పెన్సిల్వేనియా రాష్ట్రంలో విచిత్రమైన కేసు నమోదు అయ్యింది. తల్లి రొమ్మే బిడ్డ ప్రాణం తీసింది. పాలు విషంగా మారటంతో ఆ బిడ్డ మృతి చెందింది. దీంతో ఆమెపై కేసు నమోదు కాగా.. కటకటాల పాలైంది. ఏప్రిల్ 2న జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే...
ఫిలడెల్ఫియా నగరానికి చెందిన సమంత జోన్స్‌కి 11 నెలల బాబు. ఒళ్లు నొప్పులు ఉండటంతో మాత్రలు వేసి పడుకుంది. అయితే నిద్రలో పసికందు ఏడవటంతో లేచి పాలిచ్చింది. ఉదయం లేచి చూసేసరికి ఆ చిన్నారిని నురగ కక్కుకుని ప్రాణాలు విడిచాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో తల్లిపాలు విషంగా మారటమే కారణమని తేలింది. కేసు నమోదు చేసి ఆమెను అరెస్ట్ చేశారు. తర్వాత 3 మిలియన్ డాలర్ల పూచీకత్తుపై సమంత బెయిల్‌పై రిలీజ్ అయ్యారు.
కాగా, ఈ కేసులో వాదనలు శుక్రవారం మొదలుకాగా, మెథడోన్‌తో కూడిన మందులను ఆమె తీసుకోవటమే చిన్నారి మరణానికి కారణమైందని ప్రాసిక్యూషన్ వాదించారు. అయితే మెథడోన్ మందులు వాడి బిడ్డకు పాలివ్వొచ్చన్న శాస్త్రవేత్తల వాదనను సమంత తరపు అటార్నీ వాదించారు. కాగా, ఈ కేసులో తదుపరి వాదనను జూలై 23కి వాయిదా వేశారు. కోర్టు దోషిగా ప్రకటిస్తే మాత్రం ఆమెకు జీవిత ఖైదు పడే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment