బిడ్డకు పాలు ఇవ్వకపోతే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని చదివాను. నిజమేనా? నా ఫ్రెండ్ కెరీర్ ఒత్తిడి వల్ల పిల్లల కోసం సరోగసీకి వెళదామనుకుంటోంది. దీనివల్ల బ్రెస్ట్ ఫీడ్ కుదరదు కదా! అందుకే బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదం ఉంటుందని చెప్పాను. అలా ఏమీ ఉడదు.. బిడ్డను కన్నా పాలు పడకపోతే కూడా అంతే రిస్క్ ఉంటుంది కదా అని వాదిస్తోంది. నా డౌట్ క్లియర్ చేయగలరు.
– కె. పృథ్వీ దీప్తి, పుణె
సరోగసీ ద్వారా పిల్లలను ప్లాన్ చేసినా.. కొంతమందికి మందుల సహాయంతో బ్రెస్ట్ ఫీడింగ్‌కి ట్రై చేయొచ్చు. దీన్ని లాక్టేషన్ ఇండక్షన్ అంటారు. సరోగసీ బేబీ డెలివరీ కన్నా ముందు నుంచి బ్రెస్ట్ ఫీడింగ్‌కి ట్రై చెయ్యడానికి ప్రిపరేషన్ చేసుకోవాలి. ఇది అందరిలోనూ విజయవంతం కావచ్చు. బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల ఉన్న ఉపయోగాలు దాదాపు అందరికీ తెలిసే ఉంటాయి. ఏడాది పాటు బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల 4 నుంచి 5 శాతం వరకు బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ అనేది హార్మోన్స్, జన్యుపరమైన, జీవనశైలి వంటివాటి వల్ల పెరుగుతుంది.
హార్మోన్స్ చేంజెస్ వల్ల 50 శాతం రిస్క్ పెరుగుతుంది. 5 నుంచి 10 శాతం జన్యుపరమైన కారణాలు ఉంటాయి. బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వనందు వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ స్వల్పమే. ఆరోగ్యకరమైన జీవనశైలి.. అంటే అధిక బరువు లేకుండా సరైన బీఎమ్‌ఐ (బాడీ మాస్ ఇండెక్స్)ని మెయిన్‌టేన్ చేస్తూ .. పోషకాహారం తీసుకుంటూంటే క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. జన్యుపరమైన కారణాలతో హైరిస్క్‌లో ఉన్నవారికి స్క్రీనింగ్‌లో బీఆర్‌సీఏ జీన్ పాజిటివ్ అని తేలిన వారికి ప్రాఫిలాక్టిక్ సర్జరీల ద్వారా ఆ రిస్క్‌ని తగ్గించవచ్చు. బ్రెస్ట్ అల్ట్రాసౌండ్ లేదా మామోగ్రఫీ ద్వారా తేలిగ్గానే క్యాన్సర్ చేంజెస్‌ను కనిపెట్టవచ్చు. ఈరోజుల్లో కొన్ని మెడికేషన్స్ ద్వారా .. సరోగసీ ద్వారా పిల్లలు కన్న తల్లులతో కూడా బ్రెస్ట్‌ఫీడింగ్‌కి, బిడ్డతో స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్‌ని చాలా ఎంకరేజ్ చేస్తున్నారు.
(చదవండి: చర్మం ఆరోగ్యంగా కాంతివంతంగా కనిపించాలంటే..ఇలా చేయండి!)
Comments
Please login to add a commentAdd a comment