
వాషింగ్టన్: టెక్ దిగ్గజం మైకోసాఫ్ట్ 50వ వసంతంలోకి అడుగుపెట్టిన వేళ.. ఆ సంస్థ సహా వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ కంపెనీకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కంపెనీ ఆరంభ రోజుల్లో.. యవ్వనంలో ఉండగా దిగిన ఫొటోలను సరదాగా ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో రూపంలో పోస్ట్ చేశారు.
‘‘దురదృష్టవశాత్తు.. నేను మళ్ళీ ఎప్పటికీ కూల్‌గా ఉండను. ఎందుకంటే ఇది మైక్రోసాఫ్ట్ తొలినాళ్లలో ఇది నేనే’’ అంటూ క్యాప్షన్ ఉంచారాయన. 1975 ఏప్రిల్ 4వ తేదీన న్యూ మెక్సికో అల్బుకెర్కీలో మైక్రోసాఫ్ట్‌ను చిన్ననాటి స్నేహితులైన బిల్ గేట్స్, పాల్ అలెన్‌లు స్థాపించారు. 1979లో కంపెనీ విస్తరణలో భాగంగా వాషింగ్టన్‌కు మార్చారు. ఆ తర్వాత గేట్స్, అలెన్‌తో పాటు స్టీవ్ బాల్మర్, సత్య నాదెళ్ల కంపెనీ ఎదుగుదలలో విశేష కృషి చేశారు.
మైక్రోసాఫ్ట్‌కు 2000 సంవత్సరం దాకా గేట్స్ సీఈవోగా ఉన్న సంగతి తెలిసిందే. వివాదాస్పద రీతిలో.. మైక్రోసాఫ్ట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల నుంచి 2020 నుంచి ఆయన వైదొలిగారు.
1955 సియాటెల్‌లో జన్మించిన విలియమ్ హెన్సీ గేట్స్.. బాలమేధావిగా 13 ఏళ్ల వయసుకే సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్స్ రాసే స్థాయికి చేరాడు. అలెన్‌తో కలిసి మైక్రోసాఫ్ట్ కంపెనీని స్థాపించేందుకు హార్వార్డ్ నుంచి విద్యాభ్యాసం మధ్యలోనే ఆపేశారాయన. చిన్ననాటి స్నేహితులైన ఈ ఇద్దరూ ఎంఎస్-డాస్ ఆపరేటింగ్ సిస్టమ్ రూపొందించి.. ఆపై దానిని విండోస్‌గా పేరు మార్చారు.
50వ వార్షికోత్సవం సందర్భంగా.. మైక్రోసాఫ్ట్ తన వెబ్‌సైట్‌లో కొత్త పేజీలను లాంచ్ చేసింది. గత ఐదు దశాబ్దాలుగా సాగిన ప్రయాణాన్ని అందులో పదిలపరిచింది. కంపెనీ ఎదుగుదల, మైలు రాళ్లు, ఆవిష్కరణలను అందులో ఉంచింది. అలాగే.. రాబోయే 50 ఏళ్ల విజన్‌ను అందులో పొందుపరిచింది.