ashritha
-
ఎంగేజ్ విత్ సిటీ..
లామకాన్‌లో సంగీత దినోత్సవం..ప్రపంచ సంగీత దినోత్సవాన్ని పురస్కరించుకుని పాశ్చాత్య సంగీత ప్రియుల కోసం అశ్రిత డిసౌజా ఆధ్వర్యంలో పాప్, జాజ్, డిస్నీ సాంగ్స్ పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. బంజారాహిల్స్‌లోని లామకాన్‌లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం సాయంత్రం 5 నుంచి 2 గంటల పాటు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. – సాక్షి, సిటీబ్యూరోచిన్నారుల కోసం మ్యాక్స్ కిడ్స్ ఫెస్టివల్..ప్రతిభావంతులైన చిన్నారుల కోసం ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ మ్యాక్స్ కిడ్స్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది. ఈ విషయాన్ని సంస్థ ప్రతినిధులు తెలిపారు.చిన్నారుల ఊహలకు డ్రాయింగ్, కలరింగ్స్తో ఊపిరిపోసే విధంగా వారిలోని ఊహాశక్తిని, సృజనను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమ ఉద్ధేశ్యమని, తమ మ్యాక్స్ స్టోర్ అందించే రీసైక్లింగ్ పేపర్‌తో తయారు చేసిన షాపింగ్ బ్యాగ్‌పై ‘భూమిని కాపాడే సూపర్‌హీరో’ అనే నేపథ్యంతో చిత్రాలను గీయాల్సి ఉంటుందని వివరించారు. తుది ఏడుగురు విజేతలకు పూర్తిస్థాయి ఖర్చులతో కుటుంబంతో సహా కశ్మీర్ పర్యటనను గెలుచుకుంటారని తెలియజేశారు. వివరాలకు దగ్గర్లోని మ్యాక్స్ స్టోర్‌లో సంప్రదించాలన్నారు. – సాక్షి, సిటీబ్యూరోఇవి చదవండి: 'షావోమీ 14 సీవీ మోడల్' ఆవిష్కరణ.. సినీతార వర్షిణి సౌందరాజన్.. -
సమంత అనారోగ్యంపై స్పందించిన మరో అక్కినేని హీరో, వెంకటేశ్ కూతురు
సమంత ఆరోగ్య పరిస్థితిపై సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఆమె రెట్టింపు శక్తితో తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని సామ్యే స్వయంగా తెలిపింది. దీంతో సామ్ త్వరగా కోలుకుకోవాలని కోరుకుంటూ ఇటూ ఫ్యాన్స్, అటూ సినీ సెలబ్రెటీలు సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షిస్తున్నారు. ఇప్పటికే ఆమె అనారోగ్య పరిస్థితిపై మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, అక్కినేని హీరో అఖిల్, నటి వరలక్ష్మి శరత్ కుమార్, కీర్తి సురేశ్‌తో పాటు పలువురు నటీనటులు స్పందిస్తు ఆమెకు ధైర్యం చెబుతున్నారు. చదవండి: సిద్దార్థ్, అదితిల సీక్రెట్ డేటింగ్? వైరల్‌గా హీరో పోస్ట్ అలాగే దగ్గుబాటి వారసురాలు, విక్టరి వెంకటేశ్ కూతురు అశ్రిత సైతం సామ్ పోస్ట్‌పై స్పందించింది. సమంత పోస్ట్‌కు అశ్రిత ఆసక్తికరంగా కామెంట్స్ చేసింది. ‘నీ గురించి నీకు తెలియదు.. నీలో ఎంతో బలం ఉంది.. నీ శక్తి గురించి నీకు తెలియదు.. అనంతమైన ప్రేమను నీకు పంపుతున్నా’ అంటూ రెడ్ హాట్ ఎమోజీలను జత చేసింది. అలాగే మరో అక్కినేని హీరో సుశాంత్ కూడా సామ్ పోస్ట్‌పై స్పందించాడు. ‘నువ్వు మరింత శక్తి, బలంతో ఉండాలని కోరుకుంటున్నా. త్వరలోనే నువ్వు దీన్ని అదిగమిస్తావు సామ్’ అంటూ ధైర్యం ఇచ్చాడు. దీంతో వారి కామెంట్స్ చూసి సామ్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వారి కామెంట్స్ నెట్టింట చర్చనీయాంశమయ్యాయి. ఇదిలా ఉంటే సామ్ ఆనారోగ్యంపై ఆమె మాజీ భర్త, హీరో నాగ చైతన్య స్పందన కోసం సమంత ఫ్యాన్స్‌తో పాటు అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) చదవండి: సమంతకు సోకిన మయోసైటిస్ అంటే ఏంటి? లక్షణాలు ఎలా ఉంటాయంటే.. Rambha Car Accident: హీరోయిన్ రంభ కారుకు ప్రమాదం, ధ్వంసమైన కారు.. ఫొటోలు వైరల్ -
పెళ్లిరోజే పోస్టులు డిలీట్.. రానా భార్య ఏం చేసిందంటే..
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే హీరోల్లో రానా దగ్గుబాటి ఒకరు. అలాంటి రానా ఉన్నట్లుండి ఇన్స్టాగ్రామ్ పోస్టులన్నీ డిలీట్ చేయడం, అది కూడా పెళ్లిరోజే పోస్టులు తొలగించడం పలు అనుమానాలకు తావిచ్చింది. పెళ్లిరోజుకు ఒకరోజు ముందే సోషల్ మీడియా బ్రేక్ కూడా ప్రకటించడంతో రానా పర్సనల్ లైఫ్‌పై నెట్టింట చర్చ మొదలైంది. భార్య మిహికాకు-రానాకు మధ్య ఏమైనా విబేధాలు తలెత్తాయన్న రూమర్స్ కూడా గుప్పుమన్నాయి. చదవండి: నమ్రతను ఒప్పుకోని మహేశ్ ఫ్యామిలీ.. అప్పుడు ఏం చేశారంటే.. అయితే తాజాగా రానా భార్య మిహికా ఈ వార్తలకు చెక్ పెట్టింది. సెకండ్ ఆనివర్సరీ సందర్భంగా భర్తతో కలిసి దిగిన కొన్ని బ్యూటిఫుల్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో రానా-మిహికాలకు సంబంధించి నెట్టింట వైరల్ అవుతున్న వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. ఇక మిహికా పోస్ట్ చూసి వెంకటేశ్ కూతురు ఆశ్రితతో పాటు పలువురు సెలబ్రిటీలు ఈ కపుల్స్‌కి ఆనివర్సరీ విషెస్‌ను తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ‘పని జరుగుతోంది. సోషల్ మీడియా నుంచి కాస్త విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను అంటూ రానా ట్వీట్ చేసి అభిమానులకు షాకిచ్చిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Miheeka Daggubati (@miheeka) View this post on Instagram A post shared by Bunty Bajaj (@buntybajaj) -
రానా భార్య ఫోటోకి కామెంట్ చేసిన సమంత..
టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి భార్య మిహికా బజాజ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి సంబంధించిన ఎప్పటికప్పుడు పోస్టులు షేర్ చేస్తుంటుంది. తాజాగా ఓ ఫ్రెండ్ వెడ్డింగ్‌లో రానా- మిహికా దంపతులు సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను మిహికా సోషల్ మీడియాలో షేర్ చేయగా నెటిజన్లతో పాటు సమంత కూడా రియాక్ట్ అయ్యింది. చదవండి: త్వరలోనే తల్లి కాబోతున్న రానా భార్య? పోస్టుతో క్లారిటీ 'నీ అవుట్‌ఫిట్ నాకు నచ్చింది' అంటూ మిహికా పోస్టుకు సమంత కామెంట్ చేయగా థ్యాంక్యూ.. అంటూ ఆమె మిహికా ఇచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా నాగచైతన్యతో విడిపోయినప్పటికీ సమంత ఆ ఫ్యామిలీ మెంబర్స్‌తో ఇప్పటికీ టచ్‌లోనే ఉండటం విశేషం. వెంకటేశ్ కూతురు ఆశ్రిత, మిహికాలతో పాటు పలువురితో సమంతకు ఇప్పటికీ మంచి ఫ్రెండిప్ ఉంది. అంతేకాకుండా సోషల్ మీడియాలోనూ నాగ చైతన్య మినహా నాగార్జున, అఖిల్ సహా అక్కినేని కుటుంబసభ్యులను సమంత ఇప్పటికీ ఫాలో అవుతుంది. చదవండి: సమంతకు కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన లేడీ సూపర్‌స్టార్ -
సమంత పోస్ట్‌పై వెంకటేశ్ కూతురు అశ్రిత ఆసక్తికర కామెంట్
నాగ చైతన్యతో విడిపోయినప్పటీ నుంచి సమంత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్‌గా ఉంటున్నారు. విడాకుల ప్రకటన అనంతరం తను ఏం చెప్పాలనుకున్నా ఇన్స్టాగ్రామ్ ద్వారానే మాట్లాడుతున్నారు. ఇక తన బాధను, భావోద్యేగాలను సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తున్నారు. అమ్మ చెప్పింది అనే హ్యాష్ ట్యాగ్ ద్వారా తన ప్రస్తుత కండిషన్‌ను చెప్పే ప్రయత్నం చేస్తున్నారామే. దీంతో సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ప్రతి పోస్ట్ చర్చనీయాంశం అవుతుంది. అంతేగాక తన నెక్ట్ పోస్ట్ ఏంటీ, ఈ సారి ఆమె ఎలా స్పందించబోతున్నారా? అని ఫ్యాన్స్, ఫాలోవర్స్‌లో కూడా ఆసక్తి నెలకొంది. చదవండి: మీ కూతురిని ఎవరు పెళ్లి చేసుకుంటారా అని కంగారు పడకండి: సామ్ ఆసక్తికర పోస్ట్ ఇదిలా ఉంటే ఇటీవల ఆమె తన స్నేహితురాలు, మోడల్ శిల్పారెడ్డితో ఛార్‌ధామ్ యాత్ర అనంతరం సమంత.. కూతుళ్ల పెళ్లి విషయంలో తల్లిదండ్రులు ఎలా ఆలోచించాలనే విషయాన్ని చెబుతూ ఓ పోస్ట్ షేర్ చేసిన సంగతి తెలిసిందే. దీనితో పాటు ఆమె పెయింటింగ్ వేస్తున్న ఫొటోను కూడా పంచుకున్నారు. ఇక తన పోస్ట్‌పై హీరో వెంకటేశ్ పెద్ద కూతురు అశ్రిత స్పందించడం హాట్‌టాపిక్‌గా మారింది. అయితే చై-సామ్ విడాకుల ప్రకటన అనంతరం దీనిపై నాగార్జున మినహా అక్కినేని కుటుంబ సభ్యులు కానీ ఇటూ దగ్గుబాటి కుటుంబంలో వెంకటేశ్ తప్పా ఎవరూ స్పందించలేదు. అంతేగాక సమంత పెట్టే సోషల్ మీడియా పోస్టులను కూడా చూసి చూడనంటూ వదిలేస్తున్నారు. చదవండి: తమన్నా వల్ల రూ. 5 కోట్లు నష్టపోయాం!: మాస్టర్ చెఫ్ నిర్వాహకులు కానీ అశ్రిత తొలిసారిగా సామ్ పోస్ట్‌పై స్పందించడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. సమంత షేర్ చేసిన తన పెయింటింగ్ ఫొటోపైనామె ఆసక్తికరంగా కామెంట్ చేశారు. దీంతో ఇది చర్చకు దారి తీసింది. అసలు అశ్రిత ఏమని స్పందించారంటే.. ‘ఇక నువ్వు స్వేచ్ఛగా పెయింటింగ్ వేసుకోవచ్చు’ అంటూ కామెంట్ చేశారు. అశ్రిత కామెంట్ చూసిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఆమె కామెంట్లో మరెదో ఆంతర్యం ఉందని, చై-సామ్ విడాకుల విషయంలో అశ్రిత హర్ట్ అయినట్టు కనిపిస్తోందంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదే పోస్టుపై పలువురు సినీ సెలబ్రెటీలు సైతం స్పందిస్తున్నారు. దీనిపై మంచు లక్ష్మి స్పందిస్తూ.. ‘నిన్ను ఇలా సరదాగా చూడటం సంతోషంగా ఉంది’ అంటూ కామెంట్ చేశారు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Infinity Platter (@infinityplatter) -
భారతదేశ తొలి మహిళా ఫ్లయిట్ టెస్ట్ ఇంజినీర్
కర్ణాటక రాష్ట్రం ఇప్పుడు ఒకందుకు గర్విస్తుంది. భారతదేశ తొలి మహిళా ఫ్లయిట్ టెస్ట్ ఇంజినీర్ మా రాష్ట్రం నుంచి దేశానికి లభించింది అని ఆ రాష్ట్రం ఆశ్రిత వి. ఓలేటిని చూసి పొంగిపోతోంది. 1973 నుంచి ఎయిర్‌ఫోర్స్ నిర్వహిస్తున్న ఈ పరీక్షను కేవలం 275 మంది పాసవ్వగా వారిలో తొలి మహిళగా ఆశ్రిత చరిత్ర సృష్టించింది. ఇకమీద భారతీయ ఎయిర్‌ఫోర్స్‌లో ఏ విమానం కొనాలన్నా, సేవలు మొదలెట్టాలన్నా దానిని పరీక్షించే ఓ.కె చేయాల్సిన బాధ్యత ఆశ్రితదే. కర్ణాటక రాష్ట్రం కొల్లెగల్ కు చెందిన ఆశ్రిత బెంగళూరులో ఇంజినీరింగ్ చేసింది. అది విశేషం కాదు. 2014లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ లో చేరి స్క్వాడ్రన్ లీడర్ అయ్యింది. అది కూడా విశేషం కాదు. కాని ‘ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ టెస్ట్ పైలెట్ స్కూల్’ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ‘ఫ్లయిట్ టెస్ట్ కోర్స్’ (43వ బ్యాచ్)లో ఉత్తీర్ణత చెందింది. అదీ విశేషం. ప్రపంచంలో కేవలం 7 మాత్రమే ఉండే ఇలాంటి స్కూల్స్‌లో ఈ కోర్సులో ఉత్తీర్ణత చెందడమే కాకుండా భారతదేశ తొలి మహిళా ఫ్లయిట్ టెస్ట్ ఇంజినీర్ కావడం ఇంకా పెద్ద విశేషం. ఐ.ఎ.ఎఫ్ ఈ విషయాన్ని తన అఫీషియల్ ట్విటర్ ఖాతాలో ప్రకటించి ఆశ్రితకు అభినందనలు తెలిపింది. ఇండియన్ ఆర్మీలో ప్రస్తుతం 6,807 మంది మహిళా ఆఫీసర్లు పని చేస్తున్నారు. ఎయిర్‌ఫోర్స్‌లో 1607 మంది మహిళా ఆఫీసర్లు పని చేస్తున్నారు. నేవీలో వీరి సంఖ్య 704 మాత్రమే. పురుషులతో పోలిస్తే త్రివిధ దళాలలో స్త్రీ శాతం తక్కువే అయినా ఇటీవల కాలంలో మారిన పరిస్థితుల్లో జెండర్ అడ్డంకులు అధిగమించి స్త్రీలు ఆ మూడు సైనిక విభాగాలలో తమ స్థానాన్ని నిరూపించుకుంటున్నారు. 2015 నుంచి ఎయిర్ ఫోర్స్ తన ఫైటర్ విభాగంలో మహిళల ప్రవేశాన్ని ఆమోదించాక సరిగ్గా ఆరేళ్లకు ఆశ్రిత తనదైన ఘనతను సాధించింది. -
ఘనంగా వెంకటేష్ కూతురి వివాహం
టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ పెద్ద కూతురి వివాహం జైపూర్‌లో ఆదివారం ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ఆశ్రిత, వినాయక్‌లు పెళ్లి వేడుకను నిర్వహించారు. ఈ వేడుకకు టాలీవుడ్, బాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ రోజు ఉదయం జరిగిన పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలను మెగా కోడలు ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేశారు. వధూవరులతో పాటు వెంకటేష్ దంపతులతో కలిసి చరణ్ ఉపాసన దిగిన ఫోటో, చరణ్ బెస్ట్ ఫ్రెండ్ యంగ్ హీరో రానా తో కలిసి దిగిన ఫోటోలను ఉపాసన ట్విటర్లో పోస్ట్ చేశారు. హైదరాబాద్ రేస్ క్లబ్ అధినేత సురేందర్ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డి, ఆశ్రీతలు కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. ఇప్పుడు పెద్దల అంగీకారంతో ఈ ఇద్దరు ఒక్కటయ్యారు. పెళ్లి వేడుకను అత్యంత సన్నిహితుల మధ్యే నిర్వహించిన దగ్గుబాటి ఫ్యామిలీ సినీ ప్రముఖుల కోసం త్వరలో హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ ఇవ్వనుందని తెలుస్తోంది. Congratulations Venky uncle Neeru aunty Aashritha & Vinayak. ❤️wishing u all the very best. @RanaDaggubati & Mr C u guys r super Jaipur déjà vu 😉 😁#besties #ramcharan pic.twitter.com/MZry4zckUj — Upasana Konidela (@upasanakonidela) 24 March 2019 -
దగ్గుబాటి కల్యాణ వైభోగమే...
హీరో వెంకటేశ్ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. ఆయన పెద్ద కుమార్తె అశ్రిత వివాహం హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సురేంద్ర రెడ్డి మనవడు వినాయక్ రెడ్డితో నేడు జరగనుంది. కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో రాజస్తాన్‌లో జరగనున్న ఈ డెస్టినేషన్ వెడ్డింగ్‌లో భాగంగా జరిగిన వేడుకలో రానా, నాగచైతన్య, సమంత, బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ మరికొందరు పాల్గొన్నారు. శనివారం జరిగిన సంగీత్ కార్యక్రమంలో రానా, నాగచైతన్య డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు హైలైట్‌గా నిలిచాయని సమాచారం. నాగచైతన్య, సమంత వివాహ వేడుకల్లో అతిథులతో వెంకటేశ్ -
టీచర్ పనిష్మెంట్ ప్రాణం తీసింది
హోంవర్క్ చేయలేదని విద్యార్థినికి రెండు గంటలపాటు శిక్ష ⇒అస్వస్థతకు గురై వారం రోజులకు చిన్నారి మృతి ⇒కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో వివేకవర్ధిని పాఠశాల నిర్వాకం ⇒స్కూలు ముందు చిన్నారి శవంతో బంధువులు, విద్యార్థి సంఘాల ఆందోళన ⇒పాఠశాలపై దాడి, ఫర్నిచర్ ధ్వంసం ⇒30లోపు నివేదిక ఇవ్వాలంటూ కలెక్టర్‌కు బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ నోటీసులు హుజూరాబాద్ టౌన్: హోంవర్క్ చేయని పాపానికి టీచర్ విధించిన శిక్ష ఓ చిన్నారిని బలిగొంది! పసిపాప అని కూడా చూడకుండా ఏకంగా రెండు గంటలపాటు మోకాళ్లపై నిల్చోబెట్టి అమానుషంగా ప్రవర్తించింది ఆ ఉపాధ్యాయురాలు. చిన్నారి బంగారు భవిష్యత్తుపై ఎన్నో కలలుకన్న తల్లిదండ్రులకు గుండెకోతను మిగిల్చింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన కొలిపాక సమ్మయ్య, రమ దంపతులకు ఇద్దరు కుమార్తెలు అక్షిత(12), అశ్రీత(10). సమ్మయ్య ఓ ప్రైవేట్ కంపెనీలో గుమస్తా. రమ రజక వృత్తి చేస్తారు. తమ పిల్లలకు మంచి భవిష్యత్తును అందించాలనే తపనతో ఆర్థిక ఇబ్బందులను లెక్కచేయకుండా ఇద్దరినీ పట్టణంలోని వివేకవర్ధిని అనే ప్రైవేట్ పాఠశాలలో చేర్పించారు. అక్షిత ఆరో తరగతి, అశ్రీత ఐదో తరగతి చదువుతున్నారు. ఈ నెల 16న స్కూల్లో గణితం బోధించే కళావతి అనే టీచర్.. హోంవర్క్ చేయలేదంటూ అశ్రీతను రెండు గంటల పాటు కదలకుండా మోకాళ్లపై నిల్చోబెట్టింది. సాయంత్రం స్కూలు నుంచి ఇంటికి వెళ్లిన అశ్రీత జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. కొద్దిసేపటికే మోకాళ్ల నొప్పి భరించలేక అస్వస్థతకు గురైంది. తల్లిదండ్రులు స్థానికంగా ఉన్న ఓ ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతుండగా.. స్కూలు కరస్పాండెంట్ ప్రసాద్ విద్యార్థిని ఇంటికి వచ్చి వరంగల్‌లోని ఓ ప్రైవేట్ హోమియోపతి ఆసుపత్రికి తీసుకెళ్లమని సలహా ఇచ్చారు. దీంతో వారు ప్రసాద్ చెప్పిన ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేరుుంచారు. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఎంజీఎంలో చికిత్స పొందుతూ అశ్రీత గురువారం ఉదయం 7 గంటలకు మృతి చెందింది. అశ్రీత మృతి వార్త తెలియడంతో గురువారం పాఠశాలను తెరవలేదు. మృతదేహంతో స్కూలు ముందు ఆందోళన.. అశ్రీత మృతికి టీచరే కారణమంటూ కుటుంబ సభ్యులు, బంధువులు, విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాల ఎదుట చిన్నారి మృతదేహంతో ఆందోళనకు దిగారు. సమాధానం చెప్పేవారు ఎవరూ లేకపోవటంతో ఆగ్రహంతో తరగతి గదుల్లో ఉన్న ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఎనిమిది గంటల పాటు ఆందోళన చేశారు. సాయంత్రం 4 గంటలకు కరీంనగర్ ఆర్డీవో చంద్రశేఖర్ పాఠశాలకు వచ్చి, పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పూర్తి వివరాలు సేకరించి కలెక్టర్‌కు నివేదిస్తామని తెలిపారు. శాంతించిన బంధువులు పోస్టుమార్టం బాలిక మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ ప్రతి విద్యార్థికి దండనే? వివేకవర్ధిని పాఠశాలలో హోంవర్కులు చేయకున్నా, సమయానికి రాకున్నా విద్యార్థులకు దండన తప్పడం లేదు. గుంజీలు తీయించడం, గోడ కుర్చీ వేయడం, మోకాళ్లపై నిలబెట్టడం, బెత్తం దెబ్బలు వంటి పనిష్మెంట్ ప్రతి రోజు ఉంటాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 30లోగా నివేదిక ఇవ్వండి: బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ అశ్రీత మృతికి గల కారణాలను తెలుసుకుని ఈనెల 30వ తేదీలోగా నివేదిక సమర్పించాలని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు అచ్యుతరావు జిల్లా కలెక్టర్, ఎస్పీ, డీఈవోలకు గురువారం సాయంత్రం నోటీసులు జారీ చేశారు. స్కూళ్లల్లో పాఠాలు చెప్పేవారే రాక్షసులుగా మారి పిల్లల ప్రాణాలను బలితీసుకోవడం వంటి చర్యలను సహించబోమని ఆయన స్పష్టం చేశారు.