ఎంగేజ్‌ విత్‌ సిటీ.. | Engage With City | Sakshi
Sakshi News home page

ఎంగేజ్‌ విత్‌ సిటీ..

Jun 20 2024 1:19 PM | Updated on Jun 20 2024 1:19 PM

Engage With City

లామకాన్‌లో సంగీత దినోత్సవం..
ప్రపంచ సంగీత దినోత్సవాన్ని పురస్కరించుకుని పాశ్చాత్య సంగీత ప్రియుల కోసం అశ్రిత డిసౌజా ఆధ్వర్యంలో పాప్, జాజ్, డిస్నీ సాంగ్స్‌ పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. బంజారాహిల్స్‌లోని లామకాన్‌లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం సాయంత్రం 5 నుంచి 2 గంటల పాటు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. – సాక్షి, సిటీబ్యూరో

చిన్నారుల కోసం మ్యాక్స్‌ కిడ్స్‌ ఫెస్టివల్‌..
ప్రతిభావంతులైన చిన్నారుల కోసం ప్రముఖ ఫ్యాషన్‌ బ్రాండ్‌ మ్యాక్స్‌ కిడ్స్‌ ఫెస్టివల్‌ నిర్వహిస్తోంది. ఈ విషయాన్ని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

చిన్నారుల ఊహలకు డ్రాయింగ్, కలరింగ్స్‌తో ఊపిరిపోసే విధంగా వారిలోని ఊహాశక్తిని, సృజనను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమ ఉద్ధేశ్యమని, తమ మ్యాక్స్‌ స్టోర్‌ అందించే రీసైక్లింగ్‌ పేపర్‌తో తయారు చేసిన షాపింగ్‌ బ్యాగ్‌పై ‘భూమిని కాపాడే సూపర్‌హీరో’ అనే నేపథ్యంతో చిత్రాలను గీయాల్సి ఉంటుందని వివరించారు. తుది ఏడుగురు విజేతలకు పూర్తిస్థాయి ఖర్చులతో కుటుంబంతో సహా కశ్మీర్‌ పర్యటనను గెలుచుకుంటారని తెలియజేశారు. వివరాలకు దగ్గర్లోని మ్యాక్స్‌ స్టోర్‌లో సంప్రదించాలన్నారు. – సాక్షి, సిటీబ్యూరో

ఇవి చదవండి: 'షావోమీ 14 సీవీ మోడల్‌' ఆవిష్కరణ.. సినీతార వర్షిణి సౌందరాజన్‌..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement