వృత్తీరీత్యా చెఫ్‌గా పదిమందికి భోజనం పెట్టిన ఆమె విధి శాపమో లేక కర్మఫలమో గానీ కడుపు నిండా తినడం కష్టమయ్యే అరుదైన వ్యాధి బారిన పడింది. కనీసం గుప్పెడు మెతుకులు నోట్లో పెట్టుకోవాలంటే అల్లాడిపోయేది. నిజానికి కేన్సర్ నుంచి బయటపడేందుకు చేయించుకున్న శస్త్ర చికిత్స ఆమె పాలిట మృత్యువుగా మారింది. చివరికి ఆ వ్యాధితో పోరాడుతూ కానరాని లోకాలకు వెళ్లిపోయింది.
వివరాల్లోకెళ్తే..ప్రముఖ ఫుడ్ బ్లాగర్ నటాషా దిద్దీ(50) వృత్తి రీత్యా చెఫ్. రకరకాల వంటకాలతో కస్టమర్లను అలరించేది. ఏమోందో ఏమో గానీ 2019లో కేన్సర్ ఉన్నట్లు నిర్థారణ అయ్యింది. ఆమె కడుపులో కణుతులు వేగంగా అభివృద్ధి చెందాయి. దీంతో వైద్యులు ఆ కేన్సర్ మొత్త వ్యాపించకుండా ఉడేలా మొత్తం కడుపు భాగానే తొలగించారు. ఆమె పొట్ట భాగం లేకపోవడంతో ఆహారాన్ని జీర్ణించుకోవడం ఆనేది సమస్యత్మకంగా మారింది. ఆ క్షణం నుంచే ఆమె జీవితం మరింత నరకప్రాయంగా మారిపోయింది.
వైద్యులు చిన్న మీల్స్ తినమని సూచించినా..అది తినడమే మహానరకంగా ఉండేది నటాషాకి. అలా ఆమె ప్రాణాలతో పోరాడుతూ మార్చి 24న తుదిశ్వాస విడిచింది. ఆమె పలు ఇంటర్యూల్లో తాను డంపింగ్ సిండ్రోమ్‌తో పోరాడుతున్నట్లు తెలిపింది. దీని కారణంగా కడుపులోని ఆహరం స్పీడ్‌గా కదిలి జీర్ణంకాకమునుపే ప్రేగుల్లోకి వెళ్లిపోతుంది. దీని దుష్ప్రభావం కారణంగా అలసట, చెమటలు పట్డడం, విపరీతంగా ఆవులించడం వంటి సమస్యలు ఎదుర్కొనవల్సి వస్తుందని వాపోయింది కూడా.
డంపింగ్ సిండ్రోమ్ అంటే..
కడుపులో జీర్ణక్రియం సక్రమమైన పద్ధతిలో జరగుతుంది. అలాకాకుండా అనియంత్రంగా కడుపులో పడ్డ ఆహారం వేగంగా కదిలితే దాన్ని 'గ్యాస్ట్రిక్ చలనశీలత' అంటారు. ఆహారం కండరాలు, నరాలు, హార్మోన్లు సంకేతాలతో నెమ్మదిగా ఖాళీ అవుతుంది. అలాగాకుండా అనియంత్రంగా త్వరితగతిన తిన్న ఆహారం పోట్టలో ఖాళీ అయిపోతుందంటే.. ఇక్కడ పైలోరిక్ వాల్వ్ తెరుచుకుని కడుపులోని ఆహారం బయటకు పోతుందని అర్థం. అంటే..ఇది చిన్న ప్రేగు తక్కువ ఆహారాన్ని జీర్ణం చేసుకోవడంతో తలెత్తే సమస్య ఇది.
మాములుగా అయితే చిన్నప్రేగులు ఆహారాన్ని జీర్ణం చేసేలోపు మిగతా అవయవాలు ఆహారం నెమ్మదిగా కదిలేలా సర్దుబాటు చేసుకుంటాయి. అప్పుడు అది చక్కగా వంటబడుతుంది. మనకు హాయిగా ఉంటుంది. అలాగాకుండా ఆహారం వేగంగా కదిలితే అనారోగ్య సమస్యలు ఉన్నట్లు అర్థం.
ఎవరు బాధపడతారంటే..
కడుపుకి సంబంధించిన శస్త్ర చికిత్స కారణంగా ఈ డంపింగ్ సిండ్రోమ్ లక్షణాలను అభివృద్ధి చేస్తారు. గ్యాస్ట్రెక్టమీ లేదా గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ వంటి కడుపులోని పెద్ద భాగాలను తొలగించే లేదా బైపాస్ శస్త్రచికిత్సలు చేయించుకున్న వ్యక్తులలో కూడా ఇది సాధారణం. నిజానికి ఈ డంపింగ్ సిండ్రోమ్ ప్రాణాంతకం కాకపోయినప్పటికీ..ఒక్కోసారి కొన్ని కేసుల్లో తీవ్రమై..బరువు తగ్గి, పోషకాహార లోపాలను ఎదుర్కొనవల్సి వస్తుంది. దీన్ని స్వీయ సంరక్షణతో నయం చేసుకోవచ్చు. చాలామందికి తేలికపాటి లక్షణాలే ఉండి క్రమేణ తగ్గుముఖం పడతాయి. కొందరిలో మాత్రం ప్రాణాంతకంగా మారుతుంది.
లక్షణాలు ఎలా ఉంటాయంటే..
- వాంతులు అవుతున్నాయి
- అతిసారం
- ఉదరం మరియు తీవ్రమైన తిమ్మిరిలో నొప్పి
- ఉబ్బరం
- డిజ్జి అక్షరములు
- హృదయ స్పందన రేటును వేగవంతం చేయడం
- బలహీనత
- అలసట
- చల్లని చెమటలు
- ముఖం ఎర్రబడుతోంది
- మెదడు అలిసిపోవడం
- ఆకలి
(చదవండి: ఇలాంటి తల్లులు కూడా ఉంటారా?..మాటలు కూడా రాని ఆ చిన్నారిని..)
Comments
Please login to add a commentAdd a comment