![Rana Daggubati Wife Miheeka Bajaj Drops Unseen Pics On 2nd Anniversary - Sakshi](/styles/webp/s3/article_images/2022/08/9/rana-daggubati.jpg.webp?itok=WmmRdKWH)
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే హీరోల్లో రానా దగ్గుబాటి ఒకరు. అలాంటి రానా ఉన్నట్లుండి ఇన్‌స్టాగ్రామ్ పోస్టులన్నీ డిలీట్ చేయడం, అది కూడా పెళ్లిరోజే పోస్టులు తొలగించడం పలు అనుమానాలకు తావిచ్చింది. పెళ్లిరోజుకు ఒకరోజు ముందే సోషల్ మీడియా బ్రేక్ కూడా ప్రకటించడంతో రానా పర్సనల్ లైఫ్‌పై నెట్టింట చర్చ మొదలైంది. భార్య మిహికాకు-రానాకు మధ్య ఏమైనా విబేధాలు తలెత్తాయన్న రూమర్స్ కూడా గుప్పుమన్నాయి.
చదవండి: నమ్రతను ఒప్పుకోని మహేశ్ ఫ్యామిలీ.. అప్పుడు ఏం చేశారంటే..
అయితే తాజాగా రానా భార్య మిహికా ఈ వార్తలకు చెక్ పెట్టింది. సెకండ్ ఆనివర్సరీ సందర్భంగా భర్తతో కలిసి దిగిన కొన్ని బ్యూటిఫుల్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో రానా-మిహికాలకు సంబంధించి నెట్టింట వైరల్ అవుతున్న వార్తల్లో నిజం లేదని తేలిపోయింది.
ఇక మిహికా పోస్ట్ చూసి వెంకటేశ్ కూతురు ఆశ్రితతో పాటు పలువురు సెలబ్రిటీలు ఈ కపుల్స్‌కి ఆనివర్సరీ విషెస్‌ను తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ‘పని జరుగుతోంది. సోషల్ మీడియా నుంచి కాస్త విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను అంటూ రానా ట్వీట్ చేసి అభిమానులకు షాకిచ్చిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment