banjara hills
-
కొత్తవారికి ఈ నెల రేషన్ లేనట్లే..!
బంజారాహిల్స్: కొత్త రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో దరఖాస్తుదారులు మీ–సేవా కేంద్రాలకు క్యూ కట్టారు. బంజారాహిల్స్ రోడ్డు నంబర్–7లోని మీ–సేవా కేంద్రంతో పాటు ఖైరతాబాద్‌లోని ఆర్టీఏ కార్యాలయ ఆవరణలోని సెంటర్ల వద్ద ఉదయం నుంచే బారులుదీరారు. కొత్త కార్డుతో పాటు ప్రస్తుత కార్డులో కొత్తపేర్లు చేర్చాలని ఆధార్‌తో పాటు కరెంట్ బిల్లు, గ్యాస్ బిల్లును జతచేసి దరఖాస్తు చేసుకున్నారు. సిబ్బంది సైతం అప్పటికప్పుడే ఆన్లైన్లో నమోదు చేశారు. బంజారాహిల్స్‌లోని మీ–సేవా కేంద్రానికి ఒక్కరోజే దాదాపు 1000 మంది వరకు, అలాగే బస్తీలు, కాలనీల్లోని మీ–సేవా కేంద్రాలకు కూడా దరఖాస్తుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.మరికొద్ది రోజుల పాటు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు సిబ్బంది తెలిపారు. రేషనింగ్ ఖైరతాబాద్ సర్కిల్–7 పరిధి కిందికి వచ్చే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వేంకటేశ్వరకాలనీ, సోమాజీగూడ, ఖైరతాబాద్, రహమత్‌నగర్, యూసుఫ్‌గూడ, వెంగళరావునగర్, బోరబండ, ఎర్రగడ్డ, సనత్‌నగర్, అమీర్‌పేట డివిజన్ల పరిధిలోని 81 రేషన్ షాపుల పరిధిలో కొత్తగా రేషన్ కార్డు కోసం మీ–సేవా కేంద్రాలకు వెళ్లి సదరు దరఖాస్తు ఫారానికి సంబంధిత డాక్యుమెంట్లు జతపరిచి ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు. సర్కిల్–7 పరిధిలో 83,013 రేషన్‌కార్డులు.. ఖైరతాబాద్ సర్కిల్–7 పరిధిలో 81 రేషన్ షాపులు ఉండగా ప్రస్తుతం వీటి పరిధిలో ఆహార భద్రత కార్డులు 79,531, అంత్యోదయ అన్నయోజన కార్డులు 3481, ఒక అన్నపూర్ణ కార్డు కలిపి మొత్తం 83,013 కార్డులు ఉన్నాయి. ఈ కార్డుల్లో 2,92,882 మంది లబి్ధదారులు ఉన్నారు. వీరికి ప్రతినెలా ఒక్కొక్కరికీ 6 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నారు. సర్కిల్ పరిధిలో మొత్తం ప్రతినెలా 18,19,011 కిలోల రేషన్ బియ్యం అందిస్తున్నారు. కొత్తవారికి ఈ నెల రేషన్ లేనట్లే..!ప్రజాపాలనలో భాగంగా స్వీకరించిన దరఖాస్తుల్లో గత నెల 6,093 మందిని అర్హులుగా గుర్తించి సర్వే చేయగా ఇందులో 2,938 మందిని లబ్ధిదారులుగా గుర్తించారు. అయితే జీహెచ్ఎంసీ పరిధిలో నూతన లబ్ధిదారులకు ఇప్పటివరకు పంపిణీ చేయలేదు. ఈనెల కూడా వారికి రేషన్ లేనట్లేనని తెలుస్తోంది. -
Banjara Hills: అక్కా అంటూ పరిచయం చేసుకుని...
బంజారాహిల్స్(హైదరాబాద్): అక్కా అంటూ పిలుస్తూ ఓ కుటుంబంతో పరిచయం పెంచుకున్న యువకుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో మద్యం మత్తులో ఆమె కూతురిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..మోతీనగర్‌లో నివసించే బత్తుల శివ (33) కారు డ్రైవర్‌గా జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–45లోని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ డైరెక్టర్ వద్ద పనిచేస్తున్నాడు. అదే కంపెనీ బిల్డింగ్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న మహిళను పరిచయం చేసుకుని అక్కా అంటూ తరచూ ఇంటికి వెళ్తూ ఆమె భర్తతో కలిసి మద్యం తాగేవాడు. శనివారం రాత్రి బాధిత యువతి తండ్రి తీర్థయాత్రలకు వెళ్లగా, తల్లి అదే బిల్డింగ్ మొదటి అంతస్తులో పని కోసం వెళ్లింది. బాధితురాలి సోదరుడు కూడా అదే బిల్డింగ్‌కు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుండగా మొదటి అంతస్తులో ఉన్నాడు. రాత్రి 8 గంటల సమయంలో బాధిత యువతి ఇంట్లో ఉండగా బత్తుల శివ వచ్చాడు. రాత్రి 11.30 గంటల వరకు ఇద్దరు మాట్లాడుకున్నాక..ఇక తాను వెళ్తానని శివ చెప్పగా యువతి బెడ్‌పై నిద్రకు ఉపక్రమించింది. అరగంట తర్వాత ఆమె మేల్కొనగా..శివ కదలికలు కనిపించడంతో ఒక్కసారిగా అరవాలని ప్రయత్నించింది. దిండుతో ఆమె నోరు నొక్కేసి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని, నువ్వు ప్రేమించిన యువకుడితో పెళ్లి చేస్తానని నమ్మించాడు. అర్ధరాత్రి ఒంటి గంటకు ఇంట్లో నుంచి వెళ్లిపోగా జరిగిన ఘటనపై బాధిత యువతి తీవ్రంగా రోదిస్తూ తల్లికి విషయం చెప్పింది. ఈ మేరకు పోలీసులు బత్తుల శివపై బీఎన్ఎస్ సెక్షన్ 64 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అదుపు తప్పి.. వేగంగా ఢీకొట్టి..
బంజారాహిల్స్: ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్నవారి నుంచి కారు దూసుకెళ్లడంతో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలైన ఘటన బంజారాహిల్స్‌లో చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్‌కు చెందిన ఆభరణాల వ్యాపారి తనయుడు సాధుల హర్షవర్ధన్ మరో ఐదుగురు స్నేహితులతో కలిసి బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–13లోని సాయి మెన్షన్ అపార్ట్మెంట్లో అద్దెకు ఉంటున్నాడు. ఆయనే నిర్మాతగా, హీరోగా అర్జున్ దేవర అనే సినిమాలో నటిస్తున్నాడు. శుక్రవారం రాత్రి హర్షవర్ధన్ తన స్నేహితులు సాంకేత్ శ్రీనివాస్ అలియాస్ తేజ, మాడే కార్తీక్, వంశీ, రాకేష్ నేతతో కలిసి ఉంటున్నాడు. హర్షవర్ధన్, వంశీలు గదిలో మద్యం తాగుతుండగా.. రాకేష్ అనే మరో స్నేహితుడు జూబ్లీహిల్స్‌లోని ఎయిర్‌లైవ్ పబ్‌లో ఉండగా తనను పికప్ చేసుకోవడానికి రావాలని హర్షవర్ధన్‌కు ఫోన్ చేశాడు. తాను మద్యం మత్తులో ఉన్నానని, మీరు వెళ్లి తీసుకురావాలంటూ కార్తీక్‌కు చెప్పి కారు తాళంచెవి ఇచ్చాడు. అర్ధరాత్రి 1.04 గంటల ప్రాంతంలో కార్తీక్.. థార్ కారు నడుపుతుండగా తేజ పక్కన కూర్చొని రాకే‹Ùను తీసుకురావడానికి జూబ్లీహిల్స్ పబ్‌కు బయలుదేరారు. బంజారాహిల్స్ రోడ్డునెంబర్–12 నుంచి అగ్రసేన్ చౌరస్తా మీదుగా అతి వేగంగా కేబీఆర్ పార్కు వైపు వెళ్తుండగా బసవతారకం కేన్సర్ హాస్పిటల్ సమీపంలో కారు అదుపుతప్పి ఫుట్‌పాత్‌ను ఢీకొట్టి అక్కడ నిద్రిస్తున్న గుర్తు తెలియని వ్యక్తి పైకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వ్యక్తి (40) అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన తెల్లవారుజామున 1.15 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న బంజారాహిల్స్ ఏసీపీ సామల వెంకట్‌రెడ్డి సిబ్బందితో కలిసి ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఘటన వివరాలను ప్రత్యక్ష సాక్షుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. కారు డోర్ తీసి పరారైన యువకులు.. కారు బోల్తా పడిన తర్వాత డోర్ నుంచి ఇద్దరు యువకులు బయటకు వచ్చి పరుగులు తీశారని అక్కడ ఉన్నవారు తెలిపారు. రంగంలోకి దిగిన పోలీసులు కారు నెంబర్ ఆధారంగా ఫోన్ నెంబర్ సేకరించి సీసీ ఫుటేజీల ఆధారంగా కారు ఎక్కడి నుంచి వచి్చందో గుర్తించారు. ప్రమాదం జరిగిన తర్వాత భయంతో కార్తీక్, తేజ పారిపోతూ గదిలో ఉన్న హర్షవర్దన్, వంశీ, నేతను కూడా పారిపోవాలని చెప్పడంతో అంతా ఉడాయించారు. అయితే తెల్లవారుజామున ఇంటికి వచ్చిన రాకే‹Ùకు గదికి తాళం వేసి ఉండడం కనిపించింది. పోలీసులు రాకేష్ ను అదుపులోకి తీసుకుని విచారించగా ఈ మిస్టరీ వీడింది. పరారీలో ఉన్న కార్తీక్, తేజ, హర్షవర్ధన్, వంశీ, నేత తదితరులను అదుపులోకి తీసుకున్నారు. కారు నడిపిన కార్తీక్ పక్కనే కూర్చొన్న తేజలపై బీఎన్ఎస్ సెక్షన్ 105 (2), 337, ఎంవీ యాక్ట్ 184, 187, పీడీపీపీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కారు ఇచి్చన హర్షవర్దన్‌పై కూడా కేసు నమోదైంది. కారు నడుపుతున్న కార్తీక్‌కు డ్రైవింగ్ లైసెన్స్ లేదని గుర్తించారు. కార్తీక్, తేజకు డ్రంకన్ డ్రైవ్ నిర్వహించగా వారు మద్యం తాగలేదని తేలింది. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బంజారాహిల్స్ లో కారు బీభత్సం
-
బంజారాహిల్స్‌లో కారు చోరీ.. ఖైరతాబాద్‌లో చైన్ స్నాచింగ్..
బంజారాహిల్స్: చైన్ స్నాచింగ్ చేసేందుకు ఓ వ్యక్తి ఏకంగా కారు చోరీకి పాల్పడిన సంఘటన బంజారాహిల్స్, ఖైరతాబాద్ పోలీస్స్టేషన్ల పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బంజారాహిల్స్ రోడ్డునెంబర్–12లోని ఎన్బీటీనగర్ బస్తీకి చెందిన అఫ్రోజ్ తన మారుతీ వ్యాన్‌లో పాఠశాల విద్యార్థులను తీసుకెళ్లేవాడు. గురువారం రాత్రి కారులో సాంకేతిక సమస్య తలెత్తడంతో రిపేరు చేయాలని రోడ్డునెంబర్–12లోని కమాన్‌లో మెకానిక్కు కారు అప్పగించి ఇంటికి వెళ్లాడు. అర్ధరాత్రి వరకు కారుకు మరమ్మతులు చేసిన మెకానిక్ షెడ్‌కు తాళం వేసీ ఇంటికి వెళ్లిపోయాడు. శుక్రవారం ఉదయం వ్యాన్ తీసుకెళ్లేందుకు అక్కడికి వచి్చన ఆఫ్రోజ్కు షెడ్ ఎదుట కారు కనిపించలేదు. దీంతో మెకానిక్కు ఫోన్ చేయడంతో తాను కారు అక్కడే పార్కింగ్ చేసి వెళ్లిపోయానని చెప్పిన అతను ఘటనా స్థలానికి పరిగెత్తుకొచ్చాడు. పరిసర ప్రాంతాల్లో గాలించినా కారు కనిపించకపోవడంతో బాధితుడు ఆఫ్రోజ్ బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. కారు తాజ్‌కృష్ణా హోటల్ వైపు వెళ్లినట్లుగా గుర్తించారు. కాగా ఉదయం 9.45 గంటల ప్రాంతంలో ఆనంద్‌నగర్ కాలనీలో ఓ మహిళ మెడలో గొలుసు చోరీకి గురైనట్లు ఖైరతాబాద్ పోలీసులకు సమాచారం అందింది. అక్కడి పోలీసులు సీసీ ఫుటేజీలు పరిశీలించగా మారుతీ వ్యాన్‌లో వచ్చిన ఓ వ్యక్తి కారు దిగి కొంతదూరం నడిచి వెళ్లి రోడ్డుపై వెళుతున్న నర్సమ్మ అనే మహిళ మెడలోని 2.5 తులాల బంగారు గొలుసు లాక్కుని పరారైనట్లుగా గుర్తించారు. దీంతో కంట్రోల్ రూం నుంచి అన్ని ఠాణాలకు సమాచారం అందించారు. బంజారాహిల్స్‌లో చోరీకి గురైన కారు అదేనని గుర్తించారు. దీంతో అటు ఖైరతాబాద్ పోలీసులు, ఇటు బంజారాహిల్స్ పోలీసులు ప్రత్యేక బృందీలను ఏర్పాటు చేసి దొంగ కోసం గాలింపు చేపట్టారు. ఈ విషయాన్ని పసిగట్టిన సదరు దొంగ కారును ఖైరతాబాద్‌లో వదిలేసి సందుల్లో పడి ఉడాయించినట్లుగా తేలింది. అర్ధరాత్రి బంజారాహిల్స్‌లో కారు దొంగిలించిన అతను ఉదయం వరకు అటూ ఇటూ తిరుగుతూ ఆనంద్‌నగర్ కాలనీలో ఒంటరిగా కనిపించిన మహిళను టార్గెట్ చేసుకుని చైన్ స్నాచింగ్‌కు పాల్పడినట్లుగా పోలీసులు నిర్థారించారు. స్నాచర్ కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. వెస్ట్–సెంట్రల్ జోన్ల సరిహద్దులో ఈ ఘటన చోటు చేసుకోవడంతో బంజారాహిల్స్, ఖైరతాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బంజారాహిల్స్‌లో కారు బీభత్సం.. ఒకరు మృతి
సాక్షి, హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్‌లో కారు బీభత్సం సృష్టించింది. అధిక వేగంలో ఉన్న కారు.. పుట్‌పాత్‌పైన నిద్రిస్తున్న వారి మీదకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒక్కరు మృతి చెందగా.. ఇద్దరు గాయపడ్డారు. దీంతో, వారిద్దరినీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.వివరాల ప్రకారం.. బంజారాహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి వద్ద కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంలో ఉన్న కారు.. దుపుతప్పి ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. అయిఏత, ప్రమాదం జరిగిన తర్వాత వాహనం వదిలి పారిపోయిన కారులోని వ్యక్తులు పారిపోయారు. -
హీరో రాణా సహా సంపన్నుల నివాసగృహాలు కేఫ్స్, రెస్టారెంట్స్‌గా
ప్రస్తుతం స్పెయిన్‌లో నివసిస్తూ ఫుడ్ అండ్ ట్రావెల్ బ్లాగర్‌గానూ పాపులర్ అయిన ఆశ్రిత ప్రముఖ నటుడు వెంకటేష్ కుమార్తె. ప్రముఖ నటుడు రానా దగ్గుబాటితో కలిసి ఆశ్రిత దగ్గుబాటి ఇటీవల తాము సందర్శించిన ఓ రెస్టారెంట్ గురించి తన యూట్యూబ్ ఛానెల్లోని కొత్త వీడియోలో పంచుకున్నారు. అది గతంలో తమ దగ్గుబాటి కుటుంబానికి చెందిన పాత నివాసగృహం కాగా ఇప్పుడు రెస్టారెంట్‌గా మారింది. నాటి దగ్గుబాటి నివాసం.. ఇప్పుడు సరికొత్త ఇంటీరియర్లతో శాంక్చురీ బార్ అండ్ కిచెన్ అనే అత్యాధునిక రెస్టారెంట్‌గా మారిన తర్వాత ఆ ఇంటిని సందర్శించడం ఇదే తొలిసారి అని ఆశ్రిత తెలిపారు. కళాశాలలో చదువుతున్న సమయంలో ఆ పాత ఇంటిలో నివసించినట్లు ఆమె గుర్తు చేసుకున్నారు.ప్రకృతి మధ్యకు.... ఇళ్లను రెస్టారెంట్లుగా మార్చడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. తమ పిల్లలు విదేశాల్లో నివసిస్తూ ఉండడంతో తాము ఇక్కడ ఒంటరిగా లంకంత ఇళ్ల నిర్వహణ చూడలేక లీజ్‌కి ఇస్తున్నట్టు కొందరు సంపన్న తల్లిదండ్రులు చెబుతున్నారు. మరోవైపు ఈ రెస్టారెంట్లు.. పన్నులు విద్యుత్ బిల్లులతో సహా ఎంత అద్దె అయినా సరే చెల్లించడానికి వెనుకాడడం లేదు. రెసిడెన్షియల్ ప్రాపర్టీ అన్వేషకులు అద్దె బదులు ఇఎమ్ఐలు చెల్లించడానికి ఇష్టపడతారు. కానీ ఈ కేఫ్స్ అద్దెలు ఎక్కువైనా సై అంటాయి. ‘అని ఓ ప్రాపర్టీ యజమాని చెప్పారు. కరోనా తర్వాత కొన్ని కుటుంబాలు తమ ఆస్తులను లీజుకు ఇచ్చేసి నగరం నడిబొడ్డు నుంచి కాలుష్య రహిత ప్రాంతాలకు, శివార్లలోని విల్లాలకు తరలివెళ్లారు. ‘నా జీవితాంతం కష్టపడి పనిచేశాను. ఇప్పుడు నేను ప్రకృతి నీడలో నివసించాలని కోరుకుంటున్నాను. అందుకే గండిపేటలోని మా అర ఎకరం స్థలంలో చిన్న ఇంటిని నిర్మించుకుని అక్కడకు మారాను’ అని ఐదేళ్ల క్రితం జూబ్లీహిల్స్‌లో నివసించిన వ్యాపారి దినకర్ చెబుతున్నారు. మరికొందరు సినిమా సెలబ్రిటీలు.. గచ్చిబౌలి చుట్టుపక్కల ప్రాంతాలకు తమ నివాసాలను మారుస్తూ.. హిల్స్‌లోని తమ ఇళ్లను రెస్టారెంట్స్‌కి అద్దెకు ఇవ్వడం లేదా తామే రెస్టారెంట్స్, బ్రూవరీ.. వంటివి ఏర్పాటు చేయడం కనిపిస్తోంది. నాటి ఇంట్లో.. నేటి రెస్టారెంట్లో.. ‘మా ఇంటికి స్వాగతం. నేను 20 సంవత్సరాల పాటు ఇక్కడే నివసించాను’ అంటూ రానా సైతం గుర్తు చేసుకున్నారు. రానా, ఆశ్రిత ఆ రెస్టారెంట్లో తిరుగుతున్నప్పుడు గోడలపై రంగురంగుల కళాఖండాలు కనిపించాయి. కుటుంబ సభ్యులకు చెందిన వేర్వేరు గదుల్లో కలియ తిరిగారు. ఆ తర్వాత ఇద్దరూ తాము చాలా కాలం క్రితం నడిచిన బ్లాక్ రైలింగ్‌తో కూడిన స్పైరల్ చెక్క మెట్ల మీద నడిచారు. ఇంటి మొదటి అంతస్తు’ అని రానా గుర్తు చేసుకున్నారు. మొదటి అంతస్తులో చాలా గాజు తలుపులు కనిపించాయి. ఇప్పుడు బార్గా ఉన్న ఆ ప్రదేశం గురించి చెబుతూ ‘ఈ బార్ ఉన్న ప్లేస్లోనే అప్పట్లో నేను సినిమాలు చూసేవాడిని’ అని రానా చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తన పాత బెడ్రూమ్లో బ్లాక్ షాండ్లియర్లు, రెస్టారెంట్ అతిథుల కోసం సీటింగ్స్ ఏర్పాటు చేశారు. రానాకు ఇష్టమైన బాల్కనీ ఇప్పుడు ‘పిజ్జా ప్లేస్’ గా మారింది. హిల్స్‌లో.. ఇవే ట్రెండ్స్.. ఒక్క దగ్గుబాటి కుటుంబానికి చెందిన ఇల్లు మాత్రమే కాదు జూబ్లీహిల్స్‌లోని పలు ఇండిపెండెంట్ ఇళ్లు రెస్టారెంట్స్‌గా మారిపోతున్నాయి. రోడ్డు నెం.1, 10, 36, 45, 92లు మినహాయిస్తే మిగిలినవన్నీ నివాసప్రాంతాలే అయినప్పటికీ.. దాదాపు 350 దాకా వ్యాపార సంస్థలు నడుస్తున్నాయి. వాటిలో ఎక్కువ భాగం పబ్‌లు, బార్లు, కాఫీ హౌస్‌లు కాగా కొన్ని మాత్రం బొటిక్స్. జూబ్లీ హిల్స్‌లోని అనేక నివాసాలు ఇప్పుడు భారతీయ, ఇటాలియన్ జపనీస్ తదితర దేశ విదేశీ రుచికరమైన వంటకాలకు కేరాఫ్ అడ్రెస్.నగరంలో విశాలమైన స్థలంలో విలాసవంతంగా నిర్మించిన పలు నివాసాలకు ఒకేఒక చిరునామా జూబ్లీహిల్స్ అని చెప్పాలి. మరెక్కడా అంత చల్లటి, ప్రశాంతమైన వాతావరణం కనిపించదు.రెస్టారెంట్స్‌తో పాటు కేఫ్స్ సందర్శకులు, కేఫ్స్‌లో ఆఫీస్ వర్క్ చేసుకునే కార్పొరేట్ ఉద్యోగులు తరచూ ప్రశాంతమైన, హోమ్లీ వాతావరణాన్ని కోరుకుంటారు. అందుకే ఇక్కడ ఏర్పాటు చేస్తున్న కెఫేలు బాగా సక్సెస్ అవుతున్నాయి. ఐదారేళ్ల క్రితం ఒకటో రెండో కేఫ్స్ ఉండే పరిస్థితి నుంచి పదుల సంఖ్యకు విస్తరించడానికి ఈ పీస్ఫుల్ వాతావరణమే దోహదం చేసింది.ఇళ్లను మారుస్తున్నారు.. : గత కొంత కాలంగా ఈ ట్రెండ్ ఊపందుకుంది. మా రెస్టారెంట్ సైతం అలా ఏర్పాటు చేసిందే. మాలాంటి కొందరు పూర్తిగా రూపురేఖలు మారుస్తుంటే.. మరికొందరు మాత్రం స్వల్ప మార్పులకు మాత్రమే పరిమితమై ఇంటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా చూస్తున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఫుడ్‌ని ఎంజాయ్ చేయడానికి జూబ్లీహిల్స్ ఒక మంచి ప్లేస్. -సంపత్, స్పైస్ అవెన్యూ రెస్టారెంట్ ఆపాతమధురం -
బంజారాహిల్స్ పీఎస్ వద్ద ఉద్రిక్తత
-
బంజారాహిల్స్‌లో బెంజ్ కారు బీభత్సం
బంజారాహిల్స్: బంజారాహిల్స్‌లో ఆదివారం అర్ధరాత్రి ఒక బెంజ్ కారు బీభత్సం సృష్టించింది. బంజారాహిల్స్ పోలీసుల కథనం ప్రకారం. ఆదివారం రాత్రి బంజారాహిల్స్ రోడ్డునెంబర్–1లోని సిటీ సెంట్రల్ వైపు నుంచి రోడ్డునెంబర్–10 వైపు వెళ్తున్న బెంజ్ కారు అదుపుతప్పి పక్కనే ఉన్న డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు ముందు భాగం ధ్వంసమైంది. విషయం తెలుసుకున్న బంజారాహిల్స్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ట్రాఫిక్ పోలీసుల సాయంతో కారు నడుపుతున్న నజీర్ అనే వ్యక్తికి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించగా మద్యం సేవించలేదని తేలింది. ప్రమాద సమయంలో కారు యజమానితో పాటు ఆయన భార్య కారులోనే ఉన్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా మద్యం మత్తులో ఒక మహిళ ఈ ప్రమాదానికి పాల్పడినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. దీంతో సీసీ ఫుటేజీలను పరిశీలించి కారు ఎవరు నడుపుతున్నారనేది తేలుస్తామని పోలీసులు స్పష్టం చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఉత్సాహంగా ఉత్కర్ష్.. మెరీడియన్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు (ఫోటోలు)
-
కుక్క మీద ప్రేమ.. పీఎస్‌కు పంచాయతీ
బంజారాహిల్స్: పెంపుడు కుక్క మీద ఉన్న ప్రేమ రెండు కుటుంబాలను పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కించింది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లోని ఎమ్మెల్యే కాలనీలో నివసించే చాంద్ షేక్ ఒక విదేశీ కుక్కను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. పక్క ప్లాట్‌లో నివసించే రుచిక అగర్వాల్ అనే యువతికి సైతం ఈ కుక్క అంటే ఎనలేని ప్రేమ. ఈ కుక్కతో ఆమె అనుబంధాన్ని మరింతగా పెంచుకుంది. అంతేకాకుండా కుక్కను తన ఇంటికి తీసుకెళ్తూ ఆహారం కూడా అందించేది. తరచూ ప్రయాణాలు చేసే ఈ పెంపుడు కుక్క యజమాని చాంద్ షేక్ ఎక్కడికైనా వెళ్లినప్పుడు కుక్క బాగోగులు చూసుకోవడానికి రుచిక అగర్వాల్ కు అప్పగించేవాడు. ఈ నెల 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు చాంద్ షేక్ విదేశాలకు వెళ్లారు. ఈ క్రమంలోనే తన పెంపుడు కుక్కను చూసుకోవాల్సిందిగా రుచిక అగర్వాల్ కు అప్పగించి వెళ్లాడు. అయితే ఈ కుక్క అంటే చాంద్ షేక్ తండ్రి షేక్ సుభానికి కూడా మహా ప్రాణం. తాను అల్లారు ముద్దుగా చూసుకునే కుక్క పక్కింట్లో ఉండటాన్ని జీరి్ణంచుకోలేక షేక్ సుభాని రుచిక ఇంటికి వెళ్లి కుక్కను తనతో పాటు తీసుకొని వచ్చాడు. దీంతో రుచిక కోపం పట్టలేక కుక్క మీద ఉన్న ప్రేమతో సుభానితో గొడవకు దిగింది. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కుక్క కోసం రుచిక తో పాటు ఆమె సోదరుడు ఆమె వద్ద పనిచేసే వికాస్, జేమ్స్, ఆమె వదిన గొడవ పడ్డారు. కుక్కను తీసుకెళ్లేందుకు ప్రయతి్నంచగా సుభాని అడ్డుకున్నాడు. ఈ గొడవలో సుభానికి స్వల్ప గాయాలయ్యాయి. ఆగ్రహం పట్టలేక రుచికాపై విరుచుకుపడ్డాడు. దీంతో తనను తిట్టాడంటూ రుచిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న సుభాని కొడుకు చాంద్ షేక్ కూడా తన తండ్రిని కొట్టారంటూ పోలీసులకు ప్రతి ఫిర్యాదు చేశాడు. ఇరు వర్గాల ఫిర్యాదులపై పోలీసులు సెక్షన్ 329(4), 115(2), 351(2), రెడ్ విత్ 3(5) బీఎన్ ఎస్ కింద ఆరుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
హైదరాబాద్‌లో స్పీడ్ లిమిట్ 60 దాటితే ఫైన్.. ఏ రూట్లో తెలుసా?
హైదరాబాద్ నగరంలో కొన్ని ప్రాంతాల్లో బైక్ రైడర్లు రయ్..రయ్ అంటూ దూసుకెళ్తున్నారు.. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో వీరి స్పీడ్‌కు అద్దూఅదుపు లేకుండాపోతోంది. దీంతో తరచూ వీరు ప్రమాదాల బారీనపడటమే కాకుండా ఇతరుల ప్రమాదాలకు కారణమవుతున్నారు. దీంతో వీరికి ముకుతాడు వేసేందుకు ట్రాఫిక్ అధికారులు లేజర్గన్లను ఏర్పాటు చేసి 60కి మించి వేగంతో వెళ్లిన వారికి జరిమానాలు విధిస్తూ ప్రమాదాలు అరికట్టేందుకు చర్యలు చేపట్టారు.బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ రహదారులపై రయ్.. రయ్‌మంటూ మితిమీరిన వేగంతో దూసుకెళ్తున్న స్పీడ్ రైడర్లకు ట్రాఫిక్ పోలీసులు ‘లేజర్ గన్’తో ముకుతాడు పెడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అదుపుతప్పిన వేగంతో దూసుకెళ్లిన వాహనదారులపై కొరడా ఝళిపిస్తున్నారు. లేజర్ గన్ ద్వారా స్పీడ్ లిమిట్ దాటిన వాహనాలను గుర్తించి వారికి జరిమానాలు కూడా విధిస్తున్నారు. ఇటీవల కాలంలో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ రహదారులపై అతి స్పీడ్ కారణంగా తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో వీటిని అదుపు చేసేందుకు రోడ్డు పక్క న సీక్రెట్‌గా స్పీడ్‌ను నమోదు చేస్తూ హద్దులు దాటిన వారిని గుర్తిస్తున్నారు.1324 మందిపై కేసులుదీనిలో భాగంగానే బంజారాహిల్స్ రోడ్డునెంబర్–2లోని కేబీఆర్ పార్కు చౌరస్తా నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టుకు వెళ్లే రోడ్డులో ట్రాఫిక్ పోలీసులు లేజర్ గన్ ఏర్పాటు చేశారు. ఈ నెల 1వ తేదీ నుంచి స్పీడ్ లిమిట్ దాటిన వారిని గుర్తించి చలాన్లు విధిస్తున్నారు. ఈ రోడ్డులో స్పీడ్ లిమిట్ 60కి మించరాదని నిబంధనలు విధించారు. 18 రోజుల్లో ఇప్పటి వరకు లిమిట్ 60 దాటిన 1324 మందిపై కేసులు కూడా నమోదు చేశారు. ఒక్కొక్కరికీ రూ.1000 చొప్పున జరిమానా విధించారు.చదవండి: ప్యారడైజ్ వద్ద ట్రాఫిక్ కష్టాలకు త్వరలో చెక్..! ప్రతిరోజూ 100 నుంచి 150 మంది వరకు మితిమీరిన వేగంతో లిమిట్ 60 దాటి దూసుకుపోతున్నట్లుగా లేజర్ గన్ ద్వారా తేలింది. ఈ రోడ్లలో స్పీడ్ లిమిట్ 60 దాటితే జరిమానాలు విధిస్తామని పోలీసులు వెల్లడించారు. ప్రతిరోజూ ఇక్కడ ఉంటే ట్రాఫిక్ పోలీసు స్పీడ్‌గా వెళ్లే వాహనాలపై నిఘా పెడతారని పేర్కొన్నారు. కేబీఆర్ పార్కు నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వైపు వెళ్లే వాహనాలు ఇక నుంచి నిర్దేశించిన స్పీడ్‌లోనే వెళ్లాలని పేర్కొంటున్నారు. -
Family Survey : ఇద్దరు మహిళా ఎన్యుమరేటర్లపై కుక్కల్ని వదిలిన ఇంటి యజమాని
-
ఘనంగా సీఎం రేవంత్‌రెడ్డి పుట్టిన రోజు వేడుకలు
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి పుట్టిన రోజు వేడుకలు శుక్రవారం బంజారాహిల్స్ రోడ్ నెం.11లో ఘనంగా జరిగాయి. సికింద్రాబాద్ డీసీసీ ఉపాధ్యక్షుడు కొప్పిసెట్టి గోవింద్రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు పాల్గొని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బాణా సంచా కాల్చి, భారీ కేక్‌ను కట్ చేశారు.అనంతరం గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శులు ముంజగళ్ళ విజయ్‌కుమార్, మచ్చ విజయ్‌కుమార్‌లు మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో సంక్షేమ పథకాలు, రైతులకు రుణమాఫీ దిగ్విజయంగా జరిగిందన్నారు. పుట్టిన రోజు నాడు కూడా సీఎం ప్రజాక్షేత్రంలోనే ఉండాలలనే సంకల్పంతో మూసి పరివాహక ప్రాంతంలో పాదయాత్ర చేస్తుండటం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు భీమ్రావు, నజీర్, రమణ, అప్పారావు, పూల్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
Hyderabad: భార్యతో గొడవపడి అర్ధరాత్రి పోర్షే కారులో చక్కర్లు..
బంజారాహిల్స్: భార్యతో గొడవపడి అర్ధరాత్రి ఖరీదైన పోర్షే కారులో చక్కర్లు కొడుతూ మితిమీరిన వేగంతో దూసుకెళ్ళి రోడ్డు ప్రమాదానికి కారకుడైన వ్యాపారి, స్టాండప్ కమేడీయన్ ఉత్సవ్ దీక్షిత్‌ను ఇప్పటికే బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేయగా ప్రమాదానికి కారణమైన పోర్షేకారు కండీషన్ తెలియజేయాల్సిందిగా జర్మనీ కంపెనీకి బంజారాహిల్స్ పోలీసులు లేఖ రాయనున్నారు. ఇప్పటికే లేఖను సిద్ధం చేసిన పోలీసులు నేడో, రేపో ఈ కారు కండీషన్ తెలియజేయాల్సిందిగా కోరనున్నారు. ఈ కారు మరమ్మతులకు వచ్చిందని మూడునెలల క్రితమే సర్వీస్ కు తేవాలని చెప్పామని రోడ్లపైకి తీసుకెళ్ళవద్దని హెచ్చరించడం కూడా జరిగిందని షోరూం ప్రతినిధులు స్పష్టం చేసినట్లు సమాచారం. ఇదేదీ పట్టని ఉత్సవ్ దీక్షిత్ మూడునెలల నుంచి కారును నడిపిస్తూనే ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.వేగంతో కారును నడపడంతో మూల మలుపు వద్ద కారు స్టీరింగ్‌కు లాక్ పడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు కూడా ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో కారు కండీషన్లో ఉందా లేదా తేల్చాల్సిందిగా పోర్షే కంపెనీకి లేఖ రాయాలని నిర్ణయించారు. సంబంధిత కంపెనీ నుంచి నిపుణులు వచ్చి కారు కండీషన్‌పై నివేదిక ఇచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోవాలని కూడా నిర్ణయించారు. ఉత్సవ్ దీక్షిత్ అరెస్టు -
బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ వద్ద కారు బీభత్సం
-
పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం...
బంజారాహిల్స్: పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. శారీరక సంబంధం పెట్టుకోవడమే కాకుండా ఆమె కుమార్తె అయిన మైనర్‌తో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదుచేశారు. ఖమ్మంకు చెందిన ఓ మహిళ భర్త, కుమార్తెతో కలిసి బతుకుదెరువు కోసం నగరానికి వచి్చంది. అస్లాం అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. మహిళ, ఆమె భర్త మధ్య చిచ్చు పెట్టి మనస్పర్థలు వచ్చేలా చేసి దూరం ఉండేలా చేశాడు. అనంతరం పెళ్లి చేసుకుంటానని మహిళతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. పెళ్లి చేసుకోకపోగా మహిళ కష్టపడి తెచ్చే డబ్బును తన విలాసాలకు వాడేవాడు. అంతే కాకుండా ఆమె కుమార్తె మైనర్‌పై పలుమార్లు అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఇటీవలె ఇంట్లో ఉన్న రెండు తులాల బంగారు ఆభరణాలు, 15 తులాల వెండి తీసుకొని తనఖా పెట్టి వచి్చన డబ్బుతో జల్సా చేస్తున్నాడు. ఇదేమని ప్రశి్నస్తే సమాధానం చెప్పకుండా ముఖం చాటేశాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
HYD: బంజారాహిల్స్‌లో ‘మోమో’ల కలకలం
సాక్షి,హైదరాబాద్:బంజారాహిల్స్‌లో ఫుడ్‌పాయిజన్ ఘటన కలకలం రేపింది. నందినగర్‌లో వారాంతపు సంతలో రోడ్డుపై అమ్మే మోమోలు తిని పలువురికి ఫుడ్‌పాయిజన్ అయింది. మోమోలు తిన్న సింగాడికుంటకు చెందిన ఓ వివాహిత మృతి చెందింది.ఇదే ఘటనలో 20 మంది దాకా అస్వస్థతకు గురయ్యారు. మోమోల బాధితుల సంఖ్య మరింత పెరుగుతున్నట్లు తెలుస్తోంది. మోమోలు పాయిజన్ అవడంపై బాధితులు సోమవారం(అక్టోబర్ 28) బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఇదీ చదవండి: తెలంగాణ సచివాలయం వద్ద ఉద్రిక్తత -
వినబడదు.. మాటలు రావు.. అయినా అన్నింటిలోనూ ఫస్టే
బంజారాహిల్స్: దేశం కాని దేశం.. ఊరు కాని ఊరు.. మన భాష అసలే తెలియదు.. మాట్లాడడానికి నోరు పెగలదు.. చెవులు వినబడవు.. అమెకున్న గ్రహణ శక్తి సంజ్ఞలు మాత్రమే. మూగ, చెవుడు అయినా కేవలం ఉపాధ్యాయులు చెప్పేది లిప్‌మూమెంట్ ద్వారా గ్రహిస్తూ చదువులో దూసుకుపోతోంది. క్లాస్‌లో ఎప్పుడూ మొదటి స్థానమే. నేపాల్‌కు చెందిన రియా (17) తల్లిదండ్రులు జయన్బహదూర్, తల్లి జోగుమాయలు పొట్ట చేతబట్టుకుని ఉపాధి నిమిత్తం 15 సంవత్సరాల క్రితం హైదరాబాద్‌కు వచ్చారు. జయన్ బహదూర్ కుక్‌గా పనిచేస్తుండగా, భార్య మాయ గృహిణి. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. చిన్న కూతురు రియా పుట్టుకతో మూగ, చెవుడు. తన భావాలను పంచుకోవాలంటే మాటలు రావు, ఇతరులు చెప్పేది వినబడదు. అయితేనేం ఆమెకున్న గ్రహణ శక్తికి తనలోని లోపాలు కూడా చిన్నబోతాయి. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్–10లోని గాయత్రీహిల్స్‌లోని లిటిల్‌స్టార్ హైస్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతోంది రియా.ఎప్పుడూ ఫస్టే.. తరగతి గదిలో టీచర్లు చెప్పేది వినబడకపోయినా.. వారి లిప్‌మూమెంట్ ద్వారా ఆ పాఠాలు గ్రహిస్తోంది. ఏమైనా అర్థం కాకపోతే నోట్‌బుక్‌లో రాసి టీచర్లను అడుగుతుంది. నర్సరీ నుంచి తొమ్మిదో తరగతి వరకూ ఇక్కడే చదువుతున్న రియా ఎప్పుడూ క్లాస్ ఫస్టే వస్తుందని తెలుగు టీచర్ అనూష తెలిపారు. బ్లాక్‌బోర్డుపై తాము రాసే పాఠాల విషయాలు బాగా అబ్జర్వ్ చేస్తుందని హిందీ టీచర్ అర్షియా పరీ్వన్ తెలిపారు. ఈ బాలిక అంటే మొత్తం స్కూల్ విద్యార్థులకే కాకుండా టీచర్లకు కూడా ప్రత్యేక గౌరవం ఇస్తుంటారని ఆమె వెల్లడించారు. నూరు శాతం హాజరు.. వినబడదు..మాట్లాడలేదు..అయినా సరే ఏ ఒక్కరూ ఆమెను హేళనగా చూడరని, క్లాస్‌లో ఎప్పుడూ ఫస్ట్ వస్తుంటుందని స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ అస్మతున్నీసా తెలిపారు. ఈ బాలిక అక్క, అన్న కూడా ఇదే పాఠశాలలో చదివారని తెలిపారు. రియాలో ఉన్న ప్రతిభను గుర్తించి ఆమె వద్ద ఎలాంటి ఫీజూ తీసుకోకుండానే నర్సరీ నుంచి తొమ్మిదో తరగతి వరకూ ఉచితంగా చదువును అందిస్తున్నట్లు అస్మతున్నీసా పేర్కొన్నారు. కేవలం చదువులోనే కాకుండా పాఠశాలల్లో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ పాల్గొని అబ్బురపరిచే నృత్యాలు కూడా చేసి ఆకట్టుకుంటుంది. క్రాఫ్ట్‌వర్క్, డ్రాయింగ్, పోస్టర్ మేకింగ్, చార్ట్ తయారీలో కూడా రియా పాల్గొంటూ బహుమతులు సాధిస్తోంది. ఒక్కరోజు కూడా గైర్హాజరు కాకుండా స్కూల్ అటెండెన్స్‌లో 100 శాతంతో అందరి కంటే ముందుంటుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. అంతేకాదు తమ కంటే బాగా చదవడం, మార్కులు కూడా బాగా రావడం మమ్ముల్ని ఎంతగానో ఆశ్చర్యపరుస్తుందని సహచర విద్యారి్థని సౌమ్య చెబుతోంది. -
నగరమంతా తిప్పి.. సెల్‌ఫోన్‌తో ఉడాయించి..
బంజారాహిల్స్: కస్టమర్ బుక్ చేసిన మేరకు సదరు యువకుడిని గమ్యస్థానానికి చేర్చేందుకు యత్నంచగా.. రకరకాల కారణాలతో నగరమంతా తిప్పి చివరకు బాధితుడి సెల్‌ఫోన్‌తో ఉడాయించిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. కొండాపూర్‌లో నివసించే సావనం చంద్ర మహేష్ బాబు ర్యాపిడో నడుపుతూ పొట్టపోసుకుంటున్నాడు. ఈ నెల 18న రాత్రి 8 గంటల ప్రాంతంలో డెలాయిట్ ఆఫీసు గచ్చిబౌలిలో పని చేసే నితిన్ అనే యువకుడి నుంచి బుకింగ్ ఆర్డర్ వచ్చింది. కొండాపూర్ ఏఎంబీ మాల్ వద్ద తనను డ్రాప్ చేయాల్సిందిగా నితిన్ బుకింగ్ ఆర్డర్ పెట్టాడు. దీంతో మహేష్ బాబు ఆ యువకుడిని ఎక్కించుకుని ఏఎంబీ మాల్ వద్ద దింపాడు. తన స్నేహితుడి వద్ద డబ్బు తీసుకువస్తానని మాల్‌లోకి వెళ్లిన కొద్ది సేపటికే నితిన్ బయటకు వచ్చి తన స్నేహితుడు ఇక్కడ లేడని, కూకట్‌పల్లికి తీసుకువెళ్లాల్సిందిగా కోరాడు. ఇది నమ్మిన ర్యాపిడో డ్రైవర్ మహేష్ వెంటనే నితిన్‌ను కూకట్‌పల్లికి తీసుకువెళ్లాడు. అక్కడికి వెళ్లిన తర్వాత కూడా తన స్నేహితుడు కృష్ణానగర్ వెళ్లాడని, అక్కడ దింపాలని కోరాడు. దీంతో బాధిత ర్యాపిడో డ్రైవర్ జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–10లోని అల్కజర్ మాల్ వద్ద అర్ధరాత్రి 1.30 గంటలకు దింపాడు. ఫోన్ పే చేయడానికి తన స్విచ్ఛాప్ చేసి ఉందని, ఒకసారి ఫోన్ ఇస్తే తన స్నేహితుడికి చెప్పి డబ్బులు తెప్పించుకుంటానని అడిగాడు. దీంతో నితిన్‌కు మహేష్ తన ఫోన్ ఇచ్చాడు. అక్కడి నుంచి ఓ గల్లీలోకి వెళ్లిన నితిన్ ఎంతకీ తిరిగిరాలేదు. రెండు గంటలు గడిచినా రాకపోయేసరికి అన్ని ప్రాంతాలు గాలించినా ఫలి తం లేకుండాపోయింది. తాను మోసపోయానని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జూబ్లీహిల్స్ పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్ 318, 303(2)ల కింద కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు. -
బంజారాహిల్స్ లోని పలు పబ్బులపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు
-
బయటకని చెప్పి పబ్‌కి వెళ్తావా.. ఇంటికిరా నీ సంగతి చెప్తా!
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్‌లో ఓ పబ్ బాగోతం బట్టబయలైంది. నిబంధనలకు విరుద్దంగా యువతులతో పబ్‌లో అసభ్యకరమైన నృత్యాలు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించి దాడులు చేశారు. ఈ క్రమంలో 100 మంది పురుషులు, 42 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు టాస్క్‌ఫోర్స్ పోలీసులు.వివరాల ప్రకారం.. బంజారాహిల్స్‌లోని టేల్స్ ఓవర్ స్పిరిట్ పబ్‌పై శుక్రవారం అర్ధరాత్రి టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా యువతులతో నిర్వాహకులు అసభ్యకరంగా నృత్యాలు చేయిస్తున్నట్లు గుర్తించారు. పబ్‌కు కస్టమర్లకు ఆకర్షించేందుకు 42 మంది యువతులతో అసభ్యకరమైన నృత్యాలు చేస్తున్నారు పబ్ నిర్వాహకులు. పబ్‌కు వచ్చిన యువకులతో వారు సన్నిహితంగా ఉండేలా డ్యాన్స్‌లు చేపిస్తున్నారు. పబ్ వచ్చిన వారితో ఎక్కువ మద్యం తాగించి అధిక బిల్లు అయ్యేలా పబ్ నిర్వహకులు ప్లాన్ చేశారు.గత మూడు వారాలుగా పబ్‌పై టాస్క్ ఫోర్స్ పోలీసుల రెక్కి నిర్వహించారు. ఈ క్రమంలోనే తాజాగా ఆకస్మిక దాడులు చేశారు. ఈ క్రమంలో పబ్‌లో 100 మంది కస్టమర్లు, 42 మంది యువతులు, ఏడుగురు పబ్ నిర్వాహకులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం, పోలీసు స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు.ఇదిలా ఉండగా.. పబ్‌కు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉద్యోగాల పేరుతో యువతులను పబ్ యాజమాన్యాలు ట్రాప్ చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. వీక్ ఎండ్‌లో నాలుగు గంటలు పనిచేస్తే 2 వేల రూపాయలు ఇస్తామని ఆఫర్ ఇస్తున్నట్టు తెలిసింది. ఇక, పబ్‌కి వచ్చిన కస్టమర్లతో చనువుగా ఉంటూ.. ఎక్కువ మద్యం సేవించేలా చూడాలని వారి పని అప్పగించారు. మద్యం సేవిస్తున్నట్లు నటించి తాము ఇచ్చే సాప్ట్ డ్రింక్ తాగాలని యువతులకు పబ్ యాజమాన్యం సూచించారు. కస్టమర్‌తో ఎక్కువ బిల్ చేయించిన యువతికి కమీషన్ ఎక్కువ ఇస్తున్నట్టు గుర్తించారు. అసభ్య, అశ్లీల నృత్యాలు చేసే యువతులకు ఎక్కువ డబ్బు ఇస్తామని ఆఫర్ ఇచ్చినట్టు విచారణలో వెల్లడైంది.మరోవైపు.. పబ్‌లో పట్టుబడిన వారి కుటుంబ సభ్యులు పోలీసు స్టేషన్‌కు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే పబ్‌లో పట్టుబడ్డ తన భర్త కోసం ఆధార్ కార్డు తీసుకుని భార్య పీఎస్‌కు వచ్చారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. బయటకు వెళ్తున్న అని చెప్పి పబ్‌కి వచ్చి తందనాలు ఆడుతున్నాడు. ఇంటికి రానీ సంగతి చెప్తా అంటూ వార్నింగ్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. -
Hyderabad: మేయర్ విజయలక్ష్మిపై కేసు నమోదు
బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్డునంబర్–12లోని ఎన్బీటీనగర్ ప్రభుత్వ పాఠశాల ఎదురుగా ఉన్న మైదానంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకల్లో నిబంధనలకు విరుద్ధంగా డీజే ఏర్పాటు చేయడంతో పాటు గడువు ముగిసిన తర్వాత కూడా సౌండ్ పొల్యుషన్‌కు పాల్పడిన ఘటనలో నగర మేయర్‌తో పాటు మరో ఇద్దరిపై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. ఈ నెల 10వ తేదీ రాత్రి 10 గంటల çసమయంలో బంజారాహిల్స్ రోడ్డునంబర్–12లోని ఎన్బీటీనగర్లో అమ్మవారి విగ్రహాల నిమజ్జన ఊరేగింపుతో పాటు మండపాలను కానిస్టేబుళ్లు ఎస్కే నజీర్ అహ్మద్, హోంగార్డు సాయి ప్రసాద్‌లు పర్యవేక్షిస్తున్నారు. రాత్రి 11.40 గంటల ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాల ముందు జరుగుతున్న బతుకమ్మ వేడుకల్లో భారీ సౌండ్‌తో డీజే ఏర్పాటు చేశారని, శబ్ద కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని పోలీసులకు సమాచారం అందింది. దీంతో నజీర్ అహ్మద్, సాయిప్రసాద్‌లు అక్కడికి చేరుకుని డీజేను ఆపాల్సిందిగా నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో గ్రేటర్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ అక్కడికి చేరుకుని పోలీసులు ఇందులో జోక్యం చేసుకోవద్దని, మ్యూజిక్‌ను కొనసాగించాలని వారికి సూచించారు. భారీ శబ్ద కాలుష్యంతో ఈవెంట్‌ను అలాగే కొనసాగించారని, వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కానిస్టేబుల్ నజీర్ అహ్మద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో బతుకమ్మ వేడుకల నిర్వాహకులు కందాడి విజయ్‌కుమార్, మ్యూజిక్ ప్లే చేస్తున్న మహ్మద్ గౌస్, జోక్యం చేసుకోవద్దంటూ చెప్పిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మిపై బంజారాహిల్స్ పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్ 223, 280, 292, 49 రెడ్‌విత్ 3 (5), సెక్షన్ 21/76 సీపీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
పని చేసిన సంస్థకే కన్నం.. రూ.6 కోట్ల విలువైన నగలతో ఉడాయించిన ఉద్యోగులు
సాక్షి,హైదారాబాద్ : పని చేసిన సంస్థకే కన్నం వేశారు ఉద్యోగులు. రూ.6 కోట్ల విలువైన నగలతో ఉడాయించారు. నగల్ని మాయం చేసిన ప్రబుద్ధుడితో పాటు అతనికి సహకరించిన సిబ్బంది గురించి పోలీసులు ఆరాతీస్తున్నారు. బంజారాహిల్స్ శ్రీ కృష్ణ జ్యువెలర్స్ షోరూంలో భారీ చోరీ జరిగింది. రూ.6 కోట్ల విలువైన బంగారు నగలు మాయమయ్యాయి. అయితే అదే షోరూంలో ప్రస్తుతం, గతంలో పనిచేసిన ఉద్యోగులకు దుర్బుద్ది పుట్టి అందరూ ఓ ముఠాగా ఏర్పడ్డారు. భారీ చోరీకి పాల్పడ్డారు. చోరీ జరిగినప్పటి నుంచి మేనేజర్ సూకేతు షా ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. మేనేజర్ సుకేతు షాతో పాటు ఉదయ్ కుమార్, చింటు, సత్య, అజయ్, టింకు, చంద్ర, శ్రీకాంత్ బబ్బూరిలపై కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. కేసులో ట్విస్ట్..మరోవైపు రూ..6 కోట్ల నగల మాయం కేసులో కీలక పాత్రపోషించిన మేనేజర్, తన భర్త సూకేతు షా కనిపించడం లేదంటూ అతని భార్య బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీ కృష్ణ జ్యువెలర్స్ మేనేజ్మెంట్ వేధింపుల కారణంగానే తన భర్త అదృశ్యం అయ్యాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. లెటర్‌తో పాటు,ఓ వీడియోను సైతం పోలీసులకు అందించారు. -
హైదరాబాద్‌లో భారీ వర్షం
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఎండ కారణంగా ఉక్కపోతతో సతమతమవుతున్న నగరవాసులకు కొంత ఉపశమనం కలిగింది. హైదరాబాద్‌లో పలుచోట్ల ఒక్కసారిగా భారీ వర్షం కురుస్తోంది. దీంతో, రోడ్లపై భారీ వరద నీరు చేరుకుంది.నగరంలోని బంజారాహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట్, ముషీరాబాద్, చిక్కడపల్లి, ట్యాంక్ బండ్, మేడ్చల్, అల్వాల్, కూకట్పల్లి, నిజాంపేట్, ఎస్ఆర్నగర్, జీడిమెట్ల, సికింద్రాబాద్, బేగంపేట్ సహా పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. ఒక్కసారిగా కుండపోత వర్షం కురవడంతో రోడ్లపైకి వరద నీరు వచ్చి చేరుకుంది. దీంతో, భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. Hyderabad rains right now Alhamdulillah #Hyderabadrains pic.twitter.com/yXotf9aWP8— kashif Qureshi (@kashiflion) October 3, 2024 Hyderabad Rain Movement.Isolated Places Get Heavy Rain.Thunderstorms....⛈️Cloud's moving Downward Direction.Be Alert....⚠️#HyderabadRains#HeavyRain pic.twitter.com/1n69AEE4lc— Jagtial District Weather Forecast....🛰⛈️ (@SkyForecastMaN4) October 3, 2024ఇది కూడా చదవండి: కూల్చి వేతలపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు -
హైదరాబాద్‌లో భారీ వర్షం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం మొదలైంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్. కూకట్పల్లి, నిజాంపేట్, జేఎన్టీయూ, మూసాపేట్లో భారీ వర్షం కురుస్తోంది. కోఠి, వనస్థలిపురం, ఎల్బీనగర్లో కుండపోత వాన పడుతోంది. తార్నాక, ఓయూ క్యాంపస్, లాలాపేట, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్, దిల్సుఖ్నగర్, చంపాపేట్, సైదాబాద్, సరూర్‌నగర్, కోఠి, చాంద్రయణగుట్ట, మాదాపూర్ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. నగరంలో కురుస్తున్న వర్షంతో రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనేక చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భారీ వర్షం నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులకు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల వద్ద అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. @balaji25_t Rain in amberpet 🌧️🌨️⚡⚡ pic.twitter.com/Q7cKQJGsQm— ஷேக் அஃப்ரோஸ் ഷെയ്ഖ് അഫ്രോസ്✨✨ (@iamshaikmoun) September 23, 2024Heavy Rains ⛈️ #HyderabadRains ⛈️⛈️@HiHyderabad @swachhhyd @PeopleHyderabad #Hyderabad #WeatherUpdate #Rains #thunderstorm #video #musheerabad #Telangana pic.twitter.com/Of1CGjxl17— Younus Farhaan (@YounusFarhaan) September 23, 2024 -
జ్యువెల్స్ షోలో నటీమణులు సందడి (ఫొటోలు)
-
హైదరాబాద్ బంజారాహిల్స్ లో కారు బీభత్సం
-
బంజారాహిల్స్‌లో కారు బీభత్సం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఫుల్ స్పీడ్‌లో ఉన్న ఫార్చూనర్ కారు ఓ కాంప్లెక్స్‌లో ఉన్న కార్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదు కార్లు, ఓ ఆటో ధ్వంసమయ్యాయి.వివరాల ప్రకారం.. బంజారాహిల్స్‌లో ఓ మైనర్ ఫార్చూనర్ కారును నడుపుతూ బీభత్సం సృష్టించాడు. ఫుల్ స్పీడ్‌లో కారును నడిపి ఓ కాంప్లెక్స్‌లోకి దూసుకెళ్లాడు. ఈ ప్రమాదంలో కమర్షియల్ కాంప్లెక్స్ పార్కింగ్‌లో ఉన్న కారును, ఆటోను ఢీకొట్టి కారు పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదు కార్లు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై మరింత సమచారం తెలియాల్సి ఉంది. -
బంజారా హిల్స్ : హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ ప్రత్యేకత గురించి తెలుసా? (చిత్రాలు)
-
Cardiovascular Disease: కోలుకున్న క్లిష్టమైన సమస్యల రోగి
తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రోగి అద్భుతమైన రీతిలో ఆరోగ్యవంతుడయ్యాడు. క్లిష్టమైన హృద్రోగ సమస్యతో పాటు శరీరంలోని పలు అవయవాల ఆరోగ్యం నశించి విషమ స్థితిలో బంజారాహిల్స్ లోని కేర్ ఆస్పత్రిలో చేరిన ప్రవాస భారతీయునికి ఆస్పత్రి వైద్యులు అవసరమైన శస్త్ర చికిత్సలు నిర్వహించి, మూడు నెలల పాటు శ్రమించి రోగిని ఆరోగ్యవంతుడిని చేశారు. కేర్ ఆస్పత్రిలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వైద్యులు వివరాలు వెల్లడించారు. భారత సంతతికి చెందిన భాస్కర్ పొనుగంటి (43) ఆస్ట్రేలియాలో నివసిస్తున్నారు. ఇతను కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. శ్వాస ఆడక పోవడంతో పాటు తీవ్రమైన హద్రోగ సమస్యతో దాదాపు మూడు నెలల క్రితం బంజారాహిల్స్ లోని కేర్ ఆస్పత్రిలో భాస్కర్ చేరారు. రోగికి అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. ఆ రోగి ‘ఇన్ఫెక్టివ్ ఎండోకార్డిటిస్‘ వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించారు. ఇలాంటి తీవ్రమైన ఇన్ఫెక్షన్ వల్ల రోగికి మూత్రపిండాల వైఫల్యం, ఎడమవైపు పక్షవాతం కలిగించే మెదడు పోటు బ్రెయిన్ స్ట్రోక్ కలిగి రోగి ఆరోగ్యం క్షీణించింది. తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్న ఆ రోగి వెంటిలేటర్ పై ఉన్నప్పటికీ అత్యవసర శస్త్ర చికిత్స చేయడమే సరైన మార్గమని ఆస్పత్రి క్లినికల్ డైరెక్టర్, కార్డియాలజీ విభాగాధిపతి డా. వి.సూర్యప్రకాశరావు నేతత్వంలోని వైద్య బందం నిర్ధారించింది. క్లిష్టమైన శస్త్ర చికిత్సను (హై రిస్క్ సర్జరీ) నిర్వహించి రోగిని సాధారణ స్థాయికి తీసుకొచ్చారు. సీనియర్ కార్డియోథొరాసిక్, హార్ట్ ట్రా ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డా. నగేష్ ఆధ్వర్యంలో వైద్య బందం ‘మెకానికల్ వాల్వ్‘ వైద్యవిధానం ద్వారా రోగి బహద్దమని కవాట మార్పిడిని విజయవంతంగా నిర్వహించారు. దీంతో రోగి ఆరోగ్యం కుదుటపడింది. తరువాత రోగి అకస్మాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్ కు గురయ్యారు. దీంతో అతని ఆరోగ్య పరిస్థితి క్లిష్టంగా మారింది. ఈ క్రమంలో రోగిని మెడికల్ ఐసీయూలో ఉంచి.. ఆస్పత్రి అసోసియేట్ క్లినికల్ డైరెక్టర్, క్రిటికల్ కేర్ విభాగాధిపతి డా. జి.భవాని ప్రసాద్ ఆధ్వర్యంలో అవసరమైన వైద్య సాయం అందించారు. న్యూరాలజీ, నెఫ్రాలజీ, ఇంటెన్సివిటీ, కార్డియాక్ విభాగాలు.. సమన్వయంతో నిరంతర పర్యవేక్షణలో కఠినమైన ఫిజియోథెరపీతో కూడిన బహుళ వైద్య చికిత్స విధానాలను రోగికి అందించాయి. అధునాతన వైద్య సంరక్షణతో ఏం సాధించవచ్చో ఈ కేసు ద్వారా వైద్య బందం నిరూపించిందని ఈ సందర్భంగా వారు తెలిపారు. -
బంజారాహిల్స్ మెరీడియన్ స్కూల్లో ఘనంగా ఫౌండేషన్ డే వేడుకలు (ఫోటోలు)
-
మొదటిసారి డ్రగ్స్ కోసం స్నిఫర్ డాగ్స్ తో పోలీసుల రైడ్స్
-
‘మై గ్లామ్’లో మోడళ్లు..
స్థానిక రోడ్ నెం.1లోని పాప్ అప్ స్పేస్‌లో మై గ్లామ్ ఎగ్జిబిషన్ గురువారం ప్రారంభమైంది. రెండు రోజుల పాటు నిర్వహించే ప్రదర్శనలో వజ్రాభరణాలను మోడల్స్ ధరించి ర్యాంప్‌పై తళుక్కుమన్నారు.దేశ వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన డిజైనర్లు రూపొందించిన వజ్రాభరణాలను ఇక్కడ ప్రదర్శిస్తున్నట్లు నిర్వాహకులు సుచరిత, మనోజ్ తెలిపారు. – బంజారాహిల్స్ఇవి చదవండి: బస్కింగ్.. జోష్! -
ఎంగేజ్ విత్ సిటీ..
లామకాన్‌లో సంగీత దినోత్సవం..ప్రపంచ సంగీత దినోత్సవాన్ని పురస్కరించుకుని పాశ్చాత్య సంగీత ప్రియుల కోసం అశ్రిత డిసౌజా ఆధ్వర్యంలో పాప్, జాజ్, డిస్నీ సాంగ్స్ పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. బంజారాహిల్స్‌లోని లామకాన్‌లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం సాయంత్రం 5 నుంచి 2 గంటల పాటు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. – సాక్షి, సిటీబ్యూరోచిన్నారుల కోసం మ్యాక్స్ కిడ్స్ ఫెస్టివల్..ప్రతిభావంతులైన చిన్నారుల కోసం ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ మ్యాక్స్ కిడ్స్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది. ఈ విషయాన్ని సంస్థ ప్రతినిధులు తెలిపారు.చిన్నారుల ఊహలకు డ్రాయింగ్, కలరింగ్స్తో ఊపిరిపోసే విధంగా వారిలోని ఊహాశక్తిని, సృజనను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమ ఉద్ధేశ్యమని, తమ మ్యాక్స్ స్టోర్ అందించే రీసైక్లింగ్ పేపర్‌తో తయారు చేసిన షాపింగ్ బ్యాగ్‌పై ‘భూమిని కాపాడే సూపర్‌హీరో’ అనే నేపథ్యంతో చిత్రాలను గీయాల్సి ఉంటుందని వివరించారు. తుది ఏడుగురు విజేతలకు పూర్తిస్థాయి ఖర్చులతో కుటుంబంతో సహా కశ్మీర్ పర్యటనను గెలుచుకుంటారని తెలియజేశారు. వివరాలకు దగ్గర్లోని మ్యాక్స్ స్టోర్‌లో సంప్రదించాలన్నారు. – సాక్షి, సిటీబ్యూరోఇవి చదవండి: 'షావోమీ 14 సీవీ మోడల్' ఆవిష్కరణ.. సినీతార వర్షిణి సౌందరాజన్.. -
బోటీ.. లొట్టలేసీ..! 25 ఏళ్లుగా చెరగని టేస్ట్..!!
రోడ్డు పక్కనే కదా హోటల్ అనుకొని తీసిపారేయకండి. ఈమె వద్ద ఒక్కసారి బోటికూర, తలకాయ మాంసం రుచి చూశారంటే ఇక రోజూ ఇటువైపు రావాల్సిందే.. అవును మరి.. బోటికూర లక్ష్మమ్మ పెట్టే తలకాయ మాంసం, మటన్ లివర్, బోటి కూర, చికెన్ కర్రీ కోసం ఎక్కడెక్కడి నుంచో ప్రముఖులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, బడా వ్యాపారులు సైతం వచ్చి లొట్టలేసుకొని తింటుంటారు. సమపాళ్లలో మసాలా దినుసులు, ఇంట్లోనే తయారు చేసే కారంపొడి, కొబ్బరిపొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్‌తో ప్రత్యేకంగా బోటీ వండుతుంటానని, రుచికి అదే కారణమని అంటుంటారు బోటికూర లక్ష్మమ్మ. – బంజారాహిల్స్బంజారాహిల్స్ రోడ్ నెం.2లోని షేక్‌పేట మండల కార్యాలయం వద్ద ఫుట్‌పాత్‌ను ఆనుకొని రోడ్డు పక్కనే రెండు దశాబ్ధాలుగా ఆమె నిర్వహిస్తున్న మొబైల్ మెస్‌లో టేస్ట్ చేస్తున్న ఎంతో మంది ప్రముఖులు శెభాష్ అనకుండా ఉండలేకపోతున్నారు. ప్రతిరోజూ 12 కిలోల బోటీ వండి వంద మందికి పైగానే ఆహారప్రియులకు అందిస్తున్నారు. అందుకే వరంగల్ జిల్లా ఉల్లిగడ్డ దామెర గ్రామానికి చెందిన గన్నారం లక్ష్మమ్మ(73) ఏకంగా బోటీకూర లక్ష్మమ్మగా పేరు తెచ్చుకుంది.ఈమె బోటీ కూర గురించి ఇప్పటికే సుమారు 100 మంది యూట్యూబర్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బోటీ కోసమే వారంలో ఒకటి, రెండుసార్లు ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ వస్తుంటారు. తలకాయ మాంసం, మటన్ లివర్, మటన్ కూర, చికెన్ లివర్, చికెన్ కూర, ఇవన్నీ ఈమె వద్ద ప్రత్యేక రుచుల్లో లభిస్తుంటాయి. మరో నలుగురికి ఉపాధి బోటీ కూరను తానే స్వయంగా వండుతానని, ఇందులో వాడే ప్రతి మసాలా దినుసు తానే తయారు చేస్తుంటానని తెలిపారు.రాహుల్ సిప్లిగంజ్‌కు వడ్డిస్తూ..తాను సంపాదించడమే కాకుండా మరో నలుగురికి ఉపాధి కల్పిస్తున్నట్లు ఆమె చెప్పారు. లక్ష్మమ్మను చూసి బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, శ్రీనగర్‌కాలనీ, ఎస్ఆర్నగర్ ప్రాంతాల్లో ఎంతోమంది మహిళలు స్ఫూర్తి పొంది ఇలాంటి మొబైల్ మెస్‌లు ఏర్పాటు చేసుకొని ఉపాధి పొందుతున్నారు. ఈమె టేస్ట్‌కు ఎవరూ సాటిరారంటూ చాలామంది యూట్యూబర్లు సైతం తమ అభిప్రాయాలు వెల్లడించడమే కాకుండా సోషల్ మీడియాలో లక్ష్మమ్మ బోటి కూర టేస్టే సెపరేట్ అంటూ పోస్టులు పెడుతుంటారు. అంతేకాదు స్విగ్గి, జొమాటో ఆర్డర్లు కూడా వస్తుండగా ఇప్పుడున్న గిరాకీ తట్టుకోలేక ఆమె సున్నితంగా తిరస్కరిస్తున్నారు. ఎంతో ఆనందం..బోటీ వండటానికి నాకు 3 గంటల సమయం పడుతుంది. ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటలకు ఇక్కడ భోజనాలు ప్రారంభిస్తాను. మొదటి గంటలోనే వందకుపైగా బోటి కూర భోజనాలు అమ్మడవుతుంటాయి. కూర అయిపోగానే చాలా మంది వస్తుంటారు. లేదని చెప్పగానే నిరాశతో వెళ్తుంటారు. డబ్బులు సంపాదించడానికి వండటం లేదు.ఉన్నంతలోనే మంచి రుచితో అందిస్తున్నాను. రాజకీయ నాయకుడు అద్దంకి దయాకర్, గాయకుడు రాహుల్ సిప్లిగంజ్, మరో సింగర్ బిట్టు, లేడీ సింగర్ లక్ష్మీతో పాటు చాలా మంది వస్తుంటారు. బాగుంది అని చెబుతుంటే ఆనందంగా ఉంటుంది. నాతో పాటు నా కూతురు, కొడుకు, కోడలు, మనవడు, మనవరాళ్లు ఏడు చోట్ల మెస్‌లు నిర్వహిస్తున్నారు. అన్ని చోట్లకు నేను వండిన బోటి కూర వెళ్తుంది. – లక్ష్మమ్మఇవి చదవండి: 'సిగ్నోరా సర్వీస్ సెంటర్'! ఈ ముగ్గురు మహిళలు.. -
లేపాక్షిలో థీమాటిక్ ఎగ్జిబిషన్
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్–69లోని నందగిరిహిల్స్‌లోని లేపాక్షి హస్తకళా షోరూంలో థీమాటిక్ ఎగ్జిబిషన్ నగరవాసులను ఆకట్టుకుంటోంది. ఈ నెల 15 నుంచి 19 వరకు జరిగే ప్రదర్శనలో కొండపల్లి బొమ్మలు, ఏటికొప్పాక బొమ్మలు, లెదర్ పప్పెట్స్, పెన్ కలంకారీ చీరలు, ఏలూరు కార్పెట్స్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మహిళలు పెద్ద సంఖ్యలో విచ్చేస్తూ ఈ చేతి వృత్తులను ప్రోత్సహిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచి్చన కళాకారులు తమ చేతులకు పనిచెబుతూ కొనుగోలుదారులను ఆకట్టుకుంటున్నారు. -
రయ్.. రయ్.. గూబ గుయ్!
బంజారాహిల్స్: రాత్రీ పగలూ తేడా లేకుండా మోడిఫైడ్ సైలెన్సర్‌తో భీకర శబ్దాలతో దూసుకెళ్తున్న స్పోర్ట్స్ బైక్‌లు, కార్లపై అటు ట్రాఫిక్ పోలీసులు, ఇటు లా అండ్ ఆర్డర్ పోలీసులు దృష్టిపెట్టారు. గడిచిన నెల రోజుల కాలంలో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, పంజగుట్ట, ఎస్ఆర్నగర్ పోలీస్స్టేషన్ల పరిధిలో ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులు మితిమీరిన వేగంతో చెవులు దద్దరిల్లే శబ్దంతో దూసుకెళ్తున్న వాహనాలను సీజ్ చేయడంతో పాటు సదరు వాహనదారులపై కేసులు నమోదు చేశారు. ఇంత చేస్తున్నా ఇంకా కొంతమంది యువకులు స్పోర్ట్స్ బైక్‌లు, కార్లలో రయ్ రయ్‌మంటూ దూసుకెళ్తూనే ఉన్నారు. రాత్రి 10 గంటల తర్వాతనే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, నెక్లెస్‌రోడ్డు, మాసబ్‌ట్యాంక్, మాదాపూర్, దుర్గం చెరువు ప్రాంతాల వైపు యువకులు రేసింగ్‌లకు పాల్పడుతూ బైక్‌లపై దూసుకెళ్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులు ఉదయం 11 నుంచి గంట పాటు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు రెండు గంటలు మాత్రమే వాహనాల తనిఖీలు చేపడుతున్నారు. తమ దృష్టికి వస్తే మాత్రమే కేసులు నమోదు చేస్తున్నారు. రాత్రి 7 తర్వాత తెల్లవారుజామున 6 గంటల వరకు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ రహదారులపై బైక్‌లు, కార్లు మోత మోగిస్తూ దూసుకెళ్తుండగా వాహనదారులు ప్రమాదకర పరిస్థితుల్లో ప్రత్యక్ష నరకాన్ని చవిచూస్తున్నారు. చెవులు దద్దరిల్లే సౌండ్లతో నివాసితులు సైతం తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. రాత్రి 8 నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు కనీసం వారానికి రెండు సార్లైనా ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులు వేర్వేరుగా వాహన తనిఖీలు చేపడితే పెద్ద ఎత్తున మోడిఫైడ్ సైలెన్సర్ల వాహనాలను పట్టుకోవచ్చని స్థానికులు సూచిస్తున్నారు. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి ఈ విషయంపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
Banjara Hills: నేను ముంబైలో ఉన్నా..పెళ్లి చేసుకున్నా
బంజారాహిల్స్: తాను స్నేహితురాలితో వెళ్తున్నానని, తన కోసం వెతకవద్దని ఇన్సాగ్రామ్లో తల్లికి పోస్ట్ పెట్టిన ఓ బాలిక సాయంత్రం తాను ముంబైలో ఉన్నానని, సైఫ్ అనే యువకుడిని పెళ్లి చేసుకున్నట్లు మరో పోస్ట్ చేసింది. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–11లోని ఉదయ్‌నగర్‌లో నివసించే బాలిక (14) ఎనిమిదో తరగతి పూర్తి చేసింది. ఇన్సాగ్రామ్లో చురుగ్గా ఉంటుంది. సోషల్ మీడియాను బాగా ఫాలో అవుతుంది. ఇందులో భాగంగానే ఇన్‌స్టాలో జహ్రనగర్లో సైఫ్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. ఈ నెల 17వ తేదీన తన తల్లికి ఆ బాలిక తన స్నేహితురాలి ఇంటికి వెళ్తున్నానంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ నెల 22న ఆ బాలిక ఇన్స్టాలోనే తాను సైఫ్‌ను పెళ్లి చేసుకున్నానని, ముంబయ్‌లో ఉన్నానని, ఇద్దరూ కలిసి దిగిన ఫొటోను షేర్ చేసింది. కొంతకాలంగా తన కూతురు జహ్రనగర్కు వెళ్తుండేదని, సైఫ్ అనే యువకుడు ఇన్‌స్టాలో పరిచయం అయ్యాడని, ఆయనతో వెళ్లిన విషయాన్ని ఇన్‌స్టాలో పోస్ట్ చేసి చెప్పిందని బాధిత తల్లి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
HYD: మినిస్టర్ క్వార్టర్స్‌లో చోరీ
హైదరాబాద్, సాక్షి: అది నగరంలో వన్ ఆఫ్ ది వీవీఐపీ ఏరియా. ఏకంగా రాష్ట్ర మంత్రుల నివాస ప్రాంగణాలు ఉండే చోటు. కాబట్టి, భద్రత కూడా కట్టుదిట్టంగానే ఉంటుందని అంతా భావిస్తాం. అయితే.. అలాంటి చోట చోరీ జరగడం చర్చనీయాంశంగా మారింది. బంజారాహిల్స్ మినిస్టర్ క్వార్టర్స్‌లో దొంగతనం జరిగింది. క్వార్టర్స్ ప్రాంగణంలో ఉంచిన నిర్మాణ సామాగ్రిని గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లిపోయారు. అర్ అండ్ బీ అధికారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. నిర్మాణ సామాగ్రిలో తలుపుల్ని, స్టీల్‌ను దుండగులు మాయం చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే.. అత్యంత పటిష్ట భద్రత ఉండే మంత్రుల నివాస ప్రాంగణంలో ఈ చోరీ జరగడంతో స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇది కిందిస్థాయి అధికారుల పనే అయ్యి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. -
Banjara Hills: యువతులను ఎరగా వేసి..
హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్డు నంబర్–14లోని ఆఫ్టర్ 9 పబ్‌లో సాగుతున్న చీకటి వ్యాపారం గుట్టును వెస్ట్‌జోన్ టాస్‌్కఫోర్స్ పోలీసులు రట్టుచేశారు. శనివారం రాత్రి ఆఫ్టర్ 9 పబ్‌కు పెద్ద సంఖ్యలో యువతీ యువకులు వచ్చారనే సమాచారంతో దాడులు చేశారు. పబ్ లోపలికి జంటలకు మాత్రమే అనుమతి ఉండగా.. ఇక్కడకు వస్తున్న యువకులకు, యువతులకు ఎలాంటి సంబంధాలు లేవని గుర్తించారు. ఇక్కడికి వచ్చే యువకులకు తాను అద్దెకు తీసుకువచ్చిన యువతులను పబ్ యజమాని ఎరగా వేస్తున్నట్లుగా గుర్తించారు. దీంతో పబ్ యజమాని బరిదక సతీష్, భవన యజమాని విద్యాధర మూర్తి, పబ్ మేనేజర్ కోరాడ శ్రీనివాసరావు, డీజే నిర్వాహకుడు అజ్మత్‌ఖాన్, క్యాషియర్ శ్రీనివాసరావు, అయిదుగురు బౌన్సర్లు సాయితేజ, మహేష్, కిషోర్, వినీల్, శేఖర్లతో పాటు 131 మంది యువకులు, 32 మంది యువతులను అరెస్టు చేసి బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిబంధనలు బేఖాతరు చేసిన ఆఫ్టర్ 9 పబ్ లైసెన్స్‌ను రద్దు చేయాల్సిందిగా ఎక్సైజ్ సూపరింటెండెంట్‌కు లేఖ రాశారు. అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నందున ఈ బిల్డింగ్‌ను సీజ్ చేయాలని సికింద్రాబాద్ ఆర్డీఓకు లేఖ రాసినట్లు పోలీసులు తెలిపారు. -
బంజారాహిల్స్ పబ్‌లో అసభ్య డ్యాన్స్‌లు.. 35 యువతుల అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ సమీపంలోని ఆఫ్టర్ 9 పబ్‌పై శనివారం రాత్రి వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేపట్టారు. కస్టమర్లను ఆకర్షించడానికి నిర్వాహకులు వేరే రాష్ట్రాల నుంచి యువతులను తీసుకొచ్చి పబ్‌లో అసభ్యకర డ్యాన్స్‌లు చేపిస్తున్నట్లు సమాచారం అందడంతో ఈ దాడులు చేపట్టారు. అర్థరాత్రి మద్యం మత్తులో అశ్లీల నృత్యాలు చేస్తున్న యువతులు, యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పబ్‌ను క్లోజ్ చేయించి.. కేసు నమోదు చేశారు.కాగా ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నప్పటికీ అర్ధరాత్రి వరకు బార్ & పబ్ ఆర్గనైజర్ నిర్వహిస్తున్నారు. After 9 పబ్ రైడ్ సమయంలో సుమారు 100 నుండి 150 మంది యువతి యువకులు ఉన్నట్లు సమాచారం. మద్యం మత్తులో డ్యాన్స్ 32 మంది యువతులు, 75 యువకులు అదుపులోకి తీసుకున్నారు. 32 మంది యువతులను పోలీస్ వాహనంలో సైదాబాద్‌లోని రెస్క్యూ హోమ్ తరలించారు. వీరు కర్ణాటకకు చెందిన వారుగా గుర్తించారు. -
Banjarahills: బంజారాహిల్స్‌లో బెంజ్ కారు బీభత్సం...
హైదరాబాద్: అదుపు తప్పిన వేగంతో వచ్చిన బెంజ్ కారు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌పైకి దూసుకెళ్లి బీభత్సం సృష్టించింది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు.. అమెరికాలో నివసించే అయిదుగురు యువతీ యువకులు ఓ వివాహానికి హాజరయ్యేందుకు నాలుగు రోజుల క్రితం నగరానికి వచ్చారు. జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్–45లో నివసించే వెంకటష్, అవినాష్‌తో పాటు జర్మనీ, అమెరికాలో నివసించే మ్యాక్స్మిలన్ హెన్రీ, ప్రీతమ్, ఓ యువతి బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్ హోటల్లో బస చేశారు.మంగళవారం రాత్రి వీరు బెంజ్ కారులో జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్–45లోని దస్పల్లా హోటల్ పైన ఉన్న కారా పబ్‌కు వెళ్లారు. మద్యం తాగిన అనంతరం అర్ధరాత్రి కారులో మాదాపూర్,గచ్చిబౌలి, దుర్గంచెరువు ప్రాంతాలను చుట్టేసి పార్క్ హయత్ హోటల్ వైపు వెళ్తున్నారు. జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 10/36 శ్రీజ్యువెలర్స్ వద్ద వీరు వెళ్తున్న కారు అదుపుతప్పి అంతే వేగంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పైకి దూసుకెళ్లింది. కాగా.. ఇందులోని అయిదుగురు యువతీ యువకులు క్షేమంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్టేషన్‌కు తరలించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించగా కారు నడుపుతున్న వెంకటేష్ 44 ఎంజీ, అవినాష్ 173 ఎంజీతో పాటు మిగతావారు కూడా మద్యం తాగినట్లు గుర్తించారు. జూబ్లీహిల్స్‌కు చెందిన చలసాని మాధవీదేవి పేరుతో కారు రిజిస్టరై ఉందని పోలీసులు గుర్తించారు. ఓ పెళ్లికి హాజరుకావడానికి వీరంతా నగరానికి వచ్చినట్లు తేలింది. జూబ్లీహిల్స్ పోలీసులు కారును సీజ్ చేసి కేసు దర్యాప్తు జరుపుతున్నారు. -
Sowmya Janu Photos: రంజాన్ విందు ఇచ్చిన నటి సౌమ్యజాను (ఫొటోలు)
-
వారం రోజుల్లో పరీక్షలు.. అంతలోనే దుర్మరణం
బంజారాహిల్స్: వారంరోజుల్లో పదోతరగతి పరీక్షలు.. ఈలోగా స్నేహితులతో సరదాగా గడుపుదామనుకున్నాడు.. అంతలోనే ఓ విద్యార్థి రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందాడు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. బోరబండకు చెందిన ఆటోడ్రైవర్ జగదీశ్ కుమారుడు భరణిసాయి లోకేష్(15) అదే ప్రాంతంలోని ఎస్వీఎస్ పబ్లిక్ స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. ఈ నెల 18వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానుండగా ఆదివారం ఉదయం నలుగురి స్నేహితులతో కలిసి బైక్‌లపై బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కుకు బయలుదేరారు. శ్రీనగర్‌కాలనీ టీవీ9 జంక్షన్లో సాయిలోకేశ్ బైక్‌ను టర్న్ చేసే క్రమంలో అదుపుతప్పింది. దీంతో రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టి ఎగిరి స్ట్రీట్‌లైట్ స్తంభానికి తగలడంతో సాయిలోకేశ్ తల పగిలి అక్కడికక్కడే చనిపోయాడు. పక్కనే బైక్‌లు నడుపుతున్న స్నేహితులు ఒక్కసారిగా వచి్చన పెద్ద శబ్దం విని షాక్‌కు గురయ్యారు. రెప్పపాటులో రక్తపుమడుగులో ఉన్న స్నేహితుడిని చూసి కన్నీరుమున్నీరయ్యారు. ఒక్కగానొక్క కొడుకు కళ్లముందే విగతజీవిగా మారడంతో జగదీశ్‌తోపాటు కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదించారు. శనివారం రాత్రే కొడుకును తీసుకెళ్లి రహమత్‌నగర్‌లో పరీక్షాకేంద్రాన్ని చూసి వచ్చానని, ఇంతలోనే ఈ ఘటన చోటుచేసుకుందని తండ్రి బోరున విలపించాడు. బంజారాహిల్స్ పోలీసులు ఘటనాస్థలంలో సీసీ ఫుటేజీలను సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హెల్మెట్ ధరించి ఉంటే ఆ బాలుడు బతికి ఉండేవాడని పోలీసులు వెల్లడించారు. -
Banjara Hills: ట్రాఫిక్ బూత్‌లో మృతదేహం
హైదరాబాద్: రోడ్డు నంబర్–1లోని తాజ్‌కృష్ణా హోటల్ చౌరస్తాలో ఉన్న ట్రాఫిక్ బూత్ అంబ్రిల్లాలో అనుమానాస్పద మృతదేహాన్ని బంజారాహిల్స్ పోలీసులు స్వాదీనం చేసుకుని ఉస్మానియాకు తరలించారు. తాజ్‌కృష్ణా చౌరస్తాలోని ట్రాఫిక్ బూత్‌లో గుర్తుతెలియని మృతదేహం(32) ఉన్నట్టు మంగళవారం ఉదయం విధుల్లోకి వచ్చిన ట్రాఫిక్ కానిస్టేబుల్ పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే అక్కడికి చేరుకున్న బంజారాహిల్స్ పోలీసులు మృతదేహాన్ని స్వాదీనం చేసుకుని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని బంజారాహిల్స్ సీఐ రాఘవేందర్ తెలిపారు. ఆరా తీయగా ఫుట్‌పాత్‌లపై పడుకునే నిరాశ్రయుడిగా తేలిందని ఆయన చెప్పారు. తలకు వెనకాల గాయమైందని.. రోడ్డు దాటుతున్నప్పుడు ఏదైనా వాహనం ఢీకొట్టిందా? లేక ప్రమాదవశాత్తూ కిందపడ్డాడా? అనే విషయాలు తెలియాల్సి ఉందన్నారు. -
ఒక అమ్మాయిని బూతులు తిట్టే హక్కు ఉందా?: ఏడ్చేసిన నటి
ఇటీవల హైదరాబాద్‌లో నటి సౌమ్య జాను ఓ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. రాంగ్ రూట్లో వెళ్తుండగా ట్రాఫిక్ హోంగార్డ్‌తో జరిగిన గొడవ కాస్తా పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. ఈ నెల 24న బంజారాహిల్స్ రోడ్ నంబరు 12లోని అగ్రసేన్ జంక్షన్లో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ హోంగార్డు.. జాగ్వార్ కారులో రాంగ్రూట్లో వచ్చిన సౌమ్యను అడ్డగించారు. దీంతో వీరిద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అయితే ఈ వ్యవహారంపై తాజగా నటి సౌమ్య జాను ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఆ సమయంలో తాను రాంగ్ రూట్లో వెళ్లినట్లు తెలిపింది. కానీ ట్రాఫిక్ పోలీస్ వ్యవహరించిన తీరుపై ఆవేదన వ్యక్తం చేసింది. తనతో చాలా అసభ్యంగా ప్రవర్తించాడని వివరించింది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ రోజు జరిగిన సంఘటన గురించి అసలు నిజాలు చెప్పుకొచ్చింది. సౌమ్య ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..' అసలు నా గురించి వీడియో సోషల్ మీడియాలో వస్తున్న సంగతే తెలీదు. ఇక్కడ పెద్ద బ్లండర్ ఎంటంటే.. నాకు మందు అలావాటే లేదు. నేను రాంగ్‌లో రూట్లోనే వెళ్లా. దీనికి సారీ చెబుతున్నా. నేను మెడిసిన్స్ కోసం వెళ్తున్నా. ఆ టైంలో ఫుల్ ట్రాఫిక్ ఉంది. మా మదర్‌కు మందులు అర్జెంట్‌గా కావాలి. ఆ విషయం అతనికి కూడా చెప్పాను. కానీ వినకుండా కారు వెనక్కి తీయమన్నారు. తను చాలా ఓవర్‌గా రియాక్ట్ అయ్యాడు. నాతో చాలా అసభ్యంగా మాట్లాడాడు. కానీ ఆ ఒక్క బూతు మాట నేను తీసుకోలేకపోయాను. రెండు రోజుల నుంచి మంచినీళ్లు కూడా తాగలేకపోతున్నా. ఆ మాటలకే నాకు కోపం వచ్చింది. అసలు ఆ మాట అనడానికి అతనికి నోరెలా వచ్చిందో నాకు తెలియట్లేదు. ప్రతి మగాడు.. ఒక ఆడదాన్ని అలా ఎందుకంటాడు.' అంటూ ఏడ్చేసింది. సౌమ్య మాట్లాడుతూ..'ఒక అమ్మాయి తప్పు చేసి ఉండొచ్చు. కానీ దానికి చాలా కారణాలు ఉంటాయి. అయిన వాళ్లను అనే హక్కు ఎవరికీ లేదు. మన సమాజంలో గేలు కూడా ఉంటారు. వాళ్లను ఉద్దేశించి ఎవరికీ అనే హక్కు లేదు. ఎందుకంటే ఆ దేవుడు వారికి అలాంటి లైఫ్ ఇచ్చాడు. డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ ఆ మాటలు నన్ను ఎలా అంటారు. అక్కడ నేనేం నానా హంగామా చేయలేదు. కావాలంటే సీసీ కెమెరాలు చూస్తే తెలుస్తుంది. నేను ఎలాంటి వైద్య పరీక్షలకైనా సిద్ధం. నా తప్పు ఉంటే ఎలాంటి శిక్షకైనా రెడీ. కానీ అతను అన్న మాటలకు నా కుటుంబం నరకం అనుభవిస్తున్నాం. నా ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఎంటి ఇలా అయింది? అని అడుగుతుంటే నాకు ఏడుపు వచ్చేస్తోంది. ఆ రోజు నాకు మా అమ్మ ఆరోగ్యమే ముఖ్యం. అందుకే పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేదు. నేను ఎక్కడికీ పోలేదు. హైదరాబాద్‌లోనే ఉన్నా. అతను చేసింది మాత్రం చాలా తప్పు. దీనిపై ఎంతవరకైనా పోరాడతా' అని అన్నారు. -
Underpass: బంజారాహిల్స్ టు జూబ్లీహిల్స్!
మహానగరంలో ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు కొత్త ప్రభుత్వం రంగంలోకి దిగింది. ట్రాఫిక్ రద్దీ అత్యధికంగా ఉన్న జంక్షన్లలో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేంచాలని, ముఖ్యంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్ జంక్షన్లలో తలెత్తుతున్న వాహన రద్దీని అదుపులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్‌పై జీహెచ్ఎంసీ, పోలీసులతో సమీక్ష నిర్వహించిన సీఎం నగరంలోనే అత్యధిక రద్దీతో రికార్డుల్లోకెక్కిన జూబ్లీహిల్స్ జంక్షన్‌పై దృష్టిపెట్టాలని సూచించారు. బంజారాహిల్స్: జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్‌రాస్, నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి సంబంధిత అధికారులతో కలిసి నాలుగు రోజుల క్రితం జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు పాటు జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్–45, రోడ్డు నెంబర్–36తో పాటు జర్నలిస్ట్ కాలనీ చౌరస్తా, సీవీఆర్ న్యూస్ చౌరస్తా, అగ్రసేన్ చౌరస్తా, విరించి హాస్పటల్ చౌరస్తా, కేబీఆర్ పార్కు చౌరస్తాల్లో రెండు విడతలుగా పర్యటించారు. ► ట్రాఫిక్ ఎక్కడెక్కడ రద్దీగా ఉంటుందో పరిశీలించడమే కాకుండా అందుకు గల కారణాలపై ఆరా తీశారు. ఏమి చేస్తే బాగుంటుందనే దానిపై అప్పటికే ట్రాఫిక్‌పై అధ్యయనం చేసిన అధికారులతో చర్చించి డిజైన్లను పరిశీలించారు. అండర్‌పాస్‌లు.. ఫ్లైఓవర్లు... జీహెచ్ఎంసీ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన సమన్వయ పర్యటనలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు చౌరస్తా నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు దాటి, రోడ్డు నెంబర్–45 బాలకృష్ణ ఇంటి చౌరస్తా వరకు వెళ్లడానికి అండర్‌పాస్ నిర్మించాలని నిర్ణయించారు. ► ఇందులో భాగంగా అడ్డుగా ఉన్న డ్రైనేజీ, మంచినీటి, వరదనీటి పైప్లైన్లను మళ్లించేందుకు ప్రణాళికలు రూపొందించాలని తీర్మానించారు. ► కేబీఆర్ పార్కులో ఒక్క చెట్టు కూడా నష్టపోకుండా గ్రీన్ ట్రిబ్యునల్ అథారిటీకి లోబడి 1.5 కిలోమీటర్ల మేర ఈ అండర్‌పాస్ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాలని ఇంజినీర్లను ఆదేశించారు. దీని ద్వారా బాలకృష్ణ ఇంటివైపు, ఫిలింనగర్ వైపు, రోడ్డు నెంబర్–45 వైపు వాహనదారులు కేబీఆర్ పార్కు నుంచి ఎలాంటి ఆటంకా>లు లేకుండా తేలిగ్గా ముందుకుసాగనున్నారు. ► జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్–45 బాలకృష్ణ ఇంటి చౌరస్తా నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు మీదుగా బంజారాహిల్స్ కేబీఆర్ పార్కు వరకు వన్‌వేలో వెళ్లేందుకు ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. సుమారు కిలోమీటరు మేర ఈ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టనున్నారు. ► జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్–45 కేబుల్ బ్రిడ్జి ఫ్లైఓవర్ నుంచి వాహనాలు దిగిన తర్వాత ఆ వెంటనే కొత్తగా నిర్మించిన ఫ్లైఓవర్ మీదుగా బంజారాహిల్స్ వైపు వాహనదారులు వెళ్లేందుకు అనువుగా ఈ నిర్మాణం చేపట్టనున్నారు. ఇప్పటికే అటు అండర్‌పాస్, ఇటు ఫ్లైఓవర్ నిర్మాణాల కోసం సంబంధిత ఇంజినీర్లు డిజైన్లు కూడా పూర్తిచేయగా, ఆ మ్యాప్‌లను జీహెచ్ఎంసీ, పోలీసు కమిషనర్లు పరిశీలించారు. ► జర్నలిస్ట్ కాలనీ చౌరస్తాలో ప్రముక పాత్రికేయుడి శిలా విగ్రహం రోడ్డు మధ్యలోకి రావడంతో ఆ విగ్రహాన్ని సెంట్రల్ మీడియన్‌లో ఏర్పాటు చేయాలని ఇప్పటికే జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ప్రతినిధులతో ఓ దఫా చర్చించారు. మరోసారి సంబంధిత ప్రతినిధులతో సంప్రదించి ఈ విగ్రహాన్ని మరింత సుందరంగా చౌరస్తా మధ్యలో నిర్మించాలని నిర్ణయించారు. ► దీని ద్వారా జర్నలిస్ట్ కాలనీ వైపు నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టుకు వెళ్లే వాహనదారులు మరింత తేలికగా ముందుకుసాగనున్నారు. ► కేబీఆర్ జంక్షన్, జూబ్లీహిల్స్ జంక్షన్, జర్నలిస్ట్‌కాలనీ జంక్షన్, జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్–45 జంక్షన్, సీవీఆర్ న్యూస్ జంక్షన్, బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–12 అగ్రసేన్ జంక్షన్లలో ఇరుకుగా ఉన్న సెంట్రల్ మీడియన్లను కొంతమర తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. ► నాలుగువైపులా వాహనాలు తేలిగ్గా వెళ్లేందుకు వీలుగా ఈ సెంట్రల్ మీడియన్లను కట్ చేయనున్నారు. 20 సంవత్సరాలు క్రితం అప్పటి ట్రాఫిక్‌కు అనుగుణంగా ఈ చౌరస్తాలు రూపుదిద్దుకోగా, అప్పటి నుంచి ఇప్పటిదాకా చిన్న మార్పు కూడా చేయకుండా ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోగా, రోడ్లు, జంక్షన్ల విస్తరణ కూడా చేపట్టలేదు. ఇన్నాళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం జంక్షన్ల విస్తరణకు ముందుకురావడమే కాకుండా నిధులు కూడా మంజూరు చేయాలని నిర్ణయించింది. ► కేబీఆర్ పార్కు వైపు నుంచి జూబ్లీహిల్స్ చౌరస్తా మీదుగా ఫిలింనగర్ వెళ్లే జూబ్లీహిల్స్ జంక్షన్ మలుపు వద్ద భారీ హైటెన్షన్ స్తంభాలు ఫుట్‌పాత్‌పై అడ్డుగా ఉన్నాయి. ఇక్కడ ఫుట్‌పాత్ కూడా చాలా వెడల్పుగా ఉంది. ఫిలింనగర్ వైపు 2, 3 బస్టాపులు అనవసరంగా నిర్మించారు. ► హైటెన్షన్ స్తంభాలను తొలగించి ఫుట్‌పాత్ వెడల్పును తగ్గించి మూడు బస్òÙల్టర్లను తీసేయడం ద్వారా ఫిలింనగర్ వైపు ప్రీలెఫ్ట్‌లో వాహనదారులు తేలికగా వెళతారని నిర్ణయించారు. ► ఇక కేబీఆర్ పార్కు చుట్టూ ఉన్న పార్కింగ్ స్థలాల్లో మలీ్టలెవల్ పార్కింగ్ సౌకర్యాలు కలి్పంచే దిశలో కూడా అధికారులు చర్చించారు. -
పేకాటలో హైటెక్ చీటింగ్!
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: బంజారాహిల్స్‌లోని రాడిసన్ హోటల్ కేంద్రంగా సాగిన పేకాటలో హైటెక్ చీటింగ్ దందాలు వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. మహబూబ్‌నగర్‌కు చెందిన శ్రీను నేతృత్వంలోని తొమ్మిది మందితో కూడిన ముఠాను పట్టుకున్నారు. వీరితో పాటు పేకాట ఆడుతున్న నలుగురినీ అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ అధికారులకు అప్పగించారు. నిందితులకు నోటీసులు జారీ చేశామని బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ పి.సతీష్ బుధవారం ‘సాక్షి’కి తెలిపారు. మహబూబ్‌నగర్‌లోని సుభా‹Ùనగర్‌కు చెందిన సింగిడి శ్రీనివాస్ అలియాస్ శ్రీను తన స్నేహితులతో కలిసి తరచూ గోవాలోని క్యాసినోవాలకు వెళ్లి వస్తుండేవారు. అక్కడ పేకాటలో భారీగా నష్టపోయిన ఇతగాడు అదే ఆటలో మోసాలకు పథక రచన చేశాడు. నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సూర్య, మెరి్వన్, చంద్రశేఖర్, గుర్మీత్ సింగ్, సంతోష్ కుమార్, సయ్యద్ నయీం, వేణు, వినోద్‌లతో ముఠా ఏర్పాటు చేశాడు. ఎదుటి వారి పేక ముక్కలు కనిపించేలా.. ఆన్లైన్లో ఆర్డర్ ఇచి్చన శ్రీను రూ.25 వేలు వెచి్చంచి ఎక్స్‌రే విజన్ కాంటాక్ట్ లెన్స్‌ను ఖరీదు చేశాడు. పేకాట సమయంలో ఎవరైనా దీన్ని ధరిస్తే ఎదుటి వ్యక్తి చేతిలోని ముక్కలు ఏంటో తెలుసుకోవచ్చు. దీన్ని ఎలా వినియోగించాలనేది మెరి్వన్ యూ ట్యూబ్ ద్వారా తెలుసుకుని ధరిచడం మొదలెట్టాడు. గోవాలో పేకాట నేపథ్యంలో పరిచయమైన సరితకు తాము రాడిసన్ హోటల్ కేంద్రంగా భారీ పేకాట శిబిరం నిర్వహిస్తున్నట్లు సమాచారం ఇచ్చాడు. దీంతో ఈమెతో పాటు బంధువులు, స్నేహితులు అయిన సాయి కృష్ణ, వినోద్‌కుమార్, కుమారీ అక్కడకు వచ్చి పేకాట ఆడేందుకు ఆసక్తి చూపారు. దీంతో ముందే రూ.1.5 లక్షల తన ఖాతాలో డిపాజిట్ చేయించుకున్న శ్రీను.. తన ముఠాకు చెందిన వాళ్లనూ పేకాట ఆడే వారి మాదిరిగానే రంగంలోకి దింపాడు. తన ఖాతాలో పడిన మొత్తం నుంచి రూ.24 వేలు వెచి్చంచిన శ్రీను.. రాడిసన్ హోటల్లో స్వీట్ రూమ్ బుక్ చేశాడు. మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు అక్కడుకు చేరుకున్న అంతా పేకాట ఆడటం మొదలెట్టారు. వినోద్ తదితరులకు శ్రీను రూ.4,500 విలువైన కాయిన్లు కూడా ఇచ్చాడు. ఎక్స్‌రే విజన్ కాంటాక్ట్ లెన్స్ ధరించిన మెరి్వన్ వినోద్‌కుమార్, సరిత చేతుల్లోని పేక ముక్కలు తెలుసుకుని.. తన ముఠా సభ్యుల సాయంతో వాళ్లు ఓడిపోయేలా చేస్తున్నాడు. ఇది పశ్చిమ మండల టాస్‌్కఫోర్స్ పోలీసులకు సమాచారం అందడంతో దాడి చేసిన అధికారులు 13 మందినీ అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.2400 నగదు, 4500 కాయిన్లు, లెన్స్‌ను స్వాధీనం చేసుకుని బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. శ్రీను తన గ్యాంగ్‌లోని వారికి ఒక్కో విడతకు రూ.2 వేలు చొప్పున చెల్లిస్తున్నాడని, లెన్స్ ధరించి సాంకేతిక సహకారం అందించే మెరి్వన్‌కు మాత్రం రూ.5 వేలు చొప్పున ఇస్తున్నాడని పోలీసులు గుర్తించారు. శ్రీను ఖాతాలో ఉన్న రూ.84 వేలు సైతం ఫ్రీజ్ చేశారు. ఈ గ్యాంగ్ గతంలోనూ కొందరిని ఇలా మోసం చేసినట్లు అనుమానిస్తున్న పోలీసులు ఆ కోణంలో ఆరా తీస్తున్నారు. పేకాట శిబిరం నిర్వహిస్తున్న శ్రీను, అతడి గ్యాంగ్‌తో పాటు పేక ఆడటానికి వచి్చన నలుగురికీ నోటీసులు జారీ చేశారు. -
బంజారాహిల్స్‌లో అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన మూడు కార్లు
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 4లో అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు హోటల్లో మంటలు చెలరేగాయి. పార్కింగ్లోని మూడు కార్లకు మంటలు అంటుకోవడంతో.. కార్లు కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. -
బంజారాహిల్స్ లో ఎక్సక్లూజివ్ పాప్-అప్ ఎగ్జిబిషన్.. (ఫోటోలు)
-
బండ్ల గణేష్ కారు డ్రైవర్ భార్య ఆత్మహత్య..
హైదరాబాద్: తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ భర్తకు ఫోన్ చేసిన అర నిమిషంలోనే ఓ యువతి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలివీ... భద్రాద్రి జిల్లాకు చెందిన బానోతు చందన (25)రమణ దంపతులు బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–2లోని ఇందిరానగర్‌లో నివాసం ఉంటున్నారు. రమణ సినీ నిర్మాత బండ్ల గణేష్ వద్ద కారు డ్రైవర్‌గా పనిచేస్తుండగా చందన భీమా జ్యువెలర్స్‌లో సేల్స్ ఉమెన్‌గా పనిచేస్తుంది. సోమవారం ఉదయం ఇద్దరి మధ్య స్వల్ప గొడవ జరిగింది. రమణ డ్యూటీకి వెళ్లిగా మధ్యాహ్నం చందన ఇంటి నుంచే ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పి ఫోన్ కట్ చేసింది. రమణ వెంటనే ఇంటి యజమానికి సమాచారం ఇచ్చి డ్యూటీ నుంచి బయలుదేరాడు. యజమాని పైకి వెళ్లి తలుపు తట్టగా ఎంతకూ తెరుచుకోకపోవడంతో కిటికీలోంచి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. చుట్టుపక్కలవారి సాయంతో తలుపులు బద్దలుకొట్టి లోనికి వెళ్లిచూడగా అప్పటికే ఆమె విగతజీవిగా కనిపించింది. మృతురాలి తండ్రి కోటేశ్వరరావు ఇచి్చన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బంజారాహిల్స్‌లో సందడి చేసిన హీరో నిఖిల్ సిద్దార్థ్ (ఫొటోలు)
-
బంజారాహిల్స్ : ర్యాక్ క్యాజిల్‌లో నూతన సంవత్సర వేడుకల్లో యువత ఉత్సాహం (ఫొటోలు)
-
రూ. 500 గ్యాస్ సిలిండర్.. ఈ కేవైసీ అవసరం లేదు..!
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఎన్నికల ప్రణాళికలో రూ. 500లకే వంట గ్యాస్ అందజేస్తామని ప్రకటించింది. దీంతో గ్యాస్ వినియోగదారులు ఈ కేవైసీ (నో యువర్ కస్టమర్) చేయించుకునేందుకు గ్యాస్ ఏజెన్సీల వద్దకు పరుగులు తీస్తున్నారు. ఈ కేవైసీతో సంబంధం లేదని అధికారులు, డీలర్లు చెబుతున్నా ఏజెన్సీల వద్ద మహిళలు బారులు తీరుతున్నారు. తమ పనులు వదులుకొని వినియోగదారులు ఉదయం 8 గంటల నుంచే గ్యాస్ ఏజెన్సీల వద్ద క్యూలు కడుతున్నారు. హైదరాబాద్: ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల పరిధిలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వరకాలనీ, సోమాజిగూడ, ఖైరతాబాద్, షేక్‌పేట, రహమత్‌నగర్, యూసుఫ్‌గూడ, ఎర్రగడ్డ, బోరబండ, వెంగళ్రావునగర్, శ్రీనగర్ కాలనీ డివిజన్ల పరిధిలో తొమ్మిది గ్యాస్ ఏజెన్సీలు ఉండగా 3.40 లక్షల మంది గ్యాస్ వినియోగదారులు ఉన్నారు. ► ఇందులో తెల్ల రేషన్ కార్డు ఉన్న వారు 83,127 మంది ఉండగా, అన్నపూర్ణ అన్నయోజన కార్డు కలిగిన వారు 3368 మంది కలిగి ఉన్నారు. ► ప్రభుత్వం రూ. 500 గ్యాస్ సిలిండర్‌పై ఇంత వరకు ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయకున్నా తెల్లరంగు రేషన్ కార్డుదారులకు వర్తిస్తుందని సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపులలో వార్తలు వైరల్ అవుతుండటంతో ఇటు తెల్లకార్డుదారులు, అటు సాధారణ గ్యాస్ వినియోగదారులు ఈ కేవైసీ కోసం గంటల తరబడి వేచి చూస్తున్నారు. ► ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద రూ. 500కే వంట గ్యాస్ అందిస్తామని చెప్పింది. ఈ పథకానికి ఈ కేవైసీకి సంబంధం లేదని దీనికి నిర్దిష్టగడువు కూడా ఏమీ లేదని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చేవరకు వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీల వద్దకు రావొద్దని ఏజెన్సీల నిర్వాహకులు ఏకంగా బ్యానర్లే కడుతున్నారు. ఉజ్వల పథకానికి మాత్రమే... ► కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉజ్వల పథకానికి మాత్రమే ఈ కేవైసీ చేయాల్సి ఉంటుంది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింద గతంలో మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు. ఈ పథకంలోని లబి్ధదారులకు ప్రభుత్వం రాయితీపై గ్యాస్ అందజేస్తుంది. ఈ పథకంలో మృతి చెందిన వారి వివరాలు తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కేవైసీని ప్రవేశ పెట్టింది. మహిళలు బయోమెట్రిక్ చేయించి నమోదు చేయించుకోవాలని వేలి ముద్రలు పడకపోతే ఐరిష్ విధానంలో ఈ కేవైసీని పూర్తి చేస్తారు. వాస్తవాలు తెలియని వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీలకు పరుగులు తీస్తున్నారు. రెండేళ్లకోసారి ఈ కేవైసీ చేయించుకోవాలని ప్రభుత్వం సూచిస్తున్నది. లబి్ధదారుల సంఖ్య, మృతులు, ఏజెన్సీ నుంచి మరో ఏజెన్సీకి బదిలీ చేయించుకోవడం, కనెక్షన్ రద్దు చేసుకోవడం, తదితర కారణాలు తెలుసుకునేందుకు ఇది వీలవుతుంది. ఇందులో భాగంగానే కచి్చతమైన సంఖ్య తెలుసుకోవడానికి లబి్ధదారుల వేలిముద్రలు సేకరిస్తున్నారు. ప్రభుత్వం నుంచి మార్గర్శకాలు వచి్చన వెంటనే వినియోగదారులకు, గ్యాస్ ఏజెన్సీలకు సమాచారం అందిస్తామని అధికారులు పేర్కొంటున్నా వినియోగదారులు వినిపించుకోకుండా గ్యాస్ ఏజెన్సీలకు పరుగులు తీస్తున్నారు. ఇంటి వద్దకే డెలివరీ బాయ్స్ వస్తారు గ్యాస్ వినియోగదారులు ఈ కేవైసీ కోసం గ్యాస్ ఏజెన్సీల కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదు. మా డెలివరీ బాయ్స్ ఇంటికే వచ్చి ఈ కేవైసీ నమోదు చేయించుకుంటారు. ఇందులో భాగంగా సెల్ఫోన్లు, ఐరిష్ విధానంలో కళ్లను స్కాన్ చేస్తారు. దీనికి అంతరాయం ఏర్పడితేనే గ్యాస్ ఏజెన్సీలకు రప్పిస్తాం. గృహ వినియోగదారులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. రూ. 500 సిలిండర్ కోసం చాలా మంది ఏజెన్సీలకు వస్తున్నారు. తప్పుడు సమాచారం సామాజిక మాధ్యమాల ద్వారా వ్యాప్తి చెందుతోంది. దీంతో వినియోగదారులు ఆందోళనకు గురవుతున్నారు. సదరు పథకం కింద లబ్ధి పొందాలని కాంక్షిస్తూ ఏజెన్సీలకు పరుగులు పెడుతున్నారు. వదంతులు నమ్మవద్దు, ఇంకా మార్గదర్శకాలు రాలేదు. ప్రస్తుతం జరుగుతున్న ఈ కేవైసీ ప్రక్రియకు రాయితీ సిలిండర్‌కు ఎలాంటి సంబంధం లేదు. వినియోగదారులు అనవసరంగా ఆందోళనకు గురికావొద్దు. – బి.శ్రీనివాస్, గ్యాస్ డీలర్, జూబ్లీహిల్స్ -
హైదరాబాద్ : హరే కృష్ణ గోల్డెన్ టింపుల్ లో ముగిసిన బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
-
బంజారా హిల్స్ తాజ్ కృష్ణ హోటల్లో ఏర్పాటు చేసిన సూత్ర ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన ఉమేష్ మధ్యాన్, మోడల్స్ (ఫోటోలు)
-
బంజారాహిల్స్‌లో కెఫేలో సందడి చేసిన తారలు (ఫొటోలు)
-
పనిమనిషిపై అత్యాచారం కేసులో మురళీ ముకుంద్ అరెస్ట్
బంజారాహిల్స్: హైదరాబాద్‌లో పేరొందిన ఒక స్కూలుకు ఒకప్పుడు చైర్మన్‌గా పనిచేసిన ఒక విద్యాధికుడు అత్యంత హీనమైన చర్యకు పాల్పడ్డాడు. తన ఇంటిలో పనిచేసే యువతిని బెదిరించి, ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఒక స్కూలుకు మార్గదర్శకునిగా వ్యవహరించిన ఆ వ్యక్తి ఇటువంటి దుర్మార్గానికి పాల్పడటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 12, మిథులానగర్‌లో నివాసముంటున్న జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ మాజీ చైర్మన్ మురళీముకుంద్ తన ఇంట్లో పని చేసే యువతిని బెదిరించి, లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అనంతరం నాంపల్లి కోర్టు న్యాయమూర్తి నివాసంలో హాజరుపరిచారు. బాధితురాలు ఈ నెల 18న బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన దరిమిలా పోలీసులు మురళీ ముకుంద్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మురళీ ముకుంద్‌కు 14 రోజుల పాటు జ్యుడీషీయల్ రిమాండ్‌ను విధించారు.ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించారు. కాగా, పరారీలో ఉన్న కుమారుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
బంజారాహిల్స్ లో 3.35 కోట్ల హవాలా నగదు పట్టివేత
-
బంజారాహిల్స్‌లో భారీగా హవాలా నగదు పట్టివేత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో హైదరాబాద్ సహా జిల్లాల్లో పోలీసులు ముమ్మర తనిఖీలు ప్రారంభించారు. తాజాగా, బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో భారీగా హవాలా నగదు పట్టుకున్నారు. రూ.3.35 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న బంజారాహిల్స్ పోలీసులు.. ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని, దీనిలో భాగంగా వాహన తనిఖీలు విస్తృతంగా చేపడుతున్నామని వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డెవిస్ తెలిపారు. నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ స్పోర్ట్స్ పోలీసులతో పాటు బంజారాహిల్స్ పోలీసులు సంయుక్తంగా వాహన తనిఖీలు చేపట్టారని, రోడ్ నెంబర్-3 వద్ద వాహనాలు తనిఖీలు చేస్తున్న సమయంలో అనుమానాస్పదంగా ఉన్న కియా కారును తనిఖీ చేయగా మూడు కోట్ల 35 లక్షల నగదు పట్టుబడిందని డీసీపీ వెల్లడించారు. ‘‘పట్టుబడిన నగదు హవాలా మనీగా గుర్తించాం.. హనుమంతరెడ్డి, బచ్చల ప్రభాకర్, మండల శ్రీరాములు రెడ్డి, ఉదయ్ కుమార్‌లను అదుపులోకి తీసుకున్నామన్నారు. హనుమంత్ రెడ్డి సూచన మేరకు ప్రభాకర్, శ్రీ రాములు, ఉదయ్ కుమార్ హవాలా మనీ సేకరిస్తూ ఉంటారు. ఇందుకోసం అరోరా కాలనీలో సాయి కృప బిల్డింగ్ ప్లాట్ నెంబర్ 583 తమ కార్యాలయంగా ఏర్పాటు చేసుకున్నారు. సేకరించిన హవాలా డబ్బులు తమ కార్యాలయానికి తీసుకెళ్తుండగా సీజ్ చేశాం. కోటి హవాలా మనీకి 25,000 కమిషన్‌గా తీసుకుంటారు. ఇవాళ ఉదయం ప్రభాకర్ రెడ్డి, హనుమంత్ రెడ్డి.. బేగంబజార్, నాంపల్లి, గోషామహల్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో మూడు కోట్ల 35 లక్షలను కలెక్ట్ చేశారు. పట్టుకున్న నగదును కోర్టులకు అప్పగిస్తాం. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున వాహన తనిఖీలు మరింత విస్తృతంగా చేస్తామని డీసీపీ పేర్కొన్నారు. రంగా రెడ్డి జిల్లాలో.. వాహన తనిఖీల్లో 6.55 లక్షల రూపాయలను ఇబ్రహీంపట్నం పోలీసులు పట్టుకున్నారు. పూర్తిస్థాయి విచారణ నిమిత్తం నగదను ఇబ్రహీంపట్నం ఆర్డీవోకి అప్పగించారు. కాగా, ఎన్నికల్లో అక్రమంగా డబ్బు, మద్యం పంపిణీని అరికట్టేందుకు ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు, నాకా బందీలు పెట్టి సోదాలు నిర్వహిస్తున్నారు. ఎలాంటి పత్రాలు, ఆధారాలు లేకుండా తరలిస్తున్న నగదు, బంగారం, వెండి, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకుంటున్నారు. రాజధాని పరిధిలో... ►సోమవారం.. బషీర్‌బాగ్ నిజాం కళాశాల వద్ద వాహన తనిఖీల్లో ఓ బంగారం దుకాణానికి చెందిన, ఎలాంటి పత్రాల్లేని 7 కిలోల బంగారం, 295 కిలోల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ. 7.5 కోట్లు ఉండొచ్చని చెప్పారు. పురానాపూల్ వద్ద బేగంబజార్‌కు చెందిన ఒకరి నుంచి రూ.15 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ►హైదరాబాద్‌లోని చైతన్యపురి పరిధిలో బైక్‌పై వెళుతున్న ఇద్దరు వ్యక్తులు ఆధారాల్లేకుండా తరలిస్తున్న రూ.25 లక్షలను స్వాదీనం చేసుకున్నారు. అదే ప్రాంతంలో షాద్‌నగర్‌కు చెందిన స్క్రాప్ వ్యాపారి సంతోష్ చంద్రశేఖర్ (48) నుంచి రూ. 5 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ►రంగారెడ్డి జిల్లా లాల్‌పహాడ్ చౌరస్తా వద్ద తనిఖీల్లో 2 కిలోల బంగారం, రూ. 1.22 లక్షలు పట్టుబడ్డాయి. ఆగాపురా హమీద్ కేఫ్ చౌరస్తాలో షాహీన్ నగర్‌కు చెందిన మహ్మద్ అబ్దుల్ నుంచి రూ. 5 లక్షలు, బేగంబజార్‌కు చెందిన దినేష్ ప్రజాపతి నుంచి రూ.12 లక్షల నగదు స్వాధీనం. ►షేక్‌పేట నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్ కారులో తరలిస్తున్న రూ. 30 లక్షలు సీజ్. ►వనస్థలిపురం పరిధిలో ఓ కారులో సంరెడ్డి భరత్‌రెడ్డి తీసుకెళ్తున్న రూ. 5.16 లక్షలు స్వాధీనం. ►గోపాలపురం పీఎస్ పరిధిలోని ఓ లాడ్జీలో చేపట్టిన తనిఖీల్లో పట్టుబడ్డ రూ. 4 లక్షలు. ►పంచశీల క్రాస్ రోడ్స్ వద్ద గోపి అనే వ్యక్తి నుంచి రూ. 9.3 లక్షలు స్వాధీనం. -
12 గంటలపాటు ప్రశ్నల వర్షం!
హైదరాబాద్: పబ్ యజమానిని మామూళ్ళ కోసం పీడించి వేధించిన ఘటనలో ఏసీబీ అధికారుల దాడుల్లో పట్టుబడ్డ బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ నరేందర్, ఎస్ఐ నవీన్‌రెడ్డి, హోంగార్డు హరిని శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు 12 మంది సభ్యులతో కూడిన ఏసీబీ బృందం ప్రశి్నంచింది. పలు రికార్డులను, ఫోన్ కాల్, వాట్సాప్ రికార్డులు వారి ముందే పరిశీలించారు. శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి శనివారం రాత్రి 8 గంటల వరకు 12 గంటల పాటు ఏకధాటిగా వీరిపై ప్రశ్నలు వర్షం కురిపించారు. తనను వేధిస్తున్నట్లు ఆరోపించిన బంజారాహిల్స్‌లోని రాక్ క్లబ్ పబ్ యజమానిని అర్ధరాత్రి ఒంటిగంటకు స్టేషన్‌కు పిలిపించారు. గత శనివారం పబ్ నుంచి తనను ఎలా తీసుకొచ్చింది, ఎలా నిర్బం«ధించింది పబ్ యజమాని లక్ష్మణ్ రావు ఏసీబీ అధికారులకు పూసగుచ్చినట్లుగా వివరించారు. అకారణంగా తనను పబ్‌నుంచి తీసుకొచ్చారని, అంతకు కొద్ది రోజుల ముందు నుంచే డబ్బులు డిమాండ్ చేస్తున్నారని చాటింగ్ వివరాలను ఆధారాలతో సహా ఏసీబీకి అందజేశారు. సీసీ కెమెరాలను పరిశీలించారు. సీఐ నరేందర్, ఎస్ఐ నవీన్‌రెడ్డి వాట్సాప్ మెసేజ్‌లతో పాటు వాట్సాప్ కాల్స్ వివరాలను కూడా అధికారులు తెప్పించి..వారి ముందే వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉదయం ఈ ముగ్గురినీ ఏసీబీ కార్యాలయానికి తరలించి 41ఏ నోటీసులు అందజేశారు. ఈ నెల 9వ తేదీన తదుపరి విచారణకు హాజరుకావాల్సిందిగా సూచించారు. అక్కడి నుంచే సీఐతో పాటు ఎస్ఐ క్యాబ్‌లు బుక్ చేసుకొని తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. మొదలైన పైరవీలు.. బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ నరేందర్‌పై ఏసీబీ ఆరోపణలు రావడంతో దాదాపు ఆయనను పదవి నుంచి తొలగించడం ఖాయంగా కనిపిస్తున్నది. అప్పుడే ఈ పోస్టు కోసం కొందరు సీఐలు పైరవీలు మొదలు పెట్టారు. సమర్ధుడైన అధికారిని రాజకీయాలతో సంబంధం లేకుండా పోస్టింగ్ ఇవ్వాలని ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు సమాచారం. రాజకీయ ప్రలోభాలతో స్టేషన్ పరువు ప్రతిష్టలు దిగజారుతున్నట్లుగా అధికారులకు భారీగా ఫిర్యాదులు అందాయి. రాజకీయ నాయకుల ప్రమేయంతో పోస్టింగ్‌లు దక్కించుకుంటున్న సీఐలు తమను ఎవరూ ఏమి చేయలేరనే ధీమాతో ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నట్లుగా నిఘా వర్గాల నివేదికలు స్పష్టం చేశాయి. దీంతో బంజారాహిల్స్ పోస్టింగ్ నేరుగా ఇవ్వాలని, రాజకీయ నాయకులకు తలొగ్గద్దని భావిస్తున్నారు. ఇద్దరు, ముగ్గురు సీనియర్ ఇన్స్పెక్టర్లు ఇక్కడికి వచ్చేందుకు పోలీసు అధికారులతోనే పైరవీ చేస్తున్నట్లు సమాచారం. -
బంజారాహిల్స్ సీఐ నరేందర్, ఎస్ఐ నవీన్, హోంగార్డుకు 41-ఏ నోటీసులు
-
వసూళ్ల బాగోతం.. బంజారాహిల్స్ సీఐకి నోటీసులు
సాక్షి, హైదరాబాద్: పెంచిన మామూళ్లతో పాటు ‘పాత బకాయిల’ కోసం పబ్ యజమానిని వేధించి, బెదిరించి, తప్పుడు కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ ఎం.నరేందర్, ఎస్సై ఎస్.నవీన్‌రెడ్డి, హోంగార్డు హరిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఏసీబీ కార్యాలయానికి నరేందర్‌ను తరలించారు. సీఐతో పాటు ఎస్ఐ, హోంగార్డును ఏసీబీ తరలించింది. సీఐ నరేందర్‌ను 20 గంటల పాటు ఏసీబీ ప్రశ్నించింది. స్కెలాంజ్ పబ్ యజమానులను ప్రశ్నించిన ఏసీబీ.. స్టేట్మెంట్ రికార్డు చేసింది. పబ్ వ్యవహారంతో పాటు... మిగతా వసూళ్ల పైనా ఏసీబీ ఆరా తీస్తోంది. 9న విచారణకు హాజరుకావాలి.. ఏసీబీ నోటీసులు.. నరేందర్ వసూళ్ల బాగోతం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సీఐ, ఎస్ఐ హోం గార్డ్లకు 41ఏ సీఆర్పీసీ నోటీసులను ఏసీబీ జారీ చేసింది. ఈ నెల 9న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. కాగా, రాజకీయ నాయకుల ప్రమేయంతో కొన్నాళ్ల క్రితం అటకెక్కిన ఈ కేసు వ్యవహారంపై ‘సాక్షి’ సోమవారం ‘ఏ’ క్లాస్ రాజీ! శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురించింది. దీంతో స్పందించిన ఏసీబీ అధికారులు శుక్రవారం బంజారాహిల్స్ పోలీసుస్టేషన్‌పై దాడి చేశారు. నరేందర్, నవీన్‌రెడ్డి, హరిలను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే నరేందర్ అస్వస్థతకు గురి కావడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ ముగ్గురి పైనా శాఖాపరమైన చర్యలు తీసుకుంటూ సస్పెండ్ చేయడానికి ఉన్నతాధికారులు సన్నాహాలు చేపట్టారు. మామూలు పెంచి ‘ఎరియర్స్’ ఇమ్మని... బంజారాహిల్స్ పీఎస్ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్న ఎం.నరేందర్‌కు రాజకీయ అండదండలు దండిగా ఉన్నాయన్నది బహిరంగ రహస్యమే. తన పరిధిలో ఉన్న పబ్స్, బార్ అండ్ రెస్టారెంట్స్‌తో పాటు మసాజ్ సెంటర్ల నుంచి నెలవారీ మామూళ్లు వసూలు చేస్తున్నారు. తన వద్ద హోంగార్డుగా పని చేస్తున్న హరికి ఈ కలెక్షన్స్ బాధ్యతలు అప్పగించారు. అతడే ప్రతి నెలా అందరికీ ఫోన్లు చేసి, డబ్బు వసూలు చేసుకుని వస్తుంటాడు. కొన్ని నెలల క్రితం నరేందర్ తన పరిధిలో ఉన్న పబ్స్ ఇచ్చే నెల వారీ మామూళ్లను రూ.50 వేల నుంచి రూ.1.5 లక్షలకు పెంచేశారు. అంతటితో ఆగకుండా రెండు నెలల ‘ఎరియర్స్’తో కలిపి మొత్తం రూ.4.5 లక్షలు చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెం.14లోని రాక్ క్లబ్ అండ్ స్కై లాంజ్ పబ్‌ను లక్ష్మణ్ రావు, శివలాల్ నిర్వహిస్తున్నారు. అంత మొత్తం ఇచ్చేందుకు వారు అంగీకరించకపోవడంతో ‘రిబేటు’ ఇచ్చిన నరేందర్ రూ.3 లక్షలకు తగ్గించారు. ఈ డబ్బు ఇవ్వాలంటూ లక్ష్మణ రావుకు హోంగార్డు హరితో పదేపదే వాట్సాప్ కాల్స్ చేయించాడు. హేయమైన ఆరోపణలతో తప్పుడు కేసు... పబ్ యాజమాన్యం తన మాట వినకపోవడంతో వారిపై తప్పుడు కేసు నమోదు చేసేందుకు ఎస్సై ఎస్.నవీన్‌రెడ్డితో కలిసి పథక రచన చేశాడు. ఈ ఏడాది జులై 30 రాత్రి నవీన్‌రెడ్డికి రాక్ క్లబ్ అండ్ స్కై లాంజ్‌లో అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నట్లు సమాచారం అందినట్లు, అతడు దానిపై దాడి చేసినట్లు కేసు నమోదు చేశారు. సదరు పబ్ యాజమాన్యం తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం పబ్‌లో మహిళలను కూడా సరఫరా చేస్తోందని, వారితోనే కస్టమర్లకు సర్విస్ చేయిస్తూ రెచ్చగొడుతోందని, ఆకర్షితులైన వినియోగదారులతో కలిసి గడిపేలా ప్రోత్సహిస్తోందనే ఆరోపణలు చేస్తూ కేసు నమోదు చేశారు. అదే నెల 31న మహిళల అక్రమ రవాణా నిరోధక చట్టం కిందన నమోదు చేసిన కేసులో ఇద్దరు యజమానులనూ నిందితులుగా చేర్చారు. కాగా రోజు పబ్‌లో వారు ఇరువురూ లేరని, అక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరగట్లేదని, అసలు పోలీసులు దాడే చేయలేదని ఇటీవల ఏసీబీ గుర్తించింది. ఒత్తిడితో మిన్నకుండిపోయిన ఏసీబీ... ఈ నేపథ్యంలో లక్ష్మణ్ రావు ఆగస్టులోనే ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అవసరమైన ఆధారాల కోసం అవినీతి నిరోధక శాఖ అధికారులు రంగంలోకి దిగారు. రహస్య కెమెరాలతో కూడిన వాచీలు తదితరాలను ఏర్పాటు చేసి పబ్‌కు సంబంధించిన ఓ వ్యక్తిని నరేందర్ వద్దకు పంపారు. లంచా నికి సంబంధించిన బేరసారాలు ఆడియో, వీడియో లు రికార్డు చేసే ప్రయత్నం చేశారు. అయితే ఓ దశలో సదరు వ్యక్తి రహస్య కెమెరాలతో వచ్చిన విషయం గుర్తించిన నరేందర్ అప్రమత్తమయ్యారు. అసలు విషయం గ్రహించి తన ‘బంధువైన’ రాజకీయ నాయకుడిని ఆశ్రయించారు. ఆయన జోక్యంతో ఏసీబీకి చెందిన కింది స్థాయి అధికారులు అడుగు వెన క్కు వేశారు. మరోసారి సదరు పబ్ జోలికి రావద్దని ఇన్స్పెక్టర్ నరేందర్‌కు, నరేందర్‌ను వదిలేయని పబ్ యాజమాన్యానికి చెప్పి రాజీ చేసి ఫైల్‌ను అటకెక్కించేశారు. దీంతో దాదాపు రెండు నెలలుగా కేసు మరుగున పడిపోయింది. ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకువస్తూ ‘సాక్షి’ సోమవారం ‘ఏ’ క్లాస్ రాజీ! శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురించింది. దీనిపై స్పందించిన ఉన్నతాధి కారులు ‘బంజారాహిల్స్ ఫైల్ దుమ్ము దులిపించారు. ఓసారి షుగర్ డౌన్... మరోసారి ఛాతి నొప్పి... ఏసీబీ డీఎస్పీ శ్రీకాంత్ నేతృత్వంలోని బృందం శుక్రవారం ఉదయం బంజారాహిల్స్ ఠాణాపై దాడి చేసింది. నరేందర్, నవీన్‌రెడ్డి, హరిలను అదుపులోకి తీసుకుని వివిధ కోణాల్లో ప్రశ్నించింది. పబ్ యాజమాన్యంపై నమోదు చేసిన కేసుకు సంబంధించిన పత్రాలు సేకరించింది. సుదీర్ఘంగా ఈ ముగ్గురు నిందితులను విచారించింది. దీంతో తొలుత తన షుగర్ లెవల్స్ పడిపోయాయంటూ నరేందర్ చెప్పడంతో వైద్య బృందాన్ని ఠాణాకు పిలిపించి చికిత్స చేయించా రు. సాయంత్రం తనకు ఛాతీ నొప్పంటూ పడిపోవడ ంతో స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించింది. హాస్పిటల్ వెళ్ళడానికి నరేందర్ నడుచుకుంటూ వచ్చి తన వాహనమే ఎక్కడం గమనార్హం. ఈ కేసుపై ప్రకటన విడుదల చేసిన అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్.. ‘ఇన్స్పెక్టర్ నరేందర్ ఆదేశాల మేరకు నవీన్‌రెడ్డి గత శనివారం అర్ధరాత్రి సదరు పబ్ వద్దకు వెళ్లా రు. లక్ష్మణ్ రావును అనవసరంగా పబ్ బయటకు పిలిచారు. రోడ్డుపై ఆపి ఉంచిన పోలీసు వాహనం వద్దకు వచ్చిన ఆయన్ను బలవంతంగా అందులో ఎక్కించుకుని ఠాణాకు తరలించారు. అక్కడ కొన్ని గంటల పాటు నిర్భంధించారు. నరేందర్, నవీన్‌రెడ్డి, హరిలపై నమోదు చేసి కేసు దర్యాప్తులో ఉందని, చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటాం’ అని పేర్కొన్నారు. చదవండి: మెట్రో రైలులో యూట్యూబర్ హల్చల్.. ప్రయాణికులను షాక్ -
Bribe Case: బంజారాహిల్స్ పీఎస్ లో కొనసాగుతోన్న ఏసీబీ విచారణ
-
‘సాక్షి’ రాసింది.. ఏసీబీ కదిలింది!
సాక్షి, హైదరాబాద్: పెంచిన మామూళ్లతో పాటు ‘పాత బకాయిల’ కోసం పబ్ యజమానిని వేధించి, బెదిరించి, తప్పుడు కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ ఎం.నరేందర్, ఎస్సై ఎస్.నవీన్‌రెడ్డి, హోంగార్డు హరిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు చర్యలకు ఉపక్రమించారు. రాజకీయ నాయకుల ప్రమేయంతో కొన్నాళ్ల క్రితం అటకెక్కిన ఈ కేసు వ్యవహారంపై ‘సాక్షి’ సోమవారం ‘ఏ’ క్లాస్ రాజీ! శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురించింది. దీంతో స్పందించిన ఏసీబీ అధికారులు శుక్రవారం బంజారాహిల్స్ పోలీసుస్టేషన్‌పై దాడి చేశారు. నరేందర్, నవీన్‌రెడ్డి, హరిలను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే నరేందర్ అస్వస్థతకు గురి కావడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ ముగ్గురి పైనా శాఖాపరమైన చర్యలు తీసుకుంటూ సస్పెండ్ చేయడానికి ఉన్నతాధికారులు సన్నాహాలు చేపట్టారు. మామూలు పెంచి ‘ఎరియర్స్’ ఇమ్మని... బంజారాహిల్స్ పీఎస్ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్న ఎం.నరేందర్‌కు రాజకీయ అండదండలు దండిగా ఉన్నాయన్నది బహిరంగ రహస్యమే. తన పరిధిలో ఉన్న పబ్స్, బార్ అండ్ రెస్టారెంట్స్‌తో పాటు మసాజ్ సెంటర్ల నుంచి నెలవారీ మామూళ్లు వసూలు చేస్తున్నారు. తన వద్ద హోంగార్డుగా పని చేస్తున్న హరికి ఈ కలెక్షన్స్ బాధ్యతలు అప్పగించారు. అతడే ప్రతి నెలా అందరికీ ఫోన్లు చేసి, డబ్బు వసూలు చేసుకుని వస్తుంటాడు. కొన్ని నెలల క్రితం నరేందర్ తన పరిధిలో ఉన్న పబ్స్ ఇచ్చే నెల వారీ మామూళ్లను రూ.50 వేల నుంచి రూ.1.5 లక్షలకు పెంచేశారు. అంతటితో ఆగకుండా రెండు నెలల ‘ఎరియర్స్’తో కలిపి మొత్తం రూ.4.5 లక్షలు చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెం.14లోని రాక్ క్లబ్ అండ్ స్కై లాంజ్ పబ్‌ను లక్ష్మణ్ రావు, శివలాల్ నిర్వహిస్తున్నారు. అంత మొత్తం ఇచ్చేందుకు వారు అంగీకరించకపోవడంతో ‘రిబేటు’ ఇచ్చిన నరేందర్ రూ.3 లక్షలకు తగ్గించారు. ఈ డబ్బు ఇవ్వాలంటూ లక్ష్మణ రావుకు హోంగార్డు హరితో పదేపదే వాట్సాప్ కాల్స్ చేయించాడు. హేయమైన ఆరోపణలతో తప్పుడు కేసు... పబ్ యాజమాన్యం తన మాట వినకపోవడంతో వారిపై తప్పుడు కేసు నమోదు చేసేందుకు ఎస్సై ఎస్.నవీన్‌రెడ్డితో కలిసి పథక రచన చేశాడు. ఈ ఏడాది జులై 30 రాత్రి నవీన్‌రెడ్డికి రాక్ క్లబ్ అండ్ స్కై లాంజ్‌లో అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నట్లు సమాచారం అందినట్లు, అతడు దానిపై దాడి చేసినట్లు కేసు నమోదు చేశారు. సదరు పబ్ యాజమాన్యం తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం పబ్‌లో మహిళలను కూడా సరఫరా చేస్తోందని, వారితోనే కస్టమర్లకు సర్విస్ చేయిస్తూ రెచ్చగొడుతోందని, ఆకర్షితులైన వినియోగదారులతో కలిసి గడిపేలా ప్రోత్సహిస్తోందనే ఆరోపణలు చేస్తూ కేసు నమోదు చేశారు. అదే నెల 31న మహిళల అక్రమ రవాణా నిరోధక చట్టం కిందన నమోదు చేసిన కేసులో ఇద్దరు యజమానులనూ నిందితులుగా చేర్చారు. కాగా రోజు పబ్‌లో వారు ఇరువురూ లేరని, అక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరగట్లేదని, అసలు పోలీసులు దాడే చేయలేదని ఇటీవల ఏసీబీ గుర్తించింది. ఒత్తిడితో మిన్నకుండిపోయిన ఏసీబీ... ఈ నేపథ్యంలో లక్ష్మణ్ రావు ఆగస్టులోనే ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అవసరమైన ఆధారాల కోసం అవినీతి నిరోధక శాఖ అధికారులు రంగంలోకి దిగారు. రహస్య కెమెరాలతో కూడిన వాచీలు తదితరాలను ఏర్పాటు చేసి పబ్‌కు సంబంధించిన ఓ వ్యక్తిని నరేందర్ వద్దకు పంపారు. లంచా నికి సంబంధించిన బేరసారాలు ఆడియో, వీడియో లు రికార్డు చేసే ప్రయత్నం చేశారు. అయితే ఓ దశలో సదరు వ్యక్తి రహస్య కెమెరాలతో వచ్చిన విషయం గుర్తించిన నరేందర్ అప్రమత్తమయ్యారు. అసలు విషయం గ్రహించి తన ‘బంధువైన’ రాజకీయ నాయకుడిని ఆశ్రయించారు. ఆయన జోక్యంతో ఏసీబీకి చెందిన కింది స్థాయి అధికారులు అడుగు వెన క్కు వేశారు. మరోసారి సదరు పబ్ జోలికి రావద్దని ఇన్స్పెక్టర్ నరేందర్‌కు, నరేందర్‌ను వదిలేయని పబ్ యాజమాన్యానికి చెప్పి రాజీ చేసి ఫైల్‌ను అటకెక్కించేశారు. దీంతో దాదాపు రెండు నెలలుగా కేసు మరుగున పడిపోయింది. ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకువస్తూ ‘సాక్షి’ సోమవారం ‘ఏ’ క్లాస్ రాజీ! శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురించింది. దీనిపై స్పందించిన ఉన్నతాధి కారులు ‘బంజారాహిల్స్ ఫైల్8 దుమ్ము దులిపించారు. ఓసారి షుగర్ డౌన్... మరోసారి ఛాతి నొప్పి... ఏసీబీ డీఎస్పీ శ్రీకాంత్ నేతృత్వంలోని బృందం శుక్రవారం ఉదయం బంజారాహిల్స్ ఠాణాపై దాడి చేసింది. నరేందర్, నవీన్‌రెడ్డి, హరిలను అదుపులోకి తీసుకుని వివిధ కోణాల్లో ప్రశ్నించింది. పబ్ యాజమాన్యంపై నమోదు చేసిన కేసుకు సంబంధించిన పత్రాలు సేకరించింది. సుదీర్ఘంగా ఈ ముగ్గురు నిందితులను విచారించింది. దీంతో తొలుత తన షుగర్ లెవల్స్ పడిపోయాయంటూ నరేందర్ చెప్పడంతో వైద్య బృందాన్ని ఠాణాకు పిలిపించి చికిత్స చేయించా రు. సాయంత్రం తనకు ఛాతీ నొప్పంటూ పడిపోవడ ంతో స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించింది. హాస్పిటల్ వెళ్ళడానికి నరేందర్ నడుచుకుంటూ వచ్చి తన వాహనమే ఎక్కడం గమనార్హం. ఈ కేసుపై ప్రకటన విడుదల చేసిన అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్.. ‘ఇన్స్పెక్టర్ నరేందర్ ఆదేశాల మేరకు నవీన్‌రెడ్డి గత శనివారం అర్ధరాత్రి సదరు పబ్ వద్దకు వెళ్లా రు. లక్ష్మణ్ రావును అనవసరంగా పబ్ బయటకు పిలిచారు. రోడ్డుపై ఆపి ఉంచిన పోలీసు వాహనం వద్దకు వచ్చిన ఆయన్ను బలవంతంగా అందులో ఎక్కించుకుని ఠాణాకు తరలించారు. అక్కడ కొన్ని గంటల పాటు నిర్భంధించారు. నరేందర్, నవీన్‌రెడ్డి, హరిలపై నమోదు చేసి కేసు దర్యాప్తులో ఉందని, చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటాం’ అని పేర్కొన్నారు. -
బంజారాహిల్స్ సీఐ నరేందర్‌కు అస్వస్థత
-
బంజారా హిల్స్ సీఐ కేసులో కీలక విషయాలు
-
ఏసీబీ వలలో బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్
-
సీఎం సారూ.. ఈ రోడ్డు జర చూడరూ!
హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెంబన్–14లోని నందినగర్ రోడ్డు పరిస్థితి దయనీయంగా తయారైంది. మూడు సంవత్సరాల నుంచి ఈ రోడ్డును నిర్మించాలని స్థానికులు జీహెచ్ఎంసీ అధికారులకు విన్నవిస్తున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. కేన్సర్ హాస్పిటల్ వెనుక ఉన్న ఈ రోడ్డు మీదుగా సీఎం కేసీఆర్ తన స్వగృహానికి వెళ్లాల్సి ఉంటుంది. ఓ వైపు హాస్పిటల్‌కు వచ్చే రోగులు వారి సహాయకులతోనూ షాపింగ్‌లకు వచ్చే వారితోనూ ఈ ప్రధాన రహదారి నిత్యం రద్దీగా ఉంటుంది. దీనికి తోడు పక్కనే ఉన్న బ్రహ్మకుమారి ఆశ్రమానికి వచ్చే భక్తులు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. అప్పుడప్పుడు చిన్న చిన్న రిపేర్లు చేసినా ఫలితం లేదు. ఈ రిపేర్ల వల్ల రోడ్డు మరింత శిథిలావస్థకు చేరుకుంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు రూపురేఖలు మారిపోయి చెరువులా తయారైంది. చిన్నపాటి వర్షం పడినా రోడ్డు నీటితో నిండిపోతోంది. అధికారులు ఇప్పటికై నా స్పందించి ఈ మార్గంలో కొత్త రోడ్డు నిర్మించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. -
బంజారాహిల్స్‌లో కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభం
-
హైదరాబాద్‌లో భారీ వర్షం..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. సోమవారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై భారీ వర్షం కురిసింది. సడెన్‌గా కురిసిన భారీ వర్షంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, బాల్కంపేట్, బాలానగర్, అమీర్‌పేట, ఎస్ఆర్ నగర్, బేగంపేట, గచ్చిబౌలి, మనికొండ, లింగంపల్లి సహా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఇక, తెలంగాణవ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. Heavy rain ☔🌧️ #Hyderabadrains pic.twitter.com/Qw3WJlLlDm — Mohan Kumar (@ursmohan_kumar) September 25, 2023 #25SEP 2:45PM⚠️ Short Duration (10-20mins) Moderate/Heavy Rain Spell Ahead for Many Parts of City during the next 1Hr🌧️#HyderabadRains pic.twitter.com/IX0cBMtOgx — Hyderabad Rains (@Hyderabadrains) September 25, 2023 -
బంజారాహిల్స్‌లో హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్లో ఉత్సవాలు
-
హైదరాబాద్ ట్రాఫిక్ జామ్ ఫస్ట్ ప్లేస్‌లో ఈ రోడ్డు!
హైదరాబాద్: నగరంలో ఇది కీలకమైన రోడ్డు. అనునిత్యం ప్రముఖులు కూడా ప్రయాణిస్తుంటారు. అయితే ఈ మార్గంలో రద్దీ వేళల్లో ట్రాఫిక్ వాహనచోదకులకు నరకం చూపిస్తోంది. డ్రైవర్ల సహనానికి పరీక్ష పెడుతోంది. సదరు రూట్లో ఉన్న బాటిల్ నెక్స్‌తో పాటు కొన్ని వ్యాపార సంస్థల కారణంగానూ ఈ పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఏళ్లుగా ఇదే దుస్థితి ఉన్నా ట్రాఫిక్ విభాగం అధికారులు మాత్రం పట్టించుకోవట్లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పంజగుట్టలోని నాగార్జున సర్కిల్ నుంచి పెన్షన్ ఆఫీస్ మీదుగా మాసబ్ ట్యాంక్ చౌరస్తా వరకు 2.9 కిలోమీటర్ల పరిధిలో రోడ్ నెం.1 ఉంటుంది. నిరంకారి–పంజగుట్ట మధ్య ఉన్న మార్గానికి ఇది సమాంతరంగా ఉంటుంది. రోడ్ నెం.1 మీదుగా అనునిత్యం ప్రముఖులు, ఉన్నతాధికారులతో పాటు ఉద్యోగులు, సామాన్యులు సైతం ప్రయాణిస్తుంటారు. ఈ కారణంగానే రోడ్డు రోజూ రద్దీగానే ఉంటుంది. వెస్ట్‌జోన్ పరిధిలో ఉన్న అనేక కీలక ఆస్పత్రులకు వెళ్లి వచ్చే అంబులెన్సులతో హడావుడి కూడా ఎక్కువే. ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లు కూడా ఈ రోడ్డులో ఉన్నాయి. బంజారాహిల్స్ రోడ్ నెం.1 మీదనే తాజ్ కృష్ణ, 1/10, 1/12 వంటి కీలక జంక్షన్లతో పాటు పోలీసు ఆఫీసర్స్ మెస్ ‘టి’ జంక్షన్ కూడా నిత్యం హడావుడిగానే ఉంటుంది. రద్దీ వేళల్లో 45 నిమిషాల వరకు... వెస్ట్‌జోన్ పరిధిలోని కొన్ని ప్రాంతాల నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్ళే ప్రయాణికులు సైతం రోడ్ నెం.1నే ఆశ్రయిస్తారు. మాసబ్‌ట్యాంక్ మీదుగా మెహదీపట్నం వరకు వెళ్ళి అక్కడే పీవీ నర్సింహ్మారావు ఎక్స్‌ప్రెస్ వే ఎక్కుతారు. దీంతో విదేశీయుల కోణంలోనూ ఈ రూట్ కీలకమే. ఈ రహదారిలో ఉన్న జంక్షన్లలో కొన్ని ఇరుకుగా ఉంటాయి. దీనికి తోడు కేర్ ఆస్పత్రికి సమీపంలో, 1/12 జంక్షన్ దాటిన తర్వాత రోడ్డు బాటిల్ నెక్‌గా మారుతుంది. వీటితో పాటు ఈ రహదారిలో ఉన్న రెండు ప్రముఖ బేకరీ కమ్ రెస్టారెంట్లకు వచ్చిపోయే వాహనాలు, ఓ మద్యం దుకాణం వద్ద ఆగే కొనుగోలుదారుల వెహికిల్స్‌తో తీవ్ర ట్రాఫిక్ జామ్స్ ఏర్పడుతున్నాయి. ఈ కారణాలతో రద్దీ వేళల్లో ఒక్కోసారి ఈ రూట్ దాటడానికి 45 నిమిషాల వరకు పడుతోంది. అంబులెన్సుల సైరన్ వినిపిస్తున్నా ఏమీ చేయలేని పరిస్థితి ఉంటోంది. వర్షం కురిస్తే మరీ ఘోరం... సాధారణ రోజుల్లో పీక్ అవర్స్‌గా పిలిచే ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయి. ఇక వర్షం కురిసిన రోజుల్లో సమయాలతో సంబంధం లేకుండా రోడ్డు మొత్తం జామ్ అయిపోతుంది. ఏళ్లుగా ఇదే పరిస్థితి ఉన్నప్పటికి అటు జీహెచ్ఎంసీ, ఇటు పోలీసు విభాగాలు సరైన చర్యలు తీసుకోవట్లేదు. గవర్నర్, ముఖ్యమంత్రి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వంటి అత్యంత ప్రముఖుల కదలికలు ఉంటే మాత్రమే ట్రాఫిక్ పోలీసుల హడావుడి కనిపిస్తుంది. సాధారణ రోజుల్లో ఈ అధికారులు తీసుకునే చర్యలు నామమాత్రమే. ఆయా వ్యాపార సంస్థల వద్ద రోడ్డుపై వాహనాలు ఆగినా, క్యారేజ్ వేల్లో రాంగ్ పార్కింగ్ చేసినా ఎవరూ పట్టించుకోవట్లేదు. దీని ప్రభావం బంజారాహిల్స్ రోడ్.నెం.1 మొత్తమ్మీద ఉంటోంది. ఇకనైనా అధికారులు స్పందించి తమ ఇబ్బందులు తీర్చాలని వాహనచోదకులు కోరుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు సైతం ఈ రూట్లో గస్తీ వాహనాలు మోహరించాలని సూచిస్తున్నారు. -
Banjara Hills: మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం..
హైదరాబాద్: మసాజ్ కేంద్రాలు, స్పాల ముసుగులో వ్యభిచారానికి పాల్పడుతున్న రెండు కేంద్రాలపై బంజారాహిల్స్ పోలీసులు దాడులు చేసి నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని హెవెన్ ఫ్యామిలీ స్పాలో కొంత కాలంగా వ్యభిచారం జరుగుతున్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు ఇక్కడ దాడులు నిర్వహించి అయిదుగురు సెక్స్ వర్కర్లను పునరావాస కేంద్రానికి తరలించారు. నిర్వాహకులు కె.నీలిమ, ఎన్.కార్తీక్‌లపై కేసు నమోదు చేశారు. ది వెల్వెట్ స్పాపై... బంజారాహిల్స్ రోడ్ నెం. 12లో ఉన్న ది వెల్వెట్ స్పాలో మసాజ్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో ఎస్ఐ కరుణాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. దాడుల్లో పట్టుబడ్డ నలుగురు సెక్స్ వర్కర్లను పునరావాస కేంద్రానికి తరలించారు. నిర్వాహకులు జ్యోతి బజాజ్, సయ్యద్ యూసుఫ్ బాషాలపై కేసు నమోదు చేశారు. -
బంజారాహిల్స్: టెక్నోవిజన్ స్టోర్‌లో సందడి చేసిన జబర్దస్త్ ఫేం, నటి వర్ష (ఫొటోలు)
-
Hyderabad: మసాజ్ ముసుగులో వ్యభిచారం
సాక్షి, హైదరాబాద్: మసాజ్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెం.2లోని సీక్రెట్ ఆఫ్ హెయిర్ అండ్ ఫ్యామిలీ సెలూన్లో మసాజ్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో బంజారాహిల్స్ పోలీసులు సదరు సెలూన్‌పై దాడులు చేశారు. ప్రకాశ్ అనే వ్యక్తి.. ఫ్యామిలీ సెలూన్ నిర్వహిస్తూ వివిధ ప్రాంతాల నుంచి యువతులను రప్పించి క్రాస్ మసాజ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పది మంది యువతులను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తేలింది. ఈ క్రమంలో యజమానిపై కేసు నమోదు చేసిన పోలీసులు సెలూన్‌ను సీజ్ చేశారు. -
Hyderabad: తాగుడుకు బానిసైన భర్త.. ఉద్యోగం మానేసి అబద్ధాలు చెప్తుండటంతో
సాక్షి, హైదరాబాద్: తాగుడుకు బానిసైన భర్తను భరించలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. మహబూబ్‌నగర్ జిల్లా దరూర్ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన అంజలికి 2014లో పెళ్లి జరిగింది. బంజారాహిల్స్ రోడ్ నెం. 10లోని శ్రీరాంనగర్‌లో నివసిస్తూ కాల్ సెంటర్లో పనిచేస్తోంది. ఆమె భర్త నరేంద్ర రోడ్ నెం. 12లోని టీఎక్స్ ఆస్పత్రిలో వార్డు బాయ్‌గా పని చేస్తుండేవాడు. ఇటీవల ఉద్యోగం కూడా చేయకుండా మద్యానికి బానిసై ఇంట్లోనే ఉంటూ భార్య సంపాదనతోనే మద్యం తాగుతున్నాడు. ఈ విషయంలో ఆమె ఎన్నిసార్లు మందలించినా వినిపించుకోకపోగా సెల్ఫోన్లు అమ్ముకుంటూ వచ్చిన డబ్బులతో మద్యం తాగుతుండటమే కాకుండా అబద్దాలు కూడా చెప్తుండేవాడు. దీంతో విసిగిపోయిన అంజలి గురువారం తెల్లవారుజామున తన గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: చిన్నారులపై దూసుకెళ్లిన వాహనం -
ఐఏఎస్‌కు అత్తింటి వేధింపులు, 25 రోజులే కాపురం చేసిన భార్య!
హైదరాబాద్: తనపై తప్పుడు కేసులు పెట్టడంతో పాటు పలు రకాలుగా వేధింపులకు గురి చేస్తున్న భార్యతో పాటు ఆమె కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఓ ఐఏఎస్ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీ సులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే... బీహార్‌కు చెందిన సందీప్ కుమార్ ఝా తెలంగాణ కేడర్‌లో ఐఏఎస్ అధికారిగా పని చేస్తున్నారు. అతడికి 2021 నవంబర్ 21న పల్లవి ఝాతో వివాహం జరిగింది. పెళ్ళి తర్వాత బంజారాహిల్స్‌లోని తన నివాసంలో 25 రోజులు మాత్రమే కాపురం చేసిన ఆమె తనతో పాటు కుటుంబ సభ్యులతో తరచూ గొడవ పడేదన్నారు. అంతేగాక ఆమె సోదరుడు తన ఇంట్లో రూ. 65 వేలు తస్కరించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పటి నుంచి పల్లవి ఝా ఆమె తండ్రి ప్రమోద్ ఝా, సోదరుడు ప్రంజాల్ ఝా తనను వేధింపులకు గురి చేయడంతో పాటు తప్పుడు ఆరోపణలతో బీహార్‌లో కేసులు నమోదు చేయించారన్నారు. అంతటితో ఆగకుండా సొంతూరులోని తన ఇంటిపై దాడి చేసి కుటుంబ సభ్యులను గాయపరిచారని అంతుచూస్తామని బెదిరించడంతో పాటు తనపై తప్పుడు ఆరోపణలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకు మెయిల్ ద్వారా ఫిర్యాదులు చేస్తున్నారని ఆరోపించారు. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
గూడు కట్టిన ‘కరుణ’
బంజారాహిల్స్: పేదింటికి పెన్నిధిలా మారారు ఆయన. తనకొచ్చిన కష్టాన్ని వివరించేందుకు వచ్చిన దీనురాలికి సాయం అందించి తోడుగా నిలిచారు ఎస్ఐ కరుణాకర్‌రెడ్డి. వివరాలు ఇలా ఉన్నాయి.. బంజారాహిల్స్ రోడ్ నంబర్– 10లో నివసించే 70 ఏళ్ల ఉన్నిసా బేగం భర్త మూడు దశాబ్దాల క్రితం మృతి చెందారు. ఇద్దరు కుమార్తెలకు వివాహాలయ్యాయి. తాను ఉంటున్న ఇంటిని ఉన్నిసా బేగం దాచుకున్న డబ్బుతో గత ఏడాది బాగు చేయించుకుంది. ఇటీవల కురిసిన వర్షాలతో ఇల్లు ఉరుస్తుండటంతో.. మేస్త్రి సరిగా రిపేరు చేయలేదని ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. వృద్ధురాలి బాధను విన్న ఎస్ఐ కరుణాకర్ రెడ్డి నేరుగా ఆమె ఇంటికి వెళ్లి పరిశీలించారు. ఇంటికి అవసరమైన కొత్త సిమెంట్ రేకులను తన సొంత డబ్బుతో అందించారు. ఎస్ఐ ఔదార్యాన్ని స్థానికులు అభినందించారు.