
బంజారాహిల్స్(హైదరాబాద్): నైజీరియా నుంచి డ్రగ్స్‌ను కొనుగోలుచేస్తూ గోవాతో పాటు ముంబయ్, హైదరాబాద్‌లలో విక్రయిస్తున్న అంతర్జాతీయ డ్రగ్ పెడ్లర్‌తో పాటు సహకరించిన మరో వ్యక్తిని బంజారాహిల్స్ పోలీసులు శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాలు.. గోవాకు చెందిన లివియో జోసఫ్ అల్మిడా అలియాస్ ప్యూషా (41) గోవాకు తరచూ పర్యాటకులుగా వచ్చే నైజీరియన్లతో ఎనిమిదేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. డ్రగ్స్ విక్రయాల ద్వారా పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించవచ్చని, నైజీరియా నుంచి తాము దిగుమతి చేస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. అలా నైజీరియా నుంచి డ్రగ్స్ దిగుమతి చేసుకుంటూ విక్రయిస్తున్న జోసఫ్ కదలికలపై నగర పోలీసులు దృష్టిసారించారు.
బంజారాహిల్స్ రోడ్ నెంబర్–2లోని కమలాపురికాలనీ ప్రాంతంలో జోసఫ్ ఓ వ్యక్తికి కొకైన్ విక్రయిస్తుండగా పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆయన నుంచి 11 గ్రాములు ఎండీఎంఏ, 10 గ్రాముల కొకైన్, రూ.1.97 లక్షల నగదు, ఒక బైక్, మూడు సెల్‌ఫోన్లు స్వా«దీనం చేసుకున్నారు. గోవా నుంచి మూడు రోజుల క్రితం జోసఫ్ హైదరాబాద్‌కు రాగా ఇక్కడ ఓ వ్యక్తి ఆశ్రయమిస్తున్నట్లుగా గుర్తించారు. బంజారాహిల్స్ రోడ్డునెంబర్–2లోని ఇందిరానగర్‌లో నివసించే ఉబలంక శంకర్ (48) అనే వ్యక్తి షెల్టర్ ఇవ్వడమే కాకుండా బైక్ కూడా సమకూర్చి తన ఇంట్లోనే ఆశ్రయమిచ్చాడు.
ఆయనను కూడా బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. 2018లో కూడా జోసఫ్ హైదరాబాద్‌లోనే డ్రగ్స్ విక్రయిస్తుండగా అప్పుడు కూడా వీరిద్దరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వీరిద్దరూ కలిసి హైదరాబాద్‌లో పలువురికి డ్రగ్స్ విక్రయిస్తున్నట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. నగరంలో ప్రతి నెలా రెండు సార్లు సంజయ్, లోకేష్ సతీష్‌వర్మ, అమిత్, సిద్దార్ధ, రుద్రరాజు తదితర కస్టమర్లకు విక్రయిస్తున్నట్లుగా పోలీసుల దర్యాప్తులో గుర్తించారు.
హైదరాబాద్‌కు వచ్చినప్పడల్లా పాత కేసులో భాగంగా కోర్టుకు హాజరవుతూ వచ్చేటప్పుడే గోవా నుంచి డ్రగ్స్ తీసుకువస్తూ తెలిసిన కస్టమర్లకు సరఫరా చేస్తున్నట్లుగా దర్యాప్తులో తేలింది. గోవా నుంచి హైదరాబాద్‌కు రావడానికి బస్సులోనే వస్తుంటాడని, బస్సులో అయితే ఎలాంటి చెకింగ్‌లు ఉండవన్న ఉద్దేశ్యంతో తన మాజీ భార్యతో టికెట్ బుక్ చేయిస్తుంటాడని తేలింది.