Drugs
-
Satyameva Jayate: డ్రగ్ నెట్ వర్క్ మూలాలు ఏ దేశాల నుండంటే..! కంట్రోల్ చేసే మార్గాలు
-
ఎంటర్టైన్మెంట్ ఉండగా.. డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్: ప్రభాస్
డ్రగ్స్ నిర్మూలనకు టాలీవుడ్ హీరో, రెబల్ స్టార్ ప్రభాస్ తన స్వరం కలిపారు. మత్తు పదార్థాలు, డ్రగ్స్‌కు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని సూచించారు. మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. డ్రగ్స్‌పై అవగాహన కల్పిస్తూ ప్రభాస్ ప్రత్యేక వీడియో విడుదల చేశారు. లైఫ్‌లో మనకు బోలెడన్నీ ఎంజాయ్ మెంట్స్, ఎంటర్టైన్మెంట్ ఉన్నాయని ప్రభాస్ అన్నారు. మనల్ని ప్రేమించే వారు, మనకోసం బతికే మనవాళ్లు ఉండగా.. డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్? అని ప్రభాస్ ప్రశ్నించారు. సే నో టూ డ్రగ్స్ అంటూ అభిమానులను, సినీ ప్రియులను ప్రభాస్ కోరారు. మీకు తెలిసిన వాళ్లు ఎవరైనా డ్రగ్స్ కు బానిసలైతే 8712671111 నెంబర్‌కు ఫోన్ చేయాలని విజ్ఞప్తి చేశారు. మత్తుకు బానిసలైనవాళ్లు పూర్తిగా కోలుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని వీడియోలో ప్రభాస్ మాట్లాడారు. -
డ్రగ్స్ హబ్ గా హైదరాబాద్.. యువతను పీడిస్తున్న మహమ్మారి
-
సాక్షి మీడియా చేపట్టిన Say No To Drugs క్యాంపెయినకి విశేష స్పందన
-
పబ్‌లపై డేగ కన్ను
బంజారాహిల్స్: పబ్‌లు అంటేనే గుర్తుకు వచ్చేది జూబ్లీహిల్స్... నగరంలో ఎక్కడా లేనంత హడావుడి, హంగామా జూబ్లీహిల్స్ పబ్‌లలోనే కనిపిస్తుంది. చుక్కేసినా... చిందేసినా జూబ్లీహిల్స్ పబ్‌లో ఉంటేనే ఆ కిక్కెక్కుతుంది. అందుకే యువత కళ్లన్నీ జూబ్లీహిల్స్ పబ్లపైనే ఉంటాయి. మామూలు రోజుల్లోనే హంగామా జరిగే ఈ పబ్‌లలో న్యూ ఇయర్ విషయం చెప్పనక్కర్లేదు...ఈ నెల 31న రాత్రి న్యూ ఇయర్ వేడుకలకు జూబ్లీహిల్స్‌లోని పబ్‌లన్నీ సరికొత్త వేదికలతో సిద్ధమవుతున్నాయి. ప్రత్యేక ఆకర్శన కోసం బాలీవుడ్, టాలీవుడ్ తారలను రప్పిస్తున్నారు. అయితే పబ్ నిర్వాహకులు న్యూ ఇయర్ వేడుకల్లో శ్రుతిమించితే ఊరుకునే ప్రసక్తే లేదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఏ మాత్రం హద్దు మీరినా కేసులు నమోదు చేస్తామన్నారు. ఏం చేయాలి.. ఏం చేయకూడదన్న దానిపై పబ్‌ల నిర్వాహకులకు పోలీసులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఒక పబ్‌లో మద్యం సేవించి ఆ నిషాలో మరో పబ్‌కు వెళ్లి తాగుతామంటే ఇప్పుడు కుదరదు అని చెప్పాలని.. నిషాలో ఉన్న వ్యక్తికి మద్యం సరఫరా చేయకూడదని ఒక వేళ అలా చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పబ్‌ల నిర్వాహకులకు సమావేశాలు నిర్వహించిన పోలీసులు హద్దుమీరి ప్రవర్తిస్తే బాగుండదని హెచ్చరించారు. ప్రతి పబ్‌లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పబ్ ముందు, పార్కింగ్ ప్లేస్‌లోనూ సీసీ కెమెరాలు ఉండాలని సూచిస్తున్నారు. పబ్‌లలో డ్రగ్స్ సరఫరా అయ్యే సూచనలు ఉండటంతో గత పది రోజులుగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు, స్థానిక పోలీసులు గతంలో డ్రగ్స్ సరఫరా చేసిన పెడ్లర్లపై ప్రత్యేక నిఘా పెట్టారు. వారంతా ఇప్పుడు ఎక్కడున్నారు. ఎక్కడెక్కడ తిరుగుతున్నారు. ఎవరెవరితో మాట్లాడుతున్నారు అన్న అంశాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ నెల 30, 31 తేదీల్లో న్యూ ఇయర్ వేడుకలు జరిగే అన్ని పబ్‌లపై పోలీసులు డేగ కన్ను వేయనున్నారు. అనుమానితుల కదలికలపై ఇప్పటికే దృష్టి సారించారు. ప్రతి పబ్‌లోనూ మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గంజాయి సరఫరాదారులపై నిఘా ఉచిన పోలీసులు గతంలో గంజాయి కేసులు నమోదైన వారిపై దృష్టి సారించారు. న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి అర్ధరాత్రి ఒంటిగంట తర్వాత మద్యం సేవించే వారు జాగ్రత్తగా ఇంటికి వెళ్లేలా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని లేని పక్షంలో వారినే బాధ్యులను చేస్తామని హెచ్చరించారు. నాలుగు పబ్‌లకు అనుమతి నో... జూబ్లీహిల్స్‌లోని హార్ట్‌కప్, అమ్నేషియా, బ్రాడ్వే, బేబీలాన్ పబ్‌లకు పోలీసులు అనుమతి ఇవ్వడం లే దు. గతంలో ఆయా పబ్‌లలో జరిగిన గొడవలు, పో లీసు కేసుల కారణంగా వాటిపై ఆంక్షలు విధిస్తూ వేదికలకు అనుమతులు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. సిద్ధమవుతున్న పబ్‌లు ఇవే... జూబ్లీహిల్స్‌లో మొత్తం 36 పబ్‌లు ఉండగా ఇందులో నాలుగింటికి అనుమతులు నిరాకరించారు. కొన్నింట్లో మాత్రం ప్రత్యేక వేడుకలు జరగడం లేదు. అయితే న్యూ ఇయర్ వేడుకల కోసం దరఖాస్తు చేసుకున్న వాటిలో లుఫ్ట్, క్లబ్ రోగ్, పోష్ నాష్, తబలారసా, జోరా, లార్డ్ ఆఫ్ డ్రింక్స్, ప్రోస్ట్, జిందగీ స్కై బార్, ఫోర్జ్ బ్రీవ్, 040 బ్రీవ్, హలో, ఎల్యూజన్, ఎయిర్‌లైవ్, గ్రీజ్ మంకీ, పోర్ ఫాదర్స్, జైథుమ్, స్టోన్ వాటర్, పోయిస్ట్ తదితర పబ్‌లు వేడుకలకు అనుమతులు పొందాయి. యువతను ఆకర్షించేందుకు ప్రత్యేక కార్యక్రమాలకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా జాతీయ, అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన డీజేలను రప్పిస్తున్నారు. గోవా నుంచి పేరొందిన డీజేలతో పాటు గాయనీ, గాయకులను పిలిపిస్తున్నారు. కొన్ని పబ్‌లకు బాలీవుడ్ తారలు కూడా వస్తుండటం గమనార్హం.అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి బంజారాహిల్స్: నూతన సంవత్సర వేడుకలను నిర్వహించే ఈవెంట్ ఆర్గనైజర్లు, పబ్‌లు, బార్ అండ్ రెస్టారెంట్ల నిర్వాహకులు భద్రతా ప్రమాణాలు పాటించాలని, అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని వెస్ట్‌జోన్ డీసీపీ విజయ్‌కుమార్ అన్నారు. ఈ నెల 31న నూతన సంవత్సర వేడుకల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శనివారం పబ్‌లు, బార్ అండ్ రెస్టారెంట్ల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ పబ్‌లు, బార్ అండ్ రెస్టారెంట్లు, స్టార్ హోటళ్ల నిర్వాహకులు మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేసుకోవాలని, భద్రతా సిబ్బందిని నియమించుకోవాలన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరిగితే వెంటనే డయల్ 100కు ఫోన్ చేయాలన్నారు. అన్ని పబ్‌లు, బార్లు మైనర్లను అనుమతించరాదన్నారు. అర్ధరాత్రి ఒంటి గంటలోగా తమ ప్రాంగణాలను ఖాళీ చేయించాలన్నారు. సీసీ కెమెరాలను ఏర్పాటుచేసుకోవాలన్నారు. విద్యుత్ సమస్యలు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో వెస్ట్‌జోన్ అడిషనల్ కమిషనర్‌తో పాటు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజగుట్ట, ఎస్ఆర్నగర్ డివిజన్ పోలీసులు పాల్గొన్నారు. -
‘మత్తు’రహిత వేడుకలు
సాక్షి, హైదరాబాద్: నూతన సంవత్సర (2025) వేడుకలు మాదకద్రవ్య రహితంగా జరిగేలా చూడటమే లక్ష్యంగా తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీజీఏఎన్‌బీ) పటిష్ట చర్యలు ప్రారంభించింది. వేడుకల్లో మత్తుపదార్థాల వినియోగాన్ని కట్టడి చేసేందుకు టీజీఏఎన్‌బీ బృందాలు నిఘా పెంచాయి. తనిఖీలు ముమ్మరం చేయడంతోపాటు మత్తు పదార్థాలు విక్రయించే, సరఫరా చేసే వారిపై ఫోకస్ పెంచినట్టు అధికారులు తెలిపారు. రంగంలోకి 266 పోలీస్ స్నిఫర్ డాగ్స్ స్థానిక పోలీస్, ఎక్సైజ్, టీజీఏఎన్‌బీ అధికారుల సోదాలు ముమ్మరం కావడంతో డ్రగ్స్, గంజాయి ముఠాలు కొత్త ఎత్తులు వేస్తున్నాయి. అధికారులకు పట్టుబడకుండా వాహనాల్లోని రహస్య ప్రదేశాల్లో దాచి డ్రగ్స్, గంజాయి రవాణా చేస్తున్నాయి. ట్రాక్టర్లు, బస్సుల్లో, సీఎన్జీ వాహనాల్లోని సిలిండర్లలో, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ అనిపించేలా ఉండే డబ్బాలలో..ఇలా రకరకాల పద్ధతులలో పోలీసుల కన్నుగప్పి రవాణా చేస్తున్న మాదక ద్రవ్యాలను పోలీసులు గతంలో స్వా«దీనం చేసుకున్నారు. నిరుద్యోగులైన యువతుల్ని కూడా డ్రగ్స్ రవాణా కోసం మాఫియా వినియోగిస్తోంది. ఇలాంటి ముఠాలపై పటిష్టమైన నిఘా వేయడంతో పాటు ఇన్ఫార్మర్ వ్యవస్థతో మత్తు ముఠాల ఆటకు టీజీఏఎన్‌బీ కృషి చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ యూనిట్లలో కలిపి 266 పోలీసు జాగిలాలకు మాదకద్రవ్యాల గుర్తింపు శిక్షణ ఇచి్చంది. వాటి ద్వారా డ్రగ్స్ రవాణాను సమర్థంగా అడ్డుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఇటీవల వరంగల్ రైల్వేస్టేషన్లో స్నిఫర్ డాగ్‌తో తనిఖీ చేస్తుండగా..అక్కడికి వంద మీటర్ల దూరంలో ఉన్న ఒక ఇంటి మొదటి అంతస్తులో గంజాయి మొక్కలను కుండీలలో పెంచుతున్న విషయాన్ని ఈ స్నిఫర్ డాగ్ గుర్తించిందని చెప్పారు. టీజీఏఎన్‌బీ తీసుకుంటున్న చర్యలను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ప్రశంసించినట్టు తెలిపారు. ఇటీవల గుర్తించిన మరికొన్ని కేసులు» గంజాయి చాక్లెట్లతో స్కూలు విద్యార్థులను, దినసరి కూలీలను టార్గెట్ చేస్తున్న ముఠాలను రాజస్తాన్ వరకు వెళ్లి పట్టుకోవడమే కాకుండా తయారు చేస్తున్న ఫ్యాక్టరీని కూడా అక్కడి అధికారుల సహాయంతో టీజీఏఎన్‌బీ మూయించగలిగింది. » ఇటీవలే 120 కిలోల ఎఫిడ్రెన్ (ఎండీఎంఏ తయారీకి ఉపయోగించే ముడి సరుకు) తయారీ కేంద్రాన్ని గుర్తించడంలో సఫలీకృతమైంది.» ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి ఈనెల 20 వరకు 641 కిలోల గంజాయి, 15 కిలోల గంజాయి చాక్లెట్స్ , 1600 గ్రాముల హాష్ ఆయిల్, 1383 గ్రాముల ఎండీఎంఏ, కిలో ఓపియం, 115 గ్రాముల చరాస్, 53 కిలోల పాపి స్ట్రా, 44 గ్రాముల హెరాయిన్‌ను సీజ్ చేశారు. » మొత్తం 148 కేసులను రిజిస్టర్ చేయించడంతో పాటు స్థానిక పోలీసులతో కలిసి 315 మంది నేరస్తులను అరెస్టు చేశారు.» ఈనెల 1 నుంచి 20 వరకు మొత్తం రూ.4.45 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను సీజ్ చేశారు. » రూ.200 కోట్ల పైగా విలువ చేసే డ్రగ్స్‌ను పర్యావరణహిత పద్ధతులలో కాల్చివేశారు. మత్తు కేసుల్లో ఇరుక్కోవద్దు నూతన ఏడాది వేడుకలను మీ కుటుంబ స భ్యులతో కలిసి సంతోషంగా జరుపుకోండి. అంతే తప్ప మాదకద్రవ్యాల కేసుల్లో ఇరుక్కుని మీరు ఇబ్బందిపడి, మీ కుటుంబ సభ్యులను బాధ పెట్టకండి. మేము ఎక్కడికక్కడ ఆకస్మిక తనిఖీలు చేస్తున్నాం. మాదకద్రవ్యాల వినియోగం, సరఫరాకు సంబంధించి ఎటు వంటి సమాచారం ఉన్నా 1908 టోల్ ఫ్రీ నంబర్ లేదా 8712671111 నంబర్లో లేదా http://tganb.tspolice.gov.in లో ఫిర్యాదు చేయవచ్చు. – సందీప్ శాండిల్య, డైరెక్టర్, టీజీఏఎన్‌బీ -
న్యూ ఇయర్ వేడుకలే టార్గెట్..
నాగోలు: నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో ఉంచుకుని నగరానికి ఇతర రాష్ట్రాల నుంచి డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముగ్గురు అంతర్రాష్ట్ర డ్రగ్స్ పెడ్లర్స్‌ను అదుపులోకి తీసుకున్న ఎల్బీనగర్ ఎస్ఓటీ, మీర్పేట్ పోలీసులు వారి నుంచి రూ.1.15 కోట్ల విలువైన 53.5 కిలోల పాపిస్ట్రా, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సోమవారం ఎల్బీనగర్లోని రాచకొండ సీపీ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాచకొండ సీపీ సుధీర్‌బాబు వివరాలు వెల్లడించారు.. రాజస్థాన్‌కు చెందిన మంగిలాల్ భీశాయ్, మంగీలాల్ డాక, బీరా రామ్ నగరంలోని మీర్ పేట్, అశోక్ రెడ్డి కాలనీలో ఉంటూ స్టీల్ రేలింగ్ వర్కర్లుగా పని చేస్తున్నారు. వీరికి మధ్యప్రదేశ్‌కు చెందిన పింటు అలియాస్ మోహన్ సింగ్‌తో పరిచయం ఏర్పడింది. సులభంగా డబ్బులు సంపాదించేందుకు డ్రగ్స్ విక్రయించాలని నిర్ణయించారు. మోహన్‌సింగ్ తాను మధ్యప్రదేశ్ నుంచి మాదకద్రవ్యాలను సరఫరా చేస్తానని ఎక్కువ ధరకు ఇతర ప్రాంతాల్లో విక్రయించాలని చెప్పడంతో అందుకు వారు అంగీకరించారు. దీంతో మధ్యప్రదేశ్ వెళ్లిన వారు ముగ్గురు మోహన్‌సింగ్ వద్ద పాపి్రస్టాను కొనుగోలు చేసి రైల్లో నగరానికి తీసుకువచ్చారు. అశోక్ రెడ్డి నగర్‌లోని తన ఇంట్లో భద్రపరిచిన వారు దానిని బీఎన్‌రెడ్డి నగర్ లో నివాసం ఉంటున్న రాజస్థాన్‌కు చెందిన శంకర్ లాల్, కరీంనగర్లో ఉంటున్న శర్వాన్ ద్వారా నగరంలో అధిక ధరకు విక్రయించాలని నిర్ణయించుకున్నారు. దీనిపై సమాచారం అందడంతో ఎల్బీనగర్ ఎస్ఓటీ, మీర్‌పేట పోలీసులు ఆదివారం రాత్రి అశోక్ రెడ్డి నగర్‌లోని వారి ఇంటిపై దాడి చేశారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి 53.5 కిలోల పాపిస్ట్రా, మూడు మొబైల్ ఫోన్లు స్వాదీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల్లో ఒకరైన మంగీలాల్ 2023లో గంజాయి విక్రయిస్తూ హయత్‌నగర్ పోలీసులకు పట్టుబడినట్లు తెలిపారు. పరారీలో ఉన్న మోహన్ సింగ్, శంకర్ లాల్, శర్వాన్‌లను త్వరలో అరెస్ట్ చేస్తామని సీపీ తెలిపారు. మాదక ద్రవ్యాలపై నిరంతర నిఘా.. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో మాదకద్రవ్యాల నియంత్రణకు రాచకొండ పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు సీపీ తెలిపారు. ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నామని, నగర శివార్లలోని రిసార్ట్‌ల యాజమానులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు సీపీ పేర్కొన్నారు. సమావేశంలో ఎస్ఓటీ డీసీపీ . మురళీధర్,అడిషనల్ డీసీపీ షాకీర్ హుస్సేన్, ఇన్స్పెక్టర్లు కీసర నాగరాజు, భాస్కర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. -
ఏపీ హోంమంత్రి అనిత వివాదాస్పద వ్యాఖ్యలు
-
ఎరక్కపోయి ఇరుక్కున్నాడు
నిషేధిత డ్రగ్స్ కలిగి ఉన్నాడన్న కారణంతో అతని ఇంటిని సోదాచేయడానికి పోలీసుల బృందం రంగంలోకి దిగగా పారిపోయేందుకు సిద్ధపడ్డ ప్రబుద్ధుడు ఎవరికీ అనుమానం రావొద్దని చిమ్నీలో దాక్కోబోయాడు. అందులో ఇరుక్కుపోయి చివరకు సాయం కోసం బిగ్గరగా అరచి తన జాడ తానే పోలీసులకు చెప్పేశాడు. అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రంలోని రివర్ ఫాల్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపి వివరాల ప్రకారం 33 ఏళ్ల రాబర్ట్ లాంగ్లేస్ వద్ద నిషేధిత డ్రగ్స్ ఉన్నాయని తెల్సి మంగళవారం పోలీసులు సెర్చ్ వారెంట్‌తో రాబర్ట్ ఇంటికొచ్చారు. అరెస్ట్ చేద్దామని ఇళ్లంతా వెతికినా రాబర్ట్ దొరకలేదు. అయితే ఇదే సమయంలో ఇంటి వెనుక ఎవరో సాయం కోసం అరుస్తున్న శబ్దం వస్తోందని అటుగా దారిన పోయే వ్యక్తులు చెప్పారు. దీంతో పోలీసులు ఇంటిపైకప్పు మీదకొచ్చి చూస్తే ఎవరూ లేరు. ఒకాయన చిమ్నీ గొట్టం ఎక్కడం చూశా అని అటూగా పోతున్న ఇంకొక వ్యక్తి చెప్పడంతో చిమ్నీ గొట్టంలోకి పోలీసులు తొంగిచూశారు. అందులో ఇరుక్కుని ఎటూపోలేక అవస్థలు పడుతున్న రాబర్ట్‌ను చూసి పోలీసులకు విపరీతంగా కోపమొచి్చంది. ‘‘నువ్వెంత మూర్ఖుడివిరా బాబు. అందులో దూరి ఎలా దాక్కున్నావనుకున్నాం. దాంట్లోంచి అవతలికి పారిపోదామనుకున్నావా?’అంటూ అతడిని ప్రశ్నించారు. ముందుగా అతడిని బయటపడేసే మార్గం కోసం వెతికారు. చివరకు చిమ్నీ అడుగుభాగాన్ని మాత్రం బద్దలుకొట్టి బయటకు తీద్దామని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా అగ్నిమాపక సిబ్బందిని పిలిచించి కొన్ని ఇటుకలు తీయించారు. బయటకు వచ్చేయ్ అని హెచ్చరించారు. భయపడుతూ ఎలాగోలా అందులోంచి బయటపడిన రాబర్ట్‌ను పోలీసులు పోలీసుల బండిలో పడేశారు. నేరుగా ఆస్పత్రికి తీసుకెళ్లి ఇరుక్కునప్పుడు అయిన గాయాలకు ప్రథమ చికిత్స చేయించారు. ప్రస్తుతం కేసు విచారణ నడుస్తోంది. – ఫాల్ రివర్ సిటీ -
HYD: మేడ్చల్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత
సాక్షి,మేడ్చల్‌జిల్లా: మేడ్చల్ పట్టణంలో డ్రగ్స్ కలకలం రేపాయి. మేడ్చల్ బస్సుడిపో వద్ద మంగళవారం(డిసెంబర్ 10) భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఓ వ్యక్తి బస్సులో ప్రయాణిస్తూ మేడ్చల్ బస్సు డిపో వద్ద దిగాడు.డ్రగ్స్‌తో దిగుతున్నాడని ముందే సమాచారం అందుకున్న నార్కొటిక్స్ బ్యూరో అధికారులు అతని వద్ద నుంచి 600 గ్రాముల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ స్వాధీనం చేసుకొని ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.ఇదీ చదవండి: లోన్ యాప్ వేధింపులకు యువకుడు బలి -
ఆంధ్రప్రదేశ్‌లో డ్రగ్స్ కథ క్లోజ్.. విశాఖపట్నానికి వచ్చిన నౌకలో డ్రగ్స్ లేవని నిర్ధారించిన సీబీఐ... అప్పట్లో ఓటర్లను మోసగించడానికి టీడీపీ అండ్ కో దుష్ప్రచారం
-
కనికట్టు కుట్ర ‘పచ్చ’ పన్నాగమే!
ఆ రోజు డ్రై ఈస్ట్ బ్యాగుల్లో డ్రగ్స్ అవశేషాలున్నాయని ఎందుకు ఊరూరా ఊదరగొట్టారు? అందులో డ్రగ్స్ లేవని ఇప్పుడు సీబీఐ స్పష్టం చేసింది. దీనిని బట్టి మీరు చేసింది విష ప్రచారం కాదా? వేల కోట్ల రూపాయల డ్రగ్స్ అంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విష ప్రచారం చేసి, వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు ఆరోపణలు గుప్పించింది కూటమి నేతలు కాదా? వీటన్నింటిపై ఇప్పుడు ఏమంటారు?సాక్షి, అమరావతి/ సాక్షి, విశాఖపట్నం : ‘అడ్డదారిలో అధికారమే చంద్రబాబు జెండా.. అందుకు దుష్ప్రచారమే అజెండా’ అని మరోసారి నిరూపితమైంది. ఎన్నికల్లో ప్రజల్ని మోసగించేందుకు టీడీపీ కూటమి పన్నిన కుట్రలు ఒక్కొక్కటిగా బట్టబయలవుతున్నాయి. సూపర్ సిక్స్ హామీల పేరిట ప్రజల్ని వంచించారన్నది ఇప్పటికే స్పష్టమైంది. అంతేకాదు ఎన్నికల ముందు అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై చంద్రబాబు ముఠా చేసిన విష ప్రచారం అంతా కుట్రేనన్నది నిరూపితమైంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం డ్రగ్స్ అడ్డాగా మారిపోయిందని టీడీపీ కూటమి చేసిన దు్రష్పచారం.. అందుకు వంత పాడిన ఎల్లో మీడియా, టీడీపీ సోషల్ మీడియా రాద్ధాంతం అంతా కుతంత్రమేనని నిగ్గు తేలింది. బ్రెజిల్ నుంచి నౌకలో విశాఖపటా్ననికి వేల టన్నుల డ్రగ్స్‌ను దిగుమతి చేశారన్న ప్రచారం కేవలం చంద్రబాబు కుతంత్రమేనని నిర్ధారణ అయ్యింది. విశాఖపట్నంకు వచ్చిన నౌకలో అసలు ఎలాంటి డ్రగ్స్ లేవని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ దర్యాప్తులో వెల్లడైంది. దీంతో అక్రమంగా ఓట్లు కొల్లగొట్టేందుకు చంద్రబాబు ముఠా చేసిన విష ప్రచారమేనని స్పష్టమైంది. అదే కాదు.. భూ వివాదాల శాశ్వత పరిష్కారం కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన భూముల రీసర్వేపై కూడా టీడీపీ కూటమి ఎన్నికల ముందు పెట్టిన గగ్గోలు అంతా దుష్ప్రచారమే తప్ప.. అందులో ఏమాత్రం వాస్తవం లేదన్నదీ తేటతెల్లమైంది. రీసర్వేను కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుందని చంద్రబాబే వెల్లడించడం అందుకు తార్కాణం. నేరుగా వైఎస్సార్సీపీని ఎదుర్కోలేమని గ్రహించే చంద్రబాబు ఎన్నికల ముందు ఈ దు్రష్పచార కుతంత్రాలతో ప్రజల్ని తప్పుదారి పట్టించారన్నది తాజా పరిణామాలు తేల్చి చెబుతున్నాయి. ఇలా నెలకో అబద్ధానికి రెక్కలు కట్టి విష ప్రచారం చేస్తుండటం చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్, వదినమ్మ పురందేశ్వరి, ఈనాడు, టీవీ–5.. ఇతర ఎల్లో మీడియాకే చెల్లింది. రాష్ట్ర అప్పులు మొదలు.. శ్రీవారి లడ్డూ, విజయవాడ వరదలు, అదానీ వ్యవహారం, కాకినాడ పోర్టు వరకు.. ఎప్పటికప్పుడు వివాదాలు లేవనెత్తుతూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది. డ్రగ్స్ అడ్డాగా ఏపీ.. ఇదీ పచ్చ ముఠా దుష్ప్రచారం » చంద్రబాబు 2024 ఎన్నికల అక్రమాలు ఒక్కొక్కటిగా బట్టబయలవుతున్నాయి. ప్రజల్ని మభ్యపెట్టందే, భయభ్రాంతులకు గురి చేయందే ఎన్నికల్లో గెలవలేమని గుర్తించిన ఆయన పక్కా పన్నాగంతో దుష్ప్రచార కుట్రకు తెగించారు. అందులో భాగంగానే వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం గంజాయి, డ్రగ్స్‌కు ఆడ్డాగా మారిపోయిందని పెద్ద ఎత్తున దు్రష్పచారం చేశారు. » చంద్రబాబుకు కొమ్ముకాసే ఎల్లో మీడియా, టీడీపీ సోషల్ మీడియా ఆ ప్రచారాన్ని ఊరూ వాడా ఊదరగొట్టి ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించాయి. పోలింగ్‌కు కచ్చితంగా నెలన్నర ముందు డ్రగ్స్ దందా కుట్రను పతాక స్థాయికి తీసుకువెళ్లాలని చంద్రబాబు భావించారు. అప్పటికే తమతో జట్టుకట్టిన జనసేన, బీజేపీ నేతల సహకారంతో అందుకోసం పక్కా కుట్రకు తెరతీశారు. అందులో భాగంగానే బ్రెజిల్ నుంచి 25 వేల టన్నుల డ్రై ఈస్ట్‌ను తీసుకువచ్చిన ‘ఎస్‌ఈకేయూ 4375380’ అనే నౌకలో డ్రగ్స్ అక్రమంగా తీసుకువస్తున్నారంటూ ఢిల్లీలోని సీఐబీ కార్యాలయానికి ఆకాశరామన్న తరహాలో తప్పుడు సమాచారం అందించారు. » అనంతరం కొందరు అధికారులను ప్రభావితం చేశారు. దాంతో ఢిల్లీ నుంచి సీబీఐ అధికారులు ఆగమేఘాల మీద విశాఖపట్నం చేరుకుని మార్చి 21న ఆ నౌకలో తనిఖీలు చేశారు. విశాఖపట్నం కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే సంధ్యా ఆక్వా అనే సంస్థ దిగుమతి చేసుకున్న 25 వేల టన్నుల డ్రై ఈస్ట్‌ను జప్తు చేశారు. అందుకోసం ముందుగానే కాచుకుని కూర్చున్న టీడీపీ.. ఆ వెంటనే డ్రై ఈస్ట్ పేరుతో కొకైన్ అనే డ్రగ్స్ అక్రమంగా దిగుమతి చేశారనే దు్రష్పచారాన్ని వ్యాప్తిలోకి తెచ్చింది. » వెయ్యి టన్నుల కొకైన్ ధర రూ.వెయ్యి కోట్లని.. ఆ లెక్కల ప్రకారం రూ.25 వేల కోట్లు విలువ చేసే 25 వేల టన్నుల కొకైన్‌ను రాష్ట్రంలోకి తీసుకువచ్చారంటూ ఎల్లో మీడియా, టీడీపీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున దు్రష్పచారం చేశాయి. చంద్రబాబు, లోకేశ్, అచ్చెన్నాయుడు, పవన్ కళ్యాణ్, దగ్గుబాటి పురందేశ్వరి.. ఇలా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు వరుసగా మైకులు పట్టుకుని అదే తప్పుడు ప్రచారాన్ని తీవ్రతరం చేశారు. వైఎస్సార్సీపీ నేతలే డ్రగ్స్‌ను రాష్ట్రంలోకి తీసుకువచ్చారంటూ విష ప్రచారం చేశారు. » ఆ షిప్లో డ్రగ్స్ దిగుమతి అయినట్టు సీబీఐ అధికారికంగా ప్రకటించనే లేదు. ఇంకా తనిఖీలు చేయాల్సి ఉందని, ఆ డ్రై ఈస్ట్‌ను ల్యాబొరేటరీకి పంపించి పరీక్షించాల్సి ఉందని సీబీఐ చెప్పినా సరే చంద్రబాబు ముఠా ఏమాత్రం పట్టించుకోలేదు. కేవలం ఎన్నికల ముందు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడమే లక్ష్యంగా రాష్ట్రం డ్రగ్స్‌కు అడ్డాగా మారిపోయిందంటూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై బురదజల్లేందుకు యత్నించారు. ఏకంగా నెల రోజులపాటు ఇదే దుష్ప్రచారాన్ని కొనసాగించడం పక్తు చంద్రబాబు పన్నాగమే. అందులో డ్రగ్స్ లేవు విశాఖపట్నం కంటైనర్ టెర్మినల్ (వీసీటీపీఎల్)లో 25 వేల కిలోల డ్రైఈస్ట్‌తో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ దిగుమతి అయ్యాయని ఈ ఏడాది మార్చి 19న సీబీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. సంధ్య ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్‌కు వెయ్యి బ్యాగులొచ్చాయని వెల్లడించింది. ఆ తర్వాత డ్రగ్స్ మూలాలపై దర్యాప్తు చేస్తామని చెప్పింది. ఈ నేపథ్యంలో దర్యాప్తు అనంతరం బ్రెజిల్ నుంచి విశాఖపట్నం వచ్చిన నౌకలో అసలు డ్రగ్స్ లేనే లేవని సీబీఐ తేల్చి చెప్పింది. కంటైనర్ క్లియరెన్స్ వాస్తవమేనని కస్టమ్స్ అధికారులు ««ధృవీకరించారు.. సీజ్ చేసిన కంటైనర్‌ను సదరు సంస్థకు అప్పగించేందుకు సీబీఐ క్లియరెన్స్ సరి్టఫికెట్ ఇచ్చిందని కస్టమ్స్ అండ్ సెంట్రల్ ట్యాక్స్ ప్రిన్సిపల్ కమిషనర్ ఎన్.శ్రీధర్ తెలిపారు. పూర్తి ఆధారాలతో సీబీఐ కోర్టులో నివేదిక సమర్పించిన తర్వాత.. కోర్టు అనుమతించిన పత్రాల్ని తమకు ఇచ్చారని ఆయన వెల్లడించారు. భూముల రీసర్వేపై కూడా విషప్రచారం » భూ వివాదాల శాశ్వత పరిష్కారం కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన భూముల రీసర్వేపై కూడా చంద్రబాబు, ఆయన ముఠా ఇదే రీతిలోదుష్ప్రచారం చేశాయి. వైఎస్సార్సీపీ నేతలు సామాన్యుల భూములను కబ్జా చేసేందుకు రీసర్వేను నిర్వహిస్తున్నారంటూ ఎల్లో మీడియా, టీడీపీ సోషల్ మీడియా ద్వారా విషం చిమ్ముతూ అందర్నీ భయాందోళనలకు గురి చేసేందుకు యత్నించాయి. » తాత, తండ్రుల నుంచి వారసత్వంగా వస్తున్న భూములను బలవంతంగా తమ పేరిట రాయించేసుకుంటారని, ఆ మేరకు రీసర్వే నివేదికల్లో నమోదు చేసేస్తారని బురద జల్లడం ద్వారా సామాన్య ప్రజానీకాన్ని బెంబేలెత్తించాయి. టీడీపీ చేస్తోందంతా దుష్ప్రచారమేనని వైఎస్సార్సీపీ ఎంతగా వివరించేందుకు యత్నించినా సరే టీడీపీ కూటమి మాత్రం తమ కుట్రలను మరింత తీవ్రతరం చేసింది. » ఎప్పుడో బ్రిటీష్ ప్రభుత్వ హయాంలో వందేళ్ల క్రితం రాష్ట్రంలో భూముల సర్వే చేసిన తర్వాత ఇప్పటి వరకు ఎవరూ సర్వే చేయలేదని వైఎస్సార్సీపీ ప్రభుత్వం వివరించింది. దాంతో భూ వివాదాలు అంతకంతకూ పెరుగుతుండటంతో సామాన్యులు పడుతున్న అవస్థలకు పరిష్కార మార్గంగానే రీసర్వే చేపట్టినట్టు ఎంతగానో చెప్పుకొచ్చింది. భూముల రీసర్వేను కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించిందని వివరించింది. కానీ టీడీపీ కూటమి ప్రజల్ని మభ్యపెట్టేందుకు పోలింగ్ వరకు తమ దు్రష్పచారాన్ని కొనసాగించింది. » తీరా అధికారంలోకి వచ్చిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. భూముల రీసర్వేను తాము కొనసాగిస్తామని ప్రకటించడం గమనార్హం. భూ వివాదాల పరిష్కారానికి రీసర్వేనే పరిష్కారమని ఆయన ప్రకటించారు. తద్వారా వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన భూముల రీసర్వే సరైన చర్యేనని అధికారికంగా ఆమోదించారు. అంటే కేవలం ఎన్నికల్లో ప్రజల్ని మోసగించి అక్రమంగా ఓట్లు కొల్లగొట్టేందుకే తాము దుష్ప్రచారం చేశామని చంద్రబాబు అంగీకరించినట్టే కదా! ఇలాంటి కుట్రలు ఎన్నెన్నో.. » వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం రూ.14 లక్షల కోట్లు అప్పులు చేసిందని టీడీపీ కూటమి విష ప్రచారం చేసింది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వ అప్పులు రూ.6.50 లక్షల కోట్లేనని వెల్లడించింది. 2014–19లో చంద్రబాబు హయాంలో అప్పుల పెరుగుదల శాతం కంటే 2019–24లో వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో అప్పుల పెరుగుదల శాతం తక్కువేనని ఆరి్థక శాఖ నివేదిక వెల్లడించింది. అంటే టీడీపీ ప్రభుత్వం కంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన అప్పులు తక్కువేనని నిరూపితమైంది. » రాష్ట్రంలో ఏకంగా 34 వేల మంది బాలికలు, మహిళలను వలంటీర్ల ద్వారా అపహరించి అక్రమ రవాణా చేశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ మేరకు తనకు కేంద్ర హోమ్ శాఖ వర్గాలు తెలిపాయంటూ ఎన్నికల సభల్లో పదే పదే దు్రష్పచారం చేశారు. కానీ టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విషయంపై ఆయన ఒక్క మాట మాట్లాడ లేదు. కనిపించకుండా పోయారని చెప్పిన 34 వేల మందిని తీసుకురావాలని వైఎస్సార్సీపీ సవాల్ విసురుతున్నా ఆయన స్పందించడమే లేదు. ఎందుకంటే అది అవాస్తవం కాబట్టే. అసలు అంత మంది కనిపించలేదన్న ప్రశ్నే ఉత్పన్నం కాలేదని ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వంలోని హోమ్ శాఖ తెలిపింది. అంటే ఇదంతా ఓటర్లను తప్పుదారి పట్టించేందుకు చేసిన దుష్ప్రచారమేనని నిగ్గు తేలింది. -
చిన్న పరిశ్రమలకు పెద్దపీట
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీ పరిశ్రమలను ప్రోత్సహిస్తూనే అవకాశమున్న చోట సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) పెద్దపీట వేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రకటించారు. గురువారం సచివాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనలో పారిశ్రామిక, ఐటీ రంగాల్లో ప్రభుత్వం సాధించిన ప్రగతి, నూతన ప్రణాళికలను వివరించారు.ఔటర్ రింగు రోడ్డు (ఓఆర్ఆర్), రీజినల్ రింగు రోడ్డు (ట్రిపుల్ ఆర్) మధ్య కొత్తగా పది పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేసి, అరులో ఐదింటిని ఎంఎస్ఎంఈల కోసం అభివృద్ధి చేస్తామని తెలిపారు. కొత్తగా ఏర్పాటయ్యే పారిశ్రామిక పార్కుల్లో ఒక దానిని మహిళా పారిశ్రామికవేత్తలకు కేటాయించడంతోపాటు కొత్త పార్కుల్లో ఐదు శాతం ప్లాట్లు మహిళలకు కేటాయిస్తామని చెప్పారు. కొన్ని ప్లాట్లు బీసీ, ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు కేటాయిస్తామని, వారికోసం ప్రత్యేక విధానం తీసుకొస్తామని వెల్లడించారు.‘మాదకద్రవ్యాలతో పొంచి ఉన్న ప్రమాదంపై విద్యా ర్థులు, వారి తల్లిదండ్రులకు అవగాహన కలి్పంచడం కోసం రూపొందించిన ‘డ్రగ్ అబ్యూజ్ యాప్’ను వేయి గ్రామీణ స్కూళ్లలో వినియోగిస్తాం. చిన్న, సన్న కారు రైతులకు 48 గంటల్లోపు రూ.లక్ష వరకు రుణం లభించేలా రూపొందించిన యాప్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ఈ నెల 8న ప్రారంభిస్తారు’అని వెల్లడించారు. కంపెనీలకు సులభంగా అనుమతులు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు సత్వరం అనుమతులు లభించేలా సరళీకరణ విధానాలను అమలుచేస్తున్నట్లు మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. ‘ఏడాది కాలంలో టీజీఐపాస్ ద్వారా రూ.6,347.59 కోట్ల విలువైన 1,539 యూనిట్లకు అనుమతులిచ్చి 35,724 మందికి ఉపాధి కలి్పంచాం. మరో రూ.9,240 కోట్లతో 37,588 ఉపాధి కల్పన కోసం 731 యూనిట్లు అనుమతులు కోరాయి. 8,894 మందికి ఉపాధి కలి్పంచేలా 14,433 కోట్లతో ఏర్పాటయ్యే 16 మెగా ప్రాజెక్టు లకు అనుమతులు ఇచ్చాం. ఫార్మా రంగంలోనూ రూ. 36 వేల కోట్ల పెట్టుబడులతో 141 ప్రాజెక్టుల ద్వారా 51 వేల మందికి ప్రత్యక్షంగా, 1.50 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి కల్పించే ప్రాజెక్టులు అనుమతుల దశలో ఉన్నాయి’అని శ్రీధర్‌బాబు వివరించారు. నిమ్జ్ ద్వారా 2 లక్షల ఉద్యోగాలు కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెరి్నంగ్ రంగంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల ద్వారా ఉపాధి కల్పనకు కృషి చేస్తున్నామని శ్రీధర్‌బాబు తెలిపారు. ‘9 కాలేజీలతో టీహబ్ ఒప్పందం చేసుకుంది. నిమ్జ్‌కు కేంద్రం రూ.2,500 కోట్ల నిధులిస్తుంది. అక్కడ రూ.15 వేల కోట్ల పెట్టుబడితో 2 లక్షల మందికి ఉపాధి కోసం కార్యాచరణపై కసరత్తు జరుగుతోంది. ఏఐ రంగంలో హైదరాబాద్‌ను అంతర్జాతీయ రాజధానిగా తీర్చిదిద్దేందుకు 200 ఎకరాల్లో ఎక్సలెన్సీ సెంటర్‌కు వచ్చే ఏడాది ఆరంభంలో శంకుస్థాపన చేస్తాం. వీహబ్ ద్వారా కొత్తగా పది వేల మంది మహిళా పారిశ్రామికవేత్తలను తీర్చిదిద్దుతాం. 33 జిల్లా కేంద్రాల్లో మినీ ప్రొటో టైపింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో మరో 11 స్కూళ్లు ఏర్పాటు చేస్తాం’అని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. -
కొండాపూర్ ఓయో రూమ్ లో డ్రగ్స్ పార్టీ.. ఢీ కొరియోగ్రాఫర్ కన్హ మహంతి అరెస్ట్
-
HYD: ‘ఓయో’లో డ్రగ్స్ పార్టీ.. కొరియోగ్రాఫర్ అరెస్టు
సాక్షి,హైదరాబాద్: మాదాపూర్ ఓయో రూమ్‌లో డ్రగ్స్ పార్టీ కలకలం రేపింది. డ్రగ్స్ పార్టీలో కొరియోగ్రాఫర్ కన్హా మహంతి పట్టుబడ్డారు. కన్హమహంతితో పాటు ప్రముఖ ఆర్కిటెక్ట్ ప్రియాంక రెడ్డిని కూడా పోలీసులు పట్టుకున్నారు. ప్రియాంకరెడ్డి ఇచ్చిన పార్టీలో కన్హా మహంతి పాల్గొన్నట్లు తెలుస్తోంది.ప్రముఖ టీవీ షోలలో కన్హా మహంతి కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ప్రముఖ డ్యాన్స్‌షోలలో చాలా కాలం పాటు పనిచేసిన కన్హా మహంతి పలుమార్లు విజేతగా నిలిచారు. మహంతి, ప్రియాంక రెడ్డి బెంగళూరు నుంచి డ్రగ్స్ తెచ్చి పార్టీ చేసుకుంటున్నట్లు సమాచారం.పార్టీలో పాల్గొన్న నలుగురిని మాదాపూర్ పోలీసులు అరెస్టు చేశారు.పార్టీ జరిగిన ప్రదేశం నుంచి ఎండీఎంఏ డ్రగ్స్‌తో పాటు మరో రెండు రకాల డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
మేడ్చల్‌లో డ్రగ్స్ కలకలం.. ముఠా నాయకుడు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో మరోసారి భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఒక కిలో మెపిడ్రైన్ను పోలీసులు పట్టుకున్నారు. ఈ క్రమంలో డ్రగ్స్ ముఠా నాయకుడు అల్లు సత్యనారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు.వివరాల ప్రకారం.. మేడ్చలో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మేడ్చల్ పోలీసులతో నార్కోటిక్ పోలీసులు జాయింట్ ఆపరేషన్‌లో భాగంగా ఒక విలో మెపిడ్రైన్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో ఏడు సంవత్సరాలుగా డ్రగ్స్ తయారు చేస్తున్న అల్లు సత్యనారాయణ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు సత్యనారాయణ యాదగిరిగుట్టలోని ఒక మూతపడిన ఫ్యాక్టరీలో డ్రగ్స్ తయారు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇక, డ్రగ్స్ ముఠాలో ఉన్న మరో ఏడుగురు నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
ఫిషింగ్ బోట్లలో వందల కిలోల డ్రగ్స్.. పట్టుకున్న నేవీ
ముంబయి: అరేబియా సముద్ర జలాల్లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. సముద్రంలో రెండు ఫిషింగ్ బోట్లలో ఏకంగా 500 కిలోల డ్రగ్స్‌ను అక్రమరవాణా చేస్తుండగా పట్టుకున్నట్లు ఇండియన్ నేవీ తెలిపింది. ఈ మేరకు ఎక్స్(ట్విటర్)లో శుక్రవారం నేవీ ఒక పోస్టు చేసింది.‘శ్రీలంకకు చెందిన రెండు ఫిషింగ్ బోట్లలో అక్రమరవాణా చేస్తున్న 500 కిలోల డ్రగ్స్‌ను ఇండియన్ నేవీ సీజ్ చేసింది. శ్రీలంక నేవీ,ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్ ఎప్పికప్పుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించిన ఇండియన్ నేవీ డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తున్న బోట్లను అడ్డుకుంది.డ్రగ్స్ ఉన్న బోట్లను గుర్తించడానికి విస్తృత ఏరియల్ సెర్చ్ నిర్వహించాం. డ్రగ్స్ రవాణా చేస్తున్న రెండు బోట్లను, అందులో ఉన్న సిబ్బందిని శ్రీలంకకు అప్పగించాం’అని ఇండియన్ నేవీ ట్వీట్లో తెలిపింది. ఈ ఆపరేషన్ డ్రగ్స్ రవాణాను అరికట్టడంలో భారత్,శ్రీలంక మధ్య ఉన్న పటిష్ట సంబంధాలను తెలియజేస్తోందని పేర్కొంది. Narcotics Seizure - Combined Operation b/n #IndianNavy & @srilanka_navy.Based on information received from #SrilankaNavy regarding probable narcotics smuggling by Sri Lankan flagged fishing vessels, the @indiannavy swiftly responded through a coordinated operation to localise &… pic.twitter.com/dkpzNQonTF— SpokespersonNavy (@indiannavy) November 29, 2024 -
అరేబియా సముద్రంలో భారీగా డ్రగ్స్ పట్టివేత
-
అలాంటి వారికి అండగా నిలుద్దాం: అల్లు అర్జున్
డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరు సహరించాలని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కోరారు. ఈ మేరకు ఆయన ఎక్స్ (ట్విటర్) వేదికగా ఓ స్పెషల్ వీడియోని షేర్ చేస్తూ.. డ్రగ్స్ బాధితులను ఆదుకోవడానికి, సురక్షితమైన, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు.‘‘మీకు తెలిసిన వారు ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటే తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో టోల్ ఫ్రీ నంబర్: 1908కు ఫోన్ చేయండి. వాళ్లు వెంటనే బాధితులను పునరావాస కేంద్రాలకు తీసుకువెళ్లి.. సాధారణ జీవనశైలిలోకి వచ్చేవరకూ జాగ్రత్తగా చూసుకుంటారు. ఇక్కడ ప్రభుత్వ ఉద్దేశం వారిని శిక్షించడం కాదు. వారికి సాయం చేయడం. మంచి సమాజం కోసం బాధితులకు అండగా నిలుద్దాం’ అని అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు.కాగా.. డ్రగ్స్ నియంత్రణలో సినీతారలు కూడా భాగం కావాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోరిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం ఓ ఈవెంట్లో రేవంత్ మట్లాడుతూ.. ఇకపై ఎవరికైనా సరే టకెట్ రేటు పెంపు కావాలంటే డ్రగ్స్, సైబర్ క్రైమ్‌పై అవగాహన కల్పిస్తూ ఓ వీడియో చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ కూడా పుష్ప 2 సినిమా రిలీజ్‌కి కొద్ది రోజుల ముందుకు అలా వీడియో చేసి పంపారు. గతంలో కమల్ హాసన్, చిరంజీవి, ఎన్టీఆర్‌తో పాటు మరికొంతమంది హీరోలు కూడా ఇలాంటి అవగాహన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. Let’s unite to support the victims and work towards building a safer, healthier society.Humbled to join this impactful initiative by the Government of Telangana.@revanth_anumula @TelanganaCMO @TG_ANB @TelanganaCOPs pic.twitter.com/tZ5Rkiw5Lg— Allu Arjun (@alluarjun) November 28, 2024 -
పన్నుకు పన్ను ట్రంప్ ప్రతిపాదనలపై మెక్సికో!
మెక్సికో: మెక్సికో నుంచి దిగుమతులపై 25 శాతం పన్ను విధిస్తామన్న అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికకు ఆ దేశం తీవ్రంగా స్పందించింది. అదే జరిగితే మెక్సికో కూడా సుంకాలతో బదులిస్తుందని మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షేన్‌బామ్ హెచ్చరించారు. అమెరికా సరిహద్దుల వెంబడి మాదకద్రవ్యాలు, వలసదారుల ప్రవాహాన్ని ఆపకపోతే మెక్సికో వస్తువులపై 25% దిగుమతి సుంకాలు తప్పవని ట్రంప్ ప్రకటించడం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలను క్లాడియా తీవ్రంగా దుయ్యబట్టారు. అమెరికా నుంచి అక్రమంగా ప్రవాహంలా వచ్చిపడుతున్న ఆయుధాలతో మెక్సికో బాధపడుతోందన్నారు. ఇక మాదకద్రవ్యాలు అమెరికా సొంత సమస్యేనన్నారు. వలస సమస్యకు అడ్డుకట్ట వేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేసిందని చెప్పారు. సమస్యలపై చర్చలకు సిద్ధమన్నారు. వలసదారుల కారవాన్లు ఇకపై సరిహద్దుకు చేరవని స్పష్టం చేశారు. ఆయుధాలపై పెట్టే ఖర్చును వలస సమస్యను పరిష్కారానికి వెచ్చిస్తే మంచిదని అమెరికాకు హితవు పలికారు. యుద్ధానికి ఖర్చు చేసే మొత్తంలో కొంత శాంతి, అభివృద్ధిపై కేటాయిస్తే సమస్యను సులువుగా పరిష్కరించవచ్చన్నారు. అమెరికా, మెక్సికో పలు అంశాల్లో పరస్పరం ఆధారపడతాయి. భారీ పన్నులు ఇరు దేశాల్లో ద్రవ్యోల్బణానికి, నిరుద్యోగానికి కారణమవుతాయి. ఇరు దేశాల మధ్య అవగాహన, శాంతి సాధనకు చర్చలే మార్గం’’అన్నారు. అవి త్వరలోనే జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. -
యాదగిరిగుట్టలో డ్రగ్స్ కలకలం
సాక్షి, యాదాద్రి భువనగిరి జిల్లా: యాదగిరిగుట్టలో డ్రగ్స్ కలకలం రేపాయి. మండలంలోని రామాజీపేట యాదాద్రి లైఫ్ సైన్సెస్ కెమికల్ ఫ్యాక్టరీలో భారీగా డ్రగ్స్ తయారు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.యాదగిరిగుట్ట నుంచి హైదరాబాద్‌కు తరలిస్తుండగా భువనగిరి మండలం గూడూరు టోల్ గేట్ వద్ద పోలీసులకు డ్రగ్స్ ముఠా సభ్యులు పట్టుబడ్డారు. గతకొంత కాలంగా గుట్టుచప్పుడు కాకుండా ఎఫిడ్రవిన్ తయారీ చేస్తున్నట్లు సమాచారం. యాదగిరిగుట్ట కేంద్రంగా తయారు చేస్తున్న ఈ డ్రగ్స్‌ను హైదరాబాద్, ముంబై తరలిస్తున్నారురూ.24 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం: డీసీపీరూ.24 కోట్ల విలువ చేసే 120 కేజీల నిషేధిత ఎఫిడ్రవిన్ మెఫెడ్రోన్ సింథటిక్ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నామని డీసీపీ రాజేష్ చంద్ర వెల్లడించారు. కొంతకాలంగా మూతపడిన యాదాద్రి లైఫ్ సైన్స్ కెమికల్ పరిశ్రమ అడ్డాగా చేసుకుని ముఠా డ్రగ్స్‌ను తయారు చేస్తుందని ఆయన మీడియా సమావేశంలో తెలిపారు.నేతి కృష్ణారెడ్డి, ఫైజాన్ అహ్మద్ (ముంబై), చెపురి సునీల్ (డైవర్)లను అరెస్ట్ చేశామని మరో ఐదుగురు నిందితులు పరారీలో ఉన్నారని తెలిపారు. రెండు కార్లు, నాలుగు మొబైల్స్ సీజ్ చేసినట్లు డీసీపీ తెలిపారు. -
తిరుపతి జాతీయ సంస్కృత యూనివర్శిటీలో డ్రగ్స్ కలకలం
సాక్షి, తిరుపతి: జాతీయ సంస్కృత యూనివర్శిటీలో డ్రగ్స్ కలకలం రేపుతున్నాయి. ఒడిశా విద్యార్థి శతపతి 20 ప్యాకెట్ల గంజాయి తీసుకొచ్చినట్లు రిజిస్ట్రార్ రమశ్రీ వెల్లడించారు. గరుడచల హాస్టల్లోని విద్యార్థి ఆంజనేయులకు 7 ప్యాకెట్ల గంజాయి ఇచ్చాడని.. హాస్టల్ తనిఖీల్లో 109 గదిలోని విద్యార్థులు గంజాయి సేవించినట్లు అభియోగం వచ్చిందన్నారు.యాంటీడ్రగ్స్ కమిటీచే విచారణ చేపట్టాం. నిర్థారణ కాగానే విద్యార్థులను కాలేజీ నుంచి డిస్మిస్ చేస్తాం. క్యాంపస్‌లో ఆరు నెలలుగా విద్యార్థులు డ్రగ్స్ సేవిస్తున్నారన్నది అవాస్తవం అని రిజిస్ట్రార్ స్పష్టం చేశారు. సంస్కృత విశ్వవిద్యాల యంలో అధికారుల నిర్లక్ష్యం వల్లే పలువురు విద్యార్థులు డ్రగ్స్ బానిసలుగా మారారంటూ సీనియర్ ఏబీవీపీ విద్యార్థి సంఘం నేత గణపతి ఆరోపించారు. -
వ్యాక్సిన్ వ్యతిరేకితో భారత్‌కు నష్టం?
అమెరికా అధ్యక్షపీఠాన్ని డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధిరోహించనున్నారు. ఇప్పటికే తన వద్ద పనిచేసే మంత్రులను నియమిస్తున్నారు. అందులో భాగంగా తాజాగా ఆరోగ్య, ప్రజా సేవల మంత్రిగా వ్యాక్సిన్ వ్యతిరేక ఉద్యమకారుడు రాబర్ట్ ఎఫ్ కెనెడీ జూనియర్‌ను నియమించనున్నట్లు ప్రకటించారు. అయితే ఇందుకు సెనెట్‌లో ఆమోదం లభించాల్సి ఉంటుంది. అమెరికాకు అత్యధికంగా భారత ఫార్మా ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. ఈ తరుణంలో కెనెడీ నియామకం పట్ల భారత కంపెనీలు కొంత ఆందోళన చెందుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.‘ప్రజారోగ్యం విషయంలో మందుల కంపెనీల మోసాలు, తప్పుడు సమాచారం తదితరాలతో అమెరికన్లు చాలాకాలంగా నలిగిపోయారు. కెనెడీ వీటికి అడ్డుకట్ట వేసి అమెరికాను మళ్లీ గొప్పగా, ఆరోగ్యంగా మారుస్తారు. ఔషధాలు, వ్యాక్సిన్లు, ఆహార భద్రత, వైద్య పరిశోధన, సామాజిక భద్రత, మెడికేర్ వంటి కీలక వ్యవహారాలను ఆయన పర్యవేక్షిస్తారు’ అని ట్రంప్ తన సోషల్ మీడియా హాండిల్ ట్రూత్‌లో పోస్ట్ చేశారు.2023 ఆర్థిక సంవత్సరంలో భారత్ దాదాపు 7.55 బిలియన్ డాలర్లు (రూ.62,615 కోట్లు) విలువ చేసే ఫార్మా ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేసింది. యాంటిసెరా, వ్యాక్సిన్లు, టాక్సిన్లు, గ్రంథులు.. వంటి వాటిని ఎగుమతి చేస్తున్నారు. అమెరికాకు ఎగుమతి చేసే దేశీయ కంపెనీల్లో ప్రధానంగా సన్ ఫార్మాస్యూటికల్స్, సిప్లా లిమిటెడ్, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్, అరబిందో ఫార్మా, లుపిన్ లిమిటెడ్.. వంటి కంపెనీలున్నాయి. వీటితోపాటు ప్రధానంగా కరోనా సమయం నుంచి ‘వ్యాక్సిన్ మైత్రి’లో భాగంగా దేశీయంగా తయారైన కొవాక్సిన్, కొవిషీల్డ్ వంటి వ్యాక్సిన్లు అమెరికాకు భారీగా ఎగుమతి చేస్తున్నారు. ఆరోగ్య మంత్రిగా వ్యాక్సిన్ వ్యతిరేకిగా ఉన్న కెనెడీ నియామకం ఫార్మా కంపెనీల్లో కొంత ఆందోళన కలిగిస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.ఇదీ చదవండి: హైదరాబాద్‌లో రియల్టీ జోరు!‘మేక్ అమెరికా హెల్దీ అగైన్’ నినాదానికి కెనెడీ పూర్తిగా న్యాయం చేస్తారని ట్రంప్ విశ్వాసం వెలిబుచ్చారు. తన రెండో విడత పాలనలో ప్రజారోగ్యం విషయంలో కీలక నిర్ణయాలు తీసుకునేందుకు కెనెడీకి పూర్తి స్వేచ్ఛనిస్తానని ట్రంప్ పదేపదే చెప్పుకొచ్చారు. టీకాలు తదితరాలను తీవ్రంగా వ్యతిరేకించే వ్యక్తికి ఏకంగా ఆరోగ్య శాఖ అప్పగించడం పట్ల తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలాఉండగా, నిబంధనల ప్రకారం యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(యూఎస్ ఎఫ్‌డీఏ) ధ్రువపరిచిన ఫార్మా ఉత్పత్తుల ఎగుమతికి ఎలాంటి ఢోకా లేదని కొందరు నిపుణులు చెబుతున్నారు. -
కొత్తగా నాలుగు డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్‌లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా 4 కొత్త డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. హైదరాబాద్‌లో ప్రస్తుతం ఉన్న ల్యాబ్ ఆధునీకరణతో పాటు కొత్త ల్యాబ్‌ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మషల్కర్ కమిటీ సిఫారసులకు అనుగుణంగా డ్రగ్ ఇన్స్పెక్టర్ల సంఖ్యను పెంచేందుకు కూడా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ప్రస్తుతం 71 మంది డ్రగ్ ఇన్స్పెక్టర్లు మాత్రమే ఉన్నారని, అదనంగా కనీసం 150 (అదనంగా ఇంకో 80 పోస్టులు) మంది అవసరం అని అధికారులు మంత్రికి తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో చర్చించి అవసరమైన మేర పోస్టులు మంజూరు చేయిస్తామని మంత్రి పేర్కొన్నారు. మంగళవారం డ్రగ్ కంట్రోల్ అడ్మిని్రస్టేషన్ (డీసీఏ) అధికారులు, తెలంగాణ మెడికల్ సరీ్వసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీజీఎంసీఐడీసీ) అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. నాసిరకం, నకిలీ మందులు తయారు చేసే సంస్థలపై, వాటిని విక్రయించేవారిపై కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫార్మా కంపెనీలు, ఔషధ తయారీ యూనిట్లు, మందుల దుకాణాల్లో మరింత విస్తృతంగా తనిఖీలు చేయాలని సూచించారు. డ్రగ్స్‌కు సంబంధించిన ఫిర్యాదుల స్వీకరణకు కలెక్టరేట్లలో ఫిర్యాదుల విభాగాలు (కంప్లైంట్ సెల్స్), వీటి ఆకస్మిక తనిఖీల కోసం రాష్ట్ర స్థాయిలో విజిలెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రులకు పంపిణీ చేసే మందుల కొనుగోలు విషయంలో టీజీఎంఎస్ఐడీసీకి అవసరమైన సహకారం అందించాలని డీసీఏ అధికారులకు సూచించారు. సమావేశంలో ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తూ, డీసీఏ డీజీ వీబీ కమలాసన్‌రెడ్డి, టీజీఎంఎస్ఐడీసీ ఎండీ హేమంత్ సహదేవరావు, డీసీఏ జాయింట్ డైరెక్టర్ జి.రాందాన్ తదితరులు పాల్గొన్నారు. -
బరువు తగ్గించే ఔషధాలతో కండరాల క్షీణత
బరువు తగ్గేందుకు వినియోగించే ఔషధాల వల్ల కండరాల ద్రవ్యరాశి క్షీణించే ప్రమాదం ఉన్నట్లు ఓ అధ్యయనం వెల్లడించింది. మధుమేహం, రక్తపోటు లాంటి జీవన శైలి వ్యాధులకు దారి తీసే ఊబకాయాన్ని నియంత్రించడంలో ఈ మందులు సమర్థంగా పని చేస్తున్నప్పటికీ బరువు కోల్పోయే ప్రక్రియలో కండరాలు క్షీణతకు గురయ్యే ముప్పు ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు.బరువు కోల్పోవడం కారణంగా కండరాలు క్షీణతకు గురైనప్పుడు వార్దక్య లక్షణాలు, హృద్రోగ జబ్బుల ముప్పు పెరుగుతాయి. ఈమేరకు పెన్నింగ్టన్ బయో మెడికల్ రీసెర్చ్ సెంటర్ (అమెరికా), ఆల్బర్టా, మెక్ మాస్టర్ వర్సిటీ (కెనడా)కి చెందిన పరిశోధకులు రూపొందించిన పత్రాలు లాన్సెట్ జనరల్‌లో ప్రచురితమయ్యాయి. – సాక్షి, సెంట్రల్ డెస్క్కండరాలు ఎందుకు అవసరం?⇒ దేహానికి పటుత్వం చేకూర్చి శరీరాన్ని దృఢంగా ఉంచడంతోపాటు జీవ క్రియలు, వ్యాధి నిరోధక వ్యవస్థను నియంత్రించడంలో చురుకైన పాత్ర పోషిస్తాయి.⇒ శరీర కదలికలు, ఆకృతికి కండర కణజాలం అవసరం.ఏం చేయాలి?⇒ బరువు కోల్పోయేందుకు తీసుకునే మందుల పట్ల జాగ్రత్తగా ఉండాలి.⇒ ఆహారం తక్కువ తీసుకుంటే విటమిన్లు, ఖనిజాలు తగిన మోతాదులో అందకపోయే ప్రమాదం ఉంది.⇒ తగినంత ప్రోటీన్లు తీసుకోవడంతోపాటు వ్యాయామాలు లాంటి ఆరోగ్యకరమైన విధానాలను పాటించాలి.బరువు తగ్గించే మందులు ఏం చేస్తాయి?డయాబెటిక్ బాధితులు, బరువు కోల్పోయేందుకు తీసుకునే ఓజెమ్పిక్, వెగావై, మౌన్జరో, జెప్‌బౌండ్ లాంటి మందుల్లో జీఎల్పీ – 1 రిసెప్టార్ఎగోనిస్ట్లు ఉంటాయి. ఒక రకమైన ప్రోటీన్లు లాంటి ఈ రిసెప్టార్లు రక్తంలో చక్కెర స్థాయిలు, జీవ క్రియలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. క్లోమ గ్రంథి నుంచి ఇన్సులిన్ విడుదలయ్యేలా ప్రేరేపిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయి పెంచే గ్లూకగాన్ హార్మోన్ విడుదలను అడ్డుకుంటాయి. ఆహారం తీసుకున్న తరువాత రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించేందుకు ఇది దోహదం చేస్తుంది.ఆకలిని కూడా ఇవే రిసెప్టార్లు నియంత్రిస్తాయి. కడుపు నిండిన భావన కలిగించడం ద్వారా బరువును నియంత్రించడంలో చురుకైన పాత్ర పోషిస్తాయి. ఈ రిసెప్టార్లను అనుకరిస్తూ టైప్ 2 డయాబెటిస్, ఊబకాయాన్ని నియత్రించే ఔషధాలు తయారయ్యాయి. మధుమేహ నియంత్రణలో వాడే మరికొన్ని మందులు మూత్రం ద్వారా గ్లూకోజ్‌ను బయటకు పంపి శరీర బరువును సమతూకంలో ఉంచేలా దోహదం చేస్తాయి. ప్రధానంగా మెదడులోని కేంద్రాలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ఆకలిని అణచివేసి తక్కువ తీసుకునేలా ప్రోత్సహిస్తాయి.