమంలో పాల్గొన్నారు. “నాట్స్ ఛైర్మన్ గా నాకు వచ్చిన అవకాశాన్ని ఓ అదృష్టంగా భావించి శాయశక్తులా కృషి చేశాననే భావిస్తున్నాను’అని మాజీ చైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ సంస్థ నాది అని పనిచేయడంతోనే నా పని మరింత సులువైందని అన్నారు. నాట్స్ అధ్యక్షుడు శ్రీనివాస్ మంచికలపూడి మాట్లాడుతూ.. ప్రస్తుత బోర్డ్ సభ్యులందరి సలహాలతోనే ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినట్లు తెలిపారు. నూతన చైర్మన్ శ్రీధర్ అప్పసానితో కలిసి నాట్స్ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తుందని ఆయన ఆకాంక్షించారు. ఇండియా నుంచి గౌతు లచ్చన్న ఫౌండేషన్ (గ్లో) సంస్థ వైస్ ఛైర్మన్ వెంకన్నచౌదరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దాదాపు 11 కోట్లతో తెలుగు నేలలో నాట్స్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిందని.. ఇదంతా నాట్స్ సభ్యుల దాతృత్వంతోనే జరిగిందని వెంకన్న చౌదరి అన్నారు. నాట్స్ నా బిడ్డ లాంటిది: శ్రీథర్ అప్పసాని నాట్స్ సంస్థ నా బిడ్డ లాంటిదని నాట్స్ ఛైర్మన్ శ్రీధర్ అప్పసాని అన్నారు. నాట్స్ పుట్టుక నుంచి ఎదుగుదల వరకు ప్రతి అడుగులో తాను కీలకమైన పాత్ర పోషించే అవకాశం రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. నాట్స్ ఎదిగే కొద్ది .. బిడ్డ ఎదుగుతున్నప్పుడు తండ్రికి కలిగే ఆనందమే తనకు కలుగుతుందని చెప్పారు. తన కుటుంబంతో ఎంత అనుబంధం ఉందో.. అంతే అనుబంధం నాట్స్‌తో ఉందన్నారు. అందుకే నాట్స్ ప్రతి కార్యక్రమంలో కుటుంబం కలిసి పాల్గొంటున్నానని శ్రీధర్ తెలిపారు. ఏ కార్యక్రమం తలపెట్టినా చిత్తశుద్ధితో చేయాలనే తపనే నన్ను నాట్స్ లో కీలక బాధ్యతలు చేపట్టేలా చేసిందన్నారు. నాట్స్ ప్రస్థానంలో తనను ప్రోత్సహించిన సభ్యులందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. సన్మానాలు, బహుమతుల పంపిణి నాట్స్ ఆహ్వానాన్ని మన్నించి భారత్ నుంచి వచ్చిన గౌతు లచ్చన్న ఫౌండేషన్ వైస్ ఛైర్మన్ వెంకన్నచౌదరికి, సేవా సంస్థ నిర్వాహకురాలు సరోజ సాగరంలను నాట్స్ డైరెక్టర్లు మధు కొర్రపాటి, మోహన కృష్ణ మన్నవలు సన్మానించారు. నాట్స్ వాలీబాల్ టోర్నమెంట్ విజేతలకు ఈ కార్యక్రమంలోనే శ్యాం నాళం, లక్ష్మి మోపర్తి తదితరులు బహుమతులు ప్రదానం చేశారు. ఇక కార్యక్రమలో భాగంగా నరేంద్ర, శిల్పారావ్ పాడిన పాటలతో, సెయింట్ లూయిస్ నుంచి వచ్చిన యాంకర్ సాహిత్య సందడితో, హాస్య నటుడు, మిమిక్రి కళాకారుడు ఇమిటేషన్ రాజు చేసిన కామెడీ అందరినీ కడుపుబ్బా నవ్వించింది, 500 మందికి పైగా విచ్చేసిన ఈ కార్యక్రమానికి బావర్చి బిర్యానీ కమ్మని రుచికరమైన విందుభోజనం, పలు వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ మెనూ ఆహూతుల మన్ననలను విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో నాట్స్ ఫిలడెల్ఫియా నాయకులు రామ్ కొమ్మనబోయిన కీలక పాత్ర పోషించారని నిర్వాహకులు తెలిపారు. -
బిడ్డకు పాలివ్వటమే శాపమైంది
పెన్సిల్వేనియా రాష్ట్రంలో విచిత్రమైన కేసు నమోదు అయ్యింది. తల్లి రొమ్మే బిడ్డ ప్రాణం తీసింది. పాలు విషంగా మారటంతో ఆ బిడ్డ మృతి చెందింది. దీంతో ఆమెపై కేసు నమోదు కాగా.. కటకటాల పాలైంది. ఏప్రిల్ 2న జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... ఫిలడెల్ఫియా నగరానికి చెందిన సమంత జోన్స్‌కి 11 నెలల బాబు. ఒళ్లు నొప్పులు ఉండటంతో మాత్రలు వేసి పడుకుంది. అయితే నిద్రలో పసికందు ఏడవటంతో లేచి పాలిచ్చింది. ఉదయం లేచి చూసేసరికి ఆ చిన్నారిని నురగ కక్కుకుని ప్రాణాలు విడిచాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో తల్లిపాలు విషంగా మారటమే కారణమని తేలింది. కేసు నమోదు చేసి ఆమెను అరెస్ట్ చేశారు. తర్వాత 3 మిలియన్ డాలర్ల పూచీకత్తుపై సమంత బెయిల్‌పై రిలీజ్ అయ్యారు. కాగా, ఈ కేసులో వాదనలు శుక్రవారం మొదలుకాగా, మెథడోన్‌తో కూడిన మందులను ఆమె తీసుకోవటమే చిన్నారి మరణానికి కారణమైందని ప్రాసిక్యూషన్ వాదించారు. అయితే మెథడోన్ మందులు వాడి బిడ్డకు పాలివ్వొచ్చన్న శాస్త్రవేత్తల వాదనను సమంత తరపు అటార్నీ వాదించారు. కాగా, ఈ కేసులో తదుపరి వాదనను జూలై 23కి వాయిదా వేశారు. కోర్టు దోషిగా ప్రకటిస్తే మాత్రం ఆమెకు జీవిత ఖైదు పడే అవకాశం ఉంది. -
వేడుకలకు సిద్ధమైన నాటా
-
అమెరికాలో రక్తదాన శిబిరం
అమెరికాలోని ఫిలడెల్ఫియాలో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఐదో వర్ధంతి సందర్భంగా శనివారం రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నారు. డాక్టర్ వై ఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి అతిథులుగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా, చిత్తూరు మాజీ ఎంపీ జ్ఞానేంద్ర రెడ్డి హాజరు కానున్నారు. రక్తదాన శిబిరం ఫిలడెల్ఫియా సమీపంలోని కింగ్ అఫ్ పర్షియాలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వాలీ ఫోర్జ్ రాడిస్సన్ హోటల్ లో ఉంటుందని, ఈ అవకాశాన్ని వైఎస్ఆర్ అభిమానులంతా సద్వినియోగం చేసుకోవాలని ఫౌండేషన్ ప్రతినిధులు కోరారు. అందరూ కుటుంబ సమేతంగా మహానేత వర్ధంతి కార్యక్రమానికి తరలివచ్చి దాన్ని విజయవంతం చేయాలని కోరారు. మరిన్ని వివరాలకు ysr_usa@yahoo.comకు ఇ-మెయిల్ పంపాలని లేదా డాక్టర్ రాఘవరెడ్డి (267-261-9436), ఆళ్ల రామిరెడ్డి (973-386-8980) లను సంప్రదించాలని తెలిపారు.