Breast Feeding
-
తల్లిపాల వారోత్సవాలు : బాధ్యత మనందరిదీ!
నవమాసాలు మోసి బిడ్డను కనిపెంచడంలో తల్లి పాత్ర చాలా కీలకమైంది. అలాగే తల్లి పాలల్లో మహత్తర శక్తి ఉంది. పుట్టిన వెంటనే బిడ్డకు స్తన్యమివ్వడం చాలా అవసరం. దీనిపై అవగాహన కల్పించేందుకే ఆగస్టు 1 నుండి ఆగస్టు 7 వరకు 120కి పైగా దేశాల్లో ప్రపంచ తల్లిపాల వారోత్సవం జరుపుకుంటారు. పిల్లల సక్రమమైన అభివృద్ధికి తల్లిపాలు చాలా అవసరం. బిడ్డకు పోషకాహారాన్ని ఇవ్వడం మాత్రమేకాదు, తల్లీబిడ్డల బాంధవ్యాన్ని పెంచుతుంది. పసివయస్సులో తీవ్రమైన వ్యాధుల బారిన పడకుండా భద్రతనిస్తుంది. మొదటి టీకాగా పనిచేస్తాయి తల్లిపాలు. 1992లో మొట్టమొదటిసారిగా ప్రపంచ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ ప్రతిపాదను ఆమోదం లభించింది.1990లో ఆగస్టులో ప్రభుత్వ అధికారులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూనిసెఫ్ , ఇతర సంస్థలచే తల్లిపాలను రక్షించడానికి, ప్రోత్సహించడానికి , మద్దతు ఇచ్చేలా ఇన్నోసెంటి డిక్లరేషన్‌పై సంతకాలు జరిగాయి. తల్లిపాలు ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన పెంచడం, దానికి మద్దతు ఇవ్వడం , ప్రోత్సహించడంతో పాటు ప్రతిచోటా తల్లులు శిశువుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం దీని ప్రధాన లక్ష్యాలు.World Breastfeeding Week...1st to 7th August 2024@OfficeOfLGJandK @SyedAbidShah @DrRakesh183 pic.twitter.com/QmgPtjLWWh— DIRECTORATE OF HEALTH SERVICES JAMMU (@dhs_jammu) August 1, 2024ప్రతీ ఏడాది, ప్రపంచ బ్రెస్ట్ ఫీడింగ్ డేని వరల్డ్ అలయన్స్ ఫర్ బ్రెస్ట్ ఫీడింగ్ యాక్షన్ (WABA) ఎంపిక చేసిన కొత్త థీమ్‌తో జరుపుకోవడం ఆనవాయితీ. “అంతరాలు లేకుండా అందరికీ తల్లిపాల మద్దతు” (Closing the gap: Breastfeeding support for all) అనే థీమ్‌తో ఈ ఏడాది ప్రపంచ తల్లిపాల వారోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. తల్లిపాలు ప్రాముఖ్యత , ప్రయోజనాలునవజాత శిశువులకు తల్లి పాలు బలవర్ధకమైన పోషకాహారం. అనేక రకాల సాధారణ వ్యాధులనుంచి రక్షించే రోగనిరోధక శక్తిని అందించడంలో తల్లిపాలు ముఖ్య పాత్ర వహిస్తాయి. తల్లిపాలలోని పోషకాలు, యాంటీబాడీస్,ఎంజైమ్‌లు పిల్లల్ని అనారోగ్యాలు ,ఇన్ఫెక్షన్ల నుండి కాపాడతాయి.తల్లి-పిల్లల బంధాన్ని బలోపేతం చేయడం, ప్రసవానంతరం బాలింతలు వేగంగా కోలుకోవడానికి, రొమ్ము, అండాశయ కేన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో తల్లి పాలు ఏంతో మేలు చేస్తాయి. ఒక కొత్త జీవిని ఈ సమాజంలోకి తీసుకొచ్చే ఈ ప్రయాణంలో అమ్మకు మనం అందరంఅండగా నిలబడాల్సిన అవసరం ఎంతో ఉంది. బిడ్డకు జన్మనిచ్చిన తల్లి మానసిక, శారీరక స్థితిని అర్థం చేసుకొని అటు భర్త, ఇటు ఇరు కుటుంబ సభ్యులు ఆమె తోడుగా నిలవాలి. అలాగే కమ్యూనిటీ స్థాయిలో రాష్ట్ర, జిల్లా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఇతర ఆరోగ్య సంస్థలు అధికారులు ఇందుకు మద్దతుగా నిలబడాలి. ఈ అవగాహన పెంచేందుకు,తల్లులు ఎదుర్కొంటున్ ఇబ్బందులను పరిష్కరించడానికి, ప్రపంచవ్యాప్తంగా ఈవెంట్లు, సెమినార్లు, వర్క్‌షాప్‌ల ద్వారా కృషి చేస్తారు. -
అమ్మంటే..అమ్మే: పోలీసమ్మ వైరల్ వీడియో
అమ్మ ఎక్కడున్నా అమ్మే. పసిబిడ్డ గుక్క పట్టి ఏడిస్తే ఏ తల్లి మనసైనా తల్లడిల్లి పోదూ! అమ్మ ప్రేమ, మమకారం అలాంటిది మరి. తాజాగా సోషల్ మీడియాలో ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. కేరళ కొచ్చిలోని ఈ ఘటన చోటు చేసుకుంది నాలుగు నెలల శిశువు ఏడుపు చూసి చలించిపోయారు కేరళ పోలీసు అధికారి ఎంఏ ఆర్య. క్షణం ఆలోచించకుండా ఆకలితో ఉన్న పాపాయికి తన స్థన్యం ఇచ్చి బిడ్డను అక్కున చేర్చుకున్నారు. నెటిజనుల హృదయాలను గెలుచుకున్నారు. పాట్నాకు చెందిన బిడ్డ తల్లి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరింది. కొచ్చిలోని ఎర్నాకులం జనరల్ హాస్పిటల్‌లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో చికిత్స పొందుతోంది. బిడ్డ తండ్రి వలస కార్మికుడు ఇక్కడ జైలులో ఉన్నాడు. ఈ దంపతులకు ఐదుగురు పిల్లలు.అయితే అనారోగ్య సమస్య కారణంగా ఆసుపత్రిలో చేరిన తల్లికి నలుగురు పిల్లలు ఉన్నారని కంట్రోల్ రూమ్ పోలీసుల సమాచారం అందించారు సిబ్బంది. వారిని చూసుకునే వారు ఎవరూ లేకపోవడంతో, సహాయం కోసం ఎదురు చూస్తున్నారని తెలిపింది. వెంటనే స్పందించిన పోలీసులు వారిని గురువారం కొచ్చి సిటీ మహిళా స్టేషన్‌కు తీసుకువచ్చారు. ఇంతలో తల్లి దూరమైన ఆ చిన్నారి ఆకలితో ఏడుస్తోంది. అది చూసి ఫీడింగ్ మదర్ కూడా అయిన పోలీసమ్మ తన తల్లి మనసు చాటుకున్నారు. ఆ చిన్నారికి పాలివ్వడానికి సిద్ధంగా ఉన్నానని అధికారిని ఒప్పించి శిశువు కడుపు నింపి నిద్రపుచ్చారు. తనకూ తొమ్మిది నెలల పసి బిడ్డ ఉందని బిడ్డ ఆకలి తనకు తెలుసునని చెప్పింది. ఆర్య చేసిన పనిని నగర పోలీసులు ప్రశంసించారు. అలాగే అనారోగ్యంతో ఉన్న మహిళ పిల్లలను చైల్డ్ కేర్ హోమ్‌కు తరలించామని పోలిసులు తెలిపారు. എറണാകുളം ജനറൽ ആശുപത്രിയിൽ ഐസിയുവിൽ അഡ്മിറ്റായ പാട്ന സ്വദേശിയുടെ 4 കുട്ടികളെയാണ് നോക്കാൻ ആരും ഇല്ലാത്തതിനാൽ രാവിലെ കൊച്ചി സിറ്റി വനിതാ സ്റ്റേഷനിൽ എത്തിച്ചത്. അതിൽ 4 മാസം പ്രായമായ കുഞ്ഞിന് ഫീഡിങ് മദർ ആയ ആര്യ മുലപ്പാൽ ഇറ്റിച്ച് വിശപ്പകറ്റി ❤️❤️ കുട്ടികളെ ശിശു ഭവനിലേക്ക് മാറ്റി.. pic.twitter.com/kzcrzq0hh6 — Remya Rudrabhairav (@RMahatej) November 23, 2023 -
సరోగసీలో బిడ్డకు పాలివ్వలేం!..మరీ బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందా?
బిడ్డకు పాలు ఇవ్వకపోతే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని చదివాను. నిజమేనా? నా ఫ్రెండ్ కెరీర్ ఒత్తిడి వల్ల పిల్లల కోసం సరోగసీకి వెళదామనుకుంటోంది. దీనివల్ల బ్రెస్ట్ ఫీడ్ కుదరదు కదా! అందుకే బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదం ఉంటుందని చెప్పాను. అలా ఏమీ ఉడదు.. బిడ్డను కన్నా పాలు పడకపోతే కూడా అంతే రిస్క్ ఉంటుంది కదా అని వాదిస్తోంది. నా డౌట్ క్లియర్ చేయగలరు. – కె. పృథ్వీ దీప్తి, పుణె సరోగసీ ద్వారా పిల్లలను ప్లాన్ చేసినా.. కొంతమందికి మందుల సహాయంతో బ్రెస్ట్ ఫీడింగ్‌కి ట్రై చేయొచ్చు. దీన్ని లాక్టేషన్ ఇండక్షన్ అంటారు. సరోగసీ బేబీ డెలివరీ కన్నా ముందు నుంచి బ్రెస్ట్ ఫీడింగ్‌కి ట్రై చెయ్యడానికి ప్రిపరేషన్ చేసుకోవాలి. ఇది అందరిలోనూ విజయవంతం కావచ్చు. బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల ఉన్న ఉపయోగాలు దాదాపు అందరికీ తెలిసే ఉంటాయి. ఏడాది పాటు బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల 4 నుంచి 5 శాతం వరకు బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ అనేది హార్మోన్స్, జన్యుపరమైన, జీవనశైలి వంటివాటి వల్ల పెరుగుతుంది. హార్మోన్స్ చేంజెస్ వల్ల 50 శాతం రిస్క్ పెరుగుతుంది. 5 నుంచి 10 శాతం జన్యుపరమైన కారణాలు ఉంటాయి. బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వనందు వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ స్వల్పమే. ఆరోగ్యకరమైన జీవనశైలి.. అంటే అధిక బరువు లేకుండా సరైన బీఎమ్ఐ (బాడీ మాస్ ఇండెక్స్)ని మెయిన్టేన్ చేస్తూ .. పోషకాహారం తీసుకుంటూంటే క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. జన్యుపరమైన కారణాలతో హైరిస్క్‌లో ఉన్నవారికి స్క్రీనింగ్‌లో బీఆర్సీఏ జీన్ పాజిటివ్ అని తేలిన వారికి ప్రాఫిలాక్టిక్ సర్జరీల ద్వారా ఆ రిస్క్‌ని తగ్గించవచ్చు. బ్రెస్ట్ అల్ట్రాసౌండ్ లేదా మామోగ్రఫీ ద్వారా తేలిగ్గానే క్యాన్సర్ చేంజెస్‌ను కనిపెట్టవచ్చు. ఈరోజుల్లో కొన్ని మెడికేషన్స్ ద్వారా .. సరోగసీ ద్వారా పిల్లలు కన్న తల్లులతో కూడా బ్రెస్ట్ఫీడింగ్కి, బిడ్డతో స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్‌ని చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. (చదవండి: చర్మం ఆరోగ్యంగా కాంతివంతంగా కనిపించాలంటే..ఇలా చేయండి!) -
వెస్ట్రన్ కల్చర్.. తల్లిపాలు ఇవ్వట్లేదు, అరగంటలోపే మరణాలు
పాశ్చాత్య సంస్కృతి అంటూ కొందరు, సౌందర్యం తగ్గుతుందని మరికొందరు, ఉద్యోగరీత్యా ఇంకొందరు తల్లులు బిడ్డలకు పాలివ్వడం లేదు. పుట్టిన నెలరోజులకే పోతపాలు పట్టిస్తున్నారు. ఇది మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానమని, పుట్టిన అరగంటలోపు తల్లిపాలు తాగించడం వల్ల శిశువుకు అనేక ప్రయోజనాలు ఉన్నట్లు వైద్యులు వివరిస్తున్నారు. నేటికీ కొందరు మూఢ నమ్మకాలతో పుట్టిన రెండు, మూడు రోజుల వరకూ తల్లిపాలను ఇవ్వడం లేదని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇలాంటి చర్యల వల్ల బిడ్డలతో పాటు, తాము నష్టపోతున్నామనే విషయాన్ని తల్లులు గ్రహించలేక పోతున్నారని వైద్యులు వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తల్లిపాలలో ఉండే పోషకాలు, బిడ్డ ఎదుగుదలపై చూపే ప్రభావంపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగించేందుకు ప్రపంచ ఆరోగ్యసంస్థ ఏటా ఆగస్టు 1 నుంచి 7 వరకూ వారోత్సవాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా నేత్ర, శిశు సంక్షేమశాఖతో కలిసి వైద్య ఆరోగ్యశాఖ అవగాహన కార్యక్రమాలు నిర్వహించనుంది. శిశు మరణాలు నివారించవచ్చు.. ఎక్కువ మంది శిశువులకు ఇన్ఫెక్షన్స్లు సోకడం, పుట్టగానే కామెర్లు, శ్వాసకోశ వ్యాధులతో మరణాలు సంభవించడం జరుగుతున్నట్లు యూనిసెఫ్ గుర్తించింది. అలాంటి మరణాలను నివారించేందుకు పుట్టిన అరగంటలోపు తల్లిపాలు తాగించడం ద్వారా నెలలోపు శిశువుల్లో సంభవించే మరణాలను తగ్గించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. దీంతో తల్లిపాల ఆవశ్యకతపై గర్భిణులుగా ఉన్నప్పటి నుంచే విస్తృతంగా అవగాహన కలిగిస్తున్నారు. బిడ్డకు పాలివ్వడం ద్వారా తల్లికీ ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. తల్లిపాలతో ప్రయోజనాలెన్నో.. ► బిడ్డకు పాలిచ్చే తల్లులకు బ్రెస్ట్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ. ► రక్తహీనత, ఎముకల బలహీనత వంటి జబ్బులు రావని వైద్యులు చెబుతున్నారు. ► అంతేకాదు బిడ్డకు పాలివ్వడం ద్వారా ప్రసవం అనంతరం అయ్యే రక్తస్రావాన్ని అదుపు చేస్తాయని వైద్యులు వివరిస్తున్నారు. ► తల్లిపాలలో అన్ని పోషకాలు సమపాళ్లలో ఉంటాయి. వ్యాధి నిరోధకశక్తిని కూడా పెంపొందిస్తాయి. ► తల్లిపాలు తాగిన శిశువుల్లో యాంటీబాడీస్ వృద్ధి చెంది ఇన్ఫెక్షన్లు, నిమోనియా, డయేరియా వంటి వ్యాధులు సోకకుండా నివారించవచ్చు. ► మెదడు ఎదుగుదలకు దోహదం చేయడంతో పాటు, జ్ఞాపకశక్తి పెంపొందుతుంది. తల్లిపాలు తాగిన పిల్లల్లో తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. ● పసిబిడ్డకు ► ప్రధాన శత్రువు చలి. బిడ్డను ఒడిలో ఉంచుకుని పాలివ్వడం ద్వారా తల్లిశరీరం నుంచి శిశువుకు అవసరమైన వేడి అందుతుంది. అంతేకాదు తల్లీబిడ్డ మధ్య ఆప్యాయత పెరుగుతుంది. ► ముర్రుపాలు వ్యాధి నిరోధకశక్తిని పెంచడంతో పాటు, శిశువు జీర్ణాశయ అభివృద్ధికి దోహదపడే విటమిన్–ఎ అధిక మోతాదులో ఉంటుంది. ►శిశువు మొట్టమొదట విసర్జించే నల్లటి మెకోనియం అనే మలంతో పాటు, పచ్చకామెర్లు కలిగించే బెలురూబిన్ అనే పదార్థాన్ని కూడా త్వరగా విసర్జించేలా ముర్రుపాలు దోహదం చేస్తాయి. బిడ్డకు మొదటి వారంలో కలిగే పచ్చకామెర్లను నివారిస్తాయి. అవగాహన కల్పిస్తున్నాం తల్లిపాల విశిష్టతపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నాం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేందాల్లో, కుటుంబ డాక్టర్ కార్యక్రమంలో, వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌లో గర్భిణులు, బాలింతలకు తల్లిపాల విశిష్టతను వివరిస్తాం. అంగన్వాడీ కేంద్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తాం. బిడ్డకు పాలివ్వడం ద్వారా తల్లికీ ప్రయోజనాలు ఉన్నాయని అవగాహన కల్పిస్తాం. – డాక్టర్ మాచర్ల సుహాసిని, వైద్య ఆరోగ్యశాఖాధికారి, ఎన్టీఆర్ జిల్లా -
Police Ramya: అమ్మా.. నీకు వందనం
ఆకలితో అలమటిస్తున్న పసికందుకు పాలిచ్చి రక్షించినందుకు పోలీసు అధికారిణిని హైకోర్టు న్యాయమూర్తితో సహా పలువురు అధికారులు ప్రశసించారు. ఈ ఘటన కోజికోడ్ చెవాయూర్ పోలీస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కోజికోడ్ చెవాయూర్ పోలీస్టేషన్లో సివిల్ పోలీస్ ఆఫీసర్‌గా ఎంఆర్ రమ్య విధులు నిర్వర్తిస్తున్నారు. శనివారం ఉదయం 22 ఏళ్ల మహిళ తన నవజాత శిశువు కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. కుటుంబ కలహాల కారణంగా పసికందుని తల్లి వద్ద నుంచి ఎత్తుకెళ్లి ఉండవచ్చిన అనుమానించి.. ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేయడం మొదలు పెట్టారు. పని నిమిత్తం బెంగుళూరు వెళ్లిన తండ్రితోనే ఆ పసికందు ఉండవచ్చనే అనుమానంతో వాయనాడ్ సరిహద్దులోని పోలీస్టేషన్లకు సమాచారం అందించారు. దీంతో సుల్తాన్బతేరి పోలీసులు సరిహద్దు వెంబడి వాహనాలను తనిఖీ చేస్తుండగా శిశువుతో ఉన్న తండ్రిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అయితే అతని వద్ద ఉన్న శిశువు ఆకలితో అలమటించి సొమ్మసిల్లింది. దీంతో పోలీసులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఐతే బిడ్డ షుగర్ లెవెల్స్ పడిపోయినట్లు వైద్యులు గుర్తించారు. ఆస్పత్రికి చేరు పోలీస్ అధికారి రమ్య తాను పాలిచ్చే తల్లినని చెప్పి వెంటనే ఆ పసిబిడ్డను అక్కున చేర్చుకుని పాలిచ్చారు. ఆ తర్వాత ఆ శిశువును తల్లి ఒడికి చేర్చారు. ఆ సమయంలో ఆమె చూపించిన ఉదార సేవకు ముగ్ధుడై హైకోర్టు న్యాయమూర్తి దేవన్ రామచంద్రన్ ఆమె చేసిన పనిని మెచ్చుకుంటూ పోలీసు ఉన్నతాధికారులకు లేఖ కూడా రాశారు. ఈ మేరకు పోలీస్ అధికారి రమ్యకు జడ్జి సర్టిఫికేట్‌ను పోలీస్ చీఫ్ అనిల్ అందించడమే ఆమె కుటుంబసభ్యులను పోలీసు ప్రధాన కార్యాలయానికి ఆహ్వానించి ప్రశంసా పత్రంతో సత్కరించారు. అంతేకాదు ఆకలితో అలమటించిన పసికందు పట్ల సానుభూతితో రమ్య వ్యవహరించిన తీనే పోలీసు శాఖ ప్రతిష్టను పెంచిందని ఉన్నతాధికారులు అన్నారు. (చదవండి: చాక్లెట్ల దొంగతనం వైరల్ కావడంతో... విద్యార్థిని ఆత్మహత్య) -
తల్లి పాలల్లో మైక్రో ప్లాస్టిక్... ఆందోళనలో శాస్త్రవేత్తలు
తల్లిపాలల్లో మైక్రో ప్లాస్టిక్‌ని గుర్తించింది ఇటాలియన్ పరిశోధక బృందం. దీంతో పరిశోధకులు ఒక్కసారిగా ఈ పాలు ఆరోగ్యంపై ఎలాంటి దుష్ప్రభావం చూపనుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఒక బిడ్డకు జన్మనిచ్చిన 34 ఏళ్ల తల్లిపై పరీక్షలు నిర్వహించగా ఆమె పాలల్లో ప్లాస్టిక్ కణాలను గుర్తించారు. ఈ ఘటనతో పాలివ్వడం మంచిదని చెప్పాల? వద్దా? అనే సందిగ్ధంలో ఉన్నారు పరిశోధకులు. ఎందుకంటే ఈ పాల వల్ల ఉపయోగాల కంటే ప్రమాదమే ఎక్కువగా ఉండటంతో పరిశోధకులు తీవ్ర భయాందోళనలను వ్యక్తం చేశారు. ఈ విషయమై త్వరితగతిన పరిశోధనలు చేయాల్సి ఉందని అన్నారు. తాము ఇంతవరకు సుమారు 5 మిల్లి మీటర్ల కంటే తక్కువ ఉండే ప్లాస్టిక్ కణాలను మానవ కణ తంతుల్లోనూ, జంతువుల్లో, సముద్ర జీవుల్లోనూ గుర్తించాం అన్నారు. అవన్నీ ల్యాబ్‌లో చనిపోయిన వాటిపై జరిపిన పరిశోధనల్లో బయటపడినట్లు పేర్కొన్నారు. శాస్త్రవేత్తల పరిశోధనల్లో... గర్భిణి మహిళ గర్భధారణ సమయంలో ప్లాస్టిక్ వాటిల్లో సర్వ్ చేసే ఏ ఆహారాన్ని తీసుకోవద్దని హెచ్చరించారు. అలాగే తీసుకునే ఆహారం విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎందుకంటే మానవుని కార్యకలాపాల కారణంగానే జంతువుల శరీరాల్లో ప్లాస్టిక్ కణాలు ఉంటున్నాయని అన్నారు. మరీ ముఖ్యంగా గర్భిణి స్త్రీలు సీ ఫుడ్ తీసుకునేటప్పుడూ, పాలు తీసుకునేటప్పుడూ కాస్త జాగురకతతో ఉండాలని అన్నారు. ప్రస్తుతం మైక్రోప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాల కంటే తల్లి పాల ప్రయోజనాల గురించే నొక్కి చెప్పాల్సిన అవసరం ఎంతైన ఉందని వైద్యుడు నోటార్స్టెషానో చెబుతున్నారు. అంతేగాదు కాలుష్యాన్ని నియంత్రించే చట్టాలను ప్రోత్సహించేలా రాజకీయ నాయకులపై ఒత్తిడి తీసుకురావాలని చెప్పారు. అలాగాని పిల్లలకు బాటిల్ పాలను అలవాటు చేయడం మంచిద కాదని, పైగా దానివల్ల వారు మరింత ప్లాస్టిక్ వారి నోటిలోకి డైరెక్ట్‌గా వెళ్లే ప్రమాదం ఎక్కువ ఉందని అన్నారు. ముఖ్యంగా ప్లాస్టిక్‌తో ప్యాక్ చేసే ఆహారం, పానీయాలు, సౌందర్య ఉత్పత్తులు, టూత్ పేస్ట్‌లు, సింథటిక్ ఫ్యాబ్రిక్‌తో చేసే దుస్తులు కూడా వాడకుండా ఉండాలని గర్భిణి స్త్రీలకు శాస్త్రవేత్తలు సలహలు, సూచనలు ఇస్తున్నారు. (చదవండి: 7 ఖండాలు కాదు ఏక ఖండమే..!) -
తల్లిలో బిడ్డకు తగినన్ని పాలు పడాలంటే...?
కొత్తగా అమ్మగా మారిన తల్లిలో తగినన్ని పాలు పడకపోతే ఆమె తల్లడిల్లిపోతుంది. ఇలాంటివారు చిన్నారికి సరిపోయినంతగా పాలు పడటానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. దీంతో ఆమె ఆరోగ్యం బాగుపడటంతో పాటు, బిడ్డకూ తగినన్ని పాలు సమకూరతాయి. కొత్తగా తల్లి అయిన మహిళలు తమ ఆహారంలో పాలు, పెరుగు, కూరగాయలు, ఆకుకూరలు, పప్పుధాన్యాలు, నీళ్లు తప్పనిసరిగా తీసుకోవాలి. కొత్త తల్లులు, అలాగే చాలామంది ఇళ్లలోని పెద్దవాళ్లలో ఓ అపోహ ఉంటుంది. సిజేరియన్ సహాయంతో బిడ్డను తీసిన మహిళల్లో, ఆ కుట్లు చీము పడతాయనే అపోహతో... వారికి పప్పుధాన్యాలు ఇవ్వరు. అలాగే ఒంటికి నీరు పడుతుందనే అపప్రధ తో ద్రవపదార్థాలనూ, బిడ్డకు జలుబు చేస్తుందనే అభిప్రాయంతో పండ్లను తిననివ్వరు. దాంతో తల్లికి పాలు సరిగ్గా పడవు సరికదా... ఆమెకు అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలు వచ్చే అవకాశమూ ఉంది. ఇక కొందరు తల్లుల్లో తగినన్ని పాలు ఊరకపోవడంతో... బిడ్డకు సరిపడినన్ని పాలు అందించడం కోసం వెంటనే పోతపాలను అలవాటు చేస్తారు. పోతపాలు రుచిగా ఉండటంతో బిడ్డ వాటికి అలవాటు పడటం చాలా సాధారణం. అటు తర్వాత చిన్నారులు తల్లి దగ్గర తాగడానికి ఇష్టపడరు. దాంతో బిడ్డ పాలు తగడం తగ్గించడంతో తల్లి దగ్గర తగినన్ని పాలు ఉత్పత్తి కావడం తగ్గిపోతుంది. ఇలా పాలు ఊరడం తగ్గిపోడానికి ఇది కూడా ఒక కారణమే. బిడ్డకు తల్లిదగ్గరి పాలు సరిపోతున్నాయా లేదా అని తెలుసుకోడానికి ఓ మార్గం ఉంది. తాగిన తర్వాత బిడ్డ... రెండు నుంచి మూడు గంటల పాటు నిద్రపోతున్నా, రోజు మొత్తంలో ఆరుసార్ల కంటే ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చేస్తున్నా, వయసుకు తగినట్లు బరువు పెరుగుతున్నా... తల్లి పాలు బిడ్డకు సరిపోతున్నట్లు లెక్క. ఒకవేళ నిజంగానే అమ్మ దగ్గర బిడ్డకు సరిపడినన్ని పాలు పడనట్లయితే... తల్లి తన ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అన్ని రకాల పోషకాలు అందేలా మంచి బలవర్థకమైన ఆహారంతోపాటు... అందులో మరీ ముఖ్యంగా నువ్వులు, వెల్లుల్లి, పాలు, కోడిగుడ్లు, కొబ్బరి, కొబ్బరి నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి. అలాగే మంచినీళ్లు కూడా ఎక్కువగా తాగేలా చూడాలి. ఆ తర్వాత కూడా బిడ్డకు ఇంకా పాలు సరిపోక పోయినట్లయితే డాక్టర్ సలహా తీసుకోవాలి. -
తల్లిపాలతో తయారు చేసిన ఆభరణాలు!... వాటి ధర ఎంతంటే!!
Jewellery Made From Breast Milk: ఇంతవరకు తల్లిపాల ప్రాధాన్యత గురించి మాత్రమే తెలుసు. అంతేకాదు పుట్టిన నవజాత శిశువులకు తొలి ఆరునెలల తల్లిపాలు తాగితే వారికి వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని డాక్టర్లు చెబుతుంటారు. అంతేందుకు తల్లిపాల వారోత్సవాలు లేదా మథర్ బ్రెస్ట్ మిల్క్ డే అని ఒక రోజు కూడా ఏర్పాటు చేశారు. పైగా తల్లిపాలకు నోచుకోని చిన్నారులకు తల్లిపాలు అందించాలన్న ఉద్దేశంతో మిల్క్ బ్యాంక్స్ ఏర్పాటు చేద్దాం అంటూ విన్నూతన పద్ధతులు శ్రీకారం చుట్టాలని యోచిస్తున్నారు నిపుణులు. కొన్ని దేశాల ఇప్పటికే ఆ పద్ధతులను అవలంభించాయి కూడా. అయితే ఇప్పుడు ఈ తల్లిపాలతో విలువైన ఆభరణాలను కూడా తయారుచేస్తున్నారట. అంతేకాదు ఇది తల్లులు తమ పిల్లతో గల విశిష్ట అనుబంధానికి గుర్తుగా రూపొందిస్తున్నారట!. (చదవండి: నా భార్య, బిడ్డను వెతికి తీసుకువచ్చిన వారికి రూ.5000 బహుమతి!!) అసలు విషయంలోకెళ్లితే...యూఎస్‌కి చెందిన అల్మా పార్టిడా తన కుమార్తె అలెస్సాకు సుమారు 18 నెలల పాటు పాలిచ్చింది. అయితే అప్పుడే ఆమెకు తాను తన పిల్లలకు ఇస్తున్న పాలను మాృతృత్వపు మాధుర్యానికి గుర్తుగా ఉంచుకునే మార్గం కోసం అన్వేషించింది. అంతేకాదు ఇందుకోసం ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా మాధ్యమాల్లో సర్చ్ చేసింది. అప్పుడే ఆమెకు తల్లిపాలతో తయారు చేసే నగల కంపెనీ కీప్‌సేక్స్ బై గ్రేస్ గురించి తెలుసుకుంది. ఇక ఆమె వెంటనే తల్లిపాలలో దాదాపు 10 మిల్లీలీటర్లను కీప్‌సేక్స్ బై గ్రేస్ అనే కంపెనీకి పంపింది. ఈ మేరకు ఒక నెల తర్వాత ఆ కంపెనీ ఆమె చేతికి మిల్కీ-వైట్ గుండె ఆకారంలో లాకెట్టును పంపించింది. దీంతో అల్మా పార్టిడా తన కోరిక ఫలించినందకు సంతోషించడమే కాక తాను తల్లిగా మారిన తర్వాత చివరి మిల్క్ డ్రాప్‌గా తన బిడ్డకు పాలు ఇస్తు సాగిన జీవితపు తీపి గుర్తుగా పదిలంగా ఉంటుందని పేర్కొంది . ఈ మేరకు కీప్‌సేక్స్ బై గ్రేస్ కంపెనీ యజమాని సారా కాస్టిల్లో మాట్లాడుతూ...తల్లిపాలతో ఆభరణాలా అంటూ ఆశ్యర్యంతోపాటు నన్ను ఒక వెర్రిదాని వలే చూశారు. నేను తయారు చేసిన ఆభరణాలను చూసిన తర్వాతే నాకు చాలా ఆర్డర్లు రావడం జరిగింది. బిడ్డకు జన్మనిచ్చేటప్పుడూ విపరీతమైన నరకయాతనను అనుభవించిన తల్లుల నుంచే తనకు ఎక్కు ఆర్డర్లు వచ్చాయి" అని న్యూయార్క్ టైమ్స్‌కి తెలిపింది. అంతేకాదు సారా తల్లిపాలతో తయారు చేసే స్టోన్లు దాదాపు రూ.4 వేల నుంచి 11 వేలు వరకు ధర పలుకుతాయి. అంతేకాదు సదరు మహిళ అల్మా చేతికి జ్యువెలరీని ధరించిన వీడియో ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆవీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. మీరు ఓ లుక్కేయండి. (చదవండి: మమ్మీలను తాకకుండానే పుట్టు పూర్వోత్తరాలు..!) View this post on Instagram A post shared by Sarah | Breastmilk Jewelry (@keepsakesbygrace) -
విషాదం: ఈ తల్లి త్యాగానికి చేతులెత్తి మొక్కాల్సిందే!
Venezuela Mother Sacrifice Story: మనిషికి మాత్రమే కాదు.. మిగతా జీవరాశికి తల్లి స్పర్శే మొదటి ప్రేమ. అమ్మ ప్రేమ జీవికి ఆప్యాయతను పరిచయం చేస్తుంది. ‘అమ్మ’.. మాటల్లో వర్ణించలేని ఓ మధురానుభూతి. అందుకేనేమో తల్లికి మాత్రమే సాధ్యపడే త్యాగానికి ఆమె సిద్ధపడింది. ప్రాణం పోతోందని తెలిసి కూడా సాహసానికి పూనుకుంది. తాను నరకం అనుభవిస్తూ.. బిడ్డల ఆకలిని తీర్చింది. చివరికి ప్రాణ త్యాగంతో పిల్లల్ని బతికించుకుని.. మృత్యువు ఒడిలోకి ఒదిగిపోయింది. ఆ తల్లి గాథ సోషల్ మీడియాలో ఇప్పుడు అందరితో కంటతడి పెట్టిస్తోంది. వెనిజులా బోట్ ప్రమాదం.. సెప్టెంబర్ 3న కరేబియన్ దీవులవైపు వెళ్లిన వెనిజులా టూరిస్ట్ క్రూజ్ బోట్ ఒకటి అదృశ్యం అయ్యిందని నావికా అధికారులకు సమాచారం అందింది. దీంతో సిబ్బంది సహాయక చర్యలు మొదలుపెట్టారు. నాలుగు రోజుల తర్వాత ‘లా టార్టు’ దీవి సమీపంలో ఓ చిన్నసైజు లైఫ్ బోట్‌ను గుర్తించి.. దగ్గరి వెళ్లి ఆ దృశ్యాన్ని చూసి సిబ్బంది నిశ్చేష్టులయ్యారు. తల్లి మృతదేహం పక్కనే ఒదిగిన ఇద్దరు చిన్నారుల్ని గుర్తించి వెంటనే కాపాడారు. ఆ తల్లి పేరు మార్లేస్ బీట్రిజ్ చాకోన్ మర్రోక్విన్. తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి సరదా ట్రిప్ కోసం వెళ్తే.. అది కాస్త వాళ్ల జీవితాల్లో విషాదాన్ని నింపింది. నరకం ఓర్చుకుంది.. భారీ అలల కారణంగా క్రూజ్ దెబ్బతినగా.. చిన్న లైఫ్ బోట్ సాయంతో మార్లేస్, తన బిడ్డల్ని రక్షించుకునే ప్రయత్నం చేసింది. వెనిజులా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అక్వాటిక్ స్పేసెస్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రమాదం జరిగాక నాలుగు రోజులపాటు ఆ తల్లీబిడ్డలు ఆ చిన్న లైఫ్బోట్లోనే ఉన్నారు. తన ఇద్దరు బిడ్డల్ని(ఒకరికి రెండేళ్లు, ఒకరికి ఆరేళ్లు) డీహైడ్రేషన్, అలల నుంచి కాపాడుకునేందుకు మార్లేస్ వీలైనంత ప్రయత్నం చేసింది. వాళ్ల ఆకలి తీర్చేందుకు పాలు పట్టింది. తన మూత్రాన్ని తానే తాగి ఆకలి తీర్చుకుంది. వేడికి ఆమె ఒళ్లంతా మంటలు పుట్టాయి. అయినా ఓర్చుకుంది. తనకేమైనా పర్వాలేదనుకుని.. బిడ్డల్ని అక్కున చేర్చుకుని వేడి తగలకుండా చూసుకుంది. చివరికి డీహైడ్రేషన్ కారణంగా అవయవాలు దెబ్బతిని ప్రాణం విడిచిందామె. మొత్తం తొమ్మిది మంది లైఫ్ బోటులో తల్లి మృతదేహంలో ఒదిగి పడుకున్న పిల్లలను.. కారాకస్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పిల్లల ఒంటిపై సూర్య తాపానికి బొబ్బలు వచ్చాయి. తిండి లేక నీరసించిపోయిన ఆ పిల్లల్ని తిరిగి మామూలు స్థితికి తీసుకొచ్చారు కూడా. మరోవైపు ఈ ఇద్దరు పిల్లల్ని చూసేందుకు నియమించిన యువతి వెరోనికా మార్టినెజ్(25).. పక్కనే ఓ ఐస్ బాక్స్‌లో పడుకుని బతికి బట్టకట్టింది. ప్రస్తుతం కోలుకున్న ఆ యువతి.. మానసికంగా మాత్రం కోలుకోలేకపోతోంది. అయితే ఆ మార్లేస్ భర్త రెమిక్ డేవిడ్ కాంబ్లర్ ఆచూకీ మాత్రం తెలియరాలేదు. సరదా ట్రిప్‌లో భాగంగా వెనిజులా హిగుయిరోట్ నుంచి లా టార్టుగా ఐల్యాండ్(కరేబియన్ దీవులు) వైపు తొమ్మిది మందితో వెళ్లింది. భారీ అల కారణంగా మొదట పాడైన బోటు.. ఆ తర్వాత అలల ధాటికి చెల్లాచెదురై ఉంటుందని, సుమారు 70 మైళ్ల దూరం కొట్టుకుని పోయి ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రమాదంలో మిగిలిన వాళ్లెవరూ బతికే అవకాశాలు లేవని అధికారులు భావిస్తున్నారు. సెప్టెంబర్ 11న ఆ మాతృమూర్తికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. చదవండి: ఇలాంటి కూతురు చచ్చినా పర్లేదు అన్నారు -
బిడ్డకు పాలిస్తే.. బిల్డప్ ఎలా అవుతుంది?: హీరోయిన్
బోల్డ్ స్టేట్మెంట్లు, యాక్షన్లు తరచూ సెలబ్రిటీలను ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంటాయి. అందుకే నొప్పింపక.. తానొవ్వక అనే రీతిలో వ్యవహరిస్తుంటారు కొందరు. ఆ కొందరిలో ఒకరు నటి గాల్ గాడోట్(36). వండర్ ఉమెన్‌గా క్రేజ్ సంపాదించుకున్న హాలీవుడ్ నటి గాడోట్.. తరచూ సామాజిక అంశాలపై స్పందిస్తూ ఉంటుంది. చెప్పాలనుకున్న విషయాన్ని చాలా సున్నితంగా ఆడియెన్స్‌కు చేరవేస్తుంటుంది కూడా. అలాంటిది తాజాగా ఆమె చేసిన ఓ పని.. ఇంటర్నెట్లో విమర్శలకు దారితీసింది. షూటింగ్ కోసం రెడీ అవుతున్న తరుణంలో.. టచప్ సందర్భంగా చనుబాలను పంపింగ్ చేస్తూ ఆ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దీంతో కొందరు పనిగట్టుకుని ఆమెను విమర్శించడం మొదలుపెట్టారు. అతి చేష్టల్లో భాగంగా ఆమె ఆ పని చేసిందంటూ మండిపడ్డారు. దీంతో గాడోట్ ఓ మీడియా హౌజ్ ద్వారా స్పందించింది. తల్లి పాల విలువేంటో చెప్పేందుకు తాను ఆ పని చేశానని క్లారిటీ ఇచ్చింది. తల్లయ్యాక తిరిగి పనుల్లోకి వెళ్లడం ఎంత కష్టమో ఆ విమర్శించే వాళ్లకు తెలిసి ఉండకపోవచ్చు. అది తెలియాలనే నా ఈ ప్రయత్నం. పైకి నవ్వుతూ ఉన్నా.. ఎల్లప్పుడూ బిడ్డల ఆకలి గురించి ఆలోచించే తల్లుళ్లకు జోహార్లు అంటూ చెంపపెట్టు సమాధానమిచ్చింది గాల్ గాడోట్. కాగా, ఇప్పటికే ఇద్దరు పిల్లల తల్లైన గాడోట్.. రెండు నెలల క్రితమే మూడో బిడ్డకు జన్మనిచ్చింది. గాడోట్ మాత్రమే కాదు.. గతంలో క్రిస్సి టెయిగెన్, లోకి నటి సోఫియా డి మార్టినో కూడా ఇలా సెట్స్ నుంచే పంపింగ్ ఫొటోలతో వార్తల్లో చర్చకు దారితీశారు. చదవండి: పూజా హెగ్డే.. ఇది మంచి పద్ధతి కాదు! -
తల్లిపాలు: పాలిచ్చే సమయంలో ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోండి
బిడ్డకు అమ్మ పాలు వరం.. సురక్షితం.. పౌష్టికాహారం.. అన్ని పోషకాలు అందించి రోగాల నుంచి రక్షించే అమృతం. పోతపాల కంటే తల్లిపాలు తాగే పిల్లలు బలంగా, తెలివిగా ఉంటారన్నది నిరూపితమైన వాస్తవం. శిశువు సంపూర్ణ ఆరోగ్యంతో, వజ్ర సమానమైన రోగనిరోధక శక్తిని పొందాలంటే తల్లిపాలు పట్టించాల్సిందే. తల్లి పాలతో తల్లికి, బిడ్డకు ఇద్దరికీ లాభాలున్నాయి. ఎన్నోరకాల వ్యాధుల నివారణకు దోహదపడుతాయి. ఇంతటి విశిష్టత కలిగిన తల్లిపాలను బిడ్డ ఎంత వయస్సు వచ్చే వరకు ఇవ్వాలి.? రోజుకు ఎన్నిసార్లు పట్టాలి.? ఎలా పట్టాలి.? తల్లిపాలు పుష్కలంగా రావాలంటే ఏమి తినాలి.? ముర్రుపాలు ఎప్పుడు పట్టాలి.? ఇలా చాలా అంశాలపై అందరికి అవగాహన ఉండదు. ఆధునిక కాలం అమ్మలకు మరింత తక్కువ. ఇలాంటి అంశాలను వారికి తెలియజేస్తూ, తల్లిపాల ప్రాముఖ్యతను చాటేందుకు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో వారోత్సవాలను ఆగస్టు 7వ తేదీ వరకు కోవిడ్–19 నేపథ్యంలో టీ శాట్ ద్వారా నిర్వహించనున్నారు. సాక్షి, మంచిర్యాల: బిడ్డ పుట్టిన గంటలోపు నుంచి 6నెలల వరకు తల్లిపాలు తప్ప మరే పదార్థాలూ ఇవ్వకూడదు. తల్లి పాలు తేలికగా జీర్ణమవుతాయి. అంతే కాకుండా శుభ్రంగా ఎటువంటి క్రీములు లేకుండా ఉంటాయి. శ్వాసకోశ, అలర్జీ, అస్తమా, చర్మవ్యాధుల నుంచి పిల్లలను రక్షిస్తాయి. బిడ్డ మానసిక శారీరక వికాసానికి అవసరమైన పోషకాలు అందిస్తాయి. రోజులో బిడ్డకు 8–10 సార్లు పాలు ఇవ్వాలి. ఆరు మాసాల తర్వాత నుంచి బిడ్డకు తల్లిపాలతో పాటు అనుబంధ ఆహారం ఇవ్వాలి. రెండేళ్ల వరకు క్రమం తప్పకుండా పాలు పట్టాలి. దీంతో ఎలాంటి వ్యాధులు దరిచేరకుండా బిడ్డ ఎదుగుదల సక్రమంగా ఉంటుంది. పాలిచ్చే సమయంలో ఇవి తీసుకోకూడదు.. ♦ బిడ్డకు పాలిచ్చే సమయంలో తల్లి కొన్నింటిపై ప్రత్యేకంగా శ్రద్ధ చూపాలి. బిడ్డను పడుకోబెట్టి, నిలబెట్టి పాలు పట్టకూడదు. ♦ పాలిచ్చే సమయంలో కెఫిన్ అధికంగా ఉండే పదార్థాలు, శీతల పానీయాలు తీసుకోకూడదు. ఇది బిడ్డ శారీరక, మానసిక ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. ముర్రుపాలు తప్పనిసరి ♦ బిడ్డ పుట్టిన మొదటి అరగంటలోపు తల్లులకు వచ్చే పాలను ముర్రుపాలు అంటారు. ♦ ఇవి రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా బిడ్డకు సమతుల్యమైన పోషకాహార పదార్థాలు అందజేస్తాయి. ఇందులో మాంసకృత్తులు, విటమిన్ ‘ఏ’ ఉంటుంది. ♦ వ్యాధులు రాకుండా ముర్రుపాలు బిడ్డను జీవిత కాలం కాపాడుతాయి. ♦ శిశువు ప్రేగులను శుభ్రం చేసి, మొదటి మల విసర్జనకు తోడ్పడుతాయి. ♦ తల్లులు సహజంగా బిడ్డకు సరిపడా పాలు రావడం లేదని అనుకోవడం అపోహ మాత్రమే. ♦ బిడ్డ పుట్టగానే పాలు మూడు, నాలుగు రోజుల వరకు పడవని తేనె నాకించడం, పంచదార నీళ్లు ఇవ్వడం, గ్లూకోజ్ నీళ్లు ఇవ్వడం చేయకూడదు. తల్లిపాలు పుష్కలంగా రావాలంటే... ♦ గర్భిణిగా ఉన్నప్పటి నుంచే పోషక విలువలున్న ఆహారం తీసుకోవాలి. పాలు, చేపలు, గుడ్లు, వెల్లుల్లిపాయ, తాజా కూరగాయలు, పండ్లు తగిన మోతాదులో తీసుకోవాలి. ♦ ఆహారంలో తీపి పదార్థాలు(స్వీటు కాదు) అంటే ప్రకృతి సహజంగా దొరికే పండ్లు తినాలి. తల్లికి కలిగే లాభాలు.. ♦ తల్లులు చనుపాలు ఇవ్వడంతో గర్భధారణ తర్వాత రక్తస్రావ ప్రమాదం తగ్గడంతో పాటు త్వరగా కోలుకుంటారు. జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు. ♦ చనుపాలు ఇవ్వడంతో ఊబకాయం వచ్చే ప్రమాదం తగ్గుతుంది. గర్భానికి పూర్వం ఉన్న బరువును తిరిగి పొందగలుగుతారు. ♦ బిడ్డకు పాలు పట్టించడంతో రొమ్ము, గర్భ సంచి క్యాన్సర్లు రావు. ♦ తల్లులకు మలి వయసులో వచ్చే అస్టియో పొరొసిన్ (ఎముకల బలహీనత) నుంచి కాపాడుతుంది. ♦ తల్లి శిశువుల మధ్య బంధాన్ని పెంపొందిస్తుంది. ♦ ఆరు నెలల వరకు రోజుకు 8 నుంచి 10 సార్లు పాలు ఇవ్వాలి. ♦ తల్లికి, శిశువుకు జ్వరం వచ్చినప్పుడు, టీకాలు ఇచ్చినప్పుడు కూడా పాలు పట్టించవచ్చు. తల్లిపాలతో కలిగే లాభాలు ► తల్లిపాలు శిశువుకు సంపూర్ణమైన సంతులిత ఆహారాన్ని అందిస్తాయి. ► నాణ్యమైన ప్రోటీన్లు, ఒమెగా 3,.6 అలాగే 9 బిడ్డ మెదడుకు వికాసానికి తోడ్పడుతాయి. ► ఈ పాలలో బిడ్డలకు అవసరమయ్యే విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ► ఇందులోని లాక్టోజ్‌తో కాల్షియం నిల్వలు పెరుగుతాయి. బిడ్డను రక్తహీనత నుంచి కాపాడుతాయి. ► తొలి నెలలో శిశువులకు వివిధ రకాల అంటువ్యాధుల బారినుంచి కాపాడుతాయి. ► తల్లిపాలతో బిడ్డలకు డయేరియా, నిమోనియా వంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చు. క్యాన్సర్, చెవికి సంబంధించిన వ్యాధులు, గుండె జబ్బులు వంటి వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి. ► ఎలర్జీ, అస్తమా, డయాబెటీస్ వంటి వ్యాధులు రావు. ► బాల్యంలో, యవ్వనంలో ఊబకాయం వచ్చే ప్రమాదం తక్కువ. తల్లిపాలు ఎంతో శ్రేష్ఠమైనవి ప్రతి ఏటా తల్లిపాల వారోత్సవాలను ఆగస్టు మొదటి వారంలో నిర్వహించడం జరుగుతుంది. కోవిడ్ 19 నేపథ్యంలో ఆన్లైన్ ద్వారా, టీ శాట్ ద్వారానే చిన్నారులకు ప్రీస్కూల్ పాఠాలను బోధిస్తున్నాం. గర్భిణులు కరోనా సమయంలో మరింత జాగ్రత్తలను తీసుకుని, పుట్టే బిడ్డలకు తల్లిపాలనే అందించాలి. – ఉమాదేవి, మంచిర్యాల జిల్లా ఇన్చార్జి సంక్షేమశాఖ అధికారి -
తల్లికి పాజిటివ్ ఉన్నా.. శిశువుకు పాలు ఇవ్వొచ్చా?
సాక్షి, మహబూబ్‌నగర్: ‘కరోనా పాజిటివ్ వచ్చిన తల్లి.. శిశువుకు పాలు ఇవ్వొచ్చు. కాకపోతే పాలు ఇచ్చే సమయంలో తల్లి రెండు మాస్కులు ధరించాలి.’ కేవలం పాలు ఇచ్చే సమయంలో మాత్రమే శిశువును దగ్గరకు తీసుకోవాలి, ఇతర ఆలనాపాలన మాత్రం నెగిటివ్ ఉన్న మహిళతో చేయించాలి. శిశువుకు లక్షణాలు ఉంటే కావాల్సిన మందులు వాడాలి. పరీక్షలు మాత్రం చేయించాల్సిన అవసరం లేదు. చిన్నారులకు మాస్కు పెట్టలేం కనుక అధిక లక్షణాలతో పాజిటివ్ ఉండే తల్లులు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. తరచూ శిశువు పట్టుకోకుండా పాలు ఇచ్చే సమయంలో కాకుండా ఇతర సమయాల్లో కొంత దూరం ఉండడం ఉత్తమం.’ అని ప్రముఖ చిన్న పిల్లల డాక్టర్ రాఘవేంద్రకుమార్ తెలిపారు. శనివారం సాక్షి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఆయన పలువురు కాలర్స్ అడిగిన సందేహాలను నివృత్తి చేయడంతో పలు సలహాలు, సూచనలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మొదటి వేవ్ కంటే సెకండ్ వేవ్‌లో 3 నుంచి 4శాతం చిన్నారులు అధికంగా కరోనా బారినపడుతున్నారు. కాకపోతే ఎవరూ కూడా తీవ్ర సమస్యలకు గురికాకుండా స్వల్ప లక్షణాలతో రికవరీ అవుతున్నారు. సెకండ్ వేవ్‌లో వందలో పదిశాతం చిన్నారులు కరోనా లక్షణాలతో ఆస్పత్రులకు వెళ్తున్నారు. ఇందులో ప్రధానంగా జ్వరం, దగ్గు, విరేచనాలు వంటి లక్షణాలు కన్పిస్తున్నాయి. ప్రస్తుతం చిన్నారులలో ఎవరిలో కూడా ఆయాసం కన్పించడం లేదు. పిల్లలకు ఒకటి లేదా రెండు రోజుల పాటు జ్వరం వస్తుంటే పారాసిటమాల్ ప్రతి ఆరు గంటలకు ఓసారి వేయాలి. మల్టీవిటమిన్, కొద్దిగా లక్షణాలు అధికంగా యాంటీబయోటిక్స్ వాడాలి. తల్లిదండ్రులకు పాజిటివ్ వచ్చి పిల్లలకు ఆ రోజు నెగిటివ్ వస్తే నిర్లక్ష్యం చేయవద్దు. మళ్లీ రెండు రోజుల తర్వాత వారిలో లక్షణాలు బయటపడుతాయి. వారిలో ఉండే టీకా, రోగనిరోధక శక్తివల్ల లక్షణాలు బయటపడటానికి కొంత సమయం పడుతుంది. 24గంటల నుంచి 48 గంటల పాటు పారాసిటమాల్ వేసిన కూడా జ్వరం తగ్గకపోతే అప్పుడు కరోనా పరీక్షలకు వెళ్లాలి.’ అని పేర్కొన్నారు. ప్రశ్న: మా తల్లిదండ్రులతో పాటు నాకు పాజిటివ్ వచ్చింది. నాకు చిన్నారి ఉంది. నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డాక్టర్: మీ పాపను కొంత దూరంగా పెట్టండి. ఏదైనా అత్యవసరం ఉండి, పాలు ఇవ్వాల్సిన సమయంలో చేతులకు గ్లౌజ్, రెండు మాస్కులు పెట్టుకొని శిశువును పట్టుకోవాలి. పాపకు ఏదైనా లక్షణాలు కనిపిస్తే మందులు వాడండి. ప్రశ్న: మా పాపకు 8 ఏళ్లు నా తల్లిదండ్రులతో ఉంటుంది. ఇటీవల వారికి కరోనా పాజిటివ్ వచ్చింది. కానీ పాపకు నెగిటివ్ ఉంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పాపకు మళ్లీ పరీక్ష చేయించాలా? డాక్టర్: పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు పాపను కొంత దూరం పెట్టండి. ప్రస్తుతం ఆమెకు ఎలాంటి లక్షణాలు లేకుండా ఆరోగ్యంగా ఉంటే మళ్లీ పరీక్ష చేయాల్సిన అవసరం లేదు. జ్వరం ఉంటే పారాసిటమాల్ వాడండి. ప్రశ్న: మా ఇంట్లో నలుగురం ఉంటే మా చిన్న బాబుకు తప్పా అందరికీ పాజిటివ్ వచ్చింది. మాతో పాటు బాబు ఉండవచ్చా? డాక్టర్: మీ ముగ్గురు కూడా ఇంట్లో వేరువేరుగా ఉంటూ మాస్కులు వాడండి. నెగిటివ్ ఉన్న బాబును మాత్రం ప్రత్యేకంగా ఉంచండి. ఆ బాబుకు ఏదైనా లక్షణాలు ఇతర సమస్య ఏదైనా ఉంటే పరిశీలించండి. లక్షణాలు లేకపోతే పరీక్ష చేయాల్సిన అవసరం లేదు. ప్రశ్న: చిన్న పిల్లలలో కరోనా లక్షణాలు ఎలా గుర్తించాలి. తుమ్ములు రావడం కూడా కరోనా లక్షణమేనా? డాక్టర్: సాధారణంగా చిన్న పిల్లలలో ప్రస్తుతం జ్వరం, దగ్గు, విరేచనాలు వంటి లక్షణాలు కన్పిస్తున్నాయి. ఈ మూడింటిలో రెండు లక్షణాలు రెండు కంటే ఎక్కువ రోజులు ఉంటే ఓసారి పరీక్ష చేసు కోవాలి. తుమ్ములు రావడం కరోనా లక్షణం కాదు. ప్రశ్న: మా తల్లిదండ్రులకు పాజిటివ్ వచ్చింది. మా 8 ఏళ్ల బాబు వారితో ఉండేవాడు. అతడికి పరీక్ష చేస్తే నెగిటివ్ వచ్చింది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. డాక్టర్: కొందరి పిల్లల్లో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. వీరిలో వైరస్ పెద్దగా ప్రభావం చూపదు. మళ్లీమళ్లీ పరీక్షలు చేయకండి. ఏదైనా లక్షణాలు కన్పిస్తే అవి కూడా మూడు రోజుల పాటు తగ్గకుండా ఉంటే అప్పుడు చూడండి. లక్షణాలు కనిపిస్తే మల్టీ విటమిన్ సిరఫ్, పారాసిటమాల్ వాడండి. ప్రశ్న: మా ఇంట్లో నిమోనియా వచ్చిన వ్యక్తి ఉన్నాడు. కరోనా నేపథ్యంలో పిల్లలు అలాంటి వారికి దూరంగా ఉండాలా? డాక్టర్: సాధారణంగా నిమోనియా వచ్చిన వారికి పిల్లలను దూరంగా పెట్టడం చాలా ఉత్తమం. అతనికి దగ్గు కూడా ఉంటుంది కనుక ఎప్పుడూ మాస్కు పెట్టండి. ఇలాంటి వారికి వైరస్ తొందరగా సోకుతుంది. ప్రశ్న: నాకు పాజిటివ్ ఉంది. నా పాప ప్రస్తుతం మూడు నెలల శిశువు. పాపకు పరీక్ష చేయలేదు. తల్లి పాలు ఇవ్వొచ్చా? డాక్టర్: శిశువుకు పాలు ఇచ్చే సమయంలో తల్లిగా మీరు రెండు మాస్కులు పెట్టుకోవాలి. కరోనా ఉన్నా..పాలు ఇవ్వొచ్చు. పాపకు రెండురోజుల పాటు జ్వరం లేదా ఇతర లక్షణాలు ఉంటే టానిక్స్‌తో పాటు ఇతర మందులు వాడండి. మూడేళ్ల పైబడిన పిల్లలకు మాత్రమే మాస్కులు పెట్టవచ్చు. పిల్లల్లోజ్వరం, దగ్గు, కంట్లో నలత, గొంతు నొప్పి, కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు, 8 ఏళ్లు పైబడిన వారికి వాసన, రుచి తెలియకపోవడం వంటి లక్షణాలు కన్పిస్తే అప్పుడుఅనుమానించాలి. ముఖ్యంగా కిడ్నీ, గుండె జబ్బులు, లివర్ సమస్య, ఎదుగుదల లోపం ఉన్న వారు హైరిస్క్‌లో ఉన్నట్లు. వీరికి వైరస్ కొంచెం త్వరగా సోకే అవకాశం ఉంటుంది. ఇలాంటి వారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలకు పాజిటివ్ ఉన్న సమయంలో ఆహారం విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. - డాక్టర్ రాఘవేంద్రకుమార్ -
‘బిడ్డకు పాలిచ్చిన తల్లి’..క్షమాపణ చెప్పాల్సిందే!
‘ఆఫీసులో బిడ్డకు పాలిస్తూ తీసుకున్న ఫొటో తీసుకోవడమే కాక, సోషల్ మీడియాలో పోస్టు చేసి దేశ మహిళల పరువును తక్కువ చేస్తావా? వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పు. ఇకపై ఇలాంటి తప్పు చేయనని హామీపత్రం రాసివ్వు’ అంటూ గదమాయించారు ఉన్నతాధికారులు ఆ మహిళా ఉద్యోగిని. ఆమె ఏమీ మాట్లాడలేదు.. మాట్లాడే అవకాశమూ లేదు. మౌనంగా వాళ్లు అడిగిన హామీపత్రం రాసి ఇచ్చి బయటకు వచ్చేసింది. అప్పుడు ఆమె మనసులో చెలరేగిన ప్రశ్న ‘దేశ మహిళల పరువు పోయేది ఆఫీసులో బిడ్డకు పాలివ్వడం వల్లనా? లేక ఆ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడం వల్లనా?!’ ఇది జరిగింది కంబోడియాలో.. జరిగి సుమారు మూడు వారాలకు పై మాటే. ఆ తల్లి పేరు సిథాంగ్ సొఖా. స్టంగ్ ట్రెంగ్ రాష్ట్రంలోని సియామ్ పాంగ్ జిల్లాలో డిప్యూటీ పోలీస్ చీఫ్‌గా పనిచేస్తోంది. సొఖాకు ఏడాది బాబు ఉన్నాడు. మార్చి 2న పిల్లాడిని తీసుకొని డ్యూటీకి హాజరయ్యింది. కాసేపటికి పిల్లాడు ఏడవడంతో ఆఫీసు బయట చెట్టు కింద కూర్చొని పాలు పట్టింది. అక్కడే ఉన్న ఆమె సహోద్యోగి ఫొటో తీసింది. ఆ ఫొటోను తన ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేసిన సొఖా ‘పిల్లలపై తల్లి ప్రేమను సిగ్గు ప్రభావితం చేయలేదు’ అంటూ క్యాప్షన్ రాసింది. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అటు ఇటు తిరిగి సొఖా ఉన్నతాధికారుల కంట పడింది. మార్చి 9న.. అంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిగిన మరుసటి రోజు సొఖాను ఆఫీస్‌కు రప్పించారు. ఆ సందర్భంగా ఆమెతో వాళ్లన్న మాటలే పైన చెప్పినవి. గళమెత్తిన మహిళా సంఘాలు.. సొఖా హామీపత్రం రాసింది కానీ బహిరంగ క్షమాపణ మాత్రం చెప్పలేదు. కానీ, సొఖా విషయంలో పోలీసు అధికారుల ప్రవర్తన తెలిసి దేశవ్యాప్తంగా మహిళా హక్కుల సంఘాలు భగ్గుమన్నాయి. ‘ఇది పనిచేసే చోట మహిళలపై చూపుతున్న వివక్షకు నిదర్శనం. విధుల్లో ఉన్న తల్లులను పిల్లల సంరక్షణ లేదా డ్యూటీలో ఏదో ఒకటి మాత్రమే ఎంచుకోవాలని చెప్పడం దారుణం. దీన్ని బట్టి మహిళల హక్కుల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైంది’ అంటూ వేలాది మంది గళమెత్తారు. సొఖాకు మద్దతుగా సోషల్ మీడియాలోనూ పోస్టులు వెల్లువెత్తాయి. వివరణలూ వివాదాస్పదమే.. సొఖా విషయంలో అలజడి చెలరేగడంతో ఆమె ఉన్నతాధికారులు దిద్దుబాటుకు దిగారు. ‘డ్యూటీలో ఉండగా పిల్లాడికి పాలివ్వడాన్ని తప్పు పట్టలేదు. కాకపోతే ఆమె ఆ ఫొటోను ‘పర్మిషన్’ తీసుకోకుండా పోస్ట్ చేసినందుకు మాత్రమే మందలించామ’ని వివరణ ఇచ్చారు. ఇది మరింత ఆజ్యానికి కారణమైంది. ఈ వివరణ మహిళల మాట్లాడే స్వేచ్ఛను కాలరాసేలా ఉందని హక్కుల కార్యకర్తలు మండిపడ్డారు. ఆ వివరణ ఇచ్చిన పోలీసాఫీరు మహిళలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో ఈసారి ఏకంగా మహిళా మంత్రిత్వ శాఖే జోక్యం చేసుకుంది. సొఖా విషయంలో పోలీసు అధికారుల తీరును తప్పుపడుతూనే పనిచేసే చోట, పబ్లిక్ ప్రదేశాల్లో మహిళలు పిల్లలకు పాలిచ్చేటప్పుడు చాటుగా లేదా, ఏదైనా వస్త్రాన్ని అడ్డుగా ఉంచుకోవాలని సూచించింది. దీనిపైనా హక్కుల సంఘాలు భగ్గుమన్నాయి. ‘పనిప్రదేశాల్లో ఓ మహిళ తన బిడ్డకు పబ్లిక్‌గా పాలివ్వడం ఆ ఆఫీసుకు, దేశ మహిళల పరువుకు ఏ విధంగా భంగమో తెలియడం లేదు. నిజానికి టీవీల్లో వచ్చే ప్రకటనల్లో చాలా భాగం అశ్లీలతతో కూడుకొన్నవే. మరి వాటి వల్ల దేశ మహిళల పరువుకు భంగం కలగదా?’ అని ప్రశ్నిస్తున్నారు కంబోడియా మానవ హక్కుల కేంద్రం అధిపతి చాక్ సొఫియా. ప్రధాని సతీమణి మద్దతు.. సొఖాకు మద్దతుగా గళమెత్తే వాళ్ల సంఖ్య పెరగడంతో విషయం ఆ దేశ ప్రధాని సతీమణి బున్ రనీ హున్ సెన్కు చేరింది. వెంటనే ఆమె సొఖాకు ఓ లేఖతోపాటు 2,500 డాలర్లను బహుమతిగా పంపారు. అలాగే స్టంగ్ ట్రెంగ్ రాష్ట్ర గవర్నర్‌తోపాటు సొఖాను తప్పుపట్టిన ఉన్నతాధికారులు సైతం బహుమతులు అందించారు. ఇలా దేశం నలుమూలల నుంచి సొఖాకు మద్దతు బహమతులు కుప్పలు తెప్పలుగా వచ్చిపడ్డాయి. మరోవైపు, ఈ వివాదానికి సాధ్యమైనంత త్వరగా పుల్‌స్టాప్ పడాలని సొఖా కోరుకుంటోంది. ‘నేను పనిచేసే చోట ఉండే సుహృద్భావ వాతావరణాన్ని చెడగొట్టడం నా పోస్ట్ ఉద్దేశ్యం కాదు. పిల్లాడిపై ఓ మాతృమూర్తి ప్రేమను చెప్పాలనుకున్నాను అంతే’ అంటోంది. నిజానికి ఈ వివాదం కొన్ని వారాలు గడిచినా ఇప్పటికీ చల్లారడం లేదు. విషయం ఏకంగా ఐక్యరాజ్యసమితికి చేరడంతో కంబోడియా ఆందోళనకు గురవుతోంది. అసలే ఆ దేశంలో మహిళలపై హింస ఎక్కువనే అపవాదు ఇప్పటికే ఉండడమే దీనికి కారణం. -
అమ్మపాలే ‘అమృతం’
గుంటూరు మెడికల్: శిశుమరణాల నియంత్రణకు ప్రపంచ ఆరోగ్య సంస్థ విస్తృత ప్రచారం చేపట్టింది. అందులో భాగంగా ఏటా ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు మొదటి వారాన్ని తల్లిపాల వారోత్సవంగా 1992లో ఐక్యరాజ్యసమితి నిర్దేశించి 210 దేశాల్లో అమలు చేస్తోంది. తల్లిపాల ఆవశ్యకత గురించి వరల్డ్ అలయన్ ఫర్ బ్రెస్ట్ ఫీడింగ్ యాక్షన్ అనే సంస్థ ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేస్తోంది. ఆగస్టు ఒకటో నుంచి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహిసస్తున్న సందర్భంగా ప్రత్యేక కథనం. తల్లిపాలతో ప్రయోజనాలు... ♦ తల్లిపాలలో సహజ సిద్ధమైన ప్రొటీన్లు లాక్టొఫెరిన్, కోలోస్ట్రమ్, కొన్ని కీలకమైన హార్మోన్లు, రోగ నిరోధక బ్యాక్టీరియా ఉంటాయి. ♦ తల్లిపాలు తాగే పిల్లలో తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. డబ్బాపాలు తాగే పిల్లల కంటే చురుగ్గా ఉంటారు. ♦ తల్లి బిడ్డకు పాలు ఇవ్వటంతో తల్లీబిడ్డ మధ్య అనుబంధం పెనవేసుకుంటుంది. ♦ మంచి గుణాలు, మానవ సంబంధాలు శిశువులో పుట్టుక నుంచే అలవడతాయి. ♦ పాలిచ్చే తల్లులకు క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. ♦ పొత్తికడుపు త్వరగా తగ్గిపోతుంది. పాలు ఇస్తున్నంతకాలం వెంటనే గర్భం రాకుండా కృత్రిమంగా ఆగిపోతుంది. ♦ ప్రసవ సమయంలో అయ్యే బ్లీడింగ్ కూడా త్వరగా తగ్గిపోతుంది. -
పాల కోసం ఎమర్జెన్సీ నెంబర్‌కు కాల్ చేసింది!
వాషింగ్టన్ : శాంతి భద్రతలు, పౌరులకు మెరుగైన రక్షణ, క్విక్ రెస్పాన్స్ విషయంలో అమెరికా పోలీసులు వహ్వా అనిపించారు. అర్ధరాత్రి సమయంలో ఓ మహిళ విన్నపాన్ని మన్నించి.. ఆమె బుజ్జి పాపాయికి పాలు, బేబీ ఫార్ములా తీసుకెళ్లి అందించారు. అమెరికాలో ఎమర్సెన్సీ నెంబర్ 911. ఆపత్కాలంలో ఈ నెంబర్‌కు డయల్ చేసి పోలీసుల సాయంతో బయటపడొచ్చు. యూఎస్‌లోని ఉత రాష్ట్రానికి చెందిన షానన్ బర్డ్‌కు జనవరి 28, అర్ధరాత్రి 2 గంటల సమయంలో తలెత్తిన పరిస్థితి కూడా అలాంటిదే. స్పందన కరువైంది..! నెలల తన బుజ్జి పాపాయికి బ్రెస్ట్ ఫీడ్ చేద్దామంటే షానన్ దగ్గర పాలు లేవు. ఇంట్లో ఉన్న పాలు కూడా అయిపోయాయి. పనిమీద వేరే ప్రాంతానికి వెళ్లిన భర్త కూడా ఆ సమయంలో అందుబాటులో లేడు. సమయమేమో అర్ధరాత్రి రెండవుతోంది. తన మిగతా పిల్లలు (నలుగురు) నిద్రిస్తూ ఉన్నారు. ఇక ఇరుగుపొరుగు వారి సాయం అడుగుదామంటే ఎవరూ స్పందించలేదు. అప్పటికే తన చిన్నారి కూతురు ఆకలితో గుక్కపెట్టి ఏడుస్తోంది. దాంతో, షానన్‌కు ఏం చేయాలో పాలు పోలేదు. ఇలా కాసేపు మానసిక వేదనకు గురైన ఆమెకు ఆపత్కాలంలో ఆదుకునే 911 గుర్తుకు వచ్చింది. వెంటనే 911కు కాల్ చేసి.. తన పరిస్థితిని పోలీసులకు విన్నవించింది. స్పందించిన లోన్ పీక్ ప్రాంత పోలీసులు ఓ పాల డబ్బా, బేబీ ఫార్ములాను తీసుకెళ్లి ఇచ్చారు. పోలీసుల సాయానికి కృతజ్ఞతలు తెలిపిన షానన్ తన బ్లాగులో ఈ వివరాలు వెల్లడించింది. ఇక అమెరికన్ పోలీసుల ఔదార్యం, షానన్ తెలివైన పనిపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. చిన్నారి ఆకలి తీర్చిన పోలీసులు సంతోష పడి ఉంటారని కొందరు, ‘మనసు’పెట్టి పనిచేసిన పోలీసులకు సెల్యూట్ అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. కష్టకాలంలోనూ బిడ్డ ఆకలి తీర్చగలిగిన అమ్మకు సలాం అని కొందరు నెటిజన్లు పేర్కొన్నారు. -
వైరల్ ఫొటో: ఈ అమ్మకు సలాం...!!
చంటిబిడ్డ ఆకలి తల్లికే తెలుస్తుంది.. అందుకే తన ఏ చోట ఉన్నా.. బిడ్డ ఆకలిని తీర్చేందుకు తల్లి వెనుకాడదు. అమృతం వంటి చనుబాలు అందించి తనను లాలిస్తుంది. మిజోరాంకు చెందిన లాల్వేంట్లుంగాని కూడా అలాంటి తల్లే. అందుకే వాలీబాల్ ఆటల పోటీ మధ్యలో కాస్త విరామం దొరకగానే తన పాపాయికి పాలుపట్టి మాతృత్వాన్ని చాటుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోను నింగ్లిన్ హంగల్ అనే నెటిజన్ ఫేస్బుక్లో షేర్ చేశారు. ‘ ఆట మధ్యలో తన ఏడు నెలల బుజ్జాయి ఆకలి తీర్చేందుకు ఓ తల్లి పాలుపట్టిన క్షణం. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆట పట్ల ఆ తల్లి అంకిత భావాన్ని... నలుగురిలో బిడ్డకు పాలు పట్టిన ధైర్యాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. క్రీడాకారిణిగా, ఓ తల్లిగా రెండు బాధ్యతలు ఒకేసారి నిర్వహించిన ఆమెకు జేజేలు పలుకుతున్నారు’ అని నింగ్లిన్ పేర్కొన్నారు. ఈ క్రమంలో లాల్వేంట్లుంగాని ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో.. ‘ఆ అమ్మకు సలాం’ అంటూ నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తున్నారు. కాగా లాల్వేంట్లుంగాని మిజోరాంకు చెందిన వాలీబాల్ క్రీడాకారిణి. టికుమ్ నియోజకవర్గానికి చెందిన వాలీబాల్ జట్టు సభ్యురాలిగా ఉన్న ఆమె రాష్ట్ర స్థాయిలో క్రీడల్లో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఐజ్వాల్‌లో జరిగిన పోటీల్లో ఆమె ఈ విధంగా బిడ్డకు పాలుపట్టారు. ఇక ఈ ఫొటో మిజోరాం క్రీడాశాఖ మంత్రి రాబర్ట్ రోమావియా రోటే దృష్టికి రావడంతో ఆయన లాల్వేపై ప్రశంసలు కురిపించారు. ఆమెకు రూ. 10 వేలు బహుమానంగా ప్రకటించారు. Mizoram State Games ‘19 chu tan a na tlang a ni e....Ms Lalventluangi Tuikum Bial Volleyball Player pawhin chawlh lawk remchanga lain a naute thla 7 leka upa chu a hnute a hnek tir e!! Ms Veni a ngaihsanawm em vangin Rs 10,000/- in puih kan tum e. MSG tiropuitu a ni ngei e! pic.twitter.com/QHJ4tEmtQt — Robert Romawia Royte (@robertroyte) December 9, 2019 -
మీరెవరు విడదీసేందుకు?
చావీ మిట్టల్ చక్కటి ప్రశ్నే వేశారు. ‘‘బహిరంగ ప్రదేశాలలో సిగరెట్ తాగితే తప్పు కాదు కానీ, తల్లి తన బిడ్డకు పాలిస్తే తప్పు అవుతుందా?’’ అని! ‘‘స్తన్యమివ్వడం ప్రకృతిలోని అందమైన విషయం. తల్లికి, బిడ్డకు మధ్య ఉండే ఈ బంధం ఎవరూ విడదీయలేనిది. బిడ్డకు ఆకలైనప్పుడు చనుబాలు పట్టడానికి ఇంట్లో ఉన్నానా, వీధిలో ఉన్నానా అని చూసుకోదు తల్లి. కానీ సమాజం దీన్నొక అపరాధంగా చూస్తోంది. రోడ్ల మీద సిగరెట్ కాలుస్తూ, తాగి తూలుతూ చుట్టుపక్కల వాళ్లకు ఇబ్బంది కలిగిస్తే ఎవరికీ పట్టదు కానీ, ఒక తల్లి తన బిడ్డకు పాలు పడితే మాత్రం ఏదో బ్రహ్మాండం బద్దలైనట్లే మాట్లాడతారు’’ అని చావీ అంటున్నారు. టీవీ నటి అయిన చావీ ఇటీవలే రెండో బిడ్డకు జన్మనిచ్చారు. -
దయచేసి వాళ్లను సిగ్గుపడేలా చేయకండి..!
తన గారాల పట్టి నైరాకు పాలు పడుతూ మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నారు నటి సమీరారెడ్డి. రెండోసారి గర్భం దాల్చిన నాటి నుంచి తన ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు ఆమె. గర్భిణిగా ఉన్నపుడు, ప్రసవం తర్వాత ఎదురయ్యే ఇబ్బందులు, శరీరాకృతి గురించి ఆందోళన చెందకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని మహిళల్లో స్ఫూర్తి నింపారు. ప్రస్తుతం ప్రపంచ తల్లిపాల వారోత్సవం(ఆగష్టు 1-7)సందర్భంగా తల్లిపాల ఆవశ్యకతను వివరిస్తూ, అటువంటి సమయంలో భర్తలు... ఏవిధంగా అండగా ఉండాలో సూచిస్తూ సమీరా పెట్టిన పోస్టు నెటిజన్లను హత్తుకుంటోంది. ‘అమ్మ’ పై ప్రేమ, గౌరవం చూపండి! ‘ కొత్తగా తండ్రులైనవారు, ప్రియమైన నా వాళ్లందరూ ఈ విషయాన్ని శ్రద్ధగా గమనించండి! ప్రపంచ తల్లిపాల వారోత్సవం సందర్భంగా మీకో విషయం చెప్పదలచుకున్నాను. కొత్తగా బిడ్డకు జన్మనిచ్చిన తల్లులకు మీ అండ అవసరం. గర్భిణిగా ఉన్నప్పుడు, ప్రసవం తర్వాత మహిళల్లో ఒక రకమైన ఒత్తిడి, భయం నెలకొంటాయి. వారు ఆత్మవిశ్వాసంతో ఉండలేరు. ఇవన్నీ పరోక్షంగా వారి ఆరోగ్యంపై.. ముఖ్యంగా చనుబాలపై ప్రభావం చూపుతాయి. బిడ్డతో వ్యవహరించే తీరులో మార్పునకు కారణమవుతాయి. కాబట్టి పాల ఉత్పత్తి తగ్గిపోయి శిశువు ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఇటువంటి సమయాల్లో మీ సహకారం ఆమెకు అవసరం. మీ ప్రేమతో ఆ ఒత్తిడిని, భయాలను దూరం చేయండి. ఇక ఇంకో విషయం బిడ్డకు చనుబాలు పట్టే తల్లులను హేళనగా చూస్తూ వాళ్లను సిగ్గుతో బిగుసుకుపోయేలా చేయకండి. తల్లులూ మీరూ వినండి. పాలు పడటం లేదని ఆందోళన చెందకండి. పాలు పట్టే తీరును బట్టి కూడా వాటి ఉత్పత్తి ఆధారపడి ఉంటుంది. నేను మాత్రం ఈ విషయంలో అస్సలు ఒత్తిడికి లోనవ్వను. ప్రతీ అమ్మపై ప్రేమ, గౌరవం చూపాల్సిన బాధ్యత అందరిపై ఉంది’ అంటూ సమీరా రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు. అంతేగాక తన బిడ్డను హత్తుకొని ఉన్న క్యూట్ ఫొటోను షేర్ చేశారు. View this post on Instagram New dads & loved ones listen up! Its World Breast feeding week and this post is for you to know that you can be the biggest support and encouragement to a new mom! A mother may be depressed, lacking in confidence, worried, or stressed and it affects breastfeeding. These factors do not directly affect her milk production, but can interfere with the way in which she responds to her baby. This can result in the baby taking less milk, and failing to stimulate milk production. So be there for her . ❤️ Understanding the pressure on her physically and emotionally is the best thing you can do. Nothing like feeling loved at such an overwhelming time. 🙌🏻 . I would also like to give a shoutout to moms who have struggled with low milk production . This could happen due to a pathological reason including endocrine problems or a host of other factors .A few mothers have a physiological low breast-milk production, for no apparent reason, and production does not increase when the breastfeeding technique and pattern improve. There is no reason to shame them or make them feel any pressure in not being able to BF. we need to support all mothers and show love and respect 🍼. . #worldbreastfeedingweek2019 . @WABA_global @who @unicefindia A post shared by Sameera Reddy (@reddysameera) on Aug 2, 2019 at 12:46am PDT ఇక మరో నటి నేహా దుఫియా కూడా తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. తన బిడ్డ మెహర్ పుట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు తనతో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ.. తల్లిపాల ఆవశ్యకతను వివరిస్తూ ఓ సందేశాత్మక వీడియో రూపొందించారు. బహిరంగ ప్రదేశాల్లో సిగ్గుపడకుండా అనువైన రీతిలో బిడ్డకు పాలు పట్టడం నేరమేమీ కాదని నేహ వీడియోలో చెప్పుకొచ్చారు. -
స్తన్యమిచ్చి ఆదుకున్న మహిళా కానిస్టేబుల్ ..
కర్ణాటక, శివాజీనగర: మహిళా పోలీసు కానిస్టేబుల్ తల్లి మనసు అందరి ప్రశంసలను అందుకుంటోంది. రోడ్డు పక్కను విసరివేసిన నవజాత శిశువుకి ఆమె స్తన్యమిచ్చి ఆదుకున్నారు. బుధవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు యలహంక జీకేవీకే క్యాంపస్ రోడ్డు పక్కలో నవజాత ఆడశిశువును వదిలివెళ్లారు. విపరీతమైన చలికి బిడ్డ గుక్కపట్టి ఏడుస్తోంది. చీమలు పట్టిన్న నవజాత శిశువును చూసిన కొందరు స్థానికులు విద్యారణ్యపురం పోలీసులకు సమాచారం అందించారు. బిడ్డ లభించిన స్థలం తమ పరిధి కాదని విద్యారణ్యపుర పోలీసులు రాలేదు. దీంతో యలహంక పోలీసులు వెళ్లారు. చలించిన సంగీత వారిలోని మహిళా కానిస్టేబుల్ సంగీతా ఎస్ హలిమనికి ఆ బిడ్డను చూడగానే తల్లి మనసు తల్లడిల్లింది. పసిగుడ్డుకు రొమ్ము ఇచ్చి ఆకలి తీర్చారు. బిడ్డకు బట్టలు తొడిగి యలహంక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి, అక్కడ నుంచి వాణి విలాస్ ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్యంగా ఉన్న బిడ్డను పిల్లల సంక్షేమ శాఖకు అప్పగించేందుకు వైద్యులు నిర్ధారించారు. సంగీత చేసిన మంచిపనికి డీసీపీ కళా కృష్ణస్వామితో పాటు పలువురు సీనియర్ అధికారులు అభినందించారు. సకాలంలో పాలు త్రాగించి బిడ్డను కాపాడిన సంగీతను ఆసుపత్రి సిబ్బంది ప్రశంసించారు. సంగీతకు 10 నెలల ఆడకూతురు ఉంది. ఆమె గొప్పమనసుపై సోషల్ మీడియాలో కూడా మన్ననలు అందుకుంటోంది. -
తల్లిపాలు తాగుతూ ఊపిరాడక బిడ్డ మృతి
సాక్షి ప్రతినిధి, చెన్నై: తల్లి కావడం ప్రతి మహిళకు ఒక వరం. రక్తం పంచుకుని జన్మించిన బిడ్డకు స్తన్యం ద్వారా పాలివ్వడం అనిర్వచనీయమైన అనుభూతి. అయితే దురదృష్టవశాత్తూ ఇలా పాలుపట్టడమే ఆ తల్లిపాలిట శాపమైంది. బిడ్డ ప్రాణాన్ని హరించివేసిన విషాద సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. చెన్నై రాయపురానికి చెందిన వినోద్‌బాబు (25), సంధ్య (22) దంపతులకు ఆనంద్ అనే మూడు నెలల కుమారుడు ఉన్నాడు. బుధవారం రాత్రి సంధ్య తన కుమారుడికి స్థన్యం ద్వారా పాలుపడుతున్న సమయంలో బిడ్డకు ఊపిరాడలేదు. దీంతో తల్లి ఒడిలో తలవాల్చేసి ప్రాణాలు విడిచాడు. ఈ హఠాత్పరిణామాన్ని తట్టుకోలేక తల్లి బిగ్గరగా ఏడవడంతో ఇరుగూపొరుగూ వచ్చి ఓదార్చారు. ఇంతలో పోలీసులు సైతం అక్కడికి చేరుకుని బిడ్డ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వైరలవుతోన్న పోలీసాఫీసర్ ఫోటో
బ్యూనస్ ఎయిర్స్ : కంటేనే అమ్మా అవుతుందా.. కాదు, బిడ్డ ఆకలి గుర్తించి స్పందించే ప్రతి స్త్రీ కూడా మాతృమూర్తే. ఇందుకు నిదర్శనంగా నిలిచారు అర్జెంటీనాకు చెందిన ఓ మహిళా పోలీసు అధికారి. ఆకలితో గుక్కపట్టిన చిన్నారికి స్తన్యమిచ్చి అమ్మ ప్రేమకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. వివరాల ప్రకారం.. అర్జెంటీనాకు చెందిన సెలెస్ట్ జాక్వెలిన్ అయాలా ఒక పిల్లల ఆస్పత్రి వద్ద గార్డ్‌గా పనిచేస్తోంది. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం పోషాకాహార లోపంతో బాధపడుతోన్న ఒక పసివాణ్ణి ఆ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఒక రోజు జాక్వెలిన్ విధుల్లో ఉన్న సమయంలో ఆ బాలుడు గుక్కపట్టి ఏడ్వడం ప్రారంభించాడు. ఆ పసివాడి ఏడుపు జాక్వెలిన్ మాతృహృదయాన్ని కదిలించింది. దాంతో వెంటనే జాక్వెలిన్ ఆస్పత్రి సిబ్బందిని అడిగి ఆ పసివాడికి పాలిచ్చింది. జాక్వెలిన్ చూపిన మాతృప్రేమ అక్కడ ఉన్న వారి మనసులను కదిలించింది. వెంటనే ఆ అపురూప దృశ్యాన్ని తమ కెమెరాల్లో బంధించారు. ఇంటర్నెట్లో షేర్ చేసిన ఈ ఫోటో జాక్వెలిన్‌ని ఓవర్ నైట్ స్టార్‌గా మార్చేసింది. ఈ ఫోటోను ఇప్పటికే ఒక లక్ష మంది షేర్ చేయగా, ఫేస్బుక్లో ప్రశంసలు వెల్లువ కొనసాగుతోంది. ట్విటర్లో అయితే జాక్వెలిన్ పేరే ఒక హాష్ట్యాగ్గా మారిపోయింది. జాక్వెలిన్ గురించి తెలుసుకున్న అర్జెంటీనా వైస్ ప్రెసిడెంట్ క్రిస్టియాన్ రిటోండో.. ఆమెను ప్రత్యేకంగా అభినందించడమే కాక, పోలీస్ అధికారి స్థాయి నుంచి సార్జంట్‌గా పదోన్నతి కల్పించారు. Hoy recibimos a Celeste, la oficial que amamantó a un bebé en el Hospital de Niños de #LaPlata para notificarle su ascenso. Queríamos agradecerle en persona ese gesto de amor espontáneo que logró calmar el llanto del bebé. La policía que nos enorgullece, la policía que queremos. pic.twitter.com/8aBp0Xj4Zj — Cristian Ritondo (@cristianritondo) August 17, 2018 -
బిడ్డకు పాలివ్వటమే శాపమైంది
పెన్సిల్వేనియా రాష్ట్రంలో విచిత్రమైన కేసు నమోదు అయ్యింది. తల్లి రొమ్మే బిడ్డ ప్రాణం తీసింది. పాలు విషంగా మారటంతో ఆ బిడ్డ మృతి చెందింది. దీంతో ఆమెపై కేసు నమోదు కాగా.. కటకటాల పాలైంది. ఏప్రిల్ 2న జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... ఫిలడెల్ఫియా నగరానికి చెందిన సమంత జోన్స్‌కి 11 నెలల బాబు. ఒళ్లు నొప్పులు ఉండటంతో మాత్రలు వేసి పడుకుంది. అయితే నిద్రలో పసికందు ఏడవటంతో లేచి పాలిచ్చింది. ఉదయం లేచి చూసేసరికి ఆ చిన్నారిని నురగ కక్కుకుని ప్రాణాలు విడిచాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో తల్లిపాలు విషంగా మారటమే కారణమని తేలింది. కేసు నమోదు చేసి ఆమెను అరెస్ట్ చేశారు. తర్వాత 3 మిలియన్ డాలర్ల పూచీకత్తుపై సమంత బెయిల్‌పై రిలీజ్ అయ్యారు. కాగా, ఈ కేసులో వాదనలు శుక్రవారం మొదలుకాగా, మెథడోన్‌తో కూడిన మందులను ఆమె తీసుకోవటమే చిన్నారి మరణానికి కారణమైందని ప్రాసిక్యూషన్ వాదించారు. అయితే మెథడోన్ మందులు వాడి బిడ్డకు పాలివ్వొచ్చన్న శాస్త్రవేత్తల వాదనను సమంత తరపు అటార్నీ వాదించారు. కాగా, ఈ కేసులో తదుపరి వాదనను జూలై 23కి వాయిదా వేశారు. కోర్టు దోషిగా ప్రకటిస్తే మాత్రం ఆమెకు జీవిత ఖైదు పడే అవకాశం ఉంది. -
‘నా బిడ్డ అనుకునే పాలిచ్చా’
సాక్షి, బెంగళూరు: సోషల్ మీడియా మొత్తం ఇప్పుడు ఆ మహిళా కానిస్టేబుల్‌కు హ్యాట్సాఫ్ చెబుతోంది. కన్నతల్లికి దూరమైన ఓ పసికందుకు పాలిచ్చి.. ఆకలిని తీర్చిందామె. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలో ఈ ఘటన తాజాగా చోటు చేసుకుంది. స్థానికంగా నిర్మాణంలో ఉన్న ఓ భవనం వద్ద ప్లాస్టిక్ బ్యాగులో చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లిపోయారు. అది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఏఎస్సై నగేశ్ ఘటనాస్థలానికి చేరుకుని ఆ పసికందును పరిశీలించారు. బ్యాగ్‌లో రక్తం, బొడ్డు తాడు ఉండటంతో అప్పుడే పుట్టిన చిన్నారిగా నిర్ధారించారు. వెంటనే ఆ మగ శిశువును ఆస్పత్రికి తీసుకెళ్లగా వారు ఉచితంగా చికిత్స అందించారు. ఆపై కాస్త కోలుకున్నాక పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అయితే ఆకలితో ఆ పసిగుడ్డు గుక్కపట్టి ఏడ్వటం ప్రారంభించింది. అది గమనించిన కానిస్టేబుల్ అర్చన ఆ చిన్నారిని ఒళ్లోకి తీసుకుని పాలు పట్టించారు. అర్చన మూడు నెలల బాబుకు తల్లి. ఈ మధ్యే మెటర్నిటీ లీవ్ పూర్తి చేసుకుని తిరిగి విధుల్లో చేరారు. ‘ఏడుస్తుంది నా బిడ్డే అనిపించింది. చూసి తట్టుకోలేకపోయా. అందుకే ఆ బాబుకు పాలిచ్చా’ అని అర్చన ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. అర్చనపై ప్రశంసలు... ఈ విషయం తన దృష్టికి రావటంతో ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి.. ఆ మహిళా కానిస్టేబుల్‌పై ప్రశంసలు గుప్పించారు.‘ఈ ఉదంతం కదిలించింది. ఆ చిన్నారి ఆకలిని తీర్చిన ఆ తల్లికి వందనాలు’అని బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. బెంగళూరు సిటీ పోలీసులు కూడా ఫేస్ బుక్ పేజీలో ‘అర్చనకు సెల్యూట్’ పేరిట ఓ సందేశం ఉంచారు. మరోవైపు ఈ కథనం చూసిన ప్రజలు కూడా ఆ తల్లి హృదయానికి సలాం కొడుతున్నారు. అన్నట్లు ఆ బిడ్డకు కుమారస్వామి అన్న పేరు పెట్టిన ఏఎస్సై నగేశ్.. ఇకపై ఆ పసికందు బాధ్యత ప్రభుత్వానిదేనని ప్రకటించారు. బెంగళూరులోని శిశుమందిర్ నిర్వాహకులకు ఆ బాబును అప్పగించగా, ఆ శిశువు ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. -
వైరల్‌గా మారిన మళయాళం మ్యాగజైన్ కవర్ పేజీ
-
నిన్నటి వరకు గొప్ప కవి.. నేడు వేశ్యనా?
తిరువనంతపురం : సోషల్ మీడియా వేదికగా తనపై వస్తున్న విమర్శలపై మలయాళ మోడల్ గిలు జోసెఫ్ ఘాటుగా స్పందించారు. నిన్నటి వరకు గొప్ప కవి అని కొనియాడినవారే ఇప్పడు వేశ్యగా ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిపాలు ఆవశ్యకతపై అవగాహన పెంచడానికి మలయాళ మ్యాగజైన్ ‘గృహలక్ష్మీ’ ఓ సంచికను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ కవర్ పేజీపై 27 ఏళ్ల మోడల్ గిలుజోసెఫ్ ఒక బిడ్డకు స్తన్యమిస్తున్న ఫొటోను ప్రచురించారు. అయితే ఈ మ్యాగజైన్‌పై సోషల్‌మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ మ్యాగజైన్‌తో చనుబాలపై మరోసారి చర్చ మొదలైందని కొందరు ప్రశంసిస్తుండగా.. పెళ్లి కాని మోడల్‌ను ఫోటో కవర్ పేజీపై వినియోగించడం ఏమిటని మరి కొందరు విమర్శలు చేస్తున్నారు. దీంతో ఈ మ్యాగజైన్‌పై వివాదం చెలరేగి కేసులు నమోదయ్యే వరకు వెళ్లింది. ఇక నటి గిలుజోసెఫ్పై పరుష పదజాలంతో నెటిజన్లు విమర్శలు గుప్పించారు. బిడ్డకు బహిరంగంగా పాలివ్వడం ఏంటని మండిపడ్డారు. పెళ్లి కాని నటివి ఇటువంటి ఫొటో షూట్లు చేయవచ్చా అని నిలదీసారు. ఇదంతా పబ్లిక్ స్టంట్‌లో భాగమేనని విరుచుకుపడ్డారు. ఈ విమర్శలపై నటి గిలు జోసెఫ్ ఓ జాతీయ చానెల్‌తో ఘాటుగా స్పందించారు. ‘ఆ ఫొటో షూట్‌కు ఒక్క పైసా కూడా తీసుకోలేదని అలాంటప్పుడు అది పబ్లిక్ స్టంట్ ఎలా అవుతుంది. పత్రికలు, టీవీల్లో వచ్చే గ్రాఫిక్ ఫొటోలను చూడటంలో ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఓ తల్లి తన బిడ్డకు పాలిస్తూ కనిపిస్తే మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఇష్టంతోనే గృహలక్ష్మీ చేపట్టిన చనుబాల ఆవశ్యకత ప్రచారంలో భాగస్వామినయ్యాను. తల్లులు వారి బిడ్డలకు దైర్యంగా పాలివ్వాలనే లక్ష్యంతో ఈ ప్రచారం మొదలెట్టాం. అంతే తప్ప ఎలాంటి దురుద్దేశం లేదు. నిన్నటి వరకు తనను గొప్ప కవిగా కొనియాడిన వారే నేడు నీతి తప్పిన దానిగా, వేశ్యగా ప్రచారం చేస్తున్నారు’ అని జోసెఫ్ ఆవేదన వ్యక్తం చేశారు.