Blogger
-
చెఫ్‌గా పదిమందికి కడుపు నిండా భోజనం పెట్టేది..కానీ ఆమె అన్నమే..!
వృత్తీరీత్యా చెఫ్‌గా పదిమందికి భోజనం పెట్టిన ఆమె విధి శాపమో లేక కర్మఫలమో గానీ కడుపు నిండా తినడం కష్టమయ్యే అరుదైన వ్యాధి బారిన పడింది. కనీసం గుప్పెడు మెతుకులు నోట్లో పెట్టుకోవాలంటే అల్లాడిపోయేది. నిజానికి కేన్సర్ నుంచి బయటపడేందుకు చేయించుకున్న శస్త్ర చికిత్స ఆమె పాలిట మృత్యువుగా మారింది. చివరికి ఆ వ్యాధితో పోరాడుతూ కానరాని లోకాలకు వెళ్లిపోయింది. వివరాల్లోకెళ్తే..ప్రముఖ ఫుడ్ బ్లాగర్ నటాషా దిద్దీ(50) వృత్తి రీత్యా చెఫ్. రకరకాల వంటకాలతో కస్టమర్లను అలరించేది. ఏమోందో ఏమో గానీ 2019లో కేన్సర్ ఉన్నట్లు నిర్థారణ అయ్యింది. ఆమె కడుపులో కణుతులు వేగంగా అభివృద్ధి చెందాయి. దీంతో వైద్యులు ఆ కేన్సర్ మొత్త వ్యాపించకుండా ఉడేలా మొత్తం కడుపు భాగానే తొలగించారు. ఆమె పొట్ట భాగం లేకపోవడంతో ఆహారాన్ని జీర్ణించుకోవడం ఆనేది సమస్యత్మకంగా మారింది. ఆ క్షణం నుంచే ఆమె జీవితం మరింత నరకప్రాయంగా మారిపోయింది. వైద్యులు చిన్న మీల్స్ తినమని సూచించినా..అది తినడమే మహానరకంగా ఉండేది నటాషాకి. అలా ఆమె ప్రాణాలతో పోరాడుతూ మార్చి 24న తుదిశ్వాస విడిచింది. ఆమె పలు ఇంటర్యూల్లో తాను డంపింగ్ సిండ్రోమ్‌తో పోరాడుతున్నట్లు తెలిపింది. దీని కారణంగా కడుపులోని ఆహరం స్పీడ్‌గా కదిలి జీర్ణంకాకమునుపే ప్రేగుల్లోకి వెళ్లిపోతుంది. దీని దుష్ప్రభావం కారణంగా అలసట, చెమటలు పట్డడం, విపరీతంగా ఆవులించడం వంటి సమస్యలు ఎదుర్కొనవల్సి వస్తుందని వాపోయింది కూడా. డంపింగ్ సిండ్రోమ్ అంటే.. కడుపులో జీర్ణక్రియం సక్రమమైన పద్ధతిలో జరగుతుంది. అలాకాకుండా అనియంత్రంగా కడుపులో పడ్డ ఆహారం వేగంగా కదిలితే దాన్ని 'గ్యాస్ట్రిక్ చలనశీలత' అంటారు. ఆహారం కండరాలు, నరాలు, హార్మోన్లు సంకేతాలతో నెమ్మదిగా ఖాళీ అవుతుంది. అలాగాకుండా అనియంత్రంగా త్వరితగతిన తిన్న ఆహారం పోట్టలో ఖాళీ అయిపోతుందంటే.. ఇక్కడ పైలోరిక్ వాల్వ్ తెరుచుకుని కడుపులోని ఆహారం బయటకు పోతుందని అర్థం. అంటే..ఇది చిన్న ప్రేగు తక్కువ ఆహారాన్ని జీర్ణం చేసుకోవడంతో తలెత్తే సమస్య ఇది. మాములుగా అయితే చిన్నప్రేగులు ఆహారాన్ని జీర్ణం చేసేలోపు మిగతా అవయవాలు ఆహారం నెమ్మదిగా కదిలేలా సర్దుబాటు చేసుకుంటాయి. అప్పుడు అది చక్కగా వంటబడుతుంది. మనకు హాయిగా ఉంటుంది. అలాగాకుండా ఆహారం వేగంగా కదిలితే అనారోగ్య సమస్యలు ఉన్నట్లు అర్థం. ఎవరు బాధపడతారంటే.. కడుపుకి సంబంధించిన శస్త్ర చికిత్స కారణంగా ఈ డంపింగ్ సిండ్రోమ్ లక్షణాలను అభివృద్ధి చేస్తారు. గ్యాస్ట్రెక్టమీ లేదా గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ వంటి కడుపులోని పెద్ద భాగాలను తొలగించే లేదా బైపాస్ శస్త్రచికిత్సలు చేయించుకున్న వ్యక్తులలో కూడా ఇది సాధారణం. నిజానికి ఈ డంపింగ్ సిండ్రోమ్ ప్రాణాంతకం కాకపోయినప్పటికీ..ఒక్కోసారి కొన్ని కేసుల్లో తీవ్రమై..బరువు తగ్గి, పోషకాహార లోపాలను ఎదుర్కొనవల్సి వస్తుంది. దీన్ని స్వీయ సంరక్షణతో నయం చేసుకోవచ్చు. చాలామందికి తేలికపాటి లక్షణాలే ఉండి క్రమేణ తగ్గుముఖం పడతాయి. కొందరిలో మాత్రం ప్రాణాంతకంగా మారుతుంది. లక్షణాలు ఎలా ఉంటాయంటే.. వాంతులు అవుతున్నాయి అతిసారం ఉదరం మరియు తీవ్రమైన తిమ్మిరిలో నొప్పి ఉబ్బరం డిజ్జి అక్షరములు హృదయ స్పందన రేటును వేగవంతం చేయడం బలహీనత అలసట చల్లని చెమటలు ముఖం ఎర్రబడుతోంది మెదడు అలిసిపోవడం ఆకలి (చదవండి: ఇలాంటి తల్లులు కూడా ఉంటారా?..మాటలు కూడా రాని ఆ చిన్నారిని..) -
Chugurova: ఆహా...పోహ వైరల్
ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది బ్లాగర్స్ మన దేశానికి వచ్చి స్థానికులతో హాయిగా కలిసిపోతారు. ఆ జ్ఞాపకాల వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. తాజాగా మన దేశానికి వచ్చిన రష్యన్ బ్లాగర్ చుగురోవా వీడియో వైరల్ అయింది. మహారాష్ట్రలోని చిన్నపాటి హోటల్‌కి వెళ్లిన చుగురోవా అక్కడ ఉన్న సూర్యవన్షి అనే మహిళను ‘నమస్తే దీదీ’ పలకరించి ‘ఏం చేస్తున్నారు?’ అని అడిగింది. ‘పోహ’ (అటుకుల ఉప్మా) అని చెప్పింది సూర్యవన్షి. ‘నాకు కూడా నేర్పించరా?’ అని చుగురోవా అడగగానే ఓకే చెప్పింది సూర్య. సూర్య డైరెక్షన్లో టమాటాలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి...మొదలైనవి తరగడం నుంచి పెనంలో వేడి నూనెలో వేయడం వరకు ఎన్నో చేసి ‘పోహ’ ప్రాజెక్ట్‌ను విజయవంతంగా పూర్తి చేసింది చుగురోవా. ఆ తరువాత ‘పోహ తినండి....వోన్లీ ఇరవై రూపాయలు మాత్రమే’ అని హిందీలో అరిచింది. ‘నమస్తే దోస్తో’ కాప్షన్స్‌తో ‘మేకింగ్ పోçహ’ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది చుగురోవా. -
నవ్వుల పువ్వుల దారిలో...
ఫ్యాషన్ బ్లాగర్‌గా ప్రయాణం మొదలుపెట్టింది దిల్లీకి చెందిన డాలీసింగ్. రైటర్, స్టైలిస్ట్, కంటెంట్ క్రియేటర్, ఎంటర్‌ప్రెన్యూర్‌గా విజయపథంలో దూసుకుపోతోంది. ‘మనలో ఉన్న శక్తి ఏమిటో మనం చేసే పనే చెబుతుంది’ అంటున్న 29 సంవత్సరాల డాలీసింగ్కు పనే బలం. ఆ బలమే తన విజయ రహస్యం... డాలీసింగ్ మాట్లాడితే చుట్టుపక్కల నవ్వుల పువ్వులు పూయాల్సిందే! ఆమె ఏం మాట్లాడినా సూటిగా ఉంటుంది. అదే సమయంలో ఫన్నీగా ఉంటుంది. ‘స్పిల్ ది సాస్’ అనే ఫ్యాషన్ బ్లాగ్‌తో ప్రయాణం మొదలు పెట్టింది. లైఫ్‌స్టైల్ పోర్టల్ ‘ఐ–దివ’ కోసం జూనియర్ రైటర్, స్టైలిస్ట్‌గా పనిచేసింది. ‘రాజు కీ మమ్మీ’ ఫన్నీ వీడియోలతో కంటెంట్ క్రియేషన్‌లోకి అడుగుపెట్టింది. ఈ వీడియోలు ఎంతో పాపులర్ అయ్యాయి. రోజువారి జీవితం నుంచే తన ఫన్నీ వీడియోలకు కావాల్సిన స్టఫ్‌ను ఎంపిక చేసుకునేది. ‘బయట ఏదైన ఆసక్తికరమైన దృశ్యం కంటపడితే నోట్ చేసుకునేదాన్ని. ఆ తరువాత డెవలప్ చేసేదాన్ని. మనలోని శక్తి ఏమిటో మన రచనల్లో తెలిసిపోతుంది. రచన చేయడం అనేది నాకు ఎంతో ఇష్టమైన పని. ఎప్పటికప్పుడూ కొత్త కొత్త క్యారెక్టర్లను సృష్టించడానికి ప్రయత్నిస్తాను. ఐ–దివలో పనిచేస్తున్నప్పుడు స్క్రిప్ట్ రెడీ చేసుకోవడం అంటూ ఉండేది కాదు. ఒక టాపిక్ అనుకొని కెమెరా ముందుకు వచ్చి తోచినట్లుగా మాట్లాడడమే. ఆ తరువాత మాత్రం స్క్రిప్ట్ రాయడం మొదలైంది’ అంటుంది డాలీ సింగ్. కామెడీ అయినా సరే, ప్రేక్షకులు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కాల్పనిక హాస్యం కంటే నిజజీవిత సంఘటనల నుంచి తీసుకున్న కామెడీనే ఇష్టపడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని పంచ్‌లైన్స్ విషయంలో రకరకాలుగా ఎక్సర్సైజ్లు చేస్తుంటుంది డాలీ. ‘ప్రేక్షకులను మెప్పించడం అనేది ఫన్ అండ్ చాలెంజింగ్‌గా ఉంటుంది. రెండు మూడు నెలలకు ఒకసారి రీస్టార్ట్ కావాల్సిందే. కంటెంట్ క్రియేషన్‌లో అతి ముఖ్యమైనది ఎప్పుటికప్పుడు మనల్ని మనం పునరావిష్కరించుకోవడం’ అంటుంది డాలీ. తాము క్రియేట్ చేయాలనుకునేదానికీ, ప్రేక్షకులు ఇష్టపడుతున్న కంటెంట్‌కూ మధ్య కంటెంట్ క్రియేటర్ సమన్వయం సాధించాల్సి ఉంటుంది. మరి డాలీ సంగతి? ‘అనేకసార్లు నిరాశపడిన సందర్భాలు ఉన్నాయి. మొదట్లో... నేను క్రియేట్ చేసేది ప్రేక్షకులకు నచ్చేది కాదు. వారికి నచ్చేది నాకు నచ్చేది కాదు. దీంతో ప్రేక్షకుల అభిరుచికి ప్రాధాన్యత ఇవ్వడం, ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో ఎప్పటికప్పుడు తెలుసుకోవడం మొదలుపెట్టాను’ అంటుంది డాలీ. కంటెంట్ క్రియేటర్లకు ఒత్తిడి అనేది సర్వసాధారణం. ‘ఒత్తిడిని పనిలో భాగంగానే భావించాను. దానినుంచి దూరం జరగడం అనేది కుదిరే పని కాదు. అయితే ఒత్తిడి ప్రభావం కంటెంట్‌పై పడకుండా జాగ్రత్త పడాలి’ అంటుంది డాలీ. ఫ్యాషన్ బ్లాగర్, డిజిటల్ కంటెంట్ క్రియేటర్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లూయెన్సర్గా గుర్తింపు పొందిన డాలీ అమెజాన్ ప్రైమ్ వీడియో వెబ్‌సీరిస్ ‘మోడ్రన్ లవ్ ముంబై’తో నటిగా మంచి మార్కులు తెచ్చుకుంది. ‘నేను విజయం సాధించాను అనుకోవడం కంటే, ఇప్పుడే బయలుదేరాను అనుకుంటాను. అప్పుడే ఫ్రెష్‌గా ఆలోచించడానికి, మరిన్ని విజయాలు సాధించడానికి వీలవుతుంది’ అంటున్న డాలీసింగ్ ఒక షార్ట్‌ఫిల్మ్ కోసం స్క్రిప్ట్రెడీ చేసుకుంటోంది. అందులో తానే నటించనుంది. -
Kara Perez Success Story:ఒకపుడు వెయిట్రెస్.. ఇపుడు కోట్లలో సంపాదిస్తోంది.. ఎలా?
పట్టుదల ఉండాలేగానీ ఏమైనా సాధించవచ్చుఅనేది కారాపెరెజ్ మరోసారి నిరూపించారు.ముఖ్యంగా కష్టాల కొలిమిలో మండిన వారు మరింత శ్రమించి విజయాలు సాధిస్తారు. కారా పెరెజ్అది అలాంటి స్ఫూర్తిదాయకమైన కథే. ఎడ్యుకేషన్ ఫీజు కట్టడానికి అమెరికాలో ఒక హోటల్లో వెయిట్రెస్‌గా పనిచేసింది. ప్రస్తుతం ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ కంపెనీ స్థాపకురాలిగా,మనీ ఎక్స్పర్ట్, స్పీకర్‌గా అందరికి ఆదర్శనీయంగా నిలుస్తోంది. పెరెజ్ అమెరికాలో ఆస్టిన్‌లో వెయిట్రెస్‌గా పని చేస్తూన్నపుడు రూ. 15 లక్షలు (ఇండియన్ కరెన్సీ ప్రకారం) సంపాదించేది. ఈ సంపాదనతో నిజానికి అక్కడ బతకడమే కష్టం. దీనికితోడు రూ.24 లక్షలకు పైగా విద్యార్థి రుణాన్ని చెల్లించాల్సి వచ్చింది. అదే ఆమెను క్రియేటివ్‌గా ఆలోచించేలా చేసింది. 2011లో పట్టభద్రురాలైన ఆమెకు ఎన్ని పార్ట్ టైం జాబ్‌లతో కష్టాలు తీరలేదు. అప్పులు, తక్కువ సంపాదన అనే విష వలయం నుండి బయటపడాలని అంతకుముందే క్రియేట్ చేసుకున్న బ్లాగు వైపు దృష్టి పెట్టింది. రోజుకు 12 గంటలు పనిచేస్తూ ఉద్యమంలాగా దీనిపై పనిచేసింది. అప్పులన్నీ తీర్చేసింది. మొదట్లో తన వ్యక్తిగత ప్రయాణం గురించి బ్లాగింగ్ చేసేది. పబ్లిక్ వర్సెస్ ప్రైవేట్ స్టూడెంట్ లోన్లు గురించి డబ్బు, పొదుపు, గురించి అనేక వ్యాసాలు రాసింది. అలా అనేక సమావేశాలకు స్పీకర్‌గా అవకాశం లభించింది. కాలక్రమంలో మహిళలు ఎక్కువ ఆసక్తి చూపడం గమనించింది. దీంతో ఎక్కువగా మహిళలతోనే ఎక్కువ సమావేశమవుతూ, అప్పులను తగ్గించు కోవడానికి లేదా పెట్టుబడులపై సలహాలు ఇవ్వడం ప్రారంభించింది. క్రమంగా బ్లాగ్ కాస్తా ‘బ్రేవ్లీ గో’ అనే ఫైనాన్షియల్ ఎడ్యుకేషనల్ కంపెనీకి నాంది పలికింది. దీని ద్వారా ప్రతి సంవత్సరం రూ. 1.5 కోట్లు సంపాదిస్తోంది. ముఖ్యంగా మహిళల ఆర్థిక స్వేచ్ఛ, ఆర్థిక విద్య కోసం తాను పనిచేస్తున్నానని, అందుకే తనను తాను ఫైనాన్షియల్ ఫెమినిస్ట్‌గా చెప్పుకుంటుంది. ఈ సంస్థ ద్వారా వర్క్‌షాప్‌లు, కోర్సులు, స్పీకింగ్ ఎంగేజ్మెంట్స్తో మహిళల్లో డబ్బు సంపాదన, పొదుపు లాంటి అలవాట్లను పెంపొందించడంలో శిక్షణ ఇస్తుంది. 34 ఏళ్ల పెరెజ్ ఇపుడు సేల్స్ ద్వారా లక్ష డాలర్లు, సోషల్ మీడియా మేనేజర్, హైస్కూల్ కోచ్ , ఫ్రీలాన్స్ రైటింగ్ వంటి పార్ట్ టైమ్ ఉద్యోగాలతో మరో 27వేల డాలర్లు ఆర్జిస్తోంది. 2017లో, ఆమె స్పాన్సర్షిప్ డీల్స్ ద్వారా డబ్బు సంపాదిస్తోంది. కాగా తన డొమైన్ పేరుకోసం కేవలం 12 డాలర్లు, వెబ్సైట్ హోస్ట్‌లో 50 డాలర్లు, టెక్సాస్‌లో కంపెనీని స్థాపించడానికి 308 డాలర్లు ఖర్చు చేసింది. వెబ్సైట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌పై న్యాయవాదికి 900 డాలర్లు మాత్రమే ఆమె ఖర్చు చేసింది. -
శాంతి నికేతన్‌లో పెరిగిన శ్రేయసి.. అంచెలంచెలుగా ఎదిగి! సొంత లేబుల్‌తో
Sreyashi Raka Das: పశ్చిమబెంగాల్ లోని చిన్న పట్టణానికి చెందిన శ్రేయసి రక దాస్ ఫ్యాషన్ డిజైనర్‌గా అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంటోంది. శ్రేయసి ఫ్యాషన్ ఇనిస్టిట్యూట్‌లో చదువుకోలేదు. శాంతి నికేతన్‌లో పెరిగిన శ్రేయసి ప్రకృతి నుంచే పాఠాలు, ‘వర్ణ’మాల నేర్చుకుంది. ఫ్యాషన్ బ్లాగర్‌గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన శ్రేయసి ఆ ప్రయాణంలో ఎన్నో విషయాలను నేర్చుకుంది. తన ప్రతిభను మెరుగుపరుచుకుంది. శ్రేయసి క్రియేటివ్ ఐడియాలు పెద్ద బ్రాండ్లకు నచ్చి అవకాశం ఇచ్చాయి. ఇక వెనక్కి తిరిగిచూసుకోలేదు.‘ఎస్ఆర్డీ’ లేబుల్‌తో తానే ఒక బ్రాండ్‌గా ఎదిగింది. కొరియన్ యూట్యూబర్ లునా యోగినితో కలిసి చేసిన ప్రాజెక్ట్‌కు మంచి పేరు వచ్చింది. ‘ఎస్ఆర్డీ’ వింటర్ కలెక్షన్‌కు మార్కెట్లో మంచి ఆదరణ దక్కింది. ఇప్పుడు తన దగ్గర ప్రతిభావంతులైన యువబృందం ఉంది. అందరూ కలిసి కొత్తరకం డిజైన్ల గురించి ఎప్పటికప్పుడు చర్చిస్తారు. ‘సమ్‌థింగ్ ఫర్ ఎవ్రీ వన్’ అనేది ఎన్ఆర్డీ అందమైన నినాదం. ‘మనల్ని మనం ప్రేమించుకోగలిగినప్పుడు, ఇతరులలోని ప్రతిభను అభినందించగలిగినప్పుడు అసలుసిసలైన అందం మన కంటికి కనిపిస్తుంది. అప్పుడే అందమైన ఐడియాలు వస్తాయి’ అంటున్న శ్రేయసికి వ్యాపార ప్రయోజనాలు మాత్రమే ప్రాధాన్యత కాదు. 26 సంవత్సరాల శ్రేయసికి సామాజిక స్పృహతో పాటు పర్యావరణ స్పృహ కూడా ఉంది. చదవండి: Sustainable Fashion: చమురుతో కంటే.. పాలిస్టర్‌తో తయారయ్యే ఫాస్ట్ ఫ్యాషన్ వల్లే ఎక్కువ కలుషితం! ఏం చేయాలి? -
వైరల్ వీడియో.. 5 నిమిషాల్లో 3 కేజీల సమోసా తినేశాడు..
న్యూఢిల్లీ: ఆహార పోటీల గురించి చాలా సందర్భాల్లో వినే ఉంటారు. ఆహార పదార్థాలను చెప్పిన సమయంలోపు పూర్తి చేస్తే నగదు బహుమతులు సైతం ఇస్తుంటారు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఇలాంటి ఛాలెంజ్‌లు నిర్వహిస్తూ బహుమతులు ఇస్తున్నారు. అలాంటి.. సంఘటనే తాజాగా వైరల్‌గా మారింది. రాజ్నీశ్ జ్ఞాని అనే వ్యక్తి ‘ఆర్ యూ హంగ్రీ’ అనే పేరుతో ఫేస్బుక్ పేజీ, యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాడు. ఆహార పోటీలకు వెళ్లటం.. ఇచ్చిన ఛాలేంజ్‌ను పూర్తి చేసి నగదు గెలుచుకోవటమే పనిగా పెట్టుకున్నాడు. గత నెలలో 30 నిమిషాల్లోనే 21 ప్లేట్ల ‘చోలే కుల్తే’ తిని వైరల్‌గా మారాడు. ఆ ఛాలేంజ్ పూర్తి చేయటం ద్వారా బులెట్ బైక్ గెలుచుకున్నాడు. అయితే, ఆ బైక్‌ను తిరిగి ఇచ్చేసి ఛాలెంజ్‌ను కొనసాగించాలని సూచించాడు. ఆ వీడియోను ఫేస్బుక్లో 12 మిలియన్ల మంది చూశారు. ఇప్పుడు మరోమారు ఈ బ్లాగర్ వీడియో వైరల్‌గా మారింది. స్ట్రీట్ ఫుడ్ ఛాలేంజ్‌లో పాల్గొని కేవలం 5 నిమిషాల్లోనే 3 కిలోల సమోసా లాగించేశాడు. ఢిల్లీలోని ఓ హోటల్లో జరిగిన ఈ సంఘటన వీడియో యూట్యూబ్‌లో షేర్ చేయగా 1 మిలియన్‌కుపైగా వ్యూస్ వచ్చాయి. వీడియోలో.. ఛాలెంజ్‌ను బ్లాగర్‌తో పాటు రెస్టారెంట్ ఓనర్ వివరించారు. ఆ తర్వాత బాహుబలి సమోసాను తింటున్న వీడియోను ప్లే చేశారు. అయితే, ఇలాంటి ఛాలెంజ్‌లు స్వీకరించేందుకు ముందు 1-2 రెండు రోజులు ఏమీ తినకుండా ఉంటాడు. కొంచెం చట్నీ, నీళ్లతో స్నేహితుల ప్రోత్సాహంతో ఈ ఛాలెంజ్‌ను పూర్తి చేశాడు బ్లాగర్. అందుకు గానూ రెస్టారెంట్ ఓనర్ వద్ద రూ.11వేల నగదు బహుమతి అందుకున్నాడు. ఇదీ చదవండి: Bahubali Samosa Challenge: తిన్నారంటే రూ. 51,000 మీవే.. కానీ ఒక్క షరతు! -
గులాబ్ జామూన్ సమోసా రెసిపీ ట్రై చేసే ధైర్యం ఉందా మీకు?
సాక్షి, హైదరాబాద్: వంటల్లో రకారకాల కాంబినేషన్లు, ప్రయోగాలు చాలామందికి తెలుసు. దాదాపు చాలావరకు ఇలాంటి మిక్స్డ్ రెసిపీస్, వినూత్నమైన వంటకాలు బాగానే క్లిక్అవుతాయి. కానీ ఒక్కోసారి మాత్రం దారుణంగా బెడిసి కొడతాయి. తాజాగా గులాబ్ జామూన్ సమోసా వంటకం నెట్టింట నవ్వులు పూయిస్తోంది. కమెంట్లు, లైక్‌లతో ఈ వీడియో ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. (Salman Khan Birthday: జెనీలియా, సల్మాన్ డ్యాన్సింగ్ వీడియో వైరల్) అభిషేక్ అనే ఫుడ్ బ్లాగర్ వెరైటీగా సమోసా విత్గులాబ్ జామూన్ ట్రైస్ చేశాడు. ఢిల్లీలోని రోడ్డు పక్కన తినుబండారాలు అమ్మే ఒక దుకాణం వద్ద గులాబ్ జామూన్ సమోసాను తయారు చేయించాడు. అయితే గులాబ్ జామూన్ సమోసా టేస్ట్ చేసిన అభిషేక్ ఫీలింగ్స్ చూసి నెటిజన్లు పడీ పడీ నవ్వుతున్నారు.‘‘కనీసం ట్రై కూడా చేయొద్దు.. అతని కోతి మొఖం చూస్తే అర్థం కావడం లేదా. దాని టేస్ట్ ఎలా ఉందో’’ అని ఒకరు, నీ కరేజ్కి హేట్సాఫ్ భయ్యా అని మరొకరు ‘‘చండాలంగా ఉంది’’ అని ఇంకో యూజర్ కమెంట్ చేశారు. గత వారం అప్లోడ్ చేసిన వీడియోకు వ్యూస్ ఇప్పటికే 2 మిలియన్లు దాటేసాయి. View this post on Instagram A post shared by KOMAL || ABHISHEK (@thefoodiehat) -
వయస్సు ఏడాదే..సంపాదన ఎంతో తెలిస్తే ముక్కున వేసుకోవాల్సిందే
న్యూయార్క్: ఏడాది వయస్సున్న బుడి బుడి అడుగుల బుబ్జాయి..ముసిముసి నవ్వుల పాపాయి ఏం చేస్తుంది. అమ్ము ఒడిలో సేదతీరుతుంది. కానీ ఈ బుడ్డోడు మాత్రం అలా కాదు. టూరిస్ట్ ప్రాంతాల్ని చుట్టేస్తూ .. సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్లకు పోటీ పోటీగా డబ్బులు సంపాదిస్తున్నాడు. అమెరికాలోని ఇడహో ఫాల్స్ కు చెందిన జెస్, స్టీవ్ దంపతులు. ఈ ఇద్దరు దంపతులకు బ్రిగ్స్ డారింగ్టన్ జన్మించాడు. అయితే తల్లి జెస్ గర్భవతిగా ఉన్నప్పుడు కొంతకాలం ఉపాధి కోల్పోవాల్సి వస్తుందని ఆందోళనకు గురైంది. అదే సమయంలో ఆమెకు మెరుపులాంటి ఐడియా వచ్చింది. అదే బేబీ ఇన్ఫ్లూయెన్సర్. పుట్టబోయే పిల్లల్ని సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ని చేయాలని. వెంటనే బేబీ ఇన్ ఫ్లూయెన్సర్లు ఎవరైనా ఉన్నారా అని సోషల్ మీడియాను జల్లెడ పట్టింది. కానీ ఎవరూ లేరు. అందుకే తనకు పుట్టిన బ్రిగ్స్‌ను సోషల్ మీడియా ఇన్ ఫ్ల్యూయెన్సర్గా మార్చేసింది. టూరిస్ట్ ప్రాంతాలకు బ్రిగ్స్‌ను తీసుకెళ్లి తిప్పి చూపించేది. ఇలా అమెరికాలో 16 రాష్ట్రాల్లోని పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లింది. ఆ పర్యాటక ప్రాంతాలకు వచ్చే సమయంలో పిల్లల గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?ఎలాంటి ఫుడ్ దొరకుతుందో వివరించేంది. అందుకు టూరిజం సంస్థలు బ్రిగ్స్ తల్లిదండ్రులతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. తమ సంస్థ తరుపు ప్రచారం చేసినందుకు పెద్ద మొత్తంలో డబ్బులు చెలిస్తున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో 34,000 మంది ఫాలోవర్స్ సోషల్ మీడియా ఇన్ ఫ్ల్యూయెన్సర్గా ఉన్న బ్రిగ్స్‌కు సైతం నెలకు 1000 డాలర్ల(ఇండియన్ కరెన్సీలో రూ. 75 వేలు) స్పాన్సర్ అందిస్తున్నాయి. వీటితో పాటు బ్రిగ్స్‌కి అవసరమైన డైపర్స్, వైప్స్ లాంటివి కూడా ఉచితంగానే వస్తున్నాయి. -
‘269 రోజులైంది.. నా భార్యను చూడనివ్వరా?’
తన భార్యను నుంచి తనను విడదీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, భారత దేశంలోకి తనను అడుగుపెట్టనివ్వడం లేదని పాపులర్ యూట్యూబర్ కర్ల్ రాక్ ఆరోపిస్తున్నాడు. కనీసం తనకు వివరణ కూడా ఇవ్వట్లేదంటూ ఇండియన్ గవర్నమెంట్ పై ఆరోపణలు గుప్పిస్తూ తాజాగా యూట్యూబ్ ఛానెల్లో ఓ వీడియో పోస్ట్ చేశాడు. అయితే కార్ల్ రాక్‌ను బ్లాక్ లిస్ట్‌లో చేర్చిన కారణం ఇంతకాలం వెల్లడించకుండా వస్తున్న కేంద్ర హోం శాఖ.. తాజాగా దానిపై వివరణ ఇచ్చుకుంది. న్యూఢిల్లీ: న్యూజిల్యాండ్‌కు చెందిన కార్ల్ ఎడ్వర్డ్రైస్.. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇతనికి భారీగా మద్ధతు లభిస్తోంది. ‘కర్ల్ రాక్’ పేరుతో యూట్యూబర్‌గా పాపులర్ అయిన కార్ల్.. ట్రావెల్ సేఫ్టీ, వివిధ ప్రాంతాల్లో కల్చర్, వేరేదేశాల్లో ఫారినర్లకు ఎదురయ్యే మోసాల మీద వీడియోలు తీస్తుంటాడు. ప్రస్తుతం అతని ఛానెల్‌కు 1.8 మిలియన్ సబ్స్క్రయిబర్లు ఉన్నారు. 2019లో భారత్‌కు చెందిన మనీషా మాలిక్‌కు పెండ్లి చేసుకున్నాడు. అయితే కిందటి ఏడాది అక్టోబర్ నుంచి అతన్ని భారత్‌లో అడుగుపెట్టనివ్వడం లేదు. ఈ విషయంపై భారత్‌ను నిలదీయడంతో పాటు న్యూజిలాండ్ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తూ వస్తున్నాడు. కనీసం స్పందించరా? 2020 అక్టోబర్‌లో దుబాయ్, పాకిస్థాన్‌లో అతను పర్యటించాడు. ఆ టైంలో న్యూఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి అతను బయలుదేరగానే.. అతన్ని భారత ప్రభుత్వం బ్లాక్ లిస్ట్‌లో తనపేరు చేర్చిందన్నది అతని వాదన. ‘269 రోజుల నుంచి నా భార్యను చూడనివ్వడం లేదు. భారత ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోంది. కనీసం కారణాలైనా చెప్పమని ఎన్ని మెయిల్స్ పంపినా బదులు లేదు. నా భార్య, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా బదులు ఇవ్వడం లేద’ని వీడియోలో వాపోయాడు అతను. అంతేకాదు ట్విటర్లో న్యూజిలాండ్ పీఎం జెస్సిండాను సైతం ట్యాగ్ చేశాడు. ప్రస్తుతం కర్ల్కు సపోర్ట్‌గా సైన్ పిటిషన్ కూడా నడుస్తోంది. ఈ కోణాలు కూడా! అయితే సీఏఏ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్నందువల్లే అతనికి ఇలా జరుగుతోందని కొందరు మద్ధతుదారులు అంటున్నాడు. అంతేకాదు గతంలో అతను పాక్‌లో కొన్ని నెలలు గడిపాడు కూడా. అటుపై పాక్ అక్రమిత కశ్మీర్‌తో పాటు సైనిక శిబిరాలను సైతం సందర్శించాడు. ఈ నేపథ్యంలోనే అనుమానాల నడుమ భారత ప్రభుత్వం అతన్ని అడ్డుకుంటోందని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాక్ ఇంటెలిజెన్సీ ఏజెన్సీ ఐఎస్ఐ తనను గమనిస్తోందని అప్పట్లో అతను తీసిన వీడియోను సైతం పోస్ట్ చేస్తున్నారు. #Exclusive | ‘India is a secular country and it shouldn’t have any laws which talk about religion’, says Karl Rock on anti-CAA protests. Watch TIMES NOW’s Mohit Sharma speaking exclusively with YouTuber (@YouTube) @iamkarlrock. pic.twitter.com/RVtx6YWwI6 — TIMES NOW (@TimesNow) December 19, 2019 ఆరోపణలపై స్పందించిన కేంద్రం అయితే కర్ల్ రాక్ విషయంలో వినిపిస్తున్న వాదనలను, ఆరోపణలను కేంద్రం ఖండించింది. వీసా నిబంధనల, షరతులు ఉల్లంఘించిన నేరానికే అతన్ని బ్లాక్ లిస్ట్‌లో చేర్చినట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. టూరిస్ట్ వీసా మీద వచ్చిన అతను.. వ్యాపారాల్లో భాగం అయ్యాడని, ఇది వీసా కండిషన్స్‌ను ఉల్లంఘించడమే అవుతుందని, వచ్చే ఏడాది వరకు అతన్ని దేశంలోకి అనుమతించే ప్రసక్తే ఉండదని స్పష్టం చేసింది. కాగా, కరోనా టైంలో ఢిల్లీ ప్లాస్మా బ్యాంకులో రెండుసార్లు రక్తదానం చేసి సీఎం కేజ్రీవాల్ నుంచి అభినందనలు కూడా అందుకున్నాడు కర్ల్ రాక్. -
కుకింగ్ క్వీన్ .. 50 ఏళ్ల వయసులో ఫుడ్ బ్లాగ్..
పిల్లల చదువులు పూర్తయ్యి ఉద్యోగాల్లో స్థిరపడగానే పెళ్లి చేసి కోడళ్లకు కిచెన్ బాధ్యత లు అప్పజెప్పి మనవళ్లు మనవరాండ్రతో ఆడుకోవాలనుకుంటారు మన భారతీయ సంప్రదాయ మహిళలు. కానీ నిషా మధులిక మాత్రం అలా అనుకోలేదు. జీవితంలో తనకు దొరికిన ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకున్నారు. 50 ఏళ్ల వయసులో ఫుడ్ బ్లాగ్‌ను ప్రారంభించి కోట్లమంది అభిమానుల్ని సంపాదించారు. దాంతో ఆమె సోషల్ మీడియా స్టార్‌గానే గాక ..‘‘పాపులర్ ఇండియన్ వెజిటేరియన్, యూట్యూబ్ చెఫ్, రెస్టారెంట్ కన్సల్టెంట్, ఫుడ్ బ్లాగర్, టెలివిజన్ పర్సనాలిటీ’’ వంటి అనేక సెలబ్రిటీ హోదాలను సొంతం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లో పుట్టి పెరిగిన నిషాకి ఢిల్లీకి చెందిన ఎంఎస్ గుప్తాతో వివాహం జరిగింది. ఢిల్లీకి వచ్చేసిన నిషాకు ఇద్దరు పిల్లలు. వాళ్ల పెంపకంలోనూ, మరోపక్క భర్త వ్యాపారంలో సాయం చేస్తూ బిజీగా ఉండేవారు. పిల్లలు చదువులు పూరై తమ ఉద్యోగాలతో బిజీ అయిపోయారు. దీంతో అప్పటిదాకా తీరిక లేకుండా గడిపిన నిషాకి ఒక్కసారిగా తీరిక ఏర్పడడంతో తనని తాను బిజీగా ఉంచుకునేందుకు ఏదైనా చేయాలనుకున్నారు. ఈ క్రమంలో తన కొడుకు బ్లాగ్‌కు రాస్తుండడం చూసి.. తనకు బాగా అనుభవమున్న కుకింగ్‌ను బ్లాగ్స్లో రాయాలనుకున్నారు. కొడుకు సాయంతో.. భర్త, కొడుకు సాయంతో.. నిషా 2007లో కుకింగ్ బ్లాగ్‌ను ప్రారంభించి దానిలో వంటల తయారీ గురించి రాసేవారు. తర్వాత తనే సొంత వెబ్సైట్ https:/nishamadhulika.com లో తన తల్లి దగ్గర నేర్చుకున్న విభిన్న వంటకాలు వండుతూ అవి ఎలా వండాలో రాసి పోస్టులు పెట్టేవారు. నిషా వంటలను ఇష్టపడిన అభిమానులు ‘‘వీడియోలు పెట్టండి మేడం’’ అని అడగడంతో.. వీడియోలు కూడా అప్లోడ్ చేయడం మొదలు పెట్టారు. అప్పటినుంచి ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇప్పటిదాకా 1300 కుపైగా వంటల వీడియోలను అప్లోడ్ చేశారు. సిసలైన శాకాహార వంటలు మధులిక కుటుంబం 2009 లో నోయిడాకు మకాం మార్చింది. అప్పుడే ఆమె సొంత యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు. శాకాహార వంటకాలకు ప్రాధాన్యత నిచ్చిన నిషా ఉల్లి, వెల్లుల్లి లేని వంటకాల వీడియోలు పోస్టు చేసేవారు. ఈ వీడియోలు మిలియన్ల మందిని ఆకర్షించేవి. ప్రస్తుతం నిషా ఛానల్ సబ్స్క్రైబర్స్ కోటీ పదిహేను లక్షలకు పైనే ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా వేలమంది ఆమెను ఫాలో అవుతున్నారు. ఐదుగురితో టీం .. యూ ట్యూబ్ వీడియోల ద్వారా ఆదాయం వస్తుండడంతో.. మంచి కిచెన్‌ను సెటప్ చేసి, ఐదుగురితో టీమ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఈ టీమ్ రెండుమూడు వంటల వీడియోలు తీసి.. తరువాత ఛానల్లో అప్లోడ్ అయిన వంటకాలకు వచ్చే కామెంట్లు, అభిప్రాయాలను సమీక్షిస్తూ లోపాలను ఎలా సరిదిద్దాలో చూసుకునేది. టాప్‌టెన్ బెస్ట్ యూ ట్యూబర్.. మొదట్లో బ్లాగ్స్, వీడియోలు చేయడం ప్రారంభించినప్పుడు ఇది వ్యాపారంగా చూడని నిషా.. తనకు తెలిసిన అనేక వంటకాలను హిందీలో అప్లోడ్ చేసేవారు. తరువాత ఆస్ట్రేలియా, ఆఫ్రికాలలో ఉన్న తన ఫాలోవర్స్ తమ భాషల్లో వీడియోలు అప్లోడ్ చేయమని అడగగా వాళ్ల భాషల్లో వంటల వీడియోలు, సబ్‌టైటిల్స్‌తో పోస్టు చేసేవారు. అంతేగాక పలు వెబ్సైట్లకు వంటల ఆర్టికల్స్ రాసిచ్చేవారు. దీంతో సబ్స్క్రైబర్స్తోపాటు, ఆదాయం పెరిగింది. ఈ క్రమంలో ఆమె 2014లో యూట్యూబ్ చెఫ్స్ టైటిల్, 2017లో టాప్ యూట్యూబ్ కుకింగ్ కంటెంట్ క్రియేటర్ అవార్డులు అందుకున్నారు. ఇండియన్ టాప్‌టెన్ బెస్ట్ యూ ట్యూబ్ స్టార్స్ జాబితాలో.. రెండుసార్లు నిషా స్థానం దక్కించుకున్నారు. అంతేగాక ప్రముఖ మ్యాగజీన్లు బ్లూమ్‌బర్గ్, ఎకనామిస్ట్, ఇండియా టుడే వంటివి ఆమె సక్సెస్ స్టోరీని ప్రచురిస్తూ ‘కుకింగ్ క్వీన్’గా అభివర్ణించాయి. లోక్‌సభ టీవీ ఆమె ఇంటర్వ్యూనూ టెలికాస్ట్ చేయడం విశేషం. -
Komal Pandey: మిడిల్ క్లాస్ నుంచి ఫ్యాషన్ స్టార్‌గా..
సోషల్ మీడియా వేదికగా నేటి యువతరం తమలోని ప్రతిభాపాటవాలను ప్రదర్శిస్తూ సోషల్ స్టార్లుగా ఎదుగుతూ.. ఎందరికో ప్రేరణగా నిలుస్తున్నారు. కొందరు మాత్రం ఇలా మెరిసి అలా వెళ్లిపోతుంటారు. కానీ, ఇండియన్ యూట్యూబర్, ఫ్యాషన్ బ్లాగర్, మోడల్, స్టైలిస్ట్, కంటెంట్ క్రియేటర్ ఫ్యాషన్ క్వీన్, ఇన్స్టాగ్రామ్ సెన్సేషన్ ‘కోమల్ పాండే’ ఆరేళ్లుగా సోషల్ స్టార్‌గా నిలుస్తూ సంచలనం సృష్టిస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఫ్యాషనబుల్‌గా ఎలా ఉండాలో వివరిస్తూ... రీయూజబుల్ ఫ్యాషన్‌ను పరిచయం చేస్తూ డిజిటల్ వరల్డ్‌ను ఉర్రూతలూగిస్తోంది. ఢిల్లీకి చెందిన 26 ఏళ్ల కోమల్ పాండే 1994లో మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది. బి.కామ్ చేసిన కోమల్‌కు చిన్నప్పటినుంచి ఫ్యాషనబుల్‌గా ఉండడమంటే ఎంతో ఇష్టం. దీంతో రోజుకోరకంగా తయారై కాలేజీకి వెళ్లేది. ఆమెను చూసిన ఫ్రెండ్స్ ‘నువ్వు చాలా స్టైలిష్‌గా ఉన్నావు! మోడలింగ్ ట్రై చేయెచ్చు కదా!’ అనేవారు. అయితే ఆ సమయంలో .. బాయ్‌ఫ్రెండ్ తో ప్రేమలో ఉన్న కోమల్... వాళ్ల మాటలు అంతగా పట్టించుకోలేదు. అలా నాలుగేళ్లు గడిచిన తరువాత బాయ్ ఫ్రెండ్ బ్రేకప్ చెప్పడంతో ఒక్కసారిగా తన జీవితం మారిపోయింది. లుక్ ఆఫ్ ది డే.. లవ్ బ్రేకప్ను మర్చిపోవడానికి తనకెంతో ఇష్టమైన ఫ్యాషన్ రంగంలోకి తనదైన శైలిలో అడుగులు వేసింది. 2015లో ‘లుక్ ఆఫ్ ది డే’ పేరిట తన ఫ్యాషన్ కెరీర్ ను ప్రారంభించింది. రోజుకోరకంగా తయారై ఇన్ స్టాగ్రామ్‌లో ఫోటోలు పెట్టేది. కోమల్ ఫ్యాషన్ బుల్ ఫోటోలు.. ఇన్‌స్టా ఫాలోవర్స్‌కు నచ్చడంతో ఫాలోవర్స్ సంఖ్య పదివేల నుంచి 50 వేలకు చేరింది. ఈ ప్రోత్సాహంతో కోమల్ ‘‘ది కాలేజీ కోచర్’’ పేరిట బ్లాగ్‌ను ప్రారంభించింది. దీనిలో తక్కువ ఖర్చుతో ఫ్యాషన్, పాకెట్ ఫ్రెండ్లీ స్టైల్, బ్యూటీ, లుక్ బుక్స్, లేటెస్ట్ ట్రెండ్స్‌పై వీడియోలు పోస్టు చేసేది. ఉద్యోగం వదిలేసి.. 2015 నవంబర్‌లో కోమల్ బ్లాగ్‌ను గుర్తించిన ‘పాప్‌క్సో’ చానెల్ కోమల్‌కు పిలిచి మరీ ఉద్యోగం ఇచ్చింది. పాప్క్సోలో చేరిన ఏడాదిన్నరలోనే 400 వీడియోలు చేసి కోమల్ మరింత ఫేమస్ అయ్యింది. అప్పుడే కోమల్‌కు ఓ ఆలోచన వచ్చింది. ‘‘నాలో ఇంత టాలెంటు దాగుందా? అయితే నేను ఎందుకు ఒకరి దగ్గర పనిచేయాలి? నా ప్రతిభను నమ్ముకుంటే నేనే బాస్‌గా ఎదుగుతాను!’’ అనుకోని వెంటనే పాప్క్సోలో ఉద్యోగం మానేసింది. అ తరువాత 2017లో తన సొంత యూట్యూబ్ చానల్‌ను ప్రారంభించింది. యూట్యూబ్ చానల్ల్లో రోజూ రకరకాల ఫ్యాషన్ లపై వీడియోలు రూపొందించి పోస్టుచేసింది.. వాటికి మంచి స్పందన రావడంతో ఫాలోవర్స్ సంఖ్య పెరిగింది. దీంతో ఆదాయం లక్షల్లో వస్తోంది. 2015 నుంచి ఇప్పటిదాకా సోషల్ మీడియా స్టార్‌గా తన స్థానాన్ని నిలబెట్టుకుంటూ.. మరోపక్క హనర్, వివో, గార్నియర్, మెబ్లిన్ వంటి ప్రముఖ బ్రాండ్ల ప్రకటనల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘‘నేను చిన్నప్పటి నుంచి స్టైలిష్‌గా, ఫ్యాషనబుల్‌గా ఉండేందుకు ఇష్టపడేదాన్ని. ఆ ఇష్టమే ఈరోజు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. చాలామంది ఫ్యాషన్ అంటే ధనవంతులకే సొంతమనుకుంటారు. అది నిజం కాదు. నేను మధ్యతరగతి కుటుంబం నుంచి ఫ్యాషన్ స్టార్‌గా ఎదిగాను. ఫ్యాషన్‌గా ఉండాలంటే రోజూ కొత్తగా, ట్రెండీగా ఉండేలా ప్రయత్నించాలి. అయితే మీ ఫ్యాషన్ చాలా సింపుల్‌గానూ, సౌకర్యంగానూ ఉండేలా చూసుకోవాలి’’ అని కోమల్ చెప్పింది. -
అసలు నా మరో పేరు ఆనంద విహారి
కేరళకు చెందిన నిధి కురియన్ ప్రస్తుతం కోల్‌కతాలో ఉంది. ఆమె తమిళనాడులో పొలంగట్లన నిలబడింది. ఆంధ్రాలో చేపల చెరువులను చూసింది. ‘ఈ దేశం స్త్రీలకు ఎంత భద్రత ఇవ్వగలదో తెలుసుకోవాలి’ అని ఒంటరిగా సొంత కారులో సొంత డ్రైవింగ్ చేసుకుంటూ దేశాటనకు బయలుదేరింది. అర్ధరాత్రి తర్వాత సంగతి పట్టపగలు తిరగడమే స్త్రీకి కష్టం అని చెప్పే ఈ దేశంలో ఇష్టమైన విహారం మనమూ చేయొచ్చు అని తన అనుభవాలను రికార్డు చేస్తోంది నిధి. 33 ఏళ్ల నిధి కురియన్ రాయబోయే పుస్తకం కచ్చితంగా బాగుండే అవకాశం ఉంది. ఎందుకంటే ఆమె ఎంచుకున్న వస్తువు అలాంటిది. ‘ఈ దేశమూ... ఈ దేశ స్త్రీలూ’... ఈ దేశంలో స్త్రీలు ఎలా ఉన్నారో తను తెలుసుకోదలిచింది. అయితే అందుకు కంప్యూటర్ ఎదురుగా కూచుని గూగుల్ చేయలేదు. కారు తీసుకొని బయలుదేరింది. దానికి ‘ది గ్రేట్ ఇండియన్ సోలో ట్రిప్’ అని పేరు పెట్టింది. సోలో ట్రిప్ నిధి కురియన్‌ది కొట్టాయం. కొచ్చిలో నివసిస్తోంది. ట్రావెల్‌కు సంబంధించిన బ్లాగ్ ద్వారా కొత్త కొత్త ప్రాంతాల గురించి తెలియచేస్తూ ఉంటుంది. అయితే ఈ చిన్న చిన్న యాత్రల కంటే ఒక భారీ యాత్ర చేయాలని నిశ్చయించుకుంది. దేశం మొత్తం తిరుగుతూ ఆ దేశంలోని ప్రదేశాలలో స్త్రీలు ఎలా ఉన్నారో ఎలా జీవిస్తున్నారో నలుగురితో పంచుకోవాలనుకుంది. పుస్తకం రాయాలనుకుంది. అనేక ఆలోచనల తర్వాత 100 రోజుల్లో 25 వేల కిలోమీటర్లు సొంత కారులో సోలో ట్రిప్ చేయాలనుకుంది. తనకు రెనాల్ట్ కారు ఉంది. ఆ కారులో ఫిబ్రవరి 7, 2021న బయలుదేరింది. తమిళనాడు మీదుగా కొచ్చి నుంచి బయలుదేరిన నిధి తమిళనాడు పాండిచ్చేరి మీదుగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశించి విశాఖ మీదుగా ఒరిస్సా చేరుకుని ‘పూరి’ దర్శించుకుని ప్రస్తుతం కోల్‌కతా చేరుకుంది. ‘తమిళనాడు పంటపొలాల్లో స్త్రీలను కలిశాను. విశాఖలో చేపల మీద ఆధారపడి జీవించే స్త్రీల కష్టాన్ని చూశాను. ఒరిస్సా ఆవాల చేలలో స్త్రీలు పిలిచి తాము తెచ్చుకున్న ఆహారంలో పెట్టింది తిన్నాను. ఒరిస్సాలోనే ఒక ఊరు ఊరు హస్తకళలు చేయడంలో నిమగ్నం కావడం గమనించాను. స్త్రీలే ఎక్కువగా ఈ కళాఖండాలు చేస్తున్నారు. వారే కుటుంబానికి ఆధారం’ అని చెప్పిందామె. పూరిలో ప్రసాదాలు తయారు చేసి పంచే స్త్రీలతో ఆమె సంభాషించింది. ప్రస్తుతం కోల్‌కతా దారుల్లో అనంతంగా కనిపించే స్త్రీలలో తాను ఒక స్త్రీగా తిరుగుతోంది. ఆ స్త్రీల ప్రతిధ్వని ఏదో ఉంటుంది. ఆ ప్రతిధ్వనిని ఆమె తన పుస్తకంలో రాస్తుంది. టూర్ కాదు ట్రావెల్... టూర్ చేయడం అంటే ఏవో ముఖ్య ప్రదేశాలను చూడటం... ట్రావెల్ చేయడం అంటే జన జీవనంలో భాగమై కలిసి తిరుగుతూ ఆ ప్రదేశాలను అనుభూతి చెందడం అంటుంది నిధి. ‘ఈ ప్రయాణం ఒక ధ్యానం కంటే తక్కువ కాదు నాకు’ అంటుందామె. కొత్త ప్రదేశాలను చూడటం వల్ల మనం లోకాన్ని తెలుసుకుంటాము. స్త్రీలు ప్రయాణాలు చేయాలి. ఒంటరిగా ప్రయాణం చేస్తే మనం మరింత జాగ్రత్తగా ఉండటం నేర్చుకుంటాం... అంతే కాదు, మన అనుభవాలు మిగిలిన స్త్రీలతో చెప్పగలుగుతాం అంటుందామె. ప్రస్తుతం నిధి తెల్లవారుజామునే తన ప్రయాణం మొదలుపెట్టి సాయంత్రానికి ఆ రోజుకు నిర్దేశించిన గమ్యానికి చేరుకుంటుంది. ఎక్కువగా యూత్ హాస్టల్స్‌లో దిగుతోంది. లేదంటే ముందే బుక్ చేసుకున్న హోటళ్లలో. అయితే ఆమె తన డిక్కీలో ఒక చిన్న సిలిండర్, వంట సామాగ్రి కూడా పెట్టుకుంది. ‘నేను తినడానికి ఈ దేశ యాత్ర చేయడం లేదు. ఏదో అవసరమైనది వండుకుంటా. లేదంటే స్ట్రీట్‌ఫుడ్ తింటా’ అని చెబుతోంది నిధి. ఆమె తన ప్రయాణాన్ని ఎప్పటికప్పుడు ఫేస్బుక్లో అప్డేట్ చేస్తోంది. ‘నీ ప్రయాణాన్ని నీతోపాటు మేమూ చేస్తున్నాం’ అంటున్నారు ఆమె ఫాలోయెర్స్. నిధి ఇప్పుడు కోల్‌కతా నుంచి ఉత్తర భారతదేశంలోకి వెళ్లనుంది. పంజాబ్, కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ల మీదుగా ప్రయాణిస్తూ దేశం తిరుగుతుంది. ఆమె యాత్ర కన్యాకుమారిలో ముగుస్తుంది. నిధిలా తిరిగే అదృష్టం అందరికీ లేకపోవచ్చు. కాని ఆమె యాత్ర సేఫ్‌గా సఫలం అవ్వాలనుకునే హృదయం మనందరికీ ఉందిగా. – సాక్షి ఫ్యామిలీ -
రెహ్మాన్ మాలిక్ నాపై అత్యాచారం చేశారు..
-
'రెహ్మాన్ మాలిక్ నాపై అత్యాచారం చేశారు'
ఇస్లామాబాద్: అమెరికా బ్లాగర్ సింథియా డి రిచీ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) సీనియర్ లీడర్, మాజీ విదేశాంగ మంత్రి రెహ్మాన్ మాలిక్‌పై సంచలన ఆరోపణలు చేశారు. 2011లో ఆయన పాకిస్తాన్ విదేశాంగ మంత్రిగా ఉండగా తనకు మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేశారని సింథియా పేర్కొన్నారు. ఇస్లామాబాద్‌లోని అధ్యక్ష భవనంలో మాజీ ప్రధాని యూసఫ్ రజా గిలానీ, మాజీ ఆరోగ్య మంత్రి మఖ్దూమ్ షాహబుద్దీన్ కూడా తనను శారీరకంగా వేధించారని ఆమె ఆరోపించారు. కాగా ఈ ఘటన సమయంలో అసిఫ్ అలీ జర్దారీ పాకిస్తాన్ అధ్యక్షుడిగా ఉన్నట్లు సింథియా పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం రోజున ఆమె తన ఫేస్బుక్ పేజీ లైవ్ ద్వారా మాట్లాడుతూ.. ఈ ముగ్గురి వ్యవహారాలకు సంబంధించి తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని వచ్చే వారంలో వాటన్నింటినీ విడుదల చేస్తానని హామీ ఇచ్చారు. కాగా.. మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో, మాజీ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీతో వైవాహిక జీవితంపై సింథియా డి రిచీ అవమానకర వ్యాఖ్యలు చేశారంటూ సింథియాపై గత వారం ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్ఐఏ) సైబర్ క్రైమ్ విభాగానికి పీపీపీ షెషావర్ జిల్లా అధ్యక్షుడు జుల్ఫికర్ ఆప్ఘానీ ఫిర్యాదు చేశారు. సింథియా గత వారం బెనజీర్ భుట్టో గురించి 'ఇన్‌డీసెంట్ కరస్పాండెంట్ సీక్రెట్ సెక్స్ లైఫ్ ఆప్ బెనజీర్ భుట్టో’ పుస్తకంలోని కొన్ని భాగాలను ట్విటర్లో పోస్ట్ చేశారు. పుస్తకంలో బెనజీర్ భుట్టో, ఆమె కుమారుడు బిలావల్ భుట్టో, పార్టీ సీనియర్ నేత షెర్రీ రెహమాన్ గురించి వివరంగా రాశారు. చదవండి: డీ గ్యాంగ్ బాస్‌కు కరోనా? పీపీపీ నేతలు మద్యం తాగుతూ, మహిళలతో డ్యాన్స్ వేస్తూ.. మోసం చేస్తారని సింథియా పునరుద్ఘాటించారు. సింథియా ఆరోపణల ప్రకారం.. బెనజీర్ భుట్టో మహిళలపై అత్యాచారాలు చేసేవారు అంటూ దివంగత రాజకీయ నాయకుల లైంగిక జీవితం గురించి ఆమె కొన్ని అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు. ఒక బొమ్మల దుకాణం యొక్క రశీదును కూడా పోస్ట్ చేస్తూ సెక్స్ బొమ్మల వ్యాపారానికి సహాయం చేయడానికి తన రాజకీయ ప్రభావాన్ని ఉపయోగించారనే ఆరోపణలను ఖండించమని పీపీపీ సీనియర్ నాయకుడు షెర్రీ రెహ్మాన్‌కు సవాల్ చేయడం గమనార్హం. చదవండి: జార్జియాలో కూలిన విమానం; ఐదుగురు మృతి ఎవరీ సింథియా డి. రిచీ..? సింథియా నేపథ్యంపై పూర్తిగా ఆధారాలు లేవు. అయితే ఆమె 2009లో మొదటిసారిగా పాకిస్తాన్‌కు పర్యాటకురాలిగా వచ్చారు. తర్వాతి కాలంలో పాకిస్తాన్ ప్రధాని యూసఫ్ రజా గిలానీ, విదేశాంగ మంత్రి రెహ్మాన్ మాలిక్‌లతో సన్నిహిత సంబంధాలను కొనసాగించారు. పీపీపీ కమ్యూనికేషన్ కన్సల్టెంట్‌గా పనిచేశారు. ఈమె ఉర్దూ, పంజాబీ భాషలు మాట్లాడతారు. ప్రస్తుతం ఇస్లామాబాద్‌లో నివసిస్తూ.. ఫ్రీలాన్స్ ఫిల్మ్ మేకర్, రచయిత, కాలమిస్ట్‌గా పనిచేస్తున్నారు. ఈ మధ్య పీపీపీ అధికారానికి దూరం కావడంతో ఇమ్రాన్ ఖాన్ శిబిరంలోకి వెళ్లిన సింథియా పీపీపీ నాయకులపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. -
కార్టూనిస్ట్, ఫుడ్ బ్లాగర్ ఆత్మహత్య
మంగళూరు: ప్రముఖ కార్టూనిస్ట్, ప్రముఖ పాపులర్ ఫుడ్ బ్లాగర్ నిఖిల్ పాయ్ (29) విషం తీసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ‘ది త్రి హంగ్రీ మెన్’ అనే ఫుడ్ బ్లాగ్‌తో పాపులర్ అయిన నిఖిల్ ఆత్మహత్య ఫుడ్ లవర్స్‌ను, వ్యాపార వర్గాలను విస్మయపర్చింది. వ్యక్తిగత కారణాల రీత్యా ఆయన ఆత్మహత్యకు పాల్పడి వుంటారని భావిస్తున్నారు. తల్లితో గొడవ పడిన నిఖిల్ బయటకు వెళ్లారు. ఆయన తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆయన కుటుంబం మిస్సింగ్ కేసు నమోదు చేశారు. మంగుళూరు మలెమార్నగరంలోని ఆయన నివాసంలో మృతదేహాన్నిఆదివారం కనుగొన్నారు. నిఖిల్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ మొదలు పెట్టారు. కాగా, ముగ్గురు స్నేహితులతో కలిసి ‘ది త్రీ హంగ్రీ మెన్’ అనే ఫుడ్ బ్లాగ్‌ను 29మే 2009లో ప్రారంభించారు నిఖిల్. దీంతోపాటు తండ్రి మరణానంతరం కుటుంబ వ్యాపారాలను కూడా నిఖిల్ చూసుకుంటున్నారు. యూట్యూబ్‌లో కార్టూన్ కళపై ఆయన వీడియోలు పాపులర్ అయ్యాయి. అలాగే వివిధ ప్రదేశాల్లో దొరికే విలక్షణ ఆహార పదార్థాలు, వంటకాలపై ఆయన నిర్వహించే రివ్యూలు బహుళ ప్రజాదరణ పొందాయి. నిఖిల్‌కు భార్య, తల్లి , సోదరి ఉన్నారు. త్వరలో ‘ది త్రీ హంగ్రీ మెన్’ పదేళ్ల వార్షికోత్సవం నిర్వహించుకోనున్న తరుణంలో ఈ విషాదం చోటు చేసుకుంది. -
ప్లస్ సైజ్ బ్లాగర్ కు ఇన్ స్టాగ్రామ్ సారీ!
ప్లస్ సైజ్ ఉన్నవారి ఫోటోలను డిలీట్ చేసిన ఇన్ స్టాగ్రామ్.. అనంతరం బ్లాగర్లకు క్షమాపణలు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సింగపూరియన్ ఇండియన్ బ్లాగర్ ఆర్తీ ఒలీవియా దుబే.. తాను బికినీతో ఉన్న ఫోటోలను పోస్టు చేయగా కొద్దికాలం క్రితం ఇన్ స్టాగ్రామ్ నుంచి వాటిని తొలగించారు. దీంతో ఆమె వారంపాటు ఆందోళన నిర్వహించడంతో చివరికి దారికొచ్చిన ఇన్ స్టాగ్రామ్... తప్పైపోయిందంటూ ఆమెకు క్షమాపణలు చెప్పడంతోపాటు, అనుకోకుండా ఫోటోలు డిలీట్ అయినట్లుగా వివరణ కూడ ఇచ్చింది. తన బ్లాగ్ లో 'పెంఛంట్ ఫర్ ఫ్యాషన్, ఫాట్ బ్రౌన్ ఫెమినిస్ట్' అంటూ తనకు తాను నిర్వచించుకునే బ్లాగర్ ఒలీవియా దుబే... తనతోపాటు మరో ఇద్దరు ప్లస్ సైజ్ బ్లాగర్ల బికినీ షూట్ ఫోటోలను మే 21న సైట్ నుంచి తొలగించడంతో ఆందోళన ప్రారంభించింది. తన బికిని ఫోటోలను సైట్ నుంచి తొలగించి తనను అవమానించినందుకు గాను తనకు ఇన్ స్టాగ్రామ్ అధికారికంగా క్షమాపణలు చెప్పాలంటూ జూన్ 1న తన అకౌంట్ లో ఓ నోట్ పెట్టి డిమాండ్ ప్రారంభించింది. అయితే దుబే డిమాండ్ కు దిగొచ్చిన ఇన్ స్టాగ్రామ్ ఆమె ఫోటోలను తొలగించినందుకు క్షమాపణలు చెప్పింది. కాగా ఇన్ స్టాగ్రామ్ క్షమాపణలు చెప్పినంత మాత్రాన సరిపోదని, తాను క్షమాపణలను అంగీకరించినా తదుపరి ప్రయోజనం ఉండదని, అందుకే తిరిగి తన ఫోటోలను పోస్ట్ చేయడంతోపాటు, తొలగించిన ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ లలోని ప్లస్ సైజ్ ఫ్రెండ్స్ అందరి ఫోటోలను పోస్ట్ చేసి, అకౌంట్లను తిరిగి ప్రారంభించాలంటూ దుబే పట్టుబడుతోంది.