anniversary
-
అయోధ్యలో ఘనంగా ప్రాణప్రతిష్ఠ వార్షికోత్సవాలు
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యంలో రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన మొదటి వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు (జనవరి 11) ప్రారంభమైన ఉత్సవాలు ఈనెల 13 వరకు జరగనున్నాయి.హిందూ క్యాలెండర్ ప్రకారం గత ఏడాది అంటే 2024 లో పుష్యమాస శుక్లపక్ష ద్వాదశి జనవరి 22న వచ్చింది. అది ఈ ఏడాది(2025) జనవరి 11న వచ్చింది. ఈ కారణంగా హిందూ క్యాలెండర్(Hindu calendar)ను అనుసరించి అయోధ్యలో నేడు నూతన రామాలయ మొదటి వార్షికోత్సవాలు ప్రారంభమయ్యాయి. రామమందిర ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగే ఈ మూడు రోజుల ఉత్సవాలకు 110 మందికి పైగా వీఐపీలు హాజరుకానున్నారు. ఈరోజు(శనివారం) ఉదయం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రామ్ లల్లాకు అభిషేకం చేయనున్నారు. అనంతరం ఆయన భక్తులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.వార్షికోత్సవాల సందర్భంగా ఆలయ ట్రస్ట్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అంగద్ తిలా స్థలంలో ఒక భారీ టెంట్ ఏర్పాటు చేశారు. దీనిలో ఐదు వేలమందికి పైగా భక్తులు కూర్చొనే అవకాశం ఉంది. అలాగే పెవిలియన్‌తో పాటు యాగశాలలో శాస్త్రీయ సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించనున్నారు. దీనితో పాటు రామ కథా(Rama Katha) గానం కూడా నిర్వహించనున్నారు. గత సంవత్సరం ఇక్కడికి రాలేకపోయినవారికి ఈసారి ట్రస్ట్ ప్రత్యేక ఆహ్వానాలు పంపిందని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. 110 మంది వీఐపీలతో సహా పలువురు అతిథులకు ఆహ్వానాలు పంపినట్లు ట్రస్ట్ పేర్కొంది. ఆలయ ట్రస్ట్(Temple Trust) తెలిపిన వివరాల ప్రకారం మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాలకు మండలం, యాగశాల ప్రధాన వేదికలుగా నిలిచాయి. ఇది కూడా చదవండి: Delhi Election: ఆ 29 స్థానాలు అన్ని పార్టీలకు సవాల్.. ఈసారి ఏమవునో? -
Lal Bhadur Shastri: నాటి ప్రధాని అభ్యర్థనతో దేశమంతా ఉపవాసం
దేశానికి సేవలు అందించిన మహనీయులను స్మరించుకోవడం దేశవాసులుగా మన కర్తవ్యం. ఈరోజు (జనవరి 11) భారతదేశ రెండవ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి వర్థంతి. 1966 జనవరి 11న ఆయన కన్నుమూశారు. ఆడంబరాలకు దూరంగా ఉండే వ్యక్తిగా శాస్త్రి పేరుగాంచారు. దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ మరణానంతరం శాస్త్రి 1964, జూన్ 9న ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.18 నెలల పాటు దేశ ప్రధానమంత్రిగా కొనసాగిన శాస్త్రి నాయకత్వాన 1965లో భారత్-పాక్ మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో పాక్ ఘోరపరాజయాన్ని ఎదుర్కొంది. పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్‌తో తాష్కెంట్(Tashkent)లో యుద్ధాన్ని ముగించే ఒప్పందంపై శాస్త్రి సంతకం చేశారు. ఆ తర్వాత 1966, జనవరి 11న రాత్రి ఆయన అనుమానాస్పద పరిస్థితుల్లో కన్నుమూశారు. ప్రధానిగా లాల్ బహదూర్ శాస్త్రి పదవీకాలం చాలా తక్కువ. కానీ అదే సమయంలో ఆయన తన సరళమైన స్వభావం, దృఢ సంకల్ప శక్తి ప్రభావాలను దేశప్రజలకు చాటిచూపారు. క్లిష్ట సమయంలో దేశంలో అధికారాన్ని చేపట్టిన ఆయన పలు సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొన్నారు.లాల్ బహదూర్ శాస్త్రి(Lal Bahadur Shastri) 1964, జూన్ నుండి 1966, జనవరి వరకు భారత ప్రధానిగా ఉన్నారు. ఆ సమయంలో భారతదేశంలో ఆహారధాన్యాల కొరత అధికంగా ఉండేది. అటువంటి పరిస్థితుల్లో భారత్ ఆహార ధాన్యాల కోసం అమెరికాపై ఆధారపడింది. ఇంతలో 1965లో పాకిస్తాన్.. భారతదేశంపై దాడికి దిగింది. అయితే పాక్‌కు భారత సైన్యం(Indian Army) తగిన సమాధానం ఇచ్చింది. కానీ మన సైనికులకు తీవ్ర ఆహార సమస్య ఏర్పడింది. అటువంటి పరిస్థితిలో ప్రధాని శాస్త్రి.. దేశ ప్రజలంతా ఒక ఉపవాసం ఉండాలని విజ్ఞప్తి చేశారు. దీనికి దేశ ప్రజలంతా అంగీకరించారు. ఆ తదుపరి సంవత్సరాల్లో భారత్ ఆహార ఉత్పత్తుల విషయంలో స్వయం సమృద్ధిని సాధించింది.ఇది కూడా చదవండి: Mahakumbh-2025: అంబాసిడర్ బాబా.. 35 ఏళ్లుగా కారులోనే సాధన -
11నుంచి అయోధ్యలో వార్షికోత్సవాలు
అయోధ్య: అయోధ్య ఆలయంలో రామ్ లల్లా ప్రతిష్ఠాపనకు ఏడాది పూర్తవుతున్న సందర్భంగా జనవరి 11వ తేదీన సీఎం యోగి ఆదిత్యనాథ్ అభిషేకం జరిపించనున్నారు. ప్రతిష్ఠా ద్వాదశి వార్షికోత్సవాలు 11 నుంచి 13వ తేదీ వరకు మూడు రోజులపాటు కొనసాగనున్నాయి. రామాలయం సమీపంలోని ‘అంగద్ తిల’లో జరిగే సాంస్కృతిక కార్యక్రమాన్ని కూడా సీఎం యోగి ప్రారంభించనున్నారు. ప్రముఖ గాయకుల భక్తి గీతాల రికార్డును కూడా ఆయన విడుదల చేస్తారని అధికారులు చెప్పారు. అంతేకాకుండా, అయోధ్యలోని లతా చౌక్, జన్మభూమి పథ్, శ్రింగార్ హాట్, రామ్ కీ పైడీ, సుగ్రీవ ఫోర్ట్, చోటి దేవ్‌కాళి ప్రాంతాల్లో యువ కళాకారులతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, గీతా లాపన వంటివి ఉంటాయని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ చెప్పారు. ఆలయ గర్భగుడి వద్ద ‘శ్రీరామ్ రాగ్ సేవ’కార్యక్రమం కూడా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా దేశ వ్యాప్తంగా ఉన్న సాధువులు, భక్తులకు ఆహ్వానాలు పంపామని వెల్లడించారు. -
రాజకీయ కవిసార్వభౌముడు
అది 1984 డిసెంబర్ 30. ముంబైలోని శివాజీ పార్కు. బీజేపీ సదస్సులో అటల్ ప్రసంగిస్తున్నారు. చీమ చిటుక్కుమన్నా విని్పంచేంతటి నిశ్శబ్దం నడుమ అంతా చెవులు రిక్కించి మరీ వింటున్నారు. ‘‘చీకట్లు విడిపోతాయి. సూర్యుడు ఉదయిస్తాడు. కమలం వికసిస్తుంది’’ అంటూ భవిష్యద్దర్శనం చేశారాయన. అప్పట్లో అంతా పెదవి విరిచినా, మరో పుష్కరం తిరక్కుండానే హస్తిన కోటపై కాషాయ జెండా ఎగరేసి చూపించారు. ప్రాణమిత్రుడు ఆడ్వాణీతో కలిసి బీజేపీని కేవలం రెండు లోక్‌సభ సీట్ల స్థాయి నుంచి కేంద్రంలో అధికార పీఠం దాకా ఒక్కొక్క మెట్టూ ఎక్కించారు. ఒకప్పుడు రాజకీయాల్లో అంటరానిదిగా పరిగణన పొందిన బీజేపీని వాజ్‌పేయీ ప్రబల శక్తిగా తీర్చిదిద్దారు. ఆ క్రమంలో ఎదురైన ఆటుపోట్లను ఏమాత్రమూ చలించని నిబ్బరంతో, అచంచల ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొన్నారు. మూడుసార్లు ప్రధానిగా చేసి ఆ పదవికే వన్నె తెచ్చారు. అంతకుముందు లోక్‌సభలో విపక్ష నేతగానూ పార్టీలకతీతంగా మన్ననలూ అందుకున్నారు. అంతర్జాతీయ వేదికలపై పొరుగు దేశం కుట్రలను పటాపంచలు చేసి దేశ వైఖరిని ప్రస్ఫుటంగా చాటారు. నెహ్రూ తనకిష్టమైన నేత అని చెప్పినా, పాక్ పీచమణిచి బంగ్లాను విముక్తం చేసిన ఇందిరను విజయేందిరగా కొనియాడినా వాజ్‌పేయికే చెల్లింది. తర్వాత కొన్నేళ్లకే ఎమర్జెన్సీ వేళ అదే ఇందరి నియంతృత్వాన్ని ఆయన అంతే నిస్సంకోచంగా కడిగిపారేశారు. అదే సమయంలో పార్టీ సిద్ధాంతాల కంటే దేశమే ముందని, ముఖ్యమని త్రికరణ శుద్ధిగా నమ్మడమే గాక దాన్ని ఆచరణలోనూ చూపారు. పలు సందర్భాల్లో మాతృ సంస్థ ఆరెస్సెస్ విధానాలతోనే విభేదించారు. బాబ్రీ మసీదు కూల్చివేతపై పార్టీ వైఖరికి భిన్న స్వరం వినిపించేందుకు కూడా వెనకాడలేదు. అంతేనా...? తొలిసారి ప్రధాని పదవి తనకు 13 రోజుల ముచ్చటగానే ముగిశాక నెలకొన్న రాజకీయ అనిశ్చితికి తెర దించేందుకు ఏకంగా కాంగ్రెస్‌కు బయటి నుంచి మద్దతిచ్చేందుకు కూడా ముందుకొచి్చన దేశ ప్రేమికుడు వాజ్‌పేయి. ఇలా బహుముఖీనమైన వ్యక్తిత్వంతో పార్టీలకతీతంగా చెరగని అభిమానం సంపాదించుకున్నారు వాజ్‌పేయి. రాజనీతిజ్ఞుడనే పదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిపోయారు. ఆయన జయంతి డిసెంబర్ 25 సుపరిపాలన దినోత్సవంగా ప్రకటిస్తూ కేంద్రం సముచిత నిర్ణయమే తీసుకుంది. ఆదర్శ నాయకుడు 1984 సార్వత్రిక ఎన్నికల నాటికే దేశంలో ముఖ్యమైన పార్టీగా బీజేపీ గుర్తింపు తెచ్చుకుంది. వాజ్‌పేయి నేతృత్వంలో 1996 ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా నిలిచింది. మిత్రపక్షాల సాయంతో తొలిసారి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎన్డీఏ రూపంలో జాతీయ రాజకీయాల్లో సంకీర్ణ ప్రయోగాలకు వాజ్‌పేయి ఆద్యునిగా నిలిచారు. పదో ప్రధానిగా ప్రమాణం చేశారు. 13 రోజులకే గద్దె దిగాల్సి వచ్చినా 1998లో రెండోసారి ప్రధానిగా పగ్గాలు చేపట్టారు. 13 నెలల అనంతరం ఒక్క ఓటు తేడాతో ప్రభుత్వం పడిపోయినా చలించలేదు. ఆ వెంటనే వచి్చన ఎన్నికల్లో నెగ్గి ముచ్చటగా మూడోసారి గద్దెనెక్కి పూర్తికాలం పదవిలో కొనసాగారు. ఆ ఘనత సాధించిన తొలి కాంగ్రెసేతర ప్రధానిగా నిలిచిపోయారు. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో దశాబ్దాల విభేదాలకు, ఉద్రిక్తతలకు శాంతిచర్చలే విరుగుడంటూ సాహసోపేతంగా సంప్రదింపులకు తెర తీశారు. నాటి పాక్ అధ్యక్షుడు ముషార్రఫ్ ఆగ్రా ఒప్పందం కుదుర్చుకున్నారు. 1999లో ఢిల్లీ–లాహోర్ మధ్య చరిత్రాత్మక బస్సు సరీ్వసును ప్రారంభించారు. పాక్ కపట బుద్ధి కార్గిల్ యుద్ధానికి దారి తీసినా ‘ఆపరేషన్ విజయ్’ ద్వారా దాయాదికి మర్చిపోలేని గుణపాఠం నేర్పారు. 2003లో ఇరాక్‌పై యుద్ధంలో అమెరికా సైనిక సాయం కోరితే నిష్కర్షగా తిరస్కరించిన ధీశాలి వాజ్‌పేయి. డజన్ల కొద్దీ దేశాలు అమెరికా పక్షం వహించినా, అదే బాటన నడుద్దామని సొంత మంత్రివర్గ సభ్యులే ఒత్తిడి తెచి్చనా, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా అదే మేలని మీడియా సలహాలిచి్చనా ససేమిరా అన్నారు. ఇరాక్‌పై అమెరికా యుద్ధంలో పాల్గొనేది లేదని పార్లమెంటులోనే కుండబద్దలు కొట్టారు. ఇది అంతర్జాతీయ వేదికపై భారత ప్రతిష్టను ఇనుమడింపజేసిన కీలక ఘట్టంగా మిగిలిపోయింది.కీలక సంస్కరణలు మూడోసారి ప్రధానిగా కీలక ఆర్థిక సంస్కరణలకు వాజ్‌పేయి బాటలు వేశారు. పీవీ బాటన సాగుతూ స్వేచ్ఛా వాణిజ్యాన్ని, సరళీకృత విధానాలను, విదేశీ పెట్టుబడులను, ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించారు. ఆర్థికరంగాన్ని కొత్తపుంతలు తొక్కించారు. హైవేల అభివృద్ధి, ప్రధాని గ్రామసడక్ పథకాలతో దేశ రవాణా రూపురేఖలనే మార్చేశారు. అమెరికాతో బంధాన్ని బలోపేతం చేశారు. నాటి అధ్యక్షుడు బిల్ క్లింటన్‌తో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. 1998లో పోఖ్రాన్లో రెండో అణు పరీక్షల ద్వారా భారత అణ్వస్త్ర పాటవాన్ని ప్రపంచానికి చాటారు. దేశంలో టెలికాం విప్లవానికి బాటలు పరిచిందీ వాజ్పేయే. ఆయన హయాం సుపరిపాలనకు పర్యాయపదంగా నిలిచిపోయింది. 2004 ఎన్నికల్లో బీజేపీ ఓటమి అనంతరం వాజ్‌పేయీ క్రమంగా రాజకీయ రంగం నుంచి తప్పుకున్నారు. 2006లో బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీ తర్వాత చివరిసారిగా మీడియాతో మాట్లాడారు వాజ్‌పేయి. ఈ సందర్భంగానే నాయకత్వ బాధ్యతలను ఆడ్వాణీకి అప్పగించారు. క్షీణించిన ఆరోగ్యానికి నిదర్శనంగా అప్పటికే చేతికర్ర సాయం తీసుకున్నారు. 2007లో చివరిసారి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ కోసం ప్రచారం చేశారు. ఆ తర్వాత 2018 ఆగస్టు 16న కన్నుమూసేదాకా దాదాపు పుష్కర కాలం వాజ్‌పేయి ఏకాంత జీవితమే గడిపారని చెప్పాలి. ఆ గళం.. అనితరసాధ్యంవాజ్పేయి అద్భుత వక్త. హిందీ, ఇంగ్లీష్ ల్లో తిరుగులేని వాగ్ధాటి ఆయన సొంతం. 1957లో పార్లమెంటేరియన్‌గా తొలి ప్రసంగంతోనే నాటి ప్రధాని నెహ్రూతో సహా అందరినీ ఆకట్టుకున్నారు. రాజకీయాల్లో గొప్పగా రాణించి ప్రధాని అవుతాడంటూ నెహ్రూ ప్రశంసలు అందుకున్నారు. విపక్ష నేతగా అయినా, ప్రధానిగా హోదాలోనూ ఆయన మాట్లాడేందుకు లేచారంటే సభ్యులంతా చెవులు రిక్కించి వినేవారు. సునిశితమైన హాస్యం, చమత్కారాలు, అక్కడక్కడా అవసరమైన మేరకు వ్యంగ్యం మేళవిస్తూ కవితాత్మకంగా సాగే వాజ్‌పేయి ప్రసంగాలు అందరినీ మంత్రముగ్ధుల్ని చేసేవి. హిందీ అంతగా అర్థం కాని తమిళ దిగ్గజం సీఎన్ అన్నాదురైని కూడా ఆకట్టుకున్న ఘనత ఆయన ప్రసంగాలకు దక్కింది! 1994లో జెనీవా వేదికపై కాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ సమస్యగా చిత్రించేందుకు పాక్ చేసిన ప్రయత్నాన్ని తిప్పికొట్టేందుకు నాటి ప్రధాని పీవీ నరసింహారావు ఏరికోరి వాజ్‌పేయినే ఎంచుకున్నారు. ఏ అంశంపై అయినా సమగ్ర కసరత్తు చేశాకే మాట్లాడేవారు. గణాంకాలు తదితరాలను తప్పకుండా ప్రస్తావించేవారు. అందుకే పార్లమెంటులో ఆయన వాదనలను తిప్పికొట్టలేక ప్రత్యర్థి పక్షాల్లోని మహామహులైన నేతలు కూడా చేష్టలుడిగేవారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో హిందీలో ప్రసంగించిన క్షణాలు తనకు మరపురానివని గుర్తు చేసుకునేవారు. వాజ్‌పేయి కొంతకాలం జర్నలిస్టుగా కూడా రాణించారు.సినీ ప్రియుడు వాజ్‌పేయి సినీ ప్రియుడు. పాత హిందీ సినిమాలు బాగా చూసేవారు. తీస్రీ కసమ్, దేవదాస్, బందినీ వంటివి ఆయన ఆల్‌టైం ఫేవరెట్ హిందీ సినిమాల్లో కొన్ని. లతా మంగేష్కర్, ముకేశ్, ఆయన అభిమాన గాయనీ గాయకులు. ‘మీకూ నాకూ ఎన్నో పోలికలు. ఇద్దరమూ ఒంటరితనమే. ఇంగ్లీష్ లో నా పేరు (అటల్)ను తిరగేస్తే మీ పేరు (లత) వస్తుంది’ అంటూ ఓసారి లతా మంగేష్కర్తో చమత్కరించారట! అలాగే హాలీవుడ్ సినిమాలు కూడా బాగా ఇష్టపడేవారు. ద బ్రిడ్జ్ ఆన్ ద రివర్ క్వై తనకిష్టమైన సినిమా అని తరచూ చెప్పేవారు. అలాగే బార్న్ ఫ్రీ, గాంధీ సినిమాలు కూడా. వాజ్‌పేయి కవితలకు పలువురు గాయకులు ప్రాణం పోయడం మరో విశేషం. ఆయన రాసిన ‘క్యా ఖోయా, క్యా పాయా’, ‘దూర్ కహీ కోయీ రోతా హై’, ‘ఝుకీ న ఆంఖే’ వంటి వేదనాభరిత కవితలను గజల్ సమ్రాట్ జగ్జీత్సింగ్ తన గళంతో అజరామరం చేశారు. శరత్, ప్రేమ్‌చంద్ సాహిత్యమన్నా వాజ్‌పేయికి ప్రాణం. ఎమర్జెన్సీ వేళ జైల్లోనూ కవితా రచన చేసిన కళాపిపాసి వాజ్‌పేయీ. అడ్వాణీ ఆయనకు ఆజన్మాంతం ప్రియమిత్రుడు. తనతో కలిసి ఢిల్లీ వీధుల్లో స్కూటర్‌పై చక్కర్లు కొట్టేవారు. పానీపూరీ, చాట్ వాజ్‌పేయి ఎంతో ఇష్టంగా తినేవారని అడ్వాణీ చెబుతారు. ఆయన చేయి తిరిగిన వంటగాడే గాక మంచి భోజనప్రియుడు కూడా.చావు అయుష్షెంత, రెండు క్షణాలేగా! మరి జీవితమేమో ప్రగతిశీలం, ఒకటీ రెండు నాళ్లలో ముగిసేది కాదు ప్రధానిగా ఒకనాటికి మాజీని అవుతానేమో. మాజీ కవిని మాత్రం ఎప్పటికీ కాలేను మిత్రులను మార్చగలం గానీ పొరుగువారిని మార్చుకోలేం భారతీయులుగా మనమంతా ఉత్కృష్ట నాగరికతకు వారసులం. శాంతే మన జీవిత గీతిక అధికారం కోసం పార్టీని చీల్చాల్సి, కొత్త గ్రూపులు కట్టాల్సే వస్తే అలాంటి అధికారాన్ని తాకనైనా తాకను పేదరికం బహుముఖీనం. దాన్ని కేవలం డబ్బు, ఆదాయం, విద్య, ఆరోగ్య పరామితుల్లో కొలవలేం పుడమి వయసు లక్షల ఏళ్లు. మనిషివి అంతులేని జీవన గాథలు. కానీ మన దేహానికి హద్దులున్నాయి.శత శరత్కాలాల వాణిని విన్నాం. అది చిట్టచివరిసారి తట్టినపుడైనా మనసు తలుపు తెరుద్దాంపాలిటిక్స్తో విసిగిపోయా. వాటిని వదిలేద్దామనుకుంటున్నాను. కానీ అవి నన్ను వదిలేలా లేవుస్వేచ్ఛకు సంకెళ్లు వేద్దామనుకునేవాళ్లు ఒకటి గుర్తుంచుకోవాలి. నిప్పుతో చెలగాటాలొద్దు. పక్కింటికి నిప్పుపెడితే ఆ దావాగ్ని మీ ఇంటినీ కాల్చేస్తుంది–వాజ్‌పేయి -
ఆర్థిక సంస్థల స్థాయి పెరిగితేనే ‘అభివృద్ధి చెందిన దేశం’
ముంబై: భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలనే ఆకాంక్షను సాధించాలంటే ఆర్థిక సంస్థల స్థాయి, పరిమాణం గణనీయంగా పెరగాల్సిన అవసరం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)డిప్యూటీ గవర్నర్ ఎం రాజేశ్వర రావు అన్నారు.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన 90వ వార్షికోత్సవాన్ని పురష్కరించుకుని ఇక్కడ నిర్వహించిన ‘గ్లోబల్ సౌత్‌లోని సెంట్రల్ బ్యాంక్‌ల ఉన్నత–స్థాయి విధాన సదస్సు’లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగంలో ముఖ్యాంశాలు...గతంలో ప్రారంభించిన నియంత్రణా విధానాలు, తీసుకున్న విధానపరమైన చర్యలు భారత్‌లో పటిష్టమైన. సవాళ్లను తట్టుకోగల ఆర్థిక వ్యవస్థ, ఆర్థికాభివృద్ధికి దారితీశాయి. అనేక సంక్షోభాలను ఎదుర్కొన్న భారత్ ఎకానమీని స్థిరపరచాయి. అయితే ఎకానమీ మరింత పురోభివృద్ధికి ఫైనాన్షియల్ సంస్థల పరిమాణం మరింత పెరగాలి. దృఢమైన పాలన వ్యవస్థ, ప్రభావవంతమైన రిస్క్ మేనేజ్మెంట్ ఈ దిశలో పురోగతికి దారితీసే అంశాలు. బ్యాంకులతో పాటు సంస్థలుసైతం తమ పెరుగుతున్న నిధులు అవసరాలను నెరవేర్చుకోడానికి క్యాపిటల్ మార్కెట్లను వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్బీఐకి ఉన్నంత విస్తృత ఆధారిత ప్రపంచంలో చాలా సెంట్రల్ బ్యాంకులు లేవు. ఎకానమీ పురోభివృద్ధి, ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యంగా ఆర్బీఐ తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. ఈ విషయంలో కేంద్రంతో సమన్వయంతో పనిచేస్తోంది. ఆర్బీఐ 75 సంవత్సరాల అనుభవం.. దేశ అభివృద్ధి ఆకాంక్షలను నెరవేర్చడంతోపాటు, ఎకానమీకి మద్దతు ఇవ్వగల బలమైన ఆర్థిక రంగానికి పునాదిని నిర్మించింది. -
అయోధ్య: 10 రోజుల ముందుగానే వార్షికోత్సవాలు.. కారణమిదే..
అయోధ్య: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో వచ్చే ఏడాది(2025) జనవరిలో నూతన రామాలయ వార్షికోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం ఇప్పుటినుంచే ఏర్పాట్లు ముమ్మరం చేశారు. 2024 జనవరి 22న అయోధ్యలో నూతన రామాలయాన్ని ప్రారంభించడంతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో బాలక్ రాముని ప్రాణప్రతిష్ఠ జరిగింది.అప్పటి నుంచి లక్షలాది మంది భక్తులు ప్రతినిత్యం అయోధ్య ఆలయాన్ని సందర్శించుకుంటూ వస్తున్నారు. తాజాగా శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రామాలయ వార్షికోత్సవ వేడుల నిర్వహణపై నిర్ణయం తీసుకున్నారు. దీనిప్రకారం జనవరి 22న కాకుండా జనవరి 11నే వార్షికోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఇలా 10రోజుల ముందుగా ఈ వేడుకలు నిర్వహించడం వెనుక ఒక కారణం ఉందని ట్రస్ట్ సభ్యులు తెలిపారు.అయోధ్యలోని మణిరామ్ దాస్ కంటోన్మెంట్లో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పండితులతో సంప్రదింపులు జరిపారు. రాబోయే సంవత్సరంలో రామాలయంలో ఎప్పుడు ఏ ఉత్సవం నిర్వహించాలనేదీ నిర్ణయించారు. హిందూ క్యాలెండర్ ప్రకారం రామ్‌లల్లా ప్రాణప్రతిష్ట వార్షికోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించారు.ప్రతి సంవత్సరం పౌష్య శుక్ల ద్వాదశి అంటే కూర్మ ద్వాదశి నాడు ఈ ఉత్సవం జరుపుకోవాలని పండితులు తెలిపారు. 2025లో ఈ తిధి జనవరి 11న వచ్చింది. దీని ప్రకారం అయోధ్యలో నూతన రామాలయ, బాల రాముని ప్రాణప్రతిష్ఠ వార్షికోత్సవ కార్యక్రమాలు జనవరి 11న జరగనున్నాయి. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఈ సమావేశంలో వచ్చే ఏడాది నిర్వహించబోయే వార్షికోత్సవ వేడుకల ఏర్పాట్లకు సంబంధించిన పలు నిర్ణయాలు కూడా తీసుకుంది. ఇది కూడా చదవండి: World Oldest Man: ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడు కన్నుమూత -
ఉత్సాహంగా ఉత్కర్ష్.. మెరీడియన్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు (ఫోటోలు)
-
ఒయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ 15వ వార్షికోత్సవం నటి రమ్యకృష్ణ (ఫొటోలు)
-
భార్యకు స్టార్ హీరో స్పెషల్ విషెస్.. ఏకంగా ఐ లవ్ యూ చెబుతూ!
-
సింగపూర్ తెలుగు బ్రాహ్మణ సమాజం దశమ వార్షికోత్సవం
-
అంగరంగ వైభవంగా మహాత్మాగాంధీ మెమోరియల్ దశమ వార్షికోత్సవ వేడుకలు
అమెరికా దేశంలోనే అతిపెద్దదైన మహాత్మాగాంధీ మెమోరియల్‌ని డాలస్‌లో స్థాపించి పదేళ్లు పూర్తి అయిన సందర్భంగా మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ అధ్వర్యంలో దశమ వార్షికోత్సవ వేడుకలు గత ఆదివారం ఘనంగా జరిగాయి.ఈ మహాత్మాగాంధీ మెమోరియల్ నిర్మాణంలో సహకరించిన దాతలకు, అధికారులకు అభినందన పూర్వక విందు సమావేశం ఇర్వింగ్ నగరంలో ఉన్న విండాం హోటల్ లో ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో శ్రీకరి లంకా వీణానాదం; చక్రి పైలా శిక్షణలో పాల్గొన్న విద్యార్థులు గాంధీ ఆశయాలపై చేసిన ప్రసంగాలు, రవీంద్ర గుడిమెళ్ళ, సమీర శ్రీపాద శిక్షణలో పాల్గొన్న సింధు గుడిమెళ్ళ, సంయుక్త గుడిమెళ్ళ, అన్షు చుండి, అయేషాని చుండి, సంహిత్ చిలకమర్రి, రిత్విక లక్కిరెడ్డి, అభినవ్ కార్తీక్ లక్కిరెడ్డి, సమన్విత మాడా, పవన్ కుమార్ గడగండ్ల, రవీంద్ర గుడిమెళ్ళ, శ్రీకర్ దేసు లు గానం చేసిన దేశభక్తి గీతాలు; సింధుజ ఘట్టమనేని శిక్షణలో పాల్గొన్న నందిత దినేష్, గ్రీష్మ అశోక్, తేజస్విని శర్వణన్, నక్షత్ర నల్లమోతు, నిత్య ఆవాల, ఆర్షియ మాచవోలు, ప్రియ దర్శిని కృష్ణమూర్తి, రుషిక కల్ల, సహన కార్తీక్, శ్రీనిత ఆర్కాటి, రియ బూర, వీక్షవ్ సురకంటి, ప్రణిత కొసరాజు, నేహశ్రీ పిల్లా, ప్రిష మదన్, సరయు తూనుగుంట్ల, అకిర తేర, నిహారిక కొండూరు, సాన్విక కొలన్పాక, ఆద్యవర్మ కొండూరు బృందం వందేమాతరం, జనగణమన గీతాలకు అద్భుతమైన నృత్య ప్రదర్శనలు చేసి అందరినీ ఆకట్టుకున్నారు.మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ నాయకత్వానికి దశమ వార్షికోత్సవ శుభాకాంక్షలు, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న చిన్నారులకు శుభాశ్సీసులు తెలియజేసిన ప్రత్యేక అతిథులుగా హాజరైన ఇర్వింగ్ నగర మేయర్ ప్రోటెం డెన్నిస్ వెబ్, కౌన్సిల్ మెంబర్ అబ్దుల్ ఖబీర్, కాపెల్ నగర కౌన్సిల్ మెంబర్ బిజూ మాత్యు, రమేశ్ ప్రేమ్ కుమార్, ఫ్రిస్కో ఇండిపెండెంట్ స్కూల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ ఉపాధ్యక్షులు గోపాల్పోణంగిలను మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర, కార్యదర్శి రావు కల్వాల, బోర్డు సభ్యులు మురళి వెన్నం, రన్నా జానీ, జాన్ హామండ్, కమల్ కౌశల్, బి.ఎన్ రావు, తాయాబ్ కుండావాల, సి.సి తియోఫిన్, స్వాతి షా, షబ్నం మాడ్గిల్ లు సత్కరించారు.కాపెల్ నగర కౌన్సిల్ సభ్యులు బిజూ మాత్యు మరియు రమేశ్ ప్రేమ్ కుమార్ లు కాపెల్ నగర మేయర్ మహాత్మా గాంధీ మెమోరియల్ ను అభినందిస్తూ చేసిన అధికారిక అబినందన పత్రాన్ని (ప్రోక్లమేషన్), మరియు ఇర్వింగ్ నగర మేయర్ వ్రాసిన ప్రశంసా పత్రాన్ని మేయర్ ప్రోటెం డెన్నిస్ వెబ్ లు డా. ప్రసాద్ తోటకూర కు అందజేశారు.ఇటీవలే గాంధీ మెమోరియల్ గవర్నెన్స్ బోర్డు సభ్యులుగా నియమితులైన రాంకీ చేబ్రోలు, జాన్ హామండ్, రన్నా జానీ, కిషోర్ కంచర్ల, తిరుమలరెడ్డి కుంభం, లోకేష్ నాయుడు కొణిదల, అనంత్ చౌదరి మల్లవరపు, అక్రం సయ్యద్, డా. రాఘవేంద్ర ప్రసాద్ సూదనగుంట్ల, వినోద్ ఉప్పు, రాజేంద్ర వంకావాల లను డా. ప్రసాద్ తోటకూర సభకు పరిచయం చేసి తోటి సభ్యులతో కలసి వారందరినీ సన్మానించారు.మహాత్మాగాంధీ విగ్రహాన్ని తయారుచేసిన రాష్ట్రపతి పురస్కార గ్రహీత, విజయవాడకు చెందిన బుర్రా శివ వరప్రసాద్, గుజరాత్‌కు చెందిన ప్రముఖ చిత్రకారుడు జిగర్ సోనీను మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ బోర్డ్ సభ్యులందరూ కలసి ఘనంగా సన్మానించారు. షబ్నం మాడ్గిల్ వందన సమర్పణతో, రుచికరమైన విందు భోజనంతో ఈ దశమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ముగిశాయి.(చదవండి: కాలేజీ అడ్మిషన్ల సంసిద్ధతపై నాట్స్ అవగాహన సదస్సు) -
‘బంగారానికి వెండి ఉచితం’
హైదరాబాద్: జీఆర్టీ జ్యువెలర్స్ 60వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని దీపావళికి ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. బంగారు ఆభరణాల బరువుకు సమానమైన వెండిని పూర్తిగా ఉచితంగా పొందవచ్చు. వజ్రాలపై ప్రతి క్యారెట్‌కు 25 గ్రాముల వెండి, అన్‌కట్ డైమండ్స్‌పై క్యారెట్‌కు 2 గ్రాముల వెండి, ప్లాటినం ఆభరణాల బరువుకు సమానమైన వెండి ఉచితంగా పొందవచ్చు. అలాగే వెండి వస్తువుల మేకింగ్ చార్జీలపై 25% తగ్గింపు, వెండి ఆభరణాలు, గిఫ్ట్ ఆర్టికల్స్ గరిష్ట విక్రయ ధరపై 10 శాతం తగ్గింపు ఇస్తుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోని అన్ని షోరూమ్‌ల్లో ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఈ పండుగ సీజన్లో ‘బంగారానికి వెండి ఉచితం’ ఆఫర్ కస్టమర్లకు మరింత ఆనందాన్ని అందిస్తుందని జీఆర్టీ జ్యువెలర్స్ ఎండీ ఆనంద్ అనంత పద్మనాభన్ తెలిపారు. -
చుక్కలు చూపిన ఎయిర్ షో
సాక్షి, చెన్నై: చెన్నైలో ఆదివారం జరిగిన భారీ ఎయిర్ షో చేదు అనుభవం మిగిల్చింది. ఎండలకు తాళలేక సొమ్మసిల్లి ఐదుగురు చనిపోగా, 230 మంది ఆస్పత్రి పాలయ్యారు. మృతుల్లో ఒకరు తెలుగు వ్యక్తి అని సమాచారం. షో ఉదయం 11 నుంచి కాగా జనం 8 గంటలకే మెరీనా బీచ్ చుట్టుపక్కల ప్రాంతాలకు తరలివచ్చారు. ఎండ తీవ్రతకు చాలామంది షో ప్రారంభం కాకమునుపే సొమ్మసిల్లి పడిపోయారు. తాగునీరు కూడా అందుబాటులో ఉంచలేదని వాపోయారు. భారత వైమానిక దళం 92వ వార్షికోత్సవం సందర్భంగా 21 ఏళ్ల తర్వాత చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమంలో 72 రకాల విమానాలు, హెలికాప్టర్లు ప్రదర్శనలు చేశాయి. వీటిని చూసేందుకు ఏకంగా 16 లక్షల మంది తరలివచ్చారు. ప్రదర్శన అనంతరం అంతా ఒక్కసారిగా ఇళ్లకు మరలడంతో గందరగోళం నెలకొంది. ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. మండుతున్న ఎండ, రద్దీతో ముందుకు సాగేందుకు మార్గం లేకపోవడంతో ఒంట్లో ఓపికలేక చాలామంది రోడ్డు పక్కనే కూర్చుండిపోయారు. బీచ్‌కు సమీపంలోని వారు కొందరికి మంచినీరు సరఫరా చేయడంతో పరిస్థితి కొంత తేలికపడింది. అయితే, జనం మెట్రో రైళ్లను ఆశ్రయించడంతో మెట్రో స్టేషన్లు కూడా కిక్కిరిసిపోయాయి. లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించడం లక్ష్యంగా పెట్టుకున్న అధికార యంత్రాంగానికి తగు ప్రణాళిక లేదని, కనీస వసతులు సైతం ఏర్పాట్లు చేయలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.మెరీనా బీచ్ రోడ్డులో కిక్కిరిసిన జన సందోహం -
హమాస్ దాడికి ఏడాది.. ఇజ్రాయెల్‌పై రాకెట్ల వర్షం
ఇజ్రాయెల్, గాజాలోని హమాస్ బలగాల మధ్య దాడులు కొనసాగుతున్నాయి. హమాస్‌ను అంతం చేయటమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం భీకర దాడులు చేస్తోంది. అయితే.. అక్టోబర్ 7వ తేదీకి హమాస్ బలగాలు ఇజ్రాయెల్‌పై మెరుపు దాడులు చేసి ఏడాది పూర్తి అవుతుంది. ఈ నేపథ్యంలో హమాస్ దాడి మొదటి వార్షికోత్సవానికి ఒకరోజు ముందు ఇవాళ (ఆదివారం) మరోసారి.. ఉత్తర గాజా నుంచి పలు రాకెట్లు దక్షిణ ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించాయని ఇజ్రాయెల్ సైన్యం ఓ ప్రకటనలో వెల్లడించింది.‘‘అనేక రాకెట్లు ఉత్తర గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్ భూభాగంలోకి ప్రవేశించినట్లు గుర్తించాం. అందులో ఒక రాకెట్‌ను ఇజ్రాయెల్ సైన్యం విజయవంతంగా ధ్వంసం చేసింది. మిగిలినవి రాకెట్లు జనావాసాలు లేని బహిరంగ ప్రదేశాల్లో పడిపోయాయి’’ అని సైన్యం తెలిపింది. ఇక.. హమాస్ బలగాలు.. ఇజ్రాయెల్‌పై చేసిన దాడికి ఏడాది పూర్తి కానున్న నేపథ్యంలో తమ సైన్యం మరింత అప్రమత్తంగా ఉందని ఇజ్రాయెల్ పేర్కొంది.🚨Sirens sounding along Israel’s coast🚨 pic.twitter.com/ebdBsj0vNT— Israel Defense Forces (@IDF) October 6, 2024 గతేడాది అక్టోబర్ 7న హమాస్ బలగాలు ఇజ్రాయెల్‌పై దాడి.. ఇజ్రాయెల్ పౌరులను బంధీలుగా గాజాకు తీసుకువెళ్లిన విషయం తెలిసిందే. ఇక.. అప్పటి నుంచి తమ పౌరులను విడిచిపెట్టే వరకు హమాస్‌పై దాడులు చేస్తామని ఇజ్రాయెల్ చెబుతోంది. హమాస్ టార్గెట్ ఇజ్రాయెల్ సైన్యం చేసిన దాడుల్లో 41, 900 మంది పాలస్తీనా పౌరులు మృత్యువాతపడ్డారు. -
ప్రియురాలికి హృతిక్ రోషన్ విషెస్ .. పెళ్లి అయిపోయిందా?
బాలీవుడ్ సెలబ్రిటీ ప్రేమ జంటల్లో హృతిక్ రోషన్- సబా ఆజాద్ ఒకరు. కొన్నేళ్లుగా వీరిద్దరూ డేటింగ్లో ఉన్న సంగతి తెలిసిందే. ఏ ఈవెంట్ జరిగినా జంటగా కనిపిస్తారు. దీంతో ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలెక్కనుందంటూ బీటౌన్‌లో టాక్ వినిపించింది. కానీ అలాంటిదేం జరగలేదు.అయితే తాజాగా హృతిక్ రోషన్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హ్యాపీ యానివర్సిరీ పార్ట్నర్ అంటూ సబా ఆజాద్‌తో దిగిన ఫోటోను షేర్ చేశారు. ఈ పోస్ట్ చూస్తుంటే అయితే తన ప్రియురాలిని హృతిక్ పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. తాజా పోస్ట్‌తో గతేడాది అక్టోబర్‌లోనే వీరి పెళ్లి జరిగినట్లు హృతిక్ హింట్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. దీంతో ఈ జంట తమ మొదటి వివాహా వార్షికోత్సవాన్ని ఇవాళ జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇది చూస్తుంటే ఎలాంటి హడావుడి లేకుండానే హృతిక్- సబా సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నట్లు అర్థమవుతోంది. కాగా.. గతంలో సబా ఆజాద్ త్వరలోనే గుడ్ న్యూస్ చెబుతానంటూ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.కాగా.. 'క్రిష్', 'కోయి మిల్ గయా' సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమున్న హీరో హృతిక్ రోషన్. 2000లో ఇంటీరియర్ డిజైనర్ సుస్సానే ఖాన్ని పెళ్లి చేసుకున్న ఇతడు.. 2014లో ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. దీని తర్వాత సుస్సానే మరో వ్యక్తితో రిలేషన్షిప్లో ఉండగా.. హృతిక్ కూడా షబా అనే యువ నటితో ప్రేమలో పడ్డారు. అయితే పెళ్లి విషయం గురించి ఎక్కడా కూడా ప్రస్తావించలేదు. ఇక సినిమాల విషయానికొస్తే హృతిక్ రోషన్ చివరిసారిగా యాక్షన్ చిత్రం ఫైటర్‌లో కనిపించారు. ప్రస్తుతం హృతిక్ వార్ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ సైతం కీలక పాత్ర పోషిస్తున్నారు. సబా ఆజాద్ చివరగా అమెజాన్ ప్రైమ్ వెబ్ సిరీస్‌లో నటించింది. View this post on Instagram A post shared by Hrithik Roshan (@hrithikroshan) -
జీబీలకు జీబీలు.. జియో జర్నీకి ఎనిమిదేళ్లు
ఒకప్పుడు మొబైల్ ఇంటర్నెట్ అంటే చాలా ఖరీదైన అంశం. ఒక్కో ఎంబీ డేటాను ఆచితూచి వాడుకునేవాళ్లం. ఇక వాయిస్ కాల్స్ సంగతి సరేసరి. కాలింగ్ సదుపాయాన్ని నిమిషాల లెక్కన కొనుక్కునేవాళ్లం. భారత టెలికాం మార్కెట్లో జియో అడుగు పెట్టిన తర్వాత ఈ పరిస్థితులు మారిపోయాయి. నేడు జీబీలకు జీబీలు అలవోకగా వాడేసుకుంటున్నాం. గంటలకొద్దీ వాయిస్ కాల్స్ అపరిమితంగా మాట్లాడేసుకుంటున్నాం..దేశ టెలికం మార్కెట్లోకి రిలయన్స్ జియో ప్రవేశించి ఎనిదేళ్లు అవుతోంది. 2016 సెప్టెంబర్ లో ప్రారంభమైన నాటి నుంచి జియో వినూత్న ఆఫర్లతో యూజర్లను ఆకట్టకుంటూ అగ్రస్థానికి చేరి తన జైత్రయాత్రను కొనసాగిస్తూ వస్తోంది. సున్నా నుంచి 49 కోట్ల సబ్ స్క్రైబర్ బేస్ ను చేరుకుంది. అంతే కాకుండా సున్నా నుంచి 8% దాకా అంతర్జాతీయ డేటా ట్రాఫిక్ ను పొందింది. ఫలితంగా డాటా వినియోగంలో 2016లో 155వ స్థానంలో ఉన్న భారత్ నేడే నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది. ఈ ఎనిమిదేళ్లలో దేశంలో డాటా వినియోగం 73 రేట్లు పెరిగింది. 2016లో సగటు జియో యూజర్ డేటా సగటు వినియోగం నెలకు 800 ఎంబీ కాగా ఇప్పుడది నెలకు 30 జీబీగా ఉంది.సంచలనంగా..ప్రారంభం నుంచి కూడా మార్కెట్లో సంచలనాలకు మారుపేరుగా నిలిచింది జియో. మొదటిసారిగా ఉచిత అపరిమిత కాల్స్‌ను, దేశవ్యాప్తంగా ఉచిత రోమింగ్ ను ప్రవేశపెట్టింది. దేశానికి వాయిస్ ఓవర్ ఎల్టీఈ (వీవోఎల్టీఈ)ని తీసుకొచ్చిన ఘనత కూడా జియోదే. యూజర్ల కోసం మై జియో యాప్ ను కూడా ప్రవేశపెట్టింది. వై-ఫై కాలింగ్ ద్వారా కనెక్టివిటీ ఆప్షన్లను మరింతగా మెరుగుపర్చింది. ఇక 4జీ ఎనేబుల్డ్ ఫీచర్ ఫోన్ ను ప్రవేశపెట్టడం డిజిటల్ సేవల్లో విప్లవమనే చెప్పాలి. 4జీ మౌలిక వసతులపై ఆధారపడకుండా దేశంలో విడిగా 5జీ నెట్ వర్క్ ను ఏర్పాటు చేసిన ఘనత కూడా జియోకే దక్కుతుంది.విస్తరణజియో తన సర్వీస్ ఉత్పత్తులను ఏళ్లుగా క్రమంగా విస్తరిస్తూ వచ్చింది. 2023లో జియో భారత్, జియో బుక్, జియో ఎయిర్ ఫైబర్ లను ప్రవేశపెట్టింది. జియో సబ్ స్క్రైబర్ల సంఖ్య ఊహకు అందని రీతిలో పెరిగింది. 2024 ఆగస్టు నాటికి 49 కోట్లకు చేరుకుంది. వారిలో 13 కోట్ల మంది 5జీ యూజర్లు ఉన్నారు. 2022లో జియో ట్రూ5జీ ఆవిష్కారం, 2021లో జియోఫోన్ నెక్ట్స్ ను ప్రవేశపెట్టడం, దేశంలో నంబర్ వన్ ఫైబర్ -టు-ది-హోమ్ (ఎఫ్ టీటీహెచ్) ప్రొవైడర్ జియో ఫైబర్ కావడం లాంటివి జియో సాధించిన మైలురాళ్లలో ముఖ్యమైనవి. -
బిస్మిల్లా ఖాన్ వర్థంతి: మరణంలో షెహనాయి తోడు
మృదుమధురమైన షెహనాయి స్వరాలు ఎక్కడైనా వినిపించాయంటే అందరికీ ముందుగా ప్రముఖ షహనాయి వాయిద్యకారుడు బిస్మిల్లా ఖాన్ తప్పక గుర్తుకు వస్తారు. ఈరోజు (ఆగస్టు 21) ఆ మహనీయుని వర్థింతి. నేడు సంగీత ప్రియులు ఆయనను తప్పనిసరిగా గుర్తుచేసుకుంటారు.ప్రపంచవ్యాప్తంగా షెహనాయ్కి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఘనత బిస్మిల్లా ఖాన్‌కే దక్కుతుంది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారి ఎర్రకోటపై నుంచి ప్రధాన మంత్రి ప్రసంగం అనంతరం బిస్మిల్లా ఖన్ షెహనాయి ప్లే చేశారు. ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని ప్రసంగం అనంతరం షెహనాయ్ వాయించడం ఆనవాయితీగా వస్తోంది.బిస్మిల్లా ఖాన్ 1961 మార్చి 21న బీహార్‌లోని దుమ్రాన్ గ్రామంలో జన్మించారు. బాల్యంలో అతని పేరు ఖమరుద్దీన్. తరువాత అతని తాత రసూల్ భక్ష్ అతని పేరును బిస్మిల్లాగా మార్చారు. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ కుటుంబం ఐదు తరాలుగా షెహనాయ్ వాయిస్తూ వస్తోంది. బిస్మిల్లా ఖాన్ తన 14 ఏళ్ల వయసులో తొలిసారి షెహనాయ్ వాయించారు. అనతికాలంలోనే మరింత ప్రావీణ్యం సంపాదించి, సంగీత ప్రపంచంలో షెహనాయ్కి భిన్నమైన గుర్తింపు తెచ్చారు. బనారస్ హిందూ విశ్వవిద్యాలయం అతనికి డాక్టరేట్ పట్టా ఇచ్చింది.2001లో సంగీత రంగంలో ఆయన చేసిన కృషికి గాను దేశ అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’తో ప్రభుత్వం సత్కరించింది. ఆయన 1980లో పద్మవిభూషణ్, 1968లో పద్మభూషణ్ అవార్డులు కూడా అందుకున్నారు. బిస్మాల్లా ఖాన్ మరణం తరువాత, అతను వినియోగించిన షెహనాయిని అతనితో పాటు ఖననం చేశారు.బిస్మిల్లా ఖాన్ షెహనాయి వాదనను ప్రతి ఏటా ఆగస్టు 15న దూరదర్శన్‌లో ప్రసారం చేస్తుంటారు. ఆయన షెహనాయి ప్లే చేయడం ద్వారా ఏమీ సంపాదించలేదు. ఫలితంగా పలు ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నారు. బిస్మిల్లా ఖాన్ తన తన జీవితపు చివరి రోజుల్లో ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద షెహనాయ్ వాయించాలని భావించారు. అయితే ఆ కోరిక నెరవేరకుండానే 2006 ఆగస్టు 21న బిస్మిల్లా ఖాన్ కన్నుమూశారు. -
లక్ష్య సాధనకు దిక్సూచి అయ్యి...
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో ‘మేము సైతం’ అంటూ ప్రవాస తెలంగాణవారు ‘తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్’ (టీడీఎఫ్)ను ఏర్పాటు చేశారు. ప్రొ. జయశంకర్ సార్ స్ఫూర్తితో మలి ఉద్యమంలో మొలచి, వృక్షంలా ఎదిగింది ఈ సంస్థ. పట్టుమని పది మందితో అమెరికా కేంద్రంగా న్యూయార్క్ నగరంలో 1999లో ఏర్పాటైన తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ ఆ తర్వాత శాఖోపశాఖలుగా వివిధ దేశాల్లో విస్తరించింది. పొట్టకూటి కోసం గల్ఫ్ బాట పట్టిన కార్మికుడు మొదలు, ఆస్ట్రేలియా, అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే యువకుడు కూడా ‘జై తెలంగాణ’ అని నినదించేలా చేసింది ఈ సంస్థ. నిధులు, నీళ్లు, నియామకాల్లో అప్పట్లో జరుగుతున్న అన్యాయాలను ప్రతి ఒక్కరికీ అర్థమయ్యే రీతిలో వివరించటంలో విజయవంతం అయింది టీడీఎఫ్.సామాజిక ప్రచార సాధనాల పరిధి ఇంతగా లేని రోజుల్లోనే తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరమ్ వినూత్న పంథాలో విస్తరించింది. ఉద్యమం దిశగా సమాజంలోని ప్రతి ఒక్కరినీ చైతన్యం చెయ్యడంలో కీలక భూమిక పోషించింది. అన్ని పార్టీలకు చెందిన రాజకీయ నాయకులతో పాటు, కవులు, కళాకారులను, మేధావులను కలవడం ద్వారా టీడీఎఫ్ తెలంగాణ వాణి, బాణీలను బలంగా వినిపించే ప్రయత్నం చేసింది.ఓ వైపు బతుకు దెరువు కోసం దేశ దేశాల్లో ఉద్యోగాలు, వ్యాపా రాలు చేస్తూనే, తాము కూడబెట్టిన దాంట్లో కొంత తెలంగాణ సాధన కోసం ప్రవాసులు ఖర్చు పెట్టి మరీ స్వరాష్ట్రం కోసం కృషి చేశారు. కవులు, కళాకారులను ఆహ్వానించి ఊరూరా తెలంగాణ ధూమ్ ధామ్ లను ఏర్పాటు చేశారు. వ్యయ ప్రయాసలు కోర్చి తెలంగాణ ఉద్యమ వ్యాప్తిలో తనదైన పాత్ర పోషించింది ఈ సంస్థ.ముఖ్యంగా విద్యార్థులను జాగృతం చేసింది. భవిష్యత్ తెలంగాణ బలిదానాల తెలంగాణ కావొద్దంటూ నినదించింది. ప్రత్యేక రాష్ట్రం వస్తే తెలంగాణ యువతే బాగుపడుతుందనే సందేశాన్ని బలంగా ప్రచారం చేసింది. రాజకీయ అవసరాలు, ప్రలోభాలతో ఉద్యమం పక్కదారి పట్టిన ప్పుడల్లా పట్టు విడవకుండా ఉద్యమ దివిటీని ముందుడి మోసింది. ఎక్కడెక్కడో పనిచేసే సంస్థ సభ్యులు తెలంగాణలో ప్రతీ పల్లెనూ, ప్రతీ గడపనూ తాకేలా తమ సంస్థ కార్యకలాపాలు నిర్వహించారనడం అతిశయోక్తి కాదు. ఉమ్మడి రాష్ట్ర పాలకుల హయాంలో జరిగిన మోసాలను, పక్కదారి పట్టిన నిధులను, నీటి కేటాయింపులో జరిగిన మోసాలను సమాజంలోని ప్రతి ఒక్కరూ గుర్తించేలా చేసింది.రాష్ట్రం సిద్ధించిన తర్వాత తెలంగాణ పాలన ఎజెండాను రూపొందించటంలోనూ సంస్థ కృషి మరవలేనిది. కేసులు ఎదుర్కొంటున్న వారికి అండగా నిలవటం, అమరుల కుటుంబాలను వీలైనంతగా ఆదుకోవటంలోనూ ఫోరం అగ్రభాగాన నిలిచింది. ఇప్పటికీ హెల్త్ క్యాంపుల నిర్వహణ, యువతకు క్రీడా పోటీలు, డ్రగ్స్ మహమ్మారిపై పోరాటం, రైతు చైతన్య యాత్రలు వంటి పలు కార్యక్రమాల నిర్వహిస్తూ టీడీఎఫ్ తన ఉనికిని చాటుకుంటూనే ఉంది. విదేశాల్లో తాము ఉంటున్న ప్రాంతాల్లో తెలంగాణ పండగలను నిర్వహిస్తూ మలి తరాలకు కూడా సంస్కృతీ, సంప్రదాయాలను పరిచయం చేస్తోంది.రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు మారినా తెలంగాణ ఏర్పాటు లక్ష్యాల నుంచి మరలకుండా పాలన, విధాన నిర్ణయాలు ఉండేలా టీడీఎఫ్ తన ప్రభావాన్ని చూపుతోంది. నిర్ణయాలు గాడి తప్పిన సంద ర్భాల్లో ఉద్యమ పంథానే కొనసాగిస్తూ పాలకులను, పార్టీలను ప్రశ్నించ టంతో ముందు ఉంటోంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటై పదేళ్లు దాటినా ప్రభుత్వాలు ప్రత్యేక ఎన్నారై పాలసీని ప్రకటించకపోవడం శోచనీయం. సమీప భవిష్యత్తులోనే ఎన్నారై పాలసీ రూపుదిద్దుకుంటుందనే ఆశా భావంతో టీడీఎఫ్ ఉంది. పాతికేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్, రానున్న రోజుల్లో ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తుంది.– లక్ష్మణ్ ఏనుగు, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ మాజీ అధ్యక్షుడు, న్యూయార్క్ -
పాక్‌పై విజయానికి పాతికేళ్లు.. కార్గిల్ విజయ్ దివస్న అమరజవాన్లకు ప్రధాని నివాళులు (ఫొటోలు)
-
తనకెంతో ఇష్టమైన టీచర్‌గా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము: వీడియో వైరల్
భారత రాష్ట్రపతిగా నేటితో రెండేళ్లు పూర్తి చేసుకున్న ద్రౌపది ముర్ము తనకెంతో ఇష్టమైన టీచర్‌గా అవతరించారు. కొత్తఢిల్లీలోని ప్రెసిడెంట్స్ ఎస్టేట్‌లోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ విద్యాలయంలో కాసేపు ఉపాధ్యాయురాలిగా మారిపోయారు. 9వ తరగతి విద్యార్థులతో ముచ్చటిస్తూ ఉత్సాహంగా గడిపారు. గ్లోబల్ వార్మింగ్ , పర్యావరణం లాంటి వంటి ముఖ్యమైన సమస్యలను చర్చించారు. పర్యావరణాన్ని పరిరక్షించడానికి వివిధ మార్గాలను విద్యార్థులకు సూచించారు.ఈ సందర్భంగానీటి సంరక్షణ, అడవుల పెంపకం ప్రాముఖ్యతను వివరించారు. ఎక్కువ మొక్కలు నాటాలని, నీటి వృథాను అరికట్టాలని, వర్షపు నీటి సంరక్షణ ద్వారా వాటిని సంరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ‘ఏక్ పేడ్ మా కే నామ్ (అమ్మ పేరుతో ఒక మొక్క నాటండి)’ ప్రతిపాదనను ద్రౌపది ముర్ము గుర్తు చేశారు. అలాగే ప్రతీ విద్యార్థి తమ పుట్టిన రోజున ఓ మొక్క నాటాలని పిలుపునిచ్చారు. వాయు కాలుష్యం గురించి కూడా ఆమె ప్రస్తావించారు. మీతో సంభాషించడం నిజంగా చాలా ఆనందాన్నించ్చిందనీ, మీ అందరి నుండి చాలా నేర్చుకునే అవకాశం తనకు లభించిందంటూ సంతోషాన్ని ప్రకటించారు LIVE: President Droupadi Murmu teaches the students of Class IX of Dr. Rajendra Prasad Kendriya Vidyalaya, President’s Estate, on completion of 2 year of Presidency https://t.co/FIrBrZp8qJ— President of India (@rashtrapatibhvn) July 25, 2024 -
3న శిల్పకళా వేదికలో చింగ్ హార్ట్స్..
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ నేపథ్య గాయిని మంగ్లీ స్వరాలతో నగరంలోని శిల్పకళా వేదికగా ‘చింగ్ హార్ట్స్’ పేరుతో లైవ్ మ్యూజిక్ కన్సర్ట్ను నిర్వహించనున్నారు. ఆగస్టు 3న జరగనున్న కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను రామానాయుడు స్టూడియోస్ వేదికగా సింగర్ మంగ్లీ, జబర్దస్త్ ఫేం బుల్లెట్ భాస్కర్, సంస్థ సభ్యులు అరుణ ప్రదీప్, విజయలక్షి్మ, సాయి గౌరీ, శ్రీ వల్లి ఆవిష్కరించారు. 35వ వార్షికోత్సవం నేపథ్యంలో..నిరాదరణకు గురైన బాలికలు, అనాథ చిన్నారులకు అన్నీ తామై చూసుకుంటోంది నగరంలోని సాయి సేవా సంఘ్ సామాజిక సేవా సంస్థ. 35వ వార్షికోత్సవం సందర్భంగా చిన్నారుల సహాయార్థం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇప్పటి వరకూ దాదాపు 2 వేల మంది బాలికలకు ఉచిత విద్య, వసతితో పాటు వారికి అవసరమైన సంపూర్ణ ఆరోగ్య సంరక్షణను అందింస్తుంది. నృత్యం, సంగీతం వంటి విభిన్న కళల్లో శిక్షణ అందిస్తుంది. ఆ సంస్థ వల్లే..ఈ స్థాయికి...ఏ ఆధారం లేని బాలికల ఆలనా పాలనా చూసుకోవడం అనిర్వచనీయమని మంగ్లీ అన్నారు. తనని కూడా ఆర్టీడీ అనే సంస్థ చేరదీయడం వల్లే ఈ స్థాయికి ఎదిగానని గుర్తు చేసుకున్నారు. ఇంతటి సేవను అందిస్తున్న సాయి సేవా సంఘ్ సంస్థ కోసం తాను కన్సర్ట్‌లో పాడుతున్నానని, బుక్ మై షో టిక్కెట్ల ద్వారా వచ్చే డబ్బునే కాకుండా వ్యక్తిగతంగా లక్ష రూపాయలను విరాళంగా అందిస్తానని ప్రకటించారు. ఇందులో రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి సీతక్కతో పాటు జబర్ధస్త్ ఫేం ఆటో రామ్ ప్రసాద్, బుల్లెట్ భాస్కర్, నాటీ నరేష్ వంటి ప్రముఖులు ఇందులో పాల్గొననున్నారు. -
Nanda Birth Anniversary: సొంతిల్లు లేని ప్రధాని.. జీవన భృతి కూడా వద్దంటూ..
భారతదేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ అనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే మన దేశ రెండవ ప్రధాని(తాత్కాలిక) గుల్జారీలాల్ నందా గురించి చాలా తక్కువమందికే తెలుసు. ఆయన 1964, 1966లలో రెండుసార్లు భారతదేశానికి తాత్కాలిక ప్రధానమంత్రిగా వ్యవహరించారు. నేడు (జూలై 4) గుల్జారీలాల్ నందా జన్మదినం. ఈ సందర్భంగా ఆయన జీవితంలోని కొన్ని ముఖ్యమైన విశేషాలను తెలుసుకుందాం.గుల్జారీలాల్ నందా 1898, జులై 4న ప్రస్తుత పాకిస్తాన్‌లోని సియాల్కోట్లో జన్మించారు. నందా తన విద్యాభ్యాసాన్ని లాహోర్, ఆగ్రా, అలహాబాద్లలో పూర్తి చేశారు. 1997లో ఆయనకు భారతదేశ అత్యున్నత పురస్కారం భారతరత్న లభించింది. గుల్జారీలాల్ నందా 1957, 1962లలో రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు.నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మరణానంతరం నందా 1964 మే 27న తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. నాడు అతని పదవీకాలం 13 రోజులు. దీని తరువాత తాష్కెంట్లో అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మరణించిన తరువాత నందా 1966, జనవరి 11న మరోమారు తాత్కాలిక ప్రధానిగా ప్రమాణం చేశారు. గుల్జారీ లాల్ నందా 1962, 1963లో కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిగా, 1963 నుంచి 1966 వరకు హోం వ్యవహారాల మంత్రిగా కూడా పనిచేశారు.దేశానికి రెండుసార్లు ప్రధానిగా, దీర్ఘకాలం కేంద్రమంత్రిగా పనిచేసిన గుల్జారీ లాల్ నందాకు చివరి రోజుల్లో సొంత ఇల్లు కూడా లేదు. అద్దె చెల్లించడానికి కూడా డబ్బులు లేక ఇబ్బంది పడ్డారు. కొన్ని నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో గుల్జారీ లాల్ నందాను ఇంటి యజమాని వెళ్లగొట్టాడు. ఈ వార్త దావానంలా మారడంతో నాటి కేంద్ర ప్రభుత్వం కొందరు అధికారులను నందా దగ్గరకు పంపింది. వారు స్వాతంత్ర్య సమరయోధులకు ఇచ్చే రూ. 500 భృతిని తీసుకునేందుకు నందాను అతికష్టం మీద ఒప్పించారు. గుల్జారీలాల్ నందా మాజీ ప్రధాని అని ఆ ఇంటి యజమానికి తెలియడంతో అతను నందాకు క్షమాపణలు చెప్పాడు. గుల్జారీ లాల్ నందా తన 99 సంవత్సరాల వయసులో 1998, జనవరి 15న కన్నుమూశారు. -
బ్రిల్లార్ క్లినిక్ మొదటి వార్షికోత్సవంలో మెరిసిన సినీ తారలు (ఫొటోలు)
-
మమ్మీ తిరిగొస్తోంది
హాలీవుడ్ హారర్ బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ ‘ది మమ్మీ’ రీ రిలీజ్‌కు సన్నాహాలు మొదలయ్యాయి. స్టీఫెన్ సోమర్స్ దర్శకత్వంలో 1999లో విడుదలైన ‘ది మమ్మీ’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది. ఈ యాక్షన్ అడ్వెంచరస్ హారర్ ఫిల్మ్‌లో బ్రెండెన్ ఫ్రేజర్, రాచెల్ వీజ్, జాన్ హాన్యా, ఆర్నాల్డ్ వోస్లూ, జోనాథన్ హైడ్ లీడ్ రోల్స్‌లో నటించారు. జేమ్స్ జాక్స్, సీన్ డేనియల్ నిర్మించిన ‘ది మమ్మీ’ సినిమాను 1999 మే 7న యూనివర్సల్ పిక్చర్స్ పంపిణీ చేసింది. ఈ సినిమా విడుదలై పాతిక సంవత్సరాలు సమీపిస్తున్న సందర్భంగా ఏప్రిల్ 26న థియేటర్స్‌లో రీ రిలీజ్ చేస్తున్నట్లుగా యూనివర్సల్ పిక్చర్స్ అధికారికంగా ప్రకటించింది. -
స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ వార్షికోత్సవ వేడుకలు
స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ వారు (2024 మార్చి 3వ తేదీ) 5 వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆచార్య వై. రెడ్డి శ్యామల, పీఠాధిపతి, భాషాభివృద్ధి పీఠం, డైరెక్టర్ ఐ/సి, అంతర్జాతీయ తెలుగు కేంద్రం, పొట్టి శ్రీరాములు, తెలుగు విశ్వవిద్యాలయం గారు విచ్చేసి తెలుగు భాష మన దైనందిన జీవితానికి ఎంతో ముఖ్య మైనది అని వివరించారు అన్నమయ్య పద మాధుర్యం గురించి మాట్లాడుతూ శేషుకుమారి గానం, ప్రత్యూష నాట్యం మేళ వింపుతో ప్రేక్షకులను మైమరపింప చేశారు. ఈ కార్యక్రమానికి STS వైస్ ప్రెసిడెంట్ జ్యోతీ శ్వర్, TAS (మనం తెలుగు) అసోసియేషన్ అనిత రెడ్డి శ్రీ సాంస్కృతిక కళా సారథి రత్న కుమార్ కమల క్లబ్ అధ్యక్షులు, సారీ కనెక్షన్ అడ్మిన్ పద్మజ నాయుడు మగువ మనసు అడ్మిన్ ఉష, సింగపూర్ తెలుగు వనితలు క్రాంతి, జయ, ప్రత్యూష తదితర సింగపూర్ తెలుగు కమ్యూనిటీ వ్యవస్థాపకులు హాజరు కావటం విశేషం. స్వరలయ ఆర్ట్స్, సింగపూర్ వ్యవస్థాపక అధ్యక్షురాలు యడవల్లి శేషుకుమారి, శిష్యులుచిన్నారులు కీర్తనలు, స్వరలయ ఆర్ట్స్, సింగపూర్‌కు అనుబంధ సంస్థ అభినయ నాట్యాలయ చిన్నారులు ,ప్రత్యూష శిష్య బృందం నాట్యం ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి పొట్టి శ్రీరాములు, తెలుగు విశ్వవిద్యాలయం సర్టిఫికేట్ కోర్సు మొదటి వత్సరం ఉత్తీర్ణత పొందిన స్వరలయ ఆర్ట్స్ విద్యార్థులకు ఆచార్య వై. రెడ్డి శ్యామల బహుమతి ప్రదానం చేశారు. అతిథులకుయడవల్లి శేషుకుమారి ఆచార్య వై. రెడ్డి శ్యామల మూమెంటోలను బహుకరించారు. మృదంగ వాయిద్య సహకారాన్ని శివ కుమార్ అందించారు. ఈ కార్యక్రమానికి సౌజన్య, ప్రసన్న వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. పలువురికీ లలిత కళా రంగంలో ఉత్సాహ పరుస్తూ ముందుకు నడిచే ఇటువంటి కార్యక్రమానికి దాదాపుగా 150 మంది హాజరు కావటమే కాకుండా.. సాంఘిక మాధ్యమాలాద్వారా కూడా వీక్షించి విశేషస్పందన తెలియజేయటం అభినందనీయం.