
ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది బ్లాగర్స్ మన దేశానికి వచ్చి స్థానికులతో హాయిగా కలిసిపోతారు. ఆ జ్ఞాపకాల వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. తాజాగా మన దేశానికి వచ్చిన రష్యన్ బ్లాగర్ చుగురోవా వీడియో వైరల్ అయింది. మహారాష్ట్రలోని చిన్నపాటి హోటల్‌కి వెళ్లిన చుగురోవా అక్కడ ఉన్న సూర్యవన్షి అనే మహిళను ‘నమస్తే దీదీ’ పలకరించి ‘ఏం చేస్తున్నారు?’ అని అడిగింది. ‘పోహ’ (అటుకుల ఉప్మా) అని చెప్పింది సూర్యవన్షి.
‘నాకు కూడా నేర్పించరా?’ అని చుగురోవా అడగగానే ఓకే చెప్పింది సూర్య. సూర్య డైరెక్షన్‌లో టమాటాలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి...మొదలైనవి తరగడం నుంచి పెనంలో వేడి నూనెలో వేయడం వరకు ఎన్నో చేసి ‘పోహ’ ప్రాజెక్ట్‌ను విజయవంతంగా పూర్తి చేసింది చుగురోవా. ఆ తరువాత ‘పోహ తినండి....వోన్లీ ఇరవై రూపాయలు మాత్రమే’ అని హిందీలో అరిచింది. ‘నమస్తే దోస్తో’ కాప్షన్స్‌తో ‘మేకింగ్ పోçహ’ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది చుగురోవా.
Comments
Please login to add a commentAdd a comment